ఉపవాసంతో కేన్సర్‌ నయం అవుతుందా? | Health Tips: Fasting and Cancer: What Does the Research Say | Sakshi
Sakshi News home page

ఉపవాసంతో కేన్సర్‌ నయం అవుతుందా? రేడియాలజిస్ట్‌ షాకింగ్‌ విషయాలు

May 7 2026 12:37 PM | Updated on May 7 2026 12:43 PM

Health Tips: Fasting and Cancer: What Does the Research Say

ఫ్రెంచ్‌ రేడియాలజిస్ట్‌ పాస్కల్ ట్రోటా చాలా విస్తుపోయే విషయాన్ని వెల్లడించారు. ఆయన తనకు కేన్సర్‌ నిర్థారణ అయ్యి..ఆస్పత్రిలో చేరాక అక్కడ కీమోథెరపీ చేయించుకున్న చాలా మంది చనిపోవడం చూసి తీవ్ర ఆందోళన చెందినిట్లు తెలిపారు. కానీ చాలామందికి తెలియని నిజం ఏంటంటే..50% కేన్సర్‌ రోగులు తీవ్రమైన చికిత్సల వల్లే చనిపోతారని అన్నారు. అందువల్ల తాను కేన్సర్‌ అని నిర్ధారణ అయిన వెంటనే వృత్తికి పూర్తిగా దూరంగా ఉంటూ..ఉపవాసం ఉండటం ప్రారంభించానని చెప్పారు. 

అలా ఏకంగా 30 రోజుల పాటు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉపవాసం చేస్తూ..కేన్సర్‌ని నయం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా ఇలా కేన్సర్‌ బారినపడి ఇబ్బందిపడుతుంటే వారికి ఈ విషయం చెప్పండి అంటూ అవగాహన కల్పించే యత్నం చేస్తున్నారు. అంతేగాదు ఉపవాసం ప్రయోజనాలను గుర్తించే పలు దేశాలు ఫాస్టింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి కూడా. ఈ నేపథ్యంలో ఏఏ దేశాల్లో ఉపవాస కేంద్రాలు ఉన్నాయి, నిజంగా ఉపవాసం కేన్సర్‌ని కట్టడి చేయగలదా? తదితరాల గురించి సవివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

ఉపవాసం (Fasting) కేన్సర్ చికిత్సలో సహాయపడుతుందని, కణాల పునరుద్ధరణకు (Cellular repair) దోహదపడుతుందని పలు పరిశోధనలు సూచించాయి. కానీ ఉపవాసం మాత్రమే కేన్సర్‌ని పూర్తిగా తగ్గిస్తుందని తేల్చి చెప్పడానికి మరిన్ని పరిశోధనులు జరగాల్సి ఉంది. అయితే, కేన్సర్ రోగులకు ఉపవాసం వల్ల కొన్ని లాభాలు మాత్రం కచ్చితంగా ఉన్నాయని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

ఇక్కడ ఉపవాసం కీమోథెరపీ మందుల ప్రభావాన్ని పెంచి, ఆరోగ్యకరమైన కణాలను రక్షిస్తూ కేన్సర్ కణాలను బలహీనపరుస్తుందని కొన్ని అధ్యయనాల్లో తేలింది. అంతేగాదు ఉపవాసం వల్ల శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు తగ్గి, కేన్సర్ కణాలకు కావాల్సిన పోషకాలు అందక అవి పెరగడం తగ్గుతుందని పరిశోధనల్లో తేలింది.

ఇక్కడ ఉపవాసం రోగనిరోధక వ్యవస్థను (Immune system) పునరుద్ధరించి, కేన్సర్ కణాలతో పోరాడే సామర్థ్యాన్ని పెంచుతుంది. అలాగే శరీరం పాడైపోయిన కణాలను శుభ్రం చేసి, కొత్త కణాలను పునరుత్పత్తి చేస్తుందని పలువురు నిపుణులు నొక్కి చెబుతున్నారు. ఆ నేపథ్యంలోనే ఈ ఉపవాసానికి అత్యంత ప్రజాదరణ పెరిగి, పలు దేశాల్లో ఉపవాస కేంద్రాలు పుట్టుకొచ్చాయి ఇలా.  

ఏ దేశాల్లో ఉన్నాయంటే..
ఫ్రాన్స్, స్విట్జర్లాండ్‌, అమెరికా, మెక్సికో, కోస్టారికా, స్పెయిన్, పోర్చుగల్, థాయ్‌లాండ్, బాలి తదితర దేశాల్లో ఉపవాస రీట్రీట్స్‌ నిర్వహిస్తున్నారు. వీటిని ఆరోగ్యపరమైన డిటాక్స్, బరువు తగ్గింపు, మానసిక ప్రశాంతత, ఆధ్యాత్మిక సాధన కోసం ఏర్పాటు చేశారు.

నార్త్ కరోలినా – ఐదు రోజుల జ్యూస్‌ క్లెన్స్‌, యోగా రీట్రెట్‌ ఉపవాసం 
ఈ విధానంలో యోగా, ధ్యానం తోపాటు ప్రత్యేకమైన జ్యూస్‌లు తీసుకుంటూ చేసే ఉపవాసం చేస్తారు. అలాగే కొద్ది మోతాదులోమొక్కల ఆధారిత ఆహారాన్ని ఇస్తారు.

ఫ్లోరిడా – ఇది కూడా జ్యూస్‌ ఫాస్టింగ్‌ రీట్రీట్‌ కానీ 14 రాత్రలు చేస్తారు.

మెక్సికో: ప్లయా డెల్ కార్మెన్ (Playa del Carmen) లో కాంబో డీప్ డెటాక్స్ థెరపీ 
ఇది అమెజాన్ అడవులకు చెందిన ఒక సాంప్రదాయ చికిత్స. 24 గంటలు ఉపవాసం ఉండి..అమెజాన్ జంగిల్ మెడిసిన్‌ని శరీరంపై అప్లై చేస్తారు. ఇది శరీరంలోని విష పదార్థాలను బయటకు పంపించి నిర్వీకర్షణ చేస్తుంది. 

కోస్టారికా:  5-రోజుల తీవ్రమైన శారీరక, భావోద్వేగ నిర్విషీకరణ (Detoxification) ప్రక్రియ. ఈ కార్యక్రమం జ్యూస్ ఫాస్టింగ్, కోలోన్ క్లెన్సింగ్, లివర్ ఫ్లష్‌లను సమ్మేళనం చేసి, శరీరాన్ని లోతుగా శుద్ధి చేస్తుంది

స్పెయిన్: ఆల్కెమీ ఆఫ్ బ్రెత్ సంస్థ నిర్వహించే 'టస్కనీలో 7 రోజుల ఆశా బ్రెత్‌క్యాంప్. ఇక్కడ సుమారు 40 ఎకరాల ప్రకృతి అభయారణ్యంలో ప్రతిరోజూ శ్వాస వ్యాయామాలు, ధ్వని వైద్యం, శాకాహార భోజనాలు ఉంటాయి.

పోర్చుగల్: పోర్చుగల్‌లోని ఆల్గార్వే (Algarve)లో 5-రాత్రుల ఫాస్టింగ్ మిమికింగ్ మెటబాలిక్ రీసెట్ రిట్రీట్ (Fasting Mimicking Metabolic Reset Retreat). ఇది శరీరాన్ని డిటాక్స్ చేయడానికి, బరువు తగ్గడానికి,  జీవక్రియను (metabolism) మెరుగుపరచడానికి రూపొందించిన ఒక సైన్స్-ఆధారిత వెల్నెస్ ప్రోగ్రామ్.

థాయ్‌లాండ్:  5 రోజుల అనయాత లగ్జరీ జ్యూస్ డిటాక్స్ రిట్రీట్. ఈ విధానంలో ప్రత్యేకమైన జ్యూస్‌లతో శరీరాన్ని శుద్ధి చేస్తారు. యోగా, ధ్యానం వంటి వెల్నెస్‌ ప్రోగ్రాములు కూడా ఉంటాయి. 

ఈ శిబిరాల్లో పాల్గొనేవారికి భావోద్వేగ, శారీరక మరియు మానసిక అలసట నుంచి విముక్తి పొందేలా పోషకమైన భోజనాన్ని తీసుకునే నిపుణులు మార్గదర్శకం అందిస్తారు.

ఇండోనేషియా (బాలి): ఏడు రోజుల శారీరక, భావోద్వేగ హీలింగ్. ఈ విధానంలో సోమాటిక్ థెరపీ, యోగా వంటివి ఉంటాయి

నేపాల్: శ్రీ యోగా డిటాక్స్ రిట్రీట్(కాఠ్మాండు). ప్రకృతి మధ్యలో నివాసం, యోగా, డిటాక్స్ వంటివి ఉంటాయి. 

కంబోడియా    CPC వెల్‌నెస్ డిటాక్స్‌ రీట్రీట్‌. హోలిస్టిక్ డిటాక్స్, రీబ్యాలెన్సింగ్ ప్రోగ్రామ్.

ఫిలిప్పీన్స్ : 'ది ఫార్మ్ ఎట్ శాన్ బెనిటో'. ఇందులో    మెడికల్ + హోలిస్టిక్ థెరపీ, జ్యూస్ డిటాక్స్ వంటివి ఉంటాయి. అయితే వ్యక్తిగత ప్రోగ్రామ్ ఆధారంగా, ఆయా వ్యక్తుల ఆరోగ్య సమస్యల అనుగుణంగా థెరపీలు ఇస్తారు.

భారత్‌లో ఉపవాస కేంద్రాలు..
భారత్‌: సెహత్వాన్ (Sehatvan) ఫారెస్ట్ థెరపీ రిట్రీట్.  'సెహత్వాన్' అంటే అక్షరాలా "హీలింగ్ ఫారెస్ట్" (ఆరోగ్యాన్నిచ్చే అడవి) అని అర్థం. ప్రకృతి ఒడిలో మానసిక, శారీరక ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక అద్భుతమైన ప్రదేశం

భారత్‌లో ఉపవాస (Fasting) రిట్రీట్స్ ప్రధానంగా ఋషికేశ్, కేరళ, మధ్యప్రదేశ్, జోధ్‌పూర్, ధర్మశాల వంటి ప్రాంతాల్లో ఉన్నాయి. ఇవి యోగా, ఆయుర్వేదం, ధ్యానం, డిటాక్స్ ప్రోగ్రామ్‌లతో కలిపి శరీరానికి, మనసుకు శాంతి కలిగించేలా రూపొందించారు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ఏ ఉపవాస రీట్రీట్స్‌ ఎంచుకున్న వైద్య పర్యవేక్షణ అవసరం. అలాగే నిపుణుల సమక్షంలో అందించే ఉపవాస కేంద్రాలనే ఎంచుకోవాలి. అలాగే డయాబెటిస్‌, హృదయ సంబంధ దీర్ఘకాలిక సమస్యలున్నవారు ఉపవాసం ప్రారంభించే ముందు వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి.

(చదవండి: కాలేయ సమస్య? విశ్రాంతి మాత్రమే మార్గమా?)

 

Advertisement
 
Advertisement
Advertisement