యువ జంట ఘనత.. జస్ట్‌ 10 గంటల్లో.. | Bengaluru Couple Creates History, Swims From Sri Lanka To India In 10 Hours, Read Story For More Details | Sakshi
Sakshi News home page

యువ జంట ఘనత..జస్ట్‌​ 10 గంటల్లో..

May 7 2026 4:59 PM | Updated on May 8 2026 9:48 AM

Bengaluru Couple Creates History Swims From Sri Lanka To India In 10 Hours

బెంగళూరు యువ జంట అరుదైన ఘనత సృష్టించారు. కేవలం పది గంటల్లో శ్రీలకం నుంచి భారత్‌కు ఈది రికార్డు సృష్టించారు. మొత్తం పదిగంటల 45 నిమిషాల పాటు నీటిలో ఈదుతూ ఈ అరుదైన ఘనతను నమోదు చేశారు. ఇలా బహిరంగంగా జల ఈతను పూర్తి చేసితన తొలి జంట వారే. 

బెంగుళూరుకు చెందిన డానిష్‌ అబ్ది, వృషాలి ప్రసాదే దంపతులు హిందూ మహాసముద్రంలో రామ్‌ సేతు మార్గం గుండా దాదాపు 32 కిలోమీటర్లు ఈదారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా వెల్లడించారు. ఈతను పూర్తి చేసిన వెంటనే ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన వీడయోని షేర్‌ చేస్తూ "మేము సాధించాం". పోస్టు పెట్టారు. 

మరిన్ని విషయాలు 12 గంటల పాటు హాయిగా నిద్రపోయిన తదనంతరం చెబుతానని అన్నారు. ఈ పోస్ట్‌ నెట్టింట వైరల్‌ అవ్వడమేకాదు..గర్వించదగ్గ క్షణం, ఇరువురికి అభినందనలు అని ప్రశింసిస్తూ పోస్టులు పెట్టారు. 
 

 (చదవండి: ఆ రేంజ్‌లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement