breaking news
Hanamkonda
-
ఉల్లం‘ఘనుల’పై కొరడా
‘గ్రేటర్’ ట్రేడ్ వ్యాపార సంస్థలకు కమర్షియల్ ట్యాక్స్వీఎల్టీపై బాదుడే ● జల్లెడ పడుతున్న రెవెన్యూ, ప్రజారోగ్య విభాగం సిబ్బంది ● గ్రేటర్ వరంగల్ ఆదాయం పెంపే లక్ష్యంగా ప్రత్యేక బృందాలు ● కమిషనర్ వార్నింగ్‌తో కదిలిన యంత్రాంగం వరంగల్ అర్బన్ : బల్దియాకు ప్రతీ ఏడాది రావా ల్సిన రూ.కోట్ల ఆదాయం చేజారిపోయింది. అన్నీ తెలిసి చేతివాటానికి అలవాటు పడిన అధికారులు కళ్లున్నా కబోధులయ్యారు. అడ్డదారిలో జేబులను నింపుకుంటున్నారు. ఇటీవల గ్రేటర్ వరంగల్ కమిషనర్‌గా విధుల్లో చేరిన చాహత్ బాజ్ పాయ్ పిన్‌పాయింట్‌గా లెక్కలు వేసి తప్పిదాలను బహిర్గతం చేయడంతో ఆయా విభాగాల అధికారులు, సిబ్బంది గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆస్తిపన్ను, ట్రేడ్ లైసెన్స్ పన్నుల్లో తేడాలొస్తే – మిగతా 4లోuలెక్క.. పక్కా వాణిజ్య, నివాస గృహాల పన్ను మగింపును ఒకవైపు భువన్ యాప్ ద్వారా కొలతల తీసుకోవడంతోపాటు మాన్యువల్‌గా కొలతలు వేసేందుకు బల్దియా పన్నుల విభాగం సిబ్బంది రంగంలోకి దిగారు. జోన్ల వారీగా భవనాల పింత్ ఏరియాను వడబోసి పన్ను కేటాయింపులు చేపట్టేందుకు శ్రమిస్తున్నారు. నామమాత్రపు పన్ను చెల్లిస్తూ బల్దియా ఆదాయానికి గండి కొడుతున్న వారిపై కొరడా ఝుళిపించనున్నారు. నిర్మాణాలను అంగుళం వదలకుండా వాణిజ్య, నివాస నిర్మాణాలను కొలతలు వేసి పన్ను బాదుతారు. అంతేకాకుండా ట్రేడ్ లైసెన్స్ తీసుకోని వాణిజ్య సంస్థలకు రెట్టింపు చార్జీలు విధిస్తూ పన్ను బాదనున్నారు. దీంతో వ్యాపార, నివాస యజమానులకు కొంత ఆందోళన కలుగుతోంది. ఇంతకాలం పన్ను ఎగ్గొట్టడానికి అలవాటుపడిన వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఏది ఏమైనా కొత్త కమిషనర్ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
● భక్తులకు సౌకర్యాల కల్పనపై ప్రత్యేక దృష్టి పెట్టండి ● రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ ● మేడారంలో అమ్మవార్లకు పూజలు, మాస్లర్ ప్లాన్‌పై పరిశీలన
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారంలో భక్తుల సౌకర్యార్థం శాశ్వత నిర్మాణాల కోసం రూపొందిస్తున్న మాస్టర్ ప్లాన్ పక్కాగా ఉండాలని రాష్ట్ర దేవాదాయశాఖ ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్ అన్నారు. గురువారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారం ఐటీడీఏ గెస్ట్‌హౌస్ సమావేశ మందిరంలో కలెక్టర్ దివాకర టీఎస్, అడ్వయిజర్ గోవిందహరిలతో కలిసి ఆమె 2026లో నిర్వహించనున్న మహాజాతరపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారామయ్యర్ మాట్లాడుతూ మేడారం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాల ఏర్పాటు కోసం స్టూడియో వన్ ఆర్కిటెక్ట్ డిజైనర్లు రూపొందించిన మాస్టర్‌ప్లాన్‌పై క్షేత్రస్థాయిలో పరిశీలన, పూజారులు, అధికారులతో చర్చించేందుకు సమావేశ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పనుల మాస్టర్ ప్లాన్ నివేదికను కమిటీ క్షేత్రస్థాయిలో పరిశీలించి, పక్కా ప్రణాళికతో రూపొందించాలన్నారు. కోటిన్నరమంది భక్తులు హాజరయ్యే ఈ నాలుగు రోజుల మహాజాతరకు జిల్లా యంత్రాంగం తగిన ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని, గత జాతర అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వసతులు కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు మహేందర్, సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేష్, ఏపీఓ వసంతరావు, మేడారం ఈఓ వీరస్వామి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, పూజారులు, అధికారులు పాల్గొన్నారు. మాస్లర్ప్లాన్పై క్షేత్రస్థాయిలో పరిశీలన.. మేడారంలో శాశ్వత నిర్మాణాలపై స్టూడియో వన్ అర్కిటెక్ట్ డిజైనర్ల బృందం రూపొందించిన మాస్ట ర్ప్లాన్పై ముఖ్య కార్యదర్శి శైలజారామయ్యర్, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎండోమెంట్ అడ్వయిజర్ గోవిందహరి, జిల్లా అధికారులతో కలిసి మేడారం పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జంపన్నవాగు, చిలకలగుట్ట, ఆర్టీసీ బస్టాండ్ వైజంక్షన్ ప్రాంతాలను సందర్శించారు. ఈప్రాంతాల్లో రూపొందించిన మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనుల వివరాలను అధికారులు అమెకు వివరించారు. గద్దెల విస్తీర్ణంపై పూజారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కమిటీ ఏర్పాటు చేసుకుని మార్పులు, చేర్పులపై వివరిస్తామని పూజారులు తెలిపారు. కన్నెపల్లిలోని సారలమ్మ గుడిని శైలజారామయ్యర్ సందర్శించి పరిశీలించారు. ముందుగా వారు సమ్మక్క– సారలమ్మలను దర్శించుకుని పూజలు చేశారు. శైలజారామయ్యర్‌కు జగ్గారావు బెల్లం ప్రసాదం అందజేశారు. -
ఊరి మధ్యలో.. ఊడల మర్రి
శాయంపేట : ఇంతింతై..వటుడింతై అన్నట్లు.. మర్రి మొక్క, ఊడలతో మహా వృక్షంగా మారింది. ఊరి మధ్యలో నాటిన మర్రి మొక్క.. నేడు ఊడలతో ఎందరికో నీడనిస్తోంది. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం జోగంపల్లి సెంటర్లో ఊడల మర్రి, రాళ్లచెట్టు 30ఏళ్లుగా గ్రామస్తులకు నీడను అందిస్తున్నాయి. జోగంపల్లి నుంచి వేరే గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ఎండ, వానకు నీడనిచ్చి కాపాడుతోంది. అంతేకాకుండా గ్రామంలోని వృద్ధులు ఉదయం నుంచి సాయంత్రం వరకు మర్రిచెట్టు నీడన కూర్చొని కాలక్షేపం చేస్తున్నారు. 35ఏళ్ల క్రితం కూచన మొగిలి అనే వ్యక్తి.. ఊడల మర్రి, రాళ్ల చెట్లను నాటడంతో అవి పెరిగి మహా వృక్షాలై వాటి నీడన సేదదీరుతున్నామని గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే మర్రిచెట్టు నీడను రచ్చబండగా మార్చేశారు. ఈ చెట్టు నీడన సైకిల్ షాపు, పచార్ కొట్టు, సెలూన్ షాపులను ఏర్పాటు చేసుకొని జీవనోపాధి పొందుతున్నారు. మర్రి నీడన కాలక్షేపం చేస్తా.. 35ఏళ్ల క్రితం గ్రామంలో ఒకరు చనిపోగా కట్టెల కోసం వెళ్లా. కట్టెల మొదలల్లో మర్రి, రాళ్ల చెట్ల మొలక ఉండడాన్ని గమనించి వాటిని గ్రామంలోని సెంటర్లో ఉన్న ఖాళీ స్థలంలో నాటిన. అవి నేడు ఊడల మర్రిగా.. మహా వృక్షంగా మారడాన్ని చూస్తే ఎంతో ఆనందంగా ఉంది. నేను రోజు మర్రి నీడన కాలక్షేపం చేస్తాను. ప్రతీ ఒక్కరు తమ ఇళ్లలో తల్లిదండ్రుల పేరుతో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. – కూచన మొగిలి, గ్రామస్తుడు -
న్యూస్‌రీల్
స్టాక్ ట్రేడింగ్ పేరుతో రూ.12 లక్షలు స్వాహాభూపాలపల్లి అర్బన్: స్టాక్ ట్రేడింగ్ పేరిట రూ.12లక్షలు సైబర్ నేరగాళ్లు స్వాహా చేశారు. ఈ ఘటన భూపాలపల్లి పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక సీఐ నరేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కృష్ణాకాలనీకి చెందిన ఓ ఉద్యోగిని నాలుగు రోజుల క్రితం వాట్సాప్ ద్వారా స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ అడ్వయిజర్లమని కావ్య, సంధ్య అనే మహిళలు సంప్రదించారు. పెట్టుబడి ప్రణాళికలను వివరిస్తూ మీరు కేవలం 15 రోజుల్లో 50శాతం లాభాలు పొందవచ్చని నమ్మించారు. దీంతో ఆశపడిన సదరు ఉద్యోగి మొదట రూ.లక్ష పెట్టుబడి పెట్టగా, దానికి లాభాలు వచ్చాయని సైబర్ నేరగాళ్లు పంపించారు. ఆ తరువాత బాధితుడు దశల వారీగా రూ.12లక్షల వరకు పెట్టుబడి పెట్టాడు. రెండు రోజుల తరువాత సైబర్ నేరగాళ్లు వాట్సాప్ నంబర్లు మార్చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు భూపాలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో భద్రకాళిహన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా గురువారం ఎనిమిదవ రోజు అమ్మవారిని ఉగ్రప్రభ, త్వరితాక్రమాల్లో పూజలు నిర్వహించారు. అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించి పూలమాలలతో అలంకరించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రప్రభమాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని త్వరితామాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జాతీయ సదస్సు బ్రోచర్ ఆవిష్కరణ కేయూ క్యాంపస్ : హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ, పీజీ కళాశాలలో వాణిజ్య శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో రెండ్రోజుల పాటు జరిగే జాతీయ సదస్సు బ్రోచర్‌ను గురువారం కేయూ వీసీ ప్రొఫెసర్ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వి.రామచం ద్రం, ఆ కళాశాల ప్రిన్సిపాల్ బి.చంద్రమౌళితో కలిసి ఆవిష్కరించారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో ఈ సదస్సు నిర్వహించనున్నట్లు చంద్రమౌళి తెలిపారు. ఆర్థిక రంగంలో మానవ వనరుల నిర్వహణ, నివేదికల విశ్లేషణకు ఈ సదస్సు దోహదం చేస్తుందని సదస్సు కన్వీనర్ డాక్టర్ పెండ్యాల రాజిరెడ్డి తెలిపారు. కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.రాజేందర్, వైస్ ప్రిన్సిపాల్ జి.సుహాసిని, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ సురేష్‌బాబు, వాణిజ్యశాస్త్ర విభాగం అధిపతి సారంగపాణి, అధ్యాపకులు రాజు, సుమలత, సమత, సురేష్, హేమలత తదితరులు పాల్గొన్నారు. తీర్థయాత్రలకు ప్రత్యేక రైలుజనగామ: దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను సందర్శించేందుకు రైల్వే శాఖ భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రెయిన్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొ చ్చిందని టూరిజం అసిస్టెంట్ మేనేజర్(ఐఆర్సీటీసీ) పీవీ వెంకటేష్ తెలిపారు. జనగామ రైల్వేస్టేషన్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ నుంచి 26 వరకు తీర్థయాత్రల కోసం ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు స్పష్టం చేశారు. దివ్యదక్షిణ జ్యోతిర్లింగ యాత్రలో భాగంగా తిరువణ్ణామలై(అరుణాచలం), రామేశ్వరం, మధురై, కన్యాకుమారి, త్రివేండ్రం, తిరుచ్చి, తంజావూరు క్షేత్రాలను సందర్శించవచ్చన్నారు. ఒక్కొక్కరికీ సాధారణ టికె ట్ రూ.14,100, థర్డ్ ఏసీ రూ.22,300, సెకండ్ ఏసీ రూ.29,200 టికెట్ ధర నిర్ణయించినట్లు తెలిపారు. ఆసక్తి ఉన్న వారు టికెట్ బుకింగ్‌కోసం 97013 60701, 92810 30711, 9281030 712, 92814 95843, 92810 30750 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
‘ప్రత్యేక’ పిల్లలకు విశిష్ట బోధన
విద్యారణ్యపురి: ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం ప్రభుత్వం భరోసా భవిత కేంద్రాలు నిర్వహిస్తోంది. శారీరక, మానసిక వైకల్యం ఉన్న పిల్లలను భవిత కేంద్రాలల్లో చేర్పించి పాఠశాల స్థాయి చిన్నారులకు ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్, రిసోర్స్పర్సన్లతో ప్రత్యేకంగా విద్యను బోధించనున్నారు. మండలానికో కేంద్రం హనుమకొండ జిల్లాలో ప్రతీ మండలానికి ఒక భవిత కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సర్వశిక్షా అభియాన్ కింద ఈసెంటర్లను ఏర్పాటు చేశారు. హనుమకొండ, పరకాలలో శాశ్వత భవనంతో కూడిన భవిత కేంద్రాలున్నాయి. మిగతా మండలాల్లో ప్రభుత్వ పాఠశాలల్లోనే ఓగదిలో నడిపిస్తున్నారు. ప్రతి భవిత సెంటర్లో 16మంది చొప్పున ప్రత్యేక అవసరాల పిల్లలకు అవకాశం కల్పిస్తున్నారు. భవిత సెంటర్లో ఐఈఆర్పీ(బోధకుడు) ఆయా పిల్లలకు ప్రత్యేక పద్ధతుల్లో బొమ్మలు చూపిస్తూ.. వారి వైకల్యాన్ని బట్టి వారికి అర్థమయ్యేలా టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్‌తో విద్యను బోధిస్తుంటారు. ఈభవిత సెంటర్‌కు కూడా రాలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు ఇంటివద్దనే హోమ్ బేస్డ్ విద్యను సైతం అందిస్తున్నారు. ప్రతీ శనివారం ఒక్కో ఐఈఆర్పీ కనీసం 8 మంది ప్రత్యేక అవసరాల పిల్లల వద్దకు వెళ్లి వారికి అనుగుణంగా విద్యను నేర్పించాల్సి ఉంటుంది. ఫిజియోథెరపీ వైద్యం.. రెమ్యునరేషన్ ప్రతీ భవిత సెంటర్లో ఫిజియోథెరఫిస్ట్‌ను అందుబాటులో ఉంచుతారు. శారీరకంగా వైకల్యాన్ని బట్టి ఫిజియోథెరపీ చేస్తారు. గతంలో వారానికి ఒక్కరోజే వీరు భవిత సెంటర్‌కు వచ్చి ఫిజియోథెరపీ చేసేవారు. ఈవిద్యా సంవత్సరం నుంచి వారంలో రెండు రోజులు చేయనున్నారు. కాగా భవిత సెంటర్లకు పిల్లల్ని తీసుకొచ్చే తల్లిదండ్రులకు నెలకు రూ 500లు, పిల్లలకు ఒక్కొక్కరికి నెలకు రూ 500లు చొప్పున రవాణా భత్యం ఇస్తున్నారు. ఈవిద్యాసంవత్సరంలో హనుమకొండ జిల్లాలో 1,841 మంది పిల్లలు ప్రత్యేక అవసరాల పిల్లలున్నట్లుగా సంబంధిత అధికారులు చెబుతున్నారు. సొంత భవనాలు రెండింటికే హనుమకొండ మండల కేంద్రంలో, పరకాలలోని భవిత కేంద్రాలకు సొంత భవనాలున్నాయి. వీటిని అందంగా తీర్చిదిద్దారు. ఈరెండు భవిత కేంద్రాలకు ఒక్కొ భవిత కేంద్రానికి రూ. 2 లక్షలు చొప్పున మంజూరయ్యాయి. ఆ నిధులతో పిల్లలను ఆకట్టుకునే బొమ్మలు, మెటీరియల్ కొని ఉంచారు. మరో రెండింటికి రూ.7 లక్షలు హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరి ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ స్థలం ఉండడంతో భవిత కేంద్రం నిర్వహించేందుకు ఒక గదిని నిర్మించేందుకు కొన్ని నెలల క్రితం రూ.7 లక్షలు మంజూరయ్యాయి. హసన్‌పర్తి మండలం భీమారంలోని ప్రాథమిక పాఠశాలలో భవిత కేంద్రాన్ని నడుపుతున్నారు. అక్కడ సైతం గది నిర్మాణానికి రూ.7 లక్షలు మంజూరయ్యాయి. వీటిని త్వరలోనే నిర్మించనున్నారు. కాగా.. మిగతా చోట్ల మరమ్మతులకు టాయ్‌లెట్స్ ర్యాంపులకు ఒక్కో భవిత కేంద్రానికి రూ.లక్ష జిల్లాలో ఐనవోలు, కమలాపూర్, మడికొండ, కంఠాత్మకూరు, పత్తిపాక, వేలేరు, అక్కంపేట, భీమదేవరపల్లి, దామెర స్కూళ్లలో నడుపుతున్న భవిత సెంటర్ల మరమ్మతులకు రూ.లక్ష చొప్పున నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా జిల్లాలోని 14 భవిత కేంద్రాలకు పేయింటిం కోసం ఒక్కో భవిత కేంద్రానికి రూ ఒక లక్ష 50 వేల చొప్పున నిధులు మంజూరయ్యాయి. జిల్లాలో మొత్తం రూ.63.25 లక్షల నిధులు మంజూరయ్యాయి. ప్రత్యేక పిల్లలకు‘ భవిత’ తోడ్పాటు గ్రామాల్లోని ప్రత్యేక అవసరాల పిల్లల్ని సిబ్బంది గుర్తించి భవిత కేంద్రాల్లో చేర్పించనున్నారు. పిల్లలకు ఉచిత పాఠ్యపుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ఫిజియోథెరపీ, ప్రత్యేకంగా బోధన ఉంటుంది. భవిత కేంద్రాలను ప్రత్యేక అవసరాల పిల్లల తల్లిదండ్రులు వినియోగించుకోవాలి. – బద్దం సుదర్శన్ రెడ్డి, జిల్లా కమ్యునిటీ మొబిలింగ్ కోఆర్డినేటర్ జిల్లాలో భరోసా భవిత కేంద్రాలు రెండింటికి ప్రత్యేక నిధులు, శాశ్వత భవనాలు వైకల్యం ఆధారంగా విద్యా బోధన వారానికి రెండు సార్లు ఫిజియోథెరపీ జిల్లాలో 1841 మంది ప్రత్యేక అవసరాలున్న పిల్లలు -
విపత్తు నిర్వహణ ప్రణాళికలు రూపొందించాలి
న్యూశాయంపేట: ప్రజల భాగస్వామ్యంతోనే సమర్థవంతంగా విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (ఎన్డీఎంఏ) జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ అన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ సత్యశారద అధ్యక్షతన గురువారం జరిగిన సమావేశంలో నావల్ మాట్లాడారు. చట్టప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందని పేర్కొన్నారు. విపత్తు నిర్వహణలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ ఉపయోగంపై దృష్టి సారించాలని సూచించారు. కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి విపత్తులను ఎదుర్కొనేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. ముంపు గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించామని, శిథిలావస్థలో ఉన్న ఇళ్లు, పాఠశాలలను గుర్తించినట్లు చెప్పారు. వాటిలో ఉన్నవారిని ముందస్తుగానే ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయి మాట్లాడుతూ బల్దియా ఏర్పాటు చేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తులను ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. సమావేశంలో ఎన్డీఎంఏ అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్ వసీం ఇక్బాల్, గౌతమ్ కృపా, సంధ్రా, అనుపమా, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాశ్ -
శుక్రవారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2025
– 4లోuపక్క ఫొటోలోని సీసీ రోడ్డు వరంగల్‌లోని 42 డివిజన్లో ఇటీవల నిర్మించినది. ఈ రోడ్డు నిర్మాణ పనులకు సుమారు రూ.65 లక్షలకుపైగా నిధులు వెచ్చించారు. అలాగే గవిచర్ల క్రాస్ రోడ్ టీచర్స్ కాలనీలో రోడ్లు వేసిన కొద్ది రోజులకే గుంతలు ఏర్పడిన నీరు నిలిచిన ధ్వంసమవుతున్నాయి.ఈ ఫొటోలో కనిపిస్తున్న హనుమకొండ స్నేహనగర్‌లో రోడ్ నంబర్–17లో గతంలో నిర్మించిన సైడ్ కాల్వ నిర్మాణం ధ్వంసం కావడంతో అందులో మట్టి, నీరు నిలిచింది. పిచ్చిమొక్కలు పెరగడంతో నీరు వెళ్లకుండా మురుగు నీరు ముందుకు పోవడం లేదు. న్యూస్‌రీల్ -
ఎన్నికల విధులపై అవగాహన కలిగి ఉండాలి
హన్మకొండ అర్బన్: ఎన్నికల విధులు, నియమ నిబంధనలపై బూత్ లెవల్ అధికారులు పూర్తిస్థాయి అవగాహనతో ఉండాలని హనుమకొండ ఆర్డీఓ రమేశ్ అన్నారు. గురువారం హనుమకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాల, హైస్కూల్లో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ బీఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హనుమకొండ తహసీల్దార్ రంజిత్‌కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ మాట్లాడుతూ ఓట్ల నమోదు కోసం, తొలగింపు, బదిలీ, మార్పు, చేర్పులకు సంబంఽధించి వినియోగించే ఫారాలపై బీఎల్ఓలకు అవగాహన ఉండాలన్నారు. భారత ఎన్నికల సంఘం తీసుకువచ్చే నూతన మార్పులను తెలుసుకుంటూ విధులు నిర్వహించాలన్నారు. ముఖ్యంగా ఓటర్ల తొలగింపు విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఓటర్ల జాబితాలో నమోదు నిరంతర ప్రక్రియ అన్న విషయంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు నమోదు చేసుకునే విధంగా బీఎల్ఓలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో హనుమకొండ రెవెన్యూ ఇన్స్పెక్టర్లు దశరథ రామ్‌రెడ్డి, శరత్‌కుమార్, ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు. హనుమకొండ ఆర్డీఓ రమేశ్ -
మురికి కాల్వలు అస్తవ్యస్తం
రూ.లక్షలు ఖర్చు చేసి డ్రెయినేజీలు నిర్మిస్తున్న అవి మూణ్ణాళ్ల ముచ్చటగా మారుతున్నాయి. నిర్మాణం సమయంలో కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, సిమెంట్, ఇసుక మోతాదులో వాడకపోవడం వల్ల నాణ్యత లోపిస్తుంది. కాలుతో తన్నితే మురికి కాల్వలు కూలిపోతున్నాయి. కనీసం వానాకాలం సీజన్ వరద రాకముందే దెబ్బతింటున్నాయి. – నద్దునూరి నాగరాజు, చింతగట్టు నిర్మాణాల్లో నాణ్యత పాటించాలి సైడ్ డ్రెయినేజీల నిర్మాణం త్వరగా, తక్కువ ఖర్చు, ఎక్కువ లాభం కోసం రెడ్మిక్స్తో పూర్తి చేస్తున్నారు. పూర్తయిన మురికి కాల్వలకు సరిగా క్యూరింగ్ చేపట్టడం లేదు. పూర్తి నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఇదేంటని అడిగితే వర్క్ అగ్రిమెంట్లో ఇలానే ఉందంటున్నారు. – పెరుగు సురేష్, న్యూశాయంపేట రోడ్లపైకి నీళ్లు వస్తున్నయ్.. వరంగల్ మార్కెట్ ఏరియాలో సీసీ రోడ్లు వేసి సైడ్ డ్రెయినేజీ నిర్మించారు. అయితే కొద్ది రోజులకే డ్రెయినేజీ దెబ్బతినడంతో మురుగునీరు రోడ్లపైకి వస్తుంది. పారిశుద్ధ్యం సరిగా లేక రోడ్లపైకి వస్తున్న బురద దుర్వాసన, దోమలతో చాలా ఇబ్బంది పడుతున్నాం. – మాడిశెట్టి భరత్, పాతవీధి మురుగును భరించలేకున్నాం..ఆర్భాటంగా నిర్మించిన డ్రెయినేజీలు.. ఆ తర్వాత నిర్వహణకు నోచుకోవడం లేదు. 39వ డివిజన్లోని కరీమాబాద్ ప్రాంతంలో మురికికాల్వల్లో చెత్త, మురుగు నిలిచి విపరీతంగా దుర్గంధం వస్తుంది. ఇటీవల వర్షాలకు మురుగు నీరుతోపాటు దోమల వల్ల సీజనల్ వ్యాధులు వస్తున్నాయి. – కొప్పుల రాజ్‌కుమార్, కరీమాబాద్ -
ఓపెన్ స్కూల్ అడ్మిషన్లు పెంచాలి
● హనుమకొండ డీఈఓ వాసంతి విద్యారణ్యపురి: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ లో ఈవిద్యాసంవత్సరం (2025–2026)లో ప్రవేశాలు పెంపుదల చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు. గురువారం హనుమకొండలోని ఓపెన్ స్కూల్ అధ్యయన కేంద్రాల కోఆర్డినేటర్లతో డీఈఓ కార్యాయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్‌కు అర్హులలైన మహిళా సమాఖ్య సభ్యులు 1,800మందికిపైగా జిల్లాలో ఉన్నారని, వారు ప్రవేశాలు పొందేలా కృషి చేయాలని సూచించారు. వారికి ఓపెన్ స్కూల్ విద్య గురించి తెలియజేసి చేరేలా ప్రోత్సహించాలని సూచించారు. అడ్మిషన్ల విధానం, ఎన్ని సబ్జెక్టులు ఉంటాయి అనేది కూడా వివరించాలన్నారు. ఓపెన్ స్కూల్లో ప్రవేశాల లక్ష్యాలను వివరించారు. మళ్లీ ఈనెల 9న సమీక్ష సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. సమావేశంలో జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్ అనగోని సదానందం పాల్గొన్నారు. నేడు శ్రీరుద్రేశ్వరస్వామికి శతఘటాభిషేకం హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో శుక్రవారం ఉదయం శ్రీరుద్రేశ్వరస్వామి వారికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ ధరణికోట అనిల్‌కుమార్, ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో వర్షాలు కురవాలని, పాడిపంటల సమృద్ధి, భూగర్భజలాలు నిండుగా ఉండాలనే సంకల్పంతో రుష్యశృంగపూజ 60 వారుణానువాకాలుతో శ్రీరుద్రేశ్వరుడికి శతఘటాభిషేకం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదాల వితరణ ఉంటుందని తెలిపారు. మహాశాకంబరీ ఉత్సవ ఏర్పాట్లపై సమీక్ష హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 10న గురువారం ఆషాఢ శుద్ధ పౌర్ణమిరోజున మహాశాకంబరీగా అమ్మవారు దర్శనమివ్వనున్నారు. ఈ సందర్భంగా గురువారం కార్యాలయంలో ఈఓ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం జరిగింది. ధర్మకర్తలు, మట్వాడ సీఐ గోపి, ట్రాఫిక్ ఎస్సై సాయికిరణ్ పాల్గొని దేవాలయాన్ని పరిశీలించి శాకంబరీ ఉత్సవాలకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. భక్తులకు క్యూ లైన్లు, తాగునీటి వసతి, బాదంమిల్క్, మజ్జిగ పంపిణి, అదనంగా ప్రసాదాల విక్రయకౌంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు పాలిటెక్నిక్ కాలేజి పక్కగా ప్రవేశించి దర్శనం అనంతరం కాపువాడ మీదుగా బయటకు వెళ్లాలని సూచించారు. వనమహోత్సవంలో భాగంగా ఈఓ శేషుభారతి దేవాలయంలో పూలమొక్కలు నాటారు. నేడు దొడ్డి కొమురయ్య వర్ధంతి కాజీపేట అర్బన్ : హనుమకొండ కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని నిర్వహించనున్నట్లు జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ లక్ష్మణ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు హాజరుకావాలని కోరారు. రోగనిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలి న్యూశాయంపేట: రోగ నిర్ధారణ పరీక్షల లక్ష్యాన్ని అధిగమించాలని భారత ప్రభుత్వ ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి అరుంధతి పట్నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ 100 రోజుల ఇంటెన్సిఫైడ్ క్యాంపెయిన్‌పై గురువారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లా నుంచి కలెక్టర్ డాక్టర్ సత్యశారద పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో 8 రకాల వ్యాధులకు సంబంధించి 2,04,979 మంది రోగులు ఉన్నారని తెలిపారు. వారిలో 3,794 మందికి జూన్ 3 నుంచి రెండో విడత టీబీ, 8 రకాల వ్యాధుల నిర్మూలనకు వైద్య, ఆరోగ్య శాఖ కృషిచేస్తోందని తెలిపారు. టీబీ రహిత జిల్లాగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆమె వివరించారు. అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఎంహెచ్ఓ సాంబశివరావు, అధికారులు పాల్గొన్నారు. -
కోట్లు గుల్ల
నాణ్యత డొల్ల..● ‘గ్రేటర్’లో ఇష్టారాజ్యంగా రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం ● పనుల్లో నాణ్యతకు తిలోదకాలు.. ప్రజాధనం దుర్వినియోగం ● ముసురుకే రోడ్లన్నీ గుంతలమయం... ● మహా నగరవాసులకు తప్పని తిప్పలుసాక్షిప్రతినిధి, వరంగల్ : వరంగల్ నగరంలో నిర్మించిన రోడ్లు, డ్రెయినేజీలు మూడ్రోజుల ముచ్చటగా మారుతున్నాయి. స్మార్ట్ సిటీ, అమృత్, మున్సిపల్ నిధులతో చేపట్టిన పనుల్లో నాణ్యత లోపించి ధ్వంసమవుతున్నాయి. ఇటీవల కురిసిన తేలికపాటి చినుకులకే వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీలోని రోడ్లు, డ్రెయినేజీలు నోళ్లు తెరిచి ఉన్నాయి. దీంతో కిందకు ప్రవహించే నీరు లోతట్టు కాలనీలకు చేరి కుంటను తలపిస్తున్నాయి. దీంతో కాలనీలకు అనుసంధానమైన రోడ్లన్నీ గుంతలమయమై నగరవాసులకు నరకప్రాయంగా మారాయి. అలాగే మురుగు, చెత్త నగరవాసులకు ఆందోళన కలిగిస్తున్నాయి. కాంట్రాక్టర్ల సిండికేట్, అధికారుల వత్తాసు.. గ్రేటర్ వరంగల్‌లో పనులు దక్కించుకున్న కొందరు కాంట్రాక్టర్లకు ఇంజనీరింగ్ అధికారులు వత్తాసు పలుకుతుండటంతో రూ.కోట్లు ఖర్చు చేసిన పనులు కొద్దిరోజుల్లోనే దెబ్బతింటున్నాయనే ఆరోపణలున్నాయి. 2015 నుంచి మున్సిపల్ కార్పొరేషన్లో పాతుకుపోయిన కాంట్రాక్టర్లు ఇష్టారాజ్యంగా పనులు నిర్వహిస్తున్నారు. 2015–2018 సంవత్సరాల్లో సాగిన కుమ్మక్కు, మాముళ్ల వ్యవహారం అప్పట్లో పెద్ద దుమారం లేపాయి.. ఐదారు నెలల క్రితం కీలక ప్రజాప్రతినిధి కనుసన్నల్లో కాంట్రాక్టర్లు మళ్లీ జట్టుకట్టి పనులు చేస్తున్నారు. ఏడాదిలో వివిధ పద్దుల (స్మార్ట్ సిటీ నిధులు కాకుండా) కింద సుమారు రూ.195 కోట్లతో నగరంలో అంతర్గత రోడ్లు, డ్రెయినేజీలు నిర్మించారు. ఈ పనులను కొద్ది మంది కాంట్రాక్టర్లు కీలక ప్రజాప్రతినిధుల ఆదేశం, ఇంజనీరింగ్ అధికారుల మద్దతుతో పూర్తి చేశారు. ట్రైసీటిలో చేసిన పనుల్లో చాలాచోట్ల దెబ్బతినడం. తరచూ కాలనీ వాసులు ప్రజావాణిల్లో ఫిర్యాదు చేస్తుండటం వివాదస్పదంగా మారింది. తాజాగా జీడబ్ల్యూఎంసీ కీలక ప్రజాప్రతినిధి అండదండలతో బడా కాంట్రాక్టర్లు రూ.187.24 కోట్ల పనులపై కన్నేసి సిండికేట్ దక్కించుకుంది. కాగా ప్రజాప్రతినిధులు, అధికారుల మద్దతు.. ఎక్సెస్ టెండర్లు, నాసిరకం పనులతో కొందరు కాంట్రాక్టర్లు భారీగా దండుకోగా, కొద్ది రోజులకే దెబ్బతిన్న రోడ్లు, డ్రెయినేజీల ప్రభావం నగరవాసులపై పడుతోంది. వాళ్లకు పర్సంటేజీలు.. ఇంజనీరింగ్ డీబీ సెక్షన్‌కు 0.25 శాతం, స్థానిక కార్పొరేటర్‌కు 4, ఆపై ప్రజాప్రతినిధికి 4, ఏఈకి 4, డీఈకి 3, ఈఈకి 2, ఎస్ఈకి 1 శాతం, అడిట్ విభాగం, అకౌంట్స్‌కు తలా 0.50 శాతం.. ఇలా పర్సంటేజీలు చెల్లించాల్సి వస్తోందని గ్రేటర్ పరిధిలో చేపట్టే రోడ్లు, డ్రెయినేజీ తదితర నిర్మాణం పనులు చేసే కాంట్రాక్టర్లు బహిరంగంగా చెబుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే కాంట్రాక్టర్లు రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణాల్లో నాణ్యతకు తిలోదకాలిస్తున్నారన్న చర్చ జరగుతోంది. మట్టి, కంకర రోడ్లు వేశాకా.. తారు వేసేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను విస్మరించి ఒక్కోచోట మట్టిపై నుంచి కంకర పరిచిన సంఘటనలు ఉన్నాయి. దీంతో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలకు రోడ్డుకు రెండు వైపులా ఎక్కడికక్కడ కోతకు గురై రోడ్లకు గండ్లు పడ్డాయి. ఇక సీసీ రోడ్డు నిర్మాణాలైతే అధ్వానంగా మారాయి. గతంలో ఉన్న తారురోడ్డుపైనే సీసీ రోడ్డును వేశారు. మురికి కాల్వలు నిర్మించాల్సి ఉండగా, అవి లేకుండానే సీసీరోడ్డు వేయగా బురద, మురుగు నీరు రోడ్లపైకి, కాలనీల్లోకి చేరుతోందని నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పై ఫొటో గ్రేటర్ వరంగల్‌లోని రహమత్‌నగర్‌లో గల సీసీ రోడ్డుది. ఈ రోడ్డు పనులు చేస్తున్నప్పుడే నాణ్యత లోపించిందంటూ సంబంధిత కాలనీలకు చెందిన కొందరు ప్రజావాణిలో ఫిర్యాదులు చేశారు. ఈ రోడ్డుతో పాటు ఐదు కాలనీల్లో పనులు పూర్తి చేసిన కొద్ది రోజులకే సీసీ రోడ్డు కూలిపోయింది. -
జిల్లా కోర్టులకు పీపీల నియామకం
వరంగల్ లీగల్ : వరంగల్ జిల్లా మొదటి అదనపు కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్, పోక్సో కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా గంప వెంకటరమణను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయ, శాసనశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం ఇరువురు పీపీలుగా బాధ్యతలు స్వీకరించి జిల్లా ప్రధాన న్యాయమూర్తి వి.బి నిర్మలా గీతాంబ, ఇతర న్యాయమూర్తులను మర్యాదపూర్వకంగా కలిశారు. ములుగు జిల్లా మదనపల్లికి చెందిన సీనియర్ న్యాయవాది భూక్య వెంకట్రామ్ నాయక్ 1988 నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. అంతకుముందు ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా, జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్‌గా, రాష్ట్ర లోకాయుక్తలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేశారు. వరంగల్ జిల్లా కేంద్రంలో కోర్టు ఏర్పడిన నాటి నుంచి ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన న్యాయవాది జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావడం ఇదే తొలిసారి. నగరంలోని మట్టెవాడ ప్రాంతానికి చెందిన గంప వెంకటరమణ 18 ఏళ్లుగా న్యాయవాదిగా పనిచేస్తున్నాడు. వరంగల్ బార్ అసోసియేషన్‌కు మూడు పర్యాయాలు క్రీడా, సాంస్కృతిక కార్యదర్శిగా పనిచేశారు. కాగా ఇరువురు మూడేళ్ల వరకు బాధ్యతల్లో కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
చైల్డ్ ట్రాఫికింగ్‌పై కఠిన చర్యలు
వరంగల్ క్రైం : చైల్డ్ ట్రాఫికింగ్, బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు వివిధ శాఖలతో కలిసి కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పేర్కొన్నారు. అభ్యుదయ సేవా సమితి ఆధ్వర్యంలో చైల్డ్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్‌ను సీపీ గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చైల్డ్ ట్రాఫికింగ్ అనేది సమాజాన్ని గాయపరిచే తీవ్రమైన నేరమని, ఇది అమాయక పిల్లల జీవితాలను నాశనం చేస్తుందని వివరించారు. సాధారణంగా పేద పిల్లలను లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు, చదువు, మంచి జీవితం అనే మాయ మాటలతో నిందితులు మోసగిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలను బాలకార్మికులుగా మారకుండా చూడాలని, రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఉచితంగా, నాణ్యమైన విద్యను అందిస్తుందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. బాలలకు ఆపద వస్తే డయల్ 100 లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సమాచారం ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో డీసీపీ రవికుమార్, యాంటీ హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఇన్స్పెక్టర్ జి.శ్యామ్‌కుమార్, వరంగల్ జిల్లా చైల్డ్ రైట్స్ అడ్వయిజరీ ఫోరం కన్వీనర్ మండల పరశురాములు, ఎఫ్ఎంఎం సోషల్ సర్వీస్ సొసైటీ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్లు బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మాజీ సభ్యురాలు మంజులతో పాటు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ -
‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. భర్త, పిల్లలను వదిలేసి రా'
జనగాం: ఒక పక్క భర్త.. మరోపక్క ప్రేమపేరుతో తరచూ ఫోన్ చేస్తున్న ఓ యువకుడి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన బుధవారం మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెందిన ఏదుల సతీశ్‌కుమార్‌తో ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలు గ్రామానికి చెందిన శైలజ(24)కు 8 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం 5 సంవత్సరాలు సజావుగానే సాగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ క్రమంలో 3 సంవత్సరాల నుంచి పిండిప్రోలు గ్రామానికి చెందిన యువకుడు కంపటి శ్రీరామ్.. తరచూ శైలజకు ఫోన్ చేసి ప్రేమపేరుతో వేధిస్తున్నాడు.‘నేను నిన్ను ప్రేమిస్తున్నా.. మనమిద్దరం కలిసి ఉందాం.. పిల్లలు, భర్తను వదిలిపెట్టి రా’అని వేధిస్తున్నాడు. ఈ విషయం భర్త సతీశ్‌కుమార్‌కు రెండు సంవత్సరాల క్రితం తెలిసింది. దీంతో ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఎన్నాళ్ల నుంచి కొనసాగుతుందని ప్రశ్నిస్తూ.. నువ్వు ఎందుకు బతుకుతున్నావు, చావరాదు అని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. దీంతో భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్ వేధింపులు తాళలేక శైలజ ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎలుకల మందు తాగింది. గమనించిన భర్త సతీశ్‌కుమార్ హుటాహుటిన మహబూబాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా శైలజ మృతిచెందింది. ఈ ఘటనపై మృతురాలి తల్లి కవిత ఫిర్యాదు మేరకు భర్త సతీశ్‌కుమార్, యువకుడు శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్కె. రియాజ్‌పాషా తెలిపారు. -
జాతర ఇలా..
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తెలంగాణ కుంభమేళాగా ప్రసిద్ధి చెందిన మేడారం సమ్మక్క– సారలమ్మ మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. 2026 జనవరి 28 నుంచి 31 వరకు మహాజాతర జరగనుంది. ప్రతీ రెండేళ్లకోసారి సాగే మహాజాతర తేదీలను పూజారులు ఎక్కువగా ఫిబ్రవరి నెలలోనే ఖరారు చేస్తారు. ఈసారి అధిక అమావాస్య రావడంతో వచ్చే ఏడాది జనవరి నెలాఖరులో నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు పూజారులు బుధవారం మహాజాతర తేదీలను ప్రకటించారు. 20 రోజుల ముందుగానే జాతర ఫిబ్రవరిలో నిర్వహించాల్సిన మేడారం మహాజాతర ఈసారి 2026 జనవరి 28 నుంచి 31 వరకు జరగనుంది. దీంతో 20 రోజుల ముందుగానే మహాజాతర జరగనుంది. పూజారులు పంచాంగం, కొత్త క్యాలెండర్ ప్రకారం మాఘశుద్ధ పౌర్ణమి, అమ్మవార్ల ఘడియలను బట్టి జాతర తేదీలను ఖరారు చేస్తారు. ప్రతీ రెండేళ్లకోసారి జాతర తేదీలను అమావాస్య రోజుల్లో పౌర్ణమికి ముందుగా నిర్ణయించడం ఆనవాయితీ. ఈసారి 2026 జనవరి 17 నుంచి అమావాస్య మాసం ప్రారంభం కావడం, జనవరి 31న పౌర్ణమి అవుతుండడంతో మాఘశుద్ధ పౌర్ణమికి ముందుగా జాతర తేదీలను నిర్ణయించారు. అంటే అధిక అమావాస్య రావడంతో ఈసారి జనవరిలోనే నిర్ణయించినట్లు పూజారులు వెల్లడించారు. 2018లో జనవరిలోనే జాతర.. గత మహాజాతరల తేదీలను పరిశీలిస్తే.. 2018లో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకు జాతర జరిగింది. అలాగే 2010లో ఫిబ్రవరి 17నుంచి 20 వరకు, 2012లో ఫిబ్రవరి 8 నుంచి 11వరకు, 2014లో ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు, 2016లో ఫిబ్రవరి 17 నుంచి 20 వరకు, 2020లో ఫిబ్రవరి 5 నుంచి 8 వరకు, 2022లో ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు, 2024లో ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మహాజాతర సాగింది. 2018లో మాత్రం జనవరి 31 నుంచి జాతర సాగగా.. ఈ దఫా 2026 జనవరి నెలాఖరులోనే జాతర సాగనుంది. అధికార యంత్రాంగం సమాయత్తం మేడారం మహాజాతర తేదీలను పూజారులు ప్రకటించడంతో జిల్లా అధికార యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై సమాయత్తం కానుంది. ఈసారి ముందస్తుగానే శాశ్వత అభివృద్ధి పనులను పూర్తి చేయాలనే సంకల్పంతో అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రాష్ట్ర మంత్రి సీతక్క చొరవతో ఇప్పటికే మేడారంలో శాశ్వత నిర్మాణం పనులు కొనసాగుతున్నాయి. ఇకనుంచి జిల్లా యంత్రాంగం జాతర అభివృద్ధి పనులపై ప్రణాళికలతో ముందుకెళ్తూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు కోరారు. 2026 జనవరి 28 నుంచి 31 వరకు.. కొనసాగుతున్న శాశ్వత అభివృద్ధి పనులుజనవరి 28వ తేదీ: సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు గద్దెలపైకి రాక 29వ తేదీ : సమ్మక్క గద్దైపెకి 30వ తేదీ: భక్తులు మొక్కుల చెల్లింపు 31వ తేదీ: దేవతల వనప్రవేశం -
దంపతుల మధ్య గొడవ..
● మనస్తాపంతో మహిళ ఆత్మహత్య ● తూర్పు తండాలో ఘటన సంగెం: దంపతుల మధ్య గొడవతో మనస్తాపం చెందిన ఓ మహిళ క్షణికావేశంలో బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగెం మండలం నల్లబెల్లి శివారు తూర్పు తండాలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. తండాకు చెందిన అజ్మీరా జ్యోతి(44), బాలరాజు దంపతులకు ఇద్దరు కుమారులు సంతోశ్, సందీప్ ఉన్నారు. వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. పెద్ద కుమారుడికి వివాహం జరగగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. చిన్న కుమారుడు చదువుకుంటున్నాడు. బుధవారం కుటుంబం, మేకలు మేపడానికి వెళ్లే విషయాల్లో దంపతుల మధ్య గొడవ జరిగింది. దీంతో మనస్తాపం చెందిన జ్యోతి వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అందులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. జ్యోతి బావిలో దూకుతుండగా పక్క చేనులో కలుపు తీస్తున్న మహిళా రైతు బానోత్ బుజ్జమ్మ చూసి తండాకు చెందిన మూడు మోతీలాల్‌కు చెప్పింది. మోతీలాల్ తండాకెళ్లి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చాడు. వారు వచ్చి చూడగా జ్యోతి బావిలో కనిపించలేదు. డయల్100కు కాల్ చేసి విషయం తెలపడంతో స్థానిక పోలీసులు.. ఫైర్ రెస్క్యూ టీంకు సమాచారం అందించగా వారు వచ్చి వెతకగా జ్యోతి మృతదేహం లభించింది. మృతురాలి కుమారుడు సంతోశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ పేర్కొన్నారు. -
ఉగ్రామాత, శివదూతీమాతగా భద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళి దేవాలయంలో నిర్వహిస్తున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా బుధవారం ఏడో రోజు అమ్మవారిని ఉగ్రామాత, శివదూతీమాతగా అలంకరించి పూజలు నిర్వహించారు. అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని ఉగ్రామాతగా, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని శివదూతీమాతగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి, సిబ్బంది, ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాండ్ల స్రవంతి, శ్రీనివాస్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. కేఎఫ్ఐ ఎథిక్స్ కమిషన్ కన్వీనర్‌గా రాఘవరెడ్డివరంగల్ స్పోర్ట్స్: ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(కేఎఫ్ఐ) ఎథిక్స్ కమిషన్ కన్వీనర్‌గా, ఖోఖో అసోసియేషన్ సౌత్ జోన్ అధ్యక్షుడిగా తెలంగాణ ఆయిల్‌ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్, ఖోఖో సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి ఎన్నికయ్యారు. న్యూఢిల్లీలోని ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో బుధవారం ఎథిక్స్ కమిషన్ ఎన్నికలు జరిగాయి. ఖోఖో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు సుధామ్ష్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన ఎన్నికల్లో రాఘవరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఒక ప్రకటనలో తెలి పారు. తన ఎన్నికకు సహకరించిన ఖోఖో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కృష్ణమూర్తి, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉపాధ్యక్షుడు సీతారాంరెడ్డిలకు రాఘవరెడ్డి ధన్యవాదాలు తెలిపారు. స్నాతకోత్సవానికి రండి గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన కేయూ వీసీ కేయూ క్యాంపస్: ఈ నెల 7వ తేదీన జరగనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా రావాలని బుధవారం వీసీ కె.ప్రతాప్‌రెడ్డి హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మను కలిసి ఆహ్వానించారు. స్నాతకోత్సవం నిర్వహణ సమయం, గోల్డ్‌మెడల్స్, పీహెచ్డీ అభ్యర్థులకు పట్టాల ప్రదానం వివరాలు, కాన్వొకేషన్ ప్రొసీడర్ను గవర్నర్‌కు తెలిపారు. గవర్నర్ స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు ఓకే చెప్పారని సమాచారం. వీసీ వెంట కేయూ ఓఎస్డీ ప్రొఫెసర్ పి.మల్లారెడ్డి, పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ ఉన్నారు. వయోజనులను అక్షరాస్యులుగా చేయాలివిద్యారణ్యపురి: జిల్లాలోని నిర్లక్ష్యరాస్యులైన వయోజనులను అక్షరాస్యులుగా చేయాలని హనుమకొండ డీఈఓ డి.వాసంతి కోరారు బుధవారం హనుమకొండలోని సుబేదారి ప్రభుత్వ హైస్కూల్లో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇచ్చారు. డీఈఓ హాజరై మాట్లాడుతూ మండలస్థాయిలో జరిగే శిక్షణకు ప్రతీ పాఠశాలనుంచి ఒక ఉపాధ్యాయుడు, గ్రామసమాఖ్య సభ్యులు హాజరుకావాలన్నారు. వయోజన విద్య డైరెక్టర్ రమేష్‌రెడ్డి ఉల్లాస్ యాప్‌లో నిరక్ష్యరాస్యులైనవారిని గుర్తించి ఎలా నమోదు చేయాలో వివరించారు. కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ సదానందం పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం న్యూశాయంపేట: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉపాధి సంబంధిత ప్రోత్సాహక పథకానికి(ఈఎల్ఐ) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రాంతీయ ప్రావిడెంట్ ఫండ్ (పీఎఫ్) కమిషనర్ వైడీ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి సృష్టించడం, ప్రోత్సహించడం, ఉపాధి సామర్థ్యాన్ని పెంపొందించడం, సామాజిక భద్రతను ఈ పథకం ద్వారా మెరుగుపరచాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం వరంగల్ ప్రాంతీయ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
‘నిట్’ ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం
ఇంపాక్ట్–99 స్కాలర్‌షిప్‌నకు శ్రీకారం కాజీపేట అర్బన్ : ‘నిట్ వరంగల్ మాకు ఎంతో ఇచ్చింది.. తిరిగి ఇచ్చేద్దాం’ అంటూ అల్యూమ్ని 1999వ బ్యాచ్ పూర్వ విద్యార్థులు తమకు విద్యనందించిన ఇనిస్టిట్యూట్ రుణం తీర్చుకునే సంకల్పంతో ఇంపాక్ట్ (ఇన్స్పైరింగ్ మీనింగ్‌ఫుల్ ప్రోగ్రెస్ అండ్ అల్యూమ్ని కంట్రీబ్యూషన్ టు గెదర్)–99 పేరిట స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నిట్ డైరెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆ కార్యక్రమ వాల్‌పోస్టర్‌ను డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ ఆవిష్కరించి మాట్లాడారు. ఇక్కడ విద్యనభ్యసించిన 1999 బీటెక్ విద్యార్థులు నిట్‌లో ప్రస్తుతం చదువుతున్న 2025–26 బ్యాచ్ సెకండియర్ నుంచి ఫోర్త్ ఇయర్ విద్యార్థులతోపాటు ఇటీవల బీటెక్ పూర్తి చేసిన ప్రతిభావంతులైన పిల్లలకు చేయూతనందించేందుకు ఇంపాక్ట్–99 స్కాలర్షిప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, ల్యాప్‌టాప్, టెక్నికల్ స్కిల్స్ డెవలప్మెంట్లో ఇంపాక్ట్–99 తోడ్పడుతుందని తెలిపారు. కార్యక్రమంలో నిట్ అల్యూమ్ని అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ చంద్రగిరి శ్రీనివాస్, సెక్రటరీ రమ, వరంగల్ చాప్టర్ ప్రెసిడెంట్ పులి రవికుమార్, కిరణ్‌కుమార్, శైలజ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
బల్దియాలో పరికరాల చోరీ
వరంగల్ అర్బన్ : వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో చోరీలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. కమాండ్ కంట్రోల్ సిస్టమ్ పనిచేస్తున్నా.. దొంగతనాలకు అడ్డుకట్టపడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా బల్దియా ప్రధాన కార్యాలయంలో స్టోర్ తాళాలు పగులకొట్టి న్యూస్ పేపర్స్ బండిల్స్, ఇనుము, ఇతర పరికరాలు అపహరించారు. క్షేత్రస్థాయి సిబ్బంది పనినా.. లేక ఇతరుల ప్రమేయం ఉందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బల్దియా ప్రధాన కార్యాలయానికి నిఘా నేత్రాలున్నా పనికిరావడం లేదనే ఆ రోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంపై పరిపాలన విభాగం అధికారులను వివరణ కోరితే పరిశీలిస్తామని దాటవేయడం గమనార్హం. -
ఇక వినియోగంలోకి..
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లోని అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం లభించింది. ఏళ్లుగా పక్కకు పెట్టిన ఆ పోస్టులు ఎట్టకేలకు ఇక వినియోగంలోకి రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 216 అన్యూజ్డ్ పోస్టులతో పాటు ప్రస్తుతం అవసరం లేని 217 పోస్టులను రద్దు చేస్తూ అవసరమైన 339 పోస్టులను క్రియేట్ చేస్తూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానీయా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏళ్లుగా వినియోగంలో లేని డీఎం గ్రేడ్–1, హెల్పర్ బెంచ్, గన్‌మాన్, టెలిఫోన్ బాయ్, కార్పెంటర్, సివిల్ మేసీ్త్ర, స్టోర్ కీపర్, టూల్ కీపర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్ కమ్ మిక్సర్, టెలిఫోన్ ఆపరేటర్, ఎస్ఎస్ఎ, ఎల్ఎండీ, జేఎల్ఎండీ, క్లీనర్, రోనియో ఆపరేటర్, లష్కర్ వంటి 216 పోస్టులతో పాటు ప్రస్తుతం ఖాళీగా ఉన్న 217 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులను రద్దు చేస్తూ కొత్త పోస్టులుగా పునరుద్ధరించారు. దీంతో కొత్తగా 2 చీఫ్ ఇంజనీర్, 1 జాయింట్ సెక్రటరీ, 4 సూపరిటెండెంట్ , 1 జనరల్ మేనేజర్, 4 డివిజనల్ ఇంజనీర్, 4 సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, , 6 అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్, 1 అకౌంట్స్ ఆఫీసర్, 2 అసిస్టెంట్ అకౌంట్ , 4 పర్సనల్ ఆఫీసర్ , 16 సబ్ ఇంజనీర్, 16 అసిస్టెంట్ ఇంజనీర్, 20 జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, 32 సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్, 88 సీనియర్ అసిస్టెంట్, 48 అసిస్టెంట్ లైన్మెన్, 80 ఆఫీస్ సబార్డినేట్, 4 వాచ్మెన్, స్వీపర్ కమ్ గార్డెనర్, స్వీపర్, 6 శానిటరీ ఆర్డర్లీస్ పోస్టులు మంజూరయ్యాయి. దీంతో అధికా రుల కొరత తీరనుంది. పెరిగిన ఉన్నత స్థాయి పోస్టులతో పదోన్నతి.. ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో పదోన్నతి లభించనుంది. అన్ యూజ్డ్ పోస్టులను నూతన పోస్టులుగా సృష్టించేందుకు ప్రభుత్వ అనుమతి కోరినప్పటి నుంచి చాలా మంది ఆశావహులు పదోన్నతి కోసం ఎదురుచూస్తున్నారు. చివరకు ప్రభుత్వం కొత్త పోస్టులు సృష్టిస్తూ అనుమతి ఇవ్వడంతో వారిలో సంతోషం వెల్లివిరిస్తోంది. సీజీఎం, ఎస్ఈ, డీఈ, ఏడీఈ, జనరల్ మేనేజర్, జాయింట్ సెక్రటరీ, సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ పదోన్నతి కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. పోస్టులకు అనుమతి వచ్చినా పదోన్నతి ప్రక్రియ అంశం కోర్టులో ఉంది. పదోన్నతులపై హైకోర్టు స్టే విధించడంతో కొంత కాలంగా ఈ ప్రక్రియ నిలిచింది. కోర్టు ఏ క్షణాన స్టే ఎత్తివేసిన వెంటనే పదోన్నతి కల్పించేందుకు యాజమాన్యం సిద్ధంగా ఉంది. నూతన పోస్టుల కోసం టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్‌రెడ్డి కృషి ఫలించిందని ఆయా సంఘాలు, అసోసియేషన్ల నాయకులు తెలిపారు. అవసరమైన పోస్టులు పెరగడంతో వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన సేవలు అందుతాయన్నారు. ఎట్టకేలకు అన్యూజ్డ్ పోస్టులకు మోక్షం 339 ఉద్యోగాలు క్రియేట్ చేసి ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఉన్నత స్థాయి పోస్టులు పెరగడంతో లభించనున్న పదోన్నతి ఆశావహుల్లో వెల్లువెత్తిన సంతోషం.. తీరనున్న అధికారుల కొరత -
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి
హన్మకొండ అర్బన్: జిల్లాలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు.. కలెక్టరేట్లో బుధవారం వివిధ విభాగాల అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. వర్షాకాలం నేపథ్యంలో స్థానికంగా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై సమీక్షించారు. అర్హుల ఎంపికలో నిబంధనలు పాటించాలని సూచించారు. అర్హులందరికీ డబ్బులు బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి.. అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు అందజేయాలని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారితో కలిసి బుధవారం కలెక్టర్ స్నేహ శబరీష్‌ను కలిసి కోరారు. అదేవిధంగా భద్రకాళి చెరువు పూడికతీత పనుల్లో అవినీతి జరిగిన విషయాన్ని వివరించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ -
నకిలీ విత్తనాలు, పురుగు మందులమ్మిన వ్యక్తిపై పీడీ యాక్ట్
రామన్నపేట : నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించిన వ్యక్తిపై వరంగల్ పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్.. పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేశారు. శాయంపేట చెందిన నూక రాజేశ్‌పై పీడీ యాక్టు నమోదు కాగా, మట్టెవాడ ఇన్స్పెక్టర్ గోపి.. బుధవారం నిందితుడికి పరకాల జైలులో ఉత్తర్వులు అందజేసి చర్లపల్లి జైలుకు తరలించారు. నూక రాజేశ్ మరో ఆరుగురు నిందితులతో కలిసి ముఠాగా ఏర్పడి కాలం తీరిన పురుగుల మందులను ఫర్టిలైజర్ల డీలర్ల నుంచి తక్కువ డబ్బులకు కొనుగోలు చేయడంతోపాటు నకిలీ విత్తనాలు, పురుగుల మందులను రైతులకు విక్రయిస్తూ మట్టెవాడ పోలీసులకు ఏప్రిల్ 7వ తేదీన చిక్కారు. నిందితుడు గతంలో వరుస చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న క్రమంలో మట్డెవాడ, సుబేదారి, హనుమకొండ, కాకతీయ యూనివర్సిటీ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు పేర్కొన్నారు. అతని నేరప్రవృత్తిని దృష్టిలో ఉంచుకుని పీడీయాక్ట్ నమోదు చేసినట్లు సీపీ తెలిపారు. రైతులను మోసం చేస్తూ నకిలీ విత్తనాలు, పురుగు మందులను విక్రయిస్తే పీడీ యాక్టు నమోదవుతుందని, ఇప్పటికే కమిషనరేట్ పరిధిలో రెండు కేసులు నమోదు చేసినట్లు సీపీ వివరించారు. ఎవరైనా నకిలీ మందులు విక్రయిస్తే 77998 48333 సెల్‌నంబర్‌కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గడువులోగా లక్ష్యాలు పూర్తి చేయాలి
హన్మకొండ : నిర్దేశించిన లక్ష్యాలను గడువులోగా పూర్తి చేయాలని తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ అపెక్స్ బ్యాంకు, వరంగల్ డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్ రావు బ్రాంచ్ మేనేజర్లను ఆదేశించారు. బుధవారం హనుమకొండ నక్కలగుట్టలోని వరంగల్ డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో డీసీసీబీ బ్రాంచ్ మేనేజర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్రాంచ్‌ల వారీగా ప్రగతిని సమీక్షించారు. ప్రతీ అధికారి, ఉద్యోగి వ్యక్తిగత పనితీరును మెరుగు పరుచుకోవాలన్నారు. పీఏసీఎస్‌ల ద్వారా ఇచ్చిన రుణాలు కూడా లీగల్‌గా కవర్ చేసి రికవరీ చేసి సంఘాలను పటిష్టం చేయాలని సూచించారు. ఐఆర్ఏసీ నిబంధనలకు లోబడి మార్చి నెలకు సంబంధంచి నిరార్ధక రుణాలుగా వర్గీకరించిన బకాయిలను రికవరీ చేయాలని ఆదేశించారు. నిరార్ధక ఆస్తులు 2 శాతానికి లోబడి టర్నోవర్ రూ.2,500 కోట్లకు చేరేలా కృషి చేయాలన్నారు. మహిళ స్వయం సహాయక సంఘాలు, చిరు వ్యాపారులకు ఇచ్చిన రుణాల చెల్లింపుపై వన్‌టైమ్ సెటిల్మెంట్ వివరించి వారి ద్వారా రుణాలు రికవరీ చేయాలని సూచించారు. నాబార్డు తనిఖీల్లో వరంగల్ డీసీసీబీ ఏ కేటగిరీ సాధించేలా బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలన్నారు. వేతన సవరణ చేసినందు కు ఈ సందర్భంగా చైర్మన్ రవీందర్ రావును మేనేజర్లు, ఉద్యోగులు సన్మానించారు. సమావేశంలో సీఈఓ వజీర్ సుల్తాన్, జీఎం పద్మావతి, డీజీఎం అశోక్, ఏజీఎంలు మధు, గొట్టం స్రవంతి, బోడ రాజు, గంప స్రవంతి, కృష్ణ మోహన్, డీఆర్ ఓఎస్డీ విజయ కుమారి, బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. టెస్కాబ్ చైర్మన్ మార్నేని రవీందర్ రావు -
జిల్లాకు ఐదుగురు సెర్ఫ్ డీపీఎంలు
హన్మకొండ అర్బన్: గ్రామీణ అభివృద్ధి శాఖలో ప్రభుత్వం ఇటీవల నిర్వహిస్తున్న సాధారణ బదిలీల నేపథ్యంలో జిల్లాలో పనిచేస్తున్న నలుగురు డీపీఎం వారు ఇతర జిల్లాలకు వెళ్లారు. అదేవిధంగా ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న ఐదుగురు డీపీఎం కేడర్ అధికారులు జిల్లాలో రిపోర్ట్ చేశారు. ఈ మేరకు వారు ఐడీఓసీ కార్యాలయంలో డీఆర్డీఓ పీడీ మేన శ్రీనుని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. వారికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాకు ఇతర జిల్లాలనుంచి రాజేంద్రప్రసాద్, దయాకర్, అనిత, సరిత, పద్మప్రియ బదిలీపై వచ్చారు. వీరిలో పద్మప్రియకు పెన్షన్ విభాగం, సరితకు ఫామ్స్, అనిత ఫైనాన్స్, దయాకర్ ఐబీ, రాజేంద్రప్రసాద్ నాన్ ఫామ్స్ విభాగాలు కేటాయిస్తూ పీడీ శ్రీను ఉత్తర్వులు ఇచ్చారు. హనుమకొండ జిల్లాలో పనిచేసిన దాసు, అనిల్ వరంగల్‌కు, శ్రీకాంత్ మహబూబాబాద్, ప్రకాష్ జనగామ జిల్లాకు బదిలీ అయ్యారు. -
వృత్తి నైపుణ్యంతోనే విధుల్లో రాణింపు
వరంగల్ క్రైం: విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం సొంతం చేసుకోవాలని ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్‌కుమార్ అన్నారు. బుధవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మూడు రోజుల పాటు జరిగే భద్రాది కొత్తగూడెం జోనల్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ భద్రాది పోలీస్ డ్యూటీ మీట్లో వరంగల్, ఖమ్మం పోలీస్ కమిషనరేట్లు, మహబూబాబాద్, భద్రాది కొత్తగూడెం పోలీస్ విభాగాలకు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొంటున్నారని తెలిపారు. ప్రతీ విభాగంలో ప్రతిభ కనబరిచిన వారిని త్వరలో రాష్ట్ర స్థాయి పోలీస్ డ్యూటీ మీట్‌కు ఎంపిక చేస్తామని పేర్కొన్నారు. నేరాలు త్వరితగతిన ఛేదించేందుకు, సాక్ష్యాలను శాసీ్త్రయంగా విశ్లేషించడానికి, ప్రజలకు న్యాయం అందించేందుకు ఈ వృత్తి శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. కార్యక్రమంలో వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్, అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్, ప్రభాకర్‌రావు, బోనాల కిషన్, జోన్‌కు చెందిన ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు ఆర్ఐలు తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్‌జోన్ డీసీపీ అంకిత్ కుమార్ -
అసలు సమస్య!
డంపింగ్ యార్డులేసాక్షిప్రతినిధి, వరంగల్: గ్రేటర్ వరంగల్.. 407.77 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం.. సుమారు 11.15 లక్షలకు పెరిగిన జనాభా.. 2.26 లక్షలకు పైగా ఇళ్లు.. రోజు రోజుకూ పెరుగుతన్న నగర విస్తీర్ణంతో.. ‘చెత్త’సమస్య తీవ్రమవుతోంది. జీడబ్ల్యూఎంసీ పరిధిలోని 66 డివిజన్ల నుంచి నిత్యం 518.62 మెట్రిక్ టన్నుల వరకు తడి, పొడిచెత్త ఉత్పత్తి అవుతోంది. ఆ మేరకు చెత్తను నిల్వ చేయడానికిగానీ, బయో మైనింగ్ చేయడానికి అవకాశం లేకపోవడం నగరవాసులకు శాపంగా మారింది. రోజుకు టన్నుల కొద్దీ చెత్తను తరలించే అవకాశం ఉన్నా.. 54శాతం మాత్రమే తరలించిన చెత్తతో 32.14 ఎకరాల్లోని మడికొండ డంప్ యార్డు నిండిపోతున్నది. ఒక్కో కాలనీకి వారానికి రెండు లేదా మూడు సార్లే చెత్త వాహనాలు వెళ్తుండగా.. తరలించిన 54 శాతం పోను మిగిలిన 46 శాతం కాలనీలు, రోడ్లు, ఇళ్లమధ్యనే వేయాల్సిన పరిస్థితి ఉందని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. మూడు నెలలకే మూలన పడ్డ బయోమైనింగ్ నగరంలో వెలువడే చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు బయోమైనింగ్ ప్లాంట్‌ను మడికొండలో ఏర్పాటు చేశారు. రైతులనుంచి భూములను కొనుగోలు చేసిన రాష్ట్ర ప్రభుత్వం 2013లో మడికొండ, రాంపూర్ గ్రామాల మధ్య ఎత్తయిన ప్రదేశంలో 32 ఎకరాల విస్తీర్ణంలో ఈ డంపింగ్ యార్డును ఏర్పాటు చేసింది. స్మార్ట్ సిటీ స్కీమ్‌లో భాగంగా రూ.37 కోట్లు కేటాయించి బయోమైనింగ్ పనులు చేపట్టారు. 2021లో మొదలైన చెత్త రీసైక్లింగ్ పనులు మూడు నెలలకే మూలన పడింది. దీంతో చెత్త సమస్య యథాతఽథంగా మారింది. పలుమార్లు కలెక్టర్, మున్సిపల్ కమిషనర్లు సందర్శించి త్వరితగతిన చెత్త బయో మైనింగ్ చేయాలని సూచించినా కదలికలేదు. ఫలితంగా ఏడు లక్షల టన్నులకు పైగా చేరిన చెత్తతో డంపింగ్ యార్డు నిండిపోయింది. చేసేదిలేక ఎప్పటికప్పుడు చెత్త నిల్వలు పెరిగిపోకుండా డంపుయార్డులోనే కాల్చివేసే ప్రయత్నం చేస్తుండగా ఆ పొగ, దుర్వాసనతో మడికొండ, రాంపూర్, ఎలుకుర్తిలతోపాటు చుట్టుపక్కల నివసించే ప్రజలు తరచూ వ్యాధుల బారిన పడుతున్నారు. ఊసేలేని హుజూరాబాద్ డంపింగ్ యార్డు.. మడికొండకు ప్రత్యామ్నాయంగా కరీంనగర్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట జిల్లాల్లోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని చెత్తను తరలించేందుకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కొత్తపల్లి శివారులో స్థల పరిశీలన చేశారు. అక్కడ చెత్త రీసైక్లింగ్‌తోపాటు బయో మైనింగ్, 6 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే చెత్తను డంప్ చేసే యోచన చేశారు. ఇందుకోసం వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లతో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, కొత్తపల్లి, హుస్నాబాద్, నర్సంపేట, పరకాల, వర్ధన్నపేట మున్సిపాలిటీలనుంచి చెత్తను అక్కడికి తరలించాలని నిర్ణయించారు. హజూరాబాద్ సమీ పం (కొత్తపల్లి శివారు)లో ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూపకల్పన చేశారు. 25 ఎకరాల కేటాయింపు, ప్లాంట్ నిర్మాణం కోసం రూ.50 కోట్లు ఊసే లేకుండాపోయాయి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందిస్తారా.. లేదా చూడాలి. గ్రేటర్ వరంగల్‌లో రోజుకు 518.62 మె.టన్నుల చెత్త రోజూ 54శాతమే చెత్త సేకరణ, తరలింపు.. మిగిలింది ఇళ్ల మధ్యన, వీధుల్లోనే.. మడికొండ డంపింగ్ యార్డులో పేరుకు పోయిన నిల్వలు హుజూరాబాద్ దగ్గర ప్రతిపాదనల్లోనే డంపింగ్ యార్డు మూలన పడిన బయో మైనింగ్ ప్లాంట్.. ‘చెత్త’కు దొరకని పరిష్కారం.. -
కాలనీల్లో నీరు నిల్వకుండా చర్యలు
మేయర్ గుండు సుధారాణి న్యూశాయంపేట: వరంగల్ 3వ డివిజన్ పైడిపల్లిలోని కాలనీల్లో వర్షపు నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని నగర మేయర్ గుండు సుధారాణి, వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజులు అఽధికారులను ఆదేశించారు. పైడిపల్లి కొత్తగూడెంలోని ఎస్సీ, బీసీ కాలనీల్లో వర్షపు నీరు తమ ఇళ్లలోకి చేరుతుందని, విషపురుగులు వస్తున్నాయని స్థానికుల ఫిర్యాదు మేరకు బుధవారం మేయర్, ఎమ్మెల్యే కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కరించాలని అక్కడే ఉన్న అధికారులకు సూచించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ జన్ను షీభారాణి అనిల్‌కుమార్, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, ఎంహెచ్ఓ డా.రాజేష్, ఈఈ సంతోష్‌బాబు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం
వేలేరు: కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్ కేసులతో కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయమని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. బుధవారం వేలేరు మండల కేంద్రంలోని రైతు వేదికలో 17 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్‌రావే ప్రధాన కారణమని ఆరోపించారు. మేడిగడ్డ లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు లేదని, మనిషికి గుండె ఎంత ముఖ్యమో కాళేశ్వరానికి కూడా మేడిగడ్డ అంతేముఖ్యమన్నారు. రూ.లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ద్వారా కనీసం 50 వేల ఎకరాలకు కూడా సాగునీరు అందలేదని విమర్శించారు. బనకచర్ల ప్రాజెక్టుకు నాంది పలికింది కేసీఆరేనని, గతంలో ఆయన ఆంధ్రా ప్రాజెక్టులకు సహకరిస్తామని చెప్పి ఇప్పుడు తప్పించకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ హక్కులే ముఖ్యమని, బనకచర్ల, పోలవరం ప్రాజెక్టులను ఆపి తీరుతామన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ హెచ్.కోమి, ఎంపీడీఓ లక్ష్మీప్రసన్న, ఏఓ కవితా, ఎంపీఓ భాస్కర్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కత్తి సంపత్, కాంగ్రెస్ నాయకులు బిల్లా యాదగిరి, సద్దాం హుస్సేన్, మల్లికార్జున్, రాజిరెడ్డి, ప్రమోద్ రెడ్డి, లక్ష్మణ్‌నాయక్, రవీందర్, రణధీర్ రెడ్డి, సలీంమాలిక్, తదితరులు పాల్గొన్నారు.కాళేశ్వరం కూలిపోవడానికి కేసీఆర్, హరీశ్‌రావే కారణం స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి -
10లోగా మార్కెట్ ఫీజు బకాయిలు చెల్లించాల్సిందే
మార్కెటింగ్ జేడీ శ్రీనివాస్ వరంగల్ చౌరస్తా : వ్యాపారులు, పండ్లు, కూరగాయల, అద్దె బకాయిదారులు మార్కెట్ ఫీజును ఈనెల 10వ తేదీలోగా చెల్లించాలని వరంగల్ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రధాన కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేడీ శ్రీనివాస్ మాట్లాడుతూ పన్నులు సకాలంలో చెల్లిస్తేనే రైతులకు, ఆయా వర్గాలకు మెరుగైన వసతులు లభిస్తాయని పేర్కొన్నారు. అనంతరం కూరగాయల వర్తక సంఘం నూతన కార్యవర్గం సభ్యులు.. జేడీకి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ ప్రాంతీయ ఉప సంచాలకులు పద్మావతి, కార్యదర్శి గుగులోతు రెడ్డి, గ్రేడ్–2 కార్యదర్శి జి.రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
పథకాలను వేగవంతంగా అమలు చేయాలి
హన్మకొండ: ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ ద్వారా అమలు చేస్తున్న పథకాలను వేగవంతం చేయాలని ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి అన్నారు. పథకాల అమలు వేగవంతం చేసేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఉమ్మడి జిల్లాల వారీగా సూపర్వైజర్ ఆఫీసర్లుగా నియమించారు. ఈ క్రమంలో సంగీత లక్ష్మి హనుమకొండలోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వానాకాలం పూర్తయ్యేలోపు మూడు నెలల్లో ఆయిల్ పాం తోటల పెంపకంలో భాగంగా నిర్దేశించిన లక్ష్యం మేరకు మొక్కలు నాటాలన్నారు. అదే విధంగా ఇతర తోటల పెంపకాన్ని పూర్తి చేయాలని, సూక్ష్య సేద్యపు పరికరాల బిగింపు పనులు మూడు నెలల్లో పూర్తి చేయాలన్నారు. ఇక నుంచి ప్రతీ వారం సమీక్ష సమావేశం నిర్వహించి జిల్లాల వారీగా నివేదికను వ్యవసాయ శాఖ మంత్రికి అందించనున్నట్లు తెలిపారు. సమావేశంలో హనుమకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగామ డీహెచ్ఎస్ఓలు జి.అనసూయ, ఆర్.శ్రీనివాసరావు, మిరయన్న, శ్రీధర్‌రావు, మైక్రో ఇరిగేషన్ కంపెనీ ప్రతినిధులు, ఉద్యాన అధికారులు పాల్గొన్నారు. వానాకాలంలోపు తోటల పెంపకం పూర్తి చేయాలి ఉద్యాన శాఖ జాయింట్ డైరెక్టర్ సంగీత లక్ష్మి -
నవీన్‌కుమార్‌కు వైద్య సేవలందించాలి
● సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశం గీసుకొండ: రెండు కిడ్నీలు పాడైపోయి ప్రాణాపాయ స్థితిలో ఉన్న నవీన్‌కుమార్ ఆరోగ్య స్థితిపై స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించారు. గ్రేటర్ వరంగల్ నగరం 36 డివిజన్ పుప్పాల గుట్టకు చెందిన నవీన్‌కుమార్ దీనస్థితిపై ఈ నెల 1వ తేదీన ‘దాతలారా ఆపన్న హస్తం అందించండి ’ అనే శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ముఖ్యమంత్రి స్పందించారు. వెంటనే బాధితుల వివరాలు సేకరించి వైద్య సేవలందించాలని అధికారులను ఆదేశించారు. దీంతో సీఎం ఆదేశాల మేరకు సీఎంఓ ఓఎస్డీ బాధితుడి తండ్రి రత్నంతో మాట్లాడి అవసరమైన వైద్యసేవలందిస్తామని తెలిపారు. కాగా, ఈ విషయంపై కలెక్టర్‌కు ఆదేశాలు జారీ కాగా బాధిత కుటుంబానికి అన్ని విధాలా వైద్య సేవలందిస్తామని కలెక్టర్ తెలిపారు. -
అభివృద్ధి పథంలో తెలంగాణ
మహబూబాబాద్ రూరల్ : తెలంగాణ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ గ్రామ అధ్యక్షుల సన్నాహక సమావేశం పార్టీ పార్లమెంట్ నియోజవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్ రావు అధ్యక్షతన జిల్లా కేంద్రంలోని వీరబ్రహ్మేంద్రస్వామి మందిరంలో నిర్వహించారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముఖ్యఅతిథిగా హాజరుకానుండగా ఈ నెల 4వ తేదీన హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నారన్నారు. నా యకులు, కార్యకర్తలను ప్రభుత్వంలో భాగస్వాములను చేసేందుకు ఖర్గే వస్తున్నారని, ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహులు తప్పనిసరిగా ఖర్గే సభకు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంతోపాటు గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయడానికి నేతలకు దిశానిర్దేశం చేయనున్నారని తెలిపారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లో బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేందుకు కృషి చేస్తామని, సెప్టెంబర్ లోపు గ్రామపంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్, మున్సి పాలిటీ ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. సమావేశంలో మానుకోట, భద్రాచలం, సత్తుపల్లి ఎమ్మెల్యేలు డాక్టర్ మురళీనాయక్, తెల్లం వెంకట్రావు, మట్టా రాగమయి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ పొదెం వీరయ్య, టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు మద్ది బేబీస్వర్ణకుమారి, నాగ సీతారాములు, డీసీసీ అధ్యక్షుడు జెన్నారెడ్డి భరత్చందర్ రెడ్డి, కేసముద్రం ఏఎంసీ చైర్మన్ ఘంట సంజీవరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. డిప్యూటీ స్పీకర్ జాటోత్ రామచంద్రునాయక్ -
మాటల మంటలు!
సాక్షి, వరంగల్: మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మాటలు అధికార పార్టీ కాంగ్రెస్‌లో కల్లోలం రేపుతున్నాయి. విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీకి కూడా అస్త్రశస్త్రాలు దొరకడంతో రాజకీయం రసకందాయంగా మారింది. ఓవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేలే ‘కొండ’పై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీచేసిన కొండా సురేఖ ఎన్నికల్లో రూ.70 కోట్లు ఖర్చు చేశారని స్వయంగా ఆమె భర్త కొండా మురళి బహిరంగంగా ప్రకటించారు.. ఎన్నికల కమిషన్ జోక్యం చేసుకొని ఆమె శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని మరోవైపు బీఆర్ఎస్, బీజేపీ నాయకులు నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీకి కీలక నేతగా చెలామణి అవుతున్న కొండా మురళి మాటలతో అందరికీ కార్నర్ అయ్యారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొన్నిరోజుల క్రితం ఎమ్మెల్యేలు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, కడియం శ్రీహరిపై పరోక్షంగా ఘాటైన పదజాలాన్ని ఉపయోగించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.. ఇప్పుడు ఓరుగల్లు రాజకీయాల్లో ఎర్రబెల్లి కుటుంబంలో పుట్టినవారు ఎర్రబల్లులేనని విమర్శించడంతో మాటల మంటలకు ఆజ్యం పోసినట్లయ్యింది. దీనికి బదులుగా కొండా మురళిని పిచ్చాస్పత్రిలో చేర్పించాలన్న బీజేపీ నేత ఎర్రబెల్లి ప్రదీప్‌రావు.. నాడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, నేడు రేవంత్‌రెడ్డి సహకారంతో పదవులు పొందింది నిజం కాదా అని ప్రశ్నించారు. బీసీలు, సొంత పార్టీ నేతలు, వరంగల్ తూర్పు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారంటూ ఆయన ఫైర్ అయ్యారు. ఇలా కొన్నిరోజుల నుంచే వరంగల్ రాజకీయం అంతా కొండా చుట్టూనే తిరుగుతుండడం గమనార్హం. ఇంకోవైపు పరకాల ఎమ్మెల్యేగా కొండా సుష్మితాపటేల్ పోటీ చేస్తారని ప్రకటించారు. దీంతో ఆ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీలోనే రెండు గ్రూపులవడం, సొంత పార్టీకే పెద్ద తలనొప్పిగా మారిందనే అభిప్రాయాలు రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. కాంగ్రెస్ నిర్ణయం ఎలా ఉంటుందో..? స్థానిక ఎన్నికలకు అన్ని విధాలుగా సిద్ధమవుతున్న కాంగ్రెస్ పార్టీకి వరంగల్‌లోని రాజకీయం మాత్రం చికాకుపరుస్తోంది. ఇప్పటికే రైతు భరోసా నిధులు విడుదల చేసి గ్రామాల్లో రైతులనుంచి మద్దతు కూడగట్టుకుంటామనుకుంటున్న కాంగ్రెస్‌కు మాత్రం ఇక్కడి ముఖ్య ప్రజాప్రతినిధుల మధ్య వైరుధ్యం తలనొప్పిగా మారిందనే టాక్ ఉంది. అందుకే నష్టనివారణ చర్యల్లో భాగంగా ఇరువైపుల నుంచి వివరణ తీసుకుందని, అయితే ఏ నిర్ణయం ఉంటుందో చూడాలని కిందిస్థాయి కార్యకర్తలు అంటున్నారు. ముఖ్యనేతల మధ్య ఇలానే వైరుధ్యం కొనసాగితే పార్టీకి ప్రతికూల ఫలితాలు వచ్చే అవకాశం లేకపోలేదన్న చర్చ కూడా నడుస్తోంది. కిందిస్థాయి కేడర్‌లో మాత్రం అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. ఓవైపు నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయకుండా కాంగ్రెస్ పార్టీలో ఇదేం రాజకీయమని మదనపడుతున్నారు. కొండా ఎపిసోడ్ సీరియల్‌గా నడుస్తుండడంతో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ కార్యకర్తల్లో నెలకొంది. సాధ్యమైనంత తొందరగా ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే తప్ప దీనికి చెక్‌పడేలా కనిపించడం లేదు. స్వపక్షంతోపాటు బీఆర్ఎస్, బీజేపీకి కార్నరైన కొండా మురళి వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్సీ తీరుతో కాంగ్రెస్ కేడర్‌లో అయోమయం ముఖ్యంగా పరకాల నియోజకవర్గంలో గ్రూపు రాజకీయాలు స్థానిక ఎన్నికల ముందు హస్తం పార్టీకి పెద్ద తలనొప్పి -
చిరుద్యోగుల విభజనకు షెడ్యూల్
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్ పూర్వ వరంగల్ సర్కిల్లో నిలిచిన చిరుద్యోగుల విభజన ప్రక్రియ అడుగు ముందుకు పడింది. మూడేళ్లుగా జాప్యం జరుగుతూ వస్తున్న ఆ ప్రక్రియ ఎట్టకేలకు ప్రారంభకానుంది. టీజీ ఎన్పీడీసీఎల్ సీజీఎం ఆడిట్ చైర్మన్‌గా, హనుమకొండ సర్కిల్ సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ కన్వీనర్‌గా, ఆరు సర్కిళ్ల ఎస్ఈలు సభ్యులుగా ఉన్న కమిటీ.. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీ పోస్టుల బైపర్కేషన్కు నిర్ణయం తీసుకుంది. వాచ్మెన్, స్వీపర్, ఎల్ఎండీలకు ఈ నెల 15 వతేదీ వరకు వారు ఎక్కడి వెళ్తారో సంసిద్ధత తెలిపేందుకు దరఖాస్తులు అందిస్తారు. పూరించిన ఆ దరఖాస్తులను ఈ నెల 31వ తేదీలోపు స్వీకరిస్తారు. ఆగస్టులో పరిశీలించి ఉద్యోగుల విభజన పూర్తి చేస్తారు. ఈ మేరకు సీజీఎం ఆడిట్ షెడ్యూల్ ఖరారు చేశారు. టెమ్రిస్ ఉమ్మడి జిల్లా ఆర్ఎల్సీగా సతీశ్ న్యూశాయంపేట : తెలంగాణ మైనారిటీ గురుకులాల విద్యాసంస్థల(టెమ్రిస్) ఉమ్మడి వరంగల్ జిల్లా రీజినల్ లేవల్ కో–ఆర్డినేటర్(ఆర్ఎల్సీ)గా హనుమకొండ(బి–1) గురుకులం ప్రిన్సి పాల్ డాక్టర్ జంగా సతీశ్ నియమితులయ్యా రు. ఈ మేరకు సెక్రటరీ షఫియుల్లా బుధవా రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో ఇద్దరు ఆర్ఎల్సీలు మూడు జిల్లాలకు ఒకరు చొప్పున పదహారు గురుకులాలను పర్యవేక్షిస్తుండగా ఉమ్మడి జిల్లాలో ఉ న్న 16 గురుకులాలను ఒక్కరే పర్యవేక్షించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఆర్ఎల్సీగా నియమితుడైన సతీశ్‌ను ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గురుకులాల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు అభినందించారు. వరంగల్ మీదుగా తిరుపతికి 8 వీక్లీ రైళ్లుకాజీపేట రూరల్: దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలంగాణలో కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లా ప్రజల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుపతి పుణ్యక్షేత్రానికి వరంగల్ మీదుగా జూలై 6వ తేదీ నుంచి కరీంనగర్–తిరుపతి మధ్య 8 ప్రత్యేక రైళ్ల సర్వీస్‌లను నడిపిస్తున్నట్లు బుధవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల సర్వీస్‌ల వివరాలు ఈ నెల 6వ తేదీ నుంచి 27వ తేదీ వరకు తిరుపతి–కరీంనగర్ (02761) వీక్లీ ఎక్స్‌ప్రెస్ వరంగల్‌కు ప్రతీ సోమవారం వచ్చి వెళ్తుంది. 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు కరీంనగర్– తిరుపతి (02762) వీక్లీ ఎక్స్‌ప్రెస్ ప్రతీ సోమవారం వరంగల్‌కు వచ్చి వెళ్తుంది. ఈ రైళ్ల సర్వీస్‌లకు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, డోర్నకల్, మహబూబాబాద్, వరంగల్, జమ్మికుంట, పెద్దపల్లిలో అప్ అండ్ డౌన్ రూట్లో హాల్టింగ్ సౌకర్యం కల్పించారు. -
అడ్డుకుంటున్నది ఎవరు
టీజీ ఎన్పీడీసీఎల్లో నిలిచిన వాచ్మెన్, స్వీపర్ పోస్టుల బైఫర్కేషన్హన్మకొండ: సాధారణంగా ప్రతీ ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయంలో కచ్చితంగా వాచ్మెన్, స్వీపర్‌ను నియమిస్తారు. ఎందుకంటే ఆ కార్యాలయానికి సంబంధించి ఆస్తుల కాపలాకు వాచ్మెన్, నిరంతరం పరిశుభ్రంగా ఉంచడానికి స్వీపర్ ఉంటారు. అయితే రాష్ట్రంలో రెండు విద్యుత్ పంపిణీ సంస్థల్లో ఒక్కటైన టీజీ ఎన్పీడీసీఎల్లో మాత్రం ఆ పోస్టులను ఇంకా విభజన చేయడం లేదు. ఫలితంగా ఈ సంస్థ పరిధిలో నూతనంగా ఏర్పాటైన కార్యాలయాలకు కాపలా, పరిశుభ్రత కరువైంది. దీంతో అధికా రులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. వాచ్మెన్, స్వీపర్ల విభజన కాకుండా తెర వెనుక ఎవరో అడ్డుకుంటున్నారని విద్యుత్ ఉద్యోగులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మిగతా ఉద్యోగుల విభజన పూర్తి చేసి వీరిని బైఫర్కేషన్ చేయకపోవడంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెరిగిన సర్కిళ్లు.. తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనతో పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్)లో నూతన సర్కిళ్లు, డివిజన్లు, ఈఆర్ఓలు, సబ్ డివిజన్లు, సెక్షన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. పాలన సౌలభ్యం కోసం వీటిని ఏర్పాటు చేశారు. ఆయా కార్యాలయాలకు ఇంజనీర్లు, ప్రొవెన్షియల్, ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బందిని సర్దుబాటు చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. స్వీపర్, వాచ్మెన్ల బైఫర్‌కేషన్‌ను పట్టించుకోలేదు. ఫలితంగా వారు పాత కార్యాలయాల్లోనే విధులు నిర్వహిస్తుండగా, నూతనంగా ఏర్పాటైన కార్యాలయాల్లో వాచ్మెన్లు, స్వీపర్లు లేక అధికారులు, ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ల వారీగా ఉద్యోగుల సర్దుబాటు.. నూతన కార్యాలయాల ఏర్పాటు తర్వాత ఉద్యోగుల విభజనకు 2018, జూన్‌లో సీజీఎం చైర్మన్‌గా ఎస్ఎఓగా కన్వీనర్, పూర్వ సర్కిల్ పరిధిలోని ఎస్ఈలు సభ్యులుగా కమిటీని నియమించి సర్కిల్ స్థాయిలో ఉద్యోగుల విభజన చేశారు. అదే విధంగా సీజీఎం చైర్మన్‌గా, డీఈ టెక్నికల్ కన్వీనర్, ఎస్ఈలు సభ్యులుగా నియమించిన కమిటీ.. డివిజన్ల వారీగా ఉద్యోగులను సర్దుబాటు చేసింది. కానీ స్వీపర్, వాచ్మెన్లను ముట్టు కోలేదు. పూర్వ ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాలో ఇంజనీర్లు, ప్రొవెన్షియల్ ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్, స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్లను సర్దుబాటు చేశారు. కానీ ఒక్క పూర్వ వరంగల్ సర్కిల్లో స్వీపర్, వాచ్మెన్ లైన్మెన్ డ్రైవర్ పోస్టులను పట్టించుకోకుండా వదిలేశారు. ఆ తర్వాత 2022 ఏప్రిల్‌లో సర్కిల్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ల విభజన, సర్దుబాటుకు కమిటీ నియమించారు. అదే విధంగా డివిజన్ స్థాయిలో స్వీపర్, వాచ్మెన్, లైన్మెన్ డ్రైవర్ పోస్టుల విభజన, సర్దుబాటు కోసం మరో కమిటీని నియమించారు. మూడేళ్లు గడిచినా ఎలాంటి నిర్ణయం లేదు.. ఈ కమిటీలను నియమించి మూడేళ్లు గడిచాయి. అయినా ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చైర్మన్లుగా వ్యవహరించాల్సిన సీజీఎంలు మారినా, బదిలీల్లో ఎస్ఈలు, ఎస్ఏఓలు, డీఈ టెక్నికల్లు మారుతున్నారే కాని ఉద్యోగుల విభజన మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అక్కడే ఉంది. ఈ విషయాన్ని యాజమాన్యం కూడా సీరియస్‌గా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను విస్మరించిన యాజమాన్యం..వాచ్మెన్, స్వీపర్ పోస్టుల విభజనను యాజమాన్యం విస్మరించినట్లు కనిపిస్తోంది. పూర్వ వరంగల్ జిల్లా (సర్కిల్) పరిధిలో టీజీ ఎన్పీడీసీఎల్ నాలుగు సర్కిళ్లు ఏర్పాటు చేసింది. హనుమకొండ సర్కిల్ ఆఫీస్ పూర్వ కార్యాలయంగా, నోడల్ కార్యాలయంగా పని చేస్తుండగా, వరంగల్, జనగామ, మహబూబాబాద్‌తోపాటు జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాలను కలిపి భూపాలపల్లి సర్కిళ్లను ఏర్పాటు చేశారు. వీటితో పాటు డివిజన్ కార్యాలయాలు, సబ్ డివిజన్ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాలకు సబ్ ఇంజనీర్ స్థాయి నుంచి డివిజనల్ ఇంజనీర్ వరకు, జూనియర్ లైన్మెన్ నుంచి ఫోర్‌మెన్ వరకు, జూనియర్ అసిస్టెంట్ నుంచి సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ వరకు అధికారులు, ఉద్యోగుల బైఫర్కేషన్ చేసి పోస్టులు మంజూరు చేసి భర్తీ చేసిన యాజమాన్యం.. వాచ్మెన్, స్వీపర్ పోస్టులను విస్మరించిందని అధికారులు, ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి..
కాజీపేట : మెడకు బెల్ట్ బిగించి.. కాళ్లను చున్నీతో కట్టేసి.. కూరగాయలు కోసే కత్తితో ఫైనాన్స్ వ్యాపారిని దారుణంగా హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 16.5 తులాల బంగారం స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు కాజీపేట పీఎస్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి.. సీఐ సుధాకర్ రెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు. వరంగల్ శివనగర్‌కు చెందిన త్రిపురాధి నవీన్‌కుమార్ (55) చిరువ్యాపారులకు ఫైనాన్స్ ఇస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈ క్రమంలో కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో సహజీవనం చేస్తున్న ఇద్దరు రైల్వే ఉద్యోగులు గుండా రజని( ఇందులో ప్రస్తుతం రజనీ ఉద్యోగం కోల్పోయింది.) , గడ్డం ప్రవీణ్‌కుమార్.. నవీన్‌కుమార్ వద్ద రూ.30 వేల అప్పు తీసుకున్నారు. అసలు, వడ్డీ కలిపి రూ.50 వేలకు పెరిగింది. ఈ డబ్బు చెల్లించాలంటూ నవీన్‌కుమార్ కొంత కాలంగా ప్రవీణ్‌కుమార్‌ను వేధిస్తున్నాడు. అప్పటికే పలు నేరాలతో సంబంధం ఉండి జైలుకెళ్లొచ్చి ఉద్యోగం కోల్పోయిన రజని, ప్రవీణ్‌కుమార్.. నవీన్‌కుమార్‌పై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకోవాలనుకున్నారు. ఏ విధంగానైనా ఫైనాన్స్ వ్యా పారిని హత్య చేసి ఆభరణాలు కాజేసి కుటుంబ అప్పులు, అవసరాలు తీర్చుకోవాలని భావించి నవీన్ కుమార్‌కు శుక్రవారం ఫోన్ చేసి రైల్వే క్వార్టర్స్‌కు పిలిపించారు. అయితే అప్పు చెల్లిస్తారనే నమ్మకంతో వచ్చిన వ్యాపారి నవీన్‌కుమార్ మెడకు ప్రవీణ్ బెల్ట్ బిగించి ఊపిరి ఆడకుండా చేయగా, రజని కాళ్లను చున్నీతో కట్టివేసింది. అనంతరం కూరగాయలు కోసే కత్తితో పొడవడంతో పాటు బండరాయితో తలపై మోది నవీన్‌కుమార్‌ను హత్య చేశారు. తర్వాత నిందితులు మృతదేహాన్ని మా యం చేయాలని భావించగా ఎవరూ సహకరించకపోవడంతో చేసేదేమి లేక పరారయ్యారు. హత్య అనంతరం పరారైన రజని.. ఫైనాన్స్ వ్యాపారి నవీన్‌కుమార్‌ను హత్య చేసిన అ నంతరం రజనీ యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం మర్రిగూడెం గ్రామానికి చేరుకుంది. ప్రవీ ణ్ పట్టణంలోనే ఉండి పోలీసుల కదలికలు ఎప్ప టికప్పుడు తెలుసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలో ఈ హత్యపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మర్రిగూడెంలో ఉన్న రజనిని అరెస్ట్ చేసి 16.5 తులాల బంగారు ఆభరణాలు, రెండు బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కడిపికొండ క్రాస్‌లో పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులకు ప్రవీణ్‌కుమార్ పట్టుబడ్డాడు. ఇద్దరిది నేర చరిత్రే.. కాజీపేట రైల్వే ఎలక్ట్రికల్ షెడ్లో పని చేస్తున్న రజని, ప్రవీణ్‌కుమార్ 2013 నుంచి సహజీవనం కొనసాగిస్తున్నారు. కాగా, ప్రవీణ్‌కుమార్ తన భార్య రేణుకను అదనపు కట్నం కోసం వేధించడంతో ఆమె 2018లో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనలో రజని, ప్రవీణ్‌కుమార్ జైలుకెళ్లొచ్చారు. జైలులో సహ నిందితులతో పరిచయం ఏర్పడింది. వారి సూచనల మేరకు ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయగా బసంత్‌నగర్ పోలీసులు రిమాండ్‌కు తరలించారు. దీంతో ఉద్యోగాలు పోవడంతో ఇద్దరు సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో దొంగనోట్ల వ్యాపారం చేస్తూ పోలీసులకు పట్టుబడగా సుబేదారి, మట్టెవాడ, పాలకుర్తి పోలీసుస్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఫైనాన్స్ వ్యాపారిని హత్య చేసిన నిందితులు ఇద్దరి అరెస్ట్.. 16.5 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన పోలీసులురౌడీషీట్, పీడీ యాక్ట్ నమోదు .. నిందితులు రజని, ప్రవీణ్‌కుమార్‌పై వెంటనే రౌడీషీట్ తెరవడంతోపాటు పీడీ యాక్ట్ నమోదు చేయనున్నట్లు ఏసీపీ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కాగా, కేసు ఛేదనలో ప్రతిభకనబర్చిన సీఐ వై.సుధాకర్ రెడ్డి, ఎస్సైలు నవీన్‌కుమార్, సర్వేశ్వర్, సిబ్బంది శ్రీధర్, బి.భాస్కర్, విష్ణు, కె.శ్రీనివాస్‌ను ఏసీపీ అభినందించారు. -
వర్షాకాలంలో అప్రమత్తంగా ఉండాలి
● టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి హన్మకొండ: వర్షాకాలంలో విద్యుత్ అధికారులు, ఉద్యోగులు అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం హనుమకొండ నక్కలగుట్టలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో చీఫ్ ఇంజనీర్లు, నోడల్ జీఎంల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎండీ మాట్లాడుతూ అంతరాయాలు ఏర్పడిన వెంటనే పునరుద్ధరించేలా మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. ప్రతీ సబ్ స్టేషన్‌కు ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరా ఉండాలన్నారు. వచ్చే మూడు నెలల్లో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్న లూజు లైన్లు, వంగిన పోల్స్, తుప్పు పట్టిన స్తంభాలు, తక్కువ ఎత్తులో ఉన్న డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్ల గద్దెల ఎత్తు పెంచడం, లైన్ క్రాసింగ్, డబుల్ ఫీడింగ్ వచ్చే వాటిని గుర్తించి సరి చేయాలని ఆదేశించారు. 16 సర్కిళ్ల పరిధిలో కొత్తగా వ్యవసాయ కనెక్షన్లు పెరుగుతున్నాయని, అందుకు తగట్లు రిలీజ్ వేగవంతం చేయడానికి చర్యలు తీసుకోవాలని సీఈలను ఆదేశించారు. విద్యుత్ బిల్లుల వసూళ్లు వందశాతం జరిగేలా నోడల్ జనరల్ మేనేజర్లు దృష్టి సారించాలన్నారు. సమావేశంలో డైరెక్టర్లు వి. మోహన్ రావు, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, వి. తిరుపతిరెడ్డి, చీఫ్ ఇంజనీర్లు టి.సదర్లాల్, బి.అశోక్ కుమార్, కె.తిరుమల్ రావు, రాజు చౌహాన్, అశోక్, రవీంద్రనాథ్, ఆర్.చరణ్ దాస్, మాధవరావు, జాయింట్ సెక్రటరీ కె.రమేశ్, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షం
హన్మకొండ: నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదులుతున్న క్రమంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా మంగళవారం వర్షం కురిసింది. గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై ఉండి తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసింది. కొద్ది రోజులుగా వర్షాలు లేక తల్లడిల్లిన రైతాంగానికి ఈ వర్షం ఊరటనిచ్చింది. మెట్ట పంటలకు ఈ వాన జీవం పోసింది. ముందుగా విత్తనాలు వేసిన పంటలో కలుపు తీయడానికి అనుకూల వాతావరణం. సోమవారం ఉదయం 8.30 నుంచి మంగళవారం ఉదయం 8.30 గంటల వరకు కురిసిన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. జిల్లాలో సగటున 14.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భీమదేవరపల్లిలో 9.1 మిల్లీమీటర్లు, వేలేరులో 11.4, ఎల్కతుర్తిలో 12.7, కమలాపూర్‌లో 18.7, హసన్‌పర్తిలో 13.5, ధర్మసాగర్లో 10.9, కాజీపేటలో 15.4, హనుమకొండలో 13, ఐనవోలులో 18.5, పరకాలలో 8.3, దామెరలో 12.2, ఆత్మకూరులో 20.2, శాయంపేటలో 28.9, నడికూడలో 14.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.హనుమకొండ కాకాజీ కాలనీలో రోడ్డుపై నిలిచిన వర్షపు నీరు -
సురేఖ శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలి
● ఎన్నికల సంఘానికి మాజీ ఎమ్మెల్యే నరేందర్ ఫిర్యాదు వరంగల్ చౌరస్తా: గత శాసన సభ ఎన్నికల్లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యేగా పోటీ చేసిన కొండా సురేఖ రూ.70 కోట్లు ఖర్చు చేసినట్లు స్వయంగా తన భర్త, మాజీ ఎమ్మెల్సీ మురళీధర్ రావు బహిరంగంగా ప్రకటించడంపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్‌లో ఉప ప్రధాన ఎన్నికల అధికారి బి.హరిసింగ్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులను పరిశీలించాలని కోరారు. తాజాగా వరంగల్ తూర్పు నియోజక వర్గంలో జరిగిన కార్యక్రమంలో కొండా మురళీధర్ రావు వ్యాఖ్యల వీడియోలు ఉన్నాయని, వాటిని పరిశీలించి సురేఖ శాసన సభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. డీఎంహెచ్ఓ, ప్రోగ్రాం అధికారులకు సన్మానం గీసుకొండ: జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని వరంగల్ జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో సిబ్బంది, అధికారులు మంగళవారం డీఎంహెచ్ఓ సాంబశివరావు, ప్రోగ్రాం అధికారులను సన్మానించారు. అనంతరం డీఎంహెచ్ఓ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వైద్యులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని, వర్షాకాలంలో సంక్రమించే వ్యాధుల నివారణపై దృష్టి సారించాలన్నారు. డిప్యూటీ డీఎంహెచ్ఎఓలు ప్రకాశ్, కొమురయ్య, ప్రోగ్రాం అధికారులు ఆచార్య, అర్చన, విజయ్‌కుమార్, డిప్యూటీ డెమో అనిల్‌కుమార్, ఎస్ఓ విజయలక్ష్మి, డీపీఓ అర్చన ,సిబ్బంది పాల్గొన్నారు. -
కొత్త రేషన్‌కార్డుల జారీని వేగవంతం చేయాలి
న్యూశాయింపేట: కొత్త రేషన్‌కార్డుల దరఖాస్తుల పరిశీలన, రేషన్‌కార్డుల్లో అదనంగా పేర్ల నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కాన్ఫరెన్స్హాల్లో డిఫాల్టర్ రైస్‌మిల్లర్స్, రేషన్ కార్డుల పంపిణీ, భూభారతి దరఖాస్తుల పరిష్కారం, వనమహోత్సవం ఏర్పాట్లపై అధికారులతో కలెక్టర్, అదనపు కలెక్టర్ జి.సంధ్యారాణి మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి మండలంలో ఉన్న డిఫాల్టర్ రైస్‌మిల్లర్ల జాబితా సిద్ధం చేయాలని, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రకారం మిల్లర్లపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రేషన్‌కార్డు లబ్ధిదారుల్లో డెత్ కేసులు ఉంటే గ్రామపంచాయతీల నుంచి నివేదికలు సేకరించాలని పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన భూభారతి దరఖాస్తుల ఆన్‌లైన్‌ను వేగవంతం చేయాలని ఆదేశించారు. మహిళా పెట్రోల్ బంకుల స్థాపనకు ప్రభుత్వ స్థలాలను గుర్తించి నివేదికలు సమర్పించాలని తహసీల్లార్లకు సూచించారు. పీఎం కుసుమ ప్రాజెక్టు కింద సోలార్‌ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు. వనమహోత్సవంలో భాగంగా విరివిగా మొక్కలు నాటేందుకు ఒక్కో మండలంలో ఐదెకరాల చొప్పున ప్రభుత్వ స్థలాన్ని సేకరించి గ్రీనరీ ఏర్పాటు చేయాలని అన్నారు. వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, డీసీఎస్ఓ కిష్టయ్య, డీఎం సంధ్యారాణి, సంబంధిత మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు ప్రైవేట్ పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో డీఈఓ జ్ఞానేశ్వర్‌తో కలిసి ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించారు. జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. పోస్టర్ ఆవిష్కరణ జిల్లాలో నేషనల్ స్టూడెంట్స్ పర్యావరణ పోటీ–2025 పోస్టర్‌ను కలెక్టర్ సత్యశారద కార్యాలయంలో ఆవిష్కరించారు. డీఈఓ జ్ఞానేశ్వర్, జిల్లా సైన్స్ అధికారి తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం సాయంత్రం అధికారులతో జరిగిన సమీక్షలో ఆమె మాట్లాడారు. అధికారుల సమీక్షలో వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద -
టీజీఎప్‌సెట్ సర్టిఫికెట్ల పరిశీలన షురూ..
కేయూ క్యాంపస్: తెలంగాణ రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం టీజీఎప్‌సెట్ –2025 ఎంపీసీ స్ట్రీమ్‌లో ఇంజనీరింగ్ అండ్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకుగాను కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీ, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలల్లోని హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ మంగళవారం ప్రారంభమైంది. ప్రథమ దశలో ఇప్పటికే స్లాట్‌బుకింగ్ చేసుకున్న విద్యార్థులు ఆయా హెల్ప్‌లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారు. స్లాట్ బుకింగ్ ప్రక్రియ జూన్ 28 నుంచి జూలై 7వ తేదీ వరకు ఉంది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జూలై 8వ తేదీ వరకు కొనసాగనుంది. క్యాంపస్‌లోని అడ్మిషన్ల డైరెక్టరేట్‌లో హెల్ప్‌లైన్ సెంటర్లో సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు డైరెక్టర్ ప్రొఫెసర్ సీజే శ్రీలత, సహాయ కోఆర్డినేటర్ సురేశ్‌బాబు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 300 మంది విద్యార్థులకు వెరిఫికేషన్ చేశారు. ఆర్ట్స్ అండ్ స్సైన్స్ కాలేజీ హెల్ప్లైన్సెంటర్లో ప్రిన్సిపాల్ ఎస్.జ్యోతి విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు.అలాగే, కేడీసీలోనూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగింది. వరంగల్‌లోని ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో ఆ కళాశాల ప్రిన్సిపాల్ బైరి ప్రభాకర్ సర్టిఫికెట్ల వెఫికేషన్ చేసుకున్న విద్యార్థులకు ధ్రువపత్రాలు అందజేశారు. తొలిరోజు 400 మంది విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరయ్యారని ప్రభాకర్ తెలిపారు. నాలుగు హెల్ప్‌లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ ప్రక్రియ -
ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించాలి
వరంగల్ క్రైం: నేరాల నియంత్రణతో పాటు నేరస్తులను పట్టుకోవడంలో పోలీస్ అధికారులు ప్రజలతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అధికారులకు పిలుపునిచ్చారు. జూన్‌కు సంబంధించిన నెలవారీ నేర సమీక్షను కమిషనరేట్‌లో మంగళవారం నిర్వహించారు. సుధీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న కేసుల వివరాలు, పెండింగ్‌లో ఉండడానికి కారణాలను స్టేషన్ల వారీగా అడిగి తెలుసుకున్నారు. పరిష్కారంపై తీసుకోవాల్సిన చర్యలను సూచించారు. ఈసందర్భంగా సీపీ సన్‌ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణకు అర్బన్, మున్సిపల్, గ్రామ స్థాయిలోని ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలో విలేజ్ పోలీస్ అఫీసర్‌ను ఏర్పాటు చేయాలని, నేరాల నియంత్రణకు ప్రతీ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఉదయం 6 గంటల వరకు పెట్రోలింగ్ నిర్వహించాలని సూచించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు పోలీస్ అధికారులు సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులతో రోడ్డు ప్రమాదాలకు కారణాలపై క్షేత్రస్థాయిలో సమీక్ష జరపాలన్నారు. డ్రగ్స్‌కు అలవాటు పడిన యువత పోలీసులకు చిక్కినప్పుడు పునరావాస కేంద్రాలకు తరలించి చికిత్స అందించేందుకు కార్యాచరణ, ప్రణాళిక రూపొందించాలని వివరించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదులపై తప్పనిసరిగా కేసులు నమోదు చేయాలని, ప్రధానంగా ప్రజావాణి నుంచి వచ్చే ఫిర్యాదులకు అధికారులు తక్షణమే స్పందించాలని సూచించారు. సమావేశంలో డీసీపీలు షేక్ సలీమా, రాజమహేంద్రనాయక్, అంకిత్‌కుమార్, ఏఎస్పీలు శుభం, చేతన్, అదనపు డీసీపీలు ప్రభాకర్, బోనాల కిషన్, రవి, సురేశ్‌కుమార్, ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. సీపీ సన్‌ప్రీత్ సింగ్ కమిషనరేట్‌లో నెలవారీ నేర సమీక్ష -
రోడ్లు, డ్రెయినేజీల్లో చెత్త వేస్తే జరిమానా
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్.. క్షేత్రస్థాయిలో తనిఖీ వరంగల్ అర్బన్: ఇళ్లల్లో, షాపుల్లో వెలువడిన చెత్తను విధిగా స్వచ్ఛ ఆటోలు, వాహనాలకు అందించేలా చూడాలని, నిర్లక్ష్యంగా డ్రెయినేజీల్లో, రోడ్లపై వేస్తే జరిమానాలు విధించాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను హెచ్చరించారు. మంగళవారం హనుమకొండ పరిధి 31, 7, 8 డివిజన్లలో శానిటేషన్ తనిఖీలు చేపట్టారు. వడ్డేపల్లి బండ్‌పై స్మార్ట్ సిటీ పనులు, ప్రశాంత్ నగర్‌లోని 15 ఏంఎల్‌డీ సీవరేజీ ట్రీట్మెంట్ ప్లాంట్ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. హనుమకొండ మెయిన్ రోడ్డు, చౌరస్తా ప్రాంతాల్లో పర్యటించి గ్రీవెన్స్‌లో స్థానికులు అందించిన ఫిర్యాదుల ఆధారంగా ఆయా ప్రాంతాలను పరిశీలించారు. నిబంధనలు ఉల్లంఘించి చెత్త వేసిన టీ స్టాల్ యజమానికి రూ.10 వేలు పెనాల్టీ విధించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రమేశ్, ఈఈ రవికుమార్, డీఈ కార్తీక్‌రెడ్డి, ఏఈ మేనక, శానిటరీ సూపర్వైజర్ నరేందర్, శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్, స్మార్ట్ సిటీ ప్రతినిధి ఆనంద్ ఓలేటి తదితరులు పాల్గొన్నారు. -
ఆ.. జలపాతాల సందర్శన నిషేధం
వాజేడు: గతంలో జరిగిన ప్రమాదాల నేపథ్యంలో దండకారణ్యంలోని పలు జలపాతాల సందర్శనకు అటవీశాఖ, పోలీసుల ఆధ్వర్యంలో బ్రేకులు వేశారు. ములుగు జిల్లాలో ప్రాచుర్యం పొందని జలపాతాల సందర్శనకు పర్యాటకులు రావొద్దని కోరుతూ నిషేధం విధించారు. దీంతో గుట్టల సమీపంలో ఉన్న జలపాతాలను సందర్శించడం ఇక కష్టం కానుంది. నిషేధించిన జలపాతాలివే.. వాజేడు, వెంకటాపురం(కె) మండలాలను ఆనుకుని దండకారణ్యం, కర్రె గుట్టలు ఉన్నాయి. ఈ గుట్టలపైనుంచి జాలువారుతూ వాజేడు మండలంలో మరికొన్ని జలపాతాలు ఉన్నాయి. కొంగాల సమీపంలో దుసపాటిలొద్ది, కృష్ణాపురం సమీపంలో భామనసిరి, దూలాపురం సమీపంలోని మాసన్లొద్ది, అరుణాచలపురం సమీపంలో గుండం, వెంకటాపురం(కె)లో ముత్యంధార జలపాతాలు ఉన్నాయి. ఇవి ఇంకా ప్రాచుర్యం పొందలేదు. కానీ, బొగత జలపాతం సందర్శన వచ్చే పర్యాటకులు ముఖ్యంగా యువత ఎక్కువగా ఈ జలపాతాలను తిలకించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు. నిషేధం ఉందని తెలిసినా వెళ్తున్నారు. రక్షణ లేకపోవడంతోనే.. దుసపాటి లొద్ది, మాసన్ లొద్ది, గుండం, ముత్యం ధార, భామన సిరి జలపాతాలు నట్టడవిలో ఉన్నాయి. ఇక్కడికి చేరుకోవాలంటే చాలాదూరం అడవిలో కాలినడకన వెళ్లాలి. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఉండవు. ఇవి ఇంకా పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందలేదు. దీంతో ఇక్కడికి అష్టకష్టాలు పడి వెళ్లిన పర్యాటకులు ప్రమాదాలకు గురైన సందర్భంలో సమాచారం బయటికి తెలిసే అవకాశం ఉండడంలేదు. దీంతో స్థానిక అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ఈ జలపాతాల వద్ద ఎలాంటి రక్షణ చర్యలు, సౌకర్యాలు లేవు. దీంతో అటవీశాఖ సిబ్బంది వీటిని నిషేధించడంతోపాటు ఇక్కడికి పర్యాటకులు వెళ్లొద్దని అటువైపు వెళ్లే దారులను బారికేడ్లు పెట్టి మూసివేశారు. ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దొంగ దారిలో వెళ్లకుండా సిబ్బందిని కాపలాగా ఉంచారు. నిషేధిత జలపాతాలకు వెళ్లొద్దు దట్టమైన అటవీ ప్రాంతంలోని ప్రమాదకర జలపాతాల సందర్శనకు అనుమతులు లేవు. అనవసరంగా పర్యాటకులు వెళ్లి ప్రమాదాలను కొని తెచ్చుకోవద్దు. ప్రమాదం జరిగితే రక్షించడానికి ఆ సమయంలో ఎవరూ అందుబాటులో ఉండరు. ఈ విషయాన్ని పర్యాటకులు గుర్తుంచుకుని మాకు సహకరించాలి. – ద్వాలియా, ఎఫ్డీఓ, వెంకటాపురం(కె) అటవీ, పోలీస్ అధికారుల నిర్ణయం రక్షణ లేకపోవడం.. గత ప్రమాదాలే ప్రధాన కారణం దారులు మూసి.. కాపలాగా ఉన్న సిబ్బంది బొగత జలపాతానికి రావాలంటూ పిలుపుబొగతకు రండి.. బొగత జలపాతానికి ఎలాంటి ఇబ్బందులూ లేవని, పర్యాటకులు తరలి రావాలని అధికా రులు కోరుతున్నారు. అన్ని సౌకర్యాలున్న ఈ జలపాతాన్ని పర్యాటకులు వీక్షించాలని ఆహ్వానిస్తున్నారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ కూడా బొగత జలపాతాన్ని వీక్షించాలని పిలుపునిచ్చారు. ఇక్కడికి రోజురోజుకూ పర్యాటకుల సంఖ్య పెరుగుతున్నప్పటికీ మండలంలో సరైన వర్షం లేకపోవడంతో పూర్తిస్థాయిలో జాలువారడం లేదు. -
మెరుగైన వైద్యసేవలు అందించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించడం ద్వారా వైద్యవృత్తికి న్యాయం చేకూరుతుందని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ వైద్యులకు సూచించారు. మంగళవారం డాక్టర్స్ డేను పురస్కరించుకొని కలెక్టరేట్లో కేక్ కట్ చేసి వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. ప్రతీ పేదవాడికి వైద్యం అందాలని, ఆరోగ్య తెలంగాణ దిశగా కృషి చేయాలని సూచించారు. అనంతరం డీఎంహెచ్ఓ అప్పయ్య, కేఎంసీ ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డి, అధికారులు మదన్మోహన్రావు, మహేందర్, హిమబిందు, డాక్టర్ మంజుల, డాక్టర్ అహ్మద్‌ను శాలువాలతో సత్కరించారు. వైద్యుల క్రీడల్లో గెలుపొందిన వారికి ప్రశంసపత్రాలు, కప్ బహూకరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, వైద్యాధికారులు, అడ్మినిస్ట్రేటివ్ అధికారి కోలా రాజేశ్ పాల్గొన్నారు. -
కల్వర్టు పనులు ఇంకెన్నాళ్లు?
ఇంజనీర్లు, కాంట్రాక్టర్ తీరుపై మేయర్ అసహనం వరంగల్ అర్బన్: రామన్నపేట పాత సుశీల్ థియేటర్ సమీపంలోని కల్వర్టు పనులు ఇంకా ఎన్నాళ్లు చేపడతారని.. ఇంజనీర్లు, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యంపై మేయర్ సుధారాణి అసహనం వ్యక్తం చేశారు. మంగళవారం కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి వరంగల్‌లోని పోతన జంక్షన్, బీట్ బజార్ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. పోతన జంక్షన్ ప్రాంతంలోని 12 మోర్ల జంక్షన్‌ను విస్తరించాలన్నారు. ఇదే ప్రాంతంలో చేతిపంపు పని చేయట్లేదని స్థానికుల ఫిర్యాదు మేరకు మరమ్మతులు చేయించాలని సూచించారు. డ్రెయిన్‌ను ఎప్పటికప్పుడు క్లీన్‌గా ఉంచుతూ వర్షపు నీరు సులువుగా సాఫీగా వెళ్లేలా చర్యలు ఉండాలన్నారు. వర్షపు నీరు నిల్వ ఉండకుండా లెవెల్స్ సరి చూడాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి. ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, ఏసీపీ శ్రీనివాస్‌రెడ్డి, టీపీఎస్‌లు ఏర్షాద్, అనిల్, డీఈ రాజ్‌కుమార్, ఏఈలు రాగి శ్రీకాంత్, హబీబ్ శానిటరీ ఇన్స్పెక్టర్ శ్యామ్ రాజ్ పాల్గొన్నారు. -
‘స్థానికం’ కోసం.. ‘ముందస్తు’గా..
సాక్షిప్రతినిధి, వరంగల్: స్థానిక సంస్థల ఎన్నికలు కొద్ది రోజుల్లో జరిగే అవకాశం ఉండగా.. అధికార కాంగ్రెస్ పార్టీ ‘ముందస్తు’గా సిద్ధమవుతోంది. గ్రామ స్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అధిష్టానం సీనియర్లను రంగంలోకి దింపుతోంది. ఈక్రమంలోనే టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జ్‌లను నియమించింది. ఈ మేరకు టీపీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్ ఆ జాబితాను విడుదల చేశారు. ఇతర జిల్లాలకు చెందిన సీనియర్లను ఉమ్మడి వరంగల్‌కు నియమించిన టీపీసీసీ చీఫ్.. ఉమ్మడి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీనియర్లకు ఇతర జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఒక్కో పార్లమెంట్ స్థానానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులను నియమించారు. వరంగల్ (ఎస్సీ) పార్లమెంట్ నియోజకవర్గం వైస్ ప్రెసిడెంట్‌గా చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులుగా దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్ గౌడ్, మోత్కూరి ధర్మారావు, మహబూబాబాద్ (ఎస్టీ)కి వైస్‌ప్రెసిడెంట్‌గా మాజీ ఎమ్మెల్సీ పొట్ల నాగేశ్వర్రావు, ప్రధాన కార్యదర్శులుగా ఎమ్మెల్యే డా.మట్టా రాగమయి, బేబీ స్వర్ణకుమారి, నాగ సీతారాములును నియమించారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్‌నుంచి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంట్ వైస్ ప్రెసిడెంట్‌గా, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యను మల్కాజ్గిరి వైస్‌ప్రెసిడెంట్‌గా, హన్మాండ్ల ఝాన్సీరెడ్డికి సికింద్రాబాద్ ఇన్చార్జ్గా బాధ్యతలు అప్పగించారు. నల్లగొండకు నమిండ్ల శ్రీనివాస్‌ను వైస్‌ప్రెసిడెంట్‌గా నియమించిన అధిష్టానం.. ఈవీ శ్రీనివాస్‌రావు, బొద్దిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలు భువనగిరి, ప్రొఫెసర్ కత్తి వెంకటస్వామికి సికింద్రాబాద్ ఇన్చార్జ్ జనరల్ సెక్రటరీలుగా బాధ్యతలు అప్పగించారు. అదేవిధంగా మాజీ జెడ్పీ చైర్పర్సన్ లకావత్ ధన్వంతిని ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ ఆర్గనైజేషన్ ఇన్చార్జ్గా నియమించారు. పార్లమెంట్ నియోజకవర్గాలకు కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌లు టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు అవకాశం వరంగల్‌కు చిట్ల సత్యనారాయణ, మహబూబాబాద్‌కు పొట్ల నాగేశ్వర్రావు ఇతర జిల్లాల ఇన్చార్జులుగా ఓరుగల్లు నేతలు -
శ్రీవాణి ఆత్మహత్యకు ఫొటోనే కారణమా..
పరకాల: ఓ పదో తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం మల్లక్‌పేట శివారులోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో సోమవారం జరిగింది. పరకాలకు చెందిన ఏకు ఈశ్వర్–నీల కుమార్తె శ్రీవాణి ఉదయం అల్పాహారం తీసుకున్న అనంతరం బాత్రూమ్కు వెళ్లింది. చాలాసేపటి వరకు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన స్నేహితురాళ్లు ప్రిన్సిపాల్ కృష్ణకుమారికి తెలిపారు. ఆమె వచ్చి బాత్రూం డోర్‌ను బలవంతంగా తీయడంతో శ్రీవాణి చున్నీతో ఉరివేసుకుని కనిపించింది. వెంటనే ఆమెను పరకాల సివిల్ ఆస్పత్రికి తరలించారు. శ్రీవాణి బాత్రూంలో జారిపడిందని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు హుటాహుటిన ఆస్పత్రికి వచ్చారు. అప్పటికే బాలిక చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించడంతో కుటుంబ సభ్యులు భోరుమని విలపించారు. తమ కుమార్తె చావుకు కారణం తెలపాలంటూ రెసిడెన్షియల్ ముందు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ప్రిన్సిపల్ కృష్ణకుమారి, హౌజ్మాస్టర్ మీరాబాయి వేధింపుల కారణంగానే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆత్మహత్యకు ఫొటోనే కారణమా.. వారం క్రితమే రెసిడెన్షియల్లో చేరిన శ్రీవాణి వద్ద ఓ ఫొటోను చూసిన హౌస్ టీచర్ బలవంతంగా లాక్కున్నట్లు తెలిసింది. తర్వాత విద్యార్థిని సదరు టీచర్ తాళం చెవి కనుక్కొని లాకర్ ఓపెన్ చేసి ఫొటో తీసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేయగా.. విద్యార్థినుల సమక్షంలోనే శ్రీవాణిని నోటికి వచి్చనట్లు తిట్టి.. చావచ్చు కదా అన్నట్లు సమాచారం. దీంతో మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. పోలీసులకు సమాచారం ఇవ్వకుండా ప్రిన్సిపాల్ ఆటోలో విద్యారి్థని మృతదేహాన్ని తరలించడాన్ని పోలీసులు సీరియస్‌గా తీసుకున్నారు. ఆమెను అదుపులోకి తీసుకొని పరకాల పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు సమాచారం. -
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి
హన్మకొండ అర్బన్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణతో మహిళలు ఆర్థిక పురోగతిని సాధించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘ మహిళల ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా మహిళలు మరింత ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మెప్మా కో–ఆర్డినేటర్ రజితరాణి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ -
అక్టోబర్‌లో రాష్ట్రస్థాయివెయిట్ లిఫ్టింగ్ పోటీలు
నయీంనగర్: వరంగల్‌లో అక్టోబర్ నెలలో రాష్ట్ర స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కెఆర్.దివ్యజ రాజ్ తెలిపారు. సోమవారం హనుమకొండ ప్రెస్ క్లబ్లో వరంగల్ జిల్లా వెయిట్ లిఫ్టింగ్ నూతన కార్యవర్గం ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా దివ్యజ రాజ్ మాట్లాడుతూ వరంగల్ క్రీడాకారులకు నాణ్యమైన శిక్షణతోపాటు రాష్ట్ర, జాతీయ స్థాయిలో పాల్గొనే క్రీడాకారులకు ఆర్థిక సహకారం అందజేస్తామన్నారు. క్రీడాకారులకు క్రీడాసామగ్రి, క్రీడా దుస్తులు ఇస్తామన్నారు. ప్రతిభ కలిగిన క్రీడాకారులకు పారితోషికం అందజేస్తామన్నారు. కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీపాద శ్రీనివాసరావు, ట్రెజరర్ డాక్టర్ ఎస్.నూతన్, మెడ్ల సురేందర్, తదితరులు పాల్గొన్నారు.పీహెచ్డీ అడ్మిషన్లు కల్పించాలని ఆందోళనకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీలో వివిధ విభాగాల్లో 2021–2022 పీహెచ్డీ నోటిఫికేషన్ ఇచ్చి అప్పటికే అభ్యర్థులకు అడ్మిషన్లు కల్పించిన విషయం విధితమే. అయితే తమకు పీహెచ్‌డీలో అడ్మిషన్లు కల్పిస్తామని గతంలో చెప్పారని, ఉన్నత విద్యామండలి నుంచి సిఫార్సు చేసినా అడ్మిషన్లు కల్పించకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపిస్తూ ఐదుగురు అభ్యర్థులు సోమవారం వీసీ చాంబర్లో ఆందోళన చేపట్టారు. వీసీ ప్రతాప్‌రెడ్డితో వాగ్వాదానికి దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళన చేస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేసి పీఎస్‌కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై విడుదల చేశారు. ఆందో ళన చేసిన వారిలో మంద నరేశ్, బొట్ల మనోహర్, మోతే రాజు, ఎస్. అనిల్, తిరుపతినాయక్ ఉన్నారు. -
దాతలారా.. ఆపన్నహస్తం అందించండి..
గీసుకొండ: గ్రేటర్ వరంగల్ నగరం 36వ డివిజన్ పుప్పాలగుట్ట ప్రాంతానికి చెందిన వేల్పుల నవీన్‌కుమార్ (36) మూడేళ్లుగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నాడు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో మంచంపై కదల్లేని స్థితిలో దీనావస్థలో జీవితం సాగిస్తున్నాడు. అతని భార్య కవిత మూగ, చెవిటికాగా, కూతురు నివేదిత ఉన్నారు. నవీన్‌కుమార్ స్థానికంగా కరెంటు స్విచ్ బోర్డుల తయారు చేసే కాంట్రాక్టర్ వద్ద రోజుకు రూ.300 దినసరి కార్మికుడిగా పనిచేస్తూ కుటుంబాన్ని కష్టంమీద పోషిస్తున్నాడు. మూడేళ్ల క్రితం అతడికి హైబీపీ రావడంతో రెండు కిడ్నీలు పూర్తిగా చెడిపోవడంతో ఇంటిదగ్గరే ఉంటున్నాడు. గతంలో వారానికి రెండు రోజులపాటు డయాలసిస్ చేయగా, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో హనుమకొండలోని విశ్వాస్ ఆస్పత్రిలో వారానికి మూడు సార్లు డయాలసిన్ జరుగుతోంది. ఇందుకోసం ప్రతీనెల రూ.2లక్షల మేర ఖర్చు అవుతుండంతో భరించలేని స్థితిలో నవీన్‌కుమార్ కుటుంబం ఉంది. చెడిపోయిన రెండు కిడ్నీల స్థానంలో ఓ కిడ్నీ అయినా ఏర్పాటు చేస్తే తన ప్రాణం నిలిచే అవకాశం ఉందని నవీన్కమార్ చెబుతున్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో ‘జీవన్‌దాన్’ పథకం కింద కిడ్నీ మార్పిడి కోసం దరఖాస్తు చేసుకుని 8 నెలల అవుతున్నప్పటికీ కిడ్నీ దాతలు లభించడం లేదు. దాతలెవరైనా ఉంటే 99493 49660 సెల్ నంబర్‌కు ఫోన్ చేసి సహాయం అందించాలని బాధితుడి తండ్రి రత్నం కోరుతున్నారు. రెండు కిడ్నీలు చెడిపోయి దీనావస్థలో బాధితుడు నిమ్స్‌లో ‘జీవన్‌దాన్’కోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం శూన్యం చికిత్స పొందుతున్న నవీన్‌కుమార్ -
పోలీసుల అదుపులో నిందితులు?
● ఫైనాన్స్ వ్యాపారి హత్య కేసు విచారణలో విస్తుపోయే నిజాలు కాజీపేట: కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో శుక్రవారం ఫైనాన్స్ వ్యాపారి త్రిపురాధి నవీన్‌కుమార్‌ను దారుణంగా హత్య చేసిన నిందితులు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత నిందితులు అతడి(నవీన్‌కుమార్) శరీరంపై ఉన్న బంగా ర ఆభరణాలను తీసుకుని వరంగల్ బట్టల బజారులోని ఓ జ్యువెల్లరీ షాపులో రూ.6 లక్షలకు విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. నిందితులు ఇద్దరు కాజీపేటలోని ఓ చిరువ్యాపారిని కలిసి తమ ఫోన్ పోయిందని చెప్పి మరొకరితో మాట్లాడినట్లు కేసు విచారణలో బయట పడింది. దీంతో నిందితుల కదలికలపై కన్నేసిన పోలీసులు ఆదివారం రాత్రి అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మృతుడు ఆ రోజు డబ్బుల వసూలు కోసం వచ్చి సదరు మహిళ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వల్లే చంపినట్లు నిందితుడు ప్రవీణ్‌కుమార్ పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం. నవీన్‌కుమార్‌ను చంపిన తర్వాత మృతదేహాన్ని మాయం చేసి ఏమి తెలియనట్లు ఉండాలని భావించామని, కానీ పరిస్థితులు అనుకూలించకపోవడంతో విషయం బహిర్గతం అయ్యిందని కన్నీరు పెట్టుకుంటున్నట్లు ప్రచారం సాగుతోంది. డబ్బులు సాయం చేసిన వ్యాపారిని హత్య చేయాలనే ఉద్దేశం తమకు లేదని, అతడి ప్రవర్తన వల్లే మద్యం మత్తులో హత్య చేసినట్లు నిందితులు పోలీసు అధికారులకు చెబుతున్నట్లు తెలుస్తోంది. హత్య జరిగిన అనంతరం వరంగల్‌లో బంగారం విక్రయించగా వచ్చిన డబ్బులలో కొంత మేర బాకీలు చెల్లించి సుదూర ప్రాంతాలకు వెళ్లి బతకాలని నిర్ణయించుకున్నామని నిందితులు వెల్లడిస్తున్నట్లు సమాచారం. దీనిపై ఒకటి, రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి నిందితులను కోర్టులో హాజరుపర్చడానికి పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. నవీన్‌కుమార్(ఫైల్) -
లెక్కలన్నీ తేల్చుతారు ..
నేడు చార్టెడ్ అకౌంటెంట్ డేహన్మకొండ చౌరస్తా: ఏడాదిలో చేసిన లక్షలు, కోట్ల రూపాయల ఖర్చు, జమలకు సంబంధించిన ప్రతీ పైసా లెక్క తేల్చుతారు. బడా వ్యాపారుల నుంచి మొదలు.. ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లోనూ వీరిదే ముఖ్య భూమిక. లాభాల నుంచి నష్టాల వరకు ప్రతి అంశానికి ఓ లెక్క.. ఆ లెక్కకు ఓ రికార్డును సరిచేస్తారు. వారు లేనిది ఎంత పెద్ద సంస్థ అయినా నడవదంటే అతిశయోక్తి కాదు. ఇంతకీ వారు ఎవరు అనుకుంటున్నారా.. చార్టెడ్అకౌంటెంట్లు. ప్రస్తుతం ప్రతీ సంస్థకు ఓ సీఏ తప్పనిసరి అయ్యింది. దీంతో సీఏ కోర్సుకు డిమాండ్ పెరిగింది. సీఏ పూర్తి చేస్తే ఉపాధి అవకాశాలకు కొరత లేదనే చెప్పొచ్చు. నేడు చార్టెడ్ అకౌంటెంట్ల దినోత్సవ సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆర్థిక మోసాలను కనిపెట్టడంలో దిట్ట.. కంపెనీ ప్రాజెక్టు నివేదికలు తయారుచేయడం.. ఖర్చులు నియంత్రించడం.. ఆర్థిక మోసాలను కనిపెట్టి వాటి నివారణకు చర్యలు సూచించడం సీఏ బాధ్యత. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్న వారు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారు 250 మంది చార్టెడ్ అకౌంటెంట్లు ఉన్నారు. పెరుగుతున్న ఆదరణ.. సీఏగా గుర్తింపు పొందిన వారికి దేశంలోనే కాదు విదేశాల్లోనూ విస్తృత ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. మల్టీనేషనల్ కంపెనీల్లో పనిచేసే సీఏకు రూ.లక్షల్లో వేతనాలు చెల్లిస్తున్నారంటే అతిశయోక్తి కాదు. సీఏ కోర్సు వివరాలు .. ఇంటర్మీడియట్ పూర్తయ్యాక సీఏ ఫౌండేషన్‌కు రిజిస్టర్డ్ అవ్వాలి. డిగ్రీ పూర్తి చేసిన వారు ఫౌండేషన్ అవసరం లేకుండానే నేరుగా సీఏకు రిజిస్టర్డ్ కావొచ్చు. అడ్మిషన్ కోసం ముందు ఐసీఏఐ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి, అవసరమైన డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాలి. సీఏ ఫౌండేషన్ ఇంటర్ తర్వాత మొదటి స్టేజ్‌లో అకౌంటింగ్, ‘లా’, ఎకనామిక్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఇలా నాలుగు సబ్జెక్టులు ఉంటాయి. 2 నుంచి 3 సంవత్సరాల ట్రైనింగ్ చేయాల్సి ఉంటుంది. చివరి స్టేజీలో రెండు గ్రూప్స్, ఆరు పేపర్లు పూర్తి చేయాలి. కోర్సు పూర్తయ్యే వరకు రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఐసీఏఐ ద్వారా మెరిట్, నీడ్ బేస్డ్ స్కాలర్షిప్స్ అందుతాయి. కోర్సు పూర్తి చేయడానికి 4–5 సంవత్సరాలు పడుతుంది. అద్దె భవనంలో .. దశాబ్ద కాలంగా హనుమకొండ హంటర్‌రోడ్ లోని ట్యాక్స్ బార్ అసోసియేషన్ భవనంలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) వరంగల్ శాఖ అద్దె భవనంలో కొనసాగుతోంది. అప్పట్లో జిల్లాకు ఐసీఏఐకు సొంత భవనం మంజూరు చేయాలని అసోసియేషన్ బాధ్యులు అప్పటి కలెక్టర్ వాకాటి కరుణను కోరారు. స్పందించిన ఆమె బాలసముద్రంలోని ఎలక్ట్రిసిటీ రెవెన్యూ ఆఫీస్ పక్కన గల సుమారు ఎకరం ప్రభుత్వం స్థలాన్ని కేటాయించేందుకు సూచనప్రాయంగా అంగీకారం తెలిపారు. అందుకు ప్రభుత్వ ధర ప్రకారం ఆయా స్థలానికి చెల్లించేందుకు ఐసీఏఐ సైతం ముందుకొచ్చింది. అంతేకాదు భవన నిర్మాణం కోసం రూ.6 కోట్లు వెచ్చించేందుకు ఐసీఏఐ రెడీగా ఉన్నట్లు తెలిపారు. ఇంతలో ఏమైందో తెలియదు ఆ ప్రతిపాదనలు మూలకుపడ్డాయి. దీంతో సీఏ కోర్సు చదవడానికి సరైన వసతులు లేకపోవడంతో ఉమ్మడి వరంగల్ విద్యార్థులు హైదరా బాద్, చైన్నె లాంటి మహానగరాలకు వెళ్తున్నారు. విశ్వసనీయతకు నిలువుటద్దం వ్యాపారుల లెక్కలన్నీ వీరి గుప్పిట్లోనే.. సీఏ కోర్సుతో ఉన్నత అవకాశాలు -
గుట్టలెక్కి.. వైద్యం చేసి
వాజేడు: గుట్టలపై ఉన్న పెనుగోలు గ్రామానికి వెళ్లి ఆదివాసీలకు వైద్యం చేయడం మధురానుభూతినిస్తుందంటున్నారు వాజేడు వైద్యాధికారి మధుకర్. ఏడాది క్రితం వాజేడు వైద్యాధికారిగా వచ్చిన తొలి రోజుల్లో సిబ్బందితో కలిసి మండల పరిధి కొంగాల గ్రామ పంచాయతీ గుట్టలపై పెనుగోలు గ్రామానికి కాలినడకన వెళ్లారు. వాగులు వంకలు దాటుతూ అప్అండ్ డౌన్ 34 కిలో మీటర్ల నడిచారు. మారుమూల గ్రామాల ప్రజలకు సైతం ప్రభుత్వ వైద్యం అందాలని, వారికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు మధుకర్ చెబుతున్నారు. -
అమ్మవారికి విరోధిని, వహ్నివాసిని క్రమాలలో పూజలు
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కొనసాగుతున్న శాకంబరీ నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా.. సోమవారం ఐదో రోజు అమ్మవారికి విరోధిని, వహ్నివాసినిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం అమ్మవారికి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని విరోధిని క్రమంలో, షోడశీక్రమాన్ని అనుసరించి భోగభేరాన్ని వహ్నివాసిని క్రమంలో అలంకరించి విశేష పూజలు నిర్వహించారు. శ్రీమాతా, లలితాంబికా సేవా సమితి ఆధ్వర్యంలో మహిళలు హాజరై అమ్మవారికి చీర, సారె సమర్పించారు. మట్వాడ సీఐ గోపీ ఆలయాన్ని సందర్శించారు. ఆలయ ఈఓ శేషుభారతి, ఆలయ ధర్మకర్తలు తొనుపూనూరి వీరన్న, నార్ల సుగుణ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
టీ–హబ్‌తో ఒప్పందంపై మంత్రిని కలిసిన వీసీ
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సోమవారం హైదరాబాద్‌లో రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా మంత్రి దృష్టికి కేయూ అభివృద్ధికి సంబంధించిన అంశాలను తీసుకెళ్లారు. ప్రధానంగా రాష్ట్రీయ ఉన్నత విద్య అభియాన్ (రూసా) నిధులతో కేయూలో ఏర్పాటుచేసి కె–హబ్ గురించి మంత్రికి వివరించారు. యువతలో నూతన ఆవిష్కరణలు, ఇంక్యుబేషన్, అంకుర స్టార్టప్‌లను ప్రోత్సహించాలనే లక్ష్యం ఉందని వీసీ తెలిపారు. ఇంక్యుబేషన్, స్టార్టప్‌లను అభివృద్ధి చేసేందుకు హైదరాబాద్‌లోని టి–హబ్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోవాల్సిన అవసరం ఉందని, అందుకు సహకరించాలని మంత్రితో చర్చించారు. అలాగే, జీయాలజీ విభాగానికి పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య భాగస్వామ్యాన్ని ఏర్పాట చేయాలనే అంశంపై కూడా మంత్రి సానుకూలంగా స్పందించారని వీసీ తెలిపారు. ప్రత్యేకించి లైఫ్ సైన్సెస్ రంగంలో నూతన ఆవిష్కరణల కోసం కాకతీయ యూనివర్సిటీ కేంద్రంగా నిలవాలని మంత్రి కాంక్షించారని ప్రతాప్‌రెడ్డి సోమవారం సాయంత్రం క్యాంపస్‌లో వెల్లడించారు. వీసీ వెంట కేయూ జీయాలజీ విభాగం అధిపతి ఆర్. మల్లికార్జున్‌రెడ్డి ఉన్నారు. -
పల్లె డాక్టర్ ప్రణీత్‌కుమార్
ఏటూరునాగారం: ఆ గ్రామానికి వెళ్లాలంటే వాగు దాటాలి. రోడ్డు సరిగ్గా ఉండదు. అక్కడున్న వారికి ఆరోగ్యాన్ని అందించేందుకు డాక్టర్ ప్రణీత్‌కుమార్ సేవలందిస్తున్నారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి పల్లె దవాఖాన వైద్యుడు హనుమకొండ ప్రణీత్‌కుమార్ కొండాయి సబ్‌సెంటర్ (పల్లెదావఖాన)లో పని చేస్తున్నారు. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉంటూ వారికి ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా.. వెంటనే స్పందిస్తున్నారు. గొత్తికోయగూడెల్లోకి సైతం నడుచుకుంటూ వెళ్లి వైద్యం అందిస్తున్నారు. గూడెల్లోని ప్రజల మన్ననలు పొందుతున్నాడు. -
డీటీ రాజేశ్ ఖన్నా కన్నుమూత..
● ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతి ● మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ నల్లబెల్లి: కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతున్న నల్లబెల్లి డిప్యూటీ తహసీల్దార్ (డీటీ) రాజేశ్ ఖన్నా(50) కన్నుమూశారు. సోమవారం తెల్లవారుజామున ఎంజీఎంలో మృతి చెందారు. బాధిత కుటుంబీకుల కథనం ప్రకారం.. హనుమకొండ ప్రశాంత్ నగర్‌కు చెందిన డిప్యూటీ తహసీల్దార్ అన్నబోయిన రాజేశ్‌కన్నా(50) ఎనిమిదేళ్ల క్రితం అనారోగ్యానికి గురికాగా పరీక్షించిన వైద్యులు రెండు కిడ్నీలు పని చేయడం లేదని నిర్ధారించారు. దీంతో భార్య రమాదేవి తన కిడ్నీ దానం చేసి భర్తను బతికించుకుంది. ఈ క్రమంలో వైద్యం కోసం అప్పు చేయడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. వైద్యుల సూచన మేరకు జాగ్రత్తలు పాటిస్తూ డిప్యూటీ తహసీల్దార్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతేడాది తండ్రి, రెండు నెలల క్రితం తమ్ముడు మృతి చెందాడు. ఈ క్రమంలో 20 రోజుల క్రితం డీటీ రాజేశ్ కన్నా ఊపిరితిత్తుల సమస్యతో తీవ్ర ఇబ్బంది పడడంతో కుటుంబీకులు హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. భార్య, కూతురు బంగారు ఆభరణాలు అమ్మి సుమారు రూ.25 లక్షలతో చికిత్స చేయించారు. అయితే ఇంకా అదే ఆస్పత్రిలో చికిత్స చేయించేందుకు చేతిలో డబ్బులు లేవు. దీంతో డిశ్చార్జ్ చేసి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్తామంటే ప్రస్తుతం చికిత్స పొందుతున్న ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాహకులు రూ.7 లక్షలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. దీంతో దిక్కుతోచని స్థితిలో భార్య రమాదేవి విలపిస్తూ రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రతినిధులతో తన గోడు వెల్లబోసుకుంది. దీంతో వారు ఆస్పత్రి యాజమాన్యంతో చర్చించి మెరుగైన వైద్యం అందించారు. ఐదు రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి చేరుకున్నారు. కృత్రిమ శ్వాసతో కోలుకుంటున్న క్రమంలో ఆదివారం రాత్రి ఛాతీ నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు వెంటనే హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం నిమిత్తం ఎంజీఎం తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. డిప్యూటీ తహసీల్దార్ మృతితో నల్లబెల్లి మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, డీటీ రాజేశ్కన్నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. మృతుడి కుటుంబానికి కలెక్టర్ పరామర్శ.. డిప్యూటీ తహసీల్దార్ మృతి సమాచారం తెలుసుకున్న కలెక్టర్ స త్యశారద.. రాజేశ్ ఖన్నా మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. దహన సంస్కారాల నిమిత్తం రూ.50 వేలు అందించారు. నివాళులర్పించిన వారి లో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి, తహసీల్దార్ల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షు డు పాక రమేశ్, కలెక్టరేట్ ఏఓ విశ్వప్రసాద్, తహసీల్దార్లు ముప్పు కృష్ణ, నాగేశ్వరరావు, మంజుల, తదితరులు పాల్గొన్నారు. -
సీపీని కలిసిన ఏఎస్పీ
వరంగల్ క్రైం: వరంగల్ డివిజన్ నూతన ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన శుభం ప్రకాశ్ సోమవారం పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. పేదలకు సత్వరమే న్యాయం అందించేలా కిందిస్థాయి అధికారులపై పర్యవేక్షణ ఉంచాలని ఏఎస్పీకి సూచించారు. పరిశోధన కేంద్రంగా పింగిళి మహిళా కళాశాల కేయూ క్యాంపస్: హనుమకొండలోని ప్రభుత్వపింగిళి మహిళా కళాశాలను రీసెర్చ్‌సెంటర్‌గా గుర్తించారు. ఈమేరకు హిస్టరీ విభాగం పరిశోధనకు పర్యవేక్షకులుగా ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ కొలిపాక శ్రీనివాస్, డాక్టర్ ఎల్.ఇందిరను నియమించినట్లు కేయూ సోషల్ సైన్స్ డీన్, యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి.మనోహర్ సోమవారం వెల్లడించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ లెఫ్టినెంట్ ప్రొఫెసర్ బి.చంద్రమౌళి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుహాసిని, అధ్యాపకులు అభినందించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్ డాక్టర్ కోల శంకర్ పాల్గొన్నారు. నేటి నుంచి టికెట్ రిజర్వేషన్‌కు ఆధార్ తప్పనిసరికాజీపేట రూరల్: భారతీయ రైల్వే జూలై 1 నుంచి ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేందుకు ఆధార్‌కార్డు తప్పనిసరి అని ఉత్తర్వులు జారీ చేసినట్లు సోమవారం రాత్రి స్థానిక రైల్వే అధికారులు తెలిపారు. జూలై 1 నుంచి ఆన్లైన్ టికెట్ విధానంలో, జూలై 15 నుంచి రైల్వే రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ రిజర్వేషన్ చేసుకునే వారు తప్పకుండా ఆధార్ జత చేయాలని పేర్కొన్నారు. వారి ఫోన్ నంబర్ కూడా ఆధార్‌కు లింక్ అయ్యి ఉండాలని రైల్వే శాఖ ఉత్తర్వులు అమలు చేసినట్లు తెలిపారు. కలెక్టర్‌ను కలిసిన ప్రభుత్వ ప్రత్యేక పీపీవరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్‌గా నియమితులైన ఎడవల్లి సత్యనారాయణ సోమవారం హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్క అందజేశారు. కార్యక్రమంలో హనుమకొండ జిల్లా పీపీ నర్సింహారావు, ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ కమ్ లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ ప్లీడర్ నూకల వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నేడు తూమాటి దొణప్ప శతజయంత్యుత్సవాలుహన్మకొండ కల్చరల్: ఆచార్య తూమాటి దొణప్ప శతజయంతి కమిటీ, సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం తెలుగు విశ్వవిద్యాలయం తొలి ఉపాధ్యక్షులు దొణప్ప శతజయంత్యుత్సవాలు నిర్వహిస్తున్నట్లు జానపద గిరిజన విజ్ఞానపీఠం పీఠాధిపతి డాక్టర్ గడ్డం వెంకన్న తెలిపారు జిల్లా కవులు, సాహితీవేత్తలు పాల్గొనవలసిందిగా కోరారు. -
వైద్యచికిత్సతోపాటు ఆరోగ్యంపై అవగాహన కల్పిస్తున్న ‘వంగర’ వైద్యురాలు
మంగళవారం శ్రీ 1 శ్రీ జూలై శ్రీ 2025హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పీహెచ్సీ నిత్యం గర్భిణులు, మహిళలు, రోగులతో నిండిపోయి ఉంటుంది. ఇక్కడ వైద్యం కోసం వారంతా గంటల తరబడి ఎదురుచూస్తుంటారు. అందుకు కారణం అక్కడి వైద్యురాలు రుబీనా. ఆమె కేవలం చికిత్సలు అందించడమే కాకుండా జబ్బు రావడానికి కారణాలు. ఎలా చేస్తే ఆరోగ్యంగా ఉండగలం అని రోగులకు విడమర్చి చెబుతున్నారు. పేదల కష్టాలను దగ్గర్నుంచి చూశారు. వారి జబ్బులకు కారణం తెలుసుకున్నారు. వారి ఆర్థిక వెనుకబాటుకు అనారోగ్యమే కారణమని గ్రహించారు. ఆరోగ్యం అందరి ప్రాథమిక హక్కు అని చెప్పాలనుకున్నారు. అందుకే ఆమె డాక్టరయ్యారు. అనా రోగ్యంతో వచ్చిన రోగికి వైద్యమందించడమే కాదు.. వారికి అవగాహన కల్పిస్తే మరోసారి అనారోగ్యం బారిన పడరని అవగాహన కల్పించడం మొదలు పెట్టారు.ఇందుకోసం సొంతఖర్చులతో లైబ్రరీ ఏర్పాటుచేశారు. ఫలితంగా ఇప్పుడా ప్రభుత్వ వైద్యురాలి వద్దకు ప్రజలు క్యూ కడుతున్నారు. నేడు (మంగళవారం) నేషనల్ డాక్టర్స్ డే సందర్భంగా పేదల ఆరోగ్య నేస్తం వంగర పీహెచ్సీ వైద్యురాలు సయ్యద్ రుబీనాపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.ప్రజల ఆరోగ్యమే నా కర్తవ్యం ఉద్యోగాన్ని బాధ్యతగా భావిస్తున్నా. తెలంగాణ ఫార్మేషన్ డే రోజు టీబీ మీద, డ్రగ్స్ మీద పరేడ్ గ్రౌండ్లో మేం చేసిన స్కిట్‌కు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. అయితే వ్యాధులపై అవగాహన సాధారణంగా చెప్పకుండా స్కిట్ల ద్వారా, పాటల ద్వారా అవగాహన కల్పిస్తే ప్రజల్లోకి వెళ్తుందని నమ్ముతున్నా. ఇప్పుడు నా పీహెచ్సీ పరిధిలో 27,000 పాపులేషన్ ఉంది. వారు ఆరోగ్యంగా ఉండడమే నా కర్తవ్యం. – రుబీనా, పీహెచ్సీ వైద్యురాలు, వంగర వంగర పీహెచ్సీలో వైద్యఆరోగ్య పుస్తకాలు చదువుతున్న మహిళలు, లైబ్రరీలోని పుస్తకాలునవజాత శిశువుతో డాక్టర్ రుబీనా (ఫైల్)ఆరోగ్య విద్య.. పుస్తక పఠనం వంగర పీహెచ్సీ వైద్యురాలిగా చేరిన తర్వాత ఆస్పత్రికి వచ్చే రోగులకు, గర్భిణులకు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధకనబర్చడం మొదలెట్టారు. సమీప గ్రామాల్లో క్యాంపులు పెట్టి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీబీ, షుగర్, బీపీ వంటి వ్యాధులపై వందల సంఖ్యలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్ర భుత్వ పాఠశాలల్లో డ్రగ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. ఆరోగ్య కార్యకర్తల ద్వారా గర్భం దాల్చిన మహిళల్ని కలిసి ప్రైవేట్‌కు వెళ్లకుండా పీహెచ్సీలో పరీక్షలు చేయించుకునేలా, ప్రసవం చేయించుకునేలా ప్రభుత్వ వైద్యంపై నమ్మకం కల్పిస్తున్నారు. ఫలితంగా వంగర పీహెచ్‌సీకి రోజూ దాదాపు 70 నుంచి 100 మంది ఓపీ చూపించుకుంటున్నారు. డాక్టర్ కోసం వేచి ఉన్న సమయంలో పేషెంట్లతో పుస్తకాలు చదివిస్తున్నారు. ఇందుకోసం లై బ్రరీ ఏర్పాటుచేశారు. ఆమె సొంత ఖర్చులతో హెల్త్ గైడ్, హెల్త్ కేర్, ఆరోగ్య వ్యాయామ విద్య, ఆరోగ్య నిధి, ఆ రోగ్య విజ్ఞాన శాస్త్రం, యోగా, వంటిల్లే వైద్యశాల వంటి పుస్తకాలను కొనుగోలు చేసి రోగులతో చదివిస్తున్నారు. ● పలు గ్రామాల్లో సదస్సుల నిర్వహణ.. ● ఆరోగ్యకేంద్రంలో సొంతంగా ఆరోగ్య పుస్తకాలతో లైబ్రరీ ఏర్పాటు ● ఆస్పత్రికి వచ్చే మహిళలు, గర్భిణులతో పుస్తక పఠనం.. నేడు జాతీయ వైద్యుల దినోత్సవంఅనారోగ్యంతో వచ్చినవారికి మందులిచ్చి పంపించడం అందరూ చేస్తుంటారు. కానీ అనారోగ్యానికి కారణాలు. మరోసారి అలా చేయకుండా ఉండేందుకు జాగ్రత్తలు చెబితే ఆ వైద్యుల్ని ఎవరైనా మరిచిపోతారా? అచ్చం రుబీనా అదే పద్ధతి ఫాలో అవుతున్నారు. వచ్చిన వారికి తన పరిధిలో పూర్తి సాయం చేస్తున్నారు. ఒక ఇంట్లోని మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇళ్లంతా బాగుంటుందని ఆమె నమ్ముతారు. అందుకని ముఖ్యంగా మహిళా సంబంధిత అనారోగ్య సమస్యలపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. వారిని ఎడ్యుకేట్ చేస్తూ మందులిస్తున్నారు. కేన్సర్‌పై అవగాహన సదస్సులో మాట్లాడుతున్న డాక్టర్ రుబీనా– సాక్షి, వరంగల్ డెస్క్అవగాహనే కొండంత అండ.. -
ప్రతీ పేదోడికి సొంతిల్లు
ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి హన్మకొండ/హన్మకొండ చౌరస్తా: ప్రతీ పేదోడికి సొంతిల్లు నిర్మించి ఇవ్వడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అన్నారు. సోమవారం హనుమకొండలోని అంబేడ్కర్ భవన్లో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోని 800 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి ప్రొసీడింగ్స్ అందించారు. ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు కాగా.. ఇప్పటివరకు 2 వేల మందికి ప్రొసీడింగ్స్ అందించామన్నారు. త్వరలో 1,500 మందికి ప్రొసీడింగ్స్ అందించనున్నట్లు చెప్పారు. ఇళ్ల మంజూరు కోసం ఎవరికై నా లంచం ఇస్తే ఇళ్లు రద్దు చేస్తామన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ రవీందర్, హౌసింగ్ కార్పొషన్ పీడీ సిద్ధార్థ నాయక్, కార్పొరేటర్లు వేముల శ్రీనివాస్, తోట వెంకటేశ్వర్లు, విజయశ్రీ రజాలీ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ తదితరులు పాల్గొన్నారు. ఆదర్శంగా కేంద్రం కులగణన.. తెలంగాణ రాష్ట్ర సర్కారును ఆదర్శంగా తీసుకుని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కులగణనకు శ్రీకారం చుట్టిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే గ్రామస్థాయి కార్యకర్తల సమ్మేళనానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వస్తున్నారన్నారు. సభకు గ్రామ, మండల, జిల్లా స్థాయి నుంచి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని కోరారు. పీసీసీ ఉపాధ్యక్షుడు చిట్ల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు దుద్దిళ్ల శ్రీనివాస్, పల్లె శ్రీనివాస్‌గౌడ్, మోత్కూరి ధర్మారావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ డీసీసీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ, కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు, వీసం సురేందర్‌రెడ్డి, డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
కమర్షియల్ యూజర్ చార్జీలపై నిర్లక్ష్యమెందుకు?
● సీరియస్‌గా ఫోకస్ పెట్టండి ● అధికారులకు వార్నింగ్ ఇచ్చిన బల్దియా కమిషనర్ వరంగల్ అర్బన్: నగరంలో కమర్షియల్ యూజర్ చార్జీల విధింపులు, వసూళ్లపై ఎందుకింత నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులకు సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. సోమవారం ‘సాక్షి’లో ప్రచురితమైన ‘మామూళ్ల మత్తు’ వార్తకు స్పందించిన కమిషనర్ ఉదయమే బల్దియా వింగ్ అధికారుల వాట్సాప్ గ్రూప్‌లో వార్త క్లిప్పింగ్‌ను షేర్ చేశారు. అనంతరం బల్దియా సీఎంహెచ్ఓ రాజారెడ్డి, హెచ్ఓ రాజేశ్‌తో కమిషనర్ సమావేశమయ్యారు. నగరంలోని వాణిజ్య సంస్థలు, వసూలు చేస్తున్న యూజర్ చార్జీలు, పరిధిలోకి రాని సంస్థలపై వివరణ అడిగారు. ఈసందర్భంగా కమిషనర్ పలు సూచనలిచ్చారు. త్వరితగతిన యూజర్ చార్జీల పరిధిలోకి వచ్చే వాణిజ్య సంస్థలన్నీంటినీ గుర్తించి చార్జీలు వసూలు చేయాలన్నారు. ప్రతి నెలా వసూలు చేయాలని ఆదేశించారు. అదే విధంగా ప్రతీ సంస్థ నుంచి చెత్తను విధిగా వాహనాల్లో సేకరించి తరలించాలని ఆదేశించారు. ఈవిషయంలో ఏమాత్రం జాప్యం చేయవద్దని కమిషనర్ హెచ్చరించారు. -
వినతుల పరిష్కారంలో జాప్యం చేయొద్దు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో స్వీకరించిన అర్జీల పరిష్కారంలో అధికారులు జాప్యం చెయొద్దని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నేరుగా పాల్గొని ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ప్రజావాణి వినతుల్ని త్వరగా పరిష్కరించుకోవాలని, వచ్చిన వినతులపై తక్షణమే చర్యలు చేపట్టాలని జిల్లాలోని పలువురు తహసీల్దార్లను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. ప్రజావాణిలో వివిధ శాఖలకు మొత్తం 176 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్, ఆర్డీఓలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సమస్యలు త్వరగా పరిష్కరించాలి.. వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులకు సూచించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. మొత్తం 130 వినతులు రాగా.. దరఖాస్తులను ఆయా శాఖల అధికారులకు ఎండార్స్ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి వరంగల్‌లోని 13వ డివిజన్ దేశాయిపేట సీకేఎం కళాశాల గ్రౌండ్‌ను ఆనుకుని 2 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వ భూమిని కాపాడాలి. – జన్ను అనిల్‌కుమార్, వరంగల్ -
వెల్లువెత్తిన వినతులు
వరంగల్ అర్బన్ : ‘మా సమస్యలు అంటే బల్దియా అధికారులకు, సిబ్బందికి చులకనైంది’అని పలు కాలనీల ప్రజలు సోమవారం గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. సమస్యలపై పలుమార్లు ఫిర్యాదులు చేస్తున్నా పరిష్కారం కావడం లేదని, ఈ వినతుల స్వీకరణ ఎందుకు? అంటూ నిరసన వ్యక్తం చేశారు. భారీగా చేరుకున్న ఫిర్యాదుదారులతో బల్దియా కార్యాలయం అంతా కిక్కిరిపోయింది. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వింగ్ అధికారులు దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తును నిశితంగా పరిశీలించి, ప్రతీ వినతిపై వివరణాత్మక నివేదిక అందించాలని కమిషనర్.. అధికారులకు సూచించారు. జవాబు దారీగా ఉండాలని ఆదేశించారు. గ్రీవెన్స్‌సెల్‌కు మొత్తం 109 ఫిర్యాదులు రాగా, అందులో ఇంజనీరింగ్ సెక్షన్‌కు 26, హెల్త్ – శానిటేషన్ 14, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)13, టౌన్ ప్లానింగ్ 49, మంచినీటి సరఫరా 6, హార్టికల్చర్ 1 నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డా.రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్ లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, హెచ్ఓలు రమేష్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఎంహెచ్ఓ డా.రాజేశ్, హెచ్ఓ రమేశ్ పాల్గొన్నారు. ఫిర్యాదుల్లో కొన్ని ఇలా.. ● వరంగల్ పాతబీట్ బజార్లో వర్షపునీరు, మురుగు నీటితో పాదచారులు, వ్యాపారులు, కార్మికులు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, శాశ్వత పరిష్కారం చూపించాలని వ్యాపారులు కోరారు. ● మడికొండ మా హిల్స్ కాలనీలో ప్రభుత్వ రహదారిని ఆక్రమించి చేపట్టిన పనులు వెంటనే నిలిపేసి, చర్యలు తీసుకోవాలని సుమారు 60 మంది కాలనీవాసులు బల్దియా ఎదుట నిరసన వ్యక్తం చేసి, వినతిపత్రం అందజేశారు. ● రంగశాయిపేట 19–1–146 పాడుబడిన భవనం, సమీపంలోని ఖాళీ స్థలాల్లో చెట్లు, చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోందని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● వరంగల్ డాక్టర్స్ కాలనీ హనుమాన్ నగర్లో సీసీ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణానికి నిధులు మంజూరైనా పట్టించుకోడం లేదని, తాగునీటి పైపులైన్లు ఏర్పాటు చేయాలని కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ● దేశాయిపేట సర్వేనంబర్ 326లో 20 గుంటల స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలని బహుజన సమాజ్ పార్టీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ● 45వ డివిజన్ కుమ్మరిగూడెం బల్దియా 13వ ఫైనాన్స్ నిధులతో సీసీ రోడ్డు నిర్మించారని, 2 ఫీట్లు పగులగొట్టి పైపులైన్ వేశారని, ఆ స్థలాన్ని సమీప ఇళ్లవాసులు ఆక్రమించి నిర్మాణాలు చేస్తున్నారని, చర్యలు తీసుకోవాలన్ని విన్నవించారు. ● రంగశాయిపేటలో ఖాళీ స్థలాల్లో దోమలు వృద్ధి చెందుతున్నాయని, విషజ్వరాల బారిన పడుతున్నామని కాలనీవాసులు ఫిర్యాదు చేశారు. ● హనుమకొండ అశోక కాలనీలో సెల్ టవర్‌కు అనుమతులు రద్దు చేయాలని కాలనీ డెవలప్మెంట్ కమిటీ ప్రతినిధులు విన్నవించారు. ● కాజీపేట కడిపికొండ బ్రిడ్జికి ఎదురుగా గల్లీలో డ్రెయినేజీ నీరు రోడ్డుపై పారుతోందని, చర్యలు తీసుకోవాలని కమిషనర్‌కు విన్నవించారు. ● గోపాలపురం అరుణోదయ కాలనీలో హై టెన్షన్ వైర్ల కింద భవన నిర్మాణం చేపడుతున్నారని, గతేడాది ఓ వ్యక్తి మృతి చెందాడని నిబంధన మేరకు నిర్మాణం చేపట్టడం లేదని, చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. ● రంగశాయిపేట శంభునిపేట జంక్షన్లో సులభ్ కాంప్లెక్స్ నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ● 31వ డివిజన్ హంటర్ రోడ్డు హిల్స్‌లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని స్థానికులు వినతి పత్రం అందించారు. ● 2వ డివిజన్ రెడ్డికాలనీలో 33 ఫీట్ల రోడ్డు ఉందని, కొలతలను పరిగణనలోకి తీసుకోకుండా ఇష్టారాజ్యంగా నిర్మిస్తున్నట్లు, నిబంధనల మేర చేపట్టాలని కాలనీవాసులు విన్నవించారు. ● భీమారం శ్యామల చెరువు మత్తడి 33 ఫీట్ల మేరకు ఉండగా, చాలావరకు కబ్జాకు గురైందని, వర్షం వస్తే ఇళ్లల్లోకి నీళ్లు వస్తున్నాయని, ఆక్రమణలను తొలగించాలని కాలనీవాసులు కోరారు. ● 65వ డివిజన్ ఎల్లాపూర్లోని ప్రభుత్వ స్థలంలో ఓ వ్యక్తి ఇష్టారాజ్యంగా భవనాలను నిర్మిస్తునారని, చర్యలు తీసుకోవాలని స్థానికులు వినతిపత్రం అందజేశారు. ● 48వ డివిజన్ దర్గా కాజీపేటలో రోడ్డును ఆక్రమించి నిర్మించిన కారు షెడ్డును తొలగించాలని కాలనీవాసులు విన్నవించారు. ● న్యూశాయంపేటలో బీజేపీ ఆఫీస్ వెనుక సీసీ రోడ్లు, డ్రెయినేజీలు వీధిలైట్లు ఏర్పాటు చేయాలని స్థానికులు వినతిపత్రం అందించారు. ● హనుమకొండ కాంగ్రెస్ భవన్‌నుంచి బుద్ధభవన్‌కు వెళ్లే దారిలో డ్రెయినేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని స్థానికులు కోరారు.కిటకిటలాడిన గ్రేటర్ వరంగల్ గ్రీవెన్స్ సెల్ పరిష్కారం చూపకపోతే ఎందుకు స్వీకరిస్తున్నారని ఆందోళన దరఖాస్తులను స్వీకరించిన కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వింగ్ అధికారులు -
మామూళ్ల మత్తు
సోమవారం శ్రీ 30 శ్రీ జూన్ శ్రీ 2025టీచర్లకు బదిలీలు, పదోన్నతులు చేపట్టాలివిద్యారణ్యపురి: టీచర్లకు బదిలీలు, పద్నోతుల ప్రక్రియ చేపట్టాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కె.సోమశేఖర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హనుమకొండలోని సంఘం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు సీహెచ్. రవీందర్‌రాజు ఆధ్వర్యాన నిర్వహించిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణతో అనేక పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత ఏర్పడిందని, భర్తీ చేసేందుకు వెంటనే బదిలీ లు, పదోన్నతులు చేపట్టాలన్నారు. పెండింగ్‌లో ఉన్న కరువుభత్యం విడుదల చేయాలని, సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పెండెం రాజు, ఉపాధ్యక్షులు వి.రాజారామ్, జ్యోతి, కార్యదర్శులు సీఎస్ఆర్.మల్లిక్, కె.సదా నందం, ఎం.ప్రసన్నానంద్, కె.శశిధర్‌రెడ్డి, ఆడిట్ కమిటీ కన్వీనర్ జి.భాస్కర్‌రావు, బాధ్యులు ఎ.బ్రహ్మచారి తదితరులు పాల్గొన్నారు. నేడు ‘డయల్ యువర్ డీఎం’హన్మకొండ: మెరుగైన సేవలు అందించేందు కు ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు ఈనెల 30న ‘డయల్ యువర్ డీఎం’ కార్యక్ర మం నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ హనుమకొండ డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ తెలిపారు. ఉదయం 11నుంచి 12గంటల వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో జమ్మికుంట, వేలేరు, ఐనవోలు, పర్వతగిరి, సంగెం, ఖిలా వరంగల్, హనుమకొండ, హసన్‌పర్తి, కమలాపూర్, వరంగల్, హనుమకొండ, కాజీపేట ప్రాంత ప్రయాణికులు 89777 81103 నంబర్‌కు ఫోన్ చేసి సమస్యలు వివరించడంతోపాటు, సలహా లు, సూచనలు ఇవ్వాలని ఒక ప్రకటనలో కోరారు. డాక్టర్ వేణుకు అవార్డు గీసుకొండ: గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ ధర్మారానికి చెందిన హైదరాబాద్ ఉస్మానియా జనరల్ ఆస్పత్రి అసోసియేట్ ప్రొఫెసర్ (జనరల్ సర్జన్) డాక్టర్ గాదె వేణు రాష్ట్రీయ సేవా జాతీయ అవార్డు–2025ను అందుకున్నారు. ఆదివారం సాయంత్రం హైదరాబాద్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి అకాడమీ వారు ఈ అవార్డును ఆయనకు అందించి సన్మానించారు. డాక్టర్ వేణు నిరుపేద కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలో తెలుగు మీడియం చదువుకున్నారు. ఆ తర్వాత ఎంబీబీఎస్, ఎంఎస్ పూర్తి చేశారు. గతంలో ఆయన వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్, వరంగల్‌లోని పలు ప్రభుత్వ ఆస్పత్రులు, పీహెచ్‌సీల్లో వైద్యసేవలు అందించారు. తన స్వగ్రామంలో ప్రజలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. జిల్లాలో మోస్తరు వర్షంహన్మకొండ: హనుమకొండ జిల్లాలో ఆదివారం మోస్తరు నుంచి తేలికపాటి వర్షం కురిసింది. నెల రోజులుగా వర్షాభావ పరిస్థితుల కారణంగా మెట్ట పంటల మొలకలు వాడిపోతున్న క్రమంలో కురిసిన వర్షం జీవం పోసింది. రాత్రి 10 గంటల వరకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్లో నమోదైన వర్షపాతం వివరాలను ప్రణాళిక శాఖ విడుదల చేసింది. దామెర మండలం పులుకుర్తిలో 38.5 మిల్లీమీ టర్లు, వరంగల్ పైడిపల్లి 34.5, కమలాపూర్ 30.8, శాయంపేట 29.3, వేలేరు 28.3, హసన్‌పర్తి 25.5, హనుమకొండ పెద్దమ్మగడ్డ 24.3, కాజిపేట మడికొండ 18.8, దామెర 17.3, కాజీపేట 17, నడికూడ 16, పరకాల 10.5, ఐనవోలు 10, హసన్‌పర్తి నాగారం 9.5, భీమదేవరపల్లి 9.3, ఆత్మకూరులో 8.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ● ప్రతీ ఇంటి నుంచి చెత్త సేకరించి, తరలించినందుకు విస్తీర్ణం ఎస్ఎఫ్టీల ఆధారంగా మూడు స్లాబుల్లో నెలకు రూ.60 నుంచి రూ.1,200 వరకు చెత్త పన్ను విధించి ఆస్తి, నీటి పన్నులో జోడించి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ● వ్యాపార, వాణిజ్య సంస్థల యజమానులు నిత్యం రూ.వేలు, లక్షల్లో ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తుంటారు. భారీగా చెత్త వెలువడే కమర్షి యల్ షాపుల నుంచి ప్రతినెలా యూజర్ చార్జీల సొమ్ము మాత్రం వసూలు చేయట్లేదు. ఇలా.. గత 11 ఏళ్లుగా 5శాతం వరకు మాత్రమే కమర్షియల్ కాంప్లెక్స్‌ల నుంచి వసూలు చేస్తుండడంతో బల్దియాకు రావాల్సిన సూమారు రూ.10 కోట్లపైచిలుకు ఆదాయానికి గండిపడింది.వరంగల్ అర్బన్: వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు దూసుకెళ్తోంది. జాతీయ, అంతర్జాయ సంస్థలు వెలిశాయి. నగరంలో షాపులు, హోటళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు ఉదయమే తెరుచుకుంటాయి. అప్పటికే వీధులు, రహదారుల ను పారిశుద్ధ్య కార్మికులు శుభ్రం చేసి వెళ్లిపోతారు. ఆతర్వాత షాపు యజమానులు వచ్చి దుకాణాలు తెరిచి శుభ్రం చేయగా.. వచ్చిన చెత్తాచెదారాన్ని తిరిగి షాపుల ఎదుట డ్రెయినేజీ, కాల్వలు, రహదా రులపై పడేయడంతో నగరం అపరిశుభ్రంగా మారుతోంది. ఆస్పత్రుల స్థాయి ఆధారంగా, డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఫాస్ట్‌పుడ్ సెంటర్లు, బేకరీ లు, ఫంక్షన్ హాళ్లు, లాడ్జీలు, ప్రైవేట్ విశ్రాంతి భవనాలు, క్లబ్బులు, కూరగాయల, వ్యవసాయ మార్కెట్లకు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ప్రైవేట్ హాస్టళ్లు, హోల్‌సేల్ పండ్ల వ్యాపారులు, పెద్ద హోటళ్లు, మిడిల్ స్థాయి హోటళ్లు, బార్ అండ్ రెస్టారెంట్లు, వైన్ షాపులు, ఫంక్షన్ హాళ్లు ప్రతి నెలా వ్యర్థాల సేకరణకుగాను బల్దియాకు నిర్ణీత సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. యూజర్ చార్జీల వసూలేది? ఆయా సంస్థలు, వ్యాపార కేంద్రాల నుంచి చెత్తాచెదారం వ్యర్థాలను తీసుకెళ్లేందుకు వాటి విస్తీర్ణం ఆ ధారంగా యూజర్ చార్జీలు వసూలు చేయాలనే ఆలోచన వరంగల్ బల్దియాకు 2013 సంవత్సరంలో వచ్చింది. ప్రత్యేకంగా వాహనాలను ఏర్పాటు చేసి షాపుల నుంచి చెత్తను తరలించేందుకు యూజ ర్ చార్జీలను వసూలు చేయాలని నిర్ణయించారు. సర్వే చేసి 1,674 సంస్థలను గుర్తించారు. ఆయా సంస్థల నుంచి ఎంత వసూలు చేయాలో ఖరారుచేసి 2014 నుంచి వసూళ్ల ప్రక్రియ ప్రారంభించారు. రెండేళ్ల పాటు 50శాతానికి పైగా వసూలు చేసిన ప్రజారోగ్యం సిబ్బంది తదుపరి క్రమేపీ విస్మరిస్తున్నారు. తొలుత 1,674 వాణిజ్య సంస్థలు ప్రస్తుతం బల్దియా రికార్డుల్లో 427 కుచించుకుపోయాయి. ఈ ఏడాది చార్జీలు రూ.31 లక్షలు నిర్ణయించగా.. ఇప్పటి వరకు రూ.8 లక్షలు వసూలు చేసినట్లు లెక్కలు చెప్పడం అవినీతికి నిదర్శనంగా నిలుస్తోంది. కంపు.. కంపు బల్దియా సిబ్బంది నిర్లక్ష్యం.. అవినీతి కారణంగా కమర్షియల్ కాంప్లెక్స్‌లలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా మారింది. నిత్యం షాపుల నుంచి వెలువడే చెత్తనంతా రెండు కాంప్లెక్స్‌ల నడుమ, కాంప్లెక్స్ చుట్టూ ఖాళీ స్థలాల్లో నింపేస్తున్నారు. మురుగు వాసన వస్తున్నా.. ఈగలు, దోమలు విజృంభిస్తున్నా అటు బల్దియా, ఇటు కాంప్లెక్స్‌ల యజమానులు, వ్యాపారులు పట్టించుకోవట్లేదు. వ్యాపార సముదాయాల నుంచి వెలువడే చెత్తను రోజూ బల్దియా వాహనాల్లో వేయాలంటే యూజర్ చార్జీలు చెల్లించాలి. ఇది ఇష్టం లేని కొందరు వ్యాపారులు ఖాళీ స్థలాల్లో పడేస్తున్నారు. స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తాం.. వాణిజ్య సంస్థలను స్పెషల్ డ్రైవ్ నిర్విహించి గుర్తిస్తాం. లోపాలను సరిచేసుకుంటాం. యూజర్ చార్జీలను నిబంధనల మేరకు వసూలు చేస్తాం. – రాజేశ్, బల్దియా సీఎంహెచ్ఓ ● లెక్కలు పక్కా చేస్తున్న సిబ్బందిన్యూస్రీల్‘కమర్షియల్’ నుంచి కాసుల పంట శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో జవాన్ల అక్రమ వసూళ్లు! యూజర్ చార్జీల వసూళ్లలో నిర్లక్ష్యం ఆదాయంపై పట్టించుకోని గ్రేటర్ అధికార, పాలక వర్గాలు నగరంలో ప్రజారోగ్యం పచ్చిమోసం!ఆ సొమ్ము ఎవరి జేబుల్లోకి.. గత పదిన్నరేళ్ల కాలంలో సూమారు రూ.10 కోట్లకుపైగా యూజర్ చార్జీల ద్వారా బల్దియా ఆదాయం సమకూరాలి. కానీ.. ఇంత వరకు ఎంత మంది వద్ద సొమ్ము వసూలు చేశారో, ఎవరు ఎగ్గొట్టారో చిక్కుముడిగా మారింది. వాణిజ్య సంస్థల నుంచి ప్రతీ నెల జవాన్లు యూజర్ చార్జీలను వసూలు చేయాలి. ఆన్లైన్ రశీదు ఇవ్వాలి. బల్దియా వద్ద లెక్కాపత్రం లేదు. వసూలు చేయాల్సిన కొంతమంది జవా న్లు, శానిటరీ ఇన్స్పెక్టర్ల సహకారంతో యూజర్ చార్జీలతో సంబంధం లేకుండా నెలవారీ మా మూళ్లకు పాల్పడుతున్నారు. బార్ అండ్ రెస్టారెంట్లు, బిర్యానీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, ఆస్పత్రులు, హాస్టల్స్, టిఫిన్ సెంట ర్లు ఇలా ప్రతీ వాణిజ్య సంస్థకు మరీ లెక్కగట్టి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. వసూలు చేసి బల్దియాకు చెల్లించాల్సిన సొమ్మును 90శాతం మందికిపైగా సిబ్బంది తమజేబుల్లో నే వేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.పై ఫొటో హనుమకొండ చౌరస్తా సిటీ బస్టాప్ సమీపంలోది. రెండు కాంప్లెక్స్‌ల నడుమ ఒక మీటర్ ఖాళీ స్థలం ఉంది. ఆ స్థలంలో నిత్యం షాపుల నుంచి వెలువడే వ్యర్థాలను పడేస్తున్నారు. గుట్టలుగా చెత్త పేరుకుపోయి దుర్వాసన వస్తోంది. ఈగలు ముసురుకుంటున్నాయి. ఇది ఒక చౌరస్తాలో మాత్రమే కాదు. సిటీలోని చాలా కాంప్లెక్స్‌లలోని పరిస్థితి.వారు అడగరు.. వీరు ఇవ్వరు! వ్యాపార, వాణిజ్య సంస్థల నిర్వాహకుల నుంచి వ్యర్థాలను తీసుకెళ్లే క్రమంలో ఎంతో కొంత, నెలవారీగా వసూలు చేస్తున్నారు. ఇందుకుగాను యజమానులు, వ్యాపారులు చెల్లించిన సొమ్ముకు రశీదులు అడగడం లేదు. వీరు ఇవ్వడం లేదు. బల్దియా ప్రజారోగ్య శాఖ అధికారులు, కమిషనర్లు యూజర్ చార్జీల వసూళ్లపై కనీసం సమీక్షలు, పురోగతిపై సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. దీంతో బల్దియా రికార్డుల్లో ప్రతి నెలా యూజర్ చార్జీల సొమ్ము భారీగా పేరుకుపోయింది. అనధికారిక వసూళ్లే అందుకు కారణమనే విమర్శలు ఉన్నాయి. పాలకవర్గం పెద్దలు, నూతన కమిషనర్ ఈ సొమ్ము రాబట్టుకుంటారా? లేక వదిలేస్తారా? లేకపోతే శానిటరీ సిబ్బందిపై చర్యలు చేపడతారా? అనేది వేచి చూడాల్సిందే. -
‘పంచాయతీ’కి ముందస్తు ఏర్పాట్లు
హన్మకొండ అర్బన్: ఇటీవల రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం మూడు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించడంతో యంత్రాంగం అప్రమత్తమైంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు ముందుకు సాగుతున్నారు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో 210 గ్రామపంచాయతీలు, 12 మండల పరిషత్‌లు, 1,986 వార్డులు, అంతే సంఖ్యలో పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ లెక్కలను కలెక్టరేట్లోని జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో అధికారులు సరిచేస్తున్నారు. గ్రామస్థాయి నుంచి పంచాయతీ కార్యదర్శులకు ఫోన్లు చేసి అవసరమైన సమాచారం సేకరిస్తున్నారు. మొత్తం ఓటర్లు 3,72,646 జిల్లాలోని గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,72,646 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 1,81,772 మంది పురుషులు, 1,90,872 మంది మహిళలు, ఇతరుల కేటగిరీలో ఇద్దరు ఓటర్లుగా నమోదై ఉన్నారు. గ్రామాల్లో 1,169 పోలింగ్ కేంద్రాల్లో 200కంటే తక్కువ మంది ఓటర్లు ఉన్నారు. 755 పోలింగ్ కేంద్రాల్లో 201నుంచి 400 మంది ఓటర్లు ఉన్నారు. 62 కేంద్రాల్లో 401 నుంచి 650 మంది వరకు ఉన్నారు. మొత్తం 1,986 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. కాగా ఇప్పటికే బ్యాలెట్స్ ప్రింటింగ్, ఇతర స్టేషనరీ సిద్ధంగా ఉంది. జిల్లా పంచాయతీ అధికారి లక్ష్మీరమాకాంతం ఆదేశాలతో కార్యాలయ సిబ్బంది ఎన్నికలకు సంబంధించి ముందస్తు పనులు చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను సంప్రదించగా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రానప్పటికీ, ముందస్తుగా పనులు చేస్తున్నట్లు తెలిపారు. -
మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి
● తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ హన్మకొండ: మీసేవ ఆపరేటర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలంగాణ మీసేవ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్ అన్నారు. హనుమకొండ కేఎల్ఎన్రెడ్డి కాలనీలోని రాధ గ్రాండ్ బాంక్వెట్ హాల్లో ఆదివారం జరిగిన తెలంగాణ మీసేవ హనుమకొండ జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజలు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం దరఖాస్తు చేసిన తర్వాత తహసీల్దార్ కార్యాలయాల్లో ఎలాంటి దరఖాస్తు చేయకూడదని సూచించారు. అనంతరం తెలంగాణ మీసేవ ఫెడరేషన్ హనుమకొండ జిల్లా కమిటీని ప్రకటించారు. అధ్యక్షుడిగా దేశిని రమేశ్, ప్రధాన కార్యదర్శిగా జక్కు రాజు, కోశాధికారిగా పేరాల సురేందర్, ఉపాధ్యక్షులుగా మాడిశెట్టి శ్యాంప్రసాద్, కొయ్యడ శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శులుగా గుగులోత్ సతీశ్, గజ్జెల రమేశ్, సంయుక్త కోశాధికారులుగా నాంపల్లి ఆంజనేయులు, బండి కిరణ్‌కుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా పుల్లూరు సునీల్, చెన్న విద్యాసాగర్, మీడియా ఇన్‌చార్జ్‌లుగా వేముల రాజేందర్, గూడూరు అనిల్‌కుమార్, మహిళా కోఆర్డినేటర్లుగా సామల రమాదేవి, కట్ల మమత, అధికార ప్రతినిధిగా చాట్ల రాజు ఎన్నికయ్యారు. సర్వసభ్య సమావేశానికి హాజరైన రాష్ట్ర అధ్యక్షుడు బైరి శంకర్‌ను నూతన కార్యవర్గం సన్మానించింది. -
స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తాం..
వరంగల్ అర్బన్: స్ట్రీట్ వెండర్లకు అండగా నిలుస్తామని నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హామీ ఇచ్చారు. బల్దియా, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) సంయుక్త ఆధ్వర్యాన ఆదివారం భద్రకాళి బండ్లో ఏర్పాటు చేసిన స్ట్రీట్ ఫుడ్ ఫెస్టివల్(వీధి ఆహార విక్రయాదారుల వంట కళల ప్రదర్శన, అమ్మకం) కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. మధ్యాహ్నం 3 గంటలకు మొదలై రాత్రి 10 గంటల వరకు జరగాల్సిన కార్యక్రమం వివిధ కారణాలు, వర్షం కారణంగా 6 గంటలకు ప్రారంభమై రాత్రి 8.30 గంటలకు ముగిసింది. ఈసందర్భంగా మేయర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ.. స్ట్రీట్ వెండర్స్ గ్రూపులుగా ఏర్పడితే బ్యాంకు రుణాలను ఎలాంటి గ్యారెంటీ లేకుండా అందించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రభుత్వం పేద వర్గాలను అన్ని రకాలుగా ప్రోత్సహించేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. ఈసందర్భంగా 30 స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయగా.. శుచి, శుభ్రత బాగుందని హాజరైన నగర ప్రజలు, అతిథులు అభినందించారు. కార్యక్రమంలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) చైర్మన్ ఇనగాల వెంకట్రామ్రెడ్డి, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, మెప్మా స్టేట్ కో–ఆర్డినేటర్ కృష్ణ చైతన్య, బల్దియా అడిషనల్ కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసూనరాణి, రవీందర్, రాజేశ్వర్‌రావు, సీఎంహెచ్ఓ రాజారెడ్డి, టీఎంసీ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. గ్రూపులకు బ్యాంకు రుణాలు ఇప్పిస్తాం ఫుడ్ ఫెస్టివల్లో మేయర్, ఎమ్మెల్యే -
బ్యాంక్ డిపాజిట్లు రూ.219.20 కోట్లు
రామన్నపేట: వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ ఈ ఆర్థిక సంవత్సరంలో 14.24 శాతం వృద్ధితో డిపాజిట్లు రూ.219.20 కోట్లకు చేరాయని బ్యాంక్ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వెల్లడించారు. నగరంలోని దేశాయిపేట రోడ్డులోని కేఆర్ గార్డెన్స్‌లో ఆదివారం బ్యాంక్ 29వ మహాజన సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ప్రదీప్‌రావు మాట్లాడుతూ.. రుణాల మంజారులో 13.20 శాతం వృద్ధితో రూ154.13 కోట్లు కలిపి మొత్తం వ్యాపారం రూ.373.43 కోట్లకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. ఈఆర్థిక సంవత్సరంలో స్థూల లాభం రూ.3.03 కోట్లు కాగా అందులో రూ.60.90 లక్షల ఆదాయపు పన్ను చెల్లించగా నికరలాభం రూ.2.22 కోట్లు అర్జించినట్లు వెల్లడించారు. డిపాజిట్ దారులకు రిజర్వ్ బ్యాంకు నిబంధనల మేరకు డీఐసీజీసీ ద్వారా రూ.5 లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్నట్లు వివరించారు. ఈఆర్థిక సంవత్సరంలో గోపాల్పూర్, మహబూబాబాద్, జనగాం, వడ్డేపల్లి నూతన శాఖలను ప్రారంభించనట్లు తెలిపారు. సమావేశంలో బ్యాంక్ వైస్ చైర్మన్ తోట జగన్నాథం, డైరెక్టర్లు వేణుగోపాల్ ముందడ, కూరపాటి చంద్రమౌళి, తోట సంపత్‌కుమార్, మహమ్మద్ గౌసొద్దీన్, ఒడితర పవన్‌కుమార్, బొమ్మినేని పాపిరెడ్డి, పొన్న హరినాథ్, పోలేపాక రవికుమార్, బండారి భార్గవి, మంద స్వప్న, నామినేట్ డైరెక్టర్లు అప్పరాజు రాజేంద్రకుమార్, పుల్లూరి సుధాకర్, బ్యాంకు ముఖ్య కార్యనిర్వాహణ అధికారి ఎం.సత్యనారాయణరావు, వరంగల్, హనుమకొండ డీసీఓ లు కోదండ రాములు, సంజీవరెడ్డి, ఏఆర్ అన్నమనేని జగన్మోహన్రావు, సేల్స్ ఆఫీసర్ కె.రవీందర్ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ అర్బన్ కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ ప్రదీప్‌రావు -
కొత్త మెనూ.. కడుపునిండా తిను!
కాజీపేట: విద్యార్థుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోంది. ప్రభుత్వ విద్యను మరింత బలోపేతం చేసే ఆలోచనలతో నూతన సంస్కరణల దిశగా అడుగులు వేస్తోంది. ముఖ్యంగా కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాలపై ప్రత్యేక దృష్టి సారించింది. విద్యార్థులకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చేసింది. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు నూతన ఆహార పట్టిక అమలు చేయాలని ఆదేశాలను జారీ చేసింది. వారంలో అయిదు సార్లు కోడిగుడ్లు, నెలలో రెండు సార్లు మాంసం, రోజూ నెయ్యి వడ్డించాలని నిర్ణయించారు. నూతన వంటకాల తయారీకి అనుగుణంగా వంట మనుషులకు విద్యాశాఖ అధికారులు తగిన శిక్షణ ఇప్పించారు. పెరిగిన మెస్ చార్జీలు హనుమకొండ జిల్లాలో 9 కేజీబీవీలున్నాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో సరికొత్త రుచులతో వంటకాలు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు అనుగుణంగా మెస్‌చార్జీలను పెంచింది. గతంలో ఒక్కో విద్యార్థికి నెలకు మెస్ ఛార్జీ రూ.1,225 ఉండేది. ప్రస్తుతం రూ.1,740కి పెంచింది. పర్యవేక్షణతో అమలు ప్రభుత్వం ప్రత్యేక చొరవతో నూతన మెనూను రూపొందించింది. దీని అమలుకు కార్యాచరణ అమలుకు ఆదేశాలను జారీ చేసింది. జిల్లా, మండల అధికారులు తరచూ ఆకస్మిక తనిఖీలు చేస్తేనే కొత్త ఆహార పట్టిక అమలకు నోచుకుంటుందని విద్యార్థి సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. కస్తూర్బా ఆశ్రమ పాఠశాలల్లో నాణ్యమైన ఆహారంమెనూ ఇలా.. ఉదయం: అల్పాహారంలో టమాటా కిచిడీ, రాగిజావ, ఇడ్లీ, సాంబర్, పాలు (బూస్ట్), పూరి, పులిహార, బోండా, ఉప్మా, చపాతీ, జీరా రైస్, అరటి పండు ఇవ్వాలి. మధ్యాహ్నం: అన్నంతో పాటు టమాటా పప్పు, నెయ్యి, రసం, పెరుగు, ఉడికించిన గుడ్డు, చికెన్, మటన్ ఇవ్వాలి. సాయంత్రం: ఉడికిన పెసలు, శనగలు, ఎగ్‌బజ్జీ, బెల్లం పల్లీలు, అల్లం చాయ్, మిల్లెట్ బిస్కెట్లు, పకోడి రాత్రి: అన్నంతో పాటు వివిధ రకాల కూరలు, సాంబర్, మజ్జిగ ఇవ్వాల్సి ఉంటుంది. -
సౌర విద్యుత్‌పై కొరవడిన ఆసక్తి
హనుమకొండ: సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఆసక్తి తగ్గింది. ఇందుకు.. వచ్చిన దరఖాస్తులు, చేసుకున్న పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లే నిదర్శనం. వేలల్లో దరఖాస్తులు రాగా, వందలో మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు జరగడాన్ని బట్టీ.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో ఉత్సాహం సన్నగిల్లిందని అర్థమవుతోంది.భారీ పెట్టుబడి.. గిట్టుబాటు కాని ధర.. 12 ఏళ్ల వరకు రైతుకు ప్రయోజనం లేకపోవడం.. ఈఎంఐలు చెల్లించడం ఇబ్బంది కావచ్చన్న ఆలోచన.. రుణాలపై స్పష్టత లేకపోవడం, రైతు వాటాగా రూ.లక్షల్లో చెల్లించాల్సి ఉండడం.. ప్రతీనెల ఆదాయం నిలకడగా వస్తుందనే నమ్మకం లేకపోవడం వెరసి.. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతుల్లో తీవ్ర విముఖత వ్యక్తమవుతోంది. దరఖాస్తులు చేసినప్పటి ఉత్సాహం.. ఈఎండీ చెల్లింపులో కనిపించలేదు. ఈఎండీ చెల్లించడంలో కనిపించిన శ్రద్ధ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకోవడంలో లేదు. లక్ష్యం ఘనం.. స్పందన గగనం..కేంద్ర ప్రభుత్వం సౌర విద్యుదుత్పత్తిని పెంచేందుకు ప్లాంట్ ఏర్పాటుపై రైతులను ప్రోత్సహించేందుకు ప్రధాన మంత్రి కిసాన్ ఉర్జా సురక్షా ఎవం ఉత్థాన్ మహాభియాన్ (పీఎం కుసుం) పథకాన్ని తీసుకొచి్చంది. ప్రధానంగా రైతులను సౌర విద్యుదుత్పత్తి వైపు ప్రోత్సహించడం దీని ఉద్దేశం. రాష్ట్రాల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయి. తెలంగాణ పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్ ద్వారా ఈ పథకాన్ని అమలు చేస్తోంది. రైతులతోపాటు మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి సంఘాలు, సహకార సంఘాలు, పంచాయతీలు, నీటి వినియోగదారుల సంఘాలు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడం ద్వారా.. సౌర విద్యుదుత్పత్తి చేసేలా ఈ పథకాన్ని రూపొందించారు. ప్రభుత్వ, దేవాలయ భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. వీరు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను స్థానిక డిస్కంలు ముందుగా నిర్ణయించిన టారిఫ్ ధరలకు కొనుగోలు చేస్తాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4 వేల మెగావాట్ల సోలార్ విద్యుదుత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో వేయి మెగావాట్లు మహిళా స్వయం సహాయక సంఘాల ద్వారా ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మిగతా 3 వేల మెగావాట్ల ఉత్పత్తి కోసం.. రైతులతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేయాలన్నదే పథకం లక్ష్యం. ఇక్కడివరకు బాగానే ఉన్నప్పటికీ.. ఈ మేరకు రైతులనుంచి స్పందన కనిపించకపోవడంతో లక్ష్యం నీరుగారేలా ఉంది.మందకొడిగా పథకం ప్రక్రియ.. పథకం రూపకల్పన, ఆదాయం వచ్చే మార్గాలపై ఉన్న సందేహాలతో పీఎం కుసుం పథకం ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. దరఖాస్తు చేసుకున్నప్పటి నుంచి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వరకు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.టీజీ ఎన్పీడీసీఎల్లో..టీజీ ఎన్పీడీసీఎల్లో 2,098 మంది రైతులు 2,788.900 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 520 మంది రైతులు 683.800 మెగావాట్లకు రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. 439 మందికి 561.7 మెగావాట్లకు లెటర్ ఆఫ్ ఆక్సెపె్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 133 మంది రైతులు 161 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు మాత్రమే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. దరఖాస్తులు వేలల్లో వస్తే పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ వందలో మాత్రమే చేసుకున్నారు.మొదటినుంచీ రైతుల అనాసక్తి.. మొదటినుంచి సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుపై రైతులు ఆసక్తి కనబరచడం లేదు. దరఖాస్తుల స్వీకరణకు మూడుసార్లు గడువు పొడిగించారు. ఈఎండీలు చెల్లించడానికి రెండుసార్లు గడువు విధించారు. అయినా దరఖాస్తులు వచి్చన మేరకు.. ఈఎండీలు చెల్లించడానికి రైతులు ముందుకు రాలేదు. ఈఎండీలు చెల్లించిన మేరకు పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకునేందుకు రైతులు ముఖం చాటేస్తున్నారు. ఒక మెగావాట్ సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్‌కు రూ.3 కోట్లు ఖర్చవుతుంది. ఇందులో రైతులు తమ వాటాగా 25 శాతం భరిస్తే, బ్యాంకుల ద్వారా 75 శాతం రుణ సదుపాయాన్ని కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. రుణ విషయంలో బ్యాంకర్లకు స్పష్టంగా చెప్పడం లేదని రైతులు తెలిపారు. సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసుకునేంత భారీ పెట్టుబడి రైతులుగా తాము వెచ్చించలేమని చెబుతున్నారు. 25 శాతం కింద రూ.3 కోట్ల వ్యయంలో రైతు వాటాగా రూ.75 లక్షలు భరించలేమని, దీనికి తోడు తమ స్థలం నుంచి సబ్‌స్టేషన్ వరకు అయ్యే ఖర్చులు భరించలేమని, ప్రభుత్వం యూనిట్‌కు చెల్లిస్తామని చెప్పిన రూ.3.13లు ఎటూ సరిపోవన్నారు. విద్యుదుత్పత్తి కూడా అన్ని కాలాల్లో ఒకే రకంగా ఉండకపోవచ్చని, దీంతో వచ్చిన ఆదాయంలో నిలకడ లోపిస్తుందని, దీంతో నెలవారీ వాయిదాలు చెల్లించడంలో ఇబ్బందులు ఎదురుకావచ్చని భావిస్తున్నారు. పన్నెండేళ్ల వరకు రుణ వాయిదాలు చెల్లించాల్సి రావడంతో.. అప్పటి వరకు రైతుకు ఒనగూరే ప్రయోజనం ఏమీ లేదని వాపోతున్నారు. పన్నెండేళ్ల తర్వాత పరిస్థితులు ఎలా ఉంటాయోనని, అదే విధంగా 25 ఏళ్ల వరకు యూనిట్‌కు రూ.3.13 మాత్రమే చెల్లించడం ఏ మాత్రం గిట్టుబాటు కాదంటున్నారు. రాయితీ లేకపోవడంతో తమపై దారుణమైన భారం పడుతుందని రైతులు చెబుతున్నారు. దీంతో సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు రావడం లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్లో.. టీజీ ఎస్పీడీసీఎల్లో 2265 మంది రైతులు 3,369.500 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో 682 మంది రైతులు 1035.5 మెగావాట్ల విద్యుదుత్పత్తికి రూ.లక్ష చొప్పున ఈఎండీ చెల్లించారు. ఇందులో 560 మంది రైతులకు 850.8 లెటర్ ఆఫ్ ఆక్సెప్టన్సీ జారీ చేశారు. కాగా ఇప్పటివరకు 163 మంది రైతులు 225 మెగావాట్ల సౌర విద్యుదుత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు డిస్కంతో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ చేసుకున్నారు. -
వివాహితపై అమానవీయ దాడి ఘటన.. పోలీసుల అదుపులో నిందితులు
ధర్మసాగర్: హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఓ వివాహితను వివస్త్రను చేసి అమానవీయంగా దాడి చేసిన ఘటనలో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాడి ఘటనపై ‘సాక్షి’లో శనివారం ప్రచురితమైన కథనా ని కి జిల్లా యంత్రాంగం స్పందించింది. న్యా యసేవా అధికార సంస్థ హనుమకొండ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండేతోపాటు మరో జడ్జి శ్రావణ స్వాతి, వివిధ శాఖల అధికారులు, పోలీసులు హుటాహుటిన తాటికాయల గ్రామానికి చేరుకున్నారు. ఘటనాస్థలాన్ని పరిశీలించి గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామస్తుల ద్వారా వివరాలు సేకరించారు. ఏదైనా సమస్య వచి్చనప్పుడు ప్రజలు పోలీసులను లేదా కోర్టును ఆశ్రయించాలి తప్ప చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే కఠిన చర్యలు తప్పవని జడ్జీలు హెచ్చరించారు. జిల్లాలో న్యాయసేవా అధికార సంస్థను ఏర్పాటు చేశామని.. దీనిద్వారా ఉచితంగా న్యాయ సేవలు అందుతాయన్నారు. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొనిఇలాంటి ఘటనలకు పాల్పడితే వారిని కూడా నేరస్తులుగా పరిగణించి శిక్షలు విధిస్తామని హెచ్చరించారు. అశ్లీల వీడియోలు షేర్ చేయడం నేరం ఈ అంశంపై కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్‌రెడ్డి ధర్మసాగర్ పోలీసు స్టేషన్లో మీడియాతో మాట్లాడారు. సాక్షి దినపత్రికలో వచ్చిన కథనంపై వివరాలు సేకరించగా దాడి జరిగింది నిజమేనని తేలిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి విచారణ కొనసాగుతోందని.. బాధితుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామన్నారు. ఒకరు తప్పు చేశారని, మరొకరు ఇంకో తప్పు చేస్తే పెద్దశిక్షలు పడతాయని చెప్పారు. నిందితులు తమ అదుపులోనే ఉన్నారని, వారిని విచారించి పూర్తి సమాచారం సేకరించాల్సి ఉందన్నారు. జుగుప్సాకరమైన వీడియోలు, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం నేరమని.. అశ్లీల కంటెంట్‌ను షేర్ చేస్తే సెక్షన్ 67 కింద కనీసం 5 ఏళ్ల జైలుశిక్ష, రూ. 10 లక్షల జరిమామా పడుతుందన్నారు. -
సమ్మక్క సాగర్‌కు జలకళ..
కన్నాయిగూడెం: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గ్రామం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ జలకళ సంతరించుకుంది. కొన్ని రోజుల నుంచి బ్యారేజీలో నీరులేక పోవడంతో బోసిపోయిన గోదావరి.. వారం రోజుల నుంచి ఎగువన మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాలకు భారీగా నీరు చేరడంతో గోదావరి నిండుగా ప్రవహిస్తోంది. దీంతో బ్యారేజీలోకి ఎగువ నుంచి 21,500 క్యూసెక్కుల నీరు చేరడంతో అధికారులు బ్యారేజీ వద్ద 59 గేట్లలో మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. బ్యారేజీ సామర్థ్యం 6.94 టీఎంసీలకు గాను ప్రస్తుతం 3.81టీఎంసీల నీరు ఉంది. బ్యారేజీ నీటి మట్టం 83 మీటర్లకు గాను 79.50 మీటర్ల నీటి మట్టం కొనసాగుతోంది. కాగా, దేవాదుల వద్ద ఉన్న చొక్కారావు ఎత్తిపోతల నుంచి రెండు మోటార్ల ద్వారా 494 క్యూసెక్కుల నీరు ఎత్తిపోస్తున్నట్లు డీఈ శరత్ బాబు తెలిపారు. ఎగువ నుంచి బ్యారేజీలోకి 21,500 క్యూసెక్కుల నీరు చేరిక మూడు గేట్లు ఎత్తి 27,000 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల -
ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్య
● కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో ఘటన ● హత్యకు గల కారణాలపై పోలీసుల ఆరా ● పోలీసులకు లొంగిపోయిన నిందితుడు?కాజీపేట: ఓ ఫైనాన్స్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన శుక్రవారం రాత్రి కాజీపేట రైల్వే క్వార్టర్స్‌లో జరిగింది. మృతుడి భార్య మాధవి, పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్ జేపీఎన్ రోడ్డుకు చెందిన త్రిపురాధి నవీన్‌కుమార్ (55) ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా కాజీపేటలోని చిరువ్యాపారులు, రైల్వే, ఎఫ్‌సీఐ, ప్రైవేట్ ఉద్యోగులకు వడ్డీలకు డబ్బులు ఇస్తున్నాడు. ఈ క్రమంలో రైల్వే ఈఎల్ఎస్ షెడ్లో పనిచేసే గడ్డం ప్రవీణ్‌కుమార్‌కు ఆరు నెలల క్రితం రూ.50 వేలు అప్పుగా ఇచ్చాడు. అప్పు తీసుకున్నప్పటి నుంచి ప్రవీణ్‌కుమార్ అసలుతోపాటు వడ్డీ కూడా చెల్లించకపోవడంతో మృతుడు కొద్దికాలంగా ప్రవీణ్‌కుమార్‌పై ఒత్తిడి పెంచడంతో ఇద్దరి మధ్య మనస్పర్థలు పెరిగాయి. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి నవీన్‌కుమార్ రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లి నిందితుడు ప్రవీణ్ కుమార్‌ను నిలదీయడంతో ఇద్దరి మధ్య వాగ్వా దం పెరిగింది. ఆ తర్వాత గొడవ సద్దుమణగడంతో ఇద్దరు కలిసి మద్యం సేవించారు. అయితే డబ్బుల విషయంలో జరిగిన గొడవను మనసులో పెట్టుకున్న ప్రవీణ్‌కుమార్.. కూరగాయలు కొసే కత్తితో విచక్షణారహితంగా పొడవడంతో నవీన్‌కుమార్ తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. అనంతరం నిందితుడు నేరుగా కాజీపేట పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం. హత్య కేసులో విభిన్న వాదనలు .. ఫైనాన్స్ వ్యాపారి నవీన్‌కుమార్ హత్యపై విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అప్పులు ఇచ్చిన తర్వాత అధిక మొత్తంలో వడ్డీలు వసూలు చేయడం, చెక్ బౌన్స్ కేసులు నమోదు చేయించడం, ఇళ్లు, స్థలాలు రాయించుకోవడం వంటి పనులు చేస్తుండేవాడనే ఆరోపనలు వినిపిస్తున్నాయి. కాగా, నవీన్‌కుమార్‌ను నిందితుడు ప్రవీణ్‌కుమార్ మధ్యాహ్నమే రైల్వే క్వార్టర్లో చంపి మృతదేహాన్ని బయటపడేయడం కోసం ప్రయత్నించగా ఆటో డ్రైవర్లు ఎవరూ సహకరించకపోవడంతో విధిలేని పరిస్థితుల్లో పోలీసులకు నిందితుడు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. కాగా, ఫైనాన్స్ వ్యాపారి నవీన్‌కుమార్ హత్య సమాచారం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనా స్థలికి పోలీసు అధికారులు.. కాజీపేట ఏసీపీ పింగిళి ప్రశాంత్ రెడ్డి, ఇన్చార్జ్ సీ ఐ పుల్యాల కిషన్‌తో పాటు టాస్క్‌ఫోర్స్, క్రైమ్ సిబ్బంది, క్లూస్ టీం బృందం ఘటనాస్థలిని సందర్శించి ఆధారాలు సేకరించారు. నవీన్‌కుమార్ హ త్య వెనుక నిందితుడితో పాటు ఇంకా ఎవరైనా ఉ న్నారా? లేక ఒక్కడే హత్య చేసి ఉంటాడా అనే కో ణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. కా జీపేట చౌరస్తా నుంచి రైల్వే క్వార్టర్స్‌కు వెళ్లే రహదారుల్లో ఉన్న సీసీ కెమెరాలను జల్లెడ పడుతు న్నారు. మృతుడి భార్య త్రిపురాధి మాధవి ఫిర్యా దు మేర కు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ తెలిపారు. కాగా, తన భర్త ఒంటిపైనుంచి రూ. 6 లక్షల విలువైన బంగా రు ఆభరణాలు నిందితుడు ప్రవీణ్‌కుమార్ తీసుకున్నాడని మృతుడి భార్య మాధవి ఆరోపించింది. -
బీసీలపై రాజకీయ పార్టీల చిన్నచూపు
కాజీపేట రూరల్ : బీసీలను అన్ని రాజకీయ పార్టీలు చిన్న చూపు చూస్తున్నాయని, జనాభా దామాషా ప్రకారం బీసీలకు వాటా ఇచ్చే వరకూ అవిశ్రాంత పోరాటం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. కాజీపేట ఫాతిమానగర్ వైష్ణవిగ్రాండ్ హోటల్లో శనివారం బీసీ సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్ అధ్యక్షతన ‘స్థానిక సంస్థల ఎన్నికలు–బీసీల రిజర్వేషన్ల పెంపు’ అనే అంశం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆరోపించారు. నెల రోజుల్లో రిజర్వేషన్లు నిర్ణయించి ఎన్నికల సంఘానికి నివేదించాలని హైకోర్టు ఆదేశించిన ప్రభుత్వం ఇంకా చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో మరోమాటతో బీసీలను మభ్యపెడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ బీసీల వ్యతిరేక పార్టీ అని, కాంగ్రెస్, బీజేపీ మాత్రమే రిజర్వేషన్లు తేల్చాలని డిమాండ్ చేశారు. 48 గంటల్లోగా సీఎం రేవంత్‌రెడ్డి అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి రిజర్వేషన్ల అంశంపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని డైవర్ట్ చేయడానికి ఎమ్మెల్సీ కవిత బీసీ నినాదం ఎత్తుకున్నారని ధ్వజమెత్తారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీ రిజర్వేషన్ల అంశం ఇప్పుడు గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును 9వ షెడ్యూల్లో చేర్పించి 42 శాతం బీసీ బిల్లు ఆమోదింపజేయాలని, లేనిపక్షంలో తెలంగాణలో బీజేపీని మట్టి కరిపిస్తామని హెచ్చరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి రవికృష్ణ, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాడి మల్లయ్యయాదవ్, బీసీ సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు డాక్టర్ చిర్ర రాజు, తమ్మేలా శోభారాణి, మాదం పద్మజాదేవి, కాసగాని అశోక్‌గౌడ్, డాక్టర్ సంగాని మల్లేశ్వర్, మేముల మహేందర్, వల్లాల జగన్‌గౌడ్, పంజాల మధు, తెల్ల కిశోర్, తెల్ల సుగుణ, బూర్గుల ప్రమాద, బాబుయాదవ్ పాల్గొన్నారు. 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసే ఎన్నికలకు పోవాలి బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ -
బాలల సంరక్షణకు పనిచేయాలి
● అడిషనల్ డీసీపీ రవి వరంగల్ క్రైం: బాలలను సంరక్షించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని వరంగల్ పోలీస్ కమిషనరేట్ అడ్మిన్ అడిషనల్ డీసీపీ రవి సూచించారు. జులై 1 నుంచి నెలరోజులు నిర్వహించనున్న ఆపరేషన్ ముస్కాన్–11వ విడత కార్యక్రమంపై అదనపు డీసీపీ ఆధ్వర్యంలో శనివారం కమిషనరేట్‌లో అధికారులు సమన్వయ సమావేశం నిర్వహించారు. హ్యూమన్ ట్రాఫిక్ విభాగంతో పాటు వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల సీ్త్ర శిశు సంక్షేమ శాఖ, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, చైల్డ్ లైన్ 1098 విద్యాశాఖ, కార్మిక శాఖ చెందిన అధికారులు ఈసమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా అడిషనల్ డీసీపీ రవి మాట్లాడుతూ.. కమిషనరేట్ పరిధిలో 18 ఏళ్లలోపు పిల్లల్ని ఎవరైనా హింసించినా, భిక్షాటన చేయించినా, పిల్లల్ని బాల కార్మికులుగా మార్చినా అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని అదనపు డీసీపీ హెచ్చరించారు. ఈసందర్భంగా ఆపరేషన్ ముస్కాన్‌పై రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. హాజరైన అన్ని శాఖల ప్రతినిధులతో ఆపరేషన్ ముస్కాన్ ప్రతిజ్ఞ చేయించారు. సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పక్కా వంద సీట్లు.. సర్వేలన్నీ మనవైపే
హసన్‌పర్తి: వచ్చే ఎన్నికల్లో పక్కాగా వంద అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. బీఆర్ఎస్ వర్ధన్నపేట నియోజకవర్గ ముఖ్యకార్యకర్తల విస్తృతస్థాయి సమావేశం నగరంలోని నాని గార్డెన్లో శనివారం జరిగింది. సమావేశానికి మాజీ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సర్వేలన్నీ గులాబీ వైపు చూపుతున్నాయని తెలిపారు. గత ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. వాటిని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. రైతులకు కనీసం సాగు నీరు అందించకుండా వారి కళ్లల్లో కన్నీళ్లు నిలిపిందన్నారు. నాట్లకి..నాట్లకి రైతుబంధు కేసీఆర్ వేస్తే.. రేవంత్ మాత్రం ఓట్లకు ఓట్లకు రైతు భరోసా వేస్తున్నాడని ధ్వజమెత్తారు. రేవంత్‌రెడ్డి ఓ అబద్దాల కోరుగా అభివర్ణించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి, మొట్టు శ్రీనివాస్, కార్పొరేటర్లు ఇండ్ల నాగేశ్వర్రావు, రాధికారెడ్డి, నాయకులు శ్రీధర్, అటికం రవీందర్, చల్లా వెంకటేశ్వర్‌రెడ్డి, మార్గం భిక్షపతి, అప్పారావు, బండి రజనీకుమార్, తూర్ల కుమారస్వామి, కందుకూరి చంద్రమోహన్, పాడి మల్లారెడ్డి, నద్దునూరి నాగరాజు, జోరుక రమేశ్ పాల్గొన్నారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు -
విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలి
● కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ రాజేందర్‌సింగ్ విద్యారణ్యపురి/న్యూశాయంపేట: విద్యార్థులు కష్టపడి చదువుకుని ఉన్నతంగా ఎదగాలని కళాశాల విద్య జాయింట్ డైరెక్టర్ ప్రొఫెసర్ రాజేందర్‌సింగ్ కోరారు. శనివారం హనుమకొండలోని ప్రభుత్వ పింగిళి మహిళా డిగ్రీ అండ్ పీజీ కళాశాల(అటానమస్), కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ (కేడీసీ), దేశాయిపేటలోని సీకేఎం ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీని సందర్శించారు. ఆయా కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాబోయే రోజుల్లో పింగిళి మహిళా కళాశాల ఏప్లస్ గ్రేడ్ సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులను పోటీపరీక్షలకు కూడా సన్నద్ధం చేయాలన్నారు. కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రీసెర్చ్‌సెంటర్‌గా గుర్తింపు రావడంపై అభినందించారు. సీకేఎం కళాశాలలోని గ్రంథాలయం, ప్రయోగశాల, మహిళా హాస్టల్ తదితర వసతులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయా సమావేశంలో ప్రిన్సిపాళ్లు బి.చంద్రమౌళి, జి.శ్రీనివాస్, ఎ.ధర్మారెడ్డి, వైస్ ప్రిన్సిపాళ్లు సుహాసిని, రజనీలత, వరప్రసాదరావు, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ డాక్టర్ సురే్ష్బాబు, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ ఆరుణ, డాక్టర్ శశిధర్రావు, ప్రొఫెసర్ రాజారెడ్డి, టీజీసీజీటీఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె.చిన్న, జిల్లా కార్యదర్శి రవికుమార్, కేయూ సెక్రటరీ జి.సమ్మయ్య, సతీష్‌కుమార్, అధ్యాపకులు సీతారాములు, మహేందర్ శ్రీనాఽథ్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ స్వరూప తదితరులు పాల్గొన్నారు. పీఎన్డీటీ చట్టం అమలుపై ప్రత్యేక నిఘాఎంజీఎం: జిల్లాలో లింగ నిర్ధారణ చట్టం (పీఎన్డీటీ) అమలు, ఎంటీపీ చట్టాన్ని కచ్చితంగా అమలు చేసేందుకు ఆయా స్కానింగ్ కేంద్రాలు, ఆస్పత్రులపై ప్రత్యేక నిఘాతో ముందుకు సాగాలని హనుమకొండ వైద్య ఆరోగ్యశాఖ అధికారి అప్పయ్య పేర్కొన్నారు. శనివారం గర్భస్థ పూర్వ, పిండ లింగ నిర్ధారణ చట్టం జిల్లా స్థాయి అడ్వయిజరీ సమావేశాన్ని హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చట్టం అమలుకు తీసుకున్న చర్యలను, బాలికల, నిష్పత్తి గురించి సభ్యులకు వివరించారు. వైద్య ఆరోగ్యశాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ఇతర విభాగాలు లింగ వివక్షపై అవగాహన కల్పించాలని సూచించారు. ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆదేశాల మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన వారికి నోటీసులివ్వనున్నట్లు తెలిపారు. నిర్ణీత సమయంలో తప్పులు సరిద్దిదుకోకపోతే జరిమానా విధించినున్నట్లు తెలిపారు. చట్టం ఉల్లంఘిస్తున్న వారి వివరాలు, అబార్షన్లు నిర్వహించే వారి వివరాలు 63000 30940 నంబర్‌కు వాట్సాప్ చేయాలని, కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదుల పెట్టె ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. జిల్లాలో బాలికల నిష్పత్తి తక్కువగా ఉన్న వేలేరు మండలంలో ప్రత్యేక శ్రద్ధ వహించి క్షేత్రస్థాయి సిబ్బందితో తరచూ సమీక్ష నిర్వహించి వివిధ ప్రభుత్వ విభాగాలు, ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేసి అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జీఎంహెచ్ ప్రొఫెసర్ గైనకాలజిస్ట్ రాజేశ్వరి, పీఓఎంహెచ్‌ఎన్ మంజుల, సభ్యులు రేవతిదేవి, ఎన్.కవిత, జిల్లా కోర్టు సిబ్బంది నాగరాజు, డెమో అశోక్‌రెడ్డి, ఎస్ఓ ప్రసన్నకుమార్, హెచ్ఈఓ రాజేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సమన్వయంతో సీజనల్ వ్యాధుల నియంత్రణ
హన్మకొండ: జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారులు సంబంధిత ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పని చేస్తూ సీజనల్ వ్యాధుల నియంత్రణకు కృషి చేయాలని రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ సూచించారు. శనివారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లాల వారీగా నమోదవుతున్న మలేరియా, డెంగీ, ఇతర వ్యాధుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అ నంతరం ఆమె మాట్లాడుతూ వరంగల్ జిల్లా వైద్యారోగ శాఖాధికారి, సంబంధిత అధికారులు ఎంజీఎంలో నమోదవుతున్న మలేరియా, డెంగీ పాజి టివ్ కేసుల వివరాలను డీఎంహెచ్ఓలకు అందించాలన్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లాలోని అన్ని సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలల్లో హెచ్ఎంలతో సమన్వయ సమావేశం ఏర్పాటు చేసి సీజనల్ వ్యా ధులు, ముఖ్యంగా చేతుల శుభ్రత, ఓఆర్ఎస్ ద్రావ ణం తయారీ విధానం, జ్వరాలు, డయేరియాకు సంబంధించిన ప్రమాదకర లక్షణాల గురించి అవగాహన కల్పించాలన్నారు. సామాజిక మాధ్యమాల్లో ఈ కార్యక్రమాల గురించి ప్రచారం చేయాలన్నారు. ప్రతీ మంగళవారం ఎంపిక చేసిన ఆరోగ్య కేంద్రాలలో నిర్వహించే ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మరింత పటిష్టంగా నిర్వహించాలని, ఆశలు, ఏఎన్ఎంలకు అవసరమైన సూచనలు చేయాలన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బాలికల లింగ నిష్పత్తి చాలా తక్కువ ఉందని, ఈ దిశగా డీఎంహెచ్ఓలు బాధ్యతగా తగిన చర్యలు చేపట్టాలని, లింగ నిర్ధారణ పరీక్షలపై నిఘా పెంచాలన్నారు. లింగ వివక్షతపై అవగాహన కల్పించాలన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో భాగంగా ఎక్స్‌రే పరీక్షలు అవసరం వారికి ఆర్.బి.ఎస్.కె వాహనం ద్వారా అందుబాటులో ఉన్న సెంటర్లకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించాలన్నారు. మేనరికపు వివాహాలకు దూరంగా ఉండేలా అవగాహన కల్పించాలన్నారు. హనుమకొండ, వరంగల్, ములుగు, జనగామ, మహబూబాబాద్ జిల్లాల డీఎంహెచ్ఓలు ఎ.అప్ప య్య, బి.సాంబశివరావు, గోపాల్ రావు, మల్లికార్జు న్, రవి రాథోడ్, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీదేవి పాల్గొన్నారు. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ ఎస్.సంగీత సత్యనారాయణ -
విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబర్చాలి
● ఎమ్మెల్యే కడియం శ్రీహరి ధర్మసాగర్ : గురుకుల పాఠశాలల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినులు చదువులో ప్రతిభ కనబరిచి మంచి మార్కులు సాధించాలని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. హనుమకొండ పట్టణంలోని హంటర్‌రోడ్డులో గల ధర్మసాగర్ మండల సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలను ఆయన శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదట తరగతి గదులు, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యతను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. పాఠశాలలోని సదుపాయాలు, చెత్త, మరుగుదొడ్ల నిర్వహణ, సీజనల్ జ్వరాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల హాజరు శాతం, పదో తరగతి ఫలితాల వివరాలు ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం క్లాస్ రూంలోకి వెళ్లి విద్యార్థులకు పాఠాలు చెప్పడంతోపాటు వారిని పలు ప్రశ్నలు అడిగారు. గురుకుల సెక్రటరీతో ఫోన్లో మాట్లాడి సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లి వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని అన్నారు. అనంతరం కరుణాపురంలోని మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ బాలికల విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఆహారం, తాగునీరు, కిచెన్, క్లాస్ రూమ్స్, టాయిలెట్స్‌ను పరిశీలించారు. ఆయా పాఠశాలల ప్రిన్సిపాల్, హెచ్ఎం, ఉపాధ్యాయ బృందం, అధికారులు, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్లో దొంగ అరెస్ట్
● రూ. 2.86 లక్షల విలువైన ఆభరణాలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ రామన్నపేట : వరంగల్ రైల్వేస్టేషన్లో ఓ దొంగను అదుపులోకి తీసుకుని అతడి నుంచి రూ. 2,86,645 విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు వరంగల్ జీఆర్పీ సీఐ సురేందర్ తెలిపారు. జీఆర్పీ సీఐ కథనం ప్రకారం.. శనివారం ఉదయం 9 గంటల సమయంలో నాలుగో ఫ్లాట్‌ఫామ్ వద్ద చింతల్ వైపున తనిఖీలు చేస్తుండగా మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బంగ్లా తండాకు చెందిన ఇస్లావత్ సురేశ్ అనుమానాస్పదంగా సంచరిస్తూ కనిపించాడు. దీంతో అతడిని తనిఖీ చేయగా 28.645 గ్రాముల బంగారం చైన్, రెండు పుస్తెలు, 3 జతల చెవి కమ్మలు లభ్యమయ్యాయి. నిందితుడు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లో బంగారం చోరీ చేసినట్లు ఒప్పుకున్నట్లు తెలిపారు. దీంతో అరెస్ట్ చేసి కేసు దర్యాప్తు చేస్తునట్లు జీఆర్పీ సీఐ తెలిపారు. కాగా, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన సిబ్బంది రాము, రియాజుద్దీన్, నాగరాజు, రామకృష్ణ, రమేశ్. మనోజ్‌కుమార్‌ను జీఆర్పీ సీఐ అభినందించారు. -
వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు
● డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ ● ఆయన స్థానంలో ఎన్.శుభంప్రకాశ్ నియామకం.. బాధ్యతల స్వీకరణసాక్షి, వరంగల్: వరంగల్ ఏసీపీ నందిరాంనాయక్పై వేటు పడింది. కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళికి వివిధ సందర్భాల్లో నిబంధనలకు విరుద్ధంగా ఎస్కార్ట్ కల్పించి మెమోలు అందుకున్నారు. కాంగ్రెస్ నేత నవీన్‌రాజ్‌కు ఏ పదవి లేకున్నా కూడా పోలీసు భద్రత కల్పించి వివాదాల్లో చిక్కుకున్నారు. మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకల్లో కూడా పాల్గొన్న ఆయన వివాదాలకు కేంద్రబిందువుగా మారిన సందర్భాలున్నాయి. కేవలం 15నెలల పాటు పనిచేసిన నందిరాంనాయక్ను డీజీపీ కార్యాలయానికి అటాచ్డ్ చేస్తూ శనివారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఎక్కడ కూడా పోస్టింగ్ ఇవ్వలేదు. ఆస్థానంలో 2022 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఎన్.శుభంప్రకాశ్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు శనివారం ఉత్తర్వులు జారీచేశారు. శుభంప్రకాశ్ 2024లో వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ఆరు నెలలపాటు ట్రెయినీ ఐపీఎస్‌గా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం కరీంనగర్ రూరల్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్నారు. ఏసీపీగా రానున్న ఆయనకు వరంగల్‌పై కొంత అవగాహన ఉంది. కాగా, ఆయన సాయంత్రం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ డివిజన్ పోలీసులు ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛాలు అందించారు. -
ఆదివారం శ్రీ 29 శ్రీ జూన్ శ్రీ 2025
ఐనవోలు: మండల కేంద్రానికి చెందిన వడిచర్ల శ్రీనివాస్–అనురాధ దంపతుల కుమారుడు కమల్‌హాసన్, కూతురు శివాని. శ్రీనివాస్ టైలరింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. సమాజ సేవంటే ఇష్టపడే శ్రీనివాస్ ఎంపీటీసీగా పని చేశారు. గతేడాది జనవరి 22న అనారోగ్య కారణాలతో ఆయన మృతి చెందాడు. కమల్ హాసన్ నాన్న నిర్ణయం మేరకు డిగ్రీ తర్వాత లండన్‌కు వెళ్లారు. తండ్రి చనిపోయిన తర్వాత ఆయన కోరిక మేరకు చెల్లి పెళ్లి జరిపించాడు. ఆపెళ్లిలో అతడి తండ్రి ఫైబర్ విగ్రహాన్ని తయారు చేయించి నాన్నతో తనకున్న ఎమోషన్‌ను అందరికి చూపించాడు. ఈసారి లండన్ నుంచి ఇండియాకు వచ్చినపుడు ఆ ఫైబర్ విగ్రహాన్ని మండల కేంద్రంలో ఏర్పాటు చేయించనున్నట్లు కమలహాసన్ తెలిపారు.న్యూస్రీల్పెళ్లిలో విగ్రహం ఓ ఎమోషన్ -
భర్త జ్ఞాపకాలతో..
మహబూబాబాద్ రూరల్: కట్టుకున్న భర్తను ప్రాణంగా భావించి ఆయన మృతి అనంతరం పాలరాతితో విగ్రహం చేయించి ఓ భార్య ఆయనకు గుడి కట్టించింది. మహబూబాబాద్ మండలం సోమ్లా తండా గ్రామానికి చెందిన బానోత్ కల్యాణి ఎంపీటీసీగా పనిచేసింది. హరిబాబుతో ఆమెకు 1996లో వివాహం కాగా.. 2021లో హరిబాబు అనా రోగ్యంతో మృతిచెందాడు. ఆయనతోపాటే తాను చనిపోదామని కల్యాణి ప్రయత్నించినా బంధువులు ధైర్యం చెప్పడంతో హరిబాబు జ్ఞాపకాలతో జీవిస్తోంది. ఈక్రమంలో రూ.5.30 లక్షలతో పండుగ వాతావరణంలో గతేడాది ఏప్రిల్ 23న గుడి ప్రారంభించింది. ప్రతీ శనివారం ఆయనకు పూజలు చేస్తోంది. -
ఎల్లప్పుడూ కళ్ల ముందే ఉండాలని..
డోర్నకల్: కంటికి రెప్పలా చూసుకునే భర్త, అమ్మా అమ్మా అంటూ రోజుకు వెయ్యిసార్లు పలకరించే కుమారుడు అకస్మాత్తుగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో దిక్కు తోచని స్థితికి చేరుకున్న ఓ మహిళ తన భర్త, కుమారుడిని విగ్రహాల రూపంలో చూసుకుంటూ వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంది. డోర్నకల్ మండలం దుబ్బతండాకు చెందిన అజ్మీర బాల్యా, భారతి దంపతులకు సాయికుమార్ ఏకై క కుమారుడు. భారతి దుబ్బతండా సర్పంచ్‌గా పని చేసి భర్త బాల్యా సహకారంతో గ్రామాభివృద్ధిలో తమ వంతు పాత్రను సమర్థవంతంగా నిర్వహించింది. బాల్యా, భారతి వ్యవసాయం చేస్తుండగా కుమారుడు ఖమ్మంలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈనెల 5న కుమారుడు సాయికుమార్‌ను కళాశాలకు పంపేందుకు బాల్యా ఖమ్మం బయల్దేరగా ఖమ్మంలో ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొని బాల్యా, సాయికుమార్ మృతి చెందారు. వారిని మర్చిపోలేని భారతి.. బాల్యా, సాయికుమార్ విగ్రహాలను గ్రామ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసింది. జూన్ 15న వారి సంతాప సభలోబాల్యా సాయికుమార్ విగ్రహాలను ఆవిష్కరించారు. -
కుమారులు దూరమై.. విగ్రహాల్లో కొలువై
కొడకండ్ల: అల్లారుముద్దుగా పెంచుకున్న ఇద్దరు కుమారులు రోడ్డు ప్రమాదంలో దూరమయ్యారు. పుట్టెడు దుఃఖాన్ని దిగమింగుకుని వారి జ్ఞాపకాల్ని నెమరు వేసుకుంటూ ఆ తల్లిదండ్రులు కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాణం పోయిన వారి కుమారులకు విగ్రహాల రూపంలో ప్రాణం పోసి కళ్లారా చూస్తున్నారు. కొడకండ్ల మండలం రామవరం గ్రామానికి చెందిన మేటి రాములు–రాజేశ్వరి దంపతులకు ముగ్గురు కుమారులు. వ్యవసాయమే జీవనాధారమైన వారు కుమారులను చిన్నప్పటి నుంచి ప్రైవేట్ పాఠశాలల్లోనే చదివించారు. తల్లిదండ్రుల శ్రమను గుర్తించిన వారు ప్రయోజకులయ్యారు. పెద్దకుమారుడు అరవింద్, రెండో కుమారుడు శ్రవణ్ సాప్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్‌లో మూడో కుమారుడు శ్రవణ్ వరంగల్ ఎంజీఎంలో హౌస్ సర్జన్‌గా పనిచేసేవారు. గత సంవత్సరం మే 19న శివ హైదరాబాద్‌లోని అన్న శ్రవణ్ వద్దకు వెళ్లాడు. భోజనం తెచ్చుకునేందుకు బయటికి వెళ్లిన ఇద్దరు సోదరులను స్కార్పియో కారు ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడిక్కడే మృతి చెందారు. కుమారులను గుర్తు చేసుకుంటూ తమ వ్యవసాయ భూమిలో గదిని నిర్మించి శ్రవణ్, శివ విగ్రహాలను ఏర్పాటు చేయించారు. మే 19న ప్రథమ వర్ధంతి సందర్భంగా తల్లిదండ్రులు ఆవిష్కరించుకున్నారు. -
స్మార్ట్ సిటీ పెండింగ్ పనులు పూర్తి చేయండి
గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ భద్రకాళి బండ్ అభివృద్ధి పనుల పరిశీలన వరంగల్ అర్బన్: స్మార్ట్‌సిటీ పెండింగ్ ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని గ్రేటర్ వరంగల్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఆదేశించారు. శనివారం భద్రకాళి బండ్‌పై పూర్తయిన స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులను, పెండింగ్ పనులను ఆమె క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీలో భాగంగా భద్రకాళి బండ్‌పై ఏ, బీ, సీ, డీ జోన్ల వారీగా ఇప్పటికే పూర్తి చేసిన పనులను వాటి అంచనా వ్యయాలతో పాటు సమగ్ర వివరాలను కమిషనర్ ఇంజనీరింగ్ స్మార్ట్‌సిటీ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బొంది వాగు నుంచి వచ్చే నాలతోపాటు పోతన జంక్షన్ ప్రాంతం నుంచి వచ్చే 12 మోరీల నాలలను కమిషనర్ పర్యవేక్షించారు. ఆయా జోన్లలో మిగిలిన ఎలక్ట్రికల్, సివిల్ పనులకు సంబంధించి కమిషనర్ పలు సూచనలిచ్చారు. మిగతా చిన్న చిన్న పనులు పూర్తి చేయాలి. స్కీంలో పెట్టుకునేందుకు అవకావం కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఈఈలు శ్రీనివాస్, రవికుమార్, స్మార్ట్ సిటీ ప్రతినిధులు ఆనంద్ ఓలేటి, శ్రీనివాసరాజు, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు స్ట్రీట్ వెండర్స్ ఫుడ్ ఫెస్టివల్ వరంగల్ బల్దియా మెప్మా ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు స్థానిక స్ట్రీట్ వెండర్ల ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తెలిపారు. భద్రకాళీ బండ్, హంటర్ రోడ్డు, హనుమకొండలలో ఈ ఫుడ్ ఫెస్టివల్ ఉంటుందని, నగర ప్రజలు పెద్దఎత్తున హాజరు కావాలని కోరారు. -
కుల్లా, నిత్యక్లిన్నా క్రమాలలో శ్రీభద్రకాళి
హన్మకొండ కల్చరల్ : శ్రీభద్రకాళీ దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా మూడోరోజు శనివారం అమ్మవారిని కుల్లాక్రమంలో, నిత్యక్లిన్నా క్రమంలో పూజలు నిర్వహించారు. ప్రధానార్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయంనుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, చతుఃస్థానార్చన నిర్వహించారు. అనంతరం కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరానికి కుల్లాగా పూజలు నిర్వహించి, వారాహి అమ్మవారిగా అలంకరించారు. షోడశీక్రమాన్ని అనుసరించి స్నపనమందిరంలోని భోగభేరాన్ని నిత్యక్లిన్నాగా అలంకరించి పూజలు జరిపారు. ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
పీవీ సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ పటిష్టం
పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి హన్మకొండ చౌరస్తా: రాజనీతిజ్ఞుడు, తెలుగు ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన దివంగత ప్రధాని పీవీ నరసింహారావు తెచ్చిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేశాయని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. హనుమకొండలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో శనివారం పీవీ నరసింహారావు 104వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పీవీ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ.. పీవీ ఆలోచనలు, ఆర్థిక సంస్కరణలు భారత్‌ను అభివృద్ధివైపు తీసుకెళ్లాయన్నారు. అనంతరం జవహర్లాల్ నెహ్రూ స్టేడియం జంక్షన్‌లోని పీవీ కాంస్య విగ్రహానికి పూలమాలలు వేశారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఈవీ శ్రీనివాసరావు, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ అజీజ్‌ఖాన్, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ తోట వెంకటేశ్వర్లు కాంగ్రెస్ నాయకులు బంక సంపత్, నాయిని లక్ష్మారెడ్డి, అంకూస్ పాల్గొన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన ఎన్పీడీసీఎల్ డైరెక్టర్లు
హన్మకొండ: హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలోని శుక్రవారం టీజీ ఎన్పీడీసీఎల్ డైరక్టర్లు బాధ్యతలు స్వీకరించారు. ఫైనాన్స్ డైరెక్టర్‌గా వంటెరు తిరుపతి రెడ్డి, ఆపరేషన్స్ డైరెక్టర్‌గా టి.మదుసూధన్, ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా వంగూరు మోహన్ రావు, హెచ్ఆర్డీ అండ్ ఐఆర్ డైరెక్టర్‌గా సి.ప్రభాకర్ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించగా.. సీఎండీ వారికి శుభాకాంక్షలు తెలిపారు. సమష్టి కృషితో కంపెనీని అభివృద్ధి పథంలో తీసుకెళ్దామని అన్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు మాట్లాడుతూ.. సీఎండీ వరుణ్ రెడ్డి సారథ్యంలో కంపెనీ అభివృద్ధిలో భాగస్వాములవుతామని, వినియోగదారులకు మరింత మెరుగైన, నాణ్యమైన విద్యుత్ అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన డైరక్టర్లను అసోషియేషన్లు, యూనియన్ల నాయకులు, ఎస్ఈలు, డీఈలు, ఏడీఈలు, ఏఈలు, ఇతర అధికారులు, ఉద్యోగులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. -
ప్రజల గుండెల్లోనే పీవీ..
ఎల్కతుర్తి: అభివృద్ధి లేమి.. అప్పుల ఊబిలో కూనరిల్లుతున్న తరుణంలో అన్నీ తానై ఆర్థిక సంస్కణలు చేపట్టి దేశాన్ని ప్రగతిబాట పట్టించా రు.. నాటి ప్రధాని పీవీ నర్సింహారావు. హనుమకొండ జిల్లా భీమదేవపల్లి మండలంలోని వంగర అనే ఒక చిన్న గ్రామం నుంచి ప్రధాన మంత్రి స్థాయికి ఎదిగిన గొప్ప మేధావి పీవీ నర్సింహారావు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగర గ్రామం ఓ వెలుగు వెలిగింది. ఆ సమయంలోనే గ్రామంలో పలు అభివృద్ధి పనులు జరిగాయి. నేడు దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 104వ జయంతి. భీమదేవరపల్లి మండలం వంగరలో 1921 జూన్ 28న పీవీ జన్మించారు. రాష్ట్ర, కేంద్ర మంత్రి పదవులతోపాటు ముఖ్యమంతి, ప్రధాన మంత్రిగా పదవులకు వన్నెతెచ్చారు. పీవీ ప్రధానిగా ఉన్న సమయంలో వంగరలో ముమ్మరంగా అభివృద్ధి పనులు చేపట్టారు. పోలీస్‌స్టేషన్ మంజూరైంది. రక్షిత తాగునీటి బావి, పీవీ మోడల్ కాలనీ, బాలికల గురుకుల పాఠశాల, 24 గంటలు పనిచేసే ఆస్పత్రి, సబ్‌స్టేషన్ మంజూరయ్యాయి. ఓ వైపు దేశం, మరో వైపు కాంగ్రెస్ పార్టీ దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్న తరుణంలో పీపీ ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న దేశాన్ని తలెత్తుకునేలా చేయడంతోపాటు భారత ఖ్యాతిని దేశ విదేశాల్లో ఇనుమడింపజేసిన ఘనత పీవీదే. కాగా, 2004 డిసెంబర్ 23న పీపీ తుదిశ్వాస విడిచారు. పీవీ మరణానంతరం అయనను సొంతపార్టీ పట్టించుకోలేదనే విమర్శలున్నాయి. పీవీ నర్సింహారావు ఇంటిని మ్యూజియంగా మారుస్తామని హామీ ఇచ్చిన గత ప్రభుత్వం నెరవేర్చలేకపోయింది. పీవీ సొంతగ్రామంలో విగ్రహం ఏర్పాటు చేయకపోవడంతో చివరకు గ్రామస్తులే చందాలు వసూలు చేసుకొని విగ్రహాన్ని ప్రతిష్ఠించడం గమనార్హం. కళ తప్పిన వంగర గ్రామం నేడు పీవీ నర్సింహారావు జయంతి వంగరలో తుదిదశకు చేరుకున్న పీవీ విజ్ఞాన కేంద్రం పనులుతుది దశలో పీవీ విజ్ఞాన కేంద్రం పనులు వంగర గ్రామాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని రెండేళ్ల క్రితమే ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ రూ.11 కోట్లు మంజూరు చేసి పనులను ప్రారంభించారు. పీవీ విజ్ఞాన వేదిక పార్కు నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. పీవీ విజ్ఞాన వేదికలో ప్రవేశ ద్వారం, ఫుడ్‌కోర్టు, ఫొటో గ్యాలరీ, పీవీ జీవిత విశేషాలకు సంబంధించిన చిత్రాలు ఉండేలా రూపకల్పన చేశారు. దీంతోపాటు ధ్యాన మందిరం, సైన్స్ మ్యూజియం, అంపీ థియేటర్, వాటర్ ఫౌంటేషన్, చారిత్రక శిల్పాలు, పార్క్‌కు ప్రతిపాదనలు సిద్ధం చేసి పనులు ప్రారంభించారు. పీవీ శతజయంతి ఉత్సవాల సందర్భంగా ప్రారంభించాలని గత ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కానీ, అప్పటి నాయకులు పట్టించుకోకపోవడంతో పనులు నత్తనడకన కొనసాగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మంత్రి పొన్నం ప్రభాకర్.. పీవీ విజ్ఞాన కేంద్రం నిర్మాణం పనులను వేగవంతం చేశారు. దీంతో నిర్మాణ పనులు తుదిదశకు చేరుకున్నాయి.నెరవేరని హామీలు.. హనుమకొండ– సిద్ధిపేట రహదారిలో వంగర క్రాస్ నుంచి గ్రామంలోకి వెళ్లే దారిలో స్వాగత తోరణం, పీవీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతోపాటు నాలుగు లైన్ల రహదారి నిర్మించి, సెంట్రల్ లైటింగ్ తీర్చిదిద్ధేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. కానీ, నేటికీ పూర్తి కాలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వీటిపై దృష్టి సారించి వంగరలో అభివృద్ధి పనుల వేగం పెంచాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
హక్కుల పరిరక్షణలో ఓంకార్ పాత్ర ఎనలేనిది
● మోదీ పాలన దేశానికే ప్రమాదకరం ● రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలువరంగల్ చౌరస్తా: పౌర హక్కులు.. రాజ్యాంగ పరిరక్షణ కోసం మాజీ ఎమ్మెల్యే ఓంకార్ చేసిన ఉద్యమాలు, త్యాగాలు ఎనలేనివని పలువురు వక్తలు తెలిపారు. వరంగల్ అండర్ బ్రిడ్జికి సమీపంలోని ఎంసీపీఐ(యూ) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం మద్దికాయల ఓంకార్ శతజయంతి వార్షికోత్సవాల్లో భాగంగా పౌర హక్కుల పరిరక్షణలో ఆయన పాత్ర అంశంపై రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పెదారపు రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశానికి సీపీఐ జిల్లా కార్యదర్శి మేకల రవి, సీపీఎం జిల్లా నాయకురాలు నలిగంటి రత్నమాల, న్యూ డెమోక్రసీ గ్రేటర్ కార్యదర్శి రాచర్ల బాలరాజు, నాయకులు నున్నా అప్పరావు, లిబరేషన్ జిల్లా కార్యదర్శి అక్కనపెల్లి యాదగిరి, రైతు సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, ప్రజా సంఘాల నాయకులు సోమ రామమూర్తి, కేడల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి, ఈడీ, సీబీఐ లాంటి సంస్థలను ఉపయోగించి ప్రతిపక్ష పార్టీ నాయకులను అక్రమంగా జైలులో పెడుతుందని ఆరోపించారు. బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారన్నాని అన్నారు. అడవిలోని ఆదివాసీలను కాల్చి చంపుతూ.. అటవీ సంపద కార్పొరేట్ పెట్టుబడిదారులకు దోచిపెట్టేందుకు అనేక కుట్రలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో నాయకులు నర్ర ప్రతాప్, కుసుంబ బాబురావు, జగదీశ్వర్, నలిగంటి చంద్రమౌళి, రాజన్న, అనిత, ఇస్మాయిల్ పాల్గొన్నారు. -
వారాహి అవతారంలో పద్మాక్షీదేవి
హన్మకొండ అర్బన్: ఆషాఢమాసం శాకంబరీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు (శుక్రవారం) నగరంలోని పద్మాక్షి కాలనీలోని శ్రీ హనుమద్గిరి పద్మాక్షిదేవి వారాహి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అర్చకులు నాగిళ్ల షణ్ముఖ పద్మనాభ అవధాని, నాగిళ్ల శంకర్‌శర్మ ఉదయం అమ్మవారికి పూర్ణాభిషేకం నిర్వహించి వారాహి మాతగా అలంకరించారు. మంత్రపుష్పం నామ సంకీర్తన నిర్వహించారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహించే శాకంబరీ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పద్మాక్షి దేవిని దర్శించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ట్రస్ట్ సభ్యులు సదానందం, రాజ్‌కుమార్, భక్తులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి సమన్వయంతో పనిచేయాలి
కేయూ క్యాంపస్: జూలై 7న నిర్వహించనున్న కాకతీయ యూనివర్సిటీ 23వ స్నాతకోత్సవం నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలని కేయూ వీసీ ఆచార్య ప్రతాప్‌రెడ్డి ఆయా కమిటీల కన్వీనర్లు, మెంబర్లను కోరారు. ఇప్పటికే స్నాతకోత్సవం నిర్వహణకు ఐదుగురు ప్రొఫెసర్లతో కూడిన స్టీరింగ్ కమిటీ, 10 సబ్ కమిటీలను కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం నియమించారు. అన్ని కమిటీల కన్వీనర్లతో శుక్రవారం క్యాంపస్‌లోని అకాడమిక్ కమిటీ హాల్లో వీసీ ప్రతాప్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్నాతకోత్సవానికి గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ, హైదరాబాద్‌లోని ఐఐసీటీ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరవుతారని తెలిపారు. స్నాతకోత్సవం స్టీరింగ్ కమిటీ మెంబర్ కన్వీనర్ ఆచార్య రాజేందర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 331 మంది విద్యార్థులు పీహెచ్డీ పట్టాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. 374 మంది విద్యార్థులకు 564 బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్నాతకోత్సవ నిర్వహణకు సంబంధించిన విషయాలను ఆయన వివరించారు. సమావేశంలో రిజిస్ట్రార్ ఆచార్య రామచంద్రం, స్ట్టీరింగ్ కమిటీ చైర్మన్ ఆచార్య మల్లారెడ్డి, యూనివర్సిటీ కాలేజీ ప్రొఫెసర్ మనోహర్, ప్రొఫెసర్ వెంకట్రామ్రెడ్డి, ప్రొఫెసర్ మల్లికార్జున్‌రెడ్డి, అమరవేణి, ప్రొఫెసర్ నర్సింహారెడ్డి, ప్రొఫెసర్ శ్రీలత, ప్రొఫెసర్ షమిత, ప్రొఫెసర్వై వెంకయ్య, ప్రొఫెసర్ మామిడాల ఇస్తారి, డాక్టర్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి -
పెద్దపల్లి రైల్వే వంతెన ఘటనతో రైళ్లకు అంతరాయం
కాజీపేట రూరల్: పెద్దపల్లి రైల్వే వంతెన (ఆర్వోబీ) ఘటనతో శుక్రవారం పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనతో కాజీపేట జంక్షన్ మీదుగా సికింద్రాబాద్–బల్లార్షా రూట్లో ప్రయాణించే పలు రైళ్లకు గంటల తరబడి ఆలస్యం తలెత్తింది. బల్లార్షా–సికింద్రాబాద్ వెళ్లే భాగ్యనగర్, సికింద్రాబాద్– సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే ఇంటర్సిటీ, సికింద్రాబాద్– దానాపూర్ వెళ్లే ధానాపూర్ ఎక్స్‌ప్రెస్ నిర్ణీత సమయం కన్నా గంటల తరబడి ఆలస్యంగా చేరుకున్నాయి. దానాపూర్ను ఘన్పూర్ స్టేషన్లో నిలిపివేయడంతో కాజీపేటకు గంట ఆలస్యంగా చేరుకుంది. అదేవిధంగా న్యూడిల్లీ– హైదరాబాద్ వెళ్లే తెలంగాణ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ 3 గంటలు, కాగజ్‌నగర్– సికింద్రాబాద్ వెళ్లే ఇంటర్సిటీ 2 గంటలు, కాగజ్‌నగర్– సికింద్రాబాద్ వెళ్లే కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్ 2:30 గంటలు రీ షెడ్యూల్ చేసినట్లు, భద్రాలచంరోడ్–సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్లే సింగరేణి ప్యాసింజర్‌ను వరంగల్ వరకే అప్ అండ్ డౌన్ రూట్లో నడిపించినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రైళ్ల ఆలస్యం, రీ షెడ్యూల్‌తో వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. కాజీపేట రైల్వే స్టేషన్ మేనేజర్ అగ్గి రవీందర్, కాజీపేట రైల్వే చీఫ్ టికెట్ ఇన్స్పెక్టర్ జనరల్ విజయ్‌కుమార్, కాజీపేట రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ అరుణ్ ప్రయాణికులకు రైళ్ల రాకపోకలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పించారు. ఉప్పల్‌లో ఐదు గంటలు నిలిచిన ఇంటర్సిటీ.. కమలాపూర్: హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని ఉప్పల్ రైల్వే స్టేషన్లో శుక్రవారం సుమారు ఐదు గంటలపాటు నిలిచిపోయింది. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్తున్న ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ఉప్పల్‌కు సుమారు 8–30 గంటలకు చేరుకుందని తెలిపారు. గంట, రెండు, మూడు, నాలుగు గంటలు గడిచినా రైలు ముందుకు కదలకపోవడంతో రైల్వే అధికారులను అడిగితే పెద్దపల్లి వద్ద ఆర్వోబీ పనులు జరుగుతున్నాయని, ఈ క్రమంలో గడ్డర్లు అమరుస్తున్న క్రమంలో ఓ గడ్డర్‌కు సంబంధించిన వస్తువు కిందకు జారిందని, దీంతో ఎలాంటి ప్రమాదం జరుగకుండా ముందు జాగ్రత్త చర్యగా ఎక్కడి రైళ్లను అక్కడే నిలిపి వేశారని చెప్పినట్లు తెలిపారు. చివరికి మధ్యాహ్నం 1–30 ప్రాంతంలో ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్ రైలు ముందుకు కదిలింది. తెలంగాణ రీ షెడ్యూల్, సింగరేణి వరంగల్ వరకే ఇబ్బంది పడ్డ ప్రయాణికులు -
ఆషాఢం వేడుకల వేళ..
హన్మకొండ కల్చరల్: ఆషాఢం వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొలకరి వానలు పలకరించాయి. ఫలితంగా పంటల సాగుతో పాటే గ్రామ దేవతల (బోనాలు)కు పూజలు మొదలు కానున్నాయి. ఆషాఢ మాసం గురువారం ప్రారంభమైంది. ఇదే సమయంలో గ్రామాల్లో అమ్మవారిని కొలిచేందుకు ప్రజలు సన్నద్ధమవుతున్నారు. మహిళలు కలిసికట్టుగా బయలుదేరి మొక్కులు చెల్లించనున్నారు. కాగా, ఉమ్మడి వరంగల్ జిల్లాలో తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసంలో ప్రతీరోజు గ్రామ దేవతలను భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. కొందరికి గ్రామదేవతలకు బోనాలు సమర్పించే సంప్రదాయం కూడా ఉంది. ఇలవేల్పులైన అమ్మవార్లకు మొక్కులు చెల్లిస్తారు. ఆలయాల్లో ఉత్సవాలు.. ఆషాఢ మాస శుద్ధ ఏకాదశి రోజున విష్ణువు యోగా నిద్రలోకి వెళ్లిన రోజుగా భావిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇదే సమయంలో పూరి జగన్నాథ రథయాత్ర, గురుపౌర్ణమిని వ్యాస పౌర్ణమిగా వేడుకగా జరుపుకోనున్నారు. అలాగే, వరంగల్ జిల్లాలో శ్రీభద్రకాళి అమ్మవారికి శాకంబరీ ఉత్సవాలు నిర్వహించడం ప్రత్యేకం. గోరంటాకు మురిపెం.. ఆరోగ్యదాయకం వర్షకాలం ప్రారంభమై బావులు, వాగులు, చెరువుల్లోకి కొత్త నీరొస్తుంది. ఇది చర్మవ్యాధులు వ్యాప్తి చెందే కాలం. వీటి బారి నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకునేందుకు గోరింటాకు ఔషధంగా పని చేస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ మాసంలో మహిళలు గో రింటాకును (మెహందీ) అలంకరించుకోవడం సంప్రదాయంగా వస్తోంది. ఆయుర్వేద వైద్య నిపుణులు గోరింటాకు చర్మ వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుందని, శరీరంలో వేడి తగ్గిస్తుందని పేర్కొంటున్నారు. వనభోజనాల సందడి.. ఆషాఢ మాసంలో వనభోజనాలు ప్రత్యేక ఆకర్షణగా చెప్పవచ్చు. ప్రధానంగా గ్రామాల్లోని వర్షాలు సమృద్ధిగా కురిసి, పాడి పంటలు వెల్లివిరియాలని కోరుకుంటారు. గ్రామదేవతలకు పూజలు నిర్వహించి ప్రకృతి ఒడిలో పచ్చని పంట పొలాల మధ్య చెట్ల కింద సామూహిక వనభోజన సంబురాలు జరుపుకుంటారు. పట్టణ ప్రాంతాల్లో సైతం ఈ సంప్రదాయం కొనసాగుతోంది. భక్తిశ్రద్ధలతో గ్రామ దేవతలకు పూజలు అమ్మవార్లకు మొక్కుల చెల్లింపులకు సిద్ధం తొలిఏకాదశి నాడు బీరన్న బోనాలు ప్రత్యేకం గురువారం ప్రారంభమైన మాసంఆరోగ్యం.. ఆనందం హిందూ సనాతన ధర్మంలో ఆరోగ్యం, ఆనందం కోసం కొన్ని పద్ధతులు అనాదిగా వస్తున్నాయి. ఇందులో కుంకుమ, తిలకం అద్దుకోవడం, విభూదిధారణ, గంధ ధారణ, కాటుక, గోరింటాకు పెట్టుకోవడం లాంటి పద్ధతులు ఉన్నాయి. ఆయుర్వేదం ప్రకారం గోరింటాకు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఉన్న వేడి తగ్గి ఆరోగ్యంగా ఉంటామని, అలాగే శరీరం కళకళలాడుతుందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వేయిస్తంభాల దేవాలయం ప్రధానార్చకుడు గంగు ఉపేంద్ర శర్మ తెలిపారు.గోరింటాకు వేడుకలు హసన్‌పర్తి: ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు వేడుకలను మహిళలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నగరంలోని 55వ డి విజన్ సత్యసాయి కాలనీలో అతివలు అరచేతిలో గోరింటాకు పెట్టుకుని మురిసిపోయారు. కార్యక్రమంలో తుమ్మ వనమాల, ఎర్రబెల్లి సుజాత, చెరుకు కృష్ణవేణి, చిట్టిరెడ్డి మంగ పూల్లూరి సరోజన, లావణ్య, చింత జ్యోతి, తుమ్మ ప్రియాంక, తుమ్మ పద్మ నిహాసి పాల్గొన్నారు. -
టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు
హన్మకొండ: టీజీ ఎన్పీడీసీఎల్లో బదిలీలు, సర్దుబాట్లు జరిగాయి. ఈ మేరకు చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఫైనాన్స్ సీజీఎం వంటేరు తిరుపతి రెడ్డి డైరెక్టర్‌గా నియామకం కావడంతో ఖాళీ అయిన స్థానంలో సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్‌గా కొనసాగుతున్న ఆర్.చరణ్‌దాస్‌ను పూర్తి స్థాయి అదనపు బాధ్యతలతో నియమించారు. సిరిసిల్ల సెస్‌కు ఫారిన్ డిప్యుటేషన్‌పై వెళ్లిన పి.విజేందర్ రెడ్డి అక్కడి నుంచి సెలవుపై వెళ్లి తిరిగి ఎన్పీడీసీఎల్లో విధుల్లో చేరాడు. ప్రస్తుతం ఆయనను మహబూబాబాద్ ఎస్ఈగా నియమించారు. సూపరింటెండెంట్ ఇంజనీర్ బి.సుదర్శన్‌ను నిర్మల్ నుంచి జగిత్యాలకు బదిలీ చేశారు. ఎస్ఈ వి.గంగాధర్‌ను మంచిర్యాల నుంచి పెద్దపల్లికి, జీఎం వి.వేణుమాదవ్‌ను కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్ట్సు నుంచి జీఎం ప్లానింగ్‌కు బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీస్‌లో ఆపరేషన్ జనరల్ మేనేజర్‌గా కొనసాగుతున్న ఉత్తమ్.. మంచిర్యాల ఎస్ఈగా, జగిత్యాల ఎస్ఈ సాలియా నిర్మల్ ఎస్ఈగా బదిలీ అయ్యారు. తొర్రూరు డీఈ జి.మదుసూధన్‌ను మెట్‌పల్లికి, కార్పొరేటర్ ఆఫీస్ డీఈ జి.ఎల్.మర్రెడ్డిని అదే ఆఫీస్‌లో ప్రాజెక్టు విభాగానికి, డీఈ మహా బూబాద్ బి.పెద్దిరాజంను వరంగల్ డీపీఈ డీఈగా, పెద్దపల్లి ఎస్ఈ కార్యాలయంలో డీఈ టెక్నికల్‌ను తొర్రూరు డీఈగా, కార్పొరేట్ ఆఫీ స్లో ప్రాజెక్టు డీఈ డి.నందరాథోడ్ను ప్రాజెక్టు నుంచి ఇంజనీరింగ్ డీఈగా బదిలీ చేశారు. కాపులకనపర్తి ఏడీఈ నరసింహారావును కార్పొరేట్ ఆఫీస్ ప్రాజెక్టు విభాగానికి, ఏడీఈ బి.రవిని ప్రాజెక్టు నుంచి కాపుల కనపర్తికి, ఏడీఈ బి.శ్రీనివాస్ యాదవ్‌ను భూపాలపల్లి క్వాలిటీ కంట్రోల్ నుంచి కార్పొరేట్ ఆఫీస్‌కు, ఏడీఈ కె.పవన్ కుమార్‌ను కార్పొరేట్ ఆఫీస్ నుంచి హెచ్‌టీ మీటర్స్ వరంగల్ సర్కిల్‌కు బదిలీ జరిగింది. అకౌంట్స్ జనరల్ మేనేజర్ ఎన్.దేవేందర్‌కు సీజీఆర్ఎఫ్ వరంగల్ ఫైనాన్స్ మెంబర్‌గా స్థానం చలనం కలిగింది. రెవెన్యూ జీఎం ఆర్.కృష్ణ మోహన్‌ను ఫైనాన్స్ జీఎంగా, ఆడిట్ జీఎం ఎస్.సత్యనారాయణను రెవెన్యూ జీఎంగా, ఫైనాన్స్ జీఎం వి.వేణు బాబును ఆడిట్ జీఎంగా బదిలీ చేశారు. కూరగాయల విత్తనాల పంపిణీ మామునూరు: ఖిలావరంగల్ మండలం మా మునూరు కృషి విజ్ఞాన కేంద్రంలో షెడ్యూల్ కులాల ఉప ప్రణాళిక (ఎస్సీఎస్పీ) పథకాల ఆధ్వర్యంలో శుక్రవారం వర్ధన్నపేట మండలం అంబేడ్కర్ నగర్‌కు చెందిన 35 మంది మహిహిళా రైతులకు కూరగాయల విత్తనాలను ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృషి విజ్ఞానకేంద్రం కోఆర్డినేటర్ రాజన్న హాజరై మాట్లాడారు. చిన్నపాటి వ్యవసాయ పనిముట్లు మహిళలకు కలిగే శ్రమను తగ్గించి పొలాల్లో కలుపు నివారణ పనులు సు లభతరం చేస్తాయని తెలిపారు. కూరగాయల విత్తన కిట్లను ఇంటి ప్రాంగణంలో లేదా కంచె ల వెంట నాటడం ద్వారా ఆహార భద్రత మె రుగు పడి గ్రామీణ మహిళల జీవనోపాధి స్థిరత్వానికి తోడ్పడుతుందని వివరించారు. శాస్త్రవేత్త డాక్టర్ సా యి కిరణ్, డాక్టర్ గణేష్, రైతులు పాల్గొన్నారు. -
కపాలినీ, భగమాలినీ క్రమాలలో భద్రకాళి
హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శుక్రవారం అమ్మవారికి కపాలినీ, భగమాలినీ క్రమాలలో పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు ఉదయం 4 గంటల నుంచి సుప్రభాతసేవ, నిత్యాహ్నికం, క్షీరాన్న నివేదన, చతుఃస్థానార్చన తదితర పూజలు నిర్వహించారు. దశ మహావిద్యల్లోని కాళీక్రమాన్ని అనుసరించి స్నపనభేరాన్ని కపాలినిగా, షోఢశీక్రమాన్ని అనుసరించి భోగబేరాన్ని భగమాలినిగా అలంకరించి నవరాత్ర విశేష పూజలు జరిపారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి దేవాలయాన్ని సందర్శించి అమ్మవారికి పూజలు జరుపుకున్నారు. సినీ నటులు కొణిదెల నాగబాబు సతీమణి పద్మజ అమ్మవారిని దర్శించుకున్నారు. పూజల్లో ఆలయ చైర్మన్ డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, ధర్మకర్తలు పాల్గొన్నారు. ఆలయ ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు. -
ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌పై దృష్టి పెట్టండి
వరంగల్ క్రైం: ఆర్గనైజ్డ్ క్రైమ్స్‌కు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలవద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ టాస్క్‌ఫోర్స్ అధికారులను ఆదేశించారు. సీపీ శుక్రవారం టాస్క్‌ఫోర్స్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈసందర్భంగా టాస్క్ ఫోర్స్‌లో పని చేస్తున్న అధికారులు, సిబ్బందిని విధులు, బాధ్యతలపై ఆరా తీశారు. చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడే వ్యక్తుల వివరాలు సేకరించేందుకు బలమైన ఇన్ఫార్మర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నమ్మకం కలిగేలా పనిచేయాలని సూచించారు. ఈసందర్భంగా టాస్క్‌ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ సీపీకి పూలమొక్క అందించి స్వాగతం పలికారు. -
ఇంకా పునాదుల్లో నే!
సాక్షి, వరంగల్: ప్రయాణికులకు సకల సౌకర్యాలు, ఆధునిక హంగులతో చేపట్టిన వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు నిదానంగా సాగుతున్నాయి. 25 ఏళ్ల క్రితం నాటి ఆర్సీసీ ఫ్రేమ్డ్ స్ట్రక్చర్‌తో నిర్మించిన వరంగల్ పాత బస్టాండ్‌ను కూల్చివేసి.. ఆ స్థానంలో నాలుగు నెలల క్రితం మొదలు పెట్టిన నిర్మాణ పనులు ఇంకా ఫుటింగ్ దశలోనే ఉన్నాయి. భారీ ఎత్తున కాంక్రీట్ వినియోగించి, రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో పునాదులు తవ్వి నిర్మిస్తున్నారు. మట్టిని చదును చేసి పునాది కోసం కాంక్రీట్ వేయడానికి ముందు బ్లైండింగ్ కాంక్రీట్ పొర వేస్తున్నారు. కాంక్రీట్ వేసిన తర్వాత, రాడ్లు అమర్చి కావాల్సిన మందంతో స్లాబ్ నిర్మించనున్నారు. ఇలా రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్లు నిర్మించేందుకు రెండేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశం ఉంది. సాధ్యమైనంత తొందరగా కాంట్రాక్ట్ కాలపరిమితి 18 నెలల్లోనే పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నామని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) అధికారులు పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సంబంధిత కాంట్రాక్టర్‌తో మాట్లాడుతూ పనులను వేగవంతం చేస్తామంటున్నారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పనులు ఆలస్యమయ్యేలా కనిపిస్తున్నాయి. నీటి ఊటతో ఇబ్బంది కలుగకుండా ఉండేందుకు ఫుటింగ్ పనుల్లో వేగిరం పెంచారు. ఇవన్నీ పరిశీలిస్తే బస్టాండ్ నిర్మాణానికి చాలా సమయం పట్టే అవకాశం ఉందని ప్రయాణికులు అంటున్నారు. మరో రూ.50 కోట్లు అవసరం.. అన్ని జిల్లాలు, రాష్ట్రాల బస్సులతోపాటు సిటీ బస్సులు ప్రయాణికులను ఎక్కించుకునేలా గ్రౌండ్ ఫ్లోర్లో 32 ప్లాట్‌ఫాంలు నిర్మించనున్నారు. మరో ఐదు అంతస్తుల్లో వ్యాపార, వినోదం తదితర వసతులు ఉండేలా కాంప్లెక్స్‌లు అందుబాటులోకి తేనున్నారు. సెల్లార్లో పార్కింగ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాగే, వరంగల్ రైల్వే స్టేషన్, నియోకు అనుసంధానంగా వరంగల్ బస్టాండ్ ఉండేలా.. అండర్ వాక్ లేదంటే స్కైవాక్ నిర్మించేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ కోసం కేటాయించిన రూ.75 కోట్లతోపాటు మరో రూ.50 కోట్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతమున్న నిధులతో రెండు సెల్లార్లు, గ్రౌండ్ ఫ్లోర్ పనులు పూర్తి చేసి బస్సు సర్వీసులు నడిచేలా చూడనున్నారు. ఇది ఏడాదిన్నరలో పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొస్తామంటున్నారు. ఆతర్వాత వచ్చే నిధులతోనే పైఅంతస్తులు నిర్మించే అవకాశముందని తెలుస్తోంది. ఇలా పూర్తిస్థాయిలో వరంగల్ బస్టాండ్ అందుబాటులోకి రావాలంటే మూడేళ్లకుపైగా సమయం తీసుకునే అవకాశముంది. ‘ఈ బస్టాండ్ నిర్మాణ పనులు పునాది దశల్లో ఆలస్యం అవుతాయి. రెండు సెల్లార్లు, గ్రౌండ్‌ఫ్లోర్ వరకు నిర్మాణ పనులు నిర్ణీత కాలపరిమితి 18 నెలల్లో పూర్తయ్యేలా చూస్తాం. ఇప్పటికే నాలుగు నెలలు అయ్యింది. కాంట్రాక్టర్‌కు మార్గదర్శనం చేస్తూ సాధ్యమైనంత తొందరగా ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చేలా చూస్తాం’ అని ‘కుడా’ అధికారి ఒకరు తెలిపారు. ప్రయాణికులకు తిప్పలే.. వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు జరుగుతుండడంతో ప్రయాణికుల సౌకర్యార్థం సమీపంలో తాత్కాలిక బస్టాండ్‌ను ఏర్పాటు చేసి సేవలను అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వర్షం పడితే అక్కడ కూడా నీరు నిలిచే అవకాశం ఉంది. దీంతో ఈ వర్షాకాలంలో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పేలా లేవు. భారీ వర్షం కురిస్తే తడుస్తారు. ఇలా కాలం ఏదైనా వరంగల్ ఆధునిక బస్టాండ్ అందుబాటులోకి వచ్చేంత వరకు ప్రయాణికులతోపాటు ఆర్టీసీ సిబ్బందికి కూడా ఇబ్బందులు తప్పేలా లేవు. నిదానంగా వరంగల్ బస్టాండ్ నిర్మాణ పనులు రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిలో నిర్మాణం గుంతల్లో నీటిఊట రాకుండా ఫుటింగ్ వర్క్ 18 నెలల్లో పూర్తిచేస్తామంటున్న ‘కుడా’ అధికారులు అప్పటివరకు తాత్కాలిక బస్టాండ్‌లోనే సేవలు -
మహిళా డెయిరీ ఏర్పాటుకు సత్వర చర్యలు
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు కావాల్సిన చర్యలు సత్వరమే చేపట్టాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అధికారులకు సూచించారు. హనుమకొండ కలెక్టరేట్లో శుక్రవారం డెయిరీ ఏర్పాటుకు సంబంధించిన వివిధ అంశాలపై హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, డాక్టర్ సత్య శారద, అధికారులతో ఎమ్మెల్యే ప్రకాశ్‌రెడ్డి సమీక్షించారు. ఈసందర్భంగా పరకాల మహిళా డెయిరీ భవన నిర్మాణం, పాల సేకరణ, డెయిరీ ద్వారా పాల సరఫరా, మౌలిక వసతుల కల్పనకు తీసుకోవాల్సిన చర్యలు గురించి ఎమ్మెల్యే, కలెక్టర్లు, ఆయా శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. మిల్క్ సెంటర్ల ఏర్పాటు, రవాణా, సొసైటీ ఏర్పాటు, మార్కెటింగ్, చెల్లింపులు, తదితర అంశాలపై అధికారులు ప్రణాళిక రూపొందించాలన్నారు. సమావేశంలో హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ జిల్లాల డీఆర్డీఓలు మేన శ్రీను, కౌసల్య దేవి, సహకార అధికారులు సంజీవరెడ్డి, లీడ్ బ్యాంకు డిస్ట్రిక్ట్ మేనేజర్ శ్రీనివాస్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వివస్త్రను చేసి.. జననాంగంలో జీడిపోసి..
వరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధి ధర్మసాగర్ మండలం తాటికాయల గ్రామంలో ఐదు రోజుల క్రితం ఓ అమానవీయ ఘటన జరిగింది. ఓ వివాహితను వివస్త్ర చేసి జననాంగంలో జీడిపోసి విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడికి వివాహేతర సంబంధం కారణం కాగా, బాధిత మహిళ ఆచూకీ ఇప్పటివరకు బంధువులకు లభించలేదని సమాచారం. ఈఘటనకు సంబంధించి ‘సాక్షి’కి అందిన ఎక్స్‌క్లూజివ్ సమాచారం మేరకు.. తాటికాయల గ్రామానికి చెందిన ఓ యువతిని పదేళ్ల క్రితం ములుగు మండలం బోలోనిపల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. వీరికి ముగ్గురు పిల్లలు. అతడికి సమీప బంధువైన ఓ వివాహితతో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ మహిళతో కలిసి సుమారు పది రోజుల క్రితం ఎటో వెళ్లిపోయారు. దీంతో సదరు వ్యక్తి భార్య తనకు జరిగిన అన్యాయాన్ని స్వగ్రామమైన తాటికాయలకు వచ్చి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు కోపంతో రగిలిపోయి లేచిపోయిన ఆ ఇద్దరిని వెతికి ఐదు రోజుల క్రితం తాటికాయల గ్రామానికి తీసుకొచ్చి విచక్షణారహితంగా దాడి చేశారు. ఇద్దరికి గుండు గీయించారు. ఆ మహిళను ఓ మంచానికి కట్టేసి వివస్త్రను చేసి.. జననాంగంపై జీడీ (పూర్వకాలంలో నొప్పి తగ్గించేందుకు వాడేవారు, అదేవిధంగా శరీరంలోని సున్నిత అవయవాలపై పోస్తే పుండ్లు అవుతాయి) పోశారు. ‘తప్పు చేశాను.. క్షమించండి’ అని బాధిత మహిళ వేడుకున్నా.. పలువురు ఇష్టారీతిన దాడి చేశారు. యోనిలోంచి తీవ్ర రక్తస్రావమవుతున్నా వదల్లేదు. తర్వాత ఆఇద్దరిని ఏం చేశారో ఆచూకీ తెలియలేదు. ఈ అమానవీయ ఘటన జరిగి ఐదు రోజులు గడుస్తున్నా పోలీసులకు సమాచారం అందలేదని తెలిసింది. అసలు ఆ ఇద్దరు ప్రాణాలతో ఉన్నారో, లేదో తెలియని పరిస్థితి. వివాహితపై దాడి వివాహేతర సంబంధం పెట్టుకుందన్న కారణంతోనే.. ఘటన జరిగి ఐదు రోజులు తాటికాయల గ్రామంలో అమానవీయం -
టెన్త్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల
హనుమకొండ జిల్లాలో 89.95%, వరంగల్ జిల్లాలో 60.73% ఉత్తీర్ణత విద్యారణ్యపురి: ఈనెల 3 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించిన టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల్ని శుక్రవారం విడుదల చేశారు. హనుమకొండ జిల్లాలో 463 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 416 మంది 89.85 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ డి.వాసంతి తెలిపారు. బాలురు 277 మందికి 249 మంది, బాలికలకు 186 మందికి 167 మంది ఉతీర్ణులైనట్లు పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలో 60.73 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు డీఈఓ మామిడి జ్ఞానేశ్వర్ తెలిపారు. వర్సిటీ అధికారుల నిర్లక్ష్యంపై లోకాయుక్తలో ఫిర్యాదుఎంజీఎం: వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు హెల్త్ యూనివర్సిటీ అధికారుల నిర్లక్ష్యం, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలకు మేలు చేయాలనే ఒప్పందం, నష్టపోయిన అర్హులైన 400 మెడికల్ విద్యార్థులకు న్యాయం జరగాలని, అవినీతి అధికారులపై విచారణ చేపట్టాలని కోరుతూ వినియోగదారుల మండలి రాష్ట్ర కమిటీ లోకాయుక్తలో ఫిర్యాదు చేసింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు తప్పనిసరి. అయితే తెలంగాణ ప్రభుత్వ అనుమతి లేకున్నా.. 400 ఎంబీబీఎస్ సీట్లు ఉన్న రెండు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు డీమ్డ్ యూనివర్సిటీలుగా మారడం, ఈక్రమంలో గతేడాది అర్హులైన 400 మెడికల్ సీట్లు రాష్ట్ర ప్రభుత్వ పరిధి నుంచి దాటిపోవడంపై జరిగిన అవినీతిపై విచారణ కోసం లోకాయుక్తలో ఫిర్యాదు దాఖలు చేసినట్లు వినియోగదారుల మండలి ప్రతినిధులు సాంబరాజు చక్రపాణి, మొగిలిచర్ల సుదర్శన్ తెలిపారు. మధ్యవర్తిత్వ ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్‌గా వాణివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా కోర్టులో మధ్యవర్తిత్వ కేసుల ప్రత్యేక గవర్నమెంట్ ప్లీడర్ (స్పెషల్ జీపీ)గా న్యాయవాది పోలసాని వాణిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ శాసన – న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. నియామకం మూడేళ్ల వరకు వర్తిస్తుందని, నెలకు రూ.60 వేల గౌరవ వేతనం చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగెం మండలం గవిచర్ల గ్రామానికి చెందిన పోలసాని వాణి 18 సంవత్సరాల నుంచి న్యాయవాదిగా పనిచేస్తున్నారు. ఆమె జీవిత భాగస్వామి శ్రీనివాసరెడ్డి కూడా న్యాయవాదే. ఈసందర్భంగా వాణి మాట్లాడుతూ.. తన నియామకానికి సహకరించిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ‘పద్మ’ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంవరంగల్ స్పోర్ట్స్: గణతంత్ర (జనవరి 26) దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం ఏటా అందించే పద్మ అవార్డుల కోసం అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారు, అందుకు సంబంధించిన పత్రికల్లో ప్రచురితమైన ఫొటోలు, నాలుగు సెట్లను రూపొందించి జూలై 25లోగా హనుమకొండలోని ప్రభుత్వ కాకతీయ డిగ్రీ కళాశాల ఎదురుగా ఉన్న యువజన, క్రీడల కార్యాలయంలో అందజేయాలని కోరారు. అంతేకాకుండా www:https://padmaawards.gov.inలో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. నిర్ణీత గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులను తిరస్కరించనున్నట్లు పేర్కొన్నారు. బాలల సంరక్షణే లక్ష్యంకాజీపేట అర్బన్: బాలల రక్షణే లక్ష్యంగా బాలల సంరక్షణ కేంద్రాలు పని చేయాలని అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి తెలిపారు. హనుమకొండలోని ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హనుమకొండలోని ప్రభుత్వ బాలసదనం, ఫాతిమానగర్‌లోని డివైన్ మెర్సీ, స్పందన మానసిక దివ్యాంగుల కేంద్రాలను శుక్రవారం అడిషనల్ కలెక్టర్ వెంకట్‌రెడ్డి ఇన్స్పెక్షన్ కమిటీ సభ్యులతో కలిసి తనిఖీ చేశారు. నిబంధనలకు అనుగుణంగా ప్రమాణాలు పాటించాలని, భవనాలకు ఫిట్నెస్ కలిగి ఉండాలని, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని సంస్థల నిర్వాహకులకు సూచించారు. కార్యక్రమంలో సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అన్నమనేని అనిల్‌చందర్‌రావు, సభ్యుడు సందసాని రాజేంద్రప్రసాద్, ఇన్చార్జ్ డీసీపీఓ ప్రవీణ్‌కుమార్, ప్రొటెక్షన్ ఆఫీసర్ మౌనిక తదితరులు పాల్గొన్నారు. -
వన మహోత్సవానికి సన్నద్ధం కావాలి
ఉద్యాన విభాగాధికారులతో మేయర్ సమీక్ష వరంగల్ అర్బన్: నగర పరిధిలో నిర్వహించే వన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సన్నద్ధం కావాలని మేయర్ సుధారాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో ఉద్యాన వన విభాగాధికారులతో వన మహోత్సవంపై సమీక్షించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియా పరిధిలో 12 రకాల మొక్కలు, చామంతి గులాబీ పండ్ల మొక్కలు, హోం స్టేడ్ మొక్కల్ని పెంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుకు కావాల్సిన టెండర్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న 100 రోజుల కార్యక్రమాల అమలులో భాగంగా నియోజకవర్గాల్లో పార్కులను గుర్తించాలన్నారు. బల్దియా పరిధిలోని నియోజకవర్గానికి రెండు ప్రాంతాల్లో విస్తృతంగా మొక్కలు నాటేందుకు గుర్తించాలన్నారు. అదేవిధంగా నాగమయ్య కుంట ప్రాంతాన్ని ఫెన్సింగ్ చేసి వివిధ రకాల మొక్కలతో అలంకారంగా తీర్చిదిద్దాలన్నారు. సమావేశంలో ఉద్యానవన అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
పరిశీలిస్తూ.. ప్రశ్నిస్తూ
ఎంజీఎం : నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎన్ఎంసీ) మెడికల్ కాలేజీల్లో వసతులపై జారీ చేసిన షోకాజ్ నోటీసుల నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పర్యవేక్షణ కమిటీ శుక్రవారం నగరంలోని కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రులను తనిఖీ చేసింది. పర్యవేక్షణ కమిటీ చైర్మన్, రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ.. హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్యశారదతో కలిసి ముందుగా కాకతీయ మెడికల్ కళాశాల(కేఎంసీ)ను సందర్శించారు. బోధన సిబ్బంది, పరికరాల లేమిపై ఆయా విభాగాఽధిపతులతో సమీక్షించారు. కేఎంసీలో హెమటాలజీ విభాగాన్ని, వైద్యవిద్యార్థుల వసతి గృహాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రిన్సిపాల్ రాంకుమార్‌రెడ్డిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మెడికల్ కళాశాలను, ప్రస్తుతం ఉన్న వైద్య అధ్యాపకుల పోస్టుల ఖాళీలు, మౌలిక వసతులపై ప్రభుత్వానికి నివేదించేందుకు పలు అంశాలపై చర్చించారు. పీఎంఎస్ఎస్వై ఆస్పత్రి పరిశీలన.. కేఎంసీ ప్రాంగణంలోని పీఎంఎస్ఎస్వై ఆస్పత్రిని కమిషనర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. డయాలసిస్ యూనిట్‌తోపాటు ఆపరేషన్ థియేటర్, యూ రాలజీ విభాగాన్ని తనిఖీ చేశారు. పలు అంశాలపై ఆయా విభాగాల వైద్యులతో మాట్లాడి సమస్యలు వివరిస్తున్న క్రమంలో వసతుల లేమిపై ప్రభుత్వానికి రాత పూర్వకంగా నివేదించాలని ఆదేశించా రు. పరికరాల మరమ్మతులో అలసత్వం వహిస్తే సహించేది లేదన్నారు. చిన్న చిన్న సమస్యలతో రోగులకు సేవలు నిలిపేయకుండా చూడాలన్నా రు. అనంతరం కేయూ జంక్షన్‌లోని క్షయ ఆస్పత్రిని సందర్శించి రోగులు, ఓపీ సేవల గురించి ఆరా తీశారు. మెడికల్ వ్యర్థాలను ఎక్కడికి తరలిస్తున్నారన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్పై చర్యలకు ఆదేశాలు ఎన్ఎంసీ నిబంధనల ప్రకారం మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఎంజీఎం ఆస్పత్రిని సాయంత్రం కమిషనర్ డాక్టర్ సంగీతసత్యనారాయణ సందర్శించారు. మొదట ఓపీ విభాగాన్ని పరిశీలించి కౌంటర్లు పెంచాలని ఆదేశించారు. ఫార్మసీ విభా గంలో ఈ–ఔషధి నమోదులో వివరాలు చెప్పడంలో విఫలమైన ఫార్మసీ సూపర్వైజర్ను సస్పెండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అనంతరం రోగులకు అందించే భోజనశాల, పిల్లల విభాగా న్ని పరిశీలించి ఆరోగ్య మహిళ పథకం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. అదేవిధంగా సీకేఎం ఆస్పత్రిని సందర్శించి ఆయా వార్డులు, ఓపీ సేవలు, రెఫరల్స్, ఫాలోఅప్ వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్, హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్ఓలు అప్పయ్య, సాంబశివరావు, ఆర్ఈహెచ్ సూపరింటెండెంట్ భరత్, సీకేఎం ఆస్పత్రి వైద్యులు పాల్గొన్నారు. హాజరుశాతంపై చర్యలు తప్పవు.. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం వైద్యుల హాజరుశాతాన్ని ఫేస్ బ యోమెట్రిక్తో చేపట్టాలని కమిషనర్.. వైద్య ఆరోగ్యశాఖాధికారులకు స్పష్టం చేశారు. దీనిపై ఎంజీఎం సూపరింటెండెంట్ స్పందించి అలాంటి హా జరుశాతం ఎంజీఎంలో మొదలు కాలేదని సాంకేతిక కారణాలు చెప్పగా, బయోమెట్రిక్ అటెండెన్స్ తప్పనిసరి అని ఆదేశించారు. భవిష్యత్‌లో వైద్యు ల హాజరుశాతంపై బయోమెట్రిక్ ఆధారంగా చర్యలు ఉంటాయని ఆమె స్పష్టం చేశారు. ఎన్ఎంసీ షోకాజ్ నోటీసులతో ఆస్పత్రులను సందర్శించిన పర్యవేక్షణ కమిటీ కేఎంసీ, ఎంజీఎం, సీకేఎం, జీఎంహెచ్ ఆస్పత్రుల తనిఖీ సమస్యలను రాతపూర్వకంగా ప్రభుత్వానికి పంపించండి.. పర్యవేక్షణ కమిటీ ౖచైర్మన్ డాక్టర్ సంగీత సత్యనారాయణ ఎంజీఎంలో ఫార్మసీ సూపర్వైజర్ సస్పెన్షన్‌కు ఆదేశాలు -
రహదారుల భద్రతపై తనిఖీలు
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్ : రహదారుల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లాలో ప్రతీ 15 రోజులకు ఒకసారి ఆర్అండ్బీ, పోలీస్, జాతీయ రహదారులు, జీడబ్ల్యూఎంసీ అధికారులు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో రహదారుల భద్రత చర్యలపై అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ జాతీయ, రాష్ట్ర రహదారుల్లో రద్దీ, ప్రమాదకర ప్రాంతాలు, క్రిటికల్ జంక్షన్లను గుర్తించి సంబంధింత శాఖల అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కటాక్షపూర్ వద్ద నిర్మాణంలో ఉన్న జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు రేడియంతో కూడిన సైన్ బోర్డులు, ట్యాంకర్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తరచూ ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి ఆ జాబితాను అందజేయాలన్నారు. ప్రమాదాల నివారణకు మూతలు లేని, నిర్మాణ పనులు జరుగుతున్న చోట్ల, మ్యాన్‌హోల్స్ వద్ద ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, ఆర్అండ్బీ ఈఈ సురేశ్ బాబు, నేషనల్ హైవేస్ ఈఈ మనోహర్, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రమేశ్‌రాథోడ్, నారాయణ, అడిషనల్ ఏసీపీ ప్రభాకర్‌రావు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు. -
పట్టు పరిశ్రమకు ప్రభుత్వ ప్రోత్సాహం
హన్మకొండ: పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈక్రమంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి రాయితీని అందిస్తోంది. హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని, 3,19,900 పట్టు గుడ్ల ద్వారా 2,30,328 పట్టు కాయల ద్వారా 38,388 కిలోల పట్టుదారాన్ని ఉత్పత్తి చేయాలని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 81 ఎకరాలను మల్బరీ తోట పెంపకానికి గుర్తించారు. జిల్లాలో 8 మండలాల్లో 51 గ్రామాల్లో 97 మంది పట్టు పరిశ్రమ నిర్వహిస్తున్నారు. రాయితీ వివరాలు.. పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేలు సహాయాన్ని రాయితీ రూపేణా అందిస్తోంది. పట్టు పురుగుల పెంపకానికి గది నిర్మాణానికి రూ.2.25 లక్షలు, స్టాండ్స్, ఇతర పరికరాలకు రూ.37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ.2,500, నీటి పారుదల కోసం రూ.50 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మల్బరీ తోట నాటుట, నిర్వహణకు రూ.41,500, షెడ్డు నిర్మాణానికి 1,03,040 చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78 వేలు, షెడ్ నిర్మాణానికి రూ.2,92,500, రేరింగ్ పరికరాలకు రూ.26,610, రేరింగ్ స్టాండ్స్‌కు 24,140, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారాలకు రూ.3,250, నీటి పారుదల సదుపాయానికి రూ.65వేలు రాయితీగా చెల్లిస్తోంది. రాయితీ అందిస్తున్న కేంద్రం హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు ఈ ఏడాది అదనంగా 175 ఎకరాల్లో సాగు లక్ష్యం -
కేయూ డిగ్రీ సెమిస్టర్ల పరీక్షల ఫలితాలు విడుదల
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలో ఏప్రిల్, మేలో నిర్వహించిన డిగ్రీ బీఏ, బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బి ఒకేషనల్, బీఏ ఎల్ ఐదవ, ఆరవ సెమిస్టర్ పరీక్షల ఫలితాలను గు రువారం క్యాంపస్‌లో వీసీ కె.ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి.రామచంద్రం, పరీక్షల విభాగం అధికారులతో కలిసి విడుదల చేశారు. ఆయా కోర్సుల్లో ఐదవ సెమిస్టర్ పరీక్షల ఫలితాల్లో మొత్తం 13,963 మంది విద్యార్థులకుగాను 7,059 మంది (50.56శాతం) ఉత్తీర్ణులయ్యారని పరీక్షల నియంత్రణాధికారి కె.రాజేందర్ తెలిపారు. ఆరవ సెమిస్టర్ పరీక్షలకు 37,999మంది విద్యార్థులు హాజరుకాగా, 19,060 (50.16శాతం) మంది ఉత్తీర్ణులయ్యారని పేర్కొన్నారు. ఆయా పరీక్షల ఫలితాలను కేయూ వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. కార్యక్రమంలో అదనపు పరీక్షల నియంత్రణాధికారులు తిరుమలాదేవి, వెంకటయ్య, సౌజన్య, పద్మజ, ఆసిం ఆక్బాల్, నాగరాజు, కేయూ అభివృద్ధి అధికారి వాసుదేవరెడ్డి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు , తదితరులు పాల్గొన్నారు. రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.. ఆయా డిగ్రీ కోర్సుల సెమిస్టర్ల విద్యార్థులకు రీవాల్యుయేషన్‌కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. 15 రోజుల సమయం ఉంటుంది. ఆన్లైన్లోనే సంబంధిత వెబ్సైట్ద్వారా దరఖాస్తు చేసుకునే వీలు కల్పించారు. వివరాలు కూడా అందులోనే ఉంటాయి. త్వరలో 2,4 సెమిస్టర్ల వాల్యుయేషన్ ప్రక్రియ.. డిగ్రీ కోర్సుల రెండు, నాలుగు, ఐదవ, ఆరవ సెమిస్టర్ల పరీక్షలు ఒకేసారి జరిగినా తొలుత ఫైనలియర్ విద్యార్థులకు సంబంధించిన ఆరవ సెమిస్టర్ పరీక్షలు, బ్యాక్లాగ్ ఐదవ సెమిస్టర్ పరీక్షల జవాబుపత్రాలు మూల్యాంకనం చేయించారు. తద్వారా ఆయా విద్యార్థులు వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలకు అవకాశం ఉంటుంది. వాస్తవంగా ఈసారి ప్రైవేట్ యాజమాన్యాలకు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో పరీక్షల ఫీజులు చెల్లించడంలో జాప్యం చేసిన విషయం తెలిసిందే. దీంతో పరీక్షలు ఆలస్యంగా జరిగాయి. 2, 4 సెమిస్టర్ల పరీక్షల జవాబుపత్రాలకు సంబంధించిన మూల్యాంకనం త్వరలోనే నిర్వహించనున్నారు. ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఈ ఫలితాలు వచ్చేసరికి కొంతసమయం పట్టే అవకాశం ఉంది. డిగ్రీ కోర్సుల ఒకటి, మూడో సెమిస్టర్‌కు సంబంధించిన బ్యాక్ లాగ్ సబ్జెక్ట్‌ల పరీక్షలు ఇటీవలే ముగిశాయి. ఐదవ సెమిస్టర్లో 50.56 శాతం.. ఆరవ సెమిస్టర్లో 50.16శాతం ఉత్తీర్ణత -
అలరించిన ‘రుక్మిణీ కల్యాణం’
హన్మకొండ అర్బన్: శ్రీ వేణుగోపాలస్వామి కళానాట్యమండలి దశమ వార్షికోత్సవం సందర్భంగా గురువారం హనుమకొండ కాళోజి కళాక్షేత్రంలో ప్రదర్శించిన రుక్మిణీ కల్యాణం పౌరాణిక పద్య నాటకం ఆహుతులను అలరించింది. స్టేషన్‌ఘన్‌పూర్ నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు అక్కెనపల్లి రవీందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర నాటక సమాజాల సమాఖ్య అధ్యక్షుడు ఆకుల సదానందం జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కాళోజీ కళాక్షేత్రంలో మొట్టమొదటి పౌరాణిక పద్య నాటకం ప్రదర్శించే అవకాశం దక్కడం ఎంతో అదృష్టమన్నారు. నాటకం రూపొందించిన రవీందర్, కళాకారులను అభినందించారు. -
రౌడీషీటర్ దారుణ హత్య
● ఆర్థిక లావాదేవీలే కారణం.. ● పోలీసుల అదుపులో నిందితులు ● నిందితుల్లో ఓ మాజీ పోలీస్ కానిస్టేబుల్.. వరంగల్ క్రైం : నగరంలోని వడ్డేపల్లికి చెందిన రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్(48) దారుణ హ త్యకు గురయ్యాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సుబేదారి పీఎస్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ ఎం.రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. మహ్మద్ సాధిక్ హుస్సేన్ తన పెద్దనాన్న కొడుకు ఖాదర్ హుస్సేన్‌కు రూ. 3 లక్షలు అప్పు ఇచ్చాడు. ఇందులో రూ. లక్ష ఇచ్చిన అనంతరం ఖాదర్ హుస్సేన్ మృతి చెందాడు. దీంతో సాధిక్ హుస్సేన్ తన మిగతా డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇటీవల ఖాదర్ హు స్సేన్ కుమారులు మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్‌ను అడిగాడు. దీంతో బుధవారం రాత్రి సాధిక్ హుస్సేన్ ఇంటికెళ్లిన మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్.. మాట్లాడాలని సాధిక్ హుస్సేన్‌ను శ్మశాన వాటిక దగ్గరకు తీసుకొచ్చి మరో నిందితుడు అక్రమ్‌తో కలిసి హత్య చేశారు. సా ధిక్ హుస్సేన్‌ను హత్య చేస్తే డబ్బులు అడిగే వారు ఎవరూ ఉండరనే కారణంతో ఇంటి నుంచి తీసుకొచ్చి బండరాయితో మోది హత్య చేశారు. నిందితుల్లో అక్రమ్ గతంలో కానిస్టేబుల్‌గా విధులు నిర్వర్తించి ఓ హత్యకేసులో నిందితుడిగా ఉండడంతో సర్వీస్ నుంచి తొలగించినట్లు ఇన్స్పెక్టర్ పేర్కొన్నారు.మృతుడి చెల్లి తస్లీమా బేగం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు. పోలీసుల అదుపులో నిందితులు? రౌడీషీటర్ మహ్మద్ సాధిక్ హుస్సేన్ హత్య కేసులో నిందితులుగా ఉన్న మహ్మద్ సోహెల్, మహ్మద్ బషీర్, మహ్మద్ అక్రమ్ పోలీసులు అదుపులో ఉన్నట్లు తెలిసింది. సాధిక్ హుస్సేన్ హత్య విషయం తెలిసి న వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న సుబేదారి ఇన్స్పెక్టర్ రంజిత్‌కుమార్ ఎదుట నిందితులు నేరుగా వచ్చి నేరం అంగీకరించి లొంగిపోయినట్లు తెలిసింది. పోలీసులు మాత్రం ధ్రువీకరించలేదు. -
కంప్యూటర్ నాలెడ్జ్
● అప్పుడే కొలువు సాధ్యం..లేనిపక్షంలో కలే.. ● చదువుతోపాటు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవాలంటున్న నిపుణులుఖిలా వరంగల్ : ఇంజనీరింగ్.. ఒకప్పుడు డిమాండ్ ఉన్న కోర్సు.. ఈ చదువు పూర్తయిందంటే ఉద్యోగం వచ్చినట్లే. జీవితంలో ఇక స్థిరపడినట్లే. మరిప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. కోర్సు పూర్తయినా ఉద్యోగం వస్తుందనే నమ్మకం లేదు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవడమే. ఇంజనీరింగ్ విద్యతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అప్పుడే కొలువు దక్కుతుంది. లేనిపక్షంలో ఉద్యోగం కలగానే మిగులుతుంది. చదువుకు.. చేసే పనికి ఉండని పొంతన.. ఇంజనీరింగ్ కోర్సు పూర్తయిన తర్వాత యువత ఏదో ఒక చిన్న ఉద్యోగంలో చేరుతున్నారు. ఇక్కడ తన చదువుకు.. చేసే పనికి పొంతనే ఉండడం లేదు. ఎందుకంటే.. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వా త ఏం చేయాలనే అంశంపై అవగాహన ఉండడం లేదు. ఫలితంగా కొంత మంది హైదరాబాద్, బెంగళూరు, చైన్నె, ఇతర ప్రాంతాల్లో ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ కాలం గడుపుతున్నారు. యువత ఇక నుంచి అలా చేయొద్దు. ఇంజనీరింగ్ పూర్తయిన తర్వాత ఈ కోర్సులు చేస్తే ఉద్యోగాలు మీ సొంతమవుతాయి. దీనిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం ఉద్యోగ వేటలో ఇంజనీరింగ్ విద్యార్థులు.. ఇంజనీరింగ్ చదివితే ఉద్యోగం వస్తుందనుకున్న కొంతమంది విద్యార్థులు నిరుత్సాహం చెందక తప్పడం లేదు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఏటా సుమారు 3వేలకుపైగా విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సు పూర్తి చేసుకుని బయటకు వస్తున్నారు. 30 నుంచి 40 శాతంలోపే వారికి క్యాంపస్ ఇంటర్వ్యూ లు ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. మిగతా వారు ఇంజనీరింగ్ పట్టాలతో ఉద్యోగాల వేట ప్రారంభిస్తున్నారు. దీనికి ప్రధాన కారణం కంప్యూటర్ నాలెడ్జ్, ఉద్యోగానికి సంబంధించిన కంప్యూటర్ కోర్సు నేర్చుకోకపోవడమే. ఫలితంగా యువత ఇంజనీరింగ్ కోర్సులకు సంబంధంలేని ఉద్యోగాల్లో స్థిరపడుతోంది. ఉద్యోగం సులభంగా సాధించాలంటే ఇంజనీరింగ్ చదువుకు కంప్యూటర్ కోర్సు యాడ్ చేయాల్సిందే. అప్పుడే అతిసులభంగా సాఫ్ట్వేర్ ఉద్యోగంలో స్థిరపడొచ్చు. ఇందులో కొన్ని కోర్సులు ఇలా ఉన్నాయి. సీఎస్ఈ గ్రూప్ .. ఇంజనీరింగ్‌లో సీఎస్ఈ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు 6 నెలల నుంచి సంవత్సర వరకు ఉండే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు బిగ్‌డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లె ర్ని, సైబర్ సెక్యూరిటీ వంటి మూడు కోర్సుల నే ర్చుకోవాలి. ఇంజనీరింగ్‌లో మార్కులశాతంతోపా టు కంప్యూటర్ కోర్సు ఉంటేనే ఉద్యోగం వస్తుంది. ఈఈఈ గ్రూప్ .. ఈఈఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్) గ్రూప్ పూర్తి చేసిన విద్యార్థులు సాఫ్ట్వేర్ ఉద్యోగానికి కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. విద్యార్థులు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ కోర్సుతో పాటు పవర్ టెక్నాలజీ సోలార్ కోర్సు చేయాలి. ఈ కోర్సులు 3 నెలల నుంచి 6నెలల వరకు ఉంటాయి. సివిల్ గ్రూప్.. సివిల్ గ్రూప్ చదివిన విద్యార్థులు స్టక్చరల్ ఇంజనీరింగ్ రివిట్ ఆర్కిటెక్చర్, రివిట్ స్ట్రక్చర్, ఆటో క్యాడ్ కోర్సులు నేర్చుకోవాలి. వీటి ద్వారా ప్రాజెక్టుల ఏర్పాటుకు ఇంజనీర్‌గా ఉద్యోగంలో చేరడానికి అవకాశాలు ఉంటాయి. ఈసీఈ గ్రూప్.. ఈసీఈ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్) గ్రూప్ చేసిన వారికి సాఫ్ట్వేర్ ఉద్యోగాలు లభిస్తాయి. అయితే విద్యార్థులు కంప్యూటర్ కోర్సులు చేయాలి. ఆండ్రాయిడ్ స్టిస్టమ్, ఈఎల్ఎస్ఐ డిజైన్స్ కోర్సులతో పాటు బిగ్ డేటా ఎనటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్ని, సైబర్ సెక్యూరిటీ కోర్సులు చేయాలి. ఈ కోర్సులు 6 నెలలు ఉంటాయి. దీంతో పాటు ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐఓటీ) కోర్సు చేస్తే మరింత ఉపయోగం. మెకానికల్ గ్రూప్ .. మెకానికల్ గ్రూప్ విద్యార్థులు రోబోటిక్స్ ఆర్టిఫిషి యల్ ఇంటెలిజెన్స్, ఆటోకేడ్, కెటియా కోర్సులు పూర్తి చేయాలి. ఇవి మూడు నుంచి ఆరు నెలలు కోర్సులుగా ఉంటాయి. ఈకోర్సులు పూర్తి చేస్తేనే ఇంటర్వ్యూల్లో ప్రాధాన్యం ఉంటుంది. ఈకోర్సులు హైదరాబాద్, బెంగళూరులోనే.. చదువు పూర్తయిన విద్యార్థులు వెంటనే ఇంజనీరింగ్‌కు సంబంధించిన కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవాలి. ఆ కోర్సులు హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి నగరాల్లోనే నేర్చుకోవాలి. ఎందుకంటే అక్కడ కంప్యూటర్ కోర్సులు నేర్పేవారు అనుభవం కలిగి ఉంటారు. వారి సూచనలు ఉద్యోగం సాధించడానికి ఉపయోపడతాయి. విజయానికి ముఖ్య పాయింట్లు విద్యార్థులు ఇంజనీరింగ్‌లో 90 శాతం మార్కులు సాధించినా ఇంటర్వ్యూలలో వెనుకబడుతున్నారు. ప్రధానంగా సాఫ్ట్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, టెక్నికల్ స్కిల్స్, హ్యూమన్ రిలేషన్స్ వంటివి పూర్తిగా కలిగి ఉంటే ఇంటర్వ్యూల్లో ఎంపికవుతారు. కళాశాలలో క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైయినింగ్‌కు తప్పని సరిగా వెళ్లాలి. ప్రస్తుతం అన్ని కళాశాలలో అధ్యాపకులు శిక్షణ ఇస్తున్నారు. ఎలా మాట్లాడాలి అనే అంశంపై తర్ఫీదు ఇస్తున్నారు. -
గడ్డం కేశవమూర్తికి ఎన్టీఆర్ అవార్డు
హన్మకొండ అర్బన్ : సీనియర్ జర్నలిస్ట్, ప్రముఖ రచయిత గడ్డం కేశవమూర్తికి విజయవాడకు చెందిన ఎక్స్ రే సాహిత్య సాంస్కతిక సేవా సంస్థ దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని పద్మశ్రీ ఎన్టీ రామారావు స్మారక అవార్డు ప్రకటించింది. ప్రముఖ సినీ నటు డు డాక్టర్ రాజేంద్రప్రసాద్‌తోపాటు గడ్డం కేశవమూర్తికి ఈ అవార్డును ప్రదానం చేసింది. ఈ మేర కు గురువారం రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణా భివృద్ధి శాఖల మంత్రి ధనసరి సీతక్క చేతుల మీదుగా కేశవమూర్తి ఈ అవార్డును అందుకున్నారు. కేశవమూర్తికి అవార్డు లభించడం పట్ల వివిధ జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. కన్సల్టెన్సీల కార్మిక దోపిడీ అరికట్టాలిహన్మకొండ: ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సుల కన్సల్టెన్సీల కార్మిక దోపిడీని అరికట్టాలని టీజీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న డిమాండ్ చేశారు. జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లను సరఫరా చేస్తున్న శ్రీ బాలాజీ కన్సల్టెన్సీ , సిస్కాన్ సంస్థలు డ్రైవర్ల జీతాల నుంచి పీఎఫ్ డబ్బులు కోత విధించి 5 నెలలుగా ప్రావిడెంట్ ఫండ్ ఖాతాలో జమ చేయకుండా సొంతానికి వాడుకోవడం అన్యాయమని గురువారం ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 5 నెలల నుంచి జేబీఎం బస్సులపై పని చేస్తున్న కార్మికుల జీతాల నుంచి పీఎఫ్ పేరుతో నెలకు రూ.3 వేల చొప్పున వసూలు చేసి ఖాతాలో జమ చేయకపోవడాన్ని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. పీఎఫ్ సొమ్ము దుర్వినియోగంపై జేబీఎం, ఆర్టీసీ యాజమాన్యం వెంటనే స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకుని ఆ సొమ్మును పీఎఫ్ ఖాతా లో జమ చేయించాలని డిమాండ్ చేశారు. కేయూ పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలుకేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల్లో పీజీ కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు జూలై 25నుంచి నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి సౌజన్య గురువారం తెలిపారు. ఈ మేరకు గురువారం టైం టేబుల్ విడుదల చేశారు. పీజీ కోర్సుల ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ జర్నలిజం మాస్ కమ్యూనికేషన్, ఎంఎల్ఐఎస్సీ, ఎంటీఎం, ఎంఎస్‌డబ్ల్యూ, ఎంహెచ్ఆర్ఎం కోర్సుల రెండో సెమిస్టర్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూలై 25, 28, 30, అగస్టు 1, 4, 6వ తేదీల్లో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు సౌజన్య తెలిపారు. -
మత్తు పదార్థాల నిర్మూలన ప్రతీ ఒక్కరి బాధ్యత
కేయూ క్యాంపస్ : మత్తు పదార్థాల నిర్మూలన ప్రతి ఒక్కరి బాధ్యతని కాకతీయ యూనివర్సిటీ వీసీ కె.ప్రతాప్ రెడ్డి అన్నారు. కేయూ ఎన్ఎస్ఎస్, హనుమకొండ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సంయుక్తంగా ‘అంతర్జాతీయ డ్రగ్ వ్యతిరేక దినోత్సవం’ సందర్భంగా గురువారం కేయూలోని సెనేట్ హాల్లో జాతీయ సేవా పథకం ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఈసం నారాయణ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో వీసీ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేయూ డ్రగ్ ఫ్రీ యూనివర్సిటీ అని, క్షణికానందం కోసం యువత తప్పటడుగు వేయొద్దన్నారు. మత్తు పదార్థాలతో వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ, దేశంపై ప్రభావం ఉంటుందన్నారు. హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభి రామారావు మాట్లాడుతూ భావిభారత యువత మత్తు పదార్థాలపై యుద్ధం చేయాలన్నారు. అవగాహనతో శారీకక, మానసిక ఆరోగ్యం పొందొచ్చని, తద్వారా ఏదైనా సాధించొచ్చన్నారు. రిజిస్ట్రార్ రామచంద్రం మాట్లాడుతూ డ్రగ్స్‌కు జీవితాన్ని బానిస చేసుకోవద్దని, తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనను కనిపెడుతూ ఉండాలన్నారు. వరంగల్ నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ దేశాభివృద్ధికి మాదక ద్రవ్యాల వినియోగం గొడ్డలిపెట్టు అన్నారు. అనంతరం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ‘యాంటీ డ్రగ్స్’, ‘సే నో టు డ్రగ్స్’ పోస్టర్లను ఆవిష్కరించారు. క్యాంపస్‌లో ఎన్ఎస్ఎస్ వలంటీర్లు, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులు, ఉద్యోగులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో హనుమకొండ డీఎల్ఎస్ఏ కార్యదర్శి క్షమా దేశ్‌పాండే, పాలకమండలి సభ్యురాలు కె.అనితారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. కేయూ వీసీ ప్రతాప్‌రెడ్డి -
అసిస్టెంట్ లైన్మెన్కు విద్యుత్ షాక్
● రాంగ్ ఎల్సీతో ప్రమాదం..హసన్‌పర్తి: ఇటీవల పర్వతగిరి లో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ పద్ధతిపై విధులు నిర్వర్తిస్తున్న బాలాజీ ప్రమాదానికి గురైన ఘటన మరుక ముందే హసన్‌పర్తి మండలం జయగిరి సబ్‌స్టేషన్ పరిధిలోని అన్నాసాగరంలో మరో ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వర్తిస్తున్న చంద్రమూర్తి ప్రమాదానికి గురయ్యాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఏబి స్విచ్ మరమ్మతు చేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురై పోల్‌పైనే వేలాడాడు. ఈ ఘటనలో చంద్రమూర్తికి తీవ్ర గాయాలయ్యా యి. క్షతగాత్రుడిని ఎంజీఎం తరలించారు. పరిస్థితి వి షమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలించినట్లు స్థానికులు తెలిపారు. రాంగ్ ఎల్సీతో ప్రమాదం.. అన్నాసాగరం పరిధిలోని ఎస్ఎస్ 36 100 కేవీఏ వద్ద సాంకేతిక సమస్య ఉత్పన్నమైంది.దీంతో అసిస్టెంట్ లైన్మెన్ చంద్రమూర్తి ఎల్సీ తీసుకున్నాడు. స్తంభం ఎక్కి మరమ్మతు చేయడానికి యత్నిస్తున్న క్రమంలో విద్యుత్ ప్రమాదానికి గురయ్యాడు. రాంగ్ ఎల్సీ ఇవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు విద్యుత్‌ఽశాఖ అధికారులు చెబుతున్నారు. సబ్‌స్టేషన్‌కు వెళ్లకుండానే ఎల్సీ.. ఇదిలా ఉండగా, ఎక్కడైనా విద్యుత్ సమస్య ఏర్పడినప్పుడు సంబంధిత సబ్‌స్టేషన్‌కు వెళ్లి ఎల్సీ తీసుకోవాలి. కొంతమంది లైన్మెన్లు మాత్రం ఫోన్ ద్వా రా అక్కడ ఉన్న ఆపరేటర్‌కు సమాచారమిచ్చి ఎల్సీ తీసుకున్నట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కాగా, విద్యుత్ ప్రమాదంపై విచారణ చేపడుతున్నట్లు ఏఈ అశోక్‌కుమార్ తెలిపారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ఖిలా వరంగల్: యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలా గీతాంబ సూచించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మామునూరు జవహర్ నవోదయ విద్యాలయంలో జరిగిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. యువత మత్తు పదార్థాలకు అలవాటుపడితే అనేక సమస్యలు తలెత్తుతాయని పేర్కొన్నారు. దేశ భవిష్యత్‌ను కుంగదీసే మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు కృషిచేయాలని పేర్కొన్నారు. మత్తు పదార్థాల వినియోగం సరదగా మొదలై వ్యసనంలా మారి చివరకు జీవితాన్ని నాశనం చేస్తాయని వివరించారు. మద్యం, డ్రగ్స్ మత్తులో తీవ్రమైన నేరాలకు పాల్ప డుతారని, మత్తు పదార్థాలు సేవించడం హానికరమని, చట్టరీత్యా నేరమని జడ్జి పేర్కొన్నారు. సదస్సులో మామునూరు ఏసీపీ వెంకటేశ్, ఇన్స్పెక్టర్ ర మేశ్, లీగల్ కౌన్సిల్ పి.శ్రీనివాస్‌రావు, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వలుస సుధీర్, ప్రిన్సిపాల్ బి.పూర్ణిమ, కృష్ణవేణి, సిల్వర్ క్రౌన్ హైస్కూల్ నుంచి 600 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి బీవీ నిర్మలాగీతాంబ -
ఎఫ్ఎస్టీపీ పనులు పూర్తి చేయాలి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: మూడో దశలో నిర్మాణంలో ఉన్న మానవ వ్యర్థాల శుద్ధీకరణ కేంద్రం (ఎఫ్ఎస్టీపీ) పనులను యుద్ధప్రతిపాదికన పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. నగర పరిధి 44వ డివిజన్ అమ్మవారిపేటలో బల్దియా నిర్మిస్తున్న 150 కేఎల్డీ ఎఫ్ఎస్టీపీ పనులను మేయర్.. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి గురువారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. ఇప్పటివరకు పూర్తిచేసిన, పురోగతిలో ఉన్న పనులను, ప్లాన్ఆఫ్యాక్షన్ ప్లాన్ పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ప్లాంట్‌ను నెలలోగా పూర్తి చేసి ట్రయల్ రన్ నిర్వహించాలని సూచించారు. మిగిలి ఉన్న సివిల్ పనులపై దృష్టి కేంద్రీకరించాలన్నారు. అనంతరం 40 కేఎల్డీ సామర్థ్యంతో పనిచేస్తున్న ప్లాంట్‌ను సందర్శించిన మేయర్ కమిషనర్లు ఆపరేషన్–మెయింటెనెన్స్ ఏ విధంగా కొనసాగుతుందో పరిశీలించారు. రెగ్యులర్‌గా సెప్టిక్ ట్యాంకులు వస్తున్నాయా? అని తెలుసుకొని రిజిస్టర్లను పరిశీలించారు. జియోట్యూబ్ టెక్నాలజీ ద్వారా వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతి నిలిచిపోయినందున తిరిగి పునరుద్ధరించాలని కమిషనర్.. ప్లాంట్ నిర్వాహకులను ఆదేశించారు. తనిఖీల్లో సీఎంహెచ్ఓ రాజారెడ్డి, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, డీఈ సారంగం, ఏఈ సంతోష్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్ యాదవ్, సైట్ ఇంజనీర్ ప్రణీత్ తదితరులు ఉన్నారు. టైలరింగ్ శిక్షణ కేంద్రాలను సిద్ధం చేయండి టెక్స్టైల్ పార్కును దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వరంగల్ పరిధిలో మహిళలకు టైలరింగ్‌లో శిక్షణ కోసం నాలుగు కేంద్రాలను సిద్ధం చేయాలని మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ సూచించారు. గురువారం సాయంత్రం మేయర్ చాంబర్లో మెప్మా విభాగానికి చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశమయ్యారు. మెప్మా కార్యకలాపాలు, వాటి పురోగతిని అడిగి తెలుసుకున్నారు. గ్రేటర్ పరిధిలోని 4 నియోజకవర్గాల్లో ఒకటి చొప్పున ఈ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. జాక్ మిషన్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో కేంద్రానికి రూ.25 లక్షల నిధులు కేటాయించనున్నట్లు పేర్కొన్నారు. కామన్ ఇంట్రెస్ట్ గ్రూపులు (స్ట్రీట్ వెండర్స్) సంఘాలు ఏర్పాటు చేయాలన్నారు. పీఎం విశ్వకర్మ పథకం, అమృత్ 2.0 చెరువు గట్టు వద్ద మొక్కలు నాటడం, బ్యాంక్ లీంకేజీ తదితర అంశాలపై చర్చించారు. -
రౌడీ షీటర్ దారుణ హత్య
మరికొన్ని హత్యలు ఇలా.. కమిషనరేట్ పరిధిలో కలకలం రేపుతున్న వరుస హత్యలు ● వివాహేతర సంబంధం.. భూ పంచాయితీలే ప్రధాన కారణం ● మౌనం వీడని పోలీసులు.. పోలీసింగ్‌పై అనుమానాలు..● జనవరి 22న సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వివాహిత కోసం ఇద్దరు ఆటోడ్రైవర్ల మధ్య జరిగిన గొడవ హత్యకు దారి తీసింది. సుబేదారిలోని డీమార్ట్ ఎదురుగా ఏనుగు వెంకటేశ్వర్లు అనే నిందితుడు మాచర్ల రాజ్‌కుమార్‌ను నడిరోడ్డుపై జనం చూస్తుండగా హత్య చేశాడు. ● ఫిబ్రవరి 20న రాత్రి 10.30 గంటల సమయంలో మిల్స్‌కాలనీ పోలీస్ స్టేషన్ పరిధి భట్టుపల్లి దగ్గర డాక్టర్ సుమంత్‌రెడ్డిని ఆయన భార్య ఫ్లోరా తన ప్రియుడు సామ్యూల్, మరో నిందితుడు ఏఆర్ కానిస్టేబుల్ రాజ్‌కుమార్‌తో హత్య చేయించింది. ● ఏప్రిల్ 12న నల్లబెల్లి మండలం మూడు చింతలపల్లిలో బానోతు కొమ్మాలు హత్యకు గురయ్యాడు. వివాహేతర సంబంధమే కారణంగా పోలీసులు నిర్ధారించారు. ● ఏప్రిల్ 18న హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఆస్పత్రి వద్ద చిద్దం సాయి ప్రకాశ్‌ను కిడ్నాప్ చేసి 18న హత్య చేశారు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడన్న కారణంతో క్రిష్ణవేణి అనే మహిళ తన బావ కొడుకును తన ప్రియుడు కానిస్టేబుల్ బాషబోయిన శ్రీనివాస్, మరో నలుగురు కలిసి హత్య చేశారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ /వరంగల్ క్రైం: బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో మహ్మద్ సాదిక్ హుస్సేన్ తను ఇచ్చిన అప్పు డబ్బులు ఇవ్వమన్నందుకుగాను సోహేల్, బసీర్, అక్రమ్ అనే నిందితులు అతడి తలపై బండతో మోది హత్య చేశారు. ఈనెల 11న కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెగడపల్లిలో తనకు రావాల్సిన భూమిని ఇవ్వనివ్వడం లేదని చల్లా భూపాల్‌రెడ్డి తన పినతల్లి అయిన సరోజనను గొడ్డలితో నరికి హత్య చేశాడు. ఈనెల 7న గీసుగొండ పోలీస్ స్టేషన్ పరిధి లోని స్తంభంపల్లిలో జల్సాలకు అలవాటు పడిన రేకలపల్లి ప్రణయ్ తన మేనత్త స్వరూపను బంగారం, డబ్బుల కోసం హత్య చేశాడు.వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా జరుగుతున్న హత్యలు కలకలం రేపుతున్నాయి. ఒకే నెలలో మూడు హత్యలు జరగడంతో నగరవాసులు భయబ్రాంతులకు గురవుతున్నారు. అందులోనూ హనుమకొండ సబ్ డివిజన్లో ఒక్కనెలలోనే రెండు హత్యలు జరగడం, అది నగరంలో రోడ్డు మీద కిరాతకంగా చంపుతుండడంతో పోలీసింగ్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా బుధవారం రాత్రి జనం తిరుగుతున్న సమయంలో సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహ్మద్ సాదిక్ హుస్సేన్ హత్య మరోసారి సంచలనం కలిగించింది. రాత్రి 10 గంటల తరువాత నిర్వహించాల్సిన పెట్రోలింగ్ ఏమైంది? బ్లూకోల్ట్ సిబ్బంది ఎక్కడ? విజిబుల్ పోలీసింగ్ ఎక్కడ నిర్వహిస్తున్నారన్న అనేక ప్రశ్నలు తలెత్తుతున్నా పోలీసులు మౌనం వీడడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఏడాది కమిషనరేట్ పరిధిలో ఆరు నెలల్లో 18 హత్యలు, 32 హత్యాయత్నం కేసులు నమోదయ్యాయి. వివాహేతర సంబంధాలు.. ఆస్తి పంచాయితీలు? ఇటీవల జరుగుతున్న హత్యలకు వివాహేతర సంబంధాలు, భూ, ఆస్తి పంచాయితీలో ప్రధాన కారణా లు అవుతున్నాయి. అప్పుగా ఇచ్చిన డ బ్బులను అడిగినందు కు సాదిక్ హుస్సేన్ హత్య కు గురికాగా, పినతల్లి తనకు రావాల్సిన భూమిని రాకుండా చేస్తుందని కేయూ పీఎస్ పరిదిలో సరోజన అనే మహిళా హత్యకు గురైంది. జల్సాలకు అలవాటు పడ్డ మరో యువకుడు ఈఎంఐలను కట్టడం కోసం సొంత మేనత్తను హత్య చేసిన సంఘటన గీసుగొండ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. సులువుగా డబ్బులు సంపాదించడం.. చిన్ని చిన్న గొడవలు చివరికి హత్యల వరకు దారితీస్తున్న ఘటనలు ఇటీవల కమిషనరేట్ పరిధిలో ఎక్కువగా జరుగుతున్నాయి. హత్య కేసుల్లో పోలీసులు? పోలీస్ శాఖ క్రమశిక్షణకు మారుపేరు. కానీ వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ యేడాది జ రిగిన మూడు హత్య కేసుల్లో నిందితులు పోలీస్‌లు కావడం గమనార్హం. ఇది పోలీస్ శాఖకు మాయని మచ్చగా మారింది. సుబేదారి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడు అక్రమ్ పోలీస్ కానిస్టేబుల్. అతను గతంలో ఓ హత్య కేసులో నిందితుడిగా ఉండటంతో అధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. అయినప్పటికి పద్ధతి మార్చుకోలేదు. రాష్ట్రంలో సంచలనం కలిగించిన డాక్టర్ సుమంత్‌రెడ్డి హత్య కేసుల్లో ఉన్న నిందితుడు ఎం.రాజ్‌కుమార్ ఏఆర్ కానిస్టేబుల్. హనుమకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏప్రిల్ 18న జరిగిన చిద్దెం సాయి ప్రకాశ్ హత్య కేసు నిందితుడు బాషబోయిన శ్రీనివాస్ కూడా కానిస్టేబుల్. ఆరు నెలల్లో 18 హత్యలు.. 32 హత్యాయత్నాలు ఆర్థిక లావాదేవీలే కారణం ఇంట్లో నుంచి తీసుకొచ్చి తలపై బండరాయితో మోది ఘాతుకం నిందితుల్లో పోలీస్ కానిస్టేబుల్ – వరంగల్ క్రైం – వివరాలు 8లోu -
వారాహి రుద్రుడిగా శ్రీరుద్రేశ్వరస్వామి
హన్మకొండ కల్చరల్ : వేయిస్తంభాల దేవాలయంలో ఆషాఢ మాసం శుద్ధ పాడ్యమి తిథిని పురస్కరించుకుని గురువారం శ్రీరుద్రేశ్వరస్వామి వారిని వారాహి రుద్రుడిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు మణికంఠశర్మ, అర్చకులు ప్రణవ్, సందీప్‌శర్మలు ఉదయం నుంచి సుప్రభాతసేవ, ఉత్తిష్ట గణపతికి అభిషేక, అర్చన, శ్రీరుద్రేశ్వరస్వామి వారికి రుద్రాభిషేకం, అర్చన జరిపారు. ‘విద్యుత్ ప్రమాదాలపై జాగ్రత్త వహించాలి’హన్మకొండ: వినియోగదారులు, ముఖ్యంగా రైతులు విద్యుత్ ప్రమాదాల పట్ల అత్యంత జాగ్రత్త వహించాలని టీజీ ఎన్పీడీసీఎల్ వరంగల్, హనుమకొండ సర్కిళ్ల ఎస్ఈలు కె.గౌతం రెడ్డి, మధుసూదన్‌రావు గురువారం ఒక ప్రకటనలో సూచించారు. పశువులను మేతకు తీసుకెళ్లినప్పుడు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, స్తంభాలు దగ్గరికి వెళ్లకుండా యజమానులు, కాపరి జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు. వైర్లు ప్రమాదకరంగా ఉన్నట్లు గుర్తిస్తే వెంటనే విద్యుత్ అధికారులు, సిబ్బందికి తెలియజేయాలని, టోల్ ఫ్రీ నంబర్ 1912కు ఫోన్ చేయాలని సూచించారు. ఇళ్లలో విద్యుత్ సరఫరా కాని ప్లాస్టిక్ దండాల(దుస్తులు ఆరేసుకునేవి)ను ఉపయోగించాలని కోరారు. స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశాలకు మరో అవకాశంవరంగల్ స్పోర్ట్స్: హైదరాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లో గల క్రీడా పాఠశాలల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు సాట్ మరో అవకాశం కల్పించినట్లు హనుమకొండ డీవైఎస్ఓ అశోక్‌కుమార్ గురువారం తెలిపారు. ఈనెల 28వ తేదీన ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 2016, సెప్టెంబర్ 01 నుంచి 2017, ఆగస్టు 31 మధ్యలో జన్మించిన వారు అర్హులుగా పేర్కొన్నారు. లేబర్ కోర్టు ఏజీపీగా రమణారెడ్డివరంగల్ లీగల్: హనుమకొండ జిల్లా లేబర్ కోర్టు అదనపు ప్రభుత్వ న్యాయవాదిగా నూకల వెంకటరమణారెడ్డిని నియమిస్తూ రాష్ట్ర న్యాయశాఖ కార్యదర్శి తిరుపతి ఉత్తర్వులు జారీ చేశారు. ఐనవోలు మండలం పంఽథినికి చెందిన రమణారెడ్డి 1993లో న్యాయశాస్త్ర పట్టభద్రుడై సీనియర్ న్యాయవాది శివరావు వద్ద జూనియర్‌గా పనిచేశారు. 2006లో ఉమ్మడి జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. జిల్లాలో పారిశ్రామిక, కార్మిక వివాదాల్లో ప్రభుత్వ పక్షాన రమణారెడ్డి వాదిస్తారు. ఈస్థానంలో ఆయన మూడేళ్లు కొనసాగుతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పోలీసుల అదుపులో అధికార పార్టీ కార్పొరేటర్? నకిలీ నోట్ల చలామణీ కేసులో.. వరంగల్ క్రైం: నకిలీ నోట్ల చలామణీలో పశ్చిమ నియోజకవర్గానికి చెందిన ఓ అధికార పార్టీ కార్పొరేటర్‌ను హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. గతంలోనే సదరు కా ర్పొరేటర్పై కేసులు నమోదైనట్లు తెలిసింది. వారం రోజులనుంచి స్థానికంగా లేడని, దీంతో ఎవరికీ అందుబాటులోకి రావడం లేదని ప్రచారం జరుగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఆ కార్పొరేటర్‌ను పోలీసులు అధికారికంగా అరెస్టు చేసినట్లు ప్రకటించే అవకాశం ఉంది. -
ఎట్టకేలకు ఎఫ్ఐఆర్
సాక్షి, వరంగల్: రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై ఎట్టకేలకు ఎఫ్ఐఆర్ నమోదైంది. తక్కువ వయస్సున్న పిల్ల లను దత్తత పొందడానికి ఎక్కువ వయస్సున్న దంపతులను తక్కువ వయస్సుగా చూపించేందుకు సమర్పించిన డేట్ ఆఫ్ బర్త్, మెడికల్ సర్టిఫికెట్లు నకిలీవని వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలోని సుబేదారి పోలీస్ స్టేషన్లో జిల్లా సంక్షేమ విభాగాధికారి రాజమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 9 మందిపై కేసు నమోదైంది. వీరిలో నర్సయ్య, రుక్మ, లస్మయ్య, చిన్న కేతమ్మ, మహిపాల్, సంధ్యారాణి, సుమతి, ప్రేమలత, అరుణ ఉన్నారు. అసలు వీరికి సలహాలు ఇవ్వడంతోపాటు నకిలీ బర్త్ సర్టిఫికెట్ల సమర్పణలో కీలకంగా వ్యవహరించిన బాలరక్షా భవన్‌లోని సిబ్బందిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆమె సదరు పిటిషన్లో కోరగా.. వారి పేర్లు వెల్లడించకపోవడంతో విచారణ క్రమంలో వారిపై ఎఫ్ఐఆర్ నమోదుచేసే దిశగా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ కూడా ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ మూలాల్లోకి వెళ్లి అసలు సూత్రధారి, పాత్రధారి ఎవరనే వివరాలను తెలుసుకునే దిశగా విచారణ జరుగుతోంది. ఇప్పటికే వీరిపై 420 (మోసం), 468 (మోసం చేసే ఉద్దేశంతో ఫోర్జరీ), 471 రెడ్ విత్ 34 ఐపీసీ (నకిలీ పత్రాన్ని ఒరిజినల్‌గా చూపించి మోసం చేయడం, ఒకే రకమైన నేరం కొంతమంది కలిసి చేయడం) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్‌లోనే దందా బయటకు వచ్చినా.. దత్తత కోరే దంపతులు నిరక్షరాస్యులైతే వయస్సు ధ్రువీకరణ పత్రం ప్రభుత్వామోదిత వైద్యుడి వద్ద ఒసిఫిఏకేషన్ పరీక్ష నివేదిక ఆధారంగా తీసుకోవచ్చు. లేకుంటే పాన్‌కార్డులో ఉన్న పుట్టిన తేదీ ఉంటే సరిపోతుంది. అయితే, దంపతుల ఎక్కువ వయస్సు కారణంగా తక్కువ వయస్సు ఉన్న పిల్ల లు వచ్చే అవకాశం లేదని కొందరు బాలరక్షా భవన్ అధికారులే ‘మామూలు’గా మాట్లాడి కొన్ని ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలతో కుమ్మకై ్క సదరు సర్టిపికెట్లను తీసుకొచ్చారు. వాటినే ఒరిజినల్ సర్టిఫికెట్లుగా చూపిస్తూ సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (కారా) వెబ్సైట్లో అప్లోడ్ చేసిన విషయం జిల్లా రెవెన్యూ అధికారి, డీడబ్ల్యూఓ విచారణలో తేలింది. అయినా కూడా పోలీసులకు డీడబ్ల్యూఒ ఇచ్చిన ఫిర్యాదులో బాలరక్షాభవన్ సిబ్బంది పేర్లు వెల్లడించకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటి, కావాలనే వారి పేర్లు ఇవ్వలేదా అన్న చర్చ కలెక్టరేట్ వర్గాల్లో నడుస్తోంది. ఎందుకంటే ఏప్రిల్ నెలలోనే ఓ జంటకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్ల దందా బయటకు వచ్చినా చర్యలు తీసుకోకుండా, విధుల్లో డీడబ్ల్యూఓ నిర్లక్ష్యంగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ దందాలో ఎవరి ప్రమేయముందో తెలుసుకొని వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉండగా.. ఆ విభాగంలోని మరికొందరి పనితీరు బాగాలేదంటూ ఫిబ్రవరిలో కావాల్సిన రెన్యువల్‌ను బుధవారం నిలిపివేయడం వివాదాస్పదమవుతోంది. దీనిపై మహిళా, శిశు సంక్షేమ విభాగం ఉన్నతాధికారులు కూడా వాకబు చేస్తున్నట్లు తెలిసింది.‘దత్తతలో నకిలీ సర్టిఫికెట్ల దందా’పై కేసు నమోదు 9 మందిపై 420, 468, 471 రెడ్‌విత్ 34 ఐపీసీ సెక్షన్లు బాలరక్షాభవన్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు పేర్లు పిటిషన్లో పేర్కొనకపోవడంతో అనుమానాలు ఏప్రిల్‌లోనే నకిలీ సర్టిఫికెట్లని తెలిసినా పట్టించుకోని డీడబ్ల్యూఓ -
భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్హన్మకొండ అర్బన్: జిల్లాలో భూసేకరణ, చెల్లింపులకు సంబంధించిన పనులు వేగంవంతం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్.. రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం హనుమకొండ కలెక్టరేట్లో జిల్లాలోని జాతీయ రహదారులు, గౌరవెల్లి ప్రాజెక్ట్ పరిధిలో చేపట్టిన భూ సేకరణ, సంబంధిత రైతులకు పరిహారం చెల్లింపులు, వాటి పురోగతిపై సమీక్షించారు. జాతీయ రహదారి నిర్మాణానికి చేపట్టిన భూ సేకరణ ప్రక్రియ, ఇప్పటివరకు పెండింగ్‌లో ఉన్న పరిహారం, రైతులకు ఎంత చెల్లించారన్న వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం భూభారతి దరఖాస్తులపై సమీక్షించారు. రెవెన్యూ సదస్సుల ద్వారా ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, ఆన్లైన్ చేసినవి, ఎన్నింటికి నోటీసులు ఇచ్చారనే అంశాలను ఆర్డీఓలు, తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, రెవెన్యూ అధికారి వైవీ గణేష్, పరకాల ఆర్డీఓ డాక్టర్ నారాయణ, హైవే, గౌరవెల్లి ప్రాజెక్ట్ అధికారులు, తహసీల్దార్లు పాల్గొన్నారు. విద్యార్థుల నమోదు పెరగాలి అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదు పెరగాలని కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, గురుకులాల్లో విద్యార్థుల నమోదుపై పాఠశాల విద్య, ఇంటర్మీడియట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సంక్షేమ గురుకులాల అధికారులు, ఎంఈఓలతో సమీక్షించారు. పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో విద్యార్థుల నమోదు సమాచారాన్ని డీఈఓ వాసంతి, ఇంటర్ విద్యాశాఖ సూపరింటెండెంట్ చంద్రమౌళి వివరించారు. కలెక్టర్ మాట్లాడుతూ మూడేళ్లు దాటిన చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థుల నమోదు పెంచాలని, పిల్ల లకు వైద్యపరీక్షలు నిర్వహించాలని, యూనిఫామ్స్ అందించాలన్నారు. సమావేశంలో జిల్లా విద్యాశాఖ ప్లానింగ్ కోఆర్డినేటర్ మహేష్, సీఎంఓ సుదర్శన్ రెడ్డి, ఏఎస్సీ రఘు చంద్రరావు, ఎంఈఓలు, సంక్షేమ అధికారులు, సీడీపీఓలు పాల్గొన్నారు. -
మత్తుకు బానిస కావొద్దు..
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్హసన్పర్తి: యువత మత్తుకు బానిస కావొద్దని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్స దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం హనుమకొండ పోలీస్ సబ్ డివిజన్ ఆధ్వర్యంలో భీమారంలోని ఎస్వీఎస్ కళాశాలలో విద్యార్థులు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్‌సింగ్, వరంగల్ కలెక్టర్ సత్యశారద, బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా కళాశాల ఆవరణలో మొక్కలు నాటారు. అనంతరం జరిగిన సమావేశంలో సీపీ మాట్లాడారు. డ్రగ్స్ వినియోగంతో జీవితాలు అంధకారమవుతాయన్నారు. డ్రగ్స్ విక్రయించిన, ఖరీదు చేసిన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద మాట్లాడుతూ.. వరంగల్‌ను డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చడానికి ప్రతి ఒక్కరూ తమవంతు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈసందర్భంగా మాదక ద్రవ్యాలను తరిమికొడుదామని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ సలీయా, హనుమకొండ ఏసీపీ నర్సింహారావు, కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, ఎస్వీఎస్ కళాశాల సెక్రటరీ ఎర్రబెల్లి అనూప్, ఇన్స్పెక్టర్లు రవికుమార్, శివకుమార్, రంజిత్‌కుమార్, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్, ప్రొఫెసర్ రవికుమార్, అనిత, ఎస్సై రవీందర్, శ్రీకాంత్, పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. -
నేటినుంచి శాకంబరీ ఉత్సవాలు
హన్మకొండ కల్చరల్: వరంగల్‌లోని శ్రీభద్రకాళి అమ్మవారి శాకంబరీ నవరాత్రి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ నెల 26 నుంచి జూలై 10 తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈనేపథ్యంలో నవరాత్రోత్సవాలను విజయవంతం చేయాలని భద్రకాళి ఆలయ ఈఓ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శేషుభారతి అన్నారు. ఈమేరకు ఆలయంలోని అన్నదాన సత్రం ఆవరణలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శేషుభారతి, ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు, ధర్మకర్తల మండలి చైర్మన్ డాక్టర్ బండారు శివసుబ్రహ్మణ్యం ఉత్సవాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం శేషుభారతి మాట్లాడుతూ 15రోజుల పాటు శాకంబరీ ఉత్సవాలు జరగనున్నాయన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. గురువారం సహస్ర కలశాభిషేకంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయని భక్తులు అధికసంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఆలయ అర్చకుడు భద్రకాళి శేషు మాట్లాడుతూ.. రోజూ ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని, జూలై 10వతేదీ గురువారం ఉదయం 4గంటలకే మహాశాకంబరీ అలంకరణ, పూజలు జరుగుతాయన్నారు. మండలి చైర్మన్ శివసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్ల లతో ఉత్సవాల్లో పాల్గొనాలన్నారు. ఆలయ ధర్మకర్త తొనుపూనూరి వీరన్న మాట్లాడుతూ 11 సంవత్సరాల తర్వాత దేవాలయంలో ధర్మకర్తల మండలి ఏర్పాటు అయ్యిందని, ఆలయ ధర్మకర్తల తరఫున భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తామన్నారు. కార్యక్రమంలో దేవాలయ సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది హరినాథ్, అలుగు కృష్ణ, నాగులు, చింతశ్యాంసుందర్ పాల్గొన్నారు. కనీస సౌకర్యాలు కల్పించాలి.. ప్రతిష్టాత్మకంగా నిర్వహించే శాకంబరీ ఉత్సవాల్లో గతంలో భక్తులకు కనీససౌకర్యాలు కల్పించలేదని విలేకరులు ఈఓ శేషుభారతిని ప్రశ్నించారు. దేవాలయంలో శానిటేషన్, టాయిలెట్ల ఏర్పాటు చేయాలని, క్యూలైన్లో భక్తులకు మినరల్ వాటర్, ప్రసాదాలు అందజేయాలని, ఆలయ ఆవరణ శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. దీనికి ఈఓ స్పందిస్తూ భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తానని సమాధానమిచ్చారు. జూలై 10వ తేదీ వరకు నిర్వహణ మహోత్సవాలను విజయవంతం చేయాలి భద్రకాళి దేవాలయ ఈఓ శేషుభారతి ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ -
విస్తృతంగా మొక్కలు నాటాలి
● కమిషనర్ చాహత్ బాజ్పాయ్వరంగల్ అర్బన్: వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలో విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఉద్యాన శాఖ అధికారులను ఆదేశించారు. హనుమకొండలో మొక్కలు నాటే కొన్ని ప్రాంతాలను బుధవారం ఉదయం జాగింగ్ చేస్తూ ఆమె పరిశీలించారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. శాయంపేట టెంపుల్ ట్రీ విల్లాస్, కేఆర్ఆర్ టౌన్ షిప్‌లోని ప్లాట్‌లో పార్క్ అభివృద్ధి పనులు, మియావాకీ ప్లాంటేషన్, న్యూశాయంపేట ప్రభుత్వ పాఠశాల నుంచి తెలంగాణ జంక్షన్ వరకు పరిశీలించారు. అక్కడే అభివృద్ధి పనులు చేపట్టాలని, ప్రశాంత్‌నగర్‌లోని ఎస్వీ స్కూల్ ఆఫ్ బధిరుల పాఠశాలలో ఓపెన్ ప్లాంటేషన్ నిర్వహించాలని సూచించారు. కమిషనర్ వెంట ఇన్చార్జ్ సిటీప్లానర్ రవీందర్రాడేకర్, హార్టికల్చర్ అధికారులు రమేశ్, లక్ష్మారెడ్డి, ఏసీపీ రజిత, ఈఈ రవికుమార్, డీఈలు రాజ్‌కుమార్, సారంగం, ఏఈలు రాగి శ్రీకాంత్, మేనక శానిటరీ ఇన్స్పెక్టర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. పన్నెండు మోరీల ట్రాఫిక్ జంక్షన్‌ను అభివృద్ధి చేయాలి వరంగల్ హంటర్ రోడ్డు–పోతన– బీట్ బజార్ జంక్షన్లో పన్నెండు మోరీలుగా విస్తరించి, అభివృద్ధి పనులు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి సూచించారు. బుధవారం సాయంత్రం మేయర్, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. స్మార్ట్‌సిటీ పనులకు డిసెంబర్ గడువు వరంగల్ స్మార్ట్ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం చివరి గడువును డిసెంబరు నెలాఖరుగా ఖరారు చేసింది. పదేళ్లుగా కొనసాగుతున్న పనులకు గతంలో కేటాయించిన నిధులతోనే పెండింగ్ పనులు పూర్తి చేయాలని కేంద్ర స్మార్ట్‌సిటీ జాయింట్ డైరెక్టర్ రూప మిశ్రా ప్రకటించారు. బుధవారం న్యూ ఢిల్లీ నుంచి రూప మిశ్రా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. వందరోజుల యాక్షన్ ప్లాన్ అమలు చేయాలి వందరోజుల యాక్షన్ ప్లాన్‌ను సమర్థవంతంగా అమలు చేయాలని సీడీఎంఏ శ్రీదేవి అన్నారు. బుధవారం హైదరాబాద్‌నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బల్దియానుంచి కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు ఎంపికలు షురూ
వరంగల్ స్పోర్ట్స్: జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో బుధవారం హైదరాబాద్‌లోని హకీంపేట, కరీంనగర్, ఆదిలాబాద్‌లోని స్పోర్ట్స్ స్కూళ్లలో ప్రవేశాలకు బుధవారం ఎంపికలు నిర్వహించారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన సెలక్షన్స్‌ను డీవైఎస్ఓ గుగులోతు అశోక్‌కుమార్ ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండు రోజుల పాటు జరగనున్న ఎంపికలకు మొదటి రోజు 16 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను హకీంపేటలో నిర్వహించే రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ స్కూల్స్ ఎంపికలకు పంపించనున్నట్లు తెలిపారు. ఈఎంపిక ప్రక్రియలో డీఎస్ఏ కోచ్‌లు శ్రీమన్నారాయణ, మహ్మద్ అఫ్జల్, బొడ్డు విష్ణువర్ధన్, బత్తిని జీవన్‌గౌడ్, ఓనపాకల శంకర్, కూరపాటి రమేశ్, రాజారపు రమేశ్, దేవిక, రాజు, పెరుమాండ్ల వెంకటేశ్వర్లు, ఖోఖో సంఘం జిల్లా కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్, పీడీలు ప్రేమ్ప్రసాద్రావు, కిషన్‌నాయక్ పాల్గొన్నారు. హార్టికల్చర్ ఆఫీసర్ల బాధ్యతల స్వీకరణహనుమకొండ జిల్లాకు అనసూయ, వరంగల్‌కు ఆర్.శ్రీనివాసరావు హన్మకొండ: హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారుల్లో మార్పులు జరిగాయి. వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా ఆర్.శ్రీనివాస్, హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా జి.అనసూయ బాధ్యతలు స్వీకరించారు. హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి ఎం.వెంకటేశం రెండు నెలల క్రితం నాగర్ కర్నూల్ బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ జిల్లా అధికారిగా పని చేస్తున్న సంగీత లక్ష్మి రెండు జిల్లాల బాధ్యతలు చేపట్టారు. ఆమె నెల రోజుల క్రితం హైదరాబాద్‌లోని ఉద్యాన శాఖ కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. దీంతో వరంగల్ రీజియన్ పట్టు పరిశ్రమ జాయింట్ డైరెక్టర్‌గా పని చేస్తున్న జి.అనసూయను హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ అధికారిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. కాగా.. కరీంనగర్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారిగా పని చేస్తున్న ఆర్.శ్రీనివాసరావును డిప్యుటేషన్‌పై వరంగల్ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారిగా నియమిస్తూ, సెరికల్చర్ జాయింట్ డైరెక్టర్ జి.అనసూయను హనుమకొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖాధికారిగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఈ నెల 23న ఉద్యాన శాఖ డైరెక్టర్ ఎస్.యాస్మీన్ బాషా ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వారు హనుమకొండ, సుబేదారిలోని జిల్లా సమీకృత కార్యాలయం భవన సముదాయంలోని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ కార్యాలయంలో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ‘మత్తు’ నియంత్రణకు పటిష్ట చర్యలుహన్మకొండ అర్బన్: జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు హనుమకొండ జిల్లా రెవెన్యూ అధికారి వైవీ గణేశ్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో గంజాయి, ఇతర మత్తు పదార్థాల నియంత్రణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఆర్ఓ గణేశ్, డీసీపీ షేక్ సలీమా మాట్లాడుతూ.. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయించే, వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సినిమా హాళ్లలో మత్తు పదార్థాల నియంత్రణకు స్లైడ్స్ వేసేలా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. మత్తు పదార్థాల నియంత్రణలో భాగంగా నిరంతరం అవగాహన సదస్సు, కార్యక్రమాలు నిర్వహిస్తూ విస్తృత ప్రచారం చేపట్టాలన్నారు. క్రీడలు, ఇతర రంగాల్లోని సెలబ్రిటీలు గంజాయి, ఇతర మత్తు పదార్థాల ద్వారా కలిగే అనర్థాలపై ప్రచారం చేయాలన్నారు. అనంతరం మత్తుపదార్థాల నియంత్రణపై అవగాహన కలిగేలా రూపొందించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించారు. సమావేశంలో ఎకై ్సజ్ అధికారులు, ఆర్డీఓ, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
మత్తు పదార్థాలను నివారించాలి
న్యూశాయంపేట: మత్తు పదార్థాలను నివారించాలని వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్లో డీసీపీ అంకిత్‌కుమార్‌తో కలిసి బుధవారం జిల్లాస్థాయి నార్కోటిక్ సమన్వయ సమావేశం నిర్వహించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ, రోడ్డు ప్రమాదాల నివారణ, నషా ముక్త్ భారత్‌లో భాగంగా చేపడుతున్న చర్యలపై సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత్తు పదార్థాలతో జీవితం ఎలా నాశనం అవుతుందో వీడియో ప్రదర్శనల ద్వారా పాఠశాల, కళాశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే 33 ప్రాంతాల్లో మరమ్మతులు చేపట్టాలని ఆర్అండ్బీ ఈఈకి కలెక్టర్ సూచించారు. ఈసందర్భంగా పోస్టర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, ట్రాఫిక్ డీసీపీ ప్రభాకర్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, ఆర్అండ్బీ ఈఈ రమేశ్, అధికారులు పాల్గొన్నారు. స్వచ్ఛ భారత్‌లో ఉత్తమ ర్యాంకు సాధించాలి.. స్వచ్ఛ భారత్‌లో ఉత్తమ ర్యాంకు సాధించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ నిర్వహించిన జిల్లాస్థాయి శిక్షణకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక సమస్య లేదని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 35 వేల తెల్ల రేషన్‌కార్డుల సర్వే 15 రోజుల్లో పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జిల్లా పరిషత్ సీఈఓ రాంరెడ్డి, డీఎంహెచ్ఓ, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం.. బెస్ట్ అవైలబుల్ స్కీం పెండింగ్ బిల్లులు త్వరగా చెల్లించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్లో జిల్లాలోని బీఏఎస్ స్కూళ్ల యాజమాన్యాలు, విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. యాజమాన్యాలు సహకరించి వెంటనే విద్యార్థులను స్కూళ్లకు అనుమంతించాలని కలెక్టర్ కోరారు. 9 అంశాలను పరిశీలించాలి.. పంచాయతీ అభివృద్ధి సూచిక 2.0లోని 9 అంశాలపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూరిస్తే వాటి ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారని కలెక్టర్ సత్యశారద అధికారులకు తెలిపారు. కలెక్టరేట్లో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. వరంగల్ కలెక్టర్ సత్యశారద -
మార్పు వచ్చింది..
సాక్షి, మహబూబాబాద్: జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం.. ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల పనితీరు, విద్యార్థుల సామర్థ్యాలు మొదలైన ఆరు అంశాలపై నిర్వహించిన ఫెర్మార్మింగ్ గ్రేడ్ ఇండెక్స్(ఎఫ్‌జీఐ) నివేదిక మెరుగ్గా ఉంది. గత రెండు సంవత్సరాల కంటే.. గడిచిన విద్యాసంవత్సరంలో ఫలితాలు మెరుగ్గా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఆరు అంశాల్లో 74 సూచికలకు 600 మార్కులు కేటాయించారు. ప్రతీ పాఠశాల నుంచి యూడైస్‌లో పొందుపర్చిన అంశాలను పరిశీలించి, సేకరించిన వివరాల ప్రకారం.. జాతీయ స్థాయిలో జిల్లాల వారీగా మార్కులు కేటాయించారు. ఆరు అంశాలుగా పరిశీలన ప్రభుత్వ పాఠశాల పనితీరుకు అద్దం పట్టే ప్రధాన అంశాలను పరిశీలించారు. ఇందులో ఆరు అంశాల్లో 74 సూచికలను పేర్కొని మార్కులు వేశారు. మొదటి అంశంగా.. అభ్యసన ఫలితాలు, సామర్థ్యాలు, సంబంధాలు, ఉపాధ్యాయుల లక్ష్యాలు, నైపుణ్యాలు, రెండో అంశం.. బోధన నిర్వహణ, పిల్లల ప్రతిస్పందన, మూడో అంశం.. మౌలిక సదుపాయాల కల్పన, సౌకర్యాలను పరిశీలించారు. అలాగే పాఠశాలల భద్రత, పిల్లల రక్షణ, డిజిటల్ లెర్నింగ్, నిధుల వినియోగం, హాజరు పర్యవేక్షణ, పాఠశాలల్లో నాయకత్వ లక్షణాలు మొదలైన విషయాలను పరిశీలించారు. మొదటి రెండు అంశాల్లో గతం కంటే మెరుగైన మార్కులు సాధించగా.. మౌలిక వసతుల కల్పన, డిజిటల్ లెర్నింగ్‌లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 విద్యా సంవత్సరంలో వెనుకబడినట్లు తేలింది. అయితే గత విద్యా సంవత్సరం 2024–25లో మాత్రం అన్ని అంశాల్లో మెరుగుపడ్డామని, ఇందుకు ఈ ఏడాది పదో తరగతిలో సాధించిన ఫలితాలే నిదర్శనమని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. గతం కన్నా మెరుగు.. ఆరు అంశాల్లో 2022–23 విద్యా సంవత్సరం కంటే 2023–24 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల పనితీరు మెరుగుపడినట్లు స్పష్టమవుతోంది. ప్రధానంగా అభ్యసన ఫలితాలు, సమన్వయం, ఉపాధ్యాయుల పనితీరుపై మొత్తం 24 సూచికలకు 290 మార్కులు కేటాయించగా 2022–23 సంవత్సరంలో హనుమకొండ జిల్లా 109 మార్కులు సాధించింది. అత్యల్పంగా మహబూబాబాద్ జిల్లాకు 79 మార్కులు వచ్చాయి. అయితే 2023–24లో హనుమకొండ జిల్లాకు 122 మార్కులు రాగా.. మహబూబాబాద్‌కు 95 మార్కులొచ్చాయి. అలాగే మౌలిక సదుపాయాల కల్పనపై 12 సూచికల్లో 51 మార్కులకు 2022–23లో మహబూబాబాద్, హనుమకొండ జిల్లాలకు 29 మార్కుల చొప్పున వచ్చాయి. అదే మరుసటి సంవత్సరం హనుమకొండకు 29 మార్కులు రాగా.. మహబూబాబాద్ జిల్లాకు 27 మార్కులు వచ్చాయి. పాఠశాలల్లో పిల్లల భద్రతపై 31 మార్కులకు జనగామ, హనుమకొండ, ములుగు జిల్లాలకు 10 మార్కులకు పైగా రాగా మిగిలిన జిల్లాల్లో తక్కువగా వచ్చాయి.ప్రభుత్వ పాఠశాలలపై ఆరు అంశాలతో పీజీఐ సర్వే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2022–23 కన్నా 2023–24లో మెరుగైన ఫలితాలు శుభ సూచికం అంటున్న విద్యావేత్తలు జిల్లాల వారీగా ఆరు అంశాల్లో సాధించిన మార్కుల వివరాలు జిల్లా మొత్తం 2022–23 2023–24 మార్కులు వరంగల్ 600 226 245హనుమకొండ 600 250 275మహబూబాబాద్ 600 210 229జనగామ 600 235 271జేఎస్ భూపాలపల్లి 600 220 253ములుగు 600 214 231 -
రైల్వే సమస్యల పరిష్కారానికి కృషి
కాజీపేట రూరల్: కాజీపేటలో రైల్వే సంబంధిత సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఏడీఆర్ఎం గోపాలకృష్ణన్ అన్నారు. సికింద్రాబాద్‌లో మజ్దూర్ యూనియన్‌తో బుధవారం జరిగిన 164వ రివ్యూ రైల్వే ఏడీఆర్ఎం పీఎన్ఎం సమావేశంలో పాల్గొంనేందుకు కాజీపేట నుంచి యూనియన్ నాయకులు బుధవారం తరలివెళ్లారు. రైల్వే సంబంధిత, కార్మి కులు, ఉద్యోగులు, అధికారుల సమస్యలు ప్రస్తావించగా, పరిష్కారానికి ఏడీఆర్ఎం హామీ ఇచ్చిన ట్లు యూనియన్ సికింద్రాబాద్ డివిజన్ సెక్రటరీ పి.రవీందర్ తెలిపారు. కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్ వద్ద కార్మికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం, కాజీపేట రైల్వే రెఫరల్ ఆస్పత్రిగా శరత్ ఐ ఆస్పత్రి, ఎలక్ట్రిక్ లోకో షెడ్లో అడిషనల్ ఉమెన్ రూమ్స్, కాజీపేట రైల్వే ఎలక్ట్రిక్ లోకో షెడ్లో క్యాంటీన్ విస్తరణ, హసన్‌పర్తి – బిజిగిరి షరీఫ్ మధ్య అడిషనల్ పాయింట్స్ మెన్ల ఏర్పాటుకు గోపాలకృష్ణన్ అంగీకరించినట్లు పేర్కొన్నారు. -
పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగాధిపతి రాజీనామా!
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ హెచ్ఆర్ఎం విభాగాధిపతిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ పి.శ్రీనివాస్‌రావు ఆపదవికి రాజీనామా చేశారు. ఈమేరకు బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రామచంద్రం రాజీనామా పత్రం అందినట్లు ధ్రువీకరించారు. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో పీహెచ్డీ, పోస్ట్ డాక్టరల్ ఫెల్లోషిప్ పూర్తి చేసిన అభ్యర్థులు నలుగురున్నారు. ఈనెల 23న ముగ్గురు అభ్యర్థులు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో వర్క్‌లోడ్‌కు అనుగుణంగా పేపర్‌వైజ్‌గా విద్యాబోధనకు తమకు క్లాస్‌వర్క్‌కు అవకాశం కల్పించి అధ్యాపకులుగా నియమించాలని ఆవిభాగాధిపతి ప్రొఫెసర్ శ్రీనివాస్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. మిగతా విభాగాల్లో వర్క్‌లోడ్ చూపించి ఆయా విభాగాల అధిపతులు పేపర్‌వైజ్‌గా విద్యాబోధనకు అధ్యాపకులుగా నియమించారని, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో కూడా ఆ మాదిరిగానే వర్క్‌లోడ్ చూపించి తమకు అవకాశం కల్పించాలని విభాగాధిపతి శ్రీనివాస్‌రావును వారు కోరి వినతిపత్రం సమర్పించారు. కాగా.. వినతిపత్రాన్ని శ్రీనివాస్‌రావు పక్కకు వేసిరేసినట్లు.. దీంతో అభ్యర్థులు ఎందుకు విసేరేశారని ప్రశ్నించినట్లు సమాచారం. దీంతో అభ్యర్థులకు, శ్రీనివాస్‌రావుకు వాగ్వాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. అనంతరం అదే రోజు మనస్తాపంతో శ్రీనివాస్‌రావు విభాగాధిపతి పదవికి రాజీనామా చేస్తూ లేఖను రిజిస్ట్రార్‌కు పంపారు. ఇదిలా ఉంటే బుధవారం కేయూ రిజిస్ట్రార్ ఆచార్య వి.రాంచంద్రం ఆవిభాగానికి వెళ్లి మీరే విభాగాధిపతిగా కొనసాగాలని కోరినట్లు సమాచారం. అయినప్పటికీ తాను కొనసాగనని, తనను రిలీవ్ చేయాలని శ్రీనివాస్‌రావు రిజిస్ట్రార్‌ను కోరినట్లు సమాచారం. అయితే ఈవిషయంపై ‘సాక్షి’ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా.. నలుగురు పోస్ట్‌డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థుల వర్క్‌లోడ్ తెప్పించుకుని పరిశీలిస్తానని అభ్యర్థులకు తెలియజేసినట్లు తెలిపారు. అయితే శ్రీనివాస్‌రావు రాజీనామాను ఆమోదించవద్దని, ఆయననే విభాగాధిపతిగానే కొనసాగించాలని తనకు వినతిపత్రం కూడా ఆయా అభ్యర్థులు అందజేసినట్లు తెలిపారు. శ్రీనివాస్‌రావు రాజీనామాను ఆమోదించలేదని ఈనెల 26న వీసీ ఆచార్య కె ప్రతాప్‌రెడ్డి యూనివర్సిటీకి రానున్నారని.. ఈవిషయంపై నిర్ణయం తీసుకుంటారని వివరణ ఇచ్చారు. వర్క్‌లోడ్ విషయంపై తలెత్తిన వివాదం పోస్ట్ డాక్టరల్ పూర్తి చేసిన అభ్యర్థులతో వివాదం శ్రీనివాస్‌రావే కొనసాగాలని కోరిన రిజిస్ట్రార్ నేడు వీసీ దృష్టికి వివాదం -
23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యం
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ హన్మకొండ అర్బన్: వన మహోత్సవం సందర్భంగా జిల్లాలో వివిధ శాఖల ఆధ్వర్యంలో 23 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మంగళవారం ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ రాష్ట్ర ప్రభుత్వ వివిధ ప్రాధాన్యతా కార్యక్రమాలపై కలెక్టర్లతో వీసీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ నుంచి హాజరైన హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. వానాకాలం సీజన్లో ఎరువుల డిమాండ్‌కు అనుగుణంగా 6 వేల మెట్రిక్ టన్నులు అవసరం ఉందన్నారు. జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుకు 4 వేల ఎకరాలు, ప్లాంటేషన్‌కు 1,300 ఎకరాలు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. సమావేశంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, హనుమకొండ ఆర్డీఓ రమేశ్‌రాథోడ్, జిల్లా వ్యవసాయ అధికారి రవీందర్‌సింగ్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు. -
దళారుల దందా
రేషన్ కార్డులు మంజూరు చేయిస్తామని చేతివాటంహన్మకొండ అర్బన్: పేదల అవసరాన్ని ఆసరాగా చేసుకుని దళారులు అందిన కాడికి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సుమారు పదేళ్ల తర్వాత కొత్త రేషన్ కార్డులకు అనుమతి ఇవ్వడంతో అర్హులంతా మీ సేవలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. ఒక్కో మండలానికి రోజూ వందల సంఖ్యలో దరఖాస్తులు వస్తుండడంతో అధికారులు విచారణ చేయడంలో కొంత జాప్యం జరుగుతోంది. దీన్ని ఆసరాగా చేసుకుని దళారులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి తోడు సందట్లో సడేమియా అన్నట్లు కొందరు అవినీతికి అలవాటు పడిన మీ సేవ కేంద్రాల నిర్వాహకులు దరఖాస్తు చేయడంతో పాటు కార్డు కూడా ఇప్పిస్తామంటూ ఆఫర్లు ప్రకటించి డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. దీంతో నెత్తీనోరు బాదుకోవడం పేదల వంతవుతోంది. రెవెన్యూ ఉద్యోగులపైనే ఫిర్యాదులు.. జిల్లా కేంద్రంలో రేషన్ కార్డులతో పాటు ఇతర కులం, నివాసం, ఆదాయం వంటి పత్రాల కోసం నిత్యం రెవెన్యూ కార్యాలయాల్లో మీ సేవ కేంద్రాల వద్ద దళారులు తిష్ట వేసుకుంటున్నారు. తాము చెప్పిన పని చేయకపోతే రెవెన్యూ ఉద్యోగులపైనే ఏకంగా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్న ఘటనలు అధికారులను విస్మయానికి గురిచేస్తున్నాయి. తాజాగా హనుమకొండ మండల కార్యాలయంలో పనిచేసే డాటా ఎంట్రీ ఆపరేటర్‌పై ఏకంగా ఒక దళారి కలెక్టర్‌కే ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. అప్పటికే అతడి పరిస్థితి గమనించిన అధికారులు సదరు వ్యక్తి తీరుపై విస్మయానికి గురయ్యారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి హనుమకొండ, హసన్‌పర్తి, కాజీపేట మండల కార్యాలయాల్లో నిత్యకృత్యం. ఇక కొన్ని మీసేవ కేంద్రాల్లో పనిచేసే వారైతే రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేయడంతో పాటు అప్రూవల్ చేయించి ఇస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. ఈవిషయం అధికారుల దృష్టికి వచ్చినా చర్యలు తీసుకోకుండా వదిలేయడం ఆరోపణలకు ఆస్కారం ఇస్తోంది. కార్డు రాదనే భయంతో.. పదేళ్ల తర్వాత ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుకు అవకాశం ఇచ్చింది. అయితే ఇప్పుడు రాకపోతే ఇంకా ఎన్నేళ్లు ఎదురు చూడాల్సి వస్తుందోనన్న ఆందోళన పేదల్లో నెలకొంది. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో అడిగినంత ఇచ్చి పని చేయించుకుంటున్నారు. ఇదిలా ఉండగా.. ఈసారి ఫుడ్ సెక్యురిటీ కార్డు ఒకటి పకడ్బందీగా జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రైవేట్ వ్యక్తులతో కాకుండా కేవలం రెవెన్యూ సిబ్బందితో మాత్రమే విచారణ చేయిస్తోంది. వీరిలో కూడా కొందరు దరఖాస్తుదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈవిషయంపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఒకవైపు ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతుండడంతో మళ్లీ కార్డుల జారీ ప్రక్రియ నిలిచిపోతుందని పేదలు ఆందోళన చెందుతున్నారు. ఈవిషయంలో అధికారులు స్పందించి దళారుల బెడద నివారించి కొత్త కార్డులు పారదర్శకంగా జారీ చేయాలని కోరుతున్నారు. సమస్య ఉంటే నేరుగా ఆఫీసుకు రండి.. కార్యాలయానికి రేషన్ కార్డుల దరఖాస్తులతో వస్తున్న వ్యక్తులే పదేపదే రావడం గమనిస్తున్నాం. వీరి విషయంలో ప్రత్యేకంగా నిఘా పెట్టి వాటిని సమగ్రంగా విచారణ చేస్తున్నాం. ఈవిషయంలో దళారులను అరికట్టేందుకు పోలీసు వారికి ఫిర్యాదు చేసేందుకు చూస్తున్నాం. పేద ప్రజలు రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించవద్దు ఎవరికీ డబ్బులు ఇవ్వొద్దు. అన్ని ధ్రువపత్రాలు ఉంటే అధికారులు ఇంటికి వచ్చి విచారణ చేస్తారు. లేదంటే కార్యాలయానికి వస్తే నేరుగా అధికారులను కలవండి. రేషన్ కార్డు పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే నేరుగా కార్యాలయంలో ఫిర్యాదు చేయండి. – రంజిత్‌కుమార్, హనుమకొండ ఇన్చార్జ్ తహసీల్దార్ హనుమకొండ జిల్లాలో మొత్తం రేషన్ కార్డులు: 2,28,097(జనవరి 2025 వరకు) కొత్తగా అప్రూవల్ అయినవి: 3,419(జనవరి నుంచి జూన్ 1 వరకు) రెవెన్యూ సిబ్బందిపైనే ఫిర్యాదులు మధ్యవర్తులుగా కొందరు మీసేవ కేంద్రాల నిర్వాహకులు రూ.5 వేలు ఇస్తే రేషన్ కార్డు అంటూ ఆఫర్లు -
నేత పని, జీవన విధానంపై డాక్యుమెంటరీ
రామన్నపేట: వరంగల్ కొత్తవాడలోని చేనేత కార్మికుల గృహాలు, వారి పని ప్రక్రియను ఐఐసీడీ (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్ట్రాఫ్ట్ అండ్ డిజైన్) బృందం మంగళవారం పరిశీలించింది. పాత తరం నైపుణ్యాల్ని కాపాడేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ సహకారంతో ఐఐసీడీ ఉమ్మడి జిల్లాలోని వృత్తులకు సంబంధించిన అన్ని ఉత్పత్తులను డాక్యుమెంట్ చేయడానికి పూనుకున్నట్లు ప్రతినిదులు తెలిపారు. ఏళ్లు గడిచే కొద్ది పాతతరం కళాకారులు, నేత కార్మికులు వివిధ కారణాల వల్ల తమ నైపుణ్యాన్ని తదుపరి తరానికి అందించలేకపోతున్నారని, ఈ సవాల్‌ను ఎదుర్కొనేందుకు తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఈడాక్యుమెంటేషన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈబృందానికి టీపీసీసీ నేత, చేనేత విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిప్ప వెంకటేశ్వర్లు నేత కార్మికుల జీవన విధానాన్ని, వారి పనితీరును వివరించారు. కార్యక్రమంలో జిల్లా రూరల్ డెవలప్మెంట్ అథారిటీ అధికారులు భవాని, అశోక్, డాలియా తదితరులు పాల్గొన్నారు. -
ఎంజీఎంలో సెక్యూరిటీ గార్డు, స్వీపర్‌పై దాడి
ఎంజీఎం : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలోని అత్యవసర విభాగంలోని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్‌పై మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి దాడి చేశాడు. ఈఘటనపై అటు కాంట్రాక్ట్ యాజమాన్యం, ఇటు ఆస్పత్రి అధికారులు కనీసం పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం రాత్రి 11 గంటల సమయంలో చికిత్స కోసం వచ్చిన ఓ యువకుడు అత్యవసర విభాగంలో రక్తం మరకలు తుడుస్తున్న ఓ స్వీపర్‌పై అసభ్య పదజాలంతో దూషించడంతో అడ్డొచ్చిన సెక్యూరిటీ గార్డుపై దాడి చేశాడు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉండడంతో అక్కడున్న ఓ వార్డు బాయ్ వచ్చి సదరు వ్యక్తిని సముదాయించి పంపించేశాడు. సదరు యువకుడు మళ్లీ తిరిగి వచ్చి విధుల్లో ఉన్న పీఆర్ఓకు ఫోన్ చేయించి సెక్యూరిటీ సిబ్బందిని మరోసారి దుర్భాషలాడాడు. ఈఘటనలో అక్కడికి చేరుకున్న పీఆర్ఓ ‘అతను ఓ వీఐపీ.. అతడితో పెట్టుకుంటే మీ ఉద్యోగాలు పోతాయ్’ అని సెక్యూరిటీ గార్డు, స్వీపర్లపై రుసరుసలాడాడు. బెదిరించి దాడి చేసిన సదరు యువకుడికి దగ్గరుండి చికిత్స అందించి పంపించారు. కాగా, ఈఘటనతో ఖంగుతిన్న సెక్యూరిటీ గార్డులు మంగళవారం ఉదయం తమ కార్యాలయం వద్ద కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి వివరాలు సేకరించి వెళ్లిపోయారు. ఈ ఘటనపై సెక్యూరిటీ, శానిటేషన్ కాంట్రాక్టర్.. ఎంజీఎం పరిపాలనాధికారులకు రాత పూర్వకంగా ఫిర్యాదు చేయలేదు. దీంతో తాము ఎలాంటి చర్యలూ తీసుకోలేదని ఎంజీఎం పరిపాలనాధికారులు చెప్పడం కొసమెరుపు. మద్యం మత్తులో ఓ వ్యక్తి హల్చల్ పోలీసులకు ఫిర్యాదు చేయని ఎంజీఎం అధికారులు ఎవరు ఆ వీఐపీ?మద్యం మత్తులో వచ్చి సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి పీఆర్ఓకు ఫోన్ చేయించి చికిత్స పొందిన ఆ వీఐపీ ఎవరు అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది. దాడికి గురైన మహేశ్ అనే సెక్యూరిటీ గార్డు ఎంజీఎంలో వైద్యుల వద్ద చికిత్స పొందాడు. ఇంత జరిగినా ఆ వీఐపీ రోగిపై చర్యలు తీసుకునేందుకు సెక్యూరిటీ కాంట్రాక్టర్ ఫిర్యాదు చేయకపోవడం, ఎంజీఎం పరిపాలనాధికారులు రాతపూర్వకంగా ఫిర్యాదు అందలేదని దాటవేయడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు ఏదైనా పెద్ద ఘటన జరిగితే తమ పరిస్థితి ఏంటని సెక్యూరిటీ సిబ్బంది, స్వీపర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
యువతను నిర్వీర్యం చేస్తున్న డ్రగ్స్
హన్మకొండ: మాదక ద్రవ్యాల వినియోగంతో యువత భవిష్యత్ నిర్వీర్యం అవుతోందని జిల్లా రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ అన్నారు. మంగళవారం హనుమకొండ అంబేడ్కర్ భవన్లో మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా రెవెన్యూ అధికారి వై.వి.గణేశ్ మాట్లాడుతూ.. పాఠశాలలు, కళాశాలల సమీప షాపుల్లో చాక్లెట్లు, బిస్కెట్ల రూపంలో మాదక ద్రవ్యాలు అమ్ముతున్నట్లు.. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు.. పిల్లల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. హనుమకొండ ఏసీపీ నరసింహారావు మాట్లాడుతూ.. మాదక ద్రవ్యాల రవాణాపై పోలీస్ వ్యవస్థ అప్రమత్తంగా ఉందన్నారు. ఈసందర్భంగా ప్రతిజ్ఞ చేయించారు. సదస్సులో టీజీనాబ్ ఏసీపీ సైదులు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కె.ప్రహసిత్, జిల్లా సంక్షేమ అధికారి జయంతి, కేర్‌అండ్‌క్యూర్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ఆచార్య రవికుమార్, ప్రొహిబిషన్–ఎక్సైజ్ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ మాట్లాడారు. జిల్లా సంక్షేమ అధికారి అధ్యక్షతన జరిగిన ఈసదస్సులో నర్సింగ్ ఆఫీసర్ అరుణకుమారి, ఇన్చార్జ్ డీసీపీఓ ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎఫ్ఆర్ఓ రవి కృష్ణ, సఖి అడ్మిన్ పి.హైమావతి, జిల్లా మహిళా శక్తి కో–ఆర్డినేటర్ డి.కళ్యాణి, చైల్డ్ హెల్ప్ లైన్ కో–ఆర్డినేటర్ భాస్కర్ పాల్గొన్నారు. హనుమకొండ రెవెన్యూ అధికారి వైవీ.గణేశ్ విద్యార్థులకు అవగాహన -
చౌరస్తా విస్తరణలో జాప్యం
కాజీపేట: కాజీపేట చౌరస్తా విస్తరణలో జాప్యం కారణంగా వాహనదారులకు అవస్థలు తప్పట్లేదు. నాలుగు వైపుల నుంచి వచ్చే వాహనాల్ని నియంత్రించేందుకు సిగ్నలింగ్ వ్యవస్థ ఉన్నప్పటికీ ట్రాఫిక్ సిబ్బంది ఉంటే తప్ప.. వాహనదారులు సాఫీగా వెళ్లే పరిస్థితి లేదు. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రేడియల్ రోడ్డు నిర్మించాక ఈమార్గంలో ప్రయాణించే వాహనాలు అధికమయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన వారు వరంగల్ మీదుగా ఉన్న జాతీయ రహదారులను చేరుకునేందుకు సైతం ఈరోడ్డును ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాజీపేట చౌరస్తా సమీపంలో షాపులు, రోడ్లపై నిలిపిన వాహనాల కారణంగా ఆప్రాంతంలో నిత్యం వాహనాలు బారులుదీరుతున్నాయి. చౌరస్తా ఇరుకుగా ఉండడం.. ఓ వైపు స్తంభాలు, దుకాణాల ర్యాంపులు, మెట్లు, ముందుకు జరిపేసిన షెడ్లు.. నిబంధనలకు విరుద్ధంగా వెలిసిన చిరువ్యాపారుల బండ్ల వల్ల నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి మున్సిపల్, ‘కుడా’ అధికారులు వరంగల్ నగరంలో చౌరస్తాల విస్తరణ, సుందరీకరణ చేపట్టాలని 2022లో నిర్ణయించారు. ఆజాబితాలో కాజీపేట చౌరస్తా సైతం ఉంది. అదే ఏడాది సర్వే చేయడంతో పాటు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ట్రాఫిక్ రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయని ట్రాఫిక్ పోలీసులు టౌన్ ప్లానింగ్ అధికారులకు సమస్య తీవ్రతను వివరించారు. పనులు మంజూరయ్యేలోపు తాత్కాలిక చర్యలు చేపట్టాలని కోరారు. చౌరస్తాను జీరో సర్కిల్ ఆకారంలో నిర్మించాలని, విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాలు, రైల్వే స్టేడియం, త్రిబుల్ ఎస్ కాంప్లెక్స్, పోలీస్‌స్టేషన్ ప్రహరీని తొలగించాల్సి ఉంటుందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఇది గడిచి మూడేళ్లవుతున్నా.. పనులు మాత్రం నత్తనడకనే సాగుతున్నాయి. చౌరస్తా విస్తరణకు అడ్డంకిగా ఉన్న భవనాల తొలగింపు విషయం అధికారులు, ప్రజాప్రతినిధులకు తలనొప్పిగా మారింది. నిధులు మంజూరైనా.. ఎట్టకేలకు ఈఏడాది చౌరస్తా అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. చౌరస్తాలో క్రాస్ డివైడర్ కట్టి వివిధ ఆకారాల్లో ఉన్న బొమ్మలను ఏర్పాటు చేసి లాంఛనంగా ప్రారంభించి అధికారులు చేతులు దులుపుకున్నారు. ముసుగులు వేసి వదిలేశారు. అసలే ఇరుకుగా ఉన్న చౌరస్తా కావడంతో పాటు ఇరువైపులా ఉన్న దుకాణాల వద్దకు నిత్యం వచ్చే వారి వాహనాలతో ట్రాఫిక్ స్తంభిస్తోంది. చౌరస్తా సమీపంలోని బహుళ అంతస్తుల భవనాల యజమానులు సెట్‌బ్యాక్‌తో నిర్మాణాలు చేపట్టకపోవడంతో ట్రాఫిక్ సమస్య మరింత జఠిలమవుతోంది. వేలాది వాహనాలు.. కాజీపేట పట్టణ చౌరస్తా మీదుగా నిత్యం వేలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. పలు జిల్లాలను అనుసంధానం చేసే రహదారి ఇదొక్కటే కావడం గమనార్హం. ట్రాఫిక్ సిగ్నల్స్ పడినప్పుడు వాహనదారులు ఎదుర్కొనే ఇబ్బందులు వర్ణనాతీతం. అధికారులు ఇప్పటికై నా స్పందించి చౌరస్తాను విస్తరించాలని స్థానికులు కోరుతున్నారు. విస్తరిస్తేనే సమస్యకు పరిష్కారం ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా కాజీపేట చౌరస్తా విస్తరణ పనులను అధికారులు పూర్తి చేయాలి. చౌరస్తా ప్రాంతంలో రహదారులు ఇరుకుగా ఉండడంతో వచ్చిపోయే వాహనదారులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. – పిల్లల సుధాకర్, వ్యాపారి ప్రజలు సహకరించాలి.. రహదారి విస్తరణకు వందశాతం ప్రయత్నాలు మొదలు పెట్టాం. నిధులకు ఇబ్బంది లేదు. చౌరస్తాకు అటూఇటుగా ఉన్న భవనాల తొలగింపు సమస్యే ప్రధాన అడ్డంకిగా మారింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాజకీయ పార్టీలకు అతీతంగా పట్టణ ప్రజలు సహకరిస్తే పనులు ప్రారంభమవుతాయి. – నాయిని రాజేందర్‌రెడ్డి, పశ్చిమ ఎమ్మెల్యే కాజీపేటలో నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు పట్టించుకోని అధికారులు -
డీపీఆర్ త్వరగా సిద్ధం చేయండి
మేయర్ గుండు సుధారాణి వరంగల్ అర్బన్: అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ ఏర్పాటుకు అవసరమయ్యే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్(డీపీఆర్)ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం బల్దియా ప్రధాన కార్యాలయంలోని మేయర్ చాంబర్లో, కమిషనర్ చాహత్ బాజ్ పాయ్‌తో కలిసి పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. 66 డివిజన్లకు సంబంధించిన అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ, సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల పురోగతిని సమీక్షించారు. ఈసందర్భంగా బిల్డ్ కాన్ కన్సల్టెన్సీ ప్రతినిధి అగర్వాల్ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు, జోన్ల వారీగా విభజన, ఎస్టీపీల ఏర్పాటుకు భూ కేటాయింపు, తదితర అంశాలపై వివరించారు. సమావేశంలో ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, ఇన్చార్జ్ సీపీ రవీందర్ రాడేకర్, ఈఈలు, డీఈలు, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు. డ్రెయినేజీ పనులు పూర్తి చేయాలి.. వరంగల్ చౌరస్తా: వరంగల్ రామన్నపేట 28వ డివిజన్లో మేయర్ సుధారాణి అభివృద్ధి పనులు, పారిశుద్ధ్య నిర్వహణ తీరును మంగళవారం పర్యవేక్షించారు. పాత థియేటర్ వద్ద డ్రెయినేజీ నిర్మాణం అసంపూర్తిగా ఉండడం, కాల్వలో చెత్త పేరుకుపోవడంతో మేయర్ ఇంజనీర్లను, ప్రజారోగ్య విభాగాధికారులను మందలించారు. డ్రెయినేజీల్లో పూడికతీత పనులు పూర్తి చేయాలని సూచించారు. ఆమె వెంట సీఎంహెచ్ఓ రాజేశ్, ఇంజనీర్లు ఉన్నారు. -
యూరియా సరిపోయెనా..?
● ఉమ్మడి జిల్లాకు చేరిన 1,315 మెట్రిక్ టన్నుల యూరియా ● రేపు మరో 45,210 బస్తాల రాక ఖిలా వరంగల్: వానాకాలం వచ్చేసింది. అన్నదాతలు ముమ్మరంగా సాగు పనుల్లో నిమగ్నమయ్యారు. మరో వైపు డిమాండ్‌కు అనుగుణంగా ఎరువుల సరఫరా లేకపోవడంతో రైతుల్లో భయాందోళన మొదలైంది. మున్ముందు ఇదే పరిస్థితి ఉంటే ఇంకెన్ని ఇబ్బందులు ఎదురవుతాయోనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎరువుల సరఫరా తగినంత లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో రేట్లు పెంచేసి సోమ్ము చేసుకునే పరిస్థితి కనిపిస్తోంది. జిల్లాలో సుమారు 3,08,320 ఎకరాల్లో పత్తి, వరి, మొక్కజొన్న, కంది, మిర్చి, పసుపు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. పంట చేతికొచ్చెవరకు సుమారు 6 వేలపైగా బ్యాగుల యూరియా అవసరం. కానీ ఈ ఏడాది రైతులకు అవసరమైనంత మేర దొరకడం కష్టంగా కనిపిస్తుంది. నెలవారీ కోటాలో కేంద్రం కోత విధిస్తుండడంతో భవిష్యత్‌లో యూరియా సరఫరా ఆశాజనకంగా ఉండకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. డీఏపీ, 20:20 ఇతర ఎరువుల కొరత ఉండకపోవచ్చని సమాచారం. యూరియా, ఇతర ఎరువుల సరఫరా నిల్వలపై వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు దృష్టి సారిస్తున్నప్పటికీ నిల్వల వివరాలు చేప్పేందుకు వెనకాడుతున్నారు. అవసరం మేరకు సరఫరా లేకపోవడంతోనే ప్రస్తుతం వివరాలు బహిర్గతం చేయడంలేదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నేడు రైతులతో సీఎం ముఖాముఖి సీఎం రేవంత్‌రెడ్డి నేడు (మంగళవారం) రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. వానాకాలం –2025కు సంబంధించి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం ద్వారా విజయవంతంగా రైతుల ఖాతాల్లో జమ చేసిన సందర్భంగా రైతు వేదికల్లో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం ముఖాముఖి నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం 33 రైతు వేదికల్లో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రత్యేక, నోడల్ ఆఫీసర్‌గా నియమించబడిన జిల్లా, మండల స్థాయి అధికారులు, రైతు వేదికల వద్దకు ప్రజా ప్రతినిధులు, రైతులను ఆహ్వానించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 1,52,975 మంది రైతుల ఖాతాల్లో రూ.153.47కోట్లు రైతు భరోసా ద్వారా జమచేసినట్లు తెలిపారు. -
నిబంధనల మేరకే ఎంటీపీ కిట్ వినియోగించాలి
ఎంజీఎం: గైనకాలజిస్టుల పర్యవేక్షణలో, చట్టంలో సూచించిన గైడ్‌లైన్స్ ప్రకారమే ఎంటీపీ కిట్ విని యోగించాలని డీఎంహెచ్ఓ అప్పయ్య సూచించా రు. సోమవారం హనుమకొండ కలెక్టరేట్లోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్ అసోసియేషన్ గైనకాలజిస్ట్ అసోసియేషన్, ఔషధ నియంత్రణ విభాగం, ఆర్ఎంపీ అసోసియేషన్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ బాధ్యులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా డీఎంహెచ్ఓ అప్పయ్య మాట్లాడుతూ.. మెడికల్ షాపుల యజమానులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్లు లేకుండా అమ్మకూడదని, అలాగే ఎవరికి అమ్ముతున్నారో వారి వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఇప్పటికే ఈ విషయంలో డ్రగ్ ఇన్స్పెక్టర్కు సర్క్యూలర్ జారీ చేసినట్లు తెలి పారు. డీఎంహెచ్ఓ ద్వారా అనుమతి పొందిన హాస్పిటల్స్ మాత్రమే ఎంటీపీ నిర్వహించాలని ఆదేశించారు. సొంతంగా ఎంటీపీ కిట్ వినియోగం వల్ల వచ్చే అనర్థాల గురించి క్షేత్రస్థాయి సిబ్బంది ద్వారా అవగాహన కలిగించనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా ఆస్పత్రుల సమన్వయ అధికారి గౌత మ్ చౌహన్, గైనకాలజిస్టుల సంఘం అధ్యక్షురాలు డాక్టర్ శ్రీలక్ష్మి, ఐఎంఏ ఉపాధ్యక్షుడు నరేశ్‌కుమార్, మాతా శిశు సంక్షేమం ప్రోగ్రాం అధికారి మంజుల, ప్రభుత్వ ప్రసూతి వైద్యశాల అసోసియేట్ ప్రొఫెసర్ ప్రసన్నలక్ష్మి, కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్,జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్‌రెడ్డి, స్టాటిస్టికల్ అధికారి ప్రసన్నకుమార్, ఔషధ నియంత్రణ విభాగం సూపరింటెండెంట్ సత్యనారాయణ, ఆర్ఎంపీ అసోసియేషన్ కార్యదర్శి రమేశ్, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి టి.సుమలత, రాజేశ్వర్‌రెడ్డి సుప్రియ పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ అప్పయ్య -
దరఖాస్తులు పెండింగ్ ఎందుకున్నాయి?
హన్మకొండ అర్బన్: హనుమకొండ కలెక్టరేట్లో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజలు ఇచ్చిన వినతులను స్వీకరించిన ఆమె మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన దరఖాస్తుల పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పారు. గ్రీవెన్స్ జరుగుతున్న క్రమంలో కొద్దిసేపు ఆపి అధికారులతో సమీక్ష నిర్వహించారు. గత వారం వరకు శాఖల వారీగా ఎన్ని దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయో పరిశీలించి ఒక్కో అధికారిని వివరాలు అడిగారు. పెద్ద మొత్తంలో పెండింగ్‌లో ఉన్న శాఖల వారిని పిలిచి ‘మీ శాఖకు వచ్చిన దరఖాస్తులు ఎన్నో తెలుసా? ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి.. మీరేం చేస్తున్నారు?’ అని ప్రశ్నించారు. ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యల పరిష్కారం కోసం వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా పరిష్కరించాలని, ఇకపై పెండింగ్‌లో ఉంచితే సహించేది లేదని హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. ప్రజావాణిలో వినతులు స్వీకరిస్తున్న కలెక్టర్.. సమస్యలపై సంబంధిత అధికారులను పిలిచి అడిగారు. కొన్ని మండలాలకు సంబంధించి తహసీల్దార్లు, ఎంపీడీఓలతో మాట్లాడాల్సిన అవసరం రావడంతో వెబ్ కాన్ఫరెన్స్‌లోకి తీసుకుని పలు సూచనలు చేశారు. వినతులు పరిశీలించి విచారణ చేపట్టి నాలుగు రోజుల్లోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాకపోతే ఆ విషయం దరఖాస్తుదారుడికి తెలియజేయాలన్నారు. అలాగే సమస్య ఏ స్థాయిలో పరిష్కార దిశలో ఉంది? అనే విషయం ఆన్లైన్లో కనిపించేలా అప్డేట్ చేయాలని, ఏ అధికారి వద్ద ఫిర్యాదు ఆగిందో ఆ అధికారి పేరు తెలిసేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. అధికారులను ప్రశ్నించిన హనుమకొండ కలెక్టర్ గ్రీవెన్స్‌లో వెబ్ కెమెరాలు చూస్తూ.. అర్జీలను పరిశీలించిన స్నేహ శబరీష్దారి చూపండి.. దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వండి వరంగల్ కలెక్టర్ సత్యశారద న్యూశాయంపేట: వ్యవసాయ పనులు చేసుకోవడానికి వెళ్లే దారిని కొంతమంది భూస్వాములు ఆక్రమించుకున్నారు. నక్షాలో ఎడ్లబండ్లు వెళ్లేందుకు దారి ఉంది. ఆ దారిని కొంత మంది వ్యక్తులు ఆక్రమించుకుని పొలాలకు చదును చేశారు.. వారిపై చర్యలు తీసుకుని పొలాలకు దారి చూపండి అంటూ.. రాయపర్తి మండల కేంద్రానికి చెందిన సుమారు 30 మంది రైతులు వరంగల్ కలెక్టర్ సత్యశారదను వేడుకున్నారు. కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో వినతి పత్రాన్ని అందజేశారు. గ్రీవెన్స్‌లో కలెక్టర్‌తోపాటు అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్ఓ విజయలక్ష్మి, జెడ్పీ సీఈఓ రామ్‌రెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈకార్యక్రమంలో జిల్లా అధికారులు నీరజ, విశ్వప్రసాద్, జ్ఞానేశ్వర్, అనసూయ, పుష్పలత, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్రావు తదితరులు పాల్గొన్నారు. -
వీసీని కలిసిన కేయూ ఎన్జీఓ నూతన కార్యవర్గం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ ఎన్జీఓ ఎంప్లాయీస్ అసోసియేషన్‌కు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆ అసోసియేషన్ నూతన కార్యవర్గం అధ్యక్షుడు బి.నవీన్‌కుమార్, జనరల్ సెక్రటరీ వల్లాల తిరుపతి, ఇతర బాధ్యులు సోమవారం మర్యాదపూర్వకంగా వీసీ ఆచార్య కె.ప్రతాప్‌రెడ్డిని కలిశారు. ఈసందర్భంగా ఎన్జీఓ కేడర్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వీసీ దృష్టికి తీసుకెళ్లారు. వీసీని కలిసిన వారిలో ఎన్జీఓ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మహ్మద్ యూనస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎ.సతీశ్‌బాబు, రిక్రియేషన్ సెక్రటరీ తోట ప్రభాకర్, కోశాధికారి తాటి దామోదర్, మహిళా సెక్రటరీ బి.కృష్ణవేణి ఉన్నారు. -
నేడు డీసీసీబీ మహాజన సభ
హన్మకొండ : వరంగల్ జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) మహాజన సభ నేడు (మంగళవారం) నిర్వహిస్తున్నట్లు ఆ బ్యాంక్ ముఖ్య కార్యనిర్వహణాధికారి వజీర్ సుల్తాన్ తెలిపా రు. ఉదయం 11గంటలకు హనుమకొండ నక్కలగుట్టలోని డీసీసీబీ ప్రధాన కార్యాలయంలో చైర్మన్ మార్నేని రవీందర్ రావు అధ్యక్షతన ఈ సభ జరుగుతుందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రుణాల పంపిణీ, వ్యవసాయ, విద్య రుణాల జారీ, వసూళ్లు వివిధ పథకాలపై చర్చించనున్నట్లు ఆయన వివరించారు. పూర్వ వరంగల్ జిల్లా పరిధిలోని పీఏసీఎస్ చైర్మన్లు, వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొనాలని కోరారు. విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలి ● ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ నరేందర్ కేయూ క్యాంపస్ : విద్యావేత్తలు రాజకీయాల్లోకి రావాలని అప్పుడే దేశంలో విలువల పాలన నిర్మితమవుతుందని ఆల్ ఇండియా ఓబీసీ జేఏసీ చైర్మన్ సాయిని నరేందర్ పేర్కొన్నారు. హనుమకొండలోని యూనివర్సిటీ ఆర్ట్స్అండ్ సైన్స్ కాలేజీలో డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్ తెలుగు విభాగం అధిపతిగా సోమవారం బాధ్యతలు స్వీకరించగా, సన్మానించారు. ఓబీసీ జాక్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు తాడిశెట్టి క్రాంతికుమార్, బీసీ ఉద్యోగ సంఘాల బాధ్యులు బుసగొండ ఓంకార్, చాపర్తికుమార్, వల్లాల జగన్‌గౌడ్, రాసమల్ల శ్రీనివాస్, నారాయణగిరి రాజు, నలుబాల రవికుమార్, సుధాకర్ పాల్గొన్నారు. కాజీపేట మీదుగా 8 ప్రత్యేక రైళ్లు ● నేటినుంచి ప్రారంభం కాజీపేట రూరల్ : ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా కాజీపేట జంక్షన్ మీదుగా దక్షిణ మధ్య రైల్వే, బిలాస్పూర్ రైల్వే అధికారులు కాచిగూడ–బిలాస్పూర్ మధ్య 8 ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ సోమవారం తెలిపారు. ప్రత్యేక రైళ్ల వివరాలు.. జూన్ 23 నుంచి జూలై 7వ తేదీ వరకు బిలాస్పూర్లో ప్రతి సోమవారం బయలుదేరే బిలాస్పూర్–కాచిగూడ (08263) వెళ్లే ఎక్స్‌ప్రెస్ మంగళవారం కాజీపేటకు చేరుకొని వెళ్తుంది. అదేవిధంగా జూన్ 24వ తేదీ నుంచి జూలై 15వ తేదీ వరకు కాచిగూడ–బిలాస్పూర్ (08264) వెళ్లే ఎక్స్‌ప్రెస్ ప్రతి మంగళవారం కాజీపేట జంక్షన్‌కు చేరుకొని వెళ్తుంది. 3 ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లతో ప్రయాణించే ఈ రైళ్ల సర్వీస్‌లకు బిలాస్పూర్, రాయ్‌పూర్, దుర్గ్, రాజ్‌నందగాం, డోంగ్ర, గోండియా, వడ్సా, చాంద ఫోర్ట్, బలర్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, మంచిర్యాల, రామగుండం, కాజీపేట, చర్లపల్లి, మల్కాజ్గిరి స్టేషన్లలో హాల్టింగ్ కల్పించినట్లు సీపీఆర్వో తెలిపారు. -
ప్రజా ఫిర్యాదులపై శ్రద్ధ పెట్టండి
● నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు ● బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ వరంగల్ అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై అధికారులు శ్రద్ధ వహించాలి.. నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ హెచ్చరించారు. సోమవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో కమిషనర్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 133 అర్జీలు రాగా.. అందులో టౌన్ ప్లానింగ్ 68, ఇంజనీరింగ్ 41, హెల్త్–శానిటేషన్ 12, ప్రాపర్టీ టాక్స్(రెవెన్యూ)9, మంచినీటి సరఫరా 3 ఉన్నాయి. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన వినతులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పెండింగ్‌లో ఉండకుండా చూడాలని ఆయా విభాగాల అధికారులకు సూచించారు. సిటిజన్ చార్టర్ ప్రకారం సకాలంలో సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న, చేపట్టబోయే అభివృద్ధి పనులను నాణ్యతగా జరిగేలా ఇంజనీరింగ్ అధికారులు నిత్యం పర్యవేక్షించాలని ఆదేశించారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం నిబంధనల మేరకు అంతర్గత రోడ్లు నిర్మించాలని, రోడ్ల నిర్మాణానికి ముందు తప్పకుండా మురుగు కాల్వలు నిర్మాణం చేపట్టాలని పేర్కొన్నారు. బల్దియా ఆధ్వర్యాన నిర్వహించే ఉద్యానవనాల్లో పచ్చదనం, లైటింగ్, ఆట వస్తువుల నిర్వహణ సక్రమంగా ఉండాలని, అవసరం మేరకు మరమ్మతులు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ జోనా, సీఎంహెచ్ఓ డాక్టర్ రాజారెడ్డి, డీఎఫ్ఓ శంకర్లింగం, ఇన్చార్జ్ ఎస్ఈ మహేందర్, సిటీ ప్లానర్ రవీందర్, రాడేకర్, హెచ్ఓలు రమేశ్, లక్ష్మారెడ్డి, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, రాజేశ్వర్, ఎంహెచ్ఓ డాక్టర్ రాజేశ్, టీఓ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
హన్మకొండ : విద్యుత్ ఉద్యోగుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు టీజీ ఎన్పీడీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం నక్కలగుట్టలోని టీజీ ఎన్పీడీసీఎల్ హనుమకొండ సర్కిల్ కార్యాలయంలో నిర్మించిన విద్యుత్ ఉద్యోగ అమరుల స్మృతి చిహ్నాన్ని సీఎండీ వరుణ్ రెడ్డి ఆవిష్కరించారు. సీ ఎండీతో పాటు డైరెక్టర్లు, అధికారులు, ఉద్యోగులు పూలమాల వేసి విద్యుత్ అమరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యుత్ ప్రమాదకరమైనదని తెలిసి నిర్లక్ష్యంగా ఉంటూ ప్రాణాల మీదికి తెచ్చుకోవడం బా ధాకరమన్నారు. ఎల్సీ యాప్‌ను విధిగా వాడాలన్నారు. విద్యుత్ ఉద్యోగులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విధినిర్వహణలో విద్యుత్ ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పుతున్న వారి జ్ఞాపకార్థం 16 సర్కిళ్లలో స్మృతి చిహ్నాలు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో ముందుగా హనుమకొండ సర్కిల్లో నిర్మించామని తెలిపారు. ప్రతి ఏటా విద్యుత్ ఉద్యోగుల సంస్మరణ దినాన్ని నిర్వహించనున్నట్లు, మృతిచెందిన ఉద్యోగులకు అందాల్సిన ప్రయోజనాలన్ని 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. విద్యుత్ ప్రమాదాలు జరుగకుండా క్షేత్రస్థాయి వరకు ఉద్యోగులచే ప్రతిజ్ఞ చేయించాలన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జ్ డైరెక్టర్లు బి.అశోక్ కుమార్, టి.సదర్ లాల్, టి.మధుసూదన్, వి.తిరుపతి రెడ్డి, సీఈలు కె.తిరుమల్ రావు, రాజు చౌహన్, రవీంద్రనాధ్, హనుమకొండ ఎస్ఈ పి.మధుసూదన్ రావు, వరంగల్ ఎస్ఈ కె.గౌతమ్ రెడ్డి, డీఈలు ఎ.విజేందర్ రెడ్డి, జి.సాంబరెడ్డి, సామ్య నాయక్, దర్శన్ కుమార్, భిక్షపతి, ఆనందం, హర్జి, ఎస్ఏఓ నవీన్ కుమార్, ట్రేడ్ యూనియన్ నాయకులు ఇనుగాల శ్రీధర్, కె.వి.జాన్సన్, మన్నె శశి కుమార్, అజ్మీరా శ్రీరామ్ నాయక్, బి.దానయ్య, కుమార స్వామి పాల్గొన్నారు. సమస్యలపై సీఎండీ సానుకూల స్పందన విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై టీజీఎన్పీడీసీఎల్ చైర్మన్, ఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలంగాణ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి, ఎన్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షుడు బొల్లి వెంకటరాజు, కార్యదర్శి ఎ.ఆంజనేయులు తెలిపారు. సోమవారం హనుమకొండలోని ప్రధాన కార్యాలయంలో వారు సీఎండీని కలిసి వినతిపత్రాన్ని అందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు. తమ సమస్యలు విన్న సీఎండీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. వచ్చే నెలలో విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్ల బదిలీలు ఉంటాయని చెప్పారన్నారు. టీయూఈఈయూ నాయకులు శ్రీనివాస్, సుదర్శన్ వర్మ, సంతోష్, కర్నాల అనిల్ కుమార్, మధుసూదనరావు పాల్గొన్నారు. ఎల్సీ యాప్‌ను విధిగా వాడాలి టీజీఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్‌రెడ్డి -
అనాథ చిన్నారులను చదివిస్తాం..
విద్యారణ్యపురి : తల్లిదండ్రుల మృతితో అనాథలైన చిన్నారులను న్యాయ సేవాధికార సంస్థ (డీఎల్ఎస్ఏ) హనుమకొండ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి క్షమాదేశ్ పాండే, డీఎల్ఎస్ఏ వరంగల్ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సాయికుమార్ సోమవారం హనుమకొండలోని వివేకానందనగర్‌లోని సాయిట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ జిల్లా గీసుకొండ మండలం పోతరాజుపల్లికి చెందిన ఓని రమేశ్, అతడి భార్య తిరుపతమ్మ ఆరునెలల క్రితం మరణించారు. వీరికి కుమారులు గౌతమ్, గర్విక్ ఉన్నారు. కాగా రమేశ్ అన్న విజయ్ ప్రస్తుతం హనుమకొండలోని భవానినగర్‌లో ఉంటున్నాడు. తమ్ముడి పిల్లల ఆలనాపాలనకు తాము గార్డియన్‌గా ఉన్నామని అయితే వీరిని చదివించే స్థోమత తమకు లేదని వీరికి హాస్టల్ వసతితో పాటుగా విద్యను అందించే సదుపాయం కల్పించాలని ఇటీవల విజయ్ హనుమకొండ జిల్లా న్యాయసేవాధికారి సంస్థకు వినతి పత్రం అందజేశారు. దీంతో స్పందించిన డీఎల్ఎస్ఏ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి హనుమకొండ కార్యదర్శి క్షమాదేశ్‌పాండే, వరంగల్ డీఎల్ఎస్ఏ సెక్రటరీ సాయికుమార్ చైల్డ్వెల్ఫేర్ కమిటీ సహకారంతో సోమవారం ఇద్దరు చిన్నారులను వివేకానందనగర్‌లోని సాయిస్పందన హైస్కూల్లో చేర్పించారు. గౌతమ్‌ను 5వ తరగతిలో, గర్విక్ను ఒకటోతరగతిలో చేర్పించారు. పాఠశాలలో చేర్పించిన సీనియర్ సివిల్ జడ్జిలు -
ట్రాక్టర్ బోల్తా.. అన్నదాత దుర్మరణం
● లక్ష్మారెడ్డిపల్లెలో ఘటన గణపురం : సొంత వ్యవసాయ భూమిలో కల్టివేటర్‌తో దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు ఓద్దుల రాంరెడ్డి (46) అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ విషాద ఘటన సోమవారం గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లెలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు రాంరెడ్డి తన భూమిలో సొంత ట్రాక్టర్‌తో దున్నుతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు రాంరెడ్డిని బయటకు తీసే ప్రయత్నం చేసిన సాధ్యపడలేదు. వెంటనే క్రేన్ సహాయంతో ట్రాక్టర్‌ను పక్కకు జరిపి రాంరెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య జ్యోతి, కుమారుడు, కూతురు ఉన్నారు. జ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. అందరితో కలిసిమెలిసి ఉండే రాంరెడ్డి మృతితో గ్రామంలో విషాధచాయలు అలుముకున్నాయి. బైక్ అదుపుతప్పి ఆర్ఎంపీ మృతి ఎల్కతుర్తి : బంధువుల వేడుకకు వెళ్లి వస్తుండగా బైక్ అదుపుతప్పి ఓ ఆర్ఎంపీ అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన సోమవారం భీమదేవపల్లి మండలం గట్లనర్సింగాపూర్ శివారులో జరిగింది. ఎస్సై సాయిబాబు కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జగన్నాథపూర్ గ్రామానికి చెందిన ఆర్ఎంపీ చిర్ర సుదర్శన్ (60) ఆదివారం హుస్నాబాద్‌లో జరిగిన బంధువుల ఫంక్షన్‌కు ద్విచక్ర వాహనంపై వెళ్లి అర్ధరాత్రి 1గంటకు తిరిగి వస్తున్నాడు. ఈక్రమంలో బైక్ అదుపుతప్పి కిందపడి పోయాడు. దీంతో అతడి తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు. రైలు నుంచిపడి వ్యక్తి.. ఖిలా వరంగల్ : ప్రమాదవశాత్తు రైలు నుంచి జారీ పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం సాయంత్రం నెక్కొండ–ఎలుగూరు రైల్వే స్టేషన్ మధ్య గేటుపల్లి తండా సమీపంలో చోటుచేసుకుంది. జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ ఎస్.రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. నెక్కొండ– ఎలుగూరు రైల్వే గేటు మధ్య గేటుపల్లి తండా సమీపంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు 55 ఏళ్ల వయసు గల వ్యక్తి సోమవారం పడి దుర్మరణం చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతుడు బూడిద కలర్ కాటన్ ప్యాంట్, గులాబీ కలర్ ఫుల్ షర్ట్, తెల్ల బనియన్, బ్రౌన్ కలర్ డ్రాయర్ ధరించి ఉన్నాడని, తెల్లని వెంట్రుకలు, గడ్డం మీసాలు కలిగి ఉన్నాడు. మృతుడు 5.6 ఎత్తు, ఎరుపు రంగు గుండ్రని ముఖం, గుర్తు పట్టుటకు పొట్ట, ఛాతిపై పుట్టుమచ్చలు కలవు. రైల్వే అధికారుల ఫిర్యాదు మేరకు సోమవారం కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించి భద్రపరిచారు. ఎవరైనా గుర్తిస్తే 98497 49220 సమాచారం అందజేయాలని జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ రవీందర్ రెడ్డి తెలిపారు. -
ఉమ్మడి జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ విజేత కానిపర్తి
కమలాపూర్ : ఉమ్మడి వరంగల్ జిల్లాస్థాయి బాల్ బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా హనుమకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని కానిపర్తి జట్టు నిలిచింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్‌నగర్‌లో నిర్వహించిన ఆరు జిల్లాల స్థాయి ఆహ్వానిత బాల్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మొత్తం 12 జట్లు పాల్గొనగా కానిపర్తి, భూపాలపల్లి జట్లు ఫైనల్‌కు చేరాయి. ఆదివారం జరిగిన ఫైనల్లో భూపాలపల్లి జట్టుపై కానిపర్తి జట్టు గెలిచి టోర్నీని కై వసం చేసుకుంది. విజేతగా నిలిచిన జట్టుకు నిర్వాహకులు ట్రోఫీతో పాటు నగదు బహుమతి అందజేశారు. కానిపర్తి జట్టుకు కోచ్‌గా కన్నెబోయిన కిరణ్‌యాదవ్, కెప్టెన్‌గా దాసరి రమేష్ వ్యవహరించారు. -
వన మహోత్సవానికి సిద్ధం చేయండి
హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో నిర్వహించే వన మహోత్సవం కార్యక్రమంలో విస్తృతంగా మొక్కలు నాటేందుకు సంబంధిత శాఖల అధికారులు మొక్కలు సిద్ధం చేయాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో వన మహోత్సవ మొక్కలను సిద్ధం చేయడంపై కలెక్టర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. జిల్లాలో వనమహోత్సవంలో భాగంగా ఈ సంవత్సరం 23 లక్షల మొక్కలు నాటడమే లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. నిర్దేశిత లక్ష్యం మేరకు మొక్కలు నాటేందుకు గుంతలను తీసి సిద్ధంగా ఉంచాలని, వాటి సంరక్షణకు చేయాల్సిన ఏర్పాట్లను సంబంధిత శాఖల అధికారులు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్డీఓ మేన శ్రీను, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డిప్యూటీ కమిషనర్ రవీందర్, ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు. ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025–26 విద్యా సంవత్సరం ప్రవేశానికి నిర్వహించే ప్రిలిమినరీ పరీక్షకు నిరుద్యోగ, అర్హులైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. ఈమేరకు సోమవారం కలెక్టరేట్లో దరఖాస్తుల కరపత్రాన్ని అధికారులతో కలెక్టర్ స్నేహ శబరీష్ ఆవిష్కరించారు. అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి డిగ్రీ ఉత్తీర్ణులై, వార్షిక ఆదాయం రూ.3 లక్షలు మించకుండా ఉన్న వారు http://trrtudycirc e.co.in వెబ్ సైట్ ద్వారా జూలై 7 వరకు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవా లని కోరారు. జూలై 13న ఎంపిక పరీక్ష నిర్వహించి మెరిట్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులకు ప్రవేశం కల్పించి ఎస్సీ స్టడీ సర్కిల్ హైదరాబాద్‌లో సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్షకు 10 నెలల పాటు ఉచిత వసతి భోజనంతో కూడిన శిక్షణ ఇవ్వనున్నట్లు తెలి పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకటరెడ్డి, డీఆర్ఓ వై.వి.గణేశ్, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీనివాస్, షెడ్యుల్డ్ కులా ల అభివృద్ధి సంస్థ అధికారి నిర్మల, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో సమీక్ష -
తెరుచుకోని ప్రభుత్వ గిరిజన పాఠశాల
గార్ల : ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాకపోవడంతో ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాల తాళం తెరుచుకోలేదు. అసలే ఈ పాఠశాల తెరిచిన నాటి నుంచి ఒక్క విద్యార్థి సైతం చేరలేదు. గార్ల మండలంలోని చిన్నకిష్టాపురం పంచాయతీ సర్వన్తండా పాఠశాలలో ఉపాధ్యాయులే విధులకు డుమ్మా కొడుతుంటే, తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపించకుండా ప్రైవేటు పాఠశాలలకు పంపిస్తున్నారు. ఇదే పాఠశాలలో ఆవరణలో కొనసాగుతున్న అంగన్వాడీ టీచర్‌ను వివరణ కోరగా ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రాలేదని తెలిపారు. ఇప్పటికై నా సంబంధిత ట్రైబల్ వెల్ఫేర్ అధికారులు స్పందించి ప్రభుత్వ గిరిజన ప్రాథమిక పాఠశాలపై పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే విషయంపై హెచ్ఎం సీహెచ్ జోగయ్యను ‘సాక్షి’ వివరణ కోరగా సర్వన్తండా జీపీఎస్ పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు సోమవారం విధులకు హాజరు కాలేదని వివరించారు. విధులకు ఉపాధ్యాయుల గైర్హాజరు -
రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు
హన్మకొండ కల్చరల్: శ్రీరుద్రేశ్వరస్వామి వారి వేయిస్తంభాల దేవాలయంలో జ్యేష్టమాసం బహుళ త్రయోదశి సోమవారం మాసశివరాత్రిని పురస్కరించుకుని ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు, శివకల్యాణం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి నిత్య పూజల అనంతరం ఆలయ నాట్యమండపంలో శ్రీరుద్రేశ్వరీదేవి, శ్రీరుద్రేశ్వరస్వామివారి ఉత్సవ విగ్రహాలను ప్రతిష్ఠించి కల్యాణోత్సవం నిర్వహించారు. ఏర్పాట్లను ఈఓ అనిల్‌కుమార్ పర్యవేక్షించారు. కానిస్టేబుల్‌కు అభినందనవరంగల్ క్రైం: వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ రిజర్వ్ విభాగంలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సాయిరాం గత వారం క్లాషిల్లా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన అతి పెద్ద పరుగు పోటీలో పాల్గొని సిల్వర్ మెడల్ సాధించారు. ఈసందర్భంగా సోమవారం పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్‌సింగ్.. ఆయనను అభినందించి రాబోయే రోజుల్లో మరిన్ని పతకాలు సాధించాలని, క్రీడల్లో రాణించే పోలీసుకు ప్రోత్సాహం ఉంటుందని తెలిపారు. అదనపు డీసీపీ సురేశ్ కుమార్, అడ్మిన్ ఆర్ఐ స్పర్జన్‌రాజ్ పాల్గొన్నారు. మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలికాజీపేట రూరల్/మడికొండ: మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా అన్నారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై కాజీపేట దర్గా ప్రభుత్వ ఉన్నత పాఠశాల, మడికొండ శివారులోని సాంఘిక సంక్షేమ (వర్ధన్నపేట) బాలుర పాఠశాల, కళాశాలలో సోమవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. మత్తుపదార్థాలతో జరిగే అనర్థాలపై దర్గా పాఠశాల విద్యార్థులు నాటిక ప్రదర్శించగా.. డీసీపీ వారిని అభినందించి రూ.1,000 నగదు పురస్కారం అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కాజీపేట ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి, మడికొండ ఇన్స్పెక్టర్ కిషన్, హెడ్ కానిస్టేబుళ్లు జయరాజ్, రాంచందర్, కాజీపేట సీఐ సుధాకర్‌రెడ్డి, ఎస్సై లవన్‌కుమార్, స్కూల్ హెచ్ఎం ఎన్.ఎన్.ఎం.స్వామి, సెక్రటరీ కటుకూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా రూ.148.74 కోట్లు జమహన్మకొండ: రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పథకం ద్వారా అన్నదాతలకు మద్దతుగా నిలుస్తోందని హనుమకొండ జిల్లా వ్యవసా య అధికారి రవీందర్ సింగ్ తెలిపారు. ఈమేరకు వానాకాలం పంటల సాగుకు సోమవారం జిల్లాలో 14 మండలాలు, 163 గ్రామాలకు చెందిన 1,41,364 మంది రైతుల ఖాతాల్లో రూ.148.74 కోట్లు ప్రభుత్వం జమ చేసిందని ఆయన ఒక ప్రకటనలో వివరించారు. వరంగల్ రీజియన్‌కు ప్రాధాన్యంహన్మకొండ: ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీలో వరంగల్ రీజియన్‌కు ప్రాధాన్యం దక్కింది. ఖమ్మంలో ఈనెల 21, 22 తేదీల్లో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర మహాసభలు జరిగాయి. సోమవారం రాష్ట్ర నూతన కమిటీని ఎన్నుకున్నారు. వరంగల్ రీజియన్‌కు చెందిన సీహెచ్.రాంచందర్(భూపాలపల్లి ఏడీసీ) రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా బి.ఉపేంద్రచారి (వరంగల్–1 డిపో కండక్టర్) రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఎస్ఈగా శివలింగంవరంగల్ అర్బన్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీబ్ల్యూఎంసీ) ఇన్చార్జ్ ఎస్ఈగా బి.మహేందర్‌ను నియమిస్తూ కమిషనర్ చాహత్ వాజ్ పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం పనిచేస్తున్న ఇన్చార్జ్ ఈనెలఖారుతో ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో పరిపాలనలో భాగంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. -
శ్యాంప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి
హన్మకొండ: శ్యాంప్రసాద్ ముఖర్జీకి బీజేపీ నాయకులు ఘనంగా నివా ళులర్పించారు. ఆయన వర్థంతిని పురస్కరించుకొని హనుమకొండ దీన్‌దయాళ్‌నగర్‌లోని పార్టీ జిల్లా కార్యాలయంలో సోమవారం బలిదాన్ దివస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖర్జీ చిత్రపటానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోశ్‌రెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మార్తినేని ధర్మారావు, నాయకులు పూలమాలలు వేసి నివాళు లర్పించారు. అనంతరం నాయకులు మాట్లాడు తూ.. దేశం కోసం పదవులను తృణప్రాయంగా త్యజించిన జాతీయవాది, అఖండ భారత్ కోసం ప్రాణాలు వదిలిన భరతమాత ముద్దుబిడ్డ, జన సంఘ్ వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. ‘ఏక్ దేశ్ మే దో నిశాన్, దో విధాన్, దో ప్రధాన్ నహి చలేంగే, నహీ చలేంగే’ అంటూ జమ్మూ కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు కోసం పోరాడుతూ.. అసువులు బాసిన త్యాగశీలి అని పేర్కొన్నారు. కార్యక్రమం తర్వాత నాయకులు పార్టీ కార్యాలయ ఆవరణలో మొక్కలు నాటారు. బీజేపీ నాయకులు దొంతి దేవేందర్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, చాడ శ్రీనివాస్‌రెడ్డి, గుజ్జ సత్యనారా యణరావు, మాలోతు నాను నాయక్, ఆకుల శ్రీకాంత్ పటేల్, నర్మెట్ట శ్రీనివాస్ రావు గౌడ్, రత్నలక్ష్మి, సండ్ర మధు, చల్ల జైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నత్తనడకన ఇళ్ల నిర్మాణం
హన్మకొండ: నిరాశ్రయులైన, దారిద్య్రరేఖకు దిగువ న ఉన్న కుటుంబాలకు పక్కా శాశ్వత గృహాలను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల కా ర్యక్రమాన్ని చేపట్టింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించనుంది. అ యితే లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్ కు సమయం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం తదితర కారణాలతో హనుమకొండ జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. ప్రొసీడింగ్స్ జారీ వరకు ప్రతీ స్టేజీలో ప్రక్రియ ఆలస్యం కావడంతో ముగ్గులు పోసే విషయంలో వెనుకబడిపోయింది. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ రెండు నెలల ముందు పూర్తి కావాల్సి ఉండగా.. జాప్యం కావడంతో ఇళ్ల నిర్మాణం నత్తనడక న సాగుతోంది. దీనికి తోడు లబ్ధిదారుల ఆర్థిక స్థో మత, మెటీరియల్ లభ్యత, ముహూర్తాలు లేకపోవడం వంటివి ప్రతిబంధకాలుగా మారాయి. దీంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఊపందుకోలేదు. వరంగల్ జిల్లాలో.. వరంగల్ జిల్లాకు 11,004 ఇందిరమ్మ ఇళ్లు కేటాయించగా.. 7,734 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చారు. ఇప్పటి వరకు 2,251 ఇళ్లకు ముగ్గు పోశారు. ఇంకా 8,753 ఇళ్లకు ముగ్గు పోయాల్సి ఉంది. హనుమకొండ జిల్లాకు 9,942 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం కేటాయించింది. జిల్లా అధికార యంత్రాంగం 6,358 ఇళ్లకు పరిపాలనా మంజూరు ఇచ్చింది. 5,767 ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులకు అందించారు. ఇందులో 3,164 ఇళ్లకు ముగ్గు పోశారు. ముగ్గు పోసుకున్న లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం మొదలు పెట్టారు. మంచి రోజులు లేవని.. ప్రస్తుతం ముహూర్తాలు లేకపోవడం, ఆషాఢ మాసం రావడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ ప్రక్రియ ఊపందుకోవడానికి మరో నెల రోజులకుపైగా సమయం పట్టనుంది. ఇంటి నిర్మాణం 400 నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా ఉండాలనే నిబంధన లబ్ధిదారులను కొంత ఇబ్బందికి గురిచేస్తోంది. ఇందులో ఒక హాల్, కిచెన్, బెడ్రూం, వాష్‌రూం తప్పనిసరిగా ఉండాలి. దీనికి మించిన వైశాల్యంలో ఇళ్లు నిర్మించుకుంటే బిల్లు పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వం ఇచ్చే సాయానికి తాము కొంత జోడించి విశాలంగా ఇల్లు కట్టుకోవాలనే ఆసక్తి కలిగిన లబ్ధిదారులకు ప్రభుత్వ నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఒకరిని చూసి మరొకరు ఇంటి విస్తీర్ణం పెంచి ఆర్థిక సపోర్టు లభించక మధ్యలోనే నిర్మాణాన్ని వదిలేస్తే ప్రభుత్వానికి ఎక్కడ మచ్చ వస్తుందో అన్న సందేహంతో సర్కారు ఈ నిబంధనను పెట్టినట్లు తెలుస్తోంది. ఆషాఢం పూర్తయి, శ్రావణం వచ్చిన తర్వాత మంచి ముహూర్తాలు వచ్చే వరకు ఇళ్ల నిర్మాణాలకు ముగ్గులు పోసే ప్రక్రియ నిలిచిపోనుంది. హనుమకొండ జిల్లాకు ఇందిరమ్మ గృహాలు 9,942 కేటాయింపు పరిపాలనా మంజూరు ఇచ్చినవి 6,358 ముగ్గులు పోసినవి 3,194 వరంగల్ జిల్లాకు కేటాయించిన ఇళ్లు 11,004 పరిపాలనా మంజూరు ఇచ్చినవి 7,734 కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ప్రకటించని లబ్ధిదారుల జాబితా ముహూర్తాలు లేక ఆగిన ఇళ్ల నిర్మాణాల ప్రారంభంఎంపిక.. కత్తిమీద సాము వరంగల్ జిల్లాలో ఇంకా 7,734 మంది, హనుమకొండ జిల్లాలో ఇంకా 3,584 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉంది. గ్రామాల్లో లబ్ధిదారుల ఎంపిక కత్తిమీద సాముగా మారడంతో ఆచితూచి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు వేసి లబ్ధిదారులను ఎంపిక చేసింది. మొదటి ప్రాధాన్యంగా ఇంటి స్థలాలున్న పేదలకు మంజూరు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఇళ్ల స్థలాలుండి సొంతిళ్లు లేని వారిని గుర్తించారు. ఈజాబితాను ఇందిరమ్మ కమిటీ అధికారులకు అందజేసిన తర్వాత జిల్లా అధికార యంత్రాంగం వెరిఫికేషన్ అధికారులను నియమించి లబ్ధిదారుల ఎంపిక, స్థల పరిశీలన చేసి తుది జాబితాను రూపొందించారు. ఈప్రక్రియ పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంది. దీనికి తోడు ప్రొసీడింగ్స్ జారీ చేయడంతో పాటు వాటిని గ్రామాల్లో లబ్ధిదారులకు అందించేందుకు ఎమ్మెల్యేలు సమయం తీసుకోవడంతో ఆలస్యంగా నిర్మాణాలు మొదలయ్యాయి.