నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర

Mar 9 2026 7:45 AM | Updated on Mar 9 2026 7:45 AM

నేటి నుంచి కనకదుర్గమ్మ జాతర పూసపాటిరేగ : ఉత్తరాంధ్రలో ప్రసిద్ధిగాంచిన భోగాపురం కనకదుర్గమ్మ జాతర సోమవారం నుంచి మూడు రోజుల పా టు జరగనుంది. ఈ నెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు కనకదుర్గమ్మ అమ్మవారి జాతర జరపనున్నట్టు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. జాతరకు సంబంధించి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా నుంచే కాక ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు జాతరకు వస్తారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆలయం వద్ద దర్శనాని కి లైన్లు ఏర్పాటు చేశారు. భోగాపురం మెయిన్‌వీధి నుంచి ఆలయం వరకు ప్రత్యేకంగా విద్యు త్‌ అలంకరణ ఏర్పాటు చేశారు. మూడు రోజు లూ వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను కమి టీ సభ్యులు ఏర్పాటు చేశారు. పౌరాణిక, సాంఘిక కార్యక్రమాలతో పాటు ఆఖరి రోజు సంగిడిరాళ్లు పోటీలు నిర్వహించనున్నారు. జాతర కు భోగాపురం సీఐ దుర్గాప్రసాద్‌ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. అలరించిన ‘థింసా’ రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం రేపు

పార్వతీపురం రూరల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ఆదివారం మహిళా శక్తి కదం తొక్కింది. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ర్యాలీని కలెక్టర్‌ ప్రభాకరరెడ్డి, ఎస్పీ ఎస్‌వీ మాధవ్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ నుంచి నాలుగు రోడ్ల కూడలి వరకు సాగిన ఈ ప్రదర్శనలో విద్యార్థినులు, మహిళా పోలీసు లు, అంగన్‌వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మహిళా హక్కులపై నినాదాలు చేశా రు. కోలాటాలు, థింసా నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కార్యక్రమంలో జేసీ యశ్వంత్‌కుమార్‌రెడ్డి, ఏఎస్పీ మనీషారెడ్డి, ఐసీడీఎస్‌ అధికారి కనకదుర్గ తదితరులు పాల్గొన్నారు.

విజయనగరం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన రామనారాయణంలో ద్వాదశ వార్షికోత్సవం మంగళవారం ఘనంగా నిర్వహించనున్నట్టు ఎన్‌సీఎస్‌ ట్రస్టీ నారాయణం శ్రీనివాస్‌ తెలిపారు. ఈ మేరకు ఆలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వానప్రతులను ఆదివారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు చాణిక్య హర్ష, మేనేజర్‌ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement