మెట్‌పల్లి సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా రాజారాం | - | Sakshi
Sakshi News home page

మెట్‌పల్లి సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా రాజారాం

Feb 4 2026 7:24 AM | Updated on Feb 4 2026 7:24 AM

మెట్‌

మెట్‌పల్లి సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా రాజారాం

మెట్‌పల్లి: మెట్‌పల్లి స్పెషల్‌ జూడిషియల్‌ సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా మెట్‌పల్లికి చెందిన న్యాయవాది దయ్య రాజారాం నియమితులయ్యారు. ఈ మేరకు లా సెక్రటరీ పాపిరెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో కూడా ఆయన కొంతకాలం ఈ బాధ్యతలు చేపట్టారు. తాజాగా మరోసారి నియామకం కావడంపై పలువురు న్యాయవాదులు ఆయనను అభినందించారు.

స్తంభంపల్లిలో ఎడ్లబండ్ల పోటీలు

వెల్గటూర్‌: మండలంలోని స్తంభంపల్లిలో స్వయంభూ పద్మావతీ సమేత శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ స్వామివారిని దర్శించుకున్నారు. పోటీల్లో జాబితాపూర్‌కు చెందిన ఆంజనేయస్వామి మొదటిస్థానం, కోట్లపల్లి సాగర్‌, నేరెళ్ల నరేశ్‌గౌడ్‌ ద్వితీయ స్థానంలో నిలవగా.. విజేతలకు మంత్రి బహుమతి ప్రదానం చేశారు. ఆలయ కమిటీ చైర్మన్‌ చింతల రాజయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు శైలేందర్‌రెడ్డి, ఉపసర్పంచ్‌ ప్రతాప్‌రావు, నాయకులు పాల్గొన్నారు.

గణితం బోధించిన కలెక్టర్‌

మెట్‌పల్లిరూరల్‌: మెట్‌పల్లి మండలం బండలింగాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాలను కలెక్టర్‌ సత్యప్రసాద్‌ మంగళవారం సందర్శించారు. విద్యార్థుల హాజరు, విద్యాబోధన, మధ్యాహ్న భోజనం అమలుపై తెలుసుకున్నారు. బోర్డుపై లెక్కలు రాసి విద్యార్థులకు అర్థమయ్యేలా వివరించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని, బాధ్యతాయుతంగా పనిచేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించి, పనుల్లో వేగం పెంచాలన్నారు. ఆర్డీవో శ్రీనివాస్‌, డీఈవో రాము, తహసీల్దార్‌ నీత, హౌసింగ్‌ పీడీ ప్రసాద్‌, ఎంపీడీవో సురేశ్‌, ఎంఈవో చంద్రశేఖర్‌, ఎంపీవో మహేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.

అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి

మెట్‌పల్లి: రోగులకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచాలని కలెక్టర్‌ సూచించారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిని తనిఖీ చేశారు. అనంతరం మందుల నిల్వ గదిని పరిశీలించారు. రోగులతో మాట్లాడి ఆస్పత్రిలోని సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట జిల్లా కో–ఆర్డినేటర్‌ రామకృష్ణ తదితరులున్నారు.

మెట్‌పల్లి సెకండ్‌ క్లాస్‌  మేజిస్ట్రేట్‌గా రాజారాం1
1/1

మెట్‌పల్లి సెకండ్‌ క్లాస్‌ మేజిస్ట్రేట్‌గా రాజారాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement