breaking news
Jagitial District Latest News
-
జగిత్యాల
31.0/27.07గరిష్టం/కనిష్టంధర్మపురిలో సందడి ధర్మపురి: ధర్మపురి శ్రీ లక్ష్మినృసింహస్వామి సన్నిధి లో మంగళవారం భాద్రపద కృష్ణపక్షం దశమి సందర్భంగా భక్తుల రద్దీ ఏర్పడింది. గోదావరిలో స్నానా లు ఆచరించి, ఆలయాల్లో మొక్కులు చెల్లించారు.వాతావరణం జిల్లాలో నేడు అక్కడక్కడ వర్షం కురిసే అవకాశం ఉంది. ఎండ తీవ్రత తక్కువగా ఉంటుంది. చలి గాలులు వీస్తాయి. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతాయి.కొండగట్టులో భక్తుల రద్దీ మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. వర్షంలోనూ మొక్కులు చెల్లించుకున్నారు. లడ్డూ, ప్రసాదాలు, దర్శనం టికెట్ల ద్వారా రూ.2.75లక్షల ఆదాయం వచ్చింది.బుధవారం శ్రీ 17 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
సాదాసీదాకు చాన్స్
జగిత్యాల: సాదాబైనామాల క్రమబద్ధీకరణకు జిల్లా రైతులు కొన్నేళ్లుగా ఎదురుచూస్తున్నారు. హైకోర్టు తీర్పుతో మార్గం సుగమం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సాదాబైనామాలు క్రమబద్ధీకరించేందుకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూభారతి చట్టం తేవడంతో సాదాబైనామాల విధివిధానాలపై హైకోర్టు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో సాదాబైనామాల ద్వారా భూమి కొనుగోలు చేసిన రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కాగా, 2020లో దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే ఆయా భూములకు హక్కులు కల్పిస్తూ 13 బీ సర్టిఫికెట్లు అందజేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. తదనంతరం వచ్చిన వారికి అవకాశం దక్కుతుందో లేదో తెలియని పరిస్థితి. ఏళ్ల తరబడి ఎదురుచూపులు సాదాబైనామాలతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసిన రైతులు పంటలు సాగు చేసుకుంటున్నప్పటికీ హక్కులు లేకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. రైతుబంధు, రైతుబీమా.. ఏది కావాలన్నా పట్టాదారు పాస్‌బుక్ కావాల్సి ఉంటుంది. తెల్లకాగితంపై కొనుగోలు చేశాక రిజిస్ట్రేషన్ కాకపోవడంతో మోకాపై ఉన్నా.. విక్రయించిన వారే రైతుబంధుతో పాటు అన్ని ఫలితాలు పొందుతున్నారు. తమకూ ప్రభుత్వ ఫలాలు అందించాలని సాదాబైనామాల ద్వారా కొనుగోలు చేసిన రైతులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లే కుండా పోయింది. తాజాగా కాంగ్రెస్ ధరణి స్థానంలో భూభారతి చట్టాన్ని తీసుకువచ్చి వెసులుబాటు కల్పించింది. సాదాబైనామాలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని హైకోర్టు సైతం సూచించడంతో కొద్దిమేర రైతుల్లో ఆశలు పెరిగాయి. రెవెన్యూ సదస్సుల్లో 9,090 దరఖాస్తులు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూ భారతి పకడ్బందీగా అమలు చేయాలని, సాదాబైనామాలకు సైతం మోక్షం కల్పించారు. ప్రతి సమస్యపై రెవెన్యూ సదస్సులో దరఖాస్తులు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ 2 నుంచి 20వ తేదీ వరకు గ్రామాల్లో సదస్సులు నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. రెవెన్యూ సదస్సుల్లో జిల్లావ్యాప్తంగా సాదాబైనామాలపై 9,090 దరఖాస్తులు వచ్చాయి. ప్రస్తుత 2020 వరకే కటాఫ్ ఇవ్వడంతో, అక్కడి వరకు వచ్చిన సాదాబైనామా దరఖాస్తులే పరిష్కరించనున్నట్లు తెలిసింది. విచారణ షురూ.. సాదాబైనామాల ద్వారా వచ్చిన దరఖాస్తులను ఆర్డీవోస్థాయిలో విచారించనున్నారు. ప్రతి రైతుకు నోటీసులు జారీ చేసి పూర్తిస్థాయిలో విచారించిన అనంతరమే పట్టాలు అందించనున్నారు. ఎలా కొనుగోలు చేశారు, ఎప్పుడు కొనుగోలు చేశారు, అన్ని పూర్తిస్తాయిలో తహసీల్దార్, ఆర్డీవో స్థాయిలో చేపట్టనున్నారు. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం సాదాబైనామాల ప్రక్రియ చేపట్టనున్నట్లు అధికారులు తెలిపారు. సాదాబైనామాల ప్రక్రియ ప్రారంభిస్తున్నట్లు తెలిసింది.జిల్లా వివరాలు రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన సాదాబైనామా దరఖాస్తులు : 9,090 2020లో మీసేవలో వచ్చిన దరఖాస్తులు : 37,730మొత్తం దరఖాస్తులు : 46,820మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారమే సాదాబైనామాల దరఖాస్తులు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం. వచ్చిన దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి విచారణ జరిపిన అనంతరమే చర్యలు తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు దీనిపై సంసిద్ధంగా ఉన్నారు. – లత, అదనపు కలెక్టర్ -
సాంకేతిక విద్య కీలకం
జగిత్యాల/వెల్గటూర్: టీచింగ్, లర్నింగ్ మెటిరియల్ ద్వారా పాఠాలు సులభతరంగా అర్థమవుతాయని కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. జిల్లాకేంద్రంలోని పొన్నాల గార్డెన్స్‌లో టీచింగ్, లర్నింగ్ మెటిరియల్ సందర్శన కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. రోజురోజుకు సాంకేతికత వేగంగా విస్తరిస్తున్నందున విద్యార్థులకు సాధారణ విద్యతో పాటు, సాంకేతిక విద్య సైతం ఎంతో అవసరమని అన్నారు. జిల్లాలోని ప్రతి మండలంలోని 10 మంది విద్యార్థులు బెస్ట్ టీఎల్ఎంల ద్వారా 200 ప్రదర్శనలు ఇవ్వడం అభినందనీయమన్నారు. స్టేట్‌లెవల్ ప్రదర్శనకు జిల్లా నుంచి ఎనిమిది మందిని ఎంపిక చేసి పంపిస్తామని డీఈవో రాము తెలిపారు. కిషన్రావుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు జి.మునీంద్ర ప్రదర్శించిన టీఎల్ఎం రాష్ట్రస్థాయి మేళాకు ఎంపికై నట్లు మండల విధ్యాధికారి బోనగిరి ప్రభాకర్ తెలిపారు. మునీంద్రను కలెక్టర్ సత్యప్రసాద్, డీఈవో కె.రాము అభినందించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజాగౌడ్, కో ఆర్డినేటర్లు పాల్గొన్నారు. గోదాముల వద్ద పటిష్ఠ భద్రత ఈవీఎం గోదాముల వద్ద పటిష్ఠ భద్రత ఉందని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మంగళవారం ధరూర్ క్యాంప్‌లోని ఈవీఎంల గోదాంలను పరిశీలించారు. నిత్యం అప్రమత్తతో పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, ఆర్డీవో మధుసూదన్, ఎన్నికల పర్యవేక్షకులు ఏవో హకీం, జగిత్యాల అర్బన్ తహసీల్దార్ రాంమోహన్ పాల్గొన్నారు. -
ఎస్సారెస్పీ 36 గేట్లు ఎత్తివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో, ప్రాజెక్టు నుంచి 36 గేట్లను ఎత్తి 2,32,128 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 1.39 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. 2.48 లక్షల క్యూసెక్కులు ఔట్‌ఫ్లో వెళ్తోంది. వరద కాల్వకు 6,735 క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4వేల క్యూసెక్కులు, ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కులు, సరస్వతి కెనాల్‌కు 800 క్యూసెక్కులు, లక్ష్మి కెనాల్‌కు 200 క్యూసెక్కులు, అలీసాగర్ ఎత్తిపోతల పథకానికి 180 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఘాట్లను తాకిన గోదారమ్మ ధర్మపురి: కొద్ది రోజుల పాటు శాంతించిన గోదా వరి నది మంగళవారం మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎస్సారెస్పీ నుంచి వరద వస్తుండడంతో ధర్మపరి, రాయపట్నం వద్ద నీటిమట్టం భారీగా పెరిగింది. సంతోషిమాత, మంగలిగడ్డ పుష్కరఘాట్లపైకి చేరింది. పిండ ప్రదానాలు చేసే షెడ్డు 50శాతం నీటిలో మునిగింది. భక్తులు స్నానాలకోసం లోనికి వెళ్లకుండా పోలీసు, మున్సిపల్‌శాఖలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. -
ర్యాగింగ్ చట్టరీత్యా నేరం
జగిత్యాలక్రైం: ర్యాగింగ్ చట్టరీత్య నేరమని, విద్యార్థి దశ ఎంతో విలువైనదని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. జగిత్యాల పట్టణంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల విద్యార్థులకు ర్యాగింగ్‌తో కలిగే దుష్ప్రభావాలపై మంగళవారం ఐఎంఏ హాల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు ర్యాగింగ్ వంటి అనైతిక చర్యలకు పాల్పడొద్దని, అలాంటివారిపై కఠిన చర్యలు తప్పవన్నారు. విద్యార్థులు స్నేహపూర్వక వాతావరణంలో చదువుకోవాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్ పెద్ద నేరమని, బాధిత విద్యార్థుల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. ర్యాగింగ్ చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు తమ భవిష్యత్‌ను కోల్పోయిన సంఘటనలు ఎన్నో ఉన్నాయన్నారు. అలాంటివి జగిత్యాల జిల్లాలో ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదన్నారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం జైలుశిక్ష, కళాశాల నుంచి బహిష్కరణ, స్కాలర్షిప్ రద్దు, ఉద్యోగ అవకాశాలు కోల్పోవడం వంటి తీవ్ర శిక్షలు ఉంటాయన్నారు. ఎవరైనా ర్యాగింగ్ బాధితులుగా మారితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. కళాశాలలో యాంటి ర్యాగింగ్ కమిటిలను ఏర్పాటు చేయాలని అధ్యాపకులకు సూచించారు. అనంతరం ర్యాగింగ్‌తో కలిగే పరిణామాలపై విద్యార్థులను ప్రశ్నలు అడిగి, వారి అవగాహనను పరీక్షించారు. సమాధానం చెప్పిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. డీఎస్పీ రఘుచందర్, టౌన్ సీఐ కరుణాకర్, నర్సింగ్ కళాశాల సూపరింటెండెంట్ రాజ్‌గోపాల్ పాల్గొన్నారు. -
సమస్యలుంటే దృష్టికి తీసుకురండి
జగిత్యాల: పాఠశాలల్లో ఏదైనా సమస్యలుంటే తన దృష్టికి తేవాలని, ప్రభుత్వం, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మైనార్టీ గురుకుల బాలుర పాఠశాలను మంగళవారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనం విషయంలో నిర్లక్ష్యంగా ఉండకూడదని, మెనూ ప్రకారం అందించాలని, ఇబ్బందులకు గురిచేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాంప్లెక్స్ జిల్లాకు మంజూ రు చేసుకోవడం జరిగిందన్నారు. మాజీ ము న్సిపల్ చైర్మన్లు గిరి నాగభూషషణం, జ్యోతి, అబ్దుల్ ఖాదర్, ముజాహిద్ పాల్గొన్నారు. మహిళ ఆరోగ్యంతోనే శక్తివంతమైన కుటుంబం జగిత్యాల: కుటుంబంలోని మహిళ ఆరోగ్యంతోనే శక్తివంతమైన జీవితం సాధ్యమవుతుంద ని, కుటుంబం ఆనందంగా ఉంటుందని డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ తెలిపారు. మంగళవారం డీఎంహెచ్‌వో కార్యాలయంలో వివిధవిభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఈనెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ఆరోగ్య మహిళ శక్తివంతమైన కుటుంబం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి మోదీ మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వర్చువల్‌గా ప్రారంభిస్తారని, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ చేతుల మీదుగా ప్రారంభిస్తారన్నారు. మహిళ ఆరోగ్యం కోసం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి, కమ్యునిటీ హెల్త్‌సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో స్పెషలిస్ట్ వైద్య నిపుణులతో శిబిరాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్, డీఈవో రాము పాల్గొన్నారు. ఉపాధ్యాయుడి డిప్యూటేషన్ రద్దు చేయాలి కథలాపూర్: కథలాపూర్ ఎంఈవో కార్యాలయం ఎదుట మండలంలోని పోసానిపేట ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం నిరసన వ్యక్తం చేశారు. పాఠశాలలో పనిచేస్తున్న కరుణాకర్ అనే ఉపాధ్యాయుడిని ఇతర పాఠశాలకు డిప్యూటేషన్ వేయడం సరికాదన్నారు. పాఠశాలలో 128 మంది విద్యార్థులు, ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్నారన్నారు. ఒకరు వచ్చేనెలలో ఉద్యోగవిరమణ పొందుతున్నారని, ఒక ఉపాధ్యాయుడిని డిప్యూటేషన్‌పై పంపిస్తే కొరత ఏర్పడుతుందన్నారు. ఉన్నతాధికారులు చొరవ చూపి డిప్యూటేషన్ రద్దు చేయాలని ఎంఈవో శ్రీనివాస్‌కు వినతిపత్రం ఇచ్చారు. కాగా.. నిబ ంధనల ప్రకారం ఉపాధ్యాయుల డిప్యూటేషన్ జరిగిందని ఎంఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. ఆరోగ్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలి జగిత్యాల: విద్యార్థుల కోసం వైద్యశాఖ ఆధ్వర్యంలో స్వస్థ నారి స్వశక్తి పథకం కింద ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని డీఈవో రాము తెలిపారరు. నేటి నుంచి ప్రారంభం కానున్న శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్క విద్యార్థి అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ‘ఇంకెన్నాళ్లు విద్యార్థుల ఇక్కట్లు’ జగిత్యాల: విద్యార్థుల ఉద్యమాలతో తెలంగాణ సాధించుకున్నామని, ఇప్పుడు చదువు కోసం ఇక్కట్లు పడుతున్నారని మాజీ జెడ్పీచైర్‌పర్సన్ వసంత అన్నారు. మంగళవారం మాట్లాడుతూ విద్యార్థుల విషయంలో ప్రభుత్వం వివక్ష, నిర్లక్ష్యం చూపడం సమంజసం కాదన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్య అందని ద్రాక్షగా మారిందన్నారు. ఇప్పటి వరకు పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్మెంట్, ఎంపీఎఫ్ బకాయిలు వెంటనే చెల్లించాలన్నారు. -
నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్
కరీంనగర్‌టౌన్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఆరోగ్యశ్రీ సేవలు బుధవారం నుంచి పూర్తిస్థాయిలో నిలిచిపోనున్నాయి. ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడం కారణంగానే సేవలు నిలిపివేస్తున్నట్లు ఆసుపత్రుల యాజమాన్యాలు ప్రకటించాయి. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖనరెడ్డి పుణ్యమాని 17 సంవత్సరాలుగా నిరుపేద, మధ్యతరగతి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందగా, ఈ ఏడాదిలోనే జనవరిలో ఒకసారి సేవలు నిలిపివేశారు. అయినప్పటికీ బిల్లుల పంచాయితీ తేలకపోవడంతో మరోమారు సేవల నిలిపివేతకు నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. రోడ్డు ప్రమాదాలు, గుండె సమస్యలు, అపెండైసిస్ లాంటి అత్యవసర సేవలకు తీవ్ర అవస్థలుపడే పరిస్థితి ఏర్పడనుంది. గతంలో ఈ పథకం కింద ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి పేదలకు ఉచితంగా ఓపీ, రక్తపరీక్షలు, ఆపరేషన్లు నిర్వహించే వారు. ఇందుకోసం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజును నేరుగా ఆసుపత్రుల ఖాతాల్లోకే జమ అయ్యేవి. కొంత కాలంగా బకాయిలు పెరిగిపోవడంతో నిర్వహణ భారమైన ఆసుపత్రులు ఈ నిర్ణయం తీసుకోవడంతో వైద్యం నిరుపేదలకు అందని ద్రాక్షగా మారింది. ఉమ్మడి జిల్లాలో 49 ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు ఉండగా, అందులో 32 ప్రైవేటు ఆసుపత్రులు ఉన్నాయి. ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రభుత్వ, ప్రైవేటు బోధనాసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులైన అపోలోరీచ్, మెడికవర్ మినహా అన్ని ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయనున్నాయి. దీంతో రోగులు ప్రైవేటు బోధనాసుపత్రులకు పరుగులు తీసే అవకాశం ఉంది. ఆసుపత్రులన్నీ ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయడంతో ప్రైవేటు బోధనాసుపత్రులకు, కార్పొరేట్ ఆసుపత్రులకు రోగుల తాకిడి పెరగనుంది. ఉమ్మడి జిల్లాలో ప్రతీ రోజు సుమారు 70 మందికి పైగా ఆరోగ్యశ్రీ పథకం కింద ఆసుపత్రులలో చికిత్స పొందేవారు. సేవలు నిలిపివేస్తుండడంతో ప్రభుత్వ తీరు, ఆసుపత్రుల వ్యవహారశైలిపై రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
తలవంచిన నిరంకుశత్వం
బాంచెన్ కాల్మొక్త అన్న సామాన్యులే.. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం బందుకూతో గడి పునాదులను పెకిలించారు.. నిజాం నిరంకుశ పాలనలో మగ్గిపోతున్న తెలంగాణ ప్రజల విముక్తి కోసం కదంతొక్కారు.. జాగిరీదారులు, మక్తేదారులు, ఇనాందారులు, వతన్‌దారుల దుర్మార్గాలు, దౌర్జన్యాలపై పోరాటం సాగించారు..ఎందరో రజకార్లను తరిమికొట్టారు.. తెలంగాణ సాయుధ పోరాటంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా కీలక పాత్ర పోషించింది. అందులో ఇప్పటి రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రాంతం మడమతిప్పని పోరాటం సాగించింది.. బానిస సంకెళ్ల విముక్తి కోసం ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా వదిలారు. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా పలువురు యోధుల కథనాలు. – కరీంనగర్/సిరిసిల్ల/ఇల్లంతకుంట /పెద్దపల్లి రూరల్/బోయినపల్లి/మంథని రూరల్ -
ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డు ఆత్మహత్య
చొప్పదండి: మండలంలోని రుక్మాపూర్ గ్రామానికి చెందిన ముద్దసాని కనకయ్య(46) ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు... కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో హోంగార్డుగా పనిచేస్తున్న కనకయ్య ఆర్థిక ఇబ్బందులు తాళలేక జీవితంపై విరక్తి చెంది ఆదివారం రాత్రి ఆరుబయట పురుగుల మందు తాగి పడిపోయాడు. స్థానికులు గమనించి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందాడని వైద్యులు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. వేములవాడ: పట్టణంలోని భగవంతరావునగర్‌లో చల్లా లక్ష్మి(75) అనే వృద్ధురాలు సోమవారం బాత్రూమ్లో ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృతురాలికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. ఆరేళ్ల క్రితం భర్త చనిపోవడంతో లక్ష్మి ఒంటరిగా ఉంటున్నట్లు బంధువులు తెలిపారు. వృద్ధాప్యంతోపాటు ఒంటరిగా ఉంటున్న తాను మానసికస్థితి తట్టుకోలేక ఇంట్లోని బాత్రూమ్లో ఉరివేసుకుంది. పెద్దకొడుకు గంగాధర్ తన తల్లి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరప్రసాద్ తెలిపారు. జగిత్యాలక్రైం: పట్టణంలోని కరీంనగర్‌రోడ్‌లో అట్ల శ్రీకాంత్‌ను బీరుసీసాతో పొడిచి హత్యకు ప్రయత్నించిన సందీప్, సమీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ సీఐ కరుణాకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని అంగడిబజార్‌కు చెందిన శ్రీకాంత్, గోవిందుపల్లికి చెందిన సందీప్ ఓ పంచాయితీ విషయంలో ఆదివారం రాత్రి మాట్లాడుకుంటున్నారు. ఈక్రమంలోనే సందీప్‌తోపాటు సమీర్ ఆగ్రహంతో బీరుసీసా పగులగొట్టి శ్రీకాంత్‌పై దాడిచేసి పారిపోయారు. శ్రీకాంత్ సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు సందీప్‌తోపాటు సమీర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
ఆసరా పింఛన్లు పెంచేవరకూ ఆందోళన
జగిత్యాలరూరల్: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ఆసరా పింఛన్లు పెంచాలని, లేకుంటే ఆందోళన చేస్తామని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు దుమాల గంగారాం అన్నారు. జగిత్యాల అర్బన్, రూరల్ తహసీల్దార్ కార్యాలయాల ముందు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ అధికారంలోకొస్తే పింఛన్‌ను రూ.4వేలకు పెంచుతామని 22 నెలలు గడిచినా ఇప్పటివరకు అమలు చేయడంలేదన్నారు. వీఎస్పీఎస్ జిల్లా కార్యదర్శి గౌరిశెట్టి చంద్రశేఖర్, ఎంఎస్సీ జిల్లా ఉపాధ్యక్షుడు బోనగిరి కిషన్, ఎమ్మార్పీఎస్ నాయకులు బొల్లారపు దివాకర్, నక్క సతీశ్, సుధాకర్, సునిల్, గంగు, లక్ష్మీ, శ్రావణి పాల్గొన్నారు. -
పొలాస శివారులో ఒకరి హత్య
జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం పొలాస.. గుల్లపేట గ్రామాల శివారులో జిల్లాకేంద్రంలోని సుతారిపేటకు చెందిన ఎండీ.నయీమోద్దీన్ (37) హత్యకు గురయ్యాడు. అతడిని గుర్తుతెలియని వ్యక్తులు హత్యచేసి రోడ్డు పక్కనున్న నీటి కాల్వలో పడేసి వెళ్లారు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. నయీమోద్దీన్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి పాతబస్టాండ్ సమీపంలో ఇద్దరు వ్యక్తులను ఆటోలో ఎక్కించుకుని వెళ్లిపోయిన అతడు తిరిగి ఇంటికి వెళ్లలేదు. సోమవారం ఉదయం పొలాస, గుల్లపేట వెళ్లే రహదారిలో శవమై కనిపించాడు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సదాకర్ సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. సంఘటన స్థలానికి డాగ్‌స్క్వాడ్, ఫింగర్ ప్రింట్స్ సిబ్బందిని రప్పించి అణువణువునా తనిఖీ చేశారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతుడి సోదరుడు ఇసాకోద్దీన్ ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసిన పోలీసులు.. నిందితుల కోసం గాలిస్తున్నారు. మాజీమంత్రి జీవన్‌రెడ్డి సంఘటన స్థలానికి వెళ్లి పోలీసులతో మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకోవాలని కోరారు. -
పెట్రోల్ బాటిళ్లతో ప్రజావాణికి..
● అడ్డుకున్న పోలీసులు చెరువులపై ఆధారపడి జీవించే తమకు వాటిపై హక్కులు కల్పించాలని డిమాండ్ చేస్తూ మెట్పల్లి మండలం కోనరావుపేటకు చెందిన గంగపుత్రులు ప్రజావాణికి పెట్రోల్ బాటిళ్లతో వచ్చారు. పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. కొండ్రికర్ల చెరువుపై ముదిరాజ్‌లు ఆధిపత్యం చలాయిస్తున్నారని, కొన్నేళ్ల క్రితం 44ఎకరాలుగా గుర్తించిన చెరువు విస్తీర్ణాన్ని 2023లో తమ సొసైటీకి సమాచారం ఇవ్వకుండానే రీసర్వే చేసి 92ఎకరాలు ఉన్నట్లు తప్పుగా చూపించారని ఆరోపించారు. రాజకీయ ఒత్తిళ్లతో ముదిరాజులకు సభ్యత్వాలు ఇస్తున్నారని తెలిపారు. పట్టణ సీఐ కరుణాకర్ సముదాయించి అక్కడి నుంచి పంపించివేశారు. -
రోడ్డు మరమ్మతు చేయించండి
ఇటీవల కురిసిన వర్షాలకు జగిత్యాల రూరల్ మండలం చల్గల్లోని రామాలయం, పంట పొలాల వైపు వెళ్లే దారి పూర్తిగా చెడిపోయింది. రామాలయం వెళ్లే భక్తులు, పొలాలకు వెళ్లే రైతులం ఇబ్బంది పడుతున్నాం. దారికి మరమ్మతు చేయించి ఆదుకోండి. – చల్గల్ గ్రామస్తులు వ్యాపారాలు సాగేలా చూడాలి జగిత్యాల కూరగాయల మార్కెట్లో 50 ఏళ్లుగా ప్రభుత్వం కేటాయించిన స్థలంలో వ్యాపారాలు చేసుకుంటున్నం. ఇటీవల కొందరు మార్కెట్ స్థలాన్ని కబ్జా చేసేందుకు యత్నిస్తూ మమ్మల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. అలాంటి వారి నుంచి మాకు రక్షణ కల్పించండి. – మార్కెట్ డెలీ వెండర్స్ -
నా జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని చూడలేదు
హుజూరాబాద్: ‘నా పాతికేళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి ప్రభుత్వాన్ని ఎన్నడూ చూడలేదని, ప్రభుత్వ మాటలకు చేతలకు పొంతన లేదు..’ అని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ విమర్శించారు. హుజూరాబాద్‌లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రశ్నిస్తే అరెస్టులు, కేసులు పెడుతున్నారన్నారు. మీడియాను మేనేజ్ చేసి ఓర్లాపింగ్ టెక్నిక్‌తో నెట్టుకొస్తున్నారన్నారు. రూ.9వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలతో విద్యార్థుల చదువులు బలిపీఠంపై ఎక్కాయని ఆవేదన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో గురుకుల పాఠశాలలో సమయానికి డైట్ చార్జీలు చెల్లించక వారు అస్వస్థతకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా విద్యారంగానికి ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. సంవత్సరానికి దాదాపు రూ.3వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఖర్చు అవుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఫీజులు చెల్లిస్తుందన్నారు. సోషల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్, రెసిడెన్షియల్ స్కూల్స్‌లలో డైట్ చార్జీలు ఆరు నెలలుగా ఇవ్వడం లేదన్నారు. విద్యార్థులకు రూ.5లక్షల కార్డు ఇస్తామన్నా హామీ ఎటు పోయిందని ప్రశ్నించారు. మాజీ ఎమ్మెల్యే బొడిగే శోభ, నాయకులు గౌతంరెడ్డి, బండి కళాధర్, వెంకట్‌రెడ్డి, సంపత్‌రావు, సురేందర్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, కరుణాకర్, సురేందర్‌రాజు, సుదర్శన్‌రెడ్డి, శ్రీరామ్ శ్యామ్, తిరుపతి, కరుణాకర్, రత్నాకర్, సుమన్ పాల్గొన్నారు. రామగుండం: పెద్దపల్లి జంక్షన్ నుంచి తిరుచానూరు(తిరుపతి)కి ఈనెల 30వ తేదీ వరకు ఫెస్టివల్ స్పెషల్ రైలు నడుపుతామని దక్షిణ మధ్య రైల్వేశాఖ ప్రకటించింది. నాందేడ్ – తిరుచానూరు (రైలు నంబరు 07039) మధ్య ప్రతీ మంగళవారం, తిరుచానూరు – నాందేడ్(07040) మధ్య ప్రతీ బుధవారం ప్రత్యేక రైలు నడుస్తుంది. ముద్కేడ్, బాసర, నిజామా బాద్, ఆర్మూర్, లింగంపేట, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, మధి ర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూ రు, రేణిగుంట రైల్వేస్టేషన్లలో హాల్టింగ్ ఉంది. మెట్పల్లి: తనకు బాకీ ఉన్న డబ్బులు ఇవ్వాలని అడిగిన యువకుడిపై కత్తితో దాడి చేసిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. పట్టణానికి చె ందిన ఎనగందుల గణేశ్ కొంతకాలం క్రితం జగిత్యాలలోని మిర్యాల్కర్ రాజేశ్వర్ మటన్ దుకాణంలో పని చేశాడు. ఆ సమయంలో బకా యి ఉన్న రూ.5వేల గురించి ఆదివా రం అతడికి ఫోన్ చేసి అడిగాడు. దీనికి ఆగ్రహించిన రాజేశ్వర్.. దుర్భషలాడుతూ అంతు చూస్తానని బెది రించాడు. సాయంత్రం విష్ణు, నిఖిల్‌తో కలిసి మెట్‌పల్లిలోని గణేశ్ ఇంటికి వచ్చాడు. అతడు లేకపోవడంతో ఇంట్లో వాళ్లని తిట్టి వెళ్లిపోయాడు. రాత్రి సమయంలో బస్ డిపో చౌరస్తాలో గణేశ్ తన మిత్రులతో ఉండగా.. అక్కడకు వచ్చి ముగ్గురూ అతనితో గొడవకు దిగారు. రాజేశ్వర్ తన వెంట తెచ్చుకున్న కత్తి తో గణేశ్ కడుపులో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. గాయపడిన గణేశ్‌ను మొదట స్థానిక ప్రభుత్వాసుపత్రికి.. అక్కడినుంచి నిజామాబాద్ తరలించారు. గణేశ్ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మాటలకు, చేతలకు పొంతన లేదు యూరియా పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ -
బీఆర్ఎస్ వారినే తొలగించారు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన సొసైటీ చైర్మన్, పాలకవర్గాలను మాత్రమే తొలగించారు. అన్ని సొసైటీల్లో చిన్నచిన్న అవకతవకలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీ చైర్మన్లు ఉన్న సొసైటీల్లో ఏ చిన్న అవకతవకలు జరగలేదా..? అధికార పార్టీ నాయకులకు తలొగ్గే అధికారులు ఇదంతా చేస్తున్నారు. – శ్రీకాంత్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ సొసైటీల నిర్వహణ సరిగా లేకనే రాష్ట్ర సహకారశాఖ ఆదేశాలు అమలు చేశాం. నిర్వహణ సరిగ్గా లేని సొసైటీ పాలకవర్గాలను పొడిగించవద్దంటూ ప్రభుత్వ ఆదేశాలున్నాయి. ఆ మేరకు రద్దయిన ఆయా సొసైటీలకు పర్సన్ ఇన్చార్జిలను నియమించాం. మాపై ఏ పార్టీ ఒత్తిడి లేదు. ఎవరి ఒత్తిళ్లకూ తలొగ్గం. – సీహెచ్.మనోజ్‌కుమార్, జిల్లా సహాకారశాఖాధికారి -
ఘనంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు
ధర్మపురి/మల్యాల:ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి, మల్యాలలోని కొండగట్టు ఆలయాల్లో శ్రీకృష్ణాష్ఠమి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. నృసింహస్వామి ఆలయ ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్వామివారలకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ, ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంజన్న ఆలయ రాజగోపురం ఎదుట అర్చకులు, భక్తులు, వేద పాఠశాల విద్యార్థులు ఉట్టి కొట్టారు. శ్రీకృష్ణుడికి పంచామృతాభిషేకం, 56 రకాల మహా నైవేద్యం సమర్పించారు. -
రేపటి నుంచి పోషణ మహోత్సవం
జగిత్యాల: చిన్నారులు, మహిళలకు పోషకాహారంపై అవగాహన కల్పించేందుకు ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు పోషణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. సోమవారం అన్ని శాఖల అధికారులతో సమీక్షించారు. జంక్‌ఫుడ్ వినియోగాన్ని తగ్గించడంతోపాటు, చక్కెర, ఉప్పు, నూనె వాడకం పరిమితంగా వాడాలని సూచించారు. ప్రతి ఐసీడీఎస్ ప్రాజెక్ట్‌కు రూ.30వేల నుంచి రూ.50వేల చొప్పున నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. అదనపు కలెక్టర్ రాజాగౌడ్, సంక్షేమాధికారి నరేశ్, గ్రామీణాభివృద్ధి అధికారి రఘువరణ్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్ పాల్గొన్నారు. ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం జగిత్యాల: స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ నిర్వహణకు అధికారులు ససిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అన్నారు. కలెక్టర్లతో సోమవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎస్ఐఆర్ నిర్వహణపై మాస్టర్ ట్రైనర్ల ద్వారా బూత్‌స్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌స్థాయిలో 2002 ఎస్ఐఆర్ డేటా.. 2025డేటాతో సరిచూసుకోవాలన్నారు. రిటర్నింగ్ అధికారులు ఏఈఆర్వో, డిప్యూటీ తహసీల్దార్లతో నిత్యం సమావేశం కావాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
కొడుకు పట్టించుకోవడం లేదని వృద్ధుడి ఆత్మహత్యాయత్నం
సిరిసిల్ల అర్బన్: కొడుకు, కోడలు పట్టించుకోవడం లేదని రాజన్నసిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో ఓ వృద్ధుడు పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బాధితులు తెలిపిన వివరాలు. అజ్మీర విఠల్, వీరవ్వ దంపతులు ముప్పై ఏళ్ల క్రితం వీర్నపల్లి మండలం నుంచి రుద్రంగికి వలస వచ్చారు. ఇక్కడే 2.35 ఎకరాల భూమిని కొనుగోలు చేసి, ఇల్లు కట్టుకున్నారు. వీరికి ఒక కుమారుడు అజ్మీర నరేశ్, కూతురు ఉన్నారు. కొడుకు నరేశ్‌కు 10 నెలల క్రితం పెళ్లి చేశారు. కొద్ది రోజులు బాగానే ఉన్నా ప్రస్తుతం కొడుకు, కోడలు వారిని పట్టించుకోవడం లేదు. ఇంట్లో నుంచి గెంటివేశారు. ఈ విషయమై పెద్ద మనుషులు, పోలీసుల సమక్షంలో పంచాయితీ పెట్టినా.. తమకు న్యాయం జరగడం లేదని వాపోయారు. ఈనెల ఒకటో తేదీన ప్రజావాణిలోనూ ఫిర్యాదు చేశారు. ఎవరూ పట్టించుకోవడం లేదని తీవ్ర మనస్థాపానికి గురైన విఠల్ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణికి వచ్చి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కలెక్టర్, జిల్లా అధికారులు వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం కలెక్టర్ వాహనంలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విఠల్ పరిస్థితి అదుపులోనే ఉందని వైద్యులు తెలిపారు. సిరిసిల్ల కలెక్టరేట్లో ఘటన ఆస్పత్రికి తరలించిన అధికారులు -
‘విండో’ పదవీకాలం పొడిగింపులో రాజకీయం
జగిత్యాలఅగ్రికల్చర్: సింగిల్ విండో సొసైటీలపై రాజకీయం అలుముకుంది. పాలకవర్గం ఐదేళ్ల కాలపరిమితి ముగిసినప్పటికీ.. సకాలంలో ఎన్నికలు నిర్వహించక.. ఆర్నెళ్లచొప్పున పొడిగించడం వివాదాలకు దారి తీస్తోంది. ఇటీవల రెండోసారి పొడిగించిన ప్రభుత్వం.. కొన్ని పాలకవర్గాలను తిరిగి కొనసాగించగా.. మరికొన్నిటిని రద్దు చేసింది. వారి స్థానంలో సహకార అధికారులను పర్సన్ ఇన్చార్జిగా నియమించింది. బీఆర్ఎస్ పార్టీ పాలకవర్గం ఉన్నచోట మాత్రమే తొలగించి.. అధికార పార్టీ పాలకవర్గాలను పొడిగించారంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో జెడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, రద్దయిన పాలకవర్గాల చైర్మన్లు కలెక్టర్ సత్యప్రసాద్‌కు సోమవారం ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. ముగిసిన 51 సొసైటీల పదవీకాలం జిల్లాలో 51 సింగిల్ విండో సొసైటీలు ఉన్నాయి. వీటి పాలకవర్గ పదవీకాలం ఈ ఏడాది ఫిబ్రవరితో ముగిసింది. ఆ సమయంలో అన్ని సొసైటీల పాలకవర్గాలను ఆగస్టు 14 వరకు పొడిగించింది. అప్పటికీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో మరోసారి ఆర్నెళ్లు పొడిగించింది. ఈ సమయంలోనే సొసైటీలను రాజకీయం చుట్టుముట్టింది. ప్రస్తుత ప్రభుత్వానికి అనుకూలంగా లేని సొసైటీ పాలకవర్గాలను మాత్రమే తొలగించి పర్సన్ ఇన్చార్జిలను నియమించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అవినీతి ఆరోపణల సాకుతో రద్దు.. అన్ని సొసైటీల్లో ఏదోరకమైన అవినీతి ఆరోపణలు ఉంటాయి. కానీ.. కాంగ్రెస్ నాయకులు ఉన్న పాలకవర్గాలపై అవినీతి ఆరోపణలు లేవని, సంఘం అ భివృద్ధి దిశలో ఉందని, ఆ సంఘాల పదవీకాలన్ని పొడిగించారని, సంఘాలు అభివృద్ధి దిశలో ఉన్నప్పటికీ.. చైర్మన్లు, డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారనే నెపంతోనే ఆ సంఘాల పదవీకాలాన్ని పొడిగించలేదని రద్దయిన చైర్మన్లు అంటున్నారు. సహకార శాఖ అధికారులు లేని కారణాలు చూపుతూ పాలకవర్గాలు రద్దయిన సొసైటీలకు నోటీసులు పంపడం వివాదానికి దారితీస్తోంది. రద్దుకు అధికారులు చూపించిన కారణాలివే.. కొన్ని సొసైటీల పాలకవర్గాల పదవీకాలాన్ని పొడిగించకుండా సహకార శాఖ అధికారులు చూపించి న కారణాలు చూస్తే విస్తుపోవాల్సిందే. సొసైటీల్లో సభ్యులు తీసుకున్న రుణాలను పాలకవర్గాలు రికవ రీ చేయించలేదని, వారి పేర్లు ప్రకటించలేదని, రికవరీ యాక్షన్ అమలు చేయలేదని, సొసైటీ ఫైనాన్సి యల్ మేనేజ్మెంట్ సరిగ్గా లేదని, ఆడిట్ రిపోర్టులో తప్పులు చూపించినా సరిదిద్దుకోలేదని, ఏడాది ఆదాయం, వ్యయం రిపోర్టులు సమర్పించలేదని, కుటుంబసభ్యులకు రుణాలు ఇప్పించారని, ధా న్యం కొనుగోలులో గన్నీసంచుల వ్యవహారంలో ని ర్లక్ష్యం ప్రదర్శించారని, ఎప్పటికప్పుడు సొసైటీ కరెంట్ అకౌంట్ బుక్స్ మెయింటైన్ చేయలేదని.. ఇలా చిన్నచిన్న కారణాలతోనే పదవీకాలాలను రద్దు చేసి పర్సన్ఇన్చార్జిలను నియమించారు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితోనే అధికారులు ఈ తతంగం నడిపిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. ఒత్తిడితో నాలుగు సొసైటీలకు మినహాయింపు జిల్లాలోని 23 సొసైటీల పాలవర్గాలను తొలగించి రెండురోజుల క్రితం పర్సన్ ఇన్చార్జిలను నియమించారు. ప్రకటన వెలువడిన వెంటనే తనకు తెలియకుండా ఎలా చేశారు..? పర్సన్ ఇన్చార్జిలను నిలిపివేయండి.. అంటూ అధికారులకు అధికార పార్టీ నాయకుడొకరు గట్టిగా చెప్పడంతోనే జగిత్యాల, కల్లెడ, భూపతిపూర్, ఇటిక్యాల సొసైటీలకు మినహాయింపు వచ్చినట్లు సమాచారం. మల్లాపూర్ మండలంలో నాలుగు సొసైటీలు ఉండగా.. ఒక సొసైటీ చైర్మన్ ఇటీవల కాంగ్రెస్‌లో చేరడంతో ఆయన సొసైటీని వదిలి.. మిగిలిన పాలకవర్గాలను రద్దు చేసినట్లు వినికిడి. -
పోలీస్ గ్రీవెన్స్‌కు 12 దరఖాస్తులు
జగిత్యాలక్రైం: బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడుతున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో గ్రీవెన్స్ నిర్వహించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 12 మంది వారివారి సమస్యలపై దరఖాస్తు చేసుకోగా.. వారితో నేరుగా మాట్లాడారు. పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. పోలీస్ శాఖను ప్రజలకు మరింత చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. హక్కుల సాధనకు ఉద్యమించాలికోరుట్లటౌన్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో అమరులైన యోధుల స్ఫూర్తితో హక్కుల సాధనకు ఉద్యమించాలని ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు సుతారి రాములు అన్నారు. స్థానిక సినారే కళాభవన్, మున్సిపల్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్, మున్సిపల్ కార్మికులతో సోమవారం సమావేశమయ్యారు. సాయుధ పోరాటంలో అమరులకు నివాళులర్పించారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షురాలు ఎం.సాయీశ్వరి, ప్రధాన కార్యదర్శి నండూరి కర్ణకుమారి, సుమలత, పద్మ, గంగమణి, హిమగిరి తదితరులు పాల్గొన్నారు. ఎస్సారెస్పీ 22 గేట్ల ఎత్తివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి 1.28లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండటంతో 22 గేట్లు ఎత్తి 89,860 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. వరదకాలువకు ఎనిమిది వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు నాలుగు వేలు, ఎస్కేప్ గేట్ల ద్వారా ఐదు వేలు, సరస్వతి కెనాల్‌కు 800, లక్ష్మి కెనాల్‌కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 180, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలిజగిత్యాలటౌన్: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బా బు డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ జన్మదినం సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. అప్పటి కేంద్ర హోంమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ సైనిక చర్యతో 1948లో తెలంగాణకు విముక్తి లభించందని గుర్తు చేశారు. దశరథరె డ్డి, భూ మి రమణకుమార్, వడ్డెపెల్లి శ్రీనివాస్, జుంబర్తి దివాకర్, కొక్కు గంగాధర్ పాల్గొన్నారు. దైవభక్తుడికి స్వాగతంకొడిమ్యాల: మండలకేంద్రానికి చెందిన వెలమ నర్సింహారెడ్డి సైకిల్‌పై 108 పుణ్యక్షేత్రాలను దాదాపు 22వేల కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణం పూర్తి చేసుకుని స్వగ్రామానికి చేరుకున్నారు. ఆయనకు శ్రీవేంకటేశ్వర స్వామి ఆ లయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు స్వాగతం పలికారు. ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ నర్సింహారెడ్డిని ఘనంగా సన్మానించారు. -
మాస్టర్‌ప్లాన్‌తో అభివృద్ధి
ఓదెల మల్లికార్జునస్వామి దేవస్థానం అభివృద్ధికి కలెక్టర్ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు, పా లకవర్గం ఆధ్వర్యంలో మాస్టర్‌ప్లా న్ అమలు చేయాలని నిర్ణయించారు. పా లకవర్గం కూడా తీర్మా ణం చేసింది. నిధుల మంజూరు కోసం సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి ఎమ్మెల్యే ఈ విషయాన్ని తీసుకెళ్లనున్నారు. – సదయ్య, ఈవో, ఓదెల మల్లన్న ఆలయం ఓదెల మల్లన్న దర్శనం కోసం వచ్చే మాలాంటి మహిల భక్తులకు సరిపడా మరగుదొడ్లు నిర్మించాలి. లక్ష మందికి ఐదు మరగుదొడ్లు ఉంటే ఎలా సరిపోతాయి. అధికారులు స్పందించి సౌకర్యాలు కల్పించాలి. – దిడ్డిగ లక్ష్మి, భక్తురాలు, జమ్మికుంట మల్లన్నగుడిలో రాత్రిపూట నిద్రకోసం అదనపు గదులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న గదులు సరిపోవడంలేదు. ఆరుబయట పడుకొంటే దొమలతో ఇబ్బందిగా ఉంది. గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలి – వేముల సురేశ్‌కుమార్, భక్తుడు వరంగల్ -
ధర్మపురిలో కదం తొక్కిన అంగన్వాడీలు
ధర్మపురి: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొచ్చి రెండేళ్లు పూర్తవుతున్నప్పటికీ అంగన్వాడీ టీచర్ల స మస్యలు పరిష్కరించడం లేదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పుప్పాల శ్రీకాంత్, అంగన్వాడీ సంఘం జిల్లా అధ్యక్షురాలు రజిత అన్నారు. సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్మపురిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదటు సోమవారం నియోజకవర్గంలోని అన్ని మండలాల అంగన్వాడీ టీచర్లు ఆందోళన చేపట్టారు. మండుటెండలో సుమారు రెండు గంటలపాటు కూర్చోని నిరసన తెలిపారు. అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. తక్కువ వేతనాలతో ఎక్కువ పని భారం మోస్తున్న అంగన్వాడీలపై ప్రభుత్వం చిన్నచూపెందుకని ప్ర శ్నించారు. అంగన్వాడీల డిమాండ్లను పరిష్కరించాలని హైకోర్టు, సుప్రీంకోర్టులు తీర్పు చెప్పినా ప్రభుత్వం ఎందుకు పరిష్కరించడం లేదన్నారు. ప్రీప్రైమరీ, పీఎంశ్రీ విద్య పేరుతో ఐదేళ్లలోపు పిల్లలను విద్యాశాఖను అప్పగిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఐటియు జిల్లా కో–కన్వీనర్లు, ఇందూరి సులోచన, చంద్రశేఖర్ తదితరులున్నారు. -
వైద్య విద్యార్థులకు తప్పిన రవాణా కష్టాలు
కొత్తపల్లి(కరీంనగర్): కొత్తపల్లిలోని ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థుల రవాణా కష్టాలు తొలగించేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ ముందుకొచ్చారు. గతంలో ‘వైద్య కళాశాల ఒకచోట.. వసతి గృహాలు మరో చోట’ శీర్షికన విద్యార్థుల రవాణా కష్టాలపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. విద్యార్థుల వసతి గృహాలు తీగలగుట్టపల్లి, సీతారాంపూర్, దుర్గమ్మగడ్డలో ఉండడంతో కళాశాలకు వచ్చేందుకు ఇబ్బందులు పడ్డారు. ఈక్రమంలో విద్యార్థులు ఇటీవల కేంద్ర మంత్రికి తమ ఇబ్బందులపై మొరపెట్టుకోగా, సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఎంపీ లాడ్స్ నిధులు, దాతల నుంచి సేకరించిన నిధులతో కొనుగోలు చేసిన బస్సును సోమవారం ఎంపీ కార్యాలయం వద్ద విద్యార్థులు, అధ్యాపకుల సమక్షంలో ప్రిన్సిపాల్‌కు అందజేశారు. అలాగే వసతి గృహాల్లో తాగునీటి సమస్య తీర్చేందుకు ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తానని ఎంపీ చెప్పగా.. ఆ బాధ్యతను ఎమ్మెల్సీ అంజిరెడ్డి తీసుకున్నారు. కాగా, కళాశాల నిర్వహణను నెలరోజుల్లో మరో మంచి భవనంలోకి మార్చుకునేలా చర్యలు తీసుకోవాలని, అందుకు అవసరమయ్యే వ్యయాన్ని భరిస్తానని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈసందర్భంగా మంత్రికి విద్యార్థులు, అధ్యాపకులు కృతజ్ఞతలు తెలిపారు. హామీ మేరకు బస్సు సౌకర్యం కల్పించిన కేంద్ర మంత్రి బండి -
సాగుకు అనుబంధంగా పౌల్ట్రీ
జగిత్యాలఅగ్రికల్చర్: ఇటీవల కాలంలో రైతు కుటుంబాలకు చెందిన యువత సాగుకు అనుబంధంగా లేయర్ కోళ్ల ఫాం (గుడ్ల కోళ్లు)లు ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చదువుకున్నవారు తమ వ్యవసాయ భూమిలో అధునాతన టెక్నాలజీతో లేయర్ ఫాంలు ప్రారంభిస్తున్నారు. వ్యవసాయం ద్వారా అనుకున్న స్థాయిలో ఆదాయం రాక కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు ఉత్సాహం చూపుతున్నారు. ● 10వేల కోళ్లతో ప్రారంభిస్తూ.. ఒకప్పుడు కోళ్ల లేయర్ ఫాంలు అంటే బడా పారిశ్రామికవేత్తలే గుర్తుకు వచ్చేవారు. ఇప్పుడు తామేమి తక్కువ కాదంటూ యువత ఈ రంగంలోకి వస్తున్నారు. ఉపాధి కోసం ఇతర దేశాలకు వెళ్లినవారు, హైదరాబాద్ వంటి నగరాల్లో చాలీచాలనీ జీతంతో పనిచేసేవారు, స్వగ్రామాలకు వచ్చి ఫాంలు ఏర్పాటు చేస్తున్నారు. పెద్దమొత్తంలో పెట్టుబడి కావడంతో ముందుగా ఆయా ప్రాంతాల్లో సక్సెస్ అయిన కోళ్ల ఫాంలను సందర్శించి, వారితో పలు విషయాలు తెలుసుకుంటూ అవగాహనకు వస్తున్నారు. తర్వాత మొదటి దఫాగా 10 వేల కోళ్లతో ప్రారంభిస్తున్నారు. అనుభవం పెరిగిన కొద్ది కోళ్ల సంఖ్యను పెంచుతున్నారు. కోళ్లఫాంలు ఏర్పాటు చేసేందుకు కనీసం రెండుమూడు ఎకరాలు ఉండేలా చూసుకుంటున్నారు. ● బ్యాంకుల చేయూత వ్యవసాయ భూమి ఉండి కోళ్లఫాంలు నిర్మించుకుంటామని ముందుకు వచ్చే యువకులకు బ్యాంకులు భారీగా రుణాలు మంజూరు చేస్తున్నాయి. 10వేల కోళ్ల ఫాం నిర్మాణానికి రూ.కోటి వరకు ఖర్చు అవుతుండడంతో, ఆ మేరకు బ్యాంకులు రుణం అందిస్తున్నాయి. ఫాంలు నిర్మించిన తర్వాత ఏదైనా సమస్యతో కోళ్లను వేయకుంటే, అద్దెకు ఇచ్చినా మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఒక్కసారి కోడి గుడ్డుకు వస్తే దాదాపు ఏడాది పాటు గుడ్లు పెడుతుంటుంది. లేయర్ ఫాంలలో కేజీ కల్చర్ రావడంతో, కోళ్లు పోడుచుకోకుండా ఒక్కో బాక్స్‌కు 2 నుంచి 4 కోళ్లను పెడుతున్నారు. పెద్దగా కూలీల అవసరం లేకుండా అధునాత టెక్నాలతో దాణాను బాక్స్‌ల్లో ఉన్న కోళ్ల వద్దకు తీసుకెళ్లవచ్చు. మొక్కజొన్న వంటి ముడిపదార్థాలను కొని, ఫాంలోని ఓ గదిలో గ్రైండింగ్ చేసి, నేరుగా కోళ్లకు అందించే వెసులుబాటు ఉండడంతో యువత ముందుకు వస్తున్నారు. ● గుడ్ల అమ్మకందారులతో ఒప్పందం కోళ్లఫాం యజమానులు గుడ్ల అమ్మకందారులతో నేరుగా ఒప్పందం చేసుకుంటున్నారు. పేపర్ రేటు లేదా 25పైసలు తక్కువతో ఏడాదంతా రోజు మార్చి రోజు గుడ్లు తీసుకెళ్తారు. దీంతో గుడ్లు అమ్ముడు పోవనే భయం ఉండదు. కోళ్లకు ప్రొటిన్లు, విటమిన్లు ఇచ్చే దాణాను కంపెనీలు సరఫరా చేస్తుండడంతో పెద్దగా ఇబ్బందులు లేవు. కోళ్లు విసర్జించిన పేడకు మంచి డిమాండ్ ఉంది. కొంత తమ పొలాలకు ఉపయోగించుకుని, మిగతాది రైతులకు అమ్ముతుంటారు. కోళ్లు గుడ్లు పెట్టడం ఆగిపోయిన తర్వాత ఫాంలను రసాయన మందులతో పిచికారీ చేస్తుండడంతో ఎలాంటి వ్యాధులు దరి చేరే అవకాశం లేదు. అలాగే పదివేల కోళ్ల ఫాంకు కేవలం రెండు లేదా మూడు కూలీల జంటలు చాలు. ఒక్కో జంటకు వారి పనితనాన్ని బట్టి రూ.12 వేల వరకు జీతం ఉంటుంది. ఉదయం, సాయంత్రం ఫామ్‌కు వెవెళ్లాల్సి ఉంటుంది. ఫాంలలో అశుభ్రత లేకుండా చూసుకోవడం తదితర పనులు చేస్తుంటారు. ఆసక్తి చూపుతున్న గ్రామీణ యువత మొన్నటి వరకు వ్యవసాయం చేసిన. పెద్దగా ఆదాయం లేదు. బ్యాంకు లోన్ తీసుకుని 10 వేల కోళ్ల ఫాంను మామిడి తోటలో ఏర్పాటు చేశా. ఎంత పని ఉన్నా ఉదయం, సాయంత్రం ఫాంను సందర్శిస్తా. కోళ్ల ఫాంతో భారీ ఖర్చుతో పాటు ఆదాయం ఉంటుంది. – రాజేందర్, కట్లకుంట, మేడిపల్లి వ్యవసాయానికి అనుబంధంగా లేయర్ కోళ్లఫాం ఏర్పాటు చేశా. అంతకంటే ముందు కోళ్ల ఫాం గురించి తెలుసుకున్నా. రోజూ ఫామ్‌ను సందర్శించి, కొత్తగా ఏమి చేయాలో ఆలోచిస్తా. – మహేందర్, రాయికల్ -
మల్లన్నా.. సౌలత్‌ల సంగతేమిటి?
● లక్షమంది భక్తులు.. ఐదే మరుగుదొడ్లు ● అడ్రస్ లేని అదనపు వసతి గదులు ● రాత్రివేళ భక్తులకు తప్పని తిప్పలు ఓదెల(పెద్దపల్లి): ఓదెల మల్లికార్జునస్వామి సన్నిధిలో భక్తులకు సౌకర్యాలు కరువయ్యాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు భారీసంఖ్యలో తరలివస్తారు. ఉగాది పర్వదినం సందర్భంగా మల్లన్న జాతర ప్రారంభమై జూలై వరకూ కొనసాగుతుంది. పెద్దపట్నాలతో ఉత్సవాలు ముగుస్తాయి. వీటితోపాటు ప్రతీ ఆది, బుధవారాల్లో లక్షల మంది భక్తులు తరలివస్తారు. విశ్రాంతి కోసం సరిపడా గదులు లేవు. కేవలం ఐదు మరగుదొడ్లే అందుబాటులో ఉన్నాయి. శిథిలైన రేకులషెడ్ల కిందే సేదదీరుతున్నారు. కలెక్టర్ కోయ శ్రీహర్ష, ఎమ్మెల్యే విజయరమణారావు ఇటీవల ఓదెల మల్లన్న గుడిని సందర్శించారు. మాస్టర్‌ప్లాన్ అమలు చేస్తూ భక్తులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి తెస్తామన్నారు. -
పశుపోషణపై దృష్టి సారించాలి
జగిత్యాలరూరల్: పశుపోషణపై రైతులు దృష్టి సారించాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో రూ.10లక్షలతో నిర్మించనున్న పశువైద్య భవనానికి సోమవారం భూమిపూజ చేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు రాకుండా గ్రామాల్లోనే వైద్యం అందించేలా వైద్యశాలకు నిధులు మంజూరయ్యాయని తెలిపారు. అన్ని రకాల వ్యాక్సినేషన్, మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. పశువైద్యశాఖ ఏడీ నరేశ్, డిప్యూటీ డైరెక్టర్ వేణుగోపాలాచారి, హిమజ, నాయకులు పాల్గొన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలి జగిత్యాల: డబుల్బెడ్రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేసి అర్హులందరికీ అందేలా చూడాలని ఎమ్మెల్యే కలెక్టర్‌ను కలిసి కోరారు. పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కల సాకారం అయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. -
పసిబిడ్డ వైద్యానికి ‘నవదుర్గ’ చేయూత
ఆర్థిక సాయం అందిస్తున్న నవదుర్గ సేవ సమితి సభ్యులు రాయికల్: పట్టణానికి చెందిన కట్టెకోల సుధాకర్, అర్చన దంపతుల కూతురు బరువు తక్కువ ఉండడంతో వైద్యానికి డబ్బులు అవసరం అయ్యాయి. ఈ విషయాన్ని ‘సాక్షి’ఈనెల 9న ‘పసిబిడ్డకు ప్రాణభిక్ష పెట్టండి’ శీర్షికన కథనం ప్రచురించింది. ఈ కథనానికి స్పందించిన నవదుర్గ సేవా సమితి (మార్కండేయ నగర్) ఆధ్వర్యంలో రూ.28,500ను ఆదివారం కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం అధ్యక్షుడు గంట్యాల ప్రవీణ్, ఉపాధ్యక్షులు మధు, శ్రీరాముల సాయి ప్రధాన కార్యదర్శి మూర చైతన్య, కోశాధికారి రాము, గౌరవ అధ్యక్షులు గట్టు వినయ్, గొల్లవర్తి భరత్, సుజిత్ పాల్గొన్నారు. జగిత్యాలటౌన్: నాలుగు దశాబ్దాలుగా రోటరీ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. ఆదివారం పావని కంటి ఆస్పత్రి, ఆపి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నియోజకవర్గానికి చెందిన 22మందికి ఉచితంగా కంటి శస్త్రచికిత్సలు నిర్వహించారు. మందులు, కళ్లజోళ్లు అందించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి కళ్లకు సంబంధించిన మైక్రో శస్త్రచికిత్స మిషన్ అందుబాటులోకి వచ్చిందని, వైద్యులు కూడా అందుబాటులో ఉంటారని, రోగులు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రోటరీ క్లబ్ గవర్నర్ మంచాల కృష్ణ, సభ్యులు చారి, టీవీ.సూర్యం, సిరిసిల్ల శ్రీనివాస్, వైద్యులు ధీరజ్, విజయ్ ఉన్నారు. జగిత్యాలటౌన్: ఈనెల 21నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ ఉత్సవాల వాల్‌పోస్టర్‌ను సంస్కార భారతి ఆధ్వర్యంలో ఆదివారం ఆవిష్కరించారు. సంస్కార భారతి సాహిత్య విభాగం రాష్ట్ర కన్వీనర్ గంట్యాల ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ప్రతీక బతుకమ్మ ఉత్సవాలన్నారు. పూలను పూజించే బతుకమ్మ పండుగను తెలంగాణతోపాటు ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి భీమయ్య, ఉపాధ్యక్షుడు కట్ట విజయ్, రచయిత్రి, ఉపాధ్యాయురాలు అయిత అనిత, సుచరిత, వేముల చంద్రశేఖర్, గొల్లపల్లి శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు. మల్లాపూర్: ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం నిజాం షుగర్ ఫ్యాక్టరీలను తెరిపించాలని, లేకుంటే చెరుకు రైతులతో కలిసి ఉద్యమిస్తామని బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి ఇల్లెందుల కాంతయ్యచారి అన్నారు. మండలంలోని కొత్తదాంరాజుపల్లిలో విలేకరులతో మాట్లాడారు. చెరుకు రైతులను మభ్యపెట్టేందుకే పునరుద్ధరణ కమిటీ పేరుతో కాలయాపన చేస్తున్నారని తెలిపారు. ఎన్నికల్లో లబ్ధిపొందేందుకే షుగర్ ఫ్యాక్టరీ అంశాన్ని వాడుకున్నట్లు రైతులకు అర్థమైందన్నారు. ఫ్యాక్టరీ అంశాన్ని ఎంపీ అర్వింద్‌కు అప్పగిస్తే తెరిపించేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. బూత్ అధ్యక్షుడు బద్దం శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు ఎర్రోళ్ల నర్సారెడ్డి, ఎగ్యారపు శ్రీకాంత్, నరేందర్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. -
మాదిగకుంటను పర్యాటకంగా తీర్చిదిద్దాలి
రాయికల్: పట్టణ స్థానిక సంస్థల అభివృద్ధి పథకం కింద రాయికల్ బల్దియాకు మంజూరైన రూ.15 కోట్లతో మాదిగకుంటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని మాజీమంత్రి జీవన్ రెడ్డి అధికారులకు సూచించారు. పట్టణంలోని మాదిగకుంటను స్థానిక నాయకులతో కలిసి ఆదివారం పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి డెంగీ, మలేరియా వంటి విష జ్వరాలు ప్రబలకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఇరిగేషన్, మున్సిపల్ అధికారులు సమన్వయంతో పనిచేసి కుంట సమస్యకు శాశ్వత పరి ష్కారం చూపాలన్నారు. ఎస్సారెస్పీ కాలువను అనుసంధానించి కుంటను పరిశుభ్రంగా ఉంచి పర్యాటకకేంద్రంగా తీర్చిదిద్దాలని పేర్కొన్నారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు మ్యాకల రమేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజారెడ్డి, కాంగ్రెస్ మండల ప్రధాన కార్యదర్శి గుర్రం మహేందర్ గౌడ్, నాయకులు కొయ్యడి మహిపాల్‌రెడ్డి, బాపురపు నర్సయ్య, బత్తిని భూమయ్య పాల్గొన్నారు. -
పండుగ పూట చిమ్మచీకట్లు..!
ఇది బైపాస్‌రోడ్‌లోని ధర్మపురి వెళ్లే ప్రాంతం. ఇక్కడ రెండు కిలోమీటర్ల వరకు స్ట్రీట్‌లైట్లు లేవు. రాత్రివేళలో వాహనదారులు, మహిళలు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల కరెంట్ స్తంభాలు కూడా లేవు. జగిత్యాల: ఆడపిల్లలు, మహిళలు ఏటా ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ సమీపించింది. ఇప్పటికే బొడ్డెమ్మ వేడుక ప్రారంభమయ్యింది. అయితే జిల్లాకేంద్రమైన జగిత్యాల బల్దియాలో వీధిదీపాలు లేక వారంతా ఇబ్బంది పడుతున్నారు. ఐదేళ్లకోసారి పాలకవర్గాలు మారుతున్నా.. స్పెషల్ ఆఫీసర్ల పాలన ఉన్నా సమస్యలు మాత్రం అలాగే కొనసాగుతున్నాయి. జగిత్యాల గ్రేడ్–1 మున్సిపాలిటీ. అయినప్పటికీ ఏ ఒక్క కాలనీలోనూ వీధిదీపాలు లేకపోవడం ప్రజాప్రతినిధులు, అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. అసలే కుక్కలు, పోకిరీల బెడద ఎక్కువవుతోంది. చైన్‌స్నాచింగ్ సంఘటనలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. వీధిదీపాలు ఉంటే పరిస్థితిలో కొంత మార్పు వచ్చే అవకాశమున్నా.. అధికారులు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదు. మొన్నటివరకు ఓ ప్రైవేటు సంస్థ కాంట్రాక్టు ప్రకారం.. వీధిదీపాలు వేసేది. ఆ కాంట్రాక్టు ఒప్పందం ముగిసిపోవడంతో బల్దియా అధికారులు వీధిదీపాల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. కొన్నిచోట్ల వీధి స్తంభాలున్నా లైట్లు లేకపోవడం.. మరికొన్ని చోట్ల కరెంట్ స్తంభాలే లేకపోవడంతో రాత్రి ఏడు గంటలు దాంటిందంటే వెళ్లలేని పరిస్థితి ఉంది. మరమ్మతుల్లో జాప్యం లైట్లు కాలిపోయినా.. వెలగకపోయినా వెంటనే మరమ్మతు చేయాల్సి ఉంటుంది. కానీ అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆస్తి పన్ను ముక్కుపిండి వసూలు చేస్తున్నారే తప్ప తమకు కావాల్సిన వసతుల కల్పనలో నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. -
అనంతారం అద్భుతం
ఇల్లంతకుంట(మానకొండూర్): ఇల్లంతకుంట మండలం అనంతారం ప్రాజెక్టు 500 ఏళ్ల క్రితం నిర్మించారు. ప్రాజెక్టు ఆయకట్టు దాదాపు 800 ఎకరాల వరకు ఉంటుంది. అనంతారం ప్రాజె క్టు నీటితో నిండితే బిక్కవాగు పరివాహక ప్రాంతమైన అనంతారం, రహీంఖాన్‌పేట, ఇల్లంతకుంట, వంతడుపుల, నర్సక్కపేట గ్రామాల్లోని పంటలకు సమృద్ధిగా సాగునీరు లభిస్తుంది. డాక్ బంగ్లా అనంతారం ప్రాజెక్టు పరిధిలోని డాక్ బంగ్లాను రెండు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. అనంతారం ప్రాజెక్టును పరిశీలించడానికి వచ్చిన ఇరిగేషన్ అధికారులు ఇక్కడే సేద తీరేవారు. డాక్‌బంగ్లా మండలంలో ప్రాముఖ్యత సంతరించుకుంది. -
చరిత్రకు సాక్ష్యం ఎలగందుల ఖిలా
కొత్తపల్లి(కరీంనగర్): చరిత్రకు సాక్ష్యంగా కొత్తపల్లి మండలంలోని ఎలగందుల ఖిలా నిలుస్తోంది. కాకతీయులు, కులీకుతుబ్‌షాహీల శిల్ప కళావైభవానికి ప్రతీకగా ఖిలాలోని కట్టడాలు నిలుస్తున్నాయి. ఈ కోటలో టర్కీ, ఫ్రెంచ్ ఇంజినీర్ల ప్రభావం కనిపిస్తోంది. ఫ్రెంచి, టర్కీ ఇంజినీర్ల ప్రభావంతో ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా శైలిని పోలి ఉంది. 200 అడుగుల ఎత్తు, 2.5 మైళ్ల విస్తీర్ణంలో మానేరునదిని ఆనుకొని ఉంది. ఎలగందుల కోటను కాకతీయులు 1083– 1323 మధ్య నిర్మించారు. ఈ కోటకు మొదటి పేరు ‘వెలిగుండుల’. దీనిని ముసునూరి నాయకులు, రాచర్ల పద్మనాయకులు ధృడంగా తయారు చేశారు. కోట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల వెడల్పు, 4 మీటర్ల లోతు నీటి కందకాన్ని తవ్వించి మొసళ్లతో నింపి శత్రువుల నుంచి రక్షణగా ఏర్పాటు చేశారు. 16వ శతాబ్దంలో ఈ కోటను కుతుబ్‌షాహీలు ఆక్రమించారు. తర్వాత మొఘల్ సామ్రాజ్యాధీనంలోకి వచ్చింది. హైదరాబాద్ నిజాం పాలనలో నిజాం ఉల్ ముల్క్ అసఫ్జాహి (1724–1748) కాలంలో అమీన్‌ఖాన్ ఈ కోట ఖిలేదార్‌గా బాధ్యతలు చేపట్టారు. 1754లో నవాబ్ సలాబత్ జంగ్ కాలంలో మీర్జా ఇబ్రహీం దంసా ఈ కోటను పునర్నిర్మించారు. 1905లో ఆరో నిజాం మహబూబ్ అలీఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందుల్ నుంచి కరీంనగర్‌కు మార్చారు. కోటలో నీలకంఠస్వామి, లక్ష్మీనరసింహస్వామి ఆలయాలతోపాటు మసీదు హిందూ, ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలుస్తున్నాయి. ఎలగందుల ఖిలా -
రాయికల్ శివాలయంలో చోరీ
● పోలీస్‌ల అదుపులో నిందితుడు? రాయికల్: రాయికల్ పట్టణంలోని శివాలయంలో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి ఆలయంలోని హుండిని పగలగొట్టి నగదును దొంగలించారు. దొంగ ముందస్తుగా సీసీ కెమెరాలు పగలగొట్టి దొంగతనానికి ప్రయత్నించాడు. దానికి ముందు రికార్డయిన వీడియో ఆధారంగా ఆదివారం సదరు నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ● ఫేస్బుక్లో పోస్టుపై పోలీసులు కొట్టారని మనస్తాపం ● సెల్ఫీ వీడియోతో ఎలుకల మందు తాగిన వైనం సాక్షి ప్రతినిధి, కరీంనగర్: త మ ఊరికి బస్సు కావాలంటూ ఓ యువకుడు పెట్టిన పోస్టు అతని ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. అకారణంగా తనను పోలీసులు చావబాదారని మనస్తాపం చెందిన ఆ యువకుడు.. సెల్ఫీ వీడి యో తీసుకుంటూ ఎలుకల మందు తాగాడు. గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌కు చెందిన బండారి శ్రీనివాస్ తమ ఊరికి బస్సు సౌకర్యం కల్పించాలని ఫేస్బుక్లో పోస్టు పెట్టాడు. దీనిపై నాచుపల్లి శ్రీనివాస్ ఫోన్ చేసి దూషించాడు. శనివారం ఉదయం మల్యాల పోలీసులు శ్రీనివా స్ను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. అక్కడ ఎస్సై నరేశ్ తనను దుర్భాషలాడుతూ రోజంతా చితకబాదా రని, అందుకే తాను మనస్తాపంతో ఎలుకల మందు తాగుతున్నాను అంటూ శ్రీనివాస్ వీడియోలో పేర్కొన్నాడు. తన చావుకు ఎస్సై నరేశ్, కాంగ్రెస్ నేత కారణమని, గతంలో తాను ఇదే విషయమై ఎన్ని పోస్టులు పెట్టినా ఏనాడూ ఇలాంటి పరిస్థితి ఎదురవలేదని, పైగా తనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారని వాపోయాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం వీడియో ఆన్లైన్లో వైరల్‌గా మారింది. -
తల్వార్‌తో జన్మదిన వేడుకలు..
● యువకుడిపై కేసు నమోదు జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని వాణినగర్‌కు చెందిన కోరుకంటి సాయికృష్ణ అనే వ్యక్తి రోడ్డుపై.. జనావాసాల మధ్య తల్వార్‌ను పట్టుకుని మిత్రులతో కలిసి జన్మదిన వేడుకలను జరుపుకోవడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కరుణాకర్ కథనం ప్రకారం సాయికృష్ణ శనివారం రాత్రి రోడ్డుపై ప్రజలు చూస్తుండగానే వారిని భయభ్రాంతులకు గురిచేస్తూ తల్వార్ చేతపట్టుకుని మిత్రులతో కలిసి కేక్ కట్ చేశాడు. దీంతో పబ్లిక్ న్యూసెన్స్ కింద సాయికృష్ణపై కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. -
అద్భుత కట్టడం.. నాగులపేట సైఫన్
● ఆసియాలోనే అరుదైన కట్టడంగా గుర్తింపు కోరుట్ల రూరల్: ఇంజినీరింగ్ పనితీరుకు అద్భుత కట్టడంగా నిలుస్తుంది కోరుట్ల మండలం నాగులపేట వద్దగల సైఫన్. ఇది ఆసియాలో అరుదైన కట్టడాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు అప్పటి సూపరింటెండెంట్ ఇంజనీర్ పీఎస్.రామకృష్ణారాజు సైఫన్ నిర్మాణానికి డిజైనింగ్ చేశారు. నాగులపేట వద్ద కాకతీయ కాలువ సుమారు 100 మీటర్ల వెడల్పుతో ప్రవహించే పెద్దవాగు దాటాల్సి ఉంటుంది. వాగుకు అడ్డంగా కాలువ నిర్మించడం కష్టం కావటంతో వాగుపై నుంచే 100 మీటర్ల సొరంగమార్గం తవ్వి.. ఎప్పటిలాగే వాగు ప్రవహించేలా డిజైన్ చేశారు. 100 మీటర్ల పొడవు.. సుమారు 30 ఫీట్ల లోతు.. 25 ఫీట్ల వెడల్పుతో సైఫన్ నిర్మాణం చేపట్టారు. సైఫన్ సొరంగమార్గం ద్వారా కాలువ నీరు.. వాగులో వరద ప్రవాహం.. ఈ అద్భుత కట్టడం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. -
టేకు చెట్లు నరికి.. మొరం గుట్టలు తవ్వి
● అడ్డగోలుగా మట్టి అక్రమ రవాణా ● పట్టించుకోని రెవెన్యూ..మైనింగ్ ● అధికారుల వివక్ష కోరుట్ల: రెవెన్యూ.. మైనింగ్ శాఖలు మొరం తవ్వకాలు విషయంలో వివక్ష చూపుతున్న వైనం వెలుగుచూస్తున్నా.. అనుమతులు లేకుండా అడ్డగోలుగా మొరం గుట్టలు తవ్వేస్తున్న వారిపై ఎలాంటి చర్యలూ లేవు. ఓ దశలో ఈ రెండు శాఖలు ఫిర్యాదులు వస్తేనే పనిచేస్తాయా..? అన్న అనుమానాలు వస్తున్నాయి. కోరుట్ల, మెట్పల్లి మండలాల్లో పలు గ్రామాల్లో ఎక్కడపడితే అక్కడ మొరం గుట్టలు తవ్వేయడం.. వాటి వెంట అటవీ శాఖ అధ్వర్యంలో నాటిన టేకు చెట్లు నరికేయడం వంటి పనులు నిత్యకృత్యంగా మారాయి. నాలుగు చోట్ల.. కోరుట్ల మండలంలో చినమెట్‌పల్లి, కల్లూర్–అయిలాపూర్ శివారు, సంగెం గ్రామ సమీపంలో, కోరుట్ల పట్టణ శివారుల్లో మొరం, మెట్పల్లి మండలంలోని పలు గ్రామాల్లో మొరం గుట్టలను తవ్వి యథేచ్ఛగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఇటీవల కాలంలో మొరానికి డిమాండ్ పెద్ద ఎత్తున పెరగడంతో అక్రమార్కులు మొరం గుట్టలను తవ్వి పట్టణాల పరిసరాల్లో డంపింగ్ చేస్తున్నారు. కొన్నాళ్ల పాటు నిల్వ చేసి వాటిని మెల్లమెల్లగా ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మైనింగ్ డిపార్ట్మెంట్కు నయాపైసా చెల్లించకుండానే మొరం టిప్పర్‌కు రూ.5వేల నుంచి రూ.7వేల వరకు.. ఒక్కో ట్రాక్టర్ మొరాన్ని రూ.1200కు అమ్ముకుంటున్నారు. ఇంత జరుగుతున్నా స్థానిక రెవెన్యూ, మైనింగ్ అధికారులు మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో మొరం గుట్టల వెంబడి ఉన్న నాటిన టేకు చెట్లు వందలాదిగా మాయమవుతున్న వైనం కలవరపెడుతోంది. వీటి నరికివేత విషయం అటవీ శాఖ అధికారుల దృష్టిలో లేకపోవడం విడ్డూరం. ఎవరైనా రెవెన్యూ, అటవీ శాఖ అధికారులకు ఫిర్యాదు చేస్తే నామమాత్రంగా చర్యలు తీసుకుని చేతులు దులుపుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వేలం వేసి.. కోరుట్ల మండలంలోని చినమెట్‌పల్లి, సంగెం గ్రామాల్లో మొరం గుట్టలను వేలం వేసి మరీ గుట్టచప్పుడు కాకుండా మట్టిని తరలిస్తున్నారు. కొన్ని చోట్ల అనుమతులు తీసుకుని మొరం అమ్మకాలు సాగిస్తుండగా ఈ అనుమతులు కేవలం రాజకీయంగా అండ ఉన్న వారికే దక్కుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. జీవనోపాధి కోసం మొరం తవ్వకాలు చేసేవారికి అనుమతులు ఎందుకు రావడం లేదన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల వీడిసిలు మొరం వేలంపాటలతో గ్రామాభివృద్ది కోసం నిధులు సమకూర్చుకుంటున్నామని చెబుతున్నా.. పరోక్షంగా ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది. మొరం గుట్టల వేలం పాటల విషయం తెలిసినా మైనింగ్, రెవెన్యూ అధికారులు సరైన విచారణ జరపకపోవడం వెనక కారణాలు అంతుచిక్కడం లేదు. మొరం గుట్టల తరలింపు వెనక పలు పార్టీల నేతలు ఉండటంతో రెవెన్యూ, మైనింగ్, అటవీ శాఖ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న సందేహాలు ఉన్నాయి. అధికార యంత్రాంగం ఈ విషయంలో అవసరమైన చర్యలు తీసుకోకుంటే కాలక్రమేణా సహాజ వనరులు క్షీణించి భారీ వర్షాలకు కోతలు ఏర్పడి గ్రామాల పరిసరాల్లోని వాగులు, చెరువుల్లోకి యధేచ్చగా వరద నీరు చేరి మత్తడి దాటి గ్రామాలను ముంచెత్తే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
కడుపునొప్పితో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య
మల్యాల: కడుపునొప్పితో మండలంలోని రామన్నపేటకు చెందిన ఇంటర్ విద్యార్థిని హారిక (16) ఇంట్లో ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై నరేశ్‌కుమార్ కథనం ప్రకారం.. వెల్గటూర్ మండలం గొడిశెలపేటకు చెందిన ఒడిగ గంగాధర్, వరలక్ష్మి దంపతులు 15 ఏళ్ల క్రితం రామన్నపేటకు వచ్చి ఇక్కడే ఉంటున్నారు. గంగాధర్ లారీ డ్రైవర్. తల్లి వ్యవసాయ కూలీ. వీరి రెండో కూతురు హారిక జగిత్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ ప్రథమ సంవత్సరం చదువుతోంది. కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతుండగా ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటోంది. అయినప్పటికీ తగ్గకపోవడంతో ఆదివారం ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరలక్ష్మీ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. పెగడపల్లి: మండలంలోని ఎల్లాపూర్‌కు చెందిన మల్లారపు సుప్రియ (27) చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఎస్సై కిరణ్‌కుమార్ కథనం ప్రకారం.. సుప్రియ కొంతకాలంగా థైరాయిడ్ వ్యాధితో బాధపడుతోంది. ఇటీవలే కామెర్ల వ్యాధిబారిన పడింది. ఆసుపత్రుల్లో చూపించుకున్నా ఆరోగ్యం కుదటపడలేదు. జీవితంపై విరక్తి చెంది ఈనెల 12న బ్లాక్‌రోజ్ పౌడర్ తాగింది. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. సుప్రియ తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. ● రూ.1.25లక్షలు కాజేసిన కేటుగాడు ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌కు చెందిన ఒక వ్యక్తికి ముద్రలోన్ ఆఫీసర్ అని ఫోన్ చేసి రూ.5 లక్షల లోన్ ఇప్పిస్తానని నమ్మబలికాడు. ప్రాసెసింగ్ ఫీజుగా పలు దఫాలుగా రూ.1.25లక్షలు కాజేశాడు. అయినా లోన్ మంజూరుకాకపోవడంతో బాధితుడు ఆదివారం పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సై కె.రాహుల్‌రెడ్డి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఎవరైనా సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930కు కాల్ చేయాలని సూచించారు. -
ప్రయాణం..ప్రమాదం
● ఇరుకు రహదారితో ఇక్కట్లు ● ప్రమాదానికి గురవుతున్న వాహనాలు ● వెల్లుల్లలో విస్తరణకు నోచుకోని రహదారి ● రహదారి విస్తరణపై దృష్టి సారించని పాలకులు,అధికారులుమెట్పల్లిరూరల్: ఇరుకు రహదారుల్లో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వేసిన రహదారులపై ప్రస్తుతం పెరిగిన జనాభా, వాహనాల సంఖ్యతో ఇబ్బందులు తలెత్తున్నాయి. గ్రామాల్లోని ఇరుకై న రహదారులపై నిత్యం వందల సంఖ్యలో వాహనాలు ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో ముందుగా వచ్చే వాహనాలకు సైడ్ ఇస్తున్న తరుణంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వాహనాలపై వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సి వస్తోంది. రహదారి విస్తరణపై దృష్టి సారించాల్సిన పాలకులు, అధికారులు ఆ దిశగా ఆలోచన చేయడంలేదు. ఇరుకై న రహదారి మెట్పల్లి మండలం వెల్లుల్లలోని ప్రధాన రహదారి ఇరుకుగా ఉండడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. నిత్యం వందల సంఖ్యలో వాహనాలతో రద్దీగా ఉండే ఈ రహదారి మీదుగానే పాటిమీది తండా, ఆత్మకూర్, ఆత్మనగర్, రామలచ్చక్కపేట, జగ్గాసాగర్, కేసీఆర్‌తండా, రంగారావుపేట, ఏఎస్ఆర్ తండా, విట్టంపేట, నిజామాబాద్ జిల్లా భీంగల్, చౌట్పల్లితో తదితర గ్రామాల వాహనదారులు మెట్‌పల్లితోపాటు ఇతర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. అలాగే మెట్పల్లి నుంచి ఆత్మకూర్, రంగారావుపేట, భీంగల్‌కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రైవేట్ పాఠశాల బస్సులతో మరింత రద్దీగా మారి ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. మరోవైపు రహదారికి ఇరువైపులా ఏళ్ల కిత్రం నిర్మించిన డ్రైనేజీ లోతట్టు ప్రాంతంలో ప్రమాదకరంగా ఉండడంతో భారీ వాహనాలు అందులోకి ఒరిగి బోల్తాపడుతున్నాయి. గతంలో ప్రమాదాలు చోటుచేసుకున్న సందర్భాలున్నాయి. విస్తరణ చేయకపోవడంతోనే.. పెరిగిన జనాభా, వాహనాలకు అనుగుణంగా రహదారుల విస్తరణ చేపడితేనే ప్రమాదాలకు అడ్డుకట్ట వేయవచ్చు. విస్తరణపై ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పడంలేదు. అధికారులు స్పందించి రహదారి విస్తరణపై దృష్టి సారించి వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని పలు గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
తెరుచుకోని అంబులెన్స్ డోర్లు
జగిత్యాలటౌన్: అంబులెన్స్ డోర్ తెరుచుకోక లోపలున్న రోగి ఉక్కిరిబిక్కరయ్యాడు. బంధువులు తీవ్ర ఆందోళనకు గురైన ఘటన జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వద్ద ఆదివారం చోటుచేసుకుంది. ధర్మపురికి చెందిన గంగయ్యను 108 అంబులెన్సులో ప్రభుత్వాసుపత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి వద్ద వాహనాన్ని నిలిపిన డ్రైవర్.. తలుపులు తెరిచేందుకు ప్రయత్నించగా ఎంతకూ తెరుచుకోలేదు. లోపల ఉన్న రోగి ఉక్కిరిబిక్కిరయ్యాడు. 15నిమిషాలపాటు తలుపులు తెరుచుకోకపోవడంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. తండ్రితోపాటు లోపలే ఉన్న రోగి కుమారుడు కిటికీ నుంచి బయటకు దూకి 15నిమిషాల పాటు శ్రమించి అంబులెన్స్ తలుపులు తెరిచి గంగయ్యను బయటికి తీసి ఆస్పత్రిలోకి అడ్మిట్ చేశారు. అత్యవసర సమయంలో ప్రాణాలు కాపాడాల్సిన అంబులెన్స్ తలుపులు రోగి ప్రాణాలకు అడ్డంకిగా మారితే రోగులకు సత్వర వైద్యం ఎలా సాధ్యమంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికంగా అంబులెన్స్‌ల నిర్వహణ చర్చనీయాశంగా మారింది. -
బీరుసీసాలతో యువకుల దాడులు
సుల్తానాబాద్‌రూరల్: మద్యం మత్తులో యువకులు బీరుసీసాలతో స్పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ సంఘటన ఆదివారం రాత్రి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని ఓ వైన్స్ వద్ద చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సుల్తానాబాద్‌లోని మార్కెండేయకాలనీకి చెందిన యువకులు అనిల్, టోన్ ఓ వైన్స్ వద్ద మద్యం తాగారు. మద్యం మత్తులో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆగ్రహంతో ఇద్దరూ బీరుసీసాలతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలుకాగా స్థానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు వైద్యచికిత్స అందిస్తున్నారు. ● మద్యం మత్తులో వీరంగం ● ఇద్దరికి తీవ్రగాయాలు -
యువకుడిపై కత్తితో దాడి
జగిత్యాల క్రైం: జిల్లాకేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో కట్ల శ్రీకాంత్ అనే యువకుడిపై సందీప్ అనే వ్యక్తి కత్తితో దాడి చేసి గాయపరచడంతో బాధితుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. పట్టణంలోని అంగడిబజార్‌కు చెందిన శ్రీకాంత్ ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. గోవిందుపల్లెకు చెందిన సందీప్ ఆటోడ్రైవర్. సందీప్‌కు ఓ పంచాయితీ ఉండడంతో శ్రీకాంత్‌ను మధ్యవర్తిగా తీసుకెళ్లాడు. అక్కడ తనకు కాకుండా ప్రత్యర్థులకు మద్దతు ఇస్తున్నాడని మనసులో పెట్టుకుని సందీప్.. రెండు రోజులుగా శ్రీకాంత్‌కు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. ఆదివారం రాత్రి సమయంలో ఇద్దరూ కరీంనగర్ రోడ్డులో కలుసుకున్నారు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాట పెరిగి శ్రీకాంత్‌పై తన వెంట తెచ్చుకున్న కత్తితో సందీప్ దాడికి పాల్పడ్డాడు. దాడిలో శ్రీకాంత్ చెవ్వు, మెడ, కడుపులో గాయాలయ్యాయి. స్థానికులు శ్రీకాంత్‌ను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీకాంత్ సోదరుడు నవీన్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సందీప్ పరారీలో ఉన్నట్లు సమాచారం. -
ప్రాజెక్టుల ల్యాండ్‌మార్క్ మిడ్‌మానేరు
బోయినపల్లి(చొప్పదండి): తెలంగాణ ప్రాజెక్టులకు ల్యాండ్‌మార్క్‌లా మధ్యమానేరు నిలుస్తోంది. ఎగువ మానేరు, దిగువ మానేరుకు మధ్యలో ఉన్న మిడ్‌మానేరు 5.8 లక్షల క్యూసెక్కుల వరదపోటును తట్టుకుంటుంది. రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం మాన్వాడ వద్ద శ్రీరాజరాజేశ్వర(మధ్యమానేరు) ప్రాజెక్టును 27.5 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించారు. సుమారు రూ.750 కోట్ల అంచనాలతో నిర్మించారు. ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాలో సుమారు 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందకు 2006లో దివంగత సీఎం వైఎస్సార్ ఈ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ప్రాజెక్టు నిర్మాణంలో పాలుపంచుకున్న ఇంజినీర్లందరూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వారే. ప్రాజెక్టు మొత్తం 32 సీసీ కెమెరాల నిఘాలో ఉంటుంది. 25 రేడియల్ గేట్లు, పవర్ ప్యాక్స్, లోకల్ కంట్రోల్ ప్యానల్, రిమోట్ కంట్రోల్ ప్యానల్స్ వంటి కొత్త పద్ధతులు ఉన్నాయి. ప్రాజెక్టులో 4 రివర్స్ స్లూయిస్‌లు ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులో చేరిన సిల్ట్ రివర్స్స్లూయిస్ల ద్వారా బయటకు వెళ్తుంది. ప్రాజెక్టు నిర్మాణంలో సిమెంట్, కాంక్రిట్, మట్టి, రౌతు, స్టీల్, వాడారు. ప్రాజెక్టు అడుగు భాగానికి వెళ్లడానికి గ్యాలరీని ఏర్పాటు చేశారు. దీనిలోకి వెళ్లడానికి మెట్లు, అధునాతన లిఫ్ట్ ఏర్పాటు చేశారు. ప్రాజెక్టులోకి వచ్చే నీరు నిల్వ చేయడం వల్ల ఎయిర్ వెళ్లడానికి గ్యాలరీలో పరికరాలు అమర్చారు. 500 మీటర్ల మేర స్పిల్‌వే, 10 కిలోమీటర్ల మేర కట్టను నిర్మించారు. -
హాజరుశాతం పెరిగింది
ఎఫ్ఎం రేడియో ప్రసారాలతో విద్యార్థుల హా జరుశాతం పెరిగింది. క్రమశిక్షణ మెరుగైంది. స్టేజీ ఫియర్ తగ్గింది. చిన్నారులు బాగా మాట్లాడుతున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థుల మధ్య స్నేహపూరిత వాతావరణ ఏర్పడింది. సమయం వృథా కాకుండా ఎఫ్ఎం ప్రసారాలు చేస్తున్నాం. – రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్రేడియో జాకీగా మారిన తర్వాత స్టేజీ ఫియర్ పోయి ంది. మాట్లాడేటప్పుడు ఎలాంటి భయం లేకుండా సార్లు చెప్పిన అంశాలను క్లియర్ చెబుతున్న. దీనిద్వారా తెలియని విషయాలు తెలుస్తున్నాయి. – జ్యోత్స్న, 9వ తరగతిఎఫ్ఎం ఎంతో ఉపయోగపడుతోంది. మ ధ్యాహ్న భోజ న సమయంలో పాఠశాల అంతా చిందరవందరగా ఉండేది. ఎఫ్ఎంతో మంచి వాతావరణం ఏర్పడింది. వివిధ అంశాలపైనా అవగాహన వస్తోంది. – శ్రీనిధి, 9వ తరగతి -
పత్రికలపై కక్ష సాధింపు సరికాదు
ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపే పత్రికల గొంతునొక్కడం సమంజసం కాదు. సాక్షి పత్రిక ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే సరిచేసుకోవాలేగానీ కేసులు నమోదు చేయడం సరికాదు. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం సరికాదు. పత్రికలకు స్వేచ్ఛ వాతావరణం ఉండాలే కానీ ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు. – జీవన్‌రెడ్డి, మాజీమంత్రి జగిత్యాల: ప్రజా సమస్యలపై గళమెత్తుతున్న ‘సాక్షి’ దినపత్రికపై కక్షసాధింపులు సరికాదని, పత్రికల గొంతు నొక్కే ప్రయత్నం చేయకూడదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం శ్రీసాక్షిశ్రీ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడాన్ని ఖండించారు. ప్రజా సమస్యలపై ఎళ్లప్పుడూ గళమెత్తుతున్న పత్రికలపై కక్షసాధింపు సరికాదు. ప్రజాస్వామ్యంలో పత్రిక వ్యవస్థ ఎంతో గొప్పదన్న విషయం మర్చిపోవద్దు. ఇలాంటి అక్రమ కేసులు దిగజార్చుతాయి. ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన కేసులు ఎత్తివేయాలి. – సంజయ్‌కుమార్, ఎమ్మెల్యే, జగిత్యాల ప్రజాస్వామ్యంలో పత్రికలకే స్వేచ్ఛ ఉంటుంది. అలాంటి పత్రికల గొంతు నొక్కడం స రికాదు. ప్రజాసమస్యలను ఎ ప్పటికప్పుడు తెలిపేవే పత్రికలు. అలాంటి వాటిపై కక్షసాధింపు సరికాదు. పత్రిక స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నాం. సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనుంజయరెడ్డిపై నమోదు చేసిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. – సంజయ్, ఎమ్మెల్యే, కోరుట్ల -
విద్య, వైద్యానికి ప్రాధాన్యం
జగిత్యాల: పట్టణాభివృద్ధే తన ధ్యేయమని, విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని పలు వార్డుల్లో అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ప్రతి మైదానంలో ఓపెన్‌జిమ్‌లు, వాలీబాల్, బాస్కెట్‌బాల్ కోర్టులు, పార్కులు ఏర్పాటు చేస్తామన్నారు. విద్య, వైద్యం కోసం భవనాలకు నిధులు మంజూరు చేస్తామన్నారు. మున్సిపల్ కమిషనర్ స్పందన, మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, వొద్ది శ్రీలత పాల్గొన్నారు. పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. పలు సమస్యలపై పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు ఎమ్మెల్యేను కలిసి వినతిపత్రం అందింశారు. పెన్షనర్లు సమాజ మార్గదర్శకులని, వారి సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానన్నారు. సీనియర్ సిటిజన్స్ హరి అశోక్‌కుమార్, హన్మంతరెడ్డి, విజయ్, విశ్వనాథం, ప్రకాశ్, యాకూబ్ పాల్గొన్నారు. -
ఉల్టా చోర్ కొత్వాల్ కో డాంటే!
సాక్షిప్రతినిధి,కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన మె టా క్రిప్టో కరెన్సీ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఈ వ్యవహారంలో మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కార్పొరేటర్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు కట్ల సతీశ్‌ను పోలీసులు గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. కీలక నిందితులుగా ఉన్న దాసరి రాజు, దాసరి రమేశ్, బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్‌ను సీసీఎస్ పోలీసులు అదే రోజు ఉదయం అరెస్టు చేశారు. ఇదిలా ఉంటే క్రిప్టోలో అధికలాభాలు అంటూ ఉమ్మడి జిల్లాలో దాదాపు రూ.100 కోట్లు కొల్లగొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. లాభాల ఆశచూపి.. అధికలాభాల ఆశచూపగానే పోలీసులు, రెవెన్యూ, ప్రభుత్వ టీచర్లు భారీగా పెట్టుబడులు పెట్టారు. వీరిని గతేడాది పలుమార్లు బ్యాంకాక్, మలేషియా, సింగపూర్ తదితర దేశాలకు తీసుకెళ్లారు. ఇలా దాదాపు రూ.100 కోట్ల వరకు వసూలు చేశారని, ఈ డబ్బుతో సూత్రధారుల్లో లోకేశ్ అనే వ్యక్తి ద్వా రా దుబాయ్ తదితర దేశాల్లో పలు వ్యాపారాలు స్థాపించారని బాధితులు ఆరోపించారు. ‘నష్టపోయాం మహాప్రభో.. మా డబ్బులు మాకివ్వాలని’ బాధితులు కోరినా.. ఎవరికీ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమను వేధించేందుకు లీగల్ టీంను ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొంటున్నారు. బెదిరింపులు... బ్లాక్మెయిల్ మెటా క్రిప్టోలో చేరిన వారిలో సాధారణ వ్యక్తులు నిలదీస్తే కోర్టుల్లో ప్రైవేటు కేసులు వేశారు. దీనికి కొందరు పోలీసులు కూడా సహకరించడం గమనార్హం. బాధితులు ఒకవేళ ప్రభుత్వ ఉద్యోగులైతే బ్లాక్మెయిల్ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు విదేశాలకు వెళ్తే ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ...అది ఎక్కడా జరగలేదు. అంతేకాదు వారికి విదేశాల్లో అమ్మాయిలతో మసాజ్‌లు చేయించి వారి వీడియోలు దగ్గర పెట్టుకున్నారు. తమ డబ్బులు తమకు ఇవ్వమని అడిగితే.. ‘నా మీద కేసులు పెడితే.. మీరు అక్రమంగా విదేశాలకు వెళ్లడం, అక్కడ చేసిన పనుల మీద ఎదురుకేసులు పెట్టాల్సి వస్తుందని’ బెదిరింపులకు దిగారు. ఏయే చట్టాల కింద కేసు పెట్టారంటే? మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్ మాటలు నమ్మి నూనావత్ భాస్కర్ మరో 16మంది కలిసి దాదాపు రూ.1.20 కోట్లు డబ్బును మెటాలో పెట్టుబడులుగా పెట్టారు. బాధితుల ఫిర్యాదుతో కరీంనగర్ త్రీటౌన్‌లో గురువారం రాత్రి ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది. అనంతరం అతన్ని రిమాండ్‌కు తరలించారు. తెలంగాణ ప్రొటెక్షన్ ఆఫ్ డిపాజిటర్స్ ఆఫ్ ఫైనాన్సియల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1999 సెక్షన్ (5) కింద కట్ల సతీశ్‌పై కేసు నమోదు చేశారు. ఇది నాన్‌బెయిలబుల్. డిపాజిటర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును దుర్వినియోగం చేసిన సందర్భాల్లో ఈ సెక్షన్‌ను పోలీసులు ప్రయోగిస్తారు. పోలీసుల అభియోగాలు రుజువైతే రూ.లక్ష జరిమానాతోపాటు పదేళ్ల కఠిన కారాగార శిక్ష కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈ సెక్షన్ ప్రకారం దర్యాప్తులో భాగంగా డిపాజిటర్ల నుంచి సేకరించిన పెట్టుబడులతో కొన్న ఆస్తులను స్వాధీనం చేసుకుని, వాటిని వేలం వేసి బాధితులకు అందజేసే వీలుంది. అదే సమయంలో ఈ కేసు విచారణకు ప్రత్యేక కోర్టు కూడా ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయి. వీటితోపాటు ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్కులేషన్ స్కీమ్స్ బ్యానింగ్ యాక్ట్ 1978 సెక్షన్ (3), (4) కూడా పెట్టడం గమనార్హం.క్రిప్టో నిందితులపై కఠిన చర్య తీసుకోవాలికరీంనగర్ కార్పొరేషన్: క్రిప్టో కరెన్సీ పేరిట మోసం చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యవహారంలో ఎంత పెద్దవాళ్లు ఉన్నా విడిచి పెట్టవద్దన్నారు. మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ కేసులో అరెస్టయిన మాజీ కార్పొరేటర్ కట్ల సతీశ్‌ను కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరించాలని పీసీసీ, డీసీసీ అధ్యక్షులకు లేఖ రాసినట్లు తెలిపారు. సతీశ్ బీఆర్ఎస్లో ఉన్నప్పుడే క్రిప్టో పేరిట డబ్బులు వసూలు చేశాడని అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే కఠిన చర్యలు తీసుకుంటే చాలామంది మోసపోకుండా ఉండేవారని అన్నారు. క్రిప్టో నిందితులపై కఠిన చర్యలు తీసుకుని, ప్రజలకు న్యాయం చేయాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు. -
కుటుంబ కలహాలతో ప్రశాంతతకు భంగం
జగిత్యాలజోన్: కుటుంబ సమస్యలతో భార్యాభర్తలు, గుంట భూమి కోసం అన్నదమ్ములు, ఆస్తి కోసం అక్కాచెల్లెళ్లు, తీసుకున్న డబ్బులు ఇవ్వడం లేదని స్నేహితులు.. ఇలా గొడవలకు దిగుతుండటంతో ప్రశాంత జీవితానికి భంగం ఏర్పడుతుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో శనివారం మెగా లోక్‌అదాలత్ నిర్వహించారు. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకుని కేసులను రాజీ చేసుకోవాలన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి నారాయణ మాట్లాడుతూ పెండింగ్ కేసులను తగ్గించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మాణ్యశర్మ మాట్లాడుతూ.. లోక్ అదాలత్ తీర్పుపై పైకోర్టులకు అప్పీల్‌కు వెళ్లే అవకాశం ఉండదన్నారు. జ్యుడిషియల్ మేజిస్ట్రేట్లు లావణ్య, శ్రీనిజ, నిఖిషా, కరుణాకర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి పాల్గొన్నారు. పరిహారం కింద రూ.35లక్షలు పంపిణీ మల్లాపూర్ మండలం రేగుంటకు చెందిన మంద రమేశ్ ఇంటర్ చదువుతుండగా ట్రాక్టర్ ఢీకొనడంతో ఎడమ కాలును మోకాలి పైవరకు తీసేశారు. ట్రాక్టర్‌కు ఇన్సూరెన్స్ ఉండడంతో ఇన్సూరెన్సు సంస్థ రూ.35లక్షల పరిహారం అందించేందుకు ముందుకొచ్చింది. ఆస్తి కోసం దూరమైన ఇద్దరు అన్నదమ్ముల మధ్య రాజీ కుదిర్చారు. ఎక్కువ కేసుల పరిష్కారంలో కృషి చేసిన న్యాయవాదులను జడ్జిలు అభినందించారు. కక్షిదారులకు న్యాయమూర్తి వెయ్యి ప్యాకెట్ల పులిహోర పొట్లాలు అందించారు. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, ధర్మపురి కోర్టుల పరిధిలో 3,084 కేసులు పరిష్కారమయ్యాయి. సివిల్ కేసులు 26, క్రిమినల్ కేసులు 2,997, ప్రి లిటిగేషన్ కేసులు 61 ఉన్నాయి. మోటారు వాహనాలకు సంబంధించిన 12 కేసుల్లో బాధితులకు రూ.75.64లక్షల పరిహారం అందించారు. విడిపోయిన జంటలను కలిపిన న్యాయమూర్తులు రాయికల్ మండలం ఇటిక్యాలకు చెందిన వెంకటేశ్.. నిర్మల్ జిల్లా కడెం మండలం చిట్యాలకు చెందిన హరిత దంపతులు వేర్వేరుగా ఉంటున్నారు. అలాగే జిల్లా కేంద్రానికి చెందిన సిరిన్ సుల్తానా, అహ్మద్ ముస్తాఫ్ఖాన్ వేర్వేరుగా ఉంటుండడంతో వారి పిల్లలు అనాథలుగా మారే అవకాశం ఏర్పడింది. జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి చొరవతో రెండు జంటలు ఏకమయ్యాయి. న్యాయమూర్తులు వారిపై ఉన్న కేసులను తొలగించి.. ఇక నుంచి కొత్త జీవితానికి స్వాగతం పలకాలని ఆశీర్వదించారు. -
కొండగట్టుకు రండి
మల్యాల: కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించాలని ఆలయ అధికారులు, అర్చకులు త్రిదండి చిన్న జీయర్ స్వామిని ఆహ్వానించారు. ఆయనను హైదరాబాద్‌లోని ముచ్చింతల్‌లో కలిశారు. వీరిలో ఆలయ ఈఓ శ్రీకాంత్‌రావు, స్థానాచార్యులు కపీందర్, ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రాంచంద్రప్రసాద్ ఉన్నారు. జగిత్యాల: కొందరు ఎమ్మెల్యేలు అభివృద్ధి ముసుగులో ఫిరాయింపులకు దారి తెరిచారని, నమ్మి ఓట్లు వేసిన ప్రజలను వంచించి కార్యకర్తలను నట్టేట ముంచారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదవి పోతుందన్న భయంతోనే ఫిరాయింపు ఎమ్మెల్యేలు అబద్ధాలు ఆడుతున్నారన్నారు. నిజం ఎప్పుడూ దాగదని, పాపం పండక మానదని తెలిపారు. పదవీగండం రాగానే బీఆర్ఎస్లోనే ఉన్నామని బుకాయిస్తున్నారన్నారు. నాయకులు మల్లేశం, గంగాధర్, ఆనందరావు, దేవేందర్‌నాయక్, సత్యంరావు పాల్గొన్నారు. మల్యాల/సారంగాపూర్: ఆర్యవైశ్య అభ్యున్నతికి కృషి చేస్తున్నట్లు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్పర్సన్ కల్వ సుజాత అన్నారు. మల్యాల మండలంలో వాసవి ట్రస్టు ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో 250మంది ఆర్యవైశ్య ఉపాధ్యాయులను సన్మానించారు. ఆర్యవైశ్యుల సంక్షేమానికి.. సంఘాల అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి రూ.25కోట్లు కేటాయించారని అన్నారు. మైలారపు లింబాద్రి, రాంబాబు, బూస శ్రీనివాస్, ఊటూరి నవీన్, మైలారపు రాంబాబు, కొత్త సురేశ్, కమటాల శ్రీనివాస్, జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత పాల్గొన్నారు. వాసవి ఆలయ నిర్మాణం మహాసంకల్పం సారంగాపూర్ మండలం పెంబట్లలో రూ.12 కోట్ల వ్యయంతో ఆర్యవైశ్యులు నిర్మిస్తున్న వాసవికన్యకాపరమేశ్వరి ఆలయం మహాసంకల్పమని సుజాత అన్నారు. పెంబట్లలోని దుబ్బరాజేశ్వరస్వామిని దర్శించుకుకున్నా రు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం నాయకులు మర్యాల రాజన్న, గుండ సురేశ్ తదితరులు ఉన్నారు. -
ఎస్జీఎఫ్ షెడ్యూల్ ఖరారు
15 నుంచి జిల్లాస్థాయిలో ప్రారంభం కానున్న పోటీలు కరీంనగర్‌స్పోర్ట్స్: పాఠశాలల క్రీడాసమాఖ్య క్రీడాసందడి మొదలైంది. మండల, జోన్‌స్థాయిలో పోటీలు అట్టహాసంగా, అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆయా మైదానాలు విద్యార్థులు, క్రీడాకారులతో కిక్కిరిసిపోతున్నాయి. పలు మండలాల్లో నిర్వహించిన మండలస్థాయి పోటీలు జాతరలను సైతం మైమరపింపజేసేలా జరుగుతుండడం విశేషం. ఈనెల 14 వరకు అన్ని మండలాల్లో క్రీడాపోటీలు ముగియనున్న నేపథ్యంలో జిల్లాస్థాయి, ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వాహణకు రంగం సిద్ధమైంది. కరీంనగర్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల జిల్లాల పాఠశాలల క్రీడాసమాఖ్యల కార్యదర్శులు క్రీడల నిర్వహణపై ఇటీవల సమావేశమయ్యారు. ఏ జిల్లాలో ఏఏ క్రీడల్లో పోటీలను నిర్వహించాలో, జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో నేరుగా పోటీలను నిర్వహించే క్రీడలపై ఓ కొలిక్కి వచ్చారు. ఎక్కువ ఆదరణ ఉన్న క్రీడల్లో మొదటగా జిల్లాలో పోటీలను నిర్వహించి.. తదనంతరం ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. మిగిలిన క్రీడల్లో నేరుగా ఉమ్మడి జిల్లా పోటీలను నిర్వహించి ఉమ్మడి జట్టును ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు జిల్లాస్థాయిలో, ఉమ్మడి జిల్లాస్థాయిలో జరిగే క్రీడల జాబితాను ఎస్జీఎఫ్ కార్యదర్శులు వేణుగోపాల్(కరీంనగర్), లక్ష్మణ్(పెద్దపల్లి), శ్రీనివాస్(రాజన్న సిరిసిల్ల), చక్రాధర్(జగిత్యాల) ప్రకటించారు. అండర్–14, 17.. పాఠశాల స్థాయిలో అండర్–14, 17 బాలబాలికల విభాగాల్లో జరగనున్న ఎస్జీఎఫ్ క్రీడాపోటీలు ఆగస్టు చివరి వారం నుంచే ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. నేటికి కూడా పలు మండలాల్లో మండలస్థాయి పోటీలు చివరి దశకు చేరుకున్నాయి. దీంతో జిల్లాస్థాయి పోటీలను నిర్వహించడానికి ఎస్జీఎఫ్ కార్యదర్శులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈనెల 15న కరీంనగర్లో అండర్–17 వాలీబాల్ జిల్లాస్థాయి పోటీలు ప్రారంభం కానుండగా.. మిగిలిన జిల్లాల్లో కూడా జిల్లాస్థాయి పోటీలు పలు క్రీడల్లో జరగనున్నాయి. జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హ్యాండ్‌బాల్, కరాటే అండర్–14, 17 విభాగాల్లో బాలబాలికలకు వేరువేరుగా పోటీలు నిర్వహించనున్నారు. ఉమ్మడి జిల్లాస్థాయి వారీగా నిర్వహించే క్రీడలు ● కరీంనగర్ జిల్లాలో అథ్లెటిక్స్, అర్చరీ, బేస్‌బాల్, బీచ్ వాలీబాల్, బాక్సింగ్, ఫెన్సింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, జూడో, కళారియపటు, కురాష్, మల్లాకంబ్, మోడరన్ పెంటాథ్ల్లాన్, నెట్‌బాల్, రగ్బీ, సెపక్ తక్రా, షూటింగ్, స్కేటింగ్, సాఫ్ట్‌బాల్, స్క్వాష్, టేబుల్ టెన్నిస్, రెజ్లింగ్, యోగాసనా(అండర్–14, 17). ● పెద్దపల్లి జిల్లాలో స్విమ్మింగ్, టెన్నిస్, సైక్లింగ్, బ్యాడ్మింటన్, కరాటే(అండర్–14, 17), క్రికెట్, కబడ్డీ, వాలీబాల్(అండర్–14). ● జగిత్యాల జిల్లాలో తైకై ్వండో, బాస్కెట్‌బాల్, చెస్, ఖోఖో(అండర్–14, 17). ● రాజన్న సిరిసిల్ల జిల్లాలో హ్యాండ్‌బాల్(అండర్–14, 17), వాలీబాల్, క్రికెట్, కబడ్డీ(అండర్–17).వర్షాలతో అంతరాయం జగిత్యాల జిల్లాలో ఇటీవల కాలంలో వర్షాలు భారీస్థాయిలో పడడంతో పోటీలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పుడిప్పుడే మండలస్థాయి పోటీలు పూర్తి కావస్తున్నాయి. వాతావరణం అనుకూలిస్తే అక్టోబర్ మొదటివారంలో జిల్లాస్థాయి పోటీలను నిర్వహిస్తాం. ఉమ్మడి జిల్లా పోటీలకు కూడా సిద్ధంగా ఉన్నాం. – చక్రధర్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, జగిత్యాల -
అనుమానాస్పద స్థితిలో ఒకరి మృతి
గంభీరావుపేట(సిరిసిల్ల): గంభీరావుపేటకు చెందిన మెట్టు శ్రీనివాస్(50)సొంత ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. ఈయన మూడు రోజుల క్రితమే చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. శరీరం కుళ్లిపోయి, దుర్వాసన రావడంతో చుట్టుపక్కలవారు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం బయటపడింది. మృతుని కుటుంబసభ్యులు హైదరాబాద్‌లో ఉంటున్నారు. కొత్తగా ఇల్లు నిర్మిస్తుండడంతో శ్రీనివాస్ స్వగ్రామం గంభీరావుపేటలో ఉంటున్నారు. ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెంది ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. యువకుడి ఆత్మహత్యబోయినపల్లి (చొప్పదండి): ఆర్థిక ఇబ్బందులు, ఒంటరితనం భరించలేక ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన ముకుంద అనిల్ (22 ) ఏడాదిగా ఒంటరిగా ఉంటూ కిరాణషాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురవుతున్నాడు. శుక్రవారం ఇంట్లో ఇనుప పైపుకి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమాకాంత్ తెలిపారు. పోక్సో కేసులో పదేళ్ల జైలు పెద్దపల్లిరూరల్: ఓ బాలికపై అఘాయిత్యం చేసిన కేసులో మందల రవికి పదేళ్ల కఠిన కారగార శిక్షతోపాటు రూ.10వేల జరిమానా విధించి, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత శుక్రవారం తీర్పునిచ్చారని సీఐ ప్రవీణ్‌కుమార్ తెలిపారు. 2017 జనవరి 21న పాల పాకెట్ తీసుకొచ్చేందుకు ఇంటినుంచి వెళ్లిన తన కూతురు చాలాసేపటి వరకు ఇంటికి రాలేదు. ఎదురుగా వెళ్లిన ఆమెను ఇంటివద్ద దిగబెడతానని నమ్మించి రవి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయంలో పోలీస్‌స్టేషన్‌లో కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎస్‌హెచ్‌వో శ్రీనివాస్ కేసు నమోదు చేశారు. పూర్వాపరాలపై విచారణ జరిపి వాదోపవాదాల అనంతరం నేరం రుజువు కావడంతో రవికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష, జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. అలాగే లీగల్ సర్వీసెస్ అధారిటీ ద్వారా రూ.2లక్షల పరిహారం ఇప్పించాలని పేర్కొన్నారు. ఇందుకు సహకరించిన పోలీసు అధికారులను, కోర్టు కానిస్టేబుళ్లను సీపీ అభినందించారు. ఉరేసుకుని యువకుడు మృతివెల్గటూర్: నాలుగేళ్ల క్రితమే తండ్రి అనారోగ్యంతో మృతి చెందగా, అదే అనారోగ్యం కొడుకునూ బాధించింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన యువకుడు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తన తల్లికి కడుపు కోత మిగిల్చాడు. ఈ సంఘటన వెల్గటూర్ మండలం ముత్తునూర్ గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం గ్రామానికి చెందిన సంగ శరత్‌కుమార్(23) గ్రామంలో హార్వెస్టర్ నడిపిస్తుంటాడు. కొంతకాలంగా ఛాతినొప్పితో బాధపడుతున్నారు. పలుమార్లు హాస్పిటల్‌కు వెళ్లినా సమస్య తగ్గకపోవడంతో జీవితంపై విరక్తి చెందాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి తండ్రి నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. చేతికందొచ్చిన ఒక్కగానొక్క కొడుకు బలవన్మరణానికి పాల్పడడంతో తల్లి రాజేశ్వరి గుండెలవిసేలా రోదించింది. రాజేశ్వరి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉమాసాగర్ తెలిపారు. పంచాయతీ కార్మికుల వేతనాలు చెల్లించాలిముస్తాబాద్(సిరిసిల్ల): పండుగలు సమీస్తున్న వేతనాలు చెల్లించడం లేదని పంచాయతీ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నల్దాస్ గణేశ్ పేర్కొన్నారు. ముస్తాబాద్‌లో పంచాయతీ కార్మికులు శుక్రవారం వేతనాల కోసం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా గణేశ్ మాట్లాడుతూ వేతనాలు రాకపోవడంతో కార్మిక కుటుంబాలు పస్తులు ఉంటున్నాయన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కార్మికులందరిని పర్మనెంట్ చేస్తామని హామీలు ఇచ్చి మరచిపోయారన్నారు. రూ.26వేల వేతనం ఇస్తామని రెండేళ్ల క్రితం చెప్పారన్నారు. ఇప్పటి వరకు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల డిమాండ్లు నెరవేర్చకుంటే ఈ నెల 26 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. సీఐటీయూ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, పల్లటి బాబు, లక్ష్మణ్, భిక్షపతి, రాజు, స్వరూప, దేవరాజు, లక్ష్మి, రాజు తదితరులు పాల్గొన్నారు. -
పేట్రేగిపోతున్న సైబర్‌మోసగాళ్లు
గోదావరిఖని: ప్రపంచం సెల్‌ఫోన్ గుప్పిట్లోకి వచ్చింది. ఆన్లైన్ బ్యాంకింగ్, ఆన్లైన్షాపింగ్, ఆన్లైన్ టూరిజం, ఆన్లైన్ గేమింగ్.. ఇలా ఒక్కటేమిటి ప్రతీది సెల్‌ఫోన్ ద్వారానే జరుగుతోంది. సెల్‌ఫోన్ ఎంత సౌకర్యంగా ఉందో, అప్రమత్తంగా లేకుంటే అదేస్థాయిలో మోసపోయే ప్రమాదమూ ఉంది. రోజుకో తీరులో సైబర్‌మోసగాళ్లు రెచ్చిపోతున్నారు. సెల్‌ఫోన్ లేకుంటే క్షణం కూడా గడవని ఈరోజుల్లో.. ఇదే సెల్‌ఫోన్ ద్వారా రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. అమాయకులు, మహిళలు, టెక్నాలజీపై అవగాహన లేనివారు. డబ్బు అత్యవసరం ఉన్నవారిని టార్గెట్ చేసుకొంటున్నారు. కేవలం నిరక్ష్యరాస్యులే కాదు విద్యావంతులు సైతం సైబర్‌గాళ్ల వలలో చిక్కుతున్నారు. కొద్దిరోజులుగా బాధితులు పోలీస్‌కు ఫిర్యాదు చేయడం అధికంగా అవుతోంది. అపరిచిత కాల్స్‌కు స్పందిస్తే.. అపరిచిత కాల్స్‌కు స్పందించినా, గుర్తుతెలియని లింక్స్ క్లిక్ చేసినా సైబర్ మోసగాళ్ల ఉచ్చులో పడ్డట్లే. వయస్సు, వ్యక్తుల విధులను బట్టి కూడా నేరాలు జరుగుతున్నాయి. ఒకరు ఫోన్‌చేసి ఆధార్ అప్డేట్ చేయాలి.. లింక్ పంపిస్తున్నామంటూ ఖజానా ఖాళీ చేస్తారు. మరొకరు వీడియోకాల్ చేసి అమ్మాయిలతో మాట్లాడించి న్యూడ్‌గా రికార్డు చేసి బ్లాక్మెయిల్ చేసి మరీ డబ్బులు గుంజుతారు. ఇంకొకరు ఓటీపీ అడిగి ముంచుతారు. ఇలాంటి సైబర్ మోసాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. ఇలాంటి నేరాల్లో కొన్నింటిపైనే పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. కొందరు పరువు పోతుందనో, ఇరుగుపొరుగువారిలో చులకన అవుతామనే ఉద్దేశంతో మోసపోయామని తెలిసినా ఎవరికీ చెప్పకుండా లోలోపల మదనపడుతున్నారు. ఏపీకే ఫైళ్లు పంపి ఇలా.. ఇటీవల సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్లు ఆండ్రాయిడ్ అప్లికేషన్ ప్యాకేజీ లేదా ఆండ్రాయిడ్ ప్యాకేజీ కిట్ (ఏపీకే) పైళ్లను వాట్సప్ ద్వారా పంపుతున్నారు. వాటిని ఓపెన్‌చేసి ఓకే అని క్లిక్ చేసేవారి ఫోన్లు హ్యాక్ అవుతున్నాయి. ఫోన్ నియంత్రణ సైబర్ నేరగాళ్ల చేతిలోకి వెళ్తోంది. ఈ విషయం తెలియనివారు డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ ద్వారా సొమ్ము పంపితే వెంటనే సైబర్ నేరగాళ్లు పిన్ నంబర్ తెలుసుకొని నిమిషాల్లో బాధితుడి బ్యాంకు ఖాతాలోని నగదు కాజేస్తున్నారు. హ్యాక్ చేసిన ఫోన్ డివైస్ డిస్ప్లే సైబర్ నేరగాళ్ల చేతిలో ఉంటుంది. దీంతో నేరగాళ్లు ఆ ఫోన్లోని కాంటాక్ట్ నంబర్లకు ఏపీకే ఫైళ్లను పంపుతున్నారు. దీంతో తమకు తెలిసిన వ్యక్తి నుంచే మేసేజ్ వచ్చిందని భావించిన ఇతరులు ఆఏపీకే ఫైళ్లలింక్ను ఓపెన్ చేయటంతో ఖాతాలో సొమ్ము కోల్పోతున్నారు. పీఎం కిసాన్ యోజన, ఎస్బీఐ రివార్డ్స్, పెళ్లికార్డులు, బర్త్‌డే ఇన్విటేషన్ తదితర లింక్‌ల పేరిట పంపుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు లాగేస్తున్నారు. జాబ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్.. జాబబ్ పేరుతో ఆన్లైన్లో డబ్బులు పంపించమని చాలామందిని మోసం చేస్తున్నారు. ఇలాగే స్టాక్మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభాలు వస్తాయని ఆన్లైన్లో లాభాలు చూపిస్తూ పెద్దమొత్తంలో పెట్టిబడి పెట్టిన తర్వాత చేతులెత్తేస్తున్నారు. కొందరికి ఓటీపీ పంపి దాన్ని చెప్పమని ఆ తర్వాత ఖాతా ఖాళీ చేస్తున్నారు. మీ ఆధార్‌కార్డ్ ద్వారా ఫ్రాడ్ జరిగిందని వెంటనే డిటేల్స్ చెప్పాలని ఒత్తిడి చేసి ఆ తర్వాత సైబర్ మోసాలకు పాల్పడుతున్నారు. కొత్త పంథాలో ఆన్లైన్ మోసాలు చలాన్ల పేరుతో గ్రూపుల్లో ఏపీకే ఫైల్స్ ఓపెన్‌చేస్తే ఖాతాలోంచి మాయమవుతున్న డబ్బు బలవుతున్న సామాన్యులు, అమాయకులు రెండేళ్లలో జరిగిన సైబర్ మోసాలు ఏడాది ఫిర్యాదులు నష్టం(రూ.లలో) రికవరీ(రూ.లలో) 2024 1,406 3,91,20,408 11,02,566 2025 1,206 2,75,00,542 22,35,689 అప్రమత్తంగా ఉండాలి అప్రమత్తతతోనే ఆన్లైన్మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ప్రధానంగా ఏపీకే ఫైల్స్ పంపి వాటిని ఓపెన్ చేస్తే ఉన్న సొమ్మంతా మాయం చేస్తున్నారు. ఉద్యోగాలిప్పిస్తామని లింక్‌లు పంపించి ఆ తర్వాత సొమ్ము రాబట్టి మోసం చేస్తున్నారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తే భారీలాభాలు ఇస్తామని, లాభాలను ఆన్లైన్లోనే చూపించి పెద్దమొత్తంలో నొక్కేస్తున్నారు. దీనిపై పోలీసుశాఖ అవగాహన కల్పిస్తోంది. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930నంబర్‌కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలి. లేదా సమీప పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలి. – అంబర్ కిశోర్ ఝా, పోలీస్ కమిషనర్, రామగుండం -
యూరియా కోసం సకుటుంబ సపరివారం
సిరిసిల్ల/ఓదెల: అన్నదాతలు యూరియా కోసం అష్టకష్టాలు పడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రైతుల కష్టాలు చెప్పలేనివిగా ఉన్నాయి. రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫర్టిలైజర్షాప్ వద్ద శుక్రవారం కుటుంబ సభ్యులు క్యూౖ లెన్లో నిల్చున్నారు. సిరిసిల్ల శివారులోని చిన్నబోనాలకు చెందిన పడిగే ఎల్లయ్య, మణెమ్మ దంపతులు తమ కూతురు రమ్యతో కలిసి తెల్లవారుజాము నుంచే క్యూలైన్లో ఉన్నారు. ఒక్కొక్కరికి ఒకే బస్తా ఇస్తుండడంతో తాము సాగుచేసిన ఐదు ఎకరాలలోని వరిపొలానికి ఎటూ సరిపోవని ముగ్గురు లైన్లో ఉండి మూడు యూరియా బస్తాలకు టోకెన్ పొందారు. ఓదెల తహసీల్ ముట్టడి ఓదెలకు చెందిన రైతులు దాదాపు 100 మంది యూరియా కోసం తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించారు. స్థానిక ఫర్టిలైజర్‌షాపు యజ మాని బ్లాక్‌లో విక్రయిస్తున్నాడంటూ తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. ఏఈవోలు సైతం టోకెన్లు స రిగా ఇవ్వడం లేదన్నారు. గంటల తరబడి క్యూౖ లెన్లో ఎదురుచూస్తుంటే స్టాక్ లేదంటూ కుంటిసాకులు చెబుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓదెల: తహసీల్దార్‌తో గోడు వెల్లబోసుకుంటున్న రైతులుసిరిసిల్లలో యూరియా కోసం వచ్చిన తల్లీకూతుళ్లు పడిగె మణెమ్మ, రమ్య సిరిసిల్లలో క్యూలైన్లో కుటుంబ సభ్యులు ఓదెలలో తహసీల్ ఆఫీస్ ముట్టడి -
4.098 కిలోల గంజాయి స్వాధీనం
● కారు, మొబైల్‌ఫోన్ స్వాధీనం ● పెద్దపల్లి ఏసీపీ కృష్ణ వెల్లడి ఓదెల(పెద్దపల్లి): పొత్కపల్లి గ్రామ శివారులో 4.098 కేజీల గంజాయి స్వాధీనం చేసు కున్నట్లు పెద్దపల్లి ఏసీపీ కృష్ణ తెలిపారు. పొత్కపల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం వివరాలు వెల్లడించారు. సుల్తానాబాద్ సీఐ సుబ్బారెడ్డి, పొత్కపల్లి ఎస్సై రమేశ్ పొత్కపల్లి గ్రామ శివారులో వాహనాలు తనిఖీ చేస్తుండగా అటుగా ఓ కారు వచ్చిందన్నారు. అందులో తనిఖీ చేయగా.. కంసాని అరుణ్ వద్ద 4.098 కేజీల ఎండు గంజాయి లభిందని పేర్కొన్నారు. దాని విలువ సుమారు రూ.2.04 లక్షలు ఉంటుందని వివరించారు. కారుతోపాటు మొబైల్‌ఫోన్ స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశామని వివరించారు. ఇదే కేసులో నిందితులు ఇల్లెందుకు చెందిన బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాశ్ పరారీలో ఉన్నట్లు ఏసీపీ పేర్కొన్నారు. నిందితులను పట్టుకున్న సీఐ, ఎస్సైతోపాటు ఏఎస్సై రత్నాకర్, కానిస్టేబుళ్లు రాజుయాదవ్, హరీశ్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేశ్‌ను అభినందించారు. ఎన్టీపీసీ స్టేజ్–2కు పర్యావరణ అనుమతులు జ్యోతినగర్(రామగుండం): రామగుండం ఎన్టీపీసీలో చేపట్టిన 2,400 మెగావాట్ల తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండోదశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. సుమారు ఎనిమిది నెలల క్రితం ఇందుకోసం ప్రజాభిప్రాయ సేకరణ చేశారు. పర్యావరణ క్లియరెన్స్ కోసం గత ఆగస్టు 26న ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నివేదికను సమగ్రంగా పరిశీలించిన అనంతరం పర్యావరణ అనుమతులను జారీ చేస్తూ భారత ప్రభుత్వ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ విభాగం అనుమతి జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టం –2014 ప్రకారం బొగ్గు ఆధారిత 4,000 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్‌ను తెలంగాణ రాష్ట్రం కోసం ఏర్పాటు చేయాలని కేంద్రప్రభుత్వం ఆదేశించింది. ఈక్రమంలో ఇప్పటికే 1,600 మెగావాట్ల ఒకటో దశ ప్రాజెక్టు నిర్మించింది. రెండోదశలో ఒక్కోటి 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు యూనిట్లను నిర్మించనున్నారు. -
రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్స
కరీంనగర్‌టౌన్: నగరంలోని రెనే ఆస్పత్రిలో అధునాతన గుండె చికిత్సను విజయవంతంగా పూర్తి చేసినట్లు ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ బంగారి స్వామి తెలిపారు. శుక్రవారం ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ రవికుమార్‌తో కలిసి ఆపరేషన్ వివరాలు తెలియజేశారు. మంచిర్యాల జిల్లా లక్సెట్టిపేటకు చెందిన అజయ్ అనే బాలుడికి పుట్టినప్పటి నుంచి గుండెకు రంద్రం ఉందని తెలిపారు. ఆయాసం, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావడంతో గుండెదడ, బరువైన పనులు చేయలేక బాధపడుతున్నాడని వివరించారు. రెనే ఆస్పత్రికి వచ్చిన తర్వాత అతడికి మల్టీ ఇన్వేసివ్ కార్డియాక్ సర్జరీ(ఎంఐసీఎస్) చేసినట్లు తెలిపారు. ఛాతి భాగంలో పూర్తిగా చీరకుండ, పక్కటెముకల మధ్యలో చిన్న గాటు పెట్టి ప్రత్యేకమైన పరికరం ద్వారా ఈ ఆపరేషన్ చేసినట్లు తెలిపారు. మెట్రో సిటీలకే పరిమితమైన ఈ ఆపరేషన్ కరీంనగర్‌లోని రెనే ఆస్పత్రిలో మాత్రమే అందుబాటులో ఉందన్నారు. తెలంగాణలో హైదరాబాద్ మినహా రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కీలుమార్పిడి శస్త్రచికిత్స వైద్యసేవలు తమ ఆస్పత్రిలో అక్టోబరులో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో కార్డియాలజీ డాక్టర్ దినకర్, చిన్నపిల్లల గుండె వైద్యుడు రాజావిజయేందర్రెడ్డి, మెడికల్ సూపరింటెండెంట్ రవీంద్రాచారి, నాన్ క్లినికల్ డైరెక్టర్ అరవింద్‌బాబు, జనరల్ మేనేజర్ పవన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
130 మంది మందుబాబులకు జరిమానా
● డ్రంకెన్‌డ్రైవ్‌లో పట్టుబడ్డ యువత వేములవాడ: వేములవాడ టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధి లో 14 రో జులుగా నిర్వహించిన డ్రంకెన్‌డ్రైవ్ తనిఖీలలో పట్టుబడ్డ 130 మంది మందుబాబు లను శుక్రవారం కోర్టులో ప్రవేశపెట్టారు. వీరిలో 70 మంది ద్విచక వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.2వేలు, 30 మంది ద్విచక్ర వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.5వేలు, 30 మంది టూవీలర్, ఫోర్ వీలర్ వాహనదారులకు ఒక్కొక్కరికి రూ.10వేలు జరిమానా విధిస్తూ వేములవాడ మేజిస్ట్రేట్ ప్రవీణ్ తీర్పు వెల్లడించినట్లు టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. ఠాణా ఆవరణలో వీరందరికీ కౌన్సెలింగ్ నిర్వహించి ఇంకెప్పుడు మద్యం సేవించి వాహనాలు నడపబోమని ప్రతిజ్ఞ చేపించారు. అదుపుతప్పి బోల్తాపడిన ఆటో శంకరపట్నం: కేశవపట్నం గ్రామంలో శుక్రవారం ఆటో అదుపుతప్పి బోల్తాపడడంతో నలుగురికి తీవ్రగాయాలైనట్లు స్థానికులు తెలిపా రు. హుజూరాబాద్ మండలం చెల్పూర్ గ్రామానికి చెందిన ఆరుగురు ఆటోలో తిమ్మాపూర్ మండలం మొగిలిపాలెంలో బంధువుల సంవత్సరికానికి వెళ్తుండగా ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలోని నలుగురు మహిళలకు గాయాలు కాగా మరో ఆటోలో చికిత్స కోసం కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. గంజాయి విక్రేతల రిమాండ్వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను శుక్రవారం రిమాండ్‌కు తరలించినట్లు ఎ ల్లారెడ్డిపే ట సీఐ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. మండలంలో ని గర్జనపల్లికి చెందిన భరత్, దినేశ్ వీర్నపల్లిలో గంజాయి విక్రయిస్తుండగా ఎస్సై వేముల లక్ష్మణ్ అరెస్ట్ చేసి, రిమాండ్‌కు పంపించారు. -
రాజన్నా శరణు..శరణు
సినీనటుడు చిన్నకు స్వామి వారి ప్రసాదాలు అందజేస్తున్న అర్చకులురాజన్నను దర్శించుకుంటున్న భక్తులు వేములవాడ: రాజన్నను శుక్రవారం 10 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. అమ్మవారికి కుంకుమపూజ, గండాదీపంలో నూనె పోశారు. స్వామి వారికి అత్యంత ప్రీతపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తుల సౌకర్యార్థం ఆలయ అధికారులు ఈ–టికెట్ విధానం ప్రఽవేశపెట్టారు. దీంతో రోజుకో కలర్‌తో కూడిన ప్రింట్ అవుట్‌తో కోడె టికెట్లు అందజేస్తున్నారు. రూ.200 కోడె టికెట్‌కు ఒక లడ్డూ ఉచితంగా అందజేస్తున్నారు. సినిమా నటుడు చిన్న స్వామి వారిని దర్శించుకున్నారు. -
ఉత్తమ జట్టును ఎంపిక చేయాలి
పాఠశాలల క్రీడలకు పూర్వ వైభ వం వచ్చింది. కరో నా అనంతరం ఈ సంవత్సరం జరుగుతున్న పో టీలకు పెద్దసంఖ్యలో క్రీడాకా రులు హాజరవడం శుభపరిణా మం. ఆయా జిల్లాల ఎస్జీఎఫ్ కా ర్యదర్శులు ఉత్తమమైన, పటిష్టమైన ఉమ్మడి జిల్లా జట్టును ఎంపి క చేసి రాష్ట్ర పోటీలకు పంపించాలి. – నందెల్లి మహిపాల్, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు విజేతగా నిలవాలి 69వ రాష్ట్రస్థాయి పాఠశాలల క్రీడల్లో ఉమ్మడి కరీంనగర్ జట్టు విజేతగా నిలవాలి. ఎస్జీఎఫ్ క్రీడల్లో నంబర్‌వన్‌గా ఎదగాలి. జిల్లా, ఉమ్మడి జిల్లా పోటీలకు ఒలింపిక్ సంఘం సహాయ, సహకారాలందిస్తాం. క్రీడాకారులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఘనంగా నిర్వహించాలి. – గసిరెడ్డి జనార్దన్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి మంచి స్పందన.. కరీంనగర్ జిల్లాలో పెద్దసంఖ్యలో ఉమ్మడి జిల్లాస్థాయి పోటీల నిర్వహణ బాధ్యతలను తీసుకున్న. క్రీడలకు తలమానికంగా ఉన్న కరీంనగర్ జిల్లాలో క్రీడలను ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నాం. మండలస్థాయి పోటీలకు మంచి స్పందన వచ్చింది. జిల్లాస్థాయి పోటీలను కూడా అదే స్ఫూర్తితో నిర్వహిస్తాం. – బి.వేణుగోపాల్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, కరీంనగర్ ఘనంగా నిర్వహిస్తాం పెద్దపల్లి జిల్లాలో జరగనున్న ఉమ్మడి జిల్లాస్థాయి పోటీలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. మండలస్థాయి, మండల జోన్‌స్థాయి పోటీలు అట్టహాసంగా జరుగుతున్నాయి. క్రీడాకారులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. జిల్లాస్థాయి పోటీలు కూడా త్వరలోనే నిర్వహిస్తాం. – కనుకుంట్ల లక్ష్మణ్, ఎస్జీఎఫ్ కార్యదర్శి, పెద్దపల్లి -
ఇరువర్గాలకు ప్రయోజనం
కక్షిదారులకు సత్వర న్యాయం అందించడానికి లోక్ అదాలత్‌లు ఉపయోగపడతాయి. కేసుల కోసం ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగే బదులు, ఇరువర్గాలు రాజీ చేసుకుంటే సంతోషంగా ఉండవచ్చు. లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసుల పరిష్కారంతో కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గుతుంది. – సి.రత్న పద్మావతి, జిల్లా న్యాయ సేవా సంస్థ చైర్మన్ సత్వర న్యాయం లోక్ అదాలత్ ద్వారా కక్షిదారులకు సత్వర న్యాయం లభిస్తుంది. డబ్బుతో పాటు సమయం ఆదా అవుతుంది. మనశ్శాంతి లభిస్తుంది. క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్ అదాలత్ ఒక్క వేదిక. రాజీయే రాజమార్గం అనే సూత్రంపై లోక్ అదాలత్‌లు పనిచేస్తాయి. – వెంకట మల్లిక్ సుబ్రహ్మణ్య శర్మ, జిల్లా న్యాయ సేవాసంస్థ కార్యదర్శి -
సమర్థవంతమైన నేర విచారణ చేపట్టాలి
జగిత్యాలక్రైం: ప్రతీ కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ఎస్పీ అశోక్‌కుమార్ సూచించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఇన్వెస్టిగేషన్ అండ్ బిల్డింగ్ ది కేస్ అంశాలపై పోలీసు అధికారులకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ.. నేర విచారణ, నేర నిరూపన సమర్థవంతంగా చేయడం ద్వారా నిందితులకు కోర్టు ద్వారా శిక్షలు పడే అవకాశం ఉందన్నారు. కేసుల దర్యాఫ్తు ఒక సమగ్ర ప్రక్రియ అని, ఎఫ్ఐఆర్ నుంచి చార్జ్‌షీట్ సిద్ధం చేసేంత వరకు ప్రతి దశను పకడ్బందీగా నిర్వహించడం అత్యంత ముఖ్యమన్నారు. పోక్సో, ఎస్సీ, ఎస్టీ గ్రేవ్ కేసుల్లో నాన్ గ్రేవ్ అగెనెస్ట్ ఉమెన్ కేసుల్లో, గంజాయ్, మత్తు పదార్థాల కేసుల్లో ప్రొసిజర్ ప్రకా రం ఇన్వెస్టిగేషన్ చేసి కోర్టులో చార్జ్‌షీట్ దాఖలు చేయాలన్నారు. డీఎస్పీ రఘుచందర్, సీఐ లు అనిల్‌కుమార్, సురేశ్‌కుమార్, సుధాకర్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, రవి, ఎస్సైలు పాల్గొన్నారు. మేడిపల్లి పోలీస్‌స్టేషన్ తనిఖీ మేడిపల్లి: మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అశోక్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్‌లోని రికార్డులు, కేసు డైరీలు, సిబ్బంది పనితీరును తెలు సుకున్నారు. పెండింగ్ కేసులు త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. 5ఎస్ విధానాన్ని పాటించాలన్నారు. విజిబుల్ పోలీసింగ్‌పై ప్రత్యేక దృష్టి చూపాలన్నారు. స్టేషన్పరిధిలోని గ్రామాలను తరచూ సందర్శించాలన్నారు. పాతనేరస్తులపై నిఘా పెంచాలన్నారు. ఎస్సై శ్రీధర్‌రెడ్డి, సిబ్బంది ఉన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కథలాపూర్: గ్రామాల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరైతే పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులకు సూచించారు. శుక్రవారం కథలాపూర్ మండలం చింతకుంట, భూషణరావుపేట గ్రామాల్లో గ్రామపంచాయతీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించారు. అంబారిపేటలో కొత్తగా నిర్మిస్తున్న ప్రాథమిక ఆరోగ్యకేంద్రం భవనాన్ని పరిశీలించారు. పీహెచ్సీలో ప్రజలకు అందిస్తున్న వైద్యం గురించి ఆరా తీశారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. వైద్యసిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ఇంటింటా జ్వర సర్వే చేయాలని, ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా అందించాలన్నారు. ఆర్డీవో జివాకర్‌రెడ్డి, గృహానిర్మాణశాఖ అధికారి ప్రసాద్, పంచాయతీరాజ్‌శాఖ ఈఈ లక్ష్మణ్‌రావు, తహసీల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్, వైద్యాధికారి రచన, ఏఈ జగదీశ్వర్ పాల్గొన్నారు. పంచాయతీ భవనాలు పూర్తి చేయాలి జగిత్యాల: జిల్లాలోని పంచాయతీ భవనాల నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ భవనాలను గుర్తించి, కొత్తవి నిర్మించేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్లు లత, రాజాగౌడ్, డీఆర్డీఏ పీడీ రఘువరణ్, పంచాయతీ అధికారి మదన్మోహన్ పాల్గొన్నారు. -
‘యూరియా కొరత కేంద్రం వైఫల్యమే’
జగిత్యాలటౌన్: యూరియా కొరత కేంద్ర ప్ర భుత్వ వైఫల్యానికి నిదర్శనమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరాభవన్ శుక్రవారం మాట్లాడుతూ.. పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తాము అదేపార్టీలో ఉంటున్నామని స్పీకర్‌కు వివరణ ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నానని తెలిపారు. ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం చక్కెర ఫ్యాక్టరీని తిరిగి ప్రారంభించేందుకు సర్కార్ మంత్రి శ్రీధర్‌బాబు నేతృత్వంలో కమిటీ వేసిందన్నారు. రూ.176 కోట్లు చెల్లించి, బ్యాంకు తాకట్టులో ఉన్న కార్మాగారాన్ని విడిపించడం జరిగిందన్నారు. నాయకులు జువ్వా డి కృష్ణారావు, బండ శంకర్, గాజుల రాజేందర్, పుప్పాల అశోక్, నందయ్య పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేయాలి వెల్గటూర్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై ఎండపల్లి మండల ముఖ్య నాయకులతో కరీంనగర్లో శుక్రవారం సమీక్షించారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు రెండు పిల్లర్లు కుంగి నంత మాత్రాన డ్యాం కూలిపోయిందని అ బ ద్ధపు ప్రచారాలు చేసి కాంగ్రెస్ గద్దెనెక్కిందని ఆరోపించారు. ఎల్అండ్టీ కంపెనీ మరమ్మతు చేస్తామని చెప్పినా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పట్టించుకోలేదని ఆరోపించారు. మాజీ ఎమ్మె ల్యే పుట్ట మధు, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మ ణరావు పాల్గొన్నారు. యమ ధర్మరాజుకు ప్రత్యేక పూజలు ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మినృసింహాస్వామి అనుబంధ శ్రీ యమధర్మరాజు ఆలయంలో శుక్రవారం భరణి నక్షత్రం సందర్భంగా ప్రత్యే క పూజలు నిర్వహించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేదపండితులు బొజ్జ రమేశ్‌శర్మ మంత్రోచ్ఛారణలతో రుద్రాభిషేకం, మన్యసూక్తం, ఆయుష్యసూక్తంతో అభిషేకం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ఆయుష్య హో మం హారతి, మంత్రపుష్పం పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ సూపరింటెండెంట్ కిరణ్, సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ పాల్గొన్నారు. నీటి విడుదల నిలిపివేత జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి జిల్లాకు సాగునీరు అందించే కాకతీయ కాలువకు శుక్రవారం నీటి విడుదలను నిలిపివేశారు. నిర్మల్ జిల్లా సావెల్ గ్రామ సమీపంలోని ఎస్సారెస్పీ కాలువలో ఒక్కరు గల్లంతు కావడంతో, ఆయన ఆచూకీ కోసం నీటి విడుదల ఆపేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 17,715 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఆ మేరకు ఔట్‌ఫ్లో వెళ్తోంది. ప్రాజెక్టు నుంచి వరద కాలు వకు 8వేల క్యూసెక్కులు, సరస్వతీ కాలువకు 800 క్యూసెక్కులు, మిషన భగీరథకు 231 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జిల్లాకు వర్ష సూచన జగిత్యాలఅగ్రికల్చర్: రాబోయే ఐదు రోజుల్లో జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని పొలాస వ్యవసాయ పరిశోధనస్థానం వాతావరణ శాస్త్రవేత్త బి.శ్రీ లక్ష్మి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. సెప్టెంబర్ 15 నుంచి 17 వరకు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశముందన్నారు. పగటి ఉష్ణోగ్రతలు 29– 31 డిగ్రీల సెల్సియస్‌గా, రాత్రి ఉష్ణోగ్రతలు 24 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యే అవకాశముందన్నారు. -
పాఠశాలల అభివృద్ధికి కృషి
జగిత్యాలరూరల్/జగిత్యాల: పాఠశాలల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ తెలిపారు. జగిత్యాల రూరల్ మండలం చల్గల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.14 లక్షలతో నిర్మించే సైన్స్ ల్యాబ్‌కు, రూ.19 లక్షల ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. చల్గల్ గ్రామంలో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేయడం జరిగిందన్నారు. 10ఎకరాల్లో ఇండోర్ స్టేడియం విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరందన్, ఎంఈవో గంగాధర్, మాజీ జెడ్పీటీసీ ఎల్లారెడ్డి, మాజీ ఏఎంసీ చైర్మన్ దామోదర్‌రావు, నాయకులు పెండెం రాములు, బాలముకుందం, మల్లేశం, ఆసీఫ్ పాల్గొన్నారు. లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలి విద్యార్థులు పాఠశాలల్లోని లైబ్రరీలను సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో రూ.20 లక్షల నిధులతో ఏర్పాటు చేసిన గదులను, లైబ్రరీని ప్రారంభించారు. జిల్లా కేంద్రంలో సోషల్ వెల్ఫేర్ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేసుకోవడంతో పాటు, టీఆర్‌నగర్ వద్ద ఏటీసీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లైబ్రరీకి పుస్తకాలు, పేపర్లు అందించేందుకు దాతలు ముందుకు రావాలన్నారు. కమిషనర్ స్పందన, డీఈ ఆనంద్, ఏఈ అనిల్ పాల్గొన్నారు. హైపటైటిస్ వ్యాక్సిన్ తీసుకోవాలి హైపటైటిస్ బి వ్యాక్సిన్‌పై అవగాహన లేక అనేక మంది మరణిస్తున్నారని, అందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ సూచించారు. శుక్రవారం మాత శిశు కేంద్రంలో హెల్త్‌కేర్ వర్కర్లకు హైపటైటిస్ బి వ్యాక్సిన్‌ను ఇచ్చారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ఆర్ఎంవో సుమన్‌రావు, గీతిక, సూర్య, మహేశ్ పాల్గొన్నారు. -
రాజీకి వారధి లోక్ అదాలత్
జగిత్యాలజోన్: ‘ఓడిన వాడు కోర్టులో ఏడిస్తే.. గెలిచిన వాడు ఇంటికెళ్లి ఏడ్చాడు’ అనే సామెతను కోర్టు కేసులు ఎదుర్కొన్నవారు చెబుతుంటారు. కేసుల విచారణలో ఎనలేని జాప్యంతో కక్షిదారుల కు సత్వర న్యాయం దక్కడం లేదనే వాదన ఉంది. ఏడాదిలో కనీసం నాలుగైదు మెగా లోక్ అదాలత్‌లు నిర్వహించి, వీలైనన్ని కేసులు పరిష్కరించేందు కు న్యాయమూర్తులు, న్యాయవాదులు చొరవ చూ పుతున్నారు. శనివారం(నేడు) జిల్లావ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో మెగా లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. 20 నెలలు.. 14,778 కేసుల పరిష్కారం జిల్లాలోని అన్ని కోర్టుల్లో విచారణలో ఉన్న సివిల్, క్రిమినల్ కేసుల్లో 14,778 కేసులకు 20 నెలల్లో లోక్‌అదాలత్ ద్వారా మోక్షం లభించింది. 2024లో 10,660 కేసులు, 2025లో ఇప్పటి వరకు 4,118 కేసులు పరిష్కరించారు. అయినా జిల్లాలోని అన్ని కోర్టుల్లో మరో 18వేల కేసులు పెండింగ్‌లో ఉన్నా యి. శనివారం నాటి లోక్ అదాలత్‌లో రాజీకి అనుకూలమైన కేసులు 8,697 ఉండగా, 3వేలకు పైగా కేసులు పరిష్కరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రిమినల్ కేసుల్లో 865, మనీ రికవరీ కేసుల్లో 51, దంపతులకు సంబంధించినవి 31 కేసులు, 316 సివిల్ కేసులతో పాటు డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ– పెట్టి కేసులు, చెక్‌బౌన్స్ కేసులు పరిష్కరించనున్నారు. జిల్లాలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కో ర్టులు లేవు. జడ్జిల నియామకం పెద్దగా జరగడం లే దు. దీంతో చిన్న విషయంలో కోర్టుకు వెళ్లినా పరి ష్కారానికి ఏళ్లసమయం పడుతోంది. ఒక కేసులో దాదాపు 15 నుంచి 20మందిని విచారించి తీర్పులు చెప్పడం జడ్జిలకు కష్టసాధ్యంగా మారుతోంది. లోక్ అదాలత్‌కు అధిక ప్రాధాన్యం లోక్ అదాలత్‌ల్లో రాజీ చేసుకోదగ్గ అన్ని రకాల కేసులు పరిష్కరిస్తున్నారు. ఇరువర్గాలకు రాజీమార్గంలో నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందుకో సం మధ్యవర్తిత్వ బెంచ్‌లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. లోక్ అదాలత్ తీర్పులు సుప్రీం కోర్టు తీర్పుతో సమానం. ఒక్కసారి లోక్ అదాలత్‌లో రాజీ చే సుకున్న తర్వాత మళ్లీ ఎక్కడికెళ్లినా చెల్లదు. ఎలాంటి ఫీజులు వసూలు చేయరు. లోక్ అదాలత్‌పై అవగాహన కల్పించేందుకు గ్రామాల్లో న్యాయ సేవా అధికార సంస్థ ద్వారా చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. -
ప్రిజన్ డ్యూటీ మీట్– 2025లో జైలర్‌కు గోల్డ్‌మెడల్
జగిత్యాలజోన్: ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్– 2025 క్రీడోత్సవాలు సెప్టెంబర్ 9నుంచి 11వరకు హైదరాబాద్‌లోని పోలీస్ అకాడమీలో నిర్వహించారు. 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి అయా రాష్ట్రాల తరఫున జైళ్లశాఖకు చెందిన 1300 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. మన రాష్ట్రం తరుఫున పాల్గొన్న జగిత్యాల స్పెషల్ సబ్ జైలర్ మొగిలేశు వన్ మినిట్ డ్రిల్ విభాగంలో గోల్డ్‌మెడల్ గెలుచుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ సౌమ్యమిశ్రా చేతుల మీదుగా గోల్డ్‌మెడల్‌ను అందుకున్నారు. మెగిలేశును హెడ్ వార్డర్లు ఎండీ.మజారోద్దిన్, పీహెచ్.దేవదాసు, కానిస్టేబుళ్లు ఎస్.అశోక్‌కుమార్, ఎం.విజయ్, బి.శ్రీనివాస్ అభినందించారు. -
రోడ్డుపైకి వ్యాపారాలు
జగిత్యాల: జిల్లా కేంద్రం శరవేగంగా అభివృద్ధి చెందుతుండటంతో ఆస్పత్రులు, సూపర్మార్కెట్లు, వ్యాపార సముదాయాలు వెలుస్తున్నాయి. ట్రాఫిక్ పెరిగి.. రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది. కొత్తబస్టాండ్ నుంచి టవర్‌సర్కిల్ వరకు, తహసీల్ చౌరస్తా నుంచి జంబిగద్దె వరకు, జంబిగద్దె నుంచి అశోక్, పాతబస్టాండ్ ఏరియాల్లో జనసంచారం ఎక్కువగా ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో కొందరు వ్యాపారులు రోడ్డును ఆక్రమించి అమ్మకాలు నిర్వహిస్తున్నారు. దుకాణాల నేమ్‌బోర్డులు, ఫ్లెక్సీలతో కూడిన బోర్డులు రోడ్డుపై పెడుతున్నారు. ఇది ప్రజ లకు ఇబ్బందికరంగా మారుతోంది. అసలే ఇరుకై న రోడ్లు కావడం, రోడ్లను ఆనుకుని బోర్డులు ఏర్పా టు చేయడంతో వాహనదారులకు పార్కింగ్ కష్టాలు తప్పడం లేదు. కార్లు, ఆటోలు అటువైపు వెళ్లే పరిస్థితి లేదు. కొందరైతే దర్జాగా రోడ్లను ఆనుకుని రేకులషెడ్లు నిర్మిస్తున్నారు. ఇంత జరుగుతున్నా.. టౌన్‌ప్లానింగ్ అధికారులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికై నా బల్దియా అధికారులు స్పందించి రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేసేవా రిపై చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ‘రోడ్లను ఆనుకుని బోర్డులు పెట్టవద్దు. ప్రజలకు ఇబ్బంది కలిగించొద్దు. అలాంటి వారికి నోటీసులు ఇస్తాం’ అని టీపీవో శ్రీనివాస్ వివరించారు.జిల్లా కేంద్రంలోని అశోక్‌నగర్ కాలనీ ఇది. ఇక్కడ పదుల సంఖ్యలో ఆస్పత్రులున్నాయి. ఆస్పత్రుల సూచిక బోర్డులు రోడ్డుపైనే పెట్టడంతో వాహనదారులు, పాదచారులకు ఇబ్బందిగా మారింది. వాహనాల పార్కింగ్‌కు స్థలం లేకుండా పోతోంది. శుక్రవారం ఓ వ్యక్తి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే అంబులెన్స్‌లో ఈ దారిలో ఉన్న ఆస్పత్రికి తీసుకొచ్చారు. రోడ్డు ఇరుకుగా మారడంతో అంబులెన్స్ 20 నిమిషాల పాటు ట్రాఫిక్‌లో చిక్కుకుపోయింది. రోడ్డు ఆక్రమణలపై టౌన్‌ప్లానింగ్ అధికారులు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
అను‘మతి’లేని ల్యాబ్‌లు
● నిర్వాహకుల ఇష్టారాజ్యం ● ప్రజల ప్రాణాలతో చెలగాటం ● అందినంతా దోపిడీ ● జిల్లాకేంద్రంలో రెండు ల్యాబ్‌లు సీజ్జగిత్యాల: జిల్లాకేంద్రంలోని బైపాస్‌రోడ్‌లో గల ఓ ల్యాబ్‌పై వైద్యశాఖ అధికారులు గురువారం తనిఖీలు చేపట్టారు. అనుమతి పత్రాలు లేకపోవడం, నిబంధనలకు విరుద్ధంగా ఉండటంతో దానిని సీజ్ చేశారు. అనుమతి తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని నోటీసులు ఇచ్చారు. వాతావరణంలో వస్తున్న మార్పులతో చాలామంది వైరల్ జ్వారాల బారిన పడుతున్నారు. దీనిని ఆసరగా చేసుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రులు వివిధ రకాల టెస్ట్‌లతో దోపిడీ చేస్తున్నాయి. కొన్ని ల్యాబ్‌లు అనుమతి లేకుండా ఇష్టానుసారంగా ల్యాబ్‌లు ఏర్పాటు చేసుకుని అందినంతా దోచుకుంటున్నా రు. ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే వైద్య శాఖ నుంచి అనుమతి తప్పనిసరి. కానీ నిబంధనలకు విరుద్ధంగా గల్లీకో రక్తపరీక్ష కేంద్రాలు వెలిశాయి. చిన్నపాటి శిక్షణ పొందుతూ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే.. వాస్తవానికి ఒక ల్యాబ్ ఏర్పాటు చేయాలంటే గది సుమారు 100 స్క్వైర్ ఫీట్స్ ఉండాలి. పరికరాలు ఉండాలి. ల్యాబ్‌లో ఎంబీబీఎస్ డాక్టర్‌తోపాటు పాథాలజిస్ట్, టెక్నిషియన్స్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. జిల్లాలోని కొన్ని ల్యాబ్‌లలో వీరు ఎక్కడా కనిపించరు. రోగికి చేసే పరీక్షల్లోనూ ప్రమాణాలు పాటించడం లేదు. కిట్లలోనూ అవకతవకలు జరుగుతున్నట్లు ఆరోపణలున్నాయి. గల్లీకొకటి.. జిల్లా కేంద్రంతోపాటు కోరుట్ల, మెట్పల్లి మున్సిపాలిటీల్లో ల్యాబ్‌లు, రక్త పరీక్ష కేంద్రాలు ఇష్టారాజ్యంగా వెలిశాయి. మొత్తంగా 500కు పైగానే ఉంటాయని అంచనా. ఎలాంటి అర్హత లేకున్నా.. అనుమతి లేకుండానే కొన్ని ఏర్పాటు చేశారు. చిన్నపాటి మెట్ల సందులు, చిన్నచిన్న షటర్లలో వీటిని ఏర్పాటు చేశారు. దోపిడే వారి పని కొన్ని ఆస్పత్రులకు అనుసంధానంగా ల్యాబ్‌లు లేవు. దీంతో రోగులు ఇలాంటి ల్యాబ్‌కు వెళ్తున్నారు. అక్కడ వీరికి రక్తపరీక్ష, మూత్రపరీక్ష చేస్తూ దాదాపు రూ.1500 నుంచి రూ.3000 వరకు వసూలు చేస్తున్నారు. రూ.100కు చేయాల్సిన పరీక్షకు రూ.500 వరకు బిల్లు వేస్తున్నారు. ఈ రిపోర్టుల్లోనూ అనేక తప్పులు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలున్నాయి. అనుమతి ఉన్నవి నాలుగే జిల్లా కేంద్రంలో అన్ని నిబంధనలతో కూడిన ల్యాబ్‌లు నాలుగు మాత్రమే ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. ఇంత పెద్ద జిల్లా కేంద్రంలో దాదాపు 500కు పైగా ల్యాబ్‌లు అనుమతి లేకుండా కొనసాగుతున్నాయి. నిబంధనల ప్రకారం నర్సింగ్‌హోంలకు మాత్రమే అనుబంధంగా ల్యాబ్‌లుంటాయి. కానీ ఇక్కడ ఎక్కబడితే అక్కడ ఏర్పాటు చేశారు. ఆఫర్ల పేరిట దోపిడీ రక్త పరీక్ష, మూత్రపరీక్షలే కాకుండా వివిధ రకాల పరీక్షలు చేస్తామంటూ ఆఫర్లు ఇస్తున్నారు. థైరాయిడ్, కిడ్నీ, లివర్, లిపిడ్ పరీక్షలకు రూ.450, రూ.200కే చేస్తామంటూ బోర్డులు తలిగిస్తున్నారు. అంతేకాకుండా రూ.వెయ్యికే 50 రకాల టెస్ట్‌లు అంటూ మభ్యపెడుతున్నారు. విదేశాలకు వెళ్లే వారికీ చెకప్ జిల్లా నుంచి అనేక మంది విదేశాలకు వెళ్తుంటారు. వీరికి మెడికల్ రిపోర్ట్స్ తప్పనిసరి. దీనిని ఆసరాగా చేసుకున్న ల్యాబ్ నిర్వాహకులు విదేశాలకు వెళ్లే వారికి పరీక్షలు చేస్తూ అన్నీ బాగానే ఉన్నట్లు రిపోర్ట్ ఇస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రిజిస్ట్రేషన్ తప్పనిసరి ల్యాబ్‌కు రిజిస్ట్రేషన్ తప్పనిసరి. ఎంబీబీఎస్ డాక్టర్, పాథాలజిస్ట్, మైక్రోబయాలజిస్ట్ ఉండాలి. ఎక్కపడితే అక్కడ ల్యాబ్ ఏర్పాటు చేయకూడదు. వైద్యశాఖ అనుమతి ఉండాలి. పరికరాలు అన్నింటిని ఏర్పాటు చేయాలి. కొన్నింటిని సీజ్ చేశాం. మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తీసుకుంటాం. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
‘మెటా’ నిందితుల అరెస్టు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: క్రిప్టో కరెన్సీ పేరిట పాత జిల్లావాసులకు రూ.100 కోట్లు కుచ్చుటోపీ పెట్టిన మెటా ఫండ్ యాప్ కథ కొలిక్కి వచ్చింది. రోజుకు రూ.లక్షలు సంపాదించవచ్చని ఆశచూపి రూ.కోట్లు వసూలు చేసిన సూత్రధారుల్లో నలుగురుని కరీంనగర్ సీసీఎస్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. జూలైలో కశ్మీర్‌గడ్డకు చెందిన పుప్పాల శ్రీకర్ తనను మెటా ఫండ్ పేరిట రూ.54 లక్షల మేర మోసం చేశారని దాసరి రమేశ్, దాసరి రాజులపై ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పరారీలో ఉన్న దాసరి రమేశ్, దాసరి రాజులతోపాటు బూర శ్రీధర్, తులసీ ప్రకాశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వీరితోపాటు లోకేశ్, సతీశ్‌ను అరెస్టు చేయాల్సి ఉంది. లోకేశ్ థాయ్‌లాండ్‌లో తలదాచుకుంటుండగా, సతీశ్ దుబాయ్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ కేసులో జాతీయ నిఘా సంస్థలు, రాష్ట్ర నిఘా సంస్థలు నిందితుల పాత్రపై ఎప్పుడో పూర్తిగా సమాచారం సేకరించాయి. ఈ విషయంలో జూన్ నుంచి ‘సాక్షి’ రాస్తున్న కథనాలు వాస్తవరూపం దాలుస్తుండటం గమనార్హం. దుబాయ్‌లో ఆస్తులు మెటా ఫండ్ నిర్వాహకులు ఎంతమంది అన్నది ఇప్పటికీ స్పష్టత లేదు. నిందితులు ఇక్కడ వసూలు చేసిన డబ్బును హవాలా మార్గంలో విదేశాలకు పంపారు. దుబాయ్‌లో దాదాపు రూ.40 కోట్లు ఖర్చు చేసి వరల్డ్ ట్రేడ్ సెంటర్, షేక్ జాహిద్ రోడ్లో ఈ ఏడాది జనవరిలో పబ్ ప్రారంభించారు. వీరి బినామీల పేర్లతో అక్కడ పలు వ్యాపారాలు కూడా మొదలు పెట్టారని, లక్కీ భాస్కర్ సినిమాలో మాదిరిగా పరిస్థితులు అనుకూలించకపోతే ఉన్నపలంగా వీసా తీసుకుని దేశం వదిలి పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. వీరు ఏడాదిన్నరగా పలువురి వద్ద నుంచి రూ.కోట్లు వసూలు చేశారు. వీరిలో సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి, పెద్దపల్లి జిల్లాలకు చెందిన టీచర్లు, లెక్చరర్లు, పోలీసులు, రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు. వీరు ఇంతకాలం మౌనంగా ఉన్నా.. ఇప్పుడిప్పుడే ముందుకొస్తున్నారు. సీపీకి లీగల్ నోటీసులు, సీఐలకు దమ్కీలు మెటా నిర్వాహకుల్లో కొందరు పాత నేరస్తులు కావడంతో పోలీసులతో మంచి పరిచయాలు ఉన్నాయి. భారీగా లంచాలు ఎరవేసి ఇంతకాలం తమపై కేసులు కాకుండా జాగ్రత్త పడ్డారు. పైగా ఫిర్యాదుదారులనే పోలీసుల చేత బెదిరింపులకు గురిచేయించారు. కరీంనగర్ సీపీకి సైతం లీగల్ నోటీసులు పంపారు. తమపై ఫిర్యాదు చేసిన వారిపై కోర్టులో ప్రైవేటు కేసు నడిపిస్తున్నారు. వీరు అంతటితో ఆగలేదు. తమ యాప్‌లో పెట్టుబడులు పెట్టిన నలుగురు సీఐలు డబ్బులు అడుగుతుంటే దమ్కీలు ఇస్తుండటం గమనార్హం. విదేశీ యాత్ర సమయంలో మీరు ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోలేదని, విదేశాల్లో మీరు రహస్యంగా దేశ విద్రోహ శక్తులతో సమావేశం అయ్యారని, వ్యభిచారం చేసి డిపార్ట్మెంట్ రహస్యాలు అమ్ముకున్నారని, కోర్టుల్లో ప్రైవేటు కేసు వేసి ఉద్యోగాలు పోగొడతామని బెదిరింపులకు గురిచేస్తున్నారు. రూ.కోట్లాది డబ్బు విదేశాలకు తరలిపోయిన నేపథ్యలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేస్తేనే వీరి ఆస్తుల చిట్టాలో అసలు విషయాలు వెలుగులోకి వస్తాయి. -
పంచాయతీ భవనానికి రెండుసార్లు ప్రారంభోత్సవం
మల్లాపూర్: మండలంలోని సిరిపూర్‌లో ఉపాధి హామీ నిధులు రూ.20లక్షలతో నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని గురువారం బీఆర్ఎస్ నాయకులు ఒకసారి, కాంగ్రెస్ నాయకులు మరోసారి ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలోనే మంజూరు చేసిన నిధులతో నిర్మించిన భవనాన్ని ప్రోటోకాల్ ప్రకారం తామే ప్రారంభించాలంటూ ప్యాక్స్ చైర్మన్ బద్దం అంజిరెడ్డి తాళం వేసి ఉన్న భవనానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఉదయం ప్రారంభించారు. మధ్యాహ్నం కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో ర్యాలీగా వచ్చి పార్టీ ఇన్చార్జీ జువ్వాడి నర్సింగరావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పలతో కలిసి ప్రారంభించారు. ఒకే భవనాన్ని రెండుసార్లు ప్రారంభించడమేంటని మండల ప్రజలు మాట్లాడుకోవడం కొసమెరుపు. -
విద్యార్థులకు మెరుగైన విద్య అందించాలి
● కలెక్టర్ సత్యప్రసాద్ ● గిరిజన మినీ గురుకులం సందర్శనమల్లాపూర్: విద్యార్థులకు మెరుగైన విద్యబోధన అందించాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు. మండల కేంద్రంలోని గిరిజన మినీగురుకులం బాలికల పాఠశాలను గురువారం సందర్శించారు. విద్యాబోధన, వసతులు, పాఠశాల స్థితిగతులు, నిర్వహణను అడిగి తెలుసుకున్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారని ఆరా తీశారు. ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సబ్జెక్టుల వారీగా వెనుకబడిన విద్యార్థులను గుర్తించి ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయులకు సూచించారు. మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలన్నారు. పరిసరాల పరిశుభ్రత పాటించాలని, కిచెన్‌గార్డెన్ ఏర్పాటు చేసుకుని కూరగాయలు పెంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆయన వెంట మెట్పల్లి ఆర్డీవో శ్రీనివాస్, ఎస్సీ సంక్షేమశాఖ అధికారి రాజ్‌కుమార్, ప్రిన్సిపాల్ లక్ష్మీప్రియాంక, తహసీల్దార్ రమేశ్‌గౌడ్, ఎంపీడీవో శశికుమార్‌రెడ్డి, ఎంపీవో జగదీశ్ ఉన్నారు. పాఠాలో బోధించిన కలెక్టర్ పాఠశాలను తనిఖీ చేసిన సందర్భంగా కలెక్టర్ విద్యార్థులకు గణితం బోధించారు. గణితంపై పలు అంశాలను వివరించారు. మ్యాథ్స్‌లో మెలకువలు చెబుతుంటే విద్యార్థులు శ్రద్ధగా విన్నారు. ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి జగిత్యాల: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులు వేగం పెంచాలని కలెక్టర్ అన్నారు. ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలతో కలెక్టరేట్లో సమీక్షించారు. ఇసుకకు ఇబ్బంది లేకుండా సాండ్‌బజార్ ఏర్పాటు చేశామన్నారు. మండల, మున్సిపల్ అధికారులు గడువులోపు పూర్తి చేసుకునేలా చూడాలన్నారు. అదనపు కలెక్టర్ లత, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
కేసుల పరిష్కారానికి న్యాయవాదులు సహకరించాలి
● జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతిజగిత్యాలఅగ్రికల్చర్: న్యాయవాదులు, న్యాయమూర్తుల సమన్వయంతోనే కేసులకు సత్వర పరిష్కారం లభిస్తుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్నపద్మావతి అన్నారు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ న్యాయవాదులతో గురువారం సమావేశమయ్యారు. ఈనెల 13న జరిగే లోక్‌అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేందుకు న్యాయవాదులు కృషి చేయాలన్నారు. కక్షిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అన్ని కోర్టుల్లో లోక్ అదాలత్ బెంచ్‌లు ఏర్పాటు చేస్తున్నామని, కక్షిదారులకు ఇబ్బందిలేకుండా కేసులు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ లోక్ అదాలత్‌లో వీలైనన్ని ఎక్కువ కేసులు పరిష్కరించేందుకు సహకరించాలన్నారు. జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి మల్లిక్ వెంకటసుబ్రహ్మాణ్య శర్మ మాట్లాడుతూ అదాలత్‌లో సివిల్, క్రిమినల్ కేసులు, మోటార్ వాహనాలు, బ్యాంకు కేసులు పరిష్కరిస్తామన్నారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లావణ్య, మొదటి అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ శ్రీనిజ, రెండో అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కరంజియా నిఖిషా, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు. -
ఇందిరమ్మ ఇళ్ల వేగం పెంచాలి
సారంగాపూర్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని డీపీవో మదన్మోహన్ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల ప్రగతిపై సమీక్షించారు. నిర్మాణా ల్లో సారంగాపూర్ వెనుకబడి ఉందన్నారు. 455 ఇళ్లు మంజూరు కాగా.. 274 ఇళ్లకు మా ర్కింగ్ ఇచ్చామని, ఇందులో కేవలం 138 ఇళ్లు మాత్రమే బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయని తెలిపారు. లబ్ధిదారుల్లో సగం మంది నిర్మాణానికి ముందుకురావడం లేదని పంచాయతీ కార్యదర్శులు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఎంపీడీవో చౌడారపు గంగాధర్ పాల్గొన్నారు.వరద కాలువకు నీటి విడుదల పెంపుజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ నుంచి వరదకాలువకు విడుదలవుతున్న నీటి సామర్థ్యాన్ని పెంచారు. నిన్నటివరకు 18 వేల క్యూసెక్కులు విడుదల చేయగా.. గురువారం నుంచి 19వేలకు పెంచారు. ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో తగ్గడంతో ప్రాజెక్టు ఎనిమిది గేట్లను మూసివేశారు. 29,545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా కాలువలకు విడుదల చేస్తున్నారు.ఇంటి పరిసరాల్లో నిల్వ నీరు ఉండొద్దుసారంగాపూర్: ఇంటి పరిసరాలు, ఆవరణలో నీటి నిల్వ ఉండకుండా చూసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. బీర్పూర్ మండలం తుంగూర్‌లో పీహెచ్సీ ఆ ధ్వర్యంలో వైద్యశిబిరం నిర్వహించారు. రోగులకు మందులు పంపిణీ చేశారు. వాతావరణ పరిస్థితుల కారణంగా వైరల్ ఫీవర్లు వస్తున్నాయన్నారు. డెంగీ, మలేరియా, టైపాయిడ్, చికున్‌గున్యా వంటి వ్యాధులు వ్యాపిస్తున్న నేపథ్యంలో రక్తపరీక్షలు నిర్వహించగా.. ఆ లక్షణా లు ఎవరికీ కనిపించలేదన్నారు. అంతకుముందు గ్రామంలో డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్ పర్యటించారు. పీహెచ్సీ వైద్యాధికారి రాధారెడ్డి, సీహెచ్‌వో కుద్దుస్, సూపర్వైజర్ కిశోర్ఓ, ఎంఎల్‌హెచ్‌పీ సుష్మ ఉన్నారు.సికెల్‌సెల్ ఎనీమియాపైఅవగాహన కల్పించాలిజగిత్యాల: సికెల్‌సెల్ ఎనీమియాపై ప్రజలకు అవగాహన కల్పించాలని శ్రీనివాస్ అన్నారు. మోతె పట్టణ ఆరోగ్య కేంద్రంలో సిబ్బందికి అవగాహన కల్పించారు. ఎర్రరక్త కణాల నిర్మాణంలో మార్పు వచ్చి కొడవలి ఆకారంలోకి మారుతాయని, శరీరంలోని అన్ని ప్రదేశాలకు రక్తకణాలు వెళ్లలేక రక్తహీనత జరిగి నీరసం, ఆయాసం వస్తుందన్నారు. దీనికి రక్తం ఎక్కించడం ఒక్కటే మార్గమన్నారు. -
ఆగని అమృత్ భారత్
సాక్షిప్రతినిధి, కరీంనగర్: దేశంలోని వలస కూలీలను మాతృభూమికి చేర్చేందుకు ప్రవేశపెట్టిన రైలు అమత్ భారత్ ఎక్స్‌ప్రెస్. దేశంలో నలుమూలలా పనిచేస్తున్న కూలీలను తక్కువ ఖర్చుతో స్వస్థలాకు చేరుస్తుంది. ఇటీవల ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా నడిపించే ఈరోడ్– జోగ్భనీ 16601/02 అమృత్ భారత్ రైలుకు స్థానికంగా ఎక్కడా స్టాప్ దక్కలేదు. ముందున్న వరంగల్, పొరుగున ఉన్న మంచిర్యాలలో ఈ రైలుకు హాల్టింగ్ ఇవ్వడం గమనార్హం. రైల్వేశాఖ తీసుకున్న ఈ నిర్ణయం పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, కరీంనగర్‌లోని పలు పరిశ్రమల్లో పనిచేస్తున్న ఉత్తరాధి కూలీలను తీవ్రంగా నిరాశపరిచింది. త్వరలో సేవలు ప్రారంభం ప్రస్తుతం బిహార్‌లో ఎన్నికల దష్ట్యా ఆ రాష్ట్రానికి రైల్వేశాఖ ఇప్పటి వరకు ఆరు అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్రైళ్లను ప్రవేశ పెట్టింది. అందులో అతి త్వరలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా మీదుగా బిహార్‌లోని జోగ్భనీ నుంచి తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడ్ వరకు 16601/02 అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రారంభించనున్నారు. మన రాష్ట్రం మీదుగా ప్రవేశ పెట్టబోయే తొలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ ఇదే. ఇటీవల వెలువడిన రైలు షెడ్యూల్లో ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క రైల్వేస్టేషన్లో స్టాప్ లేకపోవడం స్థానిక, వలస కార్మికులను ఎంతో నిరాశ పరిచింది. హాల్టింగ్ ఇవ్వాలి అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు వరంగల్ నుంచి బల్లార్షా మధ్య కేవలం మంచిర్యాల రైల్వేస్టేషన్లోనే హాల్టింగ్ ఇచ్చారు. జోగ్భని నుంచి నేపాల్ సరిహద్దు కేవలం 10 కిలోమీటర్ల దూరమే. ఈ రైలుకు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని జమ్మికుంట, పెద్దపల్లి జంక్షన్, రామగుండం రైల్వే స్టేషన్లో స్టాప్ కల్పించాలని ఇక్కడి ప్రయాణికులు కోరుతున్నారు. నాలుగు నెలల్లో పెద్దపల్లి జంక్షన్ మీదుగా ప్రారంభించిన మూడు రైళ్లకు స్టాప్ కల్పించలేదు. – ఫణి, నార్త్ తెలంగాణ రైల్వే ఫోరం -
కాటమయ్య కిట్లతో గీతకార్మికులకు భద్రత
సారంగాపూర్: కాటమయ్య కిట్లతో గీత కార్మికులకు భద్రత ఉంటుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. బీర్పూర్ మండలం కొల్వాయిలో 72 మంది గీత కార్మికులకు కాటమయ్య కిట్లను పంపిణీ చేశారు. కొల్వాయిలో రూ.20 లక్షలతో ఏర్పాటుచేసిన పల్లెదవాఖానాను ప్రారంభించారు. 20మందికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.5.80 లక్షల చెక్కులు పంపిణీ చేశారు. రోల్లవాగు ప్రాజెక్టుకు ఎంపీ అర్వింద్, మంత్రి లక్ష్మణ్‌కుమార్ చొరవతో గేట్లు బిగిస్తామన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్ కుమార్, గౌడ సంఘం అధ్యక్షుడు రాంచంద్రం, కేడీసీసీ బ్యాంక్ డైరెక్టర్ ముప్పాల రాంచందర్‌రావు, విండో చైర్మన్ పొల్సాని నవీన్‌రావు, తహసీల్దార్ సుజాత, ఎంపీడీవో భీమేశ్ ఉన్నారు. గ్రామ అభివృద్ధికి కృషి జగిత్యాలరూరల్: గ్రామ అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. భారీ వర్షాలకు జగిత్యాల రూరల్ మండలం చల్గల్లో రోడ్లు ధ్వంసమయ్యాయని, మరమ్మతు చేయాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం సమర్పించారు. అవసరమైన పనులు గుర్తించి ఇంజినీరింగ్ అధికారులతో అంచనాలు రూపొందించి నిధుల మంజూరుకు కృషి చేస్తానన్నారు. -
మహిళాశక్తి చీరెల నిల్వకు ఐదు స్టాక్ పాయింట్లు
జగిత్యాలజోన్: ఇందిరా మహిళాశక్తి చీరల పంపిణీ కోసం ఐదు స్టోరేజీ పాయింట్లు ఏర్పాటు చేశామని డీఆర్డీఏ రఘువరణ్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళాసంఘాల సభ్యులకు అందించే చీరెలను నిల్వ చేసేందుకు గోదాంను బుధవారం పరిశీలించారు. జిల్లాకేంద్రంలో నాక్ కేంద్రం, మెప్మా సమావేశ మందిరం, కోరుట్లలో సీ్త్రశక్తి భవనం, మెప్మా సమావేశ మందిరం, మరోచోట చీరలు నిల్వ చేస్తామన్నారు. జిల్లాలోని 20,886 స్వశక్తి సంఘాల్లోని 2.39 లక్షల మంది మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరలు అందిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో సెర్ప్ ఏపీడీ సునీత, మెప్మా ఏవో శ్రీనివాస్, సెర్ప్ డీపీఎంలు రమేశ్, నారాయణ, నాగేశ్వర్ రావు, ఏపీఎంలు గంగాధర్, దేవరాజ్, సమత పాల్గొన్నారు. -
దోపిడీ అరికట్టేందుకే సాండ్‌బజార్
జగిత్యాల: ప్రజలకు ఇసుకను అందుబాటులోకి తేవడంతోపాటు, ఇసుక దోపిడీని అరికట్టాలన్న ఉద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం మేరకు సాండ్ బజార్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని వాణీనగర్‌లో ఖనిజాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సాండ్ బజార్‌ను బుధవారం ప్రారంభించి మాట్లాడారు. ఈ సాండ్‌బజార్ ద్వారా ప్రజలకు తేలికగా ఇసుక లభిస్తుందని, స్టాక్ పాయింట్ల వద్ద రూ.800 చెల్లిస్తే ఇసుక ఇంటికే వస్తుందన్నారు. అలాగే దోపిడీని, దళారి వ్యవస్థను అరికట్టేందుకు ఇవి ఎంతో ఉపయోగపడతాయన్నారు. స్టాక్ పాయింట్ల వద్ద ఇసుక తరలించడానికి లారీలు అందుబాటులో ఉంటాయని, ఇవి 24 గంటలపాటు అందుబాటులో ఉంటాయన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. కోరుట్ల, కథలాపూర్, ఇబ్రహీంపట్నం ఏరియాల్లో మాత్రమే ఇసుక రీచ్ ఉన్నందున జగిత్యాల, ధర్మపురి నియోజకవర్గాల ప్రజలకు ఇసుక కొనుగోలు చేయడం భారంగా మారిందన్నారు. జిల్లాకేంద్రంలో మూడున్నర ఎకరాల్లో ఇసుక బజార్ ఏర్పాటు చేశామని, తహసీల్దార్ వద్ద రూ.800 చలానా రూపంలో చెల్లించి ఇసుక పొందాలన్నారు. త్వరలోనే వెల్గటూర్‌లో కూడా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, మాజీమంత్రి జీవన్‌రెడ్డి, టీజీఎండీసీ జనరల్ మేనేజర్ శ్రీనివాస్, అదనపు కలెక్టర్ లత, ఆర్డీవో మధుసూదన్, ప్రాజెక్ట్ అధికారి వినయ్ పాల్గొన్నారు. ఇసుక అక్రమ రవాణాను నియంత్రించండి జగిత్యాలటౌన్: జిల్లాకేంద్రంలో ఇసుక పాయింట్ ఏర్పాటు చేసిన దృష్ట్యా టిప్పర్ల ద్వారా ఇసుక అక్రమ రవాణాను నియంత్రించాలని జీవన్‌రెడ్డి కోరారు. ఈ మేరకు మంత్రి అడ్లూరి, కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు. -
పోరాట యోధురాలు ఐలమ్మ
● కలెక్టర్ సత్యప్రసాద్ జగిత్యాలటౌన్: తెలంగాణ రైతాంగ పోరాటంలో భూస్వాములపై తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ గొప్ప యోధురాలు అని కలెక్టర్ సత్యప్రసాద్ కొనియాడారు. బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. తెలంగాణలో తొలి మహిళా విశ్వవిద్యాలయానికి ఐలమ్మ పేరు పెట్టడం ద్వారా ప్రభుత్వం ఆమె పోరాటాలను గౌరవించిందన్నారు. అదనపు కలెక్టర్ బీఎస్.లత, డీఆర్డీవో రఘువరణ్, మెప్మా పీడీ శ్రీనివాస్‌గౌడ్, బీసీ సంక్షేమ అధికారి సునీత తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంసాగర్ ఎనిమిది గేట్లు ఎత్తివేతజగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో బుధవారం ఎనిమిది గేట్లు ఎత్తి 25వేల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టులోకి 54,545 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. గేట్ల ద్వారా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. అలాగే వరదకాలువకు 19వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5500, ఏస్కేప్ గేట్ల ద్వారా 2500, సరస్వతి కెనాల్‌కు 800, లక్ష్మికెనాల్కు 200, అలీసాగర్ ఎత్తిపోతలకు 360, గుత్పా ఎత్తి పోతలకు 270, మిషన్ భగీరథకు 231 కూసెక్కుల చొప్పున వదులుతున్నారు. విధుల్లో చేరిన జీపీవోలుజగిత్యాల: గ్రామ పాలన అధికారులు విధుల్లో చేరారు. వీరికి మంగళవారమే కౌన్సెలింగ్ పూర్తి కాగా.. బుధవారం నియామక పత్రాలు అందించారు. సొంత నియోజకవర్గాల్లో చాన్స్ లేకపోవడంతో కేటాయించిన గ్రామాలకు వెళ్లారు. దూరప్రాంతాల్లో నియామకం అయిన కొందరు తమకు ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. సప్తగిరికాలనీ(కరీంనగర్): శాతవాహన యూనివర్సిటీ 2008లో స్థాపించబడి ఉత్తర తెలంగాణలోనే ప్రముఖ విద్యాలయంగా గుర్తించబడుతుందని వీసీ ఉమేశ్‌కుమార్ ఉన్నారు. యూనివర్సిటీ గురించి ప్రపంచానికి తెలిసేలా తన పర్యటన కొనసాగిందని వివరించారు. ఆగస్టు 17 నుంచి 31 వరకు అమెరికా పర్యటన వివరాలను బుధవారం వెల్లడించారు. భిన్న కోర్సులతో నాలుగు పీజీ సెంటర్లతో కొనసాగుతున్న యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ, పరిశోధన, విద్యారంగంలో మెరుగైన అవకాశాలకు ఎన్ఆర్ఐ సాయం కోసం అమెరికాలోని 7 ప్రముఖ నగరాలను సందర్శించి విరాళాలు సేకరించడం జరిగిందన్నారు. 8 బంగారు పతకాలతో పాటు రూ.అర కోటికి పైగా విరాళాలు సేకరించినట్లు తెలిపారు. సాంకేతిక అభివృద్ధి కోసం కంప్యూటర్లు, డిజిటల్ పరికరాలు అందజేసేందుకు ఎన్ఆర్ఐలు ముందుకొచ్చినట్లు తెలిపారు. నవంబర్ రెండోవారంలో విశ్వవిద్యాలయంలో 2వ స్నాతకోత్సవ వేడుకలను నిర్వహిస్తామని పేర్కొన్నారు. -
లక్ష్యం ఘనం.. పనులు శూన్యం
కథలాపూర్: జగిత్యాల – నిజామాబాద్ జిల్లాల సరిహద్దుల్లో.. మండలంలోని భూషణరావుపేట శివారులో ఉన్న రాళ్లవాగు ప్రాజెక్టు, కాలువ పనులకు 2006లో అప్పటి ప్రభుత్వం రూ.18 కోట్లు మంజూరు చేసింది. దీనిద్వారా 3,500 ఎకరాలకు నీరందించాలనేది లక్ష్యం. ఏటా ప్రాజెక్టులో సమృద్ధిగా నీరుచేరి జలకళ సంతరించుకుంటుంది. కానీ.. కాలువలు పూర్తికాకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడంలేదని రైతులు పేర్కొంటున్నారు. అప్పట్లో కాలువ పనులకోసం నిధులు మంజూరైనా ప్రభుత్వం, అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కాంట్రాక్టర్ పనులు పూర్తిచేయలేదు. ఏళ్లుగా కాలువ పనులు అసంపూర్తిగా ఉన్నా వాటిని పూర్తిచేయించకపోవడంతో రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆరు గ్రామాల్లో 3,500 ఎకరాలు రాళ్లవాగు ప్రాజెక్టు నుంచి కుడికాలువ ద్వారా మండలంలోని భూషణరావుపేట, ఊట్‌పెల్లి, పెగ్గెర్ల, కథలాపూర్, మెట్పల్లి మండలం ఆత్మకూర్, నిజామాబాద్ జిల్లా కమ్మర్పల్లి మండలం కోనాపూర్ గ్రామాల పరిధిలోని 3,500 ఎకరాలకు నీరందించాలన్నది లక్ష్యం. కుడికాలువకు అనుసంధానంగా ఐదు చిన్నకాలువలు ఏర్పాటు చేసి చివరి ఆయకట్టు రైతులకు నీరందించేలా ప్రణాళిక తయారుచేశారు. కాలువ పనులు ప్రారంభించి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ పూర్తికాలేదు. కాలువకు అనుసంధానంగా ఐదు చిన్నకాలువలు ఏర్పాటు చేయాల్సి ఉండగా... ఊట్‌పెల్లి గ్రామాల భూములకు నీరందించే పనులు, భూషణరావుపేట, పెగ్గెర్ల గ్రామాల భూములకు నీరందించే పనులు అసంపూర్తిగా వదిలేశారు. పనులు పూర్తి చేయించాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
పాఠశాలలకు రేటింగ్స్
జగిత్యాల: పాఠశాలల్లో పరిశుభ్రమైన పరిసరాలు.. ఆహ్లాదం.. ఆరోగ్యకరమైన వాతావరణం.. మౌలిక వసతులు కలిగి ఉన్న వాటికి ప్రోత్సాహకాలు అందించే దిశగా కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఏటా స్వచ్ఛ పాఠశాలలకు నగదు పురస్కారాలు అందజేస్తున్న ప్రభుత్వం ఈసారి స్వచ్ఛ ఏవం హరిత్ విద్యాలయ రేటింగ్ కింద రాష్ట్ర, దేశస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష పురస్కారం అందించేందుకు నిర్ణయించింది. 2025–26 ఏడాదికిగాను పురస్కారాలు అందజేసేలా పాఠశాలలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి జిల్లాలోని అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈనెల 30లోపు దరఖాస్తులన్నీ సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే డీఈవో ఆధ్వర్యంలో ఎంఈవో, ఆర్పీలకు శిక్షణ కల్పించారు. పాఠశాలల ఉపాధ్యాయులు నమోదు చేసిన వివరాల ప్రకారం పాయింట్ల కేటాయింపు ఉంటుంది. అత్యధిక పాయింట్స్ సాధించిన పాఠశాలలను ప్రత్యేక బృందం తనిఖీ చేసి రాష్ట్రస్థాయికి ఎంపిక చేస్తుంది. అనంతరం రాష్ట్రస్థాయి బృందం జాతీయస్థాయికి పంపిస్తుంది. అక్కడ ఎంపికై తే రూ.లక్ష ప్రోత్సాహం అందుతుంది. యాప్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ అయ్యాక పాఠశాలను ఎంచుకోవాల్సి ఉంటుంది. అనంతరం పాఠశాల యూడైస్ కోడ్‌ను నమోదు చేస్తే మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని సబ్మిట్ చేసిన వెంటనే పాఠశాలకు సంబంధించిన వివరాలన్నీ వస్తాయి. జాతీయస్థాయిలో నెగ్గితే రూ.లక్ష ప్రోత్సాహం పాఠశాలలు అత్యధిక పాయింట్స్ వచ్చి జాతీయస్థాయిలో గుర్తిస్తే ఆ పాఠశాలకు రూ.లక్ష ప్రోత్సాహక బహుమతి ప్రభుత్వం అందిస్తుంది. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించిన అనంతరం జాతీయస్థాయికి పంపుతారు. వారు పరిశీలించి ప్రోత్సాహం అందిస్తారు. ప్రధానోపాధ్యాయులకు శిక్షణ ఎస్‌హెచ్‌వీఆర్ యాప్‌పై ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, రిసోర్స్ పర్సన్లకు శిక్షణ కల్పించారు. పాయింట్స్ ఎలా ఇవ్వాలి..? నమోదు ఎలా చేయాలి అన్నదానిపై జిల్లా కార్యాలయంలో మూడు రోజులు శిక్షణ ఇచ్చారు. ఎస్‌హెచ్‌వీఆర్‌లో ప్రభుత్వ పాఠశాలలు ఈనెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. జాతీయస్థాయిలో ఎంపికై న పాఠశాలలకు రూ.లక్ష ప్రోత్సాహం అందుతుంది. ఇప్పటికే ప్రధానోపాధ్యాయులు, ఆర్పీలకు శిక్షణ అందించాం. సద్వినియోగం చేసుకోవాలి. – రాము, డీఈవో పాఠశాలలో నీటి వసతి, టాయిలెట్స్, విద్యార్థుల చేతుల శుభ్రత, వారి ప్రవర్తన, చేపడుతున్న కార్యక్రమాల నిర్వహణ, హరితహారం కింద మొక్కలు, ప్రకృతి, పర్యావరణం వంటి అంశాలపై రేటింగ్ ఇస్తారు. దీంట్లో అత్యధికంగా రేటింగ్ వచ్చిన పాఠశాలలకు ప్రత్యేక గుర్తింపుతోపాటు, ప్రోత్సాహం అందనుంది. ఫైవ్‌స్టార్ వస్తే ఎక్స్లెంట్, ఫోర్‌స్టార్స్ వస్తే వెరిగుడ్, త్రీస్టార్ వస్తే గుడ్, టూస్టార్స్ వస్తే నీడ్స్ ఇంప్రూవ్మెంట్, వన్‌స్టార్ వస్తే పూర్‌గా ఉన్నట్లు గుర్తిస్తారు. ఇందులో నీటి వసతికి 22 పాయింట్లు, వాటిని వినియోగించుకునే విధానానికి 27, చేతులు కడుక్కునే విధానానికి 14, పాఠశాలలో చేపట్టే కార్యక్రమాలకు 21, ప్రవర్తన, సామర్థ్యం నిర్మాణానికి 20, ప్రకృతి పర్యావరణానికి సంబంధించి 20 పాయింట్లు ఉంటాయి. మొత్తం 125 పాయింట్ల కేటాయింపు ఉంటుంది. ఇందులో జిల్లా నుంచి 8 నుంచి 10 పాఠశాలలను ఎంపిక చేయనున్నారు. -
అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తా
రాయికల్: నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. మండలంలోని వీరాపూర్, ఒడ్డెరకాలనీలో రూ.12 లక్షలతో అంగన్వాడీ భవన నిర్మాణాలకు భూమిపూజ చేశారు. 40మంది లబ్ధిదారులకు రూ.12లక్షల విలువైన సీఎం రిలీఫ్‌ఫండ్ చెక్కులు, 56మందికి కల్యాణలక్ష్మీ చెక్కులు పంపిణీ చేశారు. వీరాపూర్, రామాజీపేట రహదారి నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జీఎంఆర్ ట్రస్ట్ అభివృద్ధికి నిధులు కేటాయించామని, దీని ద్వారా యువతకు ఉపాధితోపాటు, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయన్నారు. రైతుల కోసం చెక్‌డ్యామ్‌లు నిర్మించామని, వేలాది ఎకరాల్లో భూమి సాగవుతుందన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో చిరంజీవి, తహసీల్దార్ నాగార్జున, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్, సింగిల్ విండో చైర్మన్ దీటి రాజిరెడ్డి, ఏనుగు మల్లారెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మోర హన్మండ్లు, గన్నె రాజిరెడ్డి, సీడీపీవో మమత, ఎంపీవో సుష్మ, పంచాయతీరాజ్ ఏఈ ప్రసాద్, నాయకులు పడిగెల రవీందర్‌రెడ్డి, కోల శ్రీనివాస్, రవీందర్రావు, అచ్యుత్‌రావు, కిషన్‌రావు, రామస్వామి, నర్సయ్య, మహబూబ్ పాల్గొన్నారు. ఎల్వోసీ అందజేత జగిత్యాల: జిల్లా కేంద్రంలోని చింతకుంటకు చెందిన నక్క సుజాతకు రూ.2.50 లక్షలు, అరవింద్నగర్కు చెందిన రాంచరణ్ అనారోగ్యానికి గురికావడంతో చికిత్స నిమిత్తం రూ.75 వేల ఎల్వోసీలను ఎమ్మెల్యే అందించారు. శ్రీగాయత్రి దుర్గాదేవి శరన్నవరాత్రోత్సవాలకు ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌ను ఆహ్వానించారు. అధ్యక్షుడు భూమ గంగారాం, ఉపాధ్యక్షుడు రాజ్‌కుమార్, రాజేందర్ పాల్గొన్నారు. -
నీళ్లుండి ఏం లాభం లేదు
రాళ్లవాగు ప్రాజెక్టు మా గ్రామ భూములకు పైభాగంలో ఉంది. కాలువల ద్వారా ఊట్‌పెల్లి గ్రామాల భూములకు నీరందిస్తామని ప్రణాళిక రూపొందించారు. ఏళ్లు గడుస్తున్నా కాలువ పనులు చేపట్టడంలేదు. మా గ్రామానికి నీళ్లు వస్తే పంటల సాగు విస్తీర్ణం పెరుగుతుంది. అధికారులు చొరవ చూపి కాలువ పనులను ప్రారంభించాలి. – ఏజీబీ గణేశ్, రైతు, ఊట్‌పెల్లి ఊట్‌పెల్లి, పెగ్గెర్లకు నీళ్లు వస్తాయని సంతోషపడ్డాం. ప్రాజెక్టు పనులు పూర్తయి ఏళ్లవుతోంది. కాలువ పనుల్లో జాప్యం చేయడం సరికాదు. భూషణరావుపేట శివారు వరకు కాలువ తవ్వారు. అక్కడి నుంచి కిలోమీటర్ కాలువ తవ్వితే మా గ్రామానికి నీళ్లు వచ్చేవి. ఇకనైనా కాలువ పనులు త్వరగా పూర్తి చేస్తే రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. – చీర్నం శ్రీకాంత్, రైతు, పెగ్గెర్ల రాళ్లవాగు ప్రాజెక్టు కుడికాలువకు అనుసంధానంగా ఉన్న కాలువ పనుల కోసం ప్రతిపాదనలు తయారు చేస్తాం. కాలువ పనుల్లో భూములు కోల్పోయే రైతులకు పరిహారం ఇవ్వాల్సి ఉంది. తదుపరి వీలైనంతా త్వరగా ఊట్‌పెల్లి, పెగ్గెర్ల గ్రామాలకు వెళ్లే కాలువ పనులు చేపడుతాం. ప్రతిపాదనలు ఉన్నతాధికారులకు నివేదిస్తాం. – ప్రశాంత్, నీటిపారుదలశాఖ డీఈ -
కోర్టులపై పెండింగ్ కేసుల భారం తగ్గిస్తున్నాం
జగిత్యాలజోన్: లోక్‌అదాలత్ ద్వారా వివిధ కేసులు పరిష్కరించి కోర్టులపై భారం తగ్గిస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. ఈనెల 13న జిల్లాకోర్టులో నిర్వహించే జాతీయ మెగా లోక్‌అదాలత్‌పై విలేకరులకు వివరాలు వెల్లడించారు. చిన్నచిన్న విషయాలకు కోర్టు మెట్లు ఎక్కుతుండడంతో కేసుల సంఖ్య పెరిగిపోతోందన్నారు. సుప్రీం, హైకోర్టుల అదేశాల మేరకు లోక్‌అదాలత్ ద్వారా వీలైనన్ని కేసులు పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. జగిత్యాల, మెట్పల్లి, కోరుట్ల, ధర్మపురి కోర్టుల్లో దాదాపు 17,300 వరకు క్రిమినల్, సివిల్ కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ఇందులో రాజీకి అనుకూలమైనవి 8,687 కేసులు ఉన్నాయని, వీటిలో మూడు వేల కేసుల పరిష్కారం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. క్రిమినల్, సివిల్, మోటార్‌వాహనాలు, ఆస్తి తగాదాలు, చెక్‌బౌన్స్, భార్యాభర్తలు, కుటుంసభ్యుల మధ్య ఉన్న కేసులు పరిష్కరిస్తామని వివరించారు. విదేశాల్లో ఉన్నా.. నడవడానికి ఇబ్బంది పడేవారు రాజీ చేసుకుంటే ఆన్లైన్ ద్వారా పరిష్కరిస్తామన్నారు. ఎక్కువ సంఖ్యలో కేసులు పరిష్కరించేందుకు పోలీస్, న్యాయవాదులతో సమావేశాలు ఏర్పాటు చేశామన్నారు. జిల్లా మొదటి అదనపు జడ్జి సుగళి నారాయణ మాట్లాడుతూ క్షణికావేశంలో చేసిన తప్పులను సరిదిద్దుకునేందుకు లోక్‌అదాలత్‌లు చక్కని వేదికన్నారు. న్యాయసేవా సంస్థ కార్యదర్శి, సబ్ జడ్జి వెంకటమల్లిక్ సుబ్రహ్మణ్యశర్మ మాట్లాడుతూ కోర్టుల వెంబడి ఏళ్ల తరబడి తిరగకుండా కేసులు పరిష్కరించుకోవాలని తెలిపారు. -
ఇసుక లింకులు తేటతెల్లం..!
కోరుట్ల: అక్రమ ఇసుక రవాణాదారులతో కోరుట్ల ఆర్డీవో పరిధిలోని కొంతమంది రెవెన్యూ సిబ్బందికి లింకులు ఉన్నాయన్న ప్రచారం జరుగుతున్న క్రమంలో ఇక్కడి నుంచి కరీంనగర్ విజిలెన్స్‌కు ఫిర్యాదులు అందాయి. దీంతో అక్కడి అధికారులు స్పందించి మంగళవారం అర్ధరాత్రి కోరుట్ల శివారులో ఓ ఇసుక టిప్పర్, మూడు లారీలు, మూడు ట్రాక్టర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఇసుక అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన వారు స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమ రవాణాదారులతో వీరికి ఉన్న లింకులేనన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. విజిలెన్స్‌కే ఎందుకు..? కథలాపూర్ మండలం బొమ్మెన, తక్కళ్లపల్లి, సిరికొండ, కోరుట్ల మండలం నాగులపేట, సంగెం పరిసర ప్రాంతాల నుంచి ప్రతీరోజు 15 నుంచి ఇరవై లారీల్లో ఇసుక నిజామాబాద్, ఆర్మూర్, నిర్మల్ పరిసర ప్రాంతాలకు తరలుతోంది. ఈ విషయమై స్థానికులు పలుమార్లు స్థానిక రెవెన్యూ, పోలీసు సిబ్బందికి ఫిర్యాదు చేసినా పెద్దగా ఫలితం దక్కలేదు. దీనికి ఇసుక అక్రమార్కులతో స్థానిక రెవెన్యూ సిబ్బందికి లింకులు ఉన్నాయనే సందేహమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఈ క్రమంలో స్థానిక అధికారులపై నమ్మకం లేక రెండురోజుల క్రితం కథలాపూర్, మేడిపల్లి పరిసర ప్రాంతాలకు చెందిన కొంతమంది కరీంనగర్ విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. రంగంలోకి దిగిన విజిలెన్స్ అధికారులు కోరుట్ల జాతీయ రహదారిపై మంగళవారం అర్ధరాత్రి సమయంలో తనిఖీలు నిర్వహించారు. ఏకంగా ఆరు లారీలు, ఓ టిప్పర్ ఇసుక లోడ్‌తో వెళ్తూ పట్టుబడటం గమనార్హం. ప్రతీరోజు జాతీయ రహదారి మీదుగా లారీలు, టిప్పర్లతో ఇసుక అక్రమంగా రవాణా అవుతున్నా.. ఈ పరిసరాల్లోకి రెవెన్యూ సిబ్బంది రాలేకపోయారు. కనీసం అధికారులకు ఏ మాత్రం సమాచారం లేకపోవడంపైనా కరీంనగర్ విజిలెన్స్ అధికారులు నివ్వెరపోయినట్లు సమాచారం. కాసులు ఇస్తే సరి.. కోరుట్ల, కథలాపూర్ పరిసరాల నుంచి మూడు జిల్లాలకు అక్రమంగా ఇసుక రవాణా జరుగుతున్నా రెవెన్యూ అఽధికారుల దృష్టిలో లేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఈ విషయం స్థానిక రెవెన్యూ సిబ్బందికి తెలిసినప్పటికీ అడపదడపా వాటిని పట్టుకుని అప్పటికప్పుడు కాసులు తీసుకుని వదిలేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కాసులు ఇవ్వని వారి వాహనాలను పట్టుకుని ఆర్టీసీ డిపోకు తరలిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. ఈ విషయంలో మంగళవారం ఓ బీఆర్ఎస్ నేత కోరుట్ల ఆర్డీవోకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. -
ఘనంగా తెలుగుభాషా దినోత్సవం
జగిత్యాలటౌన్: ప్రజాకవి, పద్మ విభూషణ్ కాళోజి నారాయణరావు జయంతి సందర్భంగా మంగళవారం కలెక్టరేట్లో తెలుగుభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కాళోజి చిత్రపటానికి కలెక్టర్ సత్యప్రసాద్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అధికారి రఘువరణ్, డీపీవో మదన్మోహన్, బీసీ సంక్షేమ అధికారి జి.సునీత, డీవైఎస్ఓ రవికుమార్ పాల్గొన్నారు. తెలుగు భాషను కాపాడుకోవాలి జగిత్యాల: తెలుగు భాషను కాపాడుకోవాలని ఎస్కేఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపల్ అశోక్ అన్నారు. మంగళవారం ఎస్కేఎన్ఆర్ కళాశాలలో తెలుగు భాష దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో తెలుగు శాఖ విభాగం అధ్యక్షుడు సురేందర్, మహేశ్, స్వరూపరాణి, గోవర్దన్, సాయిమధుకర్, రాజు, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
కక్షిదారులతో రాజీ కుదుర్చాలి
● ఎస్పీ అశోక్‌కుమార్ జగిత్యాలక్రైం: ఈనెల 13న జరిగే మెగాలోక్అదాలత్లో సాధ్యమైనన్ని కేసులు పరిష్కారం అయ్యేలా చూడాలని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజీపడదగిన క్రిమినల్ కాంపౌండబుల్, సివిల్ తగాదాలు, ఆస్తివిభజన, కుటుంబపరమైనవి, నిర్వహణ కేసులు, వైవాహిక జీవితానివి, బ్యాంక్ రికవరీ, విద్యుత్ చౌర్యం, చెక్‌బౌన్స్, డ్రంకెన్‌డ్రైవ్, పెట్టీ కేసులను పరిష్కరించేందుకు ముందుకు రావాలని సూచించారు. న్యాయశాఖ కల్పించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. పోలీసు అధికారులు, కోర్టు కానిస్టేబుళ్లు, సిబ్బంది రాజీపడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాలకు కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. చేప పిల్లల స్థానంలో నగదు బదిలీ చేయాలిజగిత్యాలటౌన్: చేప పిల్లల పంపిణీలో లోటుపాట్లను దృష్టిలో పెట్టుకుని నగదు బదిలీ చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి సీఎంకు లేఖ రాశారు. చేపపిల్లల పంపిణీ కాంట్రాక్టర్లకు కల్పతరువుగా మారిందని, పిల్లలు చిన్నవిగా ఉండడం.. లెక్కల్లో వ్యత్యాసం వస్తోందన్నారు. దళారీ వ్యవస్థ కారణంగా రూ.కోట్లు వెచ్చిస్తున్నా లక్ష్యం నెరవేరడం లేదన్నారు. హెచ్ఐవీపై అవగాహన కల్పించాలిజగిత్యాల: ప్రజలకు హెచ్ఐపీ అవగాహన కల్పించాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జిల్లాలోని సంక్షేమ అధికారి కార్యాలయంలో సీడీపీవోలు, ఐసీడీఎస్ సూపర్వైజర్లతో సమావేశమయ్యారు. గర్భిణులు, బాలింతలకు హెచ్ఐవీ సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ అధికారి శ్రీనివాస్, జిల్లా సంక్షేమాధికారి నరేశ్, హెచ్ఐవీ కో–ఆర్డినేటర్ సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్జగిత్యాల: భీమారం మండలం ఏదులలింగంపేట గ్రామపంచాయతీ సెక్రటరీ పుష్పలతను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే కారోబార్ రాజేశ్‌ను విధుల నుంచి తొలగించారు. ఇందిరమ్మ ఇళ్లకు నిధుల్లో రూ.లక్ష దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు రావడంతో విచారణ చేపట్టి ఆర్డీవో నివేదిక ఆధారంగా సెక్రటరీని సస్పెండ్, కారోబార్‌ను తొలగించారు. జమ్మికుంట లావణ్యకు రావాల్సిన డబ్బులను జవ్వాజి లావణ్యకు బదలాయించడంతో చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. విద్యార్థులు రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలిసారంగాపూర్: ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు కార్పొరేట్ కళాశాలలకు దీటుగా రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించాలని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి బి.నారాయణ అన్నారు. మంగళవారం సారంగాపూర్ కళాశాలను సందర్శించారు. కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి విద్యార్థులు, అధ్యాపకులతో కలిసి నివాళి అర్పించారు. ఫేషియల్ రికగ్నైషన్ సిస్టం ద్వారా విద్యార్థుల హాజరు, సిబ్బంది హాజరు నమోదు చేస్తోందన్నారు. ప్రిన్సిపల్ వై. రమేశ్‌బాబు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని రాచర్లబొప్పాపూర్‌కు చెందిన ఈరవేణి రమ్య(30) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకుంది. ఎస్సై రాహుల్‌రెడ్డి కథనం ప్రకారం.. రమ్య మంగళవారం ఉదయం తన ముగ్గురు పిల్లలను స్కూల్‌కు పంపించింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. సాయంత్రం స్కూల్ నుంచి వచ్చిన పిల్లలు శ్రీఅమ్మ తలుపు తీయూశ్రీ అంటూ పిలిచినా పలక లేదు. దీంతో స్థానికులు తలుపులు బద్దలు కొట్టి చూడగా రమ్య ఉరేసుకుని నిర్జీవంగా ఉండడంతో పిల్లలు లాస్య, ప్రవీన్, సుశాంత్ కన్నీరు మున్నీరుగా విలపించారు. అయితే రమ్య భర్త కృష్ణహరి బతుకుదెరువు కోసం 15 ఏళ్లుగా దుబాయ్ వెళ్తున్నాడు. భర్త దుబాయ్‌లోనే ఉండగా, భార్య కడసారి చూపు కోసం బయల్దేరాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. కోనరావుపేట(వేములవాడ): అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని సుద్దాల గ్రామానికి చెందిన అలువాల దేవయ్య (55)కు గతంలో మూడుసార్లు రోడ్డు ప్రమాదంలో కాళ్లు విరిగాయి. ఆపరేషన్ల కారణంగా కాళ్ల నొప్పులు విపరీతమయ్యాయి. పలుసార్లు ఆస్పత్రుల్లో చూపించుకున్నా తగ్గకపోవడంతో కొంతకాలంగా మనస్తానపానికి గురవుతున్నాడు. సోమవారం సాయంత్రం పొలం వద్దకని ఇంటి నుంచి వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు అర్ధరాత్రి పొలం శివార్లలో వెతకగా దేవయ్య చెట్టుకు ఉరేసుకుని కనిపించాడు. మంగళవారం ఎస్సై ప్రశాంత్‌రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి భార్య లచ్చవ్వ, కూతురు సౌజన్య, కుమారుడు రాజశేఖర్ ఉన్నారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఉరేసుకుని ఒక రు..కథలాపూర్: మండలకేంద్రానికి చెందిన పల్లికొండ లక్ష్మీనారాయణ(54) మంగళవారం గ్రామశివారులో చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై నవీన్‌కుమార్ కథనం ప్రకారం.. లక్ష్మీనారాయణ కోరుట్ల ఆర్టీసీ డిపోలో కండక్టర్‌గా పనిచేస్తూ.. ఏడాది క్రితం సస్పెండ్ అయ్యాడు. అప్పటినుంచి మద్యానికి బానిసయ్యాడు. కుటుంబపోషణ, ఇతర అవసరాలకు అప్పు చేశాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియక ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. లక్ష్మీనారాయణ కుమారుడు వికాస్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మద్యానికి బానిసై ఒకరు..తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని బస్వాపూర్ శివారులో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. ఇల్లంతకుంట మండలం దాచారంలో నివాసం ఉంటున్న వాడెపు జంగయ్య (45) లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా కుటుంబాన్ని పట్టించుకోవడం మానేసి తరుచూ గొడవలు పడుతున్నాడు. మంగళవారం చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య శ్యామల, కొడుకు, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉపేంద్రచారి తెలిపారు. చికిత్స పొందుతూ విద్యార్థిని..ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): మండలంలోని దుమాల గ్రామానికి చెందిన లకావత్ లలిత– పరంగి దంపతుల కూతురు మధుమతి(16) గడ్డి మందుతాగి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానికంగా ఉన్న ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న మధుమతి సరిగ్గా స్కూల్‌కు వెళ్లకపోవడంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన మధుమతి ఈ నెల 1న గడ్డి మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే మండల కేంద్రంలోని ఆస్పత్రికి తరలించగా, తొమ్మిది రోజులుగా చికిత్స పొందుతూ మరణించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాహుల్‌రెడ్డి తెలిపారు. మహిళ మృతిబోయినపల్లి(చొప్పదండి): మండలంలోని విలాసాగర్‌కు చెందిన సమ్మవ్వ (45) చికిత్స పొందుతూ మృతిచెందింది. ఎస్సై రమాకాంత్ తెలిపిన వివరాలు.. సమ్మవ్వ భర్త సమ్మయ్య ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో మృతిచెందాడు. అప్పటి నుంచి ఆమె మద్యానికి బానిసైంది. పదిరోజుల క్రితం సమ్మవ్వ అల్లుడు బోసు ప్రభాకర్ అనారోగ్యంతో మృతిచెందాడు. ఇద్దరి మృతితో డిప్రెషన్‌కు లోనైంది. మానసిక వేదనతో ఈ నెల 8న మద్యం సేవించిన సమ్మవ్వ తన భర్త సమాధి వద్ద విలపించింది. అనంతరం తమ పొలం వద్దకు వెళ్లి పురుగుల మందుతాగింది. కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. మృతురాలి కుమారుడు తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యసైదాపూర్: మండలంలోని దుద్దెనపల్లి గ్రామానికి చెందిన బోయిని సత్యనారాయణస్వామి(42) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని సైదాపూర్ ఎస్సై తిరుపతి తెలిపారు. ఆయన వివరాల ప్రకారంగా బోయిని సత్యనారాయణస్వామికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు మణిసాయి, భార్య రేణుక హుస్నాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్లారు. సోమవారం సాయంత్రం ఇంటి వద్ద సత్యనారాయణ, చిన్న కుమారుడు సాయితేజ ఉన్నారు. సాయితేజ కిరాణం షాపునకు వెళ్లిన సమయంలో సత్యనారాయణ స్వామి ఇంట్లో ఉరేసుకొని మృతి చచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
సీసీ కెమెరాలతో నేరాలకు చెక్
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో దొంగతనాల నియంత్రణకు పోలీసు శాఖ సీసీ కెమెరాల ఏర్పాటు చేసి సక్సెస్ అయ్యింది. బల్దియాలో ఆరేళ్ల క్రితం మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేక నిరుపయోగంగా ఉన్నాయి. దీంతో పట్టణంలో సీసీ కెమెరాలు ఉండాలన్న ఉద్దేశంతో రూరల్ సీఐ సుధాకర్, ఎస్సై సుధీర్‌రావు, మున్సిపల్ కమిషనర్ మనోహర్‌గౌడ్ ఆధ్వర్యంలో పలుమార్లు వర్తకసంఘం నాయకులతో సమావేశమయ్యారు. వారి సహకారంతో గాంధీచౌక్, శివాజీ ఏరియా, పాతబస్టాండ్, కోరుట్ల క్రాసింగ్రోడ్ వంటి ప్రదాన ఏరియాల్లో 25 సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. వీటిని మరో రెండుమూడు రోజుల్లో ఎస్పీ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. పట్టణ ప్రజల చైతన్యం.. రాయికల్‌లో తరచూ దొంగతనాలు జరుగుతుండడంతో నిందితులను పట్టుకోవడం గగనమైంది. సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు పెద్ద సవాల్‌గా మారింది. ఈ క్రమంలో ఎలాగైనా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయలన్న ఉద్దేశంతో మున్సిపల్ నుంచి రూ.1.50లక్షలు, వర్తక సంఘం, హార్డ్‌వేర్, ఫర్టిలైజర్, గోల్డ్‌స్మిత్, బట్టల వర్తక సంఘాల నుంచి నిధులు సేకరించారు. వచ్చిన నిధులను సీసీకెమెరాల వినియోగించేందుకు కమిటీని ఏర్పాటు చేశారు. వారి సూచనల మేరకు ఇప్పటికే పలు ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇంకొన్ని నిధులు ఉండడంతో మరికొన్ని సీసీకెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. బల్దియాలోని 12వార్డుల్లో కౌన్సిలర్లు, స్థానికుల సహకారంతో మరిన్ని ఏర్పాటు చేస్తామని, వాటి పర్యవేక్షణకు ప్రణాళిక రూపొందిస్తున్నామని స్థానికులు అంటున్నారు. ఈ కెమెరాలు బిగిస్తే పట్టణంలో దొంగల బెడద, పోకిరీల బెడదకు చెక్ పెట్టే అవకాశం ఉంది. -
నియోజకవర్గానికి ఆది శ్రీనివాస్ చేసిందేమీలేదు
మేడిపల్లి: సానుభూతితో గెలిచిన ఆది శ్రీనివాస్ ఇప్పటివరకు నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, కేవలం కొబ్బరికాయ కొట్టినంతా మాత్రనా అభివృద్ధి చేసినట్లు కాదని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. మేడిపల్లి, భీమారం మండలాల్లో పర్యటించిన ఆయన గోవిందారంలో విలేకరులతో మాట్లాడారు. చందుర్తి, మోత్కురావుపేట రోడ్డును గెలిచాక మూడు నెలల్లో పూర్తిచేస్తానని చెప్పి ఓట్లు దండుకుని 21 నెలలు అయినా ఇప్పటివరకు పనులు మొదలు పెట్టలేదని ఎద్దేవా చేశారు. ఇది ముమ్మాటికీ ఎమ్మెల్యే అసమర్థత అన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే అటవీశాఖ భూమికి ప్రత్యామ్నాయంగా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో ఇచ్చామన్నారు. నిత్యం మండలానికి రాకపోకలు సాగిస్తున్న ఎమ్మెల్యేకు రోడ్ల పరిస్థితి కనిపించడం లేదా.. అని ప్రశ్నించారు. రాజలింగంపేట కుంట తెగి, బ్రిడ్జి కూలిపోయి రోజులు గడుస్తున్నా..పట్టించుకోవడంలేదన్నారు. రైతులకు యూరియా అందించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఎంతసేపూ కేసీఆర్‌పై నిందలు వేయడం తప్ప.. రైతులను ఆదుకున్న దాఖాలాలు లేవన్నారు. కలిగోటలోని సూరమ్మ చెరువును పూర్తి చేయాలని ప్రతినెలా 22వ తేదీన ధర్నాలు చేశారని, ఇప్పుడు గెలిచి 22 నెలలు గడుస్తున్నా ఎందుకు పూర్తి చేయడం లేదని ప్రశ్నించారు. సూరమ్మ చెరువు భూసేకరణకు సుమారు 1800 ఎకరాలు అవసరమని, రూ.450కోట్లు కావాలని, ఇప్పటికి రూ.10 కోట్లు మాత్రమే తెచ్చినప్పటికీ గుంట భూసేకరణ జరగలేదని పేర్కొన్నారు. 21నెలల్లో రూ.10 కోట్లు తెస్తే మిగతా రూ.440 కోట్లు తెచ్చేందుకు ఎన్నేళ్లు పడుతుందని ఎద్దేవా చేశారు. నాలుగుసార్లు ఓడిపోయానని ఆది శ్రీనివాస్ కన్నీళ్లు పెట్టుకుంటే జనాలు ఓట్లేశారని, వారిని ఇప్పుడు మోసం చేయొద్దని హితవు పలికారు. -
తియ్యనైనది తెలుగు భాష
కొత్తపల్లి(కరీంనగర్): తెలుగు భాష తియ్యనైనదని అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అశ్విని తానాజీ వాకడే అన్నారు. తెలంగాణ భాష దినోత్సవాన్ని పురష్కరించుకొని కరీంనగర్ వావిలాలపల్లిలోని అల్ఫోర్స్ విద్యా సంస్థల కేంద్ర కార్యాలయంలో మంగళవారం కాళోజీ నారాయణరావు జయంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి అల్ఫోర్స్ చైర్మన్ వి.నరేందర్‌రెడ్డితో కలిసి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ప్రభుత్వ పాఠశాలల్లోని తెలుగు ఉపాధ్యాయులు, అల్ఫోర్స్ విద్యాసంస్థల్లోని తెలుగు ఉపాధ్యాయులను సన్మానించారు. జిల్లా క్వాలిటీ కో– ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, ప్రముఖ కవి మధుసూదన్‌రెడ్డి పాల్గొన్నారు. అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అల్ఫోర్స్‌లో తెలుగు ఉపాధ్యాయులకు ఘన సన్మానం -
మహిళపై కత్తితో దాడికి యత్నం
● కేసు నమోదు చేసినా మారని తీరు ● భయాందోళనలో మహిళ కుటుంబ సభ్యులు జగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తక్కళ్లపల్లికి చెందిన కవిత అనే మహిళపై అదే గ్రామానికి చెందిన రాజు అలియాస్ మల్లేశ్ సోమవారం మధ్యాహ్నం కత్తి, బీరుసీసాతో దాడికి యత్నించాడు. గణేశ్ నిమజ్జనంలో భాగంగా ఆమె డ్యాన్స్ చేస్తుండగా మల్లేశ్ అడ్డుకున్నాడు. దీంతో కవిత భర్త మల్లేశ్‌ను మందలించాడు. ఈ క్రమంలో కవితపై కక్షపెంచుకున్న మల్లేశ్ కత్తితో దాడికి యత్నిస్తుండగా ఆమె కేకలు వేయడంతో స్థానికులు వచ్చి కాపాడారు. మల్లేశ్ కత్తి, బీరుసీసాతో కాసేపు హంగామా సృష్టించాడు. ఎవరైనా అడ్డువచ్చినా.. పోలీసులకు ఫిర్యాదు చేసినా చంపేస్తానంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు నమోదైందని తెలుసుకున్న మల్లేశ్.. మంగళవారం సదరు మహిళ భర్తను చంపేస్తానంటూ మళ్లీ హంగామా సృష్టించాడు. కవిత మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
పంచాయతీల పాలన మరింత పారదర్శకంగా..
రామగుండం: పల్లెపాలనను మరింత పారదర్శకంగా అందించేందుకు కేంద్రప్రభుత్వం ‘సమర్ద్’ పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించింది. గ్రామ పంచాయతీల పాలన, పథకాల అమలు, నిధుల వినియోగం తదితర అంవాలు పారదర్శకంగా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. పోర్టల్‌లోని వివరాలు.. ● ఈ గ్రామ్స్వరాజ్ : పంచాయతీల డిజిటలైజేషన్, నిధుల ట్రాకింగ్, పథకాల అమలు, పరిపాలన, ఆర్థిక లావాదేవీలు, బడ్జెట్, గ్రాంట్లు, గ్రామ సభల ఆమోదం, ప్రణాళికలు, అభివృద్ధి.. ● ప్లాన్‌ప్లస్ : వార్షిక ప్రణాళిక, అభివృద్ధి పనులకు సాయం, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక, ప్రాజెక్టు ఆమోదం, గ్రామసభల నిర్ణయాలు, బడ్జెట్ ప్రతిపాదనలు.. ● పీఆర్–వన్ : పారిశుధ్యం, తాగునీటి సరఫరా, స్వచ్ఛభారత్ మిషన్, చెత్త సేకరణ, మురుగునీటి తొలగింపు, మరుగుదొడ్ల నిర్మాణం పర్యవేక్షణ.. ● లోకల్ గవర్నమెంట్ డైరెక్టరీ : శాసనసభ, లోక్‌సభ నియోజకవర్గాలతో అనుసంధానించి డేటా నిర్వహణ.. ● పర్యవేక్షణ విధానం : జిల్లా పంచాయతీ అధికారులు, విస్తరణ అధికారులు, కార్యదర్శుల ద్వారా పనితీరును పర్యవేక్షించే అవకాశం.. ● అవార్డులు, ప్రోత్సాహకాలు : ఏటా ఏప్రిల్ 24న పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా ఉత్తమ పనితీరును కనబరిచే పంచాయతీలకు ‘పంచాయత్ సశక్తీకరణ పురస్కార్’ ప్రదానానికి వీలు.. ● స్వచ్ఛభారత్ మిషన్ : మరుగుదొడ్ల నిర్మాణం, బహిరంగ మలవిసర్జన రహిత గ్రామాల సాధన.. ‘సమర్ద్’ పేరిట ప్రత్యేక పోర్టల్ రూపొందించిన కేంద్ర ప్రభుత్వం -
రెవెన్యూ.. ఇసుక
మాఫియా చెట్టాపట్టాల్● కోరుట్ల రెవెన్యూ కార్యాలయంలో పనిచేసే ఓ నాల్గో తరగతి ఉద్యోగి తన బంధువుల పేరిట ఉన్న జేసీబీలు, ట్రాక్టర్లతో ఇసుక తవ్వకాలు సాగిస్తూ అధికారులను మేనేజ్ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం రెవెన్యూ వర్గాల్లో అందరికి తెలిసినా పట్టించుకునే నాథుడే లేడు. ● మెట్పల్లి పాత తాలుకా పరిధిలోని ఓ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు గిర్దవార్ల మధ్య ఇసుక ‘మామూళ్ల’ పంచాయితీ సాగుతున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. వీరిద్దరూ ఒకరిపైనొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నట్లు సమాచారం. అది కూడా ఇసుక ఆక్రమ రవాణాదారులతోనే కావడం గమనార్హం. ● కథలాపూర్ మండలం సిరికొండ–తక్కళ్లపల్లి శివారు నుంచి ప్రతీరోజు రాత్రి సమయంలో చెన్నూర్ ఇసుక పర్మిట్ల పేరిట సుమారు 10 నుంచి 15 లారీలు జిల్లా సరిహద్దు దాటుతున్నాయి. వారి ప్రాంతంలో ఇసుకరీచ్ ఉన్నప్పటికీ అక్కడి నుంచి ఇసుక తవ్వకాలు జరుపుతున్నా.. రెవెన్యూ అఽధికారులు నిర్లిప్తంగా వ్యవహరిస్తూ వారానికి ఓసారి మొక్కుబడిగా ఒకటి రెండు లారీలకు జరిమానాలు వేసి వదిలేస్తున్న వైనం అనుమానాస్పదంగా ఉంది. ● ఇటీవల కోరుట్లలో ఓ ఇసుక అక్రమ రవాణాదారు ఏర్పాటు చేసిన ఫంక్షన్‌కు కోరుట్ల, కథలాపూర్ ప్రాంతాల రెవెన్యూ అధికారులు పోటాపోటీగా వచ్చి విందులు ఆరగించడం గమనార్హం. కిందిస్థాయి ఉద్యోగులు అక్కడే మందు పార్టీ చేసుకోవడం గమనార్హం. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఎక్కడిక్కడే రెవెన్యూ ఉద్యోగులు ఇసుక మాఫియాతో కుమ్మకై ్కన ఆనవాళ్లు కనిపిస్తాయి. దీని ఫలితంగానే ఇసుక అక్రమంగా అడ్డూఅదుపు లేకుండా రవాణా అవుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోరుట్ల: కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ సబ్ డివిజన్ల పరిధిలో ఇసుక అక్రమార్కులతో కిందిస్థాయి రెవెన్యూ అధికారులు సంబంధాలు నెరుపుతున్న ఫలితంగా ఉన్నతాధికారులు ఎంత నిక్కచ్చిగా వ్యవహరించినా మార్పు రావడంలేదు. కోరుట్ల మండలం నాగులపేట, పైడిమడుగు, కథలాపూర్ మండలం సిరికొండ, తక్కళ్లపల్లి, బొమ్మన శివారుల్లో మెట్పల్లి మండలం ఆత్మకూర్ వాగు, మల్లాపూర్ మండలంలోని వేంపల్లి–వెంకట్రావ్పేట, రేగుంట ఏరియాలో ఇసుక అక్రమ రవాణాతో భూగర్బజలాలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. వాగుల పరిసరాల్లో కొట్టుకుపోయి చుట్టుపక్కలతోటలు, పొలాల్లో వరదలు వచ్చిన సమయంలో మేటలు వేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీనిపై ఏడాది క్రితం పలువురు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. భారీగా జరిమానాలు ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు స్వయంగా కలెక్టర్ రంగంలోకి దిగి ఇసుక అక్రమ రవాణాకు పుల్‌స్టాప్ పెట్టేలా చర్యలు తీసుకున్నారు. దీంతో కొన్నిరోజుల పాటు ఇసుక అక్రమ రవాణా నిలిచిపోయింది. అక్రమంగా తరలిస్తూ పట్టుబడితే ట్రాక్టర్‌కు రూ.25 వేలు, లారీకి రూ.50వేల చొప్పున జరిమానా విధించారు. ఒక్క కోరుట్లలోనే ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న సుమారు 40 ట్రాక్టర్లను పట్టుకుని నెల రోజల పాటు రెవెన్యూ అధికారుల ఆధీనంలో ఉంచారు. చివరికి ట్రాక్టర్లను వదిలేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల నుంచి ఒత్తిళ్లు రావడంతో పట్టుబడిన ట్రాక్టర్లకు భారీగా జరిమానా వేసి వదిలేశారు. ఇదే రీతిలో మెట్పల్లి, మల్లాపూర్ మండలాల్లో ఆ సమయంలో అక్రమ ఇసుక రవాణాపై అధికారులు కొన్నాళ్లు పాటు నిక్కచ్చిగా వ్యవహరించారు. మళ్లీ మొదటికి.. ఇసుక అక్రమ రవాణాదారులు కొంతమంది కింది స్థాయి రెవెన్యూ అధికారులతో కుమ్మకై ్క అడపదపా ట్రాక్టర్లను పట్టుకుని జరిమానాలు వేసినట్లు ఉన్నతాధికారులకు చూపి, మిగిలిన ట్రాక్టర్లు, లారీలను వదిలేయాలని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. ఆర్నెళ్ల వ్యవధిలో కోరుట్ల, మెట్పల్లి సబ్ డివిజన్లలో అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకోవడం.. జరిమానా వేయడం చాలా మేర తగ్గిపోయింది. ప్రతీరోజు కోరుట్ల, కథలాపూర్ మండలాల నుంచి కనీసం 50 ట్రాక్టర్లు, 15 లారీల్లో ఇసుక తరలిపోతుండగా..నెలకు ఓ పది ట్రాక్టర్లు, రెండు మూడు లారీలు పట్టుకుని జరిమానా వేసి వదిలేస్తున్న వైనం రెవెన్యూ తీరుకు అద్దం పడుతోంది. ఇక్కడితో సరిపెట్టుకోకుండా కొంత మంది రెవెన్యూ ఉద్యోగులే ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుక అక్రమ రవాణాను సక్రమంగా చేసుకోవడానికి కాగితాలు సృష్టించుకోమని అక్రమార్కులకు సూచిస్తున్నట్లు సమాచారం. ఆగని ఇసుక అక్రమ రవాణా -
‘ప్రణాళిక’ లేదు.. శుభ్రత కానరాదు
● ఇది గంజ్ నుంచి వెళ్లే పెద్దనాలా. టవర్‌సర్కిల్ ప్రాంతంలో శుభ్రం చేయక ప్లాస్లిక్ కవర్లు, చెడిపోయిన బట్టలు, కూలర్లు ఇందులోనే పడేస్తున్నారు. చుట్టూ ప్రహరీ ఉన్నా.. అది చెడిపోవడంతో మట్టి చేరుతోంది. భారీ వర్షం కురిస్తే నాలా నిండి ఇళ్లలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ చిత్రం జిల్లా కేంద్రంలోని బైపాస్‌రోడ్‌లోని ప్రధాన కాలువ. ఇందులో పూడిక తీయక రోజులు గడుస్తున్నాయి. పాలిథిన్ కవర్లు, చెత్తాచెదారంతో పూర్తిగా నిండి మురికినీరు బైపాస్‌రోడ్‌లో ప్రవహిస్తోంది. దుర్గంధం వెదజల్లుతుండడం ప్రజలకు ఇబ్బందిగా మారింది. వందరోజుల ప్రణాళికలో భాగంగా పారిశుధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉన్నా.. ఎక్కడా కనిపించడం లేదు. -
జగిత్యాల
32.0/24.0నృసింహుడి సన్నిధిలో జిల్లా జడ్జి ధర్మపురి: నృసింహస్వామిని జిల్లా జడ్జి రత్నపద్మావతి దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు స్వామివారి శేషవస్త్రం, ప్రసాదం, చిత్రపటాలను బహూకరించారు.7గరిష్టం/కనిష్టంకోరుట్ల: కోరుట్ల, మెట్పల్లి రెవెన్యూ సబ్ డివిజన్ల పరిధిలో ఇసుక అక్రమార్కులతో కిందిస్థాయి రెవెన్యూ అధికారులు సంబంధాలు నెరుపుతున్నారు.వాతావరణం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. కొన్ని చోట్ల చిరుజల్లులు కురిసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఉక్కపోతగా ఉంటుంది. బుధవారం శ్రీ 10 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2025 -
‘ఇందిరమ్మ’ పనులు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం వెల్దుర్తిలో గ్రామ పంచాయతీ నూతన భవన నిర్మాణ పనులు, ఇందిరమ్మ ఇళ్లు, కండ్లపల్లి మోడల్స్కూల్లో ఈజీఎస్ ద్వారా మంజూరైన అంగన్వాడీ, కిచెన్‌షెడ్ పనులను పరిశీలించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నాణ్యత ఉండేలా ఇంజినీరింగ్ అధికారులు చూడాలన్నారు. ఆర్డీవో మధుసూదన్, ఇంజినీరింగ్ పంచాయతీ అధికారి లక్ష్మణ్‌రావు, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ వరుణ్‌కుమార్, ఎంపీవో రవిబాబు పాల్గొన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి జగిత్యాల: వైద్యులు సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలని కలెక్టర్ అన్నారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య సిబ్బందితో సమీక్షించారు. పాతటైర్లు, డిస్పోజల్ గ్లాసులు, కంటైనర్స్‌లో నీరు నిలిచి దోమలు వృద్ధి చెందడానికి ఆస్కారం ఉంటుందని, డ్రైడే చేపట్టి తొలగించాలన్నారు. డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్, ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, జైపాల్‌రెడ్డి, అర్చన, రవీందర్, సత్యనారాయణ పాల్గొన్నారు. -
లైంగికదాడి కేసులో నిందితుడి అరెస్టు
కరీంనగర్‌క్రైం: నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని అరెస్టు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. కమిషనరేట్ కేంద్రంలో మంగళవారం కేసు వివరాలు వెల్లడించారు. సీపీ కథనం ప్రకారం.. మహారాష్ట్రలోని సిరోంచ పరిధిలో ఉన్న లక్ష్మీదేవిపేటకు చెందిన పెద్ది దక్షిణ్ ఊరాఫ్ దక్షిణామూర్తి (23) కరీంనగర్ వచ్చి రెండు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేశాడు. మద్యం సేవించి విధులకు హాజరుకావడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఉద్యోగం నుంచి తొలగించారు. కొంతకాలం స్వగ్రామంలో ఉండి తిరిగి కరీంనగర్ వచ్చాడు. ఆదర్శనగర్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో కంపౌండర్‌గా చేరాడు. మద్యం తాగడంతో పాటు అశ్లీలచిత్రాలు చూసే అలవాటు ఉన్న దక్షిణామూర్తి ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్న యువతిపై ఈనెల 6న వేకువజామున మత్తుమందిచ్చి లైంగికదాడి చేశాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, మంగళవారం నిందితుడిని రిమాండ్‌కు తరలించారు. ఘటనపై కలెక్టర్‌కు నివేదిక ఇచ్చామని, ఆస్పత్రుల్లో భద్రతా చర్యలపై త్వరలోనే ఆసుపత్రి యాజమాన్యాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని తెలిపారు. చిన్నపిల్లల అశ్లీల చిత్రాలు(చైల్డ్ ఫోర్నోగ్రఫీ) చూస్తే పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామని, ఇప్పటి వరకు కరీంనగర్ జిల్లాలో 30మందిపై కేసులు నమోదు చేసినట్లు సీపీ వెల్లడించారు. సమావేశంలో కరీంనగర్ టౌన్ ఏసీపీ వెంకటస్వామి, త్రీటౌన్ సీఐ జాన్‌రెడ్డి పాల్గొన్నారు. -
గుండెపోటుతో మాజీ సర్పంచ్ మృతి
మెట్‌పల్లిరూరల్: మెట్పల్లి మండలం వేంపేట మాజీ సర్పంచ్, బీజేపీ సీనియర్ నాయకుడు మారంపెల్లి శ్రీనివాస్(53) గుండెపోటుతో మృతి చెందారు. తిరుమలతిరుపతిలోని శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనానికి స్నేహితులతో కలిసి సోమవారం వెళ్లాడు. తిరుపతిలోనే మంగళవారం గుండెపోటుకు గురై మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. శ్రీనివాస్‌కు ఇద్దరు భార్యలు, ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఆయన మృతిపై వివిధ పార్టీల నాయకులు సంతాపం ప్రకటించారు. పారిశుధ్య కార్మికుడు..పెగడపల్లి: మండలంలోని కీచులాటపల్లిలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుడు కొత్తపల్లి సత్తయ్య (50) సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందాడు. పేద కుటుంబానికి చెందిన సత్తయ్య మృతిపై గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ఆర్థిక సాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణంజగిత్యాలక్రైం: జగిత్యాల రూరల్ మండలం తాటిపల్లి శివారులో అచ్చ గంగారాం (56) ద్విచక్ర వాహనం ఢీకొని మృతిచెందాడు. గంగారాం సోమవారం సాయంత్రం పొలం పనులు ముగించుకుని సైకిల్‌పై ఇంటికి బయల్దేరాడు. మోరపల్లి బైపాస్‌రోడ్ వద్ద జగిత్యాలకు చెందిన మహేశ్ ద్విచక్ర వాహనంతో వెనుక నుంచి గంగారాంను ఢీకొన్నాడు. తీవ్రంగా గాయపడిన గంగారాంను జగిత్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అర్ధరాత్రి మృతిచెందాడు. గంగారాం కుమారుడు సురేశ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై సదాకర్ తెలిపారు. మెట్పల్లి: పట్టణ శివారులో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మగ్గిడి నర్సయ్య(59) మృతి చెందాడు. స్థానికుల కథనం ప్రకారం.. మండలంలోని వేంపేటకు చెందిన నర్సయ్య ద్విచక్ర వాహనాంపై పని నిమిత్తం మెట్‌పల్లికి వస్తున్నాడు. మార్గమధ్యంలో ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీ కొట్టింది. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడిన నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కౌలు రైతు ప్రాణం తీసిన ఫైనాన్స్ వేధింపులు● ట్రాక్టర్ లాక్కెళ్లిన ఫైనాన్స్ ప్రతినిధులు ● కిస్తీలు చెల్లించాలని ఒత్తిడి ● మనస్తాపంతో ఆత్మహత్య తిమ్మాపూర్: ఆర్థిక పరిస్థితి బాగాలేక ఫైనాన్స్‌లో అప్పు చేసిన ఓ కౌలు రైతు సదరు ఏజెంట్ల వేధింపులు భరించలేక బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఈ విషాద ఘటన తిమ్మాపూర్ మండలకేంద్రంలో చోటుచేసుకుంది. ఎల్ఎండీ ఎస్సై శ్రీకాంత్‌గౌడ్ వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గోపగోని బాబు (43) భార్య పద్మతో కలిసి గ్రామంలో కొంత భూమి కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. వీరికి ఇద్దరు కూతుళ్లు, కొడుకు సంతానం. గతంలో ట్రాక్టర్ కొన్న బాబు ఓ ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకున్నాడు. కొన్నాళ్లపాటు సక్రమంగానే కిస్తీలు చెల్లించాడు. తర్వాత ఆర్ధిక ఇబ్బందుల కారణంగా రెండు కిస్తీలు చెల్లించలేకపోయాడు. దీంతో సదరు ఫైనాన్స్ ఉద్యోగి ఒకరు ట్రాక్టర్‌ను తీసుకెళ్లాడు. మరోసారి ఆర్థిక ఇబ్బందులు రావడంతో ఇటీవలే తన ఇంటిపై మరో ఫైనాన్స్ సంస్థలో రుణం పొందాడు. బయట రూ.4లక్షలు అప్పు ఉండడం.. రెండు ఫైనాన్స్‌ల్లో వడ్డీతో కలిపి రూ.8 లక్షలకు చేరడంతో కిస్తీలు చెల్లించడం గగనంగా మారింది. మరోవైపు ఫైనాన్స్ సిబ్బంది నుంచి వేధింపులు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో మనస్తాపానికి గురైన బాబు ఈనెల6న ఉదయం పొలం వద్దకని చెప్పి వెళ్లి గడ్డిమందు తాగాడు. గమనించిన కుటుంబసభ్యులు కరీంనగర్‌లోని ప్రైవేటు ఆసుపత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. పరిస్థితి విషమించి మంగళవారం వేకువజామున మృతిచెందాడు. బాబు భార్య పద్మ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
నీటి పారుదల శాఖలో టెం‘డర్’
● మెట్పల్లి మండలంలోని కృష్ణాద్రి చెరువు అభివృద్ధి పనులకు ప్రభుత్వం రూ.39.42లక్షలు మంజూరు చేసింది. దీంతో అధికారులు రెండు నెలల క్రితం ఈ పనులకు టెండర్లు నిర్వహించింది. పలువురు కాంట్రాక్టర్లు పాల్గొని షెడ్యూళ్లు దాఖలు చేశారు. పనులు దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్.. అగ్రిమెంట్ చేసుకోవడానికి మాత్రం ముందుకు రావడం లేదు. బిల్లులు సకాలంలో వస్తాయో..? లేదో..? అనే సందేహంతో సదరు కాంట్రాక్టర్ ఆసక్తి చూపడం లేదని తెలిసింది. ● మెట్పల్లి మండలంలోని రాంలచ్చక్కపేటలోని మాదిగ కుంట అభివృద్ధి పనులదీ ఇదే పరిస్థితి. రూ.12.53లక్షలతో చేపట్టే ఈ పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్ రెండు నెలలుగా అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. ఇతను కూడా బిల్లులపై అనుమానంతోనే ముందుకు రావడం లేదని సమాచారం. మెట్పల్లి: నీటి పారుదల శాఖలో అభివృద్ధి పనులకు మోక్షం కలగడం లేదు. ప్రభుత్వం నిధులు మంజూరు చేసినప్పటికీ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్లు ఆసక్తి చూపడం లేదు. కొన్నింటిని టెండర్ ద్వారా దక్కించుకున్న కాంట్రాక్టర్లు.. ఆ తర్వాత అగ్రిమెంట్ చేసుకోకుండా జాప్యం చేస్తున్నారు. మరికొన్ని పనులకు పలుమార్లు టెండర్లు పిలిచినప్పటికీ ఒక్కరు కూడా పాల్గొనలేదు. దీంతో ఆయా పనులను పూర్తి చేయించడం స్థానిక అధికారులకు ఇబ్బందిగా మారింది. ● కృష్ణాద్రి, మాదిగ కుంటలే కాకుండా ఇంకా పలు పనులు టెండర్ దశలోనే ఆగిపోయాయి. ● మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట పెద్ద చెరువుకు రూ.6.09లక్షలను కేటాయించారు. వీటిని దక్కించుకున్న కాంట్రాక్టర్..అగ్రిమెంట్ చేసుకోవడంపై అసక్తి చూపడం లేదు. ● మెట్పల్లి మండలంలోని డీ–29 ఉప కాల్వలో షట్టర్ల మరమ్మతుకు రూ.4.99లక్షలు మంజూరు కాగా.. ఇప్పటివరకు నాలుగుసార్లు టెండర్లు పిలిచారు. ● మేడిపల్లి మండలంలోని డీ–49 ఉప కాల్వలో రూ.2లక్షలతో చేపట్టే మరమ్మతు పనులకు మూడుసార్లు టెండర్లు నిర్వహించారు. -
జీవించు.. సాధించు
కరీంనగర్‌టౌన్: సృష్టిలో ఏ జీవికి ఆత్మహత్య ఆలోచన రాదు. ఒక్క మనిషికే ఆ విపరీత బుద్ధి. చిన్న సమస్య రాగానే తల్లడిల్లిపోతాడు. చావే భయమన్న భ్రమలో పడిపోతాడు. అక్షరాస్యులైనా.. నిరక్షరాస్యులైనా... నిరుద్యోగి అయినా.. జీవితంలో స్థిరపడ్డవారైనా... చిన్నపాటి సమస్యకే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ప్రేమ వైఫల్యం... ఒంటరితనం.. నిరుద్యోగం... ఆర్థిక ఇబ్బందులు.. కుటుంబ కలహాలు.. కారణమేదైనా ప్రాణాలు వదులుతున్నారు. జీవితాన్ని జయించలేక చావుకు చేరుకుంటున్నారు. నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా కథనం. పెరుగుతున్న బలవన్మరణాలు... ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బలవన్మరణాలు భయపెడుతున్నాయి. ఏటా ఆత్మహత్యలు చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతున్నట్లు అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో సగం విద్యార్థులే కావడం బాధాకర విషయం. చదవలేక కొందరు, సహచర విద్యార్థులు, ఫ్యాకల్టీ వేధింపులతో మరికొందరు, మార్కులు రాలేదని ఇంకొందరు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. వారిలో బలమైన కారణాలు కనిపించడం లేదని మానసిక వైద్యనిపుణులు చెబుతున్నారు. ఒక వ్యక్తి బాగా మానసిక ఒత్తిడికి లోనైప్పుడు, సమస్యకు పరిష్కారం లభించనప్పుడు, తమకు ఏంచేయాలో, సమస్య నుంచి ఎలా బయట పడాలో తెలియక, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఉద్యోగం లేదని, మానసిక రుగ్మతలు, మత్తు మందులకు బానిసవడం, విపరీతమైన భయం, ఎక్కువగా నిరాశకు గురికావడం, విపరీతమైన అప్పులు, జీవితంపై నమ్మకం సన్నగిల్లడం, వ్యవసాయంలో నష్టాలు, పరీక్షలో ఉత్తీర్ణత కాకపోవడం ఇలా అనేక కారణాలు ఉంటున్నాయి. ఆత్మహత్యల నివారణకు ముఖ్యంగా కుటుంబ సభ్యుల పాత్ర కీలకం. నిరాశతో ఉన్న వారిని గమనిస్తూ ఉండాలి. వారిని దగ్గరకు తీసుకుని ఆత్మీయంగా ఓదార్చాలి. నేనున్నానంటూ భరోసా కల్పించాలి. ఒత్తిడిని అధిగమించలేక ఆత్మహత్యలు జిల్లాలో పెరుగుతున్న బలవన్మరణాలు సమస్య ఏదైనా చావు మాత్రమే పరిష్కారం కాదు నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవంఆత్మహత్యాయత్నం ఓ మానసిక సమస్య. చనిపోయినంత మాత్రాన సమస్య తీరదు. ఆత్మహత్యకు పాల్పడే వ్యక్తి ముందు ఒంటరితనాన్ని కోరుకుంటారు. తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతారు. అటువంటి వారిని గుర్తించి చికిత్స చేయించడం అత్యవసరం. వారిని నెమ్మదిగా నలుగురిలోకి తీసుకువెళ్లాలి. జీవితంపై ఆసక్తి కలిగించేలా చూడాలి. అప్పుడే ఆత్మహత్య ఆలోచనను దూరం చేయవచ్చు. డాక్టర్ ఎల్. వర్శి, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర కోశాధికారి -
వ్యాపారుల సహకారంతో..
పట్టణంలో తరచూ దొంగతనాలు జరుగుతున్నాయి. ఎస్సై సుధీర్‌రావు ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని వర్తక సంఘాల నుంచి కోరారు. దీంతో పట్టణంలోని వర్తక, వ్యాపారులు, అన్ని సంఘాల నాయకులు సహకరించి కెమెరాల ఏర్పాటుకు కృషి చేశారు. – ఎలగందుల సత్యనారాయణ, వర్తక సంఘం అధ్యక్షుడు పట్టణంలో సీసీకెమెరాల ఏర్పాటుకు వర్తక వ్యాపారులందరూ సహకరించడంతో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరి కొద్దిరోజుల్లోనే మరిన్ని బిగిస్తాం. ప్రస్తుతం 25 కెమెరాలు పనిచేస్తున్నాయి. మరో 10 సీసీకెమెరాలకు సన్నాహాలు చేస్తున్నాం. పర్యవేక్షణకూ ఓ వ్యక్తిని నియమించేలా చూస్తాం. – సుధీర్‌రావు, ఎస్సై, రాయికల్ -
రైస్‌మిల్లర్లకు గడువు గండం
జగిత్యాలరూరల్: ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు అప్పగించి.. వారి నుంచి బియ్యం (సీఎంఆర్) సేకరిస్తుంది. ఇందులో కొంత బియ్యం ఎఫ్‌సీఐ.. మరికొంత బియ్యం సివిల్సప్లైకి చేరుతుంది. అయితే 2024–25 ఖరీఫ్ సీజన్లో మిల్లర్లకు ఇచ్చిన ధాన్యాన్ని మిల్లర్లు బియ్యంగా మార్చి ప్రభుత్వానికి ఈనెల 12లోపు అప్పగించాల్సి ఉంది. ఇప్పటివరకు మిల్లర్లు బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా ఎఫ్‌సీఐ బియ్యం నిల్వ చేసేందుకు గోదాములు లేక బియ్యం తీసుకోవడం లేదు. దీంతో మిల్లర్లు పట్టిన బియ్యాన్ని నిల్వ చేయలేక ఆందోళనకు గురవుతున్నారు.2024–25 ఖరీఫ్జిల్లాలో 2024–25 ఖరీఫ్‌లో ప్రభుత్వం ఐకేపీ కొనుగోలు కేంద్రాల ద్వారా 3 లక్షల టన్నుల వరి ధాన్యం సేకరించింది. ఆ ధాన్యాన్ని జిల్లాలోని 120 రైస్‌మిల్లులకు అప్పగించింది. ఈ లెక్కన ప్రభుత్వానికి రెండు లక్షల టన్నుల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఇప్పటికీ ఎఫ్‌సీఐతోపాటు, సివిల్సప్లైకి 1.40 లక్షల టన్నుల బియ్యం అప్పగించారు. ఇంకా 60వేల టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉండగా ప్రభుత్వం ఈనెల 12 చివరి గడువుగా విధించింది. దీంతో మిల్లర్లు బియ్యం సిద్ధం చేసినా ఎఫ్‌సీఐ, సివిల్సప్లైగానీ తీసుకోవడం లేదు. ఎఫ్‌సీఐ 55వేల టన్నులు తీసుకోవాల్సి ఉండగా.. జిల్లాలో వారి గోదాములు పూర్తిగా నిల్వ ఉండటంతో తీసుకోవడం లేదు. అలాగే 5 వేల టన్నుల సివిల్ సప్లై తీసుకోవాల్సి ఉండగా.. వారు కూడా బియ్యం తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నారు.ఖాళీకాని గోదాములునాలుగు నెలలుగా ఎఫ్‌సీఐ గోదాముల్లో పూర్తిస్థాయిలో బియ్యం నిల్వ ఉండటంతో వాటిలో మిల్లర్ల నుంచి తీసుకున్నవి నిల్వ చేసే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఎఫ్‌సీఐ గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఇతర గోదాములకు తరలిద్దామన్నా.. అవి కూడా నిండుగా ఉండటంతో మిల్లర్లు బియ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా అధికారులు తీసుకోవడం లేదు.ఖరీఫ్ ధాన్యం పెట్టేదెక్కడ..?జిల్లాలోని ప్రభుత్వ ధాన్యం తీసుకున్న మిల్లర్లు ఇప్పటికే రైస్‌మిల్లుల్లో పెద్ద ఎత్తున ధాన్యం పేరుకుపోయింది. మళ్లీ ఖరీఫ్ సీజన్ ఈనెల చివరి నుంచి ప్రారంభమవుతుంది. దీంతో మళ్లీ ప్రభుత్వం సేకరించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకుని ఎక్కడ నిల్వ చేయాలో తెలియక అయోయమంలో పడుతున్నారు. దీంతోపాటు గడువులోపు ఇవ్వకపోతే ప్రభుత్వం మిల్లర్లను డిఫాల్ట్ కింద వారికి ధాన్యం కేటాయించకుండా నిర్ణయం తీసుకోనుంది.ట్రాక్ రిపేరుతోనే జాప్యంఎఫ్సీఐ, సివిల్ సప్లై గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ప్రతినెలా సుమారు 4 నుంచి 6 వ్యాగన్లు ఇతర ప్రాంతాలకు బియ్యాన్ని తరలిస్తుంటారు. కొద్దిరోజులుగా లింగంపేట రైల్వేస్టేషన్లో ట్రాక్ మరమ్మతు నేపథ్యంలో వ్యాగన్లు రావడం లేదు. దీంతో గోదాముల్లో ఉన్న బియ్యం ఖాళీ చేయడం కూడా అధికారులకు కష్టంగా మారింది.మిల్లర్లకు భారంరైస్మిల్లర్లు ప్రభుత్వం వద్ద తీసుకున్న ధాన్యాన్ని బియ్యంగా చేసి ప్రభుత్వానికి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా గోదాములు ఖాళీ లేక తీసుకోకపోవడంతో నెల రోజులుగా రైస్‌మిల్లులను పూర్తిగా మూసివేశారు. దీంతో వారికి విద్యుత్ చార్జీలతోపాటు, ఆపరేటర్ల వేతనాలు, హమాలీల వేతనాలు చెల్లించడం భారంగా మారింది.ట్రాక్ రిపేరుతోనే జాప్యంజిల్లాలో 2024–25 ఖరీఫ్ వరిధాన్యం తీసుకున్న మిల్లర్లు ఈనెల 12లోపు బియ్యం అప్పగించాల్సి ఉంది. సివిల్సప్లైకి 5 వేల టన్నులు, ఎఫ్‌సీఐకి 55 వేల టన్నుల బియ్యం అప్పగించాల్సి ఉంది. కానీ ఎఫ్‌సీఐ గోదాములు ఖాళీ లేకపోవడం, రైల్వేట్రాక్ మరమ్మతుతో గోదాముల్లో ఉన్న బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు సాధ్యం కావడం లేదు. – జితేంద్రప్రసాద్, ఇన్చార్జి డీఎస్వో, సివిల్సప్లై -
పీఆర్సీ అమలు చేయాలి
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ పరిధిలో పనిచేస్తున్న రిసోర్స్ పర్సన్లకు ప్రభుత్వపరంగా నిధులు కేటాయించాలి. గౌరవ వేతనం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలి. నిత్యం మహిళా సంఘాలను బలోపేతం చేస్తూ.. వారి ఆర్థిక పురోగతికి కృషి చేస్తున్నాం. ప్రభుత్వపరంగా అనేక సర్వేలు నిర్వహించి సమగ్రమైన పూర్తి సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులకంటే ఎక్కువగా బాధ్యత మోస్తున్నాం. గుర్తింపు లేదు. శ్రమకు తగిన ఫలితం లేదు. అధికారులు స్పందించి గౌవర వేతనం ఇచ్చి పీఆర్సీ అమలు చేయాలి. – మెప్మా ఆర్పీల సంఘం జిల్లా నాయకులు -
తెరుచుకున్న ఆలయాలు
ధర్మపురి/మల్యాల: చంద్రగహణం సందర్భంగా ఆదివారం రాత్రి మూసివేసిన ఆలయాలు సోమవారం తిరిగి తెరుచుకున్నాయి. ధర్మపురి శ్రీలక్ష్మినృసింహస్వామి ఆలయంలో సంప్రోక్షణ, హోమం తదితర పూజలు చేశారు. ఉదయం 9.30 గంటల నుంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పించారు. ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు ఉన్నారు. మల్యాల మండలం ముత్యంపేటలోని కొండగట్టు ఆంజనేయస్వామి వారి దర్శనాన్ని ఉదయం 7.30గంటల నుంచి కల్పించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు తిరుమంజనం నిర్వహించారు. స్థానాచార్యులు, కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవ స్వామి, రాంచంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. -
జీపీవోలకు కౌన్సెలింగ్ పూర్తి
జగిత్యాల: మరో రెండు రోజుల్లో గ్రామపాలన అధికారులు విధుల్లో చేరనున్నారు. ఈ మేరకు వారికి కలెక్టరేట్లో సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించారు. మెరిట్ ప్రతిపాదికన పోస్టింగ్ ఇచ్చేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్న ఉద్దేశంతో గ్రామపాలన అధికారులు (జీపీవో)లను నియమించేందుకు చర్యలు తీసుకుంది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థ ఉండటంతో ప్రభుత్వం వారిని తొలగించడంతో వ్యవస్థ కుంటుపడింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మళ్లీ వారిని తీసుకొచ్చేందుకు అర్హత పరీక్ష నిర్వహించి ఎంపిక చేసింది. హైదరాబాద్‌లో నియామక పత్రాలు అందించింది. కౌన్సెలింగ్ పూర్తి జిల్లాకు కేటాయించిన గ్రామ పాలన అధికారులకు కౌన్సెలింగ్ పూర్తయింది. వారికి పరీక్షల్లో వచ్చిన మెరిట్ ఆధారంగా స్థానికత వివరాలు, ధ్రువీకరణ పత్రాలు పరిశీలించి మంగళవారం నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. జిల్లాలో 300 రెవెన్యూ విలేజ్‌లు ఉండగా ఒక్కొక్కరికి రెండుమూడు గ్రామాలు కేటాయించనున్నారు. సొంత నియోజకవర్గంలో నో పోస్టింగ్ గ్రామపాలన అధికారులుగా నియమితులైన వారికి సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇవ్వొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసింది. సొంత నియోజకవర్గంలో పోస్టింగ్ ఇచ్చేలా చూడాలని గ్రామపాలన అధికారులు కోరుతున్నా ప్రభుత్వం నో చెప్పింది. అప్పుడే పైరవీలు.. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అధికారులు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నప్పటికీ అప్పుడే పైరవీలు చోటుచేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. స్పౌజ్ ఉన్న వారికి ప్రత్యేక కేటగిరిల్లో పోస్టింగ్ ఇస్తున్నారు. జిల్లాలో మొత్తం 218 మంది జీపీవోలు ఎంపికయ్యారు. వీరికి కౌన్సెలింగ్ నిర్వహించాం. త్వరలో పోస్టింగ్‌లు ఇస్తాం. వారు మరో రెండు రోజుల్లో విధుల్లో చేరనున్నారు. భూభారతి చట్టం పకడ్బందీగా నిర్వహించడం కోసం జీపీవోలను నియమించాం. సత్యప్రసాద్, జిల్లా కలెక్టర్ త్వరలో పోస్టింగ్‌లు డివిజన్ విలేజ్‌లు క్లస్టర్లు జగిత్యాల 190 130 కోరుట్ల 53 45మెట్పల్లి 57 43 -
కరెంట్ లేక రోగులు విలవిల
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రికి విద్యుత్ అధికారులు కరెంట్ కట్ చేశారు. ఆస్పత్రి ఆవరణలో పెరిగిన చెట్ల కొమ్మలు తొలగించడంలో భాగంగా విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆస్పత్రిలోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చెట్లకొమ్మలు, చెట్లు తొలగించడమే మంచిదే అయినా.. ఆస్పత్రిలో రోగులు లేనప్పుడో.. వారికి మరోచోట సౌకర్యాలు ఏర్పాటు చేశాక ముందుకెళ్తే బాగుండేది. అసలే వ్యాధులకాలం కావడంతో ఆస్పత్రిలో రోగులు చాలామంది ఉన్నారు. డయాలసిస్ కేంద్రం ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. అయినా అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయకుండానే చెట్లు తొలగించడం కోసమని కరెంట్ తొలగించారు. మధ్యాహ్న సమయంలో ఎండవేడిమి ఎక్కువగా ఉండటంతో రోగులు ఉక్కపోత భరించలేకపోయారు. మధ్యాహ్నం నుంచి రాత్రి ఏడు గంటల వరకు కరెంట్ రాకపోవడంతో రోగులు బెడ్లపైనుంచి లేచి బయటకు రావాల్సి వచ్చింది. టార్చ్‌లైట్ వెలుతురులోనే కొందరికి డయాలసిస్ చేపట్టారు. జనరేటర్ ఉన్నా.. ఆస్పత్రిలో రోగులకు ఇబ్బందులు లేకుండా కరెంట్ పోయినప్పుడు జనరేటర్ సౌకర్యం ఉంది. కానీ దానిని ఆన్ చేయకపోవడం అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. చెట్ల కొమ్మలు నరికి వేస్తున్నప్పుడు కరెంట్‌తోపాటు, జనరేటర్ కూడా ఆన్చేయవద్దని, కరెంట్ పాస్ అవుతుందని, అందుకే జనరేటర్ ఆన్ చేయలేదని వైద్యాధికారులు పేర్కొంటున్నారు. చెట్ల కొమ్మలు తొలగించాం ప్రధాన ఆస్పత్రి బిల్డింగ్ చుట్టూ చెట్లు పెరిగిపోవడంతో వర్షం పడినప్పుడు ఇబ్బంది ఎదురవుతోంది. కొన్నిసార్లు ఏరుస్తోంది. ఎప్పటి నుంచో తొలగించాలనుకున్నాం. రోగులు అధికంగా ఉండటంతో చేయలేకపోయాం. సోమవారం కొంత తక్కువ మంది ఉండటంతో అటవీశాఖ అనుమతితో ఈ కార్యక్రమం చేపట్టాం. సుమన్‌రావు, ఆర్ఎంవో -
అంగన్వాడీలపై యాప్‌ల భారం
పెగడపల్లి: అంగన్వాడీ టీచర్లు పోషణ ట్రాకర్, ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లతో అష్టకష్టాలు పడుతున్నారు. పోషణ ట్రాకర్ యాప్‌లో లబ్ధిదారుల ముఖ హాజరు నమోదుకు ఇబ్బంది తప్పడం లేదు. ఫేస్‌ను యాప్‌లో గుర్తించేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్ట్ చేయడం లేదని సిబ్బంది చెబుతున్నారు. సర్వర్ సమస్యతో యాప్‌లు మొరాయిస్తుండటంతో లబ్ధిదారులు కేంద్రాల వద్ద గంటలతరబడి వేచి ఉండాల్సి వస్తోంది. కొంతమంది నెలలో ఐదారుసార్లు కేంద్రాలకు రావాల్సి వస్తోంది. ఇప్పటికే ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌తో లబ్ధిదారుల వివరాలు నమోదుకు సాంకేతిక సమస్య ఏర్పడుతోందని అంటున్న సి బ్బందికి తాజాగా కేంద్రం రూపొందించిన పోషణ ట్రాకర్ యాప్‌లో లబ్ధిదారుల ముఖ గుర్తింపు తప్పనిసరి చేయడం మరింత సమస్యగా మారింది. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణులు, బా లింతలు, మూడేళ్ల చిన్నారులకు ప్రతినెలా పోషకాహారాన్ని వారి ఇంటికే అందిస్తున్నారు. గతంలో కేంద్రం వద్ద వండి ఇచ్చేవారు. ఎక్కువ మంది నుంచి టీహెచ్ఆర్ (టేక్ హోమ్ రేషన్ ) కావా లంటూ అభ్యర్థనలు రావడంతో పాలు, గుడ్లు, నూనె, పప్పు, బియ్యం వంటివి ప్రతినెలా లబ్ధి దారులకు ఇస్తున్నారు. టీహెచ్ఆర్ పంపిణీలో అవకతవకలు జరగకుండా ఎఫ్ఆర్ఎస్ (ముఖ చిత్ర యాప్)ను ప్రభుత్వం ప్రవేశ పెట్టింది. అ యితే ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపోర్టు చేయడం లేదని అంగన్వాడీ టీచర్లు పేర్కొంటున్నారు. టీ హెచ్ఆర్ కోసం 7 నెలల నుంచి 3 ఏళ్ల వయస్సు పిల్లలు కేంద్రాలకు రారు. వారి తల్లిదండ్రులు, ఇంట్లో పెద్దలు వస్తుంటారు. ముఖచిత్రం ద్వారా టీహెచ్ఆర్ పంపిణీకి చాలా సమయం పడుతోంది. యాప్ నమోదు చేయడంలో ఇబ్బందుల కారణంగా ఎక్కువ సమయం వీటికోసమే కేటాయిస్తుండటంతో పూర్వ ప్రాథమిక విద్య పూర్తిగా దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని లబ్ధిదారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు నిర్ణీత సమయంలో యాప్‌లలో నమో దు చేయాలంటూ యంత్రాంగం ఒత్తిడి తెస్తోంది. అంగన్వాడీ టీచర్లు విధిగా రెండు యాప్‌లు నిర్వహించాలి. కేంద్రానికి చెందిన పోషణ ట్రాకర్‌లో చిన్నారులు, గర్భిణులు, బాలింతల పోషణ వివరాలు నమోదు చేయాలి. ఎన్‌హెచ్‌టీఎస్ యాప్‌లో రాష్ట్ర ప్రభుత్వం అందించే పోషణ వివరాలను నమోదు చేయాలి. ప్రీస్కూల్ నిర్వహించి ఆ ఫొటోలు అప్లోడ్ చేయాలి. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే చిన్నారులు, గర్భిణులు, బాలింతల ఫేషియల్ రికగ్నేషన్ హాజర్ నమోదు చేయాలి. వీటితోపాటు టీకా రిజిష్టర్, విటమిన్ – ఏ రికార్డు, రిఫరల్ సర్వీసెస్ గృహ సందర్శకుల రికార్డు చేయాలి. రికార్డుల పనిభారం తగ్గించి కొత్త పోన్లు సరఫరా చేయాలని అంగన్వాడి టీచర్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. త్వరలో కొత్త ఫోన్లు పోషణ ట్రాకర్ యాప్‌లో లబ్ధిదారుల ఫేస్ రికగ్నైజేషన్ చేయడంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యతో అంగన్వాడీ టీచర్లు అవస్థలు పడుతున్న మాట వాస్తవమే. ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు సపో ర్టు చేయడం లేదని పిర్యాదులు వస్తున్నాయి. ఈ విషయమై ప్రభుత్వానికి నివేదించాం. త్వరలో కొత్త ఫోన్లు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. నరేశ్ డీడబ్ల్యూవో జిల్లా స్వరూపం ప్రాజెక్టులు 4 గర్భిణులు 7,267 బాలింతలు 4,553 0–6నెలల్లోపు పిల్లలు 4,518 07–నుంచి 3ఏళ్లలోపు పిల్లలు 32,437 3 నుంచి 6 ఏళ్లలోపు పిల్లలు 33,012 కిశోర బాలికలు 17,792 -
స్లాటర్‌హౌస్‌ను తరలించాలి
పింఛన్ ఇప్పించాలి నాకు పింఛన్ ఇప్పించండి. ఎలాంటి ఆధారం లేదు. పింఛన్ రాకపోవడంతో ఇబ్బందికరంగా మారింది. అధికారులు స్పందించాలి. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా.. పింఛన్ మాత్రం రావడం లేదు. ఈసారైనా ఇప్పించాలి. నాకు కార్యాలయానికి రావడానికీ ఇబ్బందిగా ఉంది. బంధువుల సహాయంతో వస్తున్నాను. – చెట్పల్లి గంగరాజు, చింతలూరు, రాయికల్జగిత్యాల పట్టణంలోని 13వ వార్డులోని మహబూబ్పురలో స్లాటర్‌హౌస్ ఉంది. ఇది పరిశుభ్రంగా లేనందున పశువులను కోసిన మురికినీటితోదుర్వాసన వస్తోంది. మున్సిపల్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. స్లాటర్‌హౌస్‌ను శుభ్రం చేయడం లేదు. దీనిని వేరే వద్దకు మార్చేలా చర్యలు తీసుకోవాలి. చిన్నపిల్లలు ఇబ్బందులకు గురవుతున్నారు. – రహమానియా వెల్ఫేర్ సొసైటీ నాయకులు -
పింఛన్ పెంచాలని ఆందోళన
జగిత్యాల: ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం వికలాంగులకు రూ.6 వేలు, చేయూత పింఛన్ రూ.4 వేలు చెల్లించాలని ఎమ్మార్పీఎస్, వీహెచ్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకొస్తే దివ్యాంగులకు రూ.4 వేల నుంచి రూ.6 వేలు, చేయూత కింద రూ.2 వేల నుంచి రూ.4 వేలు ఇస్తామని ప్రకటించిందని, అధికారంలోకొచ్చి 21 నెలలు పూర్తవుతు న్నా అమలు చేయడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పింఛన్ పెంచాలని డిమాండ్ చేశా రు. అనంతరం కలెక్టర్ సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చెట్పల్లి ల క్ష్మణ్, బెజ్జంకి సతీశ్, బోనగిరి కిషన్, శనిగర పు కాంతక్క, దివాకర్, సునీల్, చంద్రశేఖర్, ఓంప్రకాశ్, ప్రవీణ్, సాయిప్రసాద్, సతీశ్, దయా ల హన్మంతు, సాయిలు, లక్ష్మణ్ పాల్గొన్నారు.దుబ్బ రాజన్న సన్నిధిలో కలెక్టర్ దంపతులుసారంగాపూర్: మండలంలోని దుబ్బరాజేశ్వరస్వామిని సోమవారం కలెక్టర్ సత్యప్రసాద్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి పూజలు, అభిషేకాలు చేయించారు. ఆలయ ఈవో అనూష, అర్చకులు స్వామివారి ప్రసాదాలు అందించారు.బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నాంజగిత్యాలక్రైం: బాధితుల సమస్యలు పరిష్కరిస్తున్నామని ఎస్పీ అశోక్‌కుమార్ అన్నారు. ఎస్పీ కార్యాలయంలో ప్రజల సౌకర్యార్థం గ్రీవెన్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 13మంది అర్జీలు సమర్పించారు. వారితో ఎస్పీ మాట్లాడారు. వెంటనే చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదగా మాట్లాడి వినతులు స్వీకరించాలని, వేగంగా స్పందించి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు.స్థానిక ఎన్నికల్లో గెలవాల్సిందే..జగిత్యాల: స్థానిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మహిళా కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకట సుబ్బమ్మ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఇందిరాభవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయలక్ష్మి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ప్రభుత్వ పథకాలను ఇంటింటికీ వివరించాలన్నారు. విజయలక్ష్మి మాట్లాడుతూ.. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం మహిళలకు వరమన్నారు. మాజీ కౌన్సిలర్లు జయశ్రీ, పద్మ, పిప్పరి అనిత, సరిత, చిట్ల లత, రూప, మంజూల, రేణుక పాల్గొన్నారు.‘కాళేశ్వరం’ను తుమ్మడిహెట్టి వద్ద నిర్మించాల్సిందిజగిత్యాల: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను తుమ్మడిహెట్టి వద్ద నిర్మించే వీలున్నా గత బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని, మేడిగడ్డ వద్ద నిర్మించడంతో సాంకేతికలోపం ఏర్పడిందని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. సోమవారం ఇందిరాభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రూ.10వేల కోట్లతో తుమ్మడిహెట్టి వద్ద నీటిని ఎల్లంపల్లికి తీసుకురావచ్చన్నారు. జిల్లా కేంద్రంలోని ఓల్డ్ బస్టాండ్ పోలీస్క్వార్టర్స్లో పెట్రోల్‌బంక్ ఏర్పాటు చేసేలా చూడాలన్నా రు. వచ్చే ఆదాయాన్ని పోలీసు శాఖ వాడుకునే వీలుంటుందన్నారు. అనంతరం ఎస్పీ అశోక్‌కుమార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆయన వెంట నాయకులు కొత్తమోహన్, బండ శంకర్, నందయ్య, విజయలక్ష్మీ, మాజీ కౌన్సిలర్లు పిప్పరి అనిత, జయశ్రీ పాల్గొన్నారు. -
ఉపాధ్యాయులు సాంకేతికతతో బోధించాలి
జగిత్యాల: ఉపాధ్యాయులు బోధనలో సాంకేతికత జోడించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై న 60మందికి పురస్కారాలు అందించారు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. ఉపాధ్యాయులు ఉన్నత స్థానాలకు చేర్చుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 11 వేల టీచర్ పోస్టులు భర్తీ చేశామని, పదోన్నతి కల్పించామని తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో రూ.200 కోట్లతో 25ఎకరాల విస్తీర్ణంలో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ కాంప్లెక్స్ నిర్మిస్తామన్నారు. జిల్లాకు ఏటీసీ మంజూరు చేశామన్నారు. పట్టభద్రులు ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి మాట్లాడుతూ.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పురస్కారాలు అందించడం గర్వంగా ఉందన్నారు. తండ్రి ఆస్తి అందిస్తే గురువు జ్ఞానాన్ని అందిస్తారని తెలిపారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ.. సర్వేపల్లి రాధాకృష్ణన్‌ను స్ఫూర్తిగా తీసుకుని ఉపాధ్యాయులు రాష్ట్ర, జాతీయస్థాయి అవార్డులు పొందాలన్నారు. అదనపు కలెక్టర్ లత, డీఈవో రాము, అధికారులు పాల్గొన్నారు. కోటిలింగాల అభివృద్ధికి సహకరించండి వెల్గటూర్: కోటిలింగాల ఆలయ అభివృద్ధికి సహకరించాలని మంత్రి లక్ష్మణ్‌కుమార్‌కు ఆలయ కమిటీ సభ్యులు వినతిపత్రం సమర్పించారు. గోదావరి పుష్కరాల సందర్భంగా ఆలయానికి నిధులు కేటాయించాలని ఆలయ చైర్మన్ పూదరి రమేశ్, ఈవో కాంతారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శైలేందర్‌రెడ్డి తదితరులు కోరారు. బుగ్గారం అభివృద్ధికి కృషి బుగ్గారం: నూతనంగా ఏర్పడిన బుగ్గారం మండలాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి అన్నారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు రానీయబోనని, ధాన్యం కొనుగోలు కోసం త్వరలోనే ప్రత్యేక స్థలం కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ తెల్ల రేషన్‌కార్డులు ఇచ్చామన్నారు. అనంతరం కొందరు కాంగ్రెస్‌లో చేరగా.. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. పార్టీ మండల అధ్యక్షుడు వేముల సుభాష్, మాజీ జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, నాయకులు పాల్గొన్నారు. ఉపాధ్యాయుల సమస్యలపై వినతి ధర్మపురి: ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో మంత్రికి విన్నవించారు. 1992 తదుపరి అప్‌గ్రేడ్ అయిన పాఠశాలలకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు మంజూరు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి అత్రం భుజంగరావు, భోగ రమేశ్, జిల్లా అధ్యక్షులు రామ్‌చంద్రం, ప్రధానకార్యదర్శి గోవర్ధన్ తదితరులున్నారు. -
అర్హులకు డబుల్ ఇళ్లు ఇవ్వండి
జగిత్యాలటౌన్: అర్హులందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు కేటాయించాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను కోరారు. ఇందిరాభవన్‌కు వచ్చిన మంత్రికి వినతిపత్రం సమర్పించారు. నూకపల్లిలో ఎవరికీ కేటాయించకుండా మిగిలిపోయిన డబుల్ఇళ్లతోపాటు ఖాళీగా ఉన్న వెయ్యికి పైగా ఇళ్లను అందించాలని కోరారు. ఈ విషయమై ఆగస్టు 4న ప్రజావాణిలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. నాయకులు బండ శంకర్, గాజుల రాజేందర్, కల్లెపెల్లి దుర్గయ్య, లైశెట్టి విజయ్ తదితరులు ఉన్నారు. రాయితీలు ఇస్తేనే మార్పు సారంగాపూర్: సేంద్రియ వ్యవసాయం సాగును పెంచడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు భారీ రాయితీ ఇవ్వాలని జీవన్‌రెడ్డి తెలిపారు. సారంగాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. వారం రోజుల్లో సరిపడా యూరియా నిల్వలు చేరుకుంటాయన్నారు. నానో యూరియాతో వరికి తక్కువ పోషకాలు అందుతాయన్న ఆలోచనలో రైతులు ఉన్నారని, దీనికి తాను కూడా రైతులతో ఏకీభవిస్తున్నట్లు తెలిపారు. రైతులను సేంద్రియ వ్యవసాయం వైపు దృష్టి సారించడానికి రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రాంచంద్రారెడ్డి, గంగారాం, లక్ష్మారెడ్డి, హరీశ్, శేఖర్, పుష్పనాథ్ రైతులు ఉన్నారు. -
జ్వరాలతో విలవిల
జగిత్యాల: విషజ్వరాలు జిల్లాను వణికిస్తున్నాయి. జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వాతావరణంలో మార్పులతో అనారోగ్యం పాలవుతున్నారు. ఇలా ఇంటింటికీ ఒకరు లేదా ఇద్దరు జ్వరపీడితులు ఉంటున్నారు. వైద్యశాఖ నిత్యం ఇంటింటికీ వెళ్లి సర్వే చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా వైరల్‌ఫీవర్, టైపాయిడ్, మలేరియా, డెంగీతో పలువురు బాధపడుతున్నట్లు వెలుగుచూస్తోంది. ఇటీవల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. రెండు మూడు రోజులుగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఇలా వాతావరణంలో విపరీతమైన మా ర్పులు చోటుచేసుకోవడంతో చాలామంది అనా రోగ్యాల బారిన పడుతున్నారు. వైద్యాధికారులు ఇంటింటికీ తిరుగుతూ ర్యాపిడ్ ఫీవర్ సర్వే చేపడుతున్నారు. జూలై నుంచి ఇప్పటి వరకు 9 రౌండ్లు ఇంటింటికీ సర్వే చేశారు. ప్రస్తుతం 10వ రౌండ్ సైతం ప్రారంభమైంది. అనుమానంగా ఉన్న జ్వర పీడితులను గుర్తించి చికిత్స అందిస్తున్నా.. పట్టణం, పల్లె తేడా లేకుండా జ్వరాలు విజృంభిస్తున్నాయి. ఆస్పత్రులకు భారీగా పెరిగిన ఓపీ జిల్లాలో 17 పీహెచ్‌సీలు, ఐదు కమ్యునిటీ హెల్త్సెంటర్లు, ఐదు బస్తీ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితోపాటు జిల్లాకేంద్రంలో ప్రధాన ఆస్పత్రికి రోగులు క్యూ కడుతున్నారు. పీహెచ్‌సీల్లోనూ ఓపీ వందకు తగ్గడం లేదంటే పరిస్థితి ఎలా ఉందోఅర్థం చేసుకోవచ్చు. సీజనల్ వ్యాధుల బారిన పడుతున్న జనం రోగ నిర్ధారణ పరీక్షల కోసం పడిగాపులు కాస్తున్నారు. వైద్యాధికారులు సర్వే చేపట్టి అనుమానితులను ఆస్పత్రికి పంపిస్తున్నారు. ఇప్పటి వరకు 2,50,648 ఇళ్లలో పరిశీలించారు. మొత్తం 5,900 లార్వాలను గుర్తించి అభివృద్ధి చెందకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న 2,429 టైర్లను తొలగించారు. 44,706 కూలర్లు, 65,717 డ్రమ్ములు, 67,566 సిమెంట్ గాజులు, 42,814 కుండలు, ప్లాస్టిక్ తొలగించారు. లార్వాలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నా.. రోగాలు తగ్గడం లేదు. ఇంటింటికీ ఒకరిద్దరు జ్వర పీడితులున్నారు. ప్రజారోగ్యానికి ప్రధాన శత్రువు దోమ ప్రజారోగ్యానికి దోమలే ప్రధాన శత్రువుగా మా రాయి. ఇవి వృద్ధి చెందకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. డెంగీ ఎడిస్ దోమ కుట్టడం వల్ల వస్తుంది. ఇది ముఖ్యంగా డ్రమ్ములు, నీటి తొట్టెలు, వాడిన టైర్లలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. మలేరియా జ్వరం ఆడ అనాఫిలస్ దోమకాటుతో వస్తుంది. ఇవి ఎక్కువగా మంచినీటిలోనే పెరుగుతాయి. మెదడు వాపు క్యూలెక్స్ దోమ వల్ల వస్తుంది. ఎక్కువగా పంట పొలాల్లో పెరుగుతాయి. వ్యక్తిగత పరిశుభ్రతతోనే.. ప్రతిఒక్కరు ఇంటి ఆవరణ, పరిసరాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవడంతోపాటు, ప్రతి రోజు డ్రైడే పాటించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు. నిల్వ ఉన్న నీటిలో కిరోసిన్ గానీ, వాడిన ఆయిల్ చల్లితే దోమలు వృద్ధి చెందే అవకాశం ఉండదు. ఇంట్లో తప్పనిసరిగా దోమ తెరలు వాడాలి. దోమల నివారణకు 2.5 ఎంఎల్ టెమిపాస్ మందును 10 లీటర్ల నీటిలో కలిపి వర్షపునీటి కుంటల్లో చల్లాలి. కొన్ని వ్యక్తిగత చర్యలు పాటిస్తే దోమలు దరిచేరకుండా ఉండటంతో పాటు జ్వరాలు అరికట్టవచ్చు. ప్రతిరోజు గ్రామాలు, ము న్సిపాలిటిల్లో తిరుగుతూ దోమలు వృద్ధి చెందకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఖాళీ డ్రమ్ములు, పాత టైర్లు, కొబ్బరిబొండాలలో నిల్వ ఉన్న నీటిని గుర్తిస్తూ ఆశావర్కర్లు, ఏఎన్ఎంల సమన్వయంతో వాటిని తొలగిస్తున్నాం. – శ్రీనివాస్, డిప్యూటీ డీఎంహెచ్‌వో జిల్లాలో ఇంటింటి సర్వే చేపడుతున్నాం. ఇప్పటివరకు 9 రౌండ్లలో 2,50,648 ఇళ్లను సర్వే చేపట్టాం. అనుమానితులను గుర్తించి ఆస్పత్రికి తరలిస్తున్నాం. పరిసరాల పరిశుభ్రతతోనే జ్వరాలకు దూరంగా ఉండే అవకాశం ఉంది. దోమలను నివారించాలి. – ప్రమోద్‌కుమార్, డీఎంహెచ్‌వో -
హైకోర్టుకు మెటా నిందితులు
సాక్షిప్రతినిధి,కరీంనగర్: మెటా ఫండ్ క్రిప్టో కరెన్సీ పేరిట ఉమ్మడి జిల్లాలో రూ.కోట్లు వసూలు చేసిన నిందితుల విషయంలో కరీంనగర్ పోలీసులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. అధిక లాభాలు ఆశ చూపించి రూ. లక్షలు పెట్టుబడుల కింద తీసుకుని, బోర్డు తిప్పేసి న కంపెనీ విషయంలో పోలీసులు మెతక వైఖరి అవలంబిస్తున్నారని బాధితులు మండిపడుతున్నా రు. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు ముందస్తు బెయిల్‌కు హైకోర్టును ఆశ్రయించడమే ఇందుకు ఉదాహరణ అని ఆరోపిస్తున్నారు. అధిక లాభాల పేరిట పలువురు ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారుల నుంచి ఒక్క కరీంనగర్ జిల్లాలోనే రూ. 30 కోట్లు, సిరిసిల్ల, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాలు రాష్ట్రవ్యాప్తంగా రూ.100 కోట్ల వరకు వసూలు చేసి న మెటా ఫండ్ ప్రతినిధుల్లో ఒక్కరినీ అరెస్టు చేయకపోవడం, నిందితులు యధేచ్ఛగా తిరుగుతుండటంపై బాధితులు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తున్నారు. రెండుసార్లు పిటిషన్, ఒకకేసు మెటా కుంభకోణం కొత్తదేం కాదు. మే, జూన్‌లో క రీంనగర్ కమిషనరేట్ పరిధిలోని రూరల్, టూ టౌన్, కొత్తపల్లి పీఎస్ పరిధిల్లో పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. ఆయా ఠాణా ల్లో ఎస్‌హెచ్‌వోలు ఈ కేసు గ్రావిటీ తెలిసినప్పటికీ నిందితులతో చేతులు కలిపారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూ.కోట్లు మోసం చేసిన వారికి అనుకూలంగా వ్యవహరించి, పిటిషన్ వెనక్కు తీసుకునేలా చేయడంలో పోలీసులు సఫలీకృతమయ్యారని అంటున్నారు. జూలైలో ఇదే మెటా ఫండ్ కేసులో దాస రి రమేశ్, దాసరి రాజుపై పిటిషన్లు ఇచ్చినా.. ఈ రూ.కోట్ల కుంభకోణం గురించి వార్తాపత్రికల్లో కథనాలు వస్తున్నా.. నిందితులపై కేసుగా నమోదు చేయడంలో పోలీసులు తాత్సారం ప్రదర్శించారు. పిటిషనర్లు కూడా కేసు పెట్టేందుకు వెనకాడారు. తిరిగి అదే వ్యక్తులపై మూడోసారి పిటిషన్ రావడం, ఈసారి పిటిషనర్ బలంగా నిలబడటంతో విధిలే క కేసు నమోదు చేసి, దర్యాప్తుకు మీన మేషాలు లెక్కించారు. బాధితులు ఉన్నతాధికారులను కలి సేందుకు సిద్ధపడ్డారు. కేసు దర్యాప్తులో జాప్యాన్ని నివారించేందుకు కేసును సీసీఎస్‌కు అప్పగించారు. ఈ విషయం లీకవడంతో నిందితులు విజయవా డకు పరారై అక్కడ నుంచి ముందస్తు బెయిల్‌కోసం హైకోర్టును ఆశ్రయించారు. దీనికి కరీంనగర్ పోలీసులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ కేసులో హైదరాబాద్‌కు చెందిన లోకేశ్, కరీంనగర్‌కు చెందిన దాసరి రమేశ్, రాజు, ప్రకాశ్, సతీశ్ మాస్టర్‌మైండ్స్‌గా ఉన్నారు. వీరు కులాన్ని, లాభా లను ఎరగా వేసి రోజుకు రూ.6లక్షల చొప్పున ఆదాయాన్ని పొందవచ్చని పెట్టుబడులు పెట్టించారు. వసూలు చేసిన మొత్తంతో ఇప్పటికే లోకేశ్ థాయ్‌లాండ్‌కు, రమేశ్, రాజు విజయవాడకు పారిపోయారు. ఇక మిగిలింది సతీశ్, ప్రకాశ్‌లే. వీరిలో సతీశ్ దర్జాగా అధికార కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటుండటం విశేషం. పెట్టుబడి పెట్టిన వారిలో అధికశాతం రెవెన్యూ, పోలీసు, ప్రభుత్వ టీచర్లు, రియల్టర్లు ఉన్నారు. ఇదే నింది తులకు అనుకూలంగా మారుతోంది. ఈ ప్రభుత్వ ఉద్యోగులను మెటా ప్రతినిధులు ప్రభుత్వ అనుమతి లేకుండా సింగపూర్, బ్యాంకాక్, మలేషియా దేశాలకు మసాజ్‌ల కోసం విహారయాత్రలకు తీసుకువెళ్లారు. ఇప్పుడు కేసులు పెడితే.. ఎక్కడ తమ ఉద్యోగాలు పోతాయో.. అ న్న భయంతో కేసులకు వెనకాడుతున్నారు. అందులోనూ వీరి పెట్టుబడి పెట్టిన డబ్బంతా అక్రమార్జన, నల్లడబ్బు కావడంతో తేలుకుట్టిన దొంగల్లా.. తెరవెనక నుంచి సెటిల్మెంట్ కోసం యత్నిస్తున్నారు. ఐదుగురిలో ముగ్గురు పరారీ.. -
ఎస్సారెస్పీ గేట్ల మూసివేత
జగిత్యాలఅగ్రికల్చర్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు తగ్గుముఖం పట్టడంతో గేట్లను ఆదివారం మూసివేశారు. ప్రాజెక్టులోకి 40,452 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 26,123 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరదకాలువకు 18వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 5,333, ఏస్కేప్ గేట్ల ద్వారా 1,875, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున వదులుతున్నారు. మూసివేసిన ఎస్సారెస్పీ గేట్లు -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం అంతర్గాంలో ఐఎంఏ జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవోగావోచలో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. దోమల ద్వారా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని, ఇందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమలు తయారవుతాయన్నారు. ఇంటి పరిసరాలను ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. మురికి ప్రాంతాల్లో ఆడ ఏడిస్ దోమ కుడితే డెంగీ ప్రబలే అవకాశం ఉందన్నారు. ఐఎంఏ జిల్లా కార్యదర్శి ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. విషజ్వరాలు రాకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఐఎంఏ కోశాధికారి కోటగిరి సుధీర్‌కుమార్, ప్రవీణ్‌కుమార్, సౌజన్య, మెడికల్ సూపర్వైజర్ శోభారాణి, నవ్య, హెచ్ఈఓ శ్రీధర్, నాయకులు రవీందర్ రెడ్డి, ప్రధానోపాధ్యాయుడు మహిపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
వ్యాధి నిర్ధారణ పరీక్షలు తప్పనిసరి
కొడిమ్యాల: మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ శనివారం సందర్శించారు. ల్యాబ్‌లో వైద్య పరీక్షల వివరాలు, స్టాఫ్ హాజరు రిజిస్టర్లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా..? లేదా..? అని అడిగి తెలుసుకున్నారు. రోగులకు అవసరమైన మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ఎంతమంది రోగులు వస్తున్నారు..? ఎంతమంది అడ్మిట్ అవుతున్నారని ఆరా తీశారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, వ్యాధి లక్షణాలు ఉన్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు చేయించాలని సూచించారు. వ్యాధిని ముందుగా గుర్తిస్తే మెరుగైన వైద్య చికిత్స అందించే అవకాశం ఉంటుందని వివరించారు. వైద్య సిబ్బంది విధులకు సకాలంలో హాజరుకావాలన్నారు. జగిత్యాల ఆర్డీవో మధుసూదన్, ఏపీఆర్ఓ లక్ష్మణరావు, వైద్య పోగ్రాం ఆఫీసర్ శ్రీనివాస్, ఎంపీడీవో స్వరూప సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. కుట్టుమిషన్ల ద్వారా జీవనోపాధిధర్మపురి: కుట్టుమిషన్ల ద్వారా మహిళలో ఆత్మస్థైర్యం, జీవనోపాధి పెరుగుతుందని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ కిశోర్, ఏఎంసీ చైర్పర్సన్ చిలుములు లావణ్య అన్నారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఆదేశాల మేరకు మండలంలోని రాజారంలో కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. శిక్షణ పొందిన 32 మందికి ఉచితంగా మిషన్లు అందించామన్నారు. తహసీల్దార్ శ్రీనివాస్, పీఎసీఎస్ చైర్మన్ నరేశ్, దేవస్థానం చైర్మన్ జక్కు రవీందర్, కాంగ్రెస్ నాయకులు ఎస్.దినేష్, సుముక్ తదితరులున్నారు. కాకతీయ కాలువకు నీటి విడుదల పెంపుజగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు సాగు నీరు అందించే కాకతీయ కాలువకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుంచి నీటి సామర్థ్యం పెంచారు. మొన్నటి వరకు 3500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేయగా.. శనివారం 5,500 క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 40 వేల క్యూసెక్కుల నీరు వస్తోంది. ప్రాజెక్టు నుంచి 24,397 క్యూసెక్కులను కిందకు విడుదల చేస్తున్నారు. వరదకాలువకు 18 వేల క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. ముగిసిన భాగవత సప్తాహంధర్మపురి: ధర్మపురిలోని శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలో భాగవతా సప్తాహం శనివారం ముగిసింది. శ్రీశారద మహిళా మండలి ఆధ్వర్యంలో కరీంనగర్‌కు చెందిన పురాణం మహేశ్వర్‌శర్మ ఈనెల ఒకటిన భాగవత సప్తాహం ప్రారంభించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ హాజరై ప్రవచకులను స్వామివారి శేషవస్త్రంతో సన్మానించారు. ఆలయ ఈవో శ్రీనివాస్, ట్రస్ట్‌బోర్డు చైర్మన్ జక్కు రవీందర్, ధర్మకర్తలు, మహిళా మండలి సభ్యులు, భక్తులు తదితరులున్నారు. యూరియా కొరతకు కేంద్రమే కారణం సారంగాపూర్: రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్ర ప్రభుత్వమే కారణమని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. శనివారం సారంగాపూర్‌కు చెందిన రైతులు జీవన్‌రెడ్డిని జిల్లాకేంద్రంలో కలిసి యూరియా సమస్యను వివరించారు. వరికి చివరి మోతాదు అందించాల్సి ఉన్న క్రమంలో కొరత వేధిస్తోందన్నారు. స్పందించిన ఆయన మాట్లాడుతూ.. యూరియా అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, రెండు, మూడురోజుల్లో సరిపడా నిల్వలు అందుతాయని తెలిపారు. రాష్ట్రానికి రెండు లక్షల టన్నుల యూరియా అవసరం ఉందన్నారు. -
వెళ్లి రావయ్యా.. బొజ్జ గణపయ్యా
కోరుట్లలో గణపతి పల్లకీమోస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్గొల్లపల్లి: వినాయక మండపం వద్ద మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జగిత్యాలటౌన్/రాయికల్/కోరుట్ల/కోరుట్లరూరల్/ధర్మపురి/గొల్లపల్లి: తొమ్మిది రోజుల పాటు భక్తుల పూజలందుకున్న గణనాథుడు శనివారం గంగమ్మ ఒడికి చేరాడు. జగిత్యాల, కోరుట్లలో యువకులు, మహిళలు శోభాయాత్రలో ఉత్సాహంగా పాల్గొన్నారు. సందేశాత్మక, ఉత్తమ డెకరేషన్ చేసిన శకటాలకు బహుమతులు ప్రదానం చేశారు. బ్రాహ్మణ సంఘం నెలకొల్పిన గణనాథుని పల్లకీని కార్గిల్ చౌక్ వద్ద ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, తహసీల్దార్ కృష్ణ చైతన్య మోశారు. పెద్దవాగులో విగ్రహాలను నిమజ్జనం చేశారు. మెట్పల్లి డీఎస్పీ రాములు, సీఐ సురేష్ బాబు, ఎస్సైలు చిరంజీవి, రాంచంద్రం, ఎస్సైలు, అదనపు ఎస్సైలు, పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. మెట్పల్లి పట్టణంలో మధ్యాహ్నం నుంచే వట్టివాగులో నిమజ్జనం మొదలైంది. సీఐ అనిల్‌కుమార్, ఎస్సై కిరణ్‌కుమార్, కమిషనర్ మోహన్ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ధర్మపురిలో మంత్రి అడ్లూరి గణనాథులకు పూజలు చేశారు. గోదావరిలో నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. ఆంగ్లోవేదిక్ పాఠశాల విద్యార్థి సింహరాజు మణిద్వీప్ తమకు ఇల్లు లేదని, ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని మంత్రి కోరగా హామీ ఇచ్చారు. అనంతరం గొల్లపల్లి మండలం శ్రీరాములపల్లిలో మహంకాళిసేన ప్రతిష్ఠించిన గణనాథున్ని మంత్రి దర్శించుకున్నారు. -
‘ఉత్తమ’ అవార్డు ఎంపికలో అవకతవకలు?
కథలాపూర్: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో జిల్లా విద్యాశాఖ అధికారులు కొన్ని మండలాలపై వివక్ష చూపించారంటూ ఉపాధ్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయులు మించకుండా అవార్డుకు ఎంపిక చేయాలని ఎంఈవోలకు గతనెల 26న జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి ఆర్సీ నంబర్ 4353/బీ2/2025 ఉత్తర్వులు జారీ అయ్యాయి. జిల్లాలో 20 మండలాలున్నాయి. ఉత్తర్వుల ప్రకారం.. ప్రతి మండలం నుంచి ముగ్గురు ఉపాధ్యాయుల పేర్లను జిల్లాస్థాయి అవార్డుకు పంపించాల్సి ఉంది. అయితే ఈనెల 5న ప్రకటించిన ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల జాబితాలో కొన్ని మండలాల నుంచి నలుగురి పేర్లు, కొన్ని మండలాల నుంచి ఇద్దరి పేర్లు ఉండటంతో ఉపాధ్యాయవర్గాల్లో సందేహాలు నెలకొన్నాయి. జాబితా తయారీలో ఫైరవీలు చోటుచేసుకున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. ఎంఈవోలు పంపిన జాబితాలో ముగ్గురు జిల్లాలో 20 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన విద్యాశాఖ ఉత్తర్వుల ప్రకారం.. జిల్లా నుంచి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు 60 మందినే ఎంపిక చేయాల్సి ఉంటుంది. కానీ.. జాబితాలో మాత్రం 61 మంది ఉపాధ్యాయుల పేర్లు ఉన్నాయి. ప్రతి మండలం నుంచి ముగ్గురిని మాత్రమే ఎంపిక చేసిన ఎంఈవోలు జాబితాను డీఈవోకు పంపించారు. అయితే కొన్ని మండలాల నుంచి నలుగురి జాబితాలో ఉండటం ఆరోపణలకు తావిస్తోంది. ఎంఈవోలు మూడు పేర్లు పంపిస్తే నలుగురి పేర్లు ఎలా వచ్చాయనేది తేలడం లేదు. ఒక ఓ మండలంలోనైతే ఐదుగురి పేర్లు ఉండటం విశేషం. వెల్గటూర్ మండలం నుంచి ఒకేఒక్క ఉపాధ్యాయుడి పేరు ఉంది. అ వార్డు ఎంపికలో ఉపాధ్యాయుల పనితీరు, బోధనలో ప్రత్యేకతను చాటుతున్నవారిని జిల్లా యూ నిట్‌గా పరిగణనలోకి తీసుకుంటే బాగుండేదని విద్యాభిమానులు అభిప్రాయపడుతున్నారు. ముగ్గురి కన్నా తక్కువ ఎంపికై న మండలాలు ఇవే జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై నవారిలో ముగ్గురికన్నా తక్కువగా ఉన్న మండలాలు ఇలా ఉన్నాయి. వెల్గటూర్‌లో ఒక్కరు, కథలాపూర్‌లో ఇద్దరు, ఎండపల్లిలో ఇద్దరు, పెగడపల్లిలో ఇద్దరు, మెట్పల్లిలో ఇద్దరు ఉన్నారు. పారదర్శకంగా ఎంపిక ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల ఎంపికలో పైరవీలకు ఆస్కారం ఇవ్వలేదు. పారదర్శంగా జాబితా తయారు చేశాం. మండలాల నుంచి వచ్చిన జాబితాను నిశితంగా పరిశీలించి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు జాబితాను రూపొందించాం. – రాము, డీఈవో -
22 తరువాత కొందాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: కారు, బైక్ షోరూంలు కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. జీఎస్టీ శ్లాబులు తగ్గుతాయని కేంద్రం ప్రకటన దరిమిలా.. ఇప్పటికిప్పుడు బండి (కారు లేదా బైక్) కొందామనుకున్న ప్రతీ ఒక్కరూ వాయిదా వేశారు. తగ్గించిన జీఎస్టీ సెప్టెంబరు 22 తరువాత అమలులోకి రానుండటంతో కారు, బైకు ల ధరలు 10శాతం వరకు తగ్గనున్నాయి. మధ్యతరగతికి భారీ ఊరట కానుంది. ప్రతీ బైకుపై కనిష్టంగా రూ.8000 నుంచి గరిష్టంగా రూ.20వేల వరకు ధరలు తగ్గనున్నాయి. కార్లపైనా రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గనున్నాయి. ప్రస్తుతం షోరూముల్లో బుకింగులు నిలిచిపోయాయి. కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి.సెకండ్ హ్యాండ్ మార్కెట్‌కు కుదుపుజీఎస్టీ కొత్త శ్లాబులు అమలు కానుండటంతో షోరూంల్లోనే కాదు, ఇటు సెకండ్ హ్యాండ్ మార్కెట్‌పైనా ప్రభావం పడింది. బైకుల ధరలు పెట్రోల్ వేరియంట్లలో రూ.8000 నుంచి రూ.20,000 వరకు తగ్గింపు వర్తించనుండటం, కార్లలో రూ.60వేల నుంచి రూ.1.50లక్షల వరకు తగ్గింపు వర్తిస్తుండటంతో ఇంతకాలం సెకండ్ హ్యాండ్ కొందామనుకున్న వారంతా కొత్త బండ్ల వైపు చూస్తున్నారు. ఫలితంగా సెకండ్ హ్యాండ్ మార్కెట్ వెలవెలబోతోంది.ఆగస్టు 13 నుంచే కటకటసెప్టెంబరు 3వ తేదీన కొత్త జీఎస్టీ శ్లాబులను కేంద్రం ప్రకటించింది. దాంతో 4వ తేదీ నుంచి షో రూంలు, సెకండ్ హాండ్ మార్కెట్లు బోసిపోతున్నా యి. ఆటోమొబైల్ రంగానికి ఈ కుదుపు ఆగస్టు 13నే తాకింది. ఆ రోజు రాత్రి ప్రతీ వాహనంపై 2శాతం ట్యాక్స్‌ను పెంచుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడంతో మరునాటి నుంచి కొనుగోళ్లపై ప్రభావం కనిపించిందని షోరూం నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 15న కేంద్రం జీఎస్టీ విషయంలో దీపావళికి తీపి కబురు చెబుతానడటంతో ఆటోమొబైల్ రంగం ఆందోళన చెందింది. దీపావళి వరకు కొనుగోళ్లు బోసిపోతాయని కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఈనెల 3న ప్రకటన రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.కొత్త ఆఫర్లు.. డిస్కౌంట్లుప్రస్తుతం షోరూం నిర్వాహకులు బుకింగ్ చేసుకోవచ్చని డెలివరీ సెప్టెంబరు 22 తరువాతే ఇస్తామని స రికొత్త ఆఫర్లు ప్రకటిస్తూ.. కొనుగోళ్లు పెంచేందు కు ప్రయత్నిస్తున్నారు. మరికొందరు తమ పాత వాహనాలను క్లియర్ చేసేందుకు 10శాతం వరకు డి స్కౌంట్ ఇస్తామని కస్టమర్లను ఆకర్షించేందుకు య త్నిస్తున్నారు. అయినా, పెద్దగా కొనుగోళ్లు పుంజుకో వడం లేదని షోరూం నిర్వాహకులు వాపోతున్నారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వాహనాల కొనుగోళ్లు అధికంగానే జరుగుతాయి. మధ్యతరగతి వారు అధికంగా వినియోగించే 350 సీసీలోపు బైకులపై జీఎస్టీని 28శాతం నుంచి 18శాతానికి తగ్గించారు. అంటే దాదాపు 10శాతం వరకు తగ్గింపు ఉంది. ప్రస్తుతం ప్రతీ 100 సీసీ ఆపై సామర్థ్యం ఉన్న బైకులు రూ.లక్షకుపైనే పలుకుతున్నాయి. ఎలక్ట్రిక్ బైకుల ధర రూ.30వేల నుంచి మొదలవుతుంది. వీటికి సైతం 10శాతం జీఎస్టీ తగ్గింపు వర్తిస్తుంది. ప్రతీ నెలా కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల షోరూముల్లో కలిపి దాదాపు 3000కుపైగా బైకులను విక్రయిస్తారు. ఈ లెక్కన ఎలక్ట్రిక్ బైకులపై రూ.3000, పెట్రోల్ బైకులపై రూ.8000 వరకు కనిష్టంగా ధరలు తగ్గనున్నాయి. ఉమ్మడి జిల్లాలో మొత్తంగా నెలకు రూ.2.40కోట్ల వరకు వినియోగదారులకు లబ్ధి చేకూరతుందని అంచనా వేస్తున్నారు. ఇక పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ కార్లు నెలకు 500 నుంచి 550 వరకు కార్లు అమ్ముడుపోతాయి. 1200 సీసీ లోపు సామర్థ్యం ఉన్న కార్లపై జీఎస్టీని 18శాతానికి తగ్గించారు. ప్రతీ నెలా రూ.2.6 కోట్ల చొప్పున ఏటా రూ.31.2 కోట్ల వరకు వినియోగదారులకు కలిసి రానుంది. బైక్, కార్ల కొనుగోళ్లలో ఉమ్మడిజిల్లా కస్టమర్లకు దాదాపుగా రూ.60 కోట్ల వరకు కలిసి రానుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. -
ముచ్చటగా మూడు లక్షల మంది!
కోరుట్ల: జిల్లా జనాభా దాదాపు 9 లక్షలు.. వీరిలో మూడో వంతు అంటే సుమారు 3 లక్షల మంది వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన అన్నదానంలో పాలపంచుకోవడం విశేషం. పదిరోజుల పాటు గణేశ్ ఉత్సవాలు ఉత్సాహంగా సాగిన నేపథ్యంలో రోజూ వినాయక మండపాల నిర్వాహకులు ఎక్కడికక్కడే అన్నదానాలతో అలరించారు. మూడువేల మండపాలు జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి పట్టణాలతో పాటు మండలాల్లో సుమారు 3 వేల వినాయక మండపాలు అధికారిక లెక్కల ప్రకారం ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఇవి కాకుండా మరో 500 మండపాలు ఉంటాయని అంచనా. వీధివీధికి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు ముందున్నాయని కాస్త మెలకువతో వ్యవహరించిన రాజకీయ నాయకులు యువతను చేరదీసి కొత్తగా మండపాలు ఏర్పాటు చేయించి గ్రామాల్లో తమ ఉనికి చాటుకునేందుకు యధాశక్తి ప్రయత్నించారు. ఈ క్రమంలో నిర్వాహకులు ఎక్కడా తగ్గలేదు. ఓ వీధిలో ఓ యువత అన్నదానం నిర్వహిస్తుందంటే దానికి దీటుగా మరో మండపాల నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఈ లెక్కన జిల్లాలో సుమారు 2,500 వినాయక మండపాల నిర్వాహకులు ఈ పది రోజుల వ్యవధిలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. ఒక్కో అన్నదాన కార్యక్రమంలో ఎంత తక్కువ అనుకున్నా వెయ్యి నుంచి 1,200 మంది భక్తులు పాలుపంచుకున్నారు. ఈ లెక్కన జిల్లాలో ఈ పది రోజుల వ్యవధిలో సుమారు 3 లక్షల మంది అన్నదానంలో పాల్గొన్నారంటే అతిశయోక్తి కాదు. చిన్న చిన్న గ్రామాల్లో కొన్ని సందర్భాల్లో వినాయక మండపం వద్ద అన్నదానం ఉందంటే ఇళ్లలో పొయ్యి వెలగలేదు. నిర్వహణ.. యువతకు శిక్షణ వినాయక మండపాల ఏర్పాటు పది రోజుల పాటు ఉత్సవాల నిర్వహణతో యువతకు పరోక్షంగా కొన్ని నైపుణ్యాల్లో శిక్షణకు ఉపకరించింది. మొదటగా స్వయంగా మండపాల ఏర్పాటు యువకుల్లో సమష్టి కార్యాచరణపై అవగాహన పెంపొందించింది. మండపాల్లో ముగ్గులు, పాటల పోటీలు తదితర సమావేశాల ఏర్పాటు, వాటి పర్యవేక్షణ వంటి అంశాల్లో యువతకు కొంత అవగాహన వచ్చింది. అన్నదాన కార్యక్రమాలతో ఏదైనా కార్యక్రమాన్ని ఎలాంటి అంచనాలతో ప్రారంభించాలి, అకస్మాత్తుగా వచ్చే అవసరాలకు ఎలా సిద్ధంగా ఉండాలన్న అంశాలపై యువతకు అవగతం కావడం గమనార్హం. మండపాల ఏర్పాటు, ఉత్సవాల నిర్వహణ, ఖర్చులు, నిధుల సమీకరణ వంటి అంశాలు యువకుల్లో భవిష్యత్‌లో చేపట్టే పనులకు సంబంధించిన అనుభవం కల్పించింది. కొన్ని చోట్ల మండపాల్లో సామాజిక సందేశాలను ప్రతిబింబించే అంశాలను ఏర్పాటు చేసి వినాయక విగ్రహాలను అదే రీతిలో తీర్చిదిద్దడం యువతలో సామాజిక బాధ్యతను మేల్కోలిపే దిశలో ముందడుగు పడుతుందనడంలో సందేహం లేదు. మొత్తం మీద వినాయక ఉత్సవాలు గ్రామాల్లో ఆధ్యాత్మిక చింతనను పెంపొందిచడంతో పాటు సామాజిక స్పృహ, యువతకు కార్యక్రమాల నిర్వహణపై శిక్షణకు అవకాశం కల్పించింది. -
మరమ్మతు చేసినా మూలకే!
జగిత్యాల: ‘రాజుల సొమ్ము రాళ్లపాలు..’ అన్న చందంగా జగిత్యాల మున్సిపాలిటీ పరిస్థితి తయారైంది. ప్రజల సొమ్మునంతా వాహనాల పాలు చేస్తున్నారు. మరమ్మతుకు వస్తే వాటిని మూలనపడేయడం.. కొన్నింటిని షెడ్లకు తరలించి చేతులు దులుపుకోవడం చేస్తున్నారు తప్ప.. వినియోగంలోకి మాత్రం తేవడం లేదు. చిన్నపాటి మరమ్మతు ఉన్నప్పుడే రిపేర్ చేయిస్తే వాహనాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ, అవి శిథిలావస్థకు చేరిన అనంతరం రూ.లక్షల్లో బిల్లు పెడుతున్నారు బల్దియా అధికారులు. చివరి దశలో వాటికి రిపేరు చేయించడం ద్వారా అవి మళ్లీమళ్లీ చెడిపోతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ప్రధానమైన డోజర్, బ్లేడ్ ట్రాక్టర్, స్వీపింగ్ మిషన్ మరమ్మతుల్లోనే ఉన్నాయి. గతేడాది కూడా వీటి మరమ్మతుకు రూ.10 లక్షలు కేటాయించారు. అవి మరమ్మతు అయ్యాయో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ వాహనాలన్నీ ఇప్పుడు రిపేరులోనే ఉన్నాయి. స్వీపింగ్ మిషన్‌ను రూ.50 లక్షలతో కొనుగోలు చేయగా వృథాగా ఉంది. మరమ్మతుకు వస్తే మూలకు పారిశుధ్య వాహనాలు మరమ్మతుకు గురైతే వెంటనే బాగు చేయిస్తే అందుబాటులోకి వస్తాయి. కానీ అధికారుల నిర్లక్ష్యమో.. పట్టింపులేని ధోరణోగానీ.. రేకుల షెడ్డుకే పంపిస్తున్నారు. మరోవైపు బల్దియాలో పారిశుధ్యం నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. కరీంనగర్‌కు వెళ్లిన వాహనాలు అటే.. ఏడాది క్రితం పారిశుధ్య నిర్వహణ కోసం బీఎస్–6 ఆటోలు కొనుగోలు చేశారు. సుమారు 16 ఆటోలను తీసుకొచ్చారు. ఇందులో కొన్ని మరమ్మతుకు రావడంతో కరీంనగర్‌కు పంపించారు. అవి ఇప్పటి వరకు జగిత్యాలకు తీసుకురాకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనంగా నిలుస్తోంది. వాటిని తెప్పించాలంటే గతంలో బిల్లు పెట్టిన అధికారులే మళ్లీ పెట్టాలని.. తాము పెట్టే అవకాశం లేదని ప్రస్తుతమున్న అధికారులు చెబుతూ జాప్యం చేస్తున్నారు. వాటిని బల్దియాకు తీసుకురావడంలో ప్రజాప్రతినిధులు చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 48 వార్డుల్లో లోపిస్తున్న పారిశుధ్యం జగిత్యాల బల్దియాలో 48వార్డులున్నాయి. లక్షకు పైగా జనాభా ఉంది. వాహనాలు మరమ్మతులో ఉండటంతో పారిశుధ్య నిర్వహణ సమస్యగా మారింది. ఆటోలు, బ్లేడ్ ట్రాక్టర్లు, స్వీపింగ్ మిషన్లు, ఫాగింగ్ మిషన్లు సక్రమంగా లేకపోవడంతో పారిశుధ్యం నామమాత్రంగా మారింది. లెక్క తేలని రూ.30లక్షలు వాహనాల మరమ్మతును బల్దియాలోని ఇంజినీరింగ్ విభాగం అధికారులు చూస్తుంటారు. వాహనాల ఖర్చు కింద బడ్జెట్లో రూ.10 లక్షలు కేటాయిస్తారు. ఇలా ఇప్పటివరకు రూ.30 లక్షల వరకు ఖర్చు చేశారు. కానీ.. వాహనాలు మాత్రం మళ్లీ మరమ్మతుకు రావడంతో అసలు మరమ్మతు చేయిస్తున్నారా..? లేదా..? అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలిస్తే లెక్కలు తేలుతాయి. తాజాగా మళ్లీ మరమ్మతు కోసం సుమారు రూ.15 లక్షల వరకు కేటాయించారు. ప్రస్తుతం వీటికి టెండర్లు పిలవాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు స్పెషల్ ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. వార్డులు 48ట్రాక్టర్లు 12ఆటోలు 46ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్ 1స్వీపింగ్ మిషన్ 1టిప్పర్ 1వాహనాల మరమ్మతులకు టెండర్లు వేసేలా చర్యలు తీసుకుంటున్నాం. కరీంనగర్లో ఉన్న వాహనాలకు బిల్లులు చెల్లించి తెప్పించేలా చూస్తున్నాం. పారిశుధ్య నిర్వహణకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడతాం. – అనిల్, ఏఈ ఈ చిత్రంలో కనిపిస్తున్నది ఫ్రంట్ బ్లేడ్ ట్రాక్టర్. ఇది మరమ్మతుకు రావడంతో కొత్తబస్టాండ్‌లోని వాటర్‌ట్యాంక్ సమీపంలో పెట్టారు. అక్కడ చెట్ల పొదలు దట్టంగా పెరిగాయి. అందులోనే ట్రాక్టర్‌ను నిర్లక్ష్యంగా వదిలేశారు. మున్సిపల్ అధికారులు కనీసం పట్టించుకోవడం లేదనడానికి ఇది నిదర్శనంగా నిలుస్తోంది. -
లంబో‘ధర’
● వినాయక లడ్డూకు పోటాపోటీ వేలం జగిత్యాలటౌన్/జగిత్యాలజోన్: గణేశ్ నిమజ్జనాన్ని పురస్కరించుకుని శుక్రవారం మొదటిరోజు జిల్లా కేంద్రంలోని పలు మండపాల్లో గణనాథుడి లడ్డూలకు వేలం నిర్వహించగా భారీ ధర పలికింది. పద్మనాయక కల్యాణమంటపంలో వెలమ సంక్షేమ మండలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని లడ్డూను కల్లెడ గ్రామానికి చెందిన జోగినిపల్లి సందీప్‌రావు వైష్ణవి దంపతులు రూ.2,50,000లకు దక్కించుకున్నారు. అలాగే రెడ్డి సంఘం వినాయకుడి లడ్డూ రూ. 51,000 పలికింది. ఈ లడ్డూను గుర్రాల వినూత్నరెడ్డి–అనుకేత్ రెడ్డి దంపతులు దక్కించుకున్నారు. లడ్డూను మాజీ మంత్రి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. సంఘం జిల్లా అధ్యక్షుడు కొప్పెర వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి రాంచందర్‌రెడ్డి తదితరులున్నారు. జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూను రూ.22 వేలకు మహిళా న్యాయవాదులు దక్కించుకున్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు రాచకొండ శ్రీరాములు, ఉత్సవ కమిటీ అధ్యక్షులు బండ భాస్కర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి అందె మారుతి తదితరులు పాల్గొన్నారు. యూరియాపై బీజేపీ, కాంగ్రెస్ డ్రామాలుజగిత్యాల: యూరియా లేక రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. శుక్రవారం బీఆర్ఎస్ కార్యాలయంలో మాట్లాడారు. యూరియా విషయంలో బీజే పీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయ ని, ఒకవైపు రైతులు యూరియా కోసం గగ్గోలు పెడుతుంటే, కొరత లేదని సీఎం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. మంత్రిగా ఉన్న లక్ష్మణ్‌కుమార్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 20 నెలలు అవుతున్నా కేసీఆర్‌ను తిట్టడం తప్ప చేసిందేమీ లేదన్నారు. కవితను ఆడబిడ్డగా గౌరవిస్తామని, కాళేశ్వరం విషయంలో హరీశ్‌రావుపై ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత తదితరులు పాల్గొన్నారు. జయప్రదం చేయాలికోరుట్ల: తెలంగాణ సాయుధ పోరాట ఉత్సవాలను (ఈ నెల 11 నుంచి) జయప్రదం చేయాలని సీపీఐ జాతీయ నాయకుడు చాడ వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ప్రభాకర్ స్మారక భవనంలో పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ముందుగా సీపీఐ జాతీయ మాజీ కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం వెంకటరెడ్డి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17ను ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని, తెలంగాణ పాఠ్య పుస్తకాల్లో చేర్చాలన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థులు పోటీకి సిద్ధం కావాలన్నారు. జిల్లా కార్యదర్శి చెన్నా విశ్వనాథం, సహాయ కార్యదర్శి భూమేశ్వర్, వెన్న సురేశ్, భూమయ్య, సుతారి రాములు, మౌలాన, ఉస్మాన్, శాంత పాల్గొన్నారు. జీఎస్టీ తగ్గింపుతో ఊరట జగిత్యాలటౌన్/మెట్పల్లి: కేంద్ర ప్రభుత్వం ని త్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గించి ప్రజలకు ఎంతో మేలు చేసిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరి బాబు అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మాట్లాడా రు. ప్రధాని మోదీ నిర్ణయం బడుగు, బలహీనవర్గాలు, రైతులకు ఎంతో ఊరటనిచ్చిందని ఇది దేశ ప్రజలకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దసరా కానుకగా అభివర్ణించారు. అలాగే జీఎస్టీ రేట్ల తగ్గింపుపై హర్షం వ్యక్తం చేస్తూ మెట్పల్లి పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ప్రధాని మోదీ చిత్రపటానికి బీజేపీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏలేటి నరేందర్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్చారర్జి చెట్లపల్లి సుఖేందర్, గుంటుక సదాశివ్, బొడ్ల రమేశ్, ఇల్లెందుల శ్రీనివాస్, దొనికెల నవీన్, సుంకేట విజయ్ తదితరులున్నారు. -
బైబై గణేశా
జగిత్యాలటౌన్: చింతకుంట చెరువులో గణపయ్య నిమజ్జనంరాయికల్: ఎండ్లబండిపై గణనాథుని శోభాయాత్ర కోరుట్ల: మహిళల కోలాటం జగిత్యాలటౌన్/కోరుట్ల/రాయికల్: వినాయక నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగిత్యాల పట్టణంలో దాదాపు 600పైగా గణనాథులను ఏర్పాటు చేయగా శుక్రవారం 200 వరకు విగ్రహాలను నిమజ్జనం చేశారు. పాతబస్టాండ్, యావర్‌రోడ్, కొత్తబస్టాండ్, టవర్ మీదుగా శోభాయాత్ర నిర్వహించి చింతకుంట చెరువులో నిమజ్జనం చేస్తున్నారు. చెరువు వద్ద భారీ లైటింగ్, బందోబస్తు ఏర్పాటు చేశారు. మొదటిసారిగా గణేశ్ నిమజ్జనంలో ట్రాన్స్జెండర్ల సేవలను వినియోగించుకోవడం విశేషం. అలాగే కోరుట్ల, రాయికల్ పట్టణాల్లో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. -
ఉత్తమ ఉపాధ్యాయులు వీరే..
శ్రీనివాస్‌రావు (ఎంపీయూపీఎస్, లక్ష్మీదేవిపల్లి), ఎస్.శ్యామలదేవి (కేజీబీవీ, సారంగాపూర్), కె.హేమలత (లక్ష్మీదేవిపల్లి), కె.రవి (జెడ్పీహెచ్ఎస్, అర్పపల్లి),కె.సురేందర్ (ఎంపీపీఎస్, పోరుమల్ల), నిషాంత్ సాహేద (కేజీబీవీ, మేడిపల్లి), పి.చంద్రప్రకాశ్‌రెడ్డి (జెడ్పీహెచ్ఎస్, కొండాపూర్), జి.జగదీశ్వర్ (జెడ్పీహెచ్ఎస్, వల్లంపల్లి), కె.నాగరాజు (జెడ్పీహెచ్ఎస్, పైడిమడుగు), కె.శేఖర్ (ఎంపీపీఎస్, అల్లమయ్యగుట్ట), ఎస్.గంగాధర్ (ఎంపీపీఎస్, అల్లమయ్యగుట్ట), ఎన్.రవీంద్రనాథ్ (జెడ్పీహెచ్ఎస్, మద్దునూర్), షబానాసుల్తానా (ఎంపీపీఎస్, చిన్నాపూర్), ఎం.చంద్రశేఖర్‌రెడ్డి (జెడ్పీహెచ్ఎస్, వాల్గొండ), ఎన్.సంపత్ (ఎంపీపీఎస్, పాశిగాం), శ్రీనివాసులు (జెడ్పీహెచ్ఎస్, ఎర్దండి), ఎ.విజయభాస్కర్ (ఎంపీపీఎస్, వర్షకొండ), సీహెచ్.శోభారాణి (ఎంపీపీఎస్, కోజన్‌కొత్తూర్), సీహెచ్.చందన (జెడ్పీహెచ్ఎస్, మోతె), ఆర్.సావిత్రి (ఓల్డ్ హైస్కూల్, జగిత్యాల), కె.నగేశ్ (టీజీఎంఎస్, కండ్లపల్లి), ఎస్.శ్రీదేవి (ఎంపీపీఎస్, ధరూర్), సీహెచ్.మల్లికార్జున్ (ఎంపీపీఎస్, కొండాపూర్), కె.కృష్ణారెడ్డి (ఎంపీపీఎస్, గుల్లకోట), జె.శ్రీనివాస్ (ఎంపీయూపీఎస్, మద్దులపల్లి), జి.నాగరాజు (ఎంపీయూపీఎస్, దోమలకుంట), ఎన్.సంజీవరెడ్డి (జెడ్పీహెచ్ఎస్, గంభీర్పూర్), రవి (ఎంపీపీఎస్, బొమ్మెన), వెంకటేశ్వర్లు (ఎంపీపీఎస్, ముత్యంపేట), కె.గంగాధర్ (ఎంపీపీఎస్, పోతారం), ఎ.నాగేశ్వర్ (ఎంపీపీఎస్, కొత్తపేట), సీహెచ్.శారద (జెడ్పీహెచ్ఎస్, బాయ్స్, మెట్పల్లి), పి.మురళీ (జెడ్పీహెచ్ఎస్, శాతక్కపల్లి), బి.ఆంజనేయులు (ఎంపీపీఎస్, గొల్లపల్లి), ఉదయశ్రీ (ఎంపీపీఎస్, ఇస్రాజ్‌పల్లి), కె.మహేశ్ (జెడ్పీహెచ్ఎస్, రాఘవపట్నం), సీహెచ్.కిరణ్‌కుమార్ (ఎంపీపీఎస్, తుంగూర్), ఎ.భీమరాజం (జెడ్పీహెచ్ఎస్, నర్సింహులపల్లి), సీహెచ్.లక్ష్మణ్ (జెడ్పీహెచ్ఎస్, తుంగూర్), ఎన్.శ్రీహరి (జెడ్పీహెచ్ఎస్, సాతారం), ఎన్.పురుషోత్తం (జెడ్పీహెచ్ఎస్, రాఘవపేట), కె.భూమేశ్వర్ (ఎంపీపీఎస్, చిట్టాపూర్), బి.సతీశ్ (ఎంపీపీఎస్, రాయికల్), పి.నరేశ్ (టీజీఎంఎస్, రాయికల్), కె.సురేందర్ (జెడ్పీహెచ్ఎస్, రాయికల్), కె.సుజాత (జెడ్పీహెచ్ఎస్, తాట్లవాయి), కె.ప్రభాకర్ (జెడ్పీహెచ్ఎస్, దొంతాపూర్), ఎస్.మాధవి (జెడ్పీహెచ్ఎస్, దోనూర్), కె.శ్రీనివాస్ (ఎంపీపీఎస్, తుమ్మెనాల), వై.మహేశ్ (టీజీఎంఎస్, మగ్గిడి), సీహెచ్.శ్వేతరాణి (ఎంపీపీఎస్, రాజారం), సీహెచ్.సత్యం (ఎంపీపీఎస్, తిప్పాయపల్లి), ఆర్.సుగుణ (కేజీబీవీ, కొడియ్యాల), బి.లక్ష్మీరాంనాయక్ (జెడ్పీహెచ్ఎస్, పూడూరు), కె.అశోక్‌కుమార్ (ఎంపీపీఎస్, సంద్రాలపల్లి, కొడిమ్యాల), పి.ఈశ్వరయ్య (ఎంపీపీఎస్, రాజోజిపేట), పి.రాజేశం (ఎంపీపీఎస్, గోవిందారం), పి.లక్ష్మీనారాయణ (జెడ్పీహెచ్ఎస్, మన్నెగూడెం), ఎ.రాజశేఖర్ (జెడ్పీహెచ్ఎస్, పొరండ్ల), వి.వనిత (ఎంపీపీఎస్, తక్కళ్లపల్లి) ఎంపికయ్యారు. జగిత్యాల: జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లాలో 61 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికయ్యారు. వీరికి ఈనెల 7న ఉదయం 10.30 గంటలకు అవార్డులు అందించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. -
గణేశ్ నిమజ్జనానికి పటిష్ట భద్రత
● 600 సీసీ కెమెరాలతో నిఘా ● 1,000 మంది పోలీసులతో బందోబస్తు జగిత్యాలక్రైం: జిల్లాలో గణేశ్ నిమజ్జనోత్సవానికి పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ అశోక్‌కుమార్ తెలిపారు. జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జనం జరిగిన ప్రాంతాలతో పాటు, శోభాయాత్ర ప్రాంతాలను శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, జిల్లావ్యాప్తంగా వినాయక నిమజ్జనాన్ని ప్రశాంతంగా నిర్వహించేందుకు వెయ్యి మందితో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ప్రధాన కూడళ్లతో పాటు, నిమజ్జన ప్రదేశాల్లో 600 సీసీ కెమెరాలతో నిఘా వ్యవస్థను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలగకుండా నిమజ్జనం సజావుగా సాగేందుకు జిల్లా పరిధిలో 24 గంటలు పోలీసుల పర్యవేక్షణ ఉంటుందన్నారు. ఉత్సవ కమిటీ సభ్యులు నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా నిమజ్జనం జరిగేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘుచందర్, సీఐలు శ్రీనివాస్, అరీఫ్అలీఖాన్, కరుణాకర్, రాంనర్సింహారెడ్డి, రవి, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు కిరణ్‌కుమార్, వేణు, ఎస్సైలు, సిబ్బంది పాల్గొన్నారు. రేపు కొండగట్టు ఆలయం మూసివేతమల్యాల(చొప్పదండి): చంద్రగ్రహణాన్ని పురస్కరించుకొని ఈ నెల 7న మధ్యాహ్నం 12.30గంటలకు కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మూసివేయనున్నట్లు ఈవో శ్రీకాంత్‌రావు తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం నుంచి ఆర్జీత సేవలు నిలిపివేస్తామని పేర్కొన్నారు. పుణ్యహవచనం, సంప్రోక్షణ, తిరుమంజనము, ఆరాధన అనంతరం యథావిధిగా సోమవారం ఉదయం 7గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం, ఆర్జిత సేవలు ప్రారంభమవుతాయని తెలిపారు. -
మావోల తల్లి మృతి
హుజూరాబాద్: మావోయిస్టులు గోపగాని ఐలన్న, కుమరస్వామి తల్లి గోపగాని కొమరమ్మ(92)మండలంలోని తుమ్మన్నపల్లి గ్రామంలో గురువారం ఉదయం మృతి చెందారు. కొమరమ్మకు ఐదుగురు కుమారులు, ఒక కుమార్తె. గోపగాని బలన్న, గోపగాని కుమరస్వామి నాటి పీపుల్స్‌వార్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేశారు. కుమారస్వామి 1979లో కమలాపూర్ మండలం గూడూరులో ఏర్పడిన తొలిదళంలో సభ్యుడిగా చేరాడు. దళంలో పనిచేస్తున్న సమయంలోనే గ్రానైట్ ప్రమాదంలో మృతి చెందాడు. ఐలన్న పీపుల్స్ వార్ పార్టీకి ఉత్తర తెలంగాణ రీజనల్ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలో కిడ్నాప్‌నకు గురై 37 ఏళ్లు దాటినా ఆచూకీ లభించలేదు. కుమారుడి ఆచూకీకి ఎదురుచూసిన తల్లికి చివరికి నిరాశే మిగిలి మృతి చెందింది. బావిలో పడి వృద్ధురాలు..తిమ్మాపూర్: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి వృద్ధురాలు మృతిచెందింది. తిమ్మాపూర్ మండలం ఇందిరానగర్‌కు చెందిన అల్వాల లచ్చమ్మ (80) గురువారం మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయింది. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల వెతికినా ఆచూకీ దొరకలేదు. సాయంత్రం గ్రామంలోని ఓ రైతు వ్యవసాయ బావిలో మృతిచెంది కనిపించింది. ఎల్ఎండీ పోలీసులు మృతురాలిని లచ్చమ్మగా గుర్తించారు. కాల్వశ్రీరాంపూర్: అంత్యక్రియలకు వెళ్లి చెరువులో స్నానం చేస్తూ వ్యక్తి గల్లంతైన ఘటన మండలంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాలు.. మండలంలోని పందిల్లకు చెందిన దబ్బెట రాధ కరీంనగర్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందగా, గురువారం స్వగ్రామంలో అంత్యక్రియలు చేశారు. అనంతరం చెరువులో స్నానానికి వెళ్లిన అదే గ్రామానికి చెందిన దబ్బెట అనిల్(31) ఈత కొడుతూ గల్లంతయ్యాడు. స్థానిక మత్స్యకారులు గాలించినా ఫలితం లేదు. మృతుడికి భార్య ఉమ, కూతుర్లు అన్విత, వినూ త్న, తండ్రి రాజయ్య ఉన్నారు. వికలాంగురాలిపై లైంగిక వేధింపులుజూలపల్లి: మానసిక వికలాంగురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సనత్‌కుమార్ తెలిపారు. మండలానికి చెందిన మానసిక వికలాంగురాలిపై కొప్పుల మహేందర్ గత నెల 30న ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి ప్రవేశించి లైంగిక వేధింపులకు గురిచేసినట్లు బాధితురా లి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. -
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోలతో..
క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా వట్టెంల జెడ్పీ స్కూల్ గెజిటెడ్ హెచ్ఎం కడార్ల సూర్యనారాయణ కృషి చేస్తున్నారు. బడిబాటలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియోను ప్రచారం చేసి ఆకర్షణగా నిలిచారు. ప్రభుత్వ నిర్ణయానికి ముందే పాఠశాలను ఆంగ్ల మాధ్యమ స్కూల్‌గా మార్చి ఇంగ్లిష్ మీడియం బోధన ప్రారంభించారు. సిరిసిల్ల టీచర్ వెబ్సైట్ ద్వారా హెచ్ఎంలు, ఉపాధ్యాయులకు ఉపయుక్తమైన సమాచారం అందిస్తున్నారు. జిల్లాస్థాయిలో ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు, అంతర్జాతీయంగా గ్లోబల్ టీచర్ అవార్డు అందుకున్నారు. -
సురవరం ఆశయాలు, లక్ష్యాలు కొనసాగించాలి
కరీంనగర్: పేద ప్రజల పక్షపాతిగా, ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న మహోన్నతమైన గొప్ప కమ్యూనిస్టు యోధుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న వ్యక్తి సురవరం సుధాకర్‌రెడ్డి అని, ఆయన ఆశయాలు, లక్ష్యాలను కొనసాగించాలని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. గురువారం కరీంనగర్‌లోని ఫిల్మ్ భవన్లో సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సురవరం సంస్మరణ సభలో పలువురు నేతలు హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేశారు. నివాళి అర్పించి మౌనం పాటించారు. మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు మాట్లాడుతూ.. సుధాకర్‌రెడ్డి మృతిచెందడం రాజకీయాలకే అత్యంత బాధాకరమని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కలవేన శంకర్ మాట్లాడుతూ.. పేదల సమస్యలపై అనేక పోరాటాలు చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ వుట్కూరి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. నేటితరం యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి పల్లె నర్సింహ ఆలపించిన విప్లవ గేయాలు ఆలోచింపజేశాయి. సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి, సీపీఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు పోనగంటి కేదారి, అందె స్వామి, కసిరెడ్డి మణికంఠరెడ్డి, నగర కార్యదర్శి కసిరెడ్డి సురేందర్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు గూడెం లక్ష్మి, బత్తుల బాబు, నాగెల్లి లక్ష్మారెడ్డి, పిట్టల సమ్మయ్య, జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉమ్మెంతల రవీందర్‌రెడ్డి, బండ రాజిరెడ్డి, కటికరెడ్డి బుచ్చన్నయాదవ్, గోవిందుల రవి, చొక్కల శ్రీశైలం, పైడిపల్లి రాజు, చాడ శ్రీధర్‌రెడ్డి, అందె చిన్నస్వామి, న్యాలపట్ల రాజు, కంది రవీందర్‌రెడ్డి, బీర్ల పద్మ, కొట్టే అంజలి, బామండ్లపెల్లి యుగేందర్, మచ్చ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి -
జాతీయపోటీలకు నవోదయ విద్యార్థులు
చొప్పదండి: జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన ఇద్దరు విద్యార్థులు రీజియన్ పోటీలలో ప్రతిభ కనబరిచి జాతీయస్థాయికి ఎంపికయ్యారు. ఏపీలోని ఒంగోలులో జరిగిన రీజనల్ లెవల్ కళా ఉత్సవ్–2025 పోటీల్లో విద్యాలయం నుంచి పాల్గొన్న గురునాథం వంశీ, ఎం.కార్తికేయ ప్రతిభ కనబరిచి జాతీయస్థాయిలో ఢిల్లీలో జరిగే పోటీలకు ఎంపికయ్యారు. టాయ్స్ తయారీలో చూపిన ప్రతిభతో మొదటిస్థానంలో నిలిచారు. విద్యార్థులతో పాటు ఆర్ట్ టీచర్ గోకా నాగేశ్వర్రావును ఇన్చార్జి ప్రిన్సిపాల్ కె.బ్రహ్మానందరెడ్డి, రాయుడు అభినందించారు. -
‘ఇగురం’గా బోధిస్తూ..
మండలంలో సెకండరీ గ్రేడ్ టీచరుగా పనిచేస్తున్న కపిల నరేశ్ విద్య బోధన చేస్తూనే, నిరుద్యోగులకు అండగా ఉండి, పోటీ పరీక్షల్లో నెగ్గేందుకు అవసరమైన మెలకువలను ‘ఇగురుం’ యూట్యూబ్ చానల్లో అందిస్తున్నారు. ప్రస్తుతం చందుర్తి మండలంలో పోస్టింగ్ రావడంతో తన కూతురును అదే పాఠశాలలో చదివించేందుకు ప్రవేశం తీసుకుని ఆదర్శంగా నిలిచారు. తన జీవన గమనానికి ఆర్థిక వనరులు అందిస్తున్న ప్రభుత్వ బడిని దక్కించుకునేందుకు తన కూతురిని ప్రభుత్వ బడిలో చేర్పించినట్లు తెలిపారు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా విద్యాశాఖ నుంచి అవకాశాలు రానప్పటికీ వివిధ సంస్థలు 2 రాష్ట్రస్థాయి అవార్డులతో పాటు గౌరవ డాక్టరేట్ ప్రదానం చేశాయి. -
సహకార సంఘాలకు ఉజ్వల భవిష్యత్
జగిత్యాలఅగ్రికల్చర్: సహకార సంఘాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని అడిషనల్ కలెక్టర్ బీఎస్.లత అన్నారు. జిల్లా కేంద్రంలో జిల్లా సహకార అభివృద్ధి మండలి సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా పూర్తిగా వ్యవసాయాధారితం కావడంతో సహకార సంఘాలు రైతులకు అవసరమైన అనేక వ్యాపారాలు చేసుకునే వీలు కల్పిస్తున్నాయని తెలిపారు. జిల్లాలో గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం ముందుకొస్తున్న నేపథ్యంలో సహకార సంఘాలు వినియోగించుకోవాలని సూచించారు. జిల్లా సహకార అధికారి మనోజ్‌కుమార్ మాట్లాడుతూ.. కొత్త సహకార సంఘాలను ఏర్పాటుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించామన్నారు. ఎఫ్‌సీఐ మేనేజర్ రవిప్రకాశ్, జెడ్పీ సీఈవో గౌతంరెడ్డి, కరీంనగర్ సహకార బ్యాంక్ సీఈవో సత్యనారాయణరావు, డీఏవో భాస్కర్, పౌరసరఫరాల శాఖ అధికారి జితేందర్ పాల్గొన్నారు. -
కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని..
జగిత్యాలరూరల్: జగిత్యాల అర్బన్ మండలం ధరూర్ గ్రామానికి చెందిన వృద్ధురాలు తన కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారని, భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నానని, తనకు సంరక్షణ కల్పించాలని సంక్షేమాధికారి కార్యాలయంలో గురువారం ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన కిష్టమ్మను మూడు రోజుల క్రితం కొడుకు, కోడలు ఇంటి నుంచి గెంటేశారు. విద్యానగర్‌లోని రామాలయం వద్ద కాలం వెళ్లదీస్తోంది. స్థానికులు ఆమె పరిస్థితిని సంక్షేమ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో సఖీ కేంద్రం నిర్వాహకులు ఆమెను గురువారం సాయంత్రం చేరదీసి కౌన్సెలింగ్ నిర్వహించారు. తన పేరున ఉన్న ఇల్లును కొడుకు పేరిట చేసుకుని ఇప్పుడు పోషించడం లేదని అధికారులకు వివరించింది. -
వినూత్నం.. విజ్ఞానం
పాఠ్యపుస్తకాల్లోని సిలబస్ పూర్తి చేయడమే పరమావధిగా పనిచేస్తున్న నేటి కాలంలో కొందరు ఉపాధ్యాయులు వినూత్న రీతిలో విద్యాబోధన చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కొందరు పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాల కల్పనకు కృషి చేయగా.. ఇంకొందరు నిరుద్యోగులకు అండగా ఉంటూ ఉద్యోగాన్వేషణలో బాసటగా నిలుస్తున్నారు.. పలువురు విద్యాభ్యాసం వయసుతో కూడినది కాదని నిత్య విద్యార్థిగా అభ్యసన చేయాలంటూ ముందుకెళ్తున్నారు.. మరికొందరు విద్యార్థుల్లో సామాజిక సేవ దృక్పథం నింపేందుకు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు.. శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా కథనాలు..తాను పనిచేసే బడిలో సౌకర్యాల కల్పనకు ప్రయత్నిస్తూనే నిత్య విద్యార్థిగా వందల సంఖ్యలో ఆన్లైన్ కోర్సులు చేస్తూ ముందుకెళ్తున్నారు సిరిసిల్ల పట్టణం శివనగర్ కుసుమరామయ్య జిల్లా పరిషత్ హైస్కూల్ ఇంగ్లిష్ టీచర్ పాతూరి మహేందర్‌రెడ్డి. 1996లో ఉపాధ్యాయ వృత్తిలో చేరిన పాతూరి పని చేసిన ప్రతీ స్కూల్లో అంకితభావంతో విద్యార్థుల సంఖ్య పెంచారు. పదో తరగతిలో ప్రతిభచాటిన విద్యార్థులకు తన తండ్రి పేరిట గోల్డ్, సిల్వర్ మెడల్స్ అందించారు. విద్యార్థుల్లో మానవతా విలువలు, మంచి లక్షణాలను పెంపొందించే ఉద్దేశంతో పాఠశాలల్లో నిజాయితి దుకాణం, మానవత్వపు గోడ, పెన్ బ్యాంకులను ప్రవేశపెట్టి పిల్లలను ప్రోత్సహించారు. మానవతా సేవలు అందిస్తున్న మహేందర్‌రెడ్డి ఇప్పటికే ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక కాగా, రెండురోజుల క్రితం తెలుగు యూనివర్సిటీ నుంచి ఉత్తమ ఉపాధ్యాయ కీర్తిపురస్కారాన్ని అందుకున్నారు. జ్ఞానాన్ని పెంచుకునేందుకు ఏ వయసులోనైనా చదువుకోవచ్చని పేర్కొన్నారు. సిరిసిల్లఎడ్యుకేషన్: పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచుతూ, సౌకర్యాలు కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు హెచ్ఎం చకినాల శ్రీనివాస్. సిరిసిల్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హెచ్ఎంగా 2018లో విధుల్లో చేరారు. అప్పుడు ఉన్న విద్యార్థులు 31 మంది కాగా ప్రస్తుతం 306కు చేరింది. రెండేళ్లుగా పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారు. పాఠశాలలో వసతుల కల్పనకు పూర్వ విద్యార్థులతో చర్చించి కంప్యూటర్ ల్యాబ్, గ్రంథాలయం, సీసీ కెమెరాలు, వాటర్ ఫిల్టర్ ఏర్పాటుకు కృషి చేశారు. విద్యార్థుల సౌకర్యార్థం పలువరికి సైకిళ్లు అందజేశారు. విద్యార్థులను తమ బడికి రప్పించేలా వేసవి సెలవుల్లో ఉచిత కంప్యూటర్ శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి మన్ననలు పొందారు. 2022లో రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నారు. విద్యార్థుల ప్రవేశాలను గణనీయంగా పెంచి, మెరుగైన ఫలితాలు సాధిస్తున్న గణాంకాల ప్రాతిపదికన కలెక్టర్ సందీప్‌కుమార్‌ఝా ప్రత్యేక చొరవతో ఈ ఏడాది జిల్లా ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పని చేసుకుంటూ పోతే అవార్డులు రివార్డులు వస్తుంటాయని, విద్యార్థులకు మరింత మెరుగైన బోధన అందించేందుకు మద్రాస్ ఐఐటీతో అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. -
గూగుల్ కన్నా గురువే మిన్న
జ్యోతినగర్(రామగుండం): ప్రస్తుతం ఏదైనా ప్రశ్నకు సమాధానం కావాలంటే గూగుల్‌ను సంప్రదిస్తున్నారు. కానీ, గూగుల్ కంటే గురువే మిన్న అని అన్నారు ఎన్టీపీసీ రామగుండం దుర్గయ్యపల్లె ప్రభుత్వ పాఠశాల మ్యాథ్స్ టీచర్ కె.అనిత అన్నారు. పలు గణితోపకరణాలు తయారు చేసి విద్యార్థులకు వినూత్న రీతిలో బోధిస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా 2024లో ఎస్సీఈఆర్టీ హైదరాబాద్ నందు నిర్వహించిన రాష్ట్రస్థాయి గణిత సెమినార్లో పరిశోధన పత్రం సమర్పించినందుకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నరసింహారెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్నారు. విద్యార్థులకు నేర్చుకోవాలనే తపన ఉండాలని పేర్కొన్నారు. గూగుల్ మనం ఏది అడిగితే ఆ జవాబు ఇస్తుంది కానీ.. గురువు అది తప్పా, ఒప్పా చెప్పి సరైన మార్గంలో వెళ్లేలా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు. పేద విద్యార్థుల మాస్టారు.. గంగాధర్కోరుట్ల: కోరుట్ల పట్టణానికి చెందిన సోమ గంగాధర్ పేద విద్యార్థుల మాస్టారుగా పేరు సంపాందించారు. కథలాపూర్ మండలం చింతకుంట ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 2002లో ఉద్యోగ బాధ్యతలు చేపట్టాడు. అక్కడ పేద విద్యార్థులను పాఠశాలకు తీసువచ్చి చదువు చెప్పాడు. విద్యాకమిటీ ప్రోత్సాహంతో పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచారు. మెట్పల్లి మండలం ఆరపేటలో గణిత బోధన చేసి, మంచి లెక్కల మాస్టార్‌గా పేరు సంపాధించాడు. ప్రస్తుతం ఎంపీపీఎస్ అయ్యప్పగుట్ట పాఠశాలలో పని చేస్తున్నాడు. పేద విద్యార్థులను అక్కున చేర్చుకుని, పుస్తకాలు, కాపీలు, పెన్నులు, బ్యాగులతోపాటు ఆర్థిక సాయం అందించి చదువుకునేందుకు సహకరించాడు. -
ప్రయోగాలతో గుర్తింపు
ఇల్లంతకుంట(మానకొండూర్): లో కాస్ట్.. నో కాస్ట్ మెటీరియల్స్‌తో విద్యార్థులచే ప్రయోగాలు చేయిస్తూ జిల్లా, రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అందుకున్న ఇల్లంతకుంట హైస్కూల్ బయాలజీ టీచర్ వుడుత మహేశ్‌చంద్ర. ఇప్పటివరకు విద్యార్థులతో 760 ప్రాజెక్టులు తయారు చేయించారు. 2002లో సైన్స్టీచర్గా విధుల్లో చేరారు. ఇల్లంతకుంట స్కూల్లో ఎనిమిదేళ్ల నుంచి పనిచేస్తున్నారు. 2023లో రాష్ట్ర, 2019లో జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు వరించాయి. అలాగే విద్యార్థులతో ప్రయోగాలు తయారు చేయించి జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయస్థాయి పోటీల్లో గోల్డ్, సిల్వర్, ఉత్తమ ప్రశంస పత్రాలు అందుకునేలా చేశారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూర్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు బద్దం రవీందర్‌రెడ్డి 2025– జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపికయ్యారు. 2002లో విధుల్లో చేరి, రెండేళ్లుగా కందికట్కూరులో పని చేస్తున్నారు. పాఠశాలలో గతేడాది 20 మంది విద్యార్థులు ఉండగా వేసవి సెలవుల్లో ఇంటింటా తిరిగి సంఖ్య 40 మందికి చేరేలా కృషి చేశారు. గ్రామస్తుల సాయంతో స్కూల్ భవనాన్ని రైలు థీమ్ పాఠశాలగా తీర్చిదిద్దారు. మెరుగైన విద్య అందించడంతోపాటు విద్యార్థులచే పలు యాక్టివిటీస్ చేయిస్తుంటారు. -
చిట్టీ డబ్బులతో ఉడాయించిన వ్యక్తిపై కేసు
కోరుట్ల రూరల్: మండలంలోని పైడిమడుగుకు చెందిన గుగ్గిళ్ల రమేశ్ చిట్టీల పేరుతో డబ్బులు వసూలు చేసి పారిపోయినట్టు అదే గ్రామానికి చెందిన ఆడె రవిచందర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఎస్సై చిరంజీవి కథనం ప్రకారం గుగ్గిళ్ల రమేశ్, ఆయన భార్య గాయత్రి చిట్టీల పేరుతో గ్రామంలో పది మంది నుంచి రూ.32.57లక్షలు వసూలు చేశారు. వాటిని తిరిగి ఇవ్వకుండా గ్రామం నుంచి పారిపోయారు. రవిచందర్ ఫిర్యాదు మేరకు రమేశ్, గాయత్రిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు. గ్రామంలో సుమారు రూ.కోటిన్నర వరకూ రమేశ్ చిట్టీల పేరిట వసూలు చేసి తిరిగి ఇవ్వలేదని గ్రామస్తుల ద్వారా తెలిసింది. కరీంనగర్‌స్పోర్ట్స్: జూని యర్ కళాశాలల క్రీడా సమాఖ్య (ఎస్జీఎఫ్) ఉ మ్మడి జిల్లా కార్యదర్శిగా గుమ్మడి మధు జాన్సన్ నియామకమయ్యారు. కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ జూ నియర్ కళాశాలలో ఫిజికల్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న మధు జాన్సన్‌ను 2025–26 సంవత్సరానికి క్రీడా సమాఖ్య కార్యదర్శిగా నియమిస్తూ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి గంగాధర్ ఉత్తర్వులు జారీ చే శారు. ఈ సందర్భంగా మధు జాన్సన్‌ను సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, ప్రిన్సిపాల్ సత్యవర్ధన్‌రావు, ఆంజనేయరావు, వెంకటరమణచారి, శశిధర్ శర్మ, నిర్మల, సుధాకర్, బల్బీర్ సింగ్, అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డి, ఒలింపిక్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు నందెల్లి మహిపాల్, గసిరెడ్డి జనార్దన్‌రెడ్డిలు అభినందించారు. -
గురుకుల విద్యార్థినులకు అస్వస్థత
గంభీరావుపేట(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం నర్మాల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల విద్యాలయం విద్యార్థులు బుధవారం రాత్రి అస్వస్తతకు గురయ్యారు. పలువురు విద్యార్థులకు మండల కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో బుధవారం రాత్రి వైద్యం అందించారు. గురువారం ఉదయం లింగన్నపేట పీహెచ్సీ అధికారులు, సిబ్బంది పాఠశాలలో విద్యార్థులకు వైద్యపరీక్షలు చేశారు. 446 మందికి వైద్యపరీక్షలు చేయగా.. 48 మంది విద్యార్థినులు జలుబు, దగ్గు, చర్మ సంబంధిత వ్యాధులు, కడుపునొప్పి, జ్వరం, పసిరికలతో బాధపడుతున్నట్లు గుర్తించారు. వారికి మందులు అందజేశారు. సీహెచ్‌వో రమేశ్, వైద్య సిబ్బంది భారతి, శిల్ప, హేమలత, కల్పలత, ఆశకార్యకర్తలు పాల్గొన్నారు. వైద్యపరీక్షలు నిర్వహించిన పీహెచ్సీ సిబ్బంది -
ఎత్తివేసిన రైళ్లకు హాల్టింగ్ పునరుద్ధరణ
● పెద్దపల్లి ఎంపీ ఒత్తిడితో దిగివచ్చిన రైల్వేశాఖ రామగుండం: కొన్నినెలల క్రితం ప్రయాణికుల నుంచి అంతగా స్పందన లేదనే కారణంతో పాటు దాని ముందే ఓ రైలుకు హాల్టింగ్ కల్పించామనే సాకు, వీటన్నింటి కంటే పలు సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైళ్లకు ఎగువ వైపు వెళ్లే క్రమంలో హాల్టింగ్, దిగువ వైపు వెళ్లే వాటికి నాన్‌స్టాప్ ఇలా గందరగోళంగా అర్థం కాని నిర్ణయాలను దక్షిణ మధ్య రైల్వే అమలు చేసింది. దీంతో రామగుండం కేంద్రంగా రాకపోకలు సాగించే ప్రయాణికులు రైల్వేశాఖ నిర్ణయంపై తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమయ్యాయి. కాగా పలుమార్లు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ రైల్వే జీఎం దృష్టికి తీసుకెళ్లి 11 రైళ్లకు హాల్టింగ్స్ కల్పించాలని కోరగా కేవలం ఐదు రైళ్లకు మాత్రమే హాల్టింగ్ కల్పించినట్లు పేర్కొన్నారు. పెద్దపల్లి రైల్వేస్టేషన్లో రెండు రైళ్లకు హాల్టింగ్ కల్పించాలని కోరగా కేవలం ఒక రైలుకు మాత్రమే హాల్టింగ్ కల్పించారు. గురువారం పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. హాల్టింగ్ కల్పించడంపై ప్రయాణికుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. రామగుండంలో హాల్టింగ్ కల్పించిన రైళ్ల వివరాలు.. రైలు నం.12295 బెంగళూరు–దానాపూర్ (సంఘమిత్ర సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్) రైలు నం.12578 ధర్భాంగా–మైసూర్ (బాగ్మతి సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్) రైలు నం.12721 హైదరాబాద్–హజ్రత్ నిజాముద్దీన్ (దక్షిణ్) రైలు నం.22535 రామేశ్వరం–భరౌణి (రామేశ్వరం) రైలు నం.22669 ఎర్నాకులం–పాట్నా (పాట్నా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్) పెద్దపల్లి రైల్వేస్టేషన్లో రైలు నెం.12722 దక్షిణ్ ఎక్స్‌ప్రెస్‌కు హాల్టింగ్ కల్పించారు. -
మూఢనమ్మకాలపై అవగాహన
జగిత్యాల: జిల్లాకేంద్రంలోని ఎస్కేఎన్ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో జంతుశాస్త్ర విభాగం అధ్యాపకుడు.. ఎన్సీసీ అధికారి పర్లపల్లి రాజు రాష్ట్ర ఉత్తమ అధ్యాపక అవార్డుకు ఎంపికయ్యారు. 14 ఏళ్లుగా ఎన్సీసీ అధికారిగా అనేక గ్రామాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. వ్యాధులు, మూఢనమ్మకాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. రక్తదాన శిబిరాలతోపాటు రక్తదానంపై వివరిస్తున్నారు. హరితహారంలో భాగంగా ఏటా గ్రామాల్లో వందలాది మొక్కలు నాటారు. కాకతీయ వర్సిటీలో పసుపు పంటలపై కీటకాల వైవిధ్యంపై ప్రొఫెసర్ వెంకటయ్య ఆధ్వర్యంలో పరిశోధన చేశారు. వర్సిటీలో సమర్పించి మూడు పేటెంట్ హక్కులు పొందారు. ఎన్సీసీ లెఫ్టినెంట్ అధికారిగా ఐదేళ్లుగా క్యాడెట్లను త్రివిధ దళాలు, పోలీసుశాఖలో ఉద్యోగాలు సాధించేలా కృషి చేశారు. ఈయనకు అవార్డు రావడంపై ప్రిన్సిపల్ అశోక్ మాట్లాడుతూ.. మున్ముందు మరిన్ని అవార్డులు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. వైస్ ప్రిన్సిపల్ శ్రీనివాస్, సాయిమధుకర్, గోవర్దన్, సురేందర్, అభినందించారు. -
పంట దెబ్బతిన్న ప్రాంతాల్లో శాస్త్రవేత్తల పర్యటన
జగిత్యాలఅగ్రికల్చర్: పంటలు దెబ్బతిన్న ప్రాంతాల్లో పొలాస శాస్త్రవేత్తల బృందం గురువారం పర్యటించింది. ఈ మేరకు జగిత్యాల మండలం మోరపల్లి, రాయికల్ మండలం బోర్నపల్లి గ్రామాల్లో ఇటీవల కురిసిన వర్షాలకు నష్టపోయిన పత్తి, మొక్కజొన్న, కంది, వరి పంటలను పరిశీలించారు. గోదావరి బ్యాక్ వాటర్‌తో 3 నుంచి 4 రోజులు పూర్తిగా పత్తి పంట నీటిలోనే ఉండటంతో.. పత్తి పంట నష్టం ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. దాదాపు 200 ఎకరాల్లో పత్తికి తీవ్ర నష్టం జరిగినట్లు అంచనా వేశారు. ఈ సందర్భంగా అధిక వర్షాలకు పంట నష్టం జరుగకుండా ఎలా కాపాడుకోవాలనే విషయాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు స్పందన భట్, రవి, సుమలత, రాజేష్, రామకృష్ణ, బి.శ్రీలక్ష్మి, ఏఈవో నరేశ్ పాల్గొన్నారు. -
బల్దియా కార్యాలయాన్ని ముట్టడించిన బీజేపీ
జగిత్యాలటౌన్: వినాయక నవరాత్రి ఉత్సవాలకు ఏర్పాట్లు చేయడంలో బల్దియా అధికారులు విఫలమయ్యారని ఆరోపిస్తూ బీజేపీ నాయకులు గురువారం జగిత్యాల మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు బల్దియా ప్రధాన ద్వారం వద్ద బైటాయించి నిరసన తెలిపారు. బల్దియా అధికారులు హిందువుల పండుగలను చిన్నచూపు చూస్తున్నారని ఆరోపించారు. భారీవర్షాలకు పలు కాలనీల్లో పెద్ద పెద్ద గుంతలు ఏర్పడ్డాయని, శోభాయాత్రలో ఇబ్బంది పడాల్సి వస్తుందని అన్నారు. గుంతల్లో మొరం పోయకపోవడం దారుణమన్నారు. రోడ్ల వెంట లైటింగ్ పెట్టకపోవడం సరికాదని పేర్కొన్నారు. బల్దియా డీఈకి వినతిపత్రం అందించారు. నాయకులు గంగాధర్, ఆముద రాజు, సిరికొండ రాజన్న, ఠాకూర్ పవన్‌సింగ్, గడ్డల లక్ష్మి, చెన్నాడి మధురిమ, సాంబారి కళావతి, మమత, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆకట్టుకునేలా పాఠాలు
జగిత్యాలరూరల్: జగిత్యాల రూరల్ మండలం కండ్లపల్లి మోడల్ స్కూల్ జువాలజీ ఉపాధ్యాయుడు చిలుకూరి శివకృష్ణ 2014లో పెద్దపల్లి జిల్లా ధర్మారంలో విధుల్లో చేరారు. అప్పటినుంచి విద్యార్థులను ఆకట్టుకునేలా బోధిస్తున్నారు. రాష్ట్రస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్లలో విద్యార్థులు బహుమతులు పొందేలా కృషి చేస్తున్నారు. స్కూల్ ఇన్నోవేషన్ చాలెంజ్–2022లో రాష్ట్రస్థాయిలో మొదటి బహుమతి, 2023లో టాప్ 10లో నిలిచారు. ఇన్స్పైర్ అవార్డుల్లో నాలుగుసార్లు రాష్ట్రస్థాయి, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ (ఎన్సీఎస్సీ)లో ఒకసారి సాధించారు. జవహార్‌లాల్ నెహ్రూ సైన్స్ అండ్ మ్యాథ్స్ ఎగ్జిబిషన్ (ఆర్బీవీపీ)లో విద్యార్థులు పాల్గొనేలా కృషి చేశారు. గతంలో పెద్దపల్లి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయుడిగా అవార్డు అందుకున్నారు. ఈయన టెక్ మహీంద్ర, సైన్స్ అకాడమీ నుంచి ట్రాన్స్ఫార్మింగ్ ఎడ్యుకేషన్ అవార్డు, తెలంగాణ ఇన్నోవేషన్సెల్ (టీఎస్ఐసీ) విలేజ్ ఇన్నోవేటర్ అవార్డు అందుకున్నారు. హర్యానాలో జరిగిన ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్లో పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటి నిర్వహించిన ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఎడ్యుకేషన్‌లో ఇంటర్నేషనల్ పబ్లికేషన్ విడుదల చేశారు. శివకృష్ణను పాఠశాల ప్రిన్సిపల్ సరిదిదేవి, వైస్ ప్రిన్సిపల్ నగేశ్, ఉపాధ్యాయులు అభినందించారు. -
రోడ్ల మరమ్మతు చేపట్టండి
● మాజీమంత్రి జీవన్‌రెడ్డి రాయికల్: ఇటీవల కురిసిన వర్షాలకు డ్యామేజీ అయిన రోడ్లు, బ్రిడ్జిలకు వెంటనే మరమ్మతు చేపట్టాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని రాజనగర్‌లో తెగిపోయిన రోడ్లను గురువారం పరిశీలించారు. యుద్ధప్రతిపాదికన నిర్మాణ రోడ్లు, బ్రిడ్జిలకు మరమ్మతు చేయించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపి రాజిరెడ్డి, నాయకులు లక్ష్మీ, మండ రమేశ్, ఎలిగేటి మహిపాల్‌రెడ్డి, జగదీశ్, రాజేశ్వర్‌రెడ్డి, శ్రీను, రవి, రంజిత్, రాజేశ్, లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు భారీకేడ్లు ప్రమాదాల నివారణకు భారీకేడ్లు ఉపయోగపడతాయని జీవన్‌రెడ్డి అన్నారు. రాయికల్ మండలం అల్లీపూర్లో అత్తినేని అనసూయ, రాజన్న ఏర్పాటుచేసిన భారీకేడ్లను ప్రారంభించారు. గ్రామంలో ప్రతి ఆదివారం మార్కెట్ నిర్వహించేలా అధికారులకు సూచించారు. మల్లాపూర్: ఈ–పాస్ ద్వారానే రైతులకు ఎరువులు విక్రయించాలని డీఏవో భాస్కర్ అన్నారు. మండలకేంద్రంతోపాటు సిరిపూర్, ముత్యంపేట, చిట్టాపూర్‌లోని ప్యాక్స్ కార్యాలయాలను పరిశీలించారు. ఎరువుల నిల్వలు, రిజస్టర్లను తనిఖీ చేశారు. ఽయూరియా కోసం రైతులెవరూ అందోళన చెందవద్దని, అందరికీ అందిస్తామని తెలిపారు. అనంతరం మల్లాపూర్‌లో డిజిటల్ పంట నమోదు ప్రక్రియను పరిశీలించారు. రైతులందరూ తప్పనిసరిగా పంట నమోదు చేసుకోవాలని సూచించారు. ఆయన వెంట ఏవో లావణ్య, ఏఈవో గజానంద్, ప్యాక్స్ సీఈవోలు రమేశ్, భూమేశ్, రాజేశ్వర్‌రెడ్డి, రవితేజ, రైతులు పాల్గొన్నారు. జిల్లాకు మోస్తరు వర్ష సూచనజగిత్యాలఅగ్రికల్చర్: రానున్న ఐదురోజుల్లో జిల్లాలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పొలాస వ్యవసాయ పరిశోధన స్థానం వాతావరణ శారస్త్రవేత్త బి.శ్రీలక్ష్మి తెలిపారు. ఈనెల ఏడో తేదీ వరకు అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. 8, 9తేదీల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. జగిత్యాలక్రైం: వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని జిల్లాలో రెండురోజుల పాటు మద్యం షాపులు మూసివేయనునట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ సత్యనారాయణ తెలిపా రు. కలెక్టర్ ఆదేశాల మేరకు శుక్రవారం ఉద యం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఆరు గంటల వరకు అన్ని మద్యం షాపులు, బార్లు, రెస్టారెంట్లు, కల్లు దుకాణాలను మూసివేయనున్నట్లు పేర్కొన్నారు. యూరియా కోసం రైతుల ధర్నాగొల్లపల్లి: యూరియా కోసం రైతులు మండలకేంద్రంలోని జగిత్యాల–ధర్మారం ప్రధాన రహదారిపై గురువారం ధర్నా నిర్వహించారు. యూరియాను బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నారని ఆందోళన చేపట్టారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూరియా ఎప్పుడు వస్తుందో..? షాపుల్లో ఎంత స్టాక్ ఉందో తెలియడం లేదని, వ్యవసాయాధికారులు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు జోక్యం చేసుకుని ధర్నా విరమింపజేశారు. రైతుల ఆందోళనకు బీజేపీ మండల నాయకులు మద్దతు తెలిపారు. -
వినూత్నం.. విజ్ఞానం
సిరిసిల్ల ఎడ్యుకేషన్: పుస్తకాల్లో ఉన్న విజ్ఞానాన్ని విద్యార్థులకు బోధించడం పరిపాటి. కానీ మిషన్–100 లక్ష్యంగా విద్యార్థులతో నూతన ఆవిష్కరణలు చేయిస్తున్నాడు రాజన్న సిరిసిల్ల జిల్లా దమ్మన్నపేట జిల్లా పరిషత్ హైస్కూల్ భౌతికశాస్త్రం ఉపాధ్యాయుడు తాడూరి సంపత్‌కుమార్. తన ఉద్యోగ విరమణలోపు కనీసం 100మంది గ్రామీణ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను ఆవిష్కరణకర్తలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో మిషన్–100 కార్యక్రమం నిర్వహిస్తున్నాడు. ఇప్పటివరకు 61మంది వివిధ ఆవిష్కరణలు ప్రదర్శించగా.. వీరిలో 8మంది అంతర్జాతీయస్థాయి, 16మంది జాతీయస్థాయి, 30మందికి పైగా రాష్ట్రస్థాయి బహుమతులు గెలుచుకున్నారు. 2021, 2023లో ఇద్దరు విద్యార్థుల ఆవిష్కరణలు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాయి. బోచ్, ఎన్ఐఎఫ్, టీజీఐసీ సంస్థలు పిల్లల ఆవిష్కరణలకు పేటెంట్ హక్కులు పొందేందుకు సహకారం అందిస్తున్నాయి. సంపత్ కుమార్ సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం 2024లో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం అందించింది.● నూతనంగా ఆలోచిస్తున్న ఉపాధ్యాయులు ● విభిన్న బోధనలతో ఆకట్టుకుంటున్న వైనం ● ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఉత్తమ అవార్డులకు పలువురి ఎంపిక ● నేడు టీచర్స్ డేఅమ్మ జన్మనిస్తుంది.. నాన్న జీవితాన్ని ఇస్తాడు. ఆ జీవితాన్ని సక్రమ దారిలో నిలబెట్టే ఏకై క వ్యక్తి గురువు. బుడిబుడి అడుగులు వేస్తూ ఓనమాలు దిద్దే వయసు నుంచి డిగ్రీ, పీజీలు పూర్తిచేసి ఉద్యోగం, వ్యాపారంలో స్థిరపడే వరకు మార్గదర్శిగా నిలుస్తారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పాఠశాల, కళాశాల, యూనివర్సిటీల్లోని గురువురు వినూత్నంగా విద్యాబోధన అందిస్తున్నారు. పుస్తకాల్లోని పాఠాలను అర్థమయ్యే రీతిలో ప్రత్యక్షంగా వివరిస్తూ శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రపంచీకరణ వేగాన్ని అందుకునే విధంగా సలహాలు.. సూచనలు ఇస్తూ.. విద్యార్థులు వివిధ రంగాల్లో రాణించేలా తీర్చిదిద్దుతున్నారు. వివిధ రకాల ప్రయోగాలు చేయిస్తూ.. జాతీయస్థాయిలో పేరుపొందేలా ప్రోత్సహిస్తున్నారు. ఇలా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని పలువురు పాఠశాల ఉపాధ్యాయులు, కళాశాల అధ్యాపకులు ఉత్తమ గురువులుగా ప్రశంసలు పొందుతున్నారు. నేడు దేశ తొలి ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనాలు..కాల్వశ్రీరాంపూర్: విద్యార్థుల్లో ఒకరిగా ఫ్రెండ్లీ బోధనతో వినూత్నంగా ఆలోచిస్తున్నారు ఉపాధ్యాయురాలు కోయాల్కర్ స్వప్న. 13 ఏళ్లుగా కాల్వశ్రీరాంపూర్ మండలంలోని వివిధ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్నా రు. ప్రస్తుతం కాల్వశ్రీరాంపూర్ ఎస్సీకాలనీ ప్రాథమిక పాఠశాలలో హెచ్ఎంగా కొనసాగుతున్నారు. 2008లో శంకరపట్నం మండలం రాజాపూర్‌లో విధులు ప్రారంభించారు. ముస్తాబాద్ మండలం కొండాపూర్, కాల్వ శ్రీరాంపూర్ మండలం మల్యాలలో పనిచేశారు. ఉత్తమ విద్యాబోధన, విద్యార్థులతో ఫ్రెండ్లీగా ఉంటూ ఆటపాటలతోపాటు కృత్యాధారణ బోధన (టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్) చేస్తూనే మండలస్థాయిలో నిర్వహించే ఎఫ్‌ఎల్‌ఎన్‌లో రిసోర్స్ పర్సన్‌గా ప్రశంసలు అందుకుంటున్నారు. కాల్వశ్రీరాంపూర్ ఎస్సీ కాలనీకి గతేడాది బదిలీపై వచ్చిన స్వప్న 50మంది నుంచి 60మందికి విద్యార్థుల సంఖ్యను పెంచారు. -
● మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ● లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ పంపిణీ
గొల్లపల్లి: రాష్ట్రంలోని ప్రతి పేద కుటుంబానికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పేదలకు మొదటి ప్రాధాన్యం ఇస్తూ.. విడతల వారీగా ఇళ్లు కేటాయించి నిధులు సమకూర్చుతామని తెలిపారు. మండలంలోని లొత్తునూర్ గ్రామంలో 20 మంది లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలు అందించారు. కొందరి ఇళ్లకు ముగ్గుపోశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటను 200 యూనిట్ల ఉచిత కరెంట్, ఉచిత ఆర్టీసీ ప్రయాణం, రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ, 50వేల ఉద్యోగాల కల్పన వంటి సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు. ఇసుక, ఇనుము, సిమెంట్ ధరలు తగ్గించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పేదలకు మేలు చేస్తుంటే ఓర్వలేక బీఆర్ఎస్, బీజేపీ బురదజల్లే ప్రయత్నం చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబ ఆస్తి తగాదాల్లోనే చిక్కుకుపోయిందని ఎద్దేవా చేశారు. అనంతరం గ్రామంలోని వంతెన పరిశీలించి నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రతీ పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం -
పింఛన్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలి
జగిత్యాలజోన్: పింఛన్ల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని గ్రామీణాభివృద్ధి శాఖ పెన్షన్ డైరెక్టర్ గోపాల్‌రావు అన్నారు. కలెక్టరేట్లో గురువారం ఎంపీడీవోలు, మున్సిపల్, వార్డు, పంచాయతీ కార్యదర్శులు, తపాలా అధికారులతో గురువారం సమీక్షించారు. పేదలకు ప్రభుత్వం వివిధ రకాల పింఛన్లు అందిస్తోందని, అర్హులకు అందేలా చూడాలని తెలిపారు. పోస్టాఫీస్ ద్వారా పంపిణీ సరిగ్గా జరగాలని సూచించారు. అడిషనల్ కలెక్టర్ లత మాట్లాడుతూ.. జిల్లాలో 2,21,847 లబ్ధిదారులకు రూ.48కోట్ల పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. డీఆర్డీఏ పీడీ రఘువరణ్ మాట్లాడుతూ.. పోస్టాఫీసు ద్వారా 26,438 పింఛన్లను పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. సెర్ప్ అదనపు ప్రాజెక్టు అధికారి సునీత, పెన్షన్ అధికారి నాగేశ్వర్ రావు, అయా శాఖల అధికారులు పాల్గొన్నారు. -
సామాజిక సేవకుడు గొల్లపల్లి గణేశ్
సారంగాపూర్/ధర్మపురి: ధర్మపురికి చెంది.. బీర్పూర్ మండలం తాళ్లధర్మారం పాఠశాలలో తెలుగు (స్కూల్ అసిస్టెంట్) ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న గొల్లపల్లి గణేశ్ పదేళ్లుగా బోధనతోపాటు అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. స్టూడెంట్ అడాప్షన్ ప్రోగ్రాం ద్వారా 4వేల మంది పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ కిట్లు పంపిణీ చేశారు. 15 మంది ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థిక సహాయం అందించారు. వుయ్ హెల్ప్ యూ సంస్థ కన్వీనర్‌గా పనిచేస్తూ వైద్య, విద్య అవసరాలకు తనమిత్రులతో కలిసి సాయం చేస్తున్నారు. ఇదే సంస్థ ద్వారా కరోనా సమయంలో రూ.4లక్షల విలువ చేసే పీపీఈ కిట్లు, వరదల సందర్భంగా రూ.4లక్షల నిత్యావసరాలు, ఇతర సామగ్రి అందించారు. కమలాపూర్ పాఠశాలలో రూ.2లక్షల సుందరీకరణ పనులు చేయించారు. పేద విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. గణేశ్‌ను ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎంపిక చేయడంపై బీర్పూర్ ఎంఈవో నాగభూషణం, ఉపాధ్యాయులు అభినందించారు. -
సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి
జగిత్యాలరూరల్: సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోగులకు కావాల్సిన మందులు అందుబాటులో ఉంచుకోవాలని వైద్యులను ఆదేశించారు. ఇన్‌పేషెంట్లకు సత్వర సేవలందించాలని, అవుట్పేషెంట్లలో వ్యాధి లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా పరీక్షలు నిర్వహించాలని, రోగి లక్షణాలను రికార్డు చేయాలన్నారు. ముందస్తుగా వ్యాధి నిర్ధారణ జరిగితే మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. వైద్యులు ఆస్పత్రి సిబ్బంది సమయపాలన పాటించాలన్నారు. ల్యాబ్‌లో వైద్య పరీక్షల వివరాలను, స్టాఫ్ అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించారు. ఫార్మసీ విభాగంలో అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా..? లేదా..? తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, డీఎంహెచ్‌వో ప్రమోద్‌కుమార్, రూరల్ తహసీల్దార్ వరుణ్‌కుమార్ పాల్గొన్నారు. నిమజ్జనం ప్రశాంతంగా పూర్తి చేయాలి ధర్మపురి: గణపతి నిమజ్జనాన్ని శాంతియుతంగా నిర్వహించుకునేలా చూడాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ధర్మపురిలోని గోదావరి తీర ప్రాంతాలను గురువారం పరిశీలించారు. నిమజ్జనంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఏర్పాట్లు చేయాలని, విగ్రహాలను లోనికి తీసుకెళ్లడానికి సరిపడా తెప్పలను సమకూర్చుకోవాలని ఆదేశించారు. రద్దీని నియంత్రించడం, ప్రజల భద్రత వంటి అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. శానిటేషన్, హెల్త్ క్యాంపులు, మంచినీటి సౌకర్యాలు తదితర వాటిని ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. నిమజ్జనం సమయంలో భారీ విగ్రహాలు తీసుకెళ్లే వారికి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీవో మధుసూదన్, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్, తహసీల్దార్ శ్రీనివాసరావు తదితరులున్నారు. -
రసాయన శాస్త్రంలో పరిశోధనలు
జగిత్యాల: నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన నీలి వాసవి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్ర విభాగం అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ఈమె రసాయన శాస్త్రంలో చేసిన 15 పరిశోధనలు జాతీయ, అంతర్జాతీయస్థాయిలో ప్రచురితం అయ్యాయి. ప్రొఫెసర్ నసీం పర్యవేక్షణలో భూగర్భజలాలు, నేలపై ఘనవ్యర్థాలు అంశంపై పరిశోధన చేసి తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పట్టా పొందారు. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో సులభంగా వివరిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక పురస్కారానికి ఎంపిక చేసింది. ఆమెను కళాశాల ప్రిన్సిపల్ రామకృష్ణ, ప్రమోద్‌కుమార్, చంద్రయ్య, సంగీతరాణి, వరప్రసాద్, డాక్టర్ సురేందర్‌రెడ్డి అభినందించారు. -
● జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత
జగిత్యాలరూరల్: కేసీఆర్ పాలనలో సాగునీటి రంగానికి పెద్దపీట వేశారని, మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు మరమ్మతు చేయించారని జెడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వసంత అన్నారు. జగిత్యాల రూరల్ మండలం పొరండ్లలోని ఊర చెరువును గురువారం పరిశీలించారు. చెరువు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరడంతో కొందరు రైతుల పంటలు మునిగి నష్టపోతున్నారని తెలిపారు. ప్రభుత్వం చెరువుకు మరమ్మతు చేపట్టి షటర్లు బిగించాలని కోరారు. ఆమె వెంట జగిత్యాల సింగిల్ విండో చైర్మన్ పత్తిరెడ్డి మహిపాల్‌రెడ్డి, నాయకులు ఆనందరావు, మహేశ్, కర్నాల శ్రీను, లింగన్న, బాలకృష్ణ, పవన్, రవి, మల్లేశం, ప్రశాంత్, లక్ష్మణ్, నరేశ్ పాల్గొన్నారు. కేసీఆర్ పాలనలో సాగుకు పెద్దపీట -
నష్టంపై రైతులవారీగా వివరాల సేకరణ
సారంగాపూర్: భారీ వరదలు, వర్షాలకు నష్టపోయిన పంటలపై రైతువారీగా సర్వే చేపట్టినట్లు జి ల్లా వ్యవసాయాధికారి వి.భాస్కర్ అన్నారు. బుధవారం బీర్పూర్ మండలం రంగసాగర్లో ఇటీవలి వరదలు, వర్షాలకు నష్టపోయిన పంటలను పరిశీ లించారు. వరదలకు పత్తి, వరి పంటలకు భారీగా నష్టం వాటిల్లిందన్నారు. ఇసుకమేటలు వేసి, పలు చోట్ల భూములు కోతకు గురికావడంతో రైతులు తీవ్రంగా నష్టపోయినట్లు తెలిపారు. గోదావరి తీర రైతులకు నష్టం ఎక్కువగా ఉందన్నారు. నష్టపోయిన పంటలు, ఇసుకమేటలపై రైతువారీగా మండల వ్యవసాయ విస్తీర్ణాధికారులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సేకరణ పూర్తి కాగానే ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు. పాక్షికంగా దెబ్బతిన్న పంటలను కాపాడుకోవడానికి రైతులు అవసరమైన సస్యరక్షణ చర్యలు చేపట్టాలని, మండల వ్యవసాధికారులను సంప్రదించాలని సూచించారు. ఆయన వెంట మండల వ్యవసాయాధికారులు ప్రదీప్‌రెడ్డి, తిరుపతినాయక్, ఏఈవో అయ్యోరి వినోద్, రంగసాగర్ గ్రామ రైతులు ఉన్నారు. -
పక్కాగా పంటల లెక్క
● మొబైల్ యాప్‌లో వివరాల నమోదు ● క్షేత్రస్థాయిలో పంట.. సాగు విస్తీర్ణం పరిశీలన ● ఆన్లైన్లో అప్లోడ్ చేస్తున్న ఏఈవోలు ● జిల్లాలో ప్రారంభమైన క్రాప్ బుకింగ్ ప్రక్రియ మంథనిరూరల్: వానాకాలం సీజన్లో సాగు చేసిన పంటల నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. క్రాప్బుకింగ్పై ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేయడంతో వ్యవసాయ విస్తరణ అధికారులు క్షేత్రస్థాయిలో పంట నమోదు ప్రక్రియ ప్రారంభించారు. మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీల్లో ఆయా క్లస్టర్ల ఏఈవోలు పంటల నమోదు వివరాలను శరవేగంగా సేకరిస్తున్నారు. వెనువెంటనే ఆన్లైన్లో నమోదు చేయడంతో పంటలు, సాగు విస్తీర్ణం లెక్కలు పక్కగా తేలుతాయని భావిస్తున్నారు. 35 పంచాయతీలు.. ఆరు క్లస్టర్లలో.. మంథని మండలంలోని 35 గ్రామపంచాయతీలకు ఆరు క్లస్టర్లను ఏర్పాటు చేశారు. ఒక్కో క్లస్టర్ కింద ఐదు నుంచి ఆరు గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఈ ఆరు క్లస్టర్లలో ఆరుగురు వ్యవసాయ విస్తరణ అధికారులు పంటలను పరిశీలించి ఆన్లైన్లో పారదర్శకంగా నమోదు చేస్తున్నారు. ప్రత్యేక మొబైల్ యాప్ ద్వారా.. గత ప్రభుత్వం తొలుత పంటలు, సాగు విస్తీర్ణం వివరాలు సేకరించి ఆ తర్వాత ట్యాబ్‌లలో నమోదు చేసేవారు. ఈసారి అందుకు భిన్నంగా క్షేత్రస్థాయిలో ఏఈవోలు పంట, విస్తీర్ణం పరిశీలించిన తర్వాతే ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాల సేకరణ.. క్రాప్ బుకింగ్ ప్రక్రియలో రైతుపేరు, సర్వే నంబర్, బ్యాంకు ఖాతా నంబర్, పట్టాదారు పాసుబుక్, ఫోన్ నంబర్‌తోపాటు ఏఏ పంటలు ఎంత విస్తీర్ణంలో సాగు చేశారనే వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది. ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా పక్కాగా లెక్క ఉండేలా పారదర్శకంగా నమోదు ప్రక్రియను చేపట్టారు. 15 వేల ఎకరాల్లో వరి.. 8 వేల ఎకరాల్లో పత్తి.. మంథని మండలంలో ఈ వర్షాకాలం సీజన్లో సుమారు 15 వేల ఎకరాల్లో వరి, 6వేల నుంచి 8 వేల ఎకరాల్లో పత్తి పంట సాగు చేసినట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. అయితే, ప్రస్తుతం చేపట్టిన సర్వే ద్వారా క్రాప్ బుక్ంగ్ ద్వారా ఏ ఏ పంటలు ఎంత విస్తర్ణంలో సాగు చేశారనేది పక్కాగా తేలనుంచి. ప్రభుత్వ ఆదేశాల మేరకు నెలరోజుల్లోగా క్రాప్ బు కింగ్ పూర్తిచేయాల్సి ఉంటుంది. మండలంలోని ఆ రు క్లస్టర్లలో మా సిబ్బంది క్షేత్రస్థాయిలో పంటలు ప రిశీలించి ఆన్లైన్లో వివరాలు నమోదు చేస్తున్నారు. – అంజనీమిశ్రా, ఏడీఏ, మంథని -
గణేశ్ ఉత్సవాల్లో గంజాయి దందా
గోదావరిఖని: గణేశ్ ఉత్సవాల్లో యువతకు మత్తెక్కించేందుకు గంజాయి దందాకు సిద్ధమైన ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు గోదావరిఖని ఏసీపీ రమేశ్ తెలిపారు. బుధవారం పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్న కొత్తగూడెంలోని బూడిదగడ్డ ప్రాంతానికి చెందిన కోడూరి అభినవ్వర్ధన్, గోదావరిఖని శివాజీనగర్‌కు చెందిన చెరుకు శ్రీనివాస్ అడ్డగుంటపల్లి సిరి ఫంక్షన్‌హాల్ వెనుకాల చెట్లపొదల్లో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎస్సై రమేశ్ తన సిబ్బందితో దాడి చేశారు. 1.220 కిలోల డ్రై గంజాయి స్వాధీనం చేసుకున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే గంజాయి విక్రయిస్తున్నారు. అభినవ్వర్ధన్ జల్సాలకు అలవాటు ఈ దందా ఎంచుకున్నాడు. గతంలో ఈ ఇద్దరు రెండు, మూడుసార్లు గంజాయి తీసుకొచ్చి హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో విక్రయించారు. కొత్తగూడెం టూ గోదావరిఖని.. గోదావరిఖని చెందిన శ్రీనివాస్ అక్క కొత్తగూడెంలో నివాసం ఉంటోంది. అక్కడికి వెళ్లిన సమయంలో అభినవ్‌తో పరిచయం ఏర్పడింది. ఇది గంజాయి రవాణాకు తెరతీసింది. శ్రీనివాస్ తొలుత 250 గ్రాములు తీసుకొచ్చి ఒకవ్యక్తికి విక్రయించాడు. గోదావరిఖనిలో మంచిడిమాండ్ ఉందని, ఎక్కువ డబ్బులు సంపదించొచ్చని ఈ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. గణేశ్ నవరాత్రులు, నిమజ్జనం సందర్భంగా విక్రయాలు చేస్తే ఎక్కువ డబ్బులు వస్తాయనే ఆశతో వ్యాపారులతో బేరం కుదుర్చుకున్నాడు. కిలోకు రూ.15 వేలకు ఒప్పందం చేసుకుని రూ.5వేలు అ డ్వాన్స్ ఇచ్చాడు. ఈక్రమంలో పోలీసులకు చిక్కారు. నిందితులను చాకచక్యంగా పట్టుకున్న ఎస్సైలు రమేశ్, అనూష, క్రైంపార్టీ హెడ్ కానిస్టేబుళ్లు రమేశ్, శ్రీనివాస్ సదానందం, కానిస్టేబుళ్లు రమేశ్, మధూకర్, మధుసూదన్‌ను ఏసీపీ అభినందించారు. వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రవాణా చేస్తున్న ఇద్దరి అరెస్ట్ గోదావరిఖని ఏసీపీ రమేశ్ వెల్లడి