చాలామంది "నాకు కోపం రాదు, కానీ ఎవరైనా తప్పు చేస్తేనే కోపం వస్తుంది" అని అంటుంటారు. ఇది నిజం కాదు. నిజానికి, ఎదుటివారు చేసే తప్పు మీ మెదడులో ఉన్న ఒక పాత గాయాన్ని లేదా ఒక భయాన్ని తాకడం వల్లే మీకు కోపం వస్తుంది. మన వ్యక్తిత్వాన్ని శాసించే ఈ 'ఎమోషనల్ ట్రిగ్గర్స్'ను మనం ఈరోజు డీకోడ్ చేద్దాం.
1. The Anatomy of a Trigger
ట్రిగ్గర్ అనేది ఒక వ్యక్తి, ఒక మాట, ఒక శబ్దం లేదా ఒక సంఘటన. అది మన సబ్-కాన్షియస్ మైండ్‌లోని ఒక పాత బాధను లేదా అభద్రతా భావాన్ని వెలికితీస్తుంది.
* ఉదాహరణకు ఆఫీసులో మీ బాస్ మీ పనిని విమర్శించారనుకోండి. మీకు విపరీతమైన కోపం వస్తుంది. ఎందుకు? అక్కడ ఆ పనిలోని తప్పు కంటే, మీ బాస్ మాట మిమ్మల్ని "నువ్వు అసమర్థుడివి" అని గుర్తుచేస్తోంది. ఆ 'అసమర్థత' అనే ఫీలింగ్ మీకు చిన్నప్పుడు స్కూల్ టీచర్ దగ్గర లేదా ఇంట్లో ఎదురై ఉండవచ్చు. అక్కడ బాస్ కాదు, మీలోని పాత గాయం ట్రిగ్గర్ అయ్యింది.
2. ట్రిగ్గర్లను గుర్తించడం ఎలా?
మనకు ట్రిగ్గర్ ఎప్పుడు అవుతుందో తెలియాలంటే, మన రియాక్షన్‌ను గమనించాలి.
* Physical Signs: ట్రిగ్గర్ అయినప్పుడు ముందుగా మన బాడీ రియాక్ట్ అవుతుంది. గుండె వేగంగా కొట్టుకోవడం, చెమటలు పట్టడం, దవడలు బిగుసుకుపోవడం లేదా కడుపులో కలత. ఇవి మొదలవ్వగానే, మీరు ఒక 'ట్రిగ్గర్ జోన్'లోకి వెళ్లారని అర్థం.
* The Narrative: ఆ క్షణంలో మీ మైండ్ ఒక నెగటివ్ కథను అల్లుతుంది. "ఇతడు నన్ను తక్కువ చేస్తున్నాడు," "నాకు అన్యాయం జరుగుతోంది" అనే ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలే మిమ్మల్ని కోపంతో ఊగిపోయేలా చేస్తాయి.
3. పది అంకెలు లెక్కపెడితే సరిపోదు
మోటివేషనల్ స్పీకర్లు, ట్రైనర్స్... "కోపం వస్తే కళ్ళు మూసుకుని 10 వరకు లెక్కపెట్టు, అన్నీ మర్చిపో" అని చెప్తారు. ఇది కేవలం టెంపరరీ పరిష్కారం.
కానీ మీలోని చీకటి కోణాలను (Shadows) మీరు అంగీకరించనంత వరకు ట్రిగ్గర్స్ మిమ్మల్ని శాసిస్తూనే ఉంటాయని సైకాలజీ చెప్తుంది. మీరు ఎవరిని ఎక్కువగా ద్వేషిస్తున్నారో, వారిలో మీకు నచ్చని లక్షణం మీలోనే ఎక్కడో దాగి ఉందేమో ఒక్కసారి ఆలోచించండి.
4. ట్రిగ్గర్స్ ని అధిగమించడం
Genius Matrix Hub ఫిలాసఫీ Break, Build, Beyond ప్రకారం, మీ ఎమోషనల్ రిమోట్ ని మీ చేతుల్లోకి తెచ్చుకోండి.
Step 1: The Observer State
ట్రిగ్గర్ అయినప్పుడు వెంటనే రియాక్ట్ అవ్వకండి. ఆ క్షణంలో "నేను ఈ కోపానికి బానిసను కాదు, ఇది నా పాత గాయం" అని మిమ్మల్ని మీరు గమనించండి (Observer mode). ఆ క్షణికావేశాన్ని 'Break' చేయడమే మీరు చేయాల్సిన మొదటి పని.
Step 2: Trigger Rewiring
మీ ట్రిగ్గర్‌ను ఒక లెసన్‌లా మార్చుకోండి. "ఈ వ్యక్తి నన్ను ఎందుకు బాధపెట్టాడు?" అని కాకుండా, "నాలో ఏ భయం ఈ వ్యక్తి మాటతో బయటపడింది?" అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ విశ్లేషణ మీలో ఎమోషనల్ స్ట్రెంత్‌ని 'Build' చేస్తుంది.
Step 3: Emotional Freedom
ఒక్కసారి మీ ట్రిగ్గర్స్ మీకు అర్థమైతే, ఎవరూ మిమ్మల్ని కంట్రోల్ చేయలేరు. విమర్శలు చేసినా, అవమానించినా మీరు ప్రశాంతంగా ఉంటారు. ఇదే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు మీ ఎమోషన్స్ కు మాస్టర్ గా ఉంటారు.
5. మీ ఎమోషనల్ మ్యాప్
ఈ రోజు ఒక చిన్న పని చేయండి.
* ఈ వారం మీకు కోపం తెప్పించిన లేదా బాధపెట్టిన మూడు సందర్భాలను గుర్తు తెచ్చుకోండి.
* ఆ సమయంలో మీ మనసులో మొదట వచ్చిన ఆలోచన ఏంటి? (అది భయమా? అవమానమా? తక్కువగా చూస్తున్నారనే ఫీలింగా?)
* ఆ భావన మీ చిన్నప్పుడు ఎక్కడ మొదలైందో ఒక్కసారి ఆలోచించండి.
కోపం ఒక హెచ్చరిక, ఆయుధం కాదు!
బ్రో, కోపం లేదా బాధ అనేది ఒక తప్పుడు రియాక్షన్ కాదు, అది ఒక హెచ్చరిక. "నీ మనసులో ఎక్కడో గాయం ఉంది, దాన్ని నయం చేయి" అని అది మీకు చెప్తోంది. ఆ హెచ్చరికను విని, ఆ గాయాన్ని నయం చేసుకోండి.
గుర్తుంచుకోండి, "Between stimulus and response there is a space. In that space is our power and our freedom." (Victor Frankl). ఆ స్పేస్‌లో మీరు గెలిస్తే, మీ వ్యక్తిత్వం అద్భుతంగా మారుతుంది.
-సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com


