సెలబ్రిటీలను మరిపించేలా ఎయిర్‌హోస్టెస్‌ల హోయలు.. రన్‌వేపై కొలువుదీరిన విమానాలు.. హెలికాప్టర్లను తిలకించేందుకు పోటీపడ్డ సందర్శకులు.. ఆపై దేశీ, విదేశీ విమానయాన అనుభూతులను పదిలపర్చుకునేలా సెల్ఫీలు.. అన్నింటికీ మించి ఒళ్లు గగుర్పొడిచే విన్యాసాలతో బేగంపేట్ ఎయిర్‌పోర్ట్ సందడిగా మారింది.
భారత ప్రభుత్వ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్, ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వింగ్స్ ఇండియా–2026’ బుధవారం అట్టహాసంగా ప్రారంభమైంది.
విమానాలు.. హెలికాప్టర్ల ప్రదర్శన..వివిధ కంపెనీలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు రన్‌వేపై కొలువుదీరాయి. స్టాటిక్ ప్రదర్శనలో ఉంచిన లోహ విహంగాల్లో ప్రధానంగా ఎయిర్…ఇండియా 787–9, స్టార్ ఎయిర్ ఈ– 175, హున్ను ఎయిర్ వింగ్స్ ఆఫ్ మంగోలియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ 737–8, ఇండిగో– ఎ321, ఎయిర్ బాలి్టక్ (ఎయిర్‌బస్– ఎ220–300) , యూఏసీ ఐఎల్ 114–300 రీజినల్ టర్బోప్రోప్, ఆకాష్ ఎయిర్ 737–8–200, హెచ్‌ఏఎల్‌కు చెందిన యూఏసీ ఎస్‌బీజే, హెచ్‌ఏఎల్ ఎస్‌జే–100 వంటి చిన్నా.. పెద్దా మొత్తం 27 విమానాలు, హెలికాప్టర్లు ప్రదర్శనకు వచ్చాయి.
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన సూర్యకిరణ్ బృందంతో పాటు మార్క్‌జాఫ్రీస్ నేతృత్వంలోని గ్లోబల్ స్టార్ బృందం నిర్వహించిన వైమానిక విన్యాసాలు వీక్షకులను కళ్లర్పకుండాలో చేశాయి. పొగలు కక్కుతూ గగన మార్గంలో చేసిన స్టంట్లు ఒళ్లు గగుర్పొడిచేలా చేశాయి.


