ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! | can you explain the concept of acceptance in Personality development | Sakshi
Sakshi News home page

ముసుగు వెయ్యొద్దు మనసు మీద..! లోపాలను దాచొద్దు..

Feb 28 2026 7:10 AM | Updated on Feb 28 2026 7:10 AM

can you explain the concept of acceptance in Personality development

పర్సనాలిటీ డెవలప్‌మెంట్ అంటే చాలామంది తమలో ఉన్న లోపాలన్నింటినీ కప్పెట్టేసి, ఒక పర్ఫెక్ట్ ముసుగు వేసుకోవడం అనుకుంటారు. "నేను ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా ఉండాలి", "నాకు అసలు భయం వేయకూడదు" అని తమకు తాము అబద్ధాలు చెప్పుకుంటారు.

కానీ సైకాలజీ ప్రకారం, మీలోని లోపాన్ని మీరు అంగీకరించనంత కాలం, దాన్ని మీరు మార్చలేరు. అంగీకారం (Acceptance) అనేది బలహీనత కాదు, అది మార్పుకు అవసరమైన అసలైన ధైర్యం.

అంగీకారమే మార్పుకు ద్వారం
కార్ల్ రోజర్స్ తన 'Client-Centered Therapy'లో ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పారు. మనం మనలోని ఏదైనా ఒక నెగటివ్ లక్షణాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని అసహ్యించుకుంటున్నంత కాలం, మన మెదడు ఆ లక్షణాన్ని డిఫెన్స్ మోడ్‌లో రక్షిస్తుంది. ఉదాహరణకు, అతిగా కోపం రావడం లేదా అసూయ పడటం.

కానీ, "అవును, ప్రస్తుతం నాలో ఈ కోపం ఉంది" అని మీరు ఎప్పుడైతే నిజాయితీగా అంగీకరిస్తారో, అప్పుడు మీ మనసులో ఉన్న ఆందోళన (Anxiety) తగ్గుతుంది. ఆ ప్రశాంతతలోనే మార్పు సాధ్యమవుతుంది.

ముసుగుల భారం
సో-కాల్డ్ ట్రైనర్లు మిమ్మల్ని ఎప్పుడూ "నటన" చేయమని ప్రోత్సహిస్తారు. "నీ బలహీనతలను ఎవరికీ చూపించకు, పులిలా గర్జించు, లోపల ఏమున్నా బయటకు మాత్రం తోపులా కనిపించు" అని చెప్తారు.

ఇది మీలో 'Incongruence' (అంతర్ఘర్షణ) పెంచుతుంది. బయట మీరు గొప్పగా నటిస్తున్నా, లోపల మీ 'Real Self' కు అది అబద్ధం అని తెలుసు. ఈ అబద్ధం మీ సెల్ఫ్-ఎస్టీమ్ (Self-esteem) ని దెబ్బతీస్తుంది. నిజమైన వికాసం అంటే లోపాలను దాచడం కాదు, వాటిని అంగీకరించి, బాధ్యత తీసుకోవడం.

అంగీకారం అంటే రాజీ పడటం కాదు
"నన్ను నేను ఇలాగే ఒప్పుకుంటే ఇక నేను ఎప్పటికీ మారలేనేమో?" అని చాలామందికి అనుమానం ఉంటుంది

Resignation (నిరాశ): "నేను ఇంతే, నా జీవితం మారదు" అని వదిలేయడం బలహీనత.
Acceptance (అంగీకారం): "ప్రస్తుతానికి నేను ఈ స్థితిలో ఉన్నాను, ఇది నా వాస్తవం. ఇక్కడి నుండి నేను ఎలా ముందుకు వెళ్ళాలి?" అని ఆలోచించడం బలం.

ఉదాహరణకు, ఒక వ్యక్తికి స్టేజ్ ఫియర్ ఉందనుకోండి. "నాకు భయం లేదు" అని నటించడం కంటే, "అవును, నాకు స్టేజ్ ఎక్కాలంటే భయంగా ఉంది.. ఈ భయాన్ని జయించడానికి నేను ఏం చేయాలి?" అనడం నిజమైన పర్సనాలిటీ గ్రోత్.

అంగీకార ప్రక్రియ
Genius Matrix మోడల్ ఉపయోగించి మనల్ని మనం ఎలా అంగీకరించాలో చూద్దాం.
Step 1: అవమానాన్ని బద్దలు కొట్టండి
మన లోపాలను ఒప్పుకోవడానికి మనకు అడ్డుపడేది 'సిగ్గు' (Shame). "నాలో ఈ లోపం ఉందని తెలిస్తే నలుగురు ఏమనుకుంటారు?" అనే భయాన్ని 'Break' చేయండి. మీ లోపాలు మిమ్మల్ని తక్కువ మనిషిని చేయవు, అవి మిమ్మల్ని ఒక 'మనిషి'గా చూపిస్తాయి.

Step 2: నిజాయితీ గల పునాది
మీ బలహీనతలను ఒక పేపర్ మీద రాయండి. వాటిని చూసి బాధపడకండి. "అవును, ఇవి నాలో ఉన్నాయి" అని గట్టిగా చదవండి. ఎప్పుడైతే మీరు వాటిని వెలుగులోకి తెస్తారో, వాటికి మిమ్మల్ని భయపెట్టే శక్తి పోతుంది. ఇక్కడే మీ కొత్త వ్యక్తిత్వానికి పునాది 'Build' అవుతుంది.

Step 3: పరిపూర్ణతకు ఆవల
పరిపూర్ణత (Perfection) అనేది ఒక భ్రమ. మనం మనుషులం, దేవుళ్ళం కాదు. మన లోపాలను అంగీకరిస్తూనే, వాటిని మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళడమే 'Beyond' స్టేజ్. ఇక్కడ మీరు ఎవరికీ సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉండదు.

మీతో మీరు సంధి చేసుకోండి
ఈ రోజు ఒక ప్రశాంతమైన చోట కూర్చుని ఈ చిన్న పని చేయండి.

మీలో మీకు నచ్చని మూడు విషయాలను గుర్తించండి. ఉదా: బద్ధకం, అసూయ, ఫిజికల్ అప్పియరెన్స్.

ఆ మూడు విషయాల వైపు చూస్తూ.. "నిన్ను నేను అంగీకరిస్తున్నాను, నిన్ను మార్చుకోవడానికి నేను ప్రయత్నిస్తాను" అని మనసులో అనుకోండి.

ఈ అంగీకారం తర్వాత మీ మనసు ఎంత ప్రశాంతంగా ఉందో గమనించండి.

గాయాలే మీ గుర్తులు!
బ్రో, ఒక పగిలిన కప్పును బంగారంతో అతికించినప్పుడు (Kintsugi Art), అది మామూలు కప్పు కంటే ఎక్కువ విలువను, అందాన్ని పొందుతుంది. మన లోపాలు కూడా అంతే. వాటిని దాచకండి, వాటిని అంగీకరించి గౌరవించండి. అప్పుడే మీరు మీ Real Personality ని ప్రపంచానికి చూపగలరు.

గుర్తుంచుకోండి, "You can't heal what you don't reveal."

సైకాలజిస్ట్ విశేష్ 
Genius Matrix Hub 
8019 000066
www.psyvisesh.com

(చదవండి: The Inner Critic: మిమ్మల్ని నిరంతరం వెనక్కిలాగే శత్రువుని జయించాలంటే..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement