ధర్మపురి: పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ మండల, పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెప్పించిన భారీ కేక్ కట్ చేశారు. అంతకుముందుగా మంత్రి అడ్లూరి శ్రీలక్ష్మీనృసింహస్వామికి ప్రత్యేక పూజలు చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ గజమాలతో మంత్రిని సన్మానించారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్, ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జ పటేల్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎస్.దినేష్, మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, వైస్ చైర్మన్ రామన్న, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు, మాజీ ఎంపీపీ బాదినేని రాజేందర్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.


