చక్క'టీ' లైఫ్‌ స్టైల్‌ | Tour Tips: How to visit tea plantations in Sri Lanka | Sakshi
Sakshi News home page

చక్క'టీ' లైఫ్‌ స్టైల్‌

Mar 2 2026 4:56 PM | Updated on Mar 2 2026 5:02 PM

Tour Tips: How to visit tea plantations in Sri Lanka

శ్రీలంక లోని హపుటాలే అనే చిన్న కొండ పట్టణంలో టీ తోటల మధ్య సాగే జీవన విధానం ఒక నిశ్శబ్ద ప్రయాణ కథలా అనిపిస్తుంది. పొగమంచులో కమ్ముకున్న వెలుగు–నీడలు, టీ ఆకులు సేకరించే చేతులుం ఇవన్నీ ప్రతీ రోజు ప్రశాంతతకు చిహ్నాలుగా కనిపిస్తాయి. 

ఇక్కడ ప్రతీ ఉదయం హడావిడి లేకుండా మెల్లగా ప్రారంభమవుతుంది. లోయలో మేఘాలు సాఫీగా కదులుతూ ఉంటే, మనుషుల జీవితం కూడా అదే లయలో ముందుకు సాగుతుంది. సమయం ఇక్కడ పరుగెత్తదుం నడుస్తుంది. ఎలాంటి హడావిడి లేకుండా ఇక్కడ సమయం గడుస్తుంది.

సందర్శనీయ స్థలాలు
హపుటాలేలో పర్యాటకులు తప్పక వెళ్లే ప్రదేశాల్లో లిప్టన్‌ సీట్, డియాలుమా జలపాతం ముఖ్యమైనవి. ఇక్కడ కనిపించేది కేవలం ప్రకృతి అందం మాత్రమే కాదుం సాధారణంగా కొనసాగుతున్న జీవితం యొక్క ఒక నిశ్శబ్ద రాగంలా ఉంటుంది. దగ్గర్లోని తంగమాలే బర్డ్‌ శాంక్చువరి వద్ద పక్షుల సందడి ఒక స్వచ్ఛమైన సంగీతంలా అనిపిస్తుంది. ప్రతీ ఉదయం ఇక్కడ వినిపించే స్వరాలు హృదయాన్ని తాకుతాయి.

హైదరాబాద్‌ నుంచి ఎలా వెళ్లాలి?
హైదరాబాద్‌ నుంచి కొలంబోకి నేరుగా విమాన ప్రయాణం చేసి, అక్కడి నుంచి రైలు లేదా క్యాబ్‌ ద్వారా హపుటాలే చేరవచ్చు. కొలంబో నుంచి ఈ కొండ ప్రాంతానికి వెళ్లే రైలు ప్రయాణం అత్యంత అందమైన అనుభవంగా ఉంటుంది.

(చదవండి: వెలుగులతో రంగులు మార్చే భూమి..!)

Advertisement
 
Advertisement
Advertisement