విజయనగరం రూరల్: స్థానిక జేఎన్టీయూ – గురజాడ విశ్వవిద్యాలయంలో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగం, ఈఈఈ విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహించిన జాతీయ స్థాయి సాంకేతిక సదస్సులు మెక్నో– ఎంఎం–2026, ఎలక్ట్రిక్ – 2026 గురువారం ముగిశాయి. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జేఎన్‌టీయూ – జీవీ ఉపకులపతి వి.వి. సుబ్బారావు మాట్లాడుతూ యువ విద్యార్థులు సమాజానికి వారి పూర్తి సామర్థ్యానికి సేవ చేయడానికి నిరంతరం తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని సూచించారు. ఆధునిక సాంకేతిక అభివృద్ధి, పరిశ్రమలు, సమాజ అభివృద్ధిలో మెకానికల్ ఇంజినీరింగ్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. విద్యార్థులు ఈ రంగంలో నూతన ఆవిష్కరణలు చేయాలని సూచించారు. రిజిస్ట్రార్ జి.జయసుమ, ప్రిన్సిపాల్ కె.సి.బి.రావు, వైస్ ప్రిన్సిపాల్ డా. జి.జె.నాగరాజు, డాక్టర్ కె.శ్రీనివాస ప్రసాద్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్లు వి.మణికుమార్, డాక్టర్ సి.నీలిమా దేవి తదితరులు పాల్గొన్నారు.


