హైదరాబాద్‌లో భారీ వర్షం.. జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన | Heavy Rain Fall Across Telangana And Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో భారీ వర్షం.. జిల్లాల్లో ఉరుములు, మెరుపుల వాన

Mar 18 2026 7:07 AM | Updated on Mar 18 2026 10:56 AM

Heavy Rain Fall Across Telangana And Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక, హైదరాబాద్‌లో మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. సిటీలోని పలుచోట్ల వర్షం కురవడంతో లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచిపోయింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.

హైద‌రాబాద్ న‌గ‌రంలో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దాటిన త‌ర్వాత బుధ‌వారం తెల్ల‌వారుజామున ఒంటి గంట నుంచి 2 గంట‌ల స‌మ‌యంలో వాన దంచికొట్టింది. న‌గ‌ర వ్యాప్తంగా మోస్త‌రు వ‌ర్షం కురిసింది. దీంతో ఉక్క‌పోత నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భించిన‌ట్లు అయింది. ఉరుములు, మెరుపులు మెరిశాయి. చ‌ల్ల‌ని గాలులు వీచ‌డంతో పూర్తిగా వాతావ‌ర‌ణం మారిపోయింది.

అమీర్‌పేట, ఎస్‌ఆర్‌నగర్‌, బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, చింతల్‌, షాపూర్‌, జీడిమెట్ల, మ‌హేశ్వ‌రం, షాద్‌న‌గ‌ర్, శంషాబాద్, రాజేంద్ర‌న‌గ‌ర్, బండ్ల‌గూడ జాగీర్, బ‌హ‌దూర్‌పురా, కార్వాన్, కాటేదాన్, బార్క‌స్, చాంద్ర‌య‌ణ‌గుట్ట‌, చార్మినార్, ఎల్‌బీ న‌గ‌ర్, స‌రూర్ న‌గ‌ర్, వ‌న‌స్థ‌లిపురం, దిల్‌సుఖ్‌న‌గ‌ర్, సంతోష్‌న‌గ‌ర్, చాద‌ర్‌ఘాట్, కోఠి, న‌ల్ల‌కుంట‌, రాంన‌గ‌ర్, తార్నాక‌, హ‌బ్సిగూడ‌, సికింద్రాబాద్, ఖైర‌తాబాద్, బేగంపేట్, పంజాగుట్ట‌, సోమాజిగూడ‌, మెహిదీప‌ట్నంతో పాటు ప‌లు ప్రాంతాల్లో వర్షం కురిసింది.

రంగారెడ్డి, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, వికారాబాద్, వ‌న‌ప‌ర్తి, గ‌ద్వాల‌, నాగ‌ర్‌క‌ర్నూల్ జిల్లాల్లోనూ వ‌ర్షం కురిసింది. అకాల వ‌ర్షానికి రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మామిడి పంట‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లింది. ఈదురుగాలుల నేప‌థ్యంలో మామిడి కాయ‌లు నేల‌రాల‌యి. వ‌రి ధాన్యం కూడా అక్క‌డ‌క్క‌డ త‌డిసిపోవ‌డంతో రైతులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఈ నెల 22వ తేదీ వ‌ర‌కు వ‌ర్షాలు కొన‌సాగే అవ‌కాశం ఉంది.

 

 

పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ఎడతెరిపిలేని వర్షం కురుస్తోంది. బెల్లంపల్లి, చెన్నూరులో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం కురుస్తోంది. కరీంనగర్ జిల్లాలోని సైదాపూర్, హుజురాబాద్, శంకరపట్నం మండలల్లో ఉరుములు మెరుపులతో మోస్తరు వర్షం పడుతోంది. పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్‌ మండలంలో ఉరుములు మెరుపులతో వర్షం కురుస్తోంది. కోల్‌బెల్ట్‌ ఏరియా రామగుండంలో వడగళ్ల వాన కురుస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement