హైదరాబాద్ లో ఉదయం 9 గంటలు దాటినా సూరీడి జాడే లేకుండాపోతోంది.
శీతాకాలపు పొగమంచు నగరంపై ధవళ వర్ణపు తెరలా కప్పుకొంటోంది.
పొద్దునపూట పొగమంచు ఆవరించడంతో మసక చీకట్లు కమ్ముకుంటున్నాయి. ఎటుచూసినా పరిసరాలన్నీ తెల్లని మబ్బులను తలపిస్తున్నాయి.
హుస్సేన్ సాగర్ తీరం,సచివాలయం,బిర్లా మందిర్,అసెంబ్లీ భవనం,రహదారులు, శివారు ప్రాంతాలపై మంచు తెర కప్పేస్తోంది.
తెల్లవారుజామున చలితో పాటు మంచు కురుస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
ప్రధానంగా వయోధికులు, చిన్నారులపై చలి ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గాలిలో ధూళి కణాలు భారీగా పేరుకుపోతున్నాయి. శ్వాస సంబంధిత సమస్యలున్న వారు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఫొటోలు – సాక్షి, ఫొటోగ్రాఫర్ల బృందం


