సచిన్ టెండూల్కర్ అంజలి దంపతుల కుమారుడు అర్జున్ టెండూల్కర్‌ల వివాహం గత గురవారం అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. ఈ వేడుకకు బాలీవుడ్ ప్రముఖులు, క్రికెట్ దిగ్గజాలు, పలువురు ప్రముఖులు, రాజకీయనాయకులు విచ్చేసి వధువరులు ఆశ్వీరదించారు కూడా. అయితే ఈ వేడుకలో అర్జున్ అక్క సారా కుందనపు బొమ్మలా అందరి కళ్లను ఆకర్షించింది.
ముఖ్యంగా ఆమె ధరించిన మీనాకారి నెక్లెస్ అందరి దృష్టిని అమితంగా ఆకర్షించింది. సునీతా షెఖావత్ కలెక్షన్‌కి సంబంధించిన ఈ నెక్లెస్ చాలా ప్రత్యేకంగా తయారు చేశారట. ఇందులో హస్తకళ, సంప్రదాయ కుందన్ సెట్ పోల్కీలు, పూల మోటిఫ్‌లు తరతరాల సంప్రదాయాన్ని గుర్తుచేస్తాయి. ప్రముఖ ఆభరణాల నిపుణురాలు ప్రియంషు గోయెల్ జైపూర్‌కి చెందిన సునీతా షెఖావత్ తయారు చేసిన ఈ నెక్లెస్ ధర దగ్గర రూ. 40 నుంచి రూ. 60 లక్షలు పైన ఉంటుందని పేర్కొన్నారు.
ఈ నెక్లెస్‌లో కొలంబియన్ ఎమరాల్డ్‌లు, సౌత్ సీ ముత్యాలను పొందుపరిచారు. అద్భుతమైన వారసత్వ ఆభరణాలు.. మన దేశ సంస్కృతిని, గత వైభవాన్ని కళ్లముందు కదలాడలే చేసింది ఈ ఆభరణం. అంతేగాదు దీన్ని తయారు చేసేందుకు 360 గంటలు పైనే పట్టిందట. ఈ ఆభరణం ప్రత్యేకతలను వివరిస్తూ నెట్టింట షేర్ చేశారు ప్రియంషు గోయెల్.
(చదవండి: Arjun-Saaniya Chandhok Wedding: అంజలి, సారా ఆ చీరలే ఎందుకు ఎంచుకున్నారంటే..)


