breaking news
south africa
-
భారత్‌తో తొలి వన్డే.. చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా
ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఎదురైన ఘోర పరాభవానికి (0-2తో క్లీన్ స్వీప్) టీమిండియా గట్టిగానే ప్రతీకారం తీర్చుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా నిన్న (నవంబర్ 30) జరిగిన తొలి వన్డేలో (India vs South Africa) ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు సఫారీలకు చుక్కలు చూపించింది.విరాట్ కోహ్లి (Virat Kohli) 52వ వన్డే శతకంతో చెలరేగిపోవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోర్ చేసింది. రోహిత్ శర్మ (57), కేఎల్ రాహుల్ (60) కూడా అర్ద సెంచరీలతో సత్తా చాటారు. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఆదిలో తబడిన సౌతాఫ్రికా, ఆతర్వాత అనూహ్యంగా పుంజుకొని కాసేపు టీమిండియాను భయపెట్టింది. మిడిలార్డర్ బ్యాటర్లు మాథ్యూ బ్రీట్జ్కే (72), జన్సెన్ (70), కార్బిన్ బాష్ (67) ఊహించని రీతిలో ప్రతిఘటించి టీమిండియా శిబిరంలో గుబులు పుట్టించారు. అంతింగా భారత్‌దే పైచేయి అయినప్పటికీ సఫారీల పోరాటం అందరినీ ఆకట్టుకుంది. 49.2 ఓవర్లలో ఆ జట్టు 332 పరుగులు చేసి లక్ష్యానికి 18 పరుగుల దూరంలో నిలిచిపోయింది.ఈ మ్యాచ్‌లో ఓడినా సౌతాఫ్రికా (South Africa) ఓ విషయంలో చరిత్ర సృష్టించింది. వన్డే లక్ష్య ఛేదనల్లో 15 పరుగులలోపే 3 వికెట్లు కోల్పోయి అంతిమంగా 300 పరుగులు చేసిన తొలి జట్టుగా రికార్డు నెలకొల్పింది. దీనికి ముందు ఈ రికార్డు పాకిస్తాన్ పేరిట ఉండేది. 2019లో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ లక్ష్య ఛేదనలో 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి, అంతిమంగా 297 పరుగులు చేసింది. -
రాంచీ వన్డేలో దుమ్ములేపిన భారత్
-
జట్టులో కీలక మార్పులు
-
వన్డే సమరానికి సై
దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో అనూహ్యంగా చిత్తయిన తర్వాత ఇప్పుడు సొంతగడ్డపై మరో ఫార్మాట్లో పరువు నిలబెట్టుకునేందుకు భారత్ బరిలోకి దిగుతోంది. గత రెండేళ్లలో నిలకడగా రాణిస్తూ వరుస విజయాలు సాధించిన వన్డేల్లో అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని టీమిండియా పట్టుదలగా ఉంది. టెస్టు జట్టుతో పోలిస్తే కెప్టెన్‌గా రాహుల్ రావడం సహా పలు మార్పులతో భారత్ సిద్ధం కాగా...చాలా కాలం తర్వాత భారత గడ్డపై ఆడుతున్న విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలపైనే అందరి దృష్టీ నిలిచింది. మరో వైపు వన్డేల్లో ఇటీవల పెద్దగా రాణించలేకపోయినా... టెస్టు సిరీస్ విజయం ఇచి్చన ఉత్సాహంతో సఫారీ జట్టు మరో సంచలనాన్ని ఆశిస్తోంది. కెప్టెన్‌గా తెంబా బవుమా మరోసారి టీమ్‌ను విజయం దిశగా నడిపించాలని ఆశిస్తున్నాడు. రాంచీ: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) కారణంగా టెస్టు మ్యాచ్‌లకు, వచ్చే ఏడాది ఆరంభంలో ప్రపంచ కప్ జరగనున్న నేపథ్యంలో టి20లపై ప్రస్తుతం అన్ని జట్లూ ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో వన్డే మ్యాచ్‌ల ప్రాధాన్యత తాజా సీజన్లో కాస్త తగ్గినట్లు కనిపించింది. అయితే భారత గడ్డపై జరిగే ఎలాంటి అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్పైనైనా ఉండే ఆసక్తి వేరు. ఈ నేపథ్యంలో మరో వన్డే సిరీస్‌కు రంగం సిద్ధమైంది. భారత్, దక్షిణాఫ్రికా మధ్య మూడు మ్యాచ్‌ల పోరులో భాగంగా నేడు తొలి వన్డే జరుగుతుంది. గత రెండు దశాబ్దాల్లో ఇరు జట్ల మధ్య 10 వన్డే సిరీస్‌లు జరగ్గా...చెరో ఐదు సిరీస్‌లు గెలిచి భారత్, దక్షిణాఫ్రికా సమంగా ఉన్నాయి. జైస్వాల్, రుతురాజ్‌కు చాన్స్... దాదాపు నెల రోజుల క్రితం భారత జట్టు సిడ్నీలో తమ చివరి వన్డే ఆడింది. నాటి టీమ్‌తో పోలిస్తే రెండు తప్పనిసరి మార్పులు జట్టులో చోటు చేసుకున్నాయి. తొలి టెస్టులో గాయపడి ఆటకు దూరమైన గిల్ స్థానంలో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్ రానున్నాడు. గిల్ గైర్హాజరులో రాహుల్ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. మరో వైపు గాయంతోనే ఆటనుంచి తప్పుకున్న మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ స్థానంలో రుతురాజ్‌కు చోటు ఖాయమైంది. అయితే ఎప్పటిలాగే రోహిత్, కోహ్లిల గురించి మరో సారి చర్చ సాగుతోంది. 2027 వరల్డ్ కప్‌లో ఆడాలని పట్టుదలగా ఉన్న వీరిద్దరు ఎలాంటి అవకాశం వదులుకోరాదని భావిస్తున్నారు. సిడ్నీలో రోహిత్ సెంచరీలతో చెలరేగగా, కోహ్లి కూడా 74 పరుగులతో సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో వీరి ఫామ్ గురించి ఎలాంటి ఆందోళన లేదు. అభిమానుల కోణంలో చూస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో వీరు ఆఖరి సారిగా భారత గడ్డపై ఆడారు. ఇప్పుడు మైదానంలోకి దిగి సత్తా చాటాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. జట్టులో ముగ్గురు ఆల్‌రౌండర్లు ఉండాలని టీమ్ మేనేజ్మెంట్ కోరుకుంటోంది కాబట్టి నితీశ్ రెడ్డికి అవకాశం దక్కవచ్చు. మరో ముగ్గురు రెగ్యులర్ పేసర్లు హర్షిత్, ప్రసిధ్, అర్ష్ దీప్ ఆడే అవకాశం ఉంది. ఆ్రస్టేలియా సిరీస్‌తో చాన్స్ లభించని రవీంద్ర జడేజా మరోసారి తన స్థాయిని ప్రదర్శించాలని భావిస్తున్నాడు. పంత్‌కు తుది జట్టులో చోటు కష్టమే. మాథ్యూ బ్రీట్‌కీ జోరు కొనసాగేనా... చాలా కాలం తర్వాత దక్షిణాఫ్రికా వన్డేల్లో పూర్తి స్థాయి జట్టుతో బరిలోకి దిగుతోంది. టాప్ పేసర్ రబాడ గాయంనుంచి పూర్తిగా కోలుకోలేదు కాబట్టి ఇక్కడా ఆడటం సందేహంగానే అనిపిస్తోంది. అయితే టెస్టుల్లో చెలరేగిన యాన్సెన్‌తో పాటు బర్గర్, ఎన్గిడి రూపంలో పదునైన పేసర్లు టీమ్‌లో ఉన్నారు. కేశవ్ మహరాజ్ స్పిన్ బాధ్యతలు నిర్వర్తిస్తాడు. సీనియర్ ప్లేయర్ డి కాక్‌తో పాటు ఐపీఎల్ స్టార్ బ్రెవిస్, మార్క్రమ్లపై ప్రధానంగా జట్టు బ్యాటింగ్ ఆధారపడి ఉంది. మూడో స్థానంలో కెప్టెన్ బవుమా కీలక ఆటగాడు. అయితే ఇటీవల అందరికంటే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్న ప్లేయర్ మాథ్యూ బ్రీట్‌కీ. తన తొలి ఐదు వన్డేల్లోనే ఒక సెంచరీ, నాలుగు అర్ధ సెంచరీలు సాధించిన ప్లేయర్‌గా అందరి దృష్టిలో పడిన బ్రీట్‌కీ భారత గడ్డపై ఎలా ఆడతాడో చూడాలి.పిచ్, వాతావరణంఅటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే సాధారణ వికెట్. గతంలో జరిగిన ఐదు వన్డేల్లో ఒకే ఒక్కసారి స్కోరు 300 దాటింది కాబట్టి పరుగుల వరద పారించే మైదానం మాత్రం కాదు. వాతావరణం అనుకూలంగా ఉంది. వర్షసూచన లేదు. మంచు ప్రభావం లేకపోతే టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకోవచ్చు.తుది జట్ల వివరాలు (అంచనా)భారత్: రాహుల్ (కెప్టెన్), రోహిత్, జైస్వాల్, కోహ్లి, రుతురాజ్, సుందర్, జడేజా, నితీశ్ రెడ్డి, హర్షిత్, అర్ష్ దీప్, ప్రసిధ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, డి కాక్, బ్రీట్‌కీ, బ్రెవిస్, హెర్మన్, యాన్సెన్, బాష్, మహరాజ్, బర్గర్, ఎన్గిడి. -
రెండో టెస్టులో చిత్తుగా ఓడిన భారత్
మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకుంటే చాలు అదే మాకు రెండో టెస్టులో విజయంతో సమానం... నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత భారత ఆటగాడు రవీంద్ర జడేజా చేసిన వ్యాఖ్య ఇది. ‘డ్రా’ చేసుకోవడం కాదు కదా... మన ఆటగాళ్లు కనీస స్థాయి పోరాటం కూడా చేయలేకపోయారు... చివరి రోజు సఫారీ స్పిన్నర్లు పదునైన బంతులతో మన పని పట్టి అలవోకగా మిగిలిన ఎనిమిది వికెట్లు పడగొట్టారు. రికార్డు విజయంతో సిరీస్‌ను గెలుచుకొని వరల్డ్ చాంపియన్‌గా తమ స్థాయిని ప్రదర్శిస్తూ దక్షిణాఫ్రికా సింహనాదం చేసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్‌ను శాసించిన యాన్సెన్ చివరి క్యాచ్‌ను అద్భుతంగా అందుకోవడం సరైన ముగింపు కాగా... ఏడాది వ్యవధిలో సొంతగడ్డపై రెండు సిరీస్‌లలో వైట్‌వాష్ కు గురైన భారత బృందం అవమాన భారాన్ని తమ ఖాతాలో వేసుకుంది. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో టెస్టులో లాంఛనం ముగిసింది. అనూహ్యమేమీ జరగకుండా భారత్ సులువుగా తలవంచింది. ఊహించిన విధంగానే రెండు సెషన్ల లోపే మ్యాచ్ చేజారింది. టీమిండియా మిగిలిన 8 వికెట్లు తీసేందుకు సఫారీ బౌలర్లకు 48 ఓవర్లు సరిపోయాయి. బుధవారం ముగిసిన రెండో టెస్టులో దక్షిణాఫ్రికా 408 పరుగుల తేడాతో భారత్‌ను చిత్తుగా ఓడించింది. ఓవర్‌నైట్ స్కోరు 27/2తో ఆట కొనసాగించిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 63.5 ఓవర్లలో 140 పరుగులకే కుప్పకూలింది. రవీంద్ర జడేజా (87 బంతుల్లో 54; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీ సాధించడం మినహా మిగతా బ్యాటర్లంతా పూర్తిగా విఫలమయ్యారు. ఆఫ్ స్పిన్నర్ సైమన్ హార్మర్ (6/37) ఆరు వికెట్లతో భారత్ పని పట్టాడు. కోల్‌కతాలో జరిగిన తొలి టెస్టును కూడా గెలిచిన దక్షిణాఫ్రికా తాజా ఫలితంతో 2–0తో సిరీస్‌ను సొంతం చేసుకుంది. 25 ఏళ్ల తర్వాత ఆ జట్టు భారత్‌లో సిరీస్ గెలవడం విశేషం. 93 పరుగులు చేయడంతో పాటు 7 వికెట్లు తీసిన మార్కో యాన్సెన్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలవగా... మొత్తం 17 వికెట్లు తీసిన సైమన్ హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా ఎంపికయ్యాడు. ఇరు జట్ల మధ్య ఆదివారం నుంచి వన్డే సిరీస్ జరుగుతుంది. జడేజా మినహా... ఓటమి నుంచి తప్పించుకునేందుకు చివరి రోజు బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలో కాస్త అదృష్టం కలిసొచ్చింది. యాన్సెన్ బౌలింగ్‌లో 4 పరుగుల వద్ద సాయి సుదర్శన్ క్యాచ్ ఇవ్వగా అది నోబాల్‌గా తేలింది. ఆ తర్వాత 4 పరుగుల వద్ద కుల్దీప్ యాదవ్ (5) ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మార్క్రమ్ వదిలేశాడు. అయితే ఇది ఎంతోసేపు సాగలేదు. ఒకే ఓవర్లో కుల్దీప్, జురేల్ (2)లను అవుట్ చేసి దెబ్బ కొట్టిన హార్మర్... కొద్ది సేపటికే కెపె్టన్ రిషభ్ పంత్ (13)ను కూడా వెనక్కి పంపాడు. టీ విరామానికి భారత్ స్కోరు 90/5కు చేరింది. అయితే ప్రతీ బంతిని డిఫెన్స్ ఆడుతూ పట్టుదల ప్రదర్శించిన సాయి సుదర్శన్ (139 బంతుల్లో 14; 1 ఫోర్)) ఎట్టకేలకు ముత్తుసామి వేసిన ఒక చక్కటి బంతికి అవుటయ్యాడు. ఆ తర్వాత జడేజా, సుందర్ (16) కొద్దిసేపు పోరాడారు. అయితే కొత్త స్పెల్‌లో మళ్లీ బౌలింగ్‌కు దిగిన హార్మర్ 8 పరుగుల వ్యవధిలో సుందర్, నితీశ్ కుమార్ రెడ్డి (0)లను అవుట్ చేయగా... మహరాజ్ ఒకే ఓవర్లో జడేజా, సిరాజ్ (0)లను వెనక్కి పంపడంతో దక్షిణాఫ్రికా శిబిరంలో వేడుకలు మొదలయ్యాయి. ఐదో స్థానానికి భారత్.. భారీ ఓటమి తర్వాత ఇప్పటికిప్పుడు భారత టెస్టు జట్టు ప్రదర్శనపై ఎలాంటి చర్చా జరిగే అవకాశం లేదు. దక్షిణాఫ్రికాతో వన్డేలు, టి20ల తర్వాత న్యూజిలాండ్‌తో భారత్ స్వదేశంలోనే వన్డే, టి20 సిరీస్‌లు ఆడనుంది. ఆపై టి20 వరల్డ్ కప్, ఐపీఎల్ ఎలాగూ ఉంటుంది. కాబట్టి ఈ పరాజయంపై విశ్లేషణలు, ప్రశ్నలు ఇక్కడితోనే ముగిసిపోవచ్చు! మరోవైపు తాజా ఓటమితో ఐసీసీ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో భారత్ 48.15 పాయింట్ల శాతంతో ఐదో స్థానానికి పడిపోయింది. అయితే ఈ ఓటమి తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వెళ్లాలంటే భారత్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. భారత తమ తర్వాతి టెస్టు మ్యాచ్ 2026 ఆగస్టులోనే ఆడనుంది. శ్రీలంకకు వెళ్లి 2 టెస్టులు, ఆపై న్యూజిలాండ్‌లో 2 టెస్టులతో పాటు స్వదేశంలో ఆ్రస్టేలియాతో 5 టెస్టులు ఆడాల్సి ఉంది. డబ్ల్యూటీసీలో భాగంగా ఉన్న ఈ 9 టెస్టుల్లో ప్రదర్శన మన ఫైనల్ ప్రస్థానాన్ని నిర్దేశించనుంది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 260/5 డిక్లేర్డ్; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (సి) మార్క్రమ్ (బి) ముత్తుసామి 14; కుల్దీప్ (బి) హార్మర్ 5; జురేల్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 2; పంత్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 13; జడేజా (స్టంప్డ్) వెరీన్ (బి) మహరాజ్ 54; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 16; నితీశ్ రెడ్డి (సి) వెరీన్ (బి) హార్మర్ 0; బుమ్రా (నాటౌట్) 1; సిరాజ్ (సి) యాన్సెన్ (బి) మహరాజ్ 0; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (63.5 ఓవర్లలో ఆలౌట్) 140. వికెట్ల పతనం: 1–17, 2–21, 3–40, 4–42, 5–58, 6–95, 7–130, 8–138, 9–140, 10–140. బౌలింగ్: యాన్సెన్ 15–7–23–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 23–6–37–6, మహరాజ్ 12.5–1–37–2, మార్క్రమ్ 2–0–2–0, ముత్తుసామి 7–1–21–1. 408 టెస్టుల్లో పరుగులపరంగా భారత్‌కు ఇదే అతి పెద్ద ఓటమి. 2004లో ఆ్రస్టేలియా చేతిలో (నాగ్‌పూర్‌లో) భారత్ 342 పరుగుల తేడాతో ఓడింది.3స్వదేశంలో భారత్ వైట్‌వాష్ కు గురి కావడం ఇది మూడోసారి. 2000లో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో, 2024లో న్యూజిలాండ్ చేతిలో 0–3తో ఓడింది.9 ఈ మ్యాచ్‌లో మార్క్రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. ఒక టెస్టులో అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా రహానే (8) రికార్డును అతను సవరించాడు. 11 కెప్టెన్‌గా బవుమాకిది 11వ టెస్టు విజయం. ఆడిన 12 టెస్టుల్లో ఒకటి డ్రా కాగా, అతని నాయకత్వంలో జట్టు ఒక్క టెస్టూ ఓడలేదు. చాలా గొప్ప విజయం. అసాధారణ ఘనత ఇది. భారత్‌లో టెస్టు సిరీస్ గెలవడం సాధారణంగా ఊహకు కూడా అందనిది. మా ఆటపై సందేహాలు వ్యక్తం చేసిన వారందరికీ సమాధానమిది. మంచి సన్నద్ధతతో పాటు పరిస్థితులకు తగినట్లుగా మా ఆటను మార్చుకున్నాం. తమ బాధ్యతపై ప్రతీ ఒక్కరికి స్పష్టత ఉండటం మేలు చేసింది. –తెంబా బవుమా, దక్షిణాఫ్రికా కెప్టెన్ -
మరో పరాభవం పిలుస్తోంది!
పుష్కర కాలం పాటు సొంతగడ్డపై టెస్టు సిరీస్ ఓడిపోని జట్టు ఇప్పుడు 12 నెలల వ్యవధిలో రెండో సిరీస్ పరాజయానికి చేరువైంది. స్వదేశీ పిచ్‌లపై పరుగుల వరద పారించి ప్రత్యర్థికి సవాల్ విసిరే టీమ్ ఇప్పుడు సరిగ్గా దానికి వ్యతిరేక దిశలో పరువు కోసం పోరాడుతోంది. టెస్టులో చివరి రోజు ఒక్కో బంతి గండంలా కనిపిస్తుంటే... మ్యాచ్‌ను కాపాడుకునేందుకు విదేశీ జట్లు పడిన పాట్లు ఎన్నో చూశాం. ఇప్పుడు మన జట్టు సరిగ్గా అలాగే కనిపిస్తోంది. అవతలి వైపు బౌలర్లు చెలరేగిపోతుంటే ఎనిమిది వికెట్లతో రోజంతా నిలిచి బేలగా ‘డ్రా’ కోసం ఆడాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 549 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం ఏ రకంగానూ సాధ్యం కాదు కాబట్టి సిరీస్ ఓటమి అనేది ఖాయమైపోయింది. ఇక తేడా 0–1తోనా లేక 0–2తోనే అని తేలడమే మిగిలింది! ఏదైనా అద్భుతం జరిగి ఓటమి నుంచి తప్పించుకుంటారేమో అనే ఆశ ఉన్నా... ఈ సిరీస్‌లో భారత్ ఆట చూస్తే అలాంటి నమ్మకం కూడా కనిపించడం లేదు. గువాహటి: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత్ ఓటమి దిశగా పయనిస్తోంది. 549 పరుగుల అసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 15.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 27 పరుగులు చేసింది. యశస్వి జైస్వాల్ (13), కేఎల్ రాహుల్ (6) అవుట్ కాగా... ప్రస్తుతం సాయి సుదర్శన్ (2 బ్యాటింగ్), కుల్దీప్ యాదవ్ (4 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. ఆఖరి రోజు భారత్ మరో 522 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 26/0తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌ను 78.3 ఓవర్లలో 5 వికెట్లకు 260 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (180 బంతుల్లో 94; 9 ఫోర్లు, 1 సిక్స్) త్రుటిలో సెంచరీ చేజార్చుకోగా... టోనీ జోర్జి (68 బంతుల్లో 49; 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత బౌలర్లలో జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మంగళవారం ఆటలో జడేజాకు వికెట్లు దక్కిన తీరు, ఆ తర్వాత హార్మర్ బౌలింగ్‌లో రాహుల్ బౌల్డ్ అయిన బంతిని చూస్తే చివరి రోజు పిచ్‌పై అనూహ్యమైన టర్న్ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇలాంటి స్థితిలో మన బ్యాటర్లు రోజంతా నిలవడం కూడా అసాధ్యం కావచ్చు. స్థానిక వాతావరణ పరిస్థితిని బట్టి 80 ఓవర్ల ఆట మాత్రమే జరిగే అవకాశం ఉంది. కీలక భాగస్వామ్యాలు... ఓవరాల్‌గా 314 పరుగుల ఆధిక్యం ఉన్నా... దక్షిణాఫ్రికా వేగంగా ఆడి డిక్లేర్ చేసే ప్రయత్నం చేయలేదు. సాధారణ టెస్టు ఇన్నింగ్స్ తరహాలోనే బ్యాటర్లు పట్టుదలగా క్రీజ్‌లో నిలిచి జాగ్రత్తగా బ్యాటింగ్ చేస్తూ పరుగులు జోడించారు. ఫలితంగా ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీ భాగస్వామ్యాలు నమోదయ్యాయి. తొలి వికెట్‌కు 59 పరుగులు జోడించిన తర్వాత ఓపెనర్లు రికెల్టన్ (64 బంతుల్లో 35; 4 ఫోర్లు), మార్క్రమ్ (84 బంతుల్లో 29; 3 ఫోర్లు)లను తక్కువ వ్యవధిలో వెనక్కి పంపించగా, బవుమా (3)ను సుందర్ లెగ్ స్లిప్ ఉచ్చులో పడేశాడు. అయితే స్టబ్స్, జోర్జి కలిసి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరి భాగస్వామ్యం 27 ఓవర్ల పాటు సాగింది. 129 బంతుల్లో స్టబ్స్ అర్ధ సెంచరీని చేరుకోగా, జడేజా బౌలింగ్‌లో స్వీప్ చేసే ప్రయత్నంలో జోర్జి అర్ధసెంచరీ కోల్పోయాడు. లంచ్ విరామ సమయానికే దక్షిణాఫ్రికా ఆధిక్యం 508 పరుగులకు చేరింది. అయినా సరే ఆ జట్టు డిక్లేర్ చేసేందుకు ఆసక్తి చూపించలేదు. విరామం తర్వాత స్టబ్స్ జోరు పెంచాడు. తాను ఆడిన తర్వాతి 24 బంతుల్లో 34 పరుగులు రాబట్టిన అతను సెంచరీకి చేరువయ్యాడు. అయితే జడేజా ఓవర్లో సిక్స్ బాది 94కు చేరిన అతను మరో సిక్స్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. దాంతో బవుమా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అదే తడబాటు... రెండో ఇన్నింగ్స్‌ను జైస్వాల్ కొంత ధాటిగా మొదలు పెట్టినా, రాహుల్ వికెట్ కాపాడుకునేందుకే ప్రాధాన్యతనిచ్చాడు. అయితే మరోసారి యాన్సెన్ చక్కటి బంతితో జైస్వాల్‌ను అవుట్ చేసి పతనానికి శ్రీకారం చుట్టగా... హార్మర్ స్పిన్‌కు రాహుల్ స్టంప్ కూలింది. తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక బంతులు ఆడిన భారత బ్యాటర్ కుల్దీప్ ఈసారి కూడా డిఫెన్స్ ఆడే పాత్రను పోషిస్తూ 22 బంతులు సమర్థంగా ఎదుర్కొన్నాడు. సాయి, కుల్దీప్ కలిసి 39 బంతులు ఆడి మరో వికెట్ పడకుండా రోజును ముగించారు. దక్షిణాఫ్రికా ఆలస్యంగా డిక్లేర్ చేసినట్లు అనిపించినా... జట్టు తీసిన 2 వికెట్లు వారి నిర్ణయాన్ని సరైందిగా నిరూపించాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 489; భారత్ తొలి ఇన్నింగ్స్: 201; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (సి) సిరాజ్ (బి) జడేజా 35; మార్క్రమ్ (బి) జడేజా 29; స్టబ్స్ (బి) జడేజా 94; బవుమా (సి) నితీశ్ (బి) సుందర్ 3; జోర్జి (ఎల్బీ) (బి) జడేజా 49; ముల్డర్ (నాటౌట్) 35; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (78.3 ఓవర్లలో 5 వికెట్లకు డిక్లేర్డ్) 260. వికెట్ల పతనం: 1–59, 2–74, 3–77, 4–178, 5–260. బౌలింగ్: బుమ్రా 6–0–22–0, సిరాజ్ 5–1–19–0, జడేజా 28.3–3–62–4, కుల్దీప్ 12–0–48–0, సుందర్ 22–2–67–1, జైస్వాల్ 1–0–9–0, నితీశ్ రెడ్డి 4–0–24–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 13; రాహుల్ (బి) హార్మర్ 6; సుదర్శన్ (బ్యాటింగ్) 2; కుల్దీప్ (బ్యాటింగ్) 4; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (15.5 ఓవర్లలో 2 వికెట్లకు) 27. వికెట్ల పతనం: 1–17, 2–21. బౌలింగ్: యాన్సెన్ 5–2–14–1, ముల్డర్ 4–1–6–0, హార్మర్ 3.5–2–1–1, మహరాజ్ 3–1–5–0. -
యాన్సెన్ జోరు...
‘కోల్‌కతాతో పోలిస్తే ఇక్కడి పిచ్ రోడ్డులా, బ్యాటింగ్‌కు బాగా అనుకూలంగా ఉంది... కాబట్టి మా బౌలర్లు ప్రభావం చూపలేకపోయారు’... ఆదివారం దక్షిణాఫ్రికాను కట్టడి చేయడంలో విఫలమైన తర్వాత భారత బౌలర్ కుల్దీప్ యాదవ్ చేసిన వ్యాఖ్య ఇది. అదే పిచ్ సోమవారానికి వచ్చే సరికి బౌలింగ్‌కు అనుకూలించింది. ఫలితంగా భారత బ్యాటర్లంతా చేతులెత్తేశారు. రెండో రోజు బ్యాటింగ్‌తో దెబ్బ కొట్టిన మార్కో యాన్సెన్ మూడో రోజు తన బౌలింగ్ పదునుతో ఏకంగా ఆరు వికెట్లు తీసి టీమిండియాను కుప్పకూల్చాడు. అతని ‘షార్ట్’ బంతులను ఆడలేక బ్యాటర్లు వరుసగా పెవిలియన్‌కు చేరడంతో భారత్ భారీ ఆధిక్యం కోల్పోయింది. ఇప్పటికే సఫారీలు పట్టు బిగించగా...ఓటమి వెంటాడుతుండగా ఏడాది వ్యవధిలో స్వదేశంలో రెండో సిరీస్ కోల్పోయే ప్రమాదంలో మన జట్టు నిలిచింది.గువహటి: దక్షిణాఫ్రికా చేతిలో రెండో టెస్టులోనూ భారత్ ఓటమికి చేరువవుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 288 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన దక్షిణాఫ్రికా భారత్‌కు ఫాలోఆన్ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి జట్టు 8 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 26 పరుగులు చేసింది. రికెల్టన్ (13 బ్యాటింగ్), మార్క్రమ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇప్పటికే 314 పరుగులు ముందంజలో ఉన్న జట్టు రెండో ఇన్నింగ్స్‌లో మరిన్ని పరుగులు జోడించి భారత్‌కు సవాల్ విసిరేందుకు సిద్ధమైంది. ఓవర్‌నైట్ స్కోరు 9/0తో సోమవారం ఆట కొనసాగించిన భారత్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 83.5 ఓవర్లలో 201 పరుగులకే ఆలౌటైంది. యశస్వి జైస్వాల్ (97 బంతుల్లో 58; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 48; 2 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. మార్కో యాన్సెన్ (6/48) చెలరేగిపోగా, హార్మర్‌కు 3 వికెట్లు దక్కాయి. టపటపా... ఓపెనర్లు జైస్వాల్, కేఎల్ రాహుల్ (22) తొలి గంటలో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ పరుగులు రాబట్టారు. అయితే మహరాజ్ చక్కటి బంతితో రాహుల్‌ను వెనక్కి పంపడంతో జట్టు తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత 85 బంతుల్లో జైస్వాల్ అర్ధసెంచరీ పూర్తయింది. ఒక దశలో భారత్ 95/1తో మెరుగైన స్థితిలో కనిపించింది. సఫారీల చక్కటి బౌలింగ్‌తో పాటు మన బ్యాటర్ల చెత్త షాట్లు జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చాయి. 27 పరుగుల వ్యవధిలో టీమ్ 6 వికెట్లు చేజార్చుకుంది. అయితే చక్కటి షాట్లతో దూసుకుపోతున్న జైస్వాల్ ఆటకు యాన్సెన్ క్యాచ్‌తో తెరపడగా, సాయి సుదర్శన్ (15) విఫలమయ్యాడు. ఇలాంటి స్థితిలో యాన్సెన్ బౌలింగ్ జోరు మొదలైంది. వరుసగా జురేల్ (0), పంత్ (7), నితీశ్ రెడ్డి (10), జడేజా (6)లను అతను వెనక్కి పంపించాడు. వీటిలో పంత్ మినహా మిగతా ముగ్గురు బౌన్సర్లకే వెనుదిరిగారు! పంత్ మాత్రం ముందుకు దూసుకొచ్చి భారీ షాట్ ఆడబోయి కీపర్‌కు క్యాచ్ ఇచ్చాడు. కీలక భాగస్వామ్యం... 122/7 వద్ద భారత ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు పట్టదనిపించింది. అయితే గత మ్యాచ్ తరహాలోనే సుందర్ మరో చక్కటి ఇన్నింగ్స్ ఆడగా, అనూహ్యంగా కుల్దీప్ యాదవ్ (19) కూడా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడి సహకరించాడు. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని ముందు రోజు చెప్పిన కుల్దీప్ నిజంగానే క్రీజ్‌లో ఎలా నిలబడాలో ఆడి చూపిస్తూ ఇన్నింగ్స్‌లో అందరికంటే ఎక్కువగా 134 బంతులు ఎదుర్కోవడం విశేషం! ఈ జోడీ ఏకంగా 34.4 ఓవర్లు ఆడి ప్రధాన బ్యాటర్లకు పాఠం నేరి్పంది. వీరిద్దరు ఎనిమిదో వికెట్‌కు 72 పరుగులు జత చేయడంతో కాస్త పరువు నిలిచింది. సుందర్‌ను అవుట్ చేసి హార్మర్ ఈ జంటను విడదీయగా... తర్వాతి రెండు వికెట్లు యాన్సెన్ ఖాతాలోనే చేరాయి. 6.82 అడుగుల ఎత్తు ఉన్న యాన్సెన్ షార్ట్ బంతులను సమర్థంగా వాడుకోగా, మన బ్యాటర్లు ఆ వలలో పడ్డారు. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 489; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 58; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 22; సుదర్శన్ (సి) రికెల్టన్ (బి) హార్మర్ 15; జురేల్ (సి) మహరాజ్ (బి) యాన్సెన్ 0; పంత్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 7; జడేజా (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 6; నితీశ్ రెడ్డి (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 10; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 48; కుల్దీప్ (సి) మార్క్రమ్ (బి) యాన్సెన్ 19; బుమ్రా (సి) వెరీన్ (బి) యాన్సెన్ 5; సిరాజ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (83.5 ఓవర్లలో ఆలౌట్) 201. వికెట్ల పతనం: 1–65, 2–95, 3–96, 4–102, 5–105, 6–119, 7–122, 8–194, 9–194, 10–201. బౌలింగ్: యాన్సెన్ 19.5–5–48–6, ముల్డర్ 10–5–14–0, మహరాజ్ 15–1–39–1, హార్మర్ 27–6–64–3, మార్క్రమ్ 10–1–26–0, ముత్తుసామి 2–0–2–0.5: తొలి ఇన్నింగ్స్‌లో ఫీల్డర్‌గా ఎయిడెన్ మార్క్రమ్ పట్టిన క్యాచ్‌ల సంఖ్య. గతంలో ఈ ఫీట్ నమోదు చేసిన 15 మంది సరసన అతను చేరగా... దక్షిణాఫ్రికా తరఫున గ్రేమ్ స్మిత్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. -
జీ20 సరికొత్త మార్గం
దేశాల మధ్య సహకారం పెంపొందించటం ద్వారా అంతర్జాతీయ ఆర్థిక సుస్థిరత సాధించాలన్న సంకల్పంతో పదిహేడేళ్ల క్రితం ఏర్పడిన జీ20 తొలిసారి అమెరికాను ధిక్కరించింది. దక్షిణాఫ్రికాలోని జొహాన్నెస్‌బర్గ్‌లో వరసగా రెండు రోజులు కొనసాగి ఆదివారం ముగిసిన సంస్థ శిఖరాగ్ర సదస్సుకు అమెరికా ముఖం చాటేయగా, దాన్ని బతిమాలటా నికీ, నచ్చజెప్పి ఒప్పించటానికీ ఒక్కరంటే ఒక్కరు ప్రయత్నించిన దాఖలా లేదు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక తన విపరీత పోకడలతో ఇంటా బయటా వ్యతిరేకత మూటగట్టుకుంటున్నారు.శ్వేతజాతి అమెరికన్లకు ఏదో ఒరగబెడుతున్నట్టు కనబడటం కోసం ప్రమాదకర నిర్ణయాలు తీసుకుంటున్నారు. పర్యావరణ క్షీణత పెద్ద బోగస్ అని వాదించటమేగాక, బొగ్గు, ఇతర శిలాజ ఇంధనాలను వినియోగించే పరిశ్రమలకు రాయితీలిస్తున్నారు. వేరే దేశాలు కూడా తన బాటలోనే నడవాలంటూ ప్రోత్సహి స్తున్నారు. మానవ కార్యకలాపాల పర్యవసానంగా భూగోళం వేడెక్కుతున్నదని, ఇది ధరిత్రి మనుగడకే పెను ముప్పని శాస్త్రవేత్తలంతా ముక్తకంఠంతో చెబుతున్నా మొండిగా వ్యవహరిస్తున్నారు.అంతర్జాతీయంగానూ అదే బాణీ అందుకున్నారు. జొహాన్నెస్‌బర్గ్ సదస్సు ప్రధాన ధ్యేయమే వాతావరణ మార్పులపై చర్చించి తగు చర్యల కోసం ప్రపంచ దేశాలకు పిలుపునివ్వటం గనుక ట్రంప్ గుర్రుగా ఉన్నారు. సదస్సు ఎజెండాను మార్చమంటూ గత కొన్ని వారాలుగా ఒత్తిడి తెచ్చారు. అది సాధ్యపడక పోవడంతో శ్వేత జాతి మైనారిటీల పట్ల దక్షిణాఫ్రికా ప్రభుత్వం వివక్ష ప్రదర్శిస్తున్నదని, అందుకు నిరసనగానే సదస్సుకు గైర్హాజరు కాదల్చుకున్నట్టు ప్రచారం లంకించు కున్నారు. ట్రంప్‌కు వంతపాడే అర్జెంటీనా అధ్యక్షుడు జావియర్ మిలీ కూడా సదస్సుకు రాలేదు.కావడానికి జీ20 సంపన్న రాజ్యాల సంస్థే అయినా దక్షిణాఫ్రికా వంటి వెనకబడిన దేశంలో సదస్సు జరిగింది. ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సమస్యలపై ఉమ్మడి అవగాహ నకు రావాలన్న ధ్యేయంతో ఈ సంస్థ ఏర్పాటైంది. ఇందులో వర్ధమాన దేశాలకు సైతం భాగస్వామ్యం కల్పించారు. ప్రపంచంలో మూడింట రెండొంతుల జనాభా గల దేశా లకూ, ప్రపంచ స్థూల ఉత్పత్తిలో దాదాపు 85 శాతం వాటా ఉన్న ఆర్థిక వ్యవస్థలకూ ఇది ప్రాతినిధ్యం వహిస్తోంది. ఈ సదస్సు నుంచి దూరం జరిగితే ప్రపంచంలో ఏకాకిగా మిగులుతామన్న స్పృహ ట్రంప్‌కు లేకపోయింది.‘నేను లేకుండా శిఖరాగ్ర సదస్సు డిక్లరేషన్‌ను విడుదల చేయొద్దని ట్రంప్ తీవ్రంగా ఒత్తిడి తెచ్చినా సదస్సు బేఖాతరు చేసింది. అంతేగాక సంప్రదాయానికి భిన్నంగా తొలి రోజునే డిక్లరేషన్‌ను ఆమోదించింది. తన గైర్హాజర్ అయోమయాన్ని సృష్టించి, డిక్లరేషన్ ఆమోదానికి అధినేతలు తటపటా యిస్తారని ట్రంప్ అనుకున్నారు. కానీ ‘అయ్య వచ్చేదాకా అమావాస్య ఆగద’ని జీ20 తేల్చిచెప్పింది. వాస్తవానికి సంస్థ అధ్యక్ష పదవి అమెరికాకు రావాలి. కానీ సదస్సుకుట్రంప్ గైర్హాజరు కావటం, కనీసం ఉన్నతాధికారులనైనా పంపక, జూనియర్ అధికారితో సరిపుచ్చటానికి నిరసనగా అధ్యక్ష పదవి బదిలీకి దక్షిణాఫ్రికా నిరాకరించింది.అది ఎప్పుడుంటుందో, అసలు జీ20లో అమెరికా కొనసాగుతుందో లేదో చెప్పలేని స్థితి ఏర్పడింది. అమెరికాలోని మియామిలో వచ్చే ఏడాది జరగాల్సిన తదుపరి సదస్సుపైనా అనిశ్చితి అలుముకుంది. భారత, చైనా, రష్యాలేకాక అమెరికా శిబిరంలో ఉండాల్సిన జర్మనీ, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, కెనడాలు సైతం ఈ సదస్సులో పాల్గొని వాతావరణ సమస్యలపైనా, ప్రపంచ అసమానతలపైనా దృష్టిపెట్టిన డిక్లరేషన్‌ను ముక్తకంఠంతో ఆమోదించాయి.పునరుత్పాదక ఇంధన వనరులపై, నిరుపేద దేశాల రుణవిమోచనపై కూడా అవగాహన కుదిరింది. భారత్ సూచించిన విధంగా ఉగ్రవాదంపైనా, మాదకద్రవ్యాలపైనా సమష్టిగా తలపడటానికి ఆమోదం తెలిపాయి. వాతావరణ సమస్యలపై శిఖరాగ్ర సదస్సు అంగీ కారానికి రావటం ట్రంప్ జీర్ణించుకోలేనిది. సదస్సు ఆమోదించిన అంశాల్లో మెజా రిటీ పేద దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలకు సంబంధించినవే. తనది ఇక గత వైభవమేనని, ఇటువంటి సదస్సులకు దూరంగా ఉంటే అంతిమంగా తన ప్రతిష్ఠ మరింత మసకబారుతుందని అమెరికా గ్రహించాలి. -
మీరు మాకు చెప్పాల్సింది: ప్రధాని మోదీతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు
జోహెన్నెస్‌బర్గ్: జీ 20 సదస్సు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్‌బర్గ్ వేదికగా జరిగింది. నవంబర్ 22, 23 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించారు. ఐకమత్యం, సమానత్వం, సుస్థిరత తదితర అంశాల థీమ్ ఆధారంగా ఈ సదస్సును నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఆఫ్రికా ఖండంలో జరిగిన జీ 20 సదస్సు ఇదే మొదటిది. దీని గురించి ఆఫ్రికా ఖండంలోని నేతలకు పెద్దగా అనుభవం లేదు. ఇదే విషయాన్ని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా.. భారత ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకొచ్చారు. జీ 20 సదస్సును నిర్వహించడం అనేది తమకు అసలు అనుభవం లేదన్నారు. ఇది అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నిర్వహించాక తెలిసిందన్నారు. ‘ జీ 20 సదస్సు నిర్వహణ కష్టమని మాకు చెప్పాల్సింది. మీరు చెప్పి ఉంటే దానికి దూరంగా ఉండేవాళ్లం.’ అని నవ్వుతూ అన్నారు రామఫోసా. ఇక జీ 20 సదస్సు కోసం భారత్ ఇచ్చిన సహకారం మరువలేనిదని ప్రధాని మోదీతో మాటామంతీ సందర్భంగా సిరిల్ రామఫోసా పేర్కొన్నారు. జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. పలు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మోదీ మాట్లాడుతూ.. ‘ టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలి. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలి. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నాం. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉంది.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఏఐ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామం. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నాం’ అని స్పష్టం చేశారు. -
ఏఐ దుర్వినియోగాన్ని అడ్డుకోవాల్సిందే
జోహన్నెస్‌బర్గ్: ఆధునిక యుగంలో అవసరాల సృష్టించుకున్న కృత్రిమ మేధ(ఏఐ) దుర్వినియోగమవుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి పటిష్టమైన చర్యలు తీసుకోవాలని, ఇందుకోసం ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఏదైనా సరే మానవ కేంద్రీకృతగా ఉండాలి తప్ప ఆర్థిక కేంద్రీకృతంగా ఉండరాదని చెప్పారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం జీ20 దేశాల అధినేతల సదస్సులో ప్రధాని మోదీ పాల్గొన్నారు. వేర్వేరు అంశాలపై జరిగిన చర్చా కార్యక్రమాల్లో మాట్లాడారు. టెక్నాలజీ అప్లికేషన్లు ఏ ఒక్క దేశానికో ఉపయోగపడేలా కాకుండా ప్రపంచమంతా వినియోగించుకొనేలా రూపొందించాలని సూచించారు. సామాన్య ప్రజల జీవితాలను మార్చే టెక్నాలజీని ప్రోత్సహించాలని తెలిపారు. ఇండియాలో ‘అందరికోసం సాంకేతికత’అనే విధానం అమలు చేస్తున్నామని వివరించారు. స్పేస్ అప్లికేషన్లు, ఏఐ, డిజిటల్ చెల్లింపుల్లో తమ దేశం ముందంజలో ఉందన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇండియాలో ఐఏ ఇంపాక్ట్ సదస్సు నిర్వహించబోతున్నామని ప్రకటించారు. జీ20 దేశాలను ఆహ్వానిస్తున్నామని చెప్పారు. ఏఐ వాడకంలో జవాబుదారీతనం కృత్రిమ మేధ అనేది ప్రపంచ అభివృద్ధి, మానవాళి బాగుకోసం ఉపయోగపడాలని ప్రధాని మోదీ స్పష్టంచేశారు. దుర్వినియోగం చేస్తే భారీ నష్టం జరుగుతుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి కఠినమైన నిబంధనలు తీసుకురావాలని చెప్పారు. డీప్‌ఫేక్, నేరాలు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ఏఐని విచ్చలవిడిగా వాడుకోవడానికి వీల్లేకుండా పారదర్శకత కోసం పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని అన్నారు. ఏఐ డిజైన్‌లోని భద్రతాపరమైన ప్రమాణాలు ఉండాలని అభిప్రాయపడ్డారు. ఏఐ వ్యవస్థలు మానవ జీవితాన్ని, భద్రతను, ప్రజా విశ్వాసాన్ని ప్రభావితం చేస్తుంటాయని గుర్తుచేశారు. అందుకే బాధ్యతాయుతమైన ఏఐ వాడకానికి పెద్దపీట వేయాలన్నారు. ఇందులో జవాబుదారీతనం ఉండాలన్నారు. కృత్రిమ మేధ మానవ శక్తి సామర్థ్యాలను పెంచే మాట వాస్తవమే అయినప్పటికీ అంతిమ నిర్ణయం తీసుకొనే బాధ్యత మనుషులపైనే ఉండాలని తేలి్చచెప్పారు. ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యం ప్రపంచ దేశాలు శిలాజ ఇంధనాల వాడకం నుంచి క్లీన్ ఎనర్జీ దిశగా ప్రయాణం ఆరంభించాలని, శిలాజేతర ఇంధనాల వినియోగం పెరగాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. క్లీన్ ఎనర్జీ కోసం రీసైక్లింగ్‌ను మరింత వేగవంతం చేయాలని, సప్లై చైన్‌పై ఒత్తిడి తగ్గించాలని, అరుదైన ఖనిజాల గుర్తింపు, వెలికితీత, శుదీ్ధకరణ, వినియోగం విషయంలో ఉమ్మడిగా పరిశోధనలు చేయాలని చెప్పారు. క్లీన్ ఎనర్జీ సహా కీలక రంగాల్లో సహకారం కోసం జీ20 దేశాల శాటిలైట్ డేటాను అందరూ సులువుగా ఉపయోగించుకొనేలా భాగస్వామ్యం ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. ఇందుకోసం ‘జీ20 ఓపెన్ శాటిలైట్ డేటా భాగస్వామ్యాన్ని’మోదీ ప్రతిపాదించారు. వ్యవసాయం, మత్స్య సంపద, విపత్తుల నిర్వహణకు జీ20 దేశాలు తమ ఉపగ్రహ సమాచారాన్ని అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవాలని కోరారు. ఆధుని కాలంలో ప్రకృతి విపత్తులు మానవాళికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయని గుర్తుచేశారు. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా ప్రకృతి విపత్తులు విరుచుకుపడ్డాయని, కోట్లాది మంది ప్రభావితమయ్యారని తెలిపారు. అందుకే విపత్తుల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించడానికి ప్రపంచదేశాల మధ్య పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని తేలిచెప్పారు. ప్రకృతి విపత్తులను ఎదుర్కోవడం ఏ ఒక్కరి వల్లనో అయ్యే పని కాదని, అందుకోసం ఉమ్మడి కృషి అవసరమని ఉద్ఘాటించారు. విపత్తుల సన్నద్ధత, సుస్థిర వ్యవసాయం, ప్రజారోగ్యం, పౌష్టికాహారం వంటి అంశాలను అనుసంధానించాలని, దీనిపై సమగ్ర వ్యూహాలు రూపొందించాలని జీ20 దేశాలకు నరేంద్రమోదీ సూచించారు. ఇండియాలో డిజాస్టర్ రిస్క్ రిడక్షన్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేశామని తెలిపారు. అలాగే రీసైక్లింగ్, అర్బన్ మైనింగ్, సెకండ్–లైఫ్ బ్యాటరీస్తోపాటు సంబంధిత రంగాల్లో నూతన ఆవిష్కరణల కోసం ‘జీ20 క్రిటికల్ మినరల్స్ సర్క్యులేటరీ కార్యక్రమం’ప్రారంభించాలని ప్రతిపాదించారు. ప్రమాదంలో ఆహార భద్రత ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు వ్యవసాయ రంగంపై పెను ప్రభావం చూపుతున్నాయని, ఫలితంగా ఆహార భద్రత ప్రమాదంలో పడుతోందని, ప్రజలకు పోషకాహారం అందడం లేదని ప్రధాని మోదీ ఆందోళన వ్యక్తంచేశారు. అందుకే వాతావరణ మార్పుల నియంత్రణపై తక్షణమే దృష్టి పెట్టాలని ప్రపంచ దేశాలను కోరారు. వాతావరణ మార్పులు విసురుతున్న సవాళ్లను అధిగమించడానికి ఇండియాలో అతిపెద్ద ఆహార భద్రత, పోషకాహార కార్యక్రమం ప్రారంభించామని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా, పంటల బీమా పథకాన్ని తీసుకొచ్చామని వివరించారు. ప్రజలకు పౌష్టికాహారం అందించడానికి తృణ ధాన్యాల సాగు, విక్రయాలను ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. -
భద్రతా మండలిలో సంస్కరణలు అత్యవసరం
జోహన్నెస్‌బర్గ్: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో సంస్కరణలు చేపట్టడం ఇకపై ఎంతమా త్రం ఐచ్ఛికం కాదని.. అత్యవసరమని ప్రధాని నరేంద్ర మోదీ తేల్చిచెప్పారు. అంతర్జాతీయ సంస్థల్లో మార్పులు తీసుకురావాల్సిందేనని అన్నారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో ఆదివారం ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా అధినేతల సదస్సులో ఆయన మాట్లాడారు. నేడు ప్రపంచ దేశాల మధ్య విభజనలు, అడ్డుగోడలు కనిపిస్తున్న తరుణంలో తమ కూటమి ఐక్యత, సహకారం, మానవతా సందేశాన్ని ఇస్తోందని తెలిపారు. మూడు దేశాల మధ్య సహకారాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి ఐబీఎస్ఏ జాతీయ భద్రతా సలహాదారుల సదస్సు నిర్వహించాలని మోదీ ప్రతిపాదించారు. ఉగ్రవా దంపై పోరాటంలో సహకారం పెంచుకోవాలని కోరారు. ఉగ్రవాదం వంటి కీలకమైన అంశాలపై ద్వంద్వ ప్రమాణాలకు తావులేదని తేల్చిచెప్పారు. ఐబీఎస్ఏ సదస్సులో మోదీతోపాటు దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమఫోసా, బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లూలా డా సిల్వా పాల్గొన్నా రు. మానవ కేంద్రిత అభివృద్ధిలో టెక్నాలజీ పాత్ర అత్యంత కీలకమని మోదీ ఉద్ఘాటించారు. యూపీఐ, కోవిన్ లాంటి ఆరోగ్య వేదికలు, సైబర్ సెక్యూరిటీ నిబంధనలు, మహిళల సారథ్యంలోని టెక్నాలజీ కార్యక్రమాలను పంచుకోవడానికి ‘ఐబీఎస్ఏ డిజిటల్ ఇన్నోవేషన్ అలయెన్స్’ ఏర్పాటు చేసుకుందామని మోదీ ప్రతిపాదించారు. 40 దేశాల్లో విద్య, ఆరోగ్యం, మహిళా సాధికారత, సోలార్ విద్యుత్ వంటి కార్యక్రమాల కోసం ఐబీఎస్ఏ నిధులు అందజేస్తున్నందుకు ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. వాతావరణ మార్పులను తట్టుకొని పంటల దిగుబడి సాధించే విధానాల కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసుకుందామని చెప్పారు. తృణధా న్యాలు, ప్రకృతి వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, గ్రీన్ ఎనర్జీ, సంప్రదాయ ఔషధాలు, ఆరోగ్య భద్రత వంటి విషయాల్లో మూడు దేశాల మధ్య పరస్పర సహకారానికి మరిన్ని అవకాశాలు ఉన్నాయని ప్రధానమంత్రి స్పష్టంచేశారు.వివిధ దేశాల అధినేతలతో సమావేశం ప్రధాని మోదీ ఆదివారం జోహన్నెస్‌బర్గ్‌లో బిజిబిజీగా గడిపారు. వరుసగా సమావేశాల్లో పాల్గొన్నారు. కెనడా ప్రధాని కార్నీ, జపాన్ ప్రధాని తకాయిచీ, ఇటలీ జార్జియో మెలోనీ, జమైకా ప్రధాని హోల్నెస్, నెదర్లాండ్స్ ప్రధాని డిక్ స్కూఫ్‌తో మోదీ సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, కీలక రంగాల్లో పరస్పర సహకారంపై వారితో చర్చించారు. ఐఎంఎఫ్ ఎండీ క్రిస్టలీనా జార్జివాతోనూ మోదీ భేటీ అయ్యారు. మోదీ ఆదివారం దక్షిణాఫ్రికా పర్యటన పూర్తిచేసుకొని స్వదేశానికి బయలుదేరారు. రమఫోసాతో మోదీ భేటీ జీ20 సదస్సు సందర్భంగా దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసాతో ప్రధాని మోదీ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపారం, వాణిజ్యం, మైనింగ్, అరుదైన ఖనిజాలు, కృత్రిమ మేధ, ఆహార భద్రత వంటి రంగాల్లో పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. భారత్–దక్షిణాఫ్రికా సంబంధాల్లో పురోగతిని సమీక్షించారు. జీ20 కూటమికి విజయవంతంగా సారథ్యం వహిస్తున్నందుకు రమఫొసాకు మోదీ అభినందనలు తెలియజేశారు. మరోవైపు ఇండియా–దక్షిణాఫ్రికా మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరిగాయి. జీ20 సదస్సు నిర్వహించడానికి మద్దతు ఇచ్చినందుకు మోదీకి రమఫోసా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. తమకు కష్టమైన పని అప్పగించారని చెప్పారు. ఈ పని చేయలేక బహుశా పారిపోయి ఉండేవాళ్లం కావొచ్చు అని రమఫోసా వ్యాఖ్యానించడంతో సమావేశంలో నవ్వులు విరిశాయి. జీ20 సదస్సుకు ఎలా ఆతిథ్యం ఇవ్వాలో భారత్‌ను చూసి నేర్చుకున్నామని ఆయన చెప్పారు. ఆరు దేశాల అతిథులు వీరే.. 1. భూటాన్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లియోన్పో నార్బు త్షెరింగ్, ఆయన భార్య ల్హాదెన్ లోటే.2. కెన్యా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మార్తా కూమ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుసాన్ నజోకి ఎన్డుంగు.3. మలేషియా ఫెడరల్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ టాన్ శ్రీ దాతుక్ నళిని పద్మనాథన్, ఆయన భార్య పసుపతి శివప్రకాశం.4. మారిషస్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీబీ రెహనా ముంగ్లి, ఆయన కుమార్తె రిబెక్కా హన్నా బీబీ గుల్బుల్. 5. నేపాల్ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ మాన్ సింగ్ రౌత్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సప్నాప్రధాన్ మల్లా, ఆయన భార్య అశోక్ బహదూర్ మల్లా. నేపాల్ న్యాయ శాఖ మంత్రి అనిల్ కుమార్ సిన్హా. భార్య ఉర్సిలా సిన్హా. 6. శ్రీలంక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ పి.పద్మన్ సురసేన, భార్య సెపాలికా సురసేన. న్యాయమూర్తి జస్టిస్ ఎస్.ఎస్. తురైరాజా, భార్య శశికళ తురైరాజా. మరో న్యాయమూర్తి జస్టిస్ ఏహెచ్ ఎండీ నవాజ్ దంపతులు. -
బ్యాటర్లదే ఇక భారం
సఫారీతో ఆడుతోంది భారతగడ్డపైనే అయినా సవాల్ మాత్రం భారత్‌కే ఎదురవుతోంది. తొలి మ్యాచ్‌లో బౌలింగ్ అదిరింది... కానీ బ్యాటింగ్ కుదరక, చిన్న లక్ష్యాన్ని సైతం చేధించలేక శుభారంభం చెదిరింది. ఈ రెండో టెస్టులో ప్రత్యర్థి బ్యాటర్లను బెంబేలెత్తించాల్సిన మన పేస్ బేల చూపులు చూసింది. తిప్పేయాల్సిన స్పిన్ తెల్లమొహమేసింది. వెరసి దక్షిణాఫ్రికా భారీ స్కోరే చేసింది. ఇప్పుడు భారమంతా భారత బ్యాటర్లపైనే పడింది. గువాహటి: రెండో టెస్టులో దక్షిణాఫ్రికా దంచేసింది. ఈ రెండు రోజులూ సఫారీదే పైచేయి! భారత బౌలింగ్ భారత గడ్డపై ఎంతలా భంగపడిందంటే... ఏడో వరుస బ్యాటింగ్‌కు దిగిన స్పిన్ ఆల్‌రౌండర్ సేనురాన్ ముత్తుసామి (206 బంతుల్లో 109; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) శతక్కొట్టగా... తొమ్మిదో వరుస పేస్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (91 బంతుల్లో 93; 6 ఫోర్లు, 7 సిక్స్‌లు) సెంచరీ మిస్ చేసుకున్నా... వన్డే తరహా ధాటిని కనబరిచాడు. దీంతో దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 151.1 ఓవర్లలో 489 పరుగుల భారీస్కోరు వద్ద ఆలౌటైంది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్‌కు 4 వికెట్లు దక్కాయి. బుమ్రా, సిరాజ్, జడేజా తలా 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆరంభించిన భారత్ 6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (7 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఇంకా 480 పరుగుల సుదూరంలోనే ఆతిథ్య జట్టు ఉంది. తొలి సెషన్లో ఫిఫ్టీ, రెండో సెషన్లో శతక్కొట్టి... సఫారీ ఓవర్‌నైట్ స్కోరు 247/6. అంటే స్పెషలిస్టు బ్యాటర్లంతా అవుటయ్యారు. ఇక మిగిలిందల్లా బౌలింగ్ ఆల్‌రౌండర్లే. వీరిని మన స్పిన్ త్రయం, పేస్ త్రయం తేలిగ్గా పడేస్తుందనుకుంటే ఓవర్‌నైట్ బ్యాటర్లు ముత్తుసామి, వెరీన్ ఆ అవకాశం ఎవరికీ ఇవ్వలేదు. దీంతో తొలిసెషన్లో ఆరుగురి ఆతిథ్య బౌలర్ల శ్రమ ఏమాత్రం ఫలించనేలేదు. ముత్తుసామి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా... వెరీన్ ఆ దిశగా కదిలాడు. జట్టు స్కోరు 316/6 వద్ద టీ విరామానికెళ్లారు. ఎట్టకేలకు తొలిసెషన్లో లభించని సాఫల్యం రెండో సెషన్లో దక్కింది. వెరీన్ (45; 5 ఫోర్లు)ను జడేజా అవుట్ చేయడంతో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అయితే ఈ వికెట్ ఆనందం ఆలౌట్‌కు తీసుకెళ్లలేదు. యాన్సెన్ రాకాతో అంతలోనే ఆవిరైంది. ఈ క్రమంలో ముత్తుసామి శతకం, యాన్సెన్ అర్ధశతకం పూర్తయ్యాయి. 428/7 వద్ద లంచ్ విరామానికి వెళ్లారు. ఆఖరి సెషన్ ఆరంభంలో ముత్తుసామి అవుటైనప్పటికీ హార్మర్ (5), కేశవ్ మహారాజ్ (12 నాటౌట్)ల కొసరంత అండతోనే యాన్సెన్ మరో 58 పరుగులు జతచేశాడు. సెంచరీకి 7 పరుగుల దూరంలో అవుటవడంతో సఫారీ ఇన్నింగ్స్‌కు 489 వద్ద తెరపడింది.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) బుమ్రా 38; రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 35; స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 49; బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41; టోని జోర్జి (సి) పంత్ (బి) సిరాజ్ 28; ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 13; ముత్తుసామి (సి) జైస్వాల్ (బి) సిరాజ్ 109; వెరీన్ (స్టంప్డ్) పంత్ (బి) జడేజా 45; యాన్సెన్ (బి) కుల్దీప్ 93; హార్మర్ (బి) బుమ్రా 5; కేశవ్ (నాటౌట్) 12; ఎక్స్‌ట్రాలు 21; మొత్తం (151.1 ఓవర్లలో ఆలౌట్) 489. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246, 7–334, 8–431, 9–462, 10–489. బౌలింగ్: బుమ్రా 32–10–75–2, సిరాజ్ 30–5–106–2, నితీశ్ 6–0–25–0, సుందర్ 26–5–58–0, కుల్దీప్ 29.1–4–115–4, జడేజా 28–2–94–2. భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ బ్యాటింగ్ 7; రాహుల్ (బ్యాటింగ్) 2; ఎక్స్‌ట్రాలు 0; మొత్తం (6.1 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా) 9. బౌలింగ్: యాన్సెన్ 3.1–1–9–0, ముల్డర్ 3–3–0–0. -
జీ-20 సదస్సులో మరో వివాదం
దక్షిణాఫ్రికా జోహాన్స్ బర్గ్ లో నిర్వహిస్తున్న జీ-2౦ శిఖరాగ్ర సమావేశం ఆదివారం సాయంత్రం ముగిసింది. అయితే ఈ సదస్సు ముగింపులో చిన్నపాటి వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సమావేశం ముగింపులో తదుపరి జీ-20 సదస్సు నిర్వహించే దేశానికిచ్చే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.జీ-20 సమావేశం ప్రారంభం నుంచి సౌతాఫ్రికా- అమెరిాకా మధ్య విభేదాలు తారస్థాయికి చేరాయి. అమెరికా ఈ సమావేశంలో పాల్గొంటుందని సౌతాఫ్రికా అధ్యక్షుడు రమఫోసా అనడం దానిని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా ఖండించడం అంతా తెలిసిందే. అయితే ఈ శిఖరాగ్ర సమావేశం ముగింపు సమయంలో మరో వివాదం చోటు చేసుకుంది. శిఖరాగ్ర సదస్సు ముగింపులో తదుపరి జీ-20 శిఖరాగ్ర సదస్సు నిర్వహించే దేశానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలి. కానీ ఆ బాధ్యతలివ్వడానికి సౌతాఫ్రికా నిరాకరించింది.తమ దేశాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలను అమెరికా అధికారికి అప్పగించబోరని సౌతాఫ్రికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా జీ-20లో మెంబర్ వారు ఈ శిఖరాగ్ర సదస్సును రిప్రజెంట్ చేయాలంటే ఏవరినైనా సరైన హోదా గల వ్యక్తిని తమ దేశానికి పంపాలన్నారు. వారు దేశాధ్యక్షుడైనా, లేదా మంత్రైనా ప్రభుత్వం చేత నియమించబడిన ప్రత్యేక రాయబారి అయినా కావచ్చు అని ఆయన తెలిపారు. లేకపోతే ఆ బాధ్యతలను ప్రభుత్వ కార్యాలయంలో ఒకే ర్యాంకు గల అధికారులచే మార్పు చేయబడుతుందని స్పష్టం చేశారు.అయితే సౌతాఫ్రికాలో శ్వేత జాతీయులపై అక్కడి ప్రభుత్వం వేదింపులకు పాల్పడుతోందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆరోపించారు. అందుకు గాను ఆ దేశంలో జరిగే జీ-౨౦ శిఖరాగ్ర సదస్సులో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశారు. ఈనేపథ్యంలో సౌతాఫ్రికా సైతం ఘూటుగానే స్పందించింది. -
టీమిండియా కెప్టెన్‌గా రాహుల్..
న్యూఢిల్లీ: దక్షిణాఫ్రికాతో జరుగనున్న వన్డే,సిరీస్‌కు సంబంధించి భారత జట్టున ప్రకటించింది బీసీసీఐ. మూడు వన్డేల సిరీస్‌కు సంబంధించి జట్లను ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను ఎంపిక చేశారు. నవంబర్ 30 నుంచి దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న వన్డే సిరీస్‌కు గిల్ స్థానంలో రాహుల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. మెడ గాయం కారణంగా ఈ వన్డే సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ గిల్ అందుబాటులో లేకపోవడంతో ఆ స్థానంలో కెప్టెన్‌గా రాహుల్‌ను నియమించారు. ఇక విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు తిరిగి జట్టులోకి వచ్చారు. రాహుల్‌కు డిప్యూటీగా రిషభ్ పంత్ వ్యవహరిస్తారు. సఫారీలతో వన్డే సిరీస్‌కు భారత జట్టుకేఎల్ రాహల్(కెప్టెన్), రిషభ్ పంత్(వైస్ కెప్టెన్), రోహిత్ శర్మ, జైశ్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, కల్దీప్ యాదవ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, రుతురాజ్ రాజ్ గైక్వాడ్, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్, ధ్రువ్ జురెల్ -
సఫారీలు కుమ్మేశారు..!
గువహటి వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది. 247/6 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో రోపు ఆట ప్రారంభించిన సఫారీలు.. నాలుగు వందల మార్కును సునాయాసంగా దాటారు. ఈరోజు(ఆదివారం, నవంబర్ 23వతేదీ) బ్యాటింగ్‌లో సెనురన్ ముత్తుసామి సెంచరీ నమోదు చేశాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన ముత్తుసామి 206 బంతులు ఎదుర్కొని 10 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 109 పరుగులు సాధించాడు. ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో బ్యాటింగ్‌కు వచ్చిన కైల్ వెర్రెయెన్నె మార్కో జాన్సెన్లు సైతం ఆకట్టుకున్నారు. వెర్రెయెన్నె 45 పరుగులు సాధించగా, జాన్సెన్ 93 పరుగులు చేశాడు. జాన్సెన్ 91 బంతుల్లో 6 ఫోర్లు, 7 సిక్స్‌లతో చెలరేగి ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఏడో వికెట్‌కు 88 పరుగుల భాగస్వామ్యం, ఎనిమిదో వికెట్‌కు 97 పరుగుల భాగస్వామ్యం లభించడంతో సఫారీలు భారీ స్కోరు నమోదు చేశారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు సాధించగా,రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు దక్కాయి. చివరి వికెట్‌గా పెవిలియన్ చేరిన జాన్సెన్ తృటిలో సెంచరీ కోల్పోయాడు. భానత బౌలర్లలో కుల్దీప్ 115 పరుగులు సమర్పించుకోగా, సిరాజ్ 106 పరుగులు ఇచ్చాడు. 25 ఓవర్లు మించి వేసిన బౌలర్లలో బుమ్రా ఒక్కడే కుదురుగా పరుగులు ఇచ్చాడు. బుమ్రా 32 ఓవర్లు వేసి 75 పరుగులు ఇచ్చాడు. అనంతరం తొలి ఇన్నిం గ్స్ ఆరంభించిన భారత్.. ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 9 పరుగులు చేసింది. జైశ్వాల్(7 బ్యాటింగ్), రాహుల్(2 బ్యాటింగ్)క్రీజ్‌లో ఉన్నారు. -
జీ20 సౌభాగ్యానికి నాలుగు సూత్రాలు
జోహన్నెస్‌బర్గ్: ప్రపంచ అభివృద్ధి ప్రాధాన్యతలపై పునరాలోచన చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రాధాన్యతల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. సమగ్ర, సుస్థిరాభివృద్ధి నమూనాలను ఆచరించాలని పేర్కొన్నారు. నాగరికత అందించిన విజ్ఞానం నుంచి అభివృద్ధి నమూనాను స్వీకరించాలని అన్నారు. జీ20 సభ్యదేశాల సౌభాగ్యమే లక్ష్యంగా నాలుగు కీలక సూత్రాలను ప్రతిపాదించారు. ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని ఒకచోట భద్రపర్చి, భవిష్యత్ తరాలకు అందించేలా చర్యలు చేపట్టాలని స్పష్టంచేశారు. ఆఫ్రికా యువతలో నైపుణ్యాలు పెంచాలన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు, విపత్తుల సమయంలో సహకరించుకోవడానికి సభ్యదేశాలన్నీ కలిసి ఒక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. అలాగే మాదక ద్రవ్యాలు– ఉగ్రవాదుల భాగస్వామ్యాన్ని అంతం చేయడానికి సభ్యదేశాలు కలిసికట్టుగా పనిచేయాలని ఉద్ఘాటించారు. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో శనివారం జీ20 దేశాల అధినేతల సదస్సు ప్రారంభౌత్సవంలో ప్రధాని మోదీ ప్రసంగించారు. ప్రధానంగా నాలుగు అంశాలను ప్రస్తావించారు. ప్రపంచ అభివృద్ధి విధానాలపై పునరాలోచన చేయాల్సిన సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. సరైన వనరులు, పర్యావరణ సమతుల్యత లేని ప్రాంతాలు అభివృద్ధిలో వెనుకంజలోనే ఉండిపోతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. ఈ పరిస్థితిలో తప్పనిసరిగా మార్పు రావాలన్నారు. భారతీయ నాగరికత విలువల్లో అంతర్భాగమైన ‘సమీకృత మానవతావాదం’ ప్రపంచమంతటా అభివృద్ధి, పర్యావరణానికి మధ్య సమతూకం సాధించడానికి దోహదపడుతుందని వివరించారు. భవిష్యత్ తరాలకు సంప్రదాయ విజ్ఞానం ‘‘కాల పరీక్షకు నిలిచిన సుస్థిర జీవన విధానాలను పరిరక్షించుకోవాలి. ఇందుకోసం జీ20 ఆధ్వర్యంలో ప్రపంచ సంప్రదాయ విజ్ఞానాన్ని భద్రపర్చుకోవాలి. ఆరోగ్యం, పర్యావరణం, సామాజిక సంబంధాలు వంటి అంశాలపై ప్రాచీన విజ్ఞానాన్ని రికార్డు చేసి, భవిష్యత్ తరాలకు అందించాలి. వాతావరణంపై ప్రతికూల ప్రభావాలు పెరగడంతోపాటు ప్రజల జీవన విధానాలు అనూహ్యంగా మారిపోతున్న నేటి తరుణంలో ఇది చాలా అవసరం. సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం ప్రపంచ ప్రగతికి ఆఫ్రికా ప్రగతి అత్యంత కీలకం. ఆఫ్రికా యువత అభివృద్ధి, సాధికారత కోసం వారికి నైపుణ్యాలు నేరి్పంచాలి. ఇందులో భాగంగా జీ20 నేతృత్వంలో ఆఫ్రికా స్కిల్స్ మల్టిప్లయర్ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. దీనికి జీ20 దేశాలన్నీ సహకరించాలి. తొలుత శిక్షకులకు శిక్షణ ఇవ్వాలి. వచ్చే పదేళ్లలో కనీసం 10 లక్షల మంది సర్టిఫైడ్ ట్రైనర్లను తయారు చేద్దాం. ఈ ట్రైనర్లు ఆఫ్రికా యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తారు. తద్వారా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు లభిస్తాయి. సంక్షోభ సమయాల్లో సహకారానికి.. ఆరోగ్య సేవల కోసం జీ20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేద్దాం. జీ20 సభ్యదేశాల నుంచి సుశిక్షితులైన వైద్య నిపుణులు ఈ బృందంలో చేరాలి. సభ్యదేశాల్లో ఎక్కడైనా ఆరోగ్య అత్యవసర పరిస్థితి తలెత్తినప్పుడు, ప్రకృతి విపత్తులు విరుచుకుపడినప్పుడు ఈ నిపుణులు తక్షణమే రంగంలోకి సేవలందిస్తారు. మాదక ద్రవ్యాలతో పెనుముప్పు ఫెంటానిల్ వంటి సింథటిక్ డ్రగ్స్ మానవాళికి పెనుముప్పుగా మారుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యాన్ని, సామాజిక స్థిరత్వాన్ని, భద్రతను దెబ్బతీస్తున్నాయి. ఉగ్రవాద ముఠాలు డ్రగ్స్ వ్యాపారంలోనూ ఆరితేరిపోతున్నాయి. డ్రగ్స్–టెర్రర్ బంధాన్ని దీటుగా ఎదుర్కోవాల్సిందే. మాదక ద్రవ్యాల వ్వవస్థలను నాశనం చేయాలి. అక్రమ నగదు ప్రవాహాన్ని అడ్డుకోవాలి. ఉగ్రవాదులకు నిధులందించే వనరులను బలహీనపర్చాలి. ఇవన్నీ జరగాలంటే ప్రపంచదేశాల ఐక్య కార్యాచరణ కావాలి. మాదక ద్రవ్యాలు–ఉగ్రవాదుల బంధాన్ని కూకటివేళ్లతో పెకిలించడానికి ‘డెడికేటెడ్ జీ20 కార్యక్రమం’ ప్రారంభిద్దాం’’ అని మోదీ అన్నారు. అరుదైన మూలకాలపై దృష్టిపెడదాం ‘అరుదైన మూలకాలు, సహజ భూఅయస్కాంత పదార్థాలపై దృష్టిపెట్టాలి. కొత్త బ్యాటరీలపైనే ఆధారపడకుండా రీసైక్లింగ్, పట్టణప్రాంతాల్లో వాడేసిన డిజిటల్ వస్తువులు, ఉపకరణాల నుంచి అరుదైన మూలకాల సేకరణతో అర్బన్ మైనింగ్ చేద్దాం. వాడేసిన బ్యాటరీలను గ్రిడ్ స్టెబిలైజర్, బ్యాకప్ పవర్ వంటి రంగాల్లో సది్వనియోగం చేయడంతోపాటు సంబంధిత రంగానికి అనువైన ఆవిష్కరణలపై దృష్టిసారిద్దాం’ అని మోదీ అన్నారు.భారత్, ఆ్రస్టేలియా, కెనడా త్రైపాక్షిక భాగస్వామ్యం సాంకేతిక పరిజ్ఞానంతోపాటు నూతన ఆవిష్కరణల విషయంలో పరస్పరం సహకరించుకోవడానికి భారత్, ఆ్రస్టేలియా, కెనడా జట్టుకట్టబోతున్నాయి. ఈ త్రైపాక్షిక భాగస్వామ్యాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రకటించారు. ఆయన శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ఆ్రస్టేలియా ప్రధాని ఆంథోనీ అల్బానీస్, కెనడా ప్రధాని కారీ్నతో సమావేశమయ్యారు. టెక్నాలజీ, ఇన్నోవేషన్‌లో కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నామన్నారు. -
భారత బౌలర్ల పైచేయి
బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్...టాస్ గెలిచిన తర్వాత తొలి వికెట్‌కు 82 పరుగుల శుభారంభం... ఆ తర్వాతా బవుమా, స్టబ్స్ కీలక భాగస్వామ్యం... అయినా సరే దక్షిణాఫ్రికా తొలి రోజును సంతృప్తికరంగా ముగించలేకపోయింది. మెరుగ్గానే మొదలు పెట్టినా ఒక్కరూ కనీసం అర్ధ సెంచరీ కూడా సాధించలేకపోయారు. భారత బౌలర్లు సరైన సమయంలో కీలక వికెట్లు పడగొట్టి ప్రత్యర్థి ని నిలువరించారు. ముఖ్యంగా కుల్దీప్ యాదవ్ పదునైన బౌలింగ్‌తో తొలి రోజు టీమిండియా పైచేయి సాధించింది. నేడు మిగిలిన నాలుగు వికెట్లను భారత్ ఎంత తొందరగా పడగొడుతుందో చూడాలి.గువహటి: భారత్‌తో మొదలైన రెండో టెస్టులో తొలి రోజు దక్షిణాఫ్రికా బ్యాటింగ్ తడబడింది. శనివారం ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 81.5 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ (112 బంతుల్లో 49; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా, కెప్టెన్ తెంబా బవుమా (92 బంతుల్లో 41; 5 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 84 పరుగులు జోడించారు. ప్రస్తుతం సెనూరన్ ముత్తుసామి (25 బ్యాటింగ్), కైల్ వెరీన్ (1 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ (3/48) రాణించగా, బుమ్రా పొదుపుగా బౌలింగ్ చేశాడు. కోల్‌కతా టెస్టులో ఆడిన భారత జట్టులో రెండు మార్పులు జరిగాయి. గిల్, అక్షర్ స్థానాల్లో సాయి సుదర్శన్, నితీశ్ కుమార్ రెడ్డి టీమ్‌లోకి వచ్చారు. దక్షిణాఫ్రికా కార్బిన్ బాష్ స్థానంలో ముత్తుసామికి అవకాశం కల్పించింది. శుభారంభం... దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను ఎయిడెన్ మార్క్రమ్ (81 బంతుల్లో 38; 5 ఫోర్లు), ర్యాన్ రికెల్టన్ (82 బంతుల్లో 35; 5 ఫోర్లు) జాగ్రత్తగా మొదలు పెట్టారు. మార్క్రమ్ ఖాతా తెరిచేందుకు 17 బంతులు తీసుకున్నాడు. అయితే బుమ్రా బౌలింగ్‌లో 4 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మార్క్రమ్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను స్లిప్‌లో రాహుల్ వదిలేశాడు. నితీశ్ కుమార్‌తో 4 ఓవర్లు వేయించగా అతను 21 పరుగులు ఇచ్చాడు. తొలి సెషన్లో ఈ భాగస్వామ్యం మరింత బలపడుతున్న దశలో బుమ్రా బ్రేక్ ఇచ్చాడు. చక్కటి బంతితో మార్క్రమ్ను బుమ్రా బౌల్డ్ చేయడంతో టీ విరామం లభించింది. రెండో సెషన్లో రెండో బంతికే రికెల్టన్ను అవుట్ చేసి కుల్దీప్ తన విలువను ప్రదర్శించాడు. కీలక భాగస్వామ్యం... రెండో సెషన్లో స్టబ్స్, బవుమా పార్ట్నర్షిప్ దక్షిణాఫ్రికాను ఆదుకుంది. వీరిద్దరు ఓపిగ్గా చక్కటి డిఫెన్స్‌తో ఆడుతూ స్కోరు బోర్డును నడిపించారు. 27 పరుగుల వద్ద జడేజా బౌలింగ్‌లో బవుమా అదృష్టవశాత్తూ అంపైర్ రివ్యూలో త్రుటిలో ఎల్బీగా అవుట్ కాకుండా బతికిపోయాడు. స్పిన్నర్లు ప్రభావం చూపడంతో పరుగులు రావడం కష్టంగా మారిపోయింది. లంచ్ తర్వాత పూర్తిగా భారత బౌలర్ల ఆధిపత్యం కొనసాగి దక్షిణాఫ్రికా వరుసగా వికెట్లు చేజార్చుకుంది. జడేజా బౌలింగ్‌లో పేలవ షాట్‌తో బవుమా వెనుదిరిగాడు. ఆ తర్వాత తక్కువ వ్యవధిలో స్టబ్స్, ముల్డర్ (13)లను అవుట్ చేసి కుల్దీప్ దెబ్బ తీశాడు. అయితే టోనీ జోర్జీ (59 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్), ముత్తుసామి కలిసి మళ్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తూ 45 పరుగులు జోడించారు. అయితే కొత్త బంతితో తన తొలి ఓవర్లోనే జోర్జీని సిరాజ్ పెవిలియన్ పంపించాడు. అదే ఓవర్లో మరో నాలుగు బంతుల తర్వాత వెలుతురు మందగించడంతో నిర్ణీత ఓవర్లలో మరో 8.1 ఓవర్లు ఉండగానే అంపైర్లు ఆటను నిలిపివేశారు. దక్షిణాఫ్రికా టాప్–5 బ్యాటర్లంతా 25–49 మధ్యలోనే పరుగులు చేశారు. టెస్టు క్రికెట్లో ఇలా జరగడం ఇది మూడో సారి మాత్రమే.స్కోరు వివరాలుభారత్ ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) బుమ్రా 38; రికెల్టన్ (సి) పంత్ (బి) కుల్దీప్ 35; స్టబ్స్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 49; బవుమా (సి) జైస్వాల్ (బి) జడేజా 41; జోర్జి (సి) పంత్ (బి) సిరాజ్ 28; ముల్డర్ (సి) జైస్వాల్ (బి) కుల్దీప్ 13; ముత్తుసామి (బ్యాటింగ్) 25; వెరీన్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (81.5 ఓవర్లలో 6 వికెట్లకు) 247. వికెట్ల పతనం: 1–82, 2–82, 3–166, 4–187, 5–201, 6–246. బౌలింగ్: బుమ్రా 17–6–38–1, సిరాజ్ 17.5–3–59–1, నితీశ్ రెడ్డి 4–0–21–0, సుందర్ 14–3–36–0, కుల్దీప్ 17–3–48–3, జడేజా 12–1–30–1. కెప్టెన్లకు జ్ఞాపిక గువహటిలో తొలి టెస్టు కావడంతో మ్యాచ్ ఆరంభానికి ముందు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. స్టేడియం బొమ్మ ముద్రించిన చిత్రపటంపై ఇరు జట్ల కెప్టెన్లు తమ ఆటోగ్రాఫ్‌లు చేసి అస్సాం క్రికెట్ అసోసియేషన్‌కు అందించారు. అనంతరం బీసీసీఐ కార్యదర్శి, అస్సాంకే చెందిన దేవజిత్ సైకియా తమ తరఫున పంత్, బవుమాలకు ప్రత్యేక జ్ఞాపికలు అందజేశారు. అధికారిక లెక్కల ప్రకారం బర్సపర మైదానంలో తొలి రోజు 15,448 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. -
ఇదే సరైన సమయం: జీ20 సమ్మిట్‌లో ప్రధాని మోదీ
భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన G20 సమ్మిట్ మొదటి సెషన్లో ప్రసంగించారు. ప్రారంభ సమావేశంలో ప్రసంగించిన మోదీ పర్యావరణ సమతుల్యత, సాంస్కృతికంగా, సామాజికంగా సమ్మిళిత జీవన విధానాలను పరిరక్షించడానికి G20 కింద గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. సర్వతోముఖ వృద్ధి అనే కలను సాకారం చేసుకోవడానికి కొన్ని కార్యాచరణలను ప్రతిపాదించారు. ప్రపంచ అభివృద్ధి పారామితులను లోతుగా పునరాలోచించాలని పిలుపునిచ్చారు అలాగే మాదక ద్రవ్య-ఉగ్రవాద సంబంధాన్ని ఎదుర్కోవడానికి G20 ఇనీషియేటివ్‌ను, ప్రపంచ ఆరోగ్య సంరక్షణ ప్రతిస్పందన బృందాన్ని ఏర్పాటు చేయాలని మోదీ ప్రతిపాదించారు.Spoke at the first session of the G20 Summit in Johannesburg, South Africa, which focussed on inclusive and sustainable growth. With Africa hosting the G20 Summit for the first time, NOW is the right moment for us to revisit our development parameters and focus on growth that is… pic.twitter.com/AxHki7WegR— Narendra Modi (@narendramodi) November 22, 2025దేశ అతిపెద్ద ఆర్థిక కేంద్రం జోహన్నెస్‌బర్గ్‌లో మూడు రోజుల పాటు జరిగే 20వ జీ20 నాయకుల శిఖరాగ్ర సమావేశంలో కీలక అంశాలపై చర్చించనున్నారు. తొలిరోజున సమ్మిళిత, స్థిరమైన వృద్ధిపై దృష్టి సారించింది. ఆఫ్రికా మొదటిసారిగా G20 సమ్మిట్‌ను నిర్వహిస్తున్నందున, మన అభివృద్ధి పారామితులను పునఃసమీక్షించడానికి, సమ్మిళిత స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టడానికి ఇదే సరైన సమయమని మోదీ పేర్కొన్నారు. భారతదేశ నాగరికత విలువలు, ముఖ్యంగా సమగ్ర మానవతావాదం సూత్రం ముందుకు సాగడానికి ఒక మార్గాన్ని అందిస్తుందని తెలిపారు. చదవండి: 17 ఏళ్ల తరువాత ఇండియాకు ఎన్ఆర్ఐ జంట, వీడియో వైరల్ప్రధాని మోదీ ప్రతిపాదించిన వాటిల్లో మొదటిది G20 గ్లోబల్ ట్రెడిషనల్ నాలెడ్జ్ రిపోజిటరీని సృష్టించడం. ఈ విషయంలో భారతదేశానికి గొప్ప చరిత్ర ఉందనీ, ఇది మంచి ఆరోగ్యం, శ్రేయస్సును మరింతగా పెంచడానికి మన సమిష్టి జ్ఞానాన్ని అందించడానికి దోహదపడుతుందని మోదీ చెప్పారు. ఇందుకోసం G20 గ్లోబల్ హెల్త్‌కేర్ రెస్పాన్స్ టీమ్‌ను ఏర్పాటు చేయాలని భారత్ ప్రతిపాదిస్తోందన్నారు. ఆరోగ్య అత్యవసర పరిస్థితులు మరియు ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో కలిసి పనిచేస్తే బలంగా ఉంటుందని, ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో వేగంగా మోహరించడానికి సిద్ధంగా ఉన్న తోటి G20 దేశాల నుండి శిక్షణ పొందిన వైద్య నిపుణుల బృందాలను తయారు చేసుకోవడం కీలకమన్నారు.భారతదేశం మాదకద్రవ్య-ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా సవాళ్లను అధిగమించడానికి, ముఖ్యంగా ఫెంటానిల్ వంటి అత్యంత ప్రమాదకరమైన పదార్థాల వ్యాప్తిని అధిగమించడానికి గాను G20 ఇనీషియేటివ్‌ను ప్రతిపాదించారు. మాదకద్రవ్య-ఉగ్రవాద ఆర్థిక వ్యవస్థను బలహీనపరుద్దామని మోదీ పిలుపునిచ్చారు. భారతదేశం ఎల్లప్పుడూ ఆఫ్రికాతో సంఘీభావంగా నిలిచిందనీ, ఆఫ్రికన్ యూనియన్ శాశ్వత G20 సభ్యునిగా మారడం తమకు గర్వకారణమన్నారు. రాబోయే దశాబ్దంలో ఆఫ్రికాలో పది లక్షల సర్టిఫైడ్ శిక్షకులను సృష్టించడం తమ సమిష్టి లక్ష్యం అని మోదీ పేర్కొన్నారు. చదవండి: దాదాపు రెండు దశాబ్దాల జ్ఞాపకం : అసలా విమానం ఉన్నట్టే తెలియదు! -
దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీ
జోహన్నెస్‌బర్గ్: ప్రపంచ దేశాల అధినేతలతో ఫలవంతమైన చర్చల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన కీలక అంశాలపై వారితో చర్చించబోతున్నానని తెలిపారు. జీ20 దేశాల అధినేతల సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఘన స్వాగతం లభించింది. దక్షిణాఫ్రికా వైమానిక దళం మోదీకి రెడ్‌కార్పెట్ స్వాగతం పలికింది. ఎయిర్‌పోర్టులో సంప్రదాయ నృత్యాలు చేసిన కళాకారులకు మోదీ అభివాదం చేశారు. జీ20 సదస్సు కోసం జోహన్నెస్‌బర్గ్‌కు చేరుకున్నట్లు ప్రధానమంత్రి ‘ఎక్స్’లో పోస్టుచేశారు. దక్షిణాఫ్రికా ప్రభుత్వం జీ20 సదస్సుకు ఆతిథ్యం ఇస్తుండడం ఇదే మొదటిసారి. 2023లో జీ20కి భారత్ సారథ్యం వహించిన సమయంలోనే దక్షిణాఫ్రికా ఈ కూటమిలో భాగస్వామిగా చేరింది. కూటమిలో పరస్పర సహకారాన్ని బలోపేతం చేసుకోవడం, అభివృద్ధి ప్రాధాన్యతలను మరింత ముందుకు తీసుకెళ్లడమే తమ లక్ష్యమని మోదీ ఉద్ఘాటించారు. అందరికీ ఉజ్వలమైన భవిష్యత్తులను అందించాలన్నదే ఆశయమని పేర్కొన్నారు. నగరంలోని ఓ హోటల్లో బస చేసేందుకు వచ్చిన మోదీకి ప్రవాస భారతీయ చిన్నారులు స్వాగతం పలికారు. గణపతి ప్రార్థన, శాంతి మంత్రంతోపాటు వేద మంత్రాలు పఠించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బిహార్, తమిళనాడు, కేరళ, బెంగాల్, రాజస్తాన్, గుజరాత్ తదితర రాష్ట్రాల సంప్రదాయ నృత్యాలను, కళారూపాలను ప్రదర్శించారు. సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెప్పారు. చిన్నారులను మోదీ అభినందించారు. భారత్–దక్షిణాఫ్రికా మధ్య సంబంధాలకు ప్రవాస భారతీయులే వారధులు అని ప్రశంసించారు. ఆయన ఈనెల 23వ తేదీ దాకా దక్షిణాఫ్రికాలో పర్యటించబోతున్నారు. జీ20 సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు. వివిధ దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఇండియా–బ్రెజిల్–దక్షిణాఫ్రికా(ఐబీఎస్ఏ) ఆరో సదస్సుకు సైతం హాజరవుతారు. దక్షిణాఫ్రికాలోని ప్రవాస భారతీయులతోనూ భేటీ అవుతారు. అయితే, ఈసారి 20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, చైనా అధినేత షీ జిన్‌పింగ్ హాజరు కావడం లేదు. -
IND Vs SA: సిరీస్ కాపాడుకుంటారా!
పుష్కర కాలం పాటు సొంతగడ్డపై ఆడిన ప్రతీ టెస్టు సిరీస్ గెలిచిన భారత్ ఇప్పుడు ఏడాది వ్యవధిలో రెండో సిరీస్‌ను చేజార్చుకునే ప్రమాదంలో పడింది. తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో అనూహ్యంగా ఓడిన జట్టు సిరీస్ గెలుచుకునే అవకాశం లేకపోగా, ఇప్పుడు దానిని కాపాడుకునే ప్రయత్నంలో బరిలోకి దిగుతోంది. కోల్‌కతా పిచ్ మనకు పూర్తి ప్రతికూలంగా మారి చర్చకు దారి తీసిన నేపథ్యంలో... ఈసారి ఎలాంటి పిచ్ భారత్‌కు అనుకూలిస్తుందో చెప్పలేని పరిస్థితి ఉంది. మరోవైపు పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచిన వరల్డ్ చాంపియన్ దక్షిణాఫ్రికా అదే ఉత్సాహంతో మరోసారి తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి పైచేయి సాధించాలని భావిస్తోంది. ఇలాంటి స్థితిలో రెండో టెస్టు ఎంత హోరాహోరీగా సాగుతుందనేది ఆసక్తికరం. గువాహటి: భారత్, దక్షిణాఫ్రికా మధ్య సిరీస్ ఫలితాన్ని తేల్చే రెండో టెస్టు మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. మూడు రోజుల్లోపే ముగిసిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా అనూహ్య విజయం సాధించగా, ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. గత టెస్టులో మెడ నొప్పితో అర్ధాంతరంగా తప్పుకున్న శుబ్‌మన్ గిల్ ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో రిషబ్ పంత్ తొలిసారి జట్టు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. పక్కటెముకల గాయంతో తొలి టెస్టు ఆడని దక్షిణాఫ్రికా పేసర్ రబడ ఇంకా కోలుకోకపోవడంతో ఈ మ్యాచ్ నుంచి కూడా తప్పుకున్నాడు. చివరిసారి దక్షిణాఫ్రికా 2000లో భారత గడ్డపై టెస్టు సిరీస్ గెలుచుకుంది. సుదర్శన్‌కు అవకాశం! గత టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలో మన బ్యాటర్లెవరూ కనీసం అర్ధసెంచరీ కూడా నమోదు చేయలేకపోయారు. ఆ వైఫల్యాన్ని దాటి ఓపెనర్లు జైస్వాల్, రాహుల్ శుభారంభం ఇవ్వాల్సి ఉంది. గిల్ గాయం కారణంగా ఒక తప్పనిసరి మార్పుతో జట్టు బరిలోకి దిగనుంది. గిల్ స్థానంలో వచ్చే సాయి సుదర్శన్ ఎలాంటి ప్రభావం చూపిస్తాడనేది చెప్పలేం. ధ్రువ్ జురేల్ మరింత జాగ్రత్తగా ఆడాల్సి ఉండగా, ఇప్పుడు కొత్తగా కెప్టెన్సీతో పంత్‌పై బాధ్యత మరింత పెరిగింది. అతని ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగితే భారత్ పటిష్ట స్థితికి చేరుతుంది. జడేజా, సుందర్‌ల బ్యాటింగ్ మరోసారి కీలకం కానుంది. పేసర్లుగా బుమ్రా, సిరాజ్ ఖాయం కాగా, పిచ్‌ను బట్టి మూడో పేసర్‌కు అవకాశం దక్కవచ్చు. అదే మేనేజ్మెంట్ ఆలోచన అయితే నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులోకి వస్తాడు. ఈడెన్‌లో నలుగురు స్పిన్నర్లతో ఆడి విమర్శలపాలైన జట్టు నితీశ్‌ను ఆడిస్తే అక్షర్‌ను పక్కన పెట్టవచ్చు. ఆఫ్ స్పిన్నర్ హార్మర్ చెలరేగుతున్న నేపథ్యంలో ఆరుగురు లెఫ్ట్ హ్యాండర్లతో ఆడటం మరింత ఇబ్బందికరం అనుకుంటే కూడా నితీశ్‌కు చాన్స్ లభిస్తుంది. బ్రెవిస్‌కు చోటు! కోల్‌కతా టెస్టు ఘన విజయం ఇచ్చిన జోష్‌తో దక్షిణాఫ్రికా బరిలోకి దిగుతోంది. బ్యాటింగ్‌లో ఆ జట్టు తడబడినా బౌలర్లు గెలుపును అందించారు. ఈసారి కూడా హార్మర్, మహరాజ్ కీలకం కానున్నారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తే వీరిద్దరు చెలరేగిపోగలరు. అవసరమైతే మూడో స్పిన్నర్‌గా ముత్తుసామిని కూడా ఆడించాలని టీమ్ భావిస్తోంది. తొలి మ్యాచ్‌లో ప్రభావం చూపలేకపోయిన ముల్డర్ స్థానంలో అతనికి స్థానం దక్కవచ్చు. పిచ్ స్పిన్‌కు అనుకూలంగా లేకపోతే ముల్డర్ స్థానంలో మరో బ్యాటర్ బ్రెవిస్‌కు చాన్స్ దక్కవచ్చు. దూకుడుగా ఆడే బ్రెవిస్ కొద్ది సేపట్లోనే ఆట గమనాన్ని మార్చగల సమర్థుడు. జట్టు బ్యాటింగ్‌కు మరోసారి కెప్టెన్ బవుమా మూల స్థంభంలా ఉన్నాడు. ఇతర బ్యాటర్ల నుంచి అతనికి తగినంత సహకారం కావాలి. రికెల్టన్, జోర్జిలకు తగినంత అనుభవం లేకపోగా... ఓపెనర్‌గా మార్క్రమ్ రాణించడం జట్టుకు అవసరం. పేసర్లు యాన్సెన్, బాష్ కూడా భారత్‌పై ప్రభావం చూపించగలరు. గువాహటిలో తొలి టెస్టు భారత్‌లో టెస్టు మ్యాచ్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న 30వ వేదికగా గువాహటి నిలుస్తోంది. ఇక్కడి బర్సపర స్టేడియంలో ఇప్పటి వరకు 2 వన్డేలు, 4 టి20లతో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగాయి. ఇటీవల మహిళల వన్డే వరల్డ్ కప్‌లో భాగంగా ఐదు మ్యాచ్‌లకు ఈ మైదానం ఆతిథ్యం ఇచ్చింది. బర్సపరలో కొత్త మైదానం ప్రారంభానికి ముందు 1983 నుంచే గువాహటి నెహ్రూ స్టేడియంలో వన్డేలు జరిగాయి.ముందు టీ విరామం, ఆ తర్వాత లంచ్... ఈశాన్య రాష్ట్రం అసోంలోని వాతావరణ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని టెస్టు మ్యాచ్ సమయాల్లో స్వల్ప మార్పు చేశారు. ఇక్కడ సాయంత్రం తొందరగా చీకటి పడిపోతుంది. దాంతో మ్యాచ్‌ను ఉదయం 9 గంటల నుంచి మొదలుపడుతున్నారు. తొలి సెషన్ తర్వాత 11 గంటలకు టీ విరామం ఇస్తారు. 1:20కి లంచ్ బ్రేక్ అవుతుంది. సాయంత్రం 4 గంటలకు ఆట ముగుస్తుంది. ఒకటే మ్యాచ్‌కు కెప్టెన్‌గా అంటే చేసేదేముంటుంది. అయితే దేశానికి నాయకత్వం వహించడం అంటే గర్వపడాల్సిన క్షణం. నాకు అవకాశం ఇచ్చిన బీసీసీఐకి కృతజ్ఞతలు. వ్యూహాల్లో కెప్టెన్‌గా సాంప్రదాయ శైలిని అనుసరించడంతో పాటు కొత్త తరహాలో కూడా ఆలోచిస్తాను. ఆటగాళ్లకు స్వేచ్ఛనిస్తూనే జట్టు కోసం సరైన నిర్ణయాలు తీసుకోగలననే నమ్మకం ఉంది. –రిషభ్ పంత్, భారత జట్టు 38వ టెస్టు కెప్టెన్ పిచ్, వాతావరణం కోల్‌కతాతో పోలిస్తే మెరుగైన పిచ్ అని అందరూ అంగీకరించారు. ఆరంభంలో బౌన్స్, బ్యాటింగ్‌కు అనుకూలిస్తూ ఆ తర్వాత స్పిన్ ప్రభావం కనిపించవచ్చు. అయితే ఇక్కడ తొలి టెస్టు కాబట్టి ఎవరికీ స్పష్టత లేదు. మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం లేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: పంత్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సుదర్శన్, జురేల్, జడేజా, సుందర్, అక్షర్/నితీశ్, కుల్దీప్, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్/ బ్రెవిస్, జోర్జి, స్టబ్స్, వెరీన్, బాష్, యాన్సెన్, హార్మర్, మహరాజ్. -
భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్ల ప్రకటన
త్వరలో భారత్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల (India vs South Africa) కోసం వేర్వేరు సౌతాఫ్రికా జట్లను (South Africa) ఇవాళ (నవంబర్ 21) ప్రకటించారు. వన్డే జట్టు కెప్టెన్‌గా టెంబా బవుమా (Temba Bavuma), టీ20 జట్టు కెప్టెన్‌గా ఎయిడెన్ మార్క్రమ్ (Aiden Markram) ఎంపికయ్యారు. గాయం కారణంగా గత కొంతకాలంగా జట్టుకు దూరంగా ఉన్న స్టార్ పేసర్ అన్రిచ్ నోర్జే టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. తాజాగా పాకిస్తాన్‌పై అరంగేట్రం చేసిన రూబిన్ హెర్మన్ వన్డే జట్టులో కొనసాగాడు. క్వింటన్ డికాక్, ఎయిడెన్ మార్క్రమ్, ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, మార్కో జన్సెన్ రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు.మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ నవంబర్ 30, డిసెంబర్ 3, 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, విశాఖ వేదికలుగా జరుగనుంది. అనంతరం ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, ముల్లాన్‌పూర్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికగా జరుగనుంది.భారత్‌తో జరిగే వన్డే సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:టెంబా బవుమా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రూబిన్ హెర్మన్, కేశవ్ మహారాజ్, మార్కో జన్సెన్, ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, ర్యాన్ రికెల్టన్, ప్రెనెలన్ సుబ్రాయన్.భారత్‌తో జరిగే టీ20 సిరీస్‌కు దక్షిణాఫ్రికా జట్టు:ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, రీజా హెండ్రిక్స్, మార్కో జన్సెన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, డేవిడ్ మిల్లర్, లుంగి ఎంగిడి, అన్రిచ్ నోర్జే, ట్రిస్టన్ స్టబ్స్.చదవండి: టీమిండియాతో సెమీఫైనల్.. బంగ్లాదేశ్ భారీ స్కోర్ -
గిల్ అనుమానమే..!
-
ఆయనవి అనవసరపు వ్యాఖ్యలు.. రమఫోసాపై వైట్‌హౌజ్ ఆగ్రహం
అమెరికా దక్షిణాఫ్రికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదిరేలా కనిపిస్తున్నాయి. జీ20 సదస్సు నేపథ్యంతో దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా కీలక వ్యాఖ్యలు చేయగా.. వాటిపై వైట్‌హౌజ్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఆయన అనవసరమైన వ్యాఖ్యలు చేశారని మండిపడుతోంది.జీ20 సమావేశాలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిష్కరించిన సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని.. అందుకే ఆ గడ్డపై జరగబోయే సదస్సుకు తాను, తన బృందం హాజరుకాబోదని చెప్పారాయన. అయితే.. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా తాజాగా మరో ప్రకటన చేశారు.అమెరికా చివరి నిమిషంలో మనసు మార్చుకుందని.. జీ20 సమావేశాలకు హాజరు కాబోతోందని.. ఇది సానుకూల పరిణామం అని ప్రకటించారు. అంతటితో ఆగకుండా.. ‘‘ఒక దేశం మరొక దేశాన్ని బలవంతపెట్టకూడదని.. ఏ దేశం మరొక దేశాన్ని బెదిరించలేదని.. అమెరికా నిర్ణయంతో జీ20 సదస్సుపై ఎలాంటి ప్రభావం ఉండబోదు’’ అని అన్నారు. దీంతో ట్రంప్‌కే ఆయన వార్నింగ్ ఇచ్చారంటూ కథనాలు వెలువడ్డాయి.ఈ వ్యాఖ్యలపై తాజాగా వైట్‌హౌజ్ స్పందించింది. ‘‘ఆయన అనవసరపు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను ట్రంప్, ఆయన బృందం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించబోదని వ్యాఖ్యానించింది. జోహెనెస్‌బర్గ్‌లో జరగబోయే జీ20 సమావేశంలో అమెరికా పాల్గొనబోదు. అమెరికా రాయబారి కేవలం హ్యాండోవర్ కార్యక్రమానికి హాజరవుతారు. అంతేగానీ అధికారిక చర్చల్లో పాల్గొనరు’’ అని వైట్ హౌస్ సెక్రటరీ కారోలిన్ లేవిట్ స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా G20 ప్రాధాన్యతలు (తక్కువ ఆదాయ దేశాల అప్పు సమస్య, న్యాయమైన ఎనర్జీ మార్పు, ఖనిజ వనరుల వినియోగం) అమెరికా విధానాలకు విరుద్ధమని, అందువల్ల ఏకాభిప్రాయం సాధించలేమని అమెరికా రాయబారి కార్యాలయం మరో ప్రకటనలో తెలిపింది. మరోవైపు.. COP30 వాతావరణ సమావేశాన్ని సైత అమెరికా బహిష్కరించింది.రెండు దేశాల మధ్య ఎందుకీ వివాదందక్షిణాఫ్రికాలో 1948 నుంచి 1994 వరకు వర్ణవివక్ష విధానం కొనసాగింది. తెల్లవాళ్లకు (white minority) అధిక హక్కులు, అధికారం ఉండేది. నల్లజాతీయులు (Black majority) సొంతగడ్డపైనే వివక్షను ఎదుర్కొనేవారు. 1994లో నెల్సన్ మండేలా అధ్యక్షుడిగా ఎన్నికయ్యాక.. ఈ వివక్షకు ఫుల్స్టాప్ పడి సమానత్వం మొదలైంది. అయితే..అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దక్షిణాఫ్రికాపై చాలాకాలంగానే సంచలన ఆరోపణలు చేస్తున్నారు. రెండోసారి అధ్యక్షుడైన కొన్నిరోజులకు.. ఆ దేశ అధ్యక్షుడు సిరిల్ రామఫోసాను వైట్‌హౌజ్‌కు రప్పించుకుని మరీ శ్వేత జాతీయుల్ని ఊచకోత కోస్తున్నారని ఆరోపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ సమయంలో కొన్ని ఫొటోలను ఆయన చూపించారు(వాటిలో చాలావరకు తప్పుడు ఫొటోలు అని ఫ్యాక్ట్ చెక్‌లో తేలింది).తాజాగా.. ఆ దేశంలో ఉన్న తెల్లజాతీయుల్ని నల్లజాతీయుల్ని హత్యలు చేస్తూ.. వాళ్ల భూములు, పొలాలు లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఈ పరిస్థితుల్లో దక్షిణాఫ్రికాలో జీ20 సదస్సు నిర్వహించడం సిగ్గుచేటు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. అయితే.. ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం కొట్టిపారేసింది. తమ దేశంలో వర్ణవివక్ష పాలన ముగిసిన తర్వాత కూడా శ్వేత జాతీయులు ఆఫ్రికన్ల కంటే మెరుగైన పరిస్థితుల్లోనే జీవిస్తున్నారంటూ చెబుతోంది.దక్షిణాఫ్రికాపై సుంకాలునిరాధార ఆరోపణలు చేస్తున్న ట్రంప్.. దక్షిణాఫ్రికా రాయబారిని బహిష్కరించారు. ఆ ఆఫ్రికా దేశంపై 30% వాణిజ్య సుంకాలు విధించారు. అయితే అమెరికా ప్రభుత్వ బహిష్కరణ ఉన్నప్పటికీ.. దక్షిణాఫ్రికాలో అమెరికా కంపెనీలు కార్యకలాపాలు(సుమారు 600 కంపెనీలు) యధావిధిగా కొనసాగుతున్నాయి. జోహానెస్‌బర్గ్‌లో జరిగిన Business 20 (B20) సమావేశంలో అమెరికా కంపెనీలు చురుకుగా పాల్గొన్నాయి. అమెరికా చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షురాలు సుజాన్ క్లార్క్ ఆ సందర్భంలో దక్షిణాఫ్రికా నాయకత్వాన్ని ప్రశంసించడం గమనార్హం.దక్షిణాఫ్రికా పర్యటనకు మోదీ జీ20 సమావేశాలు మూడు రోజులపాటు జరగనున్నాయి. ఇందులో 40దేశాలు పాల్గొనబోతున్నాయి. భారత్ తరఫున హాజరయ్యేందుకు ప్రధాని మోదీ ఈ వేకువజామున దక్షిణాఫ్రికాకు బయల్దేరారు. -
‘గంభీర్‌పై విమర్శలేల’
గువాహటి: తొలి టెస్టులో దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఓడిపోవడంతో వస్తున్న తీవ్ర విమర్శలపై భారత జట్టు బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ అసహనం వ్యక్తం చేశాడు. కొందరు పనిగట్టుకొని గంభీర్‌పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని అతను వ్యాఖ్యానించాడు. భారత జట్టు పరాజయంలో ఆటగాళ్ల పాత్రను వదిలి కోచ్‌ను లక్ష్యంగా చేసుకోవడంలో అర్థం లేదని కొటక్ అన్నాడు. రేపటి నుంచి ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనున్న నేపథ్యంలో అతను గురువారం మీడియాతో మాట్లాడాడు. ‘గంభీర్, గంభీర్ అంటూ ఒకే వ్యక్తిపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది సరైన పద్ధతి కాదు. నేను కూడా సహాయక సిబ్బందిలో భాగం కాబట్టి చాలా బాధగా ఉంది. కొందరికి తమ వ్యక్తిగత అజెండాలు ఉండవచ్చు. అందుకే పనిగట్టుకొని ఇలా చేస్తున్నారని అనిపిస్తోంది’ అని కొటక్ స్పందించాడు. ఓటమి బాధ్యతను గంభీర్ తన మీదకు వేసుకున్నాడని కొటక్ గుర్తు చేశాడు. ‘మ్యాచ్ ఓడిపోయాక ఫలానా బ్యాటర్ బాగా ఆడలేదని లేదా ఫలానా బౌలర్ ఇలా ఆడలేదని ఎవరూ విమర్శించడం లేదు. బ్యాటింగ్‌లో ఇలా ఉంటే బాగుండేదని ఎవరూ సూచించడం లేదు. కోల్‌కతాలో పిచ్ గురించి మాట్లాడుతూ గంభీర్ ఓటమి బాధ్యత అంతా తన మీద వేసుకున్నాడు. క్యురేటర్‌పై ఎవరూ విమర్శలు చేయకుండా కాపాడేందుకే అతను ఇలా చేశాడు’ అని తమ హెడ్ కోచ్‌ను సితాన్షు వెనకేసుకొచ్చాడు. బ్యాటర్ క్రీజ్‌లోకి వెళ్లేటప్పుడు ఇలాగే ఆడాలని తాము చెప్పలేమని, పరిస్థితిని బట్టి అతను తన ఆటను మార్చుకుంటాడని కోచ్ అన్నాడు. నేడు గిల్‌కు ఫిట్నెస్ పరీక్ష కెప్టెన్ శుబ్‌మన్ గిల్ రెండో టెస్టు నుంచి తప్పుకోవడం దాదాపు ఖాయంగానే అనిపిస్తున్నా... టీమ్ మేనేజ్మెంట్ మాత్రం దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన ఇవ్వడం లేదు. కోల్‌కతా టెస్టు రెండో రోజు మెడ నొప్పితో తప్పుకున్న అనంతరం ఇప్పటి వరకు గిల్‌కు చికిత్స కొనసాగుతూనే ఉంది. అతను ఆ తర్వాత ఒక్కసారి కూడా మైదానంలోకి దిగలేదు. అయితే మ్యాచ్‌కు ముందు రోజు గిల్‌ను ఫిట్నెస్ పరీక్ష నిర్వహిస్తామని కొటక్ వెల్లడించాడు. ‘గిల్ వేగంగా కోలుకుంటున్నాడు. అయితే అతను ఆడే విషయంపై టీమ్ వైద్యులు, ఫిజియో నిర్ణయం తీసుకుంటారు. ఈరోజు సాయంత్రం ఫిట్నెస్ పరీక్ష నిర్వహించిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది. ఒకవేళ కోలుకున్నా... టెస్టు మధ్యలో మెడ నొప్పి తిరగబడితే కష్టం కదా. గిల్ లాంటి ఆటగాడు లేకపోవడం ఏ జట్టుకైనా లోటే’ అని సితాన్షు వివరించాడు. -
రెండో టెస్టులో ఆడాలని ఉన్నా...
గువాహటి: భారత టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఎలాగైనా దక్షిణాఫ్రికాతో రెండో టెస్టులో బరిలోకి దిగాలని పట్టుదలగా ఉన్నాడు. అయితే మెడనొప్పి నుంచి పూర్తిగా కోలుకోని అతను ఈ మ్యాచ్‌లో ఆడటం సందేహంగానే ఉంది. బుధవారం జట్టు సభ్యులతో పాటు గిల్ కూడా గువాహటికి వెళ్లాడు. గిల్ ఆరోగ్య స్థితిపై బీసీసీఐ ఒక ప్రకటన జారీ చేసింది. ‘కోల్‌కతా టెస్టు రెండో రోజు గిల్ మెడకు గాయం కాగా అదే రోజు ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాం. తర్వాతి రోజు కొంత కోలుకొని అతను డిశ్చార్జ్ కూడా అయ్యాడు. ప్రస్తుతం అతని గాయాన్ని బోర్డు వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. పరిస్థితిని బట్టి వైద్య బృందం సూచన మేరకే గువాహటి టెస్టులో ఆడించాలా లేదా అని నిర్ణయిస్తాం’ అని బోర్డు వెల్లడించింది. తాజా స్థితిని బట్టి చూస్తే అతను ఆరోగ్యపరంగా బాగానే ఉన్నా టెస్టు మ్యాచ్ ఆడే ఫిట్నెస్ లేదని సమాచారం. అతను అన్ని రకాలుగా కోలుకొని మైదానంలోకి వచ్చేందుకు కనీసం 10 రోజుల సమయం పట్టవచ్చు. రెండో టెస్టుతో పాటు వన్డే, టి20 సిరీస్‌ల నుంచి కూడా తప్పుకొని విశ్రాంతి తీసుకుంటే మంచిదని కూడా అభిప్రాయం వ్యక్తమవుతోంది. వన్డే సిరీస్‌కు బుమ్రా, పాండ్యా దూరం! పని భారం తగ్గించడంలో భాగంగా పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాలకు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ నుంచి విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉంది. గాయం కారణంగా ఆసియా కప్ ఫైనల్‌కు దూరమైన పాండ్యా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. త్వరలోనే టి20 వరల్డ్ కప్ జరగనున్న నేపథ్యంలో వన్డేలకంటే టి20లకే ప్రాధాన్యతనివ్వాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అందుకే సఫారీలతో వన్డే సిరీస్‌కు దూరమై ముస్తాక్ అలీ ట్రోఫీలో ఫిట్నెస్ నిరూపించుకొని పాండ్యా టి20లు ఆడే అవకాశం ఉంది. ఇదే కారణంగా ప్రధాన పేసర్ బుమ్రాకు కూడా విరామం ఇవ్వవచ్చు. -
దక్షిణాఫ్రికా పర్యటనకు ప్రధాని మోదీ
ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలో పర్యటించనన్నారు. ఈ నెల 22, 23(శని, ఆది) తేదీల్లో దక్షిణాఫ్రికా వేదికగా జరగనున్న జీ20 సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నట్లు విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. జోహాన్స్‌బర్గ్‌లో జరగనున్న జీ20 లీడర్స్ సమ్మిట్లోనూ పాల్గొంటారని పేర్కొంది. ఈ సదస్సులోని మూడు సెషన్లలో ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఈ సమావేశంలో గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి సహకారం, వాతావరణ మార్పు, ఆహారం, ఇంధన భద్రత వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ తాజాగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, గ్లోబల్ సౌత్ దేశాల సమస్యలతో పాటు అంతర్జాతీయ సహకార బలోపేతంపై ప్రధానిగా మోదీ అభిప్రాయాలను ప్రపంచ నేతలకు వివరించనున్నారు. అలాగే, జీ20 సభ్య దేశాలతో ద్వైపాక్షిక సమావేశాలు కూడా జరగనున్నాయని విదేశాంగ శాఖ తెలిపింది. -
సాధనలో స్పిన్ మంత్రం
కోల్‌కతా: ఎజాజ్ పటేల్, మిచెల్ సాంట్నర్, సైమన్ హార్మర్...గత ఏడాది కాలంలో భారత జట్టును తమ బౌలింగ్‌తో చావుదెబ్బ తీసిన విదేశీ స్పిన్నర్లు. వ్యక్తిగతంగా చూస్తే ఎవరూ చెప్పుకోగ్గ స్టార్లు కాదు. కానీ మన పిచ్‌లపై మన బ్యాటర్లను కుప్పకూల్చి పైచేయి సాధించడంలో వీరు సఫలమయ్యారు. కివీస్, దక్షిణాఫ్రికాల చేతుల్లో ఓడిన నాలుగు టెస్టుల్లో ఈ ముగ్గురు స్పిన్నర్లు కలిపి కేవలం 15.69 సగటుతో 36 వికెట్లు పడగొట్టారు! కొన్నేళ్ల క్రితం అనామకుడైన ఆ్రస్టేలియా స్పిన్నర్ స్టీవ్ ఒ కీఫ్ కూడా ఒకే టెస్టులో 14 వికెట్లతో మన పని పట్టాడు. భారత్‌కు కలిసి రావాల్సిన స్పిన్ కాస్తా ప్రత్యర్థి బౌలర్లకు వరంగా మారింది. అయితే ప్రత్యర్థి బలంకంటే స్పిన్‌ను సమర్థంగా ఆడలేని మన బలహీనత కోల్‌కతా టెస్టు ఫలితంతో బయటపడింది. నాటి దిగ్గజాలతో పోలిస్తే ప్రస్తుత తరం బ్యాటర్లు గిర్రున తిరిగే బంతులను సరిగ్గా ఎదుర్కోలేకపోతున్నారు. గువహటిలో జరిగే రెండో టెస్టుకు ముందు ఈ సమస్యకు పరిష్కారం కనుగొనేందుకు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ప్రయతి్నస్తున్నాడు. ఈ క్రమంలో నాటి తరం బ్యాటర్లు ఉపయోగించిన ‘ప్యాడ్ ఆఫ్’ పద్ధతిని అతను అనుసరించాడు. మంగళవారం జరిగిన భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్లో ఇది కనిపించింది. దీని ప్రకారం ఒకటే కాలికి ప్యాడ్ కట్టి బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. సాధారణంగా ఆటగాళ్లు డిఫెన్స్ ఆడే క్రమంలో అప్రయత్నంగా తమ కాలును ముందుకు తీసుకొస్తారు. అది చివరకు ఎల్బీడబ్ల్యూకు దారి తీస్తుంది. తాజా ప్రయోగంలో బ్యాటర్లు బంతులను ఎదుర్కొనే క్రమంలో ప్యాడ్కంటే కూడా బ్యాట్‌ను ఎక్కువగా ఉపయోగించేందుకు అలవాటు పడతారు. స్పిన్ బౌలింగ్ అయినా సరే, ప్యాడ్ లేకుండా ముందుకు జరిపి ఆడితే మోకాలి కింది భాగంలో గాయమయ్యే అవకాశం ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని అదనపు జాగ్రత్తలతో ఆడాల్సి ఉంటుంది. కోచ్ గంభీర్ ఈ తరహా ప్రాక్టీస్‌ను స్వయంగా పర్యవేక్షించాడు. దాదాపు మూడు గంటలకు పైగా భారత జట్టు ప్రాక్టీస్ సాగింది. రెండో టెస్టు వేదిక గువహటికి వెళ్లకుండా ఈడెన్ గార్డెన్‌లోనే సాధనను కొనసాగించేందుకు టీమిండియా మేనేజ్మెంట్ ఆసక్తి చూపించింది. రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్‌తో పాటు గిల్ ఆడలేకపోతే మూడో స్థానం కోసం పోటీ పడుతున్న సాయి సుదర్శన్ కూడా సుదీర్ఘ సమయం పాటు తమ బ్యాటింగ్‌కు పదును పెట్టారు. ముఖ్యంగా సుదర్శన్‌కు గంభీర్ ప్రత్యేక సూచనలు ఇవ్వాల్సి వచ్చింది. స్పిన్‌ను చక్కగా ఎదుర్కొన్న అతను పేసర్ ఆకాశ్ దీప్ బౌలింగ్‌లో మాత్రం తడబడ్డాడు. మరో వైపు జురేల్ ఎక్కువగా స్వీప్, రివర్స్ స్వీప్ షాట్లు ఆడేందుకు ప్రయతి్నంచాడు. ఆప్షనల్ కావడంతో ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే సాధనకు వచ్చారు. వాషింగ్టన్ సుందర్, దేవదత్ పడిక్కల్ కూడా ప్రాక్టీస్ చేశారు. జట్టులో అత్యంత సీనియర్ అయిన జడేజా బ్యాటింగ్ తీవ్రత చూస్తే రెండో టెస్టులో చెలరేగాలనే కసితో ఉన్నట్లు కనిపించాడు. దీంతో పాటు మరో ప్రత్యేకత కూడా టీమిండియా ప్రాక్టీస్‌లో కనిపించింది. రెండు చేతులనూ సమర్థంగా బౌలింగ్‌కు వాడగల ‘సవ్యసాచి’ బెంగాల్ స్పిన్నర్ కౌశిక్ మెయిటీ బ్యాటర్లకు నెట్స్‌లో సహకరించాడు. కుడి చేత్తో ఆఫ్‌స్పిన్, ఎడమ చేత్తో లెఫ్టార్మ్ స్పిన్ బౌలింగ్ చేయగల కౌశిక్‌ను ప్రత్యేకంగా ప్రాక్టీస్ కోసం పిలిపించారు. గతంలో పలు ఐపీఎల్ టీమ్‌లకు బౌలింగ్ చేసిన కౌశిక్ భారత జట్టుకు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ఇదే మొదటిసారి.జట్టుతో చేరిన నితీశ్ రెడ్డి... గిల్ రెండో టెస్టుకు దూరం కావడం దాదాపుగా ఖాయమైంది. దాంతో ముందు జాగ్రత్తగా మరో అదనపు ఆటగాడిని బీసీసీఐ జట్టుతో చేర్చింది. రాజ్‌కోట్‌లో భారత్ ‘ఎ’ తరఫున వన్డే సిరీస్ ఆడుతున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డిని మేనేజ్మెంట్ పిలిపించింది. సోమవారం సాయంత్రం కోల్‌కతా చేరుకున్న నితీశ్ జట్టుతో కలిసి గువహటికి వెళ్లనున్నాడు. నేడు జరిగే మూడో వన్డే ఆడితే నితీశ్ జట్టు తొలి ప్రాక్టీస్ సెషన్‌కు సరైన సమయంలో చేరడం కష్టమయ్యేది. అలాంటి సమస్య రాకుండా ముందే అతడిని జట్టుతో కలిసేలా ఏర్పాట్లు చేశారు. -
టీమిండియాకు ఒకటైతే.. సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!
కోల్‌కతా వేదికగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియాకు భారీ ఎదురుదెబ్బలు తగిలాయి. మెడ గాయం కారణంగా కెప్టెన్ గిల్ (Shubman Gill) సేవలను ఉన్నపళంగా కోల్పోయిన భారత జట్టు.. మ్యాచ్‌ను కూడా అత్యంత అవమానకర రీతిలో చేజార్చుకుంది. స్వల్ప లక్ష్యాన్ని కూడా ఛేదించలేని టీమిండియా బొక్కబోర్లా పడి, ఘోర అపవాదును మూటగట్టుకుంది.తొలి టెస్ట్ సందర్భంగా గాయపడిన గిల్.. నవంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్ట్‌కు కూడా అందుబాటులో ఉండటం అనుమానంగా మారింది. తొలి టెస్ట్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభంలోనే మైదానాన్ని వీడిన విషయం తెలిసిందే. ఆతర్వాత రెండో ఇన్నింగ్స్‌లో అతని అవసరం అనివార్యమైనా తిరిగి బరిలోకి దిగలేకపోయాడు. మైదానం నుంచి గిల్‌ను నేరుగా వుడ్లాండ్స్ హాస్పిటల్‌కు తీసుకెళ్లి చికిత్సనందించారు.సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు..!ఇదే ఆసుపత్రిలో సౌతాఫ్రికాకు చెందిన ఇద్దరు ఆటగాళ్లకు కూడా మ్యాచ్ అనంతరం చికిత్సనందించారని సోషల్‌మీడియా కోడై కూస్తుంది. తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా సంచలన విజయం సాధించడంలో కీలక పాత్రధారులైన సైమన్ హార్మర్ (Simon Harmer), మార్కో జన్సెన్ (Marco Jansen) గాయాలతో బాధపడుతూ గిల్ చికిత్స పొందిన వుడ్లాండ్స్ హాస్పిటల్లోనే చికిత్స పొందారని సమాచారం. హార్మర్ భుజం గాయం, జన్సెన్ మరో గాయంతో బాధపడుతూ సదరు ఆసుపత్రిలోనే పరీక్షలు చేయించుకున్నారని తెలుస్తుంది. ఈ గాయాల తాలుకా అధికారిక సమాచారమైతే ఇప్పటివరకు లేదు. ఒకవేళ నిజంగా హార్మర్, జన్సెన్ గాయాల బారిన పడి ఉంటే, సౌతాఫ్రికాకు డబుల్ షాక్‌లు తగిలినట్లే.కోల్‌కతా టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 8 వికెట్లు తీసిన హార్మర్ భారత్‌ను ఓడించడంలో ప్రధానపాత్ర పోషించాడు. ఫలితంగా అతినికే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. జన్సెన్ కూడా తొలి టెస్ట్‌లో సత్తా చాటాడు. 2 ఇన్నింగ్స్‌ల్లో 5 వికెట్లు తీసి టీమిండియా పతనంలో తనవంతు పాత్ర పోషించాడు. ఒకవేళ ఈ ఇద్దరు రెండో టెస్ట్‌కు దూరమైతే, సౌతాఫ్రికాకు భారీ ఎదురుదెబ్బలు తగిలనట్లవుతుంది.వీరికి ప్రత్యామ్నాయాలుగా సెనురన్ ముత్తుసామి, కగిసో రబాడ ఉన్నా, ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లు లేకపోవడం సౌతాఫ్రికాకు పెద్ద లోటే అవుతుంది. చదవండి: IPL 2026 Auction: 'ఆ ఆటగాడి' కోసం తిరిగి ప్రయత్నించనున్న సీఎస్కే -
భళా బవుమా...
సరిగ్గా పదేళ్ల క్రితం తెంబా బవుమా భారత గడ్డపై తన తొలి టెస్టు మ్యాచ్ ఓపెనర్‌గా ఆడి విఫలమయ్యాడు. మరో నాలుగేళ్ల తర్వాత కూడా ఇక్కడ మూడు టెస్టులు ఆడిన అతడు ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాడు. ఆరు ఇన్నింగ్స్‌లలో ఒక్క అర్ధ సెంచరీ కూడా లేకుండా రెండు డకౌట్లు సహా మొత్తం 96 పరుగులకే పరిమితమయ్యాడు. ఈసారి జట్టులో అందరికంటే సీనియర్ బ్యాటర్‌గా, కెప్టెన్‌గా మళ్లీ ఈ గడ్డపై అడుగు పెట్టిన అతను తొలి టెస్టునే చిరస్మరణీయం చేసుకున్నాడు. అసాధారణ రీతిలో పోరాడుతూ అజేయ హాఫ్ సెంచరీని నమోదు చేసిన అతను, తన కెప్టెన్సీ వ్యూహాలతో కూడా భారత్ పని పట్టాడు. తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ప్రత్యరి్థకి తన ఆటతోనే సమాధానమిచ్చాడు. ఇదే జోరును అతను తర్వాతి టెస్టులోనూ కనబరిస్తే సిరీస్ గెలిచే ఘనత కూడా బవుమా ఖాతాలో చేరవచ్చు. దక్షిణాఫ్రికా జట్టు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో ఫైనల్‌కు చేరిన తర్వాత కూడా కెప్టెన్‌గా ఎక్కువ మంది బవుమాను సీరియస్‌గా తీసుకోలేదు. బలమైన ప్రత్యర్థులతో తలపడకుండానే ఫైనల్ చేరిందని జట్టుపై విమర్శలూ వచ్చాయి. అయితే ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫైనల్లో చేసిన కీలక అర్ధ సెంచరీ అతడికి కొంత గుర్తింపును ఇచి్చంది. అయినా సరే... విజేతగా అందుకున్న గదతో బవుమా పాల్గొన్న వీడియో షూట్‌పై కూడా వ్యంగ్య వ్యాఖ్యానాలే వినిపించాయి. అయితే ఇవన్నీ తనకు కొత్త కాదు, వివక్షతో పాటు విసుర్లు కూడా అలవాటే అన్నట్లుగా వాటిని అతను ఎప్పుడూ పట్టించుకోలేదు. ఎప్పుడూ అలాంటి వాటికి సమాధానం కూడా ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయాడు. ఎంతో మందికి సాధ్యం కాని ఘనతను నమోదు చేస్తూ 15 ఏళ్ల తర్వాత భారత గడ్డపై దక్షిణాఫ్రికాను గెలిపించిన బవుమా... డబ్ల్యూటీసీ విజయం గాలివాటం కాదని నిరూపించాడు. అతని కెప్టెన్సీలో 11 టెస్టులు ఆడిన జట్టు 10 గెలిచి, మరో మ్యాచ్‌ను ‘డ్రా’ చేసుకొని అజేయంగా నిలవడం విశేషం. తన కెప్టెన్సీలో బ్యాటర్‌గా కూడా అతను 57 సగటుతో పరుగులు సాధించాడు. పట్టుదలకు మారు పేరుగా... డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా మరో టెస్టు మ్యాచ్ ఆడలేదు. గాయంతో ఆటకు దూరమైన అతను మెల్లగా కోలుకుంటూ భారత్‌తో టెస్టుల కోసం సిద్ధమయ్యాడు. ఈ సిరీస్‌కు ముందు ‘ఎ’ జట్టు తరఫున బరిలోకి దిగి తన బ్యాటింగ్‌కు పదును పెట్టుకున్నాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో విఫలమైనా... రెండో ఇన్నింగ్స్‌లో తన బ్యాటింగ్ విలువను అతను చూపించాడు. ఆట సాగిన కొద్దీ పిచ్ ఆడలేని స్థితికి చేరుతోందని అర్థం కావడంతో సాధ్యమైనన్ని ఎక్కువ పరుగులు జోడించేందుకు పట్టుదలగా నిలబడ్డాడు. అబేధ్యమైన డిఫెన్స్‌తో కూడా బవుమా ఆకట్టుకున్నాడు. తాను ఆడిన తొలి 23 బంతుల్లో 4 పరుగులే చేసినా... వీటిలో స్పిన్నర్లు వేసిన 17 బంతులను అతను సమర్థంగా ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత తడబాటు లేకుండా ఒక్కో పరుగు జోడిస్తూ పోయాడు. అతను తీసిన 33 సింగిల్స్ చివర్లో కీలకంగా మారాయి. నాలుగు ఇన్నింగ్స్‌లలో కలిపి రెండు జట్ల నుంచి అర్ధ సెంచరీ చేయడం ఒక్క బవుమాకే సాధ్యమైంది. భారీగా పరుగులు ఇవ్వడం లేదని భావించిన భారత్ బవుమా చేసిన నష్టాన్ని ఊహించలేకపోయింది. పదునైన వ్యూహంతో... 124 పరుగుల లక్ష్యాన్ని భారత్ ఛేదించకుండా వారి సొంతగడ్డపై నిలువరించడం సాధారణ విషయం కాదు. ఏ జట్టయినా ఆట మొదలు కాకముందే కాడి పడేస్తుంది. కానీ బవుమా సహచరుల్లో ధైర్యం నూరిపోశాడు. ఈ స్కోరు కూడా మనకు సరిపోతుంది అతని వారిలో నమ్మకం పెంచే ప్రయత్నం చేశాడు. తన వ్యూహాలతో భారత బ్యాటర్లకు అవకాశం ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఆరంభంలోనే యాన్సెన్ రెండు వికెట్లు తీసిన తర్వాత తన స్పిన్నర్లను అతను సమర్థంగా వాడుకున్నాడు. కీలక సమయంలో మార్క్రమ్ను అనూహ్యంగా బౌలింగ్ దింపి అతను ఫలితం సాధించగలిగాడు. చక్కగా ఆడుతున్న సుందర్‌ను మార్క్రమ్ అవుట్ చేయడంతో సఫారీ విజయానికి దారులు తెరచుకున్నాయి. ఇక లెఫ్ట్ హ్యాండర్ అక్షర్ పటేల్ చెలరేగే అవకాశం ఉందని తెలిసినా లెఫ్టార్మ్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్‌తో బౌలింగ్ చేయించి ‘సాహసం’ చేశాడు. ఊహించినట్లే తొలి నాలుగు బంతుల్లో అక్షర్ 2 సిక్స్‌లు, ఫోర్ బాదేయడంతో వ్యూహం బెడిసికొట్టినట్లు అనిపించింది. కానీ అక్షర్ గాల్లోకి లేపిన తర్వాతి బంతిని తానే క్యాచ్ అందుకొని బవుమా విజయనాదం చేశాడు. ఈ వ్యూహంపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వచ్చాయి. కొసమెరుపు: సరిగ్గా రెండేళ్ల క్రితం 2023 నవంబర్ 16న ఇదే ఈడెన్ గార్డెన్లో ఆస్ట్రేలియా చేతిలో దక్షిణాఫ్రికా వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో ఓడింది. కెప్టెన్ బవుమా ‘సున్నా’కు అవుటై వేదనతో ని్రష్కమించాడు. ఇప్పుడే అదే తేదీన అదే మైదానంలో బవుమా తాను ఎప్పటికీ మర్చిపోలేని ఘనతను సాధించాడు.సాక్షి క్రీడా విభాగం -
తడబడ్డ భారత్.. ఘోర పరాజయం
-
సొంతగడ్డపై ఘోర పరాభవం
విజయానికి 124 పరుగులు కావాలి...గతంలో సొంతగడ్డపై ఇంత తక్కువ లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ ఎప్పుడూ విఫలం కాలేదు...గిల్ లేకపోయినా బ్యాటింగ్ చేయగల సమర్థులు ఏడుగురు ఉన్నారు... పిచ్ ఎలాంటిదైనా కాస్త పట్టుదల కనబరిస్తే సునాయాసంగా ఛేదించగల స్కోరే... కానీ టీమిండియా ఒక్కసారిగా కుప్పకూలింది...రెండో ఇన్నింగ్స్ ఆరంభంలో పేస్‌కు, ఆ తర్వాత ప్రత్యర్థి స్పిన్ ముందు బ్యాటర్లు తలవంచారు. మనకు అనుకూలిస్తుందనుకున్న స్పిన్ పిచ్ సఫారీలకు అంది వచ్చింది. సరిగ్గా ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో చిత్తయిన తీరును గుర్తుకు చేస్తూ భారత్ స్వదేశంలో మరో పరాభవాన్ని మూటగట్టుకోగా, వరల్డ్ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా పదిహేనేళ్ల తర్వాత భారత గడ్డపై టెస్టు గెలిచి సంబరాలు చేసుకుంది. పదేళ్ల క్రితం అనామకుడిగా ఇక్కడ అడుగు పెట్టి భారత బ్యాటర్ల చేతిలో చావు దెబ్బ తిన్న ఆఫ్‌స్పిన్నర్ సైమన్ హార్మర్ దశాబ్దం తర్వాత ఒక అరుదైన విజయాన్ని రచించడం విశేషం. కోల్‌కతా: భారత టెస్టు జట్టుకు స్వదేశంలో అనూహ్య షాక్...ఈడెన్ గార్డెన్లో స్పిన్ పిచ్ కోరుకొని నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగిన జట్టు చివరకు ప్రత్యర్థి స్పిన్ దెబ్బకే తలవంచింది. ఆదివారం మూడో రోజే ముగిసిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా 30 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. 124 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 35 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. వాషింగ్టన్ సుందర్ (92 బంతుల్లో 31; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. సఫారీ బౌలర్లలో సైమన్ హార్మర్ 4, కేశవ్ మహరాజ్, మార్కో యాన్సెన్ చెరో 2 వికెట్లు తీశారు. అంతకు ముందు ఓవర్‌నైట్ స్కోరు 93/7తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 54 ఓవర్లలో 153 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తెంబా బవుమా (136 బంతుల్లో 55 నాటౌట్; 4 ఫోర్లు) కీలక అర్ధ సెంచరీతో జట్టును ఆదుకున్నాడు. జడేజాకు 4 వికెట్లు దక్కాయి. మ్యాచ్‌లో మొత్తం 8 వికెట్లు పడగొట్టిన హార్మర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు. రెండు మ్యాచ్‌లో సిరీస్‌లో దక్షిణాఫ్రికా 1–0తో ముందంజ వేయగా, నవంబర్ 22 నుంచి గువహటిలో రెండో టెస్టు జరుగుతుంది. రెండో రోజు మెడకు గాయం కావడంతో ఆట నుంచి తప్పుకొని ఆస్పత్రిలో చేరిన భారత కెపె్టన్ శుబ్‌మన్ గిల్ ఆదివారం వైద్యుల పర్యవేక్షణలో ఉండటంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు రాలేకపోయాడు. కోలుకున్న గిల్ ఆదివారం సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఆదుకున్న బవుమా... ఆదివారం మైదానంలోకి వచ్చే సమయానికి భారత్ విజయంపై ధీమాగా ఉంది. మిగిలిన 3 వికెట్లు తీసేందుకు ఎక్కువ సమయం పట్టదనిపించింది. అయితే మన స్పిన్నర్లు ప్రభావం చూపలేకపోగా, పదునైన డిఫెన్స్‌తో పట్టుదలగా నిలిచిన బవుమా సింగిల్స్‌తో పరుగులు జోడిస్తూ పోయాడు. కొద్ది సేపు దూకుడుగా ఆడిన కార్బిన్ బాష్ (37 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్), బవుమా కలిసి ఎనిమిదో వికెట్‌కు 44 పరుగులు జోడించారు. చివరకు బాష్‌ను బుమ్రా బౌల్డ్ చేయగా...సిరాజ్ ఒకే ఓవర్లో చివరి రెండు వికెట్లు పడగొట్టాడు. సుందర్ మినహా... ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే జైస్వాల్ (0)ను అవుట్ చేసిన యాన్సెన్, తన రెండో ఓవర్లో రాహుల్ (1)ను పెవిలియన్‌కు పంపి దెబ్బ కొట్టాడు. ఈ దశలో 32 పరుగులు జత చేసి సుందర్, జురేల్ (13) జట్టును ముందుకు నడిపించారు. అయితే జురేల్, పంత్ (2) చెత్త షాట్లతో వెనుదిరిగారు. ఇలాంటి స్థితిలోనూ సుందర్, రవీంద్ర జడేజా (18) భాగస్వామ్యంతో జట్టు గెలుపుపై ఆశలు చిగురించాయి. కానీ సఫారీ స్పిన్నర్లు మళ్లీ పైచేయి సాధించారు. వీరిద్దరు 8 పరుగుల తేడాతో అవుట్ కాగా, కుల్దీప్ (1) వారిని అనుసరించాడు. గెలుపునకు మరో 47 పరుగులు చేయాల్సిన స్థితిలో అక్షర్ పటేల్ (17 బంతుల్లో 26; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కాస్త సాహసం ప్రదర్శించాడు. మహరాజ్ ఓవర్లో తొలి నాలుగు బంతుల్లో ఒక ఫోర్, 2 సిక్స్‌లు బాది 16 పరుగులు రాబట్టాడు. చివరకు మహరాజ్దే పైచేయి అయింది. ఐదో బంతికి మరో భారీ షాట్‌కు ప్రయతి్నంచి అక్షర్ వెనుదిరగ్గా, తర్వాతి బంతికే సిరాజ్ (0) అవుట్ కావడంలో దక్షిణాఫ్రికా శిబిరంలో సంబరాలు మొదలయ్యాయి. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 159; భారత్ తొలి ఇన్నింగ్స్ 189; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్ 153; భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 0; రాహుల్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సుందర్ (సి) హార్మర్ (బి) మార్క్రమ్ 31; జురేల్ (సి) బాష్ (బి) హార్మర్ 13; పంత్ (సి) అండ్ (బి) హార్మర్ 2; జడేజా (ఎల్బీ) (బి) హార్మర్ 18; అక్షర్ (సి) బవుమా (బి) మహరాజ్ 26; కుల్దీప్ (ఎల్బీ) (బి) హార్మర్ 1; బుమ్రా (నాటౌట్) 0; సిరాజ్ (సి) మార్క్రమ్ (బి) మహరాజ్ 0; గిల్ (ఆబ్సెంట్ హర్ట్); ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (35 ఓవర్లలో ఆలౌట్) 93. వికెట్ల పతనం: 1–0, 2–1, 3–33, 4–38, 5–64, 6–72, 7–77, 8–93, 9–93. బౌలింగ్: యాన్సెన్ 7–3–15–2, హార్మర్ 14–4–21–4, మహరాజ్ 9–1–37–2, బాష్ 2–0–14–0, మార్క్రమ్ 3–0–5–1. బ్యాటింగ్ చేయలేనంత ఇబ్బందికరంగా పిచ్ ఏమీ లేదు. మేం సరిగ్గా ఇలాంటి పిచ్‌నే కోరుకున్నాం. తొలి రోజు నుంచే స్పిన్నర్లకు అనుకూలిస్తే టాస్ ప్రభావం తగ్గించవచ్చని భావించాం. క్యురేటర్ కూడా అదే ఇచ్చారు. మేం మ్యాచ్ గెలిచి ఉంటే పిచ్‌పై ఇంత చర్చ జరిగేది కాదు. మంచి డిఫెన్స్ ఉంటే పరుగులు సాధించవచ్చు. మీరు మానసికగా ఎంత దృఢంగా ఉన్నారో ఇక్కడ తెలుస్తుంది. బవుమా, అక్షర్, సుందర్ పరుగులు రాబట్టారు కదా’ –గౌతమ్ గంభీర్, భారత కోచ్ -
శుభం కార్డు నేడే?
ఔరా... క్రికెట్! ఇదేం వికెట్! బ్యాటింగ్ ఫ్రెండ్లీ క్రికెట్లో గేమ్ ఛేంజర్లంతా బ్యాటర్లే! మెరుపులైనా, సునామీలైనా బ్యాట్లతోనే చూశాం. కానీ ఈడెన్ గార్డెన్స్ టెస్టు చూస్తే మాత్రం ‘ఇది గతం... బౌలర్లు ఘనం’ అనక తప్పదు! ఎందుకంటే బౌలింగ్ జోరు ఒక సెషన్‌కే సరిపెట్టుకోలేదు... ఓ రోజుకే పరిమితం కాలేదు. వరుసగా ఆరు సెషన్లు బ్యాట్లు డీలా... బ్యాటర్లు విలవిలలాడేలా బౌలర్లు భళా అనిపించారు. సంప్రదాయ క్రికెట్‌కే కొత్త ఉత్తేజాన్నిచ్చేలా... మూడు రోజుల్లోనే ఫలితం వచ్చేలా ఇరు జట్ల బౌలర్లు గ్రే‘టెస్టు’ క్రికెట్ ఆడుతున్నారు. కోల్‌కతా: మార్క్రమ్ 31... కేఎల్ రాహుల్ 39... తొలి రెండు రోజుల్లో దక్షిణాఫ్రికా, భారత్ ఓపెనర్లు చేసిన పరుగులివి! రెండు జట్ల ఇన్నింగ్స్‌ల్లో టాప్ స్కోర్లు కూడా ఇవే! టెస్టులో రెండు సెషన్లు ఆడితే సెంచరీ... రెండో రోజు నిలబడితే డబుల్ సెంచరీ, ఆ రోజంతా అజేయంగా నిలిస్తే ట్రిపుల్ సెంచరీ... జెంటిల్మెన్ క్రికెట్లో సర్వసాధారణమిది. కానీ రెండు రోజుల్లో మూడో ఇన్నింగ్స్ (ఒక జట్టు రెండో ఇన్నింగ్స్)లైనా కూడా ఫిఫ్టీ కాదు కదా కనీసం 40 పరుగులైనా చేయకపోతే అది ముమ్మాటికీ బౌలింగ్ సత్తానే కాక మరేమిటి! ధనాధన్ షో చూసిన వారికి ఫటాఫట్ వికెట్లు, ఆలౌట్ మీద ఆలౌట్లు కనబడుతున్నాయి. ఎంత పటిష్ట బ్యాటింగ్ లైనప్‌లతో దిగినా... స్పిన్ బౌలింగ్–బ్యాటింగ్ ఆల్రౌండర్లను మోహరించినా... బంతి శాసిస్తోంది ఈ టెస్టుని! క్రీజులోని బ్యాటర్లకు ప్రతీ బంతికి పెడుతోంది అగ్నిపరీక్షని! రెండో సెషన్లోనే భారత్ కూలింది! భారత్, దక్షిణాఫ్రికాల మధ్య ఈడెన్‌గార్డెన్స్‌లో మొదలైన మొదటి టెస్టులో బంతి సవాల్ విసురుతోంది. ఓవర్‌నైట్ స్కోరు 37/1తో శనివారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ రెండో సెషన్ అయినా పూర్తిగా ఆడలేక 62.2 ఓవర్లలోనే తొలి ఇన్నింగ్స్‌లో 189 పరుగులకే కుప్పకూలింది. దీంతో మొదటి రోజే టెస్టుపై పట్టుబిగించిందనుకున్న ఆతిథ్య జట్టుకు... పట్టుబిగించింది మన జట్టు కాదు... బౌలర్లు అన్న విషయం రెండో రోజు రెండో సెషన్లోనే అర్థమైంది. రాహుల్ (39; 4 ఫోర్లు, 1 సిక్స్), వాషింగ్టన్ సుందర్ (29; 2 ఫోర్లు, 1 సిక్స్) ఈ ఓవర్‌నైట్ బ్యాటింగ్ జోడీ చేసిన 57 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యమే అతి పెద్ద పార్ట్నర్షిప్! రిషభ్ పంత్ (27; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జడేజా (27; 3 ఫోర్లు)లు రెండు పదుల స్కోర్లు దాటారు. ఇక పర్యాటక బౌలర్లలో హార్మర్ 4, యాన్సెన్ 3 వికెట్లు తీశారు. జడేజా ఉచ్చులో పడి... భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం లభించగా... రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన దక్షిణాఫ్రికా మెడకు జడేజా స్పిన్ ఉచ్చు బిగించాడు. తొలిరోజు బుమ్రా, సిరాజ్‌ల పేస్ అదిరిపోవడంతో వెనుకబడిన జడేజా... స్పిన్, తన విశేషానుభవాన్ని వినియోగించి సఫారీ బ్యాటర్లను క్రీజులో నిలువనీయలేదు. దీంతో ఆట నిలిచే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 93/7 స్కోరు చేసిన దక్షిణాఫ్రికా ఆలౌటయ్యేందుకు సిద్ధమైపోయింది. కెప్టెన్ బవుమా (29 బ్యాటింగ్, 3 ఫోర్లు) తప్ప ఇంకెవరూ 20 పరుగులైనా చేయలేకపోయారు. కెపె్టన్‌తో పాటు బాష్ (1 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. జడేజా 4 వికెట్లు పడగొట్టగా, కుల్దీప్కు 2, అక్షర్‌కు ఒక వికెట్ దక్కాయి. ప్రస్తుతం దక్షిణాఫ్రికా 63 పరుగుల ఆధిక్యంలో ఉంది.92 టెస్టుల్లో రిషభ్ పంత్ కొట్టిన సిక్స్‌లు. ఈ ఫార్మాట్లో అత్యధిక సిక్స్‌లు కొట్టిన భారతీయ బ్యాటర్‌గా రిషభ్ పంత్ గుర్తింపు పొందాడు. 91 సిక్స్‌లతో వీరేంద్ర సెహ్వాగ్ (103 టెస్టుల్లో) పేరిట ఉన్న రికార్డును పంత్ బద్దలు కొట్టాడు. పంత్ 48 టెస్టుల్లోనే సెహ్వాగ్‌ను దాటేశాడు.2 తొలి ఇన్నింగ్స్‌లో 27 పరుగులు చేసిన క్రమంలో రవీంద్ర జడేజా టెస్టుల్లో 4000 పరుగుల మైలురాయిని దాటాడు. తద్వారా కపిల్ దేవ్ తర్వాత టెస్టుల్లో 4000 పరుగులు చేయడంతోపాటు 300 వికెట్లు పడగొట్టిన రెండో భారతీయ క్రికెటర్‌గా, ఓవరాల్‌గా నాలుగో క్రికెటర్‌గా జడేజా గుర్తింపు పొందాడు.స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 159; భారత్ తొలి ఇన్నింగ్స్: జైస్వాల్ (బి) యాన్సెన్ 12; రాహుల్ (సి) మార్క్రమ్ (బి) కేశవ్ 39; సుందర్ (సి) మార్క్రమ్ (బి) హార్మర్ 29; గిల్ (రిటైర్డ్‌హర్ట్) 4; పంత్ (సి) వెరీన్ (బి) బాష్ 27; జడేజా (ఎల్బీడబ్ల్యూ) (బి) హార్మర్ 27; ధ్రువ్ జురేల్ (సి అండ్ బి) హార్మర్ 14; అక్షర్ (సి) యాన్సెన్ (బి) హార్మర్ 16; కుల్దీప్ యాదవ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 1; సిరాజ్ (బి) యాన్సెన్ 1; బుమ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (62.2 ఓవర్లలో ఆలౌట్) 189. వికెట్ల పతనం: 1–18, 2–75, 3–109, 4–132, 5–153, 6–171, 7–172, 8–187, 9–189. బౌలింగ్: యాన్సెన్ 15–4–35–3, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 16–1–66–1, కార్బిన్ బాష్ 11–4–32–1, సైమన్ హార్మర్ 15.2– 4–30–4. దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: రికెల్టన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 11; మార్క్రమ్ (సి) జురేల్ (బి) జడేజా 4; ముల్డర్ (సి) పంత్ (బి) జడేజా 11; తెంబా బవుమా (బ్యాటింగ్) 29; డి జోర్జి (సి) జురేల్ (బి) జడేజా 2; స్టబ్స్ (బి) జడేజా 5; కైల్ వెరీన్ (బి) అక్షర్ పటేల్ 9; మార్కో యాన్సెన్ (సి) రాహుల్ (బి) కుల్దీప్ 13; కార్బిన్ బాష్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (35 ఓవర్లలో 7 వికెట్లకు) 93. వికెట్ల పతనం: 1–18, 2–25, 3–38, 4–40, 5–60–, 6–75, 7–91. బౌలింగ్: బుమ్రా 6–1–14–0, అక్షర్ 11–0–30–1, కుల్దీప్ 5–1–12–2, రవీంద్ర జడేజా 13–3–29–4. -
విమానంలో పాలస్తీనియన్ల నిర్బంధం.. 12 గంటలపాటు..
జోహన్నెస్‌బర్గ్: ప్రయాణ పత్రాల సమస్యల కారణంగా తొమ్మిది నెలల గర్భవతి సహా 150 మందికి పైగా పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికా అధికారులు విమానంలోనే నిర్బంధించారు. వారు ప్రయాణించిన విమానాన్ని దాదాపు 12 గంటలకు పైగా నిలిపివేయడంతో పిల్లలు, స్త్రీలు సహా ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు.పాలస్తీనీయన్లు ప్రయాణిస్తున్న విమానం గురువారం ఉదయం టాంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల దగ్గర ఉన్న పత్రాలపై ఇజ్రాయెల్ అధికారుల నుంచి నిష్క్రమణ స్టాంపులు, దక్షిణాఫ్రికాలో ఎంతకాలం ఉంటారనే వివరాలు, స్థానిక చిరునామాలు పేర్కొనలేదు. దీంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయాణికులను నిలిపేశారు. దక్షిణాఫ్రికా శోం శాఖ జోక్యంతో ‘గిఫ్ట్ ఆఫ్ ది గివర్స్’అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ వారికి వసతి కల్పించడానికి ముందుకు రావడంతో పిల్లలు సహా 153 మంది ప్రయాణికులను గురువారం రాత్రి విమానం దిగేందుకు అనుమతించారు. వారిలో 23 మంది ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్లారని, 130 మంది మాత్రం దక్షిణాఫ్రికాలోనే ఉన్నారని సరిహద్దు అధికారులు తెలిపారు.South Africa put on a global show to prove its love and defense for Palestinians — even taking Israel to the International Court of Justice. Yet, when Gazans tried to enter South Africa, the same government refused to let them in. pic.twitter.com/ev96gHr7YC— Brother Rachid الأخ رشيد (@BrotherRasheed) November 13, 2025ప్రయాణికుల పట్ల వ్యవహరించిన తీరు ఆగ్రహాన్ని రేకెత్తించింది. ‘ఇది చాలా దారుణం. నేను విమానంలోకి వచ్చినప్పుడు అది చాలా వేడిగా ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు చెమటలు పట్టి అరుస్తూ, ఏడుస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకున్నా. ఈ ప్రజలను కనీసం విమానాశ్రయంలోకి అనుమతించి, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోనివ్వాలి. ఇది రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక ప్రాథమిక హక్కు.’అని నిలిపి ఉండగా విమానంలోకి వెళ్లివచి్చన పాసర్ నిగెల్ బ్రాంకెన్ అన్నారు. ఇటీవలి కాలంలో పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికాకు తీసుకొచి్చన రెండో విమానం ఇది. తాము ఎక్కడికి వెళ్తున్నామనేది కూడా వారికి తెలియదు. విమానాన్ని నిర్వహించిన సంస్థ వివరాలు కూడా తెలియరాలేదు. ఇజ్రాయెల్ దాడుల తరువాత చాలామంది పాలస్తీనియన్లు దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. అందుకు కారణం దక్షిణాఫ్రికా చాలాకాలంగా పాలస్తీనాకు మద్దతుదారుగా ఉండటమే.Questions have been raised over how hundreds of Palestinians were able to leave Gaza, board a plane in Israel, and arrive in South Africa without departure stamps in their passports or indication of their intended destination. pic.twitter.com/zjYeGHW7DK— Al Jazeera English (@AJEnglish) November 14, 2025 -
హడలెత్తించిన బుమ్రా
కోల్‌కతా: పిచ్ ఎలా ఉన్నా... చక్కటి లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు వేస్తే... వికెట్లు రావడం కష్టమేమీ కాదని భారత పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా మరోసారి నిరూపించాడు. పిచ్ స్పిన్నర్లకు అనుకూలిస్తుందని అంచనా వేసిన భారత కెప్టన్ శుబ్‌మన్ గిల్ ఏకంగా నలుగురు స్పిన్నర్లను తుది జట్టులోకి తీసుకున్నాడు. అయితే బుమ్రా నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటర్లను హడలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారత స్పిన్నర్లకు పెద్దగా పని లేకుండా చేశాడు. బుమ్రా పేస్‌కు తోడు మరో పేసర్ సిరాజ్ కూడా మెరిపించడం... ఎడంచేతి వాటం స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ వంతుగా రాణించడం... వెరసి భారత జట్టుతో శుక్రవారం మొదలైన తొలి టెస్టులో తొలి రోజే దక్షిణాఫ్రికాకు కష్టాలు మొదలయ్యాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 55 ఓవర్లలో 159 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు మార్క్రమ్ (48 బంతుల్లో 31; 5 ఫోర్లు, 1 సిక్స్), రికెల్టన్ (22 బంతుల్లో 23; 4 ఫోర్లు) తొలి వికెట్‌కు 57 పరుగులు జోడించడంతో దక్షిణాఫ్రికాకు శుభారంభం లభించినట్టే అనిపించింది. అయితే ఒక్కసారి బుమ్రా దెబ్బకు అంతా తారుమారైంది. ఐదు పరుగుల వ్యవధిలో మార్క్రమ్, రికెల్టన్లను బుమ్రా పెవిలియన్‌కు పంపించగా... కెపె్టన్ బవూమా (3)ను కుల్దీప్ అవుట్ చేశాడు. దాంతో 57/0తో పటిష్టంగా కనిపించిన దక్షిణాఫ్రికా 71/3తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత ముల్డర్ (51 బంతుల్లో 24; 3 ఫోర్లు), టోనీ జోర్జి (55 బంతుల్లో 24; 1 ఫోర్, 1 సిక్స్) నింపాదిగా ఆడి వికెట్ల పతనాన్ని నిలువరించారు. నాలుగో వికెట్‌కు వీరిద్దరు 43 పరుగులు జోడించారు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ గాడిలో పడిందనుకున్న తరుణంలో కుల్దీప్, బుమ్రా మళ్లీ మెరిశారు. ముల్డర్‌ను కుల్దీప్... జోర్జిని బుమ్రా అవుట్ చేశారు. దాంతో దక్షిణాఫ్రికా 120 పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ట్రిస్టన్ స్టబ్స్ (74 బంతుల్లో 15 నాటౌట్; 1 ఫోర్), వెరీన్ (36 బంతుల్లో 16; 2 ఫోర్లు) నిలదొక్కుకోవడానికి ప్రయత్నించినా... వెరీన్ను సిరాజ్ అవుట్ చేయడంతో దక్షిణాఫ్రికాకు దెబ్బ పడింది. చివరి ఐదు వికెట్లను దక్షిణాఫ్రికా 13 పరుగుల వ్యవధిలో కోల్పోయి చివరకు 159 పరుగులకే పరిమితమైంది. దక్షిణాఫ్రికా జట్టును తక్కువ స్కోరుకే పరిమితం చేసిన భారత్ కూడా బ్యాటింగ్‌కు ఇబ్బంది పడింది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 20 ఓవర్లు ఆడి ఒక వికెట్ కోల్పోయి 37 పరుగులు సాధించింది. స్కోరు వివరాలు దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) పంత్ (బి) బుమ్రా 31; రికెల్టన్ (బి) బుమ్రా 23; ముల్డర్ (ఎల్బీడబ్ల్యూ) (బి) కుల్దీప్ 24; బవుమా (సి) జురేల్ (బి) కుల్దీప్ 3; టోనీ జోర్జి (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 24; స్టబ్స్ (నాటౌట్) 15; వెరీన్ (ఎల్బీడబ్ల్యూ) (బి) సిరాజ్ 16; మార్కో యాన్సెన్ (బి) సిరాజ్ 0; కార్బిన్ బాష్ (ఎల్బీడబ్ల్యూ) (బి) అక్షర్ పటేల్ 3; హార్మెర్ (బి) బుమ్రా 5; కేశవ్ మహరాజ్ (ఎల్బీడబ్ల్యూ) (బి) బుమ్రా 0; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (55 ఓవర్లలో ఆలౌట్) 159; వికెట్ల పతనం: 1–57, 2–62, 3–71, 4–114, 5–120, 6–146, 7–147, 8–154, 9–159, 10–159. బౌలింగ్: బుమ్రా 14–5–27–5, సిరాజ్ 12–0–47–2, అక్షర్ పటేల్ 6–2–21–1, కుల్దీప్ యాదవ్ 14–1–36–2, రవీంద్ర జడేజా 8–2–13–0, వాషింగ్టన్ సుందర్ 1–0–3–0. భారత్ తొలి ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బి) మార్కో యాన్సెన్ 12; కేఎల్ రాహుల్ (బ్యాటింగ్) 13; వాషింగ్టన్ సుందర్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి) 37. వికెట్ల పతనం: 1–18, బౌలింగ్: మార్కో యాన్సెన్ 6–2–11–1, ముల్డర్ 5–1–15–0, కేశవ్ మహరాజ్ 5–1–8–0, కార్బిన్ బాష్ 3–2–1–0, హార్మెర్ 1–1–0–0. 2012భారత జట్టు చివరిసారి 2012లో ఒకే టెస్టులో నలుగురు స్పిన్నర్లను ఆడించింది. నాగ్‌పూర్ వేదికగా 2012 డిసెంబర్ 13 నుంచి 17 వరకు ఇంగ్లండ్‌తో ‘డ్రా’గా ముగిసిన మ్యాచ్‌లో భారత్ తరఫున నలుగురు స్పిన్నర్లు అశి్వన్, రవీంద్ర జడేజా, పీయూష్ చావ్లా, ప్రజ్ఞాన్ ఓజా బరిలోకి దిగారు. ఇదే మ్యాచ్‌తో జడేజా టెస్టుల్లో అరంగేట్రం చేయగా... ప్రస్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న గౌతమ్ గంభీర్ ఆ మ్యాచ్‌లో రెండు ఓవర్లు వేయడం విశేషం. -
సఫారీ సవాల్‌కు సై
కోల్‌కతా: సొంతగడ్డపై బెబ్బులి అయిన టీమిండియాతో ప్రపంచ టెస్టు చాంపియన్ దక్షిణాఫ్రికా సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య నేటి నుంచి ఈడెన్ గార్డెన్స్‌లో తొలి టెస్టు జరగనుంది. ఇరుజట్లలోనూ నాణ్యమైన స్పిన్నర్లు ఉండటంతో స్పిన్ ఫ్రెండ్లీ వికెట్‌పై ఈ సంప్రదాయ క్రికెట్ సమరం ఆసక్తికరంగా జరుగుతుందని అంతా ఆశిస్తున్నారు. ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను సమం చేసుకున్న భారత్ అదే ఉత్సాహంతో సొంతగడ్డపై సఫారీని ఓడించాలనే లక్ష్యంతో ఉంది. బ్యాటింగ్ బలగం, స్పిన్, పేస్‌ల కలబోతతో పాటు అనుకూలించే ఆతిథ్య వేదిక టీమిండియాను పైచేయిగా నిలుపుతోంది. టీమిండియాకు పరీక్షే! ఆతిథ్య అనుకూలతలెన్ని ఉన్నా కూడా న్యూజిలాండ్‌తో భారత్‌లో జరిగిన టెస్టు సిరీస్‌లో టీమిండియా వైట్‌వాష్ అయ్యింది. కాబట్టి ఈసారి ఆదమరిస్తే అంతేసంగతి. తొలి రోజు తొలి సెషన్ నుంచే భారత ఆటగాళ్లు ఈ విషయాన్ని గుర్తుంచుకొని శ్రమిస్తేనే అనుకూలతలో సానుకూల ఫలితాల్ని ఆశించవచ్చు. బ్యాటింగ్ లైనప్ మునుపెన్నడూ లేనంత పటిష్టంగా ఉంది. ఏకంగా ఎనిమిది, తొమ్మిది మంది బ్యాటింగ్ చేసే ఆటగాళ్లు తుది జట్టులో ఉన్నారు. జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్లతో టాపార్డర్, కెప్టెన్ గిల్, రిషభ్ పంత్, ధ్రువ్ జురేల్‌లతో కూడిన మిడిలార్డర్, జడేజా, సుందర్, అక్షర్‌లతో లోయర్ ఆర్డర్ కూడా పరుగులు రాబట్టగలదు. ఇంగ్లండ్ సిరీస్‌లో సుందర్, జడేజాల భాగస్వామ్యం, టెస్టును ‘డ్రా’ చేసిన వైనం ఇప్పుడప్పుడే ఎవరూ మర్చిపోరు. ఇంగ్లండ్ పర్యటనలో గాయపడిన రిషభ్ పంత్ తన పునరాగమనాన్ని ఘనంగా చాటేందుకు సిద్ధం కాగా, ధ్రువ్ జురేల్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. కాబట్టే టీమ్ మేనేజ్మెంట్ ఆంధ్ర పేస్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్‌ను పక్కనబెట్టి మరీ ఇద్దరు స్పెషలిస్టు వికెట్ కీపర్లకు అవకాశమిచ్చింది. సఫారీ తక్కువేం కాదు... దక్షిణాఫ్రికా గట్టి ప్రత్యర్థి. గతంలో భారత పర్యటనలకు వచ్చినపుడు కంగుతిన్న సఫారీ జట్లకి... ప్రస్తుత బవుమా బృందానికి తేడా ఉంది. భారత్‌లాగే దక్షిణాఫ్రికా ఆయుధం కూడా స్పిన్నే! అనుభవజు్ఞడైన కేశవ్ మహరాజ్‌తో పాటు సైమన్ హార్మర్, సెనురాన్ ముత్తుసామి ఈ పర్యటనలో తప్పకుండా ఆతిథ్య బౌలర్లకు దీటుగా ప్రభావం చూపించగలరు. అచ్చూ భారత్‌లాగే సఫారీ బ్యాటింగ్ లైనప్ కూడా పటిష్టంగా ఉంది. మార్క్రమ్–రికెల్టన్ ఓపెనింగ్ జోడీ నుంచి ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగే మార్కో యాన్సెన్ వరకు పరుగులు సాధిస్తారు. ట్రిస్టన్ స్టబ్స్, డి జార్జి, సారథి బవుమా, వికెట్ కీపర్ కైల్ వెరీన్లు స్పిన్, పేస్‌ను ఎంచక్కా ఎదుర్కోగలరు. పైగా ఇక్కడికి వచ్చే ముందు పాక్‌లో పర్యటించిన దక్షిణాఫ్రికా జట్టు పరిమిత ఓవర్ల సిరీస్ (వన్డే, టి20)లు ఓడిందేమో కానీ టెస్టు సిరీస్‌ను మాత్రం కోల్పోలేదు. 1–1తో సమం చేసుకొని భారత ఉపఖండంపై సత్తాచాటేందుకు ‘సై’ అంటోంది. పిచ్, వాతావరణం ఈడెన్ గార్డెన్స్ పిచ్ తొలిరోజు బ్యాటింగ్‌కు అనుకూలం. పిచ్‌పై ఉన్న పచ్చికతో పేస్ బౌలర్లు కూడాఆరంభంలో ప్రభావం చూపొచ్చు. ఆఖరి సెషన్ లేదంటే మూడో రోజు నుంచి స్పిన్‌కు టర్న్ అవుతుంది. టాస్ నెగ్గిన జట్టు కచ్చితంగా బ్యాటింగే ఎంచుకుంటుంది. వర్షం ముప్పు లేదు.16 భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఇప్పటి వరకు మొత్తం 44 టెస్టులు జరిగాయి. 16 టెస్టుల్లో భారత్, 18 టెస్టుల్లో దక్షిణాఫ్రికా గెలిచాయి. 10 టెస్టులు ‘డ్రా’గా ముగిశాయి. స్వదేశంలో దక్షిణాఫ్రికాతో భారత్ 19 టెస్టులు ఆడింది. 11 టెస్టుల్లో నెగ్గి, ఐదింటిలో ఓడింది. మూడు టెస్టులు ‘డ్రా’ అయ్యాయి.13 ఈడెన్ గార్డెన్స్‌లో భారత జట్టు ఇప్పటి వరకు 42 టెస్టులు ఆడింది. 13 మ్యాచ్‌ల్లో నెగ్గి, 9 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 20 మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి. భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఈడెన్ గార్డెన్స్‌లో మూడు టెస్టులు జరిగాయి. రెండింటిలో భారత్, ఒక దాంట్లో దక్షిణాఫ్రికా గెలుపొందాయి. తుది జట్లు (అంచనా) భారత్: గిల్ (కెప్టెన్ ), జైస్వాల్, రాహుల్, సాయిసుదర్శన్, పంత్, జురేల్, జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్/కుల్దీప్, బుమ్రా, సిరాజ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్ ), మార్క్రమ్, రికెల్టన్, స్టబ్స్, టోని డి జోర్జి, కైల్ వెరీన్, సెనురాన్ ముత్తుసామి, హార్మర్, యాన్సెన్, కేశవ్, రబడ. -
నితీశ్ స్థానంలో జురేల్
కోల్‌కతా: ఫామ్‌లో ఉన్న వికెట్ కీపర్, బ్యాటర్ ధ్రువ్ జురేల్ దక్షిణాఫ్రికాతో జరిగే తొలి టెస్టులో బరిలోకి దిగుతాడని భారత అసిస్టెంట్ కోచ్ రియాన్ టెన్ డస్కటే వెల్లడించారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి స్థానంలో జురేల్‌ను ఆడిస్తామని ఆయన చెప్పారు. 24 ఏళ్ల వికెట్ కీపర్ ఇప్పటివరకు టీమిండియా తరఫున ఏడు టెస్టులు ఆడాడు. దక్షిణాఫ్రికా ‘ఎ’ జరిగిన రెండు అనధికారిక టెస్టులు సహా గత ఐదు ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో జురేల్ నాలుగు సెంచరీలు చేశాడు. రెగ్యులర్ వికెట్ కీపర్, స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్ గైర్హాజరీలో జురేల్ ఇంగ్లడ్ పర్యటనలో నాలుగో టెస్టు ఆడాడు. అయితే ఇప్పుడు పంత్ పునరాగమనం చేయనుండటంతో జురేల్ స్థానంపై నెలకొన్న సందేహాల్ని సహాయ కోచ్ డక్కటే ఒక్క మాటతో నివృత్తి చేశాడు. ఫామ్‌లో ఉన్న జురేల్, రెగ్యులర్ వికెట్ కీపర్ పంత్ ఇద్దరిని తొలి టెస్టులో ఆడిస్తామని స్పష్టం చేశారు. వ్యూహాలకు అనుగుణంగానే... ‘కాంబినేషన్‌పై పూర్తి స్పష్టతతో ఉన్నాం. ఇద్దరు వికెట్ కీపర్లలో ఏ ఒక్కరిని పక్కనబెట్టే ఉద్దేశం జట్టు మేనేజ్మెంట్కు లేదు’ అని డస్కటే వెల్లడించారు. గత ఆరు నెలలుగా నిలకడైన ఫామ్‌ను కొనసాగిస్తున్న ధ్రువ్ జురేల్ ఈడెన్ గార్డెన్స్‌లో శుక్రవారం మొదలయ్యే తొలి టెస్టులో ఆడతాడని చెప్పారు. నితీశ్‌ను పక్కనబెట్టడంపై స్పందిస్తూ... ‘అతను వెస్టిండీస్‌తో రెండు టెస్టులు ఆడాడు. ప్రతి మ్యాచ్‌లోనూ మెరుగవుతూనే ఉన్నాడు. కాబట్టి అతని భవిష్యత్తుకు ఎలాంటి ముప్పులేదు. అయితే ప్రస్తుత జట్టు వ్యూహాలకు అనుగుణంగానే అతను తుది జట్టుకు దూరం కానున్నాడు. బలమైన ప్రత్యర్థితో మ్యాచ్ గెలవాలంటే అందుబాటులో ఉన్న వనరుల్లో మరింత మెరుగైన బలగంతోనే బరిలోకి దిగుతాం. ఇప్పుడు ఇదే జరుగుతోంది. అంతేకానీ నితీశ్‌ను విస్మరించడం మాత్రం కాదు’ అని డస్కటే వివరించారు. పరుగులు చేసే స్పిన్నర్లు ఇక లోయర్ మిడిలార్డర్లో వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాల రూపంలో భారత్ బ్యాటింగ్ లైనప్ మరింత పటిష్టంగా ఉందని అసిస్టెంట్ కోచ్ అన్నారు. వాళ్లు స్పిన్నర్లయి ఉండొచ్చు. కానీ బ్యాటింగ్ అవసరాల్ని తీరుస్తారని, కాబట్టి వారిపుడు బ్యాటర్లుగా పరిగణించవచ్చని చెప్పారు. తద్వారా కుల్దీప్ యాదవ్ స్థానంలో అక్షర్ పటేల్ తుది జట్టులో ఉంటాడనే విషయాన్ని డస్కటే చెప్పకనే చెప్పినట్లయ్యింది. దీంతో ఇద్దరు పేసర్లు ముగ్గురు స్పిన్నర్లతో కూడిన బౌలింగ్ దళాన్ని తొలి టెస్టులో దింపేందుకు భారత టీమ్ మేనేజ్మెంట్ సిద్ధమైంది. ముగ్గురు టాపార్డర్, ముగ్గురు మిడిలార్డర్ బ్యాటర్లతో స్పెషలిస్టు బ్యాటింగ్ విభాగానికి ముగ్గురు స్పిన్ ఆల్‌రౌండర్లు జట్టును నడిపించనున్నారు. కసరత్తు చేశాం... సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ నుంచి టీమిండియా పాఠాలు నేర్చుకుందని డస్కటే పేర్కొన్నారు. గతేడాది భారత్ పర్యటనకు వచ్చిన కివీస్ 3–0తో ఆతిథ్య జట్టును వైట్‌వాష్ చేసింది. మన సిŠప్న్ పిచ్‌పై ప్రత్యర్థి స్పిన్నర్లు ఎజాజ్ పటేల్ (15 వికెట్లు), మిచెల్ సాన్‌ట్నర్ (13), ఫిలిప్స్ (8) పండగ చేసుకున్నారు. ఈ ముగ్గురు కలిసి 36 వికెట్లు తీయడమే భారత్ కొంపముంచింది. దీనిపై అసిస్టెంట్ కోచ్ మాట్లాడుతూ ‘స్పిన్నేయడమే కాదు... ప్రత్యర్థి స్పిన్‌ను ఎదుర్కోవడంపై కూడా కసరత్తు చేశాం. ఎందుకంటే సఫారీ జట్టులోనూ నాణ్యమైన స్పిన్నర్లే అందుబాటులో ఉన్నరు. కాబట్టి కివీస్ నేర్పిన గత పాఠాల అనుభవంతో జట్టు సిద్ధమైంది’ అని అన్నారు. -
జోరుగా హుషారుగా...
కోల్‌కతా: భారత్, దక్షిణాఫ్రికా మధ్య తొలి టెస్టుకు మూడు రోజుల ముందు ఇరు జట్ల సన్నాహకం మొదలైంది. ఈడెన్ గార్డెన్స్ మైదానంలో ఆటగాళ్లు సుదీర్ఘ సమయం పాటు నెట్స్‌లో శ్రమించారు. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్లు కీలకం కావడంతో సిరీస్ ప్రతిష్టాత్మకంగా మారింది. సొంతగడ్డపై సత్తా చాటేందుకు భారత్ సన్నద్ధమవుతుండగా, డబ్ల్యూటీసీ డిఫెండింగ్ చాంపియన్‌గా సఫారీ బృందం తమ స్థాయిని ప్రదర్శించాలని భావిస్తోంది. ప్రధానంగా పిచ్‌కు సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. ప్రత్యర్థి టీమ్‌లోనూ మంచి స్పిన్నర్లు ఉండటంతో భారత మేనేజ్మెంట్ కూడా పూర్తిగా స్పిన్ పిచ్ గురించి ఆలోచన చేయడం లేదు. ఇటీవల పాకిస్తాన్ గడ్డపై కూడా దక్షిణాఫ్రికా ఆకట్టుకుంది. పిచ్ రూపకల్పన విషయంలో తమకు ఎలాంటి సూచనలు రాలేదని బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ (క్యాబ్) అధ్యక్షుడు, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ఇప్పటికే స్పష్టం చేశాడు. టాప్–3పై దృష్టి... టెస్టు జట్టు కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ఇటీవల ఆస్ట్రేలియాతో వన్డే, టి20ల్లో పెద్దగా రాణించలేదు. మంగళవారం నెట్స్‌లో గిల్ సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. ఎర్ర బంతితో మళ్లీ లయ అందుకోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు. హెడ్ కోచ్ గంభీర్, అసిస్టెంట్ కోచ్ సితాన్షు కొటక్లతో కొద్ది సేపు చర్చించిన తర్వాత గిల్ నెట్స్‌లోకి వెళ్లాడు. ముందుగా జడేజా, సుందర్ స్పిన్‌ను ఎదుర్కొన్న అతను, ఆ తర్వాత ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి పేస్ బౌలింగ్‌లో సాధన చేశాడు. అనంతరం అదనపు బౌన్స్‌ను ఎదుర్కొనేందుకు అర గంట పాటు ‘త్రో డౌన్స్’తో ప్రాక్టీస్ చేశాడు. మరోవైపు యశస్వి జైస్వాల్ కూడా కెప్టెన్‌తో సమాంతరంగా పక్కనే ఉన్న మరో నెట్లో సాధన కొనసాగించాడు. అతను ఎలాంటి తడబాటు లేకుండా బౌలర్లను స్వేచ్ఛగా ఎదుర్కొన్నాడు. యువ బ్యాటర్ సాయి సుదర్శన్ ప్రాక్టీస్‌ను కూడా కోచ్ గంభీర్ పర్యవేక్షించాడు. పేసర్లలో బుమ్రా ఒక్కడే ప్రాక్టీస్‌కు వచ్చాడు. బ్యాటర్ లేకుండా కేవలం రెండు స్టంప్‌లు పెట్టి ఆఫ్ స్టంప్‌పై బంతులు విసరడంపైనే అతను దృష్టి పెట్టాడు. ఏడుగురు భారత ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు రాగా... పంత్, జురేల్, రాహుల్, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్‌దీప్, దేవదత్ పడిక్కల్, అక్షర్ పటేల్ మంగళవారం సాధనకు దూరంగా ఉన్నారు. అనంతరం గంభీర్ సహా టీమ్ మేనేజ్మెంట్ టెస్టు మ్యాచ్‌కు ఉపయోగించనున్న పిచ్‌ను పరిశీలించారు. అటాకింగ్ ఆటతో... దక్షిణాఫ్రికా జట్టు కూడా సుదీర్ఘ సమయం పాటు ప్రాక్టీస్ చేసింది. భారత్‌లో ఎదురయ్యే స్పిన్ పిచ్‌ను దృష్టిలో ఉంచుకుంటూ ఆటగాళ్లు సాధన చేశారు. స్పిన్ బౌలర్లనే ప్రత్యేకంగా ఎదుర్కొంటూ అటాకింగ్ ఆటను ప్రదర్శించారు. నెట్స్‌లో సఫారీలను చూస్తే స్పిన్‌ను తడబడకుండా ఎదురుదాడి చేయడమే వ్యూహంగా కనిపిస్తోంది. ఇటీవల పాకిస్తాన్లో స్పిన్‌కు అనుకూల పిచ్‌పై టెస్టు గెలవడం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. గాయం నుంచి కోలుకొని వచ్చిన కెప్టెన్ తెంబా బవుమా ఎక్కువ సేపు నెట్స్‌లో తన బ్యాటింగ్‌కు పదును పెట్టాడు. తక్కువ దూరం నుంచి త్రో డౌన్స్ తీసుకుంటూ తన ఫిట్నెస్ చురుకుదనానికి అతను స్వయంగా పరీక్ష పెట్టుకున్నాడు. ఓపెనర్లు మార్క్రమ్, రికెల్టన్ కూడా స్పిన్నర్లతోనే చాలా సేపు సాధన చేశారు. భారత్ ‘ఎ’పై రెండో అనధికారిక టెస్టులో గెలిచిన దక్షిణాఫ్రికా ‘ఎ’ జట్టులోని సభ్యులు చాలా మంది సీనియర్ టీమ్‌లోనూ ఉన్నారు. వారంతా ఇక్కడి పిచ్‌కు అలవాటు పడినట్లుగా కనిపించింది. -
దక్షిణాఫ్రికాతో సవాల్‌కు సిద్ధంగా ఉన్నాను: సిరాజ్
ఇంగ్లండ్ గడ్డపై టెస్టు సిరీస్‌ను ‘డ్రా’ చేయడంలో కీలకపాత్ర పోషించిన భారత పేసర్ మొహమ్మద్ సిరాజ్ ఇప్పుడు స్వదేశంలో మరో పటిష్ట జట్టుపై చెలరేగాలని పట్టుదలగా ఉన్నాడు. శుక్రవారం నుంచి దక్షిణాఫ్రికాతో జరిగే టెస్టు సిరీస్‌లో మన టీమ్ పైచేయి సాధిస్తుందని అతను విశ్వాసం వ్యక్తం చేశాడు. ‘వరల్ట్ టెస్టు చాంపియన్‌షిప్ పాయింట్లపరంగా మనకు ఇది చాలా కీలక సిరీస్.పైగా దక్షిణాఫ్రికా చాంపియన్ కూడా. ఆ జట్టు ఇటీవల పాక్‌పై సిరీస్ 1–1తో ‘డ్రా’ చేసుకున్నది వాస్తవమే. అయితే మా జట్టు కూడా చాలా బలంగా ఉంది. ఇంగ్లండ్‌తో చాలా బాగా ఆడి ఇటీవల వెస్టిండీస్‌పై అలవోకగా గెలిచాం. ఈ ఫామ్ కారణంగా టీమ్‌లో ఆత్మవిశ్వాసం పెరిగి అంతా సానుకూల వాతావరణం ఉంది. వ్యక్తిగతంగా నా బౌలింగ్ మంచి లయతో సాగుతోంది. కాబట్టి అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వగలనని నమ్ముతున్నా. పెద్ద జట్లను ఎదుర్కొనేటప్పుడు మన లోపాలు ఏమిటో తెలిసి వాటిని సరిదిద్దుకునే అవకాశం కలుగుతుంది. దక్షిణాఫ్రికాతో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా’ అని సిరాజ్ చెప్పాడు. భారత్ తరఫున 43 టెస్టులు ఆడిన సిరాజ్ 133 వికెట్లు పడగొట్టాడు. -
జీ-20 సదస్సును బహిష్కరిస్తున్నాం: ట్రంప్ సంచలన ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది దక్షిణాఫ్రికాలో జరగనున్న జీ-20 సదస్సును అమెరికా బాయ్‌కాట్ చేస్తున్నట్టు ట్రంప్ తాజాగా ఓ ప్రకటనలో తెలిపారు. ఇదే సమయంలో జీ-20 గ్రూప్ నుంచి దక్షిణాఫ్రికాను తొలగించాలని డిమాండ్ చేశారు. అయితే, ఇందుకు గల కారణాలను ట్రంప్ వెల్లడించారు.అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా వేదికగా..‘జీ-20 సదస్సు దక్షిణాఫ్రికాలో జరగడం పూర్తిగా అవమానకరం. ఆ దేశంలో మైనార్టీలు అయిన తెల్లజాతి రైతులపై హింస, ఆస్తుల స్వాధీనం, హత్యలు జరుగుతున్నాయి. అక్కడ జరుగుతున్న దారుణాలు ప్రపంచానికి తెలియాలి. అందుకే అమెరికా జీ-20 సదస్సుల్లో అమెరికా పాల్గొనడం లేదు. జీ-20 దేశాల అధినేతల సదస్సుకు అమెరికా నుంచి ఎవరూ హాజరు కావడం లేదు. ఈ సదస్సును బహిష్కరిస్తున్నాం’ అని చెప్పుకొచ్చారు.అయితే, ఇటీవల మియామిలో చేసిన ప్రసంగంలో దక్షిణాఫ్రికాను జీ-20 గ్రూప్ నుంచి తొలగించాలని డిమాండ్ చేసిన ట్రంప్, తాజాగా అక్కడ జరిగే సదస్సును బహిష్కరించాలని నిర్ణయించారు. కాగా, తెల్లజాతి ఆఫ్రికన్ రైతులు దక్షిణాఫ్రికాలో దాడులకు గురవుతున్నారని, అక్కడి సర్కారు వారిని రక్షించడంలో విఫలమైందంటూ ఆరోపించారు. ఈ క్రమంలో దక్షిణాఫ్రికాకు చెందిన తెల్లజాతీయుల కోసం ట్రంప్ ప్రభుత్వం చర్యలు కూడా చేపట్టింది. వలసదారులకు ఆశ్రయం ఇస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.ట్రంప్‌కు దక్షిణాఫ్రికా కౌంటర్.. అధ్యక్షుడు ట్రంప్ ఆరోపణలను దక్షిణాఫ్రికా ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. తమ దేశంలో తెల్లజాతి ప్రజలు ఇప్పటికీ నల్లజాతి ప్రజల కంటే ఎక్కువ స్థాయి జీవన ప్రమాణాలతో జీవిస్తున్నారని స్పష్టం చేసింది. తెల్లజాతి రైతులపై వివక్ష, హింస జరుగుతున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు తప్పుడు సమాచారం అందినట్లు తెలిపింది.నవంబర్ 22-23 తేదీల్లో సదస్సు.. ఇక, జీ-20 సదస్సు ఈ ఏడాది నవంబర్ 22-23 తేదీల్లో దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది. ఈ సదస్సు ఆఫ్రికా ఖండంలో జరగడం ఇదే మొదటిసారి. వాస్తవానికి ట్రంప్ ఇప్పటికే తాను జీ-20 సదస్సుకు హాజరు కావట్లేదని ఇప్పటికే ప్రకటించారు. ఈ క్రమంలో ఆయన స్థానంలో అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ హాజరవుతారని అందరూ అనుకున్నారు. కానీ, ఇప్పుడు వాన్స్ కూడా తన ప్రయాణాన్ని రద్దు చేసినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, ఈ ఏడాది ప్రారంభంలో జీ-20 విదేశాంగ మంత్రుల సమావేశం జరిగింది. ఆ సమావేశాన్ని కూడా అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో బహిష్కరించారు. -
భారత్ నుంచి దక్షిణాఫ్రికా వెళ్లే నౌకపై.. సొమాలియా తీరంలో పైరేట్ల దాడి
దుబాయ్: సొమాలియా పైరెట్లు మరోసారి రెచ్చిపోయారు. భారత్ నుంచి దక్షిణాఫ్రికాకు వెళ్తున్న నౌకపై సొమాలియా తీరానికి సమీపంలో దాడికి దిగారు. మెషీన్ గన్లు, రాకెట్ ప్రొపెల్డ్ గ్రెనేడ్లతో నౌకపై కాల్పులకు దిగారు. మాల్టాకు చెందిన ఈ నౌక గుజరాత్‌లోని సిక్కా ఓడరేవు నుంచి బయలుదేరి దక్షిణాఫ్రికాలోని డర్బన్ వైపు వెళ్తోందని ఆంబ్రే అనే ప్రైవేట్ భద్రతా సంస్థ తెలిపింది. నౌకలో ప్రత్యేకంగా భద్రత సిబ్బంది లేరని పేర్కొంది. అందులోని మొత్తం 24 మంది సిబ్బంది ఓడలోని ఓ గదిలో లోపలి నుంచి తాళం వేసుకుని ఉండిపోయారంది. దాడి నేపథ్యంలో నౌక మార్గం మార్చుకుని, వేగం తగ్గించుకుందని వివరించింది. సముద్రం దొంగల దాడి కొనసాగుతోందని వివరించింది. ఈ ప్రాంతంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని బ్రిటిష్ మిలటరీలోని యునైటెడ్ కింగ్డమ్ మారిటైం ట్రేడ్ ఆపరేషన్స్ సెంటర్ హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల ఇరాన్‌కు చెందిన మత్స్యకార పడవను అడ్డగించి, స్వా«దీనం చేసుకున్న పైరేట్లు దాడులకు పాల్పడుతున్నారంది. తాజాగా కేమెన్ దీవులకు చెందిన నౌకపై పైరేట్లు కాల్పులకు తెగబడ్డారని, ఓడలోని భద్రతా సిబ్బంది ప్రతిదాడికి దిగడంతో వారు తోకముడిచారని పేర్కొంది. సొమాలీ తీరంలో 2011లో అత్యధికంగా 237 దాడులు జరిగాయి. అంతర్జాతీయ సహకారం, నిఘాతో పైరేట్ల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గతేడాది నాలుగు దాడులు జరిగినట్లు సమాచారం. తిరిగి ఈ ఏడాదిలో మళ్లీ దాడుల పరంపర మొదలవడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. -
దక్షిణాఫ్రికాను గెలిపించిన డికాక్
ఫైసలాబాద్: పాకిస్తాన్‌తో గురువారం జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు ఎనిమిది వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్తాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 269 పరుగులు చేసింది. సయీమ్ అయూబ్ (53; 5 ఫోర్లు, 1 సిక్స్), సల్మాన్ ఆఘా (69; 5 ఫోర్లు), నవాజ్ (59; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లు నాండ్రె బర్గర్ 4 వికెట్లు, పీటర్ 3 వికెట్లు తీశారు. అనంతరం దక్షిణాఫ్రికా 40.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 270 పరుగులు సాధించి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ డికాక్ (119 బంతుల్లో 123; 8 ఫోర్లు, 7 సిక్స్‌లు) అజేయ సెంచరీతో దక్షిణాఫ్రికాను విజయతీరాలకు చేర్చాడు. టోనీ జోర్జి (63 బంతుల్లో 76; 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) కూడా రాణించాడు. -
పంత్, ఆకాశ్ పునరాగమనం
న్యూఢిల్లీ: స్టార్ వికెట్ కీపర్–బ్యాటర్ రిషభ్ పంత్ మళ్లీ భారత టెస్టు జట్టులోకి పునరాగమనం చేశాడు. ఇంగ్లండ్ పర్యటనలో ఆకట్టుకున్న పేసర్ ఆకాశ్‌దీప్‌కూ సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చింది. ఇంగ్లండ్‌లో నాలుగో టెస్టు సందర్భంగా పంత్ కాలికి గాయమైంది. దీంతో విండీస్‌తో సిరీస్‌కు సైతం దూరమయ్యాడు. ప్రస్తుతం భారత్ ‘ఎ’ జట్టు కెప్టెన్ పంత్ దక్షిణాఫ్రికా ‘ఎ’తో జరిగిన మ్యాచ్‌లో రాణించాడు. అయితే వెటరన్ సీమర్ మహ్మద్ షమీని సెలక్టర్లు పట్టించుకోలేదు. టీమిండియా బెర్తుకోసం రంజీల్లో శ్రమిస్తున్న అతని పేరును సెలక్టర్లు పరిశీలించకపోవడం చూస్తుంటే ఇక 35 ఏళ్ల షమీ కెరీర్ ముగిసినట్లేననే ఊహాగానాలకు ఊపిరి పోసినట్లయ్యింది. సఫారీతో ఈ నెల 14 నుంచి కోల్‌కతాలో తొలిటెస్టు, 22 నుంచి గువాహటి రెండో టెస్టులో జరుగుతుంది. భారత టెస్టు జట్టు: గిల్ (కెప్టెన్), జైస్వాల్, రాహుల్, సాయి సుదర్శన్, పడిక్కల్, పంత్, జురేల్, జడేజా, సుందర్, బుమ్రా, అక్షర్, నితీశ్ రెడ్డి, సిరాజ్, కుల్దీప్, ఆకాశ్‌దీప్. -
పాకిస్తాన్‌దే తొలి వన్డే
ఫైసలాబాద్: కొత్త వన్డే కెప్టెన్ షాహిన్ అఫ్రిది నేతృత్వంలో పాకిస్తాన్ శుభారంభం చేసింది. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో పాక్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 49.1 ఓవర్లలో 263 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (71 బంతుల్లో 63; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు), డ్రి ప్రిటోరియస్ (60 బంతుల్లో 57; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధసెంచరీలు చేయగా, కార్బిన్ బాష్ (41) రాణించాడు. పాక్ బౌలర్లలో నసీమ్ షా, అబ్రార్ అహ్మద్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం పాకిస్తాన్ 49.4 ఓవర్లలో 8 వికెట్లకు 264 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ సల్మాన్ ఆగా (71 బంతుల్లో 62; 5 ఫోర్లు, 1 సిక్స్), మొహమ్మద్ రిజ్వాన్ (74 బంతుల్లో 55; 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలు నమోదు చేయగా...ఫఖర్ జమాన్ (45), సయీమ్ అయూబ్ (39) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో పాక్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లగా...రెండో వన్డే రేపు ఇదే మైదానంలో జరుగుతుంది. -
సంబరాలు... నజరానాలు...
ముంబై: ‘న లేగా కోయీ పంగా, కర్దేంగే హమ్ దంగా... రహేగా సబ్ సే ఊపర్, హమారా తిరంగా’... విశ్వ విజేతగా నిలిచిన తర్వాత భారత మహిళల క్రికెట్ జట్టు సభ్యుల సంబరాలు అంబరాన్నంటాయి. స్టేడియం నుంచి మొదలు పెట్టి హోటల్ గదిలో ట్రోఫీని గుండెలకు హత్తుకొని పడుకునే వరకు ప్రతీ క్షణాన్ని వారు ఆస్వాదించారు. దక్షిణాఫ్రికా ప్లేయర్ డిక్లెర్క్ క్యాచ్‌ను అందుకోవడంతో మన శిబిరంలో షురూ అయిన వేడుకలు ఆ తర్వాత సుదీర్ఘ సమయం పాటు కొనసాగాయి. క్యాచ్ పట్టిన బంతిని అపురూపంగా దాచుకున్న కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహచరులందరితో కలిసి ఆనందం పంచుకుంది. అక్కడే ఉన్న తన తల్లిదండ్రులను కలిసిన హర్మన్ సంతోషం రెట్టింపైంది. ఎంత ఎదిగినా నాకు పసిదానివే అన్నట్లుగా... 36 ఏళ్ల హర్మన్‌ను ఎత్తుకొని మరీ తండ్రి చూపించిన ప్రేమ హైలైట్‌గా నిలిచింది. తన బాయ్‌ఫ్రెండ్, గాయకుడు పలాష్ ముచ్చల్‌తో స్మృతి విజయానందాన్ని ప్రదర్శించింది. భావోద్వేగానికి లోనైన జట్టు సభ్యులు పరస్పర అభినందనల తర్వాత కోలుకొని సాధారణ స్థితికి వచ్చేందుకు కొంత సమయం పట్టింది. ట్రోఫీ, పతకాల ప్రదానం వంటి లాంఛనాలు ముగిసిన తర్వాత మళ్లీ ప్లేయర్లంతా తమ ‘టీమ్ సాంగ్’తో ఒక్క చోటికి చేరారు. పిచ్‌పై ట్రోఫీని ఉంచి ‘టీమిండియా, టీమిండియా... హియర్ టు ఫైట్, కోయీ న లేతా హమ్కో లైట్’... అంటూ సాగిన ఈ పాటను అందరూ కలిసి పాడారు. దీనికి సంబంధించి ఆసక్తికర నేపథ్యాన్ని జెమీమా వెల్లడించింది. నాలుగేళ్ల క్రితమే తమ జట్టుకు థీమ్ సాంగ్ కావాలని భావించామని... అయితే ప్రపంచకప్ గెలిచిన తర్వాత దీని గురించి చెప్పాలనే అంతా నిర్ణయించుకున్నామని ఆమె పేర్కొంది. ఇప్పుడు దానికి సరైన సమయం వచి్చందంటూ జెమీమా పాటను మొదలుపెట్టింది. జట్టు సభ్యులు స్టేడియం నుంచి హోటల్‌కు చేరుకున్న సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఢోల్ బాజాలతో వారికి స్వాగతం లభించింది. హర్మన్ స్వయంగా పోర్టబుల్ మ్యూజిక్ ప్లేయర్ చేతిలో పట్టుకొని పంజాబీ పాటలకు డ్యాన్స్ చేస్తూ ముందుకు సాగడం విశేషం. జెమీమా, స్మృతి ట్రోఫీతో కలిసి పడుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో సందడి చేశాయి. బోర్డు కానుకతో పాటు... తొలిసారి వరల్డ్‌కప్‌ను సొంతం చేసుకున్న భారత బృందానికి బీసీసీఐ సముచిత రీతిలో బహుమతిని ప్రకటించింది. టీమిండియా జట్టు సభ్యులు, సహాయక సిబ్బంది, సెలక్షన్ కమిటీకి కలిపి మొత్తం రూ.51 కోట్లు నజరానాగా ఇస్తున్నట్లు బోర్డు వెల్లడించింది. విడివిడిగా ఎంత మొత్తం అనే విషయంలో స్పష్టత లేకపోయినా... ప్లేయర్లకు ఒక్కొక్కరికి కనీసం రూ. 2 కోట్ల 50 లక్షలు దక్కే అవకాశం ఉంది. జట్టులో ప్రధాన పేసర్లయిన రేణుకా సింగ్, క్రాంతి గౌడ్లకు వారి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ప్రోత్సాహకాన్ని ప్రకటించాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం క్రాంతి గౌడ్‌కు, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రేణుకకు రూ. 1 కోటి చొప్పున ఇవ్వనున్నాయి. మరోవైపు సూరత్‌కు చెందిన వ్యాపారవేత్త, రాజ్యసభ సభ్యుడు గోవింద్ ఢోలకియా కూడా తన తరఫు నుంచి భారత జట్టు సభ్యులకు వజ్రాల ఆభరణాలను బహుమతిగా ఇస్తానని ప్రకటించాడు. సీనియర్లకు గౌరవంతో...భారత జట్టు తొలిసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. కానీ ప్రస్తుత టీమ్ ఈ స్థాయికి చేరడంలో తమ వంతు పాత్ర పోషించిన సీనియర్లు, గతంలో తమ సహచరులను ఆటగాళ్లు మర్చిపోలేదు. 2005, 2017 రన్నరప్‌గా నిలిచిన జట్లకు కెప్టెన్‌గా ఉండటంతో పాటు మొత్తం ఆరు వరల్డ్ కప్‌లు ఆడినా ట్రోఫీని ముద్దాడలేకపోయిన మిథాలీ రాజ్‌తో పాటు మరో దిగ్గజం జులన్ గోస్వామిలను భారత జట్టు సభ్యులు తమ వేడుకల్లో భాగం చేశారు. మరో మాజీ ప్లేయర్, టీవీ వ్యాఖ్యాత అంజుమ్ చోప్రా కూడా వీరితో జత కలిసింది. మిథాలీ చేతికి ట్రోఫీని అందించగా, దానిని అందుకొని ఆమె కొద్ది సేపు భావోద్వేగానికి గురైంది. ఈ టీమ్‌లో చాలా మంది మిథాలీ నాయకత్వంలో ఆడినవారే ఉన్నారు. -
సచిన్, లక్ష్మణ్, రోహిత్ వచ్చారు.. మీరెక్కడా సార్?
భారత మహిళల క్రికెట్ చిరకాల స్వప్నం నెరవేరింది. మూడోసారి ఫైనల్ చేరిన మన వనితలు కప్‌ను ఒడిసి పట్టుకున్నారు. కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తూ ఎట్టకేలకు విశ్వ విజేతగా నిలిచారు. భారత మహిళల క్రికెట్ టీమ్ వరల్డ్ కప్ సాధించడంతో దేశవ్యాప్తంగా ప్రజలు సంబురాలు చేసుకున్నారు. విశ్వవ్యాప్తంగా ఉన్న భారతీయులు మన మహిళలను ప్రశంసలతో ముంచెత్తారు. అదే సమయంలో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా మహిళల టీమ్‌ను సైతం కొనియాడారు.అయితే తమ టీమ్ రన్నరప్‌గా నిలవడంతో ప్రముఖ దక్షిణాఫ్రికా నటి స్పందించింది. సౌత్ఆఫ్రికాకు చెందిన ప్రముఖ నటి, రచయిత్రి తంజా వుర్ విన్నర్‌గా నిలిచిన భారత మహిళల టీమ్‌పై ప్రశంసలు కురిపించింది. అదే సమయంలో సొంత దేశంలోని పురుష క్రికెటర్లతో పాటు ప్రజలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. భారతీయులు చూపించిన ప్రేమ, మద్దతు.. మన మహిళా క్రికెట్ జట్టుకు సౌతాఫ్రికన్స్ సపోర్ట్ ఇవ్వకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియో షేర్ చేస్తూ తన ఆవేదన వ్యక్తం చేసింది. భారతీయులు క్రీడల పట్ల చూపిస్తున్న ప్రేమ, మద్దతు మనవాళ్లకు ఎందుకు రాదని ప్రశ్నించింది.వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో మాజీ క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, వీవీఎస్ లక్ష్మణ్ మహిళా క్రికెటర్లను ఉత్సాహపరిచేందుకు స్టేడియానికి వచ్చారని కొనియాడింది. మరి దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్స్ ఎక్కడ? అని నిలదీసింది. ఎందుకంటే మీకు ఈ మ్యాచ్ అంత ముఖ్యం కాకపోవచ్చంటూ సౌతాఫ్రికా పురుష క్రికెటర్లను ఉద్దేశించి ఘాటుగా విమర్శించింది. సౌతాఫ్రికా క్రీడా మంత్రి కూడా ఈ కార్యక్రమానికి హాజరు కాకపోవడం.. మహిళల క్రీడల పట్ల తన దేశ వైఖరిని సోషల్ మీడియా వేదికగా ఎండగట్టింది.స్మృతి మంధానతో పాటు భారత మహిళ క్రికెటర్స్ చాలా బాగా ఆడారని తంజా వుర్ ప్రశంసలు కురిపించింది. భారతీయ అభిమానుల నమ్మకాన్ని ఆమె కొనియాడింది. ఇలాంటి మద్దతు టీమ్ ఇండియాకు బాాగా కలిసొచ్చిందని తంజా వుర్ తెలిపింది. ఏది ఏమైనా ఈ రోజు మీరు ఈ ప్రపంచ కప్ విజేతలు.. మీరు దానికి అర్హులు అంటూ టీమిండియాను ప్రశంసంచింది. కాగా.. ఈ ప్రతిష్టాత్మ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌కు దక్షిణాఫ్రికా మాజీ దిగ్గజ క్రికెటర్స్ జాక్వస్ కల్లిస్, ఏబీ డివిలియర్స్, గ్రేమ్ స్మిత్ లాంటి వాళ్లెవరూ కూడా స్టేడియంలో కనిపించలేదు. దీంతో నటికి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ వీడియోను రిలీజ్ చేసింది. View this post on Instagram A post shared by Thanja Vuur 🔥 (@cape_town_cricket_queen) -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్.. వరల్డ్ రికార్డు బద్దలు
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) చరిత్ర సృష్టించింది. ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ (women's CWC) ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 2025 ఎడిషన్‌లో అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండిన లారా.. 9 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 3 అర్ద సెంచరీల సాయంతో 571 పరుగులు చేసింది. తద్వారా ఈ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవడంతో పాటు ఓ సింగిల్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గానూ ప్రపంచ రికార్డు సాధించింది. ఈ క్రమంలో లారా ఆస్ట్రేలియా కెప్టెన్ అలైస్సా హీలీ (Alyssa Healy) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. హీలీ 2022 ఎడిషన్‌లో 509 పరుగులు చేసింది.ఓ సింగిల్ వన్డే వరల్డ్‌కప్ ఎడిషన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ప్లేయర్లు..లారా వోల్వార్డ్ట్- 570 (2025)అలైస్సా హీలీ- 509 (2022)రేచల్ హేన్స్- 497 (2022)డెబ్బీ హాక్లీ- 456 (1997)లిండ్సే రీలర్- 448 (1989)సెమీస్, ఫైనల్స్‌లో సెంచరీలుతాజాగా ముగిసిన వన్డే ప్రపంచకప్ ఎడిషన్‌లో లారా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉండింది. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీస్, భారత్‌తో జరిగిన ఫైనల్స్‌లో అద్భుతమైన సెంచరీలు చేసింది. అలాగే భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో అర్ద సెంచరీలు చేసింది. నిన్న జరిగిన ఫైనల్లో ఓ పక్క సహచరులంతా విఫలమైనా లారా ఒంటరిపోరాటం చేసి తన జట్టును గెలిపించేందుకు విఫలయత్నం చేసింది. ఈ ఇన్నింగ్స్‌తో ఆమె అందరి మన్ననలు అందుకుంది.మూడో ప్రయత్నంలోనూ..గడిచిన రెండేళ్లలో మూడు సార్లు (2023, 2024 టీ20 ప్రపంచకప్, 2025 వన్డే ప్రపంచకప్) వరల్డ్‌కప్ ఫైనల్స్‌కు చేరిన సౌతాఫ్రికా మహిళల జట్టు ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా అవతరించలేకపోయింది. తాజాగా భారత్‌తో జరిగిన వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఈ జట్టు 52 పరుగుల తేడాతో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఫైనల్లో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ తొలిసారి జగజ్జేతగా అవతరించింది.చెలరేగిన షఫాలీ, దీప్తి.. లారా ఒంటరి పోరాటం వృధాఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. చదవండి: ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా -
ఓటమి బాధ కలిగిస్తున్నా, గర్వంగా ఉంది: సౌతాఫ్రికా కెప్టెన్ లారా
నిన్న (నవంబర్ 2) జరిగిన వన్డే వరల్డ్‌కప్ 2025 (Women's CWC 2025) ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో పరాజయంపాలై, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. గత రెండేళ్లలో ఈ జట్టుకు ఇది వరుసగా మూడో ఫైనల్స్ పరాభవం. దీనికి ముందు 2023 (ఆస్ట్రేలియా చేతిలో), 2024 (న్యూజిలాండ్ చేతిలో) టీ20 ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తాజా ఫైనల్స్ (India vs South Africa) పరాభవం తర్వాత సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (Laura Wolvaardt) తీవ్రమైన భావోద్వేగానికి లోనైంది. ఆమె మాటల్లో..“మా జట్టు పట్ల ఎంత గర్వంగా ఉన్నానో మాటల్లో చెప్పలేను. టోర్నీ ఆధ్యాంతం అద్భుతంగా ఆడాం. ఫైనల్లో భారత్ మా కంటే మెరుగ్గా ఆడింది. ఓటమి బాధ కలిగించినా, ఈ ప్రయాణం మాకు ఎంతో నేర్పింది. మరింత బలంగా తిరిగి వస్తాం.ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతిలో ఓటములపై స్పందిస్తూ.. "ఓపెనింగ్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ చేతిలో, ఆతర్వాత ఆస్ట్రేలియా చేతిలో ఎదురైన పరాభవాలను సమర్దవంతంగా అధిగమించాం. కొన్ని మ్యాచ్‌లు అద్భుతంగా, కొన్ని బాగా కష్టంగా సాగుతాయి. ఈ టోర్నీలో చాలా మంది ఆటగాళ్లు మెరిశారు. ఫైనల్ వరకూ వచ్చామంటే, మా బలాన్ని చూపించాం”అంత ఈజీ కాదు..“కెప్టెన్సీ, బ్యాటింగ్ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అంత సులభం కాదు. టోర్నమెంట్ ప్రారంభంలో నేను బాగా ఆడలేదు. కానీ చివర్లో ‘ఇది కూడా ఓ క్రికెట్ మ్యాచ్’ అని భావించి నా సహజ ఆటతీరును ప్రదర్శించగలిగాను”సరైన నిర్ణయమే..“టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం సరైన నిర్ణయమే. 300 పరుగుల లక్ష్యం సాధ్యమే అనిపించింది. కానీ వికెట్లు ఎక్కువగా కోల్పోయాం”అద్భుతంగా పుంజుకున్నాం..“టీమిండియా 350 పరుగుల దిశగా వెళ్తోంది అనిపించింది. కానీ చివర్లో మా బౌలర్లు అద్భుతంగా పుంజుకున్నారు. టోర్నమెంట్ మొత్తం మా డెత్ ఓవర్ల బౌలింగ్ బలంగా ఉంది”షఫాలీ, కాప్ గురించి..“షఫాలీ బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ అద్భుతంగా రాణించింది. ఆమె ఆట చాలా అగ్రెసివ్‌గా ఉంటుంది. ఇవాళ అది బాగా వర్కౌట్ అయ్యింది. ఆమె ప్రత్యర్థిని గాయపరచగలదు”“మారిజాన్ కాప్ గురించి చెప్పాలంటే.. ఆమె ఇద్దరు ఆటగాళ్లతో సమానం. గతంలో చాలా వరల్డ్ కప్‌లలో అద్భుతంగా ఆడింది. ఇది ఆమె చివరి టోర్నీ కావడం బాధ కలిగిస్తుంది. ఆమె కోసమైనా ఈసారి ప్రపంచకప్ గెలవాలన్న తపన అందరిలోని ఉండింది”కాగా, నిన్న జరిగిన ఫైనల్లో భారత్ సౌతాఫ్రికాపై 52 పరుగుల తేడాతో విజయం సాధించి, తొలిసారి జగజ్జేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. షఫాలీ వర్మ (87), దీప్తి శర్మ (58), స్మృతి మంధన (45) సత్తా చాటి భారీ స్కోర్ (298/7) చేసింది. టార్గెట్‌ను కాపాడుకునే క్రమంలో దీప్తి శర్మ (9.3-0-39-5) చెలరేగడంతో సౌతాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) ఒంటరి పోరాటం చేసినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. వోల్వార్డ్ట్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్లోనూ సూపర్ సెంచరీతో (169) చెలరేగింది.చదవండి: హ్యాట్సాఫ్ మజుందార్ -
పాపం సౌతాఫ్రికా.. ఓడినా మనసులు గెలుచుకుంది..!
క్రికెట్ చరిత్రలో అత్యంత దురదృష్టవంతమైన జట్టు ఏదైనా ఉందా అంటే అది సౌతాఫ్రికానే (South Africa) అని చెప్పాలి. ఈ జట్టు పురుషుల, మహిళల విభాగాంలో సమానంగా దురదృష్టాన్ని షేర్ చేసుకుంటుంది. ఇటీవలికాలంలో ఏకంగా నాలుగు ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఓడింది.తొలుత మహిళల జట్టు 2023 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ఆ మరుసటి ఏడాదే (2024) మహిళల జట్టు మరోసారి టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో (న్యూజిలాండ్) చిత్తైంది. అదే ఏడాది (2024) పురుషుల జట్టుకు కూడా ఫైనల్లో (భారత్ చేతిలో) చుక్కెదురైంది. తాజాగా మహిళల జట్టు మరోసారి ఫైనల్లో ఓటమిపాలై, దురదృష్ట పరంపరను కొనసాగించింది.2025 వన్డే ప్రపంచకప్‌లో (Women's Cricket World Cup) భాగంగా నిన్న (నవంబర్ 2) జరిగిన ఫైనల్లో సౌతాఫ్రికా భారత్ చేతిలో 52 పరుగుల తేడాతో ఓడి, రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ప్రపంచకప్ ప్రయాణంలో సౌతాఫ్రికా జట్టు రెండేళ్ల వ్యవధిలో నాలుగు సార్లు ఫైనల్‌కు చేరినప్పటికీ.. ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలవలేకపోయింది.ప్రపంచ కప్ టోర్నీల్లో సౌతాఫ్రికా జర్నీ క్రికెట్ అభిమానులను ఒకింత బాధకు గురి చేస్తుంది. పాపం సౌతాఫ్రికా.. అంటూ నెటిజన్లు సానుభూతి వ్యక్తపరుస్తున్నారు. తాజా ప్రయత్నంలో సౌతాఫ్రికా వీరోచితంగా పోరాడినప్పటికీ అంతిమ సమరంలో అద్భుతమైన క్రికెట్ ఆడిన భారత్ చేతిలో ఓడింది.ఈ ఎడిషన్‌లో సౌతాఫ్రికా సైతం అది నుంచి అద్భుతంగా ఆడింది. లీగ్ దశలో భారత్ సహా న్యూజిలాండ్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్ జట్లను ఓడించిన ఈ జట్టు (ఇంగ్లండ్, ఆస్ట్రేలియా చేతుల్లో మాత్రమే ఓడింది).. సెమీస్‌లో ఇంగ్లండ్‌పై అద్భుత విజయం సాధించి ఫైనల్‌కు చేరింది. ఫైనల్లోనూ సౌతాఫ్రికా అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. తొలుత బౌలింగ్ చేసి భారీ స్కోర్ (298) ఇచ్చినప్పటికీ.. దాన్ని ఛేదించేందుకు విశ్వ ప్రయత్నాలు చేసింది. అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్న వారి కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (101) మరోసారి శతకంతో విజృంభించింది. అయితే ఆమెకు మరో ఎండ్ నుంచి సరైన సహకారం లభించలేదు. దీంతో ఓటమి తప్పలేదు.భారత బౌలర్లు, ముఖ్యంగా స్పిన్నర్లు దీప్తి శర్మ (9.3-0-39-5), షఫాలీ వర్మ (7-0-36-2), శ్రీచరణి (9-0-48-1) మ్యాజిక్ చేసి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్ని అందించారు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడినా హుందాగా ప్రవర్తించి అందరి మన్ననలు అందుకుంది. అత్యుత్తమ క్రికెట్ ఆడిన జట్టు చేతిలో ఓడామని సర్ది చెప్పుకుంది. చదవండి: జగజ్జేత టీమిండియాకు భారీ నజరానా -
ఓటముల నుంచి ఉవ్వెత్తున ఎగసి...
ఎనిమిదేళ్ల క్రితం... వన్డే ప్రపంచ కప్ ఫైనల్లో ఇంగ్లండ్‌పై 229 పరుగుల లక్ష్య ఛేదనలో చివర్లో తడబడిన భారత మహిళలు 9 పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. ఆఖరి 3 ఓవర్లలో 3 వికెట్లతో 14 పరుగుల చేయాల్సిన స్థితిలో అంత చేరువగా వచ్చి ఓడటం అందరినీ వేదనకు గురి చేసింది. అయితే 2017 వరల్డ్ కప్ ప్రదర్శన గతంతో పోలిస్తే మహిళల జట్టుకు ఎంతో మేలు చేసింది. అన్ని వైపుల ఆసక్తి కనిపించడంతో పాటు టీమ్ స్థాయి కూడా పెరిగింది. ప్రతీ దశలో బీసీసీఐ అన్ని రకాలుగా ప్రోత్సాహం ఇస్తూ టీమ్‌కు తగిన అవకాశాలు కల్పించింది. అయినా సరే, 2021 వరల్డ్ కప్ మరోసారి నిరాశను మిగిల్చింది. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు కూడా చేరలేకపోయింది. దీని తర్వాత మళ్లీ కొత్తగా మొదలు పెట్టాల్సి వచ్చింది. సీనియర్ ప్లేయర్ మిథాలీ రాజ్ రిటైర్మెంట్ తర్వాత హర్మన్‌ప్రీత్ చేతుల్లోకి వన్డే టీమ్ సారథ్య బాధ్యతలు వచ్చాయి. సరిగ్గా రెండేళ్ల క్రితం అమోల్ మజుందార్‌ను హెడ్ కోచ్‌గా ఎంపిక చేసిన తర్వాత టీమ్‌లో అసలైన మార్పు మొదలైంది. ఆ సమయంలో వేరే ఆలోచన లేకుండా 2025 వరల్డ్ కప్ కోసమే పక్కా ప్రణాళికతో జట్టు సన్నద్ధమైంది. టోర్నీ వేదిక భారత్ కావడంతో దానికి అనుగుణంగా జట్టును తీర్చిదిద్దేందుకు టీమ్ మేనేజ్మెంట్ ప్రయత్నించింది. 2023లో పూర్తి స్థాయిలో వచ్చిన ఉమెన్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ప్రభావం కూడా టీమ్‌పై కనిపించింది. ఈ లీగ్ మన ప్లేయర్లకు కూడా పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడు నేర్పించింది. అప్పుడప్పుడు కొన్ని ఓటములు వచ్చినా ప్రత్యర్థులు తేలిగ్గా తీసుకునే పరిస్థితిలో మార్పు కూడా కనిపించింది. ప్రత్యేక శిబిరాలు, ఎక్కువ విరామం లేకుండా వరుసగా వేర్వేరు జట్లతో సిరీస్‌లు భారత్ ఆటను మరింత పదునుగా మార్చాయి. గత రెండేళ్లలో ఇది క్రమ పద్ధతిలో సాగింది. బలమైన ప్రత్యర్థులైన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికాలపై జట్టు చెప్పుకోదగ్గ విజయాలు సాధించింది. ఇటీవలే ఇంగ్లండ్‌ను వారి సొంతగడ్డపైనే ఓడించి సిరీస్ గెలవడం టీమ్‌లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. సరిగ్గా టోర్నీకి ముందు స్వదేశంలోనే జరిగిన సిరీస్‌లో ఆ్రస్టేలియాతో ఓడినా... మన జట్టు కూడా బలమైన ప్రదర్శనే ఇచ్చింది. ముఖ్యంగా మూడో వన్డేలో 412 పరుగుల లక్ష్య ఛేదనలో ఏకంగా 369 పరుగులు చేయగలిగింది. ఇదే మ్యాచ్ సెమీస్‌లో ఆసీస్‌పై విజయానికి స్ఫూర్తినిచ్చిందనడంలో సందేహం లేదు. జట్టులోని ప్రతీ ఒక్కరు విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. 434 పరుగులతో ఎప్పటిలాగే స్మృతి జట్టు నంబర్‌వన్ బ్యాటర్‌గా తన స్థాయిని ప్రదర్శించగా, గాయంతో 7 మ్యాచ్‌లకే పరిమితమైన ప్రతీక 308 పరుగులు సాధించింది. విజయం సాధించిన తర్వాత వీల్‌చైర్‌లో కూర్చొని ఆమె సంబరాల్లో పాల్గొనడం సగటు అభిమానులందరికీ సంతృప్తినిచ్చింది. జెమీమా 292 పరుగులే చేసినా, ఆసీస్‌పై సెమీఫైనల్లో ఆడిన ఇన్నింగ్స్‌ను ఆమెను చిరస్థాయిగా నిలబెట్టింది. రిచా ఘోష్ ఏకంగా 133.52 స్ట్రయిక్‌రేట్‌తో చేసిన 235 పరుగులు జట్టుకు ప్రతీసారి కావాల్సిన జోరును అందించాయి. 260 పరుగులు చేసిన హర్మన్ నాయకురాలిగా జట్టును సమర్థంగా నడిపించింది. సెమీస్ ఆడిన ఇన్నింగ్స్ కూడా ఆమె స్థాయిని చూపించింది. కెప్టెన్‌గా సాధించిన ఈ గెలుపుతో భారత క్రికెట్లో ఆమె దిగ్గజాల సరసన నిలిచింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ 22 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా విజయంలో ప్రధాన భూమిక పోషించింది. ముఖ్యంగా ఫైనల్లో తీసిన ఐదు వికెట్లు ఎప్పటికీ మర్చిపోలేనివి. బ్యాటింగ్‌లో కూడా ఆమె 3 అర్ధసెంచరీలు సాధించింది. రేణుక, క్రాంతి, అమన్‌జోత్, రాధ అంకెలపరంగా పెద్ద గణాంకాలు నమోదు చేయకపోయినా... జట్టుకు అవసరమైన ప్రతీసారి కీలక సమయంలో తామున్నామంటూ ముందుకు వచ్చారు. ఇదే జట్టును నడిపించింది. లీగ్ దశలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి చేతుల్లో ఓడి ఒక్కసారిగా జట్టు నిరాశలో కూరుకుపోయింది. అన్నివైపుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఎన్ని సౌకర్యాలు కల్పించినా ఆట మాత్రం మారడం లేదని సూటిపోటు మాటలు వినిపించాయి. కానీ అక్కడినుంచి టీమ్ ఉవ్వెత్తున ఎగసింది. సెమీస్ స్థానం ఖాయం చేసుకోవడంతో పాటు సెమీస్, ఫైనల్ మ్యాచ్‌లలో అద్భుత విజయాలతో చాంపియన్‌గా నిలిచింది. ఈ అసాధారణ, అద్భుత ప్రదర్శనకు దేశం మొత్తం సలామ్ చేస్తోంది. -
IND W Vs SA W: మన అమ్మాయిల మహాద్భుతం
మన అతివల ఆట అంబరాన్ని తాకింది... ఆకాశమంత అంచనాలతో బరిలోకి దిగిన భారత బృందం వాటిని అందుకొని అందనంత ఎత్తులో నిలిచింది... గతంలో రెండుసార్లు అందినట్లుగా అంది చేజారిన వన్డే వరల్డ్ కప్‌ను ఎట్టకేలకు మూడో ప్రయత్నంలో ముద్దాడింది... ఆఖరి సమరంలో అద్భుత ప్రదర్శనను కనబర్చిన మన అమ్మాయిలు విశ్వ విజేతలుగా శిఖరానికి చేరారు... ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు... సమష్టిగా చెలరేగిన టీమిండియా ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకుంది. ఈ ప్రపంచకప్ గెలుపు సాధారణమైంది కాదు. మన మహిళల క్రికెట్‌ను మరింత పెద్ద స్ధాయికి చేర్చే పునాదిరాయి. పురుషుల క్రికెట్లో 1983 వరల్డ్ కప్ గెలుపునకు సమానంగా మన అమ్మాయిల జట్టు రాత మార్చే అరుదైన ఘట్టం. దాదాపు 40 వేల మంది ప్రేక్షకులతో మైదానం నీలి సముద్రంగా మారిపోగా... ఆసక్తిగా సాగిన ఫైనల్లో బ్యాటింగ్‌లో షఫాలీ వర్మ, దీప్తి శర్మ, స్మృతి మంధాన భారీ స్కోరుకు బాటలు వేసి ప్రత్యర్థికి సవాల్ విసరగా... బౌలింగ్‌లోనూ దీప్తి, షఫాలీ సత్తా చాటి విజయానికి బాటలు పరిచారు. అభిమానులు అండగా నిలుస్తూ మైదానాన్ని హోరెత్తిస్తుండగా... 46వ ఓవర్ మూడో బంతికి డిక్లెర్క్ షాట్ కొట్టగా, కవర్స్‌లో కెప్టెన్హర్మన్ప్రీత్ క్యాచ్ అందుకొని విజయధ్వానం చేయడం టోర్నీకి లభించిన సరైన ముగింపు. ముంబై: భారత మహిళల జట్టు వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకొని విశ్వ విజేతగా నిలిచింది. టీమిండియా ఈ టైటిల్ సాధించడం ఇదే మొదటిసారి. ఆదివారం డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో భారత్ 52 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. వర్షం కారణంగా మ్యాచ్ రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసింది. షఫాలీ వర్మ (78 బంతుల్లో 87; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), దీప్తి శర్మ (58 బంతుల్లో 58; 3 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించగా...స్మృతి మంధాన (58 బంతుల్లో 45; 8 ఫోర్లు) రాణించింది. షఫాలీ, స్మృతి తొలి వికెట్‌కు 106 బంతుల్లో 104 పరుగులు జోడించారు. అనంతరం దక్షిణాఫ్రికా 45.3 ఓవర్లలో 246 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్లారా వోల్వార్ట్ (98 బంతుల్లో 101; 11 ఫోర్లు, 1 సిక్స్) మాత్రమే సెంచరీతో ఒంటరి పోరాటం చేసింది. దీప్తి శర్మ (5/39) ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చగా, షఫాలీ 2 వికెట్లతో కీలక పాత్ర పోషించింది. ‘ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్ మ్యాచ్’ పురస్కారం షఫాలీ వర్మకు... ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’ అవార్డు దీప్తి శర్మకు లభించాయి. భారీ ఓపెనింగ్ భాగస్వామ్యం... టోర్నీలో గత మ్యాచ్‌లతో పోలిస్తే ఈసారి భారత్‌కు మరింత మెరుగైన ఆరంభం లభించింది. సెమీస్‌లో విఫలమైన షఫాలీ ధాటిగా మొదలు పెట్టగా, స్మృతి కూడా కొన్ని చక్కటి షాట్లు ఆడింది. కాప్ వేసిన మొదటి ఓవర్ మెయిడిన్‌గా ముగిసినా... తర్వాత భారత బ్యాటర్లిద్దరూ జోరు ప్రదర్శించారు. 10 ఓవర్లు ముగిసేసరికి ఇద్దరూ చెరో 5 ఫోర్లు బాదగా, స్కోరు 64 పరుగులకు చేరింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే అత్యుత్తమ పవర్‌ప్లే స్కోరు. 17.2 ఓవర్లలో స్కోరు 100కు చేరగా, ఆ తర్వాత ట్రయాన్ తొలి ఓవర్లోనే స్మృతిని అవుట్ చేయడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. 49 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం షఫాలీ మరింత వేగంగా ఆడే ప్రయత్నం చేసింది. అయితే సెంచరీకి చేరువవుతున్న దశలో అలసటతో ఇబ్బంది పడిన ఆమె వికెట్ సమర్పించుకుంది. జెమీమా రోడ్రిగ్స్ (37 బంతుల్లో 24; 1 ఫోర్), హర్మన్‌ప్రీత్ కౌర్ (29 బంతుల్లో 20; 2 ఫోర్లు) విఫలమయ్యారు. ముఖ్యంగా ఎంలాబా చక్కటి బంతితో హర్మన్‌ను బౌల్డ్ చేయడంతో సఫారీలకు పైచేయి సాధించే అవకాశం దక్కింది. దీప్తి భారీ షాట్లకంటే సింగిల్స్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టగా, అమన్‌జోత్ (14 బంతుల్లో 12; 1 ఫోర్) విఫలమైంది. అయితే రిచా ఘోష్ (24 బంతుల్లో 34; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) క్రీజ్‌లో ఉన్నంత సేపు తనదైన శైలిలో దూకుడుగా ఆడటంతో జట్టు చెప్పుకోదగ్గ స్కోరు సాధించగలిగింది. కెప్టెన్ మినహా.. ఛేదనను వోల్వార్ట్, బ్రిట్స్ (35 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) ఎలాంటి సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ప్రారంభించారు. పవర్‌ప్లే ముగిసేసరికి జట్టు 52 పరుగులు చేసింది. అయితే 10వ ఓవర్లో అనవసరపు సింగిల్‌కు ప్రయత్నించిన బ్రిట్స్‌ను అమన్‌జోత్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో జట్టు వికెట్ల పతనం మొదలైంది. అనెక్ బాష్‌ను (0) తన తొలి ఓవర్లోనే అవుట్ చేసి శ్రీచరణి మళ్లీ దెబ్బ తీసింది. 21వ ఓవర్లో పార్ట్‌టైమర్ షఫాలీని బౌలింగ్‌కు దించడం భారత్‌కు కలిసొచ్చింది. 9 పరుగుల వ్యవధిలో లూస్ (31 బంతుల్లో 25; 4 ఫోర్లు), కాప్ (4)లను షఫాలీ అవుట్ చేసింది. ఒకవైపు వోల్వార్ట్ పోరాడుతున్నా...మరో ఎండ్‌లో వరుసగా వికెట్లు పడ్డాయి. డెర్క్సెన్ (37 బంతుల్లో 35; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొద్ది సేపు సహకరించినా లాభం లేకపోయింది. 96 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అనంతరం వోల్వార్ట్ వెనుదిరగడంతో సఫారీ ఓటమి లాంఛనమే అయింది. మన చరణి బంగారం... ప్రపంచకప్‌కు ముందు 9 వన్డేలు ఆడి ఆకట్టుకున్న ఆంధ్రప్రదేశ్ అమ్మాయి నల్లపురెడ్డి శ్రీచరణి ప్రపంచకప్‌లో చోటు దక్కించుకోగలిగింది. ప్రపంచకప్‌లో ప్రతీ మ్యాచ్‌లో సత్తా చాటింది. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల చరణి తన లెఫ్టార్మ్ స్పిన్నర్‌తో ప్రత్యర్థులందరినీ కట్టి పడేసింది. తొలి సారి ఆడిన ప్రపంచ కప్‌లో విజేతగా నిలిచిన జట్టులో సభ్యురాలిగా ఘనతను సొంతం చేసుకుంది. ఈ టోర్నీలో 9 మ్యాచ్‌లలో 27.64 సగటుతో ఆమె 14 వికెట్లు పడగొట్టి భారత్ తరఫున రెండో అత్యుత్తమ బౌలర్‌గా నిలిచింది. ఐదుకంటే తక్కువ ఎకానమీ (4.96)తో ఆమె పరుగులు ఇచ్చింది. హైదరాబాద్‌కే చెందిన అరుంధతి రెడ్డి కూడా భారత విశ్వవిజేత జట్టులో సభ్యురాలిగా ఉంది. షఫాలీ సూపర్.... ‘నన్ను దేవుడు ఒక ప్రత్యేక పని కోసమే ఇక్కడికి పంపించినట్లున్నాడు’... ఫైనల్ తర్వాత షఫాలీ వర్మ వ్యాఖ్య ఇది. నిజంగానే అనుకోకుండా కలిసి వచ్చిన అదృష్టంతో జట్టులోకి వచ్చిన ఆమె తాను అరుదైన ఘనతను నమోదు చేసి చూపించింది. ప్రతీక రావల్‌తో హడావిడిగా షఫాలీని సెమీస్‌కు ముందు టీమ్‌లోకి చేర్చారు. సెమీస్‌లో విఫలమైనా... ఫైనల్లో చెలరేగి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచి షఫాలీ తానేమిటో ప్రపంచానికి చూపించింది. బ్యాటింగ్‌తో మాత్రమే కాకుండా బౌలింగ్‌లో కూడా 2 కీలక వికెట్లు ఆమె ఫైనల్ ఫలితాన్ని శాసించింది. గతంలో అండర్–19 వరల్డ్ కప్ గెలిచిన జట్టులో సభ్యురాలైన షఫాలీ ఇప్పుడు సీనియర్ ప్రపంచకప్‌లోనూ భాగమైంది. వికెట్ కీపర్ రిచా ఘోష్‌కు కూడా అండర్–19 తర్వాత ఇది రెండో ప్రపంచ కప్ విజయం కావడం విశేషం. ఆ ముగ్గురు... 2017లో ఇంగ్లండ్ చేతిలో ఫైనల్లో అనూహ్య ఓటమి భారత ఆటగాళ్లకు వేదనను మిగిల్చింది. నాటి జట్టులో సభ్యులైన హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన, దీప్తి శర్మ ఇప్పుడు ఎట్టకేలకు విశ్వవిజేతలుగా నిలిచారు. ఈ ముగ్గురూ తమదైన ప్రత్యేకతలతో ఈ విజయాన్ని చిరస్మరణీయం చేసుకున్నారు. హర్మన్ కెపె్టన్‌గా చరిత్రను సృష్టించగా...స్మృతి టాప్ స్కోరర్‌గా, దీప్తి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలవడం వారి ఆటకు ఘనమైన గుర్తింపు అనడంలో సందేహం లేదు. 4 మహిళల వన్డే వరల్డ్‌కప్ టైటిల్ నెగ్గిన నాలుగో జట్టుగా భారత్ నిలిచింది. ఆస్ట్రేలియా ఏడుసార్లు (1978, 1982, 1988, 1997, 2005, 2013, 2022), ఇంగ్లండ్ నాలుగుసార్లు (1973, 1993, 2009, 2017), న్యూజిలాండ్ (2000), భారత్ (2025) ఒక్కోసారి విజేతగా నిలిచాయి.4 ఆతిథ్య దేశం హోదాలో వన్డే వరల్డ్‌కప్ టైటిల్ గెలిచిన నాలుగో జట్టు భారత్. గతంలో ఇంగ్లండ్ (1973, 1993, 2017), ఆ్రస్టేలియా (1988), న్యూజిలాండ్ (2000) ఈ ఘనత సాధించాయి.571 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా దక్షిణాఫ్రికా కెపె్టన్ వోల్వార్ట్ నిలిచింది. ఆ్రస్టేలియా కెపె్టన్ అలీసా హీలీ (2022లో 509 పరుగులు) పేరిట ఉన్న రికార్డును వోల్వార్ట్ బద్దలు కొట్టింది.22 ఒకే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా దీప్తి శర్మ (9 మ్యాచ్‌ల్లో 22 వికెట్లు) గుర్తింపు పొందింది. నీతూ డేవిడ్ (2005లో 20 వికెట్లు), శుభాంగి కులకర్ణి (1982లో 20 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి శర్మ సవరించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: స్మృతి (సి) జాఫ్తా (బి) ట్రయాన్ 45; షఫాలీ (సి) లూస్ (బి) ఖాకా 87; జెమీమా (సి) వోల్వార్ట్ (బి) ఖాకా 24; హర్మన్‌ప్రీత్ (బి) ఎంలాబా 20; దీప్తి శర్మ (రనౌట్) 58; అమన్‌జోత్ (సి అండ్ బి) డిక్లెర్క్ 12; రిచా (సి) డెర్క్సెన్ (బి) ఖాకా 34; రాధ (నాటౌట్) 3; ఎక్స్‌ట్రాలు 15; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 298. వికెట్ల పతనం: 1–104, 2–166, 3–171, 4–223, 5–245, 6–292, 7–298. బౌలింగ్: కాప్ 10–1–59–0, ఖాకా 9–0–58–3, ఎంలాబా 10–0–47–1, డిక్లెర్క్ 9–0–52–1, లూస్ 5–0–34–0, ట్రయాన్ 7–0–46–1. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (సి) అమన్‌జోత్ (బి) దీప్తి 101; బ్రిట్స్ (రనౌట్) 23; బాష్ (ఎల్బీ) (బి) శ్రీచరణి 0; లూస్ (సి అండ్ బి) షఫాలీ 25; కాప్ (సి) రిచా (బి) 4; జాఫ్తా (సి) రాధ (బి) దీప్తి 16; డెర్క్సెన్ (బి) దీప్తి 35; ట్రయాన్ (ఎల్బీ) (బి) దీప్తి 9; డిక్లెర్క్ (సి) హర్మన్ (బి) దీప్తి 18; ఖాకా (రనౌట్) 1; ఎంలాబా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (45.3 ఓవర్లలో ఆలౌట్) 246. వికెట్ల పతనం: 1–51, 2–62, 3–114, 4–123, 5–148, 6–209, 7–220, 8–221, 9–246, 10–246. బౌలింగ్: రేణుక 8–0–28–0, క్రాంతి 3–0–16–0, అమన్‌జోత్ 4–0–34–0, దీప్తి 9.3–0–39–5, శ్రీచరణి 9–0–48–1, రాధ 5–0–45–0, షఫాలీ 7–0–36–2. -
WC 2025: తొలిసారి ప్రపంచాన్ని గెలిచేందుకు...
ప్రపంచ కప్‌లో రెండు సార్లు ఫైనల్‌కు అర్హత సాధించినా నిరాశతో వెనుదిరిగిన జట్టు ఒక వైపు... సమష్టితత్వంలో మొదటి సారి తుది పోరుకు చేరిన టీమ్ ఒక వైపు... సొంతగడ్డపై పెద్ద ఎత్తున అభిమానుల ఆకాంక్షలు, మైదానంలో అండతో ఒక జట్టు కప్‌పై ఆశలు పెట్టుకోగా, తమ బలాన్నే నమ్ముకొని ప్రత్యర్థికి సవాల్ విసురుతున్న టీమ్ మరో వైపు... 12వ మహిళల వన్డే వరల్డ్ కప్ ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. అన్ని అడ్డంకులను దాటి అగ్రగామిగా నిలిచిన రెండు టీమ్‌లు భారత్, దక్షిణాఫ్రికా పైనల్లో తలపడనున్నాయి. ఇప్పటికే టోర్నీని సాధించిన మూడు జట్లు ముందే నిష్క్రమించడంతో వరల్డ్ కప్‌లో కొత్త విజేత రావడం ఖాయమైంది. 2017 టోర్నీ ఫైనల్లో ఓడిన జట్టులో సభ్యులైన హర్మన్, స్మృతి, దీప్తి మాత్రమే ఈ సారి వరల్డ్ కప్ బరిలో నిలిచారు. ముంబై: మహిళల వన్డే వరల్డ్ కప్ పలు ఆసక్తికర సమరాల తర్వాత తుది ఘట్టానికి చేరింది. నేడు డీవై పాటిల్ స్టేడియంలో జరిగే ఫైనల్లో ఆతిథ్య భారత జట్టు దక్షిణాఫ్రికాతో తలపడుతుంది. ఇరు జట్ల లీగ్ దశలో జరిగిన మ్యాచ్‌లో సఫారీ టీమ్ గెలుపొందగా దానికి సరైన ప్రతీకారం తీర్చేందుకు హర్మన్ బృందం సిద్ధమైంది. సెమీస్‌లో రెండు జట్లూ అద్భుత విజయాలతో తుది పోరుకు అర్హత సాధించాయి. ఇప్పటి వరకు ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవని భారత్ అతి చేరువగా వచ్చిన ఈ అవకాశాన్ని వృథా చేసుకోరాదని పట్టుదలగా ఉండగా, బలబలాల పరంగా దక్షిణాఫ్రికా కూడా ఏమాత్రం తక్కువగా లేదు. ఈ మైదానంలో మన జట్టుకు బాగా అనుకూలమైంది కాగా...దక్షిణాఫ్రికా ఈ టోర్నీలో తొలిసారి ఇక్కడ మ్యాచ్ ఆడుతోంది. ఈ నేపథ్యంలో ఆదివారం క్రికెట్ అభిమానులకు అసలైన వినోదం ఖాయం. మార్పుల్లేకుండా... సెమీఫైనల్లో ఆ్రస్టేలియాపై సంచలన విజయం సాధించిన జట్టునే సహజంగా భారత్ కొనసాగించే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో విఫలమైన షఫాలీ దూకుడుగా ఆడి మెరుపు ఆరంభం ఇవ్వడంలో సమర్థురాలు. సెమీస్‌లో అనూహ్య రీతిలో వెనుదిరిగిన స్మృతి తన స్థాయికి తగ్గ ప్రదర్శన కనబరిస్తే మన జట్టు ఓపెనింగ్‌తో మంచి పునాది ఖాయం. జెమీమా, హర్మన్ బ్యాటింగ్ సామర్థ్యం ఏమిటో సెమీస్‌లో కనిపించింది. వీరిద్దరు దానిని కొనసాగిస్తే తిరుగుండదు. భారీ షాట్లకు పెట్టింది పేరైన రిచా ఘోష్‌తో పాటు మిడిల్ ఓవర్లలో సమర్థంగా ఆడే దీప్తి కూడా రాణిస్తే మన బ్యాటింగ్‌కు తిరుగుండదు. అదనపు బ్యాటింగ్ కోసం ఆఫ్ స్పిన్నర్ స్నేహ్ రాణాను తీసుకోవాలని భావిస్తున్నా... దక్షిణాఫ్రికా టీమ్‌లో అంతా కుడి చేతివాటం బ్యాటర్లే కావడంతో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధనే కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. రేణుక, క్రాంతి తమ పేస్‌తో ప్రత్యర్థిని ఇబ్బంది పెట్టగలరు. అదనపు బ్యాటర్‌తో... కెప్టెన్ లారా వోల్వార్ట్ అసాధారణ బ్యాటింగ్‌తో దూసుకుపోతుండటం దక్షిణాఫ్రికా ప్రధాన బలం. గత మ్యాచ్‌లో ఆమె మెరుపు సెంచరీతో చెలరేగింది. టోర్నీలో పెద్దగా ప్రభావం చూపకపోయినా మరో సీనియర్ ఓపెనర్ బ్రిట్స్ అసలు పోరులో సత్తా చాటాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. లూస్, మరిజాన్ కాప్‌లతో మిడిలార్డర్ పటిష్టంగా ఉంది. వైజాగ్ మ్యాచ్‌లో భారత్‌పై చెలరేగి ఒక్కసారి స్టార్‌గా మారిన డిక్లెర్క్ లాంటి బ్యాటర్ 9వ స్థానంలో ఆడే అవకాశం ఉండటం సఫారీ టీమ్‌కు మరో సానుకూలాంశం. ఆల్‌రౌండర్ క్లో ట్రయాన్ కూడా మ్యాచ్ ఫలితాన్ని శాసించగలదు. సెమీస్‌లో దక్షిణాఫ్రికా ఒక బ్యాటర్‌ను తప్పించి బౌలర్ క్లాస్‌ను ఆడించింది. అయితే పిచ్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే క్లాస్ స్థానంలో అనరీ డెర్క్సన్ రావచ్చు. 20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య ఇప్పటి వరకు 34 వన్డేలు జరగ్గా... భారత్ 20 గెలిచి 13 ఓడింది. మరో మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. వరల్డ్ కప్ మ్యాచ్‌లలో గత మూడు సార్లూ దక్షిణాఫ్రికానే నెగ్గింది.పిచ్, వాతావరణం బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. సెమీస్లాగే భారీ స్కోరుకు అవకాశం ఉంది. మంచు ప్రభావం ఉండటంతో పాటు రాత్రి వేళ ఛేదన సులభం కాబట్టి టాస్ గెలిచిన జట్టు మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. మ్యాచ్ రోజున వర్ష సూచన ఉంది. అయితే సోమవారం రిజర్వ్ డే ఉంది. ఆట ఎక్కడ ఆగిపోతే అక్కడినుంచి మళ్లీ కొనసాగిస్తారు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి, షఫాలీ, జెమీమా, దీప్తి, రిచా, అమన్‌జోత్, రాధ, క్రాంతి, శ్రీచరణి, రేణుక. దక్షిణాఫ్రికా: వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, అనెక్ బాష్, లూస్, కాప్, జాఫ్తా, డెర్క్సన్, ట్రయాన్, డిక్లెర్క్, ఖాకా, ఎంలాబా -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బౌలర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మారిజేన్ కాప్ (Marizanne Kapp) చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే ప్రపంచకప్ (Women's Cricket World Cup) చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా టీమిండియా మాజీ బౌలర్ ఝులన్ గోస్వామి (Jhulan Goswami) రికార్డును బద్దలు కొట్టింది. 2025 ఎడిషన్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో నిన్న (అక్టోబర్ 29) తొలి సెమీఫైనల్లో ఈ ఘనత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌లోనూ (42) రాణించిన కాప్.. బౌలింగ్‌లో చెలరేగిపోయింది. 320 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్లు తీసి, ప్రత్యర్ది పతనాన్ని శాశించింది.మహిళల వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-5 బౌలర్లు..మారిజేన్ కాప్-44ఝులన్ గోస్వామి-43లిన్ ఫుల్స్టన్-39మెగాన్ షట్-39క్యారోల్ హాడ్జస్-37మ్యాచ్ విషయానికొస్తే.. గౌహతి వేదికగా జరిగిన తొలి సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఇంగ్లండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (169) రికార్డు శతకంతో చెలరేగడంతో నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 319 పరుగుల భారీ స్కోర్ చేసింది.అనంతరం లక్ష్య ఛేదనలో మారిజన్ కాప్ (7-3-20-5) నిప్పులు చెరగడంతో ఇంగ్లండ్ 42.3 ఓవర్లలో 194 పరుగులకే ఆలౌటై 125 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఇవాళ (అక్టోబర్ 30) జరుగబోయే రెండో సెమీఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా ఢీకొంటున్నాయి. నవీ ముంబై వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది.చదవండి: IND VS AUS: అదే జరిగితే టీమిండియా కొంప కొల్లేరే..! -
దక్షిణాఫ్రికా...ఈసారైనా!
గువాహటి: అన్ని విభాగాల్లో సమష్టిగా రాణిస్తూ... మహిళల వన్డే ప్రపంచకప్‌లో జోరు మీదున్న దక్షిణాఫ్రికా జట్టు ఫైనల్ బెర్త్‌పై గురి పెట్టింది. ఈ మెగా ఈవెంట్ చరిత్రలో దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ఫైనల్ చేరుకోలేకపోయింది. మూడుసార్లు సెమీఫైనల్లోకి ప్రవేశించినా ఆ అడ్డంకిని దాటడంలో విఫలమైంది. నాలుగో ప్రయత్నంలోనైనా సెమీఫైనల్ అవరోధాన్ని అధిగమించి ఫైనల్లోకి దూసుకెళ్లాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో నేడు జరిగే తొలి సెమీఫైనల్లో పటిష్టమైన ఇంగ్లండ్‌తో దక్షిణాఫ్రికా తలపడనుంది. దక్షిణాఫ్రికాతో పోలిస్తే ఇంగ్లండ్‌కు ప్రపంచకప్‌లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో ఇప్పటికే ఎనిమిదిసార్లు ఫైనల్ చేరుకున్న ఇంగ్లండ్... నాలుగుసార్లు విజేతగా నిలిచి, మరో నాలుగుసార్లు రన్నరప్ ట్రోఫీని అందుకుంది. ఇక తాజా ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్‌దే పైచేయిగా ఉంది. తమతో ఆడిన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 69 పరుగులకు కుప్పకూల్చిన ఇంగ్లండ్ మరోసారి అలాంటి ప్రదర్శన పునరావృతం చేయాలనే లక్ష్యంతో ఉంది. మరోవైపు ఇంగ్లండ్ చేతిలో ఎదురైన తొలి మ్యాచ్ పరాజయానికి బదులు తీర్చుకోవాలని దక్షిణఫ్రికా భావిస్తోంది. ఆస్ట్రేలియాతో లీగ్ దశ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 97 పరుగులకే ఆలౌటైంది. ఈ రెండు సందర్భాల్లోనూ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో సఫారీ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లోపాలను వినియోగించుకోవాలని ఇంగ్లండ్ ప్రణాళికలు రచిస్తోంది. సోఫీ ఎకిల్‌స్టోన్, లిన్సే స్మిత్, చార్లీ డీన్ రూపంలో ఇంగ్లండ్‌కు ముగ్గురు స్పిన్నర్లు అందుబాటులో ఉన్నారు. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్... ఈ టోర్నీలో ఆడిన 7 మ్యాచ్‌ల్లో 50.16 సగటుతో 301 పరుగులు చేసి జట్టును ముందుండి నడిపిస్తోంది. బ్రిట్స్, సునే లుస్, మరిజాన్ కాప్ రూపంలో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ బలంగానే ఉంది. బౌలింగ్‌లో కాప్, ఖాకా, ఎంలాబా కీలకం కానున్నారు. మరోవైపు ఇంగ్లండ్ మాజీ సారథి కెప్టెన్ హీథర్ నైట్ ఈ వరల్డ్‌కప్‌లో 288 పరుగులు చేసి ఆ జట్టు తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచింది. అమీ జోన్స్, బ్యూమౌంట్ కూడా రెండొందల పైచిలుకు పరుగులు చేశారు. కెప్టెన్ సివర్ బ్రంట్ రూపంలో నిఖార్సైన ఆల్‌రౌండర్ అందుబాటులో ఉంది. రిజర్వ్ డే... మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉన్నప్పటికీ ఈ టోర్నీలోని రెండు సెమీఫైనల్స్‌కు, ఫైనల్ మ్యాచ్‌కు ‘రిజర్వ్ డే’ ఉంది. బుధవారం వర్షం కారణంగా మ్యాచ్ సాధ్యపడకపోతే... గురువారం నిర్వహిస్తారు. ఒకవేళ గురువారం కూడా మ్యాచ్ జరగపోతే మాత్రం లీగ్ దశలో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు ఫైనల్ (ఇంగ్లండ్) చేరుకుంటుంది.36 దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ జట్ల మధ్య ఇప్పటి వరకు 47 వన్డేలు జరిగాయి. 36 మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ గెలుపొందగా ... 10 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా నెగ్గింది. ఒక మ్యాచ్ రద్దయింది. ఇక వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఈ రెండు జట్లు తొమ్మిదిసార్లు తలపడ్డాయి. 7 సార్లు ఇంగ్లండ్, 2 సార్లు దక్షిణాఫ్రికా విజయం సాధించాయి. -
సౌతాఫ్రికాకు భారీ షాక్‌లు
పాకిస్తాన్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు (Pakistan vs South Africa) ముందు సౌతాఫ్రికాకు (South Africa) భారీ షాక్‌లు తగిలాయి. ఆ జట్టు టీ20 కెప్టెన్ డేవిడ్ మిల్లర్ (David Miller), కీలక బౌలర్ గెరాల్డ్ కొయెట్జీ (Gerald Coetzee) గాయాల కారణంగా ఈ సిరీస్‌లకు దూరమయ్యారు. మిల్లర్ కొద్ది రోజుల కిందట ప్రాక్టీస్ చేస్తూ గ్రేడ్-1 హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరికి గురి కాగా.. కొయెట్జీ నబీమియాతో ఇటీవల జరిగిన టీ20 సందర్భంగా కండరాల గాయం బారిన పడ్డాడు. దీంతో ఈ ఇద్దరు పాక్‌తో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌లకు దూరమయ్యారు.మిల్లర్ గైర్హాజరీలో టీ20 జట్టు కెప్టెన్‌గా అప్పటికే జట్టులో ఉన్న డొనోవన్ ఫెరీరాను ఎంపిక చేశారు. మిల్లర్ స్థానాన్ని మాథ్యూ బ్రీట్జ్కే భర్తీ చేశారు. కొయెట్జీ స్థానాన్ని టీ20ల్లో టోనీ డి జోర్జితో, వన్డేల్లో ఓట్నీల్ బార్ట్మన్తో భర్తీ చేశారు. ఈ రెండు మార్పులు మినహా ముందుగా ప్రకటించిన జట్టు యధాతథంగా కొనసాగనుంది.పాక్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ అక్టోబర్ 28 నుంచి ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ రావల్పిండి వేదికగా.. రెండో టీ20 అక్టోబర్ 31న లాహోర్ వేదికగా.. మూడో టీ20 నవంబర్ 1న అదే లాహోర్ వేదికగా జరుగనున్నాయి.అనంతరం నవంబర్ 4 నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. నవంబర్ 4, 6, 8 తేదీల్లో ఫైసలాబాద్ వేదికగా మూడు వన్డేలు జరుగనున్నాయి. పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ముందు సౌతాఫ్రికా పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడింది. ఇవాళే (అక్టోబర్ 23) ముగిసిన ఈ సిరీస్ 1-1తో డ్రా అయ్యింది. తొలి టెస్ట్‌లో పాకిస్తాన్, రెండో టెస్ట్‌లో పర్యాటక సౌతాఫ్రికా గెలుపొందాయి.పాకిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: డోనోవన్ ఫెరీరా (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, రీజా హెండ్రిక్స్, జార్జ్ లిండే, లుంగీ ఎంగిడి, న్క్వాబా పీటర్, లూహాన్ డ్రి ప్రిటోరియస్, అండైల్ సైమ్‌లేన్, లిజాడ్ విలియమ్స్వన్డే జట్టు: మాథ్యూ బ్రీట్జ్కే (కెప్టెన్), ఒట్నీల్ బార్ట్‌మన్, కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, క్వింటన్ డి కాక్, టోనీ డి జోర్జి, డోనోవన్ ఫెరీరా, జోర్న్ ఫోర్టుయిన్, జార్జ్ లిండే, లుంగి ఎంగిడి, న్క్వాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, సినేతెంబా క్వెషైల్, లిజాడ్ విలియమ్స్చదవండి: తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో స్మృతి మంధన సూపర్ సెంచరీ -
పాక్ బౌలర్లకు చుక్కలు చూపించిన ముత్తుసామి, రబాడ
రావల్పిండి వేదికగా పాకిస్తాన్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ (Pakistan Vs South Africa) హోరాహోరీగా సాగుతోంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా ధీటుగా బదులిచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 404 పరుగులు చేసి కీలకమైన 71 పరుగుల ఆధిక్యం సాధించింది.ఈ ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా టెయిలెండర్లు పాక్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు. ముఖ్యంగా సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) (89 నాటౌట్), రబాడ (Kagiso Rabada) (71) పాక్ బౌలర్లకు చుక్కలు చూపించారు. వీరిద్దరు పదో వికెట్‌కు రికార్డు స్థాయిలో 98 పరుగులు జోడించారు. అంతకుముందు కేశవ్ మహారాజ్ (30) కూడా పాక్ బౌలర్లకు పరీక్ష పెట్టాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన ముత్తుసామి చివరి వరుస బ్యాటర్లతో కీలకమైన భాగస్వామ్యాలు నెలకొల్పి సౌతాఫ్రికాకు కీలక ఆధిక్యాన్ని అందించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (76), టోనీ డి జోర్జి (55) అర్ద సెంచరీలతో రాణించి సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌ను మంచి పునాది వేశారు.పాక్ బౌలర్లలో అరంగేట్రం స్పిన్నర్ ఆసిఫ్ అఫ్రిది 6 వికెట్లతో చెలరేగగా.. నౌమన్ అలీ 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.పాక్ తొలి ఇన్నింగ్స్‌లో అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించగా.. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) అద్బుత ప్రదర్శనతో పాక్ పతనాన్ని శాశించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: ఆసీస్‌తో రెండో వన్డే.. భారీ రికార్డులపై కన్నేసిన కోహ్లి -
పాకిస్తాన్ అవుట్
కొలంబో: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ అవకాశాలు కోల్పోయిన రెండో జట్టుగా పాకిస్తాన్ నిలిచింది. సోమవారమే బంగ్లాదేశ్ నిష్క్రమించగా... ఇప్పుడు పాకిస్తాన్ వంతు వచ్చింది. కొలంబోలో వాన బారిన పడిన మరో మ్యాచ్‌లో ఫాతిమా సనా సారథ్యంలోని పాక్ జట్టు చిత్తుగా ఓడింది. ఆ జట్టుకిది నాలుగో పరాజయం. మంగళవారం జరిగిన ఈ పోరులో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 150 పరుగుల తేడాతో పాకిస్తాన్‌ను ఓడించి 10 పాయింట్లతో అగ్రస్థానానికి చేరుకుంది. వరల్డ్ కప్‌లో దక్షిణాఫ్రికా వరుసగా ఐదు మ్యాచ్‌లు గెలవడం ఇదే మొదటిసారి. టాస్ ఓడిన దక్షిణాఫ్రికా ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. అయితే 2 ఓవర్లకే వర్షం రావడంతో ఆట ఆగిపోయింది. దాదాపు రెండు గంటల తర్వాత ఆట మళ్లీ మొదలు కాగా... మ్యాచ్‌ను 40 ఓవర్లకు కుదించారు. దక్షిణాఫ్రికా నిర్ణీత 40 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు సాధించింది. అన్ని వరల్డ్ కప్‌లలో కలిపి దక్షిణాఫ్రికాకు ఇదే అత్యధిక స్కోరు. కెపె్టన్ లారా వోల్వర్ట్ (82 బంతుల్లో 90; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) త్రుటిలో శతకం చేజార్చుకోగా... మరిజాన్ కాప్ (43 బంతుల్లో 68 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు), సూన్ లూస్ (59 బంతుల్లో 61; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు సాధించారు. ఓపెనర్ తజ్మీన్ బ్రిట్స్ (0) టోర్నీలో మూడోసారి డకౌటైన అనంతరం వోల్వర్ట్, లూస్ కలిసి రెండో వికెట్‌కు 93 బంతుల్లోనే 118 పరుగులు జోడించారు. చివర్లో డి క్లెర్క్ (16 బంతుల్లో 41; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) మెరుపు ఇన్నింగ్స్‌తో సఫారీ టీమ్ భారీ స్కోరు నమోదు చేయగలిగింది. ఆఖరి 5 ఓవర్లలో దక్షిణాఫ్రికా 72 పరుగులు సాధించింది. పాకిస్తాన్ బౌలర్లలో నష్రా సంధు, సాదియా ఇక్బాల్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాకిస్తాన్ ఇన్నింగ్స్ మొదలయ్యాక వాన కారణంగా పలు మార్లు అంతరాయం ఏర్పడటంతో మళ్లీ మళ్లీ లక్ష్యాన్ని మార్చాల్సి వచ్చింది. చివరకు పాక్ లక్ష్యాన్ని 20 ఓవర్లలో 234 పరుగులుగా నిర్దేశించారు. అయితే పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 83 పరుగులే చేయగలిగింది. సిద్రా నవాజ్ (22 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచింది. కెప్టెన్ ఫాతిమా సనా రెండు పరుగులే చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మరిజాన్ కాప్ 3 వికెట్లు పడగొట్టగా, షాంగసే 2 వికెట్లు తీసింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన మరిజాన్ కాప్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంది. ఇండోర్‌లో నేడు జరిగే మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాతో ఇంగ్లండ్ తలపడుతుంది. -
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. పాకిస్తాన్ ముందు అతి భారీ లక్ష్యం
మహిళల వన్డే ప్రపంచకప్‌లో (Women's CWC 2025) భాగంగా పాకిస్తాన్‌తో ఇవాళ (అక్టోబర్ 21) జరుగుతున్న మ్యాచ్‌లో సౌతాఫ్రికా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగారు. వర్షం కారణంగా 40 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ (90), సూన్ లస్ (68 నాటౌట్), మారిజన్ కాప్ (67 నాటౌట్), నదినే డి క్లెర్క్ (41) విధ్వంసం సృష్టించడంతో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 312 పరుగులు చేసింది.ఆఖర్లో నదినే డి క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. 38వ ఓవర్లో 2 సిక్సర్లు, 39వ ఓవర్లో 3 సిక్సర్లు, ఓ ఫోర్ బాదింది. 40వ ఓవర్లో బౌండరీ కొట్టిన అనంతరం ఔటైంది. ఆ ఓవర్లో సౌతాఫ్రికా 3 వికెట్లు కోల్పోయింది. అయినా అంతిమంగా భారీ స్కోర్ చేయగలిగింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ముగ్గురు (తజ్మిన్ బ్రిట్జ్, కరాబో మెసో, మ్లాబా) డకౌట్లైనా ఇంత స్కోర్ రావడం విశేషం. పాక్ బౌలర్లలో నష్రా సంధు, సదియా ఇక్బాల్ తలో 3 వికెట్లు తీయగా.. కెప్టెన్ ఫాతిమా సనా ఓ వికెట్ పడగొట్టింది.కాగా, ప్రస్తుత ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా జట్లు కూడా ఇదివరకే సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. అక్టోబర్ 23న ఇరు జట్ల మధ్య జరుగబోయే మ్యాచ్‌తో నాలుగో సెమీస్ బెర్త్ ఖరారవుతుంది. ఆడిన 5 మ్యాచ్‌ల్లో మూడింట ఓడిన పాకిస్తాన్ పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో కొనసాగుతోంది. చదవండి: చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా -
చెలరేగిన అఫ్రిది.. బ్రెవిస్ డకౌట్.. తడబడిన సౌతాఫ్రికా
రావల్పిండి వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా ఎదురీదుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 148 పరుగులు వెనుకపడి ఉంది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ (32), ర్యాన్ రికెల్టన్ (14), టోనీ డి జోర్జి (55), డెవాల్డ్ బ్రెవిస్ (0) ఔట్ కాగా.. ట్రిస్టన్ స్టబ్స్ (68), కైల్ వెర్రిన్ (10) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ఆసిఫ్ అఫ్రిది 2, షాహీన్ అఫ్రిది, సాజిద్ ఖాన్ తలో వికెట్ పడగొట్టారు.అంతకుముందు కేశవ్ మహారాజ్ (42.4-5-102-7) చెలరేగడంతో పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 333 పరుగులకు ఆలౌటైంది. అబ్దుల్లా షఫీక్ (57), షాన్ మసూద్ (87), సౌద్ షకీల్ (66) అర్ద సెంచరీలతో రాణించారు. సల్మాన్ అఘా (45) పర్వాలేదనిపించాడు. సైమన్ హార్మర్ 2, రబాడ ఓ వికెట్ తీశారు.తడబడిన సౌతాఫ్రికాపాక్ను ఓ మోస్తరు స్కోర్‌కు పరిమితం చేశాక తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ వికెట్ కోల్పోయింది. ఆతర్వాత కొద్ది సేపటికే మార్క్రమ్ కూడా ఔటయ్యాడు. ఈ దశలో స్టబ్స్, జోర్జి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరు మూడో వికెట్‌కు 113 పరుగులు జోడించారు.అయితే ఆట చివరి అర్ద గంటలో సౌతాఫ్రికా తడబడబాటుకు లోపైంది. ఆసిఫ్ అఫ్రిది చెలరేడంతో నాలుగు పరుగుల వ్యవధిలో సెట్ బ్యాటర్ జోర్జి, అప్పుడే క్రీజ్‌లోకి వచ్చిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ వికెట్లు కోల్పోయింది. స్టబ్స్, వెర్రిన్ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడి రెండో రోజు ఆటను ముగించారు.కాగా, రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాక్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా జరిగిన తొలి టెస్ట్‌లో పాక్ 93 పరుగుల తేడాతో పర్యాటక జట్టుపై విజయం సాధించింది.చదవండి: పాకిస్తాన్ మరో ఫార్మాట్ కెప్టెన్‌గా ఇంకో అఫ్రిది -
ఒక ఫైటర్ జెట్ 3.5 కోట్ల పూసలు
దక్షిణాఫ్రికాకు చెందిన కళాకారుడు రాల్ఫ్ జిమాన్ అయిదేళ్లపాటు 3.5 కోట్ల పూసలు ఉపయోగించి ఒక పాత సోవియట్ మిగ్–21 ఫైటర్ జెట్‌కు కొత్త రూపాన్ని ఇచ్చాడు. యుద్ధ చిహా్నలను కళాఖండాలుగా మార్చే అతని ‘వెపన్స్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్’ శ్రేణిలో ఇది చివరిది, అత్యంత ప్రతిష్టాత్మకమైనది. రాల్ఫ్ జిమాన్కు చిన్నప్పటి నుంచే ఆయుధాలతో భయంకరమైన అనుభవాలున్నాయి. 1970లలో, జోహన్నెస్‌బర్గ్‌లో 13 లేదా 14 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు, అతన్ని ఓ వ్యక్తి .45 మాగ్నమ్ తుపాకీతో బెదిరించాడు. కానీ తనకు 50 ఏళ్ల వయసు వచ్చేసరికి దాదాపు 15 నుంచి 20 సార్లు తుపాకీ గురి పెట్టినట్లు జిమాన్ గుర్తు చేసుకున్నాడు. ఈ భయంకరమైన అనుభవాల వల్లే ఆయన ‘తుపాకుల వ్యతిరేకి’గా మారారు. ప్రస్తుతం లాస్ ఏంజిలెస్‌లో ఉంటున్న జిమాన్, వృత్తిరీత్యా కమర్షియల్ ఫొటోగ్రాఫర్, ఫిల్మ్‌మేకర్. దశాబ్ద కాలంగా యుద్ధ కళాఖండాలను లక్షలాది చేతితో అల్లిన పూసలు ఉపయోగించి కళాత్మక వస్తువులుగా మార్చ డమే తన పనిగా పెట్టుకున్నాడు. జిమాన్ తన కళాఖండాల ద్వారా దక్షిణాఫ్రికా చరిత్రలో హింసపై ఒక సందేశాన్ని ఇవ్వాలనుకున్నాడు. అందుకోసం 2019లో అత్యంత పెద్ద సవాలుగా మిగ్–21 విమానాన్ని ఎంచుకున్నాడు. అయిదేళ్ల కష్టం.. మిగ్–21 కళాఖండం మొదట, జిమాన్ ఫ్లోరిడాలోని ఒక సైనిక కాంట్రాక్టర్ నుండి మిగ్–21 జెట్‌ను కొనుగోలు చేశాడు. అది ముక్కలుగా, మంచి స్థితిలో లేకపోయినా, కళాఖండంగా మార్చడానికి కచ్చితంగా సరిపోతుందని ఆయన భావించాడు. తొలు త ఆయన బృందం మిగ్ ఇంజన్‌ను తొలగించి విమానాన్ని లాస్ ఏంజిలెస్‌లోని స్టూడియోకు తరలించింది. జిమాన్ అల్యూమినియం ప్యానెల్‌లపై డిజైన్లను రూపొందించి, ఆ పేపర్ షీట్లను దక్షిణాఫ్రికాకు పంపాడు. జోహన్నెస్‌బర్గ్, క్వాజులు–నటల్, మ్పుమలంగా ప్రావిన్సుల నుండి వచ్చిన జింబాబ్వేయన్, న్డెబెలె కమ్యూనిటీలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు ఈ ప్యానెళ్లను పూసలతో తయారు చేయడం ప్రారంభించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి 5 సంవత్సరాలకు పైగా సమయం పట్టింది. 51 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు ఉన్న ఈ విమానంపై సుమారు 3.5 కోట్ల పూసలు అమర్చినట్లు అంచనా.విద్యకు నిధి మిగ్–21 ప్రాజెక్టుకు మద్దతు ఇచి్చన డీటీగ్రుయిల్లె చారిటీ సంస్థ ద్వారా ఈ కళాకారుల పిల్లలు, ఇతర యువత 25 మంది విద్యకు స్పాన్సర్íÙప్ లభిస్తోంది. వీరు వైద్యం, నర్సింగ్, ఫ్యాషన్ డిజైన్ వంటి కోర్సులు చదువుతున్నారు. ఈ అద్భుతమైన మిగ్–21 విమాన కళాఖండాన్ని అమెరికాలో ప్రదర్శన తర్వాత అమ్మకానికి ఉంచుతారు. దీనిద్వారా వచ్చే నిధులు విద్యా కార్యక్రమాలకు, ఉక్రెయిన్‌లో యుద్ధ బాధితులైన పిల్లలకు ఆర్ట్ థెరపీ అందించడానికి వినియోగిస్తారు. యుద్ధ చిహ్నాలను ఆకర్షణీయమైన కళాఖండాలుగా మార్చడం ద్వారా రాల్ఫ్ జిమాన్ కళతో శాంతి, ఆశ సందేశాన్ని ప్రపంచానికి బలంగా తెలియజేస్తున్నారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
16 ఏళ్ల తర్వాత... ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీకి దక్షిణాఫ్రికా అర్హత
జొహనెస్‌బర్గ్: ఆతిథ్య దేశం హోదాలో చివరిసారి 2010లో ప్రపంచకప్ ఫుట్‌బాల్ టోర్నీలో ఆడిన దక్షిణాఫ్రికా జట్టు... ఆ తర్వాత వరుసగా మూడు ప్రపంచకప్ టోర్నీలకు అర్హత పొందడంలో విఫలమైంది. 16 ఏళ్ల విరామం తర్వాత దక్షిణాఫ్రికా మళ్లీ ప్రపంచకప్ టోర్నీలో ఆడే అవకాశాన్ని సంపాదించింది. ఆఫ్రికా జోన్ క్వాలిఫయింగ్‌లో భాగంగా గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా అగ్రస్థానాన్ని దక్కించుకొని వచ్చే ఏడాది అమెరికా, కెనడా, మెక్సికోలలో జరిగే వరల్డ్‌కప్ టోర్నీ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఆరు జట్లను గ్రూప్ ‘సి’లో దక్షిణాఫ్రికా పది మ్యాచ్‌లు ఆడి 18 పాయింట్లతో టాపర్‌గా నిలిచింది. రువాండాతో జరిగిన చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 3–0 గోల్స్ తేడాతో గెలిచింది. 1998, 2002 ప్రపంచకప్ టోర్నీల్లో ఆడిన దక్షిణాఫ్రికా 2010లో ఈ మెగా ఈవెంట్‌కు ఆతిథ్యమిచ్చింది. అయితే మూడు పర్యాయాలు దక్షిణాఫ్రికా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఆఫ్రికా జోన్ నుంచి సెనెగల్, ఐవరీకోస్ట్ జట్లు కూడా 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత సాధించాయి. గ్రూప్ ‘బి’లో సెనెగల్, గ్రూప్ ‘ఎఫ్’లో ఐవరీకోస్ట్ జట్లు అగ్రస్థానంలో నిలిచాయి. 2026 ప్రపంచకప్‌లో మొత్తం 48 జట్లు పాల్గొంటాయి. ఆఫ్రికాకు 9 బెర్త్‌లు కేటాయించగా... తొమ్మిదీ ఖరారయ్యాయి. గతంలోనే ఆఫ్రికా నుంచి అల్జీరియా, ఈజిప్ట్, ట్యూనిషియా, మొరాకో, ఘనా, కెప్ వెర్డె ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. ఖతర్, సౌదీ అరేబియా కూడా... ప్రపంచకప్‌లో ఆసియా దేశాలకు కేటాయించిన 8 బెర్త్‌లు కూడా ఖరారయ్యాయి. ఆసియా క్వాలిఫయింగ్ నాలుగో రౌండ్ గ్రూప్ విజేతల హోదాలో ఖతర్, సౌదీ అరేబియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత పొందాయి. నాలుగో రౌండ్ గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో ఖతర్ 2–1తో యూఏఈ జట్టును ఓడించగా... ఇరాక్‌తో జరిగిన గ్రూప్ ‘బి’ మ్యాచ్‌ను సౌదీ అరేబియా 0–0తో ‘డ్రా’ చేసుకొని తమ గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచాయి. ఆసియా నుంచి గతంలో జపాన్, ఇరాన్, ఆ్రస్టేలియా, ఉజ్బెకిస్తాన్, జోర్డాన్, దక్షిణ కొరియా జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాయి. యూరప్ నుంచి ఇంగ్లండ్ ఆఫ్రికా, ఆసియా కోటాలు పూర్తి కాగా... యూరప్ నుంచి 2026 ప్రపంచకప్ టోర్నీకి అర్హత పొందిన తొలి జట్టుగా ఇంగ్లండ్ నిలిచింది. ఐదు జట్లున్న గ్రూప్ ‘కె’లో ఇంగ్లండ్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లోనూ గెలిచి 18 పాయింట్లతో వరల్డ్‌కప్ బెర్త్‌ను దక్కించుకుంది. 17వసారి ప్రపంచకప్‌లో ఆడనున్న ఇంగ్లండ్ 1966లో ఏకైకసారి ప్రపంచకప్ విజేతగా నిలిచింది. యూరప్ నుంచి మరో 15 జట్లు ప్రపంచకప్‌కు అర్హత సాధించాల్సి ఉంది. -
ప్రపంచ ఛాంపియన్లకు షాకిచ్చిన పాకిస్తాన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-27 (WTC 2025-27) సైకిల్‌ను డిఫెండింగ్ ఛాంపియన్ సౌతాఫ్రికా (South Africa) ఓటమితో ప్రారంభించింది. ఈ సైకిల్లో వారి తొలి మ్యాచ్‌లో గత సైకిల్లో చివరి స్థానంలో నిలిచిన పాకిస్తాన్ (Pakistan) చేతిలో ఊహించని పరాజయాన్ని ఎదుర్కొంది.రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తున్న సౌతాఫ్రికా లాహోర్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో 93 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు పోటాపోటీగా తలపడినప్పటికీ.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం పాక్‌ను గట్టెక్కించింది. ఇరు జట్లలో ప్రధాన స్పిన్నర్లు అత్యుత్తమంగా రాణించారు. సౌతాఫ్రికా తరఫున సెనురన్ ముత్తుసామి, పాక్ తరఫున నౌమన్ అలీ 10 వికెట్ల ప్రదర్శనలు నమోదు చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు.రాణించిన పాక్ బ్యాటర్లు.. ఆరేసిన ముత్తుసామిఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.జోర్జి బాధ్యతాయుతమైన శతకం.. ఆరేసిన నౌమన్అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికా.. నౌమన్ అలీ (6/112), సాజిద్ ఖాన్ (3/98) ధాటికి తడబడింది. టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో అతి కష్టం మీద 269 పరుగులు చేయగలిగింది. దీంతో పాక్‌కు అత్యంత కీలకమైన 109 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.పాక్‌ను మడతపెట్టిన ముత్తురెండో ఇన్నింగ్స్‌లో ముత్తుసామి మరోసారి (17-1-57-5) చెలరేగడంతో పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. ఈ ఇన్నింగ్స్‌లో మరో స్పిన్నర్ సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో పాటు రెండో ఇన్నింగ్స్ స్కోర్ కూడా కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.చెలరేగిన నౌమన్, అఫ్రిది ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆది నుంచే తడబడుతూ వచ్చింది. నౌమన్ అలీ (28-4-79-4) మరోసారి చెలరేగి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. అతనికి షాహీన్ అఫ్రిది (8.5-1-33-4), సాజిద్ ఖాన్ (14-1-38-2) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా లక్ష్యానికి 94 పరుగుల దూరంలో నిలిచిపోయింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బ్రెవిస్ (54) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ సిరీస్‌లోని రెండో టెస్ట్ అక్టోబర్ 20 నుంచి రావల్పిండిలో జరుగుతుంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య పరిమిత ఓవర్ల సిరీస్‌లు (3 టీ20లు, 3 వన్డేలు) కూడా జరుగనున్నాయి. చదవండి: గంభీర్ లేకుండానే!.. రోహిత్, కోహ్లి, శ్రేయస్ ఆస్ట్రేలియాకు.. -
పాక్‌పై 11 వికెట్లు.. సౌతాఫ్రికా బౌలర్ అరుదైన ఘనత
లాహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి ఓ అరుదైన ఘనత సాధించాడు.ఓ టెస్ట్ మ్యాచ్‌లో 10 లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన నాలుగో సౌతాఫ్రికన్ బౌలర్‌గా రికార్డుల్లోకెక్కాడు. ముత్తుసామికి ముందు హగ్ టేఫీల్డ్ (1952లో ఆస్ట్రేలియాపై 13/165), హగ్ టేఫీల్డ్ (1957లో ఇంగ్లండ్‌పై 13/192), కేశవ్ మహారాజ్ (2018లో శ్రీలంకపై 12/283), పాల్ ఆడమ్స్ (2003లో బంగ్లాదేశ్‌పై 10/106) మాత్రమే ఈ ఘనత సాధించారు.ముత్తుసామి ప్రదర్శనల కారణంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిలబడగలిగింది. తొలి ఇన్నింగ్స్‌లో పాక్‌ను 378 పరుగులకు పరిమితం చేసిన ముత్తు.. రెండో ఇన్నింగ్స్‌లో మరింతగా చెలరేగి ప్రత్యర్దిని 167 పరుగులకే మట్టుబెట్టాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముత్తుసామితో పాటు సైమన్ హార్మర్ (14.1-3-51-4) కూడా సత్తా చాటాడు.పాక్ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగులు ఆధిక్యం సాధించిన పాక్.. రెండో ఇన్నింగ్స్ స్కోర్ కలుపుకుని సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.ఓ మోస్తరు లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆదిలోనే తడబడింది. 18 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 3, వియాన్ ముల్దర్ డకౌటయ్యారు. వీరిద్దరు ఔటయ్యాక సౌతాఫ్రికా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతుంది. ర్యాన్ రికెల్టన్ (29), టోనీ డి జోర్జీ (16) ఆచితూచి ఆడుతూ నిదానంగా లక్ష్యాన్ని కరిగిస్తున్నారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా స్కోర్ 2 వికెట్ల నష్టానికి 51 పరుగులుగా ఉంది. గెలుపుకు 226 పరుగుల దూరంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లతో చెలరేగిన నౌమన్ అలీ రెండో ఇన్నింగ్స్‌లోనూ ప్రభావం చూపుతున్నాడు. సౌతాఫ్రికా కోల్పోయిన రెండు వికెట్లు నౌమన్ ఖాతాలోనే పడ్డాయి.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: రేపటి నుంచి దేశీయ క్రికెట్ మహా సంగ్రామం ప్రారంభం -
పాక్‌ను మడతపెట్టిన ముత్తుసామి.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
లాహోర్ వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్‌లో (Pakistan vs South Africa) సౌతాఫ్రికా స్పిన్నర్ సెనురన్ ముత్తుసామి (Senuran Muthusamy) చెలరేగిపోయాడు. తొలి ఇన్నింగ్స్‌లో 6, రెండో ఇన్నింగ్స్‌లో 5 సహా మ్యాచ్ మొత్తంలో 11 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బకొట్టాడు. ముత్తుసామి (17-1-57-5) ధాటికి పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 167 పరుగులకే కుప్పకూలింది. అతనికి సైమన్ హార్మర్ (14.1-3-51-4), రబాడ (10-0-33-1) సహకరించారు.పాక్ ఇన్నింగ్స్‌లో 42 పరుగులు చేసిన బాబర్ ఆజమ్ టాప్ స్కోరర్ కాగా.. అబ్దుల్లా షఫీక్ (41), సౌద్ షకీల్ (38) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. మరో ఇద్దరు (రిజ్వాన్ (14), నౌమన్ అలీ (11)) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం (109 పరుగులు) కలుపుకుని పాక్ సౌతాఫ్రికా ముందు 277 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.శతక్కొట్టిన జోర్జిఅంతకుముందు టోనీ డి జోర్జి (Tony de Zorzi) బాధ్యతాయుతమైన శతకంతో (104) మెరవడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగలిగింది. ఓ పక్క సహచరులంతా విఫలమైన జోర్జి మాత్రం పట్టుదలతో ఆడి తన జట్టును ఆదుకున్నాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో జోర్జితో పాటు ర్యాన్ రికెల్టన్ (71) ఒక్కడే రాణించారు. పాక్ వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ ఆరు వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టాడు. నౌమన్‌కు సాజిద్ ఖాన్ (3/98) సహకరించాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా 109 పరుగులు వెనుకపడి ఉంది.ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలతో రాణించారు. ఇమామ్ ఉల్ హక్ (93), సల్మాన్ అఘా (93) తృటిలో సెంచరీలు మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), మహ్మద్ రిజ్వాన్ (75) భారీ అర్ద సెంచరీలు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 6 వికెట్లు తీయగా.. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన ధ్రువ్ జురెల్.. భారత తొలి క్రికెటర్‌గా ఫీట్ -
CWC 2025: బంగ్లాదేశ్‌తో మ్యాచ్.. సౌతాఫ్రికా టార్గెట్ ఎంతంటే..?
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో ఇవాళ (అక్టోబర్ 13) బంగ్లాదేశ్, సౌతాఫ్రికా జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 232 పరుగులు మాత్రమే చేసింది. షర్మిన్ అక్తర్ (50), షోర్నా అక్తర్ (35 బంతుల్లో 51 నాటౌట్) అర్ద సెంచరీలతో రాణించారు. కెప్టెన్ నిగార్ సుల్తానా (32), ఫర్జానా హాక్ (30), రూబ్యా హైదర్ (25) ఓ మోస్తరు స్కోర్లు చేసినా.. చాలా నిదానంగా ఆడారు. వీరిలో ఫర్జానా మ్యాచ్‌ను చూసే వారికి విసుగు తెప్పించింది. 30 పరుగులు చేసేందుకు ఆమె ఏకంగా 76 బంతులు ఆడింది. రూబ్యా హైదర్ సైతం తాను చేసిన 25 పరుగుల కోసం 52 బంతులను ఎదుర్కొంది. హాఫ్ సెంచరీ చేసినా, షర్మిన్ అక్తర్ కూడా 77 బంతులు ఆడింది. నిగార్ సుల్తానా 42 బంతుల్లో 32 పరుగులు చేసింది. ఆఖర్లో రితూ మోనీ 8 బంతుల్లో 3 బౌండరీల సాయంతో 19 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. షోర్నా, రీతూ ఆఖర్లో వేగంగా ఆడకపోయుంటే బంగ్లాదేశ్ స్కోర్ 200 కూడా దాటేది కాదు. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, క్లో ట్రయాన్, నదినే డి క్లెర్క్ తలో వికెట్ తీశారు.కాగా, పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్ మొదటి మూడు స్థానాల్లో ఉండగా.. సౌతాఫ్రికా నాలుగు, బంగ్లాదేశ్ ఆరో స్థానంలో ఉన్నాయి. సౌతాఫ్రికా 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 4 పాయింట్లు ఖాతాలో కలిగి ఉండగా.. బంగ్లాదేశ్ 3 మ్యాచ్‌ల్లో ఒకే ఒక విజయంతో 2 పాయింట్లు ఖాతాలో కలిగి ఉంది. సౌతాఫ్రికా కొద్ది రోజుల కిందట జరిగిన ఉత్కంఠ పోరులో టీమిండియాపై విజయం సాధించింది. చదవండి: IND VS WI: వీరోచిత శతకాలు.. చరిత్ర తిరగరాసిన విండీస్ బ్యాటర్లు -
పాక్‌తో తొలి టెస్ట్.. తడబడుతున్న సౌతాఫ్రికా.. రికెల్టన్, జోర్జి రాణించినా..!
లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో (Pakistan vs South Africa) పర్యాటక సౌతాఫ్రికా జట్టు తడబడుతుంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్లు కోల్పోయి 216 పరుగులు మాత్రమే చేయగలిగింది. ర్యాన్ రికెల్టన్ (71), టోనీ డి జోర్జి (81 నాటౌట్) అర్ద సెంచరీలు చేసినా పెద్ద స్కోర్ సాధించేలా కనిపించడం లేదు. రికెల్టన్, జోర్జి క్రీజ్‌లో ఉన్నప్పుడు సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసేలా కనిపించింది.అయితే 26 పరుగుల వ్యవధిలో 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. 174 పరుగుల వద్ద రికెల్టన్.. 192 పరుగుల వద్ద ట్రిస్టన్ స్టబ్స్ (8).. 193 పరుగుల వద్ద డెవాల్డ్ బ్రెవిస్ (0).. 200 పరుగుల వద్ద కైల్ వెర్రిన్ (2) వికెట్లు కోల్పోయింది.ఆట ముగిసే సమయానికి టోనీ డి జోర్జితో పాటు సెనురన్ ముత్తుసామి (6) క్రీజ్‌లో ఉన్నాడు. పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు సౌతాఫ్రికా ఇంకా 162 పరుగులు వెనుకపడి ఉంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మార్క్రమ్ 20, వియాన్ ముల్దర్ 17 పరుగులకు ఔటయ్యారు. వెటరన్ స్పిన్నర్ నౌమన్ అలీ 4 వికెట్లు తీసి సౌతాఫ్రికాను దెబ్బ కొట్టాడు. సాజిద్ ఖాన్, సల్మాన్ అఘా తలో వికెట్ తీశారు.అంతకుముందు పాక్ తొలి ఇన్నింగ్స్‌లో 378 పరుగులకు ఆలౌటైంది. నలుగురు భారీ అర్ద సెంచరీలు చేసినా, ఆ జట్టు నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. సెనూరన్ ముత్తుసామి 6 వికెట్లు తీసి పాక్‌ను దెబ్బ కొట్టాడు. ప్రెనెలన్ సుబ్రాయన్ 2, రబాడ, హార్మర్ తలో వికెట్ తీశారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఇమామ్ ఉల్ హక్, సల్మాన్ అఘా తలో 93 పరుగులు, కెప్టెన్ షాన్ మసూద్ 76, వికెట్‌కీపర్ రిజ్వాన్ 75 పరుగులు చేశారు. కాగా, సౌతాఫ్రికా జట్టు 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్, అనంతరం 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం పాక్‌లో పర్యటిస్తుంది. చదవండి: సారా టెండుల్కర్‌కు అర్జున్, సానియా స్పెషల్ విషెస్.. పోస్ట్ వైరల్ -
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్.. రాణించిన పాక్ బ్యాటర్లు
రెండు టెస్ట్‌లు, మూడు టీ20లు, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టు పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ పర్యటనలో భాగంగా ఇవాళ (అక్టోబర్ 12) తొలి టెస్ట్ మొదలైంది. లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో (Pakistan vs South Africa) పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి రోజు పాక్ బ్యాటర్లు తలో చేయి వేయడంతో పాక్ మంచి స్కోర్ సాధించింది. ఆట ముగిసే సమయానికి పాక్ 5 వికెట్ల నష్టానికి 313 పరుగులు చేసింది. పాక్ ఇన్నింగ్స్‌లో నలుగురు అర్ద సెంచరీలు చేశారు. ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (93) తృటిలో సెంచరీ మిస్ కాగా.. కెప్టెన్ షాన్ మసూద్ (76), వికెట్ కీపర్ మొహమ్మద్ రిజ్వాన్ (62), సల్మాన్ అఘా (52) బాధ్యతాయుతమైన అర్ద సెంచరీలు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి రిజ్వాన్, సల్మాన్ అఘా క్రీజ్‌లో ఉన్నారు.పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), సౌద్ షకీల్ (0) పూర్తిగా నిరుత్సాహపరచగా.. బాబర్ ఆజమ్ (23) మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్‌గా మలచలేకపోయాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సెనురన్ ముత్తుసామి 2, రబాడ, ప్రెనెలన్ సుబ్రాయన్, సైమన్ హార్మర్ తలో వికెట్ తీశారు.చదవండి: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో తొలి జట్టు -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. 147 ఏళ్ల టెస్ట్ క్రికెట్లో తొలి జట్టు
సౌతాఫ్రికా జాతీయ క్రికెట్ జట్టు (South Africa) సరికొత్త చరిత్ర సృష్టించింది. వరుసగా నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చిన తొలి జట్టుగా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. 147 టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఏ జట్టు నాలుగు వరుస మ్యాచ్‌ల్లో నలుగురు వేర్వేరు కెప్టెన్లను మార్చలేదు.సౌతాఫ్రికా కెప్టెన్ల మార్పు యాదృచ్చికంగా జరిగింది. 2023-25 డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత జింబాబ్వేతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమాకు (Temba Bavuma) విశ్రాంతి కల్పించారు. ఆ సిరీస్‌కు కేవశ్ మహారాజ్ (Keshav Maharaj) కెప్టెన్‌గా ఎంపిక కాగా.. తొలి టెస్ట్‌లో అతను గాయపడ్డాడు. దీంతో రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. మహారాజ్ స్థానంలో రెండో టెస్ట్‌లో కెప్టెన్‌గా వియాన్ ముల్దర్ (Wiaan Mulder) వ్యవహరించాడు.తాజాగా పాకిస్తాన్ పర్యటన కోసం సౌతాఫ్రికా జట్టును ప్రకటించారు. ఈ సిరీస్‌కు రెగ్యులర్ కెప్టెన్ బవుమా అందుబాటులోకి రావాల్సింది. అయితే ఇంగ్లండ్‌తో ఇటీవల జరిగిన వైట్ బాల్ సిరీస్ సందర్భంగా బవుమా గాయపడ్డాడు. దీంతో అతని స్థానంలో ఎయిడెన్ మార్క్రమ్కు (Aiden Markram) పాకిస్తాన్ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు.పాక్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఇవాళే (అక్టోబర్ 12) ప్రారంభమైంది. లాహోర్ వేదికగా జరుగుతున్న తొలి మ్యాచ్‌లో మార్క్రమ్ కెప్టెన్‌గా బరిలోకి దిగాడు. ఈ మ్యాచ్‌లో ఆతిథ్య పాకిస్తాన్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది.53 ఓవర్ల తర్వాత ఆ జట్టు స్కోర్ 2 వికెట్ల నష్టానికి 188 పరుగులుగా ఉంది. ఓపెనర్ అబ్దుల్లా షఫీక్ (2), కెప్టెన్ షాన్ మసూద్ (76) ఔట్ కాగా.. మరో ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ (86), బాబర్ ఆజమ్ (21) క్రీజ్‌లో ఉన్నారు. పాక్ బౌలర్లలో ప్రెనెలన్ సుబ్రాయన్, కగిసో రబాడకు తలో వికెట్ దక్కింది.చదవండి: IND vs WI: కుల్దీప్ మాయాజాలం.. 248 పరుగులకు వెస్టిండీస్ ఆలౌట్ -
టీ20 క్రికెట్లో పెను సంచలనం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన నమీబియా
అంతర్జాతీయ టీ20 క్రికెట్లో పెను సంచలనం నమోదైంది. పసికూన నమీబియా చేతిలో టీ20 వరల్డ్‌కప్-2024 రన్నరప్ సౌతాఫ్రికాకు ఘోర పరాభావం ఎదురైంది. శనివారం విండ్‌హోక్ వేదికగా జరిగిన ఏకైక టీ20లో దక్షిణాఫ్రికాను 4 వికెట్ల తేడాతో నమీబియా ఓడించింది.నమీబియా విజయానికి ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరమ్వగా.. వికెట్ కీపర్ బ్యాటర్ జేన్ గ్రీన్(30 నాటౌట్) అద్భుత ఇన్నింగ్స్‌తో తన జట్టుకు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్లో తొలి బంతికి సిక్స్ బాది నమీబియా మ్యాచ్‌ను మలుపు తిప్పిన గ్రీన్.. చివరి బంతికి ఫోర్ బాది మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఫలితంగా 135 పరుగుల లక్ష్యాన్ని నమీబియా 6 వికెట్లు కోల్పోయి చేధించింది. ఏ ఫార్మాట్లోనైనా సౌతాఫ్రికాపై నమీబియాకు ఇదే తొలి విజయం కావడం గమనార్హం.నమీబియా బ్యాటర్లలో గ్రీన్‌తో పాటు గెర్హార్డ్ ఎరాస్మస్(21), కుర్గర్(18),ట్రంపెల్మాన్(11) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. సౌతాఫ్రికా బౌలర్లలో బర్గర్, సీమ్లైన్ తలా రెండు వికెట్లు సాధించగా.. ఫోర్టిన్, కోయిట్జీ చెరో వికెట్ సాధించారు.తేలిపోయిన ప్రోటీస్ బ్యాటర్లు..అంతకుముందు బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 134 పరుగులకే పరిమితమైంది. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని తిరిగొచ్చిన క్వింటన్ డికాక్(1) తీవ్ర నిరాశపరిచాడు. అతడితో పాటు స్టార్ బ్యాటర్లు రీజా హెండ్రిక్స్(7), ఫెరీరా(4) విఫలమయ్యారు.సఫారీ బ్యాటర్లలో జే స్మిత్(31) టాప్ స్కోరర్‌గా నిలవగా.. హెర్మన్(23), ఫోర్టిన్(19) పర్వాలేదన్పించారు. నమీబియా బౌలర్లలో ట్రంపెల్మాన్ మూడు, మాక్స్ హీంగో రెండు, ఎరాస్మస్, షికాంగో, స్మిత్ తలా వికెట్ సాధించారు. నమీబియా ఇటీవలే టీ20 ప్రపంచకప్-2026కు ఆర్హత సాధించింది. కాగా ఓ అసోసియేట్ సభ్య దేశం చేతిలో సౌతాఫ్రికా టీ20 మ్యాచ్‌లో ఓడిపోవడం ఇదే తొలిసారి.చదవండి: నాకైతే ఆడాలని ఉంది.. కానీ అది నా చేతుల్లో లేదు: జడేజా -
వైజాగ్ లో భారత మహిళల అనూహ్య ఓటమి
-
IND Vs SA: టీమిండియాపై అనూహ్య విజయం.. దక్షిణాఫ్రికా ప్రపంచ రికార్డు
మహిళల వన్డే ప్రపంచకప్ 2025లో భాగంగా నిన్న (అక్టోబర్ 9) ఓ ఆసక్తికర పోరు జరిగింది. భారత్, సౌతాఫ్రికా జట్లు వైజాగ్ వేదికగా హోరాహోరీగా తలపడ్డాయి. తప్పక గెలుస్తుందనుకున్న ఈ మ్యాచ్‌లో భారత్ అనూహ్యంగా ఓటమిపాలైంది. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు నదినే డి క్లెర్క్ (Nadine de Klerk) (54 బంతుల్లో 84 నాటౌట్; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) సంచలన ఇన్నింగ్స్ ఆడి భారత్ చేతుల్లో నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంది. భారత్ నిర్దేశించిన 252 పరుగుల లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 81 పరుగులకే 5 కోల్పోయింది. ఈ దశలో క్లెర్క్.. క్లో ట్రయాన్ (49) సహకారంతో సౌతాఫ్రికాను గెలిపించింది. లక్ష్యానికి కొద్ది దూరంలో (41 పరుగులు) ట్రయాన్ ఔట్ కాగా.. చివర్లో క్లెర్క్ పూనకం వచ్చినట్లు ఊగిపోయింది. చేతిలో మరో 3 వికెట్లు మాత్రమే ఉండి, 24 బంతుల్లో 41 పరుగులు చేయాల్సిన దశలో ఎడాపెడా బౌండరీలు, సిక్సర్లు బాది మరో 7 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ముగించింది.క్లెర్క్ సంచలన ఇన్నింగ్స్ కారణంగా సౌతాఫ్రికా ఖాతాలో ఓ భారీ రికార్డు చేరింది. వన్డే క్రికెట్ చరిత్రలో విజయవంతమైన లక్ష్య ఛేదనల్లో, ఐదు వికెట్లు కోల్పోయిన తర్వాత అత్యధిక పరుగులు చేసిన జట్టుగా సౌతాఫ్రికా చరిత్రకెక్కింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఐదో వికెట్ పడిన తర్వాత 171 పరుగులు జోడించి సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ (159) పేరిట ఉండేది.సౌతాఫ్రికా హ్యాట్రిక్ఈ గెలుపుతో సౌతాఫ్రికా హ్యాట్రిక్ సాధించింది. ప్రపంచకప్ టోర్నీల్లో సౌతాఫ్రికాకు భారత్‌పై ఇది వరుసగా మూడో విజయం. ఈ గెలుపుకు మరో ప్రాధాన్యత కూడా ఉంది. వన్డేల్లో భారత్ చేతిలో వరుసగా ఐదు ఓటముల తర్వాత సౌతాఫ్రికాకు లభించిన తొలి విజయం ఇది.రిచా ఘోష్ చారిత్రక ఇన్నింగ్స్ఈ మ్యాచ్‌లో భారత్ తొలుత బ్యాటింగ్ చేసి, రిచా ఘోష్ (77 బంతుల్లో 94; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) చారిత్రక ఇన్నింగ్స్ కారణంగా 251 పరుగులు చేసింది. 153 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న దశలో రిచా.. స్నేహ్ రాణా (33) సహకారంతో భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో భారత్‌కు ఇది తొలి ఓటమి. అంతకుముందు భారత్ వరుసగా శ్రీలంక, పాకిస్తాన్‌లపై విజయాలు సాధించింది.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 28 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు -
సఫారీతో సవాల్‌కు భారత్ సై
శ్రీలంకతో మ్యాచ్‌లో 124/6... పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో 159/5... అదృష్టవశాత్తూ ఈ రెండు సందర్భాలను అధిగమించి భారత జట్టు విజయాన్ని అందుకుంది. అయితే అవి రెండూ మనతో పోలిస్తే సహజంగానే బలహీన జట్లు. ఇలాంటి పొరపాటే పెద్ద జట్లతో జరిగితే కోలుకోవడానికి అవకాశం ఉండదు. టోర్నీలో వరుసగా దక్షిణాఫ్రికా, ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లతో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం తలపడనుంది. వీటిలో మన ప్రదర్శనపైనే వరల్డ్ కప్‌లో సెమీఫైనల్ చేరే అవకాశాలతో పాటు జట్టు అసలు సత్తా ఏమిటో తేలనుంది. ఈ నేపథ్యంలో విశాఖపట్నం వేదికగా సఫారీ టీమ్‌తో పోరుకు భారత్ ‘సై’ అంటోంది. గత మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన దక్షిణాఫ్రికా టీమ్ కూడా అమితోత్సాహంతో బరిలోకి దిగుతోంది. సాక్షి క్రీడా ప్రతినిధి, విశాఖపట్నం: మహిళల వన్డే వరల్డ్ కప్‌లో విశాఖపట్నం వేదికగా మ్యాచ్‌లకు రంగం సిద్ధమైంది. ఈ టోర్నీలో ఐదు మ్యాచ్‌లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుండగా... భారత్ తొలి రెండు మ్యాచ్‌లు ఆడుతుంది. ఇందులో భాగంగా నేడు ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో హర్మన్‌ప్రీత్ బృందం తలపడుతుంది. టోర్నీలో భారత్ ఆడిన రెండు మ్యాచ్‌లలో గెలవగా... దక్షిణాఫ్రికా ఒకటి ఓడి, మరొకటి గెలిచింది. బరిలోకి అమన్‌జోత్... టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో చూస్తే భారత బ్యాటింగ్ బలహీనత కనిపించింది. టాప్ బ్యాటర్లయిన స్మృతి, హర్మన్ విఫలం కాగా, లోయర్ ఆర్డర్ ఆదుకుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు బాగా అనుకూలించేలా ఉంది. ఇలాంటి స్థితిలో వీరిద్దరు తమ స్థాయికి తగిన ప్రదర్శన కనబర్చడం కీలకం. ఈ ఏడాది అసాధారణ ఫామ్‌లో ఉన్న స్మృతి అసలు సమరంలో విఫలం కావడం ఆందోళన కలిగించే అంశం. మిడిలార్డర్లో జెమీమా శ్రీలంకపై డకౌట్ అయినా, పాక్‌పై మ్యాచ్‌లో ఫర్వాలేదనిపించింది. గత రెండు మ్యాచ్‌లలో ఈ ముగ్గురి ఆటను కలిపి చూస్తే అత్యధిక స్కోరు 32 మాత్రమే. బౌలింగ్‌కు సంబంధించి గత మ్యాచ్‌లో ఐదుగురు రెగ్యులర్ బౌలర్లతోనే ఆడింది. అయితే పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలిస్తే ప్రత్యర్థిని నిలువరించేందుకు ప్రత్యామ్నాయంగా ఆరో బౌలర్ అవసరం. అనారోగ్యంతో గత మ్యాచ్‌కు దూరమైన అమన్‌జోత్ కోలుకుంది. దాంతో తుది జట్టులోకి రావడం ఖాయం. అయితే ఎవరి స్థానంలో ఆమె ఆడుతుందనేది ఆసక్తికరం. ఆమె స్థానంలో ఆడిన రేణుక పాక్‌పై సత్తా చాటింది. తొలి రెండు మ్యాచ్‌లలో మన ఫీల్డింగ్ ప్రదర్శన కూడా పేలవంగా ఉంది. దీనిని కూడా సరిదిద్దుకోవాల్సి ఉంది. ఆత్మవిశ్వాసంతో సఫారీ టీమ్... ఇంగ్లండ్‌పై తొలి మ్యాచ్‌లో 69 ఆలౌట్ తర్వాత న్యూజిలాండ్‌పై దక్షిణాఫ్రికా ఆటతీరు చూస్తే ఆ జట్టు ఫామ్‌లోకి వచ్చినట్లు కనిపించింది. బ్రిట్స్ సెంచరీతో చెలరేగగా... లూస్ కీలక ఇన్నింగ్స్ ఆడింది. సీనియర్లు వోల్వార్ట్, మరిజాన్ కాప్ అనుభవం జట్టుకు కీలకం కానుంది. పేసర్లు ఖాకా, క్లాస్ కూడా ప్రభావం చూపగలరు. స్పిన్నర్లను ఎదుర్కోవడంలో దక్షిణాఫ్రికా జట్టులో తడబాటు కనిపిస్తున్నా... బ్యాటింగ్‌కు పిచ్ అనుకూలిస్తే భారీ స్కోరు సాధించగల సామర్థ్యం టీమ్‌కు ఉంది. ఇద్దరు మాత్రమే... మ్యాచ్ ముందు రోజు భారత జట్టు ఆప్షనల్ ప్రాక్టీస్ అవకాశం ఇచ్చారు. దాంతో ఇద్దరు మినహా జట్టు సభ్యులెవరూ మైదానానికి రాలేదు. కెపె్టన్ హర్మన్‌ప్రీత్, జెమీమా రోడ్రిగ్స్ మాత్రమే సాధనలో పాల్గొన్నారు. టీమ్ కొలంబో నుంచి వచ్చిన తర్వాత మంగళవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు దూరంగా ఉన్న వీరిద్దరు మరుసటి రోజు ఆ అవకాశాన్ని వినియోగించుకున్నారు. శ్రీచరణి సత్తా చాటేనా... భారత్‌తో మ్యాచ్‌లో ఇనోకా రణవీరా అద్భుత బంతితో జెమీమాను బౌల్డ్ చేసింది. ఇది టోర్నీలోనే అత్యుత్తమ బంతని, తానే కాదు ఎవరూ ఆడలేరని జెమీమా స్వయంగా అంగీకరించింది. మ్యాచ్‌లో మొత్తం 4 వికెట్లతో ఇనోకా సత్తా చాటింది. దక్షిణాఫ్రికాపై ఇంగ్లండ్ బౌలర్ లిన్సీ స్మిత్ 7 పరుగులే ఇచ్చి 3 వికెట్లతో ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో సఫారీ బౌలర్ ఎంలాబా 4 కీలక వికెట్లతో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఈ ముగ్గురూ లెఫ్టార్మ్ స్పిన్నర్లే కావడం విశేషం. టోర్నీలో వారి ప్రభావం ఎలా నడుస్తుందో ఇది చూపిస్తోంది. భారత జట్టులోని లెఫ్టార్మ్ స్పిన్నర్ శ్రీచరణి కూడా సొంతగడ్డపై ఇదే తరహా ప్రదర్శన కనబర్చాలని మేనేజ్మెంట్ కోరుకుంటోంది. రెండో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాధ యాదవ్‌కు ఇంకా మ్యాచ్ దక్కలేదు కానీ... లంకపై శ్రీచరణి ఫర్వాలేదనిపించగా, పాక్‌తో పెద్దగా ప్రభావం చూపలేదు. ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ఆర్ కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి 11 వన్డేల స్వల్ప కెరీర్లో అందరినీ ఆకట్టుకుంది. అయితే తనకంటూ ప్రత్యేకంగా చెప్పుకునే ప్రదర్శన ఆమె నుంచి ఇంకా రాలేదు. దానిని చూపించేందుకు ఆమెకు సొంత రాష్ట్రానికి మించి సరైన వేదిక లభించదు. వరల్డ్‌కప్ మ్యాచ్‌లో అంచనాలకు తగినట్లుగా చెలరేగితే చరణికి ఇకపై తిరుగుండదు. పిచ్, వాతావరణం భారత్ ఆడిన గత రెండు మ్యాచ్‌లతో పోలిస్తే ఇది బ్యాటింగ్‌కు బాగా అనుకూలం. జెమీమా పరిశీలన ప్రకారం కనీసం 270 స్కోరు చేయవచ్చు. బుధవారం నగరంలో వాన కురిసింది. మ్యాచ్ రోజు కూడా స్వల్పంగా అంతరాయం కలిగించే అవకాశం ఉంది.తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: హర్మన్‌ప్రీత్ (కెప్టెన్), స్మృతి మంధాన, ప్రతీక, హర్లీన్, జెమీమా, దీప్తి, స్నేహ్, రిచా, శ్రీచరణి, క్రాంతి, రేణుక/అమన్‌జోత్. దక్షిణాఫ్రికా: వోల్వార్ట్ (కెప్టెన్), బ్రిట్స్, లూస్, కాప్, బాష్, జాఫ్తా, ట్రైఆన్, డి క్లెర్క్, క్లాస్, ఖాకా, ఎంలాబా.5 విశాఖపట్నంలో భారత మహిళల జట్టు ఆడిన 5 వన్డేల్లోనూ విజయం సాధించింది. ఈ వేదికలో శ్రీలంకపై 3 మ్యాచ్‌ల్లో, ఇంగ్లండ్‌పై 2 మ్యాచ్‌ల్లో భారత్ గెలిచింది.20 భారత్, దక్షిణాఫ్రికా మధ్య 33 వన్డేలు జరిగాయి. 20 మ్యాచ్‌ల్లో భారత్ నెగ్గింది. 12 మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా గెలిచింది. ఒక మ్యాచ్ రద్దయింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా బ్యాటర్.. ప్రపంచంలో తొలి ప్లేయర్
సౌతాఫ్రికా ఓపెనింగ్ బ్యాటర్ తజ్మిన్ బ్రిట్స్ (Tazmin Brits) మహిళల వన్డే క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓ క్యాలెండర్ ఇయర్లో ఐదు సెంచరీలు బాదిన తొలి మహిళా ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పింది. వన్డే వరల్డ్‌కప్ 2025లో భాగంగా న్యూజిలాండ్‌తో నిన్న (అక్టోబర్ 6) జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేయడంతో ఈ ఘనత సాధించింది.తజ్మిన్కు ముందు ఈ రికార్డు టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన (Smriti Mandhana) ఖాతాలో ఉండిది. మంధన 2024, 2025 క్యాలెండర్ ఇయర్స్‌లో నాలుగు సెంచరీలు బాదింది. తాజాగా తజ్మిన్ మంధన రికార్డును బద్దలు కొట్టి, సరికొత్త చరిత్ర సృష్టించింది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్ సుదీర్ఘంగా సాగనుండటంతో మంధన తిరిగి తన రికార్డును తజ్మిన్ నుంచి చేజిక్కించుకునే అవకాశాలు లేకపోలేదు. ఇటీవలికాలంలో మంధన కూడా అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉంది. అయితే ఈ ప్రపంచకప్‌లో మాత్రం తొలి రెండు మ్యాచ్‌ల్లో విఫలమైంది.తజ్మిన్ ఖాతాలో మరో భారీ రికార్డుతాజా సెంచరీతో తజ్మిన్ మరో భారీ రికార్డును కూడా సొంతం చేసుకుంది. అతి తక్కువ ఇన్నింగ్స్‌ల్లో 7 సెంచరీలు పూర్తి చేసిన ప్లేయర్‌గా ఆసీస్ దిగ్గజం మెగ్ లాన్నింగ్ రికార్డును బ్రేక్ చేసింది. వన్డేల్లో 7 సెంచరీలు పూర్తి చేసేందుకు లాన్నింగ్‌కు 44 ఇన్నింగ్స్‌లు అవసరం కాగా.. తజ్మిన్ కేవలం 41 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. ప్రపంచంలో తజ్మిన్, లాన్నింగ్ మినహా ఏ ఒక్క మహిళా ప్లేయర్ కూడా కనీసం 50 ఇన్నింగ్స్‌ల్లో 7 వన్డే సెంచరీలు పూర్తి చేయలేకపోయారు.మ్యాచ్ విషయానికొస్తే.. తజ్మిన్ మెరుపు సెంచరీతో (89 బంతుల్లో 101; 15 ఫోర్లు, సిక్స్) చెలరేగడంతో న్యూజిలాండ్‌పై సౌతాఫ్రికా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 47.5 ఓవర్లలో 231 పరుగులకు ఆలౌట్ కాగా.. సౌతాఫ్రికా 40.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తజ్మిన్కు సూన్ లస్ (83 నాటౌట్) కూడా తోడవ్వడంతో సౌతాఫ్రికా సునాయాస విజయాన్ని సాధించింది. అంతకుముందు సోఫీ డివైన్ (85) రాణించడంతో న్యూజిలాండ్ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఈ మ్యాచ్ తజ్మిన్తో పాటు న్యూజిలాండ్ ప్లేయర్స్ సూజీ బేట్స్, సోఫీ డివైన్‌కు కూడా ప్రత్యేకంగా గుర్తుండిపోతుంది. ఎందుకంటే బేట్స్ మహిళ క్రికెట్లో 350 మ్యాచ్‌లు ఆడిన తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. సోఫీ డివైన్‌కు కూడా ఇది 300వ అంతర్జాతీయ మ్యాచ్. అతి తక్కువ మంది మాత్రమే ఈ మైలురాయిని చేరుకున్నారు.వైరలవుతున్న తజ్మిన్ సంబరాలుఈ మ్యాచ్‌లో తజ్మిన్ సెంచరీ తర్వాత చేసుకున్న 'బౌ అండ్ యారో' సంబరాలు వైరలవుతున్నాయి. తజ్మిన్ సెలబ్రేషన్స్‌కు భారత క్రికెట్ అభిమానులు సైతం ముగ్దులవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. The moment Tazmin Brits made it 4️⃣ hundreds in her last 5️⃣ ODIs 🤩Watch #NZvSA LIVE in your region, broadcast details here ➡️ https://t.co/MNSEqhJP29#CWC25 pic.twitter.com/NfSYRjCsOY— ICC Cricket World Cup (@cricketworldcup) October 6, 2025తజ్మిన్ ఇంతకుముందు కూడా ఇలాంటి వినూత్న సంబరాలు చేసుకొని వార్తల్లో నిలిచింది. ఒంటికాలిపై యోగాసనం లాంటివి చేసి బాగా పాపులరైంది.యాదృచ్చికంతజ్మిన్ ఓ క్యాలెండర్ ఇయర్లో 5 సెంచరీలు చేసిన రోజే (అక్టోబర్ 6), సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ గ్యారీ కిర్‌స్టన్ కూడా ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. పురుషుల క్రికెట్లో కిర్‌స్టన్ 1996 క్యాలెండర్ ఇయర్లో ఇదే రోజు తన ఐదో వన్డే సెంచరీని పూర్తి చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి సౌతాఫ్రికన్‌గా చరిత్ర సృష్టించాడు. ఒకే రోజు ఇద్దరు సౌతాఫ్రికన్లు ఒకే ఫీట్‌ను సాధించడం యాదృచ్చికంగా జరిగింది.5 ఇన్నింగ్స్‌ల్లో 4 శతకాలుతజ్మిన్ తన వన్డే కెరీర్లో చేసిన 7 సెంచరీల్లో నాలుగింటిని గత 5 ఇన్నింగ్స్‌ల్లోనే చేయడం విశేషం. ఈ సెంచరీకి ముందు ఇంగ్లండ్‌తో వన్డేలో (5) విఫలమైన ఆమె.. అంతకుముందు మూడు వన్డేల్లో పాక్‌పై 2, వెస్టిండీస్‌పై ఓ సెంచరీ సాధించింది.గత 5 వన్డే ఇన్నింగ్స్‌ల్లో తజ్మిన్ స్కోర్లు- 101(91) Vs వెస్టిండీస్- 101*(121) Vs పాక్- 171*(141) Vs పాక్- 5(13) Vs ఇంగ్లండ్- 101(89) Vs న్యూజిలాండ్ (WC)తజ్మిన్ గురించి ఆసక్తికర విషయాలు..ప్రస్తుతం స్టార్ క్రికెటర్‌గా చలామణి అవుతున్న తజ్మిన్ తన కెరీర్‌ను అథ్లెట్‌గా మొదలుపెట్టింది. 2007లో ఆమె వరల్డ్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ సాధించింది. 2012 ఒలింపిక్స్‌కు ఎంపిక కావాల్సిన సమయంలో ఆమె రోడ్డు ప్రమాదానికి గురై, రెండు నెలలు ఆసుపత్రిలో ఉండాల్సి వచ్చింది. దీంతో అథ్లెట్‌గా ఆమె కెరీర్ అక్కడితో ముగిసింది. ఆతర్వాత 2018లో దక్షిణాఫ్రికా జట్టుకు ఎంపికైన తజ్మిన్ అప్పటి నుంచి కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తుంది. తజ్మిన్ తన తొలి 40 వన్డేల్లో ఒక్క డకౌట్ కూడా కాకుండా ఆడి అరుదైన ఆటగాళ్ల జాబితాలో నిలిచింది. చదవండి: రిషబ్ పంత్ రీఎంట్రీ..! -
అత్యంత అభిమానం నుంచి అత్యంత విద్వేషం దాకా..
వాషింగ్టన్: నూతన హెచ్–1బీ వీసా దరఖాస్తుదారులకు వార్షిక రుసుమును ఏకంగా లక్ష డాలర్లకు అమెరికా ప్రభుత్వం పెంచిన నేపథ్యంలో దక్షిణాఫ్రికా మూలాలున్న ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ గతంలో చేసిన హెచ్–1బీ అనుకూల, ప్రతికూల వ్యాఖ్యలు మరోసారి తెరమీదకొచ్చాయి. హెచ్–1బీ కారణంగానే తనలాంటి ఎంతో మంది దక్షిణాఫ్రికా మొదలు ఎన్నో ప్రపంచదేశాల నుంచి వచ్చి అమెరికాలో స్థిరపడ్డారని, హెచ్–1బీ అనేది అద్భుతమైన విధానమని గతంలో మస్క్ ‘ఎక్స్’లో ట్వీట్‌చేసిన అంశాన్ని పలువురు గుర్తుచేసుకుంటున్నారు. ఆ తర్వాతి కాలంలో హెచ్–1బీ విధానంపై మస్క్ హఠాత్తుగా మాటమార్చారు. అది అత్యంత లోపభూయిష్టమైన విధానమని, అమెరికాకు దీంతో ప్రయోజనంలేదని అభాండాలు వేయడం మొదలెట్టడం చూసి రిపబ్లికన్ పార్టీ నేతలు సైతం విస్మయం వ్యక్తంచేయడం తెల్సిందే. మొదట్లో ట్రంప్‌ను ఆకాశానికెత్తేసిన మస్క్ ఆ తర్వాత ట్రంప్‌కు పోటీగా రాజకీయ పార్టీని సైతం ప్రకటించారు. హెచ్–1బీ అమలుతీరులో ఎలాంటి లోపాలు లేవు. సంస్కరణలు అక్కర్లేదని మస్క్ గతంలో అన్నారు. ఇటీవల మాటమార్చారు. ‘అదొక విఫల విధానం. భారీ సంస్కరణలు తేవాల్సిందే’అని అన్నారు. గతంలో దీనికి పూర్తిభిన్నంగా మాట్లాడారు. ‘హెచ్–1బీ కారణంగానే నేను అమెరికాలో స్థిరపడగలిగా. నేను మాత్రమే కాదు నా సంస్థలైన టెస్లా, ఎక్స్, స్పేస్ఎక్స్, ఇతర కీలక సంస్థల ఏర్పాటులో నాకు సాయపడిన వారెందరినో హెచ్–1బీ అమెరికా కలలను నెరవేర్చింది. చట్టబద్ధ వలసలకు ఇది స్వర్గధామం. హెచ్–1బీ కోసం యుద్ధం చేయడానికైనా సిద్ధం. హెచ్–1బీని తప్పుబట్టేవాళ్లను ముఖం మీదనే చాచికొడతా’అని గతంలో అన్నారు. ఇలా మాట్లాడిన కొద్ది కాలానికే మస్క్ స్వరం మార్చారు. ‘హెచ్–1బీ వీసాతో అమెరికాలో అడుగుపెట్టిన వృత్తినిపుణులుకు కనీస వేతనం పెంచడం, మెయింటెన్స్ ఖర్చులు పెరగడంతో స్థానిక ఉద్యోగులతో పోలిస్తే ఇలా విదేశీయులను పనిలో పెట్టుకోవడం ఆర్థికంగా భారమే. ఇవన్నీ చూస్తుంటే హెచ్–1బీ అనేది కాలంచెల్లిన విధానంగా అఘోరించింది. దీనిలో భారీ సంస్కరణలు తీసుకురాక తప్పదు’అని అన్నారు. -
సౌతాఫ్రికా ఓపెనర్ల సరికొత్త చరిత్ర.. పాక్ గడ్డపై రికార్డుల మోత
సౌతాఫ్రికా మహిళా క్రికెట్ జట్టు ఓపెనర్లు లారా వోల్వార్డ్ట్, తంజిమ్ బ్రిట్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. సౌతాఫ్రికా తరఫున వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా రికార్డుల్లోకెక్కారు. అలాగే పాకిస్తాన్ గడ్డపై వన్డే క్రికెట్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నమోదు చేసిన జోడీగా చరిత్రకెక్కారు.లాహోర్‌లోని గడాఫీ స్టేడియం వేదికగా ఇవాళ (సెప్టెంబర్ 19) పాకిస్తాన్, సౌతాఫ్రికా మహిళా జట్లు వన్డే మ్యాచ్ ఆడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగగా.. ఆ జట్టు ఓపెనర్లు తంజిమ్, లారా తొలి వికెట్‌కు 260 పరుగులు జోడించారు. మహిళల వన్డే క్రికెట్లో తొలి వికెట్‌కు ఇది మూడో అత్యధిక భాగస్వామ్యం. ఏ వికెట్‌కైనా ఆరో అత్యధిక భాగస్వామ్యం.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన రికార్డు భారత జోడీ పేరిట ఉంది. 2017లో ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత ఓపెనర్లు దీప్తి శర్మ, పూనమ్ రౌత్ తొలి వికెట్‌కు 320 పరుగుల రికార్డు భాగస్వామ్యం నెలకొల్పారు.మహిళల వన్డేల్లో ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యాలు (టాప్-6)దీప్తి శర్మ-పూనమ్ రౌత్ (భారత్, 320, తొలి వికెట్‌కు)కెర్-క్యాస్పరెక్ (న్యూజిలాండ్, 295, రెండో వికెట్‌కు)టేలర్-బేమౌంట్ (ఇంగ్లండ్, 275, రెండో వికెట్‌కు)టేలర్-అట్కిన్స్ (ఇంగ్లండ్, 268, తొలి వికెట్‌కు)టిఫెన్-బేట్స్ (న్యూజిలాండ్, 262, రెండో వికెట్‌కు)వోల్వార్డ్ట్-బ్రిట్స్ (సౌతాఫ్రికా, 260, రెండో వికెట్‌కు)మ్యాచ్ విషయానికొస్తే.. వర్షం కారణంగా 46 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 3 వికెట్ల నష్టానికి 292 పరుగులు చేసింది. తంజిమ్ బ్రిట్స్ 171 పరుగులతో (141 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లు) అజేయంగా ఉండగా.. కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ 100 పరుగులు (129 బంతుల్లో 10 ఫోర్లు) చేసి ఔటైంది. పాక్ బౌలర్లలో డయానా బేగ్‌కు 2 వికెట్లు దక్కాయి.కాగా, సౌతాఫ్రికా మహిళల జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం పాకిస్తాన్లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో పాక్‌ను చితు చేసింది. మూడో వన్డే లాహోర్‌లోనే సెప్టెంబర్ 22న జరుగనుంది. -
గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు వరుస షాక్‌లు
ఇంగ్లండ్ పర్యటనలో వరుస విజయాలతో దూసుకుపోతున్న సౌతాఫ్రికాకు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఈ పర్యటనలో 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకున్న ఆ జట్టు.. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోనూ ఘనంగా బోణీ కొట్టింది. నిన్న జరిగిన తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య ఇంగ్లండ్‌పై 14 పరుగుల తేడాతో (డక్‌వర్త్ లూయిస్ పద్దతి) గెలుపొంది, సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో వెళ్లింది.ఈ మ్యాచ్‌కు ముందే సౌతాఫ్రికాకు రెండు భారీ షాక్‌లు తగిలాయి. స్టార్ పేసర్ లుంగి ఎంగిడి, స్టార్ స్పిన్నర్ కేశవ్ మహారాజ్ గాయాల బారిన పడ్డారు. వీరిలో ఎంగిడి ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ మొత్తానికి దూరంగా కాగా.. కేశవ్ మహారాజ్ ఇంగ్లండ్ టీ20 సిరీస్‌తో పాటు ఆతర్వాత పాకిస్తాన్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు కూడా దూరం కావచ్చు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఎంగిడికి ప్రత్యామ్నాయంగా నండ్రే బర్గర్‌ను ఎంపిక చేయగా.. మహారాజ్‌కు ప్రత్యామ్నాయాన్ని ఇంకా ప్రకటించలేదు. మహారాజ్ గాయంపై ఇంకా పూర్తి క్లారిటీ లేకపోవడంతో క్రికెట్ సౌతాఫ్రికా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. మెడికల్ రిపోర్ట్లు వచ్చిన తర్వాత అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.మహారాజ్ ఇటీవలికాలంలో సౌతాఫ్రికా విజయాల్లో అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నాడు. గత వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌తో మొదలు.. తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్ వరకు అతని హవా కొనసాగింది. సౌతాఫ్రికా డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో కొత్త డబ్ల్యూటీసీ సైకిల్‌ను ప్రారంభించే తరుణంలో (పాక్‌తో సిరీస్) మహారాజ్ గాయపడటం ఆ జట్టు విజయావకాశాలను తప్పక ప్రభావితం చేయవచ్చు. సౌతాఫ్రికా 2 టెస్ట్‌లు, 3 టీ20లు, 3 వన్డేల సిరీస్‌ల కోసం అక్టోబర్ 12 నుంచి పాకిస్తాన్లో పర్యటించనుంది. ఈ పర్యటనకు మహారాజ్ పూర్తిగా దూరమవుతాడా లేక టెస్ట్‌లకు మాత్రమే అందుబాటులో ఉండడా అన్న విషయంపై త్వరలోనే క్లారిటీ వస్తుంది.మహారాజ్ తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. ఈ సిరీస్‌లో అతను 3 మ్యాచ్‌ల్లో 8 వికెట్లు తీశాడు. మహారాజ్ తొలి టీ20 ఆడకపోయినా సౌతాఫ్రికా ఆ మ్యాచ్‌లో గెలుపొందింది. -
ఇంగ్లండ్‌కు సౌతాఫ్రికా మరో షాక్
సౌతాఫ్రికా ఇంగ్లండ్‌కు మరో షాక్ ఇచ్చింది. ఇంగ్లండ్‌ను వారి దేశంలోనే వన్డే సిరీస్‌లో ఓడించిన (2-1తో) ఆ జట్టు.. తాజాగా టీ20 సిరీస్‌లోనూ ఆ దిశగా తొలి అడుగు వేసింది. నిన్న (సెప్టెంబర్ 10) జరిగిన తొలి మ్యాచ్‌లో అతిథ్య జట్టుపై సౌతాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్దతిలో 14 పరుగులు తేడాతో గెలుపొందింది. ఫలితంగా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది.వర్షం అంతరాయాల నడుమ సాగిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 7.5 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 97 పరుగులు చేసింది. వర్షం కారణంగా ఆలస్యం కావడంతో ఈ మ్యాచ్‌ను తొలుత 9 ఓవర్ల మ్యాచ్‌గా నిర్ణయించారు. అయితే 7.5 ఓవర్ల తర్వాత వరుణుడు మరోసారి అడ్డుపడటంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ అక్కడే ముగించారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మార్క్రమ్ (28), బ్రెవిస్ (23), డొనొవన్ ఫెర్రియెరా (25 నాటౌట్), స్టబ్స్ (13) ఉన్న పరిధిలో చెలరేగారు. ఇంగ్లండ్ బౌలర్లలో లూక్ వుడ్ 2, ఓవర్టన్, ఆదిల్ రషీద్, సామ్ కర్రన్ తలో వికెట్ తీశారు.వర్షం కారణంగా మరి కాస్త సమయం వృధా కావడంతో డక్‌వర్త్ లూయిస్ పద్దతిన ఇంగ్లండ్ టార్గెట్‌ను 5 ఓవర్లలో 69 పరుగులకే కుదించారు. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడంలో ఇంగ్లండ్ విఫలమైంది. 5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 54 పరుగులు మాత్రమే చేయగలిగింది. సౌతాఫ్రికా బౌలర్లు వికెట్ల రూపంలోనే ఐదు బంతులు వేస్ట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టారు. జన్సెన్, కార్బిన్ బాష్ తలో 2, రబాడ ఓ వికెట్ తీశారు. ఛేదనలో తొలి బంతికే సాల్ట్‌ను రబాడ పెవిలియన్‌కు పంపాడు. ఆతర్వాత ఇంగ్లండ్ ఓవర్‌కు ఒకటి చొప్పున వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బట్లర్ (25), సామ్ కర్రన్ (10 నాటౌట్) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 మాంచెస్టర్ వేదికగా సెప్టెంబర్ 12న జరుగనుంది. -
సౌతాఫ్రికాకు భారీ షాక్
ఇంగ్లండ్‌తో ఇవాల్టి నుంచి (సెప్టెంబర్ 10) ప్రారంభం కాబోయే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు సౌతాఫ్రికా జట్టుకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ డేవిడ్ మిల్లర్ గాయం కారణంగా ఈ సిరీస్ మొత్తానికే దూరమయ్యాడు. మిల్లర్ ఇటీవల హండ్రెడ్ లీగ్‌లో Northern Superchargers తరఫున ఆడుతున్న సమయంలో హ్యామ్‌స్ట్రింగ్ గాయానికి గురయ్యాడు. ఆ గాయం నుంచి అతను ఇంకా కోలుకోలేదు. దీంతో ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని Cricket South Africa (CSA) అధికారికంగా ప్రకటించింది. అయితే మిల్లర్‌కు ప్రత్యామ్నాయ ఆటగాడిని మాత్రం ప్రకటించలేదు. ఇంగ్లండ్ సిరీస్‌లో ఆ జట్టు 14 మంది సభ్యులతోనే కొనసాగనుంది.మిల్లర్ తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లోనూ ఆడలేదు. గత కొంతకాలంగా అతను టీ20లకు మాత్రమే పరిమితమవుతున్నాడు. మిల్లర్ వన్డేలపై ఆసక్తి చూపనప్పటికీ.. 2027 వరల్డ్ కప్ ప్లాన్స్‌లో ఉంటాడని సౌతాఫ్రికా వన్డే కెప్టెన్ బవుమా తెలిపాడు. మిల్లర్ ఇంగ్లండ్ టీ20 సిరీస్‌కు దూరమైన ప్రకటన చేసిన సమయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా మరో ప్రకటన కూడా చేసింది.100కి పైగా అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన అనుభవమున్న అల్బీ మోర్కెల్ ఈ సిరీస్‌కు బౌలింగ్ కన్సల్టెంట్‌గా నియమించినట్లు తెలిపింది. అల్బీ సోదరుడు మోర్నీ మోర్కెల్ టీమిండియా బౌలింగ్ కోచ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే.కాగా, మూడు వన్డేలు, మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న సౌతాఫ్రికా జట్టు ఇదివరకే ముగిసిన వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. ఇరు జట్ల మధ్య ఇవాల్టి నుంచి టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. కార్డిఫ్ వేదికగా జరుగబోయే తొలి మ్యాచ్ భారతకాలమానం ప్రకారం ఇవాళ రాత్రి 11 గంటలకు ప్రారంభమవుతుంది. రెండు (మాంచెస్టర్), మూడు (నాటింగ్హమ్) టీ20లు 12, 14 తేదీల్లో జరుగనున్నాయి. తొలి టీ20 కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇప్పటికే ప్రకటించింది.ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌కు సౌతాఫ్రికా జట్టు: ఐడెన్ మార్క్రమ్ (కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డొనోవన్ ఫెరియెరా, మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్, క్వెనా మాఫాకా, సెనురన్ ముతుసామి, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కగిసో రబాడా, రయాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్బ్స్, లిజాడ్ విలియమ్స్, కార్బిన్ బోష్దక్షిణాఫ్రికాతో తొలి టీ20కి ఇంగ్లండ్ XI: ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), సామ్ కర్రన్, టామ్ బాంటన్, విల్ జాక్స్, జేమీ ఓవర్టన్, లియామ్ డాసన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ -
SA20 లీగ్ వేలంలో సంచలనం.. సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగిన ఆటగాడి జీతం
నిన్న జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ వేలంలో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఓ ఆటగాడి జీతం సెకెన్ల వ్యవధిలో 1050 శాతం పెరిగింది. ఈ హఠాత్ పరాణామం చూసి నిర్వహకులు సహా వేలంలో పాల్గొన్న వారంతా నివ్వెరపోయారు.పూర్తి వివరాల్లో వెళితే.. WTC 2023-25 టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టు సభ్యుడు కైల్ వెర్రిన్ నిన్న జరిగిన వేలంలో R200K (₹10.06 లక్షలు) బేస్ ధరతో పాల్గొన్నాడు. వెర్రిన్ను పార్ల్ రాయల్స్ ఇదే ధరకు దక్కించుకుని సంతృప్తి చెందింది. అయితే ఈలోపే వెర్రిన్ను దక్కించుకునేందుకు ప్రిటోరియా క్యాపిటల్స్ RTM (Right to Match) కార్డ్‌తో ముందుకొచ్చింది.దీంతో అలర్ట్ అయిన రాయల్స్ వెర్రిన్ ధరకు ఒక్కసారిగా 1050 శాతం పెంచి R2.3 మిలియన్లకు (₹1.15 కోట్లు) తీసుకెళ్లింది. ఇది చూసి క్యాపిటల్స్ సహా వేలం నిర్వహకులంతా నివ్వెరపోయారు. రాయల్స్ ఒక్కసారిగా వెర్రిన్ ధరను ఎందుకంత పెంచిందో ఎవ్వరికీ అర్దం కాలేదు. వికెట్‌కీపర్ బ్యాటర్ అయిన వెర్రిన్‌కు రాయల్స్ అంత ప్రాధాన్యత ఇవ్వడం చూసి జనాలు అవాక్కయ్యారు.వాస్తవానికి వెర్రిన్ను పొట్టి ఫార్మాట్లో చెప్పుకోదగ్గ ట్రాక్ రికార్డేమీ లేదు. అతనో సాధారణ వికెట్‌కీపర్ బ్యాటర్ మాత్రమే. అడపాదడపా మెరుపులు మెరిపించగలడు. మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తాడు. రాయల్స్ ఈ స్థాయి భారీ మొత్తం వెచ్చించాలనుకుంటే ఇంతకంటే మెరుగైన ప్రొఫైల్ ఉన్న ఆటగాడి కోసం పోటీపడి ఉండవచ్చు. కానీ వెర్రిన్‌కు ఇంత భారీ బిడ్ ఎందుకు వేసిందో మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉండిపోయింది. ఫైనల్‌గా రాయల్స్ వెర్రిన్ను దక్కించుకోగలిగింది కానీ, అనవసర ఖర్చును మీదేసుకుంది. ఒకవేళ క్యాపిటల్స్ కానీ మరే ఇతర ఫ్రాంచైజీ కానీ వెర్రిన్ కోసం పోటీపడినా అతని ధర భారత కరెన్సీలో ₹30 లక్షలు మించేది కాదు. అలాంటిది రాయల్స్ ఏకంగా ₹1.15 కోట్లు పెట్టి చేతులు కాల్చుకుంది. ఏది ఏమైనా వెర్రిన్ మాత్రం జాక్‌పాట్ కొట్టాడు. ₹10 లక్షలే ఎక్కువనుకుంటే.. సెకెన్ల వ్యవధిలో కోటీశ్వరుడయ్యాడు. అతని కెరీర్లో ఇదే భారీ వేలం మొత్తం. వెర్రిన్ గత రెండు సీజన్లలో క్యాపిటల్స్‌కు ఆడాడు. ఇందుకే ఆ ఫ్రాంచైజీ వెర్రిన్ కోసం RTM వాడింది.Paarl Royals Squad 2025–26: డేవిడ్ మిల్లర్ (కెప్టెన్), కైల్ వెర్రిన్, సికందర్ రజా, ముజీబ్ ఉర్ రెహ్మాన్, గుడకేష్ మోటీ, బ్జోర్న్ ఫోర్టుయిన్, డాన్ లారెన్స్, హార్డస్ విల్జోయెన్, డెలానో పోట్గిటర్, రూబిన్ హెర్మన్, లుహాన్-డ్రే ప్రిటోరియస్, కీగన్ లయన్-కాషెట్, ఎషాన్ మాలింగ, ఆసా ట్రైబ్, విశెన్ హలంబేజ్, జాకబ్ బాస్సన్, ఎన్కోబాని మొకోయెనా, ఎన్కాబయోమ్జీ పీటర్ -
బవుమాకు ఘోర అవమానం.. వరుసగా రెండోసారి..!
జోహన్నెస్‌బర్గ్ వేదికగా నిన్న (సెప్టెంబర్ 9) జరిగిన SA20 లీగ్ 2025-26 వేలంలో సౌతాఫ్రికా వన్డే, టెస్ట్ జట్టు కెప్టెన్ టెంబా బవుమాకు ఘోర అవమానం జరిగింది. జాతీయ జట్టుకు రెండు ఫార్మాట్లలో కెప్టెన్ అయినా బవుమాను ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు. వరుసగా రెండో సీజన్లో ఫ్రాంచైజీలు బవుమాను చిన్నచూపు చూశాయి. ఈసారి వేలంలో బవుమా 2 లక్షల ర్యాండ్ల బేస్ ప్రైజ్ విభాగంలో తన పేరు నమోదు చేసుకున్నాడు. అతనిపై ఒక్క ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబర్చలేదు.ఫ్రాంచైజీలు చిన్నచూపు చూడటానికి బవుమా టీ20 రికార్డు మరీ అంత తీసికట్టుగా ఏమీ లేదు. ఈ ఫార్మాట్లో అతను 123.99 స్ట్రయిక్‌రేట్‌తో 27.07 సగటున 2653 పరుగులు చేశాడు. అంతర్జాతీయంగానూ బవుమా టీ20 రికార్డు బాగానే ఉంది. సౌతాఫ్రికా తరఫున అతను 36 టీ20ల్లో 118.17 స్ట్రయిక్‌రేట్‌తో 670 పరుగులు చేశాడు. ఇందులో ఓ అర్ద సెంచరీ ఉంది.2021-2022 మధ్యలో బవుమా సౌతాఫ్రికా టీ20 కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. అతని సారథ్యంలో సౌతాఫ్రికా రెండు టీ20 వరల్డ్‌కప్‌లు (2021,2022) ఆడింది. అయినా బవుమాను సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఫ్రాంచైజీలు పట్టించుకోకపోవడం నిజంగా బాధాకరం. బవుమా ఆటగాడిగా, కెప్టెన్‌గా తన జట్టుకు వంద శాతం ఇచ్చేందుకు ప్రయత్నిస్తాడు. కొన్ని సార్లు సఫలం కాకపోవచు. ఇది ఆటలో సర్వసాధాణం.బవుమాకు పొట్టి క్రికెట్ ఆడే టాలెంట్ లేక విస్మరణకు గురైతే పెద్దగా పట్టింపు లేదు. అతనిలో పొట్టి క్రికెట్‌కు కావాల్సిన అన్ని లక్షణాలు ఉన్నా ఎవరు పట్టించుకోకపోవడమే బాధాకరం. అత్యుత్తమ కెప్టెన్ఎవరు ఔనన్నా కాదన్నా సౌతాఫ్రికా క్రికెట్ చరిత్రలో బవుమా అత్యుత్తమ కెప్టెన్. ఈ ఏడాది అతను సౌతాఫ్రికాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా నిలబెట్డాడు. తాజాగా ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌ను వారి దేశాల్లోనే వన్డే సిరీస్‌ల్లో మట్టికరిపించాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ఘనమైన ట్రాక్ రికార్డు ఉన్న బవుమాకు సొంత దేశంలో జరిగే టోర్నీలోనే ఆదరణ లభించకపోవడం విచారకరం. ఇదిలా ఉంటే, నిన్న జరిగిన వేలంలో బవుమాతో పాటు జేమ్స్ ఆండర్సన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, కుసాల్ పెరీరా, మొయిన్ అలీ లాంటి స్టార్ ఆటగాళ్లకు కూడా చుక్కెదురైంది. వీరిని కూడా ఏ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. డెవాల్డ్ బ్రెవిస్, ఎయిడెన్ మార్క్రమ్, మాథ్యూ బ్రీట్జ్కీ లాంటి ఆటగాళ్లు మాత్రం జాక్‌పాట్ కొట్టారు. బ్రెవిస్‌ను ప్రిటోరియా క్యాపిటల్స్ రూ. 8.31 కోట్లకు.. మార్క్రమ్ను డర్బన్ సూపర్ జెయింట్స్ రూ. 7.05 కోట్లకు.. బ్రీట్ట్కేను సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ రూ. 3.05 కోట్లకు కొనుగోలు చేశాయి. -
దుమ్ములేపిన సౌతాఫ్రికా.. పాకిస్తాన్‌ను వెనక్కి నెట్టి
ఐసీసీ వన్డే వన్డే ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా దుమ్ములేపింది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ తాజాగా ప్రకటించిన ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా టాప్-5లోకి దూసుకొచ్చింది. గురువారం ఇంగ్లండ్‌తో జరిగిన రెండో వన్డేకు ముందు ప్రోటీస్ జట్టు ఆరో స్ధానంలో ఉండేది.అయితే ఇంగ్లండ్‌పై అద్బుత విజయం సాధించడంతో సౌతాఫ్రికా.. పాకిస్తాన్‌ను వెనుక్కి నెట్టి ఐదో స్ధానానికి చేరుకుంది. సఫారీల ఖాతాలో ప్రస్తుతం 101 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఆరో స్దానంలో పాక్ వద్ద 100 రేటింగ్ పాయింట్ల ఉన్నాయి. సౌతాఫ్రికా జట్టు ఇటీవల కాలంలో వన్డేల్లో అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తోంది.గత నెలలో ఆసీస్‌తో వన్డే సిరీస్‌ను సొంతం చేసుకున్న సఫారీలు ఇప్పుడు ఇంగ్లీష్ జట్టు భరతం పట్టారు. వరుస సిరీస్ విజయాలతో సౌతాఫ్రికా ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకుంది. ఇదే జోరును సౌతాఫ్రికా కొనసాగిస్తే మరి కొద్ది రోజుల్లో రెండో స్ధానానికి చేరుకునే అవకాశముంది.ప్రస్తుతం వన్డేల్లో వరల్డ్ నంబర్ వన్ జట్టుగా టీమిండియా(124 రేటింగ్ పాయింట్లు) కొనసాగుతోంది. ఆ తర్వాత స్ధానాల్లో వరుసగా న్యూజిలాండ్(109), ఆస్ట్రేలియా(106), శ్రీలంక(103) ఉన్నాయి. రెండో ర్యాంక్‌కు చేరాలంటే సౌతాఫ్రికాకు కేవలం 8 రేటింగ్ పాయింట్లు మాత్రమే అవసరం. ఉత్కంఠ పోరులో ప్రోటీస్ విజయం..కాగా లార్డ్స్ వేదికగా నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై సౌతాఫ్రికా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 330 పరుగులు సాధించింది. ప్రోటీస్ బ్యాటర్లలో మాథ్యూ బ్రీట్జ్కే దుమ్ములేపాడు.77 బంతులు ఎదుర్కొన్న బ్రీట్జ్కే.. ఏడు ఫోర్లు, మూడు సిక్సర్ల సాయంతో 85 పరుగులు చేశాడు. అతడికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ (58), డెవాల్డ్ బ్రెవిస్ (42), కార్బిన్ బాష్ (32 నాటౌట్) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్ నాలుగు వికెట్లు దక్కించుకోగా.. ఆదిల్ రషీద్ రెండు, జేకబ్ బెతెల్ ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్య చేధనలో ఇంగ్లండ్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 325 పరుగులకే పరిమితమైంది. ఆఖరి ఓవర్లో ఇంగ్లండ్ విజయానికి 16 పరుగులు అవసరమవ్వగా.. సేన్ ముత్తుస్వామి అద్బుతంగా బౌలింగ్ చేయడంతో కేవలం 10 పరుగులు మాత్రమే వచ్చాయి.చదవండి: చరిత్ర సృష్టించిన బవుమా బృందం.. బ్రీట్జ్కే వరల్డ్ రికార్డుతో.. -
ప్రపంచంలో అత్యంత ప్రమాదకర బ్యాటర్లంతా ఒకే జట్టులో.. వణికించిన సౌతాఫ్రికా బౌలర్
ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లంతా సమకూడిన ఓ జట్టును సౌతాఫ్రికా వెటరన్ స్పిన్నర్ తబ్రేజ్ షంషి వణికించాడు. షంషి ధాటికి ఆ జట్టు పేకమేడలా కూలింది. ఇంతకీ ఏదా జట్టు.. ఎవరా ప్రమాదకర బ్యాటర్లు..?కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్ అనే ఓ జట్టు ఉంది. ఈ జట్టులో ప్రపంచ ప్రమాదకర బ్యాటర్లైన కొలిన్ మున్రో, అలెక్స్ హేల్స్, నికోలస్ పూరన్, కీరన్ పోలార్డ్, ఆండ్రీ రసెల్, సునీల్ నరైన్ లాంటి వారున్నారు.వీరంతా నిన్న సెయింట్ లూసియా కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బరిలోకి దిగారు. ఈ మ్యాచ్‌లో లూసియా కింగ్స్ టాస్ ఓడి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. తొలి బంతి నుంచే లూసియా కింగ్స్ బౌలర్లు హేమాహేమీలున్న నైట్‌రైడర్స్‌ను భయపెట్టడం మొదలుపెట్టారు.ఖారీ పియెర్, రోస్టన్ ఛేజ్, డెలానో పోట్గెటర్, అల్జరీ జోసఫ్, తబ్రేజ్ షంషి పోటీపడి వికెట్లు తీసి నైట్‌రైడర్స్‌ను మట్టుబెట్టారు. వీరిలో షంషి నైట్‌రైడర్స్ బ్యాటర్లను అధికంగా ఇబ్బందిపెట్టాడు. అతను 4 ఓవర్లలో కేవలం 12 పరుగులిచ్చి కీరన్ పోలార్డ్, అండ్రీ రసెల్, అకీల్ హోసేన్ లాంటి ప్రమాదకర బ్యాటర్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.మున్రోను పియెర్ర్.. హేల్స్, పూరన్‌ను ఛేజ్.. సునీల్ నరైన్‌ను పోట్గెటర్ పెవిలియన్‌కు పంపారు. లూసియా కింగ్స్ బౌలర్ల ధాటికి నైట్‌రైడర్స్ 18.1 ఓవర్లలో 109 పరుగులకే కుప్పకూలింది. 30 పరుగులు చేసిన పూరన్ నైట్‌రైడర్స్ తరఫున టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నాథన్ ఎడ్వర్డ్స్ (17), పోలార్డ్ (14), రసెల్ (12), డారెన్ బ్రావో (11) రెండంకెల స్కోర్లు చేశారు. మున్రో డకౌట్, అకీల్ హొసేన్ డకౌట్, హేల్స్ 9, టెర్రన్స్ హిండ్స్ 7, నరైన్, ఉస్మాన్ తారిక్ 4 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన లూసియా కింగ్స్.. టిమ్ సీఫర్ట్ (36), అకీమ్ అగస్టీ (28), రోస్టన్ ఛేజ్ (27 నాటౌట్), టిమ్ డేవిడ్ (1 నాటౌట్) చెలరగడంతో 11.1 ఓవర్లలోనే ఆడుతూపాడుతూ విజయతీరాలకు చేరింది. నైట్‌రైడర్స్ బౌలర్లలో నరైన్ 2, తారిక్ ఓ వికెట్ పడగొట్టారు. -
రిటైర్మెంట్ వెనక్కు తీసుకున్న సౌతాఫ్రికా మాజీ కెప్టెన్
సౌతాఫ్రికా మహిళల క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ డేన్ వాన్ నీకెర్క్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంది. ఈ మేరకు సోషల్‌మీడియా వేదికగా ప్రకటన చేసింది. ఈ ప్రకటనలో డేన్ ఇలా రాసుకొచ్చింది.రిటైర్మెంట్ ఉపసంహరణ నిర్ణయాన్ని ప్రకటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. నా దేశానికి ప్రాతినిధ్యం వహించడాన్ని చాలా మిస్ అయ్యాను. మరోసారి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించే అవకాశం వస్తే, నా సర్వస్వం ఇవ్వడానికి కట్టుబడి ఉన్నానంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది.కాగా, డేన్ 29 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అప్పట్లో అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. డేన్ 2023లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు గుడ్‌బై చెప్పింది. నాటి టీ20 ప్రపంచకప్ జట్టుకు ఎంపిక కాకపోవడంతో డేన్ అప్పట్లో తొందరపాటు నిర్ణయం తీసుకుంది.ఫిట్నెస్ లేకపోవడం, తరుచూ గాయాల బారిన పడుతుండటంతో సెలెక్టర్లు డేన్ను ఎంపిక చేయలేదు. దీంతో ఆమె మనస్తాపం చెంది అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించింది. డేన్ ఆకస్మిక రిటైర్మెంట్ తర్వాత సూన్ లస్ కెప్టెన్‌గా ఎంపికై, ప్రపంచకప్‌లో సౌతాఫ్రికాను ముందుండి నడిపించింది.ప్రస్తుతం 32వ పడిలో ఉన్న డేన్ సౌతాఫ్రికా తరఫున మొత్తం 194 మ్యాచ్‌లు (107 వన్డేలు, 86 టీ20లు, ఓ టెస్ట్) ఆడింది. ఇందులో 4074 పరుగులు చేసి, 204 వికెట్లు తీసింది. డేన్ సౌతాఫ్రికాకు 50 వన్డేల్లో, 30 టీ20ల్లో సారథ్యం వహించింది. ఇందులో 29 వన్డేలు, 15 టీ20ల్లో జట్టును విజయవంతంగా నడిపించింది.సౌతాఫ్రికా జట్టులో కీలక సభ్యురాలిగా ఉండిన డేన్ కోవిడ్ సమయంలో గాయాల బారిన పడి చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.2022 వన్డే ప్రపంచకప్ సమయంలో ఆమె మడమ గాయానికి గురై టోర్నీ మొత్తానికి దూరమైంది. అప్పటి నుంచి తరుచూ గాయాలతో ఇబ్బంది పడిన డేన్.. జట్టులో క్రమంగా ఉనికి కోల్పోయింది.ఇప్పుడు ఆమె రిటైర్మెంట్ విషయంలో తొందరపడ్డానని పశ్చాత్తాపడుతూ సెలెక్టర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. ఈ క్రమంలో సౌతాఫ్రికా సెలెక్టర్లకు క్షమాపణ కూడా చెప్పినట్లు తెలుస్తుంది. -
ఆర్సీబీ కోచ్ లేదంటే మెంటార్‌గా వస్తా: ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా క్రికెట్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB de Villiers)కు ఉన్న ఫ్యాన్‌ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఆ తర్వాత ఫ్రాంఛైజీ క్రికెట్‌తోనూ అభిమానులను అలరించాడు.ముఖ్యంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో ఈ మిస్టర్ 360 డిగ్రీ ప్లేయర్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్)తో తన ఐపీఎల్ ప్రయాణం ప్రారంభించిన డివిలియర్స్.. 2011లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB)లో చేరాడు. రిటైర్మెంట్ వరకు అదే జట్టుతో కొనసాగిన ఏబీడీకి ఆర్సీబీతో ప్రత్యేక అనుబంధం ఏర్పడింది. కోహ్లితో కలిసి సంబరాలుఐపీఎల్-2025 ఫైనల్లో ఆర్సీబీ గెలవగానే యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ విధ్వంసకర వీరుడు క్రిస్ గేల్‌తో కలిసి డివిలియర్స్ కూడా విరాట్ కోహ్లి (Virat Kohli)తో కలిసి సంబరాలు చేసుకున్నాడు. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన టైటిల్ పోరులో ఆర్సీబీకి మద్దతుగా వచ్చి.. ఆర్సీబీ పదిహేడేళ్ల సుదీర్ఘకల నెరవేరగానే డివిలియర్స్ కూడా భావోద్వేగానికి గురయ్యాడు.ఇక ఆర్సీబీ ఫ్యాన్స్ ఇప్పటికీ డివిలియర్స్ తమ జట్టులో భాగంగానే భావిస్తారు. అతడు తిరిగి వస్తే బాగుంటుందని సోషల్ మీడియా వేదికగా తమ అభిలాషను తెలుపుతూ ఉంటారు. ఇక ఇందుకు సమయం ఆసన్నమైనట్లే కనిపిస్తోంది. డివిలియర్స్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు.కోచ్ లేదంటే మెంటార్‌గా..అయితే, ఆటగాడిగా రీఎంట్రీ కాకుండా.. కోచ్ లేదంటే మెంటార్ పాత్రలో ఆర్సీబీలో చేరే అవకాశం ఉందని సంకేతాలు ఇచ్చాడు. ‘‘భవిష్యత్తులో నేను మళ్లీ ఐపీఎల్లో భాగమయ్యే అవకాశం ఉంది. అయితే, సీజన్ ఆసాంతం ప్రొఫెషనల్ విధులు నిర్వర్తించేందుకు నేను సిద్ధంగా లేను.మనసంతా ఆర్సీబీతోనేఆరోజులు ముగిసిపోయాయి. ఏదేమైనా నా మనసు ఎల్లప్పుడూ ఆర్సీబీతోనే ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ ఫ్రాంఛైజీ నాకు కోచ్ లేదా మెంటార్‌గా బాధ్యతలు అప్పగించాలని భావిస్తే.. అందుకు నేను సిద్ధంగా ఉన్నాను. భవిష్యత్తులో ఐపీఎల్లో పునరాగమనం చేస్తే కచ్చితంగా ఆర్సీబీతోనే ఉంటాను’’ అని డివిలియర్స్ వార్తా సంస్థ IANSతో పేర్కొన్నాడు.పరుగుల వీరుడుకాగా సౌతాఫ్రికా తరఫున 2004- 2018 వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడాడు డివిలియర్స్. తన కెరీర్లో 114 టెస్టులు, 228 వన్డేలు, 78 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆయా ఫార్మాట్లలో 8765, 9577, 1672 పరుగులు సాధించాడు.ఇక ఐపీఎల్లో 184 మ్యాచ్‌లు ఆడిన ఏబీ డివిలియర్స్ 5162 పరుగులు సాధించాడు. ఇందులో 40 హాఫ్ సెంచరీలు, మూడు సెంచరీలు ఉన్నాయి. 2021లో ఆర్సీబీ తరఫున కోల్‌కతా నైట్ రైడర్స్‌తో పోరులో డివిలియర్స్ చివరగా తన ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు.చదవండి: నేను ఎదుర్కొన్న కఠినమైన బౌలర్లు వారే: ఛతేశ్వర్ పుజారా -
కుప్పకూలిన సౌతాఫ్రికా.. చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించిన ఆస్ట్రేలియా
ఆస్ట్రేలియా జట్టు తమ వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ విజయం సాధించింది. ఇవాళ (ఆగస్ట్ 24) సౌతాఫ్రికాతో జరిగిన నామమాత్రపు వన్డేలో 276 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. పరుగుల పరంగా ఆసీస్‌కు అతి భారీ విజయం నెదర్లాండ్స్‌పై (2023 వన్డే వరల్డ్‌కప్‌లో 309 పరుగుల తేడాతో) దక్కింది.యాదృచ్చికంగా ఈ మ్యాచ్‌లో ఆసీస్ చేసిన స్కోర్ కూడా వారి వన్డే క్రికెట్ చరిత్రలో రెండో అతి భారీ స్కోర్‌గా నిలిచింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. వన్డేల్లో ఆసీస్ తమ అతి భారీ స్కోర్‌ను కూడా సౌతాఫ్రికాపైనే చేసింది. 2006లో జోహనెస్బర్గ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ 4 వికెట్ల నష్టానికి 434 పరుగులు చేసింది.సౌతాఫ్రికా విషయానికొస్తే.. ఆ జట్టుకు పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతి భారీ పరాజయంగా నిలిచింది. దీనికి ముందు 2023 వరల్డ్‌కప్‌లో భారత్ చేతిలో ఎదురైన 243 పరుగుల పరాజయం వారికి వన్డేల్లో అతి భారీ పరాజయంగా ఉండింది. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 432 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తూ 24.5 ఓవర్లలో 155 పరుగులకే కుప్పకూలింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూపర్ కన్నోలీ (5/22) అద్బుత ప్రదర్శనతో చెలరేగి సౌతాఫ్రికా పతనాన్ని శాశించాడు.మ్యాచ్ పూర్తి వివరాల్లోకి వెళితే.. 3 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా జరిగిన చివరి వన్డేలో ఆసీస్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. ట్రవిస్ హెడ్ (142), మిచెల్ మార్ష్ (100), గ్రీన్ (118 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కడంతో నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 431 పరుగులు చేసింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో అలెక్స్ క్యారీ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించాడు.అనంతరం కష్టసాధ్యమైన లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. కూపర్ కన్నోలీ (6-0-22-5), జేవియర్ బార్ట్లెట్ (6-0-45-2), సీన్ అబాట్ (4-0-27-2), ఆడమ్ జంపా (4.5-1-31-1) ధాటికి 155 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో డెవాల్డ్ బ్రెవిస్ (49) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో ఆసీస్ ఇదివరకే కోల్పోయిన సిరీస్‌లో సౌతాఫ్రికా ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. తొలి రెండు వన్డేల్లో సౌతాఫ్రికా గెలుపొందిన విషయం తెలిసిందే. కాగా, వన్డే సిరీస్‌కు ముందు ఇరు జట్ల మధ్య జరిగిన 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 1-2 తేడాతో కైవసం చేసుకుంది. -
విజృంభించిన ఎంగిడి.. ప్రపంచ ఛాంపియన్లను మట్టికరిపించిన సౌతాఫ్రికా
వన్డేల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా భారీ షాకిచ్చింది. ఆసీస్‌ను వారి సొంత ఇలాకాలో చిత్తుగా ఓడించింది. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియాపై సౌతాఫ్రికాకు ఇది వరుసగా ఐదో ద్వైపాక్షిక సిరీస్ విజయం. దీనికి ముందు 2016 (5-0), 2018 (2-1), 2019 (3-0), 2023 (3-2)లో కూడా సౌతాఫ్రికా ఆసీస్‌ను మట్టి కరిపించింది. ఆస్ట్రేలియాకు వరుసగా ఇది మూడో వన్డే సిరీస్ పరాజయం. సౌతాఫ్రికాకు ముందు ఆస్ట్రేలియా శ్రీలంక, పాకిస్తాన్ లాంటి చిన్న జట్ల చేతుల్లో కూడా సిరీస్ కోల్పోయింది.మెక్కే వేదికగా ఇవాళ (ఆగస్ట్ 22) జరిగిన రెండో వన్డేలో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాపై 84 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 49.1 ఓవర్లలో 277 పరుగులకు ఆలౌటైంది. మాథ్యూ బ్రీట్జ్కే (88), ట్రిస్టన్ స్టబ్స్ (74) అర్ద సెంచరీలతో రాణించారు. టోనీ డి జోర్జి (38), వియాన్ ముల్దర్ (26), కేశవ్ మహారాజ్ (22 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. రికెల్టన్ (8), మార్క్రమ్ (0), బ్రెవిస్ (1), ముత్తుసామి (4), బర్గర్ (8), ఎంగిడి (1) నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా 3, బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, లబూషేన్ తలో 2, హాజిల్‌వుడ్ ఓ వికెట్ పడగొట్టారు.అనంతరం 278 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. లుంగి ఎంగిడి (8.4-1-42-5) ధాటికి 37.4 ఓవర్లలో 193 పరుగులకే ఆలౌటైంది. ఎంగిడికి బర్గర్ (6-0-23-2), ముత్తుసామి (8-0-30-2), ముల్దర్ (5-0-31-1) కూడా జత కలవడంతో ఆసీస్ ఇన్నింగ్స్ పేకమేడలా కూలింది. మధ్యలో జోష్ ఇంగ్లిస్ (87) ఆసీస్‌ను ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే అతనికి ఒక్కరి నుంచి కూడా సహకారం లభించలేదు. ఇంగ్లిస్ మెరుపు ఇన్నింగ్స్‌తో అడ్డుతగలడంతో ఆసీస్ పతనం కాస్త లేట్ అయ్యింది. ఆ జట్టు తరఫున ఇంగ్లిస్‌తో పాటు కెమరూన్ గ్రీన్ (35) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. హెడ్ (6), మార్ష్ (18), లబూషేన్ (1), క్యారీ (13), హార్డీ (10), బార్ట్లెట్ (8), ఎల్లిస్ (3), జంపా (3) దారుణంగా నిరాశపరిచారు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలో కూడా ఆసీస్ ఇలాగే ఘోర పరాజయాన్ని చవి చూసింది. మిగిలిన నామమాత్రపు వన్డేలో అయిన ఆసీస్ రాణిస్తుందేమో చూడాలి. ఈ మ్యాచ్ ఆగస్ట్ 24న ఇదే వేదికగా జరునుంది. కాగా, ఈ వన్డే సిరీస్‌కు ముందు జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను ఆసీస్ 2-1 తేడాతో కైవసం చేసుకుంది. -
తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం.. సౌతాఫ్రికా ఆటగాడిపై ఫిర్యాదు
తొలి వన్డేలో ఆస్ట్రేలియాపై అద్భుత విజయం సాధించి జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు అరంగేట్రం స్పిన్నర్ ప్రేనేలన్ సుబ్రాయెన్ (Prenelan Subrayen) బౌలింగ్ యాక్షన్‌పై అనుమానాలు వ్యక్తమయ్యాయి. సుబ్రాయెన్ బౌలింగ్ శైలిపై మ్యాచ్ అఫీషియల్స్ ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కుడి చేతి వాటం రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ అయిన సుబ్రాయెన్ బౌలింగ్ శైలి కాస్త భిన్నంగా ఉంది. అతడి యాక్షన్ ఐసీసీ నియమాలకు విరుద్దమేమో అని మ్యాచ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు. దీంతో సుబ్రాయెన్ ఐసీసీ పర్యవేక్షణలో ఓ పరీక్షను (బౌలింగ్ శైలి) ఎదుర్కోవాల్సి ఉంది.సుబ్రాయెన్ ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పర్వాలేదనిపించాడు. తన కోటా 10 ఓవర్లలో 46 పరుగులిచ్చి అత్యంత కీలకమైన ట్రవిస్ హెడ్ వికెట్ తీశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆసీస్‌ను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయెన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం31 ఏళ్ల సుబ్రాయెన్ గత నెలలోనే టెస్ట్ అరంగేట్రం చేశాడు. జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో 4 వికెట్లు (ఒకే ఇన్నింగ్స్‌లో) తీసి పర్వాలేదనిపించాడు. సుబ్రాయెన్ లోయర్ ఆర్డర్లో ఉపయోగకరమైన బ్యాటర్ కూడా. అతడికి ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. లేట్‌గా అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇచ్చిన సుబ్రాయెన్ రెండో మ్యాచ్‌తోనే వివాదంలో చిక్కుకున్నాడు. బౌలింగ్ శైలిపై ఐసీసీ క్లీన్ చిట్ ఇస్తేనే అతడు ఆసీస్‌తో రెండో వన్డే ఆడగలడు. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
ఆసీస్ ప్లేయర్‌కు అక్షింతలు
ఆస్ట్రేలియా స్టార్ స్పిన్నర్ ఆడమ్ జంపాకు ఐసీసీ అక్షింతలు వేసింది. సౌతాఫ్రికాతో జరిగిన తొలి వన్డే సందర్భంగా అభ్యంతరకర భాష వాడినందుకు ఓ డీమెరిట్ పాయింట్ అతని ఖాతాలో చేర్చింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది లెవెల్-1 ఉల్లంఘన కిందికి వస్తుంది. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు ఒకటి లేదా రెండు డీమెరిట్ పాయింట్లతో పాటు 50 శాతం వరకు మ్యాచ్ ఫీజ్‌లో కోత విధిస్తారు. అయితే గడిచిన 24 నెలల్లో జంపాకు ఇది మొదటి తప్పిదం కావడంతో కేవలం ఓ డీమెరిట్ పాయింట్‌తో సరిపెట్టారు.ఏం జరిగిందంటే..?సౌతాఫ్రికా ఇన్నింగ్స్ 37వ ఓవర్ సందర్భంగా జంపా అభ్యంతరకర భాష వాడాడు. మిస్ ఫీల్డ్‌తో పాటు ఓవర్ త్రో చేయడంతో జంపా సహనం కోల్పోయి ఇలా ప్రవర్తించాడు. జంపా వాడిన భాష స్టంప్ మైక్‌ల్లో రికార్డైంది. దీని ఆధారంగా జంపాపై ఐసీసీ చర్యలు తీసుకుంది. ఈ శిక్షను స్వీకరించడంతో జంపాను తదుపరి విచారణ నుంచి మినహాయించారు.కాగా, సౌతాఫ్రికాతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేయగా.. ఛేదనలో చేతులెత్తేసిన ఆస్ట్రేలియా 40.5 ఓవర్లలో 198 పరుగులకే ఆలౌటైంది. సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ ఐదు వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు. అతనికి నండ్రే బర్గర్ (2/54), లుంగి ఎంగిడి (2/28), సుబ్రాయన్ (1/46) తోడయ్యారు.ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే రాణించాడు. ట్రవిస్ హెడ్ (27), బెన్ డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. అంతకుముందు మార్క్రమ్ (82), బవుమా (65), బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేసింది. ఆసీస్ బౌలర్లలో హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఈ మ్యాచ్‌లో ఆడమ్ జంపా (10-0-58-1) పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌గా కేశవ్ మహారాజ్.. పడిపోయిన కుల్దీప్ యాదవ్
ఐసీసీ ఇవాళ (ఆగస్ట్ 20) ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఓ ప్రధాన మార్పు చోటు చేసుకుంది. బౌలర్ల విభాగంలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ నంబర్ వన్ స్థానానికి ఎగబాకాడు. నిన్న ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సంచలన ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన మహారాజ్.. రెండు స్థానాలు మెరుగుపర్చుకుని అగ్రస్థానానికి చేరాడు. ఈ క్రమంలో శ్రీలంక స్పిన్నర్ మహీశ్ తీక్షణ, టీమిండియా చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్‌ను రెండు, మూడు స్థానాలకు నెట్టాడు. టీమిండియా నుంచి కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా టాప్-10లో(తొమ్మిదో స్థానం) ఉన్నాడు. భారత పేస్ త్రయం షమీ, బుమ్రా, సిరాజ్ వరుసగా 13, 14, 15 స్థానాల్లో ఉన్నారు.బ్యాటర్ల విభాగంలో టీమిండియా వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నంబర్ స్థానంలో కొనసాగుతుండగా.. బాబర్ ఆజమ్, డారిల్ మిచెల్ రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. భారత్ నుంచి గిల్‌తో పాటు శ్రేయస్ అయ్యర్ (6) టాప్ 10లో ఉన్నాడు. ఈ జాబితాలో టీమిండియా దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి పేర్లు కనిపించకపోవడం ఆశ్చర్యంగా ఉంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రోహిత్ రెండు.. విరాట్ నాలుగు స్థానాల్లో ఉన్నారు. ఆకస్మికంగా వారి పేర్లు ర్యాంకింగ్స్ నుంచి మాయమైపోవడానికి కారణాలు తెలియాల్సి ఉంది.ఆల్‌రౌండర్ల విభాగానికొస్తే.. ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు అజ్మతుల్లా ఒమర్జాయ్, మొహమ్మద్ నబీ టాప్-2లో కొనసాగుతుండగా.. భారత్ నుంచి రవీంద్ర జడేజా ఒక్కడే టాప్ 10లో (పదో స్థానం) ఉన్నాడు. మహారాజ్ మాయాజాలంమూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో నిన్న జరిగిన తొలి వన్డేలో సౌతాఫ్రికా స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అద్భుతమైన మాయాజాలాన్ని ప్రదర్శించాడు. 297 పరుగుల భారీ లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో 5 వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. ఫలితంగా ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో ఓడించి, సిరీస్‌లో ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ ప్రదర్శనతో మహారాజ్ పలు రికార్డులను కొల్లగొట్టాడు. తాజాగా ర్యాంకింగ్స్‌లో అగ్రపీఠాన్ని దక్కించుకున్నాడు. -
సిక్సర్‌తో ఆగమనం.. వన్డేల్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చిన డెవాల్డ్ బ్రెవిస్
సౌతాఫ్రికా చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ వన్డే క్రికెట్లోకి ఘనంగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఫార్మాట్లో తానెదుర్కొన్న తొలి బంతినే భారీ సిక్సర్‌గా మలిచి రికార్డుల్లోకెక్కాడు. వన్డేల్లో ఈ ఘనతను అతి కొద్ది మంది (2002 తర్వాత) మాత్రమే సాధించారు. బ్రెవిస్‌కు ముందు షమీమ్ హొస్సేన్ (బంగ్లాదేశ్), ఇషాన్ కిషన్ (భారత్), రిచర్డ్ నగరవ (జింబాబ్వే), క్రెయిగ్ వ్యాలెస్ (స్కాట్లాండ్), జవాద్ దావూద్ (కెనడా), జోహన్ లవ్ (సౌతాఫ్రికా) వన్డేల్లో తొలి బంతిని సిక్సర్‌గా మలిచారు. జోహన్ లవ్ తర్వాత ఈ ఘనత సాధించిన రెండో సౌతాఫ్రికా ఆటగాడిగా బ్రెవిస్ రికార్డు నెలకొల్పాడు.బాధాకరమేమిటంటే బ్రెవిస్ సిక్సర్ బాదిన మరుసటి బంతికే ఔటయ్యాడు. కెయిన్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో ఇది జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆరో స్థానంలో బరిలోకి దిగిన బ్రెవిస్ వేగంగా పరుగులు సాధించే క్రమంలో తొలి బంతికి సిక్సర్ కొట్టి, ఆతర్వాతి బంతికే ట్రవిస్ హెడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. మార్క్రమ్ (82), బవుమా (65), మాథ్యూ బ్రీట్జ్కే (57) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది.సెంచరీ.. ఓ హాఫ్ సెంచరీవన్డే సిరీస్‌కు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్‌లో బ్రెవిస్ విశ్వరూపం ప్రదర్శించాడు. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో ఓ సెంచరీ, ఓ హాఫ్ సెంచరీ సాధించాడు. దురదృష్టవశాత్తు ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా గెలవలేకపోయింది. 1-2 తేడాతో కోల్పోయింది. ఈ సిరీస్‌లో బ్రెవిస్ 180 పరుగులతో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. -
వన్డే క్రికెట్లో సరికొత్త సంచలనం.. రికార్డు స్కోర్లతో దూసుకుపోతున్న సౌతాఫ్రికా బ్యాటర్
వన్డే క్రికెట్‌కు సరికొత్త స్టార్ పరిచమయ్యాడు. అతడి పేరు మాథ్యూ బ్రీట్జ్కే (26). సౌతాఫ్రికాకు చెందిన ఈ కుడి చేతి వాటం వికెట్‌కీపర్ బ్యాటర్.. తన తొలి మూడు మ్యాచ్‌ల్లో అదిరిపోయే ప్రదర్శనలు చేసి ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేశాడు. అరంగేట్రం వన్డేలో న్యూజిలాండ్‌పై భారీ సెంచరీ (148 బంతుల్లో 150) చేసిన బ్రీట్జ్కే.. ఆతర్వాత వరుసగా రెండు వన్డేల్లో (పాకిస్తాన్, తాజాగా ఆస్ట్రేలియాపై) హాఫ్ సెంచరీలు (83, 57) బాదాడు. తద్వారా వన్డే క్రికెట్లో తొలి మూడు మ్యాచ్‌ల తర్వాత అత్యధిక స్కోర్ (290 పరుగులు) చేసిన బ్యాటర్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు ఇంగ్లండ్ మాజీ ఓపెనర్ నిక్ నైట్ పేరిట ఉండేది. నైట్ తన తొలి మూడు వన్డేల్లో 264 పరుగులు చేశాడు. ఈ విభాగంలో నైట్ తర్వాత స్థానంలో సౌతాఫ్రికాకే చెందిన టెంబా బవుమా (259) ఉన్నాడు.తొలి మూడు వన్డేల్లో 50కి పైగా స్కోర్లు చేయడంతో బ్రీట్జ్కే మరో రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. నవ్‌జోత్ సింగ్ సిద్దూ, మ్యాక్స్ ఓడౌడ్ తర్వాత చరిత్రలో ఈ ఘనత సాధించిన మూడో బ్యాటర్‌గా రికార్డుల్లోకెక్కాడు.బ్రీట్జ్కే ఇవాళ (ఆగస్ట్ 19) ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో 56 బంతుల్లో 7 ఫోర్లు, సిక్సర్ సాయంతో 57 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను 98 పరుగుల తేడాతో చిత్తు చేసింది.తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. బ్రీట్జ్కేతో పాటు మార్క్రమ్ (82), బవుమా (65) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. రికెల్టన్ (33), ముల్దర్ (31 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. ఆసీస్ బౌలర్లలో ట్రవిస్ హెడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. ఓ రనౌట్ కూడా చేశాడు.అనంతరం 297 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. కేశవ్ మహారాజ్ (10-1-33-5) ధాటికి 40.5 ఓవర్లలో 198 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ మిచెల్ మార్ష్ (88) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. హెడ్ (27), డ్వార్షుయిస్ (33) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. సౌతాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహారాజ్ ఐదేయగా.. నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి తలో 2, సుబ్రాయన్ ఓ వికెట్ తీశారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఆగస్ట్ 22న జరుగనుంది. -
చెలరేగిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. ఆసీస్ ముందు భారీ టార్గెట్
కైర్న్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో సౌతాఫ్రికా బ్యాటర్లు సమిష్టిగా కదం తొక్కారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 296 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ప్రోటీస్ ఓపెనర్లు ఐడైన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ తొలి వికెట్‌కు 92 పరుగుల ఘనమైన ఆరంభాన్ని అందించారు. రికెల్టన్(33) ఔటైన అనంతరం కెప్టెన్ టెంబా బావుమా(65), మార్క్రమ్(82) స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. అయితే బెన్ ద్వార్షుయిస్ మార్క్రమ్ను పెవిలియన్‌కు పంపడం ప్రోటీస్ స్కోర్ బోర్డు కాస్త నెమ్మదించింది.అయితే ఈ సమయంలో యువ ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే(57) దూకుడుగా ఆడుతూ ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగే ప్రయత్నం చేశాడు. ఆఖరిలో వియాన్ ముల్డర్(31) సైతం బ్యాట్ ఝూలిపించడంతో ఆసీస్ ముందు ఈ భారీ స్కోరర్‌ను సఫారీలు ఉంచగలిగారు. ఇక ఆసీస్ బౌలర్లలో పార్ట్ టైమ్ స్పిన్నర్ ట్రావిస్ హెడ్ నాలుగు వికెట్లు పడగొట్టగా.. బెన్ ద్వార్షుయిస్ రెండు, జంపా ఒక వికెట్ సాధించారు. మరో వికెట్ రనౌట్ రూపంలో లభించింది.తుది జట్లుఆస్ట్రేలియాట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మార్నస్ లబుషేన్, కామెరాన్ గ్రీన్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), అలెక్స్ కారీ, ఆరోన్ హార్డీ, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్వుడ్సౌతాఫ్రికాఐడెన్ మార్క్రమ్, ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), టెంబా బావుమా (కెప్టెన్), మాథ్యూ బ్రీట్జ్కే, ట్రిస్టన్ స్టబ్స్, డెవాల్డ్ బ్రీవిస్, వియాన్ ముల్డర్, కేశవ్ మహారాజ్, ప్రేనెలన్ సుబ్రాయెన్, నాండ్రే బర్గర్, లుంగి ఎంగిడి -
దిగ్గజ బౌలర్‌ను అధిగమించిన రబాడ
సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ తమ దేశానికే చెందిన దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను ఓ విషయంలో అధిగమించాడు. అన్ని ఫార్మాట్లలో (ఆస్ట్రేలియా వర్సెస్ సౌతాఫ్రికా మ్యాచ్‌ల్లో) ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో డొనాల్డ్‌ను వెనక్కు నెట్టి నాలుగో స్థానానికి ఎగబాకాడు.ఈ జాబితాలో షేన్ వార్న్ అగ్రస్థానంలో ఉన్నాడు. వార్న్ సౌతాఫ్రికాపై 69 మ్యాచ్‌ల్లో 190 వికెట్లు తీశాడు. వార్న్ తర్వాత టాప్-5 స్థానాల్లో డేల్ స్టెయిన్ (ఆసీస్‌పై 49 మ్యాచ్‌ల్లో 127 వికెట్లు), గ్లెన్ మెక్‌గ్రాత్ (సౌతాఫ్రికాపై 58 మ్యాచ్‌ల్లో 115 వికెట్లు), రబాడ (38 మ్యాచ్‌ల్లో 99 వికెట్లు), డొనాల్డ్ (44 మ్యాచ్‌ల్లో 98 వికెట్లు) ఉన్నారు.రబాడ ఈ ఘనతను ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో సాధించాడు. ఈ మ్యాచ్‌లో అతను 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. రబాడతో పాటు క్వేనా మపాకా (4-0-20-4) కూడా రాణించడంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది.టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు.అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ఈ గెలుపుతో ఆసీస్ 3 మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా.. చరిత్రలో తొలిసారి ఇలా..!
ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా నిన్న (ఆగస్ట్ 10) జరిగిన తొలి టీ20లో సౌతాఫ్రికా 17 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 20 ఓవరల్లో 178 పరుగులకు ఆలౌటైంది. పొట్టి క్రికెట్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఆలౌట్ చేయడం ఇదే తొలిసారి (26 టీ20ల్లో).ఈ మ్యాచ్‌లో మరిన్ని రికార్డులు కూడా నమోదయ్యాయి. ఈ గెలుపుతో ఆస్ట్రేలియా రికార్డు స్థాయిలో వరుసగా 9 టీ20 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. గతంలో ఆసీస్ వరుసగా ఇన్ని టీ20 మ్యాచ్‌ల్లో ఎప్పుడూ గెలవలేదు. ఈ సిరీస్‌కు ముందు ఆసీస్ వెస్టిండీస్‌ను వారి సొంతగడ్డపై 5-0 తేడాతో ఓడించింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు 13 సిక్సర్లు బాదారు. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఆస్ట్రేలియా (ఓ మ్యాచ్‌లో) బాదిన అత్యధిక సిక్సర్లు ఇవే. 2023లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ ఇన్నే సిక్సర్లు నమోదయ్యాయి.ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా యువ పేసర్ క్వేనా మపాకా ఓ ఆల్‌టైమ్ రికార్డును నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో 4 ఓవర్లలో 20 పరుగులిచ్చి 4 వికెట్లు తీసిన మపాకా టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో నాలుగు వికెట్ల ఘనత సాధించిన అత్యంత పిన్న వయస్కుడిగా (19 ఏళ్ల 318 రోజులు) రికార్డు సాధించాడు. అలాగే పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియాపై అత్యుత్తమ గణాంకాలు నమోదు చేసిన సౌతాఫ్రికా బౌలర్‌గా నిలిచాడు.మ్యాచ్ విషయానికొస్తే.. మపాకా (4-0-20-4), రబాడ (4-0-29-2) అద్భుతంగా బౌలింగ్ చేయడంతో ఆస్ట్రేలియా 178 పరుగులకు ఆలౌటైంది. వాస్తవానికి ఆసీస్ ఈ స్కోర్ కూడా సాధించలేకపోయేది. 75 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన దశలో టిమ్ డేవిడ్ మెరుపు ఇన్నింగ్స్ (52 బంతుల్లో 83; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) ఆడి ఆసీస్‌కు ఈ స్కోర్ అందించాడు. గ్రీన్ ఓ మోస్తరు ప్రదర్శన (13 బంతుల్లో 35; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) చేశాడు. వీరు మినహా ఆసీస్ ఇన్నింగ్స్‌లో అంతా విఫలమయ్యారు. మిచెల్ మార్ష్ 13, ట్రవిస్ హెడ్ 2, జోస్ ఇంగ్లిస్ 0, మిచెల్ ఓవెన్ 2, మ్యాక్స్‌వెల్ 1, డ్వార్షుయిస్ 17, ఎల్లిస్ 12, జంపా ఒక్క పరుగు చేశారు. ప్రొటీస్ బౌలర్లలో మపాకా, రబాడతో పాటు ఎంగిడి, లిండే, ముత్తాసామి వికెట్లు తీశారు (తలో వికెట్).అనంతరం సౌతాఫ్రికా లక్ష్య ఛేదనలో తడబడింది. హాజిల్‌వుడ్ (4-0-27-3), డ్వార్షుయిస్ (4-0-26-3), జంపా (4-0-33-2), మ్యాక్స్‌వెల్ (4-0-29-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సౌతాఫ్రికాను 161 పరుగులకే కట్టడి చేశారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో ఓపెనర్ రికెల్టన్ (55 బంతుల్లో 71; 7 ఫోర్లు, సిక్స్) ఒక్కడే రాణించాడు. ట్రిస్టన్ స్టబ్స్ (27 బంతుల్లో 37) ఓ మోస్తరు స్కోర్ చేశాడు. మిగతా బ్యాటర్లలో మార్క్రమ్ 12, ప్రిటోరియస్ 14, బ్రెవిస్ 2, లిండే 0, బాష్ 2, ముత్తుసామి 0, రబాడ 10, మపాకా 3 (నాటౌట్) పరుగులు చేశారు. ఈ సిరీస్‌లో రెండో టీ20 ఆగస్ట్ 12న జరుగనుంది. -
దక్షిణాఫ్రికా X ఆ్రస్టేలియా
డార్విన్ (ఆ్రస్టేలియా): వచ్చే ఏడాది జరగనున్న అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టి20 ప్రపంచకప్ కోసం ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా జట్లు ఇప్పటి నుంచే అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. 2026 ఫిబ్రవరిలో భారత్, శ్రీలంక వేదికగా టి20 వరల్డ్ కప్ జరగనుండగా... దానికి ముందు సన్నాహకంగా ఈ రెండు జట్ల మధ్య నేటి నుంచి మూడు మ్యాచ్‌ల టి20 సిరీస్ జరగనుంది. 2023 తర్వాత ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా మధ్య అంతర్జాతీయ టి20 మ్యాచ్ జరగలేదు. గతేడాది టీమిండియా చాంపియన్‌గా నిలిచిన వరల్డ్‌కప్‌లో ఆ్రస్టేలియా ఆకట్టుకోలేకపోగా... దక్షిణాఫ్రికా ఫైనల్లో ఓడింది. ఇరు జట్ల మధ్య ఇటీవల ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ జరగగా... అందులో దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఆ తర్వాత జింబాబ్వేలో పర్యటించిన సఫారీ జట్టు... ముక్కోణపు టి20 సిరీస్ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో పరాజయం పాలైంది. మరోవైపు ఆ్రస్టేలియా జట్టు వెస్టిండీస్ గడ్డపై 5–0తో టి20 సిరీస్ గెలుచుకుంది. ఆ సిరీస్‌కు అందుబాటులో లేని ట్రావిస్ హెడ్ తిరిగి ఆసీస్ జట్టులో చేరనుండగా... ఎయిడెన్ మార్క్రమ్, కగిసో రబాడ దక్షిణాఫ్రికా జట్టులో పునరాగమనం చేస్తున్నారు. ఆసీస్ ప్రధాన పేసర్లు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్ ఈ సిరీస్‌కు కూడా దూరంగా ఉండనుండగా... జోష్ హాజల్‌వుడ్ పేస్ భారాన్ని మోయనున్నాడు. 2008 తర్వాత డారి్వన్లో అంతర్జాతీయ మ్యాచ్ నిర్వహించనుండటం ఇదే తొలిసారి కాగా... మిచెల్ మార్ష్ ఓపెనర్‌గా బరిలోకి దిగనున్నాడు. ఇటీవల విండీస్‌తో సిరీస్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన మార్ష్.. హెడ్‌తో కలిసి వచ్చే ఏడాది వరల్డ్‌కప్‌లో ఇన్నింగ్స్ ప్రారంభించనున్నట్లు శనివారమే ప్రకటించాడు. ‘హెడ్‌తో కలిసి ఓపెనింగ్ చేస్తా. చాన్నాళ్లుగా మేం కలిసి ఆడుతున్నాం. మా మధ్య మంచి అనుబంధం ఉంది. టి20 వరల్డ్‌కప్‌లోనూ ఇదే కొనసాగుతుంది’అని మార్ష్ అన్నాడు. ఇన్‌గ్లిస్, కామెరూన్ గ్రీన్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మిచెల్ ఓవెన్‌తో ఆసీస్ బలంగా ఉంది. యువ ఆటగాడు డెవాల్డ్ బ్రేవిస్పై దక్షిణాఫ్రికా భారీ ఆశలు పెట్టుకుంది. మార్క్రమ్, రికెల్టన్, డసెన్, బ్రేవిస్, స్టబ్స్, లిండె, బాష్‌తో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ బలంగా ఉంది. రబాడ, బర్గర్, ఎంగిడి బౌలింగ్ బాధ్యతలు పంచుకోనున్నారు. -
39 బంతుల్లో శతక్కొట్టిన ఏబీడి.. ఆసీస్‌ను చిత్తు చేసిన సౌతాఫ్రికా
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో (WCL) సౌతాఫ్రికా లెజెండ్స్ వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 95 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. తద్వారా పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించారు. ఈ మ్యాచ్ ఫలితంతో సౌతాఫ్రికాతో పాటు పాకిస్తాన్, ఆస్ట్రేలియా కూడా సెమీస్‌కు అర్హత సాధించాయి. నాలుగో బెర్త్ కోసం వెస్టిండీస్, ఇంగ్లండ్, భారత్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి ప్రస్తుతం చివరి స్థానంలో ఉంది. పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. ఇవాళ రాత్రి భారత్ ఇంగ్లండ్‌తో తలపడుతుంది.డివిలియర్స్ మహొగ్రరూపంఆసీస్తో జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో అతి భారీ స్కోర్ చేసింది. ఏబీడి కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొని 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేశాడు.ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో సౌతాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా.. ఆరోన్ ఫాంగిసో (3.4-0-13-4), ఇమ్రాన్ తాహిర్ (4-0-27-3) చెలరేగడంతో 16.4 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఆసీస్ ఇన్నింగ్స్‌లో బెన్ కటింగ్ ఆఖర్లో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కటింగ్ 29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో అజేయమైన 59 పరుగులు చేశాడు.అంతకుముందు 41 బంతుల్లో..!WCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు. -
డివిలియర్స్ మహోగ్రరూపం.. మరో విధ్వంకసర శతకం.. ఈసారి 39 బంతుల్లోనే..!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్‌లో (WCL) సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. ఈ టోర్నీలో తొలి మ్యాచ్ నుంచే భీకర ఫామ్‌లో ఉన్న ఏబీడీ.. ఇవాళ (జులై 27) ఆస్ట్రేలియా లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మహోగ్రరూపం దాల్చాడు. కేవలం 39 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్‌లో మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ 15 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 123 పరుగులు చేసి ఔటయ్యాడు.AB DE VILLIERS MADNESS IN WCL - HUNDRED vs AUS & ENG..!!!- The GOAT 🐐 pic.twitter.com/qHDkZbUKod— Johns. (@CricCrazyJohns) July 27, 2025ఏబీడీతో పాటు మరో ఓపెనర్ జేజే స్మట్స్ కూడా సునామీ ఇన్నింగ్స్‌తో (53 బంతుల్లో 85; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విరుచుకుపడటంతో ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ చేసిన సౌతాఫ్రికా అతి భారీ స్కోర్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 241 పరుగులు చేసింది.ఏబీడీ-స్మట్స్ తొలి వికెట్‌కు 187 పరుగులు జోడించాక, సౌతాఫ్రికా స్వల్ప వ్యవధుల్లో వికెట్లు కోల్పోయింది. వీరి తర్వాత వచ్చిన బ్యాటర్లు జేపీ డుమిని (16), మోర్నీ వాన్ విక్ (3), హెన్రీ డేవిడ్స (1), వేన్ పార్నెల్ (1) పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడిల్ 3 వికెట్లు పడగొట్టగా.. బ్రెట్ లీ, స్టీవ్ ఓకీఫ్, డేనియల్ క్రిస్టియన్ తలో వికెట్ దక్కించుకున్నారు.మూడు రోజుల వ్యవధిలో రెండో శతకంWCL 2025లో ఏబీడీ తొలి మ్యాచ్ నుంచే అరివీర భయంకరమైన ఫామ్‌లో ఉన్నాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో 30 బంతుల్లో అజేయమైన 63 పరుగులు చేసిన అతను.. మూడు రోజుల కిందట ఇంగ్లండ్‌పై 41 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఆ మ్యాచ్‌లో మొత్తంగా 51 బంతులు ఎదుర్కొన్న ఏబీడీ అజేయమైన 116 పరుగులు చేశాడు.ఈ టోర్నీలో ఏబీడీ సూపర్ ఫామ్‌లో ఉండటంతో సౌతాఫ్రికా ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో పాకిస్తాన్ తర్వాత రెండో స్థానంలో ఉంది. ఈ టోర్నీలో భారత్ ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండు ఓడి చివరి స్థానంలో ఉంది. ఈ టోర్నీలో పాకిస్తాన్‌తో జరగాల్సిన మ్యాచ్‌ను భారత్ రద్దు చేసుకున్న విషయం తెలిసిందే. -
కివీస్‌దే ముక్కోణపు టోర్నీ
ముక్కోణపు టి20 టోర్నమెంట్ ట్రోఫీ దక్కించుకోవాలంటే దక్షిణాఫ్రికా జట్టుకు 18 బంతుల్లో 37 పరుగులుకావాలి. అలాంటి దశలో... డెవాల్డ్ బ్రేవిస్ మూడు సిక్స్‌లతో విజృంభించడంతో సఫారీ సమీకరణం 6 బంతుల్లో 7 పరుగులకు చేరింది. ఇంకేముంది దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటే... ఆఖర్లో కివీస్ బౌలర్ మ్యాట్ హెన్రీ అద్భుతం చేశాడు. జోరుమీదున్న బ్రేవిస్, హెన్రీలను అవుట్ చేసి న్యూజిలాండ్‌కు ట్రోపీ కట్టబెట్టాడు. దీంతో సఫారీలకు నిరాశ తప్పలేదు. హరారే: ముక్కోణపు టి20 టోర్నమెంట్లో న్యూజిలాండ్ విజేతగా నిలిచింది. శనివారం చివరి బంతి వరకు హోరాహోరీగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్ 3 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాపై విజయం సాధించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (31 బంతుల్లో 47; 6 ఫోర్లు, 1 సిక్స్), రచిన్ రవీంద్ర (27 బంతుల్లో 47; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు), టిమ్ సీఫెర్ట్ (30; 3 ఫోర్లు, 1 సిక్స్) రాణించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో ఎంగిడి 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం లక్ష్యఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 177 పరుగులకు పరిమితం అయింది. డ్రె ప్రిటోరియస్ (35 బంతుల్లో 51; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధశకతంతో రాణించగా... రీజా హెండ్రిక్స్ (37; 4 సిక్స్‌లు), డెవాల్డ్ బ్రేవిస్ (16 బంతుల్లో 31; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపులు మెరిపించారు. బంతి బంతికి సమీకరణాలు మారుతూ దక్షిణాఫ్రికా విజయం ఖాయమే అనుకుంటున్న సమయంలో హెన్రీ అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. అప్పటి వరకు ధాటిగా ఆడిన సఫారీ బ్యాటర్లు ఆఖర్లో ఒత్తిడికి చిత్తై ట్రోఫీని కివీస్‌కు కట్టబెట్టారు. జింబాబ్వే, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగిన ఈ టోర్నీలో న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లోనూ ఓడిపోకుండా ట్రోఫీ కైవసం చేసుకుంది. మ్యాట్ హెన్రీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు దక్కాయి. -
ఆస్ట్రేలియా పర్యటనకు సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. డబ్ల్యూటీసీ హీరోల ఎంట్రీ
ఆగస్ట్‌లో ఆస్ట్రేలియాతో జరుగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం సౌతాఫ్రికా జట్టును ఇవాళ (జులై 24) ప్రకటించారు. ఆస్ట్రేలియాలో జరిగే ఈ సిరీస్‌లతో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్స్ హీరోలు బవుమా, మార్క్రమ్ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వన్డే జట్టుకు టెంబా బవుమా, టీ20 జట్టుకు ఎయిడెన్ మార్క్రమ్ సారథ్యం వహించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత బవుమా గాయం కారణంగా జట్టుకు దూరం కాగా.. మార్క్రమ్ మరికొందరు సీనియర్లతో పాటు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ మధ్యలో సౌతాఫ్రికా జింబాబ్వేతో 2 టెస్ట్‌లు, ప్రస్తుతం ముక్కోణపు సిరీస్ (జింబాబ్వే, న్యూజిలాండ్) ఆడుతుంది.ఇటీవలే టెస్ట్ అరంగేట్రం చేసిన ఆఫ్ స్పిన్నర్ ప్రెనెలన్ సుబ్రాయెన్ సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్టులో తొలిసారి స్థానం సంపాదించాడు. అలాగే హార్డ్ హిట్టర్ లుహాన్ డ్రి ప్రిటోరియస్ కూడా తొలిసారి వన్డే జట్టులో చోటు సాధించాడు. జింబాబ్వే సిరీస్‌తో టెస్ట్ అరంగేట్రం చేసిన విధ్వంసకర ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ టీ20, వన్డే జట్లలో చోటు దక్కించుకున్నాడు.సీనియర్లు మార్క్రమ్, ర్యాన్ రికెట్లన్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, నండ్రే బర్గర్, లుంగి ఎంగిడి, కగిసో రబాడ కూడా రెండు జట్లలో చోటు దక్కించుకున్నారు. ఆసీస్‌తో సిరీస్ ఆగస్ట్ 10న మొదలుకానుంది. 10, 12, 16 తేదీల్లో టీ20లు.. 19, 22, 24 తేదీల్లో వన్డేలు జరుగనున్నాయి.ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా టీ20 జట్టు: ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురాన్ ముత్తుసామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబడా, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్, రస్సీ వాన్‌డర్ డస్సెన్ఆస్ట్రేలియా సిరీస్‌కు దక్షిణాఫ్రికా వన్డే జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), కార్బిన్ బాష్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, టోనీ డి జోర్జి, ఎయిడెన్ మార్క్రమ్, సెనురన్ ముత్తుసామి, కేశవ్ మహరాజ్, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్ డ్రి ప్రిటోరియస్, కగిసో రబాడ, ర్యాన్ రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్, ప్రెనెలన్ సుబ్రాయెన్ -
టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్
జింబాబ్వే ట్రై సిరీస్‌లో భాగంగా ఇవాళ (జులై 22) జరిగిన ఐదో మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై న్యూజిలాండ్ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన న్యూజిలాండ్ సౌతాఫ్రికాను 134 పరుగులకే (20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి) పరిమితం చేసింది. జేకబ్ డఫీ, ఆడమ్ మిల్నే, మిచెల్ సాంట్నర్ తలో 2, విలియమ్ ఓరూర్కీ ఓ వికెట్ తీసి సౌతాఫ్రికాను దెబ్బకొట్టారు. సౌతాఫ్రికా బ్యాటర్లలో రీజా హెండ్రిక్స్ (41) ఒక్కడే ఓ మోస్తరు స్కోర్ చేయగా.. ఆఖర్లో జార్జ్ లిండే (23 నాటౌట్) గౌరవప్రదమైన స్కోర్ కోసం పోరాడాడు. కెప్టెన్ డస్సెన్ 14, రూబిన్ హెర్మన్ 10, డెవాల్డ్ బ్రెవిస్ 13, డ్రి ప్రిటోరియస్ 1, సైమ్‌లేన్ 11, కొయెట్జీ 0, ముత్తుసామి 8, ఎన్ పీటర్ 7 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన న్యూజిలాండ్.. టిమ్ సీఫర్ట్ విధ్వంసకర హాఫ్ సెంచరీతో (48 బంతుల్లో 66 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) విజృంభించడంతో 15.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో డెవాన్ కాన్వే (19), రచిన్ రవీంద్ర (3), మార్క్ చాప్మన్ (10) తక్కువ స్కోర్లకే ఔటైనా.. డారిల్ మిచెల్ (20 నాటౌట్) సహకారంతో సీఫర్ట్ న్యూజిలాండ్‌ను గెలిపించాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ముత్తుసామి 2 వికెట్లతో పర్వాలేదనిపించగా.. సైమ్‌లేన్ ఓ వికెట్ పడగొట్టాడు.కాగా, ఈ ముక్కోణపు సిరీస్‌లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ జట్లు ఇదివరకే ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ఆతిథ్య జట్టు జింబాబ్వే టోర్నీ నుంచి నిష్క్రమించింది. 24న జరుగబోయే నామమాత్రపు మ్యాచ్‌లో జింబాబ్వే న్యూజిలాండ్‌తో తలపడనుంది. జులై 26న హరారేలో జరిగే ఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా అమీతుమీ తేల్చుకుంటాయి. -
2007 వరల్డ్ కప్ సీన్ రిపీట్.. బౌల్ అవుట్లో గెలిచిన సౌతాఫ్రికా
2007 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మధ్య జరిగిన బౌల్-అవుట్ సగటు క్రికెట్ అభిమాని ఎప్పటికి మర్చిపోలేడు. టై అయిన మ్యాచ్‌లో బౌల్-అవుట్ నియమం ద్వారా భారత్ విజయం సాధించింది. ఇప్పడు అచ్చెం అటువంటి సీన్ వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో రిపీటైంది.ఈ టోర్నీలో భాగంగా శనివారం వెస్టిండీస్ ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బౌల్ అవుట్ ద్వారా దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ను 11 ఓవర్లకు కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 79 పరుగులు చేసింది.విండీస్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్రిస్ గేల్(2), పొలార్డ్(0) వంటి స్టార్ ప్లేయర్లు నిరాశపరచగా.. లెండల్ సిమ్మన్స్(28) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. సఫారీ బౌలర్లలో ఫంగిసో రెండు, విల్జోయెన్, స్మట్స్, ఓలీవర్ తలా వికెట్ సాధించారు. అనంతరం సౌతాఫ్రికా లక్ష్యాన్ని డక్‌వర్త్ లూయిస్ పద్దతి ప్రకారం 81 పరుగులగా నిర్ణయించారు.లక్ష్యాన్ని చేధించే క్రమంలో సౌతాఫ్రికా లెజెండ్స్ నిర్ణీత ఓవర్లలో 80 పరుగులే చేయగల్గింది. దీంతో మ్యాచ్ టై అయింది. ఈ క్రమంలో ఫలితాన్ని తేల్చేందుకు అంపైర్లు బౌల్ అవుట్ విధానాన్ని ఎంచుకున్నారు. సౌతాఫ్రికా ఆరు బంతుల్లో రెండు బౌల్డ్‌లు చేయగా.. విండీస్ ఒక్క బౌల్డ్ కూడా చేయలేకపోయింది.దీంతో సౌతాఫ్రికా విజేతగా నిలిచింది. కాగా ఛాన్నాళ్ల తర్వాత ప్రొపిషనల్ క్రికెట్ ఆడిన సఫారీ దిగ్గజం ఎబీ డివిలియర్స్ కేవలం 3 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు.Bowl-Out Decides SA vs WI Thriller 🍿You can't write this drama! After the match ended in a tie, South Africa Champions edge out the Windies Champions 2-0 in a tense bowl-out 🎯#WCL2025 pic.twitter.com/lemLX9R0Ac— FanCode (@FanCode) July 19, 2025 -
డెవాల్డ్ బ్రెవిస్ విధ్వంసం.. సిక్సర్లతో విరుచుకుపడిన సీఎస్కే స్టార్
జింబాబ్వేలో జరుగుతున్న ముక్కోణపు టీ20 సిరీస్‌లో సౌతాఫ్రికా ఘనంగా బోణీ కొట్టింది. నిన్న (జులై 14) హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన టోర్నీ ఓపెనర్‌లో సౌతాఫ్రికా ఆతిథ్య జింబాబ్వేపై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 141 పరుగులు మాత్రమే చేయగలిగింది. జార్జ్ లిండే (3-0-10-3), లుంగి ఎంగిడి (4-1-15-1), నండ్రే బర్గర్ (4-0-22-1), ఎన్ పీటర్ (3-0-22-1), కార్బిన్ బాష్ (4-0-36-0) పొదుపుగా బౌలింగ్ చేయడమే కాకుండా వరుస విరామాల్లో వికెట్లు తీసి జింబాబ్వేను తక్కువ స్కోర్‌కే పరిమితం చేశారు. 5 SIXES BY DEWALD BREVIS IN HIS RETURN TO T20I. 🤯🔥 pic.twitter.com/avZKMovpRj— Johns. (@CricCrazyJohns) July 14, 2025జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సికందర్ రజా (38 బంతుల్లో 54; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే అజేయ అర్ద సెంచరీతో రాణించాడు. రజాతో పాటు బ్రియాన్ బెన్నెట్ (30), ర్యాన్ బర్ల్ (29) రెండంకెల స్కోర్లు చేశారు. మదెవెరె 1, క్లైవ్ మదండే 8, తషింగ ముసేకివ 9, మున్యోంగ 0, మసకద్జ 1 (నాటౌట్) పరుగుకు పరిమితమయ్యారు.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. తొలి బంతికే చిచ్చరపిడుగు లుహాన్ డ్రి ప్రిటోరియస్ డకౌటైనా, రుబిన్ హెర్మన్ (37 బంతుల్లో 45; 5 ఫోర్లు, సిక్స్), డెవాల్డ్ బ్రెవిస్ (17 బంతుల్లో 41; ఫోర్, 5 సిక్సర్లు) సౌతాఫ్రికా విజయానికి పునాది వేశారు. కార్బిన్ బాష్ (23 నాటౌట్) మ్యాచ్‌ను లాంఛనంగా ముగించాడు. అతనికి జార్జ్ లిండే (3 నాటౌట్) సహకరించాడు. సౌతాఫ్రికా 15.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. 5 సిక్సర్లతో విధ్వంసం సృష్టించిన బ్రెవిస్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా తరఫున అతనికి ఇదే తొలి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో రీజా హెండ్రిక్స్ (11), కెప్టెన్ డస్సెన్ (16) తక్కువ స్కోర్లకే ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో రిచర్డ్ నగరవ 3, ట్రెవర్ గ్వాండు 2 వికెట్లు తీశారు. ఈ టోర్నీలో జింబాబ్వే, సౌతాఫ్రికా సహా న్యూజిలాండ్ కూడా పాల్గొంటుంది. తదుపరి మ్యాచ్ రేపు సాయంత్రం 4:30 గంటలకు సౌతాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య హరారే వేదికగా జరుగనుంది. -
యూఎస్ ఎయిడ్ కోత.. దక్షిణాఫ్రికాలో నిలిచిన హెచ్ఐవీ టీకా ట్రయల్స్
జొహన్నెస్‌బర్గ్: డొనాల్డ్ ట్రంప్ సారథ్యంలోని అమెరికా ప్రభుత్వం యూఎస్ ఎయిడ్ (యూఎస్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెలవప్ మెంట్) నిధులను పూర్తిగా నిలిపివేసింది. ఇందుకు సంబంధించిన యంత్రాంగాన్ని పూర్తిగా తొలగించింది. ఈ చర్య ప్రపంచ వ్యాప్తంగా ‘యూఎస్ ఎయిడ్’సాయం అందుకునే పలు దేశాలతోపాటు వివిధ కీలకమైన సంస్థలపైనా పడింది. ముఖ్యంగా మానవ చరిత్రలోనే అత్యంత ప్రమాదకరమైన హెచ్ఐవీకి విరుగుడును తీసుకువచ్చే ప్రయత్నాలకు ట్రంప్ చర్య ఆఖరి క్షణంలో అడ్డుకట్ట వేసింది. దక్షిణాఫ్రికాలో బ్రిలియంట్ కార్యక్రమంలో భాగంగా హెచ్ఐవీ టీకా ‘లెనకపవిర్’ను రూపొందించారు. దీనికి అమెరికా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఆమోదముద్ర వేసింది. మరో వారం రోజుల్లో దక్షిణాఫ్రికాలోని యువతపై టీకా క్లినికల్ ట్రయల్స్ చేపట్టేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ సమయంలో పిడుగులాంటి వార్త వారికి అందింది. అదే యూఎస్ ఎయిడ్ నిలిపివేత. దీంతో, ఈ కార్యక్రమం కింద పనిచేస్తున్న దాదాపు 100 మంది పరిశోధకులు హతాశులయ్యారు. నిధుల్లేకుండా వారు ముందుకు సాగేందుకు ఏమాత్రం అవకాశాల్లేవు. దక్షిణాఫ్రికా ప్రభుత్వాన్ని సాయం కోరినా ఫలితం కనిపించలేదు. ఇప్పుడిక అన్ని కార్యక్రమాలను నిలిపివేయడం మినహా గత్యంతరం లేదని వారంటున్నారు. బ్రిలియంట్ కార్యక్రమం చీఫ్ గ్లెండా గ్రె..‘హెచ్ఐవీకి విరుగుడు కనుగొనడంలో ఆఫ్రికా ఖండం చాలా కీలకమైంది.హెచ్ఐవీని అరికట్టేందుకు లెనకపవిర్ టీకాను ఏడాదిలో రెండు సార్లు ఇస్తే సరిపోతుంది. ప్రపంచంలోనే ఇలాంటి మొట్టమొదటి వ్యాక్సిన్ ఇది. అవకాశమిస్తే ట్రయల్స్‌ను ప్రపంచంలోనే అందరికంటే చౌకగా, సమర్థంగా, వేగవంతంగా పూర్తి చేయగలం’అని ఆమె అన్నారు. గతంలో కోవిడ్ మహమ్మారి సమయంలో నోవావ్యాక్స్ టీకా తయారీలో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు కీలకంగా ఉన్నారని ఆమె గుర్తు చేశారు. అమెరికా నిర్ణయం ఫలితంగా సుమారు 8 వేల మంది ఆరోగ్య కార్యకర్తలు ఉద్యోగాలు కోల్పోయారు. శ్వేత వర్ణం వారిని వేధిస్తున్నామంటూ అమెరికా ప్రభుత్వం తమపై అనవసర ఆరోపణలు మోపి ఎంతో కీలకమైన ఆరోగ్యరంగానికి నిధులను ఆపేయడం అన్యాయమని దక్షిణాఫ్రికా ప్రభుత్వం వాపోతోంది. -
సౌతాఫ్రికా టీ20 లీగ్ షెడ్యూల్ విడుదల
సౌతాఫ్రికా టీ20 లీగ్ నాలుగో ఎడిషన్ (2025-26) షెడ్యూల్‌ను క్రికెట్ సౌతాఫ్రికా (CSA) బుధవారం విడుదల చేసింది. తొలిసారి ఈ లీగ్ జనవరి, ఫిబ్రవరి నెలల్లో కాకుండా డిసెంబర్లో మొదలవుతుంది. ఈ లీగ్ డిసెంబర్ 26 నుంచి వచ్చే ఏడాది జనవరి 25 మధ్యలో జరుగనుంది. తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఎంఐ కేప్‌టౌన్ డర్బన్ సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. గత సీజన్ ఫైనలిస్ట్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ పార్ల్ రాయల్స్‌తో పోటీతో సీజన్‌ను ఆరంభిస్తుంది. ఈ మ్యాచ్ డిసెంబర్ 27న జరుగనుంది.🚨 HERE IS THE FULL SCHEDULE OF SA20 2025-26 🚨 pic.twitter.com/tbEIPOMHVk— Johns. (@CricCrazyJohns) July 9, 2025డిసెంబర్లో ఎందుకు..?గత మూడు సీజన్లలో జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగిన సౌతాఫ్రికా టీ20 లీగ్ తదుపరి సీజన్లో మాత్రం డిసెంబర్లో ప్రారంభం కానుంది. దీని వెనుక బలమైన కారణం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సౌతాఫ్రికాలో టీ20 వరల్డ్‌కప్ జరునుంది. ఆటగాళ్లకు తగినంత విశ్రాంతి ఇవ్వడం కోసం క్రికెట్ సౌతాఫ్రికా తమ టీ20 లీగ్‌ను ముందుకు జరిపింది. ఐదో సీజన్ నుంచి లీగ్ మళ్లీ జనవరి, ఫిబ్రవరి నెలల్లో మారుతుందని సీఎస్ఏ కమీషనర్ గ్రేమీ స్మిత్ తెలిపారు.బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్సౌతాఫ్రికా టీ20 లీగ్ డిసెంబర్‌కు ప్రీ పోన్ కావడంతో ఆసీస్‌లో జరిగే బిగ్‌బాష్ లీగ్‌తో క్లాష్ కానుంది. ఆ లీగ్ కూడా డిసెంబర్లోనే ప్రారంభమవుతుంది. బీబీఎల్ 2025-26 డిసెంబర్ 14న మొదలై వచ్చే ఏడాది జనవరి 25 వరకు సాగుతుంది.ఛాంపియన్స్ లీగ్ పునఃప్రారంభం..?2014 తర్వాత వివిధ కారణాల వల్ల ఆగిపోయిన ఛాంపియన్స లీగ్ 2026లో తిరిగి ప్రారంభమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ లీగ్‌లో అన్ని దేశవాలీ లీగ్‌ల్లో అత్యుత్తమ ప్రదర్శనలు (విన్నిర్) చేసిన జట్లు పోటీపడతాయి. సౌతాఫ్రికా టీ20 లీగ్ నుంచి కూడా ఓ జట్టు పోటీ పడే అవకాశం ఉంది. పేరు మార్పు.. వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ఈ సారి ఛాంపియన్స్ లీగ్ పేరు కూడా మారనుందని తెలుస్తుంది. బీసీసీఐ, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు సంయుక్తంగా నిర్వహించతలపెట్టిన ఈ లీగ్‌కు వరల్డ్ క్లబ్ ఛాంపియన్షిప్ అని నామకరణం చేయనున్నట్లు సమాచారం. ఈ లీగ్‌లో మొత్తం ఆరు జట్లు పాల్గొనే అవకాశం ఉంది. ఐపీఎల్, బిగ్‌బాష్ లీగ్, హండ్రెడ్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్, సౌతాఫ్రికా టీ20 లీగ్, పాకిస్తాన్ సూపర్ లీగ్‌ల్లో ఛాంపియన్లు ఈ లీగ్‌లో పాల్గొంటారని సమాచారం. -
అందుకే లారా క్వాడ్రపుల్ సెంచరీ (400) రికార్డును బద్దలు కొట్టలేదు: వియాన్ ముల్దర్
జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (367) చెలరేగాడు. ఈ ట్రిపుల్‌తో ముల్దర్ చాలా రికార్డులను బద్దలు కొట్టాడు.విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా..సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా..టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.ఈ రికార్డులన్నీ పక్కన పెడితే ముల్దర్ ఓ చారిత్రక రికార్డును బద్దలు కొట్టే సువర్ణావకాశాన్ని వదిలేసి వార్తల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే అవకాశాన్ని ముల్దర్ చేజేతులారా జారవిడిచాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా మాత్రమే క్వాడ్రపుల్ సెంచరీ చేశాడు.మ్యాచ్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలనం నిర్ణయం తీసుకున్నాడు. ఈ నిర్ణయం యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి అవకాశం రాదు. అలాంటిది ముల్దర్ ఈ అవకాశాన్ని వదిలేసి చారిత్రక తప్పిదం చేశాడు. ఈ ఇన్నింగ్స్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసి సంచలన నిర్ణయం తీసకున్నాడు.తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. అత్యంత అరుదుగా వచ్చే అవకాశాన్ని కాదనుకొని ముల్దర్ చాలా పెద్ద తప్పిదం చేశాడని వాపోతున్నారు. ప్రస్తుత జమానాలో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని అభిప్రాయపడుతున్నారు.ఈ ఇన్నింగ్స్ అనంతరం వియాన్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడంపై స్పందించాడు. లారా ఓ దిగ్గజం. అలాంటి ఆటగాడి పేరు మీదనే క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు ఉండాలి. ఆ రికార్డును నిలబెట్టుకోవడానికి అతను అర్హుడు. నాకు మళ్లీ క్వాడ్రపుల్ సెంచరీ చేసే అవకాశం వచ్చినా ఇలాగే చేస్తాను. ఈ విషయాన్ని షుక్రీ కాన్రడ్తో (దక్షిణాఫ్రికా హెడ్ కోచ్) చెప్పాను. అతను కూడా నా అభిప్రాయంతో ఏకీభవించాడు. లంచ్ విరామం తర్వాత ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడానికి మరో కారణం కూడా ఉంది. మ్యాచ్ గెలవడానికి సరిపడా స్కోర్ చేశామని భావించాను. ఈ రెండు కారణాల చేత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసినట్లు చెప్పుకొచ్చాడు.MULDER TALKS ABOUT HIS DECLARATION:"Lara's Record is exactly where it Should be". pic.twitter.com/PWwKGlvoL6— Johns. (@CricCrazyJohns) July 7, 2025ముల్దర్ కామెంట్స్ విన్న తర్వాత యావత్ క్రికెట్ ప్రపంచం అతనికి సెల్యూట్ కొట్టింది. దిగ్గజాలను గౌరవించే సంస్కారవంతమైన క్రికెటర్ అంటూ జేజేలు పలికింది. లారా క్వాడ్రపుల్ రికార్డును త్యాగం చేసి చిరకాలం తన పేరును స్మరించుకునేలా చేశాడని కామెంట్లు చేస్తుంది. నిస్వార్థ నాయకుడు, గొప్ప ఆటగాడని కీర్తిస్తుంది. వ్యక్తిగత రికార్డులు కాకుండా జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చూడలేమని జేజేలు పలుకుతుంది.వియాన్ లారా క్వాడ్రపుల్ సెంచరీ రికార్డు కాదనుకున్నా టెస్ట్‌ల్లో ఐదో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ముల్దర్ అజేయ ట్రిపుల్ సెంచరీతో (334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు) చెలరేగడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30, వెర్రిన్ 42 (నాటౌట్) పరుగులు చేశాడు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అనంతరం సౌతాఫ్రికా బౌలర్లు కూడా రెచ్చిపోవడంతో జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 170 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా ఫాలో ఆన్ ఆడుతుంది. జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌ను సుబ్రాయన్ (10-1-42-4), కోడి యూసఫ్ (7-1-20-2), కార్బిన్ బాష్ (7-1-27-1), ముత్తస్వామి (13-2-59-1) కుప్పకూల్చారు. అజేయ ట్రిపుల్‌తో రికార్డులను తిరగరాసిన ముల్దర్ బౌలింగ్‌లోనూ రాణించాడు. 6 ఓవర్లలో 20 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో సీన్ విలియమ్స్ (83 నాటౌట్) ఒక్కడే అర్ద సెంచరీతో రాణించాడు. ఫాలో ఆన్ ఆడుతూ జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడింది. 31 పరుగుల వద్ద ఆ జట్టు తొలి వికెట్ కోల్పోయింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే స్కోర్ 51/1గా ఉంది. కైటానో (34), నిక్ వెల్చ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఇన్నింగ్స్ పరాజయాన్ని తప్పించుకోవాలంటే మరో 405 పరుగులు చేయాలి. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని వదిలేసిన సౌతాఫ్రికా కెప్టెన్
సౌతాఫ్రికా తాత్కాలిక కెప్టెన్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో అత్యంత అరుదైన క్వాడ్రపుల్ సెంచరీ (400) చేసే సువర్ణావకాశాన్ని జట్టు ప్రయోజనాల కోసం తృణప్రాయంగా వదిలేశాడు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ రెండో రోజు తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసి, క్వాడ్రపుల్ సెంచరీకి 33 పరుగుల దూరంలో (367 నాటౌట్) ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ముల్దర్ తీసుకున్న ఈ అత్యంత సాహసోపేత నిర్ణయానికి యావత్ క్రికెట్ ప్రపంచం ఆశ్చర్యానికి గురైంది.టెస్ట్ క్రికెట్లో ఎప్పుడో కాని ఇలాంటి సువర్ణావకాశం రాదు. ముల్దర్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే అవకాశాన్ని చేజేతులారా జారవిడిచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ ఉన్న ఫామ్‌ను బట్టి చూస్తే మరో 20 బంతుల్లో ఈజీగా క్వాడ్రపుల్ సెంచరీ పూర్తయ్యేది. అయితే అతను అనూహ్యంగా లంచ్ విరామం తర్వాత తిరిగి బరిలోకి దిగకుండా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. తగినంత సమయం, అవకాశం ఉండి కూడా ముల్దర్ క్వాడ్రపుల్ సెంచరీని కాదనుకోవడాన్ని సగటు క్రికెట్ అభిమాని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ జమానా టెస్ట్ క్రికెట్లో ఇలాంటి అవకాశం బహుశా ఎవరికీ రాకపోవచ్చని బాధపడుతున్నారు. ఆటలో వేగం పెరిగిపోవడంతో డబుల్ సెంచరీలు చేయడమే ఎక్కువని క్రికెటర్లు భావిస్తున్నారు.ఏది ఏమైనా ముల్దర్ చేసిన పనికి విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులచే కీర్తించబడుతున్నాడు. నిస్వార్థ నాయకుడని జేజేలందుకుంటున్నాడు. జట్టు ప్రయోజనాలే ముఖ్యమనుకునే ఇలాంటి నాయకుడిని చరిత్రలో చూడలేమని సోషల్‌మీడియా వేదికగా కామెంట్లు పెడుతున్నారు.టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఒకే ఒక్కరు క్వాడ్రపుల్ సెంచరీ చేశారు. 2004లో విండీస్ దిగ్గజం బ్రియాన్ లారా ఇంగ్లండ్‌పై ఈ ఘనత సాధించాడు. టెస్ట్‌ల్లో అత్యధిక పరగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో లారా (400 నాటౌట్), మాథ్యూ హేడెన్ (380), బ్రియాన్ లారా (375), మహేళ జయవర్దనే (374) మాత్రమే ముల్దర్ కంటే ముందున్నారు. క్వాడ్రపుల్ మిస్ చేసుకున్నప్పటికీ ముల్దర్ మరో ఘనత సాధించాడు. విదేశీ గడ్డపై అత్యధిక టెస్ట్ స్కోర్ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. అలాగే సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. గతంలో ఈ రికార్డు గ్రేమ్ స్మిత్ పేరిట ఉండేది. స్మిత్ 2003లో ఓ టెస్ట్ మ్యాచ్‌లో 362 పరుగులు (277 & 85) చేశాడు.దీనితో పాటు ముల్దర్ మరిన్ని రికార్డులు కూడా సాధించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సెకెండ్ ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ (297 బంతుల్లో) చేసిన ఆటగాడిగా (టెస్ట్‌ల్లో ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీ రికార్డు వీరేంద్ర సెహ్వాగ్ (278 బంతుల్లో) పేరిట ఉంది).. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా.. టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా పలు రికార్డులు సొంతం చేసుకున్నాడు.విదేశీ టెస్టుల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్లు..367* - వియాన్ ముల్డర్ (SA) vs ZIM, బులవాయో, 2025337 - హనీఫ్ మొహమ్మద్ (PAK) vs WI, బార్బడోస్, 1958336* - వాలీ హమ్మండ్ (ENG) vs NZ, ఆక్లాండ్, 1933334* - మార్క్ టేలర్ (AUS) vs PAK, పెషావర్, 1998334 - సర్ డాన్ బ్రాడ్‌మాన్ (AUS) vs ENG, హెడింగ్లీ, 1930మ్యాచ్ విషయానికొస్తే.. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 334 బంతుల్లో 49 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 367 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు.ముల్దర్ చెలరేగడంతో సౌతాఫ్రికా లంచ్ తర్వాత 626/5 స్కోర్ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ముల్దర్‌తో పాటు వెర్రిన్ (42) క్రీజ్‌లో ఉన్నాడు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ, మటిగిము తలో 2 వికెట్లు తీయగా.. మసకద్జ ఓ వికెట్ దక్కించుకున్నాడు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. -
చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా ప్లేయర్.. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ
సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ట్రిపుల్ సెంచరీ చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనత సాధించలేదు. జింబాబ్వేతో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ముల్దర్ ఈ ఫీట్ సాధించాడు. WIAAN MULDER BECOMES THE FIRST TEST CAPTAIN TO SCORE TRIPLE HUNDRED ON CAPTAINCY DEBUT...!!! 🦁 pic.twitter.com/SujzdKo0Ht— Johns. (@CricCrazyJohns) July 7, 2025ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 297 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేసిన ముల్దర్.. టెస్ట్‌ల్లో రెండో వేగవంతమైన ట్రిపుల్ సెంచరీ రికార్డును కూడా నమోదు చేశాడు. ఈ రికార్డు టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ పేరిట ఉంది. సెహ్వాగ్ 2008లో సౌతాఫ్రికాపై 278 బంతుల్లో ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. టెస్ట్‌ల్లో టాప్-5 ఫాస్టెస్ట్ ట్రిపుల్ సెంచరీల వివరాలు ఇలా ఉన్నాయి.వీరేంద్ర సెహ్వాగ్-278 బంతుల్లోవియాన్ ముల్దర్-297హ్యారీ బ్రూక్-310మాథ్యూ హేడెన్-262వీరేంద్ర సెహ్వాగ్-364ఈ ట్రిపుల్‌తో ముల్దర్ టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగానూ రికార్డు నెలకొల్పాడు. ఈ మ్యాచ్‌లో ముల్దర్ 314 పరుగుల స్కోర్ వద్ద హాషిమ్ ఆమ్లా (311 నాటౌట్) పేరిట ఉండిన రికార్డును బద్దలు కొట్టాడు. అలాగే ఆమ్లా తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున ట్రిపుల్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డుల్లోకెక్కాడు.మ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 264 వద్ద రెండో రోజు బరిలోకి దిగిన ముల్దర్.. తొలి సెషన్లోనే ట్రిపుల్ సెంచరీ పూర్తి చేశాడు. ముల్దర్ వన్డే తరహాలో బ్యాటింగ్ చేస్తూ వేగంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. కడపటి వార్తలు అందేసరికి ముల్దర్ 350 పరుగులు కూడా పూర్తి చేశాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు కేవలం ఏడుగురు (ముల్దర్‌తో కలిసి) మాత్రమే ఈ ఘనత సాధించారు. 108 ఓవర్ల తర్వాత తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా స్కోర్ 593/5గా ఉంది. ముల్దర్ 350 (324 బంతుల్లో 48 ఫోర్లు, 3 సిక్సర్లు), వెర్రిన్ 26 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 10, సెనోక్వానే 3, డేవిడ్ బెడింగ్హమ్ 82, లుహాన్ డ్రి ప్రిటోరియస్ 78, డెవాల్డ్ బ్రెవిస్ 30 పరుగులు చేసి ఔటయ్యారు. రెండు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా తొలి మ్యాచ్‌లో విజయం సాధించింది. తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేసిన ముల్దర్జింబాబ్వేతో జరుగుతున్న ఈ సిరీస్‌లో ముల్దర్ తొలి టెస్ట్‌లోనూ సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసిన ముల్దర్ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా కెప్టెన్‌గా ఎంపికైన కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ పగ్గాలు దక్కాయి. -
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇరగదీసిన మరో ప్లేయర్.. వరుస ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు
టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే సెంచరీతో ఇరగదీసిన విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేశాడు. తాజాగా మరో ఆటగాడు కెప్టెన్‌గా తన తొలి టెస్ట్ ఇన్నింగ్స్‌లోనే సెంచరీతో చెలరేగాడు. వియాన్ ముల్దర్ సౌతాఫ్రికా కెప్టెన్‌గా తన తొలి ఇన్నింగ్స్‌లో మూడంకెల స్కోర్‌తో సత్తా చాటాడు. జింబాబ్వేతో ఇవాళ (జులై 6) ప్రారంభమైన రెండో టెస్ట్‌లో ముల్దర్ టీ విరామం సమయానికి 133 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతకుముందు టెస్ట్‌లో ముల్దర్ కేశవ్ మహారాజ్ సారథ్యంలో ఆటగాడిగా సెంచరీ చేశాడు. తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆ మ్యాచ్‌లో ముల్దర్ బౌలర్‌గానూ రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీశాడు. తొలి టెస్ట్ సందర్భంగా కేశవ్ మహారాజ్ గాయపడటంతో ముల్దర్‌కు అనూహ్యంగా కెప్టెన్సీ అవకాశం దక్కింది. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా ఇదివరకే తనను తాను నిరూపించుకున్న ముల్దర్‌కు కెప్టెన్‌గా తనదైన ముద్ర వేసే అవకాశం కూడా దక్కింది. 27 ఏళ్ల ముల్దర్ 21 మ్యాచ్‌ల టెస్ట్ కెరీర్లో 3 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 31 సగటున 930 పరుగులు చేశాడు. అలాగే బౌలింగ్‌లో 35 వికెట్లు పడగొట్టాడు. ముల్దర్ దక్షిణాఫ్రికా జట్టులో ఆల్ ఫార్మాట్ ఆటగాడిగా స్థిరపడ్డాడు. 25 వన్డేల్లో 2 హాఫ్ సెంచరీల సాయంతో 276 పరుగులు, 22 వికెట్లు.. 11 టీ20ల్లో 105 పరుగులు, 8 వికెట్లు తీశాడు. ముల్దర్ ఇటీవలే ఐపీఎల్ అరంగేట్రం కూడా చేశాడు. 2025 సీజన్లో అతను సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఓ మ్యాచ్ ఆడాడు. ఇందులో 9 పరుగులు చేసి, వికెట్లేమీ తీయలేదు. ముల్దర్ ఇటీవల డబ్ల్యూటీసీ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో అతను 33 పరుగులు చేసి ఓ వికెట్ తీశాడు. ప్రస్తుతం రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. ఈ సిరీస్ కోసం సౌతాఫ్రికా మేనేజ్మెంట్ యువ ఆటగాళ్లకు అవకాశం ఇచ్చింది. డబ్ల్యూటీసీ గెలిచిన జట్టులోని సీనియర్లకు విశ్రాంతినిచ్చి కేశవ్ మహారాజ్‌ను సారధిగా నియమించింది. ఈ సిరీస్‌లో సీనియర్లు లేకున్నా సౌతాఫ్రికా తొలి టెస్ట్‌లో అదిరిపోయే విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో యువ ఆటగాళ్లు చెలరేగడంతో సౌతాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుతం జరుగుతున్న రెండో టెస్ట్‌లో సౌతాఫ్రికా తొలుత బ్యాటింగ్ చేస్తూ 59 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 267 పరుగులు చేసింది. వియాన్ ముల్దర్ 154, తొలి టెస్ట్ సెంచరీ హీరో లుహాన్ డ్రి ప్రిటోరియస్ 16 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో మరో ఆటగాడు డేవిడ్ బెడింగ్హమ్ (82) సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. టోని డి జోర్జి 10, అరంగేట్రం ఓపెనర్ లెసెగొ సెనోక్వానే 3 పరుగులకు ఔటయ్యారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 2, మసకద్జ ఓ వికెట్ పడగొట్టారు. -
క్యాషియర్ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కుంటే నేరమా బాస్?!
ఓ చిరుద్యోగం చేసుకునే మహిళ ఎంతో కష్టపడి, ఇష్టపడి కారు కొనుక్కుంటే..ఆ ఉద్యోగిని ఉద్యోగంలోంచి తీసేసిన ఘటన చర్చకు దారితీసింది. మంచి జీవితం గడపడం కూడా తప్పేనా అంటూ బాధిత మహిళ సోషల్ మీడియాలో తన గోడును వెళ్ల బోసుకుంది. దీంతో ఈ స్టోరీ వైరల్‌గా మారింది.దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్లో ఒక గ్యారేజ్‌లో క్యాషియర్‌గా పనిచేస్తోంది అసేజా లిమెలింటాకా (28) భారతీయ సంతతికి చెందిన షిరాజ్ పటేల్ ఆమె బాస్. సెకండ్‌హ్యాండ్ హోండా కారు కొనుక్కుని ఆ కారులో ఆఫీసుకు వెళ్లడమే ఆమె చేసిన నేరం. జీతం తక్కువగా ఉన్నా, కారు కొన్నావా అంటూ తన బాస్ తనను తొలగించారని ఆమె ఆరోపించింది. కష్టపడి ఎన్నో నెలల పొదుపు చేసుకుని, లోన్ తీసుకుని మరీ తన కారు కొన్నానని వాపోయింది.ఇవన్నీ చెప్పినా కూడా బాస్ పటేల్ తనను నమ్మ లేదని , వేరే చోట పనిచేస్తుందో లేదో తనిఖీ చేయడానికి ఆమె బ్యాంక్ ఖాతాను చూపించాలని డిమాండ్ చేశాడని ఆమె ఆరోపించింది. వివరాలు చూసి కొత్త ఫర్నిచర్ కొంటున్నావ్, ఇక నువ్వు క్యాషియర్‌గా ఉండటానికి వీల్లేదంటూ తనను తీసేసారని ఆమె ఫేస్బుక్ పోస్ట్‌లో రాసింది.అంతేకాదు దొంగతనం ఆరోపణలు కూడా చేశాడని పేర్కొంది. పెట్రోల్ పంప్ అటెండెంట్‌గా పనిచేయాలని లేదా రాజీనామా చేయాలని అతను ఆమెకు అల్టిమేటం ఇచ్చాడని ఆమె అన్నారు.అయితే బెర్క్లీ మోటార్ గ్యారేజ్ యజమాని లిమెలింటకా చేసిన ఆరోపణలను ఖండించారు. ఆమెను తొలగించలేదని పేర్కొన్నారు. తామె ఎవరిపైనా ఎలాంటి ఆరోపణలు చేయలేదద చాలా నిజాలని దాచిపెట్టిందన్నారు. అలాగే కంపెనీపై తప్పుడు ఆరోపణలు చేసినందు వల్ల ఇకపై అప్రమత్తంగా ఉంటామని తెలిపాడు. -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు మరో కొత్త కెప్టెన్
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు రోజుల వ్యవధిలో ముగ్గురు కెప్టెన్లు మారారు. గత నెలలో జరిగిన డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్లో సౌతాఫ్రికాకు సారథ్యం వహించిన టెంబా బవుమా.. జింబాబ్వే పర్యటనకు విశ్రాంతి తీసుకోగా, కేశవ్ మహారాజ్‌ను తాత్కాలిక సారధిగా నియమించారు. జింబాబ్వే పర్యటనలో తొలి టెస్ట్‌లో అదరగొట్టిన కేశవ్ మహారాజ్ దురదృష్టవశాత్తు గాయపడటంతో, రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్యామ్నాయంగా మరో కొత్త కెప్టెన్‌ను నియమించారు. కెరీర్లో కేవలం 20 టెస్ట్ మ్యాచ్‌లే ఆడిన వియాన్ ముల్దర్‌ను దక్షిణాఫ్రికా నూతన సారధిగా ఎంపిక చేశారు. జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా జట్టులో కేశవ్ మహారాజ్ తర్వాత ముల్దరే అత్యంత అనుభవజ్ఞుడు (కైల్ వెర్రిన్ (26) మినహా). మిగతా ఆటగాళ్లంతా 20కి మించి టెస్ట్‌లు ఆడలేదు. తొలి టెస్ట్‌తో ప్రిటోరియస్, బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అనంతరం సీనియర్ ఆటగాళ్లంతా విశ్రాంతి తీసుకోవడంతో సౌతాఫ్రికా మేనేజ్మెంట్ జింబాబ్వే టూర్‌కు యువ జట్టును పంపింది. ఈ యువ జట్టుకు అత్యంత సీనియర్ అయిన కేశవ్ మహారాజ్‌ను కెప్టెన్‌గా నియమించింది.అయితే అతను తొలి టెస్ట్ సందర్భంగా గజ్జల్లో గాయానికి గురయ్యాడు. రెండో టెస్ట్‌లో అతనికి ప్రత్నామ్నాయ ఆటగాడిగా సెనురన్ ముత్తుస్వామిని ఎంపిక చేశారు. జులై 6 నుంచి బులవాయోలో జరిగే రెండో టెస్ట్‌లో వియాన్ ముల్దర్ దక్షిణాఫ్రికా సారధిగా వ్యవహరిస్తాడు. దీంతో సౌతాఫ్రికా మూడు వరుస టెస్ట్ మ్యాచ్‌ల్లో ముగ్గురు వేర్వేరు కెప్టెన్లతో బరిలోకి దిగినట్లవుతుంది.కొత్త కెప్టెన్ ముల్దర్ జింబాబ్వేతో జరిగిన తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించాడు. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు తీసి, ఆతర్వాత బ్యాటింగ్‌లో సెంచరీ (147) చేశాడు. తొలి టెస్ట్‌లో సారధిగా వ్యవహరించిన కేశవ్ మహారాజ్ కూడా ఆల్‌రౌండర్‌గా రాణించాడు. బ్యాటింగ్‌లో 21, 51 పరుగులు చేసి బౌలింగ్‌లో 3,1 వికెట్లు తీశాడు.గాయంతో బాధపడుతున్న కేశవ్ మహారాజ్‌ను స్వదేశానికి పిలిపించిన సౌతాఫ్రికా యాజమాన్యం అతనితో పాటు సీనియర్ పేసర్ లుంగి ఎంగిడిని కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. తొలి టెస్ట్‌లో అద్బుతంగా రాణించిన యువ పేసర్లకు మరో అవకాశం ఇవ్వడం కోసం ఎంగిడిని స్వదేశానికి పిలిపించారు. తొలి టెస్ట్‌లో పేసర్లు కోడి యూసఫ్, మఫాకా, బాష్, ముల్దర్ విశేషంగా రాణించారు. ఆ మ్యాచ్‌లో కేశవ్ మహారాజ్ ఏకైక స్పిన్నర్‌గా బరిలోకి దిగాడు.కాగా, జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కార్బిన్ బాష్ (100, 5/43), డ్రి ప్రిటోరియస్ (153), వియాన్ ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/22) అద్భుత ప్రదర్శనలు చేసి సౌతాఫ్రికాను గెలిపించారు. ఈ గెలుపుతో సౌతాఫ్రికా చివరి 9 మ్యాచ్‌ల్లో గెలిచిన జట్టుగా అరుదైన ఘనత సాధించింది. ప్రస్తుతం టెస్ట్ క్రికెట్లో ఏ జట్టు ఈ ఘనత సాధించలేదు. -
రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ తన కెరీర్లో రెండో టెస్ట్‌లోనే అరుదైన ఫీట్ సాధించాడు. సెంచరీ సహా ఐదు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. తద్వారా ఈ ఘనత సాధించిన నాలుగో సౌతాఫ్రికా ప్లేయర్‌గా, ఓవరాల్‌గా 40వ ఆల్‌రౌండర్‌గా రికార్డుల్లోకెక్కాడు. బాష్‌కు ముందు (సౌతాఫ్రికా) జిమ్మీ సింక్లైర్ (106, 6/26), ఏ ఫాల్కనర్ (123. 5/120), జాక్ కల్లిస్ (110, 5/90), జాక్ కల్లిస్ (139 నాటౌట్, 5/21) ఈ ఘనత సాధించారు.జింబాబ్వేతో తాజాగా ముగిసిన టెస్ట్ మ్యాచ్‌లో బాష్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయ సెంచరీ (100) చేసి రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్ల ప్రదర్శన (5/43) నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ సహా డ్రి ప్రిటోరియస్ (153), ముల్దర్ (4/50, 147), కేశవ్ మహారాజ్ (3/70, 51), కోడి యూసఫ్ (3/42, 3/ 22) సత్తా చాటడంతో జింబాబ్వేపై సౌతాఫ్రికా 328 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ గెలిచిన తర్వాతి మ్యాచ్‌లోనే సౌతాఫ్రికా ఛాంపియన్‌లా ఆడి కొత్త టెస్ట్ సైకిల్‌ను (2025-27) ఘనంగా ప్రారంభించింది. రెండు మ్యాచ్‌ల సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తున్న సౌతాఫ్రికా ద్వితియ శ్రేణి జట్టుతో బరిలోకి దిగింది. అయినా ఛాంపియన్ ఆట ఆడి పసికూన జింబాబ్వేపై తమ పరాక్రమాన్ని చూపించింది. సీనియర్లు బవుమా, మార్క్రమ్, రబాడ లాంటి వారు ఈ సిరీస్ ఆడకుండా విశ్రాంతి తీసుకున్నారు.ఈ మ్యాచ్‌లో జింబాబ్వే ఓడినప్పటికీ వారి స్థాయికి మించి పోరాటం చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు సౌతాఫ్రికాకు ధీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. సీన్ విలియమ్స్ (137) అద్బుతమైన సెంచరీతో జింబాబ్వేను గట్టెక్కించే ప్రయత్నం చేశాడు. మరో ఎండ్ నుంచి ఎవరి సహకారం లేకపోవడంతో అతని పోరాటం వృధా అయ్యింది. రెండో ఇన్నింగ్స్‌లో జింబాబ్వే పూర్తిగా చేతులెత్తేసింది. భారీ లక్ష్య ఛేదనలో ఆ జట్టు స్వల్ప స్కోర్‌కే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన అరంగేట్రం ఆటగాడు డ్రి ప్రిటోరియస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ మ్యాచ్‌లో ప్రిటోరియస్తో పాటు డెవాల్డ్ బ్రెవిస్, కోడి యూసఫ్ అరంగేట్రం చేశారు. రెండో టెస్ట్ జులై 6 నుంచి బులవాయో వేదికగానే జరుగనుంది. -
సెంచరీతో కదంతొక్కిన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్
ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడే సౌతాఫ్రికా ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్.. జింబాబ్వేతో జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో కదంతొక్కాడు. మ్యాచ్ మూడో రోజు లంచ్ విరామానికి ముందు ముల్దర్ 149 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ముల్దర్‌కు టెస్ట్‌ల్లో ఇది రెండో సెంచరీ. గతేడాది అక్టోబర్‌లో ముల్దర్ బంగ్లాదేశ్‌పై అజేయ శతకం బాదాడు.ముల్దర్ ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ టైటిల్ గెలిచిన సౌతాఫ్రికా జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. ముల్దర్ తాజా ఐపీఎల్ సీజన్లో ఇంగ్లండ్ ఆటగాడు బ్రైడన్ కార్స్‌కు రీప్లేస్‌మెంట్‌గా ఎస్ఆర్హెచ్లో చేరాడు. ఎస్ఆర్హెచ్ ముల్దర్‌ను 75 లక్షల బేస్ ధరకు సొంతం చేసుకుంది. ముల్దర్ ఐపీఎల్ 2025లో 2 మ్యాచ్‌లు ఆడి కేవలం 9 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో ఓ ఓవర్ మాత్రమే వేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పటిష్ట స్థితిలో ఉంది. మూడో రోజు రెండో సెషన్ సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ జట్టు 415 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది. వియాన్ ముల్దర్ 142, కైల్ వెర్రిన్ 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.అంతకుముందు జింబాబ్వే తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటై ఫాలో ఆన్ తప్పించుకుంది. జింబాబ్వేను సీన్ విలియమ్స్ (137) అద్బుత సెంచరీతో గట్టెక్కించాడు. రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీతో కదంతొక్కిన ముల్దర్ బంతితో కూడా రాణించాడు. 16 ఓవర్లు వేసి 4 వికెట్లు తీశాడు. కేశవ్ మహారాజ్, కోడి యూసఫ్ తలో 3 వికెట్లు పడగొట్టారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా.. తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. కాగా, రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
అద్భుతమైన సెంచరీ.. ఆండీ ఫ్లవర్ తర్వాతి స్థానంలో సీన్ విలియమ్స్
బులవాయో వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో జింబాబ్వే వెటరన్ బ్యాటర్ సీన్ విలియమ్స్ అద్భుతమైన సెంచరీతో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో (23/2) ఉన్నప్పుడు బరిలోకి దిగి 121 బంతుల్లో 12 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. 38 ఏళ్ల విలియమ్స్‌కు టెస్ట్‌ల్లో ఇది ఆరో శతకం. సెంచరీ అనంతరం కూడా విలియమ్స్ పోరాటం కొనసాగిస్తూ జింబాబ్వేను గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. విలియమ్స్ ప్రస్తుతం 134 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మసెకెస (4) క్రీజ్‌లో ఉన్నాడు. రెండో రోజు మూడో సెషన్ సమయానికి జింబాబ్వే 7 వికెట్లు కోల్పోయి 242 పరుగులు చేసింది. ఆ జట్టు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 176 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36, వెస్లీ మెదెవెరె 15, మసౌరే 7, ట్సిగా 9, మసకద్జ 4 పరుగులు చేసి ఔట్ కాగా.. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్ట్ హర్ట్‌గా (తలకు గాయం) వెనుదిరగాడు. బెన్నెట్ ఈ మ్యాచ్‌లో తిరిగి బరిలోకి దిగడు. అతని స్థానంలో మసౌరేను కన్కషన్ సబ్‌స్టిట్యూట్‌గా ప్రకటించింది జింబాబ్వే మేనేజ్మెంట్. సౌతాఫ్రికా బౌలర్లలో యూసఫ్ కోడి, వియాన్ ముల్దర్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. కేశవ్ మహారాజ్ ఓ వికెట్ దక్కించుకున్నాడు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.ప్లవర్ సరసన విలియమ్స్ఈ మ్యాచ్‌లో సెంచరీతో విలియమ్స్ జింబాబ్వే మాజీ ఆటగాళ్లు గ్రాంట్ ఫ్లవర్, బ్రెండన్ టేలర్ సరసన చేరాడు. ఫ్లవర్, టేలర్, విలియమ్స్ టెస్ట్‌ల్లో తలో ఆరు సెంచరీలు చేసి జింబాబ్వే తరఫున ఈ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నారు. టెస్ట్‌ల్లో జింబాబ్వే తరఫున అత్యధిక సెంచరీల రికార్డు ఆండీ ఫ్లవర్ పేరిట ఉంది. -
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం.. చరిత్ర సృష్టించిన కేశవ్ మహారాజ్
సౌతాఫ్రికా క్రికెట్లో సరికొత్త అధ్యాయం లిఖించబడింది. ఆ దేశం తరఫున తొలిసారి ఓ స్పిన్నర్ టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీశాడు. సౌతాఫ్రికా తరఫున 200 టెస్ట్ వికెట్ల మార్కును ఇప్పటివరకు ఏ స్పిన్నర్ తాకలేదు. ఆ దేశం తరఫున 200కు పైగా టెస్ట్ వికెట్లు తీసిన బౌలర్లంతా ఫాస్ట్ బౌలర్లే. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో 200 వికెట్లు తీసిన తొలి స్పిన్ బౌలర్‌గా కేశవ్ మహారాజ్ రికార్డు నెలకొల్పాడు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో కేశవ్ ఈ ఘనత సాధించాడు. జింబాబ్వే కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ వికెట్ కేశవ్‌కు 200వ టెస్ట్ వికెట్. కేశవ్ తర్వాత టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన స్పిన్నర్లుగా టేఫీల్డ్ (170), పాల్ ఆడమ్స్ (134), పాల్ హ్యారిస్ (103), నికీ బోయే (100) ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా డేల్ స్టెయిన్ (439) ఉన్నాడు. అతని తర్వాత షాన్ పోలాక్ (421), ఎన్తిని (390), రబాడ (336), డొనాల్డ్ (330), మోర్కెల్ (309), కల్లిస్ (291), ఫిలాండర్ (224) 200 కంటే ఎక్కువ వికెట్లు తీసిన వారిలో ఉన్నారు. వీరంతా ఫాస్ట్ బౌలర్లే.మ్యాచ్ విషయానికొస్తే.. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా బులవాయో వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్‌లో రెండో రోజు ఆట కొనసాగుతుంది. రెండో సెషన్ సమయానికి జింబాబ్వే 3 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. బ్రియాన్ బెన్నెట్ (19) రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4, క్రెయిగ్ ఎర్విన్ 36 పరుగులకు ఔటయ్యారు. సీన్ విలియమ్స్ (81), వెస్లీ మెదెవెరె (15) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా బౌలర్లలో కోడి యూసఫ్ 2, కేశవ్ మహారాజ్ ఓ వికెట్ తీశారు.అంతకుముందు సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. లుహాన్ డ్రి ప్రిటోరియస్ (153), కార్బిన్ బాష్ (100 నాటౌట్) సెంచరీలతో కదంతొక్కారు. డెవాల్డ్ బ్రెవిస్ (51) మెరుపు అర్ద సెంచరీతో రాణించారు.మిగతా ఆటగాళ్లలో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు. -
ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి రికార్డు సెంచరీ చేసిన సౌతాఫ్రికా ప్లేయర్
బులవాయో వేదికగా జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా ఆటగాడు కార్బిన్ బాష్ ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి సెంచరీ చేశాడు. తద్వారా ఆ దేశ దిగ్గజాల సరసన రికార్డు బుక్కుల్లో చోటు దక్కించుకున్నాడు. గతంలో మార్క్ బౌచర్ (122 నాటౌట్), డాల్టన్ (117), ముర్రే (109), డేవ్ రిచర్డ్సన్ (109), విన్స్లో (108), జేపీ డుమిని (100 నాటౌట్) సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో ఎనిమిదో స్థానంలో బరిలోకి దిగి సెంచరీలు చేశారు. జింబాబ్వేతో జరుగుతున్న మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో 124 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో 100 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో బాష్‌కు ముందు అరంగేట్రం ఆటగాడు లూహాన్ డ్రి ప్రిటోరియస్ (153) కూడా సెంచరీతో కదంతొక్కాడు. మరో అరంగేట్రం ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ (41 బంతుల్లో 51) మెరుపు అర్ద సెంచరీతో అలరించాడు.MAIDEN INTERNATIONAL HUNDRED FOR CORBIN BOSCH WHILE BATTING AT 8 🥶 pic.twitter.com/Md4Qv3DwNN— Johns. (@CricCrazyJohns) June 28, 2025ప్రిటోరియస్, బాష్ సెంచరీలతో సత్తా చాటడంతో సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 418 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్‌లో టోని డి జోర్జి 0, బ్రీట్జ్కీ 13, ముల్దర్ 17, బెడింగ్హమ్ 0, వెర్రిన్ 10, కెప్టెన్ కేశవ్ మహారాజ్ 21, కోడి యూసఫ్ 27, మఫాకా 9 (నాటౌట్) పరుగులు చేశారు. జింబాబ్వే బౌలర్లలో చివంగ 4, ముజరబానీ 2, మసరద్జ, మసెకెస తలో వికెట్ తీశారు.అనంతరం బరిలోకి దిగిన జింబాబ్వే.. రెండో రోజు రెండో సెషన్ సమయానికి 2 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది. సీన్ విలియమ్సన్ (56), కెప్టెన్ క్రెయిగ్ ఎర్విన్ (30) క్రీజ్‌లో ఉన్నారు. సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు జింబాబ్వే ఇంకా 305 పరుగులు వెనుకపడి ఉంది. జింబాబ్వే ఇన్నింగ్స్‌లో బ్రియాన్ బెన్నెట్ 19 పరుగుల వద్ద రిటైర్డ్ హర్ట్ కాగా.. కైటానో 0, వెల్చ్ 4 పరుగులకు ఔటయ్యారు. అరంగేట్రం బౌలర్ కోడి యూసఫ్‌కు రెండు వికెట్లు దక్కాయి. కాగా, ఇటీవలే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన సౌతాఫ్రికా తమ ద్వితియ శ్రేణి జట్టుతో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం జింబాబ్వేలో పర్యటిస్తుంది. -
టెస్ట్ అరంగేట్రం చేయనున్న సీఎస్కే చిచ్చరపిడుగు
సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తన జాతీయ జట్టు సౌతాఫ్రికా తరఫున టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. రేపటి నుంచి జింబాబ్వేతో జరుగబోయే టెస్ట్ మ్యాచ్ కోసం ప్రకటించిన తుది జట్టులో బ్రెవిస్ చోటు దక్కించుకున్నాడు. తుది జట్టు ఆటగాళ్ల జాబితాను క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (జూన్ 27) ప్రకటించింది. సీనియర్ల గైర్హాజరీలో రెండు మ్యాచ్‌లో ఈ సిరీస్‌లో సౌతాఫ్రికా సారధిగా కేశవ్ మహారాజ్ ఎంపికయ్యాడు. రేపటి నుంచి ప్రారంభం కాబోయే టెస్ట్ మ్యాచ్‌లో మహారాజ్ యువ దక్షిణాఫ్రికా జట్టును ముందుండి నడిపిస్తాడు. ఓపెనర్లుగా టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ బరిలోకి దిగనుండగా.. వన్ డౌన్లో వియాన్ ముల్దర్, నాలుగో స్థానంలో డేవిడ్ బెడింగ్హమ్, ఐదో స్థానంలో లుహాన్ డ్రి ప్రిటోరియస్, ఆరో స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ బరిలోకి దిగనున్నారు. వికెట్ కీపర్ బ్యాటర్‌గా కైల్ వెర్రిన్, ఆల్‌రౌండర్ కోటాలో కార్బిన్ బాష్, స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా కేశవ్ మహారాజ్, పేసర్లుగా కోడి యూసఫ్, క్వేనా మఫాకా బరిలోకి దిగనున్నారు. ఈ మ్యాచ్‌లో బ్రెవిస్‌తో పాటు డ్రి ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రం చేస్తాడు.వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించాక సౌతాఫ్రికా ఆడబోయే తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది. డబ్ల్యూటీసీ టైటిల్ గెలవడం ద్వారా సౌతాఫ్రికా చిరకాల కల నెరవేర్చిన రెగ్యులర్ కెప్టెన్ టెంబా బవుమా ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నాడు. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్లో అద్భుత సెంచరీ చేసిన మార్క్రమ్, అదే మ్యాచ్‌లో చెలరేగిన రబాడ, ఆల్‌రౌండర్ జన్సెన్, బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ ఈ సిరీస్‌కు దూరంగా ఉన్నారు. వీరందరికి క్రికెట్ సౌతాఫ్రికా విశ్రాంతినిచ్చింది. డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడిన కార్బిన్ బాష్, వియాన్ ముల్దర్ తొలి టెస్ట్‌లో సౌతాఫ్రికా పేస్ విభాగాన్ని ముందుండి నడిపిస్తారు. రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సౌతాఫ్రికా జింబాబ్వేలో పర్యటిస్తుంది. రెండు టెస్ట్‌లు బులవాయోలోని క్వీన్స్ స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. రెండో టెస్ట్ జులై 6 నుంచి ప్రారంభమవుతుంది.జింబాబ్వేతో తొలి టెస్ట్ కోసం సౌతాఫ్రికా తుది జట్టు..టోనీ డి జోర్జి, మాథ్యూ బ్రీట్జ్కీ, వియాన్ ముల్డర్, డేవిడ్ బెడింగ్హమ్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, డెవాల్డ్ బ్రెవిస్, కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), కార్బిన్ బాష్, కేశవ్ మహారాజ్ (కెప్టెన్), కోడి యూసఫ్, క్వేనా మఫాకాజింబాబ్వే జట్టు..క్రెయిగ్ ఎర్విన్ (కెప్టెన్), బ్రియాన్ బెన్నెట్, తనకా చివాంగా, ట్రెవర్ గ్వాండు, టకుద్జ్వానాషే కైటానో, వెస్లీ మాధేవెరే, క్లైవ్ మదాండే, విన్సెంట్ మసెకేసా, వెల్లింగ్టన్ మసకద్జా, ప్రిన్స్ మస్వౌరే, కుండై మతిగిము, బ్లెస్సింగ్ ముజరబానీ, న్యూమ్యాన్ న్యామ్హురి, తఫద్జా సిగ, నికోలస్ వెల్చ్, సీన్ విలియమ్స్ -
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ సౌతాఫ్రికాకు కొత్త కెప్టెన్ వచ్చాడు. టీ20 ఫార్మాట్లో ఆ జట్టుకు రస్సీ వాన్ డెర్ డస్సెన్ సారధిగా నియమితుడయ్యాడు. జులైలో జింబాబ్వేలో జరుగనున్న పొట్టి ఫార్మాట్ సిరీస్ కోసం క్రికెట్ సౌతాఫ్రికా డస్సెన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ ట్రై సిరీస్‌లో జింబాబ్వే, సౌతాఫ్రికాతో పాటు న్యూజిలాండ్ పాల్గొననుంది. రెగ్యులర్ టీ20 కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ సహా సీనియర్లకు విశ్రాంతినివ్వడంతో డస్సెన్‌కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పారు. ఈ ట్రై సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా కొత్త ముఖాలు ఉన్నాయి.ఈ ఏడాది సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచిన విధ్వంసకర ఓపెనర్ లూహాన్ డ్రి ప్రిటోరియస్ తొలిసారి జాతీయ టీ20 జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. ఇదివరకే వన్డే, టెస్ట్‌ల్లో అరంగేట్రం చేసిన కార్బిన్ బాష్ కూడా తొలిసారి టీ20 బెర్త్ దక్కించుకున్నాడు. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో సత్తా చాటిన రూబిన్ హెర్మన్.. ఇదివరకే మిగతా రెండు ఫార్మాట్లలో జాతీయ జట్టుకు ఆడిన సెనురన్ ముత్తుస్వామి మిగతా అన్క్యాప్డ్ ప్లేయర్లుగా ఎంపికయ్యారు.గాయాల కారణంగా గత కొంతకాలంగా ఆటకు దూరంగా ఉన్న పేసర్లు నండ్రే బర్గర్, గెరాల్డ్ కొయెట్జీ ఈ ట్రై సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. గత రెండేళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న బ్యాటింగ్ సంచనలం డెవాల్డ్ బ్రెవిస్ కూడా ఈ సిరీస్ కోసం పిలుపునందుకున్నాడు. షుక్రీ కన్రాడ్ సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇదే అతనికి తొలి టీ20 అసైన్మెంట్. జింబాబ్వేలోని హరారే వేదికగా జరిగే ఈ ట్రై సిరీస్ జులై 14 నుంచి ప్రారంభమవుతుంది. జులై 26న జరిగే ఫైనల్‌తో ఈ టోర్నీ ముగుస్తుంది. కాగా, టెంబా బవుమా నేతృత్వంలోని సౌతాఫ్రికా ఇటీవలే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌గా అవతరించిన విషయం తెలిసిందే. లార్డ్స్‌లో జరిగిన ఫైనల్లో ఈ జట్టు ఆస్ట్రేలియాను చిత్తు చేసి చాలాకాలం తర్వాత ఐసీసీ టోర్నీ గెలిచింది.జింబాబ్వేలో జరిగే ట్రై సిరీస్ కోసం సౌతాఫ్రికా జట్టు..రస్సీ వాన్ డెర్ డస్సెన్ (కెప్టెన్), కార్బిన్ బాష్, డెవాల్డ్ బ్రెవిస్, నండ్రే బర్గర్, గెరాల్డ్ కోయెట్జీ, రీజా హెండ్రిక్స్, రూబిన్ హెర్మన్, జార్జ్ లిండే, క్వేనా మఫాకా, సెనురన్ ముత్తుస్వామి, లుంగి ఎంగిడి, న్కాబా పీటర్, లుహాన్-డ్రి ప్రిటోరియస్, ఆండైల్ సైమ్లేన్జింబాబ్వే ట్రై సిరీస్ షెడ్యూల్..జులై 14- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 16- సౌతాఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్జులై 18- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 20- జింబాబ్వే వర్సెస్ సౌతాఫ్రికాజులై 22- న్యూజిలాండ్ వర్సెస్ సౌతాఫ్రికాజులై 24- జింబాబ్వే వర్సెస్ న్యూజిలాండ్జులై 26- ఫైనల్అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరుగుతాయి. భారతకాలమానం ప్రకారం మ్యాచ్‌లన్నీ సాయంత్రం 4:30 గంటలకు ప్రారంభమవుతాయి. -
28 బంతుల్లో సెంచరీ.. మళ్లీ బ్యాట్ పట్టనున్న ఏబీ డివిలియర్స్
సౌతాఫ్రికా బ్యాటింగ్ దిగ్గజం ఏబీ డివిలియర్స్ (AB DE Villiers) మళ్లీ బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025 (World Championship Of Legends) లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ (South Africa Champions) జట్టులో జాయిన్ కానున్నాడు. ఈ లీగ్‌లో ఏబీడీ సౌతాఫ్రికా కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. సౌతాఫ్రికా జట్టులో ఏబీడీతో పాటు హషీమ్ ఆమ్లా, క్రిస్ మోరిస్, అల్బీ మోర్కెల్, వేన్ పార్నెల్, హార్డస్ విల్యోన్, ఆరోన్ ఫాంగిసో తదితర దిగ్గజాలు ఉన్నారు.2021 నవంబర్‌లో క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన ఏబీడీ.. ఇటీవలే ఓ సారి బ్యాట్ పట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడి తన సహజ శైలిలో రెచ్చిపోయాడు. ఆ మ్యాచ్‌లో టైటాన్స్ లెజెండ్స్ జట్టుకు ప్రాతినిథ్యం వహించిన ఏబీడీ.. బుల్స్ లెజెండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 28 బంతుల్లో సెంచరీ చేశాడు. ఇందులో 15 సిక్సర్లు ఉన్నాయి.ఆ మ్యాచ్ తర్వాత ఏబీడీ తిరిగి జులైలో బ్యాట్ పట్టనున్నాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ కోసం సౌతాఫ్రికా ఛాంపియన్స్ జట్టు ఏబీడీని సంప్రదించగా.. అతను ఒప్పుకున్నాడు. 41 ఏళ్ల ఏబీడీ తన అభిమానుల కోసమే ఈ లీగ్‌లో ఆడటానికి ఒప్పుకున్నానని చెప్పాడు.కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ లీగ్ 2025 ఇంగ్లండ్ వేదికగా జులైలో జరుగనుంది. ఇంగ్లండ్‌లోని బర్మింగ్హమ్, నార్తంప్టన్, లీడ్స్, లీసెస్టర్ నగరాల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ లీగ్‌లో మొత్తం 6 జట్లు (ఇండియా ఛాంపియన్స్, దక్షిణాఫ్రికా ఛాంపియన్స్, ఆస్ట్రేలియా ఛాంపియన్స్, ఇంగ్లాండ్ ఛాంపియన్స్, వెస్టిండీస్ ఛాంపియన్స్ మరియు పాకిస్తాన్ ఛాంపియన్స్) పాల్గొంటాయి. ఈ లీగ్‌లో ఇది రెండో ఎడిషన్. గతేడాది ఈ లీగ్ పురుడు పోసుకుంది. గతేడాది కూడా జులైలో జరిగిన ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ విజేతగా నిలిచింది. ఫైనల్లో యువరాజ్ సింగ్ నేతృత్వంలోని ఇండియా పాకిస్తాన్‌పై విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో భారత్ పాక్ నిర్దేశించిన 157 పరుగుల లక్ష్యాన్ని 19.1 ఓవర్లలో ఛేదించింది. అంబటి రాయుడు 50, యూసఫ్ పఠాన్ 30 పరుగులు చేసి భారత్ విజయంలో ప్రధాన పాత్రలు పోషించారు.ఏబీడీ కెరీర్ విషయానికొస్తే.. ఈ ప్రొటీస్ విధ్వంసకర బ్యాటర్ దక్షిణాఫ్రికా తరఫున 114 టెస్టులు, 228 వన్డేలు, 78 టీ20లు ఆడి 20,014 పరుగులు చేశాడు. ఏబీడీ తన అంతర్జాతీయ కెరీర్లో 47 సెంచరీలు, 99 అర్ద సెంచరీలు సాధించాడు. ఏబీడీ 2018లో అంతర్జాతీయ క్రికెట్ నుంచి తప్పుకున్నా వన్డేల్లో ఇప్పటికి అతని పేరిటే ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు ఉంది. 2015లో జోహనెస్‌బర్గ్‌లో అతను వెస్టిండీస్‌పై 31 బంతుల్లో సెంచరీ చేశాడు. ఏబీడీకి ఐపీఎల్‌లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. లీగ్ ప్రారంభం నుంచి క్యాష్ రిచ్ లీగ్ ఆడిన ఏబీడీ 2021లో రిటైరయ్యాడు. ఈ లీగ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ఇప్పుడు ఢిల్లీ క్యాపిటల్స్) మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున ఆడిన ఇతను.. 184 మ్యాచ్‌ల్లో 151.68 స్ట్రైక్-రేట్‌తో 5162 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 40 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
స్వదేశంలో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్లకు ఘన స్వాగతం (ఫొటోలు)
-
‘లార్డ్’ బవుమా
‘కోటా’ వల్లే కొనసాగుతున్నాడనే విమర్శలు... ఆటగాడిగానూ అర్హత లేని వాడికి సారథ్యమా అనే విసుర్లు... సోషల్ మీడియాలో లెక్కకు మిక్కిలి మీమ్స్... కొన్నాళ్ల క్రితం ఆ ఆటగాడి పరిస్థితి ఇది! కానీ వాటన్నింటిని లెక్క చేయని ఆ ప్లేయర్... ‘పక్షి కన్నుకు గురి పెట్టిన పార్థుడిలా...’ లక్ష్యాన్ని మాత్రమే స్వప్నించాడు. దాని కోసమే తపించాడు. అహర్నిశలు దానికై సర్వశక్తులు ధారపోశాడు. ఎట్టకేలకు దాన్ని సాధించాడు. తమ దేశాభిమానులు సుదీర్ఘ కాలంగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించి... అందరికీ ప్రీతిపాత్రుడయ్యాడు.లార్డ్స్ బాల్కానీలో ఐసీసీ గద చేతబూని సగర్వంగా చిరు దరహాసం చేసిన ఆ ఐదడుగుల నాలుగు అంగుళాల ప్లేయరే తెంబా బవుమా. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టే జట్టులో చోటు దక్కిందనే విమర్శల దశ నుంచి... 27 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాకు ఐసీసీ ట్రోఫీ అందించిన సారథిగా ఇప్పుడు ఎక్కడ చూసినా అతడి పేరు మారుమోగుతోంది. ప్రధాన జట్లతో ఆడకుండానే ఫైనల్ చేరారనే విమర్శలకు తనదైన శైలిలో జవాబిచ్చిన బవుమా... తుదిపోరులో తమ మనోస్థయిర్యాన్ని దెబ్బతీసేందుకు కంగారూలు ‘చోకర్స్’ అంటూ స్లెడ్జింగ్‌కు దిగినా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతూ జట్టుకు అపురూప విజయాన్ని అందించాడు. సఫారీ జట్టును ప్రపంచ టెస్టు చాంపియన్‌గా నిలిపిన బవుమా ప్రస్థానాన్ని ఓసారి పరిశీలిస్తే... – సాక్షి క్రీడావిభాగం లార్డ్స్ వేదికగా జరిగిన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో... దక్షిణాఫ్రికా ముందు 282 పరుగుల విజయ లక్ష్యం నిలిచింది. స్కోరు బోర్డుపై 70 పరుగులు చేరేసరికి రెండు వికెట్లు నేలకూలాయి. 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవాలంటే సఫారీ జట్టుకు ఇంకా 212 పరుగులు చేయాల్సిన పరిస్థితి. అప్పుడు లార్డ్స్ లాంజ్ రూమ్ నుంచి దక్షిణాఫ్రికా సారథి తెంబా బవుమా చిట్టి చిట్టి అడుగులు వేస్తూ మైదానంలో అడుగు పెట్టాడు. అప్పటి వరకు పేసర్లు పండగ చేసుకున్న పిచ్ అది. అందులోనూ మిచెల్ స్టార్క్, జోష్ హాజల్‌వుడ్, ప్యాట్ కమిన్స్ వంటి ఆరున్నర అడుగుల ఆజానుబావుల భీకర బౌలింగ్. ఒక ఎండ్‌లో మార్క్రమ్ పోరాడుతున్నా... అతడికి సహకరించే వారేరి అనే అనుమానాలు. గతేడాది ఆరంభంలో కేప్‌టౌన్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన టెస్టులోనూ మార్క్రమ్ ఒంటరి పోరాటంతో సెంచరీ చేసినా అతడికి అండగా నిలిచేవారు లేక సఫారీ జట్టు ఘోర పరాజయం ఎదుర్కొంది. లార్డ్స్‌లోనూ దాదాపు అదే ప్రమాద ఘంటికలు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు రానున్న వారిలో పెద్దగా అనుభవం ఉన్న వాళ్లు లేరు. ఇలాంటి దశలో బవుమా తన కెరీర్లో అత్యుత్తమం అనదగ్గ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. అప్పటి వరకు 63 టెస్టులాడినా... కేవలం నాలుగు శతకాలే సాధించిన అతడు... లార్డ్స్‌లో ఆణిముత్యంలాంటి అర్ధసెంచరీతో మార్క్రమ్కు అండగా నిలిచాడు. ఆసీస్ పేసర్లు బాడీలైన్ బౌలింగ్‌తో పరీక్ష పెడుతున్నా... ప్రత్యర్థులు తన ఎత్తును అదునుగా చేసుకొని బౌన్సర్లతో బెంబేలెత్తిస్తున్నా ఏమాత్రం వెరవలేదు. క్రీజులో అడుగుపెట్టిన కాసేపటికే కండరాలు పట్టేసినా... మైదానం వీడితే క్షణాల్లో మ్యాచ్‌ను లాగేసుకోవడంలో సిద్ధహస్తులైన కంగారూలకు అవకాశం ఇవ్వకుండా నొప్పిని పంటిబిగువున భరిస్తూనే మార్క్రమ్కు అండగా నిలిచాడు. దీంతో స్వేచ్ఛగా ఆడిన మార్క్రమ్ జట్టును విజయ తీరాలకు చేరువ చేశాడు. సార్థక నామధేయుడు తెంబా బవుమా పేరు వెనక ఒక చరిత్ర ఉంది. దక్షణాఫ్రికా స్థానిక జులూ భాషలో తెంబా అంటే ‘ఆశ’ అని అర్థం. అందుకు తగ్గట్లే ఎప్పుడూ ఆశావాహ దృక్పథంతోనే ఉండే బవుమా... ‘పొట్టివాడు గట్టివాడు’ అని తన చేతలతో నిరూపించాడు. ఐసీసీ ట్రోఫీ ఫైనల్లో ఆ్రస్టేలియాతో తలపడాలంటే... ఆట ఆరంభానికి ముందే ప్రత్యర్థి మానసికంగా కుంగిపోవడం ఖాయం. అలాంటిది డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన కంగారూలను కంగుతినిపిస్తూ బవుమా జట్టును నడిపిన తీరుపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ‘చోకర్స్’ ముద్రను చెరిపేస్తూ... ‘క్రికెట్ మక్కా’ లార్డ్స్‌లో తమ జట్టును సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వవిజేతగా నిలిపిన అతడి నాయకత్వ సామర్థ్యాన్ని విమర్శకులు సైతం కొనియాడుతున్నారు. గతంలో విరాట్ కోహ్లి మాదిరిగా ‘అతి సంబరాల’తో విమర్శల పాలైన బవుమా... డబ్ల్యూటీసీ ఫైనల్లో కైల్ వెరీన్ విన్నింగ్ రన్స్ కొట్టిన తర్వాత ముఖాన్ని అరచేతుల్లో దాచుకొని... కళ్లలో నీటి చెమ్మ కనిపించకుండా ముభావంగా కూర్చుండిపోయాడు. సహచరులంతా సంబరాల్లో మునిగి తేలుతుంటే... భారీ బరువేదో భుజస్కంధాలపై నుంచి దించేసుకున్నట్లు నింపాదిగా లేచి అందరితో కలిసిపోయాడు. ‘లాంగా’ నుంచి లార్డ్స్ వరకు... దక్షిణాఫ్రికా మూడు రాజధానుల్లో ఒకటైన కేప్‌టౌన్‌లో నల్లజాతీయులు అధికంగా నివసించే ‘లాంగా’లో బవుమా క్రీడా ప్రస్థానం ప్రారంభమైంది. పదేళ్ల ప్రాయంలో వీధుల్లో క్రికెట్ ఆడుతూ... గల్లీకొక మైదానం పేరుతో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేసిన బవుమా... పదకొండేళ్లకు స్పోర్ట్స్ స్కాలర్షిప్ దక్కించుకున్నాడు. ఆ తర్వాత కఠోర శ్రమ, నిత్యం నేర్చుకోవాలనే తపనతో ఆటను మెరుగు పర్చుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన సమీప బంధువు సూచనలు పాటిస్తూ ఒక్కో మెట్టూ ఎదుగుతూ జాతీయ జట్టు వరకు చేరుకున్నాడు. ప్రతీక్షణం నిరూపించుకోవాల్సిన కఠిన పరిస్థితులను ఎదురొడ్డి వచ్చిన అవకాశాలను అతడు సది్వనియోగ పర్చుకున్నాడు. కెరీర్ ఆరంభంలో పెద్దగా ఆకట్టుకోలేకపోవడంతో జట్టులో అతడి స్థానానికి భరోసా లేకపోయింది. అయితే డీన్ ఎల్గర్ రిటైర్మెంట్ అనంతరం అనూహ్యంగా సారథిగా ఎంపికైన తెంబా... ఆ తర్వాత చక్కటి ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్లో జట్టు పగ్గాలు అందుకున్న బవుమా... కెపె్టన్‌గా ఆడిన తొలి 10 టెస్టుల్లో ఓటమి ఎరగని రికార్డు సృష్టించాడు. ఈ క్రమంలో ఆటగాడిగానూ మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో 59.25 సగటుతో 711 పరుగులు చేశాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్ధసెంచరీలు ఉన్నాయి. భాగస్వామ్యాలకు పెట్టింది పేరైన బవుమా... ఈ డబ్ల్యూటీసీ సర్కిల్లో 60.35 పార్ట్నర్షిప్ సగటుతో అందరికంటే అగ్రస్థానంలో నిలిచాడు. ‘గత కొన్నేళ్లుగా తెంబా జట్టును సమర్థవంతంగా నడుపుతున్నాడు. ఫైనల్లో నా ప్రదర్శన వెనక అతడి ప్రోద్బలం ఎంతో ఉంది. కండరాలు పట్టేసిన స్థితిలో పరుగు తీయడం ఇబ్బందిగా మారినా మైదానాన్ని వీడకుండా పోరాడాడు. కీలక పరుగులతో ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి చిరస్మర విజయంలో కీలకపాత్ర పోషించాడు’ అని తన సారథిపై మార్క్రమ్ ప్రశంసలు కురిపించాడు. నిస్వార్థ నాయకుడు... జట్టు ఓడితే ఆ బాధ్యత తాను వహించి... గెలిస్తే సహచరులకు ఆ క్రెడిట్ ఇచ్చేవాడే అత్యుత్తమ నాయకుడు. ఈ కోవలో చూస్తే బవుమాకు 100కు 100 మార్కులు పడతాయి. ఫైనల్లో తన అసమాన ప్రదర్శనను పక్కనపెట్టి... రబాడ, ఇన్‌గిడి, మార్క్రమ్ పోరాటంతోనే జట్టు విజయం సాధించిందని చెప్పిన గొప్ప మనసు బవుమాది. ‘జట్టంతా సమష్టిగా రాణిస్తేనే నిలకడగా విజయాలు సాధించడం సాధ్యమవుతుంది. మా టీమ్ అందుకు నిదర్శనం. ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడంలో మేమెప్పుడూ ముందుంటాం. ఒకరి విజయాలను మరొకరం ఆస్వాదిస్తాం. అప్పుడే మెరుగైన ఫలితాలు వస్తాయి. ప్రతి రోజు మెరుగయ్యేందుకు ప్రయత్నించడమే మా విజయ లక్ష్యం’ అని బవుమా అన్నాడు. అతడు అన్నట్లుగానే 2023–25 డబ్ల్యూటీసీ సర్కిల్‌ను పరిశీలిస్తే... దక్షిణాఫ్రికా జట్టు ఏ ఒక్క ఆటగాడి ప్రదర్శనపైనో అతిగా ఆధారపడలేదు. మొత్తం 13 మ్యాచ్‌ల్లో తొమ్మిది మంది వేర్వేరు ఆటగాళ్లు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు అందుకున్నారంటే సఫారీ జట్టు ‘టీమ్ వర్క్’ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. అందరిని కలుపుకుంటూ... మార్క్రమ్, బెడింగ్హామ్, స్టబ్స్ వంటి తెల్లజాతీయులు, కేశవ్ మహరాజ్, ముత్తుస్వామి వంటి భారత సంతతి ఆటగాళ్లు, రబాడ, ఇన్‌గిడి వంటి నల్ల జాతీయులు కలగలిపి ఉన్న దక్షిణాఫ్రికా జట్టును బవుమా చక్కగా నడిపించాడు. ‘విభిన్న నేపథ్యాల వాళ్లమైనా... జట్టుగా మేమంతా ఒక్కటే. సమష్టి ప్రదర్శనకు దక్కిన చక్కటి ఫలితమిది’ అని మ్యాచ్ అనంతరం బవుమా పేర్కొన్నాడు. ‘బ్లాక్ లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం సమయంలో జట్టు సహచరుడు క్వింటన్ డికాక్ మోకాళ్లపై నిల్చునేందుకు నిరాకరించిన నోరు మెదపని బవుమా... ఎన్నో అడ్డంకులను దాటుకుంటూ దక్షిణాఫ్రికా జట్టుకు ఐసీసీ ట్రోఫీ అందించిన తొలి నల్లజాతి సారథిగా చరిత్రకెక్కాడు. మైదానం బయట కూడా మంచి మానవతావాదిగా గుర్తింపు తెచ్చుకున్న బవుమా... ప్రస్తుతం నిరుపేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించేందుకు ప్రత్యేకంగా ఒక ఫౌండేషన్ నడుపుతున్నాడు. వాళ్లకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు ఈ సంస్థ సహకారం అందిస్తోంది. -
చోకర్స్ కాదు... విన్నర్స్
దాదాపు ఏడాది క్రితం దక్షిణాఫ్రికా జట్టు భారత్‌తో టి20 వరల్డ్ కప్ ఫైనల్లో తలపడింది. 177 పరుగుల లక్ష్య ఛేదనలో ఒక దశలో చేతిలో 6 వికెట్లతో 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. ఇక విజయం లాంఛనమే అనిపించగా...చివరకు 7 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. డగౌట్లో కూర్చుకున్న కెప్టెన్ మార్క్రమ్ కన్నీళ్లపర్యంతమైన దృశ్యం దక్షిణాఫ్రికా అభిమానులకు కలచివేసింది. ఇప్పుడు సంవత్సరం తిరగక ముందే అతను సఫారీ ఫ్యాన్స్ దృష్టిలో హీరోగా మారిపోయాడు. ఆస్ట్రేలియా ‘బౌలింగ్ చతుష్టయం’ను ఎదుర్కొని దక్షిణాఫ్రికా 282 పరుగులు సాధించగలదా అనే సందేహాల మధ్య అతను అసాధారణ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. తొలి ఇన్నింగ్స్‌లో ‘డకౌట్’ అయినా రెండో ఇన్నింగ్స్‌లో ఎలాంటి అవకాశం ఇవ్వకుండా పట్టుదలగా తన కెరీర్లో అత్యంత విలువైన ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించాడు. కెపె్టన్ తెంబా బవుమా విజయగాథ కూడా ఇలాంటిదే. 64 టెస్టుల కెరీర్లో కేవలం 4 సెంచరీలే సాధించిన అతను ప్రతీసారి తీవ్ర విమర్శలే ఎదుర్కొన్నాడు. ‘బ్లాక్ ఆఫ్రికన్’ కాబట్టి టీమ్‌లో చోటు దక్కిందని, రిజర్వేషన్ కారణంగానే కొనసాగుతున్నాడని వ్యాఖ్యలు వినిపిస్తూ వచ్చాయి. తాజా ఘనతతో బవుమా నాయకుడిగా ఆకాశమంత ఎత్తున నిలిచాడు. ఫైనల్‌కు ముందు తన కెపె్టన్సీలో ఆడిన 9 టెస్టుల్లో 8 మ్యాచ్‌లు గెలిపించి ఓటమి ఎరుగని అతను...ఇప్పుడు టీమ్‌ను వరల్డ్ చాంపియన్‌గా నిలిచి పొట్టివాడు అయినా గట్టివాడే అని నిరూపించాడు. మార్క్రమ్, బవుమా 147 పరుగుల భాగస్వామ్యం ఆ్రస్టేలియా ఆట కట్టించేలా చేసింది. డ్రగ్స్ వివాదం నుంచి బయటపడిన రబాడ 9 వికెట్లతో సఫారీ విజయానికి పునాది వేయగా, రెండో ఇన్నింగ్స్‌లో ఇన్‌గిడి తన విలువ చాటాడు. విమర్శలను అధిగమించి... దక్షిణాఫ్రికా జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించినా...ఆ జట్టుపై పెద్దగా అంచనాలు లేవు. ఎదురుగా బలమైన ఆస్ట్రేలియాలాంటి ప్రత్యర్థి ఉండటంతో పాటు టీమ్‌లో అనుభవలేమి స్పష్టంగా కనిపించింది. టాప్–7 బ్యాటర్లతో పాటు ఆల్‌రౌండర్ యాన్సెన్ మొత్తం టెస్టు పరుగులు కలిపినా... ఒక్క స్టీవ్ స్మిత్ సాధించిన పరుగులకంటే తక్కువగా ఉన్నాయి! పైగా స్టార్క్, కమిన్స్, హాజల్‌వుడ్, లయన్ కలిసి ఆసీస్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించారు. అలాంటి బౌలింగ్‌ను ఎదుర్కొని గెలవడం దాదాపు అసాధ్యమని అనిపించింది. అన్నింటికి మించి సఫారీ టీమ్ ఫైనల్‌కు చేరిన క్రమంపై విమర్శలు ఉన్నాయి. 2023–25 డబ్ల్యూటీసీ సైకిల్లో అగ్రశ్రేణి టీమ్‌లైన ఇంగ్లండ్, ఆ్రస్టేలియాలను ఒక్క టెస్టులోనూ ఎదుర్కోని టీమ్... సొంతగడ్డపై భారత్ చేతిలో 55కు ఆలౌటై చిత్తుగా ఓడింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లాంటి బలహీన ప్రత్యర్థులపై (వరుసగా 7 టెస్టులు) గెలిచి ఫైనల్ చేరిందని వ్యాఖ్యలు వచ్చాయి. అయితే ఫైనల్‌కు ముందు ‘అదంతా మా చేతుల్లో లేదు. ఈ ఒక్క మ్యాచ్ గెలిస్తే దానిని ఎవరూ పట్టించుకోరు’ అంటూ స్పష్టంగా చెప్పిన బవుమా దానిని చేసి చూపించాడు. ఆ్రస్టేలియాను ఓడిస్తేనే వరల్డ్ చాంపియన్‌గా భావిస్తాం అనేవారికి సమాధానం ఇచ్చాడు. స్వదేశంలో టి20 లీగ్ కోసం ప్రధాన ఆటగాళ్లతో కాకుండా ద్వితీయ శ్రేణి జట్టును న్యూజిలాండ్ పంపగా 0–2తో టీమ్ చిత్తయింది. అయినా సరే చివరకు డబ్ల్యూటీసీ ఫైనల్‌కు జట్టు అర్హత సాధించడం విశేషం. ఆనందం దక్కింది... అంతర్జాతీయ క్రికెట్లోకి 1991లో దక్షిణాఫ్రికా పునరాగమనం చేసింది. ఆ తర్వాత 1992 వరల్డ్ కప్ సెమీస్‌లో వర్షం నిబంధనతో ఓడిన జట్టు, 1996లో అన్ని లీగ్‌లు గెలిచి క్వార్టర్స్‌లో అనూహ్యంగా ఓడింది. 1998తో క్రానే, కలిస్, రోడ్స్, బౌచర్‌లతో కూడిన జట్టు తొలి చాంపియన్స్ ట్రోఫీని గెలిచి ఆనందం పంచింది. అయితే ఆ తర్వాతే జట్టు రాత పూర్తిగా మారిపోయింది. గత ఏడాది టి20 వరల్డ్ కప్‌కు ముందు వరకు ఒక్క ఐసీసీ టోర్నీలోనూ ఫైనల్ చేరలేకపోయింది. 1999 సెమీస్‌లో ‘టై’తో గుండె పగలగా, సొంతగడ్డపై 2003లో మళ్లీ వర్షంతో లెక్క తప్పడంతో సెమీస్ కూడా చేరలేకపోయింది. ఆ తర్వాత మూడు సార్లు సెమీస్ వరకు చేరడంలో సఫలమైంది. స్వదేశంలో 2007 టి20 వరల్డ్ కప్‌లో సెమీస్ చేరని జట్టు తర్వాత రెండు సార్లు సెమీస్‌లోనే ఓడింది. చాంపియన్స్ ట్రోఫీలో ఐదు సార్లు సెమీస్‌కే పరిమితమైంది. వేర్వేరు కారణాలతో వచ్చిన ఈ ఓటములతో టీమ్‌లో నైరాశ్యం నెలకొంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికా బోర్డులో రాజకీయాలు, ఆర్థిక సంక్షోభం తదితర కారణాలతో జట్టు ఆటపై కూడా ప్రభావం పడింది. వరుస ఓటములతో టీమ్ వెనుకబడిపోవడంతో ఇతర టీమ్‌ల దృష్టిలో అది ద్వితీయ శ్రేణి జట్టుగా మారిపోయింది. అయితే తాజా విజయం సఫారీ టీమ్‌లో కొత్త ఉత్సాహం తీసుకు రానుంది. 2027 వన్డే వరల్డ్ కప్ కూడా అక్కడే జరగనున్న నేపథ్యంలో ఈ విజయం వారిలో జోష్ నింపడం ఖాయం. -
సూపర్ ‘సఫారీ’
దక్షిణాఫ్రికా సుదీర్ఘ స్వప్నం నెరవేరింది...ఐసీసీ ట్రోఫీ కోసం దాదాపు మూడు దశాబ్దాలుగా పోరాడిన టీమ్ ఎట్టకేలకు ఆ లక్ష్యాన్ని చేరుకుంది...1998లో ఐసీసీ నాకౌట్ కప్ సాధించిన తర్వాత 7 వన్డే వరల్డ్ కప్‌లు, 9 టి20 వరల్డ్ కప్‌లు, 9 చాంపియన్స్ ట్రోఫీలు, 2 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లు జరగ్గా... ఒక్క సారి కూడా టైటిల్ అందుకునే అవకాశమే రాలేదు... అద్భుతంగా ఆడుతూ వచ్చి అసలు సమయంలో చేతులెత్తేసిన సందర్భాలు కొన్నయితే, అవసరమైన చోట అదృష్టం మొహం చాటేసిన సందర్భాలు మరికొన్ని... ఇప్పుడు ఆ ‘చోకర్స్’ ముద్రను వెనక్కి తోస్తూ వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌తో సఫారీ టీమ్ సంబరాలు చేసుకుంది. ఆసక్తికరంగా సాగిన డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆ్రస్టేలియాను చిత్తు చేసి బవుమా సేన సగర్వంగా సత్తా చాటింది. ఐసీసీ టోర్నీ ఫైనల్ అంటే చెలరేగిపోయే ఆసీస్ ఈ సారి మాత్రం బ్యాటింగ్ వైఫల్యంతో తలవంచి నిరాశగా వెనుదిరిగింది.లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో దక్షిణాఫ్రికా చాంపియన్‌గా నిలిచింది. శనివారం ముగిసిన ఫైనల్లో దక్షిణాఫ్రికా 5 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాపై ఘన విజయం సాధించింది. 282 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓవర్‌నైట్ స్కోరు 213/2తో నాలుగో రోజు ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 83.4 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 282 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఎయిడెన్ మార్క్రమ్ (207 బంతుల్లో 136; 14 ఫోర్లు) దాదాపు చివరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ (2021), ఆ్రస్టేలియా (2023) తర్వాత డబ్ల్యూటీసీ గెలుచుకున్న మూడో టీమ్‌గా దక్షిణాఫ్రికా నిలిచింది. విజేత దక్షిణాఫ్రికాకు రూ. 30.76 కోట్లు ప్రైజ్‌మనీ దక్కింది.27.4 ఓవర్లలో 69 పరుగులు... ఆట ఆరంభంలోనే తెంబా బవుమా (134 బంతుల్లో 66; 5 ఫోర్లు)ను కమిన్స్ అవుట్ చేయగా, కొద్ది సేపటికే స్టబ్స్ (8)ను స్టార్క్ బౌల్డ్ చేశాడు. ఆ సమయంలో దక్షిణాఫ్రికా మరో 41 పరుగులు చేయాల్సి ఉండటంతో కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే మరో వైపు మార్క్రమ్ మూడో రోజు తరహాలోనే పట్టుదలగా ఆడుతూ జట్టును గెలుపు దిశగా నడిపించాడు. అతనికి బెడింగ్హామ్ (21 నాటౌట్) అండగా నిలిచాడు. ఎట్టకేలకు కొత్త బంతిని తీసుకున్న వెంటనే తొలి ఓవర్లోనే మార్క్రమ్ను హాజల్‌వుడ్ వెనక్కి పంపించినా...అప్పటికే ఆలస్యమైపోయింది. విజయానికి మరో 5 పరుగులు మాత్రమే కావాల్సి ఉండగా, స్టార్క్ వేసిన బంతిని వెరీన్ కవర్ పాయింట్ దిశగా ఆడి సింగిల్ తీయడంతో సఫారీ శిబిరంలో వేడుక మొదలైంది. స్కోరు వివరాలు: ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్ 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (సి) హెడ్ (బి) హాజల్‌వుడ్ 136; రికెల్టన్ (సి) క్యారీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (సి) క్యారీ (బి) కమిన్స్ 66; స్టబ్స్ (బి) స్టార్క్ 8; బెడింగ్హామ్ (నాటౌట్) 21; వెరీన్ (నాటౌట్) 4; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం (83.4 ఓవర్లలో 5 వికెట్లకు) 282. వికెట్ల పతనం: 1–9, 2–70, 3–217, 4–241, 5–276. బౌలింగ్: స్టార్క్ 14.4–1–66–3, హాజల్‌వుడ్ 19–2–58–1, కమిన్స్ 17–0–59–1, లయన్ 26–4–66–0, వెబ్‌స్టర్ 5–0–13–0, హెడ్ 2–0–8–0. -
SA Vs AUS Photos: 27 ఏళ్ల నిరీక్షణకు తెర.. డబ్ల్యూటీసీ విజేతగా సౌతాఫ్రికా (ఫొటోలు)
-
విజయం దిశగా దక్షిణాఫ్రికా
ఐసీసీ టోర్నీల్లో తమ రాత మార్చుకునేందుకు దక్షిణాఫ్రికా సిద్ధమైంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్లో మూడో రోజు అసాధారణ ఆటతో టైటిల్‌కు చేరువైంది. 282 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఎక్కడా తడబడని సఫారీ టీమ్ గెలుపుపై గురి పెట్టింది. పేలవ ప్రదర్శనతో ఆసీస్ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేయగా... మార్క్రమ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు కండరాల నొప్పితో బాధపడుతూ కూడా బ్యాటింగ్ కొనసాగించిన కెపె్టన్ తెంబా బవుమా అండగా నిలిచాడు. చేతిలో 8 వికెట్లతో శనివారం మరో 69 పరుగులు సాధిస్తే 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ దక్షిణాఫ్రికా ఖాతాలో చేరుతుంది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో విజేతగా నిలిచే దిశగా దక్షిణాఫ్రికా అడుగులు వేస్తోంది. లార్డ్స్ మైదానంలో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో సఫారీ టీమ్ డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియాపై మూడో రోజు సంపూర్ణ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. 282 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా ఆట ముగిసే సమయానికి 56 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 213 పరుగులు సాధించింది. మార్క్రమ్ (159 బంతుల్లో 102 బ్యాటింగ్; 11 ఫోర్లు) శతకం బాదగా... కెప్టెన్ తెంబా బవుమా (121 బంతుల్లో 65 బ్యాటింగ్; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు ఇప్పటికే అభేద్యంగా 143 పరుగులు జోడించారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 144/8తో ఆట కొనసాగించిన ఆ్రస్టేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 207 పరుగులకు ఆలౌటైంది. స్టార్క్ (136 బంతుల్లో 58 నాటౌట్; 5 ఫోర్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. చివరి వికెట్‌కు 59 పరుగులు... మూడో రోజు ఆట ఆరంభంలోనే లయన్ (2)ను రబాడ అవుట్ చేయడంతో ఆసీస్ 9వ వికెట్ కోల్పోయింది. ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సమయం పట్టదనిపించింది. అయితే స్టార్క్ పట్టుదలగా పోరాడాడు. అతనికి హాజల్‌వుడ్ (53 బంతుల్లో 17; 2 ఫోర్లు) అండగా నిలవడంతో ఆలౌట్ చేసేందుకు సఫారీ బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొన్ని చక్కటి షాట్లు ఆడిన స్టార్క్ 131 బంతుల్లో అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. దీంతో ఆసీస్ స్కోరు కూడా 200 దాటింది. ఎట్టకేలకు మార్క్రమ్ బౌలింగ్‌లో హాజల్‌వుడ్ వెనుదిరగడంతో దక్షిణాఫ్రికా ఊపిరి పీల్చుకుంది. స్టార్క్, హాజల్‌వుడ్ 22.3 ఓవర్ల పాటు ఆడి చివరి వికెట్‌కు 59 పరుగులు జోడించడం విశేషం. శతక భాగస్వామ్యం... తొలి ఇన్నింగ్స్‌కు భిన్నంగా దక్షిణాఫ్రికా ఆరంభం నుంచే ధాటిగా ఆడింది. 10 ఓవర్లలోనే 47 పరుగులు చేసిన జట్టు రికెల్టన్ (6) కోల్పోయింది. మార్క్రమ్, ముల్డర్ (27; 5 ఫోర్లు) ఓవర్‌కు 4 పరుగుల రన్‌రేట్‌తో ధాటిని కొనసాగించారు. లబుషేన్ చక్కటి క్యాచ్‌తో ముల్డర్ వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యం ముగిసింది. అయితే ఆ్రస్టేలియా ఆనందం ఇక్కడికే పరిమితమైంది. మార్క్రమ్, బవుమా కలిసి సమర్థంగా ఇన్నింగ్స్‌ను నడిపించారు.ఈ క్రమంలో 69 బంతుల్లోనే మార్క్రమ్ అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. తీవ్రంగా ఎండ కాయడంతో పిచ్ పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారిపోయింది. దాంతో ఆసీస్ ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకపోయింది. కొద్ది సేపటికి బవుమా 83 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆట ముగియడానికి కొద్దిసేపు ముందు మార్క్రమ్ 156 బంతుల్లో సెంచరీతో సగర్వంగా నిలిచాడు. బవుమా క్యాచ్ పట్టి ఉంటే... భారీ భాగస్వామ్యానికి ముందు ఒకే ఒక్క సారి ఆసీస్‌కు మరింత పట్టు బిగించే అవకాశం వచ్చింది. 2 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బవుమాకు లైఫ్ లభించింది. స్టార్క్ ఓవర్లో బవుమా ఆడిన షాట్‌కు బంతి మొదటి స్లిప్‌లోకి దూసుకెళ్ళగా క్యాచ్ అందుకోవడంలో స్మిత్ విఫలమయ్యాడు. అయితే నిజానికి అది అంత సులువైన క్యాచ్ కాదు. ఈ టెస్టులో చాలా బంతులు బ్యాట్‌కు తగిలాక స్లిప్ కార్డాన్కు కాస్త ముందే పడుతుండటంతో స్మిత్ సాహసం చేస్తూ సాధారణంగా నిలబడే చోటుకంటే కాస్త ముందు వచ్చి నిలబడ్డాడు. ముందు జాగ్రత్తగా హెల్మెట్ కూడా పెట్టుకున్నాడు. ఊహించినట్లుగానే బంతి చాలా వేగంగా దూసుకొచి్చంది. మరీ దగ్గర కావడం వల్ల స్పందించే సమయం కూడా లేకపోయింది. దాంతో స్మిత్ కుడి చేతి వేలికి బంతి బలంగా తగిలి కింద పడిపోయింది. నొప్పితో విలవిల్లాడిన అతను వెంటనే మైదానం వీడాడు. అనంతరం స్కానింగ్‌లో వేలు విరిగినట్లు తేలింది! స్కోరు వివరాలు: ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 138; ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: 207; దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: మార్క్రమ్ (బ్యాటింగ్) 102; రికెల్టన్ (సి) కేరీ (బి) స్టార్క్ 6; ముల్డర్ (సి) లబుషేన్ (బి) స్టార్క్ 27; బవుమా (బ్యాటింగ్) 65; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (56 ఓవర్లలో 2 వికెట్లకు) 213. వికెట్ల పతనం: 1–9, 2–70. బౌలింగ్: స్టార్క్ 9–0–53–2, హాజల్‌వుడ్ 13–0–43–0, కమిన్స్ 10–0–36–0, లయన్ 18–3–51–0, వెబ్‌స్టర్ 4–0–11–0, హెడ్ 2–0–8–0. -
ఆస్ట్రేలియాకు భారీ షాక్.. స్టీవ్ స్మిత్‌కు తీవ్ర గాయం
లార్డ్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియా సూపర్ స్టార్ స్టీవ్ స్మిత్ గాయపడ్డాడు. మూడో రోజు ఆట సందర్భంగా స్లిప్‌లో ఫీల్డింగ్ చేస్తుండగా స్మిత్ చేతి వేలికి గాయమైంది. సౌతాఫ్రికా సెకెండ్ ఇన్నింగ్స్ 20వ ఓవర్ వేసిన మిచెల్ స్టార్క్.. రెండో బంతిని బావుమాకు షార్ట్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు.ఆ బంతిని బావుమా లెగ్ సైడ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి థిక్ ఎడ్జ్ తీసుకుని సెకెండ్ స్లిప్ దిశగా వెళ్లింది. ఈ క్రమంలో స్మిత్ ఆ క్యాచ్‌ను అందుకునే ప్రయత్నం చేశాడు. ఈ ప్రయత్నంలో బంతి బలంగా స్మిత్ చిటికెన వేలికి తాకింది. దీంతో స్మిత్ తీవ్రమైన నొప్పితో విల్లవిల్లాడు.వెంటనే ఫిజియో సాయంతో స్మిత్ మైదానం నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడి స్దానంలో కొన్‌స్టాస్ సబ్‌స్ట్యూట్‌గా ఫీల్డ్‌లోకి వచ్చాడు. స్మిత్ గాయంపై క్రికెట్ ఆస్ట్రేలియా అప్డేట్ ఇచ్చింది. అతడి చిటికెన వేలు ఎముక పక్కకు జరిగిందని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో పేర్కొంది. దీంతో త్వరలో వెస్టిండీస్‌తో జరనున్న టెస్టు సిరీస్‌కు స్మిత్ దూరమయ్యే అవకాశముంది. -
రెండో రోజూ 14 వికెట్లు
వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ రెండో రోజు ముగిసేసరికే ఉత్కంఠభరిత స్థితికి చేరింది. గురువారం కూడా పేసర్ల జోరు కొనసాగడంతో తొలి రోజులాగే మొత్తం 14 వికెట్లు నేలకూలాయి. ముందుగా కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా తడబడి ఆధిక్యం కోల్పోగా... ఆ తర్వాత రబాడ, ఇన్‌గిడి దెబ్బకు ఆసీస్ బ్యాటర్లు కూడాచేతులెత్తేశారు. అయితే ఇప్పటికే ఆధిక్యం 200 దాటిన ఆ్రస్టేలియాదే కాస్త పైచేయిగా కనిపిస్తుండగా... చివరి రోజు సఫారీ టీమ్ ముందు ఎంతటి లక్ష్యం ఉంటుందనేది ఆసక్తికరం. లండన్: ఆ్రస్టేలియా డబ్ల్యూటీసీ ట్రోఫీని నిలబెట్టుకుంటుందా... దక్షిణాఫ్రికా 27 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీ గెలుచుకుంటుందా అనేది శుక్రవారమే తేలే అవకాశం ఉంది. బౌలర్లు ఆధిపత్యం ప్రదర్శిస్తున్న ఫైనల్లో మ్యాచ్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా తమ రెండో ఇన్నింగ్స్‌లో 8 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. అలెక్స్ కేరీ (50 బంతుల్లో 43; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... ప్రస్తుతం ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 218 పరుగులకు చేరింది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 43/4తో ఆటను కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్స్‌లో 57.1 ఓవర్లలో 138 పరుగులకు ఆలౌటైంది. దాంతో ఆ్రస్టేలియాకు 74 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. బెడింగ్హామ్ (45; 6 ఫోర్లు), బవుమా (36; 4 ఫోర్లు, 1 సిక్స్) ఫర్వాలేదనిపించారు. కమిన్స్ (6/28) ఆరు వికెట్ల ప్రదర్శనతో చెలరేగాడు. 12 పరుగులకు 5 వికెట్లు... రెండో రోజు బవుమా, బెడింగ్హామ్ భాగస్వామ్యంతో జట్టు పరిస్థితి మెరుగ్గా కనిపించింది. లబుషిషేన్ అద్భుత క్యాచ్‌కు బవుమా వెనుదిరగడంతో ఈ భాగస్వామ్యానికి తెర పడింది. బవుమా, బెడింగ్హామ్ ఐదో వికెట్‌కు 64 పరుగులు జోడించారు. ఆ తర్వాత బెడింగ్హామ్ కొద్దిసేపు పోరాడాడు. అయితే లంచ్ తర్వాత కమిన్స్ ధాటికి దక్షిణాఫ్రికా ఒక్కసారిగా కుప్పకూలింది. 126/5తో ఉన్న జట్టు 12 పరుగుల వ్యవధిలో 5 వికెట్లు కోల్పోయింది. ఒకే ఓవర్లో వెరీన్ (13), యాన్సెన్ (0)లను అవుట్ చేసిన కమిన్స్... బెడింగ్హామ్నూ పెవిలియన్‌కు పంపించి ఐదు వికెట్ల ప్రదర్శనను పూర్తి చేసుకున్నాడు. కేశవ్ మహరాజ్ (7) రనౌట్ కాగా, రబాడ (1) వికెట్‌తో సఫారీల ఇన్నింగ్స్ ముగిసింది. టపటపా... తొలి ఇన్నింగ్స్‌కంటే మెరుగైన ప్రదర్శనతో ప్రత్యర్థికి సవాల్ విసరాల్సిన ఆ్రస్టేలియా బ్యాటింగ్ రెండో ఇన్నింగ్స్‌లో మరింత పేలవంగా సాగింది. ఓపెనర్లు లబుషేన్ (22), ఖ్వాజా (6) తొలి 10 ఓవర్ల పాటు జాగ్రత్తగా ఆడారు. దాంతో ఆసీస్‌కు సరైన ఆరంభం లభించినట్లు అనిపించింది. అయితే ఆ తర్వాత అనూహ్యంగా జట్టు పతనం మొదలైంది.ఒకే ఓవర్లో ఖ్వాజా, గ్రీన్ (0) లను రబాడ పెవిలియన్ పంపించగా, యాన్సెన్ చక్కటి బంతితో లబుషేన్‌ను అవుట్ చేశాడు. స్మిత్ (13) ఇన్‌గిడి బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయాడు. అంపైర్ నాటౌట్ ఇవ్వగా... ‘రివ్యూ’ లో దక్షిణాఫ్రికా ఫలితం సాధించింది. వెబ్‌స్టర్ (9), హెడ్ (9), కమిన్స్ (6) కేవలం 7 పరుగుల వ్యవధిలో వెనుదిరిగారు. కేరీ, స్టార్క్ (16 బ్యాటింగ్) 8వ వికెట్ కు 61 పరుగులు జోడించి జట్టు ను ఆదుకున్నారు. దాంతో ఆసీస్ ఓవరాల్ ఆధిక్యం 200 దాటింది.‘హ్యాండిల్డ్ ద బాల్’ వివాదం దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో అనూహ్య ఘటన చోటు చేసుకుంది. వెబ్‌స్టర్ వేసిన 49వ ఓవర్లో బెడింగ్హామ్ బ్యాట్‌ను తాకిన బంతి అతని కాలి ప్యాడ్ ఫ్లాప్లోకి వెళ్లింది. అది కింద పడే లోపు క్యాచ్ అందుకునేందుకు ఆసీస్ కీపర్ కేరీ ప్రయత్నించాడు. అయితే అదే సమయంలో బెడింగ్హామ్ తన చేత్తో బంతిని తీసి కింద విసిరేశాడు. దీనిపై స్మిత్, ఖ్వాజా ‘హ్యాండిల్డ్ ద బాల్’ గురించి అప్పీల్ చేశారు. దీనిపై ఫీల్డ్ అంపైర్లు గాఫ్నీ, ఇల్లింగ్‌వర్త్ చర్చించి అప్పటికే ‘డెడ్‌బాల్’ అయిందని ప్రకటిస్తూ నాటౌట్‌గా తేల్చారు. అయితే రీప్లేలు చూస్తే బంతి ప్యాడ్‌లో ఇరుక్కుపోకుండా ఇంకా ‘రోలింగ్’లోనే ఉండటం కనిపించింది. అది స్పష్టంగా అవుట్ అని, మూడో అంపైర్‌ను సంప్రదించకుండా ఫీల్డ్ అంపైర్లు వేగంగా నిర్ణయం వెలువరించారని దీనిపై తీవ్ర చర్చ సాగింది. 300 టెస్టుల్లో ప్యాట్ కమిన్స్ వికెట్ల సంఖ్య. ఈ ఘనత సాధించిన ఎనిమిదో ఆ్రస్టేలియా బౌలర్‌గా నిలిచిన కమిన్స్ 68 టెస్టుల్లో ఈ మైలురాయిని చేరాడు. స్కోరు వివరాలుఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్: 212; దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి) కమిన్స్ 6; బవుమా (సి) లబుషేన్ (బి) కమిన్స్ 36; స్టబ్స్ (బి) హాజల్‌వుడ్ 2; బెడింగ్హామ్ (సి) కేరీ (బి) కమిన్స్ 45; వెరీన్ (ఎల్బీ) (బి) కమిన్స్ 13; యాన్సెన్ (సి అండ్ బి) కమిన్స్ 0; మహరాజ్ (రనౌట్) 7; రబాడ (సి) వెబ్‌స్టర్ (బి) కమిన్స్ 1; ఇన్‌గిడి (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (57.1 ఓవర్లలో ఆలౌట్) 138. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30, 5–94, 6–126, 7–126, 8–135, 9–138, 10–138. బౌలింగ్: స్టార్క్ 13–3–41–2, హాజల్‌వుడ్ 15–5–27–1, కమిన్స్ 18.1–6–28–6, లయన్ 8–3–12–0, వెబ్‌స్టర్ 3–0–20–0. ఆ్రస్టేలియా రెండో ఇన్నింగ్స్: లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 22; ఖ్వాజా (సి) వెరీన్ (బి) రబాడ 6; గ్రీన్ (సి) ముల్డర్ (బి) రబాడ 0; స్మిత్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 13; హెడ్ (బి) ముల్డర్ 9; వెబ్‌స్టర్ (ఎల్బీ) (బి) ఇన్‌గిడి 9; కేరీ (ఎల్బీ) (బి) రబాడ 43; కమిన్స్ (బి) ఇన్‌గిడి 6; స్టార్క్ (బ్యాటింగ్) 16; లయన్ (బ్యాటింగ్) 1; ఎక్స్‌ట్రాలు 19; మొత్తం (40 ఓవర్లలో 8 వికెట్లకు) 144. వికెట్ల పతనం: 1–28, 2–28, 3–44, 4–48, 5–64, 6–66, 7–73, 8–134. బౌలింగ్: రబాడ 11–0–44–3, యాన్సెన్ 12–3–31–1, ముల్డర్ 6–0–14–1, ఇన్‌గిడి 9–0–35–3, మహరాజ్ 2–0–10–0. -
WTC Final 2025: చరిత్ర సృష్టించిన రబాడ
లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో నిన్న (జూన్ 11) మొదలైన వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌతాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ చరిత్ర సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసిన అతను.. సౌతాఫ్రికా తరఫున టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు నెలకొల్పాడు. రబాడ ఈ రికార్డు సాధించే క్రమంలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్‌ను (72 టెస్ట్‌ల్లో 330 వికెట్లు) అధిగమించాడు. తాజా ప్రదర్శన అనంతరం రబాడ ఖాతాలో 332 వికెట్లు (70 టెస్ట్‌ల్లో) ఉన్నాయి.టెస్ట్‌ల్లో సౌతాఫ్రికా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రికార్డు డేల్ స్టెయిన్ పేరిట ఉంది. స్టెయిన్ 93 టెస్ట్‌ల్లో 439 వికెట్లు తీశాడు. స్టెయిన్ తర్వాత షాన్ పొలాక్ (108 టెస్ట్‌ల్లో 421 వికెట్లు), మఖాయా ఎన్తిని (101 టెస్ట్‌ల్లో 390 వికెట్లు) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఓవరాల్‌గా టెస్ట్‌ల్లో అత్యధిక వికెట్లు తీసిన రికార్డు ముత్తయ్య మురళీథరన్ పేరిట ఉంది. మురళీ 133 టెస్ట్‌ల్లో 800 వికెట్లు తీశాడు. షేన్ వార్న్ (145 టెస్ట్‌ల్లో 708), జేమ్స్ ఆండర్సన్ (188 టెస్ట్‌ల్లో 704) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు.కాగా, ఆసీస్‌తో జరుగుతున్న డబ్ల్యూటీసీ ఫైనల్లో రబాడ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. రబాడ ఆసీస్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. ఉస్మాన్ ఖ్వాజా, గ్రీన్, వెబ్‌స్టర్, కమిన్స్, స్టార్క్ వికెట్లు తీసి ఆసీస్ పతనాన్ని శాశించాడు.రబాడకు (5/51) జన్సెన్ (3/49), కేశవ్ మహారాజ్ (1/19), మార్క్రమ్ (1/5) తోడవ్వడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకే కుప్పకూలింది (56.4 ఓవర్లలో). తొలి రోజు టీ విరామం కాగానే ఆసీస్ ఇన్నింగ్స్ ముగిసింది. 67 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన ఆసీస్‌ను స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అర్ద సెంచరీలతో ఆదుకున్నారు. వీరిద్దరు ఐదో వికెట్‌కు 79 పరుగులు జోడించి ఆసీస్ గౌరవప్రదమైన స్కోర్ సాధించేందుకు దోహదపడ్డారు. వీరిద్దరు ఔటయ్యాక ఆసీస్ ఇన్నింగ్స్ మరోసారి పేకమేడలా కూలింది. మధ్యలో అలెక్స్ క్యారీ (23) కాసేపు పోరాడాడు. ఆసీస్ ఇన్నింగ్స్‌లో స్మిత్, వెబ్‌స్టర్, క్యారీ కాక లబూషేన్ (17), ట్రవిస్ హెడ్ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగలిగారు. ఓపెనర్ ఉస్మాన్ ఖ్వాజా 20 బంతుల డకౌట్ కావడంతో ఆసీస్ పతనం మొదలైంది.ఈ మ్యాచ్‌తో ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ఓపెనింగ్ ప్రయోగం చేసినప్పటికీ సత్ఫలితం రాలేదు. గాయం నుంచి కోలుకొని చాలాకాలం తర్వాత తిరిగి వచ్చిన కెమరూన్ గ్రీన్ (4) దారుణంగా విఫలమయ్యాడు. స్టీవ్ స్మిత్‌ను మార్క్రమ్, క్యారీని కేశవ్ మహారాజ్.. హెడ్, లియోన్‌ను (0) జన్సెన్ ఔట్ చేశారు.అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన సౌతాఫ్రికాకు కూడా ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. తొలి ఓవర్లోనే మార్క్రమ్ను స్టార్క్ డకౌట్ చేశాడు. జట్టు స్కోర్ 19 పరుగుల వద్ద ఉండగా మరో ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ను (16) స్టార్కే పెవిలియన్‌కు పంపాడు. వన్‌డౌన్ బ్యాటర్‌గా ప్రమోషన్ పొందిన వియాన్ ముల్దర్ (6) దారుణంగా విఫలమయ్యాడు. అతని వికెట్ కమిన్స్‌కు దక్కింది. అనంతరం వచ్చిన ట్రిస్టన్ స్టబ్స్‌ను (2) హాజిల్‌వుడ్ ఔట్ చేశాడు. దీంతో 30 పరుగులకే సౌతాఫ్రికా 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. సౌతాఫ్రికాను గట్టెక్కించే బాధ్యత బవుమా (3), బెడింగ్హమ్ భుజస్కందాలపై ఉంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్ స్కోర్ 43/4గా ఉంది. ప్రస్తుతం ఆ జట్టు ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోర్‌కు ఇంకా 169 పరుగులు వెనుకపడి ఉంది. -
మొదటి రోజు పేసర్ల హవా
సుదీర్ఘ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే అసలు సిసలు సమరం రసవత్తరంగా ప్రారంభమైంది. లార్డ్స్ వేదికగా డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య ప్రారంభమైన ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో పేసర్ల జోరు సాగుతోంది. పచ్చిక పిచ్‌పై పేసర్ రబాడ విజృంభించినా... ఆసీస్ బ్యాటర్లు కాస్త సంయమనం చూపడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. ఆ తర్వాత కంగారూ పేసర్ల ధాటికి దక్షిణాఫ్రికా టాపార్డర్ తడబడింది. రెండో రోజు తొలి సెషన్లో కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్‌ను సఫారీ జట్టు ఎదుర్కోవడంపైనే ఈ మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉంది. లండన్: బ్యాటర్ల పట్టుదలకు బౌలర్ల సహకారం తోడవడంతో... ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌ను ఆ్రస్టేలియా మెరుగ్గా ఆరంభించింది. డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన ఆసీస్ బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయినా... తమ పదునైన పేస్‌తో ప్రత్యర్థిని కట్టిపడేసింది. ఐసీసీ ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పెద్దగా మెరిపించలేకపోయింది. లార్డ్స్ వేదికగా బుధవారం ప్రారంభమైన ఈ పోరులో టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఆ్రస్టేలియా తొలి ఇన్నింగ్స్‌లో 56.4 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. బ్యూ వెబ్‌స్టర్ (92 బంతుల్లో 72; 11 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (112 బంతుల్లో 66; 10 ఫోర్లు) అర్ధ శతకాలు సాధించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు పడగొట్టగా... మార్కో యాన్సెన్ 3 వికెట్లు తీశాడు. అనంతరం తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో 22 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 43 పరుగులు చేసింది. చేతిలో 6 వికెట్లు ఉన్న సఫారీ జట్టు... ప్రత్యర్థి తొలి ఇన్నింగ్స్ స్కోరుకు ఇంకా 169 పరుగులు వెనుకబడి ఉంది. కెప్టెన్ తెంబా బవుమా (3 బ్యాటింగ్)తో పాటు డేవిడ్ బెడింగ్హామ్ (8 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్ 2... హాజల్‌వుడ్, కమిన్స్ చెరో వికెట్ పడగొట్టారు. బౌలర్ల హవా సాగుతున్న ఈ మ్యాచ్‌లో తొలి రోజే 14 వికెట్లు నేలకూలగా... అందులో సింహభాగం (12 వికెట్లు) పేసర్ల ఖాతాలోకే వెళ్లాయి. రబాడ పేస్ దాడి.. ఐసీసీ టెస్టు గదను నిలబెట్టుకునేందుకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియాకు శుభారంభం దక్కలేదు. 20 బంతులాడినా ఖాతా తెరవలేకపోయిన ఉస్మాన్ ఖ్వాజా (0)ను రబాడ పెవిలియన్ బాట పట్టించాడు. అదే ఓవర్లో కామెరూన్ గ్రీన్ (4) కూడా అవుటయ్యాడు. మార్క్రమ్ స్లిప్స్‌లో చక్కటి క్యాచ్‌తో గ్రీన్‌ను సాగనంపగా... క్రీజులో నిలిచేందుకు మొండిగా ప్రయత్నించిన లబుషేన్ (56 బంతుల్లో 17)ను యాన్సెన్ బుట్టలో వేసుకున్నాడు. ఇక ఐసీసీ నాకౌట్ మ్యాచ్‌ల్లో మంచి రికార్డు ఉన్న ట్రావిస్ హెడ్ (11) కీపర్ వెరీన్ పట్టిన ఒంటి చేతి క్యాచ్‌తో పెవిలియన్ చేరుకున్నాడు. దీంతో ఆసీస్ 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ తన అనుభవాన్ని చూపించాడు. పేసర్లను కాచుకుంటూ... చెత్త బంతుల్లో పరుగులు రాబట్టాడు. దీంతో ఇక కోలుకున్నట్లే అనుకుంటున్న దశలో మార్క్రమ్ బౌలింగ్‌లో అనవసర షాట్‌కు అతడు అవుట్ కాగా... కేశవ్ మహరాజ్ బంతిని రివర్స్ స్వీప్ ఆడే ప్రయత్నంలో అలెక్స్ కేరీ (23) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. మరో ఎండ్‌లో ధాటిగా ఆడిన వెబ్‌స్టర్‌ను కూడా రబాడ వెనక్కి పంపడంతో ఆసీస్ ఇన్నింగ్స్ వేగంగా ముగిసింది. 20 పరుగులకే జట్టు తమ చివరి 5 వికెట్లు కోల్పోయింది. బెంబేలెత్తించిన పేస్ త్రయం... దక్షిణాఫ్రికా పేసర్లు విజృంభించిన పిచ్‌పై ఆసీస్ పేస్ త్రయం మరింత రెచ్చిపోతుందని ఊహించినట్లే జరిగింది. బంతి బంతికి వికెట్ తీసేలా కనిపించిన కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్... సఫారీ బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించారు. స్టార్క్ తొలి ఓవర్ చివరి బంతిని వికెట్ల మీదకు ఆడుకున్న మార్క్రమ్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరగా... కాసేపటికి రికెల్టన్ (16) కూడా అతడిని అనుసరించాడు. ఆసీస్ ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేసి అవకాశం ఇచ్చినా... దక్షిణాఫ్రికా బ్యాటర్లు వాటిని వినియోగించుకోలేకపోయారు. క్రీజులో అడుగు పెట్టిన తొలి బంతికే సింగిల్ తీసిన ముల్డర్ (44 బంతుల్లో 6) మరో పరుగు చేసేందుకు 39 బంతుల వరకు ఎదురు చూశాడంటే... కంగారూల బౌలింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు దక్షిణాఫ్రికా కెప్టెన్ బవుమా 31వ బంతికి ఖాతా తెరవగా... స్టబ్స్ (2) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. 4 దక్షిణాఫ్రికా తరఫున టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో కగిసో రబాడ నాలుగో స్థానానికి (332 వికెట్లు) చేరుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతను అలెన్ డొనాల్డ్ (330)ను అధిగమించగా...టాప్–3లో వరుసగా డేల్ స్టెయిన్ (439, షాన్ పొలాక్ (421), మఖయా ఎన్తిని (390) ఉన్నారు. స్కోరు వివరాలు ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: ఖ్వాజా (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 0; లబుషేన్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 17; గ్రీన్ (సి) మార్క్రమ్ (బి) రబాడ 4; స్మిత్ (సి) యాన్సెన్ (బి) మార్క్రమ్ 66; హెడ్ (సి) వెరీన్ (బి) యాన్సెన్ 11; వెబ్‌స్టర్ (సి) బెడింగ్హామ్ (బి) రబాడ 72; కేరీ (బి) కేశవ్ 23; కమిన్స్ (బి) రబాడ 1; స్టార్క్ (బి) రబాడ 1; లయన్ (బి) యాన్సెన్ 0; హాజల్‌వుడ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (56.4 ఓవర్లలో ఆలౌట్) 212. వికెట్ల పతనం: 1–12, 2–16, 3–46, 4–67, 5–146, 6–192, 7–199, 8–210, 9–211, 10–212. బౌలింగ్: రబాడ 15.4–5–51–5; యాన్సెన్ 14–5–49–3; ఇన్‌గిడి 8–0–45–0; ముల్డర్ 11–3–36–0; కేశవ్ మహరాజ్ 6–0–19–1; మార్క్రమ్ 2–0–5–1. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: మార్క్రమ్ (బి) స్టార్క్ 0; రికెల్టన్ (సి) ఖ్వాజా (బి) స్టార్క్ 16; ముల్డర్ (బి)కమిన్స్ 6; బవుమా (నాటౌట్) 3; స్టబ్స్ (బి) హాజల్‌వుడ్ 2; బెడింగ్హామ్ (నాటౌట్) 8; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (22 ఓవర్లలో 4 వికెట్లకు) 43. వికెట్ల పతనం: 1–0, 2–19, 3–25, 4–30. బౌలింగ్: స్టార్క్ 7–3–10–2; హాజల్‌వుడ్ 7–3–10–1; కమిన్స్ 7–3–14–1; లయన్ 1–0–1–0. -
డబ్ల్యూటీసీ ఫైనల్.. ఆస్ట్రేలియా జట్టులో అనూహ్య మార్పు
లార్డ్స్ వేదికగా జూన్ 11న ప్రారంభమయ్యే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ 2023-25 ఫైనల్ కోసం సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు తమ ప్లేయింగ్ ఎలెవెన్‌ను ప్రకటించాయి. ఇరు జట్లలో ఊహించిన ఆటగాళ్లే తుది జట్టులో చోటు దక్కించుకున్నారు. అయితే ఆస్ట్రేలియా మాత్రం తమ బ్యాటింగ్ ఆర్డర్లో ఓ అనూహ్య మార్పు చేసింది. మిడిలార్డర్లో కీలకమైన మార్నస్ లబూషేన్‌ను ఆసీస్ మేనేజ్మెంట్ ఓపెనర్‌గా ప్రమోట్ చేసింది. డేవిడ్ వార్నర్ రిటైరయ్యాక ఆసీస్ ఓపెనర్ సమస్యను ఎదుర్కొంటుంది. కొన్ని మ్యాచ్‌ల్లో స్టీవ్ స్మిత్‌ను ప్రయోగించినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. దీంతో ఉస్మాన్ ఖ్వాజాకు జోడీగా లబూషేన్‌తో ప్రయోగానికి పూనుకుంది. కీలక డబ్ల్యూటీసీ ఫైనల్ కావడంతో ఓపెనర్‌గా లబూషేన్ ఏ మేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. మరోవైపు సౌతాఫ్రికా కూడా బ్యాటింగ్ లైనప్‌లో ఓ మార్పు చేసింది. బౌలింగ్ ఆల్‌రౌండర్ వియాన్ ముల్దర్‌ను వన్‌డౌన్‌కు ప్రమోట్ చేసింది. సౌతాఫ్రికా తుది జట్టులో ఏకంగా నలుగురు వికెట్‌కీపర్ బ్యాటర్లు (రికెల్టన్, స్టబ్స్, వెర్రిన్, బెడింగ్హమ్) ఉండటం విశేషం. అయితే మ్యాచ్‌లో మాత్రం వెర్రిన్ వికెట్‌కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నట్లు సౌతాఫ్రికా మేనేజ్మెంట్ ప్రకటించింది.మ్యాచ్ విషయానికొస్తే.. డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా టైటిల్ నిలబెట్టుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది. మరోవైపు 27 ఏళ్లుగా ఐసీసీ టైటిల్ సాధించలేకపోయిన సౌతాఫ్రికా ఈ సువర్ణావకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని మహా పట్టుదలగా ఉంది.డబ్ల్యూటీసీలో ఇది మూడో ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత సాధించలేకపోయింది. మూడో స్థానంతో సరిపెట్టుకుంది.తుది జట్లు..దక్షిణాఫ్రికా: ఎయిడెన్ మార్క్రమ్, 2. ర్యాన్ రికెల్టన్, 3. వియాన్ ముల్డర్, 4. టెంబా బవుమా (కెప్టెన్), 5. ట్రిస్టన్ స్టబ్స్, 6. డేవిడ్ బెడింగ్హమ్, 7. కైల్ వెర్రిన్ (వికెట్‌కీపర్), 8. మార్కో జన్సెన్, 9. కేశవ్ మహారాజ్, 10. కగిసో రబాడ, 11. లుంగి ఎంగిడిఆస్ట్రేలియా: 1. ఉస్మాన్ ఖవాజా, 2. మార్నస్ లబూషేన్, 3. కెమరూన్ గ్రీన్, 4. స్టీవ్ స్మిత్, 5. ట్రావిస్ హెడ్, 6. బ్యూ వెబ్‌స్టర్, 7. అలెక్స్ క్యారీ (వికెట్‌కీపర్), 8. పాట్ కమిన్స్ (కెప్టెన్), 9. మిచెల్ స్టార్క్, 10. నాథన్ లియోన్, 11. జోష్ హాజిల్‌వుడ్ -
రెండు జట్లకు తుది ‘టెస్టు’
టెస్టు క్రికెట్లో అతి పెద్ద సమరానికి రంగం సిద్ధమైంది. సాంప్రదాయ ఫార్మాట్లో విశ్వ విజేతను తేల్చే వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరుకు నేడు తెర లేవనుంది. డిఫెండింగ్ చాంపియన్ ఆ్రస్టేలియా తమ టైటిల్‌ను నిలబెట్టుకోవాలని భావిస్తుండగా... గత 27 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీని సాధించలేకపోయిన దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి రికార్డును మార్చాలని పట్టుదలగా ఉంది. వరుసగా మూడోసారి ఇంగ్లండ్ డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఆతిథ్యం ఇస్తుండగా సౌతాంప్టన్, ఓవల్ తర్వాత ఈసారి వేదిక ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానానికి మారింది. లండన్: వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) 2023–25 టైటిల్ వేటలో ఆ్రస్టేలియా, దక్షిణాఫ్రికా హోరాహోరీ సమరానికి ‘సై’ అంటున్నాయి. లార్డ్స్ మైదానంలో నేటి నుంచి జరిగే ఫైనల్ పోరులో ఇరు జట్లు తలపడతాయి. 2023–25 మధ్య కాలంలో 9 జట్లు 27 సిరీస్‌లలో కలిపి మొత్తం 69 మ్యాచ్‌లలో తలపడిన అనంతరం తుది సమరానికి ఆసీస్, సఫారీ టీమ్ అర్హత సాధించాయి. ఇది మూడో డబ్ల్యూటీసీ ఫైనల్ కాగా...తొలి రెండు ట్రోఫీలను న్యూజిలాండ్, ఆ్రస్టేలియా గెలుచుకున్నాయి. రెండు సందర్భాల్లోనూ ఫైనల్ చేరి ఓడిన భారత్ ఈసారి తుది పోరుకు అర్హత పొందలేకపోయింది. ఆసీస్ అదే జోరుతో... ఐసీసీ ఫైనల్ మ్యాచ్‌లు అనగానే ఆస్ట్రేలియా ఆట ఒక్కసారిగా పతాక స్థాయికి చేరుతుందని గతంలో చాలాసార్లు రుజువైంది. ఆఖరి సమరంలో ప్రత్యర్థిపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడి మ్యాచ్‌ను తమ సొంతం చేసుకోవడంలో ఆ జట్టుకు తిరుగులేదు. మూడు ఫార్మాట్లలో కలిపి 13 ఐసీసీ ఫైనల్స్ ఆడిన కంగారూలు 10 టైటిల్స్ సాధించడం వారి ఆధిపత్యాన్ని చూపిస్తోంది. 2023లో భారత్‌పై ఫైనల్ ఆడిన తుది జట్టులోంచి 9 మంది మళ్లీ ఇక్కడా బరిలోకి దిగడం ఖాయమైంది. వార్నర్ రిటైర్ కాగా, ఆల్‌రౌండర్ వెబ్‌స్టర్‌కు చోటు దక్కింది. గాయంతో నాటి మ్యాచ్‌కు దూరమైన హాజల్‌వుడ్ ఇప్పుడు బోలండ్ స్థానంలో ఆడతాడు. ఖ్వాజాకు జోడీగా లబుõÙన్ ఓపెనింగ్ చేయనుండగా, గ్రీన్ మూడో స్థానంలో ఆడతాడు. ఆల్‌టైమ్ గ్రేట్ బ్యాటర్లలో ఒకడైన స్టీవ్ స్మిత్, గత డబ్ల్యూటీసీ ఫైనల్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ హెడ్ బ్యాటింగ్‌లో ప్రధాన బలం కాగా, కీపర్ అలెక్స్ కేరీ కూడా చెలరేగిపోగలడు. కమిన్స్, స్టార్క్, హాజల్‌వుడ్, లయన్లతో టీమ్ బౌలింగ్ పటిష్టంగా కనిపిస్తోంది. రాత మారేనా... దక్షిణాఫ్రికా వరుసగా గత 7 టెస్టుల్లో విజయాలు సాధించి ముందుగా ఫైనల్‌కు అర్హత సాధించినా సరే టీమ్‌పై విమర్శలు వచ్చాయి. టెస్టుల్లో అగ్రగామి అయిన ఆ్రస్టేలియా, ఇంగ్లండ్‌లాంటి టీమ్‌లతో లీగ్ దశలో ఒక్కసారి కూడా తలపడకుండానే జట్టు ఫైనల్ చేరింది. అయితే ఏ దారిలో వచ్చినా ఇప్పుడు తుది పోరులో విజేతగా నిలిచి సత్తా చాటాలని సఫారీలు భావిస్తున్నారు. అయితే జట్టులో అనుభవలేమి స్పష్టంగా కనిపిస్తోంది. మార్క్రమ్, కెపె్టన్ తెంబా బవుమాలకు మాత్రమే ప్రస్తుత ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్న అనుభవం ఉంది. రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్ ఇంకా టెస్టు కెరీర్ ఆరంభ దశలోనే ఉన్నారు. ఇంకా చెప్పాలంటే సఫారీ టాప్–7 బ్యాటర్లందరి టెస్టు పరుగులు కలిపినా (9,873)... ఒక్క స్మిత్ (10,271) పరుగులకంటే తక్కువే ఉన్నాయి! అయితే వైవిధ్యమైన బౌలింగ్ తో ఆసీస్‌ను కట్టడి చేయగలమని నమ్ముతోంది. ఇంగ్లండ్‌లో వాతావరణం అనుకూలిస్తే తన స్వింగ్‌తో రబాడ ప్రమాదకరమైన బౌలర్ కాగా, యాన్సెన్ లెఫ్టార్మ్ పేస్ కూడా ఇటీవల పదునెక్కింది. ఇక స్పిన్ కోసం మరోసారి దక్షిణాఫ్రికా మహరాజ్నే నమ్ముకుంది.పిచ్, వాతావరణంసాధారణ బ్యాటింగ్ పిచ్. ప్రస్తుతం ఉపఖండం తరహాలోనే వాతావరణం ఉంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. వర్షంతో అంతరాయం కలగవచ్చు. అయితే ఐదు రోజులలో నిర్ణీత ఓవర్లు పూర్తి కాకుండా ఫలితం రాకపోతే ‘రిజర్వ్ డే’ ఆరో రోజుకు మ్యాచ్ సాగుతుంది. భారత్, కివీస్ మధ్య 2021 ఫైనల్లో ఇదే జరిగింది.తుది జట్లు (అంచనా)ఆస్ట్రేలియా: కమిన్స్ (కెప్టెన్), ఖ్వాజా, లబుషేన్, గ్రీన్, స్మిత్, హెడ్, వెబ్‌స్టర్, కేరీ, స్టార్క్, లయన్, హాజల్‌వుడ్. దక్షిణాఫ్రికా: బవుమా (కెప్టెన్), మార్క్రమ్, రికెల్టన్, ముల్డర్, స్టబ్స్, బెడింగ్హామ్, వెరీన్, యాన్సెన్, కేశవ్ మహరాజ్, రబాడ, ఇన్‌గిడి. -
సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ప్రకటన.. సీఎస్కే చిచ్చరపిడుగుకు చోటు
ఈ నెలాఖరులో జింబాబ్వేతో జరుగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం 16 మంది సభ్యుల దక్షిణాఫ్రికా జట్టును ఇవాళ (జూన్ 6) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా ఎంపిక కాగా.. ఐదు అన్క్యాప్డ్ ప్లేయర్లకు చోటు దక్కింది. తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఇరగదీసిన సీఎస్కే చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ తొలిసారి టెస్ట్ జట్టు నుంచి పిలుపునందుకున్నాడు. అతనితో పాటు మరో విధ్వంసకర బ్యాటర్ లుహాన్-డ్రి-ప్రిటోరియస్ కూడా టెస్ట్ అరంగేట్రానికి సిద్దమయ్యాడు. జింబాబ్వే సిరీస్‌లో బ్రెవిస్, ప్రిటోరియస్ సెంటర్ ఆఫ్ ద అట్రాక్షన్‌గా ఉంటారు. భారీ హిట్టర్లుగా పేరున్న వీరు టెస్ట్ ఫార్మాట్లో ఏమేరకు రాణిస్తారో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన అన్క్యాప్డ్ ప్లేయర్ల జాబితాలో బ్రెవిస్, ప్రిటోరియస్తో పాటు లెసెగొ సెనొక్వానే (బ్యాటర్), కోడి యూసఫ్ (ఫాస్ట్ బౌలర్), ప్రెనెలన్ సుబ్రాయన్ (ఆఫ్ స్పిన్నర్) ఉన్నారు. స్పిన్నర్ జుబేర్ హంజా ఏడాది తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ప్రస్తుతం ఇంగ్లండ్‌లో ఉన్న జట్టులోని ఎనిమిది మందికి (బవుమా, బెడింగ్హమ్, కార్బిన్ బాష్, జోర్జి, కేశవ్ మహారాజ్, ముల్దర్, ఎంగిడి, వెర్రిన్) మాత్రమే ఈ జట్టులో చోటు దక్కింది. జన్సెన్, రబాడ, మార్క్రమ్, రికెల్టన్, ట్రిస్టన్ స్టబ్స్‌కు విశ్రాంతి కల్పించారు. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ జూన్ 11 నుంచి 15 వరకు లార్డ్స్ వేదికగా జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ కోసం సౌతాఫ్రికా జట్టు ఇదివరకే లండన్‌కు చేరుకుంది.జింబాబ్వేతో సిరీస్ షెడ్యూల్.. తొలి టెస్ట్-జూన్ 28-జులై 2 (బులవాయో)రెండో టెస్ట్-జులై 6-10 (బులవాయో)జింబాబ్వే సిరీస్‌కు దక్షిణాఫ్రికా టెస్టు జట్టు: టెంబా బవుమా (కెప్టెన్), డేవిడ్ బెడింగ్హమ్, మాథ్యూ బ్రీట్జ్కే, డెవాల్డ్ బ్రెవిస్, కార్బిన్ బాష్, టోనీ డి జోర్జి, జుబేర్ హంజా, కేశవ్ మహరాజ్, క్వేనా మఫాకా, వియాన్ ముల్డర్, లుంగి ఎంగిడి, లుహాన్-డ్రి-ప్రిటోరియస్, ప్రీటోరియస్, లెసెగొ సెనొక్వానే, ప్రెనెలన్ సుబ్రాయన్, కైల్ వెర్రిన్, కోడి యూసుఫ్. -
హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం
సౌతాఫ్రికా విధ్వంసకర ఆటగాడు హెన్రిచ్ క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నాడు. 33 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన క్రికెట్ ప్రపంచాన్ని షాక్‌కు గురి చేసింది. క్లాసెన్ ఈజీగా మరో రెండు, మూడేళ్లు అంతర్జాతీయ కెరీర్‌ను కొనసాగించి ఉండవచ్చు. మరో విధ్వంసకర బ్యాటర్, ఆసీస్ ఆటగాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్ వన్డేలకు రిటైర్మెంట్ ప్రకటించిన గంటల వ్యవధిలోనే క్లాసెన్ రిటైర్మెంట్ ప్రకటన రావడంతో వారివారి దేశ క్రికెట్ అభిమానులు విచారం వ్యక్తం చేస్తున్నారు. మ్యాక్స్‌తో పోలిస్తే క్లాసెన్‌కు వయసు, ఫామ్ రెండూ ఉన్నాయి. పైగా 2027లో సౌతాఫ్రికాలో వన్డే వరల్డ్‌కప్ జరుగనుంది. క్లాసెన్ ఈ టోర్నీ ఆడతాడని ఆ దేశ అభిమానులు ఆశించి ఉంటారు. అయితే క్లాసెన్ షాకింగ్ నిర్ణయం తీసుకుని వారికి దుఖాన్ని మిగిల్చాడు. ఈ ఏడాది స్టార్ క్రికెటర్లు ఒక్కొక్కరుగా రిటైర్మెంట్ ప్రకటిస్తూ వస్తున్నారు. రోహిత్, కోహ్లి టెస్ట్‌లకు.. స్టీవ్ స్మిత్, మ్యాక్స్‌వెల్ వన్డేలకు.. తాజాగా క్లాసెన్ మూడు ఫార్మాట్లకు వీడ్కోలు పలికాడు.2018లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన క్లాసెన్.. సౌతాఫ్రికా తరఫున 4 టెస్ట్‌లు, 60 వన్డేలు, 58 టీ20లు ఆడాడు. ఇందులో 4 సెంచరీలు (వన్డేల్లో), 16 హాఫ్ సెంచరీల సాయంతో 3245 పరుగులు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించినా క్లాసెన్ ఐపీఎల్ తదితర లీగ్‌ల్లో కొనసాగుతాడు. క్లాసెన్ ఇటీవలే ఐపీఎల్లో సెంచరీ బాది వార్తల్లో నిలిచాడు. కేకేఆర్‌తో జరిగిన తమ చివరి మ్యాచ్‌లో క్లాసెన్ కేవలం 39 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 105 (నాటౌట్) పరుగులు చేశాడు. క్లాసెన్‌కు ఐపీఎల్లో ఇది రెండో సెంచరీ. ఈ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడిన క్లాసెన్ 172.70 స్ట్రయిక్‌రేట్‌తో 487 పరుగులు చేశాడు. ఈ సీజన్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఈ సీజన్ మెగా వేలానికి ముందు సన్‌రైజర్స్ యాజమాన్యం క్లాసెన్‌ను రీటైన్ చేసుకుంది. -
శ్వేతసౌధంలో మళ్లీ ‘పంచాయితీ’
అతిథుల్ని పిలిచి బహిరంగంగా వాగ్యుద్ధానికి దిగటం ఏ రకంగా దౌత్యనీతి అవుతుందో, దాన్ని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎక్కడ నేర్చారో ఎవరికీ తెలియదు. కానీ ఆయన దాన్ని కొనసాగించదల్చుకున్నారని దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రాంఫోసాతో వైట్‌హౌస్‌లో తాజాగా సాగిన జగడం నిరూపిస్తోంది. మొన్న ఫిబ్రవరిలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో ట్రంప్ ఇదే మాదిరి తగువు పెట్టుకున్నారు. ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దురాక్రమణ యుద్ధంలో తప్పంతా ఉక్రెయిన్‌దే అన్నట్టు తేల్చి, దాన్ని వెంటనే నిలిపేయాలని ఒత్తిడి తెచ్చారు.అడుగడుగునా అవమా నిస్తూ మాట్లాడారు. మళ్లీ మూణ్ణెల్లకు అదే వైట్‌హౌస్‌లో ట్రంప్ ఆ డ్రామాకే తెరతీశారు. నిజానికి ఇరు దేశాల అధినేతలు కలుసుకుని చర్చించినాక వారిద్దరూ కలిసి మాట్లాడే మీడియా సంయుక్త సమావేశం లాంఛనప్రాయమైనది. నాలుగు గోడలమధ్యా నిర్మొహమాటంగా మాట్లాడుకున్నా, వాదులాడుకున్నా... మీడియా సమావేశంలో పరస్పరం ప్రశంసించుకోవటాలు, రెండు దేశాల మధ్యా కుదిరిన ఒప్పందాల విశిష్టతను అతిగా చూపించుకోవటాలు జరిగిపోతాయి. ఇందువల్లరెండు దేశాల్లోనూ అధినేతలకు ప్రశంసలు దక్కుతాయి. కానీ ఇలాంటివి ట్రంప్‌కు పట్టవు. ప్రపంచానికి తాను మకుటంలేని మహారాజునని, ఎవరినైనా ఏమైనా అనగలనని అమెరికా శ్వేతజాతి ఓటరు మహాశయులకు ఆయన చెప్పదల్చుకున్నారు.అందుకే అతిథులుగా వచ్చిన అధినేతలను కెమెరాల ముందు ఇష్టానుసారం మాట్లాడటం అల వాటు చేసుకున్నారు. పోనీ ఆయన నిలదీస్తున్న అంశాలు గొప్పవేమీ కాదు. వాటిల్లో చాలామటుకు నకిలీవీ... నిరాధారమైనవీ. సామాజిక మాధ్యమాల్లో ఎవరెవరో పెట్టే తప్పుడు పోస్టింగులే వాటికి ఆధారం. ఉక్రెయిన్‌లో దేశాధినేతను మార్చి, ఆయన ద్వారా రష్యాను చీకాకుపెట్టి చివరకు అది రెచ్చిపోయి దాడిచేసే స్థితి కల్పించింది అమెరికాయే. అటు తర్వాత రష్యాను ప్రపంచంలో ఏకాకిని చేయటానికి ప్రయత్నించి, ఉక్రెయిన్‌కు పెద్దయెత్తున ఆయుధాలు అమ్ముకున్నది అమెరికాయే. నాటో దేశాలను సైతం ఈ రొంపిలోకి దించింది కూడా ఆ దేశమే. జో బైడెన్ హయాంలో ఇవన్నీ జరిగినట్టు తెలిసినా, ట్రంప్ ఏమీ తెలియనట్టు నటించారు. ఉక్రెయిన్నే వేలెత్తి చూపారు. ఇప్పుడు రాంఫోసాతో సైతం అదే తరహాలో వ్యవహారం నడిపారు. దక్షిణాఫ్రికాలో శ్వేతజాతీయుల ఊచకోత సాగుతున్నదనీ, వాటిల్లో చాలాభాగం బయటకు రావటం లేదనీ ట్రంప్ వాదించారు. ఒకప్పటి శ్వేతజాతి పాలనలో నల్లజాతీయులపై అఘాయి త్యాలు జరిగాయని ఒప్పుకుంటూనే ఇప్పుడు నల్లజాతి పాలనలో శ్వేతజాతీయుల్ని ఆ మాదిరేహింసిస్తున్నారని చెప్పుకొచ్చారు. మీ వద్ద ఆధారాలున్నాయా అని రాంఫోసా అడిగితే, లేవని అంగీ కరిస్తూనే ట్రంప్ ఒక వీడియో ప్రదర్శించారు. అందులో నల్లజాతి వామపక్ష నాయకుడు జూలియస్ మలేమా ‘శ్వేతజాతి ఆఫ్రికన్లను హతమార్చండ’ంటూ నినాదాలిస్తున్న దృశ్యాలు కనబడ్డాయి. మొత్తం గంటసేపు జరిగిన ఈ మీడియా సమావేశంలో రాంఫోసా ఎక్కడా ఆవేశానికి పోకుండాఎంతో సంయమనంతో ట్రంప్‌కు జవాబిచ్చే ప్రయత్నం చేశారు. నిజానికి దక్షిణాఫ్రికాలో ఇప్పటికీ నాలుగింట మూడొంతుల వ్యవసాయ భూములు 8 శాతంకన్నా తక్కువ జనాభాగల శ్వేతజాతీయుల చేతుల్లో వున్నాయి. జనాభాలో 80 శాతంగా వున్న నల్లజాతీయులకు వ్యవసాయ భూముల్లో వాటా కేవలం 4 శాతం మాత్రమే. కానీ ట్రంప్ మాత్రం దక్షిణాఫ్రికా ప్రభుత్వం శ్వేతజాతీయుల భూముల్ని గుంజుకుని వాటిని నల్లజాతీయులకు పంచు తున్నదని ఆరోపించారు. శ్వేతజాతి దురహంకార పాలనలో నల్లజాతీయుల నుంచి అక్రమంగా చేజిక్కించుకున్న భూములు వెనక్కిప్పించాలని స్థానికులు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నా అక్కడి ప్రభుత్వం అంగీకరించటం లేదు. దానికి బదులు స్వచ్ఛందంగా అమ్మటానికి సిద్ధపడే శ్వేత జాతీయులకు పలు రాయితీలిస్తున్నది. శ్వేతజాతి రైతుల ఊచకోత సాగుతున్నదన్న ట్రంప్ వాదన కూడా పూర్తి అబద్ధం. నేరాల రేటు చూస్తే ప్రపంచంలోనే దక్షిణాఫ్రికా ముందుంది. అక్కడ సగటున రోజుకు 72 హత్యలు జరుగుతాయి. ఆరుకోట్ల జనాభాగల ఆ దేశంలో హతుల్లో అత్యధికులు నల్లజాతీయులు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం నిరుడు 26,232 మంది హత్యకు గురైతే అందులో కేవలం 8 మంది మాత్రమే శ్వేతజాతి రైతులు. వాస్తవాలు ఇవికాగా ట్రంప్ వైట్‌హౌస్ వేదికగా ఒక దేశాధినేతపై ప్రపంచమంతా చూస్తుండగా దబాయించటం ఎంత దారుణం! నిజానికి రెండు దేశాలూ చర్చించి పరిష్కరించుకోవాల్సినవి చాలావున్నాయి. శ్వేతజాతి రైతుల ఊచకోత ప్రచారాన్ని నమ్మటంతో బైడెన్ హయాంలోనే నిధులు ఆపేశారు. ట్రంప్ వచ్చాక 25 శాతం సుంకాల విధింపును ప్రకటించారు. ఆ దేశంలోని సహజ వనరులపై ట్రంప్ కన్నుపడింది. వీటిపై అర్థవంతమైన చర్చలు జరగకుండానే తప్పుడు ప్రచారంపై వాదులాట సాగింది. గాజాలో ఇజ్రాయెల్ సాగిస్తున్న ఊచ కోతపై ధైర్యంగా అంతర్జాతీయ న్యాయస్థానం తలుపుతట్టింది దక్షిణాఫ్రికాయే. రాంఫోసా అదృష్టం బాగుండి ట్రంప్‌కు ఆ సంగతి గుర్తురాలేదు. లేకుంటే మరింతగా విరుచుకుపడేవారు. వర్తమాన ప్రపంచంలో పలు దేశాధినేతలు తప్పుడు సమాచారాన్నీ, వదంతుల్నీ ప్రచారంలో పెట్టి అధికారంలోకొచ్చినవారే. ఈ ఎత్తుగడలే మరోసారి అందలం ఎక్కిస్తాయని... రాజ్యాంగాన్ని సవరించి మూడోసారి అధ్యక్షుడు కావాలని కలగంటున్న ట్రంప్ విశ్వసిస్తున్నారు. ఇలాంటపుడు అమెరికాలో అడుగుపెట్టడానికీ, ట్రంప్‌తో చీవాట్లు తినటానికీ ఏ దేశాధినేతయినా ధైర్యం చేయగలరా? -
IPL 2025: నేనైతే వెళ్లేవాడిని కాదు.. మీరూ వెళ్లొద్దు: ఆసీస్ మాజీ క్రికెటర్
ఐపీఎల్-2025 (IPL 2025) ప్లే ఆఫ్స్ దశకు చేరుకున్న వేళ అనుకోని విధంగా వారం పాటు వాయిదా పడింది. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత్- పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అయితే, ప్రస్తుతం పరిస్థితులు చక్కబడటంతో లీగ్‌ను పునఃప్రారంభించేందుకు బోర్డు సిద్ధమైంది.కొందరు వచ్చేశారుఇప్పటికే పది ఫ్రాంఛైజీలకు తమ ఆటగాళ్లందరినీ ఒకే చోట చేర్చాల్సిందిగా ఆదేశించిన బోర్డు.. శనివారం (మే 17) నుంచి మ్యాచ్‌లు కొనసాగించనుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే కొంత మంది విదేశీ ఆటగాళ్లు భారత్‌కు చేరుకోగా.. మరికొంత మంది జాతీయ జట్టు విధుల దృష్ట్యా స్వదేశాల్లోనే ఉండిపోయారు.ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మిచెల్ జాన్సన్ ఐపీఎల్ ఆడే విదేశీ ఆటగాళ్లను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘ఐపీఎల్ ఆడేందుకు తిరిగి ఇండియాకు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఆటగాళ్లకే వదిలివేసింది.నేనైతే ‘నో’ చెప్పేవాడినినిజానికి మధ్యలోనే ఇలా లీగ్‌ను వదిలివేయడం నిరాశకు గురిచేస్తుంది. ప్రొఫెషనల్‌గా, ఆర్థికంగా ఒక్కోసారి ఎదురుదెబ్బలు తగులుతాయి. అయితే, అన్నింటికంటే భద్రతే ముఖ్యం. ఒకవేళ నేనే గనుక వారి స్థానంలో ఉండి ఉంటే.. ఇండియాకు వెళ్లి లీగ్ పూర్తి చేయాలని ఆదేశించినా.. కచ్చితంగా ‘నో’ చెప్పేవాడిని.ఎందుకంటే నా వరకు చెక్కుల కంటే కూడా ప్రాణాలు ముఖ్యమైనవి. అయితే, ఇది కేవలం నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. ఐపీఎల్ ఒక్కటనే కాదు.. పాకిస్తాన్ సూపర్ లీగ్ ఆడేందుకు కూడా ఆటగాళ్లు అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదనే నేను భావిస్తున్నా’’ అని మిచెల్ జాన్సన్ ది వెస్ట్రన్ ఆస్ట్రేలియన్‌కు రాసిన కాలమ్‌లో పేర్కొన్నాడు.సౌతాఫ్రికా క్రికెట్ బోర్డు ఓప్పుకోవడానికి కారణం అదేఅదే విధంగా.. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్-2025 ఫైనల్ గురించి ప్రస్తావిస్తూ.. ‘‘జూన్ 3న ఐపీఎల్ ఫైనల్ జరుగుతుంది. ఆ తర్వాత వారం రోజులకే లార్డ్స్‌లో డబ్ల్యూటీసీ ఫైనల్ ఉంది. కాబట్టి ఈ మెగా మ్యాచ్‌కు సన్నద్ధమయ్యే క్రమంలో ఆటగాళ్లపై తీవ్రమైన ఒత్తిడి నెలకొంటుంది’’ అని మిచెల్ జాన్సన్ పేర్కొన్నాడు.అయితే, బీసీసీఐతో సౌతాఫ్రికా క్రికెట్ బోర్డుకు ఉన్న ఆర్థిక సంబంధాల దృష్ట్యా ప్రొటిస్ ఆటగాళ్లంతా తిరిగి ఐపీఎల్లో పాల్గొంటారని జాన్సన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఐపీఎల్ ఫ్రాంఛైజీల సారథ్యంలోనే సౌతాఫ్రికా టీ20 లీగ్ జరుగుతున్న విషయం తెలిసిందే.రిక్కీ పాంటింగ్ ఉండటమే కాదు.. వాళ్లనూ ఒప్పించాడుఇదిలా ఉంటే.. ధర్మశాలలో పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ అర్ధంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. పాక్ దుశ్చర్యలను తిప్పికొట్టేందుకు భారత్ అక్కడ బ్లాక్ అవుట్ (విద్యుత్ సరఫరా నిలిపివేయడం) ప్రకటించడంతో స్టేడియం కూడా చీకటైపోయింది.ఈ క్రమంలో ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులను సురక్షితంగా అక్కడి నుంచి తరలించింది బీసీసీఐ. అంతేకాదు.. వందే భారత్ రైలులో అత్యంత భద్రత నడుమ పంజాబ్, ఢిల్లీ ఆటగాళ్లను ఢిల్లీకి చేర్చింది. ఈ నేపథ్యంలో కాస్త భయాందోళనకు లోనైనప్పటికీ.. భారత్‌లోనే ఉండిపోవాలని పంజాబ్ కింగ్స్ హెడ్‌కోచ్, ఆసీస్ దిగ్గజ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ నిర్ణయించుకున్నాడు. బీసీసీఐ చేసిన ఏర్పాట్లు, భారత ప్రభుత్వం తీసుకున్న రక్షణ చర్యల నేపథ్యంలో ఆటగాళ్లను కూడా ఇందుకు ఒప్పించాడు. అయితే, మిచెల్ జాన్సన్ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించాడు. కాగా ముంబై ఇండియన్స్ తరఫున రెండుసార్లు (2013, 2017) ఐపీఎల్ గెలిచిన జట్టులో జాన్సన్ సభ్యుడు. చదవండి: మాట తప్పారు!.. ఆర్సీబీకి తిరిగి ఆడాలని అనుకోలేదు: పాటిదార్ఐపీఎల్ 2025 పునఃప్రారంభం.. ఎవరు తిరిగొస్తున్నారు.. ఎవరు రావడం లేదు..? -
IPL 2025 Resumption: ఆ దేశ ఆటగాళ్లు లీగ్ పూర్తయ్యే వరకు అందుబాటులో ఉంటారు..!
ఐపీఎల్ 2025 విషయంలో క్రికెట్ సౌతాఫ్రికా (CSA) యూ టర్న్ తీసుకున్నట్లు తెలుస్తుంది. తొలుత తమ ఆటగాళ్లు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండరని (డబ్ల్యూటీసీ ఫైనల్ సన్నాహకాల కోసం) ప్రకటించిన ఆ క్రికెట్ బోర్డు, తాజాగా మనసు మార్చుకున్నట్లు సమాచారం. లీగ్ పూర్తయ్యే వరకు (జూన్ 3) వారి ఆటగాళ్లు సంబంధిత ఫ్రాంచైజీలతో ఉండేందుకు క్రికెట్ సౌతాఫ్రికా అంగీకరించినట్లు ఐపీఎల్ వర్గాలు అంటున్నాయి.ఈ ప్రచారం నిజమైతే ఫ్రాంచైజీలకు సగం టెన్షన్ వదిలినట్లే. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మంది డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకున్నారు. ఈ ఎనిమిది మందిలో ఆరుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్, స్టబ్స్) ప్రాతినిథ్యం వహిస్తున్న ఫ్రాంచైజీలు ప్లే ఆఫ్స్‌లో ముందున్నాయి. ఈ ఆరుగురు ప్లే ఆఫ్స్‌కు అందుబాటులో ఉండకపోతే సంబంధిత ఫ్రాంచైజీలు భారీగా నష్టపోతాయి.చక్రం తిప్పిన ఫ్రాంచైజీ యజమానులుక్రికెట్ సౌతాఫ్రికా ఆథ్వర్యంలో నడిచే సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు ఉన్నాయి. ఈ ఆరు ఫ్రాంచైజీలను ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలే నడిపిస్తున్నాయి. తాజా పరిస్థితి నేపథ్యంలో ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పాయి. వారు క్రికెట్ సౌతాఫ్రికాతో మాటామంతి జరిపి ఆ దేశ ఆటగాళ్లను ప్లే ఆఫ్స్ పూర్తయ్యే వరకు కొనసాగేందుకు ఒప్పించినట్లు తెలుస్తుంది.కాగా, రీ షెడ్యూల్ ప్రకారం ఐపీఎల్ ఫైనల్ ముగిసిన వారం రోజుల్లోనే సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా మధ్య ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే క్రికెట్ సౌతాఫ్రికా తమ ఆటగాళ్లను ముందుగా అనుకున్నట్లు మే 26వ తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని కోరింది. అయితే ఐపీఎల్ ఫ్రాంచైజీల యాజమాన్యాలు చక్రం తిప్పడంతో క్రికెట్ సౌతాఫ్రికా తమ సన్నాహకలను (డబ్ల్యూటీసీ ఫైనల్) వాయిదా వేసుకుంది. జూన్ 3 తర్వాతే వాటి షెడ్యూల్‌ను ప్లాస్ చేసుకుంది.ప్లే ఆఫ్స్ రేసులో ముందున్న ఫ్రాంచైజీలకు చెందిన సౌతాఫ్రికా ఆటగాళ్లు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్. -
IPL 2025: మే 26లోగా తిరిగి రండి.. సౌతాఫ్రికా ప్లేయర్లకు వార్నింగ్..!
ముందుగా అనుకున్నట్లుగా మే 26 తేదీలోగా స్వదేశానికి తిరిగి రావాలని ఐపీఎల్-2025 ఆడుతున్న తమ ఆటగాళ్లకు (డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన వారికి) క్రికెట్ సౌతాఫ్రికా వార్నింగ్ ఇచ్చింది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో 20 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. వీరిలో 8 మందికి డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఎంపిక చేసిన సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కింది.ఈ ఎనిమిది మంది విషయంలోనే క్రికెట్ సౌతాఫ్రికా, ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య పేచీ పడేలా ఉంది. సంబంధిత ఫ్రాంచైజీలు క్రికెట్ సౌతాఫ్రికాతో చర్చలు జరుపుతున్నా వారు ససేమిరా అంటున్నట్లు తెలుస్తుంది. ఆటగాళ్లకు లీగ్ కంటే దేశమే ముఖ్యం కావాలని సౌతాఫ్రికా హెడ్ కోచ్ షుక్రి కాన్రాడ్ భావోద్వేగంతో పిలుపునిచ్చాడు. సదరు 8 మంది సౌతాఫ్రికా ప్లేయర్ల నిర్ణయంపై వారి ఫ్రాంచైజీల భవితవ్యం ఆధారపడి ఉంది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన 8 మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)మార్కో జన్సెన్ (పంజాబ్ కింగ్స్)లుంగి ఎంగిడి (ఆర్సీబీ)కగిసో రబాడ (గుజరాత్)ర్యాన్ రికెల్టన్ (ముంబై)ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ)ఎయిడెన్ మార్క్రమ్ (లక్నో)వియాన్ ముల్దర్ (ఎస్ఆర్హెచ్)పైనున్న ఆటగాళ్లలో ఐదుగురు (కార్బిన్ బాష్, జన్సెన్, ఎంగిడి, రబాడ, రికెల్టన్) సంబంధిత ఫ్రాంచైజీలకు ప్లే ఆఫ్స్‌లో కీలకమవుతారు. వీరు అందుబాటులో లేకపోతే వారి జట్ల విజయావకాశాలు ఖచ్చితంగా ప్రభావితమవుతాయి. మిగతా ముగ్గురు (స్టబ్స్, మార్క్రమ్, ముల్దర్) ఆటగాళ్లలో ఒకరి (ముల్దర్) జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి ఇదివరకే నిష్క్రమించడంతో ఎలాంటి ఇబ్బంది లేదు. మరో ఇద్దరి (స్టబ్స్, మార్క్రమ్) జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్ కోసం లైన్లో ఉన్నాయి. క్రికెట్ సౌతాఫ్రికా, బీసీసీఐ మధ్య ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం.. మే 25న ఐపీఎల్ ఫైనల్ ముగిస్తే, ఆ మరుసటి రోజే (మే 26) సౌతాఫ్రికా ఆటగాళ్లంతా స్వదేశానికి బయల్దేరాలి. అనంతరం మే 30న డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన సౌతాఫ్రికా జట్టు ఇంగ్లండ్‌కు బయల్దేరాలి. అక్కడు జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు జింబాబ్వేతో వార్మప్ మ్యాచ్ ఆడాల్సి ఉంది. జూన్ 7న డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం లండన్‌కు బయల్దేరాలి. ఐపీఎల్ 2025 ముందస్తు షెడ్యూల్ ప్రకారం సౌతాఫ్రికా జట్టు ప్రణాళిక ఇది.అయితే భారత్, పాక్ మధ్య యుద్దం కారణంగా ఐపీఎల్ 2025 వారం రోజులు వాయిదా పడింది. దీంతో సీన్ మొత్తం మారిపోయింది. ఐపీఎల్ రివైజ్డ్ షెడ్యూల్‌కు (జూన్ 3) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు (జూన్ 11) కేవలం వారం రోజుల గ్యాప్ మాత్రమే ఉంది. దీని వల్ల డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఆటగాళ్లు ఐపీఎల్ లీగ్ మ్యాచ్‌ల వరకు మాత్రమే అందుబాటులో ఉండే పరిస్థితి ఏర్పడింది. డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపిక కాని మిగతా సౌతాఫ్రికా ఆటగాళ్లు (ఐపీఎల్ ఆడుతున్న వారు)..డెవాల్డ్ బ్రెవిస్ (చెన్నై సూపర్ కింగ్స్), ఫాఫ్ డుప్లెసిస్, డోనోవన్ ఫెరీరా (ఢిల్లీ క్యాపిటల్స్), గెరాల్డ్ కోట్జీ (గుజరాత్ టైటాన్స్), క్వింటన్ డికాక్, అన్రిచ్ నోర్ట్జే (కోల్‌కతా నైట్ రైడర్స్), డేవిడ్ మిల్లర్, మాథ్యూ బ్రీట్జ్కే (లక్నో), నండ్రే బర్గర్, క్వేనా మఫాకా, డ్రే ప్రిటోరియస్ (రాజస్థాన్ రాయల్స్), హెన్రిచ్ క్లాసెన్ (సన్‌రైజర్స్ హైదరాబాద్) -
డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు ప్రకటన.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్
జూన్ 11 నుంచి లార్డ్స్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగే డబ్ల్యూటీసీ 2023-25 ఫైనల్ కోసం 15 మంది సభ్యుల సౌతాఫ్రికా జట్టును ఇవాళ (మే 13) ప్రకటించారు. ఈ జట్టుకు సారధిగా టెంబా బవుమా వ్యవహరించనున్నాడు. ఈ జట్టులో ఏకంగా ఆరుగురు పేసర్లకు (కగిసో రబాడ, లుంగి ఎంగిడి, మార్కో జన్సెన్, వియన్ ముల్దర్, డేన్ ప్యాటర్సన్, కార్బిన్ బాష్) చోటు దక్కింది. లార్డ్స్ పిచ్ పేసర్లకు అనుకూలంగా ఉండనుండటంతో సౌతాఫ్రికా సెలక్టర్లు ఈ మేరకు నిర్ణయించారు.పేస్ దళంతో పోలిస్తే సౌతాఫ్రికా బ్యాటింగ్ విభాగం కాస్త బలహీనంగా కనిపిస్తుంది. ఆ జట్టులో బవుమా, మార్క్రమ్ మినహా అనుభవజ్ఞులైన బ్యాటర్లు లేరు. రికెల్టన్, స్టబ్స్, డేవిడ్ బెడింగ్హమ్ లాంటి పరిమిత ఓవర్ల స్టార్లు ఉన్నా టెస్ట్‌ల్లో వారు ఏ మేరకు రాణించగలరో చూడాలి.TEMBA BAVUMA ANNOUCING SOUTH AFRICA SQUAD FOR WTC FINAL. 🥶🔥 pic.twitter.com/uZbtbcxAGn— Johns. (@CricCrazyJohns) May 13, 2025డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టు: టెంబా బావుమా (కెప్టెన్), ఎయిడెన్ మార్క్రమ్, లుంగి ఎంగిడి, టోనీ డి జోర్జి, డేవిడ్ బెడింగ్హమ్, కేశవ్ మహరాజ్, ట్రిస్టన్ స్టబ్స్, కార్బిన్ బాష్, సెనురన్ ముత్తుసామి, మార్కో జన్సెన్, కగిసో రబడ, కైల్ వెర్రెయిన్, డేన్ ప్యాటర్సన్, వియాన్ ముల్డర్, ర్యాన్ రికెల్టన్.కాగా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో సౌతాఫ్రికాకు ఇదే తొలి ఫైనల్. 1998 ఐసీసీ నాకౌట్ ట్రోఫీ తర్వాత ఆ జట్టు ఇప్పటివరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. మరోవైపు ఫైనల్లో సౌతాఫ్రికా ఎదుర్కోబోయే ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీలో డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉంది. ఆ జట్టు గత ఎడిషన్ (2021-23) ఫైనల్లో భారత్‌పై విజయం సాధించి ఛాంపియన్‌గా అవతరించింది. ఆస్ట్రేలియా కూడా ఇవాళే జట్టును ప్రకటించింది. ఆసీస్ జట్టుకు సారధిగా పాట్ కమిన్స్ వ్యవహరించనున్నాడు. ఆల్‌రౌండర్ కెమారూన్ గ్రీన్ చాలా కాలం తర్వాత ఆసీస్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఆస్ట్రేలియా జట్టు: పాట్ కమిన్స్, స్కాట్ బోలాండ్, అలెక్స్ క్యారీ, కెమారూన్ గ్రీన్, జోష్ హాజిల్‌వుడ్, ట్రవిస్ హెడ్, జోస్ ఇంగ్లిస్, ఉస్మాన్ ఖ్వాజా, సామ్ కొన్‌స్టాస్, మ్యాట్ కుహ్నేమన్, మార్నస్ లబూషేన్, నాథన్ లియోన్, స్టీవ్ స్మిత్, మిచెల్ స్టార్క్, బ్యూ వెబ్స్టర్ట్రావెలింగ్ రిజర్వ్: బ్రెండన్ డాగెట్ఐపీఎల్ జట్టుకు షాక్డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం ఇవాళ ప్రకటించిన ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లలో 13 మంది ఐపీఎల్ స్టార్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐదుగురు కాగా.. సౌతాఫ్రికాకు చెందిన వారు ఎనిమిది మంది. ఐపీఎల్ 2025 పూర్తైన వారం రోజులకే డబ్ల్యూటీసీ ఫైనల్ మొదలు కానుండటంతో ఈ 13 మంది ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్‌కు ఏమేరకు అందుబాటులో ఉంటారో అన్నది ప్రశ్నార్థకంగా మారింది.డబ్ల్యూటీసీ ఫైనల్‌కు ఎంపికైన ఐపీఎల్ 2025 స్టార్లు..ఆసీస్ ఆటగాళ్లు..పాట్ కమిన్స్ (ఎస్ఆర్హెచ్)ట్రవిస్ హెడ్ (ఎస్ఆర్హెచ్)జోష్ హాజిల్‌వుడ్ (ఆర్సీబీ)జోస్ ఇంగ్లిస్ (పంజాబ్)మిచెల్ స్టార్క్ (ఢిల్లీ)సౌతాఫ్రికా ఆటగాళ్లు..మార్క్రమ్ (లక్నో)ఎంగిడి (ఆర్సీబీ)స్టబ్స్ (ఢిల్లీ)కార్బిన్ బాష్ (ముంబై ఇండియన్స్)ర్యాన్ రికెల్టన్ (ముంబై ఇండియన్స్)జన్సెన్ (పంజాబ్)రబాడ (గుజరాత్)ముల్దర్ (ఎస్ఆర్హెచ్) -
సౌతాఫ్రికా ఆల్ ఫార్మాట్ కోచ్‌గా షుక్రి కాన్రాడ్
సౌతాఫ్రికా సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా షుక్రి కాన్రాడ్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా ఇవాళ (మే 9) ప్రకటించింది. కాన్రాడ్ 2023 నుంచి సౌతాఫ్రికా టెస్ట్ హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. తాజాగా అతనికి పరిమిత ఓవర్ల ఫార్మాట్ల పగ్గాలు కూడా అప్పజెప్పారు. ఏప్రిల్ వరకు సౌతాఫ్రికా పరిమిత ఓవర్ల జట్లకు హెడ్ కోచ్‌గా రాబ్ వాల్టర్ ఉండేవాడు. వాల్టర్ తన పదవీకాలం ముగియండతో రాజీనామా చేశాడు. ఆల్ ఫార్మాట్ హెడ్ కోచ్‌గా కాన్రాడ్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు కొనసాగుతాడు. ఆ ఏడాది వరల్డ్‌కప్‌కు సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా ఆతిథ్యమివ్వనున్నాయి. కాన్రాడ్ ఆథ్వర్యంలో సౌతాఫ్రికా టెస్ట్ జట్టు ఈ దఫా (2023-25) డబ్ల్యూటీసీ ఫైనల్‌కు చేరింది. వచ్చే నెలలో లార్డ్స్‌లో జరుగబోయే ఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. ఆల్ ఫార్మాట్ కోచ్‌గా నియమితుడు కావడంపై కాన్రాడ్ సంతోషం వ్యక్తం చేశాడు.58 ఏళ్ల కాన్రాడ్ సౌతాఫ్రికా జాతీయ జట్టు తరఫున ఎలాంటి మ్యాచ్‌లు ఆడనప్పటికీ.. కోచింగ్‌లో అతనికి మంచి అనుభవం ఉంది. కాన్రాడ్ దేశవాలీ క్రికెట్లో వెస్ట్రన్ ఫ్రావిన్స్‌కు ఆడేవాడు. 1985-91 మధ్య కాలంలో అతను 9 మ్యాచ్‌లు ఆడి 324 పరుగులు, 13 వికెట్లు తీశాడు. ఇదిలా ఉంటే, ప్రస్తుతం చాలా మంది సౌతాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్ కోసం భారత్‌లో ఉన్నారు. అయితే క్యాష్ రిచ్ లీగ్ రద్దు కావడంతో (భారత్, పాక్‌ల మధ్య ఉద్రిక్తతల కారణంగా) అంతా స్వదేశానికి తిరుగు ముఖం పట్టారు. -
‘శత’క్కొట్టిన జెమీమా
కొలంబో: ముక్కోణపు మహిళల వన్డే క్రికెట్ టోర్నమెంట్లో భారత జట్టు ఫైనల్లోకి దూసుకెళ్లింది. దక్షిణాఫ్రికాతో బుధవారం జరిగిన నాలుగో లీగ్ మ్యాచ్‌లో హర్మన్‌ప్రీత్ కౌర్ బృందం 23 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. మూడు జట్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో ఈ టోర్నీ జరుగుతోంది. భారత జట్టు తమ నాలుగు మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. మూడు మ్యాచ్‌ల్లో గెలిచి ఆరు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయి ఫైనల్‌కు దూరమైంది. భారత్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడిపోవడంతో ఆతిథ్య శ్రీలంక జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. శుక్రవారం జరిగే నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో శ్రీలంక, దక్షిణాఫ్రికా తలపడతాయి. భారత్, శ్రీలంక జట్ల మధ్య టైటిల్ పోరు ఆదివారం జరుగుతుంది. ఫైనల్ బెర్త్ లక్ష్యంగా దక్షిణాఫ్రికాతో పోరు ప్రారంభించిన భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 337 పరుగుల భారీ స్కోరు సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ (101 బంతుల్లో 123; 15 ఫోర్లు, 1 సిక్స్) సఫారీ బౌలర్ల భరతం పట్టి కెరీర్లో రెండో సెంచరీ సాధించింది.ఓపెనర్ స్మృతి మంధాన (63 బంతుల్లో 51; 6 ఫోర్లు) కెరీర్లో 31వ అర్ధ సెంచరీ నమోదు చేసుకోగా... దీప్తి శర్మ (84 బంతుల్లో 93; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడి త్రుటిలో శతకాన్ని చేజార్చుకుంది. అనంతరం దక్షిణాఫ్రికా జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసి ఓడిపోయింది. అనెరి డెరెక్సన్ (80 బంతుల్లో 81; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), చోల్ ట్రయాన్ (43 బంతుల్లో 67; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీలతో రాణించినా ఫలితం లేకపోయింది. గాయం కారణంగా దక్షిణాఫ్రికా రెగ్యులర్ కెపె్టన్ లౌరా వొల్వార్ట్ ఈ మ్యాచ్‌కు దూరంకాగా... చోల్ ట్రయాన్ సారథిగా వ్యవహరించింది. ఈ మ్యాచ్‌తో శుచి ఉపాధ్యాయ్ (భారత్), మియాని స్మిట్ (దక్షిణాఫ్రికా) అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. 122 పరుగుల భాగస్వామ్యం ఫైనల్ బెర్త్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. ప్రతీక (1), హర్లీన్ డియోల్ (4), హర్మన్‌ప్రీత్ కౌర్ (20 బంతుల్లో 28; 6 ఫోర్లు) తక్కువ స్కోరుకే వెనుదిరిగారు. ఈ దశలో స్మృతి, జెమీమా మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. నాలుగో వికెట్‌కు 88 పరుగులు జోడించారు. స్మృతి అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న వెంటనే అవుటవ్వగా... జెమీమాతో దీప్తి శర్మ జత కలిసింది. వీరిద్దరూ దూకుడుగా ఆడటంతో భారత స్కోరు బోర్డులో వేగం పెరిగింది. ఈ క్రమంలో జెమీమా శతకం పూర్తి చేసుకుంది. ఐదో వికెట్‌కు వీరిద్దరూ 122 పరుగుల భాగస్వామ్యం జోడించాక జెమీమా పెవిలియన్ చేరుకుంది. వన్డేల్లో ఐదో వికెట్‌కు భారత్‌కిదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. గతంలో ఈ రికార్డు మిథాలీ రాజ్–వేద కృష్ణమూర్తి (108 పరుగులు) పేరిట ఉండేది. జెమీమా అవుటయ్యాక దీప్తి శర్మ మరింత దూకుడు పెంచడంతో భారత స్కోరు 300 పరుగులు దాటింది. ఏడు పరుగుల తేడాతో దీప్తి శర్మ సెంచరీని కోల్పోయింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడంతో ఏ దశలోనూ విజయంపై ఆశలు రేకెత్తించలేదు. డెరెక్సన్, ట్రయాన్ మెరిపించినా దక్షిణాఫ్రికా విజయానికి సరిపోలేదు. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ మూడు వికెట్లు పడగొట్టింది. జెమీమా రోడ్రిగ్స్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక రావల్ (సి) డెరెక్సన్ (బి) డి క్లెర్క్ 1; స్మృతి మంధాన (సి) డి క్లెర్క్ (బి) ట్రయాన్ 51; హర్లీన్ డియోల్ (బి) క్లాస్ 4; హర్మన్‌ప్రీత్ కౌర్ (సి) షాంగేస్ (బి) డెరెక్సన్ 28; జెమీమా రోడ్రిగ్స్ (సి) సునె లుస్ (బి) క్లాస్ 123; దీప్తి శర్మ (సి) ట్రయాన్ (బి) డి క్లెర్క్ 93; రిచా ఘోష్ (సి) బ్రిట్స్ (బి) మలాబా 20; అమన్‌జోత్ కౌర్ (సి) స్మిట్ (బి) మలాబా 5; శ్రీ చరణి (రనౌట్) 6; స్నేహ్ రాణా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 337. వికెట్ల పతనం: 1–9, 2–18, 3–50, 4–138, 5–260, 6–296, 7–314, 8–336, 9–337. బౌలింగ్: మసబటా క్లాస్ 8–0–51–2, నదినె డి క్లెర్క్ 9–0–54–2, అనెరి డెరెక్సన్ 6–0–36–1, మలాబా 8–0–71–2, షాంగేస్ 6–0–43–0, చోల్ ట్రయాన్ 8–0–46–1, సునె లుస్ 3–0–15–0, మియాని స్మిట్ 2–0–20–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: లారా గుడాల్ (సి) రిచా ఘోష్ (బి) అమన్‌జోత్ కౌర్ 4; తజ్మీన్ బ్రిట్స్ (సి) జెమీమా (బి) అమన్‌జోత్ కౌర్ 26; మియాని సిŠమ్ట్ (బి) దీప్తి శర్మ 39; అనెరి డెరెక్సన్ (బి) అమన్‌జోత్ కౌర్ 81; షాంగేస్ (సి) హర్లీన్ డియోల్ (బి) ప్రతీక రావల్ 36; సినాలో జాఫ్టా (ఎల్బీడబ్ల్యూ) (బి) శ్రీ చరణి 21; చోల్ ట్రయాన్ (బి) దీప్తి శర్మ 67; నదినె డి క్లెర్క్ (నాటౌట్) 22; సునె లుస్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 16; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 314. వికెట్ల పతనం: 1–7, 2–70, 3–89, 4–159, 5–188, 6–260, 7–311. బౌలింగ్: స్నేహ్ రాణా 7–1–53–0, అమన్‌జోత్ కౌర్ 9–0–59–3, శ్రీ చరణి 10–0–58–1, శుచి ఉపాధ్యాయ్ 9–0–59–0, దీప్తి శర్మ 10–0–57–2, ప్రతీక రావల్ 3–0–15–1, స్మృతి మంధాన 2–0–12–0. -
టీమిండియా భారీ టార్గెట్.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. -
మెగా గుమ్మడి!
దక్షిణాఫ్రికాలోని కల్లినన్ ప్రాంత రైతు సంఘం ప్రతి ఏటా గుమ్మడికాయల పోటీ పెడుతుంటుంది. కార్నెలి బెస్టర్ అనే రైతు ఈ ఏడాది 445 కిలోల గుమ్మడి ఫస్ట్ ప్రైజ్ గెల్చుకున్నారు. ఈ అవార్డు ఆయనకు కొత్త కాదు. గత ఏడాది ఏకంగా 730 కిలోల గుమ్మడితో ఆయనే ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవటం విశేషం. ఏడాదిలో అతిపెద్ద గుమ్మడి సైజు అంత ఎందుకు తగ్గిందో తెలీదు. బహుశా భూతాపోన్నతి కావచ్చు. అదలా ఉంచితే, 2023లో ఇంకా బరువైన గుమ్మడి కాయను పండించిన వైకస్ లాంప్రెచ్ట్ విజేతగా నిలిచారు. ఆయన గుమ్మడి కాయ బరువెంతో తెలిస్తే మరింత ఆశ్చర్యం కలుగుతుంది.. 890 కిలోలు! వ్యవసాయం పట్ట మక్కువను పెంపొందించే లక్ష్యం తోపాటు నిధుల సమీకరణ కోసం కల్లినన్ రైతు సంఘం ఈ వార్షిక ΄ోటీలు పెడుతుంటుంది. అట్లాంటిక్ జెయింట్ గుమ్మడితో సంకపరచిన వంగడంతో సాగు చేసిన కాయలనే ఇక్కడ పోటీలో ఉంచుతారు. పోటీ ముగిసిన తర్వాత ప్రిటోరియా నగరంలో పేదలకు ఈ గుమ్మడి కాయలను పంచుతారు! (చదవండి: దిల్ మ్యాంగో మోర్..! నోరూరించే వెరైటీ మ్యాంగ్ డెజర్ట్స్..) -
స్నేహ్ మాయాజాలం
భారత ఆఫ్‌స్పిన్నర్ స్నేహ్ రాణా 5 వికెట్ల ప్రదర్శన... వీటిలో ఒకే ఓవర్లో తీసిన 3 వికెట్లు... ప్రతీక రావల్ మరో అర్ధసెంచరీతో అద్భుత ఫామ్ కొనసాగింపు... తజ్మీన్ బ్రిట్స్ వీరోచిత సెంచరీ వృథా... భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన వన్డే మ్యాచ్‌లో హైలైట్స్ ఇవి. ముక్కోణపు టోర్నీలో భాగంగా ఆడిన రెండో మ్యాచ్‌లోనూ గెలిచిన హర్మన్ బృందం తమ అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకుంది. కొలంబో: ముక్కోణపు వన్డే టోర్నీలో భారత మహిళలు మరో విజయాన్ని అందుకున్నారు. మంగళవారం జరిగిన పోరులో భారత్ 15 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా మహిళల జట్టును ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. ప్రతీక రావల్ (91 బంతుల్లో 78; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా... జెమీమా రోడ్రిగ్స్ (32 బంతుల్లో 41; 4 ఫోర్లు), కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (48 బంతుల్లో 41 నాటౌట్; 4 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. అనంతరం దక్షిణాఫ్రికా 49.2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. తజ్మీన్ బ్రిట్స్ (107 బంతుల్లో 109; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు) సెంచరీ చేయగా, ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ స్నేహ్ రాణా (5/43) ఐదు వికెట్ల ప్రదర్శనతో సఫారీ టీమ్‌ను పడగొట్టడంలో ప్రధాన పాత్ర పోషించింది. కీలక భాగస్వామ్యాలు... భారత్‌కు ప్రతీక, స్మృతి మంధాన (54 బంతుల్లో 36; 5 ఫోర్లు) శుభారంభం అందించారు. తొలి వికెట్‌కు వీరిద్దరు 18.3 ఓవర్లలో 83 పరుగులు జోడించారు. స్మృతి వెనుదిరిగిన తర్వాత ప్రతీకకు హర్లీన్ డియోల్ (47 బంతుల్లో 29; 4 ఫోర్లు) సహకారం అందించింది. 58 బంతుల్లో ప్రతీక అర్ధ సెంచరీ పూర్తయింది. ప్రతీక, హర్లీన్ మూడు పరుగుల వ్యవధిలో వెనుదిరగ్గా... హర్మన్, జెమీమా 59 పరుగుల భాగస్వామ్యంతో ఇన్నింగ్స్‌ను నడిపించారు. చివర్లో రిచా ఘోష్ (14 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్) దూకుడైన ఆటను ప్రదర్శించగా...ఆఖరి 10 ఓవర్లలో భారత్ 82 పరుగులు సాధించింది. బ్రిట్స్ సెంచరీ వృథా... బ్రిట్స్ వరుస బౌండరీలతో చెలరేగిపోవడంతో ఛేదనలో దక్షిణాఫ్రికాకు మరింత ఘనమైన ఆరంభం దక్కింది. బ్రిట్స్‌తో తొలి వికెట్‌కు 140 పరుగులు జోడించిన తర్వాత కెప్టెన్ లౌరా వాల్వార్ట్ (75 బంతుల్లో 43; 3 ఫోర్లు) అవుట్ కాగా, ఆ తర్వాత 103 బంతుల్లో బ్రిట్స్ శతకం పూర్తయింది. ఆ తర్వాత తీవ్ర వేడి కారణంగా బ్రిట్స్ రిటైర్ట్‌హర్ట్‌గా వెనుదిరగ్గా... ఇక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది. 80 పరుగుల వ్యవధిలో జట్టు చివరి 8 వికెట్లు కోల్పోయి ఓటమి పాలైంది. ఐదు వికెట్లతో చివరి 3 ఓవర్లలో 28 పరుగులు చేయాల్సి ఉండగా... 48వ ఓవర్ వేసిన స్నేహ్ రాణా 3 వికెట్లు పడగొట్టింది. తిరిగి మైదానంలోకి వచ్చి ఆదుకునే ప్రయత్నం చేసిన బ్రిట్స్ కూడా ఇదే ఓవర్లో అవుట్ కావడంతో జట్టు ఆశలు కోల్పోయింది. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ప్రతీక (బి) ఎమ్‌లాబా 78; స్మృతి (సి) మెసో (బి) డెర్క్సన్ 36; హర్లీన్ (బి) ఎమ్‌లాబా 29; హర్మన్‌ప్రీత్ (నాటౌట్) 41; జెమీమా (సి) ఖాకా (బి) క్లాస్ 41; రిచా (సి) లూస్ (బి) ఖాకా 24; దీప్తి (సి) ట్రైయాన్ (బి) డిక్లెర్క్ 9; కాశ్వీ (నాటౌట్) 5; ఎక్స్‌ట్రాలు 13; మొత్తం (50 ఓవర్లలో 6 వికెట్లకు) 276. వికెట్ల పతనం: 1–83, 2–151, 3–154, 4–213, 5–247, 6–259. బౌలింగ్: ఖాకా 8–1– 42–1, క్లాస్ 9–1–43–1, లూస్ 4–0–24–0, డిక్లెర్క్ 9–1–39–1, ఎమ్‌లాబా 10–0–55–2, డెర్క్సన్ 3–0– 40–1, ట్రైయాన్ 7–0–33–0. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్: వోల్వార్ట్ (ఎల్బీ) (బి) దీప్తి 43; బ్రిట్స్ (సి అండ్ బి) స్నేహ్ రాణా 109, గుడాల్ (బి) స్నేహ్ రాణా 9; మెసో (బి) అరుంధతి రెడ్డి 7; లూస్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) శ్రీచరణి 28; ట్రైయాన్ (సి) (సబ్) అమన్‌జోత్ (బి) స్నేహ్ రాణా 18; డెర్క్సన్ (సి) హర్లీన్ (బి) స్నేహ్ రాణా 30; డిక్లెర్క్ (బి) స్నేహ్ రాణా 0; క్లాస్ (రనౌట్) 2; ఎమ్‌లాబా (రనౌట్) 8; ఖాకా (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.2 ఓవర్లలో ఆలౌట్) 261. వికెట్ల పతనం: 1–140, 2–151, 3–181, 4–207, 5–240, 6–250, 7–251, 8–252, 9–253, 10–261. బౌలింగ్: కాశ్వీ గౌతమ్ 7.2–0–47–0, అరుంధతి రెడ్డి 9–0–59–1, స్నేహ్ రాణా 10–0–43–5, శ్రీచరణి 10–0–51–1, దీప్తి శర్మ 10–0–40–1, ప్రతీక 3–0–17–0. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
శ్రీలంక జట్టులో భారీ మార్పులు
కొలంబో: స్వదేశంలో జరగనున్న మహిళల ముక్కోణపు వన్డే టోర్నమెంట్ కోసం శ్రీలంక జట్టు భారీ మార్పులు చేసింది. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న టోర్నీ కోసం శ్రీలంక జట్టు 8 మార్పులు చేసి బుధవారం 17 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో పాటు భారత్, దక్షిణాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. గత నెలలో న్యూజిలాండ్ చేతిలో శ్రీలంక మహిళల క్రికెట్ జట్టు 0–2తో సిరీస్ కోల్పోవడంతో జట్టును ప్రక్షాళన చేసింది. సీనియర్ బ్యాటర్ చమరి ఆటపట్టు లంక జట్టుకు సారథ్యం వహిస్తుండగా... న్యూజిలాండ్‌తో టి20 సిరీస్‌లో ఆకట్టుకున్న మీడియం పేసర్ మల్కీ మదారాకు తొలిసారి వన్డే జట్టులో చోటు దక్కింది. ఈ టోర్నమెంట్లో ఒక్కో జట్టు మిగిలిన రెండు జట్లతో రెండేసి సార్లు తలపడనుంది. మ్యాచ్‌లన్నీ ప్రేమదాస స్టేడియంలోనే జరగనున్నాయి. వచ్చే నెల 11న ఫైనల్ జరుగుతుంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య శ్రీలంకతో భారత అమ్మాయిల జట్టు అమీతుమీ తేల్చుకోనుంది. శ్రీలంక జట్టు: చమరి ఆటపట్టు (కెప్టెన్ ), హర్షిత సమరవిక్రమ, విష్మీ గుణరత్నె, నీలాక్షిక సిల్వ, కవిషా దిల్హారి, అనుష్క సంజీవని, మనుడి ననయక్కర, హాసిని పెరెరా, ఆచిని కులసూర్య, పియూమి బడాల్గే, దేవ్మి విహంగ, హన్సిమ కరుణరత్నె, మల్కీ మదారా, ఇనోషి ప్రియదర్శిని, సుగంధిక కుమారి, రష్మిక, ఇనోక రణవీర. -
డౌట్ అక్కర్లేదు.. ఇవి సింహాలే..
ఎండాకాలం ఎఫెక్ట్ మరి.. దక్షిణాఫ్రికాలోని యుకుటులా రిజర్వ్ పార్క్‌లో జెడ్ నెల్సన్ అనే ఫొటోగ్రాఫర్ ఈ చిత్రాన్ని తీశారు. 2025 సోనీ వరల్డ్ ఫొటోగ్రఫీ పురస్కారాల్లో ఈ చిత్రం వైల్డ్ లైఫ్ అండ్ నేచర్ విభాగంలో మొదటి బహుమతిని గెలుచుకుంది. ఈ లయన్ రిజర్వులో శిక్షణ పొందిన గైడ్ల సాయంతో మనం సింహాలకు చాలా దగ్గరగా వెళ్లొచ్చు. వాటి జీవనశైలిని గమనించవచ్చు.రోమ్‌లో వాన్స్, మెలోనీ టారిఫ్ చర్చలురోమ్: టారిఫ్‌లపై అమెరికా–ఇటలీల మధ్య జరుగుతున్న చర్చల వేదిక రోమ్కు మారింది. శుక్రవారం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఇటలీ ప్రధానమంత్రి జార్జియో మెలోనీతో సమావేశమయ్యారు, ప్రధాని కార్యాలయం ఛిగి ప్యాలెస్‌లో వీరు చర్చలు జరిపారు. అనంతరం, వైట్ హౌస్, మెలోనీ కార్యాలయం సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. అతిత్వరలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటలీని సందర్శించనున్నారని ఆ ప్రకటన తెలిపింది.ఆ సమయంలోనే అమెరికా– యూరప్ మధ్య చర్చలు జరపాలనే విషయం పరిశీలనలో ఉందని కూడా పేర్కొంది. గురువారం వైట్ హౌస్‌లో చర్చల సందర్భంగా మెలోనీ పక్కనే కూర్చున్న ట్రంప్.. వాణిజ్యం ఒప్పందాలు కుదుర్చుకునేందుకు తాము తొందరపడటం లేదని తెలిపారు. యూరప్‌తోపాటు మధ్యధరా ప్రాంతంలో అమెరికాకు అత్యంత ముఖ్యమైన భాగస్వామిగా ఇటలీ ఉంటుందని భావిస్తున్నామని మెలోనీ పేర్కొన్నారు. వాన్స్‌తో జరుగుతున్న చర్చల్లో సుదీర్ఘకాలం మైత్రి మరింత బలోపేతమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇమ్రాన్ సోదరీమణుల అరెస్టు రావల్పిండీ: జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని 72 ఏళ్ల ఇమ్రాన్‌ఖాన్‌ను కలిసేందుకు వెళ్లిన ఆయన సోదరీమణులను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన 2023 నుంచి రావల్పిండిలోని అడియాలా జైల్లో ఉన్నారు. ప్రతి మంగళ, గురువారాల్లో కుటుంబీకులు, లాయర్ల బృందం ఆయన్ను కలుస్తారు. గురువారం వెళ్లిన ఇమ్రాన్ సోదరీమణులు అలీమా, ఉజ్మా, నొరీన్తో పాటు పీటీఐ పార్టీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. వెనక్కు వెళ్లాలని కోరారు. వారు నిరాకరించడంతో ఘర్షణ నెలకొంది. వారిని అరెస్టు చేసి జైలుకు దూరంగా విడిచిపెట్టినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి.అడియాలా జైలు బయట పీటీఐ నేతలను అరెస్టు చేయడం ఈ వారంలో ఇది రెండోసారి. వీటిని పార్టీ ఖండించింది. బలమైన ప్రజా ప్రతిస్పందన తప్పదని హెచ్చరించింది. ఇంగ్లండ్‌లో ఉంటున్న తన పిల్లలతో మాట్లాడేందుకు, వైద్య పరీక్షలకు ఇమ్రాన్ పెట్టుకున్న పిటిషన్లను పాక్ కోర్టు ఇటీవలే అనుమతించింది. -
గువాహాటిలో తొలిసారి టెస్టు
ముంబై: ఈ ఏడాది సొంతగడ్డపై భారత జట్టు ఆడే మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ సంవత్సరం భారత క్రికెట్ జట్టు స్వదేశంలో 4 టెస్టులు, 3 వన్డేలు, 5 టి20 మ్యాచ్‌లు ఆడుతుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి దేవజిత్ సైకియా స్వరాష్ట్రం అస్సాంలో భారత జట్టు తొలిసారి టెస్టు మ్యాచ్ ఆడనుంది. గువాహాటిలోని అస్సాం క్రికెట్ సంఘం (ఏసీఏ) స్టేడియం భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య రెండో టెస్టుకు నవంబర్ 26 నుంచి ఆతిథ్యమివ్వనుంది. ఈ ఏడాది వెస్టిండీస్, దక్షిణాఫ్రికా జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. వెస్టిండీస్‌తో భారత్ రెండు టెస్టులు ఆడనుంది. అనంతరం దక్షిణాఫ్రికాతో టీమిండియా రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టి20 మ్యాచ్‌ల్లో తలపడుతుంది. భారత్–దక్షిణాఫ్రికా మధ్య డిసెంబర్ 6న జరిగే మూడో వన్డే మ్యాచ్‌కు విశాఖపట్నం వేదిక కానుంది. -
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్‌కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్ చేశారు.కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
దక్షిణాఫ్రికాలో డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరం
జొహన్నెస్‌బర్గ్: వాహన డ్రైవింగ్ విషయంలో ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశంగా దక్షిణాఫ్రికా నిలిచింది. వరుసగా రెండో ఏడాది ఈ అపప్రథ మూటగట్టుకున్న దేశంగా ఉంది. ఈ విషయంలో భారత్ ఐదో స్థానంలో ఉంది. అదేసమయంలో, ప్రపంచంలోనే డ్రైవింగ్‌కు అత్యంత సురక్షితమైన దేశంగా నార్వే వరుసగా నాలుగోసారి కీర్తి కిరీటం ధరించింది. అమెరికాకు చెందిన డ్రైవర్ ట్రెయినింగ్ కంపెనీ జుటోబీ వార్షిక నివేదికలో ఈ విషయాలున్నాయి. మొత్తం 53 దేశాలకు గాను దక్షిణాఫ్రికా అట్టడుగున 53వ స్థానంలో ఉండగా అమెరికాకు 51, భారత్‌కు 49వ ర్యాంకులు దక్కా యి. రహదారులపై స్పీడ్ లిమిట్లు, డ్రైవర్లకు బ్లడ్ ఆల్కహాల్ మోతాదు పరిమితులు, రహదారి ప్రమాదాల స్థాయిలు ఆధారంగా డ్రైవింగ్‌కు సురక్షితమైన, ప్రమాదకరమైన దేశాలను విశ్లేషించామ ని జుటోబీ తెలిపింది. ప్రతి లక్ష మందిగాను రోడ్డు ట్రాఫిక్ ప్రమాదాల్లో చనిపోయే సరాసరి సంఖ్య గతేడాది 8.9 ఉండగా ఈసారి ఇది 6.3కు తగ్గిందని జుటోబీ పేర్కొంది. దక్షిణాఫ్రికాలో చట్టాలున్నా అవినీతి అధికారుల కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నాయన్నది అందరికీ తెలిసిన విషయమని జొహన్నెస్‌బర్గ్‌కు చెందిన డ్రైవింగ్ కంపెనీ ఉద్యోగి అలిషా చిన్నాహ్ వ్యాఖ్యానించారు. -
IPL 2025: ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన సౌతాఫ్రికా ఆల్‌రౌండర్
సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ ఫైవ్ టైమ్ ఐపీఎల్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్‌తో జతకట్టాడు. సహచరుడు లిజాడ్ విలియమ్స్ గాయం కారణంగా తదుపరి సీజన్‌కు దూరం కావడంతో అతని స్థానాన్ని బాష్ భర్తీ చేస్తున్నాడు. 30 ఏళ్ల బాష్‌ను ముంబై ఇండియన్స్ తమ హ్యామిలీలోకి ఆహ్వానించింది. రైట్ హ్యాండ్ బ్యాట్, రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలింగ్ వేసే బాష్ సౌతాఫ్రికా తరఫున ఓ టెస్ట్, 2 వన్డేలు ఆడాడు. బాష్ గతేడాది డిసెంబర్లో టెస్ట్‌ల్లో అరంగేట్రం చేశాడు.బాష్ తన తొలి టెస్ట్ మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బాష్ తొలి ఇన్నింగ్స్‌లో అజేయమైన 81 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్‌లో 4 వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు. ఈ మ్యాచ్‌లో బాష్ అద్భుత ఆల్‌రౌండ్ ప్రదర్శన కారణంగా సౌతాఫ్రికా పాకిస్తాన్‌ను 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది.ఈ మ్యాచ్‌కు ముందు బాష్ అదే పాకిస్తాన్‌పైనే వన్డే అరంగేట్రం చేశాడు. బాష్ ఇప్పటివరకు 2 వన్డేలు ఆడి 2 వికెట్లు సహా 55 పరుగులు చేశాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లో బాష్ 44 బంతుల్లో 40 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఇదే అతనికి వన్డేల్లో అత్యధిక స్కోర్. బాష్ తన రెండో వన్డేను కూడా పాక్‌తోనే ఆడాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు జరిగిన ట్రై సిరీస్‌లో బాష్ పాకిస్తాన్ మ్యాచ్‌లో ఆడాడు.అంతర్జాతీయ అరంగేట్రం అనంతరం బాష్ సౌతాఫ్రికా టీ20 లీగ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ ఏడాది బాష్ ఎంఐ కేప్‌టౌన్ తరఫున బరిలో నిలిచాడు. ఈ సీజన్లో బాష్ 8 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీసి ఎంఐ కేప్‌టౌన్ తమ తొలి టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు.బాష్ సౌతాఫ్రికా 2014 అండర్-19 వరల్డ్‌కప్ గెలిచిన జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. నాడు పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో చెలరేగి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా నిలిచాడు. ఆ మ్యాచ్‌లో బాష్ 4 వికెట్లు తీశాడు. బాష్ తన కెరీర్లో వివిధ ఫార్మాట్లలో ఇప్పటివరకు 2500కు పైగా పరుగులు చేసి 150కిపైగా వికెట్లు తీశాడు. బాష్ టీ20ల్లో 86 మ్యాచ్‌లు ఆడి 59 వికెట్లు తీశాడు. బాష్ చేరికతో ముంబై ఇండియన్స్‌లో ఆల్‌రౌండర్ల సంఖ్య 9కి చేరింది. ఇప్పటికే ఆ జట్టులో కెప్టెన్ హార్దిక్ పాండ్యా, బెవాన్ జాకబ్స్, మిచెల్ సాంట్నర్, విల్ జాక్స్, అర్జున్ టెండూల్కర్ తదితర ఆల్‌రౌండర్లు ఉన్నారు. త్వరలో ప్రారంభంకానున్న ఐపీఎల్-2025 ఎడిషన్‌లో ముంబై తమ తొలి మ్యాచ్‌ను మార్చి 23న ఆడుతుంది. చెన్నైలో జరిగే ఆ మ్యాచ్‌లో ముంబై సీఎస్కేను ఢీకొంటుంది.ఐపీఎల్-2025లో ముంబై ఇండియన్స్..రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార యాదవ్, నమన్ ధిర్, బెవాన్ జాకబ్స్, రాజ్ బవా, విల్ జాక్స్, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), విజ్ఞేశ్ పుథుర్, సత్యనారాయణ రాజు, కార్బిన్ బాష్, మిచెల్ సాంట్నర్, అర్జున్ టెండూల్కర్, ర్యాన్ రికెల్టన్, కృష్ణణ్ శ్రీజిత్, రాబిన్ మింజ్, జస్ప్రీత్ బుమ్రా, అశ్వనీ కుమార్, కర్ణ్ శర్మ, ట్రెంట్ బౌల్ట్, దీపక్ చాహర్, ముజీబ్ ఉర్ రెహ్మాన్ -
పాపం క్లాసెన్.. ఎక్కడికి వెళ్లినా చేదు అనుభవమే..!
అంతర్జాతీయ క్రికెట్లో సౌతాఫ్రికా ఎంత దురదృష్టమైన జట్టో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఐసీసీ టోర్నీలో ఈ జట్టు దురదృష్టం పతాకస్థాయిలో ఉంటుంది. అంతర్జాతీయ క్రికెట్లోకి రీఎంట్రీ (1991) ఇచ్చిన నాటి నుంచి సౌతాఫ్రికా ఒకే ఒక ఐసీసీ టైటిల్ (1998 ఛాంపియన్స్ ట్రోఫీ) గెలిచింది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నా ఈ జట్టుకు అదృష్టం కలిసి రాదు. ఐసీసీ టోర్నీల్లో మొదటి దశలో రెచ్చిపోయే సౌతాఫ్రికన్లు నాకౌట్ మ్యాచ్‌లు వచ్చే సరికి తేలిపోతారు. నాకౌట్ మ్యాచ్‌ల్లో.. ముఖ్యంగా సెమీఫైనల్స్‌లో సౌతాఫ్రికాను ఏదో ఒక రూపంలో దురదృష్టం వెంటాడుతుంది. తాజాగా జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ సెమీఫైనలే ఇందుకు నిదర్శనం.కాగా, సౌతాఫ్రికా దురదృష్టాన్ని ఆ జట్టు విధ్వంసకర బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ కొనసాగిస్తున్నాడు. క్లాసెన్ ఎక్కడ నాకౌట్ మ్యాచ్‌లు ఆడినా అతని జట్టు ఓటమిపాలవుతుంది. క్లాసెన్ నాకౌట్ ఫోబియా ఒక్క సౌతాఫ్రికాకే పరిమితం కాలేదు. ప్రైవేట్ లీగ్‌ల్లోనూ క్లాసెన్‌ను నాకౌట్ బూచి వెంటాడుతుంది. ప్రైవేట్ లీగ్‌ల్లో క్లాసెన్ ఆడిన మూడు నాకౌట్ మ్యాచ్‌ల్లో అతను ప్రాతినిథ్యం వహించిన జట్లు ఓడాయి. 2023 మేజర్ లీగ్ క్రికెట్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిత్యం వహించిన సియాటిల్ ఓర్కాస్ ముంబై ఇండియన్స్ న్యూయార్క్ చేతుల్లో ఓడింది.2024 సౌతాఫ్రికా టీ20 లీగ్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన డర్బన్ సూపర్ జెయింట్స్ సన్‌రైజర్స్ ఈస్ట్రన్‌కేప్ చేతుల్లో ఓటమిపాలైంది. 2024 ఐపీఎల్ ఫైనల్లో క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ చేతుల్లో పరాజయంపాలైంది.తొలి నాకౌట్ నుంచే..క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన తొలి ఐసీసీ నాకౌట్లోనే సౌతాఫ్రికా ఓటమిపాలైంది. 2023 వన్డే సెమీఫైనల్లో సౌతాఫ్రికా ఆస్ట్రేలియా చేతిలో చిత్తైంది. క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన రెండో ఐసీసీ నాకౌట్లో సౌతాఫ్రికా గుండెబద్దలైంది. 2024 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్లో ఆ జట్టు భారత్ చేతిలో అనూహ్యంగా ఓటమిపాలైంది. తాజాగా క్లాసెన్ ప్రాతినిథ్యం వహించిన మూడో ఐసీసీ నాకౌట్లో కూడా సౌతాఫ్రికాకు చేదు అనుభవమే మిగిలింది. 2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్‌లో సౌతాఫ్రికాను న్యూజిలాండ్ చిత్తుగా ఓడించింది. నాకౌట్ మ్యాచ్‌ల్లో ఇన్ని పరాభవాలు ఎదురుకావడంతో క్లాసెన్‌పై క్రికెట్ అభిమానులు జాలి చూపిస్తున్నారు. పాపం క్లాసెన్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో సౌతాఫ్రికా గ్రూప్ దశలో అదిరిపోయే ప్రదర్శనలు చేసింది. ఆఫ్ఘనిస్తాన్, ఇంగ్లండ్‌పై ఘన విజయాలు సాధించింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. అయినప్పటికీ సౌతాఫ్రికా గ్రూప్ టాపర్‌గా సెమీస్‌కు చేరింది. సెమీస్‌లోనూ మంచి ప్రదర్శనే చేసినప్పటికీ న్యూజిలాండ్ బ్యాటర్లు రచిన్ రవీంద్ర, కేన్ విలియమ్సన్ సూపర్ సెంచరీలు చేసి సౌతాఫ్రికా చేతి నుంచి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన న్యూజిలాండ్ ఫైనల్లో భారత్‌తో అమీతుమీ తేల్చుకుంటుంది. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది.


