breaking news
Year Ender 2025
-
2026లో టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
2025 సంవత్సరం మరి కొద్ది గంటల్లో ముగియనున్న నేపథ్యంలో వచ్చే ఏడాది భారత పురుషుల క్రికెట్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లపై ఓ లుక్కేద్దాం. 2026లో టీమిండియా చాలా బిజీగా గడపనుంది. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీస్‌లు మొదలుకొని, స్వదేశంలోనే జరిగే టీ20 ప్రపంచకప్, ఆతర్వాత ఇంగ్లండ్ పర్యటనలో పరిమిత ఓవర్ల సిరీస్‌లు.. ఆతర్వాత స్వదేశంలోనే ఆఫ్ఘనిస్తాన్‌తో పరిమిత ఓవర్ల సిరీస్.. ఆతర్వాత స్వదేశంలోనే వెస్టిండీస్‌తో వన్డే సిరీస్, దాని తర్వాత న్యూజిలాండ్ పర్యటన.. సంవత్సరాంతంలో స్వదేశంలోనే శ్రీలంకతో సిరీస్.. ఇలా, ఈ ఏడాదంతా టీమిండియా బిజీబిజీగా గడపనుంది.వచ్చే ఏడాది టీమిండియా షెడ్యూల్ ఇదే...జనవరి, 2026: న్యూజిలాండ్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుఫిబ్రవరి, మార్చి: ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్మార్చి నుంచి మే మధ్యలో ఐపీఎల్ 2026జూన్‌లో ఆఫ్ఘనిస్తాన్ టూర్ ఆఫ్ ఇండియా1 టెస్టు, 3 వన్డేలుజూలైలో టీమిండియా టూర్ ఆఫ్ ఇంగ్లండ్5 టీ20లు, 3 వన్డేలుఆగస్టులో టీమిండియా టూర్ ఆఫ్ శ్రీలంక2 టెస్టులుసెప్టెంబర్లో టీమిండియా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ (తటస్థ వేదిక)3 టీ20లుసెప్టెంబర్, అక్టోబర్‌లో వెస్టిండీస్ టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 5 టీ20లుసెప్టెంబర్ 19-అక్టోబర్ 4: ఆసియా క్రీడలు 2026అక్టోబర్-నవంబర్‌లో టీమిండియా టూర్ ఆఫ్ న్యూజిలాండ్2 టెస్టులు, 3 వన్డేలు, 5 టీ20లుడిసెంబర్లో శ్రీలంక టూర్ ఆఫ్ ఇండియా3 వన్డేలు, 3 టీ20లు* పైన తెలిపిన షెడ్యూల్లో ఇంకా కొన్నింటికీ పూర్తి ఆమోదం లభించలేదు. -
2025లో తరలిపోయిన మహిళా దిగ్గజాలు
మరికొన్ని గంటల్లో యావత్ ప్రపంచం కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. కోటి ఆశలతో, మరింత నూతనోత్తేజంతో 2026 సంవత్సరానికి స్వాగతం చెప్పేందుకు ఉవ్విళూరుతోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, సకల శుభాలు, ప్రేమ, ఉత్సాహంతో నిండిన సరికొత్త ప్రారంభానికి స్వాగతం చెబుతాం. అలాగే రాబోయే సంవత్సరంలో మహిళలు మరిన్ని అవకాశాలు రావాలని, సాధికారత దిశగా మరింత సాహసోపేతమైన అడుగులు పడాలని యావత్ మహిళా లోకం కలలు గంటోంది.కొత్త అడుగు వేసే ముందు, మునుపటి అడుగును, అనేక రంగాల్లో తమదైన ముద్ర వేసిన పలువురు మహిళలను గుర్తు చేసుకోవడం కూడా అవసరం.2025 సంవత్సరం సినిమా, రాజకీయం, సామాజిక రంగాలకు తీరని లోటును మిగిల్చింది. ఈ ఏడాది కన్నుమూసిన దేశీయ , అంతర్జాతీయ ప్రముఖ మహిళల వివరాలు చూద్దాంభారతీయ ప్రముఖులుబీ సరోజా దేవి (నటి): "అభినయ సరస్వతి"గా పేరుగాంచిన లెజెండరీ నటి సరోజా దేవి జూలై 14, 2025న కన్నుమూశారు. ఆమె తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో వందలాది చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి దిగ్గజాలతో పోటా పోటీగా నటించి సినీ అభిమానులు గుండెల్లో సినిమాలు చిరస్థాయిగా నిలిచిపోయిన గొప్ప నటి.సీ కృష్ణవేణి (నటి ): తొలితరం తెలుగు నటి, నిర్మాత అయిన కృష్ణవేణి గారు ఫిబ్రవరి 16, 2025న తన 100వ ఏట మరణించారు. ఆమె తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తొలి మహిళా నిర్మాతలలో ఒకరు.కామినీ కౌశల్ (నటి): బాలీవుడ్ స్వర్ణయుగపు నటి కామినీ కౌశల్ నవంబర్ 13, 2025న మరణించారు. 'నీచా నగర్' వంటి ప్రతిష్టాత్మక చిత్రాలతో ఆమె ప్రసిద్ధి చెందారు.సిమోన్ టాటా (వ్యాపారవేత్త): భారతీయ సౌందర్య సాధనాల బ్రాండ్ 'లాక్మే' (Lakme) , 'ట్రెంట్/వెస్ట్‌సైడ్' అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన ప్రముఖ వ్యాపారవేత్త సిమోన్ టాటా డిసెంబర్ 5, 2025న 95 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.యువ నటి షెఫాలీ: 'కాంటా లగా' గర్ల్‌గా గుర్తింపు పొందిన షెఫాలీ జూన్ 27, 2025న గుండెపోటుతో 42 ఏళ్ల వయసులో అకాల మరణం చెందడం ఆమె అభిమానులును తీవ్ర విషాదంలో ముంచేసింది.సంధ్యా శాంతారామ్ (నటి): సీనియర్ నటి సంధ్య ఈ ఏడాది అక్టోబర్ 4, మరణించారు. ఆమె 'జనక్ జనక్ పాయల్ బాజే' వంటి క్లాసిక్ సినిమాల్లో నటనతో నభూతో నభవిష్యతి అనుపించుకున్నారు. అంతర్జాతీయ ప్రముఖులుఖలీదా జియా (రాజకీయవేత్త): బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30 న మరణించారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాన మంత్రి ఖలీదా జియా డిసెంబర్ 30, 2025న మరణించారు. పశ్చిమ బెంగాల్లో పుట్టి, బంగ్లాదేశ్‌కు తొలి మహిళా ప్రధానిగా ఘనత సాధించారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఆమె ఒక శక్తివంతమైన మహిళా నేతగా నిలిచారు.జేన్ గుడాల్ (శాస్త్రవేత్త): ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ప్రైమాటాలజిస్ట్ మరియు పర్యావరణ కార్యకర్త జేన్ గుడాల్ అక్టోబర్ 1, 2025న 91 ఏళ్ల వయసులో మరణించారు. చింపాంజీల ప్రవర్తనపై ఆమె చేసిన పరిశోధనలు విప్లవాత్మకమైనవి.డయాన్ కీటన్ (హాలీవుడ్ నటి): ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ అమెరికన్ నటి డయాన్ కీటన్ అక్టోబర్ 11న మరణించారు.డేమ్ అన్నెట్ బ్రూక్: UKలో ఎక్కువ కాలం పనిచేసిన మహిళా లిబరల్ డెమొక్రాట్ MP ఈ ఏడాది ఆగస్టులో మరణించారు. 2001లో డోర్సెట్‌లో సాధారణ ఎన్నికల్లో ఎన్నికైన తొలి మహిళా MPగా ఆమె రికార్డ్ సృష్టించారు. బ్రిజిట్ బార్డోట్ (నటి) ఫ్రెంచ్ సినిమా ఐకాన్ మరియు జంతు హక్కుల పోరాట యోధురాలు బ్రిజిట్ బార్డోట్ డిసెంబర్ 28, 2025న 91 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు.కిమ్ సే-రాన్ (దక్షిణ కొరియా నటి): ప్రముఖ కొరియన్ నటి కిమ్ సే-రాన్ ఫిబ్రవరి 16, 2025న కేవలం 24 ఏళ్ల వయసులో మరణించడం ఆ దేశ చిత్ర పరిశ్రమను షాక్‌కు గురిచేసింది.బార్బీ హ్సు (తైవానీస్ నటి): 'మెటియోర్ గార్డెన్' సీరీస్ ద్వారా ఆసియావ్యాప్తంగా గుర్తింపు పొందిన బార్బీ హ్సు ఫిబ్రవరి 2, 2025న మరణించారు.వీరితోపాటు 2025 అనేక రంగాలకు చెందిన ప్రముఖులను కూడా కోల్పోయాం. ముఖ్యంగా సినీ రంగంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు ధర్మేంద్ర, గోవర్దన్ అస్రానీ, సతీష్ షా, పంకజ్ ధీర్, జుబీన్ గార్గ్ ఉన్నారు. మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకుడు శివరాజ్ పాటిల్ చకుర్కర్ ఈ ఏడాదిలోనే మరణించారు. హిందూజా గ్రూప్ ఛైర్మన్ గోపీచంద్ పి. హిందూజా, టి.టి.కె. ప్రెస్టీజ్ కిచెన్ మొగల్ టి.టి. జగన్నాథన్ 77 ఏళ్ళ వయసులో మరణించారు ప్రఖ్యాత ప్రకృతి శాస్త్రవేత్త, వన్యప్రాణి సంరక్షకుడు , రచయిత కొన్ని దశాబ్దాల పాటు తన జీవితాన్ని పులుల సంరక్షణకు అంకితం చేసిన వాల్మిక్ థాపర్ క్యాన్సర్‌తో పోరాడుతూ 73 ఏళ్ళ వయసులో మే నెలలో కన్నుమూశారు. -
జనాలకు భరోసా కల్పిస్తూ జగన్ ప్రయాణం.. 2025 రౌండప్ చిత్రాలు
-
ఛేంజ్ మేకర్స్ 2025
→ డయానా పుండోల్32 ఏళ్ల ఈ ఇద్దరు పిల్లల తల్లి మోటార్ రేసింగ్‌లో మొదటి మహిళా జాతీయ ఛాంపియన్. ఆమె 2024లో ఎంఆర్ఎఫ్ ఇండియన్ నేషనల్ కార్ రేసింగ్ ఛాంపియన్ షిప్‌ను గెలుచుకున్నారు. పురుషులు–ఆధిపత్యం వహించే ఈ క్రీడలో స్త్రీల నుంచి ఇదో పెద్ద ముందడుగు. ఇప్పుడు 2025–2026 ఫెరారీ క్లబ్ ఛాలెంజ్ మిడిల్ ఈస్ట్ సిరీస్‌లో ΄ోటీ పడుతున్న మొదటి భారతీయ మహిళగా నిలిచారు, ఫెరారీ 296 ఛాలెంజ్ కారును నడుపుతున్నారు. ఒకప్పుడు ఉపాధ్యాయురాలిగా పనిచేసి, ఇప్పుడు రేసింగ్‌లో ఎంతోమంది మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.→ అంజ్లీ అగర్వాల్డాక్టర్ అంజ్లీ అగర్వాల్‌కు జీవితంలో ఎదురైన లోతైన బాధలెన్నో తెలుసు. కండరాల బలహీనతతో చక్రాల కుర్చీలో జీవిస్తున్నారామె. బహిరంగ స్థలాల్లో ర్యాంప్ లేక΄ోవడం వల్ల అవస్థ పడుతున్న తనలాంటి వేలమంది దివ్యాంగుల కోసం ఆమె ΄ోరాటం సాగిస్తున్నారు. ఆమె, ఆమె బృందం కలిసి వందలాది ప్రజా స్థలాలకు పునః రూపకల్పన చేశారు. ర్యాంప్ ఉండటం వల్ల దివ్యాంగులు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అధికారులకు అవగాహన కల్పించారు.→ బీబీ జాన్ కర్నాటకకు చెందిన బీబీ జాన్ చిన్నపాటి లోన్ కోసం బ్యాంక్ వెళితే తనలాంటి వాళ్లకు లోన్ రావడం ఎంత కష్టమో తెలియడమే కాకుండా తనలాంటి వాళ్లు చాలామంది లోన్ల కోసం బాధలు పడుతున్నారని అర్థమైంది. దాంతో ఆమె స్థానిక స్వయం సహాయక సంఘానికి నాయకత్వం వహించడానికి ముందుకు వచ్చి 14 మంది సభ్యుల బృందంతో మొదలుపెట్టి నేడు 1,000 మందికి పైగా మహిళల సమష్టి ఎదుగుదలకు కారణమయ్యారు. వారంతా స్వంత మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను నడుపుతూ సేంద్రీయ, వాతావరణ–స్థిరమైన పద్ధతులను ఉపయోగించి 30 గ్రామాలలో వ్యవసాయం చేస్తున్నారు. -
కొంచెం మోదం... కొంచెం ఖేదం
పురుషుల హాకీ, బ్యాడ్మింటన్, షూటింగ్ ప్రతీ సంవత్సరం తరహాలోనే ‘సమ్’తృప్తిని పంచాయి. చెస్‌లో మహిళల వరల్డ్ కప్ టైటిల్‌తో కాస్త అదనపు ఆనందం దక్కితే, ఆర్చరీ, బాక్సింగ్‌లలో ఫర్వాలేదనిపించే ఫలితాలు వచ్చాయి. ఫుట్‌బాల్, టెన్నిస్ ఎప్పటిలాగే నిరాశను పంచితే... వెయిట్‌లిఫ్టింగ్‌లో కొత్త తరం విజయాలు అందించలేకపోయింది. నీరజ్ చోప్రా తన స్థాయికి తగినట్లు పతకం తేలేక ప్రపంచ వేదికపై నిరాశ పర్చడం అనూహ్య ప్రదర్శనగా మిగిలిపోయింది. 2025లో క్రికెటేతర క్రీడల్లో భారత ఆటగాళ్లు అటు టీమ్ ఈవెంట్లలో, ఇటు వ్యక్తిగత క్రీడాంశాల్లోనూ మిశ్రమ ప్రదర్శన కనబర్చారు. ప్రపంచ వేదికపై ఓ ఆటగాడిని శిఖరాన నిలిపే అసాధారణ ప్రదర్శన లేదా అద్భుత క్షణాలు మాత్రం చెప్పుకోదగ్గవి ఏవీ రాలేదు. ఈ ఏడాది భిన్న క్రీడాంశాల్లో భారత ఆటగాళ్ల ప్రదర్శనను సమీక్షిస్తే... ఆర్చరీ: భారత్‌కు సంబంధించి ఆర్చరీలో ఈ ఏడాది గుర్తుంచుకోదగ్గ విధంగా సాగింది. నాలుగు ప్రపంచకప్‌లలో కలిపి భారత ఆర్చర్లు మొత్తం 15 పతకాలు గెలుచుకున్నారు. 2025 ప్రపంచ కప్ పతకాల పట్టికను భారత్ నాలుగో స్థానంతో ముగించింది. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఒక స్వర్ణం, ఒక రజతం గెలుచుకుంది. ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో 10 పతకాలతో అగ్రస్థానం సాధించడం విశేషం. వరల్డ్ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో శీతల్ దేవి స్వర్ణంతో మెరిసింది. ఫుట్‌బాల్: భారత ఫుట్‌బాల్ చరిత్రలో మరో చెత్త సంవత్సరంగా ఇది మిగిలిపోనుంది. అతి చిన్న జట్ల చేతుల్లో ఓడిపోవడంతోపాటు ప్రపంచ ర్యాంకింగ్స్‌లో మరింత దిగువకు పడిపోయింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో 127వ ర్యాంక్‌లో ఉన్న టీమ్ చివరకు వచ్చేసరికి 142వ ర్యాంక్‌తో ముగించింది. మహిళల జట్టు కొంత మెరుగ్గా ఆడటం విశేషం. క్వాలిఫికేషన్ టోర్నమెంట్ గెలవడం ద్వారా 2026 ఆసియా కప్‌కు భారత మహిళలు అర్హత సాధించారు.రెజ్లింగ్: 2025 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ ఏకైక పతకాన్ని గెలుచుకుంది. మహిళల 53 కేజీల విభాగంలో అంతిమ్ ఆ ఘనతను సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో మన దేశం 10 పతకాలు గెలుచుకుంది. తాను రిటైర్మెంట్ను వీడి మళ్లీ రెజ్లింగ్ బరిలోకి దిగుతున్నట్లు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ ఏడాది చివర్లో ప్రకటించింది. సీనియర్లతో పోలిస్తే ప్రపంచ అండర్–20, అండర్–23 ఈవెంట్లలో మన రెజ్లర్లు మెరుగైన ప్రదర్శన కనబర్చి భవిష్యత్తుపై ఆశలు రేపారు.టెన్నిస్: పురుషుల టెన్నిస్‌లో భారత్‌కు సంబంధించి చెప్పుకోదగ్గ విశేషాలేమీ లేవు. ఏ ఒక్కరు కూడా టాప్–200 ర్యాంకింగ్స్‌లోకి వెళ్లలేకపోగా, చాలెంజర్ టూర్లో సింగిల్స్ విభాగంలో ఒక్కరూ కనీసం ఒక్క టైటిల్ కూడా గెలవలేకపోయారు. ఏటీపీ టూర్ డబుల్స్‌లో యూకీ బాంబ్రీ దుబాయ్ ఓపెన్ గెలవగా, రితి్వక్ బొల్లిపల్లి చిలీ ఓపెన్ సాధించాడు. డేవిస్ కప్‌లో స్విట్జర్లాండ్‌ను ఓడించి భారత్ 2026 డేవిస్ కప్ క్వాలిఫయర్ దశకు అర్హత సాధించగా... బిల్లీ జీన్‌కింగ్ కప్‌లో భారత్ ప్లే ఆఫ్స్ దశ వరకు వెళ్లగలిగింది. వర్ధమాన క్రీడాకారిణుల్లో శ్రీవల్లి రషి్మక, మాయ చక్కటి ఆటతో అందరి దృష్టిలో పడినా... ఫలితాలపరంగా పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. సీనియర్ డబుల్స్ స్టార్, రెండు గ్రాండ్‌స్లామ్‌ల విజేత రోహన్ బోపన్న ఈ ఏడాది ఆటకు రిటైర్మెంట్ ప్రకటించాడు. బ్యాడ్మింటన్: భారత షట్లర్లు అంతర్జాతీయ వేదికపై మెరుగైన ప్రదర్శన కనబర్చారు. వరల్డ్ చాంపియన్‌షిప్‌లో సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడి కాంస్యం గెలుచుకోవడం ఈ ఏడాది హైలైట్ కాగా బీడబ్ల్యూఎఫ్ టూర్లో మరో మూడు టైటిల్స్ మన ఆటగాళ్ల ఖాతాలో చేరాయి. ఆ్రస్టేలియన్ ఓపెన్‌ను లక్ష్య సేన్, యూఎస్ ఓపెన్‌ను ఆయుశ్ శెట్టి గెలుచుకోగా... మహిళల డబుల్స్‌లో పుల్లెల గాయత్రి–ట్రెసా జాలీ జోడి సయ్యద్ మోడీ ఇంటర్నేషనల్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. టేబుల్ టెన్నిస్: వరల్డ్ టీటీ టూర్లో భారత ఆటగాళ్లు రెండు టైటిల్స్ సాధించగలిగారు. మిక్స్డ్ డబుల్స్‌లో దియా–మనుష్ జోడీ ట్యూనిస్ కంటెండర్ టోర్నీని, పురుషుల డబుల్స్‌లో సత్యన్–ఆకాశ్ ద్వయం లాగోస్ కంటెండర్ టోర్నీని సొంతం చేసుకున్నారు. ఆసియా టీటీ చాంపియన్‌షిప్‌లో కనీసం ఒక్క పతకమైనా గెలుచుకోవడంలో భారత ప్యాడ్లర్లు సఫలం కాలేకపోయారు. పురుషుల టీమ్ 11వ, మహిళల టీమ్ 12వ ర్యాంక్‌తో ఈ ఏడాదిని ముగించింది. షూటింగ్: ఈ ఏడాది షూటింగ్లో భారత్ ప్రదర్శన సంతృప్తికరంగా సాగింది. అన్ని ప్రపంచకప్‌లలో కలిపి 11 స్వర్ణాలు సహా మొత్తం 28 పతకాలు గెలుచుకున్న భారత్... ఓవరాల్‌గా రెండో స్థానంతో ముగించింది. వరల్డ్ షూటింగ్ చాంపియన్‌షిప్‌లో కూడా మన షూటర్లు మొత్తం 13 పతకాలు అందించారు. ఈ ఏడాది కొత్తగా వెలుగులోకి వచ్చి వేర్వేరు టోర్నీల్లో సత్తా చాటిన షూటర్‌గా సురుచి సింగ్ (మహిళల పిస్టల్)కు గుర్తింపు లభించింది.వెయిట్‌లిఫ్టింగ్: వరల్డ్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ మహిళల 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను రజత పతకాన్ని గెలుచుకుంది. స్వదేశంలో జరిగిన కామన్వెల్త్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించింది. ఇవి మినహా ఈ క్రీడాంశంలో భారత్ నుంచి చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు.హాకీ: భారత పురుషుల జట్టు ఆసియా కప్‌లో విజేతగా నిలిచి వచ్చే ఏడాది జరిగే ప్రపంచ కప్‌కు అర్హత సాధించడం చెప్పుకోదగ్గ విశేషం. అయితే ఎఫ్ఐహెచ్ ప్రొ లీగ్ టోర్నీలో పేలవ ప్రదర్శనతో జట్టు ఎనిమిదో స్థానంతో ముగించింది. మహిళల హాకీ జట్టు ప్రదర్శన అయితే మరీ పేలవంగా ఉంది. చెప్పుకోదగ్గ విజయం ఒక్కటీ దక్కకపోగా...ప్రొ హాకీ లీగ్‌లో దిగువ స్థానానికి పడిపోయింది. చెస్: మహిళల చెస్ వరల్డ్ కప్‌లో భారత్‌కు చెందిన దివ్య దేశ్‌ముఖ్ చాంపియన్‌గా, కోనేరు హంపి రన్నరప్‌గా నిలవడం ఈ ఏడాది చదరంగంలో చెప్పుకోదగ్గ విశేషం. వరల్డ్ చాంపియన్‌గా నిలిచిన తర్వాతి ఏడాది గుకేశ్ కెరీర్ పడుతూ, లేస్తూ సాగింది. ‘ఫిడే’ వరల్డ్ కప్‌లో, ఫ్రీస్టయిల్ చెస్ గ్రాండ్‌స్లామ్‌లో అతను విఫలమయ్యాడు. అయితే నార్వే ఓపెన్‌లో దిగ్గజం కార్ల్‌సన్‌పై సాధించిన గెలుపు చిరస్మరణీయంగా నిలిచింది. స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్‌లో ప్రజ్ఞానంద, అర్జున్, నిహాల్, విదిత్, హరికృష్ణ విఫలం కాగా...‘ఫిడే’ సర్క్యూట్లో గెలిచి ఎట్టకేలకు ప్రజ్ఞానంద క్యాండిడేట్స్ టోరీ్నకి అర్హత సాధించగలిగాడు. ప్రపంచ ర్యాపిడ్ చెస్ చాంపియన్‌షిప్‌లో కోనేరు హంపి, ఇరిగేశి అర్జున్ కాంస్య పతకాలతో మెరిశారు. ఈ ఒక్క ఏడాదే భారత్ నుంచి ఆరుగురు కొత్త ‘గ్రాండ్‌మాస్టర్లు’ రావడం విశేషం.అథ్లెటిక్స్: భారత స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా మరో ఏడాదిని తన పేరిట లిఖించుకున్నాడు. పారిస్ డైమండ్ లీగ్, పోష్్రసూ్టమ్ ఇని్వటేషనల్, కుసోసిన్కీ మెమోరియల్, గోల్డెన్ స్పయిక్ ఒస్ట్రావా, నీరజ్ చోప్రా క్లాసిక్ ఈవెంట్లలో (మొత్తం ఐదు) నీరజ్ విజేతగా నిలిచాడు. పైగా కెరీర్లో తొలిసారి 90 మీటర్ల మార్క్‌ను కూడా (దోహా డైమండ్ లీగ్‌లో) అతను దాటడం మరో విశేషం. అయితే దురదృష్టవశాత్తూ 2025 వరల్డ్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో చోప్రా పతకం గెలవకుండా వెనుదిరగడం మాత్రం నిరాశ కలిగించిన అంశం. మరోవైపు ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భారత అథ్లెట్లు 8 స్వర్ణాలు సహా మొత్తం 24 పతకాలు గెలుచుకున్నారు.బాక్సింగ్: వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్ 4 పతకాలు గెలుచుకుంది. వరల్డ్ బాక్సింగ్ కప్ సిరీస్‌లో భారత్ 3 ప్రపంచ కప్‌లలో కలిపి 13 స్వర్ణాలు సహా మొత్తం 40 పతకాలు సాధించడం విశేషం. తెలంగాణ బాక్సర్ నిఖత్ కూడా పసిడి పతకం నెగ్గింది. –సాక్షి క్రీడా విభాగం -
ఈ ఏడాది టెక్ కంపెనీల్లో లేఆఫ్స్ కలకలం
భారత్‌లోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ రంగంలో లేఆఫ్స్ పర్వం కొనసాగుతోంది. ఒకవైపు కృత్రిమ మేధ(ఏఐ) కొత్త పుంతలు తొక్కుతుంటే, మరోవైపు అదే వేగంతో ఉద్యోగాల కోత పెరుగుతోంది. ప్రముఖ లేఆఫ్స్ ట్రాకర్ ‘లేఆఫ్స్.ఎఫ్‌వైఐ’(Layoffs.fyi) తాజా గణాంకాల ప్రకారం, ఈ ఏడాది ఇప్పటివరకు సుమారు 551 టెక్ కంపెనీల నుంచి 1,22,549 మందికి పైగా ఉద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు. గత కొన్ని వారాలుగా ఈ వేగం కొద్దిగా తగ్గినట్లు కనిపిస్తున్నా, ప్రభావం మాత్రం తీవ్రంగా ఉంది.ప్రముఖ కంపెనీలు ఇలా..అమెజాన్.. అక్టోబర్‌లో కంపెనీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా అత్యధికంగా ఉద్యోగాల కోత విధిస్తూ 14,000 కొలువులను తొలగించింది.మైక్రోసాఫ్ట్.. 2025 నాటికి మొత్తం 15,000 మందిని తొలగించే దిశగా అడుగులు వేసింది. జులైలోనే దాదాపు 9,000 మందిని పంపించివేసింది.ఇంటెల్.. చిప్ తయారీలో వెనుకబడటం, ఆర్థిక నష్టాల నేపథ్యంలో ఏకంగా మొత్తం సిబ్బందిలో 15% (సుమారు 25,000 మంది) తగ్గించుకోవాలని నిర్ణయించుకుంది.సేల్స్ ఫోర్స్.. ఏఐ సహాయంతో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ ఉద్యోగులను తగ్గించినట్లు సీఈఓ మార్క్ బెనియోఫ్ ధ్రువీకరించారు.టీసీఎస్.. భారత్‌లో దాదాపు 12,000 మందిని (మొత్తం ఉద్యోగుల్లో 2%) తొలగించి ఐటీ రంగంలో ఆందోళన కలిగించింది. అయితే ఇది ఏఐ వల్ల కాదని, నైపుణ్యాల అసమతుల్యత వల్లేనని సంస్థ స్పష్టం చేసింది.మెటా (600 మంది), గూగుల్ (100+), వెరిజోన్ (13,000), హెచ్‌పీ (4,000-6,000 మంది) వంటి సంస్థలు కూడా లేఆఫ్స్ ఇచ్చాయి.లేఆఫ్స్‌కు దారితీసిన కారణాలుచాలా కంపెనీలు ఇప్పుడు ‘ఏఐ ఫస్ట్’ విధానాన్ని అనుసరిస్తున్నాయి. గతంలో వందలాది మంది చేసే పనులను (డేటా ఎంట్రీ, కస్టమర్ సపోర్ట్, బేసిక్ కోడింగ్..) ఇప్పుడు ఏఐ టూల్స్ తక్కువ ఖర్చుతో వేగంగా చేస్తున్నాయి. కంపెనీలు తమ బడ్జెట్‌ను మానవ వనరుల నుంచి ఏఐ మౌలిక సదుపాయాల వైపు మళ్లిస్తున్నాయి.ద్రవ్యోల్బణం పెరగడం, సుంకాల భారం పెరగడంతో కంపెనీల నిర్వహణ ఖర్చులు పెరిగాయి. ఇన్వెస్టర్ల నుంచి ఒత్తిడి పెరగడంతో తక్కువ మంది ఉద్యోగులతో ఎక్కువ ఉత్పాదకత సాధించడంపై యాజమాన్యాలు దృష్టి పెట్టాయి.కరోనా సమయంలో డిజిటల్ సేవల కోసం డిమాండ్ పెరగడంతో టెక్ కంపెనీలు భారీగా నియామకాలు చేపట్టాయి. ఇప్పుడు డిమాండ్ సాధారణ స్థితికి రావడంతో అవసరానికి మించి ఉన్న సిబ్బందిని తొలగిస్తున్నాయి.పాత ప్రాజెక్టులను మూసివేసి కేవలం క్లౌడ్, సెక్యూరిటీ, జనరేటివ్ ఏఐ వంటి భవిష్యత్తు అవసరాల మీదనే కంపెనీలు పెట్టుబడి పెడుతున్నాయి. దీనివల్ల పాత నైపుణ్యాలు కలిగిన వారు ఉద్యోగాలు కోల్పోతున్నారు.టెక్ రంగం ప్రస్తుతం ఒక పరివర్తన దశలో ఉంది. ఉద్యోగాల కోత ఆందోళన కలిగించే విషయమే అయినా ఏఐ రంగంలో కొత్త రకమైన ఉద్యోగ అవకాశాలు కూడా పుట్టుకొస్తున్నాయి. సిబ్బంది తమ నైపుణ్యాలను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవడమే ప్రస్తుత సంక్షోభం నుంచి గట్టెక్కే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు.ఇదీ చదవండి: బంగారం ధరలు రివర్స్! తులం ఎంతంటే.. -
భారతీయ వారసత్వ విశ్వరూపం
ప్రయాగరాజ్ మహాకుంభం నుండి పారిస్ వేదికపై మరాఠా పరాక్రమం వరకు.. మట్టి ప్రమిదల వెలుగు నుండి వందేమాతరం శంఖారావం వరకు.. 2025 సంవత్సరం భారతీయ సంస్కృతికి స్వర్ణయుగంగా నిలిచింది. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పురాతన సంప్రదాయాలను, ఆధునిక డిజిటల్ యుగంతో మేళవిస్తూ సాగిన ఈ ఏడాది ప్రయాణం.. ‘వికసిత్ భారత్’దిశగా బలమైన ముద్ర వేసింది. ఇది కేవలం కాలాన్ని లెక్కించడం కాదు, ప్రపంచ యవనికపై భారత్ తన అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని సువర్ణాక్షరాలతో లిఖించిన అద్భుత ఘట్టం. మహా కుంభమేళా, ‘కళాగ్రామ్’ హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాతి్మక కలయికగా భావించే కుంభమేళాను ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్)లో గంగ, యమున, సరస్వతి నదుల సంగమం వద్ద నిర్వహించారు. మహా కుంభమేళా జనవరి 13, 2025న ప్రారంభమై, ఫిబ్రవరి 26, 2025న ముగిసింది. 144 ఏళ్లకు ఒకసారి వచ్చే అత్యంత పవిత్రమైన ఘట్టంగా దీనిని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లోని టెంట్ సిటీలో 10.24 ఎకరాల్లో ’కళా గ్రామం’ ఏర్పాటు చేశారు. ఇది భారతీయ హస్తకళలు, సంప్రదాయాలు, సాంస్కృతిక వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. కుంభమేళా చిహ్నాన్ని దేశవ్యాప్తంగా ఉన్న రక్షిత కట్టడాలపై ప్రదర్శించి, దీనిని ఒక జాతీయ పండుగలా జరిపారు. వందేమాతరం @ 150 1875–76 ప్రాంతంలో బంకిం చంద్ర ఛటర్జీ రచించిన వందేమాతరం గీతం 2025 నాటికి 150 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ’వందేమాతరం’ నినాదం పోషించిన వీరోచిత పాత్రను స్మరించుకుంటూ ఏడాది పొడవునా సాగే ఉత్సవాలకు కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ నవంబర్ 2025లో శ్రీకారం చుట్టింది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, సాంస్కృతిక కేంద్రాల్లో ఈ వేడుకలను నిర్వహించారు. దేశవ్యాప్తంగా చారిత్రక కట్టడాల వద్ద వందేమాతరం గీతంతో కూడిన ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. బుద్ధుడి వారసత్వం – దౌత్య నీతి పైప్రావా (కపిలవస్తు) వద్ద లభించిన బుద్ధ భగవానుడి పవిత్ర అవశేషాలను థాయ్‌లాండ్, భూటాన్ దేశాల్లో ప్రదర్శించడం ద్వారా భారత్ తన ‘సాంస్కృతిక దౌత్యం’చాటింది. 1898లో కనుగొన్న అత్యంత విలువైన పిప్రావా పవిత్ర అవశేషాల వేలాన్ని హాంగ్‌కాంగ్‌లో భారత్ విజయవంతంగా అడ్డుకుంది. ఒక ప్రైవేట్ పారిశ్రామిక సంస్థ, ప్రభుత్వ దౌత్య సహకారంతో అమూల్యమైన బంగారు, స్ఫటిక ఆభరణాల నిధిని తిరిగి స్వదేశానికి రప్పించింది. గుజరాత్ (దేవ్నిమోరి) నుండి లభించిన అవశేషాలను శ్రీలంకలోని కొలంబోకు 2026 ఫిబ్రవరిలో తీసుకెళ్లనున్నారు. జ్ఞాన భారతం – డిజిటల్ విప్లవం సెపె్టంబర్లో ప్రధాని మోదీ ప్రారంభించిన ‘జ్ఞాన భారతం’పోర్టల్ ద్వారా దేశంలోని అరుదైన రాత ప్రతులను భద్రపరిచి, డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది ‘వికసిత్ భారత్ 2047’లక్ష్యంలో భాగంగా ‘ఢిల్లీ డిక్లరేషన్’తో ముగిసింది. దీపావళికి విశ్వ కిరీటం భారతీయుల ఆరాధ్య పండుగ ’దీపావళి’కి యునెస్కో తన ప్రతిష్టాత్మకమైన ’మానవత్వపు అమూల్య సాంస్కృతిక వారసత్వ’ జాబితాలో చోటు కల్పించింది. డిసెంబర్ 10న లభించిన ఈ గుర్తింపుతో భారత్ నుండి ఈ జాబితాలో చేరిన అంశాల సంఖ్య 16కు చేరింది.మరాఠా కోటల ప్రపంచ రికార్డు జూలైలో పారిస్‌లో జరిగిన సమావేశంలో శివనేరి, రాయ్‌గఢ్ సహా 12 మరాఠా సైనిక కోటలకు ‘ప్రపంచ వారసత్వ హోదా’లభించింది. శత్రు దుర్భేద్యమైన భారతీయ యుద్ధ తంత్రానికి ఇది దక్కిన అంతర్జాతీయ గౌరవం. మహనీయుల స్మరణఅహిల్యాబాయి హోల్కర్ 300 వ జయంతి, సర్దార్ పటేల్ 150వ జయంతి, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ (125 ఏళ్లు), గాడియా మిషన్ స్థాపకుడు శ్రీల ప్రభుపాద 150వ జన్మదిన వేడుకలను దేశవ్యాప్తంగా నిర్వహించి, భారతీయ మూలాలను స్మరించుకున్నారు. ఎర్రకోట వేదికగా ప్రపంచ సదస్సుయునెస్కో ఇంటర్ గవర్నమెంటల్ కమిటీ 20వ సమావేశాన్ని తొలిసారిగా భారత్ నిర్వహించింది. వారసత్వ సంపద రక్షణపై ‘ఢిల్లీ డిక్లరేషన్’ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేసింది. గతాన్ని గౌరవించడం, వర్తమానాన్ని వేడుకగా జరుపుకోవడం, భవిష్యత్తు కోసం వారసత్వాన్ని భద్రపరచడం.. ఈ మూడింటి కలయికే 2025 భారత సాంస్కృతిక గమనం. భారతావనికి ఒక ‘సాంస్కృతిక వసంతం’! – సాక్షి, నేషనల్ డెస్క్ -
మెరుపులు.. కొన్ని మరకలు.. ఇంకొన్ని వివాదాలు
త్వరలో కాలగర్భంలో కలిసిపోనున్న 2025 సుప్రీంకోర్టు చరిత్రలో చిరకాలం గుర్తుండిపోయే ఏడాదిగా నిలవనుంది. పలు సంచలనాత్మక కేసులు, వక్ఫ్ చట్టం వంటి వివాదాస్పద అంశాలు, రాజ్యంగపరంగా కీలకమైన సందేహాలు లేవనెత్తిన రాష్ట్రపతి రిఫరెన్సు వంటివి సంవత్సరం పొడవునా అత్యున్నత న్యాయస్థానానికి ఊపిరి సలపనివ్వలేదు. ఆ కేసులను పరిష్కరించే క్రమంలో సుప్రీం పలు చరిత్రాత్మక తీర్పులు వెలువరించింది. ప్రజాప్రయోజనాలు, రాజకీయాలు, పర్యావరణం, నేర సంబంధిత కేసులతో పాటు పలు సంక్లిష్టమైన పౌరసంబంధ తగాదాలను సైతం సమర్థంగా పరిష్కరించింది. కీలకమైన కేసుల్లో రాష్ట్రపతి, గవర్నర్లకు డెడ్‌లైన్ వంటి తీర్పుల విషయంలో కాస్త చూసీచూడనట్టు పోయిందన్న అభిప్రాయాలకు కూడా తావిచ్చింది. ఈ ఏడాది అత్యున్నత న్యాయస్థానం ముందుకొచ్చిన పలు కీలక కేసులను ఓసారి చూస్తే... వ్యవస్థల నడుమ... టగ్ ఆఫ్ వార్!గవర్నర్లు, విపక్ష పాలిత రాష్ట్రాల మధ్య చిరకాలంగా పెను వివాదంగా మారిన బిల్లుల ఆమోదం అంశం ఈ ఏడాది సుప్రీంకోర్టుకు అగ్నిపరీక్షే పెట్టింది. బిల్లులను తమిళనాడు గవర్నర్ రవి తొక్కిపట్టడాన్ని సవాలు చేస్తూ తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వం సుప్రీంకోర్టు తలుపు తట్టడంతో న్యాయవ్యవస్థకే సుదీర్ఘ, సంక్లిష్ట సవాలుకు తెరలేచింది. గవర్నర్‌తో పాటు రాష్ట్రపతి కూడా మూడు నెలల్లోపు బిల్లులకు ఆమోదం తెలపడం, వాటిని తిప్పి పంపడమో చేయని పక్షంలో అవి ఆమోదం పొందినట్టే భావించాలంటూ సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు పెను సంచలనమే సృష్టించింది. అధికార బీజేపీకి ఖేదం, విపక్షాలకు మోదం కలిగించింది. దాంతో, ఇలా గడువు విధించడం సబబేనా అంటూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టారు. తన అసాధారణ అధికారాలను ఉపయోగించుకుంటూ, ఈ అంశంపై కోర్టుకు 14 ప్రశ్నాస్త్రాలు సంధించి వాటికి బదులు కోరారు. దాంతో సమస్య కీలక మలుపు తిరిగింది. ఒక దశలో అతి కీలకమైన న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అమీతుమీ తరహా పరిస్థితులు నెలకొన్నాయి. చివరికి రాష్ట్రపతికి, గవర్నర్లకు కోర్టులు అలా గడువు విధించలేవంటూ ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించడం ద్వారా ఈ వివాదానికి సామరస్యపూర్వకంగా తెర దించింది. అయితే ఆ క్రమంలో న్యాయవ్యవస్థ ఒక మెట్టు దిగిందన్న అభిప్రాయాలు విపక్షాలతో పాటు న్యాయ నిపుణుల నుంచి కూడా విన్పించాయి. కాకపోతే గవర్నర్లు బిల్లులపై ఏ నిర్ణయమూ తీసుకోకుండా సుదీర్ఘకాలం సాగదీస్తే ఊరుకునేది లేదని, అలాంటప్పుడు న్యాయసమీక్ష సబబేనని ధర్మాసనం పేర్కొనడం ప్రజాస్వామ్యవాదులకు కాస్త ఊరటనిచ్చింది. ‘వక్ఫ్’పై మధ్యేమార్గంవక్ఫ్ ఆస్తులను క్రమబద్ధీకరించే క్రమంలో మోదీ సర్కారు తీసుకొచ్చిన అత్యంత వివాదాస్పద కొత్త వక్ఫ్ (సవరణ) చట్టం–2025 కేసు విషయంలో సుప్రీంకోర్టు వీలైనంత సమతుల్యత పాటించే ప్రయత్నం చేసింది. వక్ఫ్ బై యూజర్ ప్రయోజనాన్ని తొలగింపు సక్రమమేనని, ఈ నిర్ణయం ద్వారా వక్ఫ్ భూములను కేంద్రం లాక్కుంటుందన్న వాదనలో పస లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అదే సమయంలో కనీసం ఐదేళ్లుగా ఇస్లాంను అనుసరిస్తున్న వాళ్లు మాత్రమే వక్ఫ్ కింద దానాలు ఇవ్వొచ్చన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టింది. సోషల్ న్యూసెన్స్‌కు ముకుతాడుభావ ప్రకటన స్వేచ్ఛ పేరిట హద్దు మీరుతున్న యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లూ యన్సర్లకు సుప్రీంకోర్టు ముకుతాడు వేసింది. తల్లిదండ్రులు–పిల్లలపై అసహ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు చేసిన రణ్వీర్ అలహాబాదియా, దివ్యాంగులను కించపరిచిన సమయ్ రైనా వంటి పలువు రు ఇన్ఫ్లూయన్సర్లను కోర్టు గట్టిగా నలుగు పెట్టి వదిలింది. మున్ముందు ఇలాంటి ఉదంతాల్లో కఠిన శిక్షలు విధించేలా ఎస్సీ, ఎస్టీ చట్టం తరహాలో గట్టి చట్టం తేవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. ఆన్లైన్ కంటెంట్‌ను క్రమబద్ధీకరించేలా గైడ్‌లైన్స్ విడుదల రూపొందించాలని పేర్కొంది. గ్రామ సింహాల గోలఏ వీధికి వెళ్లినా సర్వసాధారణంగా కన్పించే వీధి కుక్కల బెడద సుప్రీం దృష్టికీ వెళ్లింది. దీనిపై మీడియా కథనాలను సుమోటోగా విచారణకు స్వీకరించడమే గాక వీధి కుక్కలను శాశ్వతంగా తరలించే దిశగా కేంద్ర, రాష్ట్రాలకు పలు నిర్దేశాలు జారీ చేసింది. దీనిపై జంతు ప్రేమికుల నుంచి వ్యక్తమైన అభ్యంతరాల నేపథ్యంలో ముగ్గురు సభ్యుల ధర్మాసనం లోతైన విచారణ జరిపింది. కుటుంబనియంత్రణ ఆపరేష్ల అనంతరం కుక్కల్ని తిరిగి వీధుల్లోకి వదలవచ్చంటూ తీర్పును కాస్త సవరించింది. సీజేపైకి బూటుఅక్టోబర్ 6వ తేదీ. సుప్రీంకోర్టులో అత్యంత అరుదైన, అవాంఛనీయమైన ఉదంతం జరిగిన రోజు. రాకేశ్ కిషోర్ అనే సీనియర్ న్యాయవాది ఏకంగా నాటి సీజేఐ జస్టిస్ గవాయ్‌పైకి బూటు విసిరి కలకలం రేపాడు. అంతకుముందు విచారణ సందర్భంగా హిందూ దేవీ దేవతలపై ఆయన చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ఈ మతిలేని చర్యకు పూనుకున్నాడు.న్యాయమూర్తుల ఆస్తుల వెల్లడిన్యాయవ్యవస్థలో మరింత పారదర్శకత, విశ్వసనీయత దిశగా న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను బయట పెట్టాలని అత్యున్నత న్యాయస్థానం మరో కీలక నిర్ణయమూ తీసుకుంది. వాటిని ఆన్లైన్లో అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంది. అలాగే న్యాయ సిబ్బంది తదితర నియామకాల్లో ఎస్సీ, ఎస్టీలకు ప్రజలకు రిజర్వేషన్ల కల్పన కూడా వినూత్నమే.జడ్జి ఇంట్లో నోట్ల కట్టలుదేశ రాజధానిలో హైకోర్టు న్యాయ మూర్తిగా ఉన్న జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో కట్టలు కట్టలుగా కరెన్సీ నోట్లు సగం కాలిపోయిన స్థితిలో బయటపడ్డ ఉదంతం దేశమంతటా పెను ప్రకంపనలు సృష్టించడమే గాక న్యాయవ్యవస్థ ప్రతిష్టకే మచ్చగా నిలిచింది. మార్చి 14వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఆయన అధికార నివాసంలో చెలరేగిన మంటలను ఆపేందుకు వెళ్లిన అగ్నిమాపక, పోలీసు సిబ్బంది స్టోర్ రూములో నేలపై పరిచిన భారీస్థాయిలో నోట్ల కట్టలు చూసి నోరెళ్లబెట్టారు. ఇతర పౌరుల్లాగే ఆయన్ను కూడా చట్టప్రకారం కఠినంగా శిక్షించి న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచాలని సామాన్యులంతా ఆశించారు. సుప్రీంకోర్టు నియమించిన అంతర్గత న్యాయ మూ ర్తుల కమిటీ సైతం ఆయన్ను దోషిగా తేల్చి చర్యలకు సిఫార్సు చేసింది. రాజీ నామా చేయాల్సిందిగా నాటి సీజేఐ జస్టిస్ ఖన్నా సూచించినా జస్టిస్ వర్మ ససేమిరా అన్నారు. దాంతో ఆయన్ను అభి శంసించాల్సిందిగా రాష్ట్రపతి, ప్రధానులకు సీజే లేఖ రాయాల్సి వచ్చింది. జస్టిస్ వర్మను తొలగించాలని పలువురు ఎంపీలు కూడా పార్లమెంటుకు లేఖ రాశారు. అభిశంసన ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం ఆయనపై పార్లమెంటరీ ప్యానల్ విచారణ కొన సాగుతోంది. దాన్ని కూడా సవాలు చేస్తూ జస్టిస్ వర్మ సుప్రీం మెట్లెక్కడం అందరినీ నిర్ఘాంతపరిచింది.ముగ్గురు సీజేలుసుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పీఠంపై ముగ్గురు అత్యంత సీనియర్ జడ్జీలు కొలువుతీరడం ఈ ఏడాది ప్రత్యేకతగా చెప్పొచ్చు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ గవాయ్ ఈ ఏడాదే రిటైరవగా జస్టిస్ సూర్యకాంత్ సీజేగా బాధ్యతలు స్వీకరించారు. న్యాయవ్యవస్థ స్వయంప్రతిపత్తిని నిలబెట్టే క్రమంలో రిటైర్మెంట్ అనంతరం ఎలాంటి ప్రభుత్వ పదవులూ స్వీకరించబోమని జస్టిస్ ఖన్నా, జస్టిస్ గవాయ్ స్పష్టం చేయడం మరో విశేషం.మరిన్ని కీలక తీర్పులు...→ పెచ్చరిల్లుతున్న సైబర్ నేరాలపైనా సుప్రీంకోర్టు ప్రధానంగా దృష్టి సారించింది. ముఖ్యంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో అమాయకులను, ముఖ్యంగా వృద్ధులను భయభ్రాంతులకు గురిచేసి భారీగా డబ్బు కొల్లగొడుతున్న ఆన్లైన్ మోసగాళ్లపై ఉక్కుపాదం మోపాల్సిందిగా సీబీఐని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఇందుకోసం దేశవ్యాప్త విచారణ జరపాలని సూచించింది.→ బోగస్ ఓట్ల ఏరివేతకు కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) సర్వే రాజకీయ రంగు పులుముకుని సుప్రీంకోర్టుకు చేరింది.→ పశ్చిమబెంగాల్లో దశాబ్దం క్రితం నియమి తులైన ఏకంగా 25,753 మంది ప్రభుత్వ టీచర్లు, సిబ్బంది నియామ కాన్ని సుప్రీం ఒక్క కలం పోటుతో రద్దు చేయడం మమత సర్కారుకు తీరని షాకిచ్చింది.→ లాయర్లు, కక్షిదారులను దర్యాప్తు సంస్థలు తమ ఇష్టమొచ్చిన రీతిలో విచారించేందుకు వీల్లేదంటూ, వారి ప్రత్యేక హక్కుల పరిరక్షణకు పలు చర్యలు ప్రకటించిన సుప్రీం తీర్పు కూడా చరిత్రాత్మకమైనదే.→ నోయిడాలో 2006లో 8 మంది పేద చిన్నారుల అస్థిపంజరాలు ఓ కాలువలో బయటపడ్డ ఉదంతంలో ప్రధాన నిందితుడు సురేంద్ర కోలీని నిరపరాధిగా సుప్రీం తేల్చడం విస్మయం కలిగించింది.→ జ్యుడీషియల్ సర్వీసెస్ పరీక్షలకు లాయర్లకు కనీసం మూడేళ్ల అనుభవం తప్పనిసరని, న్యాయాధికారులు బార్ కోటా కింద పదోన్నతి పరీక్షలు రాయొచ్చంటూ ఇచ్చిన తీర్పులు చర్చనీయంగా మారాయి.→ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ మార్పిడి ఉదంతంపై తాము సూచించినట్టుగా మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోనందుకు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌పై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలకు దిగడమూ సంచలనమే సృష్టించింది.– సాక్షి, నేషనల్ డెస్క్ -
భయపెడితే భళా.. బాక్సాఫీస్ గలగలా
బాలీవుడ్ నుంచి టాలీవుడ్ దాకా ఏ వుడ్ చూసినా హారరే గుడ్ అంటున్న పరిస్థితి చూస్తున్నాం. అయితే ఈ ట్రెండ్ మనకు మాత్రమే ప్రత్యేకం కాదు. విశ్వవ్యాప్తంగా కూడా సినిమా రూపకర్తలంతా దయ్యాలకు, భయాలకు జై కొడుతున్నారు. మొత్తంగా హాలీవుడ్ హారర్ చిత్రాలతో హాహా కారాలు చేయిస్తోంది.ఈ ఏడాది ఉత్తర అమెరికా టిక్కెట్ల అమ్మకాలలో 17% హర్రర్ చిత్రాలే దక్కించుకున్నాయి ఇది దశాబ్దం క్రితం 4% గా మాత్రమే ఉండడం గమనార్హం. అదేవిధంగా, రెండేళ్ల నుంచి నిర్మాణంలో ఉన్న వాటిలో హర్రర్ చిత్రాల సంఖ్య 21% గా ఉంది. అంటే దాని అర్ధం రానున్న ఏడాది కూడా థియేటర్లలో మరిన్ని హర్రర్ సినిమాలను ప్రేక్షకులు చూడబోతున్నారుకళ్లకు భయం... కనకవర్షంఈ ఏడాది అమెరికా బాక్సాఫీస్ దగ్గర 100 మిలియన్లకు పైగా సంపాదించిన వాటిలో ఒకటి ‘‘ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్‌లైన్స్’’కాగా, మరొకటి ‘‘ది కంజురింగ్: లాస్ట్ రైట్స్’’ ర్యాన్ కూగ్లర్ పీరియాడికల్ వాంపైర్ చిత్రం ‘‘సిన్నర్స్’’ కూడా 2025లో బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది, గిల్లెర్మో డెల్ టోరో తీసిన 120 మిలియన్ డాలర్ల ‘ ఫ్రాంకెన్‌స్టైన్‘, ఆస్ట్రేలియన్ దర్శకురాలు ఆలిస్ మైయో మాకే కొత్త చిత్రం ‘‘ది సర్పెంట్స్ స్కిన్’’.. కూడా హారర్ చిత్రాలే. ది కాంజురింగ్: లాస్ట్ రైట్స్: ప్రపంచవ్యాప్తంగా సుమారు 494 మిలియన్ల డాలర్లు అందుకుందని అంచనా. ర్యాన్ కూగ్లర్ దర్శకత్వం వహించిన భారీ హిట్ సిన్నర్స్ 367మిలియన్ డాలర్లకు పైగా కొల్లగొట్టింది.కధలెన్నో..కాన్సెప్ట్ ఒక్కటే...ప్రేమలో ఉన్న ఇద్దరు యువతుల గురించి వారి ప్రేమకు అడ్డుగా ఉండే శాపగ్రస్తమైన టాటూ గురించిన కథ ‘‘బఫీ ది వాంపైర్ స్లేయర్’’ టోబీ పోజర్, జాన్ ఆడమ్స్ వారి కుమార్తెలు జేల్డా ల రూపకల్పనలో.. క్యాన్సర్‌తో బాధపడుతున్న టీనేజ్ అమ్మాయి, తన అనారోగ్యాన్ని నయం చేయాలనే ఆశతో ఒక నెక్రోమాన్సర్ను సందర్శించడం తదనంతర పరిణామాలతో ‘‘మదర్ ఆఫ్ ఫ్లైస్’’, రూపొందింది. ఈ సంవత్సరంలో, వచ్చిన ఉత్తమ హారర్ చిత్రంగా ఇది విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అలాగే డానియెల్ డెడ్‌వైలర్ రూపొందించిన నెమ్మదిగా సాగే హారర్–డ్రామా 40 ఏకర్స్... నల్లజాతి ప్రజల నిర్దిష్ట చారిత్రక గాయాలను ఆధారంగా చేసుకుని రూపొందింది. విచిత్రమైన మలుపులకు పేరొందిన జపనీస్ దర్శకుడు యుటా షిమోట్సు అందించిన బెస్ట్ విషెస్ టూ ఆల్... కూడా హారర్ హిట్స్ జాబితాలో చేరింది. అరుదుగా సినిమాలు తీసే సీన్ బైర్న్ ‘‘డేంజరస్ యానిమల్స్’’మరో సక్సెస్. ఈ సంవత్సరపు ఉత్తమ హారర్ నటనలలో ఒకటిగా కుక్క నటనకు విమర్శకుల ప్రశంసలు పొందిన ‘‘గుడ్ బాయ్’’ ఒక సాధారణ దెయ్యాల ఇంటి కథాంశానికి సరికొత్త రూపం. ‘‘‘సిన్నర్స్‘ తో, దర్శకుడు ర్యాన్ కూగ్లర్ రూపొందించిన చిత్రం ఓ వాంపైర్ కథాంశం. దర్శకుడు ఎమిలీ బ్లిచ్‌ఫెల్ట్æ అందించిన ‘‘ది అగ్లీ స్టెప్‌సిస్టర్‘ కూడా సౌందర్య చికిత్సల నేపధ్యంలో నడిచే హారర్ చిత్రం. అలాగే వెపన్స్ కూడా. అటు విమర్శకుల ప్రశంసలు పొందిన చిత్రాలతో పాటు, ది ఉమెన్ ఇన్ ది యార్డ్ డెత్ ఆఫ్ ఎ యునికార్న్ వంటి ప్రత్యేకమైన స్వతంత్ర చిత్రాల వరకు విడుదలయ్యాయి, ప్రత్యేకమైన కాన్సెప్ట్ ది మంకీ ఆకట్టుకుంది. బ్లాక్ ఫోన్ 2: బ్రింగ్ హర్ బ్యాక్ వంటివీ ఇదే కోవలోకి వస్తాయి. -
టెస్టుల్లో తడబాటు... పరిమిత ఓవర్లలో పైచేయి...
సాక్షి క్రీడా విభాగం : ఇంగ్లండ్‌లో యువ జట్టుతో ఓటమి లేకుండా తిరిగొచ్చామని సంబరం ఒకవైపు, సొంతగడ్డపై పాతికేళ్ల తర్వాత సఫారీలకు సిరీస్ కోల్పోయిన పరాభవం మరోవైపు.... వన్డేల్లో పుష్కర కాలం తర్వాత ఐసీసీ ట్రోఫీ ఆనందాన్ని పంచితే... టి20ల్లో అజేయ ఆటతో ఆసియా కప్ గెలుచుకొని ఈ ఫార్మాట్లో మన స్థాయి కనిపించింది. మొత్తంగా 2025లో భారత క్రికెట్ జట్టు మిశ్రమ ఫలితాలు సాధించింది. టెస్టుల్లో ప్రదర్శన కాస్త అసంతృప్తిని మిగల్చగా... పరిమిత ఓవర్ల క్రికెట్లో వరుస విజయాలతో ప్రత్యర్థులపై పైచేయి చూపించింది. మరోవైపు పురుషులకు ఏమాత్రం తగ్గని రీతిలో భారత మహిళల క్రికెట్ జట్టు వన్డే వరల్డ్ కప్ టైటిల్ సాధించడం అన్నింటికంటే చిరస్మరణీయ ఘట్టం. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ ముద్ర... సిడ్నీలో ఆ్రస్టేలియాతో ఐదో టెస్టుతో ఈ ఏడాది మొదలైంది. ఈ మ్యాచ్‌లో ఓటమితో సిరీస్ 1–3తో చేజారింది. అయితే 32 వికెట్లతో బుమ్రా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచాడు. పేలవ బ్యాటింగ్‌తో జట్టుకు భారం కాలేనంటూ రోహిత్ శర్మ స్వయంగా మ్యాచ్‌కు ముందు తప్పుకోవడం చర్చకు దారి తీసింది. చివరకు ఇదే అతని ఆఖరి టెస్టుగా మారగా, కొన్నాళ్ల తర్వాత సరిగ్గా ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు మరో స్టార్ కోహ్లి కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. కొత్త కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ నాయకత్వంలో సీనియర్లు లేకుండా అంచనాలు లేకుండా ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టిన భారత జట్టు అద్భుతమే చేసింది. నాలుగు టెస్టుల తర్వాత 1–2తో వెనుకబడి సిరీస్ కోల్పోయే స్థితిలో పడిన జట్టు ఓవల్‌లో జరిగిన ఆఖరి టెస్టులో మొహమ్మద్ సిరాజ్ అసాధారణ బౌలింగ్‌తో అనూహ్యంగా 6 పరుగులతో నెగ్గి సంతృప్తిగా 2–2తో ముగించింది. బ్యాటర్‌గా 4 సెంచరీలు సహా ఏకంగా 754 పరుగులు చేసిన గిల్, ఇటు కెప్టెన్‌గా తొలి సిరీస్‌ను ఘనంగా ముగించాడు. ఆ తర్వాత స్వదేశంలో బలహీన వెస్టిండీస్‌పై 2–0 సిరీస్ గెలుచుకోవడం ఎవరినీ ఆశ్చర్యపర్చలేదు. అయితే ఇంగ్లండ్ గడ్డపై వచి్చన పేరు కాస్తా సొంతగడ్డపై భారత జట్టు చేజార్చుకుంది. స్వదేశంలో దక్షిణాఫ్రికా చేతిలో 0–2తో టెస్టు సిరీస్‌ను కోల్పోవడం ఒక్కసారిగా షాక్‌కు గురి చేసింది. మన గడ్డపై సఫారీల చేతిలో పాతికేళ్ల తర్వాత జట్టు సిరీస్ ఓడింది. ఏడాది క్రితం న్యూజిలాండ్ చేతిలో ఎదురైన ఇదే తరహా 0–3 పరాజయాన్ని గుర్తుకు తెచి్చన టీమ్ మేనేజ్మెంట్ తీవ్ర విమర్శలకు గురైంది. కోచ్ గౌతమ్ గంభీర్ జట్టును నడిపిస్తున్న శైలిపై చర్చకు దారి తీసింది. మొత్తంగా ఈ ఏడాది 4 టెస్టులు గెలిచిన జట్టు 5 ఓడింది. రోహిత్ ఖాతాలో మరో ఐసీసీ టైటిల్... వన్డేల్లో భారత్ గుర్తుంచుకోదగ్గ ఏడాదిగా 2025 నిలిచింది. ముందుగా స్వదేశంలో ఇంగ్లండ్‌పై 3–0తో సిరీస్ గెలుచుకున్న టీమిండియా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో సత్తా చాటింది. వరుసగాఆడిన ఐదు మ్యాచ్‌లలోనూ (బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్‌లపై) నెగ్గి విజేతగా నిలిచింది. 2013 తర్వాత భారత్ గెలుచుకున్న ఐసీసీ వన్డే టోర్నీ ఇదే కావడం విశేషం. 2024 టి20 వరల్డ్ కప్‌లో భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ ఏడాది తిరిగేలోగా మరో ఐసీసీ ట్రోఫీని అందించి తన ఘనతను ప్రదర్శించాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన సిరీస్‌లో అనూహ్యంగా రోహిత్‌ను తప్పించిన సెలక్టర్లు గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌ను జట్టు 1–2తో కోల్పోయింది. అయితే సరిగ్గా ఇక్కడి నుంచే రోహిత్, కోహ్లిల భవిష్యత్తుపై చర్చ మొదలైంది. కోహ్లి రెండు డకౌట్ల తర్వాత అర్ధసెంచరీ సాధించగా, రోహిత్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచి తన విలువను చూపించాడు. అనంతరం స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగి వన్డే సిరీస్‌ను జట్టు 2–1తో గెలుచుకుంది. అయితే ఈ సారి కోహ్లి వంతు వచ్చింది. 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీలతో 302 పరుగులు చేసి ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలవడంతో కోహ్లి, రోహిత్‌ల గురించి చర్చకు ఫుల్స్టాప్ పడింది. మొత్తంగా 11 మ్యాచ్‌లు గెలిచిన టీమ్ 3 ఓడింది. అభిషేక్ శర్మ అదరహో... టి20 ఫార్మాట్లో 2024లో వరల్డ్ కప్ గెలుచుకున్న భారత జట్టు అదే జోరును ఈ ఏడాదీ కొనసాగించింది. సొంతగడ్డపై ఇంగ్లండ్‌పై 4–1తో సిరీస్, ఆ్రస్టేలియా గడ్డపై 2–1తో సిరీస్, మళ్లీ స్వదేశంలో దక్షిణాఫ్రికాతో 3–1 సిరీస్... ఇలా ఆడిన మూడు సిరీస్‌లూ జట్టు గెలుచుకుంది. వీటిలో రెండింటిలో వరుణ్ చక్రవర్తి, మరో దాంట్లో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’లుగా నిలిచారు. అయితే 2025లో హైలైట్‌గా నిలిచిన అంశం భారత జట్టు ఆసియా కప్ గెలుచుకోవడం. ఆడిన 7 మ్యాచ్‌లలో ఓటమి లేకుండా (వరుసగా యూఏఈ, పాకిస్తాన్, ఒమన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్‌లపై) అజేయంగా నిలిచి భారత్ టైటిల్ సాధించింది. 314 పరుగులతో అభిషేక్ శర్మ ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ’గా నిలిచాడు. ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన హైదరాబాదీ బ్యాటర్ తిలక్ వర్మ 53 బంతుల్లో అజేయంగా 69 పరుగులతో జట్టును గెలిపించి హీరోగా అవతరించాడు. పహల్గాం దాడి తర్వాత జరిగిన ఈ టోర్నీలో పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు భారత క్రికెటర్లు నిరాకరించడం, చివరకు ఆసియా కప్ ట్రోఫీని మన జట్టుకు అందించకుండా ఏసీసీ చైర్మన్ మొహసిన్ నఖ్వీ తన వద్దే ఉంచుకోవడం టోర్నీని వివాదాస్పదంగా మార్చాయి. మొత్తంగా 16 మ్యాచ్‌లు గెలిచిన జట్టు 3 మాత్రమే ఓడింది. ఈ ఏడాది అభిషేక్ శర్మ ఓపెనర్‌గా చెలరేగి కొత్త స్టార్‌గా నిలిచాడు. 21 మ్యాచ్‌లు ఆడి 444 బంతులు ఎదుర్కొన్న అతను ఏకంగా 193.46 స్ట్రయిక్‌రేట్‌తో 859 పరుగులు చేసి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. హర్మన్ బృందానికి హ్యాట్సాఫ్... ప్రపంచ కప్‌లో పది ప్రయత్నాల తర్వాత రెండుసార్లు రన్నరప్‌కే పరిమితమై, ఒక్క ఐసీసీ టోర్నీ కూడా గెలవకుండా సుదీర్ఘ కాలం ఎదురు చూసిన భారత మహిళల క్రికెట్ జట్టు చిరకాల స్వప్నం 2025లో నెరవేరింది. ఈ ఏడాది స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో తొలిసారి చాంపియన్‌గా సగర్వంగా శిఖరాన నిలిచింది. లీగ్ దశలో ఆడిన 7 మ్యాచ్‌లలో 3 విజయాలు, 3 పరాజయాలతో శ్రమించి జట్టు సెమీస్ చేరింది. వరుసగా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ చేతుల్లో పరాజయాల తర్వాత ఇక నిష్క్రమణ ఖాయమనిపించిన దశలో హర్మన్ బృందం కోలుకున్న తీరు స్ఫూర్తిదాయకం. ఆపై సెమీఫైనల్లో అసాధారణ ఆటతో ఆస్ట్రేలియాను చిత్తు చేయడంతోనే ట్రోఫీపై ఆశలు చిగురించగా... నవంబర్ 2న జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాపై 52 పరుగులతో గెలవడం భారత క్రికెట్ అభిమానులెవరూ మర్చిపోలేని ఘట్టం. హర్మన్, స్మృతి, జెమీమా, ప్రతీక, షఫాలీ, దీప్తి, శ్రీచరణి, క్రాంతి... ఇలా ప్రతీ ఒక్కరూ చేయి వేసి వరల్డ్ కప్‌ను భారత్‌కు అందించారు. అండర్–19 వరల్డ్ కప్ కూడా మనదే... ఈ ఏడాది జనవరి–ఫిబ్రవరిలో మలేసియా వేదికగా జరిగిన అండర్–19 మహిళల టి20 ప్రపంచకప్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత జట్టు టైటిల్ నిలబెట్టుకుంది. ఈ ఫార్మాట్లో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది.దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో షఫాలీ వర్మ సారథ్యంలోని భారత జట్టు 9 వికెట్లతో గెలిచింది. తెలంగాణకు చెందిన గొంగడి త్రిష 7 మ్యాచ్‌లు ఆడి 309 పరుగులతో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డును గెల్చుకుంది. భారత్‌కే చెందిన వైష్ణవి శర్మ (17 వికెట్లు) టోర్నీలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచింది. -
ఎక్కువమంది ఫాలో అయిన ఫిట్నెస్ సూత్రాలివే
2025వ సంవత్సరం డిసెంబర్ చివరి వారంలో ఉన్నాం మనం. ఈ సందర్భంగా వివిధ రంగాలలో జీవన శైలి పరంగా ముఖ్యంగా ఫిట్నెస్ కోసం అత్యధికులు అనుసరించిన ట్రెండ్స్ ఏమిటో తెలుసుకుందాం..ఫిట్‌గా ఉండాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. అయితే ఫిట్‌గా ఉండేందుకు ఎంచుకునే విధానాలే రకరకాలుగా ఉంటాయి. కొందరు జిమ్ మెంబర్షిప్ తీసుకుని ఫిట్ అవుతారు. మరికొందరు యోగా చేయడాన్ని ఇష్టపడతారు. ఇంకొంతమంది తమ ఆహారపు అలవాట్లను మార్చుకుని ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఈ నేపథ్యంలో 2025 సంవత్సరంలో ఫిట్‌గా ఉండేందుకు ఎక్కువమంది దేనిని అనుసరించారో ఓసారి రివైండ్ చేసుకుందాం.మొబైల్ ఫిట్నెస్ యాప్స్ఈ సంవత్సరంలో ప్రజలు తమ ఫిట్నెస్ను (Fitness) ట్రాక్ చేయడానికి ట్రాకింగ్ యాప్స్‌ను విస్తృతంగా ఉపయోగించారు. ధరించే పరికరాలు, ఆటోమేటెడ్ అలర్ట్‌లు ఇచ్చే ఫిట్నెస్ ట్రాకర్స్, స్మార్ట్ వాచ్‌లు, హార్ట్ రేట్ మానిటర్ల వంటి పరికరాలు ఈ సంవత్సరం బాగా చర్చలో నిలిచాయి. పర్సనల్ ట్రైనర్‌ను నియమించుకోవడం కంటే ప్రజలు ఈ సంవత్సరం తమ ఫిట్నెస్ను సొంతంగా ట్రాక్ చేసుకున్నారు.మితంగా తినే మినిమల్ ఈటింగ్ హ్యాబిట్ఈ సంవత్సరంలో ఎక్కువమంది సమతుల్య ఆహారం (Balanced Diet) ప్రాముఖ్యతను అర్థం చేసుకున్నారు. దీనిపై సోషల్ మీడియా ప్రభావం కూడా ఉందని చెప్పవచ్చు. రోజూ ప్రోటీన్ అధికంగా ఉండే హెల్తీ స్నాక్స్ రీల్స్ చూసి చూసీ చూసీ ఈ ఆరోగ్యకరమైన ఆహారాలను తినడం ప్రారంభించి, తమ డైట్లో మంచి మార్పులు చేసుకున్నారు.ఔట్‌డోర్ యోగా2025లో అధిక సంఖ్యాకులు ఫిట్నెస్ను సీరియస్‌గా తీసుకుని ఔట్‌డోర్ యాక్టివిటీస్‌పైనా దృష్టి పెట్టారు. ముఖ్యంగా ఔట్‌డోర్ యోగా చేయడం ద్వారా తమను తాము ఫిట్‌గా ఉంచుకున్నారు. వీటితో పాటు వాకింగ్ చేయడం, పరుగెత్తడం, హైకింగ్, స్కీయింగ్ వంటి యాక్టివిటీస్ కూడా ప్రజల ఫిట్నెస్ రొటీన్లో భాగమయ్యాయి.చదవండి: వ్యాయామానికి ముందు కాఫీ తాగొచ్చా?మార్నింగ్ వర్కవుట్స్సాయంత్రం సమయాన్ని బయట తిరగడానికి కేటాయించడం కోసం చాలామంది తమ ఉదయం రొటీన్లో వ్యాయామాన్ని చేర్చుకున్నారు. కేవలం వ్యాయామం మాత్రమే కాకుండా యోగా లేదా వాక్ చేయడానికి కూడా ఉదయం సమయం సరైనదిగా నిలిచింది.కలిసి మెలిసి..2025లో వైరల్ అయిన వాటిలో గ్రూప్ ట్రైనింగ్ యాక్టివిటీ ఒకటి. అదేంటంటే... ఇంట్లో ఒంటరిగా వ్యాయామం చేయడం కంటే స్నేహితులు లేదా భాగస్వామితో కలిసి వ్యాయామం చేయడం మరింత మెరుగ్గా ఉంటుందనిపించి చాలామంది తమకు తోడుగా ఎవరైనా ఉంటే జిమ్‌కి వెళ్లడం లేదా వర్కవుట్ చేయడంలో మునిగిపోయారు. -
ఫ్యాషన్ ఫార్వర్డ్.. జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ..
టైమ్‌లెస్ ఇండియన్ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్ ఇస్తోంది. ప్రీ–డ్రేప్డ్ శారీస్, డెనిమ్–ఇన్ఫ్యూజ్డ్ ఫ్యాబ్రిక్స్, బాంబర్ జాకెట్లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్ ఇది.సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్ కోర్సెట్ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్ల వరకు... ఈ ట్రెండ్ మోడ్రన్ ఇండియన్ ఫ్యాషన్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.‘హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ మోడ్రన్ సిల్హవుటీ’ ట్రెండ్ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్లాంటి చేనేత వస్త్రాలను జంప్సూట్లు, వోవర్సైజ్డ్ కోట్స్, కో–ఆర్డర్ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.సంప్రదాయ జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ న్యూట్రల్–కలర్డ్ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్–ఎక్స్ప్రెషన్స్కు అవకాశం ఇస్తున్నాయి.చదవండి: లేత రంగుల లేటెస్ట్ చీరల ట్రెండ్ఇంజినీరింగ్ వైపు మ్యూజిక్ స్టూడెంట్స్ మొగ్గువిద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్ స్టూడెంట్స్ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్ డైరెక్టర్ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ మ్యూజిక్’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు. -
పిల్లలూ ప్రపంచమూ
బై బై 2025... వెల్కమ్ 2026. మరో నాలుగు రోజుల్లో అందరూ ఇదే అనబోతున్నారు. న్యూ ఇయర్లో చేయాల్సిన పనులు, అందుకోవాల్సిన విజయాల గురించి ఆరాటపడుతున్నారు. ఈ పెద్దల ప్రపంచం ఎప్పుడూ ఇలాగే ఉంటుంది. మరి పిల్లలూ... మన సంగతి? 2025 ఘటనలు, పరిణామాలు మనకు ఏం చెప్పాయి? ఎలా స్ఫూర్తినిచ్చాయి? ఏం నేర్పాయి? ఏమి హెచ్చరికలు చేశాయి? ఒకసారి అలా ఒక రౌండేసి చూద్దామా?వీరే మన ఇన్స్పిరేషన్2025లో మెరిసిన తారలు బాలల్లో ఉన్నారు. బాలలకు స్ఫూర్తినిచ్చేలా వార్తల్లో నిలిచినవారూ ఉన్నారు.టైమ్ పత్రిక ‘కిడ్ ఆఫ్ ది ఇయర్’ అమెరికన్ టీనేజర్ తేజస్వి మనోజ్ ప్రోగ్రామర్‌గా, వెబ్సైట్ డెవలపర్‌గా వార్తల్లో నిలిచింది. కాలిఫోర్నియాలో జన్మించిన తేజస్వి టెక్సాస్‌లో పెరిగింది. సైబర్ నేరాల నుండి వృద్ధులను రక్షించడానికి ఒక యాప్‌ను కనిపెట్టింది. ఆమె చొరవకు 2025లో టైమ్ పత్రిక వారి ’కిడ్ ఆఫ్ ది ఇయర్’ అవార్డును అందుకుంది. ఆమె ఫ్రిస్కోలోని లెబనాన్ ట్రైల్ హైస్కూల్లో చదువుకుంటోంది.‘సర్కాడియావి’ యాప్..ఎన్ ఆర్ఐ విద్యార్థి అయిన సిద్ధార్థ్ నంద్యాలకు 14ఏళ్లు. అంత చిన్న వయసులోనే గుండె జబ్బులను గుర్తించడానికి ఏఐను ఉపయోగించి ‘సర్కాడియావి’ అనే యాప్‌ను అభివృద్ధి చేశాడు. సిద్ధార్థ్ ఆవిష్కరణ గురించి తెలుసుకున్న రాష్ట్రనేతలు అతన్ని ప్రత్యేకంగా అభినందించారు. ఈ యాప్ ద్వారా గుండె జబ్బులను నియంత్రించడంతో పాటు మరణాలను అరికట్టవచ్చు.గుకేష్... ది గ్రాండ్‌మాస్టర్..2025లో భారతీయ చదరంగంలో డి.గుకేశ్ పేరు మారుమోగింది. 2025లో ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి ప్రపంచాన్ని తనవైపు తిప్పుకున్నాడు. 12 ఏళ్ల వయసులోనే గ్రాండ్‌మాస్టర్‌గా మారి, ఆ తర్వాత క్యాండిడేట్స్ టోర్నమెంట్‌ను గెలుచుకున్న అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు. గుకేశ్ తన ఆట శైలికి, ఆత్మవిశ్వాసానికి ప్రసిద్ధి చెందాడు. కష్టపడితే కలలెలా నిజమవుతాయో చెప్పడానికి అతను నిదర్శనంగా మారాడు. గుకేష్ చాలా మంది పిల్లలకు నేడు ఐడెల్గా కనిపిస్తున్నాడు.క్రికెట్ స్టార్... వైభవ్ సూర్యవంశీ 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ క్రికెట్లో దూసుకు΄ోతున్నాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్నాడు. జనవరి 2024లో అరంగేట్రం చేసి ఇండియన్ లిస్ట్ ఏలో కెరీర్ మొదలుపెట్టిన అతి పిన్న వయస్కుడిగా పేరుపొందాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అరంగేట్రం చేసిన అతి చిన్నవయసు ఆటగాడిగా మారాడు. ఇటీవల రాష్ట్రపతి భవన్ లో వైభవ్ సూర్యవంశీకి ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్‌ను అందజేశారు.2025ల పిల్లలూ.. పరిణామాలుసోషల్ మీడియా ఈ ఏడాది జరిగిన పరిశోధనల్లో సోషల్ మీడియా ప్రభావం చిన్నారులపైనా పడుతోందని గుర్తించారు. చాలామంది తల్లిదండ్రులు తమ 16 ఏళ్లలోపు పిల్లలు సోషల్ మీడియాను ఎలా వాడుతున్నారు, ఎందుకోసం వాడుతున్నారనేది గమనించడం లేదు. అయితే కొందరు చిన్నారులు అనైతిక చర్యల కోసం సోషల్ మీడియాను వాడుతున్నారని, మరికొందరు మానసిక సంబంధిత సమస్యలకు గురవుతున్నారని తేలడంతో ఆస్ట్రేలియా ఇటీవల చిన్నారుల సోషల్ మీడియా వాడకంపై నిషేధం విధించింది. తమ పిల్లలకు డిజిటల్ వ్యవహారజ్ఞానం అందించాలని అనుకోవడం మంచిదే కానీ, దానిపైనా పెద్దల అజమాయిషీ అవసరం అని 2025లో నిపుణులు తేల్చారు.ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్2025లో ఏఐ బలంగా దూసుకు΄ోయింది. రాబోయే కాలంలో దీని ప్రభావం మరింత పెరుగనుంది. ఈ నేపథ్యంలో పిల్లల హక్కులపై దాని ప్రభావం తప్పకుండా పడుతుందని నిపుణులు అంటున్నారు. 16 ఏళ్లలోపు పిల్లలు ఏఐ మీద నమ్మకంతో అన్ని విషయాలు దాంతో పంచుకుంటున్నారు. కొందరు తమ ఆస్తిపాస్తుల వివరాలు, తమ వ్యక్తిగత విషయాలు, తన లైంగికేచ్ఛలు కూడా వాటితో చెప్పడం ఆందోళన కలిగిస్తోంది. ఒంటరితనం నుంచి వారు దూరమవడానికి చేసే క్రమంలో జరుగుతున్న పరిణామం ఇది. దీనివల్ల దీర్ఘకాలికంగా చాలా నష్టాలు ఉన్నాయనేది నిపుణుల మాట. ముఖ్యంగా పిల్లలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెంచేసుకొని, కేవలం ఏఐతోనే అనుబంధం పెంచుకోవడం భారీ ముప్పుగా మారుతుందని అంటున్నారు.రికార్డ్స్ కామిక్ పుస్తకం ఖరీదు రూ.81.8 కోట్లు2025 నవంబర్‌లో అత్యంత అరుదైన ఓ కామిక్ పుస్తకం 9.12 మిలియన్ డాలర్ల (రూ.81.8 కోట్ల)కు అమ్ముడు΄ోయింది. సూపర్‌మ్యాన్ కథలుండే ‘సూపర్‌మ్యాన్’ కామిక్ పుస్తకాల శ్రేణిలో ఇది మొదటి సంచిక. ఒక అటకపై కనుగొన్న ఈ పుస్తకాన్ని ఆ ఇంటివారు వేలం వేయగా ఇంత భారీ ధర పలికింది. ఇప్పుడిది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కామిక్ పుస్తకంగా నిలిచింది.80 ఏళ్ల వయసు ఐరన్ మ్యాన్అక్టోబర్ 11న, 2025 ఐరన్ మ్యాన్ ప్రపంచ ఛాంపియన్ షిప్ ట్రయాథ్లాన్ లో 1,600 మందికి పైగా అథ్లెట్లు ఈత కొట్టారు. అనంతరం వారు 100 మైళ్లకు పైగా సైకిల్ తొక్కారు. ఆ తర్వాత ఒక మారథాన్ పరుగును పూర్తి చేశారు. ఇందులో 80 ఏళ్ల నటాలీ గ్రాబో ఈ మొత్తం రేసును పూర్తి చేశారు. ఈ ΄ోటీని పూర్తి చేసిన అత్యంత వృద్ధ మహిళగా రికార్డు సృష్టించింది.ఓటీటీ స్పెషల్ ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్2025లో విడుదలైన ‘అడాలసెన్స్’ సైకలాజికల్ క్రైమ్ డ్రామా సిరీస్ అనేకమందికి కనువిప్పుగా మారింది. 13 ఏళ్ల పిల్లాడు తన పాఠశాలలో ఒక అమ్మాయి హత్య చేసి అరెస్టయిన ఉదంతం ఇందులోని కథ. కథంతా అతని చుట్టూ, అతని ఆలోచనల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రతి ఎపిసోడ్‌ను ఒకే టేక్‌లో చిత్రీకరించడం విశేషం. మార్చి 13, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సిరీస్ విడుదలైంది.వాతావరణంలో మార్పులు..వాతావరణ మార్పు పిల్లల భవిష్యత్తుకు అత్యంత తీవ్రమైన ముప్పుగా మారుతోందని 2025 హెచ్చరించింది. పర్యావరణానికి జరుగుతున్న నష్టం వల్ల ఆహార అభద్రత ఏర్పడి ఆరోగ్య సంక్షోభాలు లక్షలాది మంది పిల్లల భవితను ప్రశ్నార్థకంగా మార్చవచ్చు. అందుకే 2025లో పలు దేశాల్లో చిన్నారులు బృందాలుగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ కోసం తమ వాణి వినిపించారు. భూమిని కాపాడాలని, తమ భవితకు స్వచ్ఛమైన గాలి, నీరు అందించాలని కోరారు. 2026 నుంచి ప్రపంచమంతా ఈ విషయంపై బలమైన దృక్పథం ఏర్పరచుకోవాలని నిపుణులు అంటున్నారు.ఆరోగ్యంపిల్లలకు తినడానికి ఆహారం ఇచ్చి స్కూళ్లకు పంపితే చాలని తల్లిదండ్రులు అనుకుంటున్నారు. అయితే శ్రమ లేని జీవనశైలి, మానసిక ఒత్తిడి, ఆటపాటలకు దూరమవడం, రసాయనిక ఆహార పదార్థాలు, వేళ కాని వేళల్లో నిద్ర వంటి అంశాలన్నీ కలిసి చిన్నారుల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తున్నాయి. పెరుగుతున్న ఊబకాయం రేట్లు ఒకపక్క, ప్రపంచ ΄ోషకాహార లోపం మరో పక్క 2025ను ఆందోళనకు గురి చేశాయి. ఈ ప్రభావం చిన్నారుల మీద వెంటనే పడక΄ోయినా, రానున్న కాలంలో మరింత గడ్డు పరిస్థితిని తేనుందని నిపుణులు అంటున్నారు. జంక్ ఫుడ్ ఉత్పత్తులను చిన్నారుల దాకా చేరకుండా అడ్డుకోవడం తల్లిదండ్రులకు సవాలే అని తేల్చారు.బాల కార్మికులుగా చాకిరీలో..2025 నాటికి ప్రపంచవ్యాప్తంగా బాల కార్మిక వ్యవస్థను అంతం చేయాలని 2015లో ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది. అయితే 2025 వచ్చి వెళ్లి΄ోతున్నా ఇంకా 138 మిలియన్ల మంది పిల్లలు బాల కార్మికులుగా ఉన్నారని అంతర్జాతీయ కార్మిక సంస్థ, యూఎన్ బాలల నిధి విడుదల చేసిన బాల కార్మిక నివేదికలో పేర్కొంది. అతి త్వరలో ప్రపంచంలో బాల కార్మిక వ్యవస్థ రూపుమాసి΄ోతుందని తెలిపింది. అందరూ సమష్టిగా కృషి చేసి ఎక్కడా బాలకార్మికులు లేకుండా చూడాలని పిలుపునిచ్చింది.పరిశోధనలూ హెచ్చరికలూ జన్యు–సవరణ విధానంపిల్లలూ... ఈ సంవత్సరం వైద్య రంగంలో ఒక మంచి జరిగింది. జన్యుపరమైన అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడే చిన్నారుల కోసం శాస్త్రవేత్తలు మొట్టమొదటిసారి జన్యు–సవరణ విధానాన్ని సృష్టించారు. తన డీఎన్ఏలో సమస్య కారణంగా అనారోగ్యంతో ఉన్న ఓ చిన్నారిపై అమెరికాలోని పెన్సిల్వేనియాలో ఈ CRISPR (Clustered Regularly Interspaced Short Palindromic Repeats) విధానంతో చికిత్స అందించారు. ఆ చిన్నారి ఇప్పుడు చాలా వరకు కోలుకున్నాడు. త్వరలోనే ఇతర పిల్లల్లాగే అతనూ ఎదుగుతాడని, వైద్యశాస్త్రంలో ఇది కీలక పరిణామని శాస్త్రవేత్తలు అంటున్నారు.2025 పుస్తకాలు2025లో పిల్లల కోసం అనేక పుస్తకాలు మార్కెట్లోకి వచ్చాయి. అందులో కొన్ని మాయలు, మంత్రాలతో కూడిన ఊహా ప్రపంచం కాగా, మరికొన్ని వారిలో మంచిని పెంచి, ఆసక్తికరంగా చదివించే విషయాలు ఉన్నాయి. ఇవి బాగా అమ్ముడు΄ోయాయి.ది లాస్ట్ బుక్‌స్టోర్ ఆన్ ఎర్త్ – లిల్లీ బ్రాన్–ఆర్నాల్డ్ ఒక వినాశకరమైన తుఫాను లిజ్ ప్రపంచాన్ని ఛిన్నాభిన్నం చేసి ఏడాది సంవత్సరం గడిచింది. ఇప్పుడు మరో ప్రళయం రాబోతోంది. ఈ సమయంలో ఆమె సురక్షితంగా భావించిన ఏకైక ప్రదేశంలో ఆమె గతంలో పని చేసిన పుస్తకాల దుకాణం ఉంది. అక్కడ ఏం జరిగిందనేది ఇందులోని కథ.పీపుల్ లైక్ స్టార్స్ – పాట్రిస్ లారెన్స్ 13 ఏళ్ల ముగ్గురు అపరిచితులకు నడుమ ఒక పెద్ద రహస్యం ముడిపడి ఉంది. అదేమిటనేదే ఇందులోని కథ. వారెవరు? వారికీ, ఆ రహస్యానికీ సంబంధం ఏమిటి అనే ఆసక్తికరంగా సాగుతుంది. విచ్ఛిన్నమైన కుటుంబాలు తిరిగి కలవడం, చరిత్రలోని రహస్యాలు తెలుసుకోవడం ఇందులో చూడొచ్చు.ది డే మై స్కూల్ గాట్ ఫేమస్ – జెన్ కార్నీ పాఠశాలకు మంచి డిజైన్ సూచించాలని ప్రధాన ఉపాధ్యాయుడు సవాలు విసిరారు. గెలిచినవారికి బహుమతి ఇస్తానని ప్రకటించాడు. ఫెర్రిస్ తన సోదరుడు నైల్‌తో కలిసి ఆ డిజైన్ కోసం ప్రయత్నించాలనుకున్నాడు. కానీ అతను ఎక్కడికి వెళ్ళినా అల్లరి చేస్తాడు. బహుమతిని గెలుచుకోవడానికి వారిద్దరూ తమ విభేదాలను పక్కన పెట్టారా అనేది ఇందులోని కథ. పులోమా అండ్ ది బేర్ – జస్బిందర్ బిలాన్ పులోమా అనే బాలికకు సవాల్ ఎదురైంది. ఓ ప్రమాదం నుంచి ఒకేసారి నైలా అనే ఎలుగుబంటిని, తనను తాను రక్షించుకోవాలి. అది సాధ్యమేనా? అప్పుడు ఆమె ఏం చేసింది? ఎటువంటి మార్గాలు అన్వేషించింది? ఉత్కంఠభరితమైన ఈ సాహసయాత్ర చిన్నారుల్ని విశేషంగా అలరిస్తోంది. బందీగా ఉన్న ఎలుగుబంటిని రక్షించడానికి పులోమా ధైర్యాన్ని చదివి తీరాలి. -
2025.. ఏఐ ఇయర్
సరిగ్గా ఏడాది కిందట.. ఏఐని ఒక డిజిటల్ విజ్ఞాన సర్వస్వంలా చూశాం. ఏదైనా సమాచారం కావాలన్నా చాట్ జీపీటీని అడిగేవాళ్లం. కానీ 2025కు వచ్చేసరికి ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నిన్నటి వరకు మన ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఏఐ (జనరేటివ్ ఏఐ), నేడు మన పనులను చక్కబెట్టే ఏఐ ఏజెంట్‌గా రూపాంతరం చెందింది. గతంలో ఏఐ కేవలం ఒక రియాక్టివ్ అసిస్టెంట్. అంటే మనం అడిగితేనే సమాధానం చెప్పేది. కానీ 2025 ఏఐ టూల్స్ ప్రోయాక్టివ్ పార్ట్నర్స్(మీరు ఒక చిన్న మాట చెబితే మీ అవసరాలను ఊహించి, మీ ప్రమేయం లేకుండానే పనులను పూర్తి చేసే ఒక తెలివైన భాగస్వామి)గా మారాయి.సాంకేతిక నిపుణులు 2025వ సంవత్సరాన్ని ఏఐ ఇయర్‌గా అభివర్ణిస్తున్నారు. 2024లో కేవలం మాటలకే పరిమితమైన కృత్రిమ మేధ (ఏఐ) 2025లో చేతల్లోకి వచ్చేసింది. కేవలం ప్రశ్నలకు సమాధానాలివ్వడమే కాకుండా మన పనులను స్వయంగా పూర్తి చేసే ఏఐ ఏజెంట్లు ఈ ఏడాది కీలకంగా మారాయి. జనవరి 2025 నుంచి డిసెంబర్ 2025 వరకు జనరేటివ్ ఏఐ రంగంలో కంపెనీలు తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు, టూల్స్ పై ప్రత్యేక కథనం.తొలి త్రైమాసికంలో..చైనాకు చెందిన డీప్‌సీక్ ఆర్1 మోడల్ విడుదల కావడంతో ఏఐ ప్రపంచం ఉలిక్కిపడింది. ఇది తక్కువ ఖర్చుతో అత్యుత్తమ ఆలోచనా సామర్థ్యం అందించడంతో ఓపెన్ సోర్స్ ఏఐ ఊపందుకుంది. ఇదే నెలలో ఓపెన్ఏఐ ఓ3-మినీని విడుదల చేసింది.ఆంథ్రోపిక్ Claude 3.7 Sonnetను, ఎలాన్ మస్క్ గ్రోక్ 3ని లాంచ్ చేశారు. వీటితో పాటు ఓపెన్ఏఐ కంప్యూటర్లను స్వయంగా ఆపరేట్ చేయగల Operator అనే ఏజెంట్‌ను పరిచయం చేసింది. గూగుల్ తన అత్యంత వేగవంతమైన Gemini 2.5 Flash, రోబోటిక్స్ కోసం ప్రత్యేకమైన ఏఐ మోడల్స్‌ను తెచ్చింది.రెండో త్రైమాసికంలో..ఏప్రిల్‌లో మెటా Llama 4 మోడల్స్‌ను విడుదల చేసింది. ఇవి ఓపెన్ సోర్స్ రంగంలో సరికొత్త రికార్డులు సృష్టించాయి. మేలో ఆంథ్రోపిక్ నుంచి Claude 4 విడుదలయ్యింది. ఇది మనుషుల లాగా వరుసగా ఏడు గంటల పాటు స్వయంగా పని చేయగల సామర్థ్యాన్ని ప్రదర్శించి ఆశ్చర్యపరిచింది. జూన్‌లో గూగుల్ తన సెర్చ్ ఇంజిన్‌లో ఏఐ మోడ్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తెచ్చింది.మూడో త్రైమాసికంజులైలో ఓపెన్ఏఐ తన ఆదాయంలో 1 బిలియన్ డాలర్ల మార్కును దాటి ఏఐ మార్కెట్ సత్తాను చాటింది. ఆగస్టులో అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూసిన జీపీటీ-5 విడుదలైంది. ఇది మునుపటి మోడల్స్ కంటే రెట్టింపు తెలివితేటలతో, కోడింగ్‌లో అద్భుతమైన ప్రతిభను కనబరిచింది. సెప్టెంబర్‌లో వీడియో జనరేషన్ రంగంలో ఓపెన్ఏఐ Sora యాప్ అందరికీ అందుబాటులోకి వచ్చింది. గూగుల్ తన వీడియో మోడల్ Veo 2తో దీనికి పోటీనిచ్చింది.నాలుగో త్రైమాసికంఅక్టోబర్లో ఓపెన్ఏఐ తన సంస్థాగత నిర్మాణాన్ని మార్చుకుని పూర్తి లాభాపేక్ష కలిగిన కంపెనీగా అవతరించింది. నవంబర్‌లో గూగుల్ Gemini 3.0ని విడుదల చేసింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లలో పర్సనల్ అసిస్టెంట్‌గా మారింది. డిసెంబర్లో GPT-5.2 అప్డేట్తో పాటు, గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో అత్యంత కచ్చితమైన ఏఐ అనువాద ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి.ఇదీ చదవండి: చెక్ పవర్ తగ్గిందా? -
ఈ ఏడాది క్రికెట్లో బద్దలైన భారీ ప్రపంచ రికార్డులు ఇవే..!
అంతర్జాతీయ క్రికెట్లో 2025 సంవత్సరం చరిత్రాత్మకంగా నిలిచిపోయింది. ఈ ఏడాది చాలా ప్రపంచ రికార్డులు చేతులు మారాయి. దిగ్గజాలు తమ వారసత్వాన్ని మరింత బలపరుచుకోగా, కొత్త తరం ఆటగాళ్లు సరికొత్త రికార్డులు నెలకొల్పారు. పురుషుల క్రికెట్లో విరాట్ కోహ్లి, జో రూట్.. మహిళల క్రికెట్లో స్మృతి మంధన లాంటి వారు వేర్వేరు విభాగాల్లో ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టారు. జట్ల పరంగా పురుషుల క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు.. మహిళల క్రికెట్లో టీమిండియా సరికొత్త వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పాయి. తిలక్ వర్మ 318 నాటౌట్ఈ ఏడాది టీమిండియా ఆటగాడే ప్రపంచ రికార్డుల బోణీ కొట్టాడు. జనవరిలో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అంతర్జాతీయ టీ20ల్లో ఔట్ కాకుండా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. తిలక్ టీ20ల్లో ఔట్ కాకుండా 318 పరుగులు (19*, 120*, 107*, 72*) చేసి విరాట్ కోహ్లి పేరిట ఉండిన రికార్డును తన పేరిట బదిలీ చేసుకున్నాడు. విరాట్ కోహ్లి @ ఫాస్టెస్ట్ 14000 రన్స్ఈ ఏడాది ఫిబ్రవరిలో (ఛాంపియన్స్ ట్రోఫీ) విరాట్ కోహ్లి ఓ భారీ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. పురుషుల వన్డేల్లో అత్యంత వేగంగా 14000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. సచిన్ ఈ మైలురాయిని 350 ఇన్నింగ్స్‌ల్లో చేరుకుంటే, కోహ్లి కేవలం 287 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ ఘనత సాధించాడు.సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలుఇదే ఏడాది విరాట్ మరో భారీ ప్రపంచ రికార్డును కూడా సాధించాడు. ఓ సింగిల్ ఫార్మాట్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. సచిన్ టెస్ట్‌ల్లో 51 సెంచరీలు చేయగా.. విరాట్ ఖాతాలో ప్రస్తుతం 53 వన్డే శతకాలు ఉన్నాయి. అరంగేట్రం మ్యాచ్‌లో అత్యధిక స్కోర్సౌతాఫ్రికా ఆటగాడు మాథ్యూ బ్రీట్జ్కే తన తొలి అంతర్జాతీయ మ్యాచ్‌లోనే ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. వన్డే అరంగేట్రంలో అత్యధిక స్కోర్ చేసిన ఆటగాడిగా డెస్మండ్ హేన్స్ రికార్డును బద్దలు కొట్టాడు. హేన్స్ 1978లో తన వన్డే అరంగేట్రంలో 148 పరుగులు చేయగా.. బ్రీట్జ్కే 150 పరుగులు చేసి సరికొత్త ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.రోహిత్ శర్మ.. క్రికెట్ చరిత్రలో ఒకే ఒక్కడుఈ ఏడాది జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాను ఫైనల్స్‌కు చేర్చడంతో రోహిత్ శర్మ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. నాలుగు మేజర్ ఐసీసీ టోర్నీల్లో ఓ జట్టును ఫైనల్స్‌కు చేర్చిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు సృష్టించాడు. రోహిత్ టీమిండియాను వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, వన్డే, టీ20 వరల్డ్‌కప్, ఛాంపియన్స్ ట్రోఫీల ఫైనల్స్‌కు చేర్చాడు. వీటిలో డబ్ల్యూటీసీ మినహా అన్ని టైటిళ్లు కైవసం చేసుకున్నాడు.అనామక బ్యాటర్ ఖాతాలో ప్రపంచ రికార్డుఆస్ట్రియాకు చెందిన అనామక బ్యాటర్ కరణ్‌బీర్ సింగ్ ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. అంతర్జాతీయ టీ20ల్లో ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు (1488) చేసిన బ్యాటర్‌గా కరణ్‌బీర్ సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.ఓ ఓవర్లో ఏకంగా 39 పరుగులుసమోవా జట్టు ఓ అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో ఓ ఓవర్లో అత్యధిక పరుగులు (39) సాధించిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. సమోవాకు చెందిన డారియస్ విస్సర్ ఓ ఓవర్లో 6 సిక్సర్లు కొట్టి 36 పరుగులు పిండుకోగా.. 3 పరుగులు నో బాల్స్ రూపంలో వచ్చాయి.రూట్ @ 213టెస్ట్ క్రికెట్లో బ్యాటింగ్‌కు సంబంధించి వరుసగా రికార్డును బద్దలు కొడుతున్న ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్.. ఈ ఏడాది ఫీల్డింగ్‌లో ఓ భారీ రికార్డును బద్దలు కొట్టాడు. రూట్ టెస్ట్ అత్యధిక క్యాచ్‌లు పట్టిన ఫీల్డర్‌గా (213) రాహుల్ ద్రవిడ్ (210) రికార్డును బ్రేక్ చేశాడు. చరిత్ర సృష్టించిన స్టార్క్ఆసీస్ స్పీడ్ గన్ మిచెల్ స్టార్క్ టెస్ట్ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో అత్యధిక వికెట్లు తీసిన లెఫ్ట్ ఆర్మ్ పేసర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఈ రికార్డు సాధించే క్రమంలో స్టార్క్ (420) పాకిస్తాన్ దిగ్గజం వసీం అక్రమ్ (414) పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు.వన్డేల్లో అతి భారీ విజయంఇంగ్లండ్ పురుషుల క్రికెట్ జట్టు వన్డేల్లో అతి భారీ విజయాన్ని నమోదు చేసిన జట్టుగా ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో ఈ జట్టు సౌతాఫ్రికాపై 342 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. వన్డే క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఇదే భారీ విజయం. గతంలో ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. 2023 జనవరిలో భారత్ శ్రీలంకపై 317 పరుగుల తేడాతో గెలుపొందింది.మంధన ఖాతాలో భారీ రికార్డుభారత మహిళా జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధన ఖాతాలో ఓ భారీ ప్రపంచ రికార్డు చేరింది. మహిళల వన్డేల్లో అత్యంత వేగంగా 5000 పరుగులు పూర్తి చేసిన ప్లేయర్‌గా వెస్టిండీస్ ప్లేయర్ స్టెఫానీ టేలర్ రికార్డును బద్దలు కొట్టింది. టేలర్ 5000 పరుగులు పూర్తి చేసేందుకు 129 ఇన్నింగ్స్‌లు తీసుకోగా.. మంధన కేవలం 112 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని తాకింది.టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డుమహిళల వన్డే క్రికెట్లో టీమిండియా సరికొత్త ప్రపంచ రికార్డు నెలకొల్పింది. ఈ ఫార్మాట్ చరిత్రలో అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా ఆసీస్ పేరిట ఉండిన ప్రపంచ రికార్డును బద్దలు కొట్టింది. ఈ ఏడాది జరిగిన ప్రపంచకప్ సెమీఫైనల్లో భారత్ ఆసీస్‌పై ఈ భారీ రికార్డు సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 339 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా మరో 9 బంతులు మిగిలుండగానే ఛేదించి, సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌కు చేరిన భారత్.. ఫైనల్లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తొలిసారి ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. -
ఈ ఏడాది టాలీవుడ్ కలెక్షన్స్ ఢమాల్.. సత్తా చూపని తెలుగు సినిమా
కొద్దిరోజుల్లో టాలీవుడ్ కొత్త ఏడాదిలోకి అడుగుపెట్టబోతుంది. అయితే, 2025లో బాక్సాఫీస్ వద్ద టాలీవుడ్ వాటా రేంజ్ ఎంత అనేది తెలుసుకోవాలని చాలామంది ఆసక్తితో ఉంటారు. గత కొన్నేళ్లుగా హిందీ చిత్రసీమ పరిస్థితి అంత గొప్పగా ఏమీ లేదు. కానీ, ఈ ఏడాదిలో సత్తా చాటింది. ధురందర్, ఛావా, సైయారా వంటి మూడు సినిమాలే సుమారు రూ. 2,500 కోట్ల కలెక్షన్స్‌కు దగ్గర్లో ఉన్నాయి. అయితే, ఈ ఏడాది టాలీవుడ్ పరిస్థితి చెప్పుకోతగినంత రేంజ్లో లేదు. అత్యధిక వసూళ్లు రాబట్టిన టాప్-10 చిత్రాల్లో ఓజీ మాత్రమే ఉంది. అదే గతేడాదిలో అయితే పుష్ప2, కల్కి, దేవర, హనుమాన్ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలు టాప్- 10లో ఉన్నాయి. ఈ నాలుగు సినిమాలు ఏకంగా రూ. 3600 కోట్లు రాబట్టాయి. దీంతో గతేడాది ఇండియన్ సినిమా మార్కెట్లో తెలుగు పరిశ్రమ వాటానే ఎక్కువగా ఉంది. 2024లో టాలీవుడ్ మొత్తం ప్రపంచవ్యాప్త వసూళ్లు సుమారు రు. 7,924 కోట్ల గ్రాస్ ఉంది.2025లో మరింత ఉత్సాహంతో భారతీయ సినీ పరిశ్రమ అడుగుపెట్టింది. ఈ ఏడాదిలో మెత్తం భాషలలో కలిపి దేశవ్యాప్తంగా 1546 సినిమాలు విడుదలయ్యాయి. అన్ని సినిమాలు రూ. 12,604 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టాయి. నెట్ పరంగా చూస్తే రూ. 10696 కోట్లుగా ఉంది. అయితే, కేవలం హిందీ పరిశ్రమ నుంచి ఈ ఏడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. తర్వాతి స్థానంలో టాలీవుడ్ ఉంది. తెలుగులో విడుదలైన 274 సినిమాలకు గాను రూ. 2,551 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి.బాలీవుడ్లో సత్తా చూపని తెలుగు సినిమాఈ ఏడాదిలో తెలుగు సినిమా కలెక్షన్స్ పెద్దగా ప్రభావం చూపలేదు. కనీసం రూ. 500 కోట్లు రాబట్టిన సినిమా ఒక్కటీ లేదు. ఓజీ, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మాత్రమే రూ. 300 కోట్ల కలెక్షన్స్‌తో టాప్‌లో ఉన్నాయి. తర్వాత మిరాయ్, డాకు మహారాజ్, హిట్, కుబేర వంటి చిత్రాలు మాత్రమే కాస్త మెప్పించాయి. అయితే, ఈ ఏడాదిలో భారీ అంచనాలతో విడుదలైన గేమ్ ఛేంజర్ నిరాశపరిచింది. రూ. 500 కోట్ల కలెక్షన్స్ సాధిస్తుందని అందరూ అనుకుంటే ఆశించినంత రేంజ్లో రీచ్ కాలేదు. ఆపై హరిహర వీరమల్లు, కింగ్డమ్, ఘాటీ, మాస్ జాతర, అఖండ-2 వంటి సినిమాలు కూడా అదే బాటలో నిలిచాయి. ఫైనల్‌గా 2025 టాలీవుడ్‌కు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ సాధించిన సినిమాలు పడలేదు. -
పరిమిత ఓవర్ల ఫార్మాట్లో హిట్.. టెస్ట్‌ల్లో ఫట్..!
2025.. భారత పురుషుల క్రికెట్‌కు మిశ్రమ ఫలితాలు మిగిల్చిన సంవత్సరం. ఈ ఏడాది టీమిండియాకు మూడు ఫార్మాట్లలో వేర్వేరు అనుభవాలు ఎదురయ్యాయి. టెస్ట్ క్రికెట్లో చతికిలబడిన భారత్.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో మాత్రం సత్తా చాటింది.షాకిచ్చిన దిగ్గజాలుఈ ఏడాది దిగ్గజ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈ ఇద్దరు ఇంగ్లండ్ పర్యటనకు ముందు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.అప్పటికే (2024 టీ20 వరల్డ్‌కప్ విజయం తర్వాత) పొట్టి ఫార్మాట్ నుంచి వైదొలిగిన రో-కో.. టెస్ట్ క్రికెట్ నుంచి కూడా తప్పుకున్నట్లు ప్రకటించారు. వారం వ్యవధిలో ఇది జరిగిపోయింది. భారత క్రికెట్ అభిమానులకు 2025లో ఇదే అతి పెద్ద షాక్. సుదీర్ఘ అనుభవం కలిగిన రోహిత్, కోహ్లి ఒకేసారి నిష్క్రమించడంతో, టెస్ట్‌ల్లో భారత్‌కు పెద్ద దిక్కు లేకుండా పోయింది. టెస్ట్‌ల నుంచి వైదొలుగుతూనే రోహిత్ వన్డే కెప్టెన్సీకి కూడా గుడ్‌బై చెప్పేశాడు. సాధారణ ఆటగాడిగా కొనసాగుతానని ప్రకటించాడు.గిల్ జమానా షురూదీంతో టెస్ట్, వన్డే ఫార్మాట్లలో టీమిండియా కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ శకం మొదలైంది. అయితే రోహిత్, కోహ్లి గైర్హాజరీలో గిల్‌కు టెస్ట్ జట్టు బాధ్యతలు మోయడం కాస్త కష్టమైంది. టెస్ట్ కెప్టెన్‌గా తొలి పర్యటనలో గిల్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. చావుతప్పి కన్ను లొట్ట బోయిందన్న చందంగా ఇంగ్లండ్‌లో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో డ్రా చేసుకోగలిగాడు. కానీ, ఈ సిరీస్‌లో రోహిత్, కోహ్లి లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ సిరీస్‌లో గిల్ వ్యక్తిగతంగా అత్యుత్తమంగా రాణించాడు.5 మ్యాచ్‌ల్లో 75.40 సగటున, నాలుగు శతకాల సాయంతో (ఓ డబుల్ సెంచరీ) 754 పరుగులు సాధించాడు. ఓ భారత క్రికెటర్ విదేశీ గడ్డపై కనబర్చిన అత్యుత్తమ ప్రదర్శన ఇది. ఈ సిరీస్‌లో కేఎల్ రాహుల్, పంత్, జైస్వాల్, సుందర్, సిరాజ్, బుమ్రా, ఆకాశదీప్ లాంటి వాళ్లు కూడా రాణించినా, రోహిత్, కోహ్లి లోటు మాత్రం భర్తీ చేయలేనిదిగా కనిపించింది.ఓటమితో ప్రారంభం2025 సంవత్సరాన్ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో (బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ) భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన చివరి మ్యాచ్‌ను 6 వికెట్ల తేడాతో కోల్పోయింది. ఈ ఓటమితో సిరీస్‌ను 1-3 తేడాతో కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి టెస్ట్ జెర్సీల్లో కనిపించిన చివరి సిరీస్ ఇదే.విండీస్‌ను క్లీన్ స్వీప్ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ సిరీస్‌లు అయిన తర్వాత ఈ ఏడాది భారత్ స్వదేశంలో విండీస్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌ను టీమిండియా 2-0తో క్లీన్ స్వీప్ చేసింది.సొంతగడ్డపై పరాభవంఈ ఏడాది భారత్‌కు టెస్ట్‌ల్లో సొంతగడ్డపైనే ఘోర పరాభవం ఎదురైంది. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 0-2 తేడాతో కోల్పోయింది. ఓవరాల్‌గా చూస్తే, ఈ ఏడాది భారత్‌కు విండీస్‌పై మినహా ఒక్క టెస్ట్ సిరీస్ విజయం కూడా దక్కలేదు.వన్డేల్లో తిరుగలేని భారత్ఈ ఏడాది భారత్ వన్డే ఫార్మాట్లో అద్బుత ప్రదర్శనలు చేసింది. స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0తో క్లీన్ స్వీప్ చేసి, ఈ ఏడాది ఘనంగా బోణీ కొట్టింది.మూడోసారి ఛాంపియన్అనంతరం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలోనూ భారత్ జయకేతనం ఎగురవేసింది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది.ఆసీస్ చేతిలో భంగపాటుఈ ఏడాది ఇంగ్లండ్‌ను క్లీన్ స్వీప్ చేసి, అనంతరం ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకున్న భారత వన్డే జట్టుకు ఆస్ట్రేలియా చేతిలో భంగపాటు ఎదురైంది. ఆసీస్‌లో జరిగిన మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-2తో కోల్పోయింది.రెచ్చిపోయిన రోహిత్.. నిరాశపరిచిన కోహ్లిఈ సిరీస్‌లో రోహిత్ శర్మ సెంచరీ, హాఫ్ సెంచరీతో అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చాడు. విరాట్ మాత్రం వరుసగా రెండు మ్యాచ్‌ల్లో డకౌటై నిరాశపరిచాడు. అయితే కోహ్లి మూడో వన్డేలో అర్ద సెంచరీతో రాణించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు.పూనకాలు తెప్పించిన కోహ్లి.. సౌతాఫ్రికాకు చుక్కలుఆస్ట్రేలియా పర్యటనలో ఇబ్బందిపడిన కోహ్లి స్వదేశంలో సౌతాఫ్రికా జరిగిన వన్డే సిరీస్‌లో పూనకాలు తెప్పించాడు. వరుసగా రెండు సెంచరీలు చేసి ప్రత్యర్ధికి చుక్కలు చూపించాడు. ఈ సిరీస్‌లో రోహిత్ శర్మ కూడా పర్వాలేదనిపించాడు. రో-కో చెలరేగడంతో భారత్ ఈ సిరీస్‌ను 2-1 తేడాతో కైసవం చేసుకుంది. తద్వారా ఈ ఏడాది వన్డే ఫార్మాట్‌ను ఘనంగా ముగించింది. ఆసీస్‌తో సిరీస్ మినహా టీమిండియా ఈ ఏడాది వన్డేల్లో అత్యుత్తమంగా రాణించింది. ఇంగ్లండ్, సౌతాఫ్రికాపై సిరీస్ విజయాలతో పాటు ఛాంపియన్స్ ట్రోఫీని కూడా కైవసం చేసుకుంది.పొట్టి ఫార్మాట్లో తిరుగులేని భారత్ పొట్టి ఫార్మాట్లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఈ ఏడాదిని ప్రారంభించిన భారత్.. డిఫెండింగ్ ఛాంపియన్ హోదాకు తగ్గట్టుగానే అద్భుతంగా రాణించింది. స్వదేశంలో ఇంగ్లండ్‌పై 4-1 తేడాతో జైత్రయాత్రను ప్రారంభించి.. సౌతాఫ్రికాపై 3-1 గెలుపుతో ఈ ఏడాదిని ఘనంగా ముగించింది.ఈ మధ్యలో భారత్ ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. ఆ టోర్నీలో టీమిండియా పాక్‌ను (ఫైనల్ సహా) ముచ్చటగా మూడుసార్లు ఓడించి ట్రోఫీని ఎగరేసుకుపోయింది. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ఈ టోర్నీలో భారత ఆటగాళ్లు పాక్ ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. అలాగే టైటిల్ గెలిచాక ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు బాస్‌గా ఉన్న పాకిస్తానీ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని కూడా తీసుకోలేదు. నఖ్వీ భారత ఆటగాళ్లకు ఇప్పటివరకు ట్రోఫీ ఇవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు.ఆసియా కప్ తర్వాత భారత్ ఆస్ట్రేలియాను వారి సొంతగడ్డపై మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 తేడాతో ఓడించింది. ఓవరాల్‌గా చూస్తే.. భారత్ ఈ ఏడాది పొట్టి ఫార్మాట్లో తిరుగులేని శక్తిగా నిలిచింది. -
బంగారం ధరలు.. ఏడాది తిరిగేలోపు చుక్కలు!
ఈ ఏడాది ఇక ముగింపునకు వచ్చేసింది. 2025 సంవత్సరం బంగారం మార్కెట్లో చరిత్రాత్మక ఏడాదిగా నిలిచింది. ఏడాది ప్రారంభంలో తులం (10 గ్రాములు) బంగారం ధర సుమారు రూ.80 వేల స్థాయిలో ఉండగా, ఏడాది చివరికి అది రూ.1.30 లక్షలకుపైగా చేరింది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి, కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు, డాలర్ బలహీనత, భారతీయ రూపాయి మారకం విలువ వంటి అంశాలు బంగారం ధరలను కొత్త రికార్డుల వైపు నడిపించాయి. 2025లో పసిడి ధరలు ఎప్పుడు ఎలా పెరుగుతూ వచ్చాయి.. కొత్త మార్కులను ఎలా దాటాయి.. చూద్దాం ఈ కథనంలో..జనవరి: స్థిరమైన ఆరంభం2025 జనవరిలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు సుమారు రూ.80 వేలు – రూ.82 వేల మధ్య కొనసాగింది. సంవత్సరం ప్రారంభంలో మార్కెట్ పెద్దగా కదలికలు చూపకపోయినా, అంతర్జాతీయంగా వడ్డీ రేట్లపై అంచనాలు బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తిని పెంచాయి.మార్చి: వేగం పుంజుకున్న ధరలుమార్చి నాటికి బంగారం ధరలు రూ.88,000–రూ.90,000 స్థాయికి చేరాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు పెరగడం, గ్లోబల్ మార్కెట్లలో అనిశ్చితి పెరగడం బంగారాన్ని ‘సేఫ్ హేవన్’గా మార్చాయి.ఏప్రిల్: చరిత్రాత్మక మైలురాయిఏప్రిల్ నెల బంగారం మార్కెట్లో కీలక మలుపు. ఏప్రిల్ చివరి వారంలో తొలిసారిగా 10 గ్రాముల బంగారం ధర రూ.1 లక్ష మార్కును దాటింది. ఒకే రోజులో వేల రూపాయల పెరుగుదల నమోదై, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురి చేసింది.మే–జూన్: స్వల్ప ఊగిసలాటమే, జూన్ నెలల్లో ధరలు కొంత స్థిరపడుతూ రూ.95,000– రూ.98,000 మధ్య కదిలాయి. అధిక ధరల కారణంగా ఆభరణాల కొనుగోళ్లు కొంత తగ్గినా, పెట్టుబడి డిమాండ్ మాత్రం కొనసాగింది.సెప్టెంబర్: మళ్లీ జోరుసెప్టెంబర్ నాటికి బంగారం ధరలు మరోసారి వేగం పుంజుకుని రూ.1.08 లక్షల నుంచి రూ.1.10 లక్షల స్థాయికి చేరాయి. ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు భారీగా బంగారం కొనుగోలు చేయడం మార్కెట్‌పై ప్రభావం చూపింది.అక్టోబర్: పండుగ సీజన్ రికార్డులుదసరా–దీపావళి సీజన్లో బంగారం ధరలు మరింత ఎగబాకాయి. అక్టోబర్ మధ్య నాటికి 10 గ్రాముల ధర సుమారు రూ.1.30 లక్షలకు చేరి కొత్త ఆల్‌టైమ్ హైని నమోదు చేసింది. పండుగలు, పెళ్లిళ్ల సీజన్, పెట్టుబడిదారుల కొనుగోళ్లు కలసి ధరలను ఆకాశానికి చేర్చాయి.డిసెంబర్: స్వల్ప తగ్గుదలడిసెంబర్ చివర్లో ధరలు కొంత సర్దుబాటు చెంది రూ.1.28 లక్షలు – రూ.1.30 లక్షల పరిధిలో కొనసాగాయి. ఏదేమైనప్పటికీ, ఏడాది మొత్తంగా చూస్తే బంగారం భారీ లాభాన్ని ఇచ్చిన ఆస్తిగా నిలిచింది. -
2025లో లాంచ్ అయిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లు.. ఇవే!
భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లకు ఆదరణ పెరుగుతున్న క్రమంలో.. వాహన తయారీ సంస్థలు మార్కెట్లో ఎప్పటికప్పుడు ఈవీలను లాంచ్ చేస్తున్నాయి. ఇందులో భాగంగానే ఈ ఏడాది కూడా లెక్కకు మించిన ఈవీలు మార్కెట్లో లాంచ్ అయ్యాయి. ఈ కథనంలో ఈ ఏడాది (2025) దేశీయ విఫణిలో కనిపించిన బెస్ట్ ఎలక్ట్రిక్ కార్లను గురించి వివరంగా తెలుసుకుందాం.హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ఇండియన్ మార్కెట్లో ఎంతోమందికి ఇష్టమైన హ్యుందాయ్ క్రెటా.. ఈ ఏడాది ఎలక్ట్రిక్ రూపంలో మార్కెట్లో లాంచ్ అయింది. ఇది 42 కిలోవాట్ బ్యాటరీ, 51.4 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అనే రెండు ఎంపికలతో లభిస్తుదఞ్హి. ఇవి రెండూ వరుసగా 420 కిమీ, 510 కిమీ రేంజ్ అందిస్తాయి. ఈ కారును డీసీ ఫాస్ట్ ఛార్జర్ ద్వారా 58 నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ చేయవచ్చు. దీని ప్రారంభ ధర రూ. 18.02 లక్షలు (ఎక్స్ షోరూమ్).టాటా హారియార్ ఈవీ2025 టాటా మోటార్స్ లాంచ్ చేసిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి 'టాటా హారియార్ ఈవీ'. acti.ev ప్లస్ EV ప్లాట్‌ఫామ్‌పై నిర్మితమైన ఈ కారు 65 kWh & 75 kWh బ్యాటరీ ప్యాక్‌లతో లభిస్తుంది. ఇది ఒక సింగిల్ ఛార్జితో 627 కిమీ దూరం ప్రయాణిస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ కారు రియర్ వీల్ డ్రైవ్, ఆల్ వీల్ డ్రైవ్ కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. ఇందులో లెవల్ 2 ఏడీఏఎస్, పెద్ద ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, డ్యూయెల్ జోన్ క్లైమేట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ కారు ప్రారంభ ధర రూ. 21.49 లక్షలు (ఎక్స్ షోరూమ్).మహీంద్రా ఎక్స్ఈవీ 9ఎస్మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ కూడా ఎక్స్ఈవీ 9ఎస్ పేరుతో.. ఏడు సీట్ల ఎలక్ట్రిక్ కారును లాంచ్ చేసింది. ఇది 59 kWh, 70 kWh, 79 kWh అనే బ్యాటరీ ఎంపికలతో లభిస్తుంది. ఈ కారు రేంజ్.. ఎందుకుని బ్యాటరీ ప్యాక్, వేరియంట్‌ను బట్టి 521 కిమీ నుంచి 679 కిమీ వరకు ఉంటుంది. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ట్రిపుల్ డిజిటల్ స్క్రీన్లు & లెవల్-2 ఏడీఏఎస్ ఫీచర్స్ కూడా కలిగి ఉంది. దీని ధర రూ. 19.95 లక్షలు (ఎక్స్ షోరూమ్).కియా కారెన్స్ క్లావిస్ ఈవీకియా మోటారు లాంచ్ చేసిన కారెన్స్ క్లావిస్ ఈవీ.. ఏడు సీట్ల లేఅవుట్‌ను పొందుతుంది. ఫ్యామిలీ కారు కావాలనుకునే వారికి ఇది ఉత్తమ ఎంపిక. ఇది 42 kWh & 51.4 kWh బ్యాటరీ ప్యాక్‌లతో.. 404 కిమీ, 490 కిమీ రేంజ్ అందిస్తుంది. ఫీచర్స్ విషయానికి వస్తే.. ఈ కారులో లెవల్-2 ఏడీఏఎస్, పనోరమిక్ సన్‌రూఫ్, వైర్లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జింగ్ వంటివన్నీ ఉన్నాయి. దీని ధరలు రూ. 17.99 లక్షల నుంచి రూ. 24.49 లక్షలు మధ్య ఉన్నాయి.విన్‌ఫాస్ట్ వీఎఫ్7 & వీఎఫ్6వియత్నామీస్ EV బ్రాండ్ విన్‌ఫాస్ట్ ఈ ఏడాది.. వీఎఫ్7 & వీఎఫ్6 కార్లను లాంచ్ చేసింది. వీఎఫ్7 ధరలు రూ. 20.89 లక్షల నుంచి రూ. 25.49 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య ఉన్నాయి. ఇందులో 70.8 కిలోవాట్ బ్యాటరీ, 75.3 కిలోవాట్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ (LFP) బ్యాటరీతో సింగిల్ మోటార్ & డ్యూయల్ మోటార్ వేరియంట్లలో లభిస్తుంది.వీఎఫ్6 విషయానికి వస్తే.. దీని ప్రారంభ ధర రూ. 16.49 లక్షలు (ఎక్స్ షోరూమ్). ఇది సాధారణంగా 59.6 kWh బ్యాటరీతో.. ఫ్రంట్-మోటార్ సెటప్ & ఫాస్ట్-ఛార్జింగ్ సామర్థ్యంతో వస్తుంది. ఈ కారు 468 కిమీ రేంజ్ అందిస్తుంది. డిజైన్, ఫీచర్స్ అద్భుతంగా ఉంటాయి.వోల్వో ఈఎక్స్30వోల్వో కంపెనీ ఈఎక్స్30 ప్రీమియం ఎలక్ట్రిక్ కారును ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. ఇది 69 kWh లిథియం అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఈ కారు రియర్ మౌంటెడ్ మోటారుతో జతచేయబడి.. 272 bhp & 343 Nm ఉత్పత్తి చేస్తుంది. ఇది 480 కిమీ రేంజ్ అందిస్తుంది. DC ఛార్జర్‌ని ఉపయోగించి 28 నిమిషాల్లో 10–80 శాతం ఛార్జ్ చేయడానికి అనుమతిస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 39.99 లక్షలు (ఎక్స్ షోరూమ్). -
ప్రారంభంలో ఆశావహం.. సవాళ్ల సుడిగుండం!
భారత పౌర విమానయాన చరిత్రలో 2025వ సంవత్సరం ఒక మరుపురాని అధ్యాయంగా మిగిలిపోనుంది. ఈ ఏడాది ఒకవైపు కుంభమేళా వంటి పండుగలతో ఆకాశమంత సంబరాన్ని చూసింది.. మరోవైపు ఘోర విమాన ప్రమాదాలు, సర్వీసుల రద్దుతో పాతాళమంత విషాదాన్ని మిగిల్చింది. అభివృద్ధి బాటలో పయనిస్తున్న దేశీయ ఏవియేషన్ రంగానికి ఈ ఏడాది ఎదురైన సవాళ్లు, భవిష్యత్తు పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.కుంభమేళా మెరుపులు.. అంతర్జాతీయ గౌరవంసంవత్సరం ప్రారంభంలో దేశీయ విమానయాన రంగం పరిస్థితి ఎంతో ఆశాజనకంగా ఉంది. జనవరి 13న ప్రయాగ్‌రాజ్‌లో ప్రారంభమైన కుంభమేళా విమానయాన రంగానికి ఊపునిచ్చింది. 45 రోజుల పాటు సాగిన ఈ వేడుక కోసం విమాన సంస్థలు అదనపు విమానాలను నడిపాయి. దీనివల్ల జనవరి-మార్చి త్రైమాసికంలో దేశీయ ట్రాఫిక్ 10.35 శాతం వృద్ధి సాధించింది.మరోవైపు, 42 ఏళ్ల విరామం తర్వాత భారతదేశం ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ (IATA) 81వ వార్షిక సర్వసభ్య సమావేశానికి ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణంగా నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న మార్కెట్‌గా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంది.ఎయిరిండియా విషాదం..జూన్ 12న జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 (AI171) ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఈ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కూలిపోయింది. 242 మంది ప్రయాణికుల్లో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడటం అత్యంత విషాదకరం.ప్రపంచవ్యాప్తంగా సురక్షితమైనదిగా భావించే బోయింగ్ 787 చరిత్రలో ఇది తొలి ప్రమాదం. ఈ ఘటనతో డీజీసీఏ బోయింగ్ 787 విమానాలపై కఠిన తనిఖీలను ఆదేశించింది. ఎయిర్ ఇండియా తన విమానాల భద్రతపై పునసమీక్ష చేపట్టింది.ఆర్థిక, ఇండిగో సంక్షోభంవిమాన ప్రమాదాలే కాకుండా భౌగోళిక రాజకీయ పరిస్థితులు కూడా విమానయాన సంస్థలను దెబ్బతీశాయి. ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో పాకిస్థాన్ గగనతలాన్ని మూసివేయడంతో ఒక్క ఎయిరియండానే సుమారు రూ.4,000 కోట్ల నష్టాన్ని చవిచూసింది. అమెరికా, యూరప్ విమానాలు సుదీర్ఘ మార్గాల్లో ప్రయాణించాల్సి రావడం వల్ల ఇంధన ఖర్చులు, సిబ్బంది భారం పెరిగిపోయింది.ఇక దేశంలోనే అతిపెద్ద విమానయాన సంస్థ ఇండిగో సర్వీసులు ఊహించని విధంగా ఉన్నపలంగా రద్దయ్యాయి. నవంబర్ మాసంలో రికార్డు స్థాయిలో ప్రయాణికులు నమోదైనప్పటికీ పైలట్ల కొరత కారణంగా వందలాది విమానాలు రద్దు కావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ‘ఇండిగో ఏకఛత్రాధిపత్యం అనేది మార్కెట్ వైఫల్యాల వల్ల ఏర్పడిందే తప్ప, ఒక పద్ధతి ప్రకారం జరిగిన అభివృద్ధి కాదు’ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.భవిష్యత్తుపై ఆశలుఇన్ని సవాళ్లు ఉన్నప్పటికీ భారత విమానయాన రంగం కోలుకుంటుందనే నమ్మకం వ్యక్తమవుతోంది. దేశీయ విమానాల్లో ప్రయాణ డిమాండ్ బలంగా ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. విమానయాన కంపెనీలు స్మార్ట్ భాగస్వామ్యాల ద్వారా వృద్ధి సాధిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (ఎన్ఐఏ) వంటి ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సీఆర్ ప్రాంతంలో విమానయాన సామర్థ్యాన్ని పెంచుతాయని చెబుతున్నారు.2025 సంవత్సరం భారత ఏవియేషన్ రంగానికి ఒక గట్టి హెచ్చరిక. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యం, పైలట్ల నిర్వహణలో వైఫల్యాలు, విదేశీ పరిణామాల ప్రభావం ఈ రంగాన్ని అతలాకుతలం చేశాయి. అయితే, కొత్త విమానాశ్రయాల నిర్మాణం, పెరుగుతున్న ప్రయాణ డిమాండ్ భవిష్యత్తుపై ఆశలు రేకెత్తిస్తున్నాయి.ఇదీ చదవండి: కొందరి చేతుల్లోనే పోగవుతున్న ధనలక్ష్మీ -
Year Ender 2025: వైభవ్, దివ్య, శీతల్.. మరెన్నో విజయాలు
భారత క్రీడా రంగంలో ఈ ఏడాది యువ ప్లేయర్లు దుమ్ములేపారు. ఐపీఎల్-2025లో పద్నాలుగేళ్ల వైభవ్ సూర్యవంశీతో పాటు ఆయుశ్ మాత్రే సంచలన ప్రదర్శనలు నమోదు చేయగా.. చెస్‌లో దివ్యా దేశ్‌ముఖ్ మహిళల వరల్డ్‌కప్ విజేతగా నిలిచి సత్తా చాటింది. వీరితో పాటు 2025లో అద్భుత ఆట తీరుతో ఆకట్టుకున్న భారత యువ ఆటగాళ్లు, వారి విజయాలను నెమరు వేసుకుందాం!దూసుకొచ్చిన యువ కెరటంభారత క్రికెట్లో నయా సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi). హర్యానాకు చెందిన ఈ పద్నాలుగేళ్ల చిచ్చర పిడుగు రికార్డులు సృష్టించడమే పనిగా పెట్టుకున్నాడు. ఐపీఎల్ వేలంలో రాజస్తాన్ రాయల్స్ అతడిని ఏకంగా 1.10 కోట్లకు కొనుగోలు చేసింది.ఈ క్రమంలో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన వైభవ్ గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో కేవలం 38 బంతుల్లోనే 101 పరుగులు సాధించాడు. తద్వారా అత్యంత పిన్న వయసులో ఐపీఎల్లో శతక్కొట్టిన ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు. అదే విధంగా క్యాష్ రిచ్ లీగ్‌లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగానూ రికార్డు సాధించాడు. ఆ తర్వాత భారత్ అండర్-19 జట్టు తరఫునా యూత్ వన్డే, టెస్టుల్లో సెంచరీలతో చెలరేగాడు.ఆయుశ్ మాత్రేమహారాష్ట్రకు చెందిన ఆయుశ్ మాత్రే ఈ ఏడాది చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఐపీఎల్లో అడుగుపెట్టాడు. గుజరాత్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో 28 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. వైభవ్ మాదిరే సెంచరీ బాదాలని చూసిన ఆయుశ్ ఆర్సీబీతో మ్యాచ్‌లో 48 బంతుల్లోనే 94 పరుగులు చేశాడు. అయితే తృటిలో శతకం చేజార్చుకున్నాడు.ఇక వైభవ్ బ్యాటర్‌గా భారత అండర్-19 జట్టు తరఫున సత్తా చాటుతుండగా.. పదిహేడేళ్ల ఆయుశ్ అతడికి ఓపెనింగ్ జోడీగా ఉంటూనే కెప్టెన్‌గానూ కీలక బాధ్యతను సమర్థవంతంగా నెరవేరుస్తున్నాడు.దివ్య దేశ్ముఖ్భారత చెస్ రంగంలో సరికొత్త సంచలన దివ్య దేశ్‌ముఖ్. ఫిడే మహిళల వరల్డ్‌కప్-2025లో ఈ మహారాష్ట్ర అమ్మాయి అద్భుత విజయం సాధించింది. సీనియర్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపిని ఓడించి టైటిల్ కైవసం చేసుకుంది.తద్వారా అత్యంత పిన్నవయసులోనే (19 ఏళ్లు) ఈ ఘనత సాధించిన చెస్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. అంతేకాదు.. గ్రాండ్ మాస్టర్ హోదా పొందడానికి ముందే ఈ ఫీట్ అందుకున్న ప్లేయర్‌గానూ రికార్డు సాధించింది. వరల్డ్‌కప్ విజయంతోనే దివ్యకు గ్రాండ్ మాస్టర్ హోదా దక్కింది. ఓవరాల్‌గా ఇండియాలో 88వ, మహిళలలో 44వ గ్రాండ్ మాస్టర్‌గా దివ్య నిలిచింది.ఇక వరల్డ్‌కప్ చాంపియన్‌గా నిలవడంతో పాటు ఫిడే మహిళల క్యాండిడేట్స్ టోర్నమెంట్-2026కు కూడా దివ్య దేశ్‌ముఖ్ అర్హత సాధించింది.డి. గుకేశ్గతేడాది వరల్డ్‌చెస్ చాంపియన్‌గా నిలిచిన దొమ్మరాజు గుకేశ్ ఈ ఏడాదిని ఫిడే గ్రాండ్ స్విస్-2025లో విజయం సాధించాడు. అంతేకాదు.. తొలిసారిగా తన కెరీర్లో అత్యుత్తమంగా ఫిడే క్లాసికల్ రేటింగ్ లిస్టులో వరల్డ్ నంబర్ 3గా ఈ చెన్నై చిన్నోడు నిలిచాడు. ఆర్. ప్రజ్ఞానంద, వైశాలి రమేశ్బాబుచెన్నైకి చెందిన అక్కాతమ్ముళ్లైన ఈ చెస్ గ్రాండ్‌మాస్టర్లు ఈ ఏడాది కూడా తమ హవా కొనసాగించారు. ప్రజ్ఞానంద టాటా స్టీల్ చెస్-2025లో గుకేశ్‌ను టై బ్రేకర్‌లో ఓడించి టైటిల్ సాధించాడు.తద్వారా ఫిడే రేటింగ్స్‌లో అత్యుత్తమంగా వరల్డ్ నంబర్ 8 ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది నిలకడైన ప్రదర్శనతో అతడు ఆకట్టుకున్నాడు.ఇక వైశాలి రమేశ్ బాబు వరుసగా రెండో ఏడాది ఫిడే గ్రాండ్ స్విస్ 2025 టైటిల్ గెలుచుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా చెస్ ప్లేయర్‌గా నిలిచింది. ఈ ప్రదర్శన నేపథ్యంలో వుమెన్స్ క్యాండిడేట్స్‌కు అర్హత సాధించింది. ఆమె కంటే ముందు హంపి, దివ్య ఈ క్వాలిఫై అయ్యారు.టాటా స్టీల్ చాలెంజర్స్‌లోనూ సత్తా చాటిన వైశాలి రమేశ్‌బాబు మహిళల రేటింగ్స్‌లో ఇండియా నంబర్ 2గా నిలిచింది. వీరితో పాటు తెలంగాణ స్టార్ అర్జున్ ఇరిగేసి కూడా ఈ ఏడాది మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు.మరెన్నో విజయాలుఫ్రీస్టైల్ చెస్ గ్రాండ్‌స్లామ్ ఫైనల్స్‌లో మాగ్నస్ కార్ల్‌సన్‌నే ఓడించి నాకౌట్‌కు చేరాడు. అంతేకాదు.. రాపిడ్ రౌండ్ రాబిన్ స్టేజ్‌లోనూ మరోసారి అతడికి ఓటమిని రుచి చూపించాడు. అయితే, క్వార్టర్‌ఫైనల్స్‌లో విన్సెంట్ కెమెర్ చేతిలో ఓడిపోవడంతో అర్జున్ సెమీస్ చేరే అవకాశాన్ని కోల్పోయాడు.ఇక ఇతరులలో పారా ఆర్చర్ శీతల్ దేవి ఈ ఏడాది వరల్డ్ ఆర్చరీ పారా చాంపియన్‌షిప్స్ గెలిచింది. మరోవైపు.. షూటర్ సామ్రాట్ రాణా ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ చాంపియన్స్‌షిప్స్‌లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో టైటిల్ గెలిచి.. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ అథ్లెట్‌గా నిలిచాడు.వీరితో పాటు పారా అథ్లెట్ సుమిత్ ఆంటిల్, అథ్లెట్ అనిమేశ్ కుజూర్ చెప్పుకోదగ్గ విజయాలు సాధించారు. మరోవైపు.. టీమ్ ఈవెంట్లలో భారత్ తొలిసారి మహిళల క్రికెట్ వన్డే వరల్డ్‌కప్ గెలవగా.. ఖో-ఖో పురుషుల, మహిళలు.. కబడ్డీ పురుషులు, మహిళా జట్లు చాంపియన్లుగా నిలిచి సత్తా చాటాయి. మహిళల అంధుల క్రికెట్ జట్టు టీ20 వరల్డ్‌కప్ గెలిచింది. చదవండి: Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు.. -
Year-Ender 2025: విరాట్ కోహ్లి నుంచి జాన్ సీనా వరకు..
2025 ఏడాదిలో క్రీడల్లో ఒక శకం ముగిసింది. మైదానంలో తమ అసాధారణ ప్రతిభతో అభిమానులను మంత్రముగ్ధులను చేసిన ఎందరో సూపర్ స్టార్లు ఈ ఏడాది (2025) తమ కెరీర్‌ను ముగించారు. ఈ క్రమంలో ఏడాది రిటైర్మెంట్ ప్రకటించిన క్రీడా దిగ్గజాలపై ఓ లుక్కేద్దాం.రోహిత్ శర్మ..టీమిండియా స్టార్ ప్లేయర్ రోహిత్ శర్మ ఈ ఏడాది మేలో టెస్టు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. 2024లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన తర్వాత పొట్టి ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పిన రోహిత్.. ఇంగ్లండ్ టూర్‌కు ముందు రెడ్‌బాల్ క్రికెట్ నుంచి తప్పుకొన్నాడు. తన టెస్టు కెరీర్లో 67 టెస్టు మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 40.58 సగటుతో 4301 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. రోహిత్ రిటైర్మెంట్ ప్రకటించిన భారత టెస్టు కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్ ఎంపికయ్యాడు. రోహిత్ ప్రస్తుతం వన్డే ఫార్మాట్లో మాత్రమే కొనసాగుతున్నాడు.విరాట్ కోహ్లి..క్రికెట్ చరిత్రలోనే అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకరైన విరాట్ కోహ్లి కూడా రోహిత్ శర్మ బాటలోనే నడిచాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన వారం రోజులకే కింగ్ కూడా టెస్టుల నుంచి తప్పుకొన్నాడు. టెస్ట్ క్రికెట్ అంటే తనకు అమితమైన ఇష్టమని, భారత్ తరపున ఆడినంత కాలం ఈ ఫార్మాట్లో కొనసాగుతానని కోహ్లి ఎన్నోసార్లు చెప్పారు. కానీ సడన్‌గా రిటైర్మెంట్ ప్రకటించి అందరిని ఆశ్చర్యపరిచాడు. సుదీర్ఘ ఫార్మాట్ నుంచి కోహ్లి తప్పుకోవడంతో భారత టెస్ట్ క్రికెట్లో 'రో-కో' శకం ముగిసింది. విరాట్ కోహ్లి తన టెస్టు కెరీర్లో 123 మ్యాచ్‌లు ఆడి 9230 పరుగులు చేశాడు. 30 సెంచరీలు, 31 ఆర్ధ శతకాలు ఉన్నాయి. విరాట్ కూడా ప్రస్తుతం వన్డేల్లో మాత్రమే ఆడుతున్నాడు.ఛతేశ్వర్ పుజారాభారత టెస్ట్ క్రికెట్ లో 'నయా వాల్' గా పేరుగాంచిన ఛతేశ్వర్ పుజారా.. ఈ ఏడాది ఆగస్టులో అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుండి తప్పుకొన్నాడు. గత కొన్నేళ్లగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్నప్పటికి.. దేశవాళీ క్రికెట్లో మాత్రం పుజారా అద్భుతంగా రాణిస్తుండేవాడు. కానీ యువ ఆటగాళ్లకు అవకాశమిచ్చేందుకు తన కెరీర్‌ను ఛతేశ్వర్ ముగించాడు. పుజారా తన కెరీర్లో 7195 పరుగులు చేశాడు. 19 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయ.స్టీవ్ స్మిత్, మాక్సీ గుడ్బైఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్లు స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్వెల్ వన్డే ఫార్మాట్ నుంచి తప్పుకొని అందరికి షాకిచ్చారు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 అనంతరం స్మిత్ తన నిర్ణయాన్ని వెల్లడించగా.. మాక్సీ ఈ ఏడాది జూన్‌లో తన రిటైర్మెంట్ను ప్రకటించాడు.హెన్రీచ్ క్లాసెన్సౌతాఫ్రికా స్టార్ హెన్రిచ్ క్లాసెన్ అంతర్జాతీయ క్రికెట్‌కు సడన్‌గా వీడ్కోలు పలికి అందరిని ఆశ్చర్యపరిచాడు. బోర్డుతో విభేదాల కారణంగా క్లాసెన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు. క్లాసెన్ తన అంతర్జాతీయ కెరీర్లో 3245 పరుగులు చేశాడు.నికోలస్ పూరన్: వెస్టిండీస్ వికెట్ కీపర్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 29 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్ నుండి తప్పుకొని అందరినీ షాక్‌కు గురిచేశాడు. ఫ్రాంచైజీ క్రికెట్ లీగ్‌ల మోజులో పడి పూరన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.జాన్ సీనా..స్టార్ రెజ్లర్, WWE దిగ్గజం జాన్ సీనా ఈ ఏడాది డిసెంబర్లో ప్రొఫెషనల్ రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికారు. జాన్ సీనా తన చివరి మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి.. ప్రపంచ రెజ్లింగ్ చరిత్రలో తన పేరును సువర్ణ అక్షరాలతో లిఖించుకున్నాడు. జాన్ సీనా తన కెరీర్లో మొత్తం 17 వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్స్‌ను సొంతం చేసుకున్నాడు.ఈ లెజెండరీ రెజ్లర్ ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలపై దృష్టి సారించారు. ఇప్పటికే 'పీస్‌మేకర్' (Peacemaker) వంటి సిరీస్‌లతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జాన్‌సీనా.సెర్గియో బుస్కెట్స్ (ఫుట్‌బాల్)స్పెయిన్ మిడ్‌ఫీల్డ్ మాంత్రికుడు సెర్గియో బుస్కెట్స్ మేజర్ లీగ్ సాకర్ సీజన్ ముగిసిన తర్వాత ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. మయామి ఇంటర్నేషనల్ ఫుట్‌బాల్ క్లబ్ తరపున లియోనెల్ మెస్సీతో కలిసి సెర్గియో ఆడాడు.పర్దీప్ నర్వాల్ (కబడ్డీ)కబడ్డీ లెజెండ్, 'డూ ఆర్ డై' స్పెషలిస్ట్ పర్దీప్ నర్వాల్ 2025 ప్రో కబడ్డీ లీగ్ (PKL) వేలంలో అమ్ముడుపోకపోవడంతో సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ప్రొఫెషనల్ కబడ్డీకి రిటైర్మెంట్ ప్రకటించి షాకిచ్చాడు. అయితే కోచ్‌గా పనిచేసేందుకు తన సిద్దంగా ఉన్నట్లు నర్వాల్ తెలిపాడు.


