మనం ప్రతిరోజూ అద్దం ముందు నిలబడి జుట్టు సర్దుకుంటాం, మేకప్ వేసుకుంటాం. కానీ మన కంటికి కనిపించని మరొక అద్దం మన మనసులో ఉంది. అక్కడ మన గురించి మనం ఒక చిత్రాన్ని గీసి ఉంచాం. సైకాలజీలో దీన్నే 'Self-Image' (స్వీయ ప్రతిబింబం) అంటారు. ఇదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
ఎస్, ప్రపంచం మిమ్మల్ని ఎలా చూస్తుంది అనేది కాదు, మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారు అనేదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది.
మాక్స్‌వెల్ మాల్ట్జ్ పరిశోధన...
డాక్టర్ మాక్స్‌వెల్ మాల్ట్జ్ ఒక ప్లాస్టిక్ సర్జన్. ప్రమాదాల్లో ముఖం దెబ్బతిన్న వారికి లేదా పుట్టుకతో లోపాలు ఉన్నవారికి ఆయన ఆపరేషన్ చేసేవారు. చాలామంది ఆపరేషన్ తర్వాత కొత్త ముఖంతో ఆత్మవిశ్వాసంతో ఉండేవారు. కానీ కొంతమంది మాత్రం, ముఖం పర్ఫెక్ట్‌గా మారినా, "డాక్టర్, నా ముఖం ఇంకా అలాగే ఉంది, నేను ఇంకా వికారంగానే కనిపిస్తున్నాను" అని చెప్పేవారు.
మనం బయట ఎన్ని మార్పులు చేసినా, మన మనసులోని అద్దంలో ఉన్న చిత్రం (Mental Blueprint) మారకపోతే ఏదీ మారదని ఆయనకు అర్థమైంది. దీన్నే ఆయన 'Psychocybernetics' అన్నారు. అంటే మన మెదడు ఒక ఆటో-పైలట్ మెకానిజం లాంటిది; మన అంతరంగంలో మన గురించి మనం ఎలాంటి చిత్రం గీసుకుంటే, మన జీవితం అటువైపే ప్రయాణిస్తుంది.
సెల్ఫ్-ఇమేజ్: మీ జీవితపు థర్మోస్టాట్
మీ ఇంట్లోని ఏసీ 24 డిగ్రీల దగ్గర ఉందనుకోండి, బయట ఎండ ఎంత ఉన్నా అది గదిని 24 దగ్గరే ఉంచుతుంది. మీ సెల్ఫ్-ఇమేజ్ కూడా మీ జీవితానికి ఒక థర్మోస్టాట్ లాంటిది.
ఒక విద్యార్థి "నేను యావరేజ్ స్టూడెంట్ని" అని నమ్మితే, అతను ఎంత బాగా చదివినా చివరికి యావరేజ్ మార్కులే తెచ్చుకుంటాడు. ఎందుకంటే, అతని సబ్-కాన్షియస్ మైండ్ అతన్ని అంతకు మించి వెళ్లనివ్వదు.
ఒక వ్యక్తి "నాకు అదృష్టం లేదు" అని నమ్మితే, అద్భుతమైన అవకాశం తలుపు తట్టినా దాన్ని అతను చేజేతులా వదిలేస్తాడు.
పాజిటివ్ థింకింగ్ ఎందుకు విఫలమవుతుంది?
పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్స్, మోటివేషనల్ స్పీకర్స్ మనకు "నువ్వు గొప్పవాడివి అని గట్టిగా అరువు" అని చెప్తారు. కానీ "నేను దేనికీ పనికిరాను" అని మీ అంతరంగంలో మీరు నమ్ముతున్నంత కాలం, ఆ అరుపులు కేవలం శబ్దాలుగానే మిగిలిపోతాయి. మార్కెట్ విల్ పవర్ వాడమంటుంది. సైకాలజీ ఇమాజినేషన్ వాడమంటుంది.
మన సెల్ఫ్-ఇమేజ్ లోపల ఎంత బలంగా ఉంటుందంటే, దానికి వ్యతిరేకంగా మనం చేసే ప్రయత్నాలన్నీ నీటి మీద గీతలు లాంటివే. మనల్ని మనం మార్చుకోవాలంటే మన విల్ పవర్ ని కాదు, మన సెల్ఫ్-ఇమేజ్ ని మార్చాలి.
మీ లోపలి అద్దాన్ని క్లీన్ చేసుకోండి
Genius Matrix మోడల్ బ్రేక్, బిల్డ్, బియాండ్ ఉపయోగించి ఈ సెల్ఫ్-ఇమేజ్ ని ఎలా రీ-డిజైన్ చేయాలో చూద్దాం.
Step 1: Break (పాత ముద్రను గుర్తించడం)
ముందుగా అద్దంలో మీకు కనిపించని ఆ 'నెగటివ్ ఇమేజ్' ను గుర్తించండి.
"నేను ఒక పిరికివాడిని," "నేను ఎప్పుడూ ఫెయిల్ అవుతాను" వంటి వాక్యాలు మీ మైండ్ లో ఎప్పుడు పడ్డాయి?
మనసులో ఉన్న ఆ పాత గాయాలకు ప్లాస్టిక్ సర్జరీ చేయాలి. పాత ముద్రను 'Break' చేయడమే మొదటి మెట్టు.
Step 2: Build (మెంటల్ రిహార్సల్)
మాక్స్‌వెల్ మాల్ట్జ్ ఒక గొప్ప టెక్నిక్ చెప్పారు—'Creative Visualization'.
ప్రతిరోజూ 10 నిమిషాలు కళ్ళు మూసుకుని, మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో అలాంటి వ్యక్తిగా మిమ్మల్ని మీరు ఊహించుకోండి.
మీ మెదడుకు వాస్తవానికి, ఊహకు మధ్య తేడా తెలియదు. మీరు పదే పదే ఒక కొత్త చిత్రాన్ని ఇస్తే, అది పాత సెల్ఫ్-ఇమేజ్ ని తుడిచేసి కొత్తదాన్ని 'Build' చేస్తుంది.
Step 3: Beyond (కొత్త అస్తిత్వం)
ఒక్కసారి మీ సెల్ఫ్-ఇమేజ్ మారితే, మీరు మీ పరిమితులను దాటి ప్రయాణిస్తారు. మీరు ఎవరికో ఏదో నిరూపించాల్సిన అవసరం ఉండదు. మీరు మీ మనసు లోపలి అద్దంలో ఒక 'విన్నర్' గా కనిపిస్తారు. ఇదే 'Beyond' స్టేజ్.
అద్దం అబద్ధం చెప్పదు!
ఈ రోజు మీరు ఒక చిన్న ఎక్సర్‌సైజ్ చేయండి:
కళ్ళు మూసుకుని, ఒక వ్యక్తిగా మీ గురించి మీరు ఏమనుకుంటున్నారో ఒక వాక్యంలో రాసుకోండి. (అది మీ సెల్ఫ్-ఇమేజ్).
ఆ వాక్యం నిజమేనా? దానికి ఆధారాలు ఏంటి?
మీరు ఎలా ఉండాలని కోరుకుంటున్నారో ఆ కొత్త ఇమేజ్ ని ఇప్పుడే డిజైన్ చేయండి. దాన్ని రోజూ ప్రాక్టీస్ చేయండి.
లోపలి అందమే అసలైన శక్తి!
బ్రో, ముఖానికి వేసుకునే రంగులు వర్షం వస్తే పోతాయి. కానీ మనసులో వేసుకునే ఈ 'సెల్ఫ్-ఇమేజ్' రంగులు జీవితాంతం ఉంటాయి. మీ మనసు లోపలి అద్దంలో ఉన్న మలినాలను తుడిచేయండి. మీరు ఒక అద్భుతమైన సృష్టి అని ముందు మీరు నమ్మండి.. ప్రపంచం దానంతట అదే నమ్ముతుంది. గుర్తుంచుకోండి, "You cannot outperform your own self-image."
సైకాలజిస్ట్ విశేష్
Genius Matrix Hub
8019 000066
www.psyvisesh.com


