కొన్ని అరుదైన వ్యాధులు ఎందువల్ల వస్తాయనేది అంతుచిక్కదు. పోనీ నయం చెయ్యొచ్చ అంటే అదికూడా కష్టమే. అలాంటి వ్యాధిని నయం చేసి అతడి రూపాన్నే మార్చేసి బాధపెట్టిన మనోవ్యధకు ఉపశమనం కలిగించారు వైద్యలు. ఇంతకీ అతడికి వచ్చిన రుగ్మత ఏంటంటే..
చైనాలోని హునాన్ ప్రావిన్స్‌కు చెందిన లీ అనే 23 ఏళ్ల యువకుడు మానవ మెదడు ఉపరితలాన్ని పోలిన లోతైన మడతల తల చర్మవ్యాధితో బాధపడుతున్నాడు. అతుడు ఈ సమస్యను చిన్నతనంలో గమనించాడు. తన చర్మం గట్టిపడటాన్ని గమనించాడు. చూస్తుండగానే మందంగా మారి పెద్ద అసమాన మడతలు వచ్చేశాయి. అతనికి 14 ఏళ్లు వచ్చేసరికి, ఈ అసాధారణ పెరుగుదల అతని తల చర్మంలో దాదాపు సగానికి వ్యాపించి అతడి రూపురేఖల్నే మార్చింది. అది కాస్తా అతడి ఆత్మవిశ్వాసంపై తీవ్ర ప్రభావం చూపింది.
ఏళ్ల తరబడి పలు ఆస్పత్రులలో చికిత్స పొందాడు. ఫలితంగా ఆరోగ్యకరమైన తల చర్మం కణజాలం చాలా తక్కువగా మిగిలి, విపరీతమైన మచ్చలను మిగిల్చింది. పైగా పెద్దగా ఫలితం లేదు. దాంతో పలు ఆస్పత్రులను సంప్రదించగా..ఆరోగ్యకరమైన చర్మ కణజాలం లేనందున సర్జరీ ప్రమాదకరమని నిరాకరించాయి. లీ చివరకు జోంగ్నాన్ ఆసుపత్రిలోని ప్లాస్టిక్ సర్జరీ విభాగంలో డాక్టర్ జౌ బృందాన్ని సంప్రదించారు. ఆ వైద్యులు వీలైనంత ఎక్కువ ఆరోగ్యకరమైన తల చర్మాన్ని కాపాడటానికి వారు అతని ఇప్పటికే ఉన్న మచ్చల రేఖలను ఉపయోగించుకున్నారు.
గతేడాది వైద్యులు అతని తల చర్మంలోని రెండు ప్రాంతాల కింద టిష్యూ ఎక్స్‌పాండర్‌లను అమర్చారు.తదుపరి 11 నెలల పాటు, వారు క్రమంగా ఎక్స్‌పాండర్‌లలోకి ద్రవాన్ని ఎక్కించి, పునర్నిర్మాణం కోసం తగినంత కణజాలాన్ని సృష్టించడానికి ఆరోగ్యకరమైన చర్మాన్ని నెమ్మదిగా సాగదీశారు. ఫలితంగా తగినంత ఆరోగ్యకరమైన తల చర్మం అభివృద్ధి చెందింది.
ఆ తర్వాత వైద్యులు అసాధారణ కణజాలాన్ని తొలగించి, ప్రభావిత ప్రాంతాన్ని బాగుచేయడానికి మూడు గంటల పాటు శస్త్రచికిత్స నిర్వహించారు. ప్రస్తుతం లీ తల చర్మం సాధారణంగా కనిపించడమే గాక, చర్మంపై జుట్టు సాధారణంగా పెరగగలదని వైద్యులు తెలిపారు. దీంతో ఇన్నాళ్ల నుంచి లీ అనుభవించిన మనోవ్యధకు మగింపు పలికినట్లయింది.
(చదవండి: ఆ గ్రామం కనుమరుగ్వకుండా పోరాడిన ఒకేఒక్కడు..! ఇవాళ ప్రపంచమే..)


