జగిత్యాలక్రైం/ధర్మపురి: పశువుల అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టడం జరిగిందని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని సరిహద్దు చెక్‌పోస్టులను ఆకస్మికంగా తనీఖి చేశారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, రాబోయే బక్రీద్ పండుగ దృష్ట్యా గోవులు, దూడలను నిబంధనలకు విరుద్ధంగా తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పశువుల అక్రమ రవాణాకు సంబంధించి ఏదైనా సమాచారం తెలిసిన వెంటనే ప్రజలు సమీప పోలీస్‌స్టేషన్, పోలీసు అధికారులకు తెలియజేయాలని సూచించారు. ఎవరూ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకుండా, నిందితులపై ప్రత్యక్ష దాడులకు పాల్పడకూడదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు గోవధ నివారణ, పశువుల అక్రమ రవాణా అరికట్టేందుకు పోలీసుశాఖకు ప్రజలు సహకరించాలని కోరారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు. డీఎస్పీ పురుషోత్తంరెడ్డి, ధర్మపురి సీఐ రామ్‌నరసింహారెడ్డి, ఎస్సైలు మహేశ్, ఉదయ్‌కుమార్, కృష్ణసాగర్ పాల్గొన్నారు.


