బెర్లిన్: జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఎల్‌జీబీటీక్యూ+ (LGBTQ+) వర్గాల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించిన క్రిస్టోఫర్ స్ట్రీట్ డే (ప్రైడ్) వేడుకల్లో విషాదం అలముకుంది. వేడుకలు ముగిసే సమయాన ఓ తెల్లటి వ్యాన్ జనసమూహంపైకి దూసుకెళ్లడంతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు.
శనివారం రాత్రి బ్రాండెన్‌బర్గ్ గేట్ సమీపంలోని టియర్‌గార్టెన్ పార్క్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. అంతకుముందు లక్షలాది మందితో ప్రైడ్ పరేడ్ ఎంతో శాంతియుతంగా, ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది. అయితే రాత్రి 10 గంటల ప్రాంతంలో వేడుకలు ముగిసే సమయంలో విషాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన వ్యాన్ పార్కులోని గుమిగూడిన జనాల్ని ఢీకొని , చివరకు ఓ చెట్టును బలంగా తాకి ఆగిపోయింది.
🚨BREAKING🚨
CSD abgebrochen! Täter auf der Flucht! Auto rast in Menschenmenge. Aktuell Großeinsatz in Berlin Mitte - Tiergarten und Regierungsviertel komplett dicht. Menschen flüchten in Berliner HBF. Egal, wer der Schuldige ist - am Ende war's wieder ein "Rechter". pic.twitter.com/NqtodU3gYg— DavidGegenGoliath (@_david_brg) July 25, 2026
సమాచారం అందుకున్న వెంటనే అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులు సంఘటనా స్థలంలోనే వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. వారి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ దుర్ఘటనపై జర్మనీ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్, బెర్లిన్ మేయర్ కై వెగ్నర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాజంలో శాంతిభద్రతలకు భంగం కలిగించే ఈ చర్యను తీవ్రంగా ఖండించారు.


