పువ్వులే డ్రెస్సులు! | fashion Tips: Dress Made Of Flowers | Sakshi
Sakshi News home page

పువ్వులే డ్రెస్సులు!

Mar 13 2026 5:31 PM | Updated on Mar 13 2026 5:53 PM

fashion Tips: Dress Made Of Flowers

సంప్రదాయ వివాహ వేడుకలలో పువ్వుల అలంకరణకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆ పూల అందం అమ్మాయిల డ్రెస్సులుగా మారితే మరింత ఆకర్షణీయం అవుతుంది. పెళ్లికి ముందు జరిగే హల్దీ వేడుకకైనా... మాతృత్వపు మధురిమను పొందే బేబీ షవర్‌కైనా.. పువ్వుల దుపట్టా, పువ్వుల కేప్, పువ్వుల బ్లౌజ్‌... చీరకు కొంగుగా, లెహంగాకు డిజైన్‌గా అమరే పువ్వుల అందం ఇప్పుడు వేడుకలకు ప్రత్యేకతను తీసువస్తుంది.

సుగంధాలు వెదజల్లే మల్లెలతో చేసిన దుపట్టా, బ్లౌజ్‌ డిజైన్స్‌ ఇప్పుడు పెళ్లిళ్లు, హల్దీ, మెహందీ వంటి ఫంక్షన్స్‌లో చాలా ట్రెండింగ్‌గా ఉన్నాయి. ఇవి ఫ్రెష్‌ పూలతో తయారు చేసిన కావడంతో ఒక నేచురల్, రాయల్‌ లుక్‌ను తీసుకువస్తున్నాయి.

ఫ్రెష్‌ ఫ్లవర్‌ దుపట్టా...

గులాబీలతో..  రెడ్‌ లేదా పింక్‌ రోజ్‌ పూలను ఈ దుపట్టా తయారీలో ఉపయోగిస్తారు. రెడ్‌ లేదా పింక్‌ గులాబీలతో చేసిన దుపట్టాను ధరిస్తే రాయల్‌ లుక్‌తో కనిపిస్తారు. 

మల్లెపూలతో – సన్నని కాడ మల్లెలతో చేసే ఈ డిజైన్‌ సింపుల్‌గానూ, క్లాసీ లుక్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ కలర్‌ డ్రెస్‌ ఎంచుకున్నా మల్లెల దుపట్టాతో ప్రత్యేకత నింపుకుంటుంది. 

వివిధ రకాల పువ్వులు – గులాబీ, బంతి, జిప్సీ వంటి పూల మిక్స్‌తో దుపట్టాను అలంకరిస్తారు. ∙హల్దీ స్పెషల్‌ దుపట్టా – పసుపు రంగు వచ్చేలా బంతిపూలు, మల్లెలతో కలిపి దీనిని తయారుచేస్తారు. ఈ దుపట్టాలను ఎక్కువగా హల్దీ, మెహందీ ఫంక్షన్స్‌ కోసం వాడతారు.

పువ్వుల బ్లౌజ్‌ డిజైన్స్‌...

ఫ్రంట్‌ ఫ్లోరల్‌ టాప్‌ స్టైల్‌లో బ్లౌజ్‌ మొత్తం పూలతో కవర్‌ చేస్తారు. 

పువ్వులను బ్లౌజ్‌ బోర్డర్‌కి మాత్రమే అలంకరిస్తారు. పువ్వులను దారం లేదా వైర్‌ థ్రెడ్‌తో నెటెడ్‌ మెటీరియల్‌ మీద ఫిక్స్‌ చేస్తారు. వీటిలో ఎక్కువ శాతం బంతి, గులాబీ, మల్లెలతో పాటు అలంకరణకు తామర మొగ్గలను కూడా ఉపయోగిస్తుంటారు. ఈ డిజైన్స్‌ వేడుకకు రెండు గంటల ముందు లేదా ఆర్డర్‌ మీద డిౖజైన్‌ చేస్తున్నారు. డిజైన్‌ను బట్టి, పువ్వుల ఎంపికను బట్టి వీటి ధరలు ఉంటున్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement