జస్ట్‌ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్‌..! | 18 year old shares how he lost 17 kgs in two years | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రెండేళ్లలో 17కిలోలు తగ్గిన టీనేజర్‌..! నో జిమ్‌, నో స్ట్రిక్ట్‌ డైట్‌..

Mar 2 2026 12:30 PM | Updated on Mar 2 2026 12:35 PM

18 year old shares how he lost 17 kgs in two years

ఇంతవరకు చూసిన వెయిట్‌లాస్‌ జర్నీలలో ఇది అత్యంత విభిన్నం. ఓ టీనేజర్‌ అధిక బరువు తగ్గేంచేందుకు ఎలా ‍ప్రయత్నించాడో వివరించే వెయిట్‌లాస్‌ స్టోరీ ఇది. తన పదహారవ పుట్టిన రోజున తీసుకున్న నిర్ణయం..తనలో ఎంతలా పరివర్తనకు దారితీసిందో తెలిపాడు. అయితే జిమ్‌కి వెళ్లలేదని, అలాగే ఎలాంటి కఠినమైన డైట్‌లు పాటించలేదని అంటున్నాడు. కానీ రెండేళ్లలో 17 కిలోలు పైనే తగ్గానని అంటున్నాడు. 

జిమ్‌, డైట్‌ పాటించకుండా ఆ టీనేజర్‌ ఎలా బరువుతగ్గాడంటే..ఇంటి వ్యాయామాలతో అని చెబుతున్నాడు. అదేంటి అనుకోకండి. ఎందుకంటే తాను స్లిమ్‌గా ఆరోగ్యకరమైన బరువుతో ఉండాలనుకుంటున్నట్లు తల్లిదండ్రులకు చెప్పి..వారి సహాయసహకారాలతో బరువు తగ్గాడు. పేరెంట్స్‌ సాయంతోనే..ఇంటిలోనే చేసే వ్యాయామా పరికరాలను కొనుగోలు చేసి మరి..వర్కౌట్లకు ఉపక్రమించాడు. బరువులు ఎత్తే ప్లేట్‌ల తోపాటు బార్‌బెల్‌ వంటి పరకరాలతో మంచి పురోగతిని అందుకున్నాడు. 

మొదట్లో పుల్‌అప్‌బార్‌లతో వేలాడిదీసినట్లు ఉండటం దాదాపు అసాధ్యం అనిపించింది. ఒకపుల్‌అప్‌ని కూడా పూర్తి చేయలేకపోయేవాడు. అయితే క్రమం తప్పకుండా సాధన చేసి..మంచి మెరుగుదలను అందుకున్నాడు. సరైన టెక్నిక్‌తో ఇవాళ సుమారు 18 పుల్‌అప్‌లు దాక నిర్వహించి..కండరాల బలాన్ని పెంపొందించుకుంటున్నాడు. 

అలా రెండేళ్లలో చూస్తుండగానే దాదాపు 17 కిలోలు తగ్గి..చాలా స్మార్ట్‌గా మారిన తన పరివర్తన పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నాడు ఆ టీనేజర్‌. కేవలం క్రమశిక్షణ, నిబద్ధతత, క్రమం తప్పకుండా చేయడం వంటివి వెయిట్‌లాస్‌కి ప్రధానమైనవని అంటున్నాడు. బరువు తగ్గడం గురించి భయపడే వారికి తన వెయిట్‌లాస్‌ స్టోరీ ప్రేరణ అని చెప్పడమే గాక, స్లిమ్‌గా మారేలా ఇతరులను ప్రోత్సహిస్తానని కూడా చెబుతున్నాడు.

(చదవండి: పదేపదే వైఫ్యల్యాలు, ఆర్థిక కష్టాలు..కానీ ఇవాళ సీఈవోగా విద్యార్థులకు..!)

 

Advertisement
 
Advertisement
Advertisement