టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ నేడు (ఏప్రిల్ 30)లో 39వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
ఒకప్పుడు జట్టులో స్థానం కోసం ఎదురుచూసిన రోహిత్.. ఇప్పుడు భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు.
భారత్‌కు రెండు ఐసీసీ ట్రోఫీలు అందించిన దిగ్గజ కెప్టెన్‌గా హిట్‌మ్యాన్ ఎదిగాడు.
అతడి సారథ్యంలోనే టీ20 ప్రపంచకప్-2024 (T20 WC 2024)తో పాటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025ని భారత్ సొంతం చేసుకుంది.
అంతేకాకుండా ఐపీఎల్‌లో కెప్టెన్‌గా ముంబై ఇండియన్స్‌కు ఐదు టైటిల్స్‌ను కూడా అందించాడు.
టెస్టుల్లో 4302, వన్డేల్లో 11168, టీ20లలో 4231 పరుగులు సాధించిన రోహిత్ శర్మ
వన్డేల్లో అత్యధికంగా మూడు డబుల్ సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా రోహిత్ శర్మ కొనసాగుతున్నాడు.
అంతేకాదు.. వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (264) సాధించిన క్రికెటర్‌గా కూడా రోహిత్ చరిత్రకెక్కాడు.


