ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! | Sobhita Dhulipala wore gold lehenga paired with a burgundy dupatta | Sakshi
Sakshi News home page

Sobhita Dhulipala: ఆ దుప్పటాతో పెళ్లికూతురిలా శోభితా ధూళిపాళ..! నాటి రాణుల వైభవాన్ని తలపించిలా..

Dec 24 2025 2:28 PM | Updated on Dec 24 2025 2:57 PM

Sobhita Dhulipala wore gold lehenga paired with a burgundy dupatta

టాలీవుడ్‌ నటి, అక్కినేని వారి కోడలు శోభితా ధూళిపాళ ఇటీవల పలు కార్యక్రమంలో స్టైలిష్‌ల లుక్‌లో కనిపిస్తూ తన అభిమానులను ఖుషీ చేస్తోంది. అంతేగాదు ఆమె ధరించే డిజైనర్‌ వేర్‌లు, ఆభరణాలు ఆమె ఫ్యాషన్‌ అభిరుచిని ప్రతిబింబిస్తున్నాయి. పైగా ఫ్యాషన్‌ ఐకాన్‌గా ప్రతి వేడుకలో ఆమె ఆహార్యం, లుక్‌ హైలెట్‌గా నిలవడం విశేషం. అక్కినేని వారి కోడలు అంటే రేంజ్‌ ఇది అన్నట్లుగా లగ్జరీ ఫ్యాషన్‌ వేర్‌లతో అదరహో అనేలా తళుక్కుమంటోంది. 

అంతేగాదు శోభితా అంటే అత్యంత శోభాయమానం అని చెప్పకనే చెబుతోంది తన స్టైలిష్‌ లుక్‌తో. ఈసారి ఓ ప్రముఖ లగ్జీరి మేకప్‌ ప్రొడక్ట్స్‌కి సంబంధించిన షార్లెట్ టిల్బరీ బ్రాండ్‌ ప్రమోషన్‌లో భాగంగా గోల్డ్‌ లెహంగాలో 24 క్యారెట్ల బంగారంలా మెరిసిపోయింది. అంతేగాదు ఆ లెహంగాకి బుర్గుండి దుపట్టా జత చేయడంతో అలనాటి రాణుల వైభవంలోకి తీసుకుపోయింది శోభితా స్టన్నింగ్‌ లుక్‌. చూపు తిప్పుకోనివ్వనంత ఆకర్షణీయమైన లుక్‌తో మెస్మరైజ్‌ చేస్తోంది.

 

స్లీవ్‌లెస్‌ బ్లౌజ్‌తో అత్యంత బరువైన బుర్గుండి దుప్పటా మహారాణి మాదిరి రాజదర్పాన్ని అందించింది. అంతేగాదు ఆ దుస్తులు డిజైన్‌ చేసిన విధానం కారణంగా ఆభరణాలతో పనిలేదనిపించేలా ముగ్ధమనోహరంగా తీర్చిదిద్దారు వాటిని. ఇక ఈ బుర్గుండి దుప్పటా డీప్‌ వెల్వెట్‌ టోన్డ్‌ కలర్‌ దానిపై బంగారు ఎంబ్రాయిడరీ అంచు..ఆ గోల్డెన్‌ కలర్‌ లెహంగా అందాన్ని మరింత పెంచేసింది. ఈ ఒక్క దుప్పట కారణంగా రాయల్టీ లుక్‌ వచ్చింది ఆ లెహంగాకి. 

అంతేగాదు శోభితా ఈ లెహంగాలో మహారాణి మాదిరిగా, పెళ్లికూతురిలా ధగధగ మెరిసిపోయారామె. నార్మల్‌ మేకప్‌తో, ఆ లెహంగాకి సరిపడా చోకర్‌, చెవిపోగులతో చాలా సింపుల్‌గా ఉన్నా..హెవీ డిజైన్‌తో రూపొందిన ఈ లెహంగా మిగతా లోటుని భర్తించేసిందా అనేలా నిండైన అందాన్ని అందించింది. ఇక ఈ గోల్డెన్‌ లెహంగాను జిగర్‌ మాలి రూపొందించారు. ఇక రిచ్‌ బుర్గుండి దుప్పటాను డిజైనర్‌ నైషా తీర్చిదిద్దారు. కాగా అంతకుముందు శోభితా ఒక ముంబై కార్యక్రమంలో ఇలానే గోల్డెన్‌ లెహంగాతో పెళ్లికూతురిలా మెరిసిపోగా ఈసారి రాజుల కాలం గుర్తుకుతెచ్చేలా మరో గోల్డెన్‌ లెహంగాతో మంత్రముగ్ధుల్ని చేసింది. 

 

బుర్గండీ రంగు దుపట్ట ప్రత్యేకత.. 
ఇది గాఢ ఎరుపు వైన్‌ షేడ్‌లో రిచ్‌గా కనిపించే రంగులో ఉండటమే దీని ప్రత్యేకత. ఇది సంప్రదాయ దుస్తులతో జత చేస్తారు. ఎక్కువగా చీర సల్వార్‌, లెహంగాలతో జత చేస్తే ఒక్కసారిగా రాయల్టి లుక్‌ వచ్చేస్తంఉది. ఇక్క వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్‌కి జతచేస్తే..స్టైలిష్‌గా ఉంటుంది. పార్టీవేర్‌కి సిల్క్ లేదా జార్జెట్, డైలీవేర్‌కి కాటన్ లేదా లినెన్, వింటర్‌లో అయితే శోభితా ధరించినట్లుగా వెల్వెట్‌ ఫ్యాబ్రిక్‌లో ధరిస్తే లుక్‌ అదుర్స్‌.

(చదవండి: నటాషా పూనవాలా అరుదైన పింక్ డైమండ్ రింగ్..ఇన్ని ప్రత్యేకతలు ఉన్నాయా?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement