మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారి చిన్న జయంతి సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తున్నారు. (Kondagattu Anjaneya Swamy Temple )
ఎటుచూసినా కాషాయ దుస్తులు ధరించిన దీక్షాపరుల సందడి కనిపిస్తోంది. (Hanuman Jayanti 2026)
బుధవారం ఉదయం నుంచే వివిధ ప్రాంతాల నుంచి కాలినడకన పెద్ద ఎత్తున స్వామివారి సన్నిధికి చేరుకుంటున్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, నిజామాబాద్, హైదరాబాద్‌తోపాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి భక్తులు జై హనుమాన్.. జైశ్రీరామ్.. నినాదాలతో కొండగట్టుకు తరలివస్తున్నారు.


