అదునులో విత్తనాలు ఇవ్వలేదు.. సీజన్‌కు ముందు పెట్టుబడి సాయం అందించలేదు...
అయినా అష్టకష్టాలు పడి నాట్లు వేస్తే ఎరువులు కరువు.. అప్పు చేసి వారం పది రోజులు దుకాణాల ముందు తిప్పలు పడి ఎరువులు తెచ్చి పంటలు పండించినా... పంట చేతికొచ్చే సమయంలో విపత్తులు అన్నదాతల వెన్నువిరిచాయి.
ఆదుకోవాల్సిన చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మాయమాటలతో మోసం చేసింది.
ఫలితంగా 18 నెలల నుంచి ఒక్క పంటకు గిట్టుబాటు ధరలేదు. రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారు.
ఆపద వేళ అండగా నిలవని చంద్రబాబు... ఇప్పుడు ‘రైతు కోసం’ అంటూ సరికొత్త దొంగ జపానికి తెరతీశారని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.
చంద్రబాబు మోసానికి... రైతుల కష్టాలకు ప్రతీక ఈ దృశ్యాలు. – సాక్షి నెట్‌వర్క్


