వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డికి అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజాదరణ మాత్రం పెరుగుతూ వస్తోంది. విద్యార్థులు, రైతులు సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ ఏడాది ఆరంభం నుంచే కూటమి ప్రభుత్వ కుట్రలపై వైఎస్సార్‌సీపీ తరఫున ఆయన ప్రత్యక్ష పోరాటాలకు పిలుపు ఇచ్చారు. అవకాశం దొరికినప్పుడల్లా స్వయంగా ప్రజల్లోకి వెళ్లి.. వాళ్లను పరామర్శించి.. ప్రభుత్వాన్ని నిలదీసి.. గత తన హయాంలో జరిగిన మంచిని వివరించారు. తద్వారా న్యాయం జరిగేలా చూశారు. ఆ సమయంలో వాళ్లకు ఆయన కల్పించిన భరోసా, ఆయన కోసం తరలివచ్చిన అభిమానం తాలుకా చిత్రాలు ఇవిగో..


