ఎండల ఎఫెక్ట్.. ఐఎండీ కీలక ఆదేశాలు | IMD Issues Key Instructions In The Wake Of Excessive Sun Exposure Across India In Early March, Details Inside | Sakshi
Sakshi News home page

ఎండల ఎఫెక్ట్.. ఐఎండీ కీలక ఆదేశాలు

Mar 8 2026 9:33 AM | Updated on Mar 8 2026 11:24 AM

IMD issues key instructions in the wake of excessive sun exposure

మార్చి నెల ప్రారంభంలోనే భానుడు భగభగలు మండిపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత అధికమైంది. ఈ నేపథ్యంలోనే  భారత వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. 12 రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో సైతం ఎండలు మండిపోతున్నాయి. దీంతో  ప్రజలు ఎండ వేడిమికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడే ఇలా ఉంటే ఇక వేసవి ఎలా ఉంటుందా అని భయాందోళనలకు గురవుతున్నారు. కాగా నిన్న ఆంధ్రపదేశ్  కర్నూలులో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. నంద్యాల, వైఎస్సార్ కడప, అనంతపురం తదితర ప్రాంతాల్లో సైతం గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

Advertisement
 
Advertisement
Advertisement