చిత్ర పరిశ్రమలో హీరో కొడుకు హీరో అవడం అనేది పెద్ద విషయం కాదు.. దర్శకుడి కుమారుడు మెగాఫోన్ పట్టుకునే ఛాన్స్ ఉంది. అదే ఒక స్టార్ హీరో కూతురు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చి సత్తా చాటితే ఎవరైనా సరే శభాష్ అనాల్సిందే. చిరంజీవి తనయ సుష్మిత కొణిదెల నిర్మాతగా కోట్ల రూపాయల వ్యవహారాల్నీ చాకచక్యంగా పూర్తి చేయగలనని 'మన శంకర వరప్రసాద్ గారు' మూవీతో విజయం సాధించారు. చిరు జోక్యం లేకుండానే ఈ మూవీ డిస్ట్రీబ్యూషన్ నుంచి అన్ని వ్యవహారాలను ఆమె దగ్గరుండి చూసుకున్నారు.
సుస్మిత తన చదువు పూర్తయ్యాక 'నిఫ్ట్'లో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సు చేశారు. అనంతరం సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలం, ఖైదీ నెంబర్ 150, సైరా, ఆచార్, వాల్తేరు వీరయ్య సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా పని చేశారు. తర్వాత 'గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' (Gold Box Entertainment) పతాకంపై ‘శ్రీదేవి శోభన్‌బాబు’ పేరుతో నిర్మాతగా కొత్త జర్నీ ప్రారంభించారు. ఆ తర్వాత తన తండ్రితో మన శంకర వరప్రసాద్ గారు మూవీ తెరకెక్కించి భారీ హిట్ అందుకున్నారు.
ఇదే స్పీడ్‌తో ఆమె మరో కొత్త ఛాప్టర్‌ను ప్రారంభించారు. తాజాగా ఇదే విషయాన్ని ప్రకటించారు. మన శంకర వరప్రసాద్ గారు మూవీ హిట్ తర్వాత 'గోల్డ్‌బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్' సంస్థ కొత్త కార్యాలయంలోకి అడుగుపెట్టిందని తెలిపారు. ఇప్పటి వరకు చిన్న గదికి పరిమితమైన ఆ సంస్థ ఇప్పుడు మరో ముందు అడుగు వేసింది. తమ బ్యానర్ నుంచి భారీ బడ్జెట్‌తో పాటు పెద్ద సినిమాలు వస్తాయని సుస్మిత అన్నారు. ఈ క్రమంలోనే తన టీమ్‌తో కేక్ కట్ చేసి ఒక వీడియోను షేర్ చేశారు.


