న్యూఢిల్లీ: ప్రముఖ యూట్యూబర్ అనురాగ్ దోభాల్ (UK07 Rider) ఆత్మహత్యాయత్నం ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. సుమారు 80 వేల మంది వీక్షకులు సోషల్ మీడియా లైవ్‌లో చూస్తుండగా.. ఆయన తన కారును అతివేగంతో రోడ్డు డివైడర్‌కు ఢీకొట్టాడు. ఢిల్లీ-మీరఠ్ ఎక్స్‌ప్రెస్‌వేపై జరిగిన ఈ ప్రమాదంలో అనురాగ్ తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
గత కొంతకాలంగా తీవ్ర మానసిక ఒత్తిడితో సతమతమవుతున్న అనురాగ్ దోభాల్.. శనివారం రాత్రి తన యూట్యూబ్ ఛానల్‌లో లైవ్ స్ట్రీమింగ్ ప్రారంభించాడు. తన కారును గంటకు 150 కిలోమీటర్లకు మించిన వేగంతో నడుపుతూ.. తన కుటుంబ సభ్యులపై తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రస్తుత మానసిక స్థితికి, తాను ఎదుర్కొంటున్న ఇబ్బందులకు కుటుంబమే కారణమని ఆవేదన వ్యక్తం చేశాడు. ‘వచ్చే జన్మలోనైనా నాకు ప్రేమను అందించు మమ్మీ.. నాకు ప్రేమ ఎంతో అవసరం’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఈ క్రమంలోనే ఒక్కసారిగా స్టీరింగ్‌ను మళ్లించి, కారును రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌కు బలంగా ఢీకొట్టాడు.
यूट्यूबर UK07 राइडर Anurag Dobhal ने इंस्टाग्राम पर लाइव आकर किया सुसाइड का प्रयास
◆ लाइव स्ट्रीम पर डिवाइडर में ठोकी गाड़ी, बाल बाल बची जान
◆ इस खौफनाक मंजर को उनके फॉलोअर्स ने लाइव देखा, जिसका वीडियो अब सोशल मीडिया पर तेजी से वायरल हो रहा #anuragdobhal #uk07rider ||… pic.twitter.com/d97CiEhBmE— News24 (@news24tvchannel) March 7, 2026
ఈ హృదయ విదారక దృశ్యాన్ని సుమారు 82,000 మంది నెటిజన్లు ప్రత్యక్షంగా వీక్షించారు. లైవ్ చాట్‌లో చాలామంది ఆయన్ను వారించే ప్రయత్నం చేసినప్పటికీ, అనురాగ్ ఎవరి మాట వినలేదు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మసూరి ప్రాంత పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనురాగ్‌ను హుటాహుటిన మీరఠ్‌లోని సుభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రమాదానికి ముందు అనురాగ్ 'లాస్ట్ మెసేజ్' (చివరి సందేశం) పేరుతో ఒక వీడియోను పోస్ట్ చేశారు. గత ఏడాది మే నెలలో తాను ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవాలని భావించగా, అందుకు తల్లిదండ్రులు అంగీకరించలేదని ఆయన అందులో పేర్కొన్నారు. తమను ఇంట్లోకి కూడా రానివ్వకపోవడంతో తన ప్రేయసి కూడా తనను వదిలి వెళ్లిపోయిందని, అప్పటి నుంచి తాను ఒంటరితనంతో కుమిలిపోతున్నానని వివరించారు. తనకేదైనా జరిగితే దానికి తన కుటుంబమే బాధ్యత వహించాలని ఆ వీడియోలో ఆరోపించాడు.
ఇది కూడా చదవండి: ఎన్నికలకు సిద్ధమవుతున్న డేరా బాబా?


