పొద్దుతిరుగుడు.. ఆశలు బోలెడు
ఆలోచన అదిరే..
తొగుట మండలపరిధిలోని పలు గ్రామాల్లో రైతులు పొద్దుతిరుగుడు పంటను సాగు చేశారు. పంట ఆశాజనకంగా ఉండటంతో దిగుబడులపై రైతులు బోలెడు ఆశలు పెట్టుకున్నారు. రోడ్డు పక్కనే పొద్దుతిరుగుడు పంటలు కనుచూపుమేర పసుపు పచ్చనిపూలతో చూడముచ్చటగా దర్శనమిస్తున్నాయి. అటుగా వెళ్లే వారంతా కొద్దిసేపు ఆగి
అందాలను ఆస్వాదిస్తూ సెల్ఫీలు తీసుకుంటున్నారు.
– సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట
రైతన్న ఆలోచన అదిరింది. తన వరి పంటను జంతువులు, పక్షుల నుంచి రక్షించడానికి పొలం చుట్టూ కంచె(వల)ను ఏర్పాటు చేశారు. అక్కన్నపేట మండలం మైసమ్మవాగుతండాకు చెందిన భూక్యా ధర్మనాయక్ కోళ్లు, పక్షులు తినకుండా ఉండేందుకు వరి పంట చుట్టూ ఇలా వలను ఏర్పాటు చేశారు. తండా సమీపంలోనే పొలం ఉండటంతో కోళ్లు వెళ్లి పంటను తినేస్తున్నాయి. దీంతో వాటి నుంచి రక్షణగా ఇలా వలను ఏర్పాటు చేశానని రైతు తెలిపారు. – అక్కన్నపేట(హుస్నాబాద్)
పొద్దుతిరుగుడు.. ఆశలు బోలెడు
పొద్దుతిరుగుడు.. ఆశలు బోలెడు


