ఆ రేంజ్‌లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..! | Mother of ICSE student who scored 499/500 expresses regret Goes Viral | Sakshi
Sakshi News home page

ఆ రేంజ్‌లో మంచి మార్కులు సాధించినా..ఆ తల్లి..!

May 7 2026 3:28 PM | Updated on May 7 2026 3:57 PM

Mother of ICSE student who scored 499/500 expresses regret Goes Viral

నిజంగా స్టేట్‌ ర్యాంక్‌ వస్తేనే సంబరాలు చేసుకుంటాం. అలాంటిది జాతీయ స్థాయిలో మంచి మార్కులు సాధిస్తే ఎగిరిగంతేస్తాం. తల్లిదండ్రలు ఇంట్లో ఓ పండుగలా వేడుక జరిపిస్తారు అలాంటిది ఈ తల్లి మాత్రం ఆ ఒక్క మార్కు అంటూ బాధుపడుతున్న తీరు నెటిజన్లకు ఆగ్రహం తెప్పించింది. పైగా మరీ ఇంతలా పేరెంట్స్‌ ఉండకూడదు అంటూ తిట్టిపోశారు. 

ఇంతకీ ఏం జరిగిందంటే..పశ్చిమ బెంగాల్‌కి చెందిన దిబ్యేందు ప్రమణిక్‌ పదోతరగతి బోర్డు ఎగ్జామ్స్‌లో ఐసీఎస్‌ఈ సిలబస్‌లో ఆల్‌ ఇండియా సెకండ్‌ ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచాడు. ఇంత పెద్ద ఘనత సాధించినందుకు ఏ తల్లిదండ్రలకైన పట్టరాని సంతోషం కలుగుతుంది. కానీ అతడి తల్లి ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకోవచ్చు కదా అంటూ విచారం వ్యక్తం చేసింది. అతడికి 500కి ఒక్క మార్కు తేడాతో 499 మార్కులు సాధించాడు. 

కానీ ఆ తల్లి బాగానే తెచ్చుకున్నాడు గానీ, ఇంకా కొంచెం కష్టపడితే ఆ ఒక్క మార్కు కూడా మిస్‌ అయ్యేది కాదు కదా అంటూ ఉసురుమనిపించేలా మాట్లాడింది. ఒక దిబ్యేందు కూడా తన తల్లిలా మాట్లాడాడు. ఆ ఒక్క మార్కు కోల్పోయినందుకు బాధగా ఉంది, కానీ పర్వాలేదు తన వరకు చాలా బాగా రాశానంటూ సంతృప్తి వ్యక్తం చేశాడు. తాను ఇంజనీర్‌ కావాలనుకుంటున్నానని, ఐఐటీ వంటి అగ్రశ్రేణి ప్రవేశ పరీక్షలకు సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు. 

ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవ్వడంతో నెటిజన్లు వామ్మో ఇలాంటి తల్లిదండ్రులు నాకు లేనందుకు సంతోషం అని మండిపడుతూ పోస్టులు పెట్టారు. కొందరు ఆమె మాటలను చూస్తుంటే ఆ అబ్బాయిపై ఎంత ఒత్తిడి పెంచారో ఊహించగలను అని కామెంట్‌ చేస్తూ పోస్టులు పెట్టారు.  

 

(చదవండి: ఎవరీ ర్యాన్‌ కోహెన్‌..? కాలేజీ డ్రాపౌట్‌ ఏకంగా రూ. 5 లక్షల కోట్లు..)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement