breaking news
Siddipet
-
కరెంట్ కట్కట్
● ఓ వైపు సహకరించని ప్రకృతి... మరోవైపు కరెంట్ కోతలు ● బోర్లు, బావులున్నా సాగు చేద్దామంటే..అడ్డంకిగా విద్యుత్ ● కోతలతో ఇబ్బంది పడుతున్న అన్నదాతలు ● వ్యవసాయానికి విద్యుత్తు సరఫరాపై ‘సాక్షి’పరిశీలన వ్యవసాయ సీజన్ పూర్తిస్థాయిలో జోరందుకోక ముందే విద్యుత్తు సరఫరాలో కోతలు పెడుతున్నారు. వ్యవసాయానికి నిరంతర విద్యుత్తు సరఫరా చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటనలు చేస్తున్నా క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా పరిస్థితులున్నాయి. 24గంటల విద్యుత్తు సరఫరా ఎక్కడా జరుగుతున్న దాఖలాలు లేవు. అందులో సగం అంటే 12 గంటలు కూడా సక్రమంగా సరఫరా కావడంలేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. సాక్షి, సిద్దిపేట: ఓ పక్క వర్షాభావ పరిస్థితులతో రైతులు ఇబ్బంది పడుతుండగా..బోర్లు, బావులు అందుబాటులో ఉన్న వారు కొంతభాగం సాగు చేస్తున్న రైతులను విద్యుత్తు కోతలు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వచ్చే విద్యుత్తులోనూ మధ్య మధ్యలో కోతలు పెడుతుండటంతో వ్యవసాయం ముందుకు సాగడం లేదని రైతులు రోడ్డెక్కుతున్నారు. సహకరించని ప్రకృతి జిల్లా వ్యాప్తంగా 1.90లక్షల వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్లున్నాయి. జిల్లాలో తీవ్ర వర్షభావ పరిస్థితులు ఉండటంతో బోర్లు, బావులు ఉన్న వారే సాగు చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1.60లక్షలకు పైగా ఎకరాల్లో పంటలు సాగుతున్నాయి. వరి పంటలు సాగు చేసేందుకు నార్లు పోసి రైతులు దిక్కులు చూస్తున్నారు. వర్షాల కోసం రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 31% లోటు వర్షపాతం నమోదైంది. బోర్లు, బావుల మీద ఆధారపడి పంటలు సాగుచేయాలనుకునే వారు విద్యుత్తు కోతలను చూసి రైతులు ముందుకురావడం లేదు. ఓ వైపు ప్రకృతి సహకరించడం లేదు. మరోవైపు విద్యుత్ అధికారులు 24గంటల విద్యుత్తు సరఫరా చేయడం లేదు. దీంతో సాగు చేస్తున్న వారు...సాగు చేయాలనుకునే వారు ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయానికి 10 నుంచి 12 గంటలే క్షేత్రస్థాయిలో విద్యుత్తు సరఫరాను సోమవారం ‘సాక్షి’పరిశీలించింది. పలు మండలాల్లోని సబ్స్టేషన్లవారీగా పరిస్థితి ఎలా ఉందని రైతులు, ప్రజలను ఆరా తీసింది. ఈ పరిశీలనలో చాలాచోట్ల 10 నుంచి 12గంటలు మాత్రమే విద్యుత్తును సరఫరా చేస్తున్నట్లు స్పష్టమైంది. దీనికితోడు లోఓల్టేజీ సమస్య తీవ్రంగా ఉంది. అలాగే వస్తున్న కరెంటు కూడా పదేపదే ట్రిప్, విద్యుత్తు మరమ్మతుల కోసం ఎల్సీ తీసుకుంటున్నారు. ఈసారి వర్షాలు లేకపోవడంతో రైతులు బోర్లు, బావులపైనే ఎక్కువగా ఆధారపడి సాగుకు సిద్ధపడ్డారు. సరఫరా అంతంతమాత్రమే ● హుస్నాబాద్ మండలం తోటపల్లి విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో ఉదయం 5 నుంచి సాయంత్రం 6 గంటల వరకు వ్యవసాయానికి 13గంటల త్రీఫేస్ విద్యుత్తును సరఫరా చేస్తున్నారు. సబ్‌స్టేషన్‌లో సోమవారం లాంబో పగిలిపోవడంతో మధ్యాహ్నం 1:30 నుంచి సాయంత్రం 4గంటల వరకు విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. మరమ్మతులు చేసి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. దీంతో తోటపల్లి పరిధిలో 9:30గంటలే విద్యుత్తు సరఫరా అయింది. ● కొమురవెల్లి మండలం గురువన్నపేట సబ్‌స్టేషన్‌లో ప్రతీ రోజు ఉదయం 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు త్రీఫేస్ విద్యుత్తు సరఫరా చేస్తున్నారు. రెండుసార్లు ఎల్సీ తీసుకుని విద్యుత్తు వైర్ల మరమత్తులు చేశారు. చేర్యాల మండలంలో సైతం ఉదయం 5 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్తు సరఫరా అందించగా రెండుసార్లు ఎల్సీ తీసుకున్నారు. ● మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ సబ్‌స్టేషన్ పరిధిలో ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకు వ్యవసాయానికి విద్యుత్‌ను అందిస్తున్నారు. ఖాజీపూర్‌లో ట్రాన్స్‌ఫార్మర్‌లో కార్బన్ రావడంతో విద్యుత్ దాదాపు గంట పాటు వివిద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ● కోహెడ మండలంలో సైతం ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. మండలంలో పలు చోట్ల రెండు నుంచి మూడుసార్లు ఎల్సీ తీసుకోవడంతో విద్యుత్తు అంతరాయం ఏర్పడింది. -
సంక్షోభంలో గురుకులాలు
● నాణ్యమైన విద్య, ఆహారం అందించడంలో ప్రభుత్వం విఫలం ● బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కేసీఆర్ హయాంలో సంక్షేమంగా ఉన్న గురుకులాలు నేడు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి రేవంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. జిల్లా కేంద్రంలోని ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్ఎస్ పాఠశాల ఎదుట సోమవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ..బీసీ గురుకులంలో అనేక సమస్యలున్నాయన్నారు. గురుకులంలో నెలకొన్న సమస్యలకు తోడుగా ఉపాధ్యాయులు వ్యవహారం సక్రమంగా లేదని ఆరోపించారు. విద్యార్థులకు వసతులు కల్పించడం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్న ప్రిన్సిపాల్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం, మౌలిక సౌకర్యాలు కల్పించిందని, నేటి ప్రభుత్వం విద్యా వ్యవస్థను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్వీ నాయకులు పాల్గొన్నారు. -
శాకాంబరీదేవిగా శ్రీవిద్యాసరస్వతి
వర్గల్ క్షేత్రంలో వైభవంగా మూల మహోత్సవం వర్గల్(గజ్వేల్): అమ్మకు కూరగాయలే ఆభరణాలయ్యాయి. ఫలాలే పూలహారాలుగా ఒదిగిపోయాయి. ఆలయం పందిరితోటను తలపించింది. సోమవారం మూల నక్షత్ర మహోత్సవ వేళ కూరగాయలు, ఫలాలు ఆభరణాలుగా ధరించి వర్గల్ శ్రీవిద్యాసరస్వతి అమ్మవారు శాకాంబరీదేవిగా దివ్యదర్శనమిచ్చారు. పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్చకులు మూలవిరాట్టుకు విశేషాభిషేకం చేశారు. ఆషాఢానికి ప్రతీకగా ఫలాలు, కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. లక్ష పుష్పార్చన, సప్తశతి పారాయణం, చండీహోమం నిర్వహించారు. వివిధ ప్రాంతాల భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. -
విత్తన మేళాలతో ఏం లాభం?
విత్తన మేళాలతో ఒరిగేదేమీలేదు. విత్తనాలకు సబ్సిడీ వర్తింపజేయపోగా, బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలనే అదే ధరపై అందిస్తున్నారు. పప్పుధాన్యాలు పండిద్దామనుకుంటే...కోతుల బెడదతో ఆ పంటలకు నష్టం జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి...? –నరేందర్‌రెడ్డి,రైతు, ధర్మారెడ్డిపల్లి–గజ్వేల్ మండలంవిత్తన మేళాలో అందజేస్తున్న విత్తనాలకు సబ్సీడీ వర్తించదు. ప్రభుత్వ ఆదేశాల మేరకు కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం. మేళాలో రైతులు ఎక్కువమంది పాల్గొనేలా చూస్తాం. – మల్లయ్య, జిల్లా ఇన్చార్జి వ్యవసాయాధికారి -
కొమురవెల్లిలో ఘనంగా వరుణయాగం
కొమురవెల్లి (సిద్దిపేట): కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఉత్తర్వుల మేరకు సోమవారం ఘనంగా వరుణయాగాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహాగణపతి పూజ, గౌరీపూజ, రక్షాబంధనం, స్వస్తి పుణ్యాహవచనం, నవగ్రహ, దిక్పాలక, ఏకాదశ రుద్ర, పంచాచార్య కలశ స్థాపన, ఆరాధన, మహాగణపతి హోమం, ఆవాహిక మండపా దేవత ఆవాహనం, రుద్రహోమం, వరుణ మూల మంత్ర, జయాధి హోమం, పూర్ణాహుతి పూజలను నిర్వహించారు. అనంతరం స్వామివారికి 108 ఘటాలతో మహాస్వప్నం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈవో కట్టా సుధాకర్‌రెడ్డి, ఆలయ ప్రధాన అర్చకులు మహాదేవుని మల్లికార్జున్, ఏఈఓ బుడ్డి శ్రీనివాస్, పర్యవేక్షకుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
29న క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్
ఎమ్మెల్యే హరీశ్‌రావు సిద్దిపేటజోన్: క్యాన్సర్ అంటే భయపడకుండా ముందస్తుగా వ్యాధి నిర్ధారణతో మన ప్రాణాన్ని కాపాడుకోవచ్చని అందుకే ఈ నెల 29న సిద్దిపేట ప్రజల కోసం ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్ ఏర్పాటు చేస్తున్నామని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. 40ఏండ్లు నిండిన ప్రతి మహిళ సద్వినియోగం చేసుకోవాలని సోమవారం ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లోని సింధూ క్యాన్సర్ ఆస్పత్రి సౌజన్యంతో ఉచిత నిర్ధారణ శిబిరాన్ని స్థానిక విపంచి ఆడిటోరియంలో ఈ నెల 29న ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రారంభ దశలో లక్షణాలు కన్పించవని, కానీ స్క్రీనింగ్ టెస్ట్ ద్వారా లక్షణాలు బయట పడతాయన్నారు. గర్భాశయ, రొమ్ము క్యాన్సర్ బారిన పడి చాలామంది మహిళలు చనిపోతున్నారని, దీనికి కారణం లక్షణాలను సకాలంలో గుర్తించకపోవడమేనన్నారు. గతంలో కొన్ని స్క్రీనింగ్ టెస్టు శిబిరాలు ఏర్పాటు చేసి, క్యాన్సర్ లక్షణాలు ఉన్న వారిని గుర్తించి సకాలంలో చికిత్స ఇవ్వడంతో ప్రస్తుతం వారు ప్రాణాలతో బయటపడ్డారన్నారు. మహిళలకు అవసరం మేరకే పాప్ స్మియర్ టెస్ట్, రక్త పరీక్షలు, ఎక్స్ రే లాంటివి చేస్తారన్నారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాకటౌన్: ఆధునిక జీవనశైలిలో ఆరోగ్య సంరక్షణకు వ్యాయామం అత్యంత అవసరమని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. దౌల్తాబాద్ కేంద్రంలో అత్యాధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ఫిట్నెస్ జిమ్‌ను కొత్త ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కలిసి సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...ప్రతి ఒక్కరూ శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతీ రోజు కొంత సమయాన్ని వ్యాయామానికి కేటాయించాలన్నారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి, ఫిట్నెస్తోపాటు క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని అలవర్చుకోవాలన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇలాంటి ఆధునిక ఫిట్నెస్ కేంద్రాలు యువతలో ఆరోగ్య చైతన్యాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. పీఆర్టీయూ నాయకుల డిమాండ్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): వేసవి సెలవుల్లో జనగణన విధులు నిర్వహించిన ఉపాధ్యాయులకు ఆర్జిత సెలవులు మంజూరు చేయాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, శశిధర్‌శర్మ డిమాండ్ చేశారు. సోమ వారం జిల్లా విద్యాశాఖ ఇన్చార్జి అధికారి రమేశ్ కు పీఆర్టీయూ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ.. భారత ప్రభుత్వం ప్రతీ పదేళ్లకు ఒక సారి నిర్వహించే జనగణనలో వేసవికాలాన్ని సైతం లెక్కచేయకుండా జిల్లాలో ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహించారన్నారు. ఆర్డీఓ సదానందం సిద్దిపేటజోన్: ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలని ఆర్డీఓ సదానందం ఆదేశించారు. ఆర్డీఓ కార్యాలయంలో ప్రజావాణి సందర్భంగా సోమవారం ఆయన అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ప్రజల అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. అర్జీలు పెండింగ్‌లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా వివిధ సమస్యలపై ఐదు దరఖాస్తులను స్వీకరించారు. -
మూడెకరాలకే సరిపోతుంది..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రైతు కొమురవెల్లి మండలం గురువన్నపేటకు చెందిన పుట్ట వెంకటేశం. ఇతనికి ఆరెకరాల పొలం ఉంది. బోర్ ఉంది..ప్రతీ సంవత్సరం ఆరెకరాలు సాగు చేస్తున్నారు. గతేడాది విద్యుత్తు అంతరాయం లేకుండా రావడంతో ఆరు ఎకరాల్లో వరి సాగు చేశారు. ఈ సారి విద్యుత్తు సరఫరా 11 నుంచి 12 గంటలే వస్తుండటంతో మూడెకరాలు మాత్రమే సాగు చేస్తున్నారు. ఓ వైపు వర్షాలు కురవకపోవడం...మరోవైపు విద్యుత్ సరఫరా 24గంటలు వ్యవసాయంకు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వ్యవసాయానికి 24గంటలు విద్యుత్ సరఫరా చేయాలని వెంకటేశం కోరుతున్నారు. -
వర్షపు నీటిని ఒడిసి పట్టాలి
సిద్దిపేటరూరల్: ఎల్‌నినో వర్షాభావ పరిస్థితుల్లో భాగంగా వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా గ్రామాల్లో పనులు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం మండల ప్రత్యేక అధికారులతో కలెక్టర్ హైమావతి ఎల్‌నినో ప్రభావంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...రెండు రోజులలో మండల ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ప్రజా ప్రతినిధులను, మండల స్థాయి అధికారులను ఆహ్వానించి ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యచరణ రూపొందించి అమలు చేయాలన్నారు. రైతులకు వరికి ప్రత్యామ్నాయంగా మెట్ట పంటలు పండించడంపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వ్యవసాయ భూమి ఖాళీగా ఉంచకుండా ప్రతీ రైతు ఏదో ఒక మెట్ట పంట పండించేలా ప్రోత్సహించాలన్నారు. జిల్లాలో ఉన్న నీటి వనరులు తాగునీటికి సరిపోతాయని, బెజ్జంకి, హుస్నాబాద్, కోహెడ, అక్కన్నపేట మండలాలకు త్రాగునీరు సరఫరాకు ప్రత్యేక కార్యచరణ రూపొందించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరాలో సమస్యలు రాకుండా ముందస్తుగా పర్యవేక్షించాలన్నారు. ప్రతీ గ్రామపంచాయతీ పరిధిలో 100 ఫామ్ పాండ్స్ నిర్మించాలన్నారు. వీటితోపాటు పెరుక్యులేషన్ పాండ్స్, బోర్వెల్ రీఛార్జ్ స్ట్రక్చర్స్, కమ్యూనిటీ, పర్సనల్ సోక్ పిట్స్, ప్రభుత్వ కార్యాలయాల భవనాల్లో రూప్‌టాప్ వాటర్ స్ట్రక్చర్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. నూతన పరిశ్రమలకు ప్రోత్సాహం జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు గాను నూతన పరిశ్రమల స్థాపనకు ప్రోత్సాహం అందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో పరిశ్రమల పెట్టుబడుల ప్రోత్సాహం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అంశాలను పర్యవేక్షించే జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్లో నిర్వహించారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన దరఖాస్తులు, అనుమతులు, సమస్యలను క్షేత్రస్థాయిలో సమీ క్షించాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల శాఖ అధికారి గణేశ్‌రామ్, ఇరిగేషన్ ఈఈ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఎల్‌నినో ప్రభావంపై అధికారుల సమీక్షలో కలెక్టర్ హైమావతి -
విఫలమైన విత్తన మేళా!!
● 26 మండల కేంద్రాల్లో కార్యక్రమాలకు స్పందన కరువు ● తొలిరోజు కొనుగోళ్లు 10క్వింటాళ్లలోపే ● జిల్లాలో పరిస్థితిపై పరిశీలన ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికలో భాగంగా వ్యవసాయశాఖ తొలిరోజు సోమవారం చేపట్టిన ‘విత్తన మేళా’లు విఫలమయ్యాయి. జిల్లాలోని 26మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో నిర్వహించిన ఈ కార్యక్రమాలకు 154మంది మాత్రమే రైతులు హాజరయ్యారు. అన్ని రకాల విత్తనాలు కలుపుకొని 10క్వింటాళ్లలోపు మాత్రమే రైతులు కొనుగోలు చేశారు. ఈ వ్యవహారంపై ‘సాక్షి’పరిశీలన. గజ్వేల్: జిల్లాలో ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా కనపడుతోంది. ఫలితంగా వర్షపాతం గణనీయంగా పడిపోయింది. జూన్ 1 నుంచి ఇప్పటివరకు 272.4మి.మీలు కురవాల్సి ఉండగా, ఇప్పటివరకు 185.9మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 31.7% లోటు వర్షపాతం నమోదైంది. ఫలితంగా పంటల సాగు ముందుకుసాగటం లేదు. 5.41లక్షల ఎకరాల్లో పంటలు సాగులోకి వస్తాయని భావిస్తే ఇప్పటివరకు 50% కూడా పంటలు సాగులోకి రాలేదు. ప్రధానంగా వరి సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. పత్తి ఇప్పటివరకు 1,03,461ఎకరాలు, కందులు 6,549, మొక్కజొన్న 26,969, స్వీట్‌కార్న్ 909, సజ్జలు 55, పెసర్లు 158, చెరుకు 25, ఇతర పంటల 2,483ఎకరాల్లో సాగులోకి వచ్చాయి. 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి వస్తుందని భావించిన వరి కేవలం 1,10,637 ఎకరాలకే పరిమితమైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా అన్ని రకాల పంటలు 2,51,372ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చాయి. దీనిబట్టి సాగు అంచనా 50%కూడా దాటలేదు. రైతుల నుంచి స్పందన కరువు ఈ నెల 27 నుంచి 29 వరకు జిల్లాలోని 26 మండల కేంద్రాల్లోని రైతు వేదికల వద్ద విత్తన మేళాలను నిర్వహించడానికి నిర్ణయించగా తొలిరోజు సోమవారం నిర్వహించిన శిబిరాలకు కనీస స్పందన కరువైంది. 25 మంది రైతులు 3.72క్వింటాళ్ల మొక్కజొన్న విత్తనం, అయిదుగురు రైతులు 20కిలోల స్వీట్‌కార్న్, 80మంది 4క్వింటాళ్ల కంది, 37మంది 1.5క్వింటాళ్ల కురగాయల విత్తనాలు, నలుగురు 20కిలోల పెసర్లు, ఇద్దరు 8కిలోల మినుమలు, మరొకరు 4కిలోల నువ్వుల విత్తనాలను కొనుగోలు చేశారు. మొత్తమ్మీద 10క్వింటాళ్లలోపు విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయగా...వీటిని కూడా వ్యవసాయాధికారులు అతికష్టమ్మీద రైతులచేత కొనుగోలు చేయించారు. సబ్సీడీ లేకపోవడమే కారణం! రైతులకు పంపిణీ చేస్తున్న విత్తనాలకు సబ్సిడీ ఇవ్వకపోవడం వల్లే విత్తన మేళాలకు స్పందన కరువైందని స్పష్టమవుతోంది. బహిరంగ మార్కెట్లో దొరికే విత్తనాలనే యథాతథంగా మేళాల్లో అందజేయడం ఏంటని, దీనికోసం ప్రత్యేకంగా హడావిడి చేయడం ఎందుకని రైతులు ప్రశ్నిస్తున్నారు. -
ఆగమశాస్త్రం ప్రకారమే దేవాలయాల నిర్మాణం
● దేవదాయశాఖ స్థపతి వల్లి నాయకం ● పోచమ్మ ఆలయంలో శిలాయంత్ర ప్రతిష్ఠ దుబ్బాక: దేవాలయాల నిర్మాణంతోపాటు విగ్రహాల యంత్ర ప్రతిష్ఠ ఆగమశాస్త్రం ప్రకారమే నిర్వహిస్తున్నట్లు దేవదాయశాఖ స్థపతి వల్లినాయకం స్పష్టం చేశారు. దుబ్బాకలో పోచమ్మ ఆలయం పునరుద్ధరణలో భాగంగా ఆదివారం శిలా యంత్ర ప్రతిష్ఠ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల్లో గ్రామదేవతల ఆలయాలు ఉండటం చాలా శ్రేష్టమన్నారు. అమ్మవార్ల దయతో పచ్చని పంటలతో ఆయా గ్రామాలు సుభిక్షంగా ఉంటాయని చెప్పారు. పోచమ్మ ఆలయం పునర్నిర్మాణం చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయంలో అన్ని దేవతల విగ్రహాలను శాస్త్రప్రకారం ప్రతిష్ఠించాలని సూచించారు. నూతన ఆలయాలు నిర్మించడంతోపాటు ఆలయాలు ధూప, దీప,నైవేద్యాలతో విరజిల్లాలని ఆకాంక్షించారు. -
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు
● ఘనంగా మహంకాళీ అమ్మవారి బోనోత్సవం ● అమ్మవారిని దర్శించుకున్న మెదక్ ఎంపీ రఘునందన్‌రావు గజ్వేల్‌రూరల్: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా బోనాల ఉత్సవాలు జరుపుకుంటామని, ఆషాఢమాసంలో భక్తిశ్రద్ధలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఆషాఢమాసంలో నిర్వహించే మహంకాళీ అమ్మవారి బోనాల ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని మహంకాళీ అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా మూడో రోజు నిత్యపూజా కార్యక్రమాలను ఆలయ ప్రధాన పూజారి చాడ నందబాలశర్మ, పూజారి విఠాల సాయికృష్ణశర్మల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డిలతోపాటు గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ గంగిశెట్టి చందన, మాజీ మున్సిపల్ చైర్మన్లు భాస్కర్, రాజమౌళి తదితరులు మహంకాళీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎంపీ రఘునందన్‌రావు మాట్లాడుతూ... ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నానన్నారు. పట్టణంలోని మహిళలు, ఆడపడుచులు బోనాలను అందంగా అలంకరించి నెత్తిన పెట్టుకుని పోతరాజుల విన్యాసాలు, డప్పుచప్పుళ్ల మధ్య దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి తొట్టెల ఊరేగింపు నిర్వహించారు. కార్యక్రమంలో మహంకాళీ దేవాలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు. -
బడి చేరని వస్త్రం
నూతన విద్యాసంవత్సరం ప్రారంభమై 40 రోజులు కావొస్తున్నా ఇంతవరకు విద్యార్థులకు కొత్త యూనిఫాంలు అందలేదు. దీంతో విద్యార్థులు గతేడాదిలో వాడిన యూనిఫాంలనే ధరించి బడులకు వస్తున్నారు. కనీసం జెండా పండుగ నాటికై నా కొత్త యూనిఫాంలు అందుతాయేమోనని పిల్లలు ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో 980 పాఠశాలల పరిధిలో 73 వేలమంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. దీంతో వీరికి ప్రతీ ఏటా 4.09లక్షల మీటర్ల వస్త్రం అవసరం ఉంటుంది. అయిన నేటివరకు జిల్లాకు వస్త్రం చేరుకోలేదు. దీంతో విద్యార్థులు పాత యూనిఫాంలతో బడికి వస్తూ తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. పాఠశాలలకు యూనిఫాంలతో రావడం తప్పనిసరి కావడంతో విద్యార్థులు చినుగుల్ని కుట్టుకుని పాఠశాలలకు వస్తున్నారు. ప్రతీ విద్యా సంవత్సరం ప్రారంభం నాడు విద్యార్థులకు రెండు జతల యూనిఫాంలు అందిస్తారు. రెండు జతల చొప్పున మొత్తం విద్యార్థులకు 1.46లక్షలు యూనిఫాంలు అవసరమవుతాయి. మార్పులతోనే ఆలస్యమా? ప్రతీ విద్యాసంవత్సరం ఒకే విధమైన యూనిఫాం ఉండటంతో విద్యార్థులకు సరిపడా వస్త్రాన్ని త్వరగా పంపించే వారు. కానీ ఈ విద్యాసంవత్సరం నుంచి విద్యార్థులకు వివిధ రంగులతో కూడిన యూనిఫాంలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతోనే నూతన వస్త్రం వచ్చేందుకు సమయం పడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. కనీసం నెల రోజుల సమయం జిల్లాకు ఇప్పుడు వస్త్రం వచ్చిన మహిళ సంఘాలకు కుట్టడం కోసం ఇస్తారు. మహిళ సంఘాల సభ్యులు యూనిఫాంలు కుట్టడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుంది. దీంతో ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవానికి విద్యార్థులు పాత దుస్తులతోనే పాఠఽశాలలకు రావాల్సిందే. ఇబ్బందులు పడుతున్న 73వేల మంది విద్యార్థులు జెండా పండుగకై నా అందేనా? 4.09లక్షల మీటర్లు అవసరం -
చేసిన సేవలకే జాతీయ పురస్కారం
మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత దుబ్బాకటౌన్: బుద్ధుడు, పూలే, అంబేడ్కర్ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ అందించిన సేవలకే బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (బీఎస్ఐ) సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల నర్సింహులుకు జాతీయస్థాయిలో ప్రతిష్ఠాత్మక గౌతమ బుద్ధ అవార్డు లభించిందని మహిళా కమిషన్ సభ్యురాలు శ్వేత తెలిపారు. జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన ముత్యాల నర్సింహులుకు ఆదివారం దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఘన సన్మానం చేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు చిట్యాల శ్వేత, బీఎస్ఐ రాష్ట్ర కార్యదర్శి ఉప్పర మల్లేశం, జిల్లా అధ్యక్షుడు శంకర్ బోధి హాజరయ్యారు. -
భక్తుల కల నెరవేర్చిన మోదీ
●కొమురవెల్లిపుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవంలో కేంద్రమంత్రులు ●హర్షం వ్యక్తం చేసిన భక్తులు కొమురవెల్లి(సిద్దిపేట): ఎన్నో ఏళ్ల నుంచి మల్లన్న భక్తుల కలగా మిగిలిన కొమురవెల్లి రైల్వే స్టేషన్ ఆశను ప్రధాని మోదీ నెరవేర్చారని కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ పేర్కొన్నారు. కొమురవెల్లి మల్లికార్జున ఆలయ సమీపంలో కొత్తపల్లి–మనోహరబాద్ రైల్వే లైన్లో నూతనంగా నిర్మించిన కొమురవెల్లిపుణ్య క్షేత్రం రైల్వే స్టేషన్‌ను కేంద్రమంత్రులు జి.కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో కలసి ఆదివారం ప్రారంభించారు. అంతకుముందు కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడుతూ...గతంలో రైల్వే స్టేషన్ నిర్మించాలన్న, నూతన రైల్వే లైను ఏర్పాటు చేయాలన్న దశాబ్దాల సమయం పట్టేదని మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిందన్నారు. కొమురవెల్లిలో రైల్వేస్టేషన్ ఏర్పాటు చేయడం ఒక చారిత్రక ఘట్టమని, స్టేషన్ నిర్మాణం కోసం భూమి పూజచేసిన రెండేళ్లలలోనే పూర్తిచేసి భక్తులకు అంకితం చేస్తున్నట్లు తెలిపారు. హైదరబాద్ నుంచి కొమురవెల్లికి కేవలం రూ.20లతో చేరుకోవచ్చని ప్రస్తుతం డీజిల్‌తో నడుస్తున్న ఈ లైన్‌ను తర్వలోనే రూ.300కోట్లతో విద్యుద్దీకరణ చేయనున్నట్లు వెల్లడించారు. మోధీ ప్రభుత్వ సమయం ముగిసేసరికి కొత్తపల్లి నుంచి మనోహరబాద్ రైల్వే పనులు పూర్తవుతాయని, తెలంగాణ అభివృద్ది పట్ల ప్రధాని మోదీ చిత్తశుద్ధితో ఉన్నారని తెలిపారు. అనంతరం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రం అభివృద్ధి జరగాలంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి పని చేయాలన్నారు. కొమురవెల్లి మల్లికార్జున స్వామి పుణ్యక్షేత్రం మరింత ప్రాముఖ్యత సాధించాలని, దానికోసం ఆలయాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీంలో చేర్చాలని కోరారు. కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ మల్టిపుల్ లైన్స్ ఏర్పాటు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో రైల్వే లైన్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందన్నారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కొత్తపల్లి– మనోహరబాద్ రైల్వే లైన్ ఏర్పాటుకు మాజీ సీఎం కేసీఆర్ కృషి ఫలించిందన్నారు. ఈ రైల్వే లైన్ ఏర్పాటుకు గత ప్రభుత్వం 50% నిధులు ఖర్చు చేసినట్లు వెల్లడించారు. స్టేషన్ ప్రారంభోత్సవానికి ప్రజలు భారీ సంఖ్యలో హజరయ్యారు. అనంతరం నాయకులు రైలును స్టేషన్ జెండా ఊపి ప్రారంభించి రైలులో ప్రయాణించారు. కార్యక్రమంలో రాజ్యసభ్యులు కె.లక్ష్మణ్, మెదక్ ఎంపీ రఘునందన్‌రావు, రైల్వే జీఎం సంజయ్‌కుమార్ శ్రీవత్సవ,రైల్వే అధికారులు, స్థానిక బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. రైల్వేస్టేషన్ ప్రారంభోత్సం రసాభాసగా మారింది. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి తగిన ప్రాధాన్యతనివ్వడంలేదని, ప్రొటోకాల్ పాటించడంలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. జై పల్లా అంటూ నినాదాలు చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావారణం నెలకొంది. పోలీసులు కల్పించుకుని వారిని శాంతింపజేశారు. రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు జిల్లా కలెక్టర్ హైమావతి కొమురవెల్లి పుణ్యక్షేత్రం రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడ ఆమేరకు రైల్వే అధికారులు ప్రొటోకాల్ ఇవ్వలేదని వెంటనే వెనుదిరిగారు. -
టీజీసీజీటీఏ జిల్లా కార్యవర్గం ఎన్నిక
సిద్దిపేటఎడ్యుకేషన్: తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్(టీజీసీజీటీఏ) సిద్దిపేట జిల్లా కార్యవర్గం ఎన్నికలు స్థానిక ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా డాక్టర్ శ్యాంసుందర్, ప్రధానకార్యదర్శిగా డాక్టర్ పిట్లదాసు, కోశాధికారిగా డాక్టర్ సీహెచ్.మధుసూదన్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ శ్రీలత ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శ్యాంసుందర్ మాట్లాడుతూ...అధ్యాపకుల సమస్యలను పరిష్కారానికి తమ శాయశక్తులా కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కార్యవర్గానికి జిల్లా అధ్యాపకులకు అనుసంధానకర్తలుగా ఉండి అధ్యాపకుల ప్రయోజనాలను కాపాడుతామని చెప్పారు. తమను ఎన్నుకున్న జిల్లాలోని అధ్యాపకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో ఆయా కళాశాలల యూనిట్ బాధ్యులు ఉమామహేశ్వరీ, పవన్‌కుమార్, సత్యనారాయణరెడ్డి, విజయభాస్కర్‌రెడ్డి, ప్రొఫెసర్ అయోధ్యరెడ్డి, మట్టా సంపత్‌కుమార్‌రెడ్డి, స్రవంతి, శ్రీలత, బాలచంద్రం తదితరులు పాల్గొన్నారు. పీఆర్సీని అమలు చేయాలిటీపీటీఎఫ్ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రాజయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా కేంద్రంలోని ఉపాధ్యాయ భవన్లో ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..పీఆర్సీ నివేదిక వెంటనే తెప్పించుకుని 40% ఫిట్మెంట్తో వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 2023 జూలై నుంచి అమలు చేయాల్సిన నూతన పీఆర్సీని ఆర్థిక ఇబ్బందులు సాకుతో వాయిదా వేయడం సరికాదన్నారు. ప్రభుత్వం 27 వేల పాఠశాలలను 4 వేల పాఠశాలలకు కుదించాలనే నిర్ణయాన్ని ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో విజేందర్‌రెడ్డి, కనకయ్య పాల్గొన్నారు. ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సిద్దిపేటలో ఆదివారం మధ్యాహ్నం ఓ మోస్తారు వర్షం కురిసింది. అప్పటివరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా ఈదురుగాలులు వీచి వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నారాయణఖేడ్: ఖేడ్ మండలం జూకల్ శివారులోని సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల కళాశాలలో ఇంటర్లో వివిధ కోర్సుల్లో ఉన్న ఖాళీలకు ఈనెల 28న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీనివాసచారి తెలిపారు. ఇంటర్ ప్రథమ సంవత్సరంలో ఎంపీసీలో 15, బైపీసీలో 15 సీట్ల చొప్పున ఖాళీలు ఉన్నాయన్నారు. ఈ ఖాళీ సీట్లను జోనల్ అధికారి ఉత్తర్వుల మేరకు నేరుగా భర్తీ చేస్తామన్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు ఒరిజనల్ ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. శివ్వంపేట(నర్సాపూర్): చెరువు మట్టి అమ్మకం ద్వారా వచ్చిన డబ్బులు గ్రామ పెద్దమనుషుల వద్ద ఉంచగా, వాటికి సంబంధించిన లెక్కలు తేలకపోవడంతో గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధి సికింద్లాపూర్‌లో మూడేళ్ల క్రితం చెరువు మట్టి అమ్మకం ద్వారా గ్రామానికి రూ.16 లక్షల ఆదాయం సమకూరింది. వాటిని గ్రామ అవసరాల కోసం ఖర్చు చేసేందుకు గ్రామానికి చెందిన పలువురు పెద్ద మనుషుల వద్ద ఉంచారు. ప్రస్తుతం ఆ డబ్బులను గ్రామాభివృద్ధి కోసం ఖర్చు చేయాలని అడిగితే వారు బెదిరింపులకు పాల్పడుతున్నారని గ్రామస్తులు వాపోతున్నారు. ప్రజా అవసరాల కోసం ఖర్చు చేయాల్సిన డబ్బులు సొంతానికి వాడుకోవడం ఎంతవరకు సమంజమని ప్రశ్నిస్తున్నారు. -
రైల్వేస్టేషన్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
గజ్వేల్: తెలంగాణలోని 42 రైల్వే స్టేషన్లను ఏకకాలంలో అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ఇలాంటి చర్యలు గతంలో ఎప్పుడూ జరగలేదని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో ఆదివారం రైల్వేస్టేషన్ ప్రారంభోత్సవం చేసిన అనంతరం అక్కడి నుంచి గజ్వేల్ స్టేషన్ వరకు మెదక్ ఎంపీ రఘునందన్‌రావుతో కలిసి రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ...ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర, ఇతర అంశాల ఆధారంగా రైల్వేస్టేషన్లను తీర్చిదిద్దుతున్నామన్నారు. ప్రతీ రైల్వేలైన్‌ను విద్యుదీకరించాలనే సంకల్పంతో ముందుకుసాగుతున్నామని తెలిపారు. రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై ఇతర సదుపాయాలను కల్పిస్తున్నామన్నారు. రాష్ట్రంలో హైదరాబాద్ నుంచి ముంబై వయా పుణే, హైదాబాద్–బెంగుళూరు, హైదరాబాద్–అమరావతి–చైన్నె మూడు బుల్లెట్ ట్రైన్లు, 5 వందేభారత్, మరో ఆరు అమృత్ రైళ్లను నడపడానికి నిర్ణయించినట్లు స్పష్టం చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రైలును త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ అభివృద్ధిపైనా దృష్టి పెట్టామన్నారు. కొమురవెల్లి రైల్వేస్టేషన్‌ను మరో రూ.40కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్ నుంచి నుంచి వచ్చే భక్తులకు ఈ రైలులో అతిచౌకగా రూ.25తో ప్రయాణించి కొమురవెల్లి మల్లన్నను దర్శనం చేసుకోవచ్చున్నారు. రూ.100కే నెల పాస్ ఇవ్వడానికి కూడా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీజేపీ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. రైల్వేలైన్ల విద్యుదీకరణ, ఇతర సదుపాయాల కల్పన కొత్తగా మరిన్ని బుల్లెట్, వందేభారత్, అమృత్ రైళ్లు యాదాద్రికి త్వరలోనే ఎంఎంటీఎస్ కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కొమురవెల్లి నుంచి గజ్వేల్ వరకు రైలులో ప్రయాణం -
మూడేళ్లలో కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పూర్తి
సిద్దిపేటజోన్: మరో మూడేళ్లలో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే లైన్ పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం సమీపంలో రూ. 6 కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వే స్టేషన్‌ను ఆయన ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. డిసెంబర్ నాటికి సిరిసిల్ల, 2028 జూన్ నాటికి వేములవాడ రైల్వే స్టేషన్లను అందుబాటులోకి తెచి్చ, 2029 నాటికి కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టును పూర్తి చేస్తామని పేర్కొన్నారు.కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభం చరిత్రాత్మక ఘట్టంగా ఆయన అభివర్ణించారు. సికింద్రాబాద్ నుంచి యాదగిరిగుట్టకు ఎంఎంటీఎస్ రైల్వేలైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేస్తే రైల్వే పనులు మొదలు పెడతామని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఏడు బుల్లెట్ ట్రైన్లు ఉండగా వాటిలో మూడు తెలంగాణ ప్రాంతానికి అనుసంధానం కావడంతో ఎంతో ప్రయోజనం కలుగుతోందని చెప్పారు.దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలలో ప్రభుత్వం ఏది ఉన్నా నరేంద్రమోదీ సమన్యాయం పాటించి అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు కేంద్ర హోంశాఖ సహాయ శాఖ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ.. కొమురవెల్లి భక్తుల కల సాకారం అయిందని, ఆలయ అభివృద్ధి, విస్తరణకు రవాణా వ్యవస్థ దోహదపడుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీలు రఘునందన్‌రావు, చామల కిరణ్‌కుమార్ రెడ్డి, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రొటోకాల్ రగడ.. కొమురవెల్లి రైల్వే స్టేషన్ ప్రారంభ వేడుకల్లో ప్రొటోకాల్ అంశం వివాదాలకు దారి తీసింది. ఎమ్మెల్యే రాజేశ్వర్‌రెడ్డికి తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నినాదాలు చేశారు. మరోవైపు జై శ్రీరామ్ అంటూ కొందరు నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. దీంతో ప్రొటోకాల్ అంశంపై జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేసి ప్రారంభ వేడుక కంటే ముందే వెళ్లిపోయినట్టు సమాచారం. -
వేతన బకాయిలివ్వండి
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు గజ్వేల్: గజ్వేల్‌లోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు ఏడాది కాలంగా వేతనాలు చెల్లించకపోవడం దారుణమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్‌ను శుక్రవారం సందర్శించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కార్మికులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..కార్మికులకు ఇప్పటికే అతి తక్కువ వేతనాలు అమలు చేస్తున్నారన్నారు. అవీ కూడా సకాలంలో అందజేయడం లేదని ఇప్పటికై నా అధికారులు స్పందించి వేతనాలు అందజేయాలని డిమాండ్ చేశారు. కార్మికుల ఇబ్బందులను తెలుసుకున్న గజ్వేల్ లయన్స్ క్లబ్ ఆఫ్ మేధా, లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ జిల్లా రమేశ్ ఆధ్వర్యలో నిత్యావసరాలను అందజేయడానికి ముందుకురాగా...ఆ ప్యాకెట్లను ప్రసాదరావు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, బీఎంఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మరాఠి కృష్ణమూర్తి, బీజేపీ నాయకులు పేర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. సోనమ్ వాంగ్‌చుక్ దీక్షకు మద్దతుగా.. గజ్వేల్‌రూరల్: నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని ఆమరణ దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్చుక్కు మద్దతుగా గజ్వేల్‌లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తా వద్ద శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థి, ఉపాధ్యా, ప్రజా సంఘాల నాయకులు పాల్గొని మాట్లాడారు. నీట్ పేపర్ లీకేజీకి కేంద్ర విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహిస్తూ, రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడవద్దని, నీట్ పేపర్ లీకేజీతో నష్టపోయిన వారికి న్యాయం చేయాలని కోరారు. ప్రాజెక్ట్ డైరెక్టర్ భగవంత్‌రావు సిద్దిపేటరూరల్: ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు కలెక్టరేట్లో ప్రత్యేక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పా టు చేశారు. ఈ మేరకు జిల్లా హౌసింగ్ కార్పొరేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ భగవంత్‌రావు శుక్రవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ పథకానికి సంబంధించిన అర్హతలు, ధ్రువపత్రాల సమర్పణ, చెల్లింపులు, ఇళ్ల నిర్మా ణం, సాంకేతిక అంశాలు, ఇతర సందేహాల నివృతి కోసం హెల్ప్‌డెస్క్ సేవలను లబ్ధిదారులు వినియోగించుకోవాలని సూచించారు. లబ్ధిదారులు టోల్ ఫ్రీ నంబర్ 1800 599 5991కు కాల్ చేయవచ్చని, 08457–224753 ద్వారా ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు సహాయం పొందవచ్చని తెలిపారు. అవసరమైతే సమీప హెల్ప్ డెస్క్ కేంద్రాన్ని కూడా సంప్రదించి తమ సమస్యలను నమోదు చేసుకోవచ్చన్నారు. చేర్యాల(సిద్దిపేట): డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సీటీలో డిగ్రీ పూర్తిచేసేందుకు నోటిఫికేషన్ విడుదలైనట్లు డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రణీత, అధ్యయన కేంద్రం సమన్వయకర్త రజిని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. బీఏ, బీకామ్, బీఎస్సీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అర్హులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. సిద్దిపేటకమాన్: మద్యం తాగి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులకు సిద్దిపేట కోర్టు జరిమానా విధించింది. ట్రాఫిక్ సీఐ ముత్యంరాజు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన డ్రంకెన్ డ్రైవ్‌లో 37 మంది పట్టుబడ్డారు. వారిని కోర్టులో హాజరుపర్చగా శుక్రవారం విచారణ జరిపిన న్యాయమూర్తి వారికి రూ.4.06 లక్షలు జరిమానా, డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపుతూ పట్టుబడిన 31 మందికి రూ.1.55 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ తెలిపారు. -
సమీకృత స్కూల్ పనులు వేగిరం
కలెక్టర్ హైమావతి కోహెడరూరల్(హుస్నాబాద్): మండలంలోని తంగళ్లపల్లి గ్రామ శివారులో రూ.200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ పనులను వేగవంతం చేయాలని కలెక్టర్ హైమావతి స్పష్టం చేశారు. కోహెడ మండలంలో జిల్లా కలెక్టర్ హైమావతి శుక్రవారం సుడిగాలి పర్యటన చేశారు. తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. మొదట తంగళ్లపల్లి శివారులో దాదాపు 23 ఎకారల విస్తీర్ణంలో జరుగుతున్న భారీ విద్యాసంస్థ నిర్మాణ పనులను కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నిర్మాణ ప్రాంతమంతా కలియతిరిగి పనుల పురోగతిని చూసిన ఆమె రాష్ట్రంలోనే నిర్మాణ వేగంలో ఖమ్మం జిల్లాతో సమానంగా సిద్దిపేట అగ్రస్థానంలో కొనసాగుతోందని హర్షం వ్యక్తం చేశారు. ఎలాంటి ఇటుకలు వాడకుండా ఆధునాతన మైవాన్ టెక్నాలజీతో ఈ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కాంప్లెక్స్ రాష్ట్రానికి ఒక రోల్ మోడల్‌గా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. అనంతరం కోహెడలోని బాలుర కళాశాలను సందర్శించి మధ్యాహ్న భోజన ప్రక్రియను క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. అక్కడి వండిన అన్నం,క్యాజేజీ కూర, పప్పు రసం, పెరుగును రుచి చూశారు. ప్రభుత్వం నిర్దేశించిన కామన్ డైట్మెనూను తప్పనిసరిగా పాటించాలని స్పష్టం చేశారు. అనంతరం పాఠశాల స్టాక్ రిజిస్టర్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ రికార్డులను సక్రమంగా రాకపోవడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వంట సిబ్బందికి సరుకులు అందించే ముందు మెస్ కమిటీ సమక్షంలో కొలతల ప్రకారం పారద్శకంగా ఇవ్వాలని అలా కాకుండా జూనియర్ అసిస్టెంట్ ఉపాధ్యాయులు వంట సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తే సహించేంది లేదని హెచ్చరించారు. రికార్డులు రాకయపోవడంపై తక్షణమే విచారణ జరపాలని డీసీఓను ఫోన్ ద్వారా ఆదేశించారు. -
పొదుపు రుణం పక్కదారి
ఒక సభ్యురాలికి రెండు బ్యాంకుల్లో రుణం● రూ.2 కోట్ల రుణాలు దారిమళ్లింపు ● పల్లెలో నిలిచిన శ్రీనిధి రుణాలు ● క్షేత్రస్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చర్యలు తీసుకోలే మా ఊరిలో రెండు గ్రామైక్య సంఘాలు ఉంటే రూ.50 లక్షల వరకు బకాయిలు ఉండటంతో కొత్త వారికి రుణాలు ఇవ్వడంలేదు. బోగస్ సభ్యులతో గ్రూపులు ఏర్పాటు చేసి ఒకరే రుణాలను వాడుకోవడం వల్ల రూ.2 కోట్ల రుణాలు పక్కదారి పట్టాయి. వీటిపై బాధితులు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. అధికారులు స్పందించి దారి మళ్లిన రుణాలను రికవరీ చేసి బాధితులకు న్యాయం చేయాలి. –బొమ్మగాని రాజ్‌కుమార్, ఉపసర్పంచ్, పోతారం మా దృష్టికి ఫిర్యాదు రాలేదు ఒక సంఘం మూడు నెలలు వాయిదాలు క్రమంగా చెల్లించకపోతేనే ఆ సంఘం గురించి బ్యాంకు అధికారులు మా దృష్టికి తీసుకొస్తారు. రుణాలు పక్కదారి పట్టిన విషయంలో మహిళా సంఘం సభ్యులు ఫిర్యాదు చేస్తే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం. –సుధీర్, ఏపీడీ, సిద్దిపేట మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇస్తున్న రుణాలు జిల్లాలో కొన్ని చోట్ల పక్కదారిపడుతున్నాయి. మహిళా సంఘాల ద్వారా తీసుకున్న రుణాలను కొంతమంది దుర్వినియోగం చేయడంతోపాటుగా వాటిని సక్రమంగా తిరిగి చెల్లించకపోవడంతో అవి మొండి బకాయిలుగా మారిపోతున్నాయి. దీంతో కొంతమంది మహిళలకు కొత్త రుణాలు అందడం లేదు. హుస్నాబాద్‌రూరల్: హుస్నాబాద్ మండలంలో 590 సంఘాల్లో 5,740 మంది సభ్యులు బ్యాంకు లింకేజీతో పాటు శ్రీనిధి రుణాలను తీసుకున్నారు. చాలామంది రుణాలు చెల్లించిన కొన్ని గ్రామాల్లో శ్రీనిధిలో మొండి బకాయిలు దాదాపు రూ.95 లక్షల చేరగా జిల్లెలగడ్డ, పోతారం(ఎస్) గ్రామాల్లో రూ.60 లక్షల వరకు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. రుణాలు తిరిగి చెల్లించకపోవడంతో కొత్తవారికి శ్రీనిధి రుణాలు నిలిపి వేసినట్లు సంఘ సభ్యులు వాపోతున్నారు. వ్యవసాయ పెట్టుబడులకు, పాడి పశువుల కొనుగోలుకు అవసరపడతాయని భావించిన మహిళలకు నిరాశే ఎదురవుతోంది. మొండి బకాయిలను వసూలు చేసిన తర్వాతే కొత్త రుణాలు ఇవ్వాలని అధికారులు హుకుం జారీ చేయడంతో సభ్యులకు కొత్త రుణాలు అందడం లేదు. ఒకరికి రెండు బ్యాంకుల్లో రుణం జిల్లాలో 19,897 సంఘాలు ఉండగా అందులో 1,96,623 మంది సభ్యులు వివిధ బ్యాంకుల్లో రుణాలు పొందారు. బ్యాంకుల రుణాలకు తోడు స్వయం ఉపాధి, పాడి పరిశ్రమ ఏర్పాటుకు శ్రీనిధి బ్యాంకు ద్వారా కూడా రుణాలు పొందుతున్నారు. బ్యాంకు లింకేజీల ద్వారా ఉపాధి పొందాలని అధికారులు ఎలాంటి తాకట్టు లేకుండా ఒక్కొక్క సంఘానికి రూ.20లక్షల వరకు బ్యాంకు లింకేజీలు ఇప్పిస్తున్నారు. కొందరు అధికారుల మంచితనం ఆసరా చేసుకుని ఒక బ్యాంకులో లింకేజీ తీసుకున్న గ్రూపు సభ్యులు రుణం చెల్లించకపోవడంతో ఆ గ్రూపులను అధికారులు బ్లాక్ లిస్టులో పెట్టారు. గ్రామాల్లోని సీఏల సహకారంతో అదే సభ్యులతో లీడర్లను మార్చి కొత్తగ్రూపు ఏర్పాటు చేసి మరో బ్యాంకులో లింకేజీ ఇప్పించారు. ఇందులో కెనరా, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల్లో బోగస్ మహిళా గ్రూపు సభ్యులు రుణాలు పొందినట్లు విశ్వసనీయ సమాచారం. సుమారు రూ.2 కోట్ల బ్యాంకు లింకేజీ బోగస్ గ్రూపుల పేరుతో తీసుకుని మరొక్కరు రుణాలను సొంతానికి వాడుకున్నట్లు మహిళా సంఘం సభ్యులు ఆరోపిస్తున్నారు. హుస్నాబాద్ ఏపీఎం దగ్గరకు పోతారం(ఎస్) మహిళలు వచ్చి మాకు ఒక బ్యాంకు రుణమే తెలుసు రెండో బ్యాంకు రుణం మాకు తెలియదని ఫిర్యాదు చేయడంతో ఏపీఎం గ్రామ సంఘం సమావేశం ఏర్పాటు చేసి రుణం పొందిన వారి వివరాలను వెల్లడించారు. గ్రామైక్య సంఘం అధ్యక్షులను, సీఏలను అధికారులు వారికి అనుకూలమైన వారిని ఎంపిక చేసుకుని నడిపించడం వల్ల ఇలాంటి అక్రమాలు బయటకు రావడం లేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పుణ్య తీరం.. దోపిడీ తీర్థం
ఏడుపాయల్లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కబేలా.. దోపిడీకి అడ్డాగా మారింది. రూ.300 విలువ చేసే కోడి కోయాలంటే రూ.200 వసూలు చేస్తున్నారు. మేక, గొర్రెలకై తే బరువును బట్టి కాకుండా కాంట్రాక్టర్ చెప్పిందే ధర. ఇక కొబ్బరికాయల విక్రయాల్లో సైతం నేతి దీపాలు ఇవ్వడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొక్కులు మొక్కి, మూట గట్టుకొని తెచ్చిన ఒడి బియ్యం సమర్పణలో సైతం కాంట్రాక్టర్ బలవంతపు కట్నాలు వసూలు చేస్తున్నాడని భక్తులు చెబుతున్నారు. దుర్గమ్మ సాక్షిగా భక్తుల నిలువు దోపిడీ కొనసాగుతున్నా.. ఆలయ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. – పాపన్నపేట(మెదక్)దుర్గమ్మసాక్షిగాబరితెగింపునిబంధనలకువిరుద్ధంగాకబేలా నిర్వహణతెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఏడుపాయలకు నిత్యం వేలాది భక్తులు వస్తుంటారు. మందు, విందు అక్కడ నిత్యకృత్యం. అయితే ఇక్కడ జంతు బలి నిషేధం. గతంలో భక్తులు ఎక్కడ బడితే అక్కడే మేకలు, గొర్రెలు కోసే వారు. దీంతో 2019లో అనధికారికంగా అప్పటి పాలకవర్గం కబేలా కోసం ఒక పర్మనెంట్ షాప్ నిర్మించి, ఐదేళ్ల పాటు ఎలాంటి రుసుము లేకుండా నిర్వహించుకోవాలని తీర్మానం చేసింది. మేకకు 10 కిలోల లోపు రూ.400, 10–20 కిలోల లోపు రూ.500, 20 కిలోలపై రూ.600 వసూలు చేయాలని నిర్ణయించారు. ఒక్కో మూగ జీవిపై రూ.25 దేవస్థానానికి ఇవ్వాలని సూచించారు. ఈ మేరకు మెదక్‌కు చెందిన కాంట్రాక్టర్ ఒప్పందం చేసుకొని 2024 వరకు నిర్వహించాడు. నిర్ణయించిన సమయం పూర్తి కావడంతో అతడిని తొలగించాలని కోరుతూ నాగ్సాన్పల్లి గ్రామస్తులు కబేలా ఎదుట ధర్నా నిర్వహించారు. దీంతో ఆలయ అధికారులు కబేలా సీజ్ చేసి, స్థానిక వ్యాపారులకు అవకాశం కల్పించారు. అయితే తాను కరోనా సమయంలో నష్టపోయినందున, తనకు సమయం పెంచాలని కోరుతూ అతడు కోర్టుకు వెళ్లాడు. కాగా, ఇటీవల ఆలయ అధికారులు, కాంట్రాక్టర్‌తో మాట్లాడి కోర్టు కేసు విత్ డ్రా చేయించారు. రెండు నెలల క్రితం తిరిగి కబేలా నిర్వహణ అతడికే అప్పగించారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మేకలు, గొర్రెలకు బరువును బట్టి కాకుండా, తనకు ఇష్టమొచ్చిన రీతిలో రూ.700 నుంచి 1,000 వరకు వసూలు చేస్తున్నాడన్న ఆరోపణలున్నాయి. ఇక రూ.300 కోడిని, కట్ చేయడానికి రూ.200 తీసుకుంటున్నారు. దేవస్థానానికి మాత్రం మేకకు రూ.50 టికెట్ తీసుకోవాల్సి ఉంది. ఒడి బియ్యం సమర్పణలోనూకట్నాల వసూలు ఏడుపాయల్లో కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం ఇక ఇదే కాంట్రాక్టర్‌కు కొబ్బరికాయల కాంట్రాక్ట్ సైతం ఉంది. కొబ్బరికాయను నెయ్యి దీపంతో కలిపి రూ.50కి విక్రయించాలి. కానీ నెయ్యి దీపం లేకుండా అమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే మరో ఒడి బియ్యం కాంట్రాక్టర్ సైతం భక్తుల నుంచి కట్నం పేరిట రూ.100 నుంచి 200 బలవంతంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. చేతికి కట్టే దారానికి రూ.10 నుంచి 20 వరకు దండుకుంటున్నారని భక్తులు అంటున్నారు. ధర్మ సత్రాలు కేటాయించడంలో కూడా ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఇలా దుర్గమ్మ సాక్షిగా ఏడుపాయలకు వచ్చే భక్తులు నిలువు దోపిడీకి గురవుతున్నారు. ఈ విషయమై ఈఓ వీరేశంకు ఫోన్లో వివరణ కోరగా స్పందించలేరు. -
ఒక్కొక్కరితో పనులెలా సాగేది?
● తాగునీటి ట్యాంక్ పనులు త్వరితగతిన జరగాలి ● వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ బాగుండాలి ● మున్సిపల్ అధికారులతో మాజీమంత్రి హరీశ్‌రావు సమీక్ష సిద్దిపేటజోన్: జిల్లాలో ఏకై క స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీ సిద్దిపేటలో ఒక్క అసిస్టెంట్ ఇంజనీరు, ఒక్క శానిటరీ ఇన్స్పెక్టర్తో పనులు ఎలా జరిగేది? రెగ్యులర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటనే అధికారులను నియమించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు మున్సిపల్ ఉన్నతాధికారులను ఫోన్ ద్వారా కోరారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపల్ అభివృద్ధి పనులపై శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఈ పనుల స్థితిగతులు గురించి ఆరా తీశారు. నలుగురు అసిస్టెంట్ ఇంజనీర్లకుగాను ఒక్కరే విధుల్లో ఉండడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాళీల వల్ల మున్సిపాలిటీ పనులెలా నడుస్తాయని ప్రశ్నించారు. మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఈఎన్సీకి ఫోన్ చేసి ఇంజనీరింగ్ పనుల వేగవంతం కోసం అసిస్టెంట్ ఇంజనీర్లను ఏర్పాటు చేయాలని కోరారు. పట్టణంలో మిగిలిన యూజీడీ పనులను వెంటనే ప్రారంభించాలని, ఇందుకు సంబంధించిన టెండర్ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. అనంతరం చెరువుల పనులను వేగవంతం చేయాలని, వివిధ కూడళ్లలో అభివృద్ధి పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్‌కు సూచించారు. పట్టణంలో నిర్మిస్తున్న నీటిట్యాంక్ల పనులను పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో పారిశుద్ధ్య నిర్వహణ సక్రమంగా అమలు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. మున్సిపాలిటీలో సేవలు పారదర్శకంగా అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమీక్షలో మున్సిపల్ మేనేజర్ శ్రీనివాస్, డీఈ ప్రేరణ పాల్గొన్నారు. -
గోదావరి జలాలు విడుదల చేయాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): గోదావరి నీటిని విడుదల చేసి రంగనాయక సాగర్ రిజర్వాయర్ నింపాలని గ్రామ సభల్లో గురువారం ఏకగ్రీవ తీర్మానం చేశారు. చిన్నకోడూరు, పెద్దకోడూరు, గంగాపూర్ గ్రామాల్లో గురువారం నిర్వహించిన గ్రామసభల్లో గ్రామస్తులు, వార్డు సభ్యులు, సర్పంచ్‌లు రంగనాయక సాగర్‌కు నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఏక గ్రీవ తీర్మానం చేసి తహసీల్దార్, ఎంపీడీఓలకు సదరు పత్రాలు అందజేశారు. కళ్ల ముందు నారుమడులు ఎండిపోతుంటే రైతులు ఆందోళన చెందుతున్నారని, నీటిని విడుదల చేసి రైతులను ఆదుకోవాలని కోరారు. -
సీజేపీకి భయపడి కాంగ్రెస్, బీజేపీ డ్రామాలు
ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డిగజ్వేల్: కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)కి భయపడి...కాంగ్రెస్, బీజేపీ డ్రామాలాడుతూ ప్రజలను తప్పు దోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు. గజ్వేల్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...నీట్ ప్రశ్నపత్రం లీకేజీపై కేంద్రమంత్రి ధర్మేంద్రప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేస్తూ గత 21రోజులుగా విద్యార్థుల ఉద్యమాల నేపథ్యంలో ప్రజల్లో కాక్రోచ్ జనతాపార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి కాంగ్రెస్, బీజేపీలు భయపడుతున్నాయన్నారు. రాష్ట్రంలోనూ పోటాపోటీగా ఈ రెండు పార్టీలు ఆందోళన కార్యక్రమాలను చేపడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని చెప్పారు. వైద్య విద్యార్థుల సమస్యల పరిష్కారాని కి బీఆర్ఎస్ శుక్రవారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద ఆందోళన నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ గజ్వేల్ పట్టణ శాఖ అధ్యక్షుడు నవాజ్‌మీరా, మాజీ జెడ్పీటీసీ మల్లేశం, మాజీ ఆత్మకమిటీ చైర్మన్ ఊడెం కృష్ణారెడ్డి, మున్సిపల్ కౌన్సిలర్లు శ్రీనివాస్, కోటబాబు, నాయకులు బొగ్గుల సురేశ్ తదితరులు పాల్గొన్నారు. -
పడని వర్షం..
రైతు నేస్తాలను కాపాడుదాంమితిమీరిన రసాయన మందులవినియోగంతో మిత్ర పురుగులు, పక్షులు కనుమరుగవుతున్నాయి. వివరాలు 8లో uప్రత్యామ్నాయ పంటల వైపు మరలేనా? వీడని భయంసాక్షి, సిద్దిపేట: జిల్లాలో సాధారణంగా ఖరీఫ్‌లో 5.40 లక్షల పంటలు సాగయ్యే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో వరి 3.60 లక్షల ఎకరాలు, పత్తి 1.18 లక్షలు, మిగతా పంటలు 62వేలలో సాగయ్యే అవకాశాలున్నాయని ముందుగా ప్రకటించింది. ఎల్‌నినో ప్రభావంతో సాగు అనుకున్నంతస్థాయిలో కావడం లేదు. లోటువర్షపాతం ఉండటంతో ప్రత్యామ్నాయ పంటలు వేయాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇప్పటివరకు కేవలం 34 శాతమే జిల్లాలో ఇప్పటివరకు 1,83,710 ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతున్నాయి. అందులో పత్తి అత్యధికంగా 1,01,009 ఎకరాల్లో వేయగా, 57,093 ఎకరాల్లో వరి, 24,509 ఎకరాల్లో మొక్కజొన్న, మిగతా పంటలు 1,099 మాత్రమే సాగుచేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ శాఖ అంచనా వేసిన దాంట్లో కేవలం 34% మాత్రమే పంటలు వేశారు. వరి పంటల సాగు నుంచి రైతులను ఆరుతడి పంటల వైపు కొత్తగా 1.25లక్షల ఎకరాలు మళ్లీంచాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. 41 వేల ఎకరాల్లో ఉద్యాన పంటల సాగు జిల్లా వ్యాప్తంగా ఉద్యాన పంటలు ప్రస్తుతం 41వేల ఎకరాల్లో సాగవుతుండగా మరో 11,970 ఎకరాలకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందుకోసం కేవలం ఆయిల్‌పామ్‌కు సంబంధించిన మొక్కలు మాత్రమే అందుబాటులో ఉండగా మిగతా పండ్ల మొక్కలు, కూరగాయల విత్తనాలను రైతులే ఏర్పాటు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం విత్తనాలు అందుబాటులో ఉంచితే కూరగాయ పంటలు సాగయ్యేవని రైతులు అభిప్రాయపడుతున్నారు.ఓ వైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు ఆరుతడి పంటలను వేస్తే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో లేదననే భయాందోళనలు రైతులను వెన్నాడుతున్నాయి.ప్రస్తుతం అన్నదాతల చూపంతా ఆకాశం వైపే ఉంది. వర్షాలు ఆశించిన స్థాయిలో కురిసే పరిస్థితి లేకపోవడంతో ఆరుతడి పంటలే వేయాలని జిల్లా యంత్రాంగం, వ్యవసాయ శాఖ గ్రామాల్లో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నారు. ఈ వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటలను సాగు చేస్తారా? వరి సాగుకే మొగ్గుచూపుతారా? లేక ఏ పంటలు వేయకుండా వదిలేస్తారా? అనేది చూడాలి. -
విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథం పెంపొందించాలి
ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి దుబ్బాకటౌన్: ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల్లో శాసీ్త్రయ దృక్పథాన్ని పెంపొందించాలని అందకుక డిజిటల్ స్కిల్స్ దోహదపడతాయని రాయ పోల్ మండల విద్యాధికారి రాజగోపాల్‌రెడ్డి సూచించారు. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డి రూ.1.50లక్షల విలువచేసే ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్‌ను సైన్స్ ల్యాబ్‌ను స్వంత ఖర్చులతో ఏర్పాటు చేశారు. ఎంఈఓ రాజగోపాల్‌రెడ్డి గురువారం ల్యాబ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నేటి పోటీ ప్రపంచంలో టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని దానికి అనుగుణంగా విద్యార్థులలో డిజిటల్ స్కిల్స్ నేర్పించడానికి ఈ ఇంటరక్టివ్ ఫ్లాట్ ప్యానల్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. విద్యార్థుల కోసం ఈ ప్యానల్‌ను అందించిన ఉపాధ్యాయుడు భాస్కర్‌రెడ్డిని ఎంఈఓ అభినందించారు. -
ఆనందం మూణ్నాళ్ల ముచ్చటేనా!
హుస్నాబాద్: కరీంనగర్ రీజియన్ పరిధిలో ఉన్నప్పుడు ఏదైనా పని కోసం రీజినల్ మేనేజర్ కార్యాలయానికి వెళ్లాలంటే కేవలం 40 కి.మీ దూరం ఉండేది. ప్రస్తుతం మెదక్ వెళ్లాలంటే దాదాపు 100 కి.మీ. దూరం వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతీ నెల ఆడిట్, ఏదైనా కేసుల విషయంలో అప్పీలు చేయాలన్నా, కార్మికుల సమస్యలు, డిపో మెయింటనెన్స్ ఇలా ప్రతీ విషయంలో ఆర్ఎం ఆఫీస్‌కు వెళ్లాల్సి ఉంటుంది. బస్సులకు సంబంధించి నట్లు, బోల్టులు ఇతరత్రా సామగ్రి ఇండెంట్ కోసం మెదక్ వెళ్లాలంటే సమయం వృథా అవుతుంది. పని కాకుంటే అక్కడే మరో రోజు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పాలనాసౌలభ్యం కోసం ఆర్టీసీ డిపోలను ఒకే జిల్లా, ఒకే రీజియన్ పరిధిలో చేరుస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం హుస్నాబాద్ ఆర్టీసీ డిపో తప్ప, అన్ని శాఖల కార్యకలాపాలు సిద్దిపేట జిల్లా పరిధిలో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మెదక్ రీజియన్ పరిధిలోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను విలీనం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ డిపోను మెదక్ రీజియన్‌లో కలపవద్దని, యథావిధిగా కరీంనగర్‌లోనే ఉంచాలని ఆర్టీసీ కార్మికులు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు విన్నవించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ ఉన్నతాధికారులతో ఆర్టీసీ విలీనం అంశంపై ఫోన్లో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్ పరిధిలోనే ఉంచాలని కరాఖండిగా చెప్పినట్లు సమాచారం. హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో కలపాలని ఎప్పటి నుంచో ఇక్కడి ప్రజల డిమాండ్ ఉంది. శాసనసభ ఎన్నికల ప్రచారంలో హుస్నాబాద్‌కు వచ్చిన అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హుస్నాబాద్‌ను కరీంనగర్ జిల్లాలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ నినాదంతోనే పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా, మంత్రి అయ్యారు. ప్రస్తుతం కరీంనగర్లో ఉన్న ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లో విలీనం చేశారనే ప్రచారంతో హుస్నాబాద్ విలీన ప్రక్రియ మళ్లీ చర్చకు దారితీస్తోంది. కరీంనగర్లో ఉన్న డిపోను మెదక్ రీజియన్‌లో కలుపుతారనే ప్రచారంతో, విలీన ప్రక్రియపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మెదక్ రీజియన్‌లోకి హుస్నాబాద్ ఆర్టీసీ డిపో! జిల్లాల పునర్విభజన నేపథ్యంలో కరీంనగర్ జిల్లాలో ఉన్న హుస్నాబాద్‌ను సిద్దిపేట జిల్లాలో విలీనం చేశారు. ఈ నేపథ్యంలోనే హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ (సంగారెడ్డి) రీజియన్‌లోకి మార్చారు. ఇక్కడి ఉద్యోగులు, కార్మికులు ప్రతీ పనికి దాదాపు వంద కిలో మీటర్ల దూరంలో ఉన్న సంగారెడ్డిలోని ఆర్ఎం ఆఫీస్‌కు వెళ్లి రావాలంటే ఒక్క రోజు సమయం పట్టేది. కార్మికుల ఒత్తిడి మేరకు మళ్లీ హుస్నాబాద్ డిపోను కరీంనగర్ రీజియన్‌లోకి మార్చారు. కరీంనగర్‌లోకి మార్చారనే సంతోషం ముణ్నాళ్ల ముచ్చటగానే మారింది. మళ్లీ హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లోకి మార్చారనే ప్రచారంతో కార్మికులు ఆందోళన చెందుతున్నారు. హుస్నాబాద్ ఆర్టీసీ డిపోలో 44 ఆర్టీసీ బస్సులు, 22 అద్దె బస్సులున్నాయి. 233 మంది ఉద్యోగులు, 25 మంది అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. డిపోలోని బస్సులు ప్రతీ రోజు 26 వేల కిలో మీటర్లు, రూ.15లక్షల కలెక్షన్ వస్తోందని అంచనా.అధికారికంగా ఉత్తర్వులు రాలేదు హుస్నాబాద్ ఆర్టీసీ డిపోను మెదక్ రీజియన్‌లోకి విలీనం చేసినట్లుగా అధికారికంగా ఎలాంటి ఉత్తర్వులు రాలేదు. విలీన ప్రక్రియపై సమాచారం లేదు. ప్రస్తుతం డిపో కరీంనగర్ రీజియన్‌లోనే కొనసాగుతుంది. విలీనం అయినట్లు జరుగుతున్న ప్రచారం ఎవరు నమ్మొద్దు. –వెంకన్న, ఆర్టీసీ డిపో మేనేజర్, హుస్నాబాద్ -
పీఆర్సీని 55% ఫిట్మెంట్తో ఇవ్వాలి
వంగ మహేందర్‌రెడ్డి సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం 55% ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని వెంటనే ప్రకటించాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నారాయణరావుపేట మండల పరిధిలోని జక్కాపూర్, గుర్రాలగోంది, తెలంగాణ రెసిడెన్షియల్ పాఠశాల, నారాయణరావుపేట, లక్ష్మిదేవిపల్లి, గోపులాపూర్, ఏదుల్లవాడ తదితర పాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వంగ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ..పీఆర్సీని తక్షణమే ప్రకటించి, పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలన్నారు. -
రైల్వే స్టేషన్ ప్రారంభోత్సవ పనుల పరిశీలన
కొమురవెల్లి(సిద్దిపేట): కొత్తపల్లి–మనోహరాబాద్ రైల్వేమార్గంలో కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయ సమీపంలో నిర్మించిన రైల్వేస్టేషన్‌ను ఈ నెల 26న కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా గురువారం దక్షిణ మధ్య రైల్వే అధికారులు స్టేషన్లో బుకింగ్ కౌంటర్, ప్లాట్‌ఫాం, ప్రయాణికులకు అవసరమైన వసతులు, ప్రా రంభోత్సవ సమయంలో నాయకులు ఏర్పాటు చేసే సమావేశం, పార్కింగ్ కోసం స్థల పరిశీలన, భద్రత ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కార్యక్రమంలో సీపీఆర్ఓ శ్రీధర్, ఏడీఆర్ఎం రామారావు, సీనియర్ డెన్ ప్రసాద్, సీనియర్ సీసీఎం అనిరుధ్, ఏఎస్సీ రవిశర్మ, సీనియర్ డీఓఎం విద్యాధర్, సృజనకుమార్, నవ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో హాజరు పెంచాలిమల్లంపల్లి పాఠశాలను సందర్శించిన డీఈఓ అక్కన్నపేట(హుస్నాబాద్): ప్రభుత్వ పాఠశాలలకు ప్రతీ రోజూ పిల్లలు వచ్చేలా చూడాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులను డీఈఓ రమేశ్ ఆదేశించారు. అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం అమలు తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా రాగి జావా, కోడిగుడ్లు ప్రోటీన్‌ను అందజేస్తాయని విద్యార్థులకు సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ...పాఠశాలలకు రాని పిల్లల ఇళ్లకు ఉపాధ్యాయులు వెళ్లి వారి తల్లిదండ్రులతో మాట్లాడి విద్యార్థులను వెంట పెట్టుకుని బడులకు తీసుకురావాలన్నారు. అలాగే తరగతి గదిలో విద్యార్థులను వివిధ సబ్జెక్ట్‌లలో సామర్థ్యాలపై ప్రశ్నలు అడుగుతూ వారి ప్రతిభను గమనించారు. కార్యక్రమంలో ఎంఈఓ గుగులోతు రంగానాయక్, ఉపాధ్యాయులు సర్వన్నాయక్తోపాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. సమీకృత భవనం పూర్తి చేయండి: బీఆర్ఎస్హుస్నాబాద్: హుస్నాబాద్ పట్టణంలోని పాత తహసీల్దార్ కార్యాలయ స్థలంలో పెండింగ్‌లో ఉన్న శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులు వెంటనే పూర్తి చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అసంపూర్తిగా ఉన్న సమీకృత భవనం ఎదుట చేపల వ్యాపారులతో కలిసి గురువారం బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ..గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన శాకాహార, మాంసాహార భవన నిర్మాణ పనులకు నిధులు కేటాయించకుండా వివక్ష చూపుతున్నారన్నారు. బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. చేపలు అమ్ముకునే వ్యాపారులకు మున్సిపల్ అధికారులు కనీస సౌకర్యాలు కల్పించడం లేదన్నారు. ఈ భవనం పూర్తిచేస్తే చేపల వ్యాపారులకు కొంత వరకు మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, చిత్తారి శ్రీనివాస్, వికాస్‌యాదవ్, యాస శ్రీనివాస్ తదితరులున్నారు. విద్యార్థులను రెచ్చగొడుతున్న రాహుల్బీజేపీ జిల్లా నాయకుడు శ్రీనివాస్ మిరుదొడ్డి(దుబ్బాక): కాంగ్రెస్ ఉనికిని చాటుకోవడం కోసం ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని బీజేపీ జిల్లా సీనియర్ నేత కానుగంటి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ నాయకులతో కలిసి మిరుదొడ్డిలో గురువారం రాహుల్‌గాంధీ దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశ ఔనత్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న రాహుల్ గాంధీ విద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్నారన్నారు. ప్రజా సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న మోదీ ప్రభుత్వంపై విద్యార్థులను ఉసిగొల్పి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కరుణాకర్, వార్డు సభ్యులు లింగాల సదానందరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, బీజేపీ నాయకులు రమేశ్, స్వామి, ఎల్లం పాల్గొన్నారు. -
అరెస్ట్‌లు అప్రజాస్వామికం
కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ములుగు(గజ్వేల్): విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం ఢిల్లీలో శాంతియుతంగా నిరసన చేపట్టిన కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గేల అరెస్ట్‌లు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేతల అరెస్ట్‌లను ఖండిస్తూ ములుగు అంబేడ్కర్ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలసి గురువారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..‘భేటీ పడావో’నినాదంతో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ సర్కార్ ఢిల్లీలో విద్యార్థినుల పట్ల జరిగిన దాడి గురించి ఎందుకు మాట్లాడటం లేదన్నారు. పేపర్ లీక్‌పై విద్యార్థులు ఉద్యమిస్తే అరెస్ట్‌లు చేసి ఇబ్బందులకు గురిచేయడం ఎంతవరకు సమంజసమని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం రాజీవ్‌రహదారిపై ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు కడపల్ల కృష్ణారెడ్డి, చక్రాల రఘు, పంచాయతీ రాజ్ సంఘటన్ జిల్లా అధ్యక్షుడు నరసింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ మాజీ సభ్యుడు సలీం, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయమోహన్, సర్పంచ్‌లు ముత్యంరెడ్డి, లహరి, మమత, పోచయ్య, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
యోగా టీచర్ నియామకం ఎప్పుడు?
సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని 33 పీఎంశ్రీ స్కూళ్లకు యోగా టీచర్లను నియమించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతేడాది నుంచి పీఎం శ్రీ స్కూళ్లలో యోగాను నేర్పిస్తున్నారు. ఈ ఏడాది పాఠశాలలు ప్రారంభమై 40 రోజులు గడుస్తున్నా ఇప్పటివరకు యోగా టీచర్లను నియమించలేదు. దీంతో విద్యార్థు లు యోగాకు దూరమవుతున్నారు. పీఎంశ్రీ స్కూళ్ల లో యోగా టీచర్ నియామకం కోసం నెలకు రూ. 10 వేల బడ్జెట్‌ను కేటాయిస్తోంది. గతేడాది నెలకు రూ.8వేల చొప్పున రూ.80వేలను జమ చేశారు. కానీ విద్యాశాఖ నిర్లక్ష్యంతో చివరి నాలుగు నెలలు మాత్రమే యోగా టీచర్‌ను నియమించారు. ఇప్పటి కైనా అధికారులు స్పందించి యోగా టీచర్లను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
మెరుగైన వైద్య సేవలు అందించాలి
ఆస్పత్రి ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ హైమావతిహుస్నాబాద్: ప్రభుత్వాస్పత్రికి వచ్చే ప్రతీ ఒక్కరికీ మెరుగైన వైద్య సేవలందిస్తున్నామనే భరోసా కల్పించాలని కలెక్టర్ హైమావతి పేర్కొన్నారు. పట్టణంలోని ప్రభుత్వాస్పత్రిని గురువారం తనిఖీ చేశారు. సిబ్బంది సమయ వేళలు పాటిస్తున్నారా? లేదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..సీజనల్ వ్యాధులకు సంబంధించి వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆస్పత్రిలో పలు విభాగాలకు సంబంధించి వైద్య సిబ్బంది కావాలని కోరగా స్పందిస్తూ...దగ్గరలోని ఆస్పత్రి నుంచి వైద్యులు, సిబ్బందిని హుస్నాబాద్ ఆస్పత్రికి కేటాయించాలని డీఎంహెచ్ఓకు ఫోన్ చేసి ఆదేశించారు. ఆస్పత్రి ఎదుట రూ.82 కోట్లతో కొత్తగా చేపడుతున్న 250 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులను పరిశీలించారు. -
ఆరుతడి పంటలే సాగు చేయండి
మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ హుస్నాబాద్‌రూరల్/హుస్నాబాద్: రైతులు వరి సాగు తగ్గించి ఆరుతడి పంటలే సాగు చేయాల ని మంత్రి పొన్న ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణలో ఎల్‌నినో ప్రభావంతో వచ్చే జూన్ వరకు వర్షాలు పడే అవకాశం లేదని శాస్త్రవేత్తలు చెబుతున్నా వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని అవగాహన కల్పిస్తున్నా రైతు లు వినడం లేదని మంత్రి ఆందోళ న వ్యక్తం చేశారు. హుస్నాబాద్ డివిజన్ ఇంటి గ్రేటెడ్ కార్యాలయంలో మూడు జిల్లాల కలెక్ట ర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావం ప్రత్యా మ్నాయ పంటల సాగుపై గురువారం నిర్వహించిన సమీక్షలో మంత్రి పాల్గొని దిశానిర్దేశం చేశారు. వందెకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసే గ్రామాలకు ప్రభుత్వం రూ.5లక్షల ప్రోత్సా హం అందిస్తోందని చెప్పారు. ఆయిల్‌పామ్ ఉత్పత్తులను మార్కెటింగ్ చేసేందుకు నర్మెటలో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. నీటి వనరులను ఆయా జిల్లాల కలెక్టర్లు పర్యవేక్షించి తాగునీటి సరఫరాకు ఇబ్బందులు రాకుండా చూడాలన్నారు. గౌరవెల్లి ప్రాజెక్టు కాల్వల భూ సేకరణకు రూ.250 కోట్లు మంజూ రయ్యాయని, ఆ పనులు వేగవంతం చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. జలసిరి పెంచడానికి వీబీజీరాంజీ పథకాన్ని సద్వినియోగం చేసుకుని ఇంటింటికీ ఇంకుడు గుంతలు తవ్వించి భూ గర్భ జలాలను పెంచాలని సూచించారు. ఎల్ని నోను జాతీయ విపత్తుగా గుర్తించడానికి ప్రభు త్వం కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. -
దుబ్బాకలో పోటాపోటీ
దుబ్బాక: దుబ్బాక పట్టణంలో కాంగ్రెస్..బీజేపీ నాయకుల పోటాపోటీ ఆందోళనలతో బుధవారం ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలో రాహుల్‌గాంధీ అరెస్టును నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బస్టాండ్ వద్ద పెద్ద ఎత్తున కాంగ్రెస్ నాయకులు ప్రధాన రోడ్డుపై బైఠాయించి ధర్నా, రాస్తారోకో చేపట్టారు. ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్ నాయకులను పోలీసులు బలవంతంగా అక్కడినుంచి పంపించారు. ఈ క్రమంలోనే ఈ విషయం తెలుసుకున్న బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని రోడ్డుపై ఆందోళన చేపట్టారు. రాహుల్‌గాంధీ దిష్టిబొమ్మను దహనం చేశారు. దీంతో పోలీసులు వారిని కూడా అడ్డుకుని అక్కడి నుంచి పంపించివేశారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల పోటాపోటీగా ఆందోళనలతో పోలీసులకు వారిని కట్టడి చేయడం ఇబ్బందిగా మారింది. ఆందోళనలో కాంగ్రెస్ దుబ్బాక పట్టణ, మండల అధ్యక్షులు చంద్రారెడ్డి,నరేందర్‌రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కొంగరి రవి,పీఏసీఎస్ వైస్ చైర్మన్ కాల్వ నరేశ్, నాయకులు మచ్చ శ్రీనివాస్, శ్రీరాం నరేందర్, కౌన్సిలర్లు తునికి సురేశ్ పాల్గొనగా బీజేపీ ఆందోళనలో రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్‌గౌడ్, సుభాష్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, ప్రవీణ్,రమణారెడ్డి,రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ధర్మేంద్రను బర్త్‌రఫ్ చేయాలి
గజ్వేల్: నీట్ ప్రశ్న పత్రాల లీకేజీకి బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖమంత్రి ధరేంద్రప్రధాన్ రాజీనామా చేయాలని, లేనిపక్షంలో రాష్ట్రపతి ఆయనను బర్తరఫ్ చేయాలని సిద్దిపేట డీసీసీ అధ్యక్షురాలు తూంకంట ఆంక్షారెడ్డి డిమాండ్ చేశారు. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద నిరసన చేపట్టిన విద్యార్థులపై లాఠీచార్జి, రాహుల్‌గాంధీతో ఇతర అగ్రనేతలను అక్రమంగా నిర్బంధించి ఈడ్చుకెళ్లిన ఘటనకు వ్యతిరేకంగా గజ్వేల్‌లో కాంగ్రెస్ అధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీ, రాస్తారోకో, ధర్నా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రలు ధర్మేంద్రప్రధాన్, అమిత్‌షా దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి బాధ్యుడైన ధరేంద్రప్రధాన్కు ప్రధాని నరేంద్రమోదీ వత్తాసు పలకడం సరికాదన్నారు. అప్రజాస్వామిక పద్ధతుల్లో పాలన కొనసాగిస్తున్న నరేంద్రమోదీ, అమిత్‌షాలకు ప్రజల నుంచి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో గజ్వేల్, వంటిమామిడి, కుకునూర్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్లు నరేందర్‌రెడ్డి, విజయామోహన్, శ్రీనివాస్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి నాయిని యాదగిరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సర్థార్ఖాన్, ఆత్మ కమీటీ చైర్మన్ కనకయ్య తదితరులు పాల్గొన్నారు. -
విద్యార్థులపై దాడి అమానుషం
సిద్దిపేట కాంగ్రెస్ ర్యాలీలో పార్టీ నాయకులుసిద్దిపేటకమాన్: ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద చేస్తున్న నిరసన కార్యక్రమంలో విద్యార్థులపై దాడి చేయడం అమానుషమని సిద్దిపేట కాంగ్రెస్ నాయకులు తెలిపారు. రాహుల్ గాంధీని అరెస్ట్‌ను నిరసిస్తూ, కేంద్ర శాఖ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని కోరుతూ జిల్లా కేంద్రం సిద్దిపేట రైతుబజార్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి కాంగ్రెస్ నాయకులు బుధవారం ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..నీట్ పరీక్ష పత్రాల లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలన్నారు. రాజీనామా చేయకపోతే బీజేపీ నాయకుల ఇళ్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. పిల్లలు లేని మోదీకి విద్యార్థుల విలువ తెలియదని చురకలంటించారు. కార్యక్రమంలో ఆత్మకమిటీ చైర్మన్ గోపీకృష్ణ, పట్టణ అధ్యక్షుడు అత్తుఇమామ్, మార్క సతీశ్, బొమ్మల యాదగిరి, మీసం నాగరాజు, మహేందర్, అంజయ్య, ప్రవీణ్, ప్రభాకర్, సంతోషి, తదితరులు పాల్గొన్నారు. -
నవోదయలో ఫుట్‌బాల్ సెలెక్షన్స్ మీట్
వర్గల్(గజ్వేల్): సిద్దిపేట జిల్లా వర్గల్ నవోదయ వేదికగా ఫుట్‌బాల్ రీజినల్ సెలెక్షన్స్ మీట్ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది. వర్షం తాకిడికి స్టేడియం చిత్తడిగా మారడంతో ఎంపీ హాల్లో ప్రారంభోత్సవ వేడుక నిర్వహించారు. ఆతిథ్య నవోదయ ప్రిన్సిపాల్ దాసి రాజేందర్ జ్యోతి ప్రజ్వలన చేసి మూడు రోజుల మీట్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గతేడాది సుబ్రతోకప్ టోర్నమెంట్ అనుభవాన్ని రంగరించి సెలెక్షన్స్ మీట్‌ను సమర్థవంతంగా నిర్వహిస్తామన్నారు. వివాదాలకు తావివ్వకుండా మీట్ సక్సెస్‌కు అందరూ సహకరించాలని కోరారు. వైస్‌ప్రిన్సిపాల్ మోహన్రాథోర్, సెలెక్షన్ కోచ్‌లు, ఎస్కార్ట్ టీచర్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, కేరళ, కర్ణాటక, పుదుచ్చేరి, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నవోదయ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. భయపెట్టిన వర్షం.. మూడు గంటలు ఆలస్యం సెలెక్షన్ మీట్‌ను వర్షం భయపెట్టింది. తెరిపిలేని వర్షంతో బుధవారం ఉదయం ఎంపిక పోటీలకు బ్రేక్ పడింది. వర్షం తెరిపివ్వడంతో మూడు గంటలు ఆలస్యంగా మధ్యాహ్నం నుంచి ప్రాథమిక దశ సెలెక్షన్స్ నిర్వహించారు. రీజియన్ జట్టు కూర్పునకు ప్రావీణ్యం కలిగిన క్రీడాకారులు ఫోకస్‌గా కేటగిరీల వారీగా ఇవి కొనసాగాయి. -
ప్రభుత్వ భూములను పరిరక్షించాలి: కలెక్టర్
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి తహసీల్దార్‌కు సూచించారు. మండల పరిధిలోని బుధవారం కిష్టాపూర్ రోడ్డులో అనంతగిరి రిజర్వాయర్ సమీపంలో ఉన్న 10 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...ప్రభుత్వ స్థలం చుట్టూ సర్వే నిర్వహించి హద్దులు వేసుకోవాలన్నారు. ప్రభుత్వ భూమి ఆక్రమణలకు గురి కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనతంగిరి రిజర్వాయర్ పక్కన గల నీటి పారుదల శాఖకు చెందిన భూమిని పరిశీలించారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సలీమ్ తదితరులు ఉన్నారు. -
నాచగిరి.. భక్తజన గిరి
వర్గల్(గజ్వేల్): శ్రీవారి జన్మనక్షత్రం..‘స్వాతి’నక్షత్ర మహోత్సవ వేళ నాచగిరి భక్తజన సందోహమైంది. నృసింహనామంతో శ్వేతగిరి మార్మోగింది. భక్తజన సామూహిక ‘గిరి’ప్రదక్షిణతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. బుధవారం ఉదయం పీఠాధిపతి శ్రీమాధవానందస్వామి ఉత్తరద్వారం వద్ద శ్రీలక్ష్మీనృసింహునికి హారతి సమర్పించి గిరి ప్రదక్షిణ ప్రారంభించారు. స్వామివారిని అనుసరిస్తూ ఆలయ ఈఓ రంగాచారి, మాజీ ఎమ్మెల్యే తూంకుంట నర్సారెడ్డి, మాజీ చైర్మన్ రవీందర్‌గుప్తా, వేలాదిగా భక్తజన పరివారం ముందుకుసాగారు. గోవిందుని స్మరిస్తూ, గిరిని చుడుతూ, హరిద్రతీరం మీదుగా గిరిని చుట్టి ఆలయానికి చేరుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని పునీతులయ్యారు. వరుణయాగం సంపూర్ణం నాచగిరి సందర్శించిన పీఠాధిపతికి ఆలయ ప్రధానార్చకులు జగన్నాథాచార్యులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుని, వరుణయాగంలో పాల్గొన్నారు. మూడురోజులపాటు కొనసాగిన వరుణయాగం పూర్ణాహుతితో ముగిసింది. వేడుకలో భక్తులు భారీగా పాల్గొన్నారు. -
యూరియా రవాణ చార్జీలు రద్దు
గురువారం శ్రీ 23 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి, సిద్దిపేట/మెదక్ జోన్/సంగారెడ్డి జోన్: ఉమ్మడి మెదక్ జిల్లాలోని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల రైతాంగంపై ఎరువుల ధరల పెంపు తీవ్ర ఆర్థిక భారాన్ని మోపింది. వానాకాలం ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన సమయంలోనే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలు అన్నదాతలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. కాంప్లెక్స్ ఎరువుల ధరల పెంపుతో పాటు, యూరియాపై ఉచిత రవాణ సదుపాయాన్ని ఎత్తివేయడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. కాంప్లెక్స్ ఎరువుల ధరల భారం ఖరీఫ్ ప్రారంభంలోనే కేంద్ర ప్రభుత్వం డీఏపీ/కాంప్లెక్స్ ఎరువుల ధరలను విపరీతంగా పెంచింది. యూరియా రవాణ చార్జీల మోత గతంలో రేక్ పాయింట్ల నుంచి పీఏసీఎస్‌లు, డీసీఎంఎస్‌లు, హాకా, ప్రైవేట్ డీలర్లకు యూరియా రవాణ చేసేందుకు మార్క్‌ఫెడ్ ఉచిత రవాణ సదుపాయాన్ని అందించేది. కానీ, ఇటీవల ఈ నిర్ణయాన్ని మార్చుకుని రవాణ ఖర్చులను విక్రయదారులే/రైతులే భరించాలని ఆదేశాలు జారీ చేసింది. విక్రయ కేంద్రాల్లో ‘నో స్టాక్’బోర్డులు ఈ కొత్త నిర్ణయంతో క్షేత్రస్థాయిలో తీవ్ర గందరగోళం నెలకొంది. యూరియా ఎంఆర్పీ బస్తాపై రూ.266 అని ముద్రించి ఉండటంతో, రవాణ చార్జీలు కలిపి రూ.320కి అమ్మితే రైతులు బిల్లుల గురించి ప్రశ్నిస్తే వారికి ఏం సమాధానం చెప్పాలనే సంశయంతో పీఏసీఎస్ సిబ్బంది, ప్రైవేట్ డీలర్లు స్టాక్ తెప్పించేందుకు వెనుకంజ వేస్తున్నారు. నోడల్ ఏజెన్సీగా మార్క్‌ఫెడ్ రాష్ట్రంలో యూరియాతోపాటు ఇతర ఎరువుల పంపిణీకి మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా ఉంది. రైతులకు సకాలంలో యూరియా అందడంతో పాటు నిర్ణయించిన ధరకు లభించేలా మార్క్‌ఫెడ్ నుంచి పీఏసీఎస్, ఏఆర్ఎస్, డీసీఎంస్, హాకా కేంద్రాలకు ప్రభుత్వమే రవాణ చార్జీలు భరించి పంపించేవారు. ఇటీవల రవాణ చార్జీలను విక్రయించే వారే భరించాలని నిర్ణయించింది. బస్తాపై రూ.50 పెంపు ‘నో స్టాక్’బోర్డుల దర్శనం జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ రంగానికి చెందిన విక్రయ కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ‘నో స్టాక్’బోర్డులు వెలిశాయి. ఇటీవల కురిసిన వర్షాలకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరి నాట్లు, ఆరుతడి పంటల సాగు వేగవంతమైన నేపథ్యంలో పైరుకు యూరియా వేయాల్సిన సరైన సమయంలో ఎరువుల ధరలు పెరిగిపోవడం, డీలర్లు సరఫరా నిలిపివేయడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఎల్‌నినో భయాలు, డీజిల్ ధరల పెంపు, దుక్కి ఖర్చులతో అల్లాడుతున్న రైతన్నను ఆదుకోవడానికి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. రద్దు చేసిన ఉచిత యూరియా రవాణ ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని, అలాగే కాంప్లెక్స్, యూరియా ఎరువుల ధరలను తగ్గించి పంట సాగు పెట్టుబడి భారాన్ని తగ్గించాలని ఉమ్మడి జిల్లా రైతాంగం ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తోంది. -
మంత్రి ధరేంద్ర రాజీనామా చేయాలి
మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్: నీట్ పరీక్షలకు కారణమైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇతర ముఖ్యనేతల అరెస్ట్‌కు నిరసనగా మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నీట్ పరీక్షల అంశంలో పార్లమెంట్లో చర్చ జరగాలని డిమాండ్ చేశారు. నీట్ పేపర్ లీక్‌పై ప్రధాని, హోమ్ మంత్రి అమిత్‌షా సమాధానం చెప్పాలన్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులు తిరగబడకుండా పోలీసులు కొడుతుంటే ఇంకా కొట్టండి అని గాంధేయవాదులుగా నిరసన తెలిపారన్నారు. నీట్ పరీక్షల లీక్‌తో ఆత్మహత్యకు పాల్పడ్పిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
నేడు మూడు జిల్లాల కలెక్టర్లతో సమీక్ష
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ హైమావతి హుస్నాబాద్: ఎల్‌నినో ప్రభావం ఎదుర్కొనేందుకు ఆయా శాఖల అధికారులతో నిర్వహించనున్న సన్నాహక సమావేశానికి మూడు జిల్లాల కలెక్టర్లు హాజరు కానున్నట్లు సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి తెలిపారు. నియోజకవర్గంలోని ఏడు మండలాల వివిధ శాఖల అధికారులతో నిర్వహించే సమీక్ష ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...వివిధ శాఖల అధికారుల యాక్షన్ ప్లాన్ తెలపడం కోసం ప్రొజెక్టర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థినుల వసతి కోసం కేటాయించిన రైతు బజార్‌ను పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ రామ్మూర్తి, కళాశాల అద్యాపకులు పాల్గొన్నారు.చిత్రలేఖనంలో పంచతంత్ర విద్యార్థి ప్రతిభ చేర్యాల(సిద్దిపేట): స్థానిక పంచతంత్ర పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థి భారతీశర్మ చిత్రలేఖన పోటీల్లో ప్రథమబహుమతి సాధించారు. ఈ మేరకు పాఠశాల ప్రిన్సిపాల్ బుధవారం విలేకరులకు వెల్లడించారు. బ్రాహ్మణ సంక్షేమ వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన ద్విజబాలోత్సవం కార్యక్రమంలో భాగంగా జరిగిన చిత్రలేఖన పోటీల్లో భారతీశర్మ ఉత్తమ ప్రతిభ కనబర్చి మొదటి స్థానం కై వసం చేసుకోగా...హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాప్‌రెడ్డి విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో బాలుడు బహుమతి అందుకున్నట్లు తెలిపారు. భారతీశర్మను పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు అభినందించారు. పార్లమెంట్లో ప్రశ్నించండి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాదరావు గజ్వేల్: పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు బాధ్యతగల ప్రతిపక్ష నాయకుడిగా సభలో సమస్యలను ప్రశ్నించాల్సిన రాహుల్‌గాంధీ ప్రధాని నివాసం ముందు నిరసనల పేరుతో డ్రామాలకు దిగడం ప్రజాస్వామ్యానికి పూర్తిగా విరుద్ధమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కప్పర ప్రసాదరావు మండిపడ్డారు. గజ్వేల్‌లోని అంబేడ్కర్ చౌరస్తాలో రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖర్గేల చిత్రపటాలను బుధవారం దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదరావు మాట్లాడుతూ..నీట్ అంశంపై కేంద్ర ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉన్నా...మాట్లాడలేక పార్లమెంట్‌ను వదిలేసి రోడ్లపై నాటకాలు చేస్తున్నారన్నారు. ఢిల్లీలో జరుగుతున్న హింసాత్మక ఘటల వెనుక పెద్ద కుట్ర ఉన్నట్లు కనపడుతోందని ఆరోపించారు. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేయాలిచేర్యాల(సిద్దిపేట): దేశంలో రైతులు పండించే పంటలకు గిట్టుబాటు ధర రాకుండా మన ఉత్పత్తులకు నష్టం కలిగించే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్‌మావో కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పట్టణ కేంద్రంలోని పాత బస్టాండ్ వద్ద స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దిష్టిబొమ్మను బుధవారం దగ్ధం చేశారు. అనంతరం మాట్లాడుతూ..దేశంపై అనేక ఆంక్షలు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసుకున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం మన రైతులను నష్టపరిచే విధంగా ఉందన్నారు. ఈ ఒప్పందాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు రాజు, మైసయ్య, సిద్ధులు, నర్సింహ్మారెడ్డి, యాదగిరి, తిరుపతి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదాల పరిష్కారానికే రీ సర్వే
దుబ్బాక: భూ వివాదాల శాశ్వత పరిష్కారం కోసమే ప్రభుత్వం భూ భారతి రీసర్వే చేపడుతుందని జిల్లా ల్యాండ్స్ అండ్ రికార్డ్స్ సహాయ సంచాలకులు సుదర్శన్ రాథోడ్ పేర్కొన్నారు. దుబ్బాకలో మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత అధ్యక్షతన భూభారతి రీ సర్వేపై రైతులకు మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారం,భూముల రీసర్వే, డిజిటల్ మ్యాపింగ్, కొత్త రికార్డుల తయారీ, రైతులకు భూ హక్కుల కల్పనపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో పైలట్ ప్రాజెక్టులో భాగంగా మ్యాప్లేని 21 గ్రామాల్లో భూభారతి రీసర్వే చేపట్టామన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి భూముల రీసర్వే, కొత్త మ్యాపుల తయారీ చేపట్టినట్లు తెలిపారు. రైతులు భూముల రీసర్వేను సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ మోతీసింగ్, మున్సిపల్ వైస్ చైర్పర్సన్ సులోచన, చేనేత సహకార సంఘం చైర్మన్ అంకం మధు, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, బండి శ్రీలేఖ, అనంతుల భాగ్యమ్మ, ఐరేని అఖిల తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ చేసిందేమీ లేదు
దుబ్బాకటౌన్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచినా చేసిందేమీ లేదని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయపోల్ రైతువేదికలో మంగళవారం ఆయన రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి జిల్లా, మండలస్థాయి అధికారులు, సర్పంచ్‌లతో విస్తృతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలోని గ్రామాల అభివృద్ధి, ప్రజలకు అందుతున్న ప్రభుత్వ సేవలు, వివిధ శాఖల పనితీరు, గ్రామాల్లో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై శాఖల వారీగా సమీక్షించారు. ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, గ్రామాల్లో ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయే 30 రోజుల్లో రాయపోల్ మండలంలోని అన్ని గ్రామాలను ప్లాస్టిక్ రహిత గ్రామాలుగా తీర్చిదిద్దేందుకు అధికారులు, సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులతో కలిసి ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గ్రామాల్లో కొనసాగుతున్న బెల్ట్‌షాపుల అంశంపై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని రెండు మద్యం దుకాణాలు పాఠశాలకు సమీపంలో ఉన్నాయని, వాటి వల్ల ట్రాఫిక్‌కు, విద్యార్థులకు ఇబ్బందులు కలుగుతున్నాయని వాటిని ఇతర ప్రదేశాలకు మార్చాలని అధికారులను ఆదేశించారు. ఉప్పరపల్లి కెనాల్, కిష్టాపూర్ కెనాల్, రామాయంపేట కెనాల్ పనులను పూర్తిచేయాలని సూచించారు. కార్యక్రమంలో మిషన్ భగీరథ ఎస్ఈ వెంకట్‌రెడ్డి, డీఏఓ సురేశ్, కుమార్, కరుణ్‌కుమార్, డీఈలు విజయ్ ప్రకాశ్, వెంకటేశ్, బుచ్చయ్య, నరసింహారావు, రాజేంద్రప్రసాద్, స్రవంతి, ఏడీఏ బాబునాయక్, డీఎల్పీఓ లత తదితరులు పాల్గొన్నారు. -
ప్రతీ కుటుంబం పొదుపు చేయాలి
ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ సిద్దిపేటకమాన్: ప్రతీ కుటుంబం క్రమం తప్పకుండా డబ్బులు పొదుపు చేయడం ఎంతో అవసరమని ఆర్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ చేతన్ గోరేకర్ సూచించారు. జిల్లా లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో స్వయం సహాయక సంఘాల గ్రూప్ లీడర్లకు ఆర్థిక అక్ష్యరాస్యత కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చేతన్ గోరేకర్ మాట్లాడుతూ..బ్యాంకులలో లభించే వివిధ పొదుపు పథకాలు, ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, డిజిటల్ బ్యాంకింగ్ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు తమ పొదుపులను సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థలో ఉంచడం ద్వారా ఆర్థిక భద్రతను పెంపొందించుకోవచ్చని సూచించారు. జిల్లా సైబర్ క్రైమ్ డీఎస్పీ రాజు మాట్లాడుతూ.. గుర్తు తెలియని వ్యక్తులకు ఏటీఎం పిన్, ఓటీపీ, బ్యాంక్ పాస్వర్డ్లు ఎట్టిపరిస్థితుల్లోనూ చెప్పకూడద న్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే మేలు
నంగునూరు(సిద్దిపేట): ఎల్ నినో ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని, కాబట్టి వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలని డీఆర్డీఓ రవీందర్ రైతులకు సూచించారు. నర్మేట, అప్పలాయిచెర్వు, మైసంపల్లి, అంక్షాపూర్, ఖానాపూర్‌లో మంగళవారం గ్రామసభలు నిర్వహించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ భూగర్భ జలాలు అడుగంటకుండా బోర్లు, బావుల్లో నీరు చేరేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. కరువు పరిస్థితులపై అప్రమత్తం బెజ్జంకి(సిద్దిపేట): బెజ్జంకి మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం సర్పంచ్‌లు, మండల స్థాయి అధికారులకు ఆర్డీఓ అడిషనల్ పీడీ శ్రీనివాస్ ఎల్ నినో పరిస్థితులపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఇంట ఇంకుడు గుంతలు నిర్మిచుకోవాలన్నారు. ఉద్యాన పంటలు, ఆరుతడి పంటలు సేద్యం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీడీఓ ప్రవీణ్, ఏపీఓ, ఎంపీఓ పాల్గొన్నారు. -
అయిననూ లోటే!
ఈ ఫొటోలో ఉన్న రైతు పేరు అబ్బసాని మల్లయ్య. ఈయనది మర్కూక్ మండలం గంగాపూర్ గ్రామం. తనకున్న రెండెకరాల్లో వరి సాగు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం నారు కూడా సిద్ధంగా ఉంది. అయితే తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో తన బోరుబావిలో నీటిమట్టం పడిపోయింది. కొండపోచమ్మసాగర్ కాల్వలోకి నీరు ఇంకా వదలడం లేదు. ఈ పరిస్థితుల్లో వరి సాగు చేయాలా...? వద్దా...? అనే సందిగ్ధంలో ఉన్నాడు. ఇది ఒక్క అబ్బసాని మల్లయ్యదే కాదు. జిల్లాలోని రైతులందరూ దాదాపు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తున్నప్పటికీ జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతమే నమోదైంది. ప్రధానంగా వరిసాగుపై నీలినీడలు అలుముకున్నాయి. మిగతా పంటల పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈ వ్యవహారంపై కథనం.. గజ్వేల్: జిల్లాలో జూన్ 1 నుంచి ఇప్పటివరకు 227.8మి.మీల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా..162.8మి.మీల మాత్రమే నమోదైంది. ఈ లెక్కన జిల్లావ్యాప్తంగా 28.5% లోటు వర్షపాతం నమోదైంది. ఇక్కడున్న 26 మండలాల్లోని అక్బర్పేట–భూంపల్లిలో ఇప్పటివరకు 243.2మి.మీల సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు 245.మి.మీల వర్షపాతం నమోదైంది. ఈ ఒక్క మండలం మినహా మిగతా 25మండలాల్లో మైనస్ వర్షపాతమే ఉన్నది. వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు వర్గల్, ములుగు మండలాల్లో అత్యధికంగా లోటు వర్షపాతం నమోదైంది. వర్గల్ మండలంలో జూన్ 1నుంచి ఇప్పటివరకు 210.5మి.మీల సాధారణ వర్షపాతం కురవాల్సి ఉండగా కేవలం 71.9మి.మీలు మాత్రమే కురిసింది. ఫలితంగా ఈ మండలంలో జిల్లాలోనే అత్యధికంగా 65.8% లోటు వర్షపాతం నమోదైంది. ములుగు మండలంలో 223.3 మి.మీలు కురవాల్సి ఉండగా..ఇప్పటివరకు 77.8మి.మీలు మాత్రమే కురవగా ఈ లెక్కన 65.2% మైనస్ వర్షపాతం నమోదైంది. రైతుల్లో మొదలైన కలవరం జిల్లాలో ఈసారి 5.41లక్షల ఎకరాలకుపైగా వివిధ రకాల పంటలు సాగులోకి వస్తాయని వ్యవసాయశాఖ అంచనావేసింది. ఇందులో ప్రధానంగా వరి అత్యధికంగా 3.85లక్షల ఎకరాలకుపైగా సాగులోకి రావొచ్చని భావిస్తే...ఇప్పటివరకు సాగులోకి వచ్చింది 49,646ఎకరాల్లో మాత్రమే. కాగా, పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 24,509ఎకరాల్లో, కంది 5,046 ఎకరాల్లో, స్వీట్ కార్న్ 907, పెసర్లు 119, చెరుకు 25ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోవడం వల్ల కాల్వల ద్వారా సాగునీరు అందే పరిస్థితి లేకపోవడం రైతులు ఆందోళన చెందుతున్నారు. రిజర్వాయర్లలో నీళ్లు సమృద్ధిగా ఉంటే కాల్వల ద్వారానే నీరు అందడమేకాకుండా వేలాది ఎకరాల్లో భూగర్భ జలమట్టం పెరిగి బోరుబావుల్లో నీరు పుష్కలంగా ఉండేవి. కానీ, ప్రస్తుతం భిన్నమైన పరిస్థితులు నెలకొనడం వరి సాగుపై నీలినీడలు కమ్ముకునేలా చేస్తుంది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి మాట్లాడుతూ ఎల్‌నినో నేపథ్యంలో రైతులకు ఎప్పటికప్పుడు ఎలా ముందుకుసాగాలో సలహాలు, సూచనలు చేస్తున్నామన్నారు. జిల్లాలోని 25 మండలాల్లో లోటు వర్షపాతం -
కఠిన చర్యలు తప్పవు
విద్యార్థులపై అసభ్యంగా ప్రవర్తించిన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తప్పవు. టీచర్లు అసభ్యంగా ప్రవర్తిస్తే వెంటనే ఫిర్యాదు చేయాలి. ఉపాధ్యాయులు విద్యాబోధనపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బెజ్జంకి ఘటనలో పీడీ కనకారెడ్డిని రిమూవల్, ప్రిన్సిపాల్ సంగీతలను కలెక్టర్ ఆదేశాల మేరకు సస్పెండ్ చేశాం. పూర్తిస్థాయి నివేదిక కోసం నలుగురితో కమిటీని జిల్లా కలెక్టర్ నియమించారు. రమేశ్, ఇన్చార్జి డీఈఓ గుడ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన విద్యార్థినులు అందరూ గుడ్, బ్యాడ్ టచ్‌లపై అవగాహన కలిగి ఉండాలి. అసభ్యంగా ప్రవర్తించే వారితో జాగ్రత్తగా ఉండాలి. ప్రతీ రోజు పాఠశాలలో మూడు టీంలు పాఠశాలలో అవగాహన సదస్సులను నిర్వహిస్తున్నాం. ఎవరైనా అసభ్యంగా ప్రవర్తిస్తే 8712667434 ఫోన్ నంబర్‌కు సమాచారం అందించాలి. – దుర్గ, సీఐ, షీ టీమ్స్ -
బ్రహ్మోత్సవాలకు రండి
● మంత్రి కొండా సురేఖను కలిసిన దుబ్బాక బాలాజీ ఆలయ కమిటీ ● మంత్రి చేతుల మీదుగా బ్రహ్మోత్సవాల పత్రిక ఆవిష్కరణ దుబ్బాక: వచ్చే నెల 20 నుంచి జరిగే దుబ్బాక బాలాజీ ఆలయం బ్రహ్మోత్సవాలకు రావాలని దేవదాయశాఖ మంత్రి కొండా సురేఖను ఆలయ కమిటీ బాధ్యలు ఆహ్వానించారు. ఆలయకమిటీ ఆధ్వర్యంలో మంత్రి కొండా సురేఖను మంగళవారం హైదరాబాద్‌లో కలిసి బ్రహ్మోత్సవాల పత్రికను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించి ఆమెకు పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...దుబ్బాక బాలాజీ ఆలయం అనతి కాలంలోనే రాష్ట్రంలోనే గొప్ప ఆలయంగా ప్రసిద్ధి చెందడం సంతోషకరమన్నారు. బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించాలని తాను తప్పకుండా వస్తానని చెప్పారు. మంత్రిని కలిసిన వారిలో ఆలయం చైర్మన్ వడ్లకొండ శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చింత రాజు, బాధ్యులు కూర వేణుగోపాల్, చింత నాగేందర్ ఆలయ ప్రధాన అర్చకులు అచ్చి లక్ష్మీనర్సింహచార్యులు తదితరులు ఉన్నారు. -
ప్రత్యామ్నాయ పంటలే సాగు చేయాలి
జెడ్పీ సీఈఓ రమేశ్ సిద్దిపేటరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా ఎల్‌నినో ప్రభావం కారణంగా వర్షపాతం తక్కువగా ఉన్న క్రమంలో రైతులు అధిక నీరు అవసరమున్న వరికి ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని జెడ్పీ సీఈఓ రమేశ్ రైతులకు సూచించారు. మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామంలో ఎల్‌నినో ప్రభావంపై రైతులకు అవగాహన కల్పించేందుకు మంగళవారం ప్రత్యేక గ్రామసభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన జెడ్పీ సీఈఓ, ఇన్చార్జి జిల్లా విద్యాధికారి రమేశ్ మాట్లాడుతూ...తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయడం ద్వారా ఎల్‌నినో పరిస్థితులను ఎదుర్కోవచ్చన్నారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రైతాంగం ముందుకు సాగాలన్నారు. అదేవిధంగా గ్రామాల్లో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రభుత్వం పాఠశాలల్లో అల్పాహారం అందించనున్న క్రమంలో ప్రతీ ఒక్కరూ వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించాలన్నారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పద్మ, ఉపసర్పంచ్ వెంకటేశ్, ఎంఈఓ రాజిరెడ్డి, ఎంపీడీఓ రామరాజు, ఏఓ నరేశ్, పీఆర్ ఏఈ సౌమ్య, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు. పూర్వ వైభవం తీసుకువస్తాంగ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం బెజ్జంకి(సిద్దిపేట)/ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన గ్రంథాలయాలకు పూర్వ వైభవం తీసుకువస్తామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపెల్లి చంద్రం అన్నారు. బెజ్జంకితో పాటు మండలంలోని తోటపల్లిలోని గ్రంథాలయాలను మంగళవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానగనులన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రంథాలయాల పరిస్థితిని పరిశీలించి వాటి అభివృద్ధి కోసం రాష్ట్ర చైర్మన్‌కు, ప్రభుత్వానికి వివరించనున్నట్లు తెలిపారు. సిబ్బంది హరిప్రసాద్, మాజీ సర్పంచ్ నర్సయ్య, ఆలయ కమిటీ మాజీ చైర్మన్ ప్రభాకర్, కాంగ్రెస్ నేత శ్రీనివాస్, రవితేజ, అశోక్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా గ్రంథాలయంలో తెలంగాణ బీసీ బహుజన సంక్షేమ సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ప్రతాపగిరి విజయకుమార్ మాట్లాడుతు బీసీల సంక్షేమం కోసం దరిపల్లి చంద్రం చేస్తున్న కృషి విలువైందన్నారు. వాసురి ఎల్లం, రవికుమార్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. సకాలంలో వైద్య సేవలందించాలిడీఎంహెచ్ఓ ధన్‌రాజ్ కొండపాక(గజ్వేల్): సకాలంలో నాణ్యమైన వైద్య సేవలందేలా చూసుకోవాలని జిల్లా వైద్యాధికారి ధన్‌రాజ్ సూచించారు. కుకునూరుపల్లిలోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం సందర్శించారు. ఆస్పత్రిలో అందుతున్న సేవలను వైద్యం కోసం వచ్చిన వారిని అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రికి కలియ తిరుగుతూ ల్యాబ్, మెడికల్ గదిని, లేబర్ రూమ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ధన్‌రాజ్ మాట్లాడుతూ...సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలపై విస్త్రృతంగా ప్రచారం చేయాలన్నారు. గర్భిణుల నమోదు నుంచి ప్రసవమయ్యేంత వరకు ప్రత్యేకంగా పర్యవేక్షణ చేయాలని సూచించారు. పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రతలు పాటించేలా అవగాహన సదస్సులను నిర్వహించుకోవాలన్నారు. వైద్య సేవలందించడంలో నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో వైద్యాధికారి కిరణ్‌కుమార్, నర్సింగ్ ఆఫీసర్ లలిత, హెచ్ఎస్ సుజాత, ల్యాబ్ టెక్నీషియన్ బాలమణి, ఫార్మాసిస్టు సోమిత, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. -
మై భారత్ పోర్టల్‌పై విస్తృత ప్రచారం
సిద్దిపేటరూరల్: మై భారత్ పోర్టల్‌పై జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాలు, పట్టణాల్లో విస్తృత ప్రచారం చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదే శించారు. జిల్లాలోని యువతకు మై భారత్ పోర్టల్‌లో నమోదు చేసుకోవడం ద్వారా వివిధ జాతీ య, రాష్ట్రస్థాయి కార్యక్రమాలు, స్వచ్ఛంద సేవా అవకాశాలు, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభిస్తుందన్నారు. జిల్లాలో మై భారత్ ఇంటెన్సివ్ నమోదు, అవగాహన డ్రైవ్ జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు కొనసాగుతుందని, పాఠశాలలు, కళాశాలలు,క్రీడాకారులు యువజన సంఘాల, భాగస్వామ్యంతో ఈ డ్రైవ్‌ను ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. సీ్త్రనిధి రుణాలు వందశాతం రికవరీ జిల్లాలో సీ్త్రనిధి రుణాల కింది మహిళలు తీసుకున్న రుణాల చెల్లింపులు వచ్చే అక్టోబర్ నెల చివరికల్లా రికవరీ చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మీటింగ్ హాల్లో ఐకేపీ, సీ్త్రనిధి, మెప్మా సిబ్బందితో రుణాల రికవరీపై కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీ్త్రనిధి ఫండ్స్‌ను తప్పుగా వినియోగించిన వీవోఏలు వారం రోజుల్లోగా చెల్లించకపోతే వారిని తొలగిస్తామన్నారు. మెనూ ప్రకారం భోజనం అందించాలి తొగుట(దుబ్బాక): విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందించాలని కలెక్టర్ హైమావతి స్థానిక కేజీబీవీ ప్రిన్సిపాల్‌ను ఆదేశించారు. పాఠశాలను రాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాన్ని పరిశీలించారు. బాలికలతో మాట్లాడి బోధన, ఆహారం గురించి ఆరాతీశారు. పాఠశాలలో నెలకొన్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. రోడ్డుపై విద్యుత్ దీపాలు ఏర్పాటు చేయాలని విద్యార్థులు కలెక్టర్‌ను కోరారు. డీపీఓతో ఫోన్లో మాట్లాడి పాఠశాల ఆవరణతో పాటు రోడ్డుకు రెండు వైపులా లైట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాఠశాలను తరచూ పర్యవేక్షించాలని తొగుట ఎస్ఐ నవీన్‌కు సూచించారు. -
మింగలేక.. కక్కలేక..
గజ్వేల్: మున్సిపల్ ఏఈ బదిలీ అంశం గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ అధికారులను ఇరకాటంలో పడేసింది. జీహెచ్ఎంసీకి చెందిన ఏఈ ఇటీవల ఇక్కడికి బదిలీ అయ్యారు. అయితే రెండు నెలలు కావస్తున్నా.. ఆయనను అక్కడి ఉన్నతాధికారులు రిలీవ్ చేయడం లేదు. జీహెచ్ఎంసీకి ఉండే స్వయంప్రతిపత్తి, అధికారాల వల్ల వారిని ప్రశ్నించలేక, ఇక్కడ అభివృద్ధి పనులను వెళ్లదీసుకోలేక ఇక్కడి అధికారులు మింగలేక.. కక్కలేక అన్నట్టు నానాఇబ్బందులు పడుతున్నారు. నెలలు కావస్తున్నా.. గజ్వేల్–ప్రజాపూర్ మున్సిపాలిటీలో ఏఈ బదిలీ అంశం ప్రస్తుతం హాట్ టాపిక్ మారింది. కీలకమైన ఈ పోస్టు చాలా కాలంగా ఖాళీగానే ఉంది. దీంతో అభివృద్ధి పనులు ముందుకు సాగటం లేదు. లైట్ తీసుకున్న జీహెచ్ఎంసీ అధికారులు తమ మున్సిపాలిటీకి బదిలీచేసిన ఏఈని రిలీవ్ చేయాలని అక్కడి అధికారులను అడగలేక గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ అధికారులు నానాయాతన పడుతున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన ఉన్నతస్థాయి సమీక్షలో ఇక్కడి మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లు ఏఈ అంశాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్లారు. ‘‘మీది లక్షలోపు జనాభా ఉన్నా మున్సిపాలిటీయే కదా.. ఏదో విధంగా అడ్జస్ట్ చేసుకోండి’’ అని సమాధానం దాటవేసినట్లు సమాచారం. ఇప్పుడు ఒక్కరు కూడా లేరని విన్న వించుకున్న వారు పట్టించుకోకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అభివృద్ధి పనులకు ఆటంకం స్థానిక మున్సిపాలిటీలో ఏఈ లేకపోవడం అభివృద్ధి పనులు ముందుకుసాగటం లేదు. ఇక్కడ పబ్లిక్ హెల్త్ ఏఈ ఒకరు డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నారు. ఆయన వారంలో ఒకటి రెండు రోజులు రావడమే గగనం. ఇక్కడ రూ.28కోట్లతో చేపట్టిన అమృత్ 2.0 పనులను ఆయనే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల ప్రస్తుతం మున్సిపాలిటీకి ఇటీవల టెండర్లు పూర్తయిన రూ.18.7 కోట్ల యూఐడీఎఫ్(స్టేట్ అర్బ న్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్) పనులు ప్రారంభం కావా ల్సి ఉండగా.. ఏఈ లేక ఆటంకం కలుగుతోంది. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, జంక్షన్ల అభివృద్ధి, హౌసింగ్ బోర్డు మైదానంలో చిల్డ్రన్స్ పార్కు అభివృద్ధి పనులు, సంగాపూర్ రోడ్డులో షాపింగ్ కాంప్లెక్స్ పనులు, వరద కాల్వల నిర్మాణం చేపట్టాల్సి ఉన్నది. కానీ ఈ పనులు ఏఈ వస్తేకాని ప్రారంభమయ్యే అవకాశం కనిపించడం లేదు. దీంతో పట్టణ ప్రజల్లో అసహనం వ్యక్తమవుతోంది. మున్సిపల్ ఏఈ బదిలీ వ్యవహారంలో ఇరకాటం ఇబ్బందులు పడుతున్నది నిజమే జీహెచ్ఎంసీ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చి ఏఈ ఇంకా విధుల్లో చేరకపోవడంవల్ల ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమే. మున్సిపల్ ఇంజినీరింగ్ చీఫ్(ఈఎన్సీ) దృష్టికి ఈ అంశాన్ని తీసుకువెళ్లాం. త్వరలోనే సమస్య పరిష్కారమయ్యే అవకాశముందని చెప్పారు. వేచి చూస్తున్నాం. – గణేశ్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ -
సమాంతర వ్యవస్థ అవసరం
టీఆర్టీఎఫ్ రాష్ట్ర నాయకులుప్రశాంత్నగర్(సిద్దిపేట): ఉపాధ్యాయుల పదోన్నతుల సమస్యను పరిష్కరించేందుకు ‘సమాంతర వ్యవస్థ’ను ఏర్పాటు చేయాలని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్, ప్రధాన కార్యదర్శి మారెడ్డి అంజిరెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆదివారం ఆ ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉన్న సర్వీస్ రూల్స్ వివాదం కారణంగా ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. డీఈఓ, ఎంఈఓ, డిప్యుటీ ఈఓ స్థాయి పోస్టులను సమాంతర వ్యవస్థ ద్వారా భర్తీ చేయడం వల్ల ప్రభుత్వానికి ఎటువంటి అదనపు భారం పడదన్నారు. సీపీఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, 2004 పూర్వపు నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులకు ఈ విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేశారు. ఆరు డీఏలను వెంటనే చెల్లించాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌ను అమలు చేయాలని కోరారు. బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్‌ను నెలాఖరుకల్లా విడుదల చేయాలని కోరారు. జీఓ 317 బాధితులకు జీఓ 190 ద్వారా సొంత జిల్లాలకు బదిలీలు కల్పించి స్పౌజ్ బదిలీల హామీని నెరవేర్చాలని, 5,700 కొత్త పీఎస్‌హెచ్‌ఎం పోస్టుల మంజూరు, భాషా పండితులు, మిగిలిన పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్ అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర చీఫ్ పాట్రన్ లక్కిరెడ్డి సంజీవరెడ్డి, జాతీయ ఉపాధ్యక్షులు కావలి అశోక్‌కుమార్, విష్ణుమూర్తి, రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి భైతి ఐలయ్య, సుంకిశీల ప్రభాకర్‌రావు, మహేందర్, సుశాంత్, రాజు నాయక్, గోవర్ధన్, శ్రీనివాస్‌రెడ్డి, తరాల పరమేశ్, ప్రనీద్, తుంగూరి సురేశ్, గుర్రం శ్రీనివాస్‌గౌడ్, అశోక్‌రావు పాల్గొన్నారు. -
ఇలా అయితే ఎలా సర్?
సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియ బల్దియాల్లో మందకొడిగా నెమ్మదిగా సాగుతోంది. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణ ప్రాంతాల్లో వివిధ కారణాలతో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ నమోదు శాతం చాలా తక్కువ. సిద్దిపేటజోన్: జిల్లా వ్యాప్తంగా శనివారం నాటికి 9,92,917 ఎన్యూమరేషన్ పత్రాలకు సంబంధించి 8,22,164 పత్రాలను డిజిటలైజేషన్ చేయగా 82 శాతం నమోదు పూర్తయింది. మున్సిపాలిటీలకు సంబంధించి 64,402 పత్రాలు ఉండడం గమనార్హం. అత్యధికంగా సిద్దిపేట బల్దియాలో 36,849 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉండగా, అత్యల్పంగా హుస్నాబాద్‌లో 4,267 మిగిలి ఉన్నాయి. జిల్లాలోని సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, హుస్నాబాద్ మున్సిపాలిటీల్లో 2,61,217ఓటర్లకుగాను 1,96, 815ఓటర్లకు సంబంధించి డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయింది. మిగతా 64,402 పత్రాలను డిజిటలైజేషన్ చేయాల్సి ఉంది. ఎన్నికల కమిషన్ గడువును ఆగస్టు 3వ తేదీ నాటికి పొడిగించడంతో బల్దియాల్లో ఒక్క అడుగు ముందుకు పడితే వంద శాతం డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంటుంది. విస్తృతంగా సమీక్షలు ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా యంత్రాంగం విస్తృతంగా సమావేశాలు, సమీక్షలు చేపట్టింది. మున్సిపల్ కమిషనర్ నుంచి మొదలు ఆర్డీఓ, కలెక్టర్ స్థాయి వరకు అధికారులు సమీక్షించి బూత్ లెవల్ ఆఫీసర్లకు దిశానిర్ధేశం చేశారు. త్వరితగతిన ప్రక్రియ పూర్తిచేసి శత శాతం డిజిటలైజేషన్ చేయాల్సిన ఆవశ్యకత గురించి వివరించారు. క్షేత్రస్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులు, సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. సమస్య పరిష్కారానికి సూచనలు, సలహాలు అందించి నిర్ణీత గడువులోగా ప్రక్రియ పూర్తిచేయాలని ఆదేశాలు జారీ చేశారు. కారణాలు అనేకం ఆయా మున్సిపాలిటీల్లో ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియ తక్కువగా కావడానికి సవాలక్ష కారణాలున్నాయి. ప్రధానంగా చనిపోయిన వారి సంఖ్య, ఓటరు జాబితాలో డబుల్ ఓట్లు ఉన్నవారు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారు, స్వగ్రామంలో మ్యాపింగ్ చేసుకోవడం, జాబితాలో ఉన్న ఓటర్ల ఆచూకీ సమాచారం లేకపోవడం లాంటి కారణాలతో పట్టణ ప్రాంతాల్లో డిజిటలైజేషన్ వంద శాతంపై ప్రభావం చూపుతుంది. మరోవైపు ఆగస్టు 3 గడువు ముంచుకు వస్తున్న నేపధ్యంలో బల్దియాల్లో మిగిలిపోయిన 64,402 ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ అనేది అధికార యంత్రాంగానికి సవాల్‌గా మారిందనే చెప్పాలి. బల్దియాల్లో మందకొడిగా ప్రక్రియ నాలుగు మున్సిపాలిటీల్లో.. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో శనివారం నాటికి 1,96,815 ఎన్యూమరేషన్ పత్రాల డిజిటలైజేషన్ పూర్తయింది. సిద్దిపేట మున్సిపాలిటీలో 1,12,975 ఓటర్లకుగాను 76,126 డిజిటలైజేషన్ కాగా ఇంకా 36,849 చేయాల్సి ఉంది. అదేవిధంగా దుబ్బాకలో 49,272 ఓటర్లకు గాను 43,959 పత్రాలు డిజిటలైజేషన్ కాగా ఇంకా 5,313 చేయాల్సి ఉంది. మరోవైపు గజ్వేల్‌లో 79,811 ఓటర్లకు గాను 61,838 పత్రాలను డిజిటలైజేషన్ చేశారు. మిగతా 17,973 చేయాల్సి ఉంది. అదేవిధంగా హుస్నాబాద్‌లో 19,159కిగాను 14,892 డిజిటలైజేషన్ కాగా 4,267 చేయాల్సి ఉంది. అత్యధికంగా దుబ్బాక మున్సిపాలిటీలో 89.22 శాతం డిజిటలైజేషన్ నమోదు కాగా అత్యల్పంగా సిద్దిపేట మున్సిపాలిటీలో 67.38 శాతం నమోదు కావడం విశేషం. -
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ప్రతిభ
సిద్దిపేటజోన్: మెదక్ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో సిద్దిపేట జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చారు. అండర్18 విభాగం బాలికల 1500 మీటర్ల పరుగు పందెంలో వైష్ణవి వెండి పతకం, అండర్ 20 బాలుర 5 కిలోమీటర్ల పరుగు పందెంలో యస్వంత్ వెండి పతకం, అండర్ 16 విభాగం కిలోమీటర్ పరుగు పందెంలో విష్ణు కాంస్య పతకం, అండర్ 20 విభాగం 800 మీటర్ల పరుగు పందెంలో హరి కాంస్య పతకం, అండర్ 18 విభాగంలో1500 మీటర్ల పరుగు పందెంలో అభిరామ్ కాంస్య పతకం సాధించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి, అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పరమేశ్వర్, కార్యదర్శి వెంకట్ స్వామి వారిని అభినందించారు. ఎన్జీవో భవన్ అధ్యక్ష, కార్యదర్శుల ఎన్నికసిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని ప్రముఖ పబ్లిక్ సర్వెంట్స్ హోం(ఎన్జీవో భవన్) నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాదుల నాగభూషణం, ప్రధాన కార్యదర్శిగా గ్యాదరి పరమేశ్వర్, ఆర్థిక కార్యదర్శిగా శ్రీనివాస్, ఉపాధ్యక్షులుగా పోచయ్య, రాజేందర్, సంయుక్త కార్యదర్శులుగా మధుసూదన్, శ్రీనివాస రాజు, ఆడిట్ మెంబర్లుగా రామ్మోహన్, శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులుగా రాంరెడ్డి, రవీందర్ రెడ్డి, కృష్ణ, గణేశ్, ఉపేందర్ గౌడ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ... సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టనున్నట్టు పేర్కొన్నారు. ఎన్జీవో భవన్ పేరు ప్రఖ్యాతులను మరింత ఇనుమడింప చేస్తామని తెలిపారు. నాలుగు సంఘాల ప్రతినిధులకు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. పటాన్చెరు టౌన్: బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని రుద్రారానికి చెందిన నవీన్‌గౌడ్ నియమితులయ్యారు. ఈమేరకు ఆదివారం హైదరాబాద్‌లోని బీసీ భవన్లో జరిగిన కార్యక్రమంలో జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య చేతుల మీదుగా నియామకపత్రం అందజేశారు. ఈసందర్భంగా నవీన్‌గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల పక్షాన ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే విధంగా తన వంతుగా కృషి చేస్తానన్నారు. జిల్లాలో అన్ని కమిటీలు వేసి సంఘాన్ని మరింత బలోపేతం చేస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన జాతీయ కో ఆర్డినేటర్ అరుణ్ కుమార్, జిల్లా నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. సంగారెడ్డి: నియోజకవర్గంలో అర్హులైన ఏ ఒక్కరి ఓటు మిస్ కాకుండా కాంగ్రెస్ బీఎల్ఏలు, నాయకులు జాగ్రత్తలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సూచించారు. గత నెల రోజులుగా అమలవుతున్న సర్ ప్రక్రియపై ఆదివారం పట్టణంలోని ఓ గార్డెన్లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు నిర్మలారెడ్డితో కలిసి ముఖ్య నాయకులతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 282 బీఎల్ఏలతో ఒక్కొక్కరితో జగ్గారెడ్డి ముఖాముఖిగా మాట్లాడారు. ఇప్పటికి ఎన్ని ఫారాలు పంపిణీ చేశారు, ఇచ్చిన ఫారాల్లో ఎన్ని తిరిగి వచ్చాయి, ఇంకా ఎన్ని రావాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు 66.67% ఓటరు నమోదు పూర్తయిందని, గడువులోగా మొత్తం ప్రక్రియ పూర్తి కావాలని ఆదేశించారు. మూడు రోజుల తర్వాత మరోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నియోజకవర్గ కన్వీనర్ చేర్యాల ఆంజనేయులు, టీపీసీసీ ప్రధా న కార్యదర్శి తోపాజి అనంత్ కిషన్, నాయకులు కూన సంతోష్, కిరణ్‌గౌడ్ పాల్గొన్నారు. -
నీళ్లు వదిలి.. కన్నీళ్లు తుడవండి
చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రభుత్వం సాంకేతిక కారణాలతో కన్నేపల్లి పంపుహౌస్ నుంచి మోటార్ల ద్వారా నీటిని సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులను నింపాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయకసాగర్ వరకు చేపట్టిన రైతు పాదయత్రకు భారీ స్పందన వచ్చింది. రైతులు, బీఆర్ఎస్ నాయకులు ఆదివారం ఉదయం 8 గంటలకు అల్లీపూర్ శివారులోని అన్నపూర్ణ రిజర్వాయర్‌కు చేరుకున్నారు. డప్పు కళాకారులు, మహిళల నృత్యాలు, ఆటపాటలతో రైతుల పాదయాత్ర 16 కిలో మీటర్లు సాగింది. దారిపొడవునా ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. కరువు సమయాల్లో ఆదుకున్న కాళేశ్వరం ప్రాజెక్టు సమీపంలో నీళ్లు ఉన్నా, మోటార్లు ఆన్ చేయకపోవండతో సిద్దిపేట జిల్లాలోని ప్రాజెక్టులు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన వెలిబుచ్చారు. ఖరీఫ్ పంట భవిష్యత్ ఆందోళన కలిగిస్తోందని, కన్నేపల్లి వద్ద ఉన్న నీళ్లను సిద్దిపేట ప్రాజెక్టులకు తరలించాలని నినదించారు. లేకుంటే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. ఉదయం ప్రారంభమైన పాదయత్ర మధ్యాహ్నం 3 గంటలకు రంగనాయకసాగర్‌కు చేరుకుంది. పాదయత్రలో అన్నదాతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. ఎమ్మెల్యే హరీశ్‌రావు, ఎమ్మెల్సీ దేశపలి శ్రీనివాస్ పాల్గొన్నారు. వారితోపాటు యాత్రలో కలిసి నడిశారు. నీళ్లు ఆంధ్రాకు.. నిధులు ఢిల్లీకి – ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సాగునీరు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి పంపిస్తున్నారని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. రైతు పాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. కేసీఆర్ తెలంగాణ రైతుల కష్టాలు చూసి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, లక్షల ఎకరాలకు సాగునీరు అందించారని చెప్పారు. ప్రస్తుతం ఏర్పడింది ప్రకృతి కరువు కాదని, రేవంత్‌రెడ్డి వికృత నిర్ణయం తీసుకువచ్చిన కరువు అని యద్దేవా చేశారు. సీఎం రేవంత్ రెడ్డీ.. కన్నేపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోస్తారా? లేదా ఎత్తి పారేయ్య మంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ, మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షుడు కాముని శ్రీనివాస్, సీనియర్ నాయకులు పాల సాయిరాం, పాపయ్య, కనకరాజు, ఉమేశ్ చంద్ర, జంగిటి శ్రీనివాస్, సదానందం, సర్పంచ్‌లు, అధిక సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.కర్షక బిడ్డ కేసీఆర్.. రైతుద్రోహి రేవంత్: హరీశ్‌రావు చిన్నకోడూరు(సిద్దిపేట): కాళేశ్వరం ప్రాజెక్టుతో పుష్కలమైన సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్, పెట్టుబడి సాయం, సకాలంలో ఎరువులు ఇచ్చి కేసీఆర్ కర్షక బిడ్డగా నిలిస్తే, కన్నేపల్లి పంప్‌హౌస్ నుంచి నీళ్లు ఎత్తిపోసే అవకాశం ఉండి కూడా సాగునీరు ఇవ్వకుండా రేవంత్‌రెడ్డి రైతుద్రోహిగా మారారని ఎమ్మెల్యే హరీవ్‌రావు మండిపడ్డారు. చిన్నకోడూరు మండలంలో చేపట్టిన రైతుపాదయాత్రలో పాల్గొని మాట్లాడారు. రైతులకు రూ.35 వేలకోట్ల రుణమాఫీ అని చెప్పి కేవలం రూ.18 వేల కోట్లు ఇచ్చి సగం మంది రైతలను మోసం చేశారన్నారు. మూడు పంటలకు సంబంధించి రూ.19 వేల కోట్ల రైతుబంధును ఎగనామం పెట్టారని, కేసీఆర్ తెచ్చిన రైతు బీమా పూర్తిగా నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. కన్నేపల్లి పంపులు ఆన్ చేసి రైతుల కష్టాలు తీర్చాలని, లేనిపక్షంలో చిన్నకోడూరు రైతుల స్ఫూర్తితో అన్ని మండలాల్లో పోరాటాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్పాలనకు విసిగిపోయి రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. కదం తొక్కిన కర్షకులు -
రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో ఇలా చేస్తున్నారు: హరీశ్ రావు
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కాళేశ్వరం కట్టారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ, ప్రతీకారంతో కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయట్లేరని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లాలో హరీశ్ రావు మాట్లాడుతూ... కేసీఆర్ తిట్టడమే పనిగా రేవంత్ రెడ్డి పెట్టుకున్నారని చెప్పారు.‘‘ఈ కరవు కాలం తెచ్చిన కరవు కాదు. కాంగ్రెస్ తెచ్చిన కరువు. కేసీఆర్‌ను తిడితే నీళ్లు వస్తాయా? నీళ్లు ఎత్తి పోస్తే నీళ్లు వస్తాయా? మోటార్లు ఆన్ చేస్తే నీళ్ఉల వస్తాయి అని రిటైర్డ్ ఇంజినీర్లు చెబితే బెల్టుతో కొడతా అని అంటారు రేవంత్. నువ్వు ముఖ్యమంత్రివా.. హిట్లార్వా?కాళేశ్వరం కూలింది అని అంటున్నారు..పోయిన సారీ నీళ్లు వచ్చాయా లేదా? 70 టీఎంసీల నీళ్లు ఎత్తకుండా కిందికి వదిలేశారు. రేవంత్ రెడ్డి వెంటనే కాళేశ్వరం మోటార్లు ఒత్తాలి. రేవంత్ వచ్చాక రాష్ట్రం అంత కరవే. మనకు కరవు.. కాంగ్రెస్ వాళ్లు మాత్రం బాగా దొడ్డు అవుతున్నారు. రేవంత్ నువ్వు నీళ్లు ఎత్తి రంగనాయక, మల్లన్న, కొండపోచ్చమ్మకు కోపం వస్తే మాడి మసి అయితవు. బీఆర్ఏస్ హయాంలో బోర్ బండ్లు లేవు.. కాంగ్రెస్ హయంలో మళ్లీ బోర్ బండ్లు ఊర్లలోకి వస్తున్నాయి. అనాడు కేసీఆర్ రైతుల పాలిట ఆపద్బాంధవుడుగా ఉంటే...ఇప్పుడు రేవంత్ రాక్షసుడిలా ఉన్నారు.ఈ స్కాంల ప్రభుత్వం పోవాలి..స్కీమ్ ల ప్రభుత్వం బీఆర్ఏస్ రావాలి అని ప్రజలు అంటున్నారు. కాంగ్రెస్ వచ్చాక ఖమ్మంలో పెద్దావగు కొట్టుకుపోయింది.. వట్టేం మునిగిపోయింది..సుంకిశాల కూలిపోయింది’’ అని చెప్పారు. -
బాధ్యతగా పనిచేయాలి
సిద్దిపేటకమాన్: ప్రతీ ఒక్కరూ మెరుగైన సమాజం కోసం బాధ్యత పనిచేయాలని మన పోలీస్ బలగమే మన గర్వం మన సమాజమే మన బాధ్యతని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. పోలీసు కమిషనర్ కార్యాలయంలో ‘‘సీపీ కనెక్ట్’’అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సీపీ విధుల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన పోలీసులను శనివారం అభినందించి ప్రశంసాపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..పోలీసు సిబ్బందిలో ఉత్తమ సేవలను గుర్తించే సంస్కృతి, మనోధైర్యం పెంచడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందన్నారు. ప్రతీ నెల ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం వల్ల సిబ్బందికి మరింత ఉత్సాహం, బాధ్యత కలగడంతోపాటు ఇతరులకు ప్రేరణగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ అడ్మిన్ కుశాల్కర్, ఏఆర్ అదనపు డీసీపీ సుభాష్ చంద్రబోస్, సీఐ కిరణ్, ఆర్ఎస్ఐ సాయిప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సీపీ రష్మీ పెరుమాళ్ ప్రతిభ కనబర్చిన సిబ్బందికి ప్రశంసాపత్రాలు అందజేత సీపీ కనెక్ట్ వినూత్న కార్యక్రమం ప్రారంభం -
జలసాధనకు మహాపాదయాత్ర
చిన్నకోడూరు(సిద్దిపేట): కళ్ల ముందు నారు మడులు ఎండుతుంటే గుండె మండుతున్న రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ జలసాధన పోరుకు శ్రీకారం చుట్టింది. చిన్నకోడూరు మండలం అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచి రంగనాయక సాగర్ రిజర్వాయర్ వరకు సుమారు 16 కి.మీటర్ల రెండు వేల మంది రైతులతో మహాపాదయాత్రకు పూనుకుంది. మహారాష్ట్ర నుంచి కాళేశ్వరంకు గోదావరి జలాలు భారీగా వస్తున్నప్పటికీ సాంకేతిక సమస్యల సాకుతో కాంగ్రెస్ ప్రభుత్వం కన్నేపల్లి పంప్ హౌస్ నుంచి నీళ్లు తెలంగాణలోని ప్రాజెక్టులకు మళ్లించకుండా జాప్యం చేస్తుండటం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుట్రపూరితంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇక్కడి నీళ్లను అక్కడికి తరలిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ప్రభుత్వం మెడలు వంచి కాళేశ్వరం నీళ్లను తెలంగాణ ప్రాంత ప్రాజెక్టులకు మళ్లించడమే లక్ష్యంగా ఈ మహాపాదయాత్రను ప్రారంభిస్తున్నారు. మాజీమంత్రి హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, బీఆర్ఎస్ శ్రేణులు వివిధ ప్రాంతాల నుంచి రైతులను ఈ ఉద్యమంలో భాగస్వాములను చేస్తున్నారు. ఉదయం అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ప్రారంభమై మహాపాదయాత్ర సాయంత్రం రంగనాయక సాగర్ వద్దకు చేరేవిధంగా ప్రణాళిక రూపొందించారు. చివరగా రంగనాయసాగర్ వద్ద బహిరంగ సభను ఏర్పాటు చేసి కాంగ్రెస్ సర్కారు తీరును ఎండగట్టడమే లక్ష్యంగా జలసాధన పోరును ప్రారంభిస్తున్నారు. కరువుకు ప్రధాన కారకుడు సీఎంబీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ చిన్నకోడూరు(సిద్దిపేట): ప్రస్తుత కరువుకు ప్రధాన కారకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి జలాలు ఎత్తిపోసే అవకాశమున్నా సాగునీరివ్వకుండా సీఎం రైతు ద్రోహిగా మారారని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ ఆరోపించారు. రైతు మహాపాదయాత్ర సందర్భంగా మాజీ ఎంపీపీ మాణిక్యరెడ్డి, పార్టీ మండల అధ్యక్షులు కాముని శ్రీనివాస్‌లతో కలసి అన్నపూర్ణ, రంగనాయక సాగర్ రిజర్వాయర్లను సందర్శించి రైతు మహాపాదయాత్ర ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...గోదావరి జలాలతో రిజర్వాయర్లు నింపాలని చేపట్టిన రైతు మహాపాదయత్రకు భారీగా రైతులు, పార్టీ శ్రేణులు తరలిరావాలని పిలుపునిచ్చారు. మేడిగడ్డ వద్ద భారీగా నీళ్లు సముద్రం పాలవుతుంటే ఆంధ్రా ప్రాంతానికి లబ్ధి చేకూరేవిధంగా సీఎం ప్రయత్నిస్తున్నారన్నారు. కన్నేపల్లి వద్ద పంప్‌హౌస్‌లో మోటార్లు ఆన్‌చేసే అవకాశమున్నా ఎందుకు ఆన్ చేయడం లేదని ప్రశ్నించారు. వెంటనే తెలంగాణ ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.● అన్నపూర్ణ రిజర్వాయర్ నుంచిరంగనాయక సాగర్ వరకు పాదయాత్ర ● కాళేశ్వరం నీటి కోసం నేడు రైతులతో కలిసి బీఆర్ఎస్ నిరసన యాత్ర సాగుతుందిలా అన్నపూర్ణ రిజర్వాయర్ వద్ద ఉదయం 8 గంటలకు రైతు మహాపాదయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి అల్లీపూర్ మీదుగా మైలారం, కమ్మర్లపల్లి, సలెంద్రి గ్రామాల మీదుగా చిన్నకోడూరుకు చేరుకుంటుంది. అక్కడి నుంచి పెద్దకోడూరుకు చేరుకుంటుంది. గ్రామంలోని రేణుకా మాత ఫంక్షన్ హాల్లో పాదయాత్రలో పాల్గొన్న వారికి భోజన వసతి ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మెట్టుబండలు మీదుగా రంగనాయక సాగర్‌కు సాయంత్రం 4 గంటలకు చేరుకుంటుంది. అక్కడ బహిరంగ సభ ఏర్పాటుకు సిద్ధం చేశారు. -
26న కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభం
కొమురవెల్లి(సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి దర్శనానికి వచ్చే భక్తుల చిరకాల స్వప్నం నెరవేరనుంది. సుమారు రూ.5కోట్లతో నిర్మించిన కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభానికి సిద్ధమైంది. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మధ్యప్రదేశ్ సీఎం మోహన్‌యాదవ్‌తో కలసి 2024 ఫిబ్రవరి 15న శంకుస్థాపన చేసిన ఈ రైల్వేస్టేషన్ పనులు పూర్తయ్యాయి. ఈనెల 26 కిషన్‌రెడ్డి చేతుల మీదు గా ప్రారంభించనున్నారు. దీంతో హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని ఇతరప్రాంతాల నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సౌకర్యవంతగా మారనుంది. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి సిద్దిపేటకు ప్రతీ రోజు రెండు రైళ్లు రైల్వేశాఖ నడిపిస్తుంది. సిద్దిపేట నుంచి కొత్తపల్లి వరకు రైల్వే పనులు కొనసాగుతున్నాయి. పనులు పూర్తయితే సికింద్రాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలనుంచి కొమురవెల్లికి వచ్చే భక్తులకు ప్రయాణం మరింత సులభం కా నుంది. భక్తుల రద్దీ, ప్రయాణికుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో రైళ్ల సంఖ్యను పెంచే అంశాన్ని కూడా రైల్వేశాఖ పరిశీలించనుంది. కోడ్ కేటాయింపు కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు భారతీయ రైల్వేశాఖ కేఐపీకే 0943 6626 అనే కోడ్ కేటాయించింది. దీంతో రైల్వే టికెట్ బుకింగ్, ప్రయాణికుల సమాచార సేవలతో పాటు రైల్వే కార్యకలాపాల్లో కొమురవెల్లి రైల్వేస్టేషన్‌కు గుర్తింపు లభించింది. కోడ్ కేటాయించడంతో రైల్వేస్టేషన్ ప్రారంభానికి మార్గం సులువైంది. కొమురవెల్లి రైల్వేస్టేషన్ ప్రారంభమైతే రోడ్డుమార్గంతోపాటు రైలుమార్గంలో సులువుగా చేరుకునే అవకాశమేర్పడుతుంది.● ప్రారంభించనున్నకేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ● తప్పనున్న మల్లన్న భక్తుల తిప్పలు -
పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు
హుస్నాబాద్‌రూరల్: జిల్లాలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఖాళీల భర్తీకి పార్ట్ టైం లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి శనివారం ఓ ప్రకటనలో వెల్లడించారు. 12 లెక్చరర్ పోస్టులు మంజూరయ్యాయని, వీటి కోసం అర్హుల నుంచి ఈ నెల 20 నుంచి 22 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్–4, కంప్యూటర్ ఇంజనీరింగ్–2, ఈఈఈ–3తోపాటు, గణితం–1, భౌతికశాస్త్రం–1, రసాయనశాస్త్రం–1 పోస్టులున్నాయని, ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 20 నుంచి 22 వరకు హుస్నాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న సర్టిఫికెట్లు పరిశీలించి ఉదయం 10 గంటలకు డెమో, ఇంటర్వ్యూలు నిర్వహిస్తామన్నారు. ఏఐసీటీఈ నిర్దేశించిన అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.ప్రిన్సిపాల్ పి.శ్రీదేవి -
ఆదివారం శ్రీ 19 శ్రీ జూలై శ్రీ 2026
● కన్నీళ్లు ఎరుగరే.. కన్నోళ్లు తుడవరే బడి బాట పట్టాల్సిన పసి వయస్సు బాధ్యత వైపు అడుగేసింది. కుటుంబపోషణలో తన వంతు బాధ్యత అనుకున్నాడో..కాలం కలిసిరాలేదో తెలియదు కానీ బడి బాట పట్టాల్సిన పిల్లాడు గొర్రెలమందవైపు అడుగేశాడు. వందలకుపైగా ఉన్న గొర్రెలమంద వెనుక పరుగుతీస్తూ..వాటిని మేపేందుకు వెళ్తున్న ఓ బాలుడిని ‘సాక్షి’కెమెరా నారాయణరావుపేట మండలం గుర్రాలగొంది గ్రామసమీపంలో‘క్లిక్’మనిపించింది. – సాక్షి,స్టాఫ్‌ఫొటోగ్రాఫర్,సిద్దిపేట -
రాజీతో రాజమార్గం
జిల్లా అదనపు న్యాయమూర్తి వై.జయప్రసాద్ సిద్దిపేటకమాన్: రాజీయే రాజమార్గమని, పెండింగ్‌లో ఉన్న నెగిషీయబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ (ఎన్ఐ) కేసులను పరిష్కరించుకోవడానికి లోక్ అదాలత్ సరైన వేదికని అదనపు జిల్లా న్యాయమూర్తి వై.జయప్రసాద్ తెలిపారు. సిద్దిపేట న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో సిద్దిపేట కోర్టులో స్పెషల్ లోక్ అదాలత్‌ను శనివారం నిర్వహించారు. పెండింగ్‌లో ఉన్న పలు చెక్‌బౌన్స్ కేసులను న్యాయమూర్తులు పరిష్కరించారు. ఈ సందర్భంగా అదనపు న్యాయమూర్తి మాట్లాడుతూ..సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు ఒకేసారి లోక్ అదాలత్‌లో కేసును రాజీ చేసుకుంటే సమయం వృథా అవ్వకుండా ఉంటుందన్నారు. ఈ విషయాన్ని న్యాయవాదులు, పోలీసులు ఇరు పార్టీలకు అర్థమయ్యేలా వివరించాలని సూచించారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో జిల్లాలో 09 బెంచెస్ ఏర్పాటు చేయగా..రూ.2,78,61,790 విలువైన 46 ఎన్ఐ కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. ‘గౌరవెల్లి’ కట్టపై ప్రత్యేక నిఘా అక్కన్నపేట(హుస్నాబాద్): మండలంలోని గుడాటిపల్లి వద్ద నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టును సీపీ రష్మీ పెరుమాళ్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా ప్రాజెక్టు సామర్థ్యంతో పాటు ఎన్జీటీ కేసు తదితర వివరాలను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రాజెక్టు ఆగిపోవడానికి గల కారణాలను తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో కూడా ప్రాజెక్టు కట్టపై ప్రత్యేక నిఘా ఉంచుతూ గస్తీ నిర్వహించాలని సూచించారు. సరదా కోసం ఎవరైనా ఈత కొట్టడానికి వస్తే రాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా ప్రాజెక్టు కట్టపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆకతాయిలు ధ్వంసం చేయకుండా నిరంతర నిఘా ఉంచాలన్నారు. కాళేశ్వరంపై రాజకీయం వద్దుసీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర ప్రజలకు సాగు, తాగు నీరు అందించి కరువు నుంచి ప్రజలను కాపాడటానికి బదులు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో చేస్తున్న రాజకీయాలను మానుకోవాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు వీరయ్య సూచించారు. సిద్దిపేటలో శనివారం జరిగిన సిద్దిపేట, మెదక్ జిల్లాల నిర్మాణ వర్క్‌షాప్‌కు హాజరై మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు పగుళ్లు వచ్చాయని, ఆనకట్ట దెబ్బతిన్నదని విమర్శలు చేసే బదులు అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. మేడిగడ్డ వద్ద నీరు నిల్వ చేయడం కుదరకపోతే ప్రత్యామ్నాయ మార్గం ఆలోచించకుండా విమర్శలు చేయడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. టీచర్ల సమస్యలు పరిష్కరించండియూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ గజ్వేల్: కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(టీఎస్‌యూటీఎఫ్) జిల్లా అధ్యక్షుడు వలీ అహ్మద్ డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో శనివారం వారి సమస్యల పరిష్కారానికి పోస్టుకార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వలీ అహ్మద్ మాట్లాడుతూ..దశాబ్దాలుగా శ్రమదోపీడీకి గురవుతున్న కేజీబీవీ, యూఆర్ఎస్, సమగ్ర శిక్ష టీచర్లకు కనీస వేతన విధానాన్ని వర్తింపజేయాలన్నారు. రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగులకు అందిస్తున్న విధంగానే వీరికి హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. హాస్టళ్లల్లో కేర్ టేకర్లను నియమించి, ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్ గజ్వేల్ మండల శాఖ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, ఎంఆర్పీ ఉద్యోగుల ఎంఐఎస్ బాబు సిబ్బంది పాల్గొన్నారు. -
విద్యాభివృద్ధికి ప్రాధాన్యం
సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం విద్యాభివృద్ధికి ప్రాధాన్యమిస్తోందని మంత్రి వివేక్ తెలిపారు. నారాయణరావుపేట మండలంలోని జక్కాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దొంతుల సుధాకర్ సహాయంతో రూ.40 లక్షలతో నిర్మించిన డైనింగ్ హాల్, సమావేశ మందిరం, కిషన్ షెడ్లను వివేక్ ప్రారంభించారు. పాఠశాల డైనింగ్ హాల్, కిచెన్‌ను నిర్మించిన దాత దొంతుల సుధాకర్, వారి కుటుంబ సభ్యులందరినీ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శన చూస్తే పాఠశాల పనితీరు కనిపిస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సుమారు 50 వేల మంది ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేసిందని వెల్లడించారు. మధ్యాహ్న భోజన పథకం వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరిగిందని తెలిపారు. యంగ్ ఇండియా పాఠశాలలద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు. యువతకు మెరుగైన ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో ఆధునిక సాంకేతిక నైపుణ్యాల కోసం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను(ఏటీసీ) ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలిసిద్దిపేటరూరల్: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశమున్నందున రైతులను తక్కువ నీరు అధిక ఆదాయం వచ్చే పంటల వైపు సాగేలా ప్రోత్సహించాలని మంత్రి వివేక్ సూచించారు. కలెక్టరేట్లో వానాకాలం–2026 ఎల్‌నినో ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన కంటెజెన్సీ ప్రణాళికపై కలెక్టర్‌తో కలిసి వ్యవసాయశాఖ, అనుంబంధ శాఖల ప్రజాప్రతినిధులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఎల్‌నినో ప్రభావం దృష్ట్యా అన్ని శాఖలు ముందస్తు ప్రణాళికతో సిద్ధంగా ఉండాలన్నారు. ఆయిల్‌పామ్ సాగుకు ప్రాధాన్యం ఇచ్చి, సాగు విస్తీర్ణం పెంచాలని సూచించారు. అంతకుముందు కలెక్టరేట్‌కు చేరుకున్న మంత్రి వివేక్‌కు కలెక్టర్ హైమావతి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. అనంతరం పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రం, అదనపు కలెక్టర్ లక్ష్మికిరణ్, హుస్నాబాద్, గజ్వేల్ ఆర్డీఓలు, ఏఎంసీ చైర్మన్లు, ఆత్మకమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు.జక్కాపూర్‌లో డైనింగ్ హాల్నుప్రారంభించిన మంత్రి వివేక్ -
18 గంటల ఉచిత విద్యుత్ ఇవ్వాలి
మిరుదొడ్డి(దుబ్బాక): వ్యవసాయ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం 18 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని ఖాజీపూర్ రైతులు విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన కు దిగారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ను అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నా రు. కనీసం రోజుకు 8 గంటల నిరంతరంగా కరెంటు అందించలేకపోవడంతో సాగు ప్రశ్నార్థకంగా మారుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ సరఫరా సరిగ్గా లేకపోవడంతో నారు మడులను కూడా వేసుకోలేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు. ధర్నా విషయం తెలుసుకున్న భూంపల్లి పోలీసులు అక్కడకు చేరుకుని రైతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యుత్ ఎస్ఈ, ఏడీఏ, ఏఈలతో ఫోన్లో పోలీసులు మాట్లాడారు. సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలపడంతో రైతులు ఆందోళనను విరమించారు. నీళ్లివ్వాలని చేయి కోసుకున్న రైతు దుబ్బాకరూరల్: వర్షాలు కురువక పోవడంతో రైతులు వరి తుకాలు పోసి వదిలేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులకు గురైతున్నారని ఆవేదన చెందిన దుబ్బాక మండలం పోతారం గ్రామానికి చెందిన రుద్రారం ప్రశాంత్ అనే యువకుడు తన పొలంలో నిలబడి ‘‘సీఎం రేవంత్‌రెడ్డి మా పొలాలు ఎండి పోతున్నాయి. మల్లన్నసాగర్ కాలువల ద్వారా మా పొలాలకు నీళ్లివ్వండి’’అంటూ బ్లేడ్‌తో చేయి కోసుకుని తన పొలంలో భూమికి రక్తం బొట్టు పెట్టాడు. ఈ వీడియోను సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్‌గా మారింది. ధర్మారెడ్డి సబ్‌స్టేషన్ వద్ద ... గజ్వేల్‌రూరల్: ప్రభుత్వం వ్యవసాయ రంగానికి 14 గంటల కరెంటు ఇస్తున్నామని చెబుతున్నప్పటికీ 4 గంటలు సైతం సరిగ్గా రావడం లేదని గజ్వేల్ మండలం ధర్మారెడ్డిపల్లిలో గురువారం అన్నదాతలు సబ్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగారు. గ్రామసర్పంచ్ కాసమొల్ల శ్రీనివాస్, ఫ్యాక్స్ చైర్మన్ జేజేల వెంకటేశంగౌడ్లు మాట్లాడుతూ...రాష్ట్ర ప్రభుత్వం మాయమాటలతో అన్నదాతలను మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి పంటల సాగుకు నాణ్యమైన ఉచిత విద్యుత్‌ను అందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో గ్రామ రైతులు సత్తయ్య, నవీన్, నరేందర్, శ్యామ్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. -
దుబ్బాక టాప్ ‘సర్’
దుబ్బాక: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో దుబ్బాక నియోజకవర్గం జిల్లాలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్లో జిల్లాలోని మిగతా నియోజకవర్గాల కంటే దుబ్బాక నియోజకవర్గం చాలా ముందంజలో ఉంది. దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 2,04,664 ఓటర్లకు గాను 1,69,202 మంది ఓటర్ల ఎన్యూమరేషన్ ఫారాలను డిజిటలైజ్ చేశారు. కేవలం 35,462 మంది 17.33% మాత్రమే మిగిలి ఉంది. దీంతో 82.67% పనులు పూర్తి చేసుకుని జిల్లాలో అగ్రస్థానంలో నిలిచింది. మిగతా వరుసలో హుస్నాబాద్ నియోజకవర్గం 79.32%తో 2 వ స్థానంలో నిలవగా మొత్తం 2,54,543 మంది ఓటర్లకు గాను 2,01,911 డిజిటలైజ్ కాగా ఇంకా 52,632 మంది 20.68% కావాల్సి ఉంది. గజ్వేల్ నియోజకవర్గం 2,89,253 మంది ఓటర్లకు గాను 2,13,920 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజ్ పూర్తి కావడంతో 73.96%తో 3వ స్థానంలో ఉంది. ఇంకా 75,333 మంది 26.04% కావాల్సి ఉంది. సిద్దిపేట నియోజకవర్గం కేవలం 72.28%తో జిల్లాలో చివరి స్థానంలో నిలిచింది. నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,44,507మందికి గాను 1,76,721 కాగా ఇంకా 67,786 మంది 27.72% మిగిలిపోయింది. జిల్లాలో మొత్తం 9,92,967 ఓటర్లకు గాను 7,61,754 మంది ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ పూర్తయి సగటున 76.71 % ఉండగా ఇంకా 2,31,213 ఓటర్లు 23.29% కావాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో టాప్ దుబ్బాకనే.. సర్ ప్రక్రియ లో జిల్లాలోని మున్సిపాలిటీల్లో సైతం దుబ్బాకనే అగ్రస్థానంలో నిలిచింది. తాజాగా సర్ ప్రక్రియ గడువు ఆగష్టు 3 వరకు పెంచుతూ ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.82.67శాతం ఎన్యూమరేషన్తో జిల్లాలో అగ్రస్థానం -
ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి
● సెర్ప్,ఎస్ఆర్డీఎస్ సిబ్బందికి వైద్య పరీక్షలు ● శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్ హైమావతిసిద్దిపేటఅర్బన్/నంగునూరు(సిద్దిపేట): మహిళా సంఘాల్లోని సభ్యులు, ఈజీఎస్ వంటి పనుల్లో విశ్రాంతి లేకుండా ఉండే సిబ్బంది తమ ఆరోగ్య స్థితిగతులను పరీక్షించుకోవాలని కలెక్టర్ హైమావతి సూచించారు. మండల పరిధిలోని ఎల్లుపల్లి శివారులోని జిల్లా మహిళా సమాఖ్య భవనంలో సెర్ప్, ఎస్ఆర్డీఎస్ సిబ్బందికి నిర్వహించిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ హైమావతి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...డాక్టర్లు అందించే మెడిసిన్‌తో పాటు సలహాలు, సూచనలు పాటించి ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. డాక్టర్లు సూచించిన విధంగా రోజు గంట సేపు వ్యాయామం చేయాలని, మంచి ఆహారం తీసుకోవడం, సరిపడా నీరు తాగడం వంటివి చేయాలని సూచించారు. వెల్కటూరు పాఠశాల సందర్శన సిద్దిపేట అర్బన్ మండలం వెల్కటూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కలెక్టర్ హైమావతి సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ...పదవ తరగతి అనేది జీవితానికి ఒక పునాది వంటిదని, విద్యార్థులు బాగా చదువుకుని అందరూ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణం మొత్తం కలియతిరిగారు. అన్ని తరగతులు అవుతున్నాయా? మధ్యాహ్న భోజనం బాగుంటుందా? అని విద్యార్థులను, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తం సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడటంతో పాటు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. గురువారం మండల పరిధిలోని రాజగోపాల్‌పేట పీహెచ్‌సీని ఆకస్మికంగా సందర్శించారు. రికార్డులు, మందులు, అటెండెన్స్‌ను పరిశీలించారు. సీజనల్ వ్యాధులపై గ్రామాల్లో వైద్య సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. వైద్యం కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వైద్యులు సూచించిన విదంగా మందులు వేసుకోవాలని సూచించారు. -
రైతుల ఏకరువు
ఎల్‌నినో తీవ్రరూపం దాల్చిన వేళ...‘సాగు’ముందుకు సాగక ఆందోళనలో ఉన్న రైతులు కాళేశ్వరం జలాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లాలోని మల్లన్నసాగర్, కొండపోచమ్మ, రంగనాయకసాగర్ రిజర్వాయర్లలో నీటిమట్టం గణనీయంగా పడిపోగా ప్రస్తుతం నింపుతారా...? లేదా...? అనే ఆందోళన సర్వత్రా మొదలైంది. జిల్లా వ్యవసాయానికి ప్రాణధారమైన ఈ రిజర్వాయర్లను నింపకపోతే పరిస్థితేమిటనే కలవరం వెంటాడుతోంది. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ఫోకస్ ఇది. గజ్వేల్: కాళేశ్వరంలో ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 3 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్, 50 టీఎంసీల సామర్థ్యం కలిగిన మల్లన్నసాగర్, మరో 15 టీఎంసీ సామర్థ్యమున్న కొండపోచమ్మసాగర్ రిజర్వాయర్లు జిల్లా సాగు, తాగునీటి అవవసరాలకు ప్రధాన ఆధారంగా మారాయి. మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేసే గోదావరి జలాలు సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్ మానేరు అనంతగిరి అన్నపూర్ణ రిజర్వాయర్ మీదుగా జిల్లాలోని రంగనాయకసాగర్‌కు వస్తుంటాయి. ఈ రిజర్వాయర్‌కు జిల్లాలో 1.10 లక్షల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి 2.2కిలోమీటర్ల ఓపెన్ కెనాల్, మరో 16.2 కిలోమీటర్ల టన్నెల్ ద్వారా మల్లన్నసాగర్‌కు గోదావరి జలాలు వస్తాయి. మల్లన్నసాగర్ వల్ల సిద్దిపేట, మెదక్ జిల్లాలే కాకుండా ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో 15.71 లక్షల ఆయకట్టుకు మేలు చేకూరనుంది. మల్లన్నసాగర్ నుంచి గోదావరి జలాలు కొండపోచమ్మసాగర్‌ను చేరుతాయి. మల్లన్నసాగర్ పంపుహౌజ్ నుంచి 23 కిమీల పొడవున కొండపోచమ్మ సాగర్ వరకు కాలువల ద్వారా గోదావరి నీళ్లు వస్తున్నాయి. 15 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వల్ల సిద్దిపేటతోపాటు మేడ్చల్, సంగారెడ్డి, మెదక్, యాదాద్రి జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. ఇందులో జిల్లాలో 1.25 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్నది. దీంతోపాటు పరోక్షంగా మరెన్నో లక్షల ఎకరాల భూముల్లో భూగర్భ జలమట్టం పెరిగి భారీ ప్రయోజనం కలుగుతుంది. కానీ, మేడిగడ్డ ఘటన తర్వాత నీటి ఎత్తిపోతలకు తరచూ అంతరాయం కలుగుతున్న సంగతి తెల్సిందే. ప్రస్తుతం ఈ రిజర్వాయర్లను నింపే విషయంలో స్పష్టతలేకపోవడం వల్ల రంగనాయకసాగర్ రిజర్వాయర్‌లో నీటిమట్టం 1 టీఎంసీకి పడిపోగా, మల్లన్నసాగర్లో కేవలం 16టీఎంసీల లోపు, కొండపోచమ్మసాగర్‌లో 6.3 టీఎంసీలలోపు మాత్రమే నీరు ఉన్నది. ప్రస్తుతం ఎల్‌నినో తీవ్రరూపం దాల్చి వేళ...తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో సమృద్ధిగా ఉండి ఉంటే కాల్వల ద్వారా నేరుగా పొలాలకు నీరందే అవకాశంతోపాటు లక్షలాది ఎకరాల్లో భూగర్భజలమట్టం పడిపోకుండా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితులు నెలకొనడంతో సాగు, తాగునీటికి ఇక్కట్లు తప్పేలా లేవు. ఒకవేళ...ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని కాల్వలకు వదిలితే ఈ సీజన్లో రైతులు గట్టెక్కే అవకాశముంది. ఆ దిశగా చర్యలు ఉంటాయా...? అనే విషయంలోనూ స్పష్టత లేదు. రైతుల్లో కలవరం జిల్లాలో జూన్‌కు సంబంధించి 105.6 మి.మీల వర్షపాతం కురవాల్సి ఉండగా, కేవలం 53.9 మి.మీలు మాత్రమే కురిసింది. ఈ లెక్కన 48.9 మి.మీల లోటు వర్షపాతం నమోదైంది. జూలైకు సంబంధించి 184.7 సాధారణ వర్షపాతానికి ఇప్పటివరకు కేవలం 62.8 మి.మీల వర్షపాతం మాత్రమే కురిసింది. ఈ పరిస్థితి వల్ల సాగు ముందుకు సాగటం లేదు. ఈ సీజన్‌కు సంబంధించి 5.41 లక్షల ఎకరాలకుపైగా సాగు అంచనాలో వరి సింహాభాగం 3.85 లక్షల ఎకరాలకుపైగా సాగవుతుందని వ్యవసాయశాఖ అంచనా వేస్తే... ఇప్పటివరకు కేవలం 38,500 ఎకరాల్లో మాత్రమే సాగులోకి వచ్చింది. పత్తి 1,01,109 ఎకరాల్లో, మొక్కజొన్న 20,804 ఎకరాల్లో, కందులు 4,189 ఎకరాల్లో, పెసర్లు 64 ఎకరాల్లో సాగులోకి వచ్చింది. జిల్లా రైతులకు ప్రధాన పంట అయిన వరికి జలాశయాలకు నీళ్లు వదిలితేనే ముందుకు సాగే అవకాశమున్నది. లేదంటే గడ్డు కాలం తప్పదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
19న జగన్నాథ రథయాత్ర
సిద్దిపేటకమాన్: పూరీ జగన్నాథ స్వామి రథయాత్ర స్ఫూర్తితో సిద్దిపేటలో ఈ నెల 19న జగన్నాథ రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగతీర్థదాస్ తెలిపారు. సిద్దిపేట ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ... హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు రథయాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం సమీపంలోని శ్రీనివాస ధ్యాన మందిరం నుంచి ప్రారంభమై గాంధీచౌక్, సుభాష్‌రోడ్డు, పాత బస్టాండ్, విక్టరీ చౌరస్తా మీదుగా కొనసాగుతుందని తెలిపారు. రథయాత్రలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో సభ్యులు బుచ్చిబాబు, మశ్చేందర్, వేణు తదితరులు పాల్గొన్నారు. సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులుజిల్లా ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి హమీద్ ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ అందించనున్నట్లు, ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ అధికారి హమీద్ పేర్కొన్నారు. జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన మాట్లాడుతూ... హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని టీజీఎస్సీస్టడీ సర్కిల్లో ఉచిత శిక్షణకు గాను అర్హత కలిగిన ఎస్సీ,బీసీ,ఎస్టీ అభ్యర్థులు ఈ నెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 26న పరీక్ష నిర్వహించి, రాణించిన వారికి ఉచిత శిక్షణతోపాటు భోజనం, వసతి, సౌకర్యాలు కల్పించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు చింతమడక విద్యార్థులుసిద్దిపేటరూరల్: సిద్దిపేటలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో చింత మడక కేవీఆర్ఎస్ ఉన్నత పాఠశాల విద్యార్థు లు ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొత్తరాజిరెడ్డి గురువారం తెలిపా రు. అండర్ 14 బాలికల విభాగంలో ట్రైయాథలాన్ పోటీలో పావని వెండి పతకం సాధించగా, అండర్ 14 బాలుర విభాగంలో 8వ తరగతికి చెందిన రిషి కుమార్ వెండి పతకం సాధించారు. ఈనెల 18న మెదక్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, వారికి శిక్షణ అందించిన పీడీ వెంకట స్వామిని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయబృందం అభినందించారు. పీఆర్సీ ప్రకటించకపోతే ఆందోళనే : పీఆర్టీయూగజ్వేల్: దసరాలోపు పీఆర్సీ ప్రకటించకపోతే పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని పీఆర్టీయూ రాష్ట్ర అధికార ప్రతినిధి వంగ మహేందర్‌రెడ్డి హెచ్చరించారు. గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గురవారం పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...మూడేళ్లుగా పీఆర్సీ పెండింగ్‌లో ఉండటం వల్ల ఉద్యోగులంతా ఆవేదన చెందుతున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోపు పీఆర్సీ ప్రకటిస్తామని హామీ ఇచ్చిన పాలకులు నేడు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్త చేశారు. ఉపాధ్యాయులకు సంబంధించి ఎన్నో సమస్యలు పెండింగ్‌లో ఉన్నా...ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇంద్రసేనారెడ్డి, ప్రధాన కార్యదర్శి శశిధర్‌శర్మ, లింగం తదితరులు పాల్గొన్నారు. -
చదువు భలే.. వసతి బాలే
● పెరుగుతున్న ప్రవేశాల సంఖ్య ● భోజనం రుచి లేక తినలేక పోతున్నాం ● కలెక్టర్‌కు విద్యార్థుల గోడుహాస్టల్లో వసతుల కరువు హుస్నాబాద్: ‘‘ఇంజనీరింగ్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువు బాగుందనే ఒక్క కారణంతో హాస్టల్ వసతులు ఏలా ఉన్నా సర్దుకుంటున్నాం. రెండో ఏడాదిలో కూడా మార్పు రాకుంటే ఎలా సార్’’అంటూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధ్యాపకులు, అధికారుల ముందు ఏకరువు పెడుతున్నారు. శాతవాహన యూనివర్సిటీ హుస్నాబాద్ ఇంజనీరింగ్ కళాశాలను పాలిటెక్నిక్ కళాశాలలో తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. హాస్టల్ వసతి ఉన్నందును రెండో సంవత్సరంలో ఎక్కువమంది విద్యార్థులు కళాశాలలో అడ్మిషన్లు తీసుకున్నారు. అనుభవజ్ఞులైన అద్యాపకులచే నాణ్యమైన విధ్యాబోధన, ఆధునాతనమైన ల్యాబ్స్, డిజిటల్ తరగతులు పలు సౌకర్యాలతో విద్యా బోధన చేస్తున్నారు. కళాశాలకు సంబంధించి హాస్టళ్లను హుస్నాబాద్ పట్టణంలో ఏర్పాటు చేశారు. తాత్కాలికంగా టీచర్స్ ట్రైనింగ్ సెంటర్ భవనంలో అబ్బాయిలు, బస్ డిపో ఎదుట ఉన్న ప్రభుత్వ షెడ్యూల్డు కులాల బాలికలు, కళాశాల వసతి గృహంలో అమ్మాయిలకు హాస్టల్ వసతి కల్పించారు. వసతి గృహంలో ఉండలేం ప్రత్యేక హాస్టల్ వసతి ఉందని తెలిసే తల్లిందండ్రులు ఇక్కడి ఇంజనీరింగ్ కళాశాలలో తమకు అడ్మిషన్లు తీసుకున్నారని ఇంజనీరింగ్ కళాశాల హాస్టల్ అంటే సకల సౌకర్యాలతో సొంత ఇంటిలో ఉండే రుచికరమైన భోజనం ఉంటుందని ఊహించి మమ్ములను ఇక్కడి కళాశాలలో చేర్పించారని తీరా ఇక్కడ చూస్తే అందుకు పూర్తి భిన్నంగా ఉందని అమ్మాయిలు వాపోతున్నారు. నాణ్యమైన భోజనం ఉండటం లేదని, నీళ్ల చారుతో భోజనం చేయలేక చాలాసార్లు పస్తులుండి రోజులు గడిపామని వాపోతున్నారు. ఇదే విషయాన్ని బుధవారం హాస్టల్‌ను సందర్శించిన కలెక్టర్ హైమావతికి వివరించారు. అబ్బాయిల పరిస్థితి అలానే స్థానిక టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో ఇంజనీరింగ్ కళాశాల యువకులకు హాస్టల్ వసతి కల్పించారు. చదివేది ఇంజనీరింగ్ కళాశాలలో, భోజనం చేసేది ప్రభుత్వ బీసీ సంక్షేమ బాలుర వసతి గృహంలో.. హాస్టల్ వసతి టీచర్స్ ట్రైనింగ్ సెంటర్లో. హాస్టల్ నుంచి యువకులు సైకిళ్లపై కిలోమీటర్ దూరంలో ఉన్న బాలుర వసతి గృహనికి వెళ్లి భోజనం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ కూడా భోజనం సరిగా లేదంటూ కళాశాల అధ్యాపకులకు చెప్పుకున్న ఫలితం లేకుండా పోతుంది. వసతులు కల్పిస్తాంహాస్టల్లో భోజనం బాగా లేదని విద్యార్థులు మా దృష్టికి తెచ్చారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను శాతవాహన యూ నివర్సిటీ వైస్ చాన్సలర్ దృష్టికి తీసుకెళ్లాం. దాదాపుగా 200 మంది విద్యార్థులకు సరిపోయే విధంగా నాణ్యమైన భోజనం, హాస్టల్ వసతి కల్పించేలా ముందస్తుగానే మరో భవనాన్ని పరిశీలిస్తున్నాం. విద్యార్థులకు అన్ని వసతులు కల్పిస్తాం. –తిరుపతిరెడ్డి, ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ కళాశాల, హుస్నాబాద్ -
కేజీబీవీలో తాగునీటి ఇక్కట్లు
అక్కన్నపేట(హుస్నాబాద్): అక్కన్నపేట మండల కసూర్భా గాంధీ బాలికల విద్యాలయం(కేజీబీవీ)లో తాగునీరు ఇక్కట్లు నెలకొన్నాయి. మంచినీళ్ల కోసం పడరానీ పాట్లు పడుతున్నారు. ఆ విద్యాలయంలో శాశ్వత బోరుబావి లేకపోవడంతో గుక్కెడు నీళ్ల కోసం అరిగోస తప్పడం లేదు. ఈ కేజీబీవీలో 220మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే విద్యాలయం ఆవరణంలో మిషన్ భగీరథ సంపు నిర్మించుకుని దాని ద్వారా నీరు ఉపయోగించుకుంటున్నారు. కాగా, మిషన్ భగీరథ నీళ్లు ఏమాత్రం సరిపోవడం లేదని పలువురు ఉపాధ్యాయులు చెబుతున్నారు. మిషన్ భగీరథలో ఏదైనా సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతే స్నానాలు కూడా చేయకుండా రోజుల తరబడి ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ప్రైవేట్ ట్యాంకర్ ద్వారా తాగేందుకు రోజు రెండు ట్యాంకర్లను తెప్పిస్తున్నారు. ఒక్కో ట్యాంకర్ రూ.800 నుంచి రూ.1000 వరకు వెచ్చించి నీటిని సరఫరా చేయిస్తున్నారు. అయితే, గతంలో రెండు, మూడు చోట్ల బోరు వేయించేందుకు ప్రయత్నంచినా చుక్కనీరు రాలేదని ఉపాధ్యాయులు అంటున్నారు. బోరుబావి ఉంటే తప్ప శాశ్వత తాగునీరు సమస్యను పరిష్కరించలేమని, ప్రతీరోజు నీళ్లకోసం గోస పడవల్సి వస్తుందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.సరిపోని మిషన్ భగీరథ నీళ్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లాం మిషన్ భగీరథ నీళ్లు సరిపోవడం లేదు. దీంతో ప్రైవేటు ట్యాంకర్ ద్వారా నీళ్లను తెప్పించుకుంటున్నాం. బోరు వేయించాలని చెబుతున్నాం. ప్రహారీ గోడ నిర్మాణ పనులు ప్రారంభం సమయం వరకు నూతనంగా బోరు వేయించాలని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. –సరిత, కేజీబీవీ ప్రత్యేకాధికారి -
విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి
● ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు ● కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాల వద్ద ధర్నాప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లా కేంద్రంలోని కేసీఆర్‌నగర్ డబుల్బెడ్రూం కాలనీలోని ప్రభుత్వ ప్రాథమిక, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాల ఆవరణలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మించాలన్నారు. విద్యార్థులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నామని, కోట్ల రూపాయలతో భవనాలు నిర్మిస్తున్నామని చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని మండిపడ్డారు. కలెక్టర్ హైమావతి తక్షణమే స్పందించి కేసీఆర్‌నగర్ ప్రభుత్వ పాఠశాలను సందర్శించి విద్యార్థుల సమస్యలను పరిశీలించాలని, శాశ్వత పాఠశాల భవనం నిర్మాణానికి చర్యలు ప్రారంభించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఐద్వా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం
మున్సిపల్ కమిషనర్ మహేశ్కుమార్దుబ్బాకటౌన్: సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రతి ఒక్కరు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను బహిరంగ ప్రదేశాల్లో వేయకుండా చెత్తసేకరణ వాహనాలకు అందించాలని దుబ్బాక మున్సిపల్ కమిషనర్ ఎ.మహేశ్‌కుమార్ సూచించారు. 16వ వార్డులోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించిన డ్రైడే కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్ దేవుని రాజుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో సిబ్బందితో చెత్త, వ్యర్థాలను తొలగింపజేశారు. దోమల నివారణకు మందు పిచికారీ చేయించారు. వర్షపు నీరు వృథాగా పోకుండా చేపట్టే సంరక్షణ, భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యల గురించి విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అనంతుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టాలి చేర్యాల(సిద్దిపేట): వర్షాకాలం దృష్ట్యా దోమల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ వైస్ చైర్పర్సన్ మేడిశెట్టి ఉమ పిలుపునిచ్చారు. డ్రై డే కార్యక్రమంలలో భాగంగా ఇంటింటికీ వెళ్లి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. నిలిచిన నీటిని తొలగించడం, పాత్రలను వారానికి ఒకసారి ఖాళీ చేసి శుభ్రం చేయడం, పాత టైర్లు, కొబ్బరి చిప్పలు, కూలర్లు, పూలకుండీలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. అదే విధంగా, వర్షపు నీరు వృథా కాకుండా భూగర్భ జలాలను పెంపొందించే చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
తొలకరి చినుకు.. జీవాలు బెరుకు
● చిటుకు వ్యాధితో మొదటికే మోసం ● అప్రమత్తతతోనే రక్షణ సాధ్యం ● పశు సంవర్థకశాఖ డాక్టర్ నిహారిక దుబ్బాకటౌన్: వర్షాకాలంలో తొలకరి చినుకులు మూగజీవాల పాలిటి శాపాలు. వాటి వల్ల జీవాల పెంపకందారులు తరచూ నష్టాలకు గురవుతారు. తొలకరి చినుకులకు మొలిసిన గడ్డిని గొర్రెలు, మేకలు తినడం వల్ల చిటుకు వ్యాధి సోకుతుంది. దీనిని పలురకాల పేర్లతో పిలుస్తుంటారు. నెత్తిపిడుగు, గడ్డిరోగం, పాటురోగం అనే పేర్లు కూడా ఉన్నాయి. బలిష్టంగా ఉన్న గొర్రెలకే.. ఈ వ్యాధి నివారణకు గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. చాలా అప్రమత్తంగా ఉండాలని తిమ్మాపూర్ పశు సంవర్థకశాఖ వైద్యురాలు డాక్టర్ నిహారిక సూచించారు. బలిష్టంగా పెరిగిన గొర్రెలు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఉంది. ఆమె తెలిపిన కొన్ని సూచనలు, సలహాలు. అకస్మాత్తుగా మరణిస్తాయి ఈ వ్యాధి సోకిన గొర్రెలు సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపించకుండానే అకస్మాత్తుగా మరణిస్తాయి. చనిపోయే ముందు చాలా నీరసంగా ఉంటాయి. ఎగిరి కిందపడి కాళ్లు కింద కొట్టుకుంటూ, పళ్లు కొరకుతూ.. బిగుసుకుని కొన్ని క్షణాల్లో చనిపోతాయి. ఈ వ్యాధి సోకిన మరికొన్ని గొర్రెలు చొంగ కారుస్తుంటాయి. శ్వాస అధికంగా ఉంటుంది. వ్యాధి లక్షణాలు కనిపించిన వెంటనే పశువైద్యాధికారిని సంప్రదించి మందకు చికిత్స చేయించాలి. నివారణే ముఖ్యం చికిత్స కంటే వ్యాధి నివారణే ముఖ్యం. ఏటా ఏప్రిల్, మే నెల మధ్యలో మందలో ఉన్న జీవాలన్నింటికీ వ్యాధి నిరోధక టీకా(మల్టీ కాంపోనెంట్ ఈటీ వ్యాక్సిన్) తప్పకుండా వేయించాలి. వ్యాధి లక్షణాలు కనిపిస్తే వెంటనే దగ్గరలో పశువైద్యాధికారికి తెలియజేసి చికిత్స, జాగ్రత్తలు పాటించాలి. తొలకరి వర్షాలకు మొలిసి వాడిపోయిన గడ్డిని మేయకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సాయంత్రం సమయంలో జీవాలను మేపకూడదు. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరుచేయాలి. జాగ్రత్తలు పాటిస్తే చిటుకు వ్యాధి బారి నుంచి జీవాలను కాపాడుకోవచ్చు. నిహారిక, పశు సంవర్థకశాఖ డాక్టర్, తిమ్మాపూర్ ఇలా సోకుతుంది మేత కోసం వలస వెళ్లే గొర్రెల్లో ఎక్కువగా ఈ వ్యాధి సోకుతుంది. క్లాస్ట్రీడియం ఫర్ ఫ్రింజర్స్ టైప్–డీ రకం సూక్ష్మజీవులు జీవాల ప్రేవుల్లో అభివృద్ధి చెందుతాయి. అవి వదిలిన విషపదార్థాలు చిటుకు వ్యాధికి కారణమవుతాయి. తొలకరి చినుకులకు పెరిగిన లేతగడ్డిని గొర్రెలు ఇష్టంగా తింటాయి. దీనివల్ల వాటి ప్రేవుల్లో గాలిలేని వాతావరణం ఏర్పడుతుంది. అప్పుడు సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది వ్యాధిని కలుగజేస్తాయి. ఈ వ్యాధి తొలకరి చినుకులు పడినప్పటి నుంచి జూలై నెలాఖరు మధ్య ఎక్కువగా సంభవిస్తుంది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
డీఎస్ఓ తనూజదుబ్బాక: వర్షాకాలంలో ప్రబలే సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సిద్దిపేట జిల్లా పౌర సరఫరాల అధికారి(డీఎస్ఓ) తనూజ అన్నారు. మంగళవారం కలెక్టర్ హైమావతి ఆదేశాల మేరకు దుబ్బాక మండలం హబ్షీపూర్‌లో పర్యటించారు. గ్రామంలోని పాఠశాలలతోపాటు పలు కాలనీల్లో సందర్శించి పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించారు. డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించి గ్రామస్తులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..మండలంలోని 21 గ్రామాలలో పాఠశాలలు, వసతి గృహాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్వహించనున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలత, ఎంపీడీవో సోమిరెడ్డి, ఎంపీఓ మురళి, కార్యదర్శి వజ్ర తదితరులు ఉన్నారు. -
డీఈఓ ఉత్తర్వుల ప్రకారం బాధ్యతలు అప్పగిస్తాం
ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి కొండపాక(గజ్వేల్): మండలంలోని మర్పడ్గ హైస్కూల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న కల్లెపల్లి శ్రీనివాస్‌కు హెచ్ఎంగా పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ఇన్చార్జి డీఈఓ రమేశ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బుధవారం శ్రీనివాస్‌కు పూర్తి బాధ్యతలు అప్పగిస్తామని ఎంఈఓ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ఇక్కడ హెచ్ఎంగా పనిచేసిన భైరయ్య 30న పదవీవిరమణ పొందారు. అనంతరం సీనియారిటీ ప్రకారం హైస్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల్లో ఒకరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంది. కానీ సీనియారిటీ ఉన్న వ్యక్తిపై వచ్చిన అవినీతి ఆరోపణలు దృష్ట్యా జాప్యం జరిగింది. దాడులను అరికట్టాలని కోరుతూ సీఎంకు వినతి మిరుదొడ్డి(దుబ్బాక): రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను వెంటనే అరికట్టాలని కోరుతూ సీఎం రేవంత్‌రెడ్డికి వినతిపత్రం అందించినట్టు డీబీఎఫ్(దళితబహుజన ఫ్రంట్) జాతీయ కార్యదర్శి పి.శంకర్ తెలిపారు. మిరుదొడ్డిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అత్యాచా రాల నిరోధక చట్టాలపై హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన హైపవర్ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. అత్యాచారాలు, దాడులపై చర్చించి వాటిని అరికట్టా లని కోరుతూ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి సీఎంకు వినతిపత్రం అందించినట్టు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి కల్పన పాల్గొన్నారు. ప్రజాస్వామ్యంపై అవగాహన హుస్నాబాద్‌రూరల్: ప్రజాస్వామ్య పద్ధతిలో నాయకులను ఎన్నుకునే విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించినట్లు జ్యోతిరావ్‌ఫూలే బాలికల గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వీణాచందన చెప్పారు. పోతారం(ఎస్)లో గురుకుల పాఠశాల విద్యార్థి కౌన్సిల్, హెడ్ గర్ల్ ఎంపికకు మంగళవారం ఓటింగ్ ప్రక్రియ చేపట్టారు. ప్రజాస్వామ్య పద్ధతిలో అందరికీ స్వేచ్ఛ, పోటీచేసే అవకాశం ఉంటుందన్నారు. ఆక్రమిస్తే చర్యలు తప్పవు వర్గల్(గజ్వేల్): ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ శ్రీకాంత్ హెచ్చరించారు. ఒడ్డెర, యాదవ కులస్తుల మధ్య వివాదం తలెత్తిన నేపథ్యంలో మంగళవారం ఆయన వర్గల్ శివారులోని సర్వే నంబర్ 1045 ప్రభుత్వ భూమిని పరిశీలించారు. ఆ భూమిలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మిస్తే చర్యలు తప్పవన్నారు. ఆయన వెంట గిర్ధావర్ ప్రవీణ్, భగత్ తదితరులున్నారు. ఓపీ సేవల సమయం పెంచండి సిద్దిపేటకమాన్: ప్రభుత్వాసుపత్రిలో ఓపీ సేవల సమయాన్ని పెంచి, సకాలంలో వైద్య సేవలందించాలని డీవైఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. వారు మంగళవారం ప్రభు త్వ ఆస్పత్రి సందర్శించారు. మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత కూడా ఓపీ సేవలు అందుబాటులో ఉండేలా చూడాలని కోరారు. -
పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్య భద్రతే ధ్యేయం
మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మిహుస్నాబాద్: పారిశుద్ధ్య, వ్యర్థాల సేకరణ కార్మికుల ఆరోగ్య భద్రతే తమ ధ్యేయమని మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న నమస్తే పథకంలో భాగంగా మున్సిపాలిటీలో పనిచేస్తున్న వ్యర్థాల సేకరణ కార్మికులకు మంగళవారం ఆయుష్మాన్ భారత్ కార్డులు, పీపీఈ కిట్లు పంపిణీ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నమస్తే పథకం ద్వారా వ్యర్థాల సేకరణ కార్మికుల సామాజిక భద్రత, గౌరవప్రదమైన జీవనం, వృత్తి పరమైన రక్షణ కల్పించడమే ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, వైస్ చైర్పర్సన్ చిత్తారి పద్మ, కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. సిద్దపేటలో.. సిద్దిపేటజోన్: మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచనల మేరకు శానిటరీ ఇన్స్పెక్టర్ మహేశ్, ఎన్విరాల్మెంట్ ఇంజనీర్ అన్వేష్ పారిశుద్ధ్య కార్మికులకు పీపీటీ కిట్లు పంపిణీ చేశారు. వారు మాట్లా డుతూ విధుల నిర్వహణలో తప్పనిసరి జాగ్రత్తలు పాటించాలన్నారు. చెత్త సేకరణ సమయంలో సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
మత్తు పదార్థాలపై అవగాహన అవసరం
రాజన్న జోన్–3 డీఐజీ సున్ప్రీత్సింగ్సిద్దిపేటకమాన్: గంజాయి, ఇతర మాదక ద్రవ్యాల వినియోగంపై యువత, ప్రజల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలని రాజన్న జోన్ 3 డీఐజీ సున్‌ప్రీత్‌సింగ్ ఆదేశించారు. పోలీసు కమిషనరేట్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. పోలీసు గౌరవ వందనం స్వీకరించి, కమిషనర్ కార్యాలయ ఆవరణలో సీపీతో కలిసి మొక్కను నాటారు. శాంతిభద్రతలు, నేరాలపై ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ.. సైబర్ నేరాలపై కఠినంగా వ్యవహరించాలన్నారు. షీ టీమ్స్ పనితీరుపై మహిళలు, విద్యార్థినులకు మరింత అవగాహన కల్పించాలని, ఎస్హెచ్ఓలు తమ పరిధిలో క్రమం తప్పకుండా వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు డీసీపీలు కుశాల్కర్, సుభాష్ చంద్రబోస్, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
జల సంరక్షణ అందరి బాధ్యత
మున్సిపల్ చైర్ పర్సన్ అరుణచేర్యాల(సిద్దిపేట): నీటిని వృథా చేయకుండా సంరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ ముస్త్యాల అరుణ అన్నారు. జాతీయ జల మిషన్‌లో భాగంగా మంగళవారం పట్టణ పరిధిలోని 6వ వార్డులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలతో కలిసి జల సంరక్షణ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం మాట్లాడుతూ వర్షపు నీటిని సేకరించడం, ప్రతి నీటి చుక్కను సంరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు తాగునీటి కొరత రాకుండా చూడవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జల శక్తి అభియాన్ – క్యాచ్ ది రెయిన్ కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు. భూ గర్భ జలాలను అభివృద్ధి చేసుకోవాలి హుస్నాబాద్‌రూరల్: ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి.. భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలాలు అభివృద్ధి చెందుతాయని ఎంపీడీఓ సతీశ్ అన్నారు. బంజేరుపల్లి, పోతారం(ఎస్) గ్రామాల్లో ఆయన పర్యటించి బోరు బావుల వద్ద ఇంకుడు గుంతలు తవ్వుకోవాలని సూచించారు. బంజేరుపల్లి బోరుబావి వద్ద ఇంకుడు గుంత పనులను ప్రారంభించారు. రైతులకు ఇంకుడు గుంతలపై అవగాహన కల్పించి ఉపాధి హామీ పథకంలో పనులు మంజూరు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఎంఈఓ మనీల, సర్పంచ్‌లు చంద్రకళ, లత తదితరులు ఉన్నారు. -
కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
బీఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి స్వామిగజ్వేల్: ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా బీఎంఎస్ పనిచేస్తోందని ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర స్వామి అన్నారు. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపోలో మంగళవారం నిర్వహించిన నూతన కమిటీ ఎన్నిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ కార్మికులకు ఎలాంటి ఇబ్బందులున్నా.. వాటి పరిష్కారానికి కృషిచేస్తామన్నారు. నూతన కమిటీ అధ్యక్షురాలిగా లక్ష్మి, కార్యదర్శిగా సాయికిశోర్, కోశాధికారిగా ఎం.శ్రీనివాస్ తదితరులు ఎంపికయ్యారు. కార్యక్రమంలో సంఘం నాయకులు మరాఠి కృష్ణమూర్తి, తిరుపతిగౌడ్, రాజయ్య తదితరులు పాల్గొన్నారు. -
చర్యలు తీసుకోవాలని వినతి
హుస్నాబాద్: ఎలాంటి అనుమతి లేకుండా అక్రమంగా మట్టిని తరలిస్తున్న అక్రమదారులపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఇరిగేషన్ డిప్యుటీ ఇంజనీర్ శ్రీనివాస్‌కు మంగళవారం వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పట్టణ శివారులోని కుమ్మరికుంటలో కొంతమంది అక్రమంగా మట్టి తవ్వి తరలిస్తున్నారన్నారు. అలాగే కుంటలోని కొంత భూమిని ఆక్రమించారని, అధికారులు హద్దులు నిర్ణయించి ఆ భూమిని స్వాధీనం చేసుకోవాలని కోరారు. ఇప్పటికే రహదారుల పేరిట గుట్టలను తవ్వి మట్టిని తరలించి ప్రకృతి సంపదను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. అక్రమదారుల నుంచి కుంటను కాపాడాలని కోరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, విజయభాస్కర్, తిరుపతి నాయక్, రమేశ్ పాల్గొన్నారు. ‘జబర్దస్త్’ నటి ఫైమా సందడి దుబ్బాకటౌన్: జబర్దస్త్ హాస్యనటి ఫైమా దుబ్బాక మైనారిటీ గురుకులంలో మంగళవారం సందడి చేశారు. ఈ గురుకులం ప్రత్యేకత తెలుసుకొని తన అక్క కొడుకుని చేర్పించారు. అనంతరం విద్యార్థులకు జోకులు చెప్పి నవ్వించారు. ఈ మైనారిటీ గురుకులాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు ఆమెను శాలువాతో సన్మానించారు. విద్యార్థులకు షూస్ అందజేత గజ్వేల్‌రూరల్: విద్యార్థులు చదువుల్లో రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మండలంలోని అహ్మదీపూర్ కాంప్లెక్స్ హెచ్ఎం సుగుణాకర్ సూచించారు. ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులకు గజ్వేల్‌కు చెందిన ఎర్ర సత్యం మంగళవారం షూస్ పంపిణీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు దాతల సహకారాన్ని సద్వినియో గం చేసుకుంటూ ఉన్నతులుగా ఎదగాలన్నా రు. కార్యక్రమంలో హెచ్ఎం సుధాకర్, ఉపాధ్యాయుడు భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. ఆ పాపం బీఆర్ఎస్దే.. బెజ్జంకి(సిద్దిపేట): ఇథనాల్ ఫ్యాక్టరీల ఏర్పాటుకు అనుమతినిచ్చి పాపం చేసింది బీఆర్ఎస్ పార్టీయేనని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్ ఆరోపించారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, సర్పంచ్ల ఫోరం మండ ల అధ్యక్షుడు శ్రీకాంత్‌తో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. నిబంధన లు పట్టించుకోకుండా వారి సర్పంచ్‌లు తీర్మానాలు చేయడం వల్లే మండల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. ఫ్యాక్ట రీ అనుమతులపై ఎమ్మెల్యేను కానీ, పార్టీని కానీ విమర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. సర్పంచ్‌లు, నాయకులు పాల్గొన్నారు. పల్లెల అభివృద్ధికి ప్రాధాన్యం చిన్నకోడూరు(సిద్దిపేట): పల్లెల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని పద్మశాలి కో–ఆపరేటివ్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. మండల పరిధిలోని అల్లీపూర్లో రూ.20 లక్షలతో నిర్మించే సీసీ రోడ్లకు ఏఎంసీ చైర్మన్ మీసం మహేందర్‌తో కలిసి మంగళవారం భూమిపూజ చేశారు. ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామాలు అభివృద్ధిలో కుంటుపడ్డాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి కట్టుబడి ఉందని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం, ఆర్టీఏ మెంబర్ డా.సూర్యవర్మ, ఏఎంసీ చైర్మన్ దేవులపల్లి యాదగిరి, ఎస్సీ సెల్ జిల్లా చైర్మన్ శంకర్, నాయకులు సాకి ఆనంద్, చంద్రశేఖర్, పరశురాములు, రాజేశ్ పాల్గొన్నారు. -
రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి
ఏబీవీపీ నాయకుల డిమాండ్సిద్దిపేటఎడ్యుకేషన్: ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయడంలో ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) మంగళవారం కళాశాలల బంద్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్య వర్గ సభ్యులు సావుల ఆదిత్య, జిల్లెల ఫణీందర్ తదితరులు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విద్యార్థులకు రీయింబర్స్మెంట్, స్కాలర్‌షిప్‌ల గురించి వివరించి బయటకు పంపించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులు స్కాలర్‌షిప్‌లపై ఆధారపడి చదువుతున్నారన్నారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను విడుదల చేయక పోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో నాయకులు తరుణ్, లోకేశ్, శ్రావణ్, శ్రీకాంత్, అశ్వల్, పవన్, సాత్విక్, చరణ్, ఆదిత్య, శ్రీషన్ తదితరులు పాల్గొన్నారు. ఎత్తి వేసేందుకు కుట్ర బెజ్జంకి(సిద్దిపేట): విద్యార్థులకు అందించే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తి వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఏబీవీపీ జిల్లా కార్యవర్గ సభ్యుడు బుర్ర సాయిరాం ఆరోపించారు. బెజ్జంకిలో కళాశాలల బంద్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ సుమారు రూ.11 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయన్నారు. బకాయిల కారణంగా కళాశాలల నుంచి సర్టిఫికెట్లు తెచ్చుకోలేక పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశాంత్, రవి, వీరేశం, సాయిలు పాల్గొన్నారు. విద్యార్థుల హక్కు హుస్నాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ విద్యార్థుల హక్కు అని, ప్రభుత్వ భిక్ష కాదని ఏబీవీపీ నాయకులు అన్నారు. పట్టణంలో నిర్వహించిన కళాశాలల బంద్ విజయవంతమైంది. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని మార్చుకోకపోతే ఉద్యమ కార్యాచరణను చేపడతామన్నారు. నగర కార్యదర్శి బత్తుల రాజు, నాయకులు రాజేశ్, చరణ్, అంజి, రంజిత్ తదితరులు ఉన్నారు. బంద్ విజయవంతం నంగునూరు(సిద్దిపేట): విద్యార్థులకు చెల్లించాల్సిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. నంగునూరులో జూనియర్ కళాశాల, మోడల్ స్కూల్ బంద్ నిర్వహించారు. -
సుల్తానా ఉమర్‌కు జాతీయ సేవారత్న అవార్డు
దుబ్బాకటౌన్: సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ అధ్యక్షురాలు, సామాజిక ప్రజా సేవకురాలు మహమ్మద్ సుల్తాన ఉమర్ ప్రతిష్టాత్మక ‘నేషనల్ సేవా రత్న’ అవార్డు అందుకున్నారు. జనసాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జేబీరాజు, జనసాహిత్య అకాడమీ వ్యవస్థాపక అధ్యక్షుడు డా.పాముల రమణ ఆమెకు అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో పేదలు, మహిళలు, అనాథలు, సంచార జాతుల సంక్షేమం కోసం సోషల్ రిఫార్మేషన్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని కొనియాడారు. సామాజిక బాధ్యతతో ప్రజలకు అండగా నిలుస్తున్న ఆమె సేవలను గుర్తించి ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారన్నారు. అనంత రం సుల్తానా ఉమర్ తన సేవలను గుర్తించి అవార్డుతో సత్కరించిన జనసాహిత్య అకాడమీ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. -
ఘనంగా శీత్లాభవానీ పండుగ
అక్కన్నపేట(హుస్నాబాద్): గిరిజనులు ప్రతియేటా నిర్వహించుకునే శీత్లాభవాని పండుగను మండలంలోని కెప్టన్చౌడుతండా గ్రామంలో మంగళవారం సర్పంచ్ గుగులోతు స్వరూపరాజు నేతృత్యంలో గిరిజనులు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ప్రజలు పశుపక్ష్యాధులు ఆరోగ్యంగా ఉండాలని, పాడి పంటలు సమృద్ధిగా పండాలని, వర్షాలు కురవాలని గిరిజన మహిళలు, యువతులు శీత్లా భవానీకి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. మహిళ లు తమ సంప్రదాయ దుస్తులు ధరించి డప్పుచప్పుళ్ల నడుమ నృత్యాలు చేసుకుంటూ తరలివెళ్లా రు. గ్రామస్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు. -
భూనిర్వాసితులకు పరిహారం చెల్లించండి
గజ్వేల్: రాయపోల్ మండలం కొత్తపల్లి రెవెన్యూ పరిధిలోగల టెంకంపేట కొండపోచమ్మసాగర్ కాల్వ భూనిర్వాసితులకు వెంటనే పరిహారం ఇవ్వాలని సీపీఎం పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు సందెబోయిన ఎల్లయ్య కోరారు. అదేవిధంగా ఆహ్మద్‌నగర్ నుంచి ముత్యంపేట వరకు కాల్వ నిర్మాణం చేపట్టాలన్నారు. సోమవారం గజ్వేల్‌లోని ఆర్డీఓ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో ఈ సమస్యపై రైతులతో కలిసి అధికారులకు ఆయన వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ టెంకంపేటకు చెందిన 19మంది రైతులకు చెందిన 15ఎకరాల భూమిలో కొండపోచమ్మసాగర్ కాల్వను మూడేళ్ల క్రితం నిర్మించారని, అయినా ఇప్పటివరకు రైతులకు పరిహారం ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆహ్మద్‌నగర్– ముత్యంపేట వరకు కాల్వను నిర్మించాలని రైతులు కోరుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదని వాపోయారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రంగారెడ్డి పాల్గొన్నారు. -
‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’
సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేట నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. తమ రక్తంతో రైతుల కష్టాలు తీరుతాయంటే రక్తం చిందించడానికి బీఆర్ఎస్ శ్రేణులు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ‘ఇదిగో మా రక్తం తీసుకోండి.. రైతులకు నీళ్లివ్వండి’ అంటూ రక్తదానం చేశారు. సేకరించిన రక్తం ప్యాకెట్లను సీఎం ఇంటికి పంపిస్తామని వారు అన్నారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు సంపత్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయిరాం నాయకులు మోహన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. – సిద్దిపేటజోన్ -
మల్లన్న హుండీ ఆదాయం రూ.94 లక్షలు
కొమురవెల్లి(సిద్దిపేట): మల్లికార్జున స్వామి వారి ఖజానాకు హుండీల ద్వారా రూ.94లక్షల ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. 47రోజులలో భక్తుల కానుకల రూపంలో రూ.94,93,627 ఆదాయం వచ్చిందని ఆలయ కార్యనిర్వహణ అధికారి సుధాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం స్వామి వారి ఆలయ ముఖ మండపంలో కానుకలను లెక్కించారు. నగదు రూ.94,93,627, మిశ్రమ బంగారం 56 గ్రాముల 600మిల్లీగ్రాములు, మిశ్రమ వెండి 3కిలోల 500గ్రాములు, విదేశీ కరెన్సీనోట్లు 32 వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ శ్రీనివాస్, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, పర్యవేక్షకులు తదితరులు పాల్గొన్నారు. పరిహారం ఇవ్వకుండానే రోడ్డు పనులా? అడ్డుకున్న గ్రామస్తులు కోహెడరూరల్(హుస్నాబాద్): మండల పరిధి నాగసముద్రాల గ్రామ శివారులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జాతీయ రహదారి (765 డీజీ) మెదక్–ఎల్కతుర్తి విస్తరణ రోడ్డు పనులను సోమవారం ఉదయం ఎలాంటి సమాచారం లేకుండా ప్రారంభించడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఎలా ప్రారంభిస్తారని వారు ప్రశ్నించారు. మా భూములు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంట్రాక్టర్లకు కొమ్ముకాస్తూ బాధితుల గోడును పట్టించుకోని అధికారులు తీరుపై మండిపడ్డారు. పరిహారం అందే వరకు ఇంచు భూమి కూడా వదలమని బాధితులు తెగేసి చెప్పారు. ‘చేనేత’ సలహా మండలి చైర్మన్‌గా శ్రీనివాస్హుస్నాబాద్: చేనేత ఐక్య వేదిక రాష్ట్ర సలహా మండలి కమిటీ చైర్మన్‌గా చింతకింది శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా పద్మ శాలి సంఘం నాయకులు ఆయనను ఘనంగా సన్మానించారు. సోమవారం స్థానిక శివభక్త మార్కండేయ స్వామి ఆలయంలో అభినంద సభ ఏర్పాటు చేశారు. చేనేత వృత్తిదారుల సంక్షేమం, చేనేత పరిశ్రమ అభివృద్ధి, నేతకారుల సమస్యల పరిష్కారంలో శ్రీనివాస్ కీలక పాత్ర పోషించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో చేనేత, పద్మశాలి సంఘ నాయకులు భగవాన్, వెంకటరమణ, లక్ష్మీపతి, లక్ష్మయ్య, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి నేటి నుంచి 28 వరకు టీకాలు జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి గోపాలకృష్ణమూర్తి ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): గొర్రెలు, మేకలలో పీపీఆర్ వ్యాధి (పారుడు రోగం) వ్యాపిస్తోందని, పెంపకందారులు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా పశువైద్య, పశుసంవర్ధకశాఖ అధికారి డాక్టర్ గోపాలకృష్ణమూర్తి తెలిపారు. పీపీఆర్ వ్యాధి వైరస్ వలన వ్యాపిస్తోందన్నారు. గొర్రెలు, మేకలలో తీవ్ర జ్వరం, నోటిలో పొక్కులు రావడం, పల్చటి విరేచనాలు, శ్వాస సరిగా తీసుకోకపోవడం, ముక్కు, కళ్ల నుంచి స్రవాలు కారడం, డీ హైడ్రేషన్‌కు గురి అవ్వడం జరుగుతుందన్నారు. ఈ వ్యాధి వలన 4 నెలల నుంచి సంవత్సరం లోపు పిల్లలు మరణిస్తాయన్నారు. ఈ వ్యాధి నివారణకు గాను పీపీఆర్ టీకాలు వేయాలన్నారు. వ్యాధిని గమనించిన వెంటనే పశు వైద్యున్ని సంప్రదించి, చికిత్స అందించాలన్నారు. ఈ వ్యాధి నివారణకు మంగళవారం నుంచి ఈ నెల 28 వరకు టీకాలు వేయనున్నట్లు తెలిపారు. -
సర్‌పై అలసత్వం వద్దు
● యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలి ● ఒక్క ఓటూ తప్పిపోవద్దు ● కలెక్టర్ హైమావతి సిద్దిపేటజోన్: సమగ్ర ప్రత్యేక ఓటరు జాబితా సవరణ(సర్) ప్రక్రియలో పాల్గొనే అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేసి నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని కలెక్టర్ హైమావతి పిలుపుని చ్చారు. సోమవారం మున్సిపల్ కార్యాలయంలో సిద్దిపేట పట్టణ పరిధిలో సర్ ప్రక్రియ తీరుతెన్ను లు, ప్రస్తుత పరిస్థితులు గూర్చి సమీక్ష నిర్వహించా రు. జిల్లా కేంద్రంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదని అధికారులు, సిబ్బందిని కలెక్టర్ కారణాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ శాతం నమోదైన సూపర్ వైజర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లు పై ఆగ్రహం వ్యక్తంచేశారు. పట్టణంలో ఒక్క ఓటు తప్పిపోవద్దని, అదేవిధంగా రెండు చోట్ల ఒకరికి ఓటు ఉండకూడదని స్పష్టం చేశారు. అత్యంత పారదర్శకంగా విధులను నిర్వర్తించాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సక్రమంగా విధులను నిర్వహించకపోతే ,అలసత్వం వహిస్తే వారిపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ కు సూచించారు. బూత్ లెవల్ ఆఫీసర్లు తప్పనిసరి ఇంటింటికి వెళ్లి పూరించిన ఎన్యుమరేషన్ పత్రాలను సేకరించాలని ఆదేశించారు. సమావేశంలో ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ భవ్య, ఆర్డీఓ సదానందం, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్, తహశీల్దార్ హరి కిరణ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇల్లు.. అందని చివరి బిల్లు
ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ సిద్దిపేట రూరల్ మండలం రాఘవాపూర్ గ్రామానికి చెందిన బోండ్ల శోభ. ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం పూర్తయి మూడు నెలలు అవుతోంది. ఇల్లుతో సొంతింటి కల నెరవేరింది కానీ.. అప్పులు మిగిలాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అందించే బిల్లులు సరిపోవడం లేదని, దీంతో అప్పులు తెచ్చి ఇంటి నిర్మాణం చేయాల్సి వస్తోందని వాపోయారు. ఫైనల్ బిల్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది పడుతున్నామన్నారు. అప్పులు తెచ్చిన వాటికి వడ్డీ పెరిగిపోతోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఫైనల్ బిల్లు త్వరగా ఇప్పించాలని శోభ కోరుతున్నారు. గృహ ప్రవేశమైనా పైసలు అందలే.. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తి అయి దాదాపు నాలుగు నెలలు అవుతోంది. ఇప్పటి వరకు రూ.4లక్షలు మాత్రమే వచ్చాయి. ఇటీవల గృహ ప్రవేశం సైతం పూర్తయింది. అయినప్పటికీ ఫైనల్ బిల్లు రాలే. ప్రభుత్వం అందించిన డబ్బులే సరిపోవడంలేదు.. మరో వైపు బిల్లు ఆలస్యంతో ఇబ్బందులు పడుతున్నాం. –గీకురు సుమలత, హుస్నాబాద్సాక్షి, సిద్దిపేట: ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా ప్రభుత్వం చివరి బిల్లు చెల్లించకపోవడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పలువురు పేదలకు ఆర్థికంగా భారమవుతోంది. బిల్లుల చెల్లింపుల్లో జరుగుతున్న తీవ్ర జాప్యం లబ్ధిదారులను అప్పుల ఊబిలోకి నెడుతోంది. జిల్లా వ్యాప్తంగా 11,834 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు కాగా 10,244 ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోశారు. ఇందులో 2,567 ఇళ్లు నిర్మాణం పూర్తయ్యాయి. వాటిలో 491 వాటికే పూర్తి బిల్లులు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 10,244 ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా అందులో బేస్మెంట్ స్థాయిలో 1,489, గోడల నిర్మాణం 821, స్లాబ్ వేసినవి 3,998, నిర్మాణం పూర్తి అయినవి 2,567 ఉన్నాయి. వీటిలో చివరి బిల్లు కేవలం 491 ఇళ్లకు మాత్రమే చెల్లించగా మిగతా 2,076 ఇళ్లకు ఇంకా రూ.33.21కోట్లను లబ్ధిదారులకు చెల్లించాలి. గృహ ప్రవేశాలు జరిగి నెలలు గడుస్తున్నా.. చివరి బిల్లుల కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. మరికొందరి ఇళ్ల నిర్మాణాలు మధ్యలోనే ఆగిపోవడంతో అప్పులు చేసి పనులు చేపడుతుండటం గమనార్హం. దీనికి తోడు ఉపాధి హామీ పథకానికి అనుసంధానం చేసిన బిల్లులు సైతం ఆలస్యమవుతుండటంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణం కోసం మొత్తంగా దాదాపు రూ.12లక్షలు ఖర్చు అవుతోంది. ప్రభుత్వం అందించే సాయంలో నిర్మాణం చేసే మేసీ్త్రకే రూ.3.5లక్షలు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం అందించే డబ్బుల్లో మిగిలేది రూ.1.5లక్షలు మాత్రమే. మెటీరియల్, ఇతర ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ వారికి ఇలా దాదాపు మొత్తంగా అదనంగా రూ.7లక్షలు లబ్ధిదారుల మీద డబ్బులు పడుతున్నాయి. వడ్డీల భారం ఓ వైపు బిల్లులు రాకపోవడం.. ప్రభుత్వం అందించే డబ్బులు సరిపోకపోవడంతో లబ్ధిదారులు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల నిర్మాణం పూర్తి చేయడానికి బిల్డర్లు డబ్బులు అడుగుతుండటంతో గత్యంతరం లేక లబ్ధిదారుల తమ వద్ద ఉన్న కొద్దిపాటి బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెడుతున్నారు. మరికొందరు గ్రామాల్లో రూ.2 వడ్డీకి అప్పులు తెస్తూ.. ఇంటి నిర్మాణాలను పూర్తి చేస్తున్నారు. ఇంటి నిర్మాణాలను పూర్తి చేసిన వారికి బిల్లు చెల్లింపుల్లో జాప్యం కారణంగానే అనేక చోట్ల పనులు మధ్యలోనే నిలిచిపోతున్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇళ్లు బిల్లులు చెల్లించే విధంగా కృషి చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు. ఫైనల్ బిల్లు ఆలస్యమవుతోంది ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణంలో ఫైనల్ బిల్లు ఆలస్యమయ్యేది వాస్తవమే. త్వరలో ఫైనల్ బిల్లు ప్రభుత్వం చెల్లించనుంది. ఎప్పటికప్పుడు ఫొటోలు అప్లోడ్ చే యించిన వారికి మిగతా బిల్లులను ప్రభుత్వం చెల్లిస్తుంది. – భగవాన్ రావు, ఇన్చార్జి హౌసింగ్ పీడీ -
నులిపురుగులను నివారిద్దాం
కొండపాక(గజ్వేల్): నట్టల నివారణ కోసం 1 నుంచి 19 ఏళ్ల పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు వేయించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. నులిపురుగుల నివారణ దినోత్సవా న్ని పురస్కరించుకొని కొండపాక మండలంలోని దుద్దెడలో గల హైస్కూల్ల్లో విద్యార్థులకు మాత్ర లు వేశారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఎదిగే వయస్సులో పిల్లలు వ్యాధులకు గురైతే సరైన ఎదుగదల ఉండకపోవడంతో వివిధ రకాల సమస్యలతో బాధపడాల్సి వస్తుందన్నారు. ఆరోగ్య విషయంలో పిల్లలు తగు జాగ్రత్తలు తీసు కునేలా తల్లిదండ్రులు చూసుకోవాలన్నారు. కడుపు లో నులిపురుగులు ఉంటే.. ఆకలి మందగించడంతో పాటు ఎప్పుడూ నీరసంగా కనిపించే లక్షణా లుంటాయన్నారు. మధ్యాహ్న భోజనంలో మెనూ పాటించని పాఠశాలలపై చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ ధన్‌రాజ్, ఎంఈఓ శ్రీనివాస్‌రెడ్డి, హెచ్ఎం లక్ష్మి, సర్పంచ్ శివకుమార్, అధికారులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి పతకాలు భేష్
సీపీ రష్మీ పెరుమాళ్సిద్దిపేటకమాన్: పోలీసు సిబ్బంది రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని పతకాలు సాధించడం అభినందనీయమని సీపీ రష్మీ పెరుమాళ్ తెలిపారు. మల్కాజ్గిరి పోలీసు కమిషనరేట్‌లో ఇటీవల జరిగిన తెలంగాణ పోలీసు గేమ్స్ అండ్ స్పోర్ట్స్‌లో ప్రతిభ కనబర్చి పతకాలు సాధించిన పోలీసు సిబ్బందిని సీపీ సోమవారం అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర స్థాయి పోటీల్లో కమిషనరేట్ నుంచి పాల్గొన్న ఆర్ఎస్ఐ పి.రోహిత్ పవర్‌లిఫ్టింగ్ 83 కేజీల విభాగంలో బంగారు పతకం, అలాగే ఎస్ఐ అంజయ్య కరాటే 84 కేజీల విభాగంలో బంగారు పతకం, కానిస్టేబుల్ ఎన్.అనిల్‌కుమార్ కరాటే 75 కేజీల విభాగంలో కాంస్య పతకంసాధించారన్నారు. ఏఆర్ పీసీ భరత్ త్వైకాండో 74కేజీల విభాగంలో కాంస్య పతకం, ఏఆర్ మహిళా కానిస్టేబుల్ డి.శ్రావణి యోగాలో ప్రతిభ చాటి కాంస్య పతకాన్ని గెలు చుకున్నట్లు సీపీ తెలిపారు. ప్రాజెక్టు సిద్ధి కార్యక్రమంలో యోగా నేర్చుకుని మొదటి ప్రయత్నంలోనే పతకం సాధించడం అభినందనీయమన్నారు. -
కేవైసీ.. పరేషన్!
ప్రహసనంగా ఐడెంటిటీజిల్లా పౌర సరఫరాల శాఖలో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియ ప్రహసనంగా మారుతోంది. రేషన్ కార్డుదారుల కేవైసీ ప్రక్రియకు రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరంగా ఉండటంతో నిర్దేశించిన వందశాతంపై నీలినీడలు కమ్ముకున్నాయి. కేవైసీ చేయని వారికి రేషన్ సరుకుల పంపిణీ నిలిపివేయాల్సి వస్తుందని సంబంధించిన శాఖ హెచ్చరికలు చేసినప్పటికీ లబ్ధిదారుల్లో స్పందన కనబడకపోవడంతో రేషన్ డీలర్లు, శాఖ అధికారులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు. – సిద్దిపేటజోన్ జిల్లాలోని 688 రేషన్ షాప్‌ల ద్వారా ప్రభుత్వం నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలో 3,36,976 రేషన్ కార్డులు ఉండగా వీటి ద్వారా 1,04,9021 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఈ క్రమంలో రేషన్ పక్కదారి పట్టకుండా అర్హులైన వారిని గుర్తింపు నేపథ్యంలో కేవైసీ అంశం తెర మీదకి వచ్చింది. రేషన్ షాప్ వారీగా లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ చేపట్టి వారి ఐడెంటిటీ నిర్దారణ మొదలుపెట్టారు. ఈ లెక్కన జిల్లాలో ఇప్పటివరకు 3,23,100 రేషన్ కార్డులకు సంబంధించి 8,48,106మంది లబ్ధిదారుల బయోమెట్రిక్, ఐరిష్ సేకరణ జరిగింది. ఇంకా 13,876కార్డులకు చెందిన 2,00,915మంది బయోమెట్రిక్, ఐరిష్ చేపట్టాల్సిన పరిస్థితి నెలకొంది. వారి కోసం కొన్ని నెలలుగా రేషన్ డీలర్లు ఎదురుచూస్తున్నా వారిలో స్పందన నామమాత్రంగా ఉందని చెప్పాలి. వందశాతంపై ప్రభావం.. జిల్లాలోని రేషన్ కార్డుదారులందరి కేవైసీ వందశాతం పూర్తి చేయాలనే ప్రభుత్వ లక్ష్యానికి సవాలక్ష కారణాలు అడ్డుగా నిలుస్తున్నాయి. ముఖ్యంగా కార్డుల్లో చిన్న పిల్లలు, వృద్ధులు అధిక సంఖ్యలో ఉండటంతో వారి బయోమెట్రిక్, ఐరిష్ ప్రక్రియ సమస్యగా మారుతోంది. అదేవిధంగా కొన్నేళ్లుగా వివిధ కారణాలతో లబ్ధిదారులు చనిపోయారు. అయినప్పటికీ వారి పేర్లను కార్డుల నుంచి తొలగింపు ప్రక్రియ లేకపోవడం, అలాగే వన్ నేషన్.. వన్ రేషన్ నినాదంతో లబ్ధిదారులు ఎక్కడైనా సరుకులు తీసుకునే అవకాశం ఏర్పడింది. సరుకుల కోసం వచ్చిన లబ్ధిదారులు అంతే ఆసక్తిగా గుర్తింపు ప్రక్రియకు రావడం లేదు. ఇలాంటి కారణాలతో ప్రస్తుతం కేవైసీ నిర్దేశించిన లక్ష్యం పై ప్రభావం పడుతోంది. ఐడెంటిటీ ప్రక్రియకు రాకుండా రికార్డులలో పెండింగ్ అంశంగా ఉన్న లబ్ధిదారుల ఆచూకీ కోసం రేషన్ డీలర్లు నెలల కొద్దీ ఎదురుచూస్తూనే ఉన్నారు. ఇంకా రెండు లక్షల మంది లబ్ధిదారులు దూరం నెలలు గడిచినా స్పందన కరువు కష్టతరంగా వందశాతం ప్రక్రియ వెతుకులాటలో రేషన్ డీలర్లు 20శాతం మిగిలింది.. జిల్లాలో రేషన్ కార్డుల లబ్ధిదారుల కేవైసీ ప్రక్రియ నిరంతరం.. ఇప్పటివరకు 80శాతం పూర్తి అయింది. ఇంకా 20శాతం మిగిలి ఉంది. లబ్ధిదారులు తప్పనిసరిగా రేషన్ దుకాణానికి వెళ్లి కేవైసీ చేయించుకోవాలి. –తనూజ, డీఎస్ఓ, సిద్దిపేట -
నేడు ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ
డీఎంహెచ్ఓ ధనరాజ్ సిద్దిపేటకమాన్: జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంలో భాగంగా 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ సోమవారం ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు డీఎంహెచ్ఓ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మాత్రలు పంపిణీ చేయనున్నట్లు, ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల వారు 2,12,569మంది పిల్లలు ఉన్నట్లు గుర్తించామన్నారు. మొత్తం 2,461 పంపిణీ కేంద్రాల ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, హాస్టళ్లు, వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాల్లో వైద్య సిబ్బంది మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నేడు మాత్రలు తీసుకోలేని పిల్లలకు ఈ నెల 20న నిర్వహించే మాప్ అప్ డే కార్యక్రమంలో భాగంగా మాత్రలు పంపిణీ చేస్తామన్నారు. నులిపురుగుల నివారణకు ప్రతి ఒక్కరూ వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలని డీఎంహెచ్ఓ సూచించారు. -
రైతులపై నోటీసుల పిడుగు
యూరియా కష్టాలు వీడేనా మీసేవలో యూరియా బుకింగ్ ఉపయోగకరంగా ఉండదని రైతులు వాపోతున్నారు. వివరాలు 8లో uపారిశుద్ధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ ఫలితం కానరావడం లేదు. వివరాలు 9లో uసోమవారం శ్రీ 13 శ్రీ జూలై శ్రీ 2026పంట రుణం చెల్లించాలంటూ బ్యాంకు అధికారులు రోజూ ఇంటికి వస్తుండ్రు. నోటీసులు కూడా ఇచ్చారు. గత యాసంగిలో కడదామంటే అకాల వర్షాలతో పంట పూర్తిగా దెబ్బతిన్నది. ఈసారైనా పంటలు పండుతాయనుకుంటే.. వానలు కురుస్తలేవు. ఈ కరువు కాలంలో రుణం ఎలా కట్టేది?.. ఎలా బతికేది? – ఎల్లవ్వ, మహిళ, రైతు దుబ్బాకరూరల్: పంట రుణాలు చెల్లించాల్సిందేనంటూ బ్యాంకు అధికారులు నోటీసులు పంపుతుండటంతో రైతులు అయోమయానికి గురవుతున్నారు. అసలే ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావం నెలకొనడం.. మరోవైపు కరువు కమ్ముకొస్తున్న ఈ తరుణంలో రుణాలు ఎలా చెల్లించేది అంటూ వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది రైతుల రుణాలను మాఫీ చేసింది. అందరికీ మాఫీ చేస్తారని గంపెడాశతో ఎదురు చూసినా చివరకు కొందరికి నిరాశే మిగిలింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం రైతు ఇంటికి వచ్చి రుణం చెల్లించాల్సిందేనని నోటీసులు ఇచ్చి వెళ్తున్నారు. రుణం మాఫీ చేస్తారనుకుంటే బ్యాంక్ అధికారులు ఇంటికి వచ్చి ఫొటోలు, నోటీసులు ఇవ్వడంతో రైతులు కంగుతింటున్నారు. యాసంగిలో దెబ్బతిన్న పంటలు యాసంగిలో వేసిన పంటలు అకాల వర్షాలు.. వడగళ్లవానలతో పూర్తిగా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో మొక్కజొన్న పంటలు నేల మట్టమయ్యాయి. మరి కొన్ని చోట్ల మొక్కజొన్న పంటలు, వరి పంటలు అగ్నికి దగ్ధమయ్యాయి. దీంతో పంట రాబడి రాకుండా పోయింది. సాగుకు అప్పులు తీసుకువచ్చి పెట్టుబడులు పెడితే.. చేతి కొచ్చిన పంట రైతు కళ్లెదుటే దెబ్బతినడంతో కన్నీరు మున్నీరుగా విలపించారు. పంట రుణాలు చెల్లించాలంటూ బ్యాంకర్ల హుకుం అయోమయంలో అన్నదాతలు మరోవైపు కమ్ముకొస్తున్న కరువు -
క్రీడలతో సంపూర్ణ ఆరోగ్యం
చిన్నకోడూరు(సిద్దిపేట): క్రీడల ద్వారా సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని ఆత్యాపాత్యా అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ముకేష్, చైర్మన్ జంగిటి శ్రీనివాస్‌లు అన్నారు. చిన్నకోడూరు ఉన్నత పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఆత్యా పాత్యా క్రీడలు ఆదివారం ఉత్సాహభరితంగా సాగాయి. వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి వారిని ప్రోత్సహించడమే ఆత్యా పాత్యా లక్ష్యమన్నారు. క్రీడల ద్వారా యువతలో మానసిక ఉల్లాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయన్నారు. క్రీడా స్ఫూర్తితో యువత ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు మహేశ్, వెంకట్‌రెడ్డి, రాజు, కనకారెడ్డి, రజిత, రజినీ, రవీందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు. గజ్వేల్‌రూరల్: కౌలు రైతులను గుర్తించే వరకు సంఘటితంగా ఉద్యమిస్తామని డీబీఎఫ్ జాతీయ కార్యదర్శి శంకర్ పిలుపునిచ్చారు. ఆదివారం గజ్వేల్ పట్టణంలోని అంబేడ్కర్ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం కౌలు రైతులను గుర్తిస్తామని ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోవడం లేదన్నారు. కౌలు రైతులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ప్రభుత్వం కౌలు రైతులను గుర్తించి రైతు భరోసా, పంట నష్ట పరిహారం చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా ఉత్పత్తులను కొనుగోలు చేయాలని, యూరియా సరఫరాకు ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీబీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఏగొండస్వామి, జిల్లా అధ్యక్షుడు బ్యాగరి వేణు, మండల అధ్యక్షుడు చంద్రం, కౌలు రైతులు పాల్గొన్నారు. మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సూచించారు. ఆదివారం పట్టణంలో హెల్ప్ డెస్క్ లను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సర్’ విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అందుబాటులో ఉండని సూపర్ వైజర్లు, వార్డు ఆఫీసర్లు, బూత్ లెవల్ ఆఫీసర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తప్పనిసరి విధులకు హాజరుకావాలని సూచించారు. అనంతరం మున్సిపల్ కార్యాలయంలో సర్ ఎన్యుమరేషన్ పత్రాల పంపిణీ, సేకరణ, ఆన్లైన్ ప్రక్రియ గూర్చి సమీక్షించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పటాన్చెరు టౌన్: సర్ ప్రక్రియపై పార్టీ నాయకులు, ఆశావహులు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో నమ్మకం పోయిందని.. స్కామ్‌ల ప్రభుత్వం పోయి మళ్లీ సంక్షేమ పథకాల ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన విమర్శించారు. ఎస్ఐఆర్, బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు అంశాలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అధ్యక్షతన జీఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు మాజీమంత్రి హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేసి యావత్తు మీ వైపు చూసేలా చేశారన్నారు. పశ్చిమ బెంగాల్, అస్సాం, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో సర్ ప్రక్రియ కారణంగా ఓటర్ల జాబితాల్లో అవకతవకలు జరిగి ఎన్నికల ఫలితాలు మారాయని ఆరోపించారు. -
శాలివాహన సంఘాల అభివృద్ధికి కృషి
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): శాలివాహన సంఘాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహకరిస్తానని జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ దరిపల్లి చంద్రం అన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రంలో హుస్నాబాద్, చిన్నకోడూరు మండలాలకు చెందిన శాలివాహన కుల సంఘాల నాయకులు దరిపల్లి చంద్రాన్ని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా దరిపల్లి చంద్రం మాట్లాడుతూ ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం శాలివాహనుల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తోందన్నారు. కార్యక్రమంలో హుస్నాబాద్ శాలివాన సంఘం అధ్యక్షుడు బెక్కంటి భీమయ్య, ఇటికాల స్వామి, నాంపల్లి సమ్మయ్య, నమిలి కొండ ఐలయ్య, తిరుపతి, భూపతి, ప్రదీప్, పరశురాములు, శ్రీధర్, కుంటయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
మరో ముందడుగు
స్వచ్ఛ దిశగా● మున్సిపాలిటీకో వార్డు పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక ● పూర్తిస్థాయిలో జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలు ● విజయవంతం కాగానే అన్ని వార్డుల్లో అమలు ● త్వరలోనే అన్ని మున్సిపాలిటీల్లో శ్రీకారంకొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు మున్సిపాలిటీల్లో కొత్త తరహాలో స్వచ్ఛ కార్యక్రమాలు జరగనున్నాయి. ఎస్ఐఆర్ కార్యక్రమం పూర్తవగానే ఓ వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి జీరోవేస్ట్ మేనేజ్మెంట్ కార్యక్రమాలను చేపట్టాలనుకుంటున్నాం. పారిశుద్ధ్య అధికారులు, సిబ్బంది కొరత ఉన్న మాట వాస్తవమే. అయినా అందుబాటులో వారితో కార్యక్రమాలు జరిగేలా ప్రయత్నిస్తాం. – గణేశ్‌రెడ్డి, కమిషనర్, గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపల్ గజ్వేల్: మున్సిపాలిటీల్లో వ్యర్థాల నిర్వహణ తీరు ప్రజారోగ్యానికి ముప్పుగా మారింది. తడి, పొడి చెత్త సేకరణ శాసీ్త్రయంగా జరగకపోవడం వల్ల ఈ సమస్య రోజురోజుకూ జఠిలంగా మారుతోంది. ఈ క్రమంలోనే కొత్త పంథాలో చెత్త సేకరణ చేపట్టడమే కాకుండా జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను చేపట్టాలని మున్సిపల్ యంత్రాంగం భావిస్తున్నది. ఈ క్రమంలోనే ఈనెల 9న గజ్వేల్‌లోని డంపు యార్డు వద్ద జిల్లాలోని గజ్వేల్–ప్రజ్ఞాపూర్, సిద్దిపేట, హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీలతోపాటు అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట కమీషనర్లు, శానిటేషన్ అధికారులు, సిబ్బందితో మున్సిపల్ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త తరహా పద్ధతులపై దిశానిర్వేశం చేశారు. సిబ్బంది కొరతే శాపమా? పారిశుద్ధ్య విభాగాలకు సంబంధించిన అధికారులు, సిబ్బంది కొరత ఆయా మున్సిపాలిటీలకు శాపంగా మారాయి. గజ్వేల్–ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో కొత్తగా ఏర్పడిన ఆర్అండ్ఆర్ కాలనీలతో కలుపుకొని 15వేలకుపైగా ఇళ్లు ఉండగా.. జనాభా 80వేల పైచిలుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ నిత్యం ఉత్పత్తి అవుతున్న చెత్త 18 మెట్రిక్ టన్నుల పైనే. ఇక్కడ ప్రస్తుతం 162మంది పారిశుద్ధ్య సిబ్బంది ఉన్నారు. నిజానికి మరో 60మందికిపైగా సిబ్బంది అవసరం. ఇక్కడ 30 వరకు చెత్త సేకరణ వాహనాలు ఉండగా, మరో పది వాహనాలు అవసరమున్నాయి. మరో ముఖ్యమైన అంశమేమిటంటే పారిశద్ధ్య సమస్యను పర్యవేక్షించాల్సిన శానిటరీ ఇన్స్పెక్టర్, ఎన్విరాన్మెంట్ ఇన్స్పెక్టర్, హెల్త్ అసిస్టింట్, ఏఈల పోస్టులు కొంత కాలంగా ఖాళీగా ఉన్నాయి. హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాల మున్సిపాలిటీల్లోనూ ఇలాంటి పరిస్థితే కనిపిస్తున్నది. ఈ పరిస్థితుల్లో కొత్తగా చేపట్టబోయే కార్యక్రమాలు ఏమేరకు ఫలిస్తాయనేది వేచి చూడాల్సిందే.మున్సిపాలిటీలకు సవాలుగా మారిన వ్యర్థాల నిర్వహణ కొంత పుంతలు తొక్కనుంది. పాత పద్ధతులకు స్వస్తి పలికి కొత్త తరహాలో స్వచ్ఛత కార్యక్రమాలు జరగనున్నాయి. ఇందుకోసం మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయనున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, కంపోస్ట్ కార్యక్రమాలను విజయవంతం చేయడం ద్వారా మిగతా వార్డుల్లో అమలు చేయడానికి సిద్ధమవుతున్నారు. అన్ని మున్సిపాలిటీల్లో ఈ కార్యక్రమం త్వరలో అమలు కానుంది. వ్యర్థాల నిర్వహణలో కొత్త పంథాఈ సదస్సులో మున్సిపాలిటీకో వార్డును పైలెట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేయాలని నిర్ణయించారు. వార్డులో పూర్తిస్థాయిలో జీరోవేస్ట్ మేనేజ్మెంట్, అక్కడ ఉత్పత్తయిన తడి, పొడి చెత్తను శాసీ్త్రయంగా వేరు చేసి కంపోస్ట్ ఎరువుల తయారీపై దృష్టి పెట్టాలని అనుకున్నారు. ఇలా చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా స్వచ్ఛతకు బాటలు పడతాయని భావిస్తున్నారు. ప్రధానంగా కూరగాయల చెత్తను ప్రత్యేకంగా వేరు చేసి.. కులియబెట్టడం ద్వారా కంపోస్ట్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తున్నారు. అంతేకాకుండా డంపు యార్డుల్లో అగ్గి రాజుకోకుండా తీసుకోవాల్సిన శాసీ్త్రయ చర్యలపైనా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. జిల్లాలోని సిద్దిపేట మున్సిపాలిటీకి ఈ కార్యక్రమాలు కొంత పరిచయమున్నా.. మిగతా మున్సిపాలిటీల్లో సాగడం లేదు. ఇక అన్నీ మున్సిపాలిటీల్లో ఎస్ఐఆర్ కార్యక్రమం తర్వాత ప్రారంభించాలని భావిస్తున్నారు. -
వ్రత నాచగిరి.. సేవలతో తరించి
యువతరం ప్రైవేటు ఉద్యోగాలు వదిలి.. సాగుకు జైకొట్టి.. సిరులు రాబడుతున్నారు. సరికొత్త పద్ధతులు ఆచరిస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్నారు. వినూత్న ఎవుసం చేస్తూ నాణ్యత గల ఉత్పత్తులు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలువురి యువరైతుల వ్యవసాయంపై.. ఈ వారం ప్రత్యేక కథనాలు. భక్తులతో కిటకిటలాడినపుణ్యక్షేత్రంసుప్రసిద్ధ నాచగిరి లక్ష్మీనృసింహక్షేత్రం శనివారం సామూహిక సత్యనారాయణ వ్రతాలతో అలరారింది. సేవలు, కల్యాణాలతో ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, ఉమ్మడి మెదక్, రంగారెడ్డి జిల్లాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు క్షేత్రానికి తరలివచ్చారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. శ్రీవారి కల్యాణం, సేవలు నిర్వహించి తరించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. –వర్గల్(గజ్వేల్) -
కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా శంకర్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా తప్పెట శంకర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజేంద్రపాల్ గౌతమ్, టీపీసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సత్యనారాయణలు శనివారం నియామక పత్రాన్ని ఢిల్లీలో అందించినట్లు పార్టీ నాయకులు తెలిపారు. ఉపాధ్యక్షులుగా కొత్తూరి నరహరి, బండమీది తిరుపతిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారన్నారు. 50% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించాలి వర్గల్(గజ్వేల్): ప్రభుత్వం 50% ఫిట్మెంట్తో పీఆర్సీని వెంటనే ప్రకటించాలని పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి శశిధర్ డిమాండ్ చేశారు. శనివారం వర్గల్ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్రశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డితో కలిసి పలుపాఠశాలల్లో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆరు నెలలలోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారన్నారు. ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. చేనేత కార్మికుల ఇబ్బందులు తీరుస్తాం గజ్వేల్: చేనేత కార్మికుల ఇబ్బందులను తీర్చడమే లక్ష్యంగా పనిచేస్తానని గజ్వేల్ చేనేత సహకార సంఘం నూతన అధ్యక్షుడు స్వర్గం రాజేశం అన్నారు. శనివారం జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికల అధికారి గౌతమ్ నుంచి ధ్రువీకరణ పత్రం అందుకొని ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందేలా ప్రయత్నిస్తానన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సంఘం ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, కార్యదర్శి రామచంద్రం డైరెక్టర్లు భాగ్యలక్ష్మి, అమృతమ్మ, ప్రసాద్, పద్మశాలి సంఘం నాయకులు పాల్గొన్నారు. -
వాన లేకపాయె.. స్ప్రింక్లర్లే దిక్కాయె
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026వానాకాలం సీజన్ ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో వర్షాల జాడలేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. రోజూ మేఘాలు కమ్ముకుంటున్నా వర్షాలు మాత్రం కురవడంలేదు. ఇటీవల కురిసిన కొద్ది పాటి జల్లులకు దుక్కులు దున్ని మొక్కజొన్న విత్తనాలు విత్తుకున్నారు. నీటి వసతి ఉన్న రైతులు మొక్కజొన్నను కాపాడుకోవడానికి స్ప్రింక్లర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. నీటి వసతి లేని రైతులు ఆకాశంలోని మేఘాలవైపు చూస్తున్నారు. – చిన్నకోడూరు(సిద్దిపేట) -
కొత్త పంట
ఎల్‌నినో తంట..ఆయిల్‌పామ్ వైపు రైతుల మొగ్గు ఈ ఏడాది 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యం ఊపందుకున్న ప్లాంటేషన్ఇప్పటికే 710ఎకరాల్లో పూర్తి.. గతంతో పోలిస్తే రికార్డే.. జిల్లాలో 2021–22లో ప్రారంభమైన ఆయిల్‌పామ్ సాగు ప్రస్తుతం 15వేల ఎకరాలపైచిలుకు చేరుకుంది. నాలుగేళ్ల క్రితం వేసిన తోటల్లో ప్రస్తుతం ఉత్పత్తులు వస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో 7 టన్నులకుపైగా ఉత్పత్తులు వచ్చాయి. ఈక్రమంలోనే ఆయిల్‌ఫెడ్ సంస్థ నుంచి జిల్లా రైతులకు రూ.18కోట్ల వరకు చెల్లింపులు జరిగాయి. జిల్లాలోని నర్మెటలో ఆయిల్ఫామ్ ఫ్యాక్టరీ అందుబాటులోకి రావడం, ఎక్కడాలేని విధంగా రిఫైనరీ, ప్యాకింగ్‌కు అవకాశముంది. ఇక్కడి నుంచి ప్యాకింగ్ ఉత్పత్తులు నేరుగా మార్కెట్లోకి వెళ్లే అవకాశం కలిగింది. వర్షపాతం తగ్గడంతో.. ఆయిల్‌పామ్ సాగుకు సంబంధించి ఈసారి జిల్లాలో ప్రత్యేకమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎల్‌నినో ఎఫెక్ట్ కారణంగా వర్షపాతం తగ్గడం, గత సీజన్లో పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులు నానా యాతన పడటం వల్ల ఈసారి రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నట్లు స్పష్టమవుతోంది. ఇకపోతే.. గతంలో రూ.17,500 ఉన్న ఆయిల్‌పామ్ గెలల టన్ను ధర ఆరునెలలుగా అమాంతంగా రూ.23వేల పైచిలుకు పలుకుతుండటం.. ప్రస్తుతం రూ.23,837కు చేరుకోవడం కూడా కలిసి వస్తున్నది. జోరుగా ప్లాంటేషన్.. సహజంగా ఏటా ఆయిల్‌పామ్‌కు సంబంధించి అధికారులు ఒక కార్యాచరణ సిద్ధం చేస్తారు. అది అమలు కావడానికి చాలా సమయం పడుతుంది. కానీ ఈసారి 4వేల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే రైతులు 500ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశారు. తాజాగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్‌లో మరో 210ఎకరాల్లో సాగు కొత్తగా చేరింది. దీంతో ఈ సీజన్లో 710ఎకరాల్లో ఇప్పటివరకు సాగులోకి వచ్చింది. నిజానికి ఏటా ప్రతి సీజన్లో ఈ సమయానికి 100ఎకరాల్లోపు ప్లాంటేషన్ అవడమే గగనం. కానీ ఈసారి ప్లాంటేషన్ రికార్డు స్థాయిలో ఊపందుకున్నది. అంతేకాకుండా రైతులు స్వచ్ఛందంగా సాగుకు ముందుకురావడం వల్ల మరో 2,631ఎకరాల్లో ప్లాంటేషన్‌కు అధికారులు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకున్నారు. త్వరలోనే ప్లాంటేషన్‌ను పూర్తిచేయడానికి సిద్ధమవుతున్నారు. ఇకపోతే ఆయిల్ఫామ్ రైతుల అవసరాల కోసం 1200ఎకరాల్లో డ్రిప్ ఇవ్వడానికి సైతం కార్యాచరణ సిద్ధం చేశారు. ఎల్‌నినో ఎఫెక్ట్.. జిల్లాలో రైతుల ఆలోచన విధానాన్ని మార్చింది. ఆయిల్‌పామ్ సాగు వైపు మొగ్గు చూపేలా చేసింది. ఈ ఏడాది అధికారులు 4వేల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే ప్లాంటేషన్ ఊపందుకుంది. 710 ఎకరాల్లో పూర్తికాగా, మరో 2,631 ఎకరాలకుపైగా సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. గతంతో పోలిస్తే ఇది రికార్డు. ప్రస్తుతం జిల్లాలో సాగు 15వేల ఎకరాల పైచిలుకు చేరుకున్నది. – గజ్వేల్మారుతున్న ఆలోచన విధానం జిల్లాలో సాధారణంగా వానాకాలం సీజన్లో 5.50లక్షల ఎకరాల్లో, మరో 2.50లక్షల ఎకరాల్లో యాసంగిలో వివిధ రకాల పంటలు సాగులోకి వస్తుంటాయి. మూస పద్ధతుల్లో సాగు కొనసాగటం వల్ల రైతులకు పెద్దగా కలిసి రావడం లేదు. ఈ క్రమంలో సంప్రదాయ పంటలను, ప్రధానంగా వరి సాగును తగ్గించి ఆయిల్‌పామ్‌ను పెంచడానికి అధికార యంత్రాంగం కృషి చేస్తున్నది. సాగుపై ఆసక్తి చూపుతున్న రైతులకు వెంటనే డ్రిప్పు పరికరాలు అందిస్తున్నారు. అవసరమయ్యే కూలీల ఖర్చులు, ఎరువులతోపాటు అన్ని రకాల సబ్సిడీలు అందిస్తున్నారు. దీంతో రైతుల ఆలోచన విధానంలో మార్పు వస్తున్నది.రైతుల్లో మార్పు.. ఎల్‌నినో పరిస్థితులు, వరి సాగులో ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో ఈసారి రైతులు ఆయిల్‌పామ్ సాగువైపు మొగ్గు చూపుతున్నారు. 4వేల ఎకరాల సాగు లక్ష్యంలో ఇప్పటికే 710ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తి చేశాం. మరో 2,631ఎకరాల్లో సాగు చేపట్టబోతున్నాం. – సువర్ణ, జిల్లా ఉద్యాన శాఖ అధికారి -
సర్వర్ డౌన్
మొరాయిస్తున్న భూ భారతి సైట్ మందగించిన భూముల రిజిస్ట్రేషన్లు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండల తహసీల్దార్ కార్యాలయంలో రోజుకు సగటున 20 నుంచి 25 వరకు వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు అవుతుంటాయి. భూభారతి పోర్టల్‌లో సర్వర్ సమస్య కారణంగా పక్షం రోజులుగా ఏ రోజు కూడా మూడు, నాలు గుకు మించి రిజిస్ట్రేషన్లు జరగడం లేదు. దీంతో పట్టాదారులు, రైతులు ఇలా పడిగాపులు కాస్తున్నారు. మెదక్ జిల్లా నిజాంపేట్ మండల తహసీల్దార్ కార్యాలయంలో గత నెల 29 నుంచి ఇప్పటి వరకు సుమారు 85 వరకు రిజిస్ట్రేషన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. ఈ ఒక్క చిన్న మండలంలోనే ఈ పరిస్థితి ఉంటే. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 612 తహసీల్దార్ కార్యాలయాల్లో ఎన్ని వేల రిజిస్ట్రేషన్లకు తాత్కాలిక బ్రేక్ పడిందనేది అంచనా వేసుకోవచ్చు. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి భూభారతి పోర్టల్ సర్వర్ సమస్య కారణంగా రైతులు, పట్టాదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పక్షం రోజులుగా రిజిస్ట్రేషన్లు సరిగ్గా జరగకపోవడంతో రైతులు తహసీల్దార్ కార్యాలయాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ ఎప్పుడు వస్తుందా? ఎప్పుడు తమ భూములు రిజిస్ట్రేషన్ జరుగుతుందా..అని ఎదురు చూస్తున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు వేచి చూసినా రోజుకు రెండు, మూడు రిజిస్ట్రేషన్లు కూడా జరగడం లేదు. దీంతో మిగతావారు రోజంతా వేచి చూసి నిరాశతో వెళ్లిపోతున్నారు. దాదాపు పక్షం రోజులుగా ఇదే సమస్య నెలకొంది. మెయింటెనెన్స్ పేరుతో... భూభారతి పోర్టల్‌ను యాన్యువల్ మెయింటెనెన్స్ చేస్తున్నారని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. మొదట జూన్ 26 నుంచి 29 వరకు రిజిస్ట్రేషన్లు నిలిపివేస్తున్నట్లు రెవెన్యూశాఖ అధికారికంగా ప్రకటించింది. కానీ 12 రోజులవుతున్నా..ఈ సమస్య పరిష్కారం కావడం లేదు. సాఫ్ట్‌వేర్‌ను అప్‌గ్రేడేషన్ జరుగుతోందని, సర్వర్ సామర్థ్యం కూడా పెంచుతున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయ్యాక..రానున్న రోజుల్లో పోర్టల్ మరింత వేగంగా పనిచేస్తుందని చెప్పుకొస్తున్నారు. ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ సమస్య లేదు భూభారతిలో పోర్టల్‌లో ట్రాన్సక్షనల్ సర్వీస్ మాత్రమే సమస్య కొనసాగుతోంది. సాధారణ ప్రజలు సెర్చ్ చేసే సమాచార సేవలకు మాత్రం ఎ లాంటి సమస్య రావడం లేదు. మార్కెట్ వ్యాల్యూ, భూమి వివరాలు, ప్రొహిబిటెడ్ ప్రాపర్టీలు, ఈసీ వివరాలు (ధరణికి ముందు), రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ వివరాలు వంటి సేవలుకు పెద్దగా ఇబ్బంది కావడం లేదు. కేవలం భూలావాదేవీలకు సంబంధించిన లాగిన్‌లోనే సమస్య కొనసాగుతోంది. రిజిస్ట్రేషన్లు జరగక తహసీల్దార్ కార్యాలయాల్లో రైతుల పడిగాపులు పక్షం రోజులుగా కొనసాగుతున్న పట్టాదారుల కష్టాలు పోర్టల్ యాన్యువల్ మెయింటెనెన్స్ అంటున్న అధికారులు -
సర్‌ను సమర్థంగా నిర్వహించాలి
మిరుదొడ్డి(దుబ్బాక): జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంగా నిర్వహించాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శనివారం అక్బర్పేట–భూంపల్లి మండల పరిధిలోని మోతె గ్రామంలో నిర్వహిస్తున్న సర్ డిజిటలైజేషన్ కార్యక్రమాన్ని ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. డిజిటలైజేషన్ నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును కోల్పోకూడదనే లక్ష్యంతో జిల్లా యంత్రాంగం పని చేస్తుందన్నారు. ఒక వ్యక్తికి రెండు చోట్ల ఓటు ఉండటం నేరమన్నారు. మరణించిన ఓటర్లు, నకిలీ ఓట్లు, రెండు ఓట్లు కలిగి ఉన్న వారి వివరాలను అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. జిల్లాలో సర్ ప్రక్రియ వేగంగా జరుగుతుందని, ఎమ్యునరేషన్ ఫారాల పంపిణీ దాదాపు పూర్తయినట్లు తెలిపారు. బీఎల్ఓ వారిగా ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ సైతం వేగంగా కొనసాగుతుందన్నారు. అనంతరం గ్రామంలోని ప్రభు త్వ భూమిని ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో ఆర్డీఓ సదానందం, ఆయా మండలాల తహసీ ల్దార్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలన -
ఎక్స్పో అదుర్స్..
సిద్దిపేటజోన్: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ)ఢిల్లీ సౌజన్యంతో శనివారం జిల్లా కేంద్రంలోని మెరీడియన్ పాఠశాలలో నిర్వహించిన ఎక్స్పో అండ్ గైడెన్స్ ఫెస్టివల్ అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర స్థాయిలో ఉన్న 58 సీబీఎస్ఈ విద్యాసంస్థలు ఈ ఎక్స్‌పోలో పాల్గొని వందకు పైగా నమూనా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ఆయా పాఠశాలల విద్యార్థులు వివిధ అంశాలపై ఎగ్జిబిట్లు ప్రదర్శించారు. విద్య, వైద్యం, వ్యవసాయ, నీటిపారుదల, విద్యుత్, సోలార్ వ్యవస్థ, పర్యావరణ, పారిశ్రామిక విధానం, పర్యాటక, గ్రామీణాభివృద్ధి, తదితర అంశాల ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. విద్యార్థులు రూపొందించిన వినూత్న ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, సాంకేతిక నమూనాలు ఎంతో ఆకర్షించాయి. కార్యక్రమంలో సీబీఎస్ఈ ప్రాంతీయ అధికారి సునీల్ కుమార్, తిరువనంతపురం ప్రాంతీయ డైరెక్టర్ విగ్నేష్, మెరీడియన్ విద్యాసంస్థల డైరెక్టర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
గోదారిలో నీళ్లున్నా.. మోటార్లు ఆన్ చేయని సర్కార్
నంగునూరు(సిద్దిపేట): గోదావరి నదిలో కావాల్సినన్ని నీళ్లున్నా కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసుతో కన్నెపల్లి పంప్‌హౌస్ మోటార్లను ప్రభుత్వం ఆన్ చేయించడం లేదని మాజీమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. తిమ్మాయిపల్లిలో జరుగుతున్న పెద్దమ్మ తల్లి ఉత్సవాల్లో శనివారం హరీశ్‌రావు పాల్గొని పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ ఎంతటి కరువు వచ్చినా రైతాంగానికి సాగునీరు ఇచ్చేలా కేసీఆర్.. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను నిర్మించారన్నారు. మోటార్లు ఆన్ చేస్తే రంగనాయక సాగర్ నిండి సిద్దిపేట నియోజక వర్గంలో 80 వేల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. రేవంత్‌రెడ్డికి సద్బుద్ధి ప్రసాదించాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. నర్మేటలో నిర్మించిన ఆయిల్ ఫ్యాక్టరీ ద్వారా అధిక లాభాలు వస్తున్నందున రైతులు ఆయిల్‌పామ్‌ను సాగు చేయాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా జీతం పడితే ఆయిల్‌పామ్ రైతులకు 20 రోజులకో మారు ఏడాదిలో 15 సార్లు డబ్బులు పడుతున్నాయని చెప్పారు. ప్రతీ ఓటరును కలవండి సిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు నమోదు ప్రక్రియలో బూత్ లెవల్ ఏజంట్లు అత్యంత కీలకమని, ప్రతి ఇంటికి వెళ్లి.. ప్రతీ ఓటరును క్షేత్ర స్థాయిలో కలవాలని, ఎన్యూమరేషన్ పత్రాలు నింపేలా బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్ రావు సూచించారు. శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఓటరును బూత్ లెవల్ ఏజెంట్లు కలిసి ఓటుహక్కు విలువ గూర్చి వివరించి చైతన్యం చేయాలని సూచించారు. ఒక వ్యక్తికి ఒకే ఓటు ఉండాలనేది రాజ్యాంగ సూత్రమని పేర్కొన్నారు. బూత్ లెవల్ ఏజెంట్లు సమర్థవంతంగా పనిచేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్‌కు పేరు వస్తుందనే అక్కసు మాజీ మంత్రి హరీశ్‌రావు -
షాబాద్ హంతకుడికి... సీఎం రేవంత్‌కు తేడా లేదు
సాక్షి, సిద్దిపేట/సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో పోక్సో కేసు నిందితుడు ముగ్గురు పసిపిల్లలతో సహా ఆరుగురిని కిరాతకంగా చంపేయడం ప్రభుత్వ, పోలీసుల వైఫల్యమేనని బీఆర్ఎస్ శాసనసభ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్‌రావు ఆరోపించారు. హోంమంత్రిగా, ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి విఫలమయ్యారని, తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శనివారం సాయంత్రం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. అనంతరం ‘ఎక్స్’లోనూ కొన్ని వ్యాఖ్యలు పోస్ట్‌చేశారు. ‘రేవంత్‌కు షాబాద్ హంతకుడికి తేడా లేదు. రైతులు సాగునీరు అడిగితే ప్రతిపక్షాల రక్తాన్ని పంటలపై చల్లాలని మాట్లాడిన ముఖ్యమంత్రి వెంటనే ప్రజలకు, రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలి’అని తీవ్రస్థాయిలో విమర్శించారు.ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ఆయన శాడిస్టిక్ మనస్తత్వానికి నిదర్శనమని మండిపడ్డారు. పోలీసుల నిర్లక్ష్యంతో బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితుడు మరోసారి దారుణ హత్యాకాండకు పాల్పడ్డాడన్నారు. మే 16న మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే.. నిందితుడిని అరెస్ట్ చేయడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారన్నారు. అవినీతికి, రాజకీయ ఒత్తిళ్లకు లొంగిపోయిన పోలీసులు.. నెల రోజులపాటు అతన్ని అరెస్ట్ చేయకుండా వదిలేయడంతో.. అతను కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుని ఈరోజు ఆ కుటుంబాన్నే అంతం చేశాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాలనా వైఫల్యాలు బయటపడినప్పుడల్లా ప్రజల దృష్టి మళ్లించేందుకు కాళేశ్వరం పేరుతో డైవర్షన్ రాజకీయాలు చేయడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటైందని ఆరోపించారు. చిన్నారి పేరుపై కోటి డిపాజిట్ చేయాలి ‘రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థను రేవంత్ ప్రభుత్వం పూర్తిగా భ్రష్టు పట్టించింది. పోలీస్ స్టేషన్లను ప్రతిపక్షాలపై అక్రమ కేసులు పెట్టడానికి, ల్యాండ్ సెటిల్మెంట్లకు అడ్డాలుగా మార్చేశారు. షాబాద్ ఘటనలో ప్రాణహాని ఉంది, రక్షణ కల్పించండని బాధిత కుటుంబం పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి మొత్తుకున్నా పట్టించుకోలేదు. ఈ కిరాతక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబంలో మిగిలిన దివ్యాంగ చిన్నారి పేరు మీద ప్రభుత్వం రూ.కోటి ఫిక్స్ డిపాజిట్ చేసి ఆ అమ్మాయిని పెంచే బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి’అని హరీశ్‌రావు చెప్పారు. ఓదార్పు కోసం వెళ్లిన మాజీ హోంమంత్రి సబిత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, పద్మలను నేరస్తులుగా అరెస్ట్ చేశారని, అదే హత్య చేసిన నేరస్తున్ని పోలీసులు పట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. కొంతకాలం ప్రజలను మోసం చేయవచ్చేమోగానీ, ఎల్లకాలం మోసం చేయడం సాధ్యం కాదన్న అబ్రహం లింకన్ వ్యాఖ్యలు రేవంత్‌కు సరిగ్గా సరిపోతాయని హరీశ్ అన్నారు. రేవంత్ తెచ్చిన కృత్రిమ కరువు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది కాలం తెచ్చిన కరువు కాదని, సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ కుటిల బుద్ధితో తెచ్చిన కృత్రిమ కరువు అని హరీశ్‌రావు ఆరోపించారు. గోదావరి నదిలో కావలసినన్ని నీళ్లున్నప్పటికీ, కేసీఆర్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందోనన్న ఈర్ష్యతో కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లను ప్రభుత్వం కావాలనే ఆన్ చేయడం లేదని విమర్శించారు. పంట పొలాల్లో గోదావరి నీళ్లు పారేలా రేవంత్‌రెడ్డికి కలలో వచ్చి చెప్పాలని పెద్దమ్మ తల్లిని ప్రార్థించానని చెప్పారు. రిటైర్డ్ ఇంజనీర్లు, బీఆర్ఎస్ నాయకులు సాగునీటి కోసం సూచనలు చేస్తుంటే, ముఖ్యమంత్రి మాత్రం రాజకీయ కక్షలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తగిన సమయంలో రైతులు, ప్రజలే ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హరీశ్‌రావు హెచ్చరించారు. -
హుస్నాబాద్‌లో నేడు మంత్రుల పర్యటన
కేసీఆర్‌ను కలిసిన డీసీసీబీ డైరెక్టర్ ములుగు(గజ్వేల్): ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో గురువారం మాజీ సీఎం కేసీఆర్‌ను ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ డైరెక్టర్, ములుగు పీఏసీఎస్ చైర్మన్ బట్టు అంజిరెడ్డి గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. అంజిరెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా కేసీఆర్‌కు పూల మొక్కను అందజేసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం ఆయన మండల కేంద్రమైన ములుగులో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలసి మొక్కలు నాటారు. రాష్ట్ర స్థాయి పోటీలకు మిట్టపల్లి విద్యార్థిని సిద్దిపేటఅర్బన్: రాష్ట్ర స్థాయి అత్యా పాత్యా పోటీలకు అర్బన్ మండలం మిట్టపల్లి ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని జి.ప్రణీత ఎంపికయ్యారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఇటీవల నిర్వహించిన జిల్లా స్థాయి పోటీలలో అండర్–14 విభాగంలో ప్రణీత ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ నెల 11, 12 తేదీలలో ఎల్బీ స్టేడియంలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీలలో విద్యార్థిని పాల్గొననున్నారు. ఈ సందర్భంగా విద్యార్థినిని పలువురు అభినందించారు. ఉన్ని సహకార ఎన్నికలు ఏకగ్రీవంమిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని ధర్మారంలో ఉన్ని సహకార ఎన్నికలు గురువారం ఏకగ్రీవమయ్యాయి. అధ్యక్షుడిగా కంతుల కొమురయ్య, ఉపాధ్యక్షుడిగా గుట్టయ్య, కార్యదర్శిగా బీరయ్య, డైరెక్టర్లుగా రాజయ్య, లక్ష్మి, మల్లవ్వ, స్వామి, శ్రీనివాస్, మల్లయ్యలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు ఎన్నికల నిర్వహణాధికారి రవి నియామక పత్రాలను సంఘం సభ్యులకు అందించారు. -
కాంగ్రెస్ పాలనలో రైతులకు కష్టాలే..
చిన్నకోడూరు(సిద్దిపేట): రైతులంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి చిన్న చూపని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రైతులకు అన్నీ కష్టాలే వస్తున్నాయని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం మండల పరిధిలోని చంద్లాపూర్‌లో ఫర్టిలైజర్ షాపును ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ రైతులకు సరిపడా యూరియా అందుబాటు ఉంచడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. యాప్‌ను రద్దు చేసి నేరుగా యూరియా కొనుగోలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చుకోవాలని డిమాండ్ చేశారు. రైతులకు అందించే యూరియాపై సీలింగ్ ఎత్తివేయాలన్నారు. సరిపడా యూరియా సరఫరా చేయాలన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాధాకృష్ణ శర్మ, కాముని శ్రీనివాస్, పాపయ్య, వెంకట్‌రెడ్డి, కనకరాజు, దుర్గారెడ్డి తదితరులు ఉన్నారు. జిల్లా రైతులకే ప్రాధాన్యత.. జిల్లా రైతులకు సరిపడా ఆయిల్ పామ్ మొక్కలు అందాక ఇతర జిల్లాల రైతులకు మొక్కలు అందజేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు జిల్లా ఆయిల్‌ఫెడ్ అధికారి బాస్కర్ రెడ్డికి సూచించారు. రంగనాయక సాగర్ కట్ట వద్ద ఆయిల్ పామ్ నర్సరీని సందర్శించారు. ఇతర జిల్లాలకు మొక్కలు తరలించడంతో ఆయిల్ ఫెడ్ అధికారి భాస్కర్‌రెడ్డితో ఫాన్‌లో మాట్లాడారు. జిల్లాలో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులకు సరిపడా మొక్కలు అందించారా? అందించకముందే ఇతర జిల్లాలకు పంపడం ఏమటని ప్రశ్నించారు. ముందు జిల్లాలో రైతులకు మొక్కలు అందించాలన్నారు. నర్సరీ నిర్వహణ సరిగా లేదని, మొక్కల్లో ఇసుక ఉందని, నీళ్లు కూడా సరిగా పట్టడం లేదని చెప్పారు. నర్సరీని వారానికి ఒకసారి సందర్శించి నిర్వహణ చూడాలని ఆదేశించారు. సర్‌లో భాగస్వామ్యం కావాలిసిద్దిపేటజోన్: సమగ్ర ఓటరు జాబితా సవరణ(సర్)ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, తప్పనిసరి ఓటరు ఎన్యుమరేషన్ పత్రాలను నింపాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. గురువారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన స్వయంగా బూత్ లెవల్ ఆఫీసర్ నుంచి ఎన్యుమరేషన్ పత్రం తీసుకుని దాన్ని పూరించి అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎన్యుమరేషన్ పత్రం నింపాలని సూచించారు. ఇప్పుడు నింపితేనే మీ ఓటుహక్కు జాబితాలో భద్రంగా ఉంటుందన్నారు. ప్రజలందరూ తమ ఇండ్లకు వచ్చే బూత్ లెవల్ ఆఫీసర్లకు, బూత్ లెవల్ ఏజెంట్లకు సహకరించాలని సూచించారు. ఇందిరానగర్ పాఠశాల రాష్ట్రానికే ఆదర్శం సీలింగ్ ఎత్తివేసి సరిపడాయూరియా అందజేయాలి మాజీ మంత్రి హరీశ్రావుప్రశాంత్నగర్(సిద్దిపేట): పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధిస్తూ రాష్ట్రంలోనే ఇందిరానగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆదర్శంగా నిలుస్తోందని ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతి పరీక్షల్లో అధిక మార్కులు సాధించిన 31 మంది విద్యార్థులకు ఐప్యాడ్లను గురువారం అందచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025–26 విద్యాసంవత్సరం పదోతరగతి పరీక్షల్లో ఉత్తమ పలితాలు సాధించిన 31 మందికి ఐప్యాడ్లు అందించానని, 2026–27 విద్యాసంవత్సరంలో 50 మందికి ఐప్యాడ్లు అందించనున్నట్లు తెలిపారు. ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా, కేవలం స్టడీ మెటీరియల్, జనరల్ నాలెడ్జ్ మాత్రమే ఉండేలా ఈ ఐప్యాడ్లను రూపకల్పన చేశామన్నారు. విద్యార్థుల్లో పోటీతత్వాన్ని పెంపొందించడానికి ఈ ఐప్యాడ్లను అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య లభిస్తుందన్నారు. రాష్ట్రంలోనే 1234మంది విద్యార్థులతో ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాల రెండో స్థానంలో నిలిచిందన్నారు. ఇందిరానగర్ పాఠశాల అన్ని రంగాల్లో ముందుంటడానికి ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు కృషి గొప్పదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులుపాల్గొన్నారు. -
దేశంలోనే చేనేతకు దుబ్బాక ప్రసిద్ధి
దుబ్బాక: దేశంలోనే చేనేత పరిశ్రమకు దుబ్బాక ప్రసిద్ధి చెందిందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికై న దుబ్బాక చేనేత సహకార సంఘం పాలక మండలిని క్యాంపు కార్యాలయంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలన్నారు. గొల్లభామ చీరలతో పాటు చాలా రకాల వస్త్రాలు నేయడంలో అందెవేసిన కార్మికులు ఉన్నారన్నారు. రాష్ట్రంలోనే పెద్ద చేనేత సొసైటీలో ఒకటైన దుబ్బాక పాలకమండలి ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంతోషకరమన్నారు. చేనేత కార్మికుల సంక్షేమ కోసం కొత్త పాలకవర్గం కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, చేనేత సొసైటీ అధ్యక్షులు అంకం మధు, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు ఉన్నారు. పరిశ్రమకు పూర్వ వైభవం తేవాలి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి -
నేడు ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్
సిద్దిపేటరూరల్: జిల్లాలో శుక్రవారం చేపట్టనున్న ఆయిల్‌పామ్ మెగా ప్లాంటేషన్ డ్రైవ్‌ను విజయవంతం చేయాలని కలెక్టర్ కె. హైమావతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హల్ లో జిల్లాలోనీ వ్యవసాయ శాఖ ఏడీఏ, ఏఓ, ఏఈఓ లతో కలెక్టర్ జూమ్ సమావేశం ద్వారా వ్యవసాయ శాఖ చేస్తున్న కార్యక్రమాల పనితీరు గూర్చి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా మండలాల్లో గుర్తించిన వ్యవసాయ క్షేత్రాలలో ఆయిల్‌పామ్ మొక్కలను నాటాలన్నారు. ఎల్నీనో ప్రభావంతో లోటు వర్షపాతం ఉన్నందున నీటి లభ్యత ఉన్న రైతులే వరి పండించాలన్నారు. జిల్లాలో యూరియా కొరత లేదని, ఎకరానికి 2 బ్యాగులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. యూరియా అక్రమంగా అమ్మినట్లు తెలిస్తే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు. ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ సైతం వేగవంతం చేయాలని, ఇచ్చిన లక్ష్యాన్ని తప్పనిసరిగా పూర్తి చేయాలని, నిర్లక్షం వహించవద్దన్నారు. ఫార్మర్ రిజిస్ట్రీలో మందకొడిగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ సెలవులు తీసుకోకుండా వచ్చే మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఏఈఓ లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఏఓ స్వరూప రాణి, డిహెచ్ఓ సువర్ణ, భాస్కర్ తదితరులు ఉన్నారు. డ్రైవ్‌ను సక్సెస్ చేయాలి కలెక్టర్ హైమావతి -
సెపరేటు!
శుక్రవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026రూటు..రాజుల సొమ్ము రాళ్ల పాలు అన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారు. గతుకుల రోడ్లు గాలికి వదిలేసి.. మెరుగ్గా ఉన్న రోడ్లనే మళ్లీ నిర్మాణం కోసం ప్రతిపాదనలు చేశారు. ఇది హ్యామ్ రోడ్ల ఎంపికలో మన ఇంజనీరింగ్ అధికారుల తీరు. ఓ పక్క ధ్వంసమైన రోడ్లతో వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతుంటే ఇవేమి పట్టించుకోకుండా కమీషన్ల కోసమే ఇలా ప్రతిపాదించారన్న చర్చ సాగుతోంది. ప్రజాప్రతినిధులను సంప్రదించకుండానే హ్యామ్ రోడ్లను ప్రతిపాదించారని ఇటీవల జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలోనే ఎంపీ, ఎమ్మెల్యేలు ఆరోపించడం గమనార్హం. – సాక్షి, సిద్దిపేట పల్లెల్లో రోడ్డు మార్గాలు మెరుగ్గా ఉండాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం హైబ్రిడ్ యాన్యుటీ మోడ్(హ్యామ్)లో భాగంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా రూ.711.36కోట్ల వ్యయంతో 146 రోడ్లు 659.09 కిలోమీటర్ల రోడ్డును నిర్మించనున్నారు. ఇందులో రోడ్డు భవనాల శాఖ(ఆర్అండ్బీ) 17 రోడ్లు 195.75కిలో మీటర్లు, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్(పీఆర్) 129 రోడ్లు 463.34కిలో మీటర్లు నిర్మాణం చేయనున్నారు.. డీడీఆర్సీ సమావేశంలో.. ఇంజనీరింగ్ అధికారులు గతుకుల రోడ్లను కాకుండా మరో ఐదేళ్ల వరకు ఢోకా లేని రోడ్లను హ్యామ్‌లో నిర్మించాలని నిర్ణయించారు. ఈ నెల 3న ఇన్చార్జి మంత్రి వివేక్ నిర్వహించిన డీడీఆర్సీ సమావేశంలో రోడ్ల విషయాన్ని ఎంపీ రఘునందన్ రావు ప్రస్తావించారు. హ్యామ్ రోడ్లను ఎవరిని అడిగి ప్రతిపాదించారని అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిధులు సక్రమంగా వినియోగించకుండా అక్రమ మార్గానికి తరలించేందుకే మెరుగైన రోడ్లనే తిరిగి ప్రతిపాదించారని పలువురు ఆరోపిస్తున్నారు. కోట్లాది రూపాయలు రోడ్ల నిర్మాణాలకు ఖర్చు చేసినట్లు చూపించి కాంట్రాక్టర్ల లాభం కోసమే అని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నత అధికారులు స్పందించి హ్యామ్ రోడ్ల నిర్మాణం చేసే రోడ్లను పునఃపరిశీలించి, అవసరం ఉన్న చోట్ల తప్పక నిర్మాణం చేపట్టాలని ప్రజాప్రతినిధులు, ప్రజలు కోరుతున్నారు. మర్కుక్ మండలం ఎర్రవల్లి నుంచి గంగాపూర్ రోడ్డును 2020లో రూ.5.5కోట్ల వ్యయంతో డబుల్ రోడ్‌గా నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రోడ్డు మెరుగ్గా ఉన్నప్పటికీ తిరిగి హ్యామ్ రోడ్ కింద పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ అధికారులు ఎంపిక చేశారు. 2.55 కిలో మీటర్ల రోడ్‌ను నిర్మించాలని నిర్ణయించారు. పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖ ఆధ్వర్యంలో కొమురవెల్లి నుంచి మర్రిముచ్యాల రోడ్ నిర్మాణంను 2020లో చేశారు. ఇటీవల మంజూరైన హ్యామ్ రోడ్లలో ఇదే రోడ్‌ను 5.70 కిలోమీటర్ల రోడ్‌ను తిరిగి నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. రోడ్డులో ఎలాంటి గుంతలు లేకున్నా తిరిగి నిర్మాణం చేయాలని నిర్ణయించడంతో పలువురు విమర్శిస్తున్నారు.టెండర్ దశలో ఉన్నవిఎంపిక చేయలేదు గతంలో మంజూరై టెండర్ దశలో ఉన్న రోడ్లను ఎంపిక చేయలేదు. నిర్మించి ఐదు సంవత్సరాలు దాటిన వాటిని హ్యమ్ రోడ్ల కింద ఎంపిక చేశాం. రెండో ఫేస్‌లో మరి కొన్ని హ్యామ్ రోడ్లు మంజూరు కానున్నాయి. – దీపక్, ఎస్ ఈ, పంచాయతీ రాజ్ ఇంజనీరింగ్ ఈ ఫొటోలో కనిపిస్తున్నది గౌరారం నుంచి తూప్రాన్ వెళ్లే రహదారి. ఇది దాదాపు 16 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో వర్గల్ మండల కేంద్రం ఎల్లమ్మ దేవాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు రోడ్డు పూర్తిగా ధ్వంసమైంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు నిర్మాణం కోసం ఇటీవల గ్రామ ప్రజలు, సర్పంచ్ ఒక రోజు దీక్షను చేపట్టి నిరసన తెలిపారు. -
చెత్త నుంచి కంపోస్ట్ తయారీపై గజ్వేల్‌లో ప్రాంతీయ సదస్సు
మున్సిపల్ శాఖ సీడీఓ హేమలత స్వచ్ఛతకు బాటలు గజ్వేల్: ఆధునిక వ్యర్థాల నిర్వహణ పద్ధతులు స్వచ్ఛతకు బాటలు వేస్తాయని మున్సిపల్ శాఖ సీడీఓ(కంపోస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్) హేమలత అన్నారు. గురువారం గజ్వేల్‌లోని డంపు యార్డు వద్ద ‘వేస్ట్ టూ కంపోస్ట్ విండ్రో’(వ్యర్థాల నుంచి సేంద్రియ ఎరువు తయారీ) అంశంపై మున్సిపాలిటీల ప్రాంతీయస్థాయి అవగాహన సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరైన హేమలత మాట్లాడుతూ మున్సిపాలిటీల్లో చెత్తను రీ–సైక్లింగ్ చేయడం ద్వారా పర్యావరణను కాపాడుకోవచ్చని సూచించారు. ఈ సందర్భంగా చెత్త నుంచి కంపోస్ట్ తయారీ అంశంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ చందన, కమిషనర్ గణేశ్రెడ్డితోపాటు సిద్దిపేట, దుబ్బాక, చేర్యాల, హుస్నాబాద్, ముడిచింతలపల్లి, అలియాబాద్ మున్సిపల్ కమీషనర్లు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రేమించిన అమ్మాయికి వేరే పెళ్లి చేస్తున్నారని...
సిద్దిపేట అర్బన్: తాను ప్రేమించిన అమ్మాయి కుటుంబ సభ్యులు వేరే వ్యక్తితో పెళ్లి చేస్తున్నారని, ఎలాగైనా పెళ్లిని ఆపాలనే ఉద్దేశంతో ఓ యువకుడు ఆ అమ్మాయి గ్రామంతో పాటు.. పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అంటించాడు. అభ్యంతకరమైన పోస్టర్లు అంటించి అమ్మాయి పరువు తీసేందుకు ప్రయత్నించిన ఆ యువకుడితో సహా ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ మేరకు సిద్దిపేట ఏసీపీ రవీందర్‌రెడ్డి, సిద్దిపేట త్రీటౌన్ సీఐ టాటా లక్ష్మీబాబు వివరాలు వెల్లడించారు. దుబ్బాక మండలం పెద్దగుండవెళ్లి గ్రామానికి చెందిన దొడ్ల వెంకటేష్ (29) అర్బన్ మండలం ఎన్సాన్పల్లికి చెందిన ఓ యువతిని కొంతకాలంగా ప్రేమించాడు. యువతి తల్లిదండ్రులు రాజన్నసిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లికి చెందిన ఓ యువకుడితో పెళ్లి నిశ్చయించారు. దీన్ని జీర్ణించుకోలేని యువకుడు వివాహం ఆగిపోవాలనే ఉద్దేశంతో యువతితో తనకు సన్నిహిత సంబంధం ఉన్నట్లు పోస్టర్లు సృష్టించాడు. ఆ అమ్మాయి గ్రామంతో పాటు పెళ్లి చేసుకోబోయే అబ్బాయి గ్రామంలో పోస్టర్లు అతికించాడు. ఈ విషయమై త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. వారిని విచారించగా నేరం ఒప్పుకున్నారు. అరెస్ట్ చేసిన వారిలో ప్రధాన నిందితుడు దొడ్ల వెంకటేష్ సహా అతనికి సహకరించిన వన్నెల అశ్విత్కుమార్, బండి భానుప్రసాద్, రేఖ, బురుజుకింది ఈశ్వర్, రాజబోయిన నవీన్‌కుమార్ ఉన్నారు. -
రూ.870 కోట్లు..
9.33 లక్షలమంది రైతులుఉమ్మడి మెదక్ జిల్లాలో రైతు భరోసా పథకం కింద 9,33,950 మంది రైతులకు రూ.8,70,25,44,519లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతనెల జూన్ 30న రైతు భరోసా నిధుల విడుదల కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఎకరాకు 6వేల చొప్పున ఈ నిధులను విడుదల చేసింది. నిత్యం విడతల వారీగా ఈనెల 7వ తేదీ వరకు 7 ఎకరాల వరకు భరోసా నిధులను జమ చేసినట్లు జిల్లా వ్యవసాయ అధికారులు తెలిపారు. నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లాలో 3,50,560 మంది రైతులకు రూ.348 కోట్లు, సిద్దిపేట జిల్లాలోని 3,19,601మంది రైతులకు రూ.317 కోట్లు, మెదక్ జిల్లాలో 2,63,789 మంది రైతులకు గాను రూ.204 కోట్ల కు పైగా విడుదలయ్యాయి. ఈ నిధులు నేరుగా రైతుల ఖాతాల్లోనే ప్రభుత్వం జమ చేసింది. రైతులకు ప్రయోజనం రైతు భరోసా పథకం రైతులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల కొనుగోళ్లకు ఈ నిధులు ఎంతగానో ఉపయోగపడనున్నాయి. సీజన్ ప్రారంభంలోనే నిధుల విడుదల వల్ల రైతులు వడ్డీకి అప్పులు చేసే బాధ తప్పినట్లైంది. ఇప్పటికే చాలామంది రైతులు విత్తనాలు విత్తుకొన్నారు. ఈ నెల 15వ తేదీవరకు ఆయా పంటలు విత్తుకునేందుకు కూడా అవకాశం ఉంది. ప్రస్తుతం విడుదలైన నిధులు ఎరువులు, పురుగు మందులు, కలుపుతీత, ఇతరత్రా ప్రయోజనాలకు రైతులకు ఉపయుక్తంగా మారనుంది. సీజన్ ప్రారంభం కాగానే ప్రభుత్వం విడుదల చేయడంతో రైతుల్లో సంతోషం వ్యక్తమవుతుంది. ఏడెకరాల వరకు ఇచ్చిన ప్రభుత్వం విడతల వారీగా విడుదల -
దుబ్బాక చేనేత పాలకవర్గం ఏకగ్రీవం
దుబ్బాక: చేనేత సహకార సంఘం పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. మంగళవారం ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన పాలకవర్గం ఎన్నికలో.. చైర్మన్‌గా అంకం మధు ఒక్కరే నామినేషన్ వేశారు. దీంతో ఆయనను చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. అలాగే వైస్ చైర్మన్‌గా గాజుల భాస్కర్, జనరల్ సెక్రటరీగా బోడ చంద్రమోహన్, కోశాధికారిగా కారంపురి గురుచరణ్ సైతం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికై న చైర్మన్, పాలకవర్గంతో పాటు డైరెక్టర్లు సిరిగాధ నర్సింలు, మెత్కు కవిత, చెలిమెల రాజేశం, రాపెల్లి నాగరాజు, గడ్డం రాజమణి లతో ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ పాలకవర్గం ఐదేళ్ల పాటు కొనసాగుతుందని తెలిపారు. పలువురు అభినందనలు.. పాలకవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కావడంపై మున్సిపల్ చైర్పర్సన్ శ్రీరాం సంగీత, కౌన్సిలర్లు శ్రీరాం సరస్వతి, నందాల శ్రీకాంత్, బడుగు రాజుతో పాటు రామక్కపేట సర్పంచ్ విఠోభ, పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య, నీలకంఠ సంఘం అధ్యక్షులు బోడ శ్రీహరి,నాయకులు, పలువురు సన్మానించి అభినందించారు.సిద్దిపేట చేనేత సహకార సంఘం సైతం.. సిద్దిపేటజోన్: సిద్దిపేట చేనేత సహకార సంఘం పాలకవర్గం సైతం ఏకగ్రీవంగా ఎన్నికై ంది. అధ్యక్షుడిగా జనార్దన్, ప్రధాన కార్యదర్శిగా రాధా కిషన్, ఉపాధ్యక్షుడిగా సుధాకర్, కోశాధికారిగా ప్రభాకర్‌తో పాటు డైరెక్టర్లుగా దత్తాత్రేయ, నగేష్, శ్రీనివాస్, భాగ్య, సరళ నియమితులయ్యారు. అమృతసేనా రెడ్డి ఎన్నికల అధికారి, మేనేజర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు జిల్లా కేంద్రంలోని సిద్దిపేట ప్రాజెక్టు ఎన్నికల్లో 11మంది అభ్యర్థులకు ఏడుగురు ఉపసంహరణ కావడంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ విషయాన్ని చేనేత జౌళి శాఖ ఏడీఓ రమ్య ధ్రువీకరించారు. సహకార సంఘం చైర్మన్‌గా అంకం మధు ప్రమాణస్వీకారం చేయించినఎన్నికల అధికారి -
నేడు పాలిటెక్నిక్ స్పాట్ అడ్మిషన్లు
హుస్నాబాద్‌రూరల్: ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో ఖాళీ సీట్ల భర్తీకి బుధవారం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ శ్రీదేవి మంగళవారం తెలిపారు. ఏఐలో నాలుగు సీట్లు, ఈఈఈలో రెండు సీట్లు, సివిల్‌లో ఒక సీటు ఖాళీగా ఉందన్నారు. 10వ తరగతి ఉత్తీర్ణణ సాధించిన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో ప్రవేశం పొందుటకు అర్హులన్నారు. జూలై 8న ఒరిజనల్ సర్టిఫికెట్స్‌తో హాజరు కావాలన్నారు. విద్యార్థులు ఈ చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. జిల్లా స్థాయి అథ్లెటిక్స్ ఎంపికలు సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో మంగళవారం జిల్లా స్థాయి సబ్ జూనియర్, జూనియర్ అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు అట్టహాసంగా నిర్వహించారు. జిల్లా క్రీడలశాఖ అధికారి వీరారెడ్డి జెండా ఊపి ఎంపిక ప్రక్రియ ప్రారంభించారు. ఈ సందర్భంగా అండర్ 8, 10, 12, 14, 16, 18, 20 విభాగాల్లో మహిళలు, పురుషులకు పరుగు, జంప్స్, వివిధ రకాల త్రోస్ పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాలు సాధించిన వారికి మెడల్స్, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. అత్యంత ప్రతిభ చూపిన వారు ఈనెల 12న పటాన్‌చెరువులో జరిగే రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొంటారు. సెలెక్షన్ ప్రక్రియను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకట్ స్వామి పర్యవేక్షించారు. కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రోడ్డు మరమ్మతులకు చర్యలు వర్గల్ను సందర్శించిన ఆర్అండ్బీ ఎస్ఈ వర్గల్(గజ్వేల్): గతుకులమయమైన వర్గల్ రోడ్డును మంగళవారం ఆర్అండ్బీ సూపరింటెండెంట్ ఇంజనీర్ సారంగపాణి పరిశీలించారు. సర్పంచ్ జయభారతి, డిప్యూటీ ఈఈ రేణుక, ఏఈఈ చంద్రశేఖర్‌తో కలిసి క్షేత్రస్థాయిలో రోడ్డుపై గోతులను, దెబ్బతిన్న రోడ్డును పరిశీలన చేశారు. మంగళవారం ‘సాక్షి’లో ‘గోతులు దాటిన నిర్లక్ష్యం–రోడ్డెక్కిన నిరసనగళం’ శీర్షికతో కథనం ప్రచురితమైన విషయం తెల్సిందే. ఈ మేరకు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, డిప్యూటీ ఈఈ, ఏఈలకు పలుసూచనలు చేశారు. రోడ్డు బాగుకోసం చర్యలు చేపడతామని, ఉన్నతాధికారులకు ఎస్టిమేట్లు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. కాగా రోడ్డు మీద గోతులను పూడ్చి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించారు. డీసీసీ ప్రధాన కార్యదర్శిగా మహిపాల్రెడ్డితొగుట(దుబ్బాక): మండలంలోని పెద్ద మాసాన్‌పల్లికి చెందిన కూచి మహిపాల్‌రెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షురాలు తూంకుంట ఆంక్షారెడ్డి నియామక పత్రాన్ని మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తామన్నారు. తాను పార్టీకి అందించిన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. -
ప్రభుత్వ భూములు కాపాడాలి
చిన్నకోడూరు(సిద్దిపేట): జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా హద్దులు పెట్టి ఫెన్షింగ్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ హైమావతి అధికారులకు సూచించారు. మంగళవారం మండల పరిధిలోని ఇబ్రహీంనగర్ డంపింగ్ యార్డు వద్ద భూమిని పరిశీలించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ స్థలాల రికార్డులు పరిశీలించి, ఆ ప్రాంతంలో ప్రభుత్వ భూమి ఎంత? ఆక్రమణకు గురైన పూర్తి సమాచారాన్ని సేకరించాలని సూచించారు. ప్రభుత్వ భూమి చుట్టూ హద్దులు ఏర్పాటు చేయాలన్నారు. అక్రమంగా కబ్జా చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఆక్రమణకు గురికావొద్దుకొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురి కాకుండా చూడాలని కలెక్టర్ హైమవతి తహసీల్దార్ దివ్యను ఆదేశించారు. సోమవారం కొమురవెల్లి పాత కమాన్, కేజీబీవీ పాఠశాల సమీపంలో ఉన్న ప్రభుత్వ భూములను పరిశీలించారు. అనంతరం ఆమె మట్లాడుతూ ప్రభుత్వ భూమిని అనుమతి లేకుండా ఆక్రమించడం చట్టవిరుద్ధమన్నారు. హౌసింగ్ పీడీగా భగవంతరావు సిద్దిపేటజోన్: జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌గా భగవంతరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. జిల్లా పీడీ శ్రీనివాస్ పదవీ విరమణ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా పీడీగా పనిచేస్తున్న భగవంతరావును ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ సందర్భంగా ఆయన కలెక్టరేట్లో కలెక్టర్ హైమావతిని మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యం అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని, త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కలెక్టర్ హైమావతి పలు ప్రాంతాల్లో పరిశీలన -
అవగాహన కల్పించాలి
సర్‌కు సంబంధించిన ఫారాలు బీఎల్ఓ ఇంటికి వచ్చి ఇచ్చారు. 2002 నాటి ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ లభించడం లేదు. దరఖాస్తు ఫారం నింపేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నాం. ఫారాలు ఎలా నింపాలో చెప్పే వారే కరువయ్యారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ప్రత్యేకంగా అవగాహన కల్పించాలి. – బోడ చందు, దుబ్బాక హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం ఇంటింటికీ తిరిగి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలు అందించారు. గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ వార్డుల్లో హెల్ప్ డెస్క్‌లు ఏర్పాటు చేశాం. కలెక్టర్ ప్రతీ రోజు సర్ పై రివ్యూ చేస్తున్నారు. ఫారాలు నింపే సమయంలో సందేహాలు ఉంటే బీఎల్వోలు నివృత్తి చేస్తున్నారు. – చంద్రశేఖర్, సెక్షన్ సూపరింటెండెంట్, కలెక్టరేట్ -
సవాలక్ష సందేహాలు
బుధవారం శ్రీ 8 శ్రీ జూలై శ్రీ 2026ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) విషయంలో ఓటర్లకు సవాలక్ష సందేహాలు ఎదురవుతున్నాయి. ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తి చేయడం.. అందుకు అవసరమైన వివరాలు లభించక ఓటర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఫారాలను పూరించేందుకు నిరక్షరాస్యులు ఇతరులపైనే ఆధారపడుతున్నారు. ఇక ఉపాధి కోసం ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వారికి ఫారాలు అందజేయడంలోనూ ఇబ్బందులు తప్పడంలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు 99.74శాతం ఎన్యూమరేషన్ ఫారాలు అందజేశారు. 14.27శాతం మందే ఫారాలను నింపి అధికారులకు ఇచ్చారు. ఎస్ఐఆర్పై విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. – సాక్షి, సిద్దిపేట కేంద్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. గత నెల 25న ప్రారంభమైన ఈ కార్యక్రమం ఈ నెల 24వ తేదీ వరకు కొనసాగనుంది. ఇందుకోసం ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసేందుకు 1,157 మంది బీఎల్ఓలను, సూపర్వైజర్లు 133 మంది, ఏఈఆర్ఓలు 33 మందిని నియమించారు. ఇంటింటికీ తిరిగి బీఎల్ఓలు ఎన్యూమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేశారు. ఓటర్లు ఫారాలు నింపేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏదైనా తప్పుగా నమోదు చేస్తే ఓటు హక్కు రద్దయితే తమనే బాధ్యులు చేస్తారని కొందరు నింపేందుకు ముందుకు రావడం లేదు. సందేహాలు నివృత్తి చేసేందుకు ఆన్లైన్ పైనే ఆధారపడుతున్నారు. వివరాలపై సందేహాలు ఎన్యూమరేషన్ ఫారాలను నింపడంలో క్షేత్రస్థాయిలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏకాలంలో ఏ వివరాలు రాయాలన్న సందేహం చాలా మందిని వెంటాడుతోంది. దీనిపై స్పష్టత ఇచ్చే వారు లేరు. 2002 నాటి ఓటర్ల జాబితాలోని వివరాలే సర్‌లో కీలకంగా మారాయి. నాటి వివరాలు అస్పష్టంగా, అసమగ్రంగా ఉన్న వారి ఫారాలు నింపడంలో ఇబ్బందులు తప్పడం లేదు. ఇక 2002 నాటికి ఓటు హక్కులేని వారు, లేదా ఆ తర్వాత జన్మించిన వారి విషయాల్లోనూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాగే 24 ఏళ్ల కిందటి వారి ఓటరు గుర్తింపు కార్డు నంబర్లు సేకరించడం సవాలుగా మారింది. నాటి పోలింగ్‌కేంద్రం నంబర్, ఓటరు సీరియల్ నంబర్, ఏపిక్ కార్డు నెంబర్లు తెలియక ఇబ్బందులు పడుతున్నారు. డిజిటలైజేషన్ 14.27శాతమే జిల్లా వ్యాప్తంగా 9,92,967 మంది ఓటర్లుండగా అందులో 9,90,396 మందికి ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. 99 శాతం పంపిణీ పూర్తయింది. ఎన్యూమరేషన్ ఫారాలు నింపి డిజిటలైజేషన్ 14.27శాతమే అయ్యింది. అత్యల్పంగా సిద్దిపేట నియోజకవర్గంలో 10.24 శాతం మాత్రమే కావడం గమనార్హం. 2002 ఓటర్ల వివరాలు అందజేస్తేనే సర్ వేగం పుంజుకునే అవకాశం ఉంది.సిద్దిపేట పట్టణం రంగధాంపల్లిలో ఓటర్ల వివరాలు తెలుసుకుంటూ ఫారాలు నింపుతున్న బీఎల్ఓలునియోజకవర్గం మొత్తం ఓటర్లు ఫారాల పంపిణీ నింపి ఇచ్చినవారుహుస్నాబాద్ 2,54,543 2,53,226 53,795సిద్దిపేట 2,44,507 2,44,135 25,049దుబ్బాక 2,04,664 2,04,487 25,980గజ్వేల్ 2,89,253 2,88,548 36,911మొత్తం 9,92,967 9,90,396 1,41,735బీఎల్ఓల తిప్పలు ఆరుబయటే ఎన్యూమరేషన్ ఫారాల ప్రక్రియ చిన్నకోడూరు(సిద్దిపేట): బీఎల్ఓలు ఓటర్లకు అందజేసిన ఎన్యూమరేషన్ ఫారాలను నింపుతూ ఓటరు నమోదు ప్రక్రియ ముమ్మరంగా చేపడుతున్నారు. కాగా మండల పరిధిలోని మల్లారంలో మంగళవారం బీఎల్ఓలు ఆరుబయట ఫారాలు నింపుతూ ఇబ్బందులు పడుతున్నారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటరు ప్రక్రియ చేపట్టవద్దని పంచాయతీ కార్యదర్శి చెప్పడంతో ఆరుబయటే ఫారాలు నింపుతూ.. వర్షానికి తడుస్తూ ఇబ్బందులకు గురువుతున్నారు. ఈ విషయమై తహసీల్దార్ సలీమ్‌ను అడుగగా గ్రామ పంచాయతీల్లో ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలన్నారు. మల్లారం విషయం తన దృష్టికి రాలేదన్నారు. అలాంటివి జరగకుండా చూస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 99.74శాతంఫారాల పంపిణీ 2002 ఓటర్ల వివరాలు లభించక అవస్థలు -
నాణ్యమైన విద్య అందించండి
సిద్దిపేటఎడ్యుకేషన్: కళాశాలలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రిన్సిపాల్స్, అధ్యాపకు లంతా కృషి చేయాలని జిల్లా ఇంటర్ విద్యాధికారి(డీఐఈఓ) రవీందర్‌రెడ్డి అన్నారు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో ఎడ్యుకేషన్)ను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులను, రిజిస్టర్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫస్టియర్‌లో 500లకు పైగా విద్యార్థులను చేర్చుకుని జిల్లాలో నంబర్‌వన్‌గా నిలిచారని ప్రశంసించారు. కళాశాలలో చేరిన విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించాలన్నారు. కోర్సులన్నీ మంచివేనని అన్నింటిలో విద్యార్థులు చేరేలా పోత్సహించాలని సూచించారు. అధ్యాపకులు సమయ పాలన పాటిస్తూ ఆదర్శంగా నిలవాలన్నారు. కళాశాలల్లో చేరిన విద్యార్థుల్లో అధికశాతం పేదలేనని వారందరికీ స్కాలర్షిప్లు వచ్చేలా ప్రత్యేక చొరవ తీసుకోవాలని సూచించారు. కళాశాలకు నాలుగు తరగతి గదులు మంజూరు చేయించేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. ప్రిన్సిపాల్ ప్రమీల మాట్లాడుతూ కళాశాలలో సుధీర్ఘ అనుభవం ఉన్న అధ్యాపకులున్నారని వారిని సేవలను ఉపయోగించుకుని ఉత్తమ ఫలితాలను సాధిస్తామన్నారు. అనంతరం కళాశాలలో ఏర్పా టు చేసిన ఆధార్ అప్డేట్ కేంద్రాన్ని పరిశీలించారు. డ్రై డేలో భాగంగా ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కలిసి పరిసరాల పరిశుభ్రం కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్‌రెడ్డి, స్టూడెంట్ కౌన్సిలర్ కనకచంద్రం, డిసిప్లీన్ కమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం అధికారి ధరిపల్లి నగేష్‌తో పాటు అధ్యాపకులు పాల్గొన్నారు. కళాశాలల్లో ఉత్తమ ఫలితాలుసాధించాలి డీఐఈఓ రవీందర్‌రెడ్డి -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
సిద్దిపేటకమాన్: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని డీఎంహెచ్ఓ ధనరాజ్ ప్రజలకు సూచించారు. అంటువ్యాధుల నివారణ చర్యల్లో భాగంగా జిల్లా వైద్యారోగ్యశాఖ చేపడుతున్న ముందస్తు చర్యలపై డీఎంహెచ్ఓ మంగళవారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. సిద్దిపేట పట్టణంలోని బస్తీ దవాఖాన, ముస్తాబాద్ చౌరస్తాలోని టీ స్టాళ్లు, పరిసర ప్రాంతాల్లో సిబ్బంది చేపడుతున్న ఫాగింగ్ను డీఎంహెచ్ఓ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో వర్షపు నీరు నిలిచి దోమలు వృద్ధి చెందే అవకాశం ఉందని, వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. దోమల వ్యాప్తిని అరికట్టేందుకు నివారణ చర్యలు, కార్యక్రమాలు మరింత ముమ్మరం చేయాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు డాక్టర్ వినోద్‌బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్, ఏఎన్ఏంలు, ఆశా కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిసరాల పరిశుభ్రత తప్పనిసరి డీఎంహెచ్ఓ ధనరాజ్ -
సొంతింటి కల కాంగ్రెస్‌తోనే సాకారం
ములుగు(గజ్వేల్): నిరుపేదల సొంతింటి కలను సాకారం చేసేందుకే ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ములుగులో మంత్రి వివేక్, ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలు, డబుల్ బెడ్రూం ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ సొంతిల్లు లేని పేద కుటుంబం ఉండకూడదనే లక్ష్యంతో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఆర్థిసహాయాన్ని ప్రభుత్వం అందిస్తోందన్నారు. అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి గృహ సౌకర్యం కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని తెలిపారు. మధ్యవర్తులు లేకుండా నేరుగా లబ్ధిదారులకే నిధులు ఇస్తూ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టామన్నారు. రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిధిని రూ.10 లక్షలకు పెంచామన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ హైమావతి, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ చంద్రం, హౌసింగ్ ఎండీ గౌతమ్, తదితరులు పాల్గొన్నారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి హాజరైన మంత్రి వివేక్ రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల పత్రాలు అందజేత -
ఆరుద్ర కనబడలె.. నేల మురవలె
మెదక్ అర్బన్: తొలకరి జల్లు కురియగానే పంట పొలాల్లో కనిపించే అరుదైన అందమైన జీవి ఆరుద్ర పురుగు. ఇవి విరివిగా కనిపిస్తే పంటలు సమృద్ధిగా పండుతాయని, వర్షాలు దండిగా కురుస్తాయని రైతుల నమ్మకం. కానీ రాను రాను ఆరుద్ర పురుగులు అంతరిస్తున్నాయి. రైతు నేస్తాలుగా భావించే పర్యావరణ మిత్రలు కనుమరుగవుతున్నాయి. ఆరుద్ర కార్తె ముగిసినా సరైన వర్షాలు కురవకపోవడంతో రైతులు సైతం సాగు పనులు చేపట్టలేదు. పుడమి తల్లికి సింధూరం శాసీ్త్రయంగా ‘ట్రాంబిడియం గ్రాండిస్సిమం’గా పిలిచే ఈ పురుగులు చిన్న పరిణామంలో మక్మల్ బట్టలాగా, ముదురు ఎరుపు రంగులో చూడముచ్చటగా ఉంటాయి. ముట్టుకుంటే ముడుచుకొని కాస్సేపు కదలకుండా బొమ్మలా నిలబడిపోతాయి. తమ జీవిత కాలంలో ఎక్కువగా భూమి లోపలే ఉంటాయి. కేవలం వర్షాకాలంలో మాత్రమే సంతానోత్పత్తి కోసం భూమి పైకి వస్తాయి. రైతు నేస్తం.. పర్యావరణ మిత్ర రైతు మిత్రగా పిలువబడే ఆరుద్ర పురుగులు భూమిలో ఉండే చిన్న చిన్న హానికరమైన కీటకాలు. లార్వాలను తిని పంటలకు రక్షణగా నిలుస్తాయి. ఈ మధ్య వీటిని ఔషధాల తయారీలో కూడా వాడుతున్నారు. ఆయుర్వేద వైద్య గుణాలున్నాయని అంటారు. కిలోకు రూ.800 నుంచి 1000 వరకు విక్రయిస్తున్నారని తెలిసింది. దీంతో పర్యావరణానికి ఉపయోగపడే ఆరుద్ర పురుగుల ఉనికికే ప్రమాదం ఏర్పడిందనే ఆరోపణలు వెల్తువెత్తుతున్నాయి. ఇవి శివునికి ప్రీతి పాత్రమైన జీవులని వేద పండితులు చెబుతారు. చిన్పపిల్లలు వీటిని పట్టుకొని, అగ్గిపెట్టెలో వేసుకొని ఆడుకుంటారు. -
దుబ్బాక ‘చేనేత’ డైరెక్టర్లు ఏకగ్రీవం
దుబ్బాక: జిల్లాలో అతిపెద్ద చేనేత సహకార సంఘంగా ప్రసిద్ధి చెందిన దుబ్బాక సహకార సంఘానికి డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొత్తం తొమ్మిది మంది డైరెక్టర్లకు 20 మంది నామినేషన్లు వేయగా సోమవారం 11 మంది పోటీ నుంచి వైదొలిగారు. దీంతో డైరెకర్లుగా అంకం మధు, కారంపురి గురుచరణ్, సిరిగాధ నర్సింహులు, బోడ చంద్రమోహన్, రాపెల్లి నాగరాజు, గాజుల భాస్కర్, చెలిమెల రాజేశం, మెత్కు కవిత, గడ్డం రాజమణి ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించారు. డైరెక్టర్లకు ఎన్నిక పత్రాలను అందించారు. దుబ్బాక చేనేత సహకార సంఘం డైరెక్టర్లు ఏకగ్రీవంగా ఎన్నికావడంపై దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, భూంపల్లి–అక్బర్పేట మండలాల్లోని పద్మశాలి, నీలకంఠ సంఘాల నాయకులు సంతోషం వ్యక్తం చేశారు. నేడు చైర్మన్, పాలక వర్గం ఎన్నిక దుబ్బాక చేనేత సహకార సంఘం చైర్మన్‌తో పాటు పూర్తి స్థాయి పాలకవర్గం ఎన్నిక మంగళవారం ఉదయం 11 గంటలకు ఉంటుందని ఎన్నికల అధికారి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. -
దుబ్బాక అభివృద్ధికి సీఎం హామీ: ఎమ్మెల్యే కొత్త
దుబ్బాక: నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సీఎం నివాసంలో కలిసి నియోజకవర్గానికి సంబంధించి పలు అభివృద్ధిపనులకు నిధులు మంజూరు చేయాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ‘సాక్షి’తో మాట్లాడారు. హబ్షీపూర్ చౌరస్తా నుంచి దుబ్బాక పట్టణం వరకు ఉన్న డబుల్ రోడ్డును ఫోర్‌లేన్ చేయాలని విన్నవించామన్నారు. మున్సిపాలిటీలో నిర్మించనున్న ఆధు నిక నాన్‌వెజ్ మార్కెట్ కోసం గతంలో మంజూరైన నిధులను తిరిగి విడుదల చేయాలని కోరినట్లు తెలిపారు. అలాగే నియోజకవర్గానికి యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ స్కూల్‌ను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసినట్లు చెప్పారు. ఆర్అండ్బీ, పీఆర్ రోడ పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని కోరామన్నారు. దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందించాలని కోరడంతో సీఎం సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే తెలిపారు. సీఎంను కలిసిన వారిలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి, రణం శ్రీనివాస్‌గౌడ్, కొత్త కిషన్‌రెడ్డి, రాజిరెడ్డి తదితరులు ఉన్నారు. సీపీ ఆకస్మిక తనిఖీలు సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలో సోమవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీలు చేశారు. వర్షాకాలం నేపథ్యంలో బల్దియా కమిషనర్ మల్లికార్జున్‌తో కలిసి ప్రధాన కూడళ్లలో రహదారులు, గుంతలను పరిశీలించారు. ప్రజల రవాణాకు ఇబ్బందులు లేకుండా త్వరితగతిన గుంతలను పూడ్చాలని సూచించారు. విక్టరీ టాకీస్ చౌరస్తా, పాత బస్టాండ్ ప్రాంతాల్లో వర్షాలకు వరద నీరు మడుగుగా మారుతూ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్, పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అతిథి అధ్యాపకులకు దరఖాస్తులుప్రశాంత్నగర్(సిద్దిపేట): జిల్లాలోని మైనార్టీ రెసిడెన్షియల్ విద్యాసంస్థల్లో ఖాళీగా ఉన్న బోధన సిబ్బంది (అతిథి అధ్యాపకుల) కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి నాగరాజమ్మ తెలిపారు. పీజీటీ ఫిజికల్ సైన్స్ (మహిళ), పీజీటీ ఇంగ్లిష్, బాటనీ జూనియర్ లెక్చరర్ (మహిళ), కెమిస్ట్రీ జూనియర్ లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ నెల 8వరకు గజ్వేల్ బాలికల మైనార్టీ గురుకులంలో దరఖాస్తులు అందించాలని, అదే గురుకులంలో ఈ నెల 9న సంబంధిత సబ్జెక్ట్‌లో డెమో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆరుతడి సాగుతో ఆర్థికాదాయం మిరుదొడ్డి(దుబ్బాక): ఆరుతడి సాగుతో మంచి ఆర్థికాదాయం సాధించవచ్చని హార్టికల్చర్ అధికారి రమేశ్ తెలిపారు. సోమవారం మండల పరిధిలోని చెప్యాలలో సాగవుతున్న కూరగాయల పంటలను ఆయన పరిశీలించారు. కూరగాయల సాగుపై రైతులకు అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి ఎద్దడిని తట్టుకుని ముందుకు సాగాలంటే పప్పుధాన్యాలు, కూరగాయలను పండించాలన్నారు. కొద్దిపాటి నీటి వనరులు ఉన్న చోట నీటిని పొదుపుగా వాడుతూ బీర, కాకర, సొర, చిక్కుడు, దొండ వంటి పంటలను పండించవచ్చన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై రైతులకు అవగాహన కలిగించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
వీడని ఉద్యమ కేసులు
విముక్తి కల్పించాలనిఉద్యమకారుల వేడుకోలుచేర్యాల(సిద్దిపేట): రాష్ట్రం సిద్ధించినా ఉద్యమకారులకు తిప్పలు తప్పడం లేదు. నాటి రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో నమోదైన కేసుల విచారణ ఏళ్లు గడుస్తున్నా ముగియడం లేదు. దీంతో విచారణ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్న ఉద్యమకారులు.. ప్రభుత్వం స్పందించి కేసులు ఎత్తివేయాలని కోరుతున్నారు. సోమవారం కేసు విచారణలో భాగంగా పలువురు ఉద్యమకారులు చేర్యాల కోర్టుకు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో నమోదైన ఉద్యమ కేసులు ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటై యేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొనసాగుతున్నాయన్నారు. దీంతో కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి కేసులను పూర్తిగా ఉపసంహరించి న్యాయం చేయాలని కోరారు. కోర్టుకు హాజరైన వారిలో హైదరాబాద్ జలమండలి చైర్మన్ మొగుళ్ల రాజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు ఆరుట్ల దశమంత్‌రెడ్డి, బూరుగు సురేష్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు మేకల కళింగరాజు, మాజీ సర్పంచులు వల్లూరి శ్రీనివాస్, కోనేటి స్వామి, నాయకులు బూడిద కిష్టయ్య, రఘువీరారెడ్డి, తిప్పారపు ఆనంద్, ముషిని బాబు తదితరులున్నారు. -
గోతులు దాటిన నిర్లక్ష్యం
వర్గల్(గజ్వేల్): నిర్లక్ష్యం గోతులు దాటింది. నిరసన గళం రోడ్డెక్కింది. గోతుల బాటలో వాహనదారుల ఇక్కట్లు పడుతున్నారు. ప్రయాణికులు గాయాలపాలవుతున్న ఘటనలు నిత్యకృత్యమైనా వర్గల్ రోడ్డు బాగోగులు పట్టించుకున్న నాథుడే కరువయ్యారు. అధికారులకు వినతులు చేసినా స్పందన లేకపోవడంతో సోమవారం ఏకంగా గ్రామ సర్పంచ్ దేవగణిక జయభారతి రోడ్డు పక్కన బైఠాయించి దీక్ష చేపట్టారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వర్గల్ ప్రధానరోడ్డును పునర్ నిర్మించాలని కోరారు. ఆర్అండ్బీ అధికారుల హామీతో దీక్ష విరమించారు. ఖ్యాతి ఘనం.. రోడ్డు అధ్వానం రాష్ట్రస్థాయిలో పేరొందిన విద్యాసరస్వతి క్షేత్రం, వెయ్యి ఎకరాల్లో రూపుదిద్దుకుంటున్న పారిశ్రామిక వాడ, నవోదయ విద్యాలయంతో వర్గల్ ఖ్యాతి ఇనుమడిస్తుంటే, గతుకులతో రోడ్డు ధ్వంసమై పరువుతీస్తోంది. రాజీవ్‌రహదారి నుంచి తూప్రాన్ జాతీయ రహదారికి బైపాస్‌గా నిలుస్తున్న ఈ రోడ్డుపై రాకపోకలకు సవాల్‌గా మారాయి. అధికారులు పట్టించుకోకపోవడం వల్లే.. రోడ్డును బాగుచేయాలని అనేకసార్లు అధికారుల దృష్టికి తెచ్చామని వర్గల్ సర్పంచ్ జయభారతి తెలిపారు. అయినా ఎవరూ స్పందించలేదన్నారు. చేసేదిలేకే రోడ్డు కోసం దీక్ష చేపట్టామని చెప్పారు.గోతులతో రోడ్డు ధ్వంసం గ్రామ ఎల్లమ్మ ఆలయం నుంచి దివంగత మహానేత వైఎస్సార్ విగ్రహం దాకా ప్రధాన రోడ్డు పరిస్థితి దయనీయంగా మారింది. ట్రాక్టర్, లారీలు తదితర వాహనాలు గోతులలో దిగబడుతున్నాయి. అదుపుతప్పి బోల్తాపడుతున్నాయి. ద్విచక్రవాహనదారులు గాయాలపాలవుతున్నారు. ౖపైపె మరమ్మతులు శాశ్వత పరిష్కారం చూపడం లేదు. వర్షం పడితే తారు లేచిపోయి సమస్య మొదటికే వస్తుంది. ఇక్కడ సీసీ రోడ్డు నిర్మిస్తేనే వర్గల్రోడ్డుకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. ప్రతిపాదనలు పంపుతాం వైఎస్సార్ విగ్రహం నుంచి ఎల్లమ్మ ఆలయం వరకు 400 మీటర్ల పొడవున సీసీ రోడ్డు రెన్యూవల్ కోసం, ప్యాచ్‌వర్కుల కోసం ఎస్టిమేట్లు పంపుతాం. తాత్కాలిక మరమ్మతులు చేపట్టి వాహన రాకపోకలకు మార్గం సుగమం చేస్తాం. అడ్మినిస్ట్రేటివ్ మంజూరు వచ్చిన వెంటనే పనులు చేపడతాం. – రేణుక, (ఆర్అండ్బీ డిప్యూటీఈఈ)రోడ్డెక్కిన నిరసన గళం వర్గల్ రోడ్డు కోసం సర్పంచ్ దీక్ష -
మంగళవారం శ్రీ 7 శ్రీ జూలై శ్రీ 2026
రోగులకు పరీక్షే!సాక్షి, సిద్దిపేట: జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు ఇష్టారాజ్యంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ నిబంధనలను ఏమాత్రం పాటించడంలేదు. బహుళ అంతస్తుల భవనాల్లో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులతో పాటు నర్సింగ్ హోంలు ఏర్పాటు చేశారు. నిబంధనల ప్రకారం సెల్లార్లు.. పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాల్సి ఉండగా పలు ఆస్పత్రులు సొంత అవసరాలకు వినియోగిస్తున్నాయి. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి కోసం వచ్చే సహాయకులకు ఇబ్బందులు తప్పడంలేదు. కొన్ని చోట్ల సెల్లార్లను ల్యాబ్‌లు, రోగుల బంధువులు వసతి పొందేందుకు వినియోగిస్తున్నారు. ఇది పూర్తిగా విరుద్ధమని అధికారులకు తెలిసినా అటు మున్సిపాలిటీ.. ఇటు వైద్యారోగ్య శాఖ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదు. రోడ్లపైనే వాహనాల నిలిపివేత ● జిల్లా వ్యాప్తంగా 390 అన్ని రకాల ప్రైవేట్ ఆస్పత్రులున్నాయి. భవనాల నిర్మాణ సమయంలో సెల్లార్లను పార్కింగ్ కోసం వినియోగిస్తామంటూ మున్సిపాలిటీల నుంచి అనుమతులు తీసుకుంటున్నారు. తర్వాత నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. అధికారులు అందిన కాడికి దండుకొని చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని అధిక ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు రోడ్ల పైనే వాహనాలు పార్కింగ్ చేయిస్తున్నారు. రోగులతో పాటు సహాయకులు, వైద్యుల వాహనాలు సైతం రోడ్డుపైనే నిలపాల్సి వస్తోంది. దీంతో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అలాగే అంబులెన్స్‌లను సైతం బయటే నిలుపుతున్నారు. రోడ్ల పైకి వచ్చిన భవనాలతో పాటు సెల్లార్లలో వైద్య సేవల నిర్వహణ, ట్రాఫిక్ ఇక్కట్లు, అగ్నిమాపక శాఖ నిబంధన ఉల్లంఘిస్తున్నప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకుండా అలసత్వం వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. తనిఖీలు కరువు పట్టణాల్లో మున్సిపల్ అధికారులు ఇంటి నిర్మాణ అనుమతులు ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నారు. ఇంటి నిర్మాణం నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నారా ? లేదా? పరిశీలించడం లేదు. సెల్లార్లలో పార్కింగ్ కాకుండా ఇతర అవసరాలకు యథేచ్ఛగా వినియోగిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికై నా కలెక్టర్, మున్సిపల్ అధికారులు స్పందించి సెల్లార్లలో ల్యాబ్‌లు, వైద్య సేవలు కాకుండా పార్కింగ్ కోసం వినియోగించుకునే విధంగా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. సిద్దిపేట పట్టణంలోని ఓ ప్రైవేట్ నర్సింగ్ హోం సెల్లార్లో ల్యాబ్ నిర్వహిస్తుండటమే కాకుండా.. రోగులు వేచి ఉండేందుకు కుర్చీలను ఏర్పాటు చేశారు. దీంతో ఆస్పత్రికి వచ్చే రోగులు, వారి బంధువులు వాహనాల పార్కింగ్ కోసం ఇబ్బంది పడుతున్నారు. చేసేదిలేక రోడ్లపైనే పార్కింగ్ చేస్తుండటంతో రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. -
నులిపురుగులను నిర్మూలిద్దాం
సిద్దిపేటకమాన్: ‘నులిపురుగులను నిర్మూలిద్దాం.. పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుదాం’ అని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. జాతీయ నులిపురుగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టరేట్లో జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో 1నుంచి 19ఏళ్ల వయసు గల పిల్లలందరికీ ఈ నెల 13న ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. మిగిలిపోయిన వారికి ఈనెల 20న మాత్రలు వేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, నర్సింగ్ కళాశాల, ఆరోగ్య కేంద్రాల్లో మాత్రలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. గుర్తించిన పిల్లలకు తప్పనిసరిగా మాత్రలు వేయించాలన్నారు. విద్యా, మహిళ, శిశు సంక్షేమ శాఖ, పంచాయితీ రాజ్, మున్సిపల్, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని డీఎంహెచ్ఓ కోరారు. కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓలు వినోద్‌బాబ్జి, డాక్టర్ శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి పేరుతో బీజేపీ స్కాం
హుస్నాబాద్: అయోధ్య రామమందిరంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, దేవుడి పేరుతో బీజేపీ భారీ స్కాంకు పాల్పడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. జిల్లెల్లగడ్డలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఎంతో మంది విరాళాలు ఇచ్చారని తెలిపారు. చందా బుక్కులు పట్టుకొని ఊరూరా తిరిగారని, వసూలు చేసిన డబ్బులు ఎవరికి పోయాయో, ఎవరి వద్ద ఉన్నాయో లెక్కలు లేవన్నారు. రాముడి పేరిట చందాలు వసూలు చేసిన కోట్లాది రూపాయలు మాయం చేశారని ఆరోపించారు. ప్రతి ఊరిలో జైశ్రీరాం అంటూ అక్షింతలు పంచి ఓట్లు అడిగిన బీజేపీ, ఇప్పుడు అదే రామమందిరంలో జరిగిన అవినీతిపై ఎందుకు మాట్లాడటంలేదన్నారు. ఆలయంలో జరిగిన అవినీతిపై మోదీ, అమిత్‌షా, ఆ రాష్ట్ర సీఎంతోపాటు తెలంగాణ బీజేపీ నాయకులు ఎందుకు స్పందించడంలేదన్నారు. అయోధ్య ఆలయంలో సొమ్ములు దొంగిలించడంపై హిందువులందరికీ అవమానకరమన్నారు. రామమందిరంలో జరిగిన అవినీతి పై తప్పును ఒప్పుకొని బీజేపీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్ పర్సన్ చిత్తారి పద్మ, సింగిల్ విండో అద్యక్షుడు శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, ఆత్మ డివిజన్ అధ్యక్షుడు జంగపల్లి అయిలయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు తదితరులు ఉన్నారు. భక్తి, అక్షింతల పేరిట రాజకీయాలు మంత్రి పొన్నం ప్రభాకర్ -
అక్షర విద్యాధరి.. వ్రత నాచగిరి
ప్రసిద్ధమైన వర్గల్ శ్రీవిద్యాధరి, నాచగిరి శ్రీలక్ష్మీనృసింహక్షేత్రాలు ఆదివారం భక్తులతో కిటకిటలాడాయి. సరస్వతిమాత సన్నిధానం చిన్నారుల అక్షరాభ్యాసాలతో శోభిల్లింది. తమ తల్లిదండ్రుల సమక్షంలో 650 మంది చిన్నారులు అర్చకుల మంత్రోచ్ఛారణల మధ్య అక్షరాలు దిద్దారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. మరోవైపు నాచగిరి క్షేత్రాన్ని పెద్దసంఖ్యలో భక్తులు సందర్శించారు. హరిద్రలో పుణ్యస్నానాలాచరించి అభిషేకాలు, కల్యాణాలు, వ్రతాది మొక్కులు తీర్చుకున్నారు. శ్రీవారిని దర్శించుకుని తరించారు. సరస్వతి క్షేత్రాన్ని జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా సందర్శించి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయ వేదపండితులు మహదాశీర్వచనం చేసి, శేషవస్త్రం అందజేశారు. –వర్గల్(గజ్వేల్) -
అసలే ఆలస్యం.. ఆపై అరకొర
సీజన్ ముగుస్తున్న సమయంలో ఉచిత పత్తి విత్తనాల పంపిణీ జిల్లాలో జాతీయ పత్తి ఉత్పాదకత పథకం (మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ) ఆధ్వర్యంలో సాగుతున్న ఉచిత పత్తి విత్తనాల పంపిణీ తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీజన్ ముగిసే సమయంలో విత్తనాలను పంపిణీ చేయడం, అదీ కూడా అరకొరగా సాగుతుండటం చర్చనీయాంశంగా మారుతోంది. మూడు రోజులుగా హడావిడిగా సాగుతున్న ఈ పథకం సత్ఫలితాలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ వ్యవహారంపై ‘సాక్షి’ ఫోకస్ – గజ్వేల్ పత్తి సాగు అధికంగా ఉండే రాష్ట్రంలోని 19 జిల్లాలను జాతీయ పత్తి ఉత్పాదకత పథకానికి ఎంపిక చేశారు. ఇందులో సిద్దిపేట జిల్లా కూడా ఒకటి. అధిక సాంద్రత లేదా క్లోజర్ స్పేస్ విధానాల్లో పత్తి సాగును ఈ పథకంలో ప్రోత్సహిస్తారు. అధిక సాంద్రత విధానంలో ఎకరాకు 29 వేల మొక్కలను విత్తే అవకాశం ఉంటుంది. క్లోజర్ స్పేస్ విధానంలో ఎకరాకు 15వేలకు పైగా మొక్కలను విత్తుతారు. అధిక సాంద్రత పద్ధతికి ఎకరాకు 6 ప్యాకెట్లు, క్లోజర్ స్పేస్ పద్ధతికి 4 విత్తన ప్యాకెట్లు అవసరముంటాయి. సాధారణ పద్ధతిలో అయితే రైతులు కేవలం 2నుంచి రెండున్నర ప్యాకెట్ల విత్తనమే వాడతారు. ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ విధానంలో మొక్కకు, మొక్కకు మధ్యన దూరం తగ్గిపోయి అధిక దిగుబడులకు అవకాశం కలగనుంది. ఈ క్రమంలోనే రైతులకు ప్రభుత్వం ఈ రెండు పద్ధతులను అనుసరించే రైతులకు అవసరమైన విత్తనాలను అధికారులు అందజేయనున్నారు. పత్తి ఎదుగులకు అవసరమయ్యే మందులు, క్రిమిసంహారకాలు కూడా పంపిణీ చేయనున్నారు. అధిక సాంద్రత పద్ధతి పాటించే రైతులకు ఎకరాకు రూ.7వేల వరకు, క్లోజర్ స్పేస్ పద్ధతికి విత్తనాలతో కలుపుకొని రూ.5,500వరకు ఇన్పుట్స్ ఇస్తారు. ప్రణాళికబద్ధంగా జరిగి ఉంటే... ఈ పథకానికి సంబంధించి ప్రణాళికబద్ధంగా మే నెల నుంచే కార్యాచరణ అమలు చేసి ఉంటే మంచి ఫలితాలకు అవకాశం ఉండేది. జిల్లాలో పత్తి సాగులో రైతులు మూస పద్ధతికి అలవాటుపడ్డారు. ఇష్టానుసారంగా సాగుచేయడం వల్ల దిగుబడులు నానాటికీ పడిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అధిక సాంద్రత, క్లోజర్ స్పేస్ పద్ధతులవైపు రైతులను మళ్లించి, ఉచిత విత్తనాలను, ఇన్‌పుట్స్‌ను సకాలంలో పంపిణీ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. కానీ నేడు జిల్లాలో భిన్నమైన పరిస్థితి నెలకొంది. ఆలస్యంగా, అరకొరగా అమలవుతున్న జాతీయ పత్తి ఉత్పాదకత పథకం వల్ల సత్ఫలితాలు అనుమానంగా ఉన్నాయి. -
రిజర్వాయర్ రద్దయినా ప్రభుత్వం దగ్గరే భూమి
తోటపల్లి రిజర్వాయర్ రద్దయి 11 ఏళ్లు గడుస్తున్నా అందుకు సేకరించిన భూమి ఇంకా ప్రభుత్వ అధీనంలోనే ఉంది. రిజర్వాయర్ ఎలాగు రద్దయింది కాబట్టి తమ భూమిని తమకిచ్చేయాలని రైతులు వేడుకుంటున్నారు. ప్రస్తుతం ఆ భూముల్లో రైతులు సాగు చేస్తున్నా రికార్డుల్లో లేనందున సదరు రైతులకు రైతు భరోసా, రైతు బీమా వంటి పథకాలేవీ వర్తించడం లేదని వాపోతున్నారు. – సాక్షి, సిద్దిపేటఖేడ్ ఎమ్మెల్యే సంజీవరెడ్డి నారాయణఖేడ్: ఖేడ్ నియోజకవర్గంలో 29 రహదారుల నెట్వర్క్ బలోపేతం కోసం హ్యామ్ ద్వారా ఆర్అండ్బీ రోడ్లకు రూ.137 కోట్లు, పంచాయతీరాజ్ (పీఆర్) రోడ్లకు రూ.67.95 కోట్లు కలిపి మొత్తం రూ. 204.95 కోట్లు విడుదలైనట్లు ఎమ్మెల్యే సంజీవరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలో అధ్వానంగా మారిన రహదారుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిరంతరం పట్టుబట్టి నిధులను సాధించామన్నారు. ప్రధాన రహదారులు, గ్రామీణ ప్రాంతాల్లోని అంతర్గత, లింకు రోడ్లను నిర్మిస్తామన్నారు. పనులు పూర్తయితే రవాణా ఇబ్బందులు తొలగి నియోజకవర్గ ముఖచిత్రం మారుతుందన్నారు. త్వరలోనే పనులకు శంకుస్థాపన చేసి నాణ్యతా ప్రమాణాలతో వేగంగా పూర్తయ్యేలా చూస్తామని తెలిపారు. నిధులు మంజూరు చేసినందుకు సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డికు కృతజ్ఞతలు తెలిపారు. జహీరాబాద్: జహీరాబాద్ ఐసీడీఎస్ కేంద్రం పరిధిలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్ పోస్టులతో పాటు ఆయాలుగా పనిచేసేందుకు ఉత్సాహంగా ఉన్న వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సీడీపీఓ సుశీల తెలిపారు. ప్రాజెక్టు పరిధిలో గల అన్ని ప్రాంతాల్లోని 15 అంగన్వాడీ టీచర్ పోస్టులకు, గిరిజన ప్రాంతాల్లో గల 20 ఆయాల పోస్టుల భర్తీకి అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. ఈనెల 17వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు సంబంధిత వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ప్రజావాణి, కార్యాలయంలో సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోమన్నారు.మా భూములు మాకే ఇవ్వాలి... తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం వల్ల మా ప్రాంత రైతులకు మేలు జరుగుతుందని భూము లు ఇచ్చాం. రిజర్వాయర్ రద్దయింది కాబట్టి మా భూములు మాకివ్వాలని కొన్నేళ్లుగా తిరుగుతున్నాం. భూమి మా పేరు మీద లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రావాల్సిన లబ్ధికి దూరమవుతున్నాం. ఇప్పటికై నా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు స్పందించి మా భూములు మాకు ఇవ్వాలి. –బీనవేణి లక్ష్మణ్, రాంచంద్రపూర్, రైతు రెండెకరాలు తీసుకున్నారు రిజర్వాయర్ నిర్మాణం కోసం మాకున్న రెండెకరాలు తీసుకున్నారు. అప్పుడు నామమాత్రంగా పరిహారం ఇచ్చారు. మా భూముల్లో రిజర్వాయర్ నిర్మాణం కాలేదు. కాబట్టి మా భూములు మాకివ్వాలి. పెద్ద కంపెనీలకు అయితే భూమి తిరిగి ఇచ్చారు. మాకు ఎందుకు ఇవ్వరు? –బద్దం శ్రీనివాస్ రెడ్డి, రైతు, గాగిల్లాపూర్అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో 2007లో శంకుస్థాపన చేసిన ఈ రిజర్వాయర్‌కోసం దాదాపు 510 మంది రైతుల దగ్గర నుంచి 1,603 ఎకరాల వ్యవసాయ భూమిని అధికారులు సేకరించారు. అక్కన్నపేట మండలంలో గౌరవెల్లిలో నిర్మించాలనుకున్న రిజర్వాయర్ సామర్థ్యాన్ని 1.04 టీఎంసీల నుంచి 8.23 టీంఎంసీలకు పెంచి తోటపల్లి రిజర్వాయర్‌ను 2015లో బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. 1,603 ఎకరాల భూమి సేకరణ సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం తోటపల్లిలో 0.950 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించి దాదాపు 49వేల ఎకరాలకు సాగు నీరందించాలని డిజైన్ చేశారు. ఈ రిజర్వాయర్ కోసం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని గాగిల్లాపూర్, తోటపల్లి, కోహెడ మండలంలోని రాంచంద్రాపూర్, వరికోలు, కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని ఓబులాపూర్, నారాయణపూర్ గ్రామాల నుంచి 1,603 ఎకరాల భూమిని సేకరించారు. గ్రామాలు ముంపునకు గురవుతుండటంతో ఈ రిజర్వాయర్‌పై ఇంజనీరింగ్ అధికారులతో అధ్యయనం చేయించింది. తోటపల్లి రిజర్వాయర్ 0.3 టీంఎంసీల నీటినిల్వ సామర్థ్యం ఉండేందుకు అవకాశముందని అధికారులు ప్రభుత్వానికి నివేదికను అందించారు. తక్కువ సామర్థ్యం ఉండటంతో బెజ్జంకి, కోహెడ, చిగురుమామిడి మండలాల్లోని గ్రామాలు ముంపునకు గురికాకుండా గాగిల్లాపూర్ మోయతుమ్మెద వాగుపై గ్రావిటీ కెనాల్ నిర్మించి అక్కన్నపేటలోని గౌరవెల్లి రిజర్వాయర్‌కు నీటిని తరలించేందుకు ప్రణాళికను రూపొందించింది. తోటపల్లి రిజర్వాయర్‌ను మార్చి తోటపల్లి చెరువును బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చుకోవాలని నిర్ణయించింది. దీంతో తోటపల్లి రిజర్వాయర్‌ను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేసింది. అయితే తోటపల్లి రిజర్వాయర్ నిర్మాణం కోసం సేకరించిన భూములు ఇప్పటికీ ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. ఈ భూములను సదరు రైతులు సాగు చేస్తున్నప్పటికీ రికార్డుల్లో వారి పేరిట భూములు లేకపోవడంతో వారికి రైతు భరోసా, రైతు బీమా వర్తించడం లేదు. బ్యాంక్ రుణాలకు సైతం దూరమవుతున్నారు. 100 ఎకరాల్లో గ్రావిటీ కెనాల్స్.. తోటపల్లి రిజర్వాయర్ కోసం 1,603 ఎకరాల భూమిని సేకరించగా అందులో 100 ఎకరాలు గ్రావిటీ కెనాల్స్ నిర్మాణం కోసం వినియోగించాలని, మిగతా 1,503 ఎకరాల భూమిని రైతులకు తిరిగి ఇవ్వాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రైతులకు ఎకరానికి రూ.2.10లక్షలు పరిహారం ఇవ్వగా ప్రభుత్వం మార్కెట్ ధర ఇచ్చి భూములు తిరిగి తీసుకోవాలని అప్పటి కరీంనగర్ కలెక్టర్ నీతూ ప్రసాద్ ప్రకటించారు. అయితే అప్పుడు నామమాత్రపు పరిహారం తీసుకున్న రైతులు మార్కెట్ ధర ఎక్కువగా ఉండటంతో చాలామంది రైతులు ముందుకు రాలేదు. అనంతరం జిల్లాల విభజన జరగడంతో బెజ్జంకి, కోహెడ మండలాలు సిద్దిపేట జిల్లాలోకి రాగా, చిగురుమామిడి మండలం కరీంనగర్ జిల్లాలోనే కొనసాగుతుంది. ఓ ప్రైవేట్ సీడ్ కంపెనీకి చెందిన 124 ఎకరాల భూమిని సేకరించగా దానిని 2021లో తిరిగి ఇచ్చారు. తమ భూములు తమకు ఇవ్వాలని పలువురు రైతులు దరఖాస్తు చేసుకున్నప్పటికీ స్పష్టత ఇవ్వలేదు. -
ప్రాణం గుప్పిట్లో పాఠాలు
● శిథిలావస్థలో పాఠశాల భవనం ● భయాందోళనలో విద్యార్థులు దుబ్బాకటౌన్: దౌల్తాబాద్ మండలం దీపాయంపల్లి గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు భయాందోళనల మధ్య చదువులు కొనసాగిస్తున్నారు. భవనం పైకప్పు పలుచోట్ల పెచ్చులు ఊడిపోవడం, ఇనుప రాడ్లు బయటకు కనిపించడం, గోడలకు భారీ పగుళ్లు ఏర్పడటంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు, గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో తరగతి గదుల్లోకి వర్షపు నీరు చేరుతుండటంతో విద్యార్థులకు తీవ్ర అసౌకర్యం కలుగుతుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఇంత ప్రమాదకర పరిస్థితి ఉన్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు శాశ్వత పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. విద్యార్థుల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త భవనాన్ని నిర్మించాలని లేదా ప్రస్తుత భవనానికి అత్యవసర మరమ్మతులు చేపట్టాలని గ్రామస్తులు, కోరుతున్నారు. -
కేంద్రంపై పోరాటం ఉధృతం చేస్తాం
రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ చిన్నకోడూరు(సిద్దిపేట): కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాటం ఉధృతం చేస్తామని రైతు సంఘం జిల్లా కార్యదర్శి వెంకట్ పేర్కొన్నారు. చిన్నకోడూరులో ఆదివారం నిర్వహించిన సదస్సులో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల హక్కులను హరించే విధంగా గతంలో ఉన్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు కోడ్లుగా తెచ్చిందన్నారు. దీనివల్ల కార్మికులకు మేలు జరగదన్నారు. కంపెనీల యజమానులకు లాభాలు చేకూర్చే విధంగా చట్టాలను మారుస్తుందని మండిపడ్డారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించకుండా, యూరియా యాప్ ప్రవేశపెట్టి, ఎరువుల ధరలు పెంచిందన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారుస్తుందని విమర్శించారు. సమావేశంలో నాయకులు తిరుపతిరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, దశరథం, బాలయ్య, యాదగిరి తదితరులు ఉన్నారు. ఇంటర్ ఫస్టియర్‌లో రేపు స్పాట్ అడ్మిషన్లుహుస్నాబాద్రూరల్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీ సీట్లకు ఈ నెల 6న స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు డీసీఓ శ్యామలత ఆదివారం ఓ ప్రకటనలో వెల్లడించారుఉ. బాలుర కళాశాల వర్గల్, కొండపాక, చిన్నకోడూరు, అల్వాల్, చేర్యాల, హుస్నాబాద్, బాలికల కళాశాలలు ములుగు, జగదేవ్‌పూర్,రామక్కపేట, సిద్దిపేటరూరల్, మిట్టపెల్లి, బెజ్జంకి,తొగుట,గజ్వేల్ కళాశాలలో ఖాళీ సీట్లను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికెట్స్‌తో పాటు నాలుగు పాసు పోర్టు సైజ్ ఫొటోలు, రెండు సెట్ల జిరాక్స్ కాపీలతో హాజరు కావాలన్నారు. బాలురకు మిరుదొడ్డి మండలం అల్వాల్ గురుకుల కళాశాలలో, బాలికలకు ములుగు బాలికల గురుకుల కళాశాలలో 6వ తేది ఉదయం 9 గంటల నుంచి మధ్యహ్నాం 1–00 గంటల వరకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేయండిమున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ సిద్దిపేటజోన్: అధికారులు, సిబ్బంది చిత్తశుద్ధితో పనిచేయాలని మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున్ పేర్కొన్నారు. పట్టణంలోని 43 వార్డుల్లో ఆయన సర్ ప్రక్రియ హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేసి వాటి పనితీరును ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హెల్ప్ డెస్క్‌లో పనిచేస్తున్న సిబ్బంది ప్రజల అనుమానాలను నివృతి చేయాలని సూచించారు. విధులకు గైర్హాజరు అయినా, అలసత్వం వహించినా ఉపేక్షించేది లేదని శాఖ పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు అండగా కాంగ్రెస్ ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి పటాన్చెరు టౌన్: రైతులకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఐఎన్టీయూసీ జిల్లా అధ్యక్షుడు నర్సింహారెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద 73 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఎకరాకు రూ.6 వేల చొప్పున రూ.9 వేల కోట్లను జమ చేసిందని ఆయన వెల్లడించారు. పటాన్చెరు అంబేడ్కర్ చౌరస్తా వద్ద ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చిత్రపటానికి రైతులతో కలిసి కాంగ్రెస్ శ్రేణులు ఆదివారం పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా సంగారెడ్డి నరసింహారెడ్డి మాట్లాడుతూ...కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు రైతులకు అండగా నిలుస్తోందన్నారు. పటాన్చెరు నియోజకవర్గంలోని 21 వేలమంది రైతుల ఖాతాల్లో రూ.14 కోట్ల రైతు భరోసా నిధులు జమయ్యాయని తెలిపారు. కార్యక్రమంలో పీసీసీ మాజీ కార్యదర్శి మతిన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు యువరాజ్ మోరే, సాయిలు ముదిరాజ్, అంజయ్యరాజు, రైతులు, రైతు కూలీలు, కార్మికులు పాల్గొన్నారు. -
అభివృద్ధికి సహకరించండి
డిప్యూటీ సీఎం భట్టిని కోరిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి దుబ్బాక: నియోజకవర్గం అభివృద్ధికి సహకారం అందిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హామీనిచ్చినట్లు ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి హైదరాబాద్‌లో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్కను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ‘సాక్షి’తో మాట్లాడారు. నియోజకవర్గం అభివృద్దికి సంబంధించిన పలు అంశాలను విక్రమార్క దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. నార్సింగ్ మండలానికి కొత్తగా తహసీల్దార్ కార్యాలయం భవనం మంజూరు చేయడంతోపాటు అక్బర్పేట–భూంపల్లి, రాయపోల్, నార్సింగ్ మండలాలకు ఎంపీడీఓ కార్యాలయ భవనాల నిర్మాణాలకు అవసరమైన పరిపాలన అనుమతులు, నిధులు మంజూరు చేయాలని కోరామని తెలిపారు. నియోజకవర్గంలోని ఆర్అండ్బీ, పీఆర్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన రోడ్లకు సంబంధించిన పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కోరామన్నారు. ఈ అంశాలపై మంత్రి విక్రమార్క సానుకూలంగా స్పందించినట్లు వివరించారు. -
నామమాత్రంగా అమలు
పకడ్బందీగా అమలు చేయాల్సిన ఈ పథకాన్ని ప్రభుత్వం నామమాత్రంగా అమలు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. జిల్లాలో 1.18లక్షల ఎకరాల సాగు అంచనాకు ఇప్పటికే 70 వేల పైచిలుకు ఎకరాల్లో పత్తి సాగులోకి వచ్చేసింది. జూలై 15లోగా పత్తి విత్తన గడువు కూడా ముగియనున్నది. ఈ దశలో మూడు రోజులుగా ఉచిత పత్తి విత్తనాల పంపిణీ ప్రక్రియ కొన్ని చోట్ల మాత్రమే ప్రారంభమైంది. జిల్లాకు కేవలం 7వేల ఎకరాలలోపు అవసరమయ్యే విత్తనాలు మాత్రమే వచ్చాయని అధికారులు చెబుతున్నారు. ఇవీ కూడా హడావిడిగా రైతు వేదికల వద్ద అందుబాటులో ఉన్న రైతులను పిలిచి పంపిణీ చేస్తూ...‘మమ’అనిపిస్తున్నారు. -
కష్టపడే వారికి చేయూత
● మాజీమంత్రి హరీశ్‌రావు ● రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాల్స్ పంపిణీసిద్దిపేటజోన్ /ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): కష్టపడి పనిచేసుకునే వారికి ఎల్లప్పుడూ తనవంతు సహకారం ఉంటుందని వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందిస్తానని మాజీమంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో హోటల్స్ నడుపుతూ ఉపాధి పొందుతున్న వారికి నెక్ (ఎన్ఈసీసీ)సహకారంతో రూ.72 లక్షల విలువైన 91 టీ స్టాళ్లను ఆదివారం ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.... మీ కష్టానికి తనవంతు తోడుగా ఈ స్టాళ్లను అందిస్తున్నానన్నారు. టీ స్టాల్‌తో పాటు గ్యాస్ సిలెండర్, స్టౌవ్, ఎల్ఈడీ లైట్స్, వాటర్ బాటిల్స్, హోటల్‌కు అవసరమైన సామగ్రి అందించారు. బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలు ప్రారంభించిన హరీశ్‌రావు పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో క్లీన్, గ్రీన్, సేఫ్ సిద్దిపేట పట్టణాన్ని నిర్మించుకున్నామని, మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. జిల్లా కేంద్రంలోని బృందావన్ కాలనీలో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సిద్దిపేట అంటే పచ్చదనం, పరిశుభ్రత, ప్రజారక్షణగా చేసుకున్నామన్నారు. సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, చెట్లు నాటడం లాంటి కార్యక్రమాలు చేశామని చెప్పారు. కాలనీలో హనుమాన్ దేవాలయ నిర్మాణానికి, కాలనీ అభివృద్ధికి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. ప్రజల భాగస్వామ్యంతో ఏదైనా సాధ్యమవుతుందనడానికి బృందావన్ కాలనీ ఆదర్శమన్నారు. కార్యక్రమంలో కాలనీ వాసులు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వ్రతశోభితం.. భక్తిపారవశ్యం
సుశిక్షితులైన అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, పాఠశాలల్లో మెరుగైన మౌలిక వసతుల కల్పనతో సర్కారు బడి మొత్తంగా నిలబడింది. కార్పొరేట్, ప్రైవేట్ స్కూళ్ల నిలువెత్తు దోపిడీలను తప్పించుకుంటూ చాలామంది ప్రభుత్వ బడివైపు అడుగులేస్తున్నారు. ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లోనే చేర్పిస్తూ మిగిలిన వారికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. సర్కారు బడుల బలోపేతంపై దృష్టి సారిస్తూ, ప్రభుత్వ విద్యకు పెద్ద పీట వేస్తున్న వారిపై ఈ వారం సండే స్పెషల్.భక్తులతో నాచగిరి క్షేత్రం వర్గల్(గజ్వేల్): సుప్రసిద్ధ నాచగిరి శ్రీలక్ష్మీనృసింహ క్షేత్రం శనివారం సత్యదేవుని వ్రతాలతో అలరారింది. తమ ఇష్టదైవాన్ని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. హల్దీనది వాగులో, ఆలయ పుష్కరిణిలో పుణ్యస్నానాలాచరించారు. దంపతులు శ్రీవారి సన్నిధిలో భక్తిశ్రద్ధలతో సత్యనారాయణస్వామి వ్రతమాచరించారు. భక్తులు గర్భగుడిలో విశేషాలంకృతులైన శ్రీలక్ష్మీనారసింహులను దర్శించుకుని తరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయసిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. -
లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్సిద్దిపేటకమాన్: చెక్ బౌన్స్ కేసులకు సంబంధించి ఈ నెల 18న జరగనున్న స్పెషల్ జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సుదర్శన్ తెలిపారు. సిద్దిపేట జిల్లా కోర్టు భవనంలో జిల్లా న్యాయవాదులతో ప్రధాన న్యాయమూర్తి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో మొత్తం 1,324 చెక్ బౌన్స్ (ఎన్ఐ యాక్టు) కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. స్పెషల్ లోక్ అదాలత్‌లో అధిక మొత్తంలో కేసులు రాజీపడేట్లు చూడాలని న్యాయవాదుల కు సూచించారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు కుమారస్వామి, తరణి, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేశ్‌బాబు, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. చేర్యాల కోర్టును సందర్శించిన జిల్లా జడ్జి చేర్యాల(సిద్దిపేట): చేర్యాల కోర్టును జిల్లా జడ్జి సుదర్శన్ శనివారం సందర్శించారు. ఈసందర్భంగా కోర్టు పరిసరాలను పరిశీలించి న్యాయవాదులతో కలసి మొక్కను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాత కేసులు త్వరగా పరిష్కరించాలని చేర్యాల కోర్టు జడ్జి బానోత్ శ్రీరామ్‌ను ఆదేశించారు. కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆరే వీరమల్లయ్య, ప్రధాన కార్యదర్శి మెరుగు రమేష్, ఆరే మహేందర్, జిల్లా న్యాయవాదులు, పోలీసు,కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.సన్నరకం వడ్లను యాప్‌లో నమోదు చేయాలిగజ్వేల్ ఏడీఏ బాబునాయక్ గజ్వేల్: ప్రభుత్వం సూచించిన విధంగా ఏడు సన్న రకాల వడ్లను సాగుచేసిన రైతుల వివరాలను టీ–అగ్రిసీడ్ యాప్‌లో నమోదు చేయాలని గజ్వేల్ ఏడీఏ బాబునాయక్ సూచించారు. శనివారం గజ్వేల్‌లోని రైతు వేదికలో స్థానిక వ్యవసాయాధికారి నాగరాజుతో కలిసి టీ–అగ్రిసీడ్ యాప్‌పై విత్తన డీలర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతువారీగా ఏడు రకాల సన్నరకం విత్తన అమ్మకం వివరాలను పకడ్బందీగా నమోదు చేయాలన్నారు. దీని ద్వారానే కొనుగోళ్ల సమయంలో అందుబాటులో కచ్చితమైన సమాచారం ఉంటుందని చెప్పారు. ఇంకా ఈ సదస్సులో కొండపాక, కుకునూర్‌పల్లి, రాయపోల్ వ్యవసాయాధికారులు శివరామకృష్ణ, గోవిందరాజులు, నరేష్, ఏఈఓలు సచిన్, రమ, గణేష్‌లతోపాటు విత్తన డీలర్లు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలితపస్ జిల్లా అధ్యక్షుడు మురళీధర్ తొగుట(దుబ్బాక): ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదని తెలంగాణ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు చిలుముల మురళీధర్ హెచ్చరించారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ... ఉపాధ్యాయులకు 51% పీఆర్సీని వెంటనే ప్రకటించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో ప్రకటించినట్లుగా సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో 190జీవోను అమలు పరచాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల హెల్త్‌కార్డుల విషయంలో పారదర్శకత పాటించాలని కోరారు. ప్రభుత్వం స్పందించి ఉపాధ్యాయ, ఉద్యోగుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మండల అధ్యక్ష కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, రాజేశం, నాయకులు భగవాన్, శ్రీనివాస్, మల్లేశం, కనకయ్య, నర్సింహరెడ్డి, లక్ష్మణ్ పాల్గొన్నారు. -
సిద్దిపేటకు రేవంత్ గ్రహణం
● ఎమ్మెల్యే హరీశ్‌రావు ● కాంగ్రెస్ పాలనలో ‘రియల్’ రివర్స్ప్రశాంత్నగర్(సిద్దిపేట): కాంగ్రెస్ పాలనలో తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో రియల్ ఎస్టేట్ వ్యాపారం రివర్స్ అయిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇది సిద్దిపేటకు మాత్రమే కాదని, రాష్ట్రం మొత్తం ఇదే పరిస్థితి ఉందన్నారు. దీంతో వ్యాపారులు రోడ్డున పడుతున్నారన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరూ ఆత్మవిశ్వాసం కోల్పోవద్దన్నారు. పట్టణాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశామని, కొన్ని ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయని తెలిపారు. సిద్దిపేటకు రేవంత్‌రెడ్డి అనే గ్రహణం పట్టిందని.. ఇంకో రెండేళ్లు ఆ గ్రహణం ఉంటుందన్నారు. ఆ తర్వాత మంచి రోజులు వస్తాయన్నారు. ఒకప్పుడు బంగారం కంటే సిద్దిపేటలో ప్లాట్ విలువ ఎక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం భూములు కొనుగోలు చేయాలన్న, విక్రయించాలన్న ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, మీ కళ్ల ముందే సినిమా రీల్లా అభివృద్ధి పరుగులు తీస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ అసోసియేషన్ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.పర్యావరణాన్ని కాపాడాలిప్లాస్టిక్ వినియోగాన్ని వీలైనంత వరకు తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు తెలిపారు. ప్లాస్టిక్‌కు బదులుగా పర్యావరణహిత ప్రత్యామ్నాయాలను ఉపయోగించే అలవాటు చేసుకోవాలని సూచించారు. శనివారం ఫ్రెండ్స్ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనంలో హరీశ్‌రావు పాల్గొని, అసోసియేషన్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సాధారణంగా మెకానిక్‌లలో చదువుకున్నవారు తక్కు వ, ఐక్యత కూడా తక్కువగా ఉంటుందని కానీ మన సిద్దిపేట మాత్రం మీ ఐక్యత రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. 20 ఏళ్ల ప్రయా ణం తర్వాత నూతన భవనం ఫంక్షన్ హల్లో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ప్రతీరోజు మూడు నుంచి నాలుగు కిలోమీటర్లు వేగంగా నడిస్తే, 60–70 ఏళ్ల వరకు డాక్టర్ అవసరం రాకుండా ఆరోగ్యంగా జీవించవచ్చని సూచించారు. అంతకుముందు అసోసియేషన్ సభ్యులు పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. -
కయ్య పడితే కష్టమే!!
దుబ్బాక: పట్టణంలోని మిషన్ భగీరథ సిబ్బంది పైప్‌లైన్ గేట్ వాల్ ఎయిర్ తీయడంతో నీటి ఒత్తిడికి ఏదుల్లచెరువు కట్ట కొట్టుకుపోయి పెద్ద కయ్యపడింది. సుమారుగా పదిగజాలకు పైగా కట్ట మట్టి కొట్టుకు పోయింది. దీంతో కట్టపై నుంచి ఉన్న దుబ్బాక–దుంపలపల్లి–సిద్దిపేట ప్రధాన రహదారి ప్రమాదకరంగా మారింది. చెరువుకట్ట చాలావరకు పెద్దకయ్య పడి రోడ్డు అంచువరకు రావడంతో ఏదైనా భారీ వాహనం వెళ్లినా, లేక వర్షానికి తడిసినా రోడ్డు దిగబడిపోయే ప్రమాదముంది. వాహనాలు ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదానికి గురయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. రైతుల పొలాల్లో మట్టి, కంకర కుప్పలు నీటి ఒత్తిడికి కట్ట కొట్టుకుపోయి రైతు గన్నె శ్రీనివాస్‌రెడ్డికి చెందిన పొలంలో పెద్ద ఎత్తున మట్టి, కంకర కుప్పలు పెట్టడటంతో రైతుకు నష్టం ఏర్పడింది. వెంటనే చర్యలు చేపట్టాలి.. ప్రమాదం జరగకముందే అధికారులు మరమ్మతు చేయాలని ప్రజలు కోరుతున్నారు. సంబంధిత అధికారులు ఇంతవరకు స్పందించకపోవడంపై స్థానికులు మండిపడుతున్నారు.చర్యలు తీసుకుంటాం మిషన్ భగీరథ పైప్‌లైన్ నిర్వహణలో భాగంగా ఎయిర్‌వాల్ విప్పడంతో ఘటన జరిగింది. కట్ట వద్ద ప్రమాదం జరగకుండా జాగ్రత్త చర్యలు తీసుకుంటాం. – విశ్వేశ్, మిషన్ భగీరథ ఏఈ -
కోర్టును తరలించవద్దు
హుస్నాబాద్‌లో వెలిసిన ఫ్లెక్సీలుహుస్నాబాద్: హుస్నాబాద్ కోర్టును జిల్లెల్లగడ్డ శివారుకు తరలించవద్దని పట్టణంలో ఫ్లెక్సీలు వెలిశాయి. మండలంలోని జిల్లెల్లగడ్డ శివారులో కొత్తగా కోర్టు భవనాల సముదాయ నిర్మాణం కోసం సర్వే నంబర్ 265లో 5.20 ఎకరాల భూమిని కేటాయిస్తూ ఇటీవల జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రెవెన్యూ అధికారులతో కలిసి జడ్జి రేవతి కేటాయించిన స్థలాన్ని శనివారం పరిశీలించారు. ఈ స్థలాన్ని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు భవన నిర్మాణానికి కేటాయించినట్లుగా బోర్డును ఏర్పాటు చేశారు. కోర్టును తరలిస్తే హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల పేద ప్రజలకు ఇబ్బందిగా ఉంటుందని, ప్రస్తుత హుస్నాబాద్ కోర్టు పరిధిలో 1.32 ఎకరాల భూమి ఖాళీగా ఉందని, దానిలోనే సబ్ కోర్టు నిర్మాణం చేయాలని కోరుతున్నట్లు ఫ్లెక్సీల్లో రాశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకుని స్థానికులు కోరుతున్నారు. -
వాన కురిసె.. మడి మురిసె
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): జిల్లాలో రెండు రోజులుగా వర్షం కురుస్తుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వానాకాలం సాగులో భాగంగా ఇప్పటివరకు వర్షం కోసం దిగాలుగా చూసిన రైతులు వర్షం రాకతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శుక్రవారం, శనివారాల్లో కురిసిన వర్షంతో రైతులకు ఊరట లభించినట్లైంది. ఈ వానాకాలం సాగు నుంచి రైతుతో దోబుచులాడుతున్న వర్షం రెండు రోజులుగా కురుస్తుండటంతో రైతులు తమ పనుల్లో నిమగ్నమైపోయారు. పత్తి, మొక్కజొన్న, కందులు, తదితర ఆరుతడి పంటలకు ఈ వర్షం ఉపయోగపడుతుంది. జిల్లాలో ఇప్పటివరకు 3,85,338 ఎకరాలకుగాను 2,130 ఎకరాల్లో వరి, 1,18,772 ఎకరాల పత్తికి గాను 70,402 ఎకరాల్లో, 28,027 ఎకరాలకు గాను 8,421 ఎకరాల్లో మొక్కజొన్న, 7,431 ఎకరాలకు గాను 1,312 ఎకరాల్లో కందులు, 14 ఎకరాల్లో పెసర్లకు గాను 36 ఎకరాల్లో, ఇతర ఉద్యానపంటలు సాగు చేస్తున్నారు. జిల్లాలో మొత్తంగా 5,41,550 ఎకరాల్లో సాగవుతుందని వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రతి ఏటా వర్షంతో పరేషాన్ ప్రతీ సంవత్సరం వానాకాల పంటలు ప్రారంభం కాగానే వర్షాలు ముఖం చాటేస్తున్నాయి. దీంతో రైతులు దిగాలు పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. విత్తనాలు విత్తాక వరుణుడు మాత్రం కరుణించడం లేదు. దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇప్పటివరకు జిల్లాలో 5,41,550 ఎకరాలకుగాను 82,356 ఎకరాలు మాత్రమే సాగైంది. శుక్ర, శనివారాల్లో జిల్లా వ్యాప్తంగా వర్షాలు ఈ వానాకాలంలో వర్షాల సాగుకు అనుగుణంగా వర్షాలు కురవడం లేదు. శుక్రవారం, శనివారాలు జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. శుక్రవారం జిల్లా సగటున 10.46మిల్లిమీటర్లు, శనివారం జిల్లా సగటున 32 మిల్లిమీటర్లు వర్షపాతం నమోదైంది. దీంతోపాటుగా మరో మూడు రోజుల పాటుగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని, అధికారులు తెలుపుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు కొండపాకలో అత్యధికంగా 54 మిల్లిమీటర్ల వర్షపాతం శనివారం జిల్లాలో కొండపాక మండలంలో 54 మిల్లిమీటర్లు, మద్దూరు మండలంలో 50, దుబ్బాక మండలంలో 49, సిద్దిపేట రూరల్ మండలంలో 48, మిరుదొడ్డి మండలంలో 47, అక్బర్పేట–భూంపల్లి మండలంలో 45 , దౌల్తాబాద్ మండలంలో 41, తొగుట మండలంలో 41, చేర్యాల మండలంలో 40, నారాయణరావుపేట మండలంలో 36, ధూళ్మిట్ట మండలంలో 35, కొమురవెల్లి మండలంలో 34, సిద్దిపేట అర్బన్ మండలంలో 34, కుకునూరు మండలంలో 32, చిన్నకోడూరు మండలంలో 30 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్సిద్దిపేటకమాన్: వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ధనరాజ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వర్షాకాలం నేపథ్యంలో జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా వైద్యారోగ్యశాఖ అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉందని తెలిపారు. ప్రజలు తమ ఇంటి పరిసరాల పరిశుభ్రతతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ప్రతీ మంగళవారం, శుక్రవారం డ్రై డే తప్పనిసరిగా పాటించాలన్నారు. జిల్లా టాస్క్‌ఫోర్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లను ఏర్పాటు చేసి ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జ్వర తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో అవసరమైతే వైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకోవా ల ని సూచించారు. ఇంటి పరిసరాల్లో, వినియోగంలో లేని టైర్లు, కొబ్బరి చిప్పలు, పూల కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. ప్రజలు కాచి చల్లార్చిన నీటిని తాగాలని, వేడి వేడి తాజా ఆహారం తీసుకోవాలని సూచించా రు. జ్వర లక్షణాలు, తలనొప్పి, కీళ్ల నొప్పులు, వాంతులు, విరేచనాలు, దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తే దగ్గర్లో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకుని, చికిత్స తీసుకోవాలని స్పష్టం చేశారు. జిల్లాలో పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాల్లో పరిశుభ్రతపై ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థులకు సీజనల్ వ్యాధుల నివారణపై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. -
కొను‘గోల్మాల్’పై విచారణ చేపట్టిన అధికారులు
మిరుదొడ్డి(దుబ్బాక): మండల పరిధిలోని అల్వాల ధాన్యం కొనుగోలు కేంద్రంలో జరిగిన ధాన్యం గోల్‌మాల్‌పై జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం డీపీఎం విద్యాసాగర్ అల్వాల గ్రామ పంచాయతీ వద్ద విచారణ చేపట్టారు. విచారణలో భాగంగా ఐకేపీ క్షేత్రస్థాయి సిబ్బంది నకిలీ ట్రాక్ షీట్లు సృష్టించి 109 క్వింటాళ్ల ధాన్యం సొమ్మును కాజేయడానికి ప్రయత్నించారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు కూడా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించారని రైతులు మండిపడ్డారు. కాగా ఈ విషయంపై రైతులు, గ్రామస్తులు కలిసి జిల్లా పీడీ జగదేవ్ ఆర్యకు ఫోన్ ద్వారా నేరుగా ఫిర్యాదు చేశారు. జరిగిన విషయంపై పీడీ స్పందించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కాగా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ డీపీఎం విద్యాసాగర్‌కు రైతులు వినతి పత్రాన్ని అందించారు. -
ఈ వర్షాలు లబ్ధి చేకుర్చుతాయి
శుక్రవారం, శనివారం కురిసిన వర్షాలు రైతులకు లబ్ధి చేకుర్చుతాయి. ఈ వానాకాలం నుంచి వర్షాలు సక్రమంగా కురవడం లేదు. ఈ రెండు రోజులు కురిసిన వర్షాలతో సాగుకు సిద్ధమవుతున్నాం. ఇప్పటికే వానాకాలం ప్రారంభమై నెల రోజులైంది. తిరుపతిరెడ్డి, మెట్పల్లి, చిన్నకోడూరు మండలం భయాందోళనలు నెలకొన్నాయి ఈ వానాకాలం నుంచి సక్రమంగా వర్షాలు కురవ లేదు. దీంతో దుక్కిలు దున్ని విత్తనాలు విత్తడం కోసం ఎదురు చూశాం. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలు సాగుకు అనుకూలంగా మారాయి. వరుణుడు సరైన సమయంలో అన్నదాతలకు అండగా నిలిచాడు. దీంతో ఇప్పుడు మేమందరం తిరిగి వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యాం. దండ్యాల వెంకట్‌రెడ్డి, ఐనాపూర్, కొమురవెల్లి మండలం -
సమన్వయంతో పనిచేయాలి
జిల్లా యంత్రాంగానికి సీఎస్ జాజు సూచన సిద్దిపేటజోన్: ప్రభుత్వ నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. హైదరాబాద్ నుంచి జిల్లా కలెక్టర్, జిల్లా అధికారులతో శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పలు సూచనలు చేశారు. ప్రధానంగా వ్యవసాయ, తాగునీరు, సాగునీరు, ప్రజారోగ్యం, విద్య, ఉద్యానవన, ఆయిల్‌పామ్ విస్తరణ, రైతు రిజిస్ట్రీ, మధ్యాహ్న భోజనం, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సమీక్షించారు. వ్యవసాయ సీజన్ విజయవంతం చేసేందుకు సమిష్టిగా అన్ని శాఖల అధికారులు పనిచేయాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా నకిలీ విత్తనాలు, ఎరువుల అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతు రిజిస్ట్రీ ప్రక్రియ వేగవంతం చేయాలని సూచించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హైమావతి మాట్లాడుతూ...జిల్లాలో ప్రభుత్వ పథకాలు సమర్థవంతంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. వానాకాలం సీజన్ సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందుబాటులో ఉండేలా చూస్తామని, కొరత లేకుండా సకాలంలో చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. జిల్లాలో తాగునీరు సరఫరా అంశంపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందని,వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా కాన్ఫరెన్స్‌లో జిల్లా అధికారులు స్వరూప రాణి, సువర్ణ, ధనరాజ్, వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, శాస్త్రి, తదితరులు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోల్‌మాల్
● అల్వాలలో 109 క్వింటాళ్ల ధాన్యం మాయం ● గ్రామ పంచాయతీ వద్ద రైతుల ఆందోళన ● ఐకేపీ సీఏల చేతివాటం అంటూ ఆరోపణ మిరుదొడ్డి(దుబ్బాక): అధికారుల కనుసన్నల్లో ఐకేపీ సీఏలు ధాన్యం కొనుగోళ్లలో రైతులను మోసం చేసి 109 క్వింటాళ్ల ధాన్యాన్ని మాయం చేశారని ఆరోపిస్తూ శుక్రవారం మండల పరిధిలోని అల్వాల రైతులు ఆందోళనకు దిగారు. ఇటీవల గ్రామంలోని గోదాం వద్ద వడ్ల కొనుగోలు కేంద్రంలో పొల్లు పేరిట, వర్షానికి తడిసి మొలకెత్తడంతో పాటు రంగు మారిందన్న సాకుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసి అధిక తూకం వేశారని రైతులు ఆరోపించారు. అలా అధిక తూకం వేసి సేకరించిన 254 ధాన్యం సంచులకు గానూ 109 క్వింటాళ్ల 20 కిలోల ధాన్యాన్ని ఇదే గ్రామానికి చెందిన ముగ్గురు కౌలు రైతుల పేరును నమోదు చేయించారని మండిపడ్డారు. అనంతరం చెప్యాల క్రాస్ రోడ్డులోని చందన రైస్ మిల్లుల్లో ధాన్యాన్ని వేయింగ్ బిల్లు వేయించారని మండిపడ్డారు. రూ.2.58 లక్షల విలువైన ధాన్యానికి సంబంధం లేని కౌలు రైతుల పేరిట బిల్లులు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అమాకులైన రైతులను ఆసరాగా చేసుకుని అధిక తూకం వేసిన వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల సమక్షంలో రైతులు తీర్మానించారు. అధికారుల నిర్లక్ష్యం, ఐకేపీ సీఏల చేతి వాటం వల్ల అల్వాల కోనుగోలు కేంద్రంలో జరిగిన గోల్‌మాల్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. కాగా ఐకేపీ సీఏలపై వచ్చిన ఆరోపణలపై ఏపీఎం లక్ష్మీనర్సమ్మను వివరణ కోరగా రైతుల ఆరోపణలపై పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామ తెలిపారు. -
ప్రజా సమస్యలు చెప్పేందుకు వేదిక ఏదీ?
జిల్లా పరిషత్, మండల పరిషత్, సిద్దిపేట మున్సిపాలిటీలలో పాలక వర్గాలు లేకపోవడంతో సమావేశాలు జరగడం లేదని, దీంతో ప్రజా సమస్యలు చెప్పేందుకు వేదిక లేదని మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. జిల్లా అభివృద్ధిపై రివ్యూ సమావేశం ప్రతి మూడు నెలలకు ఒక సారి నిర్వహించాలని కోరారు. గత సమావేశంలో చర్చించిన మినెట్స్ ఇవ్వడం లేదని, ఏజెండాను సమావేశానికి రెండు రోజుల ముందు ఇవ్వకుండా సమావేశంలో ఇస్తే ఎలా చర్చిస్తామని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చాక్ పీస్‌లకు డబ్బులు లేవని, సంక్షేమ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు నోట్ బుక్‌లను ఇప్పటి వరకు ఇవ్వలేదన్నారు. ఆయిల్‌పామ్ సాగు చేసేందుకు డ్రిప్ లేకపోవడంతో ముందుకు రావడం లేదని ఆరోపించారు. వ్యవసాయానికి ప్రభుత్వం 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని చెప్పుతున్నారని, క్షేత్ర స్థాయిలో 11 గంటలు కూడా రావడం లేదని ఆరోపించారు. యూరియా సరఫరాలో రైతులకు ఇబ్బంది రాకుండా చూడాలని కోరారు.


