ఆ నటి ధరించిన డైమండ్‌ నెక్లస్‌ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్.. | Margot Robbie Stuns In Elizabeth Taylors Rs 74 Crore Diamond Necklace | Sakshi
Sakshi News home page

ఆ నటి ధరించిన డైమండ్‌ నెక్లస్‌ ..రూ. 72 కోట్లా..!? ఏకంగా షాజహాన్..

Jan 29 2026 5:08 PM | Updated on Jan 29 2026 6:02 PM

Margot Robbie Stuns In Elizabeth Taylors Rs 74 Crore Diamond Necklace

సెలబ్రిటీలు ధరించే ప్రతి కాస్ట్యూమ్‌, నగలు ప్రత్యేక ఆకర్షణ తోపాటు అత్యంత విలాసవంతమైనవి కూడా. వాళ్ల స్టేటస్‌కి తగ్గ ఫ్యాషన్‌వేర్‌లే అయినా..ఇక్కడ ఈ నటి ధరించిన డైమండ్‌ నెక్లస్‌ అత్యంత ప్రత్యేకం. ఈ నెక్లస్‌ వెనుకున్న ఆసక్తికర స్టోరీలు చూస్తే..ఇంత చరిత్ర ఉందా ఈ ఆభరణానికి అని విస్తుపోవడం ఖాయం. ఎందరి చేతులు మారి ఆ నెక్లస్‌ ఆమె వద్దకు చేరిందంటే..

ఆస్ట్రేలియన్‌ నటి మార్గోట్‌ రాబీ తన రాబోయే చిత్రం వూథరింగ్‌ హైట్స్‌ ‍ప్రమోషన్‌లో భాగంగా  రెడ్ కార్పెట్‌పై తన గ్లామ్ లుక్‌తో అభిమానులను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారామె. ఈ మూవీలో హీరో జాకబ్ ఎలోర్డి కూడా నటించారు. రాబీ లాస్‌ ఏంజిల్స్‌లోని చైనీస్‌ థియేటర్‌లో జరిగిన వరల్డ్‌ మూవీ ప్రీమియర్‌కు హాజరయ్యారు. అక్కడ ఆమె షియాపరెల్లి కోచర్ గౌనుతో అందరి దృష్టిని తనవైపుకి తిప్పుకొంది. 

ముఖ్యంగా ఆమె మెడలో ధరించిన నెక్లెస్‌ అమితంగా అందరి మనసులను దోచుకుంది. ఎందుకంటే ఈ డైమండ్‌ నెక్లెస్‌ హాలీవుడ్ ఐకాన్ ఎలిజబెత్ టేలర్‌ది. దీని ధర భారత కరెన్సీ ప్రకారం.. సుమారు రూ. 74 కోట్లు పలుకుతుంది. ఆమె ధరించే ప్రతి ఆభరణం ఆలోచనాత్మకంగానూ, ఇంట్రస్టింగ్‌ కథ దాగుంటుంది. హాలీవుడ్‌​ ఐకాన్‌ నటి ఎలిజబెత్ టేలర్ 40వ పుట్టిన రోజున తన ఐదో భర్త ఈ నెక్లెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ ఇద్దరు రోమ్‌లో నిర్మిస్తున్న క్లియోపాత్రా చిత్రంలో పనిచేశారు. అప్పుడే ఇద్దరూ ఒకరికొకరు పరిచయమై ప్రేమలో పడ్డారు. ఆ టైంలో వీరి ప్రేమకథ వార్తల్లో నిలిచి సర్వత్రా చర్చనీయాంశంగా మారింది కూడా. 

రియల్‌ స్టోరీ ఏంటంటే..
గుండె ఆకారంలో ఉన్న టేబుల్-కట్ వజ్రంపై "ప్రేమ శాశ్వతమైనది" అని రాసి ఉన్న పార్సీ శాసనం ఉంది. దానిపై నూర్జహాన్ పేరు కూడా చెక్కి ఉంటుంది. ఈ రత్నాన్ని నూర్జహాన్ భర్త మొఘల్ చక్రవర్తి షాజహాంగీర్ ఇచ్చాడని, తరువాత వారి కుమారుడు షాజహాన్‌కు అందజేశాడని నమ్ముతారు. చరిత్రకారుల ప్రకారం..షాజహాన్ తన భార్య ముంతాజ్‌కు ఆభరణాలను బహుకరించాడు. మొఘలులతో దాని లోతైన అనుబంధం కారణంగా, ఈ నెక్లెస్‌ను "తాజ్ మహల్ వజ్రం" అని కూడా పిలుస్తారు.

1971 నాటికి, ఫ్రెంచ్ లగ్జరీ బ్రాండ్ కార్టియర్ తాజ్ మహల్ వజ్రాన్ని సొంతం చేసుకుంది, ఎరుపు రత్నాలు టేబుల్-కట్ వజ్రాలతో అలంకరించబడి, భారతీయ ఆభరణంలా రూబీ హారంలా డిజైన్‌ చేశారు. దీన్ని ఇలా నెక్లెస్‌లా తీర్చిదిద్దింది ప్రఖ్యాత నగల డిజైనర్‌ ఆల్ఫ్రెడ్ డ్యూరాంటే.. అంత చరిత్ర కలిగిన ఈ నెక్లెస్‌ని ఆస్ట్రేలియన్‌ నటి రాబీ మెడలో ధరించడంతో అక్కడున్న వారందరిలో ఆసక్తి, కుతుహలం వెల్లువెత్తింది. అక్కడ అందరి చూపు ఆ ఆభరణంపైనే. ఎన్నో ప్రేమకథలను పొందుపర్చుకున్న ఈ హారంతో రాబీ ఆ వేడుకలో పురాతన వైబ్స్‌ సృష్టించింది.

(చదవండి: చేతిలో పదివేలు ఉంటే చాలు..ఆ దేశాల్లో లక్షాధికారులే..?)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement