శ్రీకాళహస్తీశ్వరాలయానికి అనుబంధంగా వెలసిన ధర్మరాజులస్వామి ఆలయంలో వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఆదివారం శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు.
సుమారు 4వేలమంది భక్తులు కంకణధారులై అగ్నిగుండ ప్రవేశం చేశారు.
ఈ సందర్భంగా తొలుత సింహవాహనం అధిష్టించిన అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి అగి్నగుండం ఎదుట కొలువుదీర్చారు.
అనువంశిక పూజారి అగ్నిగుండంలోని నిప్పులను అమ్మవారి ఒడిలో పోసి ప్రత్యేక హారతులు సమర్పించారు.
అనంతరం పోతురాజును ధరించిన అనువంశిక పూజారులు మల్లెచెండును నిప్పుల్లో దొర్లించారు. ఈ క్రమంలోనే భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేశారు.
పవిత్ర ఘట్టం వీక్షించేందుకు పెద్దసంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.


