తమిళనాడు రాజకీయానికి సంబంధించిన అప్‌డేట్స్..
తమిళనాడు గవర్నర్‌ను కలిసిన సీఎస్, డీజీపీ
- విజయ్‌కు కాన్వాయ్ ఎలా ఇచ్చారని డీజీపీని ప్రశ్నించిన గవర్నర్
- ఏ బేస్ చేసుకుని కాన్వాయ్, భద్రత కేటాయించారన్న గవర్నర్
- రేపు తమిళనాడు వ్యాప్తంగా ధర్నాకు పిలుపునిచ్చిన కాంగ్రెస్
- తమిళనాడు గవర్నర్, బీజేపీ వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరనలు
గవర‍్నర్ తీరుకు నిరసనగా
- రేపు తమిళనాడు వ్యాప్తంగా కాంగ్రెస్ ధర్న
- విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అడ్డుకుంటున్నారని విమర్శలు
- గవర్నర్ తీరుకు నిరసనగా ఆందోళనకు ధర్నాకు దిగనున్న కాంగ్రెస్ శ్రేణులు
రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం
- టీవీకే అధినేత విజయ్ కీలక నిర్ణయం
- ప్రభుత్వం ఏర్పాటు కోసం అవసరమైన మద్దతు కూడగట్టే ప్రయత్నాలు వేగవంతం
- వామపక్షాలతో చర్చలు జరిపేందుకు రంగంలోకి టీవీకే నేత నిర్మల్ కుమార్
- వామ పక్షాలతో చర్చలు జరిపే బాధ్యతల్ని కుమార్‌కు అప్పగించిన విజయ్
- రేపు వామపక్షాల ఎగ్జిక్యూటివ్ సమావేశం
- సమావేశం తర్వాతే విజయ్‌కు మద్దతు అంశంపై క్లారిటీ
- అప్పటి వరకు కొనసాగనున్న ఉత్కంఠ
లోక్‌భవన్ అధికారిక ప్రకటన
- తమిళనాడు గవర్నర్ కార్యాలయం లోక్‌భవన్ అధికారిక ప్రకటన
- గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఈ రోజు చెన్నైలో విజయ్‌ని కలిశారు
- ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మద్దతు తమిళనాడు శాసనసభలో ఇంకా లభించలేదని స్పష్టం
లోక్‌భవన్ ఎదుట విజయ్ అభిమానుల ఆందోళన
ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని ప్లకార్డులతో ప్రదర్శన
నాది భరోసా
- టీవీకే చీఫ్ విజయ్‌కు గవర్నర్ భరోసా
- ప్రభుత్వ ఏర్పాటు ఇతర పార్టీలను ఆహ్వానించబోమని హామీ
- తగిన మెజారిటీతో రావాలని సూచన
- 118 మంది జాబితాతో వచ్చి మెజారిటీ నిరూపించుకోవాలని సలహా
విజయ్‌కి మద్దతు ఇస్తారా?
- డీఎంకే మిత్రపక్షాల నిర్ణయంపై ఉత్కంఠ
- వామపక్షాలతో పాటు వీసీకే పార్టీ మద్దతు కోరిన విజయ్
- మద్దతు కోరుతూ లేఖ రాసిన టీవీకే అధినేత
- డీఎంకే అధినేత స్టాలిన్‌తో భేటీ అయిన మిత్రపక్షాల నేతలు
- విడిగా పార్టీ సమావేశాలు నిర్వహించుకోవాలని నిర్ణయం
- తమ నిర్ణయం ఏంటన్నది రేపు భేటీల తర్వాత ప్రకటించే చాన్స్
- విజయ్‌కు మద్దతుగా వ్యాఖ్యలు చేసిన సీపీఐ(2)
- ఏదీ తేల్చని సీపీఎం (2)
- మద్దతు ఇవ్వమని ఇదివరకు ప్రకటించిన వీసీకే(2)
- విజయ్ లేఖ నేపథ్యంలో పునరాలోచనలో వీసీకే
- మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసిన ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(2)
తమిళనాడులో కొనసాగుతున్న సస్పెన్స్..
- విజయ్ సమర్పించిన సంఖ్యా బలం పట్ల సంతృప్తి చెందని గవర్నర్.
- గవర్నర్ ఆఫీసు నుంచి టీవీకేకి ఫోన్.
- 118 మంది మెజార్టీ ఫిగర్‌తో లేఖ సమర్పించాలని టీవీకేకు స్పష్టం చేసిన గవర్నర్ ఆఫీస్.
- కోర్ కమిటీతో సమావేశమైన టీవీకే నేతలు
సంబంధిత వార్త: 113తో ప్రభుత్వమా? అలా ఎలా?
కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు
- ఎంపీ కమల్‌హాసన్ ట్వీట్.
- ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారు.
- తమిళనాడు ప్రజల ఆకాంక్షలను గవర్నర్ అవమానిస్తున్నారు.
- లోక్‌భవన్ కాదు.. అసెంబ్లీలో మెజార్టీ నిరూపించుకోవాలి.
- ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్‌ను ఆహ్వానించాలి.
- తమిళనాడు చర్రితలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదు.
தமிழ்நாடு சட்டமன்றத் தேர்தலில் தனித்து ஆட்சியமைக்கும் அதிகாரத்தை மக்கள் எந்தக் கட்சிக்கும் வழங்கவில்லை. இந்த முடிவு தமிழ்நாட்டு வரலாற்றில் முன்னெப்போதும் நிகழாதது.
என் சகோதரர் திரு. @mkstalin அவர்கள் ‘மக்கள் தீர்ப்பை மதிக்கிறோம்; பொறுப்பான எதிர்க்கட்சியாகச் செயல்படுவோம்’ என்று…— Kamal Haasan (@ikamalhaasan) May 7, 2026
విజయ్‌కు గవర్నర్ గ్రీన్ సిగ్నల్
- 40 నిమిషాల భేటీ తర్వాత కీలక పరిణామం
- టీవీకేను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించేందుకు గవర్నర్ సానుకూలంగా స్పందన
ముగిసిన భేటీ..
- లోక్‌భవన్‌లో గవర్నర్‌తో ముగిసిన విజయ్ భేటీ.
- 24 గంటల్లో రెండోసారి గవర్నర్‌ను కలిసిన విజయ్.
- కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.
- అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్.
- 113 మంది ఎమ్మెల్యే జాబితాను సమర్పించిన విజయ్.
- కాసేపట్లో గవర్నర్‌ను కలవనున్న అన్నాడీఎంకే పళనిస్వామి.
పళనిస్వామికి టెన్షన్!
- విజయ్‌కు మద్దతుగా నిలవాలని పళనిస్వామిపై అన్నాడీఎంకే ఎమ్మెల్యేల ఒత్తిడి.
- ఈపీఎస్ ఒప్పుకోకుంటే టీవీకేకి మద్దతు పలికే ఆలోచనలో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.
- 25 నుంచి 28 మంది ఎమ్మెల్యేలతో టీవీకే నేతలు వేలుమణి, షణ్ముగం సంప్రదింపులు.
- పుదుచ్చేరి రిసార్టులో 25 మందికిపైగా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.
- విజయ్ పార్టీకి మద్దతు తెలిపిన ఇద్దరు వీసీకే ఎమ్మెల్యేలు.
లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ సమావేశం..
- ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని గవర్నర్‌ను కోరిన విజయ్.
- అసెంబ్లీలో బల నిరూపణ చేసుకుంటామన్న విజయ్
- అతిపెద్ద పార్టీ కనుక ముందుగా తనకే అవకాశం ఇవ్వాలని కోరిన విజయ్.
- కాంగ్రెస్ పార్టీ మద్దతు లేఖ, మంత్రుల జాబితాను గవర్నర్‌కు ఇచ్చిన విజయ్.
- ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం ఉంది: విజయ్
తమిళనాడులో ట్విస్ట్‌ల మీద ట్విస్టులు
- గవర్నర్ ఆర్లేకర్ అపాయింట్‌మెంట్ కోరిన అన్నాడీఎంకే పళనిస్వామి
- విజయ్ భేటీ అనంతరం గవర్నర్‌ను కలవనున్న పళనిస్వామి.
- మధ్యాహ్నం 12 గంటలకు గవర్నర్‌తో పళనిస్వామి భేటీ.
- గవర్నర్‌తో పళనిస్వామి సమావేశంపై పలు రకాల ఊహాగానాలు
- టీవీకే విజయ్‌కి మద్దతు ఇవ్వాలని పుదుచ్చేరిలో 25 మంది ఎమ్మెల్యేల క్యాంపు
- తాజా పరిణామాల నేపథ్యంలో టీవీకేకు అన్నాడీఎంకే మద్దతు ఇచ్చే ఛాన్స్
- అన్నాడీఎంకే మద్దతిస్తే సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న విజయ్
- గవర్నర్, విజయ్ భేటీపై సర్వత్ర ఉత్కంఠ
👉గవర్నర్‌ను కలిసిన విజయ్
👉లోక్‌భవన్‌లో గవర్నర్‌తో విజయ్ భేటీ.
ప్రజల అండ విజయ్‌కు ఉంది: ప్రకాశ్‌రాజ్
- తమిళనాడు రాజకీయాలపై స్పందించిన ప్రకాశ్‌రాజ్
- ప్రభుత్వ ఏర్పాటుపై అనిశ్చితి కొనసాగుతోన్న వేళ ప్రకాశ్‌రాజ్ పోస్ట్
- విజయ్‌కు ప్రజామోదం ఉందంటూ వ్యాఖ్యలు.
- ప్రజలు అండగా ఉన్నారని కితాబు.
- గవర్నర్ ప్రవర్తన అత్యంత అభ్యంతరకరం, ఆమోదయోగ్యం కానిది మరియు రాజ్యాంగ విరుద్ధమైనది.
- మన మధ్య అభిప్రాయ భేదాలు ఉండవచ్చు..
- కానీ విజయం ప్రజల తీర్పు ద్వారా లభించింది.
- సభలో తన హక్కును నిరూపించుకునే అవకాశం అతనికి కల్పించాలి.
This Governor s behaviour is Disgusting .. unacceptable and unconstitutional. We may have differences … but Vijay has got the mandate . He should be allowed to claim his right on the floor of the house. #justasking https://t.co/T72CVedXhJ
— Prakash Raj (@prakashraaj) May 7, 2026
క్షణక్షణం.. ఉత్కంఠ..
👉లోక్‌భవన్‌కు బయలుదేరిన విజయ్
👉కాసేపట్లో గవర్నర్‌తో కీలక భేటీ.
👉 కేరళ పర్యటన రద్దు చేసుకున్న గవర్నర్ ఆర్లేకర్.
విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే
- ప్రమాణ స్వీకారం చేసేంత వరకు విజయ్ కాన్వాయ్ వద్దన్నారు: టీవీకే
- అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ప్రొటోకాల్ ప్రకారం ఆయనకు కాన్వాయ్ కేటాయించినట్లు వెల్లడించిన అధికారులు
సుప్రీంకోర్టుకు విజయ్
- కాసేపట్లో గవర్నర్‌తో విజయ్ భేటీ
- తమిళ రాజకీయంపై ఉత్కంఠ
- కాసేపట్లో లోక్‌భవన్‌కు విజయ్.
- ఉదయం 11 గంటలకు గవర్నర్ ఆర్లేకర్‌తో భేటీ కానున్న విజయ్.
- నిన్న గవర్నర్‌ను కలిసిన విజయ్
- 118 మంది సంతకాలతో రావాలన్న గవర్నర్
- అతిపెద్ద పార్టీగా అవతరించినా ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలవలేదనే పాయింట్ మీద కోర్టుకు వెళ్లనున్న టీవీకే.
- సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నాల్లో విజయ్ ఉన్నట్టు సమాచారం.
అన్నాడీఎంకేలో ఏం జరుగుతోంది?
- పుదుచ్చేరి రిసార్టులోనే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు.
- అన్నాడీఎంకే బలం-47
- టీవీకే మద్దతు ఇవ్వాలన్ని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలింపు.
- టీవీకేకే మద్దతు ఇవ్వాలంటున్న ఓ వర్గం.
- టీవీకేకి దూరంగా ఉండాలంటున్న మరో వర్గం.
- చెన్నైలోనే పళనిస్వామి వర్గం.
- పుదుచ్చేరిలో షణ్ముగం వర్గం.
- పుదుచ్చేరి రిసార్టులో దాదాపు 30 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు
- రిసార్టు నుంచి ఒక్కొక్కొరుగా పార్టీ ఆఫీసుకు వస్తున్న టీవీకే ఎమ్మెల్యేలు.
నేడు విజయ్ కీలక సమావేశం..
- నేడు టీవీకే ఎమ్మెల్యేలతో విజయ్ సమావేశం.
- రిసార్టులో ఉన్న ఎమ్మెల్యేలతో విజయ్ కీలక భేటీ.
- తాజా రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం.
మళ్లీ ఎన్నికలు జరపండి: శ్రీధర్ వేంబు
- తమిళనాడులో మళ్లీ ఎన్నికలు జరపాలని జోహో వ్యవస్థాపకుడు శ్రీధర్ వేంబు వ్యాఖ్యలు.
- టీవీకే విజయ్‌కి ప్రభుత్వ ఏర్పాటు కోసం తగినంత సంఖ్యా బలం లేదు.
- సంఖ్యలు సరిపోతున్నట్లు కనిపించడం లేదు.
- ఏ ప్రభుత్వం ఏర్పడినా, అది వివిధ రకాల ఆకర్షణలు, ఒత్తిళ్లతో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది.
- తమిళనాడు ఇంతకంటే మెరుగైన ప్రభుత్వానికి అర్హమైనది.
- అందుకే రాష్ట్రంలో మళ్లీ ఎన్నికలు నిర్వహించాలి.
- విజయ్ సూపర్ మెజారిటీతో తిరిగి వస్తారని నేను భావిస్తున్నాను.
- ఒకవేళ డీఎంకే-అన్నాడీఎంకే దానిని ఆపాలనుకుంటే, వారిద్దరూ కలిసి పోరాడాలి.
- సున్నా సీట్లు వచ్చినా సరే, బీజేపీ ఒంటరిగా పోరాడాలి.
- తమిళనాడులో బీజేపీకి ఇది ఒక కొత్త ఆరంభం.
- ప్రజలే మళ్లీ నిర్ణయించనివ్వండి అంటూ కీలక వ్యాఖ్యలు.
The numbers don't seem to add up. Whatever government is cobbled together is likely to be unstable with various pulls and pressures. Tamil Nadu deserves better.
President's rule with fresh elections may be the best course, this time with a very strict "no cash for votes"…— Sridhar Vembu (@svembu) May 7, 2026
తమిళనాడులో అల్లర్లకు చాన్స్..
- తమిళనాడులో ఇంటెలిజెన్స్ హెచ్చరిక
- పలు ప్రాంతాల్లో అల్లర్లు జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాలకు సమాచారం.
- దీంతో, పలు జిల్లాల్లో భద్రత కట్టుదిట్టం చేసిన సీఎస్, డీజీపీ
పొత్తులపై కొత్త ట్విస్ట్..
- పొత్తులపై ప్రచారాన్ని ఖండించిన డీఎంకే
- అవన్నీ ఫేక్ అంటూ డీఎంకే నేతలు వ్యాఖ్యలు.
- విజయ్ ప్రభుత్వంలో తమ జోక్యం ఉండదన్న స్టాలిన్
- మరోవైపు.. విజయ్‌కు తమ మద్దతు ఇచ్చేది లేదన్న అన్నాడీఎంకే.
- ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకేకు అవసరమైన ఎమ్మెల్యేల మద్దతుపై ఉత్కంఠ.
- టీవీకేకు మద్దతు ఇచ్చేది లేదని చెబుతున్న లెఫ్ట్ పార్టీలు, అన్నాడీఎంకే.
- కాంగ్రెస్ మద్దతులో 112కు చేరిన టీవీకే బలం
- మరో ఆరుగురు ఎమ్మెల్యే కోసం టీవీకే ప్రయత్నాలు.
రిసార్ట్ రాజకీయాలు..
- గత మూడు రోజులుగా మహాబలిపురంలోని రిసార్ట్‌లో టీవీకే ఎమ్మెల్యేలు.
- మరోవైపు.. 15 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు కూడా పుదుచ్చేరిలోని రిసార్ట్‌కు తరలింపు.
- 'ది షోర్ త్రిశ్వం'లో 20కి పైగా గదులను బుక్ చేసుకున్న అన్నాడీఎంకే సీవీ షణ్ముగం
Puducherry: AIADMK MLAs have gathered at a private resort in Puducherry amid uncertainty over government formation in Tamil Nadu. With TVK lacking a clear majority and seeking support, political maneuvering is underway. Heavy police security has been deployed to maintain law and… pic.twitter.com/hsUdAsgbSE
— IANS (@ians_india) May 6, 2026
ట్విస్ట్ ఇచ్చిన గవర్నర్
- లోక్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌ను టీవీకే నేతలు కలిశారు.
- విజయ్ వెంట టీవీకే ముఖ్యనేతలు బస్సీ ఎన్ ఆనంద్, ఆధవ్ అర్జున, కేఏ సెంగొట్టయాన్, సీటీ నిర్మల్‌కుమార్
- టీవీకే పార్టీలో 108 మంది ఎమ్మెల్యేలున్నా విజయ్ రెండుచోట్ల గెలవడంతో ఆ సంఖ్య 107కు తగ్గింది.
- వీళ్లకు కాంగ్రెస్‌లోని ఐదుగురి పేర్లను జతచేసి మొత్తం 112 పేర్ల జాబితాను గవర్నర్‌కు అందజేత.
- ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి
- అందుకు గవర్నర్ విముఖత.
- 118 మంది ఎమ్మెల్యేలతో స్పష్టమైన మెజార్టీ వచ్చాక తిరిగి తన వద్దకు రావాలని విజయ్‌కు గవర్నర్ సూచన.
- దీంతో నిరాశతో వెనుతిరిగిన విజయ్.
రసవత్తరంగా తమిళ రాజకీయం..
- గంట గంటకూ మారుతున్న తమిళనాడులో రాజకీయ సమీకరణాలు
- కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు కొనసాగుతున్న ఉత్కంఠ..
- నేడు ఏం జరగబోతోందని అనేది సస్పెన్స్.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆయా పార్టీల బలం ఇలా..
- టీవీకే - 108
డీఎంకే - 59
అన్నాడీఎంకే - 47
కాంగ్రెస్ - 05
పీఎంకే - 04
ఐయూఎమ్ఎల్- 02
సీపీఐ - 02
సీవీకే - 02
సీపీఎం - 02
బీజేపీ - 01
డీఎండీకే - 01
అన్నామక్కల్ మున్నేట్ర కళగం - 01
రెండు పార్టీల మంతనాలు
- తమిళనాట కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది.
- డీఎంకే, అన్నాడీఎంకే తెరవెనుక రహస్యంగా మంతనాలు చేస్తున్నట్లు వార్తలు
- ఈ రెండు పార్టీలు కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్నట్లు సమాచారం.
- డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలుకు 106 సీట్లు
- వామపక్షాలు మిగిలిన చిన్న పార్టీలు కూడా మద్దతు ఇచ్చేందుకు సముఖంగా ఉన్నాయట!
- దీంతో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ లేకుండానే 120 సీట్లతో ప్రభుత్వం ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం.


