విమానంలో పాలస్తీనియన్ల నిర్బంధం.. 12 గంటలపాటు.. | Israel To South Africa Gazans Stopped On Plane For Over 12 Hours, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

విమానంలో పాలస్తీనియన్ల నిర్బంధం.. 12 గంటలపాటు..

Nov 15 2025 7:41 AM | Updated on Nov 15 2025 11:15 AM

Israel to South Africa Gazans Stopped on Plane for Over 12 Hours

జోహన్నెస్‌బర్గ్‌: ప్రయాణ పత్రాల సమస్యల కారణంగా తొమ్మిది నెలల గర్భవతి సహా 150 మందికి పైగా పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికా అధికారులు విమానంలోనే నిర్బంధించారు. వారు ప్రయాణించిన విమానాన్ని దాదాపు 12 గంటలకు పైగా నిలిపివేయడంతో పిల్లలు, స్త్రీలు సహా ప్రయాణికులంతా ఇబ్బందులు పడ్డారు.

పాలస్తీనీయన్లు ప్రయాణిస్తున్న విమానం గురువారం ఉదయం టాంబో అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకుంది. అయితే ప్రయాణికుల దగ్గర ఉన్న పత్రాలపై ఇజ్రాయెల్‌ అధికారుల నుంచి నిష్క్రమణ స్టాంపులు, దక్షిణాఫ్రికాలో ఎంతకాలం ఉంటారనే వివరాలు, స్థానిక చిరునామాలు పేర్కొనలేదు. దీంతో ఇమ్మిగ్రేషన్‌ అధికారులు ప్రయాణికులను నిలిపేశారు. దక్షిణాఫ్రికా శోం శాఖ జోక్యంతో ‘గిఫ్ట్‌ ఆఫ్‌ ది గివర్స్‌’అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ వారికి వసతి కల్పించడానికి ముందుకు రావడంతో పిల్లలు సహా 153 మంది ప్రయాణికులను గురువారం రాత్రి విమానం దిగేందుకు అనుమతించారు. వారిలో 23 మంది ప్రయాణికులు ఇతర దేశాలకు వెళ్లారని, 130 మంది మాత్రం దక్షిణాఫ్రికాలోనే ఉన్నారని సరిహద్దు అధికారులు తెలిపారు.

ప్రయాణికుల పట్ల వ్యవహరించిన తీరు ఆగ్రహాన్ని రేకెత్తించింది. ‘ఇది చాలా దారుణం. నేను విమానంలోకి వచ్చినప్పుడు అది చాలా వేడిగా ఉంది. అక్కడ చాలా మంది పిల్లలు చెమటలు పట్టి అరుస్తూ, ఏడుస్తూ ఉన్నారు. దక్షిణాఫ్రికా ఇలా చేస్తుందంటే నేను నమ్మలేకున్నా. ఈ ప్రజలను కనీసం విమానాశ్రయంలోకి అనుమతించి, ఆశ్రయం కోసం దరఖాస్తు చేసుకోనివ్వాలి. ఇది రాజ్యాంగంలో కల్పించిన ప్రాథమిక ప్రాథమిక హక్కు.’అని నిలిపి ఉండగా విమానంలోకి వెళ్లివచి్చన పాసర్‌ నిగెల్‌ బ్రాంకెన్‌ అన్నారు. ఇటీవలి కాలంలో పాలస్తీనియన్లను దక్షిణాఫ్రికాకు తీసుకొచి్చన రెండో విమానం ఇది. తాము ఎక్కడికి వెళ్తున్నామనేది కూడా వారికి తెలియదు. విమానాన్ని నిర్వహించిన సంస్థ వివరాలు కూడా తెలియరాలేదు. ఇజ్రాయెల్‌ దాడుల తరువాత చాలామంది పాలస్తీనియన్లు దక్షిణాఫ్రికాలో ఆశ్రయం పొందాలని భావిస్తున్నారు. అందుకు కారణం దక్షిణాఫ్రికా చాలాకాలంగా పాలస్తీనాకు మద్దతుదారుగా ఉండటమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement