చారిత్రక ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
● వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద
ఖిలా వరంగల్: వరంగల్‌లోని చారిత్రక దేవాలయాల అబివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించినట్లు కలెక్టర్ డాక్టర్ సత్యశారద అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో కుడా అధికారులు, రాష్ట్ర పురావస్తుశాఖ అధికారులతో బుధవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. వరంగల్ టూరిజంగా హబ్‌గా తీర్చిదిద్దాలనే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. పురావస్తుశాఖ రాష్ట్ర డైరెక్టర్ అర్జున్‌రావు మాట్లాడుతూ ప్రస్తుతం కోట పురావస్తుశాఖ మ్యూజియాన్ని కోటకు తరలించే దిశగా చర్యలు చేపట్టాలని సూచించారు. అనంతరం మ్యూజియం, శంభునిగుడిని పరిశీలించారు. కుడా వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్, సీపీఓ అజిత్‌రెడ్డి, ఆర్డీఓ సుమ, ఇన్‌చార్జ్ టూరిజం ఆఫీసర్ అనిల్‌కుమార్, తహసీల్దార్ శ్రీకాంత్ పాల్గొన్నారు.


