ఒళ్లు గగుర్పొడిచేలా వ్యాపారవేత్త మరణం
కడుపులో అతని అవశేషాలు, ఆరు రకాల చెప్పులు
దక్షిణాఫ్రికాలోని కోమటి నది (Komati River) తీరాన వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల వ్యాపారవేత్త ఆచూకీ కోసం వెతుకుతుండగా వెలుగులోకి వచ్చిన నిజాలు అధికారులను సైతం విస్మయానికి గురి చేశాయి. అనూహ్యమైన, అత్యంత భయంకరమైన విషాదం వైరల్‌గా మారింది. దక్షిణాఫ్రికాలో మొసళ్లు ఎక్కువగా ఉండే నది తీరాన విషాదం చోటు చేసుకుంది.
అసలేం జరిగింది?
ఒక వ్యాపారవేత్త తన కారుతో లోతట్టు వంతెన దాటుతుండగా, ఒక్కసారిగా వచ్చిన వరద ఉధృతికి కారు చిక్కుకుపోయింది. ఆ తర్వాత ఆయన నీటిలో కొట్టుకు పోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సరికి కారు ఖాళీగా ఉంది. పోలీసులు కోమటి నది ప్రాంతంలో గాలిస్తూనే ఉన్నారు, తమకు ఏమి దొరుకుతుందో లేదా అసలు ఏమైనా దొరుకుతుందో లేదో కూడా తెలియని అయోమయం నెలకొంది.
కోమటి నది ఏదో మామూలు నది కాదు, స్థానికులు చాలా ప్రమాదకరమైనదిగా భావించే నది. అత్యంత భయంకరమైన ఆ జలాల్లోకి ఒక పోలీసు అధికారిని హెలికాప్టర్ ద్వారా దించారు. డ్రోన్‌లను రంగంలోకి దించారు. హెలికాప్టర్లు గగనతలంలో చక్కర్లు కొట్టాయి. మొదట అంతా మామూలు గానే కనిపించింది. కానీ తనిఖీల సమయంలోనదిలోని ఒక చిన్న ద్వీపం దృష్టిని ఆకర్షించింది. ఆ పరిశీలనే ఆపరేషన్ దిశను పూర్తిగా మార్చేసింది.
NEW: Police airlift a crocodile with the body of a 59-year-old businessman inside.
Local police in South Africa say they suspected the crocodile ate the man after observing it from drones. They then shot it and airlifted it off.
When they landed back on the ground, the… pic.twitter.com/12NBTQbmis— Collin Rugg (@CollinRugg) May 4, 2026
fy">
అనుమానం తెప్పించిన మొసలి ప్రవర్తన
గాలింపు సమయంలో నది మధ్యలో ఉన్న ఒక చిన్న ద్వీపంపై కొన్ని మొసళ్లు ఎండకు కాచుకుంటూ కనిపించాయి. అయితే, అక్కడ ఉన్న ఒక 4.5 మీటర్ల పొడవు, సుమారు 500 కిలోల బరువున్న భారీ మొసలి మాత్రం వింతగా ప్రవర్తించింది. హెలికాప్టర్ల శబ్దం వస్తున్నా అది కదలలేదు. సాధారణంగా భారీ ఆహారాన్ని తీసుకున్న తర్వాత మొసళ్లు నిశ్చలంగా ఉంటాయని గుర్తించిన అధికారులు, ఆ మొసలిని చంపి పరీక్షల కోసం క్రూగర్ నేషనల్ పార్క్‌కు తరలించారు.

భయంకరమైన నిజాలు
మొసలి కడుపును కోసి చూడగా అధికారులకు గుండె ఆగిపోయే దృశ్యాలు కనిపించాయి మొసలి ప్రేవులలో మానవ అవశేషాలు లభించాయి. ఆ అవశేషాలు గతంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వరద నీటిలో కొట్టుకుపోయిన 59 ఏళ్ల గాబ్రియేల్ బాటిస్టావిగా అనుమానిస్తున్నారు.
అంతేకాదు మొసలి కడుపులో 6 రకాల వేర్వేరు బూట్లు లభించాయి. అయితే మొసళ్లు ఏది పడితే అది మింగుతాయి కాబట్టి, ఇతర బాధితులు ఉండకపోవచ్చని పోలీసులు భావిస్తున్నారు.కానీ గతంలో కూడా ఆ మొసలికి గతంలో కూడా బాధితులు ఉన్నారేమోనన్న ఆందోళన తలెత్తుతోంది.
ప్రాణాలకు తెగించి డేంజరస్ రెస్క్యూ ఆపరేషన్
ఈ ఆపరేషన్‌లో అత్యంత సాహసోపేతమైన ఘట్టం కెప్టెన్ జోహన్ పాట్‌గీటర్ చేసిన రెస్క్యూ. మొసళ్లు నిండి ఉన్న ఆ ప్రమాదకర నదిలోకి హెలికాప్టర్ నుండి ఆయన కిందకు దిగారు. మొసలి అప్పటికే చనిపోయి నప్పటికీ, ఆ నది ప్రవాహం, చుట్టుపక్కల ఉన్న ఇతర మొసళ్ల వల్ల, ఎంతో ఒత్తిడి మధ్య అత్యంత ఖచ్చితత్వంతో ఈ ఆపరేషన్ నిర్వహించారు. ప్రస్తుతం ఆ అవశేషాలను DNA పరీక్షలకు పంపారు. ఫలితాలు వచ్చిన తర్వాతే అధికారికంగా అవి ఎవరివో నిర్ధారిస్తారు. అయితే, నిపుణులు తొందరపడి ఒక నిర్ధారణకు రావద్దని హెచ్చరిస్తున్నప్పటికీ, అనేక బూట్లు లభించడం ఆందోళనకు తావిచ్చింది. దొరికిన అదనపు బూట్ల ఆధారంగా, ఈ మొసలికి గతంలో మరేవైనా బాధితులు ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుగుతోంది. నది ఘటనపై దర్యాప్తు కొనసాగుతుండగా ఈ సాహసోపేతమైన ఆపరేషన్ చేసిన అధికారులను సౌత్ ఆఫ్రికా పోలీస్ చీఫ్ అభినందించారు. ఈ ఘటన స్థానికులలో తీవ్ర భయాందోళనలను మిగిల్చింది.
ఇదీ చదవండి: టీఎంసీ కీలక నేతలపై మార్కండే కట్జూ షాకింగ్ వ్యాఖ్యలు


