breaking news
team india
-
ENG VS IND, 2nd Test: టీమిండియాను ఆదుకున్న కెప్టెన్ 'గిల్' సెంచెరీ
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది.భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్‌కు దక్కింది. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేశారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 99 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్ 114, రవీంద్ర జడేజా 41 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 85 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 310/5గా ఉంది. -
ENG VS IND 2nd Test Day 1: జైస్వాల్ సెంచరీ మిస్.. పోరాడుతున్న గిల్
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. కరుణ్ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. ఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే.రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించారు. ఈ దశలో జైస్వాల్ (107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు) ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది.జైస్వాల్ ఔటయ్యాక శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ కొద్ది సేపు జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 47 పరుగులు జోడించాక రిషబ్ పంత్ (25) షోయబ్ బషీర్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. జాక్ క్రాలే అద్బుతమైన క్యాచ్ పట్టడంతో పంత్ పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం క్రీజ్‌లోకి వచ్చిన నితీశ్ కుమార్ రెడ్డి (1) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇతని వికెట్ వోక్స్‌కు దక్కింది. వోక్స్ బౌలింగ్‌లో నితీశ్ క్లీన్ బౌల్ట్ అయ్యాడు.211 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాను గిల్, రవీంద్ర జడేజా గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 59 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌లను కొనసాగిస్తున్నారు. గిల్ 86, రవీంద్ర జడేజా 30 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 76 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 270/5గా ఉంది. -
ENG VS IND 2nd Test: పాపం జైస్వాల్..!
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ ఇవాళ (జులై 2) ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం భారత్ మూడు మార్పులు చేయగా.. ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించింది. భారత్ తరఫున బుమ్రా స్థానంలో ఆకాశ్‌దీప్.. సాయి సుదర్శన్ స్థానంలో వాషింగ్టన్ సుందర్.. శార్దూల్ ఠాకూర్ స్థానంలో నితీశ్ కుమార్ రెడ్డి తుది జట్టులో చోటు దక్కించుకున్నారు.తొలుత బ్యాటింగ్ చేస్తున్న భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఇన్ ఫామ్ బ్యాటర్ కేఎల్ రాహుల్ 2 పరుగులకే ఔటై నిరాశపరిచాడు. క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో రాహుల్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. రాహుల్ తర్వాత బరిలోకి దిగిన కరుణ్ నాయర్ కూడా తక్కువ స్కోర్‌కే (31) ఔటయ్యాడు. ఈ వికెట్ బ్రైడన్ కార్స్‌కు దక్కింది. 11వ హాఫ్ సెంచరీఈ మధ్యలో యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. జైస్వాల్‌కు టెస్ట్‌ల్లో ఇది 11వ అర్ద సెంచరీ. జైస్వాల్ తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో చెలరేగిన విషయం తెలిసిందే. రాహుల్, కరుణ్ వికెట్లు కోల్పోయాక జాగ్రత్తగా ఆడిన జైస్వాల్, శుభ్‌మన్ గిల్ మూడో వికెట్‌కు 66 పరుగులు జోడించాడు.పాపం జైస్వాల్ఈ దశలో జైస్వాల్ ఓ అనవసర షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్‌లో కట్ షాట్ ఆడే ప్రయత్నం చేయగా బంతి బాటమ్ ఎడ్జ్ తీసుకొని వికెట్‌కీపర్ జేమీ స్మిత్ చేతుల్లోకి వెళ్లింది. వికెట్ తీసిన ఆనందంలో స్టోక్స్ సంబరాలు చేసుకోగా.. జైస్వాల్ క్రీజ్‌లో అలాగే ఉండిపోయాడు. ఈ ఇన్నింగ్స్‌లో జైస్వాల్ చాలా సార్లు కట్ షాట్లు ఆడే ప్రయత్నం చేసి విఫలమయ్యాడు. చివరికి అదే షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. జైస్వాల్ 107 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో 87 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. జైస్వాల్ సెంచరీకి ముందు ఔట్ కావడంతో టీమిండియా అభిమానులు నిరాశపడ్డారు. పాపం జైస్వాల్ అంటూ సోషల్‌మీడియా వేదికగా సానుభూతిని వ్యక్తం చేస్తున్నారు.50 ఓవర్ల తర్వాత టీమిండియా స్కోర్ 170/3గా ఉంది. శుభ్‌మన్ గిల్ 38, రిషబ్ పంత్ 6 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు.కాగా, ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్ ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఆ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయింది. -
‘అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపు’
టీమిండియా ఓపెనర్‌గా శిఖర్ ధావన్ (Shikhar Dhawan) తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. రోహిత్ శర్మ (Rohit Sharma)తో కలిసి భారత ఇన్నింగ్స్ ఆరంభించిన ఈ లెఫ్టాండర్.. ఎన్నో విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. ముఖ్యంగా వన్డేల్లో అత్యుత్తమంగా రాణించాడు. తన కెరీర్లో మొత్తంగా 167 వన్డేలు ఆడిన గబ్బర్ 6793 పరుగులు సాధించాడు.అయితే, నయా స్టార్లు శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్ (Ishan Kishan)ల రాకతో టీమిండియాలో ధావన్ స్థానం ప్రశ్నార్థకమైంది. ఈ ఇద్దరు ఓపెనర్లుగా పాతుకుపోవడంతో పాటు.. వీరికి తోడు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్ కూడా రేసులోకి వచ్చారు. ఫలితంగా ధావన్‌ను సెలక్టర్లు పట్టించుకోవడమే మానేశారు.ఈ క్రమంలో 2022లో టీమిండియా తరఫున చివరగా ఆడిన శిఖర్ ధావన్.. రెండేళ్ల పాటు పునరాగమనం కోసం ఎదురుచూశాడు. కానీ యువ ఆటగాళ్ల జోరు ముందు నిలవలేక గతేడాది ఆగష్టులో అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.అతడి డబుల్ సెంచరీ.. నా కెరీర్‌కు ముగింపుతాజాగా ఈ విషయాల గురించి శిఖర్ ధావన్ స్పందించాడు. బంగ్లాదేశ్ మీద ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ బాదినపుడే తన కెరీర్ ముగింపు దశకు వచ్చిందని భావించినట్లు తెలిపాడు. ఈ మేరకు.. ‘‘నేను చాలాసార్లు ఫిఫ్టీలు బాదాను. ఎన్నోసార్లు డెబ్బైలలో అవుటయ్యాను.వాటిని సెంచరీలుగా మలచడంలో విఫలమయ్యాను. ఎప్పుడైతే ఇషాన్ కిషన్ బంగ్లాదేశ్‌తో వన్డేలో 200 పరుగులు చేశాడో.. అప్పుడే నా కెరీర్ ముగింపునకు వచ్చేసిందని నా మనసు చెప్పింది. నా అంతరాత్మ చెప్పినట్లే జరిగింది.ఆ సమయంలో నా స్నేహితులు, శ్రేయోభిలాషులు నా గురించి చాలా ఫీలయ్యారు. నేనెక్కడ బాధపడిపోతానో అని నన్ను కనిపెట్టుకుని ఉన్నారు. కానీ నేను మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మొదలుపెట్టాను’’ అని హిందుస్తాన్ టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో శిఖర్ ధావన్ పేర్కొన్నాడు. కాగా డబుల్ సెంచరీ వీరుడు ఇషాన్ కిషన్ కూడా అనతికాలంలోనే క్రమశిక్షణా రాహిత్యం వల్ల జట్టులో చోటుతో పాటు.. సెంట్రల్ కాంట్రాక్టు కూడా కోల్పోవడం గమనార్హం. మరోవైపు.. గిల్ మాత్రం నిలకడైన ఆటతో టీమిండియా టెస్టు కెప్టెన్‌గా ఎదిగాడు.ఒక్కరూ మాట్లాడలేదుఇక జట్టులో స్థానం కోల్పోయిన తర్వాత ఒక్కరు కూడా తనను మళ్లీ కాంటాక్టు చేయలేదని ఈ సందర్భంగా ధావన్ చెప్పుకొచ్చాడు. ‘‘జట్టులో చోటు కోల్పోవడం సాధారణ విసయమే. పద్నాలుగేళ్ల వయసు నుంచే మాకు ఇది అలవాటు అవుతుంది.అంతేకాదు ఎవరి బిజీలో వాళ్లుంటారు. పర్యటనల్లో బిజీబిజీగా గడుపుతూ ఉంటారు. అయితే, ద్రవిడ్ భాయ్ మాత్రం ఆ సమయంలో నాతో మాట్లాడాడు. ఆయన నాకు మెసేజ్ చేశారు’’ అని ధావన్ తెలిపాడు. కాగా శిఖర్ ధావన్ ప్రస్తుతం లీగ్ క్రికెట్ ఆడుతున్నాడు. నేపాల్ ప్రీమియర్ లీగ్‌లో, లెజెండ్స్ లీగ్ క్రికెట్లోనూ అతడు భాగమవుతున్నాడు.చదవండి: చరిత్ర సృష్టించిన భారత బ్యాటర్.. తొలి ప్లేయర్‌గా ప్రపంచ రికార్డు -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్‌తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్‌లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్‌లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్‌లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్‌లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్‌లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్‌పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
ఇంగ్లండ్ గడ్డపై సెంచరీ చేసిన మరో టీమిండియా యువ సంచలనం
ప్రస్తుతం భారత క్రికెట్ మొత్తం ఇంగ్లండ్ చుట్టూ తిరుగుతుంది. పురుషులు, మహిళలు, దివ్యాంగులు.. ఇలా విభాగంతో సంబంధం లేకుండా భారత క్రికెటర్లంతా ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత పురుషుల సీనియర్ జట్టు ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుండగా.. భారత పురుషుల అండర్-19 జట్టు ఇంగ్లండ్ అండర్-19 జట్టుతో ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్ ఆడుతుంది. భారత సీనియర్ మహిళల జట్టు కూడా ఇంగ్లండ్‌లోనే ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది. పురుషులు, మహిళల జట్లే కాక, భారత పురుషుల దివ్యాంగ జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ జట్టు ఇంగ్లండ్ దివ్యాంగ టీమ్‌తో ఏడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఇదే కాక చాలామంది భారత పురుష క్రికెటర్లు ఇంగ్లండ్‌లో కౌంటీ క్రికెట్ ఆడుతున్నారు. టీమిండియా యువ ఆటగాళ్లు రుతురాజ్ గైక్వాడ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఖలీల్ అహ్మద్ వేర్వేరు జట్ల తరఫున కౌంటీ ఛాంపియన్షిప్ ఆడుతున్నారు. వీరిలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ తమ కౌంటీ అరంగేట్రంలోనే సెంచరీలు చేసి అదరగొట్టగా.. మిగతా ఇద్దరు తమ తొలి మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది.పైన పేర్కొన్న జట్లు, ఆటగాళ్లే కాక ప్రస్తుతం మరో భారత స్థానిక జట్టు కూడా ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ముంబై క్రికెట్ అసోసియేషన్ తమ ఎమర్జింగ్ జట్టును ఇంగ్లండ్‌కు పంపింది. ఈ జట్టు ప్రస్తుతం నాట్స్ సెకెండ్ 11తో మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ సోదరుడు ముషీర్ ఖాన్ సెంచరీతో అదరగొట్టాడు. ముషీర్ 127 బంతుల్లో 14 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. ముషీర్ సెంచరీ చేసిన విషయాన్ని ముంబై క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఓ అధికారి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశాడు.HUNDRED FOR MUSHEER KHAN 🇮🇳- Mumbai Cricket Association has sent the Emerging players to UK and they are currently playing against Notts 2nd 11, A great work by MCA for Developing the young stars. pic.twitter.com/lFkqecQ37n— Johns. (@CricCrazyJohns) June 30, 2025ఇదిలా ఉంటే, ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న అన్ని భారత క్రికెట్ జట్లలో ఒక్క భారత సీనియర్ పురుషుల జట్టు మినహా అన్ని జట్లు సక్సెస్ చూశాయి. భారత సీనియర్ పురుషుల జట్టు ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఓటమిపాలు కాగా.. అండర్-19 జట్టు తొలి వన్డేలో ఇంగ్లండ్‌ను మట్టికరిపించింది. మరోవైపు భారత సీనియర్ మహిళల జట్టు తొలి టీ20లో ఇంగ్లండ్‌ను చిత్తు చేయగా.. భారత పురుషుల దివ్యాంగుల జట్టు ప్రతిష్టాత్మక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఓడించింది.ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత ఆటగాళ్లలో చాలామంది శతకాలు చేశారు. సీనియర్ పురుషుల జట్టులో జైస్వాల్, గిల్, రాహుల్, పంత్ (2).. సీనియర్ మహిళల జట్టులో స్మృతి మంధన.. కౌంటీల్లో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్.. తాజాగా ముషీర్ ఖాన్ శతకాలతో హోరెత్తించారు. ముషీర్ ఖాన్ ఇటీవల ముగిసిన ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అయితే ఈ సీజన్లో అతనికి పెద్దగా అవకాశాలు రాలేదు. ముషీర్ దేశవాలీ సీజన్లో అన్న సర్ఫరాజ్ ఖాన్‌తో పోటీపడి పరుగులు సాధిస్తున్నాడు. అన్నదమ్ములిద్దరూ ముంబై జట్టుకే ఆడతారు. సర్ఫరాజ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌పై తృటిలో సెంచరీ చేజార్చుకుప్పటికీ.. టీమిండియా ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో మెరుపు సెంచరీ చేశాడు. అయినా అతనికి భారత జట్టు నుంచి పిలుపు రాలేదు. -
టీమిండియాతో రెండో టెస్ట్.. తుది జట్టును ప్రకటించిన ఇంగ్లండ్.. స్టార్ ఆటగాడికి నో ఛాన్స్
జులై 2వ తేదీ నుంచి బర్మింగ్హమ్ వేదికగా టీమిండియాతో జరుగబోయే రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టును ఇవాళ (జూన్ 30) ప్రకటించారు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ తొలి టెస్ట్‌లో ఆడిన జట్టునే యథాతథంగా కొనసాగించింది. రెండో టెస్ట్ కోసం ప్రత్యేకంగా ఎంపిక చేసిన స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌కు తుది జట్టులో చోటు దక్కలేదు. తొలి టెస్ట్‌లో రాణించిక పోయినా ఇంగ్లండ్ మేనేజ్మెంట్ క్రిస్ వోక్స్‌పై నమ్మకం ఉంచింది. అతనితో పాటు జోష్ టంగ్, బ్రైడన్ కార్స్‌ను కొనసాగించింది. నాలుగో పేసర్‌గా కెప్టెన్ బెన్ స్టోక్స్ వ్యవహరించనున్నాడు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా షోయబ్ బషీర్ కొనసాగనున్నాడు. బ్యాటింగ్ విభాగంలో జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్,జో రూట్, హ్యారీ బ్రూక్ తమ యధా స్థానాల్లో బరిలోకి దిగనున్నారు. వికెట్‌కీపర్‌గా జేమీ స్మిత్ వ్యవహరించనున్నాడు.రెండో టెస్ట్ జులై 2న భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభం కానుంది. ఐదు మ్యాచ్‌ల ఈ టెస్ట్ సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివరి రోజు వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది.ఛేదనలో బెన్ డకెట్ (149) సూపర్ సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. జాక్ క్రాలే (65), జో రూట్ (53 నాటౌట్), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (44 నాటౌట్) తలో చేయి వేశారు. భారత బౌలర్లు సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లను ఏమాత్రం కట్టడి చేయలేకపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారత బౌలర్లను సునాయాసంగా ఎదుర్కొని పరుగులు చేశారు. ప్రసిద్ద్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్ తలో 2 వికెట్లు తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. అనుభవజ్ఞుడైన స్పిన్నర్ రవీంద్ర జడేజాది కూడా అదే పరిస్థితి.ఈ మ్యాచ్‌లో భారత బ్యాటర్లు రెండు ఇన్నింగ్స్‌ల్లో అద్బుతంగా ఆడారు. అయినా సెకెండ్ ఇన్నింగ్స్‌లో బౌలర్లు ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు శతకాలు నమోదైన ప్రయోజనం లేకుండా పోయింది. తొలి ఇన్నింగ్స్‌లో జైస్వాల్ (101), గిల్ (147), పంత్ (134) సెంచరీలు చేశారు. రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ (137), పంత్ (118) శతకాలు చేశారు. ఇంగ్లండ్ తరఫున తొలి ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీ చేయగా.. హ్యారీ బ్రూక్ (99) తృటిలో ఆ అవకాశాన్ని చేజార్చుకున్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా 5 వికెట్ల ప్రదర్శన చేసినప్పటికీ ఇంగ్లండ్ భారీ స్కోర్ చేసింది.టీమిండియాతో రెండో టెస్ట్ కోసం ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోష్ టంగ్, షోయబ్ బషీర్ -
నిరాశపరిచిన ఆయుశ్ మాత్రే.. మరోసారి విధ్వంసం సృష్టించిన వైభవ్ సూర్యవంశీ
14 ఏళ్ల భారత యువ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ ఇంగ్లండ్ గడ్డపై మరోసారి రెచ్చిపోయాడు. ఇంగ్లండ్ అండర్ 19 జట్టుతో ఇవాళ (జూన్ 30) జరుగుతున్న మ్యాచ్‌లో మరో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. తొలి వన్డేలో 19 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 48 పరుగులు చేసిస వైభవ్.. రెండో వన్డేలో 34 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 45 పరుగులు చేసి ఔటయ్యాడు. వైభవ్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో అర్హమైన హాఫ్ సెంచరీలను మిస్ చేసుకున్నాడు. మరోవైపు వైభవ్‌తో పాటు ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన మరో ఐపీఎల్ సంచలన ఆయుశ్ మాత్రే ఈ మ్యాచ్‌లో నిరాశపరిచాడు. మాత్రే తానెదుర్కొన్న తొలి బంతికే డకౌటయ్యాడు (గోల్డెన్ డక్). మాత్రే వైభవ్ తరహాలో కాకపోయినా తొలి వన్డేలో పర్వాలేదనిపించాడు. ఆ మ్యాచ్‌లో అతను 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్ల సాయంతో 21 పరుగులు చేశాడు.రెండో వన్డే విషయానికొస్తే.. ఇంగ్లండ్ టాస్ గెలిచి భారత్‌ను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. అధికారికంగా తొలి బంతికే ఆయుశ్ మాత్రే (0) వికెట్ కోల్పోయిన భారత్.. ఆతర్వాత కుదురుకుంది. వైభవ్ సూర్యవంశీ (45), విహాన్ మల్హోత్రా (49), చవ్డా (22), అభిగ్యాన్ కుందు (32), రాహుల్ కుమార్ (47), కనిష్క్ చౌహాన్ (45) రాణించడంతో ఓ మోస్తరుకు మించి భారీ స్కోర్ చేసింది. అయితే చివరి వరుస ఆటగాళ్లు వెంటవెంటనే ఔట్ కావడంతో భారత్ ఇన్నింగ్స్ 49 ఓవర్లలో 290 పరుగుల వద్ద ముగిసింది (ఆలౌట్). ఇంగ్లండ్ బౌలర్లలో ఫ్రెంచ్ 4 వికెట్లు పడగొట్టగా.. జాక్ హోమ్, అలెక్స్ గ్రీన్ తలో 3 వికెట్లు తీశారు. కాగా, భారత అండర్-19 జట్టు 5 వన్డేలు, 2 టెస్ట్ మ్యాచ్‌ల కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. నాటింగ్హమ్ వేదికగా ప్రస్తుతం రెండో వన్డే జరుగుతుండగా.. హోవ్‌లో జరిగిన తొలి వన్డేలో భారత్ ఇంగ్లండ్‌పై 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 42.2 ఓవర్లలో 174 పరుగులకే కుప్పకూలగా.. భారత్ కేవలం 24 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ పర్యటనలో భారత జట్టుకు ఆయుశ్ మాత్రే సారథ్యం వహిస్తున్నాడు. -
టీమిండియా చేతిలో దారుణ ఓటమి.. ఇంగ్లండ్ జట్టుకు మరో షాక్
నాటింగ్హమ్ వేదికగా నిన్న (జూన్ 28) జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్‌పై భారత మహిళల క్రికెట్ జట్టు 97 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ గెలుపుతో భారత్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో స్మృతి మంధన విధ్వంసకర శతకం (62 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 112 పరుగులు) సాధించి టీమిండియాను గెలిపించింది. ఈ సెంచరీతో మంధన మూడు ఫార్మాట్లలో శతకాలు చేసిన తొలి భారత మహిళా ప్లేయర్‌గా చరిత్ర సృష్టించింది. మంధన కేవలం 51 బంతుల్లోనే సెంచరీ మార్క్‌ను అందుకుంది. తద్వారా మహిళల టీ20ల్లో ఐదో ఫాస్టెస్ట్ సెంచరీని, భారత్ తరఫున రెండో ఫాస్టెస్ట్ సెంచరీని (హర్మన్-49 బంతుల్లో) నమోదు చేసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. మంధన శతక్కొట్టడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేసింది. అనంతరం 211 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్.. భారత బౌలర్ల ధాటికి కేవలం 113 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో కడప అమ్మాయి శ్రీచరణీ నాలుగు వికెట్లతో సత్తాచాటింది. ఆమెతో పాటు దీప్తీ శర్మ, రాధా యాదవ్ తలో రెండు వికెట్లు సాధించారు. ఇంగ్లండ్ బ్యాటర్లలో కెప్టెన్ సీవర్ బ్రంట్(66) టాప్ స్కోరర్‌గా నిలిచింది.ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ఓటమి బాధలో ఉన్న ఇంగ్లండ్‌కు మరో షాక్ తగిలింది. స్లో ఓవర్ రేట్ కారణంగా ఆ జట్టు మ్యాచ్ ఫీజ్‌లో 10 శాతం జరిమానాగా విధించబడింది. నిర్ణీత సమయంలోగా ఇంగ్లండ్ రెండు ఓవర్లు వెనుకపడింది. ఓవర్‌కు 5 శాతం చొప్పున ఐసీసీ 10 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించింది. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఇది ఆర్టికల్ 2.22 నిబంధన ఉల్లంఘన కిందికి వస్తుంది. ఐసీసీ జరిమానాను ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్ స్వీకరించింది. ఇంగ్లండ్ జట్టులోకి సభ్యులందరికీ ఈ జరిమానా వర్తిస్తుంది.కాగా, ఇంగ్లండ్ మహిళల టీ20 క్రికెట్ చరిత్రలో ఇదే అతి పెద్ద ఓటమి. టీ20ల్లో ఇంగ్లండ్‌పై 200 ప్లస్ స్కోర్ చేసిన రెండో జట్టుగా భారత్ రికార్డుల్లోకెక్కింది. రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా జులై 1న జరుగనుంది. -
చారిత్రక లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన భారత్
భారత దివ్యాంగుల క్రికెట్ జట్టు (మిక్స్డ్) చారిత్రక లార్డ్స్ మైదానంలో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టును 2 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ చివరి ఓవర్లో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. అంగస్ బ్రౌన్ (47 బంతుల్లో 77; 5 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు అర్ద శతకంతో చెలరేగాడు. భారత బౌలర్లలో వివేక్ కుమార్, కెప్టెన్ రవీంద్ర సంటే తలో వికెట్లు తీశారు.అనంతరం బరిలోకి దిగిన భారత్.. ఓపెనర్ రాజేశ్ ఇరప్పా కున్నూర్ (29), సాయి ఆకాశ్ (34 బంతుల్లో 44) సత్తా చాటడంతో 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఈ గెలుపుతో భారత్ ఏడు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ ఆధిక్యాన్ని 1-2కు తగ్గించింది. దీనికి ముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ విజయం సాధించింది. క్రికెట్ మక్కాగా పిలువబడే లార్డ్స్ మైదానంలో ఇది తొలి దివ్యాంగుల అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్. ఈ గెలుపును భారత దివ్యాంగుల జట్టు 1983 వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టుకు అంకితమిచ్చింది.ఈ మ్యాచ్ జూన్ 25న జరిగింది. 42 ఏళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు లార్డ్స్ మైదానంలో కపిల్ డెవిల్స్ వెస్టిండీస్‌ను చిత్తు చేసి తొలిసారి జగజ్జేతగా అవతరించింది. జూన్ 25ను వరల్డ్ మిక్స్డ్ డిజేబులిటీ డేగా (World Mixed Disability Day) జరుపుకున్నారు. -
IND VS ENG: బుమ్రాపై వర్క్ లోడ్.. ఒక్కడు ఎంతని చేయగలడు..?
ఇటీవలికాలంలో టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా ప్రస్తావన వచ్చే సరికి వర్క్ లోడ్ అన్న పదం వినిపిస్తుంది. చాలామందికి ఈ పదం చాలా సాధారణంగా అనిపించవచ్చు. క్రికెట్‌పై పెద్దగా అవగాహన లేని వారు.. ఈ ఇంత దానికే వర్క్ లోడ్ అంటే ఎలా అని అంటుంటారు. గతంలో చాలామంది పేసర్లు బుమ్రా కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడి, లెక్కలేనన్ని ఓవర్లు వేశారని గుర్తు చేస్తుంటారు.అయితే అప్పటి క్రికెట్‌కు, ఇప్పటి క్రికెట్‌కు పోల్చుకోలేని వ్యత్యాసం ఉందన్న విషయం వారికి అర్దం కాదు. అప్పట్లో పేసర్లు టెస్ట్ మ్యాచ్‌లు, అప్పుడప్పుడు వన్డేలు ఆడేవారు. అది కూడా ఏడాదిలో కొంతకాలం మాత్రమే. అయితే పొట్టి క్రికెట్ ఆగమనంతో పరిస్థితి చాలా మారింది. ఏడాది పొడవునా ఏదో ఒక ఫార్మాట్లో మ్యాచ్‌లు జరుగుతుంటాయి. మధ్యలో ప్రైవేట్ లీగ్‌లు, ఖాళీగా ఉంటే దేశవాలీ మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుంది.ఇలాంటి పరిస్థితుల్లో పేస్ బౌలర్లపై సహజంగానే పని భారం ఉంటుంది. శరీరం పెద్దగా సహకరించదు. ఒకవేళ ధైర్యం చేసి బరిలోకి దిగినా గాయాలు తప్పవు. గాయాల బారిన పడితే కొన్ని సందర్భాల్లో అర్దంతరంగా కెరీర్లే ముగిసిపోతాయి. కెరీర్ ముగిస్తే సదరు బౌలర్ జీవితం కూడా ముగిసినట్లే. ఇవన్నీ చూసుకొనే పేసర్లు ఆచితూచి మ్యాచ్‌లు ఆడుతుంటారు. సంబంధిత క్రికెట్ బోర్డులు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొనే వారిని ఎంపిక చేస్తుంటారు. బుమ్రా సహా ప్రపంచ క్రికెట్లో పేసర్లందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. అయితే, గత ఏడాదిన్నర కాలంగా మిగతా పేసర్లతో పోలిస్తే బుమ్రాపై అదనపు పని భారం పడుతుంది. టెస్ట్‌ల్లో ప్రపంచ ప్రఖ్యాత పేసర్లు మిచెల్ స్టార్క్ (362), కగిసో రబాడ (298) వంటి వారు 2024 నుంచి గరిష్టంగా 362 ఓవర్లు వేస్తే, బుమ్రా ఏకంగా 410 ఓవర్లు వేశాడు. ఈ గణాంకాలు చేస్తే చాలు బుమ్రాపై ఎంత పని భారం పడుతుందో చెప్పడానికి.టీమిండియా బుమ్రాపై అతిగా ఆధారపడుతూ, అతనిచే సామర్థ్యానికి మించి బౌలింగ్ చేయిస్తుంది. ఇదే కొనసాగితే బుమ్రా ఎక్కువ కాలం క్రికెట్ ఆడే అవకాశం ఉండదు. వర్క్ లోడ్ ఎక్కువై గాయాల బారిన పడి, బుమ్రా కెరీర్ అర్దంతరంగా ముగిసే ప్రమాదం ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొనే భారత మేనేజ్మెంట్ బుమ్రాను పరిమితంగా వినియోగించుకుంటుంది. ఇంగ్లండ్ టూర్లో కేవలం మూడు మ్యాచ్‌లే ఆడించాలని నిర్ణయించుకుంది.బుమ్రా గురించి ఆలోచిస్తే ఇది ఓకే. మరి టీమిండియా ప్రదర్శన మాటేంటి అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. గత కొంతకాలంగా టెస్ట్‌ల్లో బుమ్రా లేకపోతే టీమిండియా సున్నా అన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇది తెలిసి కూడా బీసీసీఐ బుమ్రాకు ప్రత్యామ్నాయాన్ని తయారు చేసుకోలేకపోతుంది. బుమ్రా ఒక్కడు ఎంత వరకు చేయగలడని మాజీలు చాలాకాలంగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. బుమ్రా రాణించకపోతే టీమిండియా పరిస్థితి ఏంటన్నది తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్ సూచిస్తుంది. ఆ మ్యాచ్‌లో బుమ్రా తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసినా, రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపలేకపోవడంతో టీమిండియా ఓటమిపాలైంది. ఇకనైనా భారత్ బుమ్రాపై అతిగా ఆధారపడకుండా, ప్రత్యామ్నాయాలను చూసుకోవాలి. -
ఇంగ్లండ్‌తో రెండో టెస్ట్.. టీమిండియాకు షాకింగ్ న్యూస్..!
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న టీమిండియా జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా రెండో టెస్ట్ ఆడుతుంది. ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తుంది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ మ్యాచ్ నుంచి వైదొలిగాడని వార్తలు వినిపిస్తున్నాయి. వర్క్ లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా జట్టు యాజమాన్యమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.బుమ్రా తాజాగా ముగిసిన లీడ్స్ టెస్ట్‌లో 44 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఇది అతనిపై అదనపు భారం పడేలా చేసిందని మేనేజ్మెంట్ భావిస్తుంది. దీంతో అతనికి రెండో టెస్ట్‌లో విశ్రాంతినిచ్చి, తిరిగి మూడో టెస్ట్‌లో బరిలోకి దించే అవకాశం ఉంది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందే బుమ్రా అన్ని మ్యాచ్‌లు ఆడడని బీసీసీఐ పరోక్షంగా చెప్పింది. వర్క్ లోడ్ కారణంగా స్టార్ పేసర్ కేవలం మూడు మ్యాచ్‌లే ఆడతాడని బోర్డులోని కీలక సభ్యులంతా చెప్పారు.తొలి టెస్ట్‌కు, రెండో టెస్ట్‌కు మధ్య 8 రోజుల గ్యాప్ ఉండటంతో బుమ్రా రెండో టెస్ట్‌లో ఆడతాడని అంతా అనుకున్నారు. ఒకవేళ విశ్రాంతినిచ్చినా, చివరి మూడు టెస్ట్‌ల్లో ఉంటుందని అంచనా వేశారు. అయితే తొలి టెస్ట్‌లో పడిన అదనపు భారం కారణంగా బుమ్రా విషయంలో ప్రణాళికలు మారాయని తెలుస్తుంది. బుమ్రా విషయంలో బీసీసీఐ ఎలాంటి సాహసాలు చేసేందుకు సిద్దంగా ఉండదు. జులై 10 నుంచి లార్డ్స్‌లో జరిగే మూడో టెస్ట్‌కు బుమ్రా సిద్దంగా ఉండే అవకాశం ఉంది. 16 రోజుల గ్యాప్‌లో బుమ్రా పూర్తి సన్నద్దత సాధించవచ్చు.రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడకపోతే సిరాజ్ భారత పేస్ విభాగానికి నాయకత్వం వహిస్తాడు. ఇప్పటికే తొలి టెస్ట్ కోల్పోయి సిరీస్‌లో వెనుకపడిన టీమిండియాకు ఇది అంత శుభపరిణాయం కాదు. తొలి టెస్ట్‌లో బుమ్రా మినహా పేసర్లంతా తేలిపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసిన బుమ్రా కూడా రెండో ఇన్నింగ్స్‌లో ప్రభావం చూపించలేకపోయాడు. రెండో టెస్ట్‌లో బుమ్రా ఆడినా, ఆడకపోయిన భారత బౌలింగ్ విభాగంలో భారీ మార్పులకు ఆస్కారం ఉంది.ఒకవేళ బుమ్రా ఆడకపోతే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్‌లలో ఎవరో ఒకరికి అవకాశం దక్కుతుంది. బుమ్రా ఆడకుండా, తొలి టెస్ట్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ద్ కృష్ణపై కూడా వేటు పడితే ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్ ఇద్దరికీ తుది జట్టులో చోటు దక్కుతుంది. తొలి టెస్ట్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయిన శార్దూల్ ఠాకూర్‌పై కూడా వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో రిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకోవచ్చు. బ్యాటింగ్ విభాగంలో భారత్ ఎలాంటి సాహసాలు చేయకపోవచ్చు.పూర్తి లైనప్‌ను యధాతథంగా కొనసాగించే అవకాశం ఉంది. తొలి టెస్ట్‌లో సాయి సుదర్శన్, కరుణ్ నాయర్ విఫలమైన వారికి మరో ఛాన్స్ తప్పక ఉంటుంది. టీమిండియా విషయాన్ని పక్కన పెడితే ఇంగ్లండ్ రెండో టెస్ట్ కోసం జట్టును ప్రకటించింది. ప్రమాదకర పేసర్ జోఫ్రా ఆర్చర్ నాలుగేళ్ల తర్వాత టెస్ట్ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. -
టీమిండియా చెత్త రికార్డు.. జింబాబ్వే సరసన చోటు
ఇంగ్లండ్ చేతిలో తొలి టెస్ట్‌లో (హెడింగ్లే) ఓడిన టీమిండియా పలు చెత్త రికార్డులను మూటగట్టుకుంది. ఇందులో ప్రధానమైనవి రెండున్నాయి. మొదటిది.. ఈ మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు ఐదు సెంచరీలు చేసినా టీమిండియా ఓటమిపాలవ్వడం. రెండోది.. టీమిండియా హ్యాట్రిక్ పరాజయాలు (టెస్ట్‌ల్లో) సహా చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకే ఒక మ్యాచ్ గెలవడం. టెస్ట్ క్రికెట్ చరిత్రలో టీమిండియాకు ముందు జింబాబ్వే మాత్రమే ఈ చెత్త రికార్డును మూటగట్టుకుంది. ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ లాంటి చిన్న జట్లు కూడా వారాడిన చివరి 9 మ్యాచ్‌ల్లో కనీసం రెండైనా గెలిచాయి. సౌతాఫ్రికా అయితే టెంబా బవుమా సారథ్యంలో చివరి 9 మ్యాచ్‌ల్లో ఏకంగా ఎనిమిదింట గెలిచింది.మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. జింబాబ్వే చివరి 9 మ్యాచ్‌ల్లో ఒకటే గెలిచినా, రెండు మ్యాచ్‌లు డ్రా అయినా చేసుకుంది. ఆరింట మాత్రమే ఓడింది. టీమిండియా అయితే ఒకటి గెలిచి, మరో మ్యాచ్ మాత్రమే డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట ఓటమిపాలైంది. ఈ లెక్కన భారత్‌ను జింబాబ్వే సరసన అనడానికి కూడా వీళ్లేదు.డ్రా అయినా చేసుకోవాల్సింది..!తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌ను భారత్ కనీసం డ్రా అయినా చేసుకొని ఉండాల్సింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాల్సిన పరిస్థితి నుంచి ఓటమిని కొని తెచ్చుకుంది. ఆటగాళ్ల స్వయంకృతాపరాధాలే భారత్ ఓటమికి కారణం. బౌలర్ల వైఫల్యం, ఫీల్డర్లు క్యాచ్‌లు జారవిడచడం టీమిండియా కొంపముంచాయి.ఈ మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు.ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. మ్యాచ్ మొత్తంలో భారత ఫీల్డర్లు ఏకంగా ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది.టీమిండియా చివరిగా ఆడిన 9 టెస్ట్‌ల వివరాలు..ఇంగ్లండ్‌తో- ఓటమి (టెండూల్కర్-ఆండర్సన్ ట్రోఫీ 2025)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-డ్రా (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-ఓటమి (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)ఆస్ట్రేలియాతో-విజయం (బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024)న్యూజిలాండ్‌తో-ఓటమి (స్వదేశంలో 3 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ 2024) -
రింకూ సింగ్‌కు ప్రభుత్వ ఉద్యోగం.. పోస్ట్ ఏమిటంటే?!
టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh) కొత్త ప్రయాణం ఆరంభించబోతున్నాడు. ఉత్తరప్రదేశ్ విద్యా శాఖ విభాగంలో అతడు ఉద్యోగం చేరనున్నాడు. అలీగఢ్‌కు చెందిన రింకూ సింగ్ పేద కుటుంబంలో జన్మించాడు.పేద కుటుంబంతన తండ్రి ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు వేస్తూ కుటుంబాన్ని పోషించగా.. ఆయన బాధ్యతల్లో భాగం పంచుకునేందుకు రింకూ చిరు ఉద్యోగాలు చేశాడు. ఒకానొక సమయంలో స్వీపర్‌గానూ పనిచేసేందుకు వెనకాడలేదని వార్తలు వచ్చాయి. అయితే, కష్టాల సుడిగుండంలో చిక్కుకుపోయినా.. క్రికెటర్‌గా ఎదగాలన్న రింకూ తన కలను సాకారం చేసుకునేందుకు అహర్నిషలు శ్రమించాడు.పట్టుదలతో టీమిండియా స్టార్గాదేశవాళీ క్రికెట్లో యూపీ తరఫున సత్తా చాటిన రింకూ సింగ్ దశ.. ఐపీఎల్‌తో మారిపోయింది. కోల్‌కతా నైట్ రైడర్స్ అతడిని కొనుగోలు చేసి.. ఆరంభంలో పక్కకుపెట్టినా.. ఆ తర్వాత వరుస అవకాశాలు ఇచ్చింది. ఈ క్రమంలో 2018లో ఐపీఎల్లో అరంగేట్రం చేసిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అద్భుత ఆట తీరుతో అలరించాడు.ఈ నేపథ్యంలో టీమిండియా సెలక్టర్లు రింకూపై నమ్మకం ఉంచి 2023లో ఐర్లాండ్ పర్యటనకు వెళ్లే భారత జట్టులో చోటిచ్చారు. అలా రింకూ అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అదే ఏడాది వన్డేల్లోనూ ఎంట్రీ ఇచ్చాడు. రింకూ ఇప్పటికి భారత్ తరఫున 33 టీ20 మ్యాచ్‌లు ఆడి 546 పరుగులు, రెండు వన్డేల్లో కలిపి 55 పరుగులు సాధించాడు.రూ. 13 కోట్లకు రిటైన్ఇక ఐపీఎల్-2025 మెగా వేలానికి ముందు కోల్‌కతా ఫ్రాంఛైజీ రింకూను తమ మొదటి ప్రాధాన్య ఆటగాడిగా.. ఏకంగా రూ. 13 కోట్లకు రిటైన్ చేసుకుంది. క్యాష్ రిచ్ లీగ్‌లో ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రింకూ 1099 పరుగులు చేశాడు.స్కూల్‌డ్రాపౌట్? ఇలా క్రికెట్ రంగంలో సేవలు అందిస్తూ.. రాష్ట్రానికి పేరు తీసుకువస్తున్న రింకూను ఉద్యోగంతో సత్కరించాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం భావించింది. ఈ క్రమంలో ఇంటర్నేషనల్ మెడల్ విన్నర్స్ డైరెక్ట్ రిక్రూట్మెంట్-2022 పథకం ప్రకారం అతడిని జిల్లా ప్రాథమిక విద్యా అధికారి (BSA) నియమించేందుకు సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. స్థానిక మీడియా ఇందుకు సంబంధించిన కథనాలు ఇచ్చింది. కాగా ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం.. రింకూ తొమ్మిదో తరగతిలో చేరకముందే డ్రాపౌట్ అయినట్లు తెలుస్తోంది.ఎంపీతో నిశ్చితార్థంఇక వ్యక్తిగత జీవితంలోనూ రింకూ సింగ్ కొత్త ప్రయాణానికి సిద్ధమయ్యాడు. లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్‌తో మూడేళ్ల ప్రేమను పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. ఈ ఏడాది జూన్ 8న ప్రియసఖి వేలికి ఉంగరం తొడిగి నిశ్చితార్థం చేసుకున్న రింకూ.. ఈ ఏడాది నవంబరులో లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నాడు.చదవండి: తప్పుడు వ్యక్తులతో స్నేహం.. అప్పుడు అతడు తప్పు ఎవరూ మాట్లాడలేదు: పృథ్వీ షా -
గౌతమ్ గంభీర్‌పై విమర్శల వర్షం
టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతమ్ గంభీర్ గతేడాది టీ20 వరల్డ్‌కప్ తర్వాత (2024, జూన్) బాధ్యతలు చేపట్టాడు. రాహుల్ ద్రవిడ్ నుంచి గంభీర్ బాధ్యతలు స్వీకరించాడు. ద్రవిడ్ ఆథ్వర్యంలో భారత్ టీ20 వరల్డ్ ఛాంపియన్‌గా అవతరించింది. ద్రవిడ్ వారసుడిగా అప్పటికే కేకేఆర్‌కు ఐపీఎల్ టైటిల్ (మెంటార్) అందించిన గంభీర్ రావడంతో టీమిండియాపై అంచనాలు భారీగా పెరిగాయి. మూడు ఫార్మాట్లలో భారత్‌కు తిరుగుండదని అందరూ భావించారు.అయితే అంచనాలు తారుమారయ్యాయి. గంభీర్ ఆథ్వర్యంలో టీమిండియా టెస్ట్‌ల్లో దారుణంగా విఫలమవుతూ వస్తుంది. టీమిండియా హెడ్ కోచ్‌గా గంభీర్ రెండు వరుస విజయాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తొలి రెండు విజయాలు బంగ్లాదేశ్‌పై సాధించినవి కావడంతో వాటికి అంత ప్రాముఖ్యత దక్కలేదు.అయితే గంభీర్‌కు అసలు పరీక్ష మూడో టెస్ట్ నుంచి మొదలైంది. భారత్ స్వదేశంలో ఇంగ్లండ్ చేతిలో వరుసగా మూడు టెస్ట్‌ల్లో ఓడింది. ఇక్కడి నుంచే గంభీర్‌పై విమర్శలు ప్రారంభమయ్యాయి. అయితే ఆ తర్వాతి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియాను ఓడించడంతో గంభీర్ విజయ ప్రస్తానం మొదలైందని అంతా అనుకున్నారు. అయితే గంభీర్ విజయ పరంపర కేవలం ఆ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన రెండో టెస్ట్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో పరాజయంపాలైంది. ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో మూడో టెస్ట్ డ్రా కాగా.. నాలుగు, ఐదు మ్యాచ్‌ల్లో టీమిండియా వరుసగా పరాజయాలు చవిచూసింది.తాజాగా ఇంగ్లండ్ చేతిలో ఓటమితో భారత్ గంభీర్ ఆథ్వర్యంలో హ్యాట్రిక్ పరాజయాలను మూటగట్టుకుంది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్‌గా ఉండగా.. భారత్ 11 టెస్ట్ మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించింది. ఒకటి డ్రా చేసుకొని, ఏకంగా ఏడింట పరాజయాలు ఎదుర్కొంది. వరుస వైఫల్యాల నేపథ్యంలో గంభీర్‌పై విమర్శలు ధాటి బాగా పెరిగింది. ద్రవిడ్ హయాంలో వరుస విజయాలతో దూసుకుపోయిన టీమిండియా.. గంభీర్ వచ్చాక అదఃపాతాళానికి పడిపోయిందని భారత క్రికెట్ అభిమానులే అంటున్నారు. గంభీర్ వచ్చాక టీమిండియాలో రాజకీయాలు ఎక్కువయ్యాయని, అందుకే ఈ పరాజయాలు పరంపర అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.గంభీర్ తన తీరును మార్చుకోకపోతే టీమిండియా ఇంగ్లండ్‌లో వైట్‌వాష్ తప్పదని జోస్యం చెబుతున్నారు. గంభీర్ రాజకీయాలు మాని జట్టును గెలుపు బాట పట్టించడంపై దృష్టి సారించాలని సూచిస్తున్నారు. గంభీర్ ఇదే ధోరణిని కొనసాగిస్తే.. భారత్‌కు టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద పరాజయాలు పరంపర తప్పదని హెచ్చరిస్తున్నారు. 1967-68లో భారత్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొంది. ఇప్పటికే హ్యాట్రిక్ పరాజయాలు ఎదుర్కొన్న భారత్.. ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయితే ఆ రికార్డును సమం చేస్తుంది. ప్రస్తుతం టీమిండియా గంభీర్ ఆథ్వర్యంలో గత 9 మ్యాచ్‌ల్లో ఒకే విజయం సాధించి, మరో అపవాదును మూటగట్టుకుంది. -
England Tour: యువ ఆటగాడిని వెనక్కి పిలిచిన బీసీసీఐ
ఇంగ్లండ్ పర్యటన కోసం టీమిండియా బ్యాకప్ పేసర్‌గా ఎంపికైన హర్షిత్ రాణాను బీసీసీఐ వెనక్కు పిలిచినట్లు తెలుస్తుంది. హర్షిత్‌ను వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని బీసీసీఐ ఆదేశించినట్లు సమాచారం. ఈ మేరకు భారత మేనేజ్మెంట్ రెండో టెస్ట్ మ్యాచ్‌కు ముందు హర్షిత్‌ను రిలీజ్ చేసినట్లు తెలుస్తుంది. రెండో టెస్ట్ కోసం బర్మింగ్హమ్కు పయనమైన భారత జట్టుతో పాటు హర్షిత్ లేడని టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. వాస్తవానికి హర్షిత్ ఇంగ్లండ్ పర్యటన కోసం తొలుత ప్రకటించిన భారత జట్టులో లేడు. సుదీర్ఘంగా సాగే పర్యటన కావడంతో పేస్ బౌలర్లు గాయపడే అవకాశం ఉందని హెడ్ కోచ్ గంభీర్ ముందు జాగ్రత్త చర్యగా హర్షిత్ పేరును సిఫార్సు చేశాడు. దీంతో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు హర్షిత్ హుటాహుటిన ఇంగ్లండ్‌కు పయనమయ్యాడు. అయితే తాజా పరిస్థితుల ప్రకారం బ్యాకప్ పేసర్ అవసరం లేదని భారత మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు తెలుస్తుంది. జట్టులోని పేసర్లంతా ఫిట్‌గా ఉన్నారని సమాచారం. అందుకే మేనేజ్మెంట్ హర్షిత్‌ను బీసీసీఐకి సరెండర్ చేసినట్లు తెలుస్తుంది.గంభీర్‌పై విమర్శలుఇంగ్లండ్ పర్యటన కోసం హర్షిత్‌ను టీమిండియా బ్యాకప్ పేసర్ ఎంపిక చేసిన తర్వాత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై విమర్శలు వచ్చాయి. హర్షిత్ విషయంలో గంభీర్ పక్షపాతంగా వ్యవహరిస్తున్నాడని విశ్లేషకులు బహిరంగ కామెంట్లు చేశారు. గంభీర్ కేకేఆర్ కోచ్‌గా ఉన్నప్పుడు హర్షిత్‌ను దగ్గరగా చూశాడు. అదే పరిచయంతో గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాక హర్షిత్ పేరును సెలెక్టర్లకు కూడా సిఫార్సు చేసినట్లు టాక్ వినిపించింది. గంభీర్ టీమిండియా హెడ్ కోచ్ అయ్యాకే హర్షిత్ మూడు ఫార్మాట్లలో భారత్ జట్టు తరఫున అరంగేట్రం చేశాడు. హర్షిత్‌లో గుర్తించదగ్గ ప్రత్యేకతలేమీ లేనప్పటికీ.. టీమిండియా తరఫున సులువుగా అన్ని ఫార్మాట్లలో అరంగేట్రం చేశాడు. తాజాగా ఇంగ్లండ్ పర్యటనకు హర్షిత్‌ను బ్యాకప్ పేసర్‌గా ఎంపిక చేయడంతో విమర్శల శృతి మించిందని గంభీరే స్వయంగా హర్షిత్‌ను బీసీసీఐ సరెండర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.కాగా, బ్యాకప్ పేసర్‌తో పాటు పేస్ బౌలింగ్ బలం సంపూర్ణంగా ఉన్నా భారత్ తొలి టెస్ట్‌లో ఇంగ్లండ్ చేతిలో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో భారత ఓటమికి బౌలింగ్ విభాగం కూడా ఒకానొక కారణం. తొలి ఇన్నింగ్స్‌లో బుమ్రా పుణ్యమా అని (5 వికెట్ల ప్రదర్శన) ఇంగ్లండ్‌ను ఆలౌట్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌లో దారుణంగా విఫలమైంది. బుమ్రా సహా బౌలింగ్ విభాగమంతా తేలిపోయింది. రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్‌కు పగ్గాలేయడం ఎవరి వల్ల కాలేదు. బుమ్రా సైతం చేతులెత్తేశాడు. ఫలితంగా భారత్ 371 పరుగుల లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేక పరాజయంపాలైంది. -
అన్ లక్కీ పంత్.. ప్రతిసారి ఇంతే..!
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ క్రికెట్ చరిత్రలో మోస్ట్ అన్ లక్కీ బ్యాటర్‌గా మారిపోతున్నాడు. ఫార్మాట్ ఏదైనా ఇతగాడు సెంచరీ చేశాడంటే అతని జట్టు గెలవడం లేదు. తాజాగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్ ఇందుకు ఉదాహరణ. ఈ మ్యాచ్‌లో పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసినా ఇండియా గెలవలేదు. దీనికి ముందు ఐపీఎల్-2025లోనూ ఇలాగే జరిగింది. ఆర్సీబీతో జరిగిన మ్యాచ్‌లో పంత్ అద్బుత సెంచరీ చేసినా, ఆ మ్యాచ్‌లోనూ అతని జట్టు (లక్నో) గెలవలేదు.టెస్ట్ క్రికెట్లో, ప్రత్యేకించి విదేశాల్లో పంత్ సెంచరీల బ్యాడ్ లక్ ఇప్పుడు మొదలైంది కాదు. 2018 నుంచి పంత్ విదేశాల్లో 6 టెస్ట్ సెంచరీలు చేయగా.. ఇందులో టీమిండియా ఒక్క మ్యాచ్‌లో కూడా గెలవలేదు. 2018లో పంత్ తన తొలి విదేశీ టెస్ట్ సెంచరీని (114) కెన్నింగ్స్టన్ ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌పై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా దారుణంగా ఓడింది. విదేశాల్లో పంత్ రెండో టెస్ట్ సెంచరీని (159 నాటౌట్) 2019లో సిడ్నీ గ్రౌండ్లో ఆస్ట్రేలియాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో టీమిండియా అదృష్టవశాత్తు డ్రాతో గట్టెక్కింది.విదేశాల్లో పంత్ మూడో టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) 2022లో న్యూలాండ్స్‌లో సౌతాఫ్రికాపై చేశాడు. ఆ మ్యాచ్‌లో కూడా టీమిండియాకు పరాజయమే ఎదురైంది. విదేశాల్లో పంత్ నాలుగో టెస్ట్ సెంచరీ (146) అదే ఏడాది ఇంగ్లండ్‌పై (ఎడ్జ్‌బాస్టన్) చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ టీమిండియాకు పరాభవం తప్పలేదు. తాజాగా హెడింగ్లే టెస్ట్‌లో పంత్ ఇంగ్లండ్‌పై రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు (134 & 118) చేసినా టీమిండియా గెలవలేకపోయింది. ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున ఐదు సెంచరీలు (పంత్-2, జైస్వాల్, గిల్, రాహుల్) నమోదైనా గెలుపు దక్కకపోవడం శోచనీయం.ఇదిలా ఉంటే, హెడింగ్లేలో నిన్న ముగిసిన తొలి టెస్ట్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో 471, రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసినా టీమిండియాకు పరాభవం తప్పలేదు. భారత బౌలర్లు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని కూడా కాపాడుకోలేకపోయారు. ఛేదనలో బుమ్రా సహా భారత బౌలర్లంతా తేలిపోయారు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు కూడా టీమిండియా కొంపముంచాయి. భారత జట్టు మ్యాచ్ మొత్తంలో ఏడు క్యాచ్‌లు నేలపాలు చేసింది. ఒక్క జైస్వాల్ ఒక్కడే నాలుగు క్యాచ్‌లు జారవిడిచాడు. భారీ లక్ష్య ఛేదనలో బెన్ డకెట్ అద్భుతమైన సెంచరీ చేసి ఇంగ్లండ్‌ను గెలిపించాడు. రెండో టెస్ట్ జులై 2 నుంచి బర్మింగ్హమ్ వేదికగా జరుగనుంది. -
చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్.. 'ఆ ఘనత' సాధించిన తొలి మొనగాడు
టీమిండియా వికెట్‌కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో 800 రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి భారత వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ వికెట్‌కీపర్ బ్యాటర్ 800 రేటింగ్ పాయింట్లు సాధించలేదు. టీమిండియా దిగ్గజ వికెట్‌కీపర్ బ్యాటర్ మహేంద్ర సింగ్ ధోనికి కూడా ఇది సాధ్యపడలేదు.ఐసీసీ తాజాగా (జూన్ 25) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో పంత్ 800 రేటింగ్ పాయింట్ల మార్కును (801) తాకాడు. అలాగే ర్యాంకింగ్స్‌లో ఓ స్థానం మెరుగపర్చుకొని ఏడో స్థానానికి ఎగబాకాడు. ప్రస్తుతమున్న వికెట్‌కీపర్లలో పంత్‌దే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇంగ్లండ్‌తో నిన్న (జూన్ 24) ముగిసిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేయడంతో పంత్ ఈ ఘనతలను సాధించాడు.తాజా ర్యాంకింగ్స్‌లో టాప్-10లో పంత్‌తో పాటు మరో భారత బ్యాటర్ కూడా ఉన్నాడు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో (తొలి ఇన్నింగ్స్‌లో) సెంచరీ చేసిన యశస్వి జైస్వాల్ నాలుగో స్థానంలో కొనసాగుతున్నాడు. మరో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో, టీమిండియా నయా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 20వ స్థానానికి చేరాడు. సెకెండ్ ఇన్నింగ్స్‌లో అద్బుతమైన సెంచరీ చేసిన కేఎల్ రాహుల్ ఏకంగా 10 స్థానాలు మెరుగుపర్చుకొని 38వ స్థానానికి ఎగబాకాడు.ఈ వారం ర్యాంకింగ్స్‌లో ఇంగ్లండ్ ఓపెనర్ బెన్ డకెట్ గణనీయంగా లబ్ది పొందాడు. భారత్‌పై అద్భుతమైన సెంచరీ (149) చేసినందుకు గానూ ఐదు స్థానాలు ఎగబాకి ఎనిమిదో స్థానానికి చేరాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లలో జో రూట్, హ్యారీ బ్రూక్ మొదటి రెండు స్థానాల్లో కొనసాగుతుండగా.. ఓలీ పోప్ 3 స్థానాలు మెరుగుపర్చుకొని 19వ స్థానానికి ఎగబాకాడు. కేన్ విలియమ్సన్ 3, స్టీవ్ స్మిత్ 5, టెంబా బవుమా 6, కమిందు మెండిస్ 9, సౌద్ షకీల్ 10 స్థానాల్లో ఉన్నారు.మిగతా బ్యాటర్ల విషయానికొస్తే.. ఇటీవల శ్రీలంకతో జరిగిన తొలి టెస్ట్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన బంగ్లాదేశ్ కెప్టెన్ నజ్ముల్ షాంటో ఏకంగా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 29వ స్థానానికి చేరగా.. అదే మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన మరో బంగ్లాదేశీ ముష్ఫికర్ రహీం 11 స్థానాలు మెరుగుపర్చుకొని 28వ స్థానానికి ఎగబాకాడు. అదే మ్యాచ్‌లో భారీ సెంచరీ చేసిన శ్రీలంక ఆటగాడు పథుమ్ నిస్సంక కూడా 21 స్థానాలు మెరుగుపర్చుకొని 31వ స్థానానికి ఎగబాకాడు. ఈ వారం బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో ఇవే చెప్పుకోదగ్గ మార్పులు.బౌలర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. టాప్-10 పెద్దగా మార్పులేమీ లేవు. బుమ్రా, రబాడ, కమిన్స్, నౌమన్ అలీ, హాజిల్‌వుడ్, నాథన్ లియోన్, జన్సెన్, మ్యాట్ హెన్రీ టాప్-8లో కొనసాగుతున్నారు. మిచెల్ స్టార్క్ ఓ స్థానం ఎగబాకి తొమ్మిదో స్థానానికి చేరాడు. భారత్‌తో తాజాగా జరిగిన టెస్ట్‌లో రాణించిన బ్రైడన్ కార్స్ 8 స్థానాలు, జోష్ టంగ్ 16 స్థానాలు మెరుగుపర్చుకొని 32, 64 స్థానాలకు ఎగబాకారు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో పర్వాలేదనిపించిన భారత పేసర్ ప్రసిద్ద్ కృష్ణ 21 స్థానాలు మెరుగుపర్చుకొని 72వ ప్లేస్‌కు చేరాడు. ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో రవీంద్ర జడేజా, మెహిది హసన్ మిరాజ్, జన్సెన్ టాప్-3లో కొనసాగుతున్నారు. -
మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారు: భారత మాజీ క్రికెటర్
సీకే నాయుడు- సీఎస్ నాయుడు, క్రిపాల్ సింగ్- ఏజీ మిల్కా సింగ్, సుభాష్- బాలూ గుప్తే, అమర్ సింగ్- లధా రామ్‌జీ, మాధవ్- అరవింద్ ఆప్టే, మోహిందర్- సురీందర్ అమర్నాథ్, వజీర్ అలీ- నజీర్ అలీ, టీమిండియాకు ప్రాతినిథ్యం వహించిన అన్నదమ్ముల జోడీలు ఇవి.ప్రస్తుతం ఆక్టివ్‌గా ఉన్న హార్దిక్ పాండ్యా- కృనాల్ పాండ్యా (Hardik Pandya- Krunal Pandya)లతో పాటు మాజీ ఆటగాళ్లు పఠాన్ బ్రదర్స్ కూడా ఈ జాబితాలో ఉన్నారు. అన్న యూసఫ్ పఠాన్ (Yousuf Pathan) బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయితే.. తమ్ముడు ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) బౌలింగ్ ఆల్‌రౌండర్. అన్న కంటే ముందు తమ్ముడే అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. అయితే, ఎవరికి వారు తమదైన శైలిలో దూసుకుపోయి గుర్తింపు సాధించారు.ఇక వీరిద్దరు మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలో 2007 టీ20 ప్రపంచకప్ గెలిచిన, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్టులో సభ్యులు కావడం మరో విశేషం. ఇదిలా ఉంటే.. ఒకానొక సందర్భంలో పరిమిత ఓవర్ల క్రికెట్లో అన్న యూసఫ్ సేవలు వినియోగించుకునే క్రమంలో టీమిండియా యాజమాన్యం తమ్ముడు ఇర్ఫాన్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టిందట.కోచ్ నాతో ఇదే అన్నాడుఈ విషయాన్ని ఇర్ఫాన్ పఠాన్ తాజాగా వెల్లడించాడు. శ్రీలంక పర్యటనలో భాగంగా తాను అద్భుత ప్రదర్శన కనబరిచినా.. తదుపరి న్యూజిలాండ్ టూర్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశాన్ని మేనేజ్మెంట్ ఇవ్వలేదని తెలిపాడు. యూసఫ్ కోసం తనను తప్పించామని నాటి కోచ్ గ్యారీ కిర్‌స్టన్ స్వయంగా తనతో అన్నట్లు తెలిపాడు.మా అన్నను ఆడించేందుకు.. నాపై వేటు వేశారుఈ మేరకు సోనీ స్పోర్ట్స్ నెట్వర్క్ షోలో మాట్లాడుతూ.. ‘‘టీమిండియాలో నా స్థానాన్ని నా సోదరుడు తీసుకున్నాడు. 2009లో శ్రీలంకతో మ్యాచ్‌లో మేమిద్దరం కలిసి ఆడి.. గెలిచాం. రెండు మ్యాచ్‌లలో కలిపి నేను నాలుగు వికెట్లు తీశాను.జట్టులో నా చోటు పదిలమైందని అనుకున్నాను. కానీ న్యూజిలాండ్‌తో నాకు ఒక్క మ్యాచ్ కూడా ఆడే అవకాశం రాలేదు. ఆ తర్వాత జట్టు నుంచి తప్పించారు.అప్పుడు గ్యారీ కిర్‌స్టన్.. ‘సారీ.. నీకు జట్టులో చోటు లేదు.. ఎందుకంటే.. ఏడో స్థానంలో ఆడేందుకు మేము మీ సోదరుడి పేరును పరగణనలోకి తీసుకున్నాం’ అని చెప్పాడు’’’ అని ఇర్ఫాన్ పఠాన్ చెప్పుకొచ్చాడు. జట్టు కూర్పు కోసం ఎవరిపై ఎప్పుడు ఎందుకు వేటు వేస్తారో తెలియని పరిస్థితి ఉంటుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్- టీమిండియా మధ్య టెస్టు సిరీస్ నేపథ్యంలో చర్చ సందర్భంగా ఇర్ఫాన్ ఈ విషయాన్ని వెల్లండించాడు.బ్రదర్స్ అదుర్స్కాగా గుజరాత్‌కు చెందిన 40 ఏళ్ల ఇర్ఫాన్ పఠాన్ పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్. 2003- 2012 వరకు టీమిండియాకు ఆడిన ఈ లెఫ్టార్మ్ ఫాస్ట్ మీడియం బౌలర్.. 29 టెస్టుల్లో 100, 120 వన్డేల్లో 173, 24 టీ20 మ్యాచ్‌లలో 28 వికెట్లు కూల్చాడు.అదే విధంగా.. ఎడమచేతి వాటం గల ఇర్ఫాన్ పఠాన్ టెస్టుల్లో 1105, వన్డేల్లో 1544, టీ20లలో 127 పరుగులు సాధించాడు. మరోవైపు.. 42 ఏళ్ల యూసఫ్ పఠాన్ 2007- 2012 మధ్య కాలంలో 57 వన్డేల్లో 810, 22 టీ20లలో 236 పరుగులు చేశాడు. ఈ రైటార్మ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ ఖాతాలో 33 వన్డే వికెట్లు, 13 టీ20 వికెట్లు ఉన్నాయి.చదవండి: ఏ ఒక్కరినో తప్పుబట్టను.. కెప్టెన్ నిర్ణయం ప్రకారమే అలా చేశాం: గంభీర్𝘒𝘢𝘩𝘢𝘯𝘪 𝘣𝘩𝘢𝘪𝘺𝘰 𝘬𝘪...𝘗𝘢𝘵𝘩𝘢𝘯 𝘬𝘪 𝘻𝘶𝘣𝘢𝘯𝘪! 😊#SonySportsNetwork #GroundTumharaJeetHamari #ENGvIND #NayaIndia #DhaakadIndia #TeamIndia #ExtraaaInnings | @IrfanPathan @rpsingh @Vimalwa pic.twitter.com/AkdeeMzz67— Sony Sports Network (@SonySportsNetwk) June 24, 2025 -
IND VS ENG 1st Test Day 5: రసవత్తరంగా సాగుతున్న మ్యాచ్
లీడ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. చివరి రోజు ఆటలో (371 పరుగుల లక్ష్య ఛేదనలో) తొలి రెండు సెషన్లలో (253/2) ఆధిపత్యం చలాయించిన ఇంగ్లండ్.. రెండో సెషన్ చివరి దశలో అనూహ్యంగా రెండు వికెట్లు కోల్పోయి డిఫెన్స్‌లో పడింది. లక్ష్యానికి 118 పరుగుల దూరంలో ఉన్న సమయంలో శార్దూల్ వరుస బంతుల్లో సెట్ బ్యాటర్ బెన్ డకెట్ (149), ఇన్ ఫామ్ బ్యాటర్ హ్యారీ బ్రూక్‌ను (0) ఔట్ చేసి ఇంగ్లండ్‌ను దెబ్బ కొట్టాడు.భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటల 52 నిమిషాల సమయంలో వర్షం మరోసారి మొదలుకావడంతో టీ బ్రేక్‌ను ముందుగానే ప్రకటించారు. టీ విరామం సమయానికి ఇంగ్లండ్ లక్ష్యానికి 102 పరుగుల దూరంలో ఉంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు 4 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. క్రీజ్‌లో జో రూట్ (14), బెన్ స్టోక్స్ (13) ఉన్నారు. ఒకవేళ టీ విరామం తర్వాత వర్షం తగ్గి మ్యాచ్ యధావిధిగా సాగితే ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. భారత్ గెలవాలంటే మరో 6 వికెట్లు తీయాలి.ఓవర్‌నైట్ స్కోర్ 21/0 వద్ద చివరి రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లండ్.. డకెట్, జాక్ క్రాలే (65) మొండి పట్టుదలతో ఆడటంతో సునాయాసంగా విజయం సాధించేలా కనిపించింది. డకెట్, క్రాలే తొలి వికెట్‌కు 188 పరుగులు రికార్డు భాగస్వామ్యం నెలకొల్పి ఇంగ్లండ్ గెలుపుకు బలమైన పునాది వేశారు. ఈ దశలో ప్రసిద్ద్ కృష్ణ క్రాలే, పోప్‌ను (8) స్వల్ప వ్యవధిలో ఔట్ చేసి భారత్‌ను తిరిగి మ్యాచ్‌లోకి తెచ్చాడు. అయితే సెంచరీ పూర్తి చేసిన తర్వాత మరింత రెచ్చిపోయిన డకెట్ వేగంగా పరుగులు సాధిస్తూ లక్ష్యాన్ని చిన్నదిగా చేశాడు. ఈ దశలో శార్దూల్ వరుస బంతుల్లో డకెట్, బ్రూక్‌ను ఔట్ చేసి భారత శిబిరంలో ఆశలు రేకెత్తించాడు.ఇవాల్టి ఆటలో తొలి సెషన్ వరకు ఎలాంటి ఆటంకం కలిగించని వర్షం.. రెండో సెషన్లో ఓ సారి, టీకి ముందు మరోసారి పలకరించింది.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 269/4 (డకెట్ 149, క్రాలే 65) -
రూ. 27 కోట్ల విలువ చేసే లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేసిన శివమ్ దూబే
టీమిండియా విధ్వంసకర ఆటగాడు శివమ్ దూబే ముంబైలోని అంధేరి వెస్ట్ ప్రాంతంలోని ఓషివరాలో రెండు లగ్జరీ అపార్ట్మెంట్లను కొనుగోలు చేశాడు. స్క్వేర్యార్డ్స్ సమీక్షించిన ఆస్తి రిజిస్ట్రేషన్ పత్రాల ప్రకారం.. ఈ అపార్ట్మెంట్ల ధర రూ. 27.50 కోట్లని తెలుస్తుంది. ఈ రెండు అపార్ట్మెంట్లు DLH ఎన్క్లేవ్ అనే నివాస ప్రాజెక్ట్‌లోని 17 మరియు 18వ అంతస్తులలో ఉన్నాయి. వీటి మొత్తం వైశాల్యం 9,603 చదరపు అడుగులు (నివాస ప్రాంతం 4,200, బాల్కనీ 3,800 చదరపు అడుగులు).అపార్ట్మెంట్లతో పాటు మూడు పార్కింగ్ స్థలాలను దూబే దేవ్ ల్యాండ్ అండ్ హౌసింగ్ లిమిటెడ్ నుండి కొనుగోలు చేశాడు. ఈ లావాదేవీ జూన్ 20, 2025న నమోదు చేయబడింది. దీనికి మొత్తం రూ. 1.65 కోట్ల స్టాంప్ డ్యూటీ మరియు రూ. 30,000 రిజిస్ట్రేషన్ ఛార్జీలు చెల్లించబడ్డాయి. DLH ఎన్‌క్లేవ్‌లో ఇదివరకే పలువురు సెలబ్రిటీలు ఉన్నారు. బాలీవుడ్ హాస్యనటుడు కపిల్ శర్మ, గాయకుడు మికా సింగ్, దివంగత నటుడు ఇర్ఫాన్ ఖాన్ కుటుంబం ఇక్కడే నివాసముంటుంది.31 ఏళ్ల శివం దూబే (లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ మీడియం పేస్ బౌలర్) భారత టీ20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా ఉండటంతో పాటు ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తాడు. దేశీయ క్రికెట్లో అతను ముంబైకి ఆడతాడు. 2019 నవంబర్‌లో టీమిండియా తరపున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన దూబే.. 2024 టీ20 ప్రపంచ కప్ గెలుచుకున్న భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. దూబే ఇప్పటివరకు టీమిండియా తరఫున 4 వన్డేలు, 35 టీ20లు ఆడి 574 పరుగులు చేశాడు. అలాగే 14 వికెట్లు పడగొట్టాడు. దూబే ఐపీఎల్లో 79 మ్యాచ్‌లు ఆడి 10 హాఫ్ సెంచరీల సాయంతో 1859 పరుగులు చేయడంతో పాటు 5 వికెట్లు తీశాడు. -
IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్
వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్లోనే ప్రసిద్ద్ కృష్ణ జాక్ క్రాలేను (65) ఔట్ చేశాడు. ఇంగ్లండ్ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. లీడ్స్ వేదికగా భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. బెన్ డకెట్ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్ జాక్ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.స్కోర్ వివరాలు.. భారత్: 471 (జైస్వాల్ 101, గిల్ 147, పంత్ 134) & 364 (రాహుల్ 137, పంత్ 118)ఇంగ్లండ్: 465 (పోప్ 106, బ్రూక్ 99) & 117/0 (డకెట్ 105 నాటౌట్, క్రాలే 59 నాటౌట్) -
ఆసియా కప్ నుంచి పాకిస్తాన్ ఔట్.. ? వైరలవుతున్న సోనీ స్పోర్ట్స్ పోస్టర్
ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరగాల్సిన ఆసియా కప్-2025 కోసం టోర్నీ అధికారిక ప్రసారదారు సోనీ స్పోర్ట్స్ ఓ ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో భారత్, బంగ్లాదేశ్, శ్రీలంక టీ20 జట్లకు చెందిన కెప్టెన్లు సూర్యకుమార్ యాదవ్, నజ్ముల్ శాంటో, చరిత్ అసలంక మాత్రమే ఉన్నారు. ఈ పోస్టర్లో పాకిస్తాన్‌కు ప్రాతినిథ్యం లేకపోవడం సోషల్‌మీడియాలో చర్చలకు తావిచ్చింది. ఆసియా కప్ నుంచి పాక్ వైదొలిగిందని ప్రచారం మొదలైంది.పహల్గాం ఉదంతం, తదనంతర పరిణామాల్లో (ఆపరేషన్ సిందూర్) భారత్, పాక్ మధ్య అప్పటివరకు ఉన్న తేలికపాటి సంబంధాలు కూడా తెగిపోయిన విషయం తెలిసిందే. క్రీడలు సహా అన్ని అంశాల్లో భారత్ పాక్‌తో సంబంధాలు తెంచుకుంది. క్రికెట్‌కు సంబంధించి ఆసియా కప్, ఐసీసీ టోర్నీల్లో, అదీ తటస్థ వేదికల్లో మాత్రమే భారత్ పాక్‌తో మ్యాచ్‌లు ఆడే విషయం పరిశీలనలో ఉంది. వాస్తవానికి క్రికెట్లో కూడా భారత్ పాక్‌తో పూర్తి స్థాయి సంబంధాలు తెంచుకోవాలని భారతీయుల నుంచి ఒత్తిడి ఉంది.ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా పాకిస్తాన్‌కు చెందిన మంత్రి, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహిసిన్ నఖ్వీ ఉండటంతో భారత్ ఆసియా కప్ నుంచి కూడా వైదొలుగుతుందని పలు నివేదికలు తెలిపాయి.మరికొన్ని నివేదికలేమో భారత్ తమ దేశ క్రికెట్ బోర్డు (బీసీసీఐ) పరపతిని ఉపయోగించి పాకిస్తాన్నే ఆసియా కప్ నుంచి వైదొలిగేలా చేస్తుందని చెప్పాయి. తాజాగా సోనీ స్పోర్ట్స్ పాక్ ప్రాతినిథ్యం లేని పోస్టర్‌ను విడుదల చేయడంతో ఇదే నిజమైదేంమోనని అనిపిస్తుంది. మొత్తానికి సోనీ స్పోర్ట్స్ విడుదల చేసిన ఆసియా కప్ పోస్టర్ భారత్, పాక్‌ల మధ్య మరోసారి అగ్గి రాజేసేలా ఉంది.కాగా, ఆసియా కప్ 2025పై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ టోర్నీ యొక్క ఖచ్చితమైన వివరాలు, వేదికలు, షెడ్యూల్ గురించి ఏసీసీ ఎలాంటి సమాచారం ఇవ్వ లేదు. ఏసీసీ అధ్యక్షుడిగా పాక్‌కు చెందిన వ్యక్తి ఉన్నా, తమ దేశ భాగస్వామ్యంపై ఇప్పటివరకు స్పందించలేదు. కొద్ది రోజుల కిందట టోర్నీని భారత్‌లో కాకుండా యూఏఈలో నిర్వహిస్తారని కూడా ప్రచారం జరిగింది.2031 వరకు ఏసీసీ ఈవెంట్స్ హక్కులను దక్కించుకున్న సోనీ స్పోర్ట్స్సోనీ పిక్చర్స్ నెట్వర్క్స్ ఇండియా (SPNI) 2024 నుండి 2031 వరకు అన్ని ఏసీసీ టోర్నమెంట్ల మీడియా హక్కులను $170 మిలియన్ల బేస్ ధరకు దక్కించుకుంది. ఇది మునుపటి సైకిల్ కంటే 70% ఎక్కువ. ఆశ్చర్యకరంగా మీడియా హక్కుల కోసం పోటీ బిడ్డింగ్ జరగలేదు. జియోస్టార్ మధ్యలో వైదొలిగింది. -
అక్రం, వార్న్ కాదు!.. నేను ఎదుర్కొన్న డేంజరస్ బౌలర్ అతడే: గంగూలీ
భారత క్రికెట్లో తమకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న ఆటగాళ్లలో సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) ఒకడు. కెప్టెన్‌గా భారత జట్టు దశ దిశను మార్చిన ఘనత అతడి సొంతం. అంతేకాదు.. సచిన్ టెండుల్కర్, రాహుల్ ద్రవిడ్‌లతో కూడిన తన సమకాలీన అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో స్థానం సంపాదించాడు దాదా.విదేశీ గడ్డపై తాను ఎదుర్కొన్న ప్రతీ బౌలర్‌పై గంగూలీ ఒకానొక సందర్భంలో పూర్తి ఆధిపత్యం కనబరిచాడు. 1992లో వెస్టిండీస్‌తో వన్డే మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన దాదా.. 1996లో టెస్టుల్లోనూ అరంగేట్రం చేశాడు.పదహారేళ్ల తన సుదీర్ఘ కెరీర్లో టీమిండియా తరఫున 113 టెస్టులు ఆడిన గంగూలీ.. పదహారు శతకాల సాయంతో 7212 పరుగులు సాధించాడు. అదే విధంగా.. 311 వన్డేల్లో ఈ ఎడమచేతి వాటం బ్యాటర్ 11363 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 72 అర్ధ శతకాలు ఉన్నాయి.గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?ఇంతటి అనుభవం, అసాధారణ నైపుణ్యాలు ఉన్న గంగూలీని భయపెట్టిన బౌలర్ ఎవరో తెలుసా?.. దాదానే స్వయంగా ఈ విషయం గురించి మాట్లాడాడు. పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తాను ఎదుర్కొన్న బౌలర్లలో తనను ఎక్కువగా భయపెట్టిందిఆస్ట్రేలియా దిగ్గజ పేసర్ గ్లెన్ మెగ్రాత్ అని గంగూలీ తెలిపాడు. తన కెరీర్లో ఎదుర్కొన్న అత్యుత్తమ బౌలర్ల జాబితాలో భాగమైన పాక్ పేస్ లెజెండ్ వసీం అక్రం, ఆసీస్ స్పిన్ దిగ్గజం షేన్ వార్న్‌ల పేర్లు కాకుండా దాదా మెగ్రాత్ పేరు చెప్పడం విశేషం. కాగా 1999-2011 మధ్య ఆస్ట్రేలియా అత్యంత పటిష్టమైన జట్టుగా కొనసాగింది.మూడుసార్లు వరుసగా కంగారూ జట్టు వన్డే వరల్డ్‌కప్ అందుకుంది. ఇక ఆసీస్ ప్రధాన బౌలర్లలో ఒకడైన మెగ్రాత్ది ఇందులో కీలక పాత్ర. ఈ రైటార్మ్ పేసర్ 1993- 2007 మధ్య ఆస్ట్రేలియా తరఫున 124 టెస్టుల్లో 563 వికెట్లు పడగొట్టాడు.అదే విధంగా.. 250 వన్డేల్లో మెగ్రాత్ 381 వికెట్లు కూల్చాడు. రెండు టీ20 మ్యాచ్‌లలో కలిపి ఐదు వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఐపీఎల్లో ఒకప్పటి ఢిల్లీ డేర్‌డెవిల్స్ ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు మెగ్రాత్ ఆడాడు. క్యాష్ రిచ్ లీగ్‌లో మొత్తంగా 14 మ్యాచ్‌లు ఆడి 12 వికెట్లు తీశాడు.చదవండి: IND vs ENG: రిషబ్ పంత్‌కు భారీ షాకిచ్చిన ఐసీసీ.. -
ఇంగ్లండ్ గడ్డపై అరంగేట్రంలోనే శతక్కొట్టిన తిలక్ వర్మ
తెలుగు తేజం, హైదరాబాదీ ఆటగాడు, టీమిండియా టీ20 స్పెషలిస్ట్ తిలక్ వర్మ ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇరగదీశాడు. కౌంటీ ఛాంపియన్షిప్ డివిజన్ వన్-2025లో ఆడేందుకు ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఒప్పందం చేసుకున్న తిలక్.. ఇంగ్లండ్ గడ్డపై తన తొలి మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లోనే సెంచరీ చేసి శభాష్ అనిపించుకున్నాడు. ఎసెక్స్‌తో రెండు రోజుల క్రితం ప్రారంభమైన మ్యాచ్‌లో తన జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు (34/2) బరిలోకి దిగిన తిలక్.. ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేసి 239 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. అయితే దురదృష్టవశాత్తు సెంచరీ పూర్తి కాగానే హార్మర్ బౌలింగ్‌లో డీన్ ఎల్గర్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఎసెక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 296 పరుగులకు ఆలౌట్ కాగా.. హ్యాంప్‌షైర్ 5 వికెట్ల నష్టానికి 327 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుంది (మూడో రోజు తొలి సెషన్). తిలక్ ఔట్ కాగానే మరో హ్యాంప్‌షైర్ ఆటగాడు లియామ్ డాసన్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. అంతకుముందు ఎసెక్స్ ఇన్నింగ్స్‌లో చార్లీ అల్లీసన్ (101) సెంచరీతో కదంతొక్కాడు.కాగా, తిలక్ ఇటీవలే హ్యాంప్‌షైర్‌తో ఆడేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. జూన్ 18 నుండి ఆగస్టు 2 వరకు ఈ జట్టుకు అందుబాటులో ఉండనున్నట్లు ప్రకటించాడు. ఈ ఒప్పందంలో తిలక్ నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనున్నాడు. వైట్‌బాల్ గేమ్స్ ఆడతాడో లేదో క్లారిటీ లేదు. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో టీ20 బ్లాస్ట్ టోర్నీ జరుగుతోంది.22 ఏళ్ల తిలక్ ఈ మ్యాచ్‌కు ముందు వరకు 18 ఫస్ట్ క్లాస్‌లు మ్యాచ్‌లు ఆడి 50కి పైగా సగటుతో 1204 పరుగులు చేశాడు. ఇందులో ఐదు సెంచరీలు, నాలుగు ఆర్ధ శతకాలు ఉన్నాయి. టీమిండియా తరఫున 4 వన్డేలు, 25 టీ20లు ఆడిన తిలక్.. టీ20ల్లో స్పెషలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నాడు. పొట్టి ఫార్మాట్లో అతను 24 ఇన్నింగ్స్‌లలో 49.93 సగటుతో 749 పరుగులు చేశాడు.తిలక్‌కు ముందు మరో ఇద్దరు టీమిండియా యువ ఆటగాళ్లు, టీ20 స్పెషలిస్ట్‌లు ఇంగ్లండ్ కౌంటీల్లో ఆడేందుకు ఒప్పందాలు చేసుకున్నారు. టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ నాటింగ్హమ్షైర్తో.. రుతురాజ్ గైక్వాడ్ యార్క్‌షైర్‌తో జతకట్టారు. ఇషాన్ కూడా తిలక్ తరహాలోనే తన కౌంటీ అరంగేట్రంలో ఇరగదీశాడు. యార్క్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో 98 బంతుల్లో 12 ఫోర్లు, సిక్సర్ సాయంతో 87 పరుగులు చేసి ఔటయ్యాడు. -
IND VS ENG 1st Test Day 5: టీమిండియాను కలవరపెడుతున్న చెడు శకునాలు..!
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లకు సమానమైన విజయావకాశాలు ఉన్నాయి. ఇంగ్లండ్ గెలవాలంటే చివరి రోజు 350 పరుగులు (90 ఓవర్లలో) సాధించాలి. అదే భారత్ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి. ఆధునిక టెస్ట్ క్రికెట్లో రెండూ అసాధ్యం కాదు. ఫలితం ఏ జట్టుకైనా అనుకూలంగా రావచ్చు.అయితే, గత రికార్డులను పరిశీలిస్తే మాత్రం ఎడ్జ్ ఇంగ్లండ్‌కే సూచిస్తున్నాయి. 2019లో ఇదే మైదానంలో ఆసీస్‌తో జరిగిన మ్యాచ్‌లో స్టోక్స్ నమ్మశక్యంకాని శతకాన్ని (135 నాటౌట్) బాది ఇంగ్లండ్‌కు చారిత్రక విజయాన్ని అందించాడు. ఆ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 67 పరుగులకే కుప్పకూలిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో రికార్డు స్థాయిలో 359 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి చరిత్ర సృష్టించింది. లీడ్స్ మైదానానికి 350 పరుగుల లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించిన ఘన చరిత్ర ఉండటం ఐదో రోజు ఆటకు ముందు భారత ఆటగాళ్లను డిఫెన్స్‌లో పడేస్తుంది. అప్పట్లో ఆ లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లండే కావడం టీమిండియాను మరింత బయపెడుతుంది. ఇంగ్లండ్ ఆటగాళ్లు సైతం చివరి రోజు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో తగ్గేదేలేదంటున్నారు.చివరి రోజు ఆట ప్రారంభానికి ముందు టీమిండియాను మరో చెడు సూచకం కూడా బయపెడుతుంది. భారత్ తమ యావత్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో 350 ప్లస్ లక్ష్యాన్ని కాపాడుకోలేక ఒకే ఒకసారి చతికిలపడింది. టీమిండియా 59 మ్యాచ్‌ల్లో 350 ప్లస్ లక్ష్యాలను కాపాడుకునేందుకు బరిలోకి దిగగా.. 42 సార్లు సఫలమైంది. ఒకే ఒక సందర్భంలో బోల్తా పడింది. ఆ ఒక్క ఓటమి ఇంగ్లండ్ చేతిలోనే కావడం టీమిండియాను కలవరపెడుతుంది. 2022లో బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత్ 378 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోలేక ఇంగ్లండ్ చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌లో రూట్, బెయిర్‌స్టో అద్భుత శతకాలు సాధించి ఇంగ్లండ్‌ను గెలిపించారు.మరోవైపు చివరి రోజు ఆటకు ముందు వాతావరణం కూడా భారత్ విజయానికి అడ్డుకట్ట వేసేలా కనిపిస్తుంది. మ్యాచ్ మధ్య మధ్యలో వరుణుడు పలకరించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇన్ని ప్రతికూలతల నడుమ భారత బౌలర్లు చివరి రోజు ఏం చేస్తారోనని టీమిండియా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.స్కోర్ వివరాలు..భారత్: 471 & 364ఇంగ్లండ్: 465 & 21/0చివరి రోజు భారత్ గెలుపుకు 10 వికెట్లు కావాలి. అదే ఇంగ్లండ్ గెలవాలంటే 90 ఓవర్లలో 350 పరుగులు చేయాలి. ఇంగ్లండ్ ఓపెనర్లు జాక్ క్రాలే, బెన్ డకెట్ క్రీజ్‌లో ఉన్నారు. -
రింకూ సింగ్- ఎంపీ ప్రియా సరోజ్ పెళ్లి వాయిదా!.. కారణం?
భారత స్టార్ క్రికెటర్ రింకూ సింగ్ (Rinku Singh)- లోక్‌సభ ఎంపీ ప్రియా సరోజ్ (Priya Saroj)ల పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. ఈ ఏడాది జరగాల్సిన వీరి వివాహం (Wedding Postoponed) వచ్చే సంవత్సరంలో జరుగనున్నట్లు తెలుస్తోంది. కాగా ఐపీఎల్లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)కు ప్రాతినిథ్యం వహిస్తూ వెలుగులోకి వచ్చాడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన రింకూ సింగ్.గుజరాత్ టైటాన్స్‌తో మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఐదు సిక్సర్లు బాదిన అతడు.. టీమిండియా సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. ఈ క్రమంలో 2023లో ఐర్లాండ్‌తో టీ20 సందర్భంగా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. నయా ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. అదే ఏడాది వన్డేల్లోనూ అరంగేట్రం చేశాడు.ఇప్పటి వరకు భారత్ తరఫున 33 టీ20లు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడిన రింకూ సింగ్.. ఆయా ఫార్మాట్లలో 339, 41 పరుగులు సాధించాడు. ఇక ఐపీఎల్ ఇప్పటికి 58 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న ఈ కేకేఆర్ స్టార్.. 1099 రన్స్ చేశాడు. ఇందులో నాలుగు అర్ధ శతకాలు ఉన్నాయి.ఎంపీతో ప్రేమలో రింకూనిరుపేద కుటుంబం నుంచి వచ్చి స్టార్ క్రికెటర్‌గా ఎదిగిన రింకూ.. కెరీర్ పరంగా నిలదొక్కుకున్నాడు. ఇటీవలే వివాహ బంధంలో అడుగుపెట్టేందుకు కూడా సిద్ధపడ్డాడు. సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారగా.. ఇరు కుటుంబాల అంగీకారంతో ఈ ఏడాది జూన్ 8న వీరి నిశ్చితార్థం జరిగింది. మూడేళ్లుగా ఈ క్షణం కోసం ఎదురుచూస్తున్నామంటూ రింకూ- ప్రియా తమ ఎంగేజ్మెంట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.జూన్ 8న నిశ్చితార్థంఇక లక్నోలోని ఓ హోటల్లో అంగరంగ వైభవంగా జరిగిన వేడుకలో రింకూ- ప్రియా ఉంగరాలు మార్చుకున్నారు. సమాజ్‌వాదీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌తో పాటు జయా బచ్చన్, బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ తదితరులు వీరి ఎంగేజ్మెంట్కు హాజరయ్యారు.ఈ క్రమంలో నవంబరు 18న తాజ్ హోటల్లో పెళ్లి వేడుకను జరిపేందుకు పెద్దలు ముహూర్తం ఖరారు చేశారు. అయితే, అమర్ ఉజాలా న్యూస్‌పేపర్ కథనం ప్రకారం.. రింకూ- ప్రియాల వివాహం వాయిదా పడినట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో వీరి పెళ్లి జరుగనుందని సమాచారం. కారణం ఇదే?టీమిండియా క్రికెటర్‌గా రింకూ బిజీ షెడ్యూల్ కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా ఈ ఏడాది నవంబరులో టీమిండియా సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. నవంబరు 14- డిసెంబరు 19 వరకు రెండు టెస్టులు, మూడు వన్డేలు, ఐదు టీ20లు ఆడనుంది.చదవండి: పంత్ సెంచరీలపై అలా.. కేఎల్ రాహుల్ శతకంపై ఇలా! గోయెంకా పోస్ట్ వైరల్ -
IND VS ENG 1st Test: శతక్కొట్టిన రాహుల్, పంత్.. ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యం
తొలి టెస్ట్ లో టీమిండియా విధించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు ఇంగ్లండ్ బరిలోకి దిగింది. సోమవారం నాటి నాలుగో రోజు ఆట ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 21 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ విజయం సాధించాలంటే ఆఖరిదైన ఐదవ రోజు బౌలింగ్ లో సత్తా చాటి 10 వికెట్లు తీయాల్సి ఉంది. మరోవైపు విజయానికి ఇంగ్లండ్ కు 350 పరుగులు అవసరం.ఇంగ్లండ్ లక్ష్యం 371లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పట్టు బిగించింది. నాలుగో రోజు భారత్ సెకెండ్ ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ (364) చేసి ఆలౌటైంది. ఫలితంగా ఇంగ్లండ్ ముందు 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. కేఎల్ రాహుల్ (137), రిషబ్ పంత్ (118) సెంచరీలతో కదంతొక్కారు. మిగతా భారత ఆటగాళ్లలో సాయి సుదర్శన్ 30, రవీంద్ర జడేజా 25 (నాటౌట్), యశస్వి జైస్వాల్ 4, శుభ్‌మన్ గిల్ 8, కరుణ్ నాయర్ 20, శార్దూల్ ఠాకూర్ 4, సిరాజ్ 0, బుమ్రా 0, ప్రసిద్ద్ కృష్ణ 0 పరుగులకు ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్, జోష్ టంగ్ తలో 3 వికెట్లు పడగొట్టగా.. బషీర్ 2, వోక్స్, స్టోక్స్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించిన కేఎల్ రాహుల్
టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఇంగ్లీష్ నేలపై అత్యధిక సెంచరీలు సాధించిన భారత ఓపెనర్‌గా రికార్డు నెలకొల్పాడు. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించడంతో రాహుల్ ఈ ఘనత సాధించాడు. ఈ ఇన్నింగ్స్‌లో రాహుల్ ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేస్తూ ఈ రికార్డుతో పాటు మరిన్ని మైలురాళ్లను చేరుకున్నాడు.47 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. టీ విరామం అనంతరం రాహుల్ 137 పరుగులతో ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా కరుణ్ నాయర్ (20) క్రీజ్‌లో ఉన్నాడు. కడపటి వార్తలు అందేసరికి భారత్ స్కోర్ 332/4గా ఉంది. భారత్ 338 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.ఇదే ఇన్నింగ్స్‌లో మరో భారత ఆటగాడు రిషబ్ పంత్ (118) కూడా శతకొట్టాడు. పంత్ తొలి ఇన్నింగ్స్‌లో కూడా సెంచరీతో (134) మెరిశాడు. ఈ మ్యాచ్‌పై భారత్ పట్టు బిగించింది.తాజా సెంచరీతో రాహుల్ సాధించిన రికార్డులు..ఆసియా ఖండం బయట అత్యధిక సెంచరీలు సాధించిన ఓపెనర్ల జాబితాలో రాహుల్ రెండో స్థానంలో ఉన్నాడు. రాహుల్ తన కెరీర్లో 9 టెస్ట్ సెంచరీలు చేయగా.. అందులో ఆరు ఆసియా బయటే చేయడం విశేషం. భారత ఓపెనర్లలో సునీల్ గవాస్కర్ అత్యధికంగా ఆసియా బయట 15 సెంచరీలు చేశాడు. గవాస్కర్ తర్వాత రాహుల్ అత్యధికంగా 6, వీరేంద్ర సెహ్వాగ్ 4 సెంచరీలు చేశారు.ఇంగ్లండ్‌పై అత్యధిక సెంచరీలు చేసిన భారత్ ఓపెనర్లు..కేఎల్ రాహుల్-3విజయ్ మర్చంట్-2సునీల్ గవాస్కర్-2రవిశాస్త్రి-2రాహుల్ ద్రవిడ్-2లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన రెండో పర్యాటక ఓపెనర్‌గా రికార్డు. రాహుల్‌కు ముందు (1955) సౌతాఫ్రికాకు చెందిన జాకీ మెక్‌గ్లూ లీడ్స్‌లో మూడో ఇన్నింగ్స్‌లో సెంచరీ చేశాడు.ఇంగ్లండ్ గడ్డపై ఆరో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాడు. ఈ సెంచరీతో రాహుల్ ఇంగ్లండ్‌పై మూడు సెంచరీలు చేసినట్లైంది. భారత ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ (6), సచిన్ టెండూల్కర్ (4), దిలీప్ వెంగసర్కార్ (4), రిషబ్ పంత్ (4) మాత్రమే ఇంగ్లండ్ గడ్డపై రాహుల్ కంటే ఎక్కువ సెంచరీలు చేశారు. సౌరభ్ గంగూలీ రాహుల్‌తో సమానంగా 3 సెంచరీలు చేశాడు.SENA దేశాల్లో అత్యధిక సెంచరీలు చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్ ఐదో స్థానంలో ఉన్నాడు. రాహుల్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు. ఈ విభాగంలో సచిన్ టెండూల్కర్ (17), విరాట్ కోహ్లి (12), రాహుల్ ద్రవిడ్ (10), సునీల్ గవాస్కర్ (8) రాహుల్ కంటే ముందున్నారు. రాహుల్‌తో సమానంగా మహ్మద్ అజారుద్దీన్ సేనా దేశాల్లో 6 సెంచరీలు చేశాడు.కాగా, ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471, ఇంగ్లండ్ 465 పరుగులు చేసిన విషయం తెలిసిందే. భారత తొలి ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలు చేయగా.. ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కాడు. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st TEST: చరిత్ర సృష్టించిన రిషబ్ పంత్
టీమిండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ టెస్ట్‌ల్లో సరికొత్త చరిత్ర సృష్టించాడు. ఓ టెస్ట్ మ్యాచ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేసిన తొలి ఆసియా వికెట్‌కీపర్ బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ఆసియా వికెట్‌కీపర్ బ్యాటర్ ఈ ఘనత సాధించలేదు. లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో పంత్ ఈ ఘనత సాధించాడు.ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 140 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 118 పరుగులు చేసి ఔటయ్యాడు. రెండో ఇన్నింగ్స్‌లో పంత్‌కు ముందు కేఎల్ రాహుల్ కూడా సెంచరీతో కదంతొక్కడంతో భారత్ పటిష్ట స్థితికి చేరింది.నాలుగో రోజు టీ విరామం సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 298 పరుగులు చేసి 304 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. కేఎల్ రాహుల్ 120, కరుణ్ నాయర్ 4 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. రెండో ఇన్నింగ్స్‌లో భారత ఆటగాళ్లు యశస్వి జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, శుభ్‌మన్ గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2 వికెట్లు పడగొట్టగా.. షోయబ్ బషీర్, బెన్ స్టోక్స్ తలో వికెట్ తీశారు.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. యశస్వి జైస్వాల్ (101), శుభ్‌మన్ గిల్ (147), రిషబ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓలీ పోప్ (106) సెంచరీతో కదంతొక్కగా.. హ్యారీ బ్రూక్ (99) పరుగు తేడాతో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా బ్యాటర్లలో బెన్ డకెట్ 62, జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 రాణించడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: రెండో ఇన్నింగ్స్‌లోనూ శతక్కొట్టిన పంత్.. అయితే ఈసారి..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రెండు ఇన్నింగ్స్‌ల్లో సెంచరీలు చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 178 బంతుల్లో డజను ఫోర్లు, అర డజను సిక్సర్ల సాయంతో 134 పరుగులు చేసిన పంత్.. రెండో ఇన్నింగ్స్‌లో 130 బంతుల్లో 13 ఫోర్లు, రెండు సిక్సర్ల సాయంతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే ఈ సారి పంత్ సెంచరీ చేసిన తర్వాత పల్టీ సెలబ్రేషన్స్ చేసుకోలేదు. స్టాండ్స్ నుంచి గవాస్కర్ పల్టీ కొట్టాలని అడిగినా పంత్ పెద్దగా పట్టించుకోలేదు. డబుల్ సెంచరీ తర్వాత అన్నట్లు సైగలు చేశాడు. తాజా సెంచరీతో టెస్ట్‌ల్లో పంత్ సెంచరీల సంఖ్య 8కి చేరింది. మరో ఎండ్‌లో కేఎల్ రాహుల్ కూడా సెంచరీ పూర్తి చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో 42 పరుగులకు ఔటైన రాహుల్.. ఈసారి మరింత బాధ్యతాయుతంగా ఆడి కెరీర్లో తొమ్మిదో సెంచరీ పూర్తి చేశాడు. రాహుల్ 202 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే శుభ్‌మన్ గిల్ (8) వికెట్ కోల్పోయిన భారత్‌ను రాహుల్-పంత్ జోడీ ఆదుకుంది. ఈ ఇద్దరు ఎంతో సంయమనంతో బ్యాటింగ్ చేస్తూ.. భారత్ పైచేయి సాధించే దిశగా తీసుకెళ్తున్నారు. ఈ జోడీ ఇప్పటికే నాలుగో వికెట్‌కు 172 పరుగులు జోడించింది. పంత్ సెంచరీ పూర్తయ్యే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో భారత్ స్కోర్ 264/3గా ఉంది. రాహుల్ 112, పంత్ 100 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 270 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో జైస్వాల్ 4, సాయి సుదర్శన్ 30, గిల్ 8 పరుగులు చేసి ఔటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ దక్కించుకున్నారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
IND VS ENG 1st Test: సెహ్వాగ్ సరసన రాహుల్.. గవాస్కర్ ఒక్కడే మిగిలాడు..!
లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ బాధ్యతాయుతమైన హాఫ్ సెంచరీతో మెరిశాడు. 47 పరుగుల ఓవర్‌నైట్ స్కోర్‌తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన రాహుల్.. 87 బంతుల్లో హాఫ్ సెంచరీని పూర్తి చేశాడు. రాహుల్‌కు కెరీర్లో ఇది 18వ హాఫ్ సెంచరీ. SENA దేశాల్లో (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) ఓపెనర్‌గా అతనికిది తొమ్మిదో హాఫ్ సెంచరీ. ఈ హాఫ్ సెంచరీతో రాహుల్ భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్, మరో మాజీ ఓపెనర్ మురళీ విజయ్ రికార్డును సమం చేశాడు. భారత ఓపెనర్లుగా సెహ్వాగ్, మురళీ కూడా సేనా దేశాల్లో తలో 9 హాఫ్ సెంచరీలు చేశారు. ఈ విభాగంలో సునీల్ గవాస్కర్ ఒక్కడే ప్రస్తుతం రాహుల్ కంటే ముందున్నాడు. భారత ఓపెనర్‌గా గవాస్కర్ సేనా దేశాల్లో 19 హాఫ్ సెంచరీలు చేశాడు.సేనా దేశాల్లో అత్యధిక 50 ప్లస్ స్కోర్లు చేసిన భారత ఓపెనర్లు:19 - సునీల్ గవాస్కర్ 57 ఇన్నింగ్స్‌లలో9* - కేఎల్ రాహుల్ 42 ఇన్నింగ్స్‌లలో9 - మురళీ విజయ్ 42 ఇన్నింగ్స్‌లలో9 - వీరేంద్ర సెహ్వాగ్ 49 ఇన్నింగ్స్లలోమ్యాచ్ విషయానికొస్తే.. ఓవర్‌నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన భారత్‌కు ఆదిలోనే పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది.ఈ దశలో రిషబ్ పంత్ రాహుల్‌కు జత కలిశాడు. వీరిద్దరు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. లంచ్ విరామం సమయానికి భారత్ స్కోర్ 153/3గా ఉంది. రాహుల్ 72, పంత్ 31 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ ఆధిక్యం 159 పరుగులుగా ఉంది. భారత రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్ (4) విఫలం కాగా.. వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఓ మోస్తరు ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో బ్రైడన్ కార్స్ 2, స్టోక్స్ ఓ వికెట్ పడగొట్టారు.అంతకుముందు భారత్, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌ల్లో నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు. -
‘లక్ష్మణ్‌ను కాదని అతడిని తీసుకున్నాం.. నాతో మూడు నెలలు మాట్లాడలేదు’
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly) 2003 వన్డే ప్రపంచకప్ నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాడు. జట్టు ఎంపిక సమయంలో ఆచితూచి వ్యవహరించామని.. కూర్పు దృష్ట్యా నాడు ఓ దిగ్గజ బ్యాటర్‌కు మొండిచేయి చూపామని పేర్కొన్నాడు. ఈ కారణంగా అతడు తనతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదని తాజాగా వెల్లడించాడు.కాగా 2003లో సౌతాఫ్రికాలో జరిగిన వన్డే వరల్డ్‌కప్ (ODI World Cup 2003) జట్టులో యాజమాన్యం వీవీఎస్ లక్ష్మణ్‌కు చోటు ఇవ్వలేదు. అతడిని కాదని దినేశ్ మోంగియా (Dinesh Mongia)ను సెలక్టర్లు ఎంపిక చేశారు. ఇక నాటి ఈ ఐసీసీ టోర్నీలో టీమిండియా రన్నరప్‌తో సరిపెట్టుకుంది.నాతో మూడు నెలలు మాట్లాడలేదుతాజాగా నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న వరల్డ్‌కప్ జట్టు కెప్టెన్ సౌరవ్ గంగూలీ.. లక్ష్మణ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడుతూ.. ‘‘ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడం సహజమే. అలా చాలా మందిని చాలా సార్లు పక్కనపెట్టాల్సి వచ్చేది.అందుకు వారు అసంతృప్తికి లోనవడం కూడా మామూలే. వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కనందుకు లక్ష్మణ్ నాతో మూడు నెలల పాటు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నేను చొరవ తీసుకుని అతడిని కదిలించాను.ఏ ఆటగాడి కెరీర్‌లోనైనా ఇలాంటి ఆటుపోట్లు తప్పవు. ముఖ్యంగా సమర్థవంతుడైన తనకు చోటు దక్కనందుకు లక్ష్మణ్ అసంతృప్తికి లోనుకావడం, బాధపడటం సహజమే.పాక్‌లో అదరగొట్టాడుఅయితే, ప్రపంచకప్ టోర్నీలో మా ప్రదర్శన పట్ల అతడు సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఈవెంట్ తర్వాత అతడు వన్డే జట్టులోకి తిరిగి వచ్చాడు. పాకిస్తాన్, ఆస్ట్రేలియా పర్యటనల్లో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఏ ఆటగాడైనా జట్టులో చోటు దక్కనపుడు బాధపడినా... దానిని మరీ వ్యక్తిగతంగా తీసుకోరు. జట్టు ప్రయోజనాల కోసం తమ అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటారు’’ అని గంగూలీ పేర్కొన్నాడు.కాగా టీమిండియా తరఫున గంగూలీ 1992 నుంచి 2008 వరకు 113 టెస్టులు, 311 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఆయా ఫార్మాట్లలో వరుసగా 7212, 11363 పరుగులు సాధించాడు. భారత క్రికెట్ జట్టు దశ దిశ మార్చిన కెప్టెన్‌గా పేరొందిన దాదా ఖాతాలో.. 16 టెస్టు, 22 వన్డే శతకాలు ఉన్నాయి.మరోవైపు.. హైదరాబాదీ వీవీఎస్ లక్ష్మణ్ 1996- 2012 మధ్య భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. తన కెరీర్లో 134 టెస్టుల్లో 8781 పరుగులు,86 వన్డేల్లో 2338 పరుగులు సాధించాడు. ఇక గతంలో గంగూలీ భారత క్రికెట్ నియంత్రణ మండలి అధ్యక్షుడిగా పనిచేయగా.. లక్ష్మణ్ జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్‌గా ఉన్నాడు. ప్రధాన కోచ్‌ల గైర్హాజరీలో టీమిండియా హెడ్‌కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు.చదవండి: దంచికొట్టిన ఉన్ముక్త్ చాంద్.. క్లాసెన్ బృందానికి తప్పని ఓటమి -
అరంగేట్రంలోనే అదరగొట్టిన ఇషాన్ కిషన్
టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ కౌంటీ క్రికెట్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చాడు. అరంగేట్రం ఇన్నింగ్స్‌లోనే మెరుపు హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కేవలం 57 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా 94 బంతుల్లో 11 ఫోర్లు, సిక్సర్ సాయంతో 83 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. కౌంటీల్లో ఇషాన్‌కు ఇదే తొలి అసైన్మెంట్. ఇటీవలే అతను నాటింగ్హమ్షైర్తో ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈ జట్టుతో ఇషాన్ ఒప్పందం కేవలం రెండు మ్యాచ్‌లకు మాత్రమే వర్తిస్తుంది. సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ కైల్ వెర్రెయిన్ జాతీయ విధులు హాజరయ్యేందుకు జింబాబ్వేకు వెళ్లడంతో (రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం) నాటింగ్హమ్షైర్ ఇషాన్‌తో స్వల్ప కాలిక ఒప్పందం చేసుకుంది. డివిజన్–1 కౌంటీ చాంపియన్‌షిప్‌లో భాగంగా నాటింగ్హమ్షైర్ యార్క్‌షైర్‌తో తలపడుతుంది. రెండో రోజు తొలి సెషన్లో నాటింగ్హమ్షైర్ 348/6గా ఉంది. ఇషాన్, లియామ్ పాటర్సన్ (22) క్రీజ్‌లో ఉన్నారు. అంతకుముందు నాటింగ్హమ్ ఇన్నింగ్స్‌లో హసబ్ హమీద్ 52, బెన్ స్లేటర్ 96, ఫ్రెడ్డీ 23, జో క్లార్క్ 31, జాక్ హేన్స్ 18, లిండన్ జేమ్స్ 12 పరుగులు చేసి ఔటయ్యారు. యార్క్‌షైర్ బౌలర్లలో జార్జ్ హిల్, డేనియల్ మోరియార్టీ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాక్ వైట్, విలయమ్ ఓరూర్కీ చెరో వికెట్ దక్కించుకున్నారు.10 రోజుల్లో మూడో ఆటగాడు..10 రోజుల వ్యవధిలో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో ఆడేందుకు ఒప్పందం కుదర్చుకున్న మూడో భారత ఆటగాడిగా ఇషాన్ కిషన్ నిలిచాడు. కిషన్ కంటే ముందు రుతురాజ్ గైక్వాడ్ ,తిలక్ వర్మ యార్క్‌షైర్, హాంప్షైర్లతో జతకట్టారు.ఇషాన్ కిషన్ గత కొంత కాలంగా జాతీయ జట్టుకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. గతేడాది బీసీసీఐ నిబంధనలు ఉల్లఘించి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన ఇషాన్.. తిరిగి ఈ ఏడాది తన కాంట్రాక్ట్‌ను దక్కించుకున్నాడు.టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. దాదాపు రెండు నెలల పాటు భారత జట్టు ఇంగ్లండ్‌లోనే ఉండనుంది. ఒకవేళ ఏ ఆటగాడు అయినా గాయపడితే ప్రత్యామ్నాయంగా ఇషాన్‌కు పిలుపు వచ్చే అవకాశముంది. -
IND VS ENG 1st Test Day 4: టీమిండియాకు షాక్
భారత్-ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుంది. తొలి ఇన్నింగ్స్‌ల్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు బ్యాటింగ్ చేశాయి. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (101), కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (147), వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (134) సెంచరీలతో చెలరేగడంతో 471 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో జోష్ టంగ్, కెప్టెన్ బెన్ స్టోక్స్ తలో నాలుగు వికెట్లు తీయగా.. షోయబ్ బషీర్, బ్రైడన్ కార్స్ చెరో వికెట్ పడగొట్టారు.అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ టీమిండియాకు ధీటుగా బదులిచ్చింది. ఓపెనర్ బెన్ డకెట్ (62) అర్ధ శతకంతో రాణించగా.. ఓలీ పోప్ (106) శతక్కొట్టాడు. హ్యారీ బ్రూక్ 99 పరుగులతో తృటిలో సెంచరీ మిస్ అయ్యాడు. మిగతా ఆటగాళ్లలో జేమీ స్మిత్ 40, క్రిస్ వోక్స్ 38 పరుగులతో పర్వాలేదనిపించారు. ఫలితంగా ఇంగ్లండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. దీంతో భారత్‌కు 6 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లతో చెలరేగగా.. ప్రసిద్ కృష్ణ మూడు, సిరాజ్ రెండు వికెట్లు దక్కించుకున్నారు.ఆరు పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (4), వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ (30) ఔట్ కాగా.. మరో ఓపెనర్ కేఎల్ రాహుల్ (47), కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 6 పరుగులతో క్రీజులో ఉన్నారు. 6 పరుగుల ఆధిక్యం కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.నాలుగో రోజు ఆట ప్రారంభం కాగానే టీమిండియాకు షాక్ఓవర్నైట్ స్కోర్ 90/2 వద్ద నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. తొలి ఓవర్ చివరి బంతికే (24.6వ ఓవర్) బ్రైడన్ కార్స్ బౌలింగ్‌లో తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో శుభ్‌మన్ గిల్ (8) క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి భారత్ మూడో వికెట్ కోల్పోయింది. కేఎల్ రాహుల్‌కు జతగా రిషబ్ పంత్ క్రీజ్‌లోకి వచ్చాడు. గిల్ వికెట్ కోల్పోవడంతో కేఎల్ రాహుల్, రిషబ్ పంత్‌పై ఒత్తిడి పడే అవకాశం ఉంది. ఇంగ్లండ్ ముందు టీమిండియా గౌరవప్రదమైన టార్గెట్ ఉంచాలంటే రాహుల్, పంత్ చాలా కీలకం కానున్నారు. వీరిద్దరు ఈ రోజంతా క్రీజ్‌లో ఉంటేనే భారత్ ఓ మోస్తరు స్కోర్ చేయగలుగుతుంది. -
విజయంతో ముగించిన భారత్
అంతర్జాతీయ హాకీ సమాఖ్య 2024–2025 ప్రొ లీగ్‌ను భారత పురుషుల జట్టు విజయంతో ముగించింది. యూరోపియన్ చివరి అంచె లీగ్‌లో భాగంగా ఆదివారం ఆంట్వర్ప్లో ఆతిథ్య బెల్జియం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 4–3 గోల్స్ తేడాతో గెలుపొందింది. యూరోపియన్ అంచెలో భారత్‌కు దక్కిన ఏకైక విజయం ఇదే కావడం గమనార్హం. యూరోపియన్ అంచెలో భారత్ వరుసగా ఏడు మ్యాచ్‌ల్లో ఓడిపోయి, చివరి మ్యాచ్‌లో నెగ్గి ఊపిరి పీల్చుకుంది.ఈ మ్యాచ్‌లో భారత్ తరఫున సుఖ్జీత్ సింగ్ (21వ, 35వ నిమిషంలో) రెండు గోల్స్ చేయగా... అమిత్ రోహిదాస్ (36వ నిమిషంలో), కెప్టేన్ హర్మన్‌ప్రీత్ సింగ్ (59వ నిమిషంలో) ఒక్కో గోల్ సాధించారు. బెల్జియం జట్టు తరఫున స్లూవర్ (8వ నిమిషంలో), స్టాక్‌బ్రోయెక్స్ (34వ నిమిషంలో), హుగో (41వ నిమిషంలో) ఒక్కో గోల్ చేశారు.మొత్తం తొమ్మిది జట్ల మధ్య జరుగుతున్న ప్రొ లీగ్‌లో భారత జట్టు తమ 16 మ్యాచ్‌లను పూర్తి చేసుకుంది. 6 మ్యాచ్‌ల్లో గెలిచి, 10 మ్యాచ్‌ల్లో ఓడిపోయిన భారత్ 18 పాయింట్లతో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. మరోవైపు భారత మహిళల జట్టు వరుసగా ఆరో పరాజయాన్ని చవిచూసింది. బెల్జియంతో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 0–2తో ఓడిపోయింది. -
అటా...ఇటా!
ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టినా... మిగిలిన వాళ్లు పెద్దగా ప్రభావం చూపకపోవడంతో... ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారత జట్టు భారీ స్కోరుకు అతి చేరువగా వచ్చింది. బ్రూక్ బాదుడుకు లోయర్ ఆర్డర్ సహకారం తోడవడంతో కేవలం 6 పరుగుల వెనుకబడిన ఇంగ్లండ్ పోటీలోకి రాగా... రెండో ఇన్నింగ్స్‌లో కేఎల్ రాహుల్ రాణించడంతో టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. ప్రస్తుతానికి ఇరు జట్లు సమంగానే ఉన్నా... నాలుగో రోజు భారత బ్యాటర్లు ఎలాంటి ప్రదర్శన కనబరుస్తారన్నది కీలకంగా మారింది. సొంతగడ్డపై దంచికొట్టే అలవాటు ఉన్న ఇంగ్లండ్ ముందు ఎంత లక్ష్యం నిర్దేశించినా సురక్షితం కాదనే విశ్లేషణల మధ్య... టీమిండియా సోమవారం పూర్తిగా బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది! లీడ్స్: భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఆధిక్యం చేతులు మారుతూ సాగుతున్న పోరులో మూడో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 23.5 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 90 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో యశస్వి జైస్వాల్ (4) త్వరగానే అవుటైనా... కేఎల్ రాహుల్ (75 బంతుల్లో 47 బ్యాటింగ్; 7 ఫోర్లు), సాయి సుదర్శన్ (48 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఆకట్టుకున్నారు. చేతిలో 8 వికెట్లు ఉన్న టీమిండియా... ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం 6 పరుగులు కలుపుకొని ఓవరాల్‌గా 96 పరుగుల ముందంజలో ఉంది.రాహుల్‌తో పాటు కెపె్టన్ శుబ్‌మన్ గిల్ (6 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 209/3తో ఆదివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్... చివరకు 100.4 ఓవర్లలో 465 పరుగులకు ఆలౌటైంది. ఒలీ పోప్ (137 బంతుల్లో 106; 14 ఫోర్లు) ఎక్కువసేపు నిలవలేకపోగా... హ్యారీ బ్రూక్ (112 బంతుల్లో 99; 11 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఒక్క పరుగు తేడాతో సెంచరీని చేజార్చుకున్నాడు. మిగతా బ్యాటర్లు తలా కొన్ని పరుగులు చేయడంతో ఇంగ్లండ్ జట్టు... టీమిండియా తొలి ఇన్నింగ్స్ స్కోరుకు 6 పరుగుల దూరంలో నిలిచింది. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లతో అదరగొట్టగా... ప్రసిధ్ కృష్ణ 3, మొహమ్మద్ సిరాజ్ 2 వికెట్లు తీశారు. జైస్వాల్ 4 పరుగులకే... తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి సెంచరీ చేసిన జైస్వాల్... రెండో ఇన్నింగ్స్‌లో ఆకట్టుకోలేకపోయాడు. ఫీల్డింగ్‌లో మూడు క్యాచ్‌లు వదిలేయడంతో నెలకొన్న ఒత్తిడి అతడి ఆటతీరులో కనిపించింది. కార్స్ వేసిన నాలుగో ఓవర్లో కీపర్‌కు క్యాచ్ ఇచ్చి భారంగా పెవిలియన్‌కు వెనుదిరిగాడు. ఈ దశలో అరంగేట్ర ఆటగాడు సాయి సుదర్శన్‌తో కలిసి రాహుల్ క్లాస్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ షాట్లతో రెచ్చిపోయిన పిచ్‌పై రాహుల్ సంయమనం పాటించాడు. రాహుల్‌తో కలిసి రెండో వికెట్‌కు 66 పరుగులు జోడించిన అనంతరం సుదర్శన్ వెనుదిరగగా... కెపె్టన్ గిల్‌తో కలిసి రాహుల్ మరో వికెట్ పడకుండా రోజును ముగించాడు. వర్షం కారణంగా ఆట నిర్ణిత సమయం కంటే ముందే ముగిసింది. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, స్టోక్స్ చెరో వికెట్ పడగొట్టారు. బ్రూక్... పరుగు తేడాతో బ్యాటింగ్‌కు అనుకూలిస్తున్న పిచ్‌పై మూడో రోజు ఇంగ్లండ్ సమష్టి ప్రదర్శనతో సత్తా చాటింది. ‘సెంచరీ హీరో’ ఓలీ పోప్ క్రితం రోజు స్కోరుకు మరో 6 పరుగులు మాత్రమే జత చేసి వెనుదిరగగా... కెపె్టన్ బెన్ స్టోక్స్ (52 బంతుల్లో 20; 3 ఫోర్లు)ను సిరాజ్ అవుట్ చేశాడు. ఇక ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎక్కువ సమయం పట్టుదు అనుకుంటే... లోయర్ ఆర్డర్‌తో కలిసి హ్యారీ బ్రూక్ చెలరేగిపోయాడు. ధనాధన్ షాట్లతో చకచకా పరుగులు రాబట్టాడు. వికెట్ కీపర్ జేమీ స్మిత్ (52 బంతుల్లో 40; 5 ఫోర్లు, 1 సిక్స్), క్రిస్ వోక్స్ (55 బంతుల్లో 38; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా ఆడారు.తొలి సెషన్లో 28 ఓవర్లు ఆడిన ఇంగ్లండ్ 2 వికెట్లు కోల్పోయి 118 పరుగులు చేయగా... రెండో సెషన్లో 23.4 ఓవర్లలోనే 138 పరుగులు చేసి మిగిలిన ఐదు వికెట్లు కోల్పోయింది. రెండో రోజు ఆటలో బుమ్రా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయినా... ఆ బంతి నోబాల్ కావడంతో బతికిపోయిన బ్రూక్‌కు... మూడో రోజు మరో రెండు అవకాశాలు లభించాయి. వాటిని వినియోగించుకున్న అతడు భారత్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. శతకానికి ఒక పరుగు దూరంలో ప్రసిధ్ కృష్ణ వేసిన షార్ట్ పిచ్ బంతికి బ్రూక్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కార్స్ (23 బంతుల్లో 22; 4 ఫోర్లు), వోక్స్, టంగ్ (18 బంతుల్లో 11; 2 ఫోర్లు) విలువైన పరుగులు చేసి టీమిండియా ఆధిక్యాన్ని 6 పరుగులకు పరిమితం చేశారు.అదే తంతు..ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డింగ్ మరీ పేలవంగా సాగింది. రెండో రోజు బుమ్రా బౌలింగ్‌లోనే మన ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు జారవిడవగా... మూడో రోజు మరో రెండు క్యాచ్‌లు నేల పాలయ్యాయి. 46 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద జడేజా బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను పంత్ అందుకోలేకపోగా... 82 పరుగుల వద్ద బుమ్రా బౌలింగ్‌లో బ్రూక్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను జైస్వాల్ జారవిడిచాడు. ఒక ఎండ్‌లో బుమ్రా ఒత్తిడి పెంచుతున్నా... మరో ఎండ్ నుంచి అతడికి సరైన సహకారం దక్కలేదు.దీనిపై మాజీ ఆటగాళ్లు కూడా మండిపడగా... షార్ట్ బాల్స్‌తో వికెట్లు తీసిన ప్రసిధ్ కృష్ణ పరుగుల నియంత్రణలో పూర్తిగా విఫలమయ్యాడు. 20 ఓవర్లు వేసిన అతడు 128 పరుగులు సమరి్పంచుకున్నాడు. దీంతో ఇంగ్లండ్ బ్యాటర్ల మీద ఒత్తిడి కొనసాగలేకపోయింది. దీనికి తోడు తొలి టెస్టులో కెపె్టన్సీ చేస్తున్న గిల్ కూడా కొన్ని తప్పుడు నిర్ణయాలతో ఇంగ్లండ్‌కు సాయపడ్డాడు.టెయిలెండర్లు బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బుమ్రాను రంగంలోకి దింపి ఆధిక్యం పెంచుకోవాల్సింది పోయి... జడేజాకు బంతి అప్పగించి ఇంగ్లండ్ మరికొన్ని పరుగులు చేసే అవకాశం ఇచ్చాడు. ఎట్టకేలకు రెండో సెషన్ చివర్లో బంతి అందుకున్న బుమ్రా వరుస ఓవర్లలో వోక్స్, టంగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్‌కు తెరదింపాడు. ఈ క్రమంలో అతడు టెస్టుల్లో 14వసారి 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసుకున్నాడు.స్కోరు వివరాలు భారత్ తొలి ఇన్నింగ్స్: 471; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: క్రాలీ (సి) నాయర్ (బి) బుమ్రా 4; డకెట్ (బి) బుమ్రా 62; పోప్ (సి) పంత్ (బి) ప్రసిధ్ 106; రూట్ (సి) నాయర్ (బి) బుమ్రా 28; బ్రూక్ (సి) శార్దుల్ (బి) ప్రసిధ్ 99; స్టోక్స్ (సి) పంత్ (బి) సిరాజ్ 20; జేమీ స్మిత్ (సి) సుదర్శన్ (బి) ప్రసిధ్ 40; వోక్స్ (బి) బుమ్రా 38; కార్స్ (బి) సిరాజ్ 22; టంగ్ (బి) బుమ్రా 11; బషీర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 34; మొత్తం (100.4 ఓవర్లలో ఆలౌట్) 465.వికెట్ల పతనం: 1–4, 2–126, 3–206, 4–225, 5–276, 6–349, 7–398, 8–453, 9–460, 10–465.బౌలింగ్: బుమ్రా 24.4–5–83–5; సిరాజ్ 27–0 –122–2; ప్రసిధ్ 20–0–128–3; జడేజా 23–4–68–0; శార్దుల్ 6–0–38–0. భారత్ రెండో ఇన్నింగ్స్: జైస్వాల్ (సి) స్మిత్ (బి) కార్స్ 4; రాహుల్ (బ్యాటింగ్) 47; సుదర్శన్ (సి) క్రాలీ (బి) స్టోక్స్ 30; గిల్ (బ్యాటింగ్) 6; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (23.5 ఓవర్లలో 2 వికెట్లకు) 90.వికెట్ల పతనం: 1–16, 2–82.బౌలింగ్: వోక్స్ 6–2– 18–0; కార్స్ 5–0–27–1; టంగ్ 5–0–15–0; బషీర్ 2.5–1– 11–0; స్టోక్స్ 5–1–18–1. -
కరుణ్‌తో కలిసి సుదీర్ఘ కాలం టీమిండియాకు ఆడాలి.. కేఎల్ రాహుల్ ఆశాభావం
భారత టెస్టు జట్టు సభ్యులైన కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్ మంచి స్నేహితులు. చిన్నప్పటి నుంచి వివిధ వయో విభాగాల్లో ఈ కర్ణాటక మిత్రులు కలిసి ఆడారు. ఇప్పుడు చాలా ఏళ్ల తర్వాత రాహుల్, నాయర్లకు ఒకే టెస్టులో కలిసి ఆడే అవకాశం దక్కింది. టీమ్‌లో రాహుల్ రెగ్యులర్ మెంబర్ కాగా, ఎనిమిదేళ్ల తర్వాత నాయర్ పునరాగమనం చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో తమ స్నేహం చిరకాలం కొనసాగడంతో పాటు టీమిండియా తరఫున ఎక్కువ మ్యాచ్‌లు ఆడే అవకాశం రావాలని కోరుకుంటున్నట్లు రాహుల్ చెప్పాడు.‘11 ఏళ్ల వయసులో ఇద్దరం ఒకేసారి క్రికెట్ ఆడటం ప్రారంభించాం. ఈ ప్రయాణం ఇప్పటికీ సాగుతోంది. ఇద్దరి కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. గత 2–3 ఏళ్లలో అద్భుతంగా ఆడి ఎన్నో ప్రతికూలతలను దాటి నాయర్ పునరాగమనం చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇంగ్లండ్‌లో ఉండే పరిస్థితులు, సవాళ్ల గురించి మేము మాట్లాడుకున్నాం. మేమిద్దరం కలిసి భారత్ తరఫున సుదీర్ఘ కాలం ఆడాలని కోరుకుంటున్నా’ అని రాహుల్ ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా, భారత క్రికెట్ జట్టు ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టులో రాహుల్, కరుణ్ సభ్యులుగా ఉన్నారు. ఈ ఇద్దరు ఇవాల్టి నుంచి (జూన్ 20) లీడ్స్ వేదికగా ప్రారంభమయ్యే తొలి మ్యాచ్‌లో ఆడటం దాదాపుగా ఖరారైంది. ఈ మ్యాచ్‌లో రాహుల్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించే అవకాశం ఉండగా.. కరుణ్ మిడిలార్డర్లో ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్‌కు రావచ్చు. విరాట్, రోహిత్‌ల టెస్ట్ రిటైర్మెంట్ తర్వాత భారత బ్యాటింగ్ విభాగంలో రాహులే సీనియర్ సభ్యుడు. పైగా రాహుల్‌కు గత ఇంగ్లండ్ పర్యటనలో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఓపెనర్‌గానే గత పర్యటనలో రాహుల్ సెంచరీ చేశాడు. ఇటీవలికాలంలో రాహుల్ పలు బ్యాటింగ్ స్థానాలు మారినా ఓపెనర్‌గా అయితే అతను పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. రాహుల్ ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలోనూ పర్వాలేదనిపించాడు. తాజాగా ముగిసిన ఐపీఎల్లో ఇరగదీశాడు.కరుణ్ విషయానికొస్తే.. గత రెండు దేశవాలీ సీజన్లలో పరుగుల వరద పారించిన ఇతగాడు.. తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి మాంచి జోష్‌లో ఉన్నాడు. కరుణ్‌కు ఇంగ్లండ్ గడ్డపై ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. కౌంట్లీలో అతని పేరిట ఓ డబుల్ సెంచరీ, పలు సెంచరీలు ఉన్నాయి. కరుణ్ తనకు గుర్తింపు తెచ్చిన ట్రిపుల్ సెంచరీని ఇంగ్లండ్‌పైనే సాధించాడు. ఇంగ్లండ్ గడ్డపై, ఇంగ్లండ్‌పై ఘనమైన ట్రాక్ రికార్డు ఉండటంతో కరుణ్‌పై ఈ సిరీస్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. కరుణ్‌ను భారత క్రికెట్ అభిమానులు విరాట్‌కు ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. దోస్తులు (రాహుల్, కరుణ్) నేటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ మ్యాచ్‌లో ఏమేరకు రాణిస్తారో చూడాలి. -
IND VS ENG 1st Test: టీమిండియా అంతా కలిసినా 'ఆ ఒక్కడితో' సమానం కాదు..!
ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా భారత్, ఇంగ్లండ్ మధ్య లీడ్స్ వేదికగా ఇవాల్టి నుంచి (జూన్ 20) తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్ డబ్ల్యూటీసీ కొత్త సైకిల్లో (2025-27) ఇరు జట్లకు మొదటిది. భారతకాలమానం ప్రకారం ఇవాళ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పోట్టి క్రికెట్‌కే అలవాటు పడిన ఫ్యాన్స్, ఈ మ్యాచ్ నుంచి సుదీర్ఘ ఫార్మాట్లోని అసలు సిసలైన మజాను ఎంజాయ్ చేస్తారు.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు కూడా సంసిద్దంగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు బరిలోకి దిగి సత్తా చాటుదామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. స్టార్ త్రయం విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత శుభ్‌మన్ గిల్ నేతృత్వంలో టీమిండియా సరికొత్త శకంలోకి అడుగుపెట్టబోతుంది. మరోవైపు ఇంగ్లండ్ బెన్ స్టోక్స్ సారథ్యంలో యువకులు, అనుభవజ్ఞులతో ఉరకలేస్తుంది. ఇంగ్లీష్ జట్టు తమ బజ్‌బాల్ అటాకింగ్ గేమ్‌ను టీమిండియాపై ప్రయోగించాలని ఆరాట పడుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇంగ్లండ్ తమ తుది జట్టును ఇదివరకే ప్రకటించగా.. భారత్ తమ కసరత్తును దాదాపుగా పూర్తి చేసింది. మ్యాచ్‌కు చాలా సమయం ముందుగానే జట్టును ప్రకటించి తమ ప్రణాళికలను బహిర్గతం చేయకూడదనే భారత మేనేజ్మెంట్ ఉద్దేశం.ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌కు ముందు ఓ ఆసక్తికర విషయం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే.. టీమిండియా ఆటగాళ్ల మొత్తం టెస్ట్ సెంచరీల సంఖ్య కన్నా, ఒక్క ఇంగ్లండ్ ఆటగాడు జో రూట్ టెస్ట్ సెంచరీల సంఖ్యనే అధికంగా ఉండటం. రూట్ తన టెస్ట్ కెరీర్లో 36 సెంచరీలు బాదగా.. ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న భారత జట్టు సభ్యులంతా కలిపి 29 సెంచరీలే చేశారు. వీరిలో కేఎల్ రాహుల్ అధికంగా 8 సెంచరీలు చేయగా.. వైస్ కెప్టెన్ పంత్ 6, కెప్టెన్ గిల్ 5, యశస్వి జైస్వాల్ 4, రవీంద్ర జడేజా 4, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి తలో సెంచరీ చేశారు. అంటే, రూట్ సెంచరీల కంటే టీమిండియా ఆటగాళ్లందరూ కలిపి చేసిన సెంచరీలు ఇంకా 7 తక్కువ అన్నమాట. రూట్ మరో 373 పరుగులు చేస్తే..భారత్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో రూట్ మరో 373 పరుగులు చేస్తే, టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానానికి దూసుకొస్తాడు. ప్రస్తుతం 13006 పరుగులు ఖాతాలో కలిగి ఉన్న రూట్.. మరో 373 పరుగులు చేస్తే, రాహుల్ ద్రవిడ్ (13288), జాక్ కల్లిస్ (13289), రికీ పాంటింగ్‌ను (13378) అధిగమిస్తాడు. అప్పుడు సచిన్ టెండూల్కర్ ఒక్కడే (15921) రూట్ కంటే ముందుంటాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుది జట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు ఊహించని ఎదురుదెబ్బ..!
భారత క్రికెట్ జట్టు రేపటి నుంచి (జూన్ 20) వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కొత్త సైకిల్‌ను (2025-27) ప్రారంభిస్తుంది. భారత్, ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ సిరీస్‌లోని తొలి టెస్ట్ హెడింగ్లేలోని లీడ్స్‌లో జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు అస్త్రశస్త్రాలు సిద్దం చేసుకున్నాయి. ఇంగ్లండ్ ఇదివరకే తుది జట్టును ప్రకటించింది. భారత్ కూడా తుది జట్టుపై క్లారిటీ ఇచ్చేసింది. రోహిత్, విరాట్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత యంగ్ ఇండియా ఎదుర్కోబోయే తొలి అగ్నిపరీక్ష ఇదే.ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ టీమిండియా కెప్టెన్‌గా తన ప్రస్థానాన్ని మొదలుపెడతాడు. భారత తుది జట్టులో చాలా మార్పులకు అవకాశం ఉంది. యువ ఆటగాడు సాయి సుదర్శన్ అరంగేట్రం దాదాపుగా ఖరారైపోయింది. బ్యాటింగ్ స్థానాలపై కూడా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ నిన్నటి ప్రెస్ మీట్లో క్లారిటీ ఇచ్చాడు. నాలుగో స్థానంలో గిల్, ఐదో ప్లేస్‌తో తను బ్యాటింగ్‌కు దిగుతామని పంత్ వెల్లడించాడు.ఓపెనర్లుగా యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్.. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్ పేర్లు కూడా దాదాపుగా ఖరారైపోయాయి. ఆరో స్థానంపై కూడా టీమిండియా మేనేజ్మెంట్కు నిన్నటి వరకు ఎలాంటి అనుమానం లేకుండింది. 8 ఏళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఈ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడని మేనేజ్మెంట్ సూచనప్రాయంగా వెల్లడించింది.The incident where Karun Nair got hit at the nets by a delivery from @prasidh43 @RohanDC98 #ENGvsIND #Headingley pic.twitter.com/xGMsiSF8PA— RevSportz Global (@RevSportzGlobal) June 18, 2025అయితే నిన్న జరిగిన ప్రాక్టీస్ సెషన్లో టీమిండియాకు ఓ ఊహించని ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తుంది. దేశవాలీ క్రికెట్లో పరుగుల వరద పారించి టీమిండియా తలుపులు తట్టిన కరుణ్ నాయర్ నెట్స్ గాయపడ్డాడని ప్రచారం జరుగుతుంది. ప్రసిద్ద్ కృష్ణ బౌలింగ్‌ను ఎదుర్కోబోయి కరుణ్ పక్కటెముకల్లో దెబ్బ తగిలించుకున్నాడని సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఒకవేళ నిజంగానే కరుణ్ గాయపడినట్లైతే టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలనట్లవుతుంది. కరుణ్ ఇటీవల ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ సాధించి జోరుమీదున్నాడు. అతని గాయం తీవ్రమైందైతే తుది జట్టులో అతని స్థానం గల్లంతైనట్లే. ఇది టీమిండియా బ్యాటింగ్ కూర్పును భారీగా ప్రభావితం చేస్తుంది. ఆరో స్థానం కోసం మేనేజ్మెంట్ మరో ఆప్షన్‌ను ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఆ స్థానం కోసం ప్రత్యామ్నాయ ఆటగాడిగా ధృవ్ జురెల్ అందుబాటులో ఉన్నప్పటికీ.. అతను మ్యాచ్ కోసం సిద్దంగా ఉండకపోవచ్చు. కరుణ్‌కు ప్రత్యామ్నాయంగా ఆల్‌రౌండర్‌తో ముందుకు వెళ్లాలనుకుంటే కూడా వాషింగ్టన్ సుందర్ అందుబాటులో ఉన్నాడు. కరుణ్ గాయం తీవ్రమైందైతేనే ఈ ఈక్వేషన్స్ అన్నిటికీ ఆస్కారం ఉంటుంది. సోషల్‌మీడియాలోని మరో వర్గం కరుణ్ గాయాన్ని కొట్టిపారేస్తుంది. అతని గాయం తీవ్రమైంది కాదని అంటుంది. తొలి టెస్ట్‌లో కరుణ్ తప్పక ఆడతాడని చెబుతుంది. ఈ విషయమై మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు భారత తుది జట్టు (అంచనా).. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), కరుణ్ నాయర్, నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్టీమిండియాతో తొలి టెస్టుకు ఇంగ్లండ్ తుదిజట్టు..జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్, జేమీ స్మిత్ (వికెట్ కీపర్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్సే, జోష్ టంగ్, షోయబ్ బషీర్. -
ప్రపంచంలో ధనిక క్రికెట్ బోర్డులు ఇవే.. చివరి స్థానంలో ఊహించని పేరు
ప్రస్తుత జమానాలో క్రికెట్ కేవలం క్రీడ మాత్రమే కాదు. ఇదో పెద్ద వ్యాపారం. ఇందులో ఆయా దేశ క్రికెట్ బోర్డులు లెక్కలేనంతగా సంపాదిస్తున్నాయి. స్పాన్సర్లు, ప్రసార ఒప్పందాలు, ఇతరత్రా మార్గాల ద్వారా కోట్లకు పడగలెత్తుతున్నాయి. గత దశాబ్దకాలంలో ఈ ధోరణి మరింత పెరిగింది. ఐపీఎల్ లాంటి లీగ్‌ల వల్ల క్రికెట్ బోర్డుల రూపురేఖలే మారిపోయాయి. ఎంతలా అంటే, క్రికెట్ బోర్డులు దేశ అర్దిక వ్యవస్థలను శాశించేంతలా మారాయి. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) ఇందుకు ప్రధాన ఉదాహరణ.బీసీసీఐ ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు కావడమే కాక ప్రపంచ క్రికెట్ మొత్తాన్నే శాశిస్తుంది. ఐపీఎల్ బీసీసీఐ దశ దిశనే మార్చేసింది. 2008లో ఐపీఎల్ ప్రారంభమయ్యాక బీసీసీఐ రెవెన్యూ అమాంతం పెరిగింది. ధనార్జన విషయంలో ఇతర దేశ క్రికెట్ బోర్డులు బీసీసీఐ దరిదాపుల్లోకి కూడా రాలేపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం బీసీసీఐ నికర విలువ రూ. 19052 కోట్లని తెలుస్తుంది. ఈ సంఖ్యతో పోలిస్తే మిగతా క్రికెట్ బోర్డుల ఆదాయం కనీసం పది శాతం కూడా లేదు. తాజా నివేదికల ప్రకారం.. బీసీసీఐ అత్యంత సంపన్న క్రికెట్ బోర్డుగా ఉంటే, టెస్ట్ హోదా కలిగిన దేశాల్లో న్యూజిలాండ్ అతి పేద క్రికెట్ బోర్డుగా ఉంది. న్యూజిలాండ్ 1926 నుంచి అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నా ఆ దేశ క్రికెట్ బోర్డు క్రికెట్‌ను కేవలం క్రీడగానే చూస్తుంది. దీన్ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ఏ నాడు ఆదాయ వనరుగా పరిగణించలేదు.కడు పేదరికాన్ని అనుభవిస్తున్న మన దాయాది దేశం పాకిస్తాన్ కూడా క్రికెట్ ద్వారా కోట్లు సంపాదిస్తుంటే న్యూజిలాండ్ మాత్రం క్రీడలో విలువలకు ప్రాధాన్యత ఇస్తూ చాలీచాలని ఆదాయంతో సరిపెట్టుకుంటుంది.బీసీసీఐ విషయానికొస్తే.. భారత్‌లో క్రికెట్ ప్రతి పౌరుడి జీవితంలో ఓ భాగం. ఇదే బీసీసీఐకి అతి పెద్ద పెట్టుబడి. బీసీసీఐ బలమంతా భారత క్రికెట్ మార్కెట్లోనే ఉంది. అంతర్జాతీయంగా ప్రముఖ కంపెనీలు భారత అభిమానుల ముందుకు రావడానికి వందల కోట్లు ఖర్చు పెడతాయి. ఐపీఎల్ పరిచమయ్యాక బీసీసీఐ తలరాతే మారిపోయింది. ఈ లీగ్ మీడియా హక్కులు చిన్న దేశ క్రికెట్ బోర్డుల ఆదాయం కంటే చాల ఎక్కువ. భారత పురుషుల సీనియర్ క్రికెట్ జట్టు స్పాన్సర్‌షిప్‌లు బీసీసీఐకి మరో ప్రధాన ఆదాయ వనరు. భారత్‌లోనే జరిగే మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలు మరియు ఆ మ్యాచ్‌ల ద్వారా జరిగే వ్యాపారం బీసీసీఐకి అదనపు ఆదాయం. డిజిటల్ ఒప్పందాలు, ఐసీసీ ఆదాయ వాటాలు బీసీసీఐకి మరో భారీ ఆదాయ వనరు. ఇలా బీసీసీఐ నాలుగు చేతులా సంపాదిస్తూ ప్రపంచంలో అత్యంత ధనిక బోర్డుగా చలామణి అవుతుంది.తాజా నివేదికల ప్రకారం ప్రపంచంలోని టాప్ 10 ధనిక క్రికెట్ బోర్డుల వివరాలు ఇలా ఉన్నాయి.భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు-రూ. 19052 కోట్లుక్రికెట్ ఆస్ట్రేలియా- రూ. 684 కోట్లుఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు- రూ. 510 కోట్లుపాకిస్తాన్ క్రికెట్ బోర్డు- రూ. 476 కోట్లుబంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు- రూ. 441 కోట్లుక్రికెట్ సౌతాఫ్రికా- రూ. 406 కోట్లుజింబాబ్వే క్రికెట్ బోర్డు- రూ. 329 కోట్లుశ్రీలంక క్రికెట్ బోరు- రూ. 173 కోట్లువెస్టిండీస్ క్రికెట్ బోర్డు- రూ. 129 కోట్లున్యూజిలాండ్ క్రికెట్ బోర్డు- రూ. 77 కోట్లు -
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. భారత్‌లో క్రికెట్ అభిమానులకు శుభవార్త
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ మరో రెండు రోజుల్లో ప్రారంభమవుతుంది. జూన్ 20 నుంచి లీడ్స్ (హెడింగ్లే) వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 3:30 గంటలకు మొదలవుతుంది.ఈ మ్యాచ్ భారత్‌లో సోని స్పోర్ట్స్ నెటవర్క్లో ప్రత్యక్ష ప్రసారమవుతుంది. ఆన్లైన్ స్ట్రీమింగ్ జియో హాట్‌స్టార్ యాప్‌తో పాటు వెబ్సైట్లో జరుగుతుంది. ఈ సిరీస్‌లో ఐదు మ్యాచ్‌లు ఇవే నెట్‌వర్క్‌లలో ప్రత్యక్ష ప్రసారమవుతాయి.ఈ సిరీస్‌కు ముందు భారత్‌లో ఉన్న క్రికెట్ అభిమానులకు శుభవార్త అందింది. ఈ సిరీస్‌లోని మ్యాచ్‌లన్నీ డిడి స్పోర్ట్స్‌లో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతాయి. ఈ ఛానెల్లో భారత్-ఇంగ్లండ్ సిరీస్ మొత్తాన్ని ఉచితంగా వీక్షించవచ్చు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్భారత్తో తొలి టెస్ట్‌కు ఇంగ్లండ్ జట్టు..బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జేకబ్ బేతెల్, హ్యారీ బ్రూక్, బ్రైడాన్ కార్స్, సామ్ కుక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్ -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు భారత బ్యాటింగ్ లైనప్ ఇదే.. రోహిత్, కోహ్లికి ప్రత్యామ్నాం వీళ్లే..!
భారత్-ఇంగ్లండ్ మధ్య ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది. హెడింగ్లే వేదికగా తొలి టెస్ట్ జరుగనుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి రిటైర్మెంట్ (టెస్ట్‌లకు) తర్వాత టీమిండియా ఎదుర్కోబోతున్న తొలి పరీక్ష ఇదే. ఈ నేపథ్యంలో రోహిత్, విరాట్ల ప్రత్యామ్నాయాలు ఎవరనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ఈ విషయంలో ఇదివరకే చాలా మంది మాజీలు, విశ్లేషకులు తమతమ అభిప్రాయాలను వెల్లడించారు. తాజాగా టీమిండియా మాజీ ఆల్‌రౌండర్, ప్రముఖ వ్యాఖ్యాత రవిశాస్త్రి కూడా రోహిత్, కోహ్లి ప్రత్యామ్నాయాలపై గళం విప్పాడు. రోహిత్ ఓపెనింగ్ స్థానాన్ని కేఎల్ భర్తీ చేయాలని శాస్త్రి సూచించాడు. అలాగే కోహ్లి నంబర్-4లో ప్లేస్‌లో శుభ్‌మన్ గిల్ బ్యాటింగ్ రావాలని అన్నాడు. వన్‌డౌన్‌లో సాయి సుదర్శన్, ఐదో స్థానంలో కరుణ్ నాయర్ పేర్లను సూచించాడు. రాహుల్‌కు జతగా మరో ఓపెనర్‌గా యశస్వి జైస్వాల్, వికెట్‌కీపర్ బ్యాటర్‌గా రిషబ్ పంత్‌ను ఎంపిక చేశాడు. స్పిన్ ఆల్‌రౌండర్ కోటాలో రవీంద్ర జడేజాను ఎంపిక చేసిన శాస్త్రి.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌ను తేల్చడం కాస్త కష్టమని చెప్పాడు. ఈ స్థానం కోసం శార్దూల్ ఠాకూర్, నితీశ్ కుమార్ రెడ్డి మధ్య తీవ్రమైన పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డాడు. అంతిమంగా ఎవరు ఎక్కువ ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే వారికే తుది జట్టులో చోటు ఉంటుందని తెలిపాడు. బ్యాటింగ్ పరంగా నితీశ్ పర్వాలేదని, అతను 15, 20 ఓవర్లు బౌలింగ్ చేయగలిగితే అతనికే తన ఓటని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో భారత్ తప్పక ముగ్గురు ఫాస్ట్ బౌలర్లలో బరిలోకి దిగాలని శాస్త్రి సూచించాడు.తొలి రెండు స్థానాలకు బుమ్రా, సిరాజ్ పేర్లను కన్ఫర్మ్ చేసిన శాస్త్రి.. మూడో ఫాస్ట్ బౌలర్ స్థానం కోసం ప్రసిద్ద్ కృష్ణ, అర్షదీప్ సింగ్ మధ్య పోటీ ఉంటుందని చెప్పాడు. మ్యాచ్ సమయానికి వాతావరణం మబ్బులు కమ్ముకుని ఉంటే బంతిని ఇరు వైపుల స్వింగ్ చేయగల అర్షదీప్‌కే తన ఓటని చెప్పాడు. ఒకవేళ వాతావరణం పొడిగా ఉంటే మాత్రం ప్రసిద్ద్ కృష్ణనే తుది జట్టులోని తీసుకోవాలని సూచించాడు.ఐసీసీ రివ్యూ సందర్భంగా మాట్లాడుతూ శాస్త్రి ఈ అభిప్రాయాలను వ్యక్త పరిచాడు. ఈ సందర్భంగా శాస్త్రి కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, సాయి సుదర్శన్‌లపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ ప్రస్తుతం భారత బ్యాటింగ్ సెటప్‌లో అత్యంత అనుభవజ్ఞుడైన ఆటగాడని, గత ఇంగ్లండ్ పర్యటనలో అతను అద్భుతంగా రాణించాడని గుర్తు చేశాడు. చివరిసారి రాహుల్ ఇంగ్లండ్‌లో ఓపెనింగ్ చేసినప్పుడు సెంచరీ చేశాడని ప్రస్తావించాడు.సాయి సుదర్శన్ తాజాగా ముగిసిన ఐపీఎల్లో, అంతకుముందు దేశవాలీ క్రికెట్లో విశేషంగా రాణించాడని, ఈ 23 ఏళ్ల బ్యాటింగ్ సంచలనం తన నిలకడ ప్రదర్శనలతో అందరినీ మెప్పించాడని అన్నాడు. సాయి సుదర్శన్ మూడో స్థానంలో బరిలోకి దిగి ఈ ఇంగ్లండ్ పర్యటనలో అద్భుతాలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు.కరుణ్ నాయర్ గురించి మాట్లాడుతూ.. ప్రస్తుత ఫామ్ ప్రకారం కరుణ్ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు రావాలి. అతను చాలా కష్టపడి ఎనిమిదేళ్ల తర్వాత భారత టెస్ట్ జట్టులోకి పునరాగమనం చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతను సాధించిన పరుగుల అద్వితీయం. ఎంత ఫామ్‌లో ఉన్నా అన్ని పరుగులు సాధించడం చాలా కష్టం. ఇందుకు కరుణ్ చాలా గ్రౌండ్ వర్క్ చేశాడని శాస్త్రి అన్నాడు.ఇంగ్లండ్‌తో తొలి టెస్టుకు రవిశాస్త్రి ఎంపిక చేసిన భారత ప్లేయింగ్ ఎలెవెన్.. యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), కరుణ్ నాయర్, రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి/శార్దూల్ ఠాకూర్, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా,మహ్మద్ సిరాజ్,ప్రసిద్ కృష్ణ/అర్షదీప్ సింగ్ -
సంచలనం.. 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసిన వైభవ్ సూర్యవంశీ స్నేహితుడు
భారత క్రికెట్‌కు మరో చిచ్చరపిడుగు పరిచయమయ్యాడు. బీహార్‌లోని ముజఫర్‌పూర్‌కు చెందిన 13 ఏళ్ల అయన్ రాజ్ కేవలం 134 బంతుల్లోనే ట్రిపుల్ సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచాన్ని షేక్ చేశాడు. ఓ డిస్ట్రిక్ట్ లెవెల్ 30 ఓవర్ల మ్యాచ్‌లో సంస్కృతి క్రికెట్ అకాడమీకి ప్రాతినిథ్యం వహించిన అయన్.. 134 బంతుల్లో 22 సిక్సర్లు, 41 ఫోర్ల సాయంతో 327 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయన్ బౌండరీలు, సిక్సర్ల రూపంలోనే 220.89 స్ట్రయిర్రేట్తో 296 పరుగులు చేయడం మరో విశేషం.అయన్ రాజ్ భారత యువ సంచలనం, బ్యాటింగ్ చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి దగ్గరి మిత్రుడు. ఇద్దరు ఒకే రాష్ట్రానికి చెందిన వారు. ఇంకా చిన్న వయసులో ఇద్దరు కలిసి ఆడారు. అయన్ వైభవ్‌ను ఆదర్శంగా తీసుకొని మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేయాలని ఆశాభావం వ్యక్తం చేశాడు. అయన్ను దగ్గరగా చూసిన వారు అతన్ని క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌తో పోలుస్తున్నారు.రికార్డు ట్రిపుల్ సెంచరీ తర్వాత ఎన్డీటీవీ స్పోర్ట్స్‌తో మాట్లాడిన అయన్ స్నేహితుడు వైభవ్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. వైభవ్ భవిష్యత్తులో మరిన్ని సంచలన ప్రదర్శనలు నమోదు చేస్తాడని అశాభావం వ్యక్తం చేశాడు. వైభవ్‌తో మాట్లాడిన ప్రతిసారి ప్రేరణతో కూడిన గొప్ప అనుభూతి కలుగుతుందని తెలిపాడు. వైభవ్‌ను చూసి ఫోకస్డ్గా ఎలా ఉండాలో నేర్చుకున్నానని అన్నాడు. వైభవ్ అడుగుజాడల్లో నడిచి తాను కూడా గొప్ప పేరు తెచ్చుకుంటానని తెలిపాడు.తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని..!అయన్ తండ్రి ఓ మాజీ క్రికెటర్ (లోకల్). టీమిండియాకు ఆడాలని అతను కలలు కన్నాడు. అయితే అతని విషయంలో అది నెరవేరలేదు. కొడుకుతోనైనా తన కలను సాకారం చేసుకోవాలని అనుకున్నాడు. ఆ దిశగా అయన్ను రాటుదేలుస్తున్నాడు. అయన్ కూడా తండ్రి కలను లక్ష్యంగా చేసుకొని తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. తండ్రితో పాటు తల్లి మద్దతుతో కేవలం క్రికెట్‌పైనే దృష్టి కేంద్రీకరించాడు.వైభవ్ విషయానికొస్తే.. అయన్ కన్నా ఏడాది పెద్దవాడైన వైభవ్ 14 ఏళ్ల వయసులోనే ఐపీఎల్‌లోని అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. వైభవ్ ఐపీఎల్లో తన మూడో మ్యాచ్‌లోనే రికార్డు బ్రేకింగ్ సెంచరీ చేసి హేమాహేమీల రికార్డులు బద్దలు కొట్టాడు. గుజరాత్ టైటాన్స్‌పై వైభవ్ చేసిన 35 బంతుల శతకం ఐపీఎల్ చరిత్రలోనే రెండో వేగవంతమైన శతకం. అలాగే ఐపీఎల్లో భారత ఆటగాడు చేసిన వేగవంతమైన శతకం. ఐపీఎల్ 2025కు ముందు వైభవ్ కేవలం 12 ఏళ్ల వయసులోనే రంజీ అరంగేట్రం చేసి చరిత్ర సృష్టించాడు. ప్రస్తుతం అతని స్నేహితుడు అయన్ రాజ్ కూడా అతి చిన్నవయసులోనే పెద్దల క్రికెట్ ఆడే దిశగా అడుగులు వేస్తున్నాడు. అయన్ ఇలాంటి ఇన్నింగ్స్‌లు ఆడటం కొనసాగిస్తే.. భారత క్రికెట్లో వైభవ్ తర్వాత మరో సంచలనం అవుతాడు. -
కాబోయే భార్యతో ఫోటోలు పోస్ట్ చేసి, వెంటనే డిలీట్ చేసిన కుల్దీప్ యాదవ్.. ఏం జరిగింది..?
టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఇటీవలే (జూన్ 4న) తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో నిశ్చితార్ధం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని త్వరలో ప్రకటిస్తామని కుల్దీప్ చెప్పాడు.కాగా, కుల్దీప్-వన్షిక నిశ్చితార్ధం జరిగి రెండు వారాలు కూడా గడవకముందే వారిద్దరి మధ్య ఏదో జరుగుతుందని సోషల్‌మీడియాలో పుకార్లు వస్తున్నాయి. తాజాగా జరిగిన ఓ ఉదంతం ఈ పుకార్లకు బలం చేకూరుస్తుంది. కుల్దీప్ వన్షికతో కలిసి దిగిన ఫోటోలను నిన్న తన ఇన్‌స్టా ఖాతాలో పోస్ట్ చేసి వెంటనే డిలీట్ చేశాడు. కుల్దీప్ ఇలా చేయడంపై క్రికెట్ ఫాలోవర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వారిద్దరి మధ్య ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు. కుల్దీప్-వన్షిక బంధం పెళ్లి వరకు కూడా సాగేలా లేదని కామెంట్లు చేస్తున్నారు.ఇదిలా ఉంటే, త్వరలో ప్రారంభం కానున్న ఇంగ్లండ్ సిరీస్ కోసం ఎంపిక చేసిన భారత జట్టులో కుల్దీప్ ఒక్కడే స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా ఉన్నాడు. ఈ సిరీస్‌లో కుల్దీప్ టీమిండియాకు చాలా కీలకంగా మారే అవకాశం ఉంది. కుల్దీప్ ఇంగ్లండ్ గడ్డపై ఇప్పటివరకు ఒకే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అందులోనూ అతను కేవలం తొమ్మిది ఓవర్లు మాత్రమే వేశాడు. ఇంగ్లిష్ కండీషన్స్‌పై పెద్ద అవగాహన లేని కుల్దీప్ ఏమేరకు రాణిస్తాడో అని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు. ఈ సిరీస్‌లో భారత స్పిన్ విభాగం బరువును కుల్దీప్తో పాటు రవీంద్ర జడేజా మోయనున్నాడు. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత ఈ ఇద్దరు భారత్ స్పిన్ విభాగానికి పెద్ద దిక్కుగా మారారు. అక్షర్ పటేల్ రూపంలో భారత్‌కు మరో స్పిన్ ఆప్షన్ ఉన్నా ఈ సిరీస్‌కు అతన్ని ఎంపిక చేయలేదు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ ఉన్నా అతనికి తుది జట్టులో అవకాశం దొరకడం అనుమానమే. జూన్ 20 నుంచి హెడింగ్లేలో తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. -
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు సంచలన విషయాన్ని బయటపెట్టిన కరుణ్ నాయర్
ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ ప్రారంభానికి ముందు (జూన్ 20) టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ఓ సంచలన విషయాన్ని బయటపెట్టాడు. మెయిల్ స్పోర్ట్ అనే ప్రముఖ మేగజైన్‌తో మాట్లాడుతూ.. ఓ బాంబు లాంటి వార్త చెప్పాడు.కరుణ్ మాటల్లో.. నాకు ఇప్పటికీ గుర్తుంది. రెండేళ్ల క్రితం టీమిండియాలో స్థానం కోసం పరితపిస్తున్న రోజులవి. ఆ సమయంలో ఓ అగ్రశ్రేణి భారత క్రికెటర్ నాకు ఫోన్ చేసి రిటైర్మెంట్ ప్రకటించమని సలహా ఇచ్చాడు. ప్రైవేట్ టీ20 లీగ్‌ల్లో చాలా డబ్బు వస్తుందని చెప్పడమే అతని ఉద్దేశం. అలా చేసి ఉండటం చాలా సులభం. కానీ నేను భారత క్రికెట్లోకి రీఎంట్రీ ఇచ్చే ఏ విషయంలోనూ రాజీ పడదలచుకోలేదు. ఆ రోజు నేను డబ్బు గురించి ఆలోచించి ఉంటే ఈ రోజు ఇక్కడ (ఇంగ్లండ్‌లో) ఉండే వాడిని కాదు.టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలన్న ధృడమైన లక్ష్యంతో ఆ రోజు ఆ ప్రముఖ క్రికెటర్ సలహాను పెడచెవిన పెట్టిన కరుణ్.. రెండేళ్ల సుదీర్ఘ పోరాటం తర్వాత ఎట్టకేలకు టీమిండియాలో చోటు సాధించాడు. 2023లో కర్ణాటక నుండి విదర్భకు మారడం (దేశవాలీ క్రికెట్లో) కరుణ్ అదృష్టాన్ని మార్చేసింది.గత రెండు దేశవాలీ సీజన్లలో 1500కు పైగా పరుగులు సాధించిన కరుణ్ (విదర్భ).. టీమిండియా తలుపులు తట్టాడు. గత రంజీ సీజన్లో అసాధారణ ప్రదర్శన (53.93 సగటున 863) కనబర్చి విదర్భ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మధ్యలో ఇంగ్లండ్ కౌంట్లీలోనూ ఆడిన కరుణ్ అక్కడ కూడా సత్తా చాటాడు. రెండు సీజన్లలో నార్తప్టంన్షైర్ తరఫున 56.61 సగటున 736 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ కూడా ఉంది.నాయర్ తాజాగా ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో కూడా డబుల్ సెంచరీతో సత్తా చాటాడు. విరాట్ కోహ్లి టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానానికి కరుణ్ సరైన అర్హుడని కొందరు భావిస్తున్నారు. 2018లో టీమిండియా తరఫున చివరి టెస్ట్ మ్యాచ్ ఆడిన కరుణ్.. దాదాపు ఏడేళ్ల తర్వాత 33 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇవ్వడం ఆసక్తికర పరిణామం. కరుణ్ తన చిన్నపాటి టెస్ట్ కెరీర్లోనే ట్రిపుల్ సెంచరీ బాది చరిత్ర సృష్టించాడు. కరుణ్ చేసిన ఆ ట్రిపుల్ సెంచరీ ఇంగ్లండ్‌పైనే కావడం విశేషం.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు..శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
ఇంగ్లండ్ గడ్డపై సునామీ శతకంతో విరుచుకుపడిన శార్దూల్ ఠాకూర్
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ఆల్‌రౌండర్ శార్దూల్ ఠాకూర్ సునామీ శతకంతో విరుచుకుపడ్డాడు. బెకింగ్‌హమ్ వేదికగా భారత సీనియర్ జట్టుతో జరిగిన ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో కేవలం 68 బంతుల్లోనే అజేయమైన 122 పరుగులు చేశాడు (భారత-ఏ జట్టుకు ఆడుతూ). ఈ మ్యాచ్‌లో శార్దూల్ తొలుత బంతితోనూ మెరిశాడు (4 వికెట్లు తీశాడు). కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, కరుణ్ నాయర్ వంటి స్టార్లతో నిండిన భారత సీనియర్ల బ్యాటింగ్ లైనప్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు.తాజా ప్రదర్శనతో శార్దూల్ ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌కు ముందు భారత సెలెక్టర్లకు కొత్త తలనొప్పి తెచ్చిపెట్టాడు. ఆస్ట్రేలియా గడ్డపై సెంచరీతో మెరిసిన మరో ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి పోటీగా మారాడు. శార్దూల్ తాజా ప్రదర్శన నేపథ్యంలో జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ప్రారంభం కాబోయే తొలి టెస్ట్‌లో ఎవరికి అవకాశం ఇవ్వాలో అర్దంకాక సెలెక్టర్లు తలలు పట్టుకున్నారు.మ్యాచ్ విషయానికొస్తే.. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్, భారత్-ఏ జట్ల మధ్య నాలుగు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. తొలి టెస్ట్‌కు ముందు భారత ఆటగాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మ్యాచ్‌ను మూడు రోజుల్లోనే ముగించారు. ఈ మ్యాచ్ డ్రాగా ముగిసింది.ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత సీనియర్ జట్టు 459 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహల్ హాఫ్ సెంచరీలతో మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత-ఏ మూడో రోజు ఆటను రద్దు చేసే సమయానికి భారీ స్కోర్ చేసింది. 19 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద మూడో రోజు ఆటను ప్రారంభించిన శార్దూల్.. జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ వంటి హేమాహేమీ పేసర్లున్న భారత బౌలింగ్ లైనప్‌కు చుక్కలు చూపించాడు.అంతకుముందు రెండో రోజు ఆటలో మరో భారత-ఏ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కూడా మెరుపు శతకంతో విరుచుకుపడ్డాడు. సర్ఫరాజ్ ఖాన్ కూడా కేవలం 76 బంతుల్లో 101 పరుగులు చేసి భారత సెలెక్టర్లకు సవాలు విసిరాడు. ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్, శార్దూల్ అద్భుతమైన ప్రదర్శనలతో సత్తా చాటడంతో ఇదివరకే భారత సీనియర్ జట్టులో చోటు ఖాయమనున్న కరుణ్ నాయర్, నితీశ్ కుమార్‌లకు భయం పట్టుకుంది. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్‌లో సర్ఫరాజ్ స్థానంపై అనుమానం ఉన్నప్పటికీ.. తాజా ప్రదర్శనతో శార్దూల్‌కు తుది జట్టులో చోటు దక్కడం ఖాయమని తెలుస్తుంది. అంతకుముందు కరుణ్ నాయర్ ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో డబుల్ సెంచరీతో మెరిశాడు కాబట్టి అతని చోటుపై ఎలాంటి అనుమానం లేదు. ఇంగ్లండ్‌తో తొలి టెస్ట్ లీడ్స్‌లోని హెడింగ్లే మైదానంలో జూన్ 20 నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్‌తో టెస్టులకు భారత జట్టు..శుబ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషభ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేడా, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుదంర్, శార్దుల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
శ్రేయస్ అయ్యర్ కోసం భారత సెలెక్టర్లపై ధ్వజమెత్తిన గంగూలీ
త్వరలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయనందుకు భారత సెలెక్టర్లపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ తీవ్ర స్థాయిలో మండిపడ్డాడు. ఇంగ్లండ్ పర్యటనలో శ్రేయస్ తప్పక జట్టులో ఉండాల్సిందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.గత కొంతకాలంగా దేశవాలీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్న శ్రేయస్‌ను ఎందుకు జట్టులోకి తీసుకోలేదని నిలదీశాడు. శ్రేయస్‌కు భారత టెస్ట్ జట్టులో ఉండే అన్ని అర్హతలు ఉన్నాయని అన్నాడు. శ్రేయస్ ఇటీవలి కాలంలో అద్భుతంగా ఆడుతూ ఒత్తిడిలోనూ పరుగులు చేస్తున్నాడని.. జట్టు అవసరాల దృష్ట్యా తగు రీతిలో ఆడుతూ బాధ్యతగా వ్యవహరిస్తున్నాడని తెలిపాడు.తనే భారత సెలెక్టర్‌ను అయితే ఈ పరిస్థితుల్లో శ్రేయస్‌కు తప్పక అవకాశం ఇచ్చే వాడినని అన్నాడు. జట్టులోకి తీసుకొని శ్రేయస్ ఏం చేశేవాడో చూసే వాడినని తెలిపాడు. దిగ్గజాలు విరాట్, రోహిత్, అశ్విన్‌ల రిటైర్మెంట్ తర్వాత ఇంగ్లండ్‌లో టీమిండియా విజయావకాశాలపై స్పందిస్తూ.. ఈ జట్టుతో భారత తప్పక గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. బాగా బ్యాటింగ్ చేసి, బుమ్రాను ఫిట్‌గా ఉంచుకోగలిగితే ఇంగ్లండ్‌లో భారత్‌కు తిరుగుండదని అభిప్రాయపడ్డాడు. 2020-21 ఆసీస్ పర్యటనలో విరాట్, రోహిత్ లేకుండానే యువ ఆటగాళ్లతో నిండిన టీమిండియా విజయం సాధించిన విషయాన్ని గుర్తు చేశాడు.ఇంగ్లండ్ పర్యటనకు శ్రేయస్‌ను ఎంపిక చేయకపోవడంపై చాలా మంది మాజీ క్రికెటర్లు భారత సెలెక్టర్లను టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఈ జాబితాలో సౌరవ్ గంగూలీ కూడా చేరాడు. గత ఏడాది కాలంగా విశేషంగా రాణిస్తున్న శ్రేయస్‌ను భారత టెస్ట్ జట్టుకు ఎంపిక చేయకపోవడం అన్యాయమని గంగూలీ అభిప్రాయపడ్డాడు. శ్రేయస్ లేని లోటు ఇంగ్లండ్ పర్యటనలో స్పష్టంగా కనిపించే అవకాశముందని తెలిపాడు.కాగా, ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత సెలెక్టర్లు కొద్ది రోజుల కిందటే జట్టును ప్రకటించారు. ప్రస్తుతం భారత జట్టు ఇంగ్లండ్‌లో ల్యాండై సాధన మొదలుపెట్టింది. జూన్ 20 నుంచి టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌తో శుభ్‌మన్ గిల్ భారత కెప్టెన్‌గా పరిచయమవుతాడు. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
ధోని అందుకున్న అత్యుత్తమ పురస్కారాలు ఇవే..!
క్రికెట్‌కు అందించిన విశేష సేవలకు గానూ టీమిండియా దిగ్గజ ఆటగాడు ఎంఎస్ ధోనిని ఐసీసీ తాజాగా హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చేర్చిన విషయం తెలిసిందే. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్‌గా ధోని రికార్డుల్లోకెక్కాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా ధోని భారత క్రికెట్‌కు ఎంతో చేశాడు.బ్యాటర్‌గా 17000కు పైగా పరుగులు, వికెట్ కీపర్‌గా 824 మందిని ఔట్ చేయడంతో భాగం కావడంతో పాటు టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ (2007), వన్డే వరల్డ్‌కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపాడు. ప్రపంచ క్రికెట్లో మూడు ఐసీసీ ట్రోఫీలు గెలిచిన కెప్టెన్ ధోని ఒక్కడే.క్రికెట్లో అత్యున్నత శిఖరాలను అధిరోహించిన ధోనికి తాజాగా లభించిన ఐసీసీ అత్యున్నత హాల్ ఆఫ్ ఫేమ్ పురస్కారంతో పాటు ఎన్నో పురస్కారాలు లభించాయి. పురస్కారాల విషయంలో ధోని ప్రస్తానం ఎంటీవీ యూత్ ఐకాన్‌తో మొదలైంది. అప్పుడ్పుడే అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టిన ధోనిని 2006లో ఎంటీవీ యూత్ ఐకాన్ పురస్కారంతో సత్కరించింది. కెరీర్ తొలినాళ్లలో ధోని పొడవాటి జులపాలతో యూత్‌ను తెగ ఆకర్శించాడు. అప్పట్లో ధోని క్రేజ్ వేరే లెవెల్లో ఉండేది. ఇందుకే ఎంటీవీ ధోనిని యూత్ ఐకాన్‌గా నామినేట్ చేసింది.ధోనికి తొలి ప్రతిష్టాత్మక అవార్డు 2008లో లభించింది. అప్పటికే టీమిండియాను టీ20 ఛాంపియన్‌గా నిలిపిన ధోనికి ఆ ఏడాది మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న పురస్కారం లభించింది. భారత ప్రభుత్వం ధోనిని ఈ అవార్డును నామినేట్ చేసింది.అదే ఏడాది (2008) ధోని తొలిసారి ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ఆ మరుసటి ఏడాది కూడా వన్డేల్లో పరుగుల వరద పారించినందుకు గానూ ధోనికి మరోసారి ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు లభించింది. 2009లో భారత ప్రభుత్వం ధోనికి పద్మశ్రీ అవార్డు ప్రకటించింది. 2011లో ధోనికి భారత సైన్యంలో లెఫ్ట్‌నెంట్ కల్నల్ హోదా లభించింది. అదే ఏడాది సీఎన్ఎన్-న్యూస్ 18 ఇండియన్ ఆఫ్ ద ఇయర్, క్యాస్ట్రాల్ ఇండియన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు లభించాయి. 2011-2020 దశాబ్దానికి గానూ ధోనికి ఐసీసీ స్పిరిట్ ఆఫ్ ద క్రికెట్ అవార్డు లభించింది.2018లో ధోని భారత దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు. తాజాగా ధోనిని ఐసీసీ తమ అత్యున్నత పురస్కారమైన హాల్ ఆఫ్ ఫేమ్‌తో సత్కరించింది. ఇవే కాకుండా ధోని కెరీర్లో ఎన్నో ప్రైవేట్ పురస్కారాలు అందుకున్నాడు. 43 ఏళ్ల ధోని 2020లో అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికి, ప్రస్తుతం ఐపీఎల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. -
టీమిండియా జాక్‌పాట్.. పాపం పాకిస్థాన్!
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) విజేత ఎవరో తేలిపోయే సమయం ఆసన్నమైంది. లండన్‌లోని లార్డ్స్ మైదానంలో బుధవారం నుంచి డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో నిలిచిన ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా టైటిల్ కోసం బరిలోకి దిగనున్నాయి. గత రెండు ఎడిషన్లతో పోలిస్తే ఈసారి విజేతకు రెండింతల ఎక్కువ ప్రైజ్‌మనీ దక్కుతుంది. టెస్ట్ క్రికెట్‌కు పూర్వవైభవం తెచ్చేందుకు ప్రైజ్‌మనీని భారీగా పెంచింది ఐసీసీ.డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచే జట్టుకు ఈసారి 3.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 30.8 కోట్లు) ప్రైజ్‌మనీ సొంతమవుతుంది. రన్నరప్‌కు 2.1 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 17.9 కోట్లు) నగదు బహుమతి అందుతుంది. హ్యాట్రిక్ ఫైనల్ మిస్సయి 3వ స్థానంలో నిలిచిన టీమిండియా కూడా భారీగానే ప్రైజ్‌మనీ అందుకోబోతోంది. మూడో స్థానంలో నిలిచినప్పటికీ గత రెండు ఎడిషన్ల విజేతల కంటే ఎక్కువ సొమ్మును భారత్ దక్కించుకోబోంది. 1.44 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 12.34 కోట్లు) నగదు బహుమతి పొందనుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్‌కు 1.2 మిలియన్ డాలర్ల (దాదాపు రూ. 10.26 కోట్లు) ప్రైజ్‌మనీ వస్తుంది.పాపం పాకిస్థాన్!పాకిస్థాన్ క్రికెట్ జట్టు పరిస్థితి రానురాను మరింత దయనీయంగా తయారవుతోంది. డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025లో పాక్ టీమ్ చివరి స్థానంతో సరిపెట్టుకుంది. దీంతో బంగ్లాదేశ్, వెస్టిండీస్ కన్నా తక్కువ మొత్తం ఆ జట్టుకు దక్కుతుంది. బంగ్లాదేశ్ 7.2 లక్షల డాలర్లు (దాదాపు రూ. 6.16 కోట్లు), వెస్టిండీస్ 6.1 లక్షల డాలర్లు (సుమారు రూ. 5.21 కోట్లు) నగదు బహుమతిగా అందుకోనున్నాయి. పాకిస్థాన్‌కు దాదాపు 4.1 కోట్ల రూపాయల (4.8 లక్షల డాలర్లు) నగదు మాత్రమే దక్కనుంది. పాయింట్ల పట్టికలో బంగ్లాదేశ్ 7, వెస్టిండీస్ 8 స్థానాల్లో నిలవగా, పాకిస్థాన్ చివరిదైన 9వ స్థానంలో ఉంది.డబ్ల్యూటీసీ సైకిల్ 2023-2025 పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్, శ్రీలంక ఐదారు స్థానాల్లో నిలిచాయి. ఇంగ్లండ్ 9.6 లక్షల డాలర్లు (సుమారు రూ. 8.21 కోట్లు), శ్రీలంక 8.4 లక్షల డాలర్లు (దాదాపు రూ. 7.18 కోట్లు) నగదు బహుమతి అందుకుంటాయి. కాగా, 2019-21లో న్యూజిలాండ్, 2021-23లో ఆస్ట్రేలియా డబ్ల్యూటీసీ టైటిల్ గెలిచిన సంగతి తెలిసిందే. ఈ రెండు జట్లు ఇండియాపైనే గెలవడం గమనార్హం.డబ్ల్యూటీసీ 2025 ప్రైజ్‌మనీ వివరాలు1. విజేత: రూ. 30.8 కోట్లు2. రన్నరప్: రూ. 17.9 కోట్లు3. ఇండియా: రూ. 12.34 కోట్లు4. న్యూజిలాండ్: రూ. 10.26 కోట్లు5. ఇంగ్లండ్: రూ. 8.21 కోట్లు6. శ్రీలంక: రూ. 7.18 కోట్లు7. బంగ్లాదేశ్: రూ. 6.16 కోట్లు8. వెస్టిండీస్: రూ. 5.21 కోట్లు9. పాకిస్థాన్: రూ.4.1 కోట్లుచదవండి: అమ్మకానికి ఆర్సీబీ..?, ఆందోళనలో ఫ్యాన్స్.. -
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు.. ధోని ఏమన్నాడో చూడండి..!
2025 సంవత్సరానికి గానూ ఐసీసీ ప్రకటించిన ఏడుగురు హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో టీమిండియా దిగ్గజ కెప్టెన్ ఎంఎస్ ధోనికి చోటు లభించింది. టీమిండియాను టీ20 వరల్డ్‌కప్ (2007), వన్ వరల్డ్‌కప్ (2011), ఛాంపియన్స్ ట్రోఫీ (2013) విజేతగా నిలిపిన ధోనిని ఐసీసీ సముచిత రీతిలో గౌరవించింది. ధోని అంతర్జాతీయ క్రికెట్లో 17000కు పైగా పరుగులు (90 టెస్టుల్లో 4876 పరుగులు, 350 వన్డేల్లో 10773 పరుగులు, 98 టి20ల్లో 1617 పరుగులు) సాధించి, టీమిండియా అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా చలామణి అయ్యాడు. వికెట్ కీపర్‌గా ధోని 824 మందిని ఔట్ చేయడంలో భాగస్వామిగా ఉన్నాడు.ఈ ఏడాదికి గానూ ధోనితో పాటు గ్రేమ్ స్మిత్ (సౌతాఫ్రికా), హాషిమ్ ఆమ్లా (సౌతాఫ్రికా), మాథ్యూ హేడెన్ (ఆస్ట్రేలియా), డేనియెల్ వెటోరి (న్యూజిలాండ్), సారా టేలర్ (మహిళా క్రికెటర్, ఇంగ్లండ్), సనా మీర్ (మహిళా క్రికెటర్, పాకిస్తాన్) హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. క్రికెట్‌కు విశేష సేవలందించిన ఆటగాళ్లకు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమర్ల జాబితాలో చోటు కల్పిస్తుంది. ఈ ప్రోగ్రాంను తొలిసారి 2009లో ప్రారంభించారు. హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇప్పటివరకు 122 మంది క్రికెటర్లుకు చోటు లభించింది.హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు దక్కించుకున్న 11వ భారత క్రికెటర్‌గా ధోని రికార్డుల్లోకెక్కాడు. అతనికి ముందు సునీల్ గవాస్కర్, బిషన్ సింగ్ బేడి, కపిల్ దేవ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రవిడ్, సచిన్ టెండూల్కర్, వినూ మన్కడ్, డయాన్ ఎడుల్జీ, వీరేంద్ర సెహ్వాగ్, నీతు డేవిడ్ ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.ప్రతిష్టాత్మక హాల్ ఆఫ్ ఫేమ్ జాబితాలో చోటు దక్కడంపై ధోని ఇలా స్పందించాడు. ప్రపంచ క్రికెట్లో ఆటగాళ్లు చేసిన సేవలకు గుర్తింపుగా భావించే ఐసీసీ ‘హాల్ ఆఫ్ ఫేమ్’లో చోటు దక్కడం పెద్ద గౌరవంగా భావిస్తున్నా. దిగ్గజాల సరసన నా పేరు కూడా చేరడం గొప్ప అనుభూతి. ఇది చిరస్మరణీయమని అన్నాడు. -
స్టేడియం పైకప్పు బద్దలు కొట్టిన పంత్.. వైరల్ వీడియో
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత సీనియర్ క్రికెట్ జట్టు ఇంగ్లండ్‌లో పర్యటిస్తుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ జూన్ 20న లీడ్స్‌లోని హెడింగ్లేలో ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్ జూన్ 13 నుంచి 16 వరకు కెంట్ కౌంటీ క్రికెట్ గ్రౌండ్లో ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది. ప్రతిష్టాత్మకమైన ఈ సిరీస్ కోసం భారత్ రెండు వారాల ముందే ఇంగ్లండ్‌లో వాలిపోయింది. ప్రస్తుతం టీమిండియా లార్డ్స్ క్రికెట్ మైదానంలో కఠోరమైన సాధన చేస్తుంది.- PANT BROKE THE ROOF WITH A SIX...!!!🔥 [Espn Cricinfo]- RISHABH PANT IS GEARING UP FOR THE TEST SERIES AGAINST ENGLAND.- RISHABH PANT IS IN GREAT TOUCH WITH BAT, GUD TO SEE HIM.#Rishabhpant#ENGvsIND#rinkusingh#RohitSharma#INDvsAUS#WTCFinalpic.twitter.com/t3dRuyeMGg— Nitesh Prajapati (@itsmenitesh004) June 9, 2025ఇందులో భాగంగా తాజాగా జరిగిన ఓ ప్రాక్టీస్ సెషన్లో టీమిండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ ఓ భారీ సిక్సర్ బాది వార్తల్లోకెక్కాడు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో పంత్ కొట్టిన ఓ సిక్సర్ స్టేడియం పైకప్పును బద్లలు కొట్టింది. దీనికి సంబంధిన వీడియో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోను చూసి పంత్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తమ ఫేవరెట్ ఆటగాడు తిరిగి లయను అందుకున్నాడని ముచ్చటపడిపోతున్నారు.పంత్‌ను ప్రస్తుత ఇంగ్లండ్ సిరీస్ కోసం టీమిండియా వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌లో అతను తొలిసారి భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికైన శుభ్‌మన్ గిల్‌కు డిప్యూటీగా వ్యవహరిస్తాడు. పంత్‌కు ఇంగ్లండ్‌లో మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఇక్కడ అతను 17 మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 32.70 సగటున 556 పరుగులు చేశాడు. పంత్ ఇంగ్లండ్ గడ్డపై చివరి సారి ఆడిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. 2022 పర్యటనలో అతను 111 బంతుల్లో 146 పరుగులు చేశాడు.పేలవ ఫామ్ కొనసాగినా..!పంత్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో పేలవ ప్రద్శనలు చేశాడు. 13 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 269 పరుగులు మాత్రమే చేశాడు. సీజన్ ఆధ్యాంతం పేలవ ఫామ్‌లో కొనసాగిన పంత్.. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో చెలరేగిపోయాడు. ఆర్సీబీతో జరిగిన ఆ మ్యాచ్‌లో పంత్ విధ్వంసకర శతకంతో (61 బంతుల్లో 118 నాటౌట్) విరుచుకుపడ్డాడు. అయినా ఆ మ్యాచ్‌లో పంత్ జట్టు ఎల్ఎస్జీ ఓటమిపాలైంది. జితేశ్ శర్మ ఊహకందని మెరుపు ఇన్నింగ్స్ ఆడి ఆర్సీబీని గెలిపించాడు. ఈ సీజన్‌కు ముందు ఎల్ఎస్జీ పంత్‌ను రికార్డు ధర రూ. 27 కోట్లకు సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా పంత్ చరిత్ర సృష్టించాడు. ఇంత డబ్బుపోసి కొనుక్కునా ఈ సీజన్లో పంత్ దారుణంగా నిరాశపరిచాడు. కెప్టెన్‌గా, ఆటగాడిగా తేలిపోయాడు. సీజన్ ఆరంభంలో టైటిల్ ఫేవరెట్‌గా కనిపించిన లక్నో చివరి వచ్చే సరికి ఏడో స్థానంతో సీజన్‌ను ముగించింది. ఇంగ్లండ్ పర్యటనలోనైనా పంత్ స్థాయికి తగ్గట్టు రాణించాలని కోరుకుందాం. -
టీమిండియా షెడ్యూల్.. బీసీసీఐ నుంచి కీలక అప్డేట్
ఈ ఏడాది చివర్లో ప్రారంభం కాబోయే టీమిండియా హోం సీజన్లో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. భారత సీనియర్ పురుషుల జట్టు.. వెస్టిండీస్, సౌతాఫ్రికాతో ఆడబోయే టెస్ట్ మ్యాచ్‌ల వేదికలు మారాయి. అలాగే భారత సీనియర్ మహిళల జట్టు ఆస్ట్రేలియాతో ఆడబోయే వన్డే సిరీస్ వేదికలు.. సౌతాఫ్రికా-ఏ జట్టు భారత-ఏ జట్టుతో ఆడబోయే వన్డే మ్యాచ్‌ల వేదికలు కూడా మారాయి. వేదికల మార్పు అంశాన్ని బీసీసీఐ ఇవాళ (జూన్ 9) అధికారికంగా ప్రకటించింది.🚨 NEWS 🚨BCCI announces updated venues for Team India (International home season) & South Africa A Tour of India.Details 🔽 #TeamIndia | @IDFCFIRSTBank https://t.co/vaXuFZQDRA— BCCI (@BCCI) June 9, 2025భారత సీనియర్ పురుషుల క్రికెట్ జట్టు ఈ ఏడాది అక్టోబర్ 10 నుంచి 14 తేదీ వరకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వేదికను ఈడెన్ గార్డన్స్ నుంచి న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది. వేదిక మారినా మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగుతుంది.నవంబర్ 14 నుంచి 18 వరకు టీమిండియా, సౌతాఫ్రికా మధ్య న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగాల్సిన తొలి టెస్ట్ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డన్స్కు మార్చడం జరిగింది. వేదిక మారినా ఈ మ్యాచ్ అదే తేదీల్లో యధాతథంగా జరుగనుంది. నవంబర్ నెలలో ఢిల్లీలో వాయు కాలుష్యం అధికంగా ఉండటంతో వేదిక మార్చినట్లు బీసీసీఐ చెప్పుకొచ్చింది.భారత సీనియర్ మహిళల జట్టు సెప్టెంబర్ 14, 17, 20 తేదీల్లో చెన్నైలోని చిదంబరం స్టేడియంలో ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే చిదంబరం స్టేడియంలో ఔట్ ఫీల్డ్, పిచ్‌కు సంబంధించి మరమ్మత్తు పనులు జరుగుతుండటంతో తొలి రెండు వన్డేను న్యూ ఛండీఘడ్‌లోని పీసీఏ స్టేడియంకు, చివరి వన్డేను న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంకు మార్చడం జరిగింది.సౌతాఫ్రికా పురుషుల ఏ టీమ్ నవంబర్ 13, 16, 19 తేదీల్లో భారత ఏ జట్టుతో బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉండింది. అయితే ఈ సిరీస్ వేదికను చిన్నస్వామి స్టేడియం నుంచి రాజ్‌కోట్‌లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంకు మార్చారు. -
అశ్విన్.. నీ స్థాయికి ఇది తగునా.. మహిళతో అలా ఎలా ప్రవర్తిస్తావు..?
తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ తన స్థాయిని మరిచి ప్రవర్తించాడు. తనను ఎల్బీడబ్ల్యూగా ప్రకటించినందుకు ఓ మహిళా అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అశ్విన్ దురుసు ప్రవర్తనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. ఈ వీడియో చూసి అభిమానులు అశ్విన్‌పై మండిపడుతున్నారు. నీ స్థాయికిది తగునా అంటూ కామెంట్లు చేస్తున్నారు.వివరాల్లోకి వెళితే.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్‌లో అశ్విన్ దిండిగల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. లీగ్‌లో భాగంగా నిన్న (జూన్ 8) దిండుగల్ డ్రాగన్స్, ఐడ్రీమ్ తిరుప్పుర్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో అశ్విన్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. సాయి కిషోర్ వేసిన ఇన్నింగ్స్ ఐదో ఓవర్ చివరి బంతికి అశ్విన్ స్వీప్ షాట్ ఆడబోయి మిస్ అయ్యాడు. బంతి వికెట్ల ముందు అశ్విన్ ప్యాడ్లకు తాకింది. Ash அண்ணா Not Happy அண்ணாச்சி! 😶🌫📺 தொடர்ந்து காணுங்கள் | TNPL 2025 | iDream Tiruppur Tamizhans vs Dindigul Dragons | Star Sports தமிழில் #TNPLOnJioStar #TNPL #TNPL2025 pic.twitter.com/Csc2ldnRS3— Star Sports Tamil (@StarSportsTamil) June 8, 2025దీంతో సాయి కిషోర్ ఎల్బీడబ్ల్యూకు అప్పీల్ చేశాడు. అక్కడే ఉన్న మహిళా అంపైర్ మారు ఆలోచించకుండా అశ్విన్‌ను ఔట్‌గా ప్రకటించింది. దీంతో అశ్విన్ పట్టరాని కోపంతో ఊగిపోతూ అంపైర్‌తో వాగ్వాదానికి దిగాడు. అంపైర్ పట్టించుకోకపోవడంతో అశ్విన్ అసహనంతో బ్యాట్‌ను తన ప్యాడ్‌కు కొట్టుకుంటూ పెవిలియన్ బాట పట్టాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ 11 బంతుల్లో 2 ఫోర్లు, సిక్సర్ సాయంతో 18 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్‌లో అశ్విన్ జట్టు దిండిగుల్ 9 వికెట్ల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగుల్.. ఎసక్కిముత్తు (4-0-26-4), మతివణ్ణన్ (2.2-0-12-3), సాయి కిషోర్ (4-0-10-2) చెలరేగడంతో 16.2 ఓవర్లలో 93 పరుగులకు ఆలౌటైంది. అనంతరం స్వల్ప ఛేదనకు దిగిన తిరుప్పుర్.. తుషార్ రహేజా (39 బంతుల్లో 65; 6 ఫోర్లు, 5 సిక్సర్లు) అజేయ మెరుపు అర్ద సెంచరీతో చెలరేగడంతో 11.5 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి విజయతీరాలకు చేరింది. -
ఘనంగా రింకూ సింగ్ ఎంగేజ్మెంట్.. మాజీ సీఎం సహా ప్రముఖులు హాజరు
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ ఎంగేజ్మెంట్ ఇవాళ (జూన్ 8) లక్నోలోని ద సెంట్రమ్ ఫైవ్ స్టార్ హోటల్లో ఘనంగా జరిగింది. రింకూ సమాజ్‌వాది పార్టీ ఎంపీ (లోక్‌సభ) ప్రియా సరోజ్‌ను నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇవాళ మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో రింకూ, సరోజ్ నిశ్చితార్థం రింగులు మార్చుకున్నారు. ఈ వేడుకకు రింకూ, సరోజ్ కుటుంబ సభ్యులతో పాటు క్రికెట్, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు.Rinku Singh got engaged with Priya Saroj. 💍 ❤️- Congratulations to both of them. pic.twitter.com/hj8aAslurI— Johns. (@CricCrazyJohns) June 8, 2025తెలుపు, పింక్ కలర్ ఔట్ ఫిట్లలో రింకూ, సరోజ్ జోడీ చూడముచ్చటగా ఉంది. ఈ వేడుకకు యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, అతని భార్య డింపుల్ యాదవ్, బిగ్‌బీ సతీమణి, సమాజ్‌వాది పార్టీ ఎంపీ జయా బచ్చన్, సమాజ్‌వాది పార్టీ సీనియర్ లీడర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్ యాదవ్, ఇక్రా హసన్ (సరోజ్ క్లోజ్ ఫ్రెండ్), బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా, ఉత్తర్‌ప్రదేశ్ మాజీ క్రికెటర్లు ప్రవీణ్ కుమార్, పియుశ్ చావ్లా, ఉత్తర్‌ప్రదేశ్ రంజీ జట్టు కెప్టెన్ ఆర్యన్ జుయల్ తదితరులు హాజరయ్యారు. వేడుక అనంతరం అతిథులకు దేశీయ విందుతో పాటు యురోపియన్ వంటాలను వడ్డించారు. ఎంగేజ్మెంట్ వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతుంది. 27 ఏళ్ల రింకూ ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2025 సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. ఈ సీజన్లో అతను 29.42 సగటున, 153.73 స్ట్రయిక్‌రేట్‌తో 206 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహించిన కేకేఆర్ పాయింట్ల పట్టికలో చివరి నుంచి మూడో స్థానంలో నిలిచింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం ఐదింట మాత్రమే గెలుపొందింది. రింకూ అంతర్జాతీయ కెరీర్ విషయానికొస్తే.. భారత్ తరఫున 33 టీ20లు, రెండు వన్డేలు ఆడాడు. ఇందులో 3 అర్ద సెంచరీల సాయంతో 601 పరుగులు చేశాడు.సరోజ్ విషయానికొస్తే.. 26 ఏళ్ల సరోజ్ ప్రస్తుతం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మచ్లిషెహర్ లోక్‌సభ స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు. 2024 జనరల్ ఎలెక్షన్స్‌లో ప్రియా సిట్టింగ్ బీజేపీ ఎంపీ బీపీ సరోజ్‌పై 35000 ఓట్ల తేడాతో గెలుపొందింది. ప్రియాకు ఇవే తొలి ఎన్నికలు.వారణాసికి చెందిన సరోజ్ పాలిటిక్స్‌లోకి రాక ముందు 'లా'లో బ్యాచ్‌లర్ డిగ్రీ పొందారు. సరోజ్ తన ఉన్నత చదువులను ఢిల్లీలో పూర్తి చేశారు. సరోజ్ తండ్రి తూఫానీ సరోజ్ మూడు సార్లు ఎంపీగా పని చేశారు. ప్రస్తుతం అతను జౌన్పూర్ జిల్లాలోని కేరాకట్ అసెంబ్లీ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. -
ఇంగ్లండ్ చేరుకున్న టీమిండియా
లండన్: భారత క్రికెట్ జట్టు శనివారం ఉదయం ఇంగ్లండ్ చేరుకుంది. పూర్తిస్థాయి పర్యటనలో భాగంగా ముందుగా ఐదు టెస్టుల ద్వైపాక్షిక సిరీస్‌లో పాల్గొంటుంది. 2025–27 కొత్త ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ)లో భారత్–ఇంగ్లండ్ సిరీస్ భాగమవుతుంది. భారత స్టార్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిలు సంప్రదాయ ఫార్మాట్‌కు రిటైర్మెంట్ పలకడంతో కొత్త కెప్టెన్ శుబ్‌మన్ గిల్ సారథ్యంలో యువ జట్టు ఇంగ్లండ్ గడ్డపై సత్తా చాటుకునేందుకు తహతహలాడుతోంది. నిజానికి ఇదివరకే పలువురు భారత క్రికెటర్లు ఇంగ్లండ్‌లో ఆడుగు పెట్టారు. ఇంగ్లండ్ లయన్స్‌తో అనధికారిక టెస్టులు ఆడుతున్నారు. ఐపీఎల్ ఫైనల్ ముగియడంతో మిగతా ఆటగాళ్లతో కూడిన బృందం తాజాగా వచ్చింది. ‘భారత జట్టులో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా సంప్రదాయ టెస్టు సిరీస్ ఆడేందుకు ఇంగ్లండ్‌కు రావడం మంచి అనుభూతినిస్తోంది’ అని సాయిసుదర్శన్ చేసిన వీడియోను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) పోస్ట్ చేసింది.భారత్ ‘ఎ’ 348 ఆలౌట్ నార్తంప్టన్: ఇంగ్లండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 89.3 ఓవర్లలో 348 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ స్కోరు 319/7తో రెండో రోజు శనివారం ఆట ప్రారంభించిన భారత్ ‘ఎ’ జట్టు 6.3 ఓవర్లే ఆడి 29 పరుగులు జోడించింది. అనంతరం తొలి ఇన్నింగ్స్ ఆడేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ లయన్స్ ఆట నిలిచే సమయానికి 46 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. -
శతక్కొట్టిన కేఎల్ రాహుల్.. రాణించిన కరుణ్ నాయర్, జురెల్
ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సహచర టీమిండియా సభ్యుల కంటే ముందుగానే ఇంగ్లండ్‌లో ల్యాండైన కేఎల్ రాహుల్ వచ్చీ రాగానే పని మొదలుపెట్టాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (జూన్ 6) ప్రారంభమైన రెండో అనధికారిక టెస్ట్‌లో అర్ద సెంచరీ పూర్తి చేసి సెంచరీ దిశగా అడుగులు వేస్తున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఓపెనర్‌గా బరిలోకి దిగిన రాహుల్ 151 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. యశస్వి జైస్వాల్‌కు జతగా బరిలోకి దిగిన రాహుల్ ఇన్నింగ్స్ ప్రారంభం నుంచి చాలా సంయమనంతో బ్యాటింగ్ చేశాడు. ఎలాంటి దూకుడైన షాట్లు ఆడకుండా, చెత్త బంతులను మాత్రమే బౌండరీలకు తరలించి ఇన్నింగ్స్‌ను నిర్మించాడు.మరో ఎండ్‌లో జైస్వాల్ (17), కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ (11) తక్కువ స్కోర్లకే ఔటైనా, తొలి అనధికారిక టెస్ట్‌లో డబుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్ సహకారంతో ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. తొలి టెస్ట్ ఫామ్‌నే కొనసాగించిన కరుణ్ ఈ మ్యాచ్‌లో కూడా భారీ స్కోర్ దిశగా సాగుతున్న వేల క్రిస్ వోక్స్ అతనికి అడ్డుకట్ట వేశాడు. వోక్స్ ఓ అద్భుతమైన బంతితో కరుణ్‌ను 40 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఎల్బీడబ్ల్యూ చేశాడు. కరుణ్ ఔటయ్యాక రాహుల్ ధృవ్ జురెల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. తొలి టెస్ట్‌లో రెండు అర్ద సెంచరీలతో సత్తా చాటిన జురెల్.. రాహుల్‌తో కలిసి 50 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. 55 ఓవర్ల అనంతరం భారత్-ఏ స్కోర్ 234/3గా ఉంది. భారత్-ఏ కోల్పోయిన మూడు వికెట్లు క్రిస్ వోక్స్ ఖాతాలనే పడ్డాయి. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ లయన్స్ టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకుంది.పాపం సర్ఫరాజ్ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్‌కు అవకాశం ఇచ్చేందుకు గత మ్యాచ్‌లో సత్తా చాటిన సర్ఫరాజ్ ఖాన్‌ను తప్పించారు. సర్ఫరాజ్ తొలి అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో 92 పరుగులు చేశాడు. రాహుల్ ఓపెనర్‌గా రావడంతో కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ మూడో స్థానానికి డిమోట్ అయ్యాడు. బౌలింగ్ డిపార్ట్మెంట్లోనూ ఓ కీలక మార్పు జరిగింది. తొలి మ్యాచ్‌లో 3 వికెట్లతో రాణించిన ముకేశ్ కుమార్ స్థానంలో ఖలీల్ అహ్మద్‌ను బరిలోకి దించారు. అలాగే హర్ష్ దూబే స్థానంలో తనుశ్ కోటియన్ తుది జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ కోసం భారత-ఏ జట్టు..యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, తనుశ్ కోటియన్, అన్షుల్ కంబోజ్, తుషార్ దేశ్‌పాండే, ఖలీల్ అహ్మద్ -
రిటైర్మెంట్ ప్రకటించిన ఐపీఎల్ దిగ్గజం
ఐపీఎల్ దిగ్గజ బౌలర్ పియూశ్ చావ్లా క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు ఇవాళ (జూన్ 6) వెల్లడించాడు. అంతర్జాతీయ క్రికెట్‌తో పాటు దేశవాలీ క్రికెట్‌కు కూడా ఇది వర్తిస్తుందని పేర్కొన్నాడు. 36 ఏళ్ల పియూశ్ చావ్లాకు ఐపీఎల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. View this post on Instagram A post shared by Piyush Chawla (@piyushchawla_official_)ఆరంభ సీజన్ నుంచి (2008) క్యాష్ రిచ్ లీగ్ ఆడుతున్న అతను 192 మ్యాచ్‌ల్లో 192 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో సంయుక్తంగా మూడో స్థానంలో ఉన్నాడు. ఐపీఎల్లో చహల్ (221), భువనేశ్వర్ కుమార్ (198) మాత్రమే చావ్లా కంటే ఎక్కువ వికెట్లు తీశారు. సునీల్ నరైన్ చావ్లాతో సమానంగా 192 వికెట్లు తీశాడు.2008లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌తో కెరీర్ ప్రారంభించిన చావ్లా.. ఆతర్వాత కేకేఆర్, సీఎస్కే, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీలకు ప్రాతినిథ్యం వహించాడు. చివరిగా 2024 సీజన్లో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిథ్యం వహించిన చావ్లాను ఈ సీజన్ మెగా వేలంలో ఏ ఫ్రాంచైజీ కొనుగోలు చేయలేదు.రైట్ ఆర్మ్ లెగ్ స్పిన్ బౌలర్ అయిన చావ్లా 2006లో టీమిండియా తరఫున టెస్ట్ అరంగేట్రం చేసి, ఆ ఫార్మాట్లో 3 మ్యాచ్‌లు ఆడి 7 వికెట్లు తీశాడు. ఆ తర్వాత 2007లో వన్డే, 2010లో టీ20 అరంగేట్రం చేసిన చావ్లా 25 వన్డేల్లో 32 వికెట్లు, 7 టీ20ల్లో 4 వికెట్లు తీశాడు. చావ్లా అంతర్జాతీయ కెరీర్ అంత సుదీర్ఘంగా సాగనప్పటికీ.. భారత్ గెలిచిన రెండు వరల్డ్‌కప్ టోర్నీల్లో భాగంగా ఉన్నాడు. చావ్లా 2007 టీ20 వరల్డ్‌కప్, 2011 వన్డే వరల్డ్‌కప్ గెలిచిన భారత జట్లలో సభ్యుడిగా ఉన్నాడు.ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జన్మించిన చావ్లా.. సొంత రాష్ట్రం తరఫున 2008-2013 వరకు దేశవాలీ క్రికెట్ ఆడాడు. ప్రస్తుతం అతను గుజరాత్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. చావ్లాకు ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనూ ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఇందులో 137 మ్యాచ్‌లు ఆడిన చావ్లా మూడు 10 వికెట్ల ప్రదర్శనలు, 23 ఐదు వికెట్ల ప్రదర్శనల సాయంతో 446 వికెట్లు తీశాడు. దేశవాలీ క్రికెట్లో చావ్లా బ్యాటర్‌గానూ రాణించాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో అతని పేరు మీద 6 సెంచరీలు, 36 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
ఆల్‌ది బెస్ట్ టీమిండియా.. ఇంగ్లండ్‌కు పయనమైన గిల్ సేన (ఫోటోలు)
-
ఇంగ్లండ్ పర్యటనకు ముందు టీమిండియాకు సంబంధించి కీలక అప్డేట్
భారత టెస్ట్ జట్టు పూర్తి స్థాయి కెప్టెన్ హోదాలో శుభ్‌మన్ గిల్ తొలిసారి మీడియా ముందుకు రానున్నాడు. ఇవాళ (జూన్ 5) సాయంత్రం 7:30 గంటలకు ముంబైలోని బీసీసీఐ హెడ్ క్వార్టర్స్‌లో జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్‌ను హాజరు కానున్నాడు. ఈ సమావేశానికి గిల్‌తో పాటు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ హాజరవుతాడు.భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన నేపథ్యంలో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరుగనుంది. ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా త్వరలోనే లండన్‌కు బయల్దేరుతుంది. ఈ సమావేశంలో గిల్, గంభీర్ ఇంగ్లండ్‌లో అనుసరించబోయే వ్యూహాలు, తదుపరి డబ్ల్యూటీసీ సైకిల్లో ప్రణాళికల గురించి మీడియాకు వివరిస్తారు. దిగ్గజ ఆటగాళ్లు రోహిత్, విరాట్, అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక జరుగనున్న సిరీస్ కావడంతో ఇంగ్లండ్ టూర్‌కు ప్రాధాన్యత సంతరించుకుంది. గిల్ ఇటీవలే రోహిత్ శర్మ నుంచి భారత టెస్ట్ జట్టు పగ్గాలు చేపట్టాడు. బుమ్రా, పంత్ లాంటి సీనియర్లు ఉన్నా బీసీసీఐ గిల్‌కే టెస్ట్ కెప్టెన్సీ అప్పగించింది. గిల్ నేతృత్వంలో భారత టెస్ట్ క్రికెట్లో కొత్త శకం మొదలుకానుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన జట్టులో యువకులు, అనుభవజ్ఞులు ఉన్నారు. వీరిని సమన్వయపరుచుకుంటూ గిల్ ఏ మేరకు నెట్టుకు రాగలడో చూడాలి. ఇంగ్లండ్ పర్యటనలో గిల్‌కు డిప్యూటీగా (వైస్ కెప్టెన్) రిషబ్ పంత్‌ను నియమించారు.ఇంగ్లండ్ పర్యటనలో భారత్ జూన్ 20న తొలి టెస్ట్ ఆడనుంది. లీడ్స్ వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. అనంతరం జులై 2, 10, 23, 31 తేదీల్లో రెండు, మూడు, నాలుగు, ఐదు టెస్ట్ మ్యాచ్‌లు బర్మింగ్హమ్, లార్డ్స్, మాంచెస్టర్, కెన్నింగ్స్టన్ ఓవల్ వేదికలుగా జరుగనున్నాయి. ఈ సిరీస్‌కు ముందు భారత్ జూన్ 13-16 మధ్యలో ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడనుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపికైన మెజార్టీ సభ్యులు ఇప్పటికే ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నారు. భారత-ఏ జట్టులో భాగమైన వారు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతున్నారు. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ ఇదివరకే ముగిసింది. రెండో మ్యాచ్ రేపటి నుంచి ప్రారంభం కానుంది.ఇంగ్లండ్ పర్యటన కోసం భారత టెస్ట్ జట్టు: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, అభిమన్యు ఈశ్వరన్, కరుణ్ నాయర్, నితీష్ రెడ్డి, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురెల్ , వాషింగ్టన్ సుందర్, శార్దూల ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాష్ దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ -
సంజూ శాంసన్ ఉదారత
టీమిండియా ఆటగాడు సంజూ శాంసన్ ఉదారత చాటుకున్నాడు. తన ఫౌండేషన్ (SSF) తరఫున రానున్న విద్యా సంవత్సరం కోసం 100 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్‌లు, బూట్లు డొనేట్ చేశాడు. తన తల్లి లిజి శాంసన్ ఆథ్వర్యంలో ఓ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసి విద్యార్థులకు స్కూల్ సామాగ్రిని ప్రదానం చేయించాడు. పేద విద్యార్థుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సంజూ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని క్రికెట్ అభిమానులు అభినందిస్తున్నారు. సంజూ గతంలో కూడా తన ఫౌండేషన్ తరఫున చాలా సేవా కార్యక్రమాలు చేపట్టాడు. 🚨 A LOVELY GESTURE BY SANJU SAMSON 🚨- Sanju Samson Foundation has donated school bags & shoes to 100 students as they start their new academic year. 🫡 pic.twitter.com/o7kMc2zCSM— Johns. (@CricCrazyJohns) June 5, 2025ఇదిలా ఉంటే, సంజూ శాంసన్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సీజన్లో రాయల్స్ పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయింది. ఆ జట్టు 14 మ్యాచ్‌ల్లో కేవలం నాలుగే విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. ఈ సీజన్లో సంజూ వ్యక్తిగతంగానూ ఆకట్టుకోలేకపోయాడు. గాయం కారణంగా చాలా మ్యాచ్‌లకు దూరంగా ఉన్న అతను.. ఆడిన మ్యాచ్‌ల్లోనూ స్థాయికి తగ్గ ప్రదర్శనలు ఇవ్వలేకపోయాడు.ఇంగ్లండ్ పర్యటన కోసం ఎంపిక చేసిన భారత టెస్ట్ జట్టులో సంజూ చోటు దక్కించుకోలేకపోయాడు. యువ వికెట్కీపర్లు రిషబ్ పంత్, ధృవ్ జురెల్, కేఎల్ రాహుల్ ఈ టూర్ కోసం ఎంపిక చేసిన జట్టులో స్థానం సంపాదించారు. పంత్, రాహుల్ జట్టులో పాతుకుపోయిన నేపథ్యంలో సంజూ టెస్ట్ కెరీర్ దాదాపుగా ముగిసిందనే చెప్పుకోవాలి. ఈ కేరళ వికెట్‌కీపర్ బ్యాటర్ కేవలం పరిమిత ఓవర్ల ఫార్మాట్లకు మాత్రమే పరిమితమయ్యాడు. -
నిశ్చితార్థం చేసుకున్న టీమిండియా స్టార్ క్రికెటర్
టీమిండియా స్టార్ క్రికెటర్ కుల్దీప్ యాదవ్ తన చిన్ననాటి స్నేహితురాలు వన్షికతో ఇవాళ (జూన్ 4) నిశ్చితార్థం చేసుకున్నాడు. లక్నోలోని ఓ హోటల్లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. కుల్దీప్-వన్షిక సంప్రదాయ బద్దంగా ఉంగరాలు మార్చుకున్నారు. కాన్పూర్‌లోని శ్యామ్ నగర్ ప్రాంతానికి చెందిన వన్షిక ఎల్ఐసీలో ఉద్యోగం చేస్తుంది. కుల్దీప్-వన్షిక ఎంగేజ్మెంట్కు యూపీకి చెందిన పలువురు క్రికెటర్లు, టీమిండియా విధ్వంసకర బ్యాటర్ రింకూ సింగ్ హాజరయ్యారు. వివాహా తేదీని కుల్దీప్ త్వరలో ప్రకటించనున్నాడు.Kuldeep Yadav gets engaged to his childhood friend Vanshika. (Abhishek Tripathi).- Many congratulations to them. ❤️ pic.twitter.com/fdTncdtYa4— Mufaddal Vohra (@mufaddal_vohra) June 4, 2025కుల్దీప్ తాజాగా ముగిసిన ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిథ్యం వహించాడు. ఈ సీజన్లో ఢిల్లీ ఆరంభంలో అద్బుత విజయాలు సాధించినా, ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. 30 ఏళ్ల కుల్దీప్ ఈ ఐపీఎల్ సీజన్లో 14 మ్యాచ్‌లు ఆడి 7.07 సగటున 15 వికెట్లు తీశాడు. కుల్దీప్ తర్వలో ఇంగ్లండ్‌తో జరుగబోయే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ప్రకటించిన భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఈ సిరీస్ కోసం ఎంపిక చేసిన ఏకైక స్పెషలిస్ట్ స్పిన్నర్ కుల్దీప్ ఒక్కడే. అశ్విన్ టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక కుల్దీప్ భారత టెస్ట్ జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా మారే అవకాశం ఉంది. ఇంగ్లండ్ పర్యటనలో రాణిస్తే అతనికి తిరుగే ఉండదు. కుల్దీప్ పరిమిత ఓవర్ల క్రికెట్లో ఇదివరకే తనను తాను నిరూపించుకున్నాడు. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచిన 2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కుల్దీప్ కీలకంగా వ్యవహరించాడు. -
ఇంగ్లండ్‌కు బయల్దేరిన కేఎల్ రాహుల్
త్వరలో ప్రారంభం కానున్న ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇంగ్లండ్ గడ్డపై అడుగుపెట్టాడు. రాహుల్ నిన్ననే ముంబై నుంచి లండన్‌కు బయల్దేరాడు. రాహుల్ లండన్‌లోని హీథ్రూ విమానాశ్రయంలో ల్యాండైన దృశ్యాలు సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.రాహుల్ ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్ ఆడతాడు. ఈ మ్యాచ్ కోసమే రాహుల్ చాలా ముందుగా లండన్‌లో ల్యాండయ్యాడు. ఈ మ్యాచ్ జూన్ 6న ప్రారంభం కానుంది. నార్తంప్టన్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్ కోసం తనను ముందుగానే ఇంగ్లండ్‌కు పంపాలని రాహుల్ బీసీసీఐకి ప్రత్యేక విజ్ఞప్తి చేశాడు. భారత్‌లో వాతావరణం ప్రాక్టీస్‌కు అనువుగా లేదని, అందుకే తనకు లయన్స్‌తో మ్యాచ్ ఆడే అవకాశం ఇవ్వాలని రాహుల్ బీసీసీఐని కోరాడు. రాహుల్ కోరిక మేరకు బీసీసీఐ అతన్ని ముందుగానే లండన్‌కు పంపింది.ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ముందు భారత్-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ నిన్ననే ముగిసింది. ఈ మ్యాచ్ డ్రా అయ్యింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఆటగాళ్లకు మంచి బ్యాటింగ్ ప్రాక్టీస్ లభించింది. ఇంగ్లండ్ సిరీస్‌కు ఎంపికైన కరుణ్ నాయర్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. తొలి ఇన్నింగ్స్‌లో సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ తృటిలో సెంచరీలు మిస్ అయ్యారు. రెండో ఇన్నింగ్స్‌లో యశస్వి జైస్వాల్, కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్, ధృవ్ జురెల్, నితీశ్ కుమార్ రెడ్డి అర్ద సెంచరీలతో రాణించారు.లయన్స్‌తో రెండో అనధికారిక టెస్ట్ మ్యాచ్ తర్వాత భారత జట్టు ఓ ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతుంది. ఈ మ్యాచ్ జూన్ 13 నుంచి 16 వరకు జరుగుతుంది. అనంతరం జూన్ 20 నుంచి ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభమవుతుంది. ఈ సిరీస్ కోసం శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టు జూన్ 5వ తేదీ తర్వాత లండన్‌కు బయల్దేరుతుంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించడంతో ఈ సిరీస్‌కు ముందే గిల్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. ఈ సిరీస్‌కు ముందే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇంగ్లండ్‌తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, కరుణ్ నాయర్, అభిమన్యు ఈశ్వరన్, యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, ధృవ్ జురెల్, జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, అర్షదీప్ సింగ్, కుల్దీప్ యాదవ్ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ షెడ్యూల్..జూన్ 20-24- తొలి టెస్ట్ (లీడ్స్)జులై 2-6- రెండో టెస్ట్ (బర్మింగ్హమ్)జులై 10-14- మూడో టెస్ట్ (లార్డ్స్)జులై 23-27- నాలుగో టెస్ట్ (మాంచెస్టర్)జులై 31-ఆగస్ట్ 4- ఐదో టెస్ట్ (కెన్నింగ్స్టన్ ఓవల్) -
విరాట్ కోహ్లికి అవమానం.. 18 నంబర్ జెర్సీ మరొకరికి కేటాయింపు
భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకరైన విరాట్ కోహ్లికి అవమానం జరిగింది. టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత విరాట్ జెర్సీ నంబర్ 18ని మరొకరి కేటాయించారు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాడు ముకేశ్ కుమార్ 18 నంబర్ జెర్సీని ధరించి కనిపించాడు. బీసీసీఐ ఏ ఉద్దేశంతో ముకేశ్‌కు ఈ జెర్సీ నంబర్ కేటాయించిందోతెలీదు కానీ, విరాట్ అభిమానులు మాత్రం ఈ విషయమై మండిపడుతున్నారు. ఇది తమ ఆరాధ్య ఆటగాడిని అవమానించినట్లే అని బీసీసీఐని టార్గెట్ చేస్తున్నారు.క్రికెట్లో దిగ్గజ ఆటగాళ్లకు సంబంధించిన జెర్సీ నంబర్లను ఇతరులకు కేటాయించకపోవడం ఆనవాయితీ. అయితే ఈ ఆనవాయితీకి బీసీసీఐ తూట్లు పొడిచింది. విరాట్ విషయంలో మొదటి నుంచి పట్టీపట్టనట్లుండే బీసీసీఐ మరోసారి దిగ్గజ ఆటగాడిని అవమానింది. టెస్ట్‌ల్లో టీమిండియాను తిరుగులేని శక్తిగా నిలబెట్టడంతో విరాట్ కీలకపాత్ర పోషించాడు. అతను కెప్టెన్‌గా ఉన్న సమయంలో భారత్ చాలాకాలం పాటు నంబర్ వన్ జట్టుగా కొనసాగింది. విరాట్ నాయకత్వంలో టీమిండియా అపురూప విజయాలు సాధించింది. వ్యక్తిగతంగానూ విరాట్‌కు టెస్ట్‌ల్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది.అలాంటి విరాట్‌కు టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించాక బీసీసీఐ కనీసం వీడ్కోలు సభ కూడా ఏర్పాటు చేయలేదు. సాధారణంగా దిగ్గజ ప్లేయర్లు అనూహ్యంగా రిటైర్మెంట్ ప్రకటించినా సంబంధిత క్రికెట్ బోర్డులు వారిని గౌరవించుకుంటాయి. అయితే బీసీసీఐ అలాంటి ప్లాన్లు ఏమీ చేయకపోగా.. దిగ్గజ ఆటగాడిని అవమానిస్తుంది. విరాట్ జెర్సీ నంబర్‌ను ఇతరులకు కేటాయించడంపై విశ్వవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా పెదవి విరుస్తున్నారు. భారత క్రికెట్‌కు విరాట్ ఎంతో చేశాడని, అతని జెర్సీని ఇతరులకు కేటాయించకపోవడం కనీస ధర్మమని అంటున్నారు.ఇదిలా ఉంటే, తొలుత టీ20లకు, ఆతర్వాత టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్నాడు. ప్రస్తుతం అతను ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. విరాట్ ప్రాతినిథ్యం వహిస్తున్న ఆర్సీబీ ఈ సీజన్లో ఫైనల్‌కు చేరింది. ఈసారి టైటిల్ సాధించి ఐపీఎల్ కెరీర్‌కు ముగింపు పలకాలని విరాట్ భావిస్తున్నాడు. జూన్ 3న ఐపీఎల్ 2025 ఫైనల్ జరుగుతుంది. ఇవాళ (జూన్ 1) జరిగే క్వాలిఫయర్-2 మ్యాచ్‌లో (ముంబై వర్సెస్ పంజాబ్) విజేతతో ఆర్సీబీ ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటుంది. -
England Tour: డబుల్ సెంచరీకి చేరువలో కరుణ్ నాయర్
ఇంగ్లండ్ లయన్స్‌తో ఇవాళ (మే 30) మొదలైన తొలి నాలుగు రోజుల అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లో భారత-ఏ జట్టు ఆటగాళ్లు కరుణ్ నాయర్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ ఇరగదీశారు. వీరిలో కరుణ్ నాయర్ డబుల్ సెంచరీకి చేరువలో (186 నాటౌట్) ఉండగా.. సర్ఫరాజ్ ఖాన్ (119 బంతుల్లో 92; 13 ఫోర్లు) తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. సర్ఫరాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ (82 నాటౌట్) అర్ద సెంచరీతో ఆకట్టుకున్నాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్-ఏ 3 వికెట్ల నష్టానికి 409 పరుగులు చేసింది.కాంటర్బరీ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత-ఏ టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగింది. భారత జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ అభిమన్యు ఈశ్వరన్ 8 పరుగులకే ఔటయ్యాడు. ఆతర్వాత మరో ఓపెనర్ యశస్వి జైస్వాల్ కరుణ్ నాయర్‌తో కలిసి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో జైస్వాల్ కూడా 24 పరుగుల వద్ద ఔటయ్యాడు.జైస్వాల్ ఔటయ్యాక ఇన్నింగ్స్ నిర్మించే బాధ్యతను కరుణ్ నాయర్ తీసుకున్నాడు. కరుణ్.. సర్ఫరాజ్ సహకారంతో అద్భుతంగా బ్యాటింగ్ చేసి భారత జట్టును గౌరవప్రదమైన స్కోర్ దిశగా తీసుకొచ్చాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఔటయ్యాడు. సర్ఫరాజ్ ఔటయ్యే సమయానికే భారత్ పటిష్ట స్థితిలో ఉంది.సర్ఫారాజ్ ఔటయ్యాక క్రీజ్‌లోకి వచ్చిన ధృవ్ జురెల్ కూడా ఇరగదీశాడు. కరుణ్, జురెల్ ఇద్దరు పోటీపోటీగా ఆడుతూ భారత్‌ను అతి భారీ స్కోర్ దిశగా తీసుకెళ్తున్నారు. -
మరోసారి తండ్రైన టీమిండియా క్రికెటర్
టీమిండియా క్రికెటర్ జయదేవ్ ఉనద్కత్ మరోసారి తండ్రి అయ్యాడు. అతని భార్య రిన్నీ కంతారియా ఈ నెల 18న మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని ఉనద్కత్ ఇవాళ (మే 28) సాయంత్రం సోషల్‌మీడియా వేదికగా వెల్లడించాడు. ఉనద్కత్, రిన్నీ 2021లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2023 డిసెంబర్లో జేడన్ (మగబిడ్డ) జన్మించాడు.👼🏻❤️ pic.twitter.com/Maoc5AbA3h— Jaydev Unadkat (@JUnadkat) May 28, 202533 ఏళ్ల ఉనద్కత్ ఐపీఎల్ 2025లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఆడాడు. ఈ సీజన్లో అతను 7 మ్యాచ్‌ల్లో 11 వికెట్లు తీశాడు. ఈ సీజన్లో సన్‌రైజర్స్ లీగ్ దశలోనే నిష్క్రమించింది. ఉనద్కత్ రంజీల్లో సౌరాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తాడు. ఆ జట్టుకు అతను కెప్టెన్‌గానూ వ్యవహరిస్తున్నాడు. అతని సారథ్యంలో సౌరాష్ట్ర 2020లో రంజీ ట్రోఫీ గెలిచింది. ఇది ఆ జట్టుకు తొలి టైటిల్. 2010లో టీమిండియా అరంగేట్రం చేసిన ఉనద్కత్.. మధ్యలో చాలాకాలం జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 15 ఏళ్లలో అతను టీమిండియా తరఫున 4 టెస్ట్‌లు, 8 వన్డేలు, 10 టీ20లు మాత్రమే ఆడాడు. ఇందులో 26 వికెట్లు తీశాడు. ఐపీఎల్లో ఉనద్కత్‌కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. క్యాష్ రిచ్ లీగ్‌లోనూ 2010లోనే కెరీర్ ప్రారంభించిన ఉనద్కత్.. ఇప్పటివరకు వివిధ ఫ్రాంచైజీల తరఫున 112 మ్యాచ్‌లు ఆడి 110 వికెట్లు తీశాడు. -
సెంచరీలు మీద సెంచరీలు చేసినా..
టాలెంట్ ఒక్కటే ఉంటే సరిపోదు, టైమ్ కూడా కలసిరావాలంటారు పెద్దవాళ్లు. అవును నిజమే.. ఎంత ప్రతిభ ఉన్నా కూడా, లక్ లేకపోతే వెనుబడిపోయే చాన్స్ ఉంది. టాలెంట్‌ను నిరూపించే వేదిక దొరక్కపోతే తెర మరుగు కావడం ఖాయం. అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోతే ఆ బాధ వర్ణణాతీతం. పోటీ ఎక్కువగా ఉండే క్రీడల్లో దేశం తరపున ఆడే అవకాశం దక్కినా బరిలోకి దిగే చాన్స్ రాక చాలా మంది వెలుగులోకి రాలేకపోయారు.క్రికెట్ కెరీర్‌గా ఎంచుకున్న ప్రతి ప్లేయర్ దేశం తరపున ఆడాలని కలలుగంటారు. జాతీయ జట్టులో స్థానమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. బ్లూ క్యాప్, జెర్సీతో బరిలోకి దిగాలని వర్ధమాన భారత క్రికెటర్లు అహరహం శ్రమిస్తుంటారు. కానీ జాతీయ జట్టులో ఆడే అరుదైన అవకాశం కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. చాన్స్ దక్కించున్న వారిలో నిలదొక్కునే వారు అతి కొద్ది మంది మాత్రమే. ఇక జట్టులో చోటు దక్కినా మైదానంలో బరిలోకి దిగే అవకాశం రాని దురదృష్టవంతులూ ఉన్నారు. అలాంటి వారిలో ప్రియాంక్ పంచల్ (Priyank Panchal) ఒకరు.విషయం అర్థమైందిదేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన ప్రియాంక్ పంచల్ టీమిండియా (Team India) తరపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణిస్తున్న బ్యాట్స్‌మెన్‌లో ఒకరైన 35 ఏళ్ల ఈ స్టార్ గుజరాతీ బ్యాటర్.. మూడు ఫార్మాట్లలో ఏ ఒక్కదానిలోనూ భారత జాతీయ జట్టు తరఫున అరంగేట్రం చేయలేకపోయాడు. దీంతో 17 ఏళ్ల క్రికెట్ కెరీర్‌కు తాజాగా వీడ్కోలు పలికాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్టు సోమవారం ప్రకటించాడు. 'టీమిండియాలో ఎప్పటికీ నాకు చోటు దక్కదనే విషయం అర్థమైంది' అంటూ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.చాన్స్ రాలేదుడొమెస్టిక్ సూపర్‌స్టార్‌గా పేరొందిన ప్రియాంక్.. 127 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 45.18 సగటు, 23 సెంచరీలతో 8856 పరుగులు సాధించి సత్తా చాటాడు. దేశీయ క్రికెట్లో అత్యంత నిలకడగా రాణించిన బ్యాటర్లలో ఒకరైన ప్రియాంక్ పేరు పలుమార్లు బీసీసీఐ సెలక్షన్ కమిటీ ముందు వచ్చింది. 2021-22లో దక్షిణాఫ్రికా పర్యటనలో టీమిండియా తరపున అరంగేట్రం చేయడానికి దగ్గరగా వచ్చాడు కానీ బ్లూ క్యాప్ దక్కించులేకపోయాడు. టెస్ట్ సిరీస్‌కు రోహిత్ శర్మ స్థానంలో రిజర్వ్ ఓపెనర్‌గా ఎంపికయ్యాడు కానీ అతడికి ఆడే అవకాశం రాలేదు. 2022లోనూ శ్రీలంక టూర్‌కు సెలెక్ట్ అయినా అరంగ్రేటం చేసే చాన్స్ రాలేదు.టైమ్ ముఖ్యంతనకు జాతీయ జట్టులో ఆడేందుకు రాసిపెట్టి లేదని భావించిన ప్రియాంక్ ఇప్పటి వరకు దేశీయ క్రికెట్లోనే కొనసాగుతూ తానేంటో నిరూపించుకున్నాడు. సెంచరీలు మీద సెంచరీలు చేసినా, టైమ్ కలిసి రాకపోతే తనలాగే అవుతుందని సరిపెట్టుకున్నాడు. 'క్రికెట్లో నిలకడగా ఆడాలి. ఆటగాడిగా మంచి ప్రదర్శన ఇవ్వాలి. సరైన సమయంలో ప్రదర్శన ఇవ్వడం అనేది చాలా ముఖ్యం. అంతర్జాతీయ క్రికెట్లో సమయం చాలా విలువైనది. నిలకడగా 100 తర్వాత 100 పరుగులు చేస్తూనే ఉన్నప్పటికీ.. మీ జట్టు గెలవకపోతే, అది సరైన సమయం కాదు. కానీ 30 పరుగులు చేసినప్పటికీ.. జట్టు గెలిస్తే మీ సహకారం చాలా విలువైనది. అంతర్జాతీయ క్రికెట్‌కు అది అవసరం. దాని నుండి నేను చాలా నేర్చుకున్నాన'ని ప్రియాంక్ పేర్కొన్నాడు.బాధగానే ఉంది.. కానీటీమిండియా తరపున ఆడలేకపోవడం బాధగానే ఉందని ప్రియాంక్ చెప్పాడు. అయితే క్రికెట్ నుంచి తాను ఎంతో నేర్చుకున్నానని తెలిపారు. విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్ వంటి దిగ్గజ ఆటగాళ్లతో డ్రెస్సింగ్ రూం షేర్ చేసుకునే అవకాశం రావడం మామూలు విషయం కాదన్నాడు. రిటైర్మెంట్ గురించి చాలా రోజులుగా ఆలోచన చేస్తున్నానని, ఇప్పుడే సరైన సమయం అని భావించి నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించాడు. చదవండి: ఐపీఎల్ 2025 తర్వాత రిటైర్ కానున్న క్రికెటర్లు వీరేనా?'రిటైర్ అవ్వాలనే ఆలోచన నా మనసులో చాలా కాలంగా ఉంది. ఎందుకంటే, నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు.. టీమిండియాకు ఆడాలన్న ఆకాంక్ష నన్ను నడిపించేంది. క్రమశిక్షణ, అంకిత భావంతో ఆడి జాతీయ జట్టులో చోటు కోసం శాయశక్తులా ప్రయత్నించాను. కానీ అవకాశాలు చేజారాక నేను ఆచరణాత్మకంగా ఆలోచించడం మొదలుపెట్టాను. టీమిండియాలో నాకు ఇక చోటు దక్కదని గ్రహించాను. అందుకే రిటైర్మెంట్ ప్రకటించాన'ని ప్రియాంక్ వివరించాడు. -
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి ఎగబాకిన పాక్ ప్లేయర్
ఐసీసీ తాజాగా విడుదల చేసిన మహిళల టీ20 ర్యాంకింగ్స్‌లో పాకిస్తాన్ బౌలర్ సదియా ఇక్బాల్ అగ్రస్థానానికి ఎగబాకింది. సదియా.. ఇంగ్లండ్ బౌలర్ సోఫీ ఎక్లెస్టోన్‌ను కిందకు దించి టాప్ ప్లేస్‌కు చేరుకుంది. గత వారం ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉండిన సదియా ఓ స్థానం మెరుగుపర్చుకుంది.తాజాగా స్వదేశంలో వెస్టిండీస్‌తో జరిగిన సిరీస్‌లో ఎక్లెస్టోన్ పాల్గొనకపోవడంతో సదియా అగ్రపీఠాన్ని దక్కించుకుంది. సదియా ఖాతాలో 746 రేటింగ్ పాయింట్లు ఉండగా.. ఎక్లెస్టోన్ ఖాతాలో 734 పాయింట్లు ఉన్నాయి. ఎక్లెస్టోన్ మూడు స్థానాలు కోల్పోయి నాలుగో స్థానానికి పడిపోయింది.భారత స్టార్ స్పిన్నర్ దీప్తి శర్మ (737 పాయింట్లు), ఆసీస్ బౌలర్ అన్నాబెల్ సదర్‌ల్యాండ్ తలో స్థానం మెరుగుపర్చుకుని రెండు, మూడు స్థానాలకు ఎగబాకారు. భారత పేసర్ రేణుక సింగ్ ఠాకూర్ ఐదో స్థానాన్ని నిలబెట్టుకుంది.ఇంగ్లండ్ బౌలర్ లారెన్ బెల్ ఏకంగా 13 స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరింది. మరో ఇంగ్లండ్ బౌలర్ చార్లీ డీన్, పాకిస్తాన్ బౌలర్ సష్రా సంధు, ఆస్ట్రేలియా బౌలర్ జార్జియా వేర్హమ్ ఏడు నుంచి తొమ్మిది స్థానాల్లో ఉన్నారు. ఇంగ్లండ్ బౌలర్ సారా గ్లెన్ నాలుగు స్థానాలు కోల్పోయి పదో స్థానానికి పడిపోయింది. భారత బౌలర్లలో రాధా యాదవ్ 16, శ్రేయాంక పాటిల్ 21, పూజా వస్త్రాకర్ 33 స్థానాల్లో ఉన్నారు.బ్యాటర్ల ర్యాంకింగ్స్ విషయానికొస్తే.. బెత్ మూనీ టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకుంది. విండీస్ స్టార్ బ్యాటర్ హేలీ మాథ్యూస్ రెండు స్థానాలు మెరుగుపర్చుకుని నాలుగు నుండి రెండో స్థానానికి చేరింది. ఆసీస్ బ్యాటర్ తహిళ మెక్‌గ్రాత్, టీమిండియా స్టార్ బ్యాటర్ స్మృతి మంధన తలో స్థానం కోల్పోయి మూడు, నాలుగు స్థానాలకు పడిపోయారు. ఇంగ్లండ్ బ్యాటర్ నాట్ సీవర్ బ్రంట్ ఐదు స్థానాలు మెరుగుపర్చుకుని తొమ్మిదో స్థానానికి ఎగబాకింది. ఆల్‌రౌండర్ల విషయానికొస్తే.. హేలీ మాథ్యూస్, అమేలియా కెర్, దీప్తి శర్మ టాప్-3లో కొనసాగుతున్నారు. -
మనమంతా టీమిండియా
న్యూఢిల్లీ: కేంద్రం, రాష్ట్రాలను ‘టీమిండియా’గా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అవి కలసికట్టుగా పని చేస్తే ఏ అభివృద్ధి లక్ష్యమూ అసాధ్యం కాబోదని ధీమా వెలిబుచ్చారు. శనివారం ఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ పాలక మండలి 10వ భేటీకి ఆయన సారథ్యం వహించారు. వికసిత భారత్–2047 థీమ్‌తో భేటీ సాగింది. 31 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, ప్రతినిధులు భేటీలో పాల్గొన్నట్టు నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం వెల్లడించారు. పశ్చిమబెంగాల్, బిహార్, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాలు పాల్గొనలేదని తెలిపారు. ఆపరేషన్ సిందూర్ అనంతరం ముఖ్యమంత్రులతో మోదీ సమావేశమవడం ఇదే తొలిసారి. ప్రతి రాష్ట్రంలో కనీసం ఒక ప్రపంచస్థాయి పర్యాటక కేంద్రం ఏర్పాటయ్యేలా కృషి చేయాలని ఈ సందర్భంగా ప్రధాని సూచించారు. పహల్గాం ఉగ్ర దాడి లక్ష్యాల్లో జమ్మూకశీ్మర్‌లో పర్యాటకాన్ని దెబ్బ తీయడం కూడా ఉన్న నేపథ్యంలో ఈ సూచన ప్రాధాన్యం సంతరించుకుంది. ‘‘ప్రతి గ్రామం, ప్రతి మున్సిపాలిటీ, ప్రతి నగరం, ప్రతి రాష్ట్రమూ ప్రగతి సాధించడమే మన లక్ష్యం కావాలి. అప్పుడు దేశమంతా దానంతటదే వృద్ధి చెందుతుంది. గడువు లోపలే వికసిత భారత్ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఆ దిశగా అభివృద్ధి పనుల వేగం మరింత పెంచుదాం. 140 కోట్ల పైచిలుకు భారతీయుల ఆకాంక్షలను నెరవేరుద్దాం’’ అని రాష్ట్రాలకు ప్రధాని పిలుపునిచ్చారు. భారత్‌లో పట్టణీకరణ శరవేగంగా సాగుతోందని గుర్తు చేశారు. కనుక నగరాలను సుస్థిరాభివృద్ధి, ఇన్నోవేషన్ల కలబోతగా, భవిష్యత్ అవసరాలకు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నారు. ‘‘మహిళా శక్తికి మరింత ప్రాధాన్యమివ్వాలి. అప్పుడే మనమంతా ఆశించిన విధంగా దేశప్రగతి సాధ్యపడుతుంది. శ్రామిక శక్తిలో మహిళలను మరింతగా భాగస్వాములను చేయాలి. అందుకు అనుగుణంగా చట్టాలు, విధానాలను రూపొందించుకోవాలి’’ అని మోదీ చెప్పారు.కేంద్ర పన్నుల్లో రాష్ట్రాలకు 50 శాతం: సీఎంలుకేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటాను 50 శాతానికి పెంచాలని తమిళనాడు, పంజాబ్ ముఖ్యమంత్రులు ఎం.కె.స్టాలిన్, భగవంత్ మాన్ డిమాండ్ చేశారు. ‘‘రాష్ట్రాలకు 41 శాతం వాటా ఇస్తామని మాటిచ్చారు. కానీ 33.16 శాతమే ఇస్తున్నారు. తమిళనాడు దేశంలోకెల్లా అత్యంత పట్టణీకరణ చెందిన రాష్ట్రం. అమృత్ 2.0 పథకం కింద రాష్ట్రానికి ప్రత్యేక పట్టణీకరణ మిషన్‌ను మంజూరు చేయాలని ఎప్పటినుంచో కోరుతున్నాం. నమామి గంగ తరహాలో తమిళనాడులోని కావేరీ, వైగే తదితర నదుల ప్రక్షాళనకు ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేయాలి’’ అని స్టాలిన్ కోరారు. ఆ ప్రాజెక్టులకు పేర్లను ఇంగ్లిష్‌లోనే పెట్టాలన్నారు. పంజాబ్‌లో పాకిస్తాన్‌ను ఆనుకుని ఉండే ఆరు సరిహద్దు జిల్లాలకు ప్రత్యేక పారిశ్రామిక ప్యాకేజీ అందించాలని కేంద్రానికి మాన్ విజ్ఞప్తి చేశారు. సరిహద్దు ప్రాంతాల రైతులకు ఇస్తున్న ఎకరాకు రూ.10 వేల పరిహారాన్ని రూ.30 వేలకు పెంచాలన్నారు. సిక్కిం, పశ్చిమబెంగాల్లోని సిలిగురిలను కలుపుతూ ప్రపంచస్థాయి జాతీయ రహదారి నిర్మించాల్సిన అవసరం చాలా ఉందని సిక్కిం సీఎం ప్రేంసింగ్ తమాంగ్ అన్నారు.విధాన అడ్డంకులు తొలగించాలన్నారు: సీఈఓ భేటీ వివరాలను నీతి ఆయోగ్ సీఈఓ సుబ్రమణ్యం మీడియాకు వెల్లడించారు. ‘‘వ్యవసాయం, విద్య, వైద్య రంగాలపై మరింతగా దృష్టి సారించాలని రాష్ట్రాలకు ప్రధాని సూచించారు. పెట్టుబడులను మరింతగా ఆకర్షించాలని, తద్వారా ఇతోధికంగా ఉపాధి అవకాశాలను సృష్టించాలని, అందుకోసం విధానపరమైన అడ్డంకులను తొలగించుకోవాలని హితవు పలికారు’’ అని చెప్పారు. భేటీలో పాల్గొన్న సీఎంలు, నేతలు ఆపరేషన్ సిందూర్‌ను ముక్తకంఠంతో సమరి్థంచారన్నారు. జైరాంతో కాంగ్రెస్‌కే చేటు: బీజేపీ నీతి ఆయోగ్ ఓ ‘అయోగ్య’ (అసమర్థ) సంస్థ అన్న కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ విమర్శలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్‌కే చేటు చేసే వివాదాలను సృష్టించడం ఆయన నైజమని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్‌ను జైరాం భూస్థాపితం చేయడం ఖాయమని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ జోస్యం చెప్పారు.నవ్వుల్ పువ్వుల్ ఆయోగ్ భేటీలో సరదా సన్నివేశాలు ప్రధాని, ముఖ్యమంత్రుల నడుమ పలు సరదా సన్నివేశాలకు నీతి ఆయోగ్ భేటీ వేదికైంది. సమావేశం ముగిశాక రేవంత్‌రెడ్డి, స్టాలిన్ తదితరులతో మోదీ సరదా సంభాషణలు జరిపారు. నవ్వుతూ, వారిని నవి్వస్తూ కని్పంచారు. భగవంత్ మాన్ (పంజాబ్), హేమంత్ సోరెన్ (జార్ఖండ్), కొన్రాడ్ సంగ్మా (నాగాలాండ్) తదితరులు మోదీతో చాలాసేపటిదాకా కరచాలనం చేస్తూ కన్పించారు. వారితో ప్రధాని సరదాగా మాట్లాడారు. ఈ సందర్భంగా నేతలంతా తేనీరు సేవిస్తూ ఉల్లాసంగా గడిపారు. -
భారత క్రికెట్లో ‘సుదర్శన’ మంత్రం
దాదాపు రెండున్నరేళ్ల క్రితం ఉప్పల్ స్టేడియం వేదికగా హైదరాబాద్, తమిళనాడు మధ్య రంజీ ట్రోఫీ మ్యాచ్... తొలి ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ తరఫున రెండు, తమిళనాడు తరఫున మూడు సెంచరీలు నమోదయ్యాయి. మ్యాచ్ సాధారణ ‘డ్రా’ దిశగా సాగుతున్నట్లు అనిపించింది. అయితే రెండో ఇన్నింగ్స్‌లో హైదరాబాద్ కుప్పకూలింది. దాంతో చివరి రోజు తమిళనాడు విజయలక్ష్యం 11 ఓవర్లలో 144... సాధారణంగా ఇలాంటి స్థితిలో బ్యాటర్లు మైదానంలోకి దిగి లాంఛనంగా కొన్ని బంతులు ఆడి ‘షేక్ హ్యాండ్’కు సిద్ధమవుతారు. కానీ తమిళనాడు టి20 శైలిలో గెలుపుపై గురి పెట్టింది. ఒకవైపు సీనియర్ జగదీశన్ చెలరేగుతుండగా మరో ఓపెనర్ తన విధ్వంసకర బ్యాటింగ్‌తో 20 బంతుల్లోనే 5 సిక్సర్లతో 42 పరుగులు బాదాడు. 7 ఓవర్లలో స్కోరు 108/1. అనూహ్యంగా వెలుతురులేమితో మ్యాచ్‌ను అంపైర్లు నిలిపివేయడంతో హైదరాబాద్ బతికిపోయింది. అయితే 21 ఏళ్ల ఆ ఓపెనర్ ఆటపై అన్ని వైపుల నుంచి అసాధారణ ప్రశంసలు వెల్లువెత్తాయి. తొలి ఇన్నింగ్స్‌లోనూ సెంచరీ బాది ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచిన ఆ కుర్రాడే సాయి సుదర్శన్. అతనికిదే తొలి ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కావడం విశేషం. నాలుగు సీజన్ల పాటు దేశవాళీ క్రికెట్లో నిలకడైన ఆటతో ‘ఆల్ ఫార్మాట్’ ప్లేయర్‌గా గుర్తింపు తెచ్చుకున్న సుదర్శన్ ఇప్పుడు ఇంగ్లండ్‌తో సిరీస్‌కు ఎంపిక చేయనున్న ఆటగాళ్లలో ముందు వరుసలో ఉన్నాడు. - సాక్షి క్రీడా విభాగం రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేయడానికి ముందే సాయి సుదర్శన్ ఐపీఎల్లో ఒక సీజన్ ఆడాడు. 2022లో ఐదు మ్యాచ్‌లలో కలిపి 114 బంతులు ఎదుర్కొని ఒక హాఫ్ సెంచరీ సహా 145 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. అయితే ఐపీఎల్లో ఒక ఏడాది బాగా ఆడి ఆ తర్వాత ఎంతో మంది కనుమరుగైన ఉదంతాలు ఉన్నాయి కాబట్టి అతని ప్రదర్శనను ఎవరూ అంత సీరియస్‌గా చూడలేదు. కానీ రంజీ ట్రోఫీ తొలి మ్యాచ్‌లోనే అతని ఆటను చూశాక భవిష్యత్తులో చాలా తొందరగా భారత్‌కు ఆడగల సత్తా ఉన్న ప్లేయర్‌గా సుదర్శన్‌కు గుర్తింపు లభించింది.రంజీ ఆరంభానికి చాలా ముందే ‘ఈ అబ్బాయిలో ఎంతో ప్రత్యేకత ఉంది. సాధ్యమైనంత తొందరగా ఇతడిని తమిళనాడు జట్టులోకి తీసుకోండి’ అంటూ స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ చేసిన సూచనను సెలక్టర్లు పరిగణనలోకి తీసుకుంటూ ‘ఫాస్ట్ ట్రాక్’తో ముందు టి20ల్లోకి, ఆ తర్వాత వన్డేల్లోకి, ఆపై రంజీ టీమ్‌లోకి ఎంపిక చేశారు. తనపై ఉంచిన ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకున్నాడు. ఒక్కసారి తమిళనాడు జట్టులోకి వచ్చాక తనకు లభించిన ప్రతీ అవకాశాన్ని సుదర్శన్ సమర్థంగా ఉపయోగించుకున్నాడు. చూడచక్కటి ఆటతో... సుదర్శన్ బ్యాటింగ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ‘క్లాస్’ తరహా శైలి అతనిది. చక్కటి డ్రైవ్‌లతో అలవోకగా ఫోర్లు రాబట్టడం అతనికి బాగా తెలిసిన విద్య. అవసరమైన సమయంలో గేర్లు మార్చి సిక్స్‌లు కొట్టినా అందులోనూ ఒక కళ ఉంటుంది. అప్పుడప్పుడు పుల్, హుక్ షాట్లతో పాటు స్లాగ్ స్వీప్‌లు, స్కూప్ షాట్లను కూడా ఐపీఎల్లో సుదర్శన్ చూపించాడు. టి20లు అయినా సరే లెక్క లేనితనంతో గుడ్డిగా బ్యాట్ ఊపే తత్వం కాదు. తనకు ఏం కావాలనే దానిపై అతనికి మంచి అవగాహన ఉంది. ఐపీఎల్లో నాలుగు సీజన్ల కెరీర్ చూస్తే అతని బ్యాటింగ్‌లో ఎక్కడా తడబాటు కనిపించకపోవడమే కాదు... అనవసరపు చెత్త షాట్లతో అవుటైన సందర్భాలు చాలా అరుదు. ఇదే అతడిని ఇతర దేశవాళీ బ్యాటర్లతో పోలిస్తే భిన్నంగా నిలబెట్టింది. అందుకే ఐపీఎల్లో చెలరేగుతున్న సమయంలో అతడిని టెస్టు జట్టులోకి తీసుకోవాలనే డిమాండ్ అన్ని వైపుల నుంచి వినిపించడం సుదర్శన్ బ్యాటింగ్‌పై నమ్మకాన్ని చూపిస్తోంది. సరిగ్గా చెప్పాలంటే టి20 ఫార్మాట్లో ఇప్పుడు అందరినీ ఆకట్టుకున్నా... సుదర్శన్ వన్డేలూ బాగా ఆడగలడు కాబట్టే ముందుగా అదే ఫార్మాట్లో తొలి అవకాశం దక్కింది. ఇక టెస్టు క్రికెట్‌కు సరిపోగల బ్యాటింగ్ నైపుణ్యం, పట్టుదల, టెక్నిక్ అతనిలో పుష్కలంగా ఉన్నాయి. అమ్మా నాన్న అండతో... సాయి సుదర్శన్ ఇప్పటికే భారత సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. 3 వన్డేలు ఆడితే వరుసగా 55 నాటౌట్, 62, 10 పరుగులు సాధించాడు. బరిలోకి దిగిన ఏకైక టి20లో బ్యాటింగ్ అవకాశం రాలేదు. వేర్వేరు కారణాలతో ఆ తర్వాత అతనికి అవకాశాలు లభించలేదు. సుదర్శన్ టి20 సామర్థ్యమేమిటో ఐపీఎల్ చూపించింది. నిజానికి ఈ ఫార్మాట్లో తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లో అదరగొట్టడంతోనే అతను ముందుగా వెలుగులోకి వచ్చాడు. అయితే అనూహ్యంగా మెరిసి ఆపై మళ్లీ కనబడకుండా పోయే ఆటగాళ్ల జాబితాలో అతను చేరరాదని సుదర్శన్ తల్లిదండ్రులు భావించారు. అందుకే పక్కా ప్రణాళికతో, సరైన కోచింగ్‌తో అతడికి వారు మార్గనిర్దేశనం చేశారు. క్రీడాకారుల కుటుంబం నుంచి రావడం కూడా అతనికి ఎంతో మేలు చేసింది. అథ్లెట్ అయిన తండ్రి భరద్వాజ్ ‘శాఫ్’ క్రీడల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించగా...తల్లి ఉష తమిళనాడు రాష్ట్ర జట్టు తరఫున వాలీబాల్ ఆడింది. పదేళ్ల వయసులో క్రికెట్ మొదలు పెట్టిన సుదర్శన్ ఆ తర్వాత మెల్లగా ఒక్కో మెట్టే ఎక్కుతూ వివిధ వయో విభాగాల్లో రాణిస్తూ ముందంజ వేశాడు. అండర్–19 చాలెంజర్ ట్రోఫీ తర్వాత భారత్ ‘ఎ’కు ఆడిన తర్వాత రెగ్యులర్‌గా మారాడు. వరుసగా రెండు ఐపీఎల్‌లలో 500కు పైగా పరుగులు సాధించి తన విలువేమిటో అతను చూపించాడు. టెస్టులకు చేరువలో...దేశవాళీలో నిలకడైన ప్రదర్శన, ప్రస్తుత ఫామ్, రోహిత్, కోహ్లిల రిటైర్మెంట్తో ఖాళీలు... ఇప్పుడు అన్నీ సరిగ్గా సరిపోయే సందర్భం 24 ఏళ్ల సుదర్శన్ కోసం వచ్చింది. దాదాపు 40 పరుగుల ఫస్ట్ క్లాస్ సగటు అసాధారణం కాకపోయినా... 29 మ్యాచ్‌లలో 1957 పరుగుల అనుభవం టెస్టు టీమ్‌లో అవకాశం కల్పించడానికి సరిపోతుంది. ప్రస్తుత టీమ్‌లో రాహుల్ ఓపెనింగ్ స్థానానికి మారితే మిడిలార్డర్ సుదర్శన్‌కు సరైన స్థానం కాగలదు. పైగా రెండు సీజన్ల పాటు ఇంగ్లండ్ కౌంటీ క్రికెట్లో ‘సర్రే’ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించడం కూడా అతనికి మరో అదనపు అర్హతగా మారనుంది. భారత్ తరఫున టెస్టు ఆడే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్లు ఇటీవల వెల్లడించిన సుదర్శన్ కోరిక త్వరలోనే తీరవచ్చు. ఇదే జోరును అతను కొనసాగిస్తే స్థానం సుస్థిరం కూడా కావచ్చు. -
గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టీమిండియా యువ క్రికెటర్
టీమిండియా యువ క్రికెటర్ సర్ఫరాజ్ ఖాన్ గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. లావుగా ఉన్నాడని విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో కఠినమైన వ్యాయామాలతో పాటు ఆహారపు నియమాలు పాటించి ఆరు వారాల్లో 10 కిలోలు తగ్గాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఫిట్నెస్ మెరుగుపర్చుకోవడమే ధ్యేయంగా పెట్టుకున్న సర్ఫరాజ్.. కఠోరమైన నియమనిబంధనలు పాటించి స్లిమ్‌గా తయారయ్యాడు. ఇంకా ఫిట్‌గా, బెటర్ క్రికెటర్‌గా తయారయ్యేందుకు ఇంకాస్త బరువు తగ్గుతానని సర్ఫరాజ్ అంటున్నాడు.కొత్త లుక్‌లో సర్ఫరాజ్ ఖాన్‌ను ఎవరూ పోల్చుకోలేకపోతున్నారు. సర్ఫరాజ్ న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరవలువుతున్నాయి. బరువు తగ్గకముందు, బరువు తగ్గాక సర్ఫరాజ్‌లో స్పష్టమైన తేడా కనిపిస్తుంది. బరువు తగ్గాక సర్ఫరాజ్ ఎంతో ఉత్సాహంగా, స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు.కాగా, 27 ఏళ్ల సర్ఫరాజ్ ఓవర్ వెయిట్ కారణంగా చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. అపారమైన నైపుణ్యమున్నప్పటికీ.. ఆ ఒక్కటీ (ఓవర్ వెయిట్) సర్ఫరాజ్‌ను టార్గెట్ చేసేలా ఉండింది. దీంతో ఇంగ్లండ్ పర్యటనకు ముందు అతను స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఎలాగైనా బరువు తగ్గాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా జిమ్‌లో జాయిన్ అయ్యాడు. న్యూట్రిషియన్‌ను పెట్టుకున్నాడు. ఉదయాన్నే గంట పాటు జాగింగ్, ఆతర్వాత అరగంట స్మిమ్మింగ్‌ను ప్రతి రోజు షెడ్యూల్ చేసుకున్నాడు.సర్ఫరాజ్‌తో పాటు అతని కుటుంబం మొత్తం వెయిట్ లాస్ ప్రక్రియకు పూనుకుంది. సర్ఫరాజ్ తండ్రి నౌషద్ ఖాన్, అతని చిన్న సోదరుడు మొయిన్ ఖాన్ కూడా ఓవర్ వెయిట్ ఉంటారు. సర్ఫరాజ్ రెండో సొదరుడు మునీర్ ఖాన్ ఫిట్‌గా ఉన్నప్పటికీ అతను కూడా ఈ వెయిట్ లాస్ ప్రోగ్రాంలో వారితో పాటే నడిచాడు. మొత్తానికి సర్ఫరాజ్ వెయిట్ లాస్ జర్నీ స్పూర్తిదాయకంగా ఉంది.ఇదిలా ఉంటే, సర్ఫరాజ్ వచ్చే నెలలో షెడ్యూలైన ఇంగ్లండ్ పర్యటన కోసం భారత-ఏ జట్టుకు ఎంపికయ్యాడు. ఈ పర్యటనలో భారత-ఏ జట్టు ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ మ్యాచ్‌ల్లో ప్రదర్శన ఆధారంగా ఆతర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు భారత జట్టును ఎంపిక చేస్తారు. ఈ సిరీస్ సత్తా చాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని సర్ఫరాజ్ పట్టుదలగా ఉన్నాడు.గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన హొం టెస్ట్ సిరీస్‌లో టీమిండియా తరఫున అరంగేట్రం చేసిన సర్ఫరాజ్.. తన డెబ్యూ మ్యాచ్‌లోనే రెండు అర్ద సెంచరీలు సాధించి (రెండు ఇన్నింగ్స్‌ల్లో) రికార్డుల్లోకెక్కాడు. అనంతరం గతేడాదే న్యూజిలాండ్‌పై 150 పరుగులు చేసిన సర్ఫరాజ్ తనలోని అత్యుత్తమ టాలెంట్‌ను వెలికి తీశాడు. అయితే తదనంతర పరిణామాల్లో (సీనియర్ల రాకతో) సర్ఫరాజ్‌కు టీమిండియాలో చోటు దక్కలేదు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక కాలేదు. ఐపీఎల్ 2025 మెగా వేలంలోనూ అతనికి మొండిచెయ్యే ఎదురైంది. ఇంగ్లండ్ పర్యటనకు భారత్ ఏ జట్టు:అభిమన్యు ఈశ్వరన్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, కరుణ్ నాయర్, ధృవ్ జురెల్ (వైస్ కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, శార్దూల్ ఠాకూర్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), మానవ్ సుతార్, తనుష్ కోటియన్, ముఖేష్ కుమార్, ఆకాశ్ దీప్, హర్షిత్ రాణా, అన్షుల్ కాంబోజ్, ఖలీల్ అహ్మద్, రుతురాజ్ గైక్వాడ్, సర్ఫరాజ్ ఖాన్, తుషార్ దేశ్‌పాండే, హర్ష్ దూబే -
టీ20, టెస్ట్‌లకు రిటైర్మెంట్.. రోహిత్, కోహ్లి తదుపరి ఆడబోయే మ్యాచ్‌లు ఇవే..!
టీ20లకు, టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా దిగ్గజ బ్యాటర్లు, కెప్టెన్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి ఇకపై వన్డేల్లో మాత్రమే కనిపిస్తారు. ఈ ఇద్దరు 2027 ప్రపంచకప్ వరకు ఆడి 50 ఓవర్ల ఫార్మాట్ నుంచి కూడా తప్పుకుంటారని తెలుస్తుంది. అయితే ఈ మధ్యలో రోహిత్, కోహ్లి భారత్ తరఫున ఎన్ని వన్డేలు ఆడతారని క్రికెట్ అభిమానులు ఆరా తీయడం మొదలుపెట్టారు.ఫ్యూచర్ టూర్ ప్రోగ్రాం ప్రకారం భారత్ 2027 వన్డే వరల్డ్‌కప్ వరకు 9 సిరీస్‌ల్లో 8 మంది ప్రత్యర్థులపై 27 మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐపీఎల్-2025తో బిజీగా ఉన్న భారత ఆటగాళ్లు క్యాష్ రిచ్ లీగ్ ముగిసిన వెంటనే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరతారు. అక్కడ ఆగస్ట్ వరకు 4 వరకు గడపనున్న భారత్.. అదే నెల 17వ తేదీ నుండి బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఇక్కడి నుండి టీమిండియా వన్డే క్రికెట్ షెడ్యూల్ మొదలుకానుంది.బంగ్లాదేశ్ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు ఆడనుంది. రోహిత్, కోహ్లి ఈ సిరీస్‌లో చెలరేగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌లో స్పిన్ ఫ్రెండ్లీ పిచ్‌లు ఉండటంతో రోకోను ఆపడం బంగ్లా బౌలర్లకు పెద్ద సవాలే అవుతుంది.అనంతరం భారత్ అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు (5 టీ20లు కూడా ఆడుతుంది) ఆడనుంది.ఈ ఏడాది చివర్లో టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఆల్ ఫార్మాట్ సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా టీమిండియాతో రెండు టెస్ట్‌లు, 5 టీ20లు సహా మూడు వన్డేలు ఆడనుంది.వచ్చే ఏడాది (2026) జనవరిలో భారత్ స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేల్లో తలపడనుంది. ఈ సిరీస్‌లో కూడా విరాట్, రోహిత్ తమదైన మార్కును చూపించే అవకాశం ఉంది.అనంతరం చాలా గ్యాప్ తర్వాత జూన్‌లో భారత్ స్వదేశంలో ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ పర్యటనలో ఆఫ్ఘన్లు టీమిండియాతో మూడు వన్డేలు ఆడనున్నారు. స్వదేశంలో ఆడబోయే సిరీస్ కావడంతో ఈ సిరీస్‌లో కూడా రోకో చెలరేగే అవకాశం ఉంది.జూలైలో భారత్ ఇంగ్లండ్‌లో పర్యటించి మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనలో రోహిత్, కోహ్లి సవాళ్లు ఎదుర్కొనే అవకాశం ఉంది.సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో భారత్ స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు ఆడనుంది.అక్టోబర్, నవంబర్ మాసాల్లో టీమిండియా స్వదేశంలో న్యూజిలాండ్‌తో మూడు వన్డేలు ఆడనుంది.డిసెంబర్లో భారత్ స్వదేశంలో శ్రీలంకతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది.దీని తర్వాత భారత్ 2027లో సౌతాఫ్రికా, జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే వన్డే వరల్డ్‌కప్‌లో పాల్గొంటుంది. ఈ మెగా టోర్నీ రోహిత్-కోహ్లిల జమానాకు చివరిదయ్యే అవకాశం ఉంది. ఈ మధ్యలో ఏవైనా వ్యక్తిగత ఇబ్బందులు ఎదురైతే తప్ప రోహిత్, కోహ్లి దాదాపుగా అన్ని మ్యాచ్‌లు ఆడే అవకాశం ఉంది. దిగ్గజాలు వన్డే వరల్డ్‌కప్‌తో తమ క్రికెట్ ప్రస్తానాన్ని ముగిస్తారేమో చూడాలి. -
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా.. దిగ్గజాలకు సైతం సాధ్యం కాని ఘనత సాధించాడు
టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చరిత్ర సృష్టించాడు. ఐసీసీ టెస్ట్ ఆల్‌రౌండర్ల ర్యాంకింగ్స్‌లో అత్యధిక కాలం టాప్ ర్యాంక్‌లో కొనసాగిన ఆటగాడిగా అవతరించాడు. ఇవాళ (మే 14) విడుదల చేసిన ర్యాంకింగ్స్‌ల జడేజా టాప్ ప్లేస్‌ను నిలబెట్టుకున్నాడు. ప్రస్తుతం జడేజా ఖాతాలో 400 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. 2022, మార్చి 9న విండీస్ ఆటగాడు జేసన్ హెల్డర్ను గద్దె దించి అగ్రపీఠాన్ని అధిరోహించిన జడ్డూ.. 1152 రోజుల పాటు (38 నెలలకు పైగా) టాప్ ర్యాంక్డ్ టెస్ట్ ఆల్‌రౌండర్‌గా కొనసాగాడు. టెస్ట్ క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఆల్‌రౌండర్లైన జాక్ కల్లిస్, కపిల్ దేవ్, ఇమ్రాన్ ఖాన్‌కు కూడా ఇది (ఇంతకాలం) సాధ్యం కాలేదు.36 ఏళ్ల జడ్డూ 2022 మార్చి నుంచి 23 టెస్ట్‌లు ఆడి 36.71 సగటున 1175 పరుగులు చేశాడు. ఇందులో మూడు సెంచరీలు, ఐదు అర్ద సెంచరీలు ఉన్నాయి. బౌలింగ్‌లో జడ్డూ 22.34 సగటున 91 వికెట్లు పడగొట్టాడు. ఇందులో ఆరు 5 వికెట్ల ప్రదర్శనలు, రెండు 10 వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. తాజా ర్యాంకింగ్స్‌లో జడేజా, తర్వాతి స్థానాల్లో మెహిది హసన్ మిరాజ్ (బంగ్లాదేశ్), మార్కో జన్సెన్ (సౌతాఫ్రికా), పాట్ కమిన్స్ (ఆస్ట్రేలియా), షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్) ఉన్నారు. మెహిది హసన్ ఇటీవల బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సహా 5 వికెట్ల ప్రదర్శన నమోదు చేసి జన్సెన్ను కిందికి దించి రెండో స్థానానికి ఎగబాకాడు. మెహిది హసన్‌కు జడేజాకు మధ్య 73 రేటింగ్ పాయింట్ల వ్యత్యాసం ఉంది.ప్రస్తుతం ఐపీఎల్‌తో బిజీగా ఉన్న జడేజా జూన్‌లో ఇంగ్లండ్‌తో జరుగబోయే టెస్ట్ సిరీస్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది. 2024 టీ20 వరల్డ్‌కప్ తర్వాత పొట్టి క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. టెస్ట్, వన్డేల్లో కొనసాగుతున్నాడు. గత కొంతకాలంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్న జడేజా 2024 ఐసీసీ టెస్ట్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. -
రిటైర్మెంట్ ప్రచారంపై స్పందించిన టీమిండియా స్టార్ పేసర్
టీమిండియా దిగ్గజ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి బాటలోనే మహ్మద్ షమీ కూడా పయనిస్తున్నాడని గత కొన్ని గంటలుగా ప్రచారం జరుగుతుంది. రోహిత్, విరాట్ లాగే షమీ కూడా టెస్ట్‌లకు రిటైర్మెంట్ ప్రకటిస్తాడని పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై షమీ తాజాగా స్పందించాడు. Mohammad Shami squashes retirement rumours. pic.twitter.com/PoKqLoS42l— Mufaddal Vohra (@mufaddal_vohra) May 13, 2025తన రిటైర్మెంట్పై ఓ ఇంగ్లిష్ వెబ్సైట్లో రాసిన వార్తను ఖండిస్తూ.. దాన్ని రాసిన వ్యక్తికి మొట్టికాయలు వేశాడు. ముందు నీ ఉద్యోగానికి వీడ్కోలు పలకడానికి రోజులు లెక్క పెట్టుకో. తర్వాత నా రిటైర్మెంట్ గురించి మాట్లాడవచ్చు. నీ లాంటి వాళ్లు మీడియాను సర్వనాశనం చేశారు. ఆటగాళ్ల భవితవ్యం గురించి ఒక్కసారైనా మంచిగా చెప్పండి. ఈ రోజుకు ఇది చాలా చెత్త వార్త. సారీ అంటూ తన సోషల్‌మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. తన రిటైర్మెంట్పై దుష్ప్రచారం చేసిన వ్యక్తికి గట్టిగా ఇస్తూనే షమీ సదరు ప్రచారాన్ని తీవ్రంగా ఖండించాడు.కాగా, 34 ఏళ్ల షమీ గత కొంతకాలంగా ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటూ టీమిండియాలో స్థిరపడలేకపోతున్నాడు. ఇదే కారణంగా షమీని త్వరలో ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు ఎంపిక చేయరని ప్రచారం సాగింది. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు గాయం నుంచి కోలుకుని టీమిండియాలోకి రీ ఎంట్రీ ఇచ్చిన షమీ మునుపటి జోరును కొనసాగించలేకపోయాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో అడపాదడపా ప్రదర్శనతో సరిపెట్టిన అతను ఐపీఎల్-2025లో దారుణంగా విఫలమయ్యాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్ షమీని గంపెడాశలతో సొంత చేసుకుంటే అతను కనీస న్యాయం చేయలేకపోయాడు. ఐపీఎల్లో పేలవ ప్రదర్శన తర్వాత షమీ వ్యతిరేకుల స్వరం పెద్దదైంది. ఇంగ్లండ్ పర్యటనకు అతన్ని ఎంపిక చేయొద్దంటూ కొందరు సోషల్‌మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. షమీ స్థానంలో ఐపీఎల్లో ఇరగదీస్తున్న ప్రసిద్ద్ కృష్ణను ఎంపిక చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనుకుంటే ప్రత్యామ్నాయ పేసర్లుగా అర్షదీప్ సింగ్, సిరాజ్, ఖలీల్ అహ్మద్‌ను ఎంపిక చేయాలని కోరుతున్నారు.ఇదిలా ఉంటే, 2023 వన్డే ప్రపంచకప్ వరకు అద్భుతంగా రాణించిన షమీ.. ఆతర్వాత గాయం తాలూకా సమస్యలతో ఢీలా పడిపోయాడు. భారత్‌లో జరిగిన 2023 వన్డే ప్రపంచకప్‌లో షమీ టీమిండియాను ఒంటిచేత్తో ఫైనల్‌కు చేర్చాడు. ఆ మెగా టోర్నీలో అతను 7 మ్యాచ్‌ల్లో ఏకంగా 24 వికెట్లు తీసి లీడింగ్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. తన కెరీర్లో 64 టెస్ట్‌లు, 108 వన్డేలు, 25 టీ20లు ఆడిన షమీ 462 వికెట్లు తీశాడు. -
రెండో స్థానానికి ఎగబాకిన టీమిండియా వైస్ కెప్టెన్
ఐసీసీ తాజాగా ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వైస్ కెప్టెన్ స్మృతి మంధన అదరగొట్టింది. ఇటీవల శ్రీలంకలో జరిగిన ట్రై నేషన్ సిరీస్‌లో సత్తా చాటిన మంధన.. తాజాగా ర్యాంకింగ్స్‌లో మూడో స్థానం నుంచి రెండో స్థానానికి ఎగబాకింది. ఈ టోర్నీలో సెంచరీ (ఫైనల్లో), అర్ద సెంచరీ సాయంతో 264 పరుగులు చేసిన మంధన.. తన రేటింగ్ పాయింట్లను 727కు పెంచుకుని ఇంగ్లండ్ కెప్టెన్ నాట్ సీవర్ బ్రంట్‌ను మూడో స్థానానికి పడేసింది. తాజా ర్యాంకింగ్స్‌లో సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ట్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. మంధనకు లారాకు మధ్య కేవలం 11 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. భారత్ తరఫున టాప్-10 బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మంధన ఒక్కరే ఉన్నారు. హేలీ మాథ్యూస్ (వెస్టిండీస్), ఎల్లిస్ పెర్రీ (ఆస్ట్రేలియా), అలైసా హీలీ (ఆస్ట్రేలియా), చమారీ ఆటపట్టు (శ్రీలంక), బెత్ మూనీ (ఆస్ట్రేలియా), ఆష్లే గార్డ్నర్ (ఆస్ట్రేలియా), ఆమీ జోన్స్ (ఇంగ్లండ్) వరుసగా నాలుగు నుంచి పది స్థానాల్లో ఉన్నారు. ట్రై నేషన్ సిరీస్‌లో రాణించిన చమారీ ఆటపట్టు రెండు స్థానాలు మెరుగుపర్చుకుని ఏడో స్థానానికి ఎగబాకింది. భారత ప్లేయర్లలో జెమీమా రోడ్రిగెజ్ 15, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 16, దీప్తి శర్మ 32, రిచా ఘోష్ 42, ప్రతిక రావల్ 45, హర్లీన్ డియోల్ 52, యస్తికా భాటియా 67, పూజా వస్త్రాకర్ 70, షఫాలీ వర్మ 86, స్థానాల్లో ఉన్నారు. ట్రై సిరీస్‌లో సౌతాఫ్రికాపై సెంచరీతో రాణించిన జెమీమా 5 స్థానాలు మెరుగుపర్చుకోగా.. ఇదే టోర్నీలో సత్తా చాటిన దీప్తి శర్మ 13 స్థానాలు మెరుగుపర్చుకుంది.బౌలింగ్ విభాగానికొస్తే.. భారత్ తరఫున దీప్తి శర్మ (4) ఒక్కరే టాప్-10లో ఉన్నారు. సోఫీ ఎక్లెస్టోన్ టాప్ ప్లేస్‌లో కొనసాగుతుండగా.. ఆష్లే గార్డ్నర్, మెగాన్ షట్ రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ట్రై సిరీస్‌లో 15 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన స్నేహ్ రాణా నాలుగు స్థానాలు మెరుగుపర్చుకుని కెరీర్ బెస్ట్ 34వ స్థానానికి ఎగబాకింది. రాణా దాదాపు 16 నెల తర్వాత టీమిండియా తరఫున రీఎంట్రీ ఇచ్చింది.కాగా, భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా పాల్గొన్న ట్రై నేషన్ సిరీస్‌లో భారత్ విజేతగా నిలిచింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో మంధన సెంచరీతో కదంతొక్కడంతో భారత్ ఏకపక్ష విజయం సాధించింది. ఈ ప్రదర్శనకు గానూ మంధనకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది. -
‘విరాట్’ పరుగుల పర్వాలు
‘నేను టెస్టు క్రికెట్‌ను రోజంతా ఒకే తరహా తీవ్రతతో ఆడాలని భావిస్తా. 88వ ఓవర్లో కూడా బ్యాటర్ షాట్ ఆడితే నేను సింగిల్ ఆపేందుకు అవసరమైతే డైవ్ కూడా చేస్తా. నా దృష్టిలో టెస్టు క్రికెట్ అంటే అదే’... ఇది విరాట్ కోహ్లికి టెస్టు ఫార్మాట్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తోంది. ‘నేను నా మనసును, ఆత్మను కూడా టెస్టు క్రికెట్ కోసమే ఇచ్చా. ఈ ఫార్మాట్లో ఫిట్నెస్ కోసమే ఎన్నో త్యాగాలు చేశా’... 100 టెస్టులు పూర్తయిన సందర్భంగా అతను తన సంతృప్తిని ప్రదర్శించిన వ్యాఖ్య ఇది. ‘ఈ రోజంతా మనిద్దరమే బ్యాటింగ్ చేద్దాం.అవతలి జట్టులో ఒక్కొక్కడికి పగిలిపోవాలి’... ఇది మైదానంలో ప్రత్యర్థులపై అతను ప్రదర్శించిన దూకుడుకు ఒక చిన్న ట్రైలర్... టెస్టు క్రికెట్‌కు ఆదరణ తగ్గిపోతోందని అనిపించినప్పుడల్లా మైదానంలో కోహ్లిని చూస్తే అలాంటి భావనే కనిపించదు. అతను టెస్టుల్లో భారీగాపరుగులు మాత్రమే చేయలేదు. అతను ఎన్నో లెక్కలను కొత్తగా తిరగరాశాడు. సాంప్రదాయ ఫార్మాట్లో ఎన్నో సాంప్రదాయాలను బద్దలు కొట్టాడు. క్రమశిక్షణ, పట్టుదల, పోరాటపటిమ, ఫిట్నెస్, ఎక్కడా వెనక్కి తగ్గని తత్వం టెస్టుల్లోనే ఎక్కువగా బయట పడింది. కోహ్లిలాంటి టెస్టు క్రికెటర్ ఇకపై రాకపోవచ్చు. ఈ ఫార్మాట్లో అది ఎవరూ పూరించలేని లోటు. –సాక్షి క్రీడా విభాగం ‘భారత్ తరఫున ఆడుతున్న ఆ్రస్టేలియన్’... విరాట్ కోహ్లి దూకుడును ఆసీస్ గడ్డపై చూసిన తర్వాత విశ్లేషకులు ఇచ్చిన పేరు ఇది. మైదానంలో దూకుడు, ఢీ అంటే ఢీ అనే తత్వం, అటు బ్యాటర్‌గా, ఇటు కెపె్టన్‌గా అతని శైలి కోహ్లి ప్రత్యేకతను నిలబెట్టాయి. ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గను అన్నట్లుగా తెల్ల దుస్తుల్లో యుద్ధానికి సిద్ధమైన ఒక సైనికుడిలా అతను కనిపించేవాడు. 2014లో ఆస్ట్రేలియా గడ్డపై నాటి టాప్ పేసర్ మిచెల్ జాన్సన్‌తో అతను తలపడిన తీరును అభిమానులు ఎవరూ మర్చిపోలేరు.తన బౌలింగ్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో కోహ్లి విరుచుకుపడుతుంటే జాన్సన్ మాటల యుద్ధానికి దిగగా, కోహ్లి ఎక్కడా తగ్గకుండా తాను అదే తరహాలో దీటుగా నిలబడ్డాడు. ఈ సిరీస్‌లో ఏకంగా 4 సెంచరీలతో 692 పరుగులు చేసిన అతను తన సత్తాను ప్రదర్శించాడు. అంతకుముందు దాదాపు మూడేళ్ల క్రితమే కోహ్లి దూకుడును ఆసీస్ చూసింది. 2011–12 టెస్టు సిరీస్‌లో భాగంగా జరిగిన పోరులో సచిన్, ద్రవిడ్, లక్ష్మణ్, గంభీర్వంటి స్టార్ బ్యాటర్లంతా విఫలం కాగా భారత్ నుంచి ఒకే ఒక సెంచరీ నమోదైంది. అది కోహ్లి బ్యాట్ నుంచి వచి్చంది. ఇది కోహ్లి కెరీర్లో ఎనిమిదో టెస్టు. రెండు టెస్టుల క్రితం సిడ్నీలో క్రమశిక్షణారాహిత్యంతో శిక్షకు గురైన కోహ్లి... ఈ మ్యాచ్‌లో తన దూకుడును పరుగులుగా మలచి కసి తీర్చుకున్నట్లుగా అనిపించింది. అలా మొదలై... వన్డేల్లో అరంగేట్రం చేసిన మూడేళ్ల తర్వాత గానీ కోహ్లి తొలి టెస్టు ఆడలేదు. సచిన్ గైర్హాజరులో అతనికి 2011లో వెస్టిండీస్ వెళ్లే అవకాశం లభించింది. అక్కడ పెద్దగా ఆకట్టుకోకపోయినా... ఆ తర్వాత ముంబైలో విండీస్‌తోనే రెండు ఇన్నింగ్స్‌లలో అర్ధ సెంచరీలు చేయడంతో కాస్త నిలదొక్కుకునే అవకాశం లభించింది. ఆ తర్వాత ఆ్రస్టేలియా సిరీస్ అవకాశం దక్కగా అడిలైడ్‌లో చేసిన సెంచరీతో కొత్త తరం ప్రతినిధిగా అతని ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత స్వదేశంలో నిలకడ కొనసాగగా... 2013 దక్షిణాఫ్రికా పర్యటనలో ప్రదర్శన కోహ్లి స్థాయిని పెంచింది. ఆపై కివీస్‌పై వెల్లింగ్టన్లో చేసిన శతకంతో అతని బ్యాటింగ్ విలువ అందరికీ కనిపించింది. ఇక్కడి వరకు కోహ్లి టెస్టు కెరీర్ సాఫీగా సాగిపోయింది. తొలి 24 టెస్టుల్లో 46.71 సగటుతో 1721 పరుగులు చేయగా అందులో 6 సెంచరీలు ఉన్నాయి. ఆ తర్వాత వచి్చంది ఇంగ్లండ్ పర్యటన. ఆరేళ్లు అద్భుతంగా... విరాట్ టెస్టు కెరీర్ అక్టోబర్ 2014 నుంచి డిసెంబర్ 2019 వరకు అత్యద్భుతంగా సాగింది. ఈ సమయంలో అతని కెరీర్లో అత్యుత్తమ ప్రదర్శనలు వచ్చాయి. అటు ఆటగాడిగా, ఇటు కెపె్టన్‌గా కూడా ఈ సమయంలో ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందుకున్నాడు. భారత అభిమానుల కోణంలో చూస్తే ఈ సమయంలో కోహ్లి అసలైన టెస్టు మజాను చూపించాడు. జట్టును తన బ్యాటింగ్‌తో బలమైన స్థితిలో నిలపడమే కాదు, కష్టాల్లో ఉన్నప్పుడు అసాధారణ బ్యాటింగ్‌తో టెస్టులను ఎలా ఆడాలో అతను చేసి చూపించాడు.ఈ ఆరేళ్ల కాలంలో 55 టెస్టులు ఆడిన కోహ్లి ఏకంగా 63.65 సగటుతో 5347 పరుగులు సాధించాడు. ఇందులో 21 సెంచరీలు, 13 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ సమయంలో గణాంకాలు అతడిని నంబర్‌వన్ టెస్టు బ్యాటర్‌గా నిలిపాయి. ముఖ్యంగా ఒక 18 నెలలు అతని బ్యాటింగ్ శిఖరానికి చేరింది. కేవలం 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో కోహ్లి ఏకంగా 6 డబుల్ సెంచరీలు నమోదు చేయడం విశేషం. 34 ఇన్నింగ్స్‌ల వ్యవధిలో చూస్తే ఒక్క బ్రాడ్‌మన్ (8) మాత్రమే అతనికంటే మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. కాస్త పదును తగ్గి... అసాధారణ బ్యాటింగ్ తర్వాత 2020 ఆరంభం నుంచి అతని టెస్టు బ్యాటింగ్‌లో పదును కాస్త నెమ్మదించింది. కోవిడ్ కారణంగా మ్యాచ్‌ల సంఖ్య తగ్గడంతో పాటు ఒకే తరహా జోరును కొనసాగించడంలో కోహ్లి విఫలమయ్యాడు. సెంచరీ మొహం చూసేందుకు మూడేన్నరేళ్లు పట్టాయి. 2021 ఇంగ్లండ్ పర్యటన కేవలం 2 అర్ధసెంచరీలతో నిరాశగా ముగియగా, 2023–24 దక్షిణాఫ్రికా పర్యటనలో కూడా అతని ముద్ర కనిపించలేదు. ఇటీవల ముగిసిన ఆ్రస్టేలియా సిరీస్‌లోనైతే పెర్త్ మినహా అతని బ్యాటింగ్ చూస్తే కెరీర్ ముగింపునకు వచి్చనట్లే అనిపించింది. జనవరి 2020 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే ఆడిన 39 టెస్టుల్లో కోహ్లి కేవలం 30.72 సగటుతో 2028 పరుగులు సాధించాడు. 3 శతకాలు మాత్రమే నమోదు చేయగలిగాడు. గత రెండేళ్లుగా అతని బ్యాటింగ్ సగటు 32.56 మాత్రమే. ఎలా చూసుకున్నా ఇది ఒక ప్రధాన బ్యాటర్‌కు సంబంధించి పేలవ ప్రదర్శనే. టెస్టు బ్యాటర్‌గా తన అత్యుత్తమ దశను ఎప్పుడో దాటిన కోహ్లి ఇప్పుడు కెరీర్‌ను హడావిడి లేకుండా ముగించాడు. పడి... పైకి లేచి... కోహ్లి వైఫల్యం గురించి చెప్పాలంటే అందరికీ గుర్తుకొచ్చేది 2014లో ఇంగ్లండ్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్. స్వింగ్‌కు అనుకూలించిన అక్కడి పరిస్థితుల్లో సరైన ఫుట్‌వర్క్ లేక ఒకే తరహాలో పదే పదే అవుట్ అవుతూ కోహ్లి అభిమానులను తీవ్రంగా నిరాశపర్చాడు. భారత నంబర్‌వన్ బ్యాటర్‌గా అక్కడ అడుగు పెట్టి అద్భుతాలు చేస్తాడనుకుంటే పూర్తిగా చేతులెత్తేశాడు. 10 ఇన్నింగ్స్‌లలో కలిపి కేవలం 134 పరుగులతో ఘోరంగా విఫలం కావడమే కాదు... అప్పటి బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా గర్ల్‌ఫ్రెండ్ అనుష్క శర్మను టూర్‌కు తీసుకెళ్లి తీవ్ర విమర్శలపాలయ్యాడు.అయితే నాలుగేళ్లు తిరిగాయి... కోహ్లి ఆట మారింది. వ్యక్తిగా కూడా ఎంతో మారాడు. లోపాలను సరిదిద్దుకొని 2018లో మళ్లీ ఇంగ్లండ్ గడ్డపై అడుగు పెట్టాడు. ఏ బౌలర్‌నూ లెక్క చేయకుండా నాటి గాయాలూ మానేలా చెలరేగిపోయాడు. 2 సెంచరీలు, 3 అర్ధ సెంచరీలతో ఏకంగా 593 పరుగులు సాధించి సిరీస్ టాపర్‌గా నిలిచాడు. ఇది కోహ్లిలోని పట్టుదలను, తాను విఫలమైన చోట మళ్లీ తానేంటో చూపించుకోవాలనే కసిని చూపించింది. ⇒ 4 భారత్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో సచిన్ (15,921), ద్రవిడ్ (13,288), గావస్కర్ (10,122) తర్వాత నాలుగో స్థానంలో నిలిచిన కోహ్లి (9230)... అత్యధిక శతకాల జాబితాలో కూడా సచిన్ (51), ద్రవిడ్ (36), గావస్కర్ (34) తర్వాత 30 శతకాలతో నాలుగో స్థానంలోనే ఉన్నాడు. ⇒ 4 టెస్టుల్లో అత్యధిక విజయాలు సాధించిన కెపె్టన్ల జాబితాలో గ్రేమ్ స్మిత్ (53), రికీ పాంటింగ్ (48), స్టీవ్ వా (41) తర్వాత కోహ్లి (40) నాలుగో స్థానంలో నిలిచాడు. ⇒ 7 కోహ్లి డబుల్ సెంచరీల సంఖ్య. ఓవరాల్ జాబితాలో బ్రాడ్‌మన్ (12; ఆస్ట్రేలియా), సంగక్కర (11; శ్రీలంక), లారా (9; వెస్టిండీస్) తర్వాత వాలీ హామండ్ (7; ఇంగ్లండ్), జయవర్ధనే (7; శ్రీలంక)లతో కలిసి సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. -
‘కష్టమే... కానీ సరైన నిర్ణయమే’
న్యూఢిల్లీ: విరాట్ కోహ్లి తన మనసులో మాటకే కట్టుబడ్డాడు... టెస్టు క్రికెట్ నుంచి తప్పుకోవాలనుకున్న తన నిర్ణయంపై ఎలాంటి పునరాలోచన చేయలేదు... అతడిని ఒప్పించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. టెస్టుల నుంచి రిటైర్ అవుతున్నట్లు కోహ్లి సోమవారం అధికారికంగా ప్రకటించాడు. భారత టెస్టు క్రికెట్లో అత్యుత్తమ బ్యాటర్లలో ఒకడిగా, సారథిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న అతను 14 ఏళ్ల కెరీర్‌కు గుడ్‌బై చెప్పాడు. ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్ కోసం త్వరలోనే టీమ్‌ను సెలక్టర్లు ప్రకటించనున్న నేపథ్యంలో తన రిటైర్మెంట్ సమాచారాన్ని ముందుగానే బీసీసీఐకి తెలియజేయడం సరైందని విరాట్ భావించాడు. ఈ నిర్ణయం తీసుకోవడం కష్టంగానే అనిపిస్తున్నా అది సరైందేనని అతను పేర్కొన్నాడు. 2011 జూలైలో కింగ్స్టన్ వేదికగా వెస్టిండీస్‌తో తన తొలి టెస్టు ఆడిన కోహ్లి... 2025 జనవరిలో సిడ్నీలో ఆ్రస్టేలియాతో చివరి టెస్టు మ్యాచ్ ఆడాడు. గత ఏడాది వరల్డ్ కప్ విజయం తర్వాత టి20 ఫార్మాట్ నుంచి రిటైర్ అయిన కోహ్లి ఇకపై వన్డేల్లోనే కొనసాగనున్నాడు. గత మంగళవారం రోహిత్ శర్మ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించగా, ఆ్రస్టేలియా సిరీస్ మధ్యలోనే స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ తప్పుకోవడంతో తక్కువ వ్యవధిలో ముగ్గురు భారత సీనియర్లు ఈ ఫార్మాట్ నుంచి ని్రష్కమించినట్లయింది. ఎందుకీ వెనకడుగు? రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెబితే పెద్దగా ఆశ్చర్యం అనిపించలేదు గానీ ఇప్పుడు కోహ్లి అనూహ్యంగా రిటైర్మెంట్ అనేశాడు. నిజానికి సవాళ్లను ఎదుర్కొనేందుకు కోహ్లి ఎప్పుడూ సిద్ధంగా ఉంటాడు. కీలకమైన ఇంగ్లండ్ పర్యటన కోసం అతను కూడా సన్నద్ధమైనట్లు కనిపించింది. ఆస్ట్రేలియా టూర్ ముగిసిన తర్వాత ఐపీఎల్ ఆరంభానికి ముందు తన టెస్టు బ్యాటింగ్ లోపాలను సరిదిద్దుకునేందుకు ఎర్ర బంతితో సంజయ్ బంగర్ పర్యవేక్షణలో అతను తీవ్రంగా సాధన చేయడాన్ని బట్టి చూస్తే ఇప్పటికిప్పుడు టెస్టుల నుంచి తప్పుకోడని అర్థమైంది. అతని అద్భుతమైన ఫిట్నెస్ ఒక కారణం కాగా, ఇంగ్లండ్‌లో తన అనుభవంతో జట్టుకు మార్గదర్శిగా నిలిచే సత్తా అతనిలో ఉంది. రిటైర్మెంట్పై సరైన కారణంగా బయటికీ ఎవరికీ తెలియకపోయినా... వేర్వేరు కారణాలు అతడిని రిటైర్మెంట్ వైపు నడిపించాయి. తాను ఆశించినప్పుడు టెస్టు కెప్టెన్సీ మళ్లీ ఇవ్వకపోవడంతో నిరాశకు గురయ్యాడనని చెబుతున్నా... నాయకత్వం లేకపోతే ఆడలేనని చెప్పే తక్కువ స్థాయి కాదు అతనిది. జట్టు కోసం వంద శాతం శ్రమించే అతనికి ఇది పెద్ద విషయం కాదు. అయితే ప్రస్తుత స్థితిలో కొన్ని అంశాలు అతను తప్పుకోవడానికి కారణంగా కనిపిస్తున్నాయి. ఇంగ్లండ్ సిరీస్‌తో కొత్తగా 2025–27 వరల్డ్ టెస్టు చాంపియన్íÙప్ సైకిల్ మళ్లీ మొదలవుతోంది. వచ్చే రెండేళ్ల పాటు కోహ్లి కొనసాగడం కష్టం కావచ్చు. యువ ఆటగాళ్లతో ప్రణాళికలు రూపొందించుకునే విధంగా తాను తప్పుకోవడమే సరైందని అతను భావించాడు. ఆ్రస్టేలియాతో తొలి టెస్టు సెంచరీ తర్వాత మిగతా 7 ఇన్నింగ్స్‌లు కలిపి 85 పరుగులే చేశాడు. ఇదే వైఫల్యం ఇంగ్లండ్‌లో కొనసాగితే మరింత చెడ్డపేరు రావచ్చు. ప్రస్తుత స్థితిలో మళ్లీ ఫామ్‌ను అందుకొని చెలరేగిపోగలననే నమ్మకం అతనిలో తగ్గినట్లుంది. బీసీసీఐ సూచనల మేరకు రంజీ ట్రోఫీ ఆడినా అక్కడా హిమాన్షు సాంగ్వాన్‌లాంటి సాధారణ బౌలర్ బంతికి క్లీన్‌బౌల్డ్ అయిన తీరు కూడా తన ఆటపై సందేహాలు రేకెత్తించి ఉంటుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కోరినట్లు ఇంగ్లండ్‌తో సిరీస్ వరకు ఆడినా కొత్తగా అతను సాధించేదేమీ ఉండదు. పైగా తీవ్ర ఒత్తిడి, అంచనాలు కూడా. రోహిత్ శర్మలాంటి బ్యాటర్ కూడా తప్పుకోవడంతో అందరి కళ్లూ ఇప్పుడు తన బ్యాటింగ్‌పైనే ఉంటాయి. అంత ఒత్తిడి అనవసరం అని అతను భావించి ఉంటాడు.టెస్టు క్రికెట్లో తొలిసారి బ్యాగీ బ్లూ ధరించి 14 ఏళ్లయింది. ఈ ఫార్మాట్ నాపై ఇంతగా ప్రభావం చూపిస్తుందని ఎప్పుడూ అనుకోలేదు. టెస్టు క్రికెట్ నన్ను పరీక్షించింది. తీర్చిదిద్దింది. జీవితానికి కావాల్సిన పాఠాలు నేర్పించింది. టెస్టులు ఆడటంలో వ్యక్తిగతంగా ఎంతో తృప్తి ఉంది. అందులోని తీవ్రత, సుదీర్ఘ రోజులు, కొన్ని కీలక క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనివి. ఈ ఫార్మాట్ నుంచి తప్పుకోవడం కష్టంగా అనిపిస్తోంది. కానీ సరైన నిర్ణయమే. టెస్టు క్రికెట్‌కు నేను ఎంతో ఇచ్చాను. నేను ఆశించిన దానికంటే ఇది ఎక్కువ నాకు తిరిగి ఇచ్చింది. ఈ ఆటకు, నాతో కలిసి ఆడిన వారికి, అండగా నిలిచిన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు. నా టెస్టు కెరీర్ పూర్తి సంతృప్తితో ముగిస్తున్నా. #269 వీడ్కోలు. –వీడ్కోలు ప్రకటనలో విరాట్ కోహ్లి‘కెప్టేన్ ఫైర్’టీమిండియాను విదేశీ గడ్డపై కూడా వెన్నెముక ఉన్న జట్టుగా సౌరవ్ గంగూలీ నిలబెడితే ఎమ్మెస్ ధోని ‘కూల్ కెప్టేన్’గా జట్టును నడిపించి చూపించాడు. కానీ విరాట్ కోహ్లి అలాంటివాడు కాదు. అతను నాయకుడిగా ఒక రగులుతున్న అగ్నిపర్వతంలాంటివాడు. అప్పటి వరకు ఉన్న స్క్రిప్ట్‌ను తగలబెట్టిన అతను కొత్త నాయకత్వ లక్షణాలను రచించాడు. తన బౌలర్లు, ఫీల్డర్లనుంచి అతను వంద శాతంకు మించి ప్రదర్శనను ఆశించాడు. అందరికంటే ముందు తానే అది చేసి చూపించాడు. తన బౌలింగ్, ఫీల్డింగ్‌ను నమ్ముకొని ‘60 ఓవర్లు వీరికి నరకం కనిపించాలి’ అని లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్‌ను ఆడుకున్న తీరు మర్చిపోలేనిది.కోహ్లికి ముందు చూస్తే బ్యాటర్లయినా భారీ స్కోరుతో జట్టును గెలిపించాలి లేదా స్పిన్నర్లపై భారం ఉండేది. కానీ స్వదేశమైనా, విదేశీ పిచ్ అయినా పేసర్లను అద్భుతంగా వాడుకొని గెలిపించిన తీరు అసాధారణం. ఒక బ్యాటర్‌ను తగ్గించి అయినా అదనపు బౌలర్‌ను తీసుకొని ప్రత్యర్థిని ఆలౌట్ చేయడం, మ్యాచ్ గెలవడమే ముఖ్యంగా కోహ్లి వ్యూహరచన సాగింది. కోహ్లి కెప్టేన్సీలో పేస్ బౌలర్లు కేవలం 26 సగటుతో 591 వికెట్లు పడగొట్టారు. 80ల్లో వివ్ రిచర్డ్సన్ నాయకత్వంలో మాత్రమే పేసర్ల సగటు (22.89) ఇంతకంటే మెరుగ్గా ఉంది. 68 టెస్టుల్లో 40 మ్యాచ్‌లు గెలిపించి భారత అత్యుత్తమ కెప్టేన్‌గా అతను నిలిచాడు. ప్రతికూలతలను దాటి ఆ్రస్టేలియా గడ్డపై తొలి సారి టెస్టు సిరీస్ గెలిపించిన సారథిగా (2018–19) కోహ్లి చరిత్రలో నిలిచిపోయాడు. మరచిపోలేని కొన్ని ఇన్నింగ్స్ 115, 141 (అడిలైడ్, 2014): ధోని గైర్హాజరులో కెప్టెన్‌గా తొలి టెస్టు మ్యాచ్‌లో కోహ్లి అసాధారణ బ్యాటింగ్ ప్రదర్శన కనబర్చాడు. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీతో ఆసీస్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగుల లక్ష్య ఛేదనలో చివరి వరకు పోరాడాడు. 119, 96 (జొహన్నెస్‌బర్గ్, 2013): తొలి ఇన్నింగ్స్‌లో విరాట్ సెంచరీతో భారత్‌కు ఆధిక్యం దక్కగా, రెండో ఇన్నింగ్స్ స్కోరుతో జట్టుకు గెలుపు అవకాశం సృష్టించాడు. 153 (సెంచూరియన్ 2018): కఠినమైన పిచ్‌పై 379 నిమిషాల పాటు పట్టుదలగా నిలబడి సాధించిన సెంచరీ. జట్టులో తర్వాతి అత్యుత్తమ స్కోరు 46 అంటే ఈ ఇన్నింగ్స్ విలువ అర్థమవుతుంది. 123 (పెర్త్, 2018): చేతి వేళ్లకు గాయాలు, హెల్మెట్‌కు దెబ్బలు, బ్యాటర్లంతా కుప్పకూలుతున్నారు. ఇలాంటి స్థితిలో అత్యుత్తమ పేస్, సీమ్ బౌలింగ్‌ను అనూహ్యంగా స్పందిస్తున్న పిచ్‌పై ఎదుర్కొని చేసిన శతకం. ఇరు జట్లలో కలిపి ఇతర బ్యాటర్ల అత్యధిక స్కోరు 70 మాత్రమే. 254 నాటౌట్ (పుణే, 2019): కెరీర్లో అత్యధిక స్కోరు. స్వదేశంలో సఫారీ బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ చేసిన డబుల్ సెంచరీలతో జట్టుకు విజయం. సచిన్ ‘100’ పదిలం!అంతర్జాతీయ క్రికెట్లో దిగ్గజం సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన 100 సెంచరీల రికార్డు ఇక ఎప్పటికీ చెరిగిపోకపోవచ్చు. ఈ ఘనతను అధిగమించగల సత్తా ఉన్న ఒకే ఒక బ్యాటర్‌గా విరాట్ కోహ్లి కనిపించాడు. ఒక దశలో వరుస శతకాలు బాదుతున్న సమయంలో అతను చేరువగా వచ్చినట్లే అనిపించింది. ఆపై ఫామ్ కోల్పోయి కొంత కాలం సెంచరీ లేక విరాట్ కాస్త వెనుకబడ్డాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్‌లో మూడు సెంచరీలు కొట్టిన కోహ్లి...ముంబైలోనే 50వ సెంచరీతో వన్డేల్లో సచిన్ అత్యధిక సెంచరీల రికార్డును సమం చేశాడు.ఆపై పెర్త్ టెస్టులో వంద బాదిన అతను... చాంపియన్స్ ట్రోఫీలో పాక్‌పై సెంచరీతో సచిన్ రికార్డును కూడా దాటాడు. దీంతో ఓవరాల్‌గా కోహ్లి సెంచరీల సంఖ్య 82కు చేరింది. కనీసం మరో రెండేళ్లు అటు టెస్టులు, ఇటు వన్డేలు ఆడి నిలకడైన ప్రదర్శన కనబరిస్తే 100 కష్టం కాదనిపించింది. కానీ ఇప్పుడు టెస్టులను కోహ్లి తప్పుకున్నాడు. తన ఫిట్నెస్, ఇష్టమైన ఫార్మాట్ దృష్ట్యా 2027 వన్డే వరల్డ్ కప్ కొనసాగి ఆపై రిటైర్ అయ్యే ఆలోచనతో కోహ్లి ఉండవచ్చు. ఆ మెగా టోరీ్నలోగా భారత్ వేర్వేరు జట్లతో మొత్తం 27 వన్డేలు ఆడాల్సి ఉంది. కోహ్లి వీటిల్లో ఎంత బాగా ఆడగలడనేది చెప్పలేం. ఎంత అద్భుతమైన ఫామ్, చెలరేగి ఆడినా సరే 27 వన్డేల్లో 18 సెంచరీలు దాదాపు అసాధ్యం! అలా చూస్తే సెంచరీల సెంచరీ రికార్డులు ఢోకా లేదు. నీ క్రికెట్ ప్రస్థానం ఎంతో మంది చిన్నారులు ఆటను ఎంచుకు⇒ నేందుకు స్ఫూర్తిగా నిలిచింది. నీ టెస్టు కెరీర్ నిజంగా చాలా అద్భుతంగా సాగింది. నువ్వు భారత క్రికెట్‌కు పరుగులు మాత్రమే ఇవ్వలేదు. కొత్తతరం వీరాభిమానులను, క్రికెటర్లను అందించావు. అభినందనలు. –సచిన్ టెండూల్కర్⇒ నువ్వు రిటైర్ అయ్యావంటే నమ్మలేకపోతున్నా. ఆధునిక క్రికెట్ దిగ్గజంగా, ఆటకు అసలైన రాయబారిగా నిలిచావు. మనం కలిసి పని చేసినప్పుడు ఎప్పటికీ మర్చిపోలేని ఎన్నో జ్ఞాపకాలను అందించావు. –రవిశాస్త్రి⇒ ఆధునిక క్రికెట్ యుగంలో టెస్టు ఫార్మాట్ కోసం అన్నీ ఇచి్చన అతి పెద్ద బ్రాండ్ కోహ్లి. టెస్టు క్రికెట్ అతనికి ఎంతో రుణపడి ఉంది. –సంజయ్ మంజ్రేకర్ ⇒ సింహంలాంటి పోరాటతత్వం ఉన్నవాడు. ఇకపై నీ లోటు కనిపిస్తుంది. –గౌతమ్ గంభీర్⇒ ‘నేను ఈ నిర్ణయాన్ని ఊహించలేదు. మరికొంత కాలం టెస్టులు ఆడగల సత్తా కోహ్లిలో ఉంది. అతనికి ఘనంగా మైదానంలో వీడ్కోలు దక్కాల్సింది. –అనిల్ కుంబ్లే -
కోహ్లి రిటైర్మెంట్పై స్పందించిన వైఎస్ జగన్
టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లి టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. విరాట్ భారత క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాళ్ళలో ఒకరని ప్రశంసించారు. విరాట్ ఆట చూడటం ఎల్లప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని అన్నారు.క్రికెట్ పట్ల విరాట్‌కు ఉన్న అభిరుచి, ఆటలో అతని స్థిరత్వం, అత్యుత్తమ ప్రదర్శన కోసం అతని దాహం సాటిలేనివని కొనియాడారు. విరాట్ రికార్డులు మాటల కంటే బిగ్గరగా మాట్లాడతాయని అన్నారు. విరాట్ వారసత్వం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని తెలిపారు. విరాట్ తన భవిష్యత్ ప్రయత్నాల్లో విజయవంతకావాలని ఎక్స్ వేదికగా తన సందేశాన్ని పంపారు.One of the greatest Indian cricketer of all time, @imVKohli, bids adieu to Test cricket.It has always been fascinating to watch him play - his passion, consistency and hunger in pursuit of excellence have been unmatched. His records speak louder than words, and his legacy will… pic.twitter.com/wBHNVEwKgY— YS Jagan Mohan Reddy (@ysjagan) May 12, 2025కాగా, 36 ఏళ్ల విరాట్ కోహ్లి ఇవాళ (మే 12) ఉదయం టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించారు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.టీమిండియా టెస్ట్ కెప్టెన్‌గానూ కోహ్లికి ఘనమైన రికార్డు ఉంది. అతని సారథ్యంలో టీమిండియా 68 మ్యాచ్‌ల్లో 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇంత విజయవంతమైన కెప్టెన్ ఎవరూ లేరు. -
ఆటగాడిగా, కెప్టెన్‌గా కోహ్లి సాధించిన ఘనతలు..!
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి సుదీర్ఘ ఫార్మాట్ నుంచి తప్పుకుంటున్నట్లు ఇవాళ (మే 12) ప్రకటించాడు. 2011లో టెస్ట్ అరంగేట్రం చేసిన విరాట్.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో ఎన్నో వ్యక్తిగత రికార్డులు సాధించాడు. కెప్టెన్‌గా చెరగని ముద్ర వేశాడు. విరాట్ టెస్ట్ రిటైర్మెంట్ నేపథ్యంలో అతని రికార్డులపై ఓ లుక్కేద్దాం.2011 వెస్టిండీస్ (జూన్‌లో) పర్యటన సందర్భంగా టెస్ట్ అరంగేట్రం చేసిన కోహ్లి.. 14 ఏళ్ల సుదీర్ఘ కెరీర్లో 123 టెస్ట్‌లు (210 ఇన్నింగ్స్‌లు) ఆడి 46.9 సగటున 9230 పరుగులు చేశాడు. ఇందులో 7 డబుల్ సెంచరీలు, 23 సెంచరీలు, 31 అర్ద సెంచరీలు ఉన్నాయి.కోహ్లి టెస్ట్‌ల్లో 10000 పరుగులు పూర్తి చేయాలని కలలు కాన్నాడు. అయితే అనూహ్య రిటైర్మెంట్ ప్రకటన కారణంగా అతను అనుకున్న టార్గెట్‌ను రీచ్ కాలేకపోయాడు. కోహ్లి తన టార్గెట్‌కు 770 పరుగుల దూరంలో నిలిచిపోయాడు.టీమిండియా టెస్ట్‌ల్లో కనీసం ఐదేళ్లు డామినేట్ చేయడం చూడాలని కోహ్లి కలలుగన్నాడు. దీన్ని అతను కెప్టెన్‌గా ఉన్న కాలంలో (2015-2022) నెరవేర్చుకున్నాడు. కోహ్లి కెప్టెన్‌గా ఉన్న కాలం టీమిండియాకు స్వర్ణ యుగం లాంటిది. కోహ్లి కెప్టెన్సీలో భారత్ 68 మ్యాచ్‌ల్లో ఏకంగా 40 మ్యాచ్‌లు గెలిచింది. భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌గా కోహ్లి రికార్డుల్లో నిలిచిపోయాడు. కోహ్లి కెప్టెన్సీలో భారత్ తొలి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు కూడా చేరింది.భారత టెస్ట్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించే సమయంలో కోహ్లి వ్యక్తిగతంగానూ రాణించాడు. టీమిండియా కెప్టెన్‌గా కోహ్లి ఏ భారత ఆటగాడికి సాధ్యంకాని రీతిలో ఏకంగా ఏడు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు.2016-18 కోహ్లి ఆటగాడిగా, భారత కెప్టెన్‌గా చెలరేగిపోయాడు. ఈ మధ్యకాలంలో కోహ్లి 35 టెస్టుల్లో 66.59 సగటున 3,596 పరుగులు చేశాడు. ఇందులో 14 సెంచరీలు, ఎనిమిది అర్ధ సెంచరీలు ఉన్నాయి. విరాట్ సాధించిన పలు ఘనతలు - కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ విజయాలు: 40 - విరాట్ కోహ్లీ (68 మ్యాచ్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- స్వదేశం వెలుపల అత్యధిక టెస్ట్ విజయాలు: 16 - విరాట్ కోహ్లీ (37 మ్యాచ్‌లు) (భారత కెప్టెన్లలో)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ విజయాలు: 7 - విరాట్ కోహ్లీ (24 మ్యాచ్‌లు)- సేనా దేశాల్లో అత్యధిక టెస్ట్ సెంచరీలు (భారత ఆటగాళ్లలో): 12 విరాట్ కోహ్లి (93 ఇన్నింగ్స్‌లు)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ పరుగులు: 5864 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు) (ఆసియా ఆటగాళ్లలో)- కెప్టెన్‌గా అత్యధిక టెస్ట్ సెంచరీలు: 20 - విరాట్ కోహ్లీ (113 ఇన్నింగ్స్‌లు)- ఆసియా ఖండం అవతల అత్యధిక సెంచరీలు: 14 విరాట్ కోహ్లి (108 ఇన్నింగ్స్‌లు)- అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో నాలుగో స్థానం- కోహ్లి సారథ్యంలో టీమిండియా 49 నెలలు నంబర్ వన్‌గా ఉండింది. -
దిగ్గజ నాయకుడు.. అసలైన టార్చ్ బేరర్! హ్యాట్సాఫ్.. కానీ ఎందుకిలా?
విరాట్ కోహ్లి (Virat Kohli)ని ఇకపై టీమిండియా టెస్టు జట్టులో చూడలేము.. సుదీర్ఘ ఫార్మాట్లో అతడి ఆటను, అల్లరిని మిస్సవుతాము.. అవును!.. పద్నాలుగేళ్లుగా తన అసాధారణ బ్యాటింగ్ నైపుణ్యాలతో అలరించిన కోహ్లి సంప్రదాయ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.టెస్టుల్లో భారత కెప్టెన్‌గా అత్యంత విజయవంతమైన సారథుల్లో ఒకడైన 36 ఏళ్ల కోహ్లి.. తన కెరీర్‌ను ముగించాడు.బ్యాటర్‌గా సూపర్ హిట్తన పద్నాలుగేళ్ల కెరీర్లో కోహ్లి 123 టెస్టులు ఆడి 9230 పరుగులు సాధించాడు. సగటు 46.85. ఇందులో 30 శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఏడు డబుల్ సెంచరీలు కూడా కోహ్లి తన ఖాతాలో వేసుకున్నాడు. సంప్రదాయ ఫార్మాట్లో అతడి అత్యధిక స్కోరు 254. ఆసీస్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్ తదితర విదేశీ గడ్డలపై సెంచరీలతో అలరించాడు.తన అద్బుత బ్యాటింగ్‌తో టెస్టుల్లో సచిన్ టెండుల్కర్ (15,921 పరుగులు), రాహుల్ ద్రవిడ్ (13,265), సునిల్ గావస్కర్ (10,122) తర్వాత అత్యధిక పరుగులు చేసిన నాలుగో భారత బ్యాటర్‌గా కోహ్లి రికార్డు సాధించాడు.టెస్టుల్లో భారత జట్టు దిశను మార్చిన యోధుడు2011లో టెస్టుల్లో అరంగేట్రం చేసిన కోహ్లి.. 2014-15 ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా కెప్టెన్‌గా పగ్గాలు చేపట్టాడు. అప్పటికి భారత్ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. అయితే, ఆ తర్వాత కోహ్లి సారథ్యంలో అగ్రస్థానానికి ఎగబాకింది.చిరస్మరణీయ విజయాలు2018-19లో తొలిసారి ఆసీస్ గడ్డపై కోహ్లి సేన టెస్టు సిరీస్ విజయం సాధించింది. అనంతరం 2021-22లో ఇంగ్లండ్‌లో 2-2తో డ్రా చేసుకుంది. సౌతాఫ్రికాలోనూ చిరస్మరణీయ విజయాలు సాధించింది. సొంతగడ్డపై కోహ్లి కెప్టెన్‌గా వరుసగా 11 టెస్టుల్లో టీమిండియాను గెలిపించాడు.సారథిగా మొత్తంగా 68 మ్యాచ్‌లలో నలభై విజయాలు సాధించిన కోహ్లి.. గ్రేమ్ స్మిత్ (53), రిక్కీ పాంటింగ్ (48), స్టీవ్ వా(41) తర్వాత టెస్టుల్లో అత్యధిక విజయాలు అందుకున్న కెప్టెన్‌గా నిలిచాడు. అంతేకాదు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌కు టీమిండియాను చేర్చాడు. అయితే, 2022లో సౌతాఫ్రికా పర్యటన సందర్భంగా టెస్టు కెప్టెన్సీకి కోహ్లి వీడ్కోలు పలికాడు.ఆ తర్వాత రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఆటగాడిగా కొనసాగిన కోహ్లి.. తాజాగా రోహిత్ టెస్టులకు గుడ్‌బై చెప్పిన వారం లోపే తానూ అదే బాటలో నడిచాడు. సోషల్ మీడియా వేదికగా సోమవారం స్వయంగా కింగ్ రిటైర్మెంట్ విషయాన్ని వెల్లడించడంతో అభిమానుల హృదయాలు ముక్కలయ్యాయి. ‘‘ఇప్పుడే.. ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు కోహ్లి?’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనవుతున్నారు.ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావుభారత మాజీ క్రికెటర్లు కూడా సోషల్ మీడియా వేదికగా ఇదే తరహాలో స్పందిస్తున్నారు. టీమిండియా దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్.. ‘‘ఎందుకు? కోహ్లి రిటైర్ అయ్యావు’’ అని ప్రశ్నించాడు. ఇక భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ స్పందిస్తూ.. ‘‘టెస్టుల్లో అత్యద్భుతమైన కెరీర్ కలిగి ఉన్నందుకు శుభాకాంక్షలు విరాట్ కోహ్లి.అసలైన టార్చ్‌బేరర్ నువ్వేకెప్టెన్గా నువ్వు కేవలం మ్యాచ్‌లు మాత్రమే గెలవలేదు. ఆటగాళ్ల ఆలోచనా విధానాన్ని కూడా మార్చివేశావు. టెస్టుల్లో ఫిట్నెస్, దూకుడుతో పాటు ఒక రకమైన గర్వంతో ఎలా ఆడాలో చూపించావు. కొత్త ప్రమాణాలు రూపొందించావు. భారత టెస్టు క్రికెట్లో అసలైన టార్చ్‌బేరర్ నువ్వే. ధన్యవాదాలు’’ అంటూ ఉద్వేగపూరిత నోట్ పంచుకున్నాడు.చదవండి: కోహ్లి రిటైర్మెంట్పై బీసీసీఐ ట్వీట్.. మండిపడుతున్న అభిమానులు -
యూ టర్న్ తీసుకున్న యశస్వి జైస్వాల్
టీమిండియా యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మనసు మార్చుకున్నాడు. దేశవాలీ క్రికెట్లో గోవాకు ఆడాలనుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నాడు. జైస్వాల్ కొద్ది రోజుల కిందట ముంబై నుంచి గోవాకు వలస వెళ్లాలని (దేశవాలీ క్రికెట్) నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా అతను ముంబై క్రికెట్ అసోసియేషన్‌పై (MCA) ఒత్తిడి తెచ్చి మరీ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) పొందాడు. తాజాగా ఈ విషయంలో జైస్వాల్ యూ టర్న్ తీసుకున్నాడు. తిరిగి తాను ముంబైకే ఆడాలని నిర్ణయించుకున్నట్లు ఎంసీఏకు ఈ-మెయిల్ ద్వారా సందేశాన్ని పంపాడు. వారు జారీ చేసిన ఎన్వోసీని వెనక్కు తీసుకోవాలని కోరాడు. గోవాకు వలస వెళ్లాలనుకున్న తన ప్రణాళికను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపాడు. ఈ దేశవాలీ సీజన్లో సెలెక్షన్‌కు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశాడు. ఎంసీఏ తిరిగి తనను ముంబైకి ఆడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశాడు. ఎంసీఏ ఇచ్చిన ఎన్వోసీని బీసీసీఐకి కానీ గోవా క్రికెట్ అసోసియేషన్‌కు కాని సమర్పించలేదని తెలిపాడు.కాగా, ఉత్తర్‌ప్రదేశ్‌లో పుట్టిన జైస్వాల్.. ముంబై తరఫున దేశవాలీ క్రికెట్ ఆడి టీమిండియాలో, ఐపీఎల్లో చోటు దక్కించుకున్నాడు. వ్యక్తిగత కారణాల చేత తనకు జీవితాన్ని ఇచ్చిన ముంబై క్రికెట్ అసోసియేషన్‌నే వదిలి వెళ్లాలనుకున్న జైస్వాల్ ఎందుకో తిరిగి మనసు మార్చుకున్నాడు. వాస్తవానికి గోవా క్రికెట్ అసోసియేషన్ జైస్వాల్‌కు కెప్టెన్సీ ఆశ చూపి తమవైపు మళ్లేలా చేసుకుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ, అతను తిరిగి పాత జట్టు ముంబైకే ఆడాలనుకుంటున్నాడు.జైస్వాల్‌కు ముంబై తరఫున ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. ఆ జట్టు తరఫున ఫార్మాట్లకతీతంగా విశేషంగా రాణించాడు. 2018-19 రంజీ సీజన్లో తొలిసారి ముంబైకు ప్రాతినిథ్యం వహించిన జైస్వాల్.. అతి తక్కువ వ్యవధిలో చాలా పాపులర్ అయ్యాడు. ముంబై తరఫున ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 60కి పైగా సగటుతో 13 సెంచరీలు, 12 అర్ద సెంచరీల సాయంతో 3712 పరుగులు చేశాడు. ఇందులో డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి.2019-20 సీజన్లో ముంబై తరఫున లిస్ట్-ఏ క్రికెట్లోకి అడుగుపెట్టిన జైస్వాల్.. విజయ్ హజారే ట్రోఫీలో జరిగిన ఓ మ్యాచ్‌లో డబుల్ సెంచరీ చేశాడు. ఈ ప్రదర్శన కారణంగానే జైస్వాల్‌కు ఐపీఎల్ ఛాన్స్ దక్కింది. 2020 సీజన్ వేలంలో రాజస్థాన్ రాయల్స్ జైస్వాల్‌ను సొంతం చేసుకుంది. ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోని జైస్వాల్ ఫార్మాట్లకతీతంగా దేశవాలీ క్రికెట్లో, అంతర్జాతీయ క్రికెట్లో, ఐపీఎల్లో చెలరేగిపోతున్నాడు. -
ఆపరేషన్ సిందూర్ 2.0పై అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు
పహల్గామ్ ఉగ్రదాడుల నేపథ్యంలో పాక్ దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సిందూర్ 2.0 పేరిట భారత బలగాలు ఇస్తున్న ధీటైన సమాధానంపై టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. కంటికి కన్ను అనుకుంటూ పోతే ప్రపంచం గుడ్డిదవుతుందని ఎక్స్ వేదికగా అభిప్రాయపడ్డాడు. రాయుడు చేసిన ఈ ట్వీట్ సోషల్‌మీడియాలో దుమారం రేపుతుంది. రాయుడును నెటిజన్లు ఆడుకుంటున్నారు.“An eye for an eye makes the whole world blind.”Let’s remember — this isn’t a call for weakness, but a reminder of wisdom.Justice must stand firm, but never lose sight of humanity.We can love our nation fiercely and still hold compassion in our hearts.Patriotism and peace can…— ATR (@RayuduAmbati) May 8, 2025విషయం పూర్తిగా తెలిసే ఇలాంటి కామెంట్లు చేస్తున్నావా అని మండిపడుతున్నారు. ఎవరు మొదలుపెట్టారో తెలిసే వాగుతున్నావా అని ప్రశ్నిస్తున్నారు. ఉగ్రమూకలపై ప్రతి చర్యకు దిగికపోతే వారు మనల్ని మట్టుబెడతారని అంటున్నారు. పాక్ సానుభూతిపరుడిలా ఉన్నావంటూ దుమ్మెత్తిపోస్తున్నారు. భారత దళాలు పాక్ దుశ్చర్యలను కేవలం తిప్పికొడుతున్నారన్న విషయాన్ని గమనించాలని కోరుతున్నారు. ఇలాంటి సమయంలో భారత దళాలకు మద్దతుగా నిలవాలి కాని, శాంతి అంటూ ఉపోద్ఘాతాలు ఇవ్వకూడదని చురకలంటిస్తున్నారు.Prayers for peace and safety in Jammu & Kashmir, Punjab and other parts of India along the border. Hoping for strength, security and swift resolution for everyone affected. Jai Hind!— ATR (@RayuduAmbati) May 8, 2025తన ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో రాయుడు డిఫెన్స్‌లో పడ్డాడు. సదరు ట్వీట్‌ను తొలగించకపోయినా, జనాలను శాంతింప జేసేందుకు మరో రెండు ట్వీట్లు చేశాడు. వీటిలో మొదటి దాంట్లో ఇలా రాసుకొచ్చాడు. జమ్మూ కశ్మీర్, పంజాబ్ మరియు భారతదేశంలోని ఇతర సరిహద్దు ప్రాంతాల్లో శాంతి భద్రత కోసం ప్రార్ధిస్తున్నాను. ప్రభావితమైన ప్రతి ఒక్కరికీ బలం, భద్రత మరియు త్వరిత పరిష్కారం కోసం ఆశిస్తున్నాను. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.In moments like these, we stand united not in fear, but in resolve. I feel immense gratitude to our Indian Army who are the real heroes who carry the weight of a nation with unmatched courage, discipline, and selflessness🙏🏻Your sacrifices don't go unnoticed. Your bravery is what…— ATR (@RayuduAmbati) May 8, 2025రెండో ట్వీట్లో ఇలా రాశాడు. ఇలాంటి క్షణాల్లో మేము భయంతో కాదు, దృఢ సంకల్పంతో ఐక్యంగా ఉన్నాము. అసమాన ధైర్యం, క్రమశిక్షణ మరియు నిస్వార్థతతో దేశ భద్రతను కాపాడుతున్న మన భారత సైన్యానికి అపారమైన కృతజ్ఞతలు. మీ త్యాగాలు గుర్తించబడకుండా ఉండవు. మీ ధైర్యమే త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తుంది. మీ ధీరత్వమే మన సరిహద్దులను సురక్షితంగా ఉంచుతుంది. మీ బలం ఎల్లప్పుడూ మమ్మల్ని భద్రంగా ఉంచాలి. మీ సేవ మరింత శాంతియుత రేపటికి మార్గం సుగమం చేయాలి. జై హింద్ అంటూ రాసుకొచ్చాడు.రాయుడు ముందు చేసిన ట్వీట్‌కు డ్యామేజ్ కంట్రోల్‌గా ఈ ట్వీట్లు చేసినప్పటికీ జనాల ఆగ్రహం తగ్గలేదు. మొదటి ట్వీట్‌నే ఆసరగా చేసుకుని ఏకి పారేస్తున్నారు. టీమిండియా, ఐపీఎల్, రాజకీయాలతో ముడిపెట్టి తోచిన రీతిలో కామెంట్లు చేస్తున్నారు. మొత్తాన్ని ఐపీఎల్ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్న వేల రాయుడు క్రికెట్ అభిమానులకు మంచి స్టఫ్‌గా మారాడు. -
క్రికెట్ అభిమానులకు గుండె పగిలే వార్త.. రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ
టీమిండియా అభిమానులకు గుండె పగిలే వార్త. రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని హిట్‌మ్యాన్ స్వయంగా తన ఇన్‌స్టా ఖాతా ద్వారా వెల్లడించాడు. తన రిటైర్మెంట్ తక్షణమే అమల్లోకి వస్తుందని రోహిత్ పేర్కొన్నాడు. రోహిత్ తన రిటైర్మెంట్ ప్రకటనలో ఇలా రాసుకొచ్చాడు. "అందరికీ నమస్కారం, నేను టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్న విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. తెల్ల దుస్తుల్లో నా దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గౌరవంగా ఉంది. సంవత్సరాలుగా మీ అందరి ప్రేమ మరియు మద్దతుకు ధన్యవాదాలు. వన్డే ఫార్మాట్లో కొనసాగుతాను"38 ఏళ్ల రోహిత్ భారత్ తరఫున 67 టెస్ట్‌లు ఆడి 40.6 సగటున 4301 పరుగులు చేశాడు. ఇందులో ఓ డబుల్ సెంచరీ, 11 సెంచరీలు, 18 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 2022లో విరాట్ కోహ్లి నుంచి టెస్ట్ కెప్టెన్సీని చేపట్టిన రోహిత్.. 24 టెస్ట్‌ల్లో టీమిండియా సారథిగా వ్యవహరించాడు. ఇందులో 12 మ్యాచ్‌ల్లో భారత్‌ను విజేతగా నిలబెట్టాడు. 9 మ్యాచ్‌ల్లో భారత జట్టు ఓడగా.. మూడు మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. రోహిత్ తర్వాత టీమిండియా తదుపరి టెస్ట్ కెప్టెన్‌ను ప్రకటించాల్సి ఉంది. రేసులో శుభ్‌మన్ గిల్ ముందున్నాడు. రోహిత్ గతేడాది పొట్టి ప్రపంచకప్ తర్వాత టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ టోర్నీలో రోహిత్ భారత్‌ను జగజ్జేతగా నిలిపాడు. ఇదిలా ఉంటే, ఇటీవలి కాలంలో టెస్ట్‌ల్లో రోహిత్ శర్మ ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. గత 10 టెస్ట్ మ్యాచ్‌ల్లో హిట్‌మ్యాన్ ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు మాత్రమే చేశాడు. తాజాగా ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. 5 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 31 పరుగులు మాత్రమే చేశాడు. పేలవ ప్రదర్శన కారణంగా ఆ సిరీస్ ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ స్వతాహాగా జట్టు నుంచి తప్పుకున్నాడు.అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. ఆ సిరీస్‌లో మూడు మ్యాచ్‌ల్లో కేవలం 91 పరుగులు మాత్రమే చేశాడు. వ్యక్తిగతంగా విఫలం కావడమే కాకుండా ఈ రెండు సిరీస్‌ల్లో రోహిత్ కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. ఈ రెండు సిరీస్‌లను భారత్ కోల్పోయింది. -
టీమిండియా భారీ టార్గెట్.. వీరోచితంగా పోరాడిన సౌతాఫ్రికా
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో ఇవాళ (మే 7) భారత్, సౌతాఫ్రికా జట్లు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత్ 23 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. జెమీమా రోడ్రిగెజ్ (123) శతక్కొట్టడంతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 337 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత ఇన్నింగ్స్‌లో జెమీమాతో పాటు స్మృతి మంధన (51), దీప్తి శర్మ (93) కూడా సత్తా చాటారు. దీప్తి 7 పరుగులతో సెంచరీని కోల్పోయింది.అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన సౌతాఫ్రికా చివరి వరకు వీరోచితంగా పోరాడినప్పటికీ గెలవలేకపోయింది. అన్నెరీ డెర్క్సన్ (81), కెప్టెన్ క్లో ట్రయాన్ (67) సౌతాఫ్రికాను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేయగలిగింది. భారీ లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా ఆటగాళ్లు పోరాడిన తీరు అభిమానులను ఆకట్టుకుంది. భారత బౌలర్లలో అమన్‌జోత్ కౌర్ 3, దీప్తి శర్మ 2, శ్రీ చరణి, ప్రతిక రావల్ తలో వికెట్ తీశారు. ఫైనల్ రేసులో నిలవాలంటే సౌతాఫ్రికా ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాల్సి ఉండింది. ఈ ఓటమితో సౌతాఫ్రికా టోర్నీ నుంచి నిష్క్రమించింది. భారత్, శ్రీలంక ఫైనల్‌కు చేరుకున్నాయి. మే 11న కొలొంబో వేదికగా ఫైనల్ జరుగుతుంది. అంతకుముందు సౌతాఫ్రికా మే 9న శ్రీలంకతో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది.ఈ టోర్నీలో సౌతాఫ్రికా ఆడిన మూడు మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. భారత్ నాలుగింట మూడు గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా.. శ్రీలంక మూడింట రెండు గెలిచి రెండో స్థానంలో ఉంది. -
వాళ్లకు డబ్బులు ఇచ్చానో లేదో మీకెందుకు?
సుదీర్ఘ కాలంగా తనపై విమర్శలు చేసే ఇద్దరు భారత మాజీ కెప్టెన్ల వ్యాఖ్యలపై టీమిండియా హెడ్‌కోచ్ గౌతం గంభీర్ (Gautam Gambhir) ఘాటుగా స్పందించాడు. ప్రస్తుతం కామెంటేటర్లుగా ఉన్న సునీల్ గావస్కర్ (Sunil Gavaskar), రవిశాస్త్రి (Ravi Shastri) తనపై పదే పదే విమర్శలు చేసిన విషయాన్ని పరోక్షంగా గంభీర్ గుర్తు చేశాడు. ఆ గాయం అంత పెద్దదేమీ కాదుకాగా 2011లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో గంభీర్ తలకు తగిలిన గాయం ‘అంత పెద్దదేమీ కాదు’ అని రవిశాస్త్రి అప్పట్లో విమర్శించాడు. మరోవైపు.. తాజాగా చాంపియన్స్ ట్రోఫీ గెలిచాక బీసీసీఐ ప్రకటించిన ప్రైజ్‌మనీలో సహచర కోచింగ్ సిబ్బందికంటే గంభీర్ ఎక్కువ మొత్తం తీసుకోవడాన్ని గావస్కర్ ప్రశ్నించాడు.ఇప్పుడు వీరిద్దరికి కలిపి గంభీర్ సమాధానమిచ్చాడు. ‘నేను కోచ్‌గా వచ్చి ఎనిమిది నెలలే అయింది. ఫలితాలు రాకపోతే విమర్శించే హక్కు అభిమానులకు ఉంది. కానీ 25 ఏళ్లుగా కామెంటరీ బాక్స్‌లో కూర్చున్నవారు భారత క్రికెట్‌ను తమ ఆస్తిగా భావిస్తున్నట్లున్నారు. డబ్బులు ఇచ్చానా లేదా అనేది మీకెందుకు?కానీ భారత్ క్రికెట్ వారిది కాదు.. 140 కోట్ల మంది భారతీయులది. వారు నా కోచింగ్‌ను, నా గాయాన్ని, చాంపియన్స్ ట్రోఫీ ప్రైజ్‌మనీని కూడా ప్రశ్నించారు. నేను నిజానికి ఎవరికీ వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరేవాళ్లకు డబ్బులు ఇచ్చానా లేదా అనేది వారికి అనవసరం. నేనెంత డబ్బు ఖర్చుపెట్టాను.. ఎంత పెట్టుబడి పెట్టాను అన్న వివరాలు వారికెందుకు? అయినా నేనేమీ ఇక్కడ సంపాదించి విదేశాలకు వలసవెళ్లిపోలేదే? 180 రోజులు విదేశాల్లోనే గడపడం లేదే? నేను భారతీయుడిని.. పన్ను తప్పించుకునేందుకు ఎన్నారైగా మారటం లేదు. గాజు గృహాల్లో ఉండేవారు వేరేవాళ్ల మీద రాళ్లు విసరవద్దు’ అని గంభీర్ కౌంటర్ ఇచ్చాడు.గంభీర్ మార్గదర్శనంలోకాగా టీ20 ప్రపంచకప్-2024 గెలిచిన తర్వాత రాహుల్ ద్రవిడ్ టీమిండియా హెడ్‌కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోగా.. గంభీర్ ఆ పదవిని చేపట్టాడు. అతడి మార్గదర్శనంలో భారత జట్టు పరిమిత ఓవర్ల క్రికెట్లో మెరుగ్గా రాణిస్తోంది.టీ20 ద్వైపాక్షిక సిరీస్‌లలో వరుస విజయాలు సాధిస్తున్న టీమిండియా... దాదాపు రెండున్నర దశాబ్దాల తర్వాత శ్రీలంకతో వన్డే సిరీస్‌ను మాత్రం కోల్పోయింది. అయితే, ఇటీవలే ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచి సత్తా చాటింది. ఈ క్రమంలో బీసీసీఐ రూ. 58 కోట్ల క్యాష్ రికార్డు ప్రకటించింది. ఆటగాళ్లకు ఒక్కొక్కరికి రూ. 3 కోట్ల చొప్పున.. అదే విధంగా హెడ్‌కోచ్ గంభీర్‌కు రూ. 3 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అయితే, గతంలో ద్రవిడ్ తాను ప్రత్యేకంగా ఎక్కువ ప్రైజ్‌మనీ తీసుకోకుండా.. సహాయక సిబ్బందికి సమానంగా పంచాడని గావస్కర్ గుర్తు చేశాడు.ఇదిలా ఉంటే.. టెస్టుల్లో టీమిండియా గంభీర్ మార్గదర్శనంలో దారుణంగా విఫలమవుతోంది. తొలుత సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో వైట్‌వాష్‌కు గురైంది. తర్వాత ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడి పదేళ్ల తర్వాత బోర్డర్- గావస్కర్ట్రోఫీని చేజార్చుకుంది.చదవండి: టీ20 క్రికెట్లో అది నేరం లాంటిదే!.. ఏదేమైనా క్రెడిట్ మా బౌలర్లకే: ఓటమిపై హార్దిక్ -
టోర్నీ మధ్యలో వైదొలిగిన టీమిండియా ప్లేయర్
భారత మహిళా క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంకలో జరుగుతున్న ట్రై నేషన్ సిరీస్‌లో ఆడుతుంది. ఈ టోర్నీలో భారత్, శ్రీలంక, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు సాధించి, పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. శ్రీలంక కూడా మూడింట రెండు విజయాలు సాధించి, రన్‌రేట్ విషయంలో భారత్ కంటే వెనుకపడి ఉండటంతో రెండో స్థానంలో ఉంది. సౌతాఫ్రికా జట్టు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో పరాజయాలు ఎదుర్కొని చివరి స్థానంలో నిలిచింది. తాజాగా జరిగిన మ్యాచ్‌లో భారత్‌పై శ్రీలంక సంచలన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 275 పరుగులు చేయగా.. శ్రీలంక మరో 5 బంతులు మిగిలుండగానే 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత్ మే 7న జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను ఢీకొట్టనుంది. ఆతర్వాత మే 9న శ్రీలంక, సౌతాఫ్రికా తలపడనున్నాయి. పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో ఉండే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి.భారత్‌కు ఎదురుదెబ్బసౌతాఫ్రికాతో జరుగబోయే మ్యాచ్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ టోర్నీలోనే అరంగేట్రం చేసిన 22 ఏళ్ల బ్యాటింగ్ ఆల్‌రౌండర్ కశ్వీ గౌతమ్ గాయం బారిన పడింది. ఈ కారణంగా ఆమె టోర్నీ నుంచి వైదొలిగింది. శ్రీలంకతో జరిగిన గత మ్యాచ్ సందర్భంగా కశ్వీ కాలికి గాయమైంది. కశ్వీ స్థానాన్ని అన్ క్యాప్డ్ పేసర్ క్రాంతి గౌడ్‌తో రీప్లేస్ చేశారు భారత సెలెక్టర్లు. కశ్వీ గత డబ్ల్యూపీఎల్ సీజన్లో విశేషంగా రాణించి టీమిండియాలో స్థానం సంపాదించింది. కశ్వీ డబ్ల్యూపీఎల్‌లో గుజరాత్ జెయింట్స్‌కు ప్రాతినథ్యం వహిస్తుంది. -
అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నా: కోహ్లి
టీమిండియా బ్యాటర్‌గా, కెప్టెన్‌గా ఎన్నో అరుదైన ఘనతలు సాధించాడు విరాట్ కోహ్లి (Virat Kohli). అయితే, 2021 టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు పేలవ ప్రదర్శన నేపథ్యంలో పొట్టి ఫార్మాట్ పగ్గాలు వదిలేశాడు. అదే ఏడాది తన ఐపీఎల్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (RCB) కెప్టెన్‌గానూ కోహ్లి వైదొలిగాడు. ఆ మరుసటి సంవత్సరం టీమిండియా వన్డే, టెస్టు జట్టు సారథిగానూ తప్పుకొన్నాడు.ఆ తర్వాత కోహ్లి 2.0గా తిరిగొచ్చి ప్రస్తుతం ఇటు టీమిండియా వన్డే, టెస్టు జట్లలో.. అటు ఆర్సీబీలో స్టార్ బ్యాటర్‌గా కొనసాగుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్-2025 (IPL 2025)తో బిజీగా ఉన్న ఈ బెంగళూరు ఆటగాడు.. తాను కెప్టెన్సీ నుంచి వైదొలగడానికి కారణాల గురించి తాజాగా మాట్లాడాడు.అందుకే టీమిండియా, ఆర్సీబీ కెప్టెన్‌గా తప్పుకొన్నాఆర్సీబీ బోల్డ్ డైరీస్ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ.. ‘‘ఒకానొక సమయంలో... పరిస్థితులన్నీ కఠినంగా మారిపోయాయి. నా కెరీర్లో చాలా మార్పులు జరిగిపోతున్నాయి. అప్పటికి ఏడు- ఎనిమిదేళ్ల నుంచి నేను టీమిండియా కెప్టెన్‌గా ఉన్నాను.ఆర్సీబీకి తొమ్మిదేళ్లుగా సారథిగా కొనసాగుతున్నాను. ఆ సమయంలో నా బ్యాటింగ్ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రతీ మ్యాచ్‌లోనూ నేను బాగా ఆడాలనే ఆకాంక్షలు ఉన్నాయి. కెప్టెన్‌గా ఉన్నా.. బ్యాటర్‌గా కొనసాగినా ఇలాంటివి తప్పదని అర్థమైంది. 24*7 నేను ఎక్స్పోజ్ అవుతూనే ఉంటా. ఇది నాకు కఠినంగా తోచింది.పరిస్థితులు నా ఆధీనంలో లేకుండా పోయాయి. అప్పుడే నేను సంతోషంగా ఉండాలని.. నా ఆనందం కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. అందుకే కెప్టెన్సీ నుంచి వైదొలిగాను. వ్యక్తిగత జీవితంలో నా కంటూ కొన్ని ప్రత్యేక పేజీలు ఉండాలి.ఆటగాడిగా వచ్చి నా పని పూర్తి చేసి వెళ్తాలి.. నా ఆటను విమర్శించే అవకాశం ఇవ్వకూడదని డిసైడ్ అయ్యాను. ఈ సీజన్లో జరుగుతున్నది ఇదే’’ అని విరాట్ కోహ్లి చెప్పుకొచ్చాడు. కాగా అండర్-19 క్రికెట్లో కెప్టెన్‌గా భారత్‌కు టైటిల్ అందించాడు కోహ్లి. ఈ క్రమంలో జాతీయ జట్టులోకి దూసుకువచ్చిన ఈ ఢిల్లీ బ్యాటర్.. మహేంద్ర సింగ్ ధోని నాయకత్వంలో రాటుదేలాడు.కెప్టెన్‌గానూ తనదైన ముద్రబ్యాటింగ్ ఆర్డర్లో మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తూ.. ఇప్పటి వరకు ఎవరికీ సాధ్యం కాని రికార్డులెన్నో సాధించాడు. కెప్టెన్‌గానూ తనదైన ముద్ర వేశాడు. ఆస్ట్రేలియాలో టెస్టుల్లో భారత్‌ను విజేతగా నిలపడం కోహ్లి కెరీర్లో చిరస్మరణీయంగా గుర్తుండిపోతుంది.ఇక భారత జట్టు సారథిగా మూడు ఫార్మాట్లలో కలిపి 213 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి ఖాతాలో 135 విజయాలు ఉన్నాయి. అదే విధంగా ఆటగాడిగా.. 2008 నుంచి ఇప్పటి వరకు టీమిండియా తరఫున ఈ కుడిచేతి వాటం బ్యాటర్ 123 టెస్టులు, 302 వన్డేలు, 125 టీ20లు పూర్తి చేసుకున్నాడు.రికార్డుల రారాజుటెస్టుల్లో 9230, వన్డేల్లో 14181, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. కోహ్లి ఖాతాలో 30 టెస్టు సెంచరీలు, వన్డేల్లో 51 శతకాలు, అంతర్జాతీయ టీ20లలో ఒక సెంచరీ ఉంది. తద్వారా ఓవరాల్‌గా 82 సెంచరీలతో.. శతక శతకాల ధీరుడు సచిన్ టెండుల్కర్ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు కోహ్లి.ఇక వన్డేల్లో 51 సెంచరీలతో సచిన్‌ను కూడా దాటేసి అత్యధిక శతకాల వీరుడిగా చరిత్ర సృష్టించాడు కూడా!.. ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే.. 2008 నుంచీ ఆర్సీబీకే ఆడుతున్న కోహ్లి 263 మ్యాచ్‌లలో ఎనిమిది శతకాలతో కలిపి 8509 పరుగులతో టాప్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. ఐపీఎల్-2025లోనూ ఇప్పటికి పదకొండు మ్యాచ్‌లలో కలిపి 505 పరుగులతో ఆరెంజ్ క్యాప్ హోల్డర్‌గా ఉన్నాడు.చదవండి: SRH Vs DC: ‘హే.. వెళ్లు.. వెళ్లు.. నువ్వు అవుట్’!.. కావ్యా మారన్ రియాక్షన్ వైరల్ -
వార్షిక ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకున్న టీమిండియా
ఐసీసీ వార్షిక పరిమిత ఓవర్ల ఫార్మాట్ల ర్యాంకింగ్స్ భారత పురుషుల క్రికెట్ జట్టు అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈ ర్యాంకింగ్స్ గతేడాది మే నుండి జరిగిన అన్ని మ్యాచ్‌లను 100 శాతంగా, గత రెండు సంవత్సరాల్లో జరిగిన మ్యాచ్‌లను 50 శాతంగా పరిగణలోకి తీసుకుని నిర్ణయించబడ్డాయి. ప్రస్తుత వన్డే, టీ20 ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో ఉన్న టీమిండియా.. వార్షిక ర్యాంకింగ్స్‌లోనూ టాప్ ప్లేస్ దక్కించుకుంది. గడిచిన రెండేళ్లలో పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో విశేషంగా రాణిస్తున్న టీమిండియా.. గతేడాది టీ20 ప్రపంచకప్, ఈ ఏడాది ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా విడుదల చేసిన వార్షిక వన్డే ర్యాంకింగ్స్‌లో భారత్ రెండు పాయింట్లు మెరుగుపర్చుకుని పాయింట్ల సంఖ్యను 122 నుంచి 124కు పెంచుకుంది. భారత్ తర్వాత రెండో స్థానంలో ఛాంపియన్స్ ట్రోఫీ రన్నరప్ న్యూజిలాండ్ ఉంది. న్యూజిలాండ్.. వన్డేల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను వెనక్కు నెట్టి రెండో స్థానానికి చేరుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీలో పేలవ ప్రదర్శన కనబర్చిన ఆసీస్ మూడో స్థానానికి పడిపోయింది.ఇటీవల స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో భారత్, ఆసీస్‌కు ఓడించిన శ్రీలంక ఐదు రేటింగ్ పాయింట్లు మెరుగుపర్చుకుని తాజా ర్యాంకింగ్స్‌లో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. పాకిస్తాన్, సౌతాఫ్రికా ఐదు, ఆరు స్థానాల్లో నిలిచాయి. గత రెండేళ్లలో మెరుగైన ప్రదర్శనలు చేసిన ఆఫ్ఘనిస్తాన్ రేటింగ్ పాయింట్లు పెంచుకుని ఏడో స్థానానికి ఎగబాకగా.. మాజీ వరల్డ్ ఛాంపియన్స్ ఇంగ్లండ్ ఎనిమిదో స్థానానికి పడిపోయింది. వెస్టిండీస్, బంగ్లాదేశ్ వరుసగా తొమ్మిది, పది స్థానాల్లో ఉన్నాయి.మరోవైపు టీ20 ర్యాంకింగ్స్‌లోనూ భారత్ హవా కొనసాగింది. ప్రస్తుత టీ20 ఛాంపియన్స్ అయిన భారత్ టాప్ ప్లేస్‌లో ఉండగా.. ఆసీస్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికా, శ్రీలంక, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ వరుస స్థానాల్లో నిలిచాయి.టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాఐసీసీ వార్షిక ర్యాంకింగ్స్‌లో ప్రస్తుత డబ్ల్యూటీసీ ఛాంపియన్ ఆస్ట్రేలియా టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. ఆసీస్ రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ కంటే 13 పాయింట్లు అధికంగా సాధించింది. ఈ దఫా డబ్ల్యూటీసీ ఫైనల్లో ఆసీస్‌ను ఎదుర్కోబోయే సౌతాఫ్రికా మూడో స్థానంలో నిలిచింది. ఇటీవల న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో పరాజయాల నేపథ్యంలో భారత్ నాలుగో స్థానానికి దిగజారింది. న్యూజిలాండ్, శ్రీలంక, పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఐర్లాండ్ టాప్-10లో ఉన్నాయి. -
ఇంటర్నేషనల్ బ్రాండ్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా కేఎల్ రాహుల్
ప్రముఖ ఇంటర్నేషనల్ బ్రాండ్ పాల్ & షార్క్‌కు (Paul & Shark) గ్లోబల్ అంబాసిడర్‌గా టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ నియమితుడయ్యాడు. ఈ విషయాన్ని పాల్ & షార్క్ సంస్థ యాజమాన్యం ఇవాళ (మే 2) ప్రకటించింది. రాహుల్ లాంటి నిష్ణాతుడైన క్రికెటర్‌తో భాగస్వామ్యం పొందడం తమ సంస్థకు గర్వకారణమని పేర్కొంది. రాహుల్ పాల్ & షార్క్‌కు గ్లోబల్ అంబాసిడర్‌గా ఎంపికైన మొట్టమొదటి భారత అథ్లెట్.పాల్ & షార్క్ అనేది ఇటలీకి చెందిన లగ్జరీ దుస్తుల కంపెనీ. ఈ సంస్థను పాలో డిని అనే వ్యాపారవేత్త 1975లో స్థాపించాడు. దీని ప్రధాన కార్యాలయం వారెస్లో ఉంది. ఈ ఫ్యాషన్ బ్రాండ్ ప్రధానంగా లైఫ్‌స్టైల్ మరియు స్పోర్ట్‌వేర్ దుస్తులను తయారు చేస్తుంది. ఈ కంపెనీ లోగోపై షార్క్ గుర్తు ఉంటుంది. ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా 280 స్టోర్లు ఉన్నాయి. పాల్ & షార్క్ భారత్‌లో 15 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ కంపెనీకి భారత్‌లో ప్రముఖ నగరాల్లో స్టోర్లు ఉన్నాయి.ఇదిలా ఉంటే, కేఎల్ రాహుల్ ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నాడు. ఈ సీజన్లో అతను ప్రాతినిథ్యం వహిస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్ ప్లే ఆఫ్స్ బెర్త్‌కు ప్రధాన పోటీదారుగా ఉంటూ, పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతుంది. ఢిల్లీ ఇప్పటివరకు ఆడిన 10 మ్యాచ్‌ల్లో 6 విజయాలు సాధించింది. ఈ జట్టు విజయాల్లో కేఎల్ రాహుల్‌ది కీలకపాత్ర. రాహుల్ ఈ సీజన్లో 9 మ్యాచ్‌లు ఆడి 53 సగటున, 146.06 స్ట్రయిక్‌రేట్‌తో 371 పరుగులు చేసి లీడింగ్ రన్‌స్కోరర్ల జాబితాలో తొమ్మిదో స్థానంలో ఉన్నాడు. ఢిల్లీ తమ తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ మే 5న హైదరాబాద్‌లో జరుగనుంది. -
Rohit Sharma: ఆ 'మూడు రికార్డులు' ఎవ్వరూ బద్దలు కొట్టలేరు..!
టీమిండియా కెప్టెన్, ముంబై ఇండియన్స్ స్టార్ ఆటగాడు రోహిత్ శర్మ ఇవాళ (ఏప్రిల్ 30) 38వ పడిలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా హిట్‌మ్యాన్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. సహచర క్రికెటర్లతో పాటు అభిమానులు సోషల్‌మీడియా వేదికగా రోహిత్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.BIRTHDAY CELEBRATION OF INDIAN CAPTAIN ROHIT SHARMA ♥️ pic.twitter.com/cQQRzoRpCd— Johns. (@CricCrazyJohns) April 30, 2025ప్రస్తుతం ఐపీఎల్ 2025 ఆడుతున్న రోహిత్.. తన జట్టు సభ్యులు మరియు భార్య రితక సజ్దేతో కలిసి కేక్ కట్ చేశాడు. హిట్‌మ్యాన్ పుట్టిన రోజు సందర్భంగా అతను సాధించిన రికార్డులపై ఓ లుక్కేద్దాం.THE BIRTHDAY CELEBRATIONS OF HITMAN ROHIT SHARMA. 🥹- Moments of the Day. ❤️ pic.twitter.com/ZncZTNEVB6— Tanuj (@ImTanujSingh) April 30, 20252007లో టీమిండియా తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేసిన రోహిత్ శర్మ తన కెరీర్లో ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆటగాడిగా, కెప్టెన్‌గా తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు. టీమిండియా తరఫున 67 టెస్ట్‌లు, 273 వన్డేలు, 159 టీ20లు ఆడిన హిట్‌మ్యాన్ మూడు ఫార్మాట్లలో కలిపి 19700 పరుగులు చేశాడు. ఇందులో 49 సెంచరీలు, 108 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఐపీఎల్లో డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఆడిన రోహిత్ మొత్తం 266 మ్యాచ్‌లు ఆడి 2 సెంచరీలు, 45 హాఫ్ సెంచరీల సాయంతో 6868 పరుగులు చేశాడు.రోహిత్ తన సుదీర్ఘ కెరీర్లో భారత జట్టు, తన ఐపీఎల్ జట్లైన డెక్కన్ చార్జర్స్, ముంబై ఇండియన్స్ తరఫున ఎన్నో రికార్డులు సాధించాడు. వీటిలో మూడు రికార్డులు మాత్రం ఎప్పటికీ పదిలంగా ఉంటాయి. అవేంటంటే..వన్డేల్లో అత్యధిక స్కోర్ (264)2014, నవంబర్ 13న రోహిత్ శర్మ శ్రీలంకపై 264 పరుగులు (173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లు) చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఇదే అత్యుత్తమ స్కోర్‌గా చలామణి అవుతుంది. బహుశా మున్ముందు కూడా ఈ రికార్డు పదిలంగానే ఉండే అవకాశం ఉంది. వన్డేల్లో ఇంత భారీ ఇన్నింగ్స్‌లు ఆడాలంటే చాలా సహనం కావాలి. నేటి తరం క్రికెటర్లలో ఇది కొరవడింది. కాబట్టి ఈ రికార్డు వన్డే క్రికెట్ చరిత్రలో చిరకాలం పదిలంగా ఉండే అవకాశం ఉంది.సింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలు (5)2019 వన్డే వరల్డ్‌కప్‌లో రోహిత్ సెంచరీల సునామీ సృష్టించాడు. ఆ టోర్నీలో ఏకంగా ఐదు సెంచరీలు (సౌతాఫ్రికా, పాకిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక) సాధించి చరిత్ర సృష్టించాడు. ఓ వరల్డ్‌కప్ ఎడిషన్‌లో ఓ ఆటగాడు చేసిన అత్యధిక సెంచరీలు ఇవే. ఈ టోర్నీలో హిట్‌మ్యాన్ ఉగ్రరూపం దాల్చి 9 మ్యాచ్‌ల్లో 648 పరుగులు చేశాడు. వన్డే క్రికెట్ చరిత్రలో ఈ రికార్డు బద్దలు కొట్టడం కూడా దాదాపుగా అసాధ్యమే.వన్డేల్లో అత్యధిక డబుల్ సెంచరీలు (3)వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ చేస్తేనే అత్యద్భుతం అనుకునే రోజుల్లో హిట్‌మ్యాన్ ఏకంగా మూడు డబుల్ సెంచరీలు బాది చరిత్ర సృష్టించాడు. వన్డేల్లో ఇప్పటివరకు 10 డబుల్ సెంచరీలు నమోదు కాగా.. అందులో రోహిత్ ఒక్కడే మూడు సాధించడమంటే మామూలు విషయం కాదు. 2013లో ఆస్ట్రేలియాపై తన తొలి డబుల్ సెంచరీ (208 నాటౌట్) సాధించిన హిట్‌మ్యాన్ ఆతర్వాతి ఏడాదే (2014) శ్రీలంకపై వరల్డ్ రికార్డు డబుల్ సెంచరీ (264) సాధించాడు. 2017లో రోహిత్ మరోసారి శ్రీలంకపై డబుల్ సెంచరీ (208 నాటౌట్) చేశాడు.అంతర్జాతీయ క్రికెట్లో రోహిత్ చాలా రికార్డులు నమోదు చేసినప్పటికీ ఈ రికార్డులను మాత్రం ఎవరూ బద్దలు కొట్టలేదు.ప్లేయర్‌గా, కెప్టెన్‌గా రోహిత్ సాధించిన పలు ఘనతలు/రికార్డులు..వరల్డ్‌కప్ సెంచరీలు- 7 కెప్టెన్‌గా 2 ఐసీసీ టైటిళ్లు (2024 టీ20 వరల్డ్‌కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ)ఆటగాడిగా 4 ఐసీసీ టైటిళ్లువన్డేల్లో మూడు డబుల్ సెంచరీలుసింగిల్ వరల్డ్‌కప్‌లో అత్యధిక సెంచరీలువన్డేల్లో అత్యధిక స్కోర్కెప్టెన్గా అత్యధిక విన్నింగ్ పర్సంటేజీ (కనీసం 100 అంతర్జాతీయ మ్యాచ్‌లు)కెప్టెన్‌గా 5 ఐపీఎల్ టైటిళ్లుఆటగాడిగా 6 ఐపీఎల్ టైటిళ్లు -
ఇంగ్లండ్ టూర్‌కు ఆర్సీబీ కెప్టెన్.. కరుణ్, సాయి సుదర్శన్‌కు కూడా పిలుపు..?
ఐపీఎల్ 2025 ముగిశాక భారత క్రికెట్ జట్టు జూన్ మధ్యలో ఇంగ్లండ్ పర్యటనకు బయల్దేరుతుంది. ఈ పర్యటనలో టీమిండియా 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ సిరీస్ కోసం బీసీసీఐ 35 మంది ఆటగాళ్లను షార్ట్ లిస్ట్ చేసినట్లు తెలుస్తుంది.బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25, అంతకుముందు స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో ఘోరంగా విఫలమైన భారత కెప్టెన్ రోహిత్ శర్మకు సెలెక్టర్లు మరో అవకాశం ఇస్తారని తెలుస్తుంది. ఇన్ ఫామ్ బ్యాటర్ కరుణ్ నాయర్, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ జట్టులో చోటు దక్కించుకోనున్నారని సమాచారం. ఐపీఎల్ 2025లో లీడింగ్ రన్ స్కోరర్‌గా కొనసాగుతున్న గుజరాత్ ఓపెనర్ సాయి సుదర్శన్‌ను ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ప్రత్యామ్నాయ ఓపెనర్‌గా సీఎస్కే యువ సంచలనం ఆయుశ్ మాత్రే పేరును కూడా పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది.అశ్విన్ రిటైర్ కావడంతో అతని స్థానాన్ని కుల్దీప్ యాదవ్‌తో భర్తీ చేయనున్నారని సమాచారం. ఈ సిరీస్ కోసం అక్షర్ పటేల్ పేరు పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. అలాగే మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ పేరును కూడా సెలెక్టర్లు పక్కన పెట్టారని తెలుస్తుంది. పరిమిత ఓవర్ల ఫార్మాట్లో సత్తా చాటుతున్న శ్రేయస్ అయ్యర్‌ను ఎంపిక చేయాలా వద్దా అన్న అంశంపై చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ప్రధాన పేసర్లుగా బుమ్రా, షమీ ఎంపిక దాదాపుగా ఖరారైనప్పటికీ.. సేఫ్టీగా వీలైనంత ఎక్కువ మంది రిజర్వ్ పేసర్లను ఎంపిక చేయనున్నారని తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటన కోసం భారత సీనియర్ జట్టుతో పాటు భారత-ఏ జట్టును కూడా మే రెండో వారంలో ప్రకటించే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, భారత ఆటగాళ్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025లో బిజీగా ఉన్నారు. ఈ లీగ్‌లో ప్రదర్శనల ఆధారంగా ఇంగ్లండ్ పర్యటనకు ఎంపికలు జరుగుతాయి. ఈ సీజన్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చే ఆటగాళ్లను భారత సెలెక్టర్లు పరిగణలోకి తీసుకోవచ్చు. ఫార్మాట్ వేరైనా ఆటగాళ్లలో కన్సిస్టెన్సీని గమనిస్తారు.ప్రస్తుతం ఐపీఎల్ 2025 రసవత్తరంగా సాగుతుంది. మొత్తం ఏడు జట్లు నాలుగు ప్లే ఆఫ్స్ బెర్త్‌ల కోసం ప్రధానంగా పోటీపడుతున్నాయి. ఏ జట్టుకు ఇప్పటివరకు ప్లే ఆఫ్స్ బెర్త్ ఖరారు కాలేదు. సీఎస్కే మినహా అన్ని జట్లకు ప్లే ఆఫ్స్ అవకాశాలు ఉన్నాయి. ప్లే ఆఫ్స్ రేసులో ఆర్సీబీ ముందుంది. ఆ జట్టు 10 మ్యాచ్‌ల్లో 7 విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతుంది. ఆతర్వాత ముంబై, గుజరాత్, ఢిల్లీ తలో 12 పాయింట్లతో వరుసగా 2, 3, 4 స్థానాల్లో ఉన్నాయి. పంజాబ్ (11), లక్నో (10), కేకేఆర్ (9) ఆతర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. రాజస్థాన్ (6), సన్‌రైజర్స్ (6), సీఎస్కే (4) 8, 9, 10 స్థానాల్లో ఉన్నాయి. -
టీమిండియాను శిక్షించిన ఐసీసీ
శ్రీలంకలో జరుగుతున్న మహిళల ట్రై నేషన్ సిరీస్‌లో కోడ్ ఉల్లంఘించినందుకు గానూ ఐసీసీ టీమిండియాను శిక్షించింది. ఈ టోర్నీలో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయంలో తమ కోటా ఓవర్లు పూర్తి చేయలేకపోయారు. ఐసీసీ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఆర్టికల్ 2.22 ఉల్లంఘన కిందికి ఇది వస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు నిర్దేశిత సమయం పూర్తయ్యే సరికి ఓ ఓవర్ వెనుక పడ్డారు. ఐసీసీ నియమాల ప్రకారం స్లో ఓవర్ రేట్లో ప్రతి ఓవర్‌కు ప్లేయర్ల మ్యాచ్ ఫీజ్‌లో 5 శాతం కోత విధిస్తారు. మ్యాచ్‌లో పాల్గొన్న సభ్యులందరికీ ఈ కోత వర్తిస్తుంది. ఐసీసీ విధించిన ఈ జరిమానాను టీమిండియా కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ఒప్పుకోవడంతో ఎలాంటి విచారణ జరగలేదు.వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు.ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై విజయంఈ టోర్నీలో భాగంగా నిన్న (ఏప్రిల్ 29) జరిగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై భారత్ 15 పరుగుల తేడాతో గెలుపొందింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.అనంతరం 277 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. 49. 2 ఓవర్లలో 261 పరుగులకు ఆలౌటైంది. ఓ దశలో సునాయాసంగా గెలిచేలా కనిపించిన సౌతాఫ్రికాను భారత స్పిన్నర్ స్నేహ్ రాణా దెబ్బతీసింది. 48వ ఓవర్లో మూడు కీలక వికెట్లు పడగొట్టి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసింది.రాణా ఓవరాల్‌గా తన 10 ఓవర్ల కోటాలో 43 పరుగులిచ్చి 5 వికెట్లు సాధించింది. దక్షిణాఫ్రికా 11 పరుగుల వ్యవధిలో ఐదు వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన ప్రదర్శన చేసినందుకు స్నేహ్ రాణాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. సౌతాఫ్రికా బ్యాటర్లలో టాజ్మిన్ బ్రిట్స్ (107 బంతుల్లో 13 ఫోర్లు, 3 సిక్స్‌లతో 109) విరోచిత శతకంతో చెలరేగింది. ఆమెతో పాటు లారా వోల్వార్డ్ట్(43), అన్నేరీ డెర్క్సెన్(30) రాణించినప్పటికి.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ప్రోటీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికా, శ్రీలంకు జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీలో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. ఈ టోర్నీలో భారత్.. సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. ప్రస్తుతం భారత్ టేబుల్ టాపర్‌గా కొనసాగుతుంది. -
ముక్కోణపు వన్డే సిరీస్.. టీమిండియా భారీ స్కోర్
శ్రీలంకతో జరుగుతున్న మహిళల ముక్కోణపు వన్డే సిరీస్-2025లో భారత్ ఇవాళ (ఏప్రిల్ 29) సౌతాఫ్రికాతో తలపడుతుంది (కొలొంబో వేదికగా). ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రతిక రావల్ (78) అర్ద సెంచరీతో.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (41), జెమీమా రోడ్రిగెజ్ (41), స్మృతి మంధన (36), హర్లీన్ డియోల్ (29), రిచా ఘోష్ (24) ఓ మోస్తరు స్కోర్లతో రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్‌లో దీప్తి శర్మ (9) ఒక్కరే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔట్ కాగా.. కశ్వీ గౌతమ్ 5 పరుగులతో అజేయంగా నిలిచింది. సౌతాఫ్రికా బౌలర్లలో మ్లాబా 2, ఖాకాచ, క్లాస్, డి క్లెర్క్, డెర్క్సెన్ తలో వికెట్ పడగొట్టారు.కాగా, ఈ ట్రై నేషన్ సిరీస్‌లో భారత్, సౌతాఫ్రికాతో పాటు శ్రీలంకు కూడా పాల్గొంటుంది. ఈ టోర్నీ ఏప్రిల్ 27న ప్రారంభం కాగా.. తొలి మ్యాచ్‌లో భారత్, శ్రీలంక తలపడ్డాయి. వర్షం కారణంగా 39 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు 147 పరుగులకే ఆలౌట్ (38.1 ఓవర్లలో) చేశారు. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3, నల్లపురెడ్డి చరణి, దీప్తి శర్మ తలో 2, అరుంధతి రెడ్డి ఓ వికెట్ పడగొట్టారు. శ్రీలంక ఇన్నింగ్స్‌లో హాసిని పెరీరా (30) టాప్ స్కోరర్‌గా నిలిచింది.అనంతరం స్వల్ప లక్ష్య ఛేదనకు దిగిన భారత్.. 29.4 ఓవర్లలో వికెట్ మాత్రమే కోల్పోయి సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించింది. ఆ మ్యాచ్‌లో కూడా ప్రతిక రావల్ (50 నాటౌట్) అర్ద సెంచరీతో రాణించింది. స్మృతి మంధన 43, హర్లీన్ డియోల్ 48 (నాటౌట్) పరుగులతో సత్తా చాటారు. ఈ టోర్నీలో భారత్ సౌతాఫ్రికా, శ్రీలంకతో మరో మ్యాచ్ ఆడుతుంది. అన్ని మ్యాచ్‌ల తర్వాత మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు మే 11న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. -
"గౌతమ్ గంభీర్‌ను చంపేస్తాం".. ఐసిస్ బెదిరింపులు
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్, బీజేపీ మాజీ ఎంపీ గౌతమ్ గంభీర్‌కు ఉగ్రవాద సంస్థ ఐసిస్ కశ్మీర్ నుంచి బెదిరింపులు వచ్చాయి. హతమారుస్తామంటూ (IKILLU) ఐసిస్ కశ్మీర్ రెండు ఈ-మెయిల్స్ చేసింది. ఈ విషయాన్ని గంభీర్ వెంటనే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాడు. ఢిల్లీలోని రాజీందర్‌నగర్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందించినందుకు గంభీర్‌కు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తుంది. తనకు, తన కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించాలని గంభీర్ ఢిల్లీ పోలీసులను కోరాడు.Praying for the families of the deceased. Those responsible for this will pay. India will strike. #Pahalgam— Gautam Gambhir (@GautamGambhir) April 22, 2025గంభీర్ పహల్గామ్ ఉగ్రదాడిపై స్పందిస్తూ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చాడు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నాను. దీనికి బాధ్యులు మూల్యం చెల్లించుకుంటారు. భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందని పేర్కొన్నాడు.కాగా, ఐపీఎల్ కారణంగా గంభీర్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గంభీర్ ఇటీవలే కుటుంబంతో కలిసి ఫ్రాన్స్‌లో హాలిడే ఎంజాయ్ చేసి వచ్చాడు. గంభీర్ గతేడాది జులైలో టీమిండియా హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. భారత్ టీ20 వరల్డ్‌కప్ గెలిచాక రాహుల్ ద్రవిడ్ నుంచి బాధ్యతలు స్వీకరించాడు. టీమిండియా కోచ్‌గా గంభీర్‌కు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. గంభీర్ నేతృత్వంలో భారత్.. శ్రీలంక చేతిలో వన్డే సిరీస్, న్యూజిలాండ్ చేతిలో టెస్ట్ సిరీస్, ఆస్ట్రేలియా చేతిలో బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ల్లో ఓటమిపాలైంది. మధ్యలో కొన్ని చిన్నాచితక విజయాలతో పాటు భారత్ గంభీర్ నేతృత్వంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని గెలిచింది. -
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితా విడుదల.. రీఎంట్రీ ఇచ్చిన శ్రేయస్, ఇషాన్.. కొత్తగా నితీశ్‌కు చోటు
2024-25 సంవత్సరానికి గానూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తమ వార్షిక సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను (34 మంది) విడుదల చేసింది. భారత స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా తమ ఏ ప్లస్ కేటగిరీని రీటైన్ చేసుకోగా.. క్రమశిక్షణారాహిత్యం కారణంగా గతేడాది కాంట్రాక్ట్ కోల్పోయిన శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్ కాంట్రాక్ట్ జాబితాలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. శ్రేయస్ బి కేటగిరీలో, ఇషాన్ సి కేటగిరీలో చోటు దక్కించుకున్నారు. ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి, ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్, యువ పేసర్ హర్షిత్ రాణా తొలిసారి బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ పొందారు.🚨 𝗡𝗘𝗪𝗦 🚨BCCI announces annual player retainership 2024-25 - Team India (Senior Men)#TeamIndiaDetails 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho— BCCI (@BCCI) April 21, 2025సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితా మొత్తం నాలుగు కేటగిరీలుగా విభజించడింది. ఇందులో ఏ ప్లస్ కింద విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, జస్ప్రీత్ బుమ్రా ఉన్నారు. వీరికి ఏడాది 7 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-ఏలో సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, హార్దిక్ పాండ్యా, షమీ, రిషబ్ పంత్ ఉన్నారు. వీరికి ఏడాదికి 5 కోట్ల రూపాయల శాలరీ లభించనుంది.గ్రేడ్-బిలో సూర్యకుమార్ యాదవ్, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్, యశస్వి జైస్వాల్, శ్రేయస్ అయ్యర్ ఉన్నారు. వీరికి ఏడాదికి 3 కోట్ల రూపాయలు శాలరీగా లభించనుంది.గ్రేడ్-సిలో రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివం దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ కృష్ణ, రజత్ పాటిదార్, ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు. వీరికి ఏడాదికి కోటి రూపాయలు శాలరీగా లభించనుంది.ఈ ఏడాది కొత్తగా కాంట్రాక్ట్ పొందిన ఆటగాళ్లు: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చకరవర్తి, హర్షిత్ రాణా, శ్రేయస్ అయ్యర్ఈ ఏడాది కాంట్రాక్ట్ కోల్పోయిన ఆటగాళ్లు: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేష్ ఖాన్ఈ ఏడాది పదోన్నతి పొందిన ఆటగాడు: రిషబ్ పంత్ (బి కేటగిరి నుండి ఏ కేటగిరికి)రిటైర్డ్ అయిన ఆటగాడు: రవిచంద్రన్ అశ్విన్ (కేటగిర ఏ నుంచి ఔట్) -
IPL 2025: కేకేఆర్‌తో జతకట్టిన అభిషేక్ నాయర్
టీమిండియా అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ ఐపీఎల్ 2025 సీజన్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జతకట్టాడు. నాయర్ టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపిక కాకముందు (గత సీజన్లో) కేకేఆర్ సపోర్టింగ్ స్టాఫ్‌లో సభ్యుడిగా ఉన్నాడు. టీమిండియా పదవి ఊడటం ఖాయమని తెలిసాక నాయర్ మళ్లీ కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌ను తిరిగి తమ సహాయక బృందంలోకి ఆహ్వానిస్తున్నామని కేకేఆర్ యాజమాన్యం అధికారికంగా వెల్లడించింది.నాయర్ గతేడాది జులైలో టీమిండియా అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అతని పదవీకాలం ఈ ఏడాది జులైతో ముగుస్తుంది. బీసీసీఐ నాయర్ కాంట్రాక్ట్ పునరుద్ధరించకూడదని నిర్ణయించింది. దీంతో నాయర్ తన పదవీకాలం మరో మూడు నెలలు ఉండగానే టీమిండియా పదవికి గుడ్‌బై చెప్పి తన పాత జట్టు కేకేఆర్‌లో చేరిపోయాడు. నాయర్‌తో పాటు టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్ కాంట్రాక్ట్‌లను కూడా పునరుద్ధరించకూడదని బీసీసీఐ నిర్ణయించింది.కాగా, గత ఐపీఎల్ సీజన్లో కేకేఆర్ ఛాంపియన్‌గా నిలవడంలో అభిషేక్ నాయర్ కీలకపాత్ర పోషించాడు. అయితే కేకేఆర్ పరిస్థితి ఈ సీజన్లో భిన్నంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ జట్టు 7 మ్యాచ్‌ల్లో కేవలం మూడే విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో ఆరో స్థానంలో ఉంది. నాయర్ చేరికతో కేకేఆర్ ఆటతీరులో మార్పు వస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్ టేబుల్ టాపర్లుగా కొనసాగుతున్నాయి. -
బంగ్లాదేశ్‌లో టీమిండియా పర్యటన ఖరారు.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది ఆగస్ట్‌లో భారత్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 15) ప్రకటించింది. ఈ పర్యటనలో టీమిండియా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. రెండు వేదికల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఆగస్ట్ 17న వన్డే సిరీస్.. 26న టీ20 సిరీస్ మొదలవుతాయి.వన్డే సిరీస్ షెడ్యూల్..తొలి వన్డే – ఆదివారం, ఆగస్టు 17, మిర్పూర్రెండో వన్డే – బుధవారం, ఆగస్టు 20, మిర్పూర్మూడో వన్డే – శనివారం, ఆగస్టు 23, చట్టోగ్రామ్టీ20 సిరీస్ షెడ్యూల్..తొలి T20I – మంగళవారం, ఆగస్టు 26, చట్టోగ్రామ్లరెండో T20I – శుక్రవారం, ఆగస్టు 29, మిర్పూర్లమూడు T20I – ఆదివారం, ఆగస్టు 31, మిర్పూర్కాగా, భారత క్రికెటర్లంతా ప్రస్తుతం ఐపీఎల్ 2025తో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది క్యాష్ రిచ్ లీగ్ మే 25న ముగుస్తుంది. అనంతరం భారత్ జూన్‌లో ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటనలో భారత్ ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.ఇంగ్లండ్‌లో భారత పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- జూన్ 20-24రెండో టెస్ట్- జులై 2-6మూడో టెస్ట్- జులై 10-14నాలుగో టెస్ట్- జులై 23-27ఐదో టెస్ట్- జులై 31-ఆగస్ట్ 3ఈ సిరీస్ తర్వాతే భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు బయల్దేరుతుంది.అనంతరం భారత జట్టు సెప్టెంబర్ నెలంతా ఖాళీగా ఉండి అక్టోబర్ 2 నుంచి స్వదేశంలో వెస్టిండీస్‌తో రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ఆడుతుంది.వెస్టిండీస్ సిరీస్ షెడ్యూల్..తొలి టెస్ట్- అక్టోబర్ 2-6 (అహ్మదాబాద్)రెండో టెస్ట్- అక్టోబర్ 10-14 (కోల్‌కతా)ఈ సిరీస్ తర్వాత భారత్ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. ఈ పర్యటనలో భారత్ 3 వన్డేలు, 5 టీ20లు జరుగనున్నాయి.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ఆస్ట్రేలియా పర్యటన తర్వాత భారత్ స్వదేశంలో సౌతాఫ్రికాతో మల్టీ ఫార్మాట్ సిరీస్ ఆడుతుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. భారత్‌లో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..తొలి టెస్ట్- నవంబర్ 14-18 (న్యూఢిల్లీ) రెండో టెస్ట్- నవంబర్ 22-26 (గౌహతి)తొలి వన్డే- నవంబర్ 30 (రాంచీ)రెండో వన్డే- డిసెంబర్ 3 (రాయ్‌పూర్)మూడో వన్డే- డిసెంబర్ 6 (వైజాగ్)తొలి టీ20- డిసెంబర్ 9 (కటక్)రెండో టీ20- డిసెంబర్ 11 (ఛండీఘడ్)మూడో టీ20- డిసెంబర్ 14 (ధర్మశాల)నాలుగో టీ20- డిసెంబర్ 17 (లక్నో)ఐదో టీ20- డిసెంబర్ 19 (అహ్మదాబాద్) -
రెండో సారి 'ఆ ఘనత' సాధించిన శ్రేయస్ అయ్యర్.. గిల్, బుమ్రా మాత్రమే..!
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ 2025 మార్చి నెలకు గానూ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకున్నాడు. ఈ అవార్డు కోసం శ్రేయస్.. న్యూజిలాండ్‌కు చెందిన రచిన్ రవీంద్ర, జేకబ్ డఫీతో పోటీపడ్డాడు. ఐసీసీ ఓటింగ్ అకాడమీ మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు తమ ఓట్ల ద్వారా శ్రేయస్‌ను ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా (మార్చి) నిర్ణయించారు.శ్రేయస్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు గెలుచుకోవడం ఇది రెండో సారి (2022 ఫిబ్రవరి, 2025 మార్చి). భారత క్రికెటర్లలో శుభ్‌మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా (2024 జూన్, 2024 డిసెంబర్) మాత్రమే ఈ అవార్డును రెండు అంతకంటే ఎక్కువ సార్లు గెలుచుకున్నారు. భారత్ తరఫున గిల్ అత్యధికంగా మూడు సార్లు (2023 జనవరి, 2023 సెప్టెంబర్, 2025 ఫిబ్రవరి) ప్లేయర్ ఆఫ్ ద మంత్‌గా నిలిచాడు.2021 జనవరిలో ఈ ప్రతిష్టాత్మక అవార్డును ఐసీసీ ప్రవేశపెట్టగా.. ఇప్పటివరకు ఎనిమిది మంది టీమిండియా క్రికెటర్లు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు అమల్లోకి వచ్చిన తొలి మూడు నెలల్లో భారత ఆటగాళ్లే (పంత్, అశ్విన్, భువనేశ్వర్ కుమార్) ఈ అవార్డు గెలవడం విశేషం.ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు గెలుచుకున్న టీమిండియా క్రికెటర్లు..శుభ్‌మన్ గిల్-3జస్ప్రీత్బుమ్రా-2శ్రేయస్ అయ్యర్-2రిషబ్ పంత్-1 (2021 జనవరి)రవిచంద్రన్ అశ్విన్-1 (2021 ఫిబ్రవరి)భువనేశ్వర్ కుమార్-1 (2021 మార్చి)విరాట్ కోహ్లి-1 (2022 అక్టోబర్)యశస్వి జైస్వాల్-1 (2024 ఫిబ్రవరి)మార్చి నెలలో శ్రేయస్ అయ్యర్శ్రేయస్ మార్చి నెలలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీలో విశేషంగా రాణించాడు. శ్రేయస్ ఈ నెలలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో 57.33 సగటున 172 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ భారత్ తరఫున లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. ఈ టోర్నీలో భారత్ విజేతగా నిలవడంలో శ్రేయస్ కీలకపాత్ర పోషించాడు. న్యూజిలాండ్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో 79 పరుగులు చేసిన శ్రేయస్.. సెమీస్‌లో ఆసీస్‌పై 45, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 48 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో శ్రేయస్ మిడిలార్డర్లో ఇతర ఆటగాళ్లతో కలిసి విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు.మహిళల విభాగంలో వాల్మహిళల విభాగంలో మార్చి నెల ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డు కోసం చేతన ప్రసాద్ (యూఎస్ఏ), జార్జియా వాల్ (ఆస్ట్రేలియా), అన్నాబెల్ సదర్‌ల్యాండ్ (ఆస్ట్రేలియా) పోటీ పడగా.. జార్జియా వాల్ విజేతగా నిలిచింది. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీమిండియా ఫీల్డింగ్ కోచ్ దిలీప్ కుమార్ (ఫోటోలు)
-
విశ్వక్రీడల్లోనూ క్రికెట్.. ఫార్మాట్, జట్లు తదితర వివరాలు
నూట ఇరవై ఎనిమిదేళ్ల తర్వాత తొలిసారి విశ్వక్రీడల్లో క్రికెట్ సమరానికి రంగం సిద్ధమైంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్-2028 సందర్భంగా టీ20 ఫార్మాట్లో ఈ టోర్నమెంట్ నిర్వహించనున్నారు. ఇందులో మహిళలు, పురుషుల విభాగం నుంచి ఆరు జట్లు భాగం కానున్నాయి. పదిహేను మంది సభ్యులతోఈ విషయాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ వర్గాలు ధ్రువీకరించాయి. అదే విధంగా.. 2032లో బ్రిస్బేన్‌లో జరిగే ఒలింపిక్స్‌లోనూ క్రికెట్ ఓ క్రీడాంశంగా ఉంటుందని స్పష్టం చేశాయి. ఇక 2028 ఒలింపిక్స్‌లో పాల్గొనబోయే క్రికెట్ జట్లకు గరిష్టంగా పదిహేను మంది సభ్యులతో కూడిన టీమ్‌ను ఎంపిక చేసుకోవచ్చు.ఇక ఆతిథ్య జట్టు హోదాలో అమెరికా నేరుగా ఈ మెగా ఈవెంట్‌కు అర్హత సాధించే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే, మిగతా జట్లను మాత్రం ఏ ప్రాతిపదికన ఎంపిక చేస్తారన్న అంశంపై మాత్రం స్పష్టత రాలేదు. అయితే, ఐసీసీ ర్యాంకింగ్స్ ఆధారంగా ఒలింపిక్స్‌కు జట్లను ఎంపిక చేసే అవకాశం ఉంది.ర్యాంకింగ్స్ ఇలాప్రస్తుతం పొట్టి ఫార్మాట్లో టీమిండియా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, వెస్టిండీస్ మెన్స్ ర్యాంకింగ్స్‌లో టాప్‌లో కొనసాగుతున్నాయి. అదే విధంగా.. మహిళల పొట్టి ఫార్మాట్లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, టీమిండియా, న్యూజిలాండ్, సౌతాఫ్రికా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి.ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ)లో 12 పూర్తి స్థాయి జట్లు ఉండగా.. 90కి పైగా అసోసియేట్ దేశాల జట్లు టీ20 ఫార్మాట్లో ఆడుతున్నాయి. కాగా విశ్వక్రీడల్లో చివరగా 1900 సంవత్సరంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహించారు. కోహ్లి, రోహిత్ లేకుండానే..?!టీ20 ప్రపంచకప్-2024లో టీమిండియా విజేతగా నిలిచిన తర్వాత.. భారత బ్యాటింగ్ దిగ్గజాలు విరాట్ కోహ్లి, కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. వీరితో పాటు రవీంద్ర జడేజా కూడా రిటైర్మెంట్ ప్రకటించాడు.ఇక రోహిత్ వారసుడిగా టీ20 కెప్టెన్‌గా బీసీసీఐ సూర్యకుమార్ యాదవ్‌ను ఎంపిక చేసింది. ఈ ముంబైకర్ సారథ్యంలో యువ జట్టు ద్వైపాక్షిక సిరీస్‌లలో అదరగొడుతోంది. వరుస విజయాలతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మొదటి స్థానంలో కొనసాగుతోంది. అయితే, ఒలింపిక్స్ 2028లో జరుగనున్నాయి. అప్పటికి కోహ్లి, రోహిత్ నలభైవ పడిలోకి వచ్చేస్తారు. కాబట్టి వారు రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నా ఫిట్నెస్ దృష్ట్యా విశ్వక్రీడల్లో కనిపించడం సాధ్యంకాకపోవచ్చు.చదవండి: సంజూ శాంసన్‌కు భారీ షాక్! -
రాజకీయాల్లోకి టీమిండియా మాజీ క్రికెటర్
టీమిండియా మాజీ క్రికెటర్ కేదార్ జాదవ్ రాజకీయాల్లోకి ప్రవేశించనున్నాడు. గతేడాదే క్రికెట్లోని అన్ని ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన కేదార్.. ఇవాళ (ఏప్రిల్ 8) బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నాడు. పలు కథనాల ప్రకారం జాదవ్ ఇవాళ సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నాడు. మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవన్కులే కేదార్‌ను భాజపాలోకి ఆహ్వానించనున్నాడు. కేదార్ మహా సీఎం ఫడ్నవిస్‌తో కలిసి దిగిన ఫోటో సోషల్‌మీడియాలో వైరలవుతుంది.Former cricketer Kedar Jadhav set to start his political career Details:👉 https://t.co/2tpIz8m7ju pic.twitter.com/ftEYmpgP3u— CricTracker (@Cricketracker) April 8, 202540 ఏళ్ల కేదార్ 2014లో టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. కుడి చేతి వాటం బ్యాటింగ్ ఆల్‌రౌండర్ అయిన అతను భారత్ తరఫున 73 వన్డేలు, 9 టీ20లు ఆడాడు. కేదార్ వన్డేల్లో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీల సాయంతో 1389 పరుగులు చేసి 27 వికెట్లు తీశాడు. 9 టీ20ల్లో హాఫ్ సెంచరీ సాయంతో 122 పరుగులు చేశాడు. కేదార్ చాలా మ్యాచ్‌ల్లో టీమిండియా విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. 2017లో పూణేలో ఇంగ్లండ్‌తో జరిగిన వన్డేలో అతను 120 పరుగులు చేసి టీమిండియాను గెలిపించాడు.టీమిండియాకు ఆడకముందే కేదార్ ఐపీఎల్లో మెరిశాడు. వాస్తవానికి ఐపీఎల్ ప్రదర్శనల కారణంగానే అతడికి టీమిండియా నుంచి పిలుపు వచ్చింది. కేదార్ 2010లో ఐపీఎల్‌లోకి ప్రవేశించి వివిధ ఫ్రాంచైజీల తరఫున (కొచ్చి టస్కర్స్ కేరళ, ఆర్సీబీ, ఢిల్లీ క్యాపిటల్స్, సీఎస్కే, సన్‌రైజర్స్) 95 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో 123.11 స్ట్రయిక్‌రేట్‌తో, 4 అర్ద సెంచరీల సాయంతో 1208 పరుగులు చేశాడు.కేదార్ దేశవాలీ క్రికెట్లో మహారాష్ట్రకు ప్రాతినిథ్యం వహించేవాడు. అతడిని ఫస్ట్ క్లాస్ మరియు లిస్ట్ ఏ క్రికెట్లో ఘనమైన ట్రాక్ రికార్డు ఉంది. మహారాష్ట్ర మిడిలార్డర్లో కేదార్ చాన్నాళ్ల పాటు కీలక సభ్యుడిగా ఉన్నాడు. కేదార్ ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 14 సెంచరీలు, లిస్ట్-ఏ క్రికెట్లో 9 సెంచరీలు చేశాడు. 2013-14 రంజీ సీజన్ కేదార్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ సీజన్లో అతను 1000కి పైగా పరుగులు చేయడమే కాకుండా ఓ ట్రిపుల్ సెంచరీ (327) కూడా చేశాడు. కేదార్ 2024 జూన్ 3న క్రికెట్లోని అన్ని ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు. -
భారత్‌లో పర్యటించనున్న వెస్టిండీస్, సౌతాఫ్రికా.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది భారత క్రికెట్ జట్టు హోం సీజన్ (స్వదేశంలో ఆడే మ్యాచ్‌లు) షెడ్యూల్‌ను బీసీసీఐ ఇవాళ (ఏప్రిల్ 2) ప్రకటించింది. అక్టోబర్‌లో వెస్టిండీస్.. నవంబర్, డిసెంబర్ నెలల్లో సౌతాఫ్రికా క్రికెట్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి.విండీస్ క్రికెట్ జట్టు రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో తొలి టెస్ట్ అహ్మదాబాద్ వేదికగా అక్టోబర్ 2-6 మధ్య తేదీల్లో జరుగనుంది. రెండో టెస్ట్ కోల్‌కతా వేదికగా అక్టోబర్ 10-14 మధ్య తేదీల్లో జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కోసం వెస్టిండీస్ భారత్‌లో పర్యటించడం 2018 తర్వాత ఇదే మొదటిసారి. ఆ సిరీస్‌లో భారత్ 2-0 తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది.అనంతరం నవంబర్ నెలలో సౌతాఫ్రికా జట్టు మల్టీ ఫార్మాట్ సిరీస్ కోసం భారత్‌కు రానుంది. ఈ పర్యటనలో సౌతాఫ్రికా రెండు టెస్ట్‌లు.. మూడు వన్డేలు.. ఐదు టీ20లు ఆడనుంది. నవంబర్ 14-18 మధ్య తేదీల్లో న్యూఢిల్లీలో తొలి టెస్ట్ జరుగనుంది. నవంబర్ 22 తేదీన గౌహతి వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.నవంబర్ 30, డిసెంబర్ 3, డిసెంబర్ 6 తేదీల్లో రాంచీ, రాయ్‌పూర్, వైజాగ్ వేదికలుగా మూడు వన్డేలు జరుగనున్నాయి. డిసెంబర్ 9, 11, 14, 17, 19 తేదీల్లో కటక్, చండీఘడ్, ధర్మశాల, లక్నో, అహ్మదాబాద్ వేదికలుగా ఐదు టీ20లు జరుగనున్నాయి. వచ్చే ఏడాది మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్ దృష్ట్యా ఈ టీ20 సిరీస్‌ను షెడ్యూల్ చేశారు.కాగా, భారత క్రికెట్ జట్టు ఐపీఎల్ 2025 తర్వాత ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్‌లో పర్యటించనుంది. ఈ పర్యటన నెలన్నర పాటు సాగనుంది. మధ్యలో భారత్ జట్టు ఆగస్ట్, సెప్టెంబర్ నెలల్లో ఖాళీగా ఉంటుంది. ఆతర్వాత హోం సీజన్ ప్రారంభమవుతుంది. భారత్‌లో వెస్టిండీస్ పర్యటన ముగిసిన అనంతరం టీమిండియా 3 వన్డేలు, 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ కోసం ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ సిరీస్‌ల షెడ్యూల్‌ను కూడా బీసీసీఐ ఇటీవలే విడుదల చేసింది.ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
ఆస్ట్రేలియాలో టీమిండియా పర్యటన.. షెడ్యూల్ విడుదల
ఈ ఏడాది చివర్లో భారత క్రికెట్ జట్టు ఆస్ట్రేలియాలో పర్యటించనుంది. ఈ పర్యటనలో టీమిండియా పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడనుంది. 3 వన్డేలు, 5 టీ20ల సిరీస్‌లు అక్టోబర్ 19న ప్రారంభం కానున్నాయి. ఈ ఏడాది హోం సమ్మర్ షెడ్యూల్‌ను క్రికెట్ ఆస్ట్రేలియా నిన్న (మార్చి 30) విడుదల చేసింది. ఈసారి హోం సమ్మర్లో ఆస్ట్రేలియా ప్రతి రాష్ట్రాన్ని, టెరిటరీని కవర్ చేస్తుంది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఈ మ్యాచ్‌లు జరుగనున్నాయి.భారత్‌తో సిరీస్‌లకు ముందు ఆస్ట్రేలియా సౌతాఫ్రికాకు ఆతిథ్యమివ్వనుంది. సౌతాఫ్రికా.. ఆస్ట్రేలియాతో 3 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఆగస్ట్ 10న ఈ సిరీస్‌లు ప్రారంభం కానున్నాయి. ఈ సిరీస్‌లతో డార్విన్ అంతర్జాతీయ క్రికెట్ మైదానం పునఃప్రారంభం కానుంది. 17 ఏళ్ల క్రితం ఈ గ్రౌండ్లో అంతర్జాతీయ మ్యాచ్ ఆడారు. 2008లో ఈ మైదానం బంగ్లాదేశ్‌ను హోస్ట్ చేసింది. డార్విన్‌లో ఆస్ట్రేలియా సౌతాఫ్రికాతో తొలి రెండు టీ20లు ఆడనుంది. ఆతర్వాత మూడో టీ20, తొలి వన్డే కెయిన్స్‌లో జరుగనున్నాయి. చివరి రెండు వన్డేలు మెక్‌కేలో జరుగుతాయి.సౌతాఫ్రికాతో సిరీస్‌ల తర్వాత ఆసీస్ భారత్‌తో పరిమిత ఓవర్ల సిరీస్‌లు ఆడుతుంది. ఈ రెండు సిరీస్‌లకు మధ్య దాదాపు రెండు నెలల గ్యాప్ ఉంది. భారత్‌తో సిరీస్‌ల అనంతరం ఆస్ట్రేలియా ఇంగ్లండ్‌తో యాషెస్ సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌కు సంబంధించిన షెడ్యూల్‌ను ఇదివరకే విడుదల చేశారు. నవంబర్ 21న తొలి యాషెస్ టెస్ట్ పెర్త్‌లో జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఆస్ట్రేలియా.. సౌతాఫ్రికా, భారత్‌లతో టీ20 సిరీస్‌లను ప్లాన్ చేసింది.ఆస్ట్రేలియాలో సౌతాఫ్రికా పర్యటన షెడ్యూల్..ఆగస్ట్ 10- తొలి టీ20- డార్విన్ఆగస్ట్ 12- రెండో టీ20- డార్విన్ఆగస్ట్ 16- మూడో టీ20- కెయిన్స్ఆగస్ట్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- కెయిన్స్ఆగస్ట్ 22- రెండో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆగస్ట్ 24- మూడో వన్డే (డే అండ్ నైట్)- మెక్కేఆస్ట్రేలియాలో భారత్ పర్యటన షెడ్యూల్..అక్టోబర్ 19- తొలి వన్డే (డే అండ్ నైట్)- పెర్త్‌అక్టోబర్ 23- రెండో వన్డే (డే అండ్ నైట్)- అడిలైడ్‌అక్టోబర్ 25- మూడో వన్డే (డే అండ్ నైట్)- సిడ్నీఅక్టోబర్ 29- తొలి టీ20- కాన్‌బెర్రాఅక్టోబర్ 31- రెండో టీ20- మెల్‌బోర్న్‌నవంబర్ 2- మూడో టీ20- హోబర్ట్‌నవంబర్ 6- నాలుగో టీ20- గోల్డ్ కోస్ట్‌నవంబర్ 8- ఐదో టీ20- బ్రిస్బేన్ -
అసాధారణ విజయాలు.. మేమంతా అందుకు అర్హులమే: రోహిత్ శర్మ
గత ఏడాది కాలంలో తాము అద్భుత విజయాలు సాధించామని.. ఇందుకు 2022లోనే పునాది పడిందని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) అన్నాడు. నాటి టీ20 ప్రపంచకప్ టోర్నీలో చేసిన తప్పిదాల నుంచి పాఠాలు నేర్చుకుని.. ఐసీసీ ఈవెంట్లలో వరుస విజయాలతో సత్తా చాటామని పేర్కొన్నాడు. పరాజయాలకు పొంగిపోకుండా.. తమ బలాన్ని గుర్తించడం వల్లే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశాడు.ఎన్నో ఎత్తుపళ్లాలుఈ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపళ్లాలు చూశామని.. వరుసగా రెండు ఐసీసీ టోర్నీలు గెలవడం ఆటగాళ్ల అంకితభావానికి నిదర్శనమని రోహిత్ శర్మ పేర్కొన్నాడు. కాగా టీ20 ప్రపంచకప్-2022లో సెమీస్‌లోనే నిష్క్రమించిన టీమిండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్‌కోచ్‌గా రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) తప్పుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. అయితే, మరుసటి ఏడాది నుంచి భారత జట్టు రాత మారిపోయింది. సొంతగడ్డపై అజేయంగా వన్డే వరల్డ్‌కప్-2023 ఫైనల్ చేరిన రోహిత్ సేన.. ఆఖరి మెట్టుపై మాత్రం తడబడింది. ఇక ఆ తర్వాత టీ20 ప్రపంచకప్-2024లో మాత్రం ఈ తప్పిదాన్ని పునరావృతం చేయలేదు.పరాజయమన్నదే లేకుండా దూసుకుపోయి చాంపియన్‌గా అవతరించింది. అనంతరం ఇటీవల ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లోనూ ఇదే తరహాలో టైటిల్ సాధించింది. లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచిన టీమిండియా.. సెమీస్‌లో ఆస్ట్రేలియాను, ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి ట్రోఫీ సాధించింది.అప్పుడే మాకు స్పష్టత వచ్చింది..ఈ జ్ఞాపకాలను తాజాగా నెమరు వేసుకున్న టీమిండియా సారథి రోహిత్ శర్మ.. ‘‘2022లో ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో మేము సెమీస్‌లోనే ఓడిపోయాం. ఆ సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అయితే, అప్పుడే మాకో స్పష్టత వచ్చింది.జట్టులోని ప్రతి సభ్యుడి నుంచి మేము ఎలాంటి ప్రదర్శన ఆశిస్తున్నామో చెప్పాము. జట్టులో వారి పాత్ర ఏమిటో వివరించాం. అప్పటి నుంచి మా జట్టు దృక్పథం మారిపోయింది. పరాజయాలకు కుంగిపోకుండా.. మరింత గొప్పగా కమ్‌బ్యాక్ ఇచ్చాము.ఈ ప్రయాణంలో ఎన్నో కఠిన సవాళ్లు ఎదురయ్యాయి. అయితే, వాటన్నింటినీ అధిగమించి మా సత్తా ఏమిటో చూపించాం. కాబట్టి విజయాలను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాం. వరుస ఐసీసీ టోర్నమెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 గెలవడం అసాధారణ విషయం.మేమంతా అందుకు అర్హులమేమేము దానిని సాధ్యం చేసి చూపించాం. బయటి నుంచి చూసే వాళ్లకు కూడా ఇది బాగానే అనిపిస్తుంది. కానీ మేము ఇందుకోసం ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు. మూడు పెద్ద టోర్నమెంట్లలో జట్టు సాధించిన ఈ విజయాల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ ఈవెంట్లలో ఆడిన ప్రతి ఒక్క ఆటగాడు అన్ని రకాల గౌరవాలకు అర్హుడు’’ అంటూ రోహిత్ శర్మ ఉద్వేగానికి లోనయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ షేర్ చేసింది.కాగా ఐపీఎల్-2025లోనూ రోహిత్ ముంబైకే ఆడుతున్నాడు. ఈ సీజన్లో తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో ఓడిన ముంబై.. శనివారం నాటి పోరులో గుజరాత్ టైటాన్స్‌తో తలపడుతుంది.చదవండి: MS Dhoni: బయటకు చెప్పరు గానీ.. ‘తలా’ వల్ల అందరికీ ఇబ్బందే! View this post on Instagram A post shared by Mumbai Indians (@mumbaiindians) -
భార్యతో కలిసి రూ. 21 కోట్లతో రెండు అపార్ట్మెంట్లు కొన్న సూర్యా భాయ్ (ఫొటోలు)
-
టీమిండియాలోకి కరుణ్ నాయర్..?
ఐపీఎల్ 2025 తర్వాత ఇంగ్లండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఎంపిక చేసే భారత జట్టుకు దేశవాలీ స్టార్ క్రికెటర్ కరుణ్ నాయర్ (భారత జట్టుకు) ఎంపిక కానున్నాడని తెలుస్తుంది. కరుణ్‌ను నేరుగా భారత జట్టులోకి కాకుండా తొలుత భారత్-ఏ జట్టుకు ఎంపిక చేస్తారని సమాచారం. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు భారత్-ఏ ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కరుణ్‌ను ఎంపిక చేసి, ఇక్కడ సత్తా చాటితే టీమిండియాకు ఎంపిక చేయాలని భారత్ సెలెక్టర్లు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఇంగ్లండ్ పర్యటనకు, దానికి ముందు ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగే మ్యాచ్‌లకు భారత జట్ల ప్రకటనకు ఇంకా చాలా సమయం ఉన్నప్పటికీ.. కరుణ్ విషయంలో సెలెక్టర్లు సానుకూలంగా ఉన్నారని టాక్ నడుస్తుంది. మరోవైపు ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు టీమిండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మనే కొనసాగిస్తారనే ప్రచారం కూడా జరుగుతుంది. రోహిత్ న్యూజిలాండ్, ఆసీస్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌ల్లో కెప్టెన్‌గా, ఆటగాడిగా దారుణంగా విఫలమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత టెస్ట్ జట్టు నుంచి రోహిత్‌ను తప్పిస్తారని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో నిజం లేదని తాజాగా వెలువడిన రిపోర్ట్స్ పేర్కొంటున్నాయి. తాజాగా జరిగిన సెలెక్టర్ల సమావేశంలో రోహిత్‌నే ఇంగ్లండ్ టూర్‌కు కెప్టెన్‌గా కొనసాగించాలని డిసైడ్ చేశారట.కాగా, ఐపీఎల్ 2025 తర్వాత భారత క్రికెట్ జట్టు 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన జూన్ 20న జరిగే తొలి టెస్ట్ మ్యాచ్‌ను ప్రారంభమవుతుంది. దీనికి ముందు భారత్-ఏ, ఇంగ్లండ్ లయన్స్ మధ్య రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు జరుగుతాయి. ఇంగ్లండ్ లయన్స్, ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌ల కోసం మే చివరి వారంలో భారత జట్లను ప్రకటించే అవకాశం ఉంది.అరివీర భయంకర ఫామ్‌లో కరుణ్కరుణ్ నాయర్ దేశవాలీ సీజన్లో అరివీర భయంకర ఫామ్‌లో ఉన్నాడు. తాజాగా ముగిసిన రంజీ సీజన్లో 57.33 సగటున 4 సెంచరీల సాయంతో 860 పరుగులు చేసి కరుణ్.. విదర్భ జట్టు చాంపియన్‌గా నిలపడంలో కీలక పాత్ర పోషించాడు. అంతకుమందు కరుణ్ విజయ్ హజారే ట్రోఫీలో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ టోర్నీలో 9 మ్యాచ్‌లు ఆడిన కరుణ్ 389.50 సగటుతో 779 పరుగులు చేశాడు. ఇందులో 5 సెంచరీలు ఉన్నాయి. కరుణ్ ప్రస్తుతం ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడుతున్నాడు. -
తొలిసారి పసిడి మెరుపులు
పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్‌లో భారత జట్టు చాంపియన్‌గా నిలిచింది. బీహార్ రాజధాని పట్నా వేదికగా జరిగిన వరల్డ్‌కప్‌లో పురుషుల రెగూ ఈవెంట్లో భారత జట్టు స్వర్ణ పతకం సాధించింది. సెపక్తక్రా ప్రపంచకప్‌లో భారత్‌కు ఇదే తొలి పసిడి పతకంకాగా... స్వదేశంలో జరిగిన ఈ టోర్నీలో మన ప్లేయర్లు మొత్తం 7 పతకాలు సాధించారు. పురుషుల ‘రెగూ’ ఫైనల్లో భారత్ 11–15, 15–11, 17–14 తేడాతో జపాన్‌పై విజయం సాధించి బంగారు పతకం కైవసం చేసుకుంది. తొలి సెట్లో ఓడి వెనుకబడిన భారత జట్టు ఆ తర్వాత పుంజుకొని వరుసగా రెండు సెట్లు నెగ్గి విజేతగా నిలిచింది. దేశంలో పెద్దగా ఆదరణ లేని ఈ క్రీడలో భారత జట్టు చక్కటి ప్రదర్శన కనబర్చింది. కేవలం స్వర్ణంతో సరిపెట్టుకోకుండా... ఈ వరల్డ్‌కప్‌లో మరో 6 పతకాలు కూడా గెలుచుకుంది. మహిళల డబుల్స్ విభాగంలో రజతం... పురుషుల డబుల్స్, మహిళల రెగూ, మిక్స్డ్ క్వాడ్, మహిళల క్వాడ్, పురుషుల క్వాడ్ విభాగాల్లో కాంస్య పతకాలు నెగ్గింది. ‘స్వదేశంలో జరిగిన సెపక్తక్రా ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శన కనబర్చిన బృందానికి అభినందనలు. రెగూ జట్టు స్వర్ణంతో పాటు మొత్తం 7 పతకాలు సాధించి భవిష్యత్తుపై భరోసా పెంచింది’ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. -
లవ్ లెటర్లు తీసుకుంటా.. ల్యాండ్ లైన్ కాల్స్ లిఫ్ట్ చేస్తా: శ్రేయాంక (ఫోటోలు)
-
సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై స్పందించిన మహిర శర్మ
టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్‌తో డేటింగ్ రూమర్స్‌పై బిగ్‌బాస్ సెలబ్రిటీ మహిర శర్మ స్పందించింది. తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదని వివరణ ఇచ్చింది. తనపై వస్తున్న ఊహాగానాలను ఆపాలని సోషల్‌మీడియా వేదికగా కోరింది. ఇదే విషయంపై సిరాజ్ కూడా స్పందించాడు. మహిరతో డేటింగ్ చేయడం లేదని సోషల్‌మీడియా వేదికగా స్పష్టం చేశాడు. జర్నలిస్ట్‌లు ఈ విషయంపై తనను ప్రశ్నించడం మానుకోవాలని కోరాడు. తాను మహిరతో డేటింగ్ చేయడమనేది పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశాడు. అయితే ఈ పోస్ట్ చేసిన కొద్ది సేపటికే సిరాజ్ తన సోషల్‌మీడియా ఖాతా నుంచి తొలగించడం ఆసక్తికరంగా మారింది. సిరాజ్ ఏదో దాయాలనే ప్రయత్నం చేస్తున్నాడంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. కాగా, సోషల్‌మీడియాలో మహీరకు చెందిన ఓ పోస్ట్‌ను సిరాజ్ లైక్ చేయడంతో వీరిద్దరి మధ్య డేటింగ్ పుకార్లు మొదలయ్యాయి. అనంతరం సిరాజ్, మహిర ఒకరినొకరు ఫాలో చేసుకోవడంతో పుకార్లు బలపడ్డాయి. ఓ దశలో సిరాజ్, మహిర పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వదంతులు వ్యాపించాయి. సిరాజ్‌తో డేటింగ్ రూమర్లను మహిర తల్లి చాలాసార్లు ఖండించారు. అయినా ఈ ప్రచారానికి పుల్‌స్టాప్ పడలేదు.ఇటీవల ముంబైలో జరిగిన ఓ క్రికెట్ అవార్డుల ఫంక్షన్లో మహిర కనిపించినప్పుడు జర్నలిస్ట్‌లు ఈ విషయమై ఆమెను గుచ్చిగుచ్చి ప్రశ్నించారు. త్వరలో జరుగబోయే ఐపీఎల్లో ఆమెకు ఇష్టమైన జట్టు ఏదని పదేపదే ప్రశ్నించి రాక్షసానందం పొందారు.ఇంతకీ ఈ మహిర ఎవరు..?రియాలిటీ షో బిగ్ బాస్-13 సీజన్‌తో మహిర శర్మ ఫేమస్ అయ్యింది. మహిర.. నాగిన్ 3, కుండలి భాగ్య, బెపనా ప్యార్ వంటి షోలలో పనిచేస్తూ టీవీ పరిశ్రమలో పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకుంది. గతంలో మహిర బిగ్ బాస్ ద్వారా పరిచయమైన టీవీ నటుడు పరాస్ ఛబ్రాతో డేటింగ్ చేసింది. మహిర ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో కూడా నటిస్తుంది.ఇదిలా ఉంటే, ఈ ఐపీఎల్ సీజన్లో సిరాజ్ గుజరాత్ టైటాన్స్‌కు ఆడుతున్న విషయం తెలిసిందే. గతేడాది మెగా వేలానికి ముందు ఆర్సీబీ సిరాజ్‌ను వదిలేయగా.. మెగా వేలంలో గుజరాత్ సిరాజ్‌ను రూ. 12.25 కోట్లకు సొంతం చేసుకుంది. 2018 నుంచి సిరాజ్ ఆర్సీబీకి ఆడుతున్నాడు. ఈ సీజన్లో గుజరాత్ తమ తొలి మ్యాచ్‌ను పంజాబ్ కింగ్స్‌తో ఆడుతుంది. ఈ మ్యాచ్ అహ్మదాబాద్ వేదికగా మార్చి 25న జరుగనుంది. -
భారత జట్టు కెప్టెన్‌గా యువరాజ్ సింగ్
డాషింగ్ బ్యాటర్ యువరాజ్ సింగ్ భారత క్రికెట్ జట్టు కెప్టెన్‌గా మళ్లీ ఎంపికయ్యాడు. వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) రెండో ఎడిషన్ కోసం ఇండియా ఛాంపియన్స్ మేనేజ్మెంట్ యువీని కెప్టెన్‌గా నియమించింది. యువీ సారథ్యంలో ఇండియా ఛాంపియన్స్ డబ్ల్యూసీఎల్ తొలి ఎడిషన్‌లో విజేతగా నిలిచింది. రెండో ఎడిషన్ డబ్ల్యూసీఎల్ ఈ ఏడాది జులైలో (18 నుంచి) యునైటెడ్ కింగ్డమ్ వేదికగా జరుగనుంది. ఈ టోర్నీలో ఇండియా ఛాంపియన్స్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగుతుంది.డబ్ల్యూసీఎల్ మొదటి సీజన్లో భారత్‌తో పాటు ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్, సౌతాఫ్రికా జట్లు పాల్గొనగా.. ఫైనల్లో భారత్ పాకిస్తాన్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా నిలిచింది. తొలి సీజన్లో భారత్ తరఫున యువీతో పాటు సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్ మెరుపులు మెరిపించారు.ఈ సీజన్లో భారత జట్టులో మరో స్టార్ కూడా చేరనున్నాడు. టీమిండియా మాజీ ఓపెనర్ శిఖర్ ధవన్ ఈ సీజన్లో ఇండియా ఛాంపియన్స్‌తో జతకట్టేందుకు సంసిద్దత వ్యక్తం చేశాడు. డబ్ల్యూసీఎల్లో ఇండియా ఛాంపియన్స్‌కు సుమంత్ బల్, సల్మాన్ అహ్మద్, జస్పాల్ బహ్రా ఓనర్లు వ్యవహరిస్తున్నారు. డబ్ల్యూసీఎల్ టోర్నీలో అంతర్జాతీయ వేదికపై మెరిసిన చాలా మంది స్టార్ క్రికెటర్లు పాల్గొంటున్నారు. ఈ టోర్నీ ప్రైవేటు యాజమాన్యం అండర్లో జరుగుతుంది.కాగా, డబ్ల్యూసీఎల్ రెండో సీజన్లో పాకిస్తాన్‌కు కొత్త సారధి వచ్చాడు. ఈ సీజన్ కోసం పాక్ ఛాంపియన్స్ మేనేజ్మెంట్ సర్ఫరాజ్ అహ్మద్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. ఈ వెటరన్ వికెట్ కీపర్ 2023 నుంచి కాంపిటేటివ్ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. సర్ఫరాజ్ చేరిక పాకిస్తాన్ ఛాంపియన్స్‌కు బూస్టప్ ఇస్తుంది. గత సీజన్ పాక్‌కు యూనిస్ ఖాన్ కెప్టెన్‌గా వ్యవహరించగా.. మిస్బా ఉల్ హక్, షాహిద్ అఫ్రిది, షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్, అబ్దుల్ రజాక్, కమ్రాన్ అక్మల్, వాహబ్ రియాజ్, సోహైల్ తన్వీర్, సయీద్ అజ్మల్ లాంటి స్టార్లు ప్రాతినిథ్యం వహించారు.గత సీజన్లో పాల్గొన్న భారత ఛాంపియన్స్ జట్టు..అంబటి రాయుడు, గురుకీరత్ మాన్, సౌరభ్ తివారి, సురేశ్ రైనా, యూసఫ్ పఠాన్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, రాబిన్ ఉతప్ప, నమన్ ఓఝా, అనురీత్ సింగ్, ధవల్ కులకర్ణి, హర్భజన్ సింగ్, రాహుల్ శుక్లా, రాహుల్ శర్మ, ఆర్పీ సింగ్, వినయ్ కుమార్ -
ఛాంపియన్ ట్రోఫీ భారత్ కైవసం, నాట్స్ సంబరాలు
ఛాంపియన్ ట్రోఫిలో భారత్ విజయం సాధించడంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) హర్షం వ్యక్తం చేసింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్ గెలవడంతో అమెరికాలో భారత క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకున్నారు.ఛాంపియన్ ట్రోఫీలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోకుండా భారత్ ఫైనల్‌కు చేరడం.. ఫైనల్లో కూడా అసాధారణ విజయం సాధించడాన్ని నాట్స్ నాయకత్వం అభినందించింది. భారత క్రికెట్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు ప్లేయర్స్ అంతా ఈ సీరీస్‌లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారని నాట్స్ బోర్డ్ చైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంపియన్ ట్రోఫీ విజయంతో ప్రవాస భారతీయుల హృదయాలు ఆనందంతో ఉప్పొంగాయని నాట్స్ అధ్యక్షుడు మదన్ పాములపాటి అన్నారు. ఛాంపియన్ ట్రోఫీలో భారత్ విజయానికి తామంతా గర్వపడుతున్నామని నాట్స్ ప్రెసిడెంట్ ఎలెక్ట్ శ్రీహరి మందాడి తెలిపారు.మరిన్ని NRI వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి!కాగా పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్, 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. తొలివికెట్ భాగస్వామ్యం రోహిత్ (76) శుభ్‌మన్ గిల్ (31) 105 పరుగులు అందించారు. కోహ్లీ కేవలం ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. ఆ తరువాత కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజా (18 నాటౌట్) బౌండరీతో భారత్ ట్రోఫి దక్కించుకుంది. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). -
బీసీసీఐకి బిగ్ షాక్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) వైద్య బృంద అధిపతి నితిన్ పటేల్ రాజీనామా చేశాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ (సీఓఈ, గతంలో ఎన్సీఏ)లో మూడేళ్లుగా స్పోర్ట్స్ సైన్స్, మెడికల్ టీమ్‌కు అధిపతిగా ఉన్న నితిన్ పటేల్ వ్యక్తిగత కారణాలతో బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. దీనిపై నితిన్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా... బోర్డు వర్గాలు రాజీనామాను ధ్రువీకరించాయి. ‘నితిన్ రాజీనామా చేశాడు. బోర్డుతో అతడికి చక్కటి అనుబంధం ఉంది. గత మూడేళ్లలో టీమిండియా కోసం నితిన్ ఎంతో చేశాడు. సీఓఈలో వైద్య విధానాలను రూపొందించడంలో అతడి పాత్ర కీలకం. ఆటగాళ్లెవరైనా గాయపడి ఎన్సీఏకు వెళ్తే... వారు పూర్తిగా కోలుకోవడమే కాకుండా రెట్టించిన ఉత్సాహంతో కోలుకునే విధంగా తీర్చిదిద్దాడు. నితిన్ కుటుంబం విదేశాల్లో స్థిరపడింది’ అని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, షమీ, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్ వంటి ఎందరో ఆటగాళ్లు గాయపడి ఎన్సీఏకు వెళ్లగా... నితిన్ పర్యవేక్షణలో తిరిగి కోలుకున్నారు. -
వయసు పెరుగుతున్నా అదే టెంపర్.. విండీస్ ఆటగాడితో కయ్యానికి కాలు దువ్విన యువరాజ్ సింగ్
వయసు పెరుగుతున్నా టీమిండియా మాజీ ఆటగాడు యువరాజ్ సింగ్‌లో టెంపర్ ఏమాత్రం తగ్గలేదు. ఆటగాడిగా ఉన్న రోజుల్లో ఎలా దూకుడుగా ఉండే వాడో ఇప్పుడూ అలాగే ఉన్నాడు. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ (దిగ్గజ క్రికెటర్లు పాల్గొన్న టోర్నీ) ఫైనల్లో యువీ తన పాత రోజులను గుర్తు చేశాడు. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్‌పై తనదైన పంధాలో విరుచుకుపడ్డాడు. pic.twitter.com/y2iHtEPyCr— Cricket Heroics (@CricHeroics786) March 16, 2025అసలేం జరిగిందంటే.. ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ తొలి ఎడిషన్ ఫైనల్లో భారత మాస్టర్స్, వెస్టిండీస్ మాస్టర్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో భారత్ విజేతగా నిలిచి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. తొలుత బౌలింగ్‌లో వినయ్ కుమార్ (3-0-26-3), షాబాజ్ నదీం (4-1-12-2).. ఆతర్వాత బ్యాటింగ్‌లో అంబటి రాయుడు (50 బంతుల్లో 74; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) సత్తా చాటి భారత్‌ను గెలిపించారు.అయితే ఈ మ్యాచ్ మధ్యలో ఓ దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. విండీస్ ఆటగాడు టీనో బెస్ట్, భారత స్టార్ ప్లేయర్ యువరాజ్ సింగ్ గొడవ పడ్డారు. విండీస్ నిర్దేశించిన లక్ష్యాన్ని భారత మాస్టర్స్ ఛేదిస్తుండగా (14వ ఓవర్ తొలి బంతి తర్వాత).. యువీ టీనో బెస్ట్‌పై తన సహజ శైలిలో వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశాడు. బెస్ట్ కూడా ఏమాత్రం తగ్గకుండా యువీకి తిరుగు సమాధానం చెప్పాడు. దీంతో గొడవ పెద్దదైంది. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. ఇద్దరి మధ్య కొద్ది సేపు వాగ్వాదం జరిగింది. అంపైర్ బిల్లీ బౌడెన్, క్రీజ్‌లో ఉన్న అంబటి రాయుడు, విండీస్ కెప్టెన్ బ్రియాన్ లారా సర్ది చెప్పడంతో ఇద్దరూ వెనక్కు తగ్గారు. ఆతర్వాత ఆట సజావుగా సాగి భారత్ విజేతగా నిలిచింది. యువీ-బెస్ట్ గొడవకు ముందు రాయుడు ఆష్లే నర్స్ బౌలింగ్‌లో భారీ సిక్సర్ బాదాడు. అంతకుముందు బెస్ట్ వేసిన ఓవర్లో రాయుడు, యువీ కలిసి 12 పరుగులు పిండుకున్నారు. రాయుడు సిక్సర్ కొట్టిన అనందంలో యువీ బెస్ట్‌ను కవ్వించగా.. అతను కూడా తగ్గేదేలేదంటూ సమాధానం చెప్పాడు. యువీకి ఇలాంటి గొడవలు కొత్తేమీ కాదు. ఆటగాడి ఉన్న రోజుల్లో ఇలాంటి ఘటనలు కోకొల్లలు. 2007 టీ20 ప్రపంచకప్ సందర్భంగా ఇంగ్లండ్ ఆటగాడు ఆండ్రూ ఫ్లింటాఫ్‌తో జరిగిన ఫైట్ భారత క్రికెట్ అభిమానులకు ఇప్పటికీ గుర్తుంటుంది. మొత్తానికి మాస్టర్స్ లీగ్ ఫైనల్లో యువీ చర్యను కొందరు సమర్దిస్తుంటే.. మరికొందరు తప్పుబడుతున్నారు. దిగ్గజాల కోసం నిర్వహించిన టోర్నీలో హుందాగా ఉండాల్సింది పోయి, గొడవలు పడటమేంటని చురకలంటిస్తున్నారు. యువీనే తొలుత బెస్ట్‌ను కవ్వించాడని మ్యాచ్‌ను చూసిన వాళ్లు అంటున్నారు. ఏది ఏమైనా సప్పగా సాగుతున్న మాస్టర్స్ లీగ్.. ఫైనల్లో యువీ చర్య వల్ల రక్తి కట్టింది. ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయిన (ఆస్ట్రేలియా చేతిలో) భారత్.. ఫైనల్లో విండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలుపొంది టైటిల్‌ను చేజిక్కించుకుంది. ఈ టోర్నీలో భారత్ సచిన్ టెండూల్కర్ నాయకత్వంలో అద్భుత విజయాలు సాధించింది. భారత మాస్టర్స్ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు పూర్వపు రోజులు గుర్తు చేశారు. లజెండ్స్ లీగ్ పోటీలు చాలా జరుగుతుండటంతో ఈ టోర్నీ ఫెయిల్ అవుతుందని అంతా అనుకున్నారు. అయితే భారత్, విండీస్, శ్రీలంక, ఆస్ట్రేలియాకు చెందిన దిగ్గజాలు అద్భుత ప్రదర్శనలు చేసి ఈ టోర్నీని సక్సెస్ చేశారు. ఈ టోర్నీలో ఆసీస్ దిగ్గజం షేన్ వాట్సన్ ఏకంగా మూడు సెంచరీలు చేయడం హైలైట్. ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 148 పరుగులు చేయగా.. భారత్ మరో 17 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది. విండీస్ ఇన్నింగ్స్‌లో డ్వేన్ స్మిత్ (45), లెండిల్ సిమన్స్ (57) మాత్రమే రాణించగా.. దిగ్గజం లారా (6) నిరాశపరిచాడు. -
హోలీ ఆడినందుకు షమీ కూతురిపై మండిపడ్డ ముస్లిం మత పెద్ద
టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీని ప్రముఖ మతాధికారి, ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షాబుద్దీన్ రజ్వీ బరేల్వీ ఇటీవలికాలంలో తరుచూ టార్గెట్ చేస్తున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగడాన్ని తప్పుబట్టిన మౌలానా షాబుద్దీన్ రజ్వీ.. తాజాగా షమీ కూతురు ఐరా హోలీ ఆడటాన్ని పెద్ద ఇష్యూ చేశాడు. హోలీ రోజు ఐరా రంగులు పూసుకొని దిగిన ఫోటో ఒకటి సోషల్‌మీడియాలో ప్రత్యక్షం కావడంతో మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఫైరయ్యాడు. పవిత్ర రంజాన్ మాసంలో ఐరా హోలీ ఆడటాన్ని తప్పుబట్టాడు. ఐరాను రంగులు పూసుకునేందుకు అనుమతించిన తల్లి హసీన్ జహాను తిట్టి పోశాడు. రంజాన్ మాసంలో ముస్లింలు హోలీ ఆడటం అక్రమమని.. షరియత్‌కు ఇది వ్యతిరేకమని అన్నాడు.ఐరా లాంటి చిన్నారి రంజాన్ యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోకపోవచ్చు. రంజాన్ విశిష్టత తెలియకుండా ఆ చిన్నారి హెలీ ఆడి ఉంటే అది నేరం కాదు. అయితే ఐరా రంజాన్ పవిత్రత తెలిసి కూడా హోలీ ఆడి ఉంటే మాత్రం అది ఇస్లాం చట్టానికి విరుద్ధమని ఓ వీడియో ద్వారా సందేశాన్ని పంపాడు. ఐరా విషయంలో మౌలానా షాబుద్దీన్ రజ్వీ స్పందించిన తీరును చాలా మంది తప్పుబడుతున్నారు. చిన్నారి సరదాగా రంగులు పూసుకుంటే ఇంత రాద్దాంతం చేయాలా అని మండిపడుతున్నారు. కొందరేమో ఇందులో చిన్నారి ఐరా తప్పు లేదు కానీ, రంజాన్ మాసం అని తెలిసి కూడా ఆమె తల్లి హోలీ ఆడేందుకు అనుమతించడం పెద్ద నేరమని కామెంట్లు చేస్తున్నారు. ఈ విషయంలో ఐరా తల్లిని తీవ్ర పదజాలంతో దూషిస్తున్నారు. ఐరా తల్లి హసీన్ జహా మహ్మద్ షమీతో విడాకులు తీసుకొని ప్రస్తుతం వేరుగా ఉంటుంది. కాగా, మౌలానా షాబుద్దీన్ రజ్వీ ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా షమీ ఎనర్జీ డ్రింక్ తాగినప్పుడు కూడా పెద్ద రాద్దాంతం చేశాడు. రంజాన్ మాసంలో రోజా (ఉపవాసం) ఉండకుండా షమీ పెద్ద నేరం చేశాడని అరోపించాడు. ఇలా చేసి షమీ ఇస్లాం సమాజానికి ఏం సందేశం ఇవ్వాలని అనుకుంటున్నాడని విమర్శించాడు. మౌలానా షాబుద్దీన్ రజ్వీ వ్యాఖ్యలపై అప్పట్లో భారత క్రికెట్ అభిమానులు మండిపడ్డారు. షమీ ఏం తప్పు చేశాడని ఇంత పెద్ద షో చేస్తున్నావని రజ్వీని ప్రశ్నించారు. దేశం కోసం శ్రమించాల్సి వచ్చినప్పుడు ఉపవాసం ఉండాలని అనడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. మతోన్మాధం ఎక్కువైనప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చురకలంటించారు.ఇదిలా ఉంటే, షమీ ఛాంపియన్స్ ట్రోఫీలో అద్భుతంగా రాణించి భారత్ టైటిల్ గెలవడంలో తనవంతు పాత్ర పోషించాడు. ఆ టోర్నీలో షమీ 5 మ్యాచ్‌ల్లో 9 వికెట్లు తీసి టోర్నీ లీడింగ్ వికెట్ టేకర్ల జాబితాలో నాలుగో స్థానంలో నిలిచాడు. ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసిన షమీ.. ఆసీస్‌తో జరిగిన సెమీస్‌లో 3 వికెట్లు పడగొట్టాడు. షమీ త్వరలో ఐపీఎల్లో ఆడనున్నాడు. ఈ సీజన్లో షమీని సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. షమీ గత సీజన్లో గుజరాత్ టైటాన్స్‌కు ఆడాడు. మెగా వేలంలో షమీని సన్‌రైజర్స్ రూ. 10 కోట్లకు దక్కించుకుంది. -
బీసీసీఐ నిర్ణయంపై కోహ్లి అసంతృప్తి
బీసీసీఐ కొత్తగా ప్రవేశపెట్టిన కుటుంబ నియంత్రణ నిర్ణయంపై (విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై అంక్షలు) టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి అసంతృప్తి వ్యక్తం చేశాడు. విదేశీ పర్యటనల్లో కుటుంబాలు దగ్గరగా లేకపోతే ఆటగాళ్లు మానసిక సమస్యలు ఎదుర్కొంటారని అన్నాడు. దీని ప్రభావం జట్టు జయాపజయాలపై పడుతుందని తెలిపాడు. కఠిన సమయాల్లో కుటుంబాలు వెంట ఉంటే ఆటగాళ్లకు ఊరట కలుగుతుందని పేర్కొన్నాడు. పర్యటనల్లో ఆటగాళ్లకు కుటంబాలు తోడుండటం ఎంతో ముఖ్యమో కొంతమందికి తెలియట్లేదని బీసీసీఐపై పరోక్షంగా తన అసహనాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్‌లు ముగిశాక ఆటగాళ్లు ఒంటరిగా కూర్చొని బాధపడాలా అని ప్రశ్నించాడు. కుటుంబాలు దగ్గరగా ఉంటే ఆటగాళ్ల ప్రదర్శన మరింత మెరుగుపడుతుందని తెలిపాడు. ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఏర్పాటు చేసిన ఇన్నోవేషన్ ల్యాబ్ ఇండియన్ స్పోర్ట్స్ సమ్మిట్‌లో కోహ్లి ఈ విషయాలను పంచుకున్నాడు.కాగా, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024-25 పరాజయం తర్వాత బీసీసీఐ విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలపై నియంత్రణ విధించింది. ఈ మేరకు ఓ రూల్‌ను జారీ చేసింది. కుటుంబ నియంత్రణ రూల్ ప్రకారం.. 45 రోజుల కంటే తక్కువ వ్యవధి ఉండే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలకు అనుమతి లేదు. 45 రోజుల కంటే ఎక్కువ నిడివితో సాగే విదేశీ పర్యటనల్లో ఆటగాళ్ల కుటుంబాలను రెండు వారాల తర్వాత అనుమతిస్తారు. మొత్తంగా కుటుంబాలు ఆటగాళ్లతో కేవలం 14 రోజులు మాత్రమే గడిపే అవకాశం ఉంటుంది.ఇదిలా ఉంటే, తాజాగా ముగిసిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ విజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో విరాట్ అద్భుతంగా ఆడి భారత్ మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీ గెలవడంలో కీలకంగా వ్యవహరించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం కొద్ది రోజులు దుబాయ్‌లోనే సేద తీరిన విరాట్.. తాజాగా ఐపీఎల్ 2025 సీజన్ కోసం తన జట్టుతో చేరాడు. ఐపీఎల్లో విరాట్ ప్రాతినిథ్యం వహించే ఆర్సీబీ.. మార్చి 22న డిఫెండింగ్ ఛాంపియన్ కేకేఆర్‌తో జరిగే మ్యాచ్‌తో తమ జర్నీ ప్రారంభిస్తుంది. ఐపీఎల్లో ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని ఆర్సీబీ.. ఈ సాలా కప్ నమ్మదే అంటూ మరోసారి తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
న్యూ లుక్‌లో విరాట్.. సోషల్‌మీడియాను షేక్ చేస్తున్న ఫోటోలు
ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభానికి టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి సరికొత్త లుక్‌లో కనిపించాడు. కోహ్లి న్యూ లుక్కు సంబంధించిన ఫోటోలు సోషల్‌మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ ఫోటోలను విరాట్ హెయిర్ స్టైలిస్ట్ ఆలీమ్ ఖాన్ ఇన్‌స్టాలో షేర్ చేయగా.. అభిమానుల నుంచి విపరీతమైన స్పందన వస్తుంది. ఈ ఫొటోలకు అలీమ్ ఖాన్ 'ది గోట్ ఎనర్జీ' అని క్యాప్షన్ ఇచ్చారు. "వన్ అండ్ ఓన్లీ విరాట్ కోహ్లీ కోసం కొత్త స్నిప్. రేజర్ షార్ప్ గా కనిపిస్తున్నాడు" అని ఆలీమ్ ఖాన్ తన ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు. నయా లుక్‌లో ఫోటోలను చూసి తమదైనశైలిలో స్పందిస్తున్నారు. కొత్త లుక్‌లో కింగ్ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Aalim Hakim (@aalimhakim)ఇదిలా ఉంటే మరో 8 రోజుల్లో (మార్చి 22) ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లోనే విరాట్ జట్టు ఆర్సీబీ డిఫెండింగ్ ఛాంపియన్స్ కేకేఆర్‌ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ కోల్‌కతా వేదికగా జరుగనుంది. అన్నీ ఫ్రాంచైజీలు ఐపీఎల్ కోసం సన్నాహకాలు మొదలుపెట్టాయి. ఆటగాళ్లు ఒక్కొక్కరుగా తమతమ జట్లలో చేరుతున్నారు. విరాట్ మరి కొద్ది రోజుల్లో ఆర్సీబీ క్యాంప్‌లో చేరే అవకాశం ఉంది. ఆర్సీబీ తమ ప్రాక్టీస్‌ను ఇదివరకే షురూ చేసింది. విరాట్ కొన్ని యాడ్ షూట్స్ కారణంగా జట్టుతో కలవడం ఆలస్యమైంది.విరాట్‌తో కూడిన టీమిండియా కొద్ది రోజుల కిందట ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన విషయం తెలిసిందే. దుబాయ్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో విరాట్ భారత విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 5 మ్యాచ్‌ల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ సాయంతో 218 పరుగులు చేశాడు. ఈ టోర్నీలో విరాట్ ఐదో లీడింగ్ రన్‌స్కోరర్‌గా నిలిచాడు.ఈ టోర్నీలో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సూపర్ సెంచరీ చేసిన విరాట్.. కీలకమైన సెమీఫైనల్లో ఆసీస్‌పై మ్యాచ్ విన్నింగ్ హాఫ్ సెంచరీ సాధించాడు. గత కొంతకాలంగా ఫామ్ లేమి వల్ల అపవాదులు ఎదుర్కొన్న విరాట్.. ఈ టోర్నీతో తిరిగి పూర్వ వైభవం సాధించాడు. విరాట్ ఇదే ఫామ్‌ను ఐపీఎల్‌లోనూ కొనసాగించాలని ఆర్సీబీ అభిమానులు కోరుకుంటున్నారు. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా ఆర్సీబీ అభిమానులు ఈ సాలా కప్ నమ్మదే అంటూ డప్పు కొట్టుకుంటున్నారు.ఆర్సీబీ ఈ ఏడాది జట్టు మొత్తాన్ని ప్రక్షాళన చేసింది. గత రెండు సీజన్లు కెప్టెన్‌గా వ్యవహరించిన డుప్లెసిస్‌ను సైతం తప్పించి కొత్త కెప్టెన్‌గా రజత్ పాటిదార్‌ను నియమించుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి టిమ్ డేవిడ్, లియామ్ లివింగ్‌స్టోన్, జేకబ్ బేతెల్, ఫిల్ సాల్ట్, రొమారియో షెపర్డ్, జోష్ హాజిల్‌వుడ్ లాంటి విదేశీ స్టార్లు వచ్చారు. చాలాకాలం పాటు తమకు సేవలందించిన హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను ఆర్సీబీ ఈ ఏడాది వదులుకుంది. ఈ ఏడాది ఆర్సీబీలోకి కృనాల్ పాండ్యా, దేవ్‌దత్ పడిక్కల్, భువనేశ్వర్ కుమార్ లాంటి దేశీయ స్టార్లు కూడా వచ్చారు. జట్టు మొత్తం మారడంతో తమ ఫేట్ కూడా మారుతుందని ఆర్సీబీ అభిమానులు ఆశిస్తున్నారు.ఐపీఎల్-2025లో ఆర్సీబీ జట్టు..రజత్ పాటిదార్ (కెప్టెన్), విరాట్ కోహ్లి, దేవ్‌దత్ పడిక్కల్, టిమ్ డేవిడ్, స్వస్థిక్ చికారా, కృనాల్ పాండ్యా, మనోజ్ భండగే, రొమారియో షెపర్డ్, స్వప్నిల్ సింగ్, జేకబ్ బేతెల్, లియామ్ లివింగ్‌స్టోన్, మోహిత్ రతీ, ఫిలిప్ సాల్ట్, జితేశ్ శర్మ, జోష్ హాజిల్‌వుడ్, భువనేశ్వర్ కుమార్, లుంగి ఎంగిడి, రసిక్ సలాం దార్, సుయాశ్ శర్మ, యశ్ దయాల్, నువాన్ తుషార, అభినందన్ సింగ్ -
టీమిండియా ఆడకుంటే రూ. 45 కోట్ల నష్టం!
పరిమిత ఓవర్ల క్రికెట్లో టీమిండియా ఎదురులేని విజయాలతో దూసుకుపోతోంది. గత మూడు ఐసీసీ ఈవెంట్లలో 24 మ్యాచ్‌లకు గానూ 23 విజయాలు సాధించడం భారత జట్టు నిలకడైన ప్రదర్శనకు నిదర్శనం. వన్డే వరల్డ్‌కప్-2023(ICC ODI World Cup)లో రన్నరప్‌గా నిలిచిన రోహిత్ సేన.. టీ20 ప్రపంచకప్-2024(T20 World Cup)లో ఆఖరి వరకు అజేయంగా నిలిచి ట్రోఫీని ముద్దాడింది.టెస్టుల్లో మాత్రం ఘోర పరాభావాలుఇక తాజాగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025(ICC Champions Trophy)లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేసింది. దుబాయ్ వేదికగా ఈ వన్డే టోర్నమెంట్లో వరుసగా ఐదు విజయాలతో విజేతగా అవతరించింది. అయితే, టెస్టుల్లో మాత్రం రోహిత్ సేనకు గతేడాది నుంచి ఘోర పరాభావాలు ఎదురవుతున్నాయి.వరుసగా రెండుసార్లు ఫైనల్‌కు.. ఈసారి మాత్రంముఖ్యంగా సొంతగడ్డపై చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా.. విదేశీ జట్టు(న్యూజిలాండ్) చేతిలో వైట్‌వాష్‌కు గురికావడం.. ఆస్ట్రేలియా పర్యటనలో 3-1తో ఓడిపోవడం విమర్శలకు దారితీసింది. ఈ రెండు పరాజయాల కారణంగా టీమిండియా ఈసారి ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్(WTC) ఫైనల్‌కు చేరుకోలేకపోయింది.ఈ మెగా ఈవెంట్‌ను ఐసీసీ 2019లో మొదలుపెట్టగా తొలి రెండు సీజన్ల(2019- 2021, 2021-2023)లో భారత్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. అయితే, ఆ రెండు సందర్భాల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలకు ట్రోఫీని చేజార్చుకుంది. ఇక .. తాజా ఎడిషన్(2023-25)లో కనీసం ఫైనల్ కూడా చేరలేకపోయింది.ఆసీస్ వర్సెస్ ప్రొటిస్ఈసారి డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఆస్ట్రేలియా మరోసారి తుదిపోరుకు అర్హత సాధించగా.. సౌతాఫ్రికా తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్ చేరింది. జూన్‌లో లార్డ్స్ మైదానంలో జరిగే ఫైనల్లో ఇరుజట్లు టైటిల్ కోసం తలపడనున్నాయి.సుమారు రూ.45 కోట్లు నష్టంఅయితే భారత్ ఫైనల్లో లేకపోవడం మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న మెరిలిబోన్ క్రికెట్ క్లబ్ (ఎంసీసీ)పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది. ఎంసీసీ ఏకంగా 40 లక్షల పౌండ్లు (సుమారు రూ.45 కోట్లు) నష్టపోనుందని సమాచారం. భారత్ ఫైనల్ చేరుకుంటుందనే గట్టి నమ్మకంతో ఎంసీసీ మ్యాచ్ టికెట్ రేట్లను భారీగా పెంచగా.. ఇప్పుడు వాటిని తగ్గించాల్సి వస్తోంది. దాంతో పెద్ద మొత్తంలో ఆదాయం కోల్పోనుంది.స్వదేశంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌కు ముందు వరకు కూడా భారత్ సునాయాసంగా ఫైనల్ చేరుతుందని అంతా భావించారు. కివీస్ చేతిలో 0–3తో ఓటమితో అంతా మారిపోయి రేసులో టీమిండియా వెనుకబడిపోయింది. భారత్ ఫైనల్ చేరే అవకాశం ఉన్న సమయంలో పెట్టిన గరిష్ట టికెట్ ధరకంటే కనీసం 50 పౌండ్లు తగ్గించి అమ్మాల్సి వస్తోంది. ఇదంతా కూడా ఎంసీసీ ఆదాయానికి గండి కొడుతోంది. గత ఏడాది లార్డ్స్‌లో ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగిన టెస్టుకు టికెట్ రేట్ భారీగా ఉండటంతో కేవలం 9 వేల మంది హాజరయ్యారు. దాంతో ఎంసీసీపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో డబ్ల్యూటీసీ ఫైనల్ కోసం కాస్త అందుబాటులో ఉంటే టికెట్లను ఉంచాల్సి వస్తోంది.చదవండి: కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మనే..! -
ప్రపంచ క్రికెట్లో భారత్ ఒక్కటే అలా చేయగలదు.. రాహుల్‌ను ఎంత పొగిడినా తక్కువే: స్టార్క్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయానంతరం టీమిండియాపై ఆసీస్ స్పీడ్‌గన్ మిచెల్ స్టార్క్ ప్రశంసల వర్షం కురిపించాడు. వ్యక్తిగత కారణాల చేత ఛాంపియన్స్ ట్రోఫీకి దూరంగా ఉన్న స్టార్క్.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ భారత క్రికెట్‌ను, టీమిండియా కీలక సభ్యుడు కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తాడు. ప్రపంచ క్రికెట్లో ప్రస్తుతం భారత్ ఒక్కటే ఒకే రోజు మూడు ఫార్మాట్లలో మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించగలదని అన్నాడు. టెస్ట్‌ల్లో ఆస్ట్రేలియాపై.. వన్డేల్లో ఇంగ్లండ్‌పై.. టీ20ల్లో సౌతాఫ్రికాపై ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించినా భారత జట్లు గట్టి పోటీ ఇవ్వగలవని కితాబునిచ్చాడు. భారత్ మినహా ప్రపంచ క్రికెట్లో ఏ దేశానికి ఒకే రోజు మూడు వేర్వేరు జట్లను బరిలోకి దించే సత్తా లేదని కొనియాడాడు.కేఎల్ రాహుల్‌ను ఆకాశానికెత్తిన స్టార్క్మిచెల్ స్టార్క్ టీమిండియా స్టార్ ఆటగాడు కేఎల్ రాహుల్‌పై ప్రశంసల వర్షం కురింపించాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో రాహుల్ ప్రదర్శనలు అద్భుతమని కొనియాడాడు. టీమిండియాకు రాహుల్ మిస్టర్ ఫిక్సిట్ లాంటి వాడని అన్నాడు. టీమిండియా అవసరాల కోసం అతను ఏమైన చేయగలడని కొనియాడాడు. ఓపెనర్‌గా, మిడిలార్డర్లో, ఆరో స్థానంలో, వికెట్ కీపింగ్ బ్యాటర్‌గా, ఫీల్డర్‌గా.. ఇలా ఏ పాత్రలో అయినా రాహుల్ ఒదిగిపోగలడని కితాబిచ్చాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు రాహుల్ తన ఐదో స్థానాన్ని అక్షర్ పటేల్‌కు త్యాగం చేసిన విషయాన్ని గుర్తు చేశాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చి అద్భుతాలు చేశాడని అన్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో టీమిండియా గెలుపుకు రాహుల్ ప్రధాన కారకుడని పేర్కొన్నాడు. రాహుల్ లాంటి మల్టీ టాలెంటెడ్ ఆటగాడితో కలిసి ఆడేందుకు ఉత్సాహంగా ఉన్నానని తెలిపాడు. కాగా, మిచెల్ స్టార్క్ ఈ ఏడాది ఐపీఎల్లో కేఎల్ రాహుల్‌తో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆడనున్నాడు. స్టార్క్‌ను గతేడాది మెగా వేలంలో ఢిల్లీ రూ. 11.75 కోట్లు సొంతం చేసుకుంది. అంతకుముందు ఏడాది (2024) స్టార్క్ కేకేఆర్‌కు ఆడాడు. ఆ సీజన్ వేలంలో కేకేఆర్ స్టార్క్‌కు రికార్డు ధర (రూ. 24.75 కోట్లు) చెల్లించి సొంతం చేసుకుంది. ఐపీఎల్ చరిత్రలో ఇది మూడో అత్యధిక ధర. ఐపీఎల్లో అత్యధిక ధర పొందిన ఆటగాడి రికార్డు రిషబ్ పంత్ పేరిట ఉంది. పంత్‌ను ఈ సీజన్ కోసం లక్నో సూపర్ జెయింట్స్ రూ. 27 కోట్లు చెల్లించి సొంతం చేసుకుంది. ఇదే సీజన్ వేలంలో ఐపీఎల్లో రెండో అత్యధిక ధర కూడా నమోదైంది. పంజాబ్ కింగ్స్ శ్రేయస్ అయ్యర్‌కు రూ. 26.75 కోట్లు చెల్లించింది.ఐపీఎల్లో టాప్-5 పెయిడ్ ప్లేయర్స్రిషబ్ పంత్- 27 కోట్లు (లక్నో, 2025)శ్రేయస్ అయ్యర్- 26.75 కోట్లు (పంజాబ్, 2025)మిచెల్ స్టార్క్- 24.75 కోట్లు (కేకేఆర్, 2024)వెంకటేశ్ అయ్యర్- 23.75 కోట్లు (కేకేఆర్, 2025)పాట్ కమిన్స్- 20.50 కోట్లు (సన్‌రైజర్స్, 2024)2025 ఐపీఎల్ సీజన్ కోసం ఢిల్లీ జట్టు..ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వి, అషుతోష్ శర్మ, విప్రాజ్ నిగమ్, దర్శన్ నల్కండే, అజయ్ జాదవ్ మండల్, త్రిపురణ విజయ్, అక్షర్ పటేల్, మన్వంత్ కుమార్, మాధవ్ తివారి, ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, డొనొవన్ ఫెరియెరా, కేఎల్ రాహుల్, కుల్దీప్ యాదవ్, దుష్మంత చమీరా, మిచెల్ స్టార్క్, మోహిత్ శర్మ, టి నటరాజన్, ముకేశ్ కుమార్ -
కెప్టెన్‌గా, ఓపెనర్‌గా రోహిత్ శర్మనే..!
ప్రతిష్టాత్మక విజ్డన్ సంస్థ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్‌ను ఇవాళ (మార్చి 13) ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్‌గా, ఓపెనర్‌గా టీమిండియా సారధి రోహిత్ శర్మను ఎంపిక చేసింది. ఈ జట్టులో ఐదుగురు టీమిండియా ఆటగాళ్లకు చోటు దక్కింది. రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి విజ్డన్ టీమ్ ఆఫ్ ద టోర్నీకి ఎంపికయ్యారు. ఈ జట్టుకు న్యూజిలాండ్ నుంచి నలుగురు.. ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ జట్ల నుంచి చెరో ఆటగాడు ఎంపికయ్యారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, మైఖేల్ బ్రేస్‌వెల్, కెప్టెన్ మిచెల్ సాంట్నర్, ఫైనల్‌కు ముందు గాయపడిన స్పీడ్‌స్టర్ మ్యాట్ హెన్రీ విజ్డన్ ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో చోటు దక్కించుకున్నారు. ఇంగ్లండ్ నుంచి జో రూట్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి అజ్మతుల్లా ఒమర్జాయ్ విజ్డన్ జట్టుకు ఎంపికయ్యారు.రోహిత్‌కు జతగా రచిన్ రవీంద్ర ఓపెనర్‌గా ఎంపిక కాగా.. విరాట్ వన్‌డౌన్‌లో, జో రూట్ నాలుగో స్థానం కోసం ఎంపిక చేయబడ్డారు. వికెట్‌కీపర్ బ్యాటర్‌గా కేఎల్ రాహుల్ ఎంపిక కాగా.. ఫాస్ట్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కోటాలో ఒమర్జాయ్, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్లుగా బ్రేస్‌వెల్, సాంట్నర్ ఎంపికయ్యారు. స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా వరుణ్ చక్రవర్తి.. స్పెషలిస్ట్ పేసర్లుగా మహ్మద్ షమీ, మ్యాట్ హెన్రీ ఎంపికయ్యారు.ఛాంపియన్స్ ట్రోఫీ జట్టును ఎంపిక చేయడంతో పాటు విజ్డన్ టీమిండియా ఆటగాళ్లకు రేటింగ్‌లు కూడా ఇచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రదర్శనల ఆధారంగా ఈ రేటింగ్‌లు ఇచ్చింది. భారత ఆటగాళ్లలో కేఎల్ రాహుల్, వరుణ్ చక్రవర్తి అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందారు. వీరికి 10కి 9 పాయింట్లు లభించాయి. రాహుల్, వరుణ్ తర్వాత విరాట్ అత్యధిక రేటింగ్ పాయింట్లు పొందాడు. విరాట్‌కు 10కి 8.5 రేటింగ్ పాయింట్లు లభించాయి. ఆతర్వాత రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌కు తలో 8 పాయింట్లు లభించాయి. శుభ్‌మన్ గిల్‌కు 7.5.. షమీ, జడేజాలకు తలో 7.. హార్దిక్, హర్షిత్ రాణాకు 10కి 6 పాయింట్లు లభించాయి.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి టైటిల్‌ను దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ అజేయ జట్టుగా నిలిచింది. ఈ టైటిల్‌తో భారత్ ఐసీసీ టైటిళ్ల సంఖ్య ఏడుకు చేరింది. రోహిత్ సారథ్యంలో టీమిండియా వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లు సాధించింది. కేవలం ఏడాదిలోపే భారత్ టీ20 వరల్డ్‌కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలను కైవసం చేసుకోవడం విశేషం. న్యూజిలాండ్‌తో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ బాధ్యతాయుతమైన అర్ద శతకం సాధించి టీమిండియా విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనకు గానూ రోహిత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు కూడా లభించింది. -
ఐసీసీ బీసీసీఐ ఆడమన్నట్టల్లా ఆడుతుంది.. విండీస్ దిగ్గజ బౌలర్ వివాదాస్పద వ్యాఖ్యలు
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా గెలవడాన్ని పాకిస్తాన్ వాళ్లే కాకుండా ఇతర దేశాల వాళ్లు కూడా జీర్జించుకోలేకపోతున్నారు. మెగా టోర్నీలో టీమిండియా తమ మ్యాచ్‌లన్నీ ఒకే వేదికపై ఆడి లబ్ది పొందిందని కొన్ని భారత వ్యతిరేక శక్తులు అవాక్కులు చవాక్కులు పేలుతున్నాయి. తాజాగా ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో ప్రాతినిథ్యమే లేని విండీస్ కూడా ఈ అంశంపై నోరు మెదపడం మొదలుపెట్టింది. భారత్ దుబాయ్‌లోనే తమ మ్యాచ్‌లన్నీ ఆడటాన్ని విండీస్ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ ఆండీ రాబర్ట్స్ తప్పుబట్టాడు. మిగతా జట్లు మైళ్లకు మైళ్లు ప్రయాణించి మ్యాచ్‌లు ఆడితే, టీమిండియా మాత్రం కాలు కదపకుండా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడిందని అన్నాడు. టోర్నీకి ఆతిథ్యమిచ్చినా పాకిస్తాన్ కూడా టీమిండియాతో మ్యాచ్‌కు దుబాయ్‌కు వెళ్లిందని గుర్తు చేశాడు. ఇలాంటప్పుడు పాక్ జట్టుకు ఆతిథ్య సౌలభ్యం ఎక్కడ లభించిందని ప్రశ్నించాడు. ఒకే వేదికపై టీమిండియా మ్యాచ్‌లు షెడ్యూల్ చేసినందుకు ఐసీసీపై కూడా ధ్వజమెత్తాడు. బీసీసీఐ ప్రతి కోరికను తీర్చడాన్ని ఐసీసీ మానుకోవాలని సూచించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ తటస్థ వేదిక (దుబాయ్) విషయంలో ఐసీసీ బీసీసీఐకి అనుకూలంగా వ్యవహరించిందని మండిపడ్డాడు. ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడటం ద్వారా టీమిండియా లబ్ది పొందిందని ఆరోపించాడు. ఈ విషయంలో మిగతా జట్లకు అన్యాయం జరిగిందని వాపోయాడు. ఇకనైనా ఐసీసీ బీసీసీఐకి సహకరించడం మానుకోవాలని అన్నాడు. 2024 టీ20 వరల్డ్‌కప్‌లోనూ ఓ విషయంలో ఐసీసీ బీసీసీఐకి సహకరించిందని నిరాధార ఆరోపణ చేశాడు. టీమిండియా కోసం బీసీసీఐ చేసే ప్రతి అభ్యర్థనను నెరవేర్చకూడదని ఐసీసీకి సూచించాడు. అప్పుడప్పుడైనా బీసీసీఐకి నో చెప్పాలని వ్యంగ్యంగా అన్నాడు. ప్రపంచంలో బీసీసీఐ ధనిక బోర్డు కావడంతో ఐసీసీ వారి చెప్పినట్టల్లా ఆడుతుందని అన్నాడు. తనవరకు ఐసీసీ అంటే ఇండియన్ క్రికెట్ బోర్డు అని ఎద్దేవా చేశాడు. బీసీసీఐ ప్రతి విషయంలో ఐసీసీని శాశిస్తుందని తెలిపాడు. రేపటి రోజుల్లో బీసీసీఐ నో బాల్స్ వద్దు, వైడ్ బాల్స్ వద్దన్నా ఐసీసీ తలూపుతుందని అన్నాడు. బీసీసీఐని తృప్తి పరిచేందుకు ఐసీసీ ఏమైనా చేస్తుందని అన్నాడు. 74 ఏళ్ల ఆండీ రాబర్ట్స్ తొలి మూడు వన్డే ప్రపంచకప్ టోర్నీల్లో విండీస్ జట్టులో కీలక సభ్యుడిగా ఉన్నాడు. ఈ మూడింటిలో విండీస్ తొలి రెండు ప్రపంచకప్‌లను గెలిచింది. 1983 వరల్డ్‌కప్‌లో కపిల్ దేవ్ నేతృత్వంలోని భారత జట్టు ఫైనల్లో విండీస్‌ను చిత్తు చేసి ఛాంపియన్‌గా అవతరించింది. నేడు రాబర్ట్స్ చేసిన వ్యాఖ్యలు నాటి ప్రపంచకప్ అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్లుంది. కాగా, రాబర్ట్స్ లేవనెత్తిన విషయాన్నే ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైక్ అథర్టన్ కూడా లేవనెత్తాడు. ఒకే వేదికపై ఆడి, ఎలాంటి ప్రయాణ బడలికలు లేకుండా టీమిండియా లబ్ది పొందిందని సోషల్‌మీడియా వేదికగా ఆరోపించాడు. అయితే ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియాకు అదనంగా ఒరిగిందేమీ లేదని పాక్ మాజీ కెప్టెన్ వసీం అక్రం అనడం విశేషం. ఈ టోర్నీలో భారత్ వేదికతో సంబంధం లేకుండా చాలా బలంగా ఉండిందని అక్రం అన్నాడు. ఈ జట్టుతో భారత్ పాకిస్తాన్లో కూడా గెలిచేదని తెలిపాడు. కాగా, ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ అన్ని మ్యాచ్‌లను దుబాయ్‌లో అడి అన్నింటా విజయాలు సాధించింది. ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌ను చిత్తు చేసి మూడోసారి ఛాంపియన్స్ ట్రోఫీని ఎగరేసుకుపోయింది. వాస్తవానికి ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా పాక్‌లో పర్యటించడానికి బీసీసీఐ ఒప్పుకోలేదు. సుదీర్ఘ చర్చల అనంతరం ఐసీసీ టీమిండియా మ్యాచ్‌లను దుబాయ్‌కు మార్చింది. -
ఇలా అయితే వరల్డ్ ఎలెవెన్‌పై కూడా గెలుస్తారు.. టీమిండియాపై పాక్ మాజీ ప్రశంసల వర్షం
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 గెలిచిన టీమిండియాపై పాకిస్తాన్ దిగ్గజ ఆల్‌రౌండర్ షాహిద్ అఫ్రిది ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ జట్టుతో భారత్ వరల్డ్ ఎలెవెన్‌పై కూడా సునాయాసంగా గెలుస్తుందని కితాబునిచ్చాడు. ఛాంపియన్స్‌గా నిలిచేందుకు టీమిండియా ఆటగాళ్లు వంద శాతం అర్హులని కొనియాడాడు.ఛాంపియన్స్ ట్రోఫీ కోసం భారత సెలెక్టర్లు సరైన జట్టును ఎంపిక చేశారని అన్నాడు. వారు దుబాయ్‌లో పరిస్థితులను ముందుగానే అంచనా వేసి స్పిన్ లోడ్‌తో బరిలోకి దిగారని తెలిపాడు. ఒకే వేదికపై ఆడటం భారత్‌కు కలిసొచ్చిందని అంటూనే ట్రోఫీ విజయంలో సెలెక్టర్ల పాత్ర అమోఘమని కితాబునిచ్చాడు.దుబాయ్‌లో స్పిన్నర్ల పాత్ర చాలా కీలకమని తెలిపాడు. తనకు అక్కడ ఆడిన అనుభవం ఉంది కాబట్టి స్పిన్నర్ల పాత్ర గురించి తెలుసని చెప్పాడు. కేవలం స్పిన్నర్లే కాకుండా టీమిండియా మొత్తం పటిష్టంగా ఉందని అన్నాడు. ఈ జట్టుతో ప్రపంచంలో ఏ జట్టునైనా ఓడించవచ్చని తెలిపాడు.తమ అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా లేకపోయినా ఈ టోర్నీలో భారత్ అన్ని మ్యాచ్‌లు గెలిచిందని గుర్తు చేశాడు. వన్డే ఫార్మాట్లో ఘనమైన ట్రాక్ రికార్డు కలిగిన మహ్మద్ సిరాజ్‌ను ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేయకుండా భారత సెలెక్టర్లు సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని అన్నాడు. నలుగురు స్పిన్నర్లకు ఆడించడం టీమిండియా వర్కౌట్ అయ్యిందని తెలిపాడు. ఈ టోర్నీలో పాకిస్తాన్ ఒకే ఒక స్పెషలిస్ట్ స్పిన్నర్‌తో (అబ్రార్ అహ్మద్) బరిలోకి దిగి పెద్ద తప్పు చేసిందని అభిప్రాయపడ్డాడు.కాగా, పాకిస్తాన్ ఆతిథ్యం ఇచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అజేయ జట్టుగా నిలిచి ఛాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ టోర్నీలో భారత్ గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్‌లపై విజయాలు సాధించి, సెమీస్‌లో ఆస్ట్రేలియా, ఫైనల్స్‌లో న్యూజిలాండ్‌ను మట్టికరిపించి, ముచ్చటగా మూడోసారి టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. మరోవైపు డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి పాకిస్తాన్ కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ సొంతగడ్డపై ఆడుతున్న అడ్వాంటేజ్‌ను కూడా పొందలేక గ్రూప్ దశలో ఆడిన 3 మ్యాచ్‌ల్లో రెండింట (న్యూజిలాండ్, భారత్ చేతుల్లో) ఓడింది. బంగ్లాదేశ్‌తో జరగాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. సొంతగడ్డపై డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగి కనీసం ఒక్క మ్యాచ్ కూడా గెలవకపోవడంతో పాక్‌కు సొంత అభిమానుల నుంచే ఛీదరింపులు ఎదురవుతున్నాయి. ఆ దేశ మాజీలు పాక్ జట్టుపై దుమ్మెత్తిపోస్తున్నారు. జట్టును ఎంపిక చేసిన సెలెక్టర్లను తూర్పారబెడుతున్నారు. పాక్ మాజీలు పాక్ ఓడిపోయిన దానికంటే తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో భారత్ గెలిచినందుకు ఎక్కువగా బాధపడుతున్నారు. పైకి టీమిండియాను పొగుడుతున్నట్లు నటిస్తున్నప్పటికీ లోలోపల కుమిలిపోతున్నారు. -
శ్రీలంకను చిత్తు చేసిన శిఖర ధవన్ సేన
ఆసియా లెజెండ్స్ లీగ్ ఆరంభ ఎడిషన్‌లో (2025) శిఖర్ ధవన్ నేతృత్వంలోని ఇండియన్ రాయల్స్ బోణీ కొట్టింది. నిన్న (మార్చి 11) శ్రీలంక లయన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 46 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 19.5 ఓవర్లలో 161 పరుగులకు ఆలౌటైంది. వన్‌డౌన్ బ్యాటర్ ఫయాజ్ ఫజల్ (52) మెరుపు అర్ద సెంచరీ సాధించి భారత్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శిఖర్ ధవన్ 16, రాహుల్ యాదవ్ 21, మనోజ్ తివారి 3, యోగేశ్ నగర్ 0, మన్‌ప్రీత్ గోని 28, జకాతి 23, అనురీత్ సింగ్ 2 పరుగులు చేయగా.. రోహన్ రతి, మునాఫ్ పటేల్ డకౌట్లయ్యారు. లంక బౌలర్లలో సంజయ 4 వికెట్లు పడగొట్టి టీమిండియాను ఇబ్బంది పెట్టాడు. తిలకరత్నే దిల్షన్ 2, అరుల్ ప్రగాసమ్, ఉపుల్ ఇంద్రసిరి, తుషారా, కెప్టెన్ తిసారి పెరీరా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం శ్రీలంక భారత బౌలర్ల ధాటికి 19.2 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌటైంది. భారత బౌలర్లలో జకాతి 3 వికెట్లు పడగొట్టగా.. మనోజ్ తివారి, అనురీత్ సింగ్, మన్‌ప్రీత్ గోని తలో 2 వికెట్లు తీశారు. లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. 35 పరుగులు చేసిన లసిత్ లక్షన్ టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మెవన్ ఫెర్నాండో (20 నాటౌట్), రవీన్ సాయర్ (18), తిసారి పెరీరా (10) రెండంకెల స్కోర్లు చేశారు. స్టార్ బ్యాటర్ తిలకరత్నే దిల్షన్ ఒక్క పరుగుకే ఔటయ్యాడు. ఈ టోర్నీలో భారత్ మొన్న (మార్చి 10) జరగాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్ టైగర్స్‌తో తలపడాల్సి ఉండింది. అయితే ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య నిన్న జరగాల్సిన మరో మ్యాచ్ కూడా వర్షం కారణంగా రద్దైంది. ఈ టోర్నీ తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్‌పై ఆసియా స్టార్స్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.కాగా, ఆసియా లెజెండ్స్ లీగ్ తొలి ఎడిషన్ (2025) మార్చి 10న ఘనంగా ప్రారంభమైంది. ఈ టోర్నీలో మొత్తం ఐదు జట్లు (ఏషియన్ లయన్స్, శ్రీలంక లయన్స్, ఆఫ్ఘనిస్తాన్ పఠాన్స్, ఇండియన్ రాయల్స్, బంగ్లాదేశ్ టైగర్స్) పాల్గొంటున్నాయి. ఏషియా ప్రాంతానికి చెందిన మాజీ స్టార్ క్రికెటర్లు ఈ టోర్నీలో పాల్గొంటున్నారు. ఇండియన్ రాయల్స్ తరఫున టీమిండియా స్టార్లు శిఖర్ ధవన్, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, అంబటి రాయుడు, మనోజ్ తివారి, మునాఫ్ పటేల్ తదితర స్టార్లు ఆడుతున్నారు. -
చాంపియన్స్ మనమే..!
చాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్ -
టీమిండియాను అవమానించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చీఫ్
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 విజేత టీమిండియాపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్యక్షుడు మొహిసిన్ నఖ్వీ తన అక్కసును వెళ్లగక్కాడు. ఛాంపియన్స్ ట్రోఫీ విజయవంతం కావడంపై ట్వీట్ చేస్తూ టోర్నీ విజేత భారత్‌ను విస్మరించాడు. తన ట్వీట్లో నఖ్వీ ఛాంపియన్స్ టీమిండియా పేరెత్తకుండా మిగతా విషయాలన్నిటిని ప్రస్తావించాడు. ఇది ఓ లెక్కన టీమిండియాకు అవమానమేనని భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. తమ దేశం ఆతిథ్యమిచ్చిన టోర్నీలో సొంత జట్టు కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోగా.. భారత్ ఛాంపియన్‌గా అవతరించడాన్ని నఖ్వీ జీర్ణించుకోలేకపోతున్నాడు. అందుకే అతను దుబాయ్‌లో జరిగిన టోర్నీ ముగింపు వేడుకకు కూడా హాజరుకాలేదు. టోర్నీ ఆతిథ్య బోర్డు అధ్యక్షుడి హోదాలో నఖ్వీ ముగింపు వేడుకకు రావాల్సి ఉన్నా ఓ సాధారణ ఉద్యోగిని పంపి చేతులు దులుపుకున్నాడు. ఇలా చేసినందుకు ఐసీసీ అధ్యక్షుడిగా ఉన్న జై షా పాక్‌కు గట్టిగానే బుద్ది చెప్పాడు. పీసీబీ పంపించిన ఉద్యోగిని ప్రోటోకాల్ సాకుగా చూపి పోడియంపైకి అనుమతించలేదు. ఈ టోర్నీ ప్రారంభం కాక ముందు నుంచి నఖ్వీ ఏదో ఒక రూపంలో భారత్ తన అయిష్టతను బహిర్గతం చేస్తూనే ఉన్నాడు. టీమిండియా తమ జెర్సీలపై పాక్ పేరును తప్పక ఉంచుకోవాలని పట్టుబట్టి మరీ ఐసీసీ చేత ఒప్పించుకున్నాడు. టోర్నీ ప్రారంభానికి ముందు అన్ని దేశాల జాతీయ జెండాలను ప్రదర్శించి, ఒక్క భారత జెండాను మాత్రమే విస్మరించాడు. భద్రతా కారణాల చేత టీమిండియా పాక్‌లో అడుగుపెట్టేందుకు నిరాకరించినందుకు ఏదో ఒక రీతిలో భారత్‌పై అక్కసును వెళ్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా టోర్నీ సక్సెస్ నోట్లో ఛాంపియన్స్ టీమిండియా పేరు ప్రస్తావించుకుండా తన వక్రబుద్దిని చాటుకున్నాడు. ఇలా చేయడంపై కొందరు భారత అభిమానులు మండిపడుతున్నప్పటికీ.. మరికొందరు మాత్రం లైట్‌గా తీసుకుంటున్నారు. వాళ్లు మన జట్టు పేరు ప్రస్తావించడమేంటి.. వారికి అస్సలు టీమిండియా పేరెత్తే అర్హత లేదంటూ కౌంటరిస్తున్నారు.ఇంతకీ ఛాంపియన్స్ ట్రోఫీ సక్సెస్ నోట్లో నఖ్వీ ఏం రాశాడంటే.. టోర్నీని అద్భుతంగా నిర్వహించిన పీసీబీ అధికారులు, స్టాఫ్‌కు కృతజ్ఞతలు. టోర్నీ నిర్వహణకు సహకరించిన ప్రాంతీయ ప్రభుత్వాలకు ధన్యవాదాలు. టోర్నీ నిర్వహణలో తమకు సహకరించిన ఐసీసీ అధికారులకు మరియు పాకిస్తాన్‌కు ప్రయాణించిన అద్భుతమైన క్రికెట్ జట్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి నిబద్ధత మరియు సమిష్టి కృషితోనే ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్ నిర్వహణ విజయవంతమైంది. ఈ మెగా టోర్నీని విజయవంతంగా నిర్వహించినందుకు యావత్ పాకిస్తాన్ గర్వపడుతుంది.కాగా, మార్చి 9న దుబాయ్‌లో జరిగిన ఫైనల్లో టీమిండియా న్యూజిలాండ్‌పై విజయం సాధించి, ముచ్చటగా మూడోసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీని కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీలో పాక్ ఒక్క మ్యాచ్ కూడా గెలవలేక గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఈ టోర్నీలో భారత్‌తో జరిగిన పోరులో పాక్ యధా మామూలుగా చిత్తుగా ఓడింది. పసికూన బంగ్లాదేశ్‌పై అయినా విజయం సాధించి టోర్నీలో బోణీ కొట్టాలనుకుంటే అది కాస్త వర్షం కారణంగా రద్దైంది. అంతకుముందు టోర్నీ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ పాక్‌కు చుక్కలు చూపించింది. ఇలా స్వదేశంలో జరిగిన టోర్నీలో వరుస పరాజయాలు ఎదుర్కొన్న పాక్, అవమాన భారంతో నిష్క్రమించింది. -
అపురూపంగా అక్కున చేర్చుకొని...
దుబాయ్: రోహిత్ శర్మ, విరాట్ కోహ్లిల చేతుల్లో నాలుగో ఐసీసీ టైటిల్స్...రవీంద్ర జడేజాకు ముచ్చటగా మూడోది. గిల్, పంత్, పాండ్యా, అక్షర్, అర్‡్షదీప్ సింగ్, కుల్దీప్ ఏడాది వ్యవధిలో రెండో ఐసీసీ ట్రోఫీని అందుకోగా... షమీ, అయ్యర్, రాహుల్, సుందర్, రాణా మొదటిసారి కప్‌ను ముద్దాడారు... 15 మంది సభ్యుల జట్టులో అందరి ఘనతలు వేర్వేరు కావచ్చు... కానీ ఇప్పటికే ఎన్ని గెలిచినా, ఏం సాధించినా మరో విజయం దక్కినప్పుడు అందరిలో కనిపించే ఆనందం ఒక్కటే... సంబరాల్లో ఎవరూ ఎక్కువ కాదు, ఎవరూ తక్కువ కాదు. ఆదివారం చాంపియన్స్ ట్రోఫీ టైటిల్‌ను గెలుచుకున్న భారత జట్టు ఆటగాళ్ల వేడుకల్లో ఇది స్పష్టంగా కనిపించింది. జడేజా బౌండరీ కొట్టి ఛేదన పూర్తి చేయడంతో మొదలైన జోష్ సోమవారం వరకు సాగింది. స్టేడియంలో ఒకవైపు జట్టు సహచరులతో విజయాన్ని పంచుకుంటూనే మరోవైపు రోహిత్, కోహ్లి, జడేజా, షమీ, గిల్ తమ కుటుంబ సభ్యులతో ట్రోఫీ ఆనందాన్ని ప్రదర్శిస్తూ సుదీర్ఘ సమయం గడిపారు. అక్కడి నుంచి ఇదే ఉత్సాహం డ్రెస్సింగ్ రూమ్‌లోనూ కొనసాగింది. ప్రత్యేకంగా సిద్ధం చేసిన కేక్‌ను కెప్టెన్ రోహిత్ కట్ చేసిన తర్వాత తమ విజయానుభూతిని అంతా పంచుకున్నారు. అనంతరం హోటల్ చేరుకున్న భారత బృందానికి ఘన స్వాగతం లభించింది. మ్యాచ్ గెలిచిన తర్వాత కుల్దీప్ చెప్పినట్లు రాత్రంతా పార్టీ కొనసాగింది. గిల్, పాండ్యా, వరుణ్ హోటల్ గదుల్లోనే చాంపియన్స్ ట్రోఫీతో ఫోటోలకు పోజులిస్తూ ఈ మధుర క్షణాలను చిరస్మరణీయం చేసుకున్నారు. సోమవారం ఉదయం విజేత కెప్టెన్‌తో ఐసీసీ ప్రత్యేక ఫొటో షూట్ కార్యక్రమం జరిగింది. ముందుగా ఐసీసీ ప్రచార కార్యక్రమంలో భాగంగా టోర్నీ జ్ఞాపికలుగా మ్యాచ్‌లలో ఉపయోగించిన బంతులు, స్టంప్స్‌పై రోహిత్ శర్మ ఆటోగ్రాఫ్‌లు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రఖ్యాత బుర్జ్ ఖలీఫా నేపథ్యంగా జరిగిన షూట్లో ట్రోఫీతో భారత సారథి సగర్వంగా నిలిచాడు. గత ఏడాది రోహిత్ నాయకత్వంలోనే గెలుచుకున్న టి20 వరల్డ్ కప్‌ను కూడా చాంపియన్స్ ట్రోఫీతో కలిపి ప్రదర్శించడం విశేషం. స్వదేశానికి చేరిన టీమిండియా ఆటగాళ్లుచాంపియన్స్ ట్రోఫీలో విజేతగా నిలిచి సంబరాలు ముగించిన వెంటనే టీమిండియా స్వదేశం పయనమైంది. సోమవారం రాత్రికే జట్టు ఆటగాళ్లంతా భారత్‌కు చేరుకున్నారు. -
Dhoni- Rohit: స్వర్ణయుగం.. ఇద్దరూ ఇద్దరే! నాకు మాత్రం అదే ముఖ్యం!
భారత్ క్రికెట్లో మహేంద్ర సింగ్ ధోని(MS Dhoni)కి ప్రత్యేక స్థానం ఉంది. సుదీర్ఘ కాలం తర్వాత అతడి నాయకత్వంలోనే టీమిండియాకు మళ్ళీ ప్రపంచ కప్ విజయం లభించింది. 1983లో కపిల్ దేవ్(Kapil Dev) నేతృత్వంలోని తొలిసారి వన్డే ప్రపంచ కప్ సాధించిన భారత్.. 2007 తర్వాత ధోని నాయకత్వంలో వరుసగా మూడు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే, సారథిగా ధోని నిష్క్రమణ తర్వాత భారత్ విజయ పరపంపరకి రోడ్‌బ్లాక్ పడింది. పదకొండు సంవత్సరాలు ట్రోఫీ లేకుండా మిగిలిపోయింది. ఇలాంటి కఠిన దశలో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన రోహిత్ శర్మ(Rohit Sharma) 2024, 2025లో వరుసగా వరుసగా రెండు ఐసీసీ ట్రోఫీ లను గెలిపించి భారత్‌కి కొత్త హీరో గా ఖ్యాతి వహించాడు.భారత క్రికెట్‌కు స్వర్ణయుగంవైట్-బాల్ క్రికెట్లో భారతదేశం తిరిగి తమ స్వర్ణ యుగానికి చేరుకుందా అంటే అవుననే చెప్పాలి. 2010ల ప్రారంభంలో ధోని చూపించిన నాయకత్వ లక్షణాలు ఇప్పుడు రోహిత్ శర్మ లో కూడా కనిపిస్తున్నాయి. వీరిద్దరూ సాధించిన ఐసీసీ ట్రోఫీలను పరిశీలిస్తే ఇది కరక్టే అనిపిస్తుంది. ఎంఎస్ ధోని సహజంగా ఎక్కువగా మాట్లాడాడు. సరిగ్గా అవసరమైనప్పుడు తన నిర్ణయాలు, వ్యక్తిగత సామర్ధ్యం ఏమిటో చూపిస్తాడు. తన స్థాయి ఏమిటో తెలియజేస్తాడు.ఇప్పుడు రోహిత్ శర్మ సరిగ్గా అదే చేసి చూపించాడు. ఇక ట్రోఫీల పరంగా చూస్తే ధోని 2007లో టీ20 ప్రపంచ కప్, 2011లో వన్డే ప్రపంచ కప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలను భారలత్కి అందించాడు.ఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వం లో భారత్ 2023లో వన్డే ప్రపంచ కప్ రన్నరప్‌గా నిలిచింది. 2024లో టీ20 ప్రపంచ కప్ గెలిచింది. మళ్ళీ ఈ సంవత్సరం ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపొందింది.అప్పటి భారత జట్టు వెనుకబాటుకి కారణం?2014- 2022 మధ్య భారత్ జట్టు వెనుకడిందని చెప్పవచ్చు. నిజానికి టీమిండియాకు అపారమైన ప్రతిభ గల ఆటగాళ్లు ఉన్నా సరళంగా చెప్పాలంటే, వారు తమ బృందానికి న్యాయం చేయడంలో విఫలమయ్యారు. ఈ కాలంలో భారత్ జట్టు ఐసీసీ ప్రధాన టోర్నమెంట్లలో నిలకడ గా ఆడి నాకౌట్ దశలకు చేరుకున్నప్పటికీ, ట్రోఫీ లను అందుకోవడంలో విఫలమైంది. ఫైనల్ కి చేరుకున్న జట్లని ఎవ్వరూ గుర్తుపెట్టుకోరు.ట్రోఫీ గెలిస్తేనే ఆ జట్టు చరిత్రలో విజయం సాధించిన జట్టుగా కీర్తిని గడిస్తుంది. ధోని నాయకత్వంలో భారత్ జట్టు 2007 టీ20 ప్రపంచ కప్ విజయం ఊహించనిది. 2011లో భారత్ భారీ అంచనాల రీతి తగ్గట్టుగా ఆడి సొంత గడ్డ పై ప్రపంచ కప్‌ను సాధించింది. ఈ టోర్నమెంట్లో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్, జహీర్ ఖాన్, యువరాజ్ సింగ్ , హర్భజన్ సింగ్ వంటి ఆటగాళ్లు భారత్ జట్టు విజయంలో కీలక భూమిక వహించారు.ఇక 2013 నాటికి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మలతో కూడిన కొత్త తరం ఆటగాళ్లు భారత జట్టులోకి చేరారు. ఇంగ్లండ్‌లో భారత్ ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్నప్పుడు ధోని వ్యూహాత్మక ప్రతిభ స్పష్టంగా కనిపించింది. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలతో పాటు కొత్త ఫాస్ట్ బౌలర్ల ఆవిర్భావంతో అప్పుడు జట్టును బలోపేతం చేశారు.కాగా 2017లో విరాట్ కోహ్లీ వైట్-బాల్ కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించినప్పుడు, అతడి టెస్ట్ విజయం పరిమిత ఓవర్ల ఆధిపత్యంగా మారలేదు. రెడ్-బాల్ క్రికెట్ పట్ల కోహ్లీకి స్పష్టమైన అవగాహన ఉన్నప్పటికీ వైట్-బాల్ టోర్నమెంట్లలో కోహ్లీ అదే విజయ పరంపరను కొనసాగించలేకపోయాడు.రోహిత్ నాయకత్వంలో పునరుజ్జీవనంఇప్పుడు రోహిత్ శర్మ నాయకత్వంలో భారత్ మళ్ళీ మునుపటి విజయ పరంపరను కొనసాగించే స్థాయికి ఎదిగింది. 2007 పరాజయం తర్వాత ధోని భారత్ జట్టు ని ఎలా పునర్నిమించాడో ఇప్పుడు రోహిత్ తనదైన శైలి లో అదే చేసి చూపించాడు. జట్టు లో ఉత్తేజాన్ని పెంచాడు. ఎక్కడా తలవొగ్గ కుండా దూకుడుగా ఆడటాన్ని అలవాటు చేసాడు.2019 ప్రపంచ కప్ సెమీ-ఫైనల్, 2021 టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్తాన్‌తో జరిగిన అవమానం, 2022లో ఇంగ్లండ్ చేతిలో జరిగిన సెమీ-ఫైనల్ ఓటమి వంటి హృదయ విదారక సంఘటనలు రోహిత్ మనస్తత్వంలో మార్పును రేకెత్తించాయి. భారత్ జట్టులో తీసుకురావాల్సిన మార్పును సరిగ్గా గుర్తించాడు.నాకు అదే ముఖ్యం2019 ప్రపంచ కప్ లో రోహిత్ ఐదు సెంచరీలు సాధించినప్పటికీ చివరికి ట్రోఫీ గెలువలేకపోవడం బాగా అసంతృప్తిని మిగిల్చింది. రోహిత్ వ్యక్తిగతంగా రాణించినప్పటికీ అది జట్టు విజయానికి దోహదం చేయలేదన్న బాధ అతన్ని కలిచివేసింది. “నేను 2019 ప్రపంచ కప్‌లో వ్యక్తిగతంగా బాగా రాణించాను. కానీ మేము ట్రోఫీ గెలవలేకపోయాం.ఆ సెంచరీల పరంపర, పరుగుల వరద నాకు సంతృప్తి ఇవ్వలేకపోయింది. వ్యక్తిగతంగా 30 లేదా 40 పరుగులు చేసినప్పటికీ ట్రోఫీ గెలిస్తే లభించే ఆనందం వేరే స్థాయిలో ఉంటుంది. అలా చేయడం నాకు చాలా ముఖ్యమని నేను భావిస్తున్నాను" అని రోహిత్ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ విజయం అనంతరం వ్యాఖ్యానించడం అతని లోని పరిణతికి అద్దం పడుతుంది.విజయం అనేది ఒక వ్యసనం లాంటిది. భారత్ ఐసీసీ వైట్-బాల్ మ్యాచ్‌లలో ఇంతవరకు వరుసగా 24 మ్యాచ్‌లలో 23 గెలించిందంటే మామూలు విషయం కాదు. వరుసగా రెండు ఐసీసీ టైటిళ్లను కైవసం చేసుకున్న రోహిత్ శర్మ ఇప్పుడు చారిత్రాత్మక ట్రిపుల్‌పై దృష్టి పెట్టాడు. అంటే 2027 వన్డే ప్రపంచ కప్‌లో టీమిండియాను విజయపథాన నడిపించాలని భావిస్తున్నాడు. అదే జరిగితే రోహిత్ శర్మ ఎంఎస్ ధోని నాయకత్వ రికార్డుని సమం చేసినట్టే!ఇక ఓవరాల్‌గా కెప్టెన్లుగా ధోని- రోహిత్ రికార్డులు చూస్తే ఇద్దరూ చెరో ఐదుసార్లు ఐపీఎల్ ట్రోఫీలు గెలిచారు. ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరఫున.. రోహిత్ ముంబై ఇండియన్స్ తరఫున ఈ ఫీట్ నమోదు చేశారు. ఆసియాకప్ టోర్నమెంట్లోనూ రెండుసార్లు టీమిండియాను విజయపథంలో నిలిపారు. ధోని 2010, 2016.. రోహిత్ 2018, 2023లో టైటిల్స్ గెలిచారు. ఇక చాంపియన్స్ లీగ్ ట్రోఫీలో ధోని రెండుసార్లు (2010, 2014).. రోహిత్ ఒకసారి(2013) టైటిల్ సాధించారు.చదవండి: తప్పులు సరిదిద్దుకుని.. ‘టాప్’ రన్ స్కోరర్‌గా.. మాటలకు అందని అనుభూతి! -
HYD: భారత్ విక్టరీపై ఫ్యాన్స్ సంబురాలు.. పోలీసుల లాఠీచార్జ్
సాక్షి, హైదరాబాద్: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్ విజయం సాధించింది. న్యూజిలాండ్ జట్టుపై నాలుగు వికెట్ల తేడాతో భారత్ జట్టు విజయాన్ని అందుకుంది. టీమిండియా విజయంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత అభిమానాలు సంబురాలు జరుపుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా రోడ్ల మీదకు వచ్చిన అభిమానులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు.వివరాల ప్రకారం.. భారత జట్టు విజయం అనంతరం హైదరాబాద్‌లో అభిమానులు బాణాసంచా పేల్చి డ్యాన్స్‌లు చేస్తూ రోడ్లకు మీదకు వచ్చారు. ఈ క్రమంలో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒక్కసారిగా భారీ సంఖ్యలో అభిమానులు బయటకు రావడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అభిమానులు గట్టిగా కేకలు వేస్తూ డ్యాన్స్ చేశారు. దీంతో, పోలీసులు రోడ్ల మీదకు వచ్చిన వారిపై లాఠీచార్జ్ చేశారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ పరుగులు తీశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.బ్రేకింగ్ న్యూస్ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ లో భారత్ విజయంహైదరాబాద్లో సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్‌ను చితకబాదిన పోలీసులఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు గెలవడంతో హైదరాబాద్‌లో దిల్సుఖ్ నగర్లో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకున్న ఫ్యాన్స్ మీద లాఠీ ఛార్జ్ చేసిన పోలీసులు pic.twitter.com/UBabGMdvkG— Telugu Scribe (@TeluguScribe) March 9, 2025 Video Credit: TeluguScribeటీమిండియా విజయం సందర్బంగా ట్యాంక్ బండ్ మీదకు భారీగా అభిమానులు చేరుకుని సంబురాలు జరుపుకున్నారు. ఐటీ కారిడార్, అమీర్‌పేట్, కూకట్పల్లి సహా పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి వరకు అభిమానులు సంబురాల్లో మునిగిపోయారు. విజయంపై తమ అభిమానం చాటుకున్నారు. MASSIVE CELEBRATIONS IN HYDERABAD FOR TEAM INDIA'S VICTORY. 🇮🇳pic.twitter.com/qhXpCzIEbJ— Mufaddal Vohra (@mufaddal_vohra) March 9, 2025 Champions trophy celebrations at Tankbund Hyderabad. pic.twitter.com/BpJvzC3KF0— 𝐒𝐚𝐟𝐟𝐫𝐨𝐧 𝐒𝐚𝐠𝐚𝐫 𝐆𝐨𝐮𝐝 (@Sagar4BJP) March 10, 2025India can win and celebrate in Muslim nation UAE but not in Hyderabad, India.Well done Telangana 👌pic.twitter.com/bnujojic5a— Vikram Pratap Singh (@VIKRAMPRATAPSIN) March 10, 2025 -
భారత్ జట్టుకు అభినందనలు తెలుపుతున్న సినీ, రాజకీయ, క్రికెట్ ప్రముఖులు
-
భారత జట్టు అపూర్వ విజయంపై వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, తాడేపల్లి: ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టు విజేతగా నిలిచింది. ఈ నేపథ్యంలో భారత జట్టుకు వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ అభినందనలు తెలిపారు. జట్టు విజయం మన దేశానికి గర్వకారణమైన క్షణం అని చెప్పుకొచ్చారు.ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో అసాధారణ విజయం సాధించిన అనంతరం భారత జట్టుకు వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. ‘ఇది ఎంతో అర్హమైన అజేయ విజయం. మన దేశానికి గర్వకారణమైన క్షణం! టీమిండియాకు అభినందనలు’ అని వైఎస్ జగన్ పేర్కొన్నారు.Congratulations to Team India on their exceptional victory! in ICC Champions Trophy 2025. This is a highly deserving unbeaten victory. A proud moment for our nation! Kudos to Team India.#ChampionsTrophy2025 #INDvsNZ— YS Jagan Mohan Reddy (@ysjagan) March 9, 2025 -
దుబాయ్ గడ్డపై గర్జించిన టీమిండియా
-
ఛాంపియన్స్ ట్రోఫీ విజేత భారత్
-
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజేత భారత్.. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో న్యూజిలాండ్‌పై విజయం
పాకిస్తాన్, దుబాయ్ సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్‌లో టీమిండియా విజేతగా నిలిచింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 9) జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఉత్కంఠగా సాగిన ఫైనల్లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. భారత స్పిన్నర్లు చెలరేగిన వేల డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అద్భుతమైన అర్ద సెంచరీలు సాధించి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. ఆదిలో రచిన్ రవీంద్ర (37), ఆఖర్లో గ్లెన్ ఫిలిప్స్ (34) మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ (15), కేన్ విలియమ్సన్ (11), టామ్ లాథమ్ (14),మిచెల్ సాంట్నర్ (8) తక్కువ స్కోర్లకు ఔటయ్యారు. భారత్ బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో 2.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకోగా.. కుల్దీప్, వరుణ్, జడ్డూ, అక్షర్ పొదుపుగా బౌలింగ్ చేశారు. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి న్యూజిలాండ్ బ్యాటర్లు భారీ స్కోర్ చేయకుండా కట్టడి చేశారు.అనంతరం స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై 252 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి విజయతీరాలకు చేరింది. ఛేదనలో రోహిత్ (76) భారత్‌కు శుభారంభాన్ని అందించారు. శుభ్‌మన్ గిల్‌తో (31) కలిసి తొలి వికెట్‌కు 105 పరుగులు జోడించాడు. అయితే భారత్ 17 పరుగుల వ్యవధిలో గిల్, కోహ్లి (1), రోహిత్ వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో శ్రేయస్ అయ్యర్ (48), అక్షర్ పటేల్ (29) మంచి భాగస్వామ్యం నెలకొల్పి భారత్‌ను తిరిగి గేమ్‌లోకి తెచ్చారు. అయితే శ్రేయస్, అక్షర్ కూడా స్వల్ప వ్యవధిలో ఔట్ కావడంతో టీమిండియా మరోసారి ఒత్తిడిలో పడింది. ఇన్నింగ్స్ మధ్యలో పరుగులు చేసేందుకు భారత బ్యాటర్లు తెగ ఇబ్బంది పడ్డారు. న్యూజిలాండ్ స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి టీమిండియా బ్యాటర్లపై తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు.ఈ దశలో కేఎల్ రాహుల్ (34 నాటౌట్).. హార్దిక్ పాండ్యా (18), రవీంద్ర జడేజాతో (18 నాటౌట్) కలిసి మ్యాచ్ విన్నింగ్ భాగస్వామ్యాలు నెలకొల్పి భారత్‌ను విజయతీరాలకు చేర్చాడు. జడేజా బౌండరీ బాది భారత్‌ను గెలిపించాడు. న్యూజిలాండ్ బౌలర్లలో సాంట్నర్, బ్రేస్‌వెల్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. జేమీసన్, రచిన్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలవడం భారత్‌కు ఇది మూడోసారి (2002, 2013, 2025). ఫైనల్లో అద్భుతంగా బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించగా.. టోర్నీ ఆధ్యాంతం రాణించిన రచిన్ రవీంద్రకు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డు లభించింది. -
CT 2025 Final: సత్తా చాటిన టీమిండియా స్పిన్నర్లు.. అయినా టఫ్ టార్గెట్‌ను సెట్ చేసిన న్యూజిలాండ్
దుబాయ్ వేదికగా జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ పోటీపడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. డారిల్ మిచెల్ (63), మైఖేల్ బ్రేస్‌వెల్ (53 నాటౌట్) అర్ద సెంచరీలు చేసి న్యూజిలాండ్‌కు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. న్యూజిలాండ్ ఇన్నింగ్స్‌లో విల్ యంగ్ 15, రచిన్ రవీంద్ర 37, కేన్ విలియమ్సన్ 11, టామ్ లాథమ్ 14, గ్లెన్ ఫిలిప్స్ 34, మిచెల్ సాంట్నర్ 8 పరుగులు చేశారు.భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు.. షమీ, జడేజా చెరో వికెట్ పడగొట్టారు. భారత బౌలర్లలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేసినా న్యూజిలాండ్ మంచి స్కోర్ చేయగలిగింది. డారిల్ మిచెల్, మైఖేల్ బ్రేస్‌వెల్ అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడి భారత్‌కు టఫ్ టార్గెట్ నిర్దేశించారు. స్పిన్నర్లు వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా తమ కోటా 10 ఓవర్లు పూర్తి చేసి పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు కీలకమైన వికెట్లు తీశారు. అయితే ఇన్నింగ్స్ చివర్లో అక్షర్ పటేల్ కోటా ఓవర్లు ఇంకా మిగిలి ఉన్నా (2 ఓవర్లు) కెప్టెన్ రోహిత్ ఎందుకో అతనితో బౌలింగ్ చేయించలేదు. చివరి 3 ఓవర్లలో షమీ 2, హార్దిక్ ఓ ఓవర్ వేశారు. ఈ 3 ఓవర్లలో న్యూజిలాండ్ 35 పరుగులు పిండుకుంది. న్యూజిలాండ్ 235 పరుగులు చేస్తే కష్టమనుకున్న తరుణంలో షమీ, హార్దిక్ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు. చివరి ఓవర్లలో షమీ, హార్దిక్ ఇచ్చిన పరుగులు టీమిండియా ఫేట్‌ను మార్చే ప్రమాదముంది.ఈ పిచ్‌పై 252 పరుగులు ఛేదించడం అంత ఆషామాషీ విషయం కాదు. పిచ్‌పై మంచి టర్న్ లభిస్తుంది. న్యూజిలాండ్ వద్ద సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి నాణ్యమైన స్పిన్నర్లు ఉన్నారు. రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ తమ స్పిన్ బౌలింగ్‌తో మాయాజాలం చేయగలరు. మొత్తంగా భారత బ్యాటర్లు న్యూజిలాండ్ బౌలర్ల నుంచి కఠినమైన సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఛేదనలో ఓపెనర్ రోహిత్ కనీసం 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో ఉండటం చాలా కీలకం. రోహిత్ తన సహజ శైలిలో వేగంగా పరుగులు సాధించే క్రమంలో వికెట్ కోల్పోతే టీమిండియా మూల్యం చెల్లించుకోక తప్పదు. భారత్‌కు ఓపెనింగ్ భాగస్వామ్యం చాలా కీలకం. భారత్ పవర్ ప్లేలో ఎట్టి పరిస్థితుల్లో వికెట్లు కోల్పోకూడదు. ఒకవేళ టీమిండియా పవర్ ప్లేలో వికెట్లు కోల్పోతే మిడిలార్డర్‌పై తీవ్రమైన ఒత్తిడి పడుతుంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌పై సాంట్నర్, బ్రేస్‌వెల్ లాంటి బౌలర్లను తట్టుకుని నిలబడటం ఆషామాషీ విషయం కాదు. -
CT 2025 Final: నాలుగు క్యాచ్‌లు జారవిడిచిన టీమిండియా ఫీల్డర్లు.. మూల్యం తప్పదా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఫైనల్లో ఇవాళ (మార్చి 9) భారత్, న్యూజిలాండ్ జట్లు తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేస్తుంది. భారత స్పిన్నర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తుండటంతో న్యూజిలాండ్ 196 పరుగులకు (44 ఓవర్లలో) సగం వికెట్లు కోల్పోయింది. డారిల్ మిచెల్ (51), మైఖేల్ బ్రేస్‌వెల్ (21) క్రీజ్‌లో ఉన్నారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా ఓ వికెట్ దక్కించుకున్నాడు. వరుణ్, కుల్దీప్ న్యూజిలాండ్ ఆటగాళ్లు భాగస్వామ్యాలు నెలకొల్పుతున్న సమయంలో వికెట్లు తీసి భారత్‌ను తిరిగి ఆటలోకి తెచ్చారు. భారత్‌కు తొలి ఫలితం వరుణ్ చక్రవర్తి అందించాడు. ఇన్నింగ్స్ 8వ ఓవర్ చివరి బంతికి వరుణ్ విల్ యంగ్‌ను (15) ఎల్బీడబ్ల్యూ చేశాడు. అనంతరం కుల్దీప్ తన మొదటి బంతికే ఇన్ ఫామ్ బ్యాటర్ రచిన్ రవీంద్రను (37) క్లీన్ బౌల్డ్ చేశాడు. కొద్ది సేపటికే కుల్దీప్ మరో అద్భుత బంతితో స్టార్ ఆటగాడు కేన్ విలియమ్సన్‌ను (11) క్యాచ్ అండ్ బౌల్డ్ చేశాడు. మిచెల్, లాథమ్ క్రీజ్‌లో కుదురుకుంటుండగా.. జడేజా లాథమ్‌ను (14) వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. మిచెల్‌తో కలిసి 50 పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని నెలకొల్పి ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్‌ను (34) వరుణ్ చక్రవర్తి మరో అద్బుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు.ఇంతవరకు బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో భారత ఫీల్డర్ల ప్రదర్శన చాలా దారుణంగా ఉండింది. 40 ఓవర్లలోపే భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు డ్రాప్ చేశారు. తొలుత రచిన్ రవీంద్ర అందించిన రెండు క్యాచ్‌లను శ్రేయస్ అయ్యర్, మహ్మద్ షమీ నేలపాలు చేశారు. అయితే అదృష్టవశాత్తు రచిన్ ఔట్ కావడంతో భారత ఆటగాళ్లు ఊపిరిపీల్చుకున్నారు. తర్వాత భారత ఫీల్డర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ మరో రెండు క్యాచ్‌లు జారవిడిచారు. డారిల్ మిచెల్ క్యాచ్‌ను రోహిత్.. ఫిలిప్స్ క్యాచ్‌ను గిల్ వదిలేశారు. ప్రమాదకరంగా కనిపిస్తున్న ఫిలిప్స్ ఔటయ్యాడు కానీ మరో డేంజర్ బ్యాటర్ డారిల్ మిచెల్ ఇంకా క్రీజ్‌లోనే ఉన్నాడు. మిచెల్ డ్రాప్ క్యాచ్‌కు టీమిండియా మూల్యం చెల్లించకుంటుందేమో వేచి చూడాలి. -
టీమిండియాకు అసలుసిసలైన మొనగాడు
-
CT 2025 Final: వరుణ్ మిస్టరీ కోడ్‌ను కివీస్ బ్యాటర్లు ఛేదించగలరా..?
భారత్, న్యూజిలాండ్ మధ్య దుబాయ్‌లో జరుగనున్న 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌ను రెండు సమవుజ్జీలైన జట్ల మధ్య జరిగే టైటిల్ పోరుగా అభివర్ణించవచ్చు. బ్యాటింగ్ పరంగా చూస్తే భారత్, న్యూజిలాండ్ రెండు జట్ల బ్యాట్స్‌మన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నారు. భారత్ తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్ లో మినహా న్యూజిలాండ్ బ్యాట్స్‌మన్ ఎక్కడా తడబడినట్టు కానీ, తక్కువ స్థాయిలో ఆడుతున్నట్టు కానీ కనిపించలేదు. న్యూజిలాండ్ ను ఈ మ్యాచ్ లో నిలువరించి ఘనత భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి దక్కుతుంది.తొలి పోరులో వరుణ్ దే పైచేయిగత ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి కివీస్ బ్యాట్స్‌మన్‌ని తన వైవిధ్యమైన బౌలింగ్ తో ముప్పతిప్పలు పెట్టాడు. అంటే న్యూ జిలాండ్ బ్యాట్స్‌మన్ కి స్పిన్నర్లను ఆడటం తెలియక కాదు. వారి జట్టులోనూ అద్భుతమైన స్పిన్నర్లు ఉన్నారు. స్పిన్నర్లపై ఆధిపత్యం సాధించే అద్భుతమైన బ్యాట్స్‌మన్ కూడా ఉన్నారు. కానీ వరుణ్ మాత్రం విభిన్నమైన స్పిన్నర్. అతని బౌలింగ్ యాక్షన్ బట్టి అతని ఎలాంటి బంతి వేస్తాడో అంచనా వేయడం కష్టం.అదే ప్రత్యర్థి బ్యాట్స్‌మన్ కి పెద్ద అవరోధంగా కనిపిస్తోంది. అందుకే ఆ మ్యాచ్ లో వరుణ్ మిస్టరీ కోడ్‌ను అర్థం చేసుకోవడానికి కివీస్ బ్యాటర్లు నానా తిప్పలు పడ్డారు. ఈ మ్యాచ్ లో వరుణ్ 52 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. ఇందులో విల్ యంగ్, గ్లెన్ ఫిలిప్స్ మరియు మిచెల్ సాంట్నర్ వంటి కీలక వికెట్లు కూడా ఉన్నాయి. ఆ తర్వాత సెమీ-ఫైనల్లో ఆస్ట్రేలియాపై కూడా వరుణ్ మంచి వైవిధ్యం తో బౌలింగ్ చేసాడు. ఎప్పడూ భారత్ జట్టుకి ప్రధాన అడ్డంకి గా నిలిచే ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్‌ను తన తొలి బంతితోనే బోల్తా కొట్టించాడు. వరుణ్ ఫామ్ ఫైనల్‌కి ముందు భారత్‌కు అదనపు బలాన్నిస్తునడంలో సందేహం లేదు.వరుణ్ గురించి హెచ్చరించిన కివీస్ కోచ్ అందుకే మ్యాచ్ కి ముందే న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టీడ్ తమ బ్యాట్సమన్లని వరుణ్ నుంచి ఎదురయ్యే సవాలుకి సిద్ధంగా ఉండాలని హెచ్చరించాడు. గత మ్యాచ్ లో మా జట్టు పై 5/42 గణాంకాలతో పైచేయి సాధించిన వరుణ్ ఫైనల్లో ఆడతాడని కచ్చితంగా చెప్పగలను. వరుణ్ ఒక క్లాస్ బౌలర్. గత మ్యాచ్ లో మాకు తన నైపుణ్యం మేమిటో రుచి చూపించాడు. ఫైనల్లో వరుణ్ మాకు పెద్ద ముప్పుగా భావిస్తున్నాం. ఈ విషయం (వరుణ్ మా ప్రధాన అడ్డంకి అని ) ముందే తెలిసింది కాబట్టి అతన్ని ఎలా ఎదుర్కోగలం. ఎలా పరుగులు సాధించగలము అనే దాని పై అంచనాలు వేస్తున్నామని స్టీడ్ అన్నాడు.హెన్రీ ఆడతాడా?న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా మధ్య జరిగిన రెండో ఛాంపియన్స్ ట్రోఫీ సెమీ-ఫైనల్ సందర్భంగా కివీస్ స్టార్ పేసర్ మాట్ హెన్రీ గాయపడ్డాడు. ప్రమాదకరమైన బ్యాట్స్‌మన్ హెన్రిచ్ క్లాసెన్‌ను అవుట్ చేసే ప్రయత్నంలో డైవింగ్ క్యాచ్ తీసుకుంటుండగా, హెన్రీ కుడి భుజంపై గాయమైంది. వెంటనే ఫిజియోలు అతనిని పరిశీలించినప్పటికీ అతను తీవ్ర అసౌకర్యంతో ఉన్నట్టు కనిపించాడు. చివరికి హెన్రీ మైదానం నుండి బయటకు వెళ్లవలసి వచ్చింది. ఈ మ్యాచ్ లో మాట్ హెన్రీ తన 10 ఓవర్లను పూర్తి చేయలేకపోయాడు. అతను కేవలం 7 ఓవర్లు బౌలింగ్ చేసి 2 వికెట్లు తీసి 42 పరుగులు ఇచ్చాడు.ఈ మ్యాచ్ అనంతరం న్యూజిలాండ్ కెప్టెన్ మిచెల్ సాంట్నర్ మాట్లాడుతూ.. మాట్ హెన్రీ భుజం కొంచెం నొప్పిగా ఉందని.. అతను భారత్‌తో ఫైనల్ ఆడగలడో లేదో వేచి చూడాలన్నాడు. ఈ మ్యాచ్ లో భారత్ బ్యాట్స్‌మన్ ని నిలువరించడంలో హెన్రీ కీలక పాత్ర వహించాడు. ఈ మ్యాచ్ లో హెన్రీ ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో తన అత్యుత్తమ గణాంకాలు (5/42) నమోదు చేసుకున్నాడు. ఫైనల్లో హెన్రీ ఆడకపోతే న్యూజిలాండ్‌కు పెద్ద దెబ్బ అవుతుంది. -
CT 2025: ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందింది.. విమర్శకులకు ఇచ్చిపడేసిన అశ్విన్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ టోర్నీకి పాక్ ఆతిథ్యమిస్తున్నప్పటికీ.. భద్రతా కారణాల రిత్యా టీమిండియా తమ మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుంది. అయితే టీమిండియా తమ మ్యాచ్‌లను ఒకే వేదికపై ఆడటాన్ని కొందరు ప్రస్తుత, మాజీ క్రికెటర్లు తప్పుబడుతున్నారు. ఒకే వేదికపై మ్యాచ్‌లు ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని ఆరోపిస్తున్నారు.ఈ ఆరోపణలపై భారత స్పిన్ దిగ్గజం రవిచంద్రన్ అశ్విన్ స్పందించాడు. ఒకే వేదికపై ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందనడం సరికాదన్నాడు. గతంలో (2009 ఛాంపియన్స్ ట్రోఫీ) సౌతాఫ్రికా ఒకే వేదికపై అన్ని మ్యాచ్‌లు ఆడినా ఫైనల్‌కు చేరలేదన్న విషయాన్ని గుర్తు చేశాడు. బాగా ఆడితేనే టోర్నమెంట్లు గెలుస్తారని, సాకుల వల్ల కాదని చురకలంటించాడు. దుబాయ్‌లో ఆడటం వల్ల టీమిండియా లబ్ది పొందుతుందని తమ కెప్టెన్, కోచ్‌లను ప్రశ్నించినప్పుడు నవ్వుకున్నానని అన్నాడు. టీమిండియా చివరిగా కోవిడ్‌కు ముందు 2018లో (ఆసియా కప్) దుబాయ్‌లో ఆడిందన్న విషయాన్ని గుర్తు చేశాడు. టీమిండియా తర్వాత న్యూజిలాండ్, ఇంగ్లండ్, సౌతాఫ్రికా దుబాయ్‌లో ఆడాయని అన్నాడు. ప్రయాణించడం వల్ల ఆటగాళ్లు అలసిపోతారన్న విషయంతో ఏకీభవించిన అశ్విన్.. షెడ్యూల్ ఫిక్స్ చేయడంలో టీమిండియా ప్రమేయం ఉండదన్న విషయాన్ని గుర్తు చేశాడు. సౌతాఫ్రికా ఆటగాడు డేవిడ్ మిల్లర్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా ఈ విషయాన్ని ప్రస్తావించాడు.ఎంతమంది ఎన్ని రకాలుగా టీమిండియాపై ఆరోపణలు (ఒకే వేదిక అంశం) చేసినా న్యూజిలాండ్ ఆటగాళ్లు మాత్రం ఎలాంటి వ్యాఖ్యలు చేయరని కితాబునిచ్చాడు. ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు చేయకుండా కేవలం ఆటపై దృష్టి పెడుతుంది కాబట్టే న్యూజిలాండ్‌కు భారీ సంఖ్యలో అభిమానులున్నారని అన్నాడు. ఫైనల్లో గెలిచినా ఓడినా న్యూజిలాండ్ ఆటగాళ్లు హుందాగా ప్రవర్తిస్తారని తెలిపాడు.కాగా, ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భారత్ అదరగొడుతున్న విషయం తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్, పాక్, న్యూజిలాండ్‌పై విజయాలు సాధించిన భారత్.. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించి అజేయ జట్టుగా ఫైనల్‌కు చేరింది. మరోవైపు న్యూజిలాండ్ గ్రూప్ దశలో పాకిస్తాన్, బంగ్లాదేశ్‌పై విజయాలు సాధించి, భారత్ చేతిలో ఓడింది. అయినా గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచి సెమీస్‌కు చేరింది. సెమీస్‌లో కివీస్ సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. దుబాయ్ వేదికగా రేపు (మార్చి 9) జరుగబోయే తుది సమరంలో న్యూజిలాండ్ రోహిత్ సేనతో అమీతుమీ తేల్చుకోనుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో న్యూజిలాండ్ భారత్‌ను ఎదుర్కోవడం ఇది రెండోసారి. 2000 ఎడిషన్ ఫైనల్లో కివీస్ భారత్‌ను ఢీకొట్టి విజేతగా నిలిచింది. న్యూజిలాండ్‌కు అది తొలి ఐసీసీ టైటిల్. -
వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు అరెస్ట్
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరుడు వినోద్ సెహ్వాగ్ అరెస్ట్ అయ్యాడు. చెక్ బౌన్స్ కేసులో చండీఘడ్ పోలీసులు వినోద్ సెహ్వాగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి అనేక మార్లు విచారణకు హాజరుకాకపోవడంతో 2023లో స్థానిక కోర్టు వినోద్ సెహ్వాగ్‌తో పాటు మరో ఇద్దరిని దోషులుగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే వినోద్ అరెస్ట్ జరిగింది. అరెస్ట్ అనంతరం వినోద్ తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. అయితే ఈ పిటిషన్‌ను పోలీసులు వ్యతిరేకించారు. దీంతో దీనిపై విచారణ మార్చి 10కి వాయిదా పడింది. అప్పటివరకు వినోద్ సెహ్వాగ్ పోలీసుల కస్టడీలోనే ఉండనున్నాడు.అసలేం జరిగిందంటే.. క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ కంపెనీలో వినోద్ సెహ్వాగ్‌తో పాటు విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రా డైరెక్టర్లుగా ఉన్నారు. ఈ కంపెనీ 2018లో శ్రీ నైనా ప్లాస్టిక్స్ నుండి రూ. 7 కోట్ల విలువైన వస్తువులు కొనుగోలు చేసింది. చెల్లింపుగా, కంపెనీ రూ. కోటి చొప్పున ఏడు వేర్వేరు చెక్కులను జారీ చేసింది.అయితే అకౌంట్లో సరిపడా నిధులు లేని కారణంగా అన్ని చెక్కులు బౌన్స్ అయ్యాయి. పలు ఫాలోఅప్‌ల అనంతరం శ్రీ నైనా ప్లాస్టిక్స్ అధినేత కృష్ణణ్ మోహన్ ఖన్నా కోర్టును ఆశ్రయించారు. స్థానిక కోర్టు క్సాల్టా ఫుడ్ అండ్ బేవరేజెస్ డైరెక్టర్లైన వినోద్ సెహ్వాగ్, విష్ణు మిట్టల్, సుధీర్ మల్హోత్రాను నిందితులుగా ప్రకటించింది. ఈ తీర్పుపై వినోద్ సెహ్వాగ్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.ఇదిలా ఉంటే, వీరేంద్ర సెహ్వాగ్‌కు సంబంధించి ఇటీవలికాలంలో వచ్చిన రెండో వార్త ఇది. వీరూ అతని భార్యతో విడాకులు తీసుకోనున్నాడని కొద్ది రోజుల కిందట సోషల్‌మీడియా కోడై కూసింది. ఇన్‌స్టాలో వీరూ, అతని సతీమణి ఇద్దరు అన్‌ఫాలో చేయడంతో ఈ ప్రచారం మొదలైంది. వీరూ గత కొద్ది రోజులుగా తన భార్యను విడిచి పెట్టి, తన ఇద్దరు పిల్లలతో పాటు వేరుగా ఉంటున్నట్లు తెలుస్తుంది. తరుచూ పుణ్యక్షేత్రాలు తిరిగే వీరూ ఈ మధ్యకాలంలో ఒంటరిగా ఆలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నాడు.46 ఏళ్ల వీరేంద్ర సెహ్వాగ్ 2013లో అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పాడు. అప్పటినుంచి కామెంటేటర్‌గా, విశ్లేషకుడిగా క్రికెట్‌తో సంబంధం కలిగి ఉంటున్నాడు. సెహ్వాగ్‌కు ఇద్దరు కొడుకులు. ఈ ఇద్దరూ క్రికెటర్లే కావడం విశేషం. సెహ్వాగ్ పెద్ద కొడుకు ఇటీవలికాలంలో జూనియర్ క్రికెట్లో సత్తా చాటి వార్తల్లో నిలిచాడు. సెహ్వాగ్‌కు టీమిండియా విధ్వంసకర బ్యాటర్‌గా పేరుండేది. సెహ్వాగ్ భారత్ తరఫున టెస్ట్‌ల్లో తొలి ట్రిపుల్ సెంచరీ చేసిన ఆటగాడిగా చరిత్రకెక్కాడు. సెహ్వాగ్ తన కెరీర్లో రెండు ట్రిపుల్ సెంచరీలు చేశాడు. కేవలం బ్రాడ్‌మన్, గేల్, లారా మాత్రమే ఈ ఘనత సాధించారు. -
Champions Trophy 2025: శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్
టీమిండియా స్టార్ మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌కు ప్రమోషన్ లభించనుందని తెలుస్తుంది. శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను తిరిగి దక్కించుకోనున్నాడని సమాచారం. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో అద్భుత ప్రదర్శనల తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రేయస్ గతేడాది మార్చిలో బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు. 2023 వన్డే వరల్డ్‌కప్‌లో అంచనాలకు మించి రాణించినప్పటికీ బీసీసీఐ అతని కాంట్రాక్ట్‌ను పునరుద్దరించలేదు. గత మార్చిలో శ్రేయస్‌తో పాటు ఇషాన్ కిషన్ కూడా బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కోల్పోయాడు.శ్రేయస్ బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయాక టీమిండియాలో స్థానాన్ని కూడా చేజార్చుకున్నాడు. అయితే దేశవాలీ టోర్నీల్లో అద్భుతంగా రాణించి గోడకు కొట్టిన బంతిలా తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. రీఎంట్రీలో శ్రేయస్ మరింత రెచ్చిపోయి ఆడుతున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో 4 మ్యాచ్‌లు ఆడి 79.92 స్ట్రయిక్‌రేట్‌తో 195 పరుగులు చేశాడు. శ్రేయస్ ప్రదర్శనల ఆధారంగా టీమిండియా ఛాంపియన్స్ ట్రోఫీలో అజేయంగా ఫైనల్‌కు చేరింది.ఈ టోర్నీలో శ్రేయస్ జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన ఇన్నింగ్స్‌లు ఆడాడు. మొదటి బ్యాటింగ్‌తో పాటు ఛేదనలోనూ సత్తా చాటాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో నిరాశపరిచిన (17 బంతుల్లో 15) శ్రేయస్.. ఆతర్వాత చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో (67 బంతుల్లో 56) మెరిశాడు. చివరి గ్రూప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై మరో హాఫ్ సెంచరీ చేసిన శ్రేయస్.. ఆస్ట్రేలియాతో జరిగిన సెమీఫైనల్లో విరాట్ కోహ్లితో కలిసి కీలక ఇన్నింగ్స్ (45) ఆడి భారత విజయంలో ప్రధానపాత్ర పోషించాడు. ఈ ప్రదర్శనల తర్వాత శ్రేయస్‌కు ఎందుకు సెంట్రల్ కాంట్రాక్ట్ ఇవ్వకూడదని చర్చ మొదలైంది. దీంతో బీసీసీఐ శ్రేయస్‌కు తిరిగి సెంట్రల్ కాంట్రాక్ట్ ఇచ్చి గౌరవించుకోవాలని భావిస్తుంది. బీసీసీఐ మరికొద్ది రోజుల్లో అధికారికంగా సెంట్రల్ కాంట్రాక్ట్ ఆటగాళ్ల జాబితాను ప్రకటించనుంది. సెంట్రల్ కాంట్రాక్ట్ జాబితాలోకి కొత్తగా వరుణ్ చక్రవర్తి వచ్చే అవకాశం ఉంది.ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఫైనల్‌కు చేరిన విషయం తెలిసిందే. సెమీస్‌లో ఆసీస్‌ను మట్టికరిపించిన భారత్ తుది సమరానికి అర్హత సాధించింది. మరోవైపు న్యూజిలాండ్ సెమీస్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్ ఈనెల 9వ తేదీన దుబాయ్ వేదికగా జరుగనుంది. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమవుతుంది.ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ తలపడటం ఇది రెండో సారి. 2000 ఎడిషన్‌లో ఇరు జట్లు ఎదురెదురుపడగా.. న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ తొలి ఐసీసీ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఈ ఇరు జట్లు ఇనాగురల్ డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ (2019-2021) తలపడ్డాయి. ఈసారి కూడా న్యూజిలాండ్ భారత్‌ను ఓడించి తమ రెండో ఐసీసీ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. న్యూజిలాండ్, తమ రెండు ఐసీసీ టైటిళ్లను భారత్‌పైనే గెలవడం విశేషం. -
ఏప్రిల్, మే నెలల్లో ట్రై సిరీస్ ఆడనున్న భారత్
ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో శ్రీలంకలో మహిళల ముక్కోణపు వన్డే టోర్నీ జరుగనుంది. ఈ టోర్నీలో శ్రీలంక సహా భారత్, సౌతాఫ్రికా జట్లు పాల్గొంటున్నాయి. ఈ టోర్నీ డబుల్ రౌండ్ రాబిన్ ఫార్మాట్లో జరుగుతుంది. ప్రతి జట్టు నాలుగు గ్రూప్ స్టేజీ మ్యాచ్‌లు ఆడుతుంది. గ్రూప్ మ్యాచ్‌ల అనంతరం మొదటి రెండు స్థానాల్లో నిలిచే జట్లు ఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ టోర్నీలో అన్ని మ్యాచ్‌లకు కొలొంబోని ప్రేమదాస స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. మ్యాచ్‌లన్నీ డే మ్యాచ్‌లుగా జరుగుతాయి. ఏప్రిల్ 27న జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు టీమిండియాతో తలపడనుంది. మే 11న ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఈ టోర్నీ ఈ ఏడాది చివర్లో భారత్‌లో జరిగే వన్డే వరల్డ్‌కప్‌కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఈ టోర్నీలో పాల్గొనే మూడు జట్లు ఇదివరకే వరల్డ్‌కప్‌కు అర్హత సాధించాయి.ముక్కోణపు సిరీస్ షెడ్యూల్ఏప్రిల్ 27- భారత్ వర్సెస్ శ్రీలంకఏప్రిల్ 29- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 1- శ్రీలంక వర్సెస్ సౌతాఫ్రికామే 4- భారత్ వర్సెస్ శ్రీలంకమే 6- భారత్ వర్సెస్ సౌతాఫ్రికామే 8- సౌతాఫ్రికా వర్సెస్ శ్రీలంకమే 11- ఫైనల్‌కాగా, భారత్ ఈ ఏడాది ఆరంభంలో స్వదేశంలో ఐర్లాండ్‌తో వన్డే సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌లో భారత్ జయకేతనం ఎగురవేసింది. గతేడాది చివర్లో సౌతాఫ్రికా మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం ఇంగ్లండ్‌కు ఆతిథ్యమిచ్చింది. ఈ సిరీస్‌ను సౌతాఫ్రికా 1-2 తేడాతో కోల్పోయింది. శ్రీలంక విషయానికొస్తే.. ఈ జట్టు ప్రస్తుతం న్యూజిలాండ్‌తో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లోని తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది.మహిళల క్రికెట్ విషయానికొస్తే.. ప్రస్తుతం భారత్‌లో డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ జరుగుతుంది. ఈ లీగ్ చివరి దశకు చేరింది. 15 మ్యాచ్‌లు అయిపోయే సరికి ఢిల్లీ క్యాపిటల్స్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీ ఆడిన 7 మ్యాచ్‌ల్లో ఐదింట విజయాలు సాధించి ప్లే ఆఫ్స్‌కు కూడా అర్హత సాధించింది. గత రెండు సీజన్లలో చివరి స్థానంలో నిలిచిన గుజరాత్ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. గతేడాది రన్నరప్ ముంబై ఇండియన్స్ మూడులో, ఢిపెండింగ్ చాంపియన్ ఆర్సీబీ నాలుగో స్థానంలో, యూపీ వారియర్జ్ ఐదో స్థానంలో ఉన్నాయి. లీగ్‌లో భాగంగా ఇవాళ (మార్చి 6) యూపీ వారియర్జ్, ముంబై ఇండియన్స్‌తో తలపడనుంది. -
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ కు టీమిండియా
-
IND Vs AUS: ఆస్టేలియాను కొట్టేశారు... ఫైనల్లో భారత్
కంగారేమీ లేదు... అంతా మన నియంత్రణలోనే సాగింది... ఆస్ట్రేలియాతో ఐసీసీ నాకౌట్ మ్యాచ్ అనగానే పెరిగే ఉత్కంఠ, ఒత్తిడి అన్నింటినీ టీమిండియా అధిగమించేసింది... ఎప్పటిలాగే టాస్ ఓడిపోవడం మినహా 11 బంతుల ముందే మ్యాచ్ ముగించే వరకు భారత్ అన్ని విధాలుగా తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. ముందు పదునైన బౌలింగ్‌తో... ఆపై చక్కటి బ్యాటింగ్‌తో ఆస్ట్రేలియాను పడగొట్టి చాంపియన్స్ ట్రోఫీలో ఆఖరి సమరానికి అర్హత సాధించింది.265 పరుగుల లక్ష్యం... చాంపియన్స్ ట్రోఫీ గత రెండు మ్యాచ్‌లలో భారత్ ఛేదించిన స్కోర్లతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువ. బ్యాటింగ్ సాగుతున్నకొద్దీ పిచ్ నెమ్మదిస్తోంది. అయితేనేమి... కోహ్లి తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో క్లాస్ ఆటతీరుతో అలవోకగా పరుగులు రాబడుతూ జట్టును నడిపించాడు. ఆరంభంలో రోహిత్, ఆపై అయ్యర్, రాహుల్, పాండ్యా... ఇలా అంతా అండగా నిలవడంతో గెలుపు భారత్ దరిచేరింది. ఆసీస్ ఆట సెమీఫైనల్లోనే ముగిసింది. 2017 చాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్ చేరిన భారత్ తుది పోరులో పాకిస్తాన్ చేతిలో ఓడింది. ఆ తర్వాత మూడు ఐసీసీ వన్డే టోర్నీల్లోనూ కనీసం సెమీస్ లేదా ఫైనల్‌కు చేరి తమ స్థాయిని చూపించింది. మధ్యలో గెలిచిన టి20 వరల్డ్ కప్ దీనికి అదనం. ఇప్పుడు మరో టైటిల్ వేటలో టీమిండియా ప్రత్యర్థి ఎవరో నేడు తేలనుంది. ఇదే జోరు కొనసాగిస్తే 2013 తరహాలోనే అజేయ ప్రదర్శనతో మళ్లీ మనం చాంపియన్స్ కావడం ఖాయం! దుబాయ్: చాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి భారత్ ఫైనల్ చేరింది. గత టోర్నీ రన్నరప్ అయిన టీమిండియా ఈసారి అజేయ ప్రదర్శనతో తుది పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో ఆ్రస్టేలియాను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ స్టీవ్ స్మిత్ (96 బంతుల్లో 73; 4 ఫోర్లు, 1 సిక్స్), అలెక్స్ కేరీ (57 బంతుల్లో 61; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు సాధించారు. షమీ 3 వికెట్లు పడగొట్టగా... రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లకు 267 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ విరాట్ కోహ్లి (98 బంతుల్లో 84; 5 ఫోర్లు) కీలక ఇన్నింగ్స్ ఆడగా... శ్రేయస్ అయ్యర్ (62 బంతుల్లో 45; 3 ఫోర్లు), కేఎల్ రాహుల్ (34 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించారు. నేడు దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్ మధ్య జరిగే రెండో సెమీఫైనల్ మ్యాచ్ విజేతతో ఆదివారం దుబాయ్‌లోనే జరిగే ఫైనల్లో భారత్ తలపడుతుంది. రాణించిన స్మిత్... హెడ్ మరోసారి భారత బౌలర్లపై ఆధిపత్యం ప్రదర్శించాడు. ‘సున్నా’ వద్ద ఇచి్చన రిటర్న్ క్యాచ్‌ను షమీ అందుకోలేకపోవడంతో అతను బతికిపోగా, మరో ఎండ్‌లో కూపర్ కనోలీ (9 బంతుల్లో 0) విఫలమయ్యాడు. పాండ్యా ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన హెడ్, షమీ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు బాదాడు. దాంతో ఆరో ఓవర్లోనే భారత్ స్పిన్నర్ కుల్దీప్ను బౌలింగ్‌కు దింపింది. మరో మూడు ఓవర్ల తర్వాత భారత్ అసలు ఫలితం సాధించింది.వరుణ్ బౌలింగ్‌లో తాను ఎదుర్కొన్న తొలి బంతినే భారీ షాట్ ఆడబోయి హెడ్ లాంగాఫ్‌లో గిల్‌కు క్యాచ్ ఇవ్వడంతో జట్టు ఊపిరి పీల్చుకుంది. మరోవైపు స్మిత్ సాహసాలకు పోకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. అతనికి కొద్దిసేపు లబుషేన్ (36 బంతుల్లో 29; 2 ఫోర్లు, 1 సిక్స్) సహకరించాడు. 68 బంతుల్లో స్మిత్ హాఫ్ సెంచరీ పూర్తయింది. అయితే తక్కువ వ్యవధిలో లబుషేన్, ఇన్‌గ్లిస్ (12 బంతుల్లో 11)లను అవుట్ చేసి జడేజా దెబ్బ కొట్టాడు. ఈ దశలో స్మిత్, కేరీ భాగస్వామ్యంతో జట్టు కోలుకుంది. వీరిద్దరు కలిసి స్కోరును 200 వరకు తీసుకొచ్చారు. ఈ భాగస్వామ్యం బలపడుతున్న దశలో షమీ ఆటను మలుపు తిప్పాడు. అతని బౌలింగ్‌లో ముందుకొచ్చి షాట్ ఆడబోయిన స్మిత్ బౌల్డయ్యాడు. మ్యాక్స్‌వెల్ (5 బంతుల్లో 7; 1 సిక్స్) విఫలం కాగా, ఆసీస్ వరుసగా వికెట్లు కోల్పోయింది. చివర్లో కేరీ దూకుడుతో జట్టు మెరుగైన స్కోరు సాధించగలిగింది. కీలక భాగస్వామ్యాలు... ఛేదనలో ఆరంభంలోనే శుబ్‌మన్ గిల్ (11 బంతుల్లో 8; 1 ఫోర్) వెనుదిరగ్గా... క్రీజ్‌లో ఉన్నంత సేపు రోహిత్ శర్మ (29 బంతుల్లో 28; 3 ఫోర్లు, 1 సిక్స్) ధాటిగా ఆడాడు. అయితే ఓపెనర్లు వెనుదిరిగిన తర్వాత కోహ్లి, అయ్యర్ భాగస్వామ్యంతో జట్టు సురక్షిత స్థితికి చేరింది. చక్కటి సమన్వయంతో బ్యాటింగ్ చేసిన వీరిద్దరు ప్రత్యర్థికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా టీమ్‌ను విజయం దిశగా నడిపించారు. ఈ క్రమంలో 53 బంతుల్లో కోహ్లి హాఫ్ సెంచరీ పూర్తి కాగా, అయ్యర్ దానిని చేజార్చుకున్నాడు. వీరిద్దరు మూడో వికెట్‌కు 18.3 ఓవర్లలో 91 పరుగులు జోడించారు. ఆ తర్వాత అక్షర్ పటేల్ (30 బంతుల్లో 27; 1 ఫోర్, 1 సిక్స్), రాహుల్‌లతో కోహ్లి కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. 51 వద్ద మ్యాక్స్‌వెల్ క్యాచ్ వదిలేయడం కూడా కోహ్లికి కలిసొచ్చింది. చక్కటి షాట్లతో ఆకట్టుకున్న అతను టోర్నీలో మరో శతకం అందుకునేలా కనిపించాడు. అయితే విజయానికి 40 పరుగుల దూరంలో భారీ షాట్‌కు ప్రయత్నించి విరాట్ అవుటయ్యాడు. ఈ స్థితిలో హార్దిక్ పాండ్యా (24 బంతుల్లో 28; 1 ఫోర్, 3 సిక్స్‌లు) మెరుపు బ్యాటింగ్ ఛేదనను సులువు చేసింది. 20 బంతుల్లో 24 పరుగులు చేయాల్సి ఉండగా కొంత ఉత్కంఠ పెరిగింది. అయితే జంపా ఓవర్లో పాండ్యా రెండు వరుస సిక్సర్లు బాదగా... అతను అవుటైన తర్వాత మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో భారీ సిక్స్‌తో రాహుల్ మ్యాచ్‌ను ముగించాడు. 1 చాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో వరుసగా మూడుసార్లు (2013, 2017, 2025) ఫైనల్లోకి ప్రవేశించిన తొలి జట్టుగా భారత్ నిలిచింది. 7 ఐసీసీ వన్డే టోర్నీలలో కోహ్లికి లభించిన ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డులు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (10), రోహిత్ శర్మ (8) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 14 ఐసీసీ టోర్నీలలో అత్యధికంగా 14 సార్లు ఫైనల్ చేరుకున్న జట్టుగా భారత్ గుర్తింపు పొందింది. ఆస్ట్రేలియా (13)ను భారత్ వెనక్కి నెట్టింది. 746 చాంపియన్స్ ట్రోఫీ టోర్నీ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్ల జాబితాలో కోహ్లి (746 పరుగులు) రెండో స్థానానికి చేరాడు. తొలి స్థానంలో క్రిస్ గేల్ (791 పరుగులు), మూడో స్థానంలో జయవర్ధనే (742) ఉన్నారు. గిల్‌కు అంపైర్ వార్నింగ్ హెడ్ క్యాచ్ పట్టినప్పుడు శుబ్‌మన్ గిల్ ప్రదర్శించిన ‘అతి’ ఆనందం అంపైర్ నుంచి హెచ్చరికకు గురయ్యేలా చేసింది. క్యాచ్ అందుకోగానే కొద్ది సేపయినా తన చేతిలో ఉంచకుండా అతను బంతిని గాల్లోకి విసిరేశాడు. నిజానికి క్యాచ్ పట్టడంలో అతను ఎక్కడా తడబడలేదు. అయితే ఎంతసేపు అనే విషయంలో నిబంధనలు సరిగ్గా లేకపోయినా... కనీసం 2–3 సెకన్ల పాటు ఫీల్డర్ బంతిని తన నియంత్రణలో ఉంచుకోవాలి. ఇదే విషయాన్ని అంపైర్ ఇల్లింగ్‌వర్త్ ప్రత్యేకంగా గిల్‌కు వివరించాడు. ఇలాంటి సందర్భాల్లో అవుట్/నాటౌట్ ఇచ్చే విషయంలో అంపైర్‌కు విచక్షణాధికారం ఉంటుంది.స్మిత్ అదృష్టం అక్షర్ వేసిన ఇన్నింగ్స్ 14వ ఓవర్లో అనూహ్యం చోటు చేసుకుంది. స్మిత్ డ్రైవ్ చేయగా బంతి అతడి ప్యాడ్ల మీదుగా స్టంప్స్‌ను తాకింది. అయితే బెయిల్స్ పడకపోవడంతో స్మిత్ బతికిపోయాడు. ఆపే ప్రయత్నం చేస్తే తన కాలితోనే స్టంప్స్ పడిపోతాయని భావనతో కావచ్చు స్మిత్ అలా కూడా చేయలేదు. ఆ సమయంలో అతని స్కోరు 23 పరుగులు. అతని స్కోరు 36 వద్ద ఉన్నప్పుడు షమీ బౌలింగ్‌లో బలంగా షాట్ కొట్టగా... తన ఎడమ చేత్తో క్యాచ్ పట్టే ప్రయత్నం చేసిన షమీ విఫలమయ్యాడు. అయితే ఇది చాలా కఠినమైన క్యాచ్. రోహిత్‌కు లైఫ్కెప్టెన్ రోహిత్ శర్మ 28 పరుగుల ఇన్నింగ్స్‌లో కూడా రెండుసార్లు అదృష్టం కలిసొచి్చంది. 13 పరుగుల వద్ద బ్యాక్వర్డ్ పాయింట్లో అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను కనోలీ వదిలేయగా... 14 వద్ద కాస్త కష్టసాధ్యమైన క్యాచ్‌ను లబుషేన్ అందుకోలేకపోయాడు. పాకిస్తాన్‌పై ఎలా లక్ష్యాన్ని ఛేదించామో ఇది కూడా దాదాపు అదే తరహాలో సాగింది. అప్పుడు సెంచరీ చేసినా ఏడు ఫోర్లే కొట్టాను. పరిస్థితులను అర్థం చేసుకోవడమే అన్నింటికంటే ముఖ్యం. దాని ప్రకారమే నా వ్యూహం సాగుతుంది. స్ట్రయిక్ రొటేట్ చేయడం కూడా అలాంటిదే. ఇలాంటి పిచ్‌పై భాగస్వామ్యాలు నెలకొల్పడం కీలకం. బౌండరీలతో వేగంగా ఆటను ముగించే ప్రయత్నంలో నేను వెనుదిరిగా. కొన్నిసార్లు అనుకున్న ప్రణాళికలు పని చేయవు. క్రీజులో పరుగుల కోసం నేను తొందరపడలేదు. అదే నా ఇన్నింగ్స్‌లో నాకు నచ్చిన విషయం. సింగిల్స్ తీయడాన్ని కూడా ప్రాధాన్యతగా భావిస్తేనే మంచి క్రికెట్ ఆడుతున్నట్లు లెక్క. ఇక ఎలాంటి ఒత్తిడి లేదు. లక్ష్యం దిశగా వెళుతున్నామని అప్పుడే అర్థమవుతుంది. ఇలాంటి నాకౌట్ మ్యాచ్‌లలో చేతిలో వికెట్లు ఉంటే ప్రత్యర్థి కూడా ఒత్తిడిలో సునాయాసంగా పరుగులు ఇచ్చేస్తుంది. అప్పుడు మన పరిస్థితి మరింత సులువవుతుంది. ఓవర్లు, చేయాల్సిన పరుగుల గురించి స్పష్టత ఉంటే చాలు. రన్‌రేట్ ఆరు పరుగులకు వచ్చినా సమస్య ఉండదు. ఎందుకంటే ఈ సమయంలో వికెట్లు తీస్తేనే ప్రత్యర్థికి అవకాశం దక్కుతుంది తప్ప నిలదొక్కుకున్న బ్యాటర్లను వారు అడ్డుకోలేరు. ఈ దశలో మైలురాళ్లు నాకు ఏమాత్రం ముఖ్యం కాదు. సెంచరీ సాధిస్తే మంచిదే. లేకపోతే విజయం దక్కిన ఆనందం ఎలాగూ ఉంటుంది. డ్రెస్సింగ్ రూమ్‌లో సంబరాలు ఉంటాయి. ఏం చేసినా ఒదిగి ఉండి మళ్లీ సాధన చేయడం, జట్టును గెలిపించేందుకు మళ్లీ కొత్తగా బరిలోకి దిగడమే నాకు తెలిసింది. ఇప్పటికీ అదే చేస్తున్నాను. –విరాట్ కోహ్లి ఆటలో ఆఖరి బంతి పడే వరకు ఏమీ చెప్పలేం. ఆసీస్ ఇన్నింగ్స్ ముగిశాక ఇది మరీ చిన్న స్కోరేమీ కాదని, విజయం కోసం మేం చాలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని అర్థమైంది. ఇవాళ మా బ్యాటింగ్ అన్ని రకాలుగా బాగుంది. పిచ్ కూడా మెరుగ్గా అనిపించింది. అయితే పిచ్‌పై ఎక్కువ దృష్టి పెట్టకుండా మా ఆటనే నమ్ముకున్నాం. ఆరు బౌలింగ్ ప్రత్యామ్నాయాలు, ఎనిమిదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగలవారు ఉండాలని మేం కోరుకున్నాం.దానిని బట్టే జట్టును ఎంపిక చేశాం. ఇప్పుడు ఆ ఆరుగురు బౌలర్లను సమర్థంగా వాడుకున్నాం. కోహ్లి ఎన్నో ఏళ్లుగా ఇదే తరహాలో జట్టును గెలిపిస్తూ వస్తున్నాడు. ఫైనల్‌కు ముందు ఆటగాళ్లంతా ఫామ్‌లో ఉంటే జట్టులో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అయితే దాని గురించి అతిగా ఆలోచించడం లేదు. సమయం వచి్చనప్పుడు అంతా సరైన రీతిలో స్పందిస్తారు. –రోహిత్ శర్మ, భారత కెప్టెన్ 4 ఐసీసీ ఈవెంట్లు... వన్డే వరల్డ్ కప్, టి20 వరల్డ్ కప్, చాంపియన్స్ ట్రోఫీ, వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లలో భారత్‌ను ఫైనల్ చేర్చిన తొలి కెప్టెన్‌గా రోహిత్ శర్మ నిలిచాడు. 336 అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న భారతీయ ఫీల్డర్‌గా కోహ్లి ఘనత వహించాడు. 334 క్యాచ్‌లతో రాహుల్ ద్రవిడ్ పేరిట ఉన్న రికార్డును కోహ్లి సవరించాడు. వన్డేల్లో అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న రెండో ఫీల్డర్‌గానూ కోహ్లి (161 క్యాచ్‌లు) నిలిచాడు. శ్రీలంక ప్లేయర్ మహేళ జయవర్ధనే (218 క్యాచ్‌లు) తొలి స్థానంలో ఉన్నాడు. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: హెడ్ (సి) గిల్ (బి) వరుణ్ 39; కనోలీ (సి) రాహుల్ (బి) షమీ 0; స్మిత్ (బి) షమీ 73; లబుషేన్ (ఎల్బీ) (బి) జడేజా 29; ఇన్‌గ్లిస్ (సి) కోహ్లి (బి) జడేజా 11; కేరీ (రనౌట్) 61; మ్యాక్స్‌వెల్ (బి) అక్షర్ 7; డ్వార్షూయిస్ (సి) అయ్యర్ (బి) వరుణ్ 19; జంపా (బి) పాండ్యా 7; ఎలిస్ (సి) కోహ్లి (బి) షమీ 10; తన్విర్ సంఘా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (49.3 ఓవర్లలో ఆలౌట్) 264. వికెట్ల పతనం: 1–4, 2–54, 3–110, 4–144, 5–198, 6–205, 7–239, 8–249, 9–262, 10–264. బౌలింగ్: షమీ 10–0–48–3, హార్దిక్ పాండ్యా 5.3–0–40–1, కుల్దీప్ యాదవ్ 8–0–44–0, వరుణ్ చక్రవర్తి 10–0–49–2, అక్షర్ పటేల్ 8–1–43–1, రవీంద్ర జడేజా 8–1–40–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (ఎల్బీ) (బి) కనోలీ 28; గిల్ (బి) డ్వార్షూయిస్ 8; కోహ్లి (సి) డ్వార్షూయిస్ (బి) జంపా 84; అయ్యర్ (బి) జంపా 45; అక్షర్ (బి) ఎలిస్ 27; రాహుల్ (నాటౌట్) 42; పాండ్యా (సి) మ్యాక్స్‌వెల్ (బి) ఎలిస్ 28; జడేజా (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (48.1 ఓవర్లలో 6 వికెట్లకు) 267. వికెట్ల పతనం: 1–30, 2–43, 3–134, 4–178, 5–225, 6–259. బౌలింగ్: డ్వార్షూయిస్ 7–0–39–1, ఎలిస్ 10–0–49–2, కనోలీ 8–0–37–1, జంపా 10–0–60–2, సంఘా 6–0–41–0, మ్యాక్స్‌వెల్ 6.1–0–35–0, హెడ్ 1–0–6–0. -
Rohit Sharma: చరిత్రలో ఒకే ఒక్కడు
దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తొలి సెమీఫైనల్లో భారత్ ఆస్ట్రేలియాను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా వరుసగా మూడోసారి (2013, 2017, 2025), మొత్తంగా ఐదోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ గెలుపుతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. నాలుగు ఐసీసీ టోర్నీల్లో ఫైనల్‌కు చేరిన తొలి కెప్టెన్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. రోహిత్ సారథ్యంలో టీమిండియా 2023 ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్, 2023 వన్డే వరల్డ్‌కప్, 2024 టీ20 వరల్డ్‌కప్.. తాజాగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో ఫైనల్స్ చేరింది. ప్రపంచంలో ఏ ఇతర కెప్టెన్ ఈ నాలుగు ఐసీసీ టోర్నీల్లో తన జట్టును ఫైనల్స్‌కు చేర్చలేదు. ప్రస్తుతం ఈ ఘనత సాధించిన ఏకైక కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమే.ప్రతీకారం తీర్చుకున్న భారత్తాజాగా గెలుపుతో భారత్ 2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్స్‌లో ఆసీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంది. 2023 వరల్డ్‌కప్ ఫైనల్స్ తర్వాత వన్డేల్లో భారత్ ఆసీస్‌ను ఎదుర్కోవడం ఇదే మొదటిసారి. హ్యాట్రిక్ విజయాలుఇతర టోర్నీలో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా ఉన్న ఆస్ట్రేలియా.. ఛాంపియన్స్ ట్రోఫీలో మాత్రం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకోలేకపోతుంది. ఈ టోర్నీలో భారత్ ఆసీస్‌పై ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంది. ఇరు జట్లు ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో మూడుసార్లు ఎదురెదురుపడగా.. మూడు సందర్భాల్లో టీమిండియానే జయకేతనం ఎగురవేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో భారత్, ఆస్ట్రేలియా తొలిసారి 1998 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 44 పరుగుల తేడాతో గెలుపొందింది. తర్వాత 2000 ఎడిషన్ క్వార్టర్ ఫైనల్స్‌లో ఇరు జట్లు రెండో సారి ఢీకొన్నాయి. ఈసారి భారత్ 20 పరుగుల తేడాతో ఆసీస్‌ను మట్టికరిపించింది. తాజాగా 2025 ఎడిషన్ సెమీస్‌లో గెలుపుతో భారత్ ఆసీస్‌పై హ్యాట్రిక్ విజయాలు (ఛాంపియన్స్ ట్రోఫీ నాకౌట్స్‌లో) నమోదు చేసింది.మ్యాచ్ విషయానికొస్తే.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో విరాట్ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ (84) ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
Champions Trophy 2025: విరాట్ అదరహో.. సెమీస్‌లో ఆసీస్‌ను చిత్తు చేసిన భారత్
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఎడిషన్ భారత్ ఫైనల్లోకి ప్రవేశించింది. దుబాయ్ వేదికగా ఇవాళ (మార్చి 4) జరిగిన తొలి సెమీస్‌లో టీమిండియా ఆసీస్‌ను 4 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. తద్వారా ఛాంపియన్స్ ట్రోఫీలో వరుసగా మూడోసారి (మొత్తంగా ఐదోసారి) ఫైనల్స్‌కు చేరింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది.స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. ఈ మ్యాచ్‌లో భారత్ ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (షమీ) బరిలోకి దిగినప్పటికీ ఆసీస్‌ను ఆలౌట్ చేయడంలో సఫలమైంది.ఛేదనలో విరాట్ (84) చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 48.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. మ్యాక్స్‌వెల్ బౌలింగ్‌లో సిక్సర్ బాది కేఎల్ రాహుల్ (42 నాటౌట్) మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు. ఆఖర్లో హార్దిక్ (24 బంతుల్లో 28) మెరుపు ఇన్నింగ్స్ ఆడగా.. భారత్ గెలుపులో శ్రేయస్ అయ్యర్ (45), అక్షర్ పటేల్ (27) తలో చేయి వేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (28) టీమిండియాకు మెరుపు ఆరంభాన్ని అందించాడు. భారత ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ (8) ఒక్కడే సింగిల్ డిజిట్ స్కోర్‌కు ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో ఇల్లిస్, జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. డ్వార్షుయిస్, కన్నోలీ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంతో భారత్ సరికొత్త చరిత్ర సృష్టించింది. ఐసీసీ వన్డే ఈవెంట్లలో ఆసీస్ నిర్దేశించిన అత్యధిక లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది.కాగా, రేపు (మార్చి 5) జరుగబోయే రెండో సెమీఫైనల్లో సౌతాఫ్రికా, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా జరుగనుంది. ఈ మ్యాచ్‌లో విజేతతో భారత్ మార్చి 9న జరిగే ఫైనల్లో తలపడుతుంది. -
ఫైనల్‌కు చేరిన టీమిండియాకు కిషన్‌రెడ్డి అభినందనలు
హైదరాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఈరోజు(మంగళవారం) జరిగిన తొలి సెమీ ఫైనల్ లో గెలిచి ఫైనల్ చేరిన టీమిండియా విజయం పట్ల కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. . ఈ సెమీస్ లో అద్భుతమైన ప్రతిభ కనబరిచి రోహిత్ సేనకు అభినందనలు తెలియజేశారు. ఇదే జోష్ ను ఫైనల్ కూడా కనబరిచి చాంపియన్స్ ట్రోఫీ గెలవాలని ఆయన ఆకాంక్షించారు.ఆసీస్ తో జరిగిన తొలి సెమీఫైనల్లో భారత్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ నిర్దేశించిన 265 పరుగుల లక్ష్యాన్ని భారత్ 48.1 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి ఛేదించింది. కోహ్లి(84), శ్రేయస్ అయ్యర్(45), రాహుల్(42 నాటౌట్)లు బాధ్యతాయుతంగా ఆడగా, హార్దిక్ పాండ్యా( 24 బంతుల్లో 3 సిక్సర్లు, 1 ఫోర్ 28)లు బ్యాట్ ఝుళిపించారు. దాంతో భారత్ లక్ష్యాన్ని సునాయాసంగా సాధించి తుదిపోరుకు సిద్ధమైంది. బుధవారం జరిగే న్యూజిలాండ్, దక్షిణాఫ్రికాల రెండో సెమీ ఫైనల్లో విజేతతో భారత్ తలపడనుంది. -
CT 2025, IND VS AUS 1st Semis: 97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!
ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్, ఆస్ట్రేలియా జట్లు ఇవాళ (మార్చి 4) తొలి సెమీఫైనల్లో తలపడుతున్నాయి. దుబాయ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసింది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలతో రాణించడంతో ఆసీస్ భారత్ ముందు ఫైటింగ్ టోటల్‌ను ఉంచింది. 49.3 ఓవర్లలో ఆ జట్టు 264 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు.ఛేదనలో భారత్ ఆదిలోనే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ 8, రోహిత్ శర్మ 28 పరుగులు చేసి ఔటయ్యారు. విరాట్ కోహ్లి (26 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (29 నాటౌట్) భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 19 ఓవర్ల అనంతరం భారత్ స్కోర్ 93/2గా ఉంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవాలంటే మరో 31 ఓవర్లలో 172 పరుగులు చేయాలి. చేతిలో 8 వికెట్లు ఉన్నాయి. భారత బ్యాటర్లలో రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.97 ఏళ్ల చరిత్రలో తొలిసారి ఇలా..!ఈ మ్యాచ్‌లో భారత్ ఆసక్తికర రీతిలో జట్టును సమీకరించింది. కేవలం ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో (మహ్మద్ షమీ) బరిలోకి దిగింది. 97 ఏళ్ల అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో భారత్ ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఇలా ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే మొదటిసారి.మొత్తంగా ఐసీసీ వన్డే సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఓ జట్టు ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగడం ఇదే నాలుగో సారి మాత్రమే. తొలి రెండు సందర్భాలు ఛాంపియన్స్ ట్రోఫీ తొలి రెండు ఎడిషన్లలో (1998, 2000) చోటు చేసుకోవడం విశేషం. 1998 ఎడిషన్ ఫైనల్లో సౌతాఫ్రికా, 2000 ఎడిషన్ సెమీస్‌లో పాకిస్తాన్ జట్లు ఇలానే ఒకే ఒక స్పెషలిస్ట్ పేసర్‌తో బరిలోకి దిగాయి. మూడో సందర్భం 2011 వన్డే వరల్డ్‌కప్ సెమీఫైనల్లో చోటు చేసుకుంది. నాడు శ్రీలంక న్యూజిలాండ్‌పై ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి విజయం సాధించింది. 14 ఏళ్ల అనంతరం భారత్ తిరిగి ఓ ఐసీసీ ఈవెంట్ సెమీస్‌లో ఒకే ఒక పేసర్‌ను బరిలోకి దించి పెద్ద సాహసమే చేసింది.ఐసీసీ ఈవెంట్ల సెమీస్ లేదా ఫైనల్స్‌లో ఒకే ఒక పేసర్‌తో బరిలోకి దిగిన జట్లు..సౌతాఫ్రికా (1998 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్స్)- వెస్టిండీస్‌పై గెలుపుపాకిస్తాన్ (2000 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్)- న్యూజిలాండ్ చేతిలో ఓటమిశ్రీలంక (2011 వన్డే వరల్డ్‌కప్ సెమీస్)- న్యూజిలాండ్‌పై గెలుపుభారత్ (2025 ఛాంపియన్స్ ట్రోఫీ సెమీస్) -
CT 2025, IND VS AUS: సిక్సర్ల శర్మ.. హిట్‌మ్యాన్ ఖాతాలో మరో రికార్డు
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) ఖాతాలో మరో రికార్డు చేరింది. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 3) జరుగుతున్న మ్యాచ్‌లో ఓ సిక్సర్ బాదిన రోహిత్.. ఐసీసీ వన్డే ఈవెంట్లలో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా అవతరించాడు. రోహిత్ ఐసీసీ వన్డే టోర్నీల్లో ఇప్పటివరకు 42 ఇన్నింగ్స్‌ల్లో 65 సిక్సర్లు బాదాడు. గతంలో ఈ రికార్డు రోహిత్, క్రిస్ గేల్ పేరిట సంయుక్తంగా ఉండేది. గేల్ 51 ఇన్నింగ్స్‌ల్లో 64 సిక్సర్లు బాదాడు. ఐసీసీ వన్డే టోర్నీల్లో అత్యధిక సిక్సర్లు బాదిన టాస్-5 ఆటగాళ్ల జాబితా ఇలా ఉంది.రోహిత్ శర్మ-65 సిక్సర్లు (42 ఇన్నింగ్స్‌లు)క్రిస్ గేల్-64 (51 ఇన్నింగ్స్‌లు)గ్లెన్ మ్యాక్స్‌వెల్-49 (30 ఇన్నింగ్స్‌లు)డేవిడ్ మిల్లర్-45 (30 ఇన్నింగ్స్‌లు)సౌరవ్ గంగూలీ-42 (32 ఇన్నింగ్స్‌లు)మ్యాచ్ విషయానికొస్తే.. రోహిత్ 29 బంతుల్లో 3 బౌండరీలు, ఓ సిక్సర్ సాయంతో 28 పరుగులు చేసి ఔటయ్యాడు. ఈ టోర్నీలో రోహిత్‌కు మరోసారి మంచి ఆరంభం లభించినప్పటికీ భారీ స్కోర్ చేయలేకపోయాడు. రోహిత్ తక్కువ స్కోర్‌కే ఔట్ కావడం టీమిండియా విజయావకాశాలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. 265 పరుగుల లక్ష్య ఛేదనలో రోహిత్ రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. అంతకుముందు మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్ కూడా తక్కువ స్కోర్‌కే (8) ఔటయ్యాడు. రోహిత్ ఔటయ్యే సమయానికి టీమిండియా స్కోర్ 43/2గా ఉంది. విరాట్ కోహ్లి (5), శ్రేయస్ అయ్యర్ (0) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా గెలవాలంటే సుదీర్ఘ ప్రయాణం చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ వికెట్ కూపర్ కన్నోలీకి.. గిల్ వికెట్ డ్వార్షుయిస్‌కు దక్కింది.ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసి 49.3 ఓవర్లలో 264 పరుగులకు ఆలౌటైంది. స్టీవ్ స్మిత్ (73), అలెక్స్ క్యారీ (61) అర్ద సెంచరీలు చేసి ఆసీస్‌కు ఫైటింగ్ స్కోర్ అందించారు. ఆసీస్ ఆటగాళ్లలో ట్రవిస్ హెడ్ 39, కూపర్ కన్నోలీ 0, లబూషేన్ 29, జోస్ ఇంగ్లిస్ 11, మ్యాక్స్‌వెల్ 7, డ్వార్షుయిస్ 19, ఆడమ్ జంపా 7, నాథన్ ఇల్లిస్ 10 పరుగులు చేసి ఔటయ్యారు. భారత బౌలర్లలో మహ్మద్ షమీ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి, రవీంద్ర జడేజా తలో 2, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ చెరో వికెట్ దక్కించుకున్నారు. -
Champions Trophy 2025: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి (Virat Kohli) అంతర్జాతీయ క్రికెట్లో మరో రికార్డు తన పేరిట లిఖించుకున్నాడు. ఈసారి విరాట్ బ్యాటర్‌గా కాకుండా ఫీల్డర్‌గా ఓ ప్రత్యేకమైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో (Champions Trophy-2025) భాగంగా ఆస్ట్రేలియాతో ఇవాళ (మార్చి 4) జరుగుతున్న మ్యాచ్‌లో జోస్ ఇంగ్లిస్ క్యాచ్ పట్టుకున్న విరాట్.. అంతర్జాతీయ క్రికెట్లో భారత్ తరఫున అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఫీల్డర్‌గా రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లిస్ క్యాచ్‌కు ముందు ఈ రికార్డు విరాట్, రాహుల్ ద్రవిడ్ (Rahul Dravid) పేరిట సంయుక్తంగా ఉండేది. వీరిద్దరు అంతర్జాతీయ క్రికెట్లో చెరి 334 క్యాచ్‌లు పట్టారు. ఇంగ్లిస్ క్యాచ్‌తో విరాట్ సోలోగా ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ అంతర్జాతీయ క్రికెట్లో (మూడు ఫార్మాట్లు) ఇప్పటివరకు 657 ఇన్నింగ్స్‌ల్లో పాల్గొని 335 క్యాచ్‌లు అందుకోగా.. రాహుల్ ద్రవిడ్ 571 ఇన్నింగ్స్‌ల్లో 334 క్యాచ్‌లు పట్టాడు. భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో అత్యధిక క్యాచ్‌లు పట్టుకున్న ఆటగాళ్ల జాబితాలో విరాట్, ద్రవిడ్ తర్వాత మహ్మద్ అజహరుద్దీన్ (261), సచిన్ టెండూల్కర్ (256) ఉన్నారు.ఓవరాల్‌గా చూస్తే.. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక క్యాచ్‌ల రికార్డు మహేళ జయవర్దనే పేరిట ఉంది. జయవర్దనే 768 అంతర్జాతీయ ఇన్నింగ్స్‌ల్లో 440 క్యాచ్‌లు పట్టాడు. ఈ జాబితాలో జయవర్దనే తర్వాత రికీ పాంటింగ్ (364), రాస్ టేలర్ (351) జాక్ కల్లిస్ (338) ఉన్నారు. విరాట్ 335 క్యాచ్‌లతో ఐదో స్థానంలో ఉన్నాడు.భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ విషయానికొస్తే.. ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ తొలి సెమీఫైనల్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఆసీస్‌కు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ కూపర్ కన్నోలిని షమీ డకౌట్ చేశాడు. ఆతర్వాత కొద్ది సేపు ట్రవిస్ హెడ్ మెరుపులు మెరిపించాడు. హెడ్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 39 పరుగులు చేసి వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఔటయ్యాడు. అనంతరం కెప్టెన్ స్టీవ్ స్మిత్, మార్నస్ లబూషేన్ కొద్ది సేపటి వరకు వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించారు. అనంతరం రవీంద్ర జడేజా లబూషేన్‌ను (29) బోల్తా కొట్టించాడు. ఆతర్వాత వచ్చిన జోస్ ఇంగ్లిస్ (11) కొద్ది సేపే క్రీజ్‌లో నిలబడి రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఇంగ్లిస్ తర్వాత బరిలోకి దిగిన అలెక్స్ క్యారీ ధాటిగా ఆడుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టాస్తున్నాడు. స్టీవ్ స్మిత్, క్యారీ ఐదో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని పూర్తి చేసి ఇన్నింగ్స్‌లు కొనసాగిస్తున్నారు. స్టీవ్ స్మిత్ 71, క్యారీ 38 పరుగులతో క్రీజ్‌లో ఉన్నారు. 36 ఓవర్ల అనంతరం ఆసీస్ స్కోర్ 195/4గా ఉంది. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 2, షమీ, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ తీశారు. -
రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత బాడీ షేమింగ్ వ్యాఖ్యలు
ఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా మొహమ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు చేశారు. రోహిత్ లావుగా ఉంటాడు.. బరువు తగ్గాలని వ్యాఖ్యలు చేశారు. ఏదో లక్కీగా అతడికి కెప్టెన్సీ దక్కిందని చెప్పుకొచ్చారు. దీంతో, వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆమె వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటరిస్తున్నారు.దుబాయ్ వేదికగా చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్, న్యూజిలాండ్ మధ్య ఆదివారం మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ రోహిత్ తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ఈ క్రమంలో రోహిత్ ఆటతీరుపై కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి షామా మొహమ్మద్ ఘాటుగా స్పందించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. షామా మొహమ్మద్ ట్విట్టర్ వేదికగా రోహిత్‌ను టార్గెట్ చేసి.. రోహిత్ లావుగా ఉంటాడు. అతడు బరువు తగ్గాలి. ఫిటినెస్ ఉండదు ఏదో అదృష్టం కొద్ది రోహిత్ భారత జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఇప్పటివరకు అత్యంత చెత్త కెప్టెన్ రోహిత్. సచిన్, కోహ్లీ, ధోనీలతో పోలిస్తే రోహిత్ జస్ట్ యావరేజ్ ఆటగాడు’ అంటూ కామెంట్స్ చేశారు.Congress leader Shama Mohamed has insulted and mocked 'National Pride' and T20 world cup winning captain Rohit Sharma .Congress with Rahul Gandhi at their helm is giving certificate of mediocrity to others ! Some jokes write themselves. pic.twitter.com/IQlquH4mri— विकास प्रताप सिंह राठौर🚩🇮🇳 (@V_P_S_Rathore) March 3, 2025దీంతో, ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. బీజేపీ నేతలు, నెటిజన్లు షామా మొహమ్మద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంతో ఆమె తన ట్వీట్‌ను సోషల్ మీడియా నుంచి తొలగించారు. ఈ నేపథ్యంలో షామా మొహమ్మద్ వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు. బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి స్పందిస్తూ..‘భారత క్రికెట్ జట్టును అభిమానించే ప్రతి దేశభక్తుడికి ఇది అవమానం. కాంగ్రెస్ విమర్శలను నేను ప్రశ్నిస్తున్నాను. రాహుల్ గాంధీ నాయకత్వంలో పనిచేసే మీకు కెప్టెన్సీ గురించి ఏం తెలుస్తుంది అంటూ విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ క్రికెట్ ఆడాలని కోరుకుంటున్నారా? అంటూ ఎద్దేవా చేశారు. దీంతో, మరోసారి షామా మొహమ్మద్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్యంలో మాట్లాడే స్వేచ్ఛ తనకు ఉందని చెప్పుకొచ్చారు. Shame on Congress!Now they are going after the Indian Cricket Captain!Do they expect Rahul Gandhi to now play cricket after failing in Indian politics! https://t.co/taWuC8bqgi— Pradeep Bhandari(प्रदीप भंडारी)🇮🇳 (@pradip103) March 2, 2025ఇదిలా ఉండగా.. విరాట్ కోహ్లీ తర్వాత 2022 నుంచి రోహిత్ శర్మ(37) భారత జట్టుకు కెప్టెన్‌గా కొనసాగుతున్నాడు. రోహిత్ నాయకత్వంలో, గత సంవత్సరం భారత జట్టు టీ20 ప్రపంచ కప్‌ను సాధించింది. ఐపీఎల్లో కూడా రోహిత్ సారథ్యంలోనే ముంబై జట్టు ఐదుసార్లు ట్రోఫీని దక్కించుకుంది. క్రికెట్ చరిత్రలోనే రోహిత్‌కు పలు రికార్డులు ఉన్న సంగతి తెలిసిందే. -
CT 2025: సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి ఆస్ట్రేలియా.. నాటి పరాభవానికి ప్రతీకారం తీర్చుకుంటుందా..?
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 సెమీఫైనల్లో ఏయే జట్లు తలపడబోతున్నాయో తేలిపోయింది. ఇవాళ (మార్చి 2) జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై విజయంతో భారత్ గ్రూప్-ఏ టాపర్‌గా నిలిచింది. తద్వారా సెమీస్‌లో గ్రూప్-బిలో సెకెండ్ ప్లేస్‌లో నిలిచిన ఆస్ట్రేలియాతో అమీతుమీకి సిద్దమైంది. భారత్, ఆస్ట్రేలియా వన్డే ఫార్మాట్లో చివరిసారిగా 2023 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో తలపడ్డాయి. నాటి మ్యాచ్‌లో ఆసీస్ భారత్‌ను ఓడించి జగజ్జేతగా నిలిచింది. దాదాపుగా ఏడాదిన్నర తర్వాత భారత్‌కు ఆసీస్‌పై ప్రతీకారం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఈ అవకాశాన్ని టీమిండియా సద్వినియోగం చేసుకుంటుందో లేదో వేచి చూడాలి. భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి సెమీఫైనల్ మార్చి 4న దుబాయ్ వేదికగా జరుగనుంది.నేటి మ్యాచ్‌లో ఫలితంతో రెండో సెమీస్‌లో ఎవరెవరు తలపడబోతున్నారో కూడా తేలిపోయింది. భారత్ చేతిలో ఓటమితో న్యూజిలాండ్ గ్రూప్-ఏలో రెండో స్థానంలో నిలిచింది. తద్వారా గ్రూప్-బి టాపర్ అయిన సౌతాఫ్రికాను రెండో సెమీస్‌లో ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లాహోర్ వేదికగా మార్చి 5న జరుగుతుంది. అనంతరం రెండు సెమీఫైనల్స్‌లో విజేతలు మార్చి 9న జరిగే ఫైనల్లో అమీతుమీ తేల్చుకుంటాయి. తొలి సెమీస్‌లో ఆసీస్‌ను ఓడించి టీమిండియా ఫైనల్‌కు చేరితే దుబాయ్ వేదికగా అంతిమ సమరం జరుగుతుంది. ఒకవేళ సెమీస్‌లో టీమిండియా ఆసీస్ చేతిలో ఓడితే లాహోర్ ఫైనల్ మ్యాచ్‌కు వేదికవుతుంది.హ్యాట్రిక్ విజయాలుభారత్ గ్రూప్-ఏలో హ్యాట్రిక్ విజయాలు సాధించి అజేయ జట్టుగా సెమీస్‌కు చేరింది. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించిన టీమిండియా.. రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను మట్టికరిపించింది. చివరిగా ఇవాళ జరిగిన మ్యాచ్‌లో భారత్ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. మరోవైపు ఆస్ట్రేలియా ఈ టోర్నీలో ఒకే ఒక మ్యాచ్‌లో విజయం సాధించినప్పటికీ సెమీస్‌కు అర్హత సాధించింది. గ్రూప్ దశలో ఆఫ్ఘనిస్తాన్, సౌతాఫ్రికా మ్యాచ్‌లు వర్షం కారణంగా రద్దు కాగా.. ఆసీస్ ఇంగ్లండ్‌పై మాత్రమే గెలుపొందింది. 44 పరుగుల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియాగ్రూప్-ఏలో భాగంగా ఇవాళ జరిగిన చివరి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భారత్ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 249 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన న్యూజిలాండ్ 45.3 ఓవర్లలో 205 పరుగులకు ఆలౌటైంది. వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు తీసి న్యూజిలాండ్ పతనాన్ని శాశించాడు. కేన్ విలియమ్సన్ (81) న్యూజిలాండ్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశాడు.