breaking news
Fashion
-
ఐవరీ చీరలో ‘రాధమ్మ’ను తలపిస్తున్న నీతా అంబానీ!
నీతా అంబానీ ధరించే చీరలే సందర్భం ఏంటో చెప్పేస్తాయి. కార్యక్రమానికి అనుగుణమైన వస్త్రాధారణతో తన ఫ్యాషన్ అభిరుచి ఏంటో చెప్పకనే చెప్పేస్తారామె. ముఖ్యంగా భారతీయ గొప్ప వారసత్వాన్ని చాటిచెప్పేలా హస్తకళకు అద్దంపట్టే చీరలతో అందర్నీ ఆశ్చర్యపర్చడమే గాక మన కళాకారుల నైపుణ్యాన్ని ఎలుగెత్తి చాటుతారామె. ఈసారి కూడా అలాంటి అందమైన చీరలో దివ్యంగా కనిపించింది నీతా అంబానీ. తన శారీతో ఆధ్యాత్మిక శోభను తీసుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియోని మేకప్ ఆర్టిస్ట్ స్మారవ్ రాయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వీడియోలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్పర్సన్ నీతా అంబానీ తన ఇంట జరిగే కృష్ణుడి పూజ కోసం..శ్రీకృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ చీరలో ప్రత్యేకంగా కనిపించింది. ఫ్యాషన్‌ని సందర్భానుసారంగా స్టైలిష్‌గా కనిపించడంలో నీతాకు సాటిలేరని చెప్పొచ్చు. ప్రకాశవంతమైన సంప్రదాయంతో ఫ్యాషన్‌ని చాటుతుందామె. ఈసారి కూడా అలానే ఇంట్లో జరిగే పూజ కోసం కృష్ణుడి స్ఫూర్తితో రూపొందించిన ఐవరీ రంగు చీరలో దివి నుంచి భువికి వచ్చిన దేవతాలా మెరిసింది. తెల్ల గన్నెరు రంగు చీరపై పురాతన బంగారు, వెండి జరీతో కృష్ణుడి రూపాన్ని అందంగా ఎంబ్రాయిడరీ చేశారు. చీర అంతటా ఆ చిన్న కృష్ణుడి మోటీప్లను ఆలోచనాత్మకం నేయడం విశేషం. ఆ శారలో అద్భుతంగా ఎంబ్రాయిడరీ చేసిన అంచు, క్లిష్టమైన పూల నమునాలు ప్రధాన ఆకర్షణగా కనిపించాయి. ఏక వర్ణంగా ఉండే ఈ చీరకు ఆ డిజైన్ అద్భుతమైన లుక్‌ని ఇచ్చింది. అలాగే పల్లు కూడా పారదర్శకమైన ఆర్గాంజా వస్త్రంతో కూడిన వంపుల అంచు ఆమె భుజాల మీద నుంచి అందంగా జాలువారింది. ఆ చీరకు మ్యాచింగ్‌గా నిరాడంబరైమన గుండ్రని మెడ, హాఫ్ హ్యాండ్స్..ఆ చీరపై ఉన్న క్లిష్టమైన హస్తకళా నైపుణ్యం స్పష్టంగా కనిపించేలా ఆకర్ణగా నిలిచింది. ఆ అందమైన లుక్‌కి అనుగుణంగా ధరించిన వజ్రాభరణాలు మరింత శోభను చేకూర్చాయి. ముఖ్యంగా ఎమరాల్డ్-కట్ రాళ్లతో కూడిన పొరల వజ్రాల నెక్లెస్, దానికి సరిపోయే పూల చెవిపోగులు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, వరుసగా పేర్చిన వజ్రాల బ్రాస్లెట్లు, ఒక పెద్ద కాక్టెయిల్ ఉంగరం వంటి జ్యువెలరీ నీతాకు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన లుక్‌ని అందించాయి. అలాగే కురులను ముడివేసి, ముఖానికి లైట్ మేకప్‌తో చక్కటి గుండ్రటి బొట్టుతో సంప్రదాయం మేళవింపుతో కూడిన ఆధునిక మహిళలా మెరిసింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Sourav Roy| Hair & Makeupartist (@souravv_roy_) (చదవండి: కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!) -
మురిపించిన మెరుపు తీగలు
-
కాంచీపురం చీరలో దేవతలా సాయిపల్లవి..!
ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో కాంచీవరం చీరతో సాయిపల్లవి అందరి దృష్టిని ఆకర్షించింది. రామాయణ చిత్ర బృందం, సిబ్బంది ఢిల్లీలో నిర్వహించిన 'ప్రథం సంకల్ప్' అనే మీడియా కార్యక్రమంతో ప్రచార కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ ఈవెంట్‌కి రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్, కునాల్ కపూర్, రవిదూబే, కుమార్ విశ్వాస్, అరుణ్ గోవిల్ తదితరులు హాజరయ్యారు. హిందూ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పౌరాణిక పాత్రలు పోషించే అవకాశం గురించి చిత్ర బృందం, నటీనటులు చాలా భావోద్వేగంగా మాట్లాడారు. ఆ నేపథ్యంలో సాయిపల్లవి ఇలా కాంచీవరం చీరలో దేవకన్యలా మెరిసింది. ఆమె ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ..నటీనటులకు ఇలాంటి పాత్రలు దక్కడం అంత సులభం కాదు. ఎందుకంటే ఒక దైవ సమానమైన పాత్రను (దేవత పాత్రను) పోషించడం సాధారణ విషయం కాదు. ఆ పాత్రను అత్యుత్తమంగా తీర్చిదిద్దడానికి ఒక బృందం తమ సర్వస్వం ధారపోసి పనిచేయాల్సి ఉంటుంది. రామాయణంలో సీత పాత్రను పోషించాలని ప్లాన్ చేసుకోవడం గానీ, ఆశించడం గానీ చేయలేదు. ఈ అవకాశం నాకు ఒక వరంలా లభించింది. అందుకే ధ్యానం చేస్తూ..'సీతమ్మా, నా ద్వారా నువ్వే నటించు. నా ద్వారా ఏది వ్యక్తమవుతుందో, అదే ఈ సినిమా కోసం నీకు కావాల్సినది' అని ఆ సీతమ్మ తల్లిని వేడుకున్నా అని భావోద్వేగంగా చెప్పింది సాయిపల్లవి. ఇక ఈ కార్యక్రమం కోసం ఆమె గులాబీ-బంగారు రంగు కాంచీవరం చీరను ఎంచుకున్నారు. ఆ చీరకు అనుగుణంగా బంగారు దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారు. అలాగే ఢిల్లీ వాతావరణానికి అనుగుణంగా డ్యూయీ బేస్‌ను ఎంచుకుంది. తన సహజ ఉంగరాల జుట్టును మధ్య పాపిడి తీసి సగం హెయిర్డోగా తీర్చిదిద్దుకుంది. కాగా, రూ.4వేల కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన నితేష్ తివారీ 'రామాయణం: మొదటి భాగం' 2026 నవంబర్ 8న థియేటర్లోకి రానుంది. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!) -
పింక్ బనారసి పట్టు చీరలో అందమైన గులాబీలా నీతా అంబానీ..!
రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ సాంప్రదాయ శైలి చీరలతో ఆకట్టుకోవడంలో ముందుంటారు. తరుచుగా అద్భుతమైన చేనేత చీరలు, విలువైన ఆభరణాలతో మెరిస్తుంటారు. తాజాగా మరోసారి అద్బుతమైన చేనేత చీరలో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆమె వారణాసిలో ఫార్చ్యూన్ మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ కార్యక్రమం కోసం స్వదేశ్ వారి అద్భుతమైన తంచోయ్ బనారసీ పట్టు చీరను ఎంచుకున్నారు. వారణాసిలో భక్తి, పండుగ ఆనందాల్లో ప్రధాన పాత్ర పోషించే గులాబీ రేకులలో నిండిపోయే హోలీ వేడుక స్ఫూర్తితో రూపొందిచారు నీతా తంచోయ్ బనారసీ పట్టు చీరను. ఈ చీరలో నీతా రాజసంగా కనిపించారు. ఈ లేత గులాబీ రంగు ఆ పవిత్ర నగర ప్రసిద్ధ పండుగతో ముడిపడి ఉన్న ప్రశాంతతను అందంగా ఆవిష్కరించింది నీతా పింక్ బనారసీ చీర. ఆమె దీన్ని వారణాసి గులాబ్ హోలీకి నివాళిగా ధరించారు. ఈ చీరపై అంత్యంత క్లిష్టమైన పూల జాలీ డిజైన్ ఉంది. దీనిపై లేత ఐవరీ, పురాతన బంగారు రంగులలో సుందరంగా నేసిన పూల బుట్టాలతో డెకరేట్ చేశారు. ఈ వివరమైన డిజైన్లు చీరకు గొప్ప ఆకృతిని, ప్రకాశవంతమైన మెరుపుని అందించాయి. ఈ నేత రెండు వైపులా ఒకలా ఉండి ఎటునుంచైనా ధరించేలా ఉండటమే దీని ప్రత్యేకత. దీన్ని ప్రఖ్యాత కళాకారులు ఆరుషి లోహియా, కృష్ణ లోహియా రెండు నెలల పాటు చేతితో నేశారు. ఈ బనారసీ పట్టు చీర నేత వారసత్వానికి, హస్త కళా నైపుణ్యానికి ప్రతీక. ఈ చీరకు సరిపోయే లేత గులాబీ రంగు బ్లౌజ్ వింత్ మోచేతి వరకు ఉండేలా జత చేశారు. ఈ బ్లౌజ్ క్లాసిక్ స్వేర్ నెక్లైన్ ఉంది. ఈ చీరకు అనుగుణంగా పూల స్టడ్ చెవిపోగులు, సున్నితమైన గుండె ఆకారపు డైమండ్ పెండెంట్, టెన్నిస్ బ్రాస్లెట్, ఒక స్టేట్మెంట్ రింగ్, లగ్జరీ వాచ్‌లను ధరించారు. ఈ చీర అందంగా కనిపించేలా చాలా తక్కువ ఆభరణాలనే ధరించారు నీతా. ఇక తన బ్యూటీ లుక్ కోసం నేచురల్ గ్లామర్‌నే ఎంచుకుంది. సాంప్రదాయా మహిళలా ఎర్రటి బొట్టు, పాపిడి తీసి జుట్టుని చక్కటి కొప్పులా తీర్చిదిద్దుకుంది. ఆ కార్యక్రమానికి అనుగుణంగా శక్తిమంతమైన సాంప్రదాయ శైలిలో హుందాగా కనిపించింది నీతా అంబానీ. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) (చదవండి: వాకింగ్'కి అత్యంత అనుకూలమైన నగరం అదే..! కానీ హారన్ కొట్టారో..) -
ఇకపై జీన్స్‌కి బ్రేక్! ఇదే న్యూ ట్రెండ్!!
‘అల్మరాలో పది ప్యాంట్లు ఉన్నా... చేతికి వచ్చేది మాత్రం అదే జీన్స్!’ చాలామంది అబ్బాయిల కథ ఇదే. ఆఫీస్ అయినా... డేట్ అయినా... పార్టీ అయినా... ‘జీన్స్ వేసుకుంటే సేఫ్!’ అనుకుంటారు. కానీ ఒక్కసారి ఆలోచించండి... అదే కంఫర్ట్‌తో, ఇంకా క్లాసీగా కనిపించే మరో ఆప్షన్ ఉంటే? అవే ఇవీ!డ్రాస్ట్రింగ్ ట్రౌజర్స్ఎలాస్టిక్ వెయిస్ట్, డ్రాస్ట్రింగ్‌తో వచ్చే ఈ ట్రౌజర్స్ కంఫర్ట్‌లో నెంబర్ వన్ . జాగర్స్లా హాయిగా, లుక్‌లో క్లాస్ ఉంటాయి.వైడ్ లెగ్ ట్రౌజర్స్ఈ మధ్య ఫ్యాషన్ ప్రపంచాన్ని షేక్ చేస్తున్న స్టయిల్ ఇదే. కాస్త లూజ్‌గా, రిలాక్స్డ్గా ఉంటాయి. ఓవర్‌సైజ్ టీ–షర్ట్ లేదా క్యాజువల్ షర్ట్‌తో వేసుకుంటే ట్రెండీ లుక్ గ్యారంటీ.స్టయిలింగ్ సపోర్ట్ ముఖ్యం!ట్రౌజర్స్ వేసుకుంటే సరిపోదు, వాటిని ఎలా స్టయిల్ చేస్తారన్నదే అసలు మ్యాజిక్! ఫైవ్ పాకెట్ ట్రౌజర్స్‌తో సాదా టీ–షర్ట్, స్నీకర్స్తోనూ, ప్లీటెడ్ ట్రౌజర్స్‌కు టక్–ఇన్ షర్ట్, లోఫర్స్ అయితే రిచ్ లుక్ గ్యారంటీ. లినెన్ ట్రౌజర్స్‌ను హాఫ్ స్లీవ్ షర్ట్‌తో మ్యాచ్ చేస్తే సమ్మర్లో కూల్‌గా కనిపిస్తారు. డ్రాస్ట్రింగ్ ట్రౌజర్స్‌కు ఓవర్‌సైజ్ టీ–షర్ట్ట్ పెయిర్ చేస్తే ట్రెండీ లుక్ మీ సొంతం. ప్రతిరోజూ అదే జీన్స్ వేసుకుని ‘నా దగ్గర ఇంకో ప్యాంట్ లేదా?‘ అని అల్మారానే అడిగే పరిస్థితి వద్దు. ఒక్కో సందర్భానికి ఒక్కో ట్రౌజర్ ఎంచుకుని, దానికి తగ్గ టాప్, షూస్‌ను మ్యాచ్ చేస్తే... అప్పుడు మీ స్టయిల్‌తో పాటు మీ ఫోటోలు కూడా అప్‌గ్రేడ్ అవుతాయి.ఫైవ్ పాకెట్ ట్రౌజర్స్!: జీన్స్‌కు దగ్గరి బంధువుల్లా కనిపిస్తాయి. పాకెట్లు, ఫిట్ అన్నీ జీన్స్‌లాగే ఉంటాయి. కానీ లుక్ మాత్రం మరింత షార్ప్. ఆఫీస్ నుంచి పార్టీ వరకు ఎక్కడైనా సెట్.చినో ట్రౌజర్స్: ‘తక్కువ హంగామా... ఎక్కువ క్లాస్!’ అనాలంటే ఇవే. టీ–షర్ట్‌తో వేసుకున్నా బాగుంటాయి... షర్ట్‌తో వేసుకున్నా సూపర్. ప్రతి అబ్బాయి వార్డ్‌రోబ్‌లో ఉండాల్సిన ప్యాంట్ ఇదే.ప్లీటెడ్ ట్రౌజర్స్: ఒకప్పుడు నాన్నల ఫ్యాషన్ ... ఇప్పుడు ట్రెండ్ సెట్టర్స్ ఫేవరెట్! ముందు ఉండే ప్లీట్స్ వల్ల లుక్కు చిన్న రాచరిక టచ్ వస్తుంది. కంఫర్ట్ కూడా అదిరిపోతుంది.లినెన్ ట్రౌజర్స్: ఎండాకాలానికి అసలు హీరో ఇవే! తేలికగా ఉంటాయి, గాలి బాగా ఆడుతుంది. బీచ్ వెకేషన్ , బ్రంచ్ డేట్, సమ్మర్ పార్టీ... ఎక్కడైనా కూల్‌గా కనిపిస్తారు.- కొండి దీపిక -
పారిస్ ఫ్యాషన్ వీక్‌లో మెరిసిన సుధారెడ్డి..స్పెషల్ అట్రాక్షన్‌గా వజ్రాభరణాలు
ప్రతి రెండేళ్లకొకసారి జరిగే పారిస్ హాట్ కౌచర్ వీక్ ఒక అద్భుతమైన ఫ్యాషన్ వేడుక. ఈ ఫ్యాషన్ వేడుకలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ డిజైనర్లు తమ చేతితో రూపొందించిన ప్రత్యేకమైన కలెక్షన్లను ప్రదర్శిస్తారు. ఈ వేడుక మొత్తం డిజైనర్లు, వారి ప్రత్యేకమైన ఫ్యాషన్ శైలి గురించే ఉంటుంది. ఈ ఏడాది మాత్రం హైదరాబాద్ బిలియనీర్ సుధారెడ్డి ధరించిన రత్నఖచిత ఆభరణాలే ఈ వేడుకలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ ఈవెంటలో మూడు రోజుల పాటు ఆమె ధరించిన ఆభరణాల లుక్ అత్యంత హాట్‌టాపిక్‌గా మారింది. సెలబ్రిటీ ఆభరణాల నిపుణుడు ప్రియాంశు గోయల్ ప్రకారం.. సుధా రెడ్డి ధరించిన ఆభరణాలు ఆమె వ్యక్తిగత కలెక్షన్‌కు చెందినవని, వాటి విలువ సుమారు రూ. 280 కోట్లు పైమాటే అని చెబుతున్నారు. View this post on Instagram A post shared by Priyanshu Goel | Celebrity Jewellery (@the_gemtlemen)జార్జియో అర్మానీ షోలో రూ. 20 కోట్లు ఖరీదు చేసే..జార్జియో అర్మానీ షో కోసం, సుధా రెడ్డి ఆ బ్రాండ్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్ నుంచి నీలి రంగులో శిల్పంలా చెక్కిన దుస్తులలో విచ్చేశారు. ఆ లుక్ నిశబ్ధమైన విలాసాన్ని చాటి చెప్పింది. అలాగే తన లుక్ హైలెట్‌గా కనిపించేలా 30 క్యారెట్ల వజ్రాలు పొదిగిన పాంథర్ ఇయర్ కఫ్స్‌ను జతచేశారు. దీంతోపాటు రూ. 20 కోట్లు విలువ చేసే 23 క్యారెట్ల పసుపు వజ్రపు ఉంగరాన్ని కూడా ధరించారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) ఎలీ సాబ్ రన్‌వే కోసం.. ఎలీ సాబ్ షోలో కూడా, సుధా రెడ్డి దుపట్టాతో జతచేసిన స్ట్రాప్‌లెస్ ఫ్లోరల్ గౌను ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. సింపుల్ ఆకృతిలో కనిపించే క్లిష్టమైన పూల ఎంబ్రాయిడరీ మెరిశారామె. ఆమె ఆభరణాల కలెక్షన్‌కి సంబంధించిన వారసత్వ ఆభరణాలు ఈ ప్రత్యేకమైన దుస్తులకు మరింత శోభను చేకూర్చాయి. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)ఆమె ధరించిన అద్భుతమైన దుస్తుల అందాన్ని ఏమాత్రం తగ్గించకుండా, ఎలీ సాబ్ రూపొందించిన టర్కోయిస్ ఇయర్ కఫ్స్ వెంటనే అందరి దృష్టిని ఆకర్షించాయి. ఈ ఇయర్ కఫ్స్‌లో పొదిగిన టర్కోయిస్ రత్నమే గతంలో సల్మాన్ ఖాన్ బ్రాస్లెట్లో కూడా కనిపించిందని ప్రియాంశు గోయల్ పేర్కొన్నారు.మనీష్ మల్హోత్రా పారిస్ షోలోపారిస్ కౌచర్ వీక్‌లో మనీష్ మల్హోత్రా తొలి షోలో, సుధా రెడ్డి చేతి ఎంబ్రాయిడరీతో కూడిన సిల్హౌట్ కార్సెట్‌ను ఎంచుకున్నారు. ఆ దుస్తుల్లో వాస్తుశిల్ప వివరాల ఎంబ్రాయిడరీని మరింతగా హైలైట్ చేశాయి.ఈ డిజైనర్‌వేర్‌కి మల్హోత్రా కలెక్షన్ నుంచి ప్రత్యేకంగా రూపొందించిన డైమండ్ బో నెక్లెస్‌ను జత చేశారు. పర్షియన్ డిజైన్ నుంచి ప్రేరణ పొందిన ఈ పూల హెయిర్ యాక్సెసరీ ఆమె రూపాన్ని మరింతగా మెరుగుపరిచింది. ఈ నెక్లెస్‌లో 75 క్యారెట్ల అత్యున్నత నాణ్యత గల సహజ వజ్రాలు పొదిగి ఉన్నాయని ప్రియాంశు గోయల్ పేర్కొన్నారు. ఈ డైమండ్ హెయిర్ క్లిప్ విలువ సుమారు రూ. 2 కోట్లు ఉంటుందని ఆయన తెలిపారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official)అంతేగాదు పారిస్ హాట్ కౌచర్ వీక్‌లో సుధా రెడ్డి ధరించిన ప్రతి ఆభరణం ఆమె వ్యక్తిగత సేకరణకు చెందినదేనని నిపుణులు పేర్కొన్నారు. కాగా, సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. పైగా ఈ MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరామె.(చదవండి: 70 ఏళ్ల వృద్ధుడి ఇడ్లీ వ్యాపారం క్రేజ్‌కి మాటల్లేవ్ అంతే..!) -
వావ్...ఇషా స్టైల్ : రూ. 17 కోట్ల బ్యాగ్ అదుర్స్
పారిశ్రామివేత్త, బిలియనీర్ ముకేష్ అంబానీ తనయ, వ్యాపారవేత్త ఇషా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ స్టైల్‌తో ఆకట్టుకున్నారు. ఇటీవల పారిస్‌లో జరిగిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రాహుల్ మిశ్రా ఫ్యాషన్ షోలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. ఇషా అంబానీ, హాలీవుడ్ పాప్ సింగర్ కార్డి బి (Cardi B)తో కలిసి ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. రాహుల్ మిశ్రా డిజైన్ చేసిన అల్ట్రా మోడ్రన్ డ్రెస్‌లో సరికొత్త లుక్‌తో మెరిసి పోయింది. ముఖ్యంగా ఆమె చేతిలో ఉన్న లగ్జరీ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. దీని రేటెంతో తెలుసా?ప్యారిస్ హాట్ కోచర్ వీక్ జూలై 6న ఎంతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. రాహుల్ మిశ్రా తన 'దేవి' కలెక్షన్‌ను ఈ స్టేజి పైన ప్రదర్శించారు. ఇక ఈ ప్రతిష్టాత్మక షోను చూడటానికి ఈషా అంబానీ ఫ్రంట్ రోలో కూర్చుని ప్రత్యేక ఆకర్షణగా నిలచింది. Isha Ambani in full luxury mode ✨ Custom Rahul Mishra couture is a masterpiece!#IshaAmbani #RahulMishra #LuxuryFashion pic.twitter.com/UWmba4YZH5— Global Celeb Updates (@gcelebupdates_) July 7, 2026 fy"> సెలబ్రిటీ స్టైలిస్ట్ ఆండ్రూ ముకమల్ ఆధ్వర్యంలో ఇషా అంబానీ లుక్ వైరల్ అయింది. రాహుల్ మిశ్రా కస్టమ్ మేడ్‌గా తయారు చేసిన చార్కోల్-గ్రే రంగులతో కూడిన రాహుల్ మిశ్రా కస్టమ్ స్ట్రాప్‌లెస్ గౌన్‌ను ధరించారు.. ఈ డ్రెస్ టాప్ పార్ట్‌ను క్రిస్టల్స్, సీక్విన్స్, త్రీడీ బీడ్వర్క్తో ఎంతో అద్భుతంగా డిజైన్ చేశారు. ఇక ఇది చూడటానికి మన సాంప్రదాయ గుడి నగల డిజైన్లా అనిపించింది. దీనికి తోడు స్టైలిష్ బ్రెయిడెడ్ జడ, సన్‌గ్లాసెస్‌తో ఆమె లుక్ అదిరిపోయింది.ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్ కంప్లీట్ బంద్ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గిందిరూ. 17 కోట్ల అత్యంత అరుదైన బిర్కిన్ బ్యాగ్ఈ వేడుకలో ఇషా అంబానీ దుస్తుల కంటే ఆమె చేతిలోని అల్ట్రా లగ్జరీ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ బ్యాగ్ విలువ అక్షరాలా రూ. 17 కోట్లు. ప్రపంచవ్యాప్తంగా ఇటువంటి బ్యాగులు కేవలం మూడు మాత్రమే తయారు కాగా, అందులో ఒకటి అంబానీ వారసురాలి చేతిలో అందంగా ఇమిడిపోయింది. నిజానికి ఇది నీతా అంబానీ వ్యక్తిగత కలెక్షన్‌కు చెందినది. ఈ బ్యాగ్‌ను మొసలి చర్మం (crocodile leather), 18 క్యారెట్ల వైట్ గోల్డ్‌తో తయారు చేశారు. అంతేకాకుండా, దీనిపై దాదాపు 111 క్యారెట్ల బరువు కలిగిన 3000 నిజమైన వజ్రాలను అమర్చారు. ఇదీ చదవండి: క్యాన్సర్‌తో కొడుకు మృతి: కోడలికి కన్యాదానం చేసిన మామగారు -
జీరో కమీషన్ పాలసీపై ఫ్లిప్‌కార్ట్ నిర్ణయం
దేశీయ ఈ-కామర్స్ రంగంలో తీవ్ర పోటీ నెలకొన్న తరుణంలో ఫ్లిప్‌కార్ట్ విక్రేతలకు (సెల్లర్లు) బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్లాట్‌ఫామ్‌పై వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడంతోపాటు విక్రేతలకు మరిన్ని లాభాలను చేకూర్చే లక్ష్యంతో తన ‘జీరో-కమీషన్’ విధానాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటివరకు కేవలం రూ.1,000 లోపు ధర గల ఫ్యాషన్ ఉత్పత్తులకే పరిమితమైన ఈ జీరో కమీషన్ నిబంధనను ఇకపై ధరతో నిమిత్తం లేకుండా అన్ని రకాల ఫ్యాషన్ ఉత్పత్తులకు వర్తింపజేస్తున్నట్లు వెల్లడించింది.90,000 మంది విక్రేతలకు ఉపశమనంఫ్లిప్కార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఫ్యాషన్ విభాగంలో వ్యాపారం చేస్తున్న సుమారు 90,000 మందికి పైగా యాక్టివ్ విక్రేతలు నేరుగా లబ్ధి పొందనున్నారు. గతంలో రూ.1,000 దాటిన ఉత్పత్తులపై కంపెనీకి కమీషన్ చెల్లించాల్సి వచ్చేది. కానీ తాజా నిర్ణయంతో, విక్రేతలు తాము అమ్మే ప్రతి ఫ్యాషన్ ప్రొడక్ట్‌పై పూర్తి మార్జిన్లను (లాభాలను) తామే నిలుపుకునే అవకాశం లభించింది. ఇది ఎంఎస్ఎమ్ఈలు, స్థానిక బ్రాండ్లు, తయారీదారులకు పెద్ద ఊరటనిచ్చే అంశం.దీర్ఘకాలిక పెట్టుబడే లక్ష్యంఈ వ్యూహాత్మక మార్పుపై ఫ్లిప్‌కార్ట్ ఫ్యాషన్ వైస్ ప్రెసిడెంట్ కపిల్ తిరానీ మాట్లాడుతూ.. ‘మా వ్యాపార భాగస్వాముల ప్రయోజనాలకే ఎల్లప్పుడూ మొదటి ప్రాధాన్యం ఇస్తాం. ఈ సెల్లర్-ఫస్ట్ చొరవను మొత్తం ఫ్యాషన్ విభాగానికి విస్తరించడం ద్వారా మా అమ్మకందారులకు మరిన్ని ప్రయోజనాలు చేకూరుస్తాం. దీనివల్ల విక్రేతలు సరికొత్త ఆవిష్కరణలు చేయడం, ప్రొడక్ట్ రేంజ్‌ను విస్తరించడం, తమ సొంత బ్రాండ్ బిల్డింగ్‌పై మరింత నమ్మకంతో పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది’ అన్నారు.ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధర.. తులం ఎంతంటే.. -
రెడ్ బెనారసీ డ్రెస్‌లో పార్టీ లుక్.. తొలిసారి ఇలా అన్షులా!
నెట్టింట ఎక్కడ చూసినా కపూర్ ఫ్యామిలీ కొత్త పెళ్లికూతురు అన్షులా కపూర్ గురించి విశేషాలే. బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్, నటుడు అర్జున్ కపూర్ సోదరి అన్షులా తన ప్రియుడు రోహన్‌ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. వివాహ వేడుక ముగిసిన తరువాత జరిగిన కాక్టైల్ పార్టీకి తగ్గట్టుగా అందంగా అలంకరించుకుంది. బనారసీ బ్రోకేడ్ డ్రెస్, మెడలో పచ్చల నెక్లెస్‌తో సమకాలీన ఫ్యాషన్ స్టైల్‌ను చాటుకుంది. ఈ సందర్భంగా ఇన్‌స్టాలో పెట్టిన పోస్ట్ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తోంది.అన్షులా ఇలా రాశారు : పెళ్లైన మహిళగా ఇది నా తొలి సాయంత్రం, ఈ కొత్త ప్రయాణాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నా. ఈ లుక్కు సిందూరి ఎరుపు రంగు మాత్రమే సరిగ్గా సరిపోతుంది అనిపించింది. ఈ ఔట్ఫిట్ గురంచి అమిత్ (ప్రముఖ డిజైనర్)తో మాట్లాడు తున్నపుడు. తన ఆహార్యం వ్యక్తిత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలవాలని అనిపించింది. దానికి తగ్గట్టుగానే శిల్పం లాంటి 'కార్సెట్ సిల్హౌట్' (sculptural corseted silhouette) గా మార్చేశారు. చీర కొంగును సరికొత్త మోడ్రన్ కోట్యూర్ స్టేట్మెంట్గా రీ-డిజైన్ చేశారు. ఇది మన సంప్రదాయానికి గౌరవాన్ని ఇస్తూనే, ఆధునికతను అద్భుతంగా చాటిచెప్పింది. నా దృష్టిలో మా పెళ్లి అంతా కూడా ఇలాగే సాగింది. మనం ఎక్కడి నుండి వచ్చామో ఆ మూలాలను (సంప్రదాయాలను) గుండెల్లో భద్రంగా దాచుకుంటూనే... భవిష్యత్తులోకి అంతే ఆనందంగా, మనస్ఫూర్తిగా అడుగుపెట్టడం! అంటూ చెప్పుకొచ్చారు. View this post on Instagram A post shared by Anshula Kapoor (@anshulakapoor)> ఇదీ చదవండి: అన్షులా-రోహన్ ఇంట్రస్టింగ్ లవ్ స్టోరీ, భర్త ఆస్తి ఎంతంటే! కాగా ముంబైలోని తాజ్ ల్యాండ్స్ ఎండ్‌లో సోమవారం (జూలై 6న) అన్షుల్ - రోహన్ వివాహ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా దివంగత తల్లిని గుర్తు చేసుకుంటూ 42 ఏళ్ల నాటి ఆమె దుప్పట్టాను ధరించడం విశేషంగా నిలిచింది. ఇదీ చదవండి: 42 ఏళ్ల నాటి అమ్మ దుప్పట్టా : కొత్త పెళ్లికూతురు అన్షులా ఎమోషనల్ -
ఆదర్శ వనిత.. అద్భుత ప్రతిభ
తూర్పుగోదావరి: అందం, చదువు, ఆటలు.. ఈ మూడింటిలో దూసుకుపోతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది నిహారిక. ఇంజినీరింగ్ సెకండియర్ చదువుతూ, సివిల్ సర్వీసెస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. పాశర్లపూడిలంకకు చెందిన తెలగారెడ్డి నిహారిక కుటుంబం ప్రస్తుతం విశాఖపట్నంలో స్థిరపడింది. గ్రామ దేవత చింతాలమ్మ జాతరకు స్వగ్రామం వచ్చిన నిహారిక తన అభిరుచులు, లక్ష్యాలను సోమవారం స్థానిక మీడియా ప్రతినిధులకు వివరించారు. View this post on Instagram A post shared by krshna (@thisiskrshna)బహుముఖ ప్రజ్ఞ నిహారిక సౌందర్య పోటీల వేదికపై భారతీయ ముద్దుగుమ్మగా మెరిసింది. శాస్త్రీయ నృత్య వేదికలపై ఆధ్యాత్మిక ఘనతను చాటింది. క్రీడా మైదానంలో బాస్కెట్ బాల్ ప్లేయర్‌గా దూసుకుపోతోంది. దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు పలువురు దేశ, విదేశీ ప్రతినిధులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. సుమారు ఆరు అడుగుల ఎత్తు ఉన్న నిహారిక బహుముఖ ప్రజ్ఞను చాటుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతోంది. విజయాల ప్రస్థానం... మిస్ టీన్ గార్జియస్ ఆఫ్ ఇండియా విజేతగా జాతీయ స్థాయిలో నిహారిక గుర్తింపు పొందింది. మిస్ ఉత్తరాంధ్రగా ప్రాంతీయ కిరీటం, మిస్ బ్రైడ్స్ ఆఫ్ ఇండియా అవార్డును సొంతం చేసుకుంది. మిస్ వైజాగ్ గ్లోబ్ పోటీల్లో టాప్–5లో నిలిచి అత్యంత ప్రతిభ చాటింది. భారతీయ సంప్రదాయ కళలను గుండెల్లో నింపుకొన్న ఆమె.. చక్కని శాస్త్రీయ నృత్య కారిణిగా రాణిస్తోంది. ప్రముఖ పుణ్యక్షేత్రాలైన కాశీ, తిరుపతితో పాటు ఎన్నో దేవస్థానాల వేదికలపై అనేక ప్రదర్శనలు ఇచ్చింది.ప్రధాని మోదీ ప్రశంసలు కళలు, క్రీడలు, చదువులో నిహారిక చూపిస్తున్న అసాధారణ ప్రతిభను ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. న్యూఢిల్లీలో జరిగిన అంబేడ్కర్ జయంతిలో ప్రధాని చేతుల మీదుగా అభినందనలు అందుకుంది. -
61 ఏళ్ల వయసులో మూడో పెళ్లి, ఇది గమనించారా?
61 ఏళ్ల వయసులో బాలీవుడ్ హీరో ఆమీర్ ఖాన్, తన ప్రియురాలు గౌరీ స్ప్రాట్‌ను ముచ్చటగా చేసుకున్న మూడో పెళ్లి హాట్ టాపిక్‌గా నిలుస్తోంది. ముంబైలోని బాంద్రాలో ఆమిర్ నివాసంలో జులై 5న ఆదివారం జరిగిన ఈ వివాహానికి మొదట భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు, కుమార్తె కూడా హాజరు కావడం విశేషంగా నిలిచింది. అయితే, ఈ పెళ్లిలో మరో విషయం కూడా ఆసక్తికరంగా నిలిచింది. కొత్త పెళ్లికొడుకుగా ఆమిర్ ఖాన్ కేవలం ఒక కాలికి 'ఘుంగ్రూ' (మువ్వల పట్టీ) ధరించారు. దీనికి సంబంధించిన వీడియోలు నెట్టింగ తెగ వైరల్‌గా మారాయా? దీని వెనుక ఏదైనా ప్రత్యేక కారణం ఉందా?ఇటీవలి సెలబ్రిటీల పెళ్లిళ్లలో వధువులతో పోటీగా పెళ్లి కొడుకులు కూడా మహిళలు ధరించే ఆభరణాలను ధరించడం ఒక ఫ్యాషన్‌గా మారింది. అందులో భాగంగానే ఆమీర్ ఖాన్ కూడా ఒక కాలికి పట్టీ ధరించాడా లేక ఇది ఏదైనా వివాహ సంప్రదాయమా? తన గత రెండు పెళ్లిళ్ల సమయంలోనూ కూడా అతను ఇలాగే చేశాడా? అనేది నెట్టింట చర్చకు దారి తీసింది. ఇదీ చదవండి: కేతన్ హత్య : సియాకు సపోర్ట్ చేసిన నెటిజన్‌పై గాయని మండిపాటుఆమిర్ దృష్టిలో ఫ్యాషన్ అంటే కేవలం ప్రత్యేక సందర్భాల్లో ఏదో ఒక ప్రత్యేకమైన దుస్తులు ధరించడం మాత్రమే కాదు; దానికి ఖచ్చితంగా ఒక పెర్సనల్టచ్ కూడా ఉంటుంది అనడానికి ఈ గజ్జెల పట్టీ ఒక ఉదారణ అంటున్నారు నెటిజన్లు. ముఖ్యంగా ఆమిర్ తెలుపు రంగు ధోవతితో, తలపాగా చాలా స్పెషల్‌గా కనిపించాడు. అంతేకాదు ఆయన ఎంచుకున్న ఆభరణాలు ప్రత్యేకంగా నిలిచాయి. ఏది ఏమైనా ఒక పురుషుడు కేవలం ఒక కాలి పట్టీని ధరించడం ఫ్యాషన్ ప్రపంచంలో ఒక కొత్త ట్రెండ్ అనే చెప్పాలి.Aamir Khan got married to Gauri Spratt today.But what is that thick metal anklet-like ornament he is wearing on one of his legs? Why is Aamir Khan wearing it? Is it part of any particular tradition or wedding ritual? pic.twitter.com/UlqXMYPXB5— Saffron Chargers (@SaffronChargers) July 5, 2026 > సాధారణంగా కాలి పట్టీ అనేది స్త్రీలు ధరించే ఆభరణం, అందుకే ఆయన ఎంపికపై చర్చ మొదలైంది. ఏ ఆభరణం ఎవరికి పరిమితం అనేది పెద్ద విషయం కాదు ,కానీ ఇంతకు ముందెన్నడూ చేయని విధంగా ఏదైనా చేసి ప్రత్యేకతను చాటుకోవడానికి ఆమిర్ ఫ్యాషన్ విషయంలో ప్రయోగాలు చేయడం ఇదే మొదటిసారి కాదు. దాదాపు దశాబ్దం క్రితం, అంటే 2017లో, ఆమిర్ ఖాన్ ముక్కు కుట్టించుకున్నారు. 'థగ్స్ ఆఫ్ హిందుస్తాన్' చిత్రంలో 'ఫిరంగి మల్లా' అనే మోసగాడి పాత్రకోసం ముక్కు కుట్టించుకున్నారట. అయితే ఇది కేవలం పాత్ర కోసం మాత్రమే కాదనీ, దీని వెనుక వ్యక్తిగతమైన ప్రేరణ ఉందని పలు మీడియా నివేదికల ద్వారా తెలుస్తోంది. తన స్కూల్ రోజుల నాటి సింధీ ఫ్రెండ్ ముక్కుకు పోగు ధరించేవాడట. ఈ ప్రేరణతోనే తన పాత్ర కోసం ఒక ముక్కుపోగును ఆమిర్ స్వయంగా దానిని డిజైన్ చేసుకున్నాడట. ఇదీ చదవండి : ఆమీర్ మూడో పెళ్లి: అంబానీ కుటుంబానికి తృటిలో తప్పిన ప్రమాదం View this post on Instagram A post shared by Irfan Pathan (@irfanpathan_official) -
షియాపరెల్లీ దుస్తుల్లో ఇషా అంబానీ స్టైలిష్ లుక్..: 'సమ్‌థింగ్ బ్లూ'కు..
ఇషా అంబానీ ఏ రెడ్కార్పెట్పైన అయినా..తనదైన ఫ్యాషన్ శైలితో స్టైలిష్ కనిపిస్తారు. తల్లి నీతాల ఫ్యాషన్‌కి ఐకాన్‌లా తన వస్త్రధారణ అత్యంత విలక్షణంగా ఆకట్టుకునేలా ఉంటుంది. ఈసారి కూడా అలానే అత్యంత స్టైలిష్ లుక్‌లో మెరిసింది. తన తాజా 'అవుట్ ఆఫ్ ది నైట్' (OOTN) కోసం షియాపరెల్లీ ఫ్యాషన్ హౌస్ స్ప్రింగ్/సమ్మర్ 2026 కలెక్షన్లకు సంబందించిన డిజైనర్‌వేర్‌లో తళుక్కుమంది. ఈ బ్రాండెడ్ డిజైనర్‌వేర్‌లు చూడటానికి ఆహ్లాదకరంగా ఉంటూనే..అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది . ఫార్మల్ దుస్తులు కూడా స్టైలిష్ కనిపించేలా చేయొచ్చు అన్నట్లుగా ఉంటుంది దీని డిజైన్. ఇక ఇషా లుక్ విషయానికి వస్తే..న్యూడ్-టోన్డ్ బేస్‌పై రూపొందించబడిన షియాపరెల్లీ సూట్ సెట్ ఏమాత్రం శరీరాన్ని బహిర్గతం చేయకుండానే..ఒక అందమైన లుక్‌ని ఇస్తుంది. షియాపరెల్లీ ప్రత్యేకత ఏమిటంటే, కాలర్‌బోన్ మీదుగా భుజాలను తాకుతూ విస్తరించిన లేయర్డ్, ట్యూల్ ఓంబ్రే నెక్ లైన్ ఆ డ్రైస్ని మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. అందులోనూ ఇక్కడ నీలి రంగు కాంట్రాస్ట్‌ని ఇంచుకుని ఆ డ్రెస్‌కి ఒక గంభీరమైన శక్తిని అందించింది. సింపుల్‌గా చెప్పాలంటే..ఎవ్వరైనా ఆమె డ్రెస్ వంక కన్ను ఆర్పకుండా చూసేలా చేసింది ఈ డిజైనింగ్. దీన్ని సూక్ష్మమైన బంగారు రంగు వెల్వెటీన్తో తయారు చేశారు. ఇక్కడ షియాపరెల్లీ తన డిజైనర్ వేర్ లుక్‌ని 'బర్డ్స్ ఆఫ్ ప్యారడైజ్' పక్షుల రంగులను ప్రేరణగా తీసుకుని రూపొందిస్తుంది. అలాగే ఇషా గతంలో కూడా ఈ రాయల్ బ్లూ షియాపరెల్లీ డిజైనర్‌వేర్‌లో మెరిసింది. తన సోదరుడు అనంత్ అంబానీ-రాధికల సంగీత వేడుకలో ఆమె పూర్తిగా నీలి రంగు చీర గౌనులో అద్భుతంగా కనిపించింది. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) (చదవండి: రాజసం ఉట్టిపడే ఊదా రంగు పట్టు చీరలో నీతా స్టన్నింగ్ లుక్..!) -
Fashion: పోగు పెట్టుకో... పోజు కొట్టుకో!
ఒకప్పటి రాజుల ఫొటోలు చూస్తే, ఒంటినిండా నగలతో మెరిసిపోతూ కనిపించేవారు. మధ్యలో ఏమైందో ఏమో మగవాళ్లు జ్యూలరీకి కాస్త దూరమయ్యారు. అయితే, ఇప్పుడు మెన్స్ ఫ్యాషన్ ప్రపంచం పెద్ద యూటర్న్ తీసుకుంది. రాజుల కుండలాలు కాస్త కూల్ ఇయర్రింగ్స్గా మారి కుర్రాళ్ల స్టయిల్‌కు కొత్త మెరుపు తెస్తున్నాయి. మగాళ్లను మళ్లీ మహారాజుల్లా మెరిపిస్తున్న ఈ ఇయర్రింగ్స్ ఏంటో ఇక్కడ చూద్దాం!స్టడ్స్సింపుల్గా ఉండాలనుకునే వారికి ఇవి బెస్ట్. చిన్న రాయి లేదా మెటల్ డిజైన్ తో నల్లటి చుక్కలా ఉండే స్టడ్స్ ఎలాంటి దుస్తులతోనైనా సెట్ అయిపోతాయి. సైలెంట్‌గా స్టయిల్ మెయింటైన్ చేయాలంటే స్టడ్స్ పెట్టుకోవాల్సిందే!రింగ్స్కొంచెం రఫ్ అండ్ టఫ్ లుక్ కావాలంటే ఇవి పర్ఫెక్ట్. స్పోర్ట్స్ బైక్ మీద కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని వెళ్తుంటే... ఆ రింగ్ గాలికి ఊగుతూ మెరుస్తుంటే.. అబ్బా, ఆ కిక్కే వేరు! చిన్న రింగ్స్ నుంచి పెద్ద రింగ్స్ వరకు ఎన్నో డిజైన్లు అందుబాటులో ఉన్నాయి.డాంగ్లర్స్ ఇవి పెట్టుకుంటే స్టయిల్ మీటర్ ఒక్కసారిగా పెరిగిపోతుంది. చెవికి కిందకి వేలాడే ఇవి సాధారణ లుక్‌ను క్షణాల్లో ట్రెండీగా మార్చేస్తాయి. ముఖ్యంగా క్రాస్ డిజైన్లు, ఫంకీ పెండెంట్లు ఉన్న డాంగ్లర్స్ పూల్ పార్టీలు, బీచ్ వెకేషన్లు, వీకెండ్ ట్రిప్స్‌లకు, ఇవి పెట్టుకున్న వెంటనే తెలియకుండా అందంగా కనిపిస్తారు.మ్యాగ్నెటిక్ పోగులు ‘ఫ్యాషన్ కావాలి. కాని, సూదితో చెవి కుట్టించుకునే ధైర్యం లేదు’ అనుకునే సుకుమారుల కోసం దేవుడు సృష్టించిన, భయస్తుల బ్రహ్మాస్త్రాలు ఇవి. అంటించుకుంటే అతుక్కుంటాయి, తీసేస్తే వచ్చేస్తాయి.పోగు పెట్టుకుంటే... స్టార్ అయిపోరు!సినిమా హీరోలు, క్రీడాకారులు చెవికి పోగు పెట్టుకున్నారని చాలామంది సేమ్ స్టయిల్ ఫాలో అవుతుంటారు. అయితే, చెవి పోగు పెట్టుకున్న వెంటనే బ్యాక్‌గ్రౌండ్‌లో హీరో ఇంట్రో మ్యూజిక్ మొదలవుతుందని మాత్రం అనుకోవద్దు! అసలు మ్యాజిక్ పోగులో కాదు... దాన్ని ఎలా క్యారీ చేస్తారన్న దాంట్లో ఉంది. మీ ముఖాకారం, హెయిర్ స్టయిల్, దుస్తులకు సరిపోయే డిజైన్ ను ఎంచుకుంటేనే లుక్ అదిరిపోతుంది.స్కిన్ టోన్ కు తగ్గట్టు బ్లాక్, సిల్వర్ లేదా గోల్డ్ కలర్‌ను ఎంచుకోండి. కనిపించిన ప్రతీ డిజైన్‌ను ఒకేసారి ట్రై చేస్తే క్రిస్మస్ ట్రీలా తయారవుతారు. అలాగే మరీ బరువైన పోగులు పెట్టుకుని చెవులకు జిమ్ వర్కౌట్ ఇవ్వొద్దు. అలాగే రోజుకో పోగు, గంటకో స్టయిల్ మార్చేస్తే కన్ఫ్యూజన్ మీకే. మీ ఫేస్‌కు ఏది బాగా సెట్ అవుతుందో అదే ఫిక్స్ చేసుకోండి. తర్వాత అద్దం ముందు నిలబడి ఒక్కసారి చూసుకోండి... మీరే మీకు ఫ్యాన్ అయిపోతారు! - కొండి దీపిక -
రాజసం ఉట్టిపడే ఊదా రంగు పట్టు చీరలో నీతా స్టన్నింగ్ లుక్..!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ ఎప్పటికప్పుడు భారతీయ వారసత్వ సంప్రదాయన్ని చాటి చెప్పే చీరలతో అలరిస్తుంటారు. నీతా ధరించే ప్రతీ చీర కళకారుల పనితరం..నాటి వస్త్ర చారిత్రకకళా వైభవాన్ని తెలుసుకునేలా ఆసక్తిని రేకెత్తించేలా ఉంటాయి. ఎప్పటిలానే ఈసారి కూడా ప్రకాశవంతమైన చీరలో అద్భుతంగా మెరిశారామె. ఫ్యాషన్ పరంగా తనకు సాటిరారెవ్వరూ అని మరోసారి నిరూపించింది.ఇటీవల, ఫ్లోరిడాలోని టాంపాలో అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (AAPI) నిర్వహించిన ఒక కార్యక్రమంలో నీతా అంబానీని హ్యుమానిటేరియన్ అవార్డుతో సత్కరించారు. ఈ ప్రతిష్టాత్మక సందర్భం కోసం, భారతదేశపు గొప్ప వస్త్ర వారసత్వాన్ని చాటిచెప్పే, గులాబీ-ఊదారంగుల అద్భుతమైన కలయికలతో ఉన్న పట్టుచీరతో అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ చీరకు మ్యాచింగ్‌గా గులాబీరంగు బ్లౌజ్‌ని జత చేశారు. ఈ చీర భారతీయ చేనేత వస్త్రాల శాశ్వత ఆకర్షణను అందంగా ప్రదర్శించింది. ముదురు గులాబీ రంగు అంచు పల్లుతో కూడిన గాఢమైన ఊదారంగు చీర మరింత శోభాయమానంగా కనిపించింది. ప్రకాశవంతమైన ఆకుపచ్చ అంచు, పురాతన బంగారు దారాలతో చేసిన సున్నితమైన పూల ఎంబ్రాయిడరీ ఆ చీర అందాన్ని మరింత పెంచేశాయి. ఈ ఎంబ్రాయిడరీ చీర అంంతట కనిపిస్తూ..విలాసవంతమైన ఆకర్షణను అందించింది. సాంప్రదాయ భారతీయ పూల నమునాల నుంచి ప్రేరణ పొందిన ఈ క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఈ వస్త్రధారణకు ఒక సుందరమైన కళాత్మక ప్రదర్శనను జోడించింది. అలాగే వస్త్రంపై అక్కడక్కడా అల్లిన నమూనాలు, భారతీయ వస్త్ర కళకు పర్యాయపదమైన కళాత్మకతను ప్రతిబింబిస్తూ..దాని హస్తకళా సౌందర్యాన్ని హైలెట్ చేసింది. ఆ వస్త్రానికి జతగా, పొట్టి చేతులు, క్లాసిక్ నెక్లైన్తో కూడిన ఆకట్టుకునే ఫ్యూషియా-పింక్ రంగు బ్లౌజ్‌ని ఎంచుకున్నారామె. ఆమె ఆకుపచ్చ రంగు పూసల నెక్లెస్, దానికి సరిపోయే చెవిపోగులు, ఆకట్టుకునే ఉంగరంతో తన అలంకరణను ఉన్నతంగా తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టుగా వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, రోజీ పింక్ లిప్‌స్టిక్‌తో లైట్వైట్ మేకప్‌ని ఎంచుకున్నారామె. ఇక కురులను పాపిడి తీసి వదులుగా వదిలేసి, రాజసం ఉట్టిపడే దుస్తులకు ఒక ప్రత్యేకమైన హుందాతనాన్ని జోడించేలా తన ఆహార్యాన్నిపూర్తి చేశారు.(చదవండి: తొమ్మిదేళ్లకే ప్రపంచ గుర్తింపు..! ఏకంగా ఐక్యరాజ్యసమితి ఏజెన్సీ ఆహ్వానం ..) -
ఈ ఫ్యాబ్రిక్స్ చాలా ప్రశాంతం బాస్!
ఇంటి అలంకరణ అంటే రంగులు మార్చడం, ఖరీదైన వస్తువులను అమర్చడమే అనుకుంటుంటారు చాలా మంది. కానీ ఇలా అనుకుంటే మీరు పొరపాటు పడ్డట్లేనని చెబుతున్నారు ఇంటీరియర్ రంగానికి చెందిన నిపుణులు. మనం నివసించే స్థలం కేవలం అందంగా కనిపించడమే కాదు.. మన మనస్సుకు ప్రశాంతతను, సేదతీరే సౌకర్యాన్ని అందించాలని చెబుతున్నారు. ఇంట్లో వాడే వివిధ రకాల దుస్తులు, వాటి టెక్స్చర్ సైతం మన దైనందిన జీవితాన్ని, మానసిక శ్రేయస్సును ప్రభావితం చేస్తాయంటున్నారు. అందుకోసం కొన్ని సలహాలు సూచిస్తున్నారు.ఫ్యాబ్రిక్ టెక్స్చర్ అనేది కేవలం కంటికి కనిపించే ఒక డిజైన్ మాత్రమే కాదు, అది మన మానసిక భావాలతో ముడిపడి ఉంటుందని పరిశోధనలు చెబుతున్నాయి. మెత్తటి వెల్వెట్ కుర్చీలో కూర్చున్నప్పుడు కలిగే హాయి, అలాగే కిటికీల మందపాటి తెరలను తాకినప్పుడు కలిగే అనుభూతి మన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. బాహ్య పరిసరాల స్పర్శ వల్ల మెదడులో సానుకూల భావాలు రేకెత్తుతాయని నిపుణులు వివరిస్తున్నారు. కొన్ని రకాల మెత్తని బట్టలు మనకు రక్షణను, భద్రతా భావాన్ని ఇస్తే.. మరికొన్ని దృఢమైన మెటీరియల్స్ మనస్సుకు స్థిరత్వాన్ని ఇస్తాయి.వెల్వెట్, ఫాక్స్ ఫర్: ఇవి గదికి విలాసవంతమైన లుక్‌ను ఇవ్వడమే కాకుండా, శీతాకాలంలో వెచ్చదనాన్ని, హాయిని అందిస్తాయి. వీటిని బెడ్ హెడ్బోర్డులు, యాక్సెంట్ కుర్చీలు, కుషన్ల కోసం ఎక్కువగా వాడుతుంటారు. లినెన్, కాటన్, ఉన్ని: ఇవి గదిలో ఎల్లప్పుడూ తాజాదనాన్ని నింపుతాయి. మానసిక ప్రశాంతతకు, ప్రశాంతమైన నిద్రకు ఇవి ఎంతో తోడ్పడుతాయి. ముఖ్యంగా బెడ్ షీట్లు, కర్టెన్లు, రోమన్ బ్లైండ్స్కు ఇవి అనువైనవి.లెదర్, జ్యూట్, హెవీ వీవ్స్: జ్యూట్, లెదర్ వంటి మెటీరియల్స్ ఇంట్లో ఒక క్రమబద్ధతను, పటిష్టతను ప్రతిబింబిస్తాయి. ఇవి స్థిరత్వానికి చిహ్నంగా నిలుస్తాయి. వీటిని తివాచీలు, ఫ్లోర్ కుషన్లలో ఎక్కువగా ఉపయోగిస్తారు.ఫెల్ట్, క్విల్టెడ్, వెయిటెడ్ ఫ్యాబ్రిక్స్: ఇవి ఇంటి లోపలి ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి, బయటి శబ్దాలు లోపలికి రాకుండా అడ్డుకోవడానికి ఉపయోగపడతాయి. ఆఫీస్ వర్క్ స్పేస్ లేదా ప్రశాంతతను కోరుకునే ప్రత్యేక గదులకు ఇవి ఉత్తమమైనవి. కాబట్టి, కేవలం ఫ్యాషన్ కోసం కాకుండా.. మన మానసిక ఉల్లాసానికి, ఆరోగ్యానికి మేలు చేసే టెక్స్‌టైల్స్‌ను ఎంచుకోవాలి. అపుడు ఇంట్లోనే సరికొత్త రీఛార్జింగ్ అనుభూతిని పొందవచ్చు. -
సెరెనా విలియమ్స్ చేతి ఉంగరం అన్ని కోట్లా..! ఆఖరికి నైల్స్‌కు కూడా..
అమెరికాకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్. ఆమె ఓపెన్ ఎరాలో అత్యధికంగా (23) గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ సాధించిన మహిళా క్రీడాకారిణి కూడా. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఈ ఏడాది వింబుల్డన్ ఛాంపియన్‌షిప్స్‌లో వైల్డ్ కార్డ్ ఎంట్రీని అంగీకరించి, ప్రొఫెషనల్ సింగిల్స్ టెన్నిస్‌లోకి పునరాగమనం చేసింది. ఆమె పునరాగమనం మొదటి రౌండ్లోనే ఓటమితో ముగిసినప్పటికీ, అందరి దృష్టిని అమితంగా ఆకర్షించడం విశేషం. అందుకు కారణం ఆమె ధరించిన వజ్రపు ఉంగరం తోపాటు చేతికి ఉన్న గోళ్లు.ఈ మ్యాచ్‌లో విలియమ్స్ రెడిట్ సహ-వ్యవస్థాపకుడు, భర్త అలెక్సిస్ ఓహానియన్ ఇచ్చిన ఎంగేజ్మెంట్ ఉంగరాన్ని ధరించింది. దీని ఖరీదు దాదాపు రూ. 28 కోట్లు పలుకుతుదట. మధ్యలో 17 క్యారెట్లు కట్ తెల్లని వజ్రం ఉండగా, దానికి ఇరువైపులా అదనపు రాళ్లు ఉంటాయి. చేతులు అందంగా కనిపించేలా చేసే మానిక్యూర్ అత్యంత హైలెట్‌గా కనిపించింది. ఎందుకంటే ఆ ఉంగరానికి అనుగుణంగా చేతి వేళ్ల గోళ్లను తీర్చిదిద్దిన విధం..అలాగే దానికి కూడా ఇచ్చిన డైమండ్ ఫినిష్ అందరి దృష్టిని ఆకర్షించేలా కట్టిపడేసింది. ఇది ఒకరకంగా ఆమెకు నెయిల్ ఆర్ట్ పట్ల ఉన్నం ఆసక్తిని చెప్పకనే చెబుతోంది. అలాగే ఆమె చేతికి ధరించిన విలాసవంతమైన వాచ్ కూడా అందర్నీ అమితంగా ఆకర్షించింది. గులాబీ రంగు ఛాయలున్న ఈ వాచ్‌ను వైట్ గోల్డ్‌తో తయారు చేసి, వజ్రాలతో అలంకరించారు. టెన్నిస్ టోర్నెమెంట్ డ్రెస్కోడుకు అనుగుణంగా లగ్జరీ ఫ్యాషన్ స్టైల్లో మెరిసింది. ఇక విలియమ్స్ చేతి వాచ్‌లో 22-క్యారెట్ల పింక్-గోల్డ్ అసిలేటింగ్ వెయిట్, నీలమణి క్రిస్టల్ కేస్ బ్యాక్‌లో పొదిగిన వజ్రాలు మరింత ప్రత్యేకత. అంతేగాదు ఆ గడియారంలో ఉండే అంకెలు కూడా 18-క్యారెట్ల బంగారంతో రూపొందించారు. అలాగే ఈ వాచ్‌లో మొత్తం 44 రత్నాల తోపాటు, 32 బ్రిలియంట్-కట్ వజ్రాలను పొదిగారు.ఇక మ్యాచ్ విషయానికొస్తే, దాదాపు నాలుగేళ్ల తర్వాత మంగళవారం జరిగిన తన మొదటి ప్రొఫెషనల్ సింగిల్స్ మ్యాచ్ రెండు గంటల 22 నిమిషాల పాటు కొనసాగింది. ఈ పోటీలో 87వ ర్యాంకు క్రీడాకారిణి అయిన జాయింట్ కీలకమైన క్షణాల్లో నిలకడగా షాట్లు కొడుతూ అమెరికన్ క్రీడాకారిణిని ఓడించి తన కెరీర్లో అతిపెద్ద విజయాన్ని నమోదు చేసుకుంది. View this post on Instagram A post shared by instylemagazine (@instylemagazine) (చదవండి: ఆ మహిళ బ్రెయిన్లో 38 పరాన్న జీవులు..!కానీ సర్జరీ చేయకుండానే..) -
సెషెల్స్ ద్వితీయ మహిళకు ప్రధాని మోదీ గిఫ్ట్‌గా కాంచీపురం చీర..! స్పెషాల్టీ ఇదే
ద్వీపదేశమైన సెషల్స్‌లో ప్రధాని మోదీ పర్యటించిన సంగతి తెలిసిందే. ఆ పర్యటనలో ఆయన ఆ దేశ స్వర్ణోత్సవ జాతీయ దినోత్సవ వేడుకలకు గౌరవ అతిథిగా హాజరయ్యారు. అక్కడ మోదీకి ఆ దేశ అధ్యక్షుడు డాక్టర్ పాట్రిక్ హెర్మిని ఘన స్వాగతం పలికారు. ఆ సందర్శన నేపథ్యంలో ఆ దేశ ద్వితీయ మహిళ లీనా పిళ్లైకి కాంచీపురం పట్టు చీరను బహుమతిగా అందించారు. ఇది తమిళనాడులో ఉన్న చారిత్రాత్మక దేవాలయ పట్టణమైన కాంచీపురంకి చెందిన ప్రత్యేక చేనేత వస్త్రం. ఇది బౌగోలిక సూచిక(GI) ట్యాగ్‌ను కూడా పొందింది. ఈ సందర్భంగా ఈ పట్టు వస్త్రం ప్రత్యేకత?..ఆ పేరుతో పిలవడానికి రీజన్ ఏంటి? తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.కాంచీపురం పట్టు వస్త్రం భారతదేశంలోని అత్యుత్తమ చేనేత చీరల్లో ఒకటి. ఇది విలాసవంతమైన ఆకృతి, అసాధారణమై పనితనం, ప్రకాశవంతమైన రంగులకు పేరుగాంచింది. ఈ వస్త్ర చరిత్ర చాలా గొప్పది. దీనిని తమిళనాడులోని కాంచీపురం పట్టణంలో నేస్తారు. అత్యంత నాణ్యమైన మల్బరీ పట్టును ఉపయోగించి ఈ పట్టు వస్త్రాన్ని తయారు చేస్తారు. ఈ చేనేత వస్త్రం చూడటానికి అందంగానే కాకుండా మన్నికకు కూడా ప్రసిద్ధి చెందింది. వాటిపై ఉండే జరీ నమునా, విభిన్న రంగులు దాని ఖరీదును, ప్రత్యేకతను నిర్దేశిస్తాయి. ఈ చీరల తయారీలో ఎక్కువగా దేవాలయ వాస్తుశిల్పం, పువ్వులు, నెమళ్లు, ఆకులు వంటి జ్యామితీయ నమునాలు ఉంటాయి. ఈ చీరలో ఉన్న ప్రత్యేకత దానికి సమకాలీనంగా ఉండే బ్లౌజు. ఇది ఆ చీరను మరింత అందంగా కనిపించేలా చేస్తుంది. భారీగా ఎంబ్రాయిడీ చేసిన బ్లౌజుకి బదులుగా సాంప్రదాయ కాంచీపురం హాల్టర్ నెక్ బ్లౌజ్ లేదా ఫుల్‌స్లీవ్ సిల్హౌట్‌లు ఈ చీర లుక్‌ని మరింత పెంచేస్తుంది. ప్రస్తుతం ఫ్యాషన్ డిజైనర్లు చీరగానే కాకుండా రకరకాలు డిజైనర్వేరల్లోకి తీసుకొస్తుండటం విశేషం. అంతేగాదు వెస్ట్‌కోట్‌లు, షర్టులు, కో-ఆర్డ్ సెట్లు లేదా న్యూట్రల్ బేసిక్స్‌తో జత చేసి సరికొత్త ట్రెండ్‌ని సృష్టిస్తున్నారు కూడా. ఈ కాంచీపురం పట్టుని ఆధునిక శైలిలో ధరించినా లేదా సాంప్రదాయ స్ఫూర్తిని గౌరవించినా..దాని వారసత్వం, చరిత్ర, సంస్కృతిని ఇనుమడింప చేసేలా ఆకర్షణీయంగా కనిపించడం దీని ప్రత్యేకత. ఇక్కడ మోదీ సెషెల్స్ ద్వితీయ మహిళకు ఈ కాంచీపురం వస్త్రాన్ని గిఫ్ట్‌గా ఇవ్వడానికి కారణం కూడా ఇదే. కొన్ని వస్త్రాలు ఎప్పటికీ ఫ్యాషన్ నుంచి తప్పుకోవని, వాటిని ధరించడానికి రకరకాల మార్గాలు దొరుకుతాయని నొక్కి చెప్పేందుకే. View this post on Instagram A post shared by New India Junction (@nijunction) వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి(చదవండి: స్లిమ్‌గా ఉపాసన కొణిదెల..! ట్విన్స్ తర్వాత బరువు తగ్గాలంటే..) -
ఆమె ఎంట్రీతో ఫ్యాషన్ వేదికగా టెన్నిస్ కోర్టు..!
కొందరు నిర్భయంగా తమ టాలెంట్‌ని, ఫ్యాషన్‌ని ఒకేసారి ప్రదర్శిస్తారు. పైగా ఆత్మవిశ్వాసానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తారు. అచ్చం అలానే చేసింది జపాన్ ప్రఖ్యాత క్రీడాకారిణి నవోమి ఒసాకా. ఒక్కసారిగా అది టెన్నిస్ కోర్టా? లేక ఫ్యాషన్ వేదిక? అని విస్తుపోయేలా చేసింది ఆమె ఎంట్రీ. అసలేం జరిగిందంటే..అందరూ ఆసక్తికగా చూస్తూన్న ప్రతిష్టాత్మక వింబుల్డన్ టెన్నిస్ ఛాంపియన్షిప్ 2026లో జపాన్ స్పోర్ట్స్ స్టార్ నవోమి ఒసాకా ఎంట్రీ అదిరిపోయింది. ఆమె ఆ టెన్నిస్ కోర్టుని ష్యాషన్ వేదిగకగా మార్చేసింది. అంత అద్భుతమైన లుక్‌తో అలరించింది. క్రీడాకారుణులు టెన్నిస్ కోర్టుకి ఎలా వస్తారో తెలిసిందే. కానీ ఒసాకా..పూర్తి తెలుపు రంగు దుస్తులతో వచ్చి..అక్కడున్న ప్రేక్షకులను ఆశ్చర్యపోయేలా చేసింది. నాలుగుసార్లు గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అయిన ఆమె జపనీస్ సంప్రదాయ కిమోనో దుస్తులతో అలరించింది. ఈ దుస్తులను టోక్యోకు చెందిన డిజైనర్ హానా యాగి రూపొందించారు. సున్నితమైన వస్త్రం అందులో సీక్వెన్స్డ్ కలర్లోనే ఎంబ్రాయిడరీ చేసిన కొంగలు, చెర్రీ పువ్వులు, ముత్యాలు పొందుపర్చారు. సాంప్రదాయ శైలిలో కుట్టిన మెడ, వదులుగా ఉండేలా చేతుల భాగం, ఇక నడుముకి చిత్రమైన విల్లు ఆకారపు అలంకరణలతో కూడిన సాంప్రదాయ జపనీస్ ఓబీ బెల్ట్‌ని ధరించింది. ఆమె సాంప్రదాయ కంజాషి కేశాలంకరణ ఆభరణం, మికిమోటో ఆభరణాలతో తన రూపాన్ని పూర్తి చేసింది. ఈమేరకు ఒసాకా తన వేషధారణ గురించి మాట్లాడుతూ.."తనకు జపాన్ వారసత్వం ముఖ్యమని, వింబుల్డన్‌లో అంతా తెలుపు రంగు దుస్తులనే ధరించాలన్నారు. అందుకే ఇలా కిమోనోలో వస్తే బాగుంటుందని అనుకున్నాను, తనకు ఇష్టమైన సినిమా 'కిల్ బిల్',అందులోని లూసీ లియు పాత్ర ఓ-రెన్ ఇషీ మాదిరిగా ఇలా తెల్ల కిమోనో ధరించాను". అని వెల్లడించింది. అంతేగాదు ఒసాకా ఆ దుస్తులతో టెన్నిస్ కోర్టులోకి అడుగు పెట్టిన వెంటనే అభిమానులు పెద్ద ఎత్తున అరుస్తూ..తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. పైగా ఆమె ఫ్యాషన్ శైలిని అభినందిస్తూ.. ఒసాకా నువ్వు క్రీడాశైలిని, సంస్కృతిని ఒకే వేదికపై భలే చూపించావంటూ ప్రశంసించారు. View this post on Instagram A post shared by Wimbledon (@wimbledon) (చదవండి: ఐఐటీ డ్రాపౌట్ అయినా..మైక్రోసాఫ్ట్, గూగుల్‌లో ఉద్యోగం!) -
విశాఖపట్నం : క్యాట్‌వాక్‌తో కెవ్వుకేక (ఫొటోలు)
-
చిన్న చిన్న ఫ్యాషన్ ట్రిక్స్‌తో.. రెయిన్ డ్రాప్స్‌కి చెక్!
వర్షాకాలం వచ్చిందంటే చాలు రోడ్లు స్విమ్మింగ్పూల్స్లా మారిపోతాయి, బట్టలు ఆరడం ఓ డ్రీమ్‌లా అనిపిస్తుంది, షూస్ అండ్ ఫ్యాషన్ పరిస్థితి అయితే చెప్పాల్సిన అవసరం లేదు... అయినా కూడా గొడుగుతో పాటు మీ స్టయిల్‌ను కూడా బ్యాగ్‌లో పెట్టేసుకునేంత ఈజీ చేయొచ్చు. కేవలం కొన్ని చిన్న చిన్న ఫ్యాషన్ ట్రిక్స్ ఫాలో అయితే మీ స్టయిల్‌కు రెయిన్ డ్రాప్సే క్లాప్స్ కొడతాయి.కాటన్ ఫ్రెండ్స్!వర్షంలో ఒకసారి తడిసిన బట్టలు ‘మళ్లీ ఎండలో కలుద్దాం!’ అన్నట్టుగా ఉంటాయి. అందుకే కాటన్ , లినెన్ లాంటి లైట్ ఫ్యాబ్రిక్స్ సమ్మర్లోనే కాదు మాన్‌సూన్‌లోనూ కంఫర్ట్‌గా ఉంటాయి. ఇవి త్వరగా ఆరిపోతాయి, చెమటను తగ్గిస్తాయి. కాస్త వేడి వేడి ఇస్త్రీ చేస్తే చాలు ఇంకాస్త త్వరగా బయటకు వెళ్లడానికి రెడీ అయిపోతాయి. వానలో తడవకుండా ఉండాలంటే రెయిన్ కోట్ తప్పనిసరి.లైట్ కలర్స్‌తో ఫ్రెష్ వైబ్మాన్సూన్ లో ఆకాశమే డార్క్‌గా ఉంటుంది. అందుకే, కనీసం మనం అయినా ఫ్రెష్‌గా కనిపిద్దాం కదా! లైట్ బ్లూ, వైట్, బీజ్, మింట్ కలర్స్ వేసుకుంటే చాలు, వర్షంలో కూడా ‘స్లో మోషన్ ’ లుక్ గ్యారెంటీ. వీటిని డార్క్ ప్యాంట్‌తో జత చేస్తే ఇంకాస్త క్లాస్!డార్క్ ట్రౌజర్స్ – బురదకు బాస్!వర్షంలో బయటికి వెళ్లి తెల్ల ప్యాంట్ వేసుకుంటే, ఇంటికొచ్చేసరికి అది రోడ్ మ్యాప్‌లా కనిపించే చాన్స్ ఉంది! అందుకే నేవీ, బ్లాక్, ఆలివ్ లాంటి డార్క్ ట్రౌజర్స్ బెస్ట్. బురద చిందులు పడినా ‘ఏం కాలేదన్నట్టు’ కవర్ చేస్తాయి.షార్ట్స్ – ఫ్రీడమ్ మోడ్ ఆన్ !వర్షంలో జీన్స్ తడిస్తే కాళ్లకు సిమెంట్ కట్టేసుకున్నట్టే ఉంటుంది. అందుకే క్యాజువల్ ఔటింగ్స్‌కి షార్ట్స్ ట్రై చేయండి. త్వరగా ఆరిపోయే మెటీరియల్‌లో ఉంటే ఇంకా బెటర్. వీటిని టీషర్ట్‌తో జత చేస్తే ‘రెయిన్ వెకేషన్ వైబ్’ రెడీ!‘చప్ చప్’ సౌండ్‌కు గుడ్‌బై!వర్షంలో తడిసిన షూస్‌తో నడిస్తే ప్రతి అడుగూ ఓ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌లా ఉంటుంది. అందుకే వాటర్ రెసిస్టెంట్ సాండల్స్, ఫ్లిప్‌ఫ్లాప్స్ లేదా వాటర్‌ప్రూఫ్ స్నీకర్స్ తొడుక్కుంటే కంఫర్ట్‌తో పాటు స్టయిల్ కూడా మిస్ కాదు.వాచ్ కూడా రెయిన్ రెడీ కావాలి!మాన్సూన్ లో మొబైల్ తర్వాత ఎక్కువ టెన్షన్ ఇచ్చేది వాచ్! అందుకే వాటర్ రెసిస్టెంట్ వాచ్ పెట్టుకుంటే మంచిది. రబ్బర్ స్ట్రాప్ వాచ్‌లు అయితే ఫుల్ మాన్సూన్ వైబ్ ఇస్తాయి. - కొండ దీపిక -
శాటిన్ హాల్టర్ డ్రెస్‌లో పుత్తడి బొమ్మలా ప్రియాంక చోప్రా..!
బాలీవుడ్ ముద్దుగుమ్మ ప్రియాంక చోప్రా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఫ్యాషన్ ఐకాన్‌గా తనదైన శైలిలో అలరిస్తుంటుంది. అది క్యాజువల్ అయినా..ఖరీదైన డిజైనర్‌వేర్ అయినా..సందర్భానుగుణంగా తన లుక్‌తో అక్కడున్న వారందర్నీ ఆకర్షించడంలో ప్రియాంకకు సాటిరారెవ్వరూ. ఈసారి అలానే కేన్స్ లయన్స్ వేడుకలో తన క్యాజువల్తో పవర్ డ్రెసింగ్‌తో అద్భుతమైన ఫ్యాషన్ పాఠం చెప్పకనే చెప్పింది. బహిరంగ కార్యక్రమాల్లో అందరి దృష్టిని ఆకర్షించేలా రెడి అవ్వడం ఆమెకు మాత్రమే తెలుసు. మనం ఎంచుకునే దుస్తులే మన వ్యక్తిత్వాన్ని ప్రదర్శిసిస్తుంది అనే మాటకునిలువెత్తు నిదర్శనం ప్రియాంక. ఎందుకుంటే ఈ గ్లోబల్ స్టార్ కేన్స్ లయన్స్‌కు హాజరయ్యారు. ఇది ఐదు రోజులపాటు జరిగే అంతర్జాతీయ సృజనాత్మక ఉత్సవం. ఈ కార్యక్రమానికి కథ చెప్పడం, మౌలికత, ఒకరి దృక్పథాన్ని చెక్కుచెదరకుండా ఎలా ఉంచుకోవాలి అనే అంశంపై డెబస్సీ థియేటర్లో మాట్లాడాలనే ఆహ్వానంపై వచ్చారామె. ఇటాలియన్ ఫ్యాబ్రిక్‌తో తయారు చేయబడిన ఈ మ్యాక్సీ డ్రెస్, కాలమ్ సిల్హౌట్‌తో ఉంటుంది. ఇది ప్రియాంకకు స్టైలిష్ లుక్‌ని అందించింది. వెనుక భాగంలో టై డీటైలింగ్‌తో కూడిన హాల్టర్ నెక్లైన్ ప్రియంకా లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఈ డ్రెస్ ధర వచ్చేసి రూ. 1,81,000 ధర పలుకుతుందట. దీన్ని సిల్వియా టెరాస్సీ రూపిందించారు. ఈ డ్రెస్ లుక్‌కి అనుగుణంగా రూ. 35,574 విలువైన ఫ్రెడా సాల్వడార్ లెదర్ థాంగ్ చెప్పులను జత చేశారు. ఈ వేడుకలో ప్రియాంక ప్రసంగించాల్సి ఉండటంతోనే ఇలా తన క్యాజువల్ డ్రెసింగ్ ఫ్యాషన్‌తో అద్భుతమైన పాఠం చెబుతున్నట్లుగా సింపుల్ లుక్‌లో రావడం విశేషం. ఈ డ్రెస్‌కు ఆమె పింక్ నెక్లెస్, రోలెక్స్ డే-డేట్ 40 చాక్లెట్ డయల్ వాచ్‌ను యాక్సెసరైజ్గా ధరించింది. చాలా లైట్వైట్ మేకప్‌తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ కార్యక్రమంలో ప్రియాంక ఇలా మాట్లాడారు. తాను కథాంశాన్ని ఎంచుకునేటప్పుడు అంతరాత్మ చెప్పే మాటకే ప్రాధాన్యత ఇస్తానన్నారు. తాను ట్రెండ్స్‌ను అనుసరించడానికి ప్రయత్నించనన్నారు. ఎందుకంటే ట్రెండ్ ఇప్పటికే ఆసక్తికరం..వారానికి అంత ఇంట్రెస్టింగ్ ఉండదు. ఇక్కడ ఒక సినిమా పూర్తవ్వడానికి ఏడాది పడుతుంది. ఏడాది గడిచినా..ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా ఉండాలే తప్ప దాని క్రేజ్ ఎన్నేళ్లు గడిచిని తగ్గకూడదని కోరుకుంటానంటోంది. థియేటర్ నుంచి బయటకి రాగానే ఆ మూవీ నుంచి చెప్పడానికి ఏదో ఒక విషయం చెప్పేలా ఉండాలి, అలాంటివే తను చేస్తానని చెబుతోంది. అందుకే తాను సినిమా స్క్రిప్ట్‌లు చదివేటప్పుడు ఈ సినిమా చూస్తే నాకు ఎలాంటి అనుభూతి కలుగుతుంది?' అని ఆలోచించాకే నిర్ణయం తీసుకుంటానని చాలా చక్కగా తన అభిప్రాయాన్ని వెల్లడించింది ప్రియాంక. View this post on Instagram A post shared by LIONS | The Home of Creativity (@cannes_lions) (చదవండి: Isha Ambani: ఎరుపు రంగు డిజైనర్‌వేర్‌లో ఇషా స్టైలిష్ గర్ల్ లుక్..!) -
ఎరుపు రంగు డిజైనర్‌వేర్‌లో ఇషా స్టైలిష్ గర్ల్ లుక్..!
ఫ్యాషన్, హస్తకళలను ఇష్టపడే అంబానీ కుటుంబానికి చెందిన ఇషా అంబానీ ఎప్పటికప్పుడు తన దుస్తులతో భారతీయ వారసత్వ సంప్రదాయాన్ని చాటుతుంటుందామె. విలాసవంతమైన ఆభరణాలు, పర్యావరణ థీమ్‌తో కూడిన నగలతో సదా ఆకర్షణీయమైన లుక్‌లో కనిపిస్తారామె. ఈసారి మాత్రం ఇషా గ్లామరస్ లుక్‌లో అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. ఆధునిక అమ్మాయిలా ఆమె లగ్జరీయస్ లుక్ అందర్నీ కట్టిపడేసింది. జూన్24న జరిగిన సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అందరి దృష్టిని ఆకర్షించారు. సరికొత్త గ్లామరస్ లుక్‌లో ఆకట్టుకున్నారామె. తన డిజైనర్స్టీవ్ ఓ స్మిత్ రూపొందించిన ఎరుపు రంగు ఎంబెల్లిష్డ్ దుస్తులలో మెరిశారామె. ఆ డ్రెస్‌కి అనుగుణమైన బ్లానిక్ హీల్స్, తల్లి నీతా అంబానీ ఆభరణాల కలెక్షన్‌కి చెందిన చెవిపోగులను జత చేశారు. ఈ సెర్పెంటైన్ సమ్మర్ పార్టీకి ఇషా అంబానీ ధరించిన స్టీవ్ ఓ స్మిత్ డ్రెస్, ఫ్లాపర్-గర్ల్ గ్లామర్ అండ్ ఆధునిక పార్టీ గర్ల్ సమ్మర్ సౌందర్యాల అద్భుతమైన కలయిక. ఈ ప్రకాశవంతమైన ఎరుపు రంగు డ్రెస్‌పై పారదర్శకమైన నల్లటి ట్యూల్ ఓవర్లే ఉంది, ఇది డ్రెస్‌కు ఒక ప్రత్యేకమైన సొబగులు అందించింది. ఈ నల్లటి ట్యూల్ ఓవర్లే యానిమల్ ప్రింట్‌ను పోలి ఉండే అడ్డ వరుస ఎంబ్రాయిడరీ నమూనాపై నల్లటి మెరిసే పూసలను చేతితో అల్లారు. చేతులు లేని డిజైన్, క్రూ నెక్లైన్, శరీరానికి అతుక్కుపోయే సిల్హౌట్, అసమానమైన అంచు అలాగే గాలికి తేలికగా కదిలే స్కర్ట్ ఇషాని మెడ్రన్గా కనిపించేలా చేసింది. ఆభరణాల పరంగా..ఆమె చెవులకు యాషర్-కట్ మల్టీ-క్యారెట్ వజ్రం పొదిగిన నాజూకైన వేలాడే చెవిపోగులను ఎంచుకుంది. అదే సమయంలో, ఆమె చేతులకు కాక్టెయిల్ రింగులు, ఒక ప్రత్యేకమైన బటర్‌ఫ్లై రింగ్‌తో సహా వజ్రాలు, కెంపులతో చేసిన ఆభరణాలను ధరించింది. అలాగే ఆహార్యం పరంగా చక్కటి హెయిర్‌స్టైల్‌తో తేలికపాటి మేకప్ టచ్‌తో ఆధునిక అమ్మాయిలా అందరి దృష్టిని ఆకర్షించింది. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..) -
రాయల్ ఆస్కట్ కార్యక్రమంలో డ్రెస్‌కు బదులుగా చీర..!
భారతీయ చీరకు ఎప్పటికీ వన్నెతరగని గౌరవం ఉందని మరోసారి రుజువైంది. బ్రిటన్‌లో ప్రతిష్టాత్మకమైన రాయల్ కార్యక్రమంలో తప్పనిసరిగా డ్రెస్‌లు, టోపీలే ధరించాలి..కానీ ఆమె భారత సంప్రదాయ చీరనే ఎంచుకుని అందర్నీ ఆకర్షించడమే కాదు..అందురూ పనిగట్టుకుని ఆమెను పలకరించడం విశేషం. ఎవరామె అంటే..ఆ మహిళే భారత సంతతి రచయిత్రి కామిని బంగా. స్వతహాగా బ్రిటన్ పౌరురాలే అయినా..ఆమె భారత సాంప్రదాయ చీరలోనే ఆ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి హాజరవ్వడం విశేషం. పైగా తన మూలాలతో ఉన్న బంధాలు ఎన్నటికీ మారవని సగర్వంగా చెబుతోందామె. రాయల్ ఆస్కాట్ అనే ప్రతిష్టాత్మక కార్యక్రమానికి తప్పనిసరిగా డ్రెస్ కోడ్ ఉంటుంది. కానీ అందుకు విరుద్ధంగా ఈ రచయిత్రి ఇలా సాంప్రదాయ చందేరి చీరలో తళక్కుమంది. ఇంతకీ ఏంటి రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అంటే..రాయల్ ఆస్కట్ అనేది యూకేలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన గుర్రపు పందెం కార్యక్రమాలలో ఒకటి. ఇది ప్రతి ఏడాది బెర్క్‌షైర్‌లోని ఆస్కట్ రేస్‌కోర్స్‌లో జరుగుతుంది. బ్రిటిష్ రాజకుటుంబంతో ఉన్న అనుబంధానికి ప్రసిద్ధి చెందిన ఐదు రోజుల కార్యక్రమం ఇది. దీనికి హాజరయ్యే వారంతా ఆడంబరమైన దుస్తుల, ప్రత్యేమైన టోపీలు ధరించి వస్తారు. సింపుల్‌గా చెప్పాలంటే రాయల్ ఎన్‌క్లోజర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి కఠినమైన డ్రెస్ కోడ్ ఉంటుంది. అక్కడ మహిళలు ఫార్మల్ దుస్తులతో పాటు టోపీలు లేదా ఫ్యాసినేటర్లను ధరించాలి, లేదా తగిన జాతీయ దుస్తులను ఎంచుకోవాల్సి ఉంటుంది. కానీ రచయిత్రి కామిని బంగా సాంప్రదాయ చీరనే ఎంచుకున్నారు. చీరనే ఎందుకంటే..తాను ఆస్కట్లో సాధారణంగా కనిపించే ఆకర్షణీయమైన దుస్తులే ధరించాలనుకుందట. తనకు రాయల్ ఆస్కట్ ఆహ్వానం అందగానే..తన బ్రిటన్ స్నేహతులతో షాపింగ్ కూడా చేశారట. ఆస్కట్ కోసం అందమైన మహిళలు ధరించే వేసవి దుస్తులు ప్రయత్నించి చూశానని, కానీ అవి తనకు సహజంగా అనిపించలేదన్నారు. తనెందుకో ఇంగ్లీష్ డ్రెస్, టోపీ తనకు ఎప్పటికీ సరిపోవని అనిపించిందన్నారు. తన స్నేహితులు ఆ డ్రెస్ తనకు బాగానే ఉందని చెప్పినా.. తనకే ఎందుకో సహజంగా అనిపించలేదన్నారు. చివరికి ఇలా బంగా రాయల్ ఆస్కట్కు వింటేజ్ ఆభరణాలతో కూడిన చందేరి చీరలో హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. తాను 20 ఏళ్లుగా యూకేలో నివశిస్తున్నానని, ఐనా ఈ దేశ పౌరురాలిగా కొన్ని విషయాల్లో మాత్రం ఎప్పటికీ మారవని అంటోంది. అదీగాక తన వారసత్వాన్ని స్వీకరించడం వల్లే ఆస్కాట్‌లో ప్రత్యేకంగా కనిపిస్తావని స్నేహితులు కూడా అనడంతో ఇలా ఈ ఆహార్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యానని అన్నారు. అయితే అక్కడకు వచ్చిన వారిందరి నుంచి, అలాగే భద్రతా సిబ్బంది, అక్కడున్న యువతుల నుంచి విశేషస్పందన వచ్చిందని లింక్డ్ఇన్ పోస్ట్‌లో రాసుకొచ్చారామె. పైగా ప్రతి ఒక్కరూ తనను ఆపి మరి అభినందించారని చెప్పుకొచ్చింది. ఎక్కడైన భారతీయ చీరకు మించిన ఫ్యాషన్ లేదు కదా..!.(చదవండి: Janhvi Kapoor: అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..! మత్స్యకారుల..) -
అత్యంత అరుదైన బనారసి కడియల్ నేత చీరలో జాన్వీ కపూర్..!
బాలీవుడ్ నటి, దివంగత టాలీవుడ్ నటి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఎప్పటికప్పుడూ తనదైన శైలిలో ఫ్యాషన్‌తో అలరిస్తుంటుంది. టాలీవుడ్ హీరో రామచరణ్ మూవీ పెద్దితో మంచి హిట్‌ని అందుకుంది. ఇటీవల తన అక్క అన్షులా కపూర్ వివాహ వేడుకల్లో అత్యంత అరుదైన చేనేత చీర ధరించి అందర్నీ ఆకర్షించారు. ఈ చీర ఎంత ప్రత్యేకమైనదంటే..నేయడమే అత్యంత విలక్షణం, కష్టతరమైన కళాత్మక పని కూడా. ఆ నేతను నేసే కళాకారులు కూడా ఇప్పుడంతగా లేరు. అంత పురాతనమైన చేనేత చీర ఇది. మరి ఆ చీర విశిష్టత గురించి సవివరంగా తెలుసుకుందామా..!.జాన్వీ కపూర్ ధరించిన బనారసి చీర, క్లిష్టమైన కడియల్ నేత గొప్పతనానికి చెందింది. దీన్ని సౌరవ్ దాస్ రూపొందించారు. మేగాన్ కాన్సెసియో స్టైలింగ్‌లో ఆమె తన చీరను "మత్స్యకారుల భార్యల చోళీ"ల మాదిరి బ్లౌజ్‌ని జత చేశారు. తన చీర లుక్కికి అనుగుణంగా జుమ్కాలు, కడాతో కలిగిన సాంప్రదాయ దేవాలయ ఆభరణాలను ఎంచుకున్నారామె. కురులను వదులుగా వదిలేసి..సింపుల్ మేకప్‌తో అట్రాక్టివ్ లుక్‌తో కనిపించారామె. ఆమె ధరించిన బనారసీ చీర తరతరాలుగా నిలిచిపోయేంత విలువైన కడియల్ నేతతో నేసిన శారీ. ప్రత్యేకత..ఈ చీర వారణాసిలో అత్యంత ప్రజాదరణ పొందిన చేనేత చీరలలో ఒకటి. అక్కడ తంచోయ్, జాంగ్లా, మీనాకారి, గ్యాసర్, రంగకాట్, ఏక్తారా, కధ్వా, కడియల్ తదిత ప్రసిద్ధ చేనేత చీరలు ఉన్నాయి. కోర్వాయిగా పిలిచే ఈ కడియల్ నేత మూడి షటిల్స్తో నేస్తారు. ఈ పద్ధతిలో నేయడానికి అత్యంత నైపుణ్యం గల కళాకారులు అవసరం. కాబట్టి ఇది చాలా అరుదైనది. జాన్వి చీరలో కనిపించే విధంగా..విభిన్నమైన అంచును రూపొందించడానికి ఈ విధమైన పద్ధతిని ఉపయోగిస్తారు. చీర పై, క్రింది అంచులను రూపొందించడాని ఈ మూడు షటిల్స్ పద్ధతిలో నేస్తారు. అలాగే అంచులను కలపడానికి ఇంటర్‌లాకింగ్ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇందులో అల్లిక పద్ధతినే కడియల్ అని అంటారు. ఈ పద్ధతిని పైఠానీ చీరలలో కూడా ఉపయోగిస్తారు. ఈ విధానంలో నేయడానికి ఎక్కువ శ్రమ అవసరం. అందుకే పవర్ లూమ్స్ ఈ చీరలను భారీ స్థాయిలో ఉత్పత్తి చేయలేకపోతోంది. అదీగాక దీని వాడకం కూడా తగ్గిపోవడంతో ఈ చీరల కొరత అధికంగా ఉంది. ఇప్పుడిప్పుడే మళ్లీ కడియల్ బ్రోకేడ్ చీరలకు ఆదరణ పెరుగుతుండటం విశేషం. ఈ చీర భారతదేశంలోనే అత్యంత ఆదరణ పొందిన విలువైన చేనేత వస్త్రంగా పేరుగాంచింది కూడా. (చదవండి: 72 కిలోల నుంచి 49 కిలోలకు..! ఆ ఎనిమిది అలవాట్లకు తక్షణమే..) -
రాఖీ సావంత్ అందం కోసం అంత ఖర్చు పెడుతుందా..? జస్ట్ జుట్టు కోసమే రూ. 12 లక్షలు..
బాలీవుడ్ బ్యూటీ రాఖీ సావంత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె తన స్పెషల్ పాటలతో ఫేమస్ అయ్యింది. అంతేగాదు ముక్కుసూటిగా మాట్లాడుతూ వివాదాస్పదురాలిగా ముద్రవేయించుకుంది. ఎవరేమన్నా..తన ఆలోచన, తనదైన నిర్ణయం ఫైనల్ అని కరాఖండీగా చెప్పేస్తుందామె. కెరీర్లో ఎన్నో విమర్శలు, ఒడిదుడుకులు ఎదురైనా..అధిగమించి నిలబడిన వ్యక్తి రాఖీ సావంత్. అయితే ఆమె ఇటీవల క్వీనీ సింగ్ పోడ్కాస్ట్లో తాను అందం కోసం ఎంతలా ఖర్చు చేసిందో బయటపెట్టింది. అన్నింట్లకంటే డబ్బే ముఖ్యమని, అది లేకుండా జీవితంలో ఏ ఒక్క పని జరగదని నర్మగర్భంగా చెప్పి అందర్ని విస్తుపోయాలా చేసింది. ఆమె అందం కోసం డబ్బుని ఎలా ఖర్చు పెడుతుందో వింటే నోటమాటరాదు.బ్యూటీ బ్రాండ్ BiE వ్యవస్థాపకురాలు, సీఈవో అయిన రాఖీ పేదరికాన్ని ద్వేషిస్తానని అంటోంది. ప్రతీదానికి డబ్బే పరిష్కారమని అంటోంది. ఆమె డబ్బు ఎంత కావాలని కోరుకుంటుందంటే..తన బెడ్‌పై పరచినంత డబ్బు సంపాదించాలని ఉందట ఆమెకు. పైగా ఆ డబ్బుని స్టైలింగ్ కోసం ఖర్చు చేస్తానని తేల్చి చెప్పింది. తన యాక్సెసరీలను చూపిస్తూ..తన జుట్టుని పట్టుకుని ఇది రష్యన్ హెయిర్ అని ఒక్కసారికే రూ. 12 లక్షలు ఖర్చు అవుతాయని అంటోంది. దీన్నిదుబాయ్, లండన్, కెనడా, అమెరికాలో మాత్రమే చేస్తారని అంటోంది. గోళ్లు, కనురెప్పల అందం కోసం ఆఫ్రికా వెళ్తానని, ఆఖరికి దవడ, బుగ్గలు, పెదవులు వీటన్నింటికీ ఎంతో డబ్బు ఖర్చు పెట్టానంటోంది. తాను ఎన్నటికీ పేదరికంలోకి రానంతగా డబ్బు సంపాదిస్తానని..అదంతా కూడా తన ఫ్యాషన్ కోసమే ఖర్చు చేస్తానని పేర్కొంది. ఆఖరికి మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా డబ్బే పరిష్కారం అని చెబుతుండటం విశేషం. తనకు నిరాశ కలిగినప్పుడూ కూడా మనీ టన్, మనీ సెటమాల్, మనీ సింగ్ అనే మందులు తన దగ్గర ఉంటాయని నవ్వుతూ చెబుతోంది. తాను డబ్బు సంపాదించడానికి చేయగలిగిందంతా చేస్తానని, కేవలం జీవనోపాధి కోసం కెమెరా ముందు ధైర్యంగా మారిన ఒక అమాయక బాలికనని ఆవేదనగా చెప్పుకొచ్చింది. కాగా, గతంలో రాఖీ తన తల్లి అనారోగ్యానికి వైద్యం చేయించడానికి, అలాగే తన గర్భాశయంలో కణితిని తొలగించుకోవడానికి పడ్డ ఆర్థిక కష్టాలే ఆమె ఆలోచన తీరుకి కారణమని తెలుస్తోంది. అయితే ఒక మనిషి తాను ఎదుర్కొనే పరిస్థితి అతడిని ఎంతలా మార్చేస్తుందనడానికి రాఖీనే నిదర్శనం కదూ..!. View this post on Instagram A post shared by Netflix India (@netflix_in) (చదవండి: Weight Loss: 144 కిలోలు నుంచి 65 కిలోలు..! నో జిమ్, నో ట్రైనర్ జస్ట్..) -
చికంకారీ చీరలో నీతా.. బనారసీ స్టైలిష్ శారీలో నటాషా..!
బిలియనీర్లు అంటే హై ష్యాషన్ బ్రాండెడ్ దుస్తులు..లగ్జరీయస్ ఆభరణాలు మాత్రమే కాదు అని నిరూపిస్తున్నారు నీతా అంబానీ, నటాషా పూనవాలాలు. ఈ ఇద్దరూ అసాధారణమైన హస్తకళా నైపుణ్యం, వస్త్ర వారసత్వం, శతాబ్దాల నాటి పద్ధతులకు సజీవంగా ఉంచేలా కళకారుల ప్రతిభను ప్రదర్శించడం విశేషం. తాజాగా ఈ ఇద్దరూ అందమైన చీరలుక్స్తో అందర్నీ విస్తుపోయేలా చేశారు. ఇక్కడ నీతా అంబానీ లక్నో చికంకారి చీరను ఎంచుకోగా, నటాషా పూనావాలా బనారసీ నేతలోని గొప్పతనాన్ని చాటిచెప్పేలా పురాతన హై ఫ్యాషన్‌తో మేళవించింది. ఈ రెండు చీరలు సమకాలీన శైలి నిరంతరం ఎలా పరిణామం చెందుతోంది ప్రపంచానికి చాటిచెప్పేలా ధరించి చూపారు. ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ ముఖేష్ అంబానీ సతీమణి నీతా అంబానీ ఎంబ్రాయిడరీ చేసిన యాంటీక్ మావ్ రంగు చికంకారి చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Swadesh Online (@swadesh_online) డిజైనర్ మనీష్ మల్హోత్రా ఈ చీర గురించి ఇలా వివరించారు. పలుచని వస్త్రంపై సున్నితమైన పూల జాలీలు మొత్తం అలిమేయగా..ఇందులో క్లిష్టమైన జాలీ, ముర్రీ, షూస్ పట్టి, బద్లా వంటి వర్క్‌లు ఉన్నాయని చెప్పారు. అంతేగాదు ఈ చీరకు మనీష్ మల్హోత్రా ఆర్గాంజా లేస్ బ్లౌజ్‌ని జత చేశారు. ఇక బిలియనీర్ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈ అదర్ పూనావాలా భార్య నటాషా పూనావాలా సంప్రదాయాన్ని ఉన్నత ఫ్యాషన్ మేళవింపుతో కూడిన లుక్‌లో మెరిశారు. ఫ్యాషన్‌కే ఐకాన్‌గా తన రూపాన్ని మలుచుకునే పూనావాలా సందర్భోచిన వస్త్రాధారణలో సరిహద్దులను విస్తరిస్తూ..ఆడంబరానికి కేరాఫ్‌గా ఉంటారామె. ఈసారి కూడా అలానే ఆకర్షణీయమైన లుక్‌లో కనిపించారు. అద్భుతమైన రియల్ వెండి జరీ బనారసీ రంగకట్ చీరను ధరించారు. రియా కపూర్ స్టైల్ చేసిన ఈ చీరను, య్వెస్ సెయింట్ లారెంట్ వారి 1988 నాటి క్యూబిస్ట్ జాకెట్‌తో జత చేశారు.ఇది సాంప్రదాయ భారతీయ వస్త్ర కళానైపుణ్యం వింటేజ్ శైలుల అద్భుతమైన కలయిక. అంతేగాదు ఆమె తన ఆహార్యాన్ని భారీ ఝుమ్కాలు, చోకర్ నెక్లెస్ వంటి ప్రత్యేకమైన ఆభరణాలతో పూర్తి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అయ్యాయి. View this post on Instagram A post shared by Rhea Kapoor (@rheakapoor) (చదవండి: భారత్ నుంచి అమ్మ పెంపకం గురించి తెలుసుకున్నా..!: విదేశీ మహిళ) -
25 వేల ఈకలు, నాలుగు లక్షల పూసలు..ఏకంగా రూ. 1,155 గంటల ఎంబ్రాయిడరీ!
అంబానీ ఇంట పెళ్లి సందడి వేడుకలో నీతా అంబానీ నుంచి కోడళ్లు వరకు అందరూ అత్యంత విలాసవంతమైన దుస్తులు, ముఖ్యంగా కళాఖండాలకు నిలువెత్తు నిదర్శనమైన డిజైనర్‌వేర్‌లలో తళుక్కుమన్నారు. అంతేగాదు కళ్లు చెదిరిపోయే ధర పలికే ఆభరణాలతో మెరిసిపోయారు. ఇప్పుడు వాటన్నింటిని తలదన్నేలా ఈ పెళ్లికూతురు దుస్తులను ధరించింది ఈ ప్రముఖ గాయని. కళాఖండమే ఆమె దుస్తులుగా మారిందా అన్నంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఆ వధువు దుస్తులు ఎంత ప్రత్యేకం అంటే..ప్రతిదీ ఓ కళాఖండం..ఓ అద్భుతం.బ్రిటన్ గాయని దువాలిపా నటుడు క్యాలమ్ టర్నర్‌ని జూన్ 20న సిసిలీలో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అందుకు సంబధించిన ఫోటోలను నెట్టింట షేర్ చేసుకున్నారు. ఈ దంపతులు మొదట లండన్‌లో దగ్గరి బంధువుల సమక్షంలో ఒక్కటవ్వగా..ఆ తర్వాత గ్రామీణ నేపథ్యంలో గ్రాండ్‌గా వివాహం చేసుకున్నారు. అక్కడ ఆమె అద్భుతమైన పెళ్లి దుస్తులతో ఫోటోలకు పోజులిచ్చారామె. ఈ దుస్తులను రూపొందించడానికి కళాకారులకు ఏకంగా నాలుగు వేల గంటలపైనే పట్టిందని గాయని దువాలిపా ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. ఆ దుస్తుల ప్రత్యేకతను వివరిస్తూ..అందుకు సంబంధించిన ఫోటోలను పంచుకునింది. దానికి "మిస్టర్ & మిసెస్" అని క్యాప్షన్ పెట్టి మరీ పోస్ట్ చేసింది.ఆమె దుస్తుల స్పెషాల్టీ..ఫ్రెంచ్ లేబుల్ చానెల్ రూపొందించిన ఈ పెళ్లి దుస్తులు వివరాల గురించి అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇలా పేర్కొంది. ఈ హాట్ కౌచర్ దుస్తులు పారిస్‌లోని హస్తకళా కేంద్రంలో రూపుదిద్దుకున్నాయని తెలిపింది. వాటిపై ప్రత్యేకమైన డిజైన్ కోసం మైసన్స్ డి'ఆర్ట్ అటెలియర్ మాంటెక్స్, లెమరీ , లెసేజ్ వంటి ఫ్యాషన్ స్టూడియోల క్లిష్టమైన అలంకరణలు ఉన్నాయి. అందుకోసం తెల్లటి శాటిన్ వంపులను షానెల్ బ్రాండ్‌కి చెందిన మస్సారో హస్తకళల బృందం ప్రత్యేకంగా తయారు చేసింది. ఇక ఈ ఫ్రెంచ్ లేబుల్ గౌను, ముసుగుని డిజైన్ చేసిన విధానం గురించి కూడా సవివరంగా తెలిపింది. ఈ హాట్ కౌచర్ దుస్తులను అటెలియర్ మాంటెక్స్ ఫ్యాషన్ స్టూడియో నాలుగు లక్షల పైగా పూసలతో పూర్తిగా చేతితో ఎంబ్రాయిడరీ చేయగా, లెసాజ్ ఏకంగా 1,155 గంటల సూదితో ట్రోంప్ లొయిల్ ఆభరణాలను అమర్చింది. అంతేగాదు లెమరీ ఫ్యాషన్ స్టూడియో ఏకంగా 25 వేల ఈకలతో సులన్నితమైన అలంకరణ చేసింది. పెళ్లి కూతురు ధరించే ముసుగు, ఆరు మీటర్లలో ట్యూట్ ముసుగు పక్షులు, పువ్వులు కవితాత్మక చిత్రాన్ని ఆవిష్కరించింది. దీన్ని పూసలు, ఈకలతో ఎండ్రాయిడరీ చేశారు. ఈ హాట్ కౌచర్ ముసుగు డిజైన్ కోసం ఏకంగా మూడుగంటలకు పైగా చేతిపని అవసరమైందట. సింపుల్‌గా చెప్పాలంటే ఈ వస్త్రధారణ ఓ కళఖండం, పైగా రాబోయే ఏళ్లలో నవ వధువులకు స్ఫూర్తిగా నిలుస్తుంది. ఇక నటుడు క్యాలమ్ టర్నర్ కస్టమ్ లూయిస్ విట్టన్ సూట్లో ఆకర్షణీయంగా కనిపించాడు. ఈ ఇటాలియన్ వివాహానికి జో అల్విన్, డొనాటెల్లా వెర్సాచే, గ్రేస్ గమ్మర్, ఒలివియా డీన్, మార్క్ రాన్సన్తో పాటు మరికొందరు హాజరైనట్లు సమాచారం. View this post on Instagram A post shared by CHANEL (@chanelofficial) (చదవండి: ప్రసవానంతరం 14 కిలోల బరువు ...! ఆ ఐదు జపనీస్ ఫుడ్ రూల్స్..) -
కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!
ఎక్కువ కష్టపడకుండానే స్టయిల్‌గా కనిపించాలంటే, కొరియన్ ఫ్యాషన్ ను ఫాలో అవ్వాల్సిందే! ముఖ్యంగా కొరియన్ డ్రామాల ప్రభావంతో ఇప్పుడు ట్రెండ్ మొత్తం కంఫర్ట్ అండ్ క్లాస్ కలిసిన రిలాక్స్డ్ ఫిట్ ప్యాంట్స్వైపు మళ్లింది. అందుకే, ఈ కొరియన్ ప్యాంట్స్ గైడ్ మీ కోసం!ప్లీటెడ్ ప్యాంట్స్‌కి క్లాస్ వేరుప్లీటెడ్ డిజైన్స్ ఈ ఫ్యాషన్ ప్రపంచంలో ఫుల్ డిమాండ్‌లో ఉన్నాయి. ముందు భాగంలో చిన్న కుచ్చులు ఉండే ప్లీటెడ్ ప్యాంట్స్‌కు, ఒక ప్లెయిన్ షర్ట్ లేదా పోలో టీషర్ట్‌తో జత చేస్తే చాలు... ‘ఈయనకి ఫ్యాషన్ గురించి తెలుసు’ అనే ఫీలింగ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది.యాంకిల్ లెంగ్త్ కిక్చీలమండ దగ్గర ముగిసే కొరియన్ ప్యాంట్స్ చాలా స్టయిల్‌గా కనిపిస్తాయి. ముఖ్యంగా వైట్ స్నీకర్స్‌తో వేసుకుంటే లుక్ మరింత షార్ప్‌గా మారుతుంది.న్యూట్రల్ కలర్స్‌నే హీరోలుబీజ్, క్రీమ్, గ్రే, ఆలివ్, బ్లాక్, నేవీ... ఇవే కొరియన్ ఫ్యాషన్ లో ఎక్కువగా కనిపించే కలర్స్. వీటిని మ్యాచ్ చేయడం కూడా చాలా ఈజీ. అందుకే స్టయిల్ చేయడంలో టెన్షన్ తక్కువ.ఓవర్సైజ్డ్ టీషర్ట్‌తో బెస్ట్ ఫ్రెండ్స్కొరియన్ ప్యాంట్స్‌కి ఓవర్సైజ్డ్ టీషర్ట్‌తో వేసుకుంటే కొరియన్ స్ట్రీట్ స్టార్లా, షర్ట్‌ను టక్ చేసి బెల్ట్ జోడిస్తే డ్రామా హీరోలా కనిపించడం మాత్రం గ్యారంటీ!అసలు స్పెషాలిటీ ఏంటంటే?కొరియన్ ప్యాంట్స్ అంటే కాళ్లకు ఫ్రీడమ్, లుక్‌కి క్లాస్! ఇవి మరీ స్కిన్నీగా అతుక్కుపోవు, అలాగని గాలికి బెలూన్లా ఊగిపోవు. నడుము దగ్గర నీట్‌గా ఫిట్ అవుతూ, కిందికి వెళ్లేకొద్దీ రిలాక్స్డ్గా ఫ్లో అవుతాయి. నడుస్తుంటే గాలి కూడా హ్యాపీగా ఆడుతుంది, స్టయిల్ కూడా తగ్గదు. అలా కంఫర్ట్ ఫుల్... స్టయిల్ డబుల్!ఈ 3 రూల్స్ గుర్తుంచుకోండి!కింద వేసుకునే ప్యాంటు లూజ్‌గా ఉన్నప్పుడు, పైన వేసుకునే షర్ట్ లేదా టీ–షర్ట్‌ను ఇన్–షర్ట్ చేయడం చాలా ముఖ్యం. దీనివల్ల మీ బాడీ షేప్ కరెక్ట్‌గా ఎలివేట్ అవుతుంది. లేదంటే మీరు బట్టల మూటలా కనిపిస్తారు.కొరియన్ లుక్ సీక్రెట్ సింప్లిసిటీ. ఎక్కువ ప్రింట్స్, ఎక్కువ కలర్స్ కంటే క్లీన్ అండ్ మినిమల్ లుక్కే ప్రాధాన్యం ఇవ్వండి..ఈ ప్యాంట్స్ సాఫ్ట్ అండ్ ఫ్లోయీగా ఉంటేనే బాగుంటాయి. అందుకే కాటన్ బ్లెండ్స్, రేయాన్ లేదా లైట్–వెయిట్ సూటింగ్ ఫ్యాబ్రిక్స్‌ను ఎంచుకోండి. -
వీక్లీ పోల్‌లో బీటీఎస్ ప్రభంజనం..
అంతర్జాతీయ పాప్ సంగీత ప్రపంచంలో కొరియన్ బ్యాండ్ ‘బీటీఎస్’ మరోసారి తన సత్తా చాటుకుంది. బిల్బోర్డ్ నిర్వహించిన అత్యంత ప్రజాదరణ పొందిన కొత్త సంగీతం పోల్‌లో బీటీఎస్ సరికొత్త డిజిటల్ సింగిల్ ‘కమ్ ఓవర్’ భారీ మెజారిటీతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది.జూన్ 12 న పారంభమైన ఈ పోలింగ్‌లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బీటీఎస్ అభిమానులు భారీగా ఓట్లు వేయడంతో, ఏకంగా 86 శాతానికి పైగా ఓట్లతో ఈ పాట క్లీన్ స్వీప్ చేసింది. ఈ రేసులో హాలీవుడ్ పాప్ స్టార్ ఒలివియా రోడ్రిగో, జాక్ వైట్, బెబే రెక్సా, కాట్సే వంటి దిగ్గజ కళాకారుల కొత్త ఆల్బమ్‌లు పోటీలో ఉన్నప్పటికీ, బీటీఎస్ క్రేజ్ ముందు అవేవీ నిలవలేకపోయాయి. ఫలితంగా ‘కమ్ ఓవర్’ ఒకేపక్షంగా ల్యాండ్‌స్లైడ్ విజయాన్ని నమోదు చేసింది. రెండవ స్థానంలో ప్రముఖ పాప్ సింగర్ ఒలివియా రోడ్రిగో విడుదల చేసిన ‘యూ సీమ్ ప్రెట్టీ శాడ్ ఫర్ ఎ గర్ల్ సో ఇన్ లవ్’ ఆల్బమ్ నిలిచింది.‘కమ్ ఓవర్’ అనేది బీటీఎస్ గతంలో విడుదల చేసిన ‘అరిరంగ్’ ఆల్బమ్‌కు సంబంధించిన బోనస్ ట్రాక్. ఇప్పటివరకు కేవలం ఫిజికల్ డీలక్స్ వినైల్ ఎడిషన్ లో మాత్రమే అందుబాటులో ఉన్న ఈ సాంగ్‌ను, బీటీఎస్ వార్షిక వేడుక ‘ఫెస్టా’ సందర్భంగా అధికారికంగా స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్‌లోకి విడుదల చేశారు. కొరియన్, ఇంగ్లీష్ భాషల కలయికతో సాగే ఈ సాంగ్.. దూరమైన ్రపాణస్నేహితుడిని లేదా ప్రియమైన వారిని తిరిగి కలుసుకోవాలనే ఆరాటాన్ని, పశ్చాత్తాపాన్ని ఎంతో భావోద్వేగంగా ఆవిష్కరిస్తుంది. బీటీఎస్ సభ్యులైన ఆర్ఎమ్, సుగా, జె–హోప్ స్వయంగా ఈ పాట నిర్మాణంలో భాగస్వాములయ్యారు. ప్రస్తుతం గ్లోబల్ మ్యూజిక్ ప్లాట్‌ఫామ్స్‌పై ‘కమ్ ఓవర్’ స్ట్రీమింగ్ రికార్డులను తిరగరాస్తోంది. -
అత్యంత స్టైలిష్ డిజైనర్‌వేర్‌లో మమ్దానీ భార్య రామా దువాజీ..!
న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి, ఉగాండ-భారత సంతతికి చెందిన 34 ఏండ్ల జోహ్రాన్ మమ్దానీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అతి చిన్న వయస్సులో ఈ పదవికి ఎన్నికైన వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించడమే కాదు అటు న్యూయార్క్ నగర ప్రజలను కూడా ఆశ్చర్యపరిచిన వ్యక్తి. అలాంటి మామ్దానీ తన భార్యతో కలిసి చాలా అరుదుగా బహిరంగ కార్యక్రమాలకు హాజరవ్వుతారు. ఇటీవల నిక్స్ ఎన్బీఏ ఛాంపియన్షిప్ వేడుకకు దంపతులిరువురి హాజరయ్యే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. అయితే ఈ వేడుకలో మమ్దానీ భార్య రామా దువాజీ CFDA ఫ్యాషన్ ఫండ్ ఫైనలిస్ట్ మిస్ క్లైర్ సుల్లివన్ ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులను ధరించారు. ఆమె ఫ్యాషన్ ఎంపిక న్యూయార్క్ నిక్స్ జట్టు(బాస్కెట్‌బాల్ టీమ్) స్ఫూర్తినిచ్చింది. వన్-షోల్డర్ పెప్లమ్ టాప్‌ను నల్లటి స్కర్ట్‌తో జత చేశారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏంటంటే..డిజైనర్ క్లైర్ ఒక నకిలీ వస్తువుల విక్రేత నుంచి సేకరించిన వివిధ రంగులలోని నిక్స్ షర్టుల నుంచి రూపొందించారు. ఆ లుక్ చాలా స్టైలిష్‌గా ఉండటమే కాకుండా..ఒక న్యూయార్క్ డిజైనర్ టాలెంట్‌ని ప్రమోట్ చేసింది. ఇది పర్యావరణ అనుకూలమైనది. దువాజీ తన దుస్తులకు నైక్ ఎయిర్ రిఫ్ట్ చెప్పులను జతచేశారు. అలాగే నారింజ రంగు పామ్-పామ్ చెవిపోగులతో స్టైలిష్‌గా కనిపించారు. దువాజీ బహిరంగంగా కనిపించిన ప్రతిసారి తన విలక్షణమైన ఫ్యాషన్‌తో ఆకట్టుకుంటారామె. గతంలో కూడా ఆమె నవంబర్4, 2025న మమ్దానీ ఎన్నికల్లో గెలుపొందినప్పడూ కూడా పాలస్తీనియన్-జోర్డానియన్ డిజైనర్ రూపొందించిన లేజర్-కట్ డెనిమ్ టాప్‌తో ఆకర్షణీయంగా కనిపించారు. కాగా, ఇక మమ్దానీ కూడా ఈ వేడుకలో తన సూట్ జాకెట్ కింద జోష్ హార్ట్ జెర్సీని ధరించి నిక్స్ స్ఫూర్తిని ప్రతిబింబించారు.(చదవండి: జీ7 సదస్సులో తొమ్మిదేళ్ల చిన్నారి..! పాపం కెమెరా కంట పడకూడదని..) -
90లలోనే అతిలోక సుందరి శ్రీదేవి ఆ ఫ్యాషన్ సాహసం..! ఇవాళ అదే..
ఇవాళ ఫ్యాషన్ రంగం ఏ రేంజ్లో ట్రెండ్స్‌ని సృష్టిస్తూ..లేటెస్ట్ డిజైనర్‌వేర్‌లను తీసుకోస్తుందో తెలిసిందే. యువత సైతం వాటిని అనుకరిస్తూ..సోషల్ మాధ్యమాల్లో సరికొత్తట్రెండ్ని సృష్టిస్తున్నారు కూడా. ఇవాళ ఫ్యాషన్ ప్రమాణాలు ఏ రేంజ్లో అదరగొడుతున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకు అనుగుణంగా టెక్నాలజీ..కుప్పలకొద్ది డిజైనర్లు, క్రియేటివిటీలు అందుబాటులో ఉన్నాయి. కానీ 90వ దశకంలో పరిస్థితి వేరు. అప్పట్లో దేశం తన మూలాలకు కట్టుబడి ఉంటూనే..అంతర్జాతీయ శైలిని అందిపుచ్చుకుని గ్లోబల్ గుర్తింపు కోసం ప్రయత్నిస్తోంది. అందువల్ల ఆ సమయంలో గ్లామర్ ప్రపంచం అందర్నీ ఆకర్షించడం అనేది అత్యంత కష్టమైన సవాలుగా ఉండేది. అయితే అప్పటి ఫ్యాషన్ దిగ్గజాలు ఆ సవాలుని చాలా సర్థవంతంగా ఎదుర్కొన్నారు. వారిలో మన టాలీవుడ్ ముద్దుగుమ్మ, అతిలోక సుందరీ శ్రీదేవి ఒకరు. అవును ఆ నాడు ఫ్యాషన్ నెమ్మదిగా పురుడు పోసుకుంటున్న సమయంలోనే ఆమె అతిపెద్ద సాహసం చేశారు. కానీ ఇవాళ ఆ స్టైల్ ట్రెండీగా మారింది. ఆ కాలంలోనే శ్రీదేవి ఆ ట్రెండ్‌ని సెట్ చేసిన ఘనత అందుకుందామె. ఏంటో ఫ్యాషన్ స్టైల్, దాని విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.అందుకు సంబంధించిన విషయాలను డిజైనర్ నీతా లుల్లా ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. శ్రీదేవి 1993లో వచ్చిన గోవింద మూవీ కోసం మెటాలిక్ హుడెడ్ డ్రెస్ ధరించారు. అది ఇవాళ సర్వసాధారణం. కానీ 90లలో ఫ్యాషన్‌లో ఓ కొత్త ఒరవడిని సృష్టించిన స్టైల్ ఇది. ఆ దుస్తులను ముంబైకి చెందిన ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా రూపొందించారు. దీన్ని మెటల్ మెష్‌తో (లోహాపు వల వంటి నిర్మాణంతో) ఒకే లైనింగ్ దీనిని తయారు చేయడం విశేషం. దీని డిజైనింగ్‌లో ఇదే ప్రత్యేకతని అన్నారు. అందువల్లే తాను ఆ మూవీ షూటింగ్ కోసం చిన్నబ్యాగులో హైదరాబాద్‌కి తీసుకురాగలిగానని అన్నారామె. అయితే ఎయిర్‌పోర్ట్‌లో చూడటానికి చిన్న బ్యాగు..కానీ ఏకంగా 25 గ్రాముల బరువు ఎందుకు తూగుతుందని ఎయిర్‌పోర్టు అధికారులు అడిగారు. అప్పుడు వారికి ఆ డిజైనర్ వేర్ని ఓపెన్ చేసి..మెటల్‌తో తయారు చేయడం వల్ల ఇంత బరువు తూగుతోందని వివరణ ఇవ్వాల్సి వచ్చిందంటూ నాటి సంఘటననను గుర్తు చేసుకున్నారు లుల్లా. ఇదొక్కటే కాదు ఆమో మరో మెటాలిక్ దుస్తులను అప్పట్లోనే ధరించి అప్సరసలా కనిపించి అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశారని ఆ సంఘటననకు కూడా ప్రస్తావించారు. బాలీవుడ్ మూవీ "మిస్టర్ ఇండియా"లో 'హవా హవాయి' పాటలో ఆమె ధరించిన బంగారు వర్ణపు, దుస్తులు అప్సరసను తలపించేలా లుక్‌ని అందించింది. కేటీ కట్రాక్ రూపొందించిన ఈ దుస్తులలో ప్రత్యేకమైన ఆకృతినిచ్చే టాజిల్స్, కదలికకు అనుగుణంగా ఉండే పూసల పనితనం ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అలాగే తలపై ధరించిన అలంకారప్రాయమైన, మెరిసే శిరోభూషణం (headpiece) మరింత హైలెట్‌గా కనిపించింది. ఇప్పుడు అదేస్టైల్ 2022లో అమెరికా బ్యూటీ మొగల్ కైలీ జెన్నర్ అచ్చలం అలానే మెడ, తల చుట్టూ హుడ్లాగా చుట్టుకుని మెరిసే సిల్వర్ మెటాలిక్ దుస్తులను ధరించారు. అక్కడ ఫెంచ్ ఫ్యాషన్ బ్రాండ్ వింటేజ్ పాకో రబానీ ఈ డిజైనర్‌వేర్‌ని డ్యూయల్-టోన్డ్ డెనిమ్స్‌తో సింపుల్ స్టైలింగ్‌ను జతచేశారు. ఈ ఇద్దరు అందాల తారల మధ్య అద్భుతమైన పోలిక కనిపిస్తున్నప్పటికీ..ఆమె స్టైలిస్ట్ ఈ లుక్‌ని శ్రీదేవి లుక్‌తో పోల్చలేదు కానీ..దశాబ్దాలక్రితమే ఈ స్టైల్ ట్రెండ్‌ని సెట్ చేశారనేది నమ్మక తప్పని నిజం అంటున్నారు ఫ్యాషన్ డిజైనర్ నీతా లుల్లా. View this post on Instagram A post shared by Neeta Lulla (@neeta_lulla) (చదవండి: పీసీఓఎస్‌తో జస్ట్ రెండు నెలల్లో తొమ్మిది కిలోలు..! కానీ ఆ ఐదు పొరపాట్లు..) -
ఆమె ‘స్కర్ట్’పై అమ్మ చిత్రం.. భావోద్వేగంలో ఒబామా!
మిషెల్ తన ఫ్యాషన్ అభిరుచికి పేరుగాంచిన మహిళ. ఎప్పటికప్పడు విలక్షణమైన స్టైలిష్ వేర్లతో ఫ్యాషన్‌కి సరికొత్త అర్థమిస్తారామె. ఆమె దృష్టిలో ఫ్యాషన్ అంటే మన వ్యక్తితత్వం, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే వస్తాలని అర్థం. అయితే ఈసారి మాత్రం ఒబామా అత్యంత విలక్షణమైన స్కర్ట్ టాప్‌లో మెరిశారామె. పైగా ఈ దుస్తులు అత్యంత ప్రత్యేకం కూడా. చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రెసెప్షన్లో మిషెల్ ఈ బ్రాండెడ్ దుస్తులతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. అగ్రరాజ్యం మాజీ అధ్యక్షుడు సైతం ఆమె డ్రెస్‌ని చూసి ఒక్క క్షణం తత్తరపడుతూ.. భావోద్వేగానికి గురయ్యారు. ఇంతకీ మిషెల్ ఒబామా దుస్తుల్లో అంత స్పెషాల్టీ ఏంటంటే..చికాగోలో ఒబామా ప్రెసిడెన్షియల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ఒక రిసెప్షన్లో, మిషెల్ ఒబామా వినూత్నమైన డ్రెస్‌లో మెరిసి అందర్నీ విస్తుపోయాలా చేశారు. ఒబామా ధరించిన స్కర్ట్‌పై ఆమెకెంతో ఇష్టమైన తన అమ్మ ఫోటోతో ఉన్న స్కర్ట్ ధరించి ఆ కార్యక్రమానికి హాజరవ్వడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆఖరికి మాజీ అధ్యక్షుడు ఒబామా సైతం ఆశ్చర్యపోయారు. From an early age, my mom, Marian Robinson, taught me how to think for myself, use my own voice, and understand my own worth.Ahead of #MothersDay, I’m proud to announce that the “Opening the White House” exhibit at the Obama Presidential Center will be named after her. 💕 pic.twitter.com/QDhSSRRet0— Michelle Obama (@MichelleObama) May 6, 2022 ఆమె తన వస్త్రధారణతో దివంగత తల్లికి నివాళులర్పించేందుకు ఇలా వచ్చినట్లు వెల్లడించారు. తన తల్లి మరియన్ రాబిన్స్ ఫోటోతో ఉన్న పెన్సిల్ స్కర్ట్ డిజైన్ కోసం మెరెడిత్ కూప్, ఆక్నే స్టూడియోస్‌తో కలసి పనిచేశానని తెలిపారు. స్కాండేనేవియన్ లేబుల్ ఆటం కలెక్షన్స్‌కు చెందిన ఈ స్కర్ట్‌కి బ్రౌన్ రంగు టాప్‌ని జత చేశారామె. ఆ వేడుకలో ఒబామా తన దుస్తులు గురించి మాట్లాడుతూ..తన భర్తను చూసి తనకెంతో గర్వంగా ఉందన్నారు. అతను నిజంగా చాలా కంగారు పడుతున్నాడు. ఎందుకంటే మెరెడిత్ కూప్ డిజైన్ చేసిన ఈ స్కర్ట్ గురించి ఒబామాకు అస్సలు తెలియదు. అందుకే ఆయన సంభ్రమాశ్చర్యాలకు లోనవ్వుతూ కంగారుపడుతున్నట్లు తెలిపారు. అలాగే తాను ఈ స్కర్ట్‌కి అలవాటుపడటానికి చాలా సమయం పట్టిందన్నారు. నిజంగా తన తల్లి ఇది చూసుంటే గర్వపడేది కదా అని ఉద్విగ్నంగా అన్నారామె. దీని గురించి అమెరికా మాజీ అధ్యక్షుడు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుకొచ్చారు. 'ఈ రాత్రి నా అత్తగారు మరియన్ రాబిన్స్ గురించి ఆలోచిస్తుంటే కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయ్. ఆమె తన పిల్లలు మిషెల్, క్రెయిగ్‌ల కోసం ఎంతో కష్టపడింది. తన భర్త ఫ్రేర్ రాబిన్సన్ ప్రతిరోజూ ఉదయాన్నే లేచి నేవీ పియర్ సమీపంలోని నీటి పునరుద్ధరణ ప్రాంతంలో పనిచేసేవారు. ఆయన వల్లే కష్టపడి పనిచేయడం, కుటుంబానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వడం గురించి తెలుసుకున్నా. వాళ్లిద్ద్దరూ విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తులని, నిమ్న వర్గాలతో సహా అందర్నీ గౌరప్రదంగా చూస్తూ..తమ పనులను తాము చక్కబెట్టుకునే వ్యక్తులు. భూమికి పునాది రాళ్లలాంటి మనుషులు ఆ ఇద్దరూ. చికాగో సౌత్ అంతటా, యావత్తు అమెరికా దేశంలోనూ ఉన్నారు" అంటూ తన పోస్ట్‌ని ముగించారు. View this post on Instagram A post shared by HOLLYWOOD UNLOCKED (@hollywoodunlocked) (చదవండి: స్లోవేకియాలో ప్రధాని మోదీకి బ్రెడ్, ఉప్పుతో స్వాగతం..! ఆహారంతో స్వాగతం పలికే దేశాలివే..) -
పాతికేళ్ల 'లగాన్' వేడుకలో..స్పెషల్ అట్రాక్షన్‌గా కరీనా కపూర్!
బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) కెరీర్లోనే కాదు.. భారత సినీ చరిత్రలోనే ఓ మైలురాయి లాంటి చిత్రంగా నిలిచిపోయింది ‘లగాన్. ఈ మూవీ ఒకవైపు దేశభక్తిని, మరోవైపు యువతను విశేషంగా ఆకర్షించే క్రికెట్ సన్నివేశాల మేళవింపుతో భావోద్వేగభరితంగా తెరకెక్కించిన క్లాసిక్ చిత్రంగా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. దర్శకుడు అశుతోష్ గోవారికర్ (Ashutosh Gowariker) తెరకెక్కించిన ఈ మూవీ 2001 జూన్ 15న విడుదలై బాక్సాఫీస్ వద్ద సూపర్ కలెక్షన్స్‌తో దూసుకుపోతూ.. సూపర్ హిట్‌గా నిలిచి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సినిమాకు సరిగ్గా ఈ నెల 15తో 25 ఏళ్లు పూర్తైయ్యాయి. ఈ సందర్భంగా ఈ మైలురాయిని పురస్కరించుకుని, నటుడు ఆమిర్ ఖాన్, దర్శకుడు అశుతోష్ గోవారికర్ జూన్ 13న ముంబైలో ఒక ప్రత్యేక ప్రదర్శనను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కరీనా కపూర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో సహా బాలీవుడ్ అగ్రశ్రేణి తారలు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో బాలీవుడ్ ముద్దుగుమ్మ కరీనా కపూర్ తనదైన గ్లామరస్ లుక్‌తో అలరించారు. అభిమానులు ముద్దుగా పిలుచుకునే బేబో పింక్ కుర్తాలో గులాబీలా మెరిసింది. ఈ వేడుకలో ఆమె ధరించి డ్రస్, హైహిల్స్ ధర వింటే విస్తుపోవాల్సిందే. ఇది ఎకాయ బనారస్ బ్రాండ్‌కి చెందిన సిల్క్ కుర్తా. డిజైనర్ అమృత గిల్ షేర్ రూపొందించారు. కరీనా డిజైనర్వేర్పై క్లిష్టమైన, చేనేత కట్‌వర్క్ బనారసీ డిజైన్లు ఉన్నాయి. ఫ్లేర్డ్ కుర్తాను స్ట్రెయిట్ ప్యాంట్లు, దానికి సరిపోయే షీర్ దుపట్టాతో జత చేశారు. ఈ లుక్‌ని మరింత అందంగా కనిపించేలా అక్వాజురా హీల్స్‌ను ఎంచుకుంది. ఇక కరీనా ధరించిన ఈ అందమైన కుర్తా ధర వచ్చేసి రూ. రూ. 41,000 కాగా, హీల్స్ ధర వచ్చేసి ఏకంగా రూ. 92,000 పైనే పలుకుతుందట. ఇక హెయిర్‌స్టైల్ కోసం క్లాసిక్ నీట్ బన్ను ఎంచుకున్నారు. అలాగే సింపుల్ మేకప్ టోన్స్, గ్రీన్ కళ్లు అందంగా కనిపించే కాజల్, చిన్న బొట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేశారామె. అంతేగాదు ఈ బ్యూటీ బేబో స్టైలిష్‌గా ఆకర్షణీయంగా కనపించే అవకాశాన్ని ఎప్పుడు వదులుకోదామె. ఎల్లప్పుడూ ఓ కొత్తలుక్‌తో కరీనా తన అభిమానులను ఆశ్చర్యపరస్తుంటుందామె. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: సాంగ్ రైటర్స్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో టేలర్ స్విఫ్ట్ ధరించిన చేతి ఉంగరం అంత ఖరీదా?) -
FLO StyleTatva 6వ ఎడిషన్‌ను ప్రారంభించిన విజయలక్ష్మి , సుధా రెడ్డి (ఫొటోలు)
-
బ్రీజీ ఔట్ఫిట్... క్రేజీ స్టయిల్
చిన్నప్పుడు అమ్మ కొనే బట్టలన్నీ లూజ్ లూజ్‌గా ఉన్నాయని ఫీల్ అయ్యిన వారే, ఇప్పుడు వెతికి వెతికి మరీ అవే కొనుక్కుంటున్నారు! కారణం, టాప్ ట్రెండీ ఫ్యాషన్స్‌లో ఇప్పుడు ఓవర్సైజ్డ్, రిలాక్స్డ్ ఫిట్ కూడా ఒక హాట్ స్టయిల్‌గా మారిపోయింది. అందుకే, లూజ్‌గా, లైట్‌గా, గాలి ఆడేలా ఉండే ఈ ఔట్ఫిట్స్ సమ్మర్లో కంఫర్ట్‌తో పాటు స్టయిల్ కూడా ఇస్తున్నాయి.హీరో లినెన్ !సమ్మర్ అనగానే గుర్తొచ్చేది లినెన్ బట్టలే. వీటిల్లో రిసార్ట్ కాలర్ అంటే ఓపెన్ కాలర్ షర్ట్స్ వేసుకుంటే పక్కా బీచ్ వైబ్ వస్తుంది. వీటికి లోపల ఒక ప్లేన్ ఫిట్టెడ్ టీషర్ట్ వేసి, పైన షర్ట్ బటన్స్ తీసేసి ఓపెన్‌గా వదిలేయండి. లేయర్డ్ లుక్ వస్తుంది, ఎండ కూడా తక్కువగా తగులుతుంది. నిట్టెడ్ పోలోస్కి క్లాస్రెగ్యులర్ కాలర్ టీషర్ట్స్ బోర్ కొడితే, ఈ నిట్టెడ్ అంటే అల్లిక డిజైన్ పోలోస్ ట్రై చేయండి. ఇవి గాలి బాగా ఆడేలా ఉండటంతో పాటు, ఒక ప్రీమియం లుక్ కూడా ఇస్తాయి.వైడ్ లెగ్ ప్లీటెడ్ ట్రౌజర్స్ కింద లూజ్‌గా ఉంటూ, పైన ప్లీట్స్ ఉండే ఈ ప్యాంట్లు వేసుకుంటే క్లాస్ లుక్ వస్తుంది. ఇటు గాలికి గాలి ఆడుతుంది, అటు ఆఫీస్ మీటింగ్స్ లేదా స్మార్ట్ క్యాజువల్ ఈవెంట్స్‌కి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి. లైట్ కలర్స్‌లో ప్లీటెడ్ ట్రౌజర్స్ వేసుకుని, లోఫర్స్ జోడిస్తే సమ్మర్ ఫ్యాషన్‌లో మీరే టాపర్!డ్రాస్ట్రింగ్ లినెన్ ప్యాంట్స్బెల్ట్ పెట్టుకునే ఓపిక కూడా లేని ఎండల్లో తాడు ఉండే ఈ లినెన్ ప్యాంట్లు బెస్ట్ చాయిస్. క్యాజువల్ అవుటింగ్స్, ఈవినింగ్ వాక్స్, ట్రావెల్స్ ఏదైనా సరే ఈజీగా సెట్ అయిపోతాయి.జాగ్రత్తలు!లూజ్ ఫిట్ అంటే చాలా పెద్ద సైజ్ కాదు. లేదంటే బెడ్‌షీట్‌లా కనిపించే చాన్స్ ఉంది.లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ మాత్రమే ఎంచుకోండి. మందపాటి మెటీరియల్ అయితే సమ్మర్లో భరించలేరు.ఒక ఔట్ఫిట్లో చాలా ప్రింట్స్ వద్దు. రిలాక్స్డ్ ఫిట్ అంటే క్లీన్, సింపుల్ లుక్ బెటర్.లైట్ కలర్స్ వేసుకుంటే సమ్మర్లో కూల్‌గా కనిపిస్తారు. బ్లాక్‌తో పూర్తి ఔట్ఫిట్ అయితే సూర్యుడు కూడా మీతో పర్సనల్‌గా కనెక్ట్ అయిపోతాడు! కొండి దీపిక(చదవండి: ఆ కారణంగానే 56 ఏళ్ల నాటి ఆ కప్పులోనే 'టీ' ..! మానసిక నిపుణులు సైతం..) -
ఫ్లిప్‌కార్ట్‌లో ‘గరం గరం’ సేల్.. భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తమ ఫ్యాషన్ విభాగంలో కొత్త తరహా షాపింగ్ అనుభవాన్ని అందించేందుకు ‘GRWM GRWM’ పేరుతో ప్రత్యేక ఫ్యాషన్ సేల్‌ను ప్రారంభించింది. మే 29 నుంచి జూన్ 7, 2026 వరకు జరిగే ఈ ఫ్యాషన్ కార్నివల్లో 10 లక్షలకుపైగా ట్రెండీ స్టైల్స్ వినియోగదారులకు అందుబాటులో ఉంటాయి. “Get Ready With Me” అనే గ్లోబల్ జెన్‌జీ (GenZ) ట్రెండ్‌కు భారతీయ మసాలా జోడిస్తూ “గరం గరం” శైలిలో రూపొందించిన ఈ క్యాంపెయిన్ ద్వారా ఫ్యాషన్ షాపింగ్‌ను ఒక కల్చరల్ ఎక్స్‌పీరియన్స్‌గా మార్చాలని ఫ్లిప్‌కార్ట్ లక్ష్యంగా పెట్టుకుంది.ప్రారంభ అంచనాల ప్రకారం ఈ సేల్కు 55 కోట్లకుపైగా సందర్శనలు నమోదయ్యే అవకాశం ఉండగా, అందులో సగానికి పైగా జెన్‌జీ వినియోగదారులే ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ సేల్‌లో ప్రముఖ అంతర్జాతీయ, దేశీయ బ్రాండ్లతో పాటు డైరెక్ట్ టు కన్స్యూమర్ బ్రాండ్లు, మార్కెట్‌ప్లేస్ విక్రేతలు పాల్గొంటున్నారు. బాగీ జీన్స్, కొరియన్ ట్రౌజర్స్, ఫ్లోరల్ డ్రెస్సులు, పలాజో సెట్లు వంటి తాజా ఫ్యాషన్ ట్రెండ్స్‌ను వినియోగదారులకు అందించనున్నారు.లీవైస్, టైటన్, రెడ్ టేప్, నైక్, ప్యూమా, ఆసిక్స్, సఫారీ, రేర్ రాబిట్, ది బేర్ హౌస్ వంటి ప్రముఖ బ్రాండ్లపై 90 శాతం వరకు తగ్గింపులు, సూపర్‌కాయిన్స్ ఆఫర్లు, స్క్రాచ్ కార్డులు, బ్యాంక్ డిస్కౌంట్లు కూడా లభించనున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ బడ్జెట్ల వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్లు రూపొందించినట్లు కంపెనీ తెలిపింది. -
1500 గంటలు, వేలాది క్రిస్టల్స్, కాన్స్ క్వీన్ ఐశ్వర్య లుక్ స్పెషాల్టీ!
కాన్స్ క్వీన్, మాజీ మిస్ వరల్డ్, బాలీవుడ్ దివా ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరోసారి ఫ్రెంచ్ రివేరా రెడ్ కార్పెట్‌పై తన అద్భుతమైన లుక్‌తో అందరినీ మంత్రముగ్ధులను చేశారు. ప్రతిష్టాత్మక 79వ గ్లోబల్ ఫిల్మ్ ఫెస్టివల్ చివరి దశలో ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య లుక్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆమె అభిమానులు ఎంతగానో ఎదురు చూశారు. అభిమానుల ఆశలను ఐష్ ఏమాత్రం వమ్ము చేయలేదు. లారియల్ (L'Oreal) బ్రాండ్ అంబాసిడర్‌గా హాజరైన ఆమె, ప్రముఖ డిజైనర్ అమిత్ అగర్వాల్ రూపొందించిన కస్టమ్ స్కల్ప్చరల్ గౌన్‌లో మెరిసి అందర్నీ మెస్మరైజ్ చేశారు.డిజైనర్ అమిత్ అగర్వాల్ ఐశ్వర్య కోసం ప్రత్యేకంగా రూపొందించిన అబిస్-బ్లూ గౌన్ హాట్ టాపిక్‌గా నిలిచింది. ఈ అబిస్-బ్లూ (Abyss-Blue) గౌను "లుమినారా" (Luminara) కేవలం ఒక గౌను మాత్రమే కాదు. అందాల ఐశ్వర్యం చుట్టూ ఒక కాంతి వలయం (Energy field) ఉన్నట్లుగా కనిపించేలా డిజైన్ చేయడం దీని స్పెషల్. అంతరిక్షంలో కాంతి ప్రయాణించే అనంతమైన తీరును ప్రతిబింబించేలా రెడ్ కార్పెట్ పై ఉన్న కాంతికి, కెమెరా ఫ్లాష్ లైట్‌కి గౌన్ లోపల ఏదో లిక్విడ్ (ద్రవం) కదులుతున్నట్లుగా ఒక విజువల్ మ్యాజిక్ కనిపిస్తుంది. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కేన్స్ వేదికపై అందరినీ మంత్రముగ్ధులను చేసింది. ఈ అద్భుతమైన శాఫైర్-బ్లూ గౌన్‌కు మ్యాచ్ అయ్యేలా ఐశ్వర్యారాయ్ మెడలో డైమండ్-శాఫైర్ కాలర్ నెక్లెస్ ధరించారు. సిల్కీ ఓపెన్ హెయిర్ స్టైల్, సింపుల్ మేకప్‌తో ఆమె రెడ్ కార్పెట్‌పై ఒక దేవకన్యలా మెరిసిపోయారు. దీన్ని రూపొందించేందుకు 1500 (62 రోజుల 12 గంటలు) గంటలు పట్టిందట.1500 గంటల కష్టంఈ గౌను తయారీ వెనుక అమిత్ అగర్వాల్‌కి చెందిన సిగ్నేచర్ 'క్రిస్టల్ వీన్' ఎంబ్రాయిడరీ టెక్నిక్ ఉంది. దీనికోసం కళాకారులు ఏకంగా 1500 గంటలకు పైగా శ్రమించి, వేలాది క్రిస్టల్స్ చేత్తో అమర్చడం విశేషం. ఇంకా ఐశ్వర్య భుజాల భాగంలో వింగ్స్ (రెక్కలు) తరహాలో డిజైన్ చేసిన నిర్మాణం ఈ గౌనుకు ఒక ప్రత్యేకమైన, ఫ్యూచరిస్టిక్ (భవిష్యత్ కాలపు) లుక్‌ను తీసుకొచ్చింది. మొదటి లుక్‌తోనే ఇంతలా అదరగొట్టిన 'కాన్స్ క్వీన్', ముగింపు వేడుకలో (Closing Ceremony) ఎలాంటి దుస్తుల్లో కనిపిస్తారోనని ఫ్యాన్స్ ఇప్పుడు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ ఐకానిక్ లుక్ వెనుక డిజైనర్ అమిత్ అగర్వాల్‌తో పాటు ప్రముఖ సెలబ్రిటీ స్టైలిస్ట్ మోహిత్ రాయ్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి.ఫ్యాషన్ ఇన్నోవేషన్‌ను సమపాళ్లలో మిక్స్ చేస్తూ ఈ లుక్‌ను ప్లాన్ చేశారంటూ అభినందిస్తున్నారు. రెండో లుక్కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2026లో తన రెండోలుక్లో తనదైన ఫ్యాషన్ స్టైల్న చాటుకున్నారు. ఈసారి, ఈ నటి లేత గులాబీ రంగు దుస్తులతో రొమాన్స్ , పురాతన గ్లామర్‌ను ప్రదర్శిస్తూ, ఈ ఉత్సవానికి మరింత గ్లామర్ జోడించారు. వర్ధమాన మహిళా చిత్రనిర్మాతలను గౌరవించడానికి లోరియల్ పారిస్ నిర్వహించే వార్షిక కార్యక్రమం 'లైట్స్ ఆన్ ఉమెన్స్ వర్త్'కు ఐశ్వర్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు కుమార్తె ఆరాధ్య బచ్చన్ కూడా పాల్గొన్నారు. ఆమె రూబీ-ఎరుపు రంగు గౌను, దానికి సరిపోయే కేప్‌తో చాలా అందంగా కనిపించారు. -
కేన్స్‌కు అందాల సుందరీ రాక ..! నల్లటి బ్లేజర్, లక్షల విలువైన..
ఫ్రాన్స్‌లో ప్రతిష్టాత్మక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈ నెల మే 12న అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో రెడ్‌కార్పెట్‌పై పలువురు ప్రముఖులు,సెలబ్రిటీలు తమదైన డిజైనర్ వేర్లో అలరించారు. ముఖ్యంగా భారతీయ సంప్రదాయ వారసత్వాన్ని ఈ ప్రపంచ వేదికపై చూపారు. అయితే ఇంత గ్రాండ్‌గా జరుగుతున్న ఈ వేడుకల్లో అందరి మదిలో ప్రశ్నం అందాల రాణి ఐశ్వర్య ఎక్కడ అని ఒకటే చర్చ. కేన్స్ వేడుకల్లో ఆమె హాజరు సోషల్‌మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఆ చర్చలకు తెరదించేలా నిన్న రాత్రి(మే 21 రాత్రి) కూతురు ఆరాధ్య బచ్చన్‌తో కలసి కేన్స్‌కు బయలు దేరుతూ ముంబై విమానాశ్రయంలో కనిపించారు. ఈ కేన్స్ వేడుకలకు బయలు దేరుతున్నప్పుడే ఈ తల్లి కూతుళ్లు సేమ్ డిజైనర్‌వేర్‌లతో అందర్నీ ఆకర్షించారు. ఇద్దరు నలుపురంగు దుస్తుల్లో ఒకేలా కనిపించారు. అక్కడున్న ఫోటోగ్రాఫర్లకు కొన్ని క్షణాల పాటు పోజిలిస్తూ ఎయిర్‌పోర్టుకి తరలి వెళ్లిపోయారు. ఇక ఐశ్వర్య ధ్రువ్ కపూర్ ఫాల్/వింటర్ 2026-27 కలెక్షన్‌కు చెందిన నలుపు రంగు బ్లేజర్, దానికి జతగా అదే కలెక్షన్‌కు చెందిన నలుపు రంగు ప్యాంటును ధరించారామె. తాను ధరించిన పూర్తి నలుపు రంగు థీమ్‌కు అనుగుణంగా తన లుక్‌ను మలిచుకున్నారామె. అలాగే ఈ డిజైనర్‌వేర్‌కి అనుగుణంగా బూట్లు, గూచీ డయానా బ్యాగ్‌తో మెరిశారామె. ఆమె ధరించిన బూట్లు సుమారు రూ. రూ. 1.78 లక్షలు కాగా ఐశ్వర్య చేతిలో ఉన్న గూచీ బ్యాగ్ ధర ఏకంగా రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. మాములుగా సెకండ్‌హ్యండ్ మార్కెట్లోనే ఈ గూచీ బ్యాగ్ ధర సుమారు రూ. 2 లక్షలు పైమాటే పలుకుతుందట. కాగా, కేన్స్ ప్రారంభమైనప్పటి నుంచి ఐశ్వర్య ఎక్కడ అంటూ అందరు ఆరా తీయడం ప్రారంబించారు. అలాగే లోరియల్ పారిస్ పోస్టర్లో సైతం ఆమె కనపించకపోవడంతో సర్వత్ర ఆ బ్రాండ్‌పై విమర్శులు వెల్లువెత్తాయి. చివరికి స్పందించిన సదరు బ్రాండ్ పోస్టర్ కేన్స్‌లో ఐశ్వర్య ఆగమనం తప్పక ఉంటుందని, ఆమె కాలాతీతమైన వ్యక్తి అని అభివర్ణించింది. (చదవండి: -
కేన్స్ రెడ్‌కార్పెట్‌పై పటోలా గౌనులో మెరిసిన మౌనీరాయ్..!
బాలీవుడ్ బుల్లి తెర నటి మౌనీరాయ్ కూడా ఫ్రెంచ్ రివేరాలో జరుగుతున్న 79వ కేన్స్ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మెరిశారు. ఇప్పటి వరకు అలియా భట్, అదితిరావు హైదరి, డయానా పెంటీ, నటి రుచి గుజ్జర్ తదితర తారాగణం అద్భుతమైన డిజైనర్‌వేర్‌లతో, అందచందాలతో ఆకట్టుకున్నారు. తాజాగా వారి సరసన మౌనీరాయ్ కూడా చేరారు. చెప్పాలంటే ఈ వేదికపై భారతీయ సాంప్రదాయ వారసత్వ కళలు తళక్కుమనడం విశేషం. మన దేశంలోని వివిధ రాష్ట్రాల సాంప్రదాయ వారసత్వాలు తరతరాలు తెలుసుకునేలా అత్యద్భతంగా ప్రదర్శించారు పలువురు సెలబ్రిటీలు. ఇక మౌనీరాయ్ కూడా ఈ ప్రతిష్టాత్మకమైన కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ వేడుకలో పటోలా ప్రింట్ గౌనుతో తుళుక్కుమంది. View this post on Instagram A post shared by mon (@imouniroy)ఈ ప్రపంచ వేదికపైనే ఆమె సినిమా పోస్టర్ టీజర్‌ని కూడా విడుదల చేశారు . గుజారాతీ పటోలా ఎండ్రాయిడరీ వర్క్ చేసిన ఈ గౌనులో మౌనీరాయ్ అత్యంత స్టైలిష్‌గా కనిపించారు. దీన్ని డిజైనర్ పూజా షా రూపొందించారు. ఈ డ్రైస్‌పై ఎంబ్రాయిడరీ చేయడానికి కళాకారులకు ఏకంగా 300 గంటల సమయం పట్టిందట. ఈ డ్రెస్ ‘ది హౌస్ ఆఫ్ పటోలా’ అనే దుస్తుల లేబుల్‌కు చెందినది. వీపు భాగం లేకుండా పూర్తి నిడివి గల గౌనుని చేతులు లేని సిల్హౌట్ శరీరానికి హత్కుకుపోయే ఫిట్, స్క్వేర్ నెక్లైన్తో కలర్ఫుల్గా ఎంబ్రాయిడరీ చేశారు. అందుకు తగ్గట్టుగా కాటుక కళ్లు, స్మడ్జ్ చేసిన వింగ్డ్ ఐలైనర్, మస్కారా పూసిన కనురెప్పలు, గూలాబీ రంగు లిప్ షేడ్‌తో అందంగా కనిపించింది. (చదవండి: కేన్స్‌లో నటి రుచి గుజ్జర్ రాజస్థాన్ లుక్..! దీని వెనుక ఇంత ఆంతర్యం ఉందా?) -
బ్రాండ్స్ కాదు..పర్ఫెక్ట్ కలర్ గేమ్ ఛేంజర్ తెలియాలి !
స్టయిలిష్‌గా కనిపించాలంటే, బ్రాండ్స్ కాదు బాస్.. సరైన కలర్స్‌తో కంట్రోల్ చేసి గేమ్ చేంజర్‌గా మారొచ్చు.. ఈ చిన్న ట్రిక్ని మిస్ అయితే, బడ్జెట్ ఎంత పెట్టినా లుక్ డల్‌గానే ఉంటుంది. మరి ఆ సీక్రెట్స్ ఏంటో చూద్దాం!త్రీ కలర్స్ రూల్: ఒక అవుట్‌ఫిట్‌లో కేవలం మూడు రంగుల్లో మాత్రమే ఉండాలి. అంతకంటే, మించిన రంగులు అసలు వద్దు. ఎందుకంటే, ఒకేసారి చాలా కలర్స్ వేసుకుంటే, మీరు స్టయిలిష్‌గా కాకుండా కలర్ ఎగ్జిబిషన్‌లా మారేలా చాన్స్ ఉంది.న్యూట్రల్స్‌గా బేస్: ఇంటికి పునాది ఎంత ముఖ్యమో, ఔట్‌ఫిట్‌కి కూడా బేస్ అంతే ముఖ్యం. బ్లాక్, వైట్, నేవీ, గ్రే, బీజ్, ఆలివ్ ఇవి మీ స్టయిల్‌కి బలమైన బేస్. ఇవి దేనితో అయినా ఈజీగా మ్యాచ్ అవుతాయి. ఇవి ఉంటే, మీ వాడ్రోబ్ ఎప్పుడూ ‘నో టెన్షన్ జోన్’లో ఉంటుంది.సింపుల్ స్టయిల్ ఫార్ములా: ఒక న్యూట్రల్ కలర్, ఒక మెయిన్ కలర్, ఒక చిన్న హైలైట్ అంతే, ఉదాహరణకు: నేవీ ప్యాంట్ + వైట్ టీషర్ట్ + లైట్ గ్రీన్ షర్ట్. అంతా న్యూట్రల్ కలర్స్ అయితే కాస్త బోరింగ్‌గా అనిపించొచ్చు. అందుకే, కాస్త బర్గండీ, లైట్ బ్లూ, రస్ట్, సాఫ్ట్ పింక్ లాంటి కలర్స్ జోడిస్తే లుక్‌కి లైఫ్ వస్తుంది.టెక్చ్సర్ కూడా మ్యాటర్: ఒకే కలర్ అయినా, మెటీరియల్ మారితే లుక్ మారిపోతుంది. ఉదాహరణకు: గ్రే టీషర్ట్ గ్రే స్వెటర్ రెండూ గ్రే కలర్సే కానీ ఫీల్ వేరు! కాట¯Œ , లినె¯Œ , వూల్ వంటి టెక్స్చర్స్ మిక్స్ చేస్తే మీ స్టయిల్ మరింత రిచ్‌గా కనిపిస్తుంది.రెడీగా ఉన్న సూపర్ కాంబినేషన్స్ఈ కాంబినేషన్స్ సేవ్ చేసుకోండి! ఎందుకంటే, ఇవి ట్రై చేస్తే స్టయిల్ ఎప్పుడూ మిస్ అవ్వరు1. వైట్ షర్ట్ + నేవీ ప్యాంట్ 2. లైట్ బ్లూ షర్ట్ + టాన్స్ప్యాంట్ 3. బ్లాక్ టీషర్ట్ + ఖాకీ ప్యాంట్ 4. బర్గండీ షర్ట్ + డెనిమ్ జీన్స్మీ స్కి టోన్‌కి సరిపడే కలర్స్అందరికీ అన్ని కలర్స్ సెట్ కావు. అందుకే, ఒక్కసారి మీకు సెట్ అయ్యే కలర్స్ తెలుసుకున్నారంటే, స్టయిల్ గేమ్‌లో మీరు అప్పుడే హాఫ్ విన్ అయిపోయినట్టే. ఎక్కువగా ఫెయిర్ స్కిన్‌కి లైట్, సాఫ్ట్ కలర్స్, మీడియం స్కిన్ ఉంటే ఆలివ్, నేవీ, రస్ట్. డార్క్ స్కిన్ వారికైతే బోల్డ్, బ్రైట్ కలర్స్ సూపర్‌గా కనిపిస్తాయి. -
బ్లేజర్ జస్ట్ రూ. 65 వేలు..కానీ హ్యాండ్ బ్యాగ్ మాత్రం అన్ని లక్షలా..!
79వ వార్షిక కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ (Cannes Film Festival) ఈ నెల మే 12, 2026 నుంచి ము 23, 2026 వరకు ఫ్రాన్స్‌లోని కేన్స్ నగరంలో జరగనుంది. ఈ వేడుకలో అరంగేట్రం చేసేందుకు సిద్దంగా ఉంది బాలీవుడ్ నటి తారా సుతారియా. తన స్టైలిష్ లుక్‌తో ఆ వెంట్లో ఎలా కనిపించనుందో ముందుగానే చిన్న హింట్ ఇచ్చేసిందామె. ఎయిర్పోర్ట్ నుంచే పవర్ డ్రెస్సింగ్ అవుట్‌ఫిట్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచింది. లగ్జరియస్ ఫ్యాషన్‌ని ఎలా నిశబ్దంగా సింపుల్‌గా ప్రదర్శించాలో తన లుక్‌తో అద్భుతంగా చూపించారామె. తారా సుతారియా ఎయిర్‌పోర్ట్‌లో అసాధారణ దుస్తుల సముదాయంతో మెరిసింది. నల్లటి సూట్లో అద్వితియంగా కనిపించింది. ఈ సూట్ జర్మనీకి చెందిన 'హెల్సా' అనే ఫ్యాషన్ లేబుల్ నుంచి ఎంపిక చేసుకుంది. మ్యాచింగ్‌గా అదే బ్రాండ్‌కు చెందిన బ్యాగీ ప్యాంట్‌తో స్టైలిష్‌గా కనిపించింది. అయితే ముందు వైపు బటన్ క్లోజర్, ప్యాడెడ్ షోల్డర్స్, హెవీవెయిట్ ట్విల్ ఫ్యాబ్రిక్‌తో కూడిన ఈ ముదురు బూడిద రంగు చారల బ్లేజర్ ధర రూ. 65,789. బటన్ క్లోజర్‌తో కూడిన జిప్-ఫ్లై ఉన్న బ్యాగీ ప్యాంట్ ధర దగ్గర దగ్గర రూ. 37 వేలు పలుకుతుందట. ఆ స్టైలిష్ డ్రెస్‌కి అనుగుణంగా నలుపు రంగు జిల్ లెదర్ హైహిల్స్‌ని ధరించింది తారా. తన లుక్‌లో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మినీ లేడీ డియోర్ బ్యాగ్. దీని ధర వింటే కళ్లు చెదిరిపోవాల్సిందే. ఎంతంటే సుమారు రూ. 4 లక్షలు పైనే పలుకుతుందట. నల్లటి గొర్రె చర్మంతో తయారు చేసిన ఈ లెదర్ బ్యాగ్ అత్యంత అద్భుతమైన వస్తువుగా నిలిచింది. ఈ బ్యాగ్‌కు తీసివేయగల చైన్ షోల్డర్ స్ట్రాప్, లోపల జిప్ పాకెట్ వంటివి ఉన్నాయి. అందుకు తగ్గట్టుగా ధరించి సన్‌గ్లాసెస్ కూడా తారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. అంతేకాదండోయ్ ఆ గాగుల్స్ ధర కూడా ఏకంగా రూ. 8 వేలు పైనే పలుకుతుందట. ఈ బ్యూటీ తన లగ్జరీయస్ అవుట్‌ఫిట్ లుక్‌తో ఈ కేన్స్ వేడుకలో తనెంత విలాసవంతమైన గ్లామరస్ కనిపించనుందో పరోక్షంగా చెప్పేసింది కదూ..!. View this post on Instagram A post shared by Varinder Chawla (@varindertchawla) (చదవండి: గోల్డ్ డిజైనర్‌వేర్‌లో రాధికా మర్చంట్ స్టన్నింగ్ లుక్!) -
వెనిస్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నీతా అంబానీ కుటుంబం
ఇటలీలోని వెనిస్లో జరుగుతున్న లా బియెన్నాలే డి వెనిజియా 61వ అంతర్జాతీయ కళా ప్రదర్శనలో అంబానీ కుటుంటం భారత జాతీయ పెవిలియన్‌ను ప్రారంభించింది. ఇది ఫ్యాషన్‌తో కూడిన భారతీయ వారసత్వ సమ్మేళనానికి అద్భుతమైన సాక్ష్యంగా నిలిచింది. ఈ మేరకు మే 7న సాయంత్రం అంబానీ కుటుంబం వెనిస్లో ఒక ఆత్మీయ వేడుకని నిర్వహించింది. ఆ వేడుకలో అంబానీ కుటుంబం ఆధునిక శైలులు, సాంప్రదాయ భారతీయ వైభవాన్ని సంపూర్ణంగా సమతుల్యం చేసేలా పలు రకాల లుక్స్‌లో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ వేడుకలో నీతా అంబానీ కుటుంబం భారతీయ కళ, ఫ్యాషన్ వైభవాన్ని ఎలా మిళితం చేసిందంటే..గోల్డ్ శారీలో నీతా అంబానీ..సాంస్కృతిక కార్యక్రమాల వెనుక దార్శనికురాలిగా, నీతా అంబానీ ఒక క్లాసిక్ గోల్డ్ టిష్యూ చీరలో అందానికి కేరాఫ్‌గా కనిపించారు. ఈ కార్యక్రమంలో నీతా తన కుటుంబంతో కలిసి ఫోటోగ్రాఫర్లకు ఫోజులిస్తున్నప్పుడు, ఆమె ధరించిన చీర మిరిమిట్లుగొల్పేలా కాంతిని వెదజల్లింది. సాంప్రదాయ భారతీయ వస్త్రధారణ విలాసానికి అంతిమ చిహ్నంగా నిలుస్తుందని ఆమె ఆహార్యం నిరూపించింది. నీతా తన లుక్‌ని ఒక భారీ వజ్రాలు-పచ్చల నెక్లెస్ సెట్, ఒక చిన్నబన్తో జత చేశారు.పుదీనా రంగులో రాధికా మర్చంట్ రాధికా మర్చంట్, సున్నితమైన పుదీనా నీలం రంగులో ఉన్న ఒక అందమైన వన్-షోల్డర్ గౌనులో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిసింది. ఈ గౌను నడుము వద్ద ముడుచుకుని, గ్రీకు శైలిలో క్లిష్టమైన డ్రేపింగ్ను కలిగి ఉంది. మెడ భాగంలో మెరుస్తున్న, స్ఫటికాకార అంచు, దానికి సరిపోయే ఆర్మ్ కఫ్, ఈ గౌనుకు ఆధునిక మెరుపును జోడించి మరింత శోభను చేకూర్చింది. రాధిక తన జుట్టును నునుపైన, ఒత్తుగా ఉన్న పోనీటెయిల్‌తో స్టైల్ చేశారు. దీంతో ఆమె ప్రకాశవంతమైన మేకప్, ప్రత్యేకమైన వజ్రాల చెవిపోగులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.వైన్ గౌనులో మెరిసిపోతున్న ఇషా అంబానీఇషా అంబానీ అధునాతన ముదురు వైన్ రంగులో ఉన్న ఫ్లోర్-లెంగ్త్ గౌనును ధరించారు. ఈ గౌను పాశ్చాత్య ఫ్యాషన్ శైలిలో కనిపిస్తూ..సాంప్రదాయ చీర కట్టుతో మేళవించింది. గౌను పైభాగంలో ఉన్న అద్భుతమైన బంగారు ఎంబ్రాయిడరీ, పూల డిజైన్లు భుజాల మీదుగా జాలువారుతూ, ముదురు రంగు వస్త్రానికి గొప్ప కాంట్రాస్ట్‌ను అందించాయి. ఇషా తన జుట్టును మృదువైన, రొమాంటిక్ అలల రూపంలో వేసుకుని, ముదురు ఎరుపు రంగు లిప్‌స్టిక్, పచ్చలు పొదిగిన ఆభరణాలతో తన రూపాన్ని పూర్తిచేశారు.ఆకర్ణణీయమైన లుక్‌లో ఆనంద్ పిరమాల్, అనంత్ అంబానీలు..వెనిస్లో, అంబానీ కుటుంబం వారసత్వ సంప్రదాయాన్ని, ప్రపంచ ఫ్యాషన్‌తో మేళవించి, పవర్ డ్రెస్సింగ్‌ను పునర్నిర్వచించారు. ఆ సాయంత్రం కేవలం భారతీయ కళల వేడుకగా మాత్రమే కాకుండా, ప్రపంచ వేదికపై భారతీయ వస్త్రధారణ నైపుణ్యానికి ఒక ప్రదర్శనగా నిలిచింది. ఇకఇషా అంబానీ భర్త, వ్యాపారవేత్త ఆనంద్ పిరమాల్, రాజసం ఉట్టిపడేలా అలంకరించిన వెండి బ్రోచ్తో కూడిన నల్లటి వెల్వెట్ జాకెట్లో ఆకర్షణీయంగా కనిపించగా, అనంత్ అంబానీ, తమ కుటుంబం మెచ్చే సూక్ష్మమైన హస్తకళా నైపుణ్యానికి ప్రతీకగా నిలిచే అలంకారమైన లాపెల్ పిన్‌తో కూడిన నల్లటి సూట్లో అద్భుతంగా కనిపించారు. View this post on Instagram A post shared by Vogue Arabia (@voguearabia)(చదవండి: Met Gala 2026: రూ. 142 కోట్ల నెక్లెస్‌తో మెరిసిన సుధా రెడ్డి..!) -
బిజినెస్ ఉమెన్ @ మెట్ మెరుపులు
ఒకప్పుడు మోడల్స్‌కు, సినీతారలకు మాత్రమే పరిమితమైన గ్లామర్ వేదికలపై ఇప్పుడు మహిళా వ్యాపారవేత్తలు కూడా మెరుస్తున్నారు. వ్యాపార రంగంలో మాత్రమే కాదు ఫ్యాషన్ మెరుపుల్లోనూ తమ సత్తా చాటుతున్నారు. తాజాగా న్యూయార్క్‌లో మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ రెడ్ కార్పెట్‌పై నిర్వహించిన మెట్‌గాలా ఫ్యాషన్ ఈవెంట్ మరోసారి గ్లామరస్ బిజినెస్ టైకూన్స్ మెరుపులకు పట్టం కట్టింది. ఒక్కొక్కరు ఒక్కోరకమైన విశేషాల వస్త్రధారణతో ర్యాంప్‌పై తళుక్కుమన్నారు.కోట్ల విలువైన వజ్రాభరణాలతో...ప్రముఖ వ్యాపార సంస్థ ‘మేఘా ఇంజనీరింగ్– ఇన్ఫ్రాస్ట్రక్చర్స్’ సంస్థకు చెందిన వ్యాపారవేత్త సుధారెడ్డి, న్యూయార్క్ నగరంలో జరిగిన మెట్ గాలా ఈవెంట్లో సెన్సేషన్‌గా నిలిచారు. భారతీయ వస్త్ర సంప్రదాయాలను ముఖ్యంగా తెలంగాణ వస్త్రశైలుల విశిష్టతను చాటిచెబుతూ ప్రత్యేకంగా డిజైన్ చేసిన దుస్తులలో ఆమె ర్యాంప్ వాక్ చేశారు. ఈ సంవత్సరపు ‘కాస్ట్యూమ్ ఆర్ట్’ థీమ్‌కు అనుగుణం గా, ‘ది ట్రీ ఆఫ్ లైఫ్’ పేరుతో ఆమె వస్త్రధారణను బాలీవుడ్ టాప్ డిజైనర్ మనీష్ మల్హోత్రా, ప్రఖ్యాత సెలబ్రిటీ స్టైలిస్ట్ మారియల్ హేన్ సంయుక్తంగా రూపొందించారు. దీనికితోడు దాదాపు 126 కోట్ల విలువైన ఆభరణాలు సైతం ధరించి ఆమె అందరి దృష్టిని మరింతగా ఆకర్షించారు. ‘క్వీన్ ఆఫ్ మెరెలానీ’ అని పేర్కొనే 550 క్యారెట్ల భారీ ముదురు ఊదా–నీలం రంగు టాంజనైట్, విక్టోరియన్ శైలి వజ్రాల నెక్లెస్ వీటిలో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అదరహో ... అంబానీ...ఇదే మెట్ గాలాకు ప్రముఖ వ్యాపార కుటుంబం అంబానీ ఫ్యామిలీ నుంచి ఇషా అంబానీ హాజరయ్యారు. ఆమె స్వదేశ్ కళాకారుల సహకారంతో డిజైనర్ గౌరవ్ గు΄్తా రూపొందించిన కస్టమ్ కౌచర్ చీరను ధరించారు. స్వచ్ఛమైన బంగారు దారాలతో నేసిన ఈ చీరపై, లేత బంగారం మట్టి రంగులలో చేతితో చిత్రించిన పిచ్వాయి–ప్రేరిత మోటిఫ్‌లు ఉన్నాయి. ఈ డిజైన్, చీరను ఒక శిల్పంలాంటి డ్రేప్‌తో, ఒక కళాత్మక రూపంగా ఆవిష్కరించింది. భారతీయ కళాకారుల చేతుల మీదుగా బంగారంతో నేసిన ఈ చీర పైభాగానికి, వస్త్రంపై 200కు పైగా పాతకాలపు వజ్రాలను చేతితో కుట్టారు. ఇవన్నీ ఆమె తల్లి నీతా అంబానీ వ్యక్తిగత ఆభరణాల సేకరణ కావడం విశేషం.స్టైల్స్‌లో ‘రాణింపు...జైపూర్ రాజ కుటుంబం కూడా మెట్ గాలా లో తనదైన శైలి రాజసం ఒలికించింది. రాజ వంశపు వారసత్వాన్ని ప్రపంచ వేదికపైకి తీసుకువస్తూ, యువరాణి గౌరవి కుమారి తన అమ్మమ్మ నుంచి ప్రేరణ పొందిన దుస్తులతో మెట్‌గాలాలో అరంగేట్రం చేశారు. ప్రబల్ గురుంగ్ రూపొందించిన ఈ గౌనులో, మహారాణి గాయత్రీ దేవి అందించిన గులాబీ రంగు షిఫాన్ చీరను పొందుపరిచి, దానిని జైపూర్ నుంచి తెచ్చిన ముత్యాలు, కట్ చేయని వజ్రాలతో అలంకరించారు. ఈ లుక్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.అనన్య సామాన్యం...బిర్లాల కుటుంబానికి చెందిన భారతీయ మహిళా వ్యాపారవేత్త అనన్య బిర్లా కూడా తనదైన శైలిలో పూర్తి వైవిధ్యాన్ని ప్రదర్శించారు. డిజైనర్ రాబర్ట్ వన్ రూపొందించిన కస్టమైజ్డ్ దుస్తులను ధరించిన ఆమె, మెరిసే నల్లటి లోహంతో చేసిన స్కర్ట్‌పై బిగుతైన పెప్లమ్ జాకెట్‌ను ధరించారు. ప్రముఖ భారతీయ కళాకారుడు సుబోధ్ గు΄్తా రూపొందించిన వెండి ఫేస్ మాస్క్‌తో ఆమె సరికొత్త లుక్‌ను ప్రదర్శించారు. అతిరథ మహారథులైన హాలీవుడ్ నటీ నటులు, బాలీవుడ్ గ్లామర్ క్వీన్స్ పాల్గొనే మెట్‌గాలాలో మన భారతీయ మహిళా వ్యాపారులు సైతం తమ సత్తా ప్రదర్శించడం... మహిళల్లోని మల్టీ టాస్కింగ్ స్కిల్స్‌కు చిరు ఉదాహరణ మాత్రమే... మొత్తం మీద మెట్‌గాలా వేడుకలో బిజినెస్ ఉమెన్ మెరుపులు అందరినీ అబ్బుర పరచాయి. – ఎస్. సత్యబాబు, సాక్షి, హైదరాబాద్ -
అంతర్జాతీయ వేదికపై భారతీయ కళా వైభవం
ఘనంగా మెట్ గాలా 2026 న్యూఢిల్లీ: ప్రపంచ ఫ్యాషన్ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘మెట్ గాలా 2026’వేడుక న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ వేదికగా ఘనంగా జరిగింది. ఈ ఏడాది ‘కాస్ట్యూమ్ ఆర్ట్’థీమ్‌తో జరిగిన ఈ వేడుకలో, భారతీయ ప్రముఖులు తమ సంప్రదాయ కళా వైభవాన్ని, ఆధునిక ఫ్యాషన్‌ను జోడించి ప్రపంచాన్ని ఆకట్టుకున్నారు. వేడుకలో ప్రత్యేక ఆకర్షణలు గౌరవ్ గుప్తా రూపొందించిన దుస్తుల్లో ఇషా అంబానీ మెరిసిపోయారు. అజంతా కుడ్య చిత్రాల స్ఫూర్తితో రూపొందిన ఈ గౌను, వజ్రాలు, విలువైన రత్నాలతో పొదిగి ఉంది. ఈ దుస్తుల తయారీకి 1,200 గంటల శ్రమ, 50 మందికి పైగా కళాకారులు పనిచేశారు. మెట్ గాలా అరంగేట్రం చేసిన దర్శకుడు కరణ్ జోహార్, ప్రఖ్యాత చిత్రకారుడు రాజా రవివర్మ పెయింటింగ్స్ స్ఫూర్తితో రూపొందించిన ‘ఫ్రేమ్డ్ ఇన్ ఎటరి్నటీ’కాస్ట్యూమ్ ధరించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన ఈ అద్భుతమైన జాకెట్ తయారీకి సుమారు 5,600 గంటల సమయం పట్టింది. హైదరాబాద్‌కు చెందిన పారిశ్రామికవేత్త సుధా రెడ్డి, 15 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.125 కోట్లు) విలువైన చారిత్రక నెక్లెస్‌తో అందరి దృష్టిని ఆకర్షించారు. మనీష్ మల్హోత్రా రూపొందించిన నేవీ బ్లూ వెల్వెట్ లెహంగా ఆమెకు రాజసాన్ని తెచ్చిపెట్టింది. నటాషా పూనావాలా ‘ఆర్కిడ్ పెక్టోరల్’శిల్పాన్ని ధరించి వినూత్నంగా కనిపించగా, అనన్య బిర్లా స్టెయిన్లెస్ స్టీల్ మాస్్కతో, జైపూర్ రాజవంశీయులు గౌరవి కుమారి, సవాయ్ పద్మనాభ్ సింగ్ సంప్రదాయ దుస్తుల్లో రాజసం ఉట్టిపడేలా మెరిశారు. నేపథ్యం, వివాదాలు మెట్ గాలా అనేది మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ నిధుల సేకరణ కోసం ఏటా నిర్వహించే అతిపెద్ద వేడుక. అయితే, ఈ ఏడాది ఈ వేడుక కొంత వివాదానికి కూడా దారి తీసింది. అమెజాన్ సంస్థాధినేత జెఫ్ బెజోస్, ఆయన భార్య లారెన్ బెజోస్ ఈ ఏడాదికి గౌరవ సహాధ్యక్షులుగా, ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరించడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి. -
మెట్ గాలాలో గోల్డ్ చీరలో మెరిసిన ఇషా అంబానీ..! బ్లౌజ్లో మొత్తం అమ్మ..
మెట్ గాలా 2026లో భారతీయ ఫ్యాషన్, కళలకు మద్దతు ఇవ్వాలనే తన వాదనను బలంగా వినిపించారు ఇషా అంబానీ. ఈ వేడుకలో ఆమె డిజైనర్ గౌరవ్ గుప్తా రూపొందించిన ప్రత్యేకమైన చీరలో తళుక్కుమన్నారు. ఈ చీరలో చేతితో చిత్రించిన పిచ్వాయి ప్రేరేపిత నమునాలు ఉన్నాయి. కేవలం కళాకారుల కోసం మాత్రమే పనిచేసే రిలయన్స్ రిటైల్ బ్రాండ్ స్వదేశ్కు చెందని కళాకారులు ఈ చీరను స్వచ్ఛమైన బంగారు దారాలతో డిజైన్ చేశారు. ఆఖరికి బ్లౌజ్ కూడా స్పెషల్ అట్రాక్షన్. ఎందుకంటే ఈ బ్లౌజ్ మొత్తం తన అమ్మ నీతా అంబానీ ఆభరణాలతో నిండి ఉందని వోగ్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొంది ఇషా. దాదాపు 1800 క్యారెట్ల వజ్రాల తోపాటు పచ్చలు, పోల్కీ, కుందన్లను ఈ వస్రం(బ్లౌజ్)లో పొదిగి దాని వారసత్వ రూపాన్ని సజీవంగా మార్చామని డిజైనర్ గౌరవ్ గుప్తా ఇన్స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఇషా అద్భుతమైన చీర, ఆభరణాల తోపాటు క్రోచెట్ బ్యాగ్‌లో సుబోధ్ గుప్తా రూపొందించిన మామిడి శిల్పాన్ని కూడా రెడ్‌కార్పెట్‌పైకి తీసుకువచ్చారామె. ఇది భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా ఉండటమే కాకుండా చేతి కళకు నిదర్శనంగా నిలిచింది. సింపుల్‌గా చెప్పాలంటే ఈ ఏడాది మెట్‌గాలా 2026 థీమ్ 'ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్'కు అనుగుణంగా ఉంది. అలాగే ఆమె తన జుట్టుని గజ్రా స్ఫూర్తితో రూపొందించిన కాగితం, రాగి ఇత్తడి కలయికతో రూపొందించిన ఆభరణంతో దివి నుంచి భువికి వచ్చిన దేవతలా మెరిశారామె. దీన్ని బ్రూక్లిన్కు చెందిన సౌరబ్ గుప్తా అనే కళాకారుడు రూపొందించారు. ఈ వేడుకకు ముందు మే1 న్యూయార్క్ నగరంలో జరిగిన వేడుకలో భారతదేశాన్ని అక్షరాలా చిత్రించిన ఒక అద్భుతమైన బ్యాండేజ్ డ్రెస్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ డ్రెస్‌ని 26 రకాల అంచులతో రూపొందించడం విశేషం. View this post on Instagram A post shared by Anaita Shroff Adajania (@anaitashroffadajania) (చదవండి: ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..) -
ఎవరీ సుధారెడ్డి..? ఏకంగా 200 క్యారెట్లకు పైగా వజ్రాలు..
MEIL గ్రూప్ డైరెక్టర్లో ఒకరైన భారతీయ వ్యాపారవేత్త, హైదరాబాదీ సుధా రెడ్డి, న్యూయార్క్‌లో జరిగే మెట్ గాలా2026లో మెరవనున్నారు. ఆమె మెట్ గాలాలో ప్రపంచ వేదికపై భారతదేశానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఈ ఏడాది మెట్ గాలా సుమారు 400 ప్రత్యేకమైన కళాత్మక వస్తువులతో.. ఏకంగా ఐదువేల ఏళ్ల నాటి శైలిని చాటిచెప్పే 'కాస్ట్యూమ్ ఆర్ట్' ప్రదర్శనను ఇతివృత్తంగా "ఫ్యాషన్ ఈజ్ ఆర్ట్" అనే డ్రెస్ కోడ్‌ను ఎంచుకుంది. ఈ మెట్‌గాలా కార్యక్రమంలో పాల్గొనే అతిరథమహులంతా తమ దుస్తులను సజీవ కళాఖండాలుగా కనిపించేలా మానవ శరీరం, కళాత్మక వ్యక్తీకరణ మధ్య ఉన్న సుదీర్ఘ సంబంధాన్ని ప్రతిబింబించాలని ఆశిస్తోంది. గతంలో సుధా ప్రఖ్యాత భారతీయ డిజైనర్లు ఫల్గుణి షేన్ పీకాక్, తరుణ్ తాహిలియాని రూపొందించిన అద్భుతమైన దుస్తులను ధరించారు. ఈ ఏడాది ఫ్యాషన్‌ను ఒక కళారూపంగా పరిగణించే ఇతివృత్తం నేపథ్యంలో ఆమె సబ్యసాచి ముఖర్జీ లేదా మనీష్ మల్హోత్రా వంటి ప్రముఖ భారతీయులతో కలిసి పనిచేయనున్నట్లు అంతరంగిక వర్గాల సమాచారం. పారిస్ ఒలింపిక్స్, కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్ వంటి అనేక ఉన్నత స్థాయి అంతర్జాతీయ కార్యక్రమాలలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ బిజీగా ఉండే ఆమె ఈ ఏడాది న్యూయార్క్‌లో జరగనున్న గాలా ఈవెంట్ల్ భారత్‌కి ప్రాతినిథ్యం వహించనున్నారు.ఇక సుధా అందం, దాతృత్వ పరంగా ఆమెకు సాటిరారెవ్వరూ. ఆమె మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL)లో డైరెక్టర్‌గా ఉన్నారు. అలాగే సుధా రెడ్డి ఫౌండేషన్‌కు కూడా నాయకత్వం వహిస్తున్నారు, దీని ద్వారా ఆమె స్వచ్ఛంద ప్రాజెక్టులు, సామాజిక కార్యక్రమాలలో పాలుపంచుకోవడం వంటివి చేస్తుంటారు.ఆమె ఎవరంటే..సుధా రెడ్డికి MEIL (Megha Engineering and Infrastructures Limited) మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణా రెడ్డితో వివాహం జరిగింది. ఆ దంపతులకు మానస్, ప్రణవ్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.ఆమె 2024 మెట్ గాలాలో 200 క్యారెట్లకు పైగా వజ్రాలు ధరించి వార్తల్లో నిలవడమే కాదు రెడ్ కార్పెట్‌పై తన ఉనికిని చాటిచెప్పేలా ప్రపంచ దృష్టిని మరింతగా ఆకర్షించారు.ఆమె పుట్టి పెరిగింది విజయవాడలోనే. 19 ఏళ్లకే కృష్ణారెడ్డిని వివాహం చేసుకున్నారు. చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం తమ బంధానికి సహాయపడిందని, తామిద్దరూ కలిసే పెరిగామని రెడ్డి గతంలో చెప్పారు.2026, మే 4, సోమవారం నాడు జరగనున్న మెట్ గాలా, ఈ ఈవెంట్లో అత్యధిక తారలు పాల్గొనే కార్యక్రమాలలో ఒకటిగా నిలుస్తుందని భావిస్తున్నారు. ఈ ఏడాది సహ-అధ్యక్షులుగా బియాన్స్, నికోల్ కిడ్మన్, వీనస్ విలియమ్స్ ఉండగా, జెఫ్ బెజోస్, లారెన్ సాంచెజ్ బెజోస్ ప్రధాన స్పాన్సర్లుగా వ్యవహరిస్తున్నారు. కాగా, న్యూయార్క్ నగరంలోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌లో ఈ వేడుక ఘనంగా జరగనుంది. ఫ్యాషన్ ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన వార్షిక వేడుక,. ఇది కాస్ట్యూమ్ ఇన్స్టిట్యూట్ కోసం నిధుల సేకరణ కార్యక్రమం. దీనిని ప్రతి ఏడాది మే మొదటి సోమవారం నిర్వహిస్తారు. View this post on Instagram A post shared by Sudha Reddy (@sudhareddy.official) (చదవండి: హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..! ఏకంగా అంత ఖరీదు..) -
హాట్‌టాపిక్‌గా నటి త్రిష తిరుపతి ఆలయ సందర్శన..!
త్రిష తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడం.. సరిగ్గా అదే సమయానికి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభం కావడంతో సోషల్ మీడియాలో దీనిపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఇవాళ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొన్న త్రిష.. తిరుమల వేంకటేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.. టీవీకే పార్టీ అధ్యక్షుడు విజయ్‌తో ఆమె సన్నిహితంగా ఉన్నారనే ప్రచారం నేపథ్యంలో ఈ పర్యటన మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. అదీగాక ఇవాళ త్రిష పుట్టిన రోజు కూడా కావడం ఈ సందర్శన మరింత హాట్‌టాపిక్‌గా మారింది. ఇక్కడ నటి త్రిష కలియుగ దైవమైన ఆ తిరుపతి వేంకటేశ్వరుని దర్శించుకునేందుకు వచ్చిన విధానం అందర్నీ అమితంగా ఆకర్షించింది. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. త్రిష అజా ఫ్యాషన్స్‌కు చెందిన వైట్‌సూట్‌తో అలరించింది. దీని ధర రూ. 12000 పైనే పలుకుతుందట. వినెక్‌తో కూడిన ఐవరీ కలర్ చేనేత వస్త్రం. ముఖ్యంగా ఈ వేసవి వేడికి ఆహ్లాదకరమైన హాయినిచ్చే కాటన్ కూడా ఇది. దీనికి తేలికపాటి ఫ్లోరల్ దుపట్టా ఈ డిజైనర్‌వేర్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆలయాన్ని సందర్శించిన అనంతరం, త్రిష కృష్ణన్ చెన్నైలోని విజయ్ నివాసానికి చేరుకున్నారు. ఇదిలా ఉండగా, తమిళనాడు,పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ఫలితాల రోజు త్రిష ఆమె ఆలయ సందర్శన రెండూ ఏకకాలంలో జరగడం కూడా అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. అదీగాక పోల్ ట్రెండ్స్ ప్రకారం, విజయ్ తమిళగ వెట్రి కజగం (టీవీకే) సంచలన విజయాన్ని నమోదు చేయడం విశేషం.తిరుమల ఆలయం విశిష్టత..ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమలలో ఉన్న వెంకటేశ్వర ఆలయం, వెంకటేశ్వర స్వామికి అంకితం చేయబడిన ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం. ఇది అత్యంత సంపన్నమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. పైగా శేషాచలం కొండలపై ఉన్న అత్యంత ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రం. కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన ప్రముఖ క్షేత్రం. ఏడు కొండలపైన కొలువైన శ్రీనివాసుడు, కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటూ, ప్రపంచంలోనే అత్యధిక భక్తులు దర్శించుకునే పుణ్యక్షేత్రంగా అలరారుతోంది. ఇక్కడ మూలవిరాట్టు స్వయంభూగా వెలిశారని భక్తుల నమ్మకం.#WATCH | Andhra Pradesh: Actor Trisha Krishnan had the darshan of Lord Sri Venkateswara Swamy at Tirumala Tirupathi Devasthanam earlier this morning. pic.twitter.com/mhiaHMOu5l— ANI (@ANI) May 4, 2026 (చదవండి: 46 దేశాలు పర్యటించా..కానీ భారత్ పర్యటన..!) -
క్రీమ్ కలర్ సిల్క్ చీరలో రష్మిక మందన్న గ్లామరస్ లుక్..!
టాలీవుడ్ నటి రష్మిక మందన్న, విజయ దేవర కొండల పెళ్లి ఫిబ్రవరి 26,2026న ఉదయ్‌పూర్‌లో అంగరంగ వైభవంగా చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఈ ముద్దుగుమ్మ సాంప్రదాయ శైలిని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దాలో పాఠాలు నేర్పుతూనే ఉంది. తన పెళ్లి వేడుక కోసం కిలోల కొద్దీ బంగారు ఆభరణాల నుంచి రిసెప్షన్లో ధరించి కూర్గీ శైలి చీర వరకు ప్రతి సందర్భంలోనూ ఫ్యాషన్ ప్రియులను గ్లామరస్ లుక్‌తో కట్టిపడేస్తోంది. ఒక అవార్డుల వేడుకు కోసం రష్మిక క్రీమ్ కలర్ సిల్క్ చీరలో తళుక్కుమంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబంధించిన ఫోటోలను రష్మిక షేర్ చేశారు. ఆమె స్టైలిస్ట్ గౌర్వి ప్రత్యర్తి మృణాలినీ రావు కలెక్షన్ల నుంచి ఎంపిక చేసుకున్నారు ఈ చీరను. ఈ సిల్క్ పట్టు మాదిరి చీరకు క్లిష్టమైన పూల జర్దోజీ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఈ చీరకు ఎరుపు రంగులోని ఎంబ్రాయిడరీ బ్లౌజ్‌ని జత చేశారు. దాంతో ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచి అందరి చూపులను ఆకర్షించింది. అంతేగాదు ఈ చీర ధర వచ్చేసి దగ్గర దగ్గర రూ. 1.68 లక్షలు పైనే పలుకుతుంది. అందుకు తగ్గట్టుగా చాలా నేచురల్ మేకప్, హెయిర్ స్టైల్ కోసం మధ్యలో పాపిడి తీసిన పోనీటెయిల్‌తో తన ఆహార్యాన్ని పూర్తి చేశారు. అలాగే తన శారీకి అనుగుణంగా మధ్యలో పచ్చరాయితో మెరుస్తున్న స్టేట్మెంట్ చెవిపోగులు, చిన్న నెక్చైన్, మంగళ సూత్రంతో సాంప్రదాయబద్దమైన మహిళలా అద్భుతంగా కనిపించారామె. అంతేగాదు రష్మిక బ్యూటీఫుల్ ఫోటోలను రీపోస్ట్ చేస్తూ సదరు బ్రాండ్ ఇలా రాసింది. "మృణాలినీ రావు దుస్తులలో మిమ్మల్ని చూడటం మాకు ఎల్లప్పుడూ ఇష్టమే! ఈ చీరలో అద్భుతంగా కనిపిస్తున్నారు." అని పేర్కొంది. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) (చదవండి: విమానం గాల్లో ఉండగానే ప్రసవం..! అయితే..) -
'ఆశా తాయ్' మహారాష్ట్ర ఫ్యాషన్ ఐకాన్..!
92 ఏళ్ల వయసులో ఆశా భోంస్లే కన్నుమూశారు. ఆమె మరణంతో, ప్రపంచం వేలాది పాటలు పాడిన ఒక గాత్రాన్ని మాత్రమే కోల్పోలేదు, హుందాతనానికి, ఫ్యాషన్ శైలికి కంచుకోట అయినా ఓ మహోన్నత వ్యక్తిని కోల్పోయాం అంటున్నారు ఫ్యాషన్ నిపుణుల. 'పియా తు అబ్ తో ఆజా', 'దిల్ చీజ్ క్యా హై', 'దమ్ మరో దమ్' వంటి అనేక హిట్ పాటలతో ప్రసిద్ధి చెందిన ఆమె ఆహార్యం పరంగా నిరంతరం కొత్తదనాన్ని కోరుకునేవారని చెబుతున్నారు. మరి ఆశా ఫ్యాషన్ పరంగా ఎలాంటివి ఇష్టపడేవారు, చీరల సెలక్షన్ తదితర విశేషాల గురించి తెలుసుకుందామా..!.రూపం పరంగా రాజీపడని విధంగా రెడీ అయ్యేవారట. వాటిలో అత్యంత హైలెట్ అయ్యేవి ఆమె చీరలు. ఆమె వార్డ్రోబ్ మొత్తం మహారాష్ట్ర సౌందర్యానికి కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు. ఆమె తరుచుగా మందపాటి బంగారు జరీ అంచులతో కూడిన ఐవరీ క్రీమ్ లేదా పాస్టల్ రంగులో ఉండే బరువైన పట్టు లేదా కాటన్ సిల్క్ చీరలనే ఇష్టపడేవారట. ముక్కుపుడక..ఇక ఆశాలో మరో ప్రత్యేకత ముక్కుపుడక. ఆమె సాంప్రదాయ మహారాష్ట్ర ముక్కుపుడక లేకుండా అలంకరణ పూర్తి చేసేవారు కాదట. ఇది ఆమె మూలాల నేపథ్యాన్ని, హుందాతనానికి ప్రతీకగా నిలిచేవని చెబుతున్నారు ఫ్యాషన్ ప్రియులు. ఇలా ఆమె పండుగలు, పర్వదినాల్లోనే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం మహారాష్ట్ర శైలి ముక్కుపుడకనే ధరించేవారట. ముఖాన కచ్చితంగా ఎర్రటి బొట్టు గుండ్రంగా పెద్దదిగా ఉండాల్సిందేనట. ఇది ఆమె వ్యక్తిత్వానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అంతేగాదు గాయని ఆశ అనేక వరుసల ముత్యాల హారాలు, బరువైన బంగారు లేదా వజ్రాల ఆభరణాలు లేకుండా బయటకు వచ్చేవారు కాదట. సింపుల్‌గా చెప్పాలంటే సాంప్రదాయన్ని, ఆధునికతను మేళవించేలా ఆభరణాలను ఎంచుకునేవారట. అంతేగాదు ఆమెను అభిమానులు ఎక్కువగా సొగసైన చీరలు, చక్కగా చుట్టిన కొప్పులోనే గుర్తించుకుంటారు. చెప్పాలంటే అభిమానుల హృదయంలో తన వేషధారణ నాటుకుని పోయేలా ఆహార్యాన్ని మెయింటైన్ చేసేవారు. పైగ మహారాష్ట్ర ప్రజలు ఆమెను ముద్దుగా 'ఆశా తాయ్'(తాయ్ అంటే మహారాష్ట్రలో అక్క అని అర్థం) అని పిలుచుకుంటుంటారు. అంతేగాదు ఆమె ప్రసిద్ధ పాప్ సంగీతం.. 1997లో లెస్లే లూయిస్‌తో కలిసి 'జనం సంఝా కరో' అనే విలక్షణమైన పాటను విడుదల చేసే టైంలో కూడా పాశ్చాత్య దుస్తులను ధరించడానికి ఒప్పుకోలేదు. మ్యూజిక్‌కి వేషధారణతో పనిలేదని, జనాల మనసుకు హత్తుకుందా లేదా అనేది ముఖ్యం అని అన్నారు. చివరి వరకు ఆశా తన సంగీత కచేరీలలో ఎర్రటి బొట్టు, అందమైన మహారాష్ట్ర చీరలతోనే విలక్షణంగా కనిపించారామె. View this post on Instagram A post shared by Zanai Bhosle💜 (@zanaibhosle) (చదవండి: ఆశా భోంస్లే మృతి: ఛాతీ ఇన్ఫెక్షన్లు ఎందుకంత ప్రమాదకరం..) -
మిస్ తెలుగు యూఎస్ఏ విజేతగా భాగ్యనగరం బ్యూటీ..! (ఫొటోలు)
-
కామాఖ్య ఆలయాన్ని సందర్శించిన నీతా..!
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, ఛైర్పర్సన్ నీతా అంబానీ సందర్భానికి తగ్గట్టు స్టైలిష్ రెడీ అవ్వడం ఆమె ప్రత్యేకత. ముఖ్యంగా హస్తకళలు, భారతీయ సంప్రదాయ వారసత్వ విలువ తెలిపేలా నీతా అలంకరణ ఉంటుంది. తాజాగా ఆమె తన తల్లి పూర్ణిమ దలాల్‌తో కలిసి కామాఖ్య ఆలయాన్ని సందర్శించారు. అక్కడ అమ్మవారికి విశేష పూజలు చేసి, ఆమె ఆవీర్వాదం కోరారామె. ఆలయ దర్శనం కోసం నీతా గులాబీ రంగులోని కుర్తాతో ఎంతో హుందాగా వచ్చారామె. పొడవాటి చేతులతో చుట్టు దుప్పటా దానిపై బంగారు ఎంబ్రాయిడరీ ఆమె లుక్‌ని మరింత హైలెట్ అయ్యేలా చేసింది. దానికి బంగారు బ్రోకేడ్‌తో అంచు ఎంబ్రాయిడరీ చేయబడిన స్ట్రెయిట్-ఫిట్ ప్యాంటుతో జత చేసింది. అందుకు తగ్గట్టుగా వదులుగా జుట్టుని వదిలేసి, చక్కటి పాపిడి బొట్టుతో సంప్రదాయంతో మిళితమైన ఆధునిక మహిళలా తళుక్కుమంది. సరళమైన సంప్రదాయ దుస్తులకు అనుగుణంగా మల్టీ-క్యారెట్ కాక్టెయిల్ రింగ్, స్టేట్మెంట్ డైమండ్ చెవిపోగులు ధరించారామె. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆలయం విశిష్టత..మా కామాఖ్య, లేదా కామేశ్వరి, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ప్రసిద్ధిగాంచిన అమ్మవారు. ఈ ఆలయం గౌహతిలో ఉంది. భూమిపై ఉన్న 51 శక్తి పీఠాలలో ఇది అత్యంత పవిత్రమైనది, పురాతనమైనది కూడాతన భద్రతా సిబ్బందితో కలిసి వచ్చిన నీతా అంబానీ, ఈ ఆలయాన్ని సందర్శించి, పూజారుల మార్గదర్శకత్వంలో పూజలు నిర్వహించారు. ఆమె అమ్మవారికి ప్రార్థనలు చేయడం, పూజారులతో మాట్లాడటం, పూజలు నిర్వహించడం, ఆలయంలో ఉన్న భక్తులను పలకరించడం వీడియలో స్పష్టంగా కనిపిస్తుంది. View this post on Instagram A post shared by Learner (@decodingeliteclass) (చదవండి: మొట్టమొదటి డైనోసార్ లెదర్ హ్యాండ్ బ్యాగ్..! ధర ఎంతో తెలుసా..) -
మహారాణిలా కియారా అద్వానీ.. చీర, నెక్లెస్ ధర తెలిస్తే విస్తుపోతారు!
ఫ్యాషన్ ఐకాన్‌గా విలక్షణంగా ఉంటారు బాలీవుడ్ నటి కియారా అద్వానీ. ఏ సందర్భమైన ఆమె ఫ్యాషన్ స్టైలే వేరేలెవెల్. ధరించే డిజైనర్ వేర్ నుంచి ఆభరణాలు, హ్యాండ్ బ్యాగ్ వరకు ప్రతిదీ అత్యంత ప్రత్యేకంగా ఉంటాయి. మ్యాగజైన్ షూట్ అయినా పండుగైనా..కియారా స్టన్నింగ్ లుక్స్ ఫ్యాషన్ ప్రియులను ఆకట్టుకునేలా, అనుకరించేలా ఉంటాయి. అలానే ఈసారి కూడా అత్యంత ఆకర్షణీయంగా మెరిశారు కియారా. ఆమె గత రాత్రి తన భర్త సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి ముంబైలో జరిగిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. అక్కడ ఆమె ధరించిన అద్భుతమైన చీర, మసబా వారి మహారాణి నెక్లెస్‌తో ఆకట్టుకున్నారు. సిల్క్ క్రేప్‌తో రూపొందించిన 'గుల్పోష్' చీరపై ఉన్న సున్నితమైన బుటా వర్క్, ఆమె మొత్తం రూపాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. ఆ చీర పల్లు మరింత హైలెట్‌గా నిలిచింది. బంగారు ఎంబ్రాయిడరీతో గులాబీ, ఆకుపచ్చ ఆర్గాంజా ప్యాచ్‌వర్క్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. పాంఖ్ బాగ్, గుల్ఝురోఖా మెటిఫ్లు చీరకు రాజససం ఉట్టిపడేలా చేయగా, ఫ్యాన్ ఆకారపు అంచులు ఈ చీర డిజైన్ని మరింత అందంగా కనిపించేలా చేశాయి. ఎంత అందమైన చీరకైనా మ్యాచింగ్ ఆభరణాలనేవి అత్యంత కీలకమైనవి. అందుకే కియారా మసబా వారి స్టేట్మెంట్ మహారాణి-శైలి నెక్లెస్‌ను ఎంచుకుంది. బంగారం, వజ్రాలు, ముత్యాలతో పొదగబడిని నెక్లెస్‌ని పొరలు పొరలుగా డిజైన్ చేశారు. ఇంతకీ కియారా ధరించిన చీర, నెక్లెస్ ధర తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం. చీర ధర వచ్చేసి రూ. 1.30 లక్షలు, నెక్లెస్ ధర రూ. 1.85 లక్షలు. అలాగే నటి సింపుల్ మ్యాకప్‌తో ఉంగారాల జుట్టుతో తన ఆహార్యాన్ని పూర్తి చేసింది. అంతేగాదు చేతిలో బ్రౌన్ రంగు హెర్మెస్ మినీ కెల్లి పోచెట్ బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. దీని ధర సైతం దగ్గర దగ్గర రూ. 33 లక్షల పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset)(చదవండి: NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!) -
NMACC వేడుకలో.. నీతా అంబానీ స్టన్నింగ్ లుక్..!
కళలు, సంస్కృతికి నిలయమైన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్(NMACC) మూడో వార్షికోత్సవం ఏప్రిల్ 3, 2026న ముంబైలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆమె ఆరుగజాల మెటాలిక సిల్క్ చీర, దానికి మ్యాచింగ్‌గా ఆభరణాలను ధరించి రాజసం ఉట్టపడే ఆహార్యంతో కట్టిపడేశారు. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖ తారలంతా విచ్చేశారు. ముఖ్యంగా షాహిద్ కపూర్, మీరా కపూర్, రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్, సిద్ధార్ధ్ మల్హోత్ర, కియార అద్వానీ తదితర తారాగణం హాజరయ్యారు. ఈ వేడుకలో నీతా అంబానీ రాజసం ఉట్టిపడే పట్టుచీరలో ధగధగ మెరిసిపోయారామె. సాంప్రదాయ భారతీయ హస్తకళకు అద్భుతమైన నిదర్శనంగా నిలిచింది ఆమె ధరించిన చీర. బంగారు, ముదురు ఎరుపు రంగుల ప్రకాశవంతమైన కలయికతో కూడిన చరీపై క్లిష్టమైన జరీ పని అద్భుతంగా ప్రతిబింబిస్తూ..ద్రవరూపంలో ఉన్న మెరుపని సృష్టిస్తోంది. సాంప్రదాయ పైస్లీ నమూనాలతో కూడిన వెడల్పాటి అంచు, చీరకు చక్కటి రూపాన్ని ఇవ్వగా పల్లుపై సూక్ష్మమైన నమూనాలు మరింత హైలెట్‌గా నిలిచాయి. దానికి మ్యాచింగ్‌గా మెరూన్ గోల్డ్ రంగులో పొట్టిచేతులతో కూడిన బ్లౌజ్ చీర లుక్‌ని అమాంతం పెంచేసింది. ఆ పట్టుచీరకు తగ్గట్టుగా ప్రకాశవంతమైన పచ్చులు, కెంపులతో పొదిగిన నెక్లెస్, చేతులకు బంగారు గాజులు, చెవులకు స్టేమెంట్ రింగులతో.. పండుగ వాతావరణాన్ని తలపించే రాయల్ లుక్‌లో ఆకర్షణీయంగా కనిపించారు నీతా. సాంప్రదాయ మహిళలా మధ్యపాపిడి చక్కటి కొప్పు, తేలికైన మేకప్‌తో హుందాగా మెరిశారామె. సింపుల్‌గా చెప్పాలంటే ఆమె మొత్తం రూపంలో సాంస్కృతికత ప్రతిధ్వనించింది. View this post on Instagram A post shared by Manav Manglani (@manav.manglani) (చదవండి: రెండుసార్లు ఉద్యోగం కోల్పోయి, మాృతృత్వం కోసం బ్రేక్ ఇచ్చి..మళ్లీ..!) -
పువ్వులే డ్రెస్సులు!
సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్‌గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్ డిజైన్స్ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్‌లో చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్ లుక్‌ను తీసుకువస్తున్నాయి.ఫ్రెష్ ఫ్లవర్ దుపట్టా...గులాబీలతో.. రెడ్ లేదా పింక్ రోజ్ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్ లేదా పింక్ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్ లుక్‌తో కనిపిస్తారు. మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్ సింపుల్‌గానూ, క్లాసీ లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్ డ్రెస్ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్‌తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్ కోసం వాడతారు.పువ్వుల బ్లౌజ్ డిజైన్స్...ఫ్రంట్ ఫ్లోరల్ టాప్ స్టైల్లో బ్లౌజ్ మొత్తం పూలతో కవర్ చేస్తారు. పువ్వులను బ్లౌజ్ బోర్డర్‌కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్ థ్రెడ్‌తో నెటెడ్ మెటీరియల్ మీద ఫిక్స్ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్ మీద డిౖజైన్ చేస్తున్నారు. డిజైన్‌ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. -
సారా మీనాకారి నెక్లెస్..! ఇంత స్పెషాల్టీ దాగుందా..?!
సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది. ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్‌లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్‌కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు. ఈ నెక్లెస్‌లో కొలంబియన్ ఎమరాల్డ్లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్. View this post on Instagram A post shared by Sunita Shekhawat (@sunita_shekhawat_jaipur) (చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..) -
అర్జున్ టెండూల్కర్ పెళ్లిలో కుందనపు బొమ్మలా సారా..!
సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు క్రికెట్ దిగ్గజాల నుంచి బాలీవుడ్ తారలు, పలువురు ప్రముఖులు విచ్చేసి సందడి చేశారు. తమ్ముడి పెళ్లిలో అక్క సారా కుందనపు బొమ్మలా మెరిసింది. మొత్తం వేడుకలో సారా లుక్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. సంప్రదాయతను ఆధునికతను కలగలసిన స్టైలిష్ లుక్‌లో కనిపించింది. సింపుల్‌గా చెప్పాలంటే దివి నుంచి భువికి వచ్చిన దేవతాలో అత్యద్భుతంగా ఉంది సారా. తల్లి అంజలి సైతం గులాబీ రంగు చీరనే ఎంచుకోవడం విశేషం. ఈ నేపథ్యంలో సారా, అంజలీలు పెళ్లి వేడుకలో ధరించిన చీరలు, ఆభరణాల స్పెషాల్టీ గురించి సవివరంగా చూద్దామా..!.సారా తన తమ్ముడి పెళ్లి వేడుక కోసం పింక్ బంధానిని ఎంచుకుంది. అద్భుతమైన జర్దోజి రేషమ్ ఎంబ్రాయిడరీకి తగ్గా కట్‌వర్క్ రోసెట్ బోర్డర్. జ్యువెల్డ్ టాసెల్స్‌తో డెకరేట్ చేసిన హాట్పింక్ సిల్క్ బ్లౌజ్‌తో మరింత అందంగా కనిపించింది. ఆ చీరపై ఉన్న ఎంబ్రాయిడరీ వర్క్ అత్యంత హైలెట్‌గా కనిపించడమే గాక ఆ శారీ అందాన్ని రెట్టింపు చేసింది. ఆ చీరకు దగ్గ భారీ సాంప్రదాయ ఆభరణాలు సారాను మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆకుపచ్చ పూసల బహుళ స్టెప్స్ ఎంబెడెడ్ నెక్లెస్, మ్యాచింగ్ చెవిపోగులు, పాపిడి బొట్టు, ఆమె లుక్‌ని మరింత హైలెట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. అలాగే మేకప్ కూడా చాలా నేచురల్‌గా కనిపించిన తీరు..సహజత్వానికి ప్రతిక సారా అని చెప్పకనే చెబుతోంది. View this post on Instagram A post shared by Viral Bhayani (@viralbhayani)ఇక కూతురు సారా అందానికి తగ్గట్టుగా తల్లి అంజలి ఈ వేడుకలో రాజరికపు గులాబీ రంగు చేనేత పట్టు చీరను ఎంచుకుంది. ఆమె అత్యంత విలాసవంతమైన లగ్జరీని అంతగా ఇష్టపడరు. సచిన్ భార్య అంజలి ధరించిన చీరను డిజైనర్ జుహి షా రూపొందించారు. ఇక అంజలిని అందంగా తీర్చిద్దింది సెలబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్ నిషి సింగ్. సచిన్ సైతం ఆ మేకప్ ఆర్టిస్ట్ నైపుణ్యాన్ని కొనియాడారు. మీరు అంజలి లుక్‌ని చాలా అందంగా చూపించారని మెచ్చుకున్నారు. View this post on Instagram A post shared by Nishi Singh (@nishisingh_muah)ఇక అంజలీ కూడా మేకప్ ఎప్పుడూ హెవీగా ఉండకూడదని సహజత్వాన్ని అందంగా చూపిస్తే చాలని, అందుకే తాను మినిమల్ లైట్ మేకప్‌నే ఎంచుకుంటానని అన్నారామె. ఇక ఈ వేడుకలో సచిన్ క్రీమ్ ఎంబ్రాయిడరీ షేర్వానీలో కనిపించగా, వధువరులు అర్జున్ సానీయాలు ఎరుపు రంగును ఎంచుకున్నారు. అర్జున్ టెండూల్కర్ దుస్తులను మనీష్ మల్హోత్రా, సానియా లెహంగాను తరుణ్ తహిలియానిలు రూపొందించారు. (చదవండి: తొలి మహిళా తవిల్ కళాకారిణి..! ఏ ఆర్ రెహమాన్ సైతం..) -
అర్జున్-సానియా వివాహంలో పుత్తడి బొమ్మలా నీతా స్టైలిష్ లుక్..!
సచిన్- అంజలి దంపతుల కుమారుడు, క్రికెటర్ అర్జున్ టెండుల్కర్, యువ వ్యాపారవేత్త సానియా చందోక్‌ల వివాహం గురువారం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు క్రికట్ దిగ్గజాలు, బాలీవుడ్ సెలబ్రిటీలు, ప్రముఖులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ కుటుంబ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. అనంత్-రాధిక మర్చంట్ల వివాహవేడుక జరిగిన అదే ప్రదేశంలో అర్జున్ సానియాల వివాహం జరగడం విశేషం. ఆ నేపథ్యంలో ఆ సచిన్ టెండూల్కర్ ఇంట జరిగే పెళ్లి తంతుకి సంబంధించిన ప్రతీది అంబానీ కుటుంబమే స్వయంగా చూసుకుంది. అందుకు సచిన్ కూడా సభా ముఖంగా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు కూడా. కాగా ఈ వేడుకలో ఫ్యాషన్‌కి ఐకాన్‌గా ఉండే రిలయన్స్ ఛైర్మన్, తన సిగ్నేచర్స్టైల్తో మెరిశారు. వేడుకుకు తగిన విధంగా తన ఆహార్యాన్ని ప్రతిబింబించేలా కేర్ తీసుకుంటారు నీతా. ఆమె ఈ వేడుకకి రిలయన్స్ వ్యాపారవేత్త ముఖేష్ అంబానీ, పెద్ద కుమారుడు ఆకాష్ అతడి భార్య శ్లోకా మెహతాలతో కలిసి విచ్చేశారు. ఈ వేడుకలో ఆయు ధరించిన చీర, ధగ ధగ మెరిసిపోతున్న నెక్లెస్ అత్యంత హైలెట్‌గా నిలిచాయి. నీతా ఈ వేడుక కోసం రాచరికపు స్టైల్ ఐవరీ బంగారు సిల్క్ చీర ఎంచుకున్నారు. ఈ ఆరుగజాల చీరలో నీతా బంగారపు బొమ్మలా ముగ్ధమనోహరంగా కనిపించారు. బంగారు మోటీఫ్‌లతో అలకరిచిన ఆ ఫ్యాబ్రిక్ ప్రకాశవంతమైన ఆకృతిని ఇచ్చింది. నిలువు జరీ చారలతో ఎంబ్రాయిడరీ స్లీవ్ బోర్డర్లు చీర లుక్‌ని మరింత అందంగా కనిపించేలా చేసింది. ఆ చీరకు సింపుల్‌గా స్టేట్మెంట్ డైమండ్ నెక్లస్ చీర అందాన్ని అమాంతం రెట్టింపు చేసింది. చెవికి కూడా డైమండ్ స్టడ్ పోగులు ధరించి స్టైల్ పరంగా నీతాకు సాటిరారెవ్వరూ అనేంతగా ఉంది ఆమె ఆహార్యం. ఇక ముఖేశ్ అంబానీ కూడా క్లాసిక్ బ్లాక్ బంధ్ గలా సూట్లో హుందాగా కనిపించారు. అంతేగాదు ఈ జంట ఆధునాతన సంప్రదాయంతో కలగలసిన స్టైలిష్ లుక్‌లో అందరి మనసులను దోచుకున్నారు. View this post on Instagram A post shared by Pallav Paliwal (@pallav_paliwal) (చదవండి: 'మిర్చి హోలీ'..రంగు పులుముకున్న పుడమి తల్లి..!: ఆనంద్ మహీంద్రా) -
బుల్లి ఫ్యాషన్ డిజైనర్..! జస్ట్ పదేళ్లకే..
ఫ్యాషన్ డిజైనర్ అవ్వడం అంత ఈజీకాదు. ఆ రంగం ఎంత ఇష్టమైనా.. దానిలోని మెళుకువలపై పట్టు సాధించేది మాత్రం టీనేజ్ వయసుకే. అంతకంటే చిన్న వయసులో అంత సులభం కాదు..పైగా క్లాత్‌ని పట్టుకుని కుట్టుగల నేర్పరితనం, క్రియేటివిటీ ఉండదు. కానీ ఈ బుడతడు..పిట్ట కొంచెం కూత ఘనంలా అలవోకగా పలు రకాల ఫాబ్రిక్లను అందమైన డిజైనర్‌వేర్‌లా తీర్చిదిద్దుతుండటం విశేషం. అంతేకాదండోయ్ ఏకంగా ప్రతిష్టాత్మక ఫ్యాషన్ వీక్‌లో దిగ్గజ డిజైనర్ల మధ్య..తన ఫ్యాషన్వేర్ని ప్రదర్శించనున్నాడు కూడా. ఇలా అత్యంత పిన్నవయసులో ఫ్యాషన్ డిజైనర్‌గా అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించనున్న చిన్నారిగా సరికొత్త చరిత్రను సృష్టించాడు. ఆ చిన్నారి ఎవరంటే..ఆ చిచ్చర పిడుగే మాక్స్ అలెగ్జాండర్. ఆ చిన్నారి తల్లిదండ్రులు జాక్ అలెగ్జాండర్, షెర్రీ మాడిసన్ దంపతులు. పూర్తిగా భాషై పట్టు రాని ఆ వయసుకే ఈ బాలుడు మాక్స్ స్కెచ్ పట్టుకుని డిజైన్లు, సూది దారం సాయంతో చక్కటి కళ్లు చెదిరిపోయే ఫ్యాషన్వేర్లను క్రియేట్ చేసేస్తాడు. తనలోని ఫ్యాషన్ క్రియేటివిటీ తన సోదరి సమంత కారణంగా బయటకు వచ్చిందట. ఆమెకు ప్రస్తుతం 14 ఏళ్లు. తాను తయారు చేసిన డిజైనర్వేర్లన్నీ తన అక్క కోసమేనని, ఆమె వాటిని ధరించి చూడటం నిజంగా చాలా ఆనందాన్నిస్తుందని చెబుతున్నాడు మాక్స్. అతడి క్రియేటివిటీ అత్యంత విభిన్నం..ఫ్యాషన్ డిజైనర్లు ముందుగా తమ క్రియేటివిటీ లేదా ఆలోచనను కాగితంపై స్కెచ్‌తో పని చెబితే..మాక్స్ మాత్రం ముందుగా దాన్ని మడతలతో కట్టి చూస్తాడు. ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి కుట్టేస్తాడు. తనకు డ్రేపింగ్ అంటే ఇష్టమని, ముందుగా ధరిస్తేనే..క్రియేటివిటీ తళుక్కుమని బుర్రలో ప్రత్యక్షమవుతుందని చెబుతున్నాడు మాక్స్. అలా ఇప్పటివరకు ఈ చిన్నారి 150కి పైగా డిజైనర్‌వేర్‌లు రూపొందించాడు. వాటిలో దుస్తులు, జాకెట్లు, స్కార్ఫ్‌లు, బ్యాగులు, కిమోనోలు, సూట్లు, స్టఫ్డ్ యానిమల్స కూడా ఉన్నాయి. అంతేగాదు తన సొంత రన్‌వే షోను ప్రదర్శించిన అతి పిన్న వయస్కుడిగా గిన్నిస్ రికార్డు కూడా నెలకొల్పాడు. 2024లో ఎనిమిదేళ్ల వయసులో ఐక్యరాజ్యసమితలో ఫ్యాషన్ స్థిరత్వంపై ప్రసంగించాడు. వ్యర్థాలను పునర్వినియోగం చేసి.. దుస్తులుగా ఎలా మలచొచ్చో ఆలోచనాత్మకంగా వివరించాడు. పైగా దాన్ని కార్యరూపంలోకి తీసుకొచ్చేలా కాఫీ బీన్ బ్యాగ్‌ల నుంచి రూపొందించిన డిజైనర్‌వేర్‌లలో మెరిశారు మోడళ్లు. అలాగే ఆ చిన్నారి మాక్స్ చదువుకుంటూనే ఫ్యాషన్ వీక్‌లలో తన ప్రదర్శనలను ఇస్తుంటాడు. ఇదేగాక మాక్స్‌కి పలు స్కిల్ కూడా ఉన్నాయి. అవేంటంటే వంట చేస్తాడు, పికిల్‌బాల్, టెన్నిస్ వంటివి ఆడతాడు, కథలు రాస్తాడు. అలాగే తనకొక రెస్టారెంట్, కారు వాష్‌ని ఉండాలని కలలుకంటుంటాడు. పైగా ఇంజనీర్ కావలన్నిది అతడి ధ్యేయం కూడా. ఇక మాక్స్ తన పాఠశాల చదువుకి ఆటంకం లేకుండా వారాంతాల్లో ఫ్యాషన్‌కి సంబంధించిన స్కిల్స్‌లో నిమగ్నమవుతుంటాడట. నిజంగా పెన్సిల్ పట్టుకుని కుదురుగా బొమ్మలు వేయని ఆ చిరుప్రాయంలో ఇంత అసామాన్య ఫ్యాషన్ డిజైనర్ ప్రతిభ మాటలకందనిది కదూ..!.వీడియోపై క్లిక్ చేయండి(చదవండి: తనకు తాను ఓటు వేసుకుని మేయర్ అయిన మహిళ..! ఎక్కడంటే..) -
నటి రష్మిక మందన్న 'కొడగు' శారీ స్టైల్..!
నటి రష్మిక మందన్న పెళ్లి గురువారం ఉదయం తెలుగు సంప్రదాయంలో, సాయంకాలం కొడగు (కూర్గి) సంప్రదాయ పద్ధతిలో వైభవంగా జరిగింది. తన సంప్రదాయ మూలాలను మర్చిపోకుండా కొడగు స్టైల్ కట్టును వివిధ సందర్భాలలో ధరించడం మనం చూశాం. వివాహం, ఇతర వేడుకలలో కొడగు సంప్రదాయ చీరకట్టుదే ప్రత్యేక ఆకర్షణ.రష్మిక వివాహ వేడుక సందర్భంగా కొడగు చీరకట్టు ప్రాచుర్యంలోకి వచ్చింది. మన దేశ సంప్రదాయ డ్రేపింగ్ శైలిలో విలక్షణంగా కనిపించే కొడగు కట్టును రీ క్రియేషన్ చేసి, బాలీవుడ్ క్లాసిక్ సినిమాలలోనూ కనువిందు చేశారు తారలు. కొడగు స్టైల్ డ్రేప్ ట్రెండ్ గురించి..కర్నాటకలోని కొడగు జిల్లాలో మగువల చీరకట్టులో ప్రత్యేకంగా కనిపిస్తుంది ఈ శారీ డ్రేపింగ్. కొండ ప్రాంతంలో పుట్టిన సంప్రదాయ శైలి ఇది. కొడగు లేదా కొడవ లేదా కూర్గి అని పిలిచే కమ్యూనిటీలోని వివాహ సమయంలో అక్కడి వధువు జరీ అంచుతో ఉన్న పట్టు చీరను వారి సంప్రదాయ శైలిలో ధరిస్తుంది. ఇది కేవలం ఒక శైలి కాదు ఒక తరం నుండి మరొక తరానికి అందివస్తున్న వారసత్వం. ఈ చీరకట్టు కొడవ మహిళల బలం, అందం, స్వాతంత్య్రాన్ని ప్రతిబింబింపజేస్తుంది. వేడుకలలో సాధారణంగా ఎరుపు, ఆకుపచ్చ, బంగారు రంగులలో .. జరీ అంచుతో ఉండే కాంతిమంతమైన పట్టు చీరలను ఎంచుకుంటారు. ఇవి శుభాన్ని, శ్రేయస్సును తీసుకువస్తాయని వారి నమ్మకం.నడుము వద్ద చీరను పెట్టికోట్ లోపలికి టక్ చేస్తారు. సాధారణ చీరకట్టుకు భిన్నంగా ముందు వైపు కాకుండా కూర్గి శారీ డ్రేప్కు వెనకవైపు కుచ్చిళ్లు పెడతారు.చీరను రెండుసార్లు శరీరం చుట్టూ తిప్పుతూ, చీర పల్లూ ఛాతీ మీదుగా ఎడమ భుజం కింద నుంచి, కుడి భుజం పై నుంచి ముందుకు తీస్తారు.కుడి భుజం నుంచి తీసిన పల్లూని బ్లౌజ్‌తో కలిపి పిన్‌తో అటాచ్ చేస్తారు. పల్లూ అలంకరణ కొంత వరకు బెంగాలీ స్టైల్‌ను పోలి ఉంటుంది. కొడవ సంప్రదాయ ఆభరణాలలో చంద్రవంక, నాగాభరణం.. వంటి పొడవాటి హారాలతోపాటు ఇతర సంప్రదాయ నగలను అలంకరించుకుంటారు.కొడవ యువతులు షిఫాన్, జార్జెట్, ఆర్గంజా చీరలతో డ్రేపింగ్‌లో వివిధ రకాల ప్రయోగాలు చేస్తారు.యువతుల కోసం రెడీమేడ్ కొడవ కట్టు శారీస్ కూడా అందుబాటులోకి వచ్చాయి. ప్రత్యేక ఆకర్షణతో ఉండే బెల్టులు, బ్రోచ్లు ఈ కట్టుకు ఇప్పుడు ఫ్యూజన్ ట్విస్ట్‌ను తీసుకువస్తున్నాయి. View this post on Instagram A post shared by राशि रमा शर्मा (@_wearyourstory__) (చదవండి: ఆ పాదాలకు నమస్కారం..! ఏకంగా 12 వేల కిలోమీటర్లు..) -
ఐడియా అదుర్స్..! ఫ్యాషన్‌ని ఇలా కూడా చూపించొచ్చా..!?
సోషల్ మీడియా పుణ్యమా అని..చాలామంది ఓవర్‌నైట్ స్టార్లుగా, సెలబ్రిటీ హోదాను పొందుతున్నారు. ఆ జాబితాలోకి చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా అందరు చేరి.. సక్సెస్‌ని అందుకోవడం విశేషం. అయితే ఫ్యాషన్ వద్దకు వచ్చేటప్పటకీ.. మనలోపల టాలెంట్ మొత్తం తీసి ..రీల్స్ చేసినా..క్లిక్ అవ్వడం కొంచెం కష్టమే. ముఖ్యంగా అందరికి చేరువవ్వాలంటే అంత సులభమైన టాస్క్ కాదు. ఫ్యాషన్ అనగానే బాగా డబ్బున్నవాళ్లకే చెల్లుతుందనే అభిప్రాయం బాగా ఎక్కువ జనాల్లో. కానీ దాన్ని సామాన్యుల చెంతకు చేర్చి..అది మన లైఫ్‌లో భాగమనిపించేలా అందంగా చూపించింది ఈ అమ్మాయి. ఈ ఒక్క రీల్‌తో సెన్సేషన్‌గా స్టార్‌గా మారి.. ప్రపంచ వేదికపై నిలిచింది. అంతేగాదు ఎవరా ఆ అమ్మాయి అంత కూల్‌గా, చాలా క్యాజువల్‌గా ఫ్యాషన్‌ని ఎంత బాగా పరిచయం చేసింది.. అని నెటిజన్లు చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఇంతకీ ఎవరంటే ఆమె..ఆ అమ్మాయే దియా జౌకానీ. వృత్తిరీత్యా ఆమె హై-ఎండ్ ఫ్యాషన్ డిజైనర్. ఇన్‌స్టాగ్రామ్‌లో"కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" అనే క్యాప్షన్‌తో ఆమె షేర్ చేసిన ఫ్యాషన్ వీడియో నెట్టిం ప్రభంజనం సృష్టించింది. ఎవరీ కూల్గర్ల్ అని చర్చలకు తెరతీసేలా..హాట్‌టాపిక్‌గా మారిందామె. ఆ రీల్లో ఆమె ధరించిన దుస్తులు కూడా స్వయంగా ఆమె డిజైన్ చేసినవేనట. సోషల్ మీడియాను ఆమె తన ఫ్యాషన్ ప్రదర్శనకు ఫ్లాట్‌ఫామ్‌గా ఉపయోగించుకుంటూ..తన డిజైన్లను ఇలా రీల్స్ ద్వారా నిశబ్దంగా ప్రదర్శించింది. తన డిజైనర్‌వేర్‌లతో చాలా స్మార్ట్‌గా మార్కెటింగ్ చేస్తోందామె. ఆ వీడియోలో దియా హై ఫ్యాషన్‌ను సరదాగా ధరించగలిగేలా ఆకర్షించింది. అంతేగాదు దియా ఇన్‌స్టాగ్రామ్‌లో మొత్తం ఆమె ఫ్యాషన్ ప్రపంచాన్ని చూడొచ్చు. తన కంటెంట్ మొత్తం చాలా నిరాడంబరంగా ప్రజెంట్ చేస్తుండటంతో..ప్రజలు ఒక్క క్షణం వేచి వీక్షించగలిగేలా ఆకట్టుకుంటున్నాయి ఆ వీడియోలు. ప్రస్తుతం దియా చేసిన "కూల్ గర్ల్ ఫ్రమ్ ఇండియా" ఎంత ట్రెండీగా మారిందంటే..అందురు ఆమెలా అనుకరించే యత్నం చేస్తున్నారంటేనే అర్థం చేసుకోవచ్చు..ఆ వీడియో ఎంతగా నెటిజన్ల మనసులను తాకిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.కాగా, నెట్టింట వైరల్ అవుతున్న ఆ వీడియోల బ్యాగ్రౌండ్లో క్లాసిక్ ఫ్రాంక్ ఓషన్స్ నైట్స్ ప్లే అవుతూ ఉంటే.. దియా చక్కటి ఫ్యాషన్‌వేర్‌లో చాయ్ తాగుతూ కనిపిస్తుంది. ఆ తర్వాత నగర వీధుల గుండా నడవడం ప్రారంభిస్తుంది. కొద్ది సెకన్లలో గుర్రపు స్వారీ చేస్తూ, కొబ్బరి నీళ్ళు తాగుతూ ఉండటం లేదా ఆమె వ్యక్తిగత రైడ్ లాగా JCB పారపై కూర్చోవడం..ఇలా విలక్షణంగా కనబడుతుంది ఆయా వీడియోలలో. అయితే వాటి అన్నింటిలోనూ దియా వివరణాత్మక, హై-ఫ్యాషన్ దుస్తులను ధరించడం స్పష్టంగా చూడొచ్చు. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani)ఈ వీడియో ఇంతలా క్లిక్ అవడానికి కేవలం ప్రజెంటేషన్ చేసిన విధానమే ఆమెను ఐకానిక్‌గా మార్చేసింది. ఇక్కడ దియా విలాసవంతమైన దుస్తులను ధరించింది కానీ..స్టూడియో లేదా లగ్జరీ నేపథ్యం ఎంచుకోకుండా..ఇలా సాధారణ వీధుల గుండా వెళ్తూ..హై ఫ్యాషన్ మన రోజువారీ జీవితంలో భాగం చేసుకోవడం ఎలాగో నేర్పుతున్నట్లుగా ఉంది. అందుకే ఇది ఎక్కువ మంది ప్రజలకు రీచ్ అయ్యి..అంతలా వ్యూస్, లైక్‌లు వచ్చాయి ఆ వీడియోకి. ఒక్క ఐడియా జీవితాన్ని మార్చేస్తుందని అన్నట్లుగా ఒక్క రీల్‌తో దియా సెన్సేషన్‌గా మారింది కదూ..!. View this post on Instagram A post shared by 🪔 (@diyajoukani) (చదవండి: అరుదైన పెళ్లి: ట్విన్ సిస్టర్స్‌ని పెళ్లాడిన ట్విన్ బ్రదర్స్..!) -
కోకిలాబెన్ అంబానీ 92వ పుట్టినరోజు వేడుకలు..! ఆమె మార్క్ ఉండేలా..
వ్యాపార ప్రపంచంలో అపరకుబేరుల్లా వెలుగుతున్న ఫ్యామిలీ అంబానీ. అలాంటి వంశ పార్యంపర్య వ్యాపారానికి వెన్నుముకగా నిలిచిన శక్తిమంతమైన మహిళ కోకిలాబెన్ అంబానీ అంటే అతిశయోక్తి కాదు. ధీరూభాయ్ వ్యాపార ప్రపంచాన్ని శాసించినా, ముఖేష్ అంబానీ ఆసియా కుబేరుడిగా అవతరించినా.. దీని వెనుకున్న గొప్ప మహిళా మూర్తి కోకిలా బెన్. ఇవాళ కోకిల్ బెన్ 92వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే ఆమె సంపన్న మహిళ వలే గ్రాండ్‌గా కాకుండా చాలా సాదాసీదాగా జరుపుకుంటూ..సింపుల్సిటీకీ కేరాఫ్‌గా నిలిచారామె. ఆఖరికి ధరించిన చీర సైతం సాధారణమైన నిమ్మపండు రంగు షిఫాన్ చీరలో కాలాతీత సౌందర్యానికి కట్టుబడి ఉన్నట్లుగా.. తన ప్రత్యేక శైలితో ఆకట్టుకున్నారామె. అంబానీ అప్డేట్ ఇన్‌స్టాగ్రామ్‌లో అందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు షేర్ చేశాడరు. భారీ అలంకరణలు, ఖరీదైన ఆభరణాలుగానీ ధరించకుండా..ఆహ్లాదకరమైన పసుపు రంగు చీరతో నవ్వుతూ కనిపించారామె. ఒక సాధారణ గొలుసు, సున్నితమైన చెవుపోగులు, సాంప్రదాయ ఎరుపు బిండితో తన లుక్‌ని పూర్తిచేసింది. సహజ అలంకరణకు మించిన బ్యూటీ మరొకటి ఉండదని చెప్పకనే చెప్పారు కోకిలాబెన్. ఇక ఈ వేడుకలో ఆమె ఉనికిని తెలియజేసేలా చేతులు, కాళ్ల గుర్తుల ఫ్రేమ్‌తో సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. కోకిలాబెన్ నేపథ్యం..1934లో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో జన్మించిన కోకిలాబెన్ అంబానీ, అంబానీ కుటుంబానికి మాతృమూర్తి, రిలయన్స్ ఇండస్ట్రీస్ వ్యవస్థాపకుడు ధీరూభాయ్ అంబానీ భార్య. 1955లో ధీరూభాయ్‌ను వివాహం చేసుకుని కొంతకాలం యెమెన్‌లోని ఆడెన్‌లో నివశించారు. ఆ తర్వాత వ్యాపార సామ్రాజ్యం అభివృద్ధి చెందడంలో ఆమె కీలక సహాయక పాత్ర పోషించారామె. అలాగే 2002లో ఆయన మరణం తర్వాత, కుమారులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీల మధ్య జరిగిన హై ప్రొఫైల్ వివాదానికి ఆమె మధ్యవర్తిత్వం వహించారు. అలా 2005లో రిలయన్స్ గ్రూప్ విభజనకు దారితీసింది. ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్‌తో సహా పలు దాతృత్వ కార్యక్రమాల్లో ఆమె పాత్ర కూడా ఉంది. సంప్రదాయాలకు కట్టుబడి ఉండే గౌరవనీయమైన వ్యక్తిగా పేరుతెచ్చుకున్నారు కోకిలాబెన్. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: పిల్లలకు నేర్పించాల్సింది ఇదే..! గుడ్ పేరెంటింగ్ స్టైల్) -
డ్యామేజ్‌ని కూడా ఫ్యాషన్‌గా మార్చేశారు..!
ఫ్యాషన్‌లో కొన్ని వింత పోకడలు పిచ్చెక్కించేలా ఉంటాయి. నీ క్రియేటివిటీ పాడు కాను అని తిట్టుకునేలా ఉంటాయ్. ఇటీవల కాలంలో కొన్ని ప్రముఖ ఫ్యాషన్ బ్రాండ్లు ఇలాంటే పనులే చేసి అభాసుపాలయ్యాయి. కొత్తగా క్రియేట్ చేసే సామర్థ్యం తప్పిందో లేక జనాలను తక్కువ అంచనా వేస్తున్నారో తెలియదు గానీ..పొరపాటున డ్యామేజ్ అయ్యే వాటినే లేటెస్ట్ ట్రెండీ ఫ్యాషన్ అంటూ పరిచేయం చేయడం బాధకరం. పైగా వాటి ధర కూడా కనివినీ ఎరుగుని రేంజ్లో ప్రకటించి..ఆయా బ్రాండ్ విలువలను దిగజార్చుకుంటున్నారు. ఇక్కడ కూడా అచ్చం అలాంటిదే జరిగింది. 'వెట్మెంట్స్' అనే లగ్జరీ ఫ్యాసన్ బ్రాండ్ 'ఐరన్ బర్న్' గుర్తు ఉన్న సాదా తెల్లచొక్కాను మార్కెట్లోకి విడుదల చేసి..దీని ధర ఏకంగా రూ. 1లక్ష అని ప్రకటించింది. దాంతో ఒక్కసారిగా ఇదేం ఫ్యాషన్ అంటూ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. క్రియేటివిటీ రాకపోతే కామ్‌గా ఉండు..మరి ఇలానా అంటూ తిట్టిపోస్తున్నారు జనాలు. చూడాలంటే మనం ఐరన్ చేసేటప్పుడు పొరపాటు షర్ట్ జేబు కాలిన గుర్తులా ఉంది అది. ఏదో లేటెస్ట్ ఫ్యాషన్ షర్ట్ అంటూ మార్కెట్లోకి వదలడమే కాక..అంత ఖరీదు ప్రకటించి జనాలను పిచ్చివాళ్లను చేయాలనుకుంటున్నారా అంటూ మండిపడుతున్నారు నెట్టింట. అంతేగాదు ఫ్యాషన్ కళాత్మకంగా కనుమరుగై..జోక్‌గా మారిపోయింది అని సెటైర్లు వేస్తు పోస్టులుపెట్టారు కూడా. VETEMENTS made a graphic shirt with an “iron burn” print that retails $1,139 pic.twitter.com/F5e9pkLQ8j— STAYGROUNDEAD TV (@staygroundeadtv) February 16, 2026 (చదవండి: ఏఐ సదస్సు లంచ్ మెనూ ఇదే..! పాలు, గోధుమలు..) -
అంబానీల ఆడపడుచు కోడలు.. లెహంగా ధర తెలిస్తే షాక్!
అంబానీల వంశంలోకి కొత్త సభ్యురాలుగా శ్వేనాపోయ్ చేరిన సంగతి తెలిసిందే. ఇటీవలే రిలయన్స్ దిగ్గజం ముఖేశ్ అంబానీ మేనల్లుడు విక్రమ్ సల్గావ్కర్, శ్వేనపోయ్లు ఈ నెల(ఫిబ్రవరి) 12న ముంబైలో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకున్నారు. ఈ వేడుకకు మొత్తం అంబానీల కుటుంబం హాజరై సందడి చేశారు. ఈవేడుక అంబానీల రేంజ్‌కి తగ్గట్టుగా అత్యంత విలాసవంతంగా జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలో శ్వేనాపోయ్ ధరించిన లెహంగా నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆ లెహంగా ఖరీదు ఊహకందని రేంజ్లో ఉంది. ఇంత ధరపలికే లెహంగాలు కూడా ఉంటాయా అని విస్తుపోయేలా ఉంది. ఆ ఫ్యాబ్రిక్‌ని డిజైన్ చేసిన విధానంలో కూడా ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. అవేంటో చూద్దామా..!.ముఖేశ్ అంబానీ మేనల్లుడు, దివగంత ధీరూభాయ్ అంబానీ మనవడు విక్రమ్ సల్గావ్కర్ని పెళ్లాడి శ్వేనా అంబానీ కుంటుంబంలోకి అడుగుపెట్టింది. ఆమె తన పెళ్లివేడుకలో ధరించిన లెహంగా అత్యంత హైలెట్‌గా నిలిచింది. ఈ లెహంగా సాంప్రదాయ ఫ్యాబ్రిక్‌తో తయారు చేసినది మాత్రం కాదు. చాలా స్పెషాల్టీ ఉంది ఈ లెహంగాకి. లోహదారాలతో తయారు చేశారట. దీన్ని జేఏడీఈ(JADE)కి చెందిన మోనికా షా డిజైన్ చేశారట. ఈ లెహంగాని డిజైన్ చేయడానికే దాదాపు 1500 గంటలపైనే పట్టిందట. చాణిక్య ఇంటర్నేషనల్ బ్రాండ్‌కి చెందిన 40 ఏళ్ల నాటి వారసత్వానికి నిదర్శనం ఈ లెహంగా. అరుదైన మొఘల్-యుగ కసబ్ టెక్నిక్‌ను పునర్జీవింప చేసేలా ఈ లెహంగాను తీర్చిదిద్దారు. చెప్పాలంటే ఇదోక కవచంలా ఉంటుంది. ఈ మొఘల్-యుగ కసబ్ టెక్నిక్ ఎంబ్రాయిడరీ గుజరాజ్, రాజస్థాన్ వంటి ప్రాంతాలలో ఉద్భవించిందని అంటుంటారు. అక్కడ చేతివృత్తులు వారు వెల్వేట్, బ్రోకేడ్‌తో సహ పలు రకాల విలాసవంతమైన దుస్తులను బంగారం లేదా వెండి లోహ దారాలతో తయారు చేస్తారట. వీటిని పట్టు లేదా కాటన్ కోర్ చుట్టూ ఈ డిజైన్ని రూపొందిస్తారు. చాలా సందర్భాల్లో మెటాలిక్ పాలిస్టర్ని కూడాఉపయోగిస్తారు. అంతేగాదు ఈ ఎంబ్రాయిడరీ అభ్యసించే కళాకారులకు చాలా నైపుణ్యం, ఓపిక తప్పనిసరిగా ఉండాలట. కసబ్ ఎంబ్రాయిడరీలో అత్యంత కష్టమైనది.. ఫ్రాబ్రిక్ ఉపరితలంపై లోహదారాలను అత్యంత జాగ్రత్తతో, నైపుణ్యంతో కుట్టాల్సి ఉంటుందట. అంతేగాదు ఈ డిజైన్లు ప్రాంతీయ సౌందర్యం, సంప్రదాయలను ప్రభావితం చేసేలా కళాత్మకంగా రూపొందిస్తారు. దీనిలో కసబ్ జర్దోజీ, గోటా పట్టి వంటి విభిన్న శైలులు కూడా ఉంటాయట. అచ్చం ఇలాంటి లెహంగానే మినావాలా కేన్స్ 2025లో అర్పితా మెహతా ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ శ్వేనా కారణంగా ఈ ఎంబ్రాయిడరీ గొప్పదనం మరోసారి వెలుగులోకి వచ్చి హెలెట్‌గా నిలిచింది. దీని ధర సుమారు రూ. 1 కోటి రూపాయలు పైనే పలుకుతుందట. View this post on Instagram A post shared by WeddingSutra.com (@weddingsutra) (చదవండి: వధువుపై కోట్ల రూపాయల నగదు వర్షం..! ఎక్కడంటే..) -
అంతర్జాతీయ మోడల్‌గా సివిల్ ఇంజనీర్..! ఒక్క రోజుకే..
ఇంజనీరింగ్ చదువుకుంటూనే ఫ్యాషన్ ప్రపంచం వైపుకి అడుగులు వేశాడు ఈయువకుడు. ఒక పక్క చదువుని, అభిరుచిని..రెండిటిని సమతుల్యం చేస్తూ..మోడలింగ్‌లో మంచి సక్సెస్‌ని అందుకున్నాడు. అంతేగాదు ఇంజనీర్‌గా ఒక్క ఏడాదిలో సంపాదించే మొత్తం మోడల్‌గా ఒక్కరోజులోనే ఆర్జిస్తూ..గ్లామర్‌కున్న క్రేజ్‌ని చాటి చెప్పాడు. అంతేగాదు రెండు విభిన్న రంగాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ని విజయవంతంగా నిర్మించుకోవచ్చని నిరూపించి, స్ఫూర్తిగా నిలిచాడు. అతడే శుభమ్ వైద్కర్. 24 ఏళ్ల ఈ యుకువడు సివిల్ ఇంజనీర్ గ్రాడ్యేయేట్. కానీ ఇవాళ అంతర్జాతీయ మోడల్‌గా లక్షలు ఆర్జిస్తున్నాడు. అంతర్జాతీయ ఫ్యాషన్ బ్రాండ్ అర్మానీ కోసం చాలాసార్లు ర్యాంప్‌పై నడిచాడు. ముంబైలో పుట్టి పెరిగిన శుభమ్ అక్కడే సివిల ఇంజనీరింగ్‌ని పూర్తి చేశాడు. ఇంజనీరింగ్ రెండో ఏడాది నుంచే మోడలింగ్ ప్రారంభించాడు. ఇన్‌స్టాగ్రామ్‌లోని ఒక రీల్ చూసి దీనిపై ఆసక్తి పెరిగిందని చెప్పుకొచ్చాడు. అయితే అప్పడు తన బరువు 83 నుంచి 84 కిలోలు వరకు ఉండేవాడినని అన్నాడు. మోడల్ వైపుకి వచ్చానే కానీ..ఎలా అనేది అంతగా తెలియదు. అందుకోసం అని గూగుల్‌లో వెతకగా..మనకు ప్రాతీనిధ్యం వహించడానికి ఏజెన్సీలు అవసరమని తెలుసకున్నానని అంటున్నాడు శుభమ్. దాతో తన ఫోటోలు ఏజెన్సీలకు పంపాను..వాటిలో ఒక ఏజెన్సీ తనను మీటింగ్‌కి పిలిచి..నేరుగా బరువు తగ్గాలని సూచించారని తెలిపాడు. అందుకు ఒక నెల సమయం ఇచ్చారని చెప్పుకొచ్చాడు. అయితే వెంటనే శుభమ్ టైం వేస్ట్ చేయకుండా వెయిట్‌లాస్ అయ్యే పనిలో పడ్డాడట. అప్పటి నుంచే చక్కెర, జంక్ పదార్థాలు, నూనె పదార్థాలకు చాలా దూరంగా ఉండేవాడట. అలా మోడల్‌గా మారేందుకు కష్టబడుతున్న తరుణంలో 2024 జనవరిలో అర్మానీ షో కోసం ఇటలీలోని మిలన్కు వెళ్లే అవకాశం తనకు మొదటిసారి లభించిందని చెప్పుకొచ్చాడు. అంతకుమందు భారత్‌లో మోడలింగ్‌గా చేశానని, కానీ విదేశాలకు వెళ్లే ఛాన్స్ మాత్రం రాలేదని అంటున్నాడు. ఆ ఏడాదే జూన్‌లో రెండోసారి మిలన్ నుంచి పారిస్‌కి ప్రయాణించినట్లు తెలిపాడు. జూన్‌లో తన గ్రాడ్యుయేషన్ పరీక్షలు పూర్తిచేసుకుని మరి వెళ్లినట్లు పేర్కొన్నాడు. మిలన్లో రెండు నెలలు ఉన్నట్లు తెలిపాడు. అయితే మోడలింగ్ అనేది స్థిరంగా పనిదొరికే రంగం కాదు. ఈవెంట్లను బట్టి వర్క్ అనేది ఉంటుంది. దాంతో శుభమ్ వెంటనే భారత్‌కి వచ్చేసి..తన డిగ్రీకి తగిన ఉద్యోగం వెతుక్కుని మరి జాయిన్ అయ్యిపోయాడు. నెలకు రూ. 30 వేల వేతనం చెల్లించేది. అయితే మోడలింగ్‌ని పూర్తి సమయం కొనసాగించే నిమిత్తం జాబ్‌లో జాయిన్ అయ్యిన ఆరునెలలకే రాజీనామా చేసేశాడు. మోడల్‌గా సంపాదన..సివిల్ ఇంజనీర్‌గా నెలకు రూ. 30 వేలు సంపాదిస్తే..మోడల్‌గా ఒక్కరోజు షూట్ కోసం లక్షల్లో డబ్బు సంపాదించడం విశేషం. మిలన్లో జరిగే రన్‌వే షో కోసం దాదాపు లక్ష నుంచి రెండు లక్షలకు వరకు సంపాదించొచ్చని చెబుతున్నాడు. అడ్వర్టైస్మెంట్లకే బాగా వేతనం లభిస్తుందని అంటున్నాడు శుభమ్. ఒక్కోసారి ప్రాజెక్ట్‌ని బట్టి..రూ. 5 లక్షలు పైనే ఆర్జించొచ్చే అవకాశం ఉందని చెబుతున్నాడు. అయితే ఇక్కడ మొత్తం మోడళ్ల చేతికి వెళ్లదని, ఏజెన్సీ 30% కోత విధిస్తుందని చెప్పుకొచ్చాడు. కేవలం 70% తాము ఉంచుకుంటామని అన్నాడు. ఇక మోడలింగ్ పైకి ఆకర్షణీయంగా కనిపిస్తున్నా..తెరవెనుక చాలా కష్టం ఉంటుందని చెబుతున్నాడు శుభమ్. తన గ్లామర్ లుక్ కోసం చాలా ఖర్చు చేయాల్సి కూడా ఉంటుందని అంటున్నాడు. అలాగే ఈవెంట్ల గురించి ఒకరోజు ముందు మాత్రమే తెలుస్తుందట. అక్కడ వసతికి సంబంధించి..ఏజెన్సీనే చూసుకుంటుంది. గానీ ఇతర ఖర్చులు మనమే భరించాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఇక ఈ రంగంలో ఒక్కోసారి ప్రదర్శన సమయంలో చివరి క్షణంలో మనల్ని తొలగించే అవకాశం కూడా ఉంటుందట. ఆ టైంలో మానసికంగా స్థైర్యంగా ఉండటం అంత ఈజీ కాదని అంటున్నాడు శుభమ్. అంతేగాదు మోడల్‌గా రాణించాలంటే బరువుని కూడా అదుపులో ఉంచుకోవడమే గాక, క్రమం తప్పకుండా వ్యాయామాలు చేయాలి కూడా. చివరగా శుభమ్ ఈ గ్లామర్ ఫీల్డ్‌లో నిలదొక్కుకోవాలంటే..తిరస్కరణలను తట్టుకోవాలి, ఓపికతో ఉండాలని అంటున్నాడు. ఎందుకంటే ఒక్కోసారి అసలు పనే ఉండదు..అయినప్పటికీ..అవకాశం కోసం చాలా నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. View this post on Instagram A post shared by Shubham Vaidkar (@shubham_vaidkar) (చదవండి: 'రెండు రకాల తల్లులు'..! థైరోకేర్ వ్యవస్థాపకుడి పేరెంటింగ్ పాఠాలు..) -
నీతా అంబానీ ధరించిన చానెల్ బ్లేజర్ ..అంత ఖరీదా!?
రిలయన్స్ ఫౌండేషన్ ధీరూభాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ చైర్పర్సన్, వ్యవస్థాపకురాలు నీతా అంబానీ లగ్జరీ దుసులకు, ఆభరణాలకు కేరాఫ్ ఆమె. నీతా ధరించి ప్రతి చీర ఓ అద్భుతం. కళ్లుచెదరిపోయే ఖరీదు చేసే ఆభరణాలతో తన ఫ్యాషన్ శైలిని చెబుతుంటారామె. భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచే సంప్రదాయ చేనేత చీరలు, అలానాటి రాజుల కాలం నాటి ఆభరణాలతో మన పూర్వవైభవాన్ని తెలుసుకునేలా లేదా గుర్తుచేసేలా అద్భుతమైన లుక్‌తో కనిపించే నీతా ఈసారి వెస్ట్రన్ వేర్లో అదుర్స్ అనిపించుకున్నారు. తను ఏది ధరించిన సెన్సెషన్గానే ఉంటుంది. ఎందుకంటే వాటి ధర, డిజైన్ కూడా ఊహకందనిది. ఇక నీతా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (IOC)లో భారత ప్రతినిధిగా మిలానో-కోర్టినా వింటర్ ఒలింపిక్ గేమ్స్ 2026కి ముందు 145వ IOC సెషన్‌కు హాజరయ్యారు. ఏ వేదికపై భారత సంప్రదాయం ఉట్టిపడేలా చీరలే ఎంచుకునే నీతా ఈసారి బాస్‌లా కనిపించే పవర్ బ్లేజర్, చిక్ కోట్తో ఎంటర్ అవ్వడం విశేషం. నీతా అంబానీ చానెల్ స్ప్రింగ్ సమ్మర్ 2026 ప్రీ కలెక్షన్ స్టైలిష్ నేవి బ్లూ బ్లేజర్ ధరించింది. పైగా ఈ బ్లేజర్కి డబుల్ కాలర్లు, ఫుల్ స్లీవ్స్, నాచ్ లాపెల్స్, రెండు సైడ్ పాకెట్స్ ఉన్నాయి. అధునాతన నేవీ బ్లూ రంగులో ఉన్న బ్లేజర్‌పై కుడివైపు కాలర్‌పై ఎరుపు పూల డైమండ్ బ్రూచ ఆ బ్లేజర్ని మరింత అద్భుతంగా కనిపించేలా చేసింది. దానికి నల్లటి ఫార్మల్ ప్యాంటుని జత చేసి..సింపుల్‌గా డైమండ్ ఆకారపు చెవిపోగులు ధరించి స్టైలిష్‌గా కనిపించారామె. ఇంతకీ ఈ బ్లేజర్ ఎంతో తెలిస్తే నోటమాటరాదు. ఇది అక్షరాలు రూ. 738,800/-. View this post on Instagram A post shared by Ambani Family (@ambani_update) (చదవండి: దుపట్టాను రూపొందించినందుకు థ్యాంక్యూ) -
లేటెస్ట్ లంగా ఓణి..! బుట్టబొమ్మల్లా అమ్మాయిలు..
ఫ్యాషన్‌లో ఎన్నో డిజైన్స్ మనల్ని పలకరిస్తుంటాయి. అంతే వేగంగా ఆ డిజైన్స్ కనుమరుగవుతుంటాయి. కానీ, మనదైన సంప్రదాయ దుస్తుల్లో అమ్మాయిల అలంకరణలో భాగమైన హాఫ్ శారీ అబ్బాయిల అలంకరణలో ధోతీ ఎప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా నిలిచే ఉంటాయి. హాఫీ శారీ వేడుక టీనేజ్‌ను దాటేస్తూ ముందుకు వెళ్లి అమ్మాయి జ్ఞాపకాలలో నిలిచే అందమైన రోజవుతుంది. హైదరాబాద్ డిజైనర్ భార్గవి కూనమ్ హాఫ్ శారీస్ డిజైన్స్‌లో వస్తున్న గ్రాండ్‌లుక్‌ని ఇటీవల మరింత ఆకర్షణీయంగా ఆవిష్కరించారు. ‘‘తెలుగింటి సంప్రదాయంలో పెళ్లి ముఖ్యమైన వేడుక. అంతే వేడుకగా ఒకమ్మాయి జీవితంలో కుటుంబసభ్యులందరూ కలిసి పండగలా జరుపుకునేది హాఫ్ శారీ ఫంక్షన్. ఇటీవల పెళ్లికి చేసిన విధంగానే హాఫ్‌శారీ ఫంక్షన్‌ను హల్దీ, మెహందీ .. అంటూ నాలుగు రోజుల పాటు సెలబ్రేషన్స్ చేస్తున్నారు. పన్నెండేళ్ల లోపు అమ్మాయిలకు చేసే ఈ వేడుకలో బుట్టబొమ్మలా కనిపించే అమ్మాయిలపైనే అందరి దృష్టి ఉంటుంది. తల్లిదండ్రులకు కూడా తమ కూతుళ్లను ఆ విధంగా చూసుకోవడానికి చాలా సంతోషిస్తుంటారు. మన చేనేతలుబెనారస్, కంచి, పైథాని పట్టు, చికంకారి జరీ కోటా .. తో చేసిన హాఫ్ శారీ, ధోతీ డిజైన్స్ ఇవి. లైట్ కలర్స్‌కి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ పట్టు, కోటా ఫ్యాబ్రిక్ ఉపయోగించాం. జరీ వర్క్‌తో చేసిన హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేనేతలకు మరింత గ్రాండ్ లుక్ వచ్చింది. అంటే చేనేతలు – ఎంబ్రాయిడరీ– ఆభరణాలతో కలిపి చేసిన క్రియేటివ్ జర్నీ ఇది. ఆభరణాల మార్క్హాఫ్ శారీస్‌కు ఆభరణాల కాంబినేషన్ కూడా అత్యంత ముఖ్యమైనది. ఆకర్షణీయమైన లుక్ క్రియేట్ చేయడానికి పట్టు– జ్యువెలరీతో కలిసి చేసిన కాంబినేషన్ వర్క్ ఇది. లంగాఓణీ కాంబినేషన్ డ్రెస్ మనదైన సంప్రదాయ డ్రెస్ కాబట్టి, దీనికి మన సౌత్ ఇండియన్ టెంపుల్ జ్యువెలరీ బాగా నప్పుతుంది. ఎంబ్రాయిడరీని మ్యాచ్ చేస్తూ పెద్ద పెద్ద హారాలు, డైమండ్ జ్యువెలరీతో మరిన్ని హంగులను తీసుకువచ్చాం’’ అని వివరించారు భార్గవి కూనమ్. (చదవండి: బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..) -
బనారసీ పట్టు చీరలో నీతా అంబానీ..! 50 ఏళ్ల నాటి..
ఎన్ని ఫ్యాషన్ ట్రెండ్లు వచ్చినా.. భారతీయ వారసత్వానికి మించింది లేదు. సాంప్రదాయ దుస్తుల్లోని అందమే వేరు. బంగారు మోటీఫ్‌లతో ఉండే బనారీసి చీర లుక్కే ఎవర్గ్రీన్. ఆ విషయాన్ని రిలయన్స్ దిగ్గజం ముఖేష్ అంబానీ భార్య నీతా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. తరచుగా బెనరసీ చీరలతో తళుక్కుమనే నీతా ఈసారి సంప్రదాయ ఎరుపు బనారసీ చీరతో పండుగ వాతావరణం తెప్పించారు. యాభైఏళ్ల క్రితం నాటి ఈ ఫ్యాషన్ నేటికి అద్భుతమే అని చాటిచెప్పారు. ఎరుపు రంగు బంగారు జరీతో ఉన్న ఈ బనారసీ చీర ..చేనేత కళాకారుల నైపుణ్యాన్ని హైలెట్ చేసింది. అందుకు తగ్గట్టుగా ధరించిన మ్యాచింగ్ బ్లౌజ్ వెనుక భాగం రాజదర్పంలా లేదా ఆలయ చిహ్నంలాంటి క్లిష్టమైన బంగారు ఎంబ్రాయిడరీ స్పెషల్ ఎట్రాక్షన్‌ని ఇచ్చింది. ఈ చిహ్నం శ్రేయస్సుకి సంకేతం కూడా. ఇంతలా వివరణాత్మకంగా డిజైన్ చేసిన ఎంబ్రాయిడరీ ఈ దుస్తుల ప్రాధాన్యతను, భారతీయ సంస్కృతిని మరింత హైలెట్ చేసింది. నీతా ఈ కాస్ట్యూమ్‌కి తగ్గట్టుగా కాంట్రాస్ట్‌గా పచ్చని డైమండ్ నెక్లెస్ ధరించి.. తన లుక్‌ని మరి ఆకర్షణీయంగా కనిపించేలా చేశారామె. ఆ ఎరుపు పట్టు చీరకు ఆ పచ్చని నెక్లెస్ మరింత అందం. నిండుదనం ఇచ్చింది. View this post on Instagram A post shared by Ritika kadam (@ritikahairstylist) (చదవండి: Strawberry: స్ట్రాబెర్రీలతో ఆరోగ్యం..అందం కూడా..) -
ఆకుపచ్చని చీరలో మెరిసిపోతున్న మాధురి దీకిత్..!
బాలీవుడ్ నటి మాధురి దీక్షిత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వివాహ సీజన్‌ని తలంపుకి వచ్చేలా ఆమె లుక్ మెస్మరైజ్ చేస్తోంది. ఆరు గజాల బాటిల్ గ్రీన్ షేడ్ సిల్క్ చీరలో ఈ ఐదు పదుల బ్యూటీ ముగ్దమనోహరంగా ఉంది. కనుచూపుని తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో ఆకర్షిస్తోంది. జనవరి 31న, మాధురి ఇన్‌స్టాగ్రామ్‌లో “పియా తోసే నైనా లాగే రే (1965 చిత్రం గైడ్ నుండి లతా మంగేష్కర్ పాట)” అనే క్యాప్షన్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో తన బ్యూటీఫుల్ ఫోటోలను షేర్ చేశారామె. ఆ పచ్చదనం మాధురికి రాచరికపు లుక్‌ని అందించింది. ఈ చీర అంచుల వెంబరడి జర్దోజీ ఎంబ్రాయిడరీ చీర విలాసవంతమైన లుక్‌ని హైలెట్ చేసింది. ఆ చీరకు సరిపోయేలా అదే కలర్లోని ఎంబ్రాయిడరీ బ్లైజ్ ఈ వివాహ వేడుకలకు లేటెస్ట్ ఫ్యాషన్స్టైల్గా నిలిచింది. స్టైలిష్‌గా కూర్చొన్న తీరు..జాలు వారుతున్న ఆ శారీ పల్లు రాజదర్బారులో కూర్చొన్న మహారాణిలా హుందాగా కనిపించింది మాధురి. జయంతి రెడ్డి లేబుల్ నుంచి వచ్చిన ఈ ఆకుపచ్చని చీర ధర వింటే నోరెళ్లబెడతారు. ఎంతంటే..అక్షరాలు రూ. 1,39,900లు పలుకుతుంది. ఆ చీరకు తగ్గట్టు మాధురి ఎంచుకున్న మేకప్, హెయిర్‌స్టయిల్ ఆమె లుక్‌ని మరింత గ్రాండ్‌గా కనబడేలా చేసింది. View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) (చదవండి: కిచెన్‌పై బడ్జెట్ ప్రభావం..ఏం తగ్గనున్నాయంటే..!) -
ఆ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..
సెలబ్రిటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్, నగలు ప్రత్యేక ఆకర్షణ తోపాటు అత్యంత విలాసవంతమైనవి కూడా. వాళ్ల స్టేటస్‌కి తగ్గ ఫ్యాషన్వేర్లే అయినా..ఇక్కడ ఈ నటి ధరించిన డైమండ్ నెక్లెస్ అత్యంత ప్రత్యేకం. ఈ నెక్లెస్ వెనుకున్న ఆసక్తికర స్టోరీలు చూస్తే..ఇంత చరిత్ర ఉందా ఈ ఆభరణానికి అని విస్తుపోవడం ఖాయం. ఎందరి చేతులు మారి ఆ నెక్లస్ ఆమె వద్దకు చేరిందంటే..ఆస్ట్రేలియన్ నటి మార్గోట్ రాబీ తన రాబోయే చిత్రం వూథరింగ్ హైట్స్ ప్రమోషన్లో భాగంగా రెడ్ కార్పెట్‌పై తన గ్లామ్ లుక్‌తో అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ మూవీలో హీరో జాకబ్ ఎలోర్డి కూడా నటించారు. రాబీ లాస్ ఏంజిల్స్‌లోని చైనీస్ థియేటర్లో జరిగిన వరల్డ్ మూవీ ప్రీమియర్‌కు హాజరయ్యారు. అక్కడ ఆమె షియాపరెల్లి కోచర్ గౌనుతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకొంది. ముఖ్యంగా ఆమె మెడలో ధరించిన నెక్లెస్ అమితంగా అందరి మనసులను దోచుకుంది. ఎందుకంటే ఈ డైమండ్ నెక్లెస్ హాలీవుడ్ ఐకాన్ ఎలిజబెత్ టేలర్‌ది. దీని ధర భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 74 కోట్లు పలుకుతుంది. ఆమె ధరించే ప్రతి ఆభరణం ఆలోచనాత్మకంగానూ, ఇంట్రస్టింగ్ కథ దాగుంటుంది. హాలీవుడ్ ఐకాన్ నటి ఎలిజబెత్ టేలర్ 40వ పుట్టిన రోజున తన ఐదో భర్త ఈ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఇద్దరు రోమ్‌లో నిర్మిస్తున్న క్లియోపాత్రా చిత్రంలో పనిచేశారు. అప్పుడే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. ఆ టైంలో వీరి ప్రేమకథ వార్తల్లో నిలిచి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కూడా. రియల్ స్టోరీ ఏంటంటే..గుండె ఆకారంలో ఉన్న టేబుల్-కట్ వజ్రంపై "ప్రేమ శాశ్వతమైనది" అని రాసి ఉన్న పార్సీ శాసనం ఉంది. దానిపై నూర్జహాన్ పేరు కూడా చెక్కి ఉంటుంది. ఈ రత్నాన్ని నూర్జహాన్ భర్త మొఘల్ చక్రవర్తి షాజహాంగీర్ ఇచ్చాడని, తరువాత వారి కుమారుడు షాజహాన్‌కు అందజేశాడని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం..షాజహాన్ తన భార్య ముంతాజ్‌కు ఆభరణాలను బహుకరించాడు. మొఘలులతో దాని లోతైన అనుబంధం కారణంగా, ఈ నెక్లెస్‌ను "తాజ్ మహల్ వజ్రం" అని కూడా పిలుస్తారు.1971 నాటికి, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తాజ్ మహల్ వజ్రాన్ని సొంతం చేసుకుంది, ఎరుపు రత్నాలు టేబుల్-కట్ వజ్రాలతో అలంకరించబడి, భారతీయ ఆభరణంలా రూబీ హారంలా డిజైన్ చేశారు. దీన్ని ఇలా నెక్లెస్‌లా తీర్చిదిద్దింది ప్రఖ్యాత నగల డిజైనర్ ఆల్ఫ్రెడ్ డ్యూరాంటే.. అంత చరిత్ర కలిగిన ఈ నెక్లెస్‌ని ఆస్ట్రేలియన్ నటి రాబీ మెడలో ధరించడంతో అక్కడున్న వారందరిలో ఆసక్తి, కుతుహలం వెల్లువెత్తింది. అక్కడ అందరి చూపు ఆ ఆభరణంపైనే. ఎన్నో ప్రేమకథలను పొందుపర్చుకున్న ఈ హారంతో రాబీ ఆ వేడుకలో పురాతన వైబ్స్ సృష్టించింది.(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?) -
భారతీయ అవుట్‌ఫిట్‌లో ఈయూ చీఫ్ ఉర్సులా ..!
భాతర 77వ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథిగా ఉర్సులా వాన్ డెర్ లేయన్ హాజరయ్యిన సంగతి తెలిసిందే. ఆమె ఈ వేడుకలో తన వేషధారణతో అందర్నీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో సిగ్నేచర్ టైలర్డ్ ప్యాంట్సూట్లకు పేరుగాంచిన ఈయూ చీఫ్ ఉర్సులా మెరూన్-అండ్-గోల్డ్ బ్రోకేడ్ బంద్‌గాలా విత్ ఆఫ్-వైట్ ప్యాంట్లో కనిపించారు. భారతీయ శైలిలో వచ్చి..ఈ వేడుకను మరింత అందంగా మార్చారామె. భారతీయ సంస్కృతిపట్ల గౌరవాన్ని, అలాగే ఈ వేడుక ప్రాముఖ్యతన ఉర్సులా తన ఆహార్యంతో చెప్పకనే చెప్పారామె. సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అధ్యక్షురాలు ద్రౌపది ముర్ము, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియోలస్ శాంటోస్ డా కోస్టాతో కలిసి కర్తవ్య పథ్‌కు చేరుకోవడానికి కొన్ని క్షణాల ముందు, చీఫ్ ఉర్సులా సోషల్ మీడియా వేదికగా ఇలా రాసుకొచ్చారు. "ఈ రిపబ్లిక్ డే వేడుకల్లో ముఖ్య అతిథిగా ఉండటం అనేది తన జీవితకాల గౌరవం. విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది. తద్వారా మనందరం ప్రయోజనం పొందుతాం." అని పోస్ట్‌లో పేర్కొన్నారు. కాగా, యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయెన్, 2019లో యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ. ఆమె జూలై 2024లో రెండవసారి ఆ పదవికి తిరిగి ఎన్నికయ్యారు. 2029లో జరిగే యూరోపియన్ ఎన్నికల వరకు కమిషన్‌కు నాయకత్వం వహిస్తారు. పైగా యూరోపియన్ కమిషన్‌లో తన పదవీకాలానికి ముందు, వాన్ డెర్ లేయెన్ 2005 నుంచి 2019 వరకు జర్మనీ సమాఖ్య ప్రభుత్వంలో పనిచేశారు. ఈ సమయంలో ఆమె కుటుంబం, యువజన, కార్మిక, రక్షణ వంటి కీలక మంత్రిత్వ శాఖలను నిర్వహించి, పాలన, ప్రజా సేవలో విస్తృతమైన అనుభవాన్ని పొందారు.77th #RepublicDay🇮🇳 | President Droupadi Murmu, along with President of the European Council, António Luís Santos da Costa and President of the European Commission, Ursula Von Der Leyen, arrives at the saluting dais at Kartavya Path in Delhi to witness the paradePrime Minister… pic.twitter.com/5Snpohoa5m— ANI (@ANI) January 26, 2026 (చదవండి: వెయ్యి కోట్ల కంపెనీని నిర్మించిన మాజీ పైలట్: ఆ ప్రమాదం ఆకాశం నుంచి..) -
అబుదాబిలో కరీనా లుక్స్ అద్బుతః..! ఆ జాకెట్ అంత ఖరీదా..
బాలీవుడ్ నటి కరీనా కపుర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కరీన తన అందం, అభినయంతో వేలాది అభిమానులను సొంతం చేసుకున్నారామె. ఇప్పటికీ ఐదు పదుల ఏజ్‌లోనూ యువ హీరోయిన్లకు తీసిపోని ఫిట్నెస్తో అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఆమె ఫ్యాషన్‌పరంగా కరీనా రేంజ్ వేరేలెవెల్ అన్నట్లు ఉంటుంది ఆమె స్టైల్. అబుదాబిలో ఓ ప్రముఖ్య జ్యువెలరీ షాప్ ప్రారంభోత్సవంలో కరీనా లుక్ అందర్నీ ఆశ్చర్యపోయేలా చేసింది.ముఖ్యంగా ఆమె ధరించిన జాకెట్ హాట్‌టాపిక్‌గా మారింది.ఓజీ స్టైల్ ఐకాన్ కరీనా కపూర్ ఖాన్ అబుదాబిలో విలాసవంతమైన లగ్జరీ ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుచారు. ఆమె స్టన్నింగ్ లుక్ కళ్లుతిప్పుకోనివ్వనంతగా హైలెట్‌గా నిలిచింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ రాజధానిలో కరీనా తన స్టైల్ స్టేట్మెంట్ ఇది అన్నట్లుగా అత్యంత అందంగా కనిపించారామె. ఈ మేరకు ఆమె శ్వేతా కపూర్ నేతృత్వంలోని ఫ్యాషన్ బ్రాండ్ బృందంతోపాటు మెరిశారామె. బ్రాండ్ బైడల్ కలెక్షన్ నుంచి బెబో తెల్లటి దుస్తులు విత్ చేతితో ఎంబ్రాయిడరీ చేసిన పొడవాటి జాకెట్‌ని ధరించింది కరీనా. నిజానికి డ్రెస్‌ని ఒపాల్ సెట్ అని పిలుస్తారట. దీని ధర వచ్చేసి సుమారు రూ. 5 లక్షలు పైనే పలుకుతుందట. తెల్టి శాటిన్పై ఆ జాకెట్ లుక్ అదిరిపోగా..ఈ జాకెట్‌ని వెండి దారలతో ఎంబ్రెయిడ్ చేసి, మేలుజాతి స్టోన్లతో తీర్చిదిద్దారు. ఇక ఆమె చెవిపోగులు, ఉంగరంగ డైమండ్‌ని ఎంచుకుని తన లుక్ మరింత ప్రకాశంతంగా కనిపించేలా జాగ్రత్త పడ్డారామె. ఇక జడను బన్ స్టైల్ వేసుకుని..ఆ డ్రెస్‌కి పూర్తి న్యాయం చేశారామె. అలాగే ఆ ప్రకాశవంతమైన డ్రెస్‌కి అనుగుణంగా పెదవులకు,బుగ్గలకు లేతరంగు గులాబీ, కనురెప్పలకు మస్కారా, స్మోకీ ఐషాడోను ఎంచుకుని స్టైల్‌కి సరికొత్త అర్థం ఇచ్చేలా కరీనా ఆహార్యం అదుర్స్. View this post on Instagram A post shared by Faisal AK (@_faisal_akf) (చదవండి: 90 నిమిషాల ఎమర్జెన్సీ రూమ్‌కి..హడలెత్తించేలా బిల్లు..!) -
ట్రెండీగా అక్షరాల అలంకరణ..
తెల్లని కాగితం మీద రాసే అక్షరమాల వేడుకలలో ఆధునిక మహిళల అలంకరణగా ఆకట్టుకుంటోంది.పెళ్లి, పుట్టినరోజు, సీమంతం.. వేడుకకు తగినట్టు తమ ప్రియమైన వారి పేర్లు హెయిర్ యాక్సెసరీస్లలోనూ, గాజులు, ఇతర ఆభరణాలలోనూ వచ్చేటట్టు ప్రత్యేకంగా డిజైన్ చేయించడం పట్ల ఆసక్తి చూపుతున్నారు. సాధారణంగా చిన్నపిల్లల కేశాలంకరణలో నేమ్ క్లిప్స్ చూస్తుంటాం. ఇప్పుడు వెస్ట్రన్ లేదా ఇండియన్ వేడుకలకు తగినట్టు అన్ని వయసుల వారు తమ కేశాలంకరణలోనూ, ఇతర ఆభరణాలలోనూ అక్షరమాలను అందంగా కూర్చుతున్నారు.నెక్లెస్... హ్యాంగింగ్స్ గానూ...చెవులకు జూకాలు, మెడన హారాలలో తమ ప్రియమైన వారి పేర్లు మెరుస్తూ కనిపిస్తున్నాయి. వేడుక అర్థం తెలిసేలా కూడా అక్షరాలమాలను ధరిస్తున్నారు. ముఖ్యంగా హ్యాండ్ ఎంబ్రాయిడరీ, థ్రెడ్ జ్యువెలరీలలో సందర్భానికి తగిన అక్షరాలు కనిపిస్తుంటాయి. హల్దీ, మెహెందీ వివాహ వేడుకలలో వధూవరుల పేర్లు కలిసివచ్చేలా డిజైన్ చేసిన ఆభరణాలను కొత్త పెళ్లికూతురు ధరిస్తుండటం కనిపిస్తోంది.కేశాల అలంకరణలో...ఎ నుంచి జెడ్ వరకు ఇంగ్లిష్ అక్షరాలతో తయారు చేసిన వివిధ లోహపు, బీడ్స్ హెయిర్ జ్యువెలరీ ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉంది. వరుడి పేరు వచ్చేలా లేదా సందర్భానికి తగిన అర్థం వచ్చేలా, ఫన్ని క్రియేట్ చేసే విధంగానూ అక్షరాలను తలకెక్కించుకుంటున్నారు. వీటిలో స్వరోస్కి, గోల్డ్, ఎంబ్రాయిడరీ, వివిధరకాల పూసల అందాలు అక్షరాల చుట్టూ చేరుతున్నాయి. జడ ΄÷డవును బట్టి కూడా లోహపు అక్షరాల క్లిప్స్ వేల రూ΄ాయల ధర పలుకుతున్నాయి.గాజుల్లో..డ్రెస్‌కు మ్యాచ్ అయ్యేలా రంగు రంగులతో ఉండే చిన్నా పెద్ద గాజుల ఎంపిక సాధారణమే. అయితే వేడుకలలో మాత్రం స్పెషల్‌గా కనిపించేలా అమ్మాయిలు తమ పేర్లతో తయారు చేయించుకున్న గాజులను ధరిస్తున్నారు. వీటి డిజైన్‌కి ఆర్డర్‌పై కస్టమైజ్డ్ బ్యాంగిల్స్ చేయించుకోవడంపై బాగా ఆసక్తి చూపుతున్నారు.వివిధ భాషలలో ప్రత్యేకంగా డిజైన్ చేయించుకోవాలి అంటే అందుకు తగిన జ్యువెలరీ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది. దీనికి ఆన్లైన్ ΄ోర్టల్స్ బాగా సహాయపడుతున్నాయి. అల్ఫాబెట్ అక్షరాల మాల క్లిప్పుల సెట్ వందల రూ΄ాయల నుంచి నాణ్యత, డిజైన్‌ను బట్టి వేల రూ΄ాయల వరకు ధర పలుకుతోంది. (చదవండి: అందుకేనా జపాన్ అంత క్లీన్‌గా ఉంటోంది..!) -
ట్రెండీగా పవర్ఫుల్ చీరకట్టు స్టైల్..!
చీరకట్టు ఆత్మవిశ్వాసానికి, హుందాతనానికి ప్రతీకగా చూపుతూ సెలబ్రిటీలు రోల్‌మోడల్స్‌గా నిలుస్తున్నారు. కార్పొరేట్ ఉద్యోగమైనా పార్టీలో ప్రత్యేకత కోరుకున్నాచీరకట్టుకు బిగ్ బెల్ట్ జత చేసి బ్రైట్‌గా వెలిగిపోతున్నారు. తమదైన మార్క్‌ను పవర్‌ఫుల్‌గా చూపుతున్నారు. ఇటీవల అంబానీ కుటుంబ సభ్యుల నివాసంలో జరిగిన ఓ వేడుకలో క్రికెట్ దిగ్గజాలు పాల్గొన్నారు. ఈ వేడుకలో డిజైనర్లు శంతను అండ్ నిఖిల్ చేసిన కస్టమైజ్డ్ శారీ డ్రేప్‌లో భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కొత్తగా మెరిశారు. చీర కట్టు కూడా ఆమెనో క్రీడాకారిణిగా ఆత్మవిశ్వాసం తొణికిసలాడేలా చూపుతోందా అనిపించేలా ఉంది. నారింజ, నలుపు రంగు కాంబినేషన్లో గల చీరను ఫిటెడ్, హైనెక్ మోడర్న్ బ్లౌజ్‌తో స్టైల్ చేసింది. నల్లని కార్సెట్ బెల్ట్‌తో లుక్‌ని శక్తిమంతంగా మార్చింది. జుట్టును బన్‌గా సెట్ చేసి, ఆభరణాలను తక్కువగా ధరించి లుక్‌ను పూర్తి చేసింది. ఈ లుక్ ఆధునిక పవర్ డ్రెస్సింగ్‌లో ఒక మాస్టర్ పీస్ అని చెప్పొచ్చు. (చదవండి: అందానికే అందం ప్రియాంక చోప్రా బ్యూటీటిప్స్..!) -
విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి సందడి..రోమ్ టూర్లో రష్మిక ఫ్యాషన్ వైబ్..!
హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్నా నిశ్చితార్థం జరిగిందన వార్తలు వచ్చినప్పటికీ వారు మాత్రం అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదు. అయితే హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ నివాసంలో వీరి ఎంగేజ్మెంట్ అయిందని వారి సన్నిహితులు కూడా పోస్టులు పెట్టారు. తాజాగా ఇప్పుడు వారి పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. ఈ జంట ఫిబ్రవరి 26, 2026న విజయ్-రష్మికల పెళ్లి జరగనుందని తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ ప్యాలెస్‌లో వారిద్దరూ పెళ్లిపీటలెక్కబోతున్నారని టాక్. ఇదెంత వరకు వాస్తవం అన్నది తెలియదు కానీ రష్మిక, హీరో విజయ్ సోదరుడు ఆనంద్ దేవరకొండ, ఆమె స్నేహితులతో కలిసి రోమ్ టూర్లో ఉంది. ఆ యూరోపియన్ విహారయాత్రలో తన అభిమానులను ఫ్యాషన్ లుక్స్‌తో అలరిస్తోంది. లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో ఫ్యాషన్ ఐకానిక్‌గా..గోధుమ రంగు లాంగ్-స్లీవ్డ్ ట్రెంచ్ కోట్లో వింటర్ ఫ్యాషన్ ఐకాన్‌గా మెరిసింది రష్మిక. ఆ కోట్ సరికొత్త ఫ్యాషన్ వైబ్స్‌ని సృష్టించింది. నిట్టెడ్ టాప్‌లో రష్మిక మందన్నరష్మిక మందన్న ధకించిన బూడిద రంగు అల్లిన టాప్‌లో సరికొత్తగా కనిపించింది. ముఖ్యంగా చేతిలో పువ్వుల గుత్తితో స్టన్నింగ్ లుక్‌తో ఆకట్టుకుంది. అందుకు తగ్గట్టు డార్క్ ఫ్రేమ్డ్ గ్లాసెస్, మెటల్ బ్యాండ్‌తో స్టైలిష్ రిస్ట్ వాచ్‌తో లుక్‌ను అలంకరించింది. బ్రౌన్ స్వెటర్లో వ్యాపారవేత్తలా..అల్లిన గోధుమ రంగు స్వెటర్, చంకీ బ్లాక్ గ్లాసెస్‌లో అదరహో అనిపించేలా ఉంది ఆమె ఆహార్యం.రష్మిక మందన్న రోమ్ వార్డ్రోబ్తో ఫ్యాషన్ ప్రియులను అలరించింది. నటి క్రీమ్ స్వెటర్, డెనిమ్ జీన్స్‌పై పొరలుగా ఉన్న మరొక నల్ల ట్రెంచ్ కోటును స్టైలిష్ ఐకాన్‌గా కనిపించింది. ఎక్కడ మేకప్ లేకుండా..చాలా సింపుల్‌గా సాదాసీదాగా నేచురల్ లుక్‌లో కనిపించి నేచరల్ స్టార్ అంటే సహజసిద్ధమైన అందం అని ఎలుగెత్తి చాటింది.(చదవండి: వాట్ యాన్ ఐడియా..! యువతకు సాంకేతికతో భావోద్వేగ సందేశం..) -
ఫ్యాషన్ ఫార్వర్డ్.. జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ..
టైమ్‌లెస్ ఇండియన్ గార్మెంట్‌గా పేరున్న చీరకు యువతరం కొత్త లుక్ ఇస్తోంది. ప్రీ–డ్రేప్డ్ శారీస్, డెనిమ్–ఇన్ఫ్యూజ్డ్ ఫ్యాబ్రిక్స్, బాంబర్ జాకెట్లతో జత చేసే చీరలు... మొదలైనవి యువతరం ఫ్యాషన్‌లో కొన్ని. సంప్రదాయం, సమకాలీన నైపుణ్యాలను మిశ్రమం చేసిన ట్రెండ్ ఇది.సంప్రదాయ దుస్తులతో జత చేసిన కోర్సెట్లు ఆకట్టుకుంటున్నాయి. కుర్తాలతో జత చేసిన డెనిమ్ కోర్సెట్ నుండి షరారాలపై ధరించే ఎంబ్రాయిడరీ డిజైన్ల వరకు... ఈ ట్రెండ్ మోడ్రన్ ఇండియన్ ఫ్యాషన్ క్రియేటివిటీకి అద్దం పడుతుంది.‘హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ ఇన్ మోడ్రన్ సిల్హవుటీ’ ట్రెండ్ మొదలైంది. ఖాదీ, ఇకత్, లినెన్లాంటి చేనేత వస్త్రాలను జంప్సూట్లు, వోవర్సైజ్డ్ కోట్స్, కో–ఆర్డర్ సెట్స్‌గా రూపొందించే ధోరణి పెరిగింది. ఈ ట్రెండ్ స్థానిక కళాకారులకు వృత్తిపరంగా సహాయపడుతోంది. ఎకో–ఫ్రెండ్లీ (Eco Friendly) ఛాయిసెస్‌గా యువతరానికి అవకాశం కల్పిస్తోంది.సంప్రదాయ జెండర్ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ న్యూట్రల్–కలర్డ్ కుర్తాలు, పఠానీ సూట్స్, యునీసెక్స్ ధోతీలు యువతరంలో ప్రాచుర్యం పొందుతున్నాయి. సెల్ఫ్–ఎక్స్ప్రెషన్స్కు అవకాశం ఇస్తున్నాయి.చదవండి: లేత రంగుల లేటెస్ట్ చీరల ట్రెండ్ఇంజినీరింగ్ వైపు మ్యూజిక్ స్టూడెంట్స్ మొగ్గువిద్యలు వేటికవి విడి విడి ద్వీపాలు కావు. అంతర్గతంగా ఒకదానితో ఒకటి అనుసంధానమై ఉంటాయి. దీనికి తాజా ఉదాహరణ... ఇంజినీరింగ్ స్టూడెంట్స్ (Engineering Students) మ్యూజిక్‌పై ఆసక్తి ప్రదర్శించడం. మ్యూజిక్ స్టూడెంట్స్ ఇంజినీరింగ్‌పై ఆసక్తి చూపడం. సంగీత నేపథ్యం ఉన్న విద్యార్థులు ఇంజినీరింగ్ వైపు మొగ్గు చూపుతున్నారని ఐఐటీ, మద్రాస్ డైరెక్టర్ప్రొఫెసర్ వి.కామకోటి అన్నారు. మ్యూజిక్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యతను ఆయన ప్రస్తావించారు. ఐఐటీ, మద్రాస్‌లో ‘ఇళయరాజా సెంటర్ ఫర్ ఎక్స్‌లెన్స్ ఇన్ మ్యూజిక్’ ఏర్పాటు చేయడం ద్వారా కళలతో, ఇంజినీరింగ్ విద్యను అనుసంధానించే పనికి శ్రీకారం చుట్టారు. -
ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..!
టాలీవుడ్ నటి, అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల పలు కార్యక్రమంలో స్టైలిష్ల లుక్‌లో కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అంతేగాదు ఆమె ధరించే డిజైనర్ వేర్లు, ఆభరణాలు ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. పైగా ఫ్యాషన్ ఐకాన్‌గా ప్రతి వేడుకలో ఆమె ఆహార్యం, లుక్ హైలెట్‌గా నిలవడం విశేషం. అక్కినేని వారి కోడలు అంటే రేంజ్ ఇది అన్నట్లుగా లగ్జరీ ఫ్యాషన్ వేర్లతో అదరహో అనేలా తళుక్కుమంటోంది. అంతేగాదు శోభితా అంటే అత్యంత శోభాయమానం అని చెప్పకనే చెబుతోంది తన స్టైలిష్ లుక్‌తో. ఈసారి ఓ ప్రముఖ లగ్జీరి మేకప్ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన షార్లెట్ టిల్బరీ బ్రాండ్ ప్రమోషన్లో భాగంగా గోల్డ్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోయింది. అంతేగాదు ఆ లెహంగాకి బుర్గుండి దుపట్టా జత చేయడంతో అలనాటి రాణుల వైభవంలోకి తీసుకుపోయింది శోభితా స్టన్నింగ్ లుక్. చూపు తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో మెస్మరైజ్ చేస్తోంది. View this post on Instagram A post shared by Bollywood Celebrity Style (@bollywoodwomencloset) స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో అత్యంత బరువైన బుర్గుండి దుప్పటా మహారాణి మాదిరి రాజదర్పాన్ని అందించింది. అంతేగాదు ఆ దుస్తులు డిజైన్ చేసిన విధానం కారణంగా ఆభరణాలతో పనిలేదనిపించేలా ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దారు వాటిని. ఇక ఈ బుర్గుండి దుప్పటా డీప్ వెల్వెట్ టోన్డ్ కలర్ దానిపై బంగారు ఎంబ్రాయిడరీ అంచు..ఆ గోల్డెన్ కలర్ లెహంగా అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఒక్క దుప్పట కారణంగా రాయల్టీ లుక్ వచ్చింది ఆ లెహంగాకి. అంతేగాదు శోభితా ఈ లెహంగాలో మహారాణి మాదిరిగా, పెళ్లికూతురిలా ధగధగ మెరిసిపోయారామె. నార్మల్ మేకప్‌తో, ఆ లెహంగాకి సరిపడా చోకర్, చెవిపోగులతో చాలా సింపుల్‌గా ఉన్నా..హెవీ డిజైన్‌తో రూపొందిన ఈ లెహంగా మిగతా లోటుని భర్తించేసిందా అనేలా నిండైన అందాన్ని అందించింది. ఇక ఈ గోల్డెన్ లెహంగాను జిగర్ మాలి రూపొందించారు. ఇక రిచ్ బుర్గుండి దుప్పటాను డిజైనర్ నైషా తీర్చిదిద్దారు. కాగా అంతకుముందు శోభితా ఒక ముంబై కార్యక్రమంలో ఇలానే గోల్డెన్ లెహంగాతో పెళ్లికూతురిలా మెరిసిపోగా ఈసారి రాజుల కాలం గుర్తుకుతెచ్చేలా మరో గోల్డెన్ లెహంగాతో మంత్రముగ్ధుల్ని చేసింది. View this post on Instagram A post shared by Nykaa (@mynykaa) బుర్గండీ రంగు దుపట్ట ప్రత్యేకత.. ఇది గాఢ ఎరుపు వైన్ షేడ్‌లో రిచ్‌గా కనిపించే రంగులో ఉండటమే దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ దుస్తులతో జత చేస్తారు. ఎక్కువగా చీర సల్వార్, లెహంగాలతో జత చేస్తే ఒక్కసారిగా రాయల్టి లుక్ వచ్చేస్తంఉది. ఇక్క వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌కి జతచేస్తే..స్టైలిష్‌గా ఉంటుంది. పార్టీవేర్‌కి సిల్క్ లేదా జార్జెట్, డైలీవేర్‌కి కాటన్ లేదా లినెన్, వింటర్లో అయితే శోభితా ధరించినట్లుగా వెల్వెట్ ఫ్యాబ్రిక్‌లో ధరిస్తే లుక్ అదుర్స్.(చదవండి: నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?) -
అత్యంత ఖరీదైన 'పట్టుచీర'..! ఆద్యంతం ఆసక్తికరం..అద్భుతం..
చీర గొప్పతనం గురించి మన తెలుగు పాటలతో.. ఎంతో మంది గాయకులు, రచయితలు అద్భుతం వర్ణించి రాశారు, పాడారు. అలాంటి చీర అత్యంత ఖరీదైనదిగా, కళఖండంగా రికార్డు సృష్టించింది ఆ చీరలో దాగున్న విశేషాలు చూస్తే..కంగుతింటారు. అడుగడుగున ఓ కళా ప్రతిరూపం, ఓ ప్రత్యేకత, ఓ ప్రసిద్ధ చిత్రకారుడు కుంచె నుంచి జాలువారిని చిత్రాలు, అమూల్యమైన ఆభరణాలు, నగలు కనిపిస్తాయి. అంతేగాదు చీరను చూడగానే "సరికొత్త చీర ఊహించినాను" అన్న పాట స్పురణకు వస్తుంది. అంత గొప్పగా తీర్చిదిద్దారు ఈ శారీని. దీని ఖరీదు లక్షలు పైమాటే..అంటే ఈ చీర ధరతో పల్లెటూరిలో ఓ మోస్తారు ఇల్లు కట్టేయొచ్చు లేదా ఓ మారుమూల ప్రాంతంలో సింగిల్ బెడ్రూం ధర అని కూడా చెప్పొచ్చు.ప్రపంచం చీరల దినోత్సవం సందర్భంగా..అత్యంత ఖరీదైన వివాహ పట్టు చీర, కళలకు నిలయమైన చెన్నై సిల్క్ కంజీవరం పట్టు చీర విశేషాలు గురించి తెలుసుకుందామా. ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో కూడా చోటు దక్కించుకుంది. దీన్ని డబుల్ వార్ఫ్ పద్ధతిని ఉపయోగించి చేతితో నేసిన చీర. దీనిలో 64 రంగుల షేడ్స్, పది ప్రత్యేకమైన డిజైన్లు ఉంటాయి. ఈ చీర బరువు వచ్చేసి దగ్గర దగ్గరగా ఎనిమిది కిలోగ్రాములు.దీనిలో బంగారం, వజ్రం, ప్లాటినం, వెండి, కెంపు, పచ్చ, నీలమణి, ముత్యాలు వంటి విలువైన రాళ్లను పొందుపరిచారు. నివేదికల ప్రకారం.. 59.7 గ్రాముల బంగారం, 3.9 క్యారెట్ల వజ్రం, 5 క్యారెట్ల నీలమణిని వినియోగించారు. అంత విలువైన వజ్రాలు, కళాఖండాలకు నిలయం కావడంతోనే ఈ చీర గిన్నిస్ వరల్డ్ రికార్డులో చోటు దక్కించుకుంది. ఇది జనవరి 05, 2008న సుమారు రూ. 39 లక్షలు పైచిలుకే అమ్ముడుపోయింది. ఈ చీర తయారీకే దాదాపు 4 వేలు గంటలు పనైనే పట్టిందట. మొత్తం 36 మంది నేత కార్మికుల కృషి ఫలితం ఈ చీర. మరో విశేషం ఏంటంటే..ఇందులో ప్రఖ్యాత భారతీయ కళాకారుడు రాజా రవి వర్మ 11 చిత్రాల ప్రతిరూపాలు ఉన్నాయి. ఆ శారీ పల్లులో 'గెలాక్సీ ఆఫ్ మ్యూజిషియన్స్' ప్రతిరూపం ఉంటుంది. ఇది సంగీత ప్రదర్శనలో నిమగ్నమైన 11 మంది మహిళలను వర్ణిస్తుంది. ఇందులో ప్రతి స్త్రీ ఒక ప్రాంతం లేదా కమ్యూనిటికి సంబంధించిన విభిన్న దుస్తులను ధరించి కనిపించడం మరింత విశేషం. కుడివైపు ఒక ముస్లీం మహిళ, ఎడమవైపు ఒక స్త్రీ నాయర్ ముండు దుస్తులను(కేరళ నాయర్ సామాజికి వర్గానికి సంబంధించిన స్త్రీలు) ధరించి చేతిలో వీణ వాయిస్తూ కనిపిస్తుంది. మధ్యలో ఆకుపచ్చ గాజులతో మరాఠీ శైలి చీర ధరించిన స్త్రీ కనిపిస్తుంది. ఇంతలా వివవరణాత్మక పెయింటింగ్ చీరపై చిత్రించడంతనే ఈ చీర అత్యంత హైలెట్‌గా నిలిచిందని చెప్పొచ్చు. అయితే ఇన్ని ప్రత్యేకతలు కలిగి ఉన్న ఈ చీరను రెండు వెర్షన్లలో తయారు చేసినట్లు సమాచారం. ఒకటి బెంగళూరుకి చెందిన ఒక వ్యాపారవేత్త తన పదవ వివాహ వార్షికోత్సవం సందర్భంగా కొనుగోలు చేయగా, మరొకటి 2009లో కువైట్‌కు చెందిన ఒక వ్యాపారవేత్త కొనుగోలు చేశారట.(చదవండి: Nita Ambani: ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!) -
ఎరుపు చీర, బాస్రా ముత్యాల నెక్లెస్‌లో నీతా అంబానీ మెస్మరైజ్ లుక్..!
ధీరూభాయ్ ఇంటర్నెషనల్ స్కూల్ వార్షిక దినోత్సవ వేడుకల్లో రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ అద్భుతమైన లుక్‌లో కనిపించారు. కార్యక్రమానికి తగ్గట్టుగా ఆమె ఫ్యాషన్ శైలి ఉండటం నీతా స్పెషాలిటీగా పేర్కొనవచ్చు. ఈవెంట్‌ని బట్టి తన డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. ఇక ఈ స్కూల్ వార్షికోత్సవంలో సంప్రదాయ ఎరుపు ఎంబ్రాయిడరీ చీర విత్ అరుదైన బాస్రా ముత్యాల ఆభరణాలతో తుళ్కుమన్నారు. ఈ లుక్ ఆమె ఫ్యాషన్ అభిరుచిని ప్రతిబింబిస్తోంది. స్టైలిష్‌గా ఉండటం కాదు..ఆ వేడుకకు పూర్తి న్యాయం చేసేలా మన ఆహార్యం ఉంటేనే ఆ కార్యక్రమం అత్యంత జయప్రదంగానూ ఆకర్షణీయంగా ఉంటుందని తన వేషధారణతో చెప్పకనే చెప్పారు నీతా అంబానీ. ఈసారి ఆమె స్టన్నింగ్ లుక్ దటీజ్ నీతా.. ఏ వేడుకైనా ఆమెదే ప్రధాన ఆకర్షణ అని మరోసారి ప్రూవ్ చేశారామె. చేతులుకు ఎర్ర గాజులు, ముత్యాల గాజులు కలిపి ధరించి ఆధునికత, నాటి సంప్రదాయన్ని కలగలిపి తన లుక్‌ని ప్రజెంట్‌ని చేశారు నీతా. ఈ కార్యక్రమంలో ధీరుబాయ్ అంబానీ ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ అయిన నీతా అంబానీ అందరికీ చేతులు జోడించి "జై శ్రీ కృష్ణ" అని పలకరిస్తూ కనిపించడం విశేషం. ఈ వార్షిక దినోత్సవ వేడుకల్లో బాలీవుడ్ ప్రముఖ నటులు షారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, కరీనా కపూర్ ఖాన్, క్రికెటర్ రోహిత్ శర్మ తదితరులు పాల్గొనన్నారు. బాస్రా ముత్యాల ప్రత్యేకత..హైదరాబాద్ నిజాంలచే ప్రాచుర్యం పొందిన బాస్రా ముత్యాలను మనకు అందుబాటులో ఉన్న ముత్యాలకెల్లా అత్యంత అరుదైనవి, విలువైనవి కూడా. చారిత్రాత్మకంగా, అరేబియా గల్ఫ్ దక్షిణ భాగం, ప్రస్తుత ఖతార్, బహ్రెయిన్‌లోని నుంచి వీటిని సేకరిస్తారట. ఈ తీరం వెంబడి శతాబ్దాలుగా ముత్యాల పెంపకం ఒక సాంప్రదాయ వృత్తిగా ఉంది. అలాగే ఆర్థిక వ్యవస్థ ప్రధాన కేంద్రం కూడా. ప్రస్తుత ఇరాక్ బాస్రా ఓడరేవు నుంచే ఆసియా, యూరప్ కొనుగోలుదారులకు ఈ ముత్యాలను విక్రయిస్తారట. భారత్ కూడా ఈ ముత్యాలను అధికంగా కొనుగోలు చేస్తుందట. మనదేశంలోని రాజకుటుంబాల కారణంగా ఈ ఆభరణాల కొనుగోళ్లు ఎక్కువట. ఇక ఈ బాస్రా ముత్యాలు తరుచుగా తెలుపు, క్రీమ్, గులాబీ, వెండి రంగుల కలయికలో లభిస్తాయట. అయితే ప్రస్తుత కాలుష్య కారణాల రీత్యా వీటి సంఖ్య తక్కువ అవ్వడంతో ఈ ముత్యాలు అరుదైనవి, అమూల్యమైనవిగా మారాయని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Zoom TV (@zoomtv) (చదవండి: ఆర్మీ లెఫ్టినెంట్‌గా మిడ్ డే మీల్ వర్కర్ కుమారుడు..! ఏకంగా ఎనిమిది సార్లు ఓటమి) -
గోల్డెన్ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా శోభితా ధూళిపాళ..!
ముంబైలో జరిగిన ఒక కార్యక్రమంలో టాలీవుడ్ నటుడు నాగచైతన్య భార్య, అక్కినేని వారి కోడలు శోభిత ధూళలిపాళ బంగారు లుక్ అందర్నీ అబ్బురపిచింది. పెళ్లి దుస్తులను తలపించే ఆమె బంగారు రంగు లెహంగాలో కొత్త పెళ్లికూతురిలా మెరిసిపోయారామె. ఆ చీర తగ్గట్టు ధరించిన రూబి నెక్లెస్ ఆమె లుక్‌ని మరింత ఆకర్షణీయంగా కనిపించేలా చేసింది. లెహంగా మెరిసే సీక్వెన్స్, పూసల అలంకరణ తోపాటు ఎంబ్రాయిడరీ, మెర్మెడ్ సిల్హౌట్‌లు లెహంగాకి గ్రాండ్ లుక్‌ని తెప్పించాయి. నేలను తాకేలా పొడవుగా ఉన్న ఈ లెహంగా రాయల్టీ లుక్‌కి దర్పణంలా నిలిచింది. ఆ లెహంగాకి మ్యాచింగ్ సీక్విన్డ్ టల్లే ఫ్యాబ్రిక్ బ్లౌజ్ లెహంగాను మరింత హైలెట్‌గా కనిపించేలా చేసింది. అలాగే దానికి సీత్రూ దుపట్టా, దానిచుట్టూ ఉన్న మిర్రర్ బోర్డర్‌తో కూడిన ఎంబాలిష్మెంట్ శోభితాను బంగారంలా మెరిసిపోయేలా చేసింది. పుత్తడి లెహంగా శోభిత ధగధగ మెరిపోతూ.. అందరి చూపులు ఆమె వైపుకే తిప్పుకునేలా చేసింది. ఇక్కడ శోభితా దరించిన ఆభరణాలు, జుమ్కీలు, స్టేట్మెంట్రింగులు, బ్యాంగిల్స్ తదితరాలన్ని శోభిత ఫ్యాషన్ స్టైల్‌ని హైలెట్ చేశాయి. మొత్తంగా ఆ కార్యక్రమంలో శోభితా లుక్ ఎవర్‌గ్రీన్‌గా నిలవడం విశేషం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by HT City (@htcity) (చదవండి: Meher Castelino: భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..) -
భారత్ తొలి మిస్ ఇండియా..!ఫ్యాషన్ జర్నలిజంకి ఐకాన్ కూడా..
భారత్‌లో అంతగా ఫ్యాషన్ , అందాల పోటీలకు ప్రాచుర్యం లేని సమయంలో ముంబైకి చెందిన మెహర్ కాస్టెలినో మోడల్‌గా ఎంట్రీ ఇచ్చి ఫెమినా మిస్ ఇండియా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించింది. అంతేగాదు ఈ ఘనత సాధించిన తొలిభారతీయ మహిళ నిలిచింది. ఆడవాళ్లు ధైర్యంగా తమకు నచ్చిన రంగంలో ధైర్యంగా దూసుకుపోవచ్చు అనేందుకు స్ఫూర్తిగా నిలిచారామె. ఈ రోజు ఇంతలా అందాల పోటీలకు క్రేజ్ వచ్చిందంటే అందుకు కాస్టలినోనే కారణమని చెప్పొచ్చు. అలాంటి శక్తిమంతమైన మహిళ 81 ఏళ్ల వయసులో అనారోగ్యంతో డిసెంబర్17న(బుధవారం) కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆమెకు కుమారుడు, కోడలు నిషా, మనవరాలు క్రిస్టినా ఉన్నారు. ఫ్యాషన్ ప్రపచంలో భారతీయ మహిళలకు మార్గదర్శకురాలిగా ఉన్నా ఆమె ప్రస్థానం, సాధించిన విజయాలు గురించి సవివరంగా తెలుసుకుందామా..!.భారత్‌కు ఫ్యాషన్ జర్నలిజాన్ని నేర్పించిన ఐకాన్, మొదటి మిస్ ఇండియా మెహర్ కాస్టెలినో(Meher Castelino). 1964లో మిస్ ఇండియాగా కిరీటాన్ని గెలుచుకుని చరిత్ర సృష్టించారు. దీని తర్వాత కూడా ఈమె మిస్ యూనివర్స్, మిస్ యునైటెడ్ నేషన్స్ వంటి అంతర్జాతీయ అందాల పోటీలలో భారత్ తరుఫున ప్రాతినిధ్యం వహించారు. తొలి ఫెమినా మిస్ ఇండియా టైటిల్ హోల్డర్‌గా, ఆమె విజయం భారత అందాల పోటీల చరిత్రలో ఒక నిర్ణయాత్మక క్షణాన్ని సూచిస్తుంది. కాస్టెలినోని నిశ్శబ్ద బలానికి చిహ్నంగా అభివర్ణిస్తూ, భారతదేశంలో ప్రారంభ ఫ్యాషన్, అందాల పోటీల దృశ్యాన్ని రూపొందించడంలో సహాయపడిన మార్గదర్శకురాలిగా ఫ్యాషన్ ప్రపంచం ఆమెను సదా కీర్తిస్తుంది.తొలితరం ఫ్యాషన్ జర్నలిస్టు కూడా..!మోడలింగ్, టైటిల్ విన్నింగ్ తర్వాత మెహర్ ఫ్యాషన్ జర్నలిజంలోకి అడుగు పెట్టారు. 1973లో ఈవ్స్ వీక్లీ లో తన మొదటి కథనాన్ని ప్రచురించారు. చాలా కొద్ది టైమ్ లోనే మెహర్ ఫ్యాషన్ కాలమిస్ట్ గా ఎదగి..160 జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, మ్యాగజైన్లలో వ్యాసాలు రాశారు. మ్యాన్‌స్టైల్’, ‘ఫ్యాషన్ కెలిడోస్కోప్’ వంటి పుస్తకాలు కూడా ఆమె రచించారు. సింపుల్‌గా చెప్పాలంటే..భారత్‌లో ఫ్యాషన్ జర్నలిజానికి మెహర్ కాస్టెలినో ఐకాన్‌గా పేర్కొనవచ్చు. లాక్మే ఫ్యాషన్ వీక్ వంటి అనేక ప్రధాన ఫ్యాషన్ ఈవెంట్లకు ఆమె అధికారిక ఫ్యాషన్ రైటర్‌గా పనిచేశారు. ఫ్యాషన్‌ను కేవలం సెలబ్రిటీల గ్లామర్‌గా కాకుండా, ఒక పరిశ్రమగా విశ్లేషించిన తొలితరం జర్నలిస్టులలో ఆమె ఒకరు. భారతదేశంలో ఫ్యాషన్ రంగం అప్పుడప్పుడే అభివృద్ధి చెందుతున్న తరుణంలో ఒక మహిళగా ప్రభంజనం సృష్టించి చాలామంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి మార్గదర్శకురాలిగా, స్ఫూర్తిగా నిలిచారామె. View this post on Instagram A post shared by Femina Miss India (@missindiaorg) (చదవండి: వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..! మన తెలుగమ్మాయి కారణంగా..) -
ప్రధాని మోదీ నుంచి బాలీవుడ్ నటుల వరకు అంతా మెచ్చే పటోలా ఫ్యాబ్రిక్..!
భారతీయ చేనేత సంప్రదాయం వేల ఏళ్ల నాటిది. అవి విలాసవంతమైనవి, సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగినవి కూడా. కొన్నిటికి వాటి చారిత్రక నేపథ్యం కారణంగా యావత్తు ప్రపంచం మెచ్చేలా ప్రజాదరణ సైతం ఉంది. అలాంటి ప్రాముఖ్యత కలిగిన చేనేత వస్త్రాల్లో ఒకటి గుజరాత్‌కి చెందిన పటాన్ పటోలా ఫ్యాబ్రిక్. ఈ ఫ్యాబ్రిక్ అందానికి రాజీకీయ నాయకుల నుంచి బాలీవుడ్ నటుల వరకు అందరూ ఫిదా. అంతలా ఆదరణ పొందుతున్న ఈ పటాన్ పటోలా చేనేత వస్త్రం ఎలా కళాకారుల చేతులో రూపుదిద్దుకుంది..? ఎలా పుట్టుకొచ్చింది వంటి వాటి గురించి సవివరంగా చూద్దామా..!.విభిన్న రంగుల్లో ఆకర్షణీయంగా కనిపించే ఈ పటోలా డబుల్ ఇకాట్ టెక్నిక్ ఉపయోగించి నేస్తారు. వీటిలో రేఖాగణిత మోటీప్‌లు కూడా ఉంటాయి. అదోక విస్తృత కథాఖండం. ఇందులో పూల నుంచి జంతువుల మోటీఫ్‌లు కూడా ఉంటాయి. ప్రతి డిజైన్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది.900 ఏళ్ల నాటి చరిత్ర..12వ శతాబ్దంలో రాజు కుమార్పాల ఈ పటోలాను ఇష్టపడ్డాడు. చాలా క్లిష్టంగా ఉండే చేతిపని. ఆయన జైన మతాన్ని స్వీకరించాడు. అందువల్ల ఆలయాలు పరిశుభ్రంగా ఉండటమే కాకుండా..అక్కడకు వచ్చే ప్రజలంతా పటోలా వస్త్రాల్లో కనిపించాలని హుకుం జారీ చేసేవాడు. ఈ వస్త్రం మహారాష్ట్రలోని జల్నా నగరం రవాణా అయ్యేది. అయితే ఒకసారి రాజు కుమార్పాల ఒక ఆయానికి వెళ్తే..అక్కడ పూజారి మీ దుస్తులు అపరిశుభ్రంగా ఉన్నాయంటూ లోపలికి వెళ్లనివ్వలేదు. ఒక్కసారిగా అతడి మాటలకు హుతాశుడై ఇలా ఎందుకన్నాడు. అత్యంత విలాసవంతమైన పటోలా పట్టు వస్త్రాలు మాములు దుస్తుల్లా ఎలా కనిపించాయని విచారించగా, అసలు విషయం బయటపడింది. జల్నా రాజు పటోలా బట్టలను బెడ్‌షీట్‌లుగా ఉపయోగించేవాడని, వాటిని రాజకుటుంబాలకు బహుమతిగానూ లేదా విక్రయించేవాడని తెలుస్తుంది. దాంతో కుమారపాల్ రాజు అతడితో యుద్ధం చేసి గెలిచాక..దాదాపు 700 మంది సాల్వి కళాకారులను, వారి కుటుంబాలను పటాన్ తీసుకువచ్చి పటోలా వస్త్రాల్లో కల్తీ లేని నాణ్యమైనవి వచ్చేలా చూశాడు. తన పాలనలో ఆ బట్ట ఉత్పత్తి బాగుండేలా కేర్ తీసుకున్నాడు. అలా దీని గురించి తరతరాలకు తెలిసేందుకు దారితీసింది. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi)నేయడానికి వ్యవధి కూడా ఎక్కువే..నిజానికి ఆరు నెలల కాలానికి గానీ ఒక చీర ఉత్పత్తి అవ్వదట. అంత సంక్లిష్టమైన చేతి పనితో కూడిన చేనేత వస్త్రం ఇది. అందుకు సంబంధించిన ఆధారాలు అజంతాలోని ఫ్రెస్కోలు, పద్మనాభపురం రాజభవనాల మీద లిఖిత పూర్వకంగా చెక్కబడి ఉన్నాయట కూడా. ముఖ్యంగా కేరళ గోడ చిత్రాల్లో ఇది ప్రస్పుటంగా కనిపిస్తుందట. అంటే ఈ పటోలా చీరలు దగ్గర దగ్గర వెయ్యి ఏళ్ల నాటివిగా పేర్కొనవచ్చు. సాల్విస్, సోనిస్ అనే రెండు వర్గాల వారికే ఈ పటోలా చేనేత నైపుణ్యం తెలుసట. గుజరాతీలోని పాత స్మారక చిహ్నాలలో ఉన్న క్లిష్టమైన గోడ డిజైన్ల ద్వారా ప్రేరణ పొందిన చతురస్రాకార నమూనాల్లో కూడా ఈ పటోలా వస్త్రాల్లో చూడొచ్చు. ఈ చేనేత వస్త్రంలోని చిహ్నాలు చాలామటుకు సంతానోత్పత్తి, శక్తి, అదృష్టం, శ్రేయస్సుతో ముడిపడి ఉండటం విశేషం. అందుకే గుజరాతీ మహిళలు శుభ సందర్భాల్లో తప్పనిసరిగా ఈ వస్త్రాలను ధరిస్తారట. డిజైన్ రూపొందించడానికే మూడు నుంచి నాలుగు నెలలు పడుతుందట. ఇక నేయడానికి ఏకంగా 40 నుంచి 50 రోజుల పడుతుందట. కనీసం ఇద్దరు కార్మికులు ఈ చీరపై ఎనిమిది నుంచి 9 గంటలు కూర్చొంటే గనుక ఇది పూర్తవ్వుతుందట. ఇప్పటకీ ఒక సాధారణ పటోలాను పూర్తిచేయాలన్న కనీసం ఐదు నెలల వ్యవధి పడుతుందట. అందుకే అంత ఖరీదు..అందువల్లే ఈ పటోలా చీరలు అంత ఖరీదు పలుకుతాయట. మార్కెట్లో అచ్చం అలాంటి నకిలీ ఫ్యాబ్రిక్ పటాన్ పటోలా వచ్చేస్తున్నాయి. అయితే అవి రూ. 2000 నుంచి రూ. 3000లు పలుకుతాయి. నాణ్యమైన ఒరిజనల్ పటోలా పట్టు చీర మాత్రం రూ. 1,50,000 నుంచి దగ్గర దగ్గర 3,50,000 వరకు పలుకుతుందట. అంతేగాదు వీటిని మలైకా అరోరా, స్మృతి ఇరానీ, దీపికా పదుకొనే, సోహా అలీ ఖాన్, కరిష్మా తన్నా, కంగనా రనౌత్, భూమి పెడ్నేక్కర్, మాధురి దీక్షిత్‌లు ఎంతో ఇష్టంగా ధరిస్తారట. అలాగే మన ప్రధాని మోదీ సైతం దీన్ని ఇష్టపడతారు. ఆయన జూలై 2022 లో పటోలా స్కార్ఫ్‌లో కనిపించి అందర్నీ ఆశ్చర్యపరిచారు. View this post on Instagram A post shared by Salvi Nirmal (@patola_bynirmalsalvi) (చదవండి: మేనరికాల జోడు..భావితరాలకు చేటు..!) -
వందేళ్ల ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకతలివే..!
మన హైదరాబాద్ నుంచి న్యూయార్క్ వెళ్లిన భవిత మండవ అనే అమ్మాయి మోడలింగ్‌లో సంచలనాలు సృష్టిస్తోంది. న్యూయార్క్ సిటీలో జరిగిన షనెల్ మెతీర్స్ దార్-2026 కలెక్షన్లో ర్యాంప్‌ను ఓపెన్ చేసి ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త స్టార్‌గా నిలిచింది. ర్యాంప్‌ను ఓపెన్ చేయడం అంటే.. షోను ప్రారంభించే స్టార్ మోడల్‌గా అందరు మోడళ్ల కంటే ముందుగా వాక్ చేయడం. ఒక తెలుగమ్మాయి ఈ ఘనతను సాధించడంతో ఒక్కసారిగా ఏంటీ షనెల్ మోతీర్స్ దార్ షో, దాని స్పెషాలిటీ గురించి ఆరాలు మొదలయ్యాయి. ఈ నేఫథ్యంలో ప్రఖ్యాతిగాంచిన దిగ్గజ ఫ్యాషన్ బ్రాండ్ 'షనెల్' ప్రత్యేకత గురించి సవివరంగా తెలుసుకుందామా..మెతీర్స్ దార్ (Métiers d'Art) అంటే ఫ్రెంచ్ భాషలో దీని అర్థం "కళల లేదా హస్తకళలు". ఈ ఫ్యాషన్ షోను షనెల్ నిర్వహిస్తోంది. ఈ ఫ్యాషన్ షో ప్రత్యేకత..సంప్రదాయ హస్తకళల నైపుణ్యాలను, వాటిని సృష్టించే కళాకారుల గురించి ప్రపంచానికి పరిచయం చేయడం, వాటికి గుర్తింపు తీసుకురావడమే ఈ షో ప్రధాన ముఖ్యోద్దేశం. ఇక ఈ షోలో అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ, ఫెదర్ వర్క్, జ్యువెలరీ, లెదర్ వర్క్ వంటి కలెక్షన్లను ప్రదర్శిస్తారు. View this post on Instagram A post shared by Bhavitha Mandava (@bhavithamandava) వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన బ్రాండ్..షనెల్ అనేది 1910లో ఫ్రెంచ్ మహిళా ఫ్యాషన్ డిజైనర్ గాబ్రియెల్ కోకో షనెల్ స్థాపించిన లగ్జరీ ఫ్యాషన్ హౌస్. ఇది మహిళల శైలిలో చక్కదనం, సరళత, కాలాతీత డిజైన్‌లో విప్లవాత్మక మార్పులను తీసుకురావడం తదితరాలకు సంబంధించి ప్రసిద్ధి చెందింది. దీన్ని 1910లో పారిస్, ఫ్రాన్స్ దేశాలలో ఈ షెనల్ బ్రాండ్‌ని స్థాపించారు ఫ్రెంచ్ మహిళా డిజైనర్ కోకో. దీని ప్రధాన కార్యాలయం లండన్. దీనికి ప్రపంచవ్యాప్తంగా బోటిక్‌లు కూడా ఉన్నాయి. ఇది హాట్ కోచర్ , రెడీ టు వేర్ దుస్తులు, హ్యాండ్ బ్యాగులు, పలు ఫ్యాషన్ ఉపకరణాలు, వాచ్‌లు, చక్కటి ఆభరణాలు, పెర్ఫ్యూమ్ తదితర సౌందర్య సాధానాలను ప్రమోట్ చేస్తుంది. ఈ బ్రాండ్ ఐకానిక్ క్రియేషన్స్..చానెల్ నం. 5 పెర్ఫ్యూమ్ (1921) - ఇప్పటివరకు అత్యంత ప్రసిద్ధ సువాసనలలో ఒకటి.చానెల్ సూట్ - మహిళలకు ఆధునిక చక్కదననానికి సింబల్ది లిటిల్ బ్లాక్ డ్రెస్ - ఫ్యాషన్‌లో ప్రధానమైనదిగా మారిన కోకో చానెల్ ఆవిష్కరణ.2.55 హ్యాండ్‌బ్యాగ్ - చైన్ స్ట్రాప్‌తో క్విల్టెడ్ లెదర్, ఇప్పటికీ ప్రపంచం మెచ్చిన హ్యాండ్‌బ్యాగ్‌గా పేరుతెచ్చుకుంది.ప్రత్యేకతలు..ఫ్యాషన్‌లో పలు విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా మహిళలను స్వేచ్ఛగా తమ ఫ్యాషన్‌ను వ్యక్తపరిచే అవకాశాన్ని ఇచ్చింది. అలాగే సౌకర్యవంతంగా దుస్తులన ధరించడాన్ని పరిచయం చేసింది. ఇది ఆధునాతనకు పెద్దపీట వేస్తూనే..సంప్రదాయ కళా నైపుణ్యాన్ని ప్రోత్సహించడమే గాక సాధికారతను కూడా సూచించింది. అంతేగాదు ఎంబ్రాయిడీరీ, ప్లీటింగ్ నగల తయారీతో కళాకారుల నైపుణ్యాన్ని ప్రపంచానికి తెలియజేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 500కుపైనే బోటిక్లతో త్వరితగతిన అత్యంత గుర్తింపు పొందిన లగ్జరీ బ్రాండ్లలో ఒకటిగా పేరుతెచ్చుకుంది. ఈ బ్రాండ్ సీఈవో లీనా నాయర్ మన భారతీయ మూలాలకు చెందినవాడు కావడం విశేషం. క్రియేటివ్ డైరెక్టర్ మాథ్యూ బ్లేజీ తన సృజనాత్మక ఫ్యాషన్ ఆవిష్కరణలతో ఈ షనెల్ ప్రభావాన్ని మరింత విస్తరింప చేస్తూనే ఉన్నారు. View this post on Instagram A post shared by @ideservecouture (చదవండి: అంతర్జాతీయ మోడల్‌గా హైదరాబాదీ.. ట్రెండింగ్‌లో భవితా మండవ) -
బ్యూటీ అండ్ ఫ్యాషన్ ఇండస్ట్రీని ఏలిన ‘షీరో’ ఇక లేరు: 5 ఆసక్తికర అంశాలు
సాక్షి, ముంబై: టాటా ట్రస్ట్స్ చైర్మన్ నోయెల్ టాటా తల్లి, టాటా గ్రూప్ మాజీ చైర్మన్ రతన్ టాటా సవతి తల్లి సైమన్ టాటా (95) శుక్రవారం తెల్లవారుజామున కన్నుమూశారు. అనారోగ్యంతో దుబాయ్‌లోని కింగ్స్ హాస్పిటల్లో ప్రాథమిక చికిత్స పొందిన తర్వాత ఈ ఆగస్టు ప్రారంభంలో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.సైమన్ టాటా అస్తమయం పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. బయోకాన్ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్-షా , లక్మే మాజీ చైర్పర్సన్ , భారతదేశ బ్యూటీ అండ్ రిటైల్ ల్యాండ్‌స్కేప్‌లో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తులలో ఒకరంటూ ఆమెకు నివాళులర్పించారు. నా షీరో ఇక లేరంటే చాలా బాధగా ఉంది, "మహిళా వ్యాపార నాయకులలో అగ్రగామి"అని తన సంతాపాన్ని ప్రకటించారు.సైమన్ టాటాకు సంబంధించి ఆసక్తికర సంగతులు.స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జన్మించారు సైమన్ నావల్ డునోయర్ 1953లో భారతదేశానికి పర్యాటకురాలిగా వచ్చారు. రెండేళ్ల తరువాత 1955లో ఆమె నావల్ హెచ్. టాటాను వివాహం చేసున్నారు.1960ల ప్రారంభంలో టాటా గ్రూప్‌తో తన వృత్తిపరమైన అనుబంధాన్ని ప్రారంభించారు.1961లో టాటా ఆయిల్ మిల్స్ కంపెనీ లక్మే బోర్డులో చేరారు. 1982లో ఆమె చైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు.భారతదేశ ఆధునిక సౌందర్య సాధనాల రంగంలో ఆమె చేసిన విశేష కృషికి గాను "కాస్మెటిక్ క్జారినా ఆఫ్ ఇండియా" అనే బిరుదును దక్కించుకున్నారు.వెస్ట్‌సైడ్ & ట్రెంట్ రిటైల్ వ్యవస్థాపకురాలుగా ఆమె ఫ్యాషన్ రంగంలో తన ప్రత్యేకతను చాటుకున్నారు. 1998లో లక్మీని హిందూస్తాన్ యూనిలీవర్‌కు విక్రయించిన తర్వాత, సిమోన్ టాటా రిటైల్ విభాగమైన ట్రెంట్ లిమిటెడ్‌కు నాయకత్వం వహించారు.తరువాత వె స్ట్సైడ్ను ప్రారంభించి భారతదేశంలో అత్యంత విజయవంతమైన ఫ్యాషన్ రిటైల్ చెయిన్‌గా తీర్చిదిద్దారు. ఇపుడు ఆ తరువాత జూడియో స్టోర్లలోకి విస్తరించింది.లక్ష కోట్ల రూపాయల రిటైల్ అండ్ బ్యూటీ సామ్రాజ్యాన్ని స్థాపించిన సైమన్ చాలా లోప్రొఫైల్మెయింటైన్ చేసేవారు. తన జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి విజయ వంతమైన వ్యాపారవేత్తగా, దార్శనికురాలిగా తన పేరును శాశ్వతం చేసుకున్న గొప్ప మహిళ సైమన్ టాటా.ఆమెకు కుమారుడు నోయెల్ టాటా, కోడలు ఆలూ మిస్త్రీ , మనవరాళ్ళు నెవిల్లే, మాయ , లియా ఉన్నారు.ఇదీ చదవండి: కొత్త జంటకు ‘ఇండిగో’ తిప్పలు, ఆన్లైన్లోనే రిసెప్షన్ -
క్రియేటివ్, డిజైన్ రంగాలపై తెలంగాణ విద్యార్థులు మొగ్గు
దశాబ్దాలుగా భారతదేశంలో ఇంజనీరింగ్, వైద్యం వంటి సాంప్రదాయ కెరీర్లే ఆధిపత్యం చెలాయించాయి. ప్రస్తుతం భారత్ యువతలో మార్పు సంతరించుకుంది. డిజైన్, ష్యాషన్, యానిమేషన్, క్రియేటివ్ సాంకేతిక కెరీర్లను ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది కూడా. ఈ మార్పుని ప్రతిబింబింబించేలా వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ (WUD) ఈ క్రియేటివ్ రంగం ప్రాముఖ్యతను హైలెట్ చేసేలా హైదరాబాద్‌లో కౌన్సలర్ల సమావేశాన్ని నిర్వహించింది. ఆంధ్ర తెలంగాణ అంతటా దాదాపు వెయ్యి మందికి పైగా పాఠశాల ప్రిన్సిపాల్లు, కౌన్సలర్లను అనుసంధానించిన ఈ డ్రైవ్‌లో సృజనాత్మక రంగాలపై పెరుగుతున్న క్రేజ్‌ని చర్చించడమే కాకుండా ఈ జెన్ జెడ్ తన ఆకాంక్షలను ఎలా రూపొందించుకోగలదు అనే దానిపై అంతర్దృష్టిని అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విద్యార్థులకు రాష్ట్రం దాటి అవకాశాలను అన్వేషించడంలో తమ వంతు పాత్రను పోషిస్తామని వరల్డ్ యూనివర్సిటీ ఆఫ్ డిజైన్ డీన్ స్కూల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ప్రొఫెసర్ షలీన్ శర్మ అన్నారు. అలాగే ఈ యూనివర్సిటికి చెందిన విద్యార్థుల్లో సుమారు 12-15% మంది ఆంధ్ర, తెలంగాణకు చెందినవారే కావడం విశేషం. అంతేగాదు ఈ ఉన్నత విద్యను అభ్యసించే విద్యార్థులకు అవకాశాలను బలోపేతం చేసేలా WUD ఆక్స్ఫర్డ్ బ్రూక్స్ విశ్వవిద్యాలయం అండ్ రీడింగ్ UK విశ్వవిద్యాలయం, ఎమిలీ కార్ యూనివర్సిటీ ఆఫ్ ఆర్ట్ అండ్ డిజైన్ అండ్ వాంకోవర్ ఫిల్మ్ స్కూల్, కెనడా; కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, బర్కిలీ USA; ENSAIT, ఫ్రాన్స్; ఉట్రెచ్ట్ విశ్వవిద్యాలయం, నెదర్లాండ్స్; వంటి ప్రముఖ సంస్థలతో కూడా అవగాహన ఒప్పందాలపై సంతకం చేసింది. చివరగా ఈ కౌన్సలర్ల సమావేశం ద్వారా తెలంగాణ, హైదరాబాద్ నుంచి వచ్చిన విద్యార్థులను సాధికారపర్చడానికి WUD తన నిబద్ధతను పునరుద్ఘాటించడమే కాకుండా ఈ డిజైన్ ఎడ్యుకేషన్‌ని పూర్తి స్థాయి కెరీర్ మార్గంగా ఎంచుకునులా ప్రోత్సహిస్తోంది కూడా. (చదవండి: ఈ పర్ఫెక్ట్ క్రిస్పీ దోసె వెనుక ఇంత సైన్సు ఉందా? సాక్షాత్తు ఐఐటీ ప్రొఫెసర్) -
ఫ్యాషన్ వీక్ 2025 గ్రాండ్ ఫినాలేలో మెరిసిన రేణు దేశాయ్ (ఫొటోలు)
-
సంయుక్తా మీనన్ ఫ్యాషన్, ఫిట్నెస్ సీక్రెట్ ఇదే..!
చీర కట్టుకుంటే క్లాసిక్ క్వీన్ , గౌన్ వేసుకుంటే గ్లామర్ గర్ల్, కేజువల్ వేర్లో వెళ్తే చీర్‌ఫుల్ చిక్! ఇలా ప్రతి లుక్‌లోనూ ‘వావ్!’ అనిపించేస్తుంది నటి సంయుక్తా మేనన్ . ఇప్పుడు ఆ అందం వెనక దాగి ఉన్న ఫ్యాషన్ రహస్యాలు, ఫిట్నెస్ మంత్రాలు మీ కోసం... ఫిట్నెస్ విషయంలో నేను చాలా కాన్షియస్! రుచిగా ఉన్న ప్రతి ఆహారం ఆరోగ్యకరమైనది కాకపోవచ్చని ఇప్పుడిప్పుడే గ్రహించాను. అందుకే చక్కెర, ఉప్పు, మసాలా, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అన్నింటినీ దూరం పెడుతున్నాను. ఇక స్టయిలింగ్ విషయానికి వస్తే, ప్రతి ఔట్ఫిట్లో చిన్న చిన్న డీటెయిల్స్ ఉండాలి, అప్పుడు లుక్ కంప్లీట్ ఫీల్ వస్తుంది.సంయుక్తా ముత్యాల వడ్డాణం!‘పూసల వడ్డాణం’ అంటే పాతకాలపు ఆభరణం అనుకుంటే, పొరపడినట్టే! ఇప్పుడు ఈ ముత్యాల వడ్డాణం ఫ్యాషన్ ర్యాంప్ మీదే కాదు, ఇన్‌స్టా రీల్స్‌లో కూడా హాట్ ఫేవరెట్! చిన్న చిన్న పూసలు, ముత్యాలతోనే బంగారు వడ్డాణం కంటే పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డార్క్ కలర్ శారీస్‌పై ఇది పర్ఫెక్ట్ చాయిస్! ఇది ఎలిగెన్స్‌కి గ్లామర్ కలిపిన కాంబినేషన్ . పర్ల్ వర్క్ బ్లౌజ్ ఉంటే, అదనపు ఆభరణాలు ఇక అవసరం కూడా ఉండవు. అయితే, ఈ పూసల వడ్డాణం వేసుకునే ముందు హెయిర్ స్టయిల్ లోబన్ లేదా ఆప్డో ఉండేలా చూసుకోండి. దానికి తగ్గట్టుగానే చీరను డార్క్ కలర్స్‌తో పెయిరప్ చేస్తే లుక్ మరింత హైలైట్ అవుతుంది. ఇయర్ రింగ్స్ హూప్ లేదా స్టేట్మెంట్ పీస్ ఉంటే మోడర్న్ వైబ్ వస్తుంది. స్మోకీ ఐస్, న్యూడ్ లిప్ కలర్ వంటి మినిమల్ మేకప్‌తో క్లాసీ లుక్ క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ సంయుక్త మీనన్ ధరించే చీర..బ్రాండ్: క్యూబీ ఐక్యూధర: రూ. 45,000, జ్యూలరీ బ్రాండ్: సుహానీ పిట్టె, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: ముందుగానే డెలివరీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి..?) -
యోధుడా.. నీకు సెల్యూట్ ..!
మిలట్రీ వాళ్లను చూసినా, మిలట్రీ డ్రెస్‌ను చూసినా సెల్యూట్ కొట్టాలని అనిపించేంతగా భావావేశానికి లోనవుతాం. అదీ మిలట్రీ పవర్! సాధ్యం కాదు కానీ, అందరికీ దేశ రక్షణ దళాలలో పని చేయాలనే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఫ్యాషన్లన్నీ మిలట్రీ నుంచి వచ్చినవే. దేశాధి నేతలు మొదలు సామాన్య పౌరుల వరకు ఏదో ఒక సందర్భంలోమిలట్రీ దుస్తులు మన ఒంటిపై కవాతు చేస్తూ కనిపిస్తాయి. అంతగా స్ఫూర్తిని ఇస్తున్న సైనిక వస్త్ర, శస్త్ర విశేషాలు.. క్లుప్తంగా మీ కోసం!కార్గో ప్యాంట్లు1930లలో, బ్రిటిష్ సైన్యం కార్గో ప్యాంట్లను యుద్ధ దుస్తులలో భాగంగా ప్రవేశపెట్టింది. తూటాలు, ఇతర మందుగుండు సామగ్రి అమర్చుకోవటానికి సదుపాయంగా ఆ ప్యాంట్లకు ఇరువైపు ‘పక్క తొడ’ల పైన, నడుముకు ముందువైపు రెండు వైపులా జేబులు ఉండేలా డిజైన్ చేశారు. బ్రిటన్ తర్వాత కార్గో ప్యాంట్లను క్రమంగా యూఎస్ సైన్యం కూడా ఉపయోగించటం మొదలుపెట్టింది. 1990ల నాటికి ఇది సాధారణ పౌరుల ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారింది. యువతీ యువకులు స్టెయిల్ కోసం వీటిని ధరించటం మొదలు పెట్టారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తరచు కార్గో ప్యాంట్స్‌లో కనిపిస్తుంటారు. మూడేళ్లుగా సాగుతున్న రష్యా–ఉక్రెయిన్ ఘర్షణల సమయంలో జెలెన్స్కీ వస్త్రధారణ కూడా ఒక ప్రతీకగా మారింది! త్రిశూలం గుర్తు ఉన్న నల్లటి, లేదా ఆలివ్ ఆకుపచ్చ టాప్‌తో, కార్గో ప్యాంట్స్ ధరించే జెలెన్స్కీ, ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపించే విషయమై ప్రపంచ దేశాధినేతలతో చర్చిస్తున్నప్పుడు దేశాధ్యక్షుడిగా కాక, కార్గో ప్యాంట్లలో ఒక సైనిక యోధుడిని తలపిస్తుంటారు. మన దగ్గర బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ కార్గో ప్యాంట్స్‌ని ఎక్కువగా ధరిస్తుంటారు.ఏవియేటర్ సన్గ్లాసెస్హాలీవుడ్లోకి ఏవియేటర్ సన్‌గ్లాసెస్ రావటానికి ముందే, యూఎస్ ఎయిర్ ఫోర్స్ పైలట్లు వాటిని ధరించారు. అంతకుముందు వరకు పైలట్లు పాతకాలపు బరువైన గాగుల్స్ వాడేవారు. ఆ తర్వాత వాటికి బదులుగా ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌ను కనిపెట్టారు. ‘పైలట్’ను ‘ఏవియేటర్’ అని కూడా అంటారు. ఆ పేరు మీదే ఏవియేటర్ సన్‌గ్లాసెస్ వాడుకలోకి వచ్చాయి. ఎండ తాకిడి నుంచి అవి బలమైన రక్షణను ఇస్తాయి.ఏవియేటర్ సన్‌గ్లాసెస్‌కు అధునాతన రూపమే ‘రే–బాన్’ కళ్లద్దాలు. ‘రే’ అంటే సూర్యకిరణాలు. ‘బ్యాన్’ అంటే తెలిసిందే, నిషేధం అని. సూర్యకిరణాలు పడకుండా అడ్డుకుంటాయి కనుక అవి రే–బాన్ సన్‌గ్లాసెస్ అయ్యాయి. సంపన్నుల ఫ్యాషన్‌లో ఇప్పుడు ముఖ్య భాగం అయ్యాయి. అమెరికా పూర్వపు అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెన్నెడీ, రెండో ప్రపంచ యుద్ధపు అమెరికన్ టాప్ కమాండర్ జనరల్ డగ్లస్ మాక్ఆర్థర్, వియత్నాం విప్లవ నాయకుడు హో చి మిన్.. రే–బాన్ గ్లాసులు ధరించేవారు. ప్రస్తుత నాయకులలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అప్పుడప్పుడు రే–బాన్‌లో దర్శనం ఇస్తుంటారు టీ–షర్ట్టీ–షర్ట్ నమూనాను తొలిసారిగా అమెరికా నావికాదళం డిజైన్ చేసినట్లు చరిత్ర చెబుతోంది. బహుశా 1898 స్పెయిన్–అమెరికా యుద్ధ సమయంలో షర్ట్ కింద వేసుకునే అండర్ షర్ట్‌గా దీనికి రూపకల్పన చేశారని అంటారు. టీ షర్ట్ క్రమేణా సైన్యంలో తప్పనిసరి ధారణగా మారింది. అక్కడి నుండి 1950ల నాటికి పాప్ సంస్కృతిలో భాగమైంది. ఆ తర్వాత దాదాపు ప్రతి వార్డ్రోబ్లోకీ ప్రవేశించింది. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. దేశాధినేతలు అధికారిక కార్యక్రమాలలో టీ షర్ట్‌ను ధరించటం ప్రపంచ దేశాలలో ఎక్కడా కనిపించదు. అదే విధంగా, దాదాపు అన్ని కార్యాలయాలలో టీ షర్ట్‌పై అనధికార నిషేధం ఉంటుంది. విధి నిర్వహణలో కాకుండా ఉల్లాసంగా గడిపే సమయాలలోనే సాధారణంగా ఎవరైనా టీ షర్ట్‌ను ధరించి ఉండటం కనిపిస్తుంది.అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా, కెనడా మాజీ ప్రధాని ఇప్పుడంటే టీ–షర్ట్‌లో దర్శనం ఇస్తున్నారు కానీ, పదవిలో ఉండగా వాళ్లేనాడూ టీ షర్ట్‌లో అధికారిక కార్యక్రమాలలో కనిపించలేదు. గ్రీకు రాజ్యమైన మేసిడోనియా రాజు ‘అలెగ్జాండర్ ది గ్రేట్’ (క్రీ.పూ.356–323) టీ షర్ట్‌లను పోలిన పై వస్త్రాన్ని ధరించేవారని అనుకోవటానికి కొన్ని పోలికలు కనిపిస్తాయి.20వ శతాబ్దం ప్రారంభంలో ప్రపంచం అంతటా నావికులు, కార్మికులు, సౌకర్యవంతమైన లోదుస్తులుగా టీ షర్టులకు ప్రాధాన్యం ఇచ్చారు. కార్డిగన్కార్డిగన్ ధరించినప్పుడు హాయిగా, సౌఖ్యంగా ఉండే కార్డిగన్ దుస్తులను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధంలో రష్యన్లపై దాడి చేసిన సమయంలో బ్రిటిష్ సైన్యం ధరించింది. నిజానికి ‘కార్డిగన్’ అనేది ఒక బిరుదు. ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ అంటే కార్డిగన్ అనే బిరుదు కలిగిన గొప్ప వంశానికి చెందిన వ్యక్తి. అప్పటి బ్రిటిష్ అశ్విక దళానికి నాయకత్వం వహించిన 7వ ‘ఎర్ల్ ఆఫ్ కార్డిగన్’ జేమ్స్ థామస్ బ్రూడెనెల్ ఆనాటి క్రిమియన్ యుద్ధానికి ఈ దుస్తులను ధరించి సారథ్యం వహించారు కనుక ఆ దుస్తులకు కార్డిగన్ అని పేరు పెట్టారు. కార్డిగన్ డిజైన్, దానిని ధరించిన వారి కార్యాచరణలు బ్రిటిషర్ల దేశభక్తికి ప్రతీకలుగా నిలిచిపోయాయి. కాలర్ లేని స్వెట్టర్ లేదా జాకెట్‌ను ‘కార్డిగన్’ అంటారు. ఫ్రెంచి ఫ్యాషన్ డిజైనర్ కోకో చానల్ 1920లలో మహిళలు ధరించే కార్డిగన్లను ప్రాచుర్యంలోకి తెచ్చారు. పురుషుల కార్డిగన్లను ధరించేటప్పుడు తన జుట్టు చెదిరిపోతుండటం నచ్చకపోవటంతో ఫ్రంట్ ఓపన్ కార్డిగాన్లను మహిళల కోసమే ఆమె ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఒక బల్గేరియన్ రేడియో ఎడిటర్నైతే కార్డిగన్ ఏకంగా ఒక హత్యాయత్నం నుండే కాపాడింది! అతను ధరించిన మందపాటి ఉన్ని కార్డిగన్.. రహస్య ఏజెంటు ఆ ఎడిటర్‌పై పేల్చిన విషపు గుళిక శరీరంలోకి చొచ్చుకొని పోకుండా నిరోధించింది. హై – హీల్స్అశ్విక దళంలోని సైనికులు గుర్రాలను ఎక్కి రెండు వైపుల బూటు కాలు ఉంచే రింగులలో (అంకేలు) పాదాలకు మరింతగా కుదురును ఇవ్వటం కోసం మొదట పర్షియన్ సైనికులు 10వ శతాబ్దంలో హై హీల్స్‌ను కనిపెట్టారు. యుద్ధ సమయంలో గుర్రాన్ని దౌడు తీయించటంలో ఎంతో ప్రాముఖ్యాన్ని కలిగి ఉండే ఈ హై హీల్స్ కాల క్రమంలో హోదాకు చిహ్నంగా మారాయి. చివరికి గ్లామర్‌కు పర్యాయపదం అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా మహిళల మనసు దోచుకున్నాయి. మహిళా దేశాధినేతలు హైహీల్స్ ధరించటం సర్వ సాధారణమే కానీ, చరిత్రలో హై హీల్స్‌ను ఇష్టపడిన పురుష నాయకులూ ఉన్నారు. ఫ్రాన్స్ రాజు 14వ లూయీ తన హోదాకు చిహ్నంగా హై హీల్స్ ధరించేవారు. ఐక్యరాజ్య సమితిలో ఓసారి అమెరికా మాజీ రాయబారి (ఐరాసకు) నిక్కీ హేలీ హై హీల్స్ ధరించటం గురించి గళం విప్పారు! ‘‘హై హీల్స్ శక్తిని, సాధికారతను ఇస్తాయి. యథాతథ స్థితిని సవాలు చేస్తాయి. అందువల్లనే నేను హై హీల్స్ ధరిస్తాను’’ అని ప్రకటించారు. రష్యా అధ్యక్షుడు పుతిన్, అమెరికా విదేశాంగ కార్యదర్శి రూబియో వంటి వారు పొడవుగా కనిపించటానికి హై హీల్స్ ధరిస్తారన్న పుకార్లు ఉన్నాయి. 2023లో, మహిళలపై హింసకు వ్యతిరేకంగా అవగాహన పెంచటానికి ‘హోప్ ఇన్ హై హీల్స్’ ప్రచారంలో కెనడా పురుష ఎంపీలు హై హీల్స్ ధరించారు. బాంబర్ జాకెట్బాంబర్ జాకెట్‌ను మొదటి ప్రపంచ యుద్ధ పైలట్ల కోసం ‘యూఎస్ ఆర్మీ ఏవియేషన్ క్లోతింగ్ బోర్డ్’ సృష్టించింది. ఎ–1 అని వ్యవహరించిన ఆ బాంబర్ జాకెట్‌ను తొలిసారి 1917లో అమెరికన్ పైలట్లు ధరించారు. పైలట్లను వెచ్చగా ఉంచడానికి బోర్డు రూపొందించిన మొదటి ఫ్లయిట్ జాకెట్ అది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో యూరప్‌పై ప్రమాదకరమైన ఎత్తైన ప్రదేశాలలో బాంబు దాడులను నిర్వహించిన యువ అమెరికన్ వైమానిక దళ సభ్యులను ‘బాంబర్ బాయ్స్’ అనే వారు. ఆ పేరు నుంచే బాంబర్ జాకెట్ వాడుకలోకి వచ్చింది.అమెరికన్ మిలిటరీ 1950లలో ఎం.ఎ.–1 అనే బాంబర్ జాకెట్‌ను వృద్ధి చేసింది. అది ప్రకాశవంతమైన నారింజ రంగు లైనింగ్‌తో ఉండేది. ఒకవేళ విమానం కూలిపోతే, రక్షణ బృందాలకు సజీవంగా ఉన్న పైలట్ తేలిగ్గా కనిపించటానికి జాకెట్‌ను తిప్పి వేసుకోవచ్చు. లోపలి లైనింగ్ నారింజ రంగులో ఉంటుంది కనుక క్షతగాత్రుడైన పైలట్ జాడ కనిపెట్టటం వారికి తేలికవుతుంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత మిగిలిపోయిన బాంబర్ జాకెట్లను అమెరికన్ సైన్యం పౌరులకు అందుబాటులోకి తెచ్చింది. ఆ తర్వాతి నుంచి వాటిని సామాన్యులూ వాడటం మొదలు పెట్టారు. ముఖ్యంగా హిప్–హాప్ కళాకారులు. 1980లో బాంబర్ జాకెట్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఒక్కసారిగా క్రేజ్ వచ్చేసింది. దానికి కారణం టామ్ క్రూజ్ హిట్ చిత్రం ‘టాప్ గన్’లో ఆయన జి1 మోడల్ బాంబర్ జాకెట్‌ను ధరించటమే. ప్రారంభంలో బాంబర్ జాకెట్లు బరువైన తోలుతో తయారైనప్పటికీ తర్వాత్తర్వాత తేలికపాటి నైలాన్, సిల్క్, రీసైకిల్ చేసిన సముద్రపు ప్లాస్టిక్‌ల వంటి వాటితో విస్తృతంగా తయారై, ఏ సీజన్‌కైనా అనుకూలంగా ఉండేలా మారాయి. డాగ్ ట్యాగ్లుయుద్ధ సమయంలో సైనికులు మరణించినా, గాయపడినా.. వారిని సేవా దళ సభ్యులు గుర్తించటానికి వీలుగా వారి దుస్తులకు తగిలించి ఉండేవే డాగ్ ట్యాగ్లు. ఇవి అండాకారంలో ఉండే రేకు ముక్కలు. వాటిపై ఆ సైనికుల వివరాలు ముద్రించి ఉంటాయి. అమెరికా అంతర్యుద్ధ సమయంలో తొలిసారిగా ఈ డాగ్ ట్యాగ్‌లను అనధికారికంగా ప్రవేశపెట్టారు. గుర్తు తెలియని సమాధులలో శత్రువులు కనుక తమ వారిని సమాధి చేస్తే వారిని కనిపెట్టేందుకు డాగ్ ట్యాగ్‌లను తగిలించారు.డాక్ ట్యాగ్‌లను ఇప్పుడు సైనికులతో పాటుగా, పౌరులు కూడా తగిలించుకుంటున్నారు. కార్పొరేట్ కార్యాలయాలలో ఉద్యోగుల మెడలో కనిపించే ఐడీ కార్డులకు ప్రేరణ డాగ్ ట్యాగ్ల నుండి వచ్చిందేనని అంటారు.ట్రెంచ్ కోట్నీటితో తడవని, బరువు ఉండని తేలికపాటి ‘గ్రేట్ కోట్’లకు సమానమైన ట్రెంచ్ కోట్‌ను తొలిసారిగా మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ సైన్యం ఉపయోగించింది. సైనికులను కందకాలలో పొడిగా ఉంచే ఈ కోటు కాల క్రమేణా పౌరుల దైనందిన జీవితంలో భాగం అయింది.గ్రేట్ కోట్ పొడవుగా, బరువుగా, వెచ్చని ఓవర్ కోట్లా, ఉన్నితో తయారై ఉంటుంది. మొదట్లో సైనిక సిబ్బంది వీటినే ధరించేవారు. తీవ్రమైన చలి గాలుల నుంచి ఈ గ్రేట్ కోట్లు వారికి రక్షణ కల్పించేవి. వీటి పొడవు సాధారణంగా మోకాలి కింది వరకు ఉంటుంది. ట్రెంచ్ కోట్... గ్రేట్ కోట్కు అడ్వాన్స్డ్ వెర్షన్ అని చెప్పాలి. వాటర్ ప్రూఫ్ వస్త్రంతో తయారౌతుంది. అదనపు రక్షణను కల్పిస్తుంది. సైనిక చిహ్నాలను తగిలించటానికి భుజం పట్టీలు ఉంటాయి. ట్రెంచ్ కోట్ కూడా మోకాలి కింది వరకు ఉంటుంది. క్రమంగా ఇందులోకీ ఫ్యాషన్ వచ్చి చేరింది. మహిళలకు ప్రత్యేకంగా ట్రెంచ్ కోట్లు వచ్చాయి. ఫ్యాషన్ షోలలో ఎక్కువ మంది మోడళ్లు ట్రెంచ్ కోట్లను పోలిన వస్త్రాలను ధరించటం మీరు చూసే ఉంటారు. ట్రెంచ్ అంటే కందకం. కందకాల్లో ఉండి పోరాడే సైనికుల కోసం తయారైన కోట్ కనుక వీటికి ట్రెంచ్ కోట్ అనే పేరు వచ్చింది. సాక్షి, స్పెషల్ డెస్క్ (చదవండి: పొలాల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి..ఇవాళ 400 మందికి పైగా యువతకు..!) -
వెల్వెట్ విలాసం..!
ఒకనాడు కోట గోడలలో విలాసంగా వెలిగింది నేడు, అతివల వస్త్ర సంపదలో సుసంపన్నంగా మెరుస్తోంది.పట్టుకుచ్చులాంటి మెత్తదనం, మది దోచే మెరుపుతో మఖమల్ పేరున్న వెల్వెట్ ఈ వింటర్ సీజన్లో రారాజులా విరాజిల్లుతుంది. బాలీవుడ్ తారలు వింటర్ సీజన్లో వెల్వెట్‌ను ధరించడంలో ముందుంటారు. అందుకు ముందుగా టబు వెల్వెట్ అనార్కలీలో రాచరికపు హుందాతనంతో కనిపించగా ఇప్పుడు యామి గౌతమ్ ఆకుపచ్చని వెల్వెట్ శారీలో గాంభీర్యంగా కనివిందు చేస్తుంది.సల్వార్ సూట్లు, లాంగ్ ఓవర్కోటులు, సంక్లిష్టమైన ఎంబ్రాయిడరీతో వెల్వెట్ ఎప్పుడూ ఎవర్గ్రీన్ మార్కులు కొట్టేస్తూనే ఉంది. ఈ శీతాకాలపు వివాహాలు, పండగ వేడుకలలో అత్యంత ఇష్టమైన ఎంపికగా అతివల మనసును ఆకట్టుకుంటోంది. పచ్చ, ఆకుపచ్చ, నెమలిపింఛం రంగు, రిచ్ బ్రౌన్, బ్లాక్.. వంటి టోన్ షేడ్స్ సెలబ్రిటీ వార్డ్రోబ్లను రిచ్‌గా మెరిపిస్తున్నాయి.వెల్వెట్కి ఈ సీజన్లో మళ్లీ ఊపిరిపోస్తున్నాం అంటే ఒక్క విలాసం గురించే కాదు. మనలోని భావోద్వేగ ప్రతిధ్వనిని కూడా బయటకు వెదజల్లుతుంది. ప్రాచీన ప్రపంచ చక్కదనాన్ని చూపెడుతుంది. చలికాలం మూడ్‌ను ఉత్తేజపరుస్తుంది. ఇండోర్ లైటింగ్‌లో అందమైన ఫొటోలకు మంచి లుక్ ఇస్తుంది. ఎంబ్రాయిడరీ మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఫ్యాషన్ మళ్లీ గొప్పగా వెల్వెట్ ఫ్యాబ్రిక్ వెలుగులో నిలిచిపోతుంది.ఈ ఏడాది వింటర్ సీజన్‌కి హీనా కొచ్చర్ రూపొందించిన వెల్వెట్ కలెక్షన్ రాయంచలా వచ్చేసింది. బ్రౌన్ అనార్కలీలో టబు ధరించిన వెల్వెట్ రాయల్టీకి ప్రతిరూపంగా నిలిచింది. ధరించిన డ్రెస్‌కు తగినట్టు ఇయర్ హ్యాంగింగ్స్, పాట్లి బ్యాగ్‌తో మ్యాచ్ చేసింది. డ్రెస్ మరింత వైభవంగా వెలిగేలా జుట్టును స్టైల్ చేసింది. యామి గౌతమి ఈ ట్రెండ్‌కు రీఫ్రెషింగ్ మినిమలిజాన్ని తీసుకువచ్చింది. దేవనాగరి సెట్ చేసిన ఈ అద్భుతమైన ఆకుపచ్చ వెల్వెట్ చీర సుతిమెత్తని అలలకు నిదర్శంగా నిలిచింది. తక్కువ మేకప్, ఆభరణాలతో అలంకరించింది. ఆమె స్టైలింగ్ అంతా ఫ్యాబ్రిక్ గొప్పదనాన్ని చెప్పకనే చెబుతోంది. డిజైనర్ నూరి తయారు చేసిన వెల్వెట్ కఫ్తాన్లో శోభిత ధూళిపాళ మెరిసిపోయారు. అందుకు తగినట్టుగా ఉండే మేకప్, హెయిర్ స్టైల్ కంఫర్ట్‌ని సూచిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. (చదవండి: నానోతో పాత ఫొటోలు కొత్తగా!) -
మత్స్యకన్యలా మెరిసిపోతున్న మిస్ ఇండియా..!
-
శిఖరాలపై సింహనాదం..!
పంచభూతాల్లో భాగమైన నింగి, నేల, నీరు, వాయువులను ఎదురీది సాహసోపేతమైన ప్రయాణం చేయడం మనుషులకు సాధ్యమేనా అంటే.., ఆత్మవిశ్వాసం, శారీరక దారుఢ్యం, మనో సంకల్పం ఉంటే సాధ్యమేనని నిరూపిస్తున్నాడు ‘ఐన్ మ్యాన్’ చాలెంజ్ పూర్తి చేసిన సాహసికుడు కళాలి జై సింహ గౌడ్. ప్రపంచంలోని వివిధ ఖండాల్లో ఎత్తైన శిఖరాలను అధిరోహించడం, మహాసముద్రాలను ఈదడం, అత్యంత విపత్కర పరిస్థితుల్లో ఫుల్ మారథాన్లు పూర్తి చేయడం, బాడీ బిల్డింగ్‌లో సత్తా చాటడం.. అన్నింటికీ మించి ‘మేక్ ఫిట్ ఇండియా’లో భాగంగా ఫిట్‌నెస్‌పై అందరికీ అవగాహన కల్పించడం తన వృత్తి, ప్రవృత్తిగా మార్చుకున్నాడు. ఎవరెస్ట్ అధిరోహణం వంటి లక్ష్యాలతో తన భవిష్యత్ ప్రణాళికలు నిర్దేశించుకుంటూనే తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలో ఫిట్నెస్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించడమే తన లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. యూరప్‌లోనే అత్యంత ఎత్తైన మంచు శిఖరం మౌంట్ ఎల్బ్రస్.. 18,600 అడుగుల ఎత్తులో ఎముకలు కొరికే 14 డిగ్రీల మైనస్ ఉష్ణోగ్రతల్లో ఈ మహా పర్వతాన్ని గతంలోనే అధిరోహించి జాతీయ జెండాతో పాటు జై తెలంగాణ పతాకాన్ని సగర్వంగా ఎగరేశారు నగరానికి చెందిన జై సింహ. అంతేకాకుండా ఆఫ్రికాలోని ఎత్తైన పర్వత శిఖరాల్లో ప్రసిద్ధి చెందిన కిలిమంజారో పర్వతాన్ని సైతం అధిరోహించారు. అంతేకాకుండా లద్దాక్‌లోని కాంగ్ యాట్సే 1, 2 పర్వతాలను సైతం ఈ లిస్ట్‌లో చేరిపోయాయి. పర్వతారోహణతో పాటు.. లద్దాక్ వేదికగా 42 కిలోమీటర్ల ఫుల్ మారథాన్, హైదరాబాద్ నగరంలో ఎన్ఎండీసీ ఫుల్ మారథాన్.. వీటితో పాటు పలు ప్రతిష్టాత్మక మారథాన్లు పూర్తిచేశారు. ఇదే నెల ప్రారంభంలో గోవా వేదికగా మిరామర్ బీచ్‌లో నిర్వహించిన 5వ ఎడిషన్ ఐరన్ మ్యాన్ 70.3లో ఏకకాలంలో 1.9 కిలో మీటర్ల స్విమ్మింగ్, 90 కిలో మీటర్ల సైక్లింగ్, 21.1 కిలో మీటర్ల రన్నింగ్ పూర్తిచేసి సత్తాచాటారు. 46 ఏళ్ల ఈ పర్వతారోహకుడు, బాడీబిల్డర్, ఫిట్నెస్ ట్రైనర్.. రంగాల్లో రాణిస్తూ.. మొత్తంగా ఐరన్ మ్యాన్ అనిపించుకుంటున్నారు. ఈ స్ఫూర్తితో మరిన్ని పర్వతాలు అధిరోహించడానికి సన్నద్ధమవుతున్నారు. ఫిట్నెస్ అవగాహనే లక్ష్యం.. ఓవైపు వ్యక్తిగతంగా ప్రపంచ రికార్టులు తన ఖాతాలో వేసుకుంటన్నారు. మరోవైపు విభిన్న కార్యక్రమాలతో సామాజికంగా అందరికీ శారీరక ఆరోగ్యం అవసరమని అవగాహన కలి్పస్తున్నారు. మారథాన్లు, ఫిట్నెస్ అవేర్నెస్ ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా నగరంలో ‘సిమ్ లయన్ ఫిట్నెస్’ సెంటర్లు ప్రారంభించి ఔత్సాహికులకు ఫిట్నెస్, జిమ్ సేవలు అందిస్తున్నారు. ఉప్పల్, బోడుప్పల్, రామంతాపూర్ వంటి ప్రాంతాల్లో జిమ్ సేవలతో పాటు బాడీబిల్డింగ్ పోటీలు నిర్వహిస్తూ సామాజిక దృఢత్వానికి తానొక పునాదిలా నిలుస్తున్నారు. గతంలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా, మెడికల్ ట్రాన్స్క్రిప్షనిస్ట్గా సుదీర్ఘ కాలం పనిచేసిన జై సింహ.. ఫిట్నెస్ రంగాన్ని విస్తృతం చేయాలనే లక్ష్యంతో వాటన్నింటికీ స్వస్తిపలికానని తెలిపారు. వచ్చే ఏడాది అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతంతో పాటు ప్రపంచంలో మరో ఎత్తైన పర్వతం ఎవరెస్టును సైతం అధిరోహించనున్నారు. ప్రపంచంలోని ఎత్తైన పర్వతాలను అధిరోహిస్తున్న నగరవాసి తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలోని మారుమూల గ్రామం నుంచి నగరానికి వచి్చన నేను.. ఫిట్నెస్ను జీవిత లక్ష్యంగా మార్చుకుని ఖండాంతరాల్లోని ఎత్తైన శిఖరాలపై దేశ ఖ్యాతిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నా. వచ్చే ఏడాది జనవరి 9న అర్జెంటీనాలోని అకాన్గువా పర్వతాన్ని, తదుపరి మార్చ్ నెలలో ఎవరెస్ట్ పర్వతారోహణకు సన్నద్ధమవుతున్నా. అంతేకాకుండా ఓషన్మ్యాన్గా రికార్డు సృష్టించేందుకు మహాసముద్రంలో 10 కిలోమీటర్ల స్విమ్మింగ్‌కు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాను. ఈ తరం యువతలో శారీరక క్రమశిక్షణ, వ్యాయామ అభిరుచి పెంచడం, అరోగ్య సంరక్షణలో ఫిట్నెస్ ప్రాధాన్యతను తెలియజేయడం,శారీరక ఆరోగ్యంపై అవగాహన కల్పించడం సంకల్పంగా ముందుకు సాగుతున్నా. ఫిట్ ఇండియా భవిష్యత్ కార్యాచరణ, ఇప్పటి వరకూ చేసిన పర్వతారోహణలన్నీ సిమ్ లయన్ ఫిట్నెస్ ప్రయత్నంలో సొంత ఖర్చులతోనే పూర్తి చేశాను. తదుపరి తలపెట్టిన పర్వతారోహణకు లక్షల రూపాయలు ఖర్చవుతాయి. ప్రభుత్వం, ఇతర సంస్థలు, వ్యక్తుల నుంచి స్పాన్సర్షిప్ లభిస్తే దేశ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి ప్రోత్సాహం లభిస్తుంది. గోవాలో జరిగిన ఐరన్ మ్యాన్ 70.3 నేపథ్యంలో పోటీదారులను మోదీ అభినందించిన విధానం నాలో మరింత స్ఫూర్తి నింపింది. – కళాలి జై సింహ గౌడ్, ఫట్నెస్ నిపుణుడు (చదవండి: Cancer Fighting Foods: ఏయే కూరగాయలు, పండ్లు కేన్సర్‌కి చెక్పెడతాయంటే..!) -
షేక్ హసీనా 'జమ్దానీ' చీరల వెనక ఇంత స్టోరీ ఉందా..!
బంగ్లాదేశ్ విమోచన పోరాటంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల వారసులకు ప్రభుత్వం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కేటాయింపు అన్న అంశం చిలికి చిలికి గాలివానలా మారి..మాజీ ప్రధాని షేక్ హసినా ప్రభుత్వం కూలి, పదవిని కోల్పోవడం తోపాటు మరణశిక్ష పడేందుకు దారితీసింది. ఉక్కు మహిళగా కీర్తిగడించిన ఆమెను ఒక్కసారిగా నేరస్తురాలిలా నిలబెట్టి మరణశిక్ష విధించింది అంతర్జాతీయ నేరాల ట్రిబ్యూనల్. ఆ తీర్పుపై తనదైన శైలిలో షేక్ హసీనా స్పదించారు కూడా . దీన్ని ఆమె రాజకీయ ప్రేరేపిత తీర్పుగా అభివర్ణించారు కూడా. కాలం అనుకూలించకపోతే ఎంతటి శక్తిమంతమైన వాళ్లైనా నిర్వీర్యం అయిపోతారనేందుకు ఉదాహరణగా నిలిచిన షేక్ హాసినా దౌత్యపరమైన సంబంధాలను నెరిపేందుకు ఏం చేసేవారో తెలిస్తే విస్తుపోతారు. మరి ఆ విశేషాల గురించి సవివరంగా తెలుసుకుందామా..!.బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హాసినా..తన స్టైలిష్ లుక్‌తోనే ఆకట్టుకుంటారామె. ముఖ్యంగా ఆమె ధరించే జమ్దానీ చీరలు.. యావత్తు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. ఆ నేపథ్యంలోనే ఆమె ఈ చీరలను ధరించేవారా అని అంతా ఆశ్చర్యపోయేలా రాజకీయాలను ఫ్యాషన్‌ని మిళితం చేసిందామె. అంతేగాదు ఆమె కృషి ఫలితంగా చేతివృత్తుల వారికి ఉపాధి లభించడం తోపాటు పురాతన సాంస్కృతికి వారసత్వాన్ని పదిలపర్చుకునేలా.. ప్రపంచ దేశాలు దాని విశిష్టతను గుర్తించేందుకు దోహదపడింది.జమ్దానీ చీరలను బెంగాల్లో అత్యంత అద్భుతమైన వస్త్ర సంప్రదాయాలలో ఒకటిగాగా చెబుతుంటారు. చేతితోమాత్రమే నేసే గొప్ప కళాఖండంగా అలరారే ఈ చీరలు అంతర్జాతీయ దృష్టిని సైతం అమితంగా ఆకర్షించాయి. అందుకు బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనానే కారణం. ఆమె చేసిన సాంస్కృతిక దౌత్య ప్రయత్నలేనని అంటుంటారు రాజకీయ విశ్లేషకులు. హసీనా మనం ధరించే దుస్తులే సంభాషిస్తాయి అని ప్రగాఢంగా విశ్వసించేవారామె. ఆ నేపథ్యంలోనే బంగ్లాదేశ్ సాంస్కృతిక కళా నైపుణ్యం, జాతీయ గర్వాన్ని ప్రతిబింబించేలా ఇలాంటి సాంప్రదాయ దుస్తులనే ఎంచుకునేవారామె. అంతర్జాతీయ వేదికపై జమ్దానీ మెరిసిన క్షణాలు..2014లో భారతదేశంలో సంబంధాలను బలోపేతం చేసే విషయమై ఈ చీరలోనే కనిపించారు. అంతేగాదు జూన్ 2014లో అప్పటి భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా హసీనాకు దక్షిణ భారత పట్టు చీరను బహూకరించగా, హసీనా జమ్దానీ చీరను బహూకరించింది.2015 ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ను సందర్శించినప్పుడు హసీనా తెలుపు-బూడిద రంగుతో మిళితమైన జమ్దానీని ధరించింది. అజర్బైజాన్లో జరిగిన NAM సమ్మిట్‌లో హసీనా జమ్దానీ-ప్రేరేపిత బృందం బంగ్లాదేశ్ నేత సంప్రదాయాన్ని ప్రపంచ దౌత్య వేదికపై ఉంచింది.2021లో గ్లాస్గోలో జరిగిన COP26 వాతావరణ సదస్సులో నీలం బూడిదర రంగుతో కలగలసిన చీరలో మెరిసింది. అంతేగాదు అది నెట్టింట విపరీతంగా వైరల్ అయిన ఫోటోగా నిలిచింది.సెప్టెంబర్ 2022లో హసీనా నాలుగు రోజుల భారతదేశ పర్యటన ఒక శిఖరాగ్ర క్షణం అని చెప్పొచ్చు. ఆమె ఆ సమయంలో కూడా ఆ చీరలనే ఎంచుకోవడం అనేది వ్యాపార నాయకులల్లో చర్చనీయాంశంగా హైలెట్ అయ్యింది. G20 సమ్మిట్‌లో, హసీనా తిలక్ రంగు ధకై జమ్దానీని ధరించింది. ఇది భారతదేశంతో బంగ్లాదేశ్‌కి ఉన్న సంబంధాలను సూక్ష్మంగా నొక్కి చెబుతూనే ప్రపంచ వేదికపై ఈ కళను హైలైట్ చేసింది.న్యూ ఢిల్లీ, లండన్, బ్రస్సెల్స్, మ్యూనిచ్‌లోని నాయకులతో జరిగిన అనేక ఉన్నత స్థాయి సమావేశాలలో జమ్దానీ చీరలోనే కనిపించారు హసీనా. జమ్దానీ చరిత్రజమ్దానీ మూలాలు రెండు వేల సంవత్సరాల క్రితం పురాతన ఢాకా మగ్గాల నుంచి రూపుదిద్దుకుంది. ఈ పేరు పర్షియన్ పదాలైన "జామ్" (పువ్వు) "డాని" (కుండీ) నుంచి వచ్చింది. చీరలలో ఉపయోగించే నేత నమూనాలు వాటి నుంచి తీసుకోవడంతోనే ఈ చీరకు ఆ పేరు వచ్చింది.జమ్దానిని ప్రత్యేకంగా నిలబెట్టేది శ్రమతో కూడిన "పారదర్శక నేత" సాంకేతికత. దీన్ని యాంత్రిక మద్దతు లేకుండా చేతితోనే తయారు చేస్తారు. అందువల్ల ఒక చీర తయారైందుకు నెలల తరబడి సమయం పడుతుంది. ఈ ప్రక్రియ చూసేందుకు తేలికగా కనిపించినా..చాలా క్లిష్టతరమైన చేతి పని. అయితే ఇదే జమ్దాని చీర పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో విభిన్న వెర్షన్లు ఉన్నాయి. అయితే ప్రతి చీర వెనుక అపారమైన నైపుణ్యం, గంటల తరబడి శ్రమ తప్పక ఉంటుంది. అంతేగాదు ఇది ప్రపంచంలోనే అత్యంత గౌరవనీయమైన విలువైన చేసేత వస్త్రాల్లో ఒకటిగా పేరొందింది. అలాంటి చేనేత చీరను మాజీ ప్రధాని షేక్ హసీనా ధరించడంతో అంతర్జాతీయ ఆకర్షణ తోపాటు బంగ్లాదేశ్ స్వదేశీ నేత కార్మికులకు నేరుగా మద్దతు లభించినట్లయ్యింది కూడా. అలాగే ఈ చీరలకు భౌగోలిక(GI) గుర్తింపు సైతం లభించడం విశేషం. గతేడాది నిరసనల టైంలో కూడా..ఆగస్టు 2024లో, హసీనా రాజీనామా, బహిష్కరణకు దారితీసిన సందర్భంలో కూడా ఈ చీరలు వార్తల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ఎందుకంటే ఆ ఘటనలో సాముహిక నిరసనకారులు ఢాకాలోని ఆమె అధికారిక నివాసాన్ని ముట్టడించి ఆమె వార్డ్‌రోబ్‌లోని జమ్దానీ చీరలను ఎత్తకుపోవడం అందర్నీ తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది.(చదవండి: మానికా విశ్వకర్మకు అప్పుడు సుష్మితాను అడిగిన అదే ప్రశ్న..! స్త్రీగా ఉండటం అంటే అదే..) -
బ్లాక్ లెహంగాలో రాణిలా మిస్ ఇండియా మానికా విశ్వకర్మ..!
-
బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో టబు స్టన్నింగ్ లుక్..!
ప్రఖ్యాత భారతీయ డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా రూపొందించిన డిజైనర్ వేర్లో టాలీవుడ్ నటి టబు తళుక్కుమంది. నవంబర్ 13న ముంబై ఫ్యాషన్‌షోలో డిజైనర్ ద్వయం అబుజానీ సందీప్ ఖోస్లా కోసం బ్లాక్ అండ్ వైట్ డ్రెస్‌లో ర్యాంప్ వాక్ చేసి అందర్ని మెస్మరైజ్ చేసింది 54 ఏళ్ల టబు. మరోసారి ఫ్యాషన్‌కి వయోపరిమితి లేదు అని ప్రూవ్ చేస్తూ..అంత్యంత ఆకర్షణీయంగా కనిపించింది. పొడవాటి చేతులతో కూడిని జాకెట్‌తో టబు చాలా కాన్ఫెడెంట్‌గా చేసిన ర్యాంప్ వాక్ అందర్నీ కట్టిపడేసింది. ఆ ఎథ్నిక్ వేర్లో ఆమె లుక్ ఎంత హైలెట్ అయ్యిందంటే..భారతీయ రూపురేఖల్ని ఎలివేట్ చేస్తున్నట్లుగా ఉంది ఆమె ఆహార్యం. అందుకు తగ్గట్టుగా కళ్లు మరింత పెద్దవిగా కనిపించేలా కాజోల్‌ని పెట్టింది. చేతికున్న వెండి ఎంబ్రాయిడరీ ఆ డిజైనర్‌వేర్ లుక్‌ని మరింత పెంచేసింది. పైగా మ్యాచింగ్ ఆర్కిటెక్చరల్ కోటుతో మరింత గ్లామరస్‌గా తళుక్కుమంది. అంతేగాదు ముంబైలోని ఫ్యాషన్ ఆర్ట్ ర్యాంప్ వాక్‌పై ఓ శక్తిమంతమైన మహిళలా స్టైలిష్‌గా తన హోయలను ఒలకపోస్తూ చూపిన విధానం..అదుర్స్. అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ డిజైనర్ల ద్వయం షోస్టాపర్‌గా టబు లుక్ అక్కడున్నవారందర్నీ మంత్రముగ్దుల్ని చేసింది అని పోస్ట్‌లో పేర్కొన్నారు. అభిమానులు సైతం ఐదు పదుల వయసులో ఇంత అద్భుతంగానా అని విస్తుపోయారు. అంతేగాదు టబు లుక్‌కి మాటల్లేవ్ అని ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Deepak Yadav (@deepakyadav___) (చదవండి: అఫ్గాన్ చిన్నారి పెళ్లి కూతురు..! విధినే ధిక్కరించి..) -
హాట్‌టాపిక్‌గా అల్లు శిరీష్ ధరించిన నెక్లెస్..! ఆభరణాలు మగవాళ్లు ధరించేవారా?
అల్లు అర్జున్ తమ్ముడు అల్లు శిరీష్‌కు గత నెల అక్టోబర్ 31 ప్రియురాలు నయనికతో నిశ్చితార్థం జరిగిన తెలిసిందే. కొందరు సినీ ప్రముఖులు, కుటుంబ సభ్యుల మ్య ఈ ఎంగేజ్మెంట్ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఈ వేడుకలో అల్లు శిరీస్ తెల్లటి షేర్వానితోపాటు ధరించిన చోకర్ చాలా హాట్‌టాపిక్ మారడమే కాదు..వేడుకలో హైలెట్‌గా కనిపించింది. ఆ ఆభరణం హీరో శిరీష్‌కు అందమివ్వడమే కాదు..మగవాళ్లు కూడా ఆభరణాలు ధరించొచ్చా..లేక ఇది సరికొత్త ట్రెండ్నా అనే చర్చలకు దారితీసింది. అదీకాకుండా ఒకపక్క ఈ చోకర్ ధరించినందుకు శిరీష్‌పై సోషల్‌మీడియాలో తెగ మీమ్స్ వెల్లువెత్తాయి కూడా. దీనిపై శిరీష్ కూడా ఘాటుగానే స్పందించారు. అయితే ఇలా మగవాళ్లు ఆభరణాలు ధరించడం అనేది లేటెస్ట్ ట్రెండ్ కానేకాదు. మరచిపోతున్న మన మూలాలను ఒక రకంగా నటుడు శిరీష్ గుర్తుచేశారనే చెప్పొచ్చు. మన సంస్కృతిలో భాగమైన ఆ ట్రెండ్‌కి సంబంధించిన విశేషాల గురించి సవివరంగా చూద్దామా..!.భారతీయ మహారాజులు, మొఘల్ పాలకులు చోకర్లు ధరించేవారు. అంతేగాదు ఆభరణాలనేవి కేవలం ఆడవాళ్లకే సొంతం కాదు. మగవాళ్లు ధరించిన అత్యద్భుతమైన ఆభరణాలు కూడా ఉన్నాయి. అయితే బ్రిటిష్ వాళ్ల పాలనాంతరం మన సంస్కృతిని మర్చిపోయాం అని చెప్పొచ్చు. నిజానికి ఇది సరొకొత్త ట్రెండ్ కాదు. రాజుల కాలం నుంచి మగవాళ్లు ఆభరణాలు ధరించేవారు. వాళ్లు ఆ కాలంలో అత్యంత విలక్షణమైనవి, ఖరీదైనవి ధరించేవారట. అంతేగాదు ప్రపంచంలో అత్యంత విలువైన ఆభరణాల్లో ఒకటైన "ఖిరాజ్-ఇ-ఆలం" లేదా తైమూర్ రూబీ ఒక చోకర్‌ని షాజహాన్ ధరించనట్లు చరిత్ర చెబుతోంది. అది ఏకంగా 352 క్యారెట్ల బరువుతో అత్యంత ఖరీదైన ఆభరణమని కూడా చరిత్రకారులు చెబుతున్నారు. ఆయన తర్వాత మహారాజా షేర్ సింగ్ ధరించినట్లు చరిత్ర పేర్కొంది. ఆ తర్వాత ఈస్ట్ ఇండియా కంపెనీ దానిని దొంగలించి 1851లో విక్టోరియా రాణికి బహుమతిగా ఇచ్చినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అంతేగాదు, మన చరిత్రను ఒక్కసారి నిశితంగా పరిశీలిస్తే.. మహారాష్ట్ర మరాఠా రాజులు, మైసూరు రాజులు, రాజస్థాన్ రాజులు కూడా వజ్రాలతో పొదిగిన అత్యంత విలాసవంతమైన ఆభరణాలు ధరించనట్లు ఆధారాలు ఉన్నాయి కూడా. ఆ కాలంలో మగవాళ్లు, ఆడవాళ్లు అనే తారతమ్యం లేకుండా చాలా విలాసవంతమైన ఆభరణాలు ధరించేవారు. రాను రాను పాశ్చాత్య సంస్కృతిని ఒట్టబట్టించుకుని, ధరించే బట్టలు కురచగా అయిపోయాయి..దాంతోపాటు ఆభరణాలను ధరించడం మానేశాం. మళ్లీ నటుడు శిరీష్ పుణ్యమా అని మన మూలాలు, మన గత సంస్కృతి వైభవం స్మతి పథంలోకి తెచ్చిందని చెబుతున్నారు ఫ్యాషన్ నిపుణులు. ఇదేమి నవ్వుకునే ఫ్యాషన్ శైలి కాదు. ఇలా మగవాళ్లు ఆభరణాలను ధరించడం అనేది మన సంప్రదాయంలో భాగమైన పురాతన స్టైల్‌గా అభివర్ణిస్తున్నారు ఫ్యాషన్ ప్రియులు. సో నచ్చితే..ఈ ట్రెండ్‌ని సరదాగా ట్రై చేయండి. ఒకరకంగా ఈ స్టైల్‌తో..మన సంస్కృతిని గౌరవించిన వాళ్లం అవ్వడమే కాకుండా..భవిష్యత్తుతరాలకు తెలియజేసినట్లు అవుతుంది కూడా.. కదూ..!."Chokers are only for women", is a very western construct. Its 2025 & high time we break free from such limiting beliefs and fully embrace our Indian style jewellery. pic.twitter.com/S1ljwMAp15— Allu Sirish (@AlluSirish) November 10, 2025 (చదవండి: Drones used for election surveillance: 'పోలింగ్‌పై నిఘా'..పెళ్లి వేడుకల్లో పాగా..) -
ఎక్స్‌ప్రెస్ ది ఫ్యాషన్
ఔట్ఫిట్లో ఆత్మవిశ్వాసం, లుక్‌లో నేచురల్ ఎలిగెన్స్ చూపించే శ్రద్ధా శ్రీనాథ్, స్టయిల్ ఆమె వ్యక్తిత్వంలాగే క్లాసీ, బాలెన్స్డ్, రిఫ్రెషింగ్‌గా ఉంటుంది. ఆ సీక్రెట్సే ఇప్పుడు మీకోసం!చీర.. బ్రాండ్: అనిల్ హోసమాని ధర: రూ. 80,000జ్యూలరీ బ్రాండ్: బబుల్ లవ్ ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఫ్యాషన్ అంటే ట్రెండ్స్ కంటే ముందు మనసుకు నచ్చే ఎక్స్ప్రెషన్ ! ఎలాంటి దుస్తులు వేసుకున్నా, సౌకర్యంగా ఉండటం, నన్ను ప్రతిబింబించేలా ఉండటమే ముఖ్యం. ట్రెడిషనల్ లుక్‌కి మినిమల్ జ్యువెలరీ జోడించడం, లేక మోడర్న్ వేర్కి ఎథ్నిక్ టచ్ ఇవ్వడం నాకు బాగా నచ్చుతుంది. – శ్రద్ధా శ్రీనాథ్. -
క్రికెట్ గాళ్స్ ...స్టైలిష్ స్టార్స్...
భారత మహిళా క్రికెట్ జట్టు విజయాల పరుగును ఆస్వాదిస్తోంది. ఇటీవలి ప్రపంచ కప్ విజయం కేవలం క్రీడా మైలురాయి మాత్రమే కాదు శక్తి సామర్ధ్యాలున్న మహిళల భవితకు స్ఫూర్తి. క్రీడల్లో మాత్రమే కాదు ఈ మహిళలు మైదానంలో వెలుపల కూడా నవ యువతికి ప్రేరణ అందిస్తున్నారు.ఈ ఆధునిక క్రీడాకారులు సంప్రదాయ నియమాలను తిరిగి వ్రాస్తున్నారు: నైపుణ్యానికి అత్యాధునిక జీవనశైలిని జోడిస్తున్నారు. వరల్డ్ కప్ విజయం తర్వాత ఒక్కసారిగా వారి లైఫ్ స్టైల్ కూడా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ముఖ్యంగా వారి ఫ్యాషన్ ఎంపికలపై నవయువ తరం దృష్టి సారించింది. అంతేకాదు పలు ఫ్యాషన్, లైఫ్ స్టైల్ బ్రాండ్స్ సైతం వీరితో ఒప్పందాలకు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ నేపధ్యంలో అనుసరించే ఫ్యాషన్స్, స్టైల్స్ ఆధారంగా చూస్తే... స్మృతి మందాన...భారతీయ మహిళా క్రికెట్లో స్మృతి మంధానకు తిరుగులేని గుర్తింపు ఉంది. ఆమె బ్యాటింగ్ స్టైల్ లాగే ఆమె ఫ్యాషన్ ఎంపికలు కూడా వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తాయి. ప్రయాణ రోజులకు రిలాక్సడ్ కుర్తా అయినా లేదా స్నీకర్లతో జత చేసిన భారీ చొక్కా అయినా, తన లుక్‌ను ఎలా చిక్‌గా చూపించాలో స్మృతికి తెలుసు. ఆమె పండుగ సమయంలో పాస్టెల్ షరారాస్ లేదా పూల చీరలలో నిజమైన భారతీయతను ప్రతిబింబిస్తుంది. ప్రసరింపజేస్తుంది. కానీ బిజీ వర్క్ లేని రోజుల్లో ఆమె సాధారణ కో–ఆర్డ్లు, డెనిమ్‌లు, సిల్హౌట్లను ఇష్టపడుతుంది. ఆత్మవిశ్వాసంతో కదిలే ఆమె తీరు ఆమె దుస్తులు ధరించే విధానం బాగా కనిపించడానికి భారీ స్టైలింగ్ అవసరం లేదని రుజువు చేస్తుంది.చదవండి: స్టార్ క్రికెటర్, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ లగ్జరీ వాచ్ : ధర ఎంతో తెలుసా?జెమీమా రోడ్రిగ్స్ప్రశాంతమైన స్మృతికి భిన్నంగా జెమీమా రోడ్రిగ్స్ మెరుపులా ఉంటుంది. ఆమెను ప్రస్తుత భారత జట్టులో జెన్–జెడ్ శక్తిగా పేర్కొంటున్నారు. ఎల్లప్పుడూ తన లుక్‌తో ప్రయోగాలు చేయడానికి సిద్ధంగా ఉంటుంది. స్పోర్టి జాకెట్లు, రంగురంగుల స్నీకర్లు, ప్రింటెడ్ టీస్ స్ట్రీట్‌వేర్ గ్లామ్ టచ్ తో ఆమె వార్డ్రోబ్ నవ యవ్వన ఉత్సాహంతో తొణికిసలాడుతుంటుంది .జెమీమా వ్యక్తిత్వం ఆమె ఫ్యాషన్ ద్వారా ప్రకాశిస్తుంది. ఆమె ట్రెండ్‌తో కంఫర్ట్‌ను కలపడం, రోజువారీ దుస్తులను స్టైల్ స్టేట్మెంట్లుగా మార్చడాన్ని ఇష్టపడుతుంది. డెనిమ్–ఆన్–డెనిమ్ సెట్ల నుంచి స్నీకర్ల, కుర్తాల వరకు, ఆమె ఫ్యాషన్ ఆకట్టుకుంటుంది. కెమెరాల కోసం కాదు, ఆమె తనకోసం తాను దుస్తులు ధరిస్తుంది. అణువణువూ కనిపించే ఆత్మవిశ్వాసమే జెమీమాను ఇన్ స్ట్రాగామ్‌లో నిజ జీవితంలో నిజమైన ట్రెండ్‌సెట్టర్‌గా మార్చింది.హర్మన్ ప్రీత్ కౌర్జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వ లక్షణాల్లానే ఆమె వార్డ్రోబ్ కూడా అదే శక్తిని ప్రతిబింబిస్తుంది. టైలర్డ్ బ్లేజర్ అయినా, స్మార్ట్ ప్యాంట్‌సూట్ అయినా, లేదా మట్టి టోన్లలో సొగసైన కుర్తా అయినా, డ్రెస్సింగ్‌లో ఆమె ఒక మాస్టర్ క్లాస్. హర్మన్ ప్రీత్ లుక్ నాటకీయతను కాకుండా ఆమె బలాన్ని ప్రదర్శిస్తుంది.ఆమె వస్త్రధారణ శైలి ఆధునికంగా అనిపించే భారతీయతను కలిగి ఉంటుంది, తరచుగా లినెన్ లేదా చేనేత పట్టు వంటి ఫ్యాబ్రిక్స్‌లో కనిపిస్తుంది. ఆమె ఎంపికలలో ఒక పరిపక్వత ఉంటుంది, ఆమె ట్రెండ్ల వెంట పడదు.చదవండి: జుకర్‌బర్గ్‌కే షాక్ : 22 ఏళ్లకే బిలియనీర్ క్లబ్లోకియాస్టికా భాటియాకొత్త తరం క్రికెటర్లలో, యాస్టికా భాటియా సొగసైన సౌందర్యానికి కేరాఫ్‌గా నిలుస్తుంది. ఆమె లుక్స్ అన్నీ క్లీన్ కట్స్, మ్యూట్ ప్యాలెట్లతో ఉంటాయి. యాస్టికా ఫ్యాషన్ సెన్స్‌లో భారీ ఉపకరణాలు లేదా రంగులు ఉండవు. ఆమె తరచుగా మోనోక్రోమ్ సెట్లు, తెల్ల చొక్కాలు లేత పాస్టెల్ కుర్తాలలో కనిపిస్తుంది, అవి మీరు ఎక్కడైనా ధరించవచ్చు ఓవర్స్టైల్డ్ సెలబ్రిటీ ఫ్యాషన్ యుగంలో ఆమె ఎంపికలో సరళత రిఫ్రెషింగ్‌గా అనిపిస్తుంది.హర్లీన్ డియోల్స్పోర్టీ గ్లామర్ల పరిపూర్ణ సమ్మేళనం హర్లీన్ డియోల్ . మైదానంలో అద్భుతమైన క్యాచ్‌లు గొప్ప శక్తి ప్రదర్శనలకు ప్రసిద్ధి చెందిన ఆమె తన ఫ్యాషన్ కు అదే స్పార్క్‌ను తెస్తుంది. ఆమె బోల్డ్ లుక్‌లను ఇష్టపడుతుంది – స్టేట్మెంట్ డ్రెస్సులు, సొగసైన పోనీ టెయిల్స్, ట్రెండీ స్నీకర్లు ఆమె అథ్లెటిక్ ఫ్రేమ్‌ను హైలైట్ చేసే బాగా సరిపోయే అథ్లెటిజర్ సెట్లు. జిమ్ గేర్ నుంచి గ్లామర్‌కు సులభంగా మారే కొద్దిమంది క్రీడాకారిణులలో ఒకరు. ఆమె ఒక రోజు చిక్ స్ట్రీట్వేర్తో మరోక రోజు మరో స్టైల్‌తో రోజుకో ప్రయోగం చేస్తుంది. ఉపకరణాల పట్ల ఆమెకున్న ప్రేమ, మేకప్ సమన్వయంతో కూడిన లుక్స్ ఆమెకు బలమైన వ్యక్తిగత బ్రాండ్‌ను సృష్టించాయి.స్టేడియంల నుంచి ఫోటో షూట్ల వరకు వీరి ప్రయాణం ఆద్యంతం ఆసక్తికరమే. వీరిలో ఎవరూ సెలబ్రిటీ అనే కిరీటంతో తమ స్టైల్స్‌ను పంచుకోవాలని ప్రయత్నించడం లేదు, వారి ఫ్యాషన్ వారి సహజమైన తీరుతెన్నులకు ఒక పొడిగింపుగా మాత్రమే చూస్తున్నారు. అందుకే ఈ అథ్లెట్లు ఇప్పుడు ఫ్యాషన్ ప్రేరణలు, బ్రాండ్ అంబాసిడర్లు మాత్రమే కాదు అత్యున్నతమైన కలలు కనే ధైర్యం ఉన్న భారతీయ యువతులకు రోల్ మోడల్స్ కూడా. -
నటి ప్రగ్యా జైస్వాల్ స్టైలింగ్ టిప్స్..!
ప్రగ్యా జైస్వాల్ అంటే సింపుల్ లుక్‌తోనే మెరిసే స్టార్.ఏ రంగులోనైనా ఏ డ్రైస్లోనైనా, కేవలం కంఫర్ట్ ఫ్లస్ కాన్ఫిడెన్స్ కలయికతో ఫ్యాషన్ స్పార్క్ చూపించే ఆమె స్టయిలింగ్ టిప్స్ మీ కోసం! జిమ్‌లో గంటల కొద్దీ గడపటం కంటే, శరీరానికి కావలసిన విశ్రాంతి ఇవ్వడమే ముఖ్యం. రెస్ట్, హైడ్రేషన్, హెల్తీ మీల్స్ ఇవే నా ఫిట్నెస్ సీక్రెట్స్. ఫ్యాషన్ విషయానికి వస్తే, సింపుల్, క్లాసీ లుక్స్‌ను ఇష్టపడతాను. రెడ్, గోల్డ్ నా ఫేవరెట్ కలర్స్. కాని, బ్లాక్ డ్రెస్ వేసుకున్నప్పుడు వచ్చే ఆ క్లాసిక్ ఫీలింగ్ వేరేలా ఉంటుంది. స్టయిలింగ్ ఏదైనా వాటికి కాన్ఫిడెన్స్ కలిస్తేనే అవే బెస్ట్ లుక్ అవుతాయి అని చెబుతోంది ప్రగ్యా జైస్వాల్. ఆమె ధరించిన చీర బ్రాండ్: స్వాన్ గాంధీ, ధర: రూ. 88,000, జ్యూలరీ బ్రాండ్: రాజ్వాడా జ్యూలర్స్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. రంగురంగుల దండ!ఏ చీర వేసుకున్నా ఈజీగా సెట్ అయిపోయే సీక్రెట్ వెపన్ కావాలా? అయితే వెంటనే ఒక మల్టీకలర్డ్ నెక్‌పీస్ రెడీ చేసుకోండి. ఇది సాధారణ ఆభరణం కాదు, నవరత్నాల ఫ్యాషన్‌లో పటాకా మోడ్ ఆన్ చేసే రంగురంగుల మణుల దండ! ఎరుపు, పచ్చ, గులాబీ, ముత్యాలు అన్నీ ఒక్కటే లైఫ్‌లో మెరిసిపోతూ, ‘నిన్ను చూడగానే దేవతా వైబ్ వచ్చిందమ్మా!’ అని చెప్పించే మ్యాజిక్ ఇది. ఏ రంగు చీర వేసుకున్నా ఈ మల్టీకలర్డ్ నెక్లెస్ ఆటోమేటిక్‌గా మ్యాచ్ అయిపోతుంది. నలుపు చీర వేసుకుంటే నయగారంగా, పసుపు చీర వేసుకుంటే పండుగలా మారిపోతుంది! జుట్టు బన్ వేసుకుంటే ఈ నెక్లెస్ మెడ చుట్టూ మెరిసిపోతూ లుక్‌ను హైలైట్ చేస్తుంది. ఓపెన్ హెయిర్ అయితే కంఫర్ట్ ఫీల్‌తో కూల్ లుక్ ఇస్తుంది. చెవుల్లో చిన్న జుంకాలు పెయిర్ చేస్తే లుక్‌కి ఫుల్ మార్క్స్. లిప్ కలర్‌ని నెక్లెస్‌లోని ఏదో ఒక స్టోన్ షేడ్‌కి మ్యాచ్ చేస్తే ఇక మీ లుక్ సూపర్‌హిట్ అనిపించక మానదు. (చదవండి: ఈత కొడుతూ ఫ్లూట్ వాయిస్తూ.. ప్రపంచ రికార్డు !) -
వారసత్వ వెలుగులు
కాలంతో పాటు ఫ్యాషన్‌లో ఎన్నో మార్పులు చోటుచేసుకుంటాయి. కానీ, కొన్నింటికి కాలం అడ్డంకి కాదు. అవి భావాలూ, జ్ఞాపకాలూ కలిపిన అందంతో మరింత ప్రత్యేకతను చాటుతుంటాయి. అలాంటి వారసత్వ ఆభరణాలు బాలీవుడ్–టాలీవుడ్లలోనూ కొత్తగా వెలుగుతున్నాయి. వివాహ వేడుకలు, ఫ్యాషన్ వేదికలు, సినిమా ఈవెంట్లలో ప్రధానంగా కనిపిస్తున్నాయి. ప్రతి ఆభరణం ఒక కథను, ఒక బంధాన్ని, ఒక జ్ఞాపకాన్ని మన ముందుంచుతుంది.వెండితెరమీద మెరిసే తారలు మోడర్న్ను మాత్రమే పరిచయం చేస్తారు అనుకుంటేపొరబాటు. తమ కుటుంబ వారసత్వాన్ని, ఆత్మీయతను ఆభరణాలలోనూ చూపుతుంటారు. శోభిత ధూళిపాళవివాహానికి ముందు జరిగే వేడుక సమయంలో శోభిత తన తల్లి, తాతమ్మగారి వారసత్వ ఆభరణాలు ధరించింది. వీటిలో సంప్రదాయ పసిడి హారం, కాసులపేర్లు ఉన్నాయి. ఆమె మాటల్లో – ‘మా అమ్మమ్మ ఈ ఆభరణాలు ధరించినప్పుడు నేను చిన్నపిల్లను. ఇప్పుడు అవే ఆభరణాలను నేను వేసుకున్నప్పుడు ఆమె నాకు మరీ మరీ గుర్తుకొచ్చింది’ అని చెబుతుంది. ఈ ఒక్క మాటతోనే ఆ ఆభరణం బంగారం కాదు, బంగారం లాంటి జ్ఞాపకం అని మనకు తెలిసిపోతుంది.కుటుంబ వారసత్వం అలియా తన వివాహ వేడుకలో పాత కాలపుపొల్కీ నెక్లెస్ ధరించింది. ఆ పీస్ ఆమె తల్లి సోనీ రాజ్దాన్ కానుకగా ఇచ్చినది. ‘ఇది కేవలం ఒక ఆభరణం కాదు. తల్లి ప్రేమకు ప్రతీక అని చెబుతుంది. ఆమె ఆ తర్వాత కూడా ఆ నెక్లెస్‌ని రీ–స్టైల్ చేసి మనీష్ మల్హోత్రా ఈవెంట్లో వాడింది.కీర్తీ సురేశ్తల్లి మేనక ఇచ్చిన టెంపుల్ జ్యువెలరీని కీర్తి పబ్లిక్ ఈవెంట్స్‌లో కూడా రీ–స్టైల్ చేసి వేసుకుంటుంది. ఆమె చెప్పినట్టుగా ‘మా అమ్మ ఆభరణాలు నేను మళ్లీ వేసుకుంటే, అది ఫ్యాషన్ కాదు గౌరవం’ అని చెబుతుంది.వారసత్వ రత్నాలుబాలీవుడ్ నటి సోనమ్ కపూర్ తన వివాహ వేడుకలో ధరించిన చోకర్ నెక్లెస్ వందేళ్ల కిందట ఆమె కుటుంబం నుంచి వారసత్వంగా వచ్చింది. దానిని రాజస్థానీ డిజైనర్లు పొల్కీ ఆభరణంగా రూపొందించారు. ‘ఈ నెక్లెస్ మా అమ్మమ్మ ధరించింది. ఇప్పుడు నేను వేసుకుంటున్నానంటే అందుకు మా మధ్య ఉండే ఆత్మీయ బంధమే కారణం’ అని చెబుతుంది సోనమ్. ఇప్పుడు ఆభరణాల డిజైనర్లు కూడా ‘సెంటిమెంట్ స్టైల్’ అనే కొత్త లైన్ ను ఎంచుకుంటున్నారు. పాత ఆభరణాలను మోడర్న్ టచ్‌తో రీ–డిజైన్ చేయడం, వాటి కథను చెప్పేలా ప్రదర్శించడం ట్రెండ్ అయ్యాయి. వారసత్వ ఆభరణం అంటే కేవలం అలంకారమే కాదు అది ప్రేమ, గౌరవం, జ్ఞాపకం కూడా! -
డైమండ్ నగల్లో మెరిపోతున్న రష్మిక మందన్నా (ఫోటోలు)
-
స్వరోవ్స్కి ఈవెంట్లో రష్మిక స్టైలిష్ లుక్ : ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా(Rashmika Mandanna) లాస్ ఏంజిల్స్‌లో జరిగిన స్వరోవ్స్కీ మాస్టర్స్ ఆఫ్ లైట్ ప్రారంభోత్సవ వేడుకలో స్టన్నింగ్ లుక్‌తో అందర్నీ ఆకట్టుకుంది. స్వరోవ్స్కీ స్థాపించి 130 సంవత్సరాలు పూర్తయిన ( Swarovski’s 130 years) సందర్భంగా 2025లో 130వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటోంది. "130 ఇయర్స్ ఆఫ్ లైట్ & జాయ్" అనే పేరిట పలు కార్యక్రమాలను నిర్వహిస్తోంది.లాస్ ఏంజిల్స్‌లో జరిగిన బ్రాండ్ మాస్టర్స్ ఆఫ్ లైట్ ఓపెనింగ్ వేడుకలో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారత రాయబారిగా స్వరోవ్స్కి ఈవెంట్లో గౌరవ్ గుప్తా కార్యక్రమంలో రష్మిక మందన్న స్టైలిష్‌గా అరంగేట్రం చేసింది. ప్రముఖ ఇండియన్ ఫ్యాషన్ డిజైనర్ గౌరవ్ గుప్తా దుస్తుల్లో రష్మిక ఈవెంట్‌కు హైలైట్‌గా నిలిచింది.గౌరవ్ గుప్తా రాబోయే హాలిడే 2026 కలెక్షన్ నుంచి రష్మిక మందన్న బెస్పోక్ పెటల్ కార్సెట్ స్కల్ప్ట్ ఫ్రాక్ ధరించింది. దీనికి హై-వెయిస్టెడ్, ఫ్లోర్-లెంగ్త్ బ్లాక్ స్కర్ట్‌తో జత చేసింది. ఇంకా అద్భుతమైన స్వరోవ్స్కీ ఆభరణాలు రష్మిక్ గ్లామర్ లుక్‌ను పెంచాయి. మాస్టరీ ఆఫ్ లైట్ థీమ్‌కు సరిపోయేలా, ఆమె అష్టభుజి-కట్ క్రిస్టల్స్ ఐకానిక్ మిలీనియా చోకర్ను ధరించింది. స్వరోవ్స్కీ నెక్లెస్, రెండు ఇయర్ కఫ్‌లతో పాటు సరిపోయే డాంగ్లర్ చెవిపోగులను కూడా ధరించింది. అలాగే రోడియం ప్లేటింగ్‌తో అలంకరించబడిన భారీ స్టేట్మెంట్ నడుం బెల్ట్ కూడా అందంగా అమిరి మెడ్రన్ లుక్‌ను తెచ్చిపెట్టాయి. దీంతోపాటు, ఫోటోగ్రాఫర్ల కోసం ఫోజులిస్తున్నపుడు కనిపించిన రింగ్, ఎంగేజ్మెంట్ రింగ్ అనే ఊహాగానాలు మాత్రం జోరుగా ఉన్నాయి.మాస్టర్స్ ఆఫ్ లైట్ - హాలీవుడ్ ఎగ్జిబిషన్ స్వరోవ్స్కీ వేడుకలు నవంబర్ 3 వరకు జరగనున్నాయి. ఇక్కడ ఎన్నె అద్భుతమైన ఫ్యాషన్ , ఐకానిక్ దుస్తులు ప్రదర్శించనున్నారు. ఎగ్జిబిషన్ ఈవెంట్లో చెర్, ఎలిజబెత్ ఒల్సెన్, జెఫ్ గోల్డ్‌బ్లమ్, వియోలా డేవిస్, వీనస్ విలియమ్స్, లా రోచ్, లారా హారియర్, ఎమిలీ రాటజ్కోవ్స్కీ, డిటా వాన్ టీస్, అనోక్ యాయ్ ,అమేలియా గ్రే వంటి ప్రముఖ హాజరైన ప్రముఖులతో సహా స్టార్-స్టడ్డ్ ప్రేక్షకులను ఆకర్షించింది. 2025 దీపావళి సందర్భంగా రష్మిక మందన్నాను స్వరోవ్స్కి ఇండియా తమ కొత్త బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రకటించింది. ఈసందర్భంగా కొన్ని ఈవెంట్లను నిర్వహిస్తూ వస్తోంది. మెట్ గాలా 2025:"టైలర్డ్ ఫర్ యు" అనే థీమ్‌తో ఒక గ్రాండ్ ఈవెంట్ నిర్వహించింది. అరియానా గ్రాండేతో కలిసి స్ప్రింగ్-సమ్మర్ 2025 ప్రచారాన్ని కూడా చేపట్టిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) -
రాయల్ బ్లూ సిల్క్ చేనేత చీరలో మెరిసిన సమంత..!
టాలీవుడ్ నటి సమంత రూత్ ప్రభు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చీర, ఫ్యాషన్ వేర్ అయినా..ఎందులో అయినా సమంత లుక్ ఎవర్గ్రీన్ అనేలా ఆమె మార్క కనిపిస్తుంది. సింపుల్‌గా కనిపిస్తూ..హైలెట్ మెరిసేలా ఫ్యాషన్ స్టైల్‌ని అనుసరిస్తుందామె. ఈసారి కూడా అలానే చూడాటానికి చాలా సాదాచీర అనిపించేలా లగ్జరీయస్ లుక్‌లో మెరిసిందామె.సమంత చీరల పట్ల ఉన్న ఇష్టాన్ని ఇలా ఏదో ఒక విధమైన స్టైల్లో కనిపిస్తూ..పరోక్షంగా చెబుతుంటారామె. ఆధునికత ఉట్టిపడేలా..మన సాంస్కృతికి చిహ్నమైన చేనేత చీరలో అదరహో అనిపించేలా ఉందామె ఆహార్యం. రాయల్ బ్లూ స్లిక్ చేనేత చీరలో రాకుమారిలా స్టైలిష్‌గా దర్శనమిచ్చింది. ఈ చీరను డిజైనర్ రినా సింగ్ రూపొందించారు. ఆర్గాంజ్ టైపు చీరను ప్యాచ్‌వర్క్, జాక్వర్డ్ బుట్టితో డిజైన్ చేశారు. దానికి మ్యాచింగ్‌గా ఎంబ్రాయిడరీ చేసిన వీ నైక్ బ్లౌజ్‌ని జత చేయడంతో.. లుక్‌ని మరింత అందంగా మార్చింది. స్మోకీ కళ్లు, నిగనిగలాడే పెదవులతో కూడిన మేకప్ ఆమె అందాన్ని రెట్టింపు చేసింది. ఈ చీర ధర ఎంతంటే..సమంత ధరించిన చీర ధర రూ. 32,500 కాగా, బ్లౌజ్ ధర రూ. 12,500. మొత్తం ధర దాదాపు: రూ. 45,000 పలుకుతోంది. కాగా, సమంత చివరిసారిగా శుభం అనే చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. View this post on Instagram A post shared by Samantha (@samantharuthprabhuoffl) (చదవండి: Power Of Love: రోగాలతో ఒక్కటయ్యారు.. ఆ తర్వాత..) -
ఫ్యాషన్ సెన్స్.. కారాదు నాన్సెన్స్..
నగరం.. ఫ్యాషన్‌కి.. కొత్త ట్రెండ్స్‌కి కేంద్ర బిందువు. అయితే దీనిని పాటించడానికీ ఫ్యాషన్ సెన్స్ ఉండాలి.. అయితే ఆ సెన్స్ నాన్సెన్స్ కాకూడదని పలువురు పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో ఫ్యాషన్, ట్రెండ్ పేరుతో ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగిస్తూ.. వాటిని భారీ స్థాయిలో డంప్ చేస్తున్నారు. దీంతో మనకు తెలియకుండానే ఈ డంప్ ప్రకృతిపై ప్రభావం చూపుతోంది.. మరీ ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో నగరాల్లో నిత్యం ఉత్పత్తయ్యే 9,000 టన్నుల వ్యర్థాల్లో 800 టన్నులు ఫ్యాషన్, వ్రస్తాలే ఉంటున్నాయని అంచనా.. వీటిలో చాలా వాటిని రీసైకిల్ చేయకుండానే డంప్ చేస్తున్నారని, ఇది పర్యావరణానికి ఓ సవాలుగా మారుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇష్టారీతిన ఫ్యాషన్ ఉత్పత్తులను వినియోగించేవారు రీసైకిల్/ ఎకో ఫ్రెండ్లీ ఉత్పత్తులను వినియోగించడం ఓ జీవన విధానంగా మార్చుకోవాలని సూచిస్తున్నారు.యువతలో పెరుగుతున్న ఫాస్ట్ ఫ్యాషన్ ధోరణి పర్యావరణానికి ప్రధాన సవాలుగా మారుతోంది. అధునాత జీవనశైలి పేరుతో మనం ధరించే ప్రతి ఉత్పత్తి వెనుక ఎకో ఫ్రెండ్లీ సూత్రం దాగుంది. దానిని గ్రహించి ఉత్పత్తులు ఎంపిక చేసుకుంటే.. అటు ప్రకృతికి.. ఇటు భవిష్యత్తు తరాలకు మేలుచేసినట్లవుతుంది. ఇందుకు సామాజిక బాధ్యతతో పాటు.. ఎకో ఫ్రెండ్లీ జీవన విధానం అలవర్చుకోవాలని నినదిస్తున్నారు. సింథటిక్ ఫ్యాబ్రిక్‌తో సమస్య.. మారుతున్న జీవనశైలికి అనుగుణంగా కొత్త దుస్తులు కొనడం, తరచూ ట్రెండ్స్ మార్చుకోవడం అలవాటుగా మారింది. మార్కెట్లో తక్కువ ధరకే దొరికే సింథటిక్ ఫ్యాబ్రిక్స్ డిమాండ్ పెరగడంతో ఉత్పత్తి పరిమాణం భారీగా పెరిగింది. ఇది అధిక వ్యర్థాలకు దారి తీస్తోంది. అంతర్జాతీయ సంస్థల నివేదికల ప్రకారం ఫ్యాషన్ పరిశ్రమలు ప్రపంచవ్యాప్తంగా 10 శాతం కర్బన ఉద్గారాలకు, 20 శాతం నీటి కాలుష్యానికీ కారణమవుతోంది. ఒక జీన్స్ తయారీకి సగటున 7,000 లీటర్ల నీరు అవసరమవుతుందంటే కాలుష్యం తీవ్రత ఎంతో అర్థం చేసుకోవచ్చు. రీ యూజ్, రీ సైకిల్ పరిష్కారం.. గతంలో ఏ వస్తువునైనా పూర్తిగా వినియోగించి, రిపేర్ చేసుకొని, తదుపరి తరానికి అందించే అలవాటు మన సంస్కృతిలో ఉండేది. అదే ‘స్లో ఫ్యాషన్’ భావన. నాణ్యమైన, దీర్ఘకాల మన్నిక కలిగిన వ్రస్తాలు వాడటం, వాడిన వాటిని ఇతర అవసరాలకు వినియోగించడం ద్వారా వ్యర్థాలను తగ్గించవచ్చు. హైదరాబాద్‌లో ఇటీవల ఔత్సాహిక యువత, స్టార్టప్‌లు ఈ మార్గాన్ని ఎంచుకున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ప్రాంతాల్లో ‘థ్రిఫ్ట్ మార్కెట్స్’ నిర్వహించి వాడిన దుస్తులను మళ్లీ అమ్మడం లేదా ఇతరులకు వితరణ చేయడం మొదలైంది. ఈ కల్చర్ ద్వారా ఫ్యాషన్ వ్యర్థాలు తగ్గుతాయి. సెలబ్రిటీలు కూడా ఈ మార్పుకు తోడ్పడుతున్నారు. నటి సమంతా ఆ మధ్య ఓ ఈవెంట్లో ‘రీయూజ్ వస్త్రాలు కూడా నా ఫ్యాషన్ స్టేట్మెంట్’ అని చెప్పడం ఆహా్వనించదగ్గ పరిణామం. మోతాదుకు మించి.. హైదరాబాద్‌లో టైMð్ట్సల్ వేస్ట్ మోతాదుకు మించుతోంది. జీహెచ్ఎంసీ ల్యాండ్‌ఫిల్ ప్రాంతాల్లో రోజూ వందల టన్నుల పాత దుస్తులు, ఫ్యాబ్రిక్ డంప్ చేస్తోంది. వీటిలో 40 శాతం రీసైకిల్ చేయగలిగినవే అయినా, అవగాహన లేక నేరుగా భూమిలోకి వెళ్తున్నాయి. నిత్యం 720 నుంచి 800 టన్నుల టెక్స్టైల్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని నివేదికలు చెబుతున్నాయి. సింథటిక్ ఫ్యాబ్రిక్‌లో ఉన్న నైలాన్, పాలిస్టర్ వంటి పదార్థాలు సహజంగా కరగవు. వీటి నుంచి విడుదలయ్యే మైక్రోఫైబర్లు నీటిని కలుషితం చేస్తున్నాయి. వ్రస్తాల్లో ఉపయోగించే రసాయనాలు, సింథటిక్ కలర్స్ చర్మవ్యాధులకు కారణమవుతున్నాయి. ప్రత్యామ్నాయ మార్గాలు..హ్యాండ్లూమ్, ఖాదీ, ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ వంటి దేశీయ ఉత్పత్తులు పర్యావరణానికి కాస్త సహాయకారిణిగా ఉంటాయి. ఇవి సహజంగా భూమిలో కరిగిపోతాయి. రసాయనాల మోతాదు తక్కువగా ఉంటుంది. తెలంగాణ హ్యాండ్లూమ్ ఉత్పత్తులు, ఇక్కత్ శారీస్, నారాయణపేట ఫ్యాబ్రిక్స్, మంగళగిరి కాటన్ వంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా దేశీయ ఆర్థిక వ్యవస్థకు తోడ్పడటమే కాక, కాలుష్యాన్ని కూడా తగ్గించవచ్చు. ముఖ్యంగా అవసరాన్ని బట్టి దుస్తులు కొనడం, మన్నికైన, నాణ్యమైన ఫ్యాబ్రిక్ ఎంపిక చేయడం, వాడిన బట్టలను దానం చేయడం, రీసైకిల్ సెంటర్లకు ఇవ్వడం..వంటి మార్పుకు నాంది పలకాలి. -
కంటెంట్ క్రియేటర్ నిహారిక ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ప్రతి లుక్‌లో మూడ్, ప్రతి మూడ్‌లో మ్యాజిక్ చూపించే నిహారికా స్టయిల్, అచ్చం ఆమెలానే! క్రియేటివ్ టచ్‌తో, కంఫర్ట్ స్పార్క్‌తో నిండిన ఆమె స్టయిలింగ్ ఎప్పుడూ ఒక ఆర్ట్‌లా అనిపించేస్తుంది.నా ఫ్యాషన్ ఫార్ములా? మిక్స్ ఇట్ అప్! ట్రెడిషనల్ టచ్‌కి మోడర్న్ ట్విస్ట్ జోడించడం నాకు ఇష్టం. క్యూట్ బిందీతో వెస్టర్న్ వేర్ స్టయిల్ చేస్తాను, అలాగే ట్రెడిషనల్ దుస్తులు ధరించినప్పుడు ఫంకీ జ్యూలరీ లేదా కూల్ ఫుట్‌వేర్‌తో మిక్స్ చేస్తా. నా మూడ్‌ను బట్టి లుక్ కూడా మారిపోతుందని అంటోంది నిహారికాచిన్నగా మెరిసే మెరుపు!చిన్నదే, కానీ చెవుల్లో పెద్ద ఫన్ షో లాంటి ప్రభావం! అవే మినీ హ్యాంగింగ్స్. పెద్ద ఇయర్రింగ్స్ కంటే, ఇవి తేలిగ్గా, క్యూట్‌గా ఉంటూ ఫ్రెండ్లీ, ట్రెండీ లుక్ ఇస్తాయి. ఒక్కసారి మినీ గోల్డ్ బీడ్స్, చిన్న ముత్యాలు, కలర్ స్టోన్స్ వంటివి వేసుకుంటే, సాధారణ డ్రెస్సు కూడా ప్రత్యేకంగా మెరుస్తుంది. డైలీ వేర్కి, సింపుల్ డిజైన్ హ్యాంగింగ్స్ ఎల్లప్పుడూ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్‌కి వెళ్లినా, క్లాస్ రూమ్‌లో కూర్చున్నా, మీరు ప్రొఫెషనల్, ఫ్రెష్ లుక్‌తో అందరినీ ఆకర్షిస్తారు. కాని, పార్టీ లేదా ఫంక్షన్ కోసం అయితే, కొంచెం స్టోన్ హ్యాంగింగ్స్ స్టేట్మెంట్గా మారతాయి. పోనీ, వేవీ, కర్ల్స్ ఏ హెయిర్ స్టయిల్ అయినా ఈ చిన్న హ్యాంగింగ్స్ క్యూట్ అండ్ రాయల్టీ ఫీల్‌ను ఇస్తాయి. ఇక్కడ నిహారిక ధరించిన చీర డిజైన్ చేసింది అశ్విని త్యాగరాజన్, ధర: రూ. 70,000, ఇక జ్యూలరీ : బ్రాండ్: రాజీ ఆనంద్, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: రుమాలు ఉంగరాలు..వివిధ డిజైన్స్‌లో..) -
గ్లోబల్ స్టార్ గొల్లభామ..!
సిద్ధిపేటలో పుట్టిన వందల ఏళ్ల నాటి సంప్రదాయ స్వరూపం గొల్లభామ. ఈ బొమ్మలను చీరలపై ముద్రించడం దాదాపు వందేళ్ల క్రితం ప్రారంభమైంది అంటారు. చాలా కాలం పాటు అందరూ మర్చిపోయిన గొల్లభామ చీర, తిరిగి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్‌గా మారింది. పలువురు సిటీడిజైనర్లు సైతం పాత గొల్లభామకు కొత్త వైభవాన్ని అందించే పనిలో పడ్డారు. పాత డిజైన్‌కు కొత్త వెలుగులు అద్దడంలో ప్రధాన పాత్ర పోషించారు కర్ణాటకకు చెందిన సునంద. నగరంలోని కొంపల్లిలో నివసించే సునంద అలనాటి గొల్లభామకు సరికొత్త రూపును జతచేసి అందరి దృష్టీ మనవైపు మళ్లేలా చేశారు. ఆమె ‘సాక్షి’తో పంచుకున్న రివైన్డ్ గొల్లభామ అనుభవాలు ఆమె మాటల్లోనే.. దుబ్బాక క్లస్టర్ డిజైనర్‌గా పనిచేసినప్పుడు ఈ డిజైన్‌ను తొలిసారి చూశా. అనంతరం హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్స్ విత్ నేచురల్ డైస్, అండ్ నానో టెక్నాలజీ అంశంపై పీహెచ్డీ కంప్లీట్ అయ్యాక మరోసారి సిద్ధిపేటకు వెళ్లి గొల్లభామ ఫీచర్స్ పరిశీలించాను. చాలా లోకల్ ఫీల్ ఉంది.. ఫేస్‌లో, షేప్‌లో స్పష్టత లేదని, మంచి ఫేస్ లుక్ జత చేస్తే ఇంకా బాగుంటుంది అనుకున్నా. పాతికేళ్ల క్రితం గొల్లభామను నేసి ఇప్పుడు పక్కన పెట్టేసిన సత్య, కైలాసాన్ని కలిసి నాకు కావాల్సినట్టు చీరలు నేసి ఇస్తారా అని అడిగాను.. కష్టం మేడమ్.. బాగా టైమ్ పడుతుంది అన్నారు. చీర మొత్తం అక్కర్లేదు.. క్లాత్ మీద బొమ్మ నేసి ఇస్తే చాలు అంటే.. అతి కష్టం మీద ఒప్పుకున్నారు.. అలా రివైవ్డ్ గొల్లభామ పునర్జన్మించి.. కొత్త విజయాలు అందుకుంది.జియోగ్రాఫికల్ ఇండికేషన్..అలా రివైవ్డ్ గొల్లభామ పేరిట నేను ఇచ్చిన డిజైన్స్‌కి జియోగ్రాఫికల్ ఇండికేషన్ వచి్చంది. తద్వారా గొల్లభామకు సిద్ధిపేట వీవర్స్ మాత్రమే హక్కుదారులయ్యారు. ప్రపంచం మొత్తం మీద ఇంకెవ్వరూ దీన్ని కాపీ కొట్టలేరన్నమాట. ఆదర్శ్ సొసైటీ ఆధ్వర్యంలో నేచురల్ డై తో గొల్లభామకు ప్రాణం పోసి పలుమార్లు ఎగ్జిబిషన్స్ నిర్వహించాం. అప్పట్లో సినీనటి చేనేతల బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న సమంత ఆధ్వర్యంలో ఫ్యాషన్ షో కూడా నిర్వహించాం. అలా మన గొల్లభామకు స్వల్పకాలంలోనే దేశ వ్యాప్తంగా ప్రాచుర్యం లభించింది. పాత కాలంలో గొల్లభామ చీరలు మాత్రమే లభించేవి. అయితే ప్రస్తుతం డ్రెస్ మెటీరియల్స్, దుపట్టా, పల్లులో సైతం గొల్లభామను జత చేయడం ప్రారంభించాం. తెలంగాణ రాష్ట్ర గొల్లభామను గ్లోబల్ మార్కెట్‌కి తీసుకెళ్లాలనే ఆశ ఫలిస్తోంది.కళాకారుల నైపుణ్యం.. సిద్ధిపేట కళాకారుల నైపుణ్యానికి అద్ధం పట్టే గొల్లభామ చీరలను డిజైనర్ అర్చన కొచ్చర్ మిస్ వరల్డ్ 2025 వేదికపై ప్రదర్శించారు. రీసెర్చ్ గేట్ నుంచి 2025 పరిశోధనా పత్రం గొల్లభామ క్రాఫ్ట్‌ను డిజిటల్‌గా సంరక్షించడం, దాని చుట్టూ ఆర్థిక వ్యవస్థ సృష్టించడానికి ఉద్దేశించింది. 2022 యునెస్కో నివేదికలో గొల్లభామ చీరలను ‘భారత దేశానికి ఐకానిక్ క్రాఫ్ట్’గా చేర్చారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వస్త్ర శాఖ ద్వారా చీరలను ప్రోత్సహిస్తోంది. స్టాల్స్ ఏర్పాటు చేయడం గోల్కొండ హస్తకళల షోరూమ్ వంటి వాటిలో అందుబాటులోకి తేవడం చేస్తోంది. గొల్లభామ చీరలకు 2012లో జీఐ ట్యాగ్ లభించింది. సిద్ధిపేట కేంద్రంగా.. కోలాటం, బతుకమ్మ డిజైన్లు కూడా అందుబాటులో ఉన్నా.. గొల్లభామ చీర తెలంగాణకే ప్రత్యేకం. ఈ చీరలు ధర కనీసం రూ.4వేల నుంచి వివిధ ధరల్లో లభిస్తున్నాయి. సిద్ధిపేటలో గొల్లభామ చీరలు నేయగలిగిన నేతన్నలు ప్రస్తుతం ఓ 20 మంది వరకూ ఉన్నారని అంచనా. నగరంలోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్, పోలీస్‌స్టేషన్ ఎదురుగా ఉన్న లేపాక్షి భవన్ (ప్రస్తుతం గోల్కండ భవన్)లో అందుబాటులో ఉన్నాయిమా జీవితాలను మార్చింది.. తెలంగాణ సంప్రదాయ చేనేత కళాకారులుగా తరాల తరబడి ఇదే వృత్తిలో కొనసాగుతున్నాం. ఆ మధ్య కాలంలో కనుమరుగైపోయిన గొల్లభామ చీరలకు గత కొంతకాలంగా డిమాండ్ పుంజుకుంది. దీనికి పాత డిజైన్‌లో మార్పు చేర్పులు కూడా కారణం. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ పురస్కారంతో పాటు ప్రభుత్వం నుంచి మాకు తగినంత ప్రోత్సాహం కూడా లభిస్తోంది. ఈ సంప్రదాయ కళలకు యువత ఆదరణ చూపించడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. – కైలాసం, చేనేత కళాకారుడుఉపాధికి ఊతం అందించింది.. సిద్ధిపేటలో గొల్లభామకు పూర్వవైభవం రావడంతో పాటు ఆ చేనేత కళాకారులకు పలువురు దీని ద్వారా ఉపాధి పొందడం ఆనందం కలిగిస్తోంది. చీర తయారు చేసే కైలాసానికి, దుపట్టా చేసే సత్యకు అవార్డు రావడంతో పాటు వారి ఆదాయం పెరగడం ఎంతో సంతృప్తినిస్తోంది. గత ఆగస్టులో కర్ణాటకకు చెందిన ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల ప్రతినిధులు, విద్యావేత్తలు ఆదర్శ్ సొసైటీని సందర్శించారు. రివైవ్డ్ గొల్లభామ వెర్షన్‌ను చూసి ప్రశంసించారు. యువత కూడా మన సంప్రదాయ చేనేత పట్ల మరింత అవగాహన పెంచుకోవాలని కోరుతున్నా. – సునంద, ,టెక్స్టైల్స్, ఫ్యాషన్ డిజైనర్ (చదవండి: ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!) -
‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ సందేశంతో కూడిన గ్లామర్..!
కొత్త దుస్తులు కొనడం, కొత్త స్టైల్లో కనిపించడం ట్రెండ్‌ను ఫాలో అవడం... ఇవే ఫ్యాషన్ అని మనలో చాలామంది అనుకుంటారు. కానీ బాలీవుడ్ స్టార్ అలియా భట్ ఆ ధోరణిని మార్చేసింది. ఇటీవల నటి కరీనాకపూర్ ఇచ్చిన దీపావళి పార్టీకి 30 ఏళ్ల నాటి వింటేజ్ సిల్క్ శారీ ధరించి అందరినీ ఆశ్చర్యపరించింది. ‘రీస్టైల్ ఫ్యాషన్‘ ద్వారా సస్టెయినబుల్ లివింగ్ కూడా గ్లామరే అనే సందేశాన్ని ఇస్తోంది. అదే నయా ట్రెండ్‌గా మన కళ్లకు కడుతోంది. ఆధునిక భారతీయ ఫ్యాషన్ గురించి చెప్పాలంటే చాలా మంది సెలబ్రిటీలు తమ దుస్తులను రీ క్రియేట్ చేస్తూ సోషల్‌మీడియాలో అందంగా... అబ్బురంగా చూపుతున్నారు. ఇది ఒక స్ఫూర్తిని కలిగించే మార్పు. ఈ మార్పు పర్యావరణ అనుకూలమైనది మాత్రమే కాదు. తరాల వారసత్వాన్ని కూడా పరిచయం చేయడం. సెలబ్రిటీల జీవనవిధానం సమాజాన్ని మార్చగలదనే విషయాన్ని అలియాభట్ తన దుస్తుల ద్వారా తెలియజేస్తుంది. లుంగీ స్టైల్ స్కర్ట్, పింక్ చికంకారీ కుర్తీని ధరించి వేడుకలు జరుపుకుంది. ఆ తర్వాత కరీనాకపూర్ ముంబైలోని తన నివాసం లో నిర్వహించిన దీ΄ావళి వేడుకలకు హాజరయ్యింది.సంగీత్ లెహంగా.. దీపావళి పార్టీలో... కిందటేడాది దీపావళి సమయంలో బాలీవుడ్ గ్లామ్ వేడుకలకు ఆలియాభట్ హాజరయ్యింది. తన పెళ్లి సమయంలో మెహెందీ వేడుకలో మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన పింక్ లెహంగాను ఈ గ్లామ్ పార్టీకి రీ స్టైల్ చేసి తిరిగి ధరించింది. మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఈ లెహంగాను రీ–స్టైల్ చేసి ధరించింది. ఈ లెహంగా సుమారు 180 టెక్స్టైల్ ప్యాచ్‌లతో, రియల్ గోల్డ్, సిల్వర్ నక్షీ, కోరా పూలు, వింటేజ్ సీక్వెన్సెస్‌తో తయారైంది. పార్టీకి కొత్త డ్రెస్ కొనకుండా, ఆమె ఆ లెహంగానే డిజైనర్ టాప్, జువెలరీ, హెయిర్‌స్టైల్‌తో రీ–స్టైల్ చేసింది. పర్యావరణ హితంపర్యావరణ స్పృహ కలిగిన దుస్తుల బ్రాండ్ ఎడ్–ఎ–మమ్మాను స్థాపించింది. ఇది పిల్లల, బాలింతలకు అవసరమయ్యే ఆర్గానిక్ దుస్తుల బ్రాండ్. ఫ్యాషన్ వ్యర్థాలను తగ్గించడానికి చేనేతలను ప్రోత్సహించడానికి కృషి చేస్తుంది. తన పెళ్లి సమయంలో ఉపయోగించిన లెహంగాతో సహా వివిధ రకాల తన దుస్తులను రీ క్రియేషన్ చేయడంలో అలియా ప్రసిద్ధురాలుగా పేరొందింది. అంతేకాదు పర్యావరణ అనుకూల బ్రాండ్లకు మద్దతు ఇస్తుంది.30 ఏళ్ల క్రితం చీర కొత్తగా...ఈ సందర్భంగా అలియాభట్ బంగారు రంగు చీరను ధరించింది. ఇండియన్ డిజైనర్ రీతుకుమార్ 30 ఏళ్ల క్రితం ఈ చీరను డిజైన్ చేశారు. ఈ చీరను స్లీవ్‌లెస్ బస్టియర్ స్టైల్ బ్లౌజ్‌తో జత చేసింది. బంగారు చోకర్ నెక్లెస్, ఉంగరాలు, మాంగ్ టిక్కా, బ్రేస్‌లెట్‌ను ధరించింది.పాత దుస్తులను కొత్తగా తీర్చిదిద్దడం. ఆ దుస్తులు కూడా కొత్తగా కనిపించేలా మార్చడం అలియా భట్ చూపుతున్న మార్గం. ఆమె స్టైలింగ్ ఫిలాసఫీ కూడా ఇదే. ‘ఫ్యాషన్ అంటే కేవలం లుక్ కాదు, అది మన విలువల ప్రతిబింబం’ అంటుంది ఆలియా. ‘రీ–స్టైల్ ఫ్యాషన్ ’ కేవలం ట్రెండ్ కాదు ఒక సందేశం కూడా! (చదవండి: మంత్లీ మ్యారేజ్ రివ్యూ!) -
ఇండోర్ మహారాణి : నీతా అంబానీ లాంగ్ నెక్లెస్ ఆ డైమండ్స్ ఎలా మోసారండీ!
లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో జరిగిన పింక్‌బాల్ ఈవెంట్‌కి రిలయన్స్ ఫౌండేషన్ చైర్పర్సన్ నీతా అంబానీ కుమార్తె ఇషా అంబానీ తొలిసారి సహ-అధ్యక్షత వహించారు. అయితే ఈ సందర్భంగా ఫ్యాషన్ ఐకాన్ నీతా అంబానీ ధరించినడైమండ్స్, ఎమరాల్డ్ నెక్లెస్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. డైమండ్స్, పచ్చలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే నీతా మరోసారి అద్భుతమైన నెక్లెస్‌ను ధరించారు. ఈ నెక్లెస్ రాయల్ లుక్, చరిత్ర ఏంటి అనేది హాట్ టాపిక్‌గా మారింది.నీతా అంబానీ మెడలో అమరిన అందమైన పచ్చలు, ఖరీదైన డైమండ్స్, బంగారంతో తయారు చేసిన ఈ లాంగ్ నెక్లెస్ ఇండోర్ మహారాణి సంయోగిత దేవి ధరించిన నెక్లెస్ నుండి ప్రేరణతో ఆమె గౌరవార్ధం రూపొందించారు. ఇది ఇండోర్ మహారాణికి చెందిన అత్యంత ప్రసిద్ధ నెక్లెస్‌లలో ఒకటి. దీని ప్రేరణతోనే స్వయంగా నీతా అంబానీ డిజైన్ చేసుకోవడం విశేషం. ఆమె వ్యక్తిగతంగా సేకరించి వజ్రాలు, పచ్చలతో దీన్ని తయారు చేయించారు. ఈ నెక్లెస్ మధ్యలో 70-క్యారెట్ల పచ్చ, 40-క్యారెట్ల పియర్ షేప్ డైమండ్ స్పెషల్ ఎట్రాక్షన్. ఈ నెక్లెస్‌లో నిజామి మూలానికి చెందిన 40-క్యారెట్ల రౌండ్ వజ్రం మరింత ప్రత్యేకంగా నిలుస్తోంది.1933లో తొలుత మౌబౌసిన్ రూపొందించారు. సంయోగిత దేవి ధరించిన నెక్లెస్‌లోని రెండు పియర్ ఆకారపు వజ్రాలను 1913లో యూరప్ పర్యటన సందర్భంగా తుకోజీ రావు హోల్కర్ III కొనుగోలు చేశారట.. ఆయన తన భార్య కోసం ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఫ్రెంచ్ ఆభరణాల వ్యాపారి చౌమెట్ పారిస్ సెలూన్‌ను సందర్శించారు. 46.70 , 46.95 క్యారెట్ల బరువున్న రెండు పియర్ ఆకారపు వజ్రాలతో ఫ్రెంచ్ లావలియర్ శైలిలో సొగసైన నెక్లెస్‌గా రూపొందించారు. ఈ వజ్రాల ధర 1913లో 631,000 ఫ్రాంక్‌లు.ఆ తరువాత ఇవి ఇండోర్ పియర్స్ గా పాపులర్ అయ్యాయి. బరువైన డైమండ్ రింగ్అంతేకాదు ప్రముఖ నగల డిజైనర్ జూలియా చాఫ్ ప్రకారం40 క్యారెట్ల పియర్ ఆకారపు సాలిటైర్లు చాలా అరుదు. ఇలాంటిది ప్రపంచంలో ఎక్కడాలేదు. ఆమె నెక్లెస్‌తో పాటు ధరించిన భారీ వజ్రపు ఉంగరం కూడామరో హైలైట్. ఇది చాలా బరువైందని ఇది ధరించాక నీతా అంబానీ వేళ్లు బాగానే ఉన్నాయా అంటూ ఆమె చమత్కరించారంటే ఈ ఉంగరం బరువును ఊహించవచ్చు చదవండి: ఢిల్లీ మెట్రోలో అమ్మాయిల స్టెప్పులు : వీడియో వైరల్ -
35 మంది, 3,670 గంటలు : పింక్ బాల్ ఈవెంట్లో మెరిసిన ఇషా అంబానీ
లండన్‌లోని బ్రిటిష్ మ్యూజియంలో చారిటీ ఈవెంట్ "పింక్ బాల్" ఈవెంట్ గ్లామర్‌కు ప్రతిరూపంగా మారింది. బ్రిటిష్ మ్యూజియం డైరెక్టర్ నికోలస్ కల్లినన్‌తో కలిసి, రిలయన్స్ రీటైల్ హెడ్ ఇషా అంబానీ దీనికి సహ అధ్యక్షత వహించారు. అలాగే ఆమె తల్లి, రిలయన్స్ ఫౌండర్ చైర్పర్సన్ ,NMACC వ్యవస్థాపకురాలు పింక్ బాల్ థీమ్‌లో అద్భుతమైన లుక్‌లో మెరిసారు.కీలకమైన కారణాల కోసం నిధులను సేకరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఈ కార్యక్రమంలో బ్రిటన్ మాజీ ప్రధాని రిషీ సునాక్‌తోపాటు, ప్రపంచవ్యాప్తంగా పలువురు సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, దాతలు, సామాజిక ,రాజకీయ ఉన్నత వర్గాలకు చెందిన 800 మంది పాల్గొన్నారు. ముఖ్యంగా వ్యాపారవేత్తగా, గొప్ప దాతగా పేరుగాంచిన నీతా అంబానీ తనదైనఫ్యాషన్ లుక్‌తో అలరించారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ స్పాన్సర్ చేసిన ఈ ఈవెంట్ ఏన్షియంట్ ఇండియా: లివింగ్ ట్రెడిషన్స్'తో పాటు జరిగిన పింక్-నేపథ్య సోయిరీలో సాగింది.పింక్ బాల్ సహ చైర్‌గా, ఇషా అంబానీ లుక్‌లో వారసత్వం, కళాత్మకత ఉట్టిపడింది. అబు జాని సందీప్ ఖోస్లా ప్రత్యేకంగా రూపొందించిన హ్యాండ్ మేడ్ కోచర్ డ్రెస్‌లో మెరిసి పోయింది. పింక్ ధీమ్కు తగ్గట్టుగా బ్లష్ పింక్ చామోయిస్ శాటిన్ జాకెట్ , గులాబీ రంగు జర్డోజీలో ముత్యాలు, సీక్విన్స్ ,స్ఫటికాలతో డిజైన్ స్కర్ట్‌ను ధరించింది.35 మందికి పైగా కళాకారులుదీన్ని తయారు చేయడానికి 3,670 గంటలు శ్రమించారు. దీనికి సంబంధించిన వీడియోను సందీప్ ఖోస్లా షేర్ చేశారు. కార్సెట్ బ్లౌజ్‌ను డిజైనర్ మనీష్ మల్హోత్రా స్టైల్ చేశారు. అలాగే నీతా అంబానీ స్వదేశ్లో తయారు చేసిన కాంచీవరం, మల్బరీ సిల్క్ చీరలో అందంగా కనిపించారు. View this post on Instagram A post shared by Nita Mukesh Ambani Cultural Centre (@nmacc.india) ఈ కార్యక్రమానికి మిక్ జాగర్, జానెట్ జాక్సన్, నవోమి కాంప్‌బెల్, సర్ నార్మన్ ఫోస్టర్, లేడీ కిట్టి స్పెన్సర్, ల్యూక్ ఎవాన్స్ , జేమ్స్ నార్టన్ వంటి అనేక మంది సృజనాత్మక ప్రముఖులు హాజరయ్యారు. హాజరైన ప్రతీవ్యక్తి సీటు కోసం 2,000 పౌండ్లు చెల్లించినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Abu Jani Sandeep Khosla (@abujanisandeepkhosla) -
కలర్‌ఫుల్ స్వింగ్ 'దివాలి' డ్రెస్సింగ్..!
దీపావళి అంటే ఒక పండుగ మాత్రమే కాదు.. విభిన్న రకాల సంబరాల కలగలుపు వేడుక. బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం మొదలు.. క్రాకర్స్ కాల్చడం వరకూ ఈ పండుగ ఆస్వాదించదగిన ఎన్నో అనుభూతులను మనకు అందిస్తుంది. అందుకే ఈ ఫెస్టివల్లో మన లుక్స్ ద్వారా గుడ్‌విల్ అందుకోవాలంటే, తగిన వస్త్రధారణ తప్పనిసరి. ఇందుకోసం తరచూ బాలీవుడ్ నటీనటుల స్టైల్స్‌ను సిటీ యూత్ అనుసరిస్తుంటారు. ఈ నేపథ్యంలో నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ అందిస్తున్న కొన్ని సూచనలు.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ధరించిన ఒక డ్రెస్.. ఒక టాంగీ నారింజ మిర్రర్–వర్క్ బ్లేజర్ కోర్డ్ సెట్ దీపావళి పార్టీకి సరైన ఎంపిక. ముఖ్యంగా పండుగ వేళ మెరుపులు విరజిమ్ముతూ.. అదే సమయంలో సౌకర్యవంతంగా ఉండాలనుకునేవారికి ఇవి సరైనవి. మినిమలిస్ట్ లుక్.. ఉత్తరాది ప్రేక్షకుల్ని ఉర్రూతలూంచే అనన్య పాండే దీపావళి కోసం మినిమలిజాన్ని సూచిస్తున్నారు. సున్నితమైన తెల్లటి ఎంబ్రాయిడరీతో అలంకరించిన లేత గులాబీ రంగు స్లీవ్‌లెస్ కుర్తాను, మ్యాచింగ్ పలాజో ప్యాంటు జత చేశారు. ఓపెన్ హెయిర్ మినిమల్ మేకప్‌తో, పండుగ డ్రెస్సింగ్‌కు ‘తక్కువలో ఎక్కువ’ విధానాన్ని సంపూర్ణంగా ప్రతిబింబిస్తున్నాయి. రెడ్ గ్లామ్ లుక్.. దీపావళికి మరో సిల్వర్ స్క్రీన్ క్వీన్ మౌని రాయ్ లాగా ఆల్–రెడ్ లెహంగాలో అబ్బురపరిచవచ్చు. కాంబినేషన్‌గా ఫుల్–స్లీవ్డ్ బ్లౌజ్, ప్రింటెడ్ బోర్డర్లతో మ్యాచింగ్ స్కర్ట్, గోల్డెన్ షిమ్మర్‌తో అంచులున్న కో–ఆర్డినేటింగ్ దుపట్టా ఉన్నాయి. బంగారు చోకర్ నెక్లెస్, మాంగ్ టిక్కాతో తన అద్భుతమైన ఎథి్నక్ లుక్ కంప్లీట్‌గా తీర్చిదిద్దుకుంది. లాంగ్ ఎథినిక్ జాకెట్లు.. పొడవాటి ఎథ్నిక్ జాకెట్లు పండుగ వార్డ్‌రోబ్‌కు చక్కదనాన్ని జోడిస్తాయి. సరళమైన కుర్తాపై అందంగా ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్‌ను జత చేయాలి లేదా క్యాజువల్, చిక్ ఫ్యూజన్ లుక్ కోసం క్రాప్ టాప్ స్కర్ట్‌తో స్టైల్ సెట్ చేసుకోవచ్చు. ఈ స్టైలిష్ లేయర్ డ్రెస్సింగ్.. ట్రెండీగా సాయంత్రపు సమావేశాలకు సౌకర్యవంతంగా ఉంటూనే సంప్రదాయాన్ని జోడిస్తుంది.సింపుల్ లాంగ్ గౌన్లు.. సొగసైన పాస్టెల్ లేదా మ్యూట్ షేడ్స్‌లో ఉన్న పొడవైన, తక్కువగా అలంకరించిన గౌన్లు దీపావళికి స్టైలిష్ ఎంపిక. అవి చక్కదనంపై రాజీ పడకుండా సౌకర్యంపై దృష్టి పెడతాయి. పండుగ రూపాన్ని పూర్తిగా ప్రతిబింబించాలంటే.. దీనికి దుపట్టా లేదా లైట్ జ్యువెలరీ జోడించాలి. పాతవే కొత్తగా.. ప్రస్తుత వార్డ్రోబ్ నుంచి కొన్నింటిని విడివిడిగా తీసి కలపడం ద్వారా అదనపు ఖర్చు చేయకుండా కూడా తాజా పండుగ స్టైల్‌ను సృష్టించవచ్చు. కొత్త పలాజోలతో పాత కుర్తీని జత చేయడం లేదా సరదాగా ఫ్యూజన్ వైబ్ కోసం జీన్స్‌తో భారీ దుపట్టాను కలిపేయడం.. వంటి ట్రిక్స్ ఫాలో అవ్వవచ్చు. ఇది మన డబ్బు ఆదా చేయడమే కాకుండా దుస్తులకు వ్యక్తిగత సృజనాత్మక ట్విస్ట్‌ను అందిస్తుంది. దేశీ డ్రీమ్.. మరీ సింపుల్‌గా వద్దు అనుకుంటే, అలంకరించబడిన షరారా సెట్లు రెడీగా ఉన్నాయిు. సీక్విన్స్, జెమ్స్ మెరుపులతో ఇవి లేట్–నైట్ డిన్నర్లు, రూఫ్‌టాప్ పార్టీలకు బెస్ట్. దీని కోసం నటి జాన్వి కపూర్ డ్రెస్ స్టైల్ పరిశీలించవచ్చు. ఆధునిక, ఆకర్షణీయమైన ట్విస్ట్ కోసం దుపట్టాను కేప్‌గా ధరించవచ్చు. బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ చతుర్వేది లాగా నల్ల కుర్తా స్ట్రెయిట్–ఫిట్ ప్యాంటు లుక్ కూడా బాగుంటుంది. లీనియర్ రెడ్ మోటిఫ్ డీటెయిలింగ్‌తో అలంకరించిన, వదులుగా ఓపెన్ జాకెట్‌తో పొరలుగా ధరించడం ఆధునిక సంప్రదాయాల స్టైలిష్ మిశ్రమం.వేదంగ్ రైనా లా నల్ల కుర్తా స్ట్రెయిట్ ప్యాంటులో మెరిసిపోవచ్చు, సమకాలీన పండుగ లుక్ కోసం మెరిసే నల్ల బ్లేజర్‌తో లుక్‌ను మరింత మెరిపించవచ్చు. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌ని గమనిస్తే.. తరచూ క్లాసిక్ సిల్హౌట్‌లతో సమకాలీన కట్లను మిళితం చేస్తాడు. ఇటీవలి దీపావళి లుక్‌లో పొట్టి కుర్తా ఎరుపు రంగు స్ట్రెయిట్ ప్యాంటు నమూనా నెహ్రూ జాకెట్‌తో కలిగి ఉంది ఆధునిక పండుగ డ్రెస్సింగ్‌కి ఇది సరైన ఉదాహరణ. బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్‌లా చాలా సింపుల్ స్టైల్‌ని ఎంచుకోవచ్చు. ఆయన ధరించిన పాస్టెల్–రంగు లినెన్ కుర్తా–పైజామా సౌకర్యం, సరళమైన కాలాతీత శైలి అని చెప్పొచ్చు. -
అవే నా స్టయిల్ ఆఫ్ లవ్: నటి చైత్ర జే ఆచార్
సింపుల్ నుంచి బోల్డ్ వరకు, ట్రెండ్ నుంచి ట్రెడిషనల్ వరకు ఏ స్టయిల్లోనైనా తన స్వాగ్‌ని చూపే నటి చైత్ర జే ఆచార్. జీన్స్, షార్ట్స్ ప్లస్ టీ షర్ట్ నా స్టయిల్ ఆఫ్ లవ్. బయటకు వెళ్లేటప్పుడు ఇదే లుక్‌ను కాస్త బోల్డ్‌గా స్టయిల్ చేస్తా. ప్రత్యేక సందర్భాల్లో చీరల్లో మెరుస్తాను. అవి నాకు సంప్రదాయబద్ధమైన, కంఫర్ట్ లుక్‌ను ఇస్తాయి. దుస్తులు ఏవైనా, మినిమల్ జ్యూలరీని ప్రిఫర్ చేస్తా అంటోంది చైత్ర జే ఆచార్. ఇక్కడ ఆమె ధరించిన చీర బ్రాండ్: ఇజాయి ధర: రూ. 3,850, జ్యూలరీ బ్రాండ్: ఫైన్ షైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. క్రిస్టల్ క్రష్!రాళ్ల నగలు నేటి యువత స్టయిల్‌కి ర్యాప్ సాంగ్లాంటి ఎనర్జీని ఇస్తున్నాయి. అందుకే, బంగారం మెరుపు కంటే, క్రిస్టల్ జ్యూలరీనే వారి ఫేవరెట్ క్రష్‌గా మారింది. నిజానికి, రాళ్ల ఆభరణాలకు ఫ్యాషన్‌లో ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంది. ఇవి కేవలం మెరుపుతోనే కాదు, ట్రెండ్, లగ్జరీ మిక్స్ చేసిన మోడర్న్ డిజైన్లతో వస్తాయి. విశేషంగా, వైట్ స్టోన్ జ్యూలరీకి ఒక అదనపు ఆర్భాటం అందిస్తాయి. ఒక్కసారి రాళ్ల ఆభరణాలు ధరించగానే సాధారణ దుస్తులు కూడా ప్రత్యేకంగా మెరుస్తాయి. డైలీ వేర్‌కు, మినిమలిస్టిక్ వైట్ సఫైర్ స్టడ్స్, సింపుల్ బ్యాంగిల్స్ ఎప్పటికీ బెస్ట్ ఆప్షన్. ఆఫీస్ స్టయిల్‌కు క్లాసిక్ వైట్ స్టోన్ పీసులు, జెంటిల్ డిజైన్, ప్రొఫెషనల్ లుక్ అందిస్తాయి. వివాహాది శుభకార్యాల కోసం పెద్ద హారాలు, చోకర్స్, గ్రాండ్ స్టేట్మెంట్ లుక్ ఇస్తాయి. ప్రతి సందర్భానికి ప్రత్యేకంగా మోడర్న్ స్టోన్ డిజైన్స్ అందుబాటులో ఉన్నాయి. జుట్టు పోనీగా కట్టి వెళ్ళితే రాయల్టీ లుక్, వేవీ హెయిర్ లేదా కర్ల్స్ వేసుకుంటే క్యూట్ టచ్ గ్యారంటీ. (చదవండి: beauty: ముఖం మెరుస్తూ..కాంతిగా ఉండాలంటే..! కుంకుమ పువ్వుతో..) -
విలాస సౌందర్యం...
బాలీవుడ్ నిర్మాత, ఫ్యాషన్ ఐకాన్ గౌరీ ఖాన్ దీపావళి పండుగ నేపథ్యంలో జోయా ఆధ్వర్యంలో ఐకానిక్ రూబీ రష్ నెక్లెస్ ఆవిష్కరించింది. 70 క్యారెట్ల మొజాంబిక్ ఎర్ర కెంపులతో నెక్లెస్ లో అందంగా కనిపించింది. 1950లో హాలీవుడ్ దిగ్గజాలు మార్లిన్ మన్రో, ఎలిజబెత్ టేలర్ ఇంద్రియాలకు ప్రసిద్ధి చెందిన ఎరుపు రంగు లిప్‌స్టిక్ ప్రేరణతో ఈ రూబీ రష్ డిజైనింగ్ రూపొందించామని జోయా యాజమాన్యం తెలిపింది. స్త్రీతత్వం, శాశ్వతమైన గ్లామర్‌ను ప్రతిబింబించే ఈ డిజైన్స్ హైదరాబాద్‌తో పాటు అన్ని నగరాల్లో అందుబాటులో ఉంటాయని అన్నారు. మహిళల సౌందర్యం, ఆత్మస్థైర్యానికే కాకుండా లగ్జరీకి నిదర్శనంగా నిలుస్తుందని గౌరీ ఖాన్ పేర్కొన్నారు -
పండుగంతా నిండుగా..ఈ చీరకట్టులో మెరుద్దాం ఇలా..!
పండగలకు, సంప్రదాయ వేడుకలకూ నిండైన హుందాతనాన్ని తీసుకువచ్చేలా కట్టూ బొట్టు విషయంలో అతివలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ దీపావళి వేళ మరింత స్పెషల్‌గా కనిపించాలనుకునే వారికోసం బెంగాలీ చీరకట్టు ఆధునికతనూ అద్దుకొని కొంగొత్తగా మెరిసి΄ోతుంది. సెలబ్రిటీ లూ ముచ్చటపడే ఈ కట్టుకు వారు జోడించే హంగులు ఇవి... పండగలు, ఇతర సంప్రదాయ వేడుకలలో బెంగాలీ స్టైల్ చీర కట్టును దేశవ్యాప్తంగా మహిళలు ధరించడానికి ఇష్టపడుతున్నారు. ఉత్తేజాన్ని కలిగించే ఎరుపు–తెలుపు కాంబినేషన్లో ఉండే ఈ చీర కట్టు, నుదుటన పెద్ద బిందీ, శంఖం ఆకృతిలో నెక్ డిజైన్, చీర పల్లూకున్న అందమైన డిజైన్.. ఇవన్నీ పండుగను మరింత ప్రత్యేకంగా చేస్తాయి. దుర్గాపూజల సమయాల్లో ఈ రంగు చీరలను బెంగాలీలు ప్రత్యేకంగా ధరిస్తారు. ఆ స్టైల్ కట్టును ఇప్పుడు లక్ష్మీ పూజలు, వివాహ వేడుకల సమయాల్లో ధరించడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే, ఈ కట్టును మనం అనుసరించాలంటే మాత్రం ఈ సూచనలు తప్పక అవసరం.ఎంపికలో సరైన చీరపూజలు, నోములు, వ్రతాల సమయంలో ఎరుపు అంచుతో ఉన్న తెలుపు లేదా ఆఫ్–వైట్ బేస్ చీరను ఎంచుకోవాలి. అంచు ఉన్న కాటన్, పట్టు లేదా టస్సర్ చీరలు ఈ బెంగాలీ లుక్కు సరైనవి. వీటిలో మనవైన చేనేతలు కూడా ఉండవచ్చు. ఈ చీరకట్టు సౌకర్యంగా ఉండటమే కాకుండా పూజ, పండగల సమయాల్లో రోజంతా ధరించడం సులభం కూడా.కట్టుతో కట్టడిబెంగాలీ స్టైల్లో నిజమైన ఆకర్షణ దాని డ్రేపింగ్ శైలిలోనే ఉంటుంది. చీర కుచ్చిళ్ల నుంచి ఎడమ వైపుగా, పొడవాటి పల్లూను ఛాతీ మీదుగా భుజం వరకు తీసుకుంటూ వెళ్లాలి. పొడవాటి పల్లూ భాగాన్ని కుడి చేతి భుజం కిందుగా తీసి, పైకి అంచు భాగం కనిపించేలా బ్లౌజ్‌కు జత చేయాలి. పొడవుగా తీసుకున్న కొంగు భాగాన్ని కుడి చేత్తో ముందుకు తీసుకువచ్చి పట్టుకోవడం కూడా ఈ కట్టులో అందంగా కనిపిస్తుంది. భుజం మీదుగా తీసిన పల్లూని కొప్పుకు అటాచ్ చేసి, ఎడమ భుజం కిందుగా తీసుకురావచ్చు. ఈ కట్టు లలనల రూపాన్ని మరింత సంప్రదాయంగా మారుస్తుంది. డ్రేపింగ్ చేసేటప్పుడు, కుచ్చుల భాగం మడతలు లేకుండా సెట్ చేసి, పల్లూ చాలా తేలికగా ఉన్నట్టు చూసుకోవాలి.నగలపై ప్రత్యేక శ్రద్ధపెద్ద పెద్ద చెవి΄ోగులు, గాజులు, నెక్లెస్‌లు ఈ స్టైల్ చీరకట్టుకు రాయల్ టచ్‌ను జోడిస్తాయి. హెవీగా ఆభరణాలు అక్కర్లేదు అనుకుంటే పెద్ద చెవి΄ోగులు, గాజులు ఈ అలంకరణకు సరి΄ోతాయి.గుండ్రని వెడల్పాటి బిందీబెంగాలీ స్టైల్ డ్రేపింగ్ సంపూర్ణం కావాలంటే నుదుటన పెద్ద, గుండ్రని ఎరుపు బిందీ తప్పక ఉండాలి. ఇది పండుగల రోజుల్లో మొత్తం మేకప్‌ను పూర్తి చేస్తుంది. నుదుటిపై బిందీతో పాటు సిందూర్ చుక్కలను కూడా అదనంగా పెట్టడం వల్ల లుక్ మరింత మెరుగవుతుంది. ఈ లుక్‌కి ఎరుపు లేదా ముదురు గులాబీ రంగు బిందీ ఆకర్షణీయంగా కనిపిస్తుంది.హెయిర్ స్టైల్– మేకప్హెయిర్ స్టైల్ కోసం ఒక బన్ తయారు చేసి, దానిని మల్లె పువ్వులు లేదా ఎరుపు, తెలుపు పువ్వులతో అలంకరించవచ్చు. పువ్వులతో కాకున్నా హెయిర్ బన్‌కు హెయిర్ పిన్ జ్యువెలరీని జోడించడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు. మేకప్ కోసం ఎరుపు లిప్‌స్టిక్, తేలికపాటి ఐ మేకప్ సరిపోతాయి. ధరించిన చీరకు మేకప్ సెట్ అవుతుందా అనేది సరి చూసుకుంటే చాలు. మెడలోనూ, చేతులకు ఎక్కువ నగల లేకుండా చూసుకుంటే చాలు. మీ రూపం ఆధునికతను అద్దుకున్న సంప్రదాయంతో కొంగొత్తగా మెరిసిపోతుంది. (చదవండి: బహుశా ఇదే చివరి దీపావళి పండుగ..! సమయం మించిపోతోంది.) -
బొట్టు కూడా ఒక డిజైనర్ ఆభరణం : ఆదాయం 20 లక్షలు
భారతీయ మహిళామణులకు బొట్టు అంటే ప్రాణం.అందం, సంప్రదాయాల మేళవింపు అది. పండగ అయినా, పెళ్లిఅయినా, ఏ వేడుక అయినా అదొక ఫ్యాషన్. అందుకే కాలక్రమేణా బొట్టు లేదా బిందీ రూపాలు మారుతూ వచ్చాయి.ఈ మార్పునే ఆకళింపు చేసుకున్నారు బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా. రోజువారీ జీవితంలో భాగమైన బొట్టు బిళ్లలను ఫ్యాషన్ ఆభరణాలుగా మార్చి, తన క్రియేటివిటీతో పలువురి సెలబ్రిటీల ఫ్యావరెట్‌గా మారిపోయింది. మిలిటరీ నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన మేఘన ఉద్యోగాన్ని వదిలి మరీ ఈ వ్యాపారాన్ని ఎంచుకుంది. మేఘనా సక్సెస్ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం ఈ కథనంలో.బెంగళూరుకు చెందిన వ్యవస్థాపకురాలు మేఘనా ఖన్నా బిందీ సంప్రదాయం నుండి ప్రేరణ పొంది, ది బిండి ప్రాజెక్ట్‌ను స్థాపించారు. అయితే ఈ జర్నీ వెనుక పెద్ద పోరాటమే ఉంది. మేఘనా ఖన్నా పూణేలో మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్‌లో ఎంబీఏ చేశారు. ఒక ఏడాది పాటు ఒక కంపెనీలో ఉద్యోగంలో చేరారు. కానీ సొంతంగా వ్యాపారాన్ని చేయాలనే ఆలోచనకు మరింత పదును పెరిగింది. ఈ క్రమంలో ఆమె దృష్టి ముక్కు పోగులపై పడింది. జోధ్‌పూర్ కళాకారులతో కలసి "లెవిటేట్" అనే హ్యాండ్‌క్రాఫ్ట్ జ్యువెలరీ బ్రాండ్‌ను ప్రారంభించింది. 2002 - 2020 వరకు అంటే పద్దెనిమిదేళ్లు లెవిటేట్ విజయవంతంగా నడిచింది. ఇందులో రకరకాల చోట్ల నుంచి వచ్చిన అందమైన నగలు, యాక్సెసరీలు, గృహాలంకరణ వస్తువులు ఉండేవి. కోవిడ్ మహమ్మారి మేఘనా వ్యాపారాన్ని దెబ్బతీసింది. చివరకు వ్యాపారం మూసివేయాల్సి వచ్చింది. కానీ బిజినెస్ చేయాలనే కోరిక మాత్రం నశించ లేదు. View this post on Instagram A post shared by Startup Pedia (@startup.pedia)2022లో అనుకోకుండా బొట్టు బిళ్లల్లో బంగారు, వెండివి ఉంటాయని తెలుసుకుంది మేఘనా. తన స్నేహితురాలు అమ్మమ్మ ఇచ్చిన బంగారు బొట్టు చూశాక తానెందుకు ఇలాంటి తయారు చేయకూడదనే ఆలోచన వచ్చింది. అన్ని ఆభరణాల మాదిరిగానే బొట్టు బిళ్లలు కూడా ఒకఫ్యాషన్‌గా ఉండాలనే ఆలోచనతో "ది బిందీ ప్రాజెక్ట్" ప్రారంభించింది. దీనికి తోడు ‘లెవిటేట్’ అనుభవం ఉండనే ఉంది. రూ.5 లక్షలతో బిందీ ప్రాజెక్ట్ షురూ అయింది. కేవలం ఇద్దరు మహిళలకు శిక్షణ ఇచ్చి, అందంగా స్పెషల్ డిజైన్లతో బిందీ డిజైన్లు రూపొందాయి. దీనికి తగ్గట్టు మార్కెటింగ్ చేసుకున్నారు. తొలుత వీటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పర్యావరణహితమైన, రీసైకిల్ చేయబడిన వ్యర్థాలతో అందమైన బొట్టు బిళ్లలను తయారు కావడంతో సెలబ్రిటీలను సైతం విపరీతంగా ఆకర్షించాయి. ఇవి కేవలం ఒక సాధనంగా కాకుండా, ఫ్యాషన్ స్టేట్మెంట్గా మారిపోయాయి. రెండున్నరేళ్లలో 1500 కస్టమర్లు వచ్చారు. సోషల్ మీడియాలో వాట్సాప్, ఇన్‌స్టా ద్వారా ఆర్డర్లు తీసుకుంటారు. ఇలా 2024 ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల ఆదాయం వచ్చింది. ఇది 2025లో రూ. 20 లక్షలకు చేరిందంటే దీని ఆదరణను అర్థం చేసుకోవచ్చు. ఫెస్టివ్, లెదర్, వస్త్రంతో పూర్తిగా చేత్తో తయారవుతాయి. రంగు రాళ్లు, ఇత్తడి ముక్కలు, పూసలు ఇలా రక రకాలుగా తయారయ్యే ఒక్కో బొట్టు బిళ్లా ఒక్కో డిజైనర్ ఆభరణంలా ఉంటుంది. సామాన్యులతో పాటు,ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్, కరీనా కపూర్, కరిష్మా, తమన్నా, సోనం కపూర్ తదితర బాలీవుడ్ హీరోయిన్లను కూడా ఆకర్షిస్తున్నాయి. -
గ్లోబల్ వేదికగా హైదరాబాదీ ఫ్యాషన్
సాక్షి, సిటీబ్యూరో: గ్లోబల్ ఇండియా కోచర్ వీక్‌లో భాగంగా నగరానికి చెందిన ప్రముఖ డిజైనర్ హరీష్ అక్కిసెట్టి ప్రదర్శించిన సరికొత్త కలెక్షన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇండియన్ బ్రైడల్, కోచర్ ఫ్యాషన్‌లో ప్రసిద్ధి చెందిన హైదరాబాదీ హరీష్ కలెక్షన్ జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో విస్తరించింది. ఈ సందర్భంగా డిజైనర్ హరీష్ అక్కిసెట్టి మాట్లాడుతూ.. టైమ్స్ ఫ్యాషన్ వీక్, ఇండియా ఫ్యాషన్ వీక్ లండన్ వరుసలో ప్రస్తుత గ్లోబల్ ఇండియా కోచర్ వీక్ కూడా హైదరాబాద్ డిజైనింగ్ వైభవాన్ని గ్లోబల్ వేదికగా ప్రదర్శించే అవకాశం కలిగిందని అన్నారు. వెడ్డింగ్ ట్రౌస్సో లైన్‌తో ఈ కలెక్షన్‌ను విడుదల చేసినట్లు పేర్కొన్నారు. ఫ్యాషన్ షోలో వాకింగ్ చేస్తూ, బ్యాక్‌స్టేజ్ మేనేజ్మెంట్లో పనిచేస్తున్న డిజైనర్లతో ప్రయాణం చేసి నగరంలో వినూత్న డిజైనింగ్ స్టైలింగ్ అందించడం కోసం లేబుల్ ప్రారంభించానని హరీష్ వివరించారు. మ్యూజియం జ్యువెలరీ కలెక్షన్ఈ నెల 18 వరకూ అందుబాటులో ప్రదర్శన సాక్షి, సిటీబ్యూరో: దక్షిణ భారతదేశపు తొలి లగ్జరీ జ్యువెలరీ మ్యూజియం కలెక్షన్ ప్రదర్శన జూబ్లీహిల్స్‌లో ఏర్పాటైంది. నగరానికి చెందిన వేగ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో శుక్రవారం ప్రారంభించిన ఈ ప్రదర్శన అక్టోబర్ 18 వరకూ అందుబాటులో ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఈ ప్రత్యేక ప్రదర్శన ప్రారంభ కార్యక్రమంలో మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠం డీమ్డ్ టు బీ యూనివర్సిటీకి చెందిన డా.సీహెచ్.ప్రీతిరెడ్డి, ఫిక్కీ ఎఫ్ ఎల్ ఓ చైర్పర్సన్ ప్రతిభా కుందా, ప్రముఖ నటి తేజస్వి మదివాడ, మాల్వి మల్హోత్రా, ప్రాంతికా దాస్ తదితర నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
ఇయర్ చెయిన్స్: ప్రాచీన అలంకరణే ట్రెండీ స్టైలిష్‌గా
రమణుల ఆభరణాల అలంకరణలో చెవుల నుంచి హెయిర్ వరకులేయర్లుగా చెయిన్ ఉండటం ఫ్యాషన్ మాత్రమే కాదు మన సంస్కృతి, సౌందర్యం, ఆచారం కూడా. దక్షిణ భారతదేశంలో చెంపసరాలు, మాటీలుగా పేరున్న ఈ ఇయర్ చెయిన్స్ బాలీవుడ్ నుంచి టాలీవుడ్ సెలబ్రిటీల వరకు ఇప్పుడు స్పెషల్ అట్రాక్షన్‌గా మారాయి. ఇటీవల దుర్గా నవరాత్రుల్లో సెలబ్రిటీలు ధరించిన మాటీల అందం నవతరపు చూపులను ఇట్టే కట్టిపడేసింది.ప్రాచీన ఆభరణంగా, అలంకరణలో సంపూర్ణతకు చిహ్నంగా నిలిచే మాటీలు వివాహ వేడుకలలో వధువు సింగారంలో తప్పనిసరై వెలుగొందుతోంది.పండగల రోజులలో ధరించిన డ్రెస్సుల తగిన ట్రెండీ మోడల్స్ కూడా ఇప్పుడు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. బంగారం, డైమండ్స్లోనే కాదు వివిధ రకాల పూసలు, సిల్వర్, ఆక్సిడైజ్లలోనూ ఈ మాటీల అందం మనసు దోచేస్తుంది. సాంప్రదాయ ఆభరణాలకు మోడర్న్ మెరుపులు జోడించడమే ఈ ఇయర్ చెయిన్స్. ఒకప్పుడు దేవతల విగ్రహాల్లో, అమ్మమ్మల చెవులకు కనిపించిన చెంప సరాలు ఇప్పుడు రన్ వే వేదికలపై అడుగులు వేసే మోడల్స్ చెవుల్లో, మ్యాజిక్ ఫెస్టివల్ లుక్స్‌లో, బ్రైడల్ ఫొటోషూట్లలో కొత్త శైలిలో మెరిసి΄ోతున్నాయి. దక్షిణ భారతీయ సంప్రదాయాల్లో చెంప సరాలు (ఇయర్ చెయిన్)ఒక ముఖ్యమైన అలంకారం. నాటి కాలంలో మహిళల గౌరవం, ఆభరణ సంపూర్ణతకు చిహ్నంగా వెలుగొందిన చెంప సరాలు రాబోయే వేడుకలలో మరిన్ని ఆకర్షణలను జోడించనున్నాయి.అద్దుకున్న ఆధునికతఈ రోజుల్లో ఆ చెంప సరాలు కొత్త రూపాల్లో కనిపిస్తున్నాయి. సిల్వర్, ఆక్సిడైజ్డ్, మెరూన్ కలర్ పూసలు, ముత్యాల చెయిన్లు, ఫ్యూషన్ ఫ్యాషన్‌లో కూడా ఇయర్ చెయిన్స్ స్పెషల్ లుక్ ఇస్తున్నాయి. సాదాసీదా కుర్తా మీదకైనా, లెహంగా లేదా చీర ధరించినా ఆభరణాల అలంకరణలో ఇయర్ చెయిన్ అందం జత చేరితే ఆ అందం ఇనుమడిస్తుంది.శక్తి సరాలు..ఇది కేవలం అలంకారం కాదు. చెవులు–జుట్టు ప్రదేశంలో ఈ సరాలు కదలడం మన ప్రాణశక్తిని సమతుల్యం చేస్తుందని చెబుతారు. అందుకే కొంతమంది దీనిని ‘శక్తి సరాలు’గా భావిస్తారు.సెలబ్రిటీల స్టైల్ టచ్బాహుబలి సినిమాలో అనుష్క ధరించిన చెవి జూకాలు, చెంప సరాలు ఎంతో మందిని ఆకట్టుకున్నాయి. అలాగే, ఇటీవల దుర్గా నవరాత్రుల్లో బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెలబ్రిటీలైన అలియా భట్, జాన్వికపూర్, సోనమ్‌కపూర్, శోభిత ధూళిపాల, నయనతార... లాంటి నటీమణులు తమ ట్రెడిషనల్ ఫొటోషూట్లలో ఇయర్ చెయి ధరించి ట్రెండ్ సెట్ చేశారు. ఆ లుక్స్ వల్లే ఈ పాత ఆభరణం మళ్లీ యంగ్ జనరేషన్లో పాపులర్ అయింది. పాత ఆభరణానికి కొత్త రూపం దక్కింది. ఇప్పుడు వాటి డిజైన్ , మెటీరియల్, వాడుక అన్నీ ఫ్యాషన్ ప్రపంచంలో కొత్త భాషను పరిచయం చేస్తున్నాయి. ఇప్పుడు కొంతమంది కళాకారులు రీసైకిల్ మెటల్, హ్యాండ్ మేడ్ ఫ్యాబ్రిక్ థ్రెడ్స్తోనూ వీటిని రూపొందిస్తున్నారు. అమ్మమ్మల నాటి సంప్రదాయ నెమలి, మామిడిపిందెల నుంచి ప్రారంభమైన చెంప సరాల డిజైన్లు ఈ రోజుల్లో ఇయర్ కఫ్స్ వరకు వినూత్నంగా కళ్లకు కడుతున్నాయి. (చదవండి: భారత్ పిలిచింది..! కష్టం అంటే కామ్ అయిపోమని కాదు..) -
యువ డిజైనర్లతో ఫ్యాషన్ బ్రాండ్స్ భేటీ
హైదరాబాద్ నగరంలో డిజైనింగ్ కోర్సు అభ్యసిస్తున్న విద్యార్థులను పలు ఫ్యాషన్ బ్రాండ్స్ ప్రతినిధులు బుధవారం కలిశారు. నగరానికి చెందిన ప్రముఖ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్ హామ్స్ టెక్ ఆధ్వర్యంలో నాగార్జునహిల్స్‌లో నిర్వహించిన కెరీర్ కనెక్ట్ కార్యక్రమానికి హాజరైన వందలాది విద్యార్థులకు దేశవ్యాప్తంగా పేరొందిన పలు ఫ్యాషన్ బ్రాండ్స్‌కు చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. డిజైనర్లలో సృజనాత్మక శక్తిని, ఇప్పటి వరకూ చేసిన వర్క్స్‌ను బేరీజు వేసుకుని వారికి అవకాశాలు అందించనున్నట్లు తెలిపారు. ఈ విధానంలో ఇప్పటికే పలువురు విద్యార్థులు అరవింద్ ఫ్యాషన్స్, షాపర్స్ స్టాప్, లేబొల్ ది స్టోరీ, సింఘానియా, ఐశారావు, మై పర్ఫెక్ట్ ఫిట్ తదితర బ్రాండ్లతో కలిసి పనిచేసేందుకు ఎంపికయ్యారని వివరించారు.పట్నంలో.. గ్రామీణభారత్ మహోత్సవంచేనేత కార్మికులు, హస్తకళ కళాకారులు, ఇతర మహిళా సంఘాలు సృష్టించిన చేనేత–హస్తకళా ఉత్పత్తులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా వినియోగదారులకు అందించడమే లక్ష్యంగా అమీర్‌పేట్‌లోని కమ్మ సంఘం వేదికగా ఏర్పాటు చేసిన ‘గ్రామీణ భారత్ మహోత్సవం’ బుధవారం ప్రారంభమైంది. నాబార్డ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ గ్రామీణ భారత్ మహోత్సవాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన ప్రారంభించారు. 15వ తేదీ వరకు కొనసాగనున్న ఈ ప్రదర్శనలో దాదాపు 21 రాష్ట్రాలకు చెందిన 53 స్టాల్స్‌లో చేనేత, హస్తకళాకారులు తమ ఉత్పత్తులు ప్రదర్శిస్తున్నారు. ఇందులో మన రాష్ట్రం నుంచి 14 స్టాల్స్ ఉన్నాయి. (చదవండి: అంతరిక్ష వేదికపై హైదరాబాద్..!) -
సెంటర్‌స్టోన్ డైమండ్‌రింగ్, లగ్జరీ గౌనులో ఇషా అంబానీ : ధర ఎంతో తెలుసా?
యువ వ్యాపారవత్త, అంబానీ వారసురాలు ఇషా అంబానీ తన ఫ్రెండ్ పెళ్లిలో స్టైలిష్ దుస్తుల్లో అందరి దృష్టిని ఆకర్షించింది. అలెశాండ్రో మిచెల్ డెబ్యూ వాలెంటినో కలెక్షన్‌కు చెందిన డిజైనర్ వేర్లో తళుక్కుమంది. ఆత్మవిశ్వాసం, హుందాతనంతో కూడిన అద్భుతమైన అందంతో తన తల్లి నీతా అంబానీలాగానే లగ్జరీ అండ్ ఫ్యాషన్ స్టైల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది ఇషా అంబానీ.క్రీమ్ కలర్, పాస్టెల్ గ్రీన్ కలర్లో, అల్లికలు ,లేయర్డ్ రఫ్ఫ్లే ఎంబ్రాయిడరీ, క్లాసిక్ లగ్జరీగా రూపొందించిన ఈ గౌను ఇషా సహజ సౌందర్యాన్ని హైలైట్ చేశాయి. ఇంకా అద్భుతమైన పూల ఆకారపు డైమండ్ చెవిపోగులు, అందమైన బంగారు బ్రాస్లెట్ , అద్భుతమై సెంటర్ స్టోన్‌తో డైమండ్ రింగ్ ధరించి అందరి దృష్టిని ఆకర్షించింది.(పారిస్ ఫ్యాషన్ వీక్ : ఐశ్వర్యా డాజ్లింగ్ లుక్ వెనుకున్న సీక్రెట్ ఇదే!)ఫ్యాషన్ ఐకాన్ ఇషా అంబానీ తన సన్నిహితులతో వేడుకలకు హాజరైంది. దీని ధర దాదాపు రూ. 5 లక్షలు. అంబానీ ఫ్యామిలీ ఇన్‌స్టా పేజ్ ఇషా అంబానీ ఫోటోలను షేర్ చేసింది. ఈ వెడ్డింగ్‌లో ఆమె లుక్ మోడ్రన్ ఫ్యాషన్ అభిరుచిని ఆమె గ్లోబల్ స్టైల్‌ని సూచిస్తుందంటూ ఫ్యాన్స్ పొగిడేశారు. ఇటాలియన్ లగ్జరీ హౌస్ క్రియేటివ్ కలెక్షన్స్ సంచలనానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు. వాలెంటినో కలెక్షన్ ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది.మరోవైపు ఇషా అంబానీకి వాలెంటినో కలెక్షన్ అంటే చాలా ప్రేమ. ఈ లగ్జరీ బ్రాండ్‌తో ఆమెకు ప్రత్యేక అనుబంధం ఉంది. తన పెళ్లి రిసెప్షన్ వేడుకలో వాలెంటినో లెహంగానే ధరించింది. ఈ ఫ్యాషన్ హౌస్ రూపొందించిన మొదటి లెహంగా ధరించడం, అనేక సందర్భాల్లో ఈ కలెక్షన్ దుస్తులకే ఆమె ప్రాధాన్యత. చదవండి: స్కూలు ప్రిన్సిపాల్ ఇంగ్లీషుకి బ్యాంకు అధికారులే ‘బౌన్స్’.. మీరూ చూడండి! కాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్-నీతా అంబానీల ఏకైక కుమార్తె ఇషా అంబానీ. ప్రస్తుతం రిలయన్స్‌రీటైల్ బాధ్యతల్లో విజయ పథంలో దూసుకుపోతోంది. 2018లో డిసెంబర్లో ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకుంది ఇషా. ఈ జంటకు ఆదియా శక్తి, కృష్ణ కవల పిల్లలున్నారు. -
10 కేజీల బంగారంతో డ్రెస్..! ఎక్కడంటే..
బంగారం రేటు ఏ రేంజ్లో ఉందో తెలిసిందే. కొనాలంటే.. గుండెల్లో గుబులు తెప్పించేలా ధర పలుకుతోంది. సామాన్యుడు సైతం బెంబేలేత్తెలా ఉంది. అలాంటిది అక్కడ ఏకంగా స్వచ్ఛమైన బంగారంతో దుస్తులు రూపొందించారట. పైగా దాని ధర వింటే కచ్చితంగా నోరెళ్లబెడతారు. మరి ఆ కథకమామీషు ఏంటో చకచక చదివేయండి మరి...సౌదీ అరేబియాకు చెందిన ప్రముఖ ఆభరణాల సంస్థ అల్ రోమైజాన్ గోల్డ్ అండ్ జ్యువెలరీ కంపెనీ ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బంగారు దుస్తులను రూపొందించి సరి కొత్త చరిత్ర సృష్టించింది. 'దుబాయ్ డ్రెస్' పేరుతో రూపొందించిన ఈ gold dress గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కింది. పూర్తిగా 21 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంతో తయారు చేశారు. దీని మొత్తం బరువు 10.0812 కిలోగ్రాములు కాగా, మార్కెట్ విలువ సుమారు రూ. 11 కోట్లు పైనే ఉంటుందని అంచనా. కేవలం బంగారం ధర కారణంగానే కాకుండా కళాత్మకంగా రూపొందించిన విధానం కూడా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అల్ రోమైజాన్ గోల్డ్ జ్యువెలరీ కంపెనీ ఈ డ్రెస్‌ని బంగారు కిరీటం(398 గ్రాములు), నెక్లెస్ (8,810.60 గ్రాములు,) చెవిపోగులు (134.1 గ్రాములు), తల అలంకరణ (738.5 గ్రాములు) బంగారంతో భాగాలుగా రూపొందించింది. ఆ తర్వాత ఈ భాగాలను మొత్తం కలిపి దుస్తుల రూపంలో ప్రత్యేకంగా ధరించేలా డిజైన్ చేసింది. ఇందులో కేవలం బంగారమే కాకుండా రంగురంగుల విలువైన రత్నాలను కూడా ఉపయోగించింది జ్యువెలరీ కంపెనీ. క్లిష్టమైన ఈ డిజైన్ని అత్యంత నాజుగ్గానూ, ఎమిరేట్స్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించింది. ఇందులోని ప్రతి నమునా చరిత్రకు అర్థంబట్టేలా తీర్చిదిద్దారు నిర్వాహకులు. ఈ డ్రెస్ ఆధునికత, చరిత్ర తోపాటు సృజనాత్మకతను ప్రతిబింబిస్తోంది. ఈ దుస్తుల డిజైన్ ప్రధాన ఉద్ధేశ్యం బంగారం, ఆభరణాల వ్యాపారానికి ప్రపంచ గమ్యస్థానంగా ఉన్న దుబాయ్‌ను మరింతగా బలపరచడమేనని సదరు జ్యువెలరీ నిర్వాహకులు చెబుతున్నారు. ఈ దుస్తులు షార్జాలో జరుగుతున్న 56వ వాచ్ అండ్ జ్యువెలరీ మిడిల్ ఈస్ట్ షోలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్లో 500కిపైగా ప్రదర్శకులు పాల్గొంటారు. అందులో ఇటలీ, భారతదేశం, టర్కి, అమెరికా, రష్యా, యునైటెడ్ కింగ్డమ్, జపాన్, చైనా, సింగపూర్, హాంకాంగ్, మలేషియా దేశాల జ్యువెలరీ డిజైన్లర్లు , తయారీదారులు పాల్గొంటారు. కాగా, ఈ షోలో తొలిసారిగా ఆస్ట్రేలియా, మయన్మార్, పాకిస్తాన్ దేశాల డిజైనర్లు, తయారీదార్లు కూడా పాల్గొనడం విశేషం.(చదవండి: అందరికీ ఒకటే రక్తం!) -
ఫెస్టివ్ ఫీవర్ : విక్రయాల జోరు
సాక్షి, సిటీబ్యూరో: పండుగ సీజన్ విక్రయాల్లో గృహోపకరణాలు, పురుషుల దుస్తులు, పాదరక్షలు ముందు వరుసలో ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఫ్యాషన్‌కే ఎక్కువ డిమాండ్ ఏర్పడిన విషయాన్ని ప్రముఖ ఆన్లైన్ విపణి ఫ్లిప్‌కార్ట్ షాప్సీ అధ్యయనం వెల్లడించింది. గృహావసర వస్తువులకు డిమాండ్ 108% పెరిగిందనీ, పురుషుల సాధారణ దుస్తులు, పాదరక్షల విక్రయాలు 95% పెరిగాయనీ తెలిపింది. మహిళల కుర్తా, ప్యాంట్ సెట్లు, ఇయర్‌బడ్స్, పురుషుల అనలాగ్ గడియారాలు అత్యధికంగా అమ్ముడైన ఉత్పత్తులుగా నిలిచాయని తేల్చింది.(చదివింది 12 th.. సంపాదన నెలకు రూ. 3 లక్షలకు పైనే) జెన్ జెడ్‌గా పేర్కొంటున్న నవ యువ తరం ప్రధానంగా గ్రూమింగ్, ఫ్యాషన్, దుస్తులపై దృష్టి పెట్టగా, మిలీనియల్స్ (నేటి తరం) గృహ అవసరాలు, ఫ్యాషన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం 60% అమ్మకాలకు దోహదపడిందని, మొత్తం ఆర్డర్లలో 57%తో మహిళా కొనుగోలుదారులు టాప్‌లో నిలిచారని వెల్లడించింది. చదవండి: దుర్గాపూజలో భక్తిపారవశ్యం, నటీమణులు ఎమోషనల్, వీడియో వైరల్ -
నవదుర్గకు ప్రతీకగా నీతా అంబానీ : 9 రంగుల్లో బనారసీ లెహంగా చోళీ
రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్పర్సన్ నీతా అంబానీ మరోసారి తన ఫ్యాషన్ శైలితో ఆకట్టుకున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజస్థానీ టై-డై టెక్నిక్ సాంప్రదాయ దుస్తులలో అమ్మ వారి ఆరాధనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. నీతా అంబానీ చిత్రాలను సోషల్ మీడియాలో సందడిగామారాయి.దుర్గాదేవి తొమ్మిది రూపాలను సూచించే బహుళ వర్ణ బనారసి పింక్ లెహంగా చోళిలో అత్యంత సుందరంగా కనిపించారు. దీనిపై వివిధ రకాల బట్టలతో ప్యాచ్‌వర్క్, క్లిష్టమైన జరీ వర్క్, సంక్లిష్టమైన హ్యాండ్ ఎంబ్రాయిడరీతో రూపొందించిన ఈ లెహంగాలో భారీ లేస్‌వర్క్ స్పెషల్ ఎట్రాక్షన్ అని చెప్పవచ్చు. ఈ స్కర్ట్‌కు మ్యాచింగ్‌గా ప్యాచ్‌వర్క్ , బంగారు జరీ వర్క్‌తో పింక్ బ్లౌజ్‌ను ఆమె ఎంచుకున్నారు. గులాబీ , నారింజ రంగు లెహెరియా ప్రింట్ దుపట్టాతో నీతా అంబానీ లుక్మరింత ఎలివేట్ అయింది. మల్టీ లేయర్డ్ డైమండ్స్, ఆకుపచ్చ పచ్చ నెక్లెస్‌తో పాటు స్టేట్మెంట్ చెవిపోగులు, మాంగ్ టికా, రంగురంగుల గాజులు, హెవీరింగ్ను ధరించారు. ఈ కాస్ట్యూమ్స్‌ను ఢిల్లీకి చెందిన ఫ్యాషన్ బ్రాండ్ JADE మోనికా అండ్ రిష్మా రూపొందించారు. నీతా అంబానీ లుక్కు సంబంధించిన వివరాలను షేర్ చేశారు. గుజరాత్ ఆత్మ నుండి ప్రేరణతో పవిత్రమైన మూలాంశాలు ,శక్తివంతమైన కచ్చి వస్త్రాలతో కూడిన దైవిక నేపథ్యంలో నీతా అంబానీ లుక్ సజీవంగా కనిపిస్తుందని పేర్కొన్నారు. (Weight Loss వెయిట్ లాస్లో ఇవే మెయిన్ సీక్రెట్స్)అంతేకాదు అంబానీ మేకప్ ఆర్టిస్ట్ మిక్కీ కాంట్రాక్టర్ కొన్ని ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఐలైనర్, కోల్-ఐడ్, మస్కారా-కోటెడ్ లాషెస్, బ్లష్డ్ బుగ్గలు, రేడియంట్ హైలైటర్, న్యూడ్ లిప్‌స్టిక్‌తోపాటు, మిడిల్-పార్టెడ్ బన్ హెయిర్‌స్టైల్ , నుదిటిపై ఎర్రటి బొట్టు తదితర వివరాలను అందించారు. (సేవకు మారు పేరు, ఐఏఎస్ ఆఫీసర్ బీలా వెంకటేశన్ ఇకలేరు)నెటిజన్ల స్పందనసోషల్ మీడియా వినియోగదారులు ఆమె సొగసైన స్టైలింగ్‌ను ప్రశంసించారు. నవరాత్రి క్వీన్‌కు అవార్డు నీతా అంబానీ జీకి దక్కుతుంది. ఎలిగెంట్ రాయల్, చాలా అందంగా ఉన్నారంటూ కొనియాడటం విశేషం. -
'వోగ్స్ ఫోర్సెస్ ఆఫ్ ఫ్యాషన్ 2025'లో మెరిసిన కృతి శెట్టి (ఫొటోలు)
-
మిలన్ ఫ్యాషన్‌వీక్ : రొటీన్‌గా కాకుండా బోల్డ్ లుక్‌లో మెరిసిన ఆలియా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ డెమ్నా లేటెస్ట్ కలెక్షన్ లాంచింగ్ వినూత్నంగా కనిపించింది. తన సాధారణ స్టైల్‌కి భిన్నంగా మిలాన్ ఫ్యాషన్‌వీక్ 2025(Milan FashionWeek)లో అందరి దృష్టినీ అలరించింది. గూచీ గ్లోబల్ బ్రాండ్ అంబాసిడర్ (Gucci global brand ambassador) ఆలియా ఫర్ కోట్లో హాట్ లుక్స్‌లో అదరగొట్టింది.ఇటాలియన్ లగ్జరీ ఫ్యాషన్ హౌస్ గూచీ క్రియేటివ్ డైరెక్టర్ డెమ్నాతొలి కలెక్షన్‌ను ప్రదర్శించిన సినిమాటిక్ దృశ్యం ది టైగర్ ప్రత్యేక చలనచిత్ర ప్రదర్శనకు హాజరైంది. బోల్డ్ దుస్తులను పాయింటెడ్-టో బ్లాక్ హీల్స్,టాప్ హ్యాండిల్ , చైన్ స్ట్రాప్‌తో కూడిన చిన్న, స్ట్రక్చర్డ్ బ్లాక్ లెదర్ హ్యాండ్‌బ్యాగ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by GUCCI (@gucci) ఆస్కార్ అవార్డు గెలుచుకున్న చిత్రనిర్మాత స్పైక్ జోన్జ్ , మేటి దర్శకురాలు హలీనా రీజ్న్ దర్శకత్వం వహించిన ఆకర్షణీయమైన లఘు చిత్రం ‘ది టైగర్’ ప్రీమియర్ ద్వారా గూచీ సినిమా , హై ఫ్యాషన్‌పై తన నిబద్దతను చాటుకుంది. ఈ ప్రీమియర్‌లో ఆలియా గూచి లా ఫామిగ్లియా లెక్షన్ను ఆవిష్కరించింది.ఈ సందర్భంగా నెక్లైన్తో కూడిన మినీ డ్రెస్‌కి ఫాక్స్ ఫర్ కోట్ లుక్ మరింత అందాన్నిచ్చింది. స్టేట్మెంట్ GG చెవిపోగులు , గూచీ వెదురు బ్యాగ్ మరో స్పెషల్ ఎట్రాక్షన్. View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) ఈ సందర్భంగా డిసెంబర్ 25, 2025న విడుదల కానున్న తన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆల్ఫా’ గురించి అలియా ఒక అప్డేట్ను అందించింది. విడుదల గురించి నటి తన ఉత్సాహాన్ని వ్యక్తం చేసింది. అయితే, ఇది నా తొలి యాక్షన్ వెంచర్,ప్రేక్షకులు దానితో ఎలా కనెక్ట్ అవుతారో అని ఆసక్తిగా ఉన్నానని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యపై అభిమానులు భిన్నంగా స్పందించారు.ఆలియా ఇప్పటికే జిగ్రా ,హార్ట్ ఆఫ్ స్టోన్లో యాక్షన్ సన్నివేశాల్లో నటించిందిగా అని కొంతమంది నెటిజన్లు ప్రతిస్పందించారు. -
అమ్మ చీర చుట్టేసి..ఫ్యాన్స్‌ను కట్టిపడేసి : జాన్వీ అమేజింగ్ లుక్
ముంబైలో జరిగిన హోమ్‌బౌండ్ స్పెషల్ స్క్రీనింగ్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor) చాలా ప్రత్యేకంగా కనిపించింది. తన తల్లి, దివంగత లెజెండరీ నటి శ్రీదేవి చీరలో అందరి దృష్టిని ఆకర్షించింది తన రాబోయే చిత్రం హోమ్‌బౌండ్ ప్రత్యేక షోలో ఒకపుడు శ్రీదేవి ధరించిన నేవీ (రాయల్ బ్లూ ) బ్లూ చీర, జాకెట్టులో తళుక్కున మెరిసింది. బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ ,విరాట్ కోహ్లీ వివాహ రిసెప్షన్లో శ్రీదేవి ఈ చీరను ధరించారు. అదే చీరలో అద్భుతమైన తన లుక్‌తో జాన్వీ అభిమానులను ఆశ్చర్యపరిచింది.బంగారు ఎంబ్రాయిడరీతో రూపుదిద్దుకున్న ఈ నేవీ బ్లూ చీరకు బ్లాక్ వెల్వెట్ బ్లౌజ్‌తో జత చేయగా, స్టేట్మెంట్ చెవిపోగులు, చోకర్-స్టైల్ నెక్లెస్ , సొగసైన బన్‌తో లుక్‌ను పూర్తి చేసింది. నీరజ్ ఘయ్వాన్ దర్శకత్వం వహించిన హోమ్‌బౌండ్ 2026 ఆస్కార్‌లో ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో భారతదేశం నుంచి అధికారిక ఎంట్రీ అని ప్రకటించిన తర్వాత ఈ ప్రీమియర్ షోకు మరింత ప్రాధాన్యత ఒనగూడింది.ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (FFI) ఈ చిత్రాన్ని 98వ అకాడమీ అవార్డులలో ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్రంగా దేశ పోటీదారుగా ప్రకటించింది. ఈ చిత్రం గతంలో 2025 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్, టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ (TIFF) మరియు ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్బోర్న్ (IFFM)లలో ప్రదర్శించబడింది. ఇది సెప్టెంబర్ 26న భారతదేశంలో థియేటర్లలో విడుదల కానుంది. View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
అదిరే ఫ్యాషన్ లుక్ : దాండియా ధడక్
నవరాత్రులలో దాండియా ఆటలు గర్భా నృత్యాలు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని ఇచ్చేలా ఉంటాయి. ఈ ఆటపాటలలో పాల్గొనే వారు మరింత సౌకర్యంగా ఉండేలా చూపరులకు కనువిందు చేసేలా... ప్రత్యేక డ్రెస్సులూ ఉంటాయి. ముదురు రంగులు, అద్దాల మెరుపులు, ఎంబ్రాయిడరీ చేసిన లెహంగాలు, ధోతీ ప్యాంట్స్‌కి ఆధునికపు హంగుల అమరిక ఈ రోజుల్లో ముచ్చట గొలుపుతుంటాయి. నవరాత్రి గర్భా, దాండియా రాత్రుల కోసం ట్రెండీ దుస్తుల ఆలోచనలు నవతరాన్ని మిక్స్ అండ్ మ్యాచ్ వైపుగా నడిపిస్తున్నాయి. ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌తో అలంకరించిన రంగురంగుల చనియా చోళి దుస్తులను స్టైల్ చేయడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి.ధోతీ ప్యాంటుతో క్రాప్ టాప్ మిర్రర్,ఎంబ్రాయిడరీ చేసిన క్రాప్ టాప్, ధోతీ ప్యాంటు కలయిక కంఫర్ట్ స్టైల్‌తో ఆకట్టుకుంటుంది. దాండియా ఆడటానికి అనుకూలంగా ఉండే ఈ డ్రెస్ కాన్ఫిడెన్స్నూ ఇస్తుంది. ఫ్యాషన్ లుక్ కోసం ధోతీ ప్యాంటును కొత్త క్రాప్ టాప్‌తో తిరిగి వాడచ్చు.లెహెంగా అసెమెట్రికల్ కుర్తీఅసెమెట్రికల్ కుర్తీలు వేడుకలకు సరైన ఎంపికగా నిలుస్తున్నాయి. ఫ్లేర్డ్ లెహెంగాతో జత చేస్తే చూపుతిప్పుకోలేరు. ఒక డైనమిక్ ఎలిమెంట్‌ను జోడిస్తుంది. పండుగ సీజన్లో స్పెషల్ లుక్ కోరుకునేవారికిది బెస్ట్ ఆప్షన్. ప్యాంటుతో సైడ్ స్లిట్ కుర్తీసంప్రదాయ దుస్తులకు ఆధునిక టచ్‌ను ఇష్టపడే వారికి సైడ్ స్లిట్ కుర్తీ సరైన ఎంపిక. ఇది ప్లెయిన్, ఎంబ్రాయిడరీ లేదా బ్రోకేడ్ బోర్డర్లతో డిజైన్ చేసిన ప్యాంటుతో, లెహెంగా కాంబినేషన్‌గా ధరించవచ్చు.లెహెంగాతో మిర్రర్ డెనిమ్ షర్ట్ఇండో–వెస్ట్రన్ లుక్ కోసం లెహెంగాతో డెనిమ్ షర్ట్‌ను జత చేయచ్చు. ఈ ఇండో–వెస్ట్రన్ లుక్ వివిధ రకాల ప్రయోగాలు చేయడానికి ఇష్టపడే వారికి సరైనది. క్లాసిక్ లెహెంగా, క్యాజువల్ డెనిమ్ షర్ట్ మరింత కంఫర్ట్‌గా ఉంటుంది, ఇది నవరాత్రుల్లో ప్రత్యేకంగా చూపుతుంది. సొంతంగా క్రియేషన్ పెద్ద పెద్ద జూకాలు, గాజులు, లేయర్డ్ నెక్లెస్‌లు.. జర్మన్ సిల్వర్ జ్యువెలరీని ఎంచుకోవచ్చు నృత్యం చేసే సమయం కాబట్టి వాటర్ ప్రూఫ్ మేకప్‌ను ఎంచుకుంటే లుక్ ఫ్రెష్‌గా ఉంటుంది. పెద్ద పెద్ద బిందీలు నవరాత్రి రోజులలో ప్రత్యేకంగా కనిపిస్తాయి. పొడవాటి జడలు, వివిధ మోడల్స్‌లో ఉన్న ముడులు, వదులుగా ఉండే హెయిర్ స్టైల్స్ బాగుంటాయి. బోహో– ఫ్యూజన్ కాంబినేషన్లో డెనిమ్ డ్రెస్‌లు పగటి పూట కూడా ఈ రోజుల్లో క్యాజువల్‌గా ధరించవచ్చు. సంవత్సరాలుగా లెహంగాలు, ఘాగ్రాలు నవరాత్రి దుస్తులుగా ఉన్నాయి కాబట్టి స్కర్టులు, కుర్తీల నుండి లేయర్డ్ ఇండో–వెస్ట్రన్ గౌన్ల వరకు ఈ రోజుల్లో ప్రయత్నించవచ్చు. ∙రంగురంగుల టాసెల్స్, రాజస్థానీ ఎంబ్రాయిడరీ ప్యాచ్‌లు, మిర్రర్ వర్క్ ఉపయోగించి పండగ థీమ్‌ను క్రియేట్ చేయవచ్చు. నవరాత్రి స్పెషల్ డ్రెస్సులు దాదాపు రూ.1500/– నుంచి మార్కెట్లో లభిస్తున్నాయి. లేదంటే ఇంట్లోనే డిజైనరీ క్రాప్ టాప్, బ్లౌజ్ లేదా చిన్న కుర్తీతో జత చేయబడిన డెనిమ్ బాటమ్స్ ధరిస్తే డ్యాన్స్ చేసేవారికి తాజా, ఉల్లాసభరితమైన వైబ్‌ను జోడిస్తాయి. పండుగ అలంకరణ కోసం దుప్పట్టా లేదా బాందిని స్టోల్ లేదా టై–డై ప్రింట్లతో స్టైల్ చేయచ్చు. నవరాత్రి ఫ్యాషన్ అనేది వ్యక్తిగత వ్యక్తీకరణతో సంప్రదాయాన్ని కళ్లకు కట్టవచ్చు. వాటిని మార్కెట్లో కొనుగోలు చేసినా, సొంతంగా తమదైన స్టైల్‌ను క్రియేట్ చేసినా, బోహో–ఫ్యూజన్ డ్రెస్సులు డ్యాన్స్ ఫ్లోర్‌పై హంగామా చేస్తాయి. ఈ పండుగ సీజన్లో సాధారణంగా కాకుండా తమదైన సొంత సృజనాత్మకతను సరికొత్తగా పరిచయం చేయచ్చు.చదవండి: పెళ్లి చేసుకోవాలని అమెరికానుంచి వస్తే.. ఊపిరే తీసేశారు! -
సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా..ప్రధాని మోదీ డ్రెస్సింగ్ స్టైల్
ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టిన రోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. అంతేగాదు ఆ పార్టీ శ్రేణులు తమ ప్రియతమ నేత పుట్టినరోజుని ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు కూడా. ఈ సందర్భంగా ఆయన మధ్యప్రదేశ్‌లోని థార్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రజలతో కాసేపు ముచ్చటించారు. అక్కడ మోదీ వేదికపైకి రాగానే ఆ రాష్ట్ర సాంస్కృతికి అద్దం పట్టే గులాబీ రంగు తలపాగా(పగ్డి), జాకెట్‌ను బహుకరించారు. ఆ పగ్డిపై(తలపాగ) క్లిష్టమైన బంగారం, ముత్యాలతో ఎంబ్రాయిడరీ చేయడగా, బంజారా సమాజం శక్తిమంతమైన చేతి పనికి నిదర్శనం జాకెట్‌పై లంబానీ ఎంబ్రాయిడరీ ఉంది. వీటితోపాటు ధార్ జిల్లాకు చెందిన ప్రసిద్ధ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ వస్త్రం పై సహజరంగులతో కూడిన రేఖాగణిత నమునాలు ఉన్న స్కార్ఫ్‌ను కూడా మోదీకి బహుకరించారు. ఇది ఆయన 75వ పుట్టినరోజు అయినప్పటికీ తన సిగ్నేచర్ శైలికే ప్రాధాన్యత ఇచ్చారు. అయితే ప్రజలు ఇచ్చిన అభిమాన బహుమతులు, దుస్తుల కారణంగా మోదీ డ్రెస్సింగ్ స్టైల్ సాంస్కృతిక వారసత్వానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. ముఖ్యంగా ఆ కానుకలతో మోదీ లుక్‌లో మధ్యప్రదేశ్ సాంస్కృతిక వారసత్వం కొట్టొచ్చినట్లు కనిపించింది. ఆయన ఈ పుట్టినరోజుని పీఎం మిత్ర పార్కుకి పునాది రాయి వేయడం, అనేక అభివృద్ధి ప్రాజెక్టులు, సంక్షేమ ఆరోగ్య పథకాల ప్రారంభంతో జరుపుకోవడం విశేషం. ఇక ఆ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ..స్వావలంబన చర్య తీసుకోవాలనే పిలుపునిస్తూ ప్రసంగించారు. "ఇది పండుగల సమయం. మన స్వదేశీ ఉత్పత్తుల మంత్రాన్ని పునరావృతం చేస్తూ ఉండాలి. 140 మంది కోట్ల భారతీయులు ఏది కొనుగోలు చేసినా..అది మేడ్ ఇన్ ఇండియాగానే ఉండాలని అభ్యర్థిస్తున్నా. వికసిత్ భారత్‌కు మార్గం వేసి, ఆత్మనిర్బర్ భారత్‌గా ముందుకు సాగాలన్నారు. ఎప్పుడైతే మనం మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులనే కొనుగోలు చేస్తామో, అప్పుడూ డబ్బు మన దేశంలోనే ఉంటుంది, పైగా ఆ డబ్బుని అభివృద్ధి ప్రాజెక్టులకు ఉపయోగించవచ్చని అన్నారు. అలాగే మహేశ్వరి చీరలు, పీఎం మిత్రా పార్క్ ప్రాముఖ్యత గురించి కూడా ఆయన మాట్లాడారు. ఇక్కడ పట్టు, పత్తి లభ్యత, నాణ్యత తనిఖీలు, సులభమైన మార్కెట్ యాక్సెస్ వంటివి నిర్ధారిస్తారని అన్నారు. దాంతోపాటు స్పిన్నింగ్, డిజైనింగ్, ప్రాసెసింగ్, ఎగుమతి అన్నీ ఒకే చోట జరుగుతాయని చెప్పారు. అదీగాక ఈ చీరలు, వస్త్రాలు ప్రపంచవ్యాప్తంగా తమ ముద్ర వేస్తూ, దేవి అహల్యాబాయి హోల్కర్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లి..మన మాతృభూమిని ప్రపంచ మార్కెట్లో ప్రకాశవంతంగా మెరిసేలా చేయగలుగుతామని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. .(చదవండి: ప్రపంచంలోనే తొలి ఏఐ కేబినేట్ మంత్రి..! ఎందుకోసం అంటే..) -
ఫిష్ ఫ్యాషన్..!
చేపలను తలచుకోగానే చాలామందికి నోరూరే వంటకాలు గుర్తు రావడం సహజమే! కాని, ఇకపై న్యూ ఫ్యాషన్ గుర్తొస్తుంది. అదెలా అనుకుంటున్నారా? త్వరలోనే చేపల చర్మంతో తయారైన అలంకరణ వస్తువులు, ఫ్యాషన్ సామగ్రి అందుబాటులోకి రానున్నాయి!అమెరికాలోని ‘కోస్టా డి పజారోస్’ అనే గ్రామానికి చేపల వేట ప్రధాన జీవనాధారం. ఈ గ్రామం పసిఫిక్ మహాసముద్ర తీరంలో ఉంది. ఈ గ్రామస్థులు చేపల వేటకు అనుసరించే ‘బాటమ్ ట్రాలింగ్’ పద్ధతి కారణంగా వీరిపై ఆంక్షలు మొదలయ్యాయి. బాటమ్ ట్రాలింగ్ అంటే పడవ అడుగుభాగంలో ఒక బరువైన వలను కట్టి, అన్ని రకాల చేపలను, సముద్ర జీవులను బయటికి లాగేస్తారు. ఈ పద్ధతి వల్ల సముద్ర ఆవాసాలు తీవ్రంగా దెబ్బతిని, సముద్ర జలాల్లోని జీవవైవిధ్యం నాశనం అవుతోంది. అందుకే ‘బాటమ్ ట్రాలింగ్’పై ఆంక్షలు పెరిగాయి. దీంతో ఆ గ్రామస్థులు ప్రత్యామ్నాయ ఆర్థిక కార్యకలాపాలను అన్వేషించడం మొదలుపెట్టారు. అందులో భాగమే ఈ ఫిష్ ఫ్యాషన్!చేపల చర్మాన్ని ఉపయోగించి వినూత్న ఫ్యాషన్ ఉత్పత్తులను తయారు చేయడం మొదలుపెట్టారు. ఈ గ్రామస్థులు. చేపల చర్మాన్ని శుభ్రం చేసి, ఆకర్షణీయమైన తోలుగా మార్చి, దానితో చెవి పోగులు, నెక్లెస్‌లు, బ్యాగులు వంటి చాలా రకాల వస్తువులను తయారు చేస్తున్నారు. ఇది సరికొత్త ఫ్యాషన్‌గానే కాదు, స్థానికులకు జీవనోపాధిగా కూడా మారిపోయింది. ‘పీల్ మెరీనా’ అనే సహకార సంస్థ, స్థానిక మహిళలతో కలిసి చేపల చర్మాన్ని పలు ఉత్పత్తులుగా మారుస్తుంది. చేపల వేట ప్రధాన వృత్తిగా ఉన్న ఈ గ్రామస్థులు చేపల చర్మాన్ని పారవేయకుండా ఉపయోగించుకోవడం పర్యావరణానికి కూడా మేలు చేస్తోందంటున్నారు నిపుణులు. చేపల చర్మాన్ని తోలుగా మార్చే ప్రక్రియలో అనేక దశలుంటాయి. మొదట చేప చర్మాన్ని చేతులతో సున్నితంగా రుద్ది పొలుసులు, చర్మానికి అతుక్కున్న మాంసాన్ని తొలగిస్తారు. ఆ తరువాత, బట్టలు ఉతికినట్లు సబ్బుతో బాగా ఆ చర్మాన్ని కడుగుతారు. అనంతరం, గ్లిజరిన్, ఆల్కహాల్, సహజ రంగులను ఉపయోగించి ఆ చర్మానికి రంగులద్దుతారు. ఈ ప్రక్రియకు నాలుగు రోజులు పడుతుంది. ఆ తర్వాత మరో నాలుగు రోజుల పాటు ఆ చర్మాన్ని ఎండలో ఆరబెడతారు. ఈ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత, చేప చర్మం మృదువుగా, బలమైన తోలులా మారుతుంది. అలాగే వాటికి చేపల వాసన పూర్తిగా పోతుంది.ఇలా తయారు చేసిన చేపతోలుతో తయారు చేసిన వాటిలో బటర్‌ఫ్లై ఆకారంలో ఉండే చెవిపోగుల జత ధర సుమారు ఏడు డాలర్లు పలుకుతోందంటే, ఈ ఫిష్ ఫ్యాషన్ గిరాకీ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. చేప తోలుతో తయారు చేసిన ఈ ఉత్పత్తులను ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా విక్రయిస్తున్నారు. అంతేకాకుండా, పంటారెనాస్లోని చిన్న తరహా వస్త్ర ఉత్పత్తిదారులకు కూడా ఈ తోలును అందిస్తున్నారు. భవిష్యత్తులో బ్యాగులు, పర్సులు, షూలను కూడా తయారుచేయాలని వీరు లక్ష్యంగా పెట్టుకున్నారు.చేపల చర్మాన్ని తోలుగా మార్చే ఈ సంప్రదాయం కొత్తది కాదు. అలాస్కా నుంచి స్కాండినేవియా, ఆసియా వరకు అనేక స్థానిక మత్స్యకార తెగలు వేల సంవత్సరాలుగా ఈ పద్ధతిని పాటిస్తున్నాయి. ఆన్లైన్లో కూడా ఈ ఉత్పత్తుల అమ్మకం సాగుతోంది. కోస్టా రికా కూడా ఇప్పుడు ఈ పద్ధతిని అనుసరించి, పర్యావరణ పరిరక్షణ ఉత్పత్తులను తయారుచేయడంలో ముందు వరుసలో నిలుస్తోంది. దీంతో అక్కడి మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రాన్ని అందించడమే కాకుండా, వారి సృజనాత్మకతకు ఒక వేదిక దొరికింది. ఇంటి పనుల నుంచి బయటపడి, చక్కటి ఉపాధిని పొందుతున్న ఈ మహిళలు, తమ ఉత్పత్తులను అంతర్జాతీయ స్థాయిలో చూడాలని ఆశిస్తున్నారు. ఇది పర్యావరణ పరిరక్షణకు కూడా చక్కని మార్గం. -
మారుమూల గ్రామం నుంచి అంతర్జాతీయ స్థాయికి..!
కలలకు ఆకాశమే హద్దు అనడానికి ఉదాహరణ డిజైనర్ సౌరభ్ పాండే. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఒక చిన్న గ్రామంలో పుట్టిన అతని పేరు ఈరోజు ప్రపంచ ఫ్యాషన్ వేదికలపై వినిపిస్తోంది. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన ఈ యువకుడు, తన కలలకోసం కష్టపడుతూ, పట్టుదలతో ఫ్యాషన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఓ ప్రత్యేకతను చూపుతున్నాడు.స్కూల్ కెళ్లే సమయంలోనే సౌరభ్‌కి డ్రాయింగ్, డిజైన్స్ పై ప్రత్యేక ఆసక్తి. పాత బట్టలను కొత్తగా కట్ చేసి, రంగులు కలిపి, తన గ్రామంలోనే చిన్న చిన్న డిజైన్స్ చేస్తూ, ‘ఫ్యాషనః అంటే ఏంటి?’ అనే ప్రశ్నకు తన స్టైల్లో సమాధానం చెప్పేవాడు.సవాళ్లే అవకాశాలకు మార్గంఉన్న ఆ చిన్న ఊళ్లో అవకాశాలు లేవు. ఫ్యాషన్ కోర్సులు, స్టడీ మెటీరియల్, ఫ్యాబ్రిక్ అందనంత దూరంలో ఉన్నాయి. అయినా అతని కృషి ఆగలేదు. నీరసపడలేదు. పేపర్‌పైన స్కెచ్‌లు వేసి, సోషల్ మీడియాలో తన టాలెంట్‌ను ప్రదర్శించాడు. అదే అతనికి పెద్ద అవకాశాలు తెచ్పిపెట్టింది.అంతర్జాతీయ బ్రాండ్ల దృష్టిసౌరభ్ పనిని గమనించిన ప్రతిభావంతులు అతన్ని మొదట స్థానిక ఈవెంట్లలో ΄ాల్గొనమని ఆహ్వానించారు. అటు నుంచి 17 ఏళ్ళ వయసులో అతన్ని ముంబై వైపుగా నడిపించింది. ఆ మహా నగరంలో మనుగడ కష్టమే. ఒక చిన్న ఇల్లు లాంటి గదిలో తల్లిదండ్రులు, తోబుట్టువులతో కలిసి ఉండేవాడు. ఇల్లు గడవడం కోసం ఒక మాల్లో 12 గంటలు షిఫ్టులో పనిచేస్తూ, రాత్రిళ్లు ఫ్యాషన్ డిజైన్లు గీస్తూ వాటిని సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. అతను తన పరిస్థితుల కంటే పెద్ద లక్ష్యాన్ని చాలా ఏకాగ్రతతో నడిపించాడు. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా సౌరభ్ పనిని గమనించినప్పుడు అతని జీవితం గొప్ప మలుపు తిప్పింది. ఒక అవకాశం మరికొన్ని మార్గాలను చూపించింది. అక్కడి నుంచి అతని డిజైన్లు గూచీ, డియోర్, ప్రాడా వంటి ప్రపంచ లగ్జరీ బ్రాండ్ల దృష్టికి వచ్చాయి. ఇప్పుడు అతను ఈ ఫ్యాషన్ హౌస్‌లతో కలసి ప్రత్యేక కలెక్షన్లు రూపొందిస్తున్నాడు.స్టైల్ ప్రత్యేకతభారతీయ సంప్రదాయ బట్టల టెక్స్చర్స్కి ఆధునిక డిజైన్ల కలయిక, నేచురల్ కలర్స్, ఎకో–ఫ్రెండ్లీ ఫాబ్రిక్‌ల వాడకం, సింపుల్ కట్లు, గ్లోబల్ లుక్ .. ఈ ప్రత్యేకతలు అతన్ని అందరిలో ముందుంచుతున్నాయి. ఫ్యాషన్ వేదికల మీద అతని డిజైన్స్ ప్రదర్శించేంతగా వెళ్లింది. సోషల్ మీడియాలో అతని విచిత్రమైన వీడియోలకు ఎగతాళి చేసిన జనమే, ఆ తర్వాత అవే వీడియోలకు కనెక్ట్ అవ్వడం ప్రారంభించారు. తిరస్కరణ, ఎగతాళి నుండి ఇప్పుడు అతను కోట్లు సంపాదించేంతగా ఎదిగాడు. తన కథను తానే తిరగ రాసుకున్నాడు. అతన్ని సక్సెస్ గురించి అడిగితే ‘ఎవ్వరు ఏమనుకున్నా నేను నాలా ఉండటమే నాకు ఇష్టం. అదే నా నిజమైన ఫ్యాషన్ స్టేట్మెంట్’ అంటాడు. మారుమూల గ్రామాల యువతకు సౌరభ్ ఒక స్ఫూర్తి. ‘కల అంటే పెద్దది కావాలి. మన దగ్గర వనరులు లేకపోయినా, కష్టపడితే ప్రపంచమే మన దారికి రావచ్చు’ అని అతను చెప్పే సందేశం ప్రతి యువకుడిలో కొత్త ఆశను నింపుతోంది. (చదవండి: 'కంగ్రాట్యులేటరీ మనీ ఆన్ డెలివరీ' గురించి విన్నారా..?) -
ఇండో వెస్ట్రన్ అంటే ఇష్టం: అనుపమ పరమేశ్వరన్
‘ఫ్యాషన్ అంటే మనల్సి మనం అందంగా తీర్చిదిద్దుకోవడం.. సౌందర్యంగా కనిపిస్తూనే సౌకర్యంగా ఉండటం మరింత బ్యూటిఫుల్ అనిపిస్తుంది. ఈ మధ్యనే సరికొత్త కథాంశంతో విడుదలైన ‘పరదా’ సినిమాలో మగువల భావోద్వేగాలను, సామాజిక పరిస్థితులను తెరకెక్కించాం. ఇది ప్రభావవంతమైన కథాంశం, నటన పరంగానూ అందరి ప్రశంసలు పొందింది.’ అంటూ చెప్పుకొచ్చారు అందాల తార అనుపమ పరమేశ్వరన్. నగరంలోని బంజారాహిల్స్ వేదికగా స్వదేశీ ఫ్యాషన్ బ్రాండ్ ‘బిబా’ ఫ్లాగ్ప్ స్టోర్‌లో సోమవారం సందడి చేశారు. ఈ వేదికపై నూతనంగా రూపొందించిన ఫెస్టివ్ కలెక్షన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అనుపమ ‘సాక్షి’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఫ్యాషన్ ట్రెండ్స్, తదుపరి సినిమాల విశేషాలు ఆమె మాటల్లోనే..! హైదరాబాద్‌లో ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతున్న ఫ్యాషన్ హంగులను చూస్తే సంతోషంగా అనిపిస్తుంది. వ్యక్తిగతంగా ఇండో వెస్ట్రన్ ఫ్యాషన్ వేర్ అంటే నాకు చాలా ఇష్టం. ఇదే నా స్టైల్ స్టేట్మెంట్. ముఖ్యంగా కాటన్, స్మూత్కాటన్ ఇష్టపడతాను. గ్రాండ్ లుకింగ్ కన్నా కంఫర్ట్ ముఖ్యం. మన మూలాల్లోని ఫ్యాబ్రిక్, సంస్కృతి–అధునాతన డిజైనింగ్ సమ్మిళిలితం చేస్తే ఎక్కువగా ఆకర్షిస్తుంది. వాటిని ప్రోత్సహిండం ఇష్టం. బ్రీతబుల్ ఫ్యాబ్రిక్ అమ్మాయిలకు అనువుగా ఉంటుంది. సందర్భాన్ని బట్టి శారీస్, ఈవెంట్స్‌ను బట్టి డ్రెస్ వేసుకుంటా. మహిళల ఫ్యాషన్ వేర్ అంతర్గత శక్తిని, మానసిక స్థితిని తెలియజేస్తుందని నమ్ముతాను. నాకు రెడ్ కలర్, మస్టర్డ్ యెల్లో రంగుల దుస్తులే నచ్చుతాయి. రెడ్ అంటే పవర్ఫుల్.. నేను ఎక్కువ షాపింగ్ చేయను. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వెళ్లినప్పుడు కచి్చతంగా షాపింగ్ చేస్తుంటాను. సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి షూటింగ్స్ వెళ్లినప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో, సందడి లేని ఇతర షాపింగ్ ప్రదేశాల్లో కొనుగోలు చేస్తాను. ‘డిఫరెంట్ బై డిజైన్’ అనే ఫిలాసఫీని ప్రతిబింబించేలా బిబా అందిస్తున్న దసరా కలెక్షన్ మన సాంస్కృతిక మూలాలను గుర్తుచేస్తుంది. వరుస షూటింగ్స్‌తో బిజీ.. సినిమాల పరంగా తెలుగు ప్రేక్షకులు నన్ను ఆదరిస్తున్న తీరు చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. హైదరాబాద్ వాతావరణంలో సరికొత్త అనుభూతిని పొందుతాను. ఈ మధ్యే తెలుగులో నా ‘పరదా’ చిత్రం విడుదలైంది. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ కొనసాగుతోంది. మరికొద్ది రోజుల్లో ‘కిష్కిందపురి’ సినిమా విడుదల కానుంది. కిష్కిందపురి తరువాత ‘బైసన్’ కూడా విడుదలకు సిద్ధమౌతోంది. ఈ రెంటితో పాటు ‘భోగీ’ అనే చిత్రంలో నటిస్తున్నాను. ఇది షూటింగ్ పూర్తి కానుంది. మరో తెలుగు సినిమాలోనూ నటిస్తున్నాను. ఇవి కాకుండా మలయాళంలో మరో రెండు సినిమాలు చేస్తున్నా. -
ఒక్కటి తగ్గినా.. పర్ఫెక్ట్గా కుదరదు
ఒక్క చూపుతోనే అందరి చూపునూ తనవైపు తిప్పుకొనే మ్యాజిక్ నిధి అగర్వాల్‌ది. ట్రెండ్స్ వెంట పరుగెట్టకుండా, సింపుల్ స్టయిలింగ్తోనే గ్లామర్‌ని క్రియేట్ చేస్తుంది. స్టయిలింగ్‌లో కొత్తదనాన్ని, కాన్ఫిడెన్స్‌ను మిక్స్ చేసే నిధి స్టయిల్ సీక్రెట్ మీకోసం. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్: నితికా గుజ్రాల్, ధర: రూ. 2,18,500, జ్యూలరీ: బ్రాండ్ ముసలద్దీన్ జెమ్స్ అండ్ జ్యూలర్స్, ఆభరణాల డిజైన్, నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.ఔట్ఫిట్ చాయిస్లో ఎప్పుడూ కంఫర్ట్, స్టయిల్ రెండూ ఉండేలా చూసుకుంటాను. ఏ ఒక్కటి తగ్గినా స్టయిలింగ్ పర్ఫెక్ట్గా కుదరదు. డ్రెస్‌కు సరిపోయే మేకప్ తప్పనిసరి. ఎక్కువగా మినిమల్ మేకప్, జ్యూలరీనే ప్రిఫర్ చేస్తానని చెబుతోంది నిధి అగర్వాల్.నుదుటిన మెరిసే మ్యాజిక్!నుదుటి మధ్యలో వేలాడుతూ ఉండే ఈ మాంగ్ టిక్కా ఒక చిన్న ఆభరణం మాత్రమే కాదు, అమ్మాయిలకు క్వీన్ ఫీలింగ్ ఇచ్చే మాయాజాలం. పెళ్లి, సంగీత్, మెహందీ, పార్టీ– ఏ సందర్భమైనా సరే, పాపిట బిళ్ల వేసుకున్న వెంటనే మిగతా ఆభరణాలు అన్నీ బ్యాక్‌గ్రౌండ్‌లోకి వెళ్లిపోతాయి. చీర కట్టుకుంటే గోల్డ్ లేదా కుందన్స్ పాపిట బిళ్ల మెరుస్తూ రాయల్టీ టచ్ ఇస్తుంది.లెహంగా లేదా హాఫ్‌శారీ అయితే పర్ల్ లేదా స్టోన్ పాపిటి బిళ్లతో మెరిసిపోతూ ప్రిన్సెస్ లుక్ గ్యారంటీ! వెస్ట్రన్ గౌన్ వేసుకున్నారా? పాపిట బిళ్ల కూడా మినిమల్ స్టయిల్‌కి వచ్చి మీ లుక్‌ను మరింత స్టయిలిష్‌గా మార్చేస్తుంది. మధ్య పాపట ఉండే హెయిర్ స్టయిల్స్ ఎంచుకుంటే మంచిది. ఎందుకంటే, మధ్య భాగం జుట్టుతో పాపట బిళ్ల వేసుకుంటే ఫొటోలు సూపర్‌గా వస్తాయి, పెళ్లిపూల జడతో కలిపితే మాత్రం ఇక నువ్వే అసలైన మహారాణి! మార్కెట్లో ఎన్నో రూపాల్లో లభిస్తున్నాయి. గోల్డ్, వెండి, కుందన్ డిజైన్స్‌లోనూ. జ్యూలరీ షాపుల్లో లైట్ వెయిట్ మోడల్స్‌లోనూ ఉంటాయి, ఆన్లైన్లో అయితే కలర్‌ఫుల్ డిజైన్స్ ఒక్క క్లిక్‌తో ఇంటికి చేరిపోతాయి. (చదవండి: 'అద్భుత భవంతులు': వాస్తుకళా నైపుణ్యానికి సాంకేతిక జత చేసి..) -
బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా ఇదే..!
ఆరోగ్యకరమైన ఆహారమే నా మెరిసే చర్మానికి కారణం. పైగా నాది డ్రై స్కిన్ కావడంతో రోజూ చర్మాన్ని నెమ్మదిగా శుభ్రం చేసి, మాయిశ్చరైజ్ చేయడం తప్పనిసరి. రాత్రి మేకప్ తీసేయకుండా అసలు నిద్రపోను. సాదాసీదా దుస్తులను కూడా ప్రత్యేకంగా మార్చడమంటే చాలా ఇష్టం అని అంటోంది పూజా హెగ్డే.మేకప్ తక్కువ, ఆత్మవిశ్వాసం ఎక్కువ.. అదే పూజా హెగ్డే ఫ్యాషన్ ఫార్ములా! రెడ్‌కార్పెట్ మీద మెరిసే గౌనులోనైనా, బీచ్‌లో బ్రీజీ డ్రెస్‌లోనైనా, లేదా జిమ్ బయట ట్రాక్పాంట్లోనైనా ఆమె లుక్ ఎప్పుడూ ‘వావ్!’ అనిపించేస్తుంది. ఇదే ఆమె మ్యాజిక్, ఎప్పుడూ ఆన్‌లో ఉండే గ్లో!. ఇక్కడ ధరించి పూజా డ్రెస్ బ్రాండ్: అరబెల్లా, ధర:రూ. 3,250, జ్యూలరీ: బ్రాండ్ : డ్రిప్ ప్రాజెక్ట్, నెక్ పీస్ ధర: రూ. 7,999, బ్రాస్లెట్ ధర: రూ. 3,999జ్యులరీ ఏమీ లేవా? ఆందోళన పడొద్దు. మీ డ్రాయర్లో ఎక్కడో పడేసిన మగవాళ్ల లింక్డ్–అప్ చైన్‌ను బయటకు తీయండి. అదే ఈరోజు మీ స్టేట్మెంట్ పీస్. ఔను, ఇది చాలాకాలంగా మగవాళ్ల జ్యూలరీగా చెప్పుకుంటోంది. కానీ ఫ్యాషన్‌లో జెండర్ అంటే కేవలం లేబుల్ మాత్రమే. ఒక్కసారి ఈ సిల్వర్ లింక్డ్ చైన్ మెడపై వేసుకున్న వెంటనే, మీరు బాస్–లెవల్ వైబ్‌కి షిఫ్ట్ అవుతారు. పైగా ఈ చన్కి డాలర్ లేకపోవడం అంటే బోరింగ్ కాదు – అదే దీని అసలైన మినిమల్ ఆటిట్యూడ్. చేతికి సిల్వర్ స్ట్రాప్ వాచ్ లేదా బ్రేస్లెట్ వేసుకుంటే, లుక్‌కి ఫుల్ కాంప్లిమెంట్. ఆఫ్–షోల్డర్ టాప్స్, ఓవర్‌సైజ్ షర్ట్స్, లెదర్ జాకెట్స్ లేదా ప్లెయిన్ బ్లాక్ టీ షర్ట్ దాదాపు వెస్ట్రన్ దుస్తులన్నింటితో ఇది సూపర్‌గా సెట్ అవుతుంది. రూల్ మాత్రం క్లియర్. దీని పక్కన మరో నెక్లెస్ వేసుకోవద్దు. జుట్టు పోనీటెయిల్ వేసుకుంటే బాస్ లేడీ లుక్, లూజ్ వేవ్స్‌లో వదిలేస్తే క్యాజువల్ డే అండర్ కంట్రోల్ అనే ఫీలింగ్ ఇస్తుంది. మొత్తానికి, ఈ లింక్డ్ చైన్ సాదాసీదా చైన్ అనిపించొచ్చు, కాని, స్టయిల్ మాత్రం కాన్ఫిడెన్స్‌ను అమాంతం పెంచే ఆర్నమెంటల్ మేజిక్!.(చదవండి: తమిళ పాకానికి అమెరికా వణక్కం!) -
టైమ్‌లెస్ క్లాసిక్
నిరాడంబరతను చాటుకోవాలన్నా ... విలాసవంతంగా కనిపించాలన్నా క్లాసీ లుక్‌తో ఆకట్టుకోవాలన్నా... ఎలాగైనా... ఏ వయసు అయినా ప్రతి సందర్భానికి అతికినట్టుగా ఆహార్యాన్ని అద్భుతంగా చూపుతుంది ఐవరీ కలర్. ఇటీవల భారతీయ ఫ్యాషన్ రంగంలో పేస్టల్ కలర్స్ అగ్రస్థానంలో ఉండగా వాటిలో ఐవరీ ఎప్పుడూ ఒక విలక్షణమైన స్థానంలోనే ఉండి ప్రతి మదిలోనూ రాయల్ లుక్‌గా కొలువుదీరుతోంది.ఐవరీకి లేస్ అల్లికలు తోడైతే విరిసిన కలువ పూల అందం గుర్తుకు వస్తుంది. ప్రింట్లు తోడైతే ఆధునిక హస్తకళల అద్భుతం కళ్లముందు నిలుస్తుంది. వెల్వెట్, కాటన్‌లోనే కాదు కంచిపట్టులోనూ ఐవరీ కలర్ రిచ్‌నెస్‌ను కళ్లకు కడుతుంది. ఐవరీ కాటన్ డ్రెస్‌కి లేయర్లు జత కలిసిన ఫ్రాక్ లేదా లెహంగా డిజైన్స్ ఎప్పటికీ ట్రెండ్‌లో ఉంటాయి.రాయల్ లుక్ తో అట్రాక్ట్ చేయడమే ఐవరీ సహజ లక్షణం. అందుకే, వివాహ వేడుకలలో ఐవరీ కలర్ డ్రెస్సులు ఆహూతుల మదిలో చెరిగి΄ోని ముద్రను వేస్తాయి. రన్ వే నుంచి రెడ్ కార్పెట్ సందడి వరకు, వివాహాల నుంచి పండగ కార్యక్రమాల వరకు, సామాన్యుల నుంచి సెలిబ్రిటీల వరకు ఐవరీని అందంగా ధరించడం చూస్తుంటాం. లేత రంగుతో ఉండే ఈ ఔట్‌ఫిట్స్‌ను ఏ సందర్భంలోనైనా ధరించవచ్చు. అయితే, ఈ రంగుపై ఏదీ అతిగా ఉండకూడదు. అది హెవీ ఎంబ్రాయిడరీ లేదా డిజిటల్ ప్రింట్లు, లేయర్లు, ఇతర ఫ్యాబ్రిక్స్.. కాంట్రాస్ట్ అయినా సరే...స్టైలిష్ గౌన్లు, ఇండో వెస్ట్రన్ గౌన్లు, లెహెంగాలు, చీరలు, అనార్కలీలు.. ఏ డ్రెస్ అయినా ఐవరీ కలర్ చాలా అందంగా కనిపిస్తుంది.క్లాసిక్ ఐవరీలో విభిన్నమైన షేడ్స్ ఉంటాయి. స్కిన్‌టోన్ ఆధారంగా తగిన షేడ్‌ను ఎంచుకోవడం ముఖ్యం. సరైన షేడ్తోపాటు ఐవరీ షేడెడ్ దుస్తులలో సరైన స్టైల్‌ను ప్రదర్శించడం కూడా ముఖ్యం. ఆధునికతనూ, చక్కదనాన్ని తెలియజేసే సామర్థ్యం ఐవరీకి ఉండటం వల్ల ఫ్యాషన్‌లో ట్రెండింగ్ రంగుగా కొనసాగుతోంది. ప్రస్తుత ట్రెండ్లలో మోనోక్రోమ్ దుస్తులు, టైలర్డ్ ట్రౌజర్లు, సిల్క్ సెపరేట్లు, రిఫైన్డ్ ఔటర్వేర్, రకరకాల థీమ్‌లతో సహా వివిధ రూపాల్లో ఐవరీ ఉంది.ఐవరీని ఎలా ధరించాలంటే...వైడ్–లెగ్ ఐవరీ ప్యాంటు, రిబ్డ్ టర్టిల్ నెక్‌తో ట్రెంచ్ కోట్ వంటి ఐవరీ పీసెస్ జత చేయడం ద్వారా మోడర్న్ రూపాన్ని సృష్టించవచ్చు.రిచ్ లుక్ కోసం లేస్–ట్రిమ్డ్ స్లిప్ స్కర్ట్‌తో జత చేసిన ఐవరీ సిల్క్టాప్తో డ్రెస్‌ను ఎలివేట్ చేయచ్చు.జీన్స్లేదా ట్రౌజర్లకు ఐవరీ టాప్స్‌ను ధరించవచ్చు. క్లాసిక్, చిక్ లుక్ కోసం బ్లాక్ ΄్లాట్స్ని ధరించవచ్చు. ఫార్మల్, ఈవెనింగ్ వేర్‌గా ఐవరీ–రంగు గౌన్లు, అనార్కలీ సూట్లను ఎంచుకోవచ్చు.వెడ్డింగ్ కలర్వధూవరుల దుస్తులకు ఐవరీ సరైన ఎంపికగా ఎప్పుడూ ముందుంటుంది. వధువు లెహంగా లేదా చీర, వరుడి ధోతి– కుర్తా ... వంటి దుస్తులు వివాహ వేడుకలో వారి బంధంలోని స్వచ్ఛతను సూచిస్తుంది. -
సీనియర్ సిటిజెమ్స్..! అరవైలోనూ ఇరవైని తలపించేలా
కొంత మంది యువకులు పుట్టుకతో వృద్ధులు అన్నారు మహా కవి శ్రీశ్రీ.. దీనికి భిన్నంగా ఈ వృద్ధులు ఎప్పటికీ యువకులే.. అన్నట్లు కొందరు నగరవాసులు వయసును లెక్కజేయకుండా అన్నింటా మేము సైతం అన్నట్లు నేటి యువతకు చాలెంజ్ విసురుతున్నారు. అరవైల్లోనూ ఇరవైని తలపించే రీతిలో విభిన్న పోటీల్లో భాగస్వాములవుతూ ఉత్సాహంగా ఆటల నుంచి అందాల పోటీల వరకూ పాలుపంచుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు కదులుతూ ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అంటున్నారు నాటి తరం సీనియర్ సిటి‘జెమ్స్’. రిటైర్మెంట్ అనంతరం కృష్ణా.. రామా.. అంటూ మూలన కూర్చోక.. ఎంచక్కా టూర్లు, ట్రెక్కింగ్స్ అంటూ తమకు నచి్చన రంగంలో సమయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కొండాపూర్‌లో నివసించే బాబూ రాజేంద్రప్రసాద్ రెడ్డికి 70 ఏళ్లు.. అనితరసాధ్యమైన రీతిలో 12వేల అడుగుల ఎత్తుకు ట్రెక్కింగ్ చేశారు. 72 ఏళ్ల వయసులోనూ ఎన్ఎమ్డీసీ ఫుల్ మారథాన్ అంటే 42.2 కి.మీ పరుగును పూర్తిచేశారు మరో నగరవాసి నాగభూషణరావు. ఇంకా మరిన్ని మారథాన్లలో భాగస్వామ్యం అవుతానంటున్నారు. పోరాట కళల్లో రాణిస్తూ మార్షల్ ఆర్ట్స్‌లో గిన్నిస్ రికార్డ్ సాధించారు మరో నగరవాసి కిరణ్ ఉనియాల్ (53).. ఇలా వయసుతో ప్రమేయం లేని విజయాలతో ఓల్డేజ్ అనే పదానికి కొత్త అర్థాన్ని ఇస్తూ.. తమ రొటీన్ లైఫ్‌ని కొత్తగా మార్చేస్తున్నారు. అలాంటి సీనియర్ల హుషారు సరికొత్త యువ తరాన్ని ఆవిష్కరిస్తూ.. కొత్త కొత్త పోటీలకు ఊపునిస్తోంది. అప్పుడే అసలైన జీవితం.. రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతోంది అంటే ఊళ్లు తిరుగుతూ తీర్ధయాత్రలతోనో, ఒళ్లు నలగని పార్ట్ టైమ్ ఉద్యోగాలతోనో, మనవళ్లతోనో.. పార్కుల్లో స్నేహితులతో ముచ్చట్లతోనో కాలం వెళ్లదీసే రోజులు కావివి అంటున్నారు నేటి తరం సీనియర్ సిటిజన్స్. ఓ వైపు ఉద్యోగమో, వ్యాపారమో.. కెరీర్ ముగుస్తుండగానే.. మరోవైపు కొత్త లక్ష్యాలు పుట్టుకొస్తున్నాయి. ‘నిజం చెప్పాలంటే ఓ వ్యక్తిగా మనకేం కావాలి.. మనమేం చేయగలం.. అనే ఆలోచనలతో అప్పుడే అసలైన జీవితం మొదలవుతుంది’ అని చెబుతున్నారు నగరానికి చెందిన సాహిల్ గులాటి(65). టాలెంట్, ఆసక్తి ఉండాలేగానీ.. ఇటీవల ఖ్యాల్స్ (కేహెచ్వైఏఏఎల్స్) అనే ఏజ్టెక్ స్టార్టప్, ‘50 ఎబవ్’ అనే పేరుతో టాలెంట్ హంట్ పోటీలు ప్రారంభించింది. ఇది 50 ఏళ్లు పైబడిన వారికి ప్రత్యేకించింది. గానం, ఫొటోగ్రఫీ, వంటలో ప్రావీణ్యం, కవితలు రాయడం, నటన.. ఇలా అదీ ఇదీ అని లేకుండా దాదాపు అన్ని విభాగాలనూ కలుపుకుని ఏకంగా 50 విభాగాల్లో విజేతలను ఎంపిక చేస్తుండడం విశేషం. కళా ప్రతిభ, ట్రావెల్, లైఫ్‌స్టైల్ వంటి విభాగాల్లో సత్తా ప్రదర్శించే అవకాశం కలి్పస్తోంది.. దేశవ్యాప్తంగా నిర్వహించే ఈ పోటీ కోసం 20 నగరాల్లో ఆఫ్‌లైన్, ఆన్లైన్ ఆడిషన్స్ నిర్వహిస్తున్నారు. వయసు సంబంధిత స్టీరియో టైప్ పోటీలకు భిన్నంగా వయోజనుల్లో పోటీ తత్వాన్ని, ప్రతిభను ప్రోత్సహించడమే లక్ష్యంగా వీటిని నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఆత్మవిశ్వాసం ఉండాలేగానీ అందం వయసెరగదు అంటున్నారు మిస్టర్ అండ్ మిసెస్ సీనియర్ ఫ్యాషన్ పేజెంట్ ఇండియా నిర్వాహకులు రేఖా దేశాయ్. గత మే నెల్లో 55 ఏళ్లు దాటిన వారి కోసం ఓ పోటీని కొత్తగా ప్రారంభించారామె. స్వయంగా ఆరు పదుల వయసులో ఉన్న రేఖా దేశాయ్.. ‘కలలకు ఎక్స్పైరీ డేట్ లేదు. సీనియర్స్ కళ్లలో మెరుపులు చూడడమే నా కార్యక్రమ లక్ష్యం’ అంటున్నారు. వీరి సంస్థ నిర్వహించే పీచ్ ఈవెంట్స్ తమ మొదటి సీజన్ పూర్తి స్థాయిలో విజయవంతమైంది. ఆటలకు, పాటలకు సై..సీనియర్స్ కోసం నిర్వహించే ఆటల పోటీలకూ కొదవలేదు. ఈత, గోల్ఫ్ నడక వంటి వాటిలోనూ పోటీలు జరుగుతున్నాయి. అలాగే బోస్, కార్న్హోల్, క్రికెట్ వంటి ఆటలు కూడా అందుబాటులో ఉన్నాయి. అస్సోంకు చెందిన 70ఏళ్ల ఖిరాదా సైకియా కలిత దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో పోరాడుతూ గత జూన్‌లో ధర్మశాలలో జరిగిన నేషనల్ మాస్టర్స్ గేమ్స్‌లో నాలుగు బంగారు పతకాలు గెలుచుకోవడం ఎందరికో స్ఫూర్తిని అందించింది. అదే విధంగా 60 ఏళ్ల పైబడిన వారి కోసం నిర్వహించే మాస్టర్స్ స్విమ్మింగ్ చాంపియన్ షిప్స్, ఏవీటీ చాంపియన్ టూర్స్, పాన్ ఇండియా ఫెడరేషన్ కప్ వంటి ఆటల పోటీల్లోనూ నగరవాసులు చురుకుగా పాల్గొంటూ పతకాలు సాధిస్తున్నారు. ( చదవండి: -
అందానికే అందం స్నేహ..! ఆమె ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్..!
స్నేహ అంటే సంప్రదాయంలో పుట్టిన సౌందర్య కవిత లాంటిది. దాదాపు చాలావరకు పట్టుచీర, జడలో మల్లెలు, నుదుటిన బొట్టు అన్నీ కలిసి కనిపిస్తూ ఉండే ఆమె అందం ఎప్పుడూ పండుగ వాతావరణంలా మెరిసిపోతుంది. ఆ అందాన్ని కూడా స్నేహ ఒక్క చిరునవ్వుతోనే రెట్టింపు చే స్తుంది. ప్రతిసారీ కొత్తగా, ప్రత్యేకంగా కనిపించడం అంటే చాలా ఇష్టం. ప్రింటెడ్ కాంచీపురం నుంచి మోనోటోన్ బనారసీ, ఫ్లోరల్ నుంచి బ్రోకేడ్ వరకు, ఏ చీర అయినా సరే రంగులతో మ్యాజిక్ చేస్తాను. అందుకే, చీరలంటే చాలా ఇష్టం అని చెబుతోంది స్నేహ.ఆభరణాల పండుగ! పండుగ రోజు ఉదయం చీర కట్టుకుంటూ అద్దం ముందు నిలబడి ఏ ఆభరణం వేసుకోవాలి అనుకుంటే, అది తప్పకుండా ఫెస్టివల్ జ్యువెలరీ అయి ఉండాలి. బంగారం మెరుపులో రంగురంగుల రత్నాలు, ముత్యాల గుత్తులు, చెక్కిన సున్నితమైన ఆకృతులు – ఇవన్నీ కలిసినప్పుడు వచ్చే వైభవం పండుగ వాతావరణాన్ని రెట్టింపు చేస్తుంది. ఇది కేవలం అలంకారం మాత్రమే కాదు, ప్రతి పండుగను ఒక జ్ఞాపకంగా మార్చే మ్యాజిక్. ఆ ఆభరణాలను వేసుకున్నప్పుడల్లా మనం కేవలం ఆ రోజుకే కాదు, మన పూర్వీకుల సంప్రదాయానికి, వారసత్వానికి కూడా గౌరవం ఇస్తున్నట్లే అనిపిస్తుంది. లేత రంగుల కంచీపురం చీరలపై ఈ ఆభరణాలను వేసుకుంటే రత్నాల మెరుపు ఇంకా హైలైట్ అవుతుంది. జుట్టును పొడవైన జడగా వేసి మల్లెపూలు, కనీసం రెండు పొడవైన హారాలు జుంకీలు, వంకీలు – ఇలా లేయరింగ్ చేస్తే ఆకర్షణ వస్తుంది. మార్కెట్లో ప్రస్తుతం లభిస్తున్న డిజైన్లను చూస్తే, లక్ష్మీదేవి, గణేశ్ మోటిఫ్స్‌తో వచ్చే టెంపుల్ హారాలకు బాగా డిమాండ్ ఉంది.చీర బ్రాండ్: స్నేహాలయ సిల్క్స్, ధర: రూ. 25,000, జ్యూలరీ బ్రాండ్ : ఇతిహాస జ్యూలర్స్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. (చదవండి: డ్రెస్ స్టైల్‌నూ మార్చేయచ్చు..!) -
అనన్య పాండే హోస్ట్‌గా 'ది స్టైల్ ఎడిట్': నలుగురికే అవకాశం!
బాలీవుడ్ నటి అనన్య పాండే న్యూఢిల్లీలో నాలుగు గంటల ఫ్యాషన్ అండ్ గ్లో-అప్ సెషన్‌ను నిర్వహించనున్నారు. 'ది స్టైల్ ఎడిట్' పేరుతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమంలో.. సెలబ్రిటీ స్టైలిస్ట్ అమీ పటేల్, హెయిర్‌స్టైలిస్ట్ ఆంచల్ మోర్వానీ, మేకప్ ఆర్టిస్ట్ రిద్దిమా శర్మ, ఫోటోగ్రాఫర్ రాహుల్ ఝంగియాని వంటి ఆమె ప్రొఫెషనల్ బృందం ఉంటుంది. ఈ సెషన్ న్యూఢిల్లీలోని ఎయిర్‌బీఎన్‌బీ ప్రాపర్టీలో జరుగుతుంది. దీనికోసం బుకింగ్స్ 2025 ఆగస్టు 21 నుంచి ప్రారంభమయ్యాయి.ది స్టైల్ ఎడిట్ కార్యక్రమంలో పాల్గొనాలకునేవారు.. ఆగస్టు 21, 2025న airbnb.com/ananyaలో భారత కాలమానం ప్రకారం ఉదయం 11 గంటల తరువాత బుక్ చేసుకోవచ్చు. దీనికోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే ఈ సెషన్‌కు నలుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఇందులో పాల్గొనేవారే.. ఢిల్లీకి రావడానికి, తిరిగి వెళ్ళడానికి అయ్యే మొత్తం ఖర్చులను భరించుకోవాల్సి ఉంటుంది.నేను క్యూరేట్ చేసి హోస్ట్ చేసిన "అనన్యస్ స్టైల్ ఎడిట్" ద్వారా నా గ్లిట్జ్.. గ్లామర్ ప్రపంచంలోకి అతిథులను స్వాగతించడానికి నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. ఒక నటిగా నా వ్యక్తిత్వంలో ఫ్యాషన్, సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చాలా ముఖ్యమైనవి. ఇవన్నీ అతిథులతో పంచుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. దీని కోసం నేను వేచి ఉన్నాను, అని అనన్య పాండే అన్నారు.జెన్ జెడ్ కల్చర్ ఐకాన్‌ను అనన్య పాండేతో కలిసి పరిచయం చేయడానికి మేము సంతోషిస్తున్నాము. ప్రపంచంలోని అత్యంత ఆసక్తికరమైన వ్యక్తులు హోస్ట్ చేసిన అసాధారణ అనుభవాలను దీని ద్వారా అందిస్తున్నాము. దీనికి అనన్య స్టైల్ ఎడిట్ ఒక ఉదాహరణ. ఈ సెషన్లో పాల్గొనేవారు మరపురాని అనుభవాలను పొందవచ్చు అని ఇండియా అండ్ ఆగ్నేయాసియా ఎయిర్‌బీఎన్‌బీ హెడ్ అమన్‌ప్రీత్ బజాజ్ అన్నారు. -
డ్రెస్ స్టైల్‌నూ మార్చేయచ్చు..!
పెద్ద సైజులో బీడ్స్, స్టోన్స్ లేదా సిల్వర్, గోల్డ్, బ్రాస్ మెటల్‌తో తయారు చేసిన ఆకర్షణీయంగా కనిపించే స్టేట్మెంట్ జ్యువెలరీని ధరించడం ఈ రోజుల్లో మరింత ఫ్యాషనబుల్‌గా ఆకట్టుకుంటోంది. యువతరం సాధారణంగా లైట్, సన్నని జ్యువెలరీకి బదులు బోల్డ్ డిజైన్స్‌ని పెద్ద సైజులో ఎంపిక చేసుకుంటోంది. ట్రైబల్ జ్యువెలరీకి అతి దగ్గరగా ఉంటోన్న ఈ ఫ్యాషన్ ఆభరణాలు డ్రెస్ స్టైల్‌ను మార్చేసే ‘హైలైట్ యాక్ససరీస్’గా నిలుస్తున్నాయి. ఇయర్ హ్యాంగింగ్స్హూప్స్, జుమ్కీలు, డ్రాప్ ఇయర్ రింగ్స్, షెల్స్ లేదా జియోమెట్రిక్ షేప్స్.వన్ పీస్ డ్రెస్ లేదా సింపుల్ కుర్తీకి బాగా సెట్ అవుతాయి.నెక్లస్, గాజులుమొత్తం మెడ కవర్ చేసే హారాలు లేదా మొత్తం చేతిని కవర్ చేసే గాజులు లభిస్తున్నాయి. వీటిని మెటల్, బీడ్స్, ముత్యాలు, స్టోన్స్‌తో తయారు చేస్తారు. ప్లెయిన్ టాప్స్, చీరల మీదకు బాగా నప్పుతాయి. మెటల్, వుడ్, ఆర్ట్ వర్క్ ఉన్నవి. వెస్ట్రన్ – ట్రెడిషనల్ రెండింటికీ సెట్ అవుతాయి.క్యాజువల్ లుక్ డైలీ వేర్ / ఫ్రెండ్స్ అవుటింగ్షర్ట్ స్టైల్స్‌కి ఓవర్సైజ్డ్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ నెక్‌పీస్ + పెద్ద హూప్ ఇయర్ రింగ్స్. బోహో మ్యాక్సీ డ్రెస్ పైకి కలర్‌ఫుల్ బీడ్స్, షెల్ జ్యువెలరీ, బ్రాడ్ బ్యాంగిల్స్. కుర్తీ లెగ్గింగ్స్ పైకి ఆక్సిడైజ్డ్ జుమ్కీలు లేదా చెవులు మొత్తం కవర్ చేసే లాంగ్ ఇయరింగ్స్.ఆఫీస్ లేదా ఫార్మల్ లుక్ఆఫీస్ వేర్ పైకి సింపుల్ ఓవర్సైజ్డ్ రింగ్ + చిన్న హూప్స్ బాగుంటాయి. ఒకే రింగ్ పెద్దగా వేసుకుంటే చేతి మీదే ఫోకస్ ఉంటుంది. కాక్టెయిల్ రింగ్స్ ఇప్పుడు ట్రెండింగ్. బ్లేజర్, ట్రౌజర్స్ పైకి పెద్ద చెయిన్ లేదా మందపాటి నెక్ పీస్ సెట్ అవుతుంది. కాటన్ లేదా లినెన్ శారీస్ పైకి పొడవాటి ముత్యాల దండ, స్టడ్స్ లేదా ఆక్సిడైజ్డ్ లాంగ్ ఇయర్ రింగ్స్.పార్టీ ఈవెనింగ్ లుక్ బ్లాక్ డ్రెస్‌పైకి గోల్డెన్ చంకీ నెక్‌పీస్, పెద్ద స్టేట్మెంట్ రింగ్ బాగా నప్పుతుంది. గౌన్ పైకి షైనీ స్టోన్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ సరి΄ోతాయి. నెక్లెస్ అవసరం లేదు.కాక్టెయిల్ పార్టీమినిమలిస్టిక్ గౌన్‌కి ఓవర్సైజ్డ్ బ్రేస్లెట్ హైలెట్ అవుతుంది. సింపుల్ డ్రెస్‌కి హెవీ జ్యువెలరీ పర్ఫెక్ట్ లుక్. వెస్ట్రన్ అవుట్‌ఫిట్‌కి బోల్డ్ మెటల్, ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ బాగుంటుంది. శారీస్, లెహంగాస్కి స్టోన్స్, పెరల్స్, కుంకుమపువ్వు కలర్స్‌తో ఉన్నవి బాగా మెరిసి΄ోతాయి. ఆఫీస్ లుక్‌కి – చిన్న ఓవర్సైజ్డ్ రింగ్స్ లేదా లైట్ కలర్ హూప్స్. పార్టీ లుక్‌కి – షైనీ, గ్లిట్టర్, బోల్డ్ నెక్పీసులు అందంగా ఉంటాయి. సంప్రదాయ వేడుకలైన పండగలు /పెళ్లిళ్లకు పట్టు చీరల మీదకు ఓవర్సైజ్డ్ కుందన్ లేదా టెంపుల్ జ్యువెలరీ నెక్లెస్, హ్యాంగింగ్స్ బాగుంటాయి. లెహంగా మీదకు నెక్లెస్ లేకుండా హెవీగా ఉండే చాంద్‌బాల్ ఇయర్ రింగ్స్ సెట అవుతాయి. అనార్కలీ లేదా కుర్తీస్ మీదకు లేయర్డ్ పెరల్ నెక్లెస్, చేతికి పెద్ద కఫ్స్ అందంగా కనిపిస్తాయి.మోడర్న్ ఫ్యూజన్ లుక్క్రాప్ టాప్, స్కర్ట్ మీదకు ఓవర్సైజ్డ్ నెక్లెస్, లాంగ్ ఫెదర్ ఇయర్ రింగ్స్ అందంగా ఉంటాయి. ఇండోవెస్ట్రన్ ఔట్‌ఫిట్స్‌కి ఆక్సిడైజ్జ్ సిల్వర్ ఓవర్సైజ్డ్ ఇయర్ రింగ్స్ బాగుంటాయి. ప్లెయిన్ జంప్‌సూట్ మీదకు బోల్డ్ జియోమెట్రిక్ నెక్లెస్ చుంకీ బ్రేస్లెట్ బాగా నప్పుతుంది.ప్రకృతి నుంచి స్ఫూర్తిజీన్స్, కుర్తీస్ కి పెర్ఫెక్ట్ లుక్ ఆక్సిడైజ్డ్ సిల్వర్ జ్యువెలరీ అయితే బోహో లుక్ కోసం కలర్‌ఫుల్ బీడెడ్ హారాలు బాగుంటాయి. ఈవెనింగ్ పార్టీ లుక్స్ కోసం యంగ్ జనరేషనల్‌లో బాగా పాపులర్‌గా ఉన్నది లేయర్డ్ నెక్‌పీస్, ప్రకృతి నుంచి స్ఫూర్తి పొందినవి ఫ్లవర్, లీఫ్ షేప్ ఎకో ఫ్రెండ్లీ జ్యువెలరీ. జాగ్రత్తలుఔట్ఫిట్ కలర్‌కి మ్యాచ్ అయ్యే జ్యువెలరీని ఎంచుకోవాలి. ఆభరణాలు చాలా హెవీ వాడితే నెక్ లేదా ఇయర్ మీద బరువు పడొచ్చు, సౌకర్యంగా ఉండేవి చూసుకోవాలి. ఒకేసారి హెవీ మేకప్, హెవీ జ్యువెలరీ కాకుండా బ్యాలెన్స్ చేయాలి. ఓవర్సైజ్డ్ నగల ధరించేటప్పుడు అన్నీ ఓవర్‌గా వేసుకోకూడదు. హెవీ ఇయర్ రింగ్స్ ధరించినప్పుడు హెవీ నెక్లెస్ వాడద్దు. సింపుల్ డ్రెస్ ధరించినప్పుడు ఓవర్ సైజ్డ్ జ్యువెలరీ అట్రాక్టివ్‌గా ఉంటుంది. క్లచ్ లేదా హ్యాండ్ బ్యాగ్ కూడా జ్యువెలరీ షైన్ కి మ్యాచ్ అయ్యేలా చేసుకోవాలి. (చదవండి: ఇండియన్ స్పైసీ రెస్టారెంట్ ఇన్ జపాన్) -
కేవలం రూ.3.5 లక్షలతో ఫ్యాషన్ బ్రాండ్..రూ. 500 కోట్ల దిశగా
ఇంటినీ, కుటుంబాన్ని చక్కదిద్దడంలో మాత్రమే కాదు.. అడుగు పెట్టిన రంగం ఏదైనా పట్టుదలగా ఎదిగి, తమ ఆసక్తిని,కలలను నెరవేర్చుకున్న ధీరవనితలు ఎందరో ఉన్నారు. ముఖ్యంగా పురుషులకే సాధ్యం అనుకునే వ్యాపార రంగంలో అడుగు పెట్టి విజయవంతమైన వ్యాపారవేత్తలుగా ఎదుగుతున్నారు. ఫల్గుణి నాయర్, వినితా సింగ్, ఇందిరా పూరి ఇషా అంబానీ కార్పొరేట్ సీఈవోలుగా ఎదుగుతున్నారు. మరికొంతమంది మహిళలు తమ కృషి ఆధారంగా స్టార్టప్‌లలో కూడా తామేంటో నిరూపించు కున్నారు. అంతేకాదు తక్కువ పెట్టుబడితోనే అద్భుతాలు చేస్తూ తనలాంటి ఎందరో ఔత్సాహికులకు ప్రేరణగా నిలుస్తున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదు. అలాంటి వారిలో ఒకరు నిధి యాదవ్. ఆమె సాధించిన విజయం ఏమిటో తెలుసుకుందామా!ఇండోర్‌లో జన్మించిన నిధికి ఫ్యాషన్ రంగం అంటే చాలా ఇష్టం. కంప్యూటర్ ఇంజనీరింగ్ చదివిన నిధి డెలాయిట్‌లో పనిచేసేది. ఐదంకెల జీతం. కానీ అది సంతృప్తి నివ్వలేదు. తన అభిరుచిని కెరీర్‌గా మార్చుకోవడానికి, నిధి కూడా ఫ్లోరెన్స్‌లోని పోలిమోడా ఫ్యాషన్ స్కూల్లో ఒక సంవత్సరం కోర్సు చేసింది. అలా సొంత వ్యాపారం మొదలు పెట్టాలనే కోరికతోపాటు,కుటుంబానికి దగ్గరగా ఉండేందుకు భారతదేశానికి తిరిగి రావాలనే పెద్ద ముందడుగు వేసింది. తన సొంత బ్రాండ్‌ను సృష్టించాలని నిర్ణయించుకుంది. అప్పటికే వివాహం, ఏడు నెలల పసిబిడ్డ ఉన్నా కూడా తన ఆశయానికి కట్టుబడి ఉంది. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత, డెలాయిట్‌లో తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాలని ధైర్యంగా నిర్ణయం తీసుకుంది. 23 ఏళ్ల వయస్సులో ఉద్యోగాన్ని వదిలివేసి భర్తతోకలిసి తన సొంత దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించింది. 2014లో గురుగ్రామ్‌లోని తన 2BHK ఇంట్లో రూ.3.5 లక్షల ప్రారంభ పెట్టుబడితో ఆక్స్ క్లోతింగ్‌ను ప్రారంభించింది.స్టైలిష్ ఎథ్నిక్ వేర్‌ను సరసమైన ధరల్లో అందించాలి, ముఖ్యంగా 18-35 సంవత్సరాల వయస్సు గల యువతులను లక్ష్యంగా చేసుకుంది. అనుకున్నట్టుగానే ఆమె వెంచర్ త్వరగా ఆదరణ పొందింది.2021 నాటికి రూ.200 కోట్ల ఆదాయాన్ని సాధించింది. చాలా తక్కువ సమయంలో ఆక్స్ ప్రజాదరణ పొందింది. కంపెనీ కేవలం ఒక సంవత్సరంలో రూ. 8.50 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది 2018లో, కంపెనీ ఆదాయం రూ. 48 కోట్లకు పెరిగింది. ఐదేళ్లలోనే కంపెనీ ఒక రేంజ్‌కి చేరింది. 2019-2020 ఆర్థిక సంవత్సరంలో రూ. 100 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జించింది.అంటే 2014లో రూ. 1.60 కోట్లుగా ఉన్న ఆదాయం 2015లో రూ. 8.50 కోట్లకు, ఆ తర్వాత 2018 నాటికి రూ. 48 కోట్లకు పెరిగింది. 2021 నాటికి, ఆక్స్ ఎటువంటి బాహ్య నిధులు లేకుండానే రూ. 200 కోట్ల ఆదాయాన్ని అధిగమించింది.రూ. 500 కోట్ల టర్నోవర్‌తోపాటు గ్లోబల్ విస్తరణ లక్ష్యంగా ముందుకు సాగుతోంది నిధియాదవ్.చదవండి: ఉద్యోగాన్ని వదిలేసిన ఇంజనీర్ కపుల్.. ఇపుడు ఏడాదికి రూ. 30 లక్షలుబ్రాండ్ ప్రారంభ రోజుల్లో, నిధి ఆమె భర్త తమ పసికందుతో కలిసి గురుగ్రామ్,జైపూర్ మధ్య వారాంతపు తిరుగుతూ సామాగ్రిని సేకరించేవారు. ఈ కష్టాల మధ్య కోవిడ్ మహమ్మారి మరో సవాల్ విసిరింది. దీంతో పాటు కొత్త అవకాశాల్ని కూడా తెచ్చిపెట్టింది. క్లోతింగ్ ఉత్పత్తి సంక్షోభం తరుణంలో ఆక్స్ మాస్క్‌లు , PPE కిట్లను తయారు చేయడంలో పై చేయి సాధించింది. అలా కోవిడ్ కాలంలో బ్రాండ్ వృద్ధి 25 శాతం పెరిగిందంటే ఆమె కృషిని అర్థం చేసుకోవచ్చు. మిగిలిపోయిన బట్టను ఉపయోగించి పిల్లల దుస్తుల శ్రేణిని కూడా ప్రారంభించింది.ఇదీ చదవండి: 70 ఏళ్ల వయసులో 30 ఏళ్ల చిన్నదానితో నటుడి పెళ్లి.. ఇపుడిదే చర్చ! -
అదితి శంకర్ ఇష్టపడే ఫ్యాషన్ బ్రాండ్స్ ఇవే..!
డైరెక్టర్ కూతురే అయినా, ఆమెను కెమెరా ముందు నిలిపింది కేవలం తన టాలెంటే! అందుకే, ప్రతిభను నమ్ముకుని ముందుకెళ్లే అదితి శంకర్ అందానికి కారణం కూడా ఆమె ఆత్మవిశ్వాసమేనట!నాకు బ్యూటీ సీక్రెట్లు ఏవీ లేవు! ప్రతిరోజూ స్నానం చేయడం, బాగా నిద్రపోవడం, మంచి ఆహారం తీసుకోవడం, అంతే! సంప్రదాయ దుస్తులు అంటే ఇష్టం. ముఖ్యంగా చీరల్లో నేను రాణిలా మెరిసిపోతుంటాను. అందుకే ప్రత్యేక సందర్భాల్లో నా మొదటి ఎంపిక చీరలే. ఇవి నాకు అందంతో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా ఇస్తాయని అంటోంది అదితి శంకర్. ఇక్కడ ఆమె ధరించిన డ్రెస్ బ్రాండ్ నిరాలీ, ధర రూ. 35,000, జ్యులరీ బ్రాండ్: ఎమిథిస్ట్, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. డబుల్ చెయిన్... డబుల్ ఇంపాక్ట్!ఫంక్షనేమో చిన్నదే కాని, అది చాలా దగ్గరి వారిది. పెద్దగా తయారవకుండానే, ప్రత్యేకంగా కనిపించాలి. అయితే, ఒక్కసారి మెడలో ఈ డబుల్ లేయర్డ్ చెయిన్ వేసుకోండి. తళతళలాడే భారీ నగలు లేకుండానే, ఈ ఒక్క ఆభరణమే అందరి చూపులను ఆకర్షించేలా చేస్తుంది. సింపుల్ అయినా సాఫిస్టికేటెడ్, క్యూట్ అయినా కిల్లర్ లుక్‌కి చిరునామా డబుల్ లేయర్డ్ చెయిన్‌తో అందుకే దీని ప్రభావం కూడా రెట్టింపుగా ఉంటుంది. అయితే, ఈ హారం వేసుకునేటప్పుడు కొన్ని స్టయిలింగ్ చిట్కాలు గుర్తుంచుకోవాలి. చెయిన్ స్పష్టంగా మెడపై మెరిసిపోవాలంటే వీ–నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ ఉండేలా చూసుకోవాలి. పెద్ద చెవిపూసలు వేసుకుంటే ఈ చెయి తో పోటీ పడతాయి. అందుకే చిన్న స్టడ్స్ లేదా చిన్ని జుమ్కీలు సరిపోతాయి. చేతికి తక్కువ గాజులు, ముఖానికి మినిమల్ మేకప్ అంతే, సిద్ధం! జుట్టు విషయంలో కూడా సహజంగా వదిలిన లైట్ కర్ల్స్ ఉంటే మెడ బాగా కనిపిస్తుంది, చెయిన్ మరింత మెరిసిపోతుంది. మొత్తంగా చూసుకుంటే, ఈ చిన్న డబుల్ చెయన్తో మీ లుక్‌కి ఒక డబుల్ ఇంపాక్ట్ గ్యారంటీ!. డ్రెస్..బ్రాండ్: నిరాలీధర: రూ. 35,000జ్యూలరీ:బ్రాండ్ : ఎమిథిస్ట్ ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది. -
ఫ్యాషన్ క్లిక్.. ట్రై లుక్ : మువ్వన్నెల వస్త్రాలు
కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల వస్త్రధారణలో భాగం కావడం సాధారణమే. అయితే ఈ మూడూ ఒకే డ్రెస్సింగ్‌లో మేళవింపుగా చూడాలంటే అది ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే సాధ్యం. భారత జాతీయ జెండాను ప్రకాశింపజేసే త్రివర్ణాలను రంగరించి ఫ్యాషన్ ఔత్సాహికులు వస్త్రధారణ కాంతులీనేలా చేయడం ఇప్పుడు నగరంలో సర్వసాధారణంగా మారింది. ఆయా సందర్భాలు, సంఘటలకు అనుగుణంగా వస్త్రధారణలో మార్పులు ప్రస్పుటంగా కనిపించేలా అదరగొట్టే లుక్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ వస్త్రధారణలో దుస్తులతోపాటు వివిధ రకాల యాక్సెసరీస్ అదనపు ఆకర్షణగా నిలుస్తున్నాయి. – సాక్షి, సిటీబ్యూరో భారతీయ జెండా రంగులను – కాషాయం (ధైర్యం), తెలుపు (శాంతి) ఆకుపచ్చ (సంపద/ శ్రేయస్సు) దుస్తుల్లో చేర్చడం ఆనవాయితీగా మారింది. ఈ సందర్భంగా మహిళలు మూడు రంగుల్లో సొగసైన చీరలు, సల్వార్ కమీజ్ సెట్స్ లేదా కుర్తాలను ఎంచుకుంటున్నారు. అలాగే కాషాయం దుపట్టా, ఆకుపచ్చ గాజులతో తెల్లటి కుర్తాలను జత చేయడం లేదా పూర్తి త్రివర్ణాలు కలగలిసిన చీర ధరించడం కూడా ట్రెండ్ అవుతోంది. ‘మిగిలిన రోజుల్లో ఎన్ని ఫ్యాషన్స్ ఫాలో అయినా, ప్రత్యేక సందర్భాల్లో ట్రై కలర్స్ మన డ్రెస్సింగ్‌లో మేళవించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తాం. ఈ వస్త్రధారణ మన ఫ్యాషన్ సెన్స్ చాటి చెప్పడానికి కాదు.. మనం భారతీయులం అని సగర్వంగా చెప్పుకోడానికి కదా’ అంటున్నారు నగరానికి చెందిన థియేటర్ ఆర్టిస్ట్ కాచిగూడ నివాసి గౌరీ జోషి. ఇదే అభిప్రాయన్ని పూర్తిగా బలపరుస్తున్నారు నగర మహిళ సుమన్ కృష్ణ. ‘ఇది ఫ్యాషన్ షో కాదు.. మన అస్తిత్వ ప్రదర్శన’ అంటారామె. ఖాదీ.. హైదరాబాదీ.. పురుషులు కుర్తాలు, నెహ్రూ జాకెట్లు లేదా జాతీయవాద స్పర్శతో కూడిన సాధారణ టీ షర్ట్స్ కూడా ఇండిపెండెన్స్ లుక్‌లో భాగం చేస్తున్నారు. ఖాదీ అనేది కేవలం ఒక ఫ్యాబ్రిక్ మాత్రమే కాదు. ఇది నాటి స్వాతంత్య్ర ఉద్యమంలో భాగం. అందుకే స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖాదీ లేదా భారతీయ చేనేత వ్రస్తాలను కూడా అనేక మంది ధరిస్తున్నారు. తద్వారా భారతదేశ స్వాతంత్య్ర పోరాట మూలాలను స్మరించుకోవడంతో పాటు స్థానిక చేనేత కళాకారులకు మద్దతు అందించినట్టుగా భావిస్తున్నారు. అలాగే ఈ ట్రెండ్స్‌లో లినెన్ కాటన్, చందేరి ఖాదీ మిశ్రమాలు కూడా స్టైలిష్‌గా ప్రదర్శిస్తున్నారు. ‘జాతీయత ప్రతిబింబించే వస్త్రధారణ ఎంచుకున్నప్పుడు నా డ్రెస్సింగ్‌లో ఖాదీ తప్పనిసరిగా ఉండాల్సిందే’ అని చెప్పారు నగరానికి చెందిన ఈవెంట్ మేనేజర్ రాజ్ కిషోర్. స్వేచ్ఛా స్ఫూర్తిని తెలిపేలా.. : స్వేచ్ఛా స్ఫూర్తిని వ్యక్తీకరించడానికి ఫ్యాషన్ ఒక శక్తిమంతమైన మార్గం అంటున్నారు నగరానికి చెందిన హామ్స్టెక్ కాలేజ్ ఆఫ్ క్రియేటివ్ ఎడ్యుకేషన్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనింగ్ ఫ్యాకల్టీ. వారు అందిస్తున్న విశేషాలివి.. త్రివర్ణాలు (కుంకుమ, తెలుపు, లేదా ఆకుపచ్చ) కలిగన కుర్తాలను ఎంచుకుని, దానికి నప్పేలా లేదా కాంట్రాస్ట్‌గా ఉండే పైజామా జత చేయాలి. వీటికి అనుగుణమైన షేడ్‌లో దుపట్టా జోడించడం ఫ్రీడమ్ లుక్‌కి మెరుపునిస్తుంది.స్వేచ్ఛను సగర్వంగా వేడుకగా జరుపుకోవడంలో ఆత్మవిశ్వాసం కనిపించాలి. అధికారిక సమావేశాలకు, సంప్రదాయ దుస్తులు, చీర లేదా కుర్తా, పైజామా వంటివి సరైన ఎంపిక. అయితే సాధారణ సమావేశాలకు, మరింత ఆధునిక శైలితో ప్రయోగాలు చేయవచ్చు. త్రివర్ణంలో మెరిసే గాజుల నుంచి స్కార్ఫ్‌లు, హెడ్ బ్యాండ్స్, రిస్ట్‌బ్యాండ్స్ వరకూ విభిన్న రకాల యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ ఫ్లేవర్ జోడించడానికి సులభమైన మార్గం. సాధారణ ట్రై కలర్స్‌లో మెరిసే హెయిర్ క్లిప్‌తో కూడా ఇండిపెండెన్స్ డే లుక్ ప్రతిబింబించవచ్చు. స్ఫటికంలా మెరిసే తెల్లటి టాప్‌కి జీన్స్, జాకెట్ లేదా వేరే డ్రెస్ ఏదైనా స్పిరిట్ ఆఫ్ ఫ్రీడమ్ ప్రస్ఫుటించేలా క్లాసిక్ డెనిమ్ దుస్తులు ధరించి, వాటికి ట్రై కలర్ యాక్సెసరీస్ జోడిస్తే అందంగా తళుక్కుమనేలా కనిపిస్తారు. ఇది ఓ రకంగా ఫ్యూజన్Œ స్వేచ్ఛను కనబరుస్తుంది. ధోతి–చీర సంప్రదాయ ట్రెండ్‌ను మిళితం చేస్తుంది. ఇది ఫ్యాషన్–ఫార్వర్డ్ సౌకర్యవంతమైన విధంగా జరుపుకోడానికి అనువైన ఎంపికగా చేస్తుంది. హామ్ స్టెక్ కాలేజ్ ఆఫ్ డిజైన్ ఇయర్ రింగ్స్ టు.. లెగ్గింగ్స్.. చెవిపోగుల నుంచి ట్రైకలర్స్తో ఎంబ్రాయిడరీ చేసిన జుతా (ఓ రకమైన పాదరక్షలు)ల వరకూ, యాక్సెసరీస్ కూడా ఫ్రీడమ్ స్ఫూర్తిని చాటేలా వినియోగిస్తున్నారు. అలాగే బ్యాగులు, దుపట్టాలు మాసు్కలు సైతం త్రివర్ణ శోభితంగా మారుతున్నాయి. పాఠశాలలు లేదా కళాశాలల్లోని అబ్బాయిలు అమ్మాయిలు త్రివర్ణాల థీమ్‌తో టీ షర్ట్స్, స్నీకర్స్ ఎంచుకుంటున్నారు. సకుటుంబ సపరివార సమేతంగా త్రివర్ణాల థీమ్‌లతో కూడిన ఫ్యామిలీ కాంబో బాగా ప్రాచుర్యం పొందుతోంది. ‘ప్రౌడ్ ఇండియన్’ అనే క్యాప్షన్ రాసున్న కస్టమైజ్డ్ టీ షర్ట్స్ స్కూల్స్‌లో విరివిగా కనిపిస్తున్నాయి. పర్యావరణ స్పృహతో మేళవించిన ఫ్యాషన్ అనుసరణీయంగా మారింది. ఆర్గానిక్ కాటన్, రీసైకిల్ చేసిన దుస్తులు కూడా వినియోగిస్తు న్నారు. -
ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ విజేతగా బంగ్లా చంద్రలేఖ
ఫరెవర్ మిసెస్ ఇండియా 2025 హైదరాబాద్ విజేతగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి చెందిన బంగ్లా చంద్రలేఖ నిలిచారు. జైపూర్ జీ స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో విజేతలను ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ టైటిల్ గెలుచుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పెరల్ సిటీ హైదరాబాద్ నుంచి పోటీల్లో పాల్గొని విజేతగా నిలవడం చాలా ఆనందాన్నిచ్చిందని తెలిపారు. షారా ఫ్యాషన్ డిజైనింగ్ వ్యవస్థాపకురాలిగా వ్యాపార కార్యకలాపాలు చూసుకుంటూ, కార్పొరేట్ కంపెనీలో టీమ్ లీడర్‌గా రాణిస్తూనే ఫరెవర్ మిసెస్ ఇండియా హైదరాబాద్ పోటీల్లో పాల్గొన్నానని చెప్పారు. నటన, మోడలింగ్ అంటే ఇష్టం. అందుకే ఫ్యాషన్ డిజైనింగ్‌లో అడుగు పెట్టాను. నా ఇష్టాలకు కుటుంబ సభ్యుల సహకారం తోడైందని ఆమె పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించగలరనే గట్టి నమ్మకాన్ని కలిగిస్తోందన్నారు. అందం, ఆత్మస్థైర్యంహైదరాబాద్కు ప్రాతినిధ్యం వహిస్తూ ఎస్కే మిసెస్ ఇండియా యూనివర్స్ ఇంటర్నేషనల్, మిసెస్ తెలంగాణ కిరీటాలను గెలుచుకున్న ప్రియాంక తారే తన వ్యక్తిత్వం, ప్రతిభ, పట్టుదలతో ఈ తరానికి స్ఫూర్తిగా నిలిచారు. నోయిడాలో జరిగిన ప్రతిష్టాత్మక ఎస్కే యూనివర్స్ ఇండియా ఇంటర్నేషనల్ 2025 సీజన్ 27లో ఆమె సౌందర్యం, సమతుల్యత, ఆత్మవిశ్వాసం జడ్జీలతో పాటు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో విజేతగా ఎంపిక చేశారు. ఛత్తీస్‌గఢ్ భిలాయ్‌కు చెందిన ప్రియాంక ఈ పోటీల్లో హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహించారు. కార్పొరేట్ లీడర్‌గా, ఈవెంట్స్, ఎచ్ఆర్, సీఎస్ఆర్ రంగాల్లో రాణించడమే కాకుండా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, గాయనిగా, నృత్యకారిణిగా తన బహుముఖ ప్రజ్ఞ చాటుకుంది. టీఎస్ఈ8 ఉమెన్స్ అచీవ్మెంట్ అవార్డు 2025తో పాటు యూట్యూబ్, ఇన్‌స్టా్రగామ్ ఇన్ఫ్లుయెన్సర్గా ఆమెకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. (చదవండి: International Youth Day: విజయకేతనం ఎగరేసిన ధీర యువత..!) -
అందాల నటి కయాదు లోహార్ ఫ్యాషన్ సీక్రెట్ ఇదే
ఫిల్టర్ లేకుండా ఫేస్ గ్లో, మేకప్ లేకుండా మెరిసిపోయే అందం కయాదు సొంతం! నిజమైన చర్మకాంతే అసలైన సౌందర్యం అని నమ్మే ఆమె, స్టయిలింగ్లోనూ మినిమలిస్ట్ టచ్‌తోనే ట్రెండ్‌ను తిరగరాస్తోంది. సింపుల్ బ్యూటీ, సోబర్ కలర్స్ ఇవే ఆమె ఫ్యాషన్ మంత్రాలు. బ్రాండ్: దేవరాగ్ ధర: రూ. 5,500జస్ట్ స్కిన్, నో సీక్రెట్స్’ అన్నదే నా బ్యూటీ సీక్రెట్. రోజూ ముఖానికి మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ , జుట్టుకు లైట్ హెయిర్ స్ప్రే అంతే. ఎంత తక్కువ ప్రొడక్ట్స్ వాడితే, అంత అందంగా, ఆరోగ్యంగా ఉంటాం. డ్రెస్‌ల విషయానికి వస్తే, సోబర్ కలర్స్, క్లీన్కట్ స్టయిల్ నాకు బాగా నచ్చుతాయని చెబుతోంది కయాదు లోహార్జ్యూలరీ: స్టయిలింగ్: అరుణ్ దేవ్ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.సింగిల్ లైన్ స్టయిల్చీర కట్టుకున్నాక వడ్డాణం పెట్టుకోవాలి అనుకుంటున్నావా? ఆ ఆలోచనకు కాస్త బ్రేక్ ఇచ్చి, ఇదీ చూడండి! సాధారణ చీర, పాత మోడల్ బ్లౌజ్ వేసుకున్నా, ఈ రేకు వడ్డాణం పెడితే లుక్ వెంటనే బ్రైట్ అవుతుంది. ఈ రేకు వడ్డాణాలు రకరకాల లోహాలతో, ట్రెండీ లుక్స్‌తో దొరుకుతున్నాయి. చీరే కాదు, ఏ డ్రెస్ అయినా సరే, ఈ రేకు వడ్డాణాన్ని నడుముకు చుట్టుకుని, అద్దం ముందు నిల్చుంటే... ‘ఒక చిన్న మెటల్ లైన్ ఎంత మాయ చేస్తుందో!’ అనిపించకుండా ఉండదు. కుచ్చిళ్లు జారిపోతాయనే టెన్షన్ లేకుండా, ఒక్క బెల్ట్‌తో అంతా కంట్రోల్లోకి వస్తుంది. అయితే, ఈ వడ్డాణం ధరించాక భారీ ఆభరణాలు వేసుకోవద్దు. ఇదొక్కటే ప్రధాన ఆకర్షణగా ఉండాలి. చేతికి చిన్న ఉంగరం, జుట్టు సైడ్ బన్ లేదా వేవీ హెయిర్‌లో వదిలేస్తే చాలు. ఇక, ఒక్క రేకు వడ్డాణం మీ ఆకర్షణను అమాంతం మార్చేస్తుంది. (చదవండి: అతిపెద్ద ఏకకణ జీవి..!) -
అతిలోక సుందరిలా జాన్వీ కపూర్ ర్యాంప్ వాక్.. మనసు దోచేసే అందం (ఫొటోలు)
-
చిరునవ్వే సిగ్నేచర్ లుక్!
ఒక్క చిరునవ్వుతో వెండితెరపై వెలుగులు కురిపించే నటి జెనీలియా దేశ్‌ముఖ్. ఎప్పుడూ క్లాసిక్ అందాన్ని కంఫర్ట్‌తో కలిపి, ఫ్రెష్ ఫ్యాషన్‌తో మెరిసిపోతుంది. ఆ యూనిక్ చార్మ్‌ను సినిమాల్లోనే కాదు, జీవితంలోనూ చూపిస్తోంది. జ్యూలరీ బ్రాండ్: షాచీ ఫైన్ జ్యూలరీ, ధర: ఆభరణాల డిజైన్ నాణ్యతపై ఆధారపడి ఉంటుంది.చీర బ్రాండ్: యాష్డెన్, ధర: రూ. 98,000నాకు స్టయిల్ అంటే సింప్లిసిటీ. ట్రెండ్ కంటే కంఫర్ట్ ముఖ్యం. చిన్న చోకర్, లైట్ ఇయర్ రింగ్స్, సాఫ్ట్ లిప్‌గ్లోస్, ఇదే నా సిగ్నేచర్ లుక్. ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటే మేకప్ లేకపోయినా, ముఖం ఆటోమేటిక్‌గా మెరిసిపోతుందని చెబుతోంది జెనీలియా.రిబ్బన్స్ రీ ఎంట్రీ!ఒకప్పుడు జడకే పరిమితమైన ఈ నాజూకైన పట్టీ, రిబ్బన్స్. ఇప్పుడు మెడ మీద మెరిసేలా ఓ కొత్త స్టయిల్ స్టేట్మెంట్ను సృష్టిస్తోంది. జడల చివర అలముకునే ఈ చిన్నదానికి ఇప్పుడు ఫ్యాషన్‌లో పెద్ద స్థానం దక్కుతోంది. ఇది వచ్చినప్పటి నుంచీ పొడవైన హారాల జమానా కాస్త వెనక్కి వెళ్లిందనే చెప్పాలి. మధ్యలో ఓ చిన్న పెండెంట్, చుట్టూ సన్నని రిబ్బతో వచ్చే ఈ చోకర్ వేసుకొని, అద్దం ముందు నిలబడగానే ‘ఇంత అందంగా నేనేనా?’ అన్న ఆశ్చర్యంతో మురిసిపోతారు! చీరా, లెహంగా, కుర్తా ఏదైనా సరే, ఈ రిబ్బన్స్ చోకర్ మెడమీద పడితే లుక్‌కి కొత్త శోభ చేకూరుతుంది. హెయిర్ స్టయిల్ బ్రేడ్ అయినా, బన్ అయినా, ఏదైనా మెడ భాగం స్పష్టంగా కనిపించేలా చూసుకోవాలి. మేకప్ విషయంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. తక్కువ టచ్ ఇచ్చినా సరే, చోకర్ ముఖాన్ని హైలైట్ చేయగలదు. ఇది వేసుకున్నాక, ఇంకొక హారం అవసరం లేదు. ఎందుకంటే, ఈ ఒక్కదానికే పొడవైన హారాల గర్వాన్ని తగ్గించేంత స్టయిల్, పవర్ ఉంది. చిన్నదిగా కనిపించినా, గొప్పగా మెరిసిపోతుంది. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
సంచార జాతుల ప్రాచీన హస్త కళ..ట్రెండీ స్టైల్‌గా..!
మెటాలిక్ కలర్, మిర్రర్ వర్క్ డ్రెస్‌లో నటి ఖుషీ కపూర్ హ్యూందయ్ ఇండియన్ కొచర్ వీక్‌లో మెరిసిపోయారు. డిజైనర్ రిమ్జిమ్ దాదు చేసిన ఈ మోడర్న్ డిజైన్స్‌కి గుజరాతీ సంచార జాతుల హస్తకళ ప్రేరణగా నిలిచింది. ఎవర్‌గ్రీన్‌గా నిలిచే కలర్స్‌కి తోడైన ప్రాచీన హస్తకళ అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు.ఖుషీ కపూర్ ధరించిన కస్టమ్ టెక్ట్స్‌టైల్ బ్రాకెట్–స్టైల్ బ్లౌజ్, హై–వెయిస్టెడ్ లెహంగా ఎంగేజ్మెంట్, రిసెప్షన్ వంటి వేడుకలలో హైలైట్‌గా నిలిచే లక్ష్యంతో ఈ డ్రెస్‌ను రూపొందించారు. మెటాలిక్ కలర్లోనే స్కర్ట్ అంతా మిర్రర్ వర్క్ చేశారు. బంజారా సంచార స్ఫూర్తితో ప్రేరణ పొందిన ఈ సేకరణలో మెటాలిక్ తీగలను ఉపయోగించారు. దీంతో బంజారా తెగ సాంస్కృతిక వారసత్వం హైలైట్ అయ్యింది. ‘బంజారాతో దుస్తులకు ఉన్న సంబంధాన్ని, అది తనకు తెచ్చిన అందం, సౌకర్యాన్ని ఇష్టపడుతున్నాన’ని ఖుషీకపూర్ ఈ సందర్భంగా తెలియజేశారు. ఆక్సిడైజ్డ్ సిల్వర్, మిర్రర్ వర్క్, హెరిటేజ్, మోడర్న్ ... అంశాలతో లగ్జరియస్ బ్రాండ్‌గా పేరొందిన రిమ్జిమ్ దాదు ఈ డిజైన్స్ రూపొందించారు. ‘ఆక్సిన్‘ పేరుతో మన మూలాల కాంతి అని అర్ధం వచ్చేలా చేసిన ఈ డిజైన్స్‌లో పటోలా వంటి సంప్రదాయ ఎంబ్రాయిడరీ, మిర్రర్ వర్క్‌ను ఆమె తన డిజైన్స్‌కి జత చేశారు. ఇతర మోడల్స్ ధరించిన డ్రెస్సులను డిజైనర్ దాదు తన బ్రాండ్ సిగ్నేచర్ మెటల్ వైర్ల నుండి రూపొందించిన టైలర్డ్ ఫారమ్స్, స్కల్ప్చర్ డ్రేప్లతో ఆకట్టుకుటోంది. ఈ డిజైన్స్‌లో పైస్లీ మోటిఫ్‌లు మెరుస్తూ ఆకట్టుకున్నాయి. మన దేశీయ వారసత్వ హస్తకళా సంపద ఎన్నటికీ వన్నెతగ్గదని నిరూపిస్తూ డిజైనర్లు స్ఫూర్తిమంతమైన డిజైన్స్ మన ముందుకు తీసుకువస్తూనే ఉంటారు. మన మూలాల గొప్పతనాన్ని ఎప్పటికీ నిలిచి ఉండేలా ప్రపంచానికి పరిచయం చేస్తూనే ఉంటారు. (చదవండి: సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..! పేరులో ఐడెంటిటీ..అదే ఇవాళ స్టైల్లో మేటి..) -
సెల్ఫ్ బ్రాండ్..అదే ట్రెండ్..!
ప్రస్తుత కాలంలో ప్రతిదీ ఓ ట్రెండే.. అది ఫ్యాషన్ అయినా.. లైఫ్ స్టైల్ అయినా.. పేర్లు, ఇష్టాలు, అభిప్రాయాలు, ఆసక్తులు ఇలా చెప్పుకుంటూ పోతే మరెన్నో.. వాడే వస్తువులు, ధరించే దుస్తుల ద్వారా తమ భావాన్ని వ్యక్తికరించాలనే తపనలో ప్రస్తుత తరం యువత ఆలోచిస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మధ్య కాలంలో విడుదలైన పుష్ప సినిమాలోని డైలాగ్ గుర్తుందా..! ‘పుష్ప అంటే పేరుకాదు పుష్ప అంటే బ్రాండ్’ అన్నట్లు బ్రాండ్ ఇమేజ్ కోసం తాపత్రయ పడుతోంది నేటి యువత. అయితే ఇందులోనూ ఎవరి ట్రెండ్ వారిదే.. ఎవరి బ్రాండ్ వారిదే.. ప్రస్తుతం ఫ్యాషన్ అంటే కేవలం అందాన్ని పెంచేదో, ఆధునికతను చూపించేదో మాత్రమే కాదు. తమ తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తపరిచే సాధనంగా కూడా మారిపోయింది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ‘తమ గురించి తాము చెప్పుకునే’ ఫ్యాషన్ ట్రెండ్. ఇప్పుడు నగరంలో ఈ తరహా ట్రెండ్ ఊపందుకొంది. వ్యక్తిగత అభిరుచిని బట్టి అలాంటి సెల్ఫ్–ఎక్స్ప్రెషన్ స్టైల్స్ విభిన్న రకాలుగా ఉంటున్నాయి. ఆధునిక ఫ్యాషన్ ప్రపంచంలో వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే స్టైల్స్ ప్రాధాన్యత పెరుగుతోంది. ఇందుకు నిదర్శనంగా పలు బ్రాండ్లు సైతం వినూత్న ఫ్యాషన్లను ఆవిష్కరిస్తున్నాయి. కఫ్ లింక్స్ పై పేర్లు.. ఇటీవల తమ పేరు లేదా వ్యక్తిగత గుర్తింపుతో కూడిన కఫ్ లింక్స్ ఫ్యాషన్ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. విభిన్న అలంకరణలతో, చేతి చివర్లలో ధరించే ఈ కఫ్ లింక్స్‌లో పేరు, ఇంకేమైనా ప్రత్యేకమైన డిజైన్లు చెక్కించుకుంటున్నారు. ఒకప్పుడు కార్పొరేట్ ఫార్మల్ వేర్లో భాగంగా మాత్రమే వినియోగించే హ్యాండ్‌మేడ్ – కస్టమ్ – డిజైన్ బంగారం, వెండి లాంటి మెటల్స్‌తో తయారవుతున్నాయి. పేర్లు, లక్షణాల ప్రాతిపదికన డిజైన్‌లో మార్పులు చేర్పులు చేస్తున్నారు. అలాగే వీటిని బహుమతులుగానూ వినియోగిస్తున్నారు. ఈ ట్రెండ్ ముఖ్యంగా యువతలో, పెళ్లిళ్లు లేదా ఫ్యామిలీ ఫంక్షన్లలో తమ పేరు లేదా ఇనీíÙయల్స్తో ప్రత్యేకత చూపించాలనుకునే వారి వల్ల బాగా పాపులర్ అవుతోంది. ఫ్యాషన్ రంగ నిపుణులు కూడా ఈ ట్రెండ్‌ను ‘పర్సనలైజ్డ్ ఎలిగెన్స్’గా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి కొత్త ప్రయోగాలు, సంప్రదాయ ఆధునికతల కలయికగా మన నగరంలో మారుతున్నాయని చెబుతున్నారు. కేవలం కఫ్లింక్స్ మాత్రమే కాదు, వ్యక్తిగత గుర్తింపును ఫ్యాషన్‌లో కలిపే ట్రెండ్స్ ప్రస్తుతం ప్రాచుర్యంలో ఉన్నాయి. సొంత/ఇంటి పేరుతో లేదా మొదటి అక్షరంతో డిజైన్ చేసిన గొలుసులు. నేమ్ నెక్లెస్ / ఇసీíÙయల్ పెండెంట్స్, రింగ్స్ వంటివి సిల్వర్, గోల్డ్, రోజ్ గోల్డ్ లాంటి మెటల్స్‌లో లభ్యం అవుతున్నాయి. ఇది ముఖ్యంగా యువతలో, ప్రేమ జంటల్లో ట్రెండింగ్ అవుతున్నాయి. జాకెట్లు/శాలువాలు : షర్ట్, జాకెట్స్(బ్లేజర్స్)పై పేరు లేదా చిన్న మెసేజ్‌ను ఎంబ్రాయిడరీతో బ్రాండెడ్ లోగో తరహాలో తీర్చిదిద్దుతున్నారు. ఇది డ్రెస్‌కి ఓ వ్యక్తిగత టచ్ ఇచ్చేలా చేస్తుంది. కస్టమ్ మేడ్ టి–షర్ట్స్, ప్రింట్ చేసిన పేరు, ఫేవరెట్ కోట్, బర్త్‌డేట్ లేదా క్యారెక్టర్ డ్రాయింగ్‌తో కూడిన డిజైన్లు, గ్రూప్ ఈవెంట్స్, బర్త్‌డేలు, ట్రావెల్ వంటి సందర్భాల్లో ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. సొంత పేర్లను కాకపోయినా, తమ భావోద్వేగాలు ప్రతిబింబించే పదాలు, సంకేతాలు టాటూలుగా వేయించుకోవడం కూడా సెల్ఫ్–ఎక్స్ప్రెషన్లో భాగమే. పేర్లు, ఇనీషియల్స్‌తో కూడిన స్నీకర్స్, లేదా ఫేవరెట్ డిజైన్‌తో ఉండే పాదరక్షలు, షూ డిజైన్లుగా మారుతున్నాయి. ఈ ట్రెండ్ దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం ‘నైక్’ వంటి బ్రాండ్లు కూడా కస్టమైజేషన్‌కు అవకాశం ఇస్తున్నాయి. ఇండియన్ వెడ్డింగ్ డ్రెస్‌లపై పేర్లు కాడలుగా అల్లడం పెళ్లి కూతురు లేదా వరుడు దుస్తుల్లో తన పేరు లేదా జంట పేరు అల్లించుకోవడం ట్రెండ్‌గా మారుతోంది. అలాగే బ్యాగ్స్, వాలెట్స్, ట్రావెల్ పౌచ్‌లు తదితర పర్సనల్ ఐటమ్స్‌పై మోనోగ్రామ్‌లు, నేమ్ ఇనీషియల్స్‌తో ఉన్న హ్యాండ్‌బ్యాగ్స్ కూడా విరివిగా వాడుతున్నారు. ఇవి లగ్జరీ బ్రాండ్స్ (లూయిస్ విటన్, గూచి) నుంచి చిన్న ఆర్టిసన్ స్టోర్ల వరకూ అందుబాటులో ఉన్నాయి. (చదవండి: జల్లుల సీజన్..ఒళ్లు జాగ్రత్త..! లేదంటే వర్షపు వ్యాధుల ముప్పు..) -
ఫ్యాషన్ ఈవెంట్లో దేవకన్యలా మెరిసిన జాన్వీ కపూర్ (ఫొటోలు)
-
ఫ్యాషన్ ఫ్రమ్ నేచర్.. డిజైనింగ్‌తో స్టోరీ టెల్లింగ్..
15 ఏళ్ల వయసులోనే ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన.. రెండేళ్లలోనే ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. వెరసి దేశంలోనే అతిపిన్న వయస్కుడైన ఫ్యాషన్ డిజైనర్‌గా రాణిస్తున్నాడు అమోగ్ రెడ్డి. భారతీయ సంప్రదాయ, వివాహ కోచర్‌లో తన నైపుణ్యాలతో ప్రసిద్ధి చెందిన అమోగ్.. వారసత్వ హంగులను ఆధునిక ఫ్యాషన్‌తో సమ్మిళితం చేస్తూ అంతర్జాతీయ స్థాయి ఫ్యాషన్ ఔత్సాహికులను ఆకర్షిస్తున్నారు. అంతేకాకుండా ‘యంగెస్ట్ డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ బిరుదును సైతం పొందారు. ఈ ప్రయాణంలో భాగంగానే నగరంలోని హెచ్ఐసీసీ నోవోటెల్ వేదికగా వినూత్నంగా ఫారెస్ట్ థీమ్‌తో ఆదివారం నిర్వహించిన ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో వనమ్ కలెక్షన్స్ ఆవిష్కరించారు. డిజైనింగ్‌తో స్టోరీ టెల్లింగ్.. మన ఊహకందని నూతన ఫ్యాషన్ ఫార్ములాతో సమ్మిళితమై రూపొందించారు. ఆ సౌందర్యం ఒక్కొక్క లేయర్‌లా నిరంతరం ఆకర్షణీయంగా అభివృద్ధి చెందుతూ ఉంటుందని అమోగ్ రెడ్డి తన ఆలోచనలను పంచుకున్నారు. నోవోటెల్ వేదికగా చిన్నారులతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 12వ సీజన్ ఇండియా కిడ్స్ ఫ్యాషన్ వీక్‌లో అమోగ్ రూపొందించిన డిజైనింగ్ వేర్ ప్రకృతిని ప్రతిబింబించాయి. ప్రకృతిలోని వర్ణాలు, అరణ్యంలోని అందాల నుంచి ప్రేరణ పొందాయి. ఆకారాల కవిత్వమే ఈ వనమ్ కలెక్షన్ అని అమోగ్ పేర్కొన్నారు. ప్రకృతి అందాలే ఈ డిజైన్లను రూపొందించడానికి ప్రేరేపించాయన్నారు. క్రియేటివిటీని హైదరాబాద్‌లో ప్రారంభించి దేశంతో పాటు ప్రపంచ నలుమూలలా విస్తరింపజేయాలనే లక్ష్యంతో ఉన్నానన్నారు. ఈ కలెక్షన్లోని ప్రతి డిజైన్ ఒక కథను చెబుతుంది. వినూత్న పద్ధతుల్లో ఆధునిక ఫ్యాషన్ హంగులతో సంప్రదాయ హస్తకళలను సమన్వయం చేయడంతో ఫ్యాషన్ ప్రియులను అలరించాయి.(చదవండి: శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!) -
ఫుడ్ అండ్ ఫ్యాషన్ టిప్స్ : వర్షంలో హాయి..హాయి
వెన్నెల్లో హాయి.. హాయి.. మల్లెల్లో హాయి హాయి.. వరాల జల్లే కురిసే.. తప్పేట్లు హాయి హాయి తృమ్పేట్లు హాయి హాయి.. ఇవ్వాళ మనసే మురిసే.. మే నెల్లో ఎండ హాయి ఆగష్టు లో వాన హాయి.. జనవరిలో మంచు హాయి.. హాయి రామ హాయి.. హాయిగుంటే చాలు నంది వెయ్యి మాటలెందుకండి.. ఈ పాట వింటుంటే ఎంత హాయిగా ఉంటుందో.. సరైన ప్రణాళికతో జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలోనూ అంతే హాయిగా ఉంటుందంటున్నారు నిపుణులు.. భాగ్యనగరంలో ప్రస్తుతం వర్షాలు ముసురుకున్నాయి. వాతావరణ శాఖ సూచనల ప్రకారం.. మరికొద్ది రోజులు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో సరైన జాగ్రత్తలు పాటించకుంటే ఇబ్బందులు పడక తప్పని పరిస్థితి.. – సాక్షి, సిటీబ్యూరోగజిబిజి నగర జీవన శైలి.. వర్షాకాలంలో మరింత ఇబ్బందికరంగా ఉంటుంది. ఓవైపు ముసురుకున్న వర్షాలతో తేమ బురద వాతావరణం. మరోవైపు ట్రాఫిక్ కష్టాలు.. వీటికి మించి ఆరోగ్య సమస్యలు.. ఈ నేపథ్యంలో చక్కని చిట్కాలు పటిస్తే వీటి నుంచి ఇట్టే పరిష్కారం లభిస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. వీటిని ఓ సమస్యగా కాకుండా జీవనశైలిలో భాగంగా మార్చుకుంటే శ్రేయస్కరం.. ఇందులో భాగంగా నగరవాసులకు పలు చిట్కాలు.. ట్రావెల్ అండ్ వర్క్ లైఫ్.. నగరంలో వర్షాకాలం అనగానే ట్రాఫిక్ కష్టాలు తప్పవు.. ఎక్కడికక్కడ నిలిచిపోయే వర్షపు నీరు, వాహనాల బ్రేక్డౌన్లు సర్వసాధారణం. దీనిని దృష్టిలో ఉంచుకుని అవకాశం ఉన్న ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల ట్రాఫిక్ కష్టాలతో పాటు వర్షం తడవాల్సిన పరిస్థితి ఉండదు.. పైగా సమయం కూడా ఆదా అవుతుందిఇంటి పరిసరాలపై శ్రద్ధ : వర్షాకాలంలో ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ఇంటి చుట్టూ నిరు నిలిచే ప్రదేశాలను శుభ్రం చేసుకోవాలి. పైప్లైన్లు బ్లాక్ అవ్వకుండా క్లీన్ చేసుకోవాలి. మేడపై కుండీల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ప్రధానంగా ఇంటి నుంచి బయటకు వెళ్లే డెయ్రిన్లలోని చెత్తను తొలగించుకోవడం ఉత్తమం. దీంతోపాటు విద్యుత్ వైర్లు, మీర్ల వద్ద తేమ లేకుండా చూసుకోవాలి. ఇన్వర్టర్లు, టార్చ్లైట్లు, బ్యాటరీ బ్యాకప్ప్ చెక్ చేసుకోవాలి. అత్యవసర పరిస్థితులకు పవర్ బ్యాంక్స్ సిద్ధంగా ఉంచుకోవాలి. చల్లని వాతావరణంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవాలి. సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత సాధ్యమని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా బయటి ఆహారం, స్ట్రీట్ ఫుడ్ ఎంత మేరకు నివారిస్తే అంత మంచిది.సరైన ఆహారంతో ఆరోగ్య భద్రత..: వీధిపక్కన దొరికేకే ఆహారానికి దూరంగా ఉండాలి.. ఇంట్లో చల్లని వాతావరణానికి తగినట్లు వేడివేడిగా వెజ్ సూప్స్, ఉల్లిపాయ పకోడి, అల్లం టీ వంటి హీటింగ్ ఫుడ్స్ వల్లఆ హ్లాదంతో పాటు ఆరోగ్య సొంతం. నీరు తాగడంలో అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. వేడి నీరు, శుద్ధి చేసిన నీటిని తాగడం మంచిది. వర్షాకాలంలో తీసుకునే ఆహారం చిన్న పిల్లలు, వృద్ధుల ఆరోగ్యంపై త్రీవ ప్రభావాన్ని చూపుతాయి. వీటి విషయంలో ప్రత్యేక శ్రద్ధపెట్టాలి. వర్షా కాలపు ఫ్యాషన్ టిప్స్.. : వర్షంలో మన ఫ్యాషన్ కూడా మారాలి. స్టైలిష్ ఉండే సమయంలో ప్రాక్టికల్‌గా కూడా ఆలోచించాలి.. వర్ష నిరోధక/వాటర్ ఫ్రూఫ్ షూస్, అనువుగా ఉండే రబ్బరు చెప్పులు సౌకర్యవంతంగా ఉంటాయి. సింథటిక్ లేదా డ్రై–ఫిట్ డ్రెస్సులు వేసుకుంటే తడవడం, ఆరిపోవడం తేలిక. లెదర్ బ్యాగ్స్‌కు బదులుగా వాటర్‌ప్రూఫ్ బ్యాగ్స్ ఎంచుకోవాలి. ల్యాప్‌టాప్ బ్యాక్స్కి కూడా వాటర్‌ప్రూఫ్ కవర్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని వినియోగించాలి.ఎక్కువ దూరం నడవాల్సిన పనిలేని వారు ఎంఎంటీఎస్, మెట్రో వంటి పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను ఆశ్రయించడం ఉత్తమం.ఒక వేళ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సి వస్తే ట్రాఫిక్ అప్డేట్స్ తెలుసుకోవాలి. ఇందుకోసం అనేక యాప్స్ అందుబాటులో ఉన్నాయి. వర్షాలతో సంబంధం లేకుండా వాహనాల్లో రెయిన్ కోట్స్, గొడుగు, అదనపు మాస్క్, టవల్ క్యారీ చేయడం మంచిది. మైండ్‌ఫుల్ లివింగ్.. వర్షం మనసుకు ప్రశాంతతను, నూతనోత్సాహాన్ని తెస్తుంది. వర్షాన్ని కాఫీ కప్పుతో ఆస్వాదిస్తూ బుక్స్ చదవడం, ఇంట్లో గేమ్స్ ఆడడం, ఫ్యామిలీతో టైమ్ గడపడం లాంటి చిన్న విషయాలు జీవితాన్ని మరింత ఆహ్లాదంగా మార్చుతాయి. ఒక రకంగా వర్షాలు వరద బీభత్సాలే.. కాకుండా ఒక్కసారిగా పరిసరాలను శుభ్రం కూడా చేస్తాయి. ఫలితంగా ప్రకృతి ప్రదేశాలకు పచ్చదనాన్ని అందుతాయి. అయితే సరైన జాగ్రత్తలు లేకపోతే సమస్యలే ఎక్కువ ఇబ్బందిపెడతాయి. ముఖ్యంగా హైదరాబాదీయులు ఈ వర్ష కాలాన్ని ఒక లైఫ్‌స్టైల్ ఫెస్టివల్‌గా మార్చుకుంటే.. ఈ కాలమెంతో మధురంగా మారుతుంది. ఇదీ చదవండి: నో జిమ్, ఓన్లీ చాట్‌జీపీటీ, డంబెల్స్ 18 కిలోలు తగ్గిన మెరుపు తీగ -
హైదరాబాద్ : సందడిగా చిన్నారుల ఫ్యాషన్ షో..చిన్నారుల ర్యాంప్‌వాక్ (ఫొటోలు)
-
పుష్కరం తరువాత అక్షయ్ కుమార్ రాయల్ కమ్ బ్యాక్ (ఫొటోలు)
-
శ్రావణ శోభను తెచ్చేలా..పట్టుతో స్టైలిష్‌గా మెరుద్దాం ఇలా..!
ఇంటికి ఐశ్వర్యాన్ని, పండగ కళనూ తీసుకువచ్చే మాసంగా శ్రావణానికి పేరు. పూజలు, వివాహ వేడుకలతో ఎప్పుడూ సందడిగా ఉండే ఈ రోజుల్లో వాతావరణం మబ్బు, తుంపరలతో డల్‌గా కనిపిస్తుంది. ఇలాంటి సమయాలలో బ్రైట్‌గా వెలిగిపోవాలంటే పట్టు ఎంపిక ఎప్పుడూ పర్ఫెక్ట్ ఛాయిస్ అవుతుంది. పట్టు చీరలు అన్నివేళలా ఒకే తరహా కట్టు అంటే బోర్‌గా ఫీలయ్యే నవతరానికి మోడర్న్ స్టైల్లో కట్టు, కుట్టు డిజైన్స్ చాలానే వచ్చాయి. ఈ మాసంలో మెరుపును, ఉత్సాహాన్ని ఇచ్చే పట్టు ఇండోవెస్ట్రన్స్ స్టైల్స్ ఇవి...డ్యుయెల్ టోన్... పండగలు అనగానే మనలో చాలామంది ఎరుపు, పసుపు, పచ్చ రంగుల గురించి ఆలోచన చేస్తారు. ఈ యేడాది ట్రెండ్‌లో ఉన్న రంగులు.. పీకాక్ బ్లూ, గోల్డ్ పట్టు చీరలు లేదా డ్రెస్సులు ఈవెనింగ్ పార్టీలకు ఎంచుకోవాలి. బాటిల్ గ్రీన్– మెరూన్ కలిసిన సంప్రదాయ రంగులు పండగల సమయాల్లో, లావెండర్ – సిల్వర్, మెహందీ రంగులు పూజలకు, మస్టర్డ్– నేవీ బ్లూ రంగులు ఇండోర్ ఈవెంట్లకు బ్రైట్ లుక్‌నిస్తాయి. దీంతోపాటు రెండు రంగుల కాంబినేషన్లో వచ్చే డ్యుయెల్ టోన్ పట్టుచీరలు వేడుకలకు మంచి లుక్‌ను తీసుకు వస్తాయి. ఉదాహరణకు బ్లూ– పింక్, గోల్డ్– మెరూన్ .. కలయికలతో ఉన్నవి. పట్టు చీరలు లైట్వెయిట్లోనూ లభిస్తున్నాయి. పెద్ద జరీ అంచు చీరలు ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నాయి. మన చేనేతలైన గద్వాల, ΄ోచంపల్లి, నారాయణపేట, పీతాంబరం, బనారసి.. పట్టు చీరలు ఈ మాసానికి నిండుతనాన్ని తీసుకువస్తాయి.పట్టు లాంగ్ జాకెట్స్/ కేప్స్...ప్లెయిన్ మ్యాక్సీ డ్రెస్ వేసుకుంటే బనారసీ లాంగ్ జాకెట్ బ్రైట్‌గా, ట్రెడిషనల్‌గా కనిపిస్తుంది. లాంగ్ గౌన్పైకి జాకెట్ లేదా కేప్ లేయర్డ్గా ఉండి స్టైలిష్ ఎంపిక అవుతుంది. మోడర్న్ పట్టు బ్లౌజ్‌లు... పట్టు చీరలు/ స్కర్ట్స్‌కి ఆఫ్–షోల్డర్ బ్లౌజ్ ధరిస్తే స్టైలిష్‌గా కనిపిస్తారు. పట్టుచీర పూర్తి సంప్రదాయ విధానం అని ఆలోచించే యువతరానికి పెప్లమ్ స్టైల్ బ్లౌజ్ లేదా బెల్ట్‌తో కూడిన చీర కట్టు మంచి లుక్‌తో నప్పుతుంద. బ్యాక్–ఓపెన్ లెహంగా స్టైల్ చీర కట్టుకు హాల్టర్ నెక్ బ్లౌజ్, ప్లెయిన్ సిల్క్ స్కర్ట్‌కి కాలర్ నెక్ ఉన్న షర్ట్ స్టైల్ బ్లౌజ్‌తో ఆధునికతను జోడించవచ్చు. పట్టు లాంగ్ గౌనులుకాంచిపట్టు లేదా మైసూర్ సిల్క్ చీరలతో డిజైన్ చేసిన లాంగ్ గౌనులు ఈ మాసంలో ప్రత్యేకంగా ధరించవచ్చు. అమ్మాయిలకు ఇవి సరైన ఛాయిస్ అవుతాయి. శరీరాకృతికి తగినట్టు, ఫ్లేయర్డ్ స్కర్ట్‌ని అలాగే ధరించవచ్చు. కొన్నిసార్లు దుపట్టాతో కూడా మ్యాచ్ చేయవచ్చు. ఎంగేజ్మెంట్, రిసెప్షన్, వివాహ ఊరేగింపు.. సమయాలలో వీటి ఎంపిక ఈ సీజన్లో ప్రత్యేకంగా ఉంటుంది.ఇండో–వెస్ట్రన్ పట్టుపట్టు క్రాప్ టాప్‌కి లెహెంగా లేదా స్కర్ట్ ధరించవచ్చు. వీటిలో బనారసి లేదా ఉ΄్పాడ క్రాప్ టాప్ (స్లీవ్‌లెస్/బోట్ నెక్/హై నెక్)తో ఉన్నవి ఎంచుకోవచ్చు. వీటికి లేయర్డ్ కాంట్రాస్ట్ జరీ లెహెంగా మంచి కాంబినేషన్ అవుతుంది. జరీ బోర్డర్‌ని నెట్ లేదా జార్జెట్ ఫ్యాబ్రిక్‌కి జత చేసి దుపట్టాను డిజైన్ చేసుకోవచ్చు. సంప్రదాయ పూజలు, రాఖీ వంటి పండగలు, ఎంగేజ్మెంట్ వంటి వేడుకలకు ఇది మంచి ఎంపిక అవుతుంది.విభిన్న మోడల్స్ కట్టుడిజైనర్ బ్లౌజ్ ధరించే సాధారణ పట్టు చీరను ఎంచుకుంటే దానికి నడుము వద్ద ఎంబ్రాయిడరీ చేసిన ఫ్యాబ్రిక్ బెల్ట్ ధరించవచ్చు. వడ్డాణానికి మరొక శైలి. ఈ స్టైల్ యంగ్ లుక్‌ని తీసుకువస్తుంది. దీనికి టెంపుల్ జ్యువెలరీ, చోకర్లు ఉపయోగించవచ్చు.పట్టు ధోతీ ప్యాంటు– షార్ట్ కుర్తీఅమ్మాయిలు ట్రెండీ లుక్ కోసం ఇటీవల ధోతీ ప్యాంట్ , షార్ట్ కుర్తీని ఎంచుకుంటున్నారు. వీటిని పట్టుతో డిజైన్ చేస్తే ఈ కాలం స్టైలిష్‌గానూ, సంప్రదాయ లుక్‌తో బ్రైట్‌గా మెరిసిపోతారు. ధోతీ ప్యాంట్ కోసం నారాయణపేట, గద్వాల్ సిల్క్లను ఎంచుకోవచ్చు. ఎంబ్రాయిడరీ/మిర్రర్ వర్క్ చేసిన షార్ట్ కుర్తీలు ధోతీ ప్యాంటుకు మంచి కాంబినేషన్ అవుతుంది. వీటికి కొల్హాపురి లేదా జుట్టీలు పాదరక్షలుగా ఎంచుకోవాలి. – ఎన్నార్(చదవండి: సమద్రగర్భంలో..మహిళా స్కూబాడైవర్లు..!) -
హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025 ఈవెంట్లో మెరిసిన తమన్నా (ఫొటోలు)


