Vizianagaram
-
రైల్వే ఉద్యోగుల నిరసన
విజయనగరం టౌన్: ఈస్ట్‌కోస్ట్ రైల్వేశ్రామిక్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ ఆవరణలో ఉద్యోగులు, యూనియన్ నాయకులు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డివిజనల్ కోఆర్డినేటర్ పీవీ.మౌళీశ్వరరావు మాట్లాడుతూ పెరిగిన ట్రాఫిక్ కారణంగా అన్ని ఎల్సీ గేట్లకు 8 గంటల రోస్టర్‌ను అమలుచేయాలన్నారు. ట్రాక్ మెయింటైనర్లకు సైకిల్ అలవెన్స్చెల్లింపును నిర్ధారించాలని, రన్‌ఓవర్ కేసుల్లో స్టేషన్ మాస్టర్లకు మెమోలు ఇచ్చే ట్రాక్ మెయింటైనర్లను నివారించాలని బదులుగా సీయూజీ ఫోన్ల ద్వారా సంబంధిత కీమాన్, ట్రాక్ మాన్ల నుంచి వివరాలను పొందడంపై పీడబ్ల్యూవే సూపర్ వైజర్ల ద్వారా మెమోలను అందించేందుకు ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేశారు. ఆక్యుపెన్సీని పెంచేందుకు క్వార్టర్స్ మెరుగైన నిర్వహణ చేపట్టాలని కోరారు. సేఫ్టీ కేటగిరీలో పనిచేస్తున్న ఉద్యోగులకు రిస్క్, హార్ట్షిప్ అలవెన్స్ అందించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో శ్రామిక్ కాంగ్రెస్ విజయనగరం బ్రాంచ్ కార్యదర్శి బి.సత్యనారాయణ, శ్రీకాకుళం బ్రాంచ్ కార్యదర్శి ఎస్.దంతేశ్వరరావు, సెంట్రల్ ఆఫీస్ బేరర్ ఎం.అనిల్ కుమార్, బి.శ్రీనివాసరావు, అధిక సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు. -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
మానాపురం ఆర్ఓబీ కాంట్రాక్టర్‌కు నోటీసులు
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: జిల్లాలోని మానాపురం ఆర్ఓబీ నిర్మాణం పనుల్లో జాప్యంపై కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆర్అండ్బీ అధికారులను ఆదేశించారు. నోటీసు అందిన రెండు వారాల్లో వివరణ ఇవ్వాలని, లేదంటే చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తన చాంబర్లో ఆర్అండ్బీ అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆర్ఓబీ 2021, జూన్ నెలలో ప్రారంభమైందని, ఒప్పందం ప్రకారం జనవరి 2023కు పూర్తిచేయాల్సి ఉండగా, ఇప్పటికే 780 రోజులు ఆలస్యమైందన్నారు. నిర్మాణంలో జాప్యం వల్ల ట్రాఫిక్ సమస్యతోపాటు ప్రజలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇంతవరకు 83.56 శాతం పనులు పూర్తయ్యాయని, 56.42 శాతం చెల్లింపులు జరిగాయని తెలిపారు. అగ్రిమెంట్ విలువ రూ.20.8 కోట్లు కాగా రూ.17.268 కోట్ల విలువైన పనులు జరిగాయని, మిగిలిన పనుల విలువ రూ.3.532 కోట్లు వరకు ఉందన్నారు. పనులు పూర్తి చేస్తే నిధులు చెల్లింపునకు ఎలాంటి ఆటంకం లేదన్నారు. ప్రజలకు అత్యవసరమైన వంతెన నిర్మాణంలో అలసత్వం తగదన్నారు. సమావేశంలో ఆర్అండ్బీ ఎస్ఈ కాంతిమతి, ఈఈలు, డీఈలు పాల్గొన్నారు. తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం విజయనగరం గంటస్తంభం: ప్రముఖ పాత్రికేయుడు, సినీ మాటల రచయిత కె.ఎన్.వై.పతంజలి 73వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన పాత్రికేయుడు, పతంజలితో పాతికేళ్ల పాటు కలిసి పనిచేసిన రచయిత తాడి ప్రకాష్‌కు పతంజలి పురస్కారం అందజేయనున్నట్టు పతంజలి సాంస్కృతిక వేదిక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి తెలిపారు. గురజాడ అప్పారావు గృహంలో వేదిక ప్రతినిధులతో కలిసి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ఏటా పతంజలి జయంతి సందర్భంగా ప్రముఖులకు పురస్కారం అందజేస్తున్నామన్నారు. 2025 సంవత్సరానికి గాను తాడి ప్రకాష్‌కు ఈ నెల 29 తేదీన గురుజాడ గ్రంథాలయంలో పురస్కారం ప్రదానం చేస్తామని చెప్పారు. సాహిత్య అభిమానులు, రచయితలు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో వేదిక కార్యదర్శి బాబు, లక్ష్మణరావు, పౌరవేదిక ప్రతినిధులు పాల్గొన్నారు. -
రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై క్రిమినల్ కేసు
● కాలం చెల్లిన మందులు, నిషేధిత మత్తు సిరప్లు లభ్యం విజయనగరం ఫోర్ట్: పట్టణంలోని అంబటి సత్రం జంక్షన్లో ఉన్న రత్నం ఫార్మాస్యుటికల్స్‌పై పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఈ దుకాణంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ బర్ల ప్రసాద్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి తనిఖీలు చేపట్టగా గడువుదాటిన మందులు, నిషేధిత మత్తు టానిక్‌లు దుకాణంలో లభ్యమయ్యాయి. దీంతో ఈ దుకాణంపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మత్తు పదార్థాలు తీసుకుని యువత జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారన్నారు. వెంకటరత్నం మెడికల్ దుకాణంలో అధిక మొత్తంలో మత్తు కలిగించే నిషేధిత టానిక్‌లు పట్టుకుని సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో ఔషధ నియంత్రణశాఖ ఎ.డి రజిత పాల్గొన్నారు. -
ప్రభుత్వానికి బుద్ధిచెబుదాం
గజపతినగరం: టిట్లాగర్ నుంచి విజయనగరం వరకు సుమారు 4 వేల కోట్ల రూపాయలతో చేపడుతున్న మూడవ రైల్వే లైన్ నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అన్యాయం చేయడం ప్రభుత్వానికి తగదని, సమయం వచ్చినప్పుడు గట్టిగా బుద్ధిచెబుతామని రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు జి.శ్రీనివాస్ తెలిపారు. గజపతినగరం మండల కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గజపతినగరం నియోజకవర్గం దత్తిరాజేరు మండలం పెదమానాపురంలో మూడో రైల్వే లైన్ నిర్మాణంలో ముందుగా 14 ఇళ్లకు అరకొర డబ్బులు చెల్లించి వాటిని కూల్చివేశారని, తరువాత మరో 28 కుటుంబాలకు చెందిన వారి ఇళ్లను కూల్చి వేసేందుకు ప్రభుత్వం సిద్ధమైందని మండిపడ్డారు. నిర్వాసితులకు నిలువునీడ చూపకుండా ఇళ్లు కూల్చివేయడం దుర్మార్గమన్నారు. ఫిబ్రవరి 9వ తేదీన బాధితులకు న్యాయం చేస్తామంటూ మాట ఇచ్చిన ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఇప్పుడు మాటమార్చారని విమర్శించారు. నిర్వాసితుల పక్షాన కాకుండా ఇళ్లను కూల్చే కాంట్రాక్టర్ తరఫున కొమ్ముకాయడం దారుణమన్నారు. తక్షణమే నిర్వాసితులకు ఇళ్ల స్థలాలు, పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా మార్చి 27, 28 తేదీల్లో మానాపురం బ్రిడ్జి సమీపంలో రెండు రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని హెచ్చరించారు. అప్పటికీ సమస్య పరిష్కరించకుంటే ఏప్రిల్ 2వ తేదీన చలో తహసీల్దార్ ఆఫీస్ కార్యక్రమం చేపడతామన్నారు. కార్యక్రమంలో నిర్వాసితుల కమిటీ నాయకులు చిల్లా గోవింద్, బోర మహేష్, నగిరెడ్ల రాము, తదితరులు పాల్గొన్నారు. నిర్వాసితులను మోసం చేయడం అన్యాయం ఎంపీ మాట మార్చడం బాధాకరం 27, 28వ తేదీల్లో నిరాహార దీక్షలు మూడవ రైల్వే లైన్ నిర్వాసితుల కమిటీ నాయకుడు శ్రీనివాస్ -
నెలాఖరుకు పథకాల మంజూరు
విజయనగరం అర్బన్: బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాల మేరకు ఈ నెలాఖరులోగా పథకాలను మంజూరు చేయాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ శుక్రవారం సమీక్షించారు. వివిధ పథకాలు, వాటి మంజూరులో బ్యాంకుల పరిస్థితిని ఎల్డీఎం వీవీరామణమూర్తి వివరించారు. నాబార్డ్ డీడీఎం నాగార్జున మాట్లాడుతూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాబార్డ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్ (పీఎల్‌సీపీ)ను వివరించారు. సుమారు రూ.10,650.32 కోట్ల అంచనాతో ఈ రుణ ప్రణాళికను రూపొందించినట్లు చెప్పారు. దీని ఆధారంగానే జిల్లా వార్షిక రుణ ప్రణాళికను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ ప్రణాళికను కలెక్టర్, ఇతర అధికారులు ఆవిష్కరించారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ ఎ.కల్యాణ చక్రవర్తి, వ్యవసాయ శాఖ జేడీ వీటీరామారావు, పశుసంవర్ధకశాఖ డాక్టర్ వైవీరమణ, జెడ్పీ సీఈఓ బీవీ సత్యనారాయణ, మెప్మా పీడీ చిట్టిరాజు, ఉద్యాన, మత్సశాఖల డీడీలు జమదగ్ని, నిర్మలాకుమారి, ఎస్సీ, బీసీ కార్పొరేషన్ ఈడీలు వెంకటేశ్వరరావు, పెంటోజీరావు, వివిధ బ్యాంకుల అధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ అంబేడ్కర్ -
రక్తహీనత కేసులు తగ్గుముఖం
విజయనగరం ఫోర్ట్: కేంద్ర ప్రభుత్వం రక్తహీనతను నివారించేందుకు ప్రవేశపెట్టిన పథకాలు క్షేత్ర స్థాయిలో సమర్ధంగా అమలుచేస్తుండడంతో రక్తహీనత కేసులు తగ్గుముఖంపట్టాయని కేంద్ర బృందం ప్రతినిధులు డాక్టర్ దృష్టిశర్మ, డాక్టర్ జాస్మిన్ అభిప్రాయపడ్డారు. గత రెండు రోజులుగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో రక్తహీనత తగ్గడానికి గల కారణాలపై ఆధ్యయనం చేశారు. సంబంధిత అంశాలను శుక్రవారం సాయంత్రం కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను కలిసి వివరించారు. ఎనిమీయా ముక్త్ భారత్, ఐసీడీఎస్, మధ్యాహ్న భోజన పథకం, ప్రజాపంపిణీ వ్యవస్థ, జాతీయగ్రామీణ జీవనోపాదుల కార్యక్రమాలు రక్తహీనత తగ్గించేందుకు దోహదపడుతున్నాయన్నారు. దేశంలోని ఆరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాంలోని 12 జిల్లాల్లో రక్తహీనత తగ్గుదలకు గల కారణాలపై ఆధ్యయనం చేస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ జీవన రాణి పాల్గొన్నారు. -
జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీసు వెల్ఫేర్ డే
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ శాఖ సిబ్బంది సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని ఎస్పీ వకుల్ జిందల్ స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని తన చాంబర్లో ఎస్పీ వకుల్ జిందల్ శుక్రవారం పోలీసు వెల్ఫేర్ డే నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బంది నుంచి విజ్ఞాపనలు స్వీకరించి, పరిశీలించారు. సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతానని చెప్పారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని బానాది గ్రామంలో అభయాంజనేయస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ పరుగు ప్రదర్శనలో 12 గుర్రాలు పాల్గొన్నాయి. వాటిలో రామన్న పాలెంకు చెందిన విక్రమ్ గుర్రం ప్రథమస్థానంలో నిలిచి రూ.12 వేలు, రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెర్సీ నిలిచి రూ. పదివేలు సాధించాయి. మూడో స్థానంలో రామన్నపాలెంకు చెందిన చోడమాంబిక గుర్రం, నాల్గో స్థానంలో ఎల్.కోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ గుర్రం నిలిచి నగదు బహుమతులు సాధించాయి. విజేతలకు ఆలయ ధర్మకర్తలు, పెద్దలు కమిటీ సభ్యులు నగదు బహమతులు అందజేశారు. ‘గేట్’ లో కార్తికేయ కుశల్ కుమార్‌కు 79వ ర్యాంక్విజయనగరం అర్బన్: గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్ (గేట్–2025) ఫలితాల్లో పట్టణ విద్యార్థి గంట కార్తికేయ కుశల్ కుమార్ జాతీయ ర్యాంక్ 79 సాధించాడు. గేట్‌లోని ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (ఈసీఈ) సబ్జెక్టులో 842 స్కోర్‌తో 79వ ర్యాంక్ తెచ్చుకున్నాడు. కార్తికేయ బీటెక్ కాలికట్ ఎన్ఐటీలో చదివాడు. మొదటి ప్రయత్నంలోనే మంచి ర్యాంక్ సాధించిన కార్తికేయ తండ్రి జి.సునీల్ కుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు కాగా తల్లి శోభ ప్రైవేట్ పాఠశాలలో ఉపాధ్యాయిని. అదృశ్యం కేసు నమోదుపార్వతీపురం రూరల్: మండలంలోని అడ్డాపుశీల గ్రామానికి చెందిన నీలయ్య జనవరి 20 నుంచి ఆచూకీ లేకపోవడంతో ఫిర్యాదు మేరకు అదృశ్యం కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై బి.సంతోషి తెలిపారు. బంధువులు, పరిచయస్తుల ఇళ్ల వద్ద భర్త ఆచూకీ కోసం ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయిందంటూ భార్య ఫిర్యాదు చేసిన మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. మెట్లు కూలి మహిళా కూలీ మృతి ● ఇద్దరికి గాయాలు పీఎంపాలెం: నిర్మాణంలో ఉన్న భవనం మెట్లు కూలిపోయిన ఘటనలో మహిళా కూలీ సంఘటన స్థలంలోనే దుర్మరణం పాలైంది. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పీఎంపాలెం సీఐ బాలకృష్ణ తెలిపిన వివరాలివి. జీవీఎంసీ 8వ వార్డు పరిధి పనోరమ హిల్స్ వద్ద ఐకానికా గ్రాండ్ విల్లా నంబరు 121 నిర్మాణంలో ఉంది. ఈ భవనం మెట్ల నిర్మాణ లోపం కారణంగా రెండవ అంతస్తు నుంచి కూలిపోయి.. అదే భవనంలో గ్రౌండ్ ఫ్లోర్లో పని చేస్తున్న మహిళా కూలీ నీలరోతు రామలక్ష్మిపై పడ్డాయి. విజయనగరం జిల్లా మొరకముడిదాం మండలం వేముల గ్రామానికి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. ఇదే ఘటనలో విజయనగరం జిల్లా దత్తిరాజేరు మండలం చౌడంతవలస గ్రామానికి చెందిన టి.ఆదినారాయణ వెన్నుపూస దెబ్బతింది. భీమిలి చేపలుప్పాడకు చెందిన కోడా అమ్మాజమ్మ కాలు విరిగి బలమైన గాయాలయ్యాయి. క్షతగాత్రులను గాయత్రీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్ సంఘటన స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఫెన్సింగ్ పోటీల్లో కానిస్టేబుల్‌కు కాంస్యం
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్‌శాఖలో ట్రాఫిక్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తూ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోని జలంధర్‌లో జరిగిన 1వ ఆలిండియా పోలీస్ క్లస్టర్ పోటీల్లో కాంస్యపతకం సాధించిన పీసీ బీఎస్ ఎన్ మూర్తికి ఎస్పీ వకుల్ జిందల్ అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని ట్రాఫిక్ సీఐ సూరినాయుడుతో పాటు కానిస్టేబుల్ మూర్తి శుక్రవారం కలిశారు. జిల్లాకు చెందిన బీఎస్ఎన్ మూర్తి పోలీస్ శాఖ నిర్వహించిన జాతీయపోటీల్లో ఫెన్సింగ్ విభాగంలో రాష్ట్ర పోలీసు జట్టు తరఫున పాల్గొని కాంస్య పతకం సాధించాడు. కాంస్య పతకం సాధించిన కానిస్టేబుల్ మూర్తిని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా అభినందించారని ఎస్పీ వకుల్ జిందల్ ఈ సందర్భంగా తెలిపారు. పతకాలు సాధించిన పోలీస్‌సిబ్బందికి త్వరలో ప్రోత్సాహక నగదు బహుమతిని, అదనంగా వార్షిక ఇంక్రిమెంట్ అందించనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎన్.గోపాల నాయుడు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు పాల్గొన్నారు. అభినందించిన ఎస్పీ వకుల్ జిందల్ -
ప్రశాంతంగా పది పరీక్షలు
పార్వతీపురంటౌన్: పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమైన పదో తరగతి పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో 67 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 10,363 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా 10,314 మంది హాజరయ్యరని, 49 మంది గైర్హాజరయ్యరని తెలిపారు. ఎటువంటి ఇబ్బందులు లేకుంగా పరీక్ష సజావుగా నిర్వహించామన్నారు. 61 పరీక్షా కేంద్రాల్లో వర్యవేక్షక బృందం 6 కేంద్రాల్లో తాను సందర్శించినట్లు తెలిపారు. డీఈఓ ఎన్.తిరుపతి నాయుడు -
ప్రాజెక్టుల నిధులకు ప్రతిపాదిద్దాం
విజయనగరం అర్బన్: జిల్లా వ్యవసాయ రంగంలో వృద్ధిరేటు సాధించాలంటే తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ తీర్థసాగరం ప్రాజెక్టులు పూర్తికావాలి... దీనికి అవసరమైన నిధులు మంజూ రు చేయాలని త్వరలో జరిగే కలెక్టర్ల సదస్సులో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళ్తానని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఆయా ప్రాజెక్టుల పనులు, భూసేకరణ, పునరావాసం పూర్తి చేసేందుకు ఏ మేరకు నిధులు అవసరమవుతాయో జలవనరుల శాఖ అధికారులు నివేదిక అందజేయాలని ఆదేశించారు. తన కార్యాల యంలో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. తోటపల్లి కుడి ప్రధాన కాలువ, తారకరామ సాగరం ప్రాజెక్టులను పూర్తిచేస్తే సుమారు 50 వేల ఎకరాల అదనపు ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. వ్యవసాయ రంగంలో అదనపు ఉత్పత్తిని, ఆదాయాన్ని సాధించే అవకాశం ఉంటుందన్నారు. మరోవైపు నగరానికి మంచినీటి సరఫరా, భోగాపురం ఎయిర్‌పోర్టుకు నీటి సరఫరా జరిగే అవకాశం ఉన్నందున ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తిచేయాల్సిన అవసరాన్ని వివరిస్తామని చెప్పారు. కలెక్టర్ల సదస్సు మార్చి 25, 26 తేదీల్లో అమరావతిలో జరగనుందని, జిల్లా అభివృద్ధి ప్రణాళికలపై ప్రజంటేషన్ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వివిధ శాఖల అధికారులు వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కంటే అద నంగా ఎంతమేరకు లక్ష్యాలు సాధించగలమో పేర్కొంటూ వాస్తవిక అంచనాలను మాత్రమే ఇవ్వా లని ఆదేశించారు. సమావేశంలో సీపీఓ పి.బాలాజీ, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి పాల్గొన్నారు. -
వేతనదారులకు నిలువనీడ కరువు
● పనిప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు ● మండుటెండలోనే పనులు ● 8 వారాలుగా వేతనాలు అందక విలవిలసీతంపేట: పార్వతీపురం మన్యం జిల్లాలో సీతంపేట మండలం ఎంఎన్ఆర్ఈజీఎస్ పనులు చేయడంలో ముందంజలో గత కొన్నేళ్లుగా ఉంది. ఈ మండలంలో ఎక్కువ పనులు జరుగుతాయి. అటువంటి ఈ మండలంలో ఉపాధి వేతనదారులకు నిలువ నీడ లేదు. మండుటెండలో విలవిల్లాడుతున్నారు. వేసవి వచ్చినా కనీసం టెంట్లు కూడా లేకపోవడంతో వేతనదారులకు అవస్థలు తప్పడం లేదు. అసలే వేసవి కావడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపాధి పనులు చేస్తుంటారు. ఆ సమయంలో అత్యధికంగా ఎండ కాస్తోంది. ఉదయం 8 గంటలైతే భానుడు భగభగ మంటున్నాడు. సాయంత్రం 5 గంటల వరకు ఎండలు మండుతున్నాయి. విశ్రాంతి తీసుకోవడానికి కనీసం నీడ లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదని వేతనదారులు వాపోతున్నారు. అలాగే పని సమయంలో వడదెబ్బ వంటివి, చిన్నచిన్నదెబ్బలు తగులుతుంటాయి. ఈ సమయంలో ప్రాథమిక చికిత్స చేయడానికి మెడికల్ కిట్లు పని ప్రదేశం వద్ద ఉండాలి. వాటిని కూడా ప్రభుత్వం ఇంతవరకు సప్లై చేయకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు వాపోతున్నారు. వేతనదారులు డీహైడ్రేషన్‌కు గురైతే ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా లేని పరిస్థితి ఉంది. బకాయిలు రూ.5 కోట్లకు పైనే.. వేతనదారులకు చెల్లించాల్సిన వేతనాల బకాయిలు రూ.కోటి వరకు ఉండవచ్చని అంచనా. మెటీరియల్ కాంపొనెంట్‌లో వేసిన రహదారులు, హార్టీకల్చర్, ఇతర పనులు దాదాపు 200 వరకు జరగడంతో వాటికి చెల్లించాల్సిన బకాయిలు రూ.4 కోట్ల వరకు ఉండవచ్చని సమాచారం. వేతనదారులు చేసిన భూ అభివృద్ధి పనులు వంటి వాటికి ఎప్పటికప్పుడు వేతనాలు చెల్లించాల్సి ఉంది. దాదాపు ఉపాధి వేతనదారులు జాబ్‌కార్డులు ఉన్నవారు 18 వేల మంది ఉన్నారు. వారిలో వందరోజుల పనులు పూర్తి చేసిన వారు 80 శాతం వరకు ఉండడంతో ప్రస్తుతం పనులు చేస్తున్న వేతనదారులు 3 వేలమంది ఉన్నారు. భూ అభివృద్ధి, టెర్రాసింగ్, ఫార్మ్పౌండ్ పనులు వేతనదారులు చేస్తున్నారు. ఇలా 150 వరకు పనులు చేశారు. సరాసరి ఒక్కో వేతనదారుకు రోజుకు రూ.270 వరకు వేతనం గిట్టుబాటవుతుంది. రెండు నెలలుగా బకాయి వేతనాలు చెల్లించకపోవడంతో నానా అవస్థలు పడుతున్నామని వేతనదారులు ఆవేదన చెందుతున్నారు. కొలతలకు టేప్ సప్లై లేదు.. ఉపాధి పనులు చేసిన వేతనదారుల పనులు ఎంత పూర్తి చేశారనేది సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్ ఇతర సిబ్బంది కొలతలు వేయడానికి వీలుగా టేపులు సప్లై చేయాల్సి ఉన్నప్పటికీ అవికూడా సరఫరా చేయని పరిస్థితి ఉంది. కేవలం ఎవరి సామగ్రి వారు తెచ్చుకునే పనుల కొలతలు వేస్తున్నారు. టెంట్లు తాత్కాలికంగా వేసుకోమన్నాం వేతనదారులు పనిచేసిన చోట టెంట్లు తాత్కాలికంగా వేసుకుంటున్నారు. ఎండ తీవ్రత లేని సమయంలో ఉదయం 7 నుంచి 11 వరకు, మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 వరకు పనులు చేసుకుంటున్నారు. బకాయి నిధులు మంజూరైన వెంటనే వేతనదారులకు వేతనాలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటాం. శ్రీహరి, ఏపీడీ, ఎంఎన్ఆర్ఈజీఎస్ -
ఇంటర్ వర్సిటీ బేస్‌బాల్ పోటీలకు పట్టణ క్రీడాకారులు
విజయనగరం అర్బన్: నెల్లూరులోని విక్రమ్ సింహపురి యూనివర్సిటీలో త్వరలో జరగనున్న ఇంటర్ యూనివర్సిటీ బేస్‌బాల్ పోటీలకు ఆంధ్రయూనివర్సిటీ నుంచి పోటీ పడే జట్టులో విజయనగరం పట్టణంలోని మహరాజా అటానమస్ కళాశాల క్రీడాకారులు ముగ్గురు ఎంపికయ్యారు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎం.సాంబశివరావు శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆంధ్రా యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ ఆధ్వర్యంలో ఈ నెల 19న జరిగిన అంతర్ కళాశాల బేస్‌బాల్ పోటీల్లో ప్రతిభచూపిన ఎం.దుర్గాప్రసాద్, ఐ.నవీన్‌కుమార్, ఎన్.భవానీప్రసాద్ ఎంపికై న తుదిజట్టులో ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న వారిని మాన్సాస్ కరెస్పాండెంట్ డాక్టర్ కేవీఎల్‌రాజు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సాంబశివరావు, పీడీ డాక్టర్ పి.రామకృష్ణ, అధ్యాపకులు అభినందించారు. -
అదృశ్యమైన వ్యక్తి మృతదేహం లభ్యం
గరుగుబిల్లి: తోటపల్లి ప్రాజెక్టు వద్ద శుక్రవారం ఓ యువకుడి మృతదేహం లభ్యమైంది. ఈ మేరకు స్థానిక ఎస్సై పి.రమేష్ నాయుడు తెలియజేసిన వివరాలిలా ఉన్నాయి. తోటపల్లి ప్రాజెక్టు నాల్గవ గేటు వద్ద యువకుడి మృతదేహం తేలియాడుతూ ఉన్నట్లు సమాచారం అందిందన్నారు. ఈ మేరకు మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత మృతుడిని పార్వతీపురం పట్టణంలో గల జగన్నాథపురం ప్రాంతానికి చెందిన ఆలవెల్లి రాజా(26)గా గుర్తించారు. ఈనెల 19 బుధవారం ఉదయం నుంచి కుమారుడు ఆలవెల్లి రాజా ఆచూకీ లేకపోవడంతో తండ్రి శ్రీనివాసరావు పార్వతీపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పట్టణ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేయగా శుక్రవారం తోటపల్లి జలాశయం వద్ద రాజా మృతదేహం లభ్యమైంది. మృతికి గల కారణాలు తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు శవ పంచనామా నిర్వహించి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించారు. -
గిరిజన వర్సిటీకి భూములిస్తే మార్చేస్తారా?
కొత్తవలస: పోలీసు శిక్షణ కేంద్రం (గ్రేహౌండ్స్) పేరిట మరోసారి తమను మోసం చేయొద్దని అప్పన్నదొరపాలెం, తమ్మన్నమెరక, జోడిమెరక గ్రామాలకు చెందిన గిరిజనులు ఆర్డీఓ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం రెల్లి గ్రామ రెవెన్యూ పరిధిలో 526 ఎకరాల భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్మించేందుకు నిర్ణయించగా.. ఆర్డీఓ దాట్ల కీర్తి ఆధ్వర్యంలో సర్పంచ్ జోడు రాములమ్మ అధ్యక్షతన తహసీల్దార్ బి.నీలకంఠరావు అప్పన్నదొరపాలెంలో గురువారం గ్రామసభ నిర్వహించారు. సభకు హాజరైన గిరిజనులు మాట్లాడుతూ.. గతంలో ఈ ప్రాంతంలో గిరిజన విశ్వవిద్యాలయం నిర్మిస్తామని చెప్పి తమ భూములను లాక్కున్నారని తెలిపారు. 2019లో ఎన్నో హామీలిచ్చారని, అందులో ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. భూములిచ్చిన గిరిజనులను పోలీస్ బందోబస్తు మధ్య బంధించి పూజలు నిర్వహించారన్నారు. ఇప్పుడు అవే భూముల్లో గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం ఏర్పాటు చేస్తామని చెప్పడం మోసగించడమేనని పేర్కొన్నారు. తహసీల్దార్ ప్రభుత్వ నిబంధనల్ని వివరిస్తూ గ్రేహౌండ్స్ శిక్షణ కేంద్రం నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ సమయంలో గిరిజనులంతా ఒక్కటై తమను మళ్లీ మోసం చేయొద్దని నినదించారు. గతంలో ఇదే టీడీపీ ప్రభుత్వం 178 మంది గిరిజనులకు చెందిన 179 ఎకరాల్లోని జీడిమామిడి తోటలను ఏడు రకాల హామీలిచ్చి తీసుకుందని.. నేటికీ వాటి అమలు ఊసే లేదని నిలదీశారు. గ్రేహౌండ్స్ నిర్మాణానికి తమ భూములిచ్చే ప్రసక్తే లేదని తెగేసి చెప్పారు. దౌర్జన్యంగా లాక్కోవాలని చూస్తే తమ శవాలపై నిర్మాణాలు చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ.. గిరిజనుల డిమాండ్లు రాసి ఇస్తే ఉన్నతాధికారులకు నివేదిస్తామని తెలిపారు. మరోసారి గ్రామంలో సభ ఏర్పాటు చేస్తామని అప్పటిలోగా ఆలోచన చేసుకోవాలని సూచించారు. -
బాలికల ఉన్నత పాఠశాలలో ‘సునీత’ విజయోత్సవాలు
విజయనగరం అర్బన్: అంతరిక్షం నుంచి సునీత విలియమ్స్ క్షేమంగా చేరుకున్న సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో గురువారం విజయోత్సవాలు ఘనంగా జరిగాయి. తొలుత పాఠశాల ప్రాంగణంలో బాలికలు సామూహిక ప్రదర్శన చేసి బాణసంచా కాలుస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం పి.రమణమ్మ మాట్లాడుతూ యువత సునీత విలియమ్స్‌ను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. బాలికల్లో స్ఫూర్తిని పెంచే విధంగా ఆమె చూపిన పట్టుదల, దృఢ సంకల్పం నిలుస్తాయన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు వి.వెంకట్రావు, ఈ.రామునాయుడు, పి.ఉమారాణి, ఎంవీ లక్ష్మీనరసమ్మ, సీహెచ్రత్నం, యూవీఏఎన్ రాజు, శ్రీరంగాచార్యులు, విద్యార్ధినులు పాల్గొన్నారు. 500 లీటర్ల బెల్లం ఊట ధ్వంసంవేపాడ: మండలంలోని కుమ్మపల్లి సమీపంలో సారా తయారీకి సిద్ధం చేసిన బెల్లం ఊటను వల్లంపూడి పోలీసులు గుర్తించి ధ్వంసం చేశా రు. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గురువారం సాయంత్రం అందిన సమాచారం మేరకు పోలీసులు నిర్వహించిన దాడుల్లో గ్రామసమీపంలోని తోటల్లో 500 లీటర్ల బెల్లం ఊట పట్టుబడింది. దీంతో బెల్లం ఊటను ధ్వంసం చేశారు. -
నిరసన గళం
ప్రకృతి సౌందర్యం ఉట్టిపడేలా.. కల్లుగీత కార్మికుల కష్టాలు తెలిసొచ్చేలా.. కనిపిస్తున్న ఈ చిత్రం విజయనగరం జిల్లా గజపతినగరం రోడ్డులో గురువారం సాయం సంధ్యా సమయాన సాక్షి కెమెరాకు ఇలా చిక్కింది. అస్తమిస్తున్న సూర్యుడి వెలుగులో గీత కార్మికుడు తన బతుకు జీవనానికి బాటలు వేసుకునేలా.. ఈ దృశ్యం చూపరులను ఇట్టే కట్టి పడేసింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయనగరం విజయనగరంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు సొంత భవనం ఏర్పాటు చేయాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థులు గురువారం నిరసన గళం వినిపించారు. 2019లో విజయనగరం పట్టణంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ముందుకొచ్చినా నేటికీ సొంత భవనం లేకపోవడంపై విద్యార్థులు నినదించారు. ఇక్కడ కళాశాలలో ఏటా 400 మందికి పైగా విద్యార్థులు కళాశాలలో చేరుతున్నా సొంత భవనం ఏర్పాటు చేయకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికీ సంస్కృత డిగ్రీ కళాశాలలోనే క్లాసులు నిర్వహించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి కె.రాజు, అధ్యక్షుడు జి.సూరిబాబు ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
ఆధునిక పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
విజయనగరం అర్బన్: పరిశ్రమ రంగానికి అవసరమైన ఆధునిక పరిశోధనలపై విద్యార్థులు ఆసక్తిని పెంచుకోవాలని జేఎన్టీయూ జీవీ ఇంజినీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాల మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ ఇండియా స్టూడెంట్ చాప్టర్ సంయుక్త నిర్వహణలో ‘మెక్ అనో ఎంఎంఎక్స్ఎక్స్వీ 2025’ అంశంపై నిర్వహించిన జాతీయస్థాయి టెక్నికల్ సింపోజియాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరిశ్రమ రంగంలో వస్తున్న ఆధునిక సాంకేతిక పరికరాలు అవి పని చేస్తున్న తీరు తదితర అంశాలపై పరిజ్ఞానాన్ని పెంచడానికి ఇలాంటి సదస్సులు విద్యార్థులకు దోహదపడతాయన్నారు. అనంతరం సావనీర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో మెకా నికల్ ఇంజినీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కె.శ్రీనివాస్ ప్రసాద్, వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమదేవి ఫ్యాకల్టీ సమన్వయకర్తలుగా,, స్టూడెంట్ కో ఆర్డినేటర్స్‌గా కె.కౌశిక్, పి.ప్రగతి వ్యవహరించారు. జేఎన్టీయూ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రాజేశ్వరరావు వర్సిటీలో మెక్అనో జాతీయ సదస్సు ప్రారంభం -
మీటర్ రీడింగ్ కార్మికుల పొట్ట కొట్టొద్దు..
విజయనగరం గంటస్తంభం: స్మార్ట్‌మీటర్లు తీసుకొచ్చి వేలాది మంది విద్యుత్ మీటర్ రీడింగ్ తీసే కార్మికుల పొట్ట కొట్టొద్దని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. గురువారం స్థానిక దాసన్నపేటలోని విద్యుత్ భవన్ ముందు మీటర్ రీడర్స్ యూనియన్ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. విద్యుత్ సంస్థల్లో సుమారు 4500 మంది విద్యుత్ మీటర్ రీడర్స్ 20 సంవత్సరాలుగా పని చేస్తున్నారన్నారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో కార్మికులందరికీ అన్యాయం జరుగుతుందని చెప్పారు. గతంలో చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు స్మార్ట్‌మీటర్లను వ్యతిరేకించి.. నేడు బీజేపీతో జత కట్టడం సిగ్గుచేటన్నారు. ఒక్కో సర్వీస్‌కు కేవలం రూ.3.60 పీస్ రేటుతో నెలకు రూ. 6 నుంచి 10 వేల రూపాయల లోపు మాత్రమే వేతనం పొందుతున్న రీడర్స్‌ను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు. మీటర్ రీడర్ల న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్‌లో ఆందోళనలను ఉధృతం చేస్తామని చెప్పారు. సమావేశంలో యూనియన్ జిల్లా అధ్యక్షుడు సింగంపల్లి శ్రీనివాసరావు, పసుమర్తి శ్రీకాంత్, (ఎస్.కోట సబ్ డివిజన్), విజయనగరం సబ్ డివిజన్ గోక రమణ, (గజపతినగరం సబ్ డివిజన్) ఆది, రీడింగ్ కార్మికులు పాల్గొన్నారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ -
ఉల్లాస్..తుస్
ఉల్లాస్.. ఇదో బృహత్తర కార్యక్రమం. గ్రామీణ ప్రాంతాల్లోని నిరక్షరాస్యులైన మహిళలను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. దీన్ని మూడేళ్ల పాటు విడతల వారీగా నిర్వహించాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కూడా జత కలిసింది. తద్వారా మహిళల అక్షరాస్యతను పెంచి సమాజాభివృద్ధిలో వారిని కీలకంగా వ్యవహరించేలా చేయాలని భావించింది. అయితే.. అనుకున్నదొకటి.. జరుగుతున్నది వేరొకటి అనేలా.. ఉంది. జిల్లాలో ఇలా.. పరీక్ష కేంద్రాలు : 875 రాయనున్నవారు : 48,578 పరీక్ష తేదీ : 23–03–2025 సమయం : ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల మధ్య ● ఎలా రాయాలి? ఏమి రాయాలి? ● అభ్యాసకుల ఆందోళన ● గ్రామాల్లో కానరాని అభ్యసనా తరగతులు ● ఈ నెల 23న పరీక్షల నిర్వహణ ● జిల్లాలో పరీక్షకు హాజరు కానున్న 48,578 మంది ● కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు ● అధికారుల పర్యవేక్షణ కరువు ● -
దర్బార్‌లో ఇఫ్తార్ విందు
విజయనగరం టౌన్: పవిత్ర రంజాన్ మాసం పురస్కరించుకుని బాబామెట్టలోని సూఫీ ఆధ్యాత్మిక చక్రవర్తి ఖాదర్‌బాబా సూఫీ క్షేత్రంలో ఆలయ ధర్మకర్త ఖలీల్‌బాబు సారథ్యంలో గురువారం ఇఫ్తార్ విందు నిర్వహించారు. విశాఖ నుంచి హాజరైన రవిచంద్ర రవి, ఖలీల్‌బాబు తనయుడు అహ్మద్‌బాబుతో కలిసి ఉపవాస దీక్షాపరులకు ఆత్మీయతతో వడ్డన చేశారు. అనంతరం పరిసర ప్రాంత ప్రజలు, భక్తులకు ఖాదర్‌బాబా వారి అన్న సమారాధనను నిర్వహించారు. నూనె గింజల పంటల సాగు పెంచాలి విజయనగరం ఫోర్ట్: నూనె గింజల పంటలైన నువ్వు, పొద్దుతిరుగుడు, వేరుశనగ పంటల సాగు విస్తీర్ణం పెంచాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విద్యాలయం సేద్య విభాగ అధిపతి డాక్టర్ ఎం.భరతలక్ష్మి అన్నారు. స్థానిక వ్యవసాయ పరిశోధన స్థానంలో వ్యవసాయ అధికారులకు, విస్తరణ అధికారులకు, వీఏఏలకు గురువారం నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. నూనె గింజల పంటల్లో కలుపు నివారణకు మార్కెట్లో కలుపు మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వేరుశనగ పంటలో కదిరి లేపాక్షి, నిత్య వారిత వంటి రకాలను వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏరువాక కేంద్రం కో ఆర్డినేటర్ డాక్టర్ కెల్ల లక్ష్మణ్, శాస్త్రవేత్తలు డాక్టర్ యు.త్రివేణి తదితరులు పాల్గొన్నారు. రెన్యువల్స్ సకాలంలో చేయించుకోవాలి విజయనగరం ఫోర్ట్: ఆస్పత్రులు, డయోగ్నోస్టిక్ సెంటర్లు, క్లినిక్స్ సకాలంలో రెన్యువల్స్ చేయించుకోవాలని డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి సూచించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు స్కానింగ్ సెంటర్ల వైద్యులకు కెపాసిటి బిల్డింగ్, జనరల్ బేసిక్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్కానింగ్ సెంటర్ల రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. స్కానింగ్ సెంటర్లలో లింగ నిర్ధారణ వెల్లడించకూడదన్నారు. సమావేశంలో అదనపు వైద్య ఆరోగ్య శాఖాధికారిణి డాక్టర్ కె.రాణి, పీసీపీఎన్డీటీ నోడల్ అధికారి డాక్టర్ రెడ్డి అచ్చుతకుమారి, డాక్టర్ ఎం.జయచంద్రనాయుడు, డెమో వి.చిన్నతల్లి, డిప్యూటీ డెమో ఎస్.రమణ పాల్గొన్నారు. మారిక హెచ్ఎం సస్పెన్షన్ వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు గిరి శిఖరంపై ఉన్న మారిక ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎస్వీ శ్రీకాంత్‌ను సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యాలనాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. పాఠశాలకు సక్రమంగా హాజరు కావడం లేదని అందిన ఫిర్యాదుల మేరకు ఎంఈఓతో విచారణ నిర్వహించారు. అనంతరం సస్పెండ్ చేస్తూ డీఈఓ ఆదేశాలు ఇచ్చారు. సదరు హెచ్ఎం స్థానంలో వేరొకరిని నియమించాలని ఎంఈఓకు సూచించారు. -
‘అగ్నివీర్’కు దరఖాస్తుల ఆహ్వానం
శరీర కొలతలు అగ్నివీర్ జనరల్ డ్యూటీ మరియు అగ్ని ట్రేడ్స్‌మెన్ పోస్టులకు 166 సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి. అగ్నివీర్ టెక్నికల్ పోస్టుకు 165 సెంటీమీటర్లు, అగ్నివీర్ క్లర్క్/టెక్నికల్ పోస్టులకు 162 సెంటీమీటర్లు ఎత్తు తప్పనిసరి. 77 సెంటీమీటర్ల కనీస విస్తీర్ణంతో ఛాతీ ఉండి ఊపిరి పీల్చేటప్పుడు 5 సెంటీమీటర్ల విస్తీర్ణం పెరగాలి. ఎత్తుకు తగిన బరువు కలిగి ఉండాలి. ఎంపికై న వారిని 4 సంవత్సరాల షార్ట్ టర్మ్ సర్వీసు అగ్నివీర్ సర్వీస్లోనికి తీసుకుంటారు. దళారులు, మధ్యవర్తులను నమ్మవద్దని ఆర్మీ రిక్రూట్మెంట్ ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఆర్మీ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతుందని కలెక్టర్ అంబేడ్కర్ స్పష్టం చేశారు. ఇతర వివరాల కోసం సెట్విజ్ కార్యాలయంలోని మేనేజర్ వెంకటరమణ 9849913080 నంబరుకు సంప్రదించాలని ఆయన సూచించారు. విజయనగరం అర్బన్: భారత సైన్యంలో అగ్నివీర్ ఉద్యోగాలకు అవివాహిత పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తులను వచ్చే నెల 10వ తేదీలోగా ఆన్లైన్లో joinindianarmy.nic.in వెబ్సైట్ ద్వారా స్వీకరిస్తున్నామని పేర్కొన్నారు. ఆన్లైన్లో ద్వారా నమోదు చేసుకున్న అభ్యర్థులు అడ్మిన్కార్డును డౌన్లోడ్ చేసుకొని ఆర్మీ ర్యాలీ జరిగే తేదీ, సమయం పొందవచ్చునని తెలిపారు. తొలిత ఆన్లైన్ పరీక్ష పాసైన అభ్యర్థులకు ఆర్మీ ర్యాలీ (ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్) నిర్వహిస్తారని పేర్కొన్నారు. అగ్నివీర్ జనరల్ డ్యూటీ: 10వ తరగతిలో కనీసం 45 శాతం మార్కులతో ఉత్తీర్ణత. అగ్నివీర్ టెక్నికల్: ఫిజిక్స్, కెమిస్ట్రీ, మేథ్స్ మరియు ఇంగ్లిష్ సబ్జెక్టులతో కనీసం 50 శాతంతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత, ప్రతి సబ్జెక్టులో కనీసం 40 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి. అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్: ఆర్ట్స్, కామర్స్, సైన్స్ సబ్జెక్టులతో కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణతతో పాటు ప్రతి సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి. అగ్నివీర్ ట్రేడ్స్‌మెన్: 8వ/10వ తరగతి ఉత్తీర్ణత. అభ్యర్థులు 2004 అక్టోబర్ 1 నుంచి 2008 ఏప్రిల్1వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. పోస్టుల వివరాలు, విద్యార్హతలు ఏప్రిల్ 10 వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
వేసవి ప్రారంభంలోనే ప్రమాద ఘంటికలు
● తగ్గుతున్న జలాశయాల నీటి మట్టాలు బొబ్బిలి: అన్నదాతకు, అటు మూగజీవులు, ప్రజానీకానికి దాహార్తిని తీర్చే జలాశయాలు నీటి నిల్వలను మార్చి నెలలోనే కోల్పోవడం కనిపిస్తోంది. జిల్లాలోని ప్రధాన జలాశయాల నీటి మట్టాలు తగ్గుముఖం పట్టే ఛాయలు ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని నీటి మట్టాలు తగ్గుతుండటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితి లేకపోయినా చాలా చోట్ల పశువుల దాహార్తిని తీర్చేందుకు, ఆరుతడి పంటలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందా.. అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న సాగునీటి వనరుల్లో ఒక భారీ తరహా నీటి పారుదల ప్రాజెక్టు ఉండగా మిగతావి మధ్య తరహా సాగునీటి ప్రాజెక్టులున్నాయి. వీటి ద్వారా ఏటా ఖరీఫ్‌లోనే సాగునీటిని విడుదల చేస్తున్నారు. రబీలో ఆరుతడి పంటలకు సాగునీటిని విడుదల చేసే అవకాశం ఉంటోంది. వీటిని ఏటా జలవనరుల శాఖ అధికారులు పరిశీలించి రబీకి సాగునీటిని విడుదల చేయాలా.. వద్దా.. అనేది నిర్ణయిస్తారు. దీని ప్రకారం రైతులు తమ పంటలను సాగు చేసుకుంటుంటారు. అయితే ఈ ఏడాది సాగునీటి నిల్వలు తగ్గే పరిస్థితి నెలకొంది. మార్చి నెలలోనే సాగునీటి ప్రాజెక్టుల్లో నీరు మీటర్ల మేర తగ్గుతూ కనిపిస్తోంది. వేసవిలో అకాల వర్షాలు, తుఫాన్ల వంటివి సంభవిస్తే తప్ప మే నెలాఖరుకు మరింత నీరు ఇంకిపోయే పరిస్థితులున్నాయి. ఇది అందరినీ కలవరపరుస్తోంది. వీఆర్ఎస్లో కొద్ది రోజుల కిందటి నీటి నిల్వలు -
నిర్దిష్ట ప్రమాణాల మేరకు పెసర, మినుము కొనుగోళ్లు
బొబ్బిలి: పట్టణంలోని పీఏసీఎస్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం ద్వారా రైతులు పండించిన పెసలు, మినుము కొనుగోళ్లు చేపట్టి సకాలంలో చెల్లింపులు చేస్తామని మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ ఎన్.వెంకటేశ్వరరావు తెలిపారు. పట్టణంలోని పీఏసీఎస్ కేంద్రంలో కొనుగోలు కేంద్రాన్ని ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మినుములు క్వింటా రూ.7,400లు, పెసలు క్వింటా రూ.8,682లకు కొనుగోలు చేస్తామన్నారు. అయితే నాఫెడ్ విధించిన నిర్దిష్ట నాణ్యతా ప్రమాణాల నిబంధనల ప్రకారం పెసలు, మినుములను పై మద్దతు ధరలకు కొనుగోలు చేస్తామన్నారు. ఇందులో మార్క్‌ఫెడ్ నోడల్ ఏజెన్సీగా తన విధులను నిర్వర్తిస్తోందన్నారు. జిల్లాలో జామి మండలం విజినిగిరి, గంట్యాడ, గజపతినగరం, సంతకవిటి, బొబ్బిలి ప్రాంతాల్లో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించామన్నారు. మిగతా ప్రాంతాల్లో కూడా త్వరలో ప్రారంభిస్తామన్నారు. గోదాముల నిర్మాణానికి భూమి కొనుగోలు మార్క్‌ఫెడ్ ద్వారా గోదాములను నిర్మించేందుకు బొబ్బిలి గ్రోత్ సెంటర్ సమీపంలోని జగనన్న కాలనీ వద్ద 5.19 ఎకరాల భూమిని గతంలో కొనుగోలు చేసినట్టు మార్క్‌ఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గొల్లపల్లి సర్వే నంబర్ 509–2లో గల ఈ భూమికి సంబంధించిన రూ.33,73,500 లను రెవెన్యూ శాఖకు చెల్లించామన్నారు. ఇప్పుడు మరోసారి దానిని గుర్తించి స్వాధీనం చేసుకునేందుకు తహసీల్దార్ ఎం.శ్రీనుతో కలసి సర్వే చేసినట్టు చెప్పారు. పూర్తి వివరాలను జిల్లా కలెక్టర్ ద్వారా తెలియజేస్తామని చెప్పారు. జిల్లాలో ఐదు మండలాల్లో కేంద్రాలు ప్రారంభించిన మార్క్‌ఫెడ్ మేనేజర్ -
గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం
విజయనగరం క్రైమ్: గంజాయి అక్రమ రవాణాపై పోలీస్ శాఖ ఉక్కుపాదం మోపుతోందని విశాఖ రేంజ్ పోలీసు డీఐజీ గోపీనాథ్ జెట్టి స్పష్టం చేశారు. ఈ మేరకు గడిచిన ఎనిమిది నెలల్లో మూడు దశల్లో పట్టుబడిన 7 వేల 378 కేజీల గంజాయిని ధ్వంసం చేశామని డీఐజీ తెలిపారు. విశాఖ పోలీస్ రేంజ్ పరిధి శ్రీకాకుళం జిల్లా లావేరు మండలం పాత కుంకాంలో గురువారం మూడు జిల్లాల్లో పలు కేసుల్లో సీజ్ చేసిన గంజాయి నిర్మూలన కార్యక్రమం జరిగింది. 226 కేసులలో సీజ్ చేసిన 7378 కిలోల గంజాయిని డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఐజీ గోపీనాథ్ జెట్టి మాట్లాడుతూ యువత మత్తు పదార్థాలకు బానిసై అమూల్యమైన జీవితాన్ని నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో విజయనగరం, పార్వతీపురం మన్యం, ,శ్రీకాకుళం జిల్లాల ఎస్పీలు పాల్గొన్నారు. విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి -
పొజిషన్ ఉంటేనే నిధుల మంజూరు..!
పార్వతీపురంటౌన్: కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ హౌసింగ్ పథకంలో భాగంగా గ్రామీణ ప్రాంతంలో మూడు సెంట్లు, అర్బన్ ప్రాంతంలో రెండున్నర సెంట్లు చొప్పున ఇంటి స్థలాలు కేటాయించనుంది. హౌసింగ్‌లో వచ్చే నిధులను ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంచినట్లు పక్క ప్రభుత్వం, మరోపక్క అధికారులు చెబుతున్నారు. వాటికి తోడు బీసీ, ఎస్సీ కులాల లబ్ధిదారులకు అదనంగా రూ.50వేలు, ఎస్టీ కులాలకు చెందిన లబ్ధిదారులకు అదనంగా రూ.70వేలు ఆర్థిక సాయం అందించనున్నారు. ఈ క్రమంలో హౌసింగ్ పథకం అమలు వేగం పుంజుకుంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇంతా ఒక ఎత్తయితే హౌసింగ్ పథకంలో బీసీ, ఎస్సీ,ఎస్టీ కులాల ధ్రువీకరణ పత్రాలు, వారి అనుభవంలో ఉన్న స్థలాలకు రెవెన్యూ అధికారులతో పొజిషన్ సర్టిఫికెట్లు జతచేయాలన్న నిబంధన పెట్టారు. దీంతో లబ్ధిదారులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు స్థలాల పొజిషన్ సర్టిఫికెట్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. కుల, ఆధాయ ధ్రువీకరణ పత్రాల మంజూరులో లబ్ధిదారులకు ఇబ్బందులు రావడం లేదు కానీ పొజిషన్ సర్టిఫికెట్ మంజూరులో రెవెన్యూ అధికారులు పలు ప్రశ్నలు వేస్తున్నారు. స్థలానికి సంబంధించి రిజిస్ట్రేషన్, అగ్రిమెంట్లు ఉండాలని, డీకేటీ, గ్రామకంఠం భూములకు ఇవ్వమని చెబుతున్నారు. గ్రామాల్లో పేద రైతులకు వారి పొలాల వద్ద హౌసింగ్ ఇంటి నిర్మాణానికి స్థలాలు ఉన్న భూములకు వన్‌బీ ఉండడంతో మూడు సెంట్ల స్థలానికి పొజిషన్ సర్టిఫికెట్లు ఎలా ఇస్తామని రెవెన్యూ అధికారులు మెలిక పెడుతున్నారు. దీంతో లబ్ధిదారులు తమ గోడు ఎవరికీ చెప్పుకోవాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గందరగోళంలో హౌసింగ్ అధికారులు పార్వతీపురం మన్యం జిల్లాలో హౌసింగ్ పథకంలో లబ్ధిదారులకు ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయండి. ప్రతి వారం రోజులకు ఈ పథకంలో సాధించిన నివేదికలు ఇవ్వండి అంటూ హౌసింగ్ ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారుల వెంట పడుతున్నారు. అన్నీ సక్రమంగా ఉంటే ఈ పాటికే హౌసింగ్ నిర్మాణాలు పునాదులు దాటి గోడస్థాయికి వచ్చి ఉండేవి. కానీ లబ్ధిదారుల సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ ఉంటేనే నిధులు మంజూరు చేయాలనే నిబంధన ఉండడంతో ఇక్కడే ఈ పథకం ముందుకు కదలకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా నిలిచిపోయింది. దీంతో ఉన్నతాధికారులకు సమాధానాలు చెప్పలేక, రెవెన్యూ అధికారులను ప్రాథేయపడలేక హౌసింగ్ అధికారుల్లో గందరగోళం నెలకొంది. జిల్లాలో 18,056 మంది లబ్ధిదారుల గుర్తింపు పార్వతీపురం మన్యం జిల్లాలో 18,056 మంది హౌసింగ్ పథకంలో లబ్ధిదారులు ఉన్నట్లు అధికారులు సర్వే చేశారు. సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు హౌసింగ్ పథకంలో ఇంటి నిర్మాణం మంజూరు చేసేందకు ఆ స్థలాల్లో పొజిషన్ సర్టిఫికెట్ల మెలిక పెట్టడంతో అవి నిలిచిపోతున్నాయి. జిల్లాలో గల 15 మండలాల్లో అధికారులు విస్తృతంగా సర్వే నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా ఇదే పరిస్థితి. సుమారు 13వేల మందికి పైగా లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్లు లేవన్న కారణంగా హౌసింగ్ బిల్లులు అందుతాయో? లేదోనన్న ఆందోళన నెలకొంది. హౌసింగ్ నిధులు ఒక్కో లబ్ధిదారుకు రూ.2.50లక్షలకు పెంపు కుల,ఆదాయ ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి తలలు పట్టుకుంటున్న ఇళ్ల లబ్ధిదారులుఅన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరి హౌసింగ్ పథకంలో భాగంగా సొంత స్థలాలు ఉన్న లబ్ధిదారులకు పొజిషన్ సర్టిఫికెట్ తప్పనిసరి. సొంత స్థలాలకు పొజిషన్ సర్టిఫికెట్ మంజూరు స్థానిక తహసీల్దార్ కార్యాలయాల్లో అందజేస్తున్నారు. ఆధాయ, కుల ధ్రువీకరణ పత్రాలతో పాటు పొజిషన్ సర్టిఫికెట్లు ఇస్తేనే లబ్ధిదారులకు హౌసింగ్ నిధులు కేటాయించి నిర్మాణ పనులు చేపట్టేలా చూస్తున్నాం. – పి.ధర్మ చంద్రారెడ్డి, ఇన్చార్జ్ హౌసింగ్ పీడీ, పార్వతీపురం మన్యం జిల్లా -
దైవదర్శనానికి వెళ్తూ ఇద్దరు మహిళల మృతి
గుర్ల: మండలంలోని పెనుబర్తికి చెందిన 15 మంది, గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన 30 మంది తమిళనాడులోని రామేశ్వరం దైవదర్శనానికి బస్సులో వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగి ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందా రు. తెలంగాణలోని మెదక్ జిల్లా శంకరంపేట వద్ద మంగళవారం జరిగిన రోడ్డుప్రమాదం వివరాలిలా ఉన్నాయి. రోడ్డు పక్కన ఆగి ఉన్న ప్రయాణికుల బస్సును డీసీఎం వ్యాన్ ఢీకొట్టడంతో ప్రమాదం జరిగి బస్సు వెనుక భాగంలో ఉన్న కూర్చున్న మహిళలు మృతిచెందారు. మృతిచెందిన వారిలో గుర్ల మండలంలోని పెనుబర్తికి చెందిన రౌతు సూరప్పమ్మ (60), గరివిడి మండలంలోని కుమరాం గ్రామానికి చెందిన మీసాల అప్పలనారాయణమ్మ (50) ఉన్నారు. అలాగే పెనుబర్తి గ్రామానికి చెందిన బెల్లాన జగన్నాథం, సుంకరి రామలక్ష్మిలకు తీవ్ర గాయాలయ్యాయి. బావిలో పడి ఒకరు...పార్వతీపురం రూరల్: రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి నేలబావిలో శవమై తేలా డు. ఈ మేరకు స్థానిక రూరల్ ఎస్సై బి.సంతో షి గురువారం తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని సారిక వీధికి చెందిన మజ్జి సత్యనారాయణ(54)ఈనెల 18న ఆస్పత్రికి అని చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు. తరువాత ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు, బంధువులు పరిసర గ్రామాల్లో వెతికారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు భార్య పార్వతి ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో గురువారం పార్వతీపురం రూరల్ పరిధిలో ఉన్న బ్యాంక్ఆఫ్ బరోడా సమీపంలో నేలబావిలో మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచా రం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి మృతదేహాన్ని సత్యనారాయణగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. నాలుగు నెలల క్రితం కుటుంబ సభ్యులలో ఒకరు మరణించడంతో మనస్తాపానికి గురై సత్యనారాయణ మృతి చెంది ఉంటాడని కుటుంబసభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. -
నిందితులకు రిమాండ్
గజపతినగరం: మెంటాడ మండలం రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మను(75) హతమార్చిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం గజపతినగరం పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మెంటాడ మండలం రెల్లిపేటలో తన నివాస గృహంలో 16.3,2025న వృద్ధురాలు అనుమానాస్పదంగా మృతి చెందినట్లు బంధువులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశామన్నారు. శవపంచనామా అనంతరం వృద్ధురాలిని గొంతునులిమి చంపినట్లు వైద్యుల రిపోర్టు రావడంతో ఎస్పీ ఆదేశాల మేరకు నిందితులను గాలించి అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. గురువారం ఉదయం 11గంటలకు నలుగురు నిందితులైన దానాలరాము, దానాల దుర్గారావు, దానాల రాములమ్మ, పాల్తేటి రామప్పడు అలియాస్ బొడ్డులు పంచాయతీ సెక్రటరీ, వీఆర్ఓల సమక్షంలో లొంగిపోయినట్లు చెప్పారు. మృతురాలు అంకమ్మ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారికి నగదు అప్పుగా ఇస్తూ ఉంటుందని అందులో భాగంగా దానాల రాములమ్మ అప్పుఅడగ్గా ఆమె తిరస్కరించింది. దీంతో రాములమ్మతో పాటు మరో ముగ్గురు తోడై వృద్ధురాలి వద్ద ఉన్న బంగారం ముక్కుపుడక, రూ.740లు దోచుకుని ఆమెను హతమార్చినట్లు తెలిపారు. కేసు దర్యాప్తులో ప్రతిభ కనబరిచిన స్థానిక సీఐ జీఏవీ రమణ, ఆండ్ర ఎస్సై కె.సీతారామ్, గజపతినగరం ఎస్సై కె.లక్ష్మణరావులతో పాటు ఇతర సిబ్బందిని ఎస్పీ వకుల్ జిందల్‌తో పాటు తాను అభినందిస్తున్నట్లు చెప్పారు. వృద్ధురాలిని హతమార్చిన కేసులో నలుగురి అరెస్ట్ -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ107 శ్రీ184 శ్రీ194గేట్లో ఆలిండియా 451వ ర్యాంక్ ● అర్తమూరు యువకుడి ప్రతిభ చీపురుపల్లి రూరల్ (గరివిడి): ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నిర్వహించిన గేట్–2025 (గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్)ఎంట్రన్స్ టెస్ట్‌లో గరివిడి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన యువకు డు సుంకరి నరసింహనాయుడు ప్రతిభ చాటా డు. మెకానికల్ విబాగంలో ఆలిండియా స్థా యిలో 451వ ర్యాంకు సాధించాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 3న గేట్ ఎంట్రన్ పరీక్ష జరగ్గా బుధవారం ఫలితాలు విడుదలయ్యాయి. తల్లిదండ్రుల చెంతకు తప్పిపోయిన బాలుడుగరుగుబిల్లి: మండలంలోని రావివలస ఎస్సీ వసతి గృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి పత్తిగూల శివసాయిని స్థానిక ఎస్సై పి.రమేష్‌నాయుడు గురువారం తల్లిదండ్రులకు అప్పగించారు. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన శివసాయి ఫిబ్రవరి 17న రావివలస ఎస్సీ వసతి గృహంనుంచి వెళ్లిపోయాడు. ఈ మేరకు తండ్రి పోలయ్య ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. శివసాయి కోసం గాలింపు చేపట్టగా సీతానగరం మండలం అంటిపేటవద్ద ఆచూకీ లభించడంతో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చి, తల్లిదండ్రులకు ఎస్సై అప్పగించారు. ఈ సందర్భింగా తల్లిదండ్రులు ఎస్సైకి, సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈహెచ్ఎస్ సేవలందించడంలో అలసత్వం తగదు● ఆరోగ్యశ్రీ జిల్లా మేనేజర్ డి.రాంబాబు విజయనగరం ఫోర్ట్: ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)కు సంబంధించి ప్రతి రోగికి వైద్యసేవలు అందించాలి. వైద్యసేవలు అందించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) జిల్లా మేనేజర్ డి.రాంబాబు అన్నారు. ఈ మేరకు పట్టణంలోని శ్రీసాయి సూపర్ స్పెషాలిటీ నెట్వర్క్ ఆస్పత్రిని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆరోగ్యశ్రీ ద్వారా చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వైద్యసేవల గురించి ఆరా తీశారు. చికిత్స సకాలంలో అందిస్తున్నారా? నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదనంగా డబ్బులు ఏమైనా అడుతున్నారా అని రోగులను ఆరా తీశారు. ఆస్పత్రిలో ఏ సమస్య ఉన్నా వెంటనే ఆరోగ్య మిత్రను కలవాలని రోగులకు చెప్పారు. కార్యక్రమంలో టీమ్ లీడర్ ఎ.భానుప్రసాద్ పాల్గొన్నారు. అట్రాసిటి కేసుపై విచారణవేపాడ: మండలంలోని గుడివాడ గ్రామానికి సంబంధించి నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసుపై విజయనగరం డీఎస్పీ మీరాకుమార్ నేతృత్వంలో గురువారం విచారణ చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. మార్చి 11న గుడివాడలో వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా నిర్వహించిన డ్యాన్స్‌బేబీ డ్యాన్స్ వద్ద జరిగిన గొడవలో తన కుమారుడిని కులం పేరుతో వల్లంపూడి ఎస్సై బి.దేవి దూషించి గాయపర్చినట్లు గ్రామానికి చెందిన గుడివాడ కృష్ణమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ పి.మీరాకుమార్, రూరల్ సీఐ అప్పలనాయుడు గ్రామంలో గురువారం విచారణ నిమిత్తం గ్రామసభ నిర్వహించారు. గ్రామసభ వద్దకు ఫిర్యాదుదారు కృష్ణమ్మ హాజరుకాకపోవడంతో డీఎస్పీ మీరాకుమార్ ఫిర్యాదు దారు ఇంటికి వెళ్లి ఆరా తీయగా కుటుంబసభ్యులు ఉన్నారు కానీ ఫిర్యాదుదారు లేకపోవడంతో గ్రామసభకు చేరుకున్నారు. గ్రామసభలో వేచి ఉన్నప్పటికీ సాక్షులు హాజరుకాకపోవడంతో సర్పంచ్ మిడతాన గోపి, ఏపీ దళితకూలీ రైతు సంఘం నాయకుడు గాలి ఈశ్వర్రావు తదితరులతో మాట్లాడిన అనంతరం డీఎస్పీ, సీఐ వెనుదిరిగారు. -
ఆదుకోకోంటే ఉద్యమమే
పెదవేగి: కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని కోకో రైతుల రాష్ట్ర సదస్సు హెచ్చరించింది. ఈ మేరకు గురువారం ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయి గ్రామంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. బొల్లు రామకృష్ణ, బోళ్ల సుబ్బారావు, ఈడ్పుగంటి శ్రీనివాసరావు అధ్యక్షులుగా వ్యవహరించిన ఈ సదస్సులో కోకో రైతుల సమస్యలపై చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కోనసీమ, కృష్ణా, ఎన్టీఆర్ తదితర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కోకో రైతులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కంపెనీల సిండికేట్‌తో దోపిడీ కోకో గింజల కొనుగోలు కంపెనీలు సిండికేట్‌గా మారి రైతులను దోపిడీ చేస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు వై.కేశవరావు విమర్శించారు. రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకొని కోకో గింజల కొనుగోలు సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 75 వేల ఎకరాల్లో కోకో తోటల సాగు ఉందని, ఏలూరు జిల్లాతో పాటు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కొబ్బరి, ఆయిల్‌పామ్ తోటల్లో కోకో అంతర పంటగా ఉందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ ప్రకారం కోకో గింజలకు ధర చెల్లించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. కోకో రైతులు సంఘటితం కావాలి కోకో రైతులంతా సంఘటితంగా లేకపోవడం వల్లే కంపెనీలు సిండికేట్ అయి ఇబ్బంది పెడుతున్నాయని ఏపీ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కార్యదర్శి మాగంటి హరిబాబు, ఏపీ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ అన్నారు. 24న ధర్నాలు, రాస్తారోకోలు కోకో రైతుల సమస్యలపై ఈ నెల 24, 25 తేదీల్లో ధర్నాలు, రాస్తారోకో కార్యక్రమాలు నిర్వహించాలని, ఎంపీలు ఎమ్మెల్యేలు, కలెక్టర్లకు వినతి పత్రాలు అందించాలని, సమస్యను పరిష్కరించకపోతే కోకో గింజలు కొనుగోలు చేస్తున్న కంపెనీల గొడౌన్ల ముందు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోకో రైతుల రాష్ట్ర సదస్సు పిలుపునిచ్చింది. తేల్చిచెప్పిన కోకో రైతులు కొనుగోలు సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని డిమాండ్ విజయరాయిలో రాష్ట్ర సదస్సుకు పెద్దసంఖ్యలో రైతుల హాజరు -
పోక్సో కేసుల్లో ఇరుక్కుని జీవితాలు నాశనం చేసుకోవద్దు
బొబ్బిలి: పోక్సో కేసుల్లో ఇరుక్కుని మీ జీవితాలు నాశనం చేసుకోవద్దని సీనియర్ సివిల్ జడ్జి ఎస్.అరుణశ్రీ హితవు పలికారు. ఈ మేరకు గురువారం స్థానిక సబ్‌జైలును ఆమె సందర్శించి రిమాండ్ ఖైదీలతో మాట్లాడి సత్ప్రవర్తనపై తెలియజేశారు. న్యాయ సహాయం కావాల్సిన వారు ఏ విధంగా పొందవచ్చో వివరించారు. చెడు ఆలోచనల వల్ల ఎలాంటి ఉపద్రవాలు ఎదుర్కోవాల్సి వస్తుందో, వాటికి దూరంగా ఉంటూ సమాజంలో మంచి పౌరులుగా ఎలా జీవించాలోనన్న విషయాలను తెలియపర్చి వారిలో పరివర్తన, చైతన్యం కల్పించే ప్రయత్నం చేశారు. సబ్‌జైలర్ పాత్రో, సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. -
సీఎస్‌లకు చేతి చమురు
పరీక్షల నిర్వహణలో వారిపైనే ఆర్థిక భారం విజయనగరం అర్బన్: ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందన్న’ చందంగా ఉంది పదోతరగతి పరీక్ష నిర్వహణ ఖర్చుల వ్యవహారం. ప్రభుత్వం కేటాయించిన నిధులు చాలకపోవడంతో పరీక్షల నిర్వహణ అధికారులకు చేతిచమురు వదులుతోంది. చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్మెంట్ అధికారులకు పరీక్షగా మారుతోంది. పరీక్షలు పూర్తయ్యేవరకు ఒక్కో విద్యార్థికి కేటాయించిన రూ.10 సరిపోకపోవడంతో కనీసం రూ.100 వరకు సొంత నిధుల నుంచి వెచ్చించాల్సి వస్తోందంటూ వాపోతున్నారు. విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడంలేదని ఆరోపిస్తున్నారు. పరీక్షల నిర్వహణ పూర్తయ్యేలోగా కేటాయింపులు పెంచాలని, ఇన్విజిలేటర్లకు ఇచ్చే రెమ్యూనరేషన్‌ను పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. పరీక్షల నిర్వహణకు ఒక్కో విద్యార్థికి రోజుకు రూ.1.42 చొప్పున ఏడు పరీక్షలకు రూ.10లు ప్రభుత్వం మంజూరు చేస్తోంది. 2018లో ఒక్కో విద్యార్థికి కంటింజెంట్ చార్జీగా రూ.5.50 మాత్రమే ఇవ్వగా పెరిగిన ధరల మేరకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2023లో ఆ చార్జీని రూ.8కి, మరుసటి ఏడాది రూ.10కి పెంచింది. ఈ ఏడాది చార్జీల పెంపు విషయాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదన్నది ఉపాధ్యాయ సంఘాల మాట. పరీక్ష కేంద్రాలను పర్యవేక్షించే చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ అధికారి పోలీస్ స్టేషన్ నుంచి ప్రశ్న పత్రాలను తీసుకొని వచ్చి, పరీక్ష అనంతరం సమాధాన పత్రాలను సీల్ చేస్తారు. ఇంగ్లిష్, ఉర్దూ మీడియంలకు వేర్వేరుగా సంచులు వాడతారు. ఒక్కో సంచికి రెండు నుంచి మూడు మీటర్ల వస్త్రం కొనుగోలుకు, జవాబు పత్రాలను పోస్టాఫీస్‌కు తీసుకుని వెళ్లడానికి రవాణా ఖర్చులను భరించాల్సి వస్తోంది. జవాబు పత్రాలను కట్టి భద్రపరిచేందుకు లక్క, కొవ్వొత్తి, ధారం, స్కెచ్ పెన్నులు, స్టాప్లర్లు, గమ్, వైట్నర్ తదితర వస్తువులను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు పరీక్ష కేంద్రంలో మంచినీరును అందుబాటులో ఉంచాలి. ఒక పరీక్ష కేంద్రంలో 100 మంది విద్యార్థులుంటే అక్కడి నిర్వాహణకు రూ.10 వంతున రూ.1,000 కంటింజెన్సీ నిధులు వస్తాయి. ఆ సెంటర్‌కి కావాల్సిన అన్ని వస్తువులను కొనాలంటే ఎంతలేదన్నా రోజుకు కనీసం రూ.600కు పైగా ఖర్చవుతుంది. ఈ లెక్కన కనీసం రూ.6 వేలు వరకు కంటింజెన్సీ నిధులు ఇవ్వాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఒక్కో విద్యార్ధికి రోజుకి 1.42 ఇస్తే ఎలా సరిపోతుందని చీఫ్‌లు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్ పరీక్షల్లో ఇన్విజిలేటర్లకు రోజుకు రూ.150 వంతున రెమ్యూనరేషన్ ఇస్తుండగా పదో తరగతి ఇన్విజిలేషన్‌కు మాత్రం రోజుకు కేవలం రూ.33 ఇస్తున్నారు. అటెండర్‌కు రూ.20, వాటర్ బాయ్‌కి రూ.17 వంతున భృతిని చెల్లిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అంతకు ముందు కంటే సీఎస్, డీఓలకు రూ.22, ఇన్విజిలేటర్లు, క్లర్క్స్‌కు రూ.11, అటెండర్లకు రూ.6.80, వాటర్ బాయ్‌కి రూ.6 చొంపున పెంపుదల చేసింది. మరోవైపు ఇంటర్, పదోతరగతి పరీక్షలకు పెద్దగా తేడా లేకున్నా, రెమ్యూనరేషన్ చెల్లింపులో మాత్రం తీవ్ర వ్యత్యాసం కనిపిస్తోందని ఉపాధ్యాయులు వాపోతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నిర్వహణ ఖర్చులు మంజూరు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని పలువురు ఇన్విజిలేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీఫ్, డీఓ, కస్టోడియన్లకు రోజుకు ఇచ్చేది రూ.66రూ.33రూ.17ఇదీ లెక్క... ఇన్విజిలేటర్లకూ అన్యాయమే ప్రతి పరీక్ష కేంద్రంలో నిర్వహణ బాధ్యత చీఫ్ సూపరింటెండెంట్ల (సీఎస్)దే. ఉమ్మడి విజయనగరం జిల్లాలో పదో తరగతి పరీక్ష నిర్వహణకు 186 మంది చీఫ్‌లు హాజరవుతున్నారు. ప్రభుత్వం నిధులను తక్కువగా విడుదల చేస్తుండడంతో అదనంగా అయ్యే ఖర్చును వారి చేతి నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోంది. రోజుకు రూ.200 నుంచి రూ.300 వరకు అదనంగా భరించాల్సి ఉంటుందని పలువురు చీఫ్‌లు చెబుతున్నారు. ఒక్కో విద్యార్థికి కనీసం రూ.15 ఇవ్వాలని, అదనంగా రవాణా చార్జీలు మంజూరు చేయాలని చీఫ్‌లు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి విజయనగరం జిల్లాలోని పరీక్ష కేంద్రాలు 186ప్రస్తుత ధరలకు అనుగుణంగా ఇవ్వాలి ప్రస్తుత ధరలకు అనుగుణంగా రెమ్యూనిరేషన్ పెంచాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం ఇచ్చే నామమాత్రపు కంటింజెంట్ చార్జి పరీక్షల నిర్వహణకు ఏ మూలకూ సరిపోవడం లేదు. ప్రభుత్వం సీఎస్, డీవోలతో పాటు ఇన్విజిలేటర్లకు కనీస చార్జీలు చెల్లించక పోవడం దురదృష్ణకరం. – జేఏవీఆర్‌కే ఈశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, యూటీఎఫ్ రెమ్యూనరేషన్‌ను పెంచాలి ప్రభుత్వం పరీక్షల నిర్వహణకు చేస్తున్న కేటాయింపులు ఏ మాత్రం సరిపోవడం లేదు. ఒక విద్యార్థికి ఒక పేపరుకు చెల్లిస్తున్న రూ.1.42 కంటింజెంట్ చార్జి ఏ విధంగా సరిపోతాయో ప్రభుత్వ పెద్దలే చెప్పాలి. ఇన్విజిలేటర్లకు రోజుకు కనీసం రూ.150, చీఫ్, డీఓ, కస్టోడియన్లకు రోజుకు రూ.200 వంతున కేటాయించాలి. ప్రభుత్వం దీనిపై వెంటనే స్పందించాలి. – బంకపల్లి శివప్రసాద్, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జ్, పీఆర్టీయూ -
91,836 మందికి ఆరోగ్యశ్రీ సేవలు
రాజాం: జిల్లాలో 91,836 మంది 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) కింద సేవలు పొందారని పథకం జిల్లా మేనేజర్ దూబ రాంబాబు తెలిపారు. ఆయన రాజాం సామాజిక ఆస్పత్రిని బుధవారం పరిశీలించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులకు అందిస్తున్న మెనూపై ఆరా తీశారు. ప్రభుత్వం అమలుచేస్తున్న మెనూను లబ్ధిదారులకు అందించాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. ఆరోగ్యశ్రీ లబ్ధిదారులతో మాట్లాడారు. ఆస్పత్రికి అవసరమైన సౌకర్యాలను ఆస్పత్రి సూపరింటెండెంట్ కె.హరిబాబును అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆరోగ్యశ్రీ కింద రూ.195 కోట్ల విలువైన వైద్యసేవలు అందించినట్టు వెల్లడించారు. డీసీసీబీలో అంతర్గత ఆడిటర్ల నియామకం విజయనగరం అర్బన్: వచ్చే ఆర్థిక సంవత్సరంలో జిల్లాలోని జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (డీసీసీబీ) పరిధిలోని 24 బ్రాంచిలలో అంతర్గత ఆడిటర్లను నియమించుకునేందుకు మహాజన సభలో ఆమోదం తెలిపారు. జేసీ ఎస్.సేతుమాధవన్ అధ్యక్షతన కలెక్టర్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మూడో మహా జన సభలో ఈ ఏడాది ఫిబ్రవరి నెలాఖరు నాటికి బ్యాంకు ఆర్థిక ఫలితాలపై చర్చించారు. గత నవంబర్ 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు వరకు కమిటీ సభ్యులు తీసుకున్న నిర్ణయాలను ఆమోదించారు. 2025–26 ఆర్థిక వార్షిక బడ్జెట్ అంచనాలను సమావేశం కన్వీనర్, డీసీసీబీ సీఈఓ ఉమామహేశ్వరరావు సభ్యులకు వివరించారు. కస్టమర్ డిపాటిట్ పాలసీ, కస్టమర్ సర్వీస్ పాలసీ, డెత్ క్లెయిమ్ పాలసీలపై చర్చించారు. సమావేశంలో నాబార్డు డీడీఎం టి.నాగార్జున, విజయనగరం డీసీఓ సన్యాసినాయుడు, పార్వతీపురం మన్యం జిల్లా డీసీఓ శ్రీరామ్మూర్తి, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు. మృత శిశువుతో ఆందోళన శృంగవరపుకోట: శిశువు మృతికి వైద్యులే కారణమంటూ మృత శిశువుతో తల్లి, కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగిన ఘటన ఎస్.కోట ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం గుమ్మ గ్రామానికి చెందిన అరుణ్ భార్య శాంతి ప్రసవం కోసం ఎస్.కోట ఏరియా ఆస్పత్రిలో చేరింది. ఉదయం 10 గంటల సమయంలో ఆపరేషన్ కోసం ఆస్పత్రి థియేటర్లోకి గర్భిణిని తీసుకెళ్లారు. అప్పటివరకు తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని చెప్పిన వైద్యులు కొద్ది సేపటికి మాట మార్చి శిశువు మృతిచెందినట్టు చెప్పారు. దీనిపై అరుణ్‌తో పాటు బంధువులు ఆందోళనకు గురయ్యారు. సకాలంలో వైద్య సేవలు అందించకపోవడం వల్లే ఆడ శిశువు చనిపోయిందంటూ శాంతితో పాటు బంధువులు, మృత శిశువుతో కలిసి ఆస్పత్రి ఆవరణలో బైఠాయించారు. బిడ్డ మృతికి వైద్యులే కారణమంటూ ఆందోళన చేశారు. ఇదే విషయంపై ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ నీల స్పందిస్తూ ప్రైవేట్స్కాన్ సెంటర్లో చేయించిన స్కాన్ రిపోర్టులో బిడ్డ హార్ట్‌బీట్ బాగుంది. సాధారణ ప్రసవం కోసం ప్రయత్నించాం. ప్రసవం అవుతున్నప్పుడు బిడ్డ మెడకు రెండు ప్రేగులు చుట్టుకున్నట్టు వైద్యులు చూశారు. బిడ్డ బయటకు వస్తున్న కొద్దీ ప్రేగులు మెడకు బిగిసుకోవడంతో ఊపిరి ఆడక శిశువు మరణించింది. ఇందులో వైద్యుల నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదని చెప్పారు. -
జిల్లా కేంద్రంలో 43 రోజులపాటు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు విరమణ సమయంలో ఆర్టీసీ అధికారులు అంగీకరించిన డిమాండ్ల పరిష్కారంలో జాప్యం చేస్తే ఉద్యమం తప్పదని ఆర్టీసీ ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పీజీ రాఫిల్ హెచ్చరించారు. విజయనగరం డిపో ఎదుట బుధవారం భోజన విరామ సమ
రూ.కోటి యంత్రం.. గదికే పరిమితం! విజయనగరం ఫోర్ట్: ‘దేవుడు వరమిచ్చినా పూజరి కరుణించని’ చందంగా ఉంది ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి వైద్యుల తీరు. రూ.కోటి ఖర్చుతో కొనుగోలుచేసిన అధునాతన డిజిటల్ ఎక్స్‌రే మిషన్‌ను గదికే పరిమితం చేసి... పాత పద్ధతిలో రోగులకు ఎక్స్‌రే సేవలందించడంపై రోగులు మండిపడుతున్నారు. గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఊపిరితిత్తుల సమస్యలు, రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, వెన్నుముఖ, ఎముకలు సంబంధిత వ్యాధుల నిర్ధారణలో ఎక్స్‌రే కీలకం. దీనికోసం సర్వజన ఆస్పత్రికి ప్రతిరోజూ 100 నుంచి 120 మంది రోగులు వస్తారు. ప్రస్తుత పాత పద్ధతిలో డిజిటల్ ఎక్స్‌రే తీయడానికి ఒక వ్యక్తికి 15 నిమిషాల సమయం పడుతోంది. సర్వజన ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన డీఆర్ ఎక్స్‌రే మిషన్‌తో అయితే ఒక వ్యక్తికి ఎక్స్‌రే తీసేందుకు 3 నిమిషాల సమయం చాలు. దీనివల్ల రోగులకు నిరీక్షణ కష్టాలు తప్పుతాయి. ఇదే విషయాన్ని ఆస్పత్రి సూపరింటెండెంట్ సంబంగి అప్పలనాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా డి.ఆర్.ఎక్స్‌రే మిషన్‌ను త్వరలో అందుబాటులోకి తీసుకొస్తామని, రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యమం తప్పదు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో వృథాగా అధునాతన డిజిటల్ ఎక్స్రేమిషన్ ఏర్పాటు చేసి రెండు నెలలైనా ప్రారంభించని వైనం -
చిన్నశ్రీను ఇంట విషాదం
● ప్రమాదంలో గాయపడిన కుమారుడి మృతి ● ఐదేళ్లపాటు మృత్యువుతో పోరాడి ప్రాణాలు విడిచిన ప్రణీత్‌బాబు ● జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించిన వైఎస్సార్సీపీ శ్రేణులు, జిల్లా ప్రజలు ● సంతాపం తెలిపిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయనగరం: ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్సార్సీపీ విజయనగరం జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు(చిన్న శ్రీను)కు పుత్ర వియోగం కలిగింది. ఆయన రెండవ కుమారుడు మజ్జి ప్రణీత్‌బాబు(20) విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. 2020 సంవత్సరం మే 14వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రణీత్ నాలుగు సంవత్సరాల పదినెలల పాటు మృత్యువుతో పోరాడారు. కరోనా విపత్కర సమయంలో ప్రమాదం చోటుచేసుకోగా.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తరలించి చికిత్స అందించారు. అనంతరం విశాఖపట్నంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉంచి చికిత్స చేయించినప్పటికీ ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని విశాఖ నుంచి విజయనగరంలోని ధర్మపురిలో గల మజ్జి శ్రీనివాసరావు ఇంటికి తీసుకొచ్చారు. అక్కడ బంధువులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, వైఎస్సార్సీపీ శ్రేణులు సందర్శన అనంతరం తోటపాలెంలోని రోటరీ స్వర్గధామంలో బంధువులు, అభిమానుల అశ్రునయనాల నడుమ సంప్రదాయబద్ధంగా మజ్జి శ్రీనివాసరావు అంత్యక్రియలు పూర్తిచేశారు. ప్రణీత్ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి. చిన్నశ్రీనును మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్లో పరామర్శించి ఓదార్చారు. తరలివచ్చిన వైఎస్సార్సీపీ శ్రేణులు తమ అభిమాన నాయకుడు మజ్జి శ్రీనివాసరావు రెండవ కుమారుడు ప్రణీత్‌బాబు మరణవార్త తెలుసుకున్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని ప్రముఖ నాయకులు, వైస్సార్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సంతాపం తెలిపారు. జిల్లా నాయకులతో పాటు వెలమ కార్పొరేషన్ మాజీ చైర్మన్ నెక్కల నాయుడుబాబు, జెడ్పీటీసీ వర్రి నర్సింహమూర్తి, వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీ సభ్యులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో పాటు వివిధ రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ప్రణీత్ భౌతికకాయంపై పూలమాలలు వేసి నివాళులర్పించారు. జెడ్పీ చైర్మన్‌ను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
బాలల సంక్షేమం కోసం కమిటీలు
విజయనగరం ఫోర్ట్: మిషన్ వాత్సల్య కార్యక్రమం కింద బాలల సంక్షేమం, పరిరక్షణ కోసం గ్రామస్థాయిలో సర్పంచ్ ఽ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి సమావేశం నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ అన్నారు. ఈ మేరకు కలెక్టరేట్లో బుధవారం జిల్లా స్థాయి బాలల పరిరక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ గ్రామస్థాయి కమిటీలో మహిళా పోలీస్ కన్వీనర్‌గా ఉంటారని, పంచాయతీ సభ్యులు, ఉపాధ్యాయలు, ఎన్జీఓలు, ఆరోగ్యవర్కర్స్ తదితరులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. గ్రామస్థాయి సమావేశాల్లో అనాథ పిల్లల్ని, స్కూల్ డ్రాపౌట్స్‌ను గుర్తించాలని చెప్పారు. బాల్య వివాహాలు, ట్రాఫికింగ్, డ్రగ్స్ దోపిడీ తదితర అంశాలపై చర్చించాలని సూచించారు. బాలల హక్కుల సంరక్షణపై అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. గ్రామస్థాయి కమిటీలో చర్చించిన అంశాలను జిల్లాస్థాయి కమిటీకి పంపించాలని ఆదేశించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. గ్రామస్థాయిలో టీనేజీ ప్రెగ్నెన్సీ, బాల్య వివాహాలపై చర్చ జరగాలని, బాల్యవివాహాలు చేయాలనే అలోచనే తల్లిదండ్రులకు రాకుండా చేయాలన్నారు. బాల్య వివాహ చట్టంపై అవగాహన కల్పించి చట్టంలో ఉన్న శిక్షలపై కూడా తెలిసేలా చూడాలని చెప్పారు. హోటల్స్, కర్మాగారాల్లో పనిచేసే బాలలను గుర్తించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ ప్రసన్న, డీఎంహెచ్ఓ డాక్టర్ జీవనరాణి, విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ నల్లనయ్య తదితరులు పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్ -
పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన
విజయనగరం లీగల్: ప్రస్తుత రోజుల్లో బాలికలు చాలా జాగ్రత్తగా ఉండాలని వారి పట్ల ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే ముందుగా తల్లిదండ్రులు, క్లాస్ టీచర్లకు తెలియజేయాలని జిల్లా జడ్జి బి.సాయి కల్యాణ్ చక్రవర్తి అన్నారు. పోక్సో చట్టంపై బాలబాలికలకు అవగాహన కార్యక్రమాన్ని బుధవారం అవగాహన కార్యక్రమంనిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి మాట్లాడుతూ 2012లో ఏర్పడిన పోక్సో చట్టం గురించి వివరించారు. బాలబాలికలకు న్యాయవ్యవస్థ ఎప్పుడూ అండగా ఉంటుందని, ఏ సమయంలోనైనా ఫిర్యాదు చేయవచ్చని చెప్పారు. బాలల హక్కులను కాపాడడానికి జిల్లా న్యాయసేవా అధికార సంస్థ ఎప్పుడూ ముందుంటుందన్నారు. బాలబాలికలపై ఎవరైనా అనుచితంగా ప్రవర్తిస్తే వారి పట్ల కఠినమైన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. 18 సంవత్సరాల్లోపు విద్యార్థులకు బాల్య దశనుంచే రాజ్యాంగం పట్ల సామాన్యమైన చట్టాల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. విద్యార్థులు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పట్ల గౌరవంతో మెలగాలని హితవు పలికారు. కార్యక్రమంలో ఎస్సీ,ఎస్టీ కోర్టు జడ్జి బి.అప్పలస్వామి, జిల్లా న్యాయసేవా అధికార సంస్థ కార్యదర్శి టీవీ రాజేష్ కుమార్, మండల విద్యాశాఖాధికారి పి.సత్యవతి, ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ డాక్టర్ పి.పర్వీన్, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉద్యోగావకాశాలు
● గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ టి.శ్రీనివాసన్ విజయనగరం అర్బన్: ఉన్నత విద్యలో రసాయన శాస్త్రంలో నైపుణ్యంతో ఉపాధి, ఉద్యోగావకాశాలు అధికంగా లభిస్తాయని కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ రిజిస్ట్రార్ టి.శ్రీనివాసన్ అన్నారు. ఈ మేరకు స్థానిక గిరిజన యూనివర్సిటీ ప్రాంగణంలో ‘మాలిక్యుయల్స్ టు మెటీరియల్స్’ అనే అంశంపై బుధవారం నిర్వహించిన ఒక రోజు సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆవిష్కరణ, విద్యానైపుణ్యాన్ని పెంపొందించడంలో యూనివర్సిటీ ఎప్పుడూ ముందంజలో ఉంటుందన్నారు. మెటీరియల్ సైన్స్‌పైనే ప్రపంచం ఆధార పడి ఉందని చెప్పారు. రాబోయే రోజుల్లో ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, నానో టెక్నాలజీలతో కలిసి ప్రపంచాన్ని శాసించే విధంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సులో జర్నల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్ చీఫ్ ఎడిటర్, బెంగళూరు ఇండియన్ ఇన్స్టిట్యూట్కి చెందిన ప్రొఫెసర్ ఎస్.నటరాజన్, ప్రొఫెసర్ బాలాజీ ఆర్ జాగీర్దార్, ప్రొఫెసర్ కేఆర్ప్రసాద్ మాట్లాడుతూ అధునాతన పద్ధతులలో తయారు చేసిన వివిధ పదార్థాలపై పరిశోధనాత్మక అంశాలను వివరించారు. కెమిస్ట్రీ విభాగాధిపతి ప్రొఫెసర్ ముక్కామల శరత్చంద్రబాబు, కో ఆర్డినేటర్ డాక్టర్ సురేష్‌బాబు, డాక్టర్ పడాల కిషోర్ నిర్వహణలో జరిగిన సదస్సులో యూనివర్సిటీ అధ్యాపకులు, వివిధ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
మారిక రోడ్డుకు మోక్షం
● గిరిజనుల హర్షం ● కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపిన గ్రామస్తులువేపాడ: గిరిశిఖర మారిక గ్రామ గిరిజనుల దశాబ్దాల పోరాటం సఫలీకృతం కావడంతో మారిక రోడ్డు నిర్మాణం చురుగ్గా సాగుతోందని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ అన్నారు. ప్రజాచైతన్య యాత్రలో భాగంగా మారిక తండాలో రెండురోజులు బస చేసిన నాయకులు బుధవారం మారిక సమీపంలో జరుగుతున్న రోడ్డు పనుల వద్దకు చేరుకుని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ మారిక గిరిజన గ్రామానికి రోడ్డు కావాలని, స్వాతంత్య్ర ఫలాలు గిరిజనులకు అందాలంటూ 2013, 2017, 2021,2025 సంవత్సరాల్లో రోడ్డుకోసం ఎంపీడీఓ కార్యాలయం ముట్టడి, వంటావార్పు, కార్యాలయ నిర్బంధం లాంటి పోరాటాల్లో యువత, మహిళలు, పెద్దలు పోరాడి నందున ఆ ఫలితంగా నేడు రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి కలెక్టర్ జాతీయ ఉపాధిహామీ పథంకం నిధులు రూ.7కోట్లు కేటాయించటమే కాకుండా రోడ్డు నిర్మాణంపై చొరవ చూపించారంటూ కలెక్టర్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే తమ సమస్య పరిష్కారంలో స్థానిక ప్రజాప్రతినిధులు కృషిచేయడంతో పాటు గతంలో ఆసంపూర్తిగా నిలిచిన రోడ్డుపనులు, కొత్తగా మంజూరైన రోడ్డు పనులు ఒకేసారి చేపట్టడంతో గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పాలకులు మరింత చొరవచూపి వర్షాకాలంనాటికి రోడ్డునిర్మాణం పూర్తయ్యేలా చూడాలని కోరుతున్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకుడు చలుమూరి శ్యామ్ మారిక పెద్దలు కిలోఆనంద్, గమ్మెల రామకృష్ణ, బాబారావు, అప్పలనాయుడు, అసు, ఆర్జున్, వెంకటరావు,లింగరాజు, కృష్ణ, శ్రీను మహిళలు పాల్గొన్నారు. -
బీసీ కార్పొరేషన్ ద్వారా రుణాలు
పార్వతీపురంటౌన్: బీసీ కార్పొరేషన్ ద్వారా అర్హులైన వారికి రుణాలు మంజూరు చేసేందుకు చర్యలు చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ సీహెచ్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ మేరకు బుధవారం స్ధానిక మున్సిపల్ కార్యాలయంలో ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నిరుపేద కుటుంబాలకు చెందిన వారు స్వయం ఉపాధికి సచివాలయాల వద్ద, మీసేవా కేంద్రాల వద్ద, నెట్‌సెంటర్ల వద్ద వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. జనరిక్ మెడికల్ స్టోర్ నిర్వహించాలనుకున్న వారు బి–ఫార్మశీ, డి–పార్మశీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలన్నారు. 21 నుంచి 60ఏళ్ల మధ్య వయస్సు అభ్యర్థి కలిగి ఉండాలన్నారు. ఉచిత టైలరింగ్ శిక్షణకు 21 నుంచి 50ఏళ్ల వయస్సు మధ్య వయస్సు ఉండాలన్నారు. శిక్షణ పూర్తి చేసిన తరువాత కుట్టు మిషన్లు ఉచితంగా అందజేస్తామని తెలిపారు. కుమ్మరి, మేదర కులాలకు చెందిన వారి కృలవృత్తి నిర్వహించేందుకు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22 లోగా తమ వివరాలు నమోదు చేసుకోవాలని కోరారు. -
పాము కాటుతో విద్యార్థిని మృతి
గుర్ల: మండలంలోని బూర్లిపేటలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థిని పాముకాటుతో బుధవారం మృతిచెందింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. బూర్లిపేటకు చెందిన ద్వారపూడి మౌనిక (16) మంగళవారం సాయంత్రం ఇంటి ఆరు బయట ఉన్న వరండాలో కుర్చీలో కుర్చుని సెల్‌ఫోన్ చూసుకుంటూ కుర్చీ కింద ఉన్న నాగుపామును గమనించలేదు. ఇంతలో మౌనిక కాలిపై పాము కాటువేసింది. పాము కాటువేసిన సంగతి కుటుంబసభ్యులకు తెలియజేయడంతో ఆస్పత్రికి తీసుకువెళ్తుండగా మా ర్గమధ్యంలో మృతిచెందింది. మౌనిక నెల్లిమర్ల సీకేఎంజీజే కాలేజీలో ఇంటర్మీడియట్ మొదటి ఏడాది చదువుతోంది. కూతురు ఆకాల మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమన్నీరయ్యారు. ఫిర్యాదు మేరకు గుర్ల ఎస్సై నారాయణ రావు బుధవారం కేసు నమోదు చేశారు. -
సైబర్ నేరాల పట్ల పోలీస్ శాఖ అలెర్ట్
విజయనగరం క్రైమ్: సైబర్ నేరాలను అరికట్టేందుకు, కేసుల దర్యాప్తుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని, నైపుణ్యాన్ని మెరుగుపర్చుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయం కాన్ఫరెన్స్ హాలులో వివిధ పోలీస్స్టేషన్లలో కంప్యూటర్ ఆపరేటర్లగా పని చేస్తున్న కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది.రాబోయే రోజుల్లో సైబర్ నేరాలు, మోసాలు మరింత పెరిగే అవకాశం ఉందని, ఈ తరహా నేరాలను నియంత్రించేందుకు నమోదైన కేసుల్లో దర్యాప్తు చేపట్టేందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రతి సిబ్బంది మెరుగుపర్చుకోవాలని సూచించారు. సైబర్ నేరాలను ఛేదించడంలో సమర్థవంతంగా ఎవరైతే విధులు నిర్వహిస్తారో వారికి తప్పనిసరిగా శాఖలో ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుందన్నారు. బాధితులు వెంటనే ఫోన్ చేయాలిసైబర్ నేరం జరిగిన వెంటనే బాధితులు1930కు ఫిర్యాదు చేసే విధంగా చూడాలని ఫిర్యాదు అంశాలను ముందుగా పరిశీలించి, అది ఏ తరహా నేరమో గుర్తించాలని సిబ్బందికి సూచించారు. నేరం జరిగిన తీరును తెలుసుకుని, బాధితులను విచారణ చేసిన తరువాత, నేరానికి సంబంధించిన ఆధారాలు, డాక్యుమెంట్లు తీసుకోవాల్సి ఉంటుందన్నారు. బాధితుడి బ్యాంకు స్టేట్మెంటును పరిశీలించి, నేరానికి పాల్పడిన మోసగాడి బ్యాంకు అకౌంటుకు నగదు ఏవిధంగా బదిలీ అయ్యింది, అక్కడి నుంచి ఇంకేమైనా అకౌంట్స్‌కు నగదు బదిలీ జరిగిందా? లేదా? అన్న విషయాలను గుర్తించాలని చెప్పారు. ఇలా గుర్తించిన బ్యాంకు లావాదేవీలను ఫ్రీజ్ చేసేందుకు సంబంధిత విభాగాలకు ఎటువంటి ఆలస్యం చేయకుండా ఉత్తర ప్రత్యుత్తరాలు జరపాలని పేర్కొన్నారు. నేరం జరిగిన గోల్డెన్ అవర్స్‌లో ఫిర్యాదు దారు 1930కు రిపోర్టు చేస్తే, సైబర్ మోసగాడి బ్యాంకు లావాదేవీలను నియంత్రించేందుకు ఉత్తర. ప్రత్యుత్తరాలు సకాలంలో జరిపితే కోల్పోయిన నగదును తిరిగి బాధితుడికి ఇప్పించే అవకాశం ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. శిక్షణలో సైబర్ అండ్ సోషల్ మీడియా సెల్ సీఐ బి.శ్రీనివాసరావు, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, కంప్యూటర్ నిపుణులు రామరాజు, కె.ప్రసాద్, జగదీష్ ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. బాధితులు 1930కు ఫిర్యాదు చేయాలి నేరాలు ఛేదించేందుకు నైపుణ్యం మెరుగుపర్చుకోవాలి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్స్‌కు ఒకరోజు శిక్షణ -
పిచ్చుకపై.. బ్రహ్మాస్త్రాలు..!
తిండి గింజలు లేక ముగ్గు పిండిని తింటున్న ఊర పిచ్చుకలు● కిచకిచల మనుగడకు ముప్పు ● నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవంపర్యావరణ పరిరక్షకులైన, చిరుప్రాణులైన పిచ్చుకలను మానవత్వంతో ఆదరించాలి. బంగారు పిచ్చుకలను పెంచవలసిన బాధ్యత పెరిగింది.అరు బయట తిండి గింజలు వేయడం, చూరుపై చిన్న చిన్న కప్పులతో నీటిని పెట్టడం, ఇంటి సన్స్లేడ్లపై ఖాళీలలో పెట్టిన గూళ్లను కాపాడడం వంటి చర్యలు చేపట్టాలి. గ్రామాల్లో సెల్‌టవర్స్ ఏర్పాటు లేకుండా రేడియేషన్‌కు దూరం చేయాలి. పిచ్చుకలు తినడంతో తిండి గింజలు నష్టపోతున్నామనే అపొహ విడనాడాలి. పంటపై పడిన కీటకాలు,పురుగులను పిచ్చుకలు తిని రైతుకు మేలు చేస్తాయి. డాక్టర్ జీఎన్‌నాయుడు, పీహెచ్డీ, జువాలజీ, భామిని పిచ్చుకలు అంతరించి పోకుండా కాపాడాలి ఒకప్పుడు పల్లెల్లో గుంపులు గుంపులుగా సందడి చేస్తూ కనిపించే పిచ్చుకలు క్రమేపీ అంతరించిపోతున్నాయి.పర్యావరణ సమతౌల్యం కాపాడడంలో పిచ్చుకలు ముఖ్య భూమిక వహిస్తాయి, వాతావరణ కాలుష్యాన్ని తగ్గించాలి. సెల్ టవర్స్ దూరంగా ఉండేలా చూడాలి. మనతో సహజీవనం చేసే పిచ్చుకలను స్నేహితులుగా భావించి రక్షించుకోవాలి. కేవీ రమణమూర్తి, సీఈఓ, గ్రీన్‌మెర్సీ సంస్థ, శ్రీకాకుళంభామిని: ఇంటి చూర్లు, లోగిళ్లలో నివాసంతో ఇంటిల్లిపాదికి పిచ్చుకలు ఆనందం పంచేవి. మనుషుల మధ్య మమేకమై సహజీవనం సాగించేలా మనముందే ఎగురుతూ అలరించేవి. నేలబావులపైన వాలిన చెట్లుపైన, పొదలు తుప్పలపైన, ఇంటి ముంగిళ్లలో ఊగిసలాడుతూ అందమైన పిచ్చుక గూళ్లు నిర్మించేవి. అపరూపమైన కళానైపుణ్యంతో నిర్మించిన పిచ్చుక గూళ్లు ఆధునిక ప్రపంచంలోనూ గృహనిర్మాణాలకు ఉదాహరణగా మారాయి. పూరింటి చూరుపై కట్టిన గూళ్లపై వాలుతూ ఊగుతూ, వేలాడుతూ కిచకిచ రావాలతో అలరించేవి. తల్లి ప్రేమకు రుజువు జంటకట్టిన పిచ్చుకల జత చెట్ల ఆకులనుంచి తెచ్చిన మొత్తని నార పీచుతో అల్లి నిర్మించిన పిచ్చుక గూళ్ల నిర్మాణం, రక్షణ వలగా మారిన గూళ్లలో గుడ్లు పెట్టి, పిల్లలు పుట్టే వరకు పొదగడం, దగ్గరుండి వాటిని సంరక్షించడంలో దిట్టగా కనిపించచేవి. ఏరి తెచ్చిన గింజలను పిల్లల నోటికి అందిస్తూ తల్లి ప్రేమకు రుజువుగా నిలిచేవి. పిల్లలు పెరిగి పెద్దవయ్యే వరకు సంరక్షించడం అన్యోన్యమైన జీవన విధానం ప్రతిబంబించేవి. ఆధునికత రూపంలో.. పర్యావరణ హితులైన పిచ్చుకల జీవనంపై ఆధునికత వేటు వేస్తోంది. విద్యుత్ రూపంలో ఇళ్లలో ఫ్యాన్లు, ఏసీలు గూళ్ల నిర్మాణాలకు అడ్డుకట్ట వేశాయి.సెల్ టవర్ల నుంచి ఉద్భవించే రేడియేషన్ పునరుత్పత్తి లేకుండా చేశాయి. వ్యవసాయ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో కళ్లాల్లో తిండి గింజలు కరువై జీవనం కష్టమైంది. వరిచేను కుప్పలు, ధాన్యం రాశులు తగ్గిపోవడం పిచ్చుకల మనుగడకు కష్టంగా మారింది. కాంక్రీట్ భవనాలు పిచ్చుకల వృద్ధిపై ప్రభావం చూపుతున్నాయి. ధాన్యం నిల్వలు లేకుండా పోవడం, పంటచేలపై క్రిమి సంహారక మందులు పిచ్చుకల మనుగడకు కష్టంగా మారుతున్నాయి. మానవత్వంతో ఆదరించాలి -
నీలగిరి తోటలు దగ్ధం
వేపాడ: మండలంలోని వీలుపర్తి పంచాయతీ శివారు కొత్తూరు గ్రామం సమీపంలో బుధవారం జరిగిన అగ్ని ప్రమాదంలో నీలగిరి, టేకు తోటలు దగ్ధమయ్యాయి. ఎస్.కోట అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందడంతో ఫైర్‌స్టేషన్ అధికారి ఎస్.కె మదీనా నేతృత్వంలో సిబ్బంది శ్రీనివాసరావు, లక్ష్మణరావు, వెంకటరావులు సంఘటానా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. కొత్తూరు గ్రామానికి చెందిన బోజంకి ఎరుకునాయుడు, బోజంకి ఈశ్వర్రావు, జూరెడ్డి దేముడు తదితర 15 మందికి సంబంధించిన నీలగిరి, టేకు చెట్లు సుమారు పది ఎకరాల్లో కాలిపోయినట్లు అగ్నిమాపక సిబ్బంది చెప్పారు. సుమారు రూ.నాలుగు లక్షల ఆస్తి నష్టం ఉంటుందని స్థానికులు అంచనా వేస్తున్నారు. -
75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు లక్ష్యం
బాడంగి: రానున్న ఖరీఫ్‌లో జిల్లాలో సుమారు 75 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేసేందుకు కృషి చేస్తున్నామని ఏపీజీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ఎం.ఆనందరావు వెల్లడించారు. మండల స్థాయి కన్వర్జెన్సీ సమావేశం స్థానిక వెలుగు మండల సమాఖ్య భవనంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2025 – 26లో చేపట్టాల్సిన కార్యక్రమాలపై ప్రణాళిక తయారీ చేసేందుకు వీఏఏలు, గ్రామైక్య సంఘాల సభ్యులతో కలసి సమీక్షించారు. గత ఏడాది 259 మంది రైతులకు చెందిన 58 వేల ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయ సాగు చేయించినట్టు తెలిపారు. ఆయనతో పాటు ఏపీఎం రత్నాకరరావు, వీఏఏలు, వీఓఏలు, సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
విద్యుత్ బిల్లుల కాల్చివేత
● ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలంటూ సీపీఎం నిరసన విజయనగరం గంటస్తంభం: విద్యుత్ బిల్లులు తగ్గించి ట్రూ అప్ చార్జీలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం సీపీఎం ఆధ్వర్యంలో పూల్‌భాగ్ కాలనీ 4వ వార్డులో విద్యుత్ బిల్లులు కాల్చివేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి వర్గ సభ్యుడు రెడ్డి శంకర్రావు మాట్లాడుతూ..కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచే ప్రసక్తి లేదని చెప్పిన చంద్రబాఋ నేడు విద్యుత్ చార్జీలు పెంచి ట్రూ అప్ చార్జీల భారం వేయడం అన్యాయమన్నారు. ట్రూ అప్ చార్జీలను రద్దు చేసి విద్యుత్ చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రూ అప్, సర్దుబాటు చార్జీల పేరిట రూ.15 వేల కోట్ల విద్యుత్తు భారం మోపిందన్నారు. అవినీతితో కూడిన సెకీ ఒప్పందాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో శాఖ కార్యదర్మి రామాలక్ష్మి, సభ్యులు విజయ, గురయ్యమ్మ తదితరులు పాల్గొన్నారు. ప్రధాన మంత్రి యోగా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానంపార్వతీపురంటౌన్: ప్రధానమంత్రి యోగా అవార్డులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సెట్విజ్ సీఈఓ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యక్తులు, సంస్థలు సమాజంలో యోగాను అంకిత భావంతో ప్రజల్లోకి తీసుకు వెళ్లినవారు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. అవార్డులకు ఎంపికై న వారికి రూ. 25 లక్షల నగదు బహుమానం ఉంటుందన్నారు. అర్హత కలిగిన వారు దరఖాస్తులను నిర్ణీత ప్రొఫార్మాలో నేరుగా డబ్ల్యూ.డబ్ల్యూ.డబ్ల్యూౖ.మైజీఓవీ.ఐన్ వెబ్సైట్లో హెచ్‌టీటీపీఎస్://ఇన్నొవేషన్ఇండియా.మైజీఓవీ.ఐన్/పీఎం–యెగా–అవార్డులు–2025 లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఈ నెల 31లోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. 10 లీటర్ల సారా స్వాధీనం● ద్విచక్రవాహనం సీజ్ గుమ్మలక్ష్మీపురం (కురుపాం): కురుపాం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో బుధవారం జియ్యమ్మవలస మండలం దత్తివలస గ్రామంలో 10 లీటర్ల సారాను ద్విచక్రవాహనంపై తరలిస్తూ చినమేరంగి గ్రామానికి చెందిన వెలగాడ బాలకృష్ణ పట్టుకున్నట్లు సీఐ పి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈ మేరకు స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనం, సారాను కురుపాం ఎకై ్సజ్ స్టేషన్ వద్ద చూపించారు. బాలకృష్ణతో పాటు సారా సరఫరా చేసిన సిరిపురం సుధాకర్‌పై కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. టాటా ఏస్ వాహనం బోల్తా● ఇద్దరికి గాయాలు గంట్యాడ: మండలంలోని లక్కిడాం నుంచి బొండపల్లి మండలంలోని రయింద్రం గ్రామానికి వాటర్ బస్తాలు తీసుకుని వెళ్తుండగా గంట్యాడ మండలంలోని చినమానాపురం జంక్షన్ వద్ద టైర్ పంక్చర్ కావడంతో 15 అడుగుల గోతిలో టాటా ఏస్ వాహనం బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులకు గాయాల య్యాయి. ప్రైవేట్ వాహనంలో వారిని విజయనగరంలోని ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ సంఘటనపై ఫిర్యాదు రాలేదని గంట్యాడ పోలీసులు తెలిపారు. శంబర పోలమాంబ అమ్మవారి జాతర ఆదాయం లెక్కింపుమక్కువ: ఉత్తరాంధ్రుల ఇలవేల్పు శంబర పోలమాంబ అమ్మవారి ఎనిమిదవ జాతర ఆదాయాన్ని ఈవో వీవీ.సూర్యనారాయణ ఆధ్వర్యంలో బుధవారం లెక్కించారు. శీఘ్రదర్శనం టిక్కెట్ల ద్వారా రూ.69,700, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.59,760. కేశఖండన టిక్కెట్ల ద్వారా రూ.2,400, మహాఅన్నదానం విరాళాల ద్వారా రూ.92,011, లడ్డూప్రసాదం ద్వారా రూ.61,950, పులిహోర ప్రసాదం ద్వారా రూ.42,250 ఆదాయం సమకూరినట్లు ఈవో తెలిపారు. మొత్తంగా ఎనిమిదవ జాతరలో రూ.3,28,071 ఆదాయం వచ్చిందని చెప్పారు. పది హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరుపార్వతీపురంటౌన్: పదవతరగతి హిందీ పరీక్షకు 99.53 శాతం హాజరు నమోదైనట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా వ్యాప్తంగా 67 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. 10,367 మంది విద్యార్ధులకు గాను 10,319 మంది హాజరయ్యరని, 48 మంది గైరాజరయ్యారయ్యారని పేర్కొన్నారు. 31 మంది స్క్వాడ్ సిబ్బంది పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారని తెలిపారు. -
23న అక్షరాస్యత పరీక్ష
విజయనగరం అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 23వ తేదీన ప్రాథమిక అక్షరాస్యత పరీక్ష నిర్వహిస్తామని వయోజన విద్య డీడీ ఎ.సోమేశ్వరరావు తెలిపారు. డీఆర్డీఏ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో మంగళవారం నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉల్లాస్ నవభారత సాక్షరత కార్యక్రమంలో భాగంగా స్వయం సహాయక సంఘ సభ్యులకు అక్షరాలు రాయడం, చదవడం, లెక్కలు చేయడం నేర్పించామన్నారు. వారి చదువు పురోగతిని తెలుసుకునేందుకు ఫౌండేషన్ లిటరస్ అండ్ న్యూమరసీ అసెస్మెంట్ టెస్ట్ (ఎఫ్‌ఎల్‌ఎన్‌ఏటీ) నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. ఆ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల మధ్య లబ్ధిదారుకు వీలైన సమయంలోని 3 గంటల పాటు పరీక్ష నిర్వహిస్తారని తెలిపారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, అనువైన స్థలాల్లో పరీక్ష జరుగుతుందని చెప్పారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి జాతీయ సార్వత్రిక విద్యాసంస్థ ద్వారా అధికారిక ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. సమావేశంలో డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ జి.ప్రసన్న, వయోజన విద్య ఏఓ సీహెచ్ఆర్సీ ధనలక్ష్మి, సీడీపీఓలు, వెలుగు ఏపీఎంలు పాల్గొన్నారు. -
● పెన్షన్ కోసం ఆందోళన
అధికారంలోకి వస్తే ఈపీఎఫ్ కనీస పెన్షన్‌ను రూ.9వేలు చెల్లిస్తామని మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం హామీ ఇచ్చి ఏళ్లు తరబడుతున్నా పెన్షన్ మాత్రం పెంచలేదని పలువురు పెన్షన్‌దారులు ఆరోపించారు. ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పీఎఫ్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. పెన్షన్ పెంచండి మహాప్రభో అంటూ చేతులెత్తి దండం పెట్టారు. రైల్వేలో రాయితీలు, ఉచిత వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు పి.శంకరరావు, కార్యదర్శి ఓ.ఎస్.ఎన్.మూర్తి, ఉపాధ్యక్షుడు వి.శేషగిరి, కమిటీ సభ్యులు ఆదినారాయణ, అప్పలరాజు, కె.రామారావు, కె. పాపారావు, తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
● ఎరుపెక్కిన విజయనగరం
పట్టణాల్లో పేదలు నివసిస్తున్న చోటే జీవో నంబర్ 30 ప్రకారం స్థలాలను కేటాయించాలని, ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించాలని సీపీఎం జిల్లా నగర కార్యదర్మి శంకరరావు డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం పట్టణాల్లో నివసిస్తున్న పేదలకు 2 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 9 నెలలు గడుస్తున్నా మంజూరు చేయకపోవడంపై మండిపడ్డారు. సీపీఎం ప్రజా చైతన్య యాత్ర ముగింపు సందర్భంగా కూటమి ప్రభుత్వ తీరుకు నిరసనగా కోట కూడలి నుంచి విజయనగరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నినదించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు బి.రమణ, పి.రమణమ్మ, జగన్మోహన్, ఆర్.శ్రీనివాసరావు, శాంతమూర్తి తదితరులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
ప్రత్యేక తరగతుల కొనసాగింపునకు ఆదేశం
నెల్లిమర్ల రూరల్: ప్రస్తుతం పదో తరగతి పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు కొనసాగించాలని ఆదర్శ పాఠశాలల రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ధర్మకుమార్ ఆదేశించారు. సతివాడ ఆదర్శ పాఠశాలను మంగళవారం సందర్శించారు. పదో తరగతి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలన్నారు. విద్యా ప్రమాణాలు పెంపొందించే దిశగా ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించి ఉత్తీర్ణతకు కృషిచేయాలన్నారు. ఆదర్శ పాఠశాలలో ఆరు, ఇంటర్మీడియట్ ప్రవేశాలకు వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి, ప్రవేశ ప్రక్రియను నిబంధనలుకు అనుగుణంగా చేపట్టాలన్నారు. శతశాతం ప్రవేశాలు జరిగేలా చూసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజన నాణ్యతను ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. వివిధ అంశాలపై ఆరా తీసి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపాల్ శైలజ, సిబ్బంది పాల్గొన్నారు. రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ ధర్మకుమార్ -
జీతాల బడ్జెట్ విడుదల
విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్ పరిధిలోని వన్ స్టాప్ సెంటర్ సిబ్బందికి 7 నెలలుగా జీతాలు లేవనే అంశంపై ఈనెల 15వ తేదీన ‘ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి ఆ శాఖ అధికారులు స్పందించారు. వన్‌స్టాప్ సిబ్బంది జీతాలకు సంబంధించిన బడ్జెట్ (నిధులు) విడుదలైనట్టు ఐసీడీఎస్ ఇన్చార్జి పీడీ జి.ప్రసన్న తెలిపారు. పెసర, మినుము కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం విజయనగరం ఫోర్ట్: జిల్లాలో పెసర, మినుము కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని మార్కెఫెడ్ జిల్లా మేనేజర్ వెంకటేశ్వరావు తెలిపారు. జిల్లాలోని జామి మండలం విజినిగిరి రైతు సేవా కేంద్రం, గంట్యాడ మండలంలోని గంట్యాడ ఆర్ఎస్కే, బొబ్బిలి, గజపతినగరం, సంతకవిటి మండలాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నాణ్యత ప్రమాణాలను అనుసరించి పెసలు, మినుములు పూర్తిగా శుభ్రపరిచి కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకురావాలన్నారు. పెసలు క్వింటాకు రూ. 8,682, మినుము రూ.7,400 మద్దతు ధరకు కొనుగోలు చేస్తామన్నారు. హెచ్ఎంపై చర్యలు తీసుకోండి వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ శివారు మారిక గ్రామ ప్రాథమిక పాఠశాలకు వెళ్లకుండా జీతం తీసుకుంటున్న ప్రధానోపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ డిమాండ్ చేశారు. నెలలో నాలుగురోజులు మాత్రమే పాఠశాలకు వెళ్లి జీతం తీసుకుంటున్నారని, బోధించేవారు లేక మారికలో 28 మంది, పాతమారికలో 14, కొత్తమారికలో 14 మంది పిల్లలు చదువుకు దూరమవుతున్నారన్నారు. హెచ్ఎం పనితీరుకు నిరసనగా పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి మంగళవారం ఆందోళన చేశారు. దీనిపై కలెక్టర్ స్పందించాలని కోరారు. కార్యక్రమంలో కె.ఆనంద్, బాబూరావు, అప్పలనాయుడు, రామకృష్ణ, ఆసు, తదితరులు పాల్గొన్నారు. విచారణ వేగవంతం చేయండి ● శాసనసభ కమిటీ చైర్మన్ నెహ్రూకు పాల రైతు సంఘం నాయకుల వినతి విజయనగరం ఫోర్ట్: విశాఖ డెయిరీపై విచారణను వేగవంతం చేయాలని పాల రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బుద్ధరాజు రాంబాబు డిమాండ్ చేశారు. కుంచనపల్లిలోని గెస్ట్ హౌస్‌లో శాసనసభ కమిటీ చైర్మన్ జ్యోతుల నోహ్రూను మంగళవారం కలిసి వినతి పత్రం అందజేశారు. తగ్గించిన పాల ధరను పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. వినతిపత్రం అందజేసిన వారిలో పాలరైతు సంఘం కార్యదర్శి కె.అజయ్‌కుమార్, డి సుబ్బారావు, తమటాపు పైడినాయుడు ఉన్నారు. -
అంగన్వాడీ కేంద్రాలకు ఒంటిపూట బడులు
విజయనగరం ఫోర్ట్: అంగన్వాడీ కేంద్రాలకు బుధవారం నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు ఇన్చార్జి ఐసీడీఎస్ పీడీ జి.ప్రసన్న తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందాయన్నారు. పిల్లల తల్లిదండ్రులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు. ఇల్లు చిన్నది... బిల్లు పెద్దది రాజాం: మండలంలోని బొద్దాం గ్రామానికి చెందిన నక్క లక్ష్మీనారాయణ తన కుమారుడి ఇంటిపై చిన్న గదిలో భార్యతో కలిసి నివసిస్తున్నారు. ఒక ఫ్యాను, రెండు లైట్లు, టీవీ మాత్రమే వినియోగిస్తున్నారు. కోడలు పద్మ పేరుతో ఉన్న విద్యుత్ కనెక్షన్‌కు ఫిబ్రవరి నెల విద్యుత్ బిల్లు రూ.1495.99 రావడంతో లబోదిబోమంటున్నారు. రూ.122 విలువ చేసే విద్యుత్ వినియోగిస్తే బిల్లు మాత్రం వేలల్లో వచ్చిందంటూ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్తే పట్టించుకోవడం లేదని, బిల్లు సరిచేయడంలేదని ఆరోపించారు. న్యాయపోరాటం చేస్తామని తెలిపారు. -
గుడ్డుకు గడ్డుకాలం!
గుడ్డు వినియోగం తగ్గించవద్దు కోడి గుడ్లును ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రతి ఒక్కరిలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎటువంటి ఇతర ఇబ్బందులు ఉండవు. ఉడకబెట్టిన గుడ్డు తీసుకోవడం మంచిది. మన జిల్లాలో బర్డ్‌ఫ్లూ వ్యాధి ప్రభావం లేదు. గుడ్డు వినియోగించడంలో అపోహలు వద్దు. – కరణం హరిబాబు, రాజాం ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రాజాం: బర్డ్‌ఫ్లూ ప్రభావంతో కోడి గుడ్డు వినియోగం జిల్లాలో సగానికి పడిపోయింది. డిమాండ్ తగ్గడంతో ధర కూడా పతనమైంది. ఒక్కో గుడ్డుపై రూ.2 నుంచి రూ.2.50 పైసల చొప్పున తగ్గింది. గుడ్డు ధర పతనం కావడంతో ఫౌల్ట్రీ యజమానులతో పాటు వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు. ● ట్రే ధర రూ.130 గతంలో కోడిగుడ్డు ధర రూ.6 నుంచి రూ.7 మధ్య ఉండేది. వారం రోజులుగా ఈ ధర పతనమవుతూ వస్తోంది. రిటైల్ షాపులు వద్ద 30 గుడ్లు ట్రే ధర రూ.130లుగా ఉంది. ఈ లెక్కన ఒక్కో గుడ్డు ధర రూ.4.50లు పడుతోంది. గ్రామాల్లోని కిరాణా వర్తకులు ఒక్కో గుడ్డు రూ.5లు చొప్పున విక్రయిస్తున్నారు. గతంలో 30 గుడ్లు ఉన్న ఈ ట్రే ధర మార్కెట్లో రూ.190 నుంచి రూ.210లు పలికేది. ● జిల్లాలో 11లక్షలకు పడిపోయిన వినియోగం విజయనగరం జిల్లాలో కోడిగుడ్డు వినియోగం గతంలో అధికంగానే ఉండేది. జిల్లా వ్యాప్తంగా సగటున ప్రతిరోజు 19,60,000 గుడ్లు వినియోగించినట్టు వ్యాపార వర్గాల రికార్డులు చెబుతున్నాయి. ఇప్పుడు గుడ్లు వినియోగం రోజుకు 11 లక్షలకు పడిపోయింది. బర్డ్‌ఫ్లూ భయంతో కోడిగుడ్ల వినియోగాన్ని పూర్తిగా తగ్గించేశారు. కోడిగుడ్డుతో తయారయ్యే న్యూడిల్స్, బిర్యానీ, రోటీలు కూడా తినడం లేదు. చికెన్ వినియోగం కూడా తగ్గింది. దీనికి ప్రత్యామ్నాయంగా చేపల వినియోగం పెరిగింది. ఇదే అదునుగా గతంలో రకాన్ని బట్టి కిలో రూ.120–రూ.150 మధ్యన పలికిన చేపల ధర ఇప్పుడు రూ.140 నుంచి రూ.180 పలుకుతోంది. మటన్ ధర కిలో రూ.900 నుంచి రూ.1000 మధ్య విక్రయిస్తున్నారు. అవగాహన కల్పిస్తాం గుడ్డు వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. చికెన్ వినియోగంపై గతంలో డోలపేట వద్ద అవగాహన కల్పించాం. ఈ ప్రాంతంలో బర్డ్‌ఫ్లూ ఎఫెక్ట్ లేదు. నిర్థిష్ట రీతిలో గుడ్డు, చికెన్ బాగా ఉడికించి తినవచ్చు. – బి.జయప్రకాష్, పశుసంవర్థకశాఖ ఏడీఏ, రాజాం బర్డ్‌ఫ్లూ ప్రచారంతో తగ్గిన కోడిగుడ్ల వినియోగం గతంలో జిల్లాలో ప్రతిరోజు సగటున 19,60,000 గుడ్లు వినియోగం ఇప్పుడు సగానికి పడిపోయిన విక్రయాలు ధర సైతం ఒక్కో గడ్డుపై రూ.2 నుంచి రూ.2.50 పైసలు చొప్పున తగ్గుదల పెరిగిన చేపల వినియోగం వ్యాపారులకు కష్టాలు జిల్లాలో ప్రత్యేకంగా బ్రాయిలర్ ఎగ్స్ విక్రయాలకు ప్రత్యేక ఏజెన్సీలు ఉన్నాయి. వీటి నుంచి కిరాణా షాపులు దగ్గర నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలకు సరఫరా అయ్యేవి. ఇప్పుడు గుడ్డు వినియోగం మార్కెట్లో తగ్గడంతో వీరికి కష్టాలు ప్రారంభమయ్యాయి. ముందుగా అడ్వాన్స్ చెల్లించిన పౌల్ట్రీ ఫామ్‌ల నుంచి తీసుకున్న గుడ్లు విక్రయించేందుకు అవస్థలు పడుతున్నారు. మరో వైపు కొత్త ఉత్పాదనకు చెక్ పెట్టేశారు. ఫలితంగా చాలా గ్రామాల్లో ఏర్పడిన గుడ్డు ఉత్పాదక పౌల్ట్రీఫామ్ల నిర్వహణ కష్టతరంగా మారింది. -
శక్తి మొబైల్ యాప్‌పై అవగాహన
విజయనగరం క్రైమ్: మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా రూపొందించిన శక్తి (ఎస్ఓఎస్) మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ మంగళవారం పిలుపునిచ్చారు. మహిళల మొబైల్ ఫోన్లో శక్తి యాప్ నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో రక్షణగా ఒక కుటుంబసభ్యుడు మీకు తోడు ఉన్నట్లేనన్నారు. ఆపద సమయాల్లో : శక్తి యాప్‌లోని ఎస్ఓఎస్ బటన్‌ను ప్రెస్ చేస్తే క్షణాల్లో పోలీసు బృందం మీరున్న ప్రాంతానికి చేరుకుని రక్షణగా నిలుస్తారని చెప్పారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్ షెల్టర్లలో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్ షెల్ట ర్ల వివరాలు, సమీపంలోని పోలీస్ స్టేషన్ల ఫోన్ నంబర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. ఈ మొబైల్ యాప్ పై ‘శక్తి‘ బృందాలు జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని బస్టాండ్లు, ఆర్టీసీ కాంప్లెక్సులు, రైల్వేస్టేషన్లు, ముఖ్యకూడళ్ళు, కళాశాలలు సందర్శించి, మహిళలు, విద్యార్ధినులకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నాయని చెప్పారు. కళాశాలలు, రైల్వేస్టేషన్లు, బస్టాండ్లలో కార్యక్రమం -
సంకల్ప మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్థానిక కోటలోని మహరాజా స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్ ప్రాంగణంలో మంగళవారం నిర్వహించిన సంకల్ప మెగా జాబ్‌మేళాకు విశేష స్పందన లభించింది. జిల్లావ్యాప్తంగా వివిధ విద్యార్హతలుగల 1,542 మంది అభ్యర్థులు ఈ మేళాకు హాజరుకాగా వివిధ స్థాయిల్లో నిర్వహించిన పరీక్షలలో ప్రతిభ చూపిన 546 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. మరో 72 మందిని తదుపరి రౌండ్‌కు ఎంపిక చేసినట్లు జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ మేనేజర్ జి.ప్రశాంత్‌కుమార్ తెలిపారు. దాదాపు 26 ప్రముఖ బహుళజాతి కంపెనీలు ఉద్యోగులను ఎంపిక చేశాయని, ఎంపికై న వారికి నెలకు రూ.13,000 నుంచి రూ.60,000 వరకు జీతాలు లభిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎంప్లాయిమెంట్ ఆఫీసర్ ఎ.అరుణ్, కళాశాల ప్రిన్సిపాల్ బీఎస్ఎస్రాజు, నైపుణ్యాభివృద్ధి సంస్థ ప్లేస్మెంట్ అధికారి టి.భాస్కర్, ఎంప్లాయిమెంట్ యంగ్ ప్రొఫెషనల్ యశ్వంత్ సీడాప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 546 మందికి లభించిన ఉద్యోగావకాశాలు -
పుష్పాలంకరణలో పైడితల్లి
విజయనగరం టౌన్: ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారు మంగళవారం పుష్పాలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ప్రధాన అర్చకుడు ఏడిద రమణ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజామునుంచి పంచామృతాలతో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. అనంతరం ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకటరావు, తాళ్లపూడి ధనుంజయ్‌ల నేతృత్వంలో సహస్ర కుంకుమార్చన చేశారు. మహిళలు అమ్మవారిని దర్శించి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయం వెనుక ఉన్న వేప, రావిచెట్ల వద్ద దీపారాధన చేశారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి తరించారు. కార్యక్రమాలను ఆలయ ఇన్చార్జ్ ఈఓ కేఎన్‌వీడీవీ ప్రసాద్ పర్యవేక్షించారు. ఘనంగా చండీయాగం ఉత్తరాంధ్రుల ఆరాధ్య దైవం, సిరుల తల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి చండీయాగం మంగళవారం చదురుగుడి, వనంగుడిలలో ఘనంగా నిర్వహించారు. ఆలయ వేదపండితులు వెలువలపల్లి నరసింహమూర్తి, సాయికిరణ్, దూసిశివప్రసాద్, తాతా రాజేష్‌లు శాస్త్రోక్తంగా యాగప్రక్రియను నిర్వహించారు. యాగం అనంతరం భక్తులకు అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కబడ్డీలో కాంస్యంశృంగవరపుకోట: సీబీఎస్ఈ స్టేట్జోన్ కబడ్డీ పోటీల్లో స్థానిక డా.వరలక్ష్మి పబ్లిక్ స్కూల్ విద్యార్థులు కాంస్య పతకం సాధించారు. ఈ మేరకు స్కూల్లో జరిగిన వార్షికోత్సవంలో పాఠశాల వ్యవస్థాపకురాలు డాక్టర్ పి.వరలక్ష్మి కబడ్డీలో పతకాలు సాధించిన విద్యార్థులను అభినందించి ట్రోఫీ అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యాబోధనలో వచ్చిన మార్పులకు అనుగుణంగా విద్యావ్యవస్థను రూపొందించడంతో పాటు విద్యార్థులకు క్రీడల్లోనూ తర్ఫీదు ఇచ్చి తయారు చేయడంతో పాఠశాల అధ్యాపక బృందాన్ని ప్రశంసించారు. -
ఆకట్టుకున్న మోడల్ యూత్ పార్లమెంట్
విజయనగరం అర్బన్: కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో విద్యార్థులు మంగళవారం నిర్వహించిన ‘యువ మంధన్ మోడల్ యూత్ పార్లమెంట్’ ప్రదర్శన ఆకట్టుకుంది. ‘వికసిత్ భారత్ : కెరియర్ డెవలప్మెంట్, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఎంప్లాయ్మెంట్ అనే అంశంపై విద్యార్థులు, అధ్యాపకులు కలిసి ఈ ప్రదర్శన చేపట్టారు. విద్యార్థులే ఎంపీలు, స్పీకర్, కార్యదర్శి వంటి భూమికలను పోషించి చర్చలను ఉత్సాహంగా, ప్రతిభావంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ తంత్రవాహి శ్రీనివాసన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి, విమర్శనాత్మక ఆలోచనను ప్రేరేపించడం, పరిపాలనా వ్యవస్థపై అవగాహన కల్పించడం వంటి లక్ష్యాలతో ఈ ప్రదర్శన సదస్సు నిర్వహించామని తెలిపారు. అనంతరం ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు సర్టిఫికెట్, అవార్డులను రిజిస్ట్రార్ అందజేశారు. కార్యక్రమంలో హ్యూమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ డీన్ ప్రొఫెసర్ ఎం.శరత్ చంద్రబాబు, మేనేజ్మెంట్ స్టడీస్ డీన్ ప్రొఫెసర్ జితేంద్రమోహన్ మిశ్రా, డాక్టర్ కుసుమ్, మాన్సాస్ కరస్పాండెంట్ ప్రొఫెసర్ కేవీలక్ష్మీపతి రాజు, డాక్టర్ ప్రేమాఛటర్జీ, డాక్టర్ నగేష్, డాక్టర్ ఎన్వీఎస్ సూర్యనారాయణ, డాక్టర్ దెబంజనా నాగ్, వివిధ విభాగాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
బంకురువలసలో మాంగనీస్ అక్రమ తరలింపు..?
బొబ్బిలిరూరల్: మండలంలోని పారాది గ్రామ పంచాయతీ శివారు గ్రామం బంకురు వలస వద్ద అక్రమంగా మాంగనీస్ తవ్వకాలు చేస్తూ తరలిస్తున్నారని అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఎటువంటి లైసెన్స్ లేకుండా తవ్వకాలు చేపడుతూ గ్రేడింగ్ చేసి తరలిస్తున్నారంటూ సోమవారం గ్రీవెన్స్‌సెల్‌లో ఆర్డీఓ రామ్మోహనరావుకు కొంతమంది వ్యక్తులు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో విచారణ జరపాలని తాహసీల్దార్ ఎం శ్రీనును ఆర్డీఓ ఆర్ఐ రామకుమార్ ఆదేశించగా తహసీల్దార్ కార్యాలయం సిబ్బంది క్వారీ ప్రదేశానికి వెళ్లి పరిశీలించారు. గతంలో ఇక్కడ మాంగనీసు ఓర్ తవ్వకాలకు అనుమతులున్నా తదనంతరం అక్కడి తవ్వకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో తవ్వకాలు నిలిపివేసినట్లు యజమాని ఫారూఖ్ తెలియజేశారు. గతంలో తవ్వి ఉంచిన మాంగనీసు కుప్పల్లో గ్రేడింగ్ చేసి మాంగనీసును తరలించేందుకు తమకు అనుమతులున్నాయని, తవ్వకాలు చేపట్టడం లేదని వివరించారు. అలాగే ప్రతి ఏడాది రూ.10వేలు ప్రభుత్వానికి చలానా ద్వారా చెల్లించి గ్రేడింగ్ చేసుకుంటున్నట్లు చెప్పడంతో రెవెన్యూ సిబ్బంది నివేదికను తహసీల్దార్‌కు అందజేశారు. మంగళవారం విలేకరులు సంబంధిత ప్రదేశానికి వెళ్లి పరిశీలించగా మాంగనీసును గ్రేడింగ్ చేస్తున్న దాదాపు 50 మంది కూలీలు అక్కడ పనిచేస్తూ కనిపించారు. కేవలం గ్రేడింగ్‌కు అనుమతి మాంగనీసు గ్రేడింగ్ తరలింపుపై తహసీల్దార్ ఎం.శ్రీనును వివరణ కోరగా గతంలో అక్కడ ప్రభుత్వ అనుమతితో మైనింగ్ జరిగిందన్నారు. ప్రస్తుతం తవ్వకాలకు అనుమతి లేదని, కేవలం గ్రేడింగ్ చేసి తరలించేందుకు ప్రభుత్వం నుంచి అనుమతులున్నాయని తెలియజేశారు. -
ఆక్రమణలపై రెవెన్యూ కొరడా
● బొండపల్లి, కొండశంభాం ప్రాంతాల్లో అధికారుల పరిశీలన ● ఆక్రమణలు జరిగినట్లు గుర్తింపు ● సర్వే చేసి తొలగించేందుకు చర్యలుచీపురుపల్లి రూరల్(గరివిడి): గరివిడి మండలంలోని బొండపల్లి, కొండశంభాం గ్రామాల్లో జరిగిన ఆక్రమణలపై రెవెన్యూ అధికారులు చర్యలు చేపట్టారు. బొండపల్లి పంచాయతీలో గల రాముల చెరువు ఆక్రమణకు గురైందని, ఆక్రమణదారులు చెరువును ఆక్రమించారని, చెరువులో నుంచి రహదారిని కూడా నిర్మించారని కొన్ని రోజుల క్రితం గరివిడి తహసీల్దార్ కార్యాలయంలో చెరువు ఆయకట్టు రైతులు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు తహసీల్దార్ సీహెచ్.బంగార్రాజు, ఆర్ఐ అచ్యుతరావుతో పాటు సర్వేయర్,స్థానిక వీఆర్ఓలు చెరువులో ఉన్న ఆక్రమణకు గురైన స్థలాన్ని మంగళవారం గుర్తించి ఆక్రమణలను తొలగించారు. చెరువు హద్దు ఎంతవరకు ఉందో చూపించి సరిచేయించారు. ఈ మేరకు గ్రామానికి చెందిన కొంతమంది రైతులు చెరువులో మరోవైపు కూడా ఆక్రమణలు ఉన్నాయని, పూర్తిస్థాయిలో ఆక్రమణలు తొలగించాలని కోరగా రాముల చెరువు మొత్తం విస్తీర్ణాన్ని కొలతలు వేసి నివేదిక సమర్పించాలని స్థానిక వీఆర్ఓ, సర్వేయర్‌ను తహసీల్దార్ ఆదేశించారు. ఇరిగేషన్‌శాఖ అధికారులకు లెటర్ రాసి ఆక్రమణలో ఉన్న చెరువుగర్భాన్ని ఉపాధి హామీ పనుల ద్వారా చెరువు పరిధిలోకి తీసుకువచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. గెడ్డవాగులో పశువుల షెడ్డు నిర్మాణం అదేవిధంగా కొండశంభాం పరిధిలో గల బొడ్లపేట గ్రామంలో ప్రభుత్వ గెడ్డవాగును స్థానికులు ఆక్రమించుకున్నారని తెలిసిన సమాచారం మేరకు గెడ్డవాగు ప్రాంతాన్ని పరిశీలించి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. గెడ్డవాగును మట్టితో కప్పి ఆవుల షెడ్డు నిర్మించారు. ప్రభుత్వ గెడ్డవాగు ఎంత మేరలో ఉందో సర్వే చేయించి గెడ్డవాగును ఆక్రమించిన వారికి నోటీసులు అందించి ఆక్రమణలు తొలగించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ స్పష్టం చేశారు. -
డ్వామాలో వింత డ్రామా..!
● అక్రమార్కులకు అండగా అధికారులు ● అవినీతికి పాల్పడిన వారిపై చర్యలకు వెనుకడుగు ● గుర్ల, గంట్యాడ ఏపీఓలపై అవినీతి ఆరోపణలు వచ్చినా చర్యలు శూన్యం ● ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నట్లు గుర్ల ఏపీఓపై ఆరోపణలు ● లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు గంట్యాడ ఏపీఓపై ఆరోపణలుదిస్థాయి సిబ్బంది సైతం అక్రమాలకు పాల్పడడానికి సాహసిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. దీంతో స్థాయిని బట్టి ఉపాధి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. డిప్యూటీ సీఎం మాటలు ప్రకటనలకే పరిమితమా..? నేను ప్రాతినిధ్యం వహిస్తున్న నీటి యాజమాన్య శాఖలో అవినీతికి తావు ఉండదు. ఎవరైనా అక్రమాలకు, అవినీతికి పాల్పడితే వారి తాట తీస్తామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పలు సందర్బాల్లో వాఖ్యనించారు. డ్వామా అధికారులు, సిబ్బందిపై పెద్ద ఎత్తున అవినీతి అరోపణలు వచ్చినప్పటికీ ఏమీ పట్టించుకోవడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని అక్రమాలే బయటకు నీటి యాజమాన్య సంస్థ (డ్వామా)లో జిల్లాలో పలు చోట్ల అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమాలపై కొన్ని చోట్ల ఫిర్యాదు చేయడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ధైర్యం చేసి ఎవరైనా ఫిర్యాదు చేస్తేనే అక్రమాలు బయటకు వస్తున్నాయి. ఉపాధి హామీ పథకం అధికారులు, సిబ్బంది అక్రమాల గురించి ప్రస్తావించేందుకు డ్వామా పీడీ ఎస్.శారదాదేవి వద్ద సాక్షి ప్రస్తావించడానికి ప్రయత్నించగా ఆమె స్పందించలేదు.విజయనగరం ఫోర్ట్: ఉపాధిహామీ పథకంలో పనిచేసే మేట్లకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇప్పిస్తానని గుర్ల ఉపాధి హామీ పథకం ఏపీఓపై ఆరోపణలు వచ్చాయి. కలెక్టరేట్లోలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో గార రామలక్ష్మి అనే మహిళ ఏపీఓపై ఇప్పటికే రెండుసార్లు ఫిర్యాదు చేసింది. అయినా అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● గంట్యాడ ఉపాధి హామీ పథకం ఏపీఓ లక్షలాది రుపాయల అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో అతనిపై ఉపాధి పథకం రాష్ట్రస్థాయి అధికారులు విచారణ చేపట్టారు. మండలంలోని నరవ, లక్కిడాం, పెణసాం, మధుపాడ తదితర గ్రామాల్లో ఉపాధి హామీ వేతనదారుల నుంచి లక్షలాది రుపాయలు వసూలు చేసినట్లు ఏపీఓపై పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయినప్పటికీ ఆ ఏపీఓపై ఎటువంటి చర్యలు తీసుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ● జిల్లా నీటి యాజమాన్య సంస్థ అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిస్తున్నాయి. అక్రమాలకు పాల్పడిన సిబ్బంది అధికారులకు కొంత మొత్తం ముట్టజెప్పి మేనేజ్ చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అవినీతి, అక్రమాలకు పాల్పడిన వారిపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో కిం -
జూడో విజేతలకు జేసీ అభినందనలు
విజయనగరం: జూడో రాష్ట్రస్థాయి పోటీల్లో విజేతలుగా నిలిచిన నెల్లిమర్ల కేజీబీవీ విద్యార్థినులను జాయింట్ కలెక్టర్ ఎస్.సేతు మాధవన్ తన చాంబర్లో మంగళవారం అభినందించారు. ఈ నెల 9న స్థానిక విజ్జి స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నెల్లిమర్ల కేజీబీవీకి చెందిన 8 మంది విద్యార్థినులు విజయవాడలో ఈ నెల 15.16 తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో గెలుపొందారు. విజేతల్లో జిల్లాకు చెందిన వై.అనూష 52 కిలోల విభాగంలో రెండోస్థానం, పి.జ్యోత్స్నరాణి తృతీయస్థానంలో నిలిచారు. బి.భార్గవి 63 కిలోల విభాగంలో రెండో స్థానంలో నిలవగా 70 కిలోల విభాగంలో పి.సత్య కూడా ద్వితీయస్థానంలో నిలిచింది. అదేవిధంగా వై.అనూష జాతీయ పోటీలకు ఎంపికై ంది. ఈ సందర్భంగా వారిని జేసీ సేతుమాధవన్ అభినందించి, మరిన్ని విజయాలను సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి మాణిక్యం నాయుడు, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ డాక్టర్ ఎ.రామారావు, జీసీడీఓ మాలతి, నెల్లిమర్ల కేజీబీవీ ప్రిన్సిపాల్ బి.ఉమ, పీడీ ఎస్.రమ తదిరులు పాల్గొన్నారు. -
850కిలోల రేషన్ బియ్యం పట్టివేత
బలిజిపేట: మండలంలోని గలావల్లిలో 850కిలోల రేషన్ బియ్యాన్ని శ్రీకాకుళం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్సై రామారావు, బలిజిపేట సీఎస్‌డీటీ రమేష్‌బాబులు మంగళవారం పట్టుకున్నారు. వారికి అందిన సమాచారం ప్రకారం గలావల్లి గ్రామానికి చెందిన ఎం.రామారావు అక్రమంగా రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధం చేసి ఇంటివద్ద ఉంచాడు. దీంతో అధికారులు దాడిచేసి రామారావు ఇంటి వద్ద ఉన్న 850కిలోల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వ్యాపారి రామారావుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో వీఆర్వో రాంబాబు, సిబ్బంది పాల్గొన్నారు. రేషన్ బియ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ నెల్లిమర్ల రూరల్: మండలంలోని సారిపల్లి జంక్షన్ వద్ద బొలెరో వ్యాన్‌లో రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న వ్యక్తిని పోలీసులు మంగళవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ గణేష్ మాట్లాడుతూ వాహన తనిఖీలు చేపడుతుండగా ఎటువంటి అనుమతులు లేకుండా వాహనంలో తరలిస్తున్న 60 భస్తాలను స్వాధీనం చేసుకుని ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని చెప్పారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ105 శ్రీ180 శ్రీ190జీడి, మామిడి తోటలు దగ్ధంవేపాడ: మండలకేంద్రం వేపాడ రెవెన్యూ పరిధి రాయుడుపేట రహదారిని ఆనుకుని ఉన్న జీడిమామిడి, మామిడి తోటలు మంగళవారం సాయంత్రం దగ్ధమయ్యాయి. దీనికి సంబంధించి ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సాయంత్రం జరిగిన అగ్ని ప్రమాదం సమాచారం తెలుసుకున్న ఎస్.కోట అగ్నిమాపకసిబ్బంది సంఘటనస్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. గ్రామానికి చెందిన గుత్తి గుణవతి, సత్యవతి, మోహన్, శ్రీను, సింహచలం తదితరులకు సంబంధించిన జీడిమామిడి, మామిడి తోటలు సుమారు నాలుగున్నర ఎకరాలు కాలిపోయాయి. కార్యక్రమంలో ఎస్.కోట అగ్నిమాపక సిబ్బంది పైర్ ఆఫీసర్ ఎస్.కె.మదీనా, ఆర్వెంకటరావు, వై.నర్సింగరావులు పాల్గొన్నారు.బాంబ్ బ్లాస్టింగ్‌లో వ్యక్తి మృతిభోగాపురం: ఎయిర్‌పోర్టు నిర్మాణంలో భాగంగా జరిపిన బాంబ్ బ్లాస్టింగ్‌లో ఒక వ్యక్తి సోమవారం రాత్రి మృతి చెందిదాడు. ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని రామచంద్రపేట గ్రామానికి చెందిన బోర కొత్తయ్య(35) విమానాశ్రయం పనుల్లో కూలీగా పనిచేస్తున్నాడు. ఎయిర్‌పోర్టు సిబ్బంది కవులవాడ సమీపంలో రోడ్డు నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలో రోడ్డుకు అడ్డంగా ఉన్న బండరాళ్లను తొలగించేందుకు బాంబులను ఏర్పాటు చేసి బ్లాస్టింగ్ చేశారు. ఈ బ్లాస్టింగ్‌లో కొత్తయ్య ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే ఎయిర్‌పోర్టు సిబ్బంది గాయపడిన కొత్తయ్యను తగరపువలస ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతునికి భార్య ఎర్రమ్మతో పాటు ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ ఎన్వీ ప్రభాకర్ తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలుపార్వతీపురంటౌన్: పట్టణంలో మంగళవారం ఆర్టీసీ బస్సు ఢీకొని ఓ వ్యక్తి గాయపడ్డాడు. దీనిపై జిల్లా ఆస్పత్రి ఔట్‌పోస్టు పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని దంగిడి వీధికి చెందిన గెంబలి కాంతారావు పనుల నిమిత్తం పార్వతీపురం పట్టణం పాతబస్టాండ్ వద్ద రోడ్డు దాటుతుండగా పార్వతీపురం నుంచి పాలకొండ రోడ్డుకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ఘటనలో కాంతారావుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు జిల్లా అస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసునమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. ఐదు లీటర్ల సారా పట్టివేతవేపాడ: మండలంలోని కృష్ణారాయుడు పేట సమీపంలో దాడులు నిర్వహిస్తుండగా వావిలపాడు గ్రామానికి చెందిన వి.దేముడు ఐదు లీటర్ల సారాతో పట్టుబడినట్లు ఎకై ్సజ్ సబ్ఇన్స్పెక్టర్ వీఎన్ రాజు తెలిపారు. దీంతో ఆ వ్యక్తి దగ్గర ఉన్న సారా క్యాన్ స్వాధీనం చేసుకునం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైతో పాటు సిబ్బంది సచివాలయం కార్యదర్శి టి.వెంకటేష్ పాల్గొన్నారు. 18 మద్యం బాటిల్స్ స్వాధీనందత్తిరాజేరు: మండలంలోని పెదమానాపురం సంత వద్ద అక్రమంగా 18 మద్యం బాటిల్స్ తరలిస్తున్న వ్యక్తిని పట్టుకుని మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్లు పెదమానాపురం ఎస్సై జయంతి తెలిపారు. మద్యం షాపు నుంచి అనుమతులు లేకుండా మద్యం తరలిస్తున్నాడని సమాచారం రావడంతో నిఘా పెట్టి ఆ వ్యక్తిని పట్టుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
మందుబాబుల దుశ్చర్య
చీపురుపల్లి: పల్లెల్లో మద్యం ఏరులై పారుతోంది. మందుబాబులు పూటగా మద్యం సేవించి రెచ్చిపోతున్నారు. మద్యం మత్తులో చీపురుపల్లి పట్టణంలోని రామాంజనేయకాలనీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని ప్రధాన కార్యాలయానికి ఆదివారం రాత్రి నిప్పుపెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... పాఠశాల ఆవరణలో గుర్తుతెలియని యువకులు మద్యం సేవించారు. అనంతరం పాఠశాల రికార్డు గది తలుపులు పగులగొట్టి లోపలకు ప్రవేశించారు. చోరీ చేసేందుకు ఏమీ దొరకకపోవడంతో బీరువాలకు నిప్పుపెట్టారు. ఈ ప్రమాదంలో రెండు బీరువాల్లో ఉన్న పుస్తకాలు, అడ్మిషన్ ఫారాలు, విద్యార్థులకు ఇచ్చే చిక్కీలు, బెల్లం ప్యాకెట్లు, గుడ్లు కాలిపోయాయి. రూ.లక్ష విలువైన మ్యాథ్స్, సైన్స్, స్పోర్ట్స్ కిట్లు కాలిబూడిదయ్యాయి. పాఠశాల కార్యాలయ గది నుంచి పొగరావడంతో సమీపంలో ఉన్న వసతిగృహ విద్యార్థులు ఉపాధ్యాయులకు సమాచారం అందించారు. అందుబాటులో ఉన్న ఉపాధ్యాయులు వచ్చి మంటలను అదుపుచేశారు. అడ్మిషన్ రిజిస్టర్లు భద్రపరిచిన బీరువా కాలిపోకుండా కాపాడగలిగారు. పాఠశాల హెచ్ఎం కంది గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పోలీస్ క్లూస్‌టీమ్ ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ తెలిపారు. పాఠశాల కార్యాలయానికి నిప్పు కాలి బూడిదైన మ్యాథ్స్, సైన్స్ కిట్లు, పుస్తకాలు, బీరువాలు ఆధారాలు సేకరించిన క్లూస్ బృందాలు -
69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి
విజయనగరం అర్బన్: జిల్లాలోని 69 మంది పంచాయతీ కార్యదర్శులకు ఉద్యోగోన్నతి లభించింది. ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి టి.వెంకటేశ్వర్రావు కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం వారికి కౌన్సిలింగ్ నిర్వహించి, ఉద్యోగోన్నతులు కల్పించారు. వారి అభీష్టానికి అనుగుణంగా పోస్టింగులు కేటాయించారు. గ్రేడ్–5 పంచాయతీ కార్యదర్శులు 57 మందికి గ్రేడ్–4 కార్యదర్శులుగా ఉద్యోగోన్నతి కల్పించారు. అలాగే గ్రేడ్–4 కార్యదర్శులు వివిధ కారణాలతో ఉద్యోగోన్నతిని తిరస్కరించారు. మిగిలిన 8 మంది కొత్త స్థానాల్లో చేరారు. ఉద్యోగోన్నతి లభించిన పంచాయతీ కార్యదర్శులకు జిల్లా ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి పత్రాలను పంపిణీ చేసి అభినందించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి
పార్వతీపురటౌన్: వేసవి వేడిమి దృష్ట్యా పార్వతీపురం మన్యం జిల్లాలో చలివేంద్రాలను విస్తృతంగా ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్‌ప్రసాద్ సూచించారు. వేసవి వేడిమి, పీజీఆర్ఎస్ తదితర అంశాలపై మండల స్థాయి అధికారులతో సోమవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడిమి పెరిగిందని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసర పనులు ఉంటేనే బయటకురావాలని, తెల్లని వదులు దుస్తులు వేసుకోవడం మంచిదని చెప్పారు. ఉపాధి పనులు చేస్తున్న ప్రాంతాల్లో నీడ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వేతనదారులకు నీరు అందుబాటులో ఉంచాలని, ఎండ ఎక్కువగా ఉండే సమయాల్లో పనివేళలో మార్పులు చేసుకోవాలని సూచించారు. రోజు రోజుకూ పెరుగుతున్న వేడిమి దృష్యా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని చెప్పారు. కొబ్బరి బొండాలు, పానీయాలు తీసుకుని ఆరోగ్యం కాపాడుకోవాలని హితవు పలికారు. కార్యక్రమంలో డీఆర్ఓ హేమలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ -
గురుకులాల ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు పెంపు
నెల్లిమర్ల: మహాత్మాజ్యోతిబా పూలే గురుకుల పాఠశాలల్లో 5 నుంచి 9వ తరగతి వరకు, కళాశాలల్లో ఇంటర్మీడియట్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష దరఖాస్తు గడువు ఈ నెల 25వ తేదీ వరకు పెంచినట్టు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కేబీబీ రావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్ష మే 4న జరుగుతుందన్నారు. 28న తపాలా అదాలత్ విజయనగరం టౌన్: విశాఖపట్టణం పోస్టల్ రీజియన్ పరిధిలోని తపాలా వినియోగదారుల ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం ఈ నెల 28వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు విశాఖపట్నంలోని పోస్టు మాస్టర్ జనరల్ కార్యాలయంలో 117వ తపాలా అదాలత్ నిర్వహించనున్నట్టు తపాలాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ కె.వి.డి.సాగర్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి విజయనగం జిల్లా తపాల వినియోగదారులు తమ సమస్యలను ఈ 24వ తేదీలోగా ‘117వ తపాలా ఆదాలత్’, కె.వి.డి.సాగర్, అసిస్టెంట్ డైరెక్టర్, పోస్టుమాస్టర్ జనరల్ వారి కార్యాలయం, విశాఖపట్నం–530017 చిరునామాకు పంపించాలని కోరారు. గడువు తేదీ తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించమని పేర్కొన్నారు.వ్యవసాయ భూమికి ‘మార్గం’ చూపండి విజయనగరం అర్బన్: భోగాపురం మండలంలో జాతీయ రహదారి నుంచి ఎయిర్‌పోర్టుకు నిర్మిస్తున్న అప్రోచ్ రోడ్డులో వ్యవసాయ భూమికి వెళ్లేందుకు ‘మార్గం’ చూపాలని గూడుపువలస, సవరవిల్లి, దల్లిపేట, బైరెడ్డిపాలెం, ఎ.రావివలస తదితర గ్రామస్తులు డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద కాసేపు ఆందోళన చేసి అనంతరం కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌కు వినతిపత్రం అందజేశారు. అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమికి ఇరువైపులా నిర్మాణ సంస్థ ఫెన్సింగ్ వేస్తోందని, దీనివల్ల వ్యవసాయ భూములకు వెళ్లే మార్గం ఉండదన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం సేకరించిన భూమిలో సర్వీసు రోడ్డు నిర్మించాలని కోరారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఆర్డీఓ కీర్తితో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఆయా గ్రామాలను సందర్శించి ప్రజల సమస్యలపై నివేదిక ఇవ్వాలని కోరారు. ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేద్దాం ● రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించాలి ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: ఎన్నికల ప్రక్రియను మరింత బలోపేతం చేసేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని, బూత్ స్థాయిలో బీఎల్ఏలను నియమించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోరారు. తన చాంబర్లో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలకు సంసిద్ధత అన్నది ప్రస్తుతం నిరంతర ప్రక్రియగా మారిందని చెప్పారు. ప్రతినెలా రాజకీయ పార్టీలతో సమావేశాన్ని నిర్వహిస్తామని, దీనివల్ల ఎన్నికల ప్రక్రియలో ఏమైనా లోటుపాట్లు గుర్తిస్తే సరిచేయడానికి అవకాశం కలుగుతుందని చెప్పారు. తప్పులు లేని ఓటర్ల జాబితాలు, పోలింగ్ కేంద్రాల్లో కనీస సౌకర్యాలు, పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించడంలో రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. సమావేశంలో ఇన్చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, ఎలక్షన్ సూపరింటెండెంట్ భాస్కరరావు, రాజకీయ పార్టీల నాయకులు వర్రి నరసింహమూర్తి, ఐవీపీరాజు, సతీష్‌కుమార్, ఎం.అప్పలసూరి, శ్రీనివాస్, కె.సోములు తదితరులు పాల్గొన్నారు. -
వివక్ష చూపొద్దు.. న్యాయం చేయండి
చీపురుపల్లిరూరల్(గరివిడి): ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దని..న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ గరివిడి వెటర్నరీ కళాశాల విద్యార్థులు చేపట్టిన నిరవధిక దీక్ష శిబిరంలో మైమ్ కార్యక్రమం సోమవారం నిర్వహించారు. వెటర్నరీ కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, స్టైపెండ్‌ను రూ.25వేలకు పెంచాలనే డిమాండ్లతో కళాశాల ఆవరణలో వెటర్నరీ విద్యార్థులు చేస్తున్న నిరవధిక దీక్ష సోమవారానికి 42వ రోజుకు చేరుకుంది. ఈ పోరాటంలో భాగంగా విద్యార్థులు కొద్ది రోజులుగా తమకు న్యాయం చేయాలంటూ నిరవధిక దీక్షలతో పాటు రోడ్డెక్కి భారీ ర్యాలీలు, నలుపు వస్త్రాలు ధరించి నిరసనలు, వంటావార్పు లాంటి వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించారు. అదే విధంగా సోమవారం కూడా నిరవధిక దీక్షా శిబిరంలో ప్రభుత్వం తమ పట్ల వివక్ష చూపొద్దు..న్యాయం చేయాలంటూ వివిధ వేషధారణలతో వారి బాధను మైమ్ రూపంలో ప్రదర్శించారు. వెటర్నరీ విద్యార్థుల మైమ్ కార్యక్రమం 42వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలు -
మా ఆశలన్నీ అడియాసలే..
బొబ్బిలి: ధర్నాలు, నిరసనలు వ్యక్తం చేయలేని వయసు మాది.. ఎన్నికల ముందు, తర్వాత కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేస్తుందనుకున్నాం.. మా ఆశలన్నీ అడియాస లయ్యాయి.. మోసపోయాం అంటూ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పీఎస్ఎస్ఎన్పీ శాస్త్రి ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి పట్టణంలో సోమవారం నిర్వహించిన సంఘ రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అనంతరం తమ డిమాండ్లను వివరిస్తూ బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ జేవీవీఎస్ రామమోహనరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. సంఘ కార్యవర్గ సభ్యులతో కలిసి అక్కడ విలేకరులతో మాట్లాడారు. గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇచ్చిన మాట ప్రకారం ఐఆర్‌ను ఏడు శాతం నుంచి 12 శాతానికి పెంచుతూ జీఓ విడుదల చేశారన్నారు. బుడమేరు వరదల సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్వయంగా కలిసి ఈహెచ్ఎస్, క్వాంటమ్ పెన్షన్, పెండింగ్ ఐఆర్, డీఏలతో పాటు పీఆర్సీ కమిషన్ ఏర్పాటు అంశాలను వివరించామని, అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారన్నారు. అనంతరం పలుసార్లు మంత్రివర్గ సమావేశాలు నిర్వహించినా ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ప్రస్తావనే లేదన్నారు. కొంత మంది పెద్దలను కలిసి మేం మీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్న వారమని, మాకు న్యాయం చేయాలని అడిగితే మీరు మమ్మల్ని ఎన్నుకోవడమేంటి? ప్రజలెన్నుకున్నారన్నారని అంటు న్నారని, మేమంతా ప్రజల్లో భాగం కాదా? మేము ఓట్లేయలేదా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమయంలో మరో రాష్ట్ర నాయకుడు రౌతు రామమూర్తినాయుడు తదితరులు షేమ్‌షేమ్ అంటూ నినదించారు. ప్రస్తుతం ఈహెచ్ఎస్పై వైద్యసేవలు అందజేసేందుకు ఆస్పత్రులు నిరాకరించే స్థాయికి ప్రభుత్వం మమ్మలను దిగజార్చిందంటూ జీఓ కాపీలను ఆయన సభా ముఖంగా ప్రదర్శించారు. సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు రౌతు రామమూర్తినాయుడు, రాష్ట్ర కార్యదర్శి ఎల్.జగన్నాథం, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి కృష్టమూర్తినాయుడు, కార్యదర్శి బొత్స సత్యనారాయణ, పలువురు సంఘ నాయకులు, విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి మోసపోయాం రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి -
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్/విజయనగరం: జిల్లాలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఇష్టదైవాలకు పూజలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హాల్‌టికెట్లు చూపించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తనిఖీ చేశారు. కంటోన్మెంట్‌లోని సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. అనారోగ్యంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం మండలంలోని జొన్నవలస ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు ఉన్నారు. తొలిరోజు 99.52 శాతం హాజరు జిల్లాలో 119 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 22,908 మందికి 108 మంది గైర్హాజరైనట్టు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. 99.52 శాతం మంది హాజరయ్యారన్నారు. -
ఎస్పీ గ్రీవెన్స్ సెల్‌కు 32 ఫిర్యాదులు
విజయనగరం క్రైమ్: జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ఎస్పీ వకుల్ జిందల్ నిర్వహించిన గ్రీవెన్స్‌సెల్‌లో 32 ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ వకుల్ జిందల్ చట్ట పరిధిలో చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. అక్కడికక్కడే బాధితుల ముందే సంబంధిత పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించాలని స్టేషన్ హౌస్ ఆఫీసర్స్‌ను ఆదేశించారు. ఎస్పీ వకుల్ జిందల్ అందుకున్న ఫిర్యాదుల్లో భూతగాదాలకు సంబంధించినవి 10, కుటుంబ కలహాలకు సంబంధించినవి 7, మోసాలకు పాల్పడినవి 8, ఇతర అంశాలకు సంబంధించినవి 7 ఫిర్యాదులు ఉన్నాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, ఎస్బీ సీఐలు ఏవీ. లీలారావు, ఆర్వీఆర్ .చౌదరి, డీసీఆర్బీ ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు. అలసత్వం లేకుండా ఫిర్యాదుల పరిష్కారం పార్వతీపురం రూరల్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన ఫిర్యాదులను అలసత్వం లేకుండా పరిష్కారం దిశగా విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తామని ఎస్పీ ఎస్వీ మాధవ్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించి జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకుని, క్షుణ్ణంగా పరిశీలించారు. వచ్చిన ఫిర్యాదుల్లో సైబర్‌మోసాలు, కుటుంబ కలహాలు, తల్లిదండ్రులను వేధింపులు, అత్తారింటి వేధింపులు, భూ ఆస్తి వివాదాలు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమ పేరుతో మోసం తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు ఎస్పీకి విన్నవించుకోగా వారి సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో ఎస్పీ ఫోన్లో మాట్లాడి వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి దర్యాప్తుచేసి వాస్తవాలైనట్‌లైతే చట్టపరిఽధిలో తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ సీఐ, తదితర సిబ్బంది పాల్గొన్నారు. పీజీఆర్ఎస్కు 54 వినతులు సీతంపేట: ఐటీడీఏలో పీఓ సి.యశ్వంత్‌కుమార్ రెడ్డి సోమవారం ర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 54 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో భామిని మండలం బొడ్డగూడకు చెందిన బి.సింగన్న కిరాణా షాపు పెట్టుకోవడానికి రుణం ఇప్పించాలని కోరాడు. చేపల చెరువు మంజూరు చేయాలని నిమ్మలవలసకు చెందిన అప్పారావు కోరగా మండ గ్రామానికి చెందిన నిమ్మక పార్వతి, ఎన్టీఆర్ జలసిరిలో బోరు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేసింది. నౌగూడకు చెందిన ఆనందరావు ట్రాక్ట్‌ర్ సబ్సిడీపై ఇప్పించాలని వినతిపత్రం అందజేశాడు. మేకలలోన్ మంజూరు చేయాలని అప్పారావు కోరగా రోడ్డు సదుపాయం కల్పించాలని జజ్జువ గ్రామస్తులు అర్జీ అందజేశారు. కార్యక్రమంలో ఏపీఓ చిన్నబాబు, ఈఈ రమాదేవి, డీడీ అన్నదొర, డిప్యూటీఈవో ప్రసన్నకుమార్, సీడీపీఓలు రంగలక్ష్మి, విమలాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
తీరప్రాంత భద్రతపై సీఐఎస్ఎఫ్ అవగాహన ర్యాలీ
భోగాపురం: తీరప్రాంత భద్రత, అక్రమంగా ఆయుధాల రవాణా, తీవ్రవాదుల చొరబాటు, మాదక ద్రవ్యాల నిర్మూలన, తీరంలో వృక్ష, జంతు సంరక్షణపై అవగాహన కలిస్తూ సీఐఎస్ఎఫ్ (సెంట్రల్ ఇండస్ట్రీస్ సెక్యూరిటీ పోర్స్) సిబ్బంది 50 మంది సైకిల్ ర్యాలీ చేపట్టారు. కోలకతాలోని జక్కలి నుంచి ప్రారంభమైన ర్యాలీ సోమవారం భోగాపురానికి చేరుకుంది. వీరికి స్థానిక పోలీసులతో పాటు ప్రజలు స్వాగతం పలికారు. ఈ నెల 31న తమిళనాడులోని కన్యకుమారిలో ర్యాలీ ముగుస్తుందని విశాఖ పోర్టు ట్రస్టు సీనియర్ కమాండెంట్ సతీష్‌కుమార్ జాబ్ పాయ్ తెలిపారు. -
స్తంభానికి కట్టి కొట్టారు
● పోలీసులకు బాధితుడి ఫిర్యాదుపాలకొండ రూరల్: మండలంలోని ఎల్‌ఎల్‌పురం గ్రామానికి చెందిన రేజేటి శేఖర్ తనను అదే గ్రామానికి చెందిన కొందరు విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టారని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.ప్రయోగమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై అందించిన వివరాలిలా ఉన్నాయి. అదే గ్రామానికి చెందిన వారాడ రాజేంద్రనాయుడు, ఆయన సోదరుడు సుమంత్ నిర్వహిస్తున్న శ్రీ సాయిలక్ష్మి టౌన్షిప్లో కొద్ది రోజులుగా ఏజెంట్‌గా శేఖర్ విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఇళ్ల స్థలాల కొనుగోలుపై ఆసక్తి ఉన్నవారిని గుర్తించి రూ.కోటి వరకూ చెల్లించి వంద మందిని టౌన్షిప్లో సభ్యులుగా చేర్పించాడు. రోజులు గడుస్తున్నప్పటికీ నగదు చెల్లించిన వారికి ఇళ్ల స్థలాలను టౌన్షిప్ యాజమాన్యం కేటాయించకపోవడంతో పాటు సరైన సమాధానం ఇవ్వడం లేదు. దీంతో ఈనెల 16వ తేదీన ఎల్ఎల్.పురంలో గల టౌన్షిప్ నిర్వాహకుల ఇంటికి వద్దకు టౌన్షిప్ సభ్యులతో కలిసి శేఖర్ వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో నిర్వాహకులు లేరని వారి తల్లి తలియజేయగా చేసేది లేక తిరిగివెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఈనెల 17వ తేదీ సోమవారం ఉదయం బాధితుడు శేఖర్ ఊరి శివారులో కాలకృత్యాలు తీర్చుకుని తిరిగి ఇంటికి వస్తుండగా టౌన్షిప్ నిర్వాహకుల బంధువులు వియ్యపు మురళి, సోదరుడు బొజ్జంనాయుడులు శేఖర్‌ను అడ్డగించి, డబ్బు అడిగేందుకు ఇంటికి వస్తావా? అంటూ దూషించి విద్యుత్ స్తంభానికి కట్టి కొట్టినట్లు ఫిర్యాదు చేశాడని ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేశామన్నారు. -
విద్యుత్‌షాక్‌తో కార్మికుడి మృతి
బాడంగి: మండలంలోని బొత్సవానివలస వద్ద చెరకు బెల్లంక్రషర్లో పని చేస్తున్న కార్మికుడు ఏడువాక రామ్‌కుమార్(25)విద్యుత్‌షాక్‌కు గురై సోమవారం మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి. వేపాడ మండలం డబ్బిరాజుపేటకు చెందిన రామ్‌కుమార్ పెద్దాపురం మండలం తాడిపత్రికి చెందిన బెల్లంక్రషర్ యజమానివద్ద పనిచేస్తున్నాడు. క్రషర్ ఆట ముగియడంతో క్రషర్కు సంబంధించిన సామగ్రిని రోడ్డు పక్కన నిలిపి ఉన్న ఐషర్వ్యాన్లో లోడ్చేస్తుండగా వ్యాన్‌పై ఉన్న విద్యుత్ హైటెన్షన్వైర్లు కనిపించకపోవడంతో అవి రామ్‌కుమార్ చేతికి తగలగా షాక్‌కు గురయ్యాడు. బాధితుడిని చికిత్స నిమిత్తం స్థానిక సీహెచ్‌సీకి తరలించగా డాక్టర్ ప్రత్యూష తనిఖీ చేసి మృతిచెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో భద్రపరిచినట్టు ఎస్సై తారకేశ్వరరావు తెలిపారు. మృతుని కుటుంబానికి సమాచారం అందించామని వారు వచ్చాక కేసు నమోదుచేసి పోస్టుమార్టం మంగళవారం నిర్వహిస్తామని చెప్పారు. -
సర్వే అధికారులను అడ్డుకున్న గిరిజన రైతులు
సాలూరు రూరల్: మండలంలోని కూర్మరాజుపేట పంచాయతీ పునికినవలస గ్రామ భూములు గత 80 ఏళ్లుగా సాగుచేస్తున్న గిరిజనులపై కొంతకాలంగా సాలూరుకు చెందిన చిట్లు శశికళ, మన్మథలు ఫిర్యాదు చేస్తున్నారు. ఆ భూములు పూర్వం తమవని గిరిజనులు, కూర్మరాజుపేటకు చెందిన బీసీ రైతులు ఆక్రమించుకున్నారని కేసులు పెడుతున్నారు. ఈ విషయంలో పలుమార్లు కలెక్టర్, ఆర్డీఓ కార్యాలయాలకు గిరిజన రైతులను తిప్పించారు. ఈ భూములపై పూర్తి హక్కులు సాగుచేస్తున్న రైతులవేనని అధికారులు ఒక వైపు చెబుతూనే మరోవైపు వారు చేస్తున్న ఫిర్యాదులపై రైతులకు నోటీసులు జారీచేసున్నారు. అందులో భాగంగా సోమవారం స్థానిక రెవెన్యూ అధికారులు 50 మందికి పైగా గిరిజన, బీసీ రైతులకు నోటీసులు జారీచేసి వారి భూములు చూపించాలని గ్రామంలో సర్వే చేసేందుకు డీఆర్ఓ కార్యాలయం నుంచి ఆదేశాలు వచ్చాయని చెబుతూ గ్రామంలోకి వచ్చిన సర్వే అధికారులను గిరిజన, బీసీ రైతులు అడ్డుకున్నారు. గత 80 ఏళ్లుగా తాము సాగుచేస్తున్నామని ఇప్పుడు వచ్చి ఎవడో పెట్టిన ఫిర్యాదుకు మాభూములు సర్వే చేస్తామనడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫిర్యాదుదారులకు అధికారులు సహకరిస్తే రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా చేయాల్సి వస్తుందని గిరిజన రైతులు హెచ్చరించారు. అధికారులు ఇచ్చిన నివేదికలు సరిగా లేకపోవడంతో తమపై పదేపదే ఫిర్యాదులు చేసేందుకు ఆస్కారం ఏర్పడుతోందని రైతులు ఆవేదన వెళ్లగక్కారు. 80 ఏళ్లుగా సాగు చేస్తున్నాం అధికారుల తప్పుడు నివేదికలతో ఫిర్యాదులు రెవెన్యూ కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తాం -
అర్జీదారుల... అసంతృప్తి వేదిక
జీతాల కోసం కలెక్టరేట్‌కు వస్తున్నాం... జమ్ము పాఠశాలలో ఆయాగా పనిచేస్తున్నాను. ఇచ్చేది నెలకు రూ. 6 వేలు జీతం. అది కూడా టైమ్‌కు ఇవ్వడం లేదు. సంక్రాంతి ముందు జీతాలు ఇప్పించాలని కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా వినతుల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశాం. అప్పుడు జీతాలు ఇచ్చారు. తర్వాత నుంచి మూడు నెలలుగా మళ్లీ ఇవ్వట్లేదు. జీతాలు ఇప్పించాలని మళ్లీ కలెక్టర్‌కు విన్నవించేందుకు వచ్చాం. – ఎస్.పార్వతి, ఆయా, జమ్ము పాఠశాల, విజయనగరం రెండుసార్లు ఫిర్యాదు చేసినా.... ఉపాధి హామీ పఽథకం (ఎన్ఆర్ఈజీఎస్)లో మన్యపురిపేట గ్రామంలో సీనియర్ మేట్‌గా నాలుగేళ్ల నుంచి పనిచేస్తున్నాను. గుర్ల మండల ఏపీవో కామేశ్వరావు నాకు ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు ఇస్తానని చెప్పి రూ.50 వేలు తీసుకున్నారు. పోస్టు నాకు కాకుండా వేరే మహిళకు ఇచ్చేశారు. నాకు న్యాయం జరుగుతుందనే ఆశతో కలెక్టరేట్‌కు రెండుసార్లు వచ్చి ప్రజా వినతుల పరిష్కార వేదికలో అధికారులకు ఫిర్యాదు చేశాను. ఫలితం కనిపించలేదు. – గార రామలక్ష్మి, మన్యపురిపేట, గుర్ల మండలం కలెక్టరేట్లో పిల్లలతో కలిసి అర్జీదారుల నిరీక్షణసాక్షి ప్రతినిధి, విజయనగరం: కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో అర్జీల పరిష్కార ప్రక్రియ సంతృప్తికరంగా లేదనేది అర్జీదారుల ఆవేదన. అర్జీలు, ఫిర్యాదులను స్వీకరించిన తర్వాత వాటి ఆన్లైన్ ప్రక్రియ వరకూ బాగానే జరుగుతోంది. తర్వాత వాటిని పరిష్కరించాల్సిన సంబంధిత అధికారికి చేరవేస్తున్నారు. అది ఆన్లైన్లో క్షణాల్లో వెళ్లిపోతుంది. కానీ పరిష్కారం విషయానికొచ్చేసరికే ఆలస్యమవుతోంది. ఫిర్యాదులు ఎలాంటివైనా వెంటనే ఏ వారానికావారం పరిష్కరించే చర్యలను క్షేత్రస్థాయి శాఖాపరమైన అధికారులు చేపట్టడం లేదని అర్జీదారులు వాపోతున్నారు. స్వల్ప వ్యవధిలో చేయదగిన పరిష్కారమైనా సరే గ్రేస్ పిరియడ్ అయ్యేంతవరకూ ఆ ఫైల్‌ను పరిశీలించట్లేదనే ఆవేదన అర్జీదారుల్లో కనిపిస్తోంది. తీరా గడువు ముగిసే సమయానికి తగిన పరిష్కారం చూపించకుండానే క్లోజ్ చేసేస్తున్నారు. రెండు మూడు సార్లు అర్జీలు పెడుతున్నవారిలో అలాంటి అర్జీదారులే ఎక్కువ. 32 శాఖల అధికారులకు మెమోలు... ‘స్పందన’ పేరుతో గతంలో ప్రజాసమస్యలను పరిష్కరించేవారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ కార్యక్రమం పేరు మార్చేశారు. 2024 జూన్ 15 నుంచి ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ అనే పేరు కొనసాగిస్తున్నారు. ఈ పేరు మార్చడంలో చూపించిన శ్రద్ధ తర్వాత ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తీసుకోవాల్సిన చర్యలపై కూటమి ప్రభుత్వ పాలకులు చూపించలేదు. ఉన్నతాధికారుల ఒత్తిడి అధికమవ్వడంతో జిల్లాలో పలు శాఖల అధికారులు హడావుడిగా అర్జీలను పరిష్కరించేస్తున్నారు. పరిష్కార శాతాన్ని పెంచాలని తప్పులతడకగా నివేదిక ఇచ్చేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అర్జీదారుల సమస్యకు పరిష్కారం చూపించకుండానే తమ నివేదికలో మాత్రం పరిష్కరించినట్లు చూపించడంపై ఆయన గట్టిగానే అధికారులను నిలదీశారు. 32 శాఖల అధికారులకు మెమోలు కూడా జారీ చేశారంటే పరిస్థితి ఊహించవచ్చు. గత ఏడాది జూన్ నుంచి ఇప్పటివరకూ ప్రజాసమస్యల పరిష్కార వేదికకు 38,238 వినతులు వచ్చాయి. వాటిలో 37,328 పరిష్కరించేశారు. ఇలా అధికారులు చూపిస్తున్న డేటా ప్రకారం దాదాపు 98 శాతం అర్జీలు పరిష్కారమైపోయినట్లే. పెండింగ్‌లో ఉన్నవి కేవలం 910 మాత్రమే. వాటిలో ప్రధానంగా 62 రెవెన్యూ శాఖ, 63 సర్వే శాఖ, 38 పోలీసు, 45 గృహనిర్మాణ శాఖ, 13 పంచాయతీరాజ్ శాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. గంటల తరబడి ప్రయాణించి.. వ్యయప్రయాసలకోర్చి కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక వద్దకు వందలాది మంది అర్జీదారులు చేరుకుంటున్నారు. ఆన్లైన్లో తమ అర్జీలను నమోదుచేయిస్తున్నారు. సమస్యను ఉన్నతాధికారులకు వినిపించి వినతిపత్రాలు అందజేస్తున్నారు. ఉన్నతాధికారులు తమ గోడు విన్నారు.. పరిష్కరిస్తారని భావించిన అర్జీదారులకు అసంతృప్తి, ఆవేదనే మిగులుతోంది. సమస్య పరిష్కారానికి క్షేత్రస్థాయిలో జరుగుతున్న జాప్యం శాపంగా మారుతోంది. మళ్లీమళ్లీ ‘వేదిక’ మెట్లు ఎక్కాల్సి వస్తోంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికపై సన్నగిల్లుతున్న నమ్మకం అర్జీదారులకు దొరకని సృంతృప్తికర పరిష్కారం ఒకే సమస్యపై పలు సార్లు విన్నవించాల్సిన పరిస్థితి ఉన్నతాధికారులు ఆదేశించినా కింది స్థాయి ఉద్యోగుల్లో వీడని నిర్లిప్తత బాధ్యులైన అధికారులపై కలెక్టర్ అంబేడ్కర్ సీరియస్ 32 శాఖల అధికారులకు శ్రీముఖాలు! ప్రచారం కొండంత... పరిష్కారం గోరంత... ప్రజా వినతుల పరిష్కార వేదిక’కు ఒకసారి వచ్చిన అర్జీ మళ్లీ మరోసారి మరెక్కడి నుంచీ తిరిగి రాకూడదనే విధంగా పరిష్కారం చూపించాల్సి ఉంది. ఆ దిశగా అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టడంలేదని అర్జీదారులు ఆరోపిస్తున్నారు. వాస్తవానికి అర్జీల్లో అధికంగా గ్రామ/వార్డు సచివాలయాల పరిధిలోనే పరిష్కారమయ్యేవే ఉంటున్నాయి. జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ వరకూ అర్జీదారులు రావాల్సి వస్తుందంటే... జరగాల్సిన ప్రక్రియ సరిగా జరగలేదనే వాదనలకు ఉతమిస్తోంది. పింఛన్లు, రేషన్‌కార్డులకు విన్నపాలు, భూమిహక్కు వివాదాలు, పట్టాదారు పాసు పుస్తకానికి దరఖాస్తులు అధికంగా ఉంటున్నాయి. ప్రధానంగా రెవెన్యూ, మున్సిపాలిటీ, విద్యుత్ శాఖలకు వచ్చే అర్జీల పరిష్కారం ఆలస్యమవుతోంది. అత్యధికంగా నమోదవుతున్న అర్జీల్లో రెవెన్యూ శాఖకు సంబంధించి భూమి హక్కు పత్రాల్లో తప్పులను సరిదిద్దాల్సినవి, డీఆర్డీఏకు సంబంధించి పింఛన్ల మంజూరు, సంక్షేమ పథకాలకు అర్హుల ఎంపికలో సాంకేతిక సమస్యలే ఉంటున్నాయి. వాటి పరిష్కారంపై సచివాలయం, మండల కార్యాలయాల స్థాయిలో అధికారులు శ్రద్ధ వహించట్లేదు. గ్రామ/వార్డు సచివాలయాలు, మండల కార్యాలయాలు, డివిజన్ స్థాయిలో వినతులు స్వీకరిస్తున్నప్పటికీ అక్కడ సత్వర పరిష్కారం రాకపోవడం వల్లే ప్రజలు అటువైపు మొగ్గు చూపించట్లేదు. నేరుగా కలెక్టర్ దృష్టిలో పెడితే తమ సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో కలెక్టరేట్లో ‘ప్రజా వినతుల పరిష్కార వేదిక’ వద్దకే అర్జీ పట్టుకొని వస్తున్నారు. -
సందడి చేసిన కోర్ట్ చిత్రం యూనిట్
విజయనగరం టౌన్: నగరంలోని ఏసీవీసీ రంజని, శివరంజని సినిమా హాల్లో కోర్టు చిత్రం యూనిట్ సందడి చేసింది. చిత్రం యూనిట్‌కు థియేటర్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చిత్రంలో మంగపతిగా నటించిన సీనియర్ నటుడు శివాజీ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ప్రేక్షకులు విశేషంగా ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. లాయర్‌గా నటించిన నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ పోక్సో చట్టం లోని లోటుపాట్లను ఆలోచనాత్మకంగా ఈ సినిమాలో చూపించామని చెప్పారు. పోక్సో చట్టం గురించి తెలియని కోణాలను ఈ సినిమాలో చూపించినట్లు తెలిపారు. హీరో, హీరోయిన్ రోషన్, శ్రీదేవిలు మాట్లాడుతూ తమ చిత్రానికి ఇంతటి ఘన విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు. దర్శకుడు రామ్ జగదీష్ మాట్లాడుతూ ఈ సినిమాలో చట్ట వ్యవస్థపై అవగాహన పెంచుతూ, నేటియువతకు సందేశాత్మక చిత్రంగా రూపొందించామన్నారు. కార్యక్రమంలో ఽథియేటర్ మేనేజర్ సాయి, ఇన్చార్జి రాజశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర
● సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు విజయనగరం గంటస్తంభం: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకే ప్రజా చైతన్యయాత్ర చేపడుతున్నట్లు సీపీఎం నగర కార్యదర్శి రెడ్డి శంకరరావు అన్నారు. కార్యక్రమంలో భాగంగా 46వ డివిజన్లో సోమవారం పర్యటించి, ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణంలోని ఇళ్లు లేని పేదలకు రెండు సెంట్ల భూమి కేటాయించి, ఇంటి నిర్మాణానికి రూ. 5 లక్షలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. పట్టణంలో చాలా మంది ఇళ్లు లేనివారు ఉన్నారని, అటువంటి వారందరికీ న్యాయం చేయాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం మంగళవారం చలో తహసీల్దార్ కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.రమణమ్మ, బి.రమణ, సత్యం, తదితరులు పాల్గొన్నారు.700 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసంగుమ్మలక్ష్మీపురం(కురుపాం): కురుపాం మండలంలోని దురిబిల్లి గ్రామ పరిసరాల్లో అక్రమంగా నిర్వహిస్తున్న సారా స్థావరాలపై సోమవారం నిర్వహించిన దాడుల్లో సుమారు 700 లీటర్ల పులియబెట్టిన బెల్లపు ఊటలను గుర్తించి ధ్వంసం చేసినట్లు కురుపాం ఎస్సై పి.నారాయణరావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ తమకు అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించి భారీగా ప్లాస్టిక్ టబ్బులను స్వాధీనం చేసుకున్నామన్నారు. గ్రామాల్లో ఎక్కడైనా అక్రమంగా సారా తయారు చేసినా, విక్రయించినా, తరలించినా చర్యలు తీసుకోనున్నట్లు హెచ్చరించారు. గంజాయితో ఐదుగురి అరెస్ట్గుర్ల: గంజాయి తరలిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై పి.నారాయణ రావు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆయన మాట్లాడుతూ గుర్ల మండలంలోని సొలిపిసోమరాజు పేట చంపావతి నదీపరీవాహక ప్రాంతంలో 1200 గ్రాముల గంజాయి తరలిస్తున్న నిందితులను పోలీసులు సోమవారం పట్టుకుని ఆరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన వారిలో మండలంలోని సొలిపిసోమరాజు పేటకు చెందిన ఇద్దరు, దమరసింగికి చెందిన ఒకరు, నెల్లిమర్లకు చెందిన ఒకరు. జామి మండలం ఆలమండకు చెందిన ఒకరు ఉన్నట్లు తెలిపారు. నిందితుల దగ్గర నుంచి ద్విచక్ర వాహనం, ఐదు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు ఎస్సై నారాయణరావు చెప్పారు. రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతిబొబ్బిలి: రైలులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తూ సీతానగరం స్టేషన్ సమీపంలో జారిపడి ఓ వ్యక్తి సోమవారం మృతి చెందాడు. జార్ఖండ్‌లోని సాలిబురు ప్రాంతానికి చెందిన ప్రధాన్ హెంబర్న్ (23) సోమవారం చక్రధర్ పూర్ వెళ్లేందుకు రైలెక్కి సీతానగరం మండలం జగ్గునాయుడి పేట వద్ద జారి పడి మృతి చెందినట్టు రైల్వే హెచ్‌సీ బి.ఈశ్వరరావు తెలిపారు. మృత దేహాన్ని జిల్లా కేంద్రాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. చికిత్స పొందుతూ వ్యక్తి..గంట్యాడ: గంట్యాడ మండలంలోని బురదపాడు గ్రామానికి చెందిన చుక్క రాంబాబు (39) ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈనెల 9వతేదీన పొలంలో పనిచేస్తుండగా రాంబాబును పాము కాటు వేసింది. దీంతో కుటుంబ సభ్యులు విజయనగరంలోని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో సర్వజన ఆస్పత్రి వైద్యులు కేజీహెచ్‌కు రిఫర్ చేయగా కేజీహెచ్‌లో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. -
రైతులు దూరం..!
ఈకేవైసీకి 4,918 మందివిజయనగరం ఫోర్ట్: పంటల సాగులో ఈ–క్రాప్ నమోదు చాలా ముఖ్యమైనది. పంటను విక్రయించుకోవాలన్నా, పంట నష్టం జరిగినప్పడు బీమా పొందాలన్నా ఈ క్రాప్ నమోదు తప్పనిసరి. ఈ– క్రాప్ నమోదు చేసుకున్న ప్రతీ రైతు ఈకేవైసీ చేయించుకోవాలి. ఈ–క్రాప్, ఈకేవైసీ చేయించుకుంటేనే రైతులకు రావాల్సిన పథకాలు, సౌకర్యా లు అందుతాయి. లేదంటే అందవు. రబీ సీజనల్లో వేలాది మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ – క్రాప్ నమోదు చేయించుకున్నప్పటకీ ఈకేవైసీ మాత్రం చేసుకోలేదు. రబీలో ఇలా.. జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి 61,324 మంది ఈ–క్రాప్ నమోదు చేసుకున్నారు. 56,406 మంది రైతులు ఈౖకేవేసీ చేయించుకున్నారు. 4,918 మంది ఈకేవైసీ చేయించుకోలేదు. 1,02,760 ఎకరాల్లో అన్ని రకాల పంటలకు ఈ–క్రాప్ నమోదు అయింది. 96,097 ఎకరాలకు ఈకేవైసీ జరిగింది. 6,673 ఎకరాలకు ఈకేవైసీ జరగ లేదు. బీమా పంటలకు సంబంధించి ఈ–క్రాప్ ఇలా.. వరి, మినుము, పెసర, మొక్కజొన్న పంటలకు పంటల బీమా వర్తిస్తుంది. ఈ నాలుగు పంటలకు సంబంధించి 97,778 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు అయింది. ఇందులో ఈకేవైసీ 91,315 ఎకరాలకు అయింది. 6,463 ఎకరాలకు ఈకేవైసీ జరగలేదు. వరి పంటకు సంబంధించి 2279 ఎకరాలకు ఈ– క్రాప్ అయింది. ఈకేవైసీ 2052 ఎకరాలకు అయింది. 1594 మంది ఈ–క్రాప్ చేసుకోగా1452 మంది రైతులు ఈకేవైసీ చేయించుకున్నారు. మినుము పంటకు సంబంధించి 39,538 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 37,073 ఎకరాలకు అయింది. 33,480 మంది రైతులు ఈ–క్రాప్ నమోదు చేసుకోగా ఈకేవైసీ 31082 మంది రైతులు చేసుకున్నారు. పెసర పంటలకు సంబంధించి 15,769 ఎకరాలకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 14,813 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 17,593 మంది రైతులకు ఈ–క్రాప్ నమోదు కాగా ఈకేవైసీ 16,319 మంది రైతులు చేసుకున్నారు. మొక్కజొన్న పంటకు సంబంధించి 40,191 ఎకరాలకు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ 37,377 ఎకరాలకు ఈకేవైసీ అయింది. 23,398 మంది రైతులు ఈ–క్రాప్ నమో దు కాగా ఈకేవైసీ మాత్రం 21,527 మంది రైతులు చేసుకున్నారు. ఈ – క్రాప్ చేయించుకున్న రైతులు 61,324 మంది ఈకేవైసీ చేయించుకున్న రైతులు 54,406 మంది 1,02,760 ఎకరాలకు ఈ – క్రాప్ 96,087 ఎకరాలకు ఈకేవైసీ 6,673 ఎకరాలకు జరగని ఈకేవైసీ ఈకేవైసీతో ప్రయోజనాలు పంటల బీమా వర్తిస్తుంది. పంట రుణాలు తీసుకోవచ్చు. ఇన్పుట్ సబ్సిడీ, పంట నష్టపరిహారం అందుకోవచ్చు. పండించిన ధాన్యాన్ని అమ్ముకోవచ్చు. 94 శాతం పూర్తి రబీ సీజన్లో అన్ని పంటలకు సంబంధించి ఈకేవైసీ 94 శాతం పూర్తయింది. 4,918 మంది రైతులు ఈకేవైసీ చేయించుకోలేదు. ఈ–క్రాప్, ఈకేవైసీపై ఈ నెల 17వతేదిన సోషల్ ఆడిట్ ప్రారంభం అవుతుంది. అంతవరకు ఈకేవైసీ చేయించుకోవచ్చు. – వి.తారకరామారావు, జిల్లా వ్యవసాయ అధికారి -
నేటి నుంచి పది పరీక్షలు
విజయనగరం అర్బన్: పదో తరగతి వార్షిక పరీక్షలు సోమవా రం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 31వ తేదీ వరకు జరిగే పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యా శాఖ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పరీక్షల నిర్వహణ లో ఎలాంటి అవకతవకలు, అక్రమాలు చోటు చేసుకోకుండా విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు పకడ్బందీగా చర్యలు చేపడుతున్నామని పది పరీక్షల జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా ఆమె స్థానిక డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ మేరకు తెలిపారు. ఈ ఏడాది కూడా పది పరీక్షల్లో పలు నూతన విధానాలను కొనసాగిస్తున్నామని పేర్కొన్నారు. ఇన్విజిలేటర్లు పరీక్ష కేంద్రంలోని ఒకే గదిలో విధులు నిర్వర్తించకుండా ఉండేలా ఏ రోజుకారోజు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంట్ ఆఫీసర్ల ఆధ్వర్యంలో ‘లాటరీ పద్ధతి’ ద్వారా వారికి విధులు కేటాయిస్తామన్నారు. పరీక్ష రోజు సంబంధిత పరీక్ష సబ్జెక్టు టీచర్ ఇన్విజిలేటర్ విధులు నిర్వర్తించకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. సమస్యాత్మక కేంద్రాలలో నాలుగు చోట్ల సీసీ కెమెరాలు ఏర్పా టు చేయడం వంటి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పరీక్ష రాస్తున్న 22,930 మంది కోసం జిల్లా వ్యాప్తంగా 119, ఓపెన్ స్కూల్ 614 మంది విద్యార్థులకు 8 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతి రోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు రెగ్యులర్ పది పరీక్ష ఉంటుంది. అదే ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. 238 మంది పరీక్షల పర్యవేక్షకులు/డిపార్ట్మెంట్ అధికారులు, 1,150 మంది ఇన్విజిలేటర్లు, 36 మంది కస్టోడియన్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్ 9 మంది, 9 రూట్లలో స్టోరేజ్ సాయింట్లు 29 ఏర్పాటు చేశారు. విద్యార్థులూ.. తస్మాత్.. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి గురికాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని కొబ్బరి నీళ్లు, గ్లూకోజ్ వాటర్, ఇతర శక్తినిచ్చే పానీయా లు తన వెంట పరీక్ష కేంద్రానికి తీసుకెళ్లొ చ్చు. పెన్ను, పెన్సిల్, హాల్‌టికెట్, తదితర పరీక్ష సామగ్రిని మాత్రమే వెంట తీసుకెళ్లాలి. పరీక్ష సమయానికి అర గంట ముందే విద్యార్థులు కేంద్రానికి చేరుకోవాలి. ఓఎంఆర్ షీట్లో విద్యార్థి వివరాలను పూర్తి చేసే సమయంలోనూ జాగ్రత్తలు వహించాలి. పరీక్ష కేంద్రాలను సందర్శించిన జిల్లా పరిశీలకురాలు పట్టణంలోని వివిధ పరీక్ష కేంద్రాలను జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్ ఆదివారం సందర్శించారు. కంటోన్మెంట్ మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలోని పరీక్ష కేంద్రంలో గదులలోని ఫ్యాన్లు, తాగునీరు, సౌకర్యాలను పరిశీలించారు. ఆమెతో పాటు డీఈఓ యు.మాణిక్యంనాయుడు, పార్వతీపురం మన్యం డీఈఓ డాక్టర్ ఎన్.తిరుపతినాయుడు, పరీక్షల విభాగం ఏసీ టి.సన్యాసిరాజు ఉన్నారు. 22,930 మంది విద్యార్థులకు 119 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు జంబ్లింగ్ విధానంలో ఇన్విజిలేటర్ల విధులు పది పరీక్షల జిల్లా పరిశీలకురాలు తెహరా సుల్తాన్ -
● విజయవాడకు తరలిరండి ● అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు నాయుడు
పోస్టల్ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి ● జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు నెల్లిమర్ల: తక్కువ ప్రీమియంతో ఎక్కువ లాభం పొందే పాలసీలను తపాలా శాఖ ప్రవేశపెట్టిందని, పోస్టల్ పథకాలను ప్రజలు సద్వి నియోగం చేసుకోవాలని జిల్లా పోస్టల్ శాఖ సూపరింటెండెంట్ కె.శ్రీనివాసరావు సూచించారు. నెల్లిమర్ల పోస్టాఫీసుని అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో ఆదివారం ఆ సేవలను ప్రారంభించారు. పోస్టల్ శాఖలో నేషనల్ సేవింగ్ సర్టిఫికెట్, ఆర్డీ, ఎఫ్డీ, సీనియర్ సిటిజన్, సుకన్య తదితర పథకాలను సద్వినియోగం చేసుకోవా లని పిలుపునిచ్చారు. పోస్టాఫీసులో చిన్నమొత్తాలతో నెలనెల పొదుపు చేసుకోవాలని సూచించారు. ఆడపిల్లలకు సుకన్య సమృద్ధి పథకం ఎంతగానో ప్రయోజనకరమన్నారు. ప్రస్తుత కాలంలో ప్రతీ ఒక్కరికి ఇన్సూరెన్సు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కరూ పోస్టల్ సేవలను ఉపయోగించుకోవాలని సూచించా రు. కార్యక్రమంలో పోస్టుమాస్టర్ జి.ఎర్రయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఏపీ ట్రెజరీస్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవం విజయనగరం అర్బన్: ఆంధ్రప్రదేశ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్ సర్వీసెస్ అసోసియేషన్ (ఏపీటీఏఎస్‌ఏ) జిల్లా నూతన కార్యవర్గాన్ని సభ్యు లు ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. స్థానిక ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ కాంప్లెక్స్ (ఐఎఫ్‌సీ) భవనంలో కాన్ఫరెన్స్ హాల్లో సంఘం రాష్ట్ర కోశాధికారి ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. జిల్లా అధ్యక్షులుగా ఎం.ఆదినారాయణ, కార్యదర్శిగా పి.శాంతి కిరణ్‌కుమార్, కోశాధికారిగా పి.వీరన్న దొర, సహాధ్యక్షులుగా ఎం.నూకరాజు, కార్యనిర్వాహక కార్యదర్శిగా వై.కృష్ణశ్రావణ్, ఉపాధ్యక్షులుగా పి.సురేష్‌బా బు, ఎస్.రామకృష్ణ, పి.వరలక్ష్మి, కార్యదర్శులు గా సీహెచ్ రమేష్‌బాబు, ఎం.దుర్గాప్రసాద్, వై.జయశ్రీ ఎన్నికయ్యారు. ఎన్నికల అధికారి గా పీవీ నారాయణరావు నూతన కమిటీని ప్రకటించారు. 19న అగ్రిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్ర పార్వతీపురం: అగ్రిగోల్డ్ బాధితుల సమస్యల పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 19న విజయవాడలో తలపెట్టిన అగ్నిగోల్డ్ బాధితుల కన్నీటి పాదయాత్రకు బాధితులు తరలి రావాలని అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీ నాయుడు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ స్థానిక కార్యాలయంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. అగ్రిగోల్డ్ ఆర్థిక మోసాలకు పాల్పడి పదేళ్ల తొమ్మిది నెలలు గడిచినా... గతంలో తెలుగుదేశం ప్రభుత్వం యుద్ద ప్రాతిపదికన ఆస్తులను అటాచ్మెంట్ చేసినప్పటికీ చెల్లింపు విషయంలో విఫలమైందన్నారు. గత ఎన్నికల సమయంలో కూటమి నాయకులు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం నెరవేర్చకుండా అలసత్వం వహిస్తున్నారని ధ్వజమెత్తారు. నెల్లూరు, ప్రకాశం తదితర జిల్లాల్లో కొట్లాదిగా అగ్రిగోల్డ్ ఆస్తులను కొల్లగొట్టడంతో బాధితుల్లో మరోసారి భయాందోళనలు నెలకొన్నాయన్నారు. కూటమి పాలకులపై ఎన్నో ఆశలు పెట్టుకున్న బాధితులకు నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించాలని ఆయన డిమాండ్ చేశారు. లేకుంటే భవిష్యత్‌లో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట మన్యం జిల్లా అధ్యక్షుడు ఆర్వీఎస్ కుమార్ తదితరులు ఉన్నారు. -
తెలుగువారి ఆత్మగౌరవం పొట్టి శ్రీరాములు
విజయనగరం అర్బన్: అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కృషి చేశారని, ఆ మహానుభావుడు తెలుగు వారి ఆత్మ గౌరవమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. అమరజీవి చిరస్మరణీయులని ప్రతి ఒక్కరూ ఆయన చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. నేటి తరానికి ఆయన స్ఫూర్తిదాయకం కావాలని ఆకాంక్షించారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి కలెక్టర్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతిని అధికారికంగా జరుపుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. తెలుగు రాష్ట్రం ఆయన చేసినటువంటి కృషిని గుర్తించిందన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలు పొట్టి శ్రీరాములు చూపిన దారిలో నడవాలని తద్వారా ఆయన ఆకాంక్షలను నెరవేర్చాలన్నారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి యు.మాణిక్యంనాయుడు, మైనారిటీ సంక్షేమ అధికారి ఆర్ఎస్ జాన్, ఇన్చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, కలెక్టరేట్ ఏఓ దేవ్‌ప్రసాద్, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ -
విజయనగరం
సోమవారం శ్రీ 17 శ్రీ మార్చి శ్రీ 2025ఆటోవాలా డీలా..! ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ప్రభుత్వాలు తరచూ డీజిల్ ధరలు పెంచుతూ పోవడంతో తిప్పలు తప్పడం లేదు. –8లోఒక్క రూపాయి కూడా ఇవ్వక్కర్లేదు.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స చేయించుకున్నా, శస్త్రచికిత్స చేసుకున్నా ఒక్క రుపాయి కూడా సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు తీసుకోకూడదు. ఒక వేళ ఏవైనా వైద్య పరీక్షలు చేయించినా వాటికై న బిల్లులు సంబంధిత ఆస్పత్రి నిర్వాహకులు రోగికి చెల్లించాలి. డిశ్చార్జ్ అయిన తర్వాత ఇంటికి వెళ్లేటప్పుడు రవాణ చార్జీలు కూడా ఇవ్వాలి. రోగికి పూర్తి స్థాయిలో ఉచితంగా వైద్యం అందించాలి. ఆరోగ్యశ్రీ పథకం ద్వారా చికిత్స అందించినా, శస్త్రచికిత్స చేసినా సంబంధిత వ్యాధికి ఆరోగ్యశ్రీ ట్రస్టు వారు సంబంధిత ఆస్పత్రికి ప్రోత్సాహకంగా నిధులు చెల్లిస్తారు. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా హెల్ప్ డెస్క్ వద్ద రిజిస్ట్రేషేన్ చేయించుకున్న వారికి ఓపీ కూడా ఉచితంగా చూడాలి. అయితే కొన్ని ఆస్పత్రుల యజమానులు ఆరోగ్యశ్రీ ట్రస్టు ఇచ్చిన నిధులు చాలవన్నట్టు రోగుల నుంచి కూడా గుట్టుగా వసూలు చేస్తున్నట్టు తెలుస్తుంది. గంట్యాడ మండలానికి చెందిన పి.గోవింద అనే వ్యక్తి కొద్ది నెలలు క్రితం వెన్నుపూసకు సంబంధించిన శస్త్రచికిత్స చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకం వర్తించినప్పటికీ అతని నుంచి అదనంగా రూ.20 వేలు తీసుకున్నారు. మెంటాడ మండలానికి చెందిన ఎన్.ఈశ్వరరావు కొద్ది నెలలు క్రితం ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రిలో తుంటి ఎముక శస్త్రచికిత్స చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ వర్తించినప్పటికి సదరు ఆస్పత్రి వారు మంచి పరికరాలు వేస్తామని చెప్పి అతను నుంచి అదనంగా రూ.60 వేలు తీసుకున్నారు. విజయనగరం ఫోర్ట్: జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు రోగుల నుంచి అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నా యి. నిబంధనల ప్రకారం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకం ద్వారా రోగులకు ఉచితంగా సేవలు పూర్తి స్థాయిలో అందించాలి. చికిత్సతో పాటు డిశ్చార్జ్ అయిన తర్వాత మళ్లీ ఫాలో ఆప్ చూపించుకోవడానికి వచ్చినప్పడు కూడా ఉచితంగా చికిత్స అందించి మందులు ఇవ్వాలి. ఒక్క పైసా కూడా అదనంగా వసూలు చేయడానికి లేదు. కాని కొన్ని నెట్వర్క్ ఆస్పత్రుల వైద్యులు ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్రచికిత్సలు చేసినప్పటికీ మీకు మంచి ఇంప్లాట్స్ (పరికరాలు) వేయాలి.. అందు కోసం కొంత డబ్బు లు ఖర్చు అవుతాయి.... అవి వేసుకుంటే మీరు త్వరగా కోలుకుంటారని చెప్పి రోగుల నుంచి అద నపు వసూళ్లుకు పాల్పడుతున్నారు. అది కూడా పెద్ద మొత్తంలో వసూలు చేస్తున్నారు. ఆర్థో(ఎముకలు), న్యూరో విభాగం శస్త్రచికిత్సలు జరిగే ఆస్పత్రుల్లో ఈ తరహా అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేసే కొంతమంది వైద్యులు ప్రభు త్వ ఆస్పత్రులు నుంచి రోగులను ప్రైవేటు నెట్వర్క్ ఆస్పత్రులకు తరలించి అక్కడ శస్త్రచికిత్సలు చేసి అదనపు వసూళ్లు చేస్తున్నట్టు విమర్శలు గుప్పుమంటున్నాయి. అధికారులు నెట్వర్క్ ఆస్పత్రులపై పర్యవేక్షణ అంతంతగా మాత్రంగానే చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. బయటకు చెప్పుకోలేక.. వైద్యులు రోగుల నుంచి అదనపు వసూళ్లుకు పాల్పడిన విషయం బయటకు చెప్పలేక పోతున్నారు. చెబితే ఎక్కడ చికిత్స అందించడంలో వైద్యులు అలసత్వం వహిస్తారోనని రోగులు భయపడుతున్నా రు. కొన్ని ఆస్పత్రులు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూలు చేయగా, మరికొన్ని ఆస్పత్రు లు రూ.20 వేల నుంచి రూ. 50 వేల వరకు వసూ లు చేసినట్టు తెలుస్తుంది. కొన్ని ఆస్పత్రులు అయితే రూ.60 వేల నుంచి రూ.80 వేల వరకు కూడా వసూలు చేసినట్టు తెలుస్తుంది. జిల్లాలో ఉన్న నెట్వర్క్ ఆస్పత్రులతో పాటు విశాఖపట్నంలోని ఆరో గ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో కూడా అదనపు వసూళ్లుకు పాల్పడుతున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు 25 ఉన్నాయి. అభినవ ఆస్పత్రి, అమృత, గాయిత్రి, జీఎంఆర్ వరలక్ష్మి ఆస్పత్రి, కావేరి, కొలపర్తి, మువ్వగోపాల, నెఫ్రో ఫ్లస్ ఆస్పత్రి, పీజీ స్టార్, పుష్పగిరి, క్వీన్స్ ఎన్ఆర్ఐ, సంజీవిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, బాబాజీ, శ్రీ సాయి సూపర్ స్పెషాలటీ ఆస్పత్రి శ్రీ సాయికృష్ణ, పీవీఆర్ ఆస్పత్రి, శ్రీనివాస నర్సింగ్ హోమ్, సన్‌రైజ్, స్వామి కంటి ఆస్పత్రి, తిరుమల మెడికవర్, వెంకటరామ, వెంకట పద్మ ఆస్పత్రులు ఉన్నాయి. అదే విధంగా 9 సీహెచ్‌సీలు, 46 పీహెచ్‌సీల్లో కూడా ఆరోగ్యశ్రీ పథకం అమల్లో ఉంది. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి, బొబ్బిలి సీహెచ్‌సీ, గజపతినగరం, ఎస్.కోట, రా జాం ఏరియా ఆస్పత్రులు, భోగాపురం నెల్లిమర్ల, చీపురుపల్లి సీహెచ్‌సీలు, ఘోషాస్పత్రిల్లో ఆరోగ్య శ్రీ పథకం అమల్లో ఉంది. న్యూస్‌రీల్ మంచి పరికరాలు వేస్తామంటూ రోగులను నమ్మిస్తున్న వైద్యులు పరికరాలు పేరుతో రూ.వేలల్లో వసూలు చేస్తున్న వైనం జిల్లా ఆస్పత్రులతో పాటు విశాఖలోని ఆస్పత్రుల్లోనూ అదే పరిస్థితి జిల్లాలో 25 ప్రైవేటు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు గుట్టుచప్పుడు కాకుండా జరుగుతున్న తంతు మొత్తం ఉచితమే.. ఆరోగ్యశ్రీ పథకం వర్తించే వారికి ఉచితంగా వైద్యం చేయాలి. అదనంగా ఒక్క పైసా కూడా తీసుకోకూడదు. ఎవరైనా అదనపు వసూళ్లుకు పాల్పడినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – డాక్టర్ కొయ్యాన అప్పారావు, ఇన్చార్జి ఆరోగ్యశ్రీ కో – ఆర్డినేటర్ -
ఒక పూరిల్లు, మూడు పాకలు దగ్ధం
సీతంపేట: మండలంలోని రేగులగూడ కాలనీలో ఆదివారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఒక పూరిల్లు మూడు పశువుల పాకలు దగ్ధమయ్యాయి. అగ్ని ప్రమాదం ఎలా జరిగిందో తెలియరావడం లేదని గిరిజనులు తెలిపారు. గ్రామంలో అందరూ కొండపోడు పనులకు వెళ్లిపోయారు. ఇంటిలో ఎవరూ లేని సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో సవరలక్ష్మణ్కు చెందిన రూ.లక్షా 50 వేల నగదు. రెండు తులాల బంగారం, సామగ్రి కాలిపోయాయి. ఇంట్లో బంధువుల వివాహం ఇటీవల జరగడంతో సారె సామగ్రి, బట్టలు మొత్తం కాలిపోవడంతో బాధితుడు లబోదిబోమంటున్నాడు. గ్యాస్, టీవీ, మంచం, 14 బస్తాల ధాన్యం అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో ఆ కుటుంబం కట్టుబట్టలతో మిగిలింది.సవర రామారావు, సవర లక్కాయి, సవర బెన్నయ్యలకు చెందిన మూడు పశువుల శాలలు, ఒక సైకిల్, ఐటీడీఏ గతంలో ఇచ్చిన పవర్‌వీడర్ దగ్ధమయ్యాయి. స్థానికులతో పాటు కొత్తూరు అగ్నిమాపకశకటం వచ్చి మంటలను అదుపుచేసింది. విషయం తెలుసుకున్న ఆర్ఐ విజయ్గణేష్తో పాటు సిబ్బంది గ్రామాన్ని సందర్శించి నష్టం దాదాపు రూ.3లక్షలు ఉంటుందని అంచనా వేశారు. -
ప్రభుత్వం హామీలు అమలు చేయాలి..
రోజంతా కష్టపడి ఆటో తోలితే నాలుగు డబ్బులు ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి లేదు.నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోవడంతో వాటిని కొనుగోలు చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నాం.అప్పులు చేసి ఆటోలు కొనుగోలు చేసి వాటి ఫైనాన్స్, పెరిగిన బీమా, రోడ్డు ట్యాక్స్‌లు కట్టుకోలేక ఆటోలు నడపలేకపోతున్నాం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు ఆటో కార్మికులకు రూ.15 వేలు చొప్పున చంద్రబాబు ఇచ్చి ఆదుకోవాలి. – సీహెచ్ లోకేష్, బొబ్బిలి రూట్ యూనియన్ అధ్యక్షుడు, రామభద్రపురం● -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
మెంటాడ: మండలంలోని రెల్లిపేట గ్రామానికి చెందిన వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు మృతురాలి మనుమరాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఆండ్ర ఎస్సై కె.సీతారాం తెలిపారు. ఈ ఘటనపై ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన వృద్ధురాలు రాళ్లపూడి అంకమ్మ(74) ఒంటరిగా పూరిపాకలో నివసిస్తోంది. వృద్ధురాలు మృతి చెందినట్లు స్దానికులు గమనించి విశాఖపట్నంలో నివాసం ఉంటున్న మనుమరాలు పైల దుర్గకు సమాచారం ఇవ్వడంతో ఆమె వచ్చి మృతిచెందిన వృద్ధురాలి ముక్కు నుంచి రక్తం కారిన మరకలు ఉండడంతో పాటు ముక్కుకు ఉండాల్సిన బంగారు వస్తువులు, ఇంట్లో ఉండాల్సిన కొంత నగదు లేనట్లు గుర్తించి అనుమానాస్పద మృతిగా భావించి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సంఘటనా స్దలాన్ని డాగ్‌స్కాడ్‌తో పాటు వేలిముద్రలు నిపుణులతో పరిశీలించి ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గజపతినగరం ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. -
కనకమ్మ మృతికి నివాళులు అర్పించిన బొత్స
గుర్ల: దివంగత మాజీ ఎమ్మెల్యే (సతివాడ) పొట్నూరు సూర్యనారాయణ సతీమణి పాలవలస సర్పంచ్ పొట్నూరు కనకమ్మ ఇటీవల మృతి చెందారు. ఆమె కుటుంబసభ్యులైన గుర్ల ఎంపీపీ పొట్నూరు ప్రమీల, వైఎస్సార్సీపీ గుర్ల మండల అధ్యక్షుడు పొట్నూరు సన్యాసినాయుడులను మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ, జెడ్పీ చైర్మన్ బొత్స సత్యనారాయణ, మాజీ ఎంపీ బెల్లాన చంద్రశేఖర్ ఆదివారం పరామర్శించారు. ఈ సందర్భంగా కనకమ్మ చిత్ర పటానికి నివాళులు ఆర్పించారు. వైఎస్సార్సీపీ తరఫున అండగా ఉంటామని భరోసా కల్పించారు. కనకమ్మకు నివాళులు ఆర్పించిన వారిలో వైఎస్సార్సీపీ నాయకులు బొత్స సందీప్. కేవీ సూర్యనారాయణ రాజు, జమ్ము స్వామి నాయుడు, కెంగువ పధుసూదనరావు, తోట తిరుపతిరావు, నియోజక వర్గం నాయకులు ఉన్నారు. -
గంజాయి వ్యాపారులకు ఖబడ్దార్..!
విజయనగరం క్రైమ్: గంజాయి విక్రయించినా, అక్రమ రవాణా చేసినా, వినియోగించినా నేరమే. దీనిని తీవ్రమైన నేరంగా పరిగణించి, చట్ట పరిధిలో కఠిన చర్యలు చేపడతామని మరోసారి ఎస్పీ వకుల్ జిందల్ ఆదివారం హెచ్చరించారు. మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం ఒకవైపు కఠినమైన చర్యలు చేపడుతూనే, మరోవైపు విద్యార్థులు, యువత, ప్రజలకు వాటి వల్ల కలిగే దుష్పప్రభావాలను వివరించేందుకు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని ఎస్పీ తెలిపారు. మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన యువతలో మార్పు తీసుకువచ్చి, వారిని తిరిగి సన్మార్గంలో నడపాలనే ఉద్దేశంతో వాటి దుష్పప్రభావాలను యువతకు వివరించే చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇక గతేడాదిలో గంజాయి అక్రమరవాణకు పాల్పడుతున్న వారిపై 62 కేసులు నమోదు చేసి, 1656 కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకుని, 218మందిని అరెస్టు చేశామన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 24కేసులు నమోదు చేసి, 265కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని 65 మందిని అరెస్టు చేశామని తెలిపారు. గంజాయి అక్రమ రవాణాకు గ్రూపులుగా ఏర్పడి, వ్యాపారాలు సాగిస్తున్న 54మందిని గుర్తించి, గంజాయి కేసుల్లో నిందితులుగా చేర్చామని చెప్పారు. వారిలో 43మంది ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారన్నారు. గంజాయి అక్రమ రవాణను నియంత్రించేందుకు జిల్లాలో ఐదు చెక్ పోస్టులను ఏర్పాటు చేసి, నిరంతరం వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టామని అలాగే ప్రతిరోజూ పది ప్రాంతాల్లో డైనమిక్ వాహన తనిఖీలు చేపడుతున్నామన్నారు. అంతేకాకుండా, వారిపై పీడీ యాక్ట్ ప్రయోగించడానికి కూడా వెనుకాడబోమని గంజాయి వ్యాపారాలకు పాల్పడే వారిని ఎస్పీ హెచ్చరించారు. ఎస్పీ వకుల్ జిందల్ హెచ్చరిక ఈ ఏడాదిలో 24కేసుల నమోదు 265 కిలోల గంజాయి సీజ్ -
వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు దగ్ధం
వేపాడ: మండలంలోని రామస్వామిపేట, బొద్దాం గ్రామాల్లో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన వేర్వేరు అగ్ని ప్రమాదాల్లో పశువులపాక, గడ్డివాములు, నీలగిరి తోట అగ్నికి ఆహూతయ్యాయి. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామస్వామిపేటలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదంలో పాత్రునాయుడు, ఎ.విజయలక్ష్మి, టి.నాగేష్, జి.తాత, గొలగాని కృష్ణమూర్తికి సంబంధించిన ఐదు గడ్డివాములు పక్కనే ఉన్న నీలగిరి తోట దగ్ధమయ్యాయి. సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లింది. అలాగే బొద్దాం రామాలయం సమీపంలో మధ్యాహ్నం జరిగిన అగ్నిప్రమాదంలో గ్రామానికి చెందిన నీలంశెట్టి దేముడమ్మ పశువుల పాక దగ్ధమైంది. కళ్లంలో ఉన్న టేకుదుంగలు, సపోటా చెట్లు కాలిపోయాయి. ప్రమాదం సమయంలో పశువులు మేతకు వెళ్లడం వల్ల వాటికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. సుమారు రూ.30వేల ఆస్తినష్టం ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఈ ప్రమాదాలపై వీఆర్ఓలకు సమాచారం అందించినట్లు బాధితులు తెలిపారు. -
తాటిపూడిలో 200 ఎకరాల్లో భూమాత వెంచర్
● ఉడా అనుమతులతో 5ఫేజ్‌లలో 1650 ప్లాట్స్ ● ఎక్కడా లేనివిధంగా క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్‌తో వెంచర్ ఏర్పాటు ● ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్’ బ్రోచర్ రిలీజ్ శృంగవరపు కోట: రియల్ ఎస్టేట్ చరిత్రలో ఎవరూ ఇవ్వని సౌకర్యాలు క్లబ్‌హౌస్, స్విమ్మింగ్‌పూల్ సదుపాయాలతో ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్’ నూతన వెంచర్‌ను వేసినట్లు భూమాత మేనేజింగ్ డైరెక్టర్ తాళ్లూరి పూర్ణచంద్రరావు, ఎస్ఎన్ గ్రూప్ చైర్మన్ శ్రీనివాస్ అన్నారు. భూమాత గ్రూప్, ఎస్బీఎన్ గ్రూప్ సంయుక్తంగా ఆదివారం విశాఖపట్నంలోని సాయిప్రియ రిసార్ట్స్‌లో ‘భూమాతాస్ ఎస్ఎన్ స్వప్నలోక్‘ బ్రోచరిను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వెంచర్ విజయనగరం జిల్లాలోని తాటిపూడి వద్ద సుమారు 200 ఎకరాలలో 5 ఫేజ్‌లలో 1650 ప్లాట్స్ ఉడా అనుమతులతో అందరికీ అందుబాటు ధరలతో విడుదల చేశామని తెలిపారు. ఈ వెంచర్ పూర్తిగా ఒక థీమ్డ్ ప్రీమియం రెసిడెన్షియల్ మెగా ప్రాజెక్ట్‌ను కస్టమర్స్‌కు విశ్రాంతి, వినోదం ఇచ్చే ఇలాంటి భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్‌లో మొదటిదని చెప్పారు. ఈ వెంచర్‌కు ఇప్పటికే విశేష స్పందన వచ్చిందన్నారు. ఈ వెంచర్లో ప్రతిష్టాత్మకంగా ప్రపంచంలోని 7 వండర్స్ తాలూకా కళాకృతులు కస్టమర్స్ సందర్శన కోసం రిసార్ట్ సౌకర్యాలతో పాటు పెట్టడం వల్ల విశేష ఆదరణ ఈ స్వప్నలోక్ ప్రాజెక్టుకు వస్తుందన్నారు. ఈ స్వప్నలోక్ వెంచర్ సమీపంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే తాటిపూడి రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా చేసి అక్కడ బోట్ షికారు పెట్టిందన్నారు. టూరిజం అభివృద్ధి త్వరలో 200 ఎకరాల్లో హెలికాప్టర్ ద్వారా హెలిటూరిజం ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ వెంచర్ సమీపంలో 500 ఎకరాల్లో జిందాల్ కంపెనీ వారు టూరిస్ట్ స్పాట్‌గా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. స్వప్నలోక్ వెంచర్ సమీపంలో భవిష్యత్‌లో టూరిజంగా అభివృద్ధికి చాలా అవకాశాలున్నాయన్నారు. ఈ వెంచర్ మీదుగా 4 లైన్ల హైవే పనులు త్వరలో ప్రారంభంకానున్నాయన్నారు. ఈ కార్యక్రమానికి సుమారు 1500 మంది మార్కెటింగ్ సభ్యులు, డైరెక్టర్ తాల్లూరి శివాజీ, కిరణ్ శంకర్, గోపాల్ హాజరయ్యారు. విజయనగరంలో మార్కెటింగ్ సభ్యుల కోసం ప్రత్యేకంగా మార్చి 23న సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏప్రిల్ నెలలో మెగా కస్టమర్ మేళా తాటిపూడి వద్ద స్వప్నలోక్ వెంచర్లో ఏర్పాటు చేస్తున్నట్లు తాళ్లూరి పూర్ణచంద్రరావు తెలిపారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160రామతీర్థంలో వైభవంగా పారాయణంనెల్లిమర్ల రూరల్: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో తిరువాయుముజీ పాశురముల పారాయణాలను భక్తులు ఆదివారం వైభవంగా నిర్వహించారు. అనకాపల్లికి చెందిన ఆచార్య గోష్ఠి బృంద సభ్యులు నాలాయర దివ్య ప్రబంధంలో తిరువాయుముజీ వెయ్యి పాశురాలను స్వామి సన్నిధిలో భక్తి శ్రద్ధలతో పారాయణం చేశారు. అనంతరం స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో అర్చకులు సాయిరామాచార్యులు, నరిసింహాచార్యులు, కిరణ్, పవన్, తదితరులు పాల్గొన్నారు. బాక్సింగ్‌లో ప్రతిభబొబ్బిలి: పట్టణంలోని యాదవ వీధికి చెందిన డీసరి భాను ప్రసాద్ ఏపీ స్టేట్ వెయిట్ లిఫ్టింగ్ 200 కిలోల విభాగంలో రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచాడు. ఈనెల 1,2 తేదీల్లో విశాఖలో జరిగిన పోటీల్లో ప్రథమ స్థానం సాధించిన భాను ప్రసాద్ జాతీయస్థాయి, అంతర్జాతీయ స్థాయికి ఎంపికయ్యే అవకాశాలున్నాయని కోచ్‌లు కేతిరెడ్డి సాయి వరుణ్, శంబంగి పురుషోత్తంలు తెలిపారు. భానుప్రసాద్ రాష్ట్ర స్థాయిలో ప్రథమ సాధించడంతో ఎమ్మెల్యే బేబీ నాయన రూ.20వేలను పోటీల ఖర్చుల నిమిత్తం అందజేశారు. గొర్రెపోతుల పందాలపై పోలీసుల దాడి● 8 మంది పందెగాళ్లను అదుపులోకి తీసుకుని 2 గొర్రెపోతులు స్వాధీనం లక్కవరపుకోట: మండలంలోని గొల్జాం గ్రామం శివారులో గల నిర్మానుష్య ప్రాంతంలో రహస్యంగా నిర్వహిస్తున్న గొర్రెపోతుల పందాలపై ఎస్సై నవీన్‌పడాల్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం దాడి చేశారు. ఈ సందర్భంగా పందాలు అడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకొని వారి నుంచి రూ 4,430 నగదు, రెండు గొర్రెపోతులు, రెండు సెల్ఫోన్లు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. గ్రామాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. దాడుల్లో పలువురు పోలీస్‌లు పాల్గొన్నారు.అక్రమ కట్టడాలపై హెచ్చరిక గుమ్మలక్ష్మీపురం: మండలంలోని ఎల్విన్‌పేట గ్రామంలో సర్వే నంబర్ 60(గ్రామకంఠం) సర్వే నంబర్ 58, 61లకు చెందిన స్థలంలో నేతేటి ఈశ్వరరావు అనే గిరిజనేతర వ్యక్తి చేపడుతున్న కట్టడాలు అక్రమమైనవంటూ రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. ఈ మేరకు 1/70 చట్టానికి వ్యతిరేకంగా గిరిజనేతరుడు ఎల్విన్‌పేట వద్ద (గుణుపూర్ జంక్షన్) ఎటువంటి అనుమతులు లేకుండానే అక్రమ నిర్మాణాలు చేపడుతున్నప్పటికీ అధికారులు స్పందించడం లేదంటూ గిరిజనాభ్యుదయ సంఘం నాయకుడు జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో రెవెన్యూ అధికారులు పై చర్యలకు ఉపక్రమించారు. ఆ నిర్మాణాలు అక్రమ కట్టడాలుగా గుర్తించామని, నిర్మాణాలు తక్షణమే తొలగించాలని హెచ్చరించారు. తాము జారీ చేసిన హెచ్చరికలను అతిక్రమిస్తే సీసీఎల్ఏ ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు ఈ సందర్భంగా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులో పొందుపరిచారు. -
నిద్ర కరువైతే అనారోగ్యం..!
విజయనగరం ఫోర్ట్: మానవుని జీవనశైలిలో మార్పులు, అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. ఎక్కువసేపు ఒకే చోట కూర్చుని పనిచేయడం, జంక్ఫుడ్స్ ఎక్కువగా తినడం, రాత్రివేళ ఆలస్యంగా నిద్రపోవడం, రాత్రి షిఫ్టుల్లో విధులు నిర్వహించడం వల్ల తగినంత నిద్ర ఉండదు. దీని వల్ల వారు బీపీ, సుగర్, ఊబకాయం, గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, థైరాయిడ్ వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. చాలా మంది నిద్ర లేకపోతే ఏంజరుగుతుంది? అని తేలికగా తీసుకుంటారు.అర్ధరాత్రి వరకు చాలా మంది నిద్రపోరు. దీని వల్ల అనేక సమస్యల బారిన పడతారు. నిద్రలేమి వల్ల ఓఎస్ఏ (అబ్‌్సట్రక్ట్రివ్ స్లీప్ అస్నియా) అనే సమస్యకు గురవుతారు. ఈ సమస్య ఉన్న వ్యక్తి శ్వాస తీసుకోవడం పదేపదే ఆగిపోవడం, ఊపిరి లోతుగా తీసుకోవడం (అల్పశ్వాస) జరుగుతుంది. అదేవిధంగా పెద్దగా గురక పెట్టడం, శ్వాస పునఃప్రారంభం అయినప్పడు ఉక్కిరిబిక్కిరి అయి వింత శబ్దాలు రావడం, పగటి సమయంలో మధ్యమధ్య కునుకుపాట్లు పడుతూ ఉండడం, అలసటగాను, మత్తుగాను ఉంటుంది. మద్యం తాగడం, పొగతాగడం, స్థూలకాయం వల్ల ఓఎస్ఏ సమస్య తీవ్రతరం అవుతుంది. చిన్నపిల్లల్లో అయితే ఎదుగుదల ఉండదు. మానసిక సమస్యల బారిన పడతారు.నెలకు 1000 మంది వరకు నిద్ర లేమి సమస్య బారిన పడుతున్నారు. 6నుంచి 7 గంటల నిద్ర అవసరం ప్రతి వ్యక్తి రోజులో 6 నుంచి 7 గంటలు నిద్రపోవాలి. ఇలా నిద్ర పోవడం వల్ల హార్మోన్స్ తయారవుతాయి. ఒత్తిడి తగ్గుతుంది. పనిచేయడానికి అవసరమైన శక్తి తయారవుతుంది. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. శరీర ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంటుంది. జాగ్రత్తలు నిద్రలేమి సమస్య బారిన పడకుండా ఉండాలంటే ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. కనీసం రోజులో 6 గంటలు నిద్ర పోవాలి. నిద్రలేమి సమస్య ఉన్నట్లయితే పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గాని సంప్రదించాలి. ఊబకాయం రాకుండా చూసుకోవాలి. పానీపూరీ, చాట్, పిజ్జా, బర్గర్లు వంటివి ఎక్కువగా తినకూడదు.ఎక్కువ మందికి నిద్రలేమి సమస్య చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. - డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
రోడ్డెక్కిన పశువైద్య విద్యార్థులు
రాజాం: ప్రముఖ సినీ నటి, సంక్రాంతికి వస్తున్నాం ఫేమ్ మీనాక్షి చౌదరి రాజాంలో శనివారం సందడి చేశారు. సీఎంఆర్ 18వ జ్యువెలరీ షోరూంను జ్యోతి ప్రజ్వల చేసి ప్రారంభించారు. షోరూంలో వెండి, బంగారు నగలను పరిశీలించారు. వాటిని అలంకరించుకుని మురిసిపోయారు. అనంతరం ఆమె మాట్లాడుతూ సీఎంఆర్ యాజమాన్యంతో తనకు మంచి అనుబంధం ఉందన్నారు. ప్రజలకు నాణ్యతతో కూడిన జ్యువెలరీతో పాటు నూతన వస్త్రాలను సరసమైన ధరలకే అందిస్తూ సీఎంఆర్ ప్రజల ఆదరణ పొందుతోందన్నారు. రాజాంలో కొత్తగా ఏర్పాటుచేసిన షోరూంలో ఇచ్చే ఆఫర్ల ను ఈ ప్రాంత ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీఎంఆర్ డైరెక్టర్లు మావూరి వెంకటరమణ, మావూరి సత్యవీరసంతోష్మోహన్బాలాజీ, హారిక, ఎమ్మెల్యే కోండ్రు మురళీమోహన్, సీతారామ గ్రూప్ ఎండీ సి.వి.జగన్నాథ స్వామి, వైద్యుడు ప్రకాశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు అంటే ఇష్టం తెలుగు భాష అంటే చాలా ఇష్టమని, తెలుగు సినిమాల్లో నటించే అవకాశాలు ఎక్కువగా రావడం అదృష్టమని మీనాక్షి చౌదరి అన్నారు. ఆమెను చూసేందుకు వచ్చిన రాజాం ప్రజలతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ఇప్పటివరకు తెలుగుభాషలో 8 సినిమాల్లో నటించానన్నారు. వీటిలో లక్కీభాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు మంచి గుర్తింపునిచ్చాయన్నారు. త్వరలో నాగచైతన్యతో సినిమా తీస్తున్నట్టు వెల్లడించారు. డెంటల్ విభాగంలో వైద్యవిద్యను అభ్యసించానని, స్విమ్మింగ్, బ్యాండింటన్ క్రీడల్లో మంచి ప్రావీణ్యం ఉందని, ఆ పాత్రల్లో నటించాలని ఉందన్నారు. చీపురుపల్లిరూరల్ (గరివిడి): తమ సమస్యలను, డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని గరివిడి వెంకటేశ్వర వెటర్నరీ కళాశాల విద్యార్థులు కోరారు. కళాశాలకు వీసీఐ గుర్తింపు, స్టైఫండ్ రూ.25వేలకు పెంచాలని 41 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడంపై మండిపడ్డారు. దీనికి నిరసనగా గరివిడి–విజయనగరం ప్రధాన రోడ్డుపై శనివారం నిరసన ర్యాలీ నిర్వహించారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద కాసేపు ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కోరారు. సీఎంఆర్ జ్యువెలరీ షోరూం ప్రారంభం 41వ రోజుకు చేరుకున్న నిరవధిక దీక్షలు ప్రభుత్వ తీరుపై నిరసన -
పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
స్ట్రాంగ్ రూంలో సహాయ కేంద్రం విద్యాశాఖకు చెందిన స్ట్రాంగ్ రూంలో సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. సందేహాలను సెల్ 90009 45346 నంబర్‌కు ఫోన్‌చేసి నివృత్తి చేసుకోవచ్చు. జిల్లా పరిశీలకులుగా ఆదర్శ పాఠశాల జేడీ సుల్తానా బేగంను నియమించారు. విజయనగరం అర్బన్: పదోతరగతి పరీక్షలకు సర్వం సిద్ధం చేసినట్టు డీఈఓ యు.మాణిక్యంనాయుడు శనివారం తెలిపారు. పరీక్షకు హాజరుకానున్న 23,765 మంది రెగ్యులర్ విద్యార్థులకు 119, ఓపెన్ స్కూల్ విద్యార్థులు 614 మందికి 8 పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశామన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి 12.45 గంటల వరకు రెగ్యులర్ విద్యార్థులకు, ఓపెన్ స్కూల్ పరీక్షలు ఉదయం 9.30 నుంచి 12.30 గంటల వరకు నిర్వహిస్తామన్నారు. పరీక్షల పర్యవేక్షకులు/డిపార్ట్మెంట్ అధికారులుగా 238 మంది, ఇన్విజిలేటర్లుగా 1,150 మంది, కస్టోడియన్లుగా 36 మంది, ఫ్లైయింగ్ స్క్వాడ్స్ 9 మంది విధుల్లో పాల్గొంటారని, 9 రూట్లలో స్టోరేజ్ సాయింట్లు 29 ఏర్పాటు చేశామన్నారు. సీసీ కెమెరాల నిఘాలో.. మాల్ ప్రాక్టీస్‌కు అవకాశం ఉన్న జిల్లాలోని నాలుగు పరీక్ష కేంద్రాల్లో సీసీ కెమెరాలను అనుసంధానం చేసినట్టు డీఈఓ తెలిపారు. పరీక్ష కేంద్రానికి 200 మీటర్ల వరకు 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమీపంలోని జెరాక్స్, ఇంటర్నెట్ సెంటర్లను మూసివేయాలని ఆదేశాలిచ్చామన్నారు. పరీక్ష కేంద్రంలోకి విద్యార్థులతో పాటు ఇన్విజిలేటర్లు, ముఖ్య పర్యవేక్షకులు, డిపార్ట్మెంట్ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. వీరుకూడా సెల్ఫోన్లు, డిజిటల్ వాచీలు తీసుకెళ్లకూడదన్నారు. తెలుగు, ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష ఉంటుందని, పరీక్షకు సమయానికి ముందుగానే 24 పేజీల బుక్లెట్ విద్యార్థికి అందజేస్తామన్నారు. బుక్లెట్ నంబర్ వేసి, విద్యార్థితో పాటు ఇన్విజిలేటర్ ధ్రువీకరించాలన్నారు. ఏమైనా తప్పులుంటే ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పారు. అదనంగా కావాలంటే మరో 12 పేజీల వరకు ఉన్న బుక్లెట్ ఇస్తారు. మాట్లాడుతున్న డీఈఓ యు. మాణిక్యం నాయుడు రేపటి నుంచి పరీక్షలు 119 కేంద్రాల్లో పరీక్ష రాయనున్న 23,765 మంది విద్యార్థులు నాలుగు సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు -
సమగ్ర వివరాలు లేని ప్రణాళికలు ఆచరణ శూన్యం
విజయనగరం అర్బన్: గ్రామస్థాయిలో వనరులు, అభివృద్ధి అవకాశాల అంచనా వివరాలు లేకుండా.. శాఖాపరమైన మదింపు చేయకుండా అభివృద్ది విజన్ ప్రణాళిక ఆచరణ సాధ్యం కాదని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ అహ్మద్‌బాబు తేల్చిచెప్పారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో పీ–4, స్వర్ణాంధ్ర విజన్ 2047 ప్రణాళికలో భాగంగా నియోజకవర్గం అభివృద్ధికి విజన్ ప్లాన్ తయారీపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఎ.బాబు పాల్గొన్నారు. నియోజకవర్గం ప్రణాళిక తయారీలో గజపతినగరం నియోజకవర్గంపై తయారు చేసిన మోడల్ ప్రణాళికను ముఖ్య ప్రణాళిక అధికారి పి.బాలజీ వివరించారు. నియోజకవర్గం భౌగోళిక స్వరూపం, వనరుల లభ్యత, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి దోహదపడే అంశాలు, పంటలు, నీటి వనరులు, భౌతిక, సాంస్కృతిక, పర్యాటక అంశాలు, బలాలు, బలహీనతలు, అవకాశాలు, సవాళ్లను వివరిస్తుండగా అసలు ఇవన్నీ గ్రామస్థాయిలో సేకరించినవేనా అంటూ బాబు సందేహం వ్యక్తంచేశారు. గ్రామస్థాయిలో రూపొందించని అభివృద్ధి ప్రణాళికలతో లాభం ఉండదన్నారు. రానున్న ఐదేళ్లకు ప్రతి శాఖ వాస్తవ, ఆచరణాత్మకమైన ప్రణాళికలను రూపొందించాలని సూచించారు. జిల్లాకు చెందిన ప్రొగ్రాం, ప్రాజెక్టులు కూలంకుషంగా ప్రణాళికలో కనపడాలన్నారు. భోగాపురం ఎయిర్పోర్ట్ అందుబాటులోకి వస్తున్న నేపథ్యంలో మామిడి వంటి వాణిజ్య పంటలకు డిమాండ్ ఉంటుందన్నారు. మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి పంటకు ఒక సమగ్ర ప్రణాళిక ఉండాలన్నారు. అందుబాటులో ఉన్న వనరులన్నింటినీ సామాజిక, ఆర్థిక అభివృద్ధికి మరల్చాలని తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ఒక బిజినెస్ సెంటర్ ఏర్పాటుకు రెండు ఎకరాల భూమిని గుర్తించాలని సూచించారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ మాట్లాడుతూ తాటిపూడి వద్ద బోటు విహార యాత్ర ద్వారా 2 నెలల్లో రూ.35 లక్షల ఆదాయం వచ్చిందని తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ప్రణాళిక తయారీ కోసం నిర్వహించే చర్చకు పలువురు ఎమ్మెల్యేలు డుమ్మాకొట్టడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. అధికార యంత్రాంగం విలువైన సమయం వృథా అయ్యిందన్న వ్యాఖ్యలు వినిపించాయి. సమావేశంలో ఎమ్మెల్యే లోకం నాగమాధవి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీఆర్వో శ్రీనివాసమూర్తి, ఆర్డీఓ దాట్ల కీర్తి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. పీ–4, స్వర్ణాంధ్ర విజన్–2047పై చర్చలో జిల్లా ప్రత్యేక అధికారి అహ్మద్‌బాబు -
బొండపల్లిలో ఒకేషనల్ జవాబు పత్రాల మూల్యాంకనం
సీతంపేట: ఉత్తరాంధ్రంలోని ఇంటర్మీడియట్ వృత్తివిద్యా కోర్సు విద్యార్థుల జవాబు పత్రాల మూల్యాంకనం బొండపల్లిలోని సిద్ధార్థ జూనియర్ కళాశాలలో నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 17 నుంచి మూల్యాంకనం జరగనుంది. గతంలో విశాఖపట్నం జైలు రోడ్డులో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించేవారు. జనరల్ సబ్జెక్టుల మూల్యాంకనం యథావిధిగా పార్వతీపురం మన్యం జిల్లాలోని బెలగాం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించనున్నారు. నేడు ఎఫ్ఆర్ఓ ఉద్యోగాలకు రాతపరీక్ష విజయనగరం అర్బన్: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి ఆదివారం నిర్వహించే రాతపరీక్షకు పకడ్బందీగా ఏర్పాట్లు చేసినట్టు డీఆర్వో ఎస్.శ్రీనివాసమూర్తి తెలిపారు. అలాగే, ఈ నెల 17న జరగనున్న ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌లో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. తన చాంబర్లో పరీక్ష ఏర్పాట్లపై శనివారం సమీక్షించారు. జిల్లాలోని చింతలవలస వద్ద ఉన్న ఎంవీజీఆర్ ఇంజినీరింగ్ కళాశాల, గాజులరేగలోని అయాన్ డిజిటల్ సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. ఏప్రిల్ 14న మెరిట్ జాబితా విడుదల విజయనగరం ఫోర్ట్: వైద్య కళాశాల, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రుల్లో 91 పోస్టులకు సంబంధించిన తుది మెరిట్ జాబితాను ఏప్రిల్ 14న ప్రకటిస్తామని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.పద్మలీల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 14న ప్రకటించిన ప్రొవిజినల్ జాబితాలో అభ్యంతరాలుంటే వారం రోజుల్లో తెలియజేయాలన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఏప్రిల్ 20వ తేదీన కౌన్సెలింగ్ చేసి నియామకపత్రం అందజేస్తామని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ వీరంగం... లాఠీలకు పనిచెప్పిన ఖాకీలు! మెరకముడిదాం: ఓ ఆటో డ్రైవర్ మద్యం మత్తు లో వీరంగం సృష్టించగా... పోలీసులు తమ లాఠీలకు పనిచెప్పిన ఘటన విజయనగరం జిల్లా మెరకముడిదాం మండలం బుదరాయవలస పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బుధరాయవలస గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సిరిపురపు రాంబాబు కొన్నినెలల కిందట అదే గ్రామానికి చెందిన ఓ మహిళను తీసుకెళ్లిపోయాడు. అప్పటికే రాంబాబుకు భార్య లక్ష్మితో పాటు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతో సైతం మద్యం సేవించి గొడవపడడంతో ఆమె కొద్దిరోజుల కిందట బుదరాయవలస పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. విచారణ కోసం పోలీసులు రాంబాబును పిలిచారు. స్టేషన్లో విచారణ జరుపుతున్న సమయంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిపై తిరగబడడం, ఆటోను పోలీసులపైకి ఎక్కించే ప్రయ త్నం చేశాడు. దీంతో పోలీసులు రాంబాబుని చుట్టుముట్టి లాఠీలకు పనిచెప్పారు. ఈ దాడిలో రాంబాబు వీపుపై తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన ఆటో డ్రైవర్‌ను కుటుంబ సభ్యులు చీపురుపల్లి ప్రభుత్వాస్పత్రిలో చేర్చారు. తనను విచారణకు పిలిచి నలుగురు పోలీసులు నిర్ధాక్షిణ్యంగా కొట్టినట్టు ఆటోడ్రైవర్ పేర్కొన్నాడు. విచారణ సమయంలో సిబ్బందిపై తిరగబడడంతోనే కొట్టాల్సి వచ్చిందని ఎస్ఐ జె.లోకేశ్వర రావు తెలిపారు. -
మా భూమి మాది కాదంటున్నారు....
మాకు ప్రభుత్వం డీ పట్టా ఇచ్చిన ఎకరా భూమిని ఎమ్మెల్యే బేబీనాయన బలవంతంగా ఆక్రమించుకున్నారు. మేము అడ్డుపడి అడిగితే ఈ భూమి మీది కాదు మాది అంటున్నారు. సంవత్సరాల తరబడి మేం అనుభవిస్తున్న భూమిని ఇప్పుడు కాదంటే మేము ఎవ్వరికి చెప్పుకోవాలి. భూమి సర్వే నంబర్లు మార్చేయడంలో వీఆర్వో సింహాచలం పాత్ర ఉంది. – అల్లు సంతోష్‌కుమార్ (సీతమ్మ వారసుడు) మాకు రైతు భరోసా కూడా వచ్చేది... మాకు ప్రభుత్వం ఇచ్చిన భూమి సాగు చేసుకుంటున్నాం కాబట్టే రైతుభరోసా పెట్టుబడి సాయం కూడా గత ప్రభుత్వంలో అందేది. ఆధారాలు చూపించమంటే వీఆర్వో సింహాచలానికి ఇదే విషయం చెప్పాం. పట్టా చూపించాం. అయినాసరే మా భూమి ఆక్రమించుకున్నవారికి ఆయన వంత పాడుతున్నారు. – తెంటు వరలక్ష్మి (చిన్నమ్మి వారసురాలు) మా భూమిలో బేబీ నాయన లే అవుట్ డీపట్టా భూమిని 1991 నుంచి మా స్వాధీనంలోనే ఉంది. వర్షాలు లేక కొన్నాళ్లు సాగుచేయలేదు. ఈ భూమిపై ప్రభుత్వం నుంచి పంట నష్టపరిహారాలు, అలాగే రైతుభరోసా పెట్టుబడి సాయం వస్తున్నాయి. కానీ ఎమ్మెల్యే బేబీ నాయన అనుచరులు మా భూమిని లాక్కొన్నారు. అడిగితే వేరేచోట భూమి ఇస్తామన్నారు. అదేమీ ఇవ్వకుండానే మా భూమిలో లేఅవుట్ వేస్తున్నారు. – బెవర అప్పలనాయుడు (సావిత్రమ్మ వారసుడు) -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ90 శ్రీ150 శ్రీ160కుక్కల దాడిలో నలుగురు చిన్నారులకు గాయాలు సాలూరు: పట్టణంలోని 18వ వార్డు పరిధి దుర్గానవీధిలో నలుగురు చిన్నారులపై కుక్కలు దాడి చేశాయి. శనివారం సాయంత్రం ఇంటి బయట ఆడుకుంటున్న చిన్నారులపై కుక్కలు ఒక్కసారిగా దాడి చేసి గాయపరిచాయి. వెంటనే స్థానికులు అప్రమత్తమై కుక్కలను తరిమేశారు. చిన్నారులను స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ఖేలో ఇండియా పోటీలకు ముగ్గురు..విజయనగరం: ఢిల్లీలో ఈ నెల 20 నుంచి 23 వరకు జరగనున్న ఖేలో ఇండియా క్రీడా పోటీలకు ఉమ్మడి విజయనగరం జిల్లా నుంచి ముగ్గురు పారా క్రీడాకారులు ఎంపికయ్యారని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ తెలిపారు. ఈ మేరకు ఎంపికై న క్రీడాకారులను శనివారం స్థానిక క్రీడాభివృద్ధి కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గత నెలలో జరిగిన పారా ఒలింపిక్ చాంపియన్‌షిప్ పోటీల్లో కిల్లక లలిత, దొగ్గా దేముడు నాయుడు, సుంకరి దినేష్ అత్యుత్తమ ప్రతిభ కనబరచడంతో ఖేలో ఇండియా పోటీలకు ఎంపికయ్యారని తెలిపారు. వీరిలో కిల్లక లలిత ఇప్పటికే ఢిల్లీలో జరుగుతున్న వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ పోటీల్లో ఆడేందుకు వెళ్లగా.. మిగిలిన ఇద్దరు త్వరలో ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారని తెలిపారు. ఖేలో ఇండియా పోటీలలోనూ బాగా రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. 27న స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు రాజాం సిటీ: స్థానిక జీఎంఆర్ నైరేడ్‌లో ఈ నెల 27న ఉచిత స్వయం ఉపాధి శిక్షణకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నామని డైరెక్టర్ ఎం.రాజేష్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం మన్యం జిల్లాలకు చెందిన 19 నుంచి 40 సంవత్సరాల మధ్య వయసుగల నిరుద్యోగ సీ్త్ర, పురుషులు అర్హులని పేర్కొన్నారు. పురుషులకు రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషన్ (75 రోజులు), సెల్‌ఫోన్ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ (30 రోజులు), జెంట్స్ టైలరింగ్ (30 రోజులు), హౌస్ వైరింగ్ (30 రోజులు).. అలాగే మహిళలకు టైలరింగ్ (30 రోజులు), కంప్యూటర్ డీటీపీ కోర్సు (45 రోజులు), మగ్గం అండ్ శారీ పెయింటింగ్ వర్క్స్ (30 రోజుల పాటు)లలో శిక్షణ ఇస్తామన్నారు. ఇంటర్వ్యూకు హాజరయ్యేవారు పదో తరగతి మార్కుల లిస్టు, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు తీసుకురావాలని సూచించారు. శిక్షణ కాలంలో భోజన, వసతి సదుపాయాలుంటాయన్నారు. మరిన్ని వివరాలకు 90147 16255, 94917 41129, 98669 13371, 998 99 53145 నంబర్లను సంప్రదించాలన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు పాల పౌడర్ ● సీ్త్ర సంక్షేమశాఖ ఆర్జేడీ చిన్మయిదేవి రామభద్రపురం: అంగన్వాడీ కేంద్రాలకు ప్రస్తుతం సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్ల స్థానంలో పాల పౌడర్ ప్యాకెట్లను సరఫరా చేస్తున్నట్టు సీ్త్ర సంక్షేమ శాఖ ఆర్జేడీ చిన్మయిదేవి తెలిపారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని పలు అంగన్వాడీ కేంద్రాలకు సరుకులు సరఫరా చేసే ఏజెన్సీకి చెందిన రామభద్రపురంలో ఉన్న గోదాంను ఆమె శనివారం సందర్శించారు. సరుకుల సరఫరా, నిల్వలను ఏజెన్సీ నిర్వాహకుడు బండారు నాగరాజును అడిగి తెలుసుకున్నారు. రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద మన్యం, భద్రగిరి, కురుపాంలలోని అంగన్వాడీ కేంద్రాలకు పాలపౌడర్ సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. అంగన్వాడీ కేంద్రాల బలోపేతంలో భాగంగా 3,173 మినీ అంగన్వాడీ కేంద్రాలను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా చేస్తామని తెలిపారు. -
మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లు
సాలూరు: న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను కేటాయించింది. వీటిని సీ్త్ర, శిశు సంక్షేమ, గిరిజన శాఖా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి శనివారం పట్టణంలో ప్రారంభించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, ఎన్పీసీఐ కొవ్వాడ కేంద్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ రవికామత్, అసోసియేట్ డైరెక్టర్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. గిరిబజార్‌ను ప్రారంభించిన మంత్రి అంబులెన్స్‌లతో పాటు గిరిజనులకు నిత్యావసర వస్తువులు అందుబాటులో తీసుకువచ్చేందుకు ఏర్పాటు చేసిన గిరిబజార్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ వాహనాల ద్వారా నాణ్యమైన సరుకులను అందించడం జరుగుతుందని తెలిపారు. మంత్రికి జన్మదిన శుభాకాంక్షలు మంత్రి సంధ్యారాణికు కలెక్టర్ శ్యామ్‌ప్రసాద్, ఐటీడీఏ ఇన్చార్జ్ పీఓ అశుతోష్ శ్రీవాస్తవ, తదితరులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. రోగులకు మెరుగైన సేవలను అందించేందుకే.. పార్వతీపురం: రోగులకు మెరుగైన సేవలను అందించేందుకు అదనంగా మూడు అంబులెన్సులను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు కలెక్టర్ ఎ. శ్యామ్‌ప్రసాద్ తెలిపారు. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జిల్లాకు కేటాయించిన మూడు అంబులెన్స్‌లను శనివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు సకాలంలో సేవలు అందించేందుకు వాహనాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పారు. -
‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’లో అగ్రశ్రేణిలో నిలవాలి
విజయనగరం: స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో విజయగనరం అగ్రశ్రేణిలో నిలవాలని జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.బాబు ఆకాంక్షించారు. శనివారం స్థానిక బీఆర్ అంబేడ్కర్ జంక్షన్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో జిల్లా ప్రత్యేక అధికారి డాక్టర్ ఎ.బాబు, కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్, ఆర్డీఓ డి.కీర్తి, మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య, తదితరులు పాల్గొన్నారు. ముందుగా గంటస్తంభం నుంచి అంబేడ్కర్ కూడలి వరకు ప్లాస్టిక్ నిషేధంపై ర్యాలీ నిర్వహించారు. ఒకసారి వినియోగించే ప్లాస్టిక్‌ను నిషేధిద్దాం – పర్యావరణాన్ని కాపాడుదాం అనే నినాదాలతో మహిళలు ర్యాలీ చేపట్టారు. అనంతరం ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధిస్తామని మహిళలతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయ వస్తువులతో ఏర్పాటు చేసిన ప్రదర్శనను, ప్లాస్టిక్ వస్తువులతో రూపొందించిన గృహాలంకరణ వస్తువులను తిలకించారు. కార్యక్రమంలో వయోజనవిద్య డీడీ ఎ.సోమేశ్వరరావు, కార్పొరేషన్ ప్రజారోగ్యాధికారి కొండపల్లి సాంబమూర్తి, వాణిజ్య పన్నుల శాఖ డిప్యూటీ కమిషనర్ వల్లి, తదితరులు పాల్గొన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి బాబు -
ఫీల్డ్ అసిస్టెంట్‌కు రూ. 50వేలు
మండలంలోని 42 పంచాయతీలలో పనిచేస్తున్న ఫీల్డ్ అసిస్టెంట్లపై స్థానిక నేతలు ఫిర్యాదు చేయడమే తరువాయి ఫిర్యాదు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్‌తో మాట్లాడి రూ. 50 వేలు ఇవ్వాలని, లేకపోతే నిన్ను తొలగిస్తామని ఉపాధి ఏపీఓ కామేశ్వరరావు హెచ్చరిస్తారు. వేతనదారుల నుంచి రూ. వంద నగదు వసూలు చేస్తున్నప్పటికీ, ఫిర్యాదు వచ్చిన ప్రతిసారీ రూ. 50 వేలు ఇవ్వాలని ఒత్తిడి రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్లు లబోదిబోమంటున్నారు. మండలంలోని మణ్యపురిపేట, రాగోలు ఫీల్డ్ అసిస్టెంట్లపై ఫిర్యాదు రావడంతో రూ. 50 వేలు ఇవ్వాలని ఉపాధి ఏపీఓ డిమాండ్ చేశారు. వాస్తవం కాదు ఫీల్డ్ అసిస్టెంట్లుగా నియమితులైన వారి నుంచి రూ. 50 వేల నగదు తీసుకున్నట్లు చేస్తున్న ఆరోపణలు నిజం కాదు. వేతనదారుల వద్ద నుంచి రూ. వంద వసూలు చేయడం లేదు. ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల ద్వారా నగదు వసూలు చేస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులలో వాస్తవం లేదు . కామేశ్వరరావు, ఏపీఓ, ఉపాధి హమీ పథకం , గుర్ల ఒత్తిడి తెచ్చి రాజీనామా చేయించారు రాగోలు ఫీల్డ్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న నాపై ఒత్తిడి తీసుకువచ్చి రాజీనామా చేయించారు. నాపై ఫిర్యాదులు వస్తున్నాయని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. నగదు ఇవ్వకపోవడంతో ఉపాధి హమీ పనులలో చాలా అవకతవకలు జరిగాయని బెదిరించారు. అవకతకవలలో నిజం అయితే మీ ఆస్తి అమ్మైనా ప్రభుత్వానికి చెల్లించాలని , లేనిచో మీ స్థిరాస్తులు వేలం వేయిస్తామని బెదిరించారు. రాజీనామా చేస్తే ఎటువంటి విచారణ ఉండదని చెప్పడంతో ఒత్తడికి తలొగ్గి రాజీనామా చేశాను. పతివాడ శ్రీను, రాగోలురూ.50 వేలు ఇచ్చాను మణ్యపురిపేట సీనియర్ మేట్‌గా పనిచేస్తున్న నాకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందిస్తానని రూ. 50 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ. 50 వేలు ఇచ్చిన తర్వాత మరో రూ. 10 వేలు ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారు. రూ. 10 వేలు ఇవ్వకపోవడంతో మరో మహిళలకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియమించారు. సీనియర్ మేట్‌గా ఉన్నప్పుడు గ్రామంలో పనిచేసిన 200 మంది నుంచి వారానికి రూ. 100 నగదు వసూలు చేసి టెక్నికల్ అసిస్టెంట్, ఏపీఓకి అందించాను. గార రామలక్ష్మి, మణ్యపురిపేట 30,775 వేతనదారులుమండలంలోని 42 పంచాయతీలలో 19,548 జాబ్ కార్డులున్నాయి. వీరిలో 34,711 మంది వేతనదారులు ఉపాధి హమీ పనుల కోసం దరఖాస్తు చేసుకోగా.. 30,775 మంది పనులకు హాజరవుతున్నారు. పనులు చేస్తున్న వారిందరి నుంచి వారానికి రూ. వంద వసూలు చేయడంతో వారానికి రూ. ముప్పై లక్షల పైనే నగదు వసూలవుతుంది. ఇంతా నగదు ఎవరి జేబుల్లోకి వెళ్తోందని వేతనదారులు చర్చించుకుంటున్నారు. దీనికితోడు గత ప్రభుత్వ హయాంలో సర్పంచ్‌లు చెరువుల వద్ద నిర్మించిన శిలాఫలకాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించిన నగదు సర్పంచ్ల ఖాతాలకు జమ చేయకుండా ఉపాధి హమీ అధికారుల వ్యక్తిగత ఖాతాలకు జమ చేసుకున్నట్లు ఆరోపణలు వినబడుతున్నాయి. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
బొబ్బిలి: పట్టణంలోని ఫ్లైఓవర్‌పై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఎస్సై వి. జ్ఞానప్రసాద్ తెలియజేసిన వివరాల ప్రకారం.. సాలూరుకు చెందిన బ్రహ్మకుమారీలు మౌంట్అబూ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్నారు. వీరిని పికప్ చేసుకునేందుకు బొలేరో వాహనంలో శాంబాన లక్ష్మణరావు (62) బొబ్బిలి రైల్వే స్టేషన్‌కు వచ్చారు. అనంతరం బ్రహ్మకుమారీలను ఎక్కించుకుని సాలూరు వెళ్తుండగా.. ఫ్లైఓవర్ వద్దకు వచ్చేసరికి స్టీరింగ్‌పై పట్టుకోల్పోయి ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీ కొన్నారు. దీంతో వాహనం ముందుభాగం నుజ్జునుజ్జు కావడంతో అందరూ గాయపడ్డారు. ఇదే సమయంలో అటుగా వస్తున్న ఆటో డ్రైవర్ కె. రమణబాబు క్షతగాత్రులను తన ఆటోలో ఎక్కించుకుని స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లగా.. లక్ష్మణరావు అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. అనంతరం క్షతగాత్రులు రాజరత్నం, సుజాత, తదితరులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం జిల్లా కేంద్రాస్పత్రికి అక్కడ నుంచి విశాఖ తరలించారు. ఎస్సై జ్ఞానప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి గాయాలు -
పైసలిస్తేనే.. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు
ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం.. ● నగదు అందిస్తేనే కొనసాగింపు ● ఉపాధి హమీ వేతనదారుల వద్ద నుంచి రూ. వంద వసూలు చేయాలని అల్టిమేటం ● ఏపీఓ ఆదేశాల ప్రకారం నగదు వసూలు చేస్తున్న ఫీల్డ్, టెక్నికల్ అసిస్టెంట్లు మణ్యపురిపేట సీనియర్ మేట్‌గా పనిచేసిన గార రామలక్ష్మి ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టు కోసం రూ. 50 వేల నగదును రెండు నెలలు కిందట మండల ఉపాధి హమీ అధికారి కామేశ్వరరావుకు ఇచ్చింది. అయితే మరో రూ. 10 వేలు ఇవ్వాలని అతను డిమాండ్ చేశారు. డిమాండ్ చేసిన నగదు ఇవ్వకపోవడంతో గ్రామానికి చెందిన మరో మహిళకు ఫీల్డ్ అసిస్టెంట్‌గా నియామకపత్రం అందజేశారు. ఆమె వద్ద నుంచి రూ. 30 వేలు తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే నగదు తీసుకున్న విషయం ఎంపీడీఓ, ఉపాధి హమీ పీడీలకు బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి విచారణ చేపట్టలేదు. జిల్లా అధికారి నుంచి మండల అధికారి వరకు వసూలు చేసిన నగదు సర్దుబాటు అవుతుందని సమాచారం. అందుకే ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే గత సోమవారం కలెక్టర్ గ్రీవెన్స్‌సెల్‌లో బాధితురాలు రామలక్ష్మి ఫిర్యాదు చేయడంతో ఈఓపీఆర్డీ అన్నపూర్ణాదేవి మన్యపురిపేట పంచాయతీ కార్యాలయంలో శనివారం విచారణ చేపట్టారు. గుర్ల: గ్రామాల్లో పేదలందరికీ వంద రోజుల పని కల్పించి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉపాధి హమీ పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వం పేదలకు అందిస్తున్న వంద రోజుల పని నుంచి వారానికి రూ. వంద వసూలు చేసే సరికొత్త పథకాన్ని గుర్ల మండల ఉపాధి హమీ అధికారులు ప్రవేశ పెట్టడం విమర్శలకు దారితీస్తోంది. మండలంలోని 42 గ్రామ పంచాయతీలలో ఉపాధి హమీ పనులు జరుగుతున్నాయి. ఈ గ్రామాలకు చెందిన ఫీల్డ్ అసిస్టెంట్లు వేతనదారుల నుంచి నగదు వసూలు చేస్తున్నారు. వేతనదారులు సక్రమంగా పని చేయడం లేదని బెదిరిస్తూ వారిని తమ గుప్పిట్లోకి తీసుకుంటున్నారు. వారానికి రూ. వంద నగదు ఇస్తే తక్కువ పని చేసినప్పటికీ టెక్నికల్ అసిస్టెంట్ సహాయంతో కొలతలను అధికంగా వేసి ప్రభుత్వం ప్రకటించిన గరిష్ట వేతనాన్ని మీఖాతాలో జమ అయ్యేలా ఆన్లైన్ చేస్తామని ఫీల్డ్ అసిస్టెంట్లు వారికి చెబుతున్నారు. నగదు ఇస్తున్నట్లు స్థానిక నేతలకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నగదు వసూలుపై ఎవరైనా వేతనదారులు ప్రశ్నిస్తే సాంకేతిక కారణాలు చూపి ఉపాధి హమీ పనులకు వెళ్లకుండా చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మోసపోతున్నా... మౌనమేల?
మోసాలెన్నో... ● తూనికలు, కొలతల్లో ఆదమరిస్తే అంతే సంగతులు ● కొనుగోలుదారులను దోచుకుంటున్న కొంతమంది వ్యాపారులు ● మోసాలు ఎదురవుతున్నా భరిస్తున్న కొనుగోలుదారులు ● అవగాహన లేక హక్కులను వదులుకుంటున్న వైనం ● వినియోగదారుల ఫోరంలో ఏటా వందకు మించని ఫిర్యాదులు ● తూనికలు, కొలతల శాఖ తనిఖీల్లోనూ వందల సంఖ్యలోనే కేసులు ● నేడు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం ఉదయాన్నే కొనుగోలుచేసే పాలు, పెరుగు ప్యాకెట్లపై తేదీ గమనించి గడువు ముగిసినది అంటగడితే వెంటనే ప్రశ్నించాలి. లేదంటే ఆ మోసాన్ని మనం ప్రోత్సహించినట్టే లెక్క. కళ్లముందే వివిధ రకాల ఆహార పదార్థాల తూకంలో తేడాలుంటే వెంటనే నిలదీయాలి. మనకెందుకులే అనుకుంటే తప్పుడు కొలతలకు ఊతమిచ్చినట్టే. ఎమ్మార్పీ ధరలకు మించి సరుకులు, వస్తువులు విక్రయించినా.. నాణ్యత లోపించిన సరుకులు అంటగట్టినా వెంటనే అధికారులకు ఫిర్యాదు చేసి శిక్ష పడేలా చేయాలి. మోసం చేసినది వ్యక్తి అయినా, సంస్థ అయినా సరే.. ఇందులో అలసత్వం వహిస్తే అక్రమాలను ప్రోత్సహించినట్టే.. చెల్లించిన డబ్బులకు తగిన సేవలు పొందే హక్కును ప్రతీ వినియోగదారుని(కొనుగోలుదారు)కి చట్టం ప్రసాదిస్తోంది. కావాల్సిందలా మోసాలను గుర్తించడం.. ప్రశ్నించడమే. వ్యాపారుల్లో ఏమాత్రం మార్పురాకపోయినా, మోసాలకు చెక్పెట్టకపోయినా వినియోగదారుల హక్కుల పరిరక్షణకు ప్రత్యేక ఫోరం ఉంది. అందులో ఫిర్యాదు చేస్తే చాలు పైసా ఖర్చులేకుండానే న్యాయం పొందవచ్చు. నేడు ప్రపంచ వినియోగదారుల హక్కులు దినోత్సవం సందర్భంగా వినియోగదారుల హక్కులు, ఫిర్యాదు చేసుకునే వెసులబాటు, జిల్లాలో నమోదైన కేసులపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఉదయం మేల్కొన్నది మొదలు ఏదో ఒక సరుకు, ఏదే ఒక వస్తువు కొనుగోలు చేస్తూనే ఉంటాం. అదే సమయంలో ఏమాత్రం ఏమరుపాటు గా ఉన్నా ఝలక్ ఇచ్చే వ్యాపారులూ ఉన్నారు. కల్తీ చేసినవో, నాసిరకమో, ఎమ్మార్పీ కన్నా ఎక్కువగా వసూలు చేయడమో, తక్కువ పరిణామంలో అంటగట్టడమో... ఇలా తూనికలు, కొలతల్లో, నాణ్యతలో మోసం ఎదురవుతూనే ఉంటుంది. ఇలాంటి మోసాలను ఎదుర్కొనేలా అవగాహన కల్పిస్తూ కొనుగోలుదారుల హక్కులను కాపాడేందుకు ఏటా మార్చి 15వ తేదీన ప్రపంచ వినియోగదారుల హక్కులు దినోత్సవం నిర్వహిస్తున్నారు. అలాగే వినియోగదారుల ప్రయోజనాల దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం కూడా వినియోగదారుల రక్షణ చట్టం రూపొందించింది. ఇది 1986 డిసెంబర్ 24 నుంచి అమల్లోకి వచ్చింది. కానీ ఇప్పటికీ సరైన అవగా హన లేక వినియోగదారులు మోసపోతూనే ఉన్నారు. తాము మోసపోయామని తెలిసినా ఫిర్యా దులు చేసేవారూ తక్కువ మందే ఉంటున్నారు. ఈ చట్ట ప్రకారం ఏర్పాటైన జిల్లా వినియోగదారుల ఫోరం (కోర్టు)కు ఫిర్యాదులు కూడా ఏటా వందకు మించట్లేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని 2019లో ఈ చట్టం, కోర్టుల పరిధిని ప్రభుత్వం విస్తృతం చేసింది. కోర్టుకు మరిన్ని అధికారాలిస్తూ చట్టాన్ని సవరించింది. ఈ ప్రకారం కోటి రూపాయలలోపు విలువ గల వ్యాజ్యాలు జిల్లా వినియోగదారుల కోర్టు పరిధిలోకే వస్తాయి. ఈ కోర్టులో ప్రస్తుతం 80 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. తూనికలు, కొలతల శాఖ కేసులు పెట్టినా... తూనికలు, కొలతల్లో మోసాలు, అధిక ధరలకు సరుకుల విక్రయాలను అరికట్టడంలో జిల్లా తూనికలు, కొలతల (లీగల్ మెట్రాలజీ) శాఖ కీలక పాత్ర పోషిస్తోంది. తరచుగా తనిఖీలు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా కొందరు వ్యాపారులు, ఇతర విక్రయ సంస్థల్లో తీరులో మార్పు రావట్లేదనే విమర్శలు వస్తున్నాయి. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు సీజనల్ వారీగా కేసులు నమోదు చేస్తున్నారు. ఎరువుల దుకాణాలు, రేషన్ దుకాణాలు, మాంసాహార విక్రయశాలలపై దాడులు చేస్తున్నారు. అదేవిధంగా బంగారం దుఖాణాలు, పెట్రోల్ బంక్‌ల్లో తరచుగా తనిఖీలు చేస్తున్నారు. చేపట్టి మోసాలకు పాల్పడేవారిపై చర్యలు తీసుకుంటున్నారు. మోసాలపై ఫిర్యాదు చేయవచ్చు విస్తృతంగా అవగాహన సదస్సులు వినియోగదారుల హక్కులు, చట్టంపై విస్తృతంగా గ్రామస్థాయి నుంచి అవగాహన సదస్సులు నిర్వహించాలి. ప్రజలను చైతన్యం చేయాలి. ఇందుకు వినియోగదారుల మండళ్లు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యత తీసుకోవాలి. యువత ముందుకు రావాలి. చట్టం వినియోగదారులకు ఒక ఆయుధం. ఫిర్యాదు చేస్తే కేవలం మూడు నెలల వ్యవధిలోనే పరిష్కరిస్తాం. విచారణ జాప్యం జరుగుతుందనే అపోహ వద్దు. నేరుగా కానీ, న్యాయవాది ద్వారా కానీ బాధితులు వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించవచ్చు. ఆన్లైన్లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. – బంటుపల్లి శ్రీదేవి, జిల్లా వినియోగదారుల కమిషన్, సీనియర్ మెంబర్, విజయనగరం ప్రతి ఒక్కరూ ఉదయం లేచిన వెంటనే కొనుగోలుచేసే పాలు, పాల పదార్థాల వద్దే మోసం మొదలవుతోంది. కలెక్టరేట్ పరిసరాల్లోనే ఉన్న ఓ దుకాణంలో పాలు ప్యాకెట్ల విక్రయాన్ని పరిశీలిస్తే ఎమ్మార్పీ కన్నా రూ.2 ఎక్కువ వసూలు చేస్తున్నారు. గత ఏడాది కాలంలో తూనికలు కొలతలు శాఖ అధికారులు తనిఖీ చేస్తే ఇలాంటివి పలు చోట్ల బయటపడ్డాయి. అలాంటి వ్యాపారులపై 58 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలుచేసిన అపరాధ రుసుమే రూ.1.37 లక్షల వరకూ ఉంది. చికెన్, మటన్, చేపల దుకాణాల్లోనూ తూకంలో తేడా వస్తోంది. ఆర్అండ్బీ రైతుబజారు సమీపంలోని ఓ చేపల దుకాణంలో తూకం తేడా చేస్తున్నారు. ఇలాంటి మోసాలు జరగకుండా తూనికలు, కొలతల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలి. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాలకు పాల్పడిన వ్యాపారులపై 98 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలైన అపరాధ రుసుం రూ.1.38 లక్షల వరకూ ఉంది. కిరాణా, డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో జరుగుతున్న అవకతవకలపై గత ఏడాది కాలంలో 208 కేసులు నమోదయ్యాయి. ఆయా వ్యాపారుల నుంచి రూ.5.55 లక్షల వరకూ తూనికలు, కొలతల శాఖ అపరాధ రుసుం వసూలు చేసింది. పేదలకు ఇచ్చే సరుకుల్లోనూ తూకం తేడా చేస్తున్నారు. రేషన్ డిపోలు, ఎండీయూ వాహనాలను తనిఖీ చేస్తే గత ఏడాది కాలంలో 20 కేసులు నమోదయ్యాయి. వారికి తూనికలు, కొలతల శాఖ అధికారులు రూ.71 వేల వరకూ జరిమానా విధించారు. రైతులకు ప్రతి దశలోనూ మోసగాళ్లు ఎదురవుతూనే ఉన్నారు. విత్తనాలు, ఎరువులు ఎమ్మార్పీ కన్నా రూ.50 నుంచి రూ.200 వరకూ డిమాండును బట్టి వ్యాపారులు అధికంగా వసూలు చేస్తున్నారు. ఇలాంటి వ్యవహారాలు గత ఏడాది కాలంలో పలుచోట్ల వెలుగులోకి వచ్చాయి. తూనికలు, కొలతల శాఖ 44 వరకూ కేసులు నమోదుచేసింది. ఆయా వ్యాపారుల నుంచి రూ.5.45 లక్షల వరకూ జరిమానా వసూలు చేశారు. ఇక ధాన్యం విక్రయాల సమయంలోనూ రైతులు మోసపోతూనే ఉన్నారు. తూకంలో అవకతవకలకు పాల్పడుతున్న రైసు మిల్లులపై గత ఏడాది కాలంలో 33 కేసులు నమోదయ్యాయి. వారి నుంచి వసూలైన అపరాధ రుసుం మాత్రం రూ.1.55 లక్షలు మాత్రమే. గృహనిర్మాణ సామగ్రి కొనుగోలులోనూ ఆదమరిస్తే మోసపోవడం ఖాయం. ఇనుము తూకం తక్కువగా వేస్తున్నారు. గత ఏడాది కాలంలో ఇలాంటి మోసాలకుపాల్పడుతున్న ఐరన్, స్టీల్ దుకాణాలపై 22 కేసులు నమోదయ్యాయి. వారికి తూనికలు, కొలతల శాఖ విధించిన జరిమానాయే రూ.92 లక్షల వరకూ ఉంది. ఇసుక తూచే వే బ్రిడ్జిల వద్ద కూడా మోసం జరుగుతోంది. గత ఏడాదికాలంలో 50 కేసులు నమోదయ్యాయి. అందుకు బాధ్యుల నుంచి వసూలు చేసిన జరిమానా రూ.2.91 లక్షలు. పెట్రోల్ బంకుల్లోనూ మోసాలు జరుగుతున్నాయి. ప్రతి లీటరు వద్ద వంద పాయింట్ల వరకూ పెట్రోల్, డీజిల్ పంపుల్లో కొట్టేస్తున్నారు. ఇది పైకి కనిపించని మోసం. కేవలం తూనికలు, కొలతల శాఖ అధికారులు తనిఖీ చేస్తేనే బయటపడుతున్నాయి. గత ఏడాది కాలంలో బంకులపై 118 కేసులు నమోదయ్యాయి. ఆ కేసుల్లో అపరాధ రుసుం చాలా తక్కువగా ఉంది. కేవలం రూ. 2.23 లక్షలు మాత్రమే. గత ఏడాది కాలంలో బంగారం దుకాణాలపై 12 కేసులు, ఇతర ముఖ్య వ్యాపారసంస్థలపై 80 కేసులు నమోదయ్యాయి. -
పదోన్నతుల్లోని లోపాలను సవరించాలి
● విద్యాశాఖ ఆర్జేడీకి ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యుల వినతి విజయనగరం అర్బన్: విద్యారంగంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియలో చేపడుతున్న విధానాల్లో లోపాలను సరిచేయాలని ఎస్టీయూ జిల్లా కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. జిల్లాకు వచ్చిన ఆర్జేడీ కె.విజయభాస్కర్‌ను శుక్రవారం కలిసి ఈ మేరకు వినతిపత్రాన్ని అందజేశారు. పదోన్నతుల్లో ఎవ్వరికీ అన్యాయం జరగకూడదన్నారు. తరగతులు, మ్యాపింగ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్ఎంసీ కమిటీ అభిప్రాయాలను పరిగణనలోకి తీసికోవాలని కోరారు. బకాయిపడి ఉన్న 50 శాతం పాఠశాల నిర్వహణ నిధులు చెల్లించాలని, గిరిశిఖర ప్రాంతాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు స్పెషల్ పాయింట్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న సరెండర్ లీవ్, పీఎఫ్, ఏపీఎల్‌ఐ వంటి ఆర్థిక బకాయిలు చెల్లించాలని కోరారు. ఆర్జేసీని కలిసిన వారిలో సంఘ జిల్లా అధ్యక్షుడు కె.జోగారావు, జిల్లా ప్రధాన క్యాదర్శి చిప్పాడ సూరిబాబు, రాష్ట్ర కౌన్సిలర్ ఎం.మురళి, జిల్లా ఉపాధ్యాయులు టి.నాగేశ్వరరావు, ఎస్.బంగారయ్య, పి.రాంబాబు తదితరులు ఉన్నారు. ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు ● వన్‌స్టాప్ సెంటర్, చైల్డ్‌హెల్ప్‌లైన్ విభాగాల సిబ్బందికి అందని జీతాలు విజయనగరం ఫోర్ట్: ఐసీడీఎస్‌లో ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఐసీడీఎస్ పరిధిలోని వన్‌స్టాప్ సెంటర్, చైల్డ్ హెల్ప్‌లైన్ విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు అందకపోవడంతో పస్తులతో గడుపుతున్నారు. ఇంటి నుంచి కార్యాలయానికి రావడానికి రవాణా చార్జీలకు కూడా అప్పుచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వన్‌స్టాప్ సెంటర్లో అడ్మినిస్ట్రేటర్, కౌన్సిలర్, ఐటీ స్టాప్, పారా మెడికల్ వర్కర్ ఒక్కొక్కరు, కేస్ వర్కర్లు ఇద్దరు, హెల్పర్స్ ఇద్దరు, సెక్యూరిటీ గార్డులు ముగ్గురు కలిపి 11 మంది పనిచేస్తున్నారు. చైల్డ్ హెల్ప్ లైన్లో నలుగురు పనిచేస్తున్నారు. వీరిలో సూపర్ వైజర్లు ఇద్దరు, కేస్ వర్కర్లు ఇద్దరు పనిచేస్తున్నారు. వన్‌స్టాప్ సెంటర్ సిబ్బంది 11 మందికి గతేడాది ఆగస్టు నుంచి నెలకు రూ.2.50 లక్షల చొప్పున రూ.17.50 లక్షల బకాయిలు చెల్లించాల్సి ఉండగా, చైల్డ్‌హెల్ప్‌లైన్ సిబ్బంది నలుగురికి రూ.5.61 లక్షలు చెల్లించాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఐసీడీఎస్ ఇన్చార్జి డీపీ జి.ప్రసన్న వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా బడ్జెట్ రాలేదని, వచ్చిన వెంటనే జీతాలు చెల్లిస్తామని చెప్పారు. -
● ఎందుకంత చిన్నచూపు!
పశువైద్య విద్యార్థులపై కూటమి ప్రభుత్వానికి ఎందుకంత చిన్నచూపని గరివిడి వెటర్నరీ వర్సిటీ విద్యార్థులు ప్రశ్నించారు. కళాశాలకు వీసీఐ గుర్తింపును తీసుకురావాలని, స్టైఫండ్‌ను రూ.25వేలకు పెంచాలని కోరుతూ కళాశాల ఆవరణలో 40 రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్నా స్పందించకపోవడం విచారకరమన్నారు. హోలీ పండగ రోజు అందరి జీవితాలు రంగులమయంగా ఉంటే ఐదు బ్యాచ్‌లకు చెందిన 327 మంది పశువైద్య విద్యార్థుల జీవితాల్లో చీకటి అలముకుందంటూ ప్రధాన గేటు బయట నలుపు వస్త్రాలు ధరించి శుక్రవారం నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుంటే పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. – చీపురుపల్లిరూరల్ (గరివిడి) -
నేడు జిల్లా ప్రత్యేక అధికారి రాక
విజయనగరం అర్బన్: జిల్లాలో ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలుపై పర్యవేక్షణకు రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక అధికారి, సీనియర్ ఐఏఎస్, రాష్ట్ర సహకార శాఖ కమిషనర్ అహ్మద్‌బాబు జిల్లాలో శనివారం పర్యటించనున్నట్టు కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు జిల్లాకు చేరుకొని స్వచ్ఛాంద్ర కార్యక్రమాలను పరిశీలిస్తారు. 10.30 గంటలకు కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. జిల్లాలో ప్రభుత్వ పథకాల అమలు, ఆదాయార్జన శాఖల ద్వారా ప్రభుత్వ ఆదాయం పెంపుదలలో సాధించిన ప్రగతి, తదితర అంశాలపై సమీక్షిస్తారని పేర్కొన్నారు. నేటితో చెరకు క్రషింగ్ పూర్తి రేగిడి: మండలంలోని సంకిలి వద్ద ఉన్న ఈఐడీ ప్యారీ చక్కెర కర్మాగారంలో శనివారంతో చెరకు క్రషింగ్ పూర్తవుతుందని కర్మాగారం యాజమాన్య ప్రతినిధులు తెలిపారు. స్థానిక విలేకరులతో శుక్రవారం మాట్లాడుతూ ప్రతిరోజు 4వేల పైచిలుకు టన్నుల చెరకు క్రషింగ్ చేశామని, ఇప్పటివరకు 3.50 లక్షల టన్నుల చెరకు క్రషింగ్ పూర్తయిందన్నారు. రైతులు కర్మాగారానికి చెరకును తరలించిన వారం రోజులకే బిల్లులు వారి బ్యాంకు ఖాతాల్లో జమచేసినట్టు వెల్లడించారు. రికార్డు సృష్టికర్తకు సన్మానం బొబ్బిలి: పాత బొబ్బిలికి చెందిన ఎంటెక్ విద్యార్థి 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పఠించి ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించాడు. జిల్లా కేంద్రంలోని కార్పొరేషన్ బిల్ కలెక్టర్‌గా పనిచేస్తున్న వెలగాడ తాతబాబు కుమారుడు జయపవన్ కళ్యాణ్ హనుమాన్ చాలీసాను నిత్య పఠనంగా మార్చుకుని పట్టుసాధించాడు. ఆన్లైన్ పోటీలో ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధులు ఇతని ప్రతిభను గుర్తించి బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు కల్పించినట్టు తెలిపారు. విషయం తెలుసుకున్న పట్టణానికి చెందిన ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుడు పుల్లెల శ్రీనివాసరావు, తదితరులు జయపవన్ను దుశ్శాలువతో సత్కరించారు. రైతు బజార్లను పరిశుభ్రంగా ఉంచాలి ● వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఎం.వి.సునీత విజయనగరం ఫోర్ట్: రైతు బజార్లను పరిశుభ్రంగా ఉంచాలని వ్యవసాయ మార్కెటింగ్ కమిషనర్ ఎం.వి.సునీత అధికారులను ఆదేశించారు. పట్టణంలో ఉన్న ఆర్అండ్బీ, ఎం.ఆర్.హెచ్, దాసన్నపేట రైతు బజార్లను ఆమె శుక్రవారం ఆకస్మికంగా తనిఖీచేశారు. రైతుల గుర్తింపు కార్డులపై ఆరా తీశారు. రైతులు తీసుకొస్తున్న టమాటా, డ్వాక్రా దుకాణాల్లో విక్రయిస్తున్న ఉల్లిపాయలను పరిశీలించారు. రైతులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని మార్కెటింగ్‌శాఖ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ పి.సుధాకర్, డిప్యూటీ డైరెక్టర్ జి.శ్రీనివాస్ కిరణ్, అసిస్టెంట్ డైరెక్టర్ బి.రవికిరణ్, రైతు బజార్ల ఏఓలు చప్ప సతీష్‌కుమార్, ఉమామహేశ్వరరావు, అప్పలనాయుడు, తదితరులు పాల్గొన్నారు. -
ఏటీఎం మోసాల ముఠా అరెస్టు
పాలకొండ: ఏటీఎంల వద్ద మాటు వేసి డబ్బులు తీసేందుకు వెళ్లిన వారిని మాటల్లో పెట్టి వారి కార్డులు, డబ్బులు దొంగిలించే ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు డీఎస్పీ ఎం రాంబాబు ఇందుకు సంబందించిన వివరాలు శుక్రవారం వెల్ల డించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ముంబైకి చెందిన అయజ్ ద్వివేది, అప్పర్ఖాన్లు ఈ ఏడాది జనవరిలో పాలకొండలోని ఎస్బీఐ ఏటీఎం వద్ద థామస్ అనే వ్యక్తిని మోసగించి ఏటీఎం కాజేసి నగదు విత్ డ్రా చేసుకున్నారు. దీనిపై జనవరి 17న పాలకొండ పోలీస్‌స్టేషన్‌లో బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తులో పోలీసులకు విస్తుగొలిపే విషయాలు వెలుగులోనికి వచ్చాయి. నిందితులిద్దరూ దేశవ్యాప్తంగా ఏటీఎంల వద్ద అత్యంత తెలివిగా మోసగించి నగదు కాజేస్తున్న విషయాన్ని గుర్తించారు. టెక్నికల్ సమస్యలు ఉన్న ఏటీఎంల వద్ద మాటు వేసి ఒకరు బయట వేచి ఉంటారు, మరొకరు లైన్లో ఉండి డబ్బులు తీయడానికి వచ్చిన వారికి సహాయం చేస్తున్నట్లు నటిస్తాడు. ఆ సమయంలో వారి పిన్ నంబర్‌ను గుర్తిస్తారు. అనంతరం ఏటీఎం నుంచి కార్డు తీసిన సమయంలో వారి వద్ద ఉన్న కార్డుతో నగదు తీసే వారికి అందించి నిందితుల వద్ద ఉన్న అదే రకం కార్డును అందజేస్తారు. ఈ విధంగా కార్డు మార్చిన తరువాత ఆ కార్డులో ఉన్న నగదు మొత్తం డ్రా చేసుకుని ఆ కార్డును మరొకరిని మోసం చేయడానికి ఉపయోగిస్తుంటారు. ఇందుకోసం వీరు నిరక్షరాస్యులు, వృద్ధులను టార్గెట్ చేసి మోసాలు చేస్తున్నారు. ఇటీవల నిందితులు మరోమారు పాలకొండలో నేరాల కోసం రావడంతో వారి కదలికలపై నిఘాపెట్టి పోలీసలుఉ అరెస్టు చేశారు. అనంతరం వారి నుంచి రూ.4లక్షల పదివేలు నగదు, స్విఫ్ట్ కారు, రెండు ఫోన్లు, 78 ఏటీఎం కార్డులు స్వాధీనం చేసుకున్నామని డీఎస్పీ రాంబాబు వివరించారు. ఆయనతో పాటు సమావేశంలో సీఐ చంద్రమౌళి, ఎస్సై ప్రయోగ మూర్తి ఉన్నారు. రూ.4లక్షల నగదు, 78 ఏటీఎం కార్డులు స్వాధీనం వివరాలు వెల్లడించిన డీఎస్పీ రాంబాబు -
ఆపదలో ఆరోగ్యమిత్రలు..!
● ఆరోగ్య శ్రీస్థానంలో బీమా కంపెనీ తీసుకొస్తున్న సర్కారు ● ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయోనని ఆందోళన ●ఈనెల 17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్న ఆరోగ్యశ్రీ సిబ్బందివిజయనగరం ఫోర్ట్: డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్య సేవ) పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రల్లో ఆందోళన నెలకొంది. ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో తెలియక సతమతమవు తున్నారు. ఆరోగ్యశ్రీ స్థానంలో బీమా కంపెనీని కూటమి సర్కారు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి బీమా కంపెనీని తేవడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే బీమా కంపెనీ వస్తే ప్రస్తుతం ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేస్తున్న ఆరోగ్య మిత్రలు, టీమ్‌లీడర్లు, ఆఫీస్ సిబ్బందిని కొనసాగిస్తారా? లేదా? అనే ప్రశ్న సర్వత్రా వినిపిస్తోంది. ప్రస్తుత ప్రభుత్వం దీనిపై స్పష్టత ఇవ్వకపోవడంతో ఈనెల 10వతేదీ నుంచి ఆరోగ్యశ్రీ పథకంలో పనిచేసే ఆరోగ్య మిత్రలు, టీమ్‌లీడర్లు, ఆఫీస్ సిబ్బంది విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయాలని నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులు ఈనెల 12న వారిని చర్చలకు పిలిచారు. చర్చలు విఫలం కావడంతో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఈనెల17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నారు. గత ప్రభుత్వం హయాంలో సంతోషంగా విధులు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఆరోగ్య మిత్రలు ఎటువంటి ఆందోళన, ఒత్తిడి లేకుండా సంతోషంగా పనిచేశారు. ఉన్నతాధికారులు కానీ, జిల్లా అధికారులు కానీ మిత్రలపై ఎటువంటి ఒత్తిడి తెచ్చేవారు కాదు. దీంతో వారు కూడా తాము చేయాల్సిన విధులను చిత్తశుద్ధితో నిర్వర్తించేవారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు పనిచేస్తారు. ఆరోగ్యశ్రీ పరిధిలో ఉన్న వ్యాధులకు చికిత్స కోసం వచ్చే వారికి ముందుగా రిజిస్ట్రేషన్ చేసి సంబంధిత వైద్యుడి దగ్గరకు పంపిస్తారు. ఆస్పత్రిలో చికిత్సకోసం కానీ, శస్త్రచికిత్స కోసం చేరినట్లయితే వారికి సకాలంలో చికిత్స, శస్త్రచికిత్స జరిగేలా చూడడం ఆరోగ్య మిత్ర విధి. అదేవిధంగా ఆరోగ్యశ్రీ రోగులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా? అని పర్యవేక్షించడం, ఎవరైనా ఆస్పత్రి సిబ్బంది సేవలు అందించడం కోసం చేతివాటం ప్రదర్శించినట్లయితే వారి ఫిర్యాదును కో ఆర్డినేటర్ దృష్టికి తీసుకెళ్లడం వారి విధి. జిల్లాలో నెట్వర్క్ ఆస్పత్రులు 30 జిల్లాలో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆస్పత్రులు 30 ఉన్నాయి. గజపతినగరం, రాజాం, ఎస్.కోట ఏరియా ఆస్పత్రులు, బాడంగి, భోగాపురం, బొబ్బిలి, చీపురుపల్లి, నెల్లిమర్ల సీహెచ్‌సీలు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి విజయనగరం, విజయనగరం ఘోషాఆస్పత్రి, అభినవ ఆస్పత్రి ఎస్.కోట, ఎస్.కోట కొలపర్తి ఆస్పత్రి, విజయనగరం సాయి పీవీఆర్ ఆస్పత్రి, సాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, వెంకటరామా ఆస్పత్రి, ఆంధ్ర హాస్పిటల్, మారుతి ఆస్పత్రి, పీజీ స్టార్ ఆస్పత్రి, స్వామి కంటి ఆస్పత్రి, నెఫ్రాఫ్లస్ ఆస్పత్రి, నెల్లిమర్ల మిమ్స్ ఆస్పత్రి, మువ్వ గోపాల ఆస్పత్రి, గాయత్రి ఆస్పత్రి, పుష్పగిరి ఐ ఆస్పత్రి, తిరుమల నర్సింగ్ హోమ్, శ్రీనివాస్ నర్సింగ్ హోమ్, జీఎంఆర్ కేర్ ఆస్పత్రి, అమృత ఆస్పత్రి, ఎన్ఆర్ఐ ఆస్పత్రి, వెంకట పద్మ ఆస్పత్రులు నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి. ఈ నెట్వర్క్ ఆస్పత్రుల్లో ఆరోగ్య మిత్రలు షిఫ్టుల ప్రకారం పనిచేస్తున్నారు. చర్చలు విఫలం మా సమస్యలపై ఆరోగ్యశ్రీ ట్రస్టు అధికారులతో జరిగిన చర్చలు విపలమయ్యాయి. దీంతో ఈనెల 17, 24 తేదీల్లో విధులు బహిష్కరించనున్నాం. బీమా కంపెనీ పరిధిలోకి వెళ్తే మా ఉద్యోగాలు ఉంటాయో, ఊడతాయో అన్న స్పష్టత లేదు. దీంతో ఏం జరుగుతుందోననే ఆందోళన ఉద్యోగుల్లో నెలకొంది. జెర్రి పోతుల ప్రదీప్, ఆరోగ్య మిత్రల సంఘం జిల్లా అధ్యక్షుడు విధుల్లో 96 మంది మిత్రలు ఆరోగ్యశ్రీ పథకంలో జిల్లాలో 96 మంది ఆరోగ్య మిత్రలు పనిచేస్తున్నారు. అదేవిధంగా జిల్లా కో ఆర్డినేటర్ ఒకరు, జిల్లా మేనేజర్ ఒకరు, ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ఒక ఆఫీస్ అసోసియేట్ ,నలుగురు టీమ్ లీడర్లు పనిచేస్తున్నారు. -
‘దిశ’ నుంచి ‘శక్తి’
● ఆపదలో ఉన్న మహిళకు భరోసా ● రద్దీ ప్రాంతాల్లో మఫ్టీలో శక్తి టీమ్స్ పహారా విజయనగరం క్రైమ్: మహిళలకు భద్రత ఇచ్చేందుకు నాడు జగన్ ప్రభుత్వం హయాంలో వినూత్న పంథాలో ‘దిశ‘ యాప్‌ను ప్రవేశపెట్టారు. ఆపదలో ఉన్న అమ్మాయి, మహిళ, ఉద్యోగిని ఇలా ఏ రంగంలో ఉన్న ఆడవారికై నీ గత జగన్ ప్రభుత్వం ‘దిశ’ యాప్‌ను ప్రవేశపెట్టి భరోసా, భద్రత కల్పించింది. దాని స్థానంలో ఇటీవల అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున ‘శక్తి‘మొబైల్ యాప్‌ను విడుదల చేసిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో ‘శక్తి‘ యాప్‌ను ప్రతి ఒక్క అమ్మాయి, మహిళ, గృహిణి, ఉద్యోగిని వినియోగించుకోవాలని ఎస్పీ వకుల్ జిందల్ పిలుపునిచ్చారు. మహిళలకు రక్షణ కవచంగా నిలిచే ‘శక్తి‘ మొబైల్ యాప్‌ను స్వచ్ఛందంగా డౌన్లోడ్ చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. మహిళల భద్రతకు ప్రత్యేకంగా ‘శక్తి‘ మొబైల్ యాప్‌ను ప్రతి మహిళ, యువత తన మొబైల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకొని, తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ‘శక్తి’ యాప్ మొబైల్ ఫోన్లో నిక్షిప్తమై ఉంటే ఆపద సమయాల్లో పోలీసుల సహాయం సులువుగా పొందవచ్చని చెప్పారు. ముఖ్యంగా మహిళలు ఒంటరిగా ప్రయాణించే సమయాల్లో ‘శక్తి‘ యాప్ రక్షణ కవచంగా నిలుస్తుందన్నారు. ఆపద సమయాల్లో సదరు మహిళలు పోలీసులకు సమాచారం అందించలేని పరిస్థితుల్లో కూడా ఈ మొబైల్ యాప్ పని చేస్తుందని చెప్పారు. అటువంటి సమయాల్లో కేవలం మొబైల్ ఫోన్‌ను గాలిలో షేక్ చేసినా, వారున్న లొకేషను, ఆడియో, వీడియో వివరాలు దగ్గరలో ఉన్న పోలీస్‌స్టేషన్‌కు చేరుతాయని, తద్వారా తమ సిబ్బంది సకాలంలో స్పందించి, కారకులైన వ్యక్తులపై చర్యలు చేపట్టి, బాధితులకు రక్షణగా నిలిచే అవకాశం ఉంటుందన్నారు. మహిళలు, విద్యార్థినులు తాము ఆపదలో ఉన్నామని భావిస్తే యాప్‌లోని ఎస్ఓఎస్. బటన్ ప్రెస్ చేయాలని సూచించారు. రాత్రి సమయాల్లో మహిళలు నైట్ షెల్టర్లలో వేచి ఉండేందుకు దగ్గరలో ఉన్న నైట్ షెల్టర్ల వివరాలు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, హక్కులు, సమీపంలోని పోలీస్స్టేషన్ల ఫోన్ నంబర్లు, హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులో ఉంటాయని ఎస్పీ వకుల్ జిందల్ తెలిపారు. కొత్తగా రూపొందించిన శక్తి టీమ్స్ జిల్లాలోని ఆర్టీసీ కాంప్లెక్సులు, బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లు, ముఖ్య కూడళ్లు, కళాశాలలను సందర్శించి, మహిళలు, విద్యార్థినులకు శక్తి మొబైల్ యాప్ పట్ల విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించినట్లు చెప్పారు. -
చికెన్
బ్రాయిలర్ లైవ్ డ్రెస్డ్ స్కిన్లెస్ శ్రీ98 శ్రీ166 శ్రీ176సెలవు రోజూ సర్వే● ఉద్యోగులను వేధిస్తున్న కూటమి ప్రభుత్వం రామభద్రపురం: సచివాలయాల ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది.కూటమి ప్రభుత్వం రాకతో వారి మీద పని భారం వేసి గొడ్డు చాకిరీ చేయిస్తోంది. పనిదినాల్లోనే కాకుండా సెలవు రోజుల్లో కూడా కనీసం కుటుంబ సభ్యులతో గడపకుండా సర్వే పేరుతో వేధిస్తోంది. శుక్రవారం హోలీ సెలవు రోజున తప్పనిసరిగా పీ–4 సర్వే చేయాలని అధికారులు ఆదేశిచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సర్వే చేశారు. రామభద్రపురం మండలంలో ప్రస్తుతం సర్వే చేసుకో..జీతం పుచ్చుకో అన్న వ్యవహారం గ్రామ సచివాలయ ఉద్యోగుల్లో ట్రెండింగ్‌గా మారింది. ప్రభుత్వం గ్రామ సచివాలయ ఉద్యోగులపై మెడపై కత్తి పెట్టి మరీ సర్వే చేయిస్తోంది.దీంతో సచివాలయాల ఉద్యోగులు నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నామని పేరు బయటకు చెప్పుకోలేని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెల్లవారితే చాలు ఏ అధికారి నుంచి ఏ ఫోన్ వస్తుందోనని టెన్షన్ పడుతున్నామని, చివరికి బీపీలు, సుగర్లు కూడా వస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా సర్వేయర్ల సంఘం ఎన్నిక● అధ్యక్షుడిగా కాశినాయుడు విజయనగరం ఫోర్ట్: గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా కాశినాయుడు ఎన్నికయ్యారు. స్థానిక ఎన్జీఓ హోంలో గ్రామ సర్వేయర్ల సంఘం జిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా స్టేట్ కో ఆర్డినేటర్‌గా భరత్, జిల్లా కార్యదర్శిగా దుర్గా మదీనా, జిల్లాస్పోర్ట్స్ సెక్రటరీగా జగదీష్ , ఉపాధ్యక్షురాలిగా రమాదేవి, జాయింట్ సెక్రటరీగా లక్ష్మీప్రసాద్, జిల్లా ట్రెజరర్‌గా అజయ్‌కుమార్, జిల్లా ఉమెన్ వింగ్ కార్యదర్శిగా యోర్నా సాయి ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గ సభ్యులకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుబాబు అభినందనలు తెలియజేశారు. ఆకట్టుకున్న గుర్రాల పరుగు ప్రదర్శనవేపాడ: మండలంలోని సోంపురం గ్రామదేవత ముత్యాలమ్మ అమ్మవారి తీర్థమహోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గుర్రాల పరుగు ప్రదర్శన ఉత్సాహంగా ఉల్లాసంగా సాగింది. ఈ గుర్రాల పరుగు ప్రదర్శనలో విజయనగరం, అనకాపల్లి జిల్లాలకు చెందిన 10 గుర్రాలు పాల్గొన్నాయి. ఈ పరుగు ప్రదర్శనలో లక్కవరపుకోటకు చెందిన సింగపూర్ సత్యనారాయణ మురుగన్ గుర్రం ప్రథమ స్థానంలో నిలిచింది. రెండోస్థానంలో చేనుల అగ్రహారానికి చెందిన మణి జెస్సీ గుర్రం, మూడోస్థానంలో అంకుపాలానికి చెందిన విజయదుర్గా గుర్రం, నాల్గోస్థానంలో కోటనందూరుకు చెందిన శివరాజు బ్రదర్స్ గుర్రం నిలిచాయి. విజేతలకు నగదు బహుమతులను గ్రామపెద్దలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందజేశారు. గడ్డి కుప్పలు దగ్ధంపాలకొండ రూరల్: మండలంలోని పద్మాపురం గ్రామానికి చెందిన ఆలుబిల్లి చంద్రశేఖర్ గడ్డికుప్పలు శుక్రవారం దగ్ధమయ్యాయి. పశువుల దాణా నిమిత్తం పొలంలో కుప్పలు వేసిన గడ్డికుప్పల నుంచి ఒక్కసారిగా మంటలు, దట్టమైన పొగ ఆక్కడి పరిసరాలను చుట్టముట్టడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. తక్షణమే ఫైర్ అధికారులకు సమాచారం అందించగా ఎస్సై జామి సర్వేశ్వరరావు, సిబ్బంది, శకటంతో సహా ఘటనా స్థలానికి చేరుకుని మంటలు అదుపు చేశారు. వేసవి నేపథ్యంలో ఈ తరహా ప్రమదాలను దృష్టిలో పెట్టుకుని గ్రామీణులు ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఫైర్ ఎస్సై ప్రజలకు అవగాహన కల్పించారు. -
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలి
విజయనగరం గంటస్తంభం: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్యాకేజీ నిధులు, కార్మికుల జీతాలకు నిధులు కేటాయించాలని, సొంత గనులు ఇచ్చి, ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేస్తూ, శుక్రవారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేఽశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం 4 సంవత్సరాలుగా కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తుంటే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా మోసపూరిత ప్రకటనలు చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత గనులు లేక స్లీల్ ప్లాంట్ ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటే నష్టాలకు కార్మికుల్ని బాధ్యులను చేస్తూ ప్లాంట్ నిర్వీర్వానికి కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. 4 వేల మంది కాంట్రాక్ట్ కార్మికుల జీతాలు నిలుపుదల చేశారని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ నిధులతో తక్షణమే జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల మోసపూరిత ప్రకటనలు ప్రజలు అర్థం చేసుకుంటారని, అప్పుడు ఈ ప్రభుత్వాలకు ఋద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఎం.శ్రీనివాస, జిల్లా కార్యదర్మి జగన్మోహన్రావు, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శి రాము, వెంకటేష్ తదితరలు పాల్గొన్నారు. కార్మికులకు జీతాలు విడుదల చేయాలి సీపీఎం జిల్లా కార్యదర్మి తమ్మినేని సూర్యనారాయణ -
హెల్త్‌వలంటీర్ల నియామకం.. ప్రకటనలకే పరిమితం
గ్రామ సచివాలయ ఏఎన్ఎంలు పర్యవేక్షిస్తున్నారుగ్రామ సచివాలయాల పరిధిలో ఉన్న ఏఎన్ఎంలు ఆశ్రమపాఠశాలల విద్యార్థులకు ఆరోగ్య తనిఖీలు చేపడుతున్నారు. అత్యవసర సమయంలో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు. కొత్త ఏఎన్ఎంలను నియమించాల్సి ఉంది. అన్నదొర, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ, సీతంపేట ఐటీడీఏసీతంపేట: గిరిజన విద్యాసంస్థల్లో హెల్త్ వలంటీర్ల నియామక ప్రక్రియ ప్రకటనలకే పరిమితమైంది. ఈ విద్యాసంవత్సరం మరో నెలరోజుల్లో ముగియనుంది. ఇంకా ఎప్పుడు హెల్త్ వలంటీర్లను ప్రభుత్వం నియమిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఇటు విద్యార్థుల తల్లిదండ్రులు, అటు విద్యాసంస్థల యాజమాన్యాలు తలపట్టుకునే పరిస్థితి నెలకొంది. పార్వతీపురం మన్యం జిల్లాలో 47 గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలు, 18 పోస్టు మెట్రిక్ వసతి గృహాలు ఉన్నాయి. వాటిలో దాదాపు 15 వేల మంది గిరిజన విద్యార్థులు చదువుతున్నారు. ఆయా విద్యాసంస్థల్లో ఉచిత, భోజన వసతి కల్పిస్తూ విద్యాబోధన అందిస్తున్నారు. విద్యార్థులకు ఆరోగ్యపరమైన సమస్యలు తలెత్తినప్పుడు ప్రాథమిక వైద్యసేవలు అందించడానికి వీలుగా హెల్త్ వలంటీర్లను నియమించాల్సి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గిరిజన సంక్షేమ విద్యాసంస్థల్లో ఏఎన్ఎంలను నియమిస్తామని హామీ ఇచ్చినప్పటికీ ఇంతవరకు అది ప్రకటనలకే పరిమితమైంది. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి బాధ్యతలు చేపట్టిన తర్వాత వెంటనే హెల్త్ వలంటీర్లను నియమిస్తామని గిరిజన సంఘాలకు హామీ ఇచ్చినా ఇంతవరకు పట్టించుకోలేదు. ఒక్కో పాఠశాలలో 250 నుంచి 640 మంది విద్యార్థులు గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలల్లో ఒక్కో పాఠశాలలో కనీసం 250 నుంచి 640 వరకు సరాసరి విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులకు జ్వరం, ఇతర వ్యాధులు వచ్చినప్పుడు వెంటనే ప్రథమ చికిత్స చేయడం, బాలికా విద్యాసంస్థల్లో విద్యార్థినులకు నెలసరి సమయంలో కడుపులో నొప్పి ఇతర సమస్యలకు సరైన ట్రీట్మెంట్ ఇవ్వాల్సి ఉంది. అవసరమైతే దగ్గర్లో ఉన్న పీహెచ్‌సీకి తరలించాలి. హెల్త్ వలంటీర్లు లేకపోవడంతో అత్యవసర సమయాల్లో పాఠశాల సిబ్బందే ఆస్పత్రికి తరలిస్తున్నారు. వారి పని ఒత్తిడి వల్ల ఆస్పత్రులకు తీసుకువెళ్లడం ఒకటి రెండు రోజులు జాప్యం జరిగితే విద్యార్థుల ఆరోగ్యం విషమించే పరిస్థితి ఉంది. హెల్త్ వలంటీర్లను నియమిస్తే ఈ సమస్య ఉండదు. వారే ఆస్పత్రికి తీసుకువెళ్తారు. నెలలో సంబంధిత పీహెచ్సీ డాక్టర్లు ఒకసారి ఆయా పాఠశాలలను విజిట్ చేసి విద్యార్థులకు అనారోగ్య పరిస్థితులు ఉంటే చెక్ చేసి మందులు పంపిణీ చేస్తున్నారు. గతంలో విద్యార్థుల మృతి ఇలా.. సీతంపేట ఐటీడీఏ పరిధి సరుబుజ్జిలి ఆశ్రమపాఠశాలలో చదువుతున్న సామరెల్లి గ్రామానికి చెందిన సవర రష్మిత గతేడాది జూలైనెలలో జ్వరంతో మృతి చెందింది. అదేనెలలో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని రావికోన గిరిజన సంక్షేమ ఆశ్రమపాఠశాలలో ఆరోతరగతి విద్యార్థి పి.రాఘవ అనారోగ్యంతో మృతిచెందాడు. అలాగే ఇదే నెలలో జియ్యమ్మవలస మండలం రావాడ రామభద్రపురం గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి బి.ఈశ్వరరావు మృతి చెందాడు. గుమ్మలక్ష్మీపురం మండలం పి.ఆమిటి గిరిజన సంక్షేమ పాఠశాలకు చెందిన ఎనిమిదోతరగతి విద్యార్థిని అవంతిక డెంగీతో మృతి చెందింది. ఇలా ఆశ్రమపాఠశాలల్లో మరణ మృదంగం వినిపిస్తున్నా ప్రభుత్వం కిమ్మనకపోవడం గమనార్హం. రోగమొస్తే విద్యార్థులకు అవస్థలే -
మహిళా ఎస్ఐ జుట్టు పట్టుకుని జులుం..
తప్పతాగండి.. ఇష్టానుసారం వ్యవహరించండంటూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఊరూరా, వీధి వీధిన మద్యం వరద పారిస్తోంది. 24/7 మద్యం లభిస్తుండటంతో అరాచక శక్తులు పేట్రేగిపోతున్నాయి. ఎదుట ఉన్న వారు ఎవరన్న కనీస విచక్షణ లేకుండా దాడులకు తెగబడుతుండటం పరిపాటిగా మారింది. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడలో మంగళవారం రాత్రి వేణుగోపాలస్వామి తీర్థం సందర్భంగా ఏర్పాటు చేసిన రికార్డింగ్ డ్యాన్స్‌లో తప్పతాగిన యువకులు కొందరు డ్యాన్సర్లతో అసభ్యంగా ప్రవర్తించారు. బందోబస్తు విధుల్లో ఉన్న ఎస్ఐ దేవి ఇలా చేయడం తగదంటూ వారిని వారించారు.దీంతో మాకే అడ్డుచెబుతావా.. అంటూ ఆ యువకులు ఆమె జుట్టు పట్టుకుని పక్కకు ఈడ్చేశారు. ఫోన్ లాక్కుని.. ఆమె చేతులు లాగుతూ, దుర్భాషలాడుతూ దాడి చేశారు. ఆమె భయంతో పక్కనే ఉన్న ఓ ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు. అప్పటికీ శాంతించని ఆ యువకులు గేట్లు లాగుతూ, పూల కుండీలు విసిరేసి బీభత్సం సృష్టించారు. ఆమె ఫోన్ చేసి పరిస్థితి చెప్పడంతో అదనంగా పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ మాయదారి మద్యం వల్లే ఇలా జరిగిందంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. – సాక్షి నెట్వర్క్ -
రూ. 26.60లక్షలు
పోలిపల్లి పైడితల్లి జాతర ఆదాయంరాజాం సిటీ: స్థానిక పోలిపల్లి పైడితల్లి అమ్మవారి జాతర ఆదాయం రూ.26,60,714లు వచ్చినట్టు ఈఓ బీవీ మాధవరావు తెలిపారు. ఈ నెల 9 నుంచి 12వ తేదీ వరకు జరిగిన జాతరలో వచ్చిన ఆదాయాన్ని ఆలయంలో గురువారం లెక్కించారు. ప్రత్యే క దర్శనం టిక్కెట్ల అమ్మకంతో రూ.3,88,850లు, మొక్కుబడుల రూపంలో రూ.2,66,700లు, శీఘ్రదర్శనం టికెట్ల నుంచి రూ.3,05,000లు, లడ్డూ ప్రసా దం విక్రయంతో రూ. 2,21,760లు, పులిహోర ప్రసాదం నుంచి రూ.1,31,900లు, హుండీల నుంచి రూ.12,85,646లు, విరాళాల రూపంలో రూ.60,858లు సమకూరిందని ఈఓ తెలిపారు. గతేడాది 22,63,571లు రాగా ఈ ఏడాది అదనంగా 3,97,143లు వచ్చినట్టు వెల్లడించారు. లెక్కింపు కార్యక్రమంలో దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శ్యామ్‌ప్రసాద్, నవదుర్గ ఆలయ ఈఓ పి.శ్యామలరావు, ఆలయ ట్రస్టీ వాకచర్ల దుర్గాప్రసాద్, అర్చకులు వేమకోటి సూర్యనారాయణశర్మ, సలాది తులసీదాస్, వెంపల లక్ష్మణరావు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్
విజయనగరం టౌన్: డీఎస్సీ ఉచిత శిక్షణకు ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు వెబ్ ఆప్షన్ సర్వీస్‌ను జ్ఞానభూమి, ఎమ్డీఎఫ్సీ డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్. డాట్ ఇన్ వెబ్సైట్లో పొందుపర్చినట్టు జిల్లా షెడ్యూల్ కులముల సంక్షేమం, సాధికారత అధికారి బి.రామానందం గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 15వ తేదీలోపు వారి లాగిన్‌లో కోచింగ్ సెంటర్ పేరు, ప్రాధాన్యత వారీగా వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలన్నారు. బదిలీ కౌన్సెలింగ్‌ను మాన్యువల్‌గా నిర్వహించాలి ● పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ విజయనగరం అర్బన్: వేసవి సెలవుల్లో చేపట్టబోయే ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియను ఆన్లైన్లో కాకుండా మాన్యువల్‌గా నిర్వహించాలని పీఆర్టీయూ జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. సంఘ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షుడు వలిరెడ్డి రవీంద్రనాయుడు మాట్లాడారు. 8 ఏళ్లు సర్వీసు నిండిన వారు బదిలీలు తప్పనిసరి చేసుకోవాల్సి ఉంటుందని, ఆన్లైన్ విధానం వల్ల వారికి ఇబ్బందని తెలిపారు. తప్పనిసరి బదిలీ ఉపాధ్యాయులు దాదాపు 1,500 మంది వరకు ఉన్నారని, ఆన్లైన్ విధానంలో ఆప్షన్స్ పెట్టుకోవడం కష్టతరమని, అన్యాయం జరిగే అవకాశాలే ఎక్కువన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ రావాడ రాంబాబు, ఉత్తరాంధ్ర మీడియా ఇన్చార్జి బంకపల్లి శివప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. తెలుగులో తొలి రచయిత్రి మొల్లమాంబ విజయనగరం అర్బన్: తెలుగులో తొలి కావ్యం రచించిన రచయిత్రి మొల్లమాంబని, ఆమె చరిత్ర భావితరాలకు స్ఫూర్తిదాయకమని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ అన్నారు. మొల్లమాంబ జయంతిని బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. తొలుత జ్యోతిని వెలిగించి మొల్లమాంబ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ వాల్మీకి రామాయణాన్ని సరళమైన తెలుగు భాషలో రచించిన ఘనత మొల్లమాంబదేనన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి జేసీ శ్రీనివాసమూర్తి, మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి పెంటోజీరావు, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, కొప్పల వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లి అప్పలనాయుడు, బీసీ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
77 జీఓ రద్దుకు డిమాండ్
విజయనగరం గంటస్తంభం: జీవో నంబర్ 77 రద్దుచేసి పీజీ విద్యార్థులకు న్యాయం చేయాలని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పూడి రామ్మోహన్ డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ విజయనగరం డిగ్రీ కళాశాల విద్యార్థులు మయూరి కూడలి నుంచి కాంప్లెక్స్ వరకు గురువారం భారీ ర్యాలీ నిర్వహించారు. కాంప్లెక్స్ వద్ద రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా రామ్మోహన్ మాట్లాడుతూ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ రద్దుచేసి యూనివర్సిటీలకు స్వయం ప్రతిపత్తి హోదా కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రతి పక్షంలో ఉన్నప్పుడు ఈ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విస్మరిస్తోందన్నారు. తక్షణమే రూ.3,680 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్మి డి.రాము, సీహెచ్. వెంకటేష్‌లు మాట్లాడుతూ ఉపకార వేతనాలు విడుదల కాక జిల్లాలో డిగ్రీ కళాశాల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో కళాశాలల్లో హాల్‌టికెట్స్ ఇచ్చే పరిస్థితి లేదని, దీనికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని విమర్మించారు. గతంలో డిగ్రీ రిలీవ్ అయిన విద్యార్థులు వేల సంఖ్యలో పీజీ జాయిన్ అయ్యేవారని, జీవో నంబర్ 77 మూలంగా ఉపకార వేతనాలు రాక డిగ్రీ తర్వాత చదువు ఆపేస్తున్నారన్నారు. వెటర్నరీ విద్యార్థులకు స్టైఫండ్‌ను రూ.25 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. డిమాండ్ల సాధనకు ఈనెల 15న విజయవాడలో తలపెట్టిన నిరసన దీక్షను జయపద్రం చేయాలని విద్యార్థులను కోరారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు జె.రవికుమార్, జగదీష్, రమేష్, జిల్లా సహాయ కార్యదర్మి శిరీషా, రాజు, తదితరులు పాల్గొన్నారు. -
● రోడ్డెక్కిన పోలీస్ అభ్యర్థులు
కోర్టులో ఉన్న హోంగార్డుల రిజర్వేషన్ కేసును వేగంగా పరిష్కరించి కానిస్టేబుల్ మెయిన్ ఎగ్జామ్ నిర్వహించాలని కోరుతూ పోలీస్ అభ్యర్థులు గురువారం ఆందోళన చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డీవైఎఫ్ఐ) ఆధ్వర్యంలో ప్రభుత్వ తీరుపై నిరసన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మెయిన్ పరీక్ష కోసం 95,208 మంది అభ్యర్థులు ఎదురు చూస్తున్నా ప్రభుత్వంలో చలనం లేదంటూ మండిపడ్డారు. పరీక్ష నిర్వహణలో జాప్యంతో రైతు కుటుంబాల నుంచి చదువుకోసం పట్టణానికి వచ్చిన అభ్యర్థులమంతా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ సీహెచ్ హరీష్, ప్రతినిధులు నాగరాజు, వినోద్, శంకర్, రాము, భానుప్రసాద్, 50 మంది కానిస్టేబుల్ అభ్యర్థులు పాల్గొన్నారు. – విజయనగరం గంటస్తంభం -
● ‘ఉపాధి’ తీసేయొద్దు బాబూ..
ఉపాధిహామీ పనుల్లో టీడీపీ నేతలు రాజకీయం చేస్తున్నారు.. ఎలాంటి సమాచారం లేకుండా ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన మేట్‌ను తొలగించారు.. 49 మంది వేతనదారులకు పని కల్పించడం లేదు.. ఇదెక్కడి అన్యాయమంటూ విజయనగరం మండలం కొండకరకాం గ్రామంలోని ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన వేతనదారులు గురువారం విజయనగరం ఎంపీడీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. మేట్‌గా నరవ సత్యవతిని కొనసాగించాలని డిమాండ్ చేశారు. తమకు జరిగిన అన్యాయాన్ని ఎంపీడీఓకు వివరించి వినతిపత్రం అందజేశారు. పని కల్పించకుండా ఇబ్బంది పెడుతున్న ఫీల్డు అసిస్టెంట్ చింతపల్లి అప్పలస్వామిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సందర్భంగా ఎంపీపీ మామిడి అప్పలనాయుడు వేతనదారులతో మాట్లాడారు. న్యాయం చేస్తానని చెప్పారు. – విజయనగరం -
తమ్ముళ్ల చేతిలో.. చంపావతి చెర
–8లోనిద్ర కరువైతే అనారోగ్యం..! అధికంగా మొబైల్ వాడడం, టీవీ ఎక్కువగా చూడడం వల్ల అధికశాతం మంది నిద్రలేమి బారిన పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం/గజపతినగరం రూరల్: సాక్షాత్తూ మంత్రి కొండపల్లి శ్రీనువాస్ ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గం.. ఆయన తండ్రి కొండబాబు కనుసన్నల్లో నడుస్తున్న యంత్రాగం.. వారు కోరితెచ్చుకున్న అధికారులు.. ఇదే అదనుగా టీడీపీ నాయకులు కొందరు చంపావతి నదిని చెరబట్టారు. ఇసుకాసురులతో చేతులు కలిపి ఇసుక మేటలను కొల్లగొడుతున్నారు. రాత్రీ పగలు తేడాలేకుండా ట్రాక్టర్లతో ఇసుక తరలిస్తున్నారు. తవ్వినంత ఎత్తిపోసుకోవడానికి వీలుగా ఉన్న కూటమి ప్రభుత్వ నూతన ఇసుక విధానం వారికి అన్నివిధాలా కలిసి వస్తోంది. అదే సాకుతో అధికారులెవ్వరూ అటువైపు కన్నెత్తి చూడట్లేదు. ఫలితం ఇసుకను దోచుకుంటున్నవారు కొద్ది రోజుల్లోనే కోట్ల రూపాయలకు పడగలెత్తారు. వారికి అనుకూలమైన అధికారులకు ఆమ్యామ్యాలు ముడుతున్నాయనే ఆరోపణలు ఎలాగూ ఉన్నాయి. చంపావతి నది మాత్రం ఇసుకాసురుల కబంధహస్తాల్లో చిక్కి రూపురేఖలే కోల్పోతోంది. వరద సమయంలో రక్షణగా ఉండే కట్టలు కరిగిపోతుండడం తీర ప్రాంత ప్రజల్లో వణుకుపుట్టిస్తోంది. దాహం తీరుస్తున్న రక్షిత మంచినీటి పథకాలకు పెను ప్రమాదం పొంచి ఉంది. ● అనుమతి లేకుండానే తవ్వకాలు గజపతినగరం మండలంలో వాస్తవానికి ఎక్కడా అధికారికంగా ఇసుక ర్యాంపులకు అనుమతి లేదు. కానీ చంపావతికి ఉపనది ఏడొంపుల గెడ్డలో తొలుత ఇసుక తవ్వకాలు మొదలెట్టారు. ఎం.గుమడాం, లింగాలవలస గ్రామాల వద్ద ఇష్టారీతిలో తవ్వేస్తున్నారు. రోజుకు కనీసం 150 ట్రాక్టర్ల ఇసుకను తరలించేస్తున్నారంటే పరిస్థితి ఊహించవచ్చు. తర్వాత ఇదే మండలం పరిధిలోనున్న చంపావతి నదీ పరివాహక ప్రాంతాలైన మర్రివలస, చిట్టేయవలస, కొణిశ, గంగచోళ్లపెంట, పట్రువాడ, దావాలపేట, పురిటిపెంట, లోగిశ, సీతారామపురం తదితర గ్రామాల్లో పెద్ద ఎత్తున ఇసుకను తవ్వేస్తున్నారు. లారీలకు లోడులెత్తి... ట్రాక్టర్లతో తెస్తున్న ఇసుకను గజపతినగరం పరిసర ప్రాంతాల్లో కుప్పలేస్తున్నారు. రాత్రిపూట ఆ ఇసుకను లారీలకు ఎత్తి విశాఖపట్నం, ఒడిశా ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఒక్కో లారీ ఇసుకకు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఇది లాభసాటిగా ఉండడంతో టీడీపీ నాయకులు ఇసుకాసురులతో చేతులు కలిపి ప్రకృతిని, ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. గజపతినగరం నియోజకవర్గంలో భారీఎత్తున ఇసుక అక్రమ తవ్వకాలు టీడీపీ నాయకుల అండదండలతో చెలరేగుతున్న అక్రమార్కులు నిలువెత్తు గోతులతో చిధ్రమవుతున్న నదీ తీరం కరిగిపోతున్న ఇరువైపులా కట్టలు కొద్ది రోజుల్లోనే రూ.కోట్లకు పడగలెత్తిన ఇసుకాసురులు కన్నెత్తి చూడని ప్రభుత్వాధికారులు అధికారుల ఉదాసీనత... కళ్ల ముందే ఇసుక ట్రాక్టర్లతో ఇష్టానుసారం తరలిపోతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడట్లేదు. రెవెన్యూ, పోలీస్ శాఖల్లోనూ ఎక్కువ మంది టీడీపీ నేతలు కోరితెచ్చుకున్నవారే కావడంతో వారికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఇదే ఇప్పుడు ఇసుక దోపిడీదారులకు కలిసివస్తోంది. కొంతమంది అధికారులకూ దండిగా మామ్మూళ్లు అందుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవేళ ఎవరైనా అధికారి అడ్డగించినా వారిపై స్థానిక ప్రజాప్రతినిధి తండ్రికి ఫిర్యాదులు వెళ్లిపోతున్నాయట. ఇప్పటికై నా ఇసుక దోపిడీని నియంత్రించకపోతే చంపావతి భవిష్యత్తులో చంపేనది అవుతుందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. -
రంగుల వేడుక... కారాదు విషాద గీతిక
చిన్నపిల్లలను రంగులకు దూరంగా ఉంచాలి చాలా మంది సరదాకోసం హోలీ పండగ సందర్భంగా చిన్నపిల్లలకు కూడా రంగులు రాస్తారు. అయితే, చిన్నపిల్లల శరీరం లేతగా ఉండడం వల్ల రసాయనాలతో తయారు చేసిన రంగులు పిల్లల చర్మంపై వెంటనే ప్రభావం చూపుతాయి. ఇక కళ్లల్లో రంగులు పడితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. అందువల్ల పిల్లలను హోలీ సందర్భంగా రంగులకు దూరంగా ఉంచితే చాలా మంచిది. – శ్రీనివాసరావు, చిన్న పిల్లల వైద్య నిపుణుడు విజయనగరం: హోలీ పండగ అంటేనే రంగులలో మునిగి తేలడం. పిల్లలు, యువత, మహిళలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ రంగులు చల్లుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఒక్క రంగు చల్లడంతో మొదలయ్యే హంగామా.. వింత వింత రంగులు పులుముకునే వరకు వెళ్తుంది. ఆనందం హద్దులు దాటుతున్న కొద్దీ.. హోలీ తీరు కూడా మారిపోతుంటుంది. సరిగ్గా ఇలాంటి సమయంలోనే ముందస్తుగా తగిన జాగ్రతలు తీసుకోకపోతే ‘రంగుపడుద్ది’ అని హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. ● హోలీ సందర్భంగా వినియోగించే కృత్రిమ సింథటిక్ రంగులు మనిషి శరీరంపై ప్రభావం చూపుతాయి. అంతేకాక ఈ రంగులు కళ్లల్లో పడితే కంటిచూపును కోల్పోయే ప్రమాదం ఉంటుందన్నది నేత్ర వైద్యుల మాట. రంగులు చల్లుకునే సమయంలో అత్యుత్సాహం ప్రదర్శించకుంటే హోలీ ఆనందహేళి అవుతుంది. రసాయన రంగులతో కాకుండా సహజ సిద్ధమైన రంగులతో హోలీ ఆడితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ● రసాయనాలతో తయారు చేసిన రంగులు మనిషిపై పడితే చర్మ సంబంధిత వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ప్రధానంగా లెడ్ ఆకై ్సడ్, అల్యూమినియం, ట్రొమైడ్, మెర్క్యూరీ సల్ఫేట్ వంటి వాటిని కలిపి తయారు చేసే రంగులు చాలా ప్రమాదాన్ని కలిగిస్తాయి. ● రసాయనాలతో కలిపిన రంగులతో హోలీ ఆడితే శరీరంపై రంగులు ఎక్కువ సమయం ఉంచకుండా చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ● హోలీ సందర్భంగా ఎరుపు, పింక్ రంగులను వాడితే మంచిది. ఎందుకంటే ఈ రంగులు శరీరం నుంచి సులభంగా తొలగిపోతాయి. ● గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ రంగులు ఎక్కువ రసాయనాలను కలిగి ఉంటాయి. అందువల్ల ఆ రంగులు శరీరం నుంచి సులభంగా తొలగిపోవు. ● హోలీ ఆడటానికి ముందు శరీరానికి మాయిశ్చ రైజర్ని, తలకు నూనె రాసుకోవాలి. దీనివల్ల రంగులు శరీరంలోకి త్వరగా ఇంకవు. శుభ్రం చేసుకోవడం సులభం. నేడు హోలీ రంగులతో జరభద్రం -
యువకుడిని కాపాడిన పోలీసులు
విజయనగరం క్రైమ్: ఆత్మహత్యకు పాల్పడతానని సూసైడ్ నోట్ రాసిన కేరళ యువకుడు విష్ణు కొయిత్తా పత్తాయా వెస్లీ (21) ఆచూకీని విజయనగరం టౌన్ పోలీసులు కనిపెట్టి డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు సమక్షంలో యువకుడిని బంధువులకు అప్పగించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. కేరళ రాష్ట్రంలోని కన్నూరు జిల్లాకు చెందిన విష్ణు కొయిత్తా పత్తాయా వెట్లీ బీఎస్సీ నర్సింగ్ చదివి బెంగళూరులోని ఒక కార్పొరేట్ ఆసుపత్రిలో వర్క్ చేస్తున్నాడు. ఒక యువతితో పరిచయం ఏర్పడి, ప్రేమకు దారితీసింది. ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో, యువకుడి ఫోన్ నంబర్‌ను సదరు యువతి బ్లాక్ చేసింది. దీంతో మనస్తాపం చెందిన యువకుడు విష్ణు అమ్మాయి ప్రేమను వదులుకోలేక తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నానని, తన మృతదేహాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ట్రేస్ చేసుకోవాలని సూసైడ్ లెటర్ రాసి, సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ పోస్టుతో అప్రమత్తమైన విష్ణు బంధువులు, స్నేహితులు సదరు విషయాన్ని నేరుగా విజయనగరం ఎస్పీకి ఫోన్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో ఆ యువకుడి ఆచూకీ కనిపెట్టి, రక్షించే చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ ఆదేశించిన మేరకు రంగంలోకి దిగిన వన్ టౌన్ సీఐ శ్రీనివాస్ తన బృందంతో టెక్నాలజీని వినియోగించి విశాఖపట్నం, చీపురుపల్లి, విజయనగరంలలో పలు ప్రాంతాల్లో గాలించి, చివరికి యువకుడి ఆచూకీని విజయనగరం రైల్వేస్టేషన్లో మార్చి 11న రాత్రి కనుగొన్నారు. వెంటనే ఆ యువకుడిని విజయనగరం వన్‌టౌన్‌కు తీసుకువచ్చి కౌన్సెలింగ్ నిర్వహించి బంధువులకు సమాచారం ఇచ్చారు. విష్టు బంధువులు గురువారం రాగానే విజయనగరం డీఎస్పీ ఆఫీస్ లో డీఎస్పీ శ్రీనివాస్ సమక్షంలో అప్పగించారు. సకాలంలో స్పందించి, యువకుడి ఆచూకీ కనిపెట్టి, ఆత్మహత్య ఆలోచనల నుంచి కాపాడిన వన్‌టౌన్ సీఐ ఎస్.శ్రీనివాస్, సిబ్బందిని డీఎస్పీ ఎం.శ్రీనివాసరావు, వన్‌టౌన్ సీఐ శ్రీనివాస్‌ను ఎస్పీ వకుల్ అభినందించారు. యువకుడ్ని కాపాడడంలో చొరవ చూపి, సమయానుకూలంగా అధికారులు, సిబ్బందికి ఆదేశాలు జారీ చేసిన ఎస్పీ వకుల్ జిందల్కు యువకుడి కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఆత్మహత్యకు పాల్పడతానని సూసైడ్ లెటర్ రాసిన యువకుడు -
రాయితీపై వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు
తెర్లాం: వ్యవసాయ యాంత్రీకరణ ఉపకరణాలు అందించేందుకు జిల్లాకు రూ.2.5కోట్ల రాయితీని ప్రభుత్వం ప్రకటించిందని జిల్లా వ్యవసాయ అధికారి వి.తారక రామారావు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన తెర్లాం వచ్చిన సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం 50శాతం రాయితీపై పవర్‌స్ప్రేయర్లు, పవర్ టిల్లర్లు, రోటోవేటర్లు, ట్రాక్టరు పరికరాలు రైతులకు అందించనుందని చెప్పారు. రస్రేయర్లకు మాత్రం కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే రాయితీ ఇవ్వనున్నట్లు చెప్పారు. వీటన్నింటికి కలిపి జిల్లాకు రూ.2.5కోట్లు ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని తెలిపారు. జిల్లాలోని రైతులు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు పొందేందుకు ఆయా మండలాల వ్యవసాయ అధికారుల ద్వారా దరఖాస్తులు పంపించాలన్నారు. అర్హులైన రైతులకు వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటా మన్నారు. జిల్లాకు మంజూరైన వ్యవసాయ పరికరాలను మండలాల వారీగా కేటాయింపులు చేశామని తెలిపారు. జిల్లాలోని రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గంగన్నపాడు రైతు సేవా కేంద్రం తనిఖీ మండలంలోని గంగన్నపాడు గ్రామంలో గల రైతు సేవా కేంద్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వీటీ రామారావు గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రం ద్వారా జరుగుతున్న రైతు విశిష్ట సేవా సంఖ్య నమోదును పరిశీలించారు. అనంతరం అక్కడ ఉన్న రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. జిరాయితీ భూములు ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా రైతు విశిష్ట సేవా సంఖ్యను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఆయనతో పాటు మండల వ్యవసాయ అధికారి జి.సునీల్‌కుమార్ ఉన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి వి.తారక రామారావు -
సంకల్పానికి సలామ్!
కేసుల నమోదు.. గత ఏడాది కాలంలో 62 కేసులు నమోదు చేసి 1656.990 కిలోల గంజాయి, 70 గ్రాముల నల్లమందు స్వాధీనం చేసుకున్నాం. 218 మందిని అరెస్టు చేశాం. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 24 కేసులు నమోదు చేసి 265.626 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని, 65 మందిని అరెస్టుచేశాం. గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న 54 గ్యాంగ్‌లను గుర్తించాం. వీరిలో 34 మంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు. విజయనగరం క్రైమ్: జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు పోలీస్ శాఖ తలపెట్టిన ‘సంకల్పం’ నెరవేరుతోంది. ఓ వైపు మత్తుపదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలపై విద్యార్థులు, యువతలో చైతన్యం కలిగిస్తున్నారు. ప్రత్యేక ప్రచార రథంతో ఊరూరా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. మరోవైపు మాదక ద్రవ్యాల రవాణా, విక్రయం, వినియోగించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జిల్లా పోలీస్ శాఖ పనితీరుకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. స్కోచ్ అవార్డు వరించింది. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందల్ ‘సాక్షి’తో గురువారం ప్రత్యేకంగా మాట్లా డారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆయన మాటల్లోనే... ● కరోనా సమయంలో అప్పటి ఎస్పీ బి.రాజకుమారి ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు అందించిన సేవలకు స్కోచ్ అవార్డు వచ్చింది. మళ్లీ ఇప్పుడు మాదక ద్రవ్యాల నియంత్రణకు పోలీస్ శాఖ చేపట్టిన ‘సంకల్పం’కు దేశ స్థాయిలో గుర్తింపు లభించింది. వివిధ రాష్ట్రాల్లో పోలీసులు డ్రగ్స్ నియంత్రణకు చేపడుతున్న చర్యలను పరిశీలించారు. చివరకు విజయనగరం జిల్లా పోలీస్‌శాఖ చేపట్టిన ‘సంకల్పం’ కార్యక్రమాలతో సంతృప్తి చెంది, ప్రతిష్టాత్మకమైన స్కోచ్ అవార్డుకు ఎంపిక చేశారు. ● మాదక ద్రవ్యాలకు అలవాటుపడిన యువతలో మార్పు తీసుకొని వచ్చి, వారిని తిరిగి సన్మార్గంలో నడపాలన్నదే మా ‘సంకల్పం’. మాదక ద్రవ్యాల అలవాటుతో విద్యార్థుల భవిష్యత్తు ఏవిధంగా నాశనం అవుతున్నది విద్యార్థులకు వివరిస్తున్నాం. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇస్తున్నాం. డీ అడిక్షన్ సెంటర్లకు పంపించి చికిత్స అందిస్తున్నాం. ● కళాశాలల్లో యాంటీ డ్రగ్స్ కమిటీలను ఏర్పాటు చేసి మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న విద్యార్థులను గుర్తిస్తున్నాం. వారి పరివర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. ● మాదక ద్రవ్యాల మత్తులో మానవ సంబంధాలు విచ్ఛిన్నమవుతున్నాయి. ఆరోగ్యం దెబ్బతింటోంది. విద్యార్థులు చదువుకు చెక్ చెబుతున్నారు. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిందితులుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లల నడతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. మంచిచెడులు వివరించి సన్మార్గంలో పెట్టాలి. ● మాదక ద్రవ్యాల అలవాటు ఉన్న విద్యా ర్థుల సమాచారం, వారికి డ్రగ్స్ ఎక్కడ నుంచి సరఫరా అవుతుందన్న విషయాలు తెలుసుకునేందుకు కళాశాలలో డ్రాప్ బాక్సులను ఏర్పాటు చేస్తున్నాం. నిందితులను పట్టుకుంటున్నాం. విస్తృత అవగాహన జిల్లా వ్యాప్తంగా 2011 ‘సంకల్పం’ కార్యక్రమాలను నిర్వహించాం. 1,18,000 మంది ప్రజలకు అవగాహన కల్పించి, 45,150 కర పత్రాలను పంచి పెట్టాం. కళాశాలలు, బహిరంగ ప్రదేశాల్లో 119 డ్రాప్ బాక్సులు, 98 హోర్డింగ్‌లను ఏర్పాటుచేశాం. జిల్లా వ్యాప్తంగా 632 కళాశాలలు/స్కూల్స్‌ను సందర్శించి సంకల్పం కార్యక్రమ ఉద్దేశాన్ని వివరించాం. జిల్లా వ్యాప్తంగా సంకల్ప రథంతో 87 స్కూల్స్‌ను సందర్శించి, 18,042 మంది విద్యార్థులకు అవగాహన కల్పించాం. 103 గ్రామాల్లో నిర్వహించిన ప్రదర్శనలతో 8,975 మందికి మాదక ద్రవ్యాలపట్ల అవగాహన కల్పించినట్టు ఎస్పీ వకుల్ జిందల్ వివరించారు. స్కాచ్ అవార్డు పోలీస్‌శాఖ సమష్టికృషిక నిదర్శనమని వివరించారు. మాదవ ద్రవ్యాల నియంత్రణలో జిల్లా పోలీస్‌శాఖ ముందడుగు నెరవేరుతున్న ఎస్పీ వకుల్‌జిందల్ ‘సంకల్పం’ డ్రగ్స్ కట్టడిలో దేశవ్యాప్త గుర్తింపు వరించిన స్కోచ్ అవార్డు -
ట్రైబల్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్లో ప్రతిభ
గుమ్మలక్ష్మీపురం: విశాఖపట్నంలో ఈనెల 12న జరిగిన జన్ జాతీయ గౌరవ దివస్ గిరిజన స్వాభిమాన్ వేడుకలు–2025లో భాగంగా నిర్వహించిన స్టేట్ లెవెట్ ట్రైబల్ పెయింటింగ్ అండ్ ఆర్ట్ కాంపిటీషన్లో పార్వతీపురం ఐటీడీఏ పరిధిలోని గిరిజన యువకులు, విద్యార్థులు ప్రతిభ చూపారు. ఈ మేరకు ఈ పోటీల నిర్వహణలో పాల్గొన్న లైజనింగ్ ఆఫీసర్/డ్రాయింగ్ టీచర్ రుగడ శ్రీనివాసరావు గురువారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ సీనియర్ విభాగంలో గుమ్మలక్ష్మీపురం మండలంలోని తాడికొండ గ్రామానికి చెందిన మండంగి బాలచంద్రుడు వేసిన ఆర్ట్ ప్రథమస్థానం పొందిందని తెలిపారు. ఈ నేపథ్యంలో బాలచంద్రుడుకు రూ.10వేల నగదు ప్రోత్సాహంతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్‌ను నిర్వాహకులు అందజేశారన్నారు. అలాగే ద్వితీయ స్థానం పొందిన గుమ్మలక్ష్మీపురం మండలం టిక్కబాయి ప్రభుత్వ గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాల విద్యార్థి ఆరిక రాజేష్‌కు రూ.5వేల నగదుతో పాటు ప్రశంసాపత్రం, షీల్డ్‌ను అందజేశారని, ప్రత్యేక బహుమతులను కురుపాంలోని ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు గౌతమ్, అన్వితలకు అందజేశారని పేర్కొన్నారు. -
నిద్ర కరువైతే అనారోగ్యం..!
ఎక్కువమందికి నిద్రలేమి సమస్య చాలామంది నిద్రలేమి సమస్య బారిన పడుతున్నా రు. అయితే ఈసమస్యకు ఎవరిని సంప్రదించాలో చాలామందికి తెలియదు. పలమనాలజిస్టునుగాని, ఈఎన్టీ వైద్యుడిని గానీ సంప్రదించాలి. ఆరోగ్యంగా జీవించడం కోసం రోజులో 6 నుంచి 7 గంటల పాటు నిద్రపోవాలి. సెల్‌ఫోన్ ఎక్కువగా వినియోగించకూడదు. అదేవిధంగా టీవీ కూడా గంటల తరబడి చూడకూడదు. డాక్టర్ బొత్స సంతోష్‌కుమార్, అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి ఓఎస్ఏ మిషన్ పెట్టుకుని నిద్రపోతున్న గురక సమస్య ఉన్న వ్యక్తి -
ఆకతాయిల ఆట కట్టించేందుకు ‘శక్తి‘ టీమ్స్
● ఐదు బృందాలుగా 30మందితో టీమ్స్ ● ఒక్కో బృందానికి ఒక్కో ఎస్సై నాయకత్వం ● టీమ్స్ పనితీరు చూసేందుకు అదనపు ఎస్పీ నియామకంవిజయనగరం క్రైమ్: ఆకతాయిల ఆట కట్టించేందుకు ‘శక్తి ‘ టీమ్స్‌ను ఏర్పాటు చేశామని ఎస్పీ వకుల్ జిందల్ అన్నారు. జిల్లాలో మహిళలపై జరుగుతున్న దాడులు, ఆకతాయిల వేధింపులను నియంత్రించేందుకు, మహిళలకు రక్షణగా నిలిచే చట్టాలు, ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ’శక్తి’ యాప్ పట్ల అవగాహన కార్యక్రమాలు చేపట్టేందుకు శక్తి టీమ్స్‌ను నియమించామని తెలిపారు. కొత్తగా ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్‌తో ఎస్పీ వకుల్ జిందల్ జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం మమేకమై, వారు నిర్వర్తించే విధులు, చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ శక్తి టీమ్స్ జిల్లాలోని కళాశాలలు, ముఖ్య కూడళ్లను మఫ్టీలో సందర్శించి, మహిళలను వేధించే ఆకతాయిలను గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు చేపడతారన్నారు. విజయనగరం, బొబ్బిలి, రాజాంలలో ఆరుగురు పోలీసు సిబ్బందితో ఐదు బృందాలుగా 30మందితో శక్తి టీమ్స్ ఏర్పాటు చేశామని, ఒక్కో బృందానికి ఒక్కో ఎస్సై నాయకత్వం వహిస్తారని చెప్పారు. ఈ బృందాలు మఫ్టీలో విధులు నిర్వహిస్తారని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేసిన శక్తి టీమ్స్ కోసం గతంలో ప్రత్యేకంగా కేటాయించిన ద్విచక్రవాహనాలను, ఫోర్ వీలర్స్ పెట్రోలింగ్ వాహనాలను వినియోగించాలని సూచించారు. ఆపద సమయంలో శక్తి యాప్‌కు వచ్చే ఎస్ఓఎస్ కాల్స్, డయల్ 112,100 కాల్స్‌ను బట్టి సంఘటన స్థలంకు వెళ్లే వారు తమతోపాటు ట్యాబ్‌లు కూడా వెంట తీసుకుని వెళ్లాలని, బాడీ వోర్న్ కెమెరాలను ధరించాలని సూచించారు. కాల్స్ వచ్చిన వెంటనే శక్తి బృందాలు అప్రమత్తమై సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకుని సమస్యలను చట్టబద్ధంగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని ఎస్పీ వకుల్ జిందల్ శక్తి టీమ్స్‌ను ఆదేశించారు. ప్రజల్లో అవగాహన కల్పించాలిమహిళలకు రక్షణగా ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన శక్తి మొబైల్ యాప్ పట్ల ప్రజల్లో విస్తృతంగా ప్రచారం కల్పించి, వారి మొబైల్స్‌లో యాప్ నిక్షిప్తం చేయడం, రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు. ఆపద సమయాల్లో శక్తి యాప్ ఏవిధంగా పని చేస్తుందన్న విషయాన్ని మహిళలకు వివరించాలని కోరారు. ఈ బృందాల పని తీరును జిల్లాలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత పర్యవేక్షిస్తారని, మహిళా పీఎస్ ఇన్స్పెక్టర్ నోడల్ అధికారిగా ఉంటారన్నారు. అంతేకాకుండా, శక్తి టీమ్స్ పని తీరును రాష్ట్ర డీజీపీ కార్యాలయం కూడా పర్యవేక్షిస్తుందని, వారి ఆదేశాల మేరకు చేయాల్సి ఉంటుందని శక్తిటీమ్స్కు ఎస్పీ విశానిర్దేశం చేశారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సౌమ్యలత, మహిళా పీఎస్ సీఐ ఈ.నర్సింహమూర్తి, ఎస్బీ సీఐ ఏవీ లీలారావు, ఆర్ఐ ఎన్.గోపాల నాయుడు, శక్తి టీమ్స్ సభ్యులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం
చీపురుపల్లి రూరల్(గరివిడి): విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గాదె శ్రీనువాసులనాయుడు, చీపురుపల్లి డీఎస్పీ ఎస్.రాఘవులు అన్నారు. గరివిడిలో శ్రీ చైతన్య పాఠశాల ఆవరణంలో నిర్వహించిన డా.బీఎస్.రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యావిధానంలో ఉన్నత భవిష్యత్తుకు చదువు ఎంత అవసరమో శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండేందుకు, క్రీడల్లో ఉన్నతంగా రాణించేందుకు క్రీడలు కూడా అంతే అవసరమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కానీ, ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు కానీ మంచి భవిష్యత్తు లక్ష్యంగా చదువుకోవాలని సూచించారు. కార్యక్రమంలో శ్రీచైతన్య ఉత్తరాంధ్ర ఎగ్జిక్యూటివ్ ఏజీఎం ఎంవీ.సురేష్, రీజనల్ ఇన్చార్జ్ వి.శ్రీనివాసరావు, రామినాయుడు, కోఆర్డినేటర్లు బాలరాజు, వెంకటరమణ, అప్పారావు, మనోరమ, ప్రిన్సిపాల్ పాల్గొన్నారు. -
బడిబయట బడిఈడు పిల్లలు
● భిక్షాటన చేస్తూ జీవనయానం ● తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులే కారణం ● పట్టించుకోని సంబంధిత అధికారులురామభద్రపురం: ఏ దేవుడు ఈ చిన్నారుల మొర ఆలకిస్తాడు? ఏ అధికారి వీరి దీనస్థితిని పట్టించుకుంటాడు? ఏ నాయకుడు ఈ పిల్లలకు అండగా ఉంటాడు? ఇంటి ఆర్థిక పరిస్థితులు సహకరించక.. ఆటపాటలతో మమేకమవుతూ విద్యను అభ్యసించవలసిన వయసులో ఎందరో బడిఈడు పిల్లలు బడి బయట భిక్షాటన చేస్తున్నారు. అలాగే వీధి పిల్లలుగా, బాలకార్మికులుగా మారుతుండడం దురదృష్టకరం. బడిఈడు పిల్లలు బడికి వెళ్లకుండా వీధులలో, ఆలయాల వద్ద భిక్షాటన చేస్తూ కనబడడంతో ప్రభుత్వ పరిరక్షణ ఇంత దీనస్థితితో ఉందా అంటూ పలువురు విమర్శిస్తున్నారు.బాలల పరిరక్షణ గురించి ప్రభుత్వంతో పాటు సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో ఆర్థిక, సామాజిక పరిస్థితుల కారణంగా కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లల్ని బలవంతంగా బడిమాన్పించి, భిక్షాటన చేయించడం, ఇంటి పనికో, దుకాణాలకో, మెకానిక్ షెడ్డులకో లేదంటే వ్యవసాయపనులకో పంపిస్తూ బాలకార్మికులుగా మారుస్తున్నారు. ఈ పద్ధతిని మార్చి పిల్లలంతా బడికి వెళ్లేలా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం, బాలల పరిరక్షణ కమిటీ తీసుకోవాల్సి ఉన్నా పట్టించుకోకుండా విద్యాహక్కు చట్టానికి విఘాతం కలిగిస్తున్నారు. సంబంధిత అధికారుల పర్యవేక్షణ ఉంటే పలువురు చిన్నారులు బహిరంగంగా భిక్షాటన ఎందుకు చేస్తారని, బాలల పరిరక్షణ కమిటీ పర్యవేక్షణ కరువైందని పలువురు విమర్శిస్తున్నారు -
సురక్షితంగా డ్రైవింగ్ చేయాలి
● కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విజయనగరం అర్బన్: డ్రైవింగ్ నేర్చుకున్న వారంతా సురక్షితంగా డ్రైవింగ్ చేయాలని అ లాగే రహదారి భద్రత కోసం అమలులో ఉన్న నియమాలను పాటించాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ సూచించారు. జీఎంఆర్ సంస్థ సీఎస్ఆర్ కింద భోగాపురం మండలం గూడెపువలస, ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన యువతకు లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్‌లో నెల రోజుల పాటు 50 మంది యువకులకు శిక్షణ ఇచ్చింది. ఈ శిక్షణ పొందిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా గురువారం ఆయన చాంబర్లో సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో మార్క్‌ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగార్రాజు, డీఆర్డీఏ పీడీ కల్యాణ్ చక్రవర్తి, ఏఎల్డీఎం వైడీ ప్రత్యూష తదితరులు పాల్గొన్నారు. నిర్బంధించిన పశువులను కాపాడిన పోలీసులుకొత్తవలస: మండలంలోని సంతపాలెం గ్రామం శివారు మామిడి తోటలో అక్రమంగా నిర్బంధించిన 171 పశువులను సీఐ సీహెచ్.షణ్ముఖరావు ఆధ్వర్యంలో పోలీసులు గురువారం కాపాడారు. ఆ పశువులను ఇక్కడికి తీసుకొచ్చి వధించి వేరే చోటకు మాంసాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్నాయని అజ్ఞాత వ్యక్తి ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా పశువులను అక్రమంగా నిర్బంధించిన ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ఆ పశువులను ప్రస్తుతానికి అక్కడే ఉంచామని కోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సీఐ చెప్పారు. చలో విజయవాడను విజయవంతం చేయండి● మధ్యాహ్న భోజన పథకం రాష్ట్ర అధ్యక్షురాలు స్రవంతి విజయనగరం గంటస్తంభం: మధ్యాహ్న భోజన పథకంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 19న విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద జరిగే మహాధర్నాను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ మధ్యాహ్న భోజన పథకం (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షురాలు, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.స్రవంతి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం ఆమె పట్టణంలోని పలు పాఠశాలల్లో ఉన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులకు కరపత్రాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నో ఏళ్లుగా అనేక ఇబ్బందులు పడుతూ కేవలం సేవా దృక్పథంతో పనిచేస్తున్న మధ్యాహ్న భోజన పథక కార్మికులు ఎన్ని ప్రభుత్వాలు మారినా నేటికీ అన్యాయానికి గురవుతున్నారన్నారు. ఈనెల 19 జరిగే చలో విజయవాడ కార్యక్రమానికి జిల్లా వ్యా ప్తంగా ఉన్న మధ్యాహ్న భోజన పథక కార్మికులంతా హాజరవాలని కోరారు. కార్యక్రమంలో సహాయ కార్యదర్శి కె.రాజి పాల్గొన్నారు విజయీభవవిజయనగరం: రాష్ట్రస్థాయిలో జరగనున్న సబ్‌జూనియర్స్ బాల, బాలికల కబడ్డీ చాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్లు విజేతలుగా తిరిగి రావాలని జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కేవీ.ప్రభావతి ఆకాంక్షించారు. ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు కడప జిల్లా పులివెందులలో జరగనున్న అంతర్ జిల్లాల పోటీలకు జిల్లా నుంచి ప్రాతి నిధ్యం వహించే క్రీడాకారులు గురువారం పయనమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా జట్టులోకి అర్హత సాధించిన క్రీడాకారులకు ఆమె పలు సూచనలు చేశారు. కృషి, పట్టుదల, నిరంతర శిక్షణ ఉంటే ఏ రంగంలోనైనా రా ణించగల సామర్థ్యం దక్కించుకోవచ్చని చెప్పా రు. విజయనగరం జిల్లా కబడ్డీ, ఖోఖో క్రీడల కు పెట్టింది పేరుగా ఖ్యాతినర్జించిందని, అదే తరహాలో సబ్‌జూనియర్స్ పోటీల్లో వర్ధమాన క్రీడాకారులు రాణించాలని ఆకాంక్షించారు. -
మిమ్మల్ని మార్చలేకపోతున్నాను.. మన్నించండి.. గుంజీలు తీసిన హెడ్ మాస్టర్
ఒరేయ్ రామూగా.. నువ్వు చెప్పినపని చేయడం లేదు.. బుద్ధిగా ఉండడం లేదు.. అమ్మకు ఎదురుసమాధానం చెబుతున్నావు.. ఇలాగైతే స్కూల్లో మీ మాస్టారుకు చెప్పి బరిగెతో తొక్క తీయిస్తాను. నీకు మేం చెబితే వినవు.. మీ లెక్కల మాష్టారే కరెక్ట్ ఆయనైతేనే నీకు చర్మం వలిచేసి బుద్ధి చెబుతాడు.. -ఒక పిల్లాడికి తండ్రి వార్నింగ్ ...మాస్టర్ గారండీ.. ఆ శీనుగాడు మా గుంటడే .. బడి నుంచి వచ్చాక పుస్తకాలు సంచి ఇంట్లో పడేసి బావుల్లోనూ చెరువుల్లోనూ ఈతకని తిరుగుతున్నాడు తప్ప పుస్తకం తీయడం లేదు.. చదవడం లేదు.. మీరు వాణ్ని ఏమాత్రం వదలొద్దు... చేమడాలు వలిచేయండి.. నేనేం అనుకోను.. ముందు వాణ్ని దారిలో పెట్టండి-టీచర్‌తో ఒక తండ్రి వేడుకోలు..ఒరేయ్ ఇక ఆడింది చాలు.. ఆదివారం కూడా చదూకోమన్నాడు సైన్స్ మాస్టర్.. అయన ఇల్లు ఈ దారిలోనే .. మనం ఇంకా ఈ మామిడి తోటల్లో తిరిగి.. ఆయనకు దొరికిపోతే మాత్రం మనం అయిపోయినట్లే.. ఇక ఇదే ఆఖరాట వెళ్లిపోదాంరా.. నాకు భయమేస్తోంది..-పిల్ల గ్యాంగులో ఒకడి ఆందోళనఒరేయ్ బెల్లం తింటే పళ్ళు పుచ్చిపోతాయి. కడుపులో పాములు వస్తాయని ఎన్నిసార్లు చెప్పినా మా పిల్లాడు వినడం లేదు.. మీరైనా చెప్పండి టీచర్ గారు.. వీడికి మేమంటే భయం లేకపోతోంది.. మీరే వీడికి రెండు వేసి దారిలో పెట్టండి-మాష్టర్ వద్ద ఒక తల్లి విజ్ఞాపనపాతికేళ్ల క్రితం టీచర్ అంటే బడిలోనే కాదు.. ఊళ్ళో.. గుడిలో.. పెళ్ళిలో.. సంతలో.. మార్కెట్లో ఎక్కడ కనిపించినా టీచర్ గానే చూసేవాళ్ళు.. ఎక్కడ ఆయన ఎదురైనా పక్కకు తప్పుకోవడం.. కూడా లేచి నిలబడి గౌరవించడం.. ఇంట్లో భయం లేకపోతే నేరుగా తల్లిదండ్రులే స్కూలుకు వచ్చి టీచరుకు చెప్పి మరీ తమ బిడ్డల్ని దారిలో పెట్టించడం నాటి సమాజపు సంస్కృతి.. స్కూలు టైములోనే కాదు.. తమ జీవితంలో ఎప్పుడూ టీచర్ అంటే టీచర్ గానే గౌరవించి.. భయభక్తులతో ఉండేవాళ్ళు. కానీ కాలం మారింది.. టీచర్ అంటే జీతం తీసుకుని పని చేసే ఒక పనివాడు.. ఒక ఉద్యోగి.. అంతేతప్ప అయన తమకు ఇంకేం కాడు కాలేడు. అయినా మనను టీచర్ కొట్టడం ఏంది.. కొడితే ఊరుకుంటామా.. ఇదే దారిలో వెళ్తాడు కదా.. సాయంత్రం చూసుకుందాం లే .. అన్నట్లుగా పిల్లల తీరు ఉండగా.. ఏంది టీచర్ మా వాణ్ని కొట్టిర్రట.. వాణ్ని మేమె ఏనాడూ ఏమీ అనలేదు. మీరు కొడితే ఎట్లా .. చదువు చెబితే చెప్పండి.. లేకుంటే లేదు.. వాడికి చదువురాకున్నా ఫర్లేదు.. కొట్టుడు మాత్రం వద్దు.. ఈసారి కొడితే ఊరుకునేది లేదు.. అంటూ టీచర్లకే పేరెంట్స్ వార్నింగ్ ఇస్తున్న కాలం ఇది.అల్లరి చేసినా .. చెప్పినమాట వినకపోయినా చేతులు ఒళ్ళు వాచిపోయేలా టీచర్లు కొట్టినా ఏమీ అనని రోజులు పోయి.. మావాణ్ని కొడితే నీకు పడతాయి మాస్టర్ గారు ఎన్ని వార్నింగ్ ఇస్తున్న రోజులు వచ్చాయి.. పిల్లల్ని దండించడాన్ని అతిపెద్ద నేరంగా పరిగణిస్తూ వ్యూస్ పెంచుకునే మీడియా లైన్లోకి వస్తుంది.. పిల్లల హక్కుల సంఘాలు సంస్థలు కూడా యాగీ చేయడానికి ఎల్లపుడూ సిద్ధమే.. టీచర్ చేతిలో బెత్తం ఏనాడైతే మూలకు చేరిందో ఆనాడే పిల్లల్లో అల్లరి పెరిగింది.. భయం బాధ్యత స్థానంలో విచ్చలవిడితనం పెరిగిపోయింది.. టీనేజీలోనే దురలవాట్లు.. నేరాలకు సిద్ధం అవుతున్నారు..ఇలాంటి పరిస్థితులను కళ్లారా చూస్తూ.. వారిని ఏమీ నిందించలేక.. దండించలేక.. శిక్షించలేక.. అనలేక ఒక హెడ్ మాస్టర్ మనస్తాపంతో కుమిలిపోతూ.. మీరు మారరు.. మిమ్మల్ని నేను మార్చలేను.. మీ దగ్గర చేతకాని వారిలాగా చేతులు కట్టుకుని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది మాకు' అంటూ విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం పెంట జడ్పీ స్కూల్ హెచ్ఎం రమణ విద్యార్థుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం ప్రార్థన సమయంలో సాష్టాంగ నమస్కారం చేసి గుంజీలు తీశారు. మేము ఎన్ని చెప్పినా మీరు వినడం లేదు.. మీకు భయం లేదు.. గౌరవం లేదు.. అయినా మాకు చేతనైనా వరకు మేం చేస్తున్నాం.. ఇకపై మీ ఇష్టం అంటూ గుంజిళ్ళు తీశారు.. ఇది అయన ఆవేదన కాదు.. సమాజంలో విద్యార్థులు.. తల్లిదండ్రుల పరిస్థితిని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. ఆనాడు గురువు గురించి వేమన రాసిన పద్యాన్ని ఒకసారి గుర్తి చేసుకుందాం‘గురుని శిక్షలేక గురుతెట్లు కలుగునో అజునకైనా వాని యబ్బకైన తాళపుచెవి లేక తలుపెట్లు లూడునో విశ్వదాభిరామ వినురవేమ’గురువుతో శిక్ష అనుభవించకుండా చదువు ఎలా వస్తుంది అంటాడు వేమన.. కానీ ఇప్పుడు పిల్లల్ని కొట్టడం నేరం అంటున్నారు.. ఇప్పుడు దండించకపోతే వారు మున్ముందు మరింతగా రాటుదేలిపోతారన్నది వేమన ఉద్దేశ్యం.. అది నాడు.. నేడు.. ఏనాడైనా చెల్లుబాటు అవుతుంది. అని ప్రస్తుత సమాజాన్ని చూస్తే స్పష్టం అవుతోంది.-సిమ్మాదిరప్పన్న. -
AP: జాతరలో మహిళా ఎస్ఐపై దాడి.. జుట్టు పట్టుకుని తిట్టుకుంటూ..
సాక్షి, విజయనగరం: ఏపీలో కూటమి ప్రభుత్వంలో ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులకే భద్రత కరువైంది. విజయనగరంలో జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జాతరలో అధికార పార్టీకి చెందిన కొందరు యువకులు వీరంగం సృష్టించారు. అసభ్య నృత్యాలను అడ్డుకున్న మహిళా ఎస్ఐపై దాడి చేశారు. దీంతో, సదరు ఎస్ఐ.. ఈ ఘటనపై సీఐకి ఫిర్యాదు చేశారు.వివరాల ప్రకారం.. విజయనగరం జిల్లా వేపాడ మండలం గుడివాడ గ్రామంలో మంగళవారం రాత్రి శ్రీ వేణుగోపాల స్వామి తీర్థ మహోత్సవం జరిగింది. జాతర సందర్భంగా ఏర్పాటు చేసిన డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమంలో కొందరు యువకులు వీరంగం సృష్టించారు. గుడివాడ మోహన్ సహా అతడి స్నేహితులు మద్యం మత్తులో హంగామా సృష్టించారు. వేదికపై నృత్యం చేస్తున్న యువతులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడే విధుల్లో ఉన్న వల్లంపూడి ఎస్ఐ బి.దేవి వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.ఈ క్రమంలో మరింత రెచ్చిపోయిన యువకులు.. విధుల్లో ఉన్న మహిళా ఎస్ఐపై దాడికి పాల్పడ్డారు. ఆమె జుట్టు పట్టుకొని కొట్టి, అత్యంత అసభ్యకరంగా దుర్భాషలాడారు. ఆమె ప్రాణభయంతో సమీపంలోని ఓ ఇంట్లోకి వెళ్లి తలదాచుకున్నారు. అయినా వెంటాడి అక్కడ రభస సృష్టించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు ఎస్ఐ సమాచారం ఇవ్వడంతో రూరల్ ఎస్సై అప్పలనాయుడు, ఎల్ కోట, కొత్తవలస పోలీస్ స్టేషన్ ఎస్‌ఐలుతో పాటు సుమారు 30 మంది సిబ్బంది వాహనాలపై రాత్రి ఆ గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో ఘర్షణలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో ఎస్ఐ దేవీకి గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.ఇక, ఈ ఘటనపై ఎస్ఐ దేవీ.. సీఐకి ఫిర్యాదు చేశారు. ఈ దాడితో సంబంధం ఉన్న గుడివాడ మోహన్‌తో పాటు అతని స్నేహితులు గుడివాడ సంతోష్‌కుమార్, విష్ణుదుర్గ, హర్ష, ఎర్నిబాబు, గౌరినాయుడు తనపైకి వచ్చి దుర్భాషలాడారని, తనను కొట్టి, జట్టు పట్టుకొని లాగారని, తన విధులకు ఆటంకం కలిగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనను వీడియో తీస్తుండగా తన సెల్‌ఫోన్ పట్టుకొని పారిపోయారని తెలిపారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
గజపతినగరం: గజపతినగరం జాతీయ రహదారి పక్కన, మెంటాడ జంక్షన్ రోడ్డు ఇరువైపులా ఉన్న మొత్తం 8షాపుల్లో ఇటీవల చోరీకి పాల్పడిన దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు బొబ్బిలి డీఎస్పీ భవ్యారెడ్డి తెలిపారు. ఈ మేరకు బుధవారం సాయంత్రం గజపతినగరం పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. గజపతినగరంలో దొంగతనాలకు పాల్పడిన వారు అంతర్ రాష్ట్ర గజదొంగలన్నారు. కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల్లో వరుసగా వీరు దొంగతనాలకు పాల్పడుతూ వస్తున్నారని రాత్రి పూట ఎవరు లేని సమయంలో షట్టర్లు పగులగొట్టి నగదు, సొత్తు లూటీ చేయడమే వారి పని అని తెలిపారు. సీసీ టీవీ ఫుటేజీ ద్వారా నిందితులను గుర్తించి నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశామని చెప్పారు. అరెస్ట్ అయిన వారిని షేక్ బాషా, రావుల రమణ, శ్రీనునాయక్, గుల్లిపల్లి కిరణ్కుమార్లుగా గుర్తించినట్లు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు వ్యక్తులు వెంకటేశ్ శివగౌడ, రంగురవిల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి రూ.88వేల620నగదు, 9స్టార్ట్ఫోన్లు,ఒక ల్యాప్‌టాప్, మూడు గోల్డ్ కలర్ వాచ్‌లను రికవరి చేసినట్లు డీఎస్పీ వివరించారు. కార్యక్రమంలో సీఐ, ఎస్సైలతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. రూ.88వేల620, 9స్మార్ట్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, మూడు గోల్డ్ కలర్ వాచ్‌లు స్వాధీనం -
గిరిజన వర్సిటీలో డ్రోన్లపై వర్క్‌షాప్ ప్రారంభం
విజయనగరం అర్బన్: డ్రోన్ల వినియోగంతో వ్యవసాయం రంగాన్ని లాభసాటిగా మెరుగుపరచవచ్చని సెంచూరియన్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ జె.అనిల్‌కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. సెంచూరియన్ యూనివర్సిటీతో సంయుక్త నిర్వహణలో స్థానిక కేంద్రీయ గిరిజన యూనివర్సిటీలో ‘వింగ్స్ ఆఫ్ ఇన్నోవేషన్: ఎంపవరింగ్ స్కిల్స్ త్రూ డ్రోన్ టెక్నాలజీ’ అనే అంశంపై రెండురోజుల పాటు నిర్వహించే వర్క్‌షాప్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యవసాయరంగంలో డ్రోన్లను ఉపయోగించి వ్యవసాయం చేయగలిగితే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. వ్యవసాయ రంగంలో డ్రోన్ల సాయంతో నీటి వనరుల లభ్యత, పురుగు మందుల పిచికారీ, ఎరువులు వేయడం తదితర పనులు తక్కువ ఖర్చుతో చేయడానికి అవకాశం ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం కొన్ని సంస్థలకు డ్రోన్లను రాయితీలపై అందజేస్తోందని తెలిపారు. పర్లాకిమిడి సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి గౌరవ అతిథిగా వచ్చిన అసోసియేట్ డీన్ డాక్టర్ కొర్ల హర్షవర్ధన్ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో డ్రోన్స్ వినియోగంపై వివరించారు. కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ ప్రొఫెసర్ శరత్ చంద్రబాబు మాట్లాడుతూ రక్షణ, వ్యవసాయం, ఇతర రంగాల్లో డ్రోన్ల అవసరం పెరిగిందన్నారు. కార్యక్రమంలో సెంచూరియన్ యూనివర్సిటీ అధ్యాపకుడు డాక్టర్ సోనియా పాణిగ్రాహి, వర్క్‌షాప్ కో ఆర్డినేటర్ డాక్టర్ కె.లత, డాక్టర్ ప్రేమ ఛటర్జీ, డాక్టర్ ఎన్వీఎస్సూర్యనారాయణ, డాక్టర్ ఎంజీనాయుడు, డాక్టర్ బి.వెంకటేశ్వర్లు, డాక్టర్ కె.దివ్య, డాక్టర్ ఎం.ప్రసాద్, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
జాతీయ రహదారిపై 64 సీసీ కెమెరాలు
విజయనగరం క్రైమ్: జిల్లాలో తరచూ జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణకు జాతీయ రహదారిపై 64 సీసీ కెమరాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ చాంబర్లో బుధవారం హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. విజయనగరం డివిజన్లో వాహనాలు ఢీకొని మృతిచెందిన, క్షతగత్రులుగా మారిన మొత్తం 10 కేసులపై ఈ హిట్ అండ్ రన్ జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ సమావేశంలో సమగ్రంగా చర్చించి ఆమోదించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వచ్చే సమావేశం నాటికి మొత్తం పెండింగ్ కేసులన్నిటినీ పూర్తి చేయాలని చెప్పారు. జిల్లాలో మొత్తం 34 కిలోమీటర్ల మేర ఉన్న 16వ జాతీయ రహదారిపై 64 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేందుకు రూ.5లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు. వాటిని అమర్చే పని వేగంగా పూర్తి చేయాలని కోరారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్లు, నేరాలు జరిగే చోట్లను దశల వారీగా అన్నిచోట్లా సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. దీని కోసం సమగ్ర సర్వే నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో ఏఎస్పీ సౌమ్యలత, ఇన్చార్జి జేసీ ఎస్.శ్రీనివాసమూర్తి, డీటీఓ మణికుమార్, డీఎంహెచ్ఓ జీవనరాణి, ఆర్డీఓలు, డీఎస్పీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ బీఆర్ అంబేడ్కర్ హిట్ అండ్ రన్ కేసులకు ఆమోదం తెలిపిన కమిటీ -
పకడ్బందీగా పదోతరగతి పరీక్షలు
విజయనగరం అర్బన్: పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఆదేశించారు. ఈ నెల 17వ తేదీ నుంచి జరగనున్న పరీక్షలపై బుధవారం సమీక్షించారు. ఈ ఏడాది పరీక్షకు హాజరయ్యే 23,765 మంది విద్యార్థుల కోసం జిల్లా వ్యాప్తంగా మొత్తం 119 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. విడతకు 1,124 మంది చొప్పున రెండు విడతలకు 2,248 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు చెప్పారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి తేదని, ఇన్విజిలేటర్లు సైతం సెల్ఫోన్లు తీసుకురాకూడదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ యు.మాణిక్యంనాయుడు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పర్యాటకాభివృద్ధికి ముందుకు రావాలి జిల్లా పర్యాటకాభివృద్ధిలో భాగంగా పీపీ మోడల్లో పెట్టుబడి పెటేందుకు ముందుకు వచ్చేవారికి అవసరమైన భూమి, ఇతర అనుమతులు మంజూరుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ అంబేడ్కర్ తెలిపారు. తన చాంబర్లో నిర్వహించిన జిల్లా స్థాయి పర్యాటక కౌన్సిల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో బీచ్ టూరిజం, టెంపుల్ టూరిజం అభివృద్ధికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, ఆయా రంగాల్లో పెట్టుబడికి ఔత్సాహికులు ముందుకు రావాలని కోరారు. గొర్రిపాటి బుచ్చిఅప్పారావు తాటిపూడి రిజర్వాయర్ వద్ద ఎకో టూరిజం అభివృద్ధికి రూ.రూ.23 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. సమావేశంలో జిల్లా పర్యాటక అభివృద్ధి అధికారి కుమారస్వామి, డీఆర్డీఏ పీడీ కళ్యాణ చక్రవర్తి, ఎండోమెంట్ డిప్యూటీ కమిషనర్, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఘనంగా వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం
విజయనగరం: వైఎస్సార్సీపీ ఆవిర్భావ దినోత్సవం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లాలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీ, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా నేతలంతా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేకరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ జెండాను మజ్జి శ్రీనివాసరావు ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసంక్షేమం, రాష్ట్ర అభివృద్దే ధ్యేయంగా స్థాపించిన వైఎస్సార్సీపీ 14 సంవత్సరాలు పూర్తి చేసుకుని 15వ సంవత్సరంలోకి అడుగుపెట్టడం ఆనందంగా ఉందన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీని విజయపథంలో నడిపించడంలో సఫలీకృతులయ్యా రని గుర్తుచేశారు. భవిష్యత్‌లో పార్టీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేసి పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని కోరారు. కార్యక్రమంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి పాల్గొన్నారు. పార్టీ జెండాను ఎగురవేసిన జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు -
మోసం చేయడంలో సక్సెస్
ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ అంటూ సకెస్స్ ఫుల్‌గా ప్రజలను మోసం చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతుంది. విద్యార్థులకు రావాల్సిన ఫీజురీయింబర్స్‌మెంట్ బకాయిలు తక్షణమే చెల్లించాలి. నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంతో పాటు అర్హులైన నిరుద్యోగ యువతకు రూ.3వేల నిరుద్యోగ భృతి చెల్లించాలి. ఇచ్చిన హామీలు అమలుచేయకుండా కూటమి ప్రభుత్వం సాగిస్తున్న కక్షపూరిత పాలనకు గుణపాఠం తప్పదు. – బెల్లాన చంద్రశేఖర్, మాజీ ఎంపీ, విజయనగరం మోసపోయిన యువత కూటమి నేతలు ఉత్తుత్తి హామీలతో యువతను మోసం చేశారు. ఫీజురీయింబర్స్ మెంట్ నిధులు విడుదల చేయకుండా పేద, మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు చదువు కష్టాలు తెచ్చిపెట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారు. ప్రజాసంక్షేమాన్ని గాలికొదిలేశారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి ఒక్క సీటు కూడా రాదు. – శంబంగి వెంకటచినఅప్పలనాయుడు, మాజీ ఎమ్మెల్యే, బొబ్బిలి నియోజకవర్గం -
మడ్డువలస కాలువలో బాలిక మృతదేహం లభ్యం
వంగర: మండల పరిధి మడ్డువలస కుడి ప్రధాన కాలువలో గల్లంతైన కళింగ సైనీ మృతదేహం బుధవారం లభ్యమైంది. ఈ నెల 11వ తేదీన ఇద్దరు బిడ్డలతో సహా తల్లి కళింగ శ్రావణి మడ్డువలస గొర్లె శ్రీరాములునాయుడు ప్రాజెక్టు దిగువ భాగం కుడిప్రధాన కాలువలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన విషయం పాఠకులకు విదితమే. ఈ సంఘటనలో మహిళ కళింగ శ్రావణి, బాలుడు కళింగ సిద్ధులను సంగాంకు చెందిన జన్ని జగన్మోహన్(చిన్న) సాహసించి కాపాడి ఒడ్డుకు చేర్చగా బాలిక కళింగ సైనీ ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో గజ ఈతగాళ్లు, పలువురు మత్స్యకారులు గాలించినా ఫలితం లేకపోయింది. చీకటి పడడంతో బంధువులంతా అక్కడే పడిగాపులు కాశారు. బుధవారం ఉదయం ఘటన జరిగిన ప్రదేశానికి కొద్ది దూరంలో బాలిక సైనీ మృతదేహం ఉన్నట్లు బంధువులు గుర్తించారు. బాలిక మేనమామ గుంట చంటి, కుటుంబసభ్యులు కాలువ నుంచి మృతదేహాన్ని తీసే ప్రయత్నంలో వారు రోదించిన తీరు అందరినీ కలిచివేసింది. మృతదేహాన్ని ఒడ్డుకు చేర్చిన అనంతరం పోలీసులు రాజాం సీహెచ్‌సీకి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం కింజంగి గ్రామానికి తరలించగా మృతదేహాన్ని చూసేందుకు వచ్చిన వారంతా చలించిపోయారు. బాలిక తండ్రి కళింగ సుధాకర్‌ను బాలిక మృతదేహం వద్దకు తీసుకువచ్చినా ఆయన మానసిక స్థితి బాగోలేక బిత్తర చూపులు చూశాడు. -
55 సెకెన్లలో హనుమాన్ చాలీసా పఠనం
విజయనగరం టౌన్: హనుమాన్ చాలీసా పఠించడంలో విజయనగరానికి చెందిన జయ పవన్ కల్యాణ్ ప్రపంచ రికార్డు సృష్టించారు. 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పూర్తిగా పఠించినందుకు గాను ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించాడు. ఈ మధ్య జరిగిన ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ పోటీల్లో ఆయన పాల్గొని, హనుమాన్ చాలీసాను అతి తక్కువ నిడివిలో పూర్తిగా పఠించిన మొదటి వ్యక్తిగా చరిత్ర సృష్టించాడు. గతంలో బీహార్‌కు చెందిన అబ్బాయి 59 సెకెన్లలో హనుమాన్ చాలీసా పఠించగా ప్రస్తుతం ఆ రికార్డును తిరగరాసి 55 సెకెన్లలో హనుమాన్ చాలీసాను పఠించడం గొప్ప విషయం. విజయనగరం నగరపాలక సంస్థలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న తాతబాబు కుమారుడు జయపవన్ కల్యాణ్. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించడంతో జయ పవన్ కల్యాణ్‌కు అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంటెక్ పూర్తి చేసిన జయ పవన్ కల్యాణ్ అత్యంత సృజనను కనపరిచి ఈ రికార్డును సొంతం చేసుకోవడం విశేషం. ఈ మేరకు ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ వారు యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ వంటి అనేక సామాజిక మాధ్యమాల్లో జయపవన్ కల్యాణ్ సాధించిన రికార్డును నిక్షిప్తం చేశారు. దీంతో ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రపంచ రికార్డు సాధించిన జయ పవన్‌కల్యాణ్ -
సారా రహిత జిల్లాయే లక్ష్యం
● ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 14405 ● కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్విజయనగరం గంటస్తంభం: సారా రహిత జిల్లాగా మార్చేందుకు కృషి చేయలని అధికారులను కలెక్టర్ డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ ఆదేశించారు. సారాకు సంబంధించిన ఫిర్యాదుల కోసం ఏర్పాటు చేసిన టోల్‌ఫ్రీ నంబర్ 14405కు విస్త్రత ప్రచారం కల్పించాలని సూచించారు. ఏపీ ప్రభుత్వ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నవోదయం 2.0 కార్యక్రమం అమలులో భాగంగా కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సారా నిర్మూలన సమన్వయ సమావేశాన్ని ఋధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తమ గ్రామంలో ఎక్కడా సారా తయారీ గానీ, వినియోగం గానీ జరగడం లేదని అన్ని గ్రామాల్లో పంచాయితీ తీర్మానాలను తీసుకోవలని సూచించారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసిన తరువాత, అప్పటికీ సారా తయారీ, వినియోగం జరుగుతున్నట్లు గుర్తించిన గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి, అదుపు చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అబ్కారీ శాఖతో పాటు పోలీసులు, అటవీశాఖ కూడా సారా తయారీపై నిఘా పెంచాలని కోరారు. అటవీ ప్రాంతంలో ఎక్కడైనా సారా తయారీ జరిగితే, దానికి అటవీశాఖదే బాధ్యత అని స్పష్టం చేశారు. జిల్లాను సారా రహితంగా మార్చడంలో అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్ కోరారు. నవోదయం 2.0 కు సంబంధించిన వాల్‌పోస్టర్, స్టిక్కర్లు, కరపత్రాలను కలెక్టర్ ఆవిష్కరించి ప్రచార రఽథాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఇన్చార్జ్ జేసీ ఎస్.శ్రీనివసమూర్తి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.శ్రీనాథుడు, అటవీశాఖాధికారి కొండలరావు, డీఈఓ మాణిక్యంనాయుడు, డీఎంహెచ్ఓ డాక్టర్ ఎస్.జీవనరాణి, డీఆర్డీఏ ఏపీడీ సావిత్రి, గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసరావు, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
పోలీసుల అదుపులో గంజాయి నిందితులు
● గంజాయి రవాణా చేస్తూ పట్టుబడిన నిందితులు ● బొడ్డవర చెక్‌పోస్ట్ వద్ద కారు టైరులో గంజాయి పట్టివేతవిజయనగరం క్రైమ్: గంజాయిని అక్రమంగా రవాణా చేసినా, అమ్మినా, కొనుగోలు చేసినా ఎన్డీపీఎస్ చట్టం ద్వారా కేసు నమోదు చేస్తామని ఎస్పీ వకుల్ జిందల్ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గంజాయిని అక్రమంగా తరలిస్తున్న ఐదుగురు నిందితుల ముఠాను ప్రవేశపెట్టారు. బొడ్డవర చెక్‌పోస్ట్ వద్ద వెహికల్స్ తనిఖీ చేస్తుండగా కారు వెనుక భాగంలో స్టెఫినీ టైరులో గంజాయిని తరలిస్తున్న ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నామని ఈ సందర్భంగా కేసు వివరాలను ఎస్పీ వకుల్ జిందల్ వెల్లడించారు. చెక్‌పోస్ట్ వద్ద ఎస్.కోట ఎస్సై ఎల్.చంద్రశేఖర్ వాహనాలు తనిఖీ చేస్తుండగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన కారు వెనక భాగంలో తనిఖీ చేస్తున్న సిబ్బందికి అనుమానం వచ్చి కారు స్టెఫినీని ఓపెన్ చేయగా డైబ్భె కిలోల గంజాయి 56 ప్యాకెట్లలో లభ్యమైందన్నారు. వెంటనే దానిని రవాణా చేస్తున్న ఒడిశాలోని మల్కన్‌గిరికి చెందిన రంజిత్ బిశ్వాస్, నిఖిల్ తపాయి, బిశ్వాస్ మహీధర్, యూపీకి చెందిన షా ఆలం, బెంగళూరుకు చెందిన షేక్ ఇజాజ్ అహ్మద్‌లను ఎన్డీపీఎస్ చట్టం కింద అరెస్ట్ చేశామని ఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి ఒక కారు, నాలుగు మొబైల్‌ఫోన్స్, రూ.20 వేలు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంజాయిని అక్రమ రవాణాపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి పోలీస్ శాఖ వెనకాడబోదని ఈ సందర్భంగా ఎస్పీ స్పష్టం చేశారు. -
పరిశోధన ప్రతిభతో ఉన్నత స్థాయిలో స్థిరం
● జేఎన్టీయూ జీవీ ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మివిజయనగరం అర్బన్: కళాశాల విద్యలోనే విద్యార్థులు పరిశోధన దృక్ఫథంపై ప్రతిభను మెరుగుపరుచుకుంటే ఉన్నత స్థాయి ఉద్యోగ, ఉపాధిలో స్థిరపడవచ్చని జేఎన్టీయూ గురజాడ విజయనగరం (జీవీ) ఇన్చార్జ్ వీసీ ప్రొఫెసర్ డి.రాజ్యలక్ష్మి అన్నారు. ఈ మేరకు స్థానిక జేఎన్టీయూ జీవీలోని ఇంజినీరింగ్ కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ విభాగం ఆధ్వర్యంలో ‘క్రిసెన్స్ 2కే25’ పేరుతో రెండు రోజుల పాటు నిర్వహించే జాతీయ సాకేతిక సదస్సును ఆమె బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎప్పటికప్పుడు నూతనంగా ఆవిష్కరిస్తున్న సాంకేతిక పరిశోధనా అంశాలపై పరిజ్ఞానాన్ని విద్యార్థులు పెంచుకోవాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఆర్.రాజేశ్వరరావు మాట్లాడుతూ ఇలాంటి సదస్సుల్లో విద్యార్థి పాల్గొంటే నూతన సాంకేతిక నిపుణతను మెరుగుపరచుకోవచ్చన్నారు. అనంతరం సదస్సు గ్రూప్ కెప్టెన్ పోలా ఆనంద్ నాయుడు సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ మరియు ప్రాక్టీకల్ మెషీన్ లెర్నింగ్ అంశంపై సదస్సులో వివరించారు. సదస్సుకు సమన్వయ కర్తలుగా డాక్టర్ ఆర్డీడీ శివరాం, వి.నారాయణరావు, విద్యార్థి సమన్వయకర్తలుగా తనూజ్ హేమంత్, పెడాడ బలాశ్రీ వ్యవహరించారు. -
జాతీయ ఫెన్సింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారులు
విజయనగరం: జాతీయస్థాయిలో జరగనున్న ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొనేందుకు జిల్లా నుంచి అర్హత సాధించిన క్రీడాకారులు బుధవారం పయనమయ్యారు. ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు కేరళ రాష్ట్రం ఎర్నాకులంలో జరిగే సీనియర్స్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తరఫున విజయనగరానికి చెందిన నలుగురు క్రీడాకారులు కె.అప్పలరాజు, జి.రాధ, కె.పవన్‌కుమార్, వై.ప్రవల్లికలు పాల్గొనేందుకు అర్హత సాధించారు. ఈ మేరకు జాతీయ పోటీలకు అర్హత సాధించిన క్రీడాకారులను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్.వెంకటేశ్వరరావు తన కార్యాలయంలో అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో పతకాలు సాధించి విజయనగరం జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావడంతో పాటు ఉజ్వల భవిష్యత్‌కు బాటలు వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఫెన్సింగ్ అసోసియేషన్ ముఖ్య శిక్షకుడు డీవీ చారిప్రసాద్ పాల్గొన్నారు. -
ఘనంగా వైభవ్ జ్యూయలర్స్ ప్రారంభం
సాలూరు: పట్టణంలో వైభవ్ జ్యూయలరీ షోరూమ్‌ను బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్పీ మాధవరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్‌లు హాజరై షోరూమ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, సాలూరు పరిసర ప్రాంతాల ప్రజలకు ఈ జ్యూయలర్స్ షోరూమ్‌ను అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామమన్నారు. సంస్థ అసిస్టెంట్ వైస్‌ప్రెసిడెంట్ రఘునాఽథ్ మాట్లాడుతూ వినియోగదారులకు అద్భుత శ్రేణి షాపింగ్ అనుభవంతో పాటు విస్తృత శ్రేణిలో 916 హాల్మార్క్డ్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ డైమండ్స్ తదితర ఆభరణాలు అందించాలనే ఉద్దేశంతో ఈ షోరూమ్‌ను సాలూరులో ప్రారంభించామన్నారు. కార్యక్రమంలో వైభవ్ సంస్థల సీఎండీ గ్రంధి భారత మల్లికా రత్నకుమారి, సీఈఓ గొంట్ల రాఖాల్ తదితరులు పాల్గొన్నారు.డీసీహెచ్ఎస్లో ఖాళీ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం ఫోర్ట్: జిల్లా ఆస్పత్రుల సేవల సమన్వయాధికారి (డీసీహెచ్ఎస్) పరిధిలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డీసీహెచ్ఎస్ డాక్టర్ జీవీ రాజ్యలక్ష్మి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ పద్దతిలో ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దరఖాస్తులను 21వతేదీ సాయంత్రం 5 గంటల లోగా ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఉన్న డీసీహెచ్ఎస్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఇతర వివరాలకు విజయనగరం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో చూసుకోవాలని కోరారు. యువకుడిపై పోక్సో కేసు నమోదుపార్వతీపురం రూరల్: అమ్మాయిని మోసం చేసిన కేసులో పార్వతీపురం మండలం జమదాల గ్రామానికి చెందిన ఓ యువకుడిపై పోక్సో కేసు నమోదు చేశామని పార్వతీపురం రూరల్ ఎస్సై బి.సంతోషి బుధవారం తెలిపా రు. అదే గ్రామానికి చెందిన బాధితురాలు పో లీసులకు చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఉగాది పురస్కారాలకు దరఖాస్తుల ఆహ్వానంవిజయనగరం టౌన్: శ్రీ విశ్వావసు నామ తెలుగు సంవత్సరం ఉగాది 2025 పండగ పర్వదిన శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఉభయ తెలుగు రాష్ట్రాలు, ఉమ్మడి విజయనగరం జిల్లాలోని మారుమూల పల్లెలు, పట్టణాల్లో మట్టిలో మాణిక్యాల్లా దాగి ఉన్న కవులు, కళాకారుల, రచయితలు, విద్యావంతులు, ఉపాధ్యాయులు, మేధావులు, వైద్యులు, సమాజ సేవకులు, ఆధ్యాత్మిక, యోగా గురువులు, కార్మికులు, కర్షకులు, క్రీడాకారుల ప్రతిభ ను సేవలను గుర్తించి వారికి ‘శ్రీ విశ్వావసు నా మ సంవత్సర ఉగాది– 2025 పురస్కారాన్ని‘ ఇచ్చి ఘనంగా సన్మానించి సత్కరించనున్నట్లు ‘ఆల్ ది బెస్ట్ ఆర్ట్స్ అకాడమీ‘ (సాహిత్య, సాంస్కృతిక, సామాజిక సేవా సంస్థ డైరెక్టర్ ఈఎస్ ఎస్ నారాయణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాజసేవ, పర్యావరణ పరిరక్షణ, వృద్ధులు, దివ్యాంగులు, విద్య, వైద్యం, సాహిత్యం, సంగీతం, నృత్యం, కళలు, క్రీడలు, కరాటే, ఆధ్యాత్మికం, వ్యవసాయం, ఉపాధి కల్పన, నాటకరంగం, టీవీ సినీరంగాల్లో సేవలందిస్తున్న వారు, ప్రతిభావంతులు, పురస్కారాల ఎంపిక కోసం వారి సేవలను, ప్రతిభను, గురించి తెలియచేసే వివరాలు పంపించాలని కోరారు. వివరాలకు ఫోన్ 9652347207నంబర్‌ను సంప్రదించాలని సూచించారు. ఆటో నుంచి జారిపడి ఆరోగ్యమిత్ర మృతిబొబ్బిలి రూరల్: మండలంలోని పక్కి గ్రామానికి చెందిన సీర గౌరినాయుడు(58) ప్రమాదవశాత్తు ఆటో నుంచి జారిపడి మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బొబ్బిలి సీహెచ్‌సీలో ఆరోగ్యమిత్రగా పనిచేస్తున్న గౌరినాయుడు మంగళవారం విధులు ముగించుకుని స్వగ్రామానికి ఆటోలో వెళ్తుండగా పక్కి గ్రామసమీపంలో ఆటోలోంచి జారి పడడంతో తలకు తీవ్రగాయమైంది. స్థానికులు సీహెచ్‌సీకి తరలించగా ప్రాథమిక చికిత్సను అందించిన అనంతరం మెరుగైన చికిత్సకోసం విశాఖలో ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. మృతుడికి భార్య సరస్వతితో పాటు 10ఏళ్ల బాలుడు,4ఏళ్ల పాప ఉన్నారు. సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
తడి నేలల పరిరక్షణకు కృషి చేయాలి
విజయనగరం అర్బన్: జిల్లాలోని చెరుపులు, కాలువలు తదితర జలావాసాలు, తడి నేలల పరిరక్షణకు కృషి చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చెప్పారు. దీని కోసం ముందుగా చెరువులు తదితర జలవనరుల సమగ్ర సర్వే నిర్వహించాలని సూచించారు. జిల్లా తడి నేలల (వెబ్ ల్యాండ్స్) కమిటీ సమావేశం బుధవారం కలెక్టరేట్లో జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముందుగా జిల్లాలోని చెరువులు, కాలువలు తదితర తడి నేలలను సర్వే చేసి జాబితా తయారు చేయాలని సూచించారు. పీఎంఏవై ఇళ్ల నిర్మాణానికి అదనపు సహాయం ప్రధాన మంత్రి ఆవాస్ యోజన గ్రామీణ, అర్బన్, పీఎంజన్‌మన్ పథకాల కింద గతంలో మంజూరై నిర్మాణం మధ్యలో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సహాయాన్ని ప్రకటించిందని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వెల్లడించారు. రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన అదనపు ఆర్ధిక సహాయం వల్ల జిల్లాలో 12,240 మంది బీసీలకు, 2,231 మంది ఎస్సీలకు ఒక్కో ఇంటికి రూ.50 వేల వంతున ఆర్థిక సహాయం అందిస్తారని తెలిపారు. 565 మంది షెడ్యూల్డ్ తెగల వారికి రూ.75 వేలు వంతున, 190 మంది ఆదిమతెగల వారికి పీఎంజన్మాన్ కింద ఇళ్ల నిర్మాణాలకు ఒక్కో ఇంటికి రూ.లక్ష వంతున ఆర్థిక సహాయం అందించనున్నట్లు చెప్పారు. కలెక్టర్ డాక్టర్ బీఆర్అంబేడ్కర్ -
పారా అథ్లెటిక్స్‌లో రాణించిన లలిత
విజయనగరం: న్యూ ఢిల్లీ వేదికగా ప్రారంభమైన ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2025 పోటీల్లో 1500 మీటర్ల పరుగు పందెంలో ఉమ్మడి విజయనగరం జిల్లా క్రీడాకారిణి కిల్లక లలిత కాంస్య పతకం గెలుచుకుంది. ఆమె గెలుపు జిల్లాకు గర్వకారణమని పారా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా గౌరవ అధ్యక్షుడు కె.దయానంద్ అన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన మాట్లాడుతూ ఈ పోటీల్లో 20 దేశాలకు చెందిన పారా క్రీడాకారులు పాల్గొన్నారని, గట్టి పోటీలో సైతం అసామాన్య ప్రతిభ కనబరచిన లలిత తానేంటో నిరూపించడమే కాకుండా అంతర్జాతీయస్థాయిలో విజయనగరం పేరు మారుమోగేలా చేసిందని ప్రశంసించారు. ఈ పతకం మన రాష్ట్ర క్రీడాకారుల్లో కొత్త ఉత్సాహన్ని నింపిందని, ఇతర విభాగాల్లోనూ ఆమె పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. అంతర్జాతీయ స్థాయిలో పతకం సాధించిన లలితకు కలెక్టర్ డాక్టర్. బీఆర్.అంబేడ్కర్, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావులు అభినందనలు తెలియజేశారని చెప్పారు. కాంస్య పతకం కై వసం -
కిడ్నీల పట్ల శ్రద్ధ చూపాలి
● నొప్పి మాత్రలు ఎక్కువగా వాడడం వల్ల కిడ్నీ సమస్యలు ● నెలకు 1200 నుంచి 1500 వరకు కేసుల నమోదు విజయనగరం ఫోర్ట్: మానవ శరీరంలో కిడ్నీలు అతి ముఖ్యమైనవి. కిడ్నీ సమస్యలపై అశ్రద్ధ చేస్తే మృత్యువాతపడే ప్రమాదం ఉంది. కిడ్నీల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలి. కిడ్నీ సమస్యలు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కిడ్నీ సమస్యలు తలెత్తిన వెంటనే చికిత్స చేయించుకుంటే సురక్షితంగా జీవించవచ్చు. ప్రతి10 మందిలో ఒకరు కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నట్లు పలు ఆధ్యయనాల్లో తేలింది. గురువారం ప్రపంచ కిడ్నీ దినోత్సవం. అధిక రక్తపోటు, మధుమేహం, స్థూలకాయం, అంటు వ్యాధులు, మాదక ద్రవ్యాల వినియోగం మూత్ర పిండాల వ్యాధికి ప్రధాన కారణం. నొప్పి మాత్రలు అధికంగా వాడడం, కిడ్నీలో రాళ్లు పెరగడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. కిడ్నీ వ్యాధి వల్ల కలిగే సమస్యలు కిడ్నీ వ్యాధిగ్రస్తులకు గుండెపోటు, స్ట్రోక్, అధిక రక్తపోటు, బలహీనమైన ఎముకలు, గుండె వ్యాధి, కిడ్నీ వైఫల్యం(చివరి దశ మూత్ర పిండ వ్యాధి) సమస్యలు వస్తాయి. పింక్, డార్క్ మూత్రం(మూత్రంలో రక్తం) కష్టమైన బాధాకరమైన మూత్రవిసర్జన, అధిక మూత్ర విసర్జన, దాహం పెరగడం అలసట, బలహీనత, ఉబ్బిన చేతులు, ముఖం, పాదాలు, నురుగుమూత్రం కిడ్నీ వ్యాధి లక్షణాలు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు: ఆరోగ్యకరమైన జీవన శైలి నిర్వహించడం ద్వారా వ్యాధి బారిన పడకుండా ఉండవచ్చు. క్రమం తప్పకుండా వ్యాయమం చేయాలి. బరువును నియంత్రించుకుని, సమత్యుల ఆహారం తీసుకోవాలి. ధూమపానానికి దూరంగా ఉండాలి. కొలెస్ట్రాల్ స్థాయిలను పర్యవేక్షించుకోవడం, వార్షిక శారీరక ఆరోగ్య పరీక్షలు చేయంచుకోవాలి. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకోవాలి. మూత్ర పిండ వ్యాధిని గుర్తించడానికి స్క్రీనింగ్ చేయించుకోవాలి. నెలకు 1200 నుంచి 1500 వరకు రోగుల నమోదు జిల్లాలో కిడ్నీ సంబంధిత వ్యాధులతో నెలకు వందలాది మంది ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులకు వస్తున్నారు. నెలకు 1200 నుంచి 1500 మంది వరకు రోగులు ఆస్పత్రుల్లో నమోదవుతున్నారు. కిడ్నీలు పాడై డయాలసిస్ చేయించుకున్న రోగులు 400 నుంచి 500 మంది వరకు ఉన్నారు. కిడ్నీ సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల కిడ్నీ వ్యాధి గ్రస్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. వ్యాధిని ప్రారంభ దశలో గుర్తించలేక పోవడం వల్ల వారు డయాలసిస్ చేయించుకోవాల్సిన పరిస్థితికి వస్తున్నారు.బీపీ, సుగర్ అదుపులో ఉంచుకోవాలి కిడ్నీ సమస్యలను ప్రాధమిక దశలో గుర్తిస్తే వ్యాధితీవ్రతను తగ్గించవచ్చు. బీపీ, సుగర్ వంటి వ్యాధులను అదుపులో ఉంచుకోవాలి. శారీరక శ్రమ ఉండేందుకు ప్రతిరోజూ వ్యాయమం చేయాలి. సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. శరీరంలో కొవ్వు పరిస్థితిని ఆరోగ్య పరీక్షల ద్వారా తెలుసుకోవాలి. కిడ్నీలో రాళ్లు పెరగకుండా చూసుకోవాలి. నొప్పిమాత్రలు అధికంగా వాడడం వల్ల కూడా కిడ్నీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. డాక్టర్ రెడ్డి శివకుమార్, నెఫ్రాలజిస్టు, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి -
జూడో రాష్ట్రస్థాయి పోటీలకు కేజీబీవీ విద్యార్థులు
నెల్లిమర్ల: పట్టణంలోని కేజీబీవీ విద్యార్థులు జూడో రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు.ఈ నెల 15, 16 తేదీల్లో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ జూడో పోటీలకు జిల్లా నుంచి మహిళల విభాగంలో ఈ పాఠశాలకు చెందిన జె కావ్య, పి పావని, పి జ్యోత్స్న రాణి, ఎస్.ఢిల్లీశ్వరి, కె భార్గవి, బి.దీపిక, సత్య, అనూష, జయలక్ష్మి ఎంపికై నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ ఉమ తెలిపారు. వారిని పీఈటీ రమణి, ఉపాధ్యాయినులు అభినందించారు.అంతర రాష్ట్ర ఫెన్సింగ్ క్రీడలకు విద్యార్థి ఎంపికవిజయనగరం అర్బన్: కేరళలో ఈ నెల 14 నుంచి 18వ తేదీ వరకు జరిగే ఫెన్సింగ్ క్రీడలో అంతర్ రాష్ట్ర పోటీలకు పట్టణానికి చెందిన సత్య డిగ్రీ/ పీజీ కళాశాల విద్యార్థి కె.పవన్‌కుమార్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎంవీసాయిదేవమణి మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.ఎంపికై న విద్యార్థిని కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం.శశిభూషణరావు, కళాశాల అధ్యాపకులు అభినందించారు. రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికనెల్లిమర్ల: నెల్లిమర్ల నగర పంచాయతీ పరిధి జరజాపుపేట ఉన్నత పాఠశాల విద్యార్థి మద్దిల మోహనకృష్ణ రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ నెల 14వ తేదీ నుంచి కడప జిల్లాలో జరిగే ఉమ్మడి బాలబాలికల చాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా జట్టు తరఫున పాల్గొంటాడు. మోహనకృష్ణను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రేవల్ల ఆదినారాయణ, వ్యాయామ ఉపాధ్యాయుడు నడిపేన సూర్యనారాయణ, ఉపాధ్యాయులు అభినందించారు. ఇంటి స్థలం కోసం తల్లి, సోదరుడిపై దాడివిజయనగరం క్రైమ్: విజయనగరం మండలంలోని ముడిదాంలో ఇంటి జాగా కోసం కన్నతల్లిపైనే దాడి చేశాడు ఓ మాజీ ఆర్మీ జవాన్. అలాగే అడ్డువచ్చిన అన్నపైన కూడా దాడికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించి రూరల్ ఎస్సై అశోక్ మంగళవారం రాత్రి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసు వివరాలిలా ఉన్నాయి. ముడిదాంకు చెందిన మజ్జి పైడితల్లికి ఇద్దరు కొడుకులు. చాలా రోజుల నుంచి ఇంటి జాగాపై అన్న దమ్ముల మధ్య గొడవలు జరుగుతునే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఆ తగాదా తారస్థాయికి చేరడంతో చిన్నకొడుకు, మాజీ సైనికుడు మజ్జి శివ దుశ్చర్యకు దిగాడు. తనకు ఇంటి జాగా ఇవ్వడం లేదని తల్లి, అన్న కలిసి అన్యాయం చేశారంటూ తల్లి, సోదరుడిపైనే దాడికి దిగాడు. ఇంట్లో ఉన్న ఓ ఆయుధంతో దాడి చేశాడు. ఈ సమాచారం తెలుసుకున్న సమీప బంధువు రూరల్ పోలీసులకు సమాచారం ఇవ్వగా ఎస్సై అశోక్ హుటాహుటిన ఘటనా స్థలికి వెళ్లి వివరాలు సేకరించారు. గాయాలపాలైన అందరినీ విజయనగరం సర్వజన ఆస్పత్రికి చికిత్స కోసం తరలించారు. అన్నపై దాడికి పాల్పడిన మాజీ ఆర్మీ జవాన్‌పై అన్న తాలూకా వారు దాడికి దిగడంతో శివ కూడా హాస్పిటల్ పాలయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న రూరల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.