Jagtial
-
యాప్ దా‘రుణాలు’
‘జగిత్యాల రూరల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడికి తల్లిదండ్రులు ఏడాది క్రితం సెల్‌ఫోన్ కొనిచ్చారు. ఆ బాలుడు ఓ యాప్ ద్వారా రూ.6 వేల రుణం తీసుకున్నాడు. రుణం చెల్లించకపోవడంతో బాలుడికి నిత్యం ఫోన్ చేస్తూ యాప్ నిర్వాహకులు బూతులు తిట్టారు. మరుసటి రోజు బాలుడి తండ్రికి కూడా ఫోన్‌చేసి నానా బూతులు తిట్టడంతో రుణం పూర్తిగా చెల్లించారు.’ రాయికల్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడు హైదరాబాద్‌లోని ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. కుటుంబ సభ్యులకు తెలియకుండా లోన్ యాప్ ద్వారా రూ.లక్ష రుణం తీసుకున్నాడు. వాటిని చెల్లించకపోవడంతో యాప్ నిర్వాహకులు వాట్సప్‌లో నానా బూతులు తిడుతూ మెసేజ్‌లు పెట్టారు. అతడి కుటుంబ సభ్యులకు కూడా ఫోన్ చేసి బెదిరించడంతో అప్పు తెచ్చి లోన్ చెల్లించారు. రెండుమూడు రోజుల తర్వాత యాప్ నిర్వాహకులు ఫోన్ చేసి మరో రూ.8 వేలు బాకీ ఉన్నాడని బెదిరించడంతో ఆ మొత్తాన్ని కూడా చెల్లించారు. జగిత్యాలక్రైం: మైనర్లు, యువత వివిధ శ్రీయాప్శ్రీలలో రుణం తీసుకుని వాటిని చెల్లించలేక మానసిక క్షోభ అనుభవిస్తున్నారు. సెల్ఫోన్ల ద్వారా పాన్‌కార్డు, ఆధార్‌కార్డు నంబర్ ఇస్తే యాప్ నిర్వాహకులు ఫోన్‌పేకు రూ.5వేల నుంచి రూ.5 లక్షల వరకు అప్పు ఇస్తున్నారు. తీసుకున్న రుణాన్ని మైనర్లు, యువత ఖర్చు చేసి.. తిరిగి చెల్లించేందుకు డబ్బు లేక నానా ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు యాప్ రుణదారులు సదరు వ్యక్తులకు ఫోన్ చేసి దుర్భషలాడుతున్నారు. రుణాలు తీసుకునేటప్పుడు వారి సెల్‌నంబరుతో పాటు సమీప బంధువుల సెల్‌నంబరు కూడా యాప్ రుణదారులు సేకరిస్తున్నారు. రుణం చెల్లించని సమయంలో సమీప వ్యక్తికి ఫోన్ చేసి దుర్భషలాడుతున్నారు. ఆ నోటా ఈనోటా కుటుంబసభ్యులకు తెలిసి.. పిల్లల బతుకులు ఆగమవుతున్నాయని ఆందోళనచెందుతున్నారు. అప్పు చెల్లించుకుంటే తీవ్ర వేధింపులు యాప్ ద్వారా రుణం తీసుకున్న వారు సకాలంలో రుణాలు చెల్లించకపోతే అప్పు చెల్లించడం లేదంటూ వాట్సప్ గ్రూపుల్లో పోస్టులు పెడుతున్నారు. సమీప బంధువులకు కూడా మెసేజ్‌లు చేస్తూ తీవ్ర ఇబ్బంది పెడుతున్నారు. -
ధర పెరగడం లేదు
ఈసారి పురుగులు, తెగుళ్లతో కాయలపై మంగు(నల్లని మచ్చలు) వస్తున్నాయి. ఆ కాయలను ఎవరూ కొనడం లేదు. ఢిల్లీ వ్యాపారులు కొనుగోలుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. రేట్లు అంతంతమాత్రంగానే ఉన్నాయి. కిలో రూ.30 నుంచి రూ.35 మధ్యనే ఉంటున్నాయి. – ఎండీ.మోయిన్, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు, జగిత్యాలపెద్దకాయలు రావడం లేదు ఈ ఏడాది వాతావరణ మార్పులతో మామిడికాయలు పెద్దగా మార్కెట్‌కు రావడం లేదు. గతంలో జిల్లా నుంచి కనీసం 40 నుంచి 50లారీలు ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఇప్పుడు 10 నుంచి15కు మించడం లేదు. గల్ఫ్‌దేశాలకు ఎగుమతి లేకపోవడంతో ధరల మందగించాయి. – ప్రకాశ్, జిల్లా మార్కెటింగ్ అధికారి -
అకాడమ్మీల దోపిడీ
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో అకాడమీల పేరుతో ఇంటర్ చదువును వ్యాపారంగా మార్చుతున్నారు. ఎడ్యుకేషన్ సొసైటీలు, కోచింగ్ సెంటర్ల పేరిట విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇంటర్ బోర్డు, విద్యాశాఖ అనుమతి లేకుండా ఐఐటీ, జేఈఈ, నీట్ అకాడమీ అంటూ సామాన్యుల జేబులు గుల్ల చేస్తున్నారు. భారీ హోర్డింగులతో ప్రచారం చేస్తూ బురిడీ కొట్టిస్తున్నారు. కరీంనగర్ జిల్లాకేంద్రంగా నిర్వహిస్తున్న బన్సాల్ క్లాసెస్, ఆకాశ్ ఇనిస్టిట్యూట్‌కు అనుమతి లేదని, ఐఐటీ, నీట్, ఎఫ్‌సెట్ అకాడమీలు ఇంటర్ బోర్డు పరిధిలోకి రావని, వాటిలో విద్యార్థులు ప్రవేశాలు పొంది మోసపోవద్దని, తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలించి అనుమతి ఉన్న కళాశాలల్లో చేర్పించాలని డీఐఈవో ఆంజనేయరావు ఒక ప్రకటన విడుదల చేయడం గమనార్హం. మాయలో తల్లిదండ్రులు కరీంనగర్‌లోని ఆకాశ్ ఇనిస్టిట్యూట్, బన్సాల్ క్లాసెస్ పేరిట ఉన్న కళాశాలలు ఐఐటీ, జేఈఈ, ఎన్ఐటీ, నీట్ ద్వారా మెడికల్ సీట్లు వచ్చేలా కోచింగ్ ఇస్తామని విద్యార్థులు వారి తల్లిదండ్రులను నమ్మిస్తున్నాయి. అడ్మిషన్లు తక్కువయ్యే ప్రైవేటు జూనియర్ కళాశాలల నుంచి విద్యార్థులను తీసుకుంటూ.. అదే కళాశాల ద్వారా పరీక్షలు రాయిస్తున్నారు. తరగతులు మాత్రం అకాడమీల్లో నిర్వహిస్తున్నారు. ఇందుకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.3లక్షల వరకు వసూలు చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఇంటర్‌బోర్డు అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. నగరంలో పుట్టగొడుగుల్లా.. కరీంనగర్ కేంద్రంగా అనుమతి లేని అకాడమీలు, కోచింగ్ సెంటర్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అడ్మిషన్ తీసుకుంటే చాలు అంతా తామే చూసుకుంటామని, ఇచ్చే ఫీజును బట్టి సర్టిఫికెట్ చేతిలో పెడతామని ఆఫర్ ఇస్తున్నారు. ఎక్కడో ఒకచోట బిల్డింగ్ అద్దెకు తీసుకోవడం.. విద్యాశాఖ అనుమతి లేకుండా ఎడ్యుకేషనల్ అకాడమీ పెట్టడం.. ఎవరైనా ఫిర్యాదు చేస్తే బోర్డు తిప్పేయడం ఇక్కడ సాధారణమైపోయింది. ఎలాగోలా పిల్లలతో డిగ్రీ పూర్తి చేయించాలనుకునే తల్లిదండ్రులు, కళాశాలకు వెళ్లకుండా.. పరీక్షలు రాయకుండా పాస్ కావాలనుకునే యువతను టార్గెట్ చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి తమ వద్ద చేర్చుకుని హాస్టల్ పేరిట తమవద్దే ఉంచుకుంటారు. పరీక్ష రాసేందుకు వీలుపడని వారుంటే వారి నుంచి ప్రత్యేకంగా నగదు తీసుకుని ‘మమ’ అనిపిస్తున్నారు. పదుల సంఖ్యలో కేంద్రాలు కరీంనగర్ జిల్లాకేంద్రంలో సుమారు 20.. ఉమ్మడి జిల్లాల్లో మరో 40 కోచింగ్ సెంటర్లు, అకాడమీలు విద్యాశాఖ అనుమతి లేకుండా నడుస్తున్నాయని ఎంఈవోల రహస్య సర్వే ద్వారా విద్యాశాఖ గుర్తించింది. చాలా సెంటర్లలో నవోదయ, కోరుకొండ, గురుకులం విద్యాలయాల ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్యుటోరియల్స్ అనుమతి లేకుండా నడుస్తున్నాయని నివేదిక ఇచ్చారు. ఈ నిబంధనలు తప్పనిసరి ● అకాడమీల్లో శిక్షణకు వచ్చే వారంతా కూర్చోవడానికి అనుకూలమైన కుర్చీలు, బల్లలు ఉండాలి ● విశాలమైన శిక్షణ గదులు, గాలి, వెలుతురు, విద్యుత్ సౌకర్యం కల్పించాలి ● విద్యార్థులకు సరిపడా మూత్రశాలలు ఉండాలి ● గ్రంథాలయం తప్పనిసరి ● శిక్షకుల విద్యార్హతల సర్టిఫికెట్లు విద్యాశాఖ అధికారులకు అందుబాటులో ఉండాలి ● బోధకుల విద్యార్హతల్లో తేడా ఉంటే చట్ట ప్రకారం చర్యలు తప్పనిసరి చేస్తూ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ అదేశాలు జారీ చేసినా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు.జిల్లాలో అనుమతిలేని అకాడమీలు, కోచింగ్ సెంటర్లలో ప్రవేశాలు పొంది విద్యార్థులు మోసపోవద్దు. జిల్లా కేంద్రంలోని ఆకాష్, బన్సాల్ లాంటి అకాడమీలకు ప్రభుత్వ గుర్తింపు లేదు. ప్రభుత్వ గుర్తింపు ఉన్న ఇంటర్ కళాశాలల్లోనే పిల్లలను చేర్పించాలి. – వి.ఆంజనేయరావు, డీఐఈవో, కరీంనగర్ -
ఎప్‌సెట్‌లో మోరపల్లి విద్యార్థికి 308 ర్యాంక్
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి సర్పంచ్ కట్ట రాజేందర్, జమున దంపతుల కుమారుడు హితేష్ ఆదివారం వెలువడిన ఎప్‌సెట్ ఫలితాల్లో రాష్ట్రస్థాయిలో 308వ ర్యాంక్ సాధించాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివిన హితేష్ ఇంటర్లో 995 మార్కులు సాధించాడు. జేఈఈ మెయిన్స్‌లో 99.77 శాతం పర్సంటైల్ సాధించాడు. హితేష్‌ను గ్రామస్తులు అభినందించారు. డీసీఎంఎస్ అధికారి నిలదీతఇబ్రహీంపట్నం: మక్కల కొనుగోలులో జాప్యంపై డీసీఎంఎస్ అధికారి రాజేందర్‌ను రైతులు ఆదివారం నిలదీశారు. తేమశాతం వచ్చి నెల అవుతున్నా.. కాంటా వేయడం లేదని, సీరియల్ పాటించడం లేదని గొడవకు దిగారు. గన్నీ సంచులు లేకపోవడంతో తామే తెచ్చుకున్నామని, అయినా ఎందుకు తూకం వేయడం లేదని ప్రశ్నించారు. -
చెరువులకు మహర్దశ
జగిత్యాల: మున్సిపాలిటీల్లో చెరువులు ఎక్కువగా కలుషితం అవడంతోపాటు.. పిచ్చిమొక్కలతో కళాహీనంగా మారాయి. వీటిని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమృత్ 2.0 పథకం కింద నిధులు మంజూరు చేసింది. లక్షకు పైగా జనాభా ఉన్న మున్సిపాలిటీలకు రెండు చెరువులకు మంజూరు చేయగా.. మిగతా చోట్ల ఒక్కో చెరువుకు నిధులు మంజూరయ్యాయి. జగిత్యాలలోని రెండు చెరువులు, రాయికల్‌లో ఒకటి, ధర్మపురిలో ఒకటి, కోరుట్లలో ఒకటి, మెట్పల్లిలో ఒక చెరువుకు కలిపి రూ.18.84 కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఇందుకు సంబంధించిన టెండర్లు కూడా పూర్తయ్యాయి. పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. అమృత్ 2.0 పథకం కింద గత నాలుగు నెలల క్రితమే నిధులు మంజూరైనప్పటికీ 45 చెరువులకు ఒకేసారి టెండర్ నిర్వహించడం, ఎవరూ ముందుకు రాకపోవడంతో జాప్యం జరిగింది. ఈసారి పలు ఏజెన్సీలు ముందుకు రాకపోవడంతో టెండర్ ప్రక్రియ పూర్తి కావడం, పనులు సైతం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. 18 నెలల్లో పూర్తి జిల్లా కేంద్రంలోని మోతె, చింతకుంట చెరువు, రాయికల్, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి చెరువుల్లో పనులు ప్రారంభించారు. ఈ పనులన్నీ 18 నెలల్లో పూర్తి చేయాల్సి ఉంది. ముందుగా ఈ చెరువులకు ప్రొటెక్షన్ చేయనున్నారు. చెరువులు కలుషితం కాకుండా డ్రైనేజీల నిర్మాణంతోపాటు, బండ్వాల్ ఏర్పాటు చేయనున్నారు. వాకింగ్ ట్రాక్ వంటివి ఏర్పాటు చేసుకుని మొత్తం చెరువులకు ప్రొటెక్షన్ ఇవ్వనున్నారు. పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోనున్నారు. ఇటీవలే జిల్లా కేంద్రంలోని మోతె చెరువులో పనులు ప్రారంభించారు. కలుషితంతో కళాహీనం మున్సిపాలిటీల్లో చెరువులు పూర్తిగా కళాహీనంగా మారాయి. సివరేజీ ట్రీట్‌మెంట్‌ప్లాంట్ లేకపోవడం, డ్రైనేజీ నీరంతా ఈ చెరువులోకి వెళ్లి నీరంతా కలుషితం కావడంతో అటు మత్స్యకారులు, ఇటు తాగడానికి నీరు కూడా ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో చెరువులు పర్యటక కేంద్రాలుగా మారనున్నాయి. చెరువు కబ్జా ఎక్కువగానేవాస్తవానికి చెరువులు తాగునీటి అవసరాలు, భూగర్భజలాల పెంపునకు ఉపయోగపడాలి. కానీ మున్సిపాలిటీల్లో వెలువడే వ్యర్థపు నీరంతా ఈ చెరువులోకి వెళ్లడం, కొందరు ఆ చెరువుల్లోనే చికెన్ వ్యర్థాలు, చెత్తాచెదారం పడేయడంతో పిచ్చిమొక్కలతో నిండిపోయాయి. భూములకు రెక్కలు రావడంతో చెరువుల్లోని పిచ్చిమొక్కలను తొలగిస్తూ, చదును చేస్తూ కబ్జాకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు కావడం, టెండర్లు సైతం పూర్తి కావడం, ముందుగా చెరువుకు ప్రొటెక్షన్ ఏర్పాటు చేసి అనంతరం సుందరీకరణ చేపట్టనున్నారు. 18 నెలల్లో చెరువుల రూపురేఖలే మారనున్నాయి. అమృత్–2 పథకం కింద చెరువుల పునర్జీవానికి సంబంధించి పనులు ప్రారంభమయ్యాయి. జిల్లాలో జగిత్యాలలో 2 చెరువులకు నిధులు మంజూరు కాగా.. మిగతా మున్సిపాలిటీల్లో ఒక్కొక్కటి మంజూరయ్యాయి. చెరువులు సుందరంగా మారుతాయి. 18 నెలల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ముందుగా చెరువుల ప్రొటెక్షన్ చేసి పర్యాటక కేంద్రంగా మారుస్తాం. – వరుణ్, పబ్లిక్ హెల్త్ మున్సిపల్ ఇంజినీరింగ్ డీఈ -
ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన విద్య
జగిత్యాల: విద్యావ్యవస్థను పటిష్టం చేయాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పాఠశాలల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఆదివారం కలెక్టరేట్లో ఎమ్మెల్యేతో కలిసి సన్మానించారు. రెండేళ్లుగా విద్యారంగంపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. టాయిలెట్స్, అదనపు తరగతి గదులు, మంచినీటి సౌకర్యం కల్పించామన్నారు. ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయుల కష్టఫలితంగానే జిల్లా టెన్త్ ఫలితాల్లో నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడు తూ జిల్లాకు మూడు తెలంగాణ పబ్లిక్ స్కూల్లు, ఇంటిగ్రెటెడ్ స్కూల్ ఏర్పాటు చేశామన్నారు. సారంగాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన రిత్వికకు రూ.10వేలు అందించా రు. డీఈవో రాము, నోడల్ అధికారి నారాయణ, డీఆర్డీవో రఘువరణ్, గ్రంథాలయ చైర్మన్ దినేష్, ఎంఈవో కిషర్, కేజీబీవీ పాఠశాల ప్రత్యేకాధికారి వీణ, పీడీ రవీందర్ ఉన్నారు. మక్కల కేంద్రాలు పెంచండిజగిత్యాలరూరల్: మక్కల కొనుగోలు కేంద్రాలు పెంచి దళారుల వ్యవస్థను నిర్మూలించాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాలరూరల్ మండలం లక్ష్మీపూర్‌లో రైతు సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగో లు కేంద్రాన్ని ఆదివారం పరిశీలించారు. ప్రభుత్వం మక్కల కొనుగోలులో జాప్యం చేయడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అకాల వర్షాలు కురిస్తే తీవ్ర నష్టం వాటిల్లుతుందని పేర్కొన్నారు. కేసీఆర్ హయాంలో ఐదు వే ల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి ఏఈవో ను నియమించి రైతులు పండించిన పంటల వివరాలను నమోదు చేయించారని, తద్వారా పంటల కొనుగోలులో ఇబ్బంది రాలేదని తెలి పారు. ఇప్పుడున్న ప్రభుత్వానికి, నాయకులకు ప్రణాళిక లేదన్నారు. సర్పంచ్ నల్ల కవిత, నాయకులు స్వామిరెడ్డి, లక్ష్మణ్, తిరుపతి, స్వామి, నరేశ్‌గౌడ్, శేఖర్ పాల్గొన్నారు. రైతుల గోడు పట్టదా..?మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని రైతులు ఆదివారం రోడ్డెక్కారు. వీరికి భారతీయ కిసాన్‌సంఘ్ మద్దతు ప్రకటించింది. సంఘ్ జిల్లా అధ్యక్షుడు కాసారపు భూమారెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతున్నాయని, పంట అమ్ముకునేందుకు ఇబ్బంది పడడమేంటని ప్రశ్నించారు. తరుగు పేరిట నిర్వాహకులు, మిల్లర్లు దోచుకుంటున్నారని తెలిపారు. ఇంత జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తోందని తెలిపారు. ఎస్సై అనిల్ ఘటన స్థలానికి చేరుకుని రైతులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. మాజీ ఎంపీటీసీ మొరపు గంగరాజం, సంఘ్ మండల అధ్యక్షు డు కళ్లెం మహిపాల్, పట్టణ అధ్యక్షుడు పోచంపల్లి రమేశ్‌రెడ్డి, కార్యదర్శి ఏనుగు ఆనంద్‌రెడ్డి, రైతులు బద్దం హరీష్‌రెడ్డి, మామిడి తుక్కారెడ్డి, సార లింగారెడ్డి, గోపిడి చిన్నారెడ్డి, కనుక మోహన్, రాజేందర్, నరేష్ పాల్గొన్నారు. కొనుగోళ్ల జాప్యంపై ధర్నాకథలాపూర్: ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ మండలంలోని చింతకుంటలో రైతులు ఆదివారం ధర్నా చేశారు. కోరుట్ల– వేములవాడ రోడ్డుపై చింతకుంట క్రాస్ రోడ్డు వద్ద బైఠాయించారు. నెలరోజులు దాటినా తూకం వేయడంలేదని మండిపడ్డారు. ధాన్యం కొనడంలో ప్రభుత్వం విఫలమైందని, రైతులను పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు వచ్చి ఆందోళన చేస్తున్న రైతులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సర్పంచ్ నాగం భూమయ్య, రైతు నాయకులు జెల్ల వేణుగోపాల్, పోకతోట లింబాద్రి, సోమ దేవేందర్‌రెడ్డి, చెదలు శేఖర్, తిరుపతిరెడ్డి, భూమారెడ్డి, జలందర్ పాల్గొన్నారు. -
మామిడి కొనుగోళ్లకు ఢిల్లీ వ్యాపారులు దూరం
జగిత్యాలఅగ్రికల్చర్: ఒకప్పుడు మామిడికాయలతో కళకళలాడే జగిత్యాల మార్కెట్‌కు ఈ ఏడాది అనుకున్న స్థాయిలో కాయలు రాకపోవడంతో కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగుతున్నాయి. ఈ ఏడాది పురుగులు, తెగుళ్లతో దిగుబడి అంతంతమాత్రంగానే రావడం.. మామిడి కాయలపై నల్లమచ్చలు, ధర తగ్గుతుందనే భావనతో రైతులు పక్వానికి రాని కాయలు తెంపుతుండటంతో ఈ ఏడాది మామిడి కొనుగోళ్లకు ఢిల్లీతోపాటు ఉత్తరాది రాష్ట్రాల వ్యాపారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. సీజన్ ప్రారంభమై నెల దాటినా జగిత్యాల మార్కెట్లో కేవలం నాలుగు వేల నుంచి ఐదు వేల టన్నుల కాయలు మాత్రమే కొనుగోళ్లు సాగాయి. గిట్టుబాటు కాని ధరలు జిల్లాలో ఎక్కువగా బంగినపల్లి, దశేరి, హిమాయత్ వంటి మామిడి రకాలు సాగవుతాయి. ఈ ఏడాది అంతంతమాత్రంగానే కాయలు ఉన్నా మార్కెట్లో సరైన ధర లేదు. కిలోకు రూ.30 నుంచి రూ.35 మాత్రమే ధర పెడుతున్నారు. కాయపై మంగు, నల్లమచ్చలు అంటూ రేటును రూ.20కి తగ్గిస్తున్నారు. రైతులు తీసుకొచ్చిన కాయల్లో సైజ్ లేదని, రాటన్, సూట్ అంటూ రకరకాల పేర్లతో కాయలను గ్రేడింగ్ చేసి.. వ్యాపారులు తమకు తోచిన రేటును నిర్ణయిస్తున్నారు. ఫలితంగా తమకు కాయలు తెంపిన ఖర్చులు కూడా రావడం లేదని, రైతులు, లీజుదారులు గగ్గోలు పెడుతున్నారు. ఎకరాకు దాదాపు రూ.50వేల నుంచి రూ.60వేలు ఖర్చు పెట్టి.. ఏడెనిమిది సార్లు రసాయన మందులు పిచికారీ చేశారు. లీజుదారులు ధర లేక, రైతులకు డబ్బులు చెల్లించలేక నానాయాతన పడుతున్నారు. నిలిచిపోయిన ఎగుమతులు జిల్లా నుంచి మామిడి ఢిల్లీ వ్యాపారుల ద్వారా ఇరాన్, సౌదీఅరేబియా, ఖతార్, దుబాయ్ వంటి దేశాలకు చేరుతుంది. పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణంతో ఎగుమతులు నిలిచిపోయాయి. దీంతో మామిడికాయలను దేశీయంగా అమ్ముకో వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉత్తరాది రాష్ట్రాల్లో మామిడిపండ్లకు డిమాండ్ తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో ఒక్కో దుకాణం నుంచి రోజుకు 7 నుంచి8 లారీలు మామిడి లోడ్‌తో ఉత్తరాది రాష్ట్రాలకు వెళ్తే ఇప్పుడు ఒకట్రెండు కూడా వెళ్లే పరిస్థితి లేదు. ఏ రాష్ట్రానికి ఎగుమతి చేయాల న్నా కనీసం కాయ బరువు 250 నుంచి 300 గ్రాము ల బరువు ఉండాలి. అయితేనే మార్కెట్లో ధర పలుకుతుంది. ఇవేమీ పట్టించుకోకుండా కాయలను తెంపడం.. మార్కెట్‌కు తేవడం చేస్తున్నారు. కాయలపై నల్ల మచ్చలు పక్వానికి రాకముందే కోతలు ఉత్తరాది రాష్ట్రాలకు అంతంతమాత్రమే ఎగుమతి -
ఉత్తుత్తి డ్రైవింగ్ ట్రాక్
కోరుట్ల: ఆరు గుంటల స్థలం.. మూడు చోట్ల పనికి రాని టైర్లు.. వాటి మధ్య వంకర టింకరగా మట్టి గుంతల రోడ్డు. ఇదే కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో ఉన్న డ్రైవింగ్ ట్రాక్.. ఇంత చిన్న స్థలంలో ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్టా..? అని ఎవరైనా నోరెళ్లబెడితే చేసేదేం లేదు. ఇదే ట్రాక్‌లో నడిపితే నడపండి.. నడపకున్నా సరే.. కాసులు తీసుకుని డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించేందుకు కొంతమంది దళారులు రెడీగా ఉంటారు. 15 ఏళ్ల క్రితం.. పట్టణంలోని ఆదర్శనగర్‌లో సుమారు 15 ఏళ్ల క్రితం రోడ్ ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దాతల దయతో సమకూరిన ఆ భవనం ముందున్న ఆరు గుంటల స్థలంలోనే వాహనాలను నిలిపి ఫిట్నెస్, టూ వీలర్, ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్టులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి డ్రైవింగ్ ట్రాక్ కనీసం ఎకరం స్థలంలో ఉండాలి. రివర్స్ గేర్ పరిశీలన కోసం ‘హెచ్’ ట్రాక్, ఎయిట్ ట్రాక్ వంటి ప్రత్యేకమైన ఏర్పాట్లు ఉండాలి. యూటర్న్ వంటి ప్రత్యేకమైన ట్రాక్ ఉండాలి. ఇలా ఎలాంటి ఏర్పాట్లు లేకుండా కేవలం ఐదారు గుంటల స్థలంలో మూడు చోట్ల మూడు టైర్లు వేసి వాటి మధ్యలో నుంచి వాహనాలు నడపించి ఫోర్ వీలర్ డ్రైవింగ్ టెస్ట్ ఎలా పాస్ చేస్తున్నారో ఎవరికీ అంతుచిక్కని ప్రశ్న. 15 ఏళ్లుగా ఎలాంటి డ్రైవింగ్ ట్రాక్ లేకుండా ఇష్టారీతిన లైసెన్స్‌లు మంజూరు చేస్తున్న వైనం విడ్డూరం. ఈ లెక్కన ఇక్కడ అధికారులు ఫోర్ వీలర్, టూ వీలర్ డ్రైవింగ్ లైసెన్స్‌లు ఇచ్చే సమయంలో ఎలాంటి ప్రమాణాలు పట్టించుకోవడం లేదన్న విషయం స్పష్టమవుతోంది. ఇలా అడ్డగోలుగా లైసెన్స్‌లు పొందిన వారు రోడ్లపైకి వాహనాలను తెచ్చి ఎన్ని ప్రమాదాలకు కారకులవుతున్నారో తెలియని దుస్థితి. చూసీ చూడనట్లుగానే.. కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో డ్రైవింగ్ ట్రాక్ దుస్థితి ఇలా ఉంటే.. అధికార యంత్రాంగం టెస్ట్ డ్రైవింగ్ విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కార్యాలయం ముందు ఉండి లేనట్లుగా ఉన్న డ్రైవింగ్ ట్రాక్‌పై వాహనాలు నడిపే సమయంలో ఓ కానిస్టేబుల్ మాత్రమే పర్యవేక్షణ చేస్తున్నట్లు సమాచారం. సదరు కానిస్టేబుల్ పక్కన ఆర్టీఏ ఏజంట్లు ఉండి.. ‘మనోడే..’ అని సిగ్నల్ ఇస్తే చాలు డ్రైవింగ్ ట్రాక్ టెస్ట్ పాసయినట్లేనని ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సదరు దరఖాస్తులపై ఆర్టీఏ ఏజంట్లు వేసే ప్రత్యేకమైన చిహ్నాల ఆధారంగా దరఖాస్తుదారులు వాహనాలను నిబంధనల ప్రకారం నడిపినా.. నడపకున్నా పాస్ చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్టీఏ ఏజెంట్లు గట్టిగా అనుకుంటే దరఖాస్తుదారు డ్రైవింగ్ టెస్టులకు రాకున్నా లైసెన్స్ పొందే ‘ప్రత్యేక సదుపాయం’ ఇక్కడ ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. ఏదేమైనా కోరుట్ల ఆర్టీఏ కార్యాలయంలో నిబంధనల ప్రకారం పక్కాగా డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేసి లైసెన్స్‌ల జారీలో జాగ్రత్త వహించాల్సిన అవసరముంది. -
విద్యుత్ పొదుపుగా వాడాలి
కొత్తపల్లి: వినియోగదారులు విద్యుత్‌ను పొదుపుగా వాడి ఆర్థికంగా బలపడవచ్చు. రోజూ ఒక్క యూనిట్ ఆదా చేస్తే జీవితకాలంలో రూ.లక్ష పొదుపు చేసినవారమవుతాం. విద్యుత్ ఆదాకు నాణ్యమైన ఐఎస్ఐ మార్కుగల, స్టార్ రేటేడ్ పరికరాలను ఉపయోగించాలి. విద్యుత్ కుక్కర్లకు బదులు ప్రెషర్ కుక్కర్లు వినియోగించాలి. వేసవికాలంలో ఏసీల వినియోగం పెరిగింది. 25 డిగ్రీల సెంటిగ్రేడ్‌కు అమర్చుకొని అరగంట తర్వాత ఆఫ్ చేయడం, ఏసీ ఫిల్టర్లను నెలకోసారి శుభ్రం చేసుకోవాలి. – కె.ఉపేందర్, డీఈ (టెక్నికల్), కరీంనగర్ సర్కిల్ -
స.హ చట్టంతో పారదర్శకత
జగిత్యాల: సమాచార హక్కు చట్టంతో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడమే ముఖ్య ఉద్దేశమని సమాచార కమిషన్ చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి అన్నారు. సమాచార హక్కు చట్టంపై కలెక్టరేట్లో పీఐవోలు, ఏపీవోలకు అవగాహన కల్పించారు. ప్రజలు కోరిన సమాచారాన్ని తెలిపే బాధ్యత అధికారులపై ఉందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజాసేవకులన్నది మరిచిపోవద్దన్నారు. కోరినప్పుడే కాకుండా సెక్షన్ 4(1)బీ ప్రకారం స్వచ్ఛందంగా సమాచారం ఇచ్చేలా అధికారులు సమాయత్తం కావాలన్నారు. సమాచార కమిషనర్లు శ్రీనివాస్‌రావు, దేశాల భూపాల్ మాట్లాడుతూ.. చట్టంలోని 6(3) కింద దరఖాస్తును చదివి పూర్తిస్థాయిలో తెలుసుకున్న అనంతరం అప్పిలేట్ అధికారి సమాచారం ఇవ్వాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. ప్రతి ఉద్యోగి వ్యక్తిగత జీవితంలో పారదర్శకత, బాధ్యతాయుత వైఖరి, నైతిక విలువలు పెంపొందించే ముఖ్యమైన చట్టమన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, వివిధస్థాయిల అధికారులు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయండిజగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేసి రైతుల ఇబ్బంది తీర్చాలని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. చల్గల్లోని మార్కెట్‌యార్డులో ధాన్యాన్ని పరిశీలించారు. ధాన్యం తెచ్చి నెల గడుస్తున్నా కొనుగోలు చేయడంలో ప్రభుత్వం తాత్సారం చేస్తోందన్నారు. ఫలితంగా రైతులు కేంద్రాలవద్ద పడిగాపులు కాయాల్సి వస్తోందన్నారు. కేసీఆర్ పాలనలో రైతులకు ఎలాంటి ఇబ్బందీ లేకుండా.. తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేశారని తెలిపారు. సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు వెంకటేశ్వర్రావు, శీలం ప్రవీణ్, ఎల్ల రాజన్న, రమేశ్, వెంకటేశ్, కిశోర్, రైతులు పాల్గొన్నారు. కేవీకి స్థలం కేటాయింపుజగిత్యాల: జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయానికి రెండెకరాల స్థలం మంజూరైందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. చల్గల్లోని వాలంతరి అటానమస్ అని, రైతుల కోసం ఏర్పాటు చేసిన ఈ స్థలాన్ని కేవీకి కేటాయించడం అభినందనీయమన్నారు. బీజేపీ నాయకులు కావాలని రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. చల్గల్లో స్థలం సరిపోకుంటే టీఆర్‌నగర్‌లో 30 ఎకరాల స్థలం ఉందని పేర్కొన్నారు. -
దీక్షకు అనుమతి ఇవ్వాలని బీజేపీ ధర్నా
జగిత్యాలటౌన్/జగిత్యాలక్రైం: కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలంటూ ఈనెల 18న జిల్లాకేంద్రంలో ఎంపీ అర్వింద్ నిర్వహించతలపెట్టిన ధర్మదీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నాయకులు శనివారం తహసీల్ చౌరస్తాలో ధర్నా చేపట్టారు. విద్యార్థుల కోసం దీక్ష చేస్తుంటే పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇది ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రాఫిక్ నిల్చిపోవడంతో పోలీసులు వచ్చి సముదాయించారు. ససేమిరా అనడంతో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురా లు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు, నాయకులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీస్‌స్టేషన్‌లో నిరసన అరెస్ట్ చేసిన వారిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకురావడంతో బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. స్టేషన్లోనే ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలంటూ కొంతమంది ఆందోళన చేపట్టారు. అరెస్ట్ చేసిన వారిని వ్యక్తిగత పూచీకత్తుపై వదిలిపెట్టారు. శ్రావణి మాట్లాడుతూ.. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించే వరకూ ధర్మదీక్ష కొనసాగిస్తామన్నారు. ఎమ్మెల్యే నిర్లక్ష్యంతోనే.. జగిత్యాల: కేంద్రీయ విద్యాలయానికి ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ నిర్లక్ష్యంతోనే స్థలం కేటాయించడం లేదని ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. 9 నెలల క్రితం జిల్లాకు విద్యాలయం మంజూరు కాగా.. ఇప్పటివరకు స్థలం ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు. స్థలం ఇవ్వకపోగా.. స్కూల్ ఎవరికి పనికొస్తుందని స్వయంగా ఎమ్మెల్యే సంజయ్ అనడం విడ్డూరంగా ఉందన్నారు. -
రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి
కథలాపూర్(వేములవాడ): కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. మండలంలోని సిరికొండ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామశివారులో ఉన్న రైస్ మిల్లులను తనిఖీ చేశారు. ధాన్యం నిల్వలు, మిల్లింగ్ పక్రియ, అన్‌లోడింగ్‌పై యజమానులను అడిగి తెలుసుకున్నారు. మిల్లుల్లో హమాలీల కొరత ఉందంటూ జాప్యం చేయొద్దన్నా రు. లారీల కొరత ఉంటే ట్రాక్టర్లలో రవాణా చేయాలన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, సింగిల్‌విండో చైర్మన్ జీవన్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్, ఎస్సై నవీన్‌కుమార్, ఆర్ఐ రవీందర్ ఉన్నారు. ప్రధాని దిష్టిబొమ్మ దహనంకోరుట్ల: నీట్ పరీక్షా పత్రం లీక్ కావటాన్ని నిరసిస్తూ ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కాంగ్రెస్ శ్రేణులు పట్టణంలోని బస్టాండ్ వద్ద శనివారం దహనం చేశారు. నాయకులు మాట్లాడుతూ వి ద్యార్థుల జీవితాలతో ఆటలాడుతున్న అధి కారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుమల గంగాధర్ గౌడ్, కాంగ్రెస్ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. దోమల నిర్మూలన అందరి బాధ్యతజగిత్యాల: దోమల నిర్మూలన అందరి బాధ్యత అని డీఎంహెచ్‌వో సుజాత అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివా రం ర్యాలీ నిర్వహించారు. జిల్లాలో గతేడాది 27 డెంగీ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, ఈసారి కేసులు లేకుండా చూడాలన్నారు. ఇప్పటికే జిల్లాలో 42 హైరిస్క్ గ్రామాలు, 14 హైరిస్క్ మండలాల్లో బ్రీడింగ్ పాయింట్స్, హాట్స్పాట్లను గుర్తించి వ్యాధి బారిన పడకుండా చూసుకోవాలన్నారు. జిల్లాను డెంగీ రహిత జిల్లాగా మార్చాలన్నారు. ప్రో గ్రాం ఆఫీసర్ అర్చన, డాక్టర్ స్రవంతి, సత్యనారాయణ, శ్రీధర్, రాజేశం, మురళీ, శ్యామ్ పాల్గొన్నారు. యమధర్మరాజుకు ప్రత్యేక పూజలుధర్మపురి: భరణి నక్షత్రం సందర్భంగా శ్రీయమధర్మరాజుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు బొజ్జ సంతోష్‌కుమార్, రాజగోపాల్ ఆధ్వర్యంలో స్వామివారికి రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించారు. నృసింహునికి స.హ చట్టం కమిషనర్ పూజలుధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామిని సమాచార హక్కు చట్టం కమిషనర్ పీవీ.శ్రీనివాసరావు, దేశాల భూపాల్ శనివారం దర్శించుకున్నారు. వారికి ఆలయం పక్షాన స్వాగతం పలికారు. స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, ఆలయ సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్, సీనియర్ అసిస్టెంట్ అలువాలు శ్రీనివాస్, అర్చకులు పాల్గొన్నారు. -
ముచ్చటేది!
జగిత్యాలమూడు చుక్కలఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026సాక్షి,ప్రతినిధి, కరీంనగర్: వారంతా 2012 బ్యాచ్ సబ్ఇన్స్పెక్టర్లు, కానీ సర్వీసులో తమ కన్నా జూనియర్లయిన సీఐ (2014 ఎస్సైలు)లకు సెల్యూల్ చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పోలీస్‌శాఖలో 2012 బ్యాచ్ సబ్ ఇన్స్పెక్టర్ల పరిస్థితి తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 14 ఏళ్ల సుదీర్ఘ సేవలు పూర్తి చేసుకున్నప్పటికీ, ఇంకా రెండు చుక్కల హోదాలోనే కొనసాగుతుండటం వారిలో తీవ్ర అసంతృప్తిని కలిగిస్తోంది. నిబంధనల ప్రకా రం ఆరేళ్లు సేవ పూర్తయ్యాకే సర్కిల్ ఇన్స్పెక్టర్ (సీఐ) ప్రమోషన్‌కు అర్హత సాధించారు. అర్హత సాధించి ఎనిమిదేళ్లు గడిచినా పదోన్నతులు అందకపోవడం గమనార్హం. ఇప్పటికే అదే బ్యాచ్‌లో కొందరు సీఐలుగా పదోన్నతులు పొంది ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్నారు. మిగిలిన వారు ఇంకా ఎస్సైలు గానే కొనసాగుతున్నారు. దీంతో ఒకే బ్యాచ్‌లో తీవ్ర అసమానత నెలకొంది. మరోవైపు 2014 బ్యాచ్‌కు చెందిన కొందరు ఇప్పటికే సీఐలుగా ప్రమోషన్ పొందడంతో 2012 బ్యాచ్ ఎస్సైలు తమ కన్నా జూనియర్లకు సెల్యూట్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు 2018 బ్యాచ్ మహిళా ఎస్సైలు కూడా సీఐ ప్రమోషన్‌కు అర్హత సాధించడంతో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. జోనల్ మార్పులతో వెనుకబడిన 2012 బ్యాచ్ ప్రభుత్వం అమలు చేసిన కొత్త జోనల్ వ్యవస్థ, ముఖ్యంగా 317 ప్రభావంతో పాత జోన్ల నుంచి పెద్ద సంఖ్యలో అధికారులు మారడంతో 2012 బ్యాచ్ సీనియారిటీ తీవ్రంగా ప్రభావితమైంది. ఇతర జోన్ల నుంచి వచ్చిన అధికారులు ప్రమోషన్లు పొందగా.. అసలు సీనియారిటీ ఉన్న పలువురు 2012 బ్యాచ్ ఎస్సైలు మాత్రం వెనుకబడ్డారు. ఎస్హెచ్ఓ పోస్టులు సీఐల చేతుల్లోనే మల్టీజోన్–1 పరిధిలోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, రామగుండం, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సిద్దిపేట తదితర జిల్లాల్లోని అనేక పోలీస్స్టేషన్లలో ఎస్‌హెచ్‌వో పోస్టులను ప్రస్తుతం సీఐలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. దాదాపు 20 పోస్టులు ఈ తరహాలో ఉన్నాయని తెలుస్తోంది. ఇది శాఖలో సీఐ స్థాయి అవసరం ఎంతగా ఉందో స్పష్టంగా తెలియజేస్తోందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఉద్యోగ విరమణ వయసు 58 నుంచి 61 ఏళ్లకు పెంచడంతో పైస్థాయి అధికారుల పదవీ కాలం పొడిగించారు. దీని ప్రభావం ప్రమోషన్ చైన్‌పై పడింది. పైస్థాయిలో ఖాళీలు లేకపోవడంతో దిగువస్థాయి ఉద్యోగుల ప్రమోషన్లు సంవత్సరాల తరబడి నిలిచిపోతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధిక కాలం ఎస్సైలుగా కొనసాగుతున్న బ్యాచ్ మాదే’ అంటూ 2012 బ్యాచ్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 ఏళ్ల సేవ పూర్తి చేసినా పదోన్నతి రాకపోవడం తమ కెరీర్ ప్రోగ్రెషన్‌ను తీవ్రంగా దెబ్బతీసిందని చెబుతున్నారు. ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు 2012లో ఎస్సైల సంఖ్య 1,044 మంది. రాష్ట్ర ఆవిర్భావంతో 544 మందిని తెలంగాణకు కేటాయించారు. ఈ బ్యాచ్‌లో కేవలం 180 మందికి పదోన్నతి సాధించగా,, ఐదుగురు మరణించారు. ఇంకా 364 మందికి పదోన్నతి రావాల్సి ఉంది. ఇక 2014 బ్యాచ్‌లో ముగ్గురికి సీఐలుగా ప్రమోషన్ వచ్చింది. రాష్టవ్యాప్తంగా 60 సీఐ ర్యాంకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కనీసం వీటిలోనైనా అవకాశం కల్పిస్తే.. కొందరికైనా సీఐ పదోన్నతి వస్తుందని, మిగిలిన వారికి అడ్‌హక్ ప్రాతిపదికన పదోన్నతులు కల్పించాలని కోరుతున్నారు. కనీసం కొత్త డీజీపీ హయాంలోనైనా 2012 బ్యాచ్‌కు న్యాయం దక్కాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
మహిళా సంక్షేమానికి పెద్దపీట
పెగడపల్లి: మహిళా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. మండలంలోని బతికపల్లిలో ఇందిరమ్మ ఇళ్లు, దోమలకుంట, సుద్దపల్లిలో రూ.30లక్షలతో నిర్మించనున్న మహిళా సంఘం భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. మహిళల అభ్యున్నతికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కోటి మంది మహిళలను కోటీశ్వర్లుగా చేయాలని సంకల్పించామన్నారు. బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గ్యాస్ సిలిండర్, రెండు వందల యూనిట్ల వరకు కరెంట్ వంటి కార్యక్రమాలు ఉపయోగపడుతున్నాయన్నారు. వెనుకబడిన బతికపల్లి అభివృద్ధికి తాను బాధ్యత తీసుకుంటానన్నారు. సీసీరోడ్లు, మురికికాల్వలు, కులసంఘాల భవనాలు, పల్లె దవాఖానాలకు నిధులు కేటాయిస్తానని పేర్కొన్నారు. ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, సర్పంచులు ముంజ మహేశ్వరీ, బండారి మణెమ్మ, ఐతరవేని లక్ష్మణ్, ఏఎంసీ వైస్ చైర్మన్ సత్తిరెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కడారి తిరుపతి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్, రాజ్‌కుమార్, తహసీల్దార్ సయ్యద్ నిజామొద్దీన్, ఎంపీవో శశికుమార్‌రెడ్డి, హౌజింగ్ ఏఈ జ్యోతి, పంచాయతీ కార్యదర్శులు నిఖిల్‌రెడ్డి, మహేశ్, నదీం, ఏఎంసీ డైరెక్టర్లు పాల్గొన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి వెల్గటూర్: కాంగ్రెస్ బలోపేతానికి కార్యకర్తలు కృషి చేయాలని మంత్రి కోరారు. కాంగ్రెస్ ఎండపల్లి మండల అధ్యక్షుడిగా గెల్లు చంద్రశేఖర్ యాదవ్ ఎన్నికై న సందర్భంగా రాజారాంపల్లిలో శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. పార్టీ మండలాల అధ్యక్షులు అన్ని గ్రామాల్లో కార్యకర్తలు, నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. మాజీ అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’ మ్యాపింగ్ వేగవంతం చేయాలి
జగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ మ్యాపింగ్ (సర్) మ్యాపింగ్‌ను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. శనివారం కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. మ్యాపింగ్ ప్రక్రియలో పొరపాట్లకు తావు లేకుండా ప్రతి ఇంటి నుంచి కచ్చితమైన వివరాలు సేకరించాలని, తప్పుడు ఎంట్రీలు, లింక్ జరగకుండా చూడాలని సూచించారు. బీఎల్వోలు ఫీల్డ్ విజిట్ తప్పనిసరిగా చేయాలని ఆదేశించారు. జూన్ 25 నుంచి జూలై 14 వరకు హౌస్ టు హౌస్ సర్వే నిర్వహిస్తున్నామని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. జిల్లాలో వందశాతం ‘సర్’ పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఇంటి నుంచి సరైన, నిర్ధిష్టమైన సమాచారం తీసుకుని మ్యాపింగ్ ప్రక్రియ కట్టుదిట్టంగా చేస్తున్నామని పేర్కొన్నారు. కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ లత, మధుసూదన్, దివాకర్‌రెడ్డి ఉన్నారు. -
ఇల్లు కడితే కాసులివ్వాల్సిందే..
కోరుట్ల: ఇంటి నిర్మాణం చేపడితే చాలు.. తనకు రూ.లక్షల్లో కాసులు ఇవ్వాల్సిందేనని మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం వేణుగోపాల్ వేధిస్తున్నారని, లేకుంటే టౌన్‌ప్లానింగ్ అధికారులను పంపి తమ ఇళ్లు కూలుస్తున్నారని 24,32వ వార్డులకు చెందిన బాధితులు జాప లక్ష్మన్, జాప రమేశ్, సునీత, అనిత, నరేందర్ ఆరోపించారు. మాజీ చైర్మన్ తీరుకు నిరసనగా కూల్చివేసిన ఇళ్ల వద్ద శుక్రవారం బాధితులు నిరసన తెలిపారు. శీలం వేణుగోపాల్ తనను రూ.20 లక్షలు డిమాండ్ చేశారని, తాను నిరాకరించడంతో తన ఇల్లు కూల్చివేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చి కూలగొట్టారని ఆరోపించారు. లంచాలు ఇవ్వకుంటే అనవసరమైన నిబంధనల పేరు చెప్పి ఇళ్లు కూల్చాలని టౌన్‌ప్లానింగ్ అధికారులపై వేణుగోపాల్, ఆయన భార్య కౌన్సిలర్ శీలం జయలక్ష్మి ఒత్తిడి తెస్తున్నారని ఆరోపించారు. ఈ విషయమై స్థానిక కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి నర్సింగరావు దృష్టికి తీసుకెళ్లామన్నారు. కాగా, ఈ విషయమై మాజీ చైర్మన్ వేణుగోపాల్ మాట్లాడుతూ, ఇళ్ల కూల్చివేత విషయంలో తనకు ఎలాంటి సంబంధం లేదని మున్సిపల్ అధికారులు నిబంధనల మేరకు వ్యవహరించారని పేర్కొన్నారు. -
ధాన్యం తరలింపు వేగవంతం చేయండి
జగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు, రవాణా, మిల్లుల్లో అన్లోడింగ్ వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సివిల్ సప్లై అధికారులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మిల్లుల వద్ద వాహనాలు ఎక్కువసేపు నిలవకుండా, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. మిల్లుల్లో లోడింగ్, అన్లోడింగ్ నిరంతరం జరగాలన్నారు. పెండింగ్‌లో ఉన్న లారీలను వెనువెంటనే ఖాళీ చేయాలన్నారు. ధాన్యం నిల్వలు ఎక్కువ కాలం చేయకుండా అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఏదైనా సమస్యలుంటే త్వరగా పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు మరిన్ని సేవలందించాలి రెడ్‌క్రాస్ ససైటీ ఆధ్వర్యంలో ప్రజలకు మరిన్ని సేవలందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదును ప్రారంభించి మాట్లాడారు. రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు ఈనెల 15 నుంచి వచ్చే నెల 15 వరకు ఉంటుందని, ప్రజలందరూ నమోదు చేసుకోవాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
పెద్ద మనుషుల పేచీలు
కోరుట్ల: ఎక్కడైనా సరే ఇరువురి మధ్య గొడవలు, భూ వివాదాలు, భార్యాభర్తల పంచాయితీలు జరిగినప్పుడు కక్షిదారులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తున్నారు. ఠాణాలో కేసులు నమోదు చేసే క్రమంలో ఇరువర్గాల నుంచి పెద్ద మనుషుల ప్రమేయం చోటు చేసుకుంటుంది. కేసులు నమోదు కావడంలో ఠాణాల్లో ఆలస్యం జరుగుతుండటం, కోర్టు కేసులు అంటే మున్ముందు ఎలా ఉంటుందోన్న భయంతో ఫిర్యాదుదారులు చివరికి పెద్ద మనుషులను ఆశ్రయించడం షరామాములుగా మారింది. ఇక్కడ నుంచి పెద్ద మనుషులు ఆడిందే ఆటగా సాగుతోంది. ఠాణా నుంచి పంచాయితీ తమ చేతిలోకి వచ్చిందే తడువుగా పెద్ద మనుషులు రూ.లక్షల్లో డిపాజిట్లు పెట్టుకోవడం, తర్వాత పంచాయితీని దపాల వారీగా కొనసాగించడం జరుగుతోంది. ఈ క్రమంలో పెద్ద మనుషులు విందులు, వినోదాలు, రాకపోకలకు డిపాజిట్ డబ్బుల నుంచి ఎడాపెడా ఖర్చులు చేయడం, చివరికి ఫిర్యాదుదారుల పంచాయితీలు ఏ మేరకు పరిష్కారం అవుతున్నాయో తెలియదు..కానీ పెద్ద మనుషుల చేస్తున్న అడ్డగోలు ఖర్చులకు మాత్రం లెక్కా పత్రం ఉండదు. నిండా మునుగుతున్నారు జిల్లాలో రోజూ ఏదో ఓ చోట పెద్ద మనుషుల పంచాయితీల్లో పేదవర్గాలు చాలా మేర నలిగిపోతున్నాయి. పోలీస్స్టేషన్లకు చేరుతున్న పంచాయితీల్లో మూడోంతుల మేర తిరిగి పెద్దమనుషుల చేతుల్లోకి చేరి నలుగుతున్నాయంటే అతిశయోక్తి కాదు. సంఘాలు, కుల పెద్ద మనుషులు స్వచ్ఛందంగా ఫిర్యాదుదారుల నుంచి ఎలాంటి డిపాజిట్లు తీసుకోకుండా, అనవసర ఖర్చులు చేయకుండా సమస్యలు పరిష్కరించడం మంచిదే.. కానీ, దానికి విరుద్ధంగా వ్యవహరించడంతో అసలే గొడవలు, కేసుల ఇబ్బందుల్లో ఉన్న ఫిర్యాదుదారులు మరిన్ని సమస్యల్లో కూరుకుపోతున్నారు. కొన్ని సందర్భాల్లో పెద్ద మనుషులు ఉద్దేశపూరితంగా వివాదాలను పెంచడం వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇక్కడితో సరిపెట్టుకోకుండా పంచాయితీలు చేసి జరిమానాలు, బహిష్కరణలు వంటి నిర్ణయాలు తీసుకోవడం సమస్యలకు కారణమవుతోంది. ఠాణాల్లో కేసులు నమోదు చేయడంలో జాప్యం, కొన్ని చోట్ల పెద్ద మనుషుల పరిధిలోకి సమస్యలను పంపడం వంటివి సమస్యలకు తావిస్తోంది. జిల్లాలో మితిమీరుతున్న పెద్ద మనుషుల పంచాయితీలను నియంత్రించి పేదలు మరింత ఇబ్బందుల్లో పడకుండా చర్యలు తీసుకోవాల్సి అవసరముంది. ఫిర్యాదులు వస్తే వెంటనే కేసులు నమోదు చేస్తున్నాం. ఎక్కడైనా పెద్ద మనుషులు అనవసరంగా పంచాయితీల్లో జోక్యం చేసుకుంటే చర్యలు తప్పవు. డిపాజిట్లు, ఇతరత్రా ఖర్చుల పేరిట డబ్బులు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటాం. – రాములు, డీఎస్పీ, మెట్పల్లి -
కేవీ స్థలం కేటాయింపుపై బీజేపీ, కాంగ్రెస్ రాజకీయం
జగిత్యాలటౌన్: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకోలేక రైతులు కల్లాల్లో పడిగాపులు కాస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. తూకం, లోడింగ్, ట్రాన్స్‌పోర్టేషన్‌లో తీవ్ర జాప్యం జరగుతుందన్నారు. ఓ వైపు రైతులు ఇబ్బందులు పడుతుంటే కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు పేరుతో బీజేపీ, కాంగ్రెస్ రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపు విషయంలో ఎమ్మెల్యే చిత్తశుద్ధిని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. బోర్నపల్లి జగన్నాథ్‌పూర్ వంతెన నిర్మాణ పనుల కోసం రూ.18కోట్లు మంజూరు కాగా, రెండుసార్లు టెండర్లు పిలిచినా ఎవరూ ముందుకు రాకపోవడంతో పనులు మొదలు కాలేదన్నారు. జిల్లాలో అన్ని పనులు చేస్తున్న గౌరీశంకర్ ఇన్ఫ్రాతో టెండర్ వేయించి పనులు ప్రారంభించేలా చూడాలని ఎమ్మెల్యేకు సూచించారు. గాజుల రాజేందర్, ధర రమేశ్, మసర్తి రమేశ్, కల్లెపెల్లి దుర్గయ్య, వెంకటేశ్వర్రావు, చెట్పల్లి సుధాకర్, గుండ మధు, శీలం ప్రవీణ్ పాల్గొన్నారు. రైతులను ఆదుకోవడంలో విఫలం జగిత్యాలరూరల్: మక్క రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్పూర్ మండలంలో మక్క, వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. మొక్కజొన్న ఎకరాన 25 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేస్తుండటంతో రైతులకు ఇబ్బందిగా మారిందన్నారు. నాయకులు రమేశ్, జితేందర్, మల్లారెడ్డి, శంకర్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి -
క్షీరాభిషేకం, పుష్పాలంకరణ
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధ శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం స్వామివారికి క్షీరాభిషేకం ఘనంగా నిర్వహించారు. స్వామివారిని పూలతో చూడముచ్చటగా అలంకరించారు. అర్చకులు శ్రీనివాసచార్యులు ప్రత్యేక పూజలు చేసి ఆలయ ప్రాంగణంలో లక్ష్మీహవన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్ లోడింగ్‌లో జాప్యం చేయొద్దుకథలాపూర్(వేములవాడ): వరిధాన్యం బస్తాల అన్లోడింగ్ విషయంలో రైస్‌మిల్లుల నిర్వాహకులు జాప్యం చేయొద్దని అదనపు కలెక్టర్ బీఎస్ లత సూచించారు. శుక్రవారం మండలంలోని సిరికొండ గ్రామశివారులోని నాలుగు రైస్ మిల్లులు, ధాన్యం కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. మిల్లుల వద్ద ధాన్యం బస్తాల వాహనాలు నిలిపి ఉండటంపై స్థానిక అధికారులతో చర్చించారు. కూలీల కొరత ఉందని రైస్‌మిల్ నిర్వాహకులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీల కొరత ఉంటే ట్రాక్టర్లలో తరలించాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకం వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్ రమేశ్, డెప్యూటీ తహసీల్దార్ ఉమాపతి, ఆర్ఐ రవీందర్ పాల్గొన్నారు. ధర్మపురి కో ఆప్షన్ సభ్యుల ఏకగ్రీవంధర్మపురి: ధర్మపురి మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం కో ఆప్షన్ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి అధ్యక్షతన కమిషనర్ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎన్నిక జరిగింది. ఈసందర్భంగా ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు కార్యాలయ ఆవరణ కౌన్సిలర్లు, నాయకులతో కిక్కిరిసిపోయింది. స్పెషల్ నాలెడ్జ్ మహిళ కోటాలో అశెట్టి మమత శ్రీనివాస్, జనరల్ కోటాలో గరిగె అరుణ రమేశ్, మైనార్టీ కోటాలో మొహ్మద్ నఫీజ్ సుల్తానారఫియొద్ది న్, ముస్లిం జనరల్ కోటాలో షౌకత్ పాషా అలీమొద్దిన్ను ఎన్నుకున్నారు. వైస్ చైర్మన్ రామన్న, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఆదిలాబాద్‌కు రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులు జగిత్యాలటౌన్: ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జగిత్యాల నుంచి ఆదిలాబాద్‌కు రెండు ఎక్స్‌ప్రెస్ బస్సులను ప్రారంభించినట్లు డిపో మేనేజర్ కల్పన శుక్రవారం తెలిపారు. ఉదయం 8.20 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరే బస్సు సారంగాపూర్, జన్నారం మీదుగా 12.20 గంటలకు ఆదిలాబాద్ చేరుకుంటుందన్నారు. ఆదిలాబాద్ నుంచి మధ్యాహ్నం 12.45 గంటలకు బయలుదేరి సాయంత్రం 4.45 గంటలకు జగిత్యాలకు చేరుకుంటుందన్నారు. మరో ఎక్స్‌ప్రెస్ బస్ మధ్యాహ్నం 12 గంటలకు జగిత్యాల నుంచి బయలుదేరి సాయంత్రం 4 గంటలకు ఆదిలాబాద్‌కు, అక్కడి నుంచి సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు జగిత్యాల చేరుకుంటుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరారు. -
పరాయి చేతుల్లో కిరాయి
జగిత్యాల: జగిత్యాల మున్సిపాలిటీలోని షాపింగ్ కాంప్లెక్స్‌ల్లో బినామీల దందా నడుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు షాపింగ్ కాంప్లెక్స్‌లకు టెండర్లు వేయగా, అప్పుడు దుకాణాలు దక్కించుకున్నవారే ఇంకా కొనసాగుతున్నారు. దాదాపు 17 ఏళ్ల క్రితం టెండర్లు నిర్వహించగా, పాతవారే బినామీలుగా ఉంటూ ఇతరులకు గుడ్‌విల్ కింద అద్దెకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనల ప్రకారం మూడేళ్లకోసారి టెండర్లు నిర్వహించాల్సి ఉంటుందని బల్దియా అధికారులే పేర్కొంటున్నారు. మున్సిపల్ కాంప్లెక్స్‌లకు డిమాండ్ జగిత్యాల జిల్లా కేంద్రంగా అవతరించడంతో మార్కెట్ ధరలు, ప్రజల తాకిడి పెరిగింది. వాణిజ్య వ్యాపారాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్‌కు దీటుగా షాపింగ్‌మాల్స్, దుకాణాలు వెలుస్తున్నాయి. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రైవేటు కాంప్లెక్స్‌లకు అద్దె అత్యధికంగా ఉండగా, మున్సిపల్ కాంప్లెక్స్‌ల గతంలో నిర్ణయించిన అద్దె కొనసాగుతోంది. ఈ అవకాశాన్ని బల్దియా అధికారులు, పాలకవర్గం సద్వినియోగం చేసుకోవడం లేదని ఆరోపణలున్నాయి. మూడేళ్లకోసారి దుకాణాల టెండర్లు నిర్వహించాల్సి ఉండగా, ప్రస్తుతం అద్దెలు 33.33 శాతం పెంచుతూ ప్రస్తుతం ఉన్న వారినే కొనసాగిస్తున్నారు. కాగా, కొత్తగా టెండర్లు వేస్తే బల్దియాకు అదనపు ఆదాయం సమకూరే అవకాశం ఉంది. జిల్లా కేంద్రంలో ప్రైవేట్ కాంప్లెక్స్‌లకు, మున్సిపల్ కాంప్లెక్స్‌లకు అద్దె విషయంలో చాలా వ్యత్యాసం ఉంది. అందులో బినామీలే.. జగిత్యాల డివిజన్ కేంద్రంగా ఉన్నప్పుడు పలువురు టెండర్ల ద్వారా మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్‌ల సముదాయం పొంది వాటిని అద్దెకిస్తున్నారు. అప్పుడు టెండర్ పొందిన యజమానులు ఏటా 33.33 శాతం మున్సిపల్‌కు అద్దె చెల్లిస్తూ వారే కొనసాగుతున్నారు. అయితే నిబంధనల ప్రకారం ఎవరైతే టెండర్ పొందారో వారే షాపులు నిర్వహించుకోవాలి. కానీ, వీరు ఇతరులకు అద్దెకిస్తూ ఎక్కువ మొత్తంలో కిరాయి పొందుతున్నారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లు పొందిన అభ్యర్థే షాప్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, ఒకరిద్దరు మినహా ప్రతి షాపులో వేరేవారు కొనసాగుతున్నారు. కాగా, అద్దె దందాను మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదు. పెరిగిన ధరలు జగిత్యాల జిల్లా కేంద్రం కావడంతో అద్దెలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక షాపునకు దాదాపు అద్దె రూ.15 వేల నుంచి రూ.30 వేల వరకు ఉండగా, మున్సిపల్ షాపులకు రూ.10 నుంచి రూ.15 వేల వరకు మాత్రమే ఉంటుంది. దీంతో గతంలో టెండర్లు పొందిన వారే ఎక్కువ అద్దెకిస్తూ లబ్ధిపొందుతున్నారు. దీంతో బల్దియా ఆదాయానికి గండిపడుతుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి మున్సిపల్ కాంప్లెక్స్‌లకు టెండర్లు నిర్వహిస్తే బల్దియాకు అత్యధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. జగిత్యాల మున్సిపల్‌కు సంబంధించి షాపింగ్ కాంప్లెక్స్, అంగడిబజార్, పార్క్ సంది, ఎంపీడీవో ఆఫీస్ ఎదురుగా, పాతబస్టాండ్ సమీపంలో మొత్తం 198 దుకాణాలు ఉన్నాయి. ఇందులో ఒకట్రెండు మినహా మొత్తం అద్దెకే నడుస్తున్నాయి. కాగా, దాదాపు 17 ఏళ్ల క్రితం నిర్వహించిన టెండర్ల ద్వారా అప్పుడే మున్సిపల్‌కు రూ.10 కోట్ల ఆదాయం వచ్చింది. ప్రస్తుతం కాంప్లెక్స్‌లకు మళ్లీ వేలం వేస్తే అత్యధికంగా ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రైవేట్ కాంప్లెక్స్‌లో నెలకు సుమారు రూ.20 వేల నుంచి రూ.30 వేల అద్దె ఉంటుంది. మున్సిపల్ కాంప్లెక్స్‌లో మాత్రం అప్పటి అద్దెకు 33.33 శాతం పెంచుతూ పోతున్నారు. అంతేకానీ టెండర్లు మాత్రం నిర్వహించడం లేదు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్ల గురించి పరిశీలిస్తున్నాం. ఇదివరకు ఎప్పుడు టెండర్లు వేశారు, తదితర వివరాలను పరిశీలించి చర్యలు తీసుకుంటాం. – సత్యప్రణవ్, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల -
పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా
జగిత్యాలక్రైం/ధర్మపురి: పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనీఖి చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే బక్రీద్ పండుగ దృష్ట్యా గోవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు సమీప పోలీస్‌స్టేషన్, పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడకూడదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గోవధ నివారణ, పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసుశాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ధర్మపురి సీఐ రామ్నరసింహారెడ్డి, ఎస్సైలు మహేశ్, ఉదయ్‌కుమార్, కృష్ణసాగర్ పాల్గొన్నారు. -
జగిత్యాల
41.0/31.07గరిష్టం/కనిష్టంవేగవంతంగా సర్ ప్రక్రియజగిత్యాల: సర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఆర్డీవో మధుసూదన్ అన్నారు. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో మాట్లాడారు. ఈనెలాఖరుకు పురోగతి సాధించాలన్నారు.మహా లింగార్చన ధర్మపురి: మాస శివరాత్రిని పురష్కరించుకొని శుక్రవారం సాయంత్రం ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో మహా లింగార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వాతావరణం ఎండగా ఉంటుంది. అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఉక్కపోతగా ఉంటుంది. గాలులు వేగంగా వీస్తాయి. శనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026 -
మెట్పల్లి తహసీల్‌లో ఫైళ్లు మాయం!
● ధ్రువీకరణ పత్రాల జారీలో అధికారుల నిర్లక్ష్యం ● ఇబ్బందిపడుతున్న దరఖాస్తుదారులు మెట్పల్లి(కోరుట్ల): మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతో వారిది ఆడిందే ఆట, పాడిందే పాటగా మారింది. ప్రధానంగా ధ్రువీకరణ పత్రాల జారీ విషయంలో దరఖాస్తుదారులను ముప్పుతిప్పలు పెడుతున్నారు. సకాలంలో ఇవ్వకపోగా, దరఖాస్తు ఫైళ్లు కనిపించడం లేదంటూ నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిప్పుకుంటూ తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గడువును పట్టించుకోని వైనం ● ధ్రువీకరణ పత్రాలు పొందడంలో ప్రజలు ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటి జారీ విషయంలో అధికారులకు గడువును నిర్దేశించింది. ● మీ–సేవ కేంద్రాల ద్వారా వచ్చిన దరఖాస్తులను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిర్దేశిత గడువులోపు పత్రాలను జారీ చేయాలి. ● కానీ, మెట్పల్లి తహసీల్దార్ కార్యాలయంలో అలా జరగడం లేదనే విమర్శలు ఉన్నాయి. ● పైరవీకారులు, పలుకుబడి ఉన్నవారికి గడువు కన్నా ముందే, అవసరమైతే దరఖాస్తు చేసుకున్న కొన్ని గంటల్లోపే జారీ చేస్తుండగా, సాధారణ దరఖాస్తుదారుల్లో పలువురికి గడువు ముగిసినా ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్చనీయాంశమవుతున్న ఫైళ్ల మాయం ● ధ్రువీకరణ పత్రాలకు సంబంధించి వచ్చే దరఖాస్తు ఫైళ్లను భద్రపర్చాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. కానీ, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కొన్ని ఫైళ్లు కనిపించకుండా పోతున్నాయి. ఇటీవల చోటు చేసుకున్న రెండు సంఘటనలు దీనికి అద్దం పడుతోంది. ● ఇవే కాకుండా గతంలో కూడా కొందరి ఫైళ్లు గల్లంతు కావడంతో నెలల తరబడి కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులు పడ్డారు. ● దరఖాస్తుదారులు ఇచ్చే ఫైళ్లలో కొన్ని ఎందుకు కనిపించకుండాపోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఉన్నతాధికారులు స్పందించి ధ్రువీకరణ పత్రాల జారీలో అలసత్వం చూపుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. వివరణకు స్పందించని ఆర్ఐ ఫైళ్లు మాయమవుతున్న వ్యవహారంపై పట్టణ బాధ్యులు ఆర్ఐ కాంతయ్యను ఫోన్లో వివరణ కోరడానికి ప్రయత్నించగా, ఆయన స్పందించలేదు. -
‘మోడల్’లో ఇంటర్ ప్రవేశాలు
మల్లాపూర్: ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్ ప్రవేశాలకు ఈనెల 25వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలో కండ్లపల్లి(జగిత్యాల), గొల్లపల్లి, మగ్గిడి (ధర్మపురి), మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, కల్లూర్ (కోరుట్ల), నూకపల్లి(మల్యాల), పెగడపల్లి, ఇటిక్యాల(రాయికల్), కుమ్మరిపల్లి (వెల్గటూర్), కొడిమ్యాల, మేడిపల్లిలో మొత్తం 13 ఆదర్శ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందిస్తున్నారు. ఒక్కో గ్రూపునకు 40మంది చొప్పున కళాశాలల్లో అవకాశం కల్పిస్తారు. ఇంటర్ ఫస్టియర్‌లో ప్రవేశానికి ఈనెల 25వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఎంసెట్, నీట్, సీఏ, సీపీటీ కోచింగ్ ఇస్తారు. ఉచితంగా పాఠ్యపుస్తకాలు అందిస్తారు. ఈ నెల 21న దరఖాస్తులు పరిశీలించి, ఎంపికై న వారి జాబితాను పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. ఈనెల 27 నుంచి 31 వరకు ఎంపికై న విద్యార్థుల విద్యార్హత ధ్రువపత్రాలను పరిశీలించి ప్రవేశాలు కల్పించనున్నారు. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. బాలికలకు మాత్రమే హాస్టల్ సౌకర్యం ఉంది.సీట్ల కేటాయింపు ఇలా కేటగిరి శాతం సీట్లు జనరల్ బాలికలు జనరల్ 50 20 13 7 ఎస్సీ 15 6 4 2 ఎస్టీ 6 2 1 1 బీసీ–ఎ 7 3 2 1 బీసీ–బీ 10 4 3 1 బీసీ–సీ 1 00 00 00 బీసీ–డీ 7 3 2 1 బీసీ–ఇ 4 2 2 00ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఈ నెల 25 వరకు గడువు జిల్లాలో 13 మోడల్ స్కూళ్లు ఒక్కో పాఠశాలలో 160 సీట్లు బాలికలకు హాస్టల్ వసతి -
బురద చల్లే ప్రయత్నం
కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయించాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి అనేక సార్లు వినతిపత్రాలు ఇచ్చాం. నాపై అనవసరపు ఆరోపణలు చేస్తున్నారు. విద్యారంగాన్ని ఎంతో అభివృద్ధి చేశా. ఇప్పటికే ఇంటిగ్రేటెడ్ స్కూల్, తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు కృషి చేశాను. ఎంపీ ధర్మదీక్ష పేరుతో నాటకం ఆడుతున్నారు. – సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే 18న దీక్ష స్థలం కేటాయింపులో జగిత్యాల ఎమ్మెల్యే నిర్లక్ష్యం వహిస్తున్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్ కోసం కేంద్రీయ విద్యాలయం మంజూరు చేయించాను. స్థలం కేటాయించడంలో ఎమ్మెల్యే పూర్తిగా విఫలమయ్యారు. అందుకే ధర్మదీక్ష చేస్తున్నాం. కేంద్రీయ విద్యాలయం అందరికీ అనుకూలమైన ప్రాంతంలో ఉంటే బాగుంటుంది. – ధర్మపురి అర్వింద్, ఎంపీ -
ఆస్పత్రుల జాతర.. నిబంధనలు పాతర
జగిత్యాల:జిల్లా కేంద్రంలో పుట్టగొడుగుల్లా ఆస్పత్రులు వెలుస్తున్నాయి. ఎందులోనూ నిబంధనలు పాటించకున్నా.. వైద్యశాఖ అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఆస్పత్రి ఏర్పాటు చేయాలంటే విశాలమైన స్థలం, ఇతర వసతులు ఉండాలి. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజిన్ ఆస్పత్రి చుట్టూ తిరిగేలా ఉండాలి. కానీ.. ఎక్కడ నిబంధనలు పాటించడం లేదు. ఇరుకై న గదుల్లోనే రోగులకు వైద్యం అందిస్తున్నారు. చిన్నచిన్న గదుల్లో ఆస్పత్రులు నిర్వహిస్తూ అందినంత ఫీజులు గుంజుతున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో సుమారు 170 వరకు ఆస్పత్రులుంటాయి. నిబంధనలు తూచ్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రుల్లో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలున్నాయి. నర్సింగ్‌హోంలు, ఐసీయూలు ఉంటే సరిపడా బెడ్స్ ఉండాలి. నిబంధనలు ఎవరూ పాటించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే మంటలు ఆర్పేందుకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు ఉండాలి. ఆస్పత్రి భవనంపై నిర్ణీత సామర్థ్యం గల నీటి ట్యాంకులు, వార్డులు, గదులకు ఉండాలి. ఇవి ఎక్కడా మచ్చుకై నా కన్పించడం లేదు. అంతస్తుల కొద్ది ఆస్పత్రులున్నాయే కానీ ఎక్కడా వాహనాలు తిరిగే చోటు లేదు. అలాగే మెట్లు విశాలంగా.. ర్యాంపులు ఉండాలి. రోగులను స్ట్రెచర్‌పై తీసుకెళ్లేందుకు వీలుగా ఉండాలి. ఇవేమీ పట్టించుకోకుండా చిన్నచిన్న ఇరుకై న గదులను అద్దెకు తీసుకుని ఆస్పత్రులను నిర్వహిస్తున్నారు. కన్పించని బోర్డులు ప్రతి ఆస్పత్రిలో వైద్యుల వివరాలు, వారి అర్హతలు, ఇతర సిబ్బంది వివరాలు, ఎలాంటి వైద్యం అందుబాటులో ఉంది, ఫీజుల వివరాలు ఉండాలి. కానీ కొన్ని ఆస్పత్రుల్లో మాత్రమే కనిపిస్తాయి. అంతేకాకుండా వేతన చట్టం ప్రకారం కనీస వేతనాలు సైతం చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కార్మిక శాఖ నుంచి అనుమతి సైతం తీసుకోవాలి. రోడ్లపైనే జనరేటర్లు జనరేటర్లకు సపరేట్ గదులు ఏర్పాటు చేసుకోవాలి. కానీ.. రోడ్లపైనే ఏర్పాటు చేస్తున్నారు. ఆస్పత్రుల ముందున్న ఖాళీ స్థలంలో పెద్దపెద్ద జనరేటర్లు పెడుతున్నారు. వాస్తవానికి ఈ ఆటోమెటిక్ జనరేటర్లను రోడ్లపై రాకుండా ప్రజలకు కాకుండా ఆస్పత్రిలోనే ఏర్పాటు చేసుకోవాలి. తరుచూ డాక్టర్లు మారితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఒక ఆస్పత్రిని ఏర్పాటు చేసినప్పుడు సంబంధిత డాక్టర్ ఎవరు..? ఏ ఆస్పత్రి..? నర్సింగ్ హోమా..? లేదా జనరల్ ఆస్పత్రా..? మల్టీకేరా..? వైద్య శాఖకు తెలపాల్సి ఉంటుంది. కొందరు న్యూరోసర్జన్ అని, మరోసారి ఫిజిషియన్ అంటూ బోర్డులు మార్చుతున్నారు. ఏదైనా ఆస్పత్రిలో డాక్టర్ మారారంటే వెంటనే వైద్యశాఖ నుంచి అనుమతులు తీసుకోవాలి. అయినా ఎవరూ అనుమతులు తీసుకోవడం లేదు. రోడ్లపైనే పార్కింగ్.. సెల్లార్లలో వ్యాపారం జగిత్యాలలో ఏ ఆస్పత్రిలోనూ పార్కింగ్ సౌకర్యం లేదు. సెల్లార్లు ఏర్పాటు చేసినప్పటికీ అందులో మెడికల్షాపులుగానీ, ఇతరత్రా వేరే షాపులు నిర్వహించుకుంటున్నారు. అశోక్‌నగర్, జంబిగద్దె, గొల్లపల్లి రోడ్లో ఎక్కువగా ఆస్పత్రులున్నాయి. ఈ ఆస్పత్రులకు పేషెంట్లను తీసుకొస్తే రోడ్లను బ్లాక్ చేయాల్సిన పరిస్థితి. ఫీజులూ అధికమే.. ఆస్పత్రుల్లో రోగులకు కనీస సౌకర్యాలు మాత్రం కల్పించరుగానీ వేలల్లో ఫీజులు లాగుతుంటారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన ఆర్ఎంపీలతో వైద్యులు కుమ్మకై ్క కమీషన్ల పేరిట వారిని ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్స చేయిస్తూ వేలల్లో బిల్లులు లాగుతుంటారు. ఆస్పత్రుల్లో మాత్రం వసతులపై నిర్లక్ష్యంగా ఉంటారు. సెల్లార్లలోనే మెడికల్ షాపుల నిర్వహణ ఇరుకు గదుల్లోనే రోగులకు చికిత్స మచ్చుకై నా కనిపించని ఫైర్ సేఫ్టీ ప్రజల భద్రత అంతంతేమంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి నియోజకవర్గానికి చెందిన ఓ వ్యక్తిని పరామర్శించేందుకు కరీంనగర్‌లోని ఓ ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ పై అంతస్తులోకి లిఫ్ట్‌లో వెళ్తుండగా అకస్మాత్తుగా వైరు తెగి ఊడిపోయింది. ఫస్ట్‌ఫ్లోర్ కావడంతో పెనుప్రమాదం తప్పింది. ఆస్పత్రుల్లో రోగులకు తగిన వసతులు లేవు. ఇలాంటి పరిస్థితులు ఒక్క కరీంనగర్‌లోనే కాదు.. మన జిల్లాలోనూ అధికంగా ఉన్నాయి. ఈ చిత్రం జిల్లాకేంద్రంలోని గొల్లపల్లిరోడ్‌లో గల ప్రైవేటు ఆస్పత్రులు. ఇందులో ఏ ఆస్పత్రిలోనూ ఫైర్‌సేఫ్టీ మచ్చుకై నా కనిపించడం లేదు. ఏదైనా ప్రమాదం జరిగితే ఫైర్ ఇంజన్ తిరిగేలా ఏ బిల్డింగ్లోనూ లేదు. వైద్యశాఖ అధికారులు కూడా పట్టించుకోవడం లేదు. ఇదే రోడ్డులో అనేక ఆస్పత్రులున్నాయి. వైద్యశాఖ అధికారుల తనిఖీలు లేకపోవడంతో ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలున్నాయి. -
ధాన్యాన్ని మిల్లులకు తరలించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ మల్లాపూర్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని ముత్యంపేట, రాఘవపేట, మొగిలిపేటలో కొనుగోలు కేంద్రాలు, మిల్లులను తనిఖీ చేశారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. ఎండ తీవ్రత దృష్టిలో ఉంచుకుని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అకాల వర్షాలు ఉన్నందున గన్నీసంచులు, టా ర్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ట్యాబ్ డాటా ఎంట్రీ ఆన్లైన్ చేసి రైతులకు ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా చూడాలన్నారు. మెట్పల్లి ఆర్డీవో నరసింహరావు, సీవిల్ సప్లయ్ డీఎం జితేంద్రప్రసాద్, తహసీల్దార్ రాంచందర్, ఆర్ఐలు రాజేష్, అశోక్, ఐకేపీ ఎపీఎం విమోచన, సీసీలు, ప్యాక్స్ సీఈవోలు, రైతులు పాల్గొన్నారు. ‘ఎస్ఐఆర్’ పకడ్బందీగా చేపట్టాలిజగిత్యాల: స్పెషల్ ఇంటెన్సీవ్ రివిజన్ (ఎస్ఐఆర్)ను పకడ్బందీగా చేపట్టాలని అదనపు కలెక్టర్ బీఎస్.లత అన్నారు. కలెక్టరేట్లో మాట్లాడుతూ.. ఎన్నికల నిర్వహణలో సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు ఈఆర్వో, ఏఈఆర్వో, బీఎల్వోలు యాప్‌లపై శిక్షణ పొందాలన్నారు. ఓటరు జాబితా సవరణ విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో ఏవో కిషన్, నరేష్, ఏడీఎం మమత పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలంపెగడపల్లి: ధాన్యం సేకరణలో ప్రభుత్వం విఫలమైందని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. క్వింటాకు 5 నుంచి 6 కిలోలు కోత విధిస్తున్నారని పేర్కొన్నారు. మండలంలోని కీచులాటపల్లిలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి గురువారం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడారు. నెల రోజులుగా రైతులు కేంద్రాల్లో పడిగాపులు పడుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఇలాంటి పరిస్థితి రాలేదన్నారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మల్లారెడ్డి, నా యకులు నరేందర్‌రెడ్డి, సత్యనారాయణరెడ్డి, వీరేశం, ఆనందం, గంగాధర్ పాల్గొన్నారు. ధర్మదీక్ష పేరిట రాజకీయంరాయికల్: కేంద్రీయ విద్యాలయం ఏర్పాటుపై ఎంపీ ధర్మపురి అర్వింద్ రాజకీయం చేయడం తగదని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్‌లో విలేకరులతో మాట్లాడారు. స్థలం కేటాయింపు కోసం ఇరిగేషన్ మంత్రికి వినతిపత్రాలు అందించానని తెలిపారు. నవోదయ పాఠశాలను కోరుట్లకు ఇచ్చి.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పిల్లలకు అడ్మిషన్లు ఇచ్చిన తర్వాతే ఇతరులకు ఇచ్చే కేవిని జగిత్యాలకు మంజూరు చేశారని, దీనికి ఎంపీ అర్వింద్ ధర్మదీక్ష పేరుతో రాజకీయం చేస్తున్నారని ఎద్దేవా చేస్తున్నా రు. అయినప్పటికీ స్థలం కేటాయించేందుకు కృషి చేస్తున్నానని తెలిపారు. ఆత్మ చైర్మన్ కాటిపల్లి గంగారెడ్డి, సింగిల్ విండో చైర్మన్లు ఏనుగు మల్లారెడ్డి, దీటి రాజిరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, కౌన్సిలర్లు పల్లికొండ గంగాధర్, రాకేష్‌నాయక్, మచ్చ గంగలక్ష్మి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు బెజ్జంకి మోహన్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు, నాయకులు పాల్గొన్నారు. -
ముగ్గురు దొరికారు.. పరారీలో పది మంది!
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్ క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెలరీ షాప్ దోపిడీ కేసులో పోలీసులు ముగ్గురినే పట్టుకోగలిగారు. ఈ దోపిడీలో మొత్తం 13 మంది పాల్గొనగా.. మిగిలిన 10 మంది కోసం గాలిస్తున్నారు. బిహార్ జైలులో ఉన్న ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్‌సింగ్ జైలు నుంచే ఈ ఆపరేషన్‌ను నడిపించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్టు చూపిస్తూ గురువారం సీపీ గౌస్ ఆలం కమిషనరేట్ కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసు వివరాలు వెల్లడించారు. ఈ కేసులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జారీరా సింగ్, బిహార్‌కు చెందిన రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమన్లు, వీరికి సిమ్‌కార్డులు సరఫరా చేసిన మెహతాబ్‌ఖాన్ అలి యాస్ మహబూబ్‌ఖాన్‌ను అరెస్ట్ చేయగా, మరో 10 మంది పరారీలో ఉన్నారని తెలిపారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని టూ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన ఈ కేసులో రూ.82.02 లక్షల విలువైన బంగారం, వజ్రాభరణాలు దోచుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. దోపిడీ సమయంలో జ్యువెలరీ షాప్ సిబ్బందిపై కాల్పులు జరపడంతో నలుగురు గాయపడిన విషయం తెలిసిందే. జైలు నుంచే మాస్టర్‌ప్లాన్ ఈ దోపిడీ వెనుక బిహార్‌లోని కరుడుగట్టిన నేరగాడు సుభోద్‌సింగ్ ఉన్నట్లు దర్యాప్తులో తేలింది. ‘ది గోల్డెన్ థీఫ్’గా పేరొందిన సుభోద్‌సింగ్ జైలులో నుంచే తన అనుచరులకు ఆదేశాలిస్తూ దేశవ్యాప్తంగా దోపిడీలు చేయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బిహార్, పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, తెలంగాణ, మహారాష్ట్రల్లో ఈ ముఠా 20కి పైగా దోపిడీలకు పాల్పడినట్లు, 400 కిలోలకుపైగా బంగారాన్ని దోచుకెళ్లినట్లు సమాచారం. సుభోద్‌సింగ్ ఆదేశాలతో ప్రధాన నిందితులు రఘునాథ్ కర్మాకర్ అలియాస్ జగీరాసింగ్, రావిష్‌కుమార్ అలియాస్ ప్రద్యుమన్, రాధే అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్ తదితరులు రెండు నెలల క్రితమే తెలంగాణకు వచ్చారు. ఖమ్మం, సిద్దిపేట, పెద్దపల్లి, కరీంనగర్ ప్రాంతాల్లో జ్యువెలరీ షాపులు, బ్యాంకులపై రెక్కీ నిర్వహించారు. చివరికి కరీంనగర్‌లోని పీఎంజే జ్యువెల్లరీ షాప్‌ను ఎంచుకున్నట్లు వెల్లడించారు. రెక్కీ సమయంలో ఎంట్రీ, ఎగ్జిట్ రూట్లను ముందుగానే డౌన్లోడ్ చేసుకుని, వాటి ఆధారంగానే పారిపోయారు. నకిలీ ఆధార్‌కార్డులు, తెలంగాణ, ఒడిషా ఫేక్ బైక్ నంబర్ ప్లేట్లు, తప్పుడు పేర్లతో లాడ్జీలలో బస చేస్తూ పోలీసులను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేసినట్లు వెల్లడైంది. ఈక్రమంలో సిద్దిపేట, పెద్దపల్లి, ధర్మపురి లాడ్జీల్లో బసచేశారు. వీరంతా ఒకరికితో మరొకరికి పరిచయం లేదు. అందరికీ ఇచ్చిన నకిలీ గుర్తింపుకార్డుల పేర్లతోనే పిలుచుకున్నారు. దోపిడీ చేసిన బంగారాన్ని ఇప్పటికే కరిగించి నేపాల్ చేర్చినట్లు అనుమానిస్తున్నారు. చంద్రాపూర్ అడవుల్లో తుపాకులు పోలీసుల విచారణలో నిందితుల నేరపద్ధతి సంచలనంగా మారింది. ఝార్ఖండ్–పశ్చిమ బెంగాల్ సరిహద్దులో ఒక్కో సిమ్‌కార్డును రూ.10వేల చొప్పున కొనుగోలు చేసినట్లు తేలింది. దోపిడీకి ముందు రఘునాథ్ కర్మాకర్ మంచిర్యాల నుంచి రైలులో చంద్రపూర్ సమీపానికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే ముఠాకు చెందిన వ్యక్తుల నుంచి ఆరు పిస్టల్స్, 60 బుల్లెట్లతో 12 మ్యాగ్జిన్లు తీసుకుని తిరిగి ధర్మపురికి చేరుకున్నట్లు వెల్లడించారు. ఈనెల 3న ధర్మపురి నుంచి వచ్చి జ్యువెల్లరీ షాపులో దోపిడీకి పాల్పడి, నలుగురు సిబ్బందిని కాల్చి ముందుగానే రెక్కి చూసి మెయిన్ రోడ్లపై కాకుండా గ్రామాల్లోని కాలువలు, చిన్న రోడ్ల ద్వారా ధర్మపురి చేసుకున్నారు. ధర్మపురి వద్ద పల్సర్‌ను వదిలేసి, ముగ్గురు దొంగలు కాలినడకన గోదావరినది దాటి మంచిర్యాల వద్ద రైలెక్కి పారిపోయారు. అపాచీ మీదున్న ఇద్దరు దొంగలు ఆభరణాలతో అడవి మార్గంలో వెళ్లి క్రెటా కారులో వచ్చిన వ్యక్తులకు నగల బ్యాగ్ అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. కీలక నిందితులైన గ్యాంగ్ లీడర్ సుభోద్సింగ్తోపాటు రాధేమిశ్రా అలియాస్ అభయ్, సూర్యమణికుమార్ అలియాస్ సనోజ్, మిశ్రా తదితరులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. వారిని పట్టుకునేందుకు ఐదు ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. జ్యువెల్లరీ షాపులు, బ్యాంకులు, లాడ్జీ యజమానులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. నాణ్యమైన పానిక్ బటన్లు, అలారం వ్యవస్థలు ఏర్పాటు చేయాలని, అనుమానితులు కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఐపీఎస్ అధికారి సోహం సునీల్, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, ఏసీపీలు వెంకటస్వామి, విజయ్‌కుమార్‌తోపాటు పలువురు సీఐలు పాల్గొన్నారు. ‘గోల్డెన్ థీఫ్’ ప్రత్యేకతలు కేసు వివరాలు -
కారు ఢీకొని యువకుడి దుర్మరణం
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లుల శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. బండలింగాపూర్ గ్రామానికి చెందిన గడ్డం మోహన్(27) కథలాపూర్‌లో ఓ వివాహానికి వెళ్లాడు. ద్విచక్రవాహనంపై తిరుగుపయనమయ్యాడు. ఈ క్రమంలో విట్టంపేట వైపు నుంచి వస్తున్న కారు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన మోహన్‌ను చికిత్స నిమిత్తం మెట్పల్లి ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడి నుంచి నిజామాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. కారు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మృతుడి తండ్రి జనార్ధన్ ఫిర్యాదు మేరకు నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం హాసకొత్తూర్‌కు చెందిన కారు డ్రైవర్ శైలేష్గౌడ్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. వరదకాలువలో దూకి వివాహిత ఆత్మహత్య మెట్‌పల్లిరూరల్: వరదకాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు ఇబ్రహీంపట్నం ఎస్సై నవీన్ తెలిపారు. మెట్పల్లి మండలం మేడిపల్లికి చెందిన గుండెల లక్ష్మీ(59)కి ఆమె భర్త రాజన్నకు కుటుంబంలో వివాదం తలెత్తింది. మనస్తాపం చెందిన లక్ష్మీ ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు వెదికినా ఆచూకీ దొరకలేదు. గురువారం వేకువజామున రాజేశ్వర్రావుపేట శివారులో వరదకాలువలో మహిళ మృతదేహం ఉన్నట్లు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వెళ్లి మృతదేహాన్ని బయటకు తీయించారు. లక్ష్మీ చెల్లె అసరీ గౌరు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతివెల్గటూర్: గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన ఎండపల్లి మండలం చెర్లపల్లి వద్ద చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్ల గ్రామానికి చెందిన ఎరవెల్లి పర్శరాం (43) వ్యక్తిగత పని నిమిత్తం ఎండపల్లి మండలానికి వచ్చాడు. కారును రోడ్డు పక్కన పార్క్ చేసి రోడ్డు దాటే క్రమంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఘటనా స్థలంలోనే మృతిచెందాడు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, సీఐ రాంనర్సింహారెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పర్శరామ్కు కుమారుడు, ఇద్దరు కూతుళ్లు సంతానం. ఆయన భార్య నాలుగేళ్ల క్రితం చనిపోయింది. పర్శరాం తల్లి లింగవ్వ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ కుమార్ తెలిపారు. అంజన్న జయంతి ఆదాయం రూ.1.74కోట్లుమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10 నుంచి 12వరకు నిర్వహించిన పెద్ద జయంతి ఉత్సవాలకు రూ.1.74కోట్ల ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో అంజనా రెడ్డి తెలిపారు. లడ్డూ ప్రసాదాల విక్రయాల ద్వారా రూ.99,79,525, పులిహోర రూ.15,41,380, దీక్ష విరమణ రూ.32,66,600, కేశఖండనం రూ.8,37,200, శీఘ్ర దర్శనం ద్వారా రూ.17, 94,200 వచ్చిందన్నారు. గతేడాదితో పోల్చితే రూ.24లక్షల ఆదాయం అదనంగా సమకూరిందని అధికారులు తెలిపారు. ఉత్సవాలను విజయవంతం చేసిన అధికారులకు ఈవో కృతజ్ఞతలు ప్రకటించారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ధర్మపురి: అతి వేగం, అజాగ్రత్తతో కారును నడిపి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. మరో నలుగురు తీవ్రంగా గాయపడినట్లు ఎస్సై తెలిపారు. ఎండపెల్లి మండలం కొత్తపేటకు చెందిన కోడి ప్రవీణ్, గోపాల మొగిలి, గోపాల రాజయ్య, తరాల రాజమల్లు గురువారం అదే గ్రామానికి చెందిన తరాల ప్రవీణ్‌తో కలిసి కారులో హాజీపూర్ వెళ్లి వస్తున్నారు. తిరుగు ప్రయాణంలో రాయపట్నం జాతీయ రహదారి మూలమలుపు వద్ద అతి వేగంగా వచ్చి ఆగి ఉన్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. పక్కనే ఉన్న స్కూటి, ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కారులో ముందు సీటులో కూర్చున్న తరాల రాయమల్లు (53) తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. కారులో ప్రయాణిస్తున్న నలుగురికి తీవ్ర గాయాలు కాగా 108లో ఆస్పత్రికి తరలించారు. కోడి ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. విద్యుత్ షాక్‌తో కౌలు రైతు..పెగడపల్లి: మండలంలోని మద్దులపల్లికి చెందిన గన్నెబోయన చంద్రయ్య విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. మామిడితోటలు కౌలుకు తీసుకుని చంద్రయ్య జీవనం సాగిస్తున్నాడు. బోయినిపల్లి మండలం అనంతపల్లెలో కౌలుకు తీసుకున్న ఓ రైతు తోటలో పనిచేస్తుండగా.. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. ఇంటికి పెద్దదిక్కును కోల్పోవడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగారు. చంద్రయ్యకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురుకు వివాహమైంది. మంటలు అంటుకుని వృద్ధురాలు..మేడిపల్లి: టీ చేసుకుందామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు చీర కొంగుకు మంటలు అంటుకుని వృద్ధురాలు సజీవ దహనమైన ఘటన భీమారం మండలం దేశాయిపేటలో చోటుచేసుకుంది. మేడిపల్లి ఎస్త్సె శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన ఎగూర్ల లక్ష్మీదేవి (82) గురువారం ఉదయం చాయ్ తాగుదామని గ్యాస్ స్టవ్ వెలిగించే క్రమంలో ప్రమాదవశాత్తు మంటలు చీర కొంగుకు అంటుకొని తీవ్రంగా గాయపడింది. స్థానికులు ఆస్పత్రికి తరలించేలోపే మృతిచెందింది. లక్ష్మీదేవి కుమారుడు మల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్సె తెలిపారు. -
మేము గీసిన బొమ్మలు
పేరు : మొగిలి సౌధామిని 8వ తరగతి గ్రామం: ముత్తారం జిల్లా: పెద్దపల్లిపేరు: స్రవిష్ట గంగుల పాఠశాల: సెయింట్ జాన్స్ హైస్కూల్ 7వ తరగతి కరీంనగర్పేరు: డి. జాయ్ నిర్వేద్ 4వ తరగతి గ్రామం: ఎఫ్‌సీఐ, ఎలకలపల్లి గేట్ రామగుండం జిల్లా: పెద్దపల్లి పేరు: టేకుమట్ల చరిష్మా ఏడో తరగతి, గ్రామం: పాతర్లపాడు మండలం: చింతకాని జిల్లా: ఖమ్మంపేరు: బుర్ర భవానిఆల్ఫ్రెడ్ నోబెల్ ఇంగ్లిష్ మీడియం హైస్కూల్ తరగతి: 9వ తరగతి గ్రామం: కరీంపేట, మండలం: శంకరపట్నం జిల్లా: కరీంనగర్ పేరు: సంగుల మోక్ష తరగతి: 4వ తరగతి వేములవాడ జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: తడుక శ్రేయాన్షి తరగతి: 2వ తరగతి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రామం: కనగర్తి, కోనరావుపేట జిల్లా: రాజన్నసిరిసిల్ల పేరు: విహాన్ దవాల్జీ తరగతి: యూకేజీ స్వస్థలం: సిరిసిల్ల జిల్లా: రాజన్న సిరిసిల్ల -
చెప్పుకోండి చూద్దాం
01. నల్లని పాయ కలిగిన జీవనది? 02. శివుడు తలపై పెట్టుకున్న నది దేవత? 03. రాతి గుండ్లకు కమ్మలు పెట్టే నది ? 04. బంగారు వదనం కలిగిన నది? 05. పనికి ‘నాగా’ పెట్టే నది? 06. నంద అలిగి కూర్చుంది ఏ నదిలో? 07. ‘తుంగ’కు జాగ్రత్త చెప్పే నది? 08. వరి పంటను ‘గోదా’ లోకి దింపే నది? 09. నీరు కడుపులో పెట్టుకుని మూసేసే నది? 10. కళ్ళున్న నది ఏమిటి?01. కృష్ణవేణి 02. గంగోత్రి 03. గుండ్లకమ్మ 04. స్వర్ణముఖి 05. నాగావళి 06. అలకనంద 07. తుంగభద్ర 08. గోదావరి, 09.మూసి, 10. నేత్రావతి. – డాక్టర్ కందేపి రాణీప్రసాద్, వైద్యురాలు, రచయిత్రి, సిరిసిల్ల -
బన్నీ వేసవి యాత్ర–7
ఉదయం అయ్యింది. కొక్కొరోకో అని కోడి కూసింది. బన్నీకి మెలకువ వచ్చింది. పక్కన చూశాడు. రామ్, చుక్క, స్వప్న లేచారు. అందరూ శుభోదయం చెప్పుకున్నారు. నానమ్మ దగ్గరకు వచ్చింది. చేతిలో ఒక పుల్ల. ఇది వేప పుల్ల రా బన్నీ అంది. దీంతో పళ్ళు తోము.్ఙ అన్నది. బన్నీ మొహం చిట్లించాడు. కోల్గేట్ లేదా? అన్నాడు. తాతయ్య నవ్వాడు. ఇదే మన పాత పేస్ట్ రా. పంటికి బలం. అన్నాడు. బన్నీ వేప పుల్లతో పళ్ళు తోమాడు. కొంచెం చేదు. కానీ ఫ్రెష్‌గా ఉంది. తర్వాత తాతయ్య బన్నీని కొట్టం దగ్గరికి తీసుకెళ్లాడు. అక్కడ ఒక ఆవు. పేరు లక్ష్మి. ఇది మన లక్ష్మ్ఙి అన్నాడు తాతయ్య. తాతయ్య పాలు పితికాడు. బన్నీ చూస్తూ ఉన్నాడు. నానమ్మ పాలను వేడి చేసి, ఒక గ్లాసులో పోసి బన్నీకి ఇచ్చింది. బన్నీ తాగాడు. చక్కెర వెయ్యలేదు. అయినా తియ్యగా ఉన్నాయి. ‘ఎందుకు నానమ్మా?’ అన్నాడు బన్నీ. నానమ్మ నవ్వింది. ‘ప్రేమ కలిపానురా కన్నయ్యా... అందుకే తియ్యగా ఉన్నాయి’. అన్నది. బన్నీకి ఆశ్చర్యం. ప్రేమకి రుచి ఉంటుందా? పిల్లలకి మాట: పాలు ప్యాకెట్లో రావు. ఆవు, గేదెల నుంచి వస్తాయి. ప్రేమతో రుచి పెరుగుతుంది. డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా -
నేటితరం అభీష్టం ప్రకారం
మన జీవితంలో సినిమా, సోషల్ మీడియా భాగమై పోయింది. స్టేజీషోలు, టీవీషోల్లో పాల్గొనాలని తమలోని నటనను పదుగురికి చూపించాలని పిల్లలు ఆసక్తి చూపిస్తున్నారు. ఆసక్తి, అభీష్టం మేరకు సినిమాకు సంబంధించిన వివిధ అంశాలలో పిల్లలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. ప్రస్తుతం 30 మంది చిన్నారులు మా ఇనిస్టిట్యూట్‌లో శిక్షణ పొందుతున్నారు. – అనసూరి భూనాథాచారి, మాస్క్ యాక్టింగ్ ఇనిస్టిట్యూట్ చైర్మన్, రోల్ ప్లే ఇన్స్ట్రక్టర్ -
అమ్మ ప్రేమ
అమ్మ మొదటి దైవమురా నేస్తమా అమ్మ ప్రేమ వర్ణించలేము తమ్ముడా భూదేవికి ఉన్నంత ఓర్పు రా ఈ జగతిలో అమ్మ ప్రేమ వర్ణించలేమురా మనను నవమాసాలు కనిపెంచేనుర కంటికిరెప్పలా కపాడెనుర మనకు మొదటి గురువు అమ్మే నేస్తమా ఈ ప్రపంచంలో దొరకదు అమ్మ ప్రేమ తన సుఖాన్నీ కోరుకోదు అమ్మ తన పిల్లలను సుఖంగా చూసుకుంటోంది అమ్మ ప్రయోజకున్ని చేయలనుకుంటుంది అమ్మ తనకు ఆహారం లేకపోయినా నేస్తమా మనకోసం తపన పడుతుంది నేస్తమా కంటికి కనురెప్పలాగా అమ్మ మనల్ని నిత్యము కాపాడుతుంది అమ్మ అమ్మ లేకుంటే మనం లేము తమ్మ ఈ జగతికి మూలాధారం అమ్మ అమ్మ ప్రేమ వెల కట్టలేని ప్రేమ అమ్మను బాగా చూసుకో తమ్మా చిన్నపుడు నిన్ను ఎత్తుకుంది అమ్మ నీవు అనాఽథగా విడిచిపెట్టకు తమ్మ నీవు అమ్మను విడిచిపెట్టకు తమ్ముడా నక్క శ్రీకర్, గ్రామం: ఊటూర్, మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
పిల్లలను ప్రోత్సహించాలి
సెలవుల సమయంలో చదువుతోపాటు కొత్త వ్యాపకాల వైపు పిల్లలను మళ్లించాలి. వేసవి శిక్షణ శిబిరాల్లోనూ పెయింటింగ్, డ్రాయింగ్, డ్యాన్స్.. ఇలా పిల్ల ల అభిరుచికి అనుగుణమైన అంశాల్లో శిక్షణ ఇప్పించాలి. – లీనా ప్రియదర్శిని. ప్రిన్సిపాల్ సెయింట్‌పాల్స్ హైస్కూల్ నాకు నటన అంటే చాలా ఇష్టం. పైగా అందరిలో మనకు ఒక గుర్తింపు ఉండాలంటే మనలో ఏదో ఒక ప్రత్యేకత ఉండాలి. సినిమా, టీవీ చానెళ్లలో నటించాలన్నదే నా కోరిక. అందుకే నటనలో శిక్షణ పొందుతున్నాను. – ఎస్.మాన్విత, 6వ తరగతి -
కాంగ్రెస్ మండల అధ్యక్షుల నియామకం
గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గ పరిధిలోని మండలాలకు పార్టీ అధ్యక్షులను నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ ఉత్తర్వులను జారీ చేశారు. ధర్మపురి అధ్యక్షుడిగా చిలుముల లక్ష్మణ్, బుగ్గారం అధ్యక్షుడిగా నగునూరి నర్సాగౌడ్, ఎండపల్లికి గెల్లు శేఖర్, గొల్లపల్లికి రాపెల్లి గంగన్న, పెగడపల్లికి కడారి తిరుపతి నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. మండల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మహేష్‌కుమార్‌గౌడ్ ఆకాంక్షించారు. కడారి తిరుపతిరాపెల్లి గంగన్నగెల్లు శేఖర్చిలుముల లక్ష్మణ్ -
ఆ నాటి ఆటలే బాగుండే..
మా నాన్న చిన్ననాటి కాలంలో ఊరు మొత్తం పది టీవీలే ఉండేవి. వేసవి కాలం వచ్చిందంటే ఉదయాన్నే నిద్రలేవగానే వరికోసిన మడికట్లలో తొమ్మిదింటి వరకు క్రికెట్ ఆడేవారు. ఇంటికి వచ్చి అన్నం తిని చేనుల వద్దకు వెళ్లేవారు.. ఈత పళ్లు, తాటి ముంజలు, పులిచింతకాలు తెంపుకుని పంచుకునే వారు. దగ్గర్లో ఉన్న బావుల్లో ఈత కొట్టేవారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి మళ్లీ అన్నం తిని చింతచెట్ల కింద ఆడుకునేవారు. ఎండ చల్లబడగానే.. మళ్లీ మడికట్లకు చేరుకునేవారు. సాయంత్రం సూర్యుడు వెళ్లిపోయే వరకు క్రికెట్ ఆడుకుని వచ్చేవారు. రాత్రికి మా నానమ్మ.. చేసిచ్చే చిరుతిండి తినుకుంటూ టీవీ చూసేవారమని మా నాన్న ఎప్పుడూ చెప్తుంటారు. కానీ.. ఇప్పుడు ఆ ఆటలు కనిపించడం లేదు. అలాంటి స్నేహితులు దొరకడం లేదు. నాన్న ఉద్యోగం, మా చదువుల కోసం సిటీకొచ్చి పడ్డాం.. ఇరుకు గదుల్లో ఉంటూ పంజరంలో పక్షిలా బతుకుతున్నాం. ఎండాకాలం అని మా మమ్మీ ఉదయం తొమ్మిదైనా నిద్ర లేవనివ్వడం లేదు. నిద్రలేచి స్నానం చేసిన తరువాత టిఫిన్ తిని టీవీ చూడడం, మళ్లీ చదువుకోవడం పొద్దంతా ఇంట్లో టీవీలో కార్టూన్లు చూడడం వరకే సరిపోతుంది. బయటికి వెళ్దామంటే అమ్మ ఎండ అంటుంది. గంటో అరగంటో ఆడితేనే అలిసిపోతున్నాం. ఎంతైనా మా నాన్న వాళ్ల చిన్నతనం నాటి రోజులే బాగుంటే.. ఆ ఆటలే మంచిగుండే. – ఎ.అద్వైత్, రెండో తరగతి, హనుమాన్‌నగర్, కరీంనగర్ -
డాక్టర్.. నిఖిత
● మల్యాల మండలంలో మొదటి దళిత డాక్టర్ ● నిఖిత వైద్య విద్యకు ‘సాక్షి’ దాతల తోడ్పాటుమల్యాల: నిరుపేద దళిత కుటుంబం నుంచి డాక్టర్ స్థాయికి ఎదిగారు మల్యాల మండలంలోని మ్యాడంపల్లికి చెందిన బెక్కం నిఖిత. ప్రభుత్వ పాఠశాలలో చదివి.. ఎంబీబీఎస్ సీటు సాధించారు. గ్రామానికి చెందిన బెక్కం గంగయ్య, పద్మ ఏకై క కూతురు నిఖిత సిరిసిల్లలోని బోనాల రెసిడెన్షియల్లో పదో తరగతి వరకు చదివారు. హైదరాబాద్ గౌలిదొడ్డి రెసిడెన్షియల్లో ఇంటర్ పూర్తి చేసి.. నీట్లో ర్యాంకుతో ఎంబీబీఎస్‌లో సీటు సాధించారు. అడ్మిషన్ ఫీజు చెల్లించేందుకు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయాన్ని ‘సాక్షి’ 2020 డిసెంబర్ 10న ‘సరస్వతీ పుత్రికకు లక్ష్మీకటాక్షం కరువు..’ శీర్షికన కథనం ప్రచురించింది. దీంతో స్పందించిన దాతలు ఎంబీబీఎస్ విద్యకు తోడ్పాటు అందించారు. వైద్య విద్యలోకి అడుగు పెట్టిన నిఖిత.. విజయవంతంగా ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని డాక్టర్ పట్టా అందుకున్నారు. తమ కూతురు డాక్టర్ కావడం ఎంతో గర్వంగా ఉందని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. తన కల సాకారం చేసుకునేందుకు తోడ్పాటునందించిన అందరికీ నిఖిత కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేదలకు సేవలందించడమే లక్ష్యంగా డాక్టర్ వృత్తిలోకి అడుగు పెట్టానని, ఆపదలో ఉన్న వారికి తనవంతుగా సాయమందిస్తానని తెలిపారు. -
బన్నీ వేసవి యాత్ర–6
రాత్రి 8 అయ్యింది. బస్ ఆగింది. బన్నీ దిగాడు. ఎదురుగా ఒక పెద్ద ఇల్లు. మట్టి గోడలు. గూనపెంకుల ఇల్లు. ముందు అరుగు. అరుగు మీద తాతయ్య. పక్కన నానమ్మ. ఇద్దరూ ఏదో మాట్లాడుకుంటూ... నవ్వుతున్నారు. ‘రా కన్నయ్య‘ అంది నానమ్మ. బన్నీని దగ్గరకు తీసుకుంది. తల నిమిరింది. తాతయ్య చెయ్యి పట్టుకున్నాడు. ‘ఇది నీ ఇల్లు రా బన్నీ‘ అన్నాడు. ఇంట్లో నుంచి పిల్లలు వచ్చారు. చాలా మంది. ముగ్గురు అత్తయ్యలు, మామయ్యలు. బాబాయ్, పిన్ని మరియు ఆరుగురు పిల్లలు. చుక్క, స్వప్న, రామ్ కూడా ఉన్నారు. ‘హాయ్ బన్నీ!‘ అన్నారు. బన్నీ ఆశ్చర్యపోయాడు. మేము కూడా వచ్చాము అన్నారు. అందరూ నవ్వుకున్నారు. నానమ్మ ఒక పళ్లెం తెచ్చింది. పళ్లెంలో గారెలు. బెల్లం గారెలు. ‘తినరా‘ అంది. బన్నీ ఒక గారె తిన్నాడు. తియ్యగా ఉంది. వేడిగా ఉంది. అమ్మ చేసినట్టే ఉంది. తాతయ్య అన్నాడు, ‘బన్నీ, ఇక్కడ అందరం ఒకే ఇంట్లో ఉంటాం. అందరం కలిసి తింటాం. కలిసి నవ్వుతాం. ఇది మన ఉమ్మడి కుటుంబం.‘ బన్నీ చుట్టూ చూశాడు. అందరి మొహాల్లో నవ్వు. బన్నీకి కూడా నవ్వు వచ్చింది. భయం పోయింది. పిల్లలకి మాట: ఇల్లు అంటే నాలుగు గోడలు కాదు. ప్రేమతో ఉన్న మనుషులు.డాక్టర్ కోట లక్ష్మణ్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు ప్రాథమిక పాఠశాల,కాకర్లపల్లి, మండలం: మంథని, పెద్దపల్లి జిల్లా గోంగూర పాపహలో పిల్లలూ! గోంగూరతో పప్పు వండుకోవచ్చు. పచ్చడి చేసుకోవచ్చు. కానీ.. అమ్మాయిని తయారు చేయవచ్చా? చేయవచ్చు! చూడండి. ఈ గోంగూరమ్మాయి బాగుందా? నేను మా కుండిలో గోంగూర చెట్టును పెట్టుకున్నాను. అందుకే ఈ గోంగూరను తేత ఆకుల్ని తీసుకున్నాను. దీని ని ’రెడ్ సోరెల్’ అని పిలుస్తారు. ఇది పుల్లగా ఉంటుంది. పోషకాలున్న ఆకుకూర. ఇందులో ఐరన్, విటమినే ’ఎ’ ఉంటుంది. యాంటి ఆక్సిడెంట్లు కూ డా ఉంటాయి. గోంగూరలో ఎర్ర గోంగూర, తెల్ల గోంగూర అని రెండు రకాలుంటాయి. రక్తహీనతను నివారిస్తుంది. రోగ నిరోధక శక్తినే పెంపొందిస్తుంది. -
ఒంటరితనం భరించలేక వృద్ధుడి ఆత్మహత్య
ముస్తాబాద్(సిరిసిల్ల): వృద్ధాప్యం.. అనారోగ్యం..ఒంటరితనం భరించలేని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై గణేశ్ తెలిపిన వివరాలు. రాజన్నసిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం చీకోడుకు చెందిన సోల నర్సయ్య(80) భార్య నలభై ఏళ్ల క్రితం విడాకులు తీసుకుని విడిపోయింది. అప్పటి నుంచి నర్సయ్య ఒంటరిగా ఉంటున్నాడు. గుడిసెలో దుర్భర జీవితం గడుపుతున్న నర్సయ్య కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఒంటరి జీవితం ఎవరూ పట్టించుకునే వారు లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది బుధవారం గ్రామ శివారులోని చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడి మృతిగోదావరిఖనిటౌన్: కరీంనగర్ నుంచి గోదావరిఖనికి వస్తున్న కరీంనగర్–2 డిపో బస్సులో మహారాష్ట్ర సిరొంచకు చెందిన అబ్ధుల్ రజాక్ కరీంనగర్లో గోదావరిఖనికి టికెట్ తీసుకున్నాడు. స్టాఫ్ వద్ద దిగకపోవడంతో కండక్టర్ గమనించి 108 సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఇతడు మార్గమధ్యలో చనిపోయినట్టుగా వైద్యులు నిర్ధారించారు. గంగాధర: మండలంలోని మప్పిడినర్సింహులపల్లి జీపీ పరిధి పెండలోనిపల్లిలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగింది. ఎస్సై వంశీకృష్ణ తెలిపిన వివరాలు.. గ్రామానికి చెందిన ముత్యాల హేమలత ఈ నెల 11న ఇంటికి తాళం వేసిన బంధువుల దగ్గరికి వెళ్లిది. బుధవారం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి ఉంది. బీరువాలోని ముప్పై తులాల వెండి, ఐదు గ్రాముల బంగారం, రూ.ఏడువేలు దొంగలు ఎత్తుకెళ్లారని, బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై వివరించారు. బాల్య వివాహం అడ్డగింతపెగడపల్లి: మండలంలోని మద్దులపల్లిలో బాల్య వివాహాన్ని అధికారులు అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన బాలికకు అదే గ్రామానికి చెందిన యువకుడితో పెళ్లి నిశ్చయమైంది. విషయం తెలుసుకున్న ఆర్ఐ జమున, చైల్డ్‌లైన్ కో–ఆర్డినేటర్ శ్రావణ్, బాలల పరిరక్షణ సమితి ఔట్రిచ్ శ్రీవాణి, అంగన్వాడీ టీచర్లు శోభ, శైలజా, పోలీసు సిబ్బంది శ్రీకాంత్, చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లారు. ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ, పదో తరగతి సర్టిఫికెట్లను పరిశీలించారు. బాలిక తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. చిన్నతనంలో వివాహం చేస్తే అనర్థాలు జరుగుతాయన్నారు. 18 ఏళ్లు దాటే వరకూ వివాహం చేయబోమని తల్లిదండ్రులు అంగీకార పత్రం రాయించి ఇవ్వడంతో అధికారులు వెళ్లిపోయారు. రేబిస్‌తో చిన్నారి మృతికోనరావుపేట(వేములవాడ): రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లికి చెందిన బాలులు రేబిస్‌తో బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన లోకుర్తి రాజు–మమతల కొడుకు లోకుర్తి నిశాంత్(11) ఇటీవల 5వ తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో సరదాగా గడుపుతున్నాడు. ఏప్రిల్ 23న గ్రామంలో ఓ పిచ్చికుక్క కరవడంతో తలకు, తొంటి భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలించి వ్యాక్సిన్లు ఇప్పించారు. వారం రోజుల తర్వాత తీవ్ర జ్వరం రావడంతో కరీంనగర్‌కు తీసుకెళ్లారు. రేబిస్‌తో బ్రెయిన్ ఇన్ఫెక్షన్ వచ్చినట్లు నిర్ధారించిన వైద్యులు హైదరాబాద్‌కు వెళ్లాలని సూచించారు. వారం రోజులుగా నిశాంత్ హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ బుధవారం మృతిచెందాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదం నెలకొంది. -
దూసుకొచ్చిన స్కార్పియో
● మహిళ మృతి.. మరో ఇద్దరికి గాయాలుగంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం రాజేశ్వర్‌రావునగర్ బస్టాండ్ వద్ద బుధవారం బస్సు కోసం ఎదురుచూస్తున్న ముగ్గురిపైకి స్కార్పియో వాహనం దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాలు. రాజేశ్వర్‌రావునగర్ బస్టాండ్ వద్ద అదే గ్రామానికి చెందిన చల్ల లక్ష్మి, బోయిని రజిత, యశ్వంత్ సిరిసిల్లకు వెళ్లేందుకు బస్సు కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో కామారెడ్డి వైపు వేగంగా వస్తున్న స్కార్పియో వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ చల్ల లక్ష్మి(35) అక్కడికక్కడే మరణించింది. తీవ్రంగా గాయపడ్డ బోయిని రజిత, యశ్వంత్‌లను ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. చల్ల లక్ష్మి భార్యభర్తలు కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు. ఇంటికి పెద్ద దిక్కు అయిన లక్ష్మి మరణంతో ఆ కుటుంబం తీవ్ర విషాదంలో కూరుకుపోయింది. ప్రమాదానికి కారణమైన కారు మహారాష్ట్రకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అనిల్‌కుమార్ తెలిపారు. -
బ్లడ్ కేన్సర్ చికిత్సలో విప్లవాత్మక మార్పులు
కరీంనగర్: బ్లడ్ కేన్సర్ చికిత్స రంగంలో ఆధునిక సాంకేతికత, అత్యాధునిక వైద్య పద్ధతులతో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి చెందిన ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద మెడికల్ సెంటర్లో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ కేన్సర్ చికిత్స మరింత సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ కేన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్, ఇమ్యూనో థెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఈ చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం కేన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుని చికిత్స అందించడం సాధ్యమవుతోందన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజలకు అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. -
కారు, బైక్ ఢీ
● ఒకరు మృతి.. 8 మందికి గాయాలు సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని మొదటి బైపాస్ రోడ్డులో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా, మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు. సిరిసిల్ల పట్టణంలోని విద్యానగర్‌కు చెందిన గోక సదానందం, అతని భార్య వినోద, కూరపాటి విజయ, కూరపాటి శ్రీకాంత్, కూరపాటి రాజేంద్రపాద్ కారులో మూడు రోజుల క్రితం హుస్నాబాద్‌లో బంధువుల పెళ్లికి వెళ్లారు. బుధవారం సిరిసిల్లకు తిరిగి వస్తుండగా మొదటి బైపాస్‌రోడ్డులో కారు అదుపు తప్పి ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వేములవాడ రూరల్ మండలం అచ్చయ్యపల్లెకి చెందిన వేణు అతని భార్య హర్షిత, పిల్లలు సౌర్యనందన్, అనుశ్రీ గాయపడ్డారు. అదే వేగంతో కారు ముందుకు వెళ్లి చెట్టును ఢీకొట్టగా అందులో ఉన్న శ్రీకాంత్, రాజేంద్రసాద్ కాళ్లు విరిగిపోయాయి. విజయ తలకు తీవ్రగాయాలు కాగా స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కరీంనగర్ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతిచెందింది. -
సీబీఎస్ఈ ఫలితాల్లో ‘అల్ఫోర్స్’ జయకేతనం
కొత్తపల్లి(కరీంనగర్): కరీంనగర్ కొత్తపల్లిలోని అల్ఫోర్స్ సీబీఎస్ఈ సీనియర్ సెకండరీ పాఠశాలకు చెందిన విద్యార్థులు బుధవారం ప్రకటించిన 12వ తరగతి ఫలితాల్లో అత్యున్నత మార్కులతో జయకేతనం ఎగురవేసినట్లు ఆ విద్యా సంస్థల చైర్మన్ వి.నరేందర్ రెడ్డి తెలిపారు. ఏడుగురు విద్యార్థులు 460పైగా, 47 మంది విద్యార్థులు 400 మార్కులు పైగా సాధించడం చాలా సంతోషంగా ఉందన్నారు. పీసీఎం విభాగంలో వి.శ్రేయాస్‌రెడ్డి 475 మార్కులతో పాఠశాల టాపర్‌గా నిలవగా, జి.చైత్ర 471 మార్కులు, ఎన్.రత్నప్రకాశ్ 469, బి.లిఖిత్ సాయి 461, ఐశ్వర్య 458, హర్షఫ్ అర్మాన్ 456, వి.సాయి హర్షిత్ 456, బి.రోహిత్, ఎన్.కావ్య, జె.సరయు 450 మార్కులు సాధించారన్నారు. అదేవిధంగా పీసీబీ విభాగంలో డి.రుత్విక్ 476 మార్కులతో పాఠశాల టాపర్‌గా, పి.శృత్విక 472, డి.శ్రేయన్ష్ 462 సాధించగా మిగిలిన విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించినట్లు వివరించారు. అధ్యాపకుల నిరంతర కృషి, విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. -
అమ్మాయిలు.. నాంచాక్
● ఆత్మరక్షణ విద్యలో అమ్మాయిలు అదుర్స్ ● కర్ర, నాంచాక్లో శిక్షణ ● ధైర్యసాహసాల విద్యపై ఆసక్తివేములవాడ: అమ్మాయిలే కదా.. అని అనుకోవద్దంటున్నారు ఈ చిచ్చరపిడుగులు. వారు కర్రసాము చేస్తే ఎదురుగా ఎవరూ ఉన్న బేజార్ కావాల్సిందే. వారు నాంచాక్ పడితే ఎంతటి వారైనా జీ హుజూర్ అనాల్సిందే. ఇదంతా వేములవాడ మున్సిపల్ పార్క్‌లో నిత్యం ఉదయం కనిపించే బాలికల గురించే. వారు కొన్నాళ్లుగా కోచ్ ఎంఏ మన్నాన్ సమక్షంలో కర్ర, నాంచక్ వంటి ఆత్మరక్షణ విద్యలో శిక్షణ పొందుతున్నారు. ప్రస్తుతం పరిస్థితుల్లో అమ్మాయిలు ఆత్మరక్షణకు యుద్ధ విద్యలు నేర్చుకోవాల్సిన అవసరం ఉందని పలువురు భావిస్తున్నారు. ఈక్రమంలోనే బాలికలు ధైర్యసాహసాలు ప్రదర్శించే విద్యలో శిక్షణ తీసుకుంటున్నారు. నాంచాక్ నైపుణ్యానికి మరో పేరు కరాటే విద్యలో భాగంగా వినియోగించే శస్త్రాయుధాలలో నాంచాక్కు ప్రత్యేక స్థానం. రెండు చిన్న ఐరన్ పైపులకు మధ్యలో గొలుసుతో కలిపి ఉంటుంది. చూసేందుకు సాధారణంగా కనిపించినా నిపుణుల చేతిలో పడితే శత్రువులకు భయంకర పరిస్థితులు ఎదురవుతాయి. దాడిచేయడం, ఆత్మరక్షణకు నాంచాక్ ఎంతగానో ఉపయోగపడుతుంది. నాంచాక్ను సాధనతో శరీర నియంత్రణ, వేగం, సమతుల్యత పెరుగుతాయి. ఇది కేవలం దెబ్బ కొట్టే ఆయుధమే కాదు, ఒక నృత్యకళా రూపంగా కూడా చెప్పుకుంటారు. పోటీలు, ప్రదర్శనలు, ఆత్మరక్షణలో తమకు కొత్త శక్తిని అందిపుచ్చుకుంటున్నారు. -
కాలుష్య వైపరీత్యం
ప్రకృతిలో ఎన్నో మార్పులు చేర్పులు వనరులను నాశనంచేసే రసాయనాలు పట్టణంలో కలదు కాలుష్యం పరిశ్రమలు ఉత్పత్తి చేసే ప్లాస్టిక్ ఎక్కడ చూసినా కాలుష్యమయం ఎక్కడ చూసినా ప్లాస్టిక్ పరిశ్రమలు ప్రకృతిని నాశనం చేసే ఎక్కడ చూసినా కాలుష్యం నీరు తాగుదామన్న చెడు రసాయనాలు మురికి నీళ్లు తాగి మురికి తిండి తిని మానవులు రోగాల బారిన పడుతున్నారు. కెమికల్ ఉన్న ఆహారంతిని మానవులు ఆయుష్షు తగ్గిపోతుంది ఎవరిని చూసినా బీపీ, షుగర్లు ఎవరిని చూసినా ఊపిరితిత్తుల సమస్యలు ఎవరిని చూసినా కిడ్నీ సమస్యలు నియంత్రించాలి ఈ వైపరీత్యం తగ్గించాలి ఈ వైపరీత్యం పెంచాలి మానవ వనరులు తగ్గించాలి ఈ వైపరీత్యం అరికట్టాలి ఈ రసాయనాలు నియంత్రించాలి ఈ వైపరీత్యం పేరు: కుమ్మరికుంట ఆరాధ్య తరగతి: 6వ తరగతి పాఠశాల: పీఎంశ్రీ మోడల్ స్కూల్ ఊరు: గోదావరిఖని జిల్లా: పెద్దపల్లి ఎన్.శ్రీకర్ గ్రామం: ఊటూరు మండలం: మానకొండూర్ జిల్లా: కరీంనగర్ -
పనులు పూర్తయినా అందని నీరు
మెట్పల్లి: మెట్పల్లి మున్సిపాలిటీలోని కొన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటిని అందించే విషయంలో అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిషన్ భగీరథ పథకం కింద ప్రత్యేకంగా వాటర్ ట్యాంకులు, పైపులైన్లు, ఇళ్లకు నల్లా కనెక్షన్లు ఇచ్చారు. ఈ పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ కొన్ని కాలనీలకు పూర్తి స్థాయిలో నీటిని సరఫరా చేయడం లేదు. అప్పటి ప్రభుత్వం ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీటిని అందించాలనే ఉద్దేశంతో రూ.కోట్లు వెచ్చించినప్పటికీ అధికారుల నిర్లక్ష్యంతో పూర్తి స్థాయిలో ప్రయోజనం కలగడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం కూడా అమృత్ 2.0 పథకం కింద నిధులను మంజూరు చేసింది. భగీరథ పథకం కింద చేయలేకపోయిన ప్రాంతాల్లో ఈ నిధులతో పనులను శ్రీకారం చుట్టారు. మెట్‌పల్లికి రూ.19.40కోట్లు కేటాయింపు ఆ రెండు చోట్ల పూర్తి.. ఈ చిత్రం మెట్‌పల్లిలోని అర్బన్ హౌజింగ్ కాలనీలో ఉన్న వాటర్‌ట్యాంక్. కాలనీ ప్రజలకు భగీరథ నీరు అందించేందుకు నిర్మించారు. వీధుల్లో అంతర్గత పైపులైన్లతోపాటు ఇళ్లకు నల్లా కనెక్షన్ల వంటి పనులు పూర్తయ్యాయి. నెలలు గడుస్తున్నప్పటికీ అధికారులు ఇంకా ఆ కాలనీకి భగీరథ నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. ప్రస్తుతం వేసవిలో అక్కడి ప్రజలు నీటి కొరతతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రత్యామ్నాయంగా మున్సిపల్ ట్యాంకర్లతో నీటిని అందిస్తున్నారే తప్ప..భగీరథ నీళ్లను మాత్రం అందించే చర్యలు తీసుకోవడం లేదు.తొందరలోనే సరఫరా చేస్తాం అమృత్ పథకం కింద చేపట్టిన పనులు కొన్ని ప్రాంతాల్లో పూర్తయ్యాయి. ఇప్పటికే కొన్ని చోట్ల నీటని సరఫరా చేస్తున్నాం. అర్బన్ హౌజింగ్ కాలనీలో కూడా దాదాపుగా పూర్తయ్యాయి. అక్కడ కూడా తొందరలోనే నల్లాల ద్వారా ప్రతి ఇంటికి భగీరథ నీటిని సరఫరా చేస్తాం. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈఈ ‘భగీరథ’ నీటి సరఫరాలో అధికారుల జాప్యం ఇబ్బంది పడుతున్న మెట్పల్లి పట్టణ ప్రజలు -
జేఎన్టీయూలో ఎడ్యుకేషన్ వీక్
కొడిమ్యాల: జేఎన్టీయూలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక – ఎడ్యుకేషన్ వీక్‌లో భాగంగా కళాశాల ప్రిన్సిపాల్ జి.నర్సింహ ఆధ్వర్యంలో ఔట్సోర్సింగ్ సిబ్బంది పిల్లలకు నోట్‌బుక్కులు పంపిణీ చేశారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు విద్యలో రాణించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజంలోని ప్రతి వర్గానికి విద్య అందుబాటులో ఉండాలని తెలిపారు. వైస్ ప్రిన్సిపాల్ కె. శ్రీనివాస్ విద్యార్థులకు పలు విషయాలపై వివరించారు. కష్టపడి చదివి మంచి భవిష్యత్తును నిర్మించుకోవాలని సూచించారు. సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు. తెమడ పరీక్ష చేయించుకోవాలి ● డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ మల్యాల: క్షయవ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించేందుకు తెమడ పరీక్ష చేయించుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో ఎన్.శ్రీనివాస్ అన్నారు. టీబీ అభియాన్‌లో భాగంగా మండలంలోని మ్యాడంపల్లి ఇట్టుకబట్టీల్లో బుదవారం టీబీ నిర్ధారణ వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీర్ఘకాలికంగా జ్వరం, బరువు తగ్గడం, సాయంత్రంవేళ చెమటలు పట్టడం, ఆకలి మందగించటం టీబీ లక్షణాలు అని, తక్షణమే తెమడ పరీక్ష చేయించుకుని, మందులు వాడితే వ్యాధిని నివారించవచ్చని అన్నారు. టీబీ వ్యాధిగ్రస్తులు పోషకాహారం తీసుకునేందుకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.వెయ్యి అందిస్తోందని తెలిపారు. సరిహద్దుల్లో విస్తృత తనిఖీలుజగిత్యాలక్రైం: బక్రీద్ సందర్భంగా జిల్లా సరిహద్దుల్లో విస్తృత తనిఖీలు చేపడుతున్నట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. ఆవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువైద్యుల ధ్రువీకరణ పత్రాలు లేకుండా జంతువులను రవాణా చేస్తే వాహనాలను జప్తు చేసి.. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. పశువుల రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు సమీప పోలీస్‌స్టేషన్‌కు లేదా పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎట్టి పరి స్థితుల్లోనూ ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడకూడదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గోవధ నివారణ, అక్రమ పశువుల రవాణా అరికట్టేందుకు పోలీసు శాఖ, పశుసంవర్ధక శాఖ సంయుక్తంగా 24 గంటల పాటు తనిఖీలు నిర్వహిస్తున్నాయని తెలిపారు. రైస్‌మిల్లుల పరిశీలనజగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు కలగనీయొద్దని ఎస్పీ అశోక్‌కుమార్ ఆదేశించారు. అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలోని ఎస్సైలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఏపీఎంలు, ప్యాక్స్ సీఈవోలు, పోలీసు అధికారులు సంయుక్తంగా కేంద్రాలు, రైస్‌మిల్లులను సందర్శించి అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ధాన్యం సేకరణ, అన్లోడింగ్ ప్రక్రియ, రవాణా వాహనాల కదలిక, ధాన్యం నిలువ విధానం, మిల్లులకు తరలింపు అంశాలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. లారీలు, ట్రాక్టర్ల రాకపోకలు సజావుగా జరిగేలా అన్లోడింగ్ ప్రక్రియ వేగవంతంగా జరిగేలా అధికారులు చొరవ చూపుతున్నారు. పాలిసెట్ ప్రశాంతంజగిత్యాల: జిల్లాలో పాలిసెట్ ప్రశాంతంగా ముగిసింది. జిల్లాకేంద్రంలో ఎనిమిది కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. మొత్తం 2,494 మంది దరఖాస్తు చేసుకున్నారు. 2,329 మంది హాజరయ్యారు. కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్‌కుమార్ పర్యవేక్షించారని పరీక్షల కో–ఆర్డినేటర్ అరిగెల అశోక్ తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన బస్తాలను మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. సారంగాపూర్, రేచపల్లి, లచ్చనాయక్ తండా, నాగునూర్ గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలన్నారు. అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆన్లైన్లో డాటా ఎంట్రీ చేసి రైతుల ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చూడాలని సూచించారు. ఽఆయన వెంట ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరన్, తహసీల్దార్ వహిదోద్దీన్ ఉన్నారు. ప్రక్రియ సక్రమంగా సాగాలి జగిత్యాల: ధాన్యం కొనుగోలు ప్రక్రియ సక్రమంగా సాగాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు, డీఎస్పీలతో సమావేశమయ్యారు. 24 గంటల్లో మిల్లుల్లో అన్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. హమాలీల సంఖ్య పెంచాలని సూచించారు. ట్రాన్స్‌పోర్టు, పోలీసు, రెవెన్యూ, మార్కెటింగ్ అధికారులు సమన్వయంతో చేయాలని ఆదేశించారు. సమస్యలపై కాల్‌సెంటర్, టోల్‌ఫ్రీ నంబరు 1800 425 8187 ఏర్పాటు చేశామన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్ మాట్లాడుతూ.. కేంద్రాల వద్ద భద్రత చేపట్టామన్నారు. అడిషనల్ ఎస్పీ చేతన్ నితిన్, అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, ఆర్డీవోలు పాల్గొన్నారు. బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలి బక్రీద్‌ను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని కలెక్టర్ అన్నారు. ఎస్పీ అశోక్‌కుమార్‌తో కలిసి మత పెద్దలతో సమావేశమయ్యారు. మసీదుల వద్ద శానిటేషన్ చేపట్టాలని, మున్సిపల్ కమిషనర్లు, సెక్రటరీలు చర్యలు తీసుకోవాలని సూచించారు. పశువుల రవాణా, సర్టిఫికేషన్ విషయంలో వెటర్నరీ అధికారులు అందుబాటులో ఉండాలన్నారు. జిల్లాలో ఐదు చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. సోషల్ మీడియాపై అప్రమత్తంగా ఉండాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ -
చివరి ధాన్యం గింజా కొంటాం
గొల్లపల్లి: రైతుల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తోందని, మక్కలు, ధాన్యం చివరి గింజవరకూ కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ తెలిపారు. గొల్లపల్లి వ్యవసాయ మార్కెట్లోని మక్కల కేంద్రాన్ని పరిశీలించారు. ఇప్పటివరకు జిల్లాలో 1.26లక్షల టన్నుల ధాన్యం కొన్నామని, రూ.153 కోట్లు రైతు ఖాతాల్లో జమచేశామని వెల్లడించారు. మక్కల లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తాపడి గాయపడిన నలుగురు రైతులకు మెరుగైన చికిత్స అందిస్తామన్నారు. గొల్లపల్లి, రాఘవపట్నంలోని గోదాములను పూర్తిస్థాయిలో వినియోగించుకుంటామన్నారు. జిల్లాలో బ్లాక్‌లిస్ట్‌లో ఉన్న 18 మిల్లులకు అనుమతులు వచ్చాయన్నారు. తూకం విషయంలో తేడా రానీయొద్దని అధికారులను మంత్రి ఆదేశించారు. కేంద్రాల వద్ద తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలన్నారు. ఏఎంసీ చైర్మన్ బీమ సంతోష్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నిషాంత్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు దాసరి తిరుపతి, సర్పంచులు అంజలి, గంగాధర్, అఖిల అనిల్, కొలగాని శ్రీలత, కాసారపు భవాని అరవింద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి పాల్గొన్నారు. విద్యారంగం అభివృద్ధికి పెద్దపీట ధర్మపురి: విద్యాభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని మంత్రి అన్నారు. ప్రజాపాలనలో భాగంగా స్థానిక బాలికల పాఠశాలలో విద్యాభివృద్ధిపై సర్పంచులు, కౌన్సిలర్లకు అవగాహన కల్పించారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కృషి చేయాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పించాలన్నారు. బండి సంజయ్ కుమారుడి కేసుపై ప్రభుత్వం ప్రత్యేక అధికారిని నియమించిందన్నారు. గ్రంథాలయ చైర్మన్ ఎస్ దినేష్, మున్సిపల్ చైర్పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్పర్సన్ లావణ్య, డీఈవో రాము, ఎంఈవో సీతామహాలక్ష్మి తదితరులున్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ -
బురదజల్లే ప్రయత్నం చేయొద్దు
జగిత్యాల: ఎంపీ అర్వింద్ చేపట్టే ధర్మదీక్ష రాజకీయ డ్రామా అని, తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మోతె పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రీయ విద్యాలయంతో పేద, మధ్యతరగతి ప్రజలకు ఒరిగేదేమీ ఉండదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు సీట్లు కేటాయించిన అనంతరమే ఇతరులకు వస్తాయని గుర్తు చేశారు. స్థలం కేటాయించడం లేదని ఎంపీ అర్వింద్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. పేదలకు అవసరమైన నవోదయను కోరుట్లలో ఏర్పాటు చేశామన్నారు. కొన్ని కారణాలతో కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపులో ఆలస్యం జరుగుతోందని, చల్గల్లో ఇప్పించాలని మంత్రులను కలిశానని తెలిపారు. జగిత్యాలకు ఇంటిగ్రేటెడ్, తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు మంజూరయ్యాయన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ నాగభూషణం, శంకర్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ధర్మదీక్ష రాజకీయ డ్రామా ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
పల్లెల్లో కార్పొరేట్ విద్య
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రప్రభుత్వం ప్రతీ నియోజకవర్గంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ (టీపీఎస్)లను ఏర్పాటు చేస్తోంది. ఈ మేరకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు మెరుగైన విద్యనందించాలనే లక్ష్యంతో సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీ నియోజవకవర్గానికో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో మూడు ఎంపికయ్యాయి. మంచి విస్తీర్ణం, విద్యార్థుల సంఖ్య అత్యధికంగా ఉండి, భవనాలు, మెరుగైన ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లను ఎంపిక చేశారు. విద్యార్థులకు మంచి అవకాశం ధర్మపురి నియోజకవర్గం గొల్లపల్లి మండలం చిల్వాకోడూర్ జెడ్పీహెచ్ఎస్, జగిత్యాల నియోజకవర్గం జగిత్యాలరూరల్ మండలం అంతర్గాం, కోరుట్ల నియోజకవర్గం మల్లాపూర్ మండలం సాతారం జెడ్పీహెచ్ పాఠశాలలు ఎంపికయ్యాయి. కార్పొరేట్ స్థాయిలో భవనాల నిర్మాణం, విద్యార్థులకు సకల సౌకర్యాలు ఉండటంతోపాటు, ఎల్కేజీ, యూకేజీ, ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత, ఇంటర్ తరగతులు ఉంటాయి. అత్యాధునిక పద్ధతిలో సౌకర్యాలు కల్పిస్తారు. విద్యార్థులకు ప్రత్యేకంగా బస్సు సౌకర్యం ఉంటుంది. ఇప్పటికే రాష్ట్రంలో కొన్ని చోట్ల తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నిర్మిస్తున్నారు. ఇందులో డిజిటల్ బోధన, ఇంగ్లిష్ మీడియం, నైపుణ్యాభివృద్ధి ప్రధానంగా ఉంటాయి. రూ.38 కోట్ల అంచనాలతో.. ఒక టీపీఎస్‌కు దాదాపు రూ.38 కోట్ల అంచనా వ్యయంతో భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో 40 వేల లీటర్ల సామర్థ్యం గల సంప్, డైనింగ్‌హాల్, మూడు అంతస్తులతో స్కూల్ బిల్డింగ్, ప్లే గ్రౌండ్, ఫర్నిచర్, ల్యాబ్, ఇండోర్ స్పోర్ట్స్, ప్రోవైడింగ్ అప్రోచ్ రోడ్, ఇంటర్నల్ రోడ్లు, డ్రైనేజీ తదితర నిర్మాణాలు చేపడతారు. వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని విద్యాశాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఆధునిక సౌకర్యాలు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయిలో విద్య ఉంటుంది. ఆధునిక సౌకర్యాలు, అన్ని వసతులు ఉంటాయి. ఇంటర్ వరకు బోధిస్తారు. – రాము, డీఈవో ఎంపికై న స్కూళ్లు ఇవే.. -
బల్దియాలో సిబ్బంది కొరత
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో సిబ్బంది కొరత వేదిస్తోంది. 2018లో మేజర్ గ్రామపంచాయతీ నుంచి మూడో శ్రేణి మున్సిపాలిటీగా మారింది. ఎనిమిదేళ్లు గడుస్తున్నప్పటికీ రాయికల్ బల్దియాలో మాత్రం ఉద్యోగులు, సిబ్బంది కొరతతో ఉన్న వారిపైనే పనిభారం తీవ్రతరం అవుతోంది. పారిశుద్ధ్యం లోపించడంతో పాటు, సమస్యలు పేరుకుపోవడం, ఆర్థికంగా వనరులు లేకపోవడంతో మున్సిపాలిటి అభివృద్ధి కుంటుపడుతోంది. బల్దియాలో సిబ్బంది కొరత.. రాయికల్ బల్దియాలో టీపీబీవో, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, శానిటరీ ఇన్స్పెక్టర్ పోస్టులే మంజూరు కాలేదు. 12 వార్డులుండగా, కేవలం ముగ్గు రు వార్డు ఆఫీసర్లు మాత్రమే నియమించారు. 9 వార్డు ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ముఖ్యంగా టీపీబీవో సూర్యతేజను కోరుట్ల నుంచి వారానికి మూడు రోజుల చొప్పున రాయికల్‌కు డిప్యూటేషన్‌పై ఇటీవల నియమించారు. పారిశుద్ధ్య కార్మికులు 56 మంది ఉండాల్సి ఉండగా, కేవలం 23 మంది మాత్రమే అవుట్సోర్సింగ్ కింద విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో మహిళలు, సిబ్బంది, వాహన డ్రైవర్లు ఉండటంతో పారిశుద్ధ్య సిబ్బంది తక్కువగా ఉండటంతో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. హెల్త్ అసిస్టెంట్ సురేశ్‌ను నియమించినప్పటికీ డిప్యూటేషన్‌పై ఆర్మూర్‌కు తరలించారు. ఉన్నవారిపైనే భారం.. బల్దియాలో ముఖ్యమైన పోస్టులన్నీ ఖాళీగా ఉండటంతో ఉన్న అవుట్ సోర్సింగ్ సిబ్బందిపైనే పనిభారం తీవ్రతరం అవుతోంది. ముఖ్యంగా పారిశుద్ధ్య కార్మికులు పూర్తిస్థాయిలో నియామకం కాకపోవడంతో పాటు, ఉన్న కార్మికులకు సరిగా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రస్తుతం రాయికల్ బల్దియా ఉంది. బల్దియాకు కేవలం పన్నుల రూపేన ఆదాయం సమకూరే అవకాశం ఉంది. బల్దియాకు ఎలాంటి ఆస్తులు లేకపోవడంతో వచ్చే ఆదాయం లేక పారిశుద్ధ్య కార్మికుల జీతాలు ఇవ్వడానికే అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌లు స్పందించి రాయికల్ బల్దియాలో ముఖ్యమైన పోస్టుల్లో అధికారులను నియమించి మరికొంత మంది పారిశుద్ధ్య కార్మికులను నియమించాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. రాయికల్ పట్టణం జనాభా : 20,500వార్డులు : 12నివాస గృహాలు : 6000 ఉన్న వారిపైనే పని భారం కుంటుపడుతున్న అభివృద్ధి ఖాళీగా 9 వార్డు ఆఫీసర్ పోస్టులు -
విద్యార్థుల భవిష్యత్‌తో రాజకీయం వద్దు
రాయికల్: విద్యార్థుల భవిష్యత్‌తో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ రాజకీయం చేయొద్దని బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి అన్నారు. రాయికల్ విలేకరులతో మాట్లాడారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించడంలో ఎమ్మెల్యే విఫలమయ్యారని, ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా స్థలం కేటాయించడం లేదని, తద్వారా విద్యార్థులు నాణ్యమైన విద్యకు దూరమయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్రీయ విద్యాలయానికి స్థలం కేటాయింపుపై ఈనెల15లోపు హామీ ఇవ్వకుంటే 18న ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో ధర్మ దీక్ష చేపడతామని పేర్కొన్నారు. బీజేపీ పట్టణ అధ్యక్షుడు కుర్మా మల్లారెడ్డి, మండల అధ్యక్షుడు ఆకుల మహేశ్, రాయికల్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కల్లెడ ధర్మపురి, కౌన్సిలర్లు పుర్రె శ్రీధర్, భూపతిపూర్ సింగిల్ విండో చైర్మన్ ముత్యంరెడ్డి, నాయకులు కునారపు భూమేష్, రవీందర్‌రెడ్డి, వే ముల రాము, తోపారపు సురేశ్, పటేల్ రాము, సా మల్ల సతీష్, సింగని సతీష్, విజయ్ పాల్గొన్నారు. ఈనెల 18న ఎంపీ అర్వింద్ ధర్మదీక్ష బీజేపీ నియోజకవర్గ ఇన్చార్జి బోగ శ్రావణి -
విద్యార్థిగా మారిన మావోయిస్టు మాజీ అగ్రనేత
సాక్షి, జగిత్యాల జిల్లా: మావోయిస్టు మాజీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్‌జీ విద్యార్థిగా మారిపోయారు. కోరుట్లలో నాలుగు దశాబ్దాల అనంతరం ఇవాళ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. ఇంటర్ సెకండ్ ఇయర్ అన్ని పరీక్షలు పాసైనా.. తెలుగు పరీక్ష తప్పిన దేవ్ జీ.. 1984- 1985లో ఇంటర్ చదివే రోజుల్లో విప్లవ భావజాలానికి ఆయన ఆకర్షితుడయ్యారు.కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో రాడికల్ స్టూడెంట్ యూనియన్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేసిన దేవ్ జీకి పరీక్ష రాసేందుకు ఇంటర్ బోర్డు నుంచి అనుమతి లభించింది. దీంతో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు ఎగ్జామ్ రాశారు. లాయర్ కావాలన్న ఉద్దేశంతో మళ్లీ పరీక్ష రాసినట్లు దేవ్‌జీ తెలిపారు. పరీక్షలు పాస్ కావాలని ఆయన కొద్ది రోజులుగా తిరుపతి ప్రిపేరవుతున్నారు. -
పారదర్శకంగా సేవలు
జగిత్యాలక్రైం: జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో పారదర్శకంగా సేవలు అంది స్తున్నట్లు ఆ శాఖ అధికారి శ్రీనివాస్ తెలి పారు. ‘అక్కడ వారు చెప్పిందే ఫైనల్’ శీర్షికన ఈనెల 8న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి స్పందించారు. కార్యాలయంలో అన్నిరకాల సేవలను పారదర్శకంగానే చేపడుతున్నట్లు పేర్కొన్నారు. డ్రైవింగ్ లైసెన్స్‌లు, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్ సేవలు ఆన్లైన్లో దళారుల ప్రమేయం లేకుండా చూస్తున్నామని, కిందిస్థాయి ఉద్యోగుల పై నిఘా పెంచామన్నారు. ఏళ్ల తరబడి ఇక్కడే పనిచేస్తున్న వారి బదిలీకి ఉన్నతాధికారులకు లేఖ రాశామన్నారు. వాహనదారులకు ఎలాంటి అసౌకర్యం కలిగినా నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. -
పేదల సంక్షేమానికే పెద్దపీట
జగిత్యాలరూరల్/రాయికల్: పేదల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జిల్లాకేంద్రంతోపాటు రాయికల్‌లో మంగళవారం పర్యటించారు. జగిత్యాలలో 61 మందికి రూ.15.70లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 89 మంది రూ.89 లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. రాయికల్‌లో 40 మంది రూ.10.70లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్, 98మందికి రూ.98.9లక్షల విలువైన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులు పంపిణీ చేశారు. గెలిపించిన ప్రజలకు అభివృద్ధి చేసి వారి రుణం తీర్చుకుంటానన్నారు. రాయికల్ మున్సిపల్ చైర్మన్ కట్కం రవి, సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, ఆత్మ జిల్లా చైర్మన్ గంగారెడ్డి, తహసీల్దార్ నాగార్జున, కమిషనర్ మనోహర్‌గౌడ్, ఎంపీవో సుష్మ పాల్గొన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ -
ఆక్రమించిన నాలా స్థలాల పరిశీలన
జగిత్యాలరూరల్: ప్రభుత్వ స్థలాలు, నాలాలను ఆక్రమిస్తే చర్యలు తప్పవని జగిత్యాలరూరల్ తహసీల్దార్ హకీం హెచ్చరించారు. ‘యథేచ్ఛగా వాగులు కబ్జా’ శీర్షికన ‘సాక్షి’లో సోమవారం ప్రచురితమైన కథనానికి గ్రామస్తులు, మత్స్సకారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు తిమ్మాపూర్ శివారులోని జగిత్యాల–గొల్లపల్లి ప్రధాన రహదారిలో సర్వేనంబరు 433, 434లోని ఒర్రె, నాలాను హకీం పరిశీలించారు. కొందరు మొ రం పోసి స్థలాన్ని ఆక్రమించినట్లు గుర్తించారు. నాలాకు హద్దులు నిర్ణయించి, జేసీబీ సహా యంతో అక్కడ పోసిన మొరాన్ని తొలగించా రు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినా, కబ్జాకు యత్నించినా చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట ఆర్ఐలు భూ మయ్య, శంషుద్దీన్, జీపీవో నరేష్ ఉన్నారు. -
కొనుగోళ్లు వేగవంతం చేయండి
జగిత్యాల: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. గూగుల్‌మీట్ ద్వారా తహసీల్దార్లతో మాట్లాడారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో అవసరమైన వసతులు కల్పించాలన్నారు. రైతులకు ఇబ్బంది కలగకుండా మిల్లర్లు, ట్రాన్స్‌పోర్టు యజమానులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మక్కల కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి చేయాలని సూచించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలుకొనుగోళ్లలో నిర్లక్ష్యం వహించొద్దని సీఎం రేవంత్‌రెడ్డి కలెక్టర్లకు సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ రైతులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, గోదాంలు తక్కువగా ఉంటే ప్రైవేట్‌వి తీసుకోవాలని, స్థానిక హమాలీలను వందశాతం ఉపయోగించుకోవాలని సూచించారు. లారీల కొరత ఉన్నచోట ట్రాక్టర్లను వినియోగించుకుంటున్నామని కలెక్టర్ సీఎంకు వివరించారు. అదనపు కలెక్టర్లత, ఆర్డీవో మధుసూదన్, డీఆర్డీవో రఘువరణ్, మనోజ్‌కుమార్, భాస్కర్, నరేశ్, ప్రకాశ్ పాల్గొన్నారు. కొడిమ్యాలలో మిల్లుల తనిఖీ కొడిమ్యాల: మండలంలోని చెప్యాలలోగల శ్రీలక్ష్మీగణేశ్, లక్ష్మీసరస్వతి, లక్ష్మీనరసింహ, శ్రీలక్ష్మీసాయి ఇండస్ట్రీస్, నమిలికొండలోని నరసింహ, ధరణి దత్తసాయి, చాముండి రైస్ మిల్లులను కలెక్టర్ పరిశీలించారు. మిల్లులకు వస్తున్న ధాన్యాన్ని ఆలస్యం చేయకుండా అన్లోడ్ చేసుకోవాలన్నారు. హమాలీలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, సివిల్ సప్లై డీఎం జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్ ఉన్నారు. వేగంగా మక్కల కొనుగోళ్లు జగిత్యాలరూరల్: జిల్లాలో మక్కల కొనుగోలు వేగంగా సాగుతోందని కలెక్టర్ అన్నారు. జిల్లావ్యాప్తంగా 12 కేంద్రాలు ఏర్పాటుచేసి ఇప్పటివరకు 6,231 మంది రైతుల నుంచి 23,428 టన్నులు కొనుగోలు చేశామన్నారు. 15 గోదాములను సిద్ధం చేశామన్నారు. మార్క్‌ఫెడ్ డీఎం హబీబ్, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ముగిసిన హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో మూడు రోజులపాటు నిర్వహించి న పెద్ద జయంతి ఉత్సవాలు మంగళవారం సా యంత్రం ముగిశాయి. మూలవిరాట్టుకు పట్టు వస్త్రాలంకరణ, విశేష అభిషేకం, హోమం, మహాపూర్ణాహుతి, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం సామూహిక విష్ణు సహస్ర పారాయణం, అమ్మవారికి కుంకుమార్చన, ఒడి బియ్యం, సహస్ర దీపాలంకరణ, గరుడ వాహన సేవ, కంకణోద్వాసన, మంత్రపుష్పం, మహాదాశ్వీరాదం, తీర్థ, ప్రసాద వితరణ నిర్వహించారు. అర్చకులు, ఆలయ అధికారులు యాగశాల నుంచి ఉత్సవ మూర్తులను మేళతాళాల మధ్య ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు జితేంద్ర ప్రసాద్, రామకృష్ణ, రఘు, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, స్థానా చార్యులు కపీందర్, ఏఈవో హరిహరనాథ్, సూపరింటెండెంట్ సునీల్ కుమార్, చంద్రశేఖర్, అశోక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. నర్స్‌ల సేవలు మరువలేనివిజగిత్యాల: నర్స్‌ల సేవలు మరువలేనివని మెడికల్ కళాశాల సూపరింటెండెంట్ కృష్ణమూర్తి అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో సీనియర్ సిటిజన్స్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ నర్స్‌ల దినోత్సవం నిర్వహించారు. రోగులకు వారి సేవలు అమోఘమని, రోగం నయం అయ్యేవరకూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు. అనంతరం విశిష్ఠ సేవలందించిన 12 మందిని సత్కరించారు. కార్యక్రమంలో శ్రీపతి, నరేశ్, రాజ్‌గోపాల్ పాల్గొన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించాలి● విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి జగిత్యాలరూరల్: వానాకాలం పంటలు సాగు చేసే రైతులకు నాణ్యమైన విత్తనాలు అందేలా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టాలని విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి అన్నారు. కలెక్టరేట్లో వానాకాలం సీజన్ విత్తనాలపై అధికారులతో మంగళవారం సమీక్షించారు. రైతులు విత్తనం కొనుగోలు చేసే ముందు నాణ్యతప్రమాణాలు చూసుకోవాలని, తప్పనిసరిగా రశీదు తీసుకోవాలని, అధిక దిగుబడినిచ్చే విత్తనాలను ఎంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, రీజినల్ మేనేజర్ విష్ణువర్దన్‌రెడ్డి, మండల వ్యవసాయాధికారులు, ప్రాథమిక సహకార సంఘాల సీఈవోలు, డీసీఎంఎస్ సీవోలు, ఆగ్రోస్ రైతు సేవ సంఘం డీలర్లు పాల్గొన్నారు. మిల్లర్ల దోపిడీ అరికట్టాలని రైతుల ధర్నా● 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని ఆగ్రహంమెట్పల్లిరూరల్: రైస్‌మిల్లర్ల దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి–కోరుట్ల జాతీయ రహదారిపై రైతులు మంగళవారం ఆందోళన చేపట్టారు. మెట్పల్లి మండలం కోనరావుపేట క్రాసింగ్ వద్ద గంటపాటు బైఠాయించారు. ధాన్యాన్ని 41 కిలోలకు బదులు 43 కిలోలు తూకం వేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు జువ్వాడి కృష్ణారావు అక్కడికి చేరుకోగా.. తూకంలో జరుగుతున్న మోసాన్ని ఆయనకు వివరించారు. సమస్య పరిష్కరిస్తామని ఆయన చెప్పడంతో ఆందోళన విరమించారు. రాష్ట్రస్థాయి క్రీడా పోటీలకు 20 మంది ఎంపికమెట్పల్లి: పట్టణంలోని మినీ స్టేడియంలో మంగళవారం జిల్లాస్థాయి అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. అండర్–8, 10, 12, 14 విభాగాల్లో ప్రతిభ కనబర్చిన 20మందిని ఈ నెల 17న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. పీఈటీ కొమురయ్య, సీనియర్ అథ్లెట్ వెంకటేశ్వర్లు, గజెల్లి రాందాస్ తదితరులున్నారు. -
నేడు పాలిసెట్
● 2,490 మంది అభ్యర్థులు ● 8 కేంద్రాలు ఏర్పాటుజగిత్యాల: మూడేళ్ల డిప్లొమా కోసం నిర్వహించే పాలిసెట్ బుధవారం జరగనుంది. ఇందుకు జిల్లా కేంద్రంలో ఎనిమిది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2,494 మంది హాజరుకానున్నట్లు ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అరిగెల అశోక్ తెలిపారు. విద్యార్థులు ఓఎంఆర్ షీట్‌పై రెండువైపులా సంతకం చేయాలని, హెచ్‌బీ బ్లాక్ పెన్సిల్, ఎరైజర్, బ్లూ/బ్లాక్ పెన్ వెంట తెచ్చుకోవాలని, హాల్‌టికెట్‌పై ఫొటో లేకుంటే ఫొటో, ఆధార్‌కార్డు వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఎస్బీ టెట్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకుని ఎగ్జామినేషన్ సెంటర్ లొకేషన్ తెలుసుకోవచ్చన్నారు. ఎస్కేఎన్ఆర్ కళాశాలలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. -
ఇష్టంతో నర్సింగ్ వృత్తి..
4చాలా ఇష్టంతోనే నర్సింగ్ వృత్తిని ఎంచుకున్న. 2011లో ఏఎన్ఎం చేశాను. నర్సింగ్ చదవాలని పట్టుదలతో డిగ్రీ వదిలేసి, జీఎన్ఎం కోర్సు పూర్తి చేశా. కాంట్రాక్ట్ పద్ధతిలో గోదావరిఖని జీజీహెచ్ ఆస్పత్రిలోని బ్లడ్ బ్యాంక్‌లో నర్సింగ్ ఆఫీసర్‌గా ఐదేళ్లుగా పని చేస్తున్న. – స్రవంతి, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని చాలా సంతృప్తిగా ఉంది మాది ఖమ్మం. నాన్న సలహాతో బీఎస్సీ నర్సింగ్ కోర్సు పూర్తి చేశాను. ఈ వృత్తిలోకి వచ్చాక రోగులకు సేవలందించడం చాలా సంతృప్తిగా ఉంది. మా కజిన్స్ కూడా నర్సింగ్ కాలేజీ ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఇలా నాకు నర్సింగ్ సేవలపై ఇంట్రెస్ట్ కలిగింది. – కె.సరిత, నర్సింగ్ ఆఫీసర్, గోదావరిఖని -
వేసవిలో చిన్నారులు భద్రం
సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు ●ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వేసవిలో పిల్లల్లో డీహైడ్రేషన్, అలసట, జ్వరం, వాంతులు, చర్మసమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తల్లిదండ్రులు వారి ఆరోగ్య పరిస్థితిని తరచూ గమనిస్తూ అవసరమైతే వైద్యులను సంప్రదించాలి. పండ్లు, ఆకుకూరలు, పోషకాహారం ఎక్కువగా ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. సెలవులను సద్వినియోగం చేసుకునే మార్గాలు కథల పుస్తకాలు చదివే అలవాటు పెంచాలి. డ్రాయింగ్, సంగీతం, నృత్యం, యోగా వంటి శిక్షణ తరగతులకు పంపించాలి. రోజూ కొంతసమయం చదువుకు కేటాయించేలా ప్రోత్సహించాలి. ఇంటిపనుల్లో చిన్న బాధ్యతలు అప్పగించడం ద్వారా క్రమశిక్షణ పెంపొందించాలి. పెద్దలతో సమయం గడిపేలా చేసి కుటుంబ విలువలను తెలియజేయాలి. మొక్కలు నాటడం, ప్రకృతి పరిరక్షణపై అవగాహన కల్పించాలి. క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాల ద్వారా శారీరక–మానసిక వికాసం కలిగించాలి. జ్యోతినగర్: వేసవి సెలవుల్లో పిల్లలు అధిక సమయం ఇంట్లోనే గడపడం, బయట ఆటలపై ఆసక్తి చూపడం సహజం. మండుతున్న ఎండలు వారి ఆరోగ్యంపై అధిక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇందుకోసం తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇదే సమయంలో వేసవి సెలవులను పిల్లల భవిష్యత్‌కు ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సలహాలిస్తున్నారు. -
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రం
నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది. జీతం కోసం కాకుండా సేవా స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ పని చేయాలి. తమ మంచి మాటలతో రోగులకు ధైర్యం చెబుతూ వైద్య సేవలందించాలి. 34 ఏళ్ల క్రితం నర్సింగ్ ఉద్యోగంలో చేరాను. నాటి నుంచి నేటి వరకు రోగులకు వైద్య సేవలందిస్తున్నాను. – శోభ, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్, కరీంనగర్ రోగులను కాపాడడంలోనే సంతృప్తి రోగులకు వైద్య సేవలందించి వారి ఆరోగ్యాన్ని కాపాడడంలోనే సంతృప్తి ఉంటుంది. ఒక రోగి తీవ్రమైన అనారోగ్యంతో వచ్చి వైద్య సేవలు పొంది పూర్తి ఆరోగ్యంతో తిరిగి వెళ్లేటప్పుడు ఎంతో అభిమానంగా తమతో మా ట్లాడే రెండు మాటలు ఎంతో సంతోషాన్ని స్తాయి. నర్సు అంటేనే సేవకు ప్రతి రూపం. ఈ వృత్తిలోకి వచ్చేవారందరూ మదర్ ఆఫ్ నర్సింగ్ ఫ్లోరెన్స్ నైటింగేల్‌ను ఆదర్శంగా తీసుకోవాలి. – దీవెన, నర్సింగ్ ఆఫీసర్, కరీంనగర్ నర్స్ పాత్ర గొప్పది రోగులకు ప్రత్యక్షంగా సేవలందించడం ఒక్క నర్సింగ్ ఆఫీసర్లకే దక్కుతుంది. న ర్సింగ్ ఆఫీసర్ల పాత్ర గొప్పది. 22 ఏళ్లుగా నర్సింగ్ పని చేస్తున్న. మా పిన్ని జానకి ఏఎన్ఎంగా పని చేశారు. ఆమె సేవలకు స్ఫూర్తి పొంది నర్సింగ్ విభాగాన్ని ఎంచుకున్న. ఆస్పత్రుల్లో డాక్టర్లతోపాటు నర్సింగ్ ఆఫీసర్ల పాత్ర చాలా ముఖ్యమైంది. – జమున,నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్–2, పెద్దపల్లి -
పాపం పసివాడు
జమ్మికుంట(హుజూరాబాద్): ఓ గుర్తు తెలియని మహిళ ఎంజీఎంలో చికిత్స పొందుతూ మృతిచెందగా, తన నాలుగేళ్ల కుమారుడు అనాథగా మిగిలాడు. రామగుండం రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ తిరుపతి తెలిపిన వివరాలు.. సుమారు 28 ఏళ్ల వయస్సుగల మహిళ తన నాలుగేళ్ల కుమారుడితో శనివారం జమ్మికుంట రైల్వే స్టేషన్‌కు వచ్చింది. అంతలోనే ఎమైందో ఎమో కానీ, రైల్వే బుకింగ్ హాల్ వద్ద స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన రైల్వే బుకింగ్ ఉద్యోగి 108 అంబులెన్స్‌కు సమచారమిచ్చాడు. వెంటనే జమ్మికుంట ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందింది. మృతురాలి వద్ద ఎలాంటి గుర్తింపుకార్డులు, వివరాలు లేవు. బ్లూ కలర్ డిజైన్ హాఫ్ ప్యాంట్, పింక్ బ్లూ, పసుపు డిజైన్ టాప్ ధరించి ఉంది. చేతిపై ‘సమ్మక్క, సలీమ్, అమ్మ’అని పచ్చబొట్టు గుర్తులు ఉన్నాయి. కాగా, చికిత్స సమయంలో తల్లి వద్దే ఉన్న కుమారుడిని ఆమె మృతిచెందడంతో ఎంజీఎం ఆసుపత్రి సిబ్బంది చైల్డ్ హోంకు పంపించారు. మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపర్చారు. మృతురాలి వివరాలు తెలిస్తే 99493 04574, 87126 58604 నంబర్లలో సంప్రదించాలని రామగుండం రైల్వే హెడ్ కానిస్టేబుల్ తెలిపారు. చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ మృతి అనాథ అయిన నాలుగేళ్ల కుమారుడు -
లైఫ్ డోనర్స్
ఏ ఉద్యోగమైనా ఉదయం పూట మాత్రమే విధులు నిర్వహిస్తుంటారు. కానీ, నర్సులు మాత్రం రాత్రి, పగలు తేడా లేకుండా సేవా భావంతో పనిచేస్తారు. కోవిడ్ సమయంలో మొక్కవోని ధైర్యంతో వారు సేవలు అందించిన రోజులను చూశాం. అన్నీ మూతపడ్డా ఆసుపత్రులు మాత్రం ఎళ్లవేళలా తెరిచే ఉన్నాయి. ఎలాంటి వ్యాధులు వచ్చినా వైద్యులు, సిబ్బంది 24 గంటల పాటు సేవలందిస్తూనే ఉంటారు. రోగమేదైనా నర్సులు మాత్రం రోగులను అక్కున చేర్చుకొని వైద్యాన్ని అందిస్తారు. సడలని సంకల్పంతో విధులు నిర్వహిస్తారు. వైద్యుల తర్వాత నర్సులదే కీలకపాత్ర వైద్య సేవల్లో వైద్యుల తర్వాత అత్యంత కీలకమైన పాత్ర పోషించేది నర్సులే. వ్యక్తిగతంగా ఎన్ని సమస్యలు ఉన్నా చిరునవ్వు, ఆత్మీయ స్పర్శతో రోగులకు సేవలందిస్తుంటారు. డాక్టర్ రౌండ్స్‌లో భాగంగా వార్డుకు వచ్చి రోగిని పరీక్షించి ఏయే మందులు వాడాలో కేస్షీట్పై రాసి వెళ్లిపోతారు. డాక్టర్ పేర్కొన్నట్లు రోగికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు ఇండెంట్ రాసుకొని మెడికల్ స్టోర్స్ నుంచి తెప్పించి వాడుతారు. ఏమైనా వైద్య పరీక్షలు అవసరమైతే నాల్గో తరగతి ఉద్యోగుల సాయంతో చేయిస్తారు. 24 గటలు అందుబాటులో ఉంటూ పేషెంట్‌కు వ్యాధి తగ్గే వరకు సేవలందిస్తారు. సేవలకు సలాం ప్రమాదాల్లో గాయపడినవారు, మందు తాగి ఆస్పత్రి పాలైనవారు, ఆపరేషన్లు చేయించుకున్నవారు, డెంగీ, మలేరియా వంటి జబ్బున పడినవారు మాత్రమే కాకుండా అనేక మంది చీము, నెత్తురుతో కలిసిన గాయాలతో ఆస్పత్రులకు వస్తుంటారు. వీరందరినీ పరీక్షించి మందులు రాసేది డాక్టర్. ఆపరేషన్లు చేసేది డాక్టర్. అయితే ఆ తర్వాత కోలుకోవడంలో, డ్రెస్సింగ్ చేసి గాయాలు మాన్పించడంలో ప్రధాన భూమిక పోషించేది నర్సులే. నర్సింగ్ కోర్సులపై ఆసక్తి నర్సింగ్ కోర్సులపై యువతుల్లో ఆసక్తి పెరుగుతోంది. కోర్సు పూర్తి చేసిన వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండడంతో డిమాండ్ పెరిగింది. ఏఎన్ఎం, జీఎన్ఎం, బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, ఎంఫిల్, పీహెచ్డీ తదితర కోర్సులు అందించేందుకు ఇన్స్టిట్యూట్లు కూడా పోటీ పడుతున్నాయి.కరీంనగర్/కోల్‌సిటీ(రామగుండం):ఒక డాక్టర్ ప్రాణాలు నిలబెడితే.. ఒక నర్సు తన సేవలతో రోగి ప్రాణానికి ధైర్యాన్ని ఇస్తోంది. ఆధునిక నర్సింగ్ వ్యవస్థకు పునాది వేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో ఎంతో మంది నర్సింగ్ వృత్తిలోకి వచ్చి తమలోని సేవాతత్పరతను చాటుకుంటున్నారు. ఫ్లోరెన్స్ నైటింగేల్ అంకితభావం, నిబద్ధత, కృషికి గుర్తింపుగా ఆమె పుట్టిన రోజున ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. -
మద్యం తాగించి.. కత్తితో పొడిచి..
గోదావరిఖని: పెద్దపల్లి జిల్లా సింగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన జూల వంశీ(28)ని పథకం ప్రకారం హత్య చేశారని గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రామగిరి మండలం సింగిరెడ్డిపల్లికి చెందిన జూల శంకరమ్మ తన కుమారుడు వంశీ గతనెల 29 నుంచి కనిపిండచం లేదని ఫిర్యాదు చేయగా ఈనెల 1న మిస్సింగ్ కేసు నమోదైంది. సీడీఆర్, మొబైల్ కాల్స్‌పై దృష్టి సారించిన పోలీసులు.. వంశీ స్నేహితురాలు అలేఖ్య, ఆ మె భర్త నీలం నవీన్, నవీన్ స్నేహితుడు బుర్ర భా స్కర్పై దృష్టి సారించారు. ఆధునిక సాంకేతికత సా యంతో ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ జరపగా.. వంశీని హత్య చేశామని అంగీకరించారు. ప్రాణం తీసిన గెట్టూగెదర్.. వంశీ, అలేఖ్య పదో తరగతిలో ప్రేమించుకున్నారు. ఆ తర్వాత అలేఖ్య, నీలం నవీన్‌ను ప్రేమ వివాహం చేసుకుని వెళ్లిపోయింది. గతేడాది ఫిబ్రవరిలో టెన్త్‌క్లాస్ గెట్టుగెదర్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతస్నేహితులు కలిశారు. ఈక్రమంలోనే వంశీ.. అలేఖ్య మొబైల్ నంబర్ తీసుకొని తరచూ ఫోన్‌చేస్తూ, మెసేజ్‌లు పంపిస్తూ ప్రేమ పేరిట వేధిస్తున్నాడు. హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి వెళ్లి మూడుసార్లు గొడవకు కూడా దిగాడు. భర్త నవీన్, స్నేహితుడు భాస్కర్ మందలించి అక్కడి నుంచి పంపించి వేశారు. వంశీ తనను వేధిస్తున్నాడని అలేఖ్య తన భర్తకు తెలిపింది. దీంతో వంశీని ఎలాగైనా హత్య చేయాలని నవీన్, భాస్కర్ పథకం వేసుకున్నారు. పథకం ప్రకారం అలేఖ్య, భాస్కర్ ఫోన్‌చేసి వంశీని హైదరాబాద్ రప్పించారు. గతనెల 30న వంశీ తొలుత అలేఖ్య నివాసానికి వెళ్లగా.. ముగ్గురూ కలిసి కారులో భాస్కర్ ఇంటికి చేరుకున్నారు. అప్పటకిఏ నవీన్ డ్యూటీకి వెళ్లాడు. ఈక్రమంలో భాస్కర్ వంశీకి మద్యం తాగించి గొడవకు దిగాడు. అప్పటికే సిద్ధం చేసుకున్న కత్తితో చాతి, మెడపై విచక్షణారహితంగా దాడి చేయడంతో వంశీ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం ఫోన్‌ద్వారా నవీన్‌కు భార్య సమాచారం అందించింది. నవీన్ చేరుకొని భాస్కర్‌తో కలిసి గదిలోని రక్తపు మరకలను లైజాల్‌తో శుభ్రపర్చారు. భాస్కర్, నవీన్ కలిసి మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్, మ్యాట్‌లో చుట్టి కారులో ఉంచారు. తర్వాత భాస్కర్ ఒక్కడే మృతదేహాన్ని పెద్దపల్లి జిల్లా మంథని మండలం గాడుదులగండి ప్రాంతానికి తీసుకెళ్లి రోడ్డు పక్క లోయలో పడవేశారు. పోలీసు విచారణలో ఈవిషయాలు వెల్లడయ్యాయి. నిందితుల నుంచి కారు, ఐదు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలేఖ్య, నవీన్, భాస్కర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వివాహితను వేధిస్తున్నాడని వంశీ హత్య వివరాలు వెల్లడించిన ఏసీపీ రమేశ్ ముగ్గురు నిందితుల అరెస్ట్ -
బండి సంజయ్.. రాజీనామా చేయ్..
జగిత్యాలటౌన్: కేంద్రసహాయ మంత్రి బండి సంజ య్ కుమారుడు ఓ బాలికను లొంగదీసుకుని అరాచకం చేస్తుంటే సీఎం రేవంత్‌రెడ్డి ఏం చేస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి ప్రశ్నించారు. రేవంత్ కళ్లకు గంతలు కట్టుకున్నాడా..? లేక ఓటుకు నోటు కేసు కోసం బీజేపీతో లాలూచి పడ్డాడా..? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే కేంద్ర, రాష్ట్ర హోంమంత్రులు బండి సంజయ్, రేవంత్‌రెడ్డి ఏంజరగనట్లు సైలెంట్‌గా ఉండటమే వారి బంధానికి నిదర్శనమన్నారు. తన దృష్టికి వచ్చిన విషయాన్ని సంబందిత శాఖ అధికారులకు రిఫర్ చేయడం కేంద్రం హోంశాఖ సహాయ మంత్రి బాద్యత అని, అలాంటిది స్వయంగా కేంద్రమంత్రే నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేయడం శిక్షార్హమన్నారు. నేరాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా శిక్షార్హుడేనన్నారు. రాష్ట్రంలో నేరాలు జరుగుతుంటే మోదీ ఆదీనంలోని సెంట్రల్ ఇంటలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ప్రధాని మోదీ బేటీ బచావో అంటే కేంద్ర మంత్రి బండి మాత్రం బేటా బచావో అంటున్నారని ఎద్దేవా చేశారు. తన కుటుంబ సభ్యులను నియంత్రించలేని బండి దేశంలో శాంతిభద్రతలు ఎలా కాపాడుతారని ప్రశ్నించారు. బాలిక జీవితం అభాసుపాలు కావడానికి కారణమైన బండి సంజయ్‌కు ఏమాత్రం నైతిక విలువలున్నా వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి కుమారుడు భగీరథ్‌పై గతంలోనే యాంటీ ర్యాగింగ్ కేసులున్నాయని, బాలికను లొంగదీసుకోవడం కిడ్నాప్ కింద కు వస్తుందని, ఈ నేరారోపణలు ఎదుర్కొంటున్న భగీరథ్‌కు పోక్సోతోపాటు సాధారణ చట్టాల కింద దాదాపు 20ఏళ్ల శిక్ష పడే అవకాశం ఉందన్నారు. బాలిక ఫిర్యాదుపై నిర్లక్ష్యం వహించిన పేట్‌బషీరాబాద్ పోలీస్టేషన్ హౌజ్ ఆఫీసర్‌ను సస్పెండ్ చేయాలన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, హరిచరణ్‌రావు, ధర రమేశ్, సురేందర్, చందా రాధాకిషన్, కల్లెపెల్లి దుర్గయ్య, గుండ మధు, వెంకటేశ్వర్రావు తదితరులు ఉన్నారు. -
లైఫ్ డోనర్స్
● వైద్యులకు దీటుగా రోగులకు సేవలు ● భరోసా కల్పించేలా తల్లికి మించి సపర్యలు ● నేడు ప్రపంచ నర్సుల దినోత్సవంనర్సులు.. అమ్మకు మించిన సేవా మూర్తులు. రోగి శరీరంలో చీము, నెత్తురు, గాయాలు, దుర్వాసనలను భరించి శుభ్రపరిచి, ఉపశమన పరచడంలో నర్సులు సేవానిరతికి నిలువెత్తు రూపాలు. కన్న తల్లి, కట్టుకున్న భార్య లేదా భర్త కూడా చేయలేని సేవలు అందిస్తున్న మానవరూపంలో కనిపించే దేవతలు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ ప్రాణాలను పణంగా పెట్టిన త్యాగశీలురు. ఆధునిక నర్సింగ్ వ్యవస్థాపకురాలు ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా మే 12న ప్రపంచ నర్సుల దినోత్సవాన్ని నిర్వహిస్తోంది. – కరీంనగర్/కోల్‌సిటీ(రామగుండం)రాష్ట్రాలను జల్లెడ పడుతున్నారు..!కరీంనగర్‌క్రైం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో నిందితుల వేట పోలీసులకు ప్రతిష్టాత్మకంగా మారింది. పట్టపగలు కాల్పులు జరిపి రూ.కోట్ల విలువైన బంగారం దోచుకెళ్లిన ఆరుగురు నిందితులు పోలీసులకు చిక్కకుండా తప్పించుకు తిరుగుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దొంగతనం జరిగిన రోజు నుంచి కరీంనగర్ కమిషనరేట్ పోలీసులు ప్రత్యేక బృందాలుగా విడిపోయి పలు రాష్ట్రాల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపడుతున్నా.. నిందితులు అడుగడుగునా ఏమరుస్తున్నట్లు తెలుస్తోంది. టవర్ లొకేషన్లతో నిందితుల జాడ దర్యాప్తులో కీలకంగా మారిన మొబైల్ టవర్ లొకేషన్ల ఆధారంగా పోలీసులు ఇప్పటివరకు పశ్చిమబెంగాల్, బిహర్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో గాలింపు చేపట్టినట్లు సమాచారం. నిందితులు తరచూ సిమ్ కార్డులు మార్చడం.. ఫోన్లు స్విచ్ఛాఫ్ చేయడం, అవసరమైన సమయంలో మాత్రమే ఫోన్లు ఆన్ చేసి మళ్లీ ఆఫ్ చేస్తుండటంతో వారి కచ్చితమైన లొకేషన్‌ను ట్రాక్ చేయడం పోలీసులకు సవాల్‌గా మారినట్లు తెలుస్తుంది. ఒకే ప్రాంతంలో ఎక్కువసేపు ఉండకుండా గంటల వ్య వధిలో ప్రాంతాలు మారుస్తూ పోలీసు బృందాలను అయోమయానికి గురిచేస్తున్నట్లు తెలిసింది. బంగారాన్ని పంచుకుని విడిపోయారా..? దోపిడీ అనంతరం ముఠా సభ్యులు కలిసి ప్రయాణించకుండా ప్రణాళిక ప్రకారం విడిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. దోచుకున్న బంగారాన్ని వాటాలుగా పంచుకుని వివిధ రాష్ట్రాలకు పారిపోయినట్లు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఓ రాష్ట్రంలో బంగారాన్ని విక్రయించే ప్రయత్నం చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ పోలీసు అధికారులు మాత్రం అధికారికంగా ధృవీకరించడంలేదు. అతడి నుంచి కీలక సమాచారం లభించినట్లు.. మరో ఇద్దరు నిందితుల జాడ కూడా పోలీసులు కనిపెట్టినట్లు విశ్వసనీయ సమాచారం. కాల్స్‌తోనే క్లూస్.. నిందితులు ఫోన్లు పూర్తిగా వాడకపోయినా కుటుంబసభ్యులు, పరిచయస్తులతో అప్పుడప్పుడు మా ట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కాల్స్ ఆధారంగానే టెక్నికల్ టీమ్‌లు వారి కదలికలను విశ్లేషిస్తున్నాయి. ముఖ్యంగా రైల్వేస్టేషన్లు, బస్స్టాండ్లు, లాడ్జీలు, బంగారం కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు సమాచారం. అనుమానాస్పదంగా బంగారం విక్రయించే వ్యక్తుల వివరాలను అన్ని రాష్ట్రాలకు పంపినట్లు తెలిసింది. ప్రత్యేక బృందాల ముమ్మర వేట కేసు ఛేదన కోసం కరీంనగర్ కమిషనరేట్ గోప్యంగా పలు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. బృందాలకు రాష్ట్రాలవారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. స్థానిక పోలీసులు, వివిధ రాష్ట్రాల ఇంటెలిజెన్స్ అధికారుల సహకారంతో నిందితుల పాత నేరచరిత్ర, ముఠా లింకులు, ప్రయాణ మార్గాలపై లోతుగా విచారణ కొనసాగుతోంది. ఇప్పటికే ఆరుగురిలో పలువురు నిందితుల జాడ పోలీసులు కనిపెట్ట గా.. మిగితా వారి కోసం వివిధ కోణాల్లో ద ర్యాప్తు సాగిస్తున్నట్లు తెలిసింది. నిందితులు ఎంతదూరం పారిపోయినా.. త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
వేసవి శిబిరాలు వినియోగించుకోండి
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్గటూర్/బుగ్గారం: విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి మోడల్ స్కూల్లో సోమవారం సమ్మర్ క్యాంప్‌ను ప్రారంభించారు. విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో నియోజకవర్గానికొక యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేస్తున్నామని అన్నారు. ప్రిన్సిపాల్ కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బుగ్గారం, గోపులాపూర్లోని కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. కేంద్రాల్లోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదనపు కలెక్టర్ లత, నాగారం సర్పంచ్ చిలుముల లక్ష్మణ్, నాయకులు పాల్గొన్నారు. -
బండి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని..
జగిత్యాలటౌన్/కోరుట్ల: బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించిన ఘటనలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు జిల్లాకేంద్రంలోని తహసీల్ చౌరస్తాలో.. కోరుట్లలోని కొత్త బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపట్టారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మాట్లాడుతూ భగీరథ్‌పై కేసు నమోదై మూడు రోజులు గడుస్తున్నా పోలీసులు చర్యలు చేపట్టకపోవటం సరికాదన్నారు. సామాన్యులపై కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేసే పోలీసులు ఎప్పుడు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని ప్రశ్నించారు. పోక్సో కేసు నమోదైన 24గంటల్లో నిందితుడిని అరెస్టు చేయాల్సిన పోలీసులు మూడు రోజులుగా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. కౌన్సిలర్ దేవేందర్నాయక్రాథోడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
గోడు వినండి.. గోస తీర్చండి
జగిత్యాలటౌన్: కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్ బాధితుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. సమస్యలపై సమగ్ర విచారణ జరిపి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. హద్దులు తొలగించాడు మాది జగిత్యాల రూరల్ మండలం గుట్రాజ్‌పల్లి. శివారులోని సర్వేనంబర్ 109లో మాకు 50గుంటల వ్యవసాయ భూమి ఉంది. మా భూమిని ఆనుకునే సర్వేనంబర్ 110 ఉంది. అందులో భూమి ఉన్న ఆంజనేయులు రోడ్డుకున్న హద్దులు తొలగించాడు. రెవెన్యూ అధికారులు, పోలీసులను ఆశ్రయించినా న్యాయం చేయడం లేదు. విచారణ చేపట్టి రోడ్డు హద్దు ఖనీలు ఏర్పాటు చేయించండి. – పయ్యావుల రమేశ్, గుట్రాజ్‌పల్లి ఇందిరమ్మ ఇల్లు పునరుద్ధరించండి మాది కోరుట్ల మండలం సంగెం. ఇదిరమ్మ ఇల్లు మంజూరైంది. ప్రొసీడింగ్ అందాక పిల్లర్ల వరకు నిర్మించుకున్నాం. బిల్లు కోసం వేచి చూస్తుండగా.. మాకు ఫోర్ వీలర్ (టాటాఏస్) ఉందంటూ ఇల్లును రద్దు చేశారు. నిరుపేదలమైన మేం ఆటోతో జీవనోపాధి పొందుతున్నాం. ఆటోను సాకుగా చూపి ఇల్లు రద్దు చేశారు. విచారణ చేపట్టి ఇంటిని పునరుద్ధరించండి. – బోయపల్లి మహేశ్వరి, సంగెం ఎఫ్టీఎల్ హద్దులు పెట్టండి జిల్లాకేంద్రానికి ఆనుకుని ఉన్న మోతె పెద్ద చెరువుపై ఆధారపడి 125 మత్య్సకార కుటుంబసభ్యులం జీవనం సాగిస్తున్నాం. కబ్జాదారులు చెరువులో మట్టిపోస్తూ చదును చేస్తూ చెరువును రోజుకింత చొప్పున ఆక్రమిస్తున్నారు. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చెరువుకు ఎఫ్టీఎల్కు హద్దులు ఏర్పాటు చేసి ఆక్రమణలు జరగకుండా చూడండి. – మోతె మత్య్సకారులు ప్రభుత్వ భూమిలో ఇళ్లు మా గ్రామ పరిధిలోని సర్వేనంబర్ 85 ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా ఇళ్లు నిర్మించుకున్నారు. సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. భూకబ్జాపై విచారణ జరిపించి ప్రభుత్వ భూమిని కాపాడండి. అక్రమార్కులపై చర్యలు తీసుకోండి. – సాయికుమార్, తుమ్మెనాల, ధర్మపురి -
పిల్లలే హమాలీలు..
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం హన్మాజీపేటకు చెందిన బొడ్డు మనీష అనే మహిళా రైతు ఎఫ్‌సీఐకి విక్రయించేందుకు జగిత్యాల మార్కెట్‌యార్డులో 10రోజుల క్రితం మక్కలు పోసింది. కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతోంది. హమాలీల కొరత తీవ్రంగా ఉంది. సోమవారం ఉదయం మార్కెట్ అధికారులు ఆమెకు గన్నీ బ్యాగులు ఇచ్చారు. దీంతో మనీష తన ఇద్దరు కూతుళ్లను వెంటబెట్టుకుని వచ్చి మార్కెట్లో ఇలా మక్కలను సంచుల్లో నింపింది. -
గిరి ప్రదక్షిణకు నిధులు
మల్యాల: కొండగట్టు గిరి ప్రదక్షిణకు నిధుల విడుదలకు కృషి చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని సోమవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం మాట్లాడుతూ గిరి ప్రదక్షిణకు సరిపడా సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. జయంతి ఉత్సవాలకు అన్ని విభాగాల అధికారుల సమన్వయంతో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని అన్నారు. ముత్యంపేట సర్పంచ్ దారం ఆదిరెడ్డి, గ్రంథాలయ చైర్మన్ దినేష్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, గిరి నాగభూషణం, శైలేందర్‌రెడ్డి, నిశాంత్ రెడ్డి, రాములు పాల్గొన్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలిమెట్పల్లి రూరల్: ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. మెట్పల్లి మండలం ఆత్మకూర్, ఆత్మనగర్, వెల్లుల్ల గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలను సోమవారం తనిఖీ చేశారు. తూకం వేసిన బస్తాలను జాప్యం చేయకుండా మిల్లులకు తరలించాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు రైతులను అప్రమత్తం చేయాలన్నారు. ఆయన వెంట తహసీల్దార్ నీత, అధికారులు ఉన్నారు. బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలుజగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం తన కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 14 మంది అర్జీ సమర్పించగా.. వారితో నేరుగా మాట్లాడారు. తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు. -
కాషాయమయమైన కొండగట్టు
మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయం కాషాయమయమైంది. హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలు సోమవారం అత్యంత వైభవంగా కొనసాగాయి. ఉదయం 9 గంటలకు వేద మంత్రోచ్ఛరణల మధ్య స్థాపిత దేవతారాధన నిర్వహించారు. హోమం, సుందరకాండ పారాయణం, పంచామృత అభిషేకం, సహస్రనామార్చన చేశారు. సాయంత్రం 5 గంటలకు విష్ణు సహస్రనామ పారాయణం, అమ్మవారి కుంకుమార్చన, పుష్పాలతో సహస్రనామార్చన, హోమం, బలిహరణము, మహానివేదన నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్, ప్రధాన అర్చకులు రామకృష్ణ, వకుళాభరణం రఘు, జితేందర్ ప్రసాద్, వేదపండితులు పెద్దన్న శర్మ, రాజేశ్వర శర్మ, హరిబాబు శర్మ పాల్గొన్నారు. -
యథేచ్ఛగా వాగులు కబ్జా
జగిత్యాలరూరల్: రియల్ వ్యాపారులు వాగులు, వంకలను వదలడం లేదు. భూముల ధరలకు రెక్కలొస్తుండడంతో ముంపు, వాగు పరివాహక ప్రాంతాల్లో ఉన్న సాగుచేయని భూములను గుర్తించి భూ యజమానులకు ఎంతో కొంత ఇస్తూ వాటిని రిజిస్ట్రేషన్ చేయించుకుని రాత్రికి రాత్రే ముంపు ప్రాంతాల్లో మట్టిపోసి చదును చేసి ఇళ్లు, ఇతర నిర్మాణాలకు విక్రయిస్తూ సొమ్ముచేసుకుంటున్నారు. రియల్ వ్యాపారులకు అధికార పార్టీకి చెందిన నాయకుల అండదండలు ఉండడంతో దందా విచ్చలవిడిగా కొనసాగుతోంది. జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులో మోతె నుంచి ప్రవహించే వాగు కింది ప్రాంతం తిమ్మాపూర్ శివారులో వారం రోజులుగా రాత్రివేళ టిప్పర్ల ద్వారా మట్టి తెప్పించి ముంపు ప్రాంతం, వాగు ప్రవహించే ప్రాంతాన్ని పూడ్చివేశారు. రానున్న రోజుల్లో నీటి ప్రవాహం వెళ్లకుండా మట్టితో చదును చేశారు. వానాకాలంలో వర్షాలు తీవ్రమైతే నీటి నిల్వలు పెరిగి జగిత్యాల, గొల్లపల్లి ప్రధాన రహదారిలో తాతమ్మ గుడి వద్ద ఉన్న వంతెన మునిగిపోయి రాకపోకలు స్తంభించిపోనున్నాయి. జగిత్యాల పట్టణానికి కూతవేటు దూరంలో వారం రోజులుగా ముంపు ప్రాంతాన్ని పూడ్చివేసి చదును చేస్తున్నా అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో కోట్లాది రూపాయల విలువ గల భూములను చదును చేసి అమాయకులకు విక్రయించి రియల్ వ్యాపారులు పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కనుమరుగైన వాగు ఎగువ ప్రాంతం నుంచి వరద వచ్చే వాగును మట్టి పోసి చదును చేశారు. దీంతో రానున్న రోజుల్లో ఎగువ నుంచి వచ్చే వరద నీరు ఎటు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తాతమ్మగుడి ప్రాంతం నుంచి శ్మశానవాటిక వరకు నీరు ప్రవహించే ప్రాంతాలను చదును చేస్తూ నిర్మాణాలు కొనసాగిస్తున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి కొనసాగితే వాగులు, ముంపు ప్రాంతాలు కనుమరుగు కానున్నాయి. ఆందోళన చెందుతున్న రైతులు రానున్న రోజుల్లో దిగువ ప్రాంతంలోని ముప్పాల చెరువు, పొలాస చెరువులు నిండడం కష్టమేనని రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో ఆయా ప్రాంతాల్లో పంటలు సాగుచేయడం కష్టతరంగా మారనుంది. కొద్ది రోజులుగా తిమ్మాపూర్, రఘురాములకోట, మోతె గ్రామాలకు చెందిన రైతులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినా ముంపు ప్రాంతాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారని ఆరోపిస్తున్నారు. -
రత్నాకర్‌రావు సేవలు అమూల్యం
కోరుట్ల: మాజీమంత్రి జువ్వాడి రత్నాకర్‌రావు సేవలు మరవలేనివని వెలమ సంక్షేమ సమితి చైర్మన్ జువ్వాడి నర్సింగరావు అన్నారు. రత్నాకర్‌రావు వర్ధంతి సందర్భంగా స్థానిక వెటర్నరీ కళాశాల సమీపంలోని విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వెటర్నరీ, పాలిటెక్నిక్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను అందుబాటులోకి తెచ్చారన్నారు. పట్టణంలో సుమారు 5వేల మందికి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి కొత్తకాలనీ ఏర్పాటు చేసిన ఘనత అయనదేనన్నారు. అనంతరం పారిశుధ్య కార్మికులకు ఏర్పాటు చేసిన అన్నదానం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కృష్ణారావు, కోరుట్ల, మెట్పల్లి మున్సిపల్ చైర్పర్సన్లు తిరుమల వసంత, మైలారపు లింబాద్రి, కాంగ్రెస్ నాయకులు తిరుమల గంగాధర్, వెంకటేశ్‌గౌడ్, జిందం లక్ష్మీనారాయణ, శంకర్, సంగ లింగం, తెడ్డు విజయ్, పుప్పాల ప్రభాకర్, ఎలిశెట్టి భూంరెడ్డి, కౌన్సిలర్లు సోగ్రాబీ, కస్తూరి లక్ష్మీనారాయణ, మోర్తాడ్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. మోదీ సభకు తరలిన బీజేపీ శ్రేణులుమెట్పల్లి: హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్లో ఆ దివారం జరిగిన ప్రధాని మోదీ సభకు పట్టణం నుంచి బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివెళ్లారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యుడు సురభి నవీన్‌కుమార్, పట్టణ అధ్యక్షుడు దొనికెల నవీన్ ఆధ్వర్యంలో వేర్వేరుగా ఏర్పాటు చేసిన వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. వీరిలో కౌన్సిలర్లు, నాయకులు ఉన్నారు. -
బస్తాలు ఉల్టా పల్టా.. రైతుకే తంటా..
జగిత్యాలఅగ్రికల్చర్: జగిత్యాల మార్కెట్‌యార్డులో రెండు రోజుల క్రితం కురిసిన అకాల వర్షంతో వరి, మొక్కజొన్న ధాన్యం తడిసింది. తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టేందుకు రైతులు నానా తిప్పలు పడుతున్నారు. రవాణా చేయాల్సిన మొక్కజొన్న ధాన్యం ఎక్కడికక్కడే పేరుకుపోయింది. ముఖ్యంగా తూకం వేసిన బస్తాలు తడవడంతో బస్తాలను కిందిది మీద, మీద్ది కిందకు చేసి ఆరబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉండటం, కొనుగోళ్లు ఆగిపోవడంతో మొక్కజొన్న ధాన్యంపై రైతులు ఇంటి నుంచి కవర్లు తెచ్చుకుని కప్పుకుంటున్నారు. తడిసిన బస్తాలను ఆరబెట్టేందుకు అదనంగా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. -
ఈత వనానికి 50శాతం సబ్సిడీ కల్పించండి
జగిత్యాలరూరల్: గీత కార్మికులు ఈతవనం పెంచుకునేందుకు ప్రభుత్వం 50 శాతం సబ్సిడీ కల్పించాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి కోరారు. ఆదివారం సారంగాపూర్ మండలం లచ్చక్కపేటలో ఎల్లమ్మతల్లి ప్రాణప్రతిష్ఠ, పట్నాల మహోత్సవంలో పాల్గొన్నారు. గౌడ వృత్తి ప్రమాదకరమైందని, ఈ వృత్తిపై ఆధారపడిన వారికి ప్రభుత్వం చేయూత అందించాలని కోరారు. బెల్ట్‌షాపులు మూసివేస్తామని ప్రకటించిన కాంగ్రెస్‌కు గ్రామానికి 10బెల్ట్ షాపులు నడుస్తున్నా కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కిరాణషాపుల్లో కూడా లిక్కర్ విక్రయిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు గంగారెడ్డి, నరేష్ గౌడ్, మురళీగౌడ్ పాల్గొన్నారు. -
జిల్లాలో 23,390 కుక్కలు
కథలాపూర్: రాష్ట్రవ్యాప్తంగా కుక్కల బెడద నేపథ్యంలో ప్రతి గ్రామంలో ఎన్ని శునకాలు ఉన్నాయో వివరాలు సేకరించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శులు ఆయా గ్రామాల్లో కుక్కలను లెక్కించారు. ఇంటింటికీ వెళ్లి పెంపుడు కుక్కలు, వీధి కుక్కలు, అందులో టీకాలు ఇప్పించినవి.. రోగాలతో బాధపడుతున్నవి.. కు.ని టీకాలు ఇప్పించినవి లెక్కించి ఈ– పంచాయత్ యాప్‌లో నమోదు చేశారు. అయితే లెక్కింపు సిబ్బందిని చూసి కుక్కలు వేరే వాడల్లోకి పరుగెత్తాయని పలువురు కార్యదర్శులు పేర్కొంటున్నారు. ఫలితంగా లెక్కల సేకరణకు నానా తంటాలు పడాల్సి వచ్చిందంటున్నారు. 385 గ్రామాలు.. 23,390 కుక్కలు జిల్లాలో 385 గ్రామాలు ఉన్నాయి. అందులో 23,390 కుక్కలు ఉన్నట్లు గుర్తించారు. ఇందులో మగ 11,864, ఆడ 11,526 ఉన్నాయి. తల్లి కుక్కలు 2,465, చిన్నవి 5,630 ఉన్నాయని పంచాయతీరాజ్ శాఖ రికార్డుల్లో నమోదైంది. ఈ విషయమై జిల్లా పంచాయతీ అధికారి మదన్మోహన్ మాట్లాడుతూ.. అధికారుల ఆదేశాల మేరకు 385 గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు, సిబ్బందితో కుక్కల గణన చేయించామని, వాటి వివరాలను ఉన్నతాధికారులకు నివేదించామని పేర్కొన్నారు. -
గుట్టకాయ స్వాహా..!
మెట్‌పల్లిరూరల్: జిల్లాలోని ప్రకృతి సంపదను అక్రమార్కులు కొల్లగొడుతున్నారు. నిబంధనలను గుట్టల్లో తొక్కి.. ఎలాంటి అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మొరం తవ్వకాలు చేపడుతున్నారు. మెట్పల్లి మండలం బండలింగాపూర్ రెవెన్యూ పరిధిలోని 63వ జాతీయ రహదారికి కేవలం 400మీటర్ల దూరంలో ఉన్న కుందేలు గుట్టను ఎక్స్వేటర్లతో అడ్డగోలుగా తవ్వేస్తున్నారు. కొన్ని రోజులుగా ఈ దందా సాగుతున్నా.. అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం అటువైపు కన్నెత్తి చూడకపోవడం, అడ్డుకోకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కొన్నినెలల క్రితం కలెక్టర్ సత్యప్రసాద్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఆ సమయంలో తవ్వకాలకు కొద్దిరోజులు బ్రేక్ పడినప్పటికీ మళ్లీ ఎప్పటిలాగే యథేచ్ఛగా తవ్వకాలు సాగిస్తుండడం గమనార్హం. 38 ఎకరాల విస్తీర్ణం కుందేలు గుట్ట సుమారు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ ప్రాంతంలో గతంలో బండలింగాపూర్ గీత కార్మిక సంఘానికి ఐదెకరాలు, ఒడ్డెర కులస్తులకు 20ఎకరాల వరకు అసైన్డ్ పట్టాలిచ్చినట్లు తెలిసింది. అక్కడ సాగుకు ఏ మాత్రం కూడా అనువు కాదని, చదునైతే అనువుగా మారుతుందని కొందరు అసైన్డ్ పట్టాదారులు మొరం అక్రమ తవ్వకాలకు అభ్యంతరం తెలపడంలేదని తెలుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకున్న కొందరు గుట్టను ఇష్టారీతిగా తవ్వేస్తున్నారు. ఎక్స్‌వేటర్‌ల సహాయంతో పెకిలించిన మొరాన్ని టిప్పర్లలో మెట్పల్లి పట్టణంతోపాటు చుట్టుపక్క గ్రామాలకు తరలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో నూతన నిర్మాణాలు, వెంచర్ల అవసరాలకు విక్రయిస్తున్నారు. టిప్పర్ మొరానికి వ్యాపారులు రూ.4వేలకు పైగానే వసూలు చేస్తున్నట్లు సమాచారం. చీకటి పడిందంటే చాలు తవ్వకాలు ప్రారంభిస్తున్న అక్రమార్కులు.. వేకువజాము వరకు తవ్వుతూనే ఉన్నారు. పొద్దుపొడిచే వరకూ రహదారిపై మొరం వాహనాలు వెళ్తూనే ఉంటున్నాయి. చీకటి పడితే చాలు.. గతంలో పగలు, రాత్రి తేడా లేకుండా సాగిన ఈ తవ్వకాలు ప్రస్తుతం రాత్రి సమయాల్లోనే జరుగుతున్నాయి. ఇందుకు మొరం తవ్వకాల విషయంలో కొందరి మధ్య వివాదాలు ఏర్పడడం, అధికారులు వరుసగా ఫిర్యాదులు వెళ్లడమే కారణమన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే సంజయ్ గుట్టను తవ్వేస్తున్న విషయంపై ఫిర్యాదు చేసిన సమయంలో మైనింగ్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. మొరం తవ్వకాలు జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఆ సమయంలో దందాకు బ్రేక్ పడుతుందేమోనని అందరూ భావించారు. తర్వాత మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూడనేలేదు. దీంతో మొరం తవ్వకాలు,తరలింపు యథేచ్చగా సాగిపోతోంది. -
దొరికిన దొంగలు?
సాక్షిప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్ దోపిడీ కేసు దర్యాప్తులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. దొంగలను అందరినీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని ఇప్పటివరకు అధికారికంగా ధృవీకరించలేదు. చోరీ జరిగి వారం రోజులు కాగా కమిషనరేట్ పోలీసులు కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రత్యేక బృందాలు నాలుగు రాష్ట్రాల్లో వారంరోజుల పాటు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. పలుకోణాల్లో గాలింపు చర్యలు చేపట్టగా దొంగలు చోరీ చేసిన నగలను బిహార్‌లో విక్రయిస్తుండగా పట్టుకున్నట్లు సమాచారం. బిహార్ నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నట్లు తెలిసింది. ప్రత్యేక బృందాలతో... ఈనెల 3వ తేదీ ఆదివారం ఉదయం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని జ్యోతినగర్‌లో ఉన్న ప్రముఖ పీఎంజే జువెల్లరీస్‌లో బంగారం దోపిడీ, కాల్పుల ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. షాపు తెరిచేటప్పుడు, జనసంచారం లేని సమయాన్ని ఎంచుకుని దుండగులు ప్రణాళికాబద్ధంగా దాడి చేసిన విషయం తెలిసిందే. ఆయుధాలతో షోరూంలోకి ప్రవేశించి, సిబ్బందిని బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ప్రతిఘటించిన సిబ్బందిపై కాల్పులు జరపగా నలుగురికి బుల్లెట్ గాయాలయ్యాయి. అనంతరం దొంగలు అక్కడి నుంచి పారిపోయారు. ఈ ఘటనతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అప్రమత్తమైన పోలీసులు వెంటనే నగరం నలువైపులా నాకాబందీ చేపట్టారు. దుండగుల ప్రణాళిక, తప్పించుకున్న తీరు చూస్తే ముందస్తు రెక్కీతో జరిగిందని అంచనాకు వచ్చారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నిందితుల కోసం విస్తృతంగా గాలింపు చేపట్టారు. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్‌ను సేకరించి, దుండగులు ఉపయోగించిన వాహనాలు, మార్గాలు, కదలికల ఆధారంగా కీలక ఆధారాలు గుర్తించారు. బిహార్‌లో నగలు విక్రయిస్తుండగా దర్యాప్తులో భాగంగా దొంగలు ఘటన అనంతరం కరీంనగర్ నుంచి ధర్మపురి వైపు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడికి చేరుకున్న తర్వాత వారు ఉపయోగించిన పల్సర్ బైక్‌ను వదిలిపెట్టి గోదావరినదిని దాటి పరారైనట్లు సీసీ కెమెరాలు, స్థానిక సమాచారంతో నిర్ధారించారు. ఈ మార్గం ద్వారా వారు మహారాష్ట్ర లేదా ఛత్తీస్‌గఢ్ వైపు వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో ప్రత్యేక బృందాలు ఆయా రాష్ట్రాల్లో కూడా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ దోపిడీ కేసు వెనుక అంతర్రాష్ట్ర ముఠా ఉండొచ్చనే కోణంలో కూడా దర్యాప్తు కొనసాగించారు. గతంలో ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఇలాంటి దోపిడీ ఘటనలతో పోల్చి చూశారు. సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరా ఫుటేజ్, పాతనేరస్తులు, గతంలో దొంగతనాలకు పాల్పడిన గ్యాంగులతో విచారణ చేపట్టి నిందితుల కదలికలను, సేకరించిన సమాచారంతో బిహార్ రాష్ట్రంలో నగలు విక్రయిస్తుండగా దొంగలను పట్టుకున్నట్లు సమాచారం. వారిని అదుపులోకి తీసుకుని కరీంనగర్‌కు తరలిస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. -
‘ఇందిరమ్మ’ లక్ష్యం చేరేనా..?!
జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతం చేయాలని, వచ్చే జూన్ 12లోపు లక్ష్యం చేరుకునేలా చూడాలని ఇటీవల ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే జిల్లాకు మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల లక్ష్యాన్ని చూస్తే ప్రభుత్వ సూచనలకు అందనంతా దూరంలో కనిపిస్తోంది. జిల్లాకు మొదటి విడత 10,865 ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో ఇప్పటివరకు కేవలం 751మాత్రమే పూర్తయ్యాయి. బేస్మెంట్ వరకు 1,743, వాలింగ్ వరకు 1,028, రూప్‌కాస్ట్ వరకు 3,968 కొనసాగుతున్నాయి. మొత్తం కలిపి 50శాతానికి చేరువలో ఇళ్ల నిర్మాణం ఉన్నప్పటికీ గృహప్రవేశం చేసేందుకు మాత్రం అవకాశం కనిపించడం లేదు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణానికి ముందుకు రాకపోవడం.. ఖర్చులు తడిసిమోపెడు కావడం.. ఇసుక దొరకకపోవడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది. ఈ సమస్య గ్రామీణప్రాంతాలతోపాటు పట్టణాల్లోనూ అధికంగా ఉంది. తప్పని ఇబ్బందులు పేదలకు గూడు కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినప్పటికీ నిర్మించుకోవడానికి లబ్ధిదారులకు ఇబ్బంది తప్పడం లేదు. ప్రభుత్వం జూన్ 12 వరకు ఇళ్లు పూర్తిగా గ్రౌండింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ కొన్నిచోట్ల ఇసుక దొరుకకపోవడం, మరికొన్ని చోట్ల ఇటుకలు, ఇతర సామగ్రి లేకపోవడం.. దొరికినా అత్యధిక రేట్లు ఉండటంతో పేదలు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా గోదావరి నుంచి ఇసుక ట్రాక్టర్ల ద్వారా వస్తున్నా అది ఎటూ సరిపోవడం లేదు. కొన్నిచోట్ల ఉచితంగా ఇసుక ఇస్తున్నప్పటికీ జాప్యం జరుగుతోంది. ఉన్నతాధికారులు ఇప్పటికే క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ గృహ నిర్మాణం త్వరగా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. వాస్తవానికి జూన్ నుంచి వర్షాకాలం ఆరంభం అవుతుంది. ఇళ్ల నిర్మాణాలు నెమ్మదిగా సాగుతాయి. ఈ క్రమంలో ప్రభుత్వం కరెంట్, ప్లంబర్, టైల్స్, కలర్స్ వంటి పనులు కాకున్నా.. గోడలు పూర్తయి దర్వాజలు పెట్టుకున్నా.. బిల్లులు వస్తాయని అధికారులు పేర్కొంటున్నారు. మహిళ సంఘాల ద్వారా రుణాలు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సంబంధించి నిధులు లేని పక్షంలో మహిళ సంఘాల ద్వారా రుణాలు అందించాలని అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కొందరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లోన్లు తీసుకుని నిర్మాణాలు చేపడుతున్నారు. ఇప్పటికీ జిల్లాలో రూ.11.60 కోట్ల రుణాన్ని లబ్ధిదారులకు అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టుకునేలా ప్రోత్సహిస్తున్నారు. మంజూరైన ఇళ్లు 10,865 మార్కవుట్ చేసింది 8,946 బేస్మెంట్ వరకు 1,743 వాలింగ్ 1,028 రూప్‌కాస్ట్ 3,968 పూర్తయినవి : 751 బిల్లుల మంజూరులో జాప్యం జిల్లావ్యాప్తంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగవంతంగా జరుగుతున్నప్పటికీ బిల్లుల మంజూరులో జాప్యం ఎదురవుతోంది. కొందరు లబ్ధిదారులకు టెక్నికల్ సమస్యలతో రావడం లేదని అంటున్నారు. బిల్లులు తొందరగా ఇస్తే ఇళ్లు త్వరగా పూర్తవుతాయని లబ్ధిదారులు పేర్కొంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు వేగవంతంగా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. లక్ష్యం చేరుకునే అవకాశాలున్నాయి. బిల్లుల మంజూరుకు ప్రభుత్వం కొన్ని వెసులుబాటు కల్పించింది. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటాం. – భాస్కర్, ఇన్చార్జి పీడీ -
జగిత్యాల
43.0/31.07గరిష్టం/కనిష్టంపోచమ్మకు బోనాలుమెట్పల్లిరూరల్: మెట్పల్లి మండలం వెల్లులలో ఆదివారం గౌడ కులస్తులు శ్రీరేణుకాఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించారు. శోభాయాత్రగా ఆలయానికి వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.నృసింహుని సన్నిధిలో రద్దీధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వైశాఖ మాసం బహుళపక్షం పురస్కరించుకుని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చారు. సోమవారం శ్రీ 11 శ్రీ మే శ్రీ 2026 -
అమ్మ జ్ఞాపకంగా నిత్యాన్నదానం
సప్తగిరికాలనీ(కరీంనగర్): చిన్నతనంలోనే అమ్మ దూరమవగా.. తన జ్ఞాపకార్థం వేల మంది కడుపు నింపుతున్నాడు రేకుర్తికి చెందిన చెందిన గోదరి జితేందర్. తిమ్మాపూర్ మండలం కొత్తపల్లికి చెందిన ఆయన రేకుర్తిలో స్థిరపడ్డాడు. తన రెండేళ్ల వయసులోనే తల్లిని కోల్పోయాడు. ఆమె జ్ఞాపకార్థం 2016 ఫిబ్రవరి 15న గోదరి కాంతలక్ష్మి సేవా సమితిని స్థాపించాడు. ‘అమ్మ ప్రేమ.. సమాజ సేవ’ నినాదంతో 2020 నవంబర్ 27 నుంచి ప్రారంభించిన నిత్యాన్నదానం నేటికి 1,987 రోజులుగా నిరంతరంగా కొనసాగుతోంది. భార్య శరణ్య, స్నేహితులు, బంధువుల సహకారంతో సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నాడు. తాను బతికున్నంతకాలం అమ్మ జ్ఞాపకార్థం నిత్యాన్నదానం కొనసాగుతుందని జితేందర్ చెబుతున్నాడు. -
‘బంగారు’ తల్లి..
యైటింక్లయిన్‌కాలనీ(రామగుండం): రామగుండం కార్పొరేషన్ యైటింక్లయిన్‌కాలనీకి చెందిన బంగారు లక్ష్మి–రాజయ్య దంపతులకు ఐదుగురు కూతుళ్లు. వారి చిన్నతనంలోనే 2000 సంవత్సరంలో అనారోగ్యంతో రాజయ్య మృతిచెందాడు. అప్పటి నుంచి లక్ష్మి కూరగాయలు విక్రయిస్తూ, కూలీ పనులు చేస్తూ కూతుళ్లను చదివించి అందరికీ పెళ్లి చేసింది. ప్రసుత్తం చిన్న కిరాణ షాపు నడుపుతోంది. పెద్ద కుమార్తె స్వరూప డిగ్రీ పూర్తి చేసి ఆశవర్కర్‌గా ఉద్యోగం చేస్తోంది. రెండో కూతురు మంజుల 10వ తరగతి చదివి ఇంట్లోనే కుట్టు మిషన్ వర్క్ చేసుకుంటోంది. మూడో కూతురు రమాదేవి ఎంబీఏ చదివి ఇటీవల అనారోగ్యంతో మృతిచెందింది. నాలుగో కుమార్తె పద్మిని పీజీ చేసింది. ఐదో కుమార్తె సంగీత పీజీ (ఎమ్మెస్సీ) పూర్తి చేసి కానిస్టేబుల్ ఉద్యోగం చేస్తోంది. -
అమ్మ ప్రోత్సాహంతోనే ఐపీఎస్‌గా..
గోదావరిఖని(రామగుండం): నా విజయంలో చిన్నప్పటి నుంచి అమ్మ ప్రోత్సాహం ఎంతో ఉంది. అమ్మ కిరణ్కుమారిఝా కెమిస్ట్రి రిటైర్డ్ ఫ్రొఫెసర్. బిహార్ రాష్ట్రం మధుబని సొంత స్థలం. తండ్రి నందికిషోర్ఝా ఎంబీబీఎస్ డాక్టర్. సోదరి పారుల్ప్రియా సుంప్రీకోర్టు న్యాయవాది. సోదరుడు క్లిసైకిషోర్ఝా మైరెన్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ చిన్నప్పటి నుంచి అన్ని విషయాల్లో మా నిర్ణయానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సొంత ప్రాంతమైన మదుబనిలో 12వ తరగతి వరకు చదివా. తిర్చి ఎన్ఐటీలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశా. చిన్ననాటి నుంచి పోలీస్‌శాఖలో చేరాలనే ఆకాంక్ష ఉండేది. సివిల్స్ రాసి ఐపీఎస్‌గా ఉద్యోగం సాధించా. అమ్మ అన్ని విషయాల్లో తోడుంటూ మమ్మల్ని ప్రోత్సహించింది. ఏనాడూ టార్గెట్ పెట్టి చదివించలేదు. కెమిస్ట్రి ప్రొఫెసర్‌గా చేస్తూనే ఉన్నత విద్యాభ్యాసానికి బాటలు వేసింది. ఎన్ని జన్మలు ఎత్తినా అమ్మ రుణం తీర్చుకోలేనిది. – అంబర్ కిశోర్ ఝా, సీపీ, రామగుండంతల్లీ.. నీకువందనం..‘పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా’.. ‘అమ్మపాడే జోలపాట అమృతానికన్నా తీయనంటా’.. అని కొందరు సినీ కవులు అన్నట్లు అమ్మ మాటల్లో తీయదనం ఉంటుంది. సృష్టికి మూలమైన రెండక్షరాల అమ్మ అనే పదం ప్రతీ గుండెను తాకుతుంది. తల్లి తమ పిల్లలకు ధైర్యం నింపుతుంది. నవమాసాలు కడుపున మోయడంతో మొదలయ్యే తల్లి బాధ్యత తన చివరి అంకం వరకు ఉంటుంది. నాన్న భవిష్యత్‌ను తీర్చిదిద్దితే.. తల్లి బతుకును అందిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలో పలువురు తల్లులు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్ని కష్టాలు ఎదురైనా కన్న బిడ్డలను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ధైర్యంగా ముందుకు సాగుతున్నారు. అచేతన స్థితిలో ఉన్న బిడ్డలకు అన్నీతానై సేవలందిస్తున్నారు. పేదరికం వారిని పగబట్టినా బిడ్డల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు మాతృమూర్తులు. ఆదిలోనే మాంగళ్య బంధం తెగిపోయినా అధైర్య పడకుండా నేనున్నాను అంటూ అండగా ఉంటున్నారు. బిడ్డలను ఉన్నత శిఖరాలకు చేర్చి వారి కళ్లలో ఆనందాన్ని నింపుకుంటూ అమ్మతనాన్ని చాటుకుంటున్నారు. అనాథలైన చిన్నారులను చేరదీసి వారికి అమ్మలవుతున్నారు మరికొందరు. కొందరు తల్లి జ్ఞాపకార్థం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండగా.. పలువురు ఉద్యోగులు.. ఇంట్లో తల్లిగా.. సమాజంలో అధికారిగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. భూదేవి అంత ఓపికతో.. కన్న బిడ్డలకు అండగా ఉంటున్న మాతృమూర్తి నీకు వందనం.. నేడు మదర్స్ డే సందర్భంగా...కొత్తపల్లి(కరీంనగర్): కుటుంబ సభ్యులు, ముఖ్యంగా భర్త శ్రీరాముల శ్రీనివాస్ సహకారంతో ఒత్తిడి తెలియకుండా ఉద్యోగంలో రాణిస్తున్నా. రెవెన్యూ శాఖలో పని ఒత్తిడి ఉన్నా ఇంట్లో అర్థం చేసుకునే భర్త, సహకరించే అత్త ఉండడం వల్లే ఉద్యోగం, ఇంటి బాధ్యతలను బ్యాలెన్స్ చేయగలుగుతున్నా. అమ్మ అనేది ఒక సంబంధం కాదు.. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని సమానంగా నడిపించే శక్తి. మదర్స్ డే సందర్భంగా ప్రతీ తల్లికి గౌరవం, గుర్తింపు, సహకారం అందాలని కోరుకుంటున్నా. – రేవెల్లి వెంకటలక్ష్మి, తహసీల్దార్, కొత్తపల్లి -
నా వెంటే నా పిల్లలు..
ఇల్లంతకుంట: నేను, మా ఆయన వెంకటేశ్వరరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయులం. మాకు ఇద్దరు అమ్మాయిలు. పెద్దమ్మాయి చైత్ర 8వ తరగతి, చిన్నమ్మాయిని ఫ్రీ ప్రైమరీ స్కూల్లో చేర్పించా. పిల్లలిద్దరినీ నేను పని చేసే పాఠశాలలోనే చదివిస్తున్నా. విధులు నిర్వహిస్తూ కుటుంబ బాధ్యతలు, పిల్లలను చూసుకోవడం కష్టంగానే ఉన్నా ఇష్టంగానే చేస్తుంటా. ఉదయం 4 గంటలకు లేచి ఇంటి పని చేసుకుని పిల్లలను స్కూల్‌కు వెళ్తాం. ఇంటి పనుల్లో భర్త చేదోడు వాదోడుగా ఉంటారు. విధులు ముగించుకొని ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలతో గడుపుతూ వారికి మంచి విలువలు, సంప్రదాయాలు నేర్పిస్తా. – సుప్రియ, ప్రభుత్వ టీచర్, ముస్కానిపేట -
నేటి నుంచి హనుమాన్ పెద్ద జయంతి
మల్యాల: ముత్యంపేటలోని కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయంలో ఆదివారం నుంచి మంగళవారం వరకు మూడు రోజులపాటు హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయం నుంచి తీసుకొచ్చిన పట్టువస్త్రాలను ఈనెల 10న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం స్వామివారికి సమర్పించనున్నారు. 11న స్థాపిత దేవతారాధన, హోమం నిర్వహిస్తారు. 12న స్వామివారి పెద్ద జయంతి సందర్భంగా ఉదయం 3 గంటలకు తిరుమంజనం, 6 గంటలకు ద్రవిడ ప్రబంధ పారాయణం, విశేష అభిషేకం, తులసీ అర్చన, పట్టు వస్త్రాల అలంకరణ, ఉత్సవమూర్తికి ఊయల సేవ, సామూహిక విష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించనున్నట్లు అర్చకులు తెలిపారు. ఉత్సవాలకు అంకురార్పణమల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాలకు శనివారం సాయంత్రం అర్చకులు ప్రత్యేక పూజలతో అంకురార్పణ చేశారు. యాగశాల శుద్ధి, పుణ్యహచనం, అంకురార్పణ, అఖండ దీపస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈఓ అంజనా రెడ్డి, ప్రధాన అర్చకులు రామకృష్ణ, స్థానాచార్యులు కపీందర్, సూపరింటెండెంట్ చంద్రశేఖర్, సునీల్, అశోక్, తదితరులు పాల్గొన్నారు. -
రేవంత్ రెడ్డి.. రైతుల గురించి ఆలోచించు
మెట్పల్లి: ఫోర్త్‌సిటీ అంశాన్ని పక్కనపెట్టి ముందుగా రైతుల గురించి ఆలోచించాలని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి సీఎం రేవంత్‌రెడ్డికి సూచించారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలోని వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, మొక్కజొన్న కేంద్రాలను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావుతో కలిసి శనివారం పరిశీలించారు. అక్కడి సమస్యలపై రైతులను అడిగి తెలుసుకున్నారు. అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్లో మాట్లాడారు. సమస్యలను ఆమెకు వివరించి పరిష్కరించాలని సూచించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. రైతులు పండించే పంటలకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, రేవంత్‌రెడ్డికి ఫోర్త్ సిటీ మీద ఉన్న శ్రద్ద రైతులపై లేదని పేర్కొన్నారు. ఆయన పాలన ఇలాగే కొనసాగితే మరో రెండున్నర ఏళ్లలో వ్యవసాయం కనుమరుగవుతుందన్నారు. పంటల కొనుగోలులో జాప్యంతో రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నా.. ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తుమ్మిడిహెట్టి నుంచి నదీ జలాలను ఎల్లంపల్లికి మళ్లిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేవంత్.. ఇంతవరకు నిలబెట్టుకోకపోవడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ గడువు ముగిసేలోపు హామీని నిలబెట్టుకోకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓటు అడిగే నైతిక హక్కు రేవంత్‌కు ఉండదన్నారు. -
శ్రీకోటేశ్వరస్వామి సన్నిధిలో జిల్లా జడ్జి
వెల్గటూర్: కోటిలింగాల శ్రీకోటేశ్వరస్వామిని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి శనివారం కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారితో పూజలు చేయించారు. శేషవస్త్రంతో సన్మానించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ కమిటీ చైర్మన్ పూదరి రమేశ్, అర్చకులు పాల్గొన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లురాయికల్/జగిత్యాలరూరల్: అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. రాయికల్ మండలం ఆల్యనాయక్తండాకు కై క తార్యనాయక్ గృహప్రవేశంలో పాల్గొన్నారు. నియోజకవర్గానికి 3500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, అదనంగా మరో రెండు వేల ఇళ్ల మంజూరుకు కృషి చేస్తానన్నారు. సర్పంచ్ జ్యోతి, సంతోష్, ఉపసర్పంచ్ గణేశ్, ఎంపీవో సుష్మ, మాజీ ఎంపీపీ లావుడ్య సంధ్యారాణి, రాయికల్ సింగిల్ విండో చైర్మన్ ఏనుగు మల్లారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్రావు పాల్గొన్నారు. అనంతరం సారంగాపూర్ మండలం పోతారానికి చెందిన మేకల తిరుపతి గృహాన్ని ప్రారంభించారు. లబ్ధిదారులకు చీర కానుకగా అందించారు. సర్పంచులు మల్యాల శ్రీనివాస్, సొల్లు సురేందర్, శేఖర్, రమేశ్, కొలపాక రాధరాజు, ఉప సర్పంచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. అల్లీపూర్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణంరాయికల్: మండలంలోని అల్లీపూర్లో శ్రీవేంకటేశ్వరస్వామి కల్యాణాన్ని శనివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలోని ఉత్సవమూర్తులకు అర్చకులు నంబి వాసుదేవ సురేందర్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిర్వాహకులు బాలె అరుణ, బాలె శ్రీరామ్, బాలె శ్రీనివాస్ వేద మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణం జరిపించారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత హాజరయ్యారు. సర్పంచ్ ఎంబారి గౌతమి, ఉపసర్పంచ్ వినయ్, అన్నదాన కమిటీ సభ్యులు మండ రవి, కొల్లూరి రాజేశ్, నాగరాజు, కట్ట రాజేశ్, కమలాకర్, గ్రామ నాయకులు పాల్గొన్నారు. ముందస్తు నిర్ధారణతోనే క్షయ నివారణరాయికల్: ముందస్తు నిర్ధారణ పరీక్షలతోనే క్షయవ్యాధి నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. మండలంలోని కుమ్మరిపల్లి ఇటుకబట్టీలు, కోళ్ల ఫారాల్లో పనిచేస్తున్న కార్మికులకు శనివారం వైద్యశాఖ ఆధ్వర్యంలో క్షయవ్యాధి నిర్ధారణ పరీక్షలు చేశారు. వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా మందులు అందిస్తారని పేర్కొన్నారు. హెల్త్ సూపర్ వైజర్ ఇల్లెందుల శ్రీనివాస్, హెల్త్ అసిస్టెంట్ కడకుంట్ల భూమయ్య, ల్యాబ్ టెక్నీషియన్ సంతోష్, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కోరుట్లలో హిందూ సమ్మేళనంకోరుట్ల: పట్టణంలోని అష్టలక్ష్మీ ఆలయ ప్రాంగణంలో శనివారం రాత్రి ఏకలవ్య బస్తీ కోరుట్ల ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. చిన్నారుల నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. వక్తలు హిందూ సమ్మేళనం ఆవశ్యకతను వివరించారు. -
త్వరితగతిన ధాన్యం కొనాలి
ధర్మపురి/వెల్గటూర్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, రైతులకు ఇబ్బంది కలిగించొద్దని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని నక్కలపేట, వెల్గటూర్‌లోని శాఖాపూర్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. కార్యక్రమంలో ధర్మపురి, వెల్గటూర్ తహసీల్దార్లు, శ్రీనివాస్ శేఖర్ ఉన్నారు. స్వీయగణనలో పాల్గొనాలి జగిత్యాల: స్వీయగణనలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ అన్నారు. ఆదివారం ఒక్కరోజే అవకాశం ఉందన్నారు. మొబైల్ ఫోన్లో ప్రక్రియ సులభంగా చేయవచ్చని, నచ్చిన భాష ఎంచుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలి ప్రత్యేక విద్యా వారోత్సవాలు విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. కలెక్టర్‌తో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. విద్యా ప్రమాణాల పెంపు, విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించడం, ప్రభుత్వ పాఠశాలల్లో నమోదు శాతం పెంచడమే లక్ష్యమన్నారు. అకాలవర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, అధికారులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. -
పార్టీలకతీతంగా వార్డుల అభివృద్ధికి కృషి
మెట్పల్లి: పార్టీలకు అతీతంగా అన్ని వార్డుల అభివృద్ధికి కృషి చేస్తానని వెలమ కార్పొరేషన్ చైర్మన్ జువ్వాడి నర్సింగరావు తెలిపారు. మున్సిపల్ కార్యాలయం వద్ద జనరల్ ఫండ్ నిధులతో నిర్మించే సీసీ రోడ్డు పనులను చైర్మన్ మైలారపు లింబాద్రితో కలిసి ప్రారంభించారు. అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి పట్టణ ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. నర్సింగరావును పాలకవర్గ సభ్యులు సన్మానించారు. వైస్‌చైర్మన్ ఓంకారి నవీన్, కమిషనర్ శ్రీనివాస్‌గౌడ్, డీఈఈ నాగేశ్వర్రావు, కౌన్సిలర్లు ఉన్నారు. నెరవేరుతున్న పేదల సొంతింటి కల మల్లాపూర్: ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కల నెరవేరుతోందని నర్సింగరావు అన్నారు. మండలంలోని చిట్టాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి గృహాప్రవేశానికి హాజరయ్యారు. లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని కోరారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సర్పంచ్ సంపతి శంకరమ్మ, ఉపసర్పంచ్ బాలసాని ప్రణయ్‌గౌడ్, మాజీ సర్పంచ్ కడకుంట్ల సాయికుమార్ పాల్గొన్నారు. -
ధాన్యం కొనకుంటే పోరాటమే..
రాయికల్: మక్కల కొనకుంటే రైతుల పక్షాన పోరాడుతామని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. పట్టణంలోని మార్కెట్‌యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కొందరు రైతులు నిర్వాహకులకు డబ్బులిస్తేనే కాంటా చేస్తున్నారని వసంత దృష్టికి తీసుకురాగా.. వెంటనే ఆమె కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆమె వెంట మాజీ జెడ్పీటీసీ గోపి మాధవి, మున్సిపల్ వైస్ చైర్మన్ తురగ సౌజన్య, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బర్కం మల్లేశ్ పాల్గొన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు మల్లాపూర్: మక్కలు, ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసి మిల్లులకు తరలించాలని మెట్పల్లి ఆర్డీవో జి.నరసింహరావు అన్నారు. అవకతవకలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు. మండలకేంద్రంలోని మార్కెట్‌యార్డ్‌లో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. కేంద్రాల్లో నీటి సదుపాయం కల్పించాలన్నారు. తహసీల్దార్ రాంచందర్, ఆర్ఐ రాజేశ్, అశోక్, ప్యాక్స్ సీఈవో రమేశ్ పాల్గొన్నారు. రైతులెవరూ అధైర్యపడొద్దు తడిసిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులెవరూ అధైర్యపడొద్దని కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. స్థానిక మార్కెట్‌యార్డులో కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ అంతడపుల పుష్పలతతో కలిసి పరిశీలించారు. ఎమ్మెల్యే సంజయ్ రైతులను రెచ్చగొడుతున్నారని పేర్కొన్నారు. 10 రోజుల్లో మక్కల కొనుగోళ్లు పూర్తవుతాయన్నారు. మాజీ ఎంపీపీ నల్ల రాజన్న, ఉపసర్పంచ్ గడ్డం సోమరెడ్డి, కాంగ్రెస్ సేవాదళ్ మండల అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు పాల్గొన్నారు. -
జగిత్యాల
37.0/27.07గరిష్టం/కనిష్టంహరహర మహాదేవ వేములవాడ: రాజన్న, భీమన్న క్షేత్రాల్లో శుక్రవారం భక్తుల రద్దీ పెరిగింది. ఎండలకు లెక్కచేయకుండా భక్తులు రాజన్నకు మొక్కులు చెల్లించుకున్నారు. వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం నుంచే ఎండ వేడిమి మొదలవుతుంది. మధ్యాహ్నం ఉక్కపోత పెరుగుతుంది.వేంకటేశ్వరస్వామి కల్యాణం కథలాపూర్: కథలాపూర్‌లో శ్రీవేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామి వారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. గ్రామస్తులే పెళ్లి పెద్దలుగా వ్యవహరించారు. శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026 -
టిఫిన్స్..
జిల్లాకేంద్రానికి చెందిన ఓ ఉపాధ్యాయుడు పని నిమిత్తం బయటకు వెళ్లాడు. అప్పటివరకు ఇంట్లో టిఫిన్ చేయకపోవడంతో కలెక్టరేట్‌కు సమీపంలోని ఓ హోటల్‌కు వెళ్లి దోశ ఆర్డర్ ఇచ్చాడు. దానికి హోటల్ నిర్వాహకుడు రూ.80 బిల్లు వేశాడు. దీంతో అవాక్కయిన సదరు ఉపాధ్యాయుడు.. ఒక్క దోశకే ఇంతనా..? అని ప్రశ్నించగా.. ధరలు పెరిగాయని, సిలిండర్ల కొరత ఉందని, అందుకే రేట్లు పెంచాల్సి వచ్చిందని నిర్వాహకుడు జవాబిచ్చాడు.కొనలేంతినలేంజగిత్యాల: అసలే ఉరుకులు పరుగుల జీవితం. ఒక్కోసారి ఇంట్లో బ్రేక్‌ఫాస్ట్ (టిఫిన్) కాకపోతే చిరు ఉద్యోగులు, ప్రైవేటు ఉద్యోగులు ఎక్కువగా చిన్నచిన్న టిఫిన్ సెంటర్లకు వెళ్లి తింటుంటారు. మొన్నటివరకు ప్లేట్ పూరీ, ఇడ్లీ, వడ, దోశకు రూ.30 నుంచి రూ.40వరకు ఉండగా.. వాటి ధరలు అమాంతం పెంచారు. ఏకంగా రూ.80వరకు పెంచడంతో సామాన్యులు తినలేని పరిస్థితి నెలకొంది. పశ్చిమాసియాలో యుద్ధం నేపథ్యంలో సిలిండర్లు సక్రమంగా రాకపోవడం.. ఇటీవల కమర్షియల్ సిలిండర్ల ధరలను పెంచడంతో చిరువ్యాపారులకు గుదిబండగా మారింది. చిన్నచిన్న టిఫిన్ సెంటర్ల నుంచి పెద్దపెద్ద బిర్యానీ సెంటర్లు కూడా కట్టెల పొయ్యినే వినియోగిస్తున్నారు. అటు టిఫిన్స్, ఇటు మీల్స్ సెక్షన్లో ఒకేసారి రేట్లు పెంచారు. ఇది సామాన్య, మధ్యతరగతి వారికి ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లకు గుదిబండ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, గప్‌చుప్ బండ్లు, చిన్నచిన్న హోటళ్లు, బిర్యానీ సెంటర్లు కమర్షియల్ సిలిండర్లపైనే ఆధారపడుతుంటారు. సాయంత్రం, మధ్యాహ్నం వేళ రోడ్లపై టిఫిన్స్ విక్రయిస్తుంటారు. ఇది సామన్య, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సిలిండర్ల ధర పెంచడంతో విధిలేని పరిస్థితుల్లో టిఫిన్స్ ధర పెంచారు. ఒక హోటల్‌కు నెలకు 4–5 వాణిజ్య సిలిండర్లు అవసరం ఉంటుందని నిర్వాహకులు పేర్కొంటున్నారు. సిలిండర్ల ధర పెంచడంతో రూ.5వేల నుంచి రూ.6వేల భారం పడుతోందని, అందుకే విధిలేని పరిస్థితుల్లో టిఫిన్ ధరలు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొంటున్నారు. ఒకవైపు ఇంటి అద్దెలు, సిబ్బంది వేతనాలు, నిత్యావసర కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వ్యాపారం సరిగా సాగడం లేదని, జీవనం కష్టతరంగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కష్టమర్లకే ఇబ్బందులు ఏదైనా చిన్న హోటల్‌కు వెళ్లి పూరీ, దోశగాని తింటే రూ.30నుంచి రూ.40 ఉండేది. ప్రస్తుతం రూ.80 నుంచి రూ.100కు పెరిగింది. ఈ ధర దాదాపు అ న్నంతో కూడిన భోజనం వస్తుంది. అలా ఒక్కసారి గా రేట్లు పెంచడంతో వినియోగదారులకు ఇబ్బంది గా మారింది. సామాన్య కుటుంబాలకు ఇది భారంగా మారింది. హోటల్ నిర్వాహకులు కట్టెల పొ య్యి ని వాడటంతో ఖర్చు అధికంగా అవుతుందని, దీంతో విధిలేని పరిస్థితుల్లో రేట్లు పెంచామని చెబుతున్నప్పటికీ అంతిమభారం కష్టమర్లపైనే పడుతోంది. ఇడ్లీ రూ.50 (రెండు) వడ రూ.70 (రెండు) మసాల దోశ రూ.80రవ్వ దోశ రూ.100పూరీ రూ.50బోండా రూ.60మీల్స్ రూ.200 -
చెరువుల్లో కలుపు మొక్కలను నివారించాలి
జగిత్యాల: చేపల చెరువులో కలుపు మొక్కలను నివారించాలని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో పారిశ్రామిక, మత్స్యకార, మార్కెటింగ్ లైసెన్స్ సహకార సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. జిల్లాలోని మత్స్యశాఖ చెరువుల్లో కలుపు మొక్కల నివారణ చేపట్టాలని, వ్యాధుల నివారణ, అధికోత్పత్తికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా మత్స్యశాఖ అధికారి సురేశ్‌బాబు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ త్వరలో భూముల రిజిస్ట్రేషన్ విలువల సవరణ చేయడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం ఆర్డీవోలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, సబ్ రిజిస్ట్రార్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. మార్కెట్ విలువల సవరణకు సంబంధించి ఫార్మర్–1 నుంచి 4 వరకు వివరాలను సమగ్రంగా సిద్ధం చేసి ఈనెల 12లోపు సమర్పించాలన్నారు. నిబంధనలు, ప్రస్తుత రికార్డు, మార్కెట్లోని విలువలను పరిగణలోకి తీసుకుని ఖచ్చితమైన విలువలు నమోదు చేయాలని సూచించారు. గ్రామాలు, పట్టణాలు, రహదారులు, సర్వే నంబర్లు, వర్గీకరణల వారీగా వివరాలను పరిశీలించి పొరపాట్లు లేకుండా నివేదికలు పంపించాలని ఆదేశించారు. సమయ పాలన పాటిస్తూ నిర్ణీత గడువులోపు అన్ని ఫార్మెట్లు సమర్పించాలని, నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రతి కూలీ లేబర్ కార్డు తీసుకోవాలి పెగడపల్లి(ధర్మపురి): భవన నిర్మాణ, ఇతర రంగాల కార్మికులకు లేబర్ కార్డు ద్వారా ఎన్నో ప్రయోజనాలున్నాయని, ప్రతీ ఒక్కరు లేబర్ కార్డు తీసుకోవాలని జిల్లా లేబర్ అధికారి అనిల్ కదం కోరారు. శుక్రవారం మండల కేంద్రంలో ఉపాధిహామీ పని ప్రదేశంలో కూలీలకు అవగాహన కల్పించారు. లేబర్ కార్డు పొందడం ద్వారా కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే రూ.2 లక్షలు, ప్రమాదంలో మరణిస్తే రూ.10 లక్షలు జీవిత బీమా ద్వారా ఆర్థికసాయం అందే అవకాశముందన్నారు. మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి లేబర్ కార్యాలయం నుంచి కార్డు ఇవ్వడం జరుగుతుందని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్పంచ్ అరుణ, ఏఎంసీ చైర్మన్ రాములుగౌడ్, జిల్లా ఉపాధి కల్పనాధికారి సదానందం, కార్యదర్శి ప్రవీన్, ఏఎంసీ డైరెక్టర్ విజయభాస్కర్, స్వామి, రవి పాల్గొన్నారు. -
సామాన్యులకు ఇబ్బందే..
ఇటు టిఫిన్స్ ధరలు పెరగడం సామాన్యులకు ఇబ్బందిగా మారింది. చిరు హోటళ్లలో రేట్లు పెంచడంతో అధిక భారం పడుతోంది. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రేట్లు తగ్గించేలా చూడాలి. – కిరణ్, జగిత్యాల భారం ప్రజలపైనే అటు సిలిండర్ల ధరలు పెంచినా.. హోటల్ నిర్వాహకులు ధరలు పెంచినా భారం ప్రజలపైనే పడుతోంది. కట్టెల పొయ్యిపై వంట చేయాల్సి వస్తోంది. ప్రభుత్వం ఆలోచించాలి. హోటళ్లు మూసివేసే పరిస్థితులు నెలకొన్నాయి. – కల్యాణ్, జగిత్యాల -
కొండగట్టుకు ఆధ్యాత్మిక శోభ
మల్యాల(చొప్పదండి): అంజన్న జయంతోత్సవాలకు కొండగట్టు ఆలయం ముస్తాబైంది. విద్యుద్దీపాలు, స్వాగత తోరణాలు, చలువ పందిళ్లతో ఉత్సవ శోభ నెలకొంది. ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహించే హనుమన్ పెద్ద జయంతికి సర్వం సిద్ధం చేశారు. సుమారు 2 వేల మంది పోలీసులు, అధికారులు, పారిశుధ్య సిబ్బందికి విధులు కేటాయించారు. ఏర్పాట్లు ఇలా.. ఉత్సవాలకు సర్వం సిద్ధం కొండగట్టు ఆలయంలో స్వామివారి జయంతోత్సవాలకు సర్వం సిద్ధం చేశాం. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశాం. లడ్డూ ప్రసాదాల కౌంటర్లు మూడు రోజులపాటు తెరిచి ఉంచుతాం. ఉత్సవాలను విజయవంతం చేసేందుకు భక్తులు సహకరించాలి. – అంజనారెడ్డి, ఆలయ ఈవో -
రైతులు అధైర్య పడొద్దు
జగిత్యాల/జగిత్యాలఅగ్రికల్చర్: రైతులెవరూ ఆందోళన చెందవద్దని, మార్కెట్‌యార్డులో ఉన్న చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.జగిత్యాల మార్కెట్‌యార్డులో అకాల వర్షానికి తడిసిన వరి, మొక్కజొన్న ధా న్యాన్ని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి పరిశీ లించారు. పంటలకు మద్దతు ధరలు ప్రకటించి కేంద్రం చేతులు దులుపుకోవడంతో ఆ భారమంతా రాష్ట్ర ప్రభుత్వంపై పడుతుందన్నారు. రానున్న రోజుల్లో మరింత ఆదాయం సమకూర్చుకోవాలనే ముందుచూపుతో ముఖ్యమంత్రి ఫ్యూచర్ సిటీ అభివృద్ధిచేస్తున్నారని తెలిపారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి ఫ్యూచర్ సిటీపై చేసిన వ్యా ఖ్యలు సమంజసం కాదన్నారు. మంత్రి వెంట కలెక్ట ర్ సత్యప్రసాద్, మున్సిపల్ చైర్పర్సన్ వాణి, మా ర్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నందయ్య, నాయకులు పాల్గొన్నారు. కేంద్రం తీరుతోనే కొనుగోలులో ఆలస్యం పెగడపల్లి: కేంద్రం తీసుకొచ్చిన నిబంధనల వల్లనే ధాన్యం కొనుగోలులో ఆలస్యమైందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. పెగడపల్లి మండలం ఆరవెల్లిలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ధాన్యం కుప్పలను పరిశీలించారు. తూకంలో తేడా, ధాన్యంలో తరుగు పేరిట మిల్లర్లు సతాయిస్తే నిర్వాహకులు సంబంధిత అధికారులకు తెలుపాలని కానీ రైతులను మిల్లర్ల వద్దకు పంపవద్దని సూచించారు. పశు పోషణపై దృష్టి సారించాలి పశు పోషణపై దృష్టి సారించి అదనపు ఆదాయం గడించాలని మంత్రి అడ్లూరి లక్ష్మన్‌కుమార్ రైతులకు సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శుక్రవారం మండలంలోని మద్దులపల్లిలో నిర్వహించిన పశువైద్య శిబిరంలో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన పశుబీమా పునరుద్ధరణపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి సీఎం దృష్టికి తీసుకెళ్లి పునరుద్ధరణ అయ్యేలా కృషి చేస్తానన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనులు చేపట్టాలి ధర్మపురి: మండలంలోని నేరెల్ల శివారులో నిర్మిస్తు న్న యంగ్ ఇండియా ఇంటి గ్రేటెడ్ స్కూల్ పనుల ను యుద్ధప్రాతిపదికన చేపట్టాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. శుక్రవారం పనులు జరుగుతున్న తీరును పెద్దపెల్లి ఎంపీ వంశీకృష్ణతో కలిసి పరిశీలించారు. త్వరితగతిన పనులు చేపట్టాలని తెలిపారు. -
ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్/జగిత్యాలఅగ్రికల్చర్: వరి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లులకు తరలించాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం జగిత్యాల మండలం చల్గల్లోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం ఆకస్మికంగా పరిశీలించారు. కేంద్రాలకు వచ్చిన వరిధాన్యాన్ని మ్యాచర్ వచ్చిన వెంటనే ఆలస్యం లేకుండా తూకం వేసి మిల్లులకు తరలించాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, సకాలంలో ధాన్యం కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం తూకం, నిల్వ, రవాణా ప్రక్రియల్లో ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదని, రైతులకు సమగ్ర సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున గన్ని సంచులు, టార్ఫలిన్లు అందుబాటులో ఉంచుకోవాలని అన్నారు. ఆయన వెంట ఆయా శాఖల అధికారులు ఉన్నారు. గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలి జగిత్యాల: ఈవీఎం గోదాం వద్ద భద్రత పటిష్టంగా ఉండాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం ఈవీఎం గోదాంలను పరిశీలించారు. సీసీకెమెరాల పనితీరు, సాంకేతిక పరమైన అంశాలు సమగ్రంగా ఉండేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు. అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ఏవో కిషన్, అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ ఉన్నారు. -
జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్
జగిత్యాలజోన్: జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతిని కలెక్టర్ సత్యప్రసాద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జిల్లా అభివృద్ధి, సంక్షేమం గురించి చర్చించారు. ‘ఇందిరమ్మ’తో సొంతింటి కల సాకారంజగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేద సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం మోరపల్లి గ్రామంలో వడ్లూరి సుజాత నిర్మించిన ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు. అర్హులైన నిరుపేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తున్నామన్నారు. రెండెకరాలు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు అందజేసినట్లు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుందన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని పథకాలను అమలు చేయడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, ఎంపీడీవో రమాదేవి, సర్పంచ్ కట్ట రాజేందర్, మాజీ ఎంపీటీసీ కర్నె భూమరెడ్డి, మాజీ సర్పంచ్ గంగారాం, సదానందం, లింగారెడ్డి, తిరుపతి, వెంకటేశ్, ప్రశాంత మల్లారెడ్డి, అనిల్ పాల్గొన్నారు. ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేజగిత్యాలఅగ్రికల్చర్: ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి అన్నారు. అకాల వర్షంతో తడిసిన వరి, మొక్కజొన్న ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. ధాన్యం తూకం వేసిన తర్వాత లారీలు రావడం లేదని, వర్షానికి సంచులు తడిస్తే రైతులదే బాధ్యత అంటున్నారని రైతులు జీవన్‌రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో జీవన్ రెడ్డి మా ర్క్‌ఫెడ్ ఎండీ, కలెక్టర్‌తో మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు. మార్కెట్లో 3 గో దాంలు ఖాళీగా ఉన్నాయని, అందులో నిల్వ చేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలుగనీయవద్దని అధికారులకు సూచించారు. పశుసంపదను పెంచేందుకు రైతు సదస్సులుజగిత్యాలఅగ్రికల్చర్/జగిత్యాలరూరల్: జిల్లాలో పశుసంపదతో పాటు పాల ఉత్పత్తిని పెంచేందుకు గ్రామీణ ప్రాంతాల్లో రైతు సదస్సులు నిర్వహిస్తున్నామని జిల్లా పశు సంవర్థక శాఖ అధికారి డాక్టర్ ప్రకాశ్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలంలోని మోరపల్లి గ్రామంలో శుక్రవారం ఉచిత పశువైద్య శిబిరంతో పాటు రైతు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పాడి పశువుల్లో వ్యాధులను నియంత్రించేందుకు సంరక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. పాడి ఉత్పత్తిని పెంచేందుకు ఆచరించాల్సిన పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని పేర్కొన్నారు. ఉచిత పశువైద్య శిబిరాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరుగుతుందని చెప్పారు. వెటర్నరీ ఏడీ నరేశ్, శ్రీదేవి, డాక్టర్ నరేశ్, సర్పంచ్ రాజేందర్, నాయకులు ఆకునూరి గంగారాజం, లింగారెడ్డి, గంగారాం, భూమారెడ్డి, పారావెటర్నరీ సిబ్బంది రవీందర్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మరమ్మతులపై నిర్లక్ష్యం..
మెట్పల్లి: రోజురోజుకూ ఎండల తీవ్రత పెరిగిపోతుండడంతో పట్టణంలో భూగర్భజలాలు వట్టి పోతున్నాయి. తద్వరా నీటి కొరత ఏర్పడి పలు వార్డుల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వేసవికి ముందే అధికారులు పనిచేయని చేతి పంపులు, పబ్లిక్ బోర్లను గుర్తించి మరమ్మతు చేయించాల్సి ఉండగా.. కొన్నిటికి మాత్రమే చేయించి చేతులు దులుపుకొన్నారనే విమర్శలు ఉన్నాయి. దీంతో వీటిపైనే ఆధారపడ్డ కుటుంబాలు నానా అవస్థలు పడుతున్నాయి. రెండు నెలలు గడిచినా.. దృష్టికి తీసుకొస్తే చర్యలు పట్టణంలో చాలాచోట్ల పని చేయని పబ్లిక్ బోర్లు, చేతి పంపులకు మర్మమతులు చేపట్టి వినియోగంలోకి తీసుకొచ్చాం. ఎక్కడైనా పని చేయనివి ఉంటే ప్రజలు మ దృష్టికి తీసుకొస్తే మరమ్మతు చేస్తాం. నీటి సమస్య ఉన్న ప్రాంతాలకు మున్సిపల్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. – నాగేశ్వర్రావు, మున్సిపల్ డీఈఈ -
సోలార్ విద్యుత్‌కు ప్రాధాన్యమివ్వాలి
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలఅగ్రికల్చర్: సోలార్ విద్యుత్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాసలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. థర్మల్, జల విద్యుత్‌తో పోల్చితే సోలార్‌తో తక్కువ ఖర్చవుతుందన్నా రు. నియోజకవర్గంలోని 78వేల పేద, మధ్య తరగ తి కుటుంబాలకు ప్రభుత్వం 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తోందన్నారు. పర్యావరణానికి హాని చేయని సోలార్ విద్యుత్ వైపు ప్రతి ఒక్కరు దృష్టి పెట్టాలన్నారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మార్కెట్ చైర్మన్ నారాయణ రెడ్డి, డీఏవో భాస్కర్, ఎన్పీడీసీఎల్ ఎస్ఈ సుదర్శనం, డీఈ గంగారాం, ఏడీ తిరుపతినాయక్, ఎడీఈ జవహర్ నాయక్, ప్రోపెసర్ సుజాత, నాయకులు పాల్గొన్నారు. -
రైతు సమస్యలపై పోరాడుతాం
● కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ కోరుట్లరూరల్: రైతు సమస్యలపై పోరాడుతూనే ఉంటామని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డును బుధవారం సదర్శించారు. నెలరోజులుగా మక్కలు కాంటా చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్క్‌ఫెడ్ డీఎంకు ఫోన్ చేసి మక్కలు త్వరగా కొనుగోలు చేయాలని సూచించారు. మక్కలు రోజుల తరబడి ఇలాగే ఉంటే అకాలవర్షాలకు తడిసిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. రైతులకు పంట పెట్టుబడి సాయం, యూరియా అందించడంలో విఫలమైన ప్రభుత్వం.. కనీసం రైతు కష్టపడి పండించిన ధాన్యాన్ని కూడా సకాలంలో కొనలేకపోవటం దారుణమన్నారు. ప్రభుత్వం మీడియా మేనేజ్మెంట్ వదిలి గ్రౌండ్లోకి వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ధాన్యం, మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఆయన వెంట రైతుబంధు సమితి జిల్లా మాజీ కన్వీనర్ చీటి వెంకట్రావు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే..మల్లాపూర్: పంటల కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బంది పడుతున్నారని ఎమ్మెల్యే అన్నారు. మండలంలోని వేంపల్లిలో షార్ట్ సర్క్యూట్‌తో కాలిపోయిన మొక్కజొన్న పంటను బుధవారం పరిశీలించారు. బాధిత మహిళారైతు గుమ్ముల లతతో మాట్లాడారు. ఆధైర్యపడోద్దని, పరిహారం అందించేలా కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. మాజీ జెడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తోట శ్రీనివాస్, సర్పంచ్ చిట్యాల లక్ష్మణ్, మాజీ ఎంపీటీసీ ఏనుగు రాంరెడ్డి ఉన్నారు. మున్సిపల్ చైర్మన్, అధికారులపై ఫిర్యాదుమెట్పల్లి: మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి, మొన్నటివరకు పనిచేసిన కమిషనర్ స్పందన, విద్యుత్ అధికారులపై 11వార్డు కాంగ్రెస్ ఇన్చార్జీ కొమిరెడ్డి లింగారెడ్డి పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వార్డులోని మంచినీటి బావి ప్రహరీ కొంతభాగాన్ని గోపనవేణి శేఖర్, బైన శ్రీనివాస్ పగులగొట్టి నీటిని వారి పంట పొలాలకు తరలిస్తున్నారని కొన్ని రోజుల క్రితం లింగారెడ్డి చైర్మన్, కమిషనర్, విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విచారణ జరిపి పైపులు, విద్యుత్ కనెక్షన్ తొలగించామంటూ లింగారెడ్డికి లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. కానీ ఇప్పటివరకు అక్కడ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. తనకు తప్పుడు సమాచారం ఇచ్చారని, వారిపై చర్యలు తీసుకోవాలని లింగారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
45.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో బుధవారం 45.3 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. బీర్పూర్ మండలం కొల్వాయిలో 45.3, రాయికల్ మండలం అల్లీపూర్లో 45.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.1, మల్లాపూర్ మండలం గోదూర్‌లో 44.8, మల్లాపూర్‌లో 44.7, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 44.5, మెట్పల్లిలో 44.5, ధర్మపురి మండలం జైనాలో 44.3, మేడిపల్లిలో44.1, రాయికల్‌లో 44.1 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. మక్క రైతుల ధర్నాజగిత్యాలఅగ్రికల్చర్: కొనుగోలు చేసిన మక్కలను తరలించడం లేదంటూ రైతులు జగిత్యాల మార్కెట్‌యార్డు ఎదుట నిజమాబాద్–కరీంనగర్ రహదారిపై బుధవారం ధర్నాకు దిగారు. 15 రోజులు గడస్తున్నా.. మక్కలు కొనడం లేదని, కాంటా వేసిన వాటిని తరలించడం లేదని ఆందోళనకు దిగారు. ప్రస్తుతం మార్కెట్లో 10 వేల క్వింటాళ్లకు పైగా మక్కలు ఉన్నాయని, 15వేల బస్తాలు కాంటా చేసి ఉన్నాయని, వర్షం వస్తే తమ పరిస్థితి ఏంటని అధికారులను నిలదీసారు. స్థల సమస్య కారణంగా ఇతర రైతులు మక్కలను మార్కెట్‌కు తీసుకురాలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఐ కరుణాకర్, ఎస్సై సదాకర్, ట్రాఫిక్ ఎస్సై మల్లేశం వచ్చి రైతులతో మాట్లాడారు. సమస్య పరిష్కారానికి అధికారులతో ఫోన్లో మాట్లాడడంతో రైతులు శాంతించారు. మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మ దహనం ధర్మపురి: హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా మాట్లాడారని పేర్కొంటూ దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ దిష్టిబొమ్మను పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద బుధవారం బీజేపీ నాయకులు దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మంత్రిగా ఉన్న సురేఖ హిందూదేవతలను కించపర్చారని, జైశ్రీరాం అంటే డబ్బులు రాలుతాయా..? అంటూ అనుచిత వ్యాఖ్యలు చేయడం బాధాకరమన్నారు. మైనార్టీల ఓట్ల కోసం హిందూ దేవుళ్లను కించపరిచేలా మాట్లాడడం సరికాదన్నారు. నాయకులు గాజు భాస్కర్, స్తంభంకాడి శ్యాం, పల్లెర్ల సురేందర్ తదితరులున్నారు. -
దోపిడీకి స్కెచ్!
● దేశవ్యాప్తంగా సుశిక్షితులైన 70 మందితో క్రిమినల్ నెట్వర్క్ ● బిహార్, పశ్చిమబెంగాల్, ఒడిశా, మధ్యప్రదేశ్ ఇతర రాష్ట్రాల్లో కేసులు ● చోరీ చేసిన మొబైళ్లు, ఎన్క్రిప్టెడ్ యాప్స్ (ఫేస్టైంతోసహా)తో జైలు నుంచే వీడియో కాల్స్ ద్వారా రియల్ టైం మానిటరింగ్ ద్వారా ఆదేశాలు. ● గోల్డ్ లోన్ కంపెనీలు, నగల దుకాణాలు, జువెల్లరీ షోరూంలే టార్గెట్ ● అనుచరులకు వేతనాలు, నేరాల్లో ప్రతిభ కనబరిస్తే బోనస్‌లు ● పలు రాష్ట్రాల్లో తనిష్క్, మణప్పురం, ముత్తూట్ తదితర సంస్థల నుంచి 30కిలోలకు పైగా బంగారం తస్కరణ. ● పారిపోయేందుకు ప్రత్యామ్నాయాలు, దోపిడీకి ముందు రెక్కీ ఈ గ్యాంగ్ ప్రత్యేకత. ● ప్రస్తుతం బిహార్, వెస్ట్‌బెంగాల్‌లో కేసులు. బిహార్ జైలు నుంచిసాక్షిప్రతినిధి,కరీంనగర్ : జులాయి సినిమాలో విలన్ ఒక దొంగ.. చోరీ చేసిన ప్రతిసారీ పోలీసులకు తప్పుడు క్లూ వదిలి.. తాను మాత్రం మరో మార్గంలో పరారవుతుంటాడు. దీనినే పోలీసు పరిభాషలో ‘అటెన్షన్ డైవర్షన్’ అంటారు. ఈ టెక్నిక్‌నే కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ దోపిడీలో దొంగలు వినియోగించినట్లు తెలుస్తోంది. దేశంలోని అనేక జువెల్లరీ షాపులను నిలువుదోపిడీ చేసిన బిహార్‌కు చెందిన ‘గోల్డ్ థీఫ్’ అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ఈ గ్యాంగ్ ఉత్తర భారతంలో దోపిడీలు, కిడ్నాప్‌లు, అక్రమ వసూళ్లకు ప్రసిద్ధి. దేశవ్యాప్తంగా గోల్డ్ థీఫ్కి క్రిమినల్ నెట్వర్క్ ఉంది. ఇతను కన్నేశాడంటే.. ఇతని అనుచరులు పథకం పన్ని బంగారం మొత్తం ఊడ్చి పారేస్తుంటారు. సుశిక్షితులైన దొంగలు కావడంతో ఇప్పటివరకు అన్నీ భారీ చోరీలే నమోదయ్యాయి. ప్రస్తుతం గోల్డ్ థీఫ్ బిహార్ జైలులో ఉన్నాడు. అక్కడ నుంచే దోపిడీకి ప్రణాళిక రచించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ధర్మపురికి వచ్చింది మొత్తం ఆరుగురు.. ఈనెల 3న.. కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో దొంగతనం చేసింది ఐదుగురు కాదు.. ఆరుగురిగా పోలీసులు గుర్తించారు. ఈనెల ఒకటిన ఉదయం ధర్మపురిలోని విజయలక్ష్మి లాడ్జిలో తొలుత నలుగురు, తర్వాత మరొకరు వచ్చారు. ఇంకోవ్యక్తి సాయంత్రం వచ్చినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అతడే ఈ ఽఐదుగురిని ధర్మపురి నుంచి ఛత్తీస్‌గఢ్ లేదా ఝార్ఖండ్ వైపు తప్పించి ఉంటాడని అనుమానిస్తున్నారు. జార్ఖండ్‌కు చెందిన సౌరభ్కుమార్మిశ్రా పేరుతో విజయలక్ష్మి లాడ్జిలో రూ.1200కు గది అద్దెకు తీసుకున్నారు. ధర్మపురిలో దైవదర్శనం కూడా చేసుకున్నట్లు ఆధారాలు లభించాయి. ఉత్తరభారతంలో దొంగలు చోరీకి ముందు పూజలు చేయడం ఆనవాయితీ. ఏప్రిల్ 27నుంచి 30వరకు దొంగలు పెద్దపల్లిలోని పరమేశ్వర లాడ్జిలో బస చేశారు. అక్కడ నుంచే దొంగతనానికి ప్లాన్ చేసినట్లు సమాచారం. అక్కడ కూడా జార్ఖండ్‌కు చెందిన చిరునామాతో గుర్తింపుకార్డులు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇదే వ్యక్తులు మార్చి నెలలోనూ ఇదే లాడ్జిలో బస చేసినట్లు కూడా దర్యాప్తులో తేలింది. చోరీకి ముందు సిద్దిపేట పరిసరాల్లోనూ ఈ ముఠా సంచరించినట్లు సమాచారం. ఘటనాస్థలంలో మహారాష్ట్రకు చెందిన బ్యాగు, గోదావరి తీరంలో బైక్‌ను అటెన్షన్ డైవర్షన్ కోసమే కావాలని వదిలేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పల్సర్ బైకు చాసీస్‌ను గుర్తించిన పోలీసులు అది ఢిల్లీదిగా తేల్చారు. బ్యాగు, బైకు విషయంలో పోలీసులను తప్పుదోవ పట్టించి దర్యాప్తు జాప్యానికి కారణమైనట్లు అనుమానిస్తున్నారు. అది అనుభవమున్న దొంగలకే సాధ్యం. చోరీలో పాల్గొన్న వారి ఆచూకీని ఇప్పటికే కనుగొన్న పోలీసులు బిహార్‌లోని నిందితుల ఇళ్లు, నిందితులు, స్నేహితుల ఇళ్ల వద్ద నిఘా పెట్టారు. ఎలాగైనా రెండు రోజుల్లో పట్టుకుంటామని ధీమాగా ఉన్నారు. -
కేంద్రప్రభుత్వ తీరుతోనే ఆలస్యం
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ధర్మపురి: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలతోనే కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. భారీ వర్షానికి కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరి, మొక్కజొన్నలను బుధవారం పరిశీలించారు. కేంద్రప్రభుత్వం ఆన్లైన్లో ట్రక్‌షీట్, వాహనాలకు జీపీఆర్ఎస్ పెట్టాలని నిబంధన తేవడంతో 15 రోజులు ఆలస్యమైనట్లు పేర్కొన్నారు. వారం పదిరోజుల్లో ధాన్యం కాంటా చేసి మిల్లులకు తరలిస్తామని, రైతులు అధైర్యపడొద్దని సూచించారు. ఆయన వెంట గ్రంథాలయ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్, ఏఎంసీ చైర్పర్సన్లు వేముల నాగలక్ష్మి, చిలుముల లావణ్య, కౌన్సిలర్ చీపిరిశెట్టి రాజేశ్ తదితరులున్నారు. -
కేంద్రమంత్రిగా ఉంటూ బూతులా..
జగిత్యాల: కేంద్ర సహాయ మంత్రిగా కొనసాగుతున్న బండి సంజయ్ బూతులు మాట్లాడటమేంటని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆమె మాట్లాడారు. బీజేపీ క్రమశిక్షణ పార్టీ అంటారని, మోదీ, అమిత్‌షా ఇలాగే మాట్లాడమని చెప్పారా అని ప్రశ్నించారు. మంత్రి ఇంటికి కూతవేటు దూరంలో కాల్పులు జరిపి దొంగలు బంగారం ఎత్తుకెళ్తే ఏం చేశారని నిలదీశారు. కేటీఆర్‌ను కరీంనగర్‌కు రానివ్వబోమంటున్నారని, రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా దత్తత ఇచ్చిందా అని ప్రశ్నించారు. కేటీఆర్‌పై విమర్శలు చేస్తే సహించబోమన్నారు. కార్యక్రమంలో నాయకులు వెంకటేశ్వర్రావు, దేవేందర్‌నాయక్ పాల్గొన్నారు. రైతులను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అనంతారంలో కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. రైతులంటే కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదన్నారు. బీఆర్ఎస్ నాయకులు అయిల్నేని ఆనందరావు, మోహన్, శ్రీపాల్, జలేందర్, రాజమల్లు, మల్లేశం, గంగాధర్, తిరుపతి, సత్తన్న పాల్గొన్నారు. -
వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ‘జువ్వాడి’
కోరుట్ల: కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, సీనియర్ నాయకుడు జువ్వాడి నర్సింగరావుకు వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా నియామకమయ్యారు. రాష్ట్రంలో మొదటిసారి ఏర్పాటు చేసిన వెలమ కార్పొరేషన్‌కు నర్సింగరావు నియామకం కావడం విశేషం. ఇటీవల నియోజకవర్గంలో మూడోవంతు సర్పంచ్ స్థానాలు గెలవడంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీలను నర్సింగరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ కై వసం చేసుకుంది. జిల్లాలో సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా గుర్తింపు పొందిన ఈయన.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో ఏపీఐఐసీ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. కొంతకాలంగా జువ్వాడి నర్సింగరావుకు కార్పొరేషన్ పదవి ఖాయమని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో స్థానిక కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నూతనోత్సాహం నెలకొంది. పట్టణంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగరావు మాట్లాడుతూ.. తనను వెలమ కార్పొరేషన్ చైర్మన్‌గా ఎంపిక చేసిన కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలకు పూర్తి న్యాయం చేస్తానని అన్నారు. -
రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఇబ్రహీంపట్నం: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని కలెక్టర్ సత్యప్రసా ద్ సూచించారు. మండలంలోని తిమ్మాపూర్, గో ధూర్, ఇబ్రహీంపట్నంలో కొనుగొలు కేంద్రాలను పరిశీలించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలన్నారు. రైతులు తమ ట్రాక్టర్ల ద్వారా ధాన్యాన్ని తరలిస్తే కిరాయి చెల్లిస్తామని తెలిపారు. అకాల వర్షాలు ఉన్నందున నిర్వాహకులు గన్నీ సంచులు, టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. రైతులు చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద ఉండకూడదని పేర్కొన్నారు. -
వీఎల్టీ స్థలం.. కమిషనర్‌కు గండం
కోరుట్ల: ఏదైనా స్థలానికి వేకెంట్ ల్యాండ్ టాక్స్ (వీఎల్టీ) వేయాలంటే ఆ స్థలానికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ తప్పకుండా ఉండాలి. స్థలం చుట్టూ హద్దులు చూపే రీతిలో కనీసం బేస్మెంట్.. అర్జీ దారుడిదే అని ధ్రువీకరించేందుకు చిన్నపాటి షెడ్డు చూపాలి. అన్నీ పరిశీలించాక.. నియమిత స్థలానికి మాత్రమే వీఎల్టీ కేటాయించాల్సి ఉంటుంది. కా నీ.. ఇవన్నీ పక్కనపెట్టి.. ఎలాంటి ధ్రువీకరణ లేకు న్నా.. ఓ వీలునామా ఆధారంగా హద్దులు లేని స్థలానికి ఆనుకుని గతంలో ఎప్పుడో ఇళ్లు ఉన్నాయ ని చెప్పి వీఎల్టీ నంబర్లు కేటాయించడం కోరుట్ల పట్టణంలో వివాదాస్పదంగా మారింది. ఈ వీఎల్ టీ కేటాయింపు వ్యవహారంలో మూడు రోజుల క్రితం బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్ రవీందర్ లెక్కలేని ఆరోపణలు ఎదుర్కొన్నారు. చివరికి కోరుట్ల నుంచి అర్ధాంతరంగా బదిలీపై వెళ్లారు. ఏమిటీ వివాదం.. కోరుట్ల పట్టణంలో చాళుక్యుల కాలం నాటి చారిత్రక కోటబురుజులు ఆనాటి ఖ్యాతికి ఆనవాళ్లుగా మిగిలాయి. అనంతరం కాలంలో సదరు కోట బురుజులకు ఆనుకుని ఉన్న సుమారు 14 వేల చదరపు గజాల స్థలం వారసత్వ సంపదగా నిర్ధారించి పురావస్తు శాఖ పరిధిలోకి తెచ్చారు. వందల ఏళ్లుగా ఆ బురుజులను ఆనుకుని ఉన్న స్థలంలో సుమారు 200 మీటర్ల మేర ఎలాంటి కట్టడాలకూ అనుమతి ఇవ్వలేదు. సదరు స్థలం తమకు వారసత్వంగా చెందుతుందని, ఆ స్థలంలో తమకు ఇదివరకు గడీలు, ఇళ్లు ఉండేవని వాటిని అమ్మేందుకు కొంతమంది ప్రయత్నాలు సాగించారు. వాటిలో కొంతభాగం అమ్మకాలు కూడా జరిగాయి. పురావస్తు శాఖ ఉత్తర్వులు అమల్లో ఉన్న క్రమంలో మున్సిపల్ నుంచి నిర్మాణాలకు అనుమతి రాలేదు. సుమారు 12 ఏళ్ల క్రితం గడి బురుజుల స్థలంలో అమ్మకాలు జరిగాయి. ఆ అమ్మకాలపై అప్పుడే వివాదం మొదలైంది. హైకోర్టుకు వివాదం కోరుట్ల కోట బురుజుల స్థలం వారసత్వ సంపద అని పేర్కొంటూ అప్పటి కౌన్సిలర్ ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో పిటిషనర్ సరైన ఆధారాలు సమర్పించకపోవడం.. పురా వస్తు, రెవెన్యూ అధికార యంత్రాంగం సదరు స్థలా న్ని తమదిగా చూపడంలో ఉదాసీనంగా వ్యవహరించడంతో పరిస్థితి చేజారింది. ఎనిమిది నెలల క్రితం సదరు స్థలంలో కోట బురుజులు మినహా మిగిలిన స్థలం అంతా వారసులకే చెందుతుందని హెరిటేజ్ డిపార్ట్మెంట్ ఉత్తర్వులు జారీ చేసి వారసులకు ఆస్తిపై హక్కును ధ్రువీకరించింది. బురుజ ల నిర్మాణం ఉన్న పరిసరాల్లో 15 ఫీట్లు మినహా యించి మిగిలిన స్థలం అంతా వారసులదే అని ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో సదరు ఆస్తి వారసులు కోట బురుజుల ఆబాదిలో ఉన్న ఆ స్థలం అమ్మకాలకు యత్నించారు. సదరు స్థలం రిజిస్ట్రేషన్ కోసం అమ్మకానికి వీఎల్టీ వేసుకోవడం తప్పనిసరి అయింది. గతంలో ఉన్న తమ గడీలు, ఇళ్లకు సంబంధించిన మూడు ఇంటి నంబర్లను ఆసరాగా చేసుకుని కోరుట్ల మున్సిపల్ అధికారులు వేలాది గజాల స్థలానికి వీఎల్టీ నంబర్లు వేశారు. ఈ వీఎ ల్టీల కేటాయింపునకు ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేకపోవడం వివాదాస్పదంగా మారింది. ఈ స్థలం ఖాళీగా ఉన్న సమయంలో మహిషాసుర మర్ధన కార్యక్రమానికి వేదికగా మారడం, దగ్గరలోనే ఉన్న కూరగాయల మార్కెట్ రోడ్డుపై ఉండటం, అందుబాటులో పార్కులు లేకపోవడంతో కో ట బురుజుల స్థలాన్ని ప్రజోపయోగానికి వినియోగించాలన్న డిమాండ్ వచ్చింది. ఈ డిమాండ్‌తో అఖిలపక్షాలు సుమారు మూడు నెలలుగా వివిధ రకాల నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నాయి. లెక్కలేని ఫిర్యాదులు.. నేడు విచారణ అఖిలపక్షాలు, స్థానికులు కొందరు కొందరు గడి స్థలంలో అక్రమంగా వేసిన వీఎల్టీలు రద్దు చేయాలని ఉద్యమాలు చేపట్టారు. బీజేపీ కౌన్సిలర్లు కలెక్టర్, ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో గడీ స్థలాలకు వీఎల్టీలు ఎలా వేశారన్న అంశంపై ఆర్డీవో జీవాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో గురువారం విచారణకు రంగం సిద్ధమైంది. తప్పుడు రీతిలో వేసిన వీఎల్టీల విషయంలో అధికార యంత్రాంగం విచారణ ఎలాంటి ఫలితం ఇస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది. తప్పుడు వీఎల్టీలకు కారణమైన బదిలీ అయిన మున్సిపల్ కమిషనర్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. గడీ స్థలం ప్రస్తుతం పట్టణ మధ్యభాగంలో ఇళ్ల మధ్య ఉంది. దీంతో సదరు స్థలం విలువ గజానికి రూ.15వేల వరకు పలుకుతోంది. దీనిపై స్థానిక భూమాఫియా కన్నేసి తక్కువ ధరకు చేజిక్కించుకునేందుకు యత్నాలు చేశాయి. ఈ క్రమంలో మళ్లీ గడి స్థలాల భూమిలో కొనుగోళ్లు.. నగదు లావాదేవీలు సాగినట్లు సమాచారం. ఎవరికి వారు అందినంత మేర దండుకునే యత్నాలకు శ్రీకారం చుట్టడం వివాదానికి దారి తీసింది. మున్సిపల్ అధికారులు ఈ విషయంలో చేతివాటం చూపారన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వచ్చాయి. గడి స్థలంపై భూ మాఫియా.. -
మీ హయాంలో జరిగిన హత్యలకు మీదే బాధ్యతా?
కరీంనగర్ కార్పొరేషన్: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన న్యాయవాదుల జంట హత్యలు, దొంగతనాలు, ఇతర నేరాలకు కేసీఆర్, కేటీఆర్‌లే బాధ్యులో చెప్పాలని మంత్రి అడ్లూరి లక్ష్మ ణ్‌కుమార్ డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిన జువెల్లరీ షాప్‌ను మంగళవారం సందర్శించారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. ఆర్అండ్బీ అతిథిగృహంలో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలకు సీఎం రేవంత్‌రెడ్డికి ముడిపెట్టే నీచస్థితికి కేటీఆర్ దిగజారారని ధ్వజమెత్తారు. డ్రగ్స్ ఎడిక్ట్ అయి, ఫామ్‌హౌజ్‌లో గడుపుతున్న విలాసవంతమైన కేటీఆర్ జీవితాన్ని ప్రజలకు తెలియచేసేందుకు డ్రోన్‌కెమెరాలతో చిత్రీకరిస్తే రేవంత్‌ను జైలుకు పంపించారన్నారు. అప్పుడు అక్రమంగా అరెస్ట్ చేసి, ఇప్పుడు దొంగలతో సంబంధాలు అంటగడుతున్నారన్నారు. 2014 నుంచి 2023 వరకు జరిగిన హత్యలు,దోపిడీ, దొంగతనాలకు అప్పటి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కారణమా..? చెప్పాలన్నారు. జువెల్లరీ దొంగతనం జరిగితే హుటాహుటిన వచ్చిన కేటీఆర్, తమ ప్రభుత్వ హయాంలో నేరెళ్ల, కొండగట్టు బాధితులను ఎందుకు పరామర్శించలేదన్నారు. దొంగలను పట్టుకొనేందుకు 15 ప్రత్యేక బందాలను ఏర్పాటు చేశామని, నేరస్తులను పట్టుకోవడానికి ఇతర రాష్ట్రాల పోలీసుల సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మొగోడైతే కాళేశ్వరం కేసులో కేసీఆర్‌కు సీబీఐ నోటీసులు ఇప్పించాలని లక్ష్మణ్‌కుమార్ సవాల్ విసిరారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్, అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు, పడిశెట్టి భూమయ్య, ఆకుల నర్సయ్య, ఆకుల ఉదయ్, మహమ్మద్ అమీర్, అబ్దుల్ రెహమాన్, మహమ్మద్ ఇమ్రాన్ పాల్గొన్నారు. -
లాభదాయక పంటలు సాగు చేయాలి
● ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు లాభదాయక పంటలు సాగు చేసి.. మంచి ఆదాయం పొందాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్యానపంటలపై సదస్సు నిర్వహించారు. రైతులు పండించడంతోపాటు మార్కెటింగ్ నైపుణ్యాన్ని అలవర్చుకోవాలన్నారు. వాట్సాప్, ఫేస్బుక్ వంటి సోషల్‌మీడియాను ఉపయోగించుకుని ఉత్పత్తులను అమ్ముకునే స్థాయికి ఎదగాలన్నారు. దొడ్డు రకం ధాన్యం తగ్గించి సన్నాలు సాగు చేయాలని సూచించారు. జిల్లా ఉద్యాన శాఖ అధికారి లత, ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నారాయణ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ స్వాతి, ప్రత్యేక అధికారి రమేశ్ పాల్గొన్నారు. హిందువుల్లో ఐక్యత పెరగాలి రాయికల్: హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం చిరకాలం వర్ధిల్లుతుందని ఆర్ఎస్ఎస్ జిల్లా సహ కార్యవాహ్ సాయి మధుకర్ అన్నారు. మంగళవారం రాయికల్ మండలం ఇటిక్యాలలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. గ్రామంలో సామూహిక భజన, గోపూజ, హనుమా న్ చాలీసా పారాయణం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్కరూ గోమాతను పూజించాలని, గోవులో సర్వదేవతలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో స ర్పంచ్ నీరటి శ్రీనివాస్ హిందువులు పాల్గొన్నారు. -
45.3 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో మంగళవారం 45.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. రాయికల్ మండలం అల్లీపూర్లో 45.3, బీర్పూర్ మండలం కొల్వాయి, ఇబ్రహీంపట్నం గోదూరులో 45, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 44.7, రాయికల్‌లో 44.6, ధర్మపురి మండలం జైనలో 44.4, కోరుట్ల మండలం అయిలాపూర్, ధర్మపురి మండలం నేరెళ్లలో 44.3, ఎండపల్లి, మెట్పల్లిలో 44.2, మేడిపల్లిలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్కథలాపూర్: కథలాపూర్ అటవీశాఖ సెక్షన్ ఆఫీసర్ ఎండీ.ముస్తాక్అలీని సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మండలంలో బీట్ ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉండటంతో సెక్షన్ ఆఫీసర్కే బీట్ ఆఫీసర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ క్రమంలో కొన్ని నెలలుగా అటవీశాఖలో వివాదం చోటుచేసుకుంటోంది. ఈ విషయంలోనే ముస్తాక్‌అలీ అసంతృప్తితో అనుమతి లేకుండా 19 రోజులు సెలవుపై వెళ్లారు. దీనిని సీరియస్‌గా తీసుకున్న ఉన్నతాధికారులు అలీని సస్పెండ్ చేశారు. ఆయన స్థానంలో కుమ్మరి పూర్ణిమ బాధ్యతలు తీసుకున్నారు. ఈమె అటవీ శాఖ జిల్లా మొబైల్ పార్టీలో సెక్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. క్షయ నివారణకు కృషిచేయాలిగొల్లపల్లి: క్షయ నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. గొల్లపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం డిజిటల్ మొబైల్ ఎక్స్‌రే మిషన్‌తో క్షయ నిర్ధారణ వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, ఆకలి లేకపోవడం వంటి లక్షణాలు ఉంటే తెమడ పరీక్షలు చేయించుకోవాలన్నారు. సుమారు 72 మందికి పరీక్షలు చేశారు. కార్యక్రమంలో మండల వైద్యాధికారి శ్రీకాంత్, పర్యవేక్షకులు నరేందర్, ఎస్టీస్ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్స్ వికాస్, రాజీవ్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరించిన కోరుట్ల మున్సిపల్ కమిషనర్కోరుట్ల: కోరుట్ల మున్సిపల్ కమిషనర్‌గా ఎం.శ్రీనివాస్‌రావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ ఉద్యోగులు కమిషనర్‌కు స్వాగతం పలికారు. అనంతరం తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. అధికారులను, సిబ్బందిని పరిచయం చేసుకున్నారు. గల్ఫ్ కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషిజగిత్యాలరూరల్: ఇండియా, ఖతర్ లేబర్ మైగ్రేషన్ కారిడార్‌లో ఇరుదేశాల్లో సంఘాల సమన్వయంతో కార్మికుల సమస్యలు పరిష్కరించనున్నట్లు తెలంగాణ ప్రవాసీ మిత్ర లేబర్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు మంద భీంరెడ్డి తెలిపారు. మంగళవారం ఖతర్ నుంచి ‘సాక్షి’తో మాట్లాడారు. వలస కార్మికుల సమస్యల పరిష్కారానికి బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బీడబ్ల్యూఐ) ప్రపంచ కార్మిక సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో గ్లోబల్ ఆర్గనైజింగ్ అకాడమీ, ఆసియా పసిఫిక్ అనే సంస్థ ఈనెల 4, 5 తేదీల్లో ఫిలిప్పీన్స్‌లోని మనీలాలో కార్మిక సంఘాల ప్రతినిధులకు రెండు రోజుల శిక్షణ ఇచ్చిందన్నారు. 10 దేశాల్లో 22 అనుబంధ సంస్థల నుంచి 42 మంది పాల్గొన్నారని పేర్కొన్నారు. ఖతార్‌లోని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు పాల్గొని స్వ దేశం, విదేశంలో పనిచేసే రెండు వేర్వేరు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే.. వలస కా ర్మికుల సమస్యలను వేగంగా, సులువుగా పరి ష్కరించవచ్చని సూచించినట్లు పేర్కొన్నారు. -
ఏసీబీ సోదాల కలకలం
జగిత్యాల: కలెక్టరేట్లోని జిల్లా సంక్షేమాధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటలకు ఏసీబీ అధికారుల బృందం చేరుకుంది. డీఎస్పీ విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో ముగ్గురు సీఐలు, ఆరుగురు సిబ్బంది సోదాలు చేపడుతున్నారు. సోదాలకు మరింత సమయం పట్టే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని డీఎస్పీ తెలిపారు. అవినీతి ఆరోపణలపైనేనా..! సంక్షేమ శాఖ కార్యాలయంలో అవినీతి చోటుచేసుకుందన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. గతంలో అంగన్వాడీ టీచర్లు కొందరు ఆ శాఖ అధికారులపై ఫిర్యాదు చేసిన విషయం తెల్సిందే. గతంలో పనిచేసిన అధికారులపైనా ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అధికారుల లావాదేవీలను పరిశీలించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ శాఖ పరిధిలో పనిచేస్తున్న కొందరు ఉద్యోగులు నేరుగానే ఉన్నతాధికారులపైనే ఫిర్యాదు చేశారు. గతంలోనే అధికారులు విచారించారు. తాజాగా ఏసీబీ అధికారులు పూర్తిస్థాయిలో తనిఖీలు చేపట్టారు. పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ విషయంపై డీఎస్పీని వివరణ కోరగా.. తనిఖీల్లో భాగంగానే సోదాలు చేశామన్నారు. నాడు మున్సిపాలిటీ.. నేడు సంక్షేమ శాఖ కార్యాలయం ఇటీవల ఏసీబీ అధికారులు సుమారు 15 మంది మున్సిపల్ కార్యాలయంలో సుమారు 10 గంటలకు పైగానే సోదాలు నిర్వహించారు. ప్రతి శాఖలోని రికార్డులను పరిశీలించి అందులో జరిగిన అవినీతి, అక్రమాలను వెల్లడించారు. రికార్డులను ఉన్నతస్థాయి అధికారులకు పంపించారు. తాజాగా జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించడంతో అధికారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఇటీవల అందులో పనిచేస్తున్న ఓ అధికారిని కలెక్టర్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఒకవేళ అవినీతి అక్రమాలు బయటపడితే మరింతమందిపై వేటు పడే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. -
రాష్ట్రంలో ప్రజావంచన పాలన
జగిత్యాలటౌన్: రాష్ట్రంలో ప్రజావంచన పాలన సాగుతోందని, ధాన్యం సేకరణపై రైతులు రోడ్డెక్కితేగానీ ప్రభుత్వంలో చలనం రాకపోవడమే ఇందుకు నిదర్శనమని మాజీమంత్రి, బీఆర్ఎస్ రాష్ట్రప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి మండిపడ్డారు. ప్రజాపాలన పేరుతో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలను వంచిస్తుంటే చూస్తూ ఉండలేక, రైతు బంధు, రైతు రుణమాఫీ వంటి పథకాలు అమలు చేయని రేవంత్ ప్రభుత్వాన్ని సమర్థించలేక కాంగ్రెస్ పార్టీ నుండి బయటకు వచ్చానని అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ధాన్యం సేకరణపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి ముందస్తు ప్రణాళిక లేకపోడంతోనే జిల్లాలో కొనుగోళ్లు జరగడం లేదన్నారు. జిల్లాలోని పలుచోట్ల ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడమే ఇందుకు నిదర్శనమన్నారు. మొక్కజొన్న కొనుగోలు చేసి వారం రోజులు గడుస్తున్నా తరలించడంలో అధికారులు అలసత్వం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రైతులు రేవంత్‌రెడ్డిని నమ్మబోరని తెలిసే రైతాంగ సమస్యలపై రాహుల్‌గాంధీతో వరంగల్ డిక్లరేషన్‌లో హామీలు ఇప్పించారని, ఆ హామీలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేయడం లేదని అన్నారు. రుణమాఫీ సగం ఎగ్గొట్టారని, ప్రభుత్వం 25శాతం ప్రీమియం చెల్లించకపోవడంతో రాష్ట్రంలో పంటల బీమా అమలుకు నోచుకోవడంలేదన్నారు. పూడూరు రైతు ధర్నాతో జిల్లా మంత్రి ధాన్యం కొనుగోలుపై సమీక్షా సమావేశం నిర్వహించడాన్ని స్వాగతిస్తున్నామని, సమీక్షతోనే సరిపెట్టకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. పక్కనే ఉన్న నిజామాబాద్ జిల్లాలో 7లక్షల మెట్రిక్ టన్నులకు గాను ఇప్పటికే 4లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారని జగిత్యాల జిల్లాలో మాత్రం ఇప్పటికీ 5శాతం మించి కొనుగోళ్లు కూడా జరగలేదన్నారు. ఉన్నమాటంటే కాంగ్రెస్ నాయకులు ఉలిక్కిపడుతన్నారని అన్నారు. తమపై ప్రతి విమర్శలు మానుకుని ఎఫ్‌సీఐ నిబంధనల మేరకు కొనుగోళ్లు జరపాలని, కొనుగోలు చేసిన 24గంటల్లో ధాన్యాన్ని తరలించాలని కోరారు. గోదాం సౌకర్యం లేని పక్షంలో ఎక్కడికక్కడ నెట్టింగ్ వేయాలో కలెక్టర్ చర్యలు చేపట్టాలని కోరారు. అంతకు ముందు జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత, మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ ప్రజాసంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్నారు. జీవన్‌రెడ్డి లేకుంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ ఉండేది కాదన్నారు. అలాంటి జీవన్‌రెడ్డిపై చోటామోటా నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో హరిచరణ్‌రావు, గాజుల రాజేందర్, దేవేందర్‌నాయక్, సాగర్‌రావు, కల్లెపెల్లి దుర్గయ్య, నేహాల్ తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ముందుచూపులేని సర్కారు జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వానికి ముందుచూపు లేదని, కేంద్రాల వద్ద రైతుల పడిగాపులు కాస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సారంగాపూర్ మండలం బట్టపల్లిపోతారం గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంగళవారం పరిశీలించారు. నెలరోజులుగా కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా.. ధాన్యం తూకం వేయడం లేదన్నారు. తేమశాతం పడిపోయి ధాన్యం బరువు తగ్గే అవకాశం ఉందని, తద్వారా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పేర్కొన్నారు. హమాలీల కొరత లేకుండా చూసుకుని కొనుగోళ్లు వేగవంతం చేయాలని కోరారు. జిల్లా వ్యవసాయాధికారితో ఫోన్లో మాట్లాడారు. నాయకులు సత్యంరావు, రాంచందర్‌రెడ్డి, మధు, సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు. రైతాంగం రోడ్డెక్కితేగాని ప్రభుత్వానికి సోయి లేదు ధాన్యం సేకరణలో ప్రభుత్వానికి ఎలాంటి ప్రణాళికా లేదు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి -
దొంగల బస!
ధర్మపురిలో సాక్షిప్రతినిధి,కరీంనగర్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కరీంనగర్ పీఎంజే జువెల్లరీస్‌లో భారీ దోపిడీ కేసులో పోలీసులు దర్యాప్తులో పురోగతి సాధించారు. ఈ నెల ఒకటిన జగిత్యాల జిల్లా ధర్మపురిలోని విజయ లక్ష్మి లాడ్జిలో బసచేసి, కరీంనగర్లో చోరీ అనంతరం 3వ తేదీన లాడ్జి ఖాళీచేశారు. అంతకన్నా ముందు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోనూ బసచేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇది ఇలాఉంటే దొంగలు వినియోగించిన నల్లరంగు పల్సర్ (220 సీసీ), హెల్మెట్‌ను ధర్మపురి గోదావరి తీరంలోని ఇటుకబట్టీల సమీపంలో మంగళవారం ఉదయం కనుగొన్నారు. టీఎస్ 08 ఎఫ్జీ 6876 నంబరు ప్లేటుతో ఉన్న ఈ బండిని దుండగులు చోరీ కోసం వినియోగించిందేనని ధ్రువీకరించారు. కానీ.. ఈ బైకుది ఫేక్ నంబరు ప్లేటుగా పోలీసులు తేల్చారు. హైదరాబాద్‌లోని ముషీరాబాద్‌కు చెందిన రమేశ్ అనే వ్యక్తికి చెందిన కారుదిగా గుర్తించారు. బండి చాసీస్ నంబరు ఆధారంగా ప్రయత్నించినా.. దాన్ని కూడా ముందే ధ్వంసం చేయడంతో బైకులను సెకండ్ హ్యాండ్లో కొన్నారా? లేక ఎత్తుకొచ్చారా? అన్న విషయంపై ఇంకా స్పష్టత రా లేదు. చోరీ కోసం వినియోగించిన మరో బైకు అపాచీ(తెలుపు) ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. దానికి పెట్టిన నంబరు ప్లేట్ కూడా ఫేక్‌గానే భావిస్తున్నారు. -
హనుమాన్ పెద్ద జయంతిని విజయవంతం చేద్దాం
మల్యాల: హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలను అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చో టుచేసుకోకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ బి. సత్య ప్రసాద్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. ఈనెల 10 నుంచి 12 వరకు కొండగట్టు శ్రీఆంజనేయస్వామి జయంతి ఉత్సవాల నేపథ్యంలో మంగళవారం వివిధ శాఖల అధికారులు, పోలీసులతో సమీక్షించారు. భక్తులు పెద్ద ఎత్తు న తరలివచ్చే అవకాశం ఉందని, పకడ్బందీ ఏర్పా ట్లు చేయాలని సూచించారు. కోనేరు, ఆలయ పరి సరాల్లో పరిశుభ్రత, ప్రథమ చికిత్స కిట్లు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచుకోవాలని, తాగునీటి వసతి కల్పించాలని పేర్కొన్నారు. మెట్లదా రిలో లైటింగ్, ప్రత్యేక ఆరోగ్య కేంద్రాలు, తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేయాలన్నారు. వాహనాల పార్కింగ్ సదుపాయం, ట్రాఫిక్ నియంత్రణకు ప్ర త్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆలయ పరిసరాల్లో పారిశుధ్యం నిర్వహణకు అదనపు సిబ్బందిని కేటాయించాలన్నారు. ఆలయ ఈవో అంజనా రెడ్డి, ఆర్డీవో మధుసూదన్, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి, ఎంపీడీఓ స్వాతి, తహసీల్దార్ శ్రీనివాస్, సీఐ నీలం రవి, ఎస్సై నరేశ్‌కుమార్, అధికారులు పాల్గొన్నారు. ధాన్యాన్ని త్వరగా మిల్లులకు చేర్చాలిధాన్యం తూకం వేసి త్వరిగతిన మిల్లులకు తరలించా లని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మండలకేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. తేమశాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేయాలని, రైతులు ఇబ్బంది రానీయొద్దని సూచించారు. -
ధాన్యం కొను‘గోల్’కు సర్వం సిద్ధం
బీజేపీ సంబరాలుజగిత్యాలటౌన్: సోమవారం వెలువడిన ఐదు రా ష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో మూడు రాష్ట్రాల్లో బీజేపీ విజయం సాధించడంతో బీజేపీ నాయకులు జగిత్యాల తహసీల్దార్ చౌరస్తాలో బాణాసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. మోదీ సంక్షేమ పాలనకు స్వాగతం పలికిన బెంగాల్ ప్రజలు మమత పాలనకు చెరమగీతం పాడారని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.మంత్రి లక్ష్మణ్కుమార్జగిత్యాలరూరల్: జిల్లాలో రబీ వరిధాన్యం కొనుగోళ్లకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్నిచోట్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. జిల్లాలో 439 కొనుగోలు కేంద్రాల ద్వారా 4.60 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించనున్నారు. జిల్లావ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం కావడంతో కొనుగోలు కేంద్రాలను ఒక్కొక్కటిగా ప్రారంభిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఐకేపీ కొనుగోలు కేంద్రాలపై ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లాలో ప్రతి రైతు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారులు ఇప్పటికే ప్రణాళిక రూపొందించారు. కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తీసుకొచ్చిన వెంటనే తేమ శాతాన్ని పరిశీలించిన తర్వాత కొనుగోలు చేస్తారు. తూకం వేసేందుకు ప్రతి సెంటర్‌కు ఎలక్ట్రానిక్ కాంటా, తేమ శాతాన్ని పరిశీలించేందుకు మీటర్, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లను సిద్ధంగా ఉంచారు. తప్పతాళ్లు లేకుండా క్లీన్ చేసేలా ప్యాడీ క్లీనర్లను ఏర్పాటు చేశారు. 76 మిల్లర్లకు ధాన్యం కేటాయింపు ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని తరలించేందుకు 76 రైస్‌మిల్లులను కేటాయించారు. మిగతా కొన్నింటికి ధాన్యం సేకరణను దృష్టిలో ఉంచుకుని కేటాయింపు చేసే అవకాశాలున్నాయి. తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేలా ఏర్పాట్లు చేయడంతోపాటు, మిల్లుల్లో కూడా వెంటనే ధాన్యాన్ని అన్లోడ్ చేసేలా మిల్లర్లకు హమాలీల కొరత లేకుండా చూసుకోవాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. తేమశాతం ఉన్న ధాన్యాన్ని తీసుకొచ్చేలా అవగాహన రైతులు పండించిన ధాన్యాన్ని పొలం నుంచి నేరుగా కొనుగోలు కేంద్రానికి కాకుండా ధాన్యాన్ని ఆరబెట్టి తేమశాతం వచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని ఇప్పటికే మహిళా సంఘాల ద్వారా వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా రైతులకు అవగాహన కల్పించారు. నేరుగా రైతులు కొనుగోలు కేంద్రానికి తీసుకువస్తే ధాన్యం ఆరబెట్టడంలో ఇబ్బందులు తలెత్తుతాయని రైతులకు తేమశాతం వచ్చిన ధాన్యాన్నే సెంటర్లోకి తీసుకురావాలని అవగాహన కల్పిస్తున్నారు. -
గంట ముందే స్పాట్‌కు!
సాక్షిప్రతినిధి, కరీంనగర్: నగరంలోని పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఎలాంటి బెరుకూ లేకుండా ఉదయాన్నే భారీ దోపిడీ చేసి, యథేచ్ఛగా పారిపోయిన వైనాన్ని సవాలుగా తీసుకున్నారు. దొంగల సంచారం, కదలికలు, వారి చిరునామా, నేరచరితపై కీలక సమాచారం సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు నాలుగు ప్రత్యేక బృందాలను మహారాష్ట్ర, బిహార్‌కు పంపినట్లు సమాచారం. మరికొంతమంది పోలీసులు సీసీ ఫుటేజీలను విశ్లేషిస్తున్నారు. వారి ఫొటోల ఆధారంగా క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ సిస్టమ్ (సీసీటీఎన్ఏ) సాయంతో నిందితులను ఇప్పటికే గుర్తించినట్లు తెలిసింది. నిందితుల్లో ఒకరు పుణే, మరొకరు నందూర్బర్ జిల్లాలతో పాటు బిహార్‌కు చెందిన వారిగా గుర్తించినట్లు సమాచారం. సీసీ ఫుటేజీని ‘రివర్స్ మేనర్’(ఎలా వచ్చారు? అన్న విజువల్స్)లో విశ్లేషించినప్పుడు దొంగలంతా దోపిడీకి కేవలం గంట ముందే కరీంనగర్‌కు వచ్చినట్లు రికార్డు అయ్యింది. అంటే ముందు రోజు ఎక్కడా బస చేసిన దాఖలాలు లేవు. కొంతకాలంగా రెక్కీ నిర్వహించి, పారిపోయేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టే నింపాదిగా వచ్చారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. మహారాష్ట్ర బ్యాగే పట్టిస్తోంది..? చోరీ సమయంలో నిందితుల్లో ఒకరి బ్యాగు కీలకంగా మారింది. ఆ బ్యాగుపై ‘ఐ లవ్ నందూర్బర్’ అని రాసి ఉంది. నందూర్బర్ ఉత్తర మహారాష్ట్రకు చెందిన జిల్లా. గుజరాత్ సరిహద్దులో ఉంటుంది. నిందితుల్లో మరొకరు పుణే జిల్లాలో నేరచరిత కలి గిన పఠాన్‌గా గుర్తించినట్లు తెలిసింది. మహారాష్ట్రకు పారిపోవాలంటే పెద్దపల్లి, మంథని మీదుగా వెళ్లవచ్చు. కానీ.. ఆ మార్గంలో ట్రాఫిక్, చెక్‌పోస్టులు ఎక్కువ. అందుకనే చోరీ అనంతరం శాతవాహన యూనివర్సిటీ, మల్కాపూర్, రామడుగు, లక్ష్మీపూ ర్, రుద్రారం, గుండి, పెగడపల్లి, జగిత్యాల మీదుగా మహారాష్ట్ర వైపు వెళ్లినట్లుగా సీసీ ఫుటేజీని పోలీసులు సంపాదించారు. ప్రధాన రహదారుల వెంట వెళ్తే సులువుగా పట్టుబడతామని, పోలీసుల కళ్లు గప్పేందుకు గ్రామీణ రహదారిని ఎంచుకున్నారు. వీరిని పట్టుకునేందుకు నాలుగు బృందాలు ఆదివారం సాయంత్రం మహారాష్ట్ర, బిహార్‌కు బయల్దేరాయి. మరో నాలుగు బృందాలు (ఒక్కో బృందంలో నలుగురు చొప్పున సభ్యులు) కరీంనగర్ నుంచి జగిత్యాల మీదుగా మహారాష్ట్ర, బీహార్, ఇటువైపు హైదరాబాద్ వరకు వందలాది సీసీ కెమెరాల ఫుటేజీని వడపోస్తున్నారు. నిందితులు వాడిన అపాచీ, పల్సర్ బైకు నంబర్లు స్పష్టంగా లేకపోవడంతో గుర్తింపు కష్టంగామారింది. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లినట్టే వెళ్లి దారిమార్చి, వాహనాలనూ మార్చినట్లు పోలీసులు గుర్తించారు. కేసును సవాలుగా తీసుకున్న పోలీసులు సాంకేతిక పరిజ్ఞాన్ని విస్తృతంగా వాడుతున్నారు. నిందితుల ఫొటోల ఆధారంగా నేషనల్ ఇంటిగ్రేటెడ్ గ్రిడ్ (నాట్‌గ్రిడ్) సాఫ్ట్వేర్ సాయంతో వారి నేరచరిత, ఎఫ్ఐఆర్, జైలు జీవితం, ఫోన్‌నంబర్లు తదితర వ్యక్తిగత వివరాలతో సహా కీలక అంశాలను ఇప్పటికే సేకరించారు. బందిపోట్లు, కరుడుగట్టిన నేరస్తులు, ఉగ్రవాదుల డేటాను నాట్గ్రిడ్లో పొందుపరుస్తారు. ఇది తిరిగి సీసీటీఎన్‌ఎస్‌తో అనుసంధానంగా ఉంటుంది. ఈ డేటాబేస్‌ను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ), రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (ఆర్ఏడబ్ల్యూ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తదితర జాతీయ దర్యాప్తు సంస్థలు వినియోగిస్తాయి. గతేడాది నుంచి ఈ డేటాబేస్ ఎస్పీ ర్యాంకు ఆఫీసర్లకు ఉగ్రవాద, ఇతర కీలక కేసుల్లో దర్యాప్తు కోసం యాక్సెస్ కల్పించారు. వచ్చిన వారు ఉగ్రవాదులు అయి ఉంటారన్న అంశాన్ని పోలీసులు కొట్టిపారేయకపోవడం గమనార్హం. నిందితులు వచ్చిన మార్గంలోని అన్ని సెల్టవర్ల పరిధిలో అనుమానిత సెల్‌ఫోన్ సంభాషణల కోసం డంప్ (సెల్ టవర్ నుంచి వెళ్లిన కాల్స్ వివరాలు)ను సీడాట్ పద్ధతిలో జల్లెడ పడుతున్నారు. ఇందులోనూ కొన్ని అనుమానిత నంబర్లను పోలీసులు గుర్తించారు. ఆ నంబర్ల సంచారం ఆధారంగానే పోలీసులు దొంగలను వెంటాడుతూ వెళ్లారని సమాచారం. చోరీ అనంతరం దొంగలు ఆ నంబర్లను మార్చడం గమనార్హం. -
పెద్ద చెరువులో హక్కులు కల్పించాలి
మెట్పల్లి డివిజన్ కోనరావుపేట కోండ్రిక్యాల పెద్ద చెరువులో చేపలు పట్టుకునే హక్కులు తమకే కల్పించాలని గ్రామానికి చెందిన గంగపుత్రులు కలెక్టరేట్ ప్రాంగణంలోని తెలంగాణ తల్లి విగ్రహం బైఠాయించి నిరసన తెలిపారు. అనంతరం తమ హక్కులు కాపాడాలంటూ కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. 44 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కోనరావుపేట కోండ్రిక్యాల చెరువును వంద ఎకరాలుగా చూపిస్తూ స్థానికేతరులకు మత్స్య సొసైటీలో సభ్యత్వం కల్పించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. నిధుల దుర్వినియోగంపై విచారణ జరపండి బుగ్గారం మండలం మద్దునూర్ గ్రామపంచాయితీ కార్యాలయంలో గత పాలకవర్గం, ప్రత్యేక అధికారి పాలనలో జరిగిన నిధుల దుర్వినియోగం, అవకతవకలపై విచారణ జరపాలని డీపీవో, కలెక్టర్, రాష్టపంచాయతీరాజ్ కమిషనర్లను మేకల అక్షయ్‌కుమార్ కోరారు. దీనిపై పలుమార్లు ఫిర్యాదు చేసినా ఎలాంటి విచారణ చేపట్టలేదన్నారు. విచారణ జరిపి అవినీతికి పాల్పడిన పాలకవర్గం, ప్రత్యేక అధికారులతో పాటు ఫిర్యాదులపై స్పందించని జిల్లా పంచాయితీ అధికారిపై కూడా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ధాన్యం నిల్వకు గోదాంలు కేటాయించాలి
జగిత్యాల: జిల్లాలో రబీ సీజన్లో రైతులు పండించిన ధాన్యం నిల్వ చేసేందుకు సిరిసిల్లలోని అపరల్ పార్క్‌లో ఉన్న గోదాంలు కేటాయించాలని పౌర సరఫరాల శాఖ మంత్రిని సోమవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ కోరారు. జిల్లాలో గత ఖరీఫ్ సీజన్లో రైతుల వద్ద ప్రభుత్వం సేకరించిన ధాన్యం సుమారు 3.50 లక్షల మెట్రిక్ టన్నులు రైస్‌మిల్లుల్లో నిలిచిపోయిందన్నారు. మళ్లీ సుమారు 5లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని అన్నారు. ధాన్యం కొనుగోళ్లు ప్రారంభమైన నేపథ్యంలో ధాన్యం నిల్వ చేసేందుకు స్థలం లేక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని, గోదాంలు కేటాయించాలని కోరారు. -
మొబైల్ ఫోన్లతో కాలక్షేపం
జగిత్యాలటౌన్: క్షేత్రస్థాయిలో పరిష్కారం దొరకని సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేట్లో ప్రతీ సోమవారం నిర్వహించే ప్రజావాణి అధికారులకు ఆటవిడుపుగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. సమస్యలను పరిష్కరించాలని, సమయపాలన పాటించాలని కలెక్టర్ పలుమార్లు ఆదేశిస్తున్నా అధికారుల తీరు మారడం లేదు. సోమవారం నిర్వహించిన ప్రజవాణిలో కలెక్టర్ సత్యప్రసాద్ బాధితుల నుంచి అర్జీలు స్వీకరించే పనిలో నిమగ్నం కాగా, అధికారులు మాత్రం తమ మొబైల్ మునిగి తేలడం కనిపించింది. కొందరు రీల్స్ చూస్తుండగా, మరికొందరు ఫోన్లు మాట్లాడుతూ కనిపించారు. ఇంకొందరు ఫోన్లో చాటింగ్ చేస్తూ కనబడ్డారు. -
మహిళా సాధికారతకు కృషి
జగిత్యాలరూరల్: మహిళా సాధికారతకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సోమవారం జగిత్యాల అర్బన్ మండలం తిప్పన్నపేటలో రూ.10 లక్షలతో నిర్మించనున్న మహిళా సమైక్య భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. రాష్ట్రంలో మహిళలకు వడ్డీలేని రుణాలు అందిస్తూ వివిధ రంగాల్లో ప్రభుత్వం మహిళలకు భాగస్వామ్యం కల్పిస్తూ ప్రోత్సహిస్తుందన్నారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ దావ తిరుపతి, ఉప సర్పంచ్ మహేశ్, నాయకులు లక్ష్మీదామోదర్రావు, రవీందర్‌రెడ్డి, గంగాధర్, ఎంపీడీవో విజయలక్ష్మీ, తహసీల్దార్ రాంమోహన్, ఎంపీవో వాసవి, ఏపీఎం రాజయ్య పాల్గొన్నారు. నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూత నిరుపేదల వైద్యానికి ప్రభుత్వం చేయూతనందిస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. సారంగాపూర్ మండలం రేచపల్లికి చెందిన దుబ్బాక పెద్ద నర్సయ్యకి సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన రూ.1.50 లక్షల ఎల్వోసీని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, గర్వందుల గంగన్న పాల్గొన్నారు. నష్టాల్లో ఉన్నప్పటికీ కొనుగోలు చేస్తున్నాం జగిత్యాలఅగ్రికల్చర్: ప్రభుత్వ సంస్థలైన మార్క్‌ఫెడ్, సివిల్ సప్లయిలు నష్ట్రాల్లో ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు వరి, మొక్కజొన్న ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నామని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్‌లో సోమవారం నిర్వహించిన రైతు ముంగిట్లోకి శాస్త్రవేత్తలు కార్యక్రమంలో మాట్లాడారు. ఈ సందర్భంగా రైతులకు భూసార పరీక్ష కార్డులు అందించారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి భాస్కర్, వ్యవసాయ కళాశాల డీన్ సుజాత, శాస్త్రవేత్తలు రవి, రాకేశ్, ఉద్యాన శాఖాధికారిణి స్వాతి, మార్కెట్ చైర్మన్ నారాయణరెడ్డి, సర్పంచ్ నల్ల కవిత, ఉప సర్పంచ్ సత్తిరెడ్డి, ఏఈవో హరీశ్ పాల్గొన్నారు. -
కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించాలి
కొడిమ్యాల: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా నిర్వహించడం లేదంటూ రైతులు రోడ్డెక్కారు. కొడిమ్యాల మండలం పూడూరు చౌరస్తాలో సోమవారం జగిత్యాల–కరీంనగర్ జాతీయ రహదారిపై బైఠాయించారు. 43కిలోలు బదులు 40 కిలోలకే తూకం వేయాలని రోడ్డుపై వడ్లు పోసి నిరసన తెలి పారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి, చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ ఆధ్వర్యంలో దాదాపు రెండు గంటల పాటు జరిగిన ఆందోళనతో ఇరువైపులా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించింది. మహిళా రైతులపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో స్వల్ప తోపులాట జరిగింది. జీవన్‌రెడ్డి, రవిశంకర్‌లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో రేవంత్‌రెడ్డి పోవాలి కేసీఆర్ రావాలి అంటూ రైతులు నినాదాలు చేశారు. కలెక్టర్ వచ్చేంతవరకు ఆందోళన విరమించని పట్టుబట్టడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు తహసీల్దార్ సంఘటన స్థలానికి చేరుకొని రైతులతో చర్చించారు. రైతుల డి మాండ్ మేరకు 40 కిలోలకే తూకం వేసి, ఎలాంటి ఆంక్షలు లేకుండా ధాన్యం కొనుగోలు చేస్తామని రా తపూర్వకంగా హామీ ఇవ్వడంతో ఆందోళన విరమి ంచారు. ఈ సందర్భంగా జీవన్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు మద్దతు ధర చెల్లించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రవిశంకర్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లు ప్రారంభించి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకటేశ్, నాయకులు, మండల రైతులు పాల్గొన్నారు. -
45.7 డిగ్రీల ఉష్ణోగ్రత
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో సోమవారం 45.7 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. మల్లాపూర్ మండలం రాఘవపేటలో 45.7, ధర్మపురి మండలం బుద్దేశ్‌పల్లిలో 45.6, ఎండపల్లి మండలం గుల్లకోట, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 45.5, ధర్మపురి మండలం నేరేళ్లలో 45.4 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అలాగే రాయికల్ మండలం అల్లీపూర్, బీర్పూర్ మండలం కొల్వాయిలో 44.9, ధర్మపురి మండలం జైనాలో 44.8, మెట్పల్లిలో 44.6, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 44.5, సారంగాపూర్‌లో 44.4, మల్లాపూర్‌లో 44.3, కొడిమ్యాల మండలం పూడూర్లో 44.2, గొల్లపల్లిలో 44.0 డిగ్రీల చొప్పున నమోదయ్యాయి. జయంతి ఉత్సవాలకు రండిమల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో ఈనెల 10నుంచి 12వరకు నిర్వహించే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు రా వాలని మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌లకు ఆలయ అధికారులు, అర్చకులు ఆహ్వాన పత్రిక అందించారు. ఆలయ ఈవో అంజనారెడ్డి, ఉప ప్రధాన అర్చకులు చి రంజీవ స్వామి, వేద పండితులు పెద్దన్న శర్మ, సూపరిండెంట్ సునీల్‌కుమార్ పాల్గొన్నారు. బాధ్యతలు స్వీకరణజగిత్యాలక్రైం: జగిత్యాల డీఎస్పీగా నియమితులైన పురుషోత్తంరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎస్పీ రఘుచందర్ నూతన డీఎస్పీకి పుష్పగుచ్ఛం అందించి బాధ్యతలు అప్పగించారు. సహకార సంఘ చైర్మన్లకు నేటి నుంచి బాధ్యతలుజగిత్యాలరూరల్: రాష్ట్ర వ్యాప్తంగా సహకార సంఘాల చైర్మన్ల పదవీ కాలం పూర్తి కావడంతో గతంలో రాష్ట్ర ప్రభుత్వం వారి పదవీ కాలాన్ని కొద్దిరోజులు పొడిగించింది. వెంటనే ప్రభుత్వం వారి పదవీకాలాన్ని రద్దు చేస్తూ ప్రత్యేకాధికారులను నియమించారు. దీంతో సహకార సంఘ చైర్మన్లు హైకోర్టును ఆశ్రయించడంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఎన్నికలు నిర్వహించే వరకు పాత సహకార సంఘాల పాలకవర్గ సభ్యులకే పదవీ బాధ్యతలు అప్పగి ంచాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో మంగళవారం జిల్లాలోని 52మంది సంఘాల చైర్మన్లు తిరిగి బాధ్యతలు చేపట్టనున్నారు. క్షయతో అప్రమత్తంగా ఉండాలిజగిత్యాల: క్షయవ్యాధితో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. సోమవారం గాయత్రి ఓల్డేజ్ హోంలో వృద్ధులకు పరీక్షలు నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు, రాత్రి చెమటలు పట్ట డం, బరువు తగ్గడం, చాతిలో పట్టేసినట్లు ఉండటం వంటి లక్షణాలు ఉంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ఆయన వెంట సూపర్వైజర్ శ్రీనివాస్, వికాస్ పాల్గొన్నారు. సజావుగా ధాన్యం కొనుగోళ్లుజగిత్యాల: వరిధాన్యం కొనుగోళ్లు సజావుగా జరుగుతున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. సోమవారం జగిత్యాలలో ఏర్పాటు చేసిన విలేకరులతో సమావేశంలో మాట్లాడారు. వరిధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేవని జీవన్‌రెడ్డి ధర్నా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రశ్నించే గొంతుకగా చెప్పుకునే జీవన్‌రెడ్డి బీఆర్ఎస్ గొంతుగా మారిపోయాడని అన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రైతులకు వ్యవసాయానికి రూ.2.68 కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ రెండేళ్లలో 1.52 వేల కోట్లు ఖర్చు చేసిందని తెలిపారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ మంత్రి లక్ష్మణ్‌కుమార్ నిత్యం కలెక్టర్‌తో సమీక్షలు నిర్వహిస్తూ ధాన్యం కొనుగోళ్లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడటం జరిగిందన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగడం లేదని, ధా న్యం కొనుగోళ్లు త్వరితగతిన జరిగేలా చూస్తామని తెలిపారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ఏఎంసీ చైర్మన్ నారాయణరెడ్డి, శంకర్ పాల్గొన్నారు. -
డంపింగ్ యార్డు తరలించండి
మాది నూకపెల్లి డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీ. కాలనీకి అతి సమీపంలోని మున్సిపల్ డంపింగ్‌యార్డు ఉంది. యార్డుకు తరలిస్తున్న టన్నుల కొద్దీ చెత్తతో దుర్వాసన వస్తోంది. వ్యర్థాలకు నిప్పు పెడుడతుండటంతో ఎగిసి పడుతున్న మంటల కారణంగా విషపూరితమైన పొగ, దుమ్ము, దూలితో రోగాల బారిన పడుతున్నాం. చిన్నపిల్లలు, వృద్ధులు శ్వాసకోస వ్యాధుల బారిన పడుతున్నారు. డంపింగ్ యార్డు తరలించాలని పలుమార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడంతో డంపింగ్ యార్డుకు గోడ నిర్మించే పనులు మొదలు పెట్టారు. గోడపెట్టినా దుర్వాసన, పొగతో ఇబ్బందులు తప్పవు. కాలనీవాసుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని గోడ నిర్మాణం కాకుండా డంపింగ్ యార్డును శాశ్వతంగా తొలగించి, దూర ప్రాంతానికి తరలించండి. -
శవం ఎదుటే ఆస్తి పంచాయితీ
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని వంజరివాడకు చెందిన రాములు, శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు సంతానం. అందరికీ పెళ్లి చేశారు. కుమారుడు రాజుకు భార్య మాధురి, కొడుకు ధీరజ్ ఉన్నారు. మూడేళ్ల క్రితం రాజు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆ సమయంలో రాజు పేరిట ఉన్న కారు, బంగారం, ఇతరత్రా ఆభరణాలను శారదనే తీసుకుంది. మాధురిని పుట్టింటికి వెళ్లగొట్టింది. ఉన్న ఆస్తులు, డబ్బులను ఇద్దరు కూతుళ్లకు పంచి ఇచ్చింది. మాధురికి మాత్రం ఆస్తి ఇవ్వబోనంటూ మొండికేసింది. ఈ క్రమంలో మాధురి తన కుమారుడు ధీరజ్‌తో కలిసి కరీంనగర్లో సోదరుడి ఇంటి వద్ద ఉంటూ.. అనారోగ్యంతో శనివారం రాత్రి మృతి చెందింది. ఆమె మృతదేహాన్ని బంధువులు, కుటుంబ సభ్యులు ఆదివారం వంజరివాడకు తెచ్చారు. అంత్యక్రియలు నిర్వహించాలని అత్త శారదను కోరినా ఒప్పుకోలేదు. అంతేకాక నయాపైసా ఇచ్చేది లేదంటూ భీష్మించుకుంది. ఆమె ఇద్దరు కూతుళ్లు కూడా తమ తల్లిపేరిట ఉన్న ఆస్తి తమకే చెందుతుందని తేల్చి చెప్పారు. ఈ క్రమంలో మాధురి మృతదేహాన్ని ఆమె బంధువులు, కుటుంబసభ్యులు ఇంట్లోనే పూడ్చేస్తామంటూ గుంత తవ్వారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పట్టణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శారద పేరిట ఉన్న ఆస్తులను ధీరజ్‌కు ఇస్తామని హామీ ఇవ్వడంతో బంధువులు శాంతించారు. -
ధాన్యం తరలింపులో ఎఫ్‌సీఐ జాప్యం
● అందుకే రైతులకు కష్టాలు ● ఎమ్మెల్యే సంజయ్కుమార్జగిత్యాలరూరల్: మిల్లుల్లోని ధాన్యాన్ని ఎఫ్‌సీఐ తరలించడంలో జాప్యంతోనే రైతులకు కష్టాలు ఎదురవుతున్నాయని జగిత్యాల ఎమ్మె ల్యే సంజయ్ కుమార్ అన్నారు. రైస్‌మిల్లుల గోదాంల నుంచి ధాన్యం తరలించేలా కేంద్రం చర్యలు చేపట్టాలన్నారు. జగిత్యాల రూరల్ మండలం కన్నాపూర్‌లో గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి ఆదివారం భూమిపూజ చేశారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, ఏఎంసీ చైర్మన్ నారాయణ రెడ్డి, సర్పంచ్‌లు సతీష్ పాల్గొన్నారు. నిరుపేదల సొంతింటి కల సాకారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతో నిరుపేదల సొంతింటి కల సాకారమైందని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల అర్బన్ మండలం ధరూర్, సారంగాపూర్ మండలం పెంబట్ల, గణేష్‌పల్లి, బీర్పూర్ మండలకేంద్రంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించారు. నియోజకవర్గానికి 3500 ఇళ్లు మంజూరయ్యాయని, ఇప్పటివరకు 2400 ఇళ్లు వివిధ దశలో ఉన్నాయన్నారు. ఆత్మ చైర్మన్ కాటిపెల్లి గంగారెడ్డి, కేడీసీసీబీ మాజీ మెంబర్ రాంచందర్‌రావు, ఎంపీడీవో సలీం, చిరంజీవి, భీమేష్, సర్పంచ్‌లు రాధ, శ్రీనివాస్, హరీశ్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలం జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. సారంగాపూర్ మండలకేంద్రంలో ఆదివారం విలేకరులతో మాట్లాడారు. రైతులు పండించిన మక్కలను కొనే దిక్కులేదన్నారు. రైతులంటే ప్రభుత్వానికి ఇంత చిన్న చూపు ఎందుకని ప్రశ్నించారు. మక్కలు ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తే ప్రభుత్వం 26 క్వింటాళ్లు మాత్రమే కొంటామని నిబంధన పెట్టడమేంటని నిలదీశారు. సన్నాలకు రూ.500 బోనస్ ఎందుకు ఇవ్వడం లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎక్కడ కోరుకుంటే అక్కడ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యం కొని మిల్లులకు తరలించామని పేర్కొన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు తేలు రాజు, సింగిల్ విండో మాజీ చైర్మన్ సాగి సత్యంరావు, కోనాపూర్ సర్పంచ్ ఆకుల రమేశ్, నాయకులు బైరి మల్లేశ్ పాల్గొన్నారు. టీబీ రోగులకు మెరుగైన వైద్యం ● డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్ జగిత్యాలరూరల్: టీబీ రోగులకు ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తోందని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. ఆదివారం పట్టణ శివారులోని టీఆర్‌నగర్‌లో బస్తీ దావా ఖానాలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వ్యాధిగ్రస్తులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ఉచిత వైద్య పరీక్షలతోపాటు నెల నెలా మందులు కూడా అందిస్తోందన్నారు. వేసవి దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసుల విస్తృత తనిఖీలుజగిత్యాలక్రైం: కరీంనగర్‌లోని పీఎంజే జువెల్లరీ షాపులో తుపాకులతో కాల్పులు జరిపి దోపిడీకి పాల్పడగా.. జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. రహదారులపై పోలీసులు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి అణువణువునా తనిఖీలు చేపట్టారు. అనుమానిత వాహనాలను సీజ్ చేశారు. అనుమానితులను విచారణ చేపడుతున్నారు. నిందితుల చిత్రాలను పోలీసులు విడుదల చేయడంతో అనుమానితులు కన్పిస్తే సమాచారం అందించాలని కోరుతున్నారు. -
ప్రశాంతంగా ‘నీట్’
కొడిమ్యాల: జేఎన్టీయూ (నాచుపల్లి)లో ఆదివారం ‘నీట్’ ప్రశాంతంగా ముగిసింది. కళాశాలలో రెండు సెంటర్లను ఏర్పాటు చేశారు. ఒక సెంటర్లో 240 మంది విద్యార్థులకు 234 మంది, మరో సెంటర్లో 196 మందికి 192 మంది హాజరయ్యారు. పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు లేకపోవడంతో పలువురు విద్యార్థులు అవస్థలు పడ్డారు. ఒక విద్యార్థిని చెవికమ్మలు తీయమనడంతో తీసే క్రమంలో చెవికమ్మ ఎక్కడో పడిపోవడంతో అసహనం వ్యక్తం చేసింది. సరిపడా బస్సులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. సాయంత్రం ఐదు గంటలకుపరీక్ష రాసి బయటకు వచ్చే క్రమంలో రద్దీతో కళాశాల ప్రాంగణం సందడిగా మారింది. కేంద్రాల తనిఖీ జగిత్యాలటౌన్: జగిత్యాల ఎస్కేఎన్ఆర్ (ప్రభుత్వ) కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో 360మంది విద్యార్థులకు 355మంది హాజరయ్యారు. జిల్లాలో మొత్తంగా 98.11శాతం విద్యార్థులు పరీక్ష రాసినట్లు కో–ఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి తెలిపారు. ఎస్కేఎన్ఆర్ పరీక్షా కేంద్రాన్ని అదనపు కలెక్టర్ లత పరిశీలించారు. -
అంతా నిమిషాల్లోనే..
సాక్షి ప్రతినిధి, కరీంనగర్/కరీంనగర్‌క్రైం: ఆదివారం ఉదయం.. నగరం ప్రశాంతంగా ఉంది. నిత్యం రద్దీగా ఉండే జ్యోతినగర్ – విద్యుత్ కార్యాలయం ప్రధాన రహదారి.. సెలవు రోజు కావడంతో సందడి తక్కువగా ఉంది. ఇదే దారిలో ఉన్న పీఎంజే జ్యువెల్లర్స్‌ను అప్పుడే తెరిచారు. సిబ్బంది లాకర్లలో ఉన్న బంగారాన్ని లెక్కచూసుకుంటూ తీసుకొచ్చి కౌంటర్లు, డిస్ప్లేలో పెడుతున్నారు. ఇంతలో పెళ్లి ఉంది.. బంగారం కావాలంటూ ఓ వ్యక్తి ఉదయం 11 గంటలకు షాపులోకి వచ్చాడు. బంగారం కొన్నట్లు నటించి, ఐదు నిమిషాల తువాత మిగితా నలుగురిని లోనికి రమ్మని సైగలు చేశాడు. 11.06 గంటలకు వారు షాపులోకి ప్రవేశించారు. తుపాకులతో బెదిరించి సిబ్బందిని తాళ్లతో బంధించారు. చేతికి అందిన బంగారాన్ని బ్యాగులో సర్దుకున్నారు. అడ్డువచ్చిన నలుగురిపై కాల్పులు జరిపా రు. సరిగ్గా 11.11 గంటలకు బైకులపై మల్కాపూర్, చింతకుంట మీదుగా సిరిసిల్ల వైపు పారిపోయారు. విషయం నిమిషాల్లో దావనంలలా వ్యాపించడంతో సీపీ గౌస్ ఆలం, ఏసీపీ వెంకటస్వామి, సీఐ సృజన్‌రెడ్డి, క్లూస్‌టీం సిబ్బంది ఘటన స్థలానికి చేరుకున్నారు. నిందితుల వేలిముద్రలు సేకరించారు. ఘటనా స్థలంలో బుల్లెట్ షెల్స్, మ్యాగ్జిన్ స్వాధీనం చేసుకున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, త్వరలోనే నిందితులను పట్టుకుంటామని, రూ.కోటిన్నర విలువైన కిలోకు పైగా బంగారం చోరీకి గురైందని సీపీ ఆలం ‘సాక్షి’కి తెలిపారు. దోపిడీ ఘటనతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ప్రధాన రహదారులు దిగ్బంధించి, తనిఖీలు కొనసాగిస్తున్నారు. ఘటనా స్థలాన్ని హై దరాబాద్ నుంచి వచ్చిన క్లూస్‌టీం సిబ్బంది రాత్రి పరిశీలించారు. పలు ఆధారాలు సేకరించారు. బీదర్ లేదా మహారాష్ట్ర వైపు? జ్యోతినగర్‌లో ఉన్న జ్యువెల్లరీ దుకాణం అయితే చోరీకి అనువుగా ఉంటుందని పక్కాగా రెక్కీ చేశా రు. కస్టమర్లు, జనసంచారం తక్కువగా ఉంటుందని ఆదివారాన్ని ఎంచుకున్నారు. చోరీ అనంతరం పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రూట్లోకి లేదా జగిత్యా ల రూట్లో పారిపోవచ్చని స్కెచ్ వేసుకున్నారని తెలుస్తోంది. ఇలాంటి దొంగతనాల్లో రైలుమార్గాలు దగ్గర ఉన్న ప్రాంతాలను ఎంచుకొని పారిపోతుంటారు. నిందితులు సిరిసిల్ల వైపు వెళ్లారని, ముందుగానే ప్లాన్ చేసి కామారెడ్డి మీదుగా హైదరాబాద్, బీదర్ లేదా మహారాష్ట వైపు వెళ్లి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మాస్కులు లేకుండానే దర్జాగా ఎక్కువశాతం దొంగతనాలకు పాల్పడేవారు తమను గుర్తు పట్టకుండా ముఖానికి మాస్కులు, హెల్మెట్ ధరిస్తుంటారు. పీఏంజే ఘటనలో దొంగలు దర్జాగా, ఎలాంటి భయం లేకుండా చోరీకి పాల్పడడం చూస్తే ఈ ప్రాంతం వారు కాదని తెలుస్తోంది. వారు బైకులపై హెల్మెట్లు, ముఖానికి మాస్క్‌లేకుండా లేకుండా రావడం, పారిపోవడం చూస్తే ఉగ్రవాదులా..? అన్న కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు. కేవలం 5 నిమిషాల్లో దోపిడీకి పాల్పడిన ముఠా దుకాణం సిబ్బందిని బెదిరించి వారి చేతులు వెనక్కి కట్టేసి, వాష్ రూంలో భయంతో దాక్కున్న మహిళను కూడా సినీఫక్కీలో బయటకు తీసుకొచ్చి బెదిరించారు. చోరీచేసి బయటకు వస్తున్న క్రమంలో గాలిలోకి కాల్పులు జరుపుతూ బైకుపై వెళ్లిపోయారు. నగలు ఎత్తుకెళ్తున్న ఓ బ్యాగు అక్కడే పడిపోగా.. దోపిడీ ముఠా సభ్యుడు కూడా కిందపడిపోయాడని, తర్వాత కొంతదూరం పరిగెత్తి బైక్ ఎక్కాడని అక్కడ ఉన్న పలువురు చర్చించుకున్నారు. దోపిడీ జరిగిన తీరు చూస్తుంటే నిందితులు పాత నేరస్తులు లేదా ఉగ్రశిక్షణ పొంది ఉండి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మ్యాగ్జిన్.. బులెట్లు స్వాధీనం ఘటనా స్థలంలో ఓ షార్ట్ వెపన్ మ్యాగ్జిన్, మూడు కాలిన తూటాలు, కత్తిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఇక్కడ లభ్యమైన మ్యాగ్జిన్, బులెట్లపై ఉన్న క్లూస్ ఆధారంగా అవి ఎక్కడ కొనుగోలు చేశారన్న వివరాలు సేకరిస్తున్నారు. దోపిడీ అనంతరం దొంగలు వెళ్లిన దారితోపాటు వచ్చిన దారి సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. ఆదివారం జనసంచారం తక్కువగా ఉంటుందని తెలుసుకున్నారంటే తప్పకుండా వారం రోజులకుపైగా రెక్కీ నిర్వహించి ఉంటారని అనుమానిస్తున్నారు. నాడు మొరాదాబాద్ దొంగలు 2022 సెప్టెంబరు 5న కరీంనగర్‌లోని సెవెన్‌హిల్స్ సమీపంలో సాయివాణి రెడీమిక్స్‌కు చెందిన రూ.15 లక్షలు చోరీ చేసిన ముఠా కూడా అపాచీ, పల్సర్ బైకులనే వాడింది. ఒకరు చింతకుంట మీదుగా సిరిసిల్ల వెళ్లగా.. మరొకరు తిమ్మాపూర్ మీదుగా పారిపోయి చివరికి సిద్దిపేట వద్ద కలుసుకున్నారు. తరువాత నాంపల్లిలో రైలెక్కి ఉత్తర్‌ప్రదేశ్‌లోని మొరాదాబాద్ వెళ్లారు. నిందితులు ధరంపాల్, మనీశ్, పింటూ, ఏక్తా అని గుర్తించి పోలీసులు రూ.10లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నాడు ఆ దొంగల ను టాస్క్‌ఫోర్స్ సీఐగా ఉన్న సృజన్‌రెడ్డి అరెస్టు చేసి పట్టుకురావడం గమనార్హం. మొత్తంగా కొ న్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న నగరం ఆదివారం ఘటనతో ఒక్కసారిగా ఉలిక్కి పడింది. పలువురి పరామర్శ ఘటనా స్థలాన్ని కేంద్రమంత్రి బండి సంజయ్, డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పరిశీలించారు. గాయపడిన జువెల్లరీస్ సిబ్బంది ముస్తాక్, మధుకర్, రాజేశ్, కమలాసన్ను ఆస్పత్రిలో పరామర్శించారు. ఘటనపై ఆరా తీశారు. జువెల్లరీ షాపు ఘటనను గంగుల, పాడి రాజకీయం చేయడం తగదని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్రరెడ్డి సూచించారు. రెక్కీ చేశాకే పీఎంజే జ్యువెల్స్‌లో చోరీ ఐదు నిమిషాల్లో ముగించి.. రెండు బైకులపై పరారీ నిందితులు మహారాష్ట్రకు చెందిన ముఠా సభ్యులు? 2022లో మొరాదాబాద్ దొంగల తరహాలోనే దోపిడీ దుండగులు వచ్చిన దారి వెంట సీసీ ఫుటేజీల పరిశీలన -
పాఠశాల ఆస్తులు పైలమేనా..!?
జగిత్యాల: పరీక్షలు అయిపోగానే పాఠశాలలకు ప్రభుత్వం వేసవి సెలవులు ప్రకటిస్తుంది. ఇది పిల్లలకు ఆనందంగా ఉన్నా.. ఉపాధ్యాయులకు మాత్రం పెద్ద తలనొప్పి వ్యవహారమే. ఏటా నెలపాటు వేసవి సెలవులు రావడంతో బడులన్నీ మూతపడతాయి. గ్రామాల్లో ఉండే కొందరు ఆకతాయిలు పాఠశాలలను టార్గెట్ చేస్తూ.. అందులో ఆటలాడటమే కాకుండా కొందరు మద్యం తాగుతూ.. సీసాలు పగులగొడుతూ.. ప్లాస్టిక్ వ్యర్థాలు పడేస్తుంటారు. బడిలో ఉన్న వస్తువులనూ చోరీ చేస్తుంటారు. ప్రస్తుతం ప్రతి బడిలో కంప్యూటర్లు ఉన్నాయి. విలువైన వస్తువులూ తెచ్చిపెట్టారు. వీటిని ఎత్తుకెళ్లినా, ధ్వంసం చేసినా ఇబ్బందే. బడి ప్రారంభంకాగానే వచ్చే ఉపాధ్యాయులకు ఇది ఏటా తలనొప్పిగా మారుతోంది. గతంలో వేసవి సెలవుల్లో ప్రభుత్వ పాఠశాలల ఆస్తులు అనేకం ధ్వంసం కావడంతోపాటు, పరిసరాలను అస్తవ్యస్తం చేసేవారు కొందరు ఆకతాయిలు. గుర్తుతెలియని వ్యక్తులు కిటికిలు, తాళాలు, తలుపులు ధ్వంసం చేసేవారు. వీటిని దృష్టిలో పెట్టుకుని పాఠశాలల ఆస్తుల రక్షణకు కొన్ని మార్గదర్శకాలను విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ జారీ చేశారు. ఈసారి బడుల ఆస్తులకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. జిల్లాలో పీఎంశ్రీ పాఠశాలలు 22 ఉన్నాయి. ఇందులో అనేక విలువైన వస్తువులున్నాయి. గతంలోనే సీసీ కెమెరాలు అమర్చినప్పటికీ ప్రత్యేకమైన భద్రత పెంచాల్సిన అవసరం ఉంది. సీసీకెమెరాలు, ప్రధానోపాధ్యాయుడితోపాటు, పీడీ, ఒక సీనియర్ ఉపాధ్యాయుడు నిరంతరం నిఘా ఉంచాలని, పాఠశాలను పర్యవేక్షించాల్సిన బాధ్యత వారిపైనే పెట్టారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఆకతాయిలకు చెక్ పెట్టేదెలా..? ప్రభుత్వ పాఠశాలలు 33కేజీబీవీలు 16ప్రాథమిక పాఠశాలలు 705మోడల్‌స్కూల్స్ 13భద్రత ఇలా.. చర్యలు తీసుకుంటున్నాం జూన్ వరకు బడులకు సెలవులు ఆస్తులు ధ్వంసం చేస్తున్న ఆకతాయిలు రక్షణకు ప్రభుత్వం మార్గదర్శకాలు బడుల్లో ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ నుంచి మార్గదర్శకాలు జారీ అయ్యా యి. నిత్యం పాఠశాలలను విజిట్ చేయడంతో పాటు, పోషకులు, విద్యార్థుల సహకారం తీసుకుంటాం. గతంలో జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తాం. రాము, డీఈవో -
నేటి నుంచి రైతు వారం
కరీంనగర్ అర్బన్/జగిత్యాలఅగ్రికల్చర్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా రైతు వారం నిర్వహిస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వారం రోజుల కార్యాచరణను రూపొందించగా సోమవారం నుంచి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ప్రభుత్వం సాగు రంగానికి చేసిన సేవలు, విప్లవాత్మక మార్పులు, పంట రుణాలు, గతంలో చేసిన రుణమాఫీ, సాంకేతికత వినియోగం వంటి అంశాలను రైతులకు క్షేత్రస్థాయిలో వివరిస్తారు. అందులో భాగంగా ఈ నెల 4నుంచి 9 వరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతు వారం నిర్వహించనున్నారు. వ్యవసాయంతో పాటు అనుబంధ విభాగాలైన పట్టు పరిశ్రమ, ఉద్యాన శాఖ, ఆత్మ, వ్యవసాయ మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖ అధికారులు అన్నదాతకు అవగాహన కల్పించనున్నారు. కాగా, రైతు వేదికలే వేదికగా ప్రతి రోజూ కార్యక్రమాలను నిర్వహిస్తామని అధికారులు వివరించారు. కార్యక్రమాలు ఇలా.. ● 4వ తేదీన: సాగు భూమి ఆరోగ్య పరిరక్షణ, సమతుల ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, వినియోగదారులు కోరుకునే సన్నరకాల సాగు వంటి వివరాలను వివరించనున్నారు. ● 5న: ఉద్యాన పంటల ద్వారా వచ్చే ఆదాయం, ఆయా పంటల అభివృద్ధి, ఆయిల్‌పాం సాగు విస్తీర్ణం పెంపుదల, ప్రత్యామ్నాయ పంటల సాగు. ● 6న పంట పెట్టుబడులకు బ్యాంకుల ద్వారా దీర్ఘకాలిక, స్వల్పకాలిక పంట రుణాలతో పాటు సహకార సంఘాలు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా రైతులకు అందించే సేవలు, మార్కెటింగ్ అవకాశాలు. ● 7న: వ్యవసాయ క్షేత్రాలు, సౌర విద్యుత్ కేంద్రాలు, పీఎం కుసుమ్, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్స్. ● 8న: వ్యవసాయంలో కీలకమైన పాడి పరిశ్రమ– పశుజాతి అభివృద్ధి, దూడల ప్రదర్శన, గడ్డి విత్తనాలు, వేసవిలో పశువుల సంరక్షణ వంటి వివరాలు. ● 9న: చెరువుల్లో కంప చెట్లు, గుర్రపు డెక్క తొలగింపు, సమతుల్య నీటి వినియోగం, కార్యాలయాల పరిశుభ్రత. వివిధ కార్యక్రమాల రూపకల్పన రైతు వేదికల్లో నిర్వహణ భూసార పరీక్ష ఫలితాల వెల్లడి -
అమ్మానాన్న లేని అభాగ్యులు
● ఏ ‘ఆధార’మూ లేని చిన్నారులు ● చేరదీసిన అమ్మమ్మ, నాన్నమ్మ ● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు వీర్నపల్లి(సిరిసిల్ల): ఆ బాలుడు పుట్టు మూగ. కన్నవారి ప్రేమకు నోచుకోలేదు. ఏ ఆధారమూ లేదు. కనీసం ఆధార్ కార్డు కూడా లేని అభాగ్యుడు. వీర్నపల్లి మండలం బంజేరు గ్రామపంచాయతీ పరిధి బీరప్పతండాకు చెందిన బట్టు శంకు పుట్టుకతోనే మూగ. అతడు పుట్టిన ఏడాదికే తల్లిదండ్రులు ఎక్కడికి వెళ్లారో, ఏమయ్యారో ఇప్పటికీ తెలియదు. అప్పటి నుంచి తన అమ్మమ్మ బట్టు నానుకు వద్దే పెరుగుతున్నాడు. కనీసం ఆధార్ కార్డు కూడా లేక దివ్యాంగుల పింఛన్, చదువు, ఇతర పథకాలకు దూరమయ్యాడు. మనవడే ప్రాణం భర్త మరణించిన తర్వాత నానుకు అండగా నిలిచేవారు కరువయ్యారు. వృద్ధాప్య పింఛన్ కోసం రెండేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేదు. కనీసం ఉండడానికి ఇల్లు లేక, చిన్న పూరిగుడిసెలో కాలం వెళ్లదీస్తోంది. మనవడు శంకును సాకడం ఆమెకు భారంగా మారింది. వయసు మళ్లినా కూలీ పనులకు వెళ్తే వచ్చే ఆదాయంతోనే ఇద్దరూ జీవనం సాగిస్తున్నారు. తాను ఉన్నన్ని రోజులు ఏదోలా రెక్కలు ముక్కలు చేసుకుంటానని, తర్వాత తన మనవడిని ఎవరు చూసుకుంటారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం స్పందించి బాలుడికి ఆధార్ ఇప్పించి, పింఛన్ సౌకర్యం కల్పించాలని తండావాసులు కోరుతున్నారు. మరో బాలుడిది అదే వ్యథ బీరప్పతండాకే చెందిన మరో బాలుడు బట్టు శివ పరిస్థితి కూడా ఇంతే. అతడి తల్లిదండ్రులు ఎటు వెళ్లారో తెలియదు. నాన్నమ్మ బట్టు సక్కుబాయి వద్ద ఉంటూ చదువుకుంటున్నాడు. తల్లిదండ్రుల మమకారానికి దూరమై, తోటి పిల్లలను చూస్తూ ఈ చిన్నారులు పడుతున్న వేదన వర్ణనాతీతం. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి సదరు పిల్లలను ఆదుకోవాలని గ్రామస్తులు వేడుకుంటున్నారు. బీరప్ప తండాలో బట్టు నాను, ఆమె మనవడు శంకు పడుతున్న ఇబ్బందులు మా దృష్టికి వచ్చాయి. తక్షణమే ఆ బాలుడికి ఆధార్ నమోదు చేయించి, బట్టు నానుకు పింఛన్ వచ్చేలా కృషి చేస్తాం. బాధిత కుటుంబానికి ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో భరోసా కల్పించేలా చూస్తాం. – బట్టు కృష్ణ, సర్పంచ్, బంజేరు -
వలస బతుకులు.. ప్రసవ బాధలు
● ఈనెల 2న బిహార్ రాష్ట్రంలోని బెగుసరాయ్ జిల్లాకు చెందిన సీతాదేవి (25) తన భర్తతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా గూడూర్ రైల్వేస్టేషన్లో శుక్రవారం రాత్రి దర్భాంగా వెళ్లే భాగ్మతి రైలు ఎక్కారు. టికెట్ లేకుండానే ఎస్–6 బోగీలో కూర్చున్నారు. శనివారం వేకువజామున వరంగల్ రైల్వేస్టేషన్ దాటాక సీతాదేవికి పురిటి నొప్పులు వచ్చి కూర్చున్న చోటనే సుఖప్రసవమై ఆడ శిశువుకు జన్మనిచ్చింది. రామగుండం: బతుకుదెరువు కోసం బిహార్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ తదితర రాష్ట్రాల నుంచి నిరక్షరాస్యులైన దంపతులు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో పనులు చేసుకునేందుకు వలస వెళ్తుంటారు. ఇటీవల రైలు ప్రయాణాల్లో గర్భిణులు ప్రసవించడంపై సంబంధిత అధికారుల్లో ఆందోళన నెలకొంది. పలువురు అనారోగ్యంతో సొంతూరు వెళ్లే క్రమంలోనే రైళ్లలో మృత్యువాత పడిన ఘటనలు ఉన్నాయి. కాగా, వీరందరూ నిరక్షరాస్యులు కావడం గమనార్హం. మూసివేసి ఉన్న ఎమర్జెన్సీ హెల్త్ రూమ్ సూదూర ప్రాంతాలకు రైళ్లలో వెళ్లే ప్రయాణికులకు ఆరోగ్య సమస్యలు తలెత్తితే కనీసం రైల్వే ప్లాట్‌ఫాంపై ప్రాథమిక వైద్య సేవలు అందించని దుస్థితిలో రామగుండం రైల్వేశాఖ ఉంది. ప్రాథమిక చికిత్స కోసం అత్యవసర గదిని ఏర్పాటు చేసి బోర్డు తగిలించినా తెరుచుకున్న పాపానా పోలేదు. అమృత్ భారత్ పథకంలో కోట్లాది నిధులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని అధికారులు, ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా.. ప్రయాణికులకు అత్యవసర వైద్య సేవలు అందించలేని దుస్థితిలో రైల్వేస్టేషన్ ఉంది. అవగాహన లేమితో నిండు గర్భిణుల రైలు ప్రయాణం రామగుండం రైల్వేస్టేషన్లో రెండు ఘటనలు స్టేషన్లో అత్యవసర వైద్యసేవలు కరువునెలలు నిండిన గర్భిణులు, అస్వస్థతతో ఉన్న వ్యక్తులు రైళ్లలో ప్రయాణం చేయడం సరికాదు. అత్యవసరంగా ఆరోగ్య సమస్యలు తలెత్తితే పెద్ద సిటీలలో వైద్య సేవలకు అనుకూలత ఉంటుంది. అటవీ ప్రాంతం సమీపంలో ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే ప్రాణాపాయం జరిగే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్న సమయంలోనే రైలు ప్రయాణాలు చేయాలి. – తిరుపతి, ఇన్చార్జి రైల్వే పోలీస్, రామగుండం -
జగిత్యాల
45.0/25.0సోమవారం శ్రీ 4 శ్రీ మే శ్రీ 202 7గరిష్టం/కనిష్టంగోదావరిలో భక్తుల రద్దీధర్మపురి: గోదావరిలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్నానాలు ఆచరించారు. ఆలయాల్లో మొక్కులు తీర్చుకున్నారు. వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. మధ్యాహ్నం ఎండ వేడిమి అధికమవుతుంది. ఉక్కపోత పెరుగుతుంది. -
ప్రభుత్వంలో చలనమే లేదు..
జగిత్యాలటౌన్: ఉద్యోగులు, నిరుద్యోగులు, పెన్షనర్ల సమస్యలపై బీజేపీ అసెంబ్లీ లోపల, వెలుపల ఎంత నిలదీసినా రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేదని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మోదీ సభ సన్నాహక సమావేశంలో మాట్లాడారు. కేంద్రం జిల్లాకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేస్తే స్థలం కేటాయించలేని దుస్థితిలో ఉండటం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అధికారంలోకి రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఎందుకు స్పందించడం లేదని, కేసీఆర్‌ను చర్లపెల్లి జైలులో పెడతానని ఇప్పుడు ఫాంహౌజే కేసీఆర్‌కు జైలులాంటిదనడం వారిద్దరి బంధానికి నిదర్శనమని పేర్కొన్నారు. హామీల అమలులో విఫలమైన కాంగ్రెస్‌పై విశ్వాసం కోల్పోయిన రాష్ట్ర ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని, తెలంగాణకు దిశానిర్దేశం చేసేందుకు ప్రధాని మోదీ హైదరాబాద్ రానున్నారని తెలిపారు. ఈనెల 10న సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించే సభకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. పార్టీ రాష్ట్ర కార్యవర్గసభ్యురాలు భోగ శ్రావణి, జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు, నాయకులు సురేందర్‌రెడ్డి, అనూప్‌రావు, పూదరి అరుణ, వడ్డెపల్లి శ్రీనివాస్, నలువాల తిరుపతి, సుంకెట దశరథరెడ్డి, భూమి రమణ, జుంబర్తి దివాకర్ ఉన్నారు. బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి -
కనికరించని మానవత్వం
● అనారోగ్యంతో యువకుడి మృతి ● తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లిన కుటుంబసభ్యులు శంకరపట్నం: మండలంలోని కేశవపట్నంలో ఆదివారం రాత్రి అనారోగ్యంతో యాకుబ్(35) మరణించగా, కుటుంబసభ్యులు తోపుడు బండిపై శవాన్ని ఇంటికి తీసుకెళ్లారు. కేశవపట్నం గ్రామానికి చెందిన వీరయ్య, రుక్కమ్మకు కొడుకు యాకుబ్, కూతురు ఉన్నారు. వీరికి పెళ్లిళ్లు అయ్యాయి, యాకుబ్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉండగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు, వీరయ్య, రుక్కమ్మలు రోడ్డు పక్కన టేలాలో చెప్పులు విక్రయించగా, ప్రస్తుతం వ్యాపారం లేక పోవడంతో కేశవపట్నం మేన్ రోడ్డుపై తోపుడు బండిపై పండ్లు అమ్ముకుంటున్నారు. యాకుబ్ రోడ్డుపక్కన గదిలో ఉండగా ఆదివారం రాత్రి చనిపోయాడు. శవాన్ని ఇంటికి తీసుకెళ్లందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో తోపుడు బండిపై యాకుబ్ శవాన్ని తల్లిదండ్రులతో పాటు సోదరి, బావ తీసుకెళ్లారు. సాహిత్యంతో పౌర సమాజం జాగృతంకరీంనగర్కల్చరల్: పండితుల పామరుల హృదయాలను కదిలించగలిగే సాహిత్యంతో పౌర సమాజం జాగృతం అవుతుందని ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నందిని సిధారెడ్డి అన్నారు. ఆదివారం ఫిలింభవన్‌లో తెలంగాణ తెలుగు భాషా సంరక్షణ సంఘం, శాతవాహన లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా నేషనల్ క్లబ్ సంయుక్తంగా నిర్వహించిన కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ఆదివారం శ్రీకవన గోదారిశ్రీ కవితా సంపుటిని ఆవిష్కరించి మాట్లాడారు. తరుగుతున్న మానవీయ విలువలను తన కవిత్వంతో తట్టి లేపడానికి బుర్ర మధుసూదన్ రెడ్డి కృషి చేయడం అభినందనీయమన్నారు. సభాధ్యక్షత వహించిన ప్రముఖ సాహితీవేత్త దాస్యం సేనాధిపతి మాట్లాడుతూ బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి కవి, రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, సమాజ సేవకులుగా పలు రంగాల్లో తమదైన విలక్షణ ప్రతిభను చాటుకుంటూ దూసుకుపోతున్నారన్నారు ఈ కార్యక్రమంలో కవులు అన్నాడి గజేందర్‌రెడ్డి, డాక్టర్ మచ్చ హరిదాసు, కొత్త అనిల్ కుమార్, బొమ్మకంటి కిషన్, అనిత పాల్గొన్నారు. -
ఎందుకో ఇంత వివక్ష..?
కోరుట్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో కనిపించని ఎమ్మెల్యే ఫొటో, జగిత్యాలలో ఎమ్మెల్యే ఫొటోతో ఉన్న ఫ్లెక్సీజగిత్యాల: జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి పట్టణాల్లో ప్రజాపాలన–పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని రెండు రోజుల క్రితం నిర్వహించారు. జగిత్యాల, ధర్మపురిలో జరిగిన సమావేశాల్లో అధికార యంత్రాంగం స్థానిక మంత్రి, ఎమ్మెల్యేల ఫొటోలను ఫ్లెక్సీల్లో వాడుకున్నారు. కోరుట్లలో మాత్రం ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఫొటో మాత్రం పెట్టలేదు. జిల్లా అధికారులు అందరికీ ఒకే ప్రోటోకాల్ అనుసరించకుండా ఇలా వివక్ష చూపడంపై కోరుట్ల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
కల్లు దుకాణాల్లో నియంత్రణ కరువు
జగిత్యాలక్రైం: కల్లు షాపులపై అధికారుల నియంత్రణ కరువైంది. కొద్దిపాటి కల్లులోనే రసాయనాలు కలిపి భారీగా తయారుచేస్తూ సీసాల్లో నింపి ఇష్టారాజ్యంగా విక్రయిస్తున్నారు. చిన్నారులకు మద్యం విక్రయించవద్దని ఉన్నా అవేమీ పట్టించుకోకుండా కల్లు షాపుల్లో ఇష్టారాజ్యం కొనసాగుతోంది. వారు విక్రయించే కల్లుతో ఎంతోమంది చిన్నారులు, పెద్దలు అస్వస్థతకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్‌రోడ్‌లో తండ్రితో కలిసి ఓ నాలుగేళ్ల బాలుడు వచ్చినా నిర్వాహకులు అడ్డుచెప్పలేదు. పైగా అతడికి తండ్రే కల్లు తాగిపించడం గమనార్హం. దీంతో బాలుడే అక్కడే నిద్రమత్తులోకి జారుకున్నాడు. బాలుడు కల్లు తాగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. తండ్రితో కలిసి చిన్నారి కల్లు సేవిస్తున్నా అక్కడి షాపు యజమానులు చూసీచూడనట్లు వ్యవహరించారు. ఇటీవల కల్లు దుకాణాలపై ఎకై ్సజ్ అధికారుల పర్యవేక్షణ కూడా కరువవడంతో ప్రజలకు అనారోగ్యం కలిగించే రసాయనాలు కలిపి కల్లు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. కొన్ని షాపుల్లో మత్తు పెంచేందుకు గుల్ఫారామ్ వంటి పదార్థాలు కలుతున్నా వాటిని పరిశీలించే వారే కరువయ్యారన్న ఆరోపణలు వెల్లువెతుతున్నాయి. తండ్రితో కలిసి కల్లు తాగిన బాలుడు కల్లు నిర్వాహకుల ఇష్టారాజ్యం -
సమ్మర్ క్యాంపుపై సందిగ్ధం
కరీంనగర్‌స్పోర్ట్స్: కరీంనగర్లో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో యేటా నిర్వహించే వేసవి క్రీడా శిబిరాలపై ఈసారి సందిగ్ధం నెలకొంది. ఏడేళ్లుగా (కరోనా వైరస్, ఎన్నికల కోడ్ మినహా) నిరంతరంగా కొనసాగుతున్న శిబిరాలు ఈసారి ఉంటాయా? లేదా? అన్న సందేహం కోచ్‌లు, తల్లిదండ్రులు, చిన్నారులను కలవరపెడుతోంది. 2017 నుంచి వేసవి శిబిరాలను ప్రారంభించిన నగరపాలక సంస్థ 2020, 2021లో కరోనా వైరస్ కారణంగా, 2024లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్వహించలేదు. ఈసారి ఎలాంటి అడ్డంకి లేకున్నా శిబిరాల నిర్వహణపై నగరపాలక సంస్థ మౌనం వహించడం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే వేసవి సెలవులు ప్రారంభం కాగా.. శిబిరాలపై ఎలాంటి ప్రకటన లేకపోవడం విమర్శలకు దారి తీస్తోంది. భారం అనుకుంటున్నారా? నగరంలోని ప్రతిభావంతులైన క్రీడాకారులకు సరైన వేదిక కల్పించాల్సిన బాధ్యత బల్దియాపై ఉందని నగర ప్రజలు గుర్తుచేస్తున్నారు. చిన్నారులకు ఇచ్చే పాలు, గుడ్లు, అరటి పండ్లు, కోచ్‌లకు ఇచ్చే గౌరవ వేతనాల భారం తప్పించుకోవడానికే శిబిరాలను పక్కన పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. క్రీడలపై ఆసక్తి పెంచే ఈ శిబిరాలు నిలిచిపోతే, యువతలో నైపుణ్యాల అభివృద్ధి దెబ్బతింటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అధికారులు స్పందించి శిబిరాల నిర్వహణపై స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం హామీలకే పరిమితం కాకుండా, వెంటనే కార్యాచరణ ప్రారంభించాలని కోరుతున్నారు. శిబిరం నిర్వహణపై బల్దియా మౌనం ఉచిత శిక్షణ శిబిరాల సంప్రదాయానికి బ్రేక్? నిరాశలో చిన్నారులు, తల్లిదండ్రులు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో సమ్మర్ క్యాంపు నిర్వహణ ఇలా ఏడాది క్రీడలు కోచ్‌లు చిన్నారులు గౌరవవేతనం 2017 17 28 1,500 రూ.5,000 2018 20 40 2,500 రూ.5,000 2019 22 45 2,600 రూ.5,000 2022 27 72 3,200 రూ.5,000 2023 28 70 3,000 రూ.8,000 2025 17 35 1,700 ఇవ్వలేదు -
వదలరు.. కదలరు..
జగిత్యాల: ఆ పది మంది ఎస్సైలు జిల్లాను వదలరు.. వారంతా ఒకే బ్యాచ్ వాళ్లు.. పదేళ్ల క్రితం జిల్లాలో పోస్టింగ్ పొంది.. అప్పటి నుంచి ఇక్కడి నుంచి వెళ్లేది లేదని భీష్మించుకుని తిష్ట వేశారు. నేతల ప్రాపకం ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులతో సదరు ఎస్సైలు జిల్లాను వదలడం లేదన్న వాదనలు ఉన్నాయి. శ్రీవదల బొమ్మాళీ.. వదలశ్రీ అన్న రీతిలో ఆ బ్యాచ్ ఎస్సైలు ఖో ఖో అడినట్లు వాళ్లల్లో వాళ్లే ఒకరి నుంచి ఒకరికి ఖో ఇచ్చుకుని పోస్టింగ్‌లకు మారిపోవడం ఆనవాయితీగా మారింది. ప్రస్తుతం ఒకే బ్యాచ్‌కు చెందిన పది మంది ఎస్సైలు జిల్లాలో ఉన్నారంటే అతిశయోక్తి కాదు. వదలరు.. కదలరు జిల్లాలో జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి పోలీస్ సర్కిళ్లు ఉన్నాయి. వాటి పరిధిలో 22 మంది ఎస్సైలు ఉన్నారు. వీరు కాక.. స్పెషల్ బ్రాంచ్, ఇంటలిజెన్స్, సీసీఎస్ వారిని పరిగణనలోకి తీసుకుంటే మొత్తం 30 మంది వరకు ఎస్సైలు ఉన్నారు. వీరిలో కనీసం పదిమంది ఒకే బ్యాచ్‌కు చెందిన వారు ఉండడం గమనార్హం. సదరు బ్యాచ్ ఎస్సైలు లూప్‌లైన్లలో పనిచేయడానికి అసలే ఇష్టపడరు. పదేళ్లుగా జగిత్యాల, మల్యాల, ధర్మపురి, కోరుట్ల, మెట్పల్లి వంటి కీలక ప్రాంతాల్లో ఉంటున్నారు. రెండవ శ్రేణి పోస్టింగ్‌లుగా చెప్పుకునే రాయికల్, కథలాపూర్, మేడిపల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, పెగడపల్లి, జగిత్యాల రూరల్ వంటి పోలీస్స్టేషన్లలోనూ ఒకరి తరువాత ఒకరు వారే ఎక్కువ కాలం పనిచేశారు. ఇతర బ్యాచ్‌లకు చెందిన ఎస్సైలు ఎవరైనా జిల్లాకు వస్తే వారిని కుదురుకోకుండా చేయడంలోనూ వీరిది అందెవేసిన చేయిగా పోలీస్ డిపార్ట్మెంట్లో ప్రచారం ఉంది. ఈ అంశం ఇటీవల కాలంలో జిల్లా పోలీస్ శాఖలో చర్చనీయంగా మారింది. ఉత్తర, దక్షిణల్లో దిట్టలు అధికార పార్టీ నేతల ప్రాపకం పొందడంలో సదరు బ్యాచ్ ఎస్సైలకు వెన్నతో విద్యగా చెప్పుకుంటారు. ధర్మపురి, జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాల అధికార పార్టీ కీలక నేతలను ఆకట్టుకుని వారి ఉత్తరాలతో పోలీసు ఉన్నతాధికారులను ఎప్పటికప్పుడు ప్రసన్నం చేసుకుంటున్నారు. జిల్లాలో ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న కీలక ఠాణాల్లో పోస్టింగ్‌ల కోసం కొంతమంది ఆ బ్యాచ్ ఎస్సైలు అవసరమైతే శ్రీదక్షిణశ్రీ మంత్రం వేసి మరీ దస్తీలు వేసుకుంటున్న వైనం విస్మయం కలిగిస్తోంది. ఇంతలా జిల్లాను వదలకుండా కొంతమంది ఎస్సైలు ఏకధాటిగా ఇక్కడే పనిచేస్తున్న వైనం ఇటీవల కాలంలో ఉన్నతాధికారుల దృష్టికి వచ్చినట్లు సమాచారం. ఈ విషయంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు లోతుగా ఆరా తీస్తున్నట్లు తెలిసింది. బాసర జోన్ వ్యాప్తంగా అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలకు ఎస్సైలు బదిలీ అయ్యే అవకాశం ఉన్నప్పటికీ ఆర్థికంగా బలంగా ఉన్న జిల్లాను సదరు బ్యాచ్ ఎస్సైలు వదలడం లేదు. దీని వెనక ఆంతర్యం ఏమిటన్న అంశం ఉన్నతాధికారులకు అంతు చిక్కకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పదేళ్లుగా ఇక్కడే ఓ పోలీస్ బ్యాచ్ జిల్లాలో పది మంది తిష్ట ఉత్తర, దక్షిణ జిమ్మిక్కులు -
పోటెత్తిన భక్తులు
వేములవాడ: మండుతున్న ఎండలను లెక్క చేయకుండా వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు ఆదివారం పెద్ద ఎత్తున కుటుంబ సభ్యులతో వేములవాడకు చేరుకుని తమ ఇలవేల్పు రాజన్న, భీమన్నలకు మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీని గమనించిన ఆలయ అధికారులు భక్తులకు సరిపడా సౌకర్యాలు కల్పించారు. ఎండ నుంచి ఉపశమనం పొందేందుకు తాగునీటి క్యాన్లను అందుబాటులో ఉంచి స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులచే నీటి సరఫరా చేయించారు. భీమన్న సేవలో సుడా చైర్మన్ వేములవాడ భీమన్నను శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి కుటుంబ సమేతంగా ఆదివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు, వేద పండితులు స్వామివారి మండపంలో శేషవస్త్రం, లడ్డూ ప్రసాదం, ఆశీర్వచనాలు అందించారు. -
సబ్‌స్టేషన్ ఆవరణలో మంటలు
కొత్తపల్లి(కరీంనగర్): 220 కె.వీ. దుర్శేడ్ విద్యుత్‌సబ్‌స్టేషన్ ఆవరణలోని పోల్ సెంటర్లో ఆదివారం రా త్రి మంటలు చెలరేగాయి. గాలి దుమారం రావడంతో అల్గునూర్, హుజూరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లే 32 కె.వీ. లైన్లు ఒకదానికొకటి రాపిడి జరిగి అగ్ని రవ్వలు కిండపడ్డాయి. అక్కడున్న చెత్త, గడ్డి అంటుకొని మంటలు చెలరేగాయి. దీంతో భయాందోళనలకు గురైన విద్యుత్ సిబ్బంది వెంటనే అప్రమత్తమై దుర్శేడ్ సబ్‌స్టేషన్‌ను ఆఫ్ చేసి ఫైరింజన్‌కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ వచ్చి మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది. దీంతో విద్యుత్ అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ విద్యుత్ ప్రమాదంలో ఎలాంటి నష్టం జరగలేదని ట్రాన్స్‌కో డీఈ భూమయ్య వెల్లడించారు. తాళం వేసిన ఇంట్లో చోరీజగిత్యాల క్రైం: జగిత్యాలలోని వాణీనగర్‌కు చెందిన విద్యుత్ శాఖ లైన్‌మన్ రమేశ్ ఇంట్లో గుర్తుతెలియని దొంగలు పడి రూ.15 వేలు ఎత్తుకెళ్లారు. రమేశ్ మూడు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి శుభకార్యం నిమిత్తం వెళ్లాడు. ఆదివారం తిరిగి వచ్చి చూసేసరికి తాళాలు పగులగొట్టి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా.. బీరువాలో డబ్బులు కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాజకీయాలకతీతంగా అభివృద్ధి
జగిత్యాల: రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి పాటుపడుతున్నట్లు జగిత్యాల ఎమ్మెల్యే సంజ య్‌కుమార్ అన్నారు. 99రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశంలో మాట్లాడారు. పరిసరాల పరిశుభ్రత, ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, యువతకు క్రీడలు, విద్యుత్, పిల్లల భద్రతలో ముందుకెళ్తున్నామని పేర్కొన్నా రు. వైకుంఠదామాలు, పల్లెప్రకృతి, పచ్చదనం పెంపుపై దృష్టి సారించాలన్నారు. తడి, పొడి చెత్తను వేరుగా ఇచ్చి ప్రజలు సహకరించాలన్నారు. నియోజకవర్గంలో 78 వేల కుటుంబాలకు ఉచిత విద్యుత్ అందుతోందని, సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు ఇస్తున్నామని పేర్కొన్నారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్ మాట్లాడుతూ గ్రామాలు, పట్టణా ల్లో అభివృద్ధి పనులను పూర్తిచేయాలన్నారు. సేవల్లో పారదర్శకత, నాణ్యత ఉండేలా చూడాలన్నా రు. ఎస్సీ అభివృద్ధి అధికారి రాజ్‌కుమార్, ము న్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి, తహసీల్దార్లు, ఎంపీడీవోలు పాల్గొన్నారు. అనంతరం పట్టణంలో ని రోటరీ పార్క్ పక్కన రూ.48 లక్షలతో బీటీరోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. అమృత్ స్కీంలో నిధులున్నాయని, అధికారులు పనులను వేగవంతం చేయాలని సూచించారు. డీసీసీ అధ్యక్షుడు నందయ్య, టీపీసీసీ సెక్రటరీ బండ శంకర్, నిమ్మల నాగరాజు, మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం, గట్టు సతీశ్, గోలి శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఉద్యోగం నుంచి బాలల పరిరక్షణ అధికారి తొలగింపు
● ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్ జగిత్యాల: జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎం.హరీశ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో హరీశ్‌పై మహిళాఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు, విధుల్లో ఇబ్బంది పెట్టడం వంటి ఆరోపణలు వచ్చాయి. ఈ విషయాలపై సదరు ఉద్యోగులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇటీవల పనిప్రదేశాల్లో వేధింపుల చట్టం కింద షోకాజ్ నోటీసులు జారీ చేసి పద్ధతి మార్చుకోవాలని ఉన్నతాధికారులు మందలించారు. అయినప్పటికీ ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉద్యోగులు మరోసారి ఫిర్యాదు చేయడంతో ఉన్నతాధికారులు సమగ్ర విచారణ చేపట్టారు. ఆరోపణలు నిజమేనని ఉన్నతాధికారులు తేల్చి నివేదిక అందించారు. పరిశీలించిన కలెక్టర్ డీసీపీవో హరీశ్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన మున్సిపల్ కమిషనర్లుజగిత్యాల/మెట్పల్లి: జగిత్యాల మున్సిపల్ కమిషనర్‌గా సత్యప్రణవ్, మెట్పల్లి కమిషనర్‌గా శ్రీనివాస్‌గౌడ్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. జగిత్యాలలో పనిచేసిన స్పందన బదిలీపై వెళ్లిపోవడంతో గ్రూప్–1 అధికారి సత్యప్రణవ్ కమిషనర్‌గా నియమితులయ్యారు. అలాగే డీఆర్డీఏ జిల్లా సూపరింటెండెంట్ శ్రీనివాస్‌గౌడ్‌ను డిప్యూటేషన్‌పై మెట్పల్లి కమిషనర్‌గా నియమించారు. బాధ్యతలు చేపట్టిన ఆయనను పలు విభాగాల సిబ్బంది శుభాకాంక్షలు తెలిపారు. గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులుజగిత్యాల: గ్యాస్ ధరల పెంపుతో సామాన్యులకు ఇబ్బందులు అని జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. జిల్లా కేంద్రంలో శనివారం మాట్లాడారు. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరలను రూ.993కు పెంచడంతో పేదలపై భారం పడుతుందన్నారు. ఇప్పటికే బీజేపీ ప్రభుత్వం కమర్శియల్ గ్యాస్ ఆరుసార్లు పెంచడం ద్వారా చిన్న హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, టీస్టాల్స్ మూతపడి కుటుంబాలు రోడ్డున పడే అవకాశాలున్నాయన్నారు. కార్మికుల దినోత్సవం రోజున సిలిండర్ ధరలు పెంచి మోదీ సామాన్యుల నడ్డీ విరిచారన్నారు. ఇప్పటికై నా ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. బాధ్యతలు స్వీకరిస్తున్న కమిషనర్ సత్యప్రణవ్ బాధ్యతలు చేపడుతున్న శ్రీనివాస్‌గౌడ్ -
రైతు సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం విఫలం
మెట్‌పల్లిరూరల్: రైతు సమస్యల పరిష్కారంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మెట్పల్లి మండలం జగ్గాసాగర్, ఆత్మకూర్‌లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను శనివారం పరిశీలించారు. కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఆయన అడిషనల్ కలెక్టర్ లతతో ఫోన్లో మాట్లాడారు. కేంద్రాల్లోకి ధాన్యం తెచ్చి రోజులు గడుస్తున్నా ఎందుకు కొనుగోళ్లు చేయడం లేదని, తేమ శాతం వచ్చినా ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు తిప్పలు తప్పడం లేదని విమర్శించారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మారు సాయిరెడ్డి, సర్పంచ్‌లు జగన్‌గౌడ్, రాజారాం, నాయకులు రాజేందర్, నర్సింహులు, అంజయ్య పాల్గొన్నారు. కల్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ కోరుట్ల రూరల్: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కా ర్యాలయంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు అండగా నిలిచేలా కేసీఆర్ అనేక పథకాలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, వివిధ గ్రామాల సర్పంచులు, కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


