ఫ్యాషన్‌ ఫార్వర్డ్‌.. జెండర్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ.. | Roundup 2025 Youth fashion and education | Sakshi
Sakshi News home page

Year-end Roundup 2025: చీరకు యువతరం కొత్త లుక్‌

Dec 27 2025 2:51 PM | Updated on Dec 27 2025 3:06 PM

Roundup 2025 Youth fashion and education

టైమ్‌లెస్‌ ఇండియన్‌ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్‌ ఇస్తోంది. ప్రీ–డ్రేప్‌డ్‌ శారీస్, డెనిమ్‌–ఇన్‌ఫ్యూజ్‌డ్‌ ఫ్యాబ్రిక్స్, బాంబర్‌ జాకెట్‌లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్‌ ఇది.

సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్‌లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్‌ కోర్సెట్‌ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్‌ల వరకు... ఈ ట్రెండ్‌ మోడ్రన్‌ ఇండియన్‌ ఫ్యాషన్‌ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.

‘హ్యాండ్లూమ్‌ ఫ్యాబ్రిక్స్‌ ఇన్‌ మోడ్రన్‌ 
సిల్హవుటీ’ ట్రెండ్‌ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్‌లాంటి చేనేత వస్త్రాలను జంప్‌సూట్‌లు, వోవర్‌సైజ్‌డ్‌ కోట్స్, కో–ఆర్డర్‌ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్‌ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.

సంప్రదాయ జెండర్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తూ న్యూట్రల్‌–కలర్డ్‌ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్‌ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్‌–ఎక్స్‌ప్రెషన్స్‌కు అవకాశం ఇస్తున్నాయి.

చ‌ద‌వండి: లేత రంగుల లేటెస్ట్ చీర‌ల ట్రెండ్‌

ఇంజినీరింగ్‌ వైపు మ్యూజిక్‌ స్టూడెంట్స్‌ మొగ్గు
విద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్‌ స్టూడెంట్స్‌ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్‌ స్టూడెంట్స్‌ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్‌ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్‌ డైరెక్టర్‌ప్రొఫెసర్‌ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్‌ ఎడ్యుకేషన్‌ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు.  ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఇన్‌ మ్యూజిక్‌’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్‌ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement