● ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్
కోరుట్ల/మెట్‌పల్లి: బీఆర్‌ఎస్ హయాంలోనే కోరుట్ల, మెట్‌పల్లి పట్టణాలు అభివృద్ధి చెందాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా బుధవారం కోరుట్లతోపాటు మెట్‌పల్లిలో ప్రచారం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందన్నారు. మున్సిపాలిటీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే మరింత అభివృద్ధికి ఆస్కారం ఉంటుందని తెలిపారు. మెట్‌పల్లి మున్సిపాలిటీకి పెద్ద ఎత్తున నిధులు తెచ్చామని, ప్రతి వార్డులో వసతులు కల్పించామని పేర్కొన్నారు. అభివృద్ధి కోసం బీఆర్‌ఎస్ అభ్యర్థులను భారీ మోజార్టీతో గెలిపించాలన్నారు.


