హరారే వేదికగా జరిగిన రెండో టీ20లో జింబాబ్వేను 90 పరుగుల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో మూడు టీ20ల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.
220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది.
భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది.
Photo Credit : @BCCI Twitter (X)


