బీసీసీఐ తాజాగా ప్రకటించిన వార్షిక కాంట్రాక్ట్‌ల్లో (2025-26) ముగ్గురి పేర్లు కనిపించకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆ ముగ్గురు ఎవరంటే.. ఇషాన్ కిషన్, మొహమ్మద్ షమీ, సర్ఫరాజ్ ఖాన్. ఈ ముగ్గురు గత కొంతకాలంగా ఫార్మాట్లకతీతంగా రాణిస్తున్నా, బీసీసీఐ కాంట్రాక్ట్‌లు దక్కలేదు. షమీ, సర్ఫరాజ్‌ను పక్కన పెడితే ఇషాన్ కిషన్‌కు కాంట్రాక్ట్ లభించకపోవడం మరింత ఆశ్చర్యాన్ని కలిగించింది.
ఎందుకంటే, ఇతగాడు ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. తిరువనంతపురం వేదికగా జరిగిన ఐదో టీ20 సుడిగాలి శతకం (43 బంతుల్లో) బాదాడు. అయినా అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. ఇషాన్‌కు కాంట్రాక్ట్ దక్కకపోవడానికి బీసీసీఐ ప్రత్యేకమైన కారణాలు ఏమీ చెప్పనప్పటికీ.. నిబంధనలు ఓ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.
అదేటంటే.. ఏ ఆటగాడికైనా బీసీసీఐ కాంట్రాక్ట్ లభించాలంటే సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాలి. ఇషాన్ ఈ మధ్యకాలంలో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడకపోవడంతో అతనికి బీసీసీఐ కాంట్రాక్ట్ లభించలేదు. కాంట్రాక్ట్ లభించడానికి ఫామ్ కొలమానం కాదు. ఈ కారణంగానే ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉన్నా కాంట్రాక్ట్ లభించలేదు.
షమీ, సర్ఫరాజ్ పరిస్థితి కూడా ఇదే. వీరిద్దరు కూడా సమీక్షా కాలం (అక్టోబర్ 2024–సెప్టెంబర్ 2025)లో ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా ఆడలేదు. దేశవాలీ క్రికెట్‌లో ఈ ముగ్గురు ఫార్మాట్లకతీతంగా సత్తా చాటినా, బీసీసీఐ కాంట్రాక్ట్ దక్కలేదు. వీరిలో ఇషాన్, సర్ఫరాజ్‌కు వచ్చే ఏడాదైనా కాంట్రాక్ట్ లభించవచ్చేమో కాని, షమీని మాత్రం ఇక మరిచిపోవాల్సిందేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
2025-26 సంవత్సరానికి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌లు లభించిన ఆటగాళ్లు..
గ్రేడ్ ‘ఎ’ – శుబ్‌మన్ గిల్, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజా
గ్రేడ్ ‘బి’ – రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, వాషింగ్టన్ సుందర్, కేఎల్ రాహుల్, సిరాజ్, హార్దిక్ పాండ్యా, రిషభ్ పంత్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్.
గ్రేడ్ ‘సి’ – అక్షర్ పటేల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, శివమ్ దూబే, సంజు సామ్సన్, అర్షదీప్ సింగ్, ప్రసిధ్ కృష్ణ, ఆకాశ్‌దీప్, ధ్రువ్ జురేల్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, నితీశ్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, సాయిసుదర్శన్, రవి బిష్ణోయ్, రుతురాజ్ గైక్వాడ్.


