breaking news
Ishan Kishan
-
శాంసన్ మెరుపులు.. రెండో టీ20లో టీమిండియా ఘన విజయం
ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదికగా జరిగిన రెండో టీ20లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అఫ్గానిస్తాన్‌పై ఘన విజయాన్ని అందుకుంది. అఫ్గానిస్తాన్ విధించిన 160 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా 14.5 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అందుకుంది. ఓపెనర్ సంజూ శాంసన్ (57) అర్థసెంచరీ చేయగా, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (39) రాణించాడు. చివర్లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ (34 నాటౌట్), తిలక్ వర్మ (15 నాటౌట్) అజేయంగా నిలిచి జట్టును గెలిపించారు. ఆఫ్గన్ బౌలర్లలో రషీద్ ఖాన్ 3 వికెట్లు తీశాడు. ఈ నేపథ్యంలో మరో మ్యాచ్ మిగిలి ఉండగానే భారత్ 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. కెప్టెన్ ఇబ్రహీం జద్రన్ (37) టాప్ స్కోరర్‌గా నిలవగా, డార్విష్ రసూలీ (26), రషీద్ ఖాన్ (28) పర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో నితీశ్‌కుమార్ రెడ్డి మూడు వికెట్లు తీయగా, అర్ష్‌దీప్ సింగ్ 2 వికెట్లు, బుమ్రా, అక్షర్ పటేల్, బిష్ణోయిలు తలా ఒక వికెట్ పడగొట్టారు. ఇరుజట్ల మధ్య చివరి టీ20 గురువారం ఇదే స్టేడియం వేదికగా జరగనుంది.Series victory sealed 🔒Superb from start to finish as #TeamIndia make it 2️⃣-0️⃣ in the Friendship Cup 🇮🇳👏Scorecard ▶️ https://t.co/96e4nhbYLf#AFGvIND pic.twitter.com/zvWVii5nBC— BCCI (@BCCI) September 15, 2026ఇదీ చదవండి: రెన్షా శతకం, ఇల్లిస్ విజృంభణ.. తొలి వన్డే ఆసీస్‌దే..! -
అభిషేక్ శర్మ సుడిగాలి ఇన్నింగ్స్.. టీమిండియా ఘన విజయం
అఫ్గానిస్తాన్‌తో తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఇబ్రహీం జద్రాన్ బృందాన్ని ఏడు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా అఫ్గాన్ ఆతిథ్యం ఇస్తున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.టీమిండియా బౌలర్ల విజృంభణఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన అఫ్గానిస్తాన్ నామమాత్రపు స్కోరు చేసింది. ఓపెనర్లలో రహ్మనుల్లా గుర్బాజ్ డకౌట్ కాగా.. కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ (11) కూడా తేలిపోయాడు. మిగిలిన వారిలో సెదీకుల్లా అటల్ (13), గుల్బదిన్ నైబ్ (2), డార్విష్ రసూలీ (2) పేలవ ప్రదర్శన కనబరిచారు.దీంతో జట్టు కష్టాల్లో కూరుకుపోగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్ హాఫ్ సెంచరీ (44 బంతుల్లో 64)తో ఆదుకున్నాడు. సీనియర్ ఆల్‌రౌండర్ మహ్మద్ నబీ 33 పరుగులతో రాణించాడు. దీంతో అఫ్గాన్ నిర్ణీత ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 156 పరుగుల మేర గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ మూడు వికెట్లతో సత్తా చాటగా.. జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు.అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ 10 పరుగులు చేసి.. అజ్మతుల్లా ఒమర్జాయ్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. అయితే, మరో ఓపెనర్ అభిషేక్ శర్మ మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగాడు.కేవలం 22 బంతుల్లోనేఅఫ్గాన్ బౌలర్లపై విరుచుకుపడ్డ అభిషేక్ కేవలం 22 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 32 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఏడు ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 82 పరుగులు సాధించాడు. అయితే, సెంచరీకి చేరువవుతున్న వేళ మహ్మద్ నబీ బౌలింగ్‌లో రషీద్ ఖాన్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.మిగిలిన వారిలో వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (33 బంతుల్లో 42) రాణించగా.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 8, తిలక్ వర్మ 3 పరుగులతో అజేయంగా నిలిచారు. ఫలితంగా 13.4 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు నష్టపోయిన టీమిండియా 157 పరుగులు సాధించి టార్గెట్ పూర్తి చేసింది. తద్వారా అఫ్గాన్‌ను ఏడు వికెట్ల తేడాతో ఓడించింది.చదవండి: Asia Cup 2026 Final: చరిత్ర సృష్టించిన భారత ఓపెనర్𝐓𝐇𝐈𝐒 𝐊𝐈𝐍𝐃 𝐎𝐅 𝐇𝐈𝐓𝐓𝐈𝐍𝐆. 🤌💥When Abhishek Sharma gets going, the bat does the talking. 🔥Watch #AFGvIND 1st T20I, LIVE NOW on Sony Sports Ten 5 & Sony MAX.#SonySportsNetwork #SonyMAX #ExtraaaInnings pic.twitter.com/aLu13MB9JF— Sony Sports Network (@SonySportsNetwk) September 13, 2026 -
ఇషాన్ గాయంపై అప్డేట్ ఇచ్చిన శ్రేయస్
ఆఫ్ఘనిస్తాన్‌తో రేపు జరుగబోయే తొలి టీ20కి ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ మ్యాచ్‌కు స్టార్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా లేదా అనే సందేహాలపై కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ క్లారిటీ ఇచ్చాడు.దులీప్ ట్రోఫీ ఫైనల్లో సుదీర్ఘ ఇన్నింగ్స్‌లు (270, 80) ఆడటం వల్ల ఇషాన్ కొంత అలసటకు గురయ్యాడని, ప్రస్తుతం అతడు సౌకర్యంగానే ఉన్నాడని ఆయన చెప్పాడు. ఇషాన్ దులీప్ ట్రోఫీ ఫైనల్ తర్వాత నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తూ స్వల్ప గాయానికి గురయ్యాడు. దీంతో అతడు తాజాగా జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు కూడా దూరంగా ఉన్నాడు.ఇషాన్ ఆడకపోతే సంజూకు అవకాశం?ఒకవేళ ఇషాన్ కిషన్ పూర్తిగా కోలుకోకపోతే తొలి టీ20లో అతడికి విశ్రాంతి ఇచ్చే అవకాశం కూడా ఉంది. అదే జరిగితే సంజూ శాంసన్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు.ఇషాన్ స్థానంలో ఒకవేళ ఆల్‌రౌండర్‌ను తీసుకోవాలని భావిస్తే, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది.కాగా, ఆఫ్ఘనిస్తాన్ జట్టు మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం భారత్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్‌లోని తొలి టీ20 రేపు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుంది. ఇదీ చదవండి: చరిత్ర సృష్టించిన జో రూట్.. సచిన్ వరల్డ్ రికార్డు బద్దలు -
#80s Trend: టీమిండియా క్రికెటర్లకు బీసీసీఐ సర్ప్రైజ్!
భారత్‌ను ప్రస్తుతం ‘80s’ ట్రెండ్ షేక్ చేస్తోంది. ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్, వాట్సాప్ ఇలా ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ చూసుకున్నా ‘80s’ ట్రెండ్ పిచ్చ వైరల్‌గా మారిపోయింది. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల దాకా తమకు నచ్చిన ఫొటోను చాట్ జీపీటీకి ఇచ్చి ప్రాంప్ట్ సహాయంతో ‘80s’ ట్రెండ్ ఫొటోలను సృష్టించి స్టేటస్‌లుగా పెట్టేస్తున్నారు. ఇప్పుడు ఇదే ‘80s’ ట్రెండ్ టీమిండియా క్రికెట్‌కు కూడా పాకింది. తాజాగా బీసీసీఐ తన అధికారిక ఎక్స్ ఖాతాలో టీమిండియా క్రికెటర్ల 80s ట్రెండ్ ఫొటోలను పంచుకుంది. అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ నేపథ్యంలో రేపటి నుంచి తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న టీమిండియా క్రికెటర్లకు వారి ‘80s’ ఫొటోలను చూపించింది. దీనిపై ఒక్కో క్రికెటర్ ఒక్కోలా రియాక్ట్ అవ్వడం కనిపించింది. Photo Credit: BCCI Twitterముఖ్యంగా అక్షర్ పటేల్, ఇషాన్ కిషన్, అభిషేక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ, అర్షదీప్ సింగ్‌లు తమ ‘80s’ ఫొటోలు చూసుకొని తెగ మురిసిపోయారు. అభిషేక్ శర్మ అయితే అచ్చం హాలీవుడ్ హీరోని తలపించే విధంగా ఉన్నాడంటూ ఇషాన్ కిషన్ ఆటపట్టించడం విశేషం. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. బుమ్రా, సంజూ శాంసన్ ఇలా అందరు క్రికెటర్లు తమ ఫొటోలను గుర్తుపట్టగా.. రవి బిష్ణోయి, యష్ ఠాకూర్లు మాత్రం తమ ఫొటోలను పోల్చుకోలేకపోయారు. Photo Credit: BCCI Twitterమొదట శివమ్ దూబే తన ఫొటో బదులు యశ్ ఠాకూర్‌ను చూపించాడు. అయితే వెంటనే తన ఫొటోను చూపిస్తూ.. ఇందాకా చూపించింది యశ్ ఠాకూర్‌ది అని పేర్కొన్నాడు. ఇక బుమ్రా మాత్రం తన ఫొటోను చూసుకోవడానికి ఇష్టపడలేదు. 2 నిమిషాల 40 సెకన్ల నిడివి ఉన్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. వీలైతే మీరు ఒక లుక్కేయండి.Photo Credit: BCCI Twitterఇక రేపు (ఆదివారం) భారత్, అఫ్గానిస్తాన్‌ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. జట్టు కూర్పు ఇప్పటికే ఒక అంచనాకు వచ్చినప్పటికీ, ఓపెనింగ్ విషయంలోనే మేనేజ్మెంట్ ఎటూ తేల్చుకోలేకపోతుంది. ఓపెనింగ్‌లో వైభవ్ లేదా శాంసన్‌లలో ఎవరిని ఆడిస్తారనేది చూడాలి. విశ్వసనీయ సమాచారం మేరకు వైభవ్‌ను బెంచ్‌కు పరిమితం చేసి శాంసన్‌కు అవకాశమివ్వనున్నట్లు తెలుస్తోంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లకు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదిక కానుంది.Vintage vibes. Priceless reactions. 😂🎥 #TeamIndia takes on the 1980s trend 😉 - By @RajalArora #AFGvIND pic.twitter.com/nSaClHHdyn— BCCI (@BCCI) September 12, 2026ఇదీ చదవండి: ఆసియా గేమ్స్‌కు కొత్త రంగు జెర్సీలో టీమిండియా! -
రేపే మ్యాచ్.. అంతలోనే డబుల్ సెంచరీ వీరుడికి గాయం!
అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు గాయపడ్డాడు. తొలి టీ20 కోసం శుక్రవారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో టీమిండియా తీవ్రంగా శ్రమించింది. ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తుండగా కిషన్ నడుము నొప్పికి గురయ్యాడు. నెట్ బౌలర్ నవదీప్ సైనీ విసిరిన ఒక వేగవంతమైన బౌన్సర్‌ను ఎదుర్కొనే క్రమంలో కిషన్‌కు ఈ సమస్య తలెత్తంది. దీంతో అతడు ప్రాక్టీస్ మధ్యలోనే డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లిపోయాడు. కీలక మ్యాచ్‌కు ముందు కిషన్ గాయపడటంతో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ఈ జార్ఖండ్ స్టార్ గాయం తీవ్రతపై నెట్ బౌలర్ నవ్‌దీప్ సైనీ తాజాగా బిగ్ అప్డేట్ ఇచ్చాడు."నేను, ఇషాన్ చాలా కాలంగా కలిసి ఆడుతున్నాం. అతడి బలహీనతలు నాకు బాగా తెలుసు. ఈ క్రమంలోనే షార్ట్ బాల్‌తో అతడిని పరీక్షించాలనుకున్నాను. కానీ అతడు ఆ బంతిని ఆడలేకపోయాడు. నడము నొప్పి రావడంతో వెళ్లిపోయాడు. ఆ తర్వాత అతడి వద్దకు వెళ్లి ఎలా ఉందని అడిగాను?. అంతా బాగానే ఉందని చెప్పాడు. కాబట్టి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు" అని సైనీ పేర్కొన్నాడు. కిషన్ ప్రస్తుతం ఫిజియో కమలేష్ జైన్ పర్యవేక్షణలో ఉన్నాడు. కాగా కిషన్ ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇటీవల ముగిసిన దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈ జార్ఖండ్ ఆటగాడు డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఇక భారత్-అఫ్గానిస్తాన్ మధ్య తొలి టీ20 ఆదివారం జరగనుంది. జస్ప్రీత్ బుమ్రా, నితీష్ కుమార్ రెడ్డి, సుందర్ వంటి స్టార్ ప్లేయర్లు తిరిగి కమ్‌బ్యాక్ ఇచ్చారు.చదవండి: చరిత్ర సృష్టించిన టీమిండియా ప్లేయర్.. 131 ఏళ్లలో ఒకే ఒక్కడు -
'డీఆర్ఎస్ ఏముందిలే బ్రో.. కాబోయే కెప్టెన్‌వి నువ్వు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. కెప్టెన్‌గా మాత్రమే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టిన ఇషాన్ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి 350కి పైగా పరుగులు సాధించి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు. మరోవైపు సెమీస్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో 92 రన్స్, రెండో ఇన్నింగ్స్‌లో 40 పరుగులు) కీలక ఇన్నింగ్స్ ఆడిన వైభవ్ సూర్యవంశీ ఫైనల్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. కానీ తనకిచ్చిన వైస్ కెప్టెన్సీ బాధ్యతలను మాత్రం వైభవ్ సమర్థంగా నిర్వహించాడు. మ్యాచ్‌లో ఇషాన్ కిషన్‌కు తలలో నాలుకలా కొనసాగుతూ వచ్చిన వైభవ్ తన కెప్టెన్ డీఆర్ఎస్ నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించాడు. అంతేకాదు సెమీస్‌లో ఇషాన్ గాయంతో కొన్ని ఓవర్ల పాటు మైదానంలోకి రాలేదు. ఆ సమయంలో వైభవ్ స్టాండిన్ కెప్టెన్‌గానూ అదరగొట్టాడు. అతడు తీసుకున్న డీఆర్ఎస్ ఫలితాలు అనుకూలంగా రావడంతో తొలి విజయం సాధించాడు. ఈ నేపథ్యంలో ఫైనల్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఈస్ట్‌జోన్ డగౌట్ వద్ద ఇషాన్ కిషన్.. వైభవ్ సూర్యవంశీని ఆకాశానికెత్తిన వీడియోను బీసీసీఐ కాస్త ఆలస్యంగా విడుదల చేసింది. ఈ వీడియోలో వైభవ్‌ను ఇషాన్ కిషన్ సరదాగా ఆటపట్టించాడు. వైభవ్ ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో అక్కడికి వచ్చిన ఇషాన్ తన సమక్షంలో వైభవ్ మాట్లాడాలంటూ నవ్వుతూ పేర్కొన్నాడు.ఇషాన్ మాట్లాడుతూ.."డీఆర్ఎస్ విషయంలోనూ ప్రతి చోటా క్రెడిట్ అంతా వైభవ్‌కే దక్కింది. నిజానికి రివ్యూ తీసుకోవాలని నేను నిర్ణయించుకున్నా. కానీ దగ్గరికి వచ్చి చాలా కాన్ఫిడెంట్‌గా ‘రివ్యూ లే లో భాయ్’ అంటూ చెప్పాడు. అంతే.. ఇంటర్నెట్ అంతా ‘వైభవ్, వైభవ్..’ అంటూ ప్రశంసలు. కెప్టెన్‌గా డీఆర్ఎస్ తీసుకునేది నేను.. క్రెడిట్ అంతా ఈ చిచ్చర పిడుగుకే వచ్చింది" అంటూ ఇషాన్ సరదాగా వైభవ్‌ను ట్రోల్ చేశాడు.దీనికి వైభవ్ సూర్యవంశీ కూడా ఇషాన్‌కు స్టన్నింగ్ రిప్లై ఇచ్చాడు. "మీరు ఉన్నప్పుడు రివ్యూ తీసుకోమని చెప్పింది నేనే.. కానీ గాయంతో పెవిలియన్‌లో ఉన్నప్పుడు డీఆర్ఎస్ తీసుకున్నది ఎవరు? అది కూడా చెప్పండి" అంటూ వైభవ్ చురక వేశాడు. వైభవ్ సమాధానాన్ని ఇషాన్ అలా చూస్తూ ఉండిపోయాడు.‘అవును.. అప్పుడు కూడా వైభవే రివ్యూలు తీసుకున్నాడు. సక్సెస్ అయ్యాడు. అతడిలో కెప్టెన్ అయ్యే లక్షణాలు చాలా ఉన్నాయి. భవిష్యత్తులో వైభవ్ కెప్టెన్ అయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం అతడి కెరీర్ ఎలా సాగుతుందో. వైభవ్ జట్టులో ఉండటం వల్ల చాలా వరకు ఒత్తిడి తగ్గుతుంది. జట్టులోని ప్రతి ఒక్కరినీ.. అది జూనియర్ అయినా, సీనియర్ అయినా.. జాగ్రత్తగా చూసుకుంటాడు. ఓహ్.. జూనియర్ అంటే నువ్వు ఒక్కడివే కదా! సారీ.. సారీ’ అంటూ ఇషాన్ మరోసారి సరదాగా వ్యాఖ్యానించాడు.Ishan Kishan with Vaibhav Sooryavanshi. 😂❤️ pic.twitter.com/hAB688xia1— Mufaddal Vohra (@mufaddal_vohra) September 11, 2026Read: ‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’ -
‘వైభవ్.. నువ్వు నా కెరీర్‌కు కూడా సాటి రాలేవు’
ఇషాన్ కిషన్ సారథ్యంలోని ఈస్ట్‌జోన్ జట్టు 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీని గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఫైనల్లో సౌత్‌జోన్‌పై తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో ఈస్ట్‌జోన్ టైటిల్‌ను అందుకుంది. ఈస్ట్‌జోన్ టైటిల్ గెలవడంలో జట్టులోని ప్రతీ ఆటగాడిది కీలకపాత్రే అని చెప్పొచ్చు. ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ ధనాదన్ ఆటతీరు, అభిమన్యు ఈశ్వరన్ క్లాస్, కెప్టెన్ ఇషాన్ కిషన్ మాస్ డబుల్‌సెంచరీ, కుమార్ కుషాగ్ర సెంచరీ.. ఇక బౌలింగ్‌లో ముకేశ్‌కుమార్, మహ్మద్ షమీ.. ఇలా జట్టు మొత్తం సమిష్టి ప్రదర్శన చేయడంతోనే ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీని దక్కించుకుంది. మ్యాచ్ ముగిసిన అనంతరం వైభవ్ సూర్యవంశీపై టీమిండియా సీనియర్ బౌలర్ మహ్మద్ షమీ ప్రశంసలు కురిపించాడు. కనీసం నా కెరీర్ వయసుకు కూడా సాటి రాని వైభవ్ ఇవాళ స్టార్ ఆటగాడిగా మారిపోయాడని షమీ పేర్కొన్నాడు. షమీ మాట్లాడుతూ.."నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. మా జట్టులో 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు. నిజం చెప్పాలంటే వైభవ్ వయసు అక్షరాలా నా కెరీర్‌తో వయసుతో సమానం. అతడిలో టీనేజ్ అమాయకత్వం అలాగే ఉంది. అందరితో సరదగా జోకులు వేయడానికి ఇష్టపడతాడు. 15 ఏళ్ల వయసులో ఒక కుర్రాడు ఏం చేస్తాడో వైభవ్ అదే చేస్తున్నాడు. కానీ పరిణితితో కూడిన దృక్పథాన్ని అలవరచుకున్నాడు. ఏ విషయాన్నైనా త్వరగా గ్రహించగల శక్తి అతడి సొంతం. వైభవ్ లాంటి యువకులు ఇప్పటికే చాలా పరిణితి చెంది ఉంటారు. క్రికెట్ ఆడే స్థాయి, ఐపీఎల్, ఇతర ఒత్తిడుల కారణంగా ఎంతో పరిణితి వస్తోంది. వైభవ్ విషయంలో అది ఎప్పుడో రుజువయ్యింది. కాబట్టి అలాంటి వాళ్లకు ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం లేదు." అని చెప్పుకొచ్చాడు.2011లో జన్మించిన వైభవ్ వయసుతోనే షమీ కెరీర్ వయసు సమానం కావడం విశేషం. 2011లో షమీ తొలిసారి దేశవాళీలో సీనియర్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. ఇక 13 ఏళ్ల వయసులో ఐపీఎల్లో ఆడే అవకాశం ఎంతమంది ఆటగాళ్లకు లభిస్తుంది? కానీ వైభవ్ ఆ అవకాశాన్ని పొందడమే కాదు, తనని తాను నిరూపించుకున్నాడు. ఐపీఎల్ 2025 సీజన్లో ఏడు మ్యాచ్‌లు ఆడి, 206.56 స్ట్రైక్ రేట్‌తో 252 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ 2026 సీజన్లో వైభవ్ సూర్యవంశీ అత్యధిక పరుగులు (776 పరుగులు) చేసి ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు. తన ఆటతో వైభవ్ రాజస్తాన్ రాయల్స్‌ను ఒంటిచేత్తో ప్లేఆఫ్స్ చేర్చడం విశేషం.షమీ, వైభవ్ కీలకపాత్రఈస్ట్జోన్ దులీప్ ట్రోఫీని ఎగరేసుకుపోవడంలో షమీ, వైభవ్ సూర్యవంశీలు కీలకపాత్ర పోషించారు. నార్త్ ఈస్ట్‌జోన్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో విఫలమైనప్పటికీ, సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీస్‌లో వైభవ్ సూర్యవంశీ (92, 40 పరుగులు) అదరగొట్టాడు. ఇక ఫైనల్లో 44 పరుగులు చేసి జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. మరోవైపు, క్వార్టర్ ఫైనల్స్‌లో షమీ పొదుపుగా బౌలింగ్ చేయగా, సెమీస్‌లో 5 వికెట్లు పడగొట్టి సెంట్రల్ జోన్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశాడు. ఇక ఫైనల్స్‌లో, అతను ఫ్లాట్ పిచ్‌పై రవిచంద్రన్ స్మరణ్ వంటి కీలక వికెట్‌తో సహా మరో 2 వికెట్లు పడగొట్టాడు.Read: ఫైనల్లో సబలెంకా; పగోడికి కూడా ఈ కష్టం రాకూడదు! -
గెలుపు జోష్‌లో హల్చల్ చేసిన ఇషాన్, వైభవ్
దులీప్ ట్రోఫీ 2026 టైటిల్‌ను ఈస్ట్ జోన్ కైవసం చేసుకుంది. సౌత్ జోన్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్ డ్రా అయినా, తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం ఆధారంగా ఆ జట్టు విజేతగా నిలిచింది. ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడం ఇది మూడోసారి. పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం ఇషాన్ కిషన్ నేతృత్వంలో ఈ జట్టు చాంపియన్‌గా అవతరించింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026టైటిల్ గెలిచిన తర్వాత ఈస్ట్ జోన్ ఆటగాళ్ల సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా కెప్టెన్ ఇషాన్ కిషన్, వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ స్టంప్స్ చేతబట్టి భాంగ్రా డ్యాన్స్ చేయడం ఫ్యాన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. జట్టు కోచ్ రతన్ కుమార్, సహాయక సిబ్బంది, ఇతర ఆటగాళ్లతో కలిసి ఇషాన్, వైభవ్ ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ గెలుపును ఆస్వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.బ్యాట్‌తోనూ అదరగొట్టిన ఇషాన్ కిషన్టైటిల్ గెలిచాక తనదైన శైలిలో చిందులేసిన ఇషాన్, ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడంలోనూ అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో అతడు భారీ డబుల్ సెంచరీ (270), హాఫ్ సెంచరీ (80) సాయంతో 350 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌లో తన జట్టు భారీ స్కోర్ (708) చేయడానికి ప్రధాన కారకుడయ్యాడు. ఈ స్కోరే (ఆధిక్యం) ఈస్ట్ జోన్ టైటిల్ గెలవడానికి కారణమైంది. బ్యాట్‌తో తన అద్భుత ప్రదర్శన కారణంగా ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సౌత్ జోన్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో అద్బుత పోరాటం (99) చేసిన ఆ జట్టు కెప్టెన్ తిలక్ వర్మ ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా నిలిచాడు. తిలక్ అంతకుముందు సెమీఫైనల్లో అద్భుత శతకంతో మెరిశాడు. చదవండి: దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్. -
దుమ్ములేపిన ఇషాన్ కిషన్.. 13 ఏళ్ల తర్వాత మరో టైటిల్
దేశవాళీ ప్రతిష్టాత్మక ఫస్ట్ క్లాస్ టోర్నీ దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకుంది. దాదాపు పదమూడేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మరోసారి చాంపియన్‌గా అవతరించింది. కెప్టెన్‌గా, ఆటగాడిగా ఈ విజయంలో ఇషాన్ కిషన్ కీలక పాత్ర పోషించాడు. మరోవైపు.. సౌత్ జోన్ సారథిగా వ్యవహరించిన తిలక్ వర్మ బ్యాటర్‌గా రాణించినప్పటికీ.. కెప్టెన్‌గా మాత్రం చేదు అనుభవం ఎదుర్కొన్నాడు.𝙏𝙝𝙖𝙩 𝙒𝙞𝙣𝙣𝙞𝙣𝙜 𝙁𝙚𝙚𝙡𝙞𝙣𝙜 🏆 Congratulations to the Ishan Kishan-led East Zone on winning their third #DuleepTrophy title 👏👏#EZvSZ | @ishankishan51 pic.twitter.com/u6D4UvOTEp— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్ ఆదివారం మొదలైంది. టాస్ గెలిచి తొలి రెండురోజుల పాటు బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్ జట్టు.. మొదటి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఇషాన్ డబుల్ సెంచరీటాపార్డర్లో ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44).. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) అదరగొట్టారు. మిడిలార్డర్లో ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ (270)తో కదం తొక్కాడు. మరోవైపు.. కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101).. అనుకుల్ రాయ్ (45), ఎండీ కౌనియన్ ఖురేషి (40) రాణించారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది. కెప్టెన్ తిలక్ వర్మ 99 పరుగులు చేయగా.. దేవదత్ పడిక్కల్ 62 పరుగులతో రాణించాడు. మిగతా వాళ్లలో సీవీ మిలింద్ 43 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ మూడు వికెట్లు పడగొట్టగా.. మహ్మద్ షమీ, ఎండీ కౌనియన్ ఖురేషి, శిఖర్ మోహన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఈ క్రమంలో సౌత్ జోన్ 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్ ఆడించకుండా..ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బుధవారమే బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.ఇషాన్ 80 పరుగులు చేయగా.. శిఖర్ మోహన్ 52 పరుగులతో రాణించాడు. ఇక ఆఖరిదైన గురువారం నాటి ఐదో రోజు ఆటలో ఆల్‌రౌండర్ ఖురేషి అజేయ శతకం (116)తో రాణించగా.. అనుకుల్ రాయ్ హాఫ్ సెంచరీ (64) సాధించాడు. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా 46 పరుగులు చేశాడు.మ్యాచ్ డ్రా.. ఈస్ట్దే టైటిల్ఈ క్రమంలో 388 పరుగుల వద్ద ఏడు వికెట్ల నష్టానికి ఈస్ట్ తమ రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. తద్వారా మొత్తంగా 760 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది. దీంతో ఆఖరి రోజు ఆట కాబట్టి సౌత్ జోన్ ‘డ్రా’కు అంగీకరించింది. నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లోనూ ఈస్ట్ ఆధిక్యంలో ఉన్నందున ట్రోఫీ ఈస్ట్ జోన్‌కే దక్కింది. ఇషాన్ కిషన్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలవగా.. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది.Handshakes in the middle to conclude a fantastic Final 🤝East Zone clinch the #DuleepTrophy 2026 title by virtue of first-innings lead 🏆#EZvSZ pic.twitter.com/4DJjNHkAHD— BCCI Domestic (@BCCIdomestic) September 10, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. 65 ఏళ్లలో ఒకే ఒక్కడు
చెపాక్ వేదికగా సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అసాధరణ ప్రదర్శన చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో భారీ డబుల్ సెంచరీతో కదం తొక్కిన ఇషాన్(270).. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహాలో మెరుపులు మెరిపించాడు. కేవలం 98 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లతో 80 పరుగులు చేశాడు.ఈ భారత వికెట్ కీపర్ బ్యాటర్ మొత్తంగా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 350 పరుగులు చేశాడు. తద్వారా 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో ఒక మ్యాచ్‌లో 350 పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా కూడా కిషన్ నిలిచాడు. ఇంతకుముందు భారత మాజీ క్రికెటర్ రామణ్ లంబా చేసిన 320 పరుగులే అత్యధికంగా ఉండేది. 1987లో భిలాయ్ వేదికగా వెస్ట్ జోన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్త్ జోన్ తరపున లంబా ఈ ఫీట్ సాధించాడు. తాజా నాక్‌తో లంబాను అధిగమించి కిషన్ సరికొత్త చరిత్ర సృష్టించాడు.అడుగు దూరంలోఇక ఈ ప్రతిష్టాత్మక దులీప్ ట్రోఫీని ఈస్ట్ జోన్ జట్టు మూడోసారి సొంతం చేసుకునేందుకు అడుగు దూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌కు నేడు చివరి రోజు కాగా... ప్రస్తుతం ఈస్ట్ ఓవరాల్‌గా 584 పరుగులు ముందంజలో ఉంది. మ్యాచ్ ‘డ్రా’ కావడం ఖాయం కాబట్టి తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందుకున్న ఈస్ట్ విజేతగా నిలవడం లాంఛనమే. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్ జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 5 వికెట్లకు 212 పరుగులు చేసింది. తిలక్ వర్మ 99 అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 242/6తో బుధవారం ఆట కొనసాగించిన సౌత్‌జోన్ తమ మొదటి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ తిలక్ వర్మ (99; 9 ఫోర్లు) ఒక్క పరుగు తేడాతో శతకం చేజార్చుకోగా, సీవీ మిలింద్ (43; 7 ఫోర్లు) రాణించాడు. ఈస్ట్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత సౌత్‌కు ‘ఫాలోఆన్’ ఇవ్వకుండా ఈస్ట్ బ్యాటింగ్‌కు దిగింది. వైభవ్ సూర్యవంశీ (8), ఈశ్వరన్ (3) విఫలమైనా...ఇషాన్ కిషన్, శిఖర్ మోహన్ మూడో వికెట్‌కు 126 పరుగులు జోడించి జట్టు ఆధిక్యాన్ని మరింత పెంచారు.చదవండి: పసికూనపై సౌతాఫ్రికా ప్రతాపం.. 99 పరుగుల తేడాతో ఘన విజయం -
584 పరుగుల ఆధిక్యం.. టైటిల్‌కు అడుగు దూరంలో ఈస్ట్‌జోన్!
దులీప్ ట్రోఫీని అందుకునేందుకు ఈస్ట్‌జోన్ జట్టు అడుగుదూరంలో నిలిచింది. సౌత్‌జోన్‌తో జరుగుతున్న ఫైనల్లో నాలుగోరోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ తమ రెండో ఇన్నింగ్స్‌లో 51 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. కుమార్ కుషాగ్ర (34), ఖురేషీ (26) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ 584 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది. గురువారం ఆటకు చివరి రోజు కావడంతో ఈస్ట్‌జోన్ గెలుపు లాంఛనమే. ఐదోరోజు ఉదయం సెషన్లో వేగంగా బ్యాటింగ్ చేసి సౌత్‌జోన్ ముంగిట 650 పరుగుల లక్ష్యాన్ని టార్గెట్‌గా ఉంచే అవకాశముంది. ఇంత టార్గెట్ ఛేదించడం అసాధ్యం కాబట్టి మ్యాచ్ డ్రా అవనుంది. దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ విజేతగా నిలవనుంది. దీంతో 13 ఏళ్ల తర్వాత దులీప్ ట్రోఫీలో ఫైనల్ చేరిన ఈస్ట్‌జోన్ చాంపియన్‌గా నిలిచేందుకు అడుగుదూరంలో ఉంది.Photo Credit: BCCI Twitterతొలి ఇన్నింగ్స్ మాదిరే రెండో ఇన్నింగ్స్‌ను వేగంగా ఆరంభించిన ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు వైభవ్ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) శుభారంభం అందించలేకపోయారు. అయితే మిడిలార్డర్లో శిఖర్ మోహన్ (52), కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), కుమార్ కుషాగ్ర (34) రాణించడంతో ఈస్ట్‌జోన్ 200 పరుగుల మార్క్‌ను దాటింది. సౌత్‌జోన్ బౌలర్లలో సిరాజ్, త్రిపురానా విజయ్, నిదీష్, షేక్ రషీద్‌లు తలా ఒక వికెట్ తీశారు. అంతకముందు సౌత్‌జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ వర్మ (99) సెంచరీ చేజార్చుకోగా, పడిక్కల్ (62), సీవీ మిలింద్ (43) పర్వాలేదనిపించారు. ముఖేశ్‌కుమార్ 3 వికెట్లు తీయగా, షమీ, ఖురేషీ, శికర్ మోహన్‌లు తలా 2 వికెట్లు పడగొట్టారు.MD Nidheesh breaks the partnership 👏He gets the crucial wicket of East Zone captain Ishan Kishan who played yet another superb knock of 80(98) 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/j9C01OLgmB— BCCI Domestic (@BCCIdomestic) September 9, 2026Read: షాకింగ్.. కోహ్లిపై ఆధారపడిన పాక్ మహిళా ప్లేయర్లు! -
ఏ బౌలర్‌ను వదల్లేదు.. భీకర ఫామ్‌లో ఇషాన్ కిషన్!
టీమిండియా వికెట్ కీపర్, ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భీకర ఫామ్‌లో ఉన్నాడు. సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇప్పటికే డబుల్ సెంచరీతో బీభత్సం సృష్టించిన ఇషాన్ కిషన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును ప్రదర్శిస్తున్నాడు. రెండో ఇన్నింగ్స్‌లో వన్డే తరహా బ్యాటింగ్‌తో అలరించిన ఇషాన్ 98 బంతుల్లో 80 పరుగులు చేసి ఔటయ్యాడు. అతడి ఇన్నింగ్స్‌లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు ఉన్నాయి. అతడికి తోడు శిఖర్ మోహన్ (52) అర్థసెంచరీతో చెలరేగాడు. 41 ఓవర్లు ముగిసేసరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది. ఈస్ట్‌జోన్ ఇప్పటికే 533 పరుగుల భారీ ఆధిక్యంలో కొనసాగుతోంది.త్రిపురానాను దంచికొట్టాడు..ఫిఫ్టీ మార్క్ సాధించిన తర్వాత త్రిపురానా వేసిన ఇన్నింగ్స్ 25వ ఓవర్లో ఇషాన్ కిషన్ విధ్వంసం సృష్టించాడు. ఆ ఓవర్లో వరుసగా 4,6,6, 4 బాదడంతో పాటు సింగిల్ సహా మొత్తం 17 పరుగులు పిండుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ బాదే క్రమంలో ఏ బౌలర్‌ను విడిచిపెట్టని ఇషాన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ అదే జోరును కనబరుస్తూ ప్రతీ బౌలర్‌ను చితక్కొడుతూ బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మ్యాచ్ విషయానికొస్తే.. తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులకు ఆలౌటైన ఈస్ట్‌జోన్, ఆ తర్వాత సౌత్‌జోన్‌ను 336 పరుగులకే కట్టడి చేసి తొలి ఇన్నింగ్స్‌లో 372 పరుగుల ఆధిక్యం సాధించింది. మ్యాచ్ డ్రా అయ్యే అవకాశం ఉండడంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ దులీప్ ట్రోఫీ టైటిల్ అందుకోనుంది.4,6,6,4 BY ISHAN KISHAN - He smashing everyone in Duleep Trophy final 🥶 pic.twitter.com/lKPAA2awOY— Johns. (@CricCrazyJohns) September 9, 2026Read: ఆరేళ్లుగా ఎదురుచూపులు.. 50వేల టికెట్లు హాంఫట్! -
300 పరుగులు పూర్తి చేసిన ఇషాన్ కిషన్
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మరో మైలురాయిని తాకాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 270 పరుగులు చేసిన అతడు.. రెండో ఇన్నింగ్స్‌లోనూ సత్తా చాటి, మ్యాచ్ మొత్తంలో 300 పరుగులు పూర్తి చేశాడు. త్రిపురణ విజయ్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాది ఈ ఘనత సాధించాడు. నాలుగో రోజు టీ విరామం సమయానికి ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్ల నష్టానికి 95 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (3) తక్కువ స్కోర్లకే ఔట్ కాగా.. ఇషాన్ కిషన్ 48, శిఖర్ మోహన్ 34 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. సిరాజ్, త్రిపురణ విజయ్‌కు తలో వికెట్ దక్కింది.తృటిలో సెంచరీ చేజార్చుకున్న తిలక్అంతకుముందు తిలక్ వర్మ ఒంటరిపోరాటం చేయడంతో సౌత్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌటైంది. తిలక్ 99 పరుగుల వద్ద ఔటయ్యాడు. తిలక్‌కు చామ మిలింద్ (43) సహకరించడంతో సౌత్ జోన్ 300 పరుగుల మార్కును దాటగలిగింది. దీనికి ముందు దేవ్‌దత్ పడిక్కల్ (62) అర్ద సెంచరీతో రాణించాడు. సౌత్ జోన్ ఇన్నింగ్స్‌లో పడిక్కల్, తిలక్ మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. ఈస్ట్ జోన్ బౌలర్లలో ముకేశ్ కుమార్ 3, షమీ, ఖురేషి, శిఖర్ మోహన్ తలో 2 వికెట్లు తీశారు.ఇషాన్ డబుల్ ధమాకాఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇషాన్ కిషన్ ఏకంగా 270 పరుగులతో చెలరేగాడు. కుమార్ కుషాగ్రా (101) సెంచరీతో సత్తా చాటాడు. అభిమన్యు ఈశ్వరన్ (72), శిఖర్ మోహన్ (85) అర్ద సెంచరీలతో రాణించగా.. వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45), కౌనైన్ ఖురేషి (40) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించారు. త్రిపురణ విజయ్ 4 వికెట్లతో రాణించాడు.ఈస్ట్‌జోన్‌దే టైటిల్సౌత్జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 336 పరుగులకు ఆలౌట్ కావడంతో ఈస్ట్‌జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. మ్యాచ్‌కు ఒకరోజు మాత్రమే మిగిలి ఉండడంతో డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.దీంతో నిబంధనల ప్రకారం తొలి ఇన్నింగ్స్‌లో ఏ జట్టు ఆధిక్యంలో నిలిస్తే వారికే దులీప్ ట్రోఫీ దక్కనుంది. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యం సాధించిన ఈస్ట్‌జోన్ 13 సంవత్సరాల తర్వాత టైటిల్ అందుకోనుంది. చదవండి: సిక్కోలు కుర్రాడి మ్యాజిక్.. వైభవ్ సూర్యవంశీ మైండ్ బ్లాంక్ -
708 పరుగులు.. అయినా నో డిక్లరేషన్.. తెలివిలేదా?
దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో అతి భారీ స్కోరు సాధించింది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో సౌత్ జోన్‌తో జరుగుతున్న ఈ ప్రతిష్టాత్మక టైటిల్ పోరులో.. ఇషాన్ కిషన్ సేన సమిష్టిగా రాణించింది.ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందిస్తే.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ (85) భారీ స్కోరు దిశగా పునాది వేశాడు. నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) విఫలమైనప్పటికీ.. కెప్టెన్ ఇషాన్ కిషన్ మాత్రం పట్టుదలగా ముందుకు సాగాడు.270 పరుగులుఈ క్రమంలో ద్విశతకం పూర్తి చేసుకున్న తర్వాత ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినప్పటికీ.. ఆఖర్లో మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. ఇషాన్‌కు తోడుగా కుమార్ కుశాగ్రా శతకం (101)తో చెలరేగాడు.I.C.Y.M.I2️⃣7️⃣0️⃣ runs3️⃣3️⃣4️⃣ balls3️⃣0️⃣ fours7️⃣ sixes8️⃣0️⃣.8️⃣3️⃣ SRWatch 🎥 highlights of Ishan Kishan's marathon knock 👌👌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/An6sT09tfu— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026708 పరుగులు చేసి ఆలౌట్మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (45) ఎండీ కౌనేన్ ఖురేషి (40) రాణించగా.. టెయిలెండర్ మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్ జోన్ ఈ మేరకు సమిష్టిగా రాణించి రెండు రోజులు పూర్తి స్థాయిలో బ్యాటింగ్ చేసింది. మొత్తంగా మొదటి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ 163 ఓవర్లు ఆడి 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది.తెలివిలేదా?.. నిజానికి రెడ్‌బాల్ మ్యాచ్‌లో ఫలితం తేలాలంటే.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టు ఈ స్థాయి భారీ స్కోరు సాధించడం కంటే.. కాస్త ముందుగానే డిక్లేర్ చేసి.. ఫలితం సాధించే దిశగా ముందుకు వెళ్తుంది. కానీ ఇషాన్ కిషన్ మాత్రం జట్టు ఆలౌట్ అయ్యేంత వరకు బ్యాటింగ్ చేయించాడు. ఇందుకు రెండు రోజులు తీసుకున్నాడు.నిబంధనల ప్రకారమే తెలివిగానిజానికి ఇలా చేయడం ద్వారా మ్యాచ్ డ్రా అవుతుందే తప్ప ఫలితం తేలదు. అయినా ఇషాన్ ఎందుకిలా చేశాడు?.. ఇషాన్ మాత్రమే కాదు.. ఆ స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా ఇలాగే చేస్తాడు. ఎందుకంటే.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) రెడ్‌బాల్ క్రికెట్ నిబంధనల ప్రకారం..రంజీ ట్రోఫీ, దులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీల్లో ఫైనల్ మ్యాచ్ కోసం టెస్టు మాదిరే ఐదు రోజులు కేటాయిస్తారు. అయితే, ఒకవేళ మ్యాచ్ డ్రా అయితే గనుక తొలి ఇన్నింగ్స్‌లో ఆధిక్యంలో ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు. అందుకే ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసేందుకే మొగ్గుచూపింది.336 పరుగులకే ఆలౌట్.. ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమేఇక సౌత్ జోన్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 709 పరుగులు చేస్తేనే మ్యాచ్‌పై ఆశలు సజీవంగా ఉంటాయి. కానీ తిలక్ వర్మ కెప్టెన్సీలోని సౌత్ జోన్ ఈ విషయంలో దారుణంగా విఫలమైంది. బుధవారం నాటి నాలుగో రోజు ఆట సందర్భంగా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 336 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ఫలితంగా ఈస్ట్ జోన్‌కు 372 పరుగుల భారీ ఆధిక్యం లభించింది. ఇక బుధవారం ఇంకా రెండు సెషన్ల ఆట మిగిలి ఉండగా.. గురువారం ఒక్కరోజు మిగిలి ఉంది. ఇలాంటి సమయంలో ఈస్ట్ జోన్ ఫాలో ఆన్ ఆడించకుండా డ్రా చేసుకునేందుకే మొగ్గుచూపే అవకాశం ఉంది. కాబట్టి దులిప్ ట్రోఫీ-2026 విజేతగా ఈస్ట్ జోన్ గెలుపు లాంఛనమే అని చెప్పవచ్చు.చదవండి: టీమిండియా సెమీస్ ప్రత్యర్థి ఎవరంటే? -
వైభవ్..నువ్వు సూపర్ రా! బుడోడిపై ఇషాన్ ప్రశంసలు
-
వారెవ్వా వైభవ్ సూర్యవంశీ!.. ఇషాన్‌ను ఒప్పించి మరీ!
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. విమర్శించిన వాళ్లకు ఆటతో పాటు నాయకత్వ నైపుణ్యాలతోనూ అదిరిపోయేలా కౌంటర్ ఇస్తున్నాడంటూ కొనియాడుతున్నారు. కాగా రెడ్‌బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేనప్పటికీ పదిహేనేళ్ల వైభవ్‌కు బీసీసీఐ కీలక బాధ్యతను అప్పగించిన సంగతి తెలిసిందే.అపుడే వైస్ కెప్టెన్‌గానా?ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ-2026 టోర్నీలో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్‌కు వైభవ్‌ను డిప్యూటీగా నియమించింది. దీంతో చిన్న వయసులోనే, అనుభవం లేని వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని భారత మాజీ క్రికెటర్లు విమర్శలు గుప్పించారు.అయితే, వైభవ్ అటు ఆటగాడిగా రాణిస్తూనే.. తన నాయకుడిగానూ తానేం తక్కువ కాదని నిరూపిస్తున్నాడు. సెంట్రల్ జోన్‌తో సెమీ ఫైనల్లో ఇషాన్ గైర్హాజరీలో వైభవ్ ఒకరోజు మొత్తం కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ మ్యాచ్‌లో ఈస్ట్ జోన్ నాలుగు వికెట్ల తేడాతో గెలిచి ఫైనల్‌కు చేరింది.708 పరుగులకు ఆలౌట్ఇక టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ సౌత్ జోన్‌తో తలపడుతోంది. చెన్నైలోని చెపాక్ స్టేడియంలో ఆదివారం మొదలైన ఈ మ్యాచ్‌లో.. ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 708 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఈ క్రమంలో మంగళవారం నాటి మూడో రోజు ఆట సందర్భంగా సౌత్ జోన్ తమ బ్యాటింగ్ మొదలుపెట్టింది.సందిగ్దంలో జట్టుఈ నేపథ్యంలో ఆరో ఓవర్లో ఈస్ట్ జోన్ పేసర్ ముకేశ్ కుమార్ వేసిన రెండో బంతిని సౌత్ జోన్ ఓపెనర్ రికీ భుయ్ బౌండరీ దిశగా తరలించే ప్రయత్నం చేశాడు. అయితే, లెంగ్త్‌ను తప్పుగా అంచనా వేసిన రికీ షాట్ ఆడటంలో విఫలం కాగా.. వికెట్ కీపర్ కుమార్ కుశాగ్రా బంతిని క్యాచ్ పట్టి.. అప్పీలు చేశాడు.ఇషాన్‌ను ఒప్పించిన వైభవ్అయితే, ఫీల్డ్ అంపైర్ మాత్రం నాటౌట్ ఇచ్చాడు. దీంతో రివ్యూకు వెళ్లాలా? వద్దా? అన్న సందేహంలో ఉన్న కెప్టెన్ ఇషాన్ కిషన్ దగ్గరికి వెళ్లిన వైభవ్ సూర్యవంశీ.. ‘రివ్యూ తీసుకో.. పర్లేదు’ అంటూ సలహా ఇచ్చాడు. కానీ మిగతా ఆటగాళ్లు మాత్రం బంతి ముందుగా బ్యాట్‌ను తాకిందా? లేదంటే ప్యాడ్‌కు తాకిందా? అనే సందేహంలో ఉన్నారు.అయితే, ఇషాన్ కిషన్ వైభవ్ మాట మీద నమ్మకంతో రివ్యూకు వెళ్లగా.. రికీ భుయ్ అవుటైనట్లు తేలింది. దీంతో ఈస్ట్ జోన్ సంబరాలు అంబరాన్నంటాయి. వైభవ్ సూర్యవంశీని ఇషాన్, ముకేశ్‌తో పాటు మిగతా జట్టు సభ్యులందరూ అభినందించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా దులిప్ ట్రోఫీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ తొలి ఇన్నింగ్స్‌లో 37 బంతులు ఎదుర్కొని 44 పరుగులు చేశాడు.చదవండి: IND vs AUS: భారత జట్టులో మార్పులు🗣️ Take it...take itVaibhav Sooryavanshi 🤝 ReviewThe vice-captain urges the captain to take the review, and it turns out to be successful 🙌Scorecard ▶️ https://t.co/BhTkGWeeoD#DuleepTrophy | #EZvSZ pic.twitter.com/MmtESDSnMy— BCCI Domestic (@BCCIdomestic) September 8, 2026 -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. ఈస్ట్ జోన్ అతి భారీ స్కోరు
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులిప్ ట్రోఫీ-2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. చెన్నై వేదికగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ భారీ డబుల్ సెంచరీతో చెలరేగాడు. ఫలితంగా టైటిల్ పోరులో ఈస్ట్ జోన్ 708 పరుగుల మేర అతి భారీ స్కోరు సాధించింది. An innings of pure class 👌Watch 🎥 snippets of Ishan Kishan's fantastic double century so far 💯💯Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ | @ishankishan51 pic.twitter.com/jOndIaA5Uo— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026ఈస్ట్ జోన్- సౌత్ జోన్ జట్ల మధ్య దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ ఫైనల్ ఆదివారం మొదలైంది. చెపాక్ స్టేడియంలో టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో సోమవారం నాటి రెండో రోజు ఆటలో భాగంగా తొలి ఇన్నింగ్స్‌లో 708 పరుగులు చేసి ఆలౌట్ అయింది. టాపార్డర్ సూపర్ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించగా.. వన్‌డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్ భారీ అర్ధ శతకం (85)తో ఆకట్టుకున్నాడు. అయితే, నాలుగో స్థానంలో వచ్చిన సుదీప్ కుమార్ ఘరామీ (6) మాత్రం విఫలమయ్యాడు. ఈ క్రమంలో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు. ఇషాన్ డబుల్ సెంచరీసౌత్ జోన్ బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన ఇషాన్.. డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత గాయపడి మైదానం వీడాడు. అయితే, జట్టుకు అవసరమైన మళ్లీ మైదానంలో అడుగుపెట్టాడు. మొత్తంగా 334 బంతులు ఎదుర్కొన్న ఈ లెఫ్టాండర్ బ్యాటర్.. 30 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో 270 పరుగులు సాధించాడు. శతక్కొట్టిన కుశాగ్రాట్రిపుల్ సెంచరీ దిశగా పయనిస్తున్న వేళ త్రిపురాన విజయ్ బౌలింగ్‌లో స్మరణ్ రవిచంద్రన్‌కు క్యాచ్ ఇవ్వడంతో ఇషాన్ కిషన్ మారథాన్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. మిగిలిన వారిలో కుమార్ కుశాగ్రా శతక్కొట్టగా (101), అనుకూల్ రాయ్ (45), ఎండీ కొనియన్ ఖురేషి (40) రాణించారు. టెయిలెండర్లలో మహ్మద్ షమీ 28 పరుగులతో ఫర్వాలేదనిపించగా.. ముకేశ్ కుమార్ డకౌట్ అయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురాణ విజయ్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. చామా మిలింద్, శ్రేయస్ గోపాల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. షేక్ రషీద్‌కు ఒక వికెట్ దక్కింది.చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్దులిప్ ట్రోఫీ చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్ కీపర్ బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ రికార్డు సాధించాడు. గతంలో ఈ రికార్డు నమన్ ఓజా పేరిట ఉండేది. సెంట్రల్ జోన్ తరఫున 2014లో నార్త్ జోన్‌తో మ్యాచ్ సందర్భంగా అతడు 217 పరుగులు స్కోరు చేశాడు. తాజాగా ఇషాన్ 270 పరుగులు సాధించి నమన్ ఓజాను అధిగమించాడు.చదవండి: షఫాలీ పట్ల దురుసు ప్రవర్తన.. మూల్యం చెల్లించిన పాక్ కెప్టెన్! -
రెస్ట్ తీసుకోమన్నా వినలేదు; నొప్పిని భరిస్తూనే డబుల్ సెంచరీ
చెన్నై చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. ఇషాన్ 128 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్నప్పుడు నిదీశ్ వేసిన బంతి పొత్తి కడుపు కింద భాగంలో బలంగా తాకింది. బంతి బలంగా తాకడంతో నొప్పితో విలవిల్లాడిపోయిన ఇషాన్ స్క్వేర్ లెగ్ రీజియన్ దిశగా పరిగెత్తి అక్కడే కూర్చుండిపోయాడు. ఫిజియో వచ్చి ఇషాన్ గాయాన్ని పర్యవేక్షించాడు. అదే సమయంలో ఫిజియోతో వచ్చిన డాక్టర్ ‘రెస్ట్ తీసుకో’ అని సలహా ఇచ్చాడు. కానీ ఇషాన్ మాత్రం తాను బ్యాటింగ్ కంటిన్యూ చేస్తానని చెప్పాడు. ఆ తర్వాత నొప్పిని భరిస్తూనే బ్యాటింగ్ చేసిన ఇషాన్ డబుల్ సెంచరీ మార్క్ కూడా అందుకున్నాడు. 270 బంతుల్లో డబుల్ సెంచరీ సాధించిన మరో 30 బంతుల్లో 250 మార్క్‌ను చేరుకున్నాడు. ఆ తర్వాత నొప్పి తిరగబెట్టడంతో ఇషాన్ చాలా ఇబ్బంది పడ్డాడు. ఫిజియో వచ్చి ఇషాన్‌తో మాట్లాడాడు. ఆ వెంటనే ఇషాన్ కిషన్ రిటైర్డ్ హర్ట్‌గా మైదానం వీడాడు. మరి మిగతా మ్యాచ్‌కు ఇషాన్ కిషన్ అందుబాటులో ఉంటాడా? ఉండడా అనే ప్రశ్న అభిమానులను తొలిచేస్తుంది. ఏది ఏమైనా డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పినా వినకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇషాన్ బ్యాటింగ్ కొనసాగించి అందరి మన్ననలు పొందాడు.అయితే స్కోరు కార్డుపై మాత్రం ఇషాన్ రిటైర్డ్ హర్ట్ అయినట్లు ప్రదర్శించడంతో అతడు మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చే అవకాశముంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసే అవకాశం లేకపోలేదు. 13 ఏళ్ల తర్వాత ఈస్ట్ జోన్ దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు చేరడం గమనార్హం. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్‌జోన్ తాజాగా టైటిల్ గెలుచుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఈస్ట్‌జోన్ 650 పరుగుల మార్క్‌ను దాటడంతో సౌత్‌జోన్ అంత స్కోరు చేయాలన్నా రెండు రోజులు పడుతుంది. ఇప్పటికే రెండు రోజుల ఆట ముగియడం, మరో మూడు రోజులు ఉండడంతో మ్యాచ్ డ్రా అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. ఈ లెక్కన తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కారణంగా ఈస్ట్ జోన్ ఛాంపియన్‌గా నిలిచే అవకాశం ఉంది.Ishan Kishan brings up his 2️⃣0️⃣0️⃣ in style 💯💯 🙌What a magnificent knock from the East Zone captain so far 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/2NaE6qG4VK— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026Doctor: rest loIshan: century laga deta hu 💀🙏Ishan Kishan during a Duleep Trophy match, sarcastically noting an apparent injury with "oops🤕" before adding he recovered quickly and is batting well. pic.twitter.com/5eZraPJVix— CricketIndian_🚩🇮🇳 (@CricketIndian_) September 7, 2026 That moment when Ishan Kishan reached 2️⃣5️⃣0️⃣ 👏👏Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/6YJYiwNtjV— BCCI Domestic (@BCCIdomestic) September 7, 2026చదవండి: భారత్‌తో టీ20 సిరీస్ ముంగిట చెలరేగిన ఆఫ్గన్ బౌలర్ -
250 రిటైర్డ్ హర్ట్.. చరిత్రలో మూడో బ్యాటర్‌గా ఇషాన్ కిషన్
సౌత్ జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ 2026 ఫైనల్లో ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. అతడికి కుమార్ కుషాగ్రా (101), శికర్ మోహన్ (85), అభిమన్యు ఈశ్వరన్ (72), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (44), అనుకూల్ రాయ్ (45) కూడా తోడవ్వడంతో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ అతి భారీ స్కోర్ దిశగా సాగుతోంది.రెండో రోజు టీ విరామ సమయానికి ఆ జట్టు 6 వికెట్ల నష్టానికి 626 పరుగులు చేసింది. మొహమ్మద్ ఖురేషి (6 నాటౌట్) క్రీజ్‌లో ఉన్నాడు. టీ విరామానికి ముందు అనుకూల్ రాయ్ ఔటయ్యాడు. సౌత్ జోన్ బౌలర్లలో త్రిపురణ విజయ్, చామ మిలింద్ తలో 2 వికెట్లు తీయగా.. షేక్ రషీద్‌కు ఓ వికెట్ దక్కింది. అభిమన్యు ఈశ్వరన్ రనౌటయ్యాడు.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో కదంతొక్కిన ఇషాన్ కిషన్ పలు అరుదైన ఘనతలు సాధించాడు. రామన్ లాంబా (320), అన్షుమన్ గైక్వాడ్ (216), చటేశ్వర్ పుజారా (256), యశస్వి జైస్వాల్ (209) తర్వాత దులీప్ ట్రోఫీ ఫైనల్లో డబుల్ సెంచరీ చేసిన ఐదో బ్యాటర్‌గా, 65 ఏళ్ల దులీప్ ట్రోఫీ చరిత్రలో 250 పరుగుల మార్కును తాకిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు.డబుల్ సెంచరీకి ముందే ఇషాన్ తన ఫస్ట్ క్లాస్ కెరీర్లో 4000 పరుగులు కూడా పూర్తి చేశాడు. 2014లో ఈ ఫార్మాట్లోకి అరంగేట్రం చేసిన ఇషాన్.. ఇప్పటివరకు 10 సెంచరీలు, 19 అర్ద సెంచరీలు చేశాడు.కాగా, ప్రస్తుత మ్యాచ్‌లో ఇషాన్ 250 పరుగుల తర్వాత రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. 85 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద బంతి పొత్తి కడుపులో బలంగా తాకడం వల్ల ఇషాన్ అసౌకర్యానికి గురయ్యాడు. అప్పుడే అతడు రిటైర్డ్ హర్ట్‌గా వెళ్తాడని అంతా అనుకున్నారు. అయితే పట్టువదలని విక్రమార్కుడిలా క్రీజ్‌లో నిలబడిన ఇషాన్ సెంచరీ పూర్తి చేయడమే కాకుండా డబుల్ సెంచరీ, 250 మార్కును కూడా తాకాడు.చదవండి: ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో -
ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ.. 26 ఫోర్లు, 2 సిక్స్‌లతో
చెపాక్ స్టేడియం వేదికగా సౌత్‌జోన్‌తో జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుతమైన డబుల్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ 270 బంతుల్లో తన రెండో ఫస్ట్‌క్లాస్ డబుల్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. అతడి ఇన్నింగ్స్‌లో 26 ఫోర్లు, 2 సిక్స్‌లు ఉన్నాయి. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో కిషన్ అత్యధిక స్కోర్ 273గా ఉంది. రంజీ ట్రోఫీ (2016–17) మ్యాచ్‌లో ఢిల్లీ జట్టుపై ఢిల్లీపై అతడు ఈ స్కోర్ సాధించాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్‌జోన్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ దిశగా దూసుకుపోతుంది.122 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 555 పరుగుల భారీ స్కోర్ సాధించింది. క్రీజులో కిషన్(204)తో పాటు అనుకుల్ రాయ్(30) ఉన్నాడు. సౌత్ జోన్ బౌలర్లు ప్రత్యర్ధి బ్యాటర్లను ఔట్ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.కాగా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్లు అభిమన్యు ఈశ్వరన్ (72), వైభవ్ సూర్యవంశీ (44) శుభారంభం అందించారు. అనంతరం ఫస్ట్ డౌన్ బ్యాటర్ శిఖర్ మోహన్(85) హాఫ్ సెంచరీతో సత్తాచాటాడు. ఈ క్రమంలో ఐదో స్ధానంలో బ్యాటింగ్ వచ్చిన ఇషాన్ కిషన్.. తనదైన శైలిలో మైదానం నలుమూలలా షాట్లు ఆడుతూ అభిమానులను అలరించాడు. కుమార్ కుషాగ్ర (101)తో కలిసి ఐదో వికెట్‌కు సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రెండో రోజు ఆటలో కుషాగ్ర ఔటైనప్పటికి కిషన్ మాత్రం తన జోరును కొనసాగిస్తున్నాడు.చదవండి: స్మృతి మంధానపై భారత మాజీ క్రికెటర్ విమర్శలు -
సెంచరీతో ఇరగదీసిన ఇషాన్ కిషన్.. తొలిరోజు ఈస్ట్‌జోన్‌దే
చెన్నై చిదంరం స్టేడియం వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్‌జోన్ తొలిరోజే స్పష్టమైన ఆధిక్యం కనబరిచింది. ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ అజేయ సెంచరీతో కదం తొక్కడంతో ఆ జట్టు భారీ స్కోరు దిశగా పరుగులు పెడుతోంది. ఆదివారం సౌత్‌జోన్‌తో మొదలైన ఫైనల్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఈస్ట్‌జోన్ 79 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 385 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (135 బంతుల్లో 111 నాటౌట్), కుమార్ కుషాగ్ర (75 బంతుల్లో 63 నాటౌట్) క్రీజులో ఉన్నారు. సౌత్‌జోన్ బౌలర్లలో సీవీ మిలింద్ 2 వికెట్లు తీయగా, త్రిపురాణా విజయ్ ఒక వికెట్ పడగొట్టాడు.వైభవ్ మాస్.. అభిమన్యు, శిఖర్ క్లాస్టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఈస్ట్‌జోన్‌కు ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చాడు. వన్డే తరహాలో వేగంగా ఆడిన వైభవ్ సూర్యవంశీ (35 బంతుల్లో 44, 5 ఫోర్లు, ఒక సిక్సర్) దంచికొట్టాడు. మరో ఓపెనర్ అభిమన్యు ఈశ్వరన్ (86 బంతుల్లో 72 పరుగులు) మరో ఎండ్‌లో నింపాదిగా ఆడాడు. వైభవ్ ఔటయ్యాకా బరిలోకి దిగిన శ్రీకర్ మోహన్ (120 బంతుల్లో 85 పరుగులు) కూడా తనదైన శైలి బ్యాటింగ్‌తో అలరించాడు. అభిమన్యు, సుదీప్ కుమార్ స్వల్ప వ్యవధిలో వెనుదిరిగిన్పటికీ, శిఖర్‌కు జత కలిసిన ఇషాన్ కిషన్ చెలరేగిపోయాడు. సౌత్‌జోన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడిన ఇషాన్ అర్ధసెంచరీ మార్క్ చేరుకున్నాడు. శిఖర్ ఔటైనప్పటికీ, కుమార్ కుషాగ్ర వేగంగా ఆడి పరుగులు రాబట్టాడు. ఇషాన్ కిషన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కాగా ఇషాన్ కిషన్‌కు ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇది పదో సెంచరీ. అనంతరం కాసేపటికే కుమార్ కుషాగ్ర కూడా అర్థసెంచరీ సాధించాడు. ఈ నేపథ్యంలో మరో 10 ఓవర్లు మిగిలి ఉండగానే బ్యాడ్‌లైట్ కారణంగా అంపైర్లు తొలి రోజు ఆట ముగిసినట్లు ప్రకటించారు.💯 for Ishan Kishan 👏He brings it up in style 💥The East Zone captain leading from the front with a superb knock 🙌Scorecard ▶️ https://t.co/KQf5Km69nk#DuleepTrophy | #SZvEZ pic.twitter.com/ql9el4G60Q— BCCI Domestic (@BCCIdomestic) September 6, 2026చదవండి: సాత్విక్-చిరాగ్ జోడీ చరిత్ర.. చైనా గోడను బద్దలుకొట్టి విజేతలుగా! -
‘ఆకలిగొన్న సింహంలా ఉన్నాడు.. అతడి రీఎంట్రీ ఆపలేరు’
టీమిండియా సీనియర్ ఆటగాడు మహ్మద్ షమీ జాతీయ జట్టులో చోటు కోల్పోయినప్పటికీ దేశవాళీ క్రికెట్లో మాత్రం అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. దులీప్ ట్రోఫీలో 13 ఏళ్ల తర్వాత ఈస్ట్‌జోన్ ఫైనల్‌కు చేరడంలో షమీ కీలకపాత్ర పోషించాడు. బెంగళూరు వేదికగా సెంట్రల్ జోన్‌తో జరిగిన సెమీఫైనల్లో షమీ రెండు ఇన్నింగ్స్‌లు కలిపి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆదివారం నుంచి ఈస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈస్ట్‌జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ శనివారం సాయంత్రం మీడియా సమావేశంలో పాల్గొన్నాడు. ఆటగాడు బాగా రాణిస్తున్నాడంటే ఎంపికకు అతడి వయసుతో సంబంధముండదని తెలిపాడు. షమీ విషయంలోనూ అదే వర్తిస్తుందని, జట్టులో చోటు కోల్పోయినప్పటి నుంచి షమీ కసితో ఉన్నాడని, అతడిని టీమిండియాకు ఎంపిక చేయాల్సిన సమయం వచ్చిందని ఇషాన్ అభిప్రాయపడ్డాడు.Photo Credit: BCCI Twitterఇషాన్ మాట్లాడుతూ.. ‘‘అత్యుత్తమ ఆటగాళ్లలో షమీ ఒకడని నేను భావిస్తున్నాను. స్టార్‌గా వెలుగొందుతున్న షమీ బెంగాల్ తరఫున ఆడడం మొదలుపెట్టినప్పటి నుంచి మంచి ప్రదర్శన చేస్తున్నాడు. ప్రతీ మ్యాచ్‌లో వికెట్లు తీస్తూ కీలక బౌలర్‌గా మారిపోయాడు. ఒక బౌలర్‌గా టీమిండియాకు కూడా ఎంతో సేవ చేశాడు. వయసు అనేది ఒక సంఖ్య మాత్రమే అని నేను భావిస్తాను. కష్టపడుతున్న సమయంలో వయసును లెక్కలోకి తీసుకోకూడనేది నా అభిప్రాయం. షమీ భాయ్‌లో ఆ కసి నాకు స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ఎలా ఆడాడు అనేదాన్ని పక్కనబెట్టి ఇప్పుడెలా ఆడుతున్నాడనే దానిపై బీసీసీఐ సెలెక్టర్లు దృష్టి సారించాల్సిన అవసరముంది. ప్రస్తుతం ఈస్ట్‌జోన్ జట్టుకు షమీ ఆడుతుండడం మా అదృష్టం. అతడు మా జట్టులో ఉండడం మాకు మరింత ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. 36 ఏళ్ల వయసులో ఎక్కువ ఓవర్లు వేస్తే అలసిపోయే బౌలర్లతో పోలిస్తే షమీ వేరుగా కనిపిస్తాడు. Photo Credit: BCCI Twitterనేను అడగకముందే జట్టుకు వికెట్ అవసరమైనప్పుడల్లా తాను బౌలింగ్ చేస్తానంటూ షమీ భాయ్ ముందుకు వచ్చేవాడు. ఒక కెప్టెన్‌గా అతడి కసిని చూస్తుంటే ముచ్చటగా అనిపిస్తుంది. టీమిండియాలోకి మళ్లీ రీఎంట్రీ ఇవ్వాలనే అతడి తాపత్రయం నా కళ్లకు స్పష్టంగా కనిపిస్తుంది. ఆకలిగొన్న సింహంలా కనిపిస్తున్నాడు. షమీ భాయ్ రీఎంట్రీని ఎవరూ ఆపలేరు.’ అని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇక సౌత్‌జోన్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా షమీపై ప్రసంశల జల్లు కురిపించాడు. షమీ లాంటి చాకచక్యమైన పేసర్‌ను ఎదుర్కోవడానికి తమ జట్టు సిద్ధంగా ఉందని తిలక్ వర్మ పేర్కొన్నాడు. షమీ భాయ్‌తో ఆడడం మాకు ఎప్పుడూ ఇష్టమే అని తిలక్ వెల్లడించాడు. ఇటీవలే షమీ ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో 900 వికెట్ల మార్క్‌ను అందుకున్న సంగతి తెలిసిందే. 2023 వన్డే ప్రపంచకప్‌లో టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచిన మహ్మద్ షమీ భారత్ తరఫున చివరిసారిగా 2025 చాంపియన్స్ ట్రోఫీలో ఆడాడు.Read: నాలుగేళ్ల తర్వాత బరిలో విలియమ్స్ సిస్టర్స్.. ఫలితం ఏంటంటే? -
గెలిపించిన షమీ, ఇషాన్ కిషన్.. ఫైనల్లో ఈస్ట్‌జోన్
దులీప్ ట్రోఫీ 2026-27 సీజన్లో ఈస్ట్ జోన్ జట్టు ఫైనల్లో అడుగుపెట్టింది. బెంగళూరులోకి బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్-1లో జరిగిన సెమీఫైనల్లో ఈస్ట్‌జోన్ 4 వికెట్ల తేడాతో సెంట్రల్ జోన్‌పై విజయాన్ని అందుకుంది. 162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఈస్ట్‌జోన్ 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (39 నాటౌట్), మహ్మద్ షమీ (8 నాటౌట్) అజేయంగా నిలిచి ఈస్ట్‌జోన్‌ను గెలిపించారు. వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (40) రాణించాడు. సెంట్రల్ జోన్ బౌలర్లలో హర్ష్ దూబే 4 వికెట్లు తీయగా, సారాంశ్ జైన్, యశ్ ఠాకూర్ చెరొక వికెట్ పడగొట్టారు. ఇక సెంట్రల్ జోన్ తమ ఇన్నింగ్స్‌లో 266 పరుగులకు ఆలౌట్ కాగా, ఈస్ట్ జోన్ కూడా తమ తొలి ఇన్నింగ్స్‌లో 266 పరుగులకే ఆలౌట్ అయింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో షమీ, ముకేశ్ కుమార్ మెరుపులతో సెంట్రల్ జోన్ అనూహ్యంగా 158 పరుగులకే కుప్పకూలింది. అయితే ఛేదనలో ఈస్ట్‌జోన్ కాస్త తడబడినప్పటికీ, ముందు వైభవ్.. చివర్లో ఇషాన్, షమీలు బాధ్యతగా ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.139 పరుగుల ఆధిక్యంలో నార్త్జోన్మరోవైపు నార్త్‌జోన్, సౌత్‌జోన్ మధ్య జరుగుతున్న రెండో సెమీఫైనల్లో నార్త్‌జోన్ 139 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి నార్త్‌జోన్ 66 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. నిషాంత్ సింధూ (20), అన్షుల్ కంబోజ్ (29) క్రీజులో ఉన్నారు. అంతకముందు సౌత్‌జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 312 పరుగులకు ఆలౌటైంది.𝐄𝐀𝐒𝐓 𝐙𝐎𝐍𝐄 𝐀𝐑𝐄 𝐈𝐍 𝐓𝐇𝐄 𝐃𝐔𝐋𝐄𝐄𝐏 𝐓𝐑𝐎𝐏𝐇𝐘 𝐅𝐈𝐍𝐀𝐋! 🔥🏆A statement win over defending champions Central Zone, sends East Zone into the Duleep Trophy summit clash! 💥👏 pic.twitter.com/lNed1OiRyt— CricTracker (@Cricketracker) September 1, 2026Read: రిటైర్మెంట్ విషయంలోనూ మెస్సీ రికార్డు -
15 ఏళ్లకే కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీ
టీమిండియా యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ మరో ఘనత సాధించాడు. 15 ఏళ్ల వయసులోనే సీనియర్ జట్టుకు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టి రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా సెంట్రల్ జోన్‌తో ఇవాళ మొదలైన తొలి సెమీఫైనల్లో వైభవ్ ఈస్ట్ జోన్ తాత్కాలిక కెప్టెన్‌గా నియమితుడయ్యాడు.CAPTAIN VAIBHAV SOORYAVANSHI 🔥- Vaibhav Sooryavanshi is currently leading the Easy Zone team in Duleep Trophy. pic.twitter.com/cGaFDpceMD— Johns. (@CricCrazyJohns) August 30, 2026రెగ్యులర్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్ కీపింగ్ చేస్తున్న సమయంలో గాయపడటంతో వైభవ్‌కు ఈ అవకాశం వచ్చింది. సీనియర్ జట్టు కెప్టెన్‌గా తొలిసారి బాధ్యతలు చేపట్టిన సమయంలో వైభవ్ చిరునవ్వుతో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో వైభవ్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ లాంటి సీనియర్ బౌలర్లను హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. వారితో అతడు ఎలా వ్యవహరిస్తాడోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.వైభవ్‌కు ఇది కేవలం రెండో దులీప్ ట్రోఫీ మ్యాచ్. ఓవరాల్‌గా 10వ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ మాత్రమే. ఇంత తక్కువ అనుభవంలో షమీ లాంటి అనుభవజ్ఞుడైన పేసర్‌ను వైభవ్ ఎలా ఉపయోగించుకుంటాడో చూడాలి.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈస్ట్ జోన్‌కు త్రిపుర పేసర్ అభిజిత్ సర్కార్ శుభారంభం అందించాడు. అమన్ మొఖాడే (8), కునాల్ చందేలా (6)లను ఆదిలోనే ఔట్ చేశాడు. కొద్ది సేపటికే ముకేశ్ కుమార్ సెంట్రల్ జోన్ కెప్టెన్ రజత్ పాటిదార్ (12)ను క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు పంపాడు. దీంతో సెంట్రల్ జోన్ 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. లంచ్ విరామం సమయానికి ఆ జట్టు స్కోర్ 81-3గా ఉంది. ఆర్యన్ జుయల్ (42), యశ్ రాథోడ్ (6) క్రీజ్‌లో ఉన్నారు. చదవండి: భారత్-ఆఫ్ఘనిస్తాన్ సిరీస్‌కు సంబంధించి కీలక అప్డేట్స్ -
టెస్ట్ జట్టులో చోటుపై ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు
భారత వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ టెస్ట్ క్రికెట్‌పై తనకున్న ఆసక్తిని మరోసారి స్పష్టం చేశాడు. దులీప్ ట్రోఫీ 2026లో ఈస్ట్ జోన్‌కు నాయకత్వం వహిస్తున్న అతడు.. నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించిన అనంతరం ఇలా అన్నాడు."నేను భారత టెస్ట్ జట్టులో భాగం కావాలని 100 శాతం కోరుకుంటున్నాను. టెస్ట్ క్రికెట్ ఆడిన ప్రతి ఒక్కరూ ఈ ఫార్మాట్‌ను ఇష్టపడతారు. ప్రజలు నమ్మకపోవచ్చు కానీ, నాకు నిజంగా రెడ్ బాల్ క్రికెట్ అంటే చాలా ఇష్టం"పరిమిత ఓవర్ల క్రికెట్లో దూకుడైన బ్యాటింగ్‌కు పేరున్న ఇషాన్.. టెస్ట్ క్రికెట్లోనూ తనకు తగిన సామర్థ్యం ఉందని ఈ వ్యాఖ్యల ద్వారా చెప్పకనే చెప్పాడు.2023లో చివరి టెస్ట్ఇషాన్ కిషన్ 2023 వెస్టిండీస్ పర్యటనలో భారత్ తరఫున టెస్ట్ అరంగేట్రం చేశాడు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో రెండు టెస్టులూ ఆడిన అతను మూడు ఇన్నింగ్స్‌ల్లో 78 పరుగులు మాత్రమే చేశాడు.పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరిగిన సిరీస్ డిసైడర్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 34 బంతుల్లోనే 52 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. అయితే అదే అతడి చివరి టెస్ట్ ఇన్నింగ్స్‌గా మిగిలిపోయింది.ఆ తర్వాత దక్షిణాఫ్రికా పర్యటనలో భారత సెలెక్టర్లు వికెట్ కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఇచ్చారు.ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మంచి రికార్డువైట్ బాల్ క్రికెట్లో ఇషాన్‌కు మంచి పేరున్నప్పటికీ, రెడ్ బాల్ క్రికెట్లోనూ అతడి గణాంకాలు బలంగానే ఉన్నాయి.ఇప్పటివరకు 65 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడిన అతడు.. 106 ఇన్నింగ్స్‌ల్లో 3897 పరుగులు చేశాడు. అతడి బ్యాటింగ్ సగటు 39.36గా ఉంది. ఇందులో 9 సెంచరీలు, 19 అర్ధసెంచరీలు ఉన్నాయి.అంత ఈజీ కాదుఇషాన్కు వ్యక్తిగతంగా రెడ్ బాల్ క్రికెట్‌పై మక్కువ ఉన్నప్పటికీ.. టెస్ట్ జట్టులోకి తిరిగి రావడం అంత ఈజీ కాదు. ప్రస్తుతం భారత జట్టులో వికెట్ కీపర్ బ్యాటర్ స్థానానికి బలమైన పోటీ ఉంది. రిషభ్ పంత్‌తో పాటు ధ్రువ్ జురెల్, కేఎల్ రాహుల్ వంటి బలమైన ఆప్షన్లు మేనేజ్మెంట్ ముందున్నాయి.ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అసాధారణ రీతిలో పరుగులు చేసినా ఇషాన్‌కు టెస్ట్ జట్టులో చోటు దక్కడం అనుమానమే. ఎందుకంటే పంత్, జురెల్, రాహుల్ అద్భుతంగా రాణిస్తున్నారు. వీరిని కాదని ఇషాన్‌ను జట్టులోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువ. చదవండి: ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు -
ఇన్నింగ్స్ తేడాతో గెలిచిన ఇషాన్, వైభవ్ జట్టు
దులీప్ ట్రోఫీ 2026 తొలి క్వార్టర్ ఫైనల్లో ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ (వైస్ కెప్టెన్) నేతృత్వంలోని ఈస్ట్ జోన్ జట్టు నార్త్ ఈస్ట్ జోన్‌పై ఇన్నింగ్స్ 210 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి, సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఈస్ట్ జోన్.. సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (167) సెంచరీలతో కదంతొక్కడంతో 467 పరుగుల భారీ స్కోర్ చేసి ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన నార్త్ ఈస్ట్ జోన్ జట్టు.. అభిజిత్ సర్కార్ (5-20), షాబాజ్ అహ్మద్ (3-20) ధాటికి 111 పరుగులకే కుప్పకూలింది.ఆతర్వాత ఫాలో ఆన్‌లోనే ఏమాత్రం ప్రతిఘటించలేకపోయిన నార్త్ ఈస్ట్ జోన్ రెండో ఇన్నింగ్స్‌లోనూ 146 పరుగులకే ఆలౌటై, ఇన్నింగ్స్ తేడాతో పరాజయంపాలైంది. అనుకూల్ రాయ్ (5-37) రెండో ఇన్నింగ్స్‌లో నార్త్ ఈస్ట్ జట్టును దెబ్బకొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో విఫలమైన చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ రెండో ఇన్నింగ్స్‌లో బంతితో సత్తా చాటి 2 వికెట్లు (4 బంతుల వ్యవధిలో) తీశాడు. చదవండి: బౌలర్‌గానూ ఇరగదీసిన వైభవ్ సూర్యవంశీ -
ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ విఫలమైనా.. భారీ స్కోరు!
దులిప్ ట్రోఫీ- 2026 క్వార్టర్ ఫైనల్ తొలి ఇన్నింగ్స్‌లో ఈస్ట్ జోన్ భారీ స్కోరు సాధించింది. మిడిలార్డర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామి, బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ భారీ శతకాలతో చెలరేగి జట్టును పటిష్ట స్థితిలో నిలిపారు. ప్రతిష్టాత్మక దేశీ రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మ్యాచ్‌లు ఆదివారం మొదలయ్యాయి.ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్- నార్త్ ఈస్ట్ జోన్ తలపడుతున్నాయి. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గ్రౌండ్ 2లో టాస్ గెలిచిన నార్త్ ఈస్ట్ జోన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్‌కు ఆరంభంలో ఎదురుదెబ్బలు తగిలాయి.వైభవ్ సూర్యవంశీ విఫలంఓపెనర్లలో సీనియర్ అభిమన్యు ఈశ్వరన్ (15), వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీ (8) పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో వన్‌డౌన్‌లో వచ్చిన కుమార్ కుశాగ్రా (55).. నాలుగో నంబర్ బ్యాటర్ సుదీప్ కుమార్ ఘరామీ కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దారు.ఘరామీ, షాబాజ్ సెంచరీలుఈ క్రమంలో ఘరామీ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తంగా 185 బంతులు ఎదుర్కొన్న అతడు.. 25 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 146 పరుగులు సాధించాడు. మిగిలిన వారిలో విరాట్ సింగ్ (2), కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (4) నిరాశపరిచారు.ఇలాంటి తరుణంలో బౌలింగ్ ఆల్‌రౌండర్ షాబాజ్ అహ్మద్ అనూహ్య రీతిలో నిలకడైన ఆటతో సెంచరీతో కదం తొక్కాడు. మొత్తంగా 244 బంతులు ఎదుర్కొన్న షాబాజ్.. 167 పరుగులతో దుమ్ములేపాడు. అతడి ఇన్నింగ్స్‌లో 17 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు ఉన్నాయి. ఇక మిగిలిన వారిలో అనుకూల్ రాయ్ (37) ఓ మోస్తరుగా రాణించగా.. మహ్మద్ షమీ 11, ముకేశ్ 7, అభిజిత్ సర్కార్ 9 (నాటౌట్) పరుగులు చేశారు.A masterclass in grit and determination! 🏏Shahbaz Ahmed brings up a magnificent 150 (211) for East Zone in the Duleep Trophy 2026-27, anchoring the innings with pure class. 🌟#DuleepTrophy #EastZone #ShahbazAhmed #CAB pic.twitter.com/RChs72osxT— CABCricket (@CabCricket) August 24, 2026 స్కోరెంతంటే?ఫలితంగా ఈస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 112.5 ఓవర్లు ఆడి 467 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఘరామీ- షాబాజ్ అత్యధికంగా ఆరో వికెట్‌కు 150 పరుగులు జోడించారు. మరోవైపు.. అనుకుల్ రాయ్‌తో కలిసిషాబాజ్ ఏడో వికెట్‌కు 103 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఇక నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో ఆకాశ్ చౌదరి, ఫిరోయిజామ్ జోటిన్ మూడేసి వికెట్లు తీయగా.. బిశ్వోర్జిత్ కొంతుజమ్ రెండు వికెట్లు దక్కించుకున్నాడు. కెప్టెన్ రంగ్సేన్ జొనాథన్, టెచి నెరి తలా ఒక వికెట్ పడగొట్టారు.చదవండి: చరిత్ర సృష్టించిన రిషభ్ పంత్ -
సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్
దులీప్ ట్రోఫీ 2026లో భాగంగా ఇవాళ (ఆగస్ట్ 23) మొదలైన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో ఈస్ట్ జోన్-నార్త్ ఈస్ట్ జోన్.. నార్త్ జోన్-ఈస్ట్ జోన్ జట్లు తలపడుతున్నాయి. తొలి క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేసింది.రెండో క్వార్టర్ ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ జోన్ తొలి ఇన్నింగ్స్‌లో 251 పరుగులకు ఆలౌటైంది. అనంతరం బరిలోకి దిగిన ఈస్ట్ జోన్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది.సెంచరీలతో కదంతొక్కిన ఘరామీ, షాబాజ్నార్త్ ఈస్ట్ జోన్‌తో జరుగుతున్న తొలి క్వార్టర్ ఫైనల్లో ఈస్ట్ జోన్ ప్లేయర్లు సుదీప్ కుమార్ ఘరామీ (146), షాబాజ్ అహ్మద్ (100 బ్యాటింగ్) సెంచరీలతో కదంతొక్కారు. ఈ జట్టు స్టార్ ప్లేయర్లు, కెప్టెన్, వైస్ కెప్టెన్లు ఇషాన్ కిషన్ (4), వైభవ్ సూర్యవంశీ (8) నిరాశపరిచారు. మిగతా ప్లేయర్లలో అభిమన్యు ఈశ్వరన్ 15, కుమార్ కుషాగ్రా 55, విరాట్ సింగ్ 2, అనుకూల్ రాయ్ 22 (బ్యాటింగ్) చేశారు. నార్త్ ఈస్ట్ జోన్ బౌలర్లలో జొతిన్ 3, ఆకాశ్ చౌదరి 2, బిష్వోర్జిత్ ఓ వికెట్ పడగొట్టారు.సత్తా చాటిన తనుశ్, తుషార్నార్త్ జోన్‌తో జరుగుతున్న రెండో క్వార్టర్ ఫైనల్లో వెస్ట్ జోన్ బౌలర్లు తనుశ్ కోటియన్ (4-72), తుషార్ దేశ్‌పాండే (4-57) సత్తా చాటారు. వీరికి ముకేశ్ చౌదరి (1-47), శార్దూల్ ఠాకూర్ (1-38) సహకరించారు. నార్త్ జోన్ ప్లేయర్లలో తొమ్మిదో నంబర్ ఆటగాడు అన్షుల్ కంబోజ్ (60) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఇతనితో పాటు ఆయుశ్ బదోని (51), ఆయుశ్ దొసేజా (42) రాణించారు. కమ్రాన్ ఇక్బాల్ 26, యశ్ ధుల్ 9, అబ్దుల్ సమద్ 6, కన్హయ్య వధవాన్ 5, నిషాంత్ సింధు 15, అబిద్ ముస్తాక్ 19, అర్షదీప్ సింగ్ 4, సునీల్ కుమార్ 0 (నాటౌట్) పరుగులు చేశారు.అనంతరం వెస్ట్ జోన్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించగా.. పృథ్వీ షా (22) మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆబిద్ ముస్తాక్ అద్భుతమైన బంతితో అతన్ని క్లీన్ బౌల్డ్ చేశాడు. మరో ఓపెనర్ హార్విక్ దేశాయ్‌ను (3) అర్షదీప్ సింగ్ పెవిలియన్‌కు పంపాడు. ఆట ముగిసే సమయానికి ముషీర్ ఖాన్ (6), శివాలిక్ శర్మ (0) క్రీజ్‌లో ఉన్నారు. -
తుస్సుమనిపించిన ఇషాన్ కిషన్
దులీప్ ట్రోఫీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో బెంగళూరు వేదికగా ఈస్ట్ జోన్, నార్త్ ఈస్ట్ జోన్ జట్లు తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టీమిండియా స్టార్ వికెట్ వికెట్ కీపర్ బ్యాటర్, ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తీవ్ర నిరాశపరిచాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో కిషన్ తొమ్మిది బంతులు ఎదుర్కొని కేవలం 4 పరుగులు మాత్రమే చేశాడు. ఫెరోయిజమ్ జోతిన్ సింగ్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అర్పిత భటేవరాకు క్యాచ్ ఇచ్చి ఇషాన్ పెవిలియన్‌కు చేరాడు. ఇప్పటికే భారత పరిమిత ఓవర్ల జట్టులో తన స్ధానాన్ని సుస్థిరం చేసుకున్న కిషన్.. టెస్టు జట్టులోకి కూడా ఎంట్రీ ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే దేశవాళీ టోర్నీ దులీప్ ట్రోఫీలో ఆడుతున్నాడు. అయినప్పటికి ఈ జార్ఖండ్ ఆటగాడు తన మార్క్ చూపించలేకపోయాడు. ఇక ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఈస్ట్ జోన్ జట్టుకు ఆరంభంలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ (8), అభిమన్యు ఈశ్వరన్ (15) త్వరగానే పెవిలియన్ బాట పట్టడంతో ఈస్ట్ జోన్ 25 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది.ఈ సమయంలో సుదీప్ కుమార్ ఘరామీ, కుమార్ కుషాగ్రా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాక కుషాగ్రా ఔటయ్యాడు.ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన విరాట్ సింగ్ (2), ఈషాన్ కిషన్ (4) స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. 56 ఓవర్లు ముగిసే సరికి ఈస్ట్‌జోన్ 5 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. క్రీజులో షాబాజ్ అహ్మద్(42), ఘరామీ(130) ఉన్నారు. -
ఈ టీమిండియా క్రికెటర్లు ప్రభుత్వ ఉద్యోగులు.. ఎవరికి ఏ జాబ్?
టీమిండియా స్టార్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ మరోసారి వార్తల్లో నిలిచాడు. క్రికెట్ నుంచి కాస్త విరామం తీసుకుని ఉద్యోగిగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయంలో కిషన్ దర్శనమిచ్చాడు. క్రికెటర్‌గా ఉన్న కిషన్ బ్యాంక్‌లో ఉద్యోగం చేయడమేంటి అని ఆశ్చర్యపోతున్నారా ? అయితే ఈ పూర్తి కథనం చదవాల్సిందే.ఇషాన్‌కు స్పోర్ట్స్ కోటాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం వచ్చింది. ప్రస్తుతం అతడు పాట్నాలోని ఆర్బీఐ రీజనల్ కార్యాలయంలో అసిస్టెంట్ మేనేజర్‌గా బాధ్యతలు నిర్వరిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ షెడ్యూల్లో విరామం దొరకడంతో కిషన్ పనిచేసేందుకు పాట్నా ఆర్బీఐ బ్రాంచ్‌కు వెళ్లాడు.ఐడీ కార్డ్ ధరించి తన సహచరలతో కలిసి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెటర్లగా ఉండి ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్న వారి గురుంచి తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. ఈ జాబితాలో చాలా మంది పురుష, మహిళ క్రికెటర్లు ఉన్నారు. భారత క్రికెట్ దిగ్గజాలు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, ఎంఎస్ ధోనిలు సాయుధ దళాల్లో గౌరవ హోదాలు పొందారు.కపిల్ దేవ్: భారత్‌కు తొలి వరల్డ్‌కప్ అందించిన కపిల్ దేవ్‌కు ఇండియన్ ఆర్మీ 2008లో 'లెఫ్టినెంట్ కల్నల్' గౌరవ హోదాను ప్రధానం చేసింది. వాస్తవానికి కపిల్ దేవ్ సైనిక నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చారు. అతడి తండ్రి రామ్ లాల్ నిఖాంజ్ భారత సైన్యంలో పని చేశారు.సచిన్ టెండూల్కర్: 24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు సేవలందించినందుకు గానూ సచిన్ టెండూల్కర్‌కు ఎయిర్ ఫోర్స్‌లో గ్రూప్ కెప్టెన్ గౌరవ ర్యాంక్ లభించింది. 2010లో అతడికి ఈ అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ 'గ్రూప్ కెప్టెన్' హోదా పొందిన తొలి క్రీడాకారుడిగా సచిన్ నిలిచాడు.ఎంఎస్ ధోని: భారత్‌కు రెండు ఐసీసీ ప్రపంచకప్‌లను అందించిన మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని కూడా సాయుధ దళాల్లో భాగమయ్యాడు. ధోని ఇండియన్ టెరిటోరియల్ ఆర్మీలో లెఫ్టినెంట్ కల్నల్ గౌరవ హోదాను కలిగి ఉన్నాడు. ధోని ఇప్పటికే పలుమార్లు మిలిటరీ శిక్షణలో పాల్గొన్నాడు.కేఎల్ రాహుల్: ఇషాన్ కిషన్ మాదిరే మరో వికెట్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ కూడా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. యువతను బ్యాంకింగ్ రంగం వైపు ఆకర్షించే క్రమంలో అతడికి ఆర్బీఐ ఈ ఉద్యోగం కట్టబెట్టింది. ఆర్బీఐ అవగాహన కార్యక్రమాల్లోనూ రాహుల్ పాల్గొంటున్నాడు.యుజ్వేంద్ర చాహల్: భారత వెటరన్ స్పిన్నర్ యుజేంద్ర చాహల్ 2018 నుంచి ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఆఫీసర్‌గా సేవలు అందిస్తున్నారు.మహమ్మద్ సిరాజ్: టీ20 ప్రపంచకప్-2024 టైటిల్ గెలిచిన భారత జట్టులో భాగమైనందుకు గాను పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తెలంగాణ ప్రభుత్వం డీఎస్పీ ఉద్యోగంతో సత్కరించింది. అతడికి నివాస స్థలాన్ని సర్కార్ కూడా కేటాయించింది.ముకేష్ కుమార్, ఆకాష్ దీప్: భారత జట్టులో చోటు దక్కించుకుని రాణిస్తున్నందుకు స్పీడ్ స్టార్స్ ముకేష్ కుమార్, ఆకాష్ దీప్‌లకు బిహార్ ప్రభుత్వం డీఎస్పీ హోదా ఇచ్చి గౌరవించింది.రింకూ సింగ్సాధరణ స్ధాయి నుంచి అంతర్జాతీయ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ సింగ్‌ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్‌గా ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల నియమించింది. అతడికి ఈ ఉద్యోగంతో పాటు రూ.3 కోట్ల క్యాష్ రివార్డును కూడా యోగి సర్కార్ అందజేసింది.హర్మన్‌ప్రీత్ కౌర్ : భారత మహిళల జట్టు కెప్టెన్‌గా అందించిన సేవలకు గానూ పంజాబ్ పోలీస్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తున్నారు.దీప్తి శర్మ: భారత మహిళల జట్టు తొలి వన్డే ప్రపంచకప్‌ను సొంతం చేసుకోవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు ఉత్తర్‌ప్రదేశ్ సర్కార్ డీఎస్పీ పదవిని కట్టబెట్టింది.రిచా ఘోష్: 2025 మహిళల వన్డే ప్రపంచకప్ విజయంలో కీలక పాత్ర పోషించినందుకు రిచా ఘోష్‌ను బెంగాల్ ప్రభుత్వం అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్‌గా నియమించింది. ఆమె ప్రస్తుతం సిలిగురి పోలీస్ కమిషనరేట్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్నారు. -
క్రికెట్ వదిలి ఆఫీస్ కి ఇషాన్ కిషన్ శాలరీ ఎన్ని లక్షలో తెలుసా ?
-
RBI అసిస్టెంట్ మేనేజర్‌గా ఇషాన్ కిషన్.. జీతం ఎంతంటే?
టీమిండియా స్టార్ క్రికెటర్ ఇషాన్ కిషన్‌కు సంబంధించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్ మేనేజర్ విధుల్లో భాగంగా.. సహచర ఉద్యోగులతో అతడు కలిసి ఉన్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.టీమిండియా రీఎంట్రీలో అదుర్స్అసలు విషయం ఏమిటంటే.. వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ గత కొంతకాలంగా టీమిండియా తరఫున బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఈ జార్ఖండ్ పాకెట్ డైనమైట్ ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్లో రీఎంట్రీ ఇచ్చాడు. టీ20 ప్రపంచకప్-2026లో అదరగొట్టి జట్టులో స్థానం సుస్థిరం చేసుకున్నాడు.ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లండ్, జింబాబ్వే పర్యటనలతో బిజీగా గడిపిన ఇషాన్ కిషన్.. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నాడు. టీమిండియా టెస్టు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లగా ఇషాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. దీంతో స్వస్థలంలో ఉన్న అతడు.. ఆర్బీఐ విధుల్లో చేరినట్లుగా ఉన్న ఫొటో ఒకటి తాజాగా వైరల్ అవుతోంది.పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయంలోకాగా స్పోర్ట్స్ కోటాలో భాగంగా ఇషాన్ కిషన్‌కు చాన్నాళ్ల క్రితమే ఆర్బీబీలో ఉద్యోగం వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం అతడు అసిస్టెంట్ మేనేజర్ హోదాలో ఉన్నట్లు తెలుస్తోంది. న్యూస్18 కథనం ప్రకారం.. అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరామం లభించగా.. ఇషాన్ ఆర్బీఐ విధుల్లో చేరాడు. పాట్నాలోని ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లిన ఇషాన్‌కు సహచర ఉద్యోగులు ఘనంగా స్వాగతం పలికినట్లు తెలుస్తోంది. అతడితో ఫొటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అవి వైరల్‌గా మారాయి.జీతం ఎంతంటే..?కాగా ఆర్బీఐ అసిస్టెంట్ మేనేజర్‌గా నెలకు ఇషాన్ కిషన్‌కు రూ. 1.22 లక్షల నుంచి 1.24 లక్షల వరకు వేతనం అందుతున్నట్లు తెలుస్తోంది. ప్రొవిడెంట్ ఫండ్ సహా మిగతా కటింగ్స్ అన్నీ పోనూ చేతికి దాదాపు రూ. 1.12 లక్షలు అందుతున్నట్లు సమాచారం.ఇక ఆగష్టు 23 నుంచి దేశవాళీ ప్రతిష్టాత్మక రెడ్‌బాల్ టోర్నీ దులిప్ ట్రోఫీ మొదలుకానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈస్ట్ జోన్ జట్టుకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. త్వరలోనే మళ్లీ అతడు ఆటతో బిజీ కానున్నాడు. ఈ జట్టుకు బిహార్ చిచ్చరపిడుగు, టీమిండియా ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్.కాగా 2021లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన ఇషాన్ కిషన్.. ఇప్పటి వరకు 32 వన్డేలు, 55 టీ20 మ్యాచ్‌లు, 2 టెస్టు మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 1107, టీ20లలో 1608 పరుగులు.. టెస్టుల్లో 78 రన్స్ చేశాడు ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.చదవండి: అనుష్క శర్మ అలా చేస్తే తప్పేంటి?: షమీIndian cricketer Ishan Kishan has reportedly resumed work as an Assistant Manager at the Reserve Bank of India office in Patna during his break from competitive cricket. Kishan was appointed to the post through the sports quota and was seen carrying out his official… pic.twitter.com/AZPdCflCrM— News18 (@CNNnews18) August 5, 2026 -
సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?: భారత మాజీ క్రికెటర్ ఫైర్
ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్‌గా వైభవ్ సూర్యవంశీని నియమించడంపై విమర్శలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే ఈ విషయంలో సెలక్టర్ల నిర్ణయాన్ని తప్పుబట్టగా.. తాజాగా భారత మాజీ క్రికెటర్ దీప్ దాస్ గుప్తా సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ క్రికెట్లో అనుభవం లేని ఆటగాడిని ఏకంగా వైస్ కెప్టెన్‌ను చేయడం ఏమిటని ప్రశ్నించాడు.అనుభవం తక్కువకాగా దేశవాళీ ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌లో ఈస్ట్ జోన్ జట్టుకు కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ ఎంపిక కాగా.. అతడి డిప్యూటీగా పదిహేనేళ్ల వైభవ్‌కు అవకాశం దక్కింది. ఇక ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టినప్పటికీ ఈ బిహారీ పిల్లాడు రెడ్‌బాల్ క్రికెట్లో మాత్రం ఇప్పటికి కేవలం 8 మ్యాచ్‌లు ఆడి 207 పరుగులు చేశాడు.ఈ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ ఇవ్వడంపై విమర్శల వర్షం కురుస్తోంది. ఈ విషయం గురించి భారత మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ దీప్ దాస్ గుప్తా సైతం సెలక్టర్ల నిర్ణయంపై పెదవి విరిచాడు. తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడుతూ..సీనియర్లు ఉండగా ఇదేం పద్ధతి?‘‘వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా నియమించడాన్ని నేను అస్సలు సమర్థించను. అనుకూల్ రాయ్ వంటి సీనియర్ ప్లేయర్లు ఎంతో మంది జట్టులో ఉన్నారు. చాలా ఏళ్లుగా వాళ్లంతా రెడ్‌బాల్ క్రికెట్లో సేవలు అందిస్తున్నారు. అలాంటి వాళ్లకి నాయకత్వ బృందంలో చోటివ్వాలి.15, 16 ఏళ్ల వయసుకే వైభవ్ సూర్యవంశీ క్రికెటర్‌గా పరిణతి సాధించాడని నేను ఒప్పుకొంటాను. అతడి ప్రతిభ విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. అయితే, రెడ్‌బాల్ క్రికెట్లో పూర్తిగా ఆడకముందే అతడికి వైస్ కెప్టెన్‌గా బాధ్యత ఇవ్వడం సరికాదు.అతడు ఇప్పుడిప్పుడే ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడటం మొదలుపెట్టాడు. వైస్ కెప్టెన్ స్థాయికి తగ్గ గణాంకాలు కూడా ప్రస్తుతం అతడి ఖాతాలో లేవు. ముందు అతడిని ఆడనివ్వండి. తనను తాను నిరూపించుకోనివ్వండి’’ అని దీప్ దాస్ గుప్తా సెలక్టర్లకు హితవు పలికాడు.మా నిర్ణయం సరైందేఇదిలా ఉంటే.. ఈస్ట్ జోన్ సెలక్టర్ ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్న సంగతి తెలిసిందే. వైభవ్ సూర్యవంశీ ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ స్థాయికి ఎదుగుతాడని.. అన్నీ తెలిసే తాము అతడిని ఇప్పుడు వైస్ కెప్టెన్‌ని చేశామని పేర్కొన్నాడు. దులిప్ ట్రోఫీలో ప్రదర్శన ఆధారంగా వైభవ్ భారత టెస్టు జట్టుకు ఎంపికయ్యే అవకాశం ఉందన్నాడు.చదవండి: ఇంగ్లండ్ గడ్డ మీద ఇరగదీస్తున్న కుల్దీప్ యాదవ్ -
అందుకే వైస్ కెప్టెన్‌గా వైభవ్: కుండబద్దలు కొట్టిన సెలక్టర్
టీమిండియా చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దక్కిన ప్రమోషన్ పట్ల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పదిహేనేళ్ల ఈ బిహారీ పిల్లాడు ప్రతిష్టాత్మక దులిప్ ట్రోఫీ టోర్నీలో ఈస్ట్ జోన్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సంగతి తెలిసిందే. ఇషాన్ కిషన్ సారథ్యంలో వైభవ్ అతడికి డిప్యూటీగా వ్యవహరించనున్నాడు.అయితే, వైభవ్ సూర్యవంశీకి ఏకంగా వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు ఇవ్వడం పట్ల కామెంటేటర్ హర్షా భోగ్లే అభ్యంతరం వ్యక్తం చేశాడు. రెడ్‌బాల్ క్రికెట్లో పెద్దగా అనుభవం లేని పిల్లాడిని కీలక పదవికి ఎలా ఎంపిక చేస్తారని సెలక్టర్లను ప్రశ్నించాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్‌ని చేశాముఈ నేపథ్యంలో ఒడిశా మాజీ క్రికెటర్, ఈస్ట్ జోస్ సెలక్షన్ కమిటీలో భాగమైన ప్రవంజన్ ములిక్ స్పందించాడు. క్రిక్‌బజ్‌తో మాట్లాడుతూ.. ‘‘వైభవ్‌ను కెప్టెన్‌గా నియమించలేదు కదా!.. అతడు ఇప్పుడు కేవలం వైస్ కెప్టెన్ మాత్రమే. ఆ జట్టుకు ఇషాన్ కిషన్ సారథి. అయితే, ఇషాన్ వికెట్ కీపర్ కూడా!రోజంతా ఇషాన్ యాక్టివ్గానే ఉంటాడు. కాబట్టి వైభవ్‌కు పెద్దగా పనేమీ ఉండదు. అయితే, ఇషాన్‌కు డిప్యూటీగా అతడు ఎంతో కొంత నేర్చుకుంటాడు. మరింత పరిణతి సాధిస్తాడు. అందుకే అతడిని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశాము. ఏదో ఒకరోజు టీమిండియా కెప్టెన్ అవుతాడుదులిప్ ట్రోఫీ వంటి ప్రతిష్టాత్మక టోర్నీలో ఉప నాయకుడిగా ఉండటం గొప్ప అవకాశం. అతడు టీమిండియా తరఫున బాగా ఆడాలని కోరుకుంటున్నాడు. మేము కూడా యువ ఆటగాళ్లకు సరైన సమయంలో అవకాశాలు ఇవ్వాలని భావిస్తున్నాము. ఎవరికి తెలుసు.. ఏదో ఒకరోజు వైభవ్ టీమిండియా కెప్టెన్ కూడా అవ్వొచ్చు.ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే మేము అతడికి వైస్ కెప్టెన్‌గా అవకాశం ఇచ్చాము. ఇంతకు ముందు భారత అండర్-19 జట్టుకు, బిహార్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్ జట్టుకు అతడు వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. దులిప్ ట్రోఫీ సందర్భంగా జాతీయ సెలక్టర్లు అతడి ఆటను తప్పక పరిశీలిస్తారు. అతడు త్వరలోనే భారత టెస్టు జట్టుకు కూడా ఎంపికయ్యే అవకాశాలు లేకపోలేదు కదా!’’ అని ప్రవంజన్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు.చదవండి: టీమిండియాకు శుభవార్త -
వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారు?
టీమిండియా యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీకి ఊహించని ప్రమోషన్ దక్కింది. ఇటీవల జింబాబ్వే గడ్డ మీద టీ20 సిరీస్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’గా నిలిచిన ఈ 15 ఏళ్ల కుర్రాడు... దులీప్ ట్రోఫీలో పాల్గొనే ఈస్ట్ జోన్ జట్టుకు ఎంపికయ్యాడు. ఏకంగా వైస్ కెప్టెన్‌గా అతడు నియమితుడయ్యాడు. అభిమానుల హర్షంభవిష్యత్తులో వైభవ్‌ను అన్ని ఫార్మాట్ల ప్లేయర్‌గా తీర్చిదిద్దే దిశగా ఇది తొలి అడుగు కానుంది. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే వైభవ్‌కు ప్రతిష్టాత్మక టోర్నీలోని జుట్టుకు ఉపనాయకుడిగా వ్యవహరించే అవకాశం రావడం పట్ల అభిమానులు హర్షం చేస్తున్నారు.అదే విధంగా.. ‘వైభవ్ పిన్న వయసులోనే ఈస్ట్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికవడం బిహార్ క్రికెట్‌కు గర్వకారణం. అతడి అద్భుత ప్రదర్శనపై సెలక్టర్లు నమ్మకముంచారు’ అని బిహార్ రాష్ట్ర క్రికెట్ సంఘం అధ్యక్షుడు హర్షవర్ధన్ కూడా సంతోషం వ్యక్తం చేశాడు.వైస్ కెప్టెన్‌గా ఎలా ఎంపిక చేస్తారు?అయితే, ప్రముఖ కామెంటేటర్ హర్షా భోగ్లే మాత్రం ఈ విషయంపై భిన్నంగా స్పందించాడు. రెడ్‌బాల్ క్రికెట్లో అంతగా అనుభవం లేని ఈ పదిహేనేళ్ల పిల్లాడిని సీనియర్ జట్టుకు వైభవ్‌ను వైస్ కెప్టెన్‌గా ఎలా నియమిస్తారని సెలక్టర్ల నిర్ణయాన్ని ప్రశ్నించాడు.ఈ మేరకు ఎక్స్ వేదికగా.. ‘‘సీనియర్ రెడ్‌బాల్ జట్టుకు వైభవ్ సూర్యవంశీని వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేయడానికి గల కారణం ఏమిటో నాకర్థం కావడం లేదు. నిజానికి ఈ విషయం నన్ను ఆశ్చర్యపరిచింది. అతడు ఇప్పటి వరకు రెడ్‌బాల్ క్రికెట్లో కేవలం 12 ఇన్నింగ్స్ ఆడి.. 207 పరుగులు చేశాడు.అతడి ప్రతిభ అసాధారణం. కానీ ఇప్పుడిప్పుడే అతడు ఎదుగుతున్నాడు. నేర్చుకోవాల్సింది ఇంకా ఎంతో ఉంది. ముఖ్యంగా రెడ్‌బాల్ క్రికెట్లో అతడు ఇంకా మొదటి దశలోనే ఉన్నాడు’’ అని హర్షా భోగ్లే సెలక్టర్ల నిర్ణయాన్ని విమర్శించాడు.ఇషాన్ కిషన్ సారథ్యంలోకాగా ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 6 వరకు బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో దులిప్ ట్రోఫీ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకోసం ఇషాన్ కిషన్ సారథ్యంలో 15 మందితో కూడిన ఈస్ట్ జోన్ జట్టును బుధవారం ప్రకటించారు. కాగా ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో వైభవ్ ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లాడి 207 పరుగులు చేశాడు. ఇక సూర్యవంశీకి ఇదే తొలి దులీప్ ట్రోఫీ కాగా... సీనియర్ పేసర్ మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్ , షహబాజ్ అహ్మద్, అభిమన్యు ఈశ్వరన్ ఈస్ట్ జోన్ జట్టులో చోటు దక్కించుకున్నారు.దులిప్ ట్రోఫీ తాజా ఎడిషన్‌కు ఈస్ట్ జోన్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిమన్యు ఈశ్వరన్, సుదీప్ ఘరామి, షహబాజ్ అహ్మద్, సూరజ్ జైస్వాల్, మహ్మద్ షమీ, ముకేశ్ కుమార్, కుమార్ కుషాగ్ర, షిక్జార్ మోహన్, అనుకూల్ రాయ్, విరాట్ సింగ్, శుభ్రంసు సేనాపతి, డేనిశ్ దాస్, అభిజిత్ సర్కార్. చదవండి: శ్రీలంకతో టెస్టులకు పంత్‌ను ఎలా సెలక్ట్ చేశారు?: డివిలియర్స్I wonder what the thinking is behind making Sooryavanshi vice-captain of a senior red ball team. He has played 12 innings for 207 runs @ 17.25. His talent is extraordinary but there is a learning curve and he is at the bottom of it in red ball cricket.— Harsha Bhogle (@bhogleharsha) July 30, 2026 -
విరాట్ రికార్డు బద్దలు కొట్టిన ఇషాన్
జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో భారత వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో 44 బంతుల్లో 81 పరుగులు (9 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసిన అతను.. ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక అంతర్జాతీయ టీ20 పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో బ్యాటింగ్ దిగ్గజం విరాట్ కోహ్లిని అధిగమించాడు. తాజా ఇన్నింగ్స్‌తో ఈ ఏడాది ఇషాన్ టీ20 పరుగుల సంఖ్య 783 పరుగులకు చేరగా.. 2022లో విరాట్ 781 పరుగులు చేశాడు. ఈ జాబితాలో పాక్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ (2021లో 1326 పరుగులు) టాప్ ప్లేస్‌లో ఉన్నాడు. భారత్ తరఫున మాజీ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (2022లో 1164 పరుగులు) అగ్రస్థానంలో ఉన్నాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉన్న ఇషాన్ ఈ ఏడాది స్కై రికార్డును కూడా బద్దలు కొట్టే అవకాశం ఉంది. మరో 381 పరుగులు చేస్తే స్కై రికార్డు.. మరో 543 పరుగులు చేస్తే మహ్మద్ రిజ్వాన్‌ను కూడా అధిగమించి ప్రపంచ రికార్డు నెలకొల్పవచ్చు.భారత్‌కు ఈ ఏడాది ఇంకా వెస్టిండీస్, న్యూజిలాండ్, శ్రీలంకలతో టీ20 సిరీస్‌లు ఉండటంతో పాటు ఆసియా క్రీడల్లో కూడా ఆడే అవకాశం ఉంది. దీంతో ఇషాన్ కిషన్‌కు ఈ రికార్డులను బద్దలు కొట్టే అవకాశాలు మెండుగా ఉన్నాయి.ఓ క్యాలెండర్ ఇయర్లో అత్యధిక టీ20 అంతర్జాతీయ పరుగులు చేసిన ఆటగాళ్లు:* 1326 – మహ్మద్ రిజ్వాన్ (2021)* 1164 – సూర్యకుమార్ యాదవ్ (2022)* 996 – మహ్మద్ రిజ్వాన్ (2022)* 939 – బాబర్ ఆజమ్ (2021)* 936 – బ్రియాన్ బెన్నెట్ (2025)* 859 – అభిషేక్ శర్మ (2025)* 783 – ఇషాన్ కిషన్ (2026)* 781 – విరాట్ కోహ్లీ (2022)మ్యాచ్ విషయానికొస్తే.. ఇషాన్ రికార్డు ఇన్నింగ్స్ కారణంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోరు (219-5) సాధించింది. అనంతరం అభిషేక్ మూడు, యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీయడంతో జింబాబ్వే 129 పరుగులకే ఆలౌటై, 90 పరుగుల భారీ తేడాతో పరాజయంపాలైంది. ఫలితంగా భారత్ మూడు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ టీమిండియానే గెలిచింది. నామమాత్రపు మూడో టీ20 ఇవాళే (జులై 26) జరుగనుంది. భారత టీ20 జట్టు కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇది తొలి సిరీస్ విజయం. -
‘వైభవ్ నా తమ్ముడు.. నేనిచ్చే సలహా అదొక్కటే’
జింబాబ్వే పర్యటనలో తొలి టీ20లో మెరుపు అర్ధసెంచరీతో ఆకట్టుకున్న వైభవ్ సూర్యవంశీ రెండో టీ20లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 9 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81), తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్) సంచలన ఇన్నింగ్స్‌లతో టీమిండియా రెండో టీ20లో 90 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఇక మ్యాచ్ ముగిసిన అనంతరం ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఇషాన్ కిషన్ వైభవ్ సూర్యవంశీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీమిండియా మేనేజ్మెంట్తో పాటు సీనియర్ ప్లేయర్లు వైభవ్‌కు ఎలాంటి సలహాలు ఇస్తుందని ఇషాన్ కిషన్‌ను అడిగారు. దీనిపై ఇషాన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా, ఇతర విషయాలను పట్టించుకోకుండా కేవలం తన ఆటపై దృష్టి పెట్టాలని మాత్రమే వైభవ్‌కు ఒక అన్నలా సలహా ఇస్తుంటానని పేర్కొన్నాడు. వైభవ్‌కు ఎంతో భవిష్యత్తు ఉన్న కారణంగా అతడిని కాపాడుకునేందుకు భారత జట్టు ఒక స్పష్టమైన వ్యూహాన్ని, ప్రణాళికలను రచించిందని ఇషాన్ కిషన్ తెలిపాడు.ఇషాన్ మాట్లాడుతూ.. ‘వైభవ్ నిజానికి చాలా తెలివైనవాడు. తాను ఏం చేస్తున్నాడో, ఎలా బ్యాటింగ్ చేయాలో, మైదానం బయట ఎలా ప్రవర్తించాలో, మైదానంలో ఎలా ఉండాలో అతనికి బాగా తెలుసు. అదే సమయంలో, అతను వచ్చిన నేపథ్యం వల్ల కావొచ్చు కొంత పరధ్యానం ఉండొచ్చు. మన స్నేహితుల వల్ల కూడా కొంత డిస్టర్బెన్స్ ఉండొచ్చు. నేను కూడా అదే నేపథ్యం నుంచి వచ్చాను కాబట్టి నాకు తెలుసు. క్రికెట్ ఆడుతూ దేశానికి ప్రాతినిధ్యం వహించేటప్పుడు దేనిపై దృష్టి పెట్టాలన్న దానిపై క్లియర్‌గా ఉన్నాను. నేను మాత్రమే కాదు, వైభవ్‌తో పాటు అభిషేక్, అక్షర్ భాయ్, ఇంకా అతనితో మాట్లాడే చాలా మంది ఆటగాళ్లు ఇదే దృష్టితో వ్యవహరిస్తారు. ప్రస్తుతం వైభవ్ సోషల్ మీడియాలో ఏం జరుగుతోందన్నది, బయటి గోల ఏంటనేది, పరుగులు చేయడంలో విఫలమైనప్పుడు తనపై వచ్చే విమర్శలను పక్కనబెట్టి కేవలం క్రికెట్ గురించే ఆలోచించేలా చూసుకుంటాము. వైభవ్‌ది చిన్న వయసు కాబట్టి తప్పుడు కారణల వల్ల పరధ్యానంలోకి వెళ్లకూడదని కోరుకుంటాం. సహచరులుగా మేమంతా వైభవ్‌ను ఒక తమ్ముడిలానే చూసుకుంటాం. వైభవ్ గనుక క్రీజులో నిలదొక్కుకుంటే పవర్ ప్లేలోనే 80-90 పరుగులు రాబట్టగలడు, అతనొక్కడే ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు’ అని ఇషాన్ చెప్పుకొచ్చాడు. 🚨 ISHAN KISHAN ON VAIBHAV SOORYAVANSHI 🇮🇳"We're all trying to guide Vaibhav like an elder brother so he avoids the mistakes we made early in our careers. Axar, Abhishek and the whole group are doing their best to help him."#IshanKishan #VaibhavSooryavanshi #TeamIndia…— KUMAR (@MyCric101) July 25, 2026Read: హండ్రెడ్‌లో జేమిమా విధ్వంసం.. ఒంటిచేత్తో జట్టుకు విజయం -
సిరీస్ మనదే
హరారే: స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటిన భారత క్రికెట్ జట్టు... జింబాబ్వేపై టి20 సిరీస్ కైవసం చేసుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా శనివారం జరిగిన రెండో మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్ సారథ్యంలోని టీమిండియా 90 పరుగుల తేడాతో ఆతిథ్య జింబాబ్వేను చిత్తు చేసింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలుండగానే 2–0తో సిరీస్ పట్టేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణిత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 81; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు), హైదరాబాదీ తిలక్ వర్మ (29 బంతుల్లో 60 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధశతకాలతో మెరిశారు. గత మ్యాచ్‌లో రికార్డు అర్ధ శతకం నమోదు చేసిన 15 ఏళ్ల ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (9 బంతుల్లో 20; 3 ఫోర్లు, 1 సిక్స్) ఎక్కువసేపు నిలవలేకపోయాడు. అనంతరం భారీ లక్ష్యఛేదనలో జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ (19 బంతుల్లో 32; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) టాప్ స్కోరర్ కాగా... తక్కినవాళ్లంతా విఫలమయ్యారు. భారత బౌలర్లలో అభిషేక్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా... అరంగేట్ర పేసర్ యశ్ ఠాకూర్, ప్రిన్స్ యాదవ్ చెరో రెండు వికెట్లు తీశారు. ఇరు జట్ల మధ్య నామమాత్రమైన మూడో టి20 నేడు ఇక్కడే జరగనుంది. వైభవ్ ఆరంభ మెరుపులు... ఐర్లాండ్–ఇంగ్లండ్ పర్యటనలో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన భారత బ్యాటింగ్ ఆర్డర్... ఈ మ్యాచ్‌లో దంచికొట్టింది. తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టిన అభిషేక్ శర్మ (8) ఎక్కువసేపు నిలవలేకపోగా... ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సూర్యవంశీ వరుసగా 4, 6, 4, 4 బాదాడు. అయితే అదే ఊపులో మరో భారీ షాట్ ఆడేందుకు ప్రయతి్నంచి అవుటయ్యాడు. మంచి టచ్‌లో కనిపించిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25; 4 ఫోర్లు) భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోగా... 10 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 95/3తో నిలిచింది. అక్కడి నుంచి ఇషాన్, తిలక్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. మంచి బంతులను గౌరవించిన ఈ జోడీ... చెత్త బంతులపై విరుచుకుపడింది. ఈ క్రమంలో ఇషాన్ 31 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా... ఇన్నింగ్స్ 13వ ఓవర్లో తిలక్ హ్యాట్రిక్ ఫోర్లతో హోరెత్తించాడు. మరుసటి ఓవర్లో ఇషాన్ 4, 4, 6 కొట్టడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. వీరిద్దరూ నిలకడగా రాణించడంతో మధ్య ఓవర్లలో భారత్ మెరుగైన స్కోరు చేసింది. ధాటిగా ఆడిన తిలక్ 23 బంతుల్లోనే హాఫ్‌సెంచరీ మార్క్ దాటాడు. తిప్పేసిన అభిషేక్... లక్ష్యఛేదనలో ఏ దశలోనూ జింబాబ్వే పోటీలో కనిపించలేదు. ఓపెనర్ బెన్నెట్ క్రీజులో ఉన్నంతసేపు భారీ షాట్లు ఆడగా... అతడిని తొలి అంతర్జాతీయ టి20 ఆడుతున్న యశ్ ఠాకూర్ అవుట్ చేశాడు. ఆ వెంటనే బెన్ కరెన్ (1) పెవిలియన్ చేరగా... మైయర్స్ (12),సికందర్ రజా (0) విఫలమయ్యారు. దీంతో జింబాబ్వే 49 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. బర్ల్ (20; 2 ఫోర్లు), మరుమని (24; 1 ఫోర్, 1 సిక్స్), ఇవాన్స్ (19; 1 ఫోర్, 2 సిక్స్‌లు) తలాకొన్ని పరుగులు చేశారు. పిచ్ స్పిన్‌కు అనుకూలిస్తుండటంతో... భారత సారథి శ్రేయస్ బంతిని పార్ట్‌టైమ్ స్పిన్నర్లు అభిషేక్ శర్మ, తిలక్ వర్మకు అందించాడు. వారిద్దరూ లోయర్ ఆర్డర్ పనిపట్టడంతో జింబాబ్వే ఆలౌటైంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: వైభవ్ (సి) ముజరబాని (బి) ఎన్గరవా 20; అభిషేక్ (సి) బర్ల్ (బి) ముజరబాని 8; ఇషాన్ (సి) బెన్నెట్ (బి) న్యూమన్ 81; శ్రేయస్ (సి) ఇవాన్స్ (బి) బెన్నెట్ 25; తిలక్ (నాటౌట్) 60; రింకూ (సి) బర్ల్ (బి) ఇవాన్స్ 12; శివమ్ దూబే (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 5 వికెట్లకు) 219. వికెట్ల పతనం: 1–10, 2–29, 3–95, 4–189, 5–213. బౌలింగ్: సికందర్ రజా 4–0–47–0; ముజరబాని 4–0–36–1; ఎన్గరవా 3–0–43–1; ఇవాన్స్ 4–0–44–1; న్యూమన్ 3–0–25–1; బెన్నెట్ 2–0–22–1. జింబాబ్వే ఇన్నింగ్స్: బెన్నెట్ (సి) ఇషాన్ (బి) యశ్ 32; కరన్ (సి) శివమ్ దూబే (బి) ప్రిన్స్ 1; మైయర్స్ (బి) రవి బిష్ణోయ్ 12; బర్ల్ (సి) రింకూ (బి) తిలక్ 20; సికందర్ రజా (సి) ఇషాన్ (బి) ప్రిన్స్ 0; మదెవెరె (సి) శ్రేయస్ (బి) శివమ్ దూబే 2; మరుమని (బి) యశ్ 24; ఇవాన్స్ (బి) అభిషేక్ 19; న్యూమన్ (బి) అభిషేక్ 3; ఎన్గరవా (సి) రింకూ (బి) అభిషేక్ 1; ముజరబాని (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (17.5 ఓవర్లలో ఆలౌట్) 129. వికెట్ల పతనం: 1–34, 2–34, 3–48, 4–49, 5–65, 6–82, 7–105, 8–119, 9–121, 10–129. బౌలింగ్: మయాంక్ 3–0–25–0; యశ్ ఠాకూర్ 4–0–30–2; ప్రిన్స్ 1.2–0–10–2; రవి బిష్ణోయ్ 4–0–20–1; శివమ్ దూబే 1.4–0–13–1; తిలక్ వర్మ 1–0–9–1; అభిషేక్ 2.5–0–17–3. -
వారిద్దరూ అద్భుతం.. గతం మాకు అవసరం లేదు: శ్రేయస్ అయ్యర్
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ భారీ విజయాన్ని అందుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 2-0 తేడాతో టీమిండియా కైవసం చేసింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొలుత బ్యాటింగ్‌లో 219 పరుగుల భారీ స్కోర్ సాధించిన మెన్ ఇన్ బ్లూ.. అనంతరం బౌలింగ్‌లో ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేసింది. ఈ విజయంపై మ్యాచ్ అనంతరం టీమిండియా కెప్టెన్ శ్రేయస్ స్పందించాడు. భారత జట్టు కెప్టెన్‌గా తొలి టీ20 సిరీస్ విజయాన్ని అందుకోవడం సంతోషంగా ఉందని అయ్యర్ చెప్పుకొచ్చాడు."ఏకపక్ష విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది. జట్టులోని ప్రతి ఒక్క ఆటగాడు అత్యుత్తమ ప్రదర్శన కనబరచడం వల్లే ఈ అద్భుత విజయం సాధ్యమైంది. తొలుత బ్యాటింగ్‌లో ఇషాన్ కిషన్, తిలక్ వర్మ అసాధరణ ప్రదర్శన కనబరిచారు. వారిద్దరూ ఆడిన కొన్ని షాట్లు చూడటానికి ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఈ పిచ్‌పై మొదట్లో 180 నుండి 200 పరుగులు చేస్తే మంచి స్కోర్ అని భావించాం. కానీ వారిద్దరి అద్భుత ఇన్నింగ్స్ వల్ల మేము ఏకంగా 219 పరుగులు సాధించాం. ఆ తర్వాత మా బౌలర్లు వారి పని వారు చేసుకుపోయారు. సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేసి ప్రత్యర్ధి జట్టును 129 పరుగులకే కట్టడి చేశారు. మ్యాచ్ ఆరంభం నుంచే ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చెలాయించాం. టీ20 ఫార్మాట్లో ఫియర్ లెస్ క్రికెట్ ఆడడం చాలా ముఖ్యం. గతంలో ఏం జరిగింది అనే దాన్ని పక్కన పెట్టి, ప్రస్తుతం గురుంచి ఆలోచిస్తూ ముందుకు సాగడమే మా సిద్దాంతం. ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోవాడనికి ప్రయత్నించాలి. ఆదివారం కూడా మాకు మరో మ్యాచ్ ఉంది. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను విజయంతో ముగించేందుకు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం" అని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో శ్రేయస్ పేర్కొన్నాడు. -
జింబాబ్వేపై భారత్ గ్రాండ్ విక్టరీ.. సిరీస్ మనదే (ఫోటోలు)
-
రెండో టీ20లో జింబాబ్వే చిత్తు.. సిరీస్ టీమిండియాదే
హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20లో 90 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు టీ20ల సిరీస్‌ను 2-0తో టీమిండియా సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 219 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్(44 బంతుల్లో 9 ఫోర్లు,2 సిక్స్‌లతో 1), తిలక్ వర్మ(29 బంతుల్లో 60 నాటౌట్) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. జింబాబ్వే బౌలర్లలో ముజార్బానీ, నగరవా, బెన్నెట్, న్యూమన్ న్యాముహురి తలా వికెట్ సాధించారు.అదరగొట్టిన అభిషేక్అనంతరం 220 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో పార్ట్‌టైమ్ స్పిన్నర్ అభిషేక్ శర్మ మూడు వికెట్లతో సత్తాచాటగా.. ప్రిన్స్ యాదవ్, యశ్ ఠాకూర్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు రవి బిష్ణోయ్, దూబే, తిలక్‌కు ఒక్కో వికెట్ దక్కింది. జింబాబ్వే బ్యాటర్లలో బెన్నెట్(32) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. మిగితా ప్లేయర్లంతా దారుణంగా విఫలమయ్యారు. కాగా భారత కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్‌కు ఇదే తొలి సిరీస్ విజయం కావడం గమనార్హం. కాగా జింబాబ్వే టూర్‌కు ముందు ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లను భారత్ కోల్పోయిన సంగతి తెలిసిందే. -
వైభవ్ విశ్వరూపం.. జింబాబ్వేపై భారత్ ఘన విజయం (ఫొటోలు)
-
అప్పుడు ఇషాన్ అసలు జట్టులోనే లేడు.. కానీ: సంజూ శాంసన్
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒక్కసారి ఇషాన్ కిషన్ జట్టులో పాతుకుపోతే.. తనకు తుదిజట్టులో చోటు ఉండదన్న సంగతి ముందే తెలుసన్నాడు. ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లకే యాజమాన్యం పెద్దపీట వేస్తుందని సంజూ పేర్కొన్నాడు.సంజూ పూర్తిగా విఫలంకాగా టీ20 ప్రపంచకప్-2026 కంటే టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌తోనే జార్ఖండ్ డైనమో ఇషాన్ కిషన్ అంతర్జాతీయ క్రికెట్లో పునరాగమనం చేశాడు. ఇక ఓపెనర్‌గా ఉన్న సంజూ కివీస్‌తో మ్యాచ్‌లలో 10, 6, 0, 24,6 పరుగులు చేసి పూర్తిగా విఫలమయ్యాడు.దుమ్ములేపిన ఇషాన్అదే సమయంలో ఇషాన్ 8, 76, 28, 103 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ ఆరంభ మ్యాచ్‌లలో అభిషేక్ శర్మకు ఓపెనింగ్ జోడీగా ఇషాన్ కిషన్ సంజూ స్థానాన్ని భర్తీ చేశాడు. దీంతో సంజూకు తుదిజట్టులో చోటు దక్కలేదు.అయితే, అనూహ్య రీతిలో నాకౌట్ దశలో తిరిగి ఓపెనర్‌గా వచ్చిన సంజూ 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో తాజాగా నాటి సంగతులను ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ గుర్తుచేసుకున్నాడు.అతడు ముందుగా అసలు జట్టులోనే లేడుజియోస్టార్తో మాట్లాడుతూ.. ‘‘ఇషాన్ కిషన్ వచ్చిన తర్వాత కథ పూర్తిగా మారిపోయింది. నిజానికి అతడు ముందుగా అసలు జట్టులోనే లేడు. అయితే, సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్‌ను ఒంటిచేత్తో గెలిచి.. తిరిగి టీమిండియాలో అడుగుపెట్టాడు.అతడి బ్యాటింగ్ కూడా వేరే లెవల్లో ఉంది. అప్పుడే నాకంటే ఇషాన్‌కు ప్రాధాన్యం పెరుగుతుందని అనిపించింది. ఐదు మ్యాచ్‌లలో ఆడే అవకాశం ఇచ్చినపుడు.. నేను 24, 6, 6, 10, 0 పరుగులు స్కోరు చేసి నిరాశపరిచాను. అదే సమయంలో.. మరొక ఆటగాడు ఏకంగా 70, 100 పరుగులు చేస్తూ శతక్కొట్టినప్పుడు.. నన్ను కాదని అతడిని నేరుగా ప్రపంచకప్ టోర్నీలో ఆడిస్తారని తెలుసు.డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పనిఎవరైనా ఫామ్‌లో ఉన్న ఆటగాడే తుదిజట్టులో ఉండాలని కోరుకుంటారు. వారికే ప్రాధాన్యం ఇస్తారు. వరల్డ్‌కప్ సమయంలో నా విషయంలో ఇదే జరిగింది. జరిగిందేదో జరిగిపోయింది.. నేనేమీ చేయలేను.. డగౌట్లో కూర్చుని చప్పట్లు కొట్టడమే నా పని అర్థమైంది.భారత క్రికెటర్ల పరిస్థితి ఇలాగే ఉంటుంది. ఒక్కరోజులో అంతా తలకిందులు కావొచ్చు. నాకు ఏడు మ్యాచ్‌లు ఆడే అవకాశం ఇస్తే.. నేను కనీసం మూడు సెంచరీలు అయినా కొడతానని అనిపించింది. కానీ అలా జరుగలేదు. టీ20 ఫార్మాట్ చాలా చిత్రమైనది. న్యూజిలాండ్‌తో సిరీస్‌లో నేను పూర్తిగా విఫలమయ్యాను.నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమేఆ తర్వాత పిచ్చివాడిలా ప్రాక్టీస్ చేశాను. వరల్డ్‌కప్ తుదిజట్టులో చోటు దక్కాలంటే తీవ్రంగా కష్టపడాలని నిర్ణయించుకున్నా. అయితే, ఆ ఐదు మ్యాచ్‌లలో నా హయ్యస్ట్ స్కోరు 24 మాత్రమే. దీంతో నేను మరింతగా కుంగిపోయాను.అయితే, అప్పుడు నా భార్య చెప్పిన మాటలు నాకు ఊరటనిచ్చాయి. గంటలు గంటలు ప్రాక్టీస్ చేసే బదులు సంతోషంగా, మానసికంగా దేనికైనా సన్నద్ధంగా ఉంటే.. ఇలాంటి తప్పిదాలు జరగవని చెప్పింది. న్యూజిలాండ్‌తో సిరీస్ నాకు చాలా విషయాలు నేర్పింది’’ అని సంజూ శాంసన్ చేదు జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు.చదవండి: ఐపీఎల్ టు ఇంగ్లండ్.. ఢిల్లీ ఆటగాడికి లక్కీ ఛాన్స్! -
IND vs ENG: మూడో వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
వన్డే సిరీస్‌లో ఇప్పటికి చెరో మ్యాచ్ గెలిచి టీమిండియా- ఇంగ్లండ్ 1-1తో సమంగా ఉన్నాయి. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా మంగళవారం నాటి తొలి మ్యాచ్‌లో గిల్ సేన గెలవగా.. కార్డిఫ్‌లో గురువారం జరిగిన మ్యాచ్‌లో బ్రూక్ బృందం జయభేరి మోగించింది. రెండో వన్డేలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగి 44 ఓవర్లలోనే ఆలౌట్ అయింది.99 పరుగులతో అజేయంగావన్డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి (65), వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (66) అర్ధ శతకాల కారణంగా.. 233 పరుగులు చేయగలిగింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఇంగ్లండ్ ఆదిలోనే ఓపెనర్లు బెన్ డకెట్ (0), జేకబ్ బెతెల్ (4) వికెట్లు కోల్పోయినా.. జో రూట్ ఒంటిచేతో జట్టును గెలిపించాడు.మూడో స్థానంలో ఆడిన రూట్.. ఓవైపు వరుసగా వికెట్లు పడుతున్నా పట్టుదలగా నిలబడ్డాడు. మొత్తంగా 133 బంతులు ఎదుర్కొని తొమ్మిది ఫోర్ల సాయంతో 99 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఇక ఇంగ్లండ్- టీమిండియా మధ్య ఆదివారం లార్డ్స్ వేదికగా నిర్ణయాత్మక మూడో వన్డే జరుగనుంది.అతడిని తొందరగా అవుట్ చేయాలిఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ కీలక సూచనలు చేశాడు. రూట్‌ను ఎంత త్వరగా అవుట్ చేశామన్న అంశం మీదే భారత జట్టు విజయం ఆధారపడి ఉంటుందన్నాడు. ఈ క్రమంలో భారత తుదిజట్టులో పలు మార్పులు సూచించాడు.స్టార్ స్పోర్ట్స్ షో గేమ్ ప్లాన్‌లో భాగంగా మాట్లాడుతూ.. ‘‘జో రూట్‌ను వీలైనంత త్వరగా అవుట్ చేయాలి. అతడి కోసం ప్రత్యేక ప్రణాళికలు అవసరం. కాబట్టి కుల్దీప్ యాదవ్‌ను తుదిజట్టులోకి తీసుకున్నా ఆశ్చర్యం లేదు. లేదంటే.. శివం దూబే స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను ఆడించవచ్చు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు.అయ్యర్ నాలుగు.. రాహుల్ ఐదో స్థానంలోఇక తాను ఎంపిక చేసుకున్న తుదిజట్టులో అభిషేక్ నాయర్ ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్లు కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్‌లకు చోటిచ్చాడు. అయితే, శ్రేయస్ అయ్యర్ రెగ్యులర్‌గా వచ్చే నాలుగో స్థానంలోనే రావాలని.. రెండో వన్డేలో మాదిరి ఇషాన్ కోసం అతడిని డిమోట్ చేయవద్దన్నాడు.అదే విధంగా కేఎల్ రాహుల్‌ను ఐదో స్థానంలో ఆడించి.. ఇషాన్‌ను ఆరో నంబర్ బ్యాటర్‌గా పంపాలని అభిషేక్ నాయర్ సూచించాడు. కాగా అనారోగ్యం కారణంగా కేఎల్ రాహుల్ రెండో వన్డేకు దూరంకాగా ఇషాన్ కిషన్ తుదిజట్టులోకి వచ్చాడు.నాలుగో స్థానంలో బరిలోకి దిగిన ఇషాన్.. ఎనిమిది బంతులు ఎదుర్కొని కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు. శ్రేయస్ అయ్యర్ ఐదో స్థానంలో వచ్చి అర్ధ శతకం బాదాడు. ఇక ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయం కారణంగా మూడో వన్డేకు దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సిరీస్‌లో తొలిసారి ఆడే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో మూడో వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న భారత తుదిజట్టుశుబ్మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, కుల్దీప్ యాదవ్/ప్రిన్స్ యాదవ్.చదవండి: విశ్రాంతి వద్దన్న రోహిత్.. అతడి కోసం గిల్ అనూహ్య నిర్ణయం! -
ఇషాన్ కిషన్ గొప్ప మనసు
భారత వికెట్‌కీపర్-బ్యాటర్ ఇషాన్ కిషన్ తన మానవత్వాన్ని చాటుతూ పాకిస్థాన్‌కు చెందిన ప్రత్యేక అవసరాలున్న (శారీరక వైకల్యం) ఓ అభిమానికి మరపురాని అనుభూతిని అందించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన ఐదో, చివరి టీ20 మ్యాచ్‌కు ముందు చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది.VIDEO OF THE DAY.....!!!! ❤️ - Ishan Kishan specially came over to meet a Pakistan fan. A lovely gesture. 👏 pic.twitter.com/xwjPxiX3dz— Sheri. (@CallMeSheri1_) July 12, 2026మ్యాచ్‌కు ముందు వార్మప్‌కు వెళ్లే క్రమంలో స్టేడియంలో ఉన్న సదరు అభిమానిని గమనించిన ఇషాన్ కిషన్ స్వయంగా అతడి వద్దకు వెళ్లాడు. అతడితో చేతులు కలిపి, చిరునవ్వుతో పలకరిస్తూ కొద్దిసేపు ఆప్యాయంగా మాట్లాడాడు. ఈ అనూహ్యమైన ఆత్మీయతతో ఆ అభిమాని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ వీడియోకు సోషల్ మీడియాలో విశేష స్పందన లభిస్తోంది. నెటిజన్లు ఇషాన్ మంచి మనసుకు ఫిదా అవుతున్నారు. దేశాల మధ్య విభేదాలను పక్కకు పెట్టి మంచి మనసు చాటుకున్నాడని అంటున్నారు.ఇదిలా ఉంటే, ఐదో టీ20లోనూ టీమిండియాకు ఇంగ్లండ్ చేతిలో భంగపాటే ఎదురైంది. ఈ ఓటమితో భారత జట్టు 0-4 తేడాతో సిరీస్‌ను కోల్పోయింది.టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేయగా.. భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమై, 56 పరుగుల తేడాతో పరాజయంపాలైంది. ఇంగ్లండ్ తరఫున జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసకర శతకంతో విరుచుకుపడగా.. కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్సర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. భారత ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ (56), తిలక్ వర్మ (53) అర్ద సెంచరీలతో రాణించారు. -
ఆఖరిదీ పోయింది
సౌతాంప్టన్: ఐర్లాండ్–ఇంగ్లండ్ టి20 టూర్‌ను భారత జట్టు ఒక్క గెలుపు లేకుండా శూన్య హస్తాలతో ముగించింది. ఫలితం తేలిన 6 మ్యాచ్‌లలోనూ జట్టు పరాజయంపాలైంది. ఐర్లాండ్ చేతిలో 0–2తో ఓడిన టీమిండియా, ఇప్పుడు ఇంగ్లండ్ చేతిలో 0–4తో ఓడటంతో కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ ప్రయాణం తీవ్ర నిరాశతో మొదలైంది. శనివారం జరిగిన ఐదో టి20లో ఇంగ్లండ్ 56 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. భారత్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు. జోస్ బట్లర్ (64 బంతుల్లో 131; 12 ఫోర్లు, 8 సిక్స్‌లు) అంతర్జాతీయ టి20లో తన రెండో సెంచరీతో చెలరేగగా...కెప్టెన్ హ్యారీ బ్రూక్ (45 బంతుల్లో 95 నాటౌట్; 4 ఫోర్లు, 8 సిక్స్‌లు) త్రుటిలో ఆ అవకాశాన్ని కోల్పోయాడు. వీరిద్దరు రెండో వికెట్‌కు 103 బంతుల్లోనే 233 పరుగులు జోడించడం విశేషం. అనంతరం భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 201 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (35 బంతుల్లో 56; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ (25 బంతుల్లో 53; 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధ సెంచరీలు చేయగా...శ్రేయస్ అయ్యర్ (16 బంతుల్లో 28; 4 ఫోర్లు), సంజు సామ్సన్ (14 బంతుల్లో 27; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించారు. ఇప్పటి వరకు ఐసీసీ టి20 టీమ్ ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్న భారత్‌ను వెనక్కి నెట్టి తాజా ఫలితంతో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది. ప్రసిధ్ రెండో ఓవర్లోనే సాల్ట్ (6)ను వెనక్కి పంపినా...ఆ తర్వాత బట్లర్, బ్రూక్ కలిసి చెలరేగిపోయారు. ఏ భారత బౌలర్‌నూ వదిలిపెట్టకుండా వీరిద్దరు ఆధిపత్యం ప్రదర్శించారు. పవర్‌ప్లేలో ఇంగ్లండ్ 61 పరుగులు చేయగా...అక్షర్ ఓవర్లో ఏకంగా 25 పరుగులు రాబట్టడంతో 10 ఓవర్లలో స్కోరు 111 పరుగులకు చేరింది. 19 బంతుల్లోనే బ్రూక్ హాఫ్ సెంచరీ పూర్తయింది. ప్రిన్స్ ఓవర్లో వరుసగా 4, 6, 6, 4 బాదిన బట్లర్...అక్షర్ ఓవర్లో భారీ సిక్స్‌తో 51 బంతుల్లోనే శతకాన్ని అందుకున్నాడు. చివరి 4 ఓవర్లలో ఇంగ్లండ్ 48 పరుగులు రాబట్టింది. అనంతరం భారీ లక్ష్య ఛేదన భారత్‌కు కష్టంగా మారిపోయింది. పవర్‌ప్లేలో 65/2తో మెరుగ్గానే కనిపించిన జట్టు 10 ఓవర్లలో 110 పరుగులు చేసి ప్రత్యర్థితో సమంగానే నిలిచింది. అయితే ఆ తర్వాత తక్కువ వ్యవధిలో వరుసగా వికెట్లు కోల్పోతూ వచ్చిన జట్టు 11–20 ఓవర్ల మధ్య 91/6 పరుగులు మాత్రమే చేయగలిగి ఓటమిపాలైంది. వైభవ్ స్థానంలో సామ్సన్... మూడు మ్యాచ్‌లలో వైఫల్యాల తర్వాత సంజు సామ్సన్ను పక్కన పెట్టి వైభవ్ సూర్యవంశీకి అవకాశం కల్పించిన భారత టీమ్ మేనేజ్మెంట్ ఈ మ్యాచ్‌లో సామ్సన్ను మళ్లీ జట్టులోకి తీసుకుంది. 15 ఏళ్ల వయసులో భారీ అంచనాలతో బరిలోకి దిగి వరుసగా 14, 13, 15 పరుగులు మాత్రమే చేసిన వైభవ్‌ను టీమ్ ఈ సారి పక్కన పెట్టింది.233 అంతర్జాతీయ టి20ల్లో రెండో వికెట్‌కు బట్లర్, బ్రూక్ జోడించిన 233 పరుగులే అత్యధిక భాగస్వామ్యం కాగా...ఓవరాల్‌గా ఏ వికెట్‌కైనా ఇది నాలుగో అత్యధిక పార్ట్నర్షిప్.7 శ్రేయస్ అయ్యర్ వరుసగా గెలిచిన టాస్‌ల సంఖ్య. కెప్టెన్‌గా తొలి 7 మ్యాచ్‌లలో అయ్యర్ ఈ ఫీట్ ప్రదర్శించగా... గతంలో వాలీ హామండ్ (8) మాత్రమే కెప్టెన్‌గా తన తొలి 8 మ్యాచ్‌లలో టాస్ నెగ్గాడు.మూడు క్యాచ్‌లు వదిలిపెట్టి... భారత జట్టు పేలవ ఫీల్డింగ్ ఈ మ్యాచ్‌లోనూ కొనసాగింది. బ్రూక్ 3 పరుగుల వద్ద శివమ్ దూబే, బట్లర్ 101 వద్ద ఉన్నప్పుడు సూర్యాంశ్ షెడ్గే, 90 వద్ద బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ కిషన్ వదిలేశారు. అన్నింటిలో షార్ట్ థర్డ్‌మాన్ స్థానంలో బంతిని సరిగా అంచనా వేయలేక దూబే వదిలేసిన బ్రూక్ క్యాచ్ భారీ నష్టం కలిగించింది!స్కోరు వివరాలుఇంగ్లండ్ ఇన్నింగ్స్: సాల్ట్ (సి) సూర్యాంశ్ (బి) ప్రసిధ్ 6; బట్లర్ (సి) అయ్యర్ (బి) దూబే 131; బ్రూక్ (నాటౌట్) 95; బెతెల్ (సి) తిలక్ (బి) దూబే 0; జాక్స్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు 18; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 257. వికెట్ల పతనం: 1–8, 2–241, 3–241. బౌలింగ్: అర్ష్ దీప్ 4–0–33–0, ప్రసిధ్ 4–0–38–1, ప్రిన్స్ యాదవ్ 4–0–60–0, అక్షర్ 4–0–63–0, సూర్యాంశ్ 3–0–39–0, శివమ్ దూబే 1–0–22–0. భారత్ ఇన్నింగ్స్: సామ్సన్ (సి) బెతెల్ (బి) కరన్ 27; అభిషేక్ (సి) బట్లర్ (బి) ఆర్చర్ 3; ఇషాన్ కిషన్ (సి) సాల్ట్ (బి) రషీద్ 56; అయ్యర్ (సి) కరన్ (బి) డాసన్ 28; తిలక్ (సి) బట్లర్ (బి) టంగ్ 53; దూబే (సి) ఆర్చర్ (బి) కరన్ 14; సూర్యాంశ్ (సి) బట్లర్ (బి) కరన్ 7; అక్షర్ (సి) జాక్స్ (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (నాటౌట్) 4; ప్రసిధ్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 201. వికెట్ల పతనం: 1–25, 2–55, 3–110, 4–131, 5–162, 6–189, 7–193, 8–199. బౌలింగ్: ఆర్చర్ 4–0–41–1, టంగ్ 4–0–53–1, జాక్స్ 3–0–32–0, స్యామ్ కరన్ 4–0–36–3, డాసన్ 2–0–14–1, రషీద్ 3–0–24–2. -
IND vs ENG: భారత తుదిజట్టు ఇదే!.. వైభవ్‌పై వేటు!
టీ20 ప్రపంచకప్ చాంపియన్ టీమిండియాకు ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. పసికూన ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన భారత జట్టు.. ఇంగ్లండ్‌కూ సిరీస్‌ను 0-3తో కోల్పోయింది. ఇక సౌతాంప్టన్ వేదికగా శనివారం నాటి ఆఖరిదైన ఐదో టీ20లో గెలిస్తేనే మరో వైట్‌వాష్ నుంచి టీమిండియా బయటపడుతుంది.పరువు దక్కాలంటేఈ నేపథ్యంలో కనీస పరువు దక్కాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత తుదిజట్టు కూర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ మొదలైంది. ఈ క్రమంలో వరుసగా మూడు మ్యాచ్‌లలో విఫలమైన యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీపై వేటు తప్పదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.కాగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ నాకౌట్ మ్యాచ్‌లలో వరుసగా 97*, 89, 89 పరుగులతో రాణించి.. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు సంజూ శాంసన్. అయితే, ఐర్లాండ్‌తో రెండు టీ20లలో 5, 0 పరుగులు చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. ఇంగ్లండ్‌తో తొలి టీ20లో కేవలం ఒకే ఒక్క పరుగు చేసి నిష్క్రమించాడు.సంజూ శాంసన్‌పై వేటు వేసిఈ నేపథ్యంలో సంజూ శాంసన్‌పై వేటు వేసిన యాజమాన్యం.. అతడి స్థానంలో వైభవ్ సూర్యవంశీతో అరంగేట్రం చేయించింది. అయితే, పదిహేనేళ్ల ఈ లెఫ్టాండర్ బ్యాటర్ ఇంగ్లండ్‌తో వరుసగా మూడు మ్యాచ్‌లలో 13, 14, 15 పరుగులు చేసి నిరాశపరిచాడు. ఇందుకు తోడు జట్టు సైతం వరుస పరాజయాలతో సిరీస్ కోల్పోయింది.తిరిగి తుదిజట్టులోకి ఇక వైభవ్‌తో పాటు వైస్ కెప్టెన్ తిలక్ వర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం విఫలమవుతున్నారు. ఇలాంటి తరుణంలో హెడ్‌కోచ్ గౌతం గంభీర్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఐదో టీ20 సందర్భంగా సంజూ శాంసన్‌ను తిరిగి తుదిజట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.టాపార్డర్‌లో ముగ్గురూ లెఫ్టాండర్లే (అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్) ఉండటం కూడా సమస్యగా మారిందని.. ఈసారి సంజూను చేర్చి లెఫ్ట్- రైట్ కాంబినేషన్‌తో ముందుకు వెళ్లనున్నట్లు సమాచారం. లేదంటే వైభవ్‌ను కొనసాగించి.. తిలక్ వర్మ లేదంటే ఇషాన్ కిషన్‌ను తప్పిస్తే ఎలా ఉంటుందన్న చర్చ జరుగుతోంది.అయితే, తిలక్ ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడిని తుదిజట్టు నుంచి తీసేయడం కష్టం. మరోవైపు.. ఇషాన్ వరల్డ్ నంబర్ వన్ బ్యాటర్‌గా ఉన్నప్పటికీ.. వన్‌డౌన్‌లో సంజూ ఆడగలడు కాబట్టి అతడు ఇషాన్‌ను రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఇక అక్షర్ పటేల్, ప్రసిద్ కృష్ణ స్థానంలో రవి బిష్ణోయి, సూర్యాంశ్ షెడ్గే రానున్నట్లు సమాచారం.ఇంగ్లండ్‌తో ఐదో టీ20కి భారత తుదిజట్టు (అంచనా)అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, సూర్యాంశ్ షెడ్గే, ప్రిన్స్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి. -
ఐపీఎల్లో హీరో.. అక్కడ మాత్రం జీరో
యూకే పర్యటనలో భారత జట్టు పేలవ ప్రదర్శన కొనసాగుతోంది. పసికూన ఐర్లాండ్ చేతిలో 2-0తో ఘోర పరాజయాన్ని చవిచూసిన టీమిండియా.. ఇప్పుడు ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 3-0 తేడాతో కోల్పోయింది. తొలి టీ20 వర్షార్పణం కాగా, తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌లలో ఓటమి పాలై సిరీస్‌ను ఇంగ్లండ్‌కు అప్పగించింది.ఐపీఎల్లో కెప్టెన్‌గా విజయవంతమైన శ్రేయస్ అయ్యర్.. అంతర్జాతీయ క్రికెట్లో మాత్రం తన మార్క్ చూపించలేకపోతున్నాడు. తొలి విజయం కోసం అతడు అతృతగా ఎదురు చూస్తున్నాడు. అతడి సారథ్యంలో భారత్ వరుసగా ఐదు మ్యాచ్‌లలో ఓటమి పాలై రెండు సిరీస్‌లను కోల్పోయింది.ఇక యూకే టూర్లో భారత బ్యాటింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. కెప్టెన్ శ్రేయస్, అభిషేక్ శర్మ మినహా మిగితా బ్యాటర్లంతా పూర్తిగా తేలిపోయారు. టీ20 ప్రపంచకప్-2026 హీరో సంజూ శాంసన్ కూడా ఈ పర్యటనలో నిరాశపరిచాడు.మూడు మ్యాచ్‌లలో సింగిల్ డిజిట్ స్కోర్‌కే పరిమితం కావడంతో సంజూను తుది జట్టు నుంచి తప్పించారు. అతడి స్ధానంలో యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి అవకాశమిచ్చారు. కానీ భారీ అంచనాలతో అంతర్జాతీయ కెరీర్‌ను మొదలు పెట్టిన వైభవ్.. తన మొదటి మూడు మ్యాచ్‌లలో మాత్రం పూర్తిగా తేలిపోయాడు. మూడు మ్యాచ్‌లు కలిపి కేవలం 42 పరుగులు మాత్రమే చేశాడు.కిషన్‌కు ఏమైంది?మరోవైపు వరల్డ్ నంబర్ టీ20 బ్యాటర్ ఇషాన్ కిషన్ సైతం దారుణంగా విఫలమయ్యాడు. టీ20 ప్రపంచకప్‌తో పాటు ఐపీఎల్లో దుమ్ములేపిన కిషన్.. ఆ ఫామ్‌ను యూకే పర్యటనలో మాత్రం కొనసాగించలేకపోయాడు. ఒకేరకమైన బంతులకు పదే పదే అవుట్ అవుతూ నిరాశపరుస్తున్నాడు. గత 6 ఇన్నింగ్స్‌ల్లో ఈ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ కేవలం 79 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో అతని యావరేజ్ 13.2 కాగా, స్ట్రైక్ రేట్ 108.2 మాత్రమే. సంజూ శాంసన్, వైభవ్ సూర్యవంశీల గురించిన చర్చల నడుమ.. కిషన్ వైఫల్యాలు అంతగా హైలెట్ కాలేదు.కానీ కీలకమైన మూడో స్ధానంలో బ్యాటింగ్ వచ్చి తన చెత్త ప్రదర్శనతో కిషన్ భారత ఓటమికి ఓ కారణమయ్యాడు. వైస్ కెప్టెన్ తిలక్ వర్మ కూడా ఏ మాత్రం ప్రభావం చూపలేకపోతున్నాడు. తన స్లో బ్యాటింగ్‌తో మాజీ క్రికెటర్లకు టార్గెట్ అవుతున్నాడు.కాగా భారత్‌లో ఫ్లాట్ పిచ్‌లకు అలవాటు పడడం కారణంగానే విదేశీ పరిస్థితులపై మన బ్యాటర్ల రాణించలేకపోతున్నారన్న విమర్శలు వస్తుస్తున్నాయి. ఇంగ్లండ్ పిచ్‌లపై ఉండే అదనపు బౌన్స్, మూవ్‌మెంట్‌ను అంచనా వేయడంలో భారత బ్యాటర్లు ఘోరంగా విఫలమవుతున్నారు.తొలి టీ20 నుంచే షార్ట్ పిచ్ బంతులకు వికెట్లు సమర్పించుకుంటున్నారు. కనీసం చివరి టీ20లోనైనా గెలిచి పరువు కాపాడుకుంటారో లేదో చూడాలి. ఐదో టీ20 శనివారం సౌతాంప్టన్ వేదికగా జరగనుంది. -
IND vs ENG: తుదిజట్టులోకి సంజూ.. కానీ ఓ కండిషన్!
ఇంగ్లండ్‌తో నాలుగో టీ20 రూపంలో టీమిండియా కఠిన సవాలు ముంగిట నిలిచింది. ఈ మ్యాచ్‌లో గెలిస్తేనే శ్రేయస్ అయ్యర్ సేన పోటీలో ఉంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం.. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆతిథ్య ఇంగ్లండ్ 3-0తో సొంతం చేసుకుంటుంది.లెఫ్టాండర్లు ఎక్కువయ్యారుఈ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మరోసారి చర్చ మొదలైంది. సంజూ శాంసన్ తిరిగి ఆడించాలని పలువురు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. జట్టులో ఎడమచేతి వాటం బ్యాటర్ల సంఖ్య ఎక్కువైందని.. ఇది కూడా ఓ సమస్యగా పరిణమించిందని అభిప్రాయపడుతున్నారు.సంజూను కాదని వైభవ్‌కు అవకాశంకాగా ఐర్లాండ్‌తో రెండు టీ20లు, ఇంగ్లండ్‌తో తొలి మ్యాచ్‌లో సంజూ విఫలమైన సంగతి తెలిసిందే. ఈ మూడు మ్యాచ్‌లలో అతడు చేసిన పరుగులు వరుసగా 5, 0, 1. ఈ నేపథ్యంలో సంజూను తప్పించి.. అతడి స్థానంలో చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీని ఓపెనర్‌గా బరిలోకి దించింది యాజమాన్యం.రెండు మ్యాచ్‌లలోనూ విఫలంఇంగ్లండ్తో రెండో టీ20 సందర్భంగా అరంగేట్రం చేసిన వైభవ్.. ఇప్పటికి రెండు మ్యాచ్‌లలో వరుసగా 14, 13 పరుగులు చేశాడు. ఇక వైభవ్ రాకతో టాపార్డర్ మొత్తం లెఫ్లాండర్లతో నిండిపోయింది. ఈ పదిహేనేళ్ల పిల్లాడితో పాటు అభిషేక్ శర్మ, వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ కూడా లెఫ్లాండరే.అదే విధంగా.. తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దూబే, అర్ష్‌దీప్ సింగ్ కూడా ఎడమచేతి వాటం గల ఆటగాళ్లే. ఈ నేపథ్యంలో కుడిచేతి వాటం గల సంజూ అవసరం ఎంతగానో ఉందంటూ పలువురు మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.సంజూను ఆడించాల్సిందేఓపెనర్గా కాకపోయినా.. మిడిల్ ఆర్డర్‌లోనైనా సంజూను ఆడించాలని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కోచ్ అభిషేక్ నాయర్ మాత్రం భిన్నంగా స్పందించాడు. టాపార్డర్‌లో ఆడిస్తే మాత్రమే సంజూకు తిరిగి తుదిజట్టులో చోటు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు.అలా అయితేనే తుదిజట్టులోకి తీసుకోండి‘‘ఒకవేళ నిజంగా సంజూను తిరిగి తుదిజట్టులోకి తీసుకోవాలనే ఆలోచన ఉంటే.. అతడు ఏ స్థానంలోనైతే సక్సెస్ అయ్యాడో ఆ స్థానంలోనే ఆడించాలి. అంతేగానీ సంజూను మళ్లీ తీసుకువచ్చి.. నాలుగు, ఐదు లేదంటే ఆరో స్థానంలో ఆడిస్తామంటే ఫలితం ఉండదు.లేదంటే ఆడించకపోవడమే మంచిదిఅతడు మళ్లీ ఇబ్బంది పడతాడు. నిజానికి సంజూ టాప్-3లో మాత్రమే విజయవంతంగా బ్యాటింగ్ చేయగలడు. ఒకవేళ అతడి పట్ల నిజంగానే మీకు నమ్మకం ఉంటే.. టాపార్డర్‌లో ఆడించండి. లేదంటే అసలు ఆడించకపోవడమే మంచిది’’ అని అభిషేక్ నాయర్ కుండబద్దలు కొట్టినట్లుగా తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.ఓపెనర్‌గా ఇలా..కాగా సంజూ ఇప్పటికి టీమిండియా టాప్-3 బ్యాటర్‌గా 36 ఇన్నింగ్స్ ఆడి ఏకంగా 1023 పరుగులు సాధించాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా నాకౌట్ మ్యాచ్‌లలో ఏకంగా 97*, 89, 89 పరుగులు సాధించి.. జట్టు చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక మొత్తంగా టాప్-3లో 36 ఇన్నింగ్స్‌లో ఆడి ఏకంగా 171కి పైగా స్ట్రైక్‌రేటుతో సంజూ పరుగులు రాబట్టడం విశేషం.మిడిలార్డర్లో అలామరోవైపు.. టాప్-3 బ్యాటర్‌గా కాకుండా మిడిలార్డర్లో వచ్చి సంజూ 21 ఇన్నింగ్స్‌లో కేవలం 382 పరుగులే చేశాడు. స్ట్రైక్‌రేటు 124. ఈ నేపథ్యంలోనే అభిషేక్ నాయర్ సంజూను ఓపెనర్‌గా మాత్రమే పంపాలని నొక్కివక్కాణించడం గమనార్హం. కాగా టీ20 సిరీస్‌లో ఐర్లాండ్ చేతిలో 2-0 వైట్‌వాష్ అయింది టీమిండియా. అనంతరం ఇంగ్లండ్‌తో తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. రెండు, మూడు మ్యాచ్‌లలో ఆతిథ్య జట్టు గెలిచింది. తద్వారా 2-0తో ఇంగ్లండ్ ఆధిక్యంలో ఉండగా.. బ్రిస్టల్ వేదికగా నాలుగో టీ20లో తప్పక గెలవాల్సిన స్థితిలో టీమిండియా నిలిచింది. చదవండి: అందుకే వైభవ్‌ను ఆడిస్తున్నాం: గంభీర్ -
సంజూతో పోల్చుకుంటే 'ఆ ముగ్గురు' మరీ దారుణం..!
భారత టీ20 జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కకపోవడంపై మరోసారి సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. బీసీసీఐ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ సంజూ శాంసన్‌ను నిలకడలేని ప్రదర్శన కారణంగానే పక్కన పెట్టారని అభిమానులు పేర్కొంటూ, అందుకు విరుద్ధంగా గణాంకాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.అభిమానులు షేర్ చేస్తున్న వివరాల ప్రకారం..సంజూ శాంసన్ చివరి పది ఇన్నింగ్స్‌లో 107, 109, 22, 24, 97, 89, 89, 5, 0, 1 పరుగులు చేయగా..ఇషాన్ కిషన్ 10, 36, 11, 8, 3, 13, 12, 0, 49, 13 పరుగులు.. తిలక్ వర్మ 1, 44, 27, 21, 8, 19, 55, 13, 24, 3 పరుగులు..అభిషేక్ శర్మ 68, 0, 10, 9, 52, 49, 0, 59, 43, 10 పరుగులు.. వైభవ్ సూర్యవంశీ రెండు ఇన్నింగ్స్‌లో 14, 13 పరుగులే చేశాడు.ఈ గణాంకాలను ఉదహరిస్తూ, "అసలు నిలకడ లేని బ్యాటర్ ఎవరు..?" అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సంజూ శాంసన్‌కు పెద్ద ఇన్నింగ్స్ ఆడే సామర్థ్యం ఉందని, ఒకసారి క్రీజులో నిలదొక్కుకుని 30 పరుగుల మార్క్ దాటితే అతడు భారీ స్కోరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అభిప్రాయపడుతున్నారు. అంతేకాకుండా, సంజూ పెద్ద స్కోర్లు చేసిన మ్యాచ్‌ల్లో భారత జట్టు విజయాలు కూడా ఎక్కువగా వచ్చాయని పోస్టుల్లో పేర్కొంటున్నారు.ఇతర బ్యాటర్లు ఒక మ్యాచ్‌లో రాణించి, తర్వాత వరుసగా విఫలమవుతున్నారని వాదిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో సంజూ శాంసన్‌ను మాత్రమే 'నిలకడలేని ఆటగాడి'గా పరిగణించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.ప్రస్తుత ఇంగ్లండ్ పర్యటనలో భారత బ్యాటింగ్ వైఫల్యాల నేపథ్యంలో ఈ చర్చ మరింత ఊపందుకుంది. గౌతమ్ గంభీర్ నేతృత్వంలోని జట్టు యాజమాన్యం సంజూ శాంసన్ విషయంలో మరోసారి పునరాలోచించాలని అభిమానులు సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.కాగా, తాజగా ఇంగ్లండ్‌తో జరిగిన మూడో టీ20లో భారత్ ఘోర ఓటమిని చవిచూసింది. ఈ ఓటమితో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో వెనుకపడిపోయింది. సిరీస్‌లో నిలవాలంటే బ్రిస్టల్‌లో జరగనున్న నాలుగో టీ20లో భారత్ తప్పనిసరిగా విజయం సాధించాలి. -
వైభవ్ ఫెయిల్.. అయినా భారత్ భారీ స్కోర్
మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో భారత బ్యాటర్లు సత్తాచాటారు. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 190 పరుగులు స్కోర్ సాధించింది.భారత ఇన్నింగ్స్‌లో అరంగేట్ర ఆటగాడు వైభవ్ సూర్యవంశీ(14) విఫలమైనప్పటికి.. ఇషాన్ కిషన్(40 బంతుల్లో 49), అభిషేక్ శర్మ(43), కెప్టెన్ శ్రేయస్ అయ్యర్(37), తిలక్ వర్మ(24) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రాన్ మూడు వికెట్లు పడగొట్టగా.. జోఫ్రా ఆర్చర్, విల్ జాక్స్, డాసన్ తలా వికెట్ సాధించారు. వైభవ్ రెండు భారీ సిక్స్‌లు కొట్టి మంచి టచ్‌లో కనిపించినప్పటికి.. తనకు లభించిన ఆరంభాన్ని భారీ స్కోర్‌గా మలుచుకోలేకపోయాడు. 10 బంతుల్లో కేవలం 14 పరుగులు చేసి సూర్యవంశీ స్టంపౌటయ్యాడు.తుదిజట్లుటీమిండియావైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హర్షిత్ రాణా, అక్షర్ పటేల్, రవి బిష్ణోయి, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.ఇంగ్లండ్ఫిల్ సాల్ట్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జేకబ్ బెతెల్, టామ్ బాంటన్, సామ్ కర్రాన్, విల్ జాక్స్, లియామ్ డాసన్, ఆదిల్ రషీద్, జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్. -
‘నిన్ను ఆడించడం కుదరదని అతడికి చెప్పేయండి’
భారత క్రికెట్ వర్గాల్లో ఎక్కడ చూసినా వైభవ్ సూర్యవంశీ గురించే చర్చ. ఈ చిచ్చరపిడుగును వీలైనంత త్వరగా టీమిండియాకు ఆడించాలని మాజీ క్రికెటర్లు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను బెంచ్‌కే పరిమితం చేస్తూ వస్తోంది.వాళ్లు విఫలమవుతున్నా..ఐర్లాండ్ పర్యటనలోనే వైభవ్ (Vaibhav Suryavanshi) అరంగేట్రం చేస్తాడని అంతా భావించారు. కానీ రెండు మ్యాచ్‌లలోనూ ఈ లెఫ్టాండర్ బ్యాటర్‌కు మొండిచేయే ఎదురైంది. ఇక ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా తొలి టీ20లోనూ పదిహేనేళ్ల ఈ పిల్లాడిని పక్కనపెట్టేశారు. మరోవైపు.. టాపార్డర్‌లో ఓపెనర్ సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ వరుసగా విఫలమవుతున్నారు.ఇలాంటి తరుణంలో వైభవ్ సూర్యవంశీని ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అతడిని కావాలనే పక్కనపెడుతున్నారనే విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్ కీపర్ బ్యాటర్ పార్థివ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశాడు.అతడితో జాగ్రత్తగా వ్యవహరించాలిస్టార్ స్పోర్ట్స్‌తో మాట్లాడుతూ.. ‘‘ఇంగ్లండ్ సిరీస్‌లో ఏదో ఒక మ్యాచ్‌లో వైభవ్‌కు కచ్చితంగా ఆడే అవకాశం వస్తుందని నేను నమ్ముతున్నాను. అయితే, ప్రస్తుతానికి కోచింగ్ సిబ్బంది అతడికి సరైన రీతిలో కమ్యూనికేట్ చేయాలి. నిరాశ చెందిన బ్యాటర్‌కు.. ‘నువ్వు రేసులోనే ఉన్నావు’ అనే విషయాన్ని తెలియజేయాలి.ఇలా చేయడం ద్వారా అతడిలో సానుకూల దృక్పథం పెరుగుతుంది. ఒకవేళ అతడిని ఆడించడం కుదురలేదంటే.. ఆ నిజాన్ని కూడా నేరుగా అతడితోనే చెప్పాలి. వైభవ్ పదిహేనేళ్ల పిల్లాడు. అతడితో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.తను నిరాశ చెందకుండా చూసుకోవాలి. తుదిజట్టులో స్థానం కోసం ఓపికతో ఎదురుచూడాల్సి ఉంటుందని సానుకూలంగా తెలియజెప్పాలి. అప్పుడే అతడి మనసు కాస్త స్థిమితంగా ఉంటుంది’’ అని పార్థివ్ పటేల్ పేర్కొన్నాడు.ఇప్పుడు వైభవ్‌ను ఆడించడం కుదరదుఅదే విధంగా.. ‘‘సంజూ శాంసన్ ప్రపంచకప్ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. ఇషాన్ కిషన్ ప్రస్తుతం టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌గా ఉన్నాడు. అభిషేక్ శర్మ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇలాంటి తరుణంలో కచ్చితంగా వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు ఉండదు. ఇదే విషయాన్ని అతడికి అర్థమయ్యేలా చెప్పాలి’’ అని హెడ్‌కోచ్ గౌతం గంభీర్ నేతృత్వంలోని కోచింగ్ సిబ్బందికి పార్థివ్ పటేల్ విజ్ఞప్తి చేశాడు. కాగా భారత్- ఇంగ్లండ్ మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దు కాగా.. ఇరుజట్ల మధ్య శనివారం రెండో మ్యాచ్ జరుగనుంది. ఇందుకు మాంచెస్టర్ వేదిక.చదవండి: తుదిజట్టులో దక్కని చోటు.. వైభవ్ పోస్ట్ వైరల్! -
పిచ్ మధ్యలోనే తిట్టుకున్నా SRH ప్లేయర్లు స్టంప్ మైక్ ఆడియో వైరల్
-
IND vs ENG: నువ్వసలు ఏం చేస్తున్నావు?.. తప్పు నీదే!
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ పూర్తిగా విఫలమయ్యాడు. తన తొందరపాటు చర్యతో మూల్యం చెల్లించుకున్నాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం సునిల్ గావస్కర్ ఇషాన్ కిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.అసలేం జరిగిందంటే.. ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టీమిండియా బుధవారం తొలి టీ20 ఆడింది. చెస్టర్ లీ స్ట్రీట్‌లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లలో సంజూ శాంసన్ (1) వైఫల్యాల పరంపర కొనసాగించగా.. అభిషేక్ శర్మ మెరుపు అర్ధ శతకం (24 బంతుల్లో 59) సాధించాడు.నువ్వసలు ఏం చేస్తున్నావు?ఇక వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ రెండు బంతులు ఎదుర్కొని డకౌట్‌గా వెనుదిరిగాడు. భారత ఇన్నింగ్స్ రెండో ఓవర్లో సకీబ్ మహ్మూద్ బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి విఫలమైన ఇషాన్.. అక్కడ పరుగుకు ఆస్కారం లేకున్నా సింగిల్ కోసం పరిగెత్తాడు.మరో ఎండ్‌లో ఉన్న అభిషేక్ శర్మ బంతిని గమనించి సింగిల్‌కు అవకాశం లేదని అక్కడే ఉండిపోయాడు. ‘‘నువ్వసలు ఏం చేస్తున్నావు?’’ అంటూ ఒకింత అసహనంతో ఇషాన్‌ను హెచ్చరించాడు కూడా!.. దీంతో ఇషాన్ క్రీజులోకి చేరుకునేందుకు డైవ్ కూడా చేశాడు.A costly mix-up in the middle. 🫣Moments after the run-out: Abhishek Sharma and Ishan Kishan share a brief conversation.#ENGvIND 1st T20I 👉 Streaming LIVE on JioHotstar! pic.twitter.com/1kagvrBjV9— Star Sports (@StarSportsIndia) July 1, 2026కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫీల్డర్ నుంచి బంతిని అందుకున్న ఇంగ్లండ్ వికెట్ కీపర్ జోస్ బట్లర్ వికెట్లను గిరాటేయడంతో ఇషాన్ కిషన్ పరుగుల ఖాతా తెరవకుండానే రనౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో ఇషాన్- అభిషేక్‌లలో తప్పెవరిది అన్న చర్చ జరుగుతుండగా.. సునిల్ గావస్కర్ అభిషేక్‌కు మద్దతుగా నిలిచాడు.ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే‘‘వీలైనంత త్వరగా క్రీజులోకి చేరుకోవాల్సింది. ముఖ్యంగా ఈ ఫార్మాట్లో అన్నీ క్షణాల్లో జరిగిపోతాయి. ఇందులో అభిషేక్ శర్మ తప్పేమీ లేదు. ఇది ఇషాన్ కిషన్ స్వీయ తప్పిదం. ఇందుకు పూర్తి బాధ్యుడు అతడే’’ అని గావస్కర్ తీవ్ర స్థాయిలో ఇషాన్‌ను విమర్శించాడు.కాగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇషాన్ కిషన్ బుధవారమే నంబర్‌వన్ స్థానానికి చేరుకున్నాడు. ఇప్పటి వరకు రెండో ర్యాంక్‌లో ఉన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్.. ఒక స్థానం మెరుగుపర్చుకొని 876 పాయింట్లతో టాప్ ర్యాంక్‌ను అందుకున్నాడు. ఈ క్రమంలో ఇప్పటి వరకు నంబర్‌వన్‌గా ఉన్న ఇషాన్ సహచరుడు అభిషేక్ శర్మ (869) రెండో స్థానానికి పడిపోయాడు.గంటల్లోనే హీరో నుంచి జీరోగా..అయితే, నంబర్ వన్‌గా ఎదిగిన కొన్ని గంటల్లోనే ఇషాన్ కిషన్ ఇలా ‘జీరో’ స్కోరుతో పెవిలియన్ చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్- టీమిండియా మధ్య తొలి టీ20 వర్షం వల్ల రద్దైపోయింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (47 బంతుల్లో 68), శివం దూబే (21 బంతుల్లో 42 నాటౌట్) రాణించారు.చదవండి: కోహ్లి రికార్డు బద్దలు కొట్టిన శ్రేయస్Another Disappointing start for Team India.Sanju Samson again fails to score.Followed by a run out of in-form Ishan Kishan.Not the Start we imagined.#ENGvINDpic.twitter.com/y9H3qfFIh7— TheFakeFakeer (@TheFakeFakeer) July 1, 2026 -
అగ్రపీఠంపై పాకెట్ డైనమైట్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ సరికొత్త నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో సహచర టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను రెండో స్థానానికి నెట్టాడు. ఇషాన్, అభిషేక్ మధ్య 7 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇషాన్ ఖాతాలో 876 రేటింగ్ పాయింట్లు ఉండగా.. అభిషేక్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి.మరోపక్క టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు చేరాడు. హెడ్ (853), బ్రూక్ (852), రూట్ (840) మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఆ జట్టు టాప్-3 ప్లేయర్లు టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు.ముఖ్యంగా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. కొంతకాలం కిందట అతడికి టీమిండియాలో చోటే లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. అలాగే భారత వన్డే జట్టులో కూడా చోటు సంపాదించాడు. భారత్ తాజా టీ20 టైటిల్ సాధించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఓ దశలో జట్టులో చోటే లేని ఇషాన్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి తానేంటో ప్రపంచానికి చాటాడు.టీమిండియాలో చోటుతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయిన ఇషాన్.. దేశవాలీ క్రికెట్లో ఆకాశమే హద్దుగా చెలరేగి మరోసారి టీమిండియా తలుపులు తట్టాడు. జాతీయ జట్టులోకి రీఎంట్రీకి ముందు దాదాపుగా ప్రతి దేశవాలీ టోర్నీలోనూ శతకాలు బాదాడు. కెప్టెన్‌గానూ తన జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగా భారత టీ20 జట్టులోకి వచ్చి, వచ్చీ రాగానే తన మార్కును చూపించాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో పాటు టీ20 ప్రపంచకప్‌లో పాక్‌పై ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు, అలాగే ఫైనల్లో మ్యాచ్ విన్నింగ్ అర్ద సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన తర్వాత వన్డే జట్టులోకీ వచ్చి, అక్కడ కూడా వచ్చీ రాగానే ఆఫ్ఘనిస్తాన్పై శతక్కొట్టాడు. ఇప్పుడు నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ ఇషాన్ జర్నీ చాలా స్పూర్తిదాయకంగా ఉంది. -
IND vs ENG: అతడికే మా మద్దతు.. వైభవ్ ఎదురుచూడాల్సిందే!
ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌లో 2-0తో క్లీన్‌స్వీప్‌నకు గురైన టీమిండియాపై మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ప్రత్యర్థిని తక్కువగా అంచనా వేసి.. చెత్త ప్రదర్శనతో మూల్యం చెల్లించారని విమర్శిస్తున్నారు. ప్రపంచ చాంపియన్‌గా ఐరిష్ గడ్డపై అడుగుపెట్టి అతి విశ్వాసంతో కొంపముంచారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.బెంచ్‌కే పరిమితంఇక మరికొందరు.. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని అరంగేట్రం చేయించకపోవడాన్ని కూడా తప్పుబడుతున్నారు. ఈ పిల్లాడిని ఆడిస్తేనైనా ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడుతున్నారు. అయితే, యాజమాన్యం మాత్రం వైభవ్‌ను రెండు మ్యాచ్‌లలోనే బెంచ్‌కే పరిమితం చేసింది.ఐర్లాండ్ చేతిలో వైట్‌వాష్ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనైనా వైభవ్ సూర్యవంశీని ఆడిస్తారేమోనన్న చర్చ మొదలైంది. ఈ నేపథ్యంలో టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డష్కాటే ఆ అవకాశం లేదని సంకేతాలు ఇచ్చాడు.సంజూకు మా మద్దతు ఉంటుంది‘‘అంతర్జాతీయ క్రికెట్ ఆడేందుకు వైభవ్ సూర్యవంశీ పూర్తి స్థాయిలో సిద్ధంగానే ఉన్నాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. అయితే, సంజూ శాంసన్‌ను తుదిజట్టు నుంచి తప్పించడం కూడా సాధ్యం కాదు.మూడు నెలల క్రితం జట్టు ప్రపంచకప్ గెలవడంలో అతడు కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్‌లోనూ 2026లో సత్తా చాటాడు. ఈ సిరీస్‌లో అతడు విఫలం కావొచ్చు. అయినప్పటికీ మా ఆటగాళ్లకు మేము మద్దతుగానే నిలబడతాము.అతడిలో ఆత్మవిశ్వాసం పెంచేలానే మా చర్యలు ఉంటాయి. దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మేము ముందుకు సాగుతాము. అరంగేట్రం చేసేందుకు వైభవ్ ఎంత ఆసక్తిగా ఉన్నాడో.. అతడి ఆటను చూడాలని మేమూ అంతే ఆతురతతో ఎదురుచూస్తున్నాం.వైభవ్ వేచిచూడక తప్పదు!అయితే, అందుకు ఇంకాస్త సమయం ఉంది. మిగతా ఆటగాళ్ల గురించి కూడా మేము ఆలోచించాల్సి ఉంటుంది. అంతమాత్రాన వైభవ్ అంతర్జాతీయ క్రికెట్లో సత్తా చాటలేడని మేము భావిస్తున్నట్లు కానేకాదు’’ అని డష్కాటే పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ పర్యటనలోనూ వైభవ్ అరంగేట్రం చేయకపోవచ్చనే అనుమానాలు బలపడుతున్నాయి.ఇదిలా ఉంటే.. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ పూర్తిగా విఫలమైంది. తొలి మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ (49) రాణించగా.. మరో ఓపెనర్ సంజూ శాంసన్ (5), వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (1) నిరాశపరిచారు.ఇక రెండో టీ20లో సంజూ, అభిషేక్.. ఇద్దరూ గోల్డెన్ డకౌట్‌గా వెనుదిరిగి జట్టు కొంపముంచారు. ఇషాన్ కిషన్ (12) అనవసరంగా పరుగుకు వెళ్లి రనౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. తద్వారా సిరీస్‌ను పసికూన ఐర్లాండ్‌కు కోల్పోయింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదొక మాయని మచ్చగా మిగిలిపోనుంది.చదవండి: IND vs IRE 2nd T20: టీమిండియా తరఫున ఆ ఇద్దరి అరంగేట్రం🔴 NO PLACE FOR VAIBHAV YET! TEAM INDIA BACKS SANJU SAMSON🤯Q🎙️: Coach, How far Vaibhav Suryavanshi from debut?Ryan ten doeschate🎙️: Vaibhav is absolutely ready for international cricket, but we won't rush him. Sanju played a big role in India's T20 World Cup win and had a… pic.twitter.com/4FrYEXD9O2— Sam (@cricsam02) June 29, 2026 -
రెండో టీ20 ఆడనున్న వైభవ్.. వేటు పడేది ఎవరిపైనో!
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా అనూహ్య ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్ వేదికగా జరిగిన టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. అయితే టీమిండియా సంచలనం వైభవ్ సూర్యవంశీకి జట్టులో చోటు లభించకపోవడంపై విమర్శలు వచ్చాయి. వైభవ్ నిన్నటి మ్యాచ్‌లో ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరంభంలోనే ఫోర్లు, సిక్సర్లు బాది ప్రత్యర్థిపై ఒత్తడి పెట్టే ప్రయత్నం చేసేవాడని కొంతమంది పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం జరగనున్న రెండో టీ20 మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీకి అవకాశం ఇవ్వాలనే డిమాండ్లు కూడా పెరిగిపోతున్నాయి. అయితే వైభవ్‌కు తుదిజట్టులో చోటు దక్కాలంటే ఎవరిని తప్పించాలనేది ఇప్పుడు ప్రశ్నార్థకం. ఒకవేళ వైభవ్ జట్టులోకి వస్తే ఓపెనర్‌గానే ఆడే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన వైభవ్ కోసం సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మల్లో ఒకరు తమ స్థానాన్ని త్యాగం చేయాల్సి ఉంటుంది. ఇక ఈ ఏడాది భారత్ టీ20 ప్రపంచకప్ గెలవడంలో సంజూ శాంసన్‌ది కీలకపాత్ర. టీ20 ప్రపంచకప్‌లో శాంసన్ 321 పరుగులు సాధించి జట్టులో తన స్థానాన్ని పటిష్టం చేసుకున్నాడు. అయితే ఐర్లాండ్‌తో తొలి టీ20లో మాత్రం శాంసన్ విఫలమయ్యాడు. నాలుగు బంతులెదుర్కొన్న శాంసన్ కేవలం ఐదు పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. అదే సమయంలో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోవడమే గాక తన స్థానాన్ని మరింత పదిలపరుచుకున్నాడు. మరోవైపు ఇషాన్ కిషన్ కూడా మంచి ఫామ్‌లో ఉన్నప్పటికీ ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో విఫలమయ్యాడు. ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో ఐదు బంతుల్లో కేవలం ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు. అయితే వైభవ్ సూర్యవంశీ జట్టులోకి రావాలంటే మాత్రం ఇషాన్ కిషన్‌ను తప్పించడమే తొలి మార్గం. ఎందుకంటే అభిషేక్‌తో కలిసి వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ వస్తే, సంజూ శాంసన్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. అంతేకాదు శాంసన్ మూడో స్థానంలో మంచి బ్యాటింగ్ రికార్డు ఉంది. ఐపీఎల్లో మూడో స్థానంలో 94 మ్యాచ్‌ల్లో 143 స్ట్రైక్‌రేట్‌తో 3,096 పరుగులు సాధించాడు. శాంసన్‌తో పాటు ఇషాన్ కిషన్‌ను జట్టులో ఉంచాలనుకుంటే ఆఖరి ఆప్షన్ మాత్రం తిలక్ వర్మే. అయితే తిలక్ వర్మ ఎక్కువగా మిడిలార్డర్లో బ్యాటింగ్‌కు వస్తున్నాడు. నాలుగు లేదా ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తూ ఫినిషర్‌గా రాణిస్తున్నాడు. ఆసియా కప్ 2025 ఫైనల్లో 69 పరుగుల కీలక ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అయితే టీ20 ప్రపంచకప్‌లో 9 ఇన్నింగ్స్‌ల్లో తిలక్ వర్మ 209 పరుగులు సాధించిన తిలక్ వర్మ స్ట్రైక్ రొటేట్ చేయడంలో ఇబ్బంది పడ్డాడు. అయితే ఇన్ని బేరీజులు వేసుకున్నప్పటికీ వైభవ్ సూర్యవంశీ ఐర్లాండ్‌తో రెండో టీ20లో మాత్రం ఆడే అవకాశాలు తక్కువే అని చెప్పొచ్చు.Read: టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు -
వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము: టీమిండియా కోచ్
వైభవ్ సూర్యవంశీ.. భారత క్రికెట్లో సరికొత్త సంచలనం. పదిహేనేళ్ల వయసులోనే ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ గెలిచిన ఈ చిచ్చరపిడుగు.. ఏకంగా టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలతో పాటు ఆసియా క్రీడలు-2026లో పాల్గొనే భారత జట్టుకు అతడు ఎంపికయ్యాడు.బ్యాటింగ్ కోచ్ ఏమన్నాడంటే?ఈ నేపథ్యంలో ఐర్లాండ్‌తో శుక్రవారం నాటి తొలి టీ20 మ్యాచ్‌తో వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెడతాడా? లేదంటే బెంచ్‌కే పరిమితమవుతాడా? అన్న చర్చ మొదలైంది. ఐర్లాండ్‌తో మ్యాచ్ కాబట్టి వైభవ్ అరంగేట్రం ఖాయమని అభిమానులు ఫిక్సయిపోగా.. టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ మాత్రం భిన్నంగా స్పందించాడు.బెల్ఫాస్ట్ వేదికగా టీమిండియా- ఐర్లాండ్ మ్యాచ్‌కు ముందు మీడియాతో మాట్లాడిన సితాన్షు కొటక్.. వైభవ్ అరంగేట్రంపై సస్పెన్స్ కొనసాగించాడు. హెడ్‌కోచ్ గౌతం గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నిర్ణయానుసారమే తుదిజట్టు కూర్పు ఉంటుందని స్పష్టం చేశాడు.వైభవ్ అరంగేట్రం కోసం వాళ్లను తప్పించలేము‘‘ఈ విషయంలో మా కెప్టెన్, హెడ్కోచ్దే తుది నిర్ణయం. ఒకవేళ వైభవ్ ఆడితే అంతకంటే గొప్ప విషయం మరొకటి ఉండదు. ఒకవేళ అతడు ఆడకపోయినా నాకు గొప్పే. ఎందుకంటే ఇంత చిన్న వయసులోనే అతడు టీమిండియాకు ఎంపికయ్యాడు కదా!వైభవ్‌కు కచ్చితంగా అవకాశాలు వస్తాయి. అయితే, కేవలం అతడిని ఆడించేందుకు ఇప్పటికే పరుగులు రాబడుతూ జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకున్న ఆటగాళ్లను తప్పించలేము కదా!.. అలా చేయడం కూడా సరికాదు.ఒకరికి అవకాశం ఇచ్చేందుకు బాగా ఆడుతున్న మరొక ఆటగాడిని బలి చేయడం అన్యాయమే అవుతుంది’’ అని సితాన్షు కొటక్ పేర్కొన్నాడు. కాగా వైభవ్ సూర్యవంశీ ఓపెనింగ్ బ్యాటర్ అన్న సంగతి తెలిసిందే. అయితే, భారత టీ20 జట్టులో ఇప్పటికే అభిషేక్ శర్మ- సంజూ శాంసన్ ఓపెనర్లుగా పాతుకుపోయారు.ఆడతాడా? లేదా?కొన్నిసార్లు అభిషేక్ విఫలమైనా యాజమాన్యం అతడిని కొనసాగించింది. కానీ సంజూ బ్యాటింగ్ ఆర్డర్‌ను మాత్రం చాలాసార్లు మార్చడమే కాకుండా.. కొన్నిసార్లు అతడిని పక్కనపెట్టింది కూడా!.. అయితే, టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో నాకౌట్ దశలో తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సంజూ.. వరుసగా 94*, 89, 89 పరుగులతో దుమ్ములేపాడు.తద్వారా భారత్ ప్రపంచకప్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచాడు. ఐపీఎల్‌లోనూ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఫర్వాలేదనిపించాడు. దీంతో గతంలో మాదిరి సంజూను తప్పించేందుకు ఆస్కారం లేదు. ఇక వన్‌డౌన్‌లో ఇషాన్ కిషన్ ప్రపంచకప్‌లో తనను తాను నిరూపించుకున్నాడు. కాబట్టి అతడిపైనా వేటు పడదు.దీంతో వైభవ్‌కు టాపార్డర్‌లో చోటు దక్కదు కాబట్టి.. ఇప్పట్లో అరంగేట్రం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. కానీ.. ఐర్లాండ్‌తో సిరీస్‌కు అంతటి ప్రాధాన్యం లేదు కాబట్టి వైభవ్‌ను ఆడించేందుకు అవకాశాలు కూడా ఉన్నాయి. ఇలా అయితే.. కాగా ఇంగ్లండ్‌తో టీ20లతో పాటు వన్డేలకూ ఇషాన్ కిషన్ ఎంపికయ్యాడు. కాబట్టి అతడికి ఇప్పుడు కాస్త విశ్రాంతినిచ్చి.. సంజూను వన్‌డౌన్‌కు డిమోట్ చేసి.. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఓపెనర్‌గా పంపే అవకాశాలనూ కొట్టిపారేయలేము.ఇదిలా ఉంటే.. ఐపీఎల్-2026లో రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా బరిలోకి దిగిన వైభవ్ సూర్యవంశీ.. 16 మ్యాచ్‌లలో కలిపి ఏకంగా 776 పరుగులు సాధించాడు. ఇటీవల శ్రీలంకలో ముక్కోణపు వన్డే సిరీస్ ఫైనల్లో 29 బంతుల్లోనే 94 పరుగులు చేసి భారత్- ‘ఎ’ జట్టును విజేతగా నిలిపాడు.చదవండి: చరిత్ర సృష్టించిన కివీస్ ఓపెనర్లు! -
ఇంగ్లండ్‌తో వన్డేలకు భారత తుదిజట్టు.. సెంచరీ వీరుడికి నో చాన్స్!
అఫ్గానిస్తాన్‌తో వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసి జోష్ మీదున్న టీమిండియా ఇంగ్లండ్ గడ్డపై టీ20లతో పాటు మూడు వన్డేలు కూడా ఆడనుంది. ఇంగ్లండ్ టూర్‌కు ముందు శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు ఐర్లాండ్‌తో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడనుంది. ఈ విషయం పక్కనబెడితే, ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు కోహ్లి ఆడుతాడా లేదా అనే సందేహం ఉండేది. అయితే ఇటీవలే గాయం నుంచి కోలుకున్న కోహ్లి ఫిట్నెస్ టెస్టులో పాసయ్యాడని తెలిపిన బీసీసీఐ ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌కు ఎంపిక చేసింది. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్‌తో ఆడబోయే టీమిండియా స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ ఎలెవెన్ జట్టుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే ఈ తుదిజట్టులో ఇషాన్ కిషన్ చోటు దక్కించుకోలేకపోయాడు. ఆఫ్గన్‌తో జరిగిన రెండో వన్డేలో ఇషాన్ శతకం బాదిన సంగతి తెలిసిందే. అంతకముందు ఐపీఎల్‌లోనూ ఇషాన్ ఎస్ఆర్హెచ్ తరఫున తన బ్యాటింగ్‌తో అలరించిన సంగతి తెలిసిందే.ఇక జట్టు విషయానికొస్తే.. టాపార్డర్‌లో ఓపెనర్లుగా కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో పాటు రోహిత్ శర్మ, వన్‌డౌన్‌లో కోహ్లి రానున్నారు. ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో కెప్టెన్ గిల్ అదరగొట్టాడు. మూడు వన్డేలు కలిపి 238 పరుగులు చేసిన గిల్ ఖాతాలో ఒక సెంచరీ, హాఫ్ సెంచరీ ఉన్నాయి. మరో బ్యాటర్ రోహిత్ శర్మ తొలి రెండు వన్డేల్లో పెద్దగా రాణించనప్పటికీ మూడో వన్డేలో తనదైన ఇన్నింగ్స్‌తో అలరించాడు. ఆఫ్గన్‌తో సిరీస్‌లో 143 పరుగులు సాధించాడు. ఇక కోహ్లి గాయం కారణంగా ఆఫ్గన్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. ఇక మిడిలార్డర్లో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్‌తో పాటు ఆల్‌రౌండర్లు నితీశ్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్‌లను ఎంపిక చేశారు. ఇక వన్డేల్లో ఇప్పటికే తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అయ్యర్ తనకు అచ్చొచ్చిన నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రానుండగా, కేఎల్ రాహుల్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రానున్నాడు. నితీశ్‌కుమార్ రెడ్డి ప్రస్తుతానికి జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, గాయంతో అతడు ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ఆడడం అనుమానంగానే ఉంది. ఆల్‌రౌండర్ కోటాలో అక్షర్‌పటేల్ ఏడో స్థానంలో ఆడడం గ్యారంటీ, బౌలింగ్ కోటాలో బుమ్రా, హర్షిత్ రానా, కుల్దీప్ యాదవ్, ప్రసిధ్ క్రిష్ణలకు చోటు కల్పించింది. ఇంగ్లండ్ వన్డేలకు భారత ప్లేయింగ్ ఎలెవన్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్, నితీశ్‌కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ.భారత్ వర్సెస్ ఇంగ్లండ్ వన్డే షెడ్యూల్1వ వన్డే జూలై 14, 2026 (మంగళవారం) ఎడ్జ్‌బాస్టన్, బర్మింగ్‌హామ్ మధ్యాహ్నం 3:302వ వన్డే జూలై 16, 2026 (గురువారం) సోఫియా గార్డెన్స్, కార్డిఫ్ సాయంత్రం 5:303వ వన్డే జూలై 19, 2026 (ఆదివారం) లార్డ్స్, లండన్ మధ్యాహ్నం 3:30Read: నితీశ్‌రెడ్డికి గాయం.. ఇంగ్లండ్ టూర్‌కు దూరం! -
డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీ
అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా అదరగొట్టింది. లక్నో వేదికగా బుధవారం నాటి మ్యాచ్‌లో ప్రత్యర్థిని ఏకంగా 170 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను సొంతం చేసుకుంది.ఆత్మవిశ్వాసంతోఈ క్రమంలో టీమిండియా వన్డే కెప్టెన్‌గా శుబ్‌మన్ గిల్ (Shubman Gill) తొలి సిరీస్ విజయాన్ని అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు 154 పరుగులతో బ్యాటర్‌గానూ సత్తా చాటాడు. ఈ నేపథ్యంలో విజయానంతరం మాట్లాడుతూ.. ‘‘మొదటి బంతి నుంచే నేను ఆత్మవిశ్వాసంతో బాదడం మొదలుపెట్టాను. నా ప్రణాళికలకు తగ్గట్లుగానే ఫలితం రావడం చూశాను.40- 45 ఓవర్ల పాటు ఈ సిరీస్‌లో నాకు నేనే ఓ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాను. నేనే మ్యాచ్‌లు ఫినిష్ చేయాలని భావించాను. 40- 45 ఓవర్ల పాటు క్రీజులో ఉండాలని టార్గెట్ పెట్టుకున్నాను. శుభారంభం అందుకుంటే దానిని భారీ స్కోరుగా మలచాలని నిర్ణయించుకున్నా.డబుల్ సెంచరీ చేసేవాడినే... కానీఈరోజు డబుల్ సెంచరీ పూర్తి చేయాలనే అనుకున్నా. కానీ జట్టు స్కోరు 430, 440, 450 రేంజ్లో ఉండాలంటే నేను హిట్టింగ్ ఆపకూడదు. నా మనసులో అదొక్కటే ఉండిపోయింది. టాస్ ఓడినంత మాత్రాన పెద్దగా తేడా ఏమీ కనబడలేదు. ఈ పిచ్ మీద 310- 320 మాత్రమే స్కోరు చేసి ఉంటే.. అది ఛేదించదగ్గ టార్గెటే.అయితే, మేము ముందు నుంచే ప్రణాళికతో ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాము. మా బౌలర్లు కూడా తమ పనిని విజయవంతంగా పూర్తి చేశారు’’ అని శుబ్‌మన్ గిల్ తన వ్యక్తిగత ప్రదర్శన పట్ల.. అదే విధంగా జట్టు ప్రదర్శన పట్ల హర్షం వ్యక్తం చేశాడు.ఆల్‌రౌండ్ ప్రదర్శనతో..ఏకనా స్టేడియంలో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్‌కు దిగింది. 49.5 ఓవర్లలో 402 పరుగులు చేసి ఆలౌట్ అయింది. గిల్ (154)తో పాటు ఇషాన్ కిషన్ (125) మెరుపు సెంచరీ సాధించడం వల్ల ఈ స్కోరు సాధ్యమైంది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో కేవలం 232 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత పేసర్లు అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ చెరో మూడు వికెట్లతో సత్తా చాటగా.. ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు తీశాడు. ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ ఓ వికెట్ దక్కించుకున్నాడు. చదవండి: వైభవ్ సూర్యవంశీకి బీసీసీఐ షాక్ The in-form #RahmanullahGurbaz is sent packing as #GurnoorBrar delivers the breakthrough.#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/6JvreD78S0— Star Sports (@StarSportsIndia) June 17, 2026 -
గిల్, ఇషాన్ శతకాల మోత
లక్నో: భారత జట్టు తమ స్థాయికి తగ్గ ప్రదర్శనతో సత్తా చాటింది. బలహీన జట్టు అఫ్గానిస్తాన్‌తో రెండో వన్డేలోనూ సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగులకు ఆలౌటైంది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ శుబ్‌మన్ గిల్ (110 బంతుల్లో 154; 22 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొమ్మిదో సెంచరీ సాధించగా... ఇషాన్ కిషన్ (79 బంతుల్లో 125; 14 ఫోర్లు, 7 సిక్స్‌లు) కెరీర్లో రెండో శతకంతో చెలరేగాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 23.3 ఓవర్లలో 224 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత్ 400కు పైగా స్కోరు చేయడం ఇది 8వసారి కావడం విశేషం. అనంతరం అఫ్గానిస్తాన్ 44.3 ఓవర్లలో 232 పరుగులకే ఆలౌటైంది. రహ్మత్ షా (89 బంతుల్లో 79; 8 ఫోర్లు) అర్ధ సెంచరీతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నామమాత్రమైన చివరి వన్డే శనివారం చెన్నైలో జరుగుతుంది. డబుల్ సెంచరీ భాగస్వామ్యం... ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4) రెండో ఓవర్లోనే వెనుదిరిగినా... రోహిత్ శర్మ (39 బంతుల్లో 48; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) తనదైన శైలిలో కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. ఘజన్ఫర్ ఓవర్లో 3 ఫోర్లతో గిల్ కూడా ధాటిని పెంచాడు. అయితే రోహిత్‌ను రషీద్ బౌల్డ్ చేయడంతో 87 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. ఈ దశలో జత కలిసిన గిల్, ఇషాన్ వేగంగా దూసుకుపోయారు. 38 బంతుల్లో గిల్ హాఫ్ సెంచరీ పూర్తి కాగా, 52 బంతుల్లో ఇషాన్ హాఫ్ సెంచరీని అందుకున్నాడు. ప్రతీ బౌలర్‌పై చెలరేగిన వీరిద్దరిని నిలువరించడం అఫ్గాన్ వల్ల కాలేదు. సమీ వేసిన ఇన్నింగ్స్ 33వ ఓవర్లో 5 బౌండరీలతో 21 పరుగులు రాబట్టిన భారత్ 250 పరుగుల స్కోరును దాటింది. ఇదే ఓవర్ తొలి బంతికి గిల్ సెంచరీ (77 బంతుల్లో) పూర్తి కాగా, చివరి బంతికి ఇషాన్ (71 బంతుల్లో) శతకాన్ని అందుకోవడం విశేషం. ఈ దశలో గిల్ 16 బంతుల వ్యవధిలో 7 ఫోర్లు బాదడం అతని జోరును చూపించింది. ఖరోటే ఓవర్లో వరుసగా రెండు సిక్స్‌లు బాదిన ఇషాన్ తర్వాతి బంతికి వెనుదిరిగాడు. గిల్, ఇషాన్ ఏకంగా 9.6 రన్‌రేట్‌తో పరుగులు జోడించడం విశేషం. గిల్ పెవిలియన్ చేరాక భారత్ ఇన్నింగ్స్ ఆశించిన వేగంతో సాగలేదు. గిల్, రాహుల్ (0) వరుస బంతుల్లో అవుట్ కాగా, శ్రేయస్ (26) పెద్దగా ప్రభావం చూపలేదు. 40 ఓవర్లు ముగిసే సరికి స్కోరు 340/3 కాగా... చివరి 10 ఓవర్లలో భారత్ 62 పరుగులు మాత్రమే చేసి 7 వికెట్లు కోల్పోయింది. టపటపా... భారీ ఛేదనలో ఊహించినట్లే అఫ్గాన్ చేతులెత్తేసింది. గుర్బాజ్ (33 బంతుల్లో 41; 7 ఫోర్లు, 1 సిక్స్) మరోసారి దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించినా... ఆపై ఇతర బ్యాటర్లు నిలవలేకపోయారు. రహ్మత్, సాదిఖుల్లా (50 బంతుల్లో 42; 5 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 57 పరుగులు జత చేసిన తర్వాత జట్టు పూర్తిగా కుప్పకూలింది. బుధవారం లక్నోలో తీవ్రమైన ఎండ కారణంగా ఇరు జట్ల ఆటగాళ్లంతా బాగా ఇబ్బంది పడ్డారు. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడంతో ప్లేయర్లు పదే పదే విరామాలు తీసుకున్నారు. గిల్, ఇషాన్ ఎంతో అలసిపోగా, రషీద్ ఖాన్ మధ్యలోనే మైదానం వీడాడు. కెరీర్లో తొలి వన్డే ఆడిన దార్విష్ రెండు సార్లు బయటకు వెళ్లాడు. బ్యాటింగ్ సమయంలో కండరాలు పట్టేయడంతో పెవిలియన్‌కు వెళ్లిన అతను మళ్లీ రాలేదు.ప్రిన్స్ యాదవ్ @263 ఈ మ్యాచ్ కోసం భారత జట్టులో మూడు మార్పులు జరిగాయి. తొడ కండరాల గాయంతో నితీశ్ కుమార్ రెడ్డి మ్యాచ్‌కు దూరం కాగా... అతని స్థానంలో జైస్వాల్‌కు చోటు లభించింది. ప్రసిధ్, హర్ష్ దూబే స్థానాల్లో ప్రిన్స్ యాదవ్, కుల్దీప్లకు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌తో ప్రిన్స్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగు పెట్టాడు. భారత్ తరఫున వన్డేలు ఆడిన 263వ ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) ఖరోటే (బి) సలీమ్ 4; రోహిత్ (బి) రషీద్ 48; గిల్ (సి) దార్విష్ (బి) ఖరోటే 154; ఇషాన్ కిషన్ (సి) (సబ్) ఇక్రామ్ (బి) ఖరోటే 125; శ్రేయస్ (సి) ఇబ్రహీం (బి)ఖరోటే 26; రాహుల్ (సి) ఇబ్రహీం (బి) ఖరోటే 0; సుందర్ (సి) గుర్బాజ్ (బి) రషీద్ 19; గుర్నూర్ (సి) ఇబ్రహీం (బి) రషీద్ 3; అర్ష్ దీప్ (సి) రషీద్ (బి) ఘజన్ఫర్ 3; కుల్దీప్ (నాటౌట్) 3; ప్రిన్స్ (రనౌట్) 5; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (49.5 ఓవర్లలో ఆలౌట్) 402. వికెట్ల పతనం: 1–9, 2–96, 3–320, 4–360, 5–360, 6–371, 7–387, 8–392, 9–396, 10–402. బౌలింగ్: ఘజన్ఫర్ 10–1–69–1, సలీమ్ 8–0–75–1, సమీ 8.5–0–90–0, ఖరోటే 10–0–76–4, రషీద్ 8–0–48–3, హష్మతుల్లా 5–0–36–0. అఫ్గానిస్తాన్ ఇన్నింగ్స్: గుర్బాజ్ (సి) రాహుల్ (బి) గుర్నూర్ 41; ఇబ్రహీమ్ (సి) ప్రిన్స్ (బి) అర్ష్ దీప్ 21; సాదిఖుల్లా (ఎల్బీ) (బి) సుందర్ 42; రహ్మత్ (సి) గుర్నూర్ (బి) ప్రిన్స్ 79; దార్విష్ (రిటైర్డ్‌హర్ట్) 6; హష్మతుల్లా (బి) గుర్నూర్ 4; ఖరోటే (బి) ప్రిన్స్ 6; రషీద్ (సి) రోహిత్ (బి) అర్ష్ దీప్ 12; ఘజన్ఫర్ (సి) శ్రేయస్ (బి) అర్ష్ దీప్ 1; సలీమ్ (బి) గుర్నూర్ 9; సమీ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (44.3 ఓవర్లలో ఆలౌట్) 232. వికెట్ల పతనం: 1–52, 2–71, 3–128, 4–140, 5–170, 6–188, 7–190, 8–220, 9–232. బౌలింగ్: అర్ష్ దీప్ 9–0–45–3, ప్రిన్స్ 7.3–0–56–2, గుర్నూర్ 10–0–60–3, కుల్దీప్ 10–0–42–0, సుందర్ 7–0–24–1, జైస్వాల్ 1–0–3–0. -
రెండో వన్డేలో అఫ్గాన్ చిత్తు.. సిరీస్ భారత్ సొంతం
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన రెండో వన్డేలో 170 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో మరో మ్యాచ్ మిగిలుండగానే మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో టీమిండియా సొంతం చేసుకుంది.భారత్ నిర్ధేశించిన 403 పరుగుల టార్గెట్‌ను చేధించలేక అఫ్గాన్ చతికల పడింది. పర్యాటక జట్టు లక్ష్య చేధనలో భారత బౌలర్ల ధాటికి 44.3 ఓవర్లలో 232 పరుగులకు ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బ్యాటర్లలో రెహమత్ షా(79) టాప్ స్కోరర్‌గా నిలవగా.. గుర్బాజ్(41), అటల్(42) పర్వాలేదన్పించారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్ తలా మూడు వికెట్లు సాధించారు.వీరిద్దరితో పాటు అరంగేట్ర ప్రిన్స్ యాదవ్ రెండు వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల భారీ స్కోరు సాధించి టీమిండియా ఆలౌట్ అయింది. శుబ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) సెంచరీలతో కదం తొక్కారు. ఇక ఇరు జట్ల మధ్య నామమాత్రపు మూడో వన్డే జూన్ 20న చెన్నై వేదికగా జరగనుంది. -
గిల్, కిషన్ సెంచరీలు.. భారత్ స్కోర్ 402 పరుగులు
లక్నో వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న రెండో వన్డేలో భారత బ్యాటర్లు విజృంభించారు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అఫ్గాన్ కెప్టెన్ తొలుత టీమిండియాను బ్యాటింగ్‌కు అహ్హానించాడు. అయితే మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆరంభంలోనే భారీ షాక్ తగిలింది. యువ ఓపెనర్ యశస్వి జైశ్వాల్ కేవలం 4 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ నిలకడగా ఆడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు.గిల్, ఇషాన్ మెరుపు సెంచరీలు..మంచి టచ్‌లో కన్పించిన రోహిత్ శర్మ(48) హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి కెప్టెన్ గిల్ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. టీ20 మ్యాచ్‌ను తలపించేలా వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు. ఈ క్రమంలో గిల్ 77 బంతుల్లో తన సెంచరీ మార్క్‌ను అందుకోగా.. కిషన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు.వీరిద్దరూ మూడో వికెట్‌కు ఏకంగా 224 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. గిల్ ఓవరాల్‌గా 110 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 154 పరుగులు చేయగా.. కిషన్ 79 బంతుల్లో 14 ఫోర్లు, 7 సిక్స్‌లతో 125 రన్స్ చేసి ఔటయ్యాడు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 49.5 ఓవర్లలో 402 పరుగుల వద్ద ఆలౌటైంది. అఫ్గానిస్తాన్ బౌలర్లలో స్పిన్నర్లు నంగ్యాలియా ఖరోటి నాలుగు, రషీద్ ఖాన్ మూడు వికెట్లు పడగొట్టారు. వీరితో పాటు ఘజన్ఫర్, మహ్మద్ సలీమ్ తలా వికెట్ సాధించారు. -
IND vs AFG: ఇషాన్ కిషన్ ‘ఫాస్టెస్ట్’ సెంచరీ
అఫ్గనిస్తాన్‌తో రెండో వన్డేలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ శతక్కొట్టాడు. లక్నో వేదికగా కేవలం 71 బంతుల్లోనే వంద పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో అఫ్గనిస్తాన్ మీద వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన రెండో భారత బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నిలిచాడు.టీమిండియా స్వదేశంలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్‌తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా తొలి మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో గెలిచింది భారత జట్టు. ఇక లక్నోలోని ఏకనా స్టేడియంలో బుధవారం నాటి రెండో వన్డేలో టాస్ ఓడిన టీమిండియా తొలుత బ్యాటింగ్‌కు దిగింది.జైసూ విఫలం.. పాపం రోహిత్ఓపెనర్లలో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. రోహిత్ శర్మ అర్ద శతకానికి రెండు పరుగుల దూరంలో నిలిచిపోయాడు. 48 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రషీద్ ఖాన్ బౌలింగ్‌లో బౌల్డ్ అయి పెవిలియన్ చేరాడు.ఇలాంటి తరుణంలో వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ శుబ్‌మన్ గిల్, నాలుగో నంబర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గిల్ 77 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకోగా.. ఇషాన్ 71 బంతుల్లోనే శతక్కొట్టాడు. ఇషాన్ సెంచరీ ఇన్నింగ్స్‌లో 14 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. 𝐓𝐡𝐞 𝐈𝐬𝐡𝐚𝐧-𝐝𝐚𝐚𝐫 𝐊𝐢𝐬𝐡𝐚𝐧 𝐬𝐡𝐨𝐰 𝐢𝐧 𝐋𝐮𝐜𝐤𝐧𝐨𝐰! 🤩He switched gears seamlessly, completely taking the game away with a magnificent ton! 🔥#INDvAFG | 2nd ODI | LIVE NOW 👉https://t.co/YiwP9pOAPC pic.twitter.com/sMtq9hV2z8— Star Sports (@StarSportsIndia) June 17, 2026వీరిద్దరి విజృంభణ కారణంగా టీమిండియా 34 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్ల నష్టానికి 276 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది. ఇక ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ మొత్తంగా 79 బంతుల్లో 14 ఫోర్లు, ఏడు సిక్సర్ల సాయంతో 125 పరుగులు చేసి.. నంగేయాలియా బౌలింగ్‌లో ఇక్రామ్ అలిఖిల్కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.అఫ్గనిస్తాన్‌పై వన్డేల్లో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన క్రికెటర్లు1.ఇయాన్ మోర్గాన్ (ఇంగ్లండ్)- 2019లో 57 బంతుల్లో శతకం2. రోహిత్ శర్మ (ఇండియా)- 2023లో 63 బంతుల్లో శతకం3. ఇషాన్ కిషన్ (ఇండియా)- 2026లో 71 బంతుల్లో శతకం4. గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 2023లో 76 బంతుల్లో శతకం5. శుబ్‌మన్ గిల్ (ఇండియా)- 2026లో 77 బంతుల్లో శతకం.చదవండి: చెలరేగిన బ్యాటర్లు.. అఫ్గన్‌పై భారత్ భారీ స్కోరు -
వైభవ్ ఎంట్రీ ..డేంజర్ లో అభిషేక్, ఇషాన్ కిషన్
-
మూడో స్థానం.. ఆ ముగ్గురికి అవకాశం: టీమిండియా కోచ్
భారత దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో అఫ్గనిస్తాన్‌తో వన్డే సిరీస్ నుంచి తప్పుకొన్నాడు. ఫిట్‌నెస్‌కు మారుపేరైన ఈ రన్‌మెషీన్.. ప్రస్తుతం తొడకండరాల గాయంతో బాధపడుతున్నాడు. దీంతో అఫ్గన్‌తో సిరీస్‌కు అతడు పూర్తిగా దూరమయ్యాడని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఇటీవలే ప్రకటించింది.వన్డే జట్టులోకి జైస్వాల్ కోహ్లి స్థానంలో టెస్టు స్పెషలిస్టు యశస్వి జైస్వాల్‌ను ఎంపిక చేసినట్లు యాజమాన్యం తెలిపింది. ఇదిలా ఉంటే.. టీ20 ఫార్మాట్లో అదరగొడుతున్న ఇషాన్ కిషన్‌కు కూడా అఫ్గన్‌తో వన్డే సిరీస్‌లో చోటు దక్కింది. ఈ నేపథ్యంలో కోహ్లి గైర్హాజరీలో వన్‌డౌన్‌లో ఎవరు ఆడతారన్న చర్చ నడుస్తోంది.ఓపెనర్లుగా జైసూ, ఇషాన్‌కు అనుభవం ఉంది. ఇక ఇషాన్ వన్‌డౌన్‌లో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మేనేజ్మెంట్ ఈ జార్ఖండ్ డైనమైట్ వైపే మొగ్గుచూపుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆ ముగ్గురికీ అవకాశంఈ విషయంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పందించాడు. అఫ్గనిస్తాన్‌తో శనివారం నాటి తొలి వన్డేకు ముందు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మూడో స్థానంలో ఎవరు బ్యాటింగ్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తికర అంశం. కోహ్లికి బదులు ఇషాన్ లేదా కేఎల్ రాహుల్.. లేదంటే యశస్వి జైస్వాల్ ఎవరైనా ఆడవచ్చు.వాళ్లకు ఇదొక మంచి అవకాశం. మాకు మూడు వన్డేలు ఉన్నాయి. కాబట్టి వివిధ ఆప్షన్లు ప్రయత్నించడానికి అవకాశం దొరికింది. ఎలాంటి పరిస్థితుల్లోనైనా జట్టు కూర్పు దెబ్బతినకుండా ఉండేలా విభిన్నమైన ప్లేయర్లను ప్రయత్నించేందుకు ఇదో చక్కటి అవకాశం’’ అని మోర్నీ మోర్కెల్ పేర్కొన్నాడు. ఇక ఓపెనర్ రోహిత్ శర్మకు ఎలాంటి ఫిట్నెస్ సమస్యా లేదని.. అతడు మ్యాచ్ ఆడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని మోర్నీ మోర్కెల్ తెలిపాడు.చదవండి: వైభవ్ తమ్ముడి సూపర్ సెంచరీ -
IND vs AFG: తొలి వన్డేకు భారత తుదిజట్టు ఇదే!
అఫ్గనిస్తాన్‌తో సిరీస్‌ను ఘనంగా ఆరంభించింది టీమిండియా. ముల్లన్పూర్ వేదికగా ఏకైక టెస్టులో ఇన్నింగ్స్ మీద 300 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. అయితే, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2025-27లో ఈ మ్యాచ్ భాగం కాదు.కాబట్టి అఫ్గన్‌తో టెస్టు, విజయంతో టీమిండియాకు పెద్దగా చేకూరే ప్రయోజనం ఏమీ లేదు. అయితే, కావాల్సినంత ప్రాక్టీస్ మాత్రం దొరికింది. మానవ్ సుతార్ (లెఫ్టార్మ్ స్పిన్నర్) వంటి కొత్త ఆటగాడు తనను తాను నిరూపించుకునే ఓ వేదిక దొరికింది.మూడు వన్డేలుఇదిలా ఉంటే.. జూన్ 13, 17, 20 తేదీల్లో టీమిండియా అఫ్గనిస్తాన్‌తో మూడు వన్డేలు ఆడనుంది. అయితే, గాయం వల్ల విరాట్ కోహ్లి అనూహ్య రీతిలో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు. దీంతో అతడి స్థానంలో యశస్వి జైస్వాల్‌ను సెలక్టర్లు ఎంపిక చేశారు.మరోవైపు.. ఇషాన్ కిషన్ సైతం చాన్నాళ్ల తర్వాత వన్డే జట్టులో చోటు దక్కించుకున్నాడు. ఇక గాయాల నుంచి కోలుకుని ఓపెనర్ రోహిత్ శర్మ, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఫిట్నెస్ సాధించారు. దీంతో అఫ్గన్‌తో తొలి వన్డేకు భారత తుదిజట్టు కూర్పు గురించి చర్చ మొదలైంది.ఇషాన్ వద్దు.. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇషాన్‌కు బదులు యశస్వి జైస్వాల్‌కు పెద్ద పీట వేయాలని జట్టు యాజమాన్యానికి సూచించాడు. ఓపెనర్‌గా కాకుండా మూడో స్థానంలోనూ జైసూ రాణించగలడని అభిప్రాయపడ్డాడు.స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘అఫ్గన్‌తో వన్డేలో కెప్టెన్ శుబ్‌మన్ గిల్‌తో కలిసి రోహిత్ శర్మ ఓపెనింగ్ చేస్తాడు. యశస్వి జైస్వాల్‌ను వన్‌డౌన్‌లో ఆడించాలి. శ్రేయస్ అయ్యర్ నాలుగు, కేఎల్ రాహుల్ ఐదు, హార్దిక్ పాండ్యా ఆరు, వాషింగ్టన్ సుందర్ ఏడు, హర్ష్ దూబే ఎనిమిదో స్థానంలో ఆడాలి.పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్‌తో పాటు గుర్నూర్ బ్రార్‌ను ఆడించాలి. స్పెషలిస్టు స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ ఉండనే ఉన్నాడు’’ అని అభిషేక్ నాయర్ పేర్కొన్నాడు. తాను ఎంపిక చేసిన తుదిజట్టులో ఇషాన్ కిషన్‌కు చోటు ఇవ్వలేదు.జైసూను ఆడిస్తారా?ఐపీఎల్-2026 సందర్భంగా బరిలో దిగిన యశస్వి జైస్వాల్ రాజస్తాన్ రాయల్స్ ఓపెనర్‌గా.. 16 మ్యాచ్‌లు ఆడి 427 పరుగులు సాధించాడు. మరోవైపు.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రాతినిథ్యం వహించిన ఇషాన్ కిషన్ 602 పరుగులతో దుమ్ములేపాడు.అంతేకాదు సీజన్ ఆరంభంలో ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా వ్యవహరించి జట్టును గెలిపించాడు ఇషాన్. అంతకుముందు టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలోనూ సత్తా చాటాడు. ప్రస్తుత ఫామ్ దృష్ట్యా ఇషాన్‌ను ఆడించే అవకాశాలు ఎక్కువగా ఉండగా.. అభిషేక్ నాయర్ మాత్రం జైసూకు ఓటేయడం విశేషం.అఫ్గనిస్తాన్‌తో తొలి వన్డేకు అభిషేక్ నాయర్ ఎంచుకున్న జట్టుశుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, గుర్నూర్ బ్రార్, కుల్దీప్ యాదవ్.చదవండి: సిరాజ్‌ను తప్పించిన బీసీసీఐ -
ODI WC: టీమిండియాకు 3 ఆప్షన్లు.. అతడే బెస్ట్!
సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాలో పునరాగమనం చేసిన ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో ఓపెనర్‌గా, వన్‌డౌన్ బ్యాటర్‌గా సత్తా చాటిన ఈ జార్ఖండ్ డైనమైట్.. ఐపీఎల్-2026లోనూ పరుగుల వరద పారించాడు.వన్డేలలోనూ రీఎంట్రీసన్రైజర్స్ హైదరాబాద్ తరఫున పదిహేను మ్యాచ్‌లలో కలిపి 602 పరుగులు సాధించాడు. ఈ మేరకు టీ20లలో సత్తా చాటిన ఇషాన్ కిషన్ (Ishan Kishan) వన్డేలలోనూ రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. వన్డే వరల్డ్‌కప్-2023 తర్వాత జట్టుకు దూరమైన ఇషాన్.. అఫ్గనిస్తాన్ స్వదేశంలో జూన్ 13 నుంచి మొదలుకానున్న సిరీస్‌కు ఎంపికయ్యాడు.సీనియర్ కేఎల్ రాహుల్‌తో కలిసి వికెట్ కీపర్ కోటాలో ఇషాన్ కిషన్‌కు చోటు దక్కింది. వన్డే వరల్డ్‌కప్-2027 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో ఇషాన్‌కు యాజమాన్యం ఈ మేరకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం.మూడో వికెట్ కీపర్‌గా..ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రాహుల్, ఇషాన్‌లతో పాటు భారత్ మూడో వికెట్ కీపర్‌ను కూడా ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని సూచించాడు. సంజూ శాంసన్‌ను బ్యాకప్ కీపర్‌గా ఎంపిక చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు.ఈ మేరకు స్టార్ స్పోర్ట్స్ షోలో మాట్లాడుతూ.. ‘‘వరల్డ్‌కప్ టోర్నీ నేపథ్యంలో నంబర్ వన్ వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్‌కు ప్రాధాన్యం ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అతడు మిడిలార్డర్లో బ్యాటింగ్ చేయగలడు. విలక్షణమైన ఆటగాడు.అతడి వన్డే రికార్డు గొప్పగా ఉందిఇక ఇషాన్ కిషన్ సైతం ఓపెనర్‌గా రాణించగలడు. వన్‌డౌన్‌లోనూ ఆడగలడు. అందుకే వారిద్దరికి సెలక్టర్లు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే, సంజూ శాంసన్ వన్డే రికార్డు కూడా గొప్పగా ఉంది. అవకాశం వచ్చినప్పుడల్లా అతడు రాణించాడు.ఒత్తిడిలోనూ రాణించగల పరిణతి సాధించాడు. అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. కాబట్టి సంజూను కూడా సెలక్టర్లు దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది’’ అని ఇర్ఫాన్ పఠాన్ పేర్కొన్నాడు. కాగా సంజూ ఇప్పటి వరకు 14 వన్డేలు ఆడి 510 పరుగులు సాధించాడు. చివరగా 2023 డిసెంబరులో టీమిండియా తరఫున వన్డే ఆడాడు.చదవండి: అతడికి అన్యాయం.. ఎక్కువ అవకాశాలు ఇవ్వలేదు: గంభీర్ -
టీ20 కొత్త కెప్టెన్‌గా అతడికే ఓటేసిన అగార్కర్!
టీమిండియా టీ20 కెప్టెన్ మార్పు అంశంపై భారత క్రికెట్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. భారత్‌కు ఈ ఏడాది ప్రపంచకప్ టైటిల్ అందించినప్పటికీ సూర్యకుమార్ యాదవ్‌పై వేటు వేసేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సిద్ధమైనట్లు తెలుస్తోంది.ఆ రెండు కారణాల వల్ల..ఒకప్పుడు ప్రపంచ నంబర్‌వన్ బ్యాటర్‌గా ఉన్న సూర్య.. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఆటగాడిగా తేలిపోవడమే ఇందుకు కారణం. అంతేగాక టీ20 ప్రపంచకప్-2028 టోర్నీకి జట్టును సన్నద్ధం చేసే క్రమంలో 35 ఏళ్ల సూర్య వయసు కూడా ఓ అడ్డంకిగా మారిందనే అభిప్రాయాలు ఉన్నాయి.పరిశీలనలో మూడు పేర్లుఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ కొత్త కెప్టెన్ విషయంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నట్లు బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. వరల్డ్‌కప్ వీరుడు సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్‌ల పేర్లు పరిశీలనలో ఉన్నట్లు ఇటీవల వెల్లడించాయి.అయితే, తాజా సమాచారం ప్రకారం.. సంజూ, అక్షర్‌లను కాదని శ్రేయస్ అయ్యర్‌కే సెలక్షన్ కమిటీ ఓటేసినట్లు సమాచారం. ఇందులో చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌దే ప్రధాన పాత్ర అని తెలుస్తోంది. ఈ విషయం గురించి బీసీసీఐ వర్గాలు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ..అతడికే ఓటేసిన అగార్కర్‘‘అజిత్ దృఢచిత్తం గల చీఫ్ సెలక్టర్. స్ట్రాంగెస్ట్ చీఫ్ సెలక్టర్లలో అతడు ముందు వరుసలో ఉంటాడు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే అతడు ఎన్నో కఠిన నిర్ణయాలు తీసుకున్నాడు.తన ప్యానెల్‌తో కలిసి కొత్త టీ20 కెప్టెన్ కోసం అగార్కర్ తీవ్రంగా కసరత్తు చేస్తున్నాడు. ఇందులో భాగంగానే శ్రేయస్ అయ్యర్‌ను తొలుత వన్డేలకు వైస్ కెప్టెన్‌గా నియమించారు. టీ20 ప్రపంచకప్-2026 ఆరంభానికి ముందే శ్రేయస్ విషయంలో ఒక నిర్ణయమైతే జరిగిపోయింది’’ అని పేర్కొన్నాయి.గంభీర్ విముఖత!అయితే, హెడ్‌కోచ్ గౌతం గంభీర్ మాత్రం శ్రేయస్ అయ్యర్ విషయంలో అగార్కర్‌తో ఏకీభవించడం లేదని సమాచారం. ‘‘గంభీర్ మనసులో ఒకరు ఉండొచ్చు. సెలక్టర్లు వేరొకరి గురించి ఆలోచించవచ్చు. అయితే, అక్షర్ పటేల్ వరల్డ్‌కప్ టోర్నీలో వైస్ కెప్టెన్‌గా వ్యవహరించిన విషయాన్ని మర్చిపోవద్దు.రేసులో ఇషాన్ కూడా!ఇక ఇషాన్ కిషన్.. అతడి వయసు చిన్నదే. ఫామ్‌లో ఉన్నాడు. సారథిగానూ నిరూపించుకుంటున్నాడు. ఇదిలా ఉంటే.. సంజూ శాంసన్ విషయంలో మాత్రం సెలక్టర్లు సంతృప్తిగా లేరు. అతడి నిలకడలేని ఆట తీరే ఇందుకు కారణం.కాబట్టి శ్రేయస్ అయ్యర్‌తో పాటు ఇషాన్, అక్షర్ కూడా రేసులో ఉన్నారని చెప్పవచ్చు. కానీ సంజూకు మాత్రం అవకాశం ఉండకపోవచ్చు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. ఏదేమైనా ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటన తర్వాత కొత్త టీ20 కెప్టెన్ గురించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.చదవండి: వైభవ్‌తో కోహ్లి చెప్పిన మాటలు ఇవే! -
కమిన్స్ సంచలన నిర్ణయం..! సన్‌రైజర్స్ కెప్టెన్‌గా విధ్వంసకర ప్లేయర్?
ఆస్ట్రేలియా స్టార్, సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ వచ్చే ఏడాది ఐపీఎల్ సీజన్‌కు దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌కు ప్రాధాన్యత ఇవ్వడం కోసం తాను ఐపీఎల్-2027కు అందుబాటులో ఉండకపోవచ్చని కమిన్స్ ఇప్పటికే సూచించాడు. తాజాగా ఓ కార్యక్రమంలో కమ్మిన్స్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. వచ్చే ఏడాది యాషెస్ సిరీస్‌తో పాటు వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే ప్రపంచకప్ వంటి మెగా టోర్నీలు ఉన్నాయి. కాగా యాషెస్ 2025-26ను ఆస్ట్రేలియా సొంతం చేసుకున్నప్పటికి, కమ్మిన్స్ మాత్రం గాయం కారణంగా ఒకే ఒక మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత కీలకమైన టీ20 ప్రపంచకప్‌కు దూరమయ్యాడు. ఈసారి మాత్రం కమిన్స్ పూర్తిగా ఫిట్‌గా అన్ని ప్రధాన టోర్నీల్లో పాల్గోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు."వచ్చే ఏడాది బిజీ షెడ్యూల్ కారణంగా ఏదో ఒకదానికి విరామం ఇవ్వక తప్పదు. అయితే అది ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్‌లు లేదా వన్డే ప్రపంచ కప్ మాత్రం కాదు. టెస్ట్ క్రికెట్, వన్డే వరల్డ్ కప్‌లకే నా మొదటి ప్రాధాన్యత ఉంటుంది. లీగ్ క్రికెట్ మ్యాచ్‌లు ఆడటంపై తుది నిర్ణయాన్ని ఆయా ఫ్రాంచైజీలతో మాట్లాడి తీసుకుంటాను. గాయాల బారిన పడే అవకాశం ఉన్నందున ఇప్పుడే దేనికీ కమిట్ అవ్వకూడదు అనుకుంటున్నాను.బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ వంటి సుదీర్ఘ సిరీస్‌లో అన్ని మ్యాచ్‌లు ఆడితే.. ఆ తర్వాత జరగబోయే 'యాషెస్' సిరీస్ కంటే ముందు నాకు కచ్చితంగా విశ్రాంతి అవసరమని కమ్మిన్స్ ఓ కార్యక్రమంలో పేర్కొన్నాడు. ఒకవేళ కమిన్స్ అందుబాటులో లేకపోతే ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు.ఐపీఎల్-2026 సీజన్ ఫస్ట్‌హాఫ్‌లో కూడా కమ్మిన్స్ గైర్హజరీలో కిషనే సన్‌రైజర్స్ జట్టును నడిపించాడు. అతడి సారథ్యంలో 8 మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ.. ఐదింట విజయం సాధించింది. ఈ జార్ఖండ్ ఆటగాడు బ్యాటర్‌గా కూడా రాణించాడు. కిషన్ 15 మ్యాచ్‌లలో 602 పరుగులు చేశాడు. కానీ ఎస్ఆర్హెచ్ ప్రయాణం ఎలిమినేటర్‌లోనే ముగిసిపోయింది.చదవండి: NZ vs ENG: ఇంగ్లండ్ జట్టు ప్రకటన.. 'గే'కు ఛాన్స్ -
IPL 2026: అత్యుత్తమ జట్టు.. ఓపెనర్లుగా ఎవరంటే?
భారత మెగా క్రికెట్ సంబరం ఐపీఎల్-2026 ఆదివారంతో ముగిసింది. అహ్మదాబాద్ వేదికగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్‌ను ఓడించి.. డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకుంది.ఇక రెండు నెలలకు పైగా వినోదం పంచిన క్యాష్ రిచ్ లీగ్‌లో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీ ఈసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. మరోవైపు ఆర్సీబీ దిగ్గజం విరాట్ కోహ్లి ఫైనల్లో 75 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును గెలిపించి.. వింటేజ్ కింగ్‌ను గుర్తుచేశాడు.అయితే, సీజన్ ఆసాంతం అదరగొట్టిన గుజరాత్ ఓపెనింగ్ జోడీ సాయి సుదర్శన్- శుబ్‌మన్ గిల్ టైటిల్ పోరులో మాత్రం నిరాశపరిచారు. సాయి 12, గిల్ 10 పరుగులకే నిష్క్రమించడంతో గుజరాత్ ఓటమికి అక్కడే పునాది పడింది.అత్యుత్తమ జట్టుఈ పరిణామాల నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్, కామెంటేటర్ ఆకాశ్ చోప్రా.. ఈ సీజన్‌కు గానూ తన అత్యుత్తమ జట్టును ప్రకటించాడు. ఇందులో పన్నెండు మందికి చోటిచ్చాడు. ఈ మేరకు..ఓపెనర్లుగా ఎవరంటే?‘‘వైభవ్ సూర్యవంశీ.. మరో మాటకు తావు లేకుండా నా జట్టులో అతడు ఉంటాడు. పదిహేనేళ్ల వయసులోనే అతడు ఆరెంజ్ క్యాప్ గెలిచాడు. అతడితో పాటు దిగ్గజ విరాట్ కోహ్లి నా జట్టు ఓపెనర్‌గా ఉంటాడు.మూడో స్థానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్‌ను ఆడిస్తాను. అతడే నా వికెట్ కీపర్.. అదే విధంగా వైస్ కెప్టెన్ కూడానూ!.. నాలుగో స్థానానికి ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్‌ను ఎంచుకుంటాను. అతడే నా జట్టు సారథి.అతడు లేకుంటే ఎలా?ఐదో స్థానంలో హైదరాబాద్ పవర్ హిట్టర్ హెన్రిచ్ క్లాసెన్ ఉంటాడు. అతడు లేకుండా అసలు ఈ జట్టు కూర్పు సాధ్యమే కాదు. పందొమిదేళ్ల ఐపీఎల్ చరిత్రలో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడ్డ ఏకైక మిడిలార్డర్ బ్యాటర్ అతడు.అతడికి తోడుగా హైదరాబాద్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి కూడా నా జట్టులో ఉంటాడు. హార్దిక్ పాండ్యా ఈసారి దారుణం గా విఫలం కాగా.. అదే సమయంలో నితీశ్ రెడ్డి అదరగొట్టాడు. ఏడో స్థానంలో కృనాల్ పాండ్యా సరైనోడు.ఎనిమిదో స్థానానికి సునిల్ నరైన్ లేదంటే రషీద్ ఖాన్‌ను ఎంచుకుంటాను. నాకు ఒక్క స్పిన్నర్ అవసరం మాత్రమే ఉంది. కాబట్టి సునిల్‌తో వెళ్తాను. ఇక తొమ్మిదో స్థానంలో భువనేశ్వర్ కుమార్ ఉంటాడనడంలో సందేహం లేదు.బౌలింగ్ దళం ఇదేఈ సీజన్లోనూ అత్యుత్తమంగా బౌలింగ్ చేశాడు. కగిసో రబడ, జోఫ్రా ఆర్చర్లకు కూడా నా జట్టులో చోటు ఉంటుంది. ఇక పన్నెండో స్థానం కోసం అన్షుల్ కాంబోజ్, సకీబ్ హుసేన్, రసిఖ్ సలామ్ దర్ పేర్లను పరిశీలించాను.సకీబ్ అత్యద్భుతంగా బౌలింగ్ చేశాడు. రసిఖ్ కూడా తక్కువేమీ కాదు. అన్క్యాప్డ్ కేటగిరీలో అతడే అత్యధిక వికెట్ల వీరుడు. కాబట్టి రసిఖ్కే నా ఓటు’’ అని ఆకాశ్ చోప్రా చెప్పుకొచ్చాడు. అయితే, అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఉన్న రెండు, మూడు స్థానాల్లో ఉన్న గిల్ (732 రన్స్), సాయి (722)లకు మాత్రం ఆకాశ్ చోప్రా తన జట్టులో చోటు ఇవ్వలేదు.ఐపీఎల్-2026 సీజన్‌కు గానూ ఆకాశ్ చోప్రా ప్రకటించిన అత్యుత్తమ జట్టు (12 member).వైభవ్ సూర్యవంశీ (776 రన్స్), విరాట్ కోహ్లి (675 రన్స్), ఇషాన్ కిషన్ (602 రన్స్), రజత్ పాటిదార్ (కెప్టెన్- 501 రన్స్), హెన్రిచ్ క్లాసెన్ (624 రన్స్), నితీశ్ కుమార్ రెడ్డి (302 రన్స్, 8 వికెట్లు ), కృనాల్ పాండ్యా (226 రన్స్, 14 వికెట్లు), సునిల్ నరైన్ (15 వికెట్లు), భువనేశ్వర్ కుమార్ (28 వికెట్లు), కగిసో రబడ (29 వికెట్లు), జోఫ్రా ఆర్చర్ (25 వికెట్లు), రసిఖ్ సలామ్ దర్ (19 వికెట్లు).చదవండి: నేనేమీ లక్కీ చార్మ్ కాదు.. కానీ నేనొచ్చాకే ఆర్సీబీకి ట్రోఫీలు! -
Asian Games: వైభవ్‌కు చోటు.. భారత జట్టు ఇదే!
ఆసియా క్రీడల అరంగేట్రంలోనే చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఈసారీ అదే ఫలితం పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. ఇప్పటికే ఈ ఏడాది టీ20 ప్రపంచకప్ రూపంలో ఐసీసీ టైటిల్ గెలిచిన భారత్.. ఆసియా క్రీడలు-2026 ఎడిషన్‌లో ఫేవరెట్‌గా బరిలో దిగనుంది.ఈ నేపథ్యంలో ఇప్పటికే ముప్పై మందితో కూడిన ప్రాబబుల్స్ జాబితాను బీసీసీఐ భారత ఒలింపిక్ సంఘానికి అందజేసింది. ఇందులో రాజస్తాన్ రాయల్స్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి కూడా చోటు దక్కింది.ఓపెనర్ల విభాగంలో పోటీఓపెనర్ల విభాగంలో సీనియర్లు సంజూ శాంసన్, అభిషేక్ శర్మ, యశస్వి జైస్వాల్, ఇషాన్ కిషన్ల నుంచి వైభవ్ సూర్యవంశీకి గట్టి పోటీ ఉంది. అయితే, రాయల్స్‌లో తన సహచర ఆటగాడు జైసూ కంటే వైభవ్ ఈసారి గొప్పగా ఆడిన సంగతి తెలిసిందే.ఐపీఎల్-2026లో వైభవ్ 776 పరుగులతో సత్తా చాటగా.. జైస్వాల్ 427 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్, టీ20 ప్రపంచకప్ విజేత అభిషేక్ శర్మ 563 పరుగులతో రాణించగా.. భారత్ వరల్డ్‌కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన సంజూ శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున 477 పరుగులు సాధించాడు.ఇషాన్‌కు చోటు లేదు!ఇక ఇషాన్ కూడా సన్‌రైజర్స్ తరఫున 602 పరుగులతో దుమ్ములేపాడు. ఓవరాల్‌గా ఓపెనర్ల విభాగంలో అభిషేక్, ఇషాన్ సత్తా చాటగా.. అందరికంటే వైభవ్ అత్యధిక పరుగులతో ముందు వరుసలో ఉన్నాడు. అభిషేక్‌కు జోడీగా వైభవ్‌ను ఆడిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.ఆల్‌రౌండర్లు, బౌలర్లు వీరేఇక సంజూను వన్‌డౌన్‌లో పంపినా.. మరో వికెట్ కీపర్ బ్యాటర్ ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, రింకూ సింగ్ బ్యాటర్ల విభాగంలో సెట్ అయిపోతారు. ఇక ఆల్‌రౌండర్ల జాబితాలో నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, హర్ష్ దూబేలను ఎంపిక చేసే అవకాశం ఉంది.బౌలర్ల విషయానికొస్తే.. పేస్ దళంలో అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్.. స్పిన్ విభాగంలో వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయిలకు అవకాశం ఉండొచ్చు. కాగా ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు ఈసారి కూడా విశ్రాంతినివ్వడం ఖాయంగానే కనిపిస్తోంది.పసిడి పతకాలతో సత్తా చాటిన భారత జట్లుకాగా 2022లో తొలిసారిగా బీసీసీఐ సీనియర్ పురుషుల, మహిళల క్రికెట్ జట్టును ఆసియా క్రీడలకు పంపింది. టీ20 ఫార్మాట్లో రుతురాజ్ గైక్వాడ్ సారథ్యంలో ద్వితీయ శ్రేణి జట్టు పసిడి పతకం సాధించగా.. హర్మన్‌ప్రీత్ కౌర్ కెప్టెన్సీలో మహిళా జట్టు స్వర్ణం గెలుచుకుంది.అయితే, ఈసారి ప్రధాన టీ20 జట్టులోని సభ్యులను కూడా ఎంపిక చేయాలని బీసీసీఐ భావిస్తోంది. కాగా జపాన్‌లోని ఐచీ- నగోయాలో సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 3 వరకు ఆసియా క్రీడలు-2026 ఎడిషన్ నిర్వహించనున్నారు. ఇక గత పర్యాయం చైనా ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన సంగతి తెలిసిందే.ఆసియా క్రీడలు-2026: భారత అత్యుత్తమ టీ20 జట్టు ఇదేఅభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, సంజూ శాంసన్, ధ్రువ్ జురెల్, తిలక్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివం దూబే, రింకూ సింగ్, హర్ష్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయి, ప్రసిద్ కృష్ణ, యశ్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి.ప్రాబబుల్స్ జాబితాయశస్వి జైస్వాల్, అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్, సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, తిలక్ వర్మ, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, నితీశ్ కుమార్ రెడ్డి, ప్రసిధ్ కృష్ణ, వరుణ్ చక్రవర్తి, అనుకూల్ రాయ్, ఆయుశ్ బదోని, హర్ష్ దూబే, ధ్రువ్ జురేల్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, రవి బిష్ణోయ్, షహబాజ్, శివమ్ దూబే, విప్రాజ్ నిగమ్, హర్షిత్ రాణా, యశ్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్. చదవండి: ‘అతడు 3 ఓవర్లు వేస్తే ఆర్సీబీ ఖేల్ ఖతం’ -
ఇషాన్ కిషన్‌కు భారీ షాకిచ్చిన ముంబై ఇండియన్స్ అనామకుడు
ఐపీఎల్ 2026లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న స్టార్ వికెట్‌కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు జార్ఖండ్ టీ20 లీగ్ వేలంలో ఊహించని షాక్ తగిలింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఈ సీజన్లో పరుగుల వరద పారించిన ఇషాన్‌ను వెనక్కినెట్టి, ముంబై ఇండియన్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు.జార్ఖండ్ రాష్ట్ర క్రికెట్ సంఘం నిర్వహించిన తొలి జార్ఖండ్ టీ20 లీగ్ మెగా వేలం మే 30న ఘనంగా జరిగింది. రాంచీ వేదికగా జరిగిన ఈ వేలంలో ఆరు జట్లు పాల్గొన్నాయి. రాంచీ టైటాన్స్, జంషెడ్పూర్ స్టీలర్స్, చోటా నాగ్‌పూర్ రాయల్స్, కోయలాంఛల్ సూపర్‌కింగ్స్, థన్‌బాద్ డైమాండ్స్, సంథల్ స్ట్రయికర్స్ ఫ్రాంచైజీలు తలో రూ.50 లక్షల బడ్జెట్‌తో ఆటగాళ్లను కొనుగోలు చేశాయి.ఈ వేలంలో రాబిన్ మింజ్‌ను దక్కించుకునేందుకు తీవ్రమైన పోటీ నెలకొంది. చివరకు కోయలాంఛల్ సూపర్ కింగ్స్ అతడిని రూ.15.25 లక్షలకు సొంతం చేసుకుంది. దీంతో టోర్నీ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా రాబిన్ మింజ్ రికార్డు సృష్టించాడు.మరోవైపు ఇషాన్ కిషన్‌ను సంథల్ స్ట్రయికర్స్ రూ.14.70 లక్షలకు కొనుగోలు చేసింది. రాబిన్ మింజ్‌తో పోలిస్తే ఇషాన్ ధర రూ.55 వేల తక్కువగా ఉండటం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.వాస్తవానికి ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026లో ఇషాన్ కిషన్ అద్భుత ఫామ్‌లో కనిపించాడు. 15 ఇన్నింగ్స్‌ల్లో 40.13 సగటు, 182.42 స్ట్రయిక్‌రేట్‌తో 602 పరుగులు చేసి సన్‌రైజర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మరోవైపు రాబిన్ మింజ్ మాత్రం ముంబై ఇండియన్స్ తరఫున కేవలం రెండే మ్యాచ్‌లు ఆడి ఆరు పరుగులు మాత్రమే చేశాడు.అయినా, దేశీయ క్రికెట్లో రాబిన్ మింజ్‌కు ఉన్న పవర్ హిట్టర్ ఇమేజ్ అతడిని ఇషాన్ కంటే ఎక్కువ మొత్తానికి అమ్ముడుపోయేలా చేసింది. ఇషాన్ జాతీయ జట్టు బాధ్యతల కారణంగా టోర్నీలో కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యే అవకాశం ఉండటం కూడా వేలంపై ప్రభావం చూపినట్లు తెలుస్తోంది.కాగా, తొలి జార్ఖండ్ టీ20 లీగ్ జూన్ 10 నుంచి ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో మొత్తం 27 మ్యాచ్‌లు జరగనున్నాయి. లీగ్ దశ అనంతరం అగ్ర జట్లు నాకౌట్ దశకు అర్హత సాధిస్తాయి. అయితే టోర్నీ ప్రారంభానికి ముందే ఇషాన్ కిషన్‌ను అధిగమించి రాబిన్ మింజ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలవడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. -
‘అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు’
ఐపీఎల్-2026లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ అసలు సమరంలో మాత్రం చేతులెత్తేసింది. రాజస్తాన్ రాయల్స్‌తో ఎలిమినేటర్ మ్యాచ్‌లో సమిష్టి వైఫల్యంతో ఇంతటితో ప్రయాణం ముగించింది. ముఖ్యంగా విధ్వంసకర బ్యాటింగ్‌కు పెట్టింది పేరైన సన్‌రైజర్స్ టాపార్డర్ రాజస్తాన్ బౌలింగ్ ధాటికి కుదేలు కావడం తీవ్ర ప్రభావం చూపింది.టాపార్డర్ కుదేలుఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ట్రవిస్ హెడ్ (8 బంతుల్లో 17) కాసేపు వేగంగా ఆడినా క్రీజులో నిలదొక్కుకోలేకపోయాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్ (11 బంతుల్లో 33) మెరుపులు కూడా ఎక్కువసేపు కొనసాగలేదు. ఈ ముగ్గురిని రాజస్తాన్ పేసర్ జోఫ్రా ఆర్చర్ పెవిలియన్‌కు చేర్చాడు.ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ కెప్టెన్ క్రిష్ణమాచారి శ్రీకాంత్ అభిషేక్ శర్మను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్లే ఆఫ్స్‌లో ఎల్లప్పుడూ అతడు విఫలం అవుతున్నాడని.. ఇంతకంటే చెత్త విషయం మరొకటి ఉండదన్నాడు. స్పోర్ట్స్‌కీడాతో మాట్లాడుతూ..అతడు ప్లే ఆఫ్స్‌లో ఫెయిల్ అవుతూనే ఉన్నాడు‘‘2024 నుంచి సన్‌రైజర్స్‌కు ఇదే సమస్య. అభిషేక్ శర్మ ప్లే ఆఫ్స్‌లో ప్రతిసారీ విఫలమవుతూనే ఉన్నాడు. ఆర్చర్ ఈసారి పవర్‌ప్లేలో అతడితో పాటు ఇషాన్ కిషన్‌నూ వెనక్కి పంపి దెబ్బకొట్టాడు. ట్రవిస్ హెడ్ అయితే గుడ్డిగా ఆడుతూ పోయాడే తప్ప ప్లాన్ ఉన్నట్లు కనిపించలేదు.ఇక హెన్రిచ్ క్లాసెన్ కంటే ముందు స్మరణ్ రవిచంద్రన్ ఎందుకు బ్యాటింగ్‌కు వచ్చాడో తెలియదు. అభిషేక్ శర్మ అవుటైనా ఇషాన్ వేగంగా ఆడాడు. మూడు ఓవర్లలోనే దాదాపుగా 50 పరుగులు తెచ్చారు. అయితే, ఇషాన్ అవుటైన తర్వాత సన్‌రైజర్స్ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలిపోయింది.Bowled ’em! 🔥Jofra Archer strikes as Travis Head departs early, and #SRH are in deep trouble in this must-win clash 😮💨#TATAIPL 2026 Eliminator 👉 #SRHvRR | LIVE NOW 👉https://t.co/AsF9BnOMCE pic.twitter.com/RAEXQ0WmL7— Star Sports (@StarSportsIndia) May 27, 2026రాయల్స్‌ను గెలిపించిన వైభవ్ఏదేమైనా ప్లే ఆఫ్స్‌లో అభిషేక్ శర్మ విఫలం కావడం సన్‌రైజర్స్‌కు అతిపెద్ద సమస్యగా మారింది’’ అని క్రిష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నాడు. కాగా ముల్లన్పూర్ వేదికగా బుధవారం నాటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో రాజస్తాన్ తొలుత బ్యాటింగ్‌కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 243 పరుగులు సాధించింది.ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (29 బంతుల్లో 97) విధ్వంసకర ఇన్నింగ్స్‌తో సన్‌రైజర్స్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఇక లక్ష్య ఛేదనలో ఆది నుంచే తడబడ్డ సన్‌రైజర్స్ 19.2 ఓవర్లలో కేవలం 196 పరుగులు చేసి ఆలౌట్ అయింది.చదవండి: ‘జైస్వాల్ రాయల్స్‌ను విడిచి వెళ్లాలి’ -
వైభవ్ సూర్యవంశీ.. విధ్వంసానికి కేరాఫ్ అడ్రస్ (ఫొటోలు)
-
సూర్యపై వేటు తగదు.. కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!
భారత టీ20 జట్టుకు త్వరలోనే కొత్త కెప్టెన్ రానున్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇంగ్లండ్ పర్యటన తర్వాత యాజమాన్యం ఈ విషయమై నిర్ణయం తీసుకుంటుందని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వర్గాలు ఇటీవల వెల్లడించడం ఇందుకు కారణం.వేటు తప్పదనే సంకేతాలుటీమిండియాకు 2026లో కెప్టెన్‌గా టీ20 ప్రపంచకప్ అందించినప్పటికీ.. ఆటగాడిగా మాత్రం తేలిపోయాడు సూర్యకుమార్ యాదవ్. సారథిగా పగ్గాలు చేపట్టిన తర్వాత అతడి బ్యాటింగ్‌లో పస లేకుండా పోయింది. ఇక ఐపీఎల్-2026లోనూ ఈ ముంబై ఇండియన్స్ బ్యాటర్ 13 ఇన్నింగ్స్‌లో కలిపి 270 పరుగులే చేయగలిగాడు.ఈ నేపథ్యంలో సూర్యపై వేటు పడటం దాదాపుగా ఖాయమవుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో టీమిండియా మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్ఎస్కే ప్రసాద్ మాత్రం భిన్నంగా స్పందించాడు. క్రిక్‌బజ్‌కు రాసిన కాలమ్‌లో..అత్యంత విలువైన ఆటగాడు‘‘ఆధునిక టీ20 క్రికెట్లో కేవలం టెక్నిక్ ద్వారానే మ్యాచ్‌లు గెలవలేము. భయం లేకుండా వినూత్న షాట్లు కొట్టడం, కొన్ని ఓవర్లలోనే మ్యాచ్‌ను మలుపు తిప్పగల సత్తా ఉండటం అత్యంత ముఖ్యం. ఆ లక్షణాలన్నీ సూర్యకుమార్లో ఉన్నాయి.అందుకే భారత టీ20 క్రికెట్లో ఇప్పటికీ అతడు అత్యంత విలువైన ఆటగాడే. అతడి ఫామ్ గురించి ఆందోళనలు ఉన్న మాట వాస్తవమే. అయితే, భారత టీ20 జట్టు నుంచి సూర్యను తొలగిస్తే మాత్రం అంతకంటే పెద్ద తప్పు మరొకటి ఉండదు.భవిష్య కెప్టెన్లుగా ఆ నలుగురు సరైనోళ్లు!ఇప్పటికీ టీమిండియాలో విభిన్న, అత్యంత ప్రత్యేకమైన బ్యాటర్ సూర్యనే. 360 డిగ్రీస్‌లో షాట్లు ఆడగల అతి కొద్దిమంది బ్యాటర్లలో అతడు ఒకడు. ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం కష్టం’’ అని ఎమ్ఎస్కే ప్రసాద్ పేర్కొన్నాడు.ఇక సూర్యను ఆటగాడిగా కొనసాగించాలన్న ఎమ్ఎస్కే ప్రసాద్.. శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్‌లలో ఒకరిని తదుపరి కెప్టెన్‌గా తీర్చిదిద్దవచ్చని అభిప్రాయపడ్డాడు. కాగా వరల్డ్‌కప్-2026 తర్వాత 2028 ప్రపంచకప్ ఆడటమే తన లక్ష్యమని 35 ఏళ్ల సూర్య తెలిపిన సంగతి తెలిసిందే.చదవండి: కోహ్లికి షాక్.. వైభవ్‌కు చోటు! -
ఎస్ఆర్హెచ్ త్రిమూర్తుల అరుదైన ఫీట్!
ఐపీఎల్ 2026 సీజన్లో ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 255 పరుగులు భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరుజట్లు ప్లేఆఫ్స్ చేరినప్పటికీ ఎస్ఆర్హెచ్ రెండో స్థానంలో ప్లేఆఫ్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సి ఉంటుంది. అయితే ఆర్సీబీతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ తొలుత బ్యాటింగ్ చేయడంతో రెండో స్థానంలో నిలవాలంటే 90 ప్లస్ పరుగుల తేడాతో గెలవాల్సి ఉంటుంది. ఈ సంగతి పక్కనబెడితే ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెనిరిచ్ క్లాసెన్‌లు ఒక అరుదైన రికార్డు తమ పేరిట లిఖించుకున్నారు. ఆర్సీబీతో మ్యాచ్‌లో ఈ ముగ్గురు త్రిమూర్తులు అర్థసెంచరీలతో చెలరేగారు. ఈ సీజన్లో అభిషేక్, క్లాసెన్, ఇషాన్‌లు 500 పరుగుల మార్క్‌ను దాటారు. తద్వారా ఒకే ఎడిషన్‌లో ఒక జట్టు నుంచే ముగ్గురు బ్యాటర్లు 500 ప్లస్ పరుగులు సాధించడం ఐపీఎల్ చరిత్రలో ఇది రెండోసారి మాత్రమే. గతంలో గుజరాత్ టైటాన్స్ 2025లో ఈ ఫీట్‌ను నమోదు చేసింది. ఆ సీజన్లో సాయి సుదర్శన్ (600 పరుగులు), శుబ్‌మన్ గిల్ (759 పరుగులు), బట్లర్ (538 పరుగులు) సాధించారు. తాజా సీజన్లో ఎస్ఆర్హెచ్ తరఫున క్లాసెన్ (606 పరుగులు), అభిషేక్ శర్మ (563 పరుగులు) ఐదొందల మార్క్ దాటగా, తాజాగా ఆర్సీబీతో మ్యాచ్‌లో ఫిఫ్టీ సాధించడం ద్వారా ఇషాన్ కిషన్ కూడా 500 మార్క్ దాటి 569 పరుగులతో ఆరెంజ్‌క్యాప్ రేసులో ఆరో స్థానంలో ఉన్నాడు. MAXIMUMS x 2️⃣🎥 Abhishek Sharma was in his element 👊🧡Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/exdErsz4bp— IndianPremierLeague (@IPL) May 22, 2026A six-hitting Master-KLAAS on show 🍿🎥 Heinrich Klaasen going big against Josh Hazlewood 💥💥Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/DGYE4ND2WN— IndianPremierLeague (@IPL) May 22, 2026 The ball literally flew to every single corner of the ground tonight 🚀Updates ▶️ https://t.co/ZcxjefgalG#TATAIPL | #KhelBindaas | #SRHvRCB | @SunRisers pic.twitter.com/8pR8qvDCnC— IndianPremierLeague (@IPL) May 22, 2026 -
ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీ.. వైభవ్‌కు ప్రమోషన్!
ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు చేరుకుంది. ఆదివారంతో లీగ్ దశ ముగిసి ప్లేఆఫ్స్ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ ఏడాది టైటిల్ ఎవరి సొంతమవుతుందనేది మే 31న తేలిపోనుంది. ఈ నేపథ్యంలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ వచ్చే ఏడాది ఐపీఎల్లో ఒకే జట్టుకు ఆడనున్నట్లు సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బీహార్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అగర్వాల్ బీసీసీఐ కొత్త ఫ్రాంచైజీకి అనుమతి ఇస్తే 'బెమిసల్ బీహార్' పేరుతో కొత్త జట్టును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీనికి బీసీసీఐ ఒప్పుకుంటే వచ్చే ఏడాది ఐపీఎల్లో కొత్త ఫ్రాంచైజీని చూసే అవకాశముంది. ఈ ఫ్రాంచైజీ ఏర్పాటైతే ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని, వైభవ్ సూర్యవంశీ వైస్ కెప్టెన్‌గా ఉంటాడని ఆయన పేర్కొన్నారు. ‘బెమిసల్ బీహార్’తో కూడిన జెర్సీని కెప్టెన్, వైస్ కెప్టెన్ హోదాలో ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ కలిసి ఆవిష్కరిస్తున్న ఫొటో చాట్ జీపీటీ ద్వారా ప్రత్యక్షమవ్వడం వైరల్‌గా మారింది. బీహార్‌కు చెందిన ఈ ఇద్దరితో పాటు ఈ సీజన్లో వేర్వేరు జట్లకు ఆడుతున్న అంగ్క్రిష్ రఘువంశీ (కేకేఆర్), సాకిబ్ హుస్సేన్ (ఎస్ఆర్హెచ్) కూడా అదే రాష్ట్రానికి చెందినవారు కావడం విశేషం. అద్భుత ప్రదర్శన కనబరుస్తున్న ఈ నలుగురు బీహార్ నుంచి వచ్చినవారు కావడంతో సెపరేట్‌గా ఒక ఐపీఎల్ జట్టు ఉంటే బాగుంటుందని అనిల్ అగర్వాల్ తెలిపారు. ఈ అంశం క్రీడల పరంగా బీహార్‌ను ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలను అందించడంతో పాటు తర్వాతి తరం క్రికెటర్లకు ఇది స్ఫూర్తినిచ్చే అవకాశముందని ఆయన తెలిపారు. అనిల్ అగర్వాల్ మాట్లాడుతూ.. 'చెన్నై సూపర్‌కింగ్స్, ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్‌లాగే బీహార్‌కు కూడా సొంత ఫ్రాంచైజీ ఉండాలనుకోవడంలో తప్పులేదు. ఎందుకంటే బీహార్ గడ్డ ఈ దేశానికి ఎంతో మంది క్రికెటర్లను అందించింది. పట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ వన్డేల్లో అత్యంత వేగవంతమైన డబుల్ సెంచరీ సాధించాడు. ఇక బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన సూర్యవంశీ ఐపీఎల్లో అరంగేట్రం చేసిన అతిపిన్న వయస్కుడిగా నిలిచాడు. గోపాల్‌గంజ్‌లోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాకిబ్ హుస్సేన్ ఇవాళ తన బౌలింగ్‌తో యావత్ క్రికెట్ ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాడు. ఇదే రాష్ట్రానికి చెందిన అంగ్క్రిష్ రఘువంశీ తన డైనమైట్ ఇన్నింగ్స్‌లతో అలరిస్తున్నాడు. వీరందరిని ఒక చోట చేర్చేలా బీహార్ పేరుతో ఒక ఫ్రాంచైజీని తీసుకొస్తే బాగుంటుంది' అని చెప్పుకొచ్చారు. ఐపీఎల్ 2026 సీజన్లో బ్యాటింగ్‌లో మెరిసిన వాళ్లలో రాజస్తాన్ రాయల్స్ వైభవ్ సూర్యవంశీతో పాటు సన్‌రైజర్స్ హైదరాబాద్ వైస్‌కెప్టెన్ ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉంటారు. ఈ సీజన్లో వైభవ్ 13 మ్యాచ్‌ల్లో 579 పరుగులతో ఆరెంజ్ క్యాప్ రేసులో మూడో స్థానంలో ఉండగా, ఇషాన్ కిషన్ 13 మ్యాచ్‌ల్లో 490 పరుగులతో రేసులో 10వ స్థానంలో కొనసాగుతున్నాడు. కాగా అనిల్ అగర్వాల్ ప్రతిపాదనతో బీహార్ నూతన ముఖ్యమంత్రి సమ్రాట్ చౌదరీ ఏకీభవించారు. 'బీహార్ క్రికెట్ అభివృద్ధి కోసం ప్రభుత్వం స్పష్టమైన దార్శనికతో ఒక మిషన్ మోడ్లా పనిచేస్తోంది. మీరు ప్రతిపాదించిన విషయంతో ఏకీభవిస్తూ ఒక సానుకూల నిర్ణయం తీసుకుంటాం' అని చెప్పుకొచ్చారు. ఇక ఐపీఎల్లో తొలుత 8 ఫ్రాంచైజీలు ఉంటే ఆ సంఖ్య 10కి పెంచారు. ఇటీవలే ఆర్సీబీ, రాజస్తాన్ ఫ్రాంచైజీలు భారీ ధరకు చేతులు మారాయి. ఒకవేళ బీసీసీఐ ఐపీఎల్లో ఫ్రాంచైజీల సంఖ్యను విస్తరించాలనుకుంటే మాత్రం బీహార్‌కు చెందిన అనిల్ అగర్వాల్ ఒక ఫ్రాంచైజీని కొనుగోలు చేసేందుకు ముందుకు రావొచ్చు.क्या आपको नहीं लगता Chennai Super Kings, Mumbai Indians और Kolkata Knight Riders की तरह बेमिसाल बिहार की भी एक टीम होनी चाहिए?बिहार की मिट्टी ने देश को बहुत से बेहतरीन क्रिकेट खिलाड़ी दिए हैं।पटना में जन्मे ईशान किशन ने सबसे कम गेंदों में ODI double century लगाई। समस्तीपुर… pic.twitter.com/bgScCh40Zd— Anil Agarwal (@AnilAgarwal_Ved) May 22, 2026 आपकी बात से पूर्णतः सहमत हूँ।बिहार के क्रिकेट "इमोशन" के लिए सरकार स्पष्ट "विजन" के साथ "मिशन" मोड में कार्यरत है। आपके सहयोग से निश्चित ही बिहार की क्रिकेट टीम को लेकर सकारात्मक निर्णय लिया जाएगा। https://t.co/Q5xfXYGwiC— Samrat Choudhary (@samrat4bjp) May 22, 2026చదవండి: పంత్ డిమోషన్ వెనుక అతడిదే కీలకపాత్ర! -
ఎస్ఆర్హెచ్, ఆర్సీబీ ప్లేయర్ల ప్రాక్టీస్.. ఉప్పల్‌లో లాస్ట్ పంచ్ ఎవరిది (ఫొటోలు)
-
BCCI: రోహిత్ శర్మకు బై.. బై!.. వరల్డ్‌కప్ జట్టులోకి అతడు?
టీమిండియా దిగ్గజ బ్యాటర్ రోహిత్ శర్మ భవితవ్యంపై మరోసారి ఊహాగానాలు ఊపందుకున్నాయి. భారత్‌కు రెండు ప్రపంచకప్ ట్రోఫీలు అందించిన ఈ మాజీ కెప్టెన్.. వన్డే వరల్డ్‌కప్-2027లో పాల్గొనడంపై సందేహాలు నెలకొన్నాయి. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) సన్నిహిత వర్గాలు తాజాగా వెల్లడించిన వివరాలే ఇందుకు కారణం.టైటిల్ గెలిచిన తర్వాత వేటు ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన తర్వాత అనూహ్య రీతిలో రోహిత్ శర్మ (Rohit Sharma)ను వన్డే కెప్టెన్సీ నుంచీ తప్పించింది బీసీసీఐ. ప్రస్తుతం కేవలం యాభై ఓవర్ల ఫార్మాట్లోనే హిట్‌మ్యాన్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయినప్పటికీ ఐసీసీ టైటిల్ గెలిచిన తర్వాత అతడిపై వేటు వేసింది యాజమాన్యం.ప్రస్తుతం కేవలం బ్యాటర్‌గా కొనసాగుతున్న 39 ఏళ్ల రోహిత్ శర్మ ఊహించని రీతిలో సన్నబడ్డాడు. దాదాపు పది కిలోలకు పైగా బరువు తగ్గి ఆస్ట్రేలియా గడ్డపై వన్డేల్లో సత్తా చాటాడు. స్వదేశంలోనూ మెరుగైన ప్రదర్శనలతో ఆకట్టుకున్నాడు.ఫిట్నెస్ సమస్యలుఇదిలా ఉంటే.. అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికినప్పటికీ ఐపీఎల్లో రోహిత్ శర్మ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ముంబై ఇండియన్స్‌తో కొనసాగుతున్న అతడు 2026 సీజన్లో తొడ కండరాల గాయం వల్ల కొన్ని మ్యాచ్‌లకు దూరమయ్యాడు.ఈ నేపథ్యంలో అఫ్గనిస్తాన్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేసినప్పటికీ.. ఫిట్‌నెస్‌కు లోబడి ఈ సిరీస్‌లో పాల్గొంటాడని స్పష్టం చేశారు. ఈ క్రమంలో టైమ్స్ ఆఫ్ ఇండియా ఓ సంచలన కథనం వెలువరించింది.బాగా సన్నబడ్డాడు.. కానీ రోహిత్ భవిష్యత్ గురించి బీసీసీఐ వర్గాలు మాట్లాడుతూ.. ‘‘బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు గత మూడు వారాల్లో రోహిత్ ఎప్పుడూ రిపోర్టు చేయలేదు. అతడు బాగా సన్నబడ్డాడు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అతడి శరీరం యాభై ఓవర్ల ఫార్మాట్‌కు సిద్ధంగా ఉందా? లేదా? అన్న అంశంపై ఆందోళన నెలకొంది.జట్టులో ఉంటే అతడు యాభై ఓవర్ల పాటు ఫీల్డింగ్ చేయాల్సి ఉంటుంది. ఐపీఎల్ మాదిరి వన్డే క్రికెట్లో ఇంపాక్ట్ ప్లేయర్ ఆప్షన్ లేదు కదా!.. నలభై ఏళ్ల వయసుకు దగ్గరపడుతున్న తరుణంలో రోహిత్ శరీరం ఎలా స్పందిస్తుందన్నది ముఖ్యం.రోహిత్‌కు బై.. బై!.. జైసూకు లైన్ క్లియర్!నిజానికి వరల్డ్‌కప్ టోర్నీకి ముందు ఆడే వన్డేల సంఖ్య కూడా తక్కువగానే ఉంది. కాబట్టి రోహిత్‌కు ప్రత్యామ్నాయంగా బ్యాకప్ ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్‌ను సిద్ధం చేయాల్సి ఉంది. ఇషాన్ కిషన్ ఇప్పటికే వన్డే జట్టులోకి వచ్చాడు.అతడు కూడా ఓపెనింగ్ చేయగలడు. వన్డే వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ ఫిట్నెస్ కారణాల దృష్ట్యా చోటు దక్కించుకోలేకపోయినా.. శుబ్‌మన్ గిల్ లేదంటే యశస్వి జైస్వాల్ గాయపడినా మరో బ్యాకప్ ఓపెనర్‌ను కూడా సిద్ధం చేసుకుంటే బాగుంటుంది’’ అని తెలిపినట్లు సదరు కథనం పేర్కొంది. అగార్కర్ సంకేతాలుకాగా చాలా ఏళ్లుగా.. మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ- ప్రస్తుత సారథి శుబ్‌మన్ గిల్ భారత వన్డే జట్టు ఓపెనింగ్ జోడీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ గురించి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ ఇటీవల స్పందించే క్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైభవ్ కంటే ముందు ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్కే తాము ప్రాధాన్యం ఇస్తామని స్పష్టం చేశాడు. తద్వారా రోహిత్‌కు ఉద్వాసన పలికి.. జైసూను బ్యాకప్ ఓపెనర్‌గా ఎంపిక చేస్తామనే సంకేతాలు ఇచ్చాడని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.చదవండి: హార్దిక్ పాండ్యాను శిక్షించిన బీసీసీఐ -
ఇంటికెళ్లి విజిల్ వేసుకోండి.. ఇషాన్ కిషన్ మాస్ ర్యాగింగ్
-
సీఎస్కే అభిమానులను రెచ్చగొట్టిన ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (మే 18) జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో ఆ జట్టు ప్లే ఆఫ్స్ బెర్త్ సైతం ఖరారు చేసుకుంది. వెళ్తూ వెళ్తూ గుజరాత్‌ను కూడా ఫైనల్-4లోకి తీసుకెళ్లింది. అంతకుముందు ఆర్సీబీ కూడా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కించుకుంది. ప్రస్తుతానికి మూడు జట్లు ప్లే ఆఫ్స్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా.. మిగిలిన బెర్త్ కోసం పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, కేకేఆర్, సీఎస్కే జట్లు పోటీలో మిగిలాయి.ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ ఆటగాడు ఇషాన్ కిషన్ చేసిన ఓ పని సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. ఓటమి బాధలో ఉన్న సీఎస్కే అభిమానులను ఇషాన్ విజిల్ వేసి రెచ్చగొట్టాడు. అంతటితో ఆగకుండా 'మీ పని అయిపోంది, ఇక ఇంటికి వెళ్లండి' అని అర్దం వచ్చేలా సైగలు చేశాడు. ఈ చర్య నెట్టింట హాట్‌టాపిక్‌గా మారింది. Good team win that's it well played Ishan Kishan👏👏👏 pic.twitter.com/sfEtoeorOk— jaguar (@rrd4859) May 18, 2026ఇషాన్ చర్యను చాలామంది తప్పుడబడుతున్నారు. అంత ఓవరాక్షన్ అవసరమా అంటున్నారు. సీఎస్కే అభిమానులైతే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. సొంతమైదానంలో (చెపాక్ స్టేడియం) ఇషాన్ తమను గేలి చేయడాన్ని తట్టుకోలేకపోతున్నారు. సీఎస్కే అభిమానులను విజిల్ వేసి రెచ్చగొట్టడం ఈ సీజన్లో ఇది రెండోసారి. కొద్ది రోజుల కిందట గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఇలాగే ప్రవర్తించాడు. సీఎస్కేపై విజయానంతరం పసుపు రంగు విజిల్‌తో ఫోటో పోస్ట్ పెట్టి ఫ్యాన్స్ మనోభావాలను దెబ్బతీశాడు. సీఎస్కే అభిమానులను ఇలా ట్రోల్ చేయడాన్ని చాలామంది తప్పుబడుతున్నారు. ఓడిన జట్టు అభిమానుల పట్ల హుందాగా ప్రవర్తించాలి కానీ, ఇలాంటి రెచ్చిగొట్టే ప్రయత్నాలు చేయకూడదని హితవు పలుకుతున్నారు. విజిల్ పోడు అనేది సీఎస్కే నినాదం అన్న విషయం తెలిసిందే.మ్యాచ్ విషయానికొస్తే.. చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన సీఎస్కే 180 పరుగులు చేసింది. ఛేదనలో హైదరాబాద్ జట్టు ఆరంభంలోనే వికెట్లు కోల్పోయినా.. ఇషాన్ కిషన్, క్లాసెన్ మ్యాచ్‌ను మలుపు తిప్పారు. ముఖ్యంగా ఇషాన్ 47 బంతుల్లో 70 పరుగులు చేసి జట్టును విజయపు అంచుల వరకు తీసుకెళ్లాడు. సలీల్ అరోరా, స్మరణ్ రవిచంద్రన్ మ్యాచ్‌ను లాంఛనంగా ముగించారు. ఈ గెలుపులో కీలకపాత్ర పోషించిన ఇషాన్‌కే ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.ఈ ఓటమితో సీఎస్కే ప్లేఆఫ్స్ అవకాశాలు మరింత క్లిష్టంగా మారాయి. రుతురాజ్ సారథ్యంలోని ఈ జట్టు ప్రస్తుతం 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. ఇక చివరి లీగ్ మ్యాచ్‌లో గెలిచినా.. ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. -
వారి వల్లే ఓడిపోయే మ్యాచ్‌లో గెలిచాము: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు చేసుకుంది. సోమవారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఎస్ఆర్హెచ్.. ఎనిమిదో సారి ప్లే ఆఫ్స్‌కు అర్హత సాధించింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. అనంతరం 181 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ కేవలం 5 వికెట్లు మాత్రమే కోల్పోయి 19 ఓవర్లలో చేధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర.కిషన్ కేవలం 47 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 70 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ కూడా 47 పరుగులతో రాణించాడు. ఇక ఈ అద్భుత విజయంపై మ్యాచ్ అనంతరం సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ స్పందించాడు. జట్టును గెలిపించిన క్లాసెన్, కిషన్‌పై కమ్మిన్స్ ప్రశంసల వర్షం కురిపించాడు.ఈ మ్యాచ్‌లో మా జట్టు ప్రదర్శన చాలా సంతృప్తిని ఇచ్చింది. మేము సాధారణంగా ఆడే శైలికి ఇది భిన్నమైన మ్యాచ్. ఇక్కడి వికెట్‌పై బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఇషాన్, క్లాసెన్ బ్యాటింగ్ చేసిన తీరు నిజంగా ఒక అద్భుతం. వారిద్దరూ బౌలర్లను టార్గెట్ చేస్తూ ధైర్యంగా షాట్లు ఆడుతూ మ్యాచ్‌ను గెలిపించారు. ఈ లక్ష్యాన్ని చేధించేందుకు మాకు 1-2 భాగస్వామ్యాలు అవసరమని మేం భావించాం. ఎందుకంటే క్రీజులోకి వచ్చే కొత్త బ్యాటర్‌కు పరిస్థితులు చాలా కఠినంగా ఉన్నాయి. క్రీజులో కుదురుకున్నాక బ్యాటింగ్ కాస్త సులభమవుతుంది. క్లాసెన్, కిషన్ ప్రణాళికలు తగ్గట్టు ఆడారు. వారిద్దరూ సరైన బౌలర్లను టార్గెట్ చేసుకుని కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారు. గత మ్యాచ్‌లో 86 పరుగులకే ఆలౌటైన తర్వాత మేము మా బ్యాటింగ్ గురుంచి చర్చించాము. నిజం చెప్పాలంటే మా జట్టు బాధ్యతాయుతమైన బ్యాటింగ్‌కు అంతగా ఫేమస్ కాదు. కానీ పరిస్థితులకు తగ్గట్టు ఆడగలమని ఈ మ్యాచ్‌లో నిరూపించాం. అయితే మా బౌలింగ్ సమయంలోనే పిచ్ కాస్త స్లోగా ఉంది. బంతి కొద్దిగా లోపలికి వస్తూ, గ్రిప్ అవ్వడం గమనించాము. అలాంటి పరిస్థితుల్లో భారీ షాట్లు ఆడడం కుదరదు. కానీ మా బ్యాటర్లు పరిస్థితులను చక్కగా అర్థం చేసుకుని ఆడారు. ఈ పిచ్‌పై 180 పరుగులు మంచి స్కోరే. కానీ చేధించగలమన్న నమ్మకం మాకు ఉండేది. టాస్ గురుంచి కూడా పెద్దగా ఆలోచించలేదు. ఎందుకంటే ఇక్కడ సెకెండ్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ కూడా గెలిచాయి. మాకు మరో మ్యాచ్ మిగిలి ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి టాప్-2లో నిలిచేందుకు ప్రయత్నిస్తాం. అయితే ప్లే ఆఫ్స్‌కు అధికారికంగా అర్హత సాధించడం చాలా సంతోషంగా ఉంది. కానీ అసలైన కథ ఇప్పుడే మొదలువుతోంది. ఇప్పటికంటే ఎక్కువగా కష్టపడాలి. ఈ విజయాల్లో కిషన్‌ది కూడా కీలక పాత్ర. సగం సీజన్ వరకు అతడే కెప్టెన్‌గా ఉన్నాడు. కాబట్టి అతడికి చాలా ఎక్కువ క్రెడిట్ దక్కాలి. మా టీమ్ అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. రాబోయే మ్యాచ్‌లలో కూడా ఇదే రిథమ్‌ను కొనసాగిస్తామని పోస్ట్ మ్యాచ్ ప్రెస్ కాన్ఫరన్స్‌లో కమ్మిన్స్ పేర్కొన్నాడు.చదవండి: ధోని వీడ్కోలు.. ఒక శకం ముగిసింది! -
ప్రపంచ కప్ హీరోకు రూ.కోటి బహుమతి
టీ20 వరల్డ్‌కప్-2026లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కిషన్‌కు కోటి రూపాయల చెక్‌ను ఆయన అందించారు. పాట్నాలో జన్మించిన ఇషాన్ కిషన్ తమ అద్భుత ప్రదర్శనలతో రాష్ట్ర ప్రతిష్టను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో కిషన్ దుమ్ములేపాడు. ఈ టోర్నమెంట్లో ఇషాన్ 9 ఇన్నింగ్స్‌ల్లో 317 పరుగులు సాధించాడు. అతడు ఏకంగా 193.29 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం విశేషం. ఇషాన్ కిషన్ 2024లో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయినప్పటికీ, పట్టుదలతో దేశవాళీ క్రికెట్లో సత్తాచాటి తిరిగి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నాడు.తనకు లభించిన రెండో అవకాశాన్ని కిషన్ సద్వినియోగపరుచుకున్నాడు. ఇప్పుడు భారత టీ20 జట్టులో కీలక సభ్యునిగా మారాడు. ఇప్పుడు వన్డే జట్టులోకి పునరాగమనం చేసేందుకు కిషన్ సిద్దమయ్యాడు. ఇక సీఎం సామ్రాట్ చౌదరి కేవలం ఇషాన్ కిషన్‌నే కాకుండా, ఎస్ఆర్హెచ్ పేసర్ షకీబ్ హుస్సేన్ కూడా సత్కరించారు.షకీబ్ తన అరంగేట్ర మ్యాచ్‌లోనే రాజస్తాన్ రాయల్స్‌పై 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. కాగా కిషన్ పాట్నాలో పుట్టినప్పటికి ఫస్ట్ క్రికెట్ మాత్రం జార్ఖండ్ తరపున ఆడుతున్నాడు.చదవండి: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్..! వైభవ్, భువీకి ఛాన్స్? -
పంత్‌కు షాక్.. కిషన్‌కు జాక్‌పాట్!
ఐపీఎల్-2026 ముగిసిన వెంటనే టీమిండియా జాతీయ విధుల్లో బీజీ కానుంది. తొలుత స్వదేశంలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు, మూడు వన్డేల సిరీస్‌లో భారత్ తలపడనుంది. అయితే ఈ సిరీస్‌ల కోసం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ మే 19న భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది.ఈ సిరీస్‌లకు పలువురు సీనియర్లకు విశ్రాంతినిస్తూ, కొత్త ముఖాలకు అవకాశం కల్పించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా అఫ్గాన్‌తో జరిగే ఏకైక టెస్టుకు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అతడితో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ వంటి స్టార్ బ్యాటర్లు సైతం అఫ్గాన్‌తో టెస్టుకు దూరమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అయితే దేశవాళీ క్రికెట్లో అదరగొడుతున్న గుర్నూర్ బ్రార్, ఆకిబ్ నబీలకు తొలిసారి భారత జట్టులో చోటు దక్కనున్నట్లు పలు రిపోర్ట్లు పేర్కొంటున్నాయి. మరోవైపు న్‌రైజర్స్ హైదరాబాద్ తరపున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడుతున్న ఇషాన్ కిషన్ కూడా సెలక్టర్ల దృష్టిలో ఉన్నాడు. రిజర్వ్ వికెట్ కీపర్‌గా పంత్ స్థానంలో ఇషాన్‌ను తీసుకునే అవకాశం ఉంది. పంత్ ప్రస్తుతం పేలవ ఫామ్‌తో సతమతమవుతున్నాడు. అదేవిధంగా వెన్నునొప్పి సమస్యతో ముంబై ఇండియన్స్‌కు దూరమైన హార్దిక్ పాండ్యా అఫ్గాన్‌తో వన్డేల్లో ఆడుతాడా లేదా అన్నది ఇంకా స్పష్టత లేదు. అతడు అందుబాటులో లేకపోతే నితీశ్ కుమార్ రెడ్డిని ఎంపిక చేసే ఛాన్స్ ఉంది. నితీశ్ ప్రస్తుతం బ్యాట్‌తో పాటు బంతితో కూడా రాణిస్తున్నాడు. ఇక అఫ్గాన్-భారత్ మధ్య ఏకైక టెస్ట్ మ్యాచ్ జూన్ 6న ముల్లాన్ పూర్ వేదికగా ప్రారంభం కానుంది.చదవండి: ముంబై ఇండియన్స్ అరుదైన రికార్డు.. 19 ఐపీఎల్ చరిత్రలోనే -
గర్ల్‌ఫ్రెండ్స్.. శ్రుతిమించుతున్నారు!.. ఇకపై..
ఐపీఎల్లో టీమిండియా స్టార్ల వైఖరిపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) గుర్రుగా ఉన్నట్లు సమాచారం. ‘గర్ల్‌ఫ్రెండ్స్’ విషయంలో కొంతమంది శ్రుతి మించి ప్రవర్తిస్తున్నట్లు బోర్డుకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. ప్రియురాళ్ల కోసం టీమ్ బస్సులు ఆపించడం.. తమతో కలిసి ఒకే హోటల్లోని ఆటగాళ్లు వారిని తీసుకువెళ్లడం పట్ల బీసీసీఐ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.కాగా ఐపీఎల్-2026 సందర్భంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్, పంజాబ్ కింగ్స్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ తరచూ తమ గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి దర్శనమిస్తున్న సంగతి తెలిసిందే.ముగ్గురూ మోడల్స్హార్దిక్ పాండ్యా తన కొత్త ప్రేయసి మహీకా శర్మను స్టేడియానికి తీసుకువస్తుండగా.. ఇషాన్ గర్ల్‌ఫ్రెండ్ అదితి హుండియా, అర్ష్‌దీప్ ప్రియురాలు సమ్రీన్ కౌర్ తరచూ వీరితో కలిసి జంటగా కనిపిస్తున్నారు. ఈ ముగ్గురూ మోడల్స్, నటీమణులన్న సంగతి తెలిసిందే. అంతేకాదు వీరు సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్లు కూడా!టీమ్ బస్సులను ఆపివేస్తున్నారుఈ నేపథ్యంలో బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు దైనిక్ జాగరణ్తో మాట్లాడుతూ.. ‘‘ఇంతటితో దీనిని ఆపకపోతే.. భవిష్యత్తులో సమస్య తీవ్రమవుతుంది. ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్ కోసమని టీమ్ బస్సులను ఆపివేస్తున్నారు. వారి ఆలస్యానికి మిగతా వాళ్లు మూల్యం చెల్లించాల్సి వస్తోంది.అంతేకాదు.. కొందరు ఆటగాళ్లు గర్ల్‌ఫ్రెండ్స్‌తో కలిసి ఒకే హోటల్లో ఉంటున్నారు. ఈ విషయంపై బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం దృష్టి సారించింది. అయితే, అధికారికంగా తమ ప్రేమ బంధాన్ని ప్రకటించిన వారికి మినహాయింపు ఇస్తామని తెలిపింది.బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదుఈ ‘అఫీషియల్ గర్ల్‌ఫ్రెండ్’ రూల్ ఏమిటో నాకైతే అర్థం కావడం లేదు. బీసీసీఐలో ఇలాంటి పాలసీ లేదు. సాధారణంగా క్రికెటర్ల భార్యలు, కుటుంబాలను మాత్రమే.. అది కూడా కొన్ని నిబంధనలకు లోబడి బోర్డు అనుమతిస్తుంది. ఈ గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌పై లోతుగా విచారణ చేయాల్సి ఉంది’’ అని పేర్కొన్నారు.బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వాళ్లే!కాగా ఆటగాళ్ల గర్ల్‌ఫ్రెండ్స్‌లో కొందరు గతంలో బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేసిన వాళ్లే. ప్రస్తుతం వాళ్లు ఏకంగా జట్టుతో టీమ్ బస్సులో వెళ్తుండటం అనుమానాలకు తావిస్తోంది. ఒకవేళ చిన్న సమాచారం లీకైనా తలనొప్పులు తప్పవని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది.అంతేకాదు.. యశ్ దయాళ్ వంటి ఆటగాళ్ల విషయంలో ఏం జరిగిందో తెలిసిందే. అతడిపై ఓ అమ్మాయి, ఓ మైనర్ తీవ్రమైన లైంగిక దాడి ఆరోపణలు చేశారు. దీంతో ఈ సీజన్ నుంచి అతడిని పక్కనపెట్టింది ఆర్సీబీ. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతమైతే బోర్డు పరువు దిగజారడం ఖాయం. అందుకే గర్ల్‌ఫ్రెండ్ కల్చర్‌కు ఫుల్స్టాప్ పెట్టాలని బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.చదవండి: ఇక్కడ ఓడినా.. SRHపై గెలుస్తాం: శ్రేయస్ అయ్యర్ -
శ్రేయస్ కాదు!.. భారత టీ20 కెప్టెన్‌గా ఊహించని పేరు!
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ భవితవ్యం త్వరలోనే తేలనుంది. ఇంగ్లండ్ పర్యటనలో అతడి ప్రదర్శన ఆధారంగానే అతడిని కొనసాగించాలా? లేదా? అన్న అంశంపై భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.కాగా సూర్య ఇటీవలే భారత్‌కు టీ20 ప్రపంచకప్ టైటిల్ అందించాడు. కెప్టెన్‌గా సూపర్ హిట్ అయినా.. బ్యాటర్‌గా మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. టీమిండియా 2028లో టీ20 ప్రపంచకప్‌తో పాటు లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ ఆడాల్సి ఉంది.యువ నాయకుడి సారథ్యంలోఇలాంటి తరుణంలో 35 ఏళ్ల సూర్యకు స్వస్తి పలికి.. యువ నాయకుడి సారథ్యంలో జట్టును తీర్చిదిద్దాలని మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సూర్యకుమార్ యాదవ్ ప్రత్యామ్నాయంగా శుబ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, సంజూ శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) పేర్లు తెరమీదకు వచ్చాయి.అయితే, గిల్ అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో గత కొంతకాలంగా పేలవంగా ఆడి వరల్డ్‌కప్ జట్టులో చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే. వన్డే, టెస్టు జట్ల కెప్టెన్ అయినప్పటికీ సెలక్టర్లు అతడిపై వేటు వేసేందుకు ఏమాత్రం వెనకాడలేదు. కాబట్టి ఇప్పట్లో అతడికి టీ20 జట్టు సారథ్య బాధ్యతలు అప్పగించకపోవచ్చు.రేసులో ఈ ఐదుగురుమరోవైపు.. రోహిత్ శర్మ (Rohit Sharma) తర్వాత హార్దిక్ పాండ్యానే టీ20 జట్టు కెప్టెన్ కావాల్సి ఉండగా.. బీసీసీఐ అనూహ్యంగా సూర్యకు పగ్గాలు అప్పగించింది. అరుదైన పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ నైపుణ్యాలున్న హార్దిక్‌పై అధిక భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.ఇక సంజూ శాంసన్, అక్షర్ పటేల్‌లకు మేనేజ్మెంట్ అవకాశం ఇవ్వడం దాదాపు అసాధ్యమే. మరోవైపు.. శ్రేయస్ అయ్యర్ 2023, డిసెంబరు తర్వాత ఇంత వరకు టీ20 జట్టులో పునరాగమనమే చేయలేదు. అయితే, దేశవాళీ, ఐపీఎల్లో టీ20 కెప్టెన్‌గా, బ్యాటర్‌గా సత్తా చాటడం శ్రేయస్‌కు సానుకూలాంశం.ఈ నేపథ్యంలో సూర్య స్థానాన్ని శ్రేయస్ అయ్యర్‌తోనే భర్తీ చేస్తారని ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, తాజాగా క్రిక్‌బ్లాగర్ మాత్రం ఇందుకు భిన్నమైన కథనం అందించింది. ‘‘మెజారిటీ మంది మాజీ క్రికెటర్లు శ్రేయస్ అయ్యర్‌ను కెప్టెన్‌ను చేయాలని సూచిస్తున్నారు.తెరమీదకు ఊహించని పేరుకానీ సెలక్టర్లు మాత్రం ఇందుకు సుముఖంగా లేరు. జాతీయ టీ20 జట్టు, వరల్డ్‌కప్ జట్టులో స్థానమే లేని ఆటగాడిని ఏకంగా కెప్టెన్‌ను చేసేందుకు వారు సిద్ధంగా లేరు. ఏదేమైనా శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, సంజూ శాంసన్ కంటే.. టీ20 కెప్టెన్సీ రేసులో ఇషాన్ కిషన్ ముందు వరుసలో ఉన్నాడు’’ అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు చెప్పినట్లు సదరు కథనం పేర్కొంది.కాగా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ2025-26 సీజన్లో జార్ఖండ్ కెప్టెన్, బ్యాటర్‌గా రాణించి ఇషాన్ జట్టుకు తొలి టైటిల్ అందించాడు. ఈ క్రమంలోనే భారత టీ20 జట్టులో పునరాగమనం చేసి.. వరల్డ్‌కప్-2026లో అదరగొట్టాడు. అదేవిధంగా.. ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆరంభ మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించి మంచి మార్కులు కొట్టేశాడు. దీంతో ఇషాన్ చుట్టూ యువ జట్టును తీర్చిదిద్దాలని సెలక్టర్లు భావిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.చదవండి: రియాన్ పరాగ్‌పై బీసీసీఐ చర్యలు -
బాధపడుతూ కూర్చోలేదు.. తప్పులు రిపీట్ చేయను: ఇషాన్
భారత క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ఇషాన్ కిషన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. టీమిండియాకు దూరమైన సమయంలో తాను కుంగిపోలేదన్నాడు. అందుకు బదులు దేశవాళీ టోర్నమెంట్లలో నిలకడగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినట్లు తెలిపాడు. రెండున్నరేళ్లుకాగా క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడ్డాడన్న కారణంగా బీసీసీఐ దాదాపు రెండున్నరేళ్లు ఇషాన్‌ను పక్కనపెట్టింది. దీంతో జాతీయ జట్టుకు దూరమైన ఈ వికెట్ కీపర్ బ్యాటర్... ఆ తర్వాత దేశవాళీల్లో భారీగా పరుగులు సాధించాడు.దేశీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో జార్ఖండ్ కెప్టెన్‌గా వ్యవహరించిన ఇషాన్... 500 పైచిలుకు పరుగులు చేసి జట్టుకు టైటిల్ అందించాడు. దీంతో ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌నకు ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లో అతడికి అవకాశం ఇచ్చింది టీమిండియా మేనేజ్మెంట్. ట్రోఫీ చేజిక్కించుకోవడంలో కీలక పాత్రసెలక్టర్ల నమ్మకాన్ని నిజం చేస్తూ కివీస్‌పై సత్తా చాటిన ఇషాన్.. ఆ తర్వాత వరల్డ్‌కప్ జట్టులోనూ చోటు దక్కించుకున్నాడు. అంతేకాదు.. టీమిండియా వరుసగా రెండోసారి ట్రోఫీ చేజిక్కించుకోవడంలో ఇషాన్ కీలక పాత్ర పోషించాడు. ఇక ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున నిలకడగా రాణిస్తున్నాడు. ప్యాట్ కమిన్స్ గైర్హాజరీలో జట్టుకు సారథ్యం వహించిన ఇషాన్ జట్టుకు హ్యాట్రిక్ విజయాలు అందించాడు.ఇక రాజస్తాన్ రాయల్స్‌తో నివారం జరిగిన మ్యాచ్‌లో 31 బంతుల్లో 74 పరుగులు చేసిన ఇషాన్ జట్టును గెలిపించాడు. ఇందుకు గానూ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందున్నాడు. ఈ సందర్భంగా టీమిండియా పునరాగమనంపై స్పందించాడు.బాధపడుతూ కూర్చుంటే ఏమీ రాదు‘నేను భారత జట్టుకు దూరంగా ఉన్నప్పుడు దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదని నాకు నేను సర్ది చెప్పుకున్నా. బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. తిరిగి జట్టులో చోటు దక్కాలంటే పరుగులు సాధించడమే మార్గం. అందుకే ఆటపై దృష్టి పెట్టా. మరింత మెరుగవుతూ నిలకడగా పరుగులు సాధించడం అలవాటు చేసుకున్నా.జాతీయ జట్టుకు దూరంగా ఉన్న సమయంలో మరింత అంకితభావంతో ఆడా. ఒక సీజన్లో 300 పరుగులు చేసినా పిలుపు రాకపోతే... 400, 500 ఇలా పరుగుల సంఖ్య పెంచుకుంటూ వెళ్లాలని నిర్ణయించుకున్నా. చాన్నాళ్లుగా మూడో స్థానంలో ఆడటం అలవాటైంది. ఇన్నింగ్స్ చివరి వరకు క్రీజులో ఉండేందుకు ప్రయత్నిస్తున్నా.చేసిన తప్పులు పునరావృతం కాకుండా... ఒక్కో మ్యాచ్‌పై దృష్టి పెడుతూ ముందుకు సాగుతున్నా’ అని ఇషాన్ కిషాన్ పేర్కొన్నాడు. ఇక 15 ఏళ్ల వయసులోనే ఐపీఎల్లో రెండు సెంచరీలు నమోదు చేసిన వైభవ్‌పై ఇషాన్ ఈ సందర్భంగా ప్రశంసలు కురిపించాడు. అతడు బంతిని బాదుతున్న తీరు చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందన్నాడు.చదవండి: ఆ పోలీస్ లుంగి ఎంగిడి ప్రాణాన్ని నిలబెట్టాడు! -
'నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు.. మా టీమ్‌పై నెమ్మదిగా ఆడు'
ఐపీఎల్-2026 సీజన్లో శనివారం జైపూర్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మ్యాచ్‌లో రాజస్తాన్ యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. వైభవ్ కేవలం 36 బంతుల్లోనే సెంచరీని సాధించి ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు.అయినప్పటికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల తేడాతో ఓడిపోవడంతో వైభవ్ వీరోచిత సెంచరీ వృథా అయిపోయింది. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ ప్లేయర్ ఇషాన్ కిషన్‌తో సూర్యవంశీతో మాట్లాడుతూ కన్పించాడు. తాజాగా వారి సంభాషణకు సంబంధించిన వివరాలను కిషన్ అభిమానులతో పంచుకున్నాడు."వైభవ్ ఎంత దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడో తనకు వివరించాను. అతడు నిజంగా ఒక అద్భుతమైన ఆటగాడు. అతడు గనుక మరికొన్ని ఓవర్లు క్రీజులో ఉండి ఉంటే స్కోరు 250 దాటేది. అతడు బ్యాటింగ్ చేస్తున్న తీరు తలుచుకుంటుంటే భయమేస్తోంది. అతడి వికెట్ తీయడం మాకు కలిసొచ్చింది" అని కిషన్ వెల్లడించాడు.అంతేకాకుండా మా జట్టుపై కొంచెం నెమ్మదిగా ఆడు, నీ రహస్యాలన్నీ నాకు తెలుసు" అని సరదాగా వైభవ్‌ను హెచ్చరించినట్లు కిషన్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 31 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 74 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు.చదవండి: నీకూ.. నీ కెప్టెన్సీకి ఒక దండం: వీరేంద్ర సెహ్వాగ్ -
ఎస్ఆర్హెచ్ ఘన విజయం.. పలు రికార్డులు బద్దలు
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) వరుసగా నాలుగో విజయాన్ని అందుకుంది. జైపూర్ వేదికగా శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ విజయం సాధించింది. 229 పరుగుల భారీ లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ 18.3 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి ఛేధించింది. కెప్టెన్ ఇషాన్ కిషన్ (74), అబిషేక్ శర్మ (57) హాఫ్ సెంచరీలతో రాణించగా, చివర్లో నితీశ్ కుమార్ (36), క్లాసెన్ (29) కీలక ఇన్నింగ్స్‌లు ఆడి జట్టును గెలిపించారు. రాజస్తాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, బ్రిజేశ్ శర్మలు చెరో 2 వికెట్లు తీయగా, ఫెరీరా ఒక వికెట్ పడగొట్టాడు. అంతకముందు రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 228 పరుగులు చేసింది. వైభవ్ సూర్యవంశీ (103) సెంచరీతో చెలరేగగా, ధ్రువ్ జురేల్ (51) అర్థసెంచరీతో రాణించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ రెండు వికెట్లు తీయగా, ప్రఫుల్ హింగే, కెప్టెన్ కమిన్స్, సాకిబ్ హుస్సేన్, నితీశ్ కుమార్ తలా ఒక వికెట్ తీశారు. ఇషాన్ కిషన్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలుచుకున్నాడు. ఐపీఎల్ 19వ సీజన్లో ఎస్ఆర్హెచ్ ఇప్పటివరకు 8 మ్యాచ్‌లు ఆడింది. ఇందులో ఐదు విజయాలు సాధించగా.. ఇది వరుసగా నాలుగో విజయం కావడం విశేషం. దీంతో ఎస్ఆర్హెచ్ 10 పాయింట్లు సాధించి రాజస్తాన్‌తో సమానంగా ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్‌తో పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది. రాజస్తాన్ మూడో ఓటమితో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. ఇక మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ పలు రికార్డులను బద్దలు కొట్టింది. 2023 సీజన్ నుంచి రాజస్తాన్ రాయల్స్‌పై ఎస్ఆర్హెచ్కు ఇది వరుసగా ఆరో విజయం కావడం విశేషం. గతంలో సీఎస్కే (2010 నుంచి 2013 మధ్య) రాజస్తాన్ రాయల్స్‌పై ఆరు వరుస విజయాలు సాధించింది. 2019 నుంచి 2022 మధ్య ఆర్సీబీ.. రాజస్తాన్‌పై 5 వరుస విజయాలు అందుకుంది. 2018 నుంచి 2020 మధ్య ఢిల్లీ క్యాపిటల్స్ ఐదు వరుస విజయాలు నమోదు చేసింది.ఐపీఎల్లో 200 ప్లస్ పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించడం ఎస్ఆర్హెచ్కు ఇది ఐదోసారి. ఇక పంజాబ్ కింగ్స్ 11 సార్లు 200 ప్లస్ స్కోర్లు ఛేదించి తొలి స్థానంలో ఉండగా, ముంబై ఇండియన్స్ (ఆరు సార్లు) రెండో స్థానంలో కొనసాగుతోంది. రాజస్తాన్, ఆర్సీబీ, ఎస్ఆర్హెచ్లు ఐదేసి సార్లు ఛేదించి సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాయి.ఐపీఎల్లో అత్యధిక పరుగులు ఛేదించిన జట్లలో ఎస్ఆర్హెచ్ చోటు దక్కించుకుంది. రాజస్తాన్‌పై 229 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన ఎస్ఆర్హెచ్ జాబితాలో నాలుగో స్థానంలో ఉంది. తొలి రెండు స్థానాలు పంజాబ్ కింగ్స్ (ఢిల్లీపై 265, కేకేఆర్‌పై 262 పరుగుల టార్గెట్), ఎస్ఆర్హెచ్ (పంజాబ్‌పై 246 పరుగుల టార్గెట్) మూడో స్థానంలో ఉంది. ఇక ఐదో స్థానంలో ఆర్సీబీ (లక్నోపై 228 పరుగుల టార్గెట్) ఉంది.జైపూర్ వేదికపై రాజస్తాన్‌పై 228 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన ఎస్ఆర్హెచ్ తన రికార్డును తానే మెరుగుపరుచుకుంది. 2023లో ఇదే రాజస్తాన్‌పై 215 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. తాజాగా ఆ రికార్డును సవరించింది.4️⃣h consecutive win ✅4️⃣th highest successful chase in #TATAIPL history ✅#SRH paint the Pink City ORANGE with a clinical win 🎨🧡Scorecard ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @SunRisers pic.twitter.com/bKWZOIAgZo— IndianPremierLeague (@IPL) April 25, 2026 -
SRH: కమిన్స్‌కు షాక్.. కెప్టెన్‌గా ఇషాన్ కొనసాగింపు!
సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు పూర్వ వైభవం తెచ్చిన ఘనత ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్‌కు దక్కుతుంది. మూడు సీజన్లుగా చతికిల పడిన ఎస్ఆర్హెచ్కు కమిన్స్ తన అద్భుతమైన కెప్టెన్సీతో జీవం పోశాడు. అతడి సారథ్యంలో 2024లో సన్‌రైజర్స్ ఫైనల్‌కు చేరింది.వెన్నునొప్పితో..ఇక గతేడాది పద్నాలుగింట ఆరు విజయాలతో.. పాయింట్ల పట్టికలో ఆరో స్థానంతో ముగించింది ఎస్ఆర్హెచ్. ఇదిలా ఉంటే.. ఈ ఏడాది వెన్నునొప్పి కారణంగా కమిన్స్ సన్‌రైజర్స్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ క్రమంలో టీమిండియా స్టార్, టీ20 ప్రపంచకప్ విజేత ఇషాన్ కిషన్ (Ishan Kishan) కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ చేపట్టాడు.ఐపీఎల్-2026లో ఇషాన్ సారథ్యంలో ఏడు మ్యాచ్‌లు ఆడిన సన్‌రైజర్స్ నాలుగు గెలిచింది. ముఖ్యంగా సొంతమైదానం ఉప్పల్‌లో హ్యాట్రిక్ విజయాలతో సత్తా చాటింది. ఈ మ్యాచ్‌లలో ఇషాన్ కెప్టెన్సీకి మంచి మార్కులు పడ్డాయి. ఇదిలా ఉంటే.. ఫిట్నెస్ సమస్యలను అధిగమించి కమిన్స్ (Pat Cummins) ఇటీవలే జట్టుతో చేరాడు.ఈ క్రమంలో శనివారం రాజస్తాన్ రాయల్స్‌తో మ్యాచ్‌తో సన్‌రైజర్స్ తరఫున కమిన్స్ రీఎంట్రీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కెప్టెన్సీ అంశం చర్చనీయాంశంగా మారగా.. టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ ఇషాన్‌నే సారథిగా కొనసాగించాలని అభిప్రాయపడ్డాడు.ఇషాన్ కిషన్‌నే కొనసాగించాలిఇక టీమిండియా స్పిన్ దిగ్గజం హర్భజన్ సింగ్ కూడా తాజాగా ఇషాన్‌కే మద్దతుగా నిలిచాడు. జియోహాట్‌స్టార్ షోలో మాట్లాడుతూ.. ‘‘ప్యాట్ కమిన్స్ తిరిగి వచ్చినా ఇషాన్ కిషన్‌నే సన్‌రైజర్స్ కెప్టెన్‌గా కొనసాగించాలి. యువ నాయకుడికి మద్దతుగా నిలబడాలని యాజమాన్యం భావిస్తే ఇలా చేయడమే సరైంది.కారణం ఇదేకమిన్స్ను ఎస్ఆర్హెచ్ను 2024లో ఫైనల్‌కు చేర్చిన మాట నిజమే. అయితే, ప్రస్తుతం ఇషాన్ నాయకత్వంలోనూ జట్టు మంచి ఫలితాలు సాధిస్తోంది. బౌలర్లు, ఇతర ఆటగాళ్లకు అతడితో మంచి సమన్వయం కుదిరింది. కాబట్టి ఇషాన్‌ను కెప్టెన్‌గా కొనసాగిస్తే సన్‌రైజర్స్‌కు ప్రయోజనం చేకూరుతుంది’’ అని భజ్జీ అభిప్రాయపడ్డాడు. కాగా చాన్నాళ్లుగా గాయం వల్ల ఆటకు దూరమైన కమిన్స్ పునరాగమనం చేయనున్నాడు. దీంతో అతడిపై కెప్టెన్సీ రూపంలో అదనపు భారం పడకుండా మేనేజ్మెంట్ చర్యలు తీసుకునే అవకాశం లేకపోలేదు.చదవండి: BCCI: డబ్బు కక్కుర్తి.. టీమిండియా ప్లేయర్లను ‘చంపేస్తారా’? -
సన్‌రైజర్స్ కెప్టెన్సీ నుంచి ఇషాన్ కిషన్ అవుట్?
ఐపీఎల్-2026లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అదిరిపోయే వార్త అందింది. ఏప్రిల్ 25న జైపూర్ వేదికగా రాజస్తాన్ రాయల్స్‌తో జరగనున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బరిలోకి దిగనున్నాడు. దీంతో తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న ఇషాన్ కిషన్ తన బాధ్యతలను కమ్మిన్స్‌కు అప్పగించనున్నాడు.కమ్మిన్స్ వెన్ను గాయం కారణంగా ఇప్పటివరకు ఎస్ఆర్హెచ్ ఆడిన ఏడు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు. అతడు ఇటీవలే క్రికెట్ ఆస్ట్రేలియా నిర్వహించిన ఫిట్నెస్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి ఎస్ఆర్హెచ్ క్యాంప్‌లో చేరాడు. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లోనే కమ్మిన్స్ ఆడుతాడని అంతా భావించారు.కానీ కాస్త ఆసౌకర్యంగా ఉండడంతో టీమ్ సెలెక్షన్ అందుబాటులేకపోయాడు. అయితే రాజస్తాన్‌తో మ్యాచ్‌లో మాత్రం కమ్మిన్స్ ఆడడం దాదాపు ఖాయమైంది. అతడు ఇప్పటికే తన ప్రాక్టీస్‌ను కూడా మొదలు పెట్టాడు. కాగా కమ్మిన్స్ గైర్హజారీలో ఇషాన్ జట్టును అద్భుతంగా నడిపించాడు.అతడి కెప్టెన్సీలో ఇప్పటివరకు ఏడు మ్యాచ్‌లు ఆడిన ఆరెంజ్ ఆర్మీ నాలుగింట విజయం సాధించింది. సన్‌రైజర్స్ ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మూడో స్ధానంలో కొనసాగుతోంది. కమ్మిన్స్ సారథిగానే కాకుండా వ్యక్తిగత ప్రదర్శనల పరంగా ఆకట్టుకుంటున్నాడు. కిషన్ 7 మ్యాచ్‌లలో 238 పరుగులు చేశాడు. అయితే కమ్మిన్స్ జట్టులోకి వచ్చినప్పటికి ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సంజయ్ బంగర్, హార్భజన్ సింగ్ వంటి భారత మాజీ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.చదవండి: ధోనికి ఆ హోదా ఇవ్వడం మొదట్లో నచ్చలేదు: మాజీ లెఫ్టినెంట్ జనరల్ -
క్రెడిట్ మొత్తం అతడికే.. క్లాసెన్ అదరగొట్టాడు: ఇషాన్ కిషన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ గెలుపు నమోదు చేసింది. సొంతమైదానం ఉప్పల్‌లో మంగళవారం ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఓడించి.. వరుసగా మూడోసారి జయభేరి మోగించింది. తద్వారా ఏడింట నాలుగో విజయంతో పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.ఈ నేపథ్యంలో జట్టు ప్రదర్శన పట్ల సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ (Ishan Kishan) సంతృప్తి వ్యక్తం చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించాడని కొనియాడాడు. ‘‘అభిషేక్ మ్యాచ్ ఆసాంతం అదరగొట్టాడు. క్లాసెన్ మంచి ఫినిషింగ్ ఇచ్చాడు. ఇలాంటి వికెట్ మీద 200కు పైగా స్కోరు చేయడం గొప్ప విషయం.క్రెడిట్ మొత్తం అతడికే.. నిజానికి ఈ పిచ్ మీద ఆరంభంలో బ్యాటర్లకు తడబాటు తప్పదు. అయినా సరే అభిషేక్ అదరగొట్టాడు. మా విజయంలో క్రెడిట్ మొత్తం అతడికే దక్కుతుంది. ప్రణాళికలకు తగినట్లుగా ఆడుతూ ఫలితాలు రాబడుతున్నాము’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.ఇక ఆఖరి ఓవర్లో హర్ష్ దూబేకు బంతి ఇవ్వడంపై స్పందిస్తూ.. ‘‘అతడు మెరుగా బౌలింగ్ చేయగలడని నాకు తెలుసు. అతడొక తెలివైన బౌలర్. కీలక ఓవర్లు నువ్వే వేయాల్సి ఉంటుందని నేను ముందుగానే అతడికి చెప్పాను. సరైన సమయంలో మనం అత్యుత్తమం అనుకున్న బౌలర్లను రంగంలోకి దించాలి. ఈరోజు మాకు ఇది కలిసి వచ్చింది’’ అని ఇషాన్ కిషన్ పేర్కొన్నాడు.కాగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 242 పరుగులు సాధించింది. అభిషేక్ శర్మ 68 బంతుల్లో 10 ఫోరు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. హెన్రిచ్ క్లాసెన్ 13 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లు బాది 37 పరుగులతో నాటౌట్‌గా ఉన్నాడు.మలింగ అద్భుతస్పెల్లక్ష్య ఛేదనకు దిగిన ఢిల్లీ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 195 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బౌలర్లలో ఇషాన్ మలింగ అద్భుత స్పెల్ వేశాడు. నాలుగు కీలక వికెట్లు కూల్చి ఢిల్లీ బ్యాటింగ్ ఆర్డర్ పతనాన్ని శాసించాడు. హర్ష్ దూబే ఆఖరి ఓవర్లోఇక హర్ష్ దూబే ఆఖరి ఓవర్లో మూడు వికెట్లతో సత్తా చాటాడు. మిగిలిన వారిలో దిల్షాన్ మధుషాంక, సకీబ్ హుసేన్ ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా ఈ సీజన్లో ఢిల్లీకి ఆరింట ఇది మూడో పరాజయం.చదవండి: ‘మమ్మల్ని ఆపడం ఎవరివల్లా కాదు’Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
అభిషేక్ విధ్వంసం.. ఎస్ఆర్హెచ్ హ్యాట్రిక్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. సమీర్ రిజ్వీ 41 పరుగులు సాధించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (68 బంతుల్లో 135 నాటౌట్) సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ ఈ సీజన్లో తొలిసారి 240 పరుగుల ప్లస్ మార్కును దాటింది. చివర్లో క్లాసెన్ (13 బంతుల్లో 37 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులు చేశారు. ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో అక్షర్ పటేల్ ఒక వికెట్ తీశాడు. అజేయ సెంచరీతో ఢిల్లీ పని పట్టిన అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు.242లో సగం స్కోరు అభిషేక్‌దే..టాస్ గెలిచి ఎస్ఆర్హెచ్ను బ్యాటింగ్‌కు ఆహ్వానించడంతోనే ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాలు మొదలయ్యాయి. ఆరంభం నుంచే ఎస్ఆర్హెచ్ ఓపెనర్లు దూకుడుగా ఆడారు. అభిషేక్ శర్మ, హెడ్లు పోటీపడి బౌండరీలు, సిక్సర్ల వర్షం కురిపించారు. ఆ తర్వాత జట్టు స్కోరు 97 పరుగుల వద్ద హెడ్ వెనుదిరగడంతో ఎస్ఆర్హెచ్ తొలి వికెట్ కోల్పోయింది. మరో ఎండ్‌లో మాత్రం అభిషేక్ శర్మ తన విధ్వంసాన్ని కొనసాగించాడు. గత రెండు మ్యాచ్‌ల్లో అర్థశతకాలు సాధించినప్పటికీ వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాడు. కానీ ఈసారి మాత్రం ఆది నుంచే ధాటిగా ఆడిన అభిషేక్ ఢిల్లీ బౌలర్లను చీల్చి చెండాడి సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. చివరి వరకు నిలిచిన అభిషేక్ క్లాసెన్, ఇషాన్‌లతో కలిసి మంచి భాగస్వామ్యాలు నమోదు చేశాడు. అయితే జట్టు సాధించిన 242 పరుగుల్లో అభిషేక్ ఒక్కడివే 135 పరుగులు ఉండడం గమనార్హం. అతడి ఇన్నింగ్స్‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లు ఉండడం విశేషం.తడబడిన ఢిల్లీ..భారీ లక్ష్యంతో బరిలోకి దిగినప్పటికీ ఢిల్లీ క్యాపిటల్స్ ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయినప్పటికీ కేఎల్ రాహుల్ (37), నితీశ్ రానా (57) రెండో వికెట్‌కు 86 పరుగులు జోడించి ఢిల్లీ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరు వెనుదిరగడం ఢిల్లీని కష్టాల్లోకి నెట్టేసింది. ఆ తర్వాత వచ్చిన మిల్లర్ గోల్డెన్ డకౌట్ కావడంతో మరింత కష్టాల్లో పడింది. ఈ దశలో సమీర్ రిజ్వీ, స్టబ్స్ (27) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లు తీయడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. సీజన్లో ఎస్ఆర్హెచ్కు ఇది నాలుగో విజయం కాగా, సొంతగడ్డపై మాత్రం హ్యాట్రిక్ విక్టరీ. ఈ గెలుపుతో ఎస్ఆర్హెచ్ పాయింట్ల పట్టికలో మూడో స్థానంలోకి దూసుకెళ్లింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన ఆరు మ్యాచ్‌ల్లో ఇది మూడో పరాజయం. దీంతో ఆ జట్టు పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతోంది.Explosive with the bat 🔥Lethal with the ball ⚡#SRH clinch a 4️⃣7️⃣-run win to make it three-in-a-row at home 🧡Updates ▶️ https://t.co/VgUjXDlrDh#TATAIPL | #KhelBindaas | #SRHvDC | @SunRisers pic.twitter.com/Vcmp5r5sh1— IndianPremierLeague (@IPL) April 21, 2026 -
ఢిల్లీ క్యాపిటల్స్‌పై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) సొంతగడ్డపై హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉప్పల్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 47 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 243 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 195 పరుగులకు పరిమితమైంది. నితీశ్ రానా 57 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 4, హర్ష్‌దూబే మూడు వికెట్లు తీశారు. అంతకముందు అభిషేక్ సెంచరీతో విధ్వంసం సృష్టించడంతో ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 242 పరుగుల భారీ స్కోరు చేసింది.18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపటల్స్ 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ 38, అక్షర్ పటేల్ 0 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఒకే ఓవర్లో రెండు వికెట్లుఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ కష్టాల్లో పడింది. ఇషాన్ మలింగ వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్లో వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయింది. తొలుత 57 పరుగుల చేసిన నితీశ్ రానాను వెనక్కి పంపిన మలింగ మరుసటి బంతికి డేవిడ్ మిల్లర్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ 4 వికెట్ల నష్టానికి 108 పరుగులు చేసింది.8 ఓవర్లలో ఢిల్లీ 86-18 ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ క్యాపిటల్స్ వికెట్ నష్టానికి 86 పరుగులు చేసింది. రాహుల్ (27), నితీశ్ రానా (47) క్రీజులో ఉన్నారు.పవర్ ప్లేలో ఢిల్లీ స్కోరు: 59-1(6)రాహుల్ 22, నితీశ్ 27 రన్స్‌తో ఉన్నారు. విజయానికి 84 బంతుల్లో 184 పరుగులు అవసరం.ఐదు ఓవర్లలో ఢిల్లీ స్కోరు: 54-1కేఎల్ రాహుల్ 21, నితీశ్ రాణా 23 పరుగులతో ఉన్నారు. విజయానికి 90 బంతుల్లో 189 పరుగులు కావాలి.ఢిల్లీ తొలి వికెట్ డౌన్2.1: దిల్షాన్ మధుషాంక బౌలింగ్‌లో తొలి వికెగ్గా వెనుదిరిగిన పాతుమ్ నిస్సాంక (6 బంతుల్లో 8). కేఎల్ రాహుల్ 12 పరుగులతో ఉండగా.. నితీశ్ రాణా క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 21-1(2.1).ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోరు సాధించింది. సొంతమైదానం ఉప్పల్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలోకేవలం రెండు వికెట్లు నష్టపోయి ఏకంగా 242 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ అజేయ సెంచరీ (68 బంతుల్లో 135)తో రాణించగా.. హెన్రిచ్ క్లాసెన్ మెరుపు ఇన్నింగ్స్ (13 బంతుల్లో 37 నాటౌట్) ఆడాడు. ట్రవిస్ హెడ్ 37, ఇషాన్ కిషన్ 25 పరుగులతో ఫర్వాలేదనిపించారు. సన్‌రైజర్స్ విధించిన 243 పరుగుల లక్ష్యంతో ఢిల్లీ క్యాపిటల్స్ బరిలోకి దిగింది. సన్‌రైజర్స్ స్కోరు: 242-2(20)సన్‌రైజర్స్ డబుల్ సెంచరీ: స్కోరు: 202-2(17)అభిషేక్ 127, క్లాసెన్ ఆరు పరుగులతో ఉన్నారు16 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 189-2 రెండో వికెట్ కోల్పోయిన సన్‌రైజర్స్ 14.4: ఇషాన్ కిషన్ రనౌట్ (13 బంతుల్లో 25). అభిషేక్ 108 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 176-2(14.4)అభిషేక్ శర్మ సెంచరీ47 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్న అభిషేక్ శర్మ13 ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 151-1అభిషేక్ 86, ఇషాన్ 23 రన్స్‌తో ఉన్నారు.పది ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 104-1అభిషేక్ 60, ఇషాన్ 4 పరుగులతో ఉన్నారు.తొలి వికెట్ డౌన్8.5: అక్షర్ పటేల్ బౌలింగ్‌లో సమీర్ రిజ్వీకి క్యాచ్ ఇచ్చి ట్రవిస్ హెడ్ (26 బంతుల్లో 37) అవుట్. స్కోరు: 97-1(8.5). అభిషేక్ 27 బంతుల్లో 58 పరుగులతో ఉన్నాడు.👉25 బంతుల్లో అభిషేక్ శర్మ హాఫ్ సెంచరీరఫ్పాడించిన అభిషేక్’ పవర్ ప్లేలో ‘అభిషేక్’ రఫ్పాడించారు. హెడ్ 17 బంతుల్లో 23 పరుగులు చేయగా.. అభిషేక్ 19 బంతుల్లోనే 42 పరుగులతో దుమ్ములేపాడు. ఫలితంగా పవర్ ప్లేలో సన్‌రైజర్స్ వికెట్ నష్టపోకుండా 67 పరుగులు చేసింది. స్కోరు: 67-0 (6)ఐదు ఓవర్లలో సన్‌రైజర్స్ స్కోరు: 56-0ఓపెనర్లు అభిషేక్ శర్మ 15 బంతుల్లో 34, ట్రవిస్‌హెడ్ 15 బంతుల్లో 21 పరుగులతో ఉన్నారు. తద్వారా ‘ట్రావిషేక్’ యాభై పరుగుల భాగస్వామ్యంతో ముందుకు సాగుతున్నారు.టాస్ గెలిచిన ఢిల్లీఐపీఎల్-2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో మంగళవారం నాటి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ టాస్ గెలిచింది. తొలుత బౌలింగ్ ఎంచుకుని ఇషాన్ సేనను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. ఈ మ్యాచ్‌కు హైదరాబాద్‌లోని ఉప్పల్ వేదిక. తుదిజట్టు మార్పులుఈ మ్యాచ్‌లో తాము ఒక మార్పుతో బరిలోకి దిగుతున్నట్లు ఢిల్లీ కెప్టెన్ అక్షర్ పటేల్ తెలిపాడు. ఆకిబ్ నబీ స్థానంలో నితీశ్ రాణా తుదిజట్టులోకి వచ్చినట్లు వెల్లడించాడు. ఇక సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. హర్ష్ దూబేను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నట్లు తెలిపాడు. అదే విధంగా ప్రఫుల్ హింగేను ఆడించే విషయంలో తమకు స్పష్టత లేదని ఇషాన్ పేర్కొన్నాడు. పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని తెలిపాడు. కాగా సన్‌రైజర్స్ తరఫున అరంగేట్రంలోనే నాలుగు వికెట్లతో చెలరేగిన ప్రఫుల్ హింగే.. గత మ్యాచ్‌లో మాత్రం తేలిపోయాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో నాలుగు ఓవర్లలో ఏకంగా 60 పరుగులు ఇచ్చి ఒకే ఒక్క వికెట్ తీశాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ తుదిజట్లుసన్రైజర్స్అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, హర్ష్ దూబే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: స్మరణ్ రవిచంద్రన్, ప్రఫుల్ హింగే, లియామ్ లివింగ్‌స్టోన్, దిల్షాన్ మధుషాంక, హర్షల్ పటేల్ఢిల్లీపాతుమ్ నిస్సాంక, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సమీర్ రిజ్వీ, నితీశ్ రాణా, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(కెప్టెన్), డేవిడ్ మిల్లర్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, టి.నటరాజన్, లుంగీ ఎంగిడిఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్: కరుణ్ నాయర్, దుష్మంత చమీర, అశుతోశ్ శర్మ, త్రిపురాణ విజయ్, ఆకిబ్ నబీ. -
ప్లాన్ ప్రకారం చేస్తున్నారు: ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న (ఏప్రిల్ 18) రాత్రి జరిగిన మ్యాచ్‌లో సీఎస్కేపై సన్‌రైజర్స్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ను బౌలర్లు గెలిపించారు. తొలుత బ్యాటింగ్ చేసి 194 పరుగులు చేసిన సన్‌రైజర్స్, ఆతర్వాత లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుంది. ఎషాన్ మలింగ (4-0-29-3), నితీశ్ కుమార్ రెడ్డి (4-0-31-2), సాకిబ్ హుస్సేన్ (4-0-32-1), శివాంగ్ కుమార్ (3-0-18-1) అద్భుతంగా బౌలింగ్ చేసి సీఎస్కేను గెలుపును అడ్డుకున్నారు.మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తమ బౌలర్లపై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇషాన్ మాటల్లో..యువ బౌలర్లు ప్లాన్ ప్రకారం బౌలింగ్ చేస్తున్నారు. వారు తమ ప్లాన్లను అమలు చేయడం చాలా సంతోషంగా అనిపిస్తుంది. వారు స్వయంగా ప్లాన్లు తయారు చేసుకోవడంతో కెప్టెన్‌గా ఫీల్డ్ సెట్ చేయడంలో ఒత్తిడి తగ్గింది. ప్రాక్టీస్ సెషన్స్‌లో వారు కష్టపడి మెరుగుపడుతున్నారు. అందుకే వారిపై పూర్తి నమ్మకం ఉంచి ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నాము.బ్యాటింగ్‌లో లోటుపై మాట్లాడుతూ.. అభిషేక్ శర్మ త్వరగా ఔట్ కావడంతో 20–30 పరుగులు తక్కువ చేశామని అనిపించింది. సాధారణంగా మా టాప్-3లో ఒకరు పెద్ద స్కోరు చేస్తారు. కానీ ఈ మ్యాచ్‌లో అది జరగలేదు. పిచ్ బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉండింది. కాబట్టి 220–230 పరుగులు చేసి ఉండవచ్చు.పాయింట్స్ టేబుల్‌పై మాట్లాడుతూ.. మేము పాయింట్స్ టేబుల్ గురించి ఆలోచించడం లేదు. ఇది చాలా సుదీర్ఘమైన టోర్నీమెంట్. ఏ మ్యాచ్‌కు ఆ మ్యాచ్‌ను టార్గెట్‌గా పెట్టుకుంటూ ముందుకు సాగుతున్నాము. ప్రతి మ్యాచ్‌ను ఆస్వాదిస్తూ, అగ్రెసివ్‌గా ఆడటమే మా కర్తవ్యం.ఇషాన్ వ్యాఖ్యలను బట్టి చూస్తే.. బౌలర్ల ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు స్పష్టమైంది. అలాగే బ్యాటింగ్‌లో మరిన్ని పరుగులు సాధించాలనే ఉద్దేశం బయటపడింది. మొత్తంగా జట్టు ప్రదర్శన పట్ల ఇషాన్ సంతోషంగా ఉన్నారు. ఈ గెలుపు తర్వాత సన్‌రైజర్స్ పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకింది. ఏప్రిల్ 21న జరిగే తదుపరి మ్యాచ్‌లో ఈ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ కూడా ఎస్ఆర్హెచ్ సొంత మైదానం హైదరాబాద్‌లోనే జరుగనుంది. -
ఎస్ఆర్హెచ్ను గెలిపించిన బౌలర్లు
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీ త 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరు మినహా మిగతావారు పరుగులు చేయడంలో విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరు మార్కును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్, జేమి ఓవర్టన్‌లు చెరో మూడు వికెట్లు తీయగా, ముకేశ్ చౌదరీ 2 వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత ఛేదనను సీఎస్కే ధాటిగానే ఆరంభించింది. ఆరంభంలోనే ఓపెనర్ సంజూ శాంసన్ ఔటైనప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఆయుశ్ మాత్రే 13 బంతుల్లోనే 5 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 30 పరుగులు సాధించాడు. మిడిలార్డర్లో సర్ఫరాజ్ ఖాన్ (25), మాథ్యూ షార్ట్ (34) పరుగులతో పర్వాలేదనిపించారు. ఆఖర్లో ఓవర్టన్ (16) కాస్త ప్రతిఘటించినప్పటికీ ఎస్ఆర్హెచ్ బౌలర్లు కఠినంగా బంతులేయడంతో సీఎస్కే ఓటమి దిశగా పయనించింది. -
సీఎస్కేపై ఎస్ఆర్హెచ్ ఘన విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) మూడో విజయాన్ని నమోదు చేసుకుంది. శనివారం సీఎస్కేతో ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 10 పరుగుల తేడాతో గెలుపొందింది. 195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ (34) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 3 వికెట్లతో ఆకట్టుకోగా, నితీశ్ కుమార్ 2 వికెట్లు తీశాడు. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. ఓపెనర్ అభిషేక్ శర్మ (59) మెరుపు అర్థసెంచరీతో ఆకట్టుకోగా, క్లాసెన్ (59) మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాడు.150 పరుగుల వద్ద సీఎస్కే ఆరో వికెట్ కోల్పోయింది. 34 పరుగుల చేసిన మాథ్యూ షార్ట్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో అనికేత్ వర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 14 ఓవర్లలో సీఎస్కే 135/514 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే ఐదు వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. మాథ్యూ షార్ట్ 32, శివమ్ దూబే 10 పరుగులతో ఆడు తున్నారు.బ్రెవిస్ డకౌట్113 పరుగుల వద్ద సీఎస్కే ఐదో వికెట్ కోల్పోయింది. దక్షిణాఫ్రికా యువ బ్యాటర్ డెవాల్డ్ బ్రెవిస్‌ను శివాంగ్ డకౌట్‌గా పెవిలియన్ చేర్చాడు.ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే 112 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. 25 పరుగులు చేసిన సర్ఫరాజ్ ఖాన్ ఇషాన్ మలింగ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. 11 ఓవర్లు ముగిసేసరికి సీఎస్కే నాలుగు వికెట్ల నష్టానికి 112 పరుగులు చేసింది. 66 పరుగుల వద్ద ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. ఇషాన్ మలింగ బౌలింగ్‌లో కెప్టెన్ రుతురాజ్ (19) వెనుదిరిగాడు. అంతకముందు ధాటిగా ఆడుతున్న ఆయుశ్ మాత్రే నితీశ్‌రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.దంచికొడుతున్న సీఎస్కేఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో సీఎస్కే దంచికొడుతుంది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 60 పరుగులు చేసింది. ఆయుశ్ మాత్రే (30), రుతురాజ్ (14) క్రీజులో ఉన్నారు.195 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సీఎస్కే 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఏడు పరుగులు చేసిన శాంసన్ నితీశ్‌కుమార్ రెడ్డి బౌలింగ్‌లో క్లాసెన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. సీఎస్కే టార్గెట్ 195 పరుగులుసీఎస్‌కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (59), క్లాసెన్ (59) అర్థసెంచరీలతో రాణించారు. వీరిద్దరు రాణించినప్పటికీ మిగతావారు విఫలం కావడంతో ఎస్ఆర్హెచ్ 200 స్కోరును దాటలేకపోయింది. సీఎస్కే బౌలర్లలో జేమి ఓవర్టన్, అన్షుల్ కంబోజ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు.ఏడో వికెట్ కోల్పోయిన ఎస్ఆర్హెచ్సీఎస్కేతో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ 179 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. 13 పరుగులు చేసిన సాహిల్ అరోరా గుర్జప్నీత్ సింగ్ బౌలింగ్‌లో డెవాల్డ్ బ్రెవిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ఎస్ఆర్హెచ్ 177 పరుగుల వద్ద 6వ వికెట్ కోల్పోయింది. 18వ ఓవర్లో క్లాసెన్ (59) కంబోజ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.ఎస్ఆర్హెచ్ 150 పరుగుల వద్ద 5వ వికెట్ కోల్పోయింది. 13వ ఓవర్లో నితీష్‌కుమార్ (12) ఓవర్టన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.12 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ 4 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. క్లాసెన్ 30, నితీశ్‌రెడ్డి 4 పరుగులతో ఆడు తున్నారు.సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. 59 పరుగులు చేసిన అభిషేక్ శర్మ జేమీ ఓవర్టన్ బౌలింగ్‌లో శాంసన్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 8 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ ఎస్ఆర్హెచ్ మూడు వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది.ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ గోల్డెన్ డకౌట్ అయ్యాడు. ముకేశ్ చౌదరీ బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ఇషాన్ రుతురాజ్‌కే క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ రెండు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది.అభిషేక్ హాఫ్ సెంచరీ..సీఎస్కేతో మ్యాచ్‌లో అభిషేక్ శర్మ విధ్వంసం సృష్టిస్తున్నాడు. కేవలం 15 బంతుల్లోనే అర్థశతకం సాధించాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 6 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోయి 75 పరుగులు చేసింది. 22 పరుగులు చేసిన హెడ్ ముకేశ్‌చౌదరీ బౌలింగ్‌లో రుతురాజ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. 4 ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టపోకుండా 38 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ 26, హెడ్ 11 పరుగులతో క్రీజులో ఉన్నారు.ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా శనివారం ఉప్పల్ వేదికగా 27వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్‌కింగ్స్ తలపడు తున్నాయి. టాస్ గెలిచిన సీఎస్కే బౌలింగ్ ఎంచుకుంది. ఇరుజట్లు ఎలాంటి మార్పులు చేయలేదు. ఐపీఎల్ చరిత్రలో ముఖాముఖి పోరులో ఇరుజట్లు 22 సార్లు తలపడ్డాయి. ఇందులో సీఎస్కే 15 విజయాలలు, ఎస్ఆర్హెచ్ 7 విజయాలు సాధించాయి. చివరి ఐదు మ్యాచ్‌ల విషయానికొస్తే ఎస్ఆర్హెచ్ 3, సీఎస్కే రెండింట నెగ్గాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా(వికెట్ కీపర్), అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, ఇషాన్ మలింగచెన్నై సూపర్ కింగ్స్ : సంజు శాంసన్ (వికెట కీపర్), రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సర్ఫరాజ్ ఖాన్, శివమ్ దూబే, డెవాల్డ్ బ్రెవిస్, జామీ ఓవర్టన్, మాథ్యూ షార్ట్, అన్షుల్ కాంబోజ్, నూర్ అహ్మద్, ముఖేష్ చౌదరి, గుర్జప్నీత్ సింగ్ -
SRHకు అదిరిపోయే శుభవార్త
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు శుభవార్త. రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ త్వరలోనే జట్టుతో చేరనున్నట్లు సమాచారం. కాగా వెన్నునొప్పి కారణంగా ఈ పేస్ బౌలర్ చాలాకాలంగా ఆటకు దూరమైన సంగతి తెలిసిందే.ఆస్ట్రేలియా కెప్టెన్‌గా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్‌లో జట్టును ముందుకు నడిపించాల్సిన కమిన్స్ (Pat Cummins).. ఫిట్నెస్ సమస్యల వల్ల ఒక్క మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ తర్వాత పూర్తిగా ఆటకు దూరమైపోయాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు లేకుండానే బరిలోకి దిగిన ఆసీస్.. గ్రూప్ దశలోనే ఇంటిబాట పట్టి అవమానం పాలైంది.కమిన్స్ లేని లోటు సుస్పష్టంమరోవైపు.. సన్‌రైజర్స్ జట్టులో సైతం కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్, ప్రధాన పేసర్‌గా అతడు సేవలు అందిస్తాడన్న సంగతి తెలిసిందే. అయితే, ఐపీఎల్-2026లో కమిన్స్ గైర్హాజరీలో ఇప్పటికి ఐదు మ్యాచ్‌లు ఆడిన ఎస్ఆర్హెచ్ కేవలం రెండు మాత్రమే గెలిచింది.గెలుపు బాట తొలుత కోల్‌కతా నైట్ రైడర్స్‌పై గెలిచిన ఇషాన్ కిషన్ బృందం.. తాజాగా రాజస్తాన్ రాయల్స్‌పై సోమవారం జయభేరి మోగించింది. సొంతమైదానం ఉప్పల్‌లో రాయల్స్‌ను 57 పరుగుల తేడాతో చిత్తు చేసి గెలుపు బాట పట్టింది. ఇలాంటి తరుణంలో కమిన్స్‌కు సంబంధించిన అప్డేట్ అందడం ఎస్ఆర్హెచ్ శిబిరంలో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది.ఆరోజే హైదరాబాద్కుక్రిక్బజ్ కథనం ప్రకారం.. కమిన్స్ బుధవారం (ఏప్రిల్ 15) ఆస్ట్రేలియాలో ఫిట్నెస్ టెస్టుకు హాజరుకానున్నాడు. పరీక్షలో పాసైతే గనుక ఏప్రిల్ 17 నాటికి అతడు హైదరాబాద్‌కు చేరుకుంటాడు. ఈ విషయం గురించి జట్టు సన్నిహిత వర్గాలు మాట్లాడుతూ.. ‘‘అతడు ఫిట్నెస్ టెస్టు క్లియర్ చేసి త్వరలోనే క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి నిరభ్యంతర పత్రం (NOC) పొందుతాడని ఆశిస్తున్నాం’’ అని తెలిపాయి. కాగా కమిన్స్ స్థానంలో టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తున్న సంగతి తెలిసిందే.చదవండి: SRH: షూ కోసం తల్లి నగలు అమ్మి.. ఎవరీ సాకిబ్ హుస్సేన్?BCCI: సూర్యకుమార్ యాదవ్‌పై వేటు! -
హైదరాబాద్ : పుంజుకున్న ఆరెంజ్ ఆర్మీ.. విజయంతో ఉప్పొంగె (ఫొటోలు)
-
హడలెత్తించిన ప్రఫుల్, సాకిబ్.. ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ (91) సెంచరీ చేజార్చుకున్నప్పటికీ మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. క్లాసెన్ (40) పరుగులు చేశాడు. ఆర్చర్ 2 వికెట్లు పడగొట్టగా, సందీప్ శర్మ, తుషార్, పరాగ్‌లు తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. డొనోవన్ ఫెరీరా (69) టాప్ స్కోరర్‌గా నిలవగా, జడేజా (45) పర్వాలేదనిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ప్రఫుల్ హెంగే, సాకిబ్ హుస్సేన్‌లు చెరో 4 వికెట్లు పడగొట్టి రాజస్తాన్‌ను శాసించారు. సంచలన బౌలింగ్‌తో మెరిసిన ప్రఫుల్ హెంగేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.చదవండి: తొలి బౌలర్‌గా రికార్డు.. ఎవరీ ప్రఫుల్ హింగే! -
IPL 2026: రాజస్తాన్‌పై ఎస్ఆర్హెచ్ విజయం
ఐపీఎల్ 2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండు వరుస ఓటములకు చెక్ పెట్టింది. సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 57 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ప్రఫుల్ హెంగే, షకీబ్ హుస్సేన్ సంచలన బౌలింగ్‌కు తోడు ఇషాన్ కిషన్ రాణించడంతో ఎస్ఆర్హెచ్ సునాయసంగా గెలుపొందింది.తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. అనంతరం 217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ 19 ఓవర్లలో 159 పరుగులకు ఆలౌటైంది. ప్రఫుల్ హెంగే, సాకిబ్‌లు చెరో 4 వికెట్లతో మెరిశారు.ఫెరీరా అర్థసెంచరీ..రాజస్తాన్ రాయల్స్ 14 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్ల నష్టానికి 120 పరుగులు చేసింది. డొనోవన్ ఫెరీరా అర్థసెంచరీ సాధించాడు. ప్రస్తుతం ఫెరీరా (63 బ్యాటింగ్), జడేజా (43 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.8 ఓవర్లు ముగిసేసరికి రాజస్తాన్ రాయల్స్ 5 వికెట్ల నష్టానికి 58 పరుగులు చేసింది. క్రీజులో జడేజా (21 బ్యాటింగ్), ఫెరీరా (24 బ్యాటింగ్) ఉన్నారు. ఐదో వికెట్ డౌన్ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ పేలవ ఆటతీరు కనబరుస్తోంది. భారీ టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ 10 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయింది. ఫ్రపుల్ హింగే బౌలింగ్‌లో 4 పరుగులు చేసిన పరాగ్ అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఎస్ఆర్హెచ్తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ 4 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన షాకిబ్ హుస్సేన్ బౌలింగ్‌లో జైస్వాల్ (1) నితీశ్‌రెడ్డికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.తొలి ఓవర్లోనే మూడు వికెట్లు..217 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్ ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఆర్హెచ్ బౌలర్ ఫ్రపుల్ హెంగే తన తొలి ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టాడు. వైభవ్ సూర్యవంశీ గోల్డెన్ డక్ కాగా.. ధ్రువ్ జురేల్,, ప్రిటోరియస్ డకౌట్‌గా వెనుదిరిగారు. దీంతో ఒక్క పరుగు వద్దే రాయల్స్ మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.రాజస్తాన్ లక్ష్యం 217 పరుగులుఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా ఉప్పల్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్.. రాజస్తాన్ ముంగిట 217 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ 91 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, క్లాసెన్ 40 పరుగులు చేశాడు.చివర్లో సాహిల్ అరోరా (24 నాటౌట్) మెరిశాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్లు పూర్తిగా నిరాశపరిచారు. రాజస్తాన్ బౌలర్లలో ఆర్చర్ 2 వికెట్లు తీయగా, సందీప్ శర్మ, తుసషార్ దేశ్ పాండే, పరాగ్ తలా ఒక వికెట్ తీశారు.నాలుగో వికెట్ డౌన్‌హెన్రిచ్ క్లాసెన్ (40) రూపంలో ఎస్ఆర్హెచ్ నాలుగో వికెట్ కోల్పోయింది. తుషార్ దేశ్ పాండే బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన క్లాసెన్ పరాగ్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 17 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఇషాన్ కిషన్ ఔట్ రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ మూడో వికెట్ కోల్పోయింది. సెంచరీ దిశగా సాగుతున్న ఇషాన్ కిషన్ (91) సందీప్ శర్మ బౌలింగ్‌లో కాట్ అండ్ బౌల్డ్ గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 14 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది.13 ఓవర్లకు ఎస్ఆర్ఎస్ హెచ్ స్కోరు: 140/2హాఫ్ సెంచరీతో అదరగొట్టిన ఇషాన్ కిషన్‌ఇషాన్ కిషన్ హఫ్ సెంచరీతో అదరొగట్టాడు. కేవలం 30 బంతుల్లో 50 పరుగుల చేశాడు. డీప్ మిడ్‌వికెట్ మీదుగా సిక్స్ కొట్టిన ఇషాన్ కిషన్ తన హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.హెడ్ ఔట్.. రెండో వికెట్ డౌన్రాజస్తాన్తో మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ రెండో వికెట్ కోల్పోయింది. 18 పరుగులు చేసిన ఓపెనర్ ట్రావిస్ హెడ్ రియాన్ పరాగ్ బౌలింగ్‌లో డొనొవన్ ఫెరీరాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్ 8 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. ఆరు ఓవర్లలో ఎస్ఆర్హెచ్ స్కోరు 51/1రాజస్తాన్‌తో మ్యాచ్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మ గోల్డెన్ డక్ అయినప్పటికీ వన్‌డౌన్‌లో వచ్చిన ఇషాన్ కిషన్ దూకుడుగా ఆడుతున్నాడు. ఆరు ఓవర్లు ముగిసేసరికి ఎస్ఆర్హెచ్ వికెట్ నష్టానికి 51 పరుగులు చేసింది. ఇషాన్ (35 బ్యాటింగ్), హెడ్ (11 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు.తొలి వికెట్ కోల్పోయిన్ ఎస్ఆర్హెచ్రాజస్తాన్తో మ్యాచ్‌లో ఆదిలోనే ఎస్ఆర్హెచ్కు గట్టి షాక్ తగిలింది. జోఫ్రా ఆర్చర్ వేసిన తొలి ఓవర్ మొదటి బంతికి భారీ షాట్ ఆడే ప్రయత్నంలో అభిషేక్ శర్మ రవి బిష్ణోయ్ క్యాచ్ ఇచ్చి గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్తాన్ఐపీఎల్ 2026 సీజన్లో మరో ఆసక్తికర పోరుకు తెరలేచింది. ఉప్పల్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్తాన్ రాయల్స్ తలపడుతున్నాయి. టాస్ గెలిచిన రాజస్తాన్ బౌలింగ్ ఎంచుకుంది. రాజస్తాన్ రాయల్స్ ఈ మ్యాచ్‌కు రెండు మార్పులతో బరిలోకి దిగింది. బ్రిజేష్ పటేల్ స్థానంలో తుషార్ దేశ్ పాండే, హెట్‌మైర్ స్థానంలో ప్రిటోరియస్ తుది జట్టులోకి వచ్చారు. కాగా ప్రిటోరియస్‌కు ఐపీఎల్లో ఇదే తొలి మ్యాచ్. మరోవైపు ఎస్ఆర్హెచ్ కూడా రెండు మార్పులతో బరిలోకి దిగింది. ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లను తప్పించినట్లు ఎస్ఆర్హెచ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ తెలిపాడు. ఇక ముఖాముఖి పోరులో ఎస్ఆర్హెచ్దే పైచేయి. ఇరుజట్ల మధ్య 21 మ్యాచ్‌లు జరగ్గా ఎస్ఆర్హెచ్ 12 మ్యాచ్‌ల్లో, రాజస్తాన్ 9 మ్యాచ్‌ల్లో విజయాలు సాధించాయి.సన్‌రైజర్స్ హైదరాబాద్ తుదిజట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్/ కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్, సలీల్ అరోరా, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష్ దూబే, శివంగ్ కుమార్, ప్రఫుల్ హింగే, ఇషాన్ మలింగ.రాజస్థాన్ రాయల్స్ తుది జట్టు: యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్(కెప్టెన్), లువాన్-డ్రే ప్రిటోరియస్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్, తుషార్ దేశ్‌పాండే. -
కమిన్స్‌లా కాదు.. ఇషాన్ కిషన్‌పై జహీర్ ఖాన్ ఫైర్!
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) పేలవ ప్రదర్శనతో విమర్శలు మూటగట్టుకుంటోంది. ఆరంభ మ్యాచ్‌లో ఆర్సీబీ చేతిలో ఓడి పరాజయంతో తాజా ఎడిషన్ మొదలుపెట్టింది ఎస్ఆర్హెచ్. రెండో మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై ఘన విజయం సాధించినా.. అదే జోరు కొనసాగించలేకపోయింది.జహీర్ ఖాన్ కీలక వ్యాఖ్యలుసొంతమైదానం ఉప్పల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ చేతిలో ఓటమిపాలైన సన్‌రైజర్స్.. చివరగా ముల్లన్‌పూర్‌లో పంజాబ్ కింగ్స్ చేతిలోనూ చిత్తుగా ఓడిపోయింది. తదుపరి మ్యాచ్‌లో ఉప్పల్ వేదికగా సోమవారం రాజస్తాన్ రాయల్స్‌తో సన్‌రైజర్స్ తలపడనుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ పేసర్ జహీర్ ఖాన్ సన్‌రైజర్స్ కెప్టెన్సీ గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు.ఆస్ట్రేలియా స్టార్, ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ జట్టుతో లేని లోటు స్పష్టంగా కనిపిస్తోందని జహీర్ ఖాన్ అన్నాడు. అతడి స్థానంలో తాత్కాలిక సారథిగా ఉన్న టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యూహాలను అమలు చేయడంలో విఫలమవుతున్నాడని విమర్శించాడు.కమిన్స్‌లా కాదు.. క్లారిటీ లేదు!ఈ మేరకు క్రిక్‌బజ్ షోలో మాట్లాడుతూ.. ‘‘అభిషేక్ శర్మ, ట్రవిస్ హెడ్ ఫామ్‌లోకి వచ్చారు. ఇషాన్ కిషన్ మాత్రం బ్యాట్‌తో ఆకట్టుకోలేకపోతున్నాడు. ఆరంభంలో బాగానే ఆడినా అదే జోరును కొనసాగించలేకపోతున్నాడు.కెప్టెన్‌గానూ పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. ప్యాట్ కమిన్స్ లేనిలోటు స్పష్టంగా కనిపిస్తోంది. అతడి కెప్టెన్సీలో ఒక స్పష్టత ఉంటుంది. కానీ ఇషాన్ విషయంలో అది మిస్సయ్యింది. తాను ఏమనుకుంటున్నాడో జట్టుకు స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు.తాత్కాలిక కెప్టెన్‌గా ఉన్న ఇషాన్ కిషన్ నాయకత్వ ప్రణాళికల్లో లోపాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పొరపాటును సరిచేసుకుంటేనే సానుకూల ఫలితాలు వస్తాయి’’ అని జహీర్ ఖాన్ అభిప్రాయపడ్డాడు. కాగా ఈ సీజన్లో ఇషాన్ కిషన్ చేసిన పరుగులు వరుసగా.. 80, 14, 1, 27.చదవండి: ‘టీమిండియాకు ఎంపిక చేయకపోతే నిరసనకు దిగుతా’ -
ఆ తప్పే మా కొంపముంచింది: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మరో ఓటమి చవిచూసింది. శనివారం ముల్లాన్‌పూర్ వేదికగా పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. 220 పరుగుల భారీ లక్ష్యాన్ని సన్‌రైజర్స్ బౌలర్లు కాపాడుకోలేకపోయారు. ఈ భారీ టార్గెట్‌ను పంజాబ్ కింగ్స్ కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఊదిపడేసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 69 పరుగులతో ఆజేయంగా నిలిచి మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. అతడితో పాటు ప్రియాన్ష్ ఆర్య(57), ప్రభ్సిమ్రాన్ సింగ్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. సన్‌రైజర్స్ బౌలర్లలో స్పిన్నర్లు శివాంగ్ కుమార్ మూడు, హర్ష్ దూబే ఓ వికెట్ సాధించారు. ఫాస్ట్ బౌలర్లు మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ స్పందించాడు. బౌలింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని కిషన్ తెలిపాడు."మేము సాధించిన 219 పరుగుల భారీ స్కోర్ ఈ రోజు సరిపోలేదు. మేము ఆరంభించిన తీరు చూస్తే కనీసం 250 పరుగులు చేస్తామని అనుకున్నాం. కానీ మధ్య ఓవర్లలో తడబడ్డాం. అయినప్పటికి ప్రత్యర్ధి ముందు భారీ లక్ష్యాన్ని అందించాము.కానీ పంజాబ్ ఓపెనర్లు కూడా అద్బుతమైన ఆరంభాన్ని ఇచ్చారు. పవర్‌ప్లేలో భారీగా పరుగులు రాబట్టుకున్నారు. జట్టులో ఆరు నుండి ఏడుగురు బౌలర్లు ఉన్నప్పటికీ, ప్రణాళికలను సరిగ్గా అమలు చేయలేకపోయాము. టీ20 క్రికెట్లో సరైన లైన్ అండ్ లెంగ్త్‌లో వేయడం ముఖ్యం. కానీ ఈ రోజు ఆ విషయంలో విఫలమయ్యారు. ప్రస్తుత క్రికెట్లో మ్యాచ్‌కు ముందే ప్లానింగ్ అంతా పూర్తవుతుంది. ఏ బ్యాటర్ ఎక్కడ హిట్టింగ్ చేస్తాడు? మైదానంలో ఏ వైపు బౌండరీ లాంగ్ ఉంది? వంటి విషయాలన్నీ మాకు తెలుసు. వీటిన్నటి దృష్టిలో పెట్టుకుని బౌలింగ్ చేశాము. కానీ ప్లానింగ్ సరిగ్గా ఉన్నా, వాటిని అమలు చేయడంలో మాత్రం పూర్తిగా విఫలమయ్యామని" కిషన్ పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో పేర్కొన్నాడు. -
హైదరాబాద్ బిర్యానీ తింటూ కన్నీళ్లు పెట్టుకున్న క్లాసెన్!
-
ఈజీ రన్అవుట్ మిస్ చేసిన ఇషాన్... అదితి రియాక్షన్ వైరల్
-
ఓడిపోయినా.. వారిద్దరూ మాత్రం అద్భుతం: సన్‌రైజర్స్ కెప్టెన్
ఐపీఎల్-2026లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు రెండో ఓటమి ఎదురైంది. ఆదివారం హైదరాబాద్ వేదికగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ పరంగా విఫలమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్ 20 ఓవర్లలో కేవలం 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగల్గింది.ఈ స్కోర్ కూడా క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) రాణించడంతో సన్‌రైజర్స్ సాధించగల్గింది. ఆ తర్వాత 157 పరుగుల లక్ష్యాన్ని బౌలర్లు డిఫెండ్ చేయలేకపోయారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే ఓటమి పాలైమని కిషన్ తెలిపాడు."ఇది చాలా క్లోజ్ గేమ్. నిజానికి ప్రత్యర్ధి ముందు మెరుగైన టార్గెట్‌ను ఉంచలేకపోయాము. కానీ మా బౌలర్లు ఆఖరి వరకు మ్యాచ్‌ను తీసుకొచ్చారు. ఫీల్డింగ్‌లో కూడా మేము మెరుగ్గా రాణించాము. అయితే ఇలాంటి లోస్కోరింగ్ గేమ్స్‌లో కటి లేదా రెండు బౌండరీలు ఫలితాన్ని మార్చేస్తాయి. అయినప్పటికి మేము చివరి వరకు పోరాడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాను. ఇన్నింగ్స్ ఆరంభంలోనే నాలుగు వికెట్లు కోల్పోవడం మమ్మల్ని దెబ్బ తీసింది. అయితే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో క్లాసెన్, నితీశ్ బ్యాటింగ్ చేసిన విధానం అద్భుతం. మ్యాచ్‌ను ఇంత క్లోజ్గాతీసుకెళ్లిన క్రెడిట్ వారికే దక్కుతుంది. అయితే మేము మా బ్యాటింగ్‌పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.రిషబ్ పంత్ కూడా తెలివిగా ఆడాడు. సింగిల్స్ తీసుకుంటూ భాగస్వామ్యాలను నెలకొల్పాడు. అయితే ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి, మాకు చాలా సానుకూల అంశాలు ఉన్నాయి. మా తదుపరి మ్యాచ్‌లో మేము తిరిగి పుంజుకుంటామన్న నమ్మకం ఉందని" పోస్ట్ మ్యాచ్ ప్రెజేంటేషన్‌లో కిషన్ పేర్కొన్నాడు.చదవండి: IPL 2026: బోణీ కొట్టిన లక్నో.. ఎస్ఆర్హెచ్కు రెండో ఓటమి -
సూపర్ డెలివరీ.. దెబ్బకు ఆఫ్ స్టంప్ ఎగిరిపోయింది
ఐపీఎల్-2026లో ఉప్పల్ వేదికగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్‌ను తన మొదటి ఓవర్లోనే పడగొట్టి ప్రత్యర్థి జట్టును ప్రిన్స్ దెబ్బతీశాడు. ఈ లక్నో స్పీడ్ స్టార్ కిషన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన డెలివరీకి ఇషాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. మూడో బంతిని గుడ్ లెంగ్త్ ఇన్ స్వింగర్‌గా సంధించాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కిషన్, కవర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్, ప్యాడ్ మధ్య ఉన్న గ్యాప్ నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.దీంతో కేవలం ఒక్క పరుగు మాత్రమే కిషన్ పెవిలియన్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. ప్రిన్స్ యాదవ్ తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.ONE OF THE BEST BALL BY AN INDIAN UNCAPPED STAR - PRINCE YADAV 🥶- The Bharat Arun effect. pic.twitter.com/wD0Bhdvsoq— Johns. (@CricCrazyJohns) April 5, 2026చదవండి: Riyan Parag: ‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’ -
ఎస్ఆర్హెచ్కు షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన కెప్టెన్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మరికొన్ని మ్యాచ్‌లకు దూరం కానున్నాడు. వెన్ను గాయంతో బాధపడుతున్న కమ్మిన్స్ జట్టుతో చేరినప్పటికి.. తొలి రెండు మ్యాచ్‌లకు బెంచ్‌కే పరిమితయ్యాడు. అయితే ఇప్పుడు కమ్మిన్స్ తుది స్కాన్ల కోసం తిరిగి ఆస్ట్రేలియాకు వెళ్లిపోయినట్లు సమాచారం.అక్కడ క్రికెట్ ఆస్ట్రేలియా పర్యవేక్షణలో అతడికి టెస్ట్‌లు నిర్వహించనున్నారు. క్రికెట్ ఆస్ట్రేలియా వైద్య బృందం నుంచి కమ్మిన్స్‌కు సిగ్నల్ వస్తే ఏప్రిల్ 17న ఎస్ఆర్హెచ్ జట్టుతో కలిసే అవకాశముంది. అంటే సన్‌రైజర్స్ ఆడే కనీసం మూడు మ్యాచ్‌లకు కమ్మిన్స్ అందుబాటులో ఉండడు. అప్పటివరకు ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ కొనసాగనున్నాడు.ఇక ఈ ఏడాది సీజన్‌ను ఓటమితో ఆరంభించిన ఆరెంజ్ ఆర్మీ.. రెండో మ్యాచ్‌లో అద్భుతంగా తిరిగి పుంజుకుంది. కేకేఆర్‌పై 65 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ ఎస్ఆర్హెచ్ దుమ్ములేపింది. హైదరాబాద్ జట్టు ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఆరో స్ధానంలో కొనసాగుతోంది. సన్‌రైజర్స్ తమ తదుపరి మ్యాచ్‌లో ఏప్రిల్ 5న లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడనుంది. ముందు ఊహించినట్టుగానే కమ్మిన్స్ సెకెండ్ హాఫ్ సీజన్‌కు అందుబాటులో ఉండనున్నాడు.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, హర్ష్ దూబే, ఈషాన్ మలింగ, శివమ్ మావి, స్మరన్ రవిచంద్రన్, కమ్మిన్స్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, కమిందు మెండిస్, బ్రైడన్ కార్సే, డేవిడ్ పేన్, ప్రఫుల్ హింగే, సాకిబ్ హుస్సేన్, క్రెయిన్స్ ఫులేట్రా, అమిత్ కుమార్, ఓంకార్ తర్మలే, శివంగ్ కుమార్చదవండి: అతడు నాకంటే ఎంతో బెటర్: యువరాజ్ సింగ్ -
అభిషేక్‌కు అన్యాయం చేశారు.. సన్‌రైజర్స్‌పై యువరాజ్ ఫైర్
ఐపీఎల్-2026 సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ వ్యహరిస్తున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ గాయం కారణంగా ఫస్ట్ హాఫ్‌కు అందుబాటులో లేకపోవడంతో జట్టు పగ్గాలను కిషన్‌కు ఎస్ఆర్హెచ్ యాజమాన్యం అప్పగించింది.ట్రావిస్ హెడ్, క్లాసెన్, అభిషేక్ శర్మ వంటి ప్లేయర్లు ఉన్నప్పటికి కిషన్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. తాజాగా ఇదే విషయంపై భారత మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. గత ఎనిమిదేళ్లుగా జట్టుతో ఉన్న అభిషేక్ శర్మకు కాకుండా కిషన్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంపై యువీ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అభిషేక్ 2017 నుంచి సన్‌రైజర్స్ జట్టుతో పాటు ఉన్నాడు. కానీ కిషన్ మాత్రం గతేడాదే ఎస్ఆర్హెచ్ జట్టులోకి వచ్చాడు. కిషన్ ఇటీవలే జార్ఖండ్‌కు కెప్టెన్‌గా తొలి సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ టైటిల్‌ను అందించాడు. ఈ క్రమంలోనే అతడిని స్టాండిన్ కెప్టెన్‌గా ఆరెంజ్ ఆర్మీ నియమించింది. అతడికి డిప్యూటీగా మాత్రం అభిషేక్ వ్యవహరిస్తున్నాడు."అభిషేక్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించకోపోవడం నన్ను నిరాశపరిచింది. ఇషాన్ కిషన్ అంటే నాకు కూడా ఇష్టమే. అతడు ఎంతో కష్టపడి ఈ స్ధాయికి ఎదిగాడు. కానీ అభిషేక్ శర్మ గత 7 ఏళ్లగా ఎస్ఆర్హెచ్ జట్టుతో పాటు ఉన్నాడు. ప్రతీ సీజన్లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు.ఎస్ఆర్హెచ్ కోసం తన సర్వస్వాన్ని ధారపోస్తున్నాడు. అతడు దేశవాళీ క్రికెట్లో పంజాబ్ జట్టుకు కూడా కెప్టెన్ కూడా వ్యవహరిస్తున్నాడు. అటువంటి వ్యక్తికి కెప్టెన్సీ ఇవ్వకపోవడం నిజంగా బాధాకరం. గతంలో కూడా నాకు ఇలానే జరిగింది. 2007లో నేను వైస్ కెప్టెన్‌గా ఉన్నాను. సెహ్వాగ్, భజ్జీ వంటి సీనియర్లు ఉన్నారు.కానీ ఎక్కడి నుంచో ఎంఎస్ ధోనీ వచ్చి కెప్టెన్ అయ్యాడు. అప్పట్లో అది నాకు ఎలా అనిపించిందో, ఇప్పుడు అభిషేక్ కూడా అలాగే ఫీల్ అవుతుంటాడు. అయితే ధోని మాత్రం కెప్టెన్‌గా భారత్‌కు గొప్ప విజయాలు అందించాడు.అందుకు అతడే అర్హడు అన్పించింది. ఇది నేను కేవలం ఉదాహరణగా మాత్రమే చెబుతున్నాను. కానీ ఒక ఆటగాడు కొన్నేళ్లు పాటు జట్టుకు తన సేవలు అందించినప్పుడు. ఆ తర్వాత జరిగే పరిణామాలు కొంత నిరాశను కలిగిస్తాయి" స్పోర్ట్స్ టాక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యువీ పేర్కొన్నాడు.చదవండి: PSL 2026: ఉన్నపళంగా పాక్ నుంచి వెళ్లిపోయిన డేవిడ్ వార్నర్? -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా ప్లేయర్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ తమ టాప్-2 స్దానాలను నిలబెట్టుకున్నారు. అభిషేక్ 875 పాయింట్లతో అగ్రస్ధానంలో కొనసాగుతుండగా.. కిషన్(848) రెండో స్ధానంలో నిలిచాడు. మూడో స్ధానంలో పాకిస్తాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్(848) ఉన్నాడు.ఇక ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో దుమ్ములేపిన సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కానర్ ఎస్టర్‌హ్యూజెన్.. ఇప్పుడు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో కూడా సత్తాచాటాడు. ఎస్టర్‌హ్యూజెన్ ఏకంగా 64 స్ధానాలు ఎగబాకి 39వ ర్యాంక్‌కు చేరుకున్నాడు. ప్రోటీస్ సిరీస్‌లో ఎస్టర్‌హ్యూజెన్ 300 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.ఇక టాప్-10లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ జోస్ బట్లర్ ఒక స్థానం మెరుగుపరుచుకుని 8వ ర్యాంకుకు చేరుకోగా, కివీస్ బ్యాటర్ టిమ్ సీఫెర్ట్ 9వ స్థానానికి పడిపోయాడు. న్యూజిలాండ్ వికెట్ కీపర్ టిమ్ రాబిన్సన్ రెండు స్థానాలు ఎగబాకి 32వ స్థానంలో నిలిచాడు. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అఫ్గానిస్తాన్ స్టార్ రషీద్ ఖాన్ తన అగ్రస్ధానాన్ని పదిలం చేసుకున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో రాణించిన దక్షిణాఫ్రికా బౌలర్లు తమ ర్యాంక్‌లను మెరుగుపరుచుకున్నారు. జెరాల్డ్ కోయెట్జీ ఏకంగా 36 స్థానాలు ఎగబాకి 52వ ర్యాంకును కైవసం చేసుకోగా.. ఒట్నీల్ బార్ట్‌మాన్ 10 స్థానాలు మెరుగుపరుచుకుని 56వ స్ధానానికి చేరుకున్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నాడు. చదవండి: IND vs ZIM: టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్..! ఓపెనర్‌గా వైభవ్ సూర్యవంశీ? -
పాపం.. వణికిపోయిన ఇషాన్ కిషన్!
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కి కెప్టెన్సీ పగ్గాలు అందుకున్న ఇషాన్ కిష మ్యాచ్ ఆద్యంతం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా అనిపించింది. డిఫెండింగ్ ఛాంపియన్‌తో తొలి మ్యాచ్ ఆడాల్సి రావడం, కమిన్స్ స్థానంలో కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టడంతో భయంతో కనిపించాడు. బ్యాటింగ్‌లో బాధ్యతగానే జట్టును ముందుకు తీసుకెళ్లినప్పటికీ ఫీల్డింగ్ సమయంలో మాత్రం టెన్షన్‌తో కీపింగ్ కూడా సరిగా చేయలేకపోయాడు.ఆర్సీబీ బ్యాటింగ్ దూకుడుతో ఒకవైపు బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకుంటుంటే.. మరోవైపు ఇషాన్ కిషన్ వికెట్ల వెనుక బంతులు వదిలేసి బౌండరీలు అందించాడు. ఈజీగా వచ్చిన బంతుల్ని కూడా పట్టుకోలేక గ్లౌజుల కింద నుంచి ఫోర్లు ఇచ్చేశాడు. ఇషాన్ కిషన్ దగ్గర రెండు బంతులు మిస్సవగా.. రెండు కూడా గ్లౌజుల కింద నుంచే వెళ్లిపోయాయి.బౌలర్లను సమన్వయం చేసుకోవడంలో కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ విఫలమయ్యాడు. రెండో ఓవర్లోనే ఫిల్ సాల్ట్ వికెట్ పడినప్పటికీ.. పవర్ ప్లేలో మరో వికెట్ తీయలేకపోయాడు. ఆర్సీబీ స్టార్స్ దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లి పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేయలేకపోయాడు. జయదేవ్ ఉనద్కత్, నితీష్ కుమార్ రెడ్డి 10లోపు పరుగులు సమర్పించగా.. మిగతా బౌలర్లంతా 11, 14 పరుగులు ఇచ్చారు. ఈషాన్ మలింగ ఏకంగా 2 ఓవర్లలో 35 పరుగులు సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు 6 వికెట్ల తేడాతో ఎస్ఆర్హెచ్పై విన్ని అందుకుంది.మ్యాచ్ అనంతరం ఇషాన్ కిషన్ మాట్లాడుతూ.. ‘మొదటి 3-4 ఓవర్ల తర్వాత వికెట్ ఖచ్చితంగా బాగా సహకరించిందని నేను భావిస్తున్నాను. మేము ఆరంభంలోనే కొన్ని వికెట్లు కోల్పోయాము, వచ్చేసారి ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఎందుకంటే, రెండో ఇన్నింగ్స్ వికెట్‌ను చూస్తే, బ్యాటింగ్ చేయడానికి చాలా సులభంగా ఉంది. బంతి బ్యాట్‌పైకి చాలా చక్కగా వస్తోంది. కాబట్టి అవును, వచ్చేసారి మేము షాట్ ఎంపికలో మరింత వివేకంతో వ్యవహరించాలి’ అని చెప్పుకొచ్చాడు. -
విన్యాసాల వీరుడు.. ఫిల్ సాల్ట్
‘క్యాచ్స్ విన్ మ్యాచెస్’ అని ఊరికే అనలేదు. ఐపీఎల్ 2026 సీజన్ తొలి మ్యాచ్‌లోనే అది మరోసారి నిరూపితమయ్యింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్)తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ ఆటగాడు ఫిల్ సాల్ట్ తన స్టన్నింగ్ క్యాచ్‌లతో హీరోగా నిలిచాడు. ఫిల్ సాల్ట్ తన అసాధారణ ఫీల్డింగ్‌తో ఆకట్టుకున్నాడు. సాల్ట్ అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి. 14వ ఓవర్లో హెడ్ కొట్టిన బంతిని బౌండరీ సమీపంలోక్లాసెన్ క్యాచ్ వివాదాస్పదమైనప్పటికీ ఎస్ఆర్హెచ్తో అతడు అందుకున్న మూడు క్యాచ్‌లు దేనికవే సాటి అని చెప్పొచ్చు. ఫిల్ సాల్ట్ చేతికి చిక్కిన ముగ్గురు (ఇషాన్ కిషన్, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్) డేంజర్ బ్యాటర్లే. ఈ ముగ్గురు సూపర్ బ్యాటింగ్‌తో అలరిస్తున్న సమయంలో సాల్ట్ అడ్డుగోడలా నిలిచాడు. ఇన్నింగ్స్ 2.4 ఓవర్లో జాకబ్ డఫీ వేసిన బంతిని హెడ్ బ్యాక్వర్డ్ స్వ్కేర్ దిశగా ఆడాడు. అయితే అక్కడే కాచుకు కూర్చున్న సాల్ట్ వెనక్కి పరిగెత్తి అద్భుతమైన రివర్స్ క్యాచ్ తీసుకున్నాడు. షెఫర్డ్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్ తొలి బంతికి క్లాసెన్ డీప్ మిడ్‌వికెట్ దిశగా భారీ షాట్ ఆడగా... అక్కడ ఫీల్డింగ్ చేస్తున్న సాల్ట్ దాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు బౌండరీ రోప్ మీద పడ్డట్లు కనిపించింది. పలుమార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ క్లాసెన్‌ను అవుట్‌గా ప్రకటించాడు. దీంతో క్లాసెన్ అసంతృప్తిగా మైదానాన్ని వీడాడు. ఏదీ ఏమైనా సాల్ట్ అందుకున్న ఈ క్యాచ్ కూడా కాస్త క్లిష్టతరమైనదే. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్‌కు వెన్నుముకలా నిలిచిన ఇషాన్ కిషన్ ఇచ్చిన క్యాచ్‌ను సాల్ట్ అందుకున్న తీరు నభూతో నభవిష్యత్తు అని చెప్పొచ్చు. అభినందన్ వేసిన ఇన్నింగ్స్ 15.6 ఓవర్లో ఇషాన్ భారీ షాట్‌కు యత్నించాడు. పాయింట్ దిశగా ఇషాన్ కొట్టిన బంతిని సాల్ట్ రెప్పపాటులో అందుకున్నాడు. డీప్ బ్యాక్వర్డ్ పాయింట్ బౌండరీ వద్ద కుడివైపు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి ఒంటి చేత్తో బంతిని అందుకోవడం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. గతేడాది ఐపీఎల్ 2025 సీజన్ ఫైనల్లోనూ ఫీల్డింగ్‌లో ఇదే తరహా విన్యాసాలతో ఫిల్ సాల్ట్ అదరగొట్టాడు. హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ప్రియాన్ష్ ఆర్య భారీ షాట్ ఆడాడు. అయితే బౌండరీ లైన్ వద్ద ఉన్న సాల్ట్ అమాంతం గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో క్యాచ్‌ను ఒడిసిపట్టడం అప్పట్లో ట్రేడ్‌మార్క్ క్యాచ్‌గా నిలిచిపోయింది. మొత్తంగా సాల్ట్ బ్యాటింగ్‌లోనే కాదు ఫీల్డింగ్‌లోనూ మెరుపులు మెరిపించి విన్యాసాల వీరుడిగా ముద్ర వేసుకున్నాడు.𝐒𝐓𝐎𝐏 𝐖𝐇𝐀𝐓 𝐘𝐎𝐔 𝐀𝐑𝐄 𝐃𝐎𝐈𝐍𝐆 𝐀𝐍𝐃 𝐖𝐀𝐓𝐂𝐇 𝐓𝐇𝐈𝐒! 🛑🎥 Phil Salt with an absolute one-handed screamer at the ropes 🫡Do we already have the Catch of the Season on Day 1 of #TATAIPL 2026 🤔Updates ▶️ https://t.co/Eo5z0jh4K4 #KhelBindaas | #RCBvSRH |… pic.twitter.com/pPax3pVNt9— IndianPremierLeague (@IPL) March 28, 2026That’s not just a catch, that’s a full-on rollercoaster at the ropes 😮💨Screen badi, awaazein badi. Apne smart TV ke JioHotstar app pe dekhiye Champions waali commentary LIVE💥#TATAIPL 2026 | #RCBvSRH | LIVE NOW 👉 https://t.co/LWOEeT2vNG pic.twitter.com/IzIDC3MtkX— Star Sports (@StarSportsIndia) March 28, 2026Picking up where he left off... 🔥🔥Never change, Phil Salt. Never change. 🙏#PlayBold #ನಮ್ಮRCB #IPL2026 #RCBvSRH pic.twitter.com/gGu6BD388g— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026చదవండి: అందుకే చేజింగ్ మాస్టర్ అనేది! -
దంచికొట్టిన పడిక్కల్, కోహ్లి.. భారీ లక్ష్యాన్ని ఊదేసిన ఆర్సీబీ
డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ ఐపీఎల్ 2026 సీజన్లో ఘనంగా బోణీ కొట్టింది. ఛాంపియన్ హోదాకు సార్దకత చేకూరుస్తూ, తొలి మ్యాచ్‌లోనే అబ్బురపరిచే విజయం సాధించింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఇవాళ (మార్చి 28) జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌పై ఘన విజయం సాధించింది.ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు.వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.దంచికొట్టిన పడిక్కల్, కోహ్లిఅనంతరం బరిలోకి దిగిన ఆర్సీబీ.. దేవ్‌దత్ పడిక్కల్ (26 బంతుల్లో 61; 7 ఫోర్లు, 4 సిక్సర్లు), విరాట్ కోహ్లి (38 బంతుల్లో 69 నాటౌట్; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), రజత్ పాటిదార్ (12 బంతుల్లో 31; 2 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసం ధాటికి కేవలం 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. విరాట్ సిక్సర్, హ్యాట్రిక్ బౌండరీలతో మ్యాచ్‌ను ముగించాడు. తొలి ఐపీఎల్ మ్యాచ్‌లోనే అద్భుత ప్రదర్శన చేసిన జేకబ్ డఫీకి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. -
ఇషాన్ విధ్వంసం.. అనికేత్ మెరుపులు.. సన్‌రైజర్స్ భారీ స్కోర్
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ భారీ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఎస్ఆర్హెచ్.. ఇషాన్ కిషన్ (38 బంతుల్లో 80; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) విధ్వంసం, అనికేత్ వర్మ (18 బంతుల్లో 43; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) మెరుపుల కారణంగా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.ఆర్సీబీ అరంగేట్రం బౌలర్ జేకబ్ డఫీ (4-0-22-3) ధాటికి 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన సన్‌రైజర్స్‌ను ఇషాన్.. హెన్రిచ్ క్లాసెన్ (22 బంతుల్లో 31; 2 ఫోర్లు, సిక్స్) సాయంతో గట్టెక్కించాడు. వరుస విరామాల్లో వికెట్లు పడినా ఆఖర్లో అనికేత్ మెరుపు ఇన్నింగ్స్ కారణంగా సన్‌రైజర్స్ 200 పరుగుల మార్కును దాట గలిగింది. మిగతా సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌట్ కాగా.. డేవిడ్ పేన్ 6, ఉనద్కత్ 4 పరుగులతో అజేయంగా నిలిచారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ, రొమారియో షెపర్డ్ చెరో 3 వికెట్లు తీయగా.. భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్
ఎస్ఆర్హెచ్ తాత్కాలిక సారధి ఇషాన్ కిషన్ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదారాబాద్ తరఫున కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్ సాధించిన ఆటగాడిగా అవతరించాడు. గతంలో ఈ రికార్డు మనీశ్ పాండే (69 నాటౌట్) పేరిట ఉండేది. ఐపీఎల్ 2026లో భాగంగా ఆర్సీబీతో ఇవాళ (మార్చి 28) జరుగుతున్న మ్యాచ్‌లో ఇషాన్ ఈ రికార్డు నమోదు చేశాడు.బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇషాన్ కష్టాల్లో ఉన్న తన జట్టును అద్భుతమైన ఇన్నింగ్స్‌తో గట్టెక్కించే క్రమంలో ఈ రికార్డు సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేసిన ఇషాన్.. అభినందన్ సింగ్ బౌలింగ్‌లో సాల్ట్ అద్భుతమైన క్యాచ్ పట్టడంతో పెవిలియన్‌కు చేరాడు.ఈ ఇన్నింగ్స్‌తో ఇషాన్ మరో ఘనత కూడా సాధించాడు. ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు చేసిన ఆటగాళ్ల జాబితాలో ఆరో స్థానంలో నిలిచాడు.ఐపీఎల్ కెప్టెన్సీ అరంగేట్రంలో అత్యధిక స్కోర్లు119 - సంజు శాంసన్ (RR) vs PBKS, 202199* - మయాంక్ అగర్వాల్ (PBKS) vs DC, 202193* - శ్రేయస్ అయ్యర్ (DC) vs KKR, 201888 - ఫాఫ్ డు ప్లెసిస్ (RCB) vs PBKS, 202283 - కీరన్ పొలార్డ్ (MI) vs PBKS, 201980 - ఇషాన్ కిషన్ (SRH) vs RCB, 2026*కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేస్తున్న ఎస్ఆర్హెచ్ 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినప్పటికీ.. ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి తన జట్టును ఆదుకున్నాడు. అతనికి క్లాసెన్ (31) కాసేపు సహకరించాడు.18 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 8 వికెట్ల నష్టానికి 175 పరుగులుగా ఉంది. అనికేత్ వర్మ (27), డేవిడ్ పేన్ (1) క్రీజ్‌లో ఉన్నారు. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో హెడ్ 11, అభిషేక్ 7, నితీశ్ కుమార్ రెడ్డి 1, సలీల్ అరోరా 9, హర్ష్ దూబే 3, హర్షల్ పటేల్ డకౌటయ్యారు. ఆర్సీబీ బౌలర్లలో డఫీ 3, రొమారియో షెపర్డ్ 2, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, సుయాశ్ శర్మ తలో వికెట్ తీశారు. -
IPL 2026, SRH VS RCB: ఇషాన్ కిషన్ భారీ రికార్డు
ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌లోనే ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ రికార్డు సాధించాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో బాధ్యతాయుతంగా ఆడుతున్న అతను.. ఐపీఎల్లో 3000 పరుగులు పూర్తి చేశాడు. తద్వారా క్యాష్ లీగ్ చరిత్రలో అత్యంత వేగంగా ఈ మైలురాయిని తాకిన ఆరో భారత ఆటగాడిగా రికార్డుల్లోకెక్కాడు. ఇషాన్ ఈ మైలురాయిని చేరుకునేందుకు 2180 బంతులు తీసుకోగా.. రిషబ్ పంత్ (2028), యూసఫ్ పఠాన్ (2082), సూర్యకుమార్ యాదవ్ (2130), సురేశ్ రైనా (2135), ఎంఎస్ ధోని (2152) అతని కంటే వేగంగా ఈ మైలురాయిని చేరుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఎస్ఆర్హెచ్ కష్టాల్లో పడింది. ఆర్సీబీ అరంగేట్రం పేసర్ జేకబ్ డఫీ నిప్పులు చెరిగే బంతులతో ఎస్ఆర్హెచ్ టాపార్డర్‌ను కుప్పకూల్చాడు. ఈ దశలో ఇషాన్ బాధ్యతాయుతంగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. అతనికి జతగా హెన్రిచ్ క్లాసెన్ క్రీజ్‌లో ఉన్నారు. 7 ఓవర్ల తర్వాత ఎస్ఆర్హెచ్ స్కోర్ 54-3గా ఉంది. ఇషాన్ (12 బంతుల్లో 25), క్లాసెన్ (7 బంతుల్లో 6) ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. డఫీ అద్బుతమైన స్పెల్‌ను (4-0-22-3) ముగించాడు.నిప్పులు చెరిగిన డఫీఎస్ఆర్హెచ్ పీకల్లోతు కష్టాల్లో పడింది. 29 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. డఫీ ఎస్ఆర్హెచ్ను దారుణంగా దెబ్బకొట్టాడు. 3వ ఓవర్లో ఓపెనర్లు అభిషేక్ (7), హెడ్ (11) వికెట్లు తీసిన ఇతను.. ఐదో ఓవర్ తొలి బంతికే నితీశ్‌కుమార్ రెడ్డిని (1) పెవిలియన్‌కు పంపాడు.తుది జట్లు..ఆర్సీబీ: విరాట్ కోహ్లీ, ఫిలిప్ సాల్ట్, రజత్ పాటిదార్(కెప్టెన్), జితేష్ శర్మ(వికెట్‌కీపర్), టిమ్ డేవిడ్, రొమారియో షెపర్డ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, అభినందన్ సింగ్, జాకబ్ డఫీ, సుయాష్ శర్మసన్‌రైజర్స్: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్(కెప్టెన్/వికెట్‌కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలీల్ అరోరా, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, జయదేవ్ ఉనద్కత్, ఎషాన్ మలింగ -
IPL 2026: ఆరంభం రోజునే ఇషాన్ అరుదైన రికార్డు!
సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) కెప్టెన్ ఇషాన్ కిషన్ ఐపీఎల్ 19వ సీజన్ ప్రారంభ మ్యాచ్‌తోనే అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఇవాళ చిన్నస్వామి స్టేడియం వేదికగా డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)తో ఎస్ఆర్హెచ్ అమీతుమీ తేల్చుకోనుంది. ప్రస్తుతం ఇషాన్ కిషన్ వయసు 27 సంవత్సరాల 253 రోజులు. దీంతో ఎస్ఆర్హెచ్ ఫ్రాంచైజీ చరిత్రలో కెప్టెన్‌గా జట్టును నడిపించనున్న రెండో అత్యంత పిన్న వయస్కుడిగా ఇషాన్ కిషన్ నిలవ నున్నాడు. అంతేకాదు టీమిండియా తరఫున ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగాను ఇషాన్ నిలవనున్నాడు. ఈ జాబితాలో తొలి స్థానంలో న్యూజిలాండ్ సీనియర్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ఉన్నాడు. 2018లో ఎస్ఆర్హెచ్కు కెప్టెన్‌గా వ్యవహరించినప్పుడు విలియ మ్సన్ వయసు 27 సంవత్సరాల 244 రోజులు. గతంలో శిఖర్ ధావన్, మనీష్‌పాండే, భువనేశ్వర్ కుమార్‌లు కూడా తక్కువ వయసులోనే ఎస్ఆర్హెచ్ కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ వెన్ను నొప్పితో సీజన్ ఆరంభ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్‌కు తాత్కాలికంగా నాయకత్వ బాధ్యతలు అప్పజెప్పుతూ ఎస్ఆర్హెచ్ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. అయితే కమిన్స్ ఈ సీజన్లో మొదటి సగం మ్యాచ్‌లకు దూరమైనట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలను ఖండించిన ఎస్ఆర్హెచ్ కోచ్ డేనియల్ వెటోరి కమిన్స్ ఆడడంపై స్పష్టతనిచ్చాడు. కమిన్స్ ఫిట్‌గానే ఉన్నాడని, మరో 10 నుంచి 12 రోజుల్లో బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. మరోవైపు కమిన్స్ ఫిట్‌నెస్‌పై క్రికెట్ ఆస్ట్రేలియా కూడా దృష్టి సారించిందని తెలిపాడు. వరుస గాయాలతో ఇప్పటికే యాషెస్, టీ20 ప్రపంచకప్‌కు కమిన్స్ దూరమైన సంగతి తెలిసిందే. ఇక ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్‌కుమార్‌రెడ్డిలతో పటిష్టంగా కనిపిస్తుంది. అయితే కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ కాస్త బలహీనంగా ఉన్నప్పటికీ హర్షల్ పటేల్, జయదేవ్ ఉనాద్కట్ సహా దేశవాలీ క్రికెటర్లు కీలకం కానున్నారు.చదవండి: వివాదంలో యువరాజ్ తండ్రి! -
‘విన్’ రైజర్స్ అవుతుందా!
ఒకప్పుడు సన్‌రైజర్స్ హైదరాబాద్ అంటే... బలమైన బౌలింగ్ దళానికి చిరునామాగా నిలిచేది! ప్రత్యర్థి ముందు స్వల్ప లక్ష్యాలను నిర్దేశించినా... పకడ్బందీ బౌలింగ్‌తో వాటిని కాపాడుకుంటూ సత్తా చాటేది! కానీ 2024 సీజన్ నుంచి జట్టు దృక్పథం పూర్తిగా మారిపోయింది. గత రెండేళ్లుగా రైజర్స్ ‘తూ మార్... మై మార్’ ప్లాన్‌తో దుమ్మురేపుతోంది. ఐపీఎల్లో అత్యధిక స్కోర్లలో తొలి నాలుగింటిని ఈ రెండు సీజన్లలోనే తమ పేరిట లిఖించుకుందంటే రైజర్స్ ఊచకోత ఏ స్థాయిలో సాగిందో అర్థం చేసుకోవచ్చు. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, హెన్రిచ్ క్లాసెన్, ఇషాన్ కిషన్, లివింగ్‌స్టోన్, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా బ్యాటింగ్ ఆర్డర్ మొత్తం హిట్టర్లతో నిండి ఉంది. ఆరంభ మ్యాచ్‌లకు కమిన్స్ లేకపోవడంతో బౌలింగ్ మరింత బలహీనపడగా... ఈ సీజన్లో ఇషాన్ కిషన్ జట్టును ఎలా నడిపిస్తాడనేది వేచి చూడాలి. –సాక్షి క్రీడా విభాగం విజృంభణ, విధ్వంసం, ఊచకోత... ఇవి గత రెండేళ్లుగా సన్‌రైజర్స్ బ్యాటింగ్ సాగిన తీరుకు పర్యాయపదాలు. ఒరిలోకి దిగింది మొదలు... చివరి బంతి వరకు ఒకటే బాదుడు! ‘యాభై పరుగులకే ఆరు వికెట్లు పడ్డా... ఏడో బ్యాటర్ కూడా ధాటిగా ఆడే క్రమంలోనే వెనుదిరగాలి తప్ప... డిఫెన్స్ ఆడుతూ దొరికిపోకూడదు’ అనే కమిన్స్ మంత్రాన్ని పాటిస్తున్న సన్‌రైజర్స్ హైదరాబాద్... ఈ రెండేళ్లలో లెక్కకు మిక్కిలి రికార్డులు తిరగరాసింది. అయితే బ్యాటింగ్‌లో దూకుడు ఉన్నా... బౌలింగ్‌లో నాణ్యత లేక రైజర్స్ వెనుకబడి పోయింది. 2013లో లీగ్‌లోకి అడుగుపెట్టిన సన్‌రైజర్స్... 2016లో డేవిడ్ వార్నర్ సారథ్యంలో తొలిసారి ఐపీఎల్ చాంపియన్‌గా నిలిచింది. ఆ తర్వాత మరో రెండుసార్లు (2018, 2024లో) ఫైనల్‌కు చేరినా... రన్నరప్‌తోనే సరిపెట్టుకుంది. ఇప్పటికే బలహీనంగా ఉన్న సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం... రెగ్యులర్ కెప్టెన్ కమిన్స్గైర్హాజరీతో మరింత డీలా పడింది. గత ఏడాది లీగ్ దశలో ఆడిన 14 మ్యాచ్‌ల్లో 6 విజయాలతో 6వ స్థానంలో నిలిచిన రైజర్స్... ఈసారి ట్రోఫీ చేజిక్కించుకోవడమే లక్ష్యంగా బరిలోకి దిగనుంది. బ్యాటింగ్‌పైనే భారం... ఐపీఎల్‌లోని అన్ని జట్లలో విధ్వంసకర బ్యాటింగ్ లైనప్ ఉన్న జట్టు ఏదంటే సన్‌రైజర్స్ అనే చెప్పాలి. ఓపెనింగ్ నుంచి ఎనిమిదో స్థానం వరకు దూకుడుగా బ్యాటింగ్ చేయగల ఆటగాళ్లు రైజర్స్ టీమ్‌కు సొంతం. క్షణాల్లో ప్రత్యర్థి నుంచి మ్యాచ్‌ను లాగేసుకోవడంలో ఓపెనర్లు అభిషేక్, హెడ్ సిద్ధహస్తులు. ఇషాన్ ధాటి ఏపాటిదో ఇటీవల టి20 ప్రపంచకప్‌లో అందరూ చూశారు. తాత్కాలిక సారథిగానూ అతడిపై అదనపు బాధ్యతలు ఉన్నాయి. క్లాసెన్, లివింగ్‌స్టోన్, నితీశ్ కుమార్ రెడ్డితో మిడిలార్డర్ దుర్బేధ్యంగా ఉంది. ఈ బ్యాటింగ్ లైనప్ కలిసికట్టుగా కదంతొక్కితే... ఎలాంటి బౌలింగ్ అయినా కకావికలం కావాల్సిందే. ఇప్పటికే హిట్టర్లతో దట్టంగా ఉన్న రైజర్స్... ఈ ఏడాది మినీ వేలంలో రూ. 13 కోట్లు పెట్టి ఇంగ్లండ్ ప్లేయర్ లివింగ్‌స్టోన్‌ను తీసుకుంది. కమిన్స్ లేకపోవడంతో అతడికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలున్నాయి. 3 కోట్లు పెట్టి కొనుగోలు చేసుకున్న ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ జాక్ ఎడ్వర్డ్స్ గాయం కారణంగా సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ రెడ్డి అటు బ్యాటింగ్‌లో, ఇటు బౌలింగ్‌లో మరింత ప్రభావం చూపాలని మేనేజ్మెంట్ ఆశిస్తోంది. స్ట్రయిక్ బౌలర్ లోటు! మంచినీళ్ల ప్రాయంలా భారీ స్కోర్లు చేస్తున్నా... రైజర్స్ నిలకడగా విజయాలు సాధించలేకపోవడానికి కారణం బలహీన బౌలింగ్. జట్టుకు అవసరమైనప్పుడు వికెట్ తీసే స్ట్రయిక్ బౌలర్ లేకపోవడం అతిపెద్ద ప్రతికూలాంశం. ఉన్న ఒక్క టీమిండియా పేసర్ మొహమ్మద్ షమీని సైతం జట్టు వదిలేసుకుంది. దీంతో జైదేవ్ ఉనాద్కట్, హర్షల్ పటేల్‌లపై అదనపు భారం పడనుంది. ఆరంభ మ్యాచ్‌ల్లో విదేశీ ప్లేయర్ల కోటాలో హెడ్, క్లాసెన్, లివింగ్‌స్టోన్, బ్రైడన్ కార్స్ చోటు దక్కించుకోవచ్చు. ఒక్క పేరున్న స్పిన్నర్ కూడా జట్టులో లేడు. ప్రఫుల్, అమిత్, ఓంకార్, సాకిబ్ హుస్సేన్, శివాంగ్ను వేలంలో తీసుకున్నా వారికి మ్యాచ్ దక్కే అవకాశాలు తక్కువే. సలీల్ అరోరా, శివమ్ మావి ఏమాత్రం ఆకట్టుకుంటారో చూడాలి. సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అనికేత్ వర్మ, స్మరణ్ రవిచంద్రన్, సలీల్ అరోరా, క్లాసెన్, హెడ్, హర్షల్ పటేల్, కమిందు మెండిస్, హర్‡్ష దూబే, కార్స్, శివాంగ్, క్రెయిన్స్ ఫులెట్రా, లివింగ్‌స్టోన్, డేవిడ్ పైన్, అభిషేక్ శర్మ, నితీశ్ కుమార్ రెడ్డి, కమిన్స్, జీషాన్ అన్సారీ, జైదేవ్ ఉనాద్కట్, ఇషాన్ మలింగ, సాకిబ్ హుస్సేన్, ఓంకార్, అమిత్, ప్రఫుల్, శివమ్ మావి.ఐపీఎల్లో సన్‌రైజర్స్ గణాంకాలుఆడిన మ్యాచ్‌లు 196 గెలిచినవి 94 ఓడినవి 101 రద్దు 1అత్యుత్తమ ప్రదర్శనవిజేత (2016), రన్నరప్ (2018, 2024) -
IPL 2026: రెండో దశలో సన్‌రైజర్స్ షెడ్యూల్ ఇదే..!
ఐపీఎల్ 2026 రెండో దశ షెడ్యూల్ ఇవాళ (మార్చి 26) విడుదలైంది. ఈ దశలో 50 మ్యాచ్‌లు జరుగనున్నాయి. తొలి దశలో ప్రకటించిన 20 మ్యాచ్‌లతో కలుపుకొని లీగ్ దశలో మొత్తం 70 మ్యాచ్‌లు జరుగుతాయి. ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన షెడ్యూల్ త్వరలో వెలువడుతుంది. దేశంలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలను దృష్టిలో ఉంచుకొని ఐపీఎల్ షెడ్యూల్‌ను రెండు దశల్లో విడుదల చేశారు. కాగా, తెలుగు రాష్ట్రాల ఏకైక ఫ్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ రెండో విడత ప్రకటించిన షెడ్యూల్లో 10 మ్యాచ్‌లు ఆడనుంది. తొలి విడత నాలుగు మ్యాచ్‌లతో కలుపుకొని సన్‌రైజర్స్ ఈ సీజన్ లీగ్ దశ మొత్తంలో 14 మ్యాచ్‌లు ఆడుతుంది.రెండో దశ ప్రారంభ మ్యాచ్‌లోనే (ఏప్రిల్ 13) ఎస్ఆర్హెచ్ రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ హైదరాబాద్ వేదికగా రాత్రి 7:30 గంటలకు జరుగనుంది.ఏప్రిల్ 18- సీఎస్కేతో (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్ 21- ఢిల్లీ క్యాపిటల్స్‌తో (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్ 25- రాజస్థాన్ రాయల్స్ (జైపూర్, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్ 29- ముంబై ఇండియన్స్ (ముంబై, రాత్రి 7:30 గంటలకు)మే 3- కేకేఆర్ (హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు)మే 6- పంజాబ్ కింగ్స్ (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)మే 12- గుజరాత్ టైటాన్స్ (అహ్మదాబాద్, రాత్రి 7:30 గంటలకు)మే 18- సీఎస్కే (చెన్నై, రాత్రి 7:30 గంటలకు)మే 22- ఆర్సీబీ (హైదరాబాద్, రాత్రి 7:30 గంటలకు)తొలి దశలో ప్రకటించిన షెడ్యూల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లు..మార్చి 28- ఆర్సీబీతో (బెంగళూరు, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్ 2- కేకేఆర్‌తో (కోల్‌కతా, రాత్రి 7:30 గంటలకు)ఏప్రిల్ 5- లక్నో సూపర్ జెయింట్స్‌తో (హైదరాబాద్, మధ్యాహ్నం 3:30 గంటలకు)ఏప్రిల్ 11- పంజాబ్ కింగ్స్‌తో (ముల్లాన్‌పూర్, మధ్యాహ్నం 3:30 గంటలకు) -
అభిషేక్, ఇషాన్ కాదు.. SRH X ఫ్యాక్టర్ అతనే
-
సెలక్టర్లు వింటారు: నితీశ్ రెడ్డికి ఇషాన్ కిషన్ వార్నింగ్!
డిఫెండింగ్ చాంపియన్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ)- సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్‌తో మార్చి 28న ఐపీఎల్-2026 టోర్నీకి తెరలేవనుంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం ఇందుకు వేదిక.కెప్టెన్‌గా ఇషాన్ కిషన్ఇక ఆరంభ మ్యాచ్‌లకు ప్యాట్ కమిన్స్ దూరం కాగా.. అతడి గైర్హాజరీలో సన్‌రైజర్స్ కెప్టెన్‌గా టీమిండియా స్టార్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఇప్పటికే సన్‌రైజర్స్ నెట్ ప్రాక్టీస్, ఇంట్రాస్వ్కాడ్ మ్యాచ్‌లతో బిజీబిజీగా గడుపుతోంది.ఈ క్రమంలో ఆటవిడుపుగా సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానులతో మమేకం అయ్యారు. ఫ్యాన్ మీట్లో ఆసక్తికర వ్యాఖ్యలతో అలరించారు. ఇందులో భాగంగా ఆంధ్ర కుర్రాడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి చేసిన కామెంట్లు.. అందుకు కెప్టెన్ ఇషాన్ కిషన్ ఇచ్చిన కౌంటర్లు.. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సెలక్టర్లు వింటారు!టెస్టు లేదంటే టీ20 ఫార్మాట్.. ఈ రెండింటిలో ఏది ఎంచుకుంటారని హోస్ట్ అడుగగా నితీశ్ రెడ్డి.. టీ20 అని సమాధానమిచ్చాడు. ఆ తర్వాత టెస్టు లేదంటే వన్డేలలో ఒకటి ఎంచుకోమనగా.. అతడు వన్డే అని బదులిచ్చాడు. ఈ క్రమంలో ఇషాన్ కిషన్ జోక్యం చేసుకుంటూ.. ‘‘నువ్వు టెస్టు జట్టులో కీలక సభ్యుడివి బ్రో. సెలక్టర్లు ఈ మాటలు వింటారు జాగ్రత్త’’ అని హెచ్చరించాడు. దీంతో నితీశ్‌తో పాటు ఆక్కడున్న వాళ్లంతా గట్టిగా నవ్వేశారు.𝙁𝙤𝙧 𝙩𝙝𝙚 𝙩𝙚𝙖𝙢, 𝙖𝙣𝙮𝙩𝙝𝙞𝙣𝙜 🤌 pic.twitter.com/ju8SpzTvxl— SunRisers Hyderabad (@SunRisers) March 22, 2026కాగా పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ అయిన నితీశ్ రెడ్డిని.. హార్దిక్ పాండ్యాకు సరైన వారసుడిగా సెలక్టర్లు భావిస్తున్నారు. వైట్‌బాల్ క్రికెట్లో హార్దిక్ గైర్హాజరీలో అడపాదడపా అవకాశాలు అందుకున్న నితీశ్.. గత రెండేళ్లుగా టెస్టుల్లో మాత్రం ఆల్‌రౌండర్‌గా స్థానం సుస్థిరం చేసుకున్నాడు.అది సాధ్యం కాదు!ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఇషాన్ కిషన్ నితీశ్ రెడ్డికి కౌంటర్ ఇవ్వడం గమనార్హం. ఇక ఐపీఎల్లో పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయడం ఇష్టమా? లేదంటే డెత్ ఓవర్లలో బ్యాటింగ్ ఇష్టమా? అని హోస్ట్ అడుగగా.. నితీశ్ రెడ్డి పవర్ ప్లే అని సమాధానం ఇచ్చాడు.దీంతో మరోసారి ఇషాన్ కిషన్ కౌంటర్‌తో ముందుకు వచ్చాడు. నితీశ్ రెడ్డి రెగ్యులర్‌గా ఆరో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి.. అతడికి ఎంత ఇష్టం ఉన్నా పవర్ ప్లేలో బ్యాటింగ్ చేయలేడంటూ నవ్వులు పూయించాడు. టెస్టు జట్టులో స్థానం సుస్థిరంకాగా సన్‌రైజర్స్ తరఫున 2024లో సత్తా చాటి భారత టీ20 జట్టులో అడుగుపెట్టిన నితీశ్ రెడ్డి.. అదే ఏడాది ఆస్ట్రేలియాలో టెస్టుల్లో అరంగేట్రం చేశాడు. మరుసటి ఏడాది వన్డేల్లోనూ అడుగుపెట్టాడు. ఇప్పటి వరకు టీమిండియా తరఫున 10 టెస్టులు, 4 వన్డేలు, 4 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.మరోవైపు ఇషాన్ కిషన్ దాదాపు మూడేళ్ల తర్వాత ఇటీవలే టీమిండియాలో పునరాగమనం చేశాడు. క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో స్థానం కోల్పోయిన అతడు.. దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి సెలక్టర్లకు సవాల్ విసిరాడు. అద్భుత ఫామ్‌లో ఉన్న అతడిని టీ20 ప్రపంచకప్-2026 జట్టుకు ఎంపిక చేయగా.. భారత్ చాంపియన్‌గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు.చదవండి: భారత్‌తో స్నేహం కావాలి: పాక్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన బంగ్లాదేశ్! -
ఇషాన్ కిషన్‌పై యువ ప్లేయర్ సీరియస్..
ఐపీఎల్-2026 సీజన్ కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ సిద్దమవుతోంది. గత సీజన్లో లీగ్ స్టేజ్‌లోనే ఇంటిముఖం పట్టిన ఎస్ఆర్హెచ్.. ఈసారి మాత్రం టైటిల్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో తీవ్రంగా శ్రమిస్తోంది.ఈ క్రమంలో శనివారం ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లు రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ మ్యాచ్ ఆడారు. అయితే ఈ సందర్భంగా ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్ ఇషాన్ కిషన్‌కు వింత అనుభవం ఎదురైంది. సన్‌రైజర్స్ స్పిన్నర్ జీషన్ అన్సారీ.. కిషన్‌పై సీరియస్ అయ్యాడు.అసలేమి జరిగిందంటే?మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 8వ ఓవర్ వేసిన జీషన్ అన్సారీ బౌలింగ్‌లో కిషన్ తొలి నాలుగు బంతులను రెండు సిక్సర్లు, రెండు ఫోర్లుగా మలిచాడు. అయితే ఆ తర్వాత ఐదో బంతికి అన్సారీ అద్భుతమైన ఫుల్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. కిషన్ డీప్ స్క్వేర్ లెగ్‌లో ఉన్న ఫీల్డర్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే జీషన్ అన్సారీ మాత్రం కిషన్‌కు ఫైరీ సెంఢాప్ ఇచ్చాడు. కిషన్ వైపు వేలు చూపిస్తూ ఇక ఆడింది చాలు, పెవిలియన్‌కు వెళ్లిపోమని సైగ చూశాడు. జీషన్ రియాక్షన్ చూసి ప్రతీ ఒక్కరూ షాక్ అయిపోయారు. కిషన్ మాత్రం నవ్వుతూ డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఈ టోర్నీ ఆరంభ మ్యాచ్‌లకు రెగ్యులర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ దూరం కావడంతో ఎస్ఆర్హెచ్ జట్టును కిషన్ నడిపించనున్నాడు.Send off to Ishan Kishan 🤯During the intra squad match today, Zeeshan Ansari, a bowler for Sunrisers Hyderabad, was seen giving a send off to his own captain Ishan Kishan after dismissing him.The team atmosphere doesn’t seem to be very good.pic.twitter.com/3b75QtTh3F— Stubbsy (@spideypant_) March 21, 2026చదవండి: IPL 2026: అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత! -
అభిషేక్ విధ్వంసం.. ఇషాన్ ఊచకోత!
ఐపీఎల్-2026 సీజన్ ఆరంభానికి ముందే సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు తమ విధ్వంసకర బ్యాటింగ్‌తో అన్ని జట్లను భయపెడుతున్నారు. శనివారం జరిగిన ఇంట్రా-స్క్వాడ్ మ్యాచ్‌లో ఎస్ఆర్హెచ్ స్టార్ బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.సన్‌రైజర్స్ రెండు జట్లగా విడిపోయి ప్రాక్టీస్ చేసింది. తొలుత సన్‌రైజర్స్-ఎ జట్టు తరపున ఆడిన అభిషేక్ తుపాన్ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు. ఉప్పల్ మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. కేవలం 42 బంతుల్లోనే 94 పరుగులు సాధించి అన్ని జట్లకు హెచ్చరిక జారీ చేశాడు.అతడి ఇన్నింగ్స్‌లో 7 సిక్స్‌లు, 8 ఫోర్లు ఉన్నాయి. అతడితో హెన్రీచ్ క్లాసెన్(31 బంతుల్లో 49), సలిల్ అరోరా (16 బంతుల్లో 47)రాణించారు. ఫలితంగా తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్-ఎ జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 253 పరుగుల భారీ స్కోర్ చేసింది. కెప్టెన్ ఇషాన్ మాత్రం కేవలం 18 పరుగులు మాత్రమే చేసి నిరాశపరిచాడు. సన్‌రైజర్స్-బి బౌలర్లలో జయదేవ్ ఉనాద్కత్ ఐదు వికెట్లతో సత్తా చాటగా.. నితీష్ రెడ్డి మూడు వికెట్లు తీసాడు. అనంతరం సన్‌రైజర్స్ బి టీమ్ తరపున కూడా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్‌లు ఓపెనర్లుగా బరిలోకి దిగారు. అయితే ఈసారి అభిషేక్ శర్మ(4) నిరాశపరిస్తే.. కిషాన్ మాత్రం విధ్వంసం సృష్టించాడు.ఇషాన్ 25 బంతుల్లో 72 పరుగులు చేసి తన బ్యాటింగ్ పవర్‌ను చూపించాడు. అయితే 253 పరుగుల భారీ లక్ష్యాన్ని మాత్రం బి టీమ్ చేరుకోలేకపోయింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.చదవండి: పాక్ టీవీ షోలో పాల్గొనడంపై విమర్శలు.. స్పందించిన గవాస్కర్🚨 "ABHISHEK SHARMA" STORM IN PRACTICE MATCH SIMULATION 🚨 He Smashed 94Runs off 42 balls with 7 Sixes and 8 Fours 🔥 He nearly Missed well deserved hundred Will IPL 2026 gonna be going hot for Abhishek's career ?? pic.twitter.com/dDaFiYgKQi— Kiara (@crickiara) March 21, 2026 -
ప్యాట్ కమిన్స్ దూరం.. SRH కెప్టెన్ గా ఇషాన్ కిషన్..
-
ఐపీఎల్ చరిత్రలో ఇదే తొలిసారి!
ఐపీఎల్-2026 సీజన్‌లోని ఆరంభ మ్యాచ్‌లలో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ వ్యవహరించనున్నాడు. ఎస్ఆర్హెచ్ రెగ్యూలర్ కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్ ప్రస్తుతం వెన్ను నొప్పి గాయంతో బాధపడుతున్నాడు. అతడు కోలుకోవడానికి మరో నాలుగు వారాల సమయం పట్టనుంది. దీంతో టోర్నీ ఫస్ట్ హాఫ్‌కు కమ్మిన్స్‌కు దూరంగా ఉన్నాడు. క్రమంలోనే కిషన్‌ను కెప్టెన్‌గా, వైస్ కెప్టెన్‌గా అభిషేక్ శర్మను సన్‌రైజర్స్ యాజమాన్యం నియమించింది.తొలిసారి అందరూ భారత కెప్టెన్లే.. సన్‌రైజర్స్ యాజమాన్యం ఇషాన్ కిషన్‌ను కెప్టెన్ ప్రకటించడంతో... ఐపీఎల్ చరిత్రలో తొలిసారి బరిలో ఉన్న 10 జట్లకు భారత ప్లేయర్లే సారథులుగా కనిపించనున్నారు. గత 18 సీజన్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. 19వ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు రుతురాజ్ గైక్వాడ్... రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు రజత్ పాటీదార్... ఢిల్లీ క్యాపిటల్స్‌కు అక్షర్ పటేల్... గుజరాత్ టైటాన్స్ జట్టుకు శుబ్‌మన్ గిల్... కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకు అజింక్య రహానే... రాజస్తాన్ రాయల్స్‌కు రియాన్ పరాగ్... ముంబై ఇండియన్స్‌కు హర్దిక్ పాండ్యా... పంజాబ్ కింగ్స్‌కు శ్రేయస్ అయ్యర్... లక్నో సూపర్ జెయింట్స్‌కు రిషభ్ పంత్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు.ఇక ఎస్ఆర్హెచ్ తమ తొలి మ్యాచ్‌లో లీగ్ ఆరంభం(మార్చి 28) రోజున చిన్నస్వామి స్టేడియం వేదికగా బెంగళూరుతో తలపడనుంది. ప్రస్తుతం బీసీసీఐ కేవలం 20 మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్‌ను మాత్రమే విడుదల చేసింది. -
ఎస్ఆర్హెచ్ కెప్టెన్‌గా ఇషాన్ కిషన్
ఐపీఎల్ 2026 సీజన్‌కు సంబంధించి సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఆరంభ మ్యాచ్‌లకు ఇషాన్ కిషన్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. అయితే ఎస్ఆర్హెచ్ రెగ్యులర్ కెప్టెన్ పాట్ కమిన్స్ గాయం కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమవ్వనున్నట్లు ఇప్పటికే జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. కాగా ఎస్ఆర్హెచ్ 2026 సీజన్లో ఆరంభం రోజునే డిఫెండింగ్ చాంపియన్ ఆర్సీబీతో తొలి మ్యాచ్ ఆడనుంది.ఈ నేపథ్యంలోనే కమిన్స్ స్థానంలో ఇషాన్ కిషన్ ఎస్ఆర్హెచ్ తాత్కాలిక కెప్టెన్‌గా బాధ్యతలు నిర్వహిస్తాడని యాజమాన్యం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక ఎస్ఆర్హెచ్ వైస్ కెప్టెన్‌గా విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ బాధ్యతలు తీసుకోనున్నట్లు స్పష్టం చేసింది. ఇటీవలే ముగిసిన టీ20 ప్రపంచకప్‌ను భారత్ గెలవడంలో ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మలు కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే.అభిషేక్ సంగతి పక్కనబెడితే రిషబ్ పంత్,జితేశ్ శర్మలు గాయాల బారీన పడడంతో ఇషాన్ కిషన్‌కు అనూహ్యంగా జట్టులోకి పిలుపొచ్చింది. టీ20 ప్రపంచకప్‌కు ముందు న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఇషాన్ కిషన్ అద్భుతంగా రాణించాడు. అదే ఫామ్‌ను టీ20 ప్రపంచకప్‌లోనూ కొనసాగించాడు. తాజాగా కమిన్స్ స్థానంలో కెప్టెన్‌గా ఎంపికైన ఇషాన్ కిషన్ ఐపీఎల్‌లోనూ అదరగొట్టాలని ఆశిద్దాం.ఇక వెన్ను గాయంతో బాధపడుతున్న కమిన్స్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు. వెన్నునొప్పి కారణంగానే ఇటీవల ముగిసిన టీ20 ప్రపంచకప్‌కు కూడా కమిన్స్ దూరమయ్యాడు. ఇక కమిన్స్ ఆస్ట్రేలియా వన్డే, టెస్టు జట్టు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. అయితే ఐపీఎల్ 2024 సీజన్లో కమిన్స్ సారథ్యంలోనే ఎస్ఆర్హెచ్ రన్నరప్‌గా నిలిచింది. ఆ సీజన్లో సంచలన ప్రదర్శనతో అదరగొట్టిన సన్‌రైజర్స్ ఫైనల్లో కోల్‌కతా నైట్‌రైడర్స్ చేతిలో ఓటమిపాలైంది. 2024 ఎడిషన్ నుంచి గేర్ మార్చిన ఎస్ఆర్హెచ్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్, లివింగ్‌స్టోన్, ఇషాన్ కిషన్ వంటి విధ్వంసకర ఆటగాళ్లతో బ్యాటింగ్ దుర్భేద్యంగా మారింది. అయితే 2025 సీజన్లో ఆశించినంతగా రాణించలేకపోయిన ఎస్ఆర్హెచ్ ఆరో స్థానానికి పరిమితమయ్యింది.సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు: ఇషాన్ కిషన్ (కెప్టెన్), అభిషేక్ శర్మ (వైస్ కెప్టెన్), అనికేత్ వర్మ, బ్రైడన్ కార్సే, ఇషాన్ మలింగ, హర్ష్ దూబే, హర్షల్ పటేల్, హెన్రిచ్ క్లాసెన్,ఘ, జయదేవ్ ఉనద్కత్, కమిందు మెండిస్, నితీష్ కుమార్ రెడ్డి, పాట్ కమిన్స్, స్మరణ్ రవిచంద్రన్, ట్రావిస్ హెడ్, జీషన్ అన్సారీ, సలీల్ అరోరా, శివంగ్ కుమార్, లివింగ్‌స్టోన్, జాక్ ఎడ్వర్డ్స్, అమిత్ కుమార్, క్రెయిన్స్ ఫెల్టూరా, సకిబ్ హుసేన్, ఒంకార్ తర్మలే, ప్రఫుల్ హింగే, శివమ్ మావి.𝐀𝐍𝐍𝐎𝐔𝐍𝐂𝐄𝐌𝐄𝐍𝐓 🚨 Pat Cummins will miss a few games while recovering from injury.Until he recovers, Ishan Kishan will be the Captain and Abhishek Sharma will be the Vice-Captain. pic.twitter.com/etXJUkQJeG— SunRisers Hyderabad (@SunRisers) March 18, 2026 -
SRH కొత్త కెప్టెన్ వచ్చేశాడోచ్..ఎవరు అంటే ..!
-
సన్‌రైజర్స్‌కు భారీ షాక్!.. ఇషాన్‌కు గోల్డెన్ ఛాన్స్!
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)-2026 ఆరంభానికి ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు సమాచారం. కెప్టెన్ ప్యాట్ కమిన్స్ గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఫలితంగా అతడు ఆరంభ మ్యాచ్‌లకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.నాలుగు మ్యాచ్‌లు కాగా మార్చి 28 నుంచి ఐపీఎల్ తాజా ఎడిషన్ మొదలుకానున్న విషయం తెలిసిందే. పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఐపీఎల్-2026కు సంబంధించి బీసీసీఐ తొలుత కేవలం ఇరవై మ్యాచ్‌లకు సంబంధించిన షెడ్యూల్ మాత్రమే ప్రకటించింది.ఇందులో భాగంగా సన్‌రైజర్స్ నాలుగు మ్యాచ్‌లలో ఒకటి మాత్రమే సొంత మైదానం ఉప్పల్ (Uppal)లో ఆడనుంది. ఇదిలా ఉంటే.. ఈ సీజన్లోనూ కమిన్స్ తమ జట్టుకు సారథ్యం వహిస్తాడని సన్‌రైజర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వెన్ను నొప్పి కారణంగా యాషెస్‌లో కొన్ని మ్యాచ్‌లు సహా టీ20 ప్రపంచకప్-2026 మొత్తానికి దూరమైన కమిన్స్ (Pat Cummins).. గాయం నుంచి ఇంకా కోలుకోలేదని ఈఎస్పీఎన్క్రిక్ఇన్ఫో కథనం పేర్కొంది.వారిద్దరిలో ఒకరు సారథి?ఒకవేళ కమిన్స్ నిజంగానే ఆరంభ మ్యాచ్‌లకు దూరమైతే ఓపెనింగ్ జోడీ ట్రవిస్ హెడ్- అభిషేక్ శర్మలలో ఒకరు సన్‌రైజర్స్‌ను ముందుకు నడిపిస్తారని వార్తలు వచ్చాయి. టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం.. దేశీ బాయ్, టీ20 వరల్డ్‌కప్ స్టార్ అభిషేక్ శర్మకే పగ్గాలు దక్కనున్నట్లు వార్తలు వచ్చాయి.ఇషాన్ వైపే యాజమాన్యం మొగ్గు?అయితే, తాజా సమాచారం ప్రకారం జార్ఖండ్ డైనమైట్, సన్‌రైజర్స్ వన్‌డౌన్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌కు ఈ బంపరాఫర్ దక్కినట్లు తెలుస్తోంది. దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2026లో జార్ఖండ్ కెప్టెన్‌గా, బ్యాటర్‌గా రాణించి తొలి టైటిల్ అందించాడు ఈ లెఫ్టాండ్ బ్యాటర్.ఈ క్రమంలో జాతీయ జట్టులోకి తిరిగి వచ్చి.. టీమిండియా టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో కీలక పాత్ర పోషించాడు ఇషాన్ కిషన్. మరోవైపు.. అభిషేక్ శర్మకు కూడా దేశీ క్రికెట్లో పంజాబ్‌కు సారథిగా వ్యవహరించిన అనుభవం ఉంది. అయితే, సన్‌రైజర్స్ యాజమాన్యం మాత్రం కమిన్స్ స్థానంలో తాత్కాలిక కెప్టెన్‌గా ఇషాన్ కిషన్‌ను నియమించేందుకే మొగ్గుచూపుతున్నట్లు సమాచారం. అభిషేక్‌పై అదనపు భారం పడకుండా ఉండేందుకు ఈ మేరకు ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: టీమిండియా హెడ్‌కోచ్‌గా ధోని రావాలి: గంభీర్ -
ఇషాన్ కెరీర్ బెస్ట్.. శాంసన్ అదరహో
భారత ఆటగాళ్ల సమిష్టి కృషితో టీ20 ప్రపంచకప్ నెగ్గిన టీమిండియా తాజాగా ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ అదరగొట్టింది. బుధవారం అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో భారత బ్యాటర్లు సత్తా చాటారు. భారత విధ్వంసక ఆల్‌రౌండర్ అభిషేక్ శర్మ (875 పాయింట్లు) తొలి స్థానాన్ని కాపాడుకున్నాడు. ఇక టీ20 ప్రపంచకప్‌లో 9 మ్యాచ్‌ల్లో 317 పరుగులతో భారత్ తరఫున రెండో టాప్ స్కోరర్‌గా నిలిచిన ఇషాన్ కిషన్ రెండు స్థానాలు మెరుగుపరుచుకొని 871 పాయింట్లతో రెండో ర్యాంకులో నిలిచి కెరీర్ బెస్ట్ సాధించాడు. మిగతా బ్యాటర్లలో తిలక్ వర్మ ఒక స్థానం దిగజారి 742 పాయింట్లతో ఏడో స్థానంలో నిలవగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 722 పాయింట్లతో 9వ స్థానంలో ఉన్నాడు. ఇక టీ20 ప్రపంచకప్ హీరో సంజూ శాంసన్ ఏకంగా 18 స్థానాలు ఎగబాకి 637 పాయింట్లతో 22వ స్థానంలో నిలిచి తన కెరీర్లో బెస్ట్ ర్యాంకును అందుకున్నాడు. ఓవరాల్‌గా టాప్-10లో నలుగురు భారత బ్యాటర్లు చోటు దక్కించుకోవడం విశేషం. బౌలింగ్ విభాగంలో అఫ్గానిస్థాన్ బౌలర్ రషీద్ ఖాన్ ఒక స్థానం ఎగబాకి 753 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. ఇక టీమిండియా మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఒక స్థానం దిగజారి 740 పాయింట్లతో రెండో స్థానంలో నిలవగా, పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఒక స్థానం ఎగబాకి 702 పాయింట్లతో ఆరో స్థానం దక్కించుకున్నాడు. మిగతా టీమిండియా బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు స్థానాలు దిగజారి 16వ స్థానంలో, అక్షర్ పటేల్ ఏకంగా ఆరు స్థానాలు ఎగబాకి 17వ స్థానానికి చేరుకున్నాడు. ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే జింబాబ్వే ఆల్‌రౌండర్ సికందర్ రజా, భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలవగా, శివమ్ దూబే మాత్రం రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి పడిపోయాడు.చదవండి: టీమిండియా సిగ్గుపడు!.. మాజీ క్రికెటర్‌కు ఇచ్చిపడేసిన గంభీర్ -
గంభీర్‌కు వ్యతిరేకంగా అగార్కర్ నిర్ణయాలు!.. ఫలితం?
టీమిండియా హెడ్‌కోచ్‌గా టెస్టు ఫార్మాట్లో విమర్శలు మూటగట్టుకున్న గౌతం గంభీర్.. వైట్ బాల్ క్రికెట్లో మాత్రం తిరుగులేని కోచ్ అనిపించుకుంటున్నాడు. అతడి మార్గదర్శనంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 టైటిల్ గెలిచిన భారత్.. ఆ తర్వాత పొట్టి ఫార్మాట్ ఆసియాకప్‌ను కైవసం చేసుకుంది.తాజాగా టీ20 ప్రపంచకప్-2026లోనూ చాంపియన్‌గా నిలిచిన టీమిండియా.. ఇంత వరకు ఏ జట్టుకు సాధ్యం కాని విధంగా సొంతగడ్డపై కప్ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో గంభీర్ విజయవంతమైన కోచ్ అంటూ ప్రశంసల వర్షం కురుస్తోంది.క్రెడిట్ గంభీర్ ఒక్కడిదే కాదు!అయితే, భారత జట్టు వరుస విజయాల్లో.. ముఖ్యంగా టీ20 వరల్డ్‌కప్ గెలవడంలో క్రెడిట్ గంభీర్ ఒక్కడికే కాకుండా.. చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్‌కూ దక్కాలనేది విశ్లేషకుల మాట. 2023లో టీమిండియా సెలక్షన్ కమిటీ చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టాడు ఈ మాజీ క్రికెటర్.అప్పటి నుంచి తనదైన మార్కు చూపించడంలో అగార్కర్ ఎప్పుడూ విఫలం కాలేదు. ముఖ్యంగా టీ20 ప్రపంచకప్-2024లో భారత్ చాంపియన్‌గా నిలిచిన తర్వాత.. రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. అతడి వారసుడిగా హార్దిక్ పాండ్యా ఎంపిక లాంఛనమేనని అంతా భావించారు.హార్దిక్ స్థానంలో సూర్యను ఎంపిక చేసిఅయితే, అనూహ్య రీతిలో అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సూర్యకుమార్ యాదవ్‌కు టీ20 జట్టు కెప్టెన్సీ పగ్గాలు అప్పగించింది. ఈ సందర్భంగా విమర్శలు వెల్లువెత్తగా.. అరుదైన పేస్ ఆల్‌రౌండర్ అయిన హార్దిక్ పాండ్యాను కాపాడుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని అగార్కర్ తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. అదనపు బాధ్యతను పాండ్యా నెత్తిన వేయలేమని పేర్కొన్నాడు.అందుకు తగ్గట్లే విజయవంతమైన కెప్టెన్‌గా సూర్య రాణించగా.. టీ20 ప్రపంచకప్-2026 గెలవడంలో ఆల్‌రౌండర్‌గా హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఇదిలా ఉంటే.. 2024 తర్వాత టీమిండియా టీ20 ఓపెనింగ్ జోడీగా సంజూ శాంసన్- అభిషేక్ శర్మ అద్భుతంగా రాణించారు.సంజూ అయితే ఏకంగా సౌతాఫ్రికా గడ్డ మీద సెంచరీలు బాది సత్తా చాటాడు. అయితే, ఆసియా కప్-2025 సందర్భంగా అప్పటికే టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా ఉన్న శుబ్‌మన్ గిల్ తిరిగి రావడంతో.. ఓపెనర్‌గా సంజూ స్థానం గల్లంతైది. కానీ సెలక్టర్ల నమ్మకాన్ని గిల్ వమ్ము చేశాడు. వరుస వైఫల్యాలతో అతడు సతమతం కాగా.. మేనేజ్మెంట్ తీరుపై విమర్శల వర్షం కురిసింది.గిల్‌పై వేటు వేస్తూ సంచలన నిర్ణయంగిల్ కోసం సంజూ లాంటి ప్రతిభావంతుడైన ఆటగాడిని బలిచేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ ఆరంభానికి ముందు సెలక్షన్ కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఊహించని రీతిలో గిల్‌పై వేటు వేసింది. ప్రపంచకప్ జట్టుకు అతడిని ఎంపిక చేయకుండా పక్కన పెట్టింది.ఈ విషయంలో గంభీర్- అగార్కర్ (Gautam Gambhir- Ajit Agarkar) మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం.. గంభీర్ గిల్‌ను ఎంపిక చేయాలని పట్టుబట్టగా.. ‘‘మీ అభిప్రాయంతో నేను ఏకీభవించకపోవచ్చు. అతడు నాణ్యమైన ఆటగాడు.కానీ జట్టులో ఇప్పుడు ఎవరో ఒకరికే స్థానం. ఒకరిని తప్పించక తప్పదు. ఆ ఒక్కడు గిల్. దీనర్థం అతడు ఇందుకు అనర్హుడని కాదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్లో ఎన్నో ఆప్షన్లు ఉండటమే ఇందుకు కారణం’’ అని అగార్కర్ వాదించినట్లు తెలుస్తోంది.ఇషాన్ విషయంలోనూ..అదే విధంగా... దేశీ క్రికెట్లో సత్తా చాటిన ఇషాన్ కిషన్.. దాదాపు మూడేళ్ల తర్వాత ఏకంగా ప్రపంచకప్ జట్టులో స్థానం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ విషయంలోనూ అగార్కర్‌దే తుది నిర్ణయం అని సమాచారం. ‘‘వైట్ బాల్ క్రికెట్లో అతడు టాపార్డర్‌లో ఆడతాడు.మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇంతకు ముందు కూడా టీమిండియాకు ఆడాడు. రిషభ్ పంత్. ధ్రువ్ జురెల్ కారణంగా ఈ వికెట్ కీపర్ బ్యాటర్ చాన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్నాడు. అంతేగానీ ప్రతిభ లేక కాదు’’ అని అగార్కర్ కన్విన్స్ చేసినట్లు తెలుస్తోంది. రింకూ సింగ్‌ను ఎంపిక చేయడంలోనూ చీఫ్ సెలక్టర్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.ఇటు ఇషాన్.. అటు సంజూఇక సెలక్టర్ల నమ్మకానికి తగ్గట్లు ఇషాన్ కిషన్ వరల్డ్‌కప్ టోర్నీలో దుమ్ములేపాడు. అయితే, గంభీర్ నిర్ణయానికి అనుగుణంగా నాకౌట్ దశలో తుదిజట్టులోకి వచ్చిన సంజూ ఆకాశమే హద్దుగా చెలరేగి.. వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీగా నిలిచి సత్తా చాటాడు.ఇదిలా ఉంటే.. భారత్ వరల్డ్‌కప్ గెలిచిన తర్వాత గంభీర్ మాట్లాడుతూ.. అగార్కర్‌కు క్రెడిట్ ఇవ్వడం విశేషం. ‘‘ఈ ట్రోఫీని నేను అగార్కర్‌కు అంకితం చేయాలి. అతడు చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అయినా సరే వెనక్కి తగ్గలేదు. నిజాయితీ గల ఇలాంటి వ్యక్తితో పనిచేయడం పట్ల ఎల్లప్పుడూ కృతజ్ఞుడినై ఉంటాను’’ అని గంభీర్ పేర్కొన్నాడు.చదవండి: T20 WC 2026: 'భారత్ ఒక ఛాంపియన్ జట్టు.. తప్పులు వెతకడం ఆపండి'⭐ 2007 ⭐ 2024 ⭐ 2026History repeated. History defeated. 🇮🇳💙#T20WorldCup pic.twitter.com/dRrraSdOoi— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
ఐసీసీ ప్రపంచకప్ టీమ్‌లో సామ్సన్, బుమ్రా, పాండ్యా, ఇషాన్... కెప్టెన్‌గా మార్క్రమ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రకటించిన టి20 ప్రపంచకప్ జట్టులో టైటిల్ నిలబెట్టుకున్న టీమిండియా నుంచి నలుగురు ఆటగాళ్లకు చోటు దక్కింది. ఈ జట్టుకు మార్క్రమ్ (దక్షిణాఫ్రికా) కెపె్టన్ కాగా, ఓపెనింగ్‌లో సంజూ సామ్సన్, టాపార్డర్‌లో ఇషాన్ కిషన్, మిడిలార్డర్లో హార్దిక్ పాండ్యా, బౌలింగ్‌లో పేసర్ జస్ప్రీత్ బుమ్రాకు చోటు లభించింది. పాకిస్తాన్ నుంచి టాప్ స్కోరర్‌గా నిలిచిన సాహిబ్జాదా ఫర్హాన్ ఈ ఐసీసీ టీమ్‌లో ఓపెనర్‌గా ఉన్నాడు.చిత్రంగా రన్నరప్ న్యూజిలాండ్ జట్టులో నుంచి కనీసం 12వ ఆటగాడిగా కూడా ఎవరికీ చాన్స్ దక్కలేదు. ఐసీసీ టి20 ప్రపంచకప్ జట్టు: మార్క్రమ్ (కెపె్టన్), ఫర్హాన్ (పాకిస్తాన్), సామ్సన్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, బుమ్రా (భారత్), విల్ జాక్స్, ఆదిల్ రషీద్ (ఇంగ్లండ్), జేసన్ హోల్డర్ (వెస్టిండీస్), ఎన్గిడి (దక్షిణాఫ్రికా), ముజరబాని (జింబాబ్వే), షాడ్లీ వాన్ షాలి్వక్ (అమెరికా; 12వ ప్లేయర్). -
ఫైనల్‌కు ముందు సిస్టర్ మృతి.. పుట్టెడు దుఃఖంలోనూ అదరగొట్టిన కిషన్
టీమిండియా ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్ ట్రోఫీని ముద్దాడిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ వేదికగా జరిగిన ఫైనల్లో 96 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. అయితే ఈ విజయంలో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌ది కీలక పాత్ర. అభిషేక్ శర్మ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన ఇషాన్ దూకుడుగా ఆడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.కేవలం 25 బంతుల్లోనే 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 54 పరుగులు చేశాడు. అయితే ఈ ఇన్నింగ్స్ వెనుక ఒక గుండెల్ని పిండేసే విషాదం దాగి ఉంది. ఓ వైపు కన్నీళ్లను దిగమింగుతూనే తన జట్టును వరల్డ్ ఛాంపియన్‌గా నిలిపాడు.ఏమి జరిగిందంటే?ఫైనల్‌కు ఒక్క రోజు ముందు (శనివారం) ఇషాన్ కిషన్ కుటంబంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కిషన్ కజిన్ సోదరి (వైష్ణవి సింగ్), ఆమె భర్త రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. కోల్‌కతాలో ఓ వివాహ వేడుకకు వెళ్తుండగా ఈ ఊహించని సంఘటన జరిగింది. వారిద్దరి మరణం కిషన్ కుటుంబాన్ని కుదిపేసింది.ఆరు నెలల పసికందు, మూడేళ్ల చిన్నారి అనాథలయ్యారు. ఈ విషయంపై కిషన్ తండ్రి ప్రణవ్ పాండే స్పందిస్తూ.. చాలా ఘోరం జరిగిపోయింది. మేము చాలా బాధలో ఉన్నాము అని అన్నారు. వాస్తవానికి ఆయన అహ్మదాబాద్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌కు హాజరావ్వాల్సి ఉండేది. కానీ తమ కుటుంబంలో చోటు చేసుకున్న విషాదం కారణంగా ప్రణవ్ కోల్‌కతాలో ఉండిపోయారు. మ్యాచ్ అనంతరం కిషన్ కూడా మాట్లాడుతూ.. నిన్న నేను నా కజిన్ సోదరిని రోడ్డు ప్రమాదంలో కోల్పోయాను. ఆమె ఎప్పుడూ నేను బాగా ఆడాలని కోరుకునేది. ఇప్పుడు నన్ను ఛాంపియన్‌గా చూసేందుకు ఆమె మాతో లేదు. చాలా బాధగా ఉందని కిషన్ భావోద్వేగానికి లోనయ్యాడు. కాగా దాదాపు రెండేళ్ల తర్వాత భారత జట్టులోకి తిరిగొచ్చిన ఇషాన్ దుమ్ములేపుతున్నాడు.చదవండి: T20 WC 2026: సంజూ, బుమ్రానే కాదు.. వారిద్దరూ కూడా హీరోలే -
సంజూ ఎవరు?.. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాం: పాక్ క్రికెటర్
టీమిండియా వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ గెలవడంపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ అహ్మద్ షెహజాద్ స్పందించాడు. భారత్‌లో ప్రతిభ గల క్రికెటర్లకు కొదవలేదని.. అక్కడి గొప్ప వ్యవస్థ కూడా ఈ అరుదైన ఘనతకు కారణం అన్నాడు. మరోవైపు.. పాకిస్తాన్లో కూడా ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారని.. అయితే, పాక్ బోర్డు తీరు మాత్రం సరిగ్గా లేదని విమర్శించాడు.టీ20 ప్రపంచకప్-2026 ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌పై 96 పరుగుల తేడాతో ఏకపక్ష విజయం సాధించిన విషయం తెలిసిందే. తద్వారా సొంతగడ్డపై పొట్టి క్రికెట్ వరల్డ్‌కప్ గెలిచిన జట్టుగా.. ఓవరాల్‌గా మూడుసార్లు టీ20 ప్రపంచకప్ అందుకున్న టీమ్‌గా చరిత్ర సృష్టించింది.ప్రశంసల వర్షం ఈ నేపథ్యంలో పాక్ మాజీ బ్యాటర్ అహ్మద్ షెహజాద్ టీమిండియాపై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తీరును కొనియాడుతూ.. పాక్ క్రికెట్ బోర్డు (PCB)కు గట్టిగానే చురకలు అంటించాడు.‘‘పాకిస్తాన్లో క్రికెట్ టాలెంట్‌కు కొదవలేదు. ఇక్కడ చాలా మంది ప్రతిభావంతులైన క్రికెటర్లు ఉన్నారు. అయితే, లోపమంతా ఇక్కడి వ్యవస్థలోనే ఉంది. మరి ఇండియాలో.. అక్కడ ప్రతిభ, సరైన వ్యవస్థ.. రెండూ ఉన్నాయి. వారు సాధిస్తున్న విజయాలే ఇందుకు నిదర్శనం.అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు?అసలు ఈ సంజూ శాంసన్ ఎవరు? అతడికి అసలు గతంలో అవకాశాలు వచ్చేవా?.. మరి ఇప్పుడో.. అతడు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు. ఇక ఈ ఇషాన్ కిషన్.. అతడు ఎప్పుడో ఒకసారి మాత్రమే జట్టుకు ఆడతాడు.క్రమశిక్షణరాహిత్యానికి పాల్పడ్డాడని బోర్డు అతడిని శిక్షించింది. ఆ కసితో దేశవాళీ క్రికెట్లో అతడు రాణిస్తే.. తిరిగి నేరుగా ప్రపంచకప్ జట్టుకు ఎంపిక చేసింది. అదే విధంగా అభిషేక్ శర్మ.. టోర్నీ ఆరంభం నుంచి ఒత్తిడిలో కూరుకుపోయి విఫలమయ్యాడు.అయినా యాజమాన్యం అతడిపై నమ్మకం ఉంచింది. అందుకు ప్రతిగా ఫైనల్లో 21 బంతుల్లోనే 52 పరుగులతో సత్తా చాటాడు. టీమిండియా పెద్ద పెద్ద మ్యాచ్‌లలో పెద్ద జట్లను ఓడిస్తుంది. ఉగాండా, కెన్యాలను ఓడిస్తాంకానీ మన పాకిస్తాన్ జింబాబ్వే, ఉగాండా, కెన్యా వంటి పసికూన జట్లపై విజయాలను పండుగ చేసుకుంటుంది. వాళ్లను ఇక్కడికి పిలిపించి వారిపై గెలుపును ఆస్వాదిస్తుంది. ఇదే తేడా’’ అని అహ్మద్ షెహజాద్ పాక్ క్రికెట్‌ను ఘాటుగా విమర్శిస్తూ.. టీమిండియాను ప్రశంసించాడు. చదవండి: T20 WC 2026: సలాం సంజూ శాంసన్Pressure? WHAT PRESSURE!? 💪Third consecutive fifty for Sanju Samson, all on the biggest stage! 😍🚨 Only Indians with fifties in semi-final & final of an ICC Men's T20 WC:👉 Virat Kohli | 2014👉 Sanju Samson | 2026ICC Men’s #T20WorldCup | FINAL | #INDvNZ | LIVE NOW 👉… pic.twitter.com/dHtwpFQet2— Star Sports (@StarSportsIndia) March 8, 2026 -
టి20 ప్రపంచకప్‌లో తుది పోరుకు భారత్ (ఫొటోలు)
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. వరల్డ్ రికార్డు
టీమిండియా సరికొత్త చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్లో ఇంత వరకు ఏ జట్టుకూ సాధ్యం కాని ఘనత సాధించింది. పురుషుల పొట్టి ఫార్మాట్లో అత్యంత అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.జింబాబ్వేపై 256 పరుగులుభారత జట్టు సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 టోర్నీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. సూపర్-8 దశలో జింబాబ్వేపై 256 పరుగులు సాధించిన భారత జట్టు.. తాజాగా గురువారం నాటి మ్యాచ్‌లోనూ 250కి పైగా స్కోరు నమోదు చేసింది.పొట్టి క్రికెట్లో తొలి జట్టుగాముంబైలోని ప్రసిద్ధ వాంఖడే మైదానంలో ఇంగ్లండ్‌తో సెమీ ఫైనల్లో.. నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 253 పరుగులు సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ (42 బంతుల్లో 82) అదరగొట్టగా.. ఇషాన్ కిషన్ (18 బంతుల్లో 39), శివం దూబే (25 బంతుల్లో 43), హార్దిక్ పాండ్యా (12 బంతుల్లో 27), తిలక్ వర్మ (7 బంతుల్లో 21) మెరుపులు మెరిపించారు.Another must-win game, another Sanju Samson masterclass! 🔥His maiden T20I fifty against England and what an occasion to bring it up! 👏ICC Men’s #T20WorldCup | Semi-final 2 | #INDvENG | LIVE NOW 👉 https://t.co/L2OuYBUDbL pic.twitter.com/1csgOPterB— Star Sports (@StarSportsIndia) March 5, 2026ఫలితంగా టీమిండియాకు ఈ మేర 253 పరుగుల స్కోరు సాధ్యమైంది. ఈ క్రమంలోనే పొట్టి క్రికెట్లో అత్యధిక సార్లు 250 ప్లస్ స్కోరు సాధించిన జట్టుగా నిలిచింది. తద్వారా ఐపీఎల్ ఫ్రాంఛైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.పురుషుల టీ20 క్రికెట్లో అత్యధిక సార్లు 250కి పైగా పరుగులు సాధించిన జట్లు👉టీమిండియా- ఆరు సార్లు👉సన్‌రైజర్స్ హైదరాబాద్- ఐదు సార్లు👉వెస్టిండీస్- మూడు సార్లు👉జింబాబ్వే- మూడు సార్లు👉సర్రే- మూడు సార్లు.చదవండి: IND vs ENG: సెమీస్‌లోనూ ఫెయిల్.. జట్టు నుంచి తీసేయండి! -
T20 WC: మారవా?.. సంజూ శాంసన్ విఫలం
ఐసీసీ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ లీగ్ దశలో ఒకే ఒక్క మ్యాచ్ ఆడాడు సంజూ శాంసన్. నమీబియాతో మ్యాచ్‌కు అభిషేక్ శర్మ దూరం కావడంతో.. ఓపెనర్‌గా అతడి స్థానంలో వచ్చాడు. పసికూనతో మ్యాచ్‌లో ఎనిమిది బంతుల్లో 22 పరుగులు చేయగలిగాడు.అయితే, ఆ తర్వాత మళ్లీ సంజూ (Sanju Samson)కు తుదిజట్టులో చోటు దక్కలేదు. ఓపెనింగ్ జోడీలో ఇషాన్ కిషన్ (Ishan Kishan) మెరుగ్గా ఆడగా.. అభిషేక్ శర్మ లీగ్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అయినప్పటికీ యాజమాన్యం అతడిని కొనసాగించింది. సంజూను బెంచ్‌కు పరిమితం చేసింది.మరో అవకాశంఅయితే, తాజాగా జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ సందర్భంగా మరోసారి సంజూ శాంసన్‌కు మేనేజ్మెంట్ అవకాశం ఇచ్చింది. లెఫ్ట్-రైట్ కాంబినేషన్ కోసం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో లెఫ్టాండర్ అభిషేక్ శర్మతో కలిసి ఈ వికెట్ కీపర్ బ్యాటర్ గురువారం భారత జట్టు ఇన్నింగ్స్ ఆరంభించాడు. 𝐃𝐈𝐒𝐏𝐀𝐓𝐂𝐇𝐄𝐃 🚀Sanju Samson starts the innings on a positive note! 💪ICC Men’s #T20WorldCup 👉 SUPER 8, #INDvZIM | LIVE NOW ➡️ https://t.co/vIdZg7mGmy pic.twitter.com/TtmJRlvcR0— Star Sports (@StarSportsIndia) February 26, 2026ఘనంగానే ఆరంభించాడు.. కానీఇన్నింగ్స్ రెండో బంతికే సిక్స్ బాది ఘనంగా ఆరంభించాడు సంజూ. రెండో ఓవర్లోనూ ఓ సిక్సర్ బాదిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ మరుసటి ఓవర్లో బౌండరీ రాబట్టాడు. ఇలా మంచి ఫామ్‌లోకి వచ్చిన సంజూ.. నాలుగో ఓవర్లో రెండో బంతికి భారీ షాట్‌కు యత్నించి అవుటయ్యాడు.బ్లెసింగ్ ముజర్బానీ సంధించిన షార్ట్ బాల్‌ను సంజూ గాల్లోకి లేపగా.. డీప్ మిడ్ వికెట్ నుంచి పరిగెత్తుకు వచ్చి ర్యాన్ బర్ల్ క్యాచ్ అందుకున్నాడు. ఫలితంగా సంజూ శాంసన్ పెవిలిన్ చేరగా.. భారత్ తొలి వికెట్ కోల్పోయింది. మారవా సంజూ!జింబాబ్వేతో మ్యాచ్‌లో మొత్తంగా 15 బంతులు ఎదుర్కొన్న సంజూ.. ఒక ఫోర్, రెండు సిక్సర్లు బాది 24 పరుగులు చేయగలిగాడు. దీంతో రాకరాక వచ్చిన అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేకపోయాడని అభిమానులు ఉసూరుమంటున్నారు.ఇక తుదిజట్టులో సంజూను చూడటం కష్టమేనని వాపోతున్నారు. కాగా టీ20 ప్రపంచకప్ టోర్నీ ఆరంభానికి ముందు న్యూజిలాండ్‌తో సిరీస్‌లోనూ సంజూ వరుసగా విఫలమయ్యాడు. దీంతో ఓపెనర్‌గా సంజూ స్థానాన్ని ఇషాన్ భర్తీ చేశాడు. ఇక జింబాబ్వేతో మ్యాచ్‌తో సంజూ తిరిగి రాగా.. ఇషాన్ వన్‌డౌన్‌లో దిగాడు. పవర్ ప్లేలో టీమిండియా స్కోరు: 80-1(6). ఆరు ఓవర్ల ఆట ముగిసే సరికి ఇషాన్ 15, అభిషేక్ శర్మ 33 పరుగులతో క్రీజులో నిలిచారు. చెన్నై వేదికగా టాస్ గెలిచిన జింబాబ్వే తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. భారత్ బ్యాటింగ్‌కు దిగింది.చదవండి: సౌతాఫ్రికా ఘన విజయం.. టీమిండియాకు గుడ్‌న్యూస్! -
దూసుకొచ్చిన ఇషాన్ కిషన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ దుమ్మురేపాడు. ఏకంగా మూడు స్థానాలు ఎగబాకి టాప్ ప్లేస్ దిశగా దూసుకొచ్చాడు. గత వారం ఎనిమిదో స్థానంలో ఉండిన అతను.. తాజాగా ఐదో స్థానానికి ఎగబాకాడు. వరుస వైఫల్యాల తర్వాత కూడా భారత విధ్వంసకర ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నెలబెట్టుకున్నాడు. అయితే రెండో ప్లేస్‌లో ఉన్న ఫిల్ సాల్ట్‌కు అతనికి మధ్య పాయింట్ల వత్యాసం బాగా తగ్గింది. ప్రస్తుత ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణిస్తున్న పాక్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ తన కెరీర్లో మొదటిసారి టాప్-3లోకి వచ్చాడు. ప్రపంచకప్‌లో వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన ఫర్హాన్.. 2 స్థానాలు మెరుగుపర్చుకొని మూడో స్థానానికి చేరాడు. తాజాగా సెంచరీ చేసినా లంక ఆటగాడు నిస్సంక ఓ స్థానం కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయాడు. ప్రపంచకప్‌లో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు చేయలేకపోయినా సూర్యకుమార్ యాదవ్ ఆరో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. పేలవ ఫామ్‌లో ఉన్న తిలక వర్మ (Tilak Varma) 3 స్థానాలు కోల్పోయి 7వ స్థానానికి పడిపోయాడు. సౌతాఫ్రిక చిచ్చరపిడుగు డెవాల్డ్ బ్రెవిస్ ఈ వారం ర్యాంకింగ్స్‌లో అత్యధికంగా లబ్ది పొందిన ఆటగాడిగా నిలిచాడు. బ్రెవిస్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 9వ స్థానానికి చేరాడు.మరిన్ని చెప్పుకోదగ్గ మార్పులు ఇవే..హ్యారీ బ్రూక్- 18వ ర్యాంక్ (10 స్థానాలు ఎగబాకి)శివమ్ దూబే- 28వ ర్యాంక్ (13 స్థానాలు ఎగబాకి)షిమ్రోన్ హెట్‌మైర్- 46 (10 స్థానాలు ఎగబాకి)షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్- 50 (8 స్థానాలు ఎగబాకి)డేవడ్ మిల్లర్- 69 (10 స్థానాలు ఎగబాకి)విల్ జాక్స్- 71 (21 స్థానాలు ఎగబాకి)శ'బాష్'ఈ వారం టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా బౌలర్ కార్బిన్ బాష్ ఏకంగా 21 స్థానాలు ఎగబాకి 3వ స్థానానికి చేరాడు. భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టాప్ ప్లేస్‌ను కాపాడుకున్నాడు. వెస్టిండీస్ బౌలర్ మాథ్యూ ఫోర్డ్ కూడా ర్యాంకింగ్స్‌లో గణనీయంగా లబ్ది పొందాడు. ఇతను ఏకంగా 23 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరాడు. భారత పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా కూడా ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఓ మోస్తరుగా లబ్ది పొందాడు. 7 స్థానాలు మెరుగుపర్చుకొని 8వ స్థానానికి ఎగబాకాడు. మిగతా భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ 3, అక్షర్ పటేల్ 10 స్థానాలు కోల్పోయి 20, 24 స్థానాలకు పడిపోయారు.భారీగా లబ్బి పొందిన బౌలర్లు..మార్కో జన్సెన్- 19వ ర్యాంక్ (8 స్థానాలు ఎగబాకి)గుడకేశ్ మోటీ- 22 (17 స్థానాలు ఎగబాకి)లియామ్ డాసన్- 23 (23 స్థానాలు ఎగబాకి)ఫమార్ జోసఫ్- 54 (14 స్థానాలు ఎగబాకి)ఉస్మాన్ తారిక్- 55 (59 స్థానాలు ఎగబాకి)షాదాబ్ ఖాన్- 65 (10 స్థానాలు ఎగబాకి)మొహమ్మద్ నబీ- 78 (37 స్థానాలు ఎగబాకి)తిరిగి నంబర్ వన్‌గా ఆల్‌రౌండర్ల విభాగానికి వస్తే.. జింబాబ్వే ఆటగడు సికందర్ రజా తిరిగి తన నంబర్ వన్ పీఠాన్ని అధిరోహించాడు. పాక్ ఆటగాడు సైమ్ అయూబ్‌ను కిందకు దించి ఈ ఘనత సాధించాడు. భారత ఆటగాళ్లలో హార్దిక్ పాండ్యా మూడో స్థానాన్ని నిలబెట్టుకోగా.. శివమ్ దూబే రెండు స్థానాలు మెరుగుపర్చుకొని ఏడో స్థానానికి చేరాడు. -
ముగ్గురూ లెఫ్టాండర్లే.. మాకు కష్టమే: టీమిండియా కోచ్
టీమిండియా అజేయంగా టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో సూపర్-8 దశకు చేరుకుంది. గ్రూప్-ఎలో అమెరికా, నమీబియా, పాకిస్తాన్, నెదర్లాండ్స్‌లను ఓడించి టాపర్‌గా తదుపరి దశకు అర్హత సాధించింది.అయితే, నమీబియా, పాకిస్తాన్‌లపై అలవోకగా విజయం సాధించిన సూర్యకుమార్ సేనకు.. పసికూనలు అమెరికా, నెదర్లాండ్స్ మాత్రం గట్టి సవాలు విసిరాయి. కష్టమ్మీద అమెరికాను 29 పరుగుల తేడాతో ఓడించిన భారత్.. నెదర్లాండ్స్‌పై 17 పరుగుల తేడాతో గట్టెక్కింది. నిజానికి ఏకపక్ష విజయాలు సాధిస్తుందనుకున్న మ్యాచ్‌లలోనే టీమిండియా తడబడటం గమనార్హం.ముగ్గురూ లెఫ్టాండర్లేఇక ఓపెనర్ అభిషేక్ శర్మ ఆడిన మూడు మ్యాచ్‌లలో డకౌట్ అయ్యాడు. అతడికి తోడుగా ఉన్న మరో లెఫ్టాండర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ అదరగొడుతుండటం సానుకూలాంశం కాగా.. మరో ఎడమ చేతి వాటం బ్యాటర్, వన్‌డౌన్‌లో వచ్చే తిలక్ వర్మ మాత్రం క్రీజులో కుదురుకునేందుకు చాలా సమయం తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో సూపర్-8లో టీమిండియా కఠిన సవాళ్లు ఎదుర్కోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయాన్ని అసిస్టెంట్ కోచ్ ర్యాన్ డష్కాటే సైతం అంగీకరించాడు. టీమిండియా ప్రధానంగా రెండు సమస్యలు ఎదుర్కోంటోందని తెలిపాడు.ప్రధానంగా రెండు సమస్యలుటాపార్డర్లో ముగ్గురూ లెఫ్టాండర్ బ్యాటర్లే ఉండటం ఒక సమస్య అయితే.. ఫింగర్ స్పిన్నర్లను ఎదుర్కోవడంలో తడబాటు మరో సమస్య అని డష్కాటే పేర్కొన్నాడు. ‘‘టాప్-3లో మాకు ఎక్కువగా ఆప్షన్లు లేవు. సంజూ బెంచ్ మీద ఉన్నాడు. కాబట్టి ముగ్గురూ ఎడమచేతి వాటం బ్యాటర్లే కొనసాగుతున్నారు.అయితే, మా బ్యాటర్లలో చాలా మంది ఫింగర్ స్పిన్‌ను ఎదుర్కోవడంలో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి సూపర్-8లో వెస్టిండీస్, సౌతాఫ్రికా మాపై ఇలాంటి బౌలర్లను ప్రయోగించడం ఖాయమే. అయితే, మాకు అత్యుత్తమ బ్యాటర్లు ఉండటం కలిసి వచ్చే అంశం.14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్పాకిస్తాన్ కూడా గత మ్యాచ్‌లో 14 ఓవర్ల పాటు ఫింగర్ స్పిన్ వేయించింది. ఆఫ్ స్పిన్ కంటే ఫింగర్ స్పిన్నే ఎక్కువగా వాళ్లు నమ్ముకున్నారని నేను అంటాను. కొలంబో వంటి స్లో పిచ్‌లపై ఇలాంటివి వర్కౌట్ అవుతాయి.అయితే, మా వాళ్లు అలాంటి చోట సమస్యను అధిగమించారు. కాబట్టి మరీ అంతగా ఆందోళన చెందాల్సిన పనిలేదు’’ అని డష్కాటే చెప్పుకొచ్చాడు.కాగా ఆఫ్ స్పిన్నర్లు బంతిని టర్న్ చేసే క్రమంలో మణికట్టు కదలికల (కుడి నుంచి ఎడమకు)పై ఆధారపడితే.. ఫింగర్ స్పిన్నర్లు చూపుడు లేదంటే మధ్యవేలును ఉపయోగించి బంతి దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు. ఈ చిన్న తేడా తప్ప రెండు దాదాపుగా ఒకే విధమైన బౌలింగ్ శైలి అని చెప్పవచ్చు. కాగా సూపర్-8లో భారత్ వరుసగా సౌతాఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్‌లతో తలపడుతుంది.చదవండి: T20 WC 2028: నేరుగా అర్హత సాధించిన బంగ్లాదేశ్ -
షాన్ కిషన్ పెళ్లిపై తాతయ్య గ్రీన్ సిగ్నల్.. తల్లి షాకింగ్ కామెంట్స్!
-
ఆయన ముసలోడు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!
భారత జట్టులోకి పునరాగమనం చేసిన యువ బ్యాటర్ ఇషాన్ కిషన్ ఇరగదీస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026 టోర్నమెంట్లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా పాకిస్తాన్‌తో మ్యాచ్‌లో టీమిండియా గెలవడంలో ఈ వికెట్ కీపర్ బ్యాటర్‌దే కీలక పాత్ర.విధ్వంసకర ఓపెనర్‌గా పేరొందిన అభిషేక్ శర్మ డకౌట్ అయినా.. ఇషాన్ (Ishan Kishan) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 10 ఫోర్లు, మూడు సిక్స్‌లు బాది 77 పరుగులు సాధించాడు.ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల తేడాతో పాక్ (IND Beat PAK)ను చిత్తు చేయగా.. ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇదిలా ఉంటే.. వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత ఈ జార్ఖండ్ డైనమైట్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడంటూ ఇషాన్ తాతయ్య అనురాగ్ పాండే ANIతో పేర్కొన్న విషయం తెలిసిందే.అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్‘‘ఇషాన్ ఎవరిని ఎంచుకున్నా ఆ అమ్మాయితోనే అతడి వివాహం జరిపించేందుకు మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అదితి వాడి గర్ల్‌ఫ్రెండ్. ఆమె ఒక మోడల్. పిల్లలు కోరుకున్నది అందించడంలోనే పెద్దలకు సంతృప్తి, సంతోషం లభిస్తాయి’’ అని అనురాగ్ పాండే పేర్కొన్నారు. దీంతో ఇషాన్ త్వరలోనే పెళ్లి బంధంలో అడుగుపెట్టనున్నాడనే వార్తలు వైరల్ అయ్యాయి.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఆయన ముసలివారు!.. వాడికి పెళ్లి వయసు రాలేదు!ఈ విషయంపై ఇషాన్ కిషన్ తల్లి సుచిత్రా దేవి స్పందించారు. ఇషాన్ వివాహం గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. ఈ మేరకు IANSతో మాట్లాడుతూ.. ‘‘ఇది పెళ్లి చేసుకునే సమయం కాదు. ఆటపై మరింతగా దృష్టి పెట్టాల్సిన తరుణం. తనకు ఇంకా పెళ్లి వయసు రాలేదు.వాళ్ల తాతయ్య ముసలివారు అవుతున్నారు కదా!.. వృద్ధులకు మనుమల విషయాల పట్ల ఉత్సుకత కాస్త ఎక్కువగానే ఉంటుంది. సోషల్ మీడియాలో వస్తున్న వాటిని చూసే ఆయన అలా మాట్లాడారు. అంతకు మించి ఏమీలేదు’’ అని సుచిత్రా దేవి కొట్టిపారేశారు.కష్టపడి.. రీఎంట్రీకాగా 27 ఏళ్ల ఇషాన్ కిషన్ క్రమశిక్షణారాహిత్యం వల్ల దాదాపు మూడేళ్లు జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలో దేశవాళీ క్రికెట్లో సత్తా చాటి ఇటీవలే టీమిండియాలో రీఎంట్రీ ఇచ్చాడు. ఓపెనర్, వికెట్ కీపర్‌గా భారత టీ20 జట్టులో సంజూ శాంసన్ స్థానాన్ని భర్తీ చేసి.. అతడికి చెక్ పెట్టాడు.ఇదిలా ఉంటే.. ఇషాన్ కిషన్.. అదితి హుండియా అనే మోడల్‌తో ప్రేమలో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆమె రాజస్తాన్‌కు చెందిన వారని సమాచారం. ఇక వరల్డ్‌కప్ టోర్నీలో టీమిండియా ఇప్పటికే సూపర్-8 చేరిన విషయం తెలిసిందే. Patna, Bihar: On India beating Pakistan by 61 runs in the ICC Men’s T20 World Cup 2026 match, Indian cricketer Ishan Kishan's mother, Suchitra Devi says, "Many congratulations to the Indian cricket team on their victory. Heartfelt congratulations to the entire team for such a… pic.twitter.com/luxVYzbd7H— IANS (@ians_india) February 15, 2026చదవండి: IND vs NED: అతడిపై వేటు!.. భారత తుదిజట్టు ఇదే! -
పెళ్లి పీటలెక్కబోతున్న ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌తో బిజీగా ఉన్న అతను.. మెగా టోర్నీ ముగిసాక తన ప్రేయసి అదితి హుండియాను మనువాడబోతున్నాడని సమాచారం. ఈ విషయాన్ని ఇషాన్ తాత అనురాగ్ పాండే స్వయంగా వెల్లడించారు. ఏఎన్ఐతో ఆయన మాట్లాడుతూ.. ఇషాన్ ఎవరిని పెళ్లి చేసుకోవాలనుకున్నా, తాము అంగీకరించేందుకు సిద్దంగా ఉన్నాము. ఇషాన్ గర్ల్ ఫ్రెండ్ పేరు అదితి. ఆమె ఓ మోడల్. పిల్లలను సంతోషపెట్టే వాటిని పెద్దలు అంగీకరించాలని అన్నాడు.#WATCH | Aurangabad, Bihar | Grandfather of Indian Cricketer Ishan Kishan, Anurag Pandey says, "...We are ready to accept whoever Ishan Kishan wants to marry. Aditi is his girlfriend...She is a model...One should accept what makes children happy..." (14.03) pic.twitter.com/narb5aZHtx— ANI (@ANI) February 14, 2026ఇషాన్‌కు సంబంధించిన ఈ వార్త ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరలవుతోంది. ఇషాన్ నిన్న (ఫిబ్రవరి 15) టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా పాకిస్తాన్‌పై చెలరేగిపోయాడు. కేవలం 40 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 77 పరుగులు చేశాడు. ఈ ఇన్నింగ్స్ ప్రధాన కారణంగా భారత్ పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు ఓడించింది. తన విధ్వంసకర ప్రదర్శనకు గానూ ఇషాన్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా గెలుచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ జట్టులోకి అనూహ్యంగా వచ్చిన ఇషాన్ అంచనాలకు మించి రాణిస్తూ.. భారత క్రికెట్ అభిమానుల మనసుల్లో చెరగని ముద్ర వేస్తున్నాడు.పాక్‌పై వీరబాదడు తర్వాత ఇషాన్ పెళ్లి ప్రస్తావన రావడం అభిమానులకు జోష్‌నిస్తుంది. వాస్తవానికి ఇషాన్-అదితి బంధంపై చాలా రోజులుగా సోషల్‌మీడియాలో రకరకాల ఊహాగానాలు వినిపిస్తుండేవి. కొందరు వీరిని ప్రేమికులంటే, మరికొందరు కేవలం స్నేహితులు మాత్రమేనని అన్నారు. ఇషాన్ తాత తాజా ప్రకటనతో ఇషాన్-అదితి బంధం బహిర్గతమైపోయింది. పెళ్లిపై ఇషాన్ కాని, అదితి కాని ఎలాంటి అధికారిక ప్రకటన చేయకపోయినా, ఇరు కుటుంబాల్లో పెళ్లి చర్చలు మొదలయ్యాయనే విషయం సుస్పష్టమైంది.ఎవరీ అదితి హుండియా..?ఇషాన్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిగా చెప్పుకుంటున్న అదితి హుండియా జైపూర్‌కు చెందిన ఓ ప్రముఖ మోడల్. ఈ అమ్మాయి 1997 జనవరి 15న జన్మించింది. ప్రస్తుతం ఆమె వయసు 29 సంవత్సరాలు. అదితి జైపూర్‌లోని ప్రముఖ వ్యాపార కుటుంబంలో జన్మించింది. అదితి పాఠశాల విద్యను ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ జైపూర్‌లో అభ్యసించింది. జైపూర్‌లోని సెయింట్ జేవియర్ ఇన్స్టిట్యూట్లో కాలేజీ విద్యను పూర్తి చేసింది. అదితికి మోడలింగ్ అంటే పిచ్చి. ఆమె 2016లో ఎలైట్ మిస్ రాజస్థాన్ రన్నరప్‌గా నిలిచింది. ఆతర్వాత 2018 మిస్ దివా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2017 ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. 2018లో మిస్ సుప్రానేషనల్ ఇండియా టైటిల్‌ను గెలుచుకుంది. అదితికి ఫ్యాషన్ రంగంలోనూ మంచి గుర్తింపు ఉంది. ఆమెకు సోషల్ మీడియాలో 2.7 లక్షలకుపైగా ఫాలోవర్లు ఉన్నారు. అదితి మోడల్‌గా, ఇన్ఫ్లూయెన్సర్గా నెటిజన్లకు సుపరిచితురాలు. అదితి 2019లో Pehla Wargi అనే వీడియో ఆల్బమ్‌లోనూ నటించింది.ఇషాన్-అదితి మధ్య బంధం 2019 ఐపీఎల్ సమయంలో బయటపడింది.అప్పటి నుంచి ఆమె తరుచూ ఇషాన్‌తో కనిపించేది. తాజాగా పెళ్లి ప్రస్తావన రావడంతో అదితి ఎవరనే విషయాన్ని క్రికెట్ అభిమానులు గూగుల్ చేయడం మొదలుపెట్టారు. -
భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్ సూపర్ హీరో ఇషాన్ కిషన్ స్పెషల్ (ఫొటోలు)
-
గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్ అభిమానుల సంబరాలు (ఫొటోలు)
-
నీకసలు బుద్ధి ఉందా?.. కుల్దీప్పై హార్దిక్, సూర్య ఫైర్
టీ20 ప్రపంచకప్-2026 టోర్నీలో టీమిండియా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. గ్రూప్-ఎలో తొలుత అమెరికా.. తర్వాత నమీబియాలను ఓడించిన భారత్.. మూడో మ్యాచ్‌లో పాకిస్తాన్ చిత్తు చేసింది. దాయాదిపై ఏకంగా 61 పరుగుల తేడాతో నెగ్గి సూపర్-8 దశకు అర్హత సాధించింది.తటస్థ వేదికైన కొలంబోలో ఆదివారం నాటి మ్యాచ్‌లో సూర్య సేన ఆద్యంతం ఆధిపత్యం కనబరిచింది. టాస్ ఓడి తొలుత నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 175 పరుగులు చేసిన టీమిండియా.. పాక్‌ను 114 పరుగులకే ఆలౌట్ చేసింది.మొదలుపెట్టి.. తానే ముగించాడుభారత బ్యాటర్లలో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77) అదరగొట్టగా.. బౌలర్లు సమిష్టిగా రాణించారు. పాక్ ఇన్నింగ్స్‌లో వికెట్ల వేట మొదలుపెట్టిన హార్దిక్ పాండ్యా (Hardik Pandya)నే.. చివరి వికెట్ కూల్చి విజయంతో ముగించాడు. పాక్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ (0)ను వచ్చీరాగానే వెనక్కి పంపిన హార్దిక్.. ఆఖరిగా ఉస్మాన్ తారిఖ్ (0)ను పెవిలియన్‌కు పంపి టీమిండియాను గెలుపును ఖరారు చేశాడు.క్యాచ్‌లు డ్రాప్ చేసిన ఇషాన్, కుల్దీప్ ఈ క్రమంలో టీమిండియా చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav)పై హార్దిక్ పాండ్యా సీరియస్ అయ్యాడు. పాక్ ఇన్నింగ్స్‌లో పదిహేడో ఓవర్లో పాండ్యా బౌలింగ్‌కు దిగగా.. తొలి బంతి వైడ్ అయింది. అనంతరం షాహిన్ ఆఫ్రిది (Shaheen Afridi) ఇచ్చిన క్యాచ్‌ను ఇషాన్ డ్రాప్ చేశాడు.దీంతో లైఫ్ పొందిన ఆఫ్రిది.. హార్దిక్ బౌలింగ్‌లో రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. నిజానికి లాంగాన్ వద్ద ఫీల్డింగ్ పొజిషన్లో ఉన్న కుల్దీప్ దానిని జారవిడిచాడు. చేతుల్లో పడిన బంతిని డ్రాప్ చేశాడు. దీంతో హార్దిక్ పాండ్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు.Hardik pandya didn’t spare Kuldeep yadav after that dropped the catch ! The frustration on Kuldeep yadav face says it all. pic.twitter.com/4qazJi9M1d— Indian First (@MaheshJain68174) February 16, 2026మీకసలు బుద్ధి ఉందా?ఇషాన్‌తో పాటు కుల్దీప్ వైపు చూపిస్తూ.. ‘ఏం జరిగినా మీ ఇద్దరే కారణం.. మీకసలు బుద్ధి ఉందా?’ అన్నట్లుగా ఫైర్ అయ్యాడు. ఇక ఆ ఓవర్లో ఐదో బంతికి ఆఫ్రిది ఒక పరుగు తీయగా.. ఆఖరి బంతికి పాండ్యా తారిఖ్‌ను బౌల్డ్ చేయడంతో పాక్ కథ ముగిసిపోయింది. టీమిండియా విధించిన 176 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 18 ఓవర్లలో కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.ये गलत है ! Feeling bad for Kuldeep Yadav 😭#IshanKishan #INDvsPAK pic.twitter.com/Z7BfPy85Fc— Amrita Yadav (@AmritaYada60221) February 15, 2026సూర్య సైతంఇక విజయానంతరం కరచాలనం చేసుకునే సమయంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ సైతం కుల్దీప్ యాదవ్‌ను గట్టిగానే మందలించాడు. ఈ చైనామన్ స్పిన్నర్ సులువైన క్యాచ్‌ను వదిలేశాడన్న కోపంతో సూర్య.. అతడిని చులకన చేసి మాట్లాడినట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.కాగా పాక్‌తో మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీయగా.. కుల్దీప్ యాదవ్, తిలక్ వర్మ చెరో వికెట్ పడగొట్టారు. పాక్ బ్యాటర్లలో వికెట్ కీపర్ బ్యాటర్ ఉస్మాన్ ఖాన్ 44 పరుగులతో టాప్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.చదవండి: IND vs PAK: తిలక్ వర్మపై గంభీర్ సీరియస్ -
అతడు అత్యద్భుతం.. ఇది ఇండియా కోసం: సూర్య
పాకిస్తాన్‌పై టీమిండియా మరోసారి విజయం సాధించింది. టీ20 ప్రపంచకప్ టోర్నీలో ఆధిపత్యాన్ని 8-1కు పెంచుకుంది. కొలంబోలో తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయి సల్మాన్ బృందం చిత్తు కాగా.. సూర్య సేన టీ20 ప్రపంచకప్-2026 సూపర్-8 దశకు అర్హత సాధించింది.ఇది సార్ మా బ్రాండ్ఈ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav).. దాయాదిపై గెలుపు నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఈ విజయం ఇండియా కోసం. ఈ మ్యాచ్‌లో ఎలా ఆడాలని ప్రణాళికలు రచించామో వాటిని పక్కాగా అమలు చేశాము. మా బ్రాండ్‌ను కొనసాగించాము.అతడు అత్యద్భుతంగా ఆడాడుఈ వికెట్ మీద తొలుత బ్యాటింగ్ చేయడం మంచిదని అనుకున్నాం. అనుకున్నట్లుగానే టాస్ ఓడినా మాకు బ్యాటింగ్ చేసే అవకాశమే వచ్చింది. ఇక ఇషాన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్లో నిలకడైన, అద్భుత ప్రదర్శనలతో ఆకట్టుకున్న ఇషాన్.. టీమిండియా తరఫునా అదే విధంగా రాణిస్తున్నాడు.ఈరోజు అతడు అత్యద్భుతంగా ఆడాడు. ఊహించని రీతిలో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. తిలక్, రింకూ, శివం కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఇక్కడ 175 పరుగులు చేయడం మంచి విషయం. చేయాల్సిన దానికంటే ఇంకో 15-20 పరుగులు ఎక్కువే చేశామనుకుంటున్నాం.బౌలర్లు సమిష్టిగా రాణించారుఇక పవర్ ప్లేలో అక్షర్ పటేల్ బాధ్యత తీసుకున్నాడు. వరుణ్, కుల్దీప్ కూడా రాణించారు. జట్టులోని ప్రతి ఒక్కరు తమ బాధ్యతను చక్కగా నెరవేర్చారు’’ అని జట్టు ప్రదర్శన పట్ల సూర్యకుమార్ యాదవ్ హర్షం వ్యక్తం చేశాడు.మ్యాచ్ విషయానికొస్తే.. గ్రూప్-ఎలో భాగంగా భారత్- పాక్ ఆదివారం కొలంబో వేదికగా తలపడ్డాయి. ఆర్.ప్రేమదాస స్టేడియంలో టాస్ గెలిచిన పాక్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 175 పరుగులు సాధించింది.ఇషాన్ విధ్వంసంఓపెనర్లలో అభిషేక్ శర్మ డకౌట్ కాగా.. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ ఇషాన్ కిషన్ మెరుపు అర్ధ శతకం (40 బంతుల్లో 77)తో రాణించాడు. తిలక్ వర్మ (25), కెప్టెన్ సూర్య (32), శివం దూబే(27) ఫర్వాలేదనిపించారు. ఇక లక్ష్య ఛేదనలో పాక్ కేవలం 114 పరుగులు చేసి ఆలౌట్ అయింది.భారత బౌలర్లలో స్పిన్నర్లు అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి చెరో రెండు వికెట్లు తీయగా.. తిలక్ వర్మ, కుల్దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. పేసర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు పడగొట్టారు. పాక్‌ను 61 పరుగుల తేడాతో చిత్తు చేసిన భారత్ గ్రూప్-ఎ నుంచి సూపర్-8 చేరిన తొలి జట్టుగా నిలిచింది.చదవండి: IND vs PAK: తిలక్ వర్మపై గంభీర్ సీరియస్ -
T20 World Cup 2026: భారత్ ‘రుద్ర’ రూపం
‘విక్రమార్కుడు మళ్లీ వెనక్కి వెళ్లి ఆ శవాన్ని భుజాన వేసుకొని మళ్లీ నడక సాగించాడు... చందమామ కథలో బేతాళ ప్రశ్నకు విక్రమార్కుడు సరైన సమాధానం ఇవ్వగానే బేతాళుడు మళ్లీ చెట్టెక్కటం... ‘బేతాళ పంచ విశతి’లో మళ్లీ మళ్లీ ఇదే దృశ్యం, ఇదే సంవాదం... భారత్, పాకిస్తాన్ మధ్య వరల్డ్ కప్‌లో మ్యాచ్ అంటే దీనికి సరిగ్గా సరిపోతుంది! ఐసీసీ టోర్నీలో ఇరు జట్ల మధ్య మ్యాచ్ తేదీ ప్రకటనతో హడావిడి మొదలు... ప్రత్యక్షంగా మైదానంలో చూడాలనుకునే అభిమానుల ఏర్పాట్లు ఒక వైపు... ప్రసారకర్తల ప్రకటనలు మరోవైపు... వ్యాఖ్యాతలు, విశ్లేషకుల తీవ్ర చర్చ... మ్యాచ్ సమీపిస్తున్న కొద్దీ ఎన్నో కథలు, కథనాలు, వివాదాలు... ఈ మ్యాచ్ లేకపోతే క్రికెట్ లేదన్నట్లుగా ఏమార్పు... ఒక రకమైన యుద్ధ వాతావరణం... ఇరు జట్ల బలాబలాల మధ్య ఉన్న అంతరం గురించి అందరికీ తెలుసు... ఫలితం ఎలా రావచ్చో కూడా అంచనాకు రావచ్చు... అయినా సరే మ్యాచ్ గురించి హంగామా... చివరకు ఎప్పటిలాగే భారత్‌దే విజయం.పిచ్ బ్యాటింగ్‌కు తగినంత అనుకూలంగా లేదు... బంతి ఆగుతూ నెమ్మదిగా వస్తోంది. భారత్ ఇన్నింగ్స్ రెండో అర్ధభాగంలో ఇది కనిపించింది కూడా. కానీ ఆరంభంలో ఇషాన్ కిషన్ చూపించిన దూకుడు పిచ్‌ను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేకుండా చేసింది. మిగతా జట్టంతా కలిసి ఎక్స్‌ట్రాలు సహా 80 బంతుల్లో 98 పరుగులు రాబడితే... ఇషాన్ ఒక్కడే మిగిలిన 40 బంతుల్లో 77 పరుగులు చేసి మ్యాచ్‌లో అసలు తేడా ఏంటో చూపించాడు. టి20 వరల్డ్ కప్‌లో పాకిస్తాన్‌పై అత్యధిక స్కోరు నమోదు చేసిన తర్వాత ప్రత్యరి్థని నిలువరించడం భారత్‌కు ఏమాత్రం కష్టం కాలేదు. ఆరుగురు బౌలర్లు కనీసం ఒక్క వికెట్ అయినా పడగొట్టగా, సమష్టి ప్రదర్శనతో పాక్‌ను టీమిండియా కుప్పకూలి్చంది. ఐదు ఓవర్ల లోపే టాప్–4 వికెట్లు కోల్పోయిన పాక్ కోలుకోలేకపోయింది. అసలు పాకిస్తాన్ తమకు ఏమాత్రం పోటీ కాదన్నట్లుగా నిరూపిస్తూ భారత్ ఏకపక్షంగా ఘన విజయం అందుకుంది. కొలంబో: టి20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత్ తమ ఆధిక్యాన్ని మరింత పెంచుకుంది. ఇప్పటి వరకు 7–1తో పైచేయి ఉండగా ఇప్పుడు ఎనిమిదోసారి పాక్‌ను విశ్వవేదికపై మట్టికరిపించింది. భారత్ ముందు పాక్ ఏమాత్రం నిలవలేకపోవడంతో ఊహించిన ఫలితమే వచి్చంది. ఆదివారం జరిగిన గ్రూప్ ‘ఎ’ మ్యాచ్‌లో భారత్ 61 పరుగుల తేడాతో పాకిస్తాను చిత్తు చేసింది. టి20ల్లో పాక్‌పై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. టాస్ గెలిచి పాకిస్తాన్ ఫీల్డింగ్ ఎంచుకోగా... ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ఇషాన్ కిషన్ (40 బంతుల్లో 77; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్‌తో చెలరేగగా, సూర్యకుమార్ యాదవ్ (29 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. పాక్ బౌలర్లలో సయీమ్ అయూబ్ 3 వికెట్లు పడగొట్టాడు. అనంతరం పాకిస్తాన్ 18 ఓవర్లలో 114 పరుగులకే కుప్పకూలింది. ఉస్మాన్ ఖాన్ (34 బంతుల్లో 44; 6 ఫోర్లు, 1 సిక్స్) మినహా అంతా విఫలమయ్యారు. వరుసగా మూడో విజయంతో భారత్ ‘సూపర్ ఎయిట్స్’కు అర్హత సాధించింది. అహ్మదాబాద్‌లో బుధవారం జరిగే తమ చివరి లీగ్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో భారత్ తలపడుతుంది. ఆసియా కప్ తరహాలోనే తమ నిర్ణయాన్ని కొనసాగిస్తూ ఈ మ్యాచ్‌లో కూడా పాక్ కెపె్టన్ సల్మాన్ ఆఘాకు భారత సారథి సూర్యకుమార్ ‘షేక్ హ్యాండ్’ ఇవ్వలేదు. భారత్ చేతిలో భారీ ఓటమితో పాకిస్తాన్ ‘సూపర్–8’ అవకాశాలపై తీవ్ర ప్రభావం పడింది. బుధవారం నమీబియాతో జరిగే మ్యాచ్‌లో పాకిస్తాన్ తప్పనిసరిగా గెలిస్తేనే ‘సూపర్–8’ దశకు అర్హత సాధిస్తుంది. పాకిస్తాన్ ఓడిపోతే అమెరికా ‘సూపర్–8’కు చేరుతుంది. అభిశేక్ మళ్లీ డకౌట్... పార్ట్ టైమ్ స్పిన్నర్ సల్మాన్ వేసిన తొలి ఓవర్లో వరుసగా మూడు బంతులు పరుగు తీయలేకపోయిన అభిశేక్ శర్మ (0) తర్వాతి బంతికి భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. టోర్నీలో అతనికి ఇది వరుసగా రెండో డకౌట్. అయితే ఇషాన్ చెలరేగిపోవడంతో జట్టు దూసుకుపోయింది. షాహీన్ అఫ్రిది ఓవర్లో వరుసగా 6, 4 కొట్టిన అతను అబ్రార్ ఓవర్లోనూ 6, 4 కొట్టాడు. పవర్‌ప్లేలో భారత్ 52 పరుగులు చేసింది. అనంతరం అబ్రార్ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఇషాన్ 27 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కూడా దూకుడుగా ఆడిన ఇషాన్‌ను ఎట్టకేలకు 9వ ఓవర్లో పాక్ అవుట్ చేయగలిగింది. ఆ సమయంలో భారత్ స్కోరు 88 అయితే ఇషాన్ ఒక్కడే 76 బాదడం విశేషం! మరోవైపు తిలక్ వర్మ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్) ఇన్నింగ్స్ కాస్త తడబడుతూనే సాగింది. వరుసగా మూడో మ్యాచ్‌లోనూ అతను ఒకే స్కోరు (25) చేశాడు. తిలక్, పాండ్యా (0)లను అయూబ్ వరుస బంతుల్లో అవుట్ చేశాడు. ఈ దశలో సూర్య, శివమ్ దూబే (17 బంతుల్లో 27 నాటౌట్; 3 ఫోర్లు, 1 సిక్స్) కూడా పిచ్ అనుకూలంగా లేకపోవడంతో జాగ్రత్తగా ఆడారు. ఐదో వికెట్‌కు వీరిద్దరు 38 పరుగులు జోడించేందుకు 34 బంతులు పట్టాయి. అఫ్రిది వేసిన చివరి ఓవర్లో దూబే, రింకూ సింగ్ (11 నాటౌట్) కలిసి 2 ఫోర్లు, సిక్స్‌తో 16 పరుగులు రాబట్టారు. భిన్నమైన యాక్షన్‌తో తీవ్ర చర్చను రేకెత్తించిన ఉస్మాన్ తారిఖ్ (1/24) 2 ఫోర్లు మాత్రమే ఇచ్చి అందరికంటే మెరుగైన బౌలింగ్ ప్రదర్శన చేశాడు. ఉస్మాన్ ఖాన్ మినహా... తొలి ఓవర్ నాలుగో బంతికి ఫర్హాన్ (0) అవుట్ కావడంతో మొదలైన పాక్ పతనం వేగంగా సాగింది. బుమ్రా వేసిన తర్వాతి ఓవర్లో అయూబ్ (6), సల్మాన్ (4) వెనుదిరగ్గా, అక్షర్ తన తొలి ఓవర్లోనే బాబర్ ఆజమ్ (5)ను బౌల్డ్ చేశాడు. పవర్‌ప్లేలో జట్టు స్కోరు 38/4కు చేరింది. ఉస్మాన్ ఒక్కడే కాస్త పోరాడుతూ కొన్ని చక్కటి షాట్లు ఆడాడు. అయితే 57 బంతుల్లో 103 పరుగులు చేయాల్సిన స్థితిలో ఉస్మాన్‌ను అక్షర్ అవుట్ చేయడంతో పాక్ గెలుపు ఆశలు కోల్పోయింది. చివర్లో షాహిన్ అఫ్రిది (19 బంతుల్లో 23 నాటౌట్; 2 ఫోర్లు, 1 సిక్స్) కొన్ని పరుగులు సాధించినా లాభం లేకపోయింది. గత మ్యాచ్ ఆడిన తుది జట్టులో భారత్ రెండు మార్పులు చేసింది. అనారోగ్యం నుంచి కోలుకున్న అభిశేక్...సామ్సన్ స్థానంలో రాగా, అర్‡్షదీప్‌కు బదులుగా అదనపు స్పిన్నర్ కుల్దీప్ను మేనేజ్మెంట్ ఎంచుకుంది.స్కోరు వివరాలు భారత్ ఇన్నింగ్స్: ఇషాన్ కిషన్ (బి) అయూబ్ 77; అభిశేక్ (సి) అఫ్రిది (బి) సల్మాన్ 0; తిలక్ (ఎల్బీ) (బి) అయూబ్ 25; సూర్యకుమార్ (సి) అయూబ్ (బి) తారిఖ్ 32; పాండ్యా (సి) బాబర్ (బి) అయూబ్ 0; దూబే (రనౌట్) 27; రింకూ (నాటౌట్) 11; అక్షర్ (సి) అయూబ్ (బి) అఫ్రిది 0; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–1, 2–88, 3–126, 4–126, 5–159, 6–175, 7–175. బౌలింగ్: సల్మాన్ 2–0–10–1, షాహిన్ అఫ్రిది 2–0–31–1, సయీమ్ అయూబ్ 4–0–25–3, అబ్రార్ 3–0–38–0, షాదాబ్ 1–0–17–0, నవాజ్ 4–0–28–0, తారిఖ్ 4–0–24–1. పాకిస్తాన్ ఇన్నింగ్స్: ఫర్హాన్ (సి) రింకూ (బి) పాండ్యా 0; అయూబ్ (ఎల్బీ) (బి) బుమ్రా 6; సల్మాన్ (సి) పాండ్యా (బి) బుమ్రా 4; బాబర్ (బి) అక్షర్ 5; ఉస్మాన్ (స్టంప్డ్) ఇషాన్ కిషన్ (బి) అక్షర్ 44; షాదాబ్ (సి) దూబే (బి) తిలక్ 14; నవాజ్ (సి) దూబే (బి) కుల్దీప్ 4; ఫహీమ్ (సి) రింకూ (బి) వరుణ్ 10; అఫ్రిది (నాటౌట్) 23; అబ్రార్ (ఎల్బీ) (బి) వరుణ్ 0; తారిఖ్ (బి) పాండ్యా 0; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (18 ఓవర్లలో ఆలౌట్) 114. వికెట్ల పతనం: 1–0, 2–6, 3–13, 4–34, 5–73, 6–78, 7–78, 8–97, 9–97, 10–114. బౌలింగ్: పాండ్యా 3–1–16–2, బుమ్రా 2–0–17–2, అక్షర్ 4–0–29–2, వరుణ్ 3–0–17–2, కుల్దీప్ 3–0–14–1, తిలక్ 2–0–11–1, రింకూ 1–0–9–0. -
చరిత్ర సృష్టించిన ఇషాన్ కిషన్.. యువరాజ్ రికార్డు బ్రేక్
టీ20 ప్రపంచకప్ 2026లో టీమిండియా విధ్వంసకర ఆటగాడు ఇషాన్ కిషన్ తన సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా కొలంబో వేదికగా పాకిస్తాన్‌తో జరుగుతున్న హైవోల్టేజ్ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్లో మరో ఓపెనర్ అభిషేక్ శర్మ వికెట్ కోల్పోయినప్పటికి.. ఇషాన్ మాత్రం ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశాడు.తిలక్ వర్మతో కలిసి స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఇషాన్ కేవలం 27 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకున్నాడు. ఓవరాల్‌గా 40 బంతులు ఎదుర్కొన్న కిషన్.. 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 77 పరుగులు చేసి ఔటయ్యాడు. కాగా మెరుపు హాఫ్ సెంచరీతో చెలరేగిన కిషన్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. పాకిస్తాన్‌పై టీ20ల్లో అత్యంతవేగవంతమైన అర్ధ సెంచరీ సాధించిన భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు ఈ రికార్డు భారత క్రికెట్ దిగ్గజం యువరాజ్ సింగ్ పేరిట ఉండేది. 2012లో అహ్మదాబాద్‌లో పాక్‌పై యువరాజ్ సింగ్ 29 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తాజా మ్యాచ్‌లో 27 బంతుల్లోనే ఆర్ధ శతకం బాదిన ఇషాన్.. 14 ఏళ్ల నాటి యువీ రికార్డును ఇషాన్ బ్రేక్ చేశాడు.కాగా ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 175 పరుగులు చేసింది. కిషన్‌తో పాటు సూర్యకుమార్ యాదవ్(32), తిలక్ వర్మ(25), శివమ్ దూబే(32) రాణించారు. పాక్ బౌలర్లలో సైమ్ అయూబ్ మూడు వికెట్లు పడగొట్టగా.. సల్మాన్ అఘా, ఉస్మాన్ తరీఖ్, అఫ్రిది తలా వికెట్ సాధించారు. -
IND vs NAM: అంపైర్‌తో నమీబియా కెప్టెన్ గొడవ.. తప్పెవరిది?
టీమిండియాతో మ్యాచ్ నేపథ్యంలో నమీబియా కెప్టెన్ గెర్హాడ్ ఎరాస్మస్ మరోసారి వార్తల్లో నిలిచాడు. టీ20 ప్రపంచకప్-2026లో భాగంగా భారత్‌తో మ్యాచ్‌కు ముందు తమకు అన్యాయం జరిగిందని ఎరాస్మస్ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.మాకు ఆ అవకాశమే లేదుతమకు రాత్రి పూట ఒక్క ప్రాక్టీస్ సెషన్ కూడా ఏర్పాటు చేయలేదని ఎరాస్మస్ (Gerhard Erasmus).. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) తీరును విమర్శించాడు. తమ దేశంలో ఫ్లడ్‌లైట్లు ఉండవని.. అందుకే ఇక్కడైనా టీమిండియాతో నైట్ మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ అవకాశం కల్పిస్తే బాగుండేదని పేర్కొన్నాడు.అదే సమయంలో టీమిండియాకు మాత్రం రాత్రిపూట రెండు నైట్ ప్రాక్టీస్ సెషన్లు ఏర్పాటు చేశారని ఎరాస్మస్ అసంతృప్తి వెళ్లగక్కాడు. ఇక మ్యాచ్ సందర్భంగానూ ఎరాస్మస్ బౌలింగ్ శైలి చర్చకు దారి తీసింది.‘డెడ్ బాల్’బౌలింగ్ క్రీజ్ వద్ద నుంచి చాలా వెనుక ఉంటూనే ఎరాస్మస్ బంతులు వేస్తుండటం కాస్త ఆశ్చర్యం కలిగించింది. దీంతో ఎరాస్మస్ తొలి ఓవర్లో దీనిని అంపైర్ టకర్ ‘డెడ్ బాల్’గా ప్రకటించాడు. ఈ క్రమంలో ఎరాస్మస్ అంపైర్‌తో వాదనకు దిగాడు. కాసేపు ఇద్దరి మధ్య ఈ విషయమై వాగ్వాదం జరిగింది.అయితే, ఎరాస్మస్ వేసిన మరుసటి ఓవర్లో మాత్రం అంపైర్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం. నిజానికి నిబంధనల ప్రకారం అది తప్పేమీ కాదు. అయితే తొలి ఓవర్లో మరీ అంపైర్ వెనక నుంచి బౌలింగ్ చేసిన ఎరాస్మస్ ఈసారి కాస్త ముందుకు వచ్చి అంపైర్‌కు కనపడేలా బౌలింగ్ చేయడంతో సమస్య రాలేదు.నాలుగు కీలక వికెట్లుఈ తరహా బౌలింగ్‌తో పాటు తన రెగ్యులర్ ఆఫ్ స్పిన్...రౌండ్ ఆర్మ్...ఇలా వైవిధ్యాన్ని చూపిస్తూ భారత బ్యాటర్లను కన్ఫ్యూజన్కు గురి చేసిన ఎరాస్మస్ నాలుగు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇషాన్ కిషన్ (24 బంతుల్లో 61), తిలక్ వర్మ (21 బంతుల్లో 25), హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52), అక్షర్ పటేల్ (0) రూపంలో కీలక వికెట్లు తీసి సత్తా చాటాడు.కాగా ఢిల్లీ వేదికగా నమీబియాతో గురువారం జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 93 పరుగులు భారీ తేడాతో విజయం సాధించింది. భారత్ తొలుత బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో నమీబియా 18.2 ఓవర్లలో కేవలం 116 పరుగులు చేసి ఆలౌట్ అయింది. బ్యాటింగ్ ఆల్‌రౌండర్, కెప్టెన్ ఎరాస్మస్ 11 బంతుల్లో 18 పరుగులు చేయగలిగాడు. చదవండి: వారిద్దరూ అద్భుతం.. కఠిన పిచ్‌పై కూడా అదరగొట్టారు: సూర్యUnfair advantage or smart bowling? 🤔@IrfanPathan, Piyush Chawla & Jatin Sapru share their thoughts on Gerhard Erasmus' action.ICC Men’s #T20WorldCup | #INDvNAM | LIVE NOW 👉 https://t.co/aLGrwgVX5o pic.twitter.com/4EvladZTMz— Star Sports (@StarSportsIndia) February 12, 2026 -
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
టీ20 ప్రపంచకప్-2026లో డిఫెండింగ్ ఛాంపియన్ టీమిండియా తన జోరును కొనసాగిస్తోంది. గురువారం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో 93 పరుగుల భారీ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో రెండింటిలోనూ మెన్ ఇన్ బ్లూ సత్తాచాటింది.మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఓపెనర్ ఇషాన్ కిషన్ కేవలం 24 బంతుల్లోనే 61 పరుగులతో విధ్వంసం సృష్టించగా, హార్దిక్ పాండ్యా (28 బంతుల్లో 52) మెరుపు అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నమీబియా 18.2 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. ఈ విజయంతో టీమిండియా ఓ ప్రపంచ రికార్డును తమపేరిట లిఖించుకుంది.టీ20 ప్రపంచకప్ చరిత్రలో వరుసగా 10 మ్యాచ్‌ల్లో విజయం సాధించిన తొలి జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా వరుసగా 8 విజయాలు సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. ఇప్పుడు వరుసగా రెండు విజయాలు నమోదు చేయడంతో ఈ అరుదైన భారత్ తమ ఖాతాలో వేసుకుంది. ఈ పొట్టి ప్రపంచకప్‌లో భారత్ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు వరుసగా 8 విజయాలు నమోదు చేశాయి.టీ20 ప్రపంచకప్‌లో వరుసగా అత్యధిక విజయాలు నమోదు చేసిన జట్లు ఇవేభారత్-10ఆస్ట్రేలియా-8దక్షిణాఫ్రికా-8ఇంగ్లండ్-7చదవండి: T20 WC 2026: అరుదైన మైలురాయిని తాకిన అర్షదీప్ సింగ్


