బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక అభివృద్ధి
ఎంపీ రఘునందన్‌రావు
దుబ్బాక: బీజేపీని గెలిపిస్తేనే దుబ్బాక మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందని ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు అన్నారు. శుక్రవారం సాయంత్రం దుబ్బాకలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలోనే దుబ్బాక వెనుకబడిన నియోజకవర్గమని, అన్నిరంగాల్లో అభివృద్ధి పర్చాల్సిన అవసరం ఉందన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి అవకాశం కల్పించాలన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధికి కేంద్రప్రభుత్వం నుంచే నిధులు వస్తాయన్నారు. ప్రజలు ఆలోచించి మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలన్నారు. ఈ ప్రాంత బిడ్డగా దుబ్బాక మున్సిపాలిటీ అభివృద్ధికి శాయశక్తుల కృషిచేస్తానన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శంకర్ ముదిరాజు, బీజేపీ రాష్ట్రనాయకులు తదితరులు ఉన్నారు.
అభివృద్ధికి బాటలువేయండి
గజ్వేల్: మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నిర్వహించిన బీజేపీ అభ్యర్థుల నామినేషన్ ర్యాలీలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో ఆశీర్వదించి అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు బైరి శంకర్, మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పార్టీ పట్టణశాఖ అధ్యక్షుడు మనోహర్‌యాదవ్, పార్టీ మండల అధ్యక్షుడు అశోక్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


